ajit doval
-
రేపు బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల భేటీ
బీజింగ్: సరిహద్దు అంశంపై చర్చించేందుకు భారత్, చైనాల ప్రత్యేక ప్రతినిధులు బుధవారం బీజింగ్ సమావేశమవనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి సేనలు వైదొలిగేందుకు అక్టోబర్ 21న చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే విషయమై ఈ బృందాలు చర్చించనున్నాయి. 23వ దఫా చర్చలకు చైనా విదేశాంగ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ల సారథ్యం వహిస్తారని చైనా విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ చర్చల్లో రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. భారత్– చైనాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించే ఉద్దేశంతో 2003లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు సమావేశమైంది. చివరి సారిగా 2019లో చర్చలు జరిపింది. -
నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg. 👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024 గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు పుతిన్ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళరష్యన్ ఎంబసీ సైతం మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.కాగా, ఉక్రెయిన్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. -
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. -
రంగంలోకి అజిత్ దోవల్.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగిసేనా!
ఢిల్లీ : ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు శత్రు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ వారంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ పర్యటించారు. మోదీ పర్యటన అనంతరం అజిత్ దోవల్ రష్యా వెళ్లడం యుద్ధం ముగింపు పలికే అవకాశం ఉందని మిత్రదేశాల అధ్యక్షులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్ట్ నెలలో మోదీ ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా, శాంతివైపు ఉందని మోదీ చెప్పారు. అంతేకాదు యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.ఇది చదవండి: కిమ్‌కు పుతిన్ గిప్ట్.. ఎందుకంటేఉక్రెయిన్ పర్యటనపై ఆగస్ట్ 27న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరి గురించి వివరించారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలికేలా శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పుతిన్ కీలక ప్రకటనవరుస పరిణామల నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై వ్లాదిమీర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని నార్త్ కొరియా,చైనా సరిహద్దు ప్రాంతమైన వ్లాడివోస్టోక్ నగరంలో సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య భారత్, బ్రెజిల్, చైనాలు శాంతి చర్చలు జరిపి అంశంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.స్పందించిన ఇటలీపుతిన్ ప్రకటన అనంతరం..అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించడంపై మిత్ర దేశాలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగియనుందనే అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా వంటి దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు.రెండేళ్లకు సమీపిస్తున్న యుద్ధంసెప్టెంబర్ 24, 2022 నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో సుమారు 5లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్
సాక్షి, ఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. పదవీకాలం పూర్తి కావడంతో మళ్లీ ఆయన్నే నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా మరోసారి పీకే మిశ్రా నియమితులయ్యారు. ప్రధానమంత్రి సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు అమిత్ కరే, తరుణ్ కపూర్ నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
Agnipath scheme: అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : అజిత్ దోవల్
న్యూఢిల్లీ : సైన్యంలో యువరక్తాన్ని నింపడానికి, మరింత టెక్ సేవీగా మార్చడానికే అగ్నిపథం పథకాన్ని తీసుకువచ్చామని, దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మన జాతికి ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని మూల్యంగా చెల్లించడానికి సిద్ధమయ్యారని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో 2006లోనే ఈ తరహా పథకం తీసుకువద్దామని అనుకున్నారని వెల్లడించారు. ప్రపంచ దేశాలో యువ జనాభా అత్యధికంగా ఉన్న మన దేశం ఆర్మీ విషయాన్నికొస్తే సగటు వయసు అత్యధికంగా ఉన్న దేశంగా ఉందని , అందుకే సైనిక రంగంలో సంస్కరణలు తప్పవన్నారు. మంగళవారం ఒక వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై చెలరేగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న వారెవరూ అసలైన ఆశావహులు కాదని, వారంతా ఇళ్లలో కూర్చొని పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఒకటే జీవితం–రెండు కెరీర్లు , ఒక్కోసారి మూడు కెరీర్లు అని యువత మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అగ్నివీరుల మొదటి బ్యాచ్ పదవీ విరమణ చేసిన సమయానికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్లు (దాదాపుగా రూ.385 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అప్పుడు పరిశ్రమలకి ఇలాంటి శిక్షణ పొందిన యువతరం అవసరం ఉంటుందన్నారు. యుద్ధభూమిని టెక్నాలజీ తన చేతుల్లోకి తీసుకుంటోందని ఇకపై కాంటాక్ట్‌లెస్ యుద్ధాలు కూడా వస్తాయని, అందుకే ఇలాంటి మార్పులు తప్పవన్నారు. అగ్నివీరులుగా శాశ్వత కెరీర్ కొనసాగించడానికి నాలుగేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకోవాలని వారిలో ఎంపికైన 25% మందికి మళ్లీ కఠోర శిక్షణ ఉంటుందని అజిత్ దోవల్ వివరించారు. -
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుండగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెంకయ్యనాయుడును కలిశారు. కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అనసూయ ఉయికే గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. 2019 జూలై నుంచి ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అజిత్ ధోవల్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే అనసూయ ఉయికే ఉపరాష్ట్రపతి అవుతారని తెలుస్తోంది. అలాగే ఉపరాష్ట్రపతి రేసులో రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్త్ర బుద్ధే పేరు కూడా వినిపిస్తోంది. కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా వెళ్తారని సమాచారం. చదవండి: (Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా) -
బోర్డర్లో భారత్‌తో కయ్యం.. అజిత్ ధోవల్‌కు చైనా ఆఫర్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య లఢక్ సహా మరిన్ని సరిహద్దు వివాదాస్పద ప్రాంతాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో భారత్ పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో వాంగ్ యీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తోనూ సమావేశం అయ్యారు. మరోవైపు.. సమావేశంలో భాగంగా అజిత్ ధోవల్‌ను తమ దేశానికి రావాలంటూ చైనా విదేశాంగ మంత్రి ఆహ్వానం అందించారు. కాగా, ఆయన ఆహ్వానంపై అజిత్ ధోవల్ పాజిటివ్‌గా స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు విజయవంతంగా పరిష్కారమైన తర్వాత కచ్చితంగా చైనాకు వస్తానని తెలిపారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే, లఢక్‌తో పాటు ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించాలని ధోవల్ ఈ సందర్భంగా వాంగ్ యీని కోరారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయని ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ క్రమంలో శాంతి స్థాపనతోనే ఇరు వర్గాల మధ్య నమ్మకం ఏర్పడుతుందని రెండు దేశాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. 2020 జూన్ 15న భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ.. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాగా, గాల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రెండు రోజుల క్రితం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఢిల్లీకి రాకముందు వాంగ్ యి.. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు. -
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద అపరిచితుడి కలకలం
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద బుధవారం ఉదయం కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు నేరుగా దోవల్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ 5, జన్‌పథ్‌లో ఉంది. ఐబీ మాజీ చీఫ్, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్ ఫ్లస్ కేటగిరీ కింద భారీగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యాతో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు. -
కలిసి పనిచేయండి.. దేశసేవకు అంకితమవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారులంతా కలిసి ఓ కుటుంబంలా పనిచేస్తూ దేశసేవకు అంకితం కావాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం జరిగిన ఐపీఎస్ ప్రొబేషనరీల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వారు మాత్రమే కాదని, దేశ సౌభాగ్యం కోసం శాంతి భద్రతల్ని పరిరక్షించడం కూడా వారి విధుల్లో భాగమేనని ఉద్బోధించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులను గుర్తు చేసుకున్న ఆయన.. వారి త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ఎప్పటికప్పుడు తమ సాంకేతిక ప్రతిభను మెరుగు పరుచుకోవాలని ధోవల్ సూచించారు. సమకాలీన అవసరాలను బట్టి పోలీసు విధుల్లో పాదర్శకతను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఐపీఎస్‌లకు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఎన్పీఏ డైరెక్టర్ అతుల్ కర్వాల్ మాట్లాడుతూ ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు శిక్షణలో భాగంగా విధి నిర్వహణతో పాటు నైతిక విలువలతో అనేకాంశాలు బోధించామని వివరించారు. ఈ ఫేజ్–1 శిక్షణలో ప్రొబేషనరీ అధికారిణి దర్పన్ అహ్లువాలియా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. ధోవల్ చేతుల మీదుగా అహ్లువాలియాకు ఉత్తమ ప్రొబేషనరీ అవార్డుతో పాటు ఆయా అంశాల్లో ప్రతిభ కనబరిచిన కేడెట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఎన్పీఏలో శిక్షణ పొందిన ఈ 73వ బ్యాచ్‌లో మొత్తం 132 మంది ప్రొబేషనరీలున్నారు. వీరిలో 27 మంది మహిళలు కాగా.. ఆరుగురు భూటాన్, మరో ఆరుగురు మాల్దీవులు, ఐదుగురు నేపాల్ వంటి మిత్రదేశాలకు చెందిన వారూ ఉన్నారు. -
సుస్థిర అఫ్గాన్‌కు దారి
అఫ్గానిస్తాన్‌పై బుధవారం వెలువడిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆ దేశంలోని వర్తమాన స్థితిగతులకు అద్దం పట్టింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. తమ దేశంలో పరిస్థితులు భేషుగ్గా ఉన్నాయని అధికారం చెలాయిస్తున్న తాలిబన్లు చెప్పుకుంటున్నారు. శాంతిభద్రతలను కాపాడ టంలో విజయం సాధించామంటున్నారు. ఆఖరికి న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై స్పందించిన సందర్భంలో సైతం తాలిబన్ల ప్రతినిధి దాన్నే పునరుద్ఘాటించారు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశం నుంచి అమెరికా నిష్క్రమించి మూడు నెలలు కావస్తోంది. అప్పటినుంచీ మహిళలపై కొన సాగుతున్న దుండగాలకు లెక్క లేదు. వారిని ఇళ్లకే పరిమితం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగిం చారు. ధిక్కరించినవారిని కాల్చిచంపుతున్నారు. పాలనలో మహిళలు, మైనారిటీలతోసహా అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పిస్తామని తాలిబన్లు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. దశా బ్దాలుగా పాలనతోసహా భిన్న రంగాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న హజారా, ఉజ్బెక్ తెగలను పూర్తిగా పక్కనపెట్టారు. ఉగ్రవాదానికి తమ గడ్డపై చోటుండదని ప్రకటించినా దేశ రాజధాని కాబూల్, కుందుజ్, కాందహార్లతోసహా అనేకచోట్ల ఐఎస్ ఉగ్రవాదులు తరచుగా నరమేథం సాగి స్తూనే ఉన్నారు. తాలిబన్లు కూడా ఏమంత మెరుగ్గా లేరు. అనాగరికమైన మరణదండనలు అమలు చేస్తున్నారు. అన్నిటికీ మించి ఆ దేశం ఆర్థికంగా పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఐక్య రాజ్యసమితి లెక్క ప్రకారం 2.30 కోట్లమంది పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. వీటిని అఫ్గాన్ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించి ప్రపంచం ప్రేక్షక పాత్ర వహించలేదు. ఇది దీర్ఘకాలం కొన సాగితే... అంతర్యుద్ధంగా మారితే ఇరుగుపొరుగు దేశాలకూ, తరువాత మొత్తంగా మధ్య ఆసియా ప్రాంతానికీ, అంతిమంగా ప్రపంచ దేశాలకూ పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశాన్ని గుప్పిట బంధించి వర్తమాన దుస్థితికి కారణమైన అమెరికా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అఫ్గాన్కొచ్చే ముప్పేమీ లేదని, అది సవ్యంగానే మనుగడ సాగిస్తుందని అమెరికా చేసిన ప్రకటనలు వంచన తప్ప మరేమీ కాదని అది నిష్క్రమించిన క్షణాల్లోనే రుజువైంది. అఫ్గాన్ దుస్థితిపై మన దేశం మాత్రమే కాదు...దానికి పొరుగునున్న రష్యా, ఇరాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్ వంటివి సైతం కలవరపడుతున్నాయి. గతంలో తాలిబన్లు ఏలికలుగా ఉన్నప్పుడు కలిగిన చేదు అనుభవాల పర్యవసానంగా వారితో చర్చించడానికి మన దేశం మొదట్లో సిద్ధపడని మాట వాస్తవం. కానీ ఆ తర్వాత మనసు మార్చు కుంది. సెప్టెంబర్ 1న ఖతార్‌లోని దోహాలో తాలిబన్లతో మన ప్రతినిధులు మాట్లాడగలిగారు. గత కొన్నేళ్లుగా అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న మన దేశంపై వారి వైఖరి మారినట్టే కనబడింది. మాటల వరకూ అయితే ఇప్పటికీ వారు అలాగే చెబుతున్నారు. కానీ వారిని వెనకుండి నడిపిస్తున్న పాకిస్తాన్ తీరుతెన్నులపై భారత్‌కు సందేహాలున్నాయి. నిజానికి తాజా సదస్సు హఠాత్తుగా ఊడిపడింది కాదు. ఆ దేశంనుంచి తాము నిష్క్రమించదల్చుకున్నట్టు తొలిసారి 2018లో అమెరికా ప్రకటించినప్పుడు ఇరాన్ చొరవతో, రష్యా తోడ్పాటుతో తొలి సదస్సు జరిగింది. ఆ మరుసటి ఏడాది సైతం ఇరానే సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుత సదస్సు ఆ క్రమంలో మూడోది. భారత్ హాజరైతే తాము రాబోమని పాకిస్తాన్ తొలి సదస్సు సమయంలోనే చెప్పింది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిజంగా తాలిబన్లు కోరుకుంటున్నట్టయితే అది కేవలం వారి వల్ల మాత్రమే అయ్యే పనికాదు. విధ్వంసకర ఘటనలతో, బెదిరింపులతో ఉగ్ర వాద ముఠాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. మాదకద్రవ్యాలను దూరతీరాలకు తరలిస్తూ వేల కోట్లు నిధులు ఆర్జిస్తున్నాయి. మారణాయుధాలు పోగేస్తున్నాయి. ఈ ముఠాలను అదుపు చేయా లన్నా, చుట్టుముట్టిన సంక్షోభాలనుంచి గట్టెక్కాలన్నా ప్రపంచ దేశాల సహకారం అత్యవసరం. పారదర్శకంగా వ్యవహరించడం నేర్చుకుని అన్ని వర్గాలకూ పాలనలో భాగస్వామ్యం కల్పిస్తే... మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులకు పూచీపడితే ఉగ్రవాద ముఠాల ఆగడాలు అంతమవు తాయి. తమకు ప్రభుత్వం నుంచి రక్షణ దొరుకుతుందన్న భరోసా ఉంటే సాధారణ ప్రజానీకం ఉగ్రవాదులను తరిమికొట్టడానికి సిద్ధపడతారు. తాలిబన్లు వచ్చాక సాయం ఆపేసిన ప్రపంచ దేశాలు సైతం పునరాలోచన చేస్తాయి. అఫ్గాన్ విషయంలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇచ్చిన పిలుపు అర్ధవంతమైనది. మొదట్లోనే అటువంటి అంతర్జాతీయ వేదికల ప్రమేయం ఉన్నట్టయితే అఫ్గాన్‌కు ప్రస్తుత దుస్థితి తప్పేది. ఆకలితో అలమటిస్తున్న పౌరులకు చేయూతనందించడం, పిల్ల లకు పౌష్టికాహారం సమకూర్చడం, కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురావడం తక్షణ కర్తవ్యం. ఈ అంశాల్లో సమష్టిగా పనిచేయాలని సదస్సు నిర్ణయించడం మెచ్చదగ్గది. వేరే కారణా లతో సదస్సుకు గైర్హాజరైన చైనా ఈ కృషిలో తాను కూడా పాలుపంచుకుంటానంటున్నది. ఆచ రణలో అది రుజువుకావాల్సివుంది. తాలిబన్లు చిత్తశుద్ధితో వ్యవహరించి మెరుగైన కార్యాచరణకు దోహదపడితే సుస్థిరమైన, శాంతియుతమైన అఫ్గాన్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆ దేశం అచిరకాలంలోనే అభివృద్ధి పథంలో పయనిస్తుంది. -
రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌తో ప్రధాని మోదీ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నికోలాయ్ పాత్రుషేవ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత సమయంలో అఫ్గాన్‌తో సహా ప్రాంతీయ సుస్థిరత దిశగా మరింత సమన్వయాన్ని బలోపోతం చేయాలంటూ పునరుద్ఘాటించారు. భారత్ -రష్యాల మధ్య భాగస్వామ్య అభివృద్ధి, రాజకీయాలు, బహుళ ఫార్మేట్స్, ఎస్సీఓ, బ్రిక్స్ తదితర విషయాలపై సంభాషించారు. నికోలాయ్ తన రెండు రోజుల ఇండియా పర్యటనలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. అఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులకు ఉనికిగా మారే అవకాశం ఉందని సెక్యూరిటీ అడ్వైజర్లు అభిప్రాయపడ్డారు. తీవ్రవాద గ్రూపులకు ఆయుధాల ప్రవాహం, అఫ్ఘన్ సరిహద్దుల్లో అక్రమ రవాణా, అఫ్ఘనిస్తాన్ నల్లమందు ఉత్పత్తి అక్రమ రవాణాకు కేంద్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. తాలిబన్లతోపాటుగా, ఇతర అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో పాకిస్తాన్ సంబంధాలను కలిగి ఉందనే విషయాన్ని భారత్ గుర్తుచేసింది. అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారకుండా చూసుకునే బాధ్యత పాకిస్తాన్‌పై ఉందని భారత్ పేర్కొంది. Was happy to meet Mr. Nikolai Patrushev, Secretary of the Security Council of Russia. His visit allowed useful discussions between both sides on important regional developments. pic.twitter.com/v0cwJH1yAF — Narendra Modi (@narendramodi) September 8, 2021 చదవండి: అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు -
డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికత!
