Adithya Varma Movie
-
ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ
ఆదిత్య వర్మ చిత్రంతో పోటీకి మాగీ చిత్రం సిద్ధం అవుతోంది. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఈ చిత్రం 22న తెరపైకి రానుంది. కాగా ఆదిత్య వర్మతో పోటీ పడుతోంది మాగీ చిత్రం. సాయిగణేశ్ పిక్చర్స్ పతారంపై ఆర్.కార్తికేయన్ జగదీశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాగీ. రియా, నిమ్మి, హరిణి ముగ్గురు కథానాయికలు నటించిన ఈ చిత్రంలో డౌట్ సెంథిల్, తిథియన్ కథానాయకులుగా నటించారు. రేయ, లియో, చిన్నసామి, మన్నై సాధిక్, ప్రదీప్, సాయి, జీవా, తిలక్ శంకర్, వీరలక్ష్మి, విజయరాఘవ్, పొన్.కరుణ, సాయిరాం ముఖ్యపాత్రల్లో నటించారు. మణిరాజు ఛాయాగ్రహణం, ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ చిత్రాన్ని పూర్తిగా కొడైకెనాల్, ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రం జనరంజకమైన అంశాలతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించే విధంగా ఉంటుందన్నారు. హర్రర్‌తో కూడిన నూరు శాతం వినోదభరిత కథాచిత్రంగా మాగీ ఉంటుందని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ నెల 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆదిత్య వర్మకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కోలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందులోనూ చియాన్ విక్రమ్ వారసుడు తెరంగేట్రం చేస్తున్న చిత్రం కావడంతో ఆదిత్య వర్మపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వినూత్న కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మాగీ.. ఆదిత్య వర్మను ఢీ కొట్ట బోతోంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో.. బాక్సీఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రిమేక్‌గా ‘ఆదిత్య వర్మ’ వస్తున్న విషయం తెలిసిందే. -
నాన్న పదేళ్ల స్ట్రగుల్ చూశా!
సినిమా: తన తండ్రి 10 ఏళ్ల స్ట్రగుల్స్‌ను అనుభవించినట్లు ఆయన వారసుడు ధ్రువ్ విక్రమ్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఇది తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధ్రువ్ విక్రమ్‌కు జంటగా భవితసంధు నటించిన ఇందులో నటి ప్రియాఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోహీరోయిన్లు ధ్రువ్‌విక్రమ్, భవితసంధు బుధవారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. నటుడు ధ్రువ్ ముచ్చట్లు చూద్దాం.. ప్ర: ఆదిత్యవర్య చిత్రం గురించి చెప్పండి? జ: ఆదిత్యవర్మ చిత్రం చాలా కేర్‌ఫుల్‌గా యూనిట్ అంతా కలిసి శ్రమించిన చిత్రం ఇది. ప్ర:అర్జున్‌రెడ్డి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం? జ: నాకు హీరో పాత్ర హ్యాబిట్. నాకు చాలెంజింగ్ అనిపించింది. ప్ర: చిత్రంలో హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశాలు గురించి? జ: అవన్నీ స్క్రిప్ట్‌లో భాగంగానే చేశాం. భవితసంధు చాలా బాగా నటించింది. ప్ర:చిత్రం చూశారా? జ:నేనింకా చూడలేదు. నాన్న అయితే ఇప్పటికి వంద సార్లు చూసి ఉంటారు. ఆయన హ్యాపీ. ప్ర: మీ నాన్నగారిలో మీకు నచ్చిన విషయం? జ: ఆయన డెడికేషన్, తపన. పాత్ర కోసం పడే శ్రమ అన్నీ నన్ను ఆశ్చర్యపరిచేవే. అలా భవిష్యత్‌లో నేను కూడా చేస్తానోలేదో చెప్ప లేను. ఆయన ప్రారంభంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి 10 ఏళ్లు స్ట్రగుల్స్ పడ్డారు. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్న నటించిన చిత్రాలన్నీ బాగున్నాయి.సేతు, పితామగన్, బీమ, దూళ్ అన్నీ నచ్చాయి. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల రీమేక్‌లో ఏ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు? జ: భీమ చిత్ర రీమేక్ చేస్తే అందులో నటించాలని ఆశగా ఉంది. ప్ర:నాన్నతో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరగడం గురించి? జ: దర్శకుడు వెట్రిమారన్ నాన్నను కలిసి మా ఇద్దరితో చిత్రం చేయాలని చెప్పారు. మాకోసం ఆయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లున్నారు. అది నాన్నకు వినిపించారు.అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్ర:మీకు నచ్చిన నటుడు? జ: నాకు అందరు నటులు ఇష్టమే.అయితే అందరికంటే నాన్న ఎక్కువ ఇష్టం. ప్ర: మీరు నటించే చిత్రాల కథలను మీరే ఎంపిక చేసుకుంటారా? మీ నాన్న సెలెక్ట్ చేస్తారా? జ: ప్రస్తుతానికి అలాంటి సందర్భం రాలేదు. అయితే కథ నాకు నచ్చితే ఆ తరువాత నాన్న దృష్టికి తీసుకెళ్లతాను. ప్ర:తదుపరి చిత్రం? జ: ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆదిత్యవర్య చిత్రంపైనే నా దృష్టి అంతా. ఈ చిత్రం విడుదలైన తరువాత కొత్త చిత్రంపై దృష్టిసారిస్తాను -
సీన్ టు సీన్ అర్జున్‌రెడ్డే..!!