న్యూఢిల్లీ: దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రక్షణ సంబంధిత సవాళ్లను, భవిష్యత్‌తో ఎదుర్కోబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విస్తృతమైన రక్షణ విధానాన్ని రూపొందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ సమావేశమయ్యారు. సమావేశంలో నూతన రక్షణ విధాన రూపకల్పనపై దృష్టి పెట్టారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలున్న డ్రోన్స్ ప్రత్యక్షమైన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రోన్ల ఘటనపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నారని అనుమానాలున్నాయి. దీంతో కొత్త పాలసీ రూపకల్పనపై పలువురు మంత్రులు, శాఖలు కసరత్తులు చేస్తున్నాయి. కొత్తవిధానం రూపకల్పన, అమలులో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ మిలటరీ, వైమానిక, నౌకా దళాలు కీలక పాత్ర పోషిస్తాయని సదరు వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ ఎటాక్స్ వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారించాలని కేంద్రం త్రివిధ దళాలకు సూచించింది. రక్షణ దళాలకు నూతన సాంకేతికతను అందించడం, ఇందుకోసం నవ యువతను, స్టార్టప్స్‌ను భాగస్వాములుగా చేసుకోవడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కృత్తిమ మేధ, రోబోటిక్స్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర కొత్త సాంకేతికతలపై మిలటరీ దృష్టి సారించింది. రాబోయే వారాల్లో త్రివిధ దళాలు, కీలక భద్రతా వ్యూహకర్తలు మరిన్ని సమావేశాలు నిర్వహించి, కొత్త పాలసీపై చర్చలు జరుపుతారు. జమ్ము ఘటన అనంతరం ఎయిర్‌ఫోర్స్ జమ్మూలోని స్టేషన్ల వద్ద భద్రతను పెంచింది. రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికతను ఇప్పటికే డీఆర్డీఓ రూపొందించింది. దీన్ని మరింత విస్తృతీకరించేందుకు కృషి జరుగుతోంది. చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి HP: ఔషధ మొక్కల పెంపకానికి ఆయుష్ 128.94 లక్షలు -
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో బుధవారం ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశానికి దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్సీఓ, యాంటీ టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్, ఉగ్రవాద దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణని కూడా ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు -
కశ్మీర్‌పై అమిత్‌షా ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ఎన్ఎస్ఏ (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్ అర్వింద్ కుమార్, రా (రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ సామంత్ కుమార్ గోయెల్, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు. కశ్మీర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ 76% వరకు పూర్తి చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆయన అభినందనలు తెలిపారు. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. పీఎం కిసాన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు తదితర పథకాల ప్రయోజనాలను కశ్మీర్ ప్రాంత రైతులకు అందేలా చూడాలని అమిత్ షా కోరారు. పారిశ్రామిక విధానం ప్రయోజనాలను చిన్న తరహా పరిశ్రమలు అందుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ సభ్యులకు శిక్షణ అందించాలనీ, దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన పంచాయతీల్లో వారు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’
న్యూఢిల్లీ: 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత భారతదేశం దాయాది పాకిస్తాన్‌పై చేసిన మొదటి వైమానకి దాడి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై చేసిన దాడికి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.30 గంటలకు భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఎల్ఓసీని దాటుకుని.. పాకిస్తాన్ బాలకోట్‌లోని జైషే మహ్మమద్ టెర్రర్ క్యాంప్‌పై దాడి చేశాయి. ఉరి, బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడులతో పాక్‌కు భారత సామార్థ్యం మరోసారి తెలిసి వచ్చింది. ఇక రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాటి ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతో పాటు నాడు ఓ క్షిపణి విఫలమయ్యిందనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాటి ఆపరేషన్‌లో మన మిరాజ్ ఫైటర్ జెట్స్‌ని ఎదిరించేందుకు.. పాక్ తన ఎఫ్ 16 ఫైటర్ జెట్స్‌ని రంగంలోకి దింపింది. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ దాడిలో ఐఏఎఫ్ మిరాజ్ 2000 యోధులు తమ స్పైస్ 2000 పెనెట్రేటర్ బాంబులను విడుదల చేశాయి. ఇవి ఒక్కొక్కటి 90 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి. సరిగ్గా పావుగంట తర్వాత అనగా 3.45 గంటలకు ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందనే సమాచారం ఇచ్చారు. ప్రత్యేక ఆర్ఏఎక్స్ నంబర్ ద్వారా టెలిఫోన్ కాల్ చేసిన ధనోవా హిందీలో బందర్ మారా గయా(కోతి చంపబడింది) అని తెలిపారు. అంటే పాకిస్తాన్, బాలకోట్లో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ టెర్రరిస్ట్ శిక్షణా క్యాంప్‌ని సరిహద్దు దాటి సాహసోపేతమైన ముందస్తు ఆపరేషన్‌లో భారత్ నాశనం చేసింది అని అర్థం. ఆర్ఏఎక్స్ అనేది అల్ట్రా-సేఫ్డ్ ఫిక్స్డ్-లైన్ నెట్వర్క్. అజిత్ దోవల్‌తో మాట్లాడిన అనంతరం ధనోవా అప్పటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రా సెక్రటరీ అనిల్ ధస్మానాకు తెలియజేశారు. ఆ తర్వాత దోవల్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను గందరగోళపరిచేందుకు ‘బందర్’ అనే కోడ్ పేరును ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నట్లు బాలకోట్ దాడిలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. చదవండి: బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన -
అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకి కుట్ర పన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతో దోవల్ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో రెక్కీ విషయం బయటపడింది. దోవల్‌తో పాటుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించామని మాలిక్ అంగీకరించాడు. గత ఏడాది మేలో న్యూఢిల్లీలోని దోవల్ కార్యాలయం సహా కొన్ని ప్రాంతాలను వీడియో తీసి పంపించామని వెల్లడించాడు. దోవల్ 2019 బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడికి క్షమాపణలు చెప్పారు. దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌పై జైరాం రమేశ్ 2019 జనవరిలో ఓ మేగజైన్లో వచ్చిన ఆర్టికల్‌ను అనుసరించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు పత్రికా ప్రకటనల్లోనూ అదే తరహా విమర్శలు గుప్పించారు. దీంతో తమపై నిరాధార ఆరోపణలు చేసిన జైరాం రమేశ్‌పైనా, సదరు మేగజైన్ నిర్వాహకులపైనా వివేక్ పరువు నష్టం దావా వేశారు. ఉన్నత స్థానంలో ఉన్న తన తండ్రిని అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తాజాగా దావాకు సంబంధించి జైరాం రమేశ్ స్పందించారు. ఎన్నికల ప్రచార వేడిలో అప్రయత్నంగా వివేక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా భంగపరిచి ఉంటే దానికి చింతిస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. వివేద్ దోవల్‌కు, అతని కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని అన్నారు. గతంలో వివేక్‌పై తన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకటనలు ఏవైనా ఉంటే అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాగా, రమేశ్ క్షమాపణల్ని అంగీకరిస్తున్నామని వివేక్ దోవల్ ఓ జాతీయ మీడియాతో అన్నారు. రమేశ్‌పై వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, తప్పుడు వార్తలు రాసిన కారవాన్ మేగజైన్‌పై మాత్రం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్..!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. చైనా సంస్థ జెన్హూవా డేటా ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంతి, ఆర్మీ చీఫ్‌తో సహా వేలాదిమంది భారతీయులపై రహస్య నిఘా నిర్వహిస్తోందనే ఆరోపణల మధ్య ఈ ఉల్లంఘన జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన డేటాతో పాటు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ) ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన మెయిల్ ఒకటి బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్కు చెందిన సంస్థ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ఐసీ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ వ్యవస్థలు అన్నీ ప్రభావితమై సమాచారం హ్యాక్ అయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని (నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో) ఏర్పాటు చేసిందని ఎన్ఐసీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదికను సమర్పించనుంది. -
సరిహద్దు ఉద్రిక్తత.. దోవల్ సమీక్ష
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నతాధికారులతో సమవేశమయ్యి.. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.(చదవండి: చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..) ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్‌కు చెందిన ప్యాంగ్యాంగ్ త్సో, ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొగ్రుంగ్ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి. -
రంగంలోకి అజిత్: తోక ముడిచిన చైనా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో నెలల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు కనిపిస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు ఇరు దేశాలు ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగాక ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ వెళ్లి సైన్యంతో మాట్లాడటం, అనంతరం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ రంగంలోకి దిగడంతో చైనా సైన్యం తోకముడిచి వెనక్కి తగ్గింది. భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్ 4 పాయింట్ నుంచి చైనా సైన్యం సుమారు కిలోమీటరున్నర దూరం వరకు వెనక్కి వెళ్లింది. మోదీ పర్యటన అనంతరం అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో ఆదివారం సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేశ భద్రతా వ్యవహారాల్లో ఆరితేరిన అజిత్.. తన చాణిక్యతను ఉపయోగించి చైనాతో సమస్య పరిష్కారానికి దారిచూపారు. (గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?) ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతి యుత పరిస్థితులు నెలకొల్పాలని ఇరు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరుదేశాల సైనిక బలగాలను వీలైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని అంగీకరించారు. వాస్తవాధీన రేఖను రెండు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలని, ఏకపక్షంగా ఎల్ఏసీని మార్చే ప్రయత్నాలను మానుకోవాలి నిర్ణయించారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం చర్చలు నిరంతరం కొనసాగాలని ఒప్పందం కుదుర్చున్నారు. (గల్వాన్ లోయలో కీలక పరిణామం) తూర్పు లద్దాఖ్ ప్రాంతాంలోని గల్వాయ్ లోయలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా సైన్యం గుడారాలు ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 15న చెలరేగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. దీంతో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని యావత్‌దేశం ముక్తకంఠంతో నినదించింది. అయితే చైనా ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని భావించిన భారత ప్రభుత్వం డిజిటల్ స్ట్రైక్స్ ద్వారా డ్రాగాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే గతవారం మోదీ అనూహ్యంగా లద్దాఖ్‌లో పర్యటించి చైనాకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. విస్తరణవాదానికి ఇక కాలం చెల్లిపోయిందని భారత భూభాగాలను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మోదీ తేల్చి చెప్పారు. ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి గట్టి షాక్ లాంటిదే. ఇక మోదీ లద్దాక్ పర్యటన అనంతరం అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయిన అజిత్ దోవల్ ఆదివారం సాయంత్రం సుమారు రెండుగంటల పాటు చైనా విదేశాంగమంత్రితో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, వివాదాస్పద భూభాగం నుంచి వెనక్కి తగ్గలని కోరారు. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం సోమవారం ఉదయం చైనా సైనం వెనక్కి తగ్గింది. కేంద్రంలో కీలక పాత్ర.. మోదీ దేశ ప్రధాని అయ్యాక అజిత్ దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న దోవల్‌కి సమర్థవంతమై అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్ వ్యూహ రచన చేశారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. గతంలో మణిపూర్‌లో మన సైన్యానికి చెందిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా మన సైన్యం మయన్మార్‌లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. దీని వెనుకా అజిత్ హస్తం ఉంది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ విషాయాల్లో మోదీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తూ అజిత్ దోవల్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చైనా వివాదాన్ని పరిష్కరించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. -
చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రతిష్టంభన వారాల తరబడి కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దు ఘర్షణలు కాస్తా దళాల మోహరింపునకు దారితీయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తున్నాయి. గల్వాన్ లోయలో జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన అనంతరం ఇరు సైనికాధికారుల చర్చలు సానుకూలంగా సాగినా సరిహద్దుల్లో చైనా దళాల మోహరింపు డ్రాగన్ దుర్నీతిని వెల్లడిస్తోంది. ఇప్పటి ఉద్రిక్తతలు ఇలా ఉంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2013లోనే భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్‌లు కుట్రకు తెరలేపాయని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు భారత్‌లో అలజడి రేపేందుకు ఈ రెండు పొరుగు దేశాల కుట్రను అజిత్ దోవల్ ఆనాడే బహిర్గతం చేశారు. ‘చైనా ఇంటెలిజెన్స్ : పార్టీ సంస్థ నుంచి సైబర్ యోధులుగా’ అనే వ్యాసంలో దోవల్ ఈ విషయం ప్రస్తావించారు. చైనా నిఘా వర్గాలు భారత్ సహా పలు దేశాల్లో మాటువేసి తమ దేశం తరపున ప్రణాళికాబద్ధంగా గూఢచర్యం నెరిపిన తీరును ఈ వ్యాసంలో దోవల్ కళ్లకు కట్టారు. ఈ వ్యాసం రాసే సమయంలో ఆయన ఢిల్లీకి చెందిన వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌కు సేవలందించారు. ఆ తర్వాత ఏడాదికి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరిన క్రమంలో కేంద్రం ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా కీలక బాధ్యతలను కట్టబెట్టింది. చదవండి : భయపడవద్దు.. మాట ఇస్తున్నా: అజిత్ దోవల్ దోవల్ వెల్లడించిన వివరాల ప్రకారం 1959లో దలైలామా తన 80,000 మంది శిష్యులతో భారత్‌లో ఆశ్రయం పొందిన అనంతరం చైనా భారత్‌పై గూఢచర్య కార్యకలాపాలను వేగవంతం చేసింది. అక్సాయ్‌చిన్ ప్రాంతంలో 219 జాతీయ రహదారిపై లాసా, జిన్‌జియాంగ్‌లను కలుపుతూ చైనా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. 1959, నవంబర్ 21న ఐబీ అధికారి కరంసింగ్ చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కన్నుమూశారు. భారత నిఘా సంస్థలు చైనా కార్యకలాపాలపై ప్రభుత్వానికి సమాచారం చేరవేసినా అప్పటి పాలకులు వాటిపై పెద్దగా దృష్టిసారించలేదని దోవల్ వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నిన చైనా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారం కూడా తీసుకుందని దోవల్ చెప్పారు. భారత్‌లో ఉగ్రసంస్ధలకు సహకరించేందుకు చైనా పాకిస్తాన్‌లు కలిసి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏకంగా ఆపరేషనల్ హబ్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. -
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ
న్యూఢిల్లీ: రెండు రోజులుగా తీవ్ర స్థాయి హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వీధులన్నీ తగలబడిన వాహనాలు, ధ్వంసమైన, లూటీ అయిన దుకాణాలు, మూసివేసి ఉన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలతో నిర్మానుష్యంగా కనిపించాయి. గోకుల్‌పురిలో చోటు చేసుకున్న పలు చెదురుమదురు ఘటనలు మినహా బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మంగళవారం రాత్రి ఒకసారి, బుధవారం మరోసారి ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ పర్యటించారు. (ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ ) పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండగా భావిస్తున్న ఈ అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. (‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’) కాగా, అల్లర్ల కారణంగా చనిపోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహాన్ని బుధవారం ఉదయం చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఒక కాలువలో గుర్తించారు. రాళ్ల దాడిలో ఆయన చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనాలి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై లోతైన సమీక్ష జరిపాం. పోలీసులు, ఇతర భద్రత వ్యవస్థలు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో ఉన్న రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఫ్లాగ్ మార్చ్ అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే బాధ్యతను అజిత్ దోవల్‌కు కేంద్రం అప్పగించిన నేపథ్యంలో.. అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కొత్తగా నియమితులైన స్పెషల్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవతో కలిసి దోవల్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. హింసను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అమూల్య పట్నాయక్ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. శ్రీవాస్తవను దోవల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య 22కి పెరిగిందని, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని జీటీబీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను పోలీసులు కాకుండా, వైద్యులు వెల్లడించడం గమనార్హం. అల్లర్ల కారణంగా ఈ ప్రాంతంలోని పాఠశాలలను, షాపులను మూసేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. దుకాణాలను లూటీ చేయడంతో జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవడం కనిపించింది. మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి 106 మందిని అరెస్ట్ చేశామని, 18 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజల సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్ నెంబర్లు 011–22829334, 011–22829335 కూడా ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఐబీ ఉద్యోగి మృతి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత అంకిత్ మళ్లీ బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని ఆయన తండ్రి దేవేంద్ర శర్మ తెలిపారు. అంకిత్ మృతదేహాన్ని మురికి కాలువలో వేయడాన్ని తమ కాలనీలోని కొందరు మహిళలు చూశారని, ఎవరికైనా చెపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ మహిళలను వారు బెదిరించారని అంకిత్ సోదరుడు అంకుర్ వెల్లడించారు. అంకిత్ శరీరంపై కత్తిగాట్లు కూడా ఉన్నాయన్నారు. ఆర్మీని పిలిపించాలి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఆర్మీని పిలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అల్లర్లకు కారణం బీజేపీ కార్యకర్తలేనని ఆప్ నేతలు సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ ఆరోపించారు. ఢిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని, అల్లర్ల కట్టడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజాయితీగా కృషి చేయడం లేదని వారు విమర్శించారు. ఢిల్లీ సరిహద్దులను ఇప్పటికైనా మూసేయాలని, పొరుగు ప్రాంతాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చి హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలి రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీ అతలాకుతలమవడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం సమావేశమైంది. ఈ ఘర్షణలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ హింసకు బాధ్యత వహించాలన్నారు. తర్వాత మీడియా సమక్షంలో కేంద్రానికి కొన్ని సూటిప్రశ్నలు సంధించారు. ► హింస జరుగుతుంటే అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కడ? ఏం చేస్తున్నారు ? ► ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు సీఏఏ నిరసనలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ఎలాంటి నివేదికలు ఇచ్చాయి? ► ఢిల్లీలో చెలరేగిన హింస హోంశాఖ చెబుతున్నట్టు అప్పటికప్పుడు జరిగినవా? లేదంటే హోంశాఖ సహాయ మంత్రి చెబుతున్నట్టు ఎవరైనా రెచ్చగొట్టినవా? ► ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగుతాయని స్పష్టమైన సంకేతాలు వచ్చినప్పుడు ఢిల్లీలో ఎన్ని బలగాలను మోహరించారు? ► ఢిల్లీ పోలీసుల చేతుల్లోంచి పరిస్థితులు జారిపోయినట్టు గ్రహించినప్పుడు భద్రతా సిబ్బందిని ఎందుకు మోహరించలేదు? అమిత్ షా రాజీనామా కోరడం హాస్యాస్పదం: బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ విమర్శించింది. పోలీసులతో కలిసి నిరంతరంగా పనిచేస్తూ ఢిల్లీలో పరిస్థితుల్ని అదుపులో ఉంచడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ అల్లర్ల విషయం ప్రస్తావనకు రాలేదన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సీఏఏపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనల నేపథ్యంలో రెచ్చగొట్టేలా ప్రసంగించిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఇందిరాగాం«ధీ హత్య సందర్భంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన హింసాకాండను ఈ దేశంలో పునరావృతం అయ్యేందుకు అనుమతించబోమని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పించాలని ఆదేశించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని అధికారులకు సూచించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించింది. అల్లర్లలో ఐబీ అధికారి మృతి చెందడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీలో తలెత్తిన హింస నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రతిస్పందించిన తీరుని ఢిల్లీ హైకోర్టు ప్రశంసించింది. ‘మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్. మురళీధర్ వ్యాఖ్యానించారు. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని సూచించింది. బాధితులు, వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది జుబేదా బేగంని నియమించింది. ఆ వీడియోలు చూశారా? సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలనీ జస్టిస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ బెంచ్ ఆదేశించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగం వీడియోని చూశారా? అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పోలీస్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) రాజేష్ డియోలను కోర్టు ప్రశ్నించింది. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్‌ని తాను చూడలేదనీ తుషార్ మెహతా జవాబిచ్చారు. బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మల వీడియోలను తాను చూశాననీ, మిశ్రా వీడియోను మాత్రం చూడలేదని రాజేష్ డియో కోర్టుకి వెల్లడించారు. అనంతరం కోర్టులో బీజేపీ నేతల వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు. సుప్రీం అక్షింతలు హింసను సకాలంలో గుర్తించడంలో, విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ నిర్లక్ష్యం 20కి పైగా పౌరుల మరణానికి దారి తీసిందని పోలీసులను ధర్మాసనం మందలించింది. అయితే సీఏఏపై చెలరేగిన హింసకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హింస చెలరేగిన సందర్భంలో ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా చట్టబద్దంగా వ్యవహరించాలని పోలీసులకు హితబోధ చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. షహీన్ బాఘ్ నిరసనలకు సంబంధించిన విషయాల్లోకి వెళ్ళడానికి ‘అనుకూల వాతావరణం అవసరమని’ వ్యాఖ్యానించింది. ఘర్షణలు జరిగిన ప్రాంతం నుంచి వ్యాన్‌లో తరలిపోతున్న ముస్లింలు -
భయపడవద్దు.. మాట ఇస్తున్నా: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీ పోలీసుల పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటికే 20 మంది మరణించగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి సమీక్షించేందుకు అజిత్ దోవల్.. మౌజ్‌పూర్, జఫ్రాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. స్పెషల్ సీపీ శ్రీవాస్తవ, అదనపు సీపీ అమన్‌దీప్ సింగ్‌తో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించారు.(ఢిల్లీ అల్లర్లు: కాల్చి పడేస్తా అన్నాడు.. దాంతో..) ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ... వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘ప్రేమ భావాన్ని పెంపొందించుకోవాలి. మనందరిదీ ఒకటే దేశం. మనమంతా కలిసే జీవించాలి. అంతా కలిసే దేశాన్ని ముందకు నడిపించాలి’’అని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురుపడిన ఓ విద్యార్థిని.. ‘‘ నేను స్టూడెంట్‌ని. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నా. నిద్ర కూడా పట్టడం లేదు. కఠిన చర్యలు తీసుకోండి’’ అని కోరింది. ఇందుకు స్పందించిన దోవల్... ‘‘ నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. ప్రభుత్వం వీటికి బాధ్యత వహిస్తుంది. పోలీసులు పనిచేస్తున్నారు. మాట ఇస్తున్నా. మీకేం కాదు’’ అని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ‘‘ చట్టబద్ధమైన సంస్థల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పోలీసుల పనితీరు బాగుంది. ప్రజలు కూడా ఈ విషయంలో సంతృప్తికరంగానే ఉన్నారు’’అని పేర్కొన్నారు. . #WATCH Delhi: National Security Advisor (NSA) Ajit Doval interacts with the local residents of #NortheastDelhi. While speaking to a woman resident he says, "Prem ki bhaavna bana kar rakhiye. Hamara ek desh hai, hum sab ko milkar rehna hai. Desh ko mil kar aage badhana hai." pic.twitter.com/Y1tyAz2LXQ — ANI (@ANI) February 26, 2020 -
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వనున్న ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ పదవి ఏర్పాటుకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఓకే చెప్పింది. కార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సీడీఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీడీఎస్‌గా నియమితులయ్యే వారు నాలుగు నక్షత్రాలతో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని, త్రివిధ దళాధిపతులతో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు. సీడీఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు, బాధ్యతలపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికనూ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదించిందని అధికారులు తెలిపారు. తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్? దేశ రక్షణ రంగానికి తలమానికంగా చెప్పుకునే సీడీఎస్ పదవికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 31న రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌కానున్నారు. సీడీఎస్ హోదా త్రివిధ దళాల అధిపతులకు సమానంగా ఉంటుందని, ప్రోటోకాల్ ప్రకారం ఆయన త్రివిధ దళాల కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని అధికారులు వివరించారు. ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం అందుకు తగిన ఏర్పాట్లు చేయడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. రూ. 6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన ఐదేళ్లపాటు ఏడు రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అటల్ భూజల్ (అటల్ జల్) పథకాన్ని రూ. 6 వేల కోట్లతో అమలు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు నిధులు: స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు గాను అదనంగా రూ. 1854.67 కోట్లను మంజూరు చేసేందుకు అంగీకరించింది. దేశాన్ని అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలుగా పర్యాటక మౌలిక వసతుల స్థాపన ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌లో మొత్తం 15 సర్క్యూట్లు ఉన్నాయి. రైల్వేలో సంస్థాగత మార్పులు సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సంస్థాగత పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే విభాగానికి సంబంధించి ఎనిమిది గ్రూప్–ఏ సర్వీసులను ఏకీకృతం చేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్(ఐఆర్ఎంఎస్)గా పరిగణించాలని నిర్ణయించారు. రైల్వే బోర్డును పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇకపై రైల్వే బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసెస్‌ను ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్(ఐఆర్‌హెచ్‌ఎస్)గా మార్చనున్నారు. -
‘హద్దు’పై భారత్, చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరుదేశాల ప్రతినిధులు శనివారం సమావేశం కానున్నారు. భారత్ తరఫున జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ చర్చల్లో పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు సమస్యలపై జరిగే సమావేశానికి రెండు దేశాల తరపున ప్రత్యేక ప్రతినిధులుగా అజిత్ దోవల్, వాంగ్ యీ వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చర్చల తరువాత చైనా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇక్కడకు వస్తుండటం గమనార్హం. ఢిల్లీలో శనివారం జరిగే సమావేశంలో ఇరుదేశాల ప్రతినిధులు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మాట్లాడతారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం 3,448 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉన్న సమస్యలపై ఇరుదేశాలు ఇప్పటికే 20 దఫాల చర్చలు జరిపాయి. -
హిందూ, ముస్లిం మత పెద్దలతో దోవల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో హిందూ ముస్లిం మత పెద్దలతో ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో భేటీ అయ్యారు. యోగా గురు బాబా రాందేవ్, స్వామి పరమాత్మానంద్, స్వామి చిదానంద్ సరస్వతి, అవదేశానంద మహరాజ్, షియా క్లరిక్ మౌలానా కల్బేజవాద్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తీర్పు తదనంతర పరిణామాలపై చర్చించారు. ప్రతిష్ఠాత్మక కేసులో తీర్పు వెలువడిన సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా ఇరువర్గాలు సంయమనం పాటించిన తీరును అజిత్ దోవల్ ప్రశంసించారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంతోపాటు భవిష్యత్‌లోనూ సామరస్యంగా వ్యవహరించాలని సంయుక్త తీర్మానం ఆమోదించాయి. -
ఉగ్ర ప్రోత్సాహకులపై చర్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది. పార్లమెంట్‌కు అవమానకరం: కాంగ్రెస్ కశ్మీర్లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జవాన్లతో మోదీ దీపావళి జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు. -
ప్రధాని మోదీతో ఈయూపీ బృందం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ప్యానెల్ (ఈయూపీపీ) అక్టోబర్ 29న జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ సందర్బంగా 28 మంది సభ్యులతో ఈయూపీ ప్యానెల్ ప్రధాని నరేంద్రమోదీతో పాటు, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను సోమవారం కలిసింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని మోదీ ప్యానెల్ సభ్యులకు వివరించారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈయూపీ ప్యానెల్ సభ్యులు కశ్మీర్లో ఉన్న ప్రజలు, స్థానిక మీడియా, డాక్టర్లతో మాట్లాడితే బాగుంటుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన తల్లి ట్వీటర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. ప్రపంచానికి జమ్మూకశ్మీర్‌కు మధ్య ఉన్న లోహపుతెర ఎత్తాల్సిన అవసరం ఉందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన పరిస్థితులకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. మెహబూబా ముఫ్తీ ట్విటర్ అకౌంట్‌ను ఇల్తిజా హాండిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కశ్మీర్ విషయంలో అబద్ధాలు చెబుతోందని ఇల్తీజా ఆరోపించారు. రెండు నెలలకు పైగా కశ్మీరీ పౌరులు నిర్భంధంలో ఉన్నారని పేర్కొన్న ఆమె చాలా ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. వాస్తవాలు బయటకు రాకుండా ప్రభుత్వం స్థానిక మీడియాను బెదిరింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు. -
ఉగ్రమూకలకు ఫండ్స్.. కరెక్ట్‌గా స్పాట్ పెట్టాం!
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న విదేశీ సంస్థలకు కరెక్ట్‌గా చెక్ పెట్టామని, ఉగ్రవాదానికి నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ద్వారా ఆయా విదేశీ సంస్థలపై సరైనరీతిలో ఒత్తిడి తీసుకురాగలిగామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం టాప్ పోలీసుల సదస్సులో దోవల్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమగ్రమైన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలకు అందుతున్న నిధులపై ఎన్ఐఏ గట్టిగా చెక్ పెట్టడం, యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ గ్రూప్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఏఫ్ గట్టి చర్యలు తీసుకుందని, ఇది పాకిస్థాన్‌పై ఒత్తిడిని పెంచిందని పేర్కొంటూ.. సరైన ఆధారాలు, సమాచారం సేకరించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రాల్లోని యాంటీ టెర్రరిస్ట్ టీమ్స్‌ను.. ఆయన ఉగ్రవాద వ్యతిరేక సైనికులుగా అభివర్ణించారు. ‘మీరు కేవలం దర్యాప్తు అధికారులు కాదు.. ఉగ్రవాద వ్యతిరేక సైనికులు. కేవలం దర్యాప్తు చేయడమే కాదు.. ఉగ్రవాదంపై సమగ్ర పోరాటాన్ని చేయాలి. కేవలం నిఘా సంస్థలే దీనిని చేయలేవు. దర్యాప్తు అధికారులు ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లను మించి లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని సూచించారు. -
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ
జెడ్డా: జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ విషయంలో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా తమకు అండగా ఉంటుందని పాక్ భావించింది. అయితే, తాజాగా పాక్‌కు షాక్ ఇస్తూ కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని సౌదీ అరేబియా సమర్థించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ బుధవారం సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి.. కశ్మీర్ విషయంలో భారత వైఖరిని వివరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి సమావేశం దాదాపు రెండుగంటలపాటు సాగింది. ఈ భేటీలో దోవల్‌తో యువరాజు సల్మాన్ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో భారత చర్యల పట్ల తన సానుకూలతను తెలిపినట్టు తెలిసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హుటాహుటిన సౌదీ అరేబియాలో పర్యటించి.. ఆ దేశ మద్దతును కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ విషయంలో భారత వైఖరికి అనుగుణంగా సౌదీ రాజు మద్దతు పలుకడం పాక్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దోవల్-సల్మాన్ భేటీలో కశ్మీర్ అంశంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. భారత్-సౌదీ అరేబియా బంధాన్ని మరింత దృఢపరుచుకునేదిశగా దోవల్ సౌదీ పర్యటన సాగింది. -
ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది. సెప్టెంబర్ 10వ తేదీన పంపినట్లు ఉన్న ఈ లేఖలో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. అలాగే ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిందన్‌లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, అదీ ఎయిర్‌బేస్ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
అమిత్ షాతో అజిత్ దోవల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్థితిని స్వయంగా సమీక్షించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబా సహా ఇతర అధికారులతో సోమవారం భేటీ అయ్యారు. కశ్మీర్లో పది రోజుల పాటు మకాం వేసి అక్కడి పరిస్థితులను చక్కబెట్టి దేశ రాజధానికి తిరిగివచ్చిన అనంతరం ధోవల్ అమిత్ షాతో భేటీ కావడం ఇదే తొలిసారి. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం అమిత్ షాతో చర్చకు వచ్చిన అంశాలపై మాట్లాడేందుకు దోవల్ నిరాకరించారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ రాష్ట్రంలో భద్రతను ముమ్మరం చేయడంతో పాటు నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించారు. -
ఢిల్లీ చేరుకున్న అజిత్ దోవల్
న్యూఢిల్లీ : జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్‌లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన దోవల్.. అక్కడ వివిధ వర్గాల వారితో చర్చలు జరిపారు. అలాగే ఉగ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రత బలగాలకు సూచనలు చేశారు. అలాగే అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్ పర్యటనలో భాగంగా దోవల్ షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బక్రీద్ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి పరిస్థితులపై ఏరియల్ సర్వే కూడా చేపట్టారు. -
మిలిటెంట్ల డెన్‌లో అజిత్ దోవల్ పర్యటన
అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శనివారం అనంత్‌నాగ్‌లో పర్యటించారు. అక్కడి స్థానికులతో ముచ్చటించారు. ఉగ్రవాదులకు అడ్డగా పేరొంది.. జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీకి కేంద్రంగా ఉన్న అనంత్‌నాగ్‌లో అజిత్ దోవల్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంత్‌నాగ్‌లో ఇటీవల పెద్దసంఖ్యలో ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో స్థానికంగా పర్యటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అజిత్ దోవల్ స్థానికులతో మమేకమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంత్‌నాగ్‌లో పర్యటించిన దోవల్.. వీధుల్లో తిరుగుతూ తనకు ఎదురుపడిన స్థానికులతో మాట్లాడారు. పిల్లలతో సరదాగా ముచ్చటించారు. మౌల్వీలు, కార్మికులు, పాదచారులు.. ఇలా అనేక మందితో మాటామంతి కలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ గొర్రెల వ్యాపారి దోవల్‌తో మాట్లాడుతుండగా.. అతన్ని మరొకరు ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. దీనికి అతను తెలియదని బదులిచ్చాడు. అదేం పెద్ద సమస్య కాదని దోవల్ బదులిచ్చారు. మరో వీడియోలో నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ బంధువులతో, ఇతరులతో మాట్లాడటం కష్టంగా ఉందని దోవల్‌కు పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి దోవల్ స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికుల్లో విశ్వాసం కల్పించేలా స్థానికులతో మాటా-మంతి కలిపారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దోవల్ వారిని ప్రశ్నించగా.. అంతా బాగుందని వారు బదులిచ్చారు. ‘ఔను. అంతా కుదురుకుంటుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించే రోజులు వస్తాయి. ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మీ భద్రత, సంక్షేమం కోసం మేం తపిస్తున్నాం. రానున్న తరాల అభివృద్ధి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం’ అని దోవల్ వారితో తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్య అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారిలో దోవల్ భరోసా నింపారు. ఈ మేరకు షోపియన్ జిల్లాలో స్థానికులతో దోవల్ భోజనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయాలను స్థానికులు స్వాగతిస్తున్నారని, లోయలో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని దోవల్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, షోపియన్‌లో స్థానికులతో దోవల్ భోజనం చేసిన వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు. పైసాలిస్తే ఎవరైనా మీతో కలిసివస్తారంటూ ఆయన ఎద్దేవా పూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. -
కశ్మీర్ గ్రౌండ్ రిపోర్ట్ : అంతా నార్మల్..