తెలుగులో అర్జున్‌రెడ్డి.. హిందీలో కబీర్ ఖాన్.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ‘కబీర్ సింగ్’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్ టు సీన్ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్లో ధ్రువ్ తనదైన ఒరిజినల్, ఇంటెన్స్, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్, ఆల్కాహల్ ఆడిక్ట్గా ఎమోషనల్ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ తమిళ ట్రైలర్‌పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్లో మాత్రం పూర్తిగా ‘అర్జున్‌రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
నాన్న లేకుంటే నేను లేను
సినిమా: నాన్న లేకుంటే తాను లేను అని పేర్కొన్నారు నవ నటుడు ధ్రువ్ విక్రమ్. నటుడు విక్రమ్ వారసుడైన ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ధ్రువ్ విక్రమ్‌కు జంటగా బనిత, ప్రియా ఆనంద్, అన్భుదాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గిరిసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు. కాగా ఆదిత్యవర్మ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. చిత్ర నిర్మాత ముఖేశ్ మెహతా మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్ర షూటింగ్లో నటుడు విక్రమ్ ఎప్పుడు ఒక స్టార్ నటుడిగా నడుచుకోలేదన్నారు. 2021లో విక్రమ్, ధ్రువ్‌విక్రమ్ కలిసి నటించి మనల్ని ఆనందపరుస్తారని భావిస్తున్నానన్నారు. ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ తాను పలు పాఠాశాలల్లో, కళాశాల్లో ప్రసంగించానన్నారు. అయితే ఈ వేడుక కొంచెం ప్రత్యేకం అన్నారు. కారణం తన కుటుంబం ఇక్కడ ఉందన్నారు. చిత్ర దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడి గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ప్రతిభావంతులు ఉండడం చూసి ఘనతగా భావించానన్నారు. తన తండ్రి విక్రమ్ గురించి చెప్పడానికి మాటలు లేవన్నారు. ఈ చిత్రానికి అంకితభావం 100 శాతం అని చెప్పారు. తన తండ్రి మంచి నటుడన్నదానికంటే మంచి తండ్రి అన్నదే తనకు తెలుసన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ధ్రువ్ మాదిరి మాట్లాడడం తనకు రాదన్నారు. తనకు 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడో, తాను నటించిన సేతు చిత్రం విడుదల కోసం ఎదురు చూసినప్పుడో ఎలాంటి ఆందోళనకు గురి కాలేదన్నది ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా తాను చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ చిత్రంలో ధ్రువ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నందుకు, అతనిపై నమ్మకం పెట్టినందుకు నిర్మాత ముఖేష్ మెహతాకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడు షరియా లేకుంటే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని పేర్కొన్నారు. -
తమిళ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాల దర్శకత్వం వహించారు. అయితే బాల రూపొందించిన సినిమాతో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ధృవ్ సరసన బనిటా సందు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతమందిస్తున్నాడు. -
హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!
తెలుగులో సంచనల విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను వర్మ పేరుతో బాలా దర్శకత్వంలో రూపొందించారు. అయితే నిర్మాతలకు అవుట్‌పుట్ నచ్చకపోవటంతో గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. అయితే రెండో వర్షన్ విషయంలోనూ రకరకాల అనుమానలు వచ్చాయి. షూటింగ్ అనుకున్నట్టుగా సాగటం లేదని, ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. చివరి షాట్‌కు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేశారు. హీరో హీరోయిన్లపై చివరి షాట్‌ను చిత్రీకరించారు. ఈ షూటింగ్ జరుగుతుండగా చియాన్ విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. View this post on Instagram Adithya Varma will always be the most beautiful thing that’s ever happened to me. He gave me a purpose, gave my life meaning, gave me clarity about myself and most importantly, taught me how to never give up. So much love for all the people in this video, especially the man in the last frame. Couldn’t have done it without you. #itsawrap 💫 A post shared by த்ருவ் (@dhruv.vikram) on Jul 15, 2019 at 4:54am PDT -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ మెప్పిస్తాడా!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఒరిజినల్‌ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే తెరకెక్కించాడు. కబీర్ సింగ్ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తమిళ రీమేక్ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాలా దర్శకత్వం వహించారు. అయితే అవుట్‌పుట్ విషయంలో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి రూపొందించారు. ఆదిత్య వర్మ పేరుతో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే ఈ సారి కూడా ఆదిత్య వర్మ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో పాత్రకు ధృవ్ వయసు సరిపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడిసిన్, పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా ధృవ్ కనిపించటంలేదంటున్నారు విశ్లేషకులు. నటన పరంగా మెప్పించినా లుక్ కన్విన్సింగ్‌గా లేకపోతే కష్టమే అంటున్నారు. మరి ఈ విమర్శల నేపథ్యంలో తమిళ అర్జున్ రెడ్డి ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ వచ్చేసింది!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. తమిళ్లో ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్ లాంటివి యాజిటీజ్‌గా దించేశారు. టీజర్లో లుక్స్, యాక్టింగ్ పరంగా ధృవ్ ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ సినిమాను సీనియర్ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్‌పుట్ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్ సరసన బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.