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో క్షేత్రస్ధాయిలో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కేంద్రానికి నివేదిక సమర్పించారు. కేంద్రం నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారని, క్షేత్రస్ధాయిలో పరిస్థితి సంతృప్తికరంగా ఉందని హోంమంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో అధికారాలు, బాధ్యతల బదలాయింపు సజావుగా సాగేలా కశ్మీర్లో అజిత్ దోవల్ తనవైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు పట్ల కశ్మీరీలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఎలాంటి ఆందోళనలూ లేవని.. ప్రజలు తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారని అజిత్ దోవల్ కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. మరోవైపు సాధారణ పరిస్థితులు నెలకొన్న క్రమంలో జమ్మూ కశ్మీర్ మరలా రాష్ట్ర హోదా పొందుతుందని, ఎప్పటికీ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్నది తమ అభిమతం కాదని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను స్థానిక ప్రజలు స్వాగతిస్తున్నారని దోవల్ తన నివేదికలో పొందుపరిచారు. -
జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం
కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను జమ్మూకశ్మీర్‌కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను పంపనున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనికులను విమానాల్లో జమ్మూ కశ్మీర్‌కు తరలించనున్నట్లు సమాచారం. కశ్మీర్ లోయలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల జమ్మూ కశ్మీర్లో పర్యటించి అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఆయన కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమర్నాథ్ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 40 వేల అదనపు బలగాలను జమ్మూ కశ్మీర్‌కు పంపింది. అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి తరలివెళ్లాయి. లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకే అదనపు బలగాలను పంపుతున్నట్టు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. భయబ్రాంతులకు గురిచేస్తున్నారు జమ్మూకశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను తరలించడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసేందుకే అదనపు బలగాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్లో శాంతి భద్రతలకు లోటు లేదని, అయినప్పటికీ బలగాలను తరలించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సమస్యలు ఉన్నాయని, వాటిని బలగాలతో పరిష్కరించలేరన్నారు. అదనపు బలగాల తరలింపుపై కేంద్రం మరోసారి పురరాలోచించాల్సిన అవరసరం ఉందన్నారు. కాగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. Centre’s decision to deploy additional 10,000 troops to the valley has created fear psychosis amongst people. There is no dearth of security forces in Kashmir. J&K is a political problem which won’t be solved by military means. GOI needs to rethink & overhaul its policy. — Mehbooba Mufti (@MehboobaMufti) July 27, 2019 -
‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్
గుర్గావ్: ‘పుల్వామా ఘటనను దేశం మరిచిపోలేదు, మర్చిపోదు. ఇటువంటి చర్యలపై దేశ నాయకత్వం సమర్థంగా, దీటుగా బదులిస్తుంది’ అని జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. సీఆర్పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో దోవల్ మాట్లాడారు. ఈ సందర్భంగా పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. అమరులైన జవాన్లు, వారి కుటుంబాలకు దేశం ఎన్నడూ రుణ పడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీరు నిండైన ఆత్మస్థైర్యంతో ఉంటే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. చరిత్ర చెప్పేది కూడా ఇదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలహీనమైన అంతర్గత రక్షణ వ్యవస్థలున్న 60 వరకు దేశాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం, సార్వభౌమత్వం కోల్పోవడం వంటివి సంభవించాయి’ అని తెలిపారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాల నుంచి యుద్ధ క్షేత్రాలకు సత్వరం తరలివెళ్లి బాధ్యతలు చేపట్టడంలో సీఆర్పీఎఫ్ ముందుందని కొనియాడారు. దేశంలో భద్రతాపరమైన సవాళ్లు తలెత్తిన ప్రతిచోటా సీఆర్‌పీఎఫ్‌నే కీలకంగా ఉంటుందని చెప్పారు. గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించిన సాహస అవార్డులను ఈ సందర్భంగా దోవల్ జవాన్లకు అందజేశారు. కాగా, 1939లో బ్రిటిష్ పాలనలో ‘క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్’ పేరుతో ఏర్పాటైన ఈ విభాగం పేరును దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో సీఆర్పీఎఫ్గా మార్చారు. ప్రస్తుతం 246 బెటాలియన్లు, 3 లక్షల మంది జవాన్లతో దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తోంది. -
భారత్‌కి అమెరికా నుంచి పెరుగుతున్న మద్దతు
-
సంకీర్ణ ప్రభుత్వాలంటే భయమేల?
సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. తర్వాత వచ్చిన చంద్రశేఖర్, వాజపేయి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే అయినా నాటి, నేటి సుస్థిర ప్రభుత్వాలు కూడా చేపట్టలేని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నాయి. అందుకే మన భవిష్యత్తుకు సుస్థిర ప్రభుత్వాలు అవసరం అంటున్న అజిత్ దోవల్ ప్రతిపాదన వాస్తవ సమ్మతం కాదు. రాబోయే పదేళ్ల కాలానికి భారత్‌కు కఠిననిర్ణయాలు తీసుకోగలిగే, సుస్థిరమైన, మెజా రిటీ ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉందంటూ, ఈ గురువారం సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ చేసిన వ్యక్తీకరణపై అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఆయనపై ఈ రకమైన దాడి అభ్యంతరకరమైనది. జాతీయ భద్రతా సలహాదారు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆ పదవి రాజకీయ నియామకంతో కూడినది. కాబట్టి తన ఓటింగ్ ప్రాధాన్యతలను ఆయన దాచుకోవలసిన అవసరం లేదు. అలాంటి నిర్ణయాత్మకమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ మాత్రమే అందించగలరని దోవల్ పేర్కొన్నా.. నేను ఆయనతో ఘర్షణకు దిగను. దోవల్ చేసిన రాజకీయ ప్రతిపాదనపై కాకుండా ఆయన ప్రాథమిక వాదనపైనే నేను చర్చిస్తాను. సుస్థిరమైన, బలమైన, పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు మాత్రమే భారత్‌కు మంచి చేస్తాయని, సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరమైనవని, అయోమయంతో కూడినవని, అస్పష్టమైనవని, అనిశ్చితమైనవని, అవినీతికరమైనవని, బ్లాక్‌మెయిల్‌కి వీలు కల్పిస్తాయని అజిత్ దోవల్ మౌలిక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదన.. వాస్తవాల నిర్ధారణలో నిలబడటం లేదు. ముందుగా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఈ రంగంలో డేటాకు పక్షపాతం ఉండదు. మన రాజకీయ చరిత్రను రెండు సుస్థిర దశలుగా విభజించవచ్చు. ఒకటి 1952–89 కాలానికి చెందింది. ఈ 37 సంవత్సరాల్లో దేశం దాదాపుగా సుస్థిరతను చవిచూసింది. 1970ల చివర్లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి కానీ సాధారణంగా ఒకే పార్టీ అటు కేంద్రం లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ పాలన సాగించిన కాలమది. ఆ దశలో దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు సుస్థిరతను సాధిం చాయి. ఒక పార్టీ నియంత్రణలో శక్తిమంతంగా అవతరించాయి. అది కూడా తిరుగులేని ఒకే కుటుంబం అంటే గాంధీల కుటుంబ యాజమాన్యంలోనే ప్రభుత్వాలు నడిచేవి. 1984–89లో లోక్‌సభలో గాంధీల పాలన దాదాపు 80 శాతం మెజారిటీని సాధించింది. ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదిస్తున్న సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ‘దోవల్ సిద్ధాంతం’ సరైందే అయితే, ఆ నాలుగు దశాబ్దాల కాలంలో భారత్ అత్యుత్తమ అభివృద్ధిని సాధించి ఉండాలి. కానీ వాస్తవానికి అది 3.5 శాతం కంటే తక్కువ ‘హిందూ అభివృద్ధి రేటు’నే అందివ్వగలిగింది. ఇక రెండోది అస్థిరమైన యుగం. 1989లో రాజీవ్ గాంధీ పరాజ యంతో ఇది మొదలైంది. 2014 వరకు అంటే 25 ఏళ్ల పూర్తికాలం ఈ అస్థిర పాలనా దశ కొనసాగింది. సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. 1996లో పీవీ హయాం ముగిశాక, తదుపరి ఎనిమిదేళ్ల కాలంలో భారత్ అయిదుగురు సంకీర్ణ కూటమి ప్రధానులను, నాలుగు సార్వత్రిక ఎన్నికలను చవి చూసింది. అయిదుగురు ప్రధానులు అని అంటున్నామంటే.. దేవేగౌడ, ఎల్కే గుజ్రాల్ స్వల్పకాలిక ప్రభుత్వాలతోపాటు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా మొదట 13 రోజులపాటు తర్వాత సంవత్సరం పాటు, చివరగా పూర్తికాలం పాలన చేశారు కదా. ఇప్పుడు చూద్దాం. 1991లో మన్మోహన్ సింగ్ తర్వాత రెండవ అత్యంత సంస్కరణాత్మక బడ్జెట్ ఏదంటే 1997 నాటి పి. చిదంబరం ‘డ్రీమ్ బడ్జెట్’ అని చెప్పాలి. ఈ డ్రీమ్ బడ్జెట్లోనే పన్నులు, వడ్డీరేట్లు తగ్గించారు. ఆదాయాన్ని స్వచ్చందంగా వెల్లడించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ కాలంలోనే జాతీయ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ మార్కెట్లో ప్రవేశించడానికి తలుపులు తెరిచారు. తద్వారా ప్రైవేటీకరణకు నాంది పలికారు. దేవేగౌడ–గుజ్రాల్ ప్రభుత్వాలను ‘రోజు కూలీ’పై పనిచేసే ప్రభుత్వాలుగా వ్యంగ్యంగా పేర్కొనేవారు. తమాషా ఏమిటంటే మన దేశ చరిత్రలో వామపక్ష భావజాలం అధికంగా కలిగిన ప్రభుత్వాలు ఇవే మరి. మొట్టమొదటిసారిగానే కాదు.. చివరిసారిగా కూడా ఇద్దరు కమ్యూనిస్టు మంత్రులను కలిగిన కేంద్ర ప్రభుత్వాలు ఇవే. వాజ్‌పేయి స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను ప్రారంభించడానికి, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి, 11 ప్రభుత్వరంగ సంస్థలను, రెండు డజన్ల ఐటీడీసీ హోటళ్లను అమ్మేయడానికి తగిన శక్తిని కలిగి ఉండేవారు. అయితే గత నాలుగున్నర ఏళ్లలో అత్యంత శక్తివంతమైన మోదీ ప్రభుత్వం కనీసం ఒక్కటంటే ఒక్క పీఎస్‌యూని అమ్మలేకపోయింది. చివరకు ఎయిర్ ఇండియా వంటి అసమర్థ సంస్థను కూడా అది వదిలించుకోలేకపోయింది. 1989–2004 మధ్యలో సాగిన 15 ఏళ్ల అస్థిర శకంలో అతిస్పల్పకాలం మనగలిగిన ప్రభుత్వం చంద్రశేఖర్ ప్రభుత్వంగా చెప్పాలి. ఇది కేవలం నాలుగు నెలలు మాత్రమే పాలన సాగించింది. దీన్ని ‘క్యాష్ అండ్ క్యారీ’ ప్రభుత్వంగా అపహాస్యం చేసేవారు. ఎందుకంటే కేవలం 50 మంది సొంత ఎంపీలను మాత్రమే కలిగిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బయటనుంచి ఇచ్చే మద్దతుపైనే ఆధారపడ్డారు. కానీ విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించడానికి ఈయన ప్రభుత్వమే భారత్ బంగారు నిల్వలను విదేశాలకు తరలిం చింది. సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వం, చివరకు మోదీ ప్రభుత్వం కూడా దీనికి సాహసించేదని నేను భావించలేను. యశ్వంత్ సిన్హాను తన ఆర్థికమంత్రిగా తీసుకొచ్చిన చంద్రశేఖర్ మరోవైపు డాక్టర్ మన్మో హన్ సింగ్‌ని శక్తివంతమైన ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆ హోదాలో మన్మోహన్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాగలిగేవారు. తదనంతర సంవత్సరాల్లో ఈ ఇద్దరే మన సంస్కరణల రూపశిల్పులుగా అవతరించారు. బలహీనమైన సంకీర్ణ కూటముల హయాంలోనే ఇది చోటుచేసుకుంది. స్థిరంగా 37 ఏళ్లపాటు మన అభివద్ధి రేటును పరిశీలిస్తే అది సగటున 3.5శాతంకు తక్కువే. తర్వాత పాతికేళ్లలో అది 5కు చేరుకుంది. ప్రస్తుతం 7కంటే ఎక్కువే నమోదవుతోంది. పాతదానికంటే రెట్టింపు అయ్యింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు స్థిరమైన ప్రభుత్వాలకు, వృద్ధిరేటుకు మధ్య గ్రాఫ్ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ, జాతీయ భద్రత విషయానికి వస్తే సంకీర్ణ ప్రభుత్వాలు అసమర్థమైనవని భావిస్తారు. 1989–90 మధ్య వీపీ సింగ్ హయాంలో మినహాయిస్తే, జాతీయభద్రత విషయంలో మన ప్రభు త్వాలు బలహీనంగా ఎప్పుడూ లేవు. ఆ ప్రభుత్వంలోనూ దోవల్ పని చేశారు. పంజాబ్, కశ్మీర్‌లలో పరిస్థితులు చేయిదాటి పోతుంటే చూస్తూ ఊరుకున్నారు. తర్వాత అవకాశం వచ్చింది. తన సత్తా నిరూపించుకున్నారు. ఇంతకు ముందు నేను రాసినట్టు, పంజాబ్‌లో చంపేసిన ప్రతి ‘ఏ’ కేటగిరీ ఖలిస్తానీ చొరబాటుదారుడినీ ‘గిల్ పట్టుకున్నాడు, దోవల్ పని పట్టాడు’అనే అభివర్ణించారు. చొరబాట్లను రూపుమాపడంలో ఐబీ, పంజాబ్ పోలీస్ మధ్య అది ఓ చక్కని ఆపరేషన్. ఇదే పద్ధతిలో 1991–96మధ్య అస్తవ్యస్థంగా వున్న çకశ్మీర్‌ని అదుపులోకి తీసుకొచ్చారు. దోవల్ కెరీర్ ఎదుగు దలకు ఇవన్నీ దోహదపడ్డాయంటే, అందుకు ఏమాత్రం చరిష్మాలేని ప్రధాని ఆధ్వర్యంలోని బలహీనమైన మైనార్టీ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అత్యంత శక్తిమంతురాలిగా వున్నప్పటికీ పోఖ్రాన్–1 పరీక్షలను అణుబాంబు ప్రయోగంగా చెప్పు కోడానికి ఇందిర సాహసించలేదు. శాంతి యుత ప్రయోజనాలకే అణు ప్రయోగాలు అనే ముసుగు కప్పుకోక తప్పలేదు. 24ఏళ్ల తర్వాత బల హీనమైన వాజ్‌పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వం అటువంటి ముసుగులు వేసుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం ఎంత బలహీనమైన దంటే పోఖ్రాన్–2 పరీక్షలు జరిగిన 11 నెలలకే ఒక్క ఓటు తక్కువ కావడంతో కూలిపోయింది. పోఖ్రాన్–2 పరీక్షలు సాహసోపేతమైన విధాన నిర్ణయం అను కుంటే, యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని ఏమనాలి? మన్మోహన్ ప్రభుత్వం వామపక్ష పార్టీలపై ఆధారపడి ఉంది. పార్లమెంట్లో తన ప్రభుత్వం ప్రమాదంలో వున్నప్పటికీ ప్రపంచం దృష్టిలో భారత్ వ్యూహాత్మక దృక్పథాన్ని మార్చివేశారు. యూపీ ఏ–2 హయాంలో కూడా ఇలాగే రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానిం చారు. మోదీ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని అప్పనంగా స్వీకరించింది. కానీ, రిటైల్ రంగంలో ఎఫ్డీ ఐల వ్యవహారాన్ని ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇందులో దృక్ప థానికి సంబంధించిన విభేదాలేమీ లేవు. ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత, విధానాలకు సంబంధించిన అంశాల్లో స్థిరమైన ప్రభుత్వాలకంటే అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు చాలా నిర్ణయాత్మకంగా, ధైర్యంగా వ్యవహరించాయని దీన్నిబట్టి మనకుఅర్థమవుతుంది. మన నేతలు పరిపూర్ణులేమీ కాదు. కానీ, వాళ్లకు ఏది మంచో వాళ్లకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక వదులుకోడానికి ఇష్టపడరు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంటే, శాంతిభద్రతలు కొనసాగుతుంటే ప్రజలు వారిని మళ్లీ ఎన్నుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వం అస్థిరమైనది. దాంతో నేతలు సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలు వెతుక్కుంటారు. ఇతరులు చెప్పేది వింటారు. స్థిరమైన ప్రభుత్వాలు నేతలను సుఖంగా, పొగరుగా, వ్యక్తిగత రాగద్వేషాలతో ఉండేలా చేస్తాయి. ఇందిర, రాజీవ్ నుంచి మోదీ వరకు రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం ఇదే. అందుకే మనం సంకీర్ణ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
బలహీన ప్రభుత్వాలు మంచివి కావు: దోవల్
న్యూఢిల్లీ: రానున్న పదేళ్లు భారత్‌కు దృఢమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు మంచివి కావని, జాతీయ, రాజకీయ, ఆర్థిక పరమైన లక్ష్యాలను సాధించడానికి దృఢమైన ప్రభుత్వమే కావాలని ఆయన పేర్కొన్నారు. గురువారం సర్దార్ పటేల్ మెమోరియల్ ‘డ్రీమ్ ఇండియా 2030– అవాయ్డింగ్ ద పిట్ఫాల్స్’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బలహీనమైన ప్రజాస్వామ్యాలు దేశాన్ని మరింత బలహీనంగా మార్చగలవు. రానున్న కొన్నేళ్లలో భారత్ అలాంటి వాటికి తలొగ్గకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నప్పుడు రాజీపడాల్సి వస్తుందని, ఎప్పుడైతే రాజీ పడతామో అప్పుడు జాతీయత కన్నా రాజకీయ మనుగడకే ప్రాధాన్యం ఉంటుందని ఉద్ఘాటించారు. విచ్ఛిన్న రాజకీయాలు, బలహీనమైన ప్రభుత్వాలు భారత్ లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుపడతాయన్నారు. ఇందుకు దోవల్ తన ప్రసంగంలో బ్రెజిల్‌ను ఉదహరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందున్న బ్రెజిల్.. రాజకీయ అస్థిరత కారణంగా వృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. -
అపరిమితాధికారం.. అతి ప్రమాదకరం
ఇండియాలో అత్యంత శక్తిమంతమైన భద్రతా వ్యవస్థకు అధిపతిగా అజిత్ దోవల్ అవతరించారు. అయితే, అధికారాలన్నీ ఆయన చేతిలో కేంద్రీకృతం చేయడంతో దొంతరల రూపంలో ఉన్న మన భద్రతా వ్యవస్థకు కీడే జరుగుతుంది. ఇందిర హయాంలో మాదిరిగా దేశ భద్రత విషయంలోప్రధానికే సర్వాధికారాలు ఇస్తే, కీలకమైన కేంద్ర మంత్రులు రబ్బరు స్టాంపులుగా మారతారు! ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ ప్రధాన విషయంలో గట్టి చర్చ అవసరం. భారత ప్రభుత్వంలోని భద్రతా వ్యవస్థను భూమితో పోల్చవచ్చు. మార్పులకు అనుకూలంగాని పొరలతో కూడిన ఈ వ్యవస్థలో భూమిలో మాదిరిగానే మార్పులు అతి స్వల్పంగా ఉంటాయి. భూమిలోని పొరల మధ్య తీవ్ర రాపిడి ఉంటే కొంప మునుగుతుంది. భారత భద్రతా వ్యవస్థలో హఠాత్తుగా మార్పు తెస్తే అదే పద్ధతిలో ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రధాని నరేం ద్రమోదీ ఓ నోటిఫికేషన్ ద్వారా హడావుడిగా ఇంతటి మార్పునకు కారణమయ్యారు. దీంతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ కుమార్ దోవల్ నాయకత్వంలోని దేశ భద్రతా విధాన నిర్ణయ గ్రూపు(ఎస్పీజీ) కొత్త రూపు సంతరిం చుకుంది. దీని 18 మంది సభ్యుల్లో ఎప్పటిలాగానే త్రివిధ దళాల(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) అధిప తులు, ఇద్దరు నిఘాసంస్థల(ఐబీ, రా) అధిపతులు, రక్షణ, హోం, ఆర్థిక, అంతరిక్ష శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్, రెవెన్యూ కార్యదర్శి, ఇంకా దేశంలోనే అత్యంత సీనియర్ సివిల్ సర్వెంట్ అయిన కేబినెట్ కార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. కేబినెట్ సెక్రెటరీ రాజ్యాం గబద్ధమైన పదవి కాగా, ఎన్ఎస్ఏకు అలాంటి హోదా లేదు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎస్పీజీ సమావేశానికి ఏ ఇతర మంత్రిత్వశాఖ కార్యదర్శు లనైనా రమ్మని ఆదేశించే అధికారం ఎన్ఎస్ఏకు ఉంటుంది. రెండోది, ఎస్పీజీ నిర్ణయాలను కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు అమలు చేయడాన్ని కేబినెట్ సెక్రెటరీ సమన్వయం చేస్తారు. మూడోది, ఈ నోటిఫికేషన్‌పై సంతకం చేసింది ప్రధాని కార్యా లయం(పీఎంఓ) లేదా కేబినెట్ సెక్రెటేరియట్‌లోని సంబంధిత అధికారి కాదు. జాతీయ భ్రదతా మండలి(ఎన్ఎస్సీ)లోని జాయింట్ సెక్రెటరీ సంత కంతో ఇది విడుదలైంది. ఎస్పీజీని మొదట 1999 ఏప్రిల్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం తొలుత ఏర్పాటు చేసింది. కాని, తేడా ఏమంటే అప్పుడు ఇది కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉండడమే. అప్పట్లో ఎన్ ఎస్ఏ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు దీనికి ప్రత్యేక ఆహ్వానితులు. ఈ సంస్థ(ఎస్పీజీ) కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి పనిచేసేది. తాజా నోటిఫికేషన్ ప్రకారం దీని కార్యస్థలాన్ని జాతీయ భద్రతా మండలి సచివాలయానికి (ఎన్ఎస్సీఎస్)కి మార్చారు. దీనికి సారథ్యం వహించాల్సిన కేబినెట్ కార్యదర్శి దీని సభ్యునిగా మారడమేగాక, దాని నిర్ణయాలు అమలుచేసే అధికారి అయ్యారు. ఎస్పీజీ కొత్త అధిపతి ఎన్ఎస్ఏ. ఇది పెద్ద మార్పు. ఈ మార్పులను చూశాక, ‘కేబినెట్ క్లర్క్’ ఇప్పుడు ‘ఎన్ఎస్సీఎస్ క్లర్క్’గా అవరించాడని వ్యాఖ్యానిం చక తప్పదు. ఇలాంటి విచిత్రమైన మార్పుల వల్ల అత్యంత సున్నితమైన రంగంలో అతి తెలివి ప్రదర్శి ంచడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో గట్టి చర్చ అవసరం. కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలు తీసుకునే అధికారం కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి ఎనెస్సీఎస్కు బదిలీ చేయ డమే ఇక్కడ అత్యంత ప్రధాన మార్పు. కేబినెట్ సెక్రె టేరియట్లోనే పరిశోధన, విశ్లేషణ విభాగం(ఆర్ఏడ బ్ల్యూ–రా) ఉంటుంది. రాకు నిధులకు కూడా అక్కడి నుంచే వస్తాయి. ఎస్పీజీ నిర్ణయాలను కేబినెట్ సెక్రె టరీ అమలు చేస్తారు కాబట్టి సాంకేతికంగా చూస్తే పూర్వ స్థితి కొనసాగుతుందనిపిస్తుంది. కాని, అధి కారం ఆయన చేతిలోనో, కేబినెట్ చేతిలోనో ఉండదు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రధా నికి కీలక సలహాదారు ఎన్ఎస్ఏ కావడంతో తనకు అప్పగించిన అధికారంపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఆయనకు ఉందని చెప్పవచ్చు. అయితే, ఇలాంటి మార్పునకు కేంద్ర సర్కారులో కీలకమైన ఈ వ్యవస్థ తేలికగా అలవాటు పడుతుందా? చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి! ఈ మార్పు వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ మార్పు కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక మంత్రుల అధి కారాన్ని బలహీనపరచదా? వారి అధికారులు, త్రివిధ దళాల అధిపతులు వాస్తవానికి ఎస్పీజీ సమా వేశం నిర్ణయాలను వారికి తెలిపితే, కేబినెట్ కార్య దర్శి వాటిని అమలు జరిగేలా చూస్తారు. రెండు, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్)కు ఇక చేయడానికి పనేమి ఉంటుంది? కేబినెట్ తరహా పాలనా వ్యవస్థలో ఉమ్మడి బాధ్యత అత్యంత కీలకం. అంటే సీసీఎస్ సభ్యులందరికీ ఎలాంటి కీలకాం శంపైనైనా మాట్లాడవచ్చు. వారి మాటకు విలువ ఉంటుంది. అలాగే వారంతా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వారిలో ప్రధాని మాటకు ఎక్కువ విలువ అని చెప్పాల్సిన పనిలేదు. సీసీఎస్‌లో భిన్నా భిప్రాయం, చర్చ ఎంతో అవసరం, ఆరోగ్యకరం. ప్రధాని అధికార పరిధికి లోబడి పనిచేసే త్రివిధ దళా ధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన భారీ ఎస్పీజీ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు చర్చగాని, భిన్నాభిప్రాయం చెప్పడంగాని సాధ్యమా? ఏదైనా అంశంపై ప్రధాని అభిప్రాయం అప్పటికే తెలిస్తే– దానిపై వారేం చర్చిస్తారు? అంటే మిగిలిన నాలుగు బడా శాఖల(హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగం) మంత్రులు కేవలం రబ్బరు స్టాంపులుగా మారి పోతారు కదా? మూడోది, ఇది జరిగేది కాదను కోండి. అదేమంటే, రక్షణ బలగాల ఉమ్మడి అధిపతి నియామకం లేదా ఈ అవసరంపై చర్చ ఇక ఈ తాజా మార్పు వల్ల ఉండదు. బలమైన ప్రధాని ఉన్న ప్పుడు నిర్ణయాలు పై నుంచి కిందకే గాని, కింద నుంచి పైకి రావనే అభిప్రాయానికి సర్వామోదం లభిస్తుంది. ఇందిరాగాంధీ హయాంలో ఇదే జరి గింది. అయితే, అధికార కేంద్రీకరణ లాంఛనంగా, వ్యవస్థీకృతంగా ఇప్పుడు జరుగుతోంది. ఇక అడ్డ గోలు నిర్ణయాలకు అడ్డుకట్టవేసే వ్యవస్థ ఉండదు. రఫాల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రశ్న? రఫాల్ యుద్ధవిమానాల కొనుగోలు వివాదంపై సుప్రీంకోర్టు ఏ ప్రశ్న అడిగిందో ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ ఒప్పందం విషయంలో నిర్ణీత పద్ధతి అనుసరించారా? లేక ప్రధాని నిర్ణయం తీసుకుని ప్రకటించారా? ప్రధాని సదుద్దేశంతో నిర్ణయించినా దానికి అవసరమైన లాంఛనప్రాయమైన లిఖితపూ ర్వక పని జరిగిందా? ఇన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మార్పులకు అవకాశం లేకుండా పనిచేస్తున్న ఉన్నతాధికార సర్కారీ వ్యవస్థలు చురుకుగా కదలవు. మార్పు అవసరమే. అంటే, అనేక దొంతరలతో కూడిన రాజ్యాంగబద్ధ వ్యవస్థను ఒక్కసారిగా చిందరవందర చేసి కూలదోయడం భావ్యం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్– ఇలా ‘కులాల మాదిరిగా విడి విడిగా పనిచేసే’ ఉన్నతాధికార వ్యవస్థలను (నిజా నికి నేను ఈ మాట అనలేదు. ఇండియన్ పోలిస్ సర్వీస్–ఐపీఎస్ అధికారుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన వినతిపత్రంలో ఈ మాట వాడింది) ప్రతిభ ఆధారంగా తిన్నగా, సక్రమంగా పనిచేసేలా చేయాలి. ఇది ఒక్క ఐఏఎస్‌కే కాదు ఏ ముఖ్య సర్వీ సుకైనా వర్తిస్తుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచిత్రమైన పద్ధతి కారణంగా అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారి ఎవరూ ఇక రిటైరయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. వారిలో అత్యధికులకు ప్రభుత్వంలో పదవీ విరమణ చేశాక కూడా పదవులు వస్తాయి. కాగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో చాలా మంది రిటైర య్యాక ఇంటి దారిపట్టడమో లేదా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడమో జరుగుతుంది. ఇక్కడ సత్వరమైన –నిర్దిష్టమైనది కాని– ఏర్పాటు ఉంది: రా మాజీ అధినేత రాజిందర్ ఖన్నా ఇప్పుడు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. అతనికంటే ముందు ఆ స్థానంలో ఉన్న అలోక్ జోషిని ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఎన్టిఆర్ఓ చైర్మన్‌ని చేసేశారు. 65 ఏళ్లు సమీపించిన తర్వాత అయన్ని సాగనంపారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్ సతీష్ ఝాని నియమించారు. ఈయనను పదవీవిరమణ తర్వాత మొదట్లో ఎన్టిఆర్ఓ సలహాదారుగా నియమించారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ వచ్చింది. ఐబీ మాజీ అధినేత దినేశ్వర్ శర్మ జమ్మూ కశ్మీర్ వ్యవహారాల ప్రతినిధిని చేశారు. ఐబీ నుంచి రిటైరైన ఆర్.ఎన్.రవి నాగా వ్యవహారాల ప్రతినిధిగా ఉంటున్నారు. ఇప్పుడు తను డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా ఉంటున్నారు. రా మాజీ అధికారి అమితాబ్ మాథుర్‌ని టిబెటన్ వ్యవహారాల సలహాదారును చేశారు. రా సంస్థలో నంబర్ టూ స్థానంలో కూడా ఉన్న మాథుర్ మొదట ఎన్ఎస్సిఎస్లో ఇప్పుడు ఎన్ఎస్ఏబీ (జాతీయ భద్రతా సలహా మండలి)లో ఉంటున్నారు. వీరితో పాటు, కర్నాల్ సింగ్‌ని రిటైర్మెంట్ అనంతరం ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా చేశారు. మాజీ ఎన్ఐఏ అధిపతి అయిన శరద్ కుమార్ రైటైరయ్యాక ప్రస్తుతం విజిలెన్స్ కమిషర్‌గా ఉన్నారు. వీళ్లంతా రిటైరైన ఐఏఎస్ అధికారులే. ఎన్ఎస్సీఎస్ బడ్జెట్ 2016–17లో రూ.81 కోట్ల నుంచి 2018–19 నాటికి రూ. 333 కోట్లకు పెరిగింది. లెంట్రల్ లుటీన్స్లో ఎన్ఎస్సీఎస్ కొలువైనచోట ఉన్న సర్దార్ పటేల్ భవన్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అక్కడ ఒక కొత్త సామ్రాజ్యం నిర్మితమైంది. ఈ అంశంపై ఈ వారం మొదట్లో నేను చేసిన సాధారణ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించారు. ఆ స్పందన ప్రభుత్వ సమర్థకులు, దోవల్ అభిమానుల నుంచి కాకుండా ఐపీఏస్ అసోసియేషన్ సభ్యుల నుంచి రావడం సరదా కలిగించింది. మాజీ కాని స్టేబుల్స్ హోమ్ మంత్రిగా (సుశీల్‌కుమార్ షిండే), ఉపరాష్ట్రపతిగా (బైరన్ సింగ్ షెఖావత్) అవుతున్న ఈ దేశంలో ఒక రిటైరైన ఐపీఎస్ అధికారి అతి శక్తిమంతుడైన భద్రతా జారు కావడంలో సమస్య ఉంటుందని చెప్పగలనా? అయితే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే 1.34 బిలియన్లమంది ప్రజలున్న, అణ్వాయుధ సమేతమైన దేశంలో అత్యంత శక్తిమం తుడు కావచ్చునా అనేది మంచిప్రశ్నగా ఉంటుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
అజిత్ దోవల్‌కు ప్రమోషన్ యుద్ధానికేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘హెన్రీ కిస్సింజర్, జేమ్స్ బాండ్ 007ను కలిపితే జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్ దోవల్ అవుతారు’ అని ఆయన గురించి ‘కారవాన్ మాగజైన్’ గొప్పగా రాసింది. దేశానికి సంబంధించిన కీలకమైన సమస్యలను కూడా అత్యంత సూక్ష్మ దృష్టితో ఆయన పరిష్కరిస్తున్నారని ఆయన్ని పొగిడింది. ‘మోదీని దోవ్ ఎలా రక్షించారంటే’ అనే శీర్షిక పెట్టి మరీ ప్రశంసించింది. ఆయన గత నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగిన మాట వాస్తవమేగానీ ఆయన సాధించిన విజయాలేమిటో ! తెలియదు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాల్లో, విదేశాంగ విధానాల వ్యూహ రచనలో ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు సహాయకారిగా ఉంటారు. కశ్మీర్లో మిలిటెంట్ సమస్యను నిర్మూలించాలంటే ఎదురుదాడి వైఖరి అవలంభించడం ఒక్కటే మార్గమని సలహా ఇచ్చిందీ అజిత్ దోవల్. ఈ విషయాన్ని ఆయన కూడా గర్వంగా చెప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకంటే ఇప్పుడు కశ్మీర్లో మిలిటెన్సీ సమస్య ఎక్కువగా పెరిగింది. మిలిటెంట్లు, మిలటరీ మధ్య ప్రతిరోజూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇరువురు మధ్య స్థానిక ప్రజలు నలిగి పోతున్నారు. పాకిస్థాన్‌తోని సంబంధాలు మెరుగు పడకపోగా, మరింత దిగజారాయి. అమెరికాతోని, చైనాతోని సంబంధాలు మాత్రం కాస్త మెరుగయ్యాయి. రష్యా నుంచి క్షిపణలను కొనుగోలు చేయడం కొత్త విషయం కాదు. ఇరుదేశాల మధ్య ఈ కొనుగోళ్లు ఎప్పటినుంచో జరుగుతున్నవే. రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తే ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు పట్టించుకోకపోవడం ఒక్కటే ఇక్కడ మోదీగానీ, దోవల్‌గానీ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్‌కు రహస్య మిత్రుడేనాయే! ట్రంప్ విజయంలో పుతిన్ పాత్ర ఉన్న విషయం అందరికి తెల్సిందే. కారవాన్ మాగజైన్ అంతగా పొగిడినందుకో, తన విదేశీ టూర్లకు వ్యూహరచన చేసినందుకో ఏమోగానీ అజిత్ దోవల్‌ను మరింత అత్యున్నత పదవితో సత్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతా సలహాదారు కూడా స్వయంగా వచ్చి సలాం కొట్టాల్సిన ‘వ్యూహాత్మక విధాన కమిటీ’ అధిపతిగా దోవల్‌ను నియమిస్తున్నారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారుతోపాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, త్రివిధ దళాధిపతులు సభ్యులుగా ఉంటారు. త్రివిధ దళాధిపతులను ఆదేశించే సంపూర్ణ అధికారాలను కమిటీ అధిపతిగా దోవల్‌కు కల్పిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య లేదా ప్రభుత్వ ఉన్నతాధికారాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం కోసం ఇలాంటి కమిటీ ఉందంటే అర్థం ఉంది. ఇంతకాలం భారత్‌కు అవసరంరాని త్రివిధ దళాధిపతులను ఆదేశించే అధికారాలు కలిగిన కమిటీ ఇప్పుడు ఎందుకు అవసరం అయింది? అందులోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ అవసరం ఎందుకు వచ్చింది? ‘అఫెన్సే బెస్ట్ డిఫెన్స్’ అని నమ్మే దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం అంటే ఏ దేశంపై యుద్ధానికి సన్నాహాలు అనుకోవాలి? కాలమే సమాధానం చెబుతుంది. -
దేశమంతటికీ ఒకే రాజ్యాంగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 35(ఏ)పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని నీరుగార్చలేమని దోవల్ వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతోపాటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దోవల్ వ్యాఖ్యలను ఖండించని పక్షంలో.. కేంద్రమే కావాలని ఈ వ్యాఖ్యలు చేయించినట్లుగా భావించాల్సి వస్తుందన్నాయి. మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా దోవల్ మాట్లాడుతూ.. ‘వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేయడంపై మాత్రమే దృష్టిపెట్టలేదు. సంస్థానాలతోపాటు దేశమంతా ఒకటిగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్లారు. దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజల సార్వభౌమత్వం దేశమంతటికీ వర్తిస్తుంది. కానీ జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండడం.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతమంతా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా కింద ఉండాలని పటేల్ భావించారు. కానీ అప్పటి కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఇందుకు విభేదించారు’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం చాలామటుకు అహింసాయుతంగా కొనసాగడం వల్ల సరైన వేడి రాజుకోలేదని.. అందుకే దేశ ప్రజలకు స్వాతంత్య్రం విలువ అర్థం కావడం లేదని దోవల్ అభిప్రాయపడ్డారు. -
దోవల్ కొడుకు పొలిటికల్ ఎంట్రీ!
డెహ్రాడూన్ : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు శౌర్య దోవల్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధ చేసుకుంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పౌరీ ఘర్వాల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 43 ఏళ్ల శౌర్య దోవల్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఉన్నారనే విషయం తెలిసిందే. కాగా గత కొంత కాలంగా శౌర్య ప్రజలతో మమేకమవుతున్నారు. ‘బీమిసాల్ ఘర్వాల్ అభియాన్’ ద్వారా ఘర్వాల్ అభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ స్కీమ్‌లో ప్రజలను భాగస్వాములను చేయుటకోసం రెండు మొబైల్ నంబర్లను కూడా బ్యానర్లలో, కటౌట్లల్లో ప్రచురించారు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే అభియాన్‌లో భాగస్వామ్యులు కావాలని తెలియజేస్తారు. మరో నంబర్ ద్వారా ‘ మెరుగైన ఘర్వాల్ గురించి ఆలోచిస్తున్న వారు ప్రచారంలో పాల్గొనవచ్చు ఇది శౌర్య దోవల్ యొక్క చొరవ’ అని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఘర్వాలి భాషలో కూడా అందుబాటులో ఉంచారు. ఘార్వాలి జిల్లాతోపాటు చుట్టుపక్కల మరో ఏడు జిల్లాల్లో కూడా శౌర్య పోటోలతో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇదంతా శౌర్య పొలిటికల్ ఎంట్రీ కోసమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో శౌర్య దోవల్ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలొచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేరతారని పార్టీ వర్గాలు అన్నాయి. 2017 డిసెంబర్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో కూడా శౌర్య పాల్గొన్నారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలేదని శౌర్య అప్పట్లో అన్నారు ‘ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అది నా చేతుల్లో లేదు. కానీ బెమిసాల్ ఘర్వాల్, బులండ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తాను. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజకీయ బలం కూడా అవసరం అని అర్థమయింది’ అని శౌర్య ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా దోవల్ పొలిటికల్ ఎంట్రీ గురించి బీజేపీ పరోక్షంగా స్పందించింది. ‘ బెమిసాల్ ఘర్వాల్ ప్రచారం శౌర్య రాజకీయ ఎంట్రీకి ఉపయోగ పడుతుంది. ఈ ప్రచారంలో బీజేపీ పాల్గొనలేదు. అతనికి చాలా తెలివి ఉంది. ఉత్తరాఖండ్ సమస్యలపై ఆయనకు పట్టుఉంది. ఇలాంటి తెలివైన వాళ్లు రాజకీయాల్లోకి రావాలి’ అని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు అజయ్ భట్ పేర్కొన్నారు. -
‘విరుద్ధ ప్రయోజనాల్లో’ దోవల్ కొడుకు!
-
‘విరుద్ధ ప్రయోజనాల్లో’ దోవల్ కొడుకు!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కుమారుడు శౌర్యకు చెందిన ఓ సంస్థలో నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శౌర్యకు చెందిన ఇండియా ఫౌండేషన్ సంస్థలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సురేశ్ ప్రభు, జయంత్ సిన్హా, ఎంజే అక్బర్లు సభ్యులుగా ఉన్నారని, ఇది పరస్పర విరుద్ద ప్రయోజనాలను పొందడమేనని ‘ది వైర్’ వెబ్సైట్ కథనం రాసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ స్పందిస్తూ..‘ అమిత్–జయ్ షాల ఎపిసోడ్ ఘన విజయం సాధించిన అనంతరం బీజేపీ ఇప్పుడు అజిత్ దోవల్– శౌర్యాల కథను కొత్తగా ప్రారంభించింది’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. ఈ కథనం పూర్తిగా నిరాధారమని ఇండియా ఫౌండేషన్ స్పష్టంచేసింది. నలుగురు వ్యక్తులు మంత్రులు కాకముందే తమ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారంది. తమ సంస్థ విశ్వసనీయత, గౌరవం, వారసత్వంపై జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా ఫౌండేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న శౌర్య జెమినీ ఫైనాన్సియల్ సర్వీసెస్ అనే సంస్థను నిర్వహిస్తున్నారని ది వైర్ వెల్లడించింది. ఈ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఈసీఈడీ)సభ్యదేశాల నుంచి ఆసియా మార్కెట్లలోకి పెట్టుబడులు వచ్చేలా చూస్తుందని తెలిపింది. -
చైనా మందులకు చెక్
చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందా? ప్రధానంగా దిగుమతులపై దాడికి ధోవల్ రెడీ అవుతున్నారా? అనేక విషయాల్లో భారత్‌కు తలనొప్పులు తెస్తున్న చైనాను చావు దెబ్బ కొట్టేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందా? ఇంతకూ భారత్ మదిలో ఏముంది? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే. భారత్‌కు దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా తయారైనా చైనాకు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ముఖ్యంగా డోక్లాం వివాదం అనంతరం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో చైనా దిగుమతుల మీద ఆధాపరపడ్డటం మంచిది కాదన్న అభిప్రాయంతో భారత్ ఉంది. ఇప్పటి వరకూ భారత్ చైనా నుంచి ఎలక్ట్రానిక్, మెడికల్ ఎక్విప్మెంట్స్ను అధికంగా దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఫార్మాస్యుటికల్స్, వాటి తయారీకి ఉపయోగించే ముడి సరుకు, మెడికల్ ఎక్విప్మెంట్స్ను అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వీటి నాణ్యతపై మరిన్ని కఠిన పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం చైనా నుంచి 70 నుంచి 80 శాతం యాక్టివ్ ఫార్మాసుటికల్స్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ)లు దిగుమతి అవుతున్నాయి. చైనా నుంచి ఇంత మొత్తంలో ఏపీఐలను దిగుమతి చేసుకోవడం దేశానికి మంచిది కాదని 2014లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రభుత్వానికి సూచించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తితే.. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని అప్పట్లోనే ఆయన చెప్పారు. ధోవల్ వ్యూహం అజిత్ ధోవల్ సూచనలతో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా ఏపీఐలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఒక కమిటిని ప్రభుత్వం నియమించింది. నిత్యం దేశంమీద విషం కక్కే చైనా నుంచి ఏపీఐలను దిగుమతి చేసుకోవాలనుకోవడం లేదని డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డీసీజీఐ జీఎన్ సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఔషధ సంస్థలకూ ఏపీఐలను తయారు చేసే లైసెన్స్‌లు ఇస్తే.. మన దగ్గరే నాణ్యమైన వస్తువులు, మందులు తయారవుతాయని అన్నారు. ఇప్పటివరకూ ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టాల్లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రాణాళికలు సిద్ధం చేస్తోందని జీఎన్ సింగ్ తెలిపారు. ధరలు తగ్గే అవకాశం ఏపీఐలను చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవడం కన్నా.. వాటిని ఇక్కడే రూపొందిచుకుంటే.. ధరల్లో 15 నుంచి 20 శాతం తగ్గుతాయని ఇండియన్ ఫార్సాస్యుటికల్స్ అలయన్స్ సెక్రెటరీ జనరల్ డీజీ షా తెలిపారు. ప్రస్తుతం చైనా నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాన్ని మరింతగా పెంచితే.. దేశీయంగా ఇప్పటికే ఉన్న ఏపీఐలతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. -
డోక్లాం పరిష్కారం: తెర వెనుక ఉన్నదెవరు?
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన నేపథ్యంలో అనూహ్యంగా తెరపడింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వివాదం.. భారత్, చైనా, భూటాన్ ట్రైజంక్షన్ అయిన డోక్లాం కొండప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి భారత్-చైనా అంగీకరించడంతో శాంతియుతంగా పరిష్కారం అయింది. చైనా మీడియా, ఆ దేశ అధికారులు డోక్లాం వివాదంపై రోజుకో రెచ్చగొట్టే వ్యాఖ్య చేసినా.. భారత్ మాత్రం పరిణతితో హుందాగా రాజకీయ మౌనాన్ని పాటించింది. అవసరమైనప్పుడు మాత్రమే చైనా వాదనను తిప్పికొట్టింది. మరి, ఈ వివాదం సామసర్యంగా ముగియడంలో తెరవెనుక ఉన్నదెవరు అంటే.. అది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన బృందమే అని చెప్పాలి. మొండి వితండవాదం చేస్తున్న చైనాతో ధోవల్, ఆయన బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రత్యర్థికి గణనీయమైన నష్టాన్ని చేకూర్చగలమన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆత్మవిశ్వాసం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో దృఢవైఖరిని అవలంబిస్తూనే.. చైనాతో దౌత్య చర్చలను దోవల్ బృందం తెలివిగా ముందుకు తీసుకెళ్లింది. గత జూలై 27న బీజింగ్‌లో ధోవల్ చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచితో తొలిసారి భేటీ అయి దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 'ఇది మీ భూభాగమా?'అని యాంగ్ ప్రశ్నించగా.. ఈ ప్రశకు ఏమాత్రం తొణక్కుండా 'ప్రతి వివాదాస్పద ప్రాంతం చైనాకే చెందుతుందా?'అని దోవల్ దీటుగా ప్రశ్నించినట్టు సమాచారం. భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మించడం ద్వారా మూడు దేశాల ట్రైజంక్షన్‌లో చైనా స్టేటస్కో మార్చివేసిందని దోవల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా చారిత్రక ఒడంబడికలకు అనుగుణంగా భూటాన్ భద్రతను కాపాడాల్సిన భారత్‌కు ఉందని గుర్తుచేశారు. అయితే, డోక్లాంకు బదులుగా 500 చదరపు కిలోమీటర్ల భూటాన్ భూభాగాన్ని తిరిగి ఇస్తామని చైనా ఆఫర్ చేసినా భారత్ తిరస్కరించింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్, చైనాలోని భారత రాయబారి విజయ్ గోఖలే, ఆర్మీ చీఫ్ రావత్, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అనిల్ భట్ తదితరులు చైనా బృందంతో చర్చలు జరిపినవారిలో ఉన్నారు. ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు చైనా అధ్యక్షుడు గ్జి జింపింగ్ ఈ దౌత్యచర్చలకు ఆమోదం తెలిపినప్పటికీ.. రాజకీయ మౌనాన్ని పాటించడంతో తెరవెనుక ఏం జరుగుతున్నది పెద్దగా తెలియలేదు. జీ20 సదస్సు సందర్భంగా హంబర్గ్‌లో భేటీ అయిన ఇద్దరు అధినేతలు డోక్లాం వివాదం మరింత ఉద్రిక్తతలు రాజేయకుండా ఉండేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే డోక్లాం వివాదం సత్వరంగా ముగిసేలా చూడాలని ప్రధాని మోదీ దోవల్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఎంతో లబ్ధ పొందుతాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో చైనా మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినా.. భారత్ మాత్రం సామరస్య పరిష్కారం కోసం ఒకింత మౌనాన్ని పాటించింది. -
జిన్‌పింగ్‌తో భేటీ అయిన దోవల్
బీజింగ్: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏలతో జిన్‌పింగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది బ్రిక్స్ బృందానికి జిన్‌పింగ్ నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రం సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం వద్ద చైనా భారత్‌ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్ఎస్ఏలతో జిన్‌పింగ్ నిర్వహించిన సమావేశానికి దోవల్ హాజరవడం గమనార్హం. ‘భద్రతా సహకారం, పరస్పర విశ్వాసాలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు’ అని జిన్‌పింగ్ అన్నారు. చర్చల్లో భాగంగా దోవల్, చైనా ఎన్ఎస్ఏ జియేచీతోనూ భేటీ అయ్యారు. -
ఆపండి.. మేం కాంప్రమైజ్ కాము: చైనా
న్యూఢిల్లీ: భారత్‌తో తాము అస్సలు రాజీపడబోమని చైనా మరోసారి స్పష్టం చేసింది. డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదని, తమ భూభాగంలో నుంచి తమ సైన్యాన్ని వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ మేరకు షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో అంతర్జాతీయ సంబంధాలపై పరిశోధకుడిగా పనిచేస్తున్న హు జియాంగ్ గ్లోబల్ టైమ్స్ కథనంలో వెల్లడించారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా జరుగుతున్న జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లడాన్ని ఉటంకిస్తూ ఇక చైనా రాజీపడుతుందని భారత్ మీడియాలో కథనాలు వస్తున్నాయని అలాంటిది జరగబోదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని ఆయన పేర్కొన్నారు. ’చైనా నిర్ణయం మారదు. భారత ప్రభుత్వం, మీడియా మేం రాజీపడతామంటూ చూస్తున్న ఊహాగానాలను వదిలేస్తే మంచిది’ అని ఆయన అన్నారు. -
దోవల్ వల్లే డోక్లామ్ ఉద్రిక్తత: చైనా
బీజింగ్/న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులోని డోక్లామ్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వల్లే ఉద్రిక్తత నెలకొందని చైనా అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం ఆరోపించింది. గురువారం నుంచి జరిగే బ్రిక్స్ దేశాల జా తీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) సమావేశం కోసం బీజింగ్‌కు వెళ్తున్న దోవ ల్.. సరిహద్దు వివాదంపై చైనా ఎన్ఎస్ఏ తో చర్చించే అవకాశమున్న నేపథ్యంలో ఈ విమర్శలు చేయడం గమనార్హం. చైనాతో ముప్పు: ఆర్మీ వైస్ చీఫ్ భారత పొరుగు ప్రాంతాల్లోని హిమాలయాల వెంబడి చైనా ప్రభావం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో మనకు ముప్పుగా మారొచ్చని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ చెప్పారు. చైనా తన భద్రతపై చేస్తున్న ఖర్చులో చాలా భాగాన్ని బహిర్గతం చేయడం లేదని అన్నారు.ఈ పరిస్థితుల్లో భారత్ తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలన్నారు. -
వైట్‌హౌస్‌లో ఆయన మోదీని ఆదుకున్నారట!
వాషింగ్టన్: అమెరికాలో పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న ఇబ్బందిలో చిక్కుకున్నారట. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా చల్లగాలి ఆయనతో కొంటెగా ఆడుకుందట. అయితే అక్కడే ఉన్న జాతీయ భద్రతా సలహాదారుడు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చురుగ్గా వ్యవహరించి మోదీ ప్రసంగంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా వ్యవహరించారు. రోజ్ గార్డెన్లో మొదటిసారి అమెరికా ప్రెసిడెన్షియల్ మాన్షన్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ శ్రద్ధగా వింటుండగా.. మోదీ ప్రసంగానికి సంబంధించి తయారుచేసిన పేపర్లు సడెన్ వచ్చిన గాలికి ఎగిరిపోయాయి. దీంతో ఇతర సీనియర్ అధికారులతో కలిసి ముందు వరుసలో కూర్చున్న దోవల్ వాటికి దొరకబుచ్చుకోవడంతోపాటు, వెంటనే దానిని తిరిగి ప్రధాన మంత్రికి అందజేశారు. అయితే గాలి మళ్లీ అదే కొంటె పనిచేయడంతో తిరిగి పేపర్లను క్రమంలో పెట్టి మరీ మోదీకి అందించారు. -
భారత్-అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా, భారత్‌లు నిర్ణయించాయి. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో కలసి పనిచేయాలని సంకల్పించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గత మూడు రోజుల్లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, అంతర్గత భద్రత మంత్రి జాన్ కెల్లీతోపాటు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హెచ్ మెక్‌మాస్టర్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల కోసం భారత్ చేస్తున్న కృషిని మాటిస్ కొనియాడారని పెంటగాన్ ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు. జాన్ కెల్లీతో దోవల్ జరిపిన చర్చల్లో సరిహద్దు నియంత్రణ, ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చర్చ జరగలేదని సమాచారం. న్యూఢిల్లీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు దోవల్ జరిపిన చర్చలప్ర ట్రంప్ ప్రభుత్వ అధికారులు అమితాసక్తి కనబరిచారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డీమోనిటైజేషన్, జీఎస్టీ బిల్లు గురించి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపాయి. భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలపై అమెరికా ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించాయి. -
యూఎస్ రక్షణశాఖ కార్యదర్శితో అజిత్ ధోవల్ భేటి
అమెరికా: భారత భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ ఎన్. మ్యాటిస్‌ను కలుసుకున్నారు. వాషింగ్టన్లో పెంటగాన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇరు దేశాల భద్రతా విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి భారత అంబాసిడర్ నవ్‌తేజ్ సర్నా కూడా హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
దోవల్ అదుర్స్.. నాడు ఫోన్లో.. నేడు భేటీలో
వాషింగ్టన్: సంస్కరణల విషయంలోనే కాదు.. దేశ సంరక్షణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళుతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో కొలువు దీరనున్న నేపథ్యంలో అగ్ర రాజ్యంతో బలమైన దోస్తీకి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వర్తించనున్న మైఖెల్ ఫ్లిన్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు, ఉమ్మడిగా అమలుచేయాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దోవల్‌కు మైఖెల్ గొప్ప గౌరవాన్ని ఇచ్చారంట. అంతేకాదు, ఆధునిక యుగంలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న దేశం భారత్ అని, భారత ఆర్థిక వ్యవస్థను, విలువలను తాము గౌరవిస్తామని కూడా దోవల్ తో ఆయన అన్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. గతంలోనే మైఖెల్తో దోవల్ ఫోన్ లో మాట్లాడగా సమావేశానికి ఆయన అమెరికా ఆహ్వానించారట. ఆ మేరకే ఆయన తాజాగా వెళ్లి భారత్- అమెరికా రక్షణ అంశాలపై పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. -
దళపతులతో మోదీ భేటీ
సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రధానిమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సైనిక, నౌకా, వైమానిక దళాల అధిపతులతో సమీక్షించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దాదాపు రోజూ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితిని, పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ ప్రధానికి వివరించారు. -
యూఎస్ నుంచి అజిత్ దోవల్‌కు ఫోన్‌కాల్
వాషింగ్టన్: భారత జాతీయ భత్రతా సలహాదారు అజిత్ దోవల్ కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుసన్ రైస్ ఫోన్ చేశారు. ఉడీ ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ను తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె దోవల్‌కు తెలిపారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికా అత్యున్నత అధికారి స్పందించడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్‌కు వివరించారు. ఉగ్రవాదులను ఒంటరి చేసేందుకు మరింత సహకారంతో కలిసి పనిచేసేందుకు ఆమెహామీ ఇచ్చారని ఫోన్ కాల్ వివరాలను అమెరికా అధ్యక్షుని అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. -
నా పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ పేరు పెడతా: కన్హయ్య
న్యూఢిల్లీ: తన భార్య, పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ అని పేరు పెడతానని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్యకుమార్ శనివారం ఢిల్లీలో అన్నారు. తనకు పెళ్లయ్యాక పేరు మార్చుకోమని భార్యకు సూచిస్తానన్నారు. తన పేరు కూడా ఆవిధంగానే మార్చుకుంటానని చెప్పారు. కాగా, సీఆర్పీఎఫ్ అమరుల కార్యక్రమం స్ఫూర్తితో 1973లో తన కొడుక్కి ‘శౌర్య’ పేరు పెట్టానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. -
'మీ పిల్లలను ఆ వైపుగా వెళ్లకుండా చూడండి'
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అరుదైన ఘట్టానికి తెర తీశారు. ప్రలోభాలకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముస్లిం యువకులను తమ సంస్థలోకి చేర్చుకుంటుండటాన్ని నివారించేందుకు ఆయన ముస్లింమత పెద్దలతో మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి అజిత్ దోవల్, ఇతర హోంశాఖ ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ వారితో మాట్లాడుతూ ముస్లిం యువకులు ఉగ్రవాద సంస్థతల ప్రలోభాలకు తలొగ్గకుండా ఉంచేందుకు తమకు సహకరించాలని ముస్లిం పెద్దలను కోరారు. జమైతే ఉలేమా ఈ హింద్ కు చెందిన నేతలు మౌలానా అర్షద్ మదానీ, అజ్మీర్ షరీఫ్ మౌలానా అబ్దుల్ వహీద్ హుస్సేన్‌తోపాటు పలు ముస్లిం సంస్థల సహాయాన్ని కూడా రాజ్ నాథ్ కోరారు. మిగితా దేశాలతో పోలిస్తే భారత్ చాలా సురక్షితమైన దేశమని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాద ముంపు ముంచుకొస్తున్నందున దాని భారిన పడకుండా ఉండేందుకు యువకులను వారి కుటుంబాలే చూడాలని చెప్పారు. మన దేశ కుటుంబ వ్యవస్థ గొప్పదని, అసాంఘిక చర్యలవైపు భారతీయ నైతికత వెళ్లనీయదని, యువకుల ఆలోచన కట్టడికి కుటుంబాలదే ప్రధాన పాత్ర అని కూడా ఆయన వారితో చెప్పినట్లు సమాచారం. -
మళ్లీ దోవల్-మసూద్ ఫేస్ టు ఫేస్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ స్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌ను రౌండప్ చేయడం, అతని కార్యాలయాలు మూసివేస్తుండటం.. తప్పకుండా ఒక వ్యక్తికి ఆనందం కలిగించి ఉండాలి. ఆయనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 1994లో శ్రీనగర్‌లో మసూద్ అజార్‌ను తొలిసారి పట్టుకున్నప్పుడు అతడో చిన్న చేప అని భద్రతా సంస్థలు కొట్టిపారేశాయి. అప్పట్లో 26 ఏళ్ల అజార్ వద్ద ఓ నకిలీ పోర్చుగీసు పాస్పోర్టుతో, హర్కతుల్ ముజాహిద్దీన్ మ్యాగజీన్ ప్రతులు దొరికాయి. కానీ అజిత్ దోవల్ రంగంలోకి దిగిన తర్వాతే తెలిసింది మసూద్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో.. అతనికి పాకిస్థాన్‌లో భారీ ఎత్తున ఉగ్రవాద నెట్వర్క్ ఉంది. కశ్మీర్ లోయలోని ఉగ్రవాద గ్రూపులు హర్కతుల్ అన్సర్, హర్కతుల్ ముజాహిద్దీన్ మధ్య సయోధ్య కుదిర్చి.. కశ్మీర్‌తోపాటు భారత్ అంతటా భారీ ఎత్తున దాడులు జరిపేందుకు మసూద్‌ను పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పంపింది. అజిత్ దోవల్, ఆయన బృందం ఎంతో శ్రమించి ఈ విషయాలను వెలుగులోకి తేవడంతో మసూద్ గురించి వెల్లడైంది. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814 నేపాల్‌లోని కట్మాండు నుంచి ఢిల్లీ బయలుదేరుతుండగా.. దానిని హైజాక్ చేసి కాందహార్ తరలించారు. దీంతో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు దోవల్ ఉగ్రవాదులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను తీసుకొని అప్పటి విదేశాంగ జశ్వంత్ సిన్హాను వెంటబెట్టుకొని కాందహార్ వెళ్లి బందీలను విడిపించుకొచ్చారు. మసూద్‌తోపాటు అప్పుడు విడుదలైన ఉగ్రవాదులు ఒమర్ షైక్ (ప్రస్తుతం జర్నలిస్టు హత్యకేసులో పాక్‌లో అరెస్టయాడు), ముస్తాక్ జార్గర్. అప్పుడు అజిత్ దోవల్ బృందంలో ఉన్న అసిఫ్ ఇబ్రహీం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉగ్రవాదంపై ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తూ.. దోవల్తోపాటే ఉండగా, మరో సభ్యుడు అవినాశ్ మోహనానీ సిక్కీం డీజీపీగా వ్యవహరిస్తున్నారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఆఫ్ఘనిస్థాన్‌లోని మజర్ ఎ షహర్లో భారత రాయబార కార్యాలయంపై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మసూద్ అరెస్టు నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై దోవల్ బృందం ఇప్పుడు మరోసారి కేంద్రానికి మార్గనిర్దేశనం చేస్తోంది. -
భారత్-పాక్ చర్చలు రద్దు
-
భారత్-పాక్ చర్చలు రద్దు: దోవల్
న్యూఢిల్లీ: ఈ నెల 15న జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగశాఖ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు అయ్యాయి. పఠాన్‌కోట్ దాడుల నేపథ్యంలో పాక్‌తో చర్చలు రద్దు చేసినట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పఠాన్‌కోట్ దాడి సూత్రదారులపై చర్యలు తీసుకునే వరకు చర్చలు జరగవని చెప్పారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందినప్పుడే చర్చలపై ఆలోచిస్తామని దోవల్ పేర్కొన్నారు. -
ఉగ్రవాదంపై నిఘా ‘నేత్రం’
జాతిహితం దోవల్‌ది ఆవశ్యకంగా ఆపరేషన్స్ ఆలోచనా ధోరణి అని ఆయన గురువుల నుంచి శిష్యుల వరకు అందరి అభిప్రాయం. కాబట్టే పఠాన్‌కోటలో జరుగుతున్నది సైనిక చర్య అనిపించిన మరుక్షణమే జాతీయ భద్రతా బలగాలను పంపాలని నిర్ణయించారు. అది అత్యంత సున్నితమైన సైనిక చర్య. పూర్తి మిలిటరీ వాతావరణంలో సాగిన ఎత్తుగడలపరమైన ఆపరేషన్. ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యకూ, ఒక కీలక ప్రాంతంలోని సువిశాల వైమానిక దళ స్థావరం పెద్ద ముప్పును ఎదుర్కోవడానికీ మధ్య తేడా ఉంది. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)అధికారిగా అజిత్ దోవల్ వృత్తి జీవితం అద్భుతమైనదని అత్యధికులు గుర్తిస్తారు. మా ఇద్దరి వృత్తి జీవి తాలు వేటికవిగానే అయినా ఒక విధంగా సమాంతరంగా సాగాయని కొన్నేళ్ల క్రితం ‘జాతిహితం’లో సైతం రాశాను. ఆయన వివిధ సందర్భాల్లో సంక్లిష్ట పరిస్థితులలో పనిచేస్తుండటం, నేను వాటి వార్తా కథనాలను నివేదిస్తుండటంగానే మా సమాంతర ప్రయాణం ఎక్కువగా సాగింది. అయితే సీనియారిటీ, వయస్సు కారణంగా ఆయన నాకంటే ఎప్పుడూ రెండడుగులు ముందే ఉండేవారు. జనవరి 20కి ఆయనకు 71 ఏళ్లు వస్తాయి. ఆ తర్వాతా ఆయన గురించిన కథనాలు మిగిలే ఉంటాయి. అయినా ఆయన గురించి మాట్లాడుకోవాల్సినంత గుర్తింపు ఆయనకు ఇప్పటికే ఉంది. ఈశాన్య భారత్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కొత్త కరెస్పాం డెంట్‌గా నేను 1981 జనవరిలో మిజోరామ్‌కు మొదటిసారిగా వెళ్లాను. నాటి ముఖ్యమంత్రి టి. సైలో గతం గురించి, భవిష్యత్తు గురించి సుదీర్ఘోప న్యాసం ఇచ్చారు. ‘‘ఏకే దోవల్‌లాంటి అధికారులు మనకు ఇంకొందరు ఉంటే ఇంకా చాలా బావుండేది’’ అని ఆయన ఆ సందర్భంగా నాతో అన్నారు. దోవల్ అప్పట్లో మిజోరాం ఐబీ యూనిట్‌కు (దాన్ని అనుబంధ ఇంటెలిజెన్స్ బ్యూరోగా పిలిచే వారు) అసిస్టెంట్ డెరైక్టర్. ఇంటెలిజెన్స్ లెజెండ్ సరిగ్గా ఒక ఏడాది తర్వాత, చోగ్యాల్ పాల్డెన్ (లేదా మాజీ చోగ్యాల్... 1975లో ఆ రాష్ట్రం విలీనమైన తర్వాత ఇందిరాగాంధీ ఆ బిరుదును రద్దు చేశారు కాబట్టి) తొండుప్ నంగ్యాల్ అంత్యక్రియల వార్తా కథనం కోసం గాంగ్టక్కు వెళ్లాను. ప్రశంసాపూర్వకంగానో, సంభ్రమంగానో అక్కడ అప్పటికే దోవల్ పేరు తరచూ ప్రస్తావనకు వస్తుండేది. ఇటీవల సైతం ఆయన అక్కడ ఉన్నారు, అప్పుడూ తనదైన ముద్రను వేశారు. ఆ తదుపరి మరో పెద్ద కథనం కోసం నేను తరచూ పంజాబ్‌కు వెళ్లాల్సివచ్చేది. అప్పుడాయన నిజానికి సరిహద్దుకు ఆవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో పూర్తి చట్టబద్ధంగానే ఉండేవారు. నా జ్ఞాపకం సరైనదే అయితే, ఆయన అక్కడ వాణిజ్య విభాగానికి అధిపతిగా ఉండేవారు. అప్పట్లో భారత్-పాక్‌ల మధ్య పెద్దగా ద్వైపాక్షిక వాణిజ్యమేమీ జరగడంలేదని నా విశ్వాసం. కాబట్టి ఆ నియామకం ఆయనకు ముసుగు మాత్రమే. అయినా దోవల్ ఎప్పుడూ పనితో తలముకలవుతూనే ఉండేవారు. విద్రోహ కార్యకలాపాలు తదితర విషయాలతో పాటూ ఆయన... పాక్‌లోని ప్రవిత్ర స్థలాల సందర్శనకు వచ్చే సిక్కులు వేర్పాటువాద ప్రచారం ప్రభావానికి గురయ్యే అవకాశంపై కూడా కన్నేసి ఉంచేవారు. పాక్ గూఢచార సంస్థ నిర్దేశకత్వంలోనే, పూర్తిగా అదే ప్రేరేపించిన దురదృష్టకరమైన ఒక వికృత ఘటనలో ఆ పవిత్ర స్థలాలలో ఒక చోట జరిగిన జాతాలో (సాయుధ ప్రదర్శన) ఆయనపై దాడి జరిగింది. దోవల్, 1969 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఐబీలో ఆయనకు ముందు ఆయనంతగానూ జానపద కథానాయక ఖ్యాతి గడించిన ఎమ్కే నారాయణన్ లాంటి ఇతర అధికారులలాగే దోవల్ కూడా జీవితమంతా ఐబీ మనిషిగానే ఉన్నారు. నారాయణన్ కూడా దోవల్లాగే కేరళ క్యాడర్‌కు చెందిన అధికారికావడం విశేషం. భారత్‌కు తిరిగి వచ్చిన మరుక్షణమే దోవల్ నేరుగా పంజాబ్/సిక్కు సంక్షోభంలోకి ప్రవేశిం చారు. దాదాపు దశాబ్దిపాటూ, తిరుగుబాటు అంతమయ్యే వరకు అక్కడే తీరుబడి లేకుండా ఉన్నారు. పునరుజ్జీవం పొందిన ఐబీ అందించిన కీలక సహాయంతో కేపీఎస్ గిల్ నేతృత్వంలోని పంజాబ్ పోలీసు యంత్రాంగం అక్కడి తిరుగుబాటును తుదముట్టించింది. ఆ కాలాన్ని ఆ ఉగ్రవాద దశాబ్దిలోని మూడవ, సుదీర్ఘ దశగా తరుచూ అభివర్ణిస్తుంటారు. గిల్, నాకు ఆయనతోనూ, కీలకమైన అధికారులతోనూ మాట్లాడే అవకాశం కల్పించడం మాత్రమే కాదు, జలంధర్‌లోని పంజాబ్ ఆర్మ్డ్ పోలీస్ సెంటర్లో నిర్బంధంలో ఉన్న ఒకప్పటి అగ్రశ్రేణి (వారిని ఏ, బీ కేటగిరీలుగా వర్గీకరిం చారు) మిలిటెంట్లతో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించారు. అందుకు నేను ఆయనకు రుణపడి ఉన్నాను. ‘బ్లాక్ థండర్’కు ఇంటెలిజెన్స్ అండ ఆ మిలిటెంట్లు లొంగిపోయిన తీరు విస్మయకరం. అంతకు కొన్ని నెలల క్రితం వరకు వాళ్లు పంజాబ్ పశ్చిమ జిల్లాలలో చాలా భాగాన్ని శాసించినవారు. వారిలో చాలా మంది మహా అయితే 20ల మధ్య వయస్కులు. వారి మాటల్లో కొంత అమాయకత్వం ధ్వనించేది. వారిలో ఒకరు తనకు తానుగానే ‘‘మేజర్ జనరల్’’గా ప్రకటించుకున్నవాడు. వాస్తవానికి తాను ఆ స్థాయికి చేరడం కోసం అప్పటికే 87 మంది హిందువులను చంపినట్టు అతను తెలిపాడు. మరో 13 మంది హిందువులను లేదా ముగ్గురు పోలీసులను (ఒక పోలీసు ఐదుగురు హిందువులకు సమానం) చంపివుంటే తనకు ‘‘లెఫ్టినెంట్ జనరల్’’ హోదా లభించేదన్నాడు. ఆ మిలిటెంట్ల కథనాలను బట్టి పంజాబ్ పోలీసుల విజయం స్థానిక పోలీసులదీ, ఐబీదేనని నాకు స్పష్టమైంది. ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ (1989-90) దశలో, ఏ లేదా బీ కేటకిరీకి చెందిన మిలిటెంటును ఎవరినైనా హతమార్చిన లేదా పట్టుకున్న ప్రతిసారీ నేను... గిల్ బౌలింగ్‌లో దోవల్ క్యాచ్ పట్టారంటూ ఒక విధమైన అర్ధ పరిహాస ధోరణిలో మాట్లాడేవాడిని. పంజాబ్ ఉగ్రవాదం చివరి దశలో దేశవ్యాప్తంగా ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆనుపానులను కనిపెట్టడంలో దోవల్ మరింత చురుగ్గా పాల్గొన్నారు. ఎప్పటిలాగే తనదైన సొంత శైలిలోనే ఆ బాధ్యతలను నిర్వహించారు. పంజాబ్‌లో ఉగ్రవాదం అంతమైంది. కానీ ఈలోగా కశ్మీర్లో మరో పూర్తిస్థాయి సంక్షోభం వృద్ధి చెందింది. దోవల్, తానెంతగానో ప్రేమించే ఆపరేషన్స్ విభాగానికి వెళ్లారు. కశ్మీర్ నుంచి దావూద్ వరకు చాలా ముఖ్య ఆపరేషన్స్‌లో ఆయనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పద్ధతులు ఆయన సీనియర్లలో కొందరు ‘‘సరైన’’ అధికారులకు అంగీకారయోగ్య మైనవి కావు. అయితే ఫలితాలను సాధించగల ఆయన సామర్థ్యాన్ని అత్యధికులు గౌరవించేవారు. యూపీఏ ప్రభుత్వం, 2004 మేలో ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్‌గా నియమించింది. ఆ తరువాతనే దోవల్ పదవీ బాధ్యతల గురించే సాపేక్షికంగా అందరికీ ఎక్కువగా తెలిసింది. వివేకానంద ఫౌండేషన్ ఏర్పాటు వెనుక ప్రధాన చోదక శక్తి ఆయనే. మధ్యేవాద మితవాద చింతనాపరులకు సంబంధించి నెలకొన్న శూన్యాన్ని అది పూడ్చింది. అన్నాహజారే ఉద్యమం సహా అవినీతికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా సాగిన ప్రచారానికి వెనుకనున్న కీలకమైన బుర్ర కూడా ఆయనదే. వివేకానంద ఫౌండేషన్, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతిభను అందించే కీలక వనరుగా మారింది. మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా కూడా అందులోని వారే. మరీ పట్టువిడుపులు లేనివారిగా దోవల్‌కు ఉన్న పేరు వల్ల, ఆయన చుట్టూ నిర్మితమై ఉన్న జానపద కథానాయక ఖ్యాతి ఫలితంగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) పదవికి ఆయన సహజమైన వ్యక్తి అయ్యారు. ‘పఠాన్‌కోట’ ముప్పుకు సరైన సమాధానం ఇప్పటికీ ఆయన ఆవశ్యకంగా ఆపరేషన్స్‌కు సంబంధించిన వ్యక్తేనని ఆయనను తీర్చిదిద్దినవారు, సహచరులు, ఆయన శిష్యులు అంతా చెప్పే సత్యం. పఠాన్‌కోటలో అప్పుడు జరుగుతున్నది సాయుధ చర్యని అనిపించిన మరుక్షణమే ఆయన, కనీసం ఆలోచనల్లోనే అయినా తిరిగి ఆ రంగంలోకి దూకారు. కాబట్టే తక్షణమే జాతీయ భద్రతా బలగాలను (ఎన్ఎస్జీ) పఠాన్ కోటకు పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే సంప్రదాయ గూఢచర్యం లేదా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కూ, సువిశాలమైన వైమానిక దళ స్థావర కీలక ప్రాంతానికి ఎదురైన అంతకంటే పెద్ద ముప్పును ఎదుర్కోవడానికీ మధ్య తేడా ఉంది. ఇదే గందరగోళానికి, విషయం కలగాపులగం కావడానికి దారితీసింది. దోవల్ ఆ ఆపరేషన్‌ను నియంత్రిస్తున్నట్టు ఎక్కువగా అనిపించడంతో దాన్ని నిరాకరించే అవకాశం ఆయనకు లేకుండాపోయింది. నిష్కపటంగా చెబు తున్నా.. నాకు కూడా ఆ విషయం కచ్చితంగా తెలియదు. అయితే తరచుగా కాల్పనిక గాథలు వాస్తవం కంటే బలమైనవిగా ఉంటాయి. ఎనభైలు, తొం భైల నాటి దోవల్ ప్రశంసకులందరికీ ఆయన అత్యంత ప్రతిభావంతుడైన, ‘కొంటె బుర్ర’ గూఢచారని తెలుసు. పఠాన్‌కోటలో జరిగనది అత్యంత సున్నితమైన, సైనిక వాతావరణంలో సాగిన ఎత్తుగడలపరమైన ఆపరేషన్. దోవల్ మన ఐదో ఎన్ఎస్ఏ. కొన్ని విధాలుగా, భద్రతకు సంబం ధించి, ఆయన ఇంతవరకు మన అత్యంత శక్తివంతమైన ఎన్ఎస్ఏ. మొదటి ఎన్ఎస్ఏ బ్రిజేష్ మిశ్రా, ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ప్రధాని కార్యాలయ నిర్వహణపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించే వారు. ఆ తదుపరి యూపీఏ ఆ బాధ్యతలను జీఎన్ దీక్షిత్ (విదేశాంగ విధానం), భద్రత (ఎమ్కే నారాయణన్)లకు మధ్య పంచింది. బ్రిజేష్ మరణించేవరకు ఆ విభజన కొనసాగింది. నారాయణన్ ఇంటెలిజెన్స్‌ను, విదేశాంగ విధానపరమైన కీలక మీటలను నియంత్రిస్తూ... పరిపాలనను టీకేఏ నాయర్‌కు వదిలిపెట్టారు. శివశంకర్ నాయర్ అంతా అనుకున్నట్టే విదేశాంగ విధానంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. సైన్యంపైన కూడా ఆయన దృష్టిని కేంద్రీకరించినా... ఏకే ఆంటోనీ సంభాషణాపరుడు కాకపోవడం, ఆయన నిర్ణయరాహిత్యం కారణంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికే అది పరిమితమైంది. ఇప్పుడు దోవల్ ఆ పదవికి ఆపరేషనల్ మేధస్సును అందించారు. ఆ మేరకు ఆయన ఎన్ఎస్ఏ పదవిని ఎక్కువగా వార్తల్లో ఉండేదిగా మార్చారు. శేఖర్ గుప్తా, twitter@shekargupta -
చర్యలు తీసుకుంటేనే చర్చలు
-
చర్యలు తీసుకుంటేనే చర్చలు
* ఇప్పుడు బంతి మీ కోర్టులోనే ఉంది: పాకిస్తాన్‌కు స్పష్టం చేసిన భారత్ * భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీపై అనిశ్చితి * ఏం చేస్తారో చెప్పండి.. ఆ తర్వాతే మాట్లాడుకుందాం: వికాస్ స్వరూప్ * జైషే పాత్రపై పాక్‌కు స్పష్టమైన ఆధారాలిచ్చిన అజిత్ దోవల్ న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య చర్చల ప్రక్రియ ముందడుగేయాలంటే.. ముందుగా పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘ఇప్పుడు బంతి పాక్ కోర్టులో ఉంది’ అని తెలిపింది. దాడికి వ్యూహరచన పాక్‌లో జరిగినట్లు ఆధారాలున్నందున.. తర్వాత ఏం చేయాలో నిర్ణయించాల్సింది పాకిస్తానేనని తేల్చిచెప్పింది. షెడ్యూల్ ప్రకారం 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఈ భేటీపై అనిశ్చితి నెలకొంది. అయితే, ఈ చర్చలను నిలిపేసి ఇరుదేశాల భద్రతా సలహాదారులు మరోసారి కలుస్తారని వార్తలొస్తున్నాయి. ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేం. పఠాన్‌కోట్‌పై పాక్ ఎలాంటి డెడ్‌లైన్ ఇవ్వకుండా.. చర్చలు కష్టం’ అన్నారు. పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణలో.. ఉగ్రవాదంపై కఠిన చర్యలపైనే మోదీ పట్టుబట్టారని వెల్లడించారు. పాక్ నుంచి భారత్‌లో విధ్వంసానికి జరుగుతున్న ప్రణాళికలపై చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పారని.. దీనికి పాక్ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశం భారత్-పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చితి నెలకొన్న సమయంలో.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి.. పఠాన్‌కోట్ దాడిపై చర్చించారు. ఆర్థిక, హోం శాఖ మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు, ఎన్ఎస్ఏ చీఫ్, ఇంటెలిజెన్స్చీఫ్లతో మాట్లాడారు. దాడి ఘటనపై భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించాలని.. కేవలం టెలిఫోన్ నంబర్లే ఉన్నందున మరింత సమాచారాన్ని భారత్‌నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. విచారణ పూర్తయిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. జైషే పాత్ర స్పష్టమే!: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో జైషే మొహమ్మద్ సంస్థ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను భారత ఇంటలిజెన్స్ సంపాదించింది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ (1999 కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి)తో పాటు మరో ఇద్దరు ఈ దాడికి వ్యూహరచన జరిపినట్లు గుర్తించింది. లాహోర్ సమీపంలో కుట్ర జరిగినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. భారత ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్.. పాక్ ఎన్ఎస్ఏ చీఫ్‌తో మాట్లాడి.. స్పష్టమైన,చర్యలు తీసుకునేందుకు అనువైన సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఈ వివరాలను పాకిస్తాన్‌కు అందజేసి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్చలు కొనసాగించండి: చైనా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న భారత్-పాక్ సంబంధాలను దెబ్బతీసేందుకే కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని స్నేహబంధాన్ని మెరుగుపరుచుకునేందుకు చర్చల ప్రక్రియ కొనసాగించాలని ఆకాంక్షించింది. చివరి దశలో కూంబింగ్ పఠాన్‌కోట్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ చివరి దశకు చేరుకుందని భద్రతా దళాలు వెల్లడించాయి. ఎన్ఎస్జీ, గరుడ్, ఐఏఎఫ్ కమాండోలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారా? ఎక్కడైనా బాంబులు పెట్టారా? అని వెతికేందుకే ఈ కూంబింగ్ జరుగుతోందని ఎయిర్ కమాండర్ జేఎస్ దమూన్ తెలిపారు. ఎన్ఎస్జీ బలగాల తక్షణ స్పందన, గరుడ్ విభాగం చాకచక్యంగా వ్యవహరించటంతో ఉగ్రవాదులను ఒక ప్రాంతానికే పరిమితం చేశామని చెప్పారు. బీఎస్ఎఫ్ నిజనిర్ధారణ కమిటీ ఉగ్రవాదులు భారత్-పాక్ సరిహద్దుగుండా ప్రవేశించి దాడికి పాల్పడ్డారనే విమర్శల నేపథ్యంలో.. అక్రమ చొరబాట్లు, నదులు, దట్టమైన అడవులున్న చోటనిఘా కొరవడటంపై విచారించేందుకు బీఎస్ఎఫ్ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. పదిహేను రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. సల్వీందర్ వాంగ్మూలం నమోదు: విచారణలో భాగంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ తీసుకుంది. ఈయన మిత్రుడు రాజేశ్ వర్మను విచారించారు. సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన ఎన్ఐఏ అధికారులు.. బీఎస్ఎఫ్ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు? సరిహద్దు గ్రామమైన టిబ్రీలో మిలటరీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడుతుండగా చూశామని గ్రామస్తులు చెప్పటంతో సైనికులు, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
చర్యలా...చర్చలా త్వరగా తేల్చండి..
న్యూఢిల్లీ: పంజాబ్ లో పఠాన్‌కోట్ భారత వైమానిక దళ స్థావరం వద్ద టెర్రర్ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ భారత్ పొరుగుదేశం పాకిస్థాన్ పై ఒత్తిడిని తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. సకాలంలో చర్యలు తీసుకోండి...లేదంటే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఉండవని తేల్చి చెబుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఒక వివరణ పత్రాన్ని పంపించింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్ లో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో జరగాల్సిన శాంతి చర్చలు ఉండవని పేర్కొంది. ఈ ఉగ్రదాడి వెనుక ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ హస్తం ఉందని భారత్ నమ్ముతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆ దేశానికి సమర్పించింది. పంజాబ్ లోని బహావల్పూర్ సహా వివిధ ప్రాంతాల నుండి పాకిస్తాన్ కు వెళ్లిన అనేక ఫోన్ కాల్స్ ను తాము ట్రేస్ చేశామని, వాటిలో కొన్ని సంక్షిప్తంగానూ, కొన్ని దీర్ఘంకానూ సాగాయని భారత్ తెలిపింది. ఉగ్రవాదుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను పాక్ కు అందించింది. పాకిస్థాన్ నిజంగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, తదితర నేతలను అరెస్ట్ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. కాగా పంజాబ్ లోని మోహాలిలో అదుపులోకి తీసుకున్న అష్ఫాక్ అహ్మద్, హఫీజ్ అబ్దుల్ షకుర్, ఖాసింజాన్ నుంచి మారణాయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఓ పాకిస్తాన్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
దావూద్‌ను ఎందుకు చంపలేదు ?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆ గడ్డపైనే హతమార్చేందుకు భారత ప్రభుత్వం కోవర్ట్ ఆపరేషన్‌కు ఎప్పుడో సిద్ధపడింది. ఇందుకోసం చోటా రాజన్ ముఠాకు చెందిన కొంత మందిని ఎంపిక చేసి మహారాష్ట్రకు ఆవల గుర్తుతెలియని చోట అవసరమైన శిక్షణ కూడా ఇచ్చింది. అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ డోవెల్ భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డెరైక్టర్‌గా పనిచేసినప్పుడు ఈ కోవర్ట్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారు. అయితే దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీతో సంబంధాలున్న ముంబై పోలీసు ఉన్నతాధికారులు డబ్బుకు అమ్ముడుబోయి ఈ వ్యూహాన్ని వమ్ము చేశారు. కోవర్ట్ ఆపరేషన్ కోసం శిక్షణ పొందుతున్న చోటా రాజన్ ముఠా సభ్యులపై అరెస్టు వారెంట్లు తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు. మాజీ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుత బీజీపీ నాయకుడు ఆర్కే సింగ్, సీదీ బాత్ కార్యక్రమం కింద ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంను హతమార్చేందుకు కోవర్ట్ ఆపరేషన్‌కు ప్రయత్నాలు జరిగినట్టు గతంలో పలుసార్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా వెల్లడవడం మాత్రం ఇదే మొదటిసారి. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం పాక్ రక్షణలో ఉన్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించి భారత ప్రభుత్వం తాజా సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. ఇప్పటికైనా దావూద్‌పై చర్య తీసుకునేందుకు భారత్ చొరవ తీసుకోవాలని, అందుకు ప్రపంచ టైస్ట్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా నిర్వహించిన తరహాలో ఆపరేషన్ నిర్వహించాలని ఆర్కే సింగ్ సూచించారు. దావూద్‌తోపాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీద్ సయాద్‌కు పాక్ రక్షణ కల్పిస్తున్న విషయం మనకే కాదని, మొత్తం ప్రపంచానికి తెలుసునని ఆయన అన్నారు. పాక్‌లో ఎవరి నుంచి తమకు ముప్పు ఏర్పడుతుందని తెలిసినా అమెరికా చర్యలు తీసుకుంటోందని, అలాగే మనం తీసుకోవాలని ఆయన వాదించారు. దావూద్‌పై కమాండో ఆపరేషన్‌కు మనం సిద్ధపడితే పాకిస్తాన్ యుద్ధానికి వస్తుందనే భయం కొందరిలో ఉందని, మనతో యుద్ధంచేసే మూర్ఖత్వం పాకిస్తాన్‌కు ఉందని తాను భావించడం లేదని ఆర్కే సింగ్ అన్నారు. ఒకవేళ నిజంగా యుద్ధానికి వచ్చినా దాన్ని పటిష్టంగా ఎదుర్కొనే సామర్థ్యం మనకుందని ఆయన చెప్పారు. చర్చల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధి కనబర్చని పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియకు స్వస్తి చెప్పాలని, చర్యల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సలహాదారులు సరైన సలహాలను ఇవ్వడం లేదని ఆయన అన్నారు. -
'ఓటుకు కోట్లు'పై నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం
-
'ఓటుకు కోట్లు'పై నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఓటుకు కోట్ల కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందా? ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సమాచారం సేకరిస్తోందా? అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు పోటాపోటీగా నివేదికలు ఇవ్వడం, గవర్నర్ నరసింహన్ కూడా నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం తన సొంత మార్గాల ద్వారా వాస్తవ విషయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ విషయం బయటపడినట్లు చెబుతున్నారు. హస్తిన పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీని కలసి ఫోన్ ట్యాంపిగ్పై ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబును కలవడానికి ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మోదీ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన వివరాలను మోదీ ఈ సందర్భంగా అజిత్‌దోవల్ ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ నుంచి అజిత్ దోవల్ పూర్తి సమాచారం సేకరించి, ఆ వివరాలను ప్రధానికి తెలిపారని తెలుస్తోంది. అజిత్ దోవల్ నుంచి వివరాలు సేకరించిన తర్వాతే చంద్రబాబుతో మోదీ సమావేశం అయినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జాతీయ భద్రతా సలహాదారుగా:దోవల్
-
జాతీయ భద్రతా సలహాదారుగా: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి అజిత్ దోవల్ (69) నూతన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమితులయ్యారు. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఆ అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తారు. దోవల్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం ఆయన నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. ప్రస్తుత ప్రధాని పదవీకాలం ముగిసే వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ దోవల్ ఈ పదవిలో కొనసాగుతారు. శివశంకర్ మీనన్ స్థానంలో దోవల్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్-చైనా సరిహద్దు అంశంలో ప్రధాని ప్రతినిధిగానూ ఉంటారు. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన రెండో కీలక నియామకం ఇది. ఇంతకుముందు ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా నియమితులవడం తెలిసిందే. దోవల్ 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యుత్తమ వ్యూహరచన చేయడంలోనూ, అమలులోనూ నిష్ణాతునిగా ఆయన పేరుపొందారు.