Aligarh
-
పాక్ జైలులో భారత యువకుడు విలవిల.. ప్రేమే కారణం
‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది... అందుకే నేను పాకిస్తాన్ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్లాంను స్వీకరించాను. నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. దయచేసి నా కోసం చింతించకండి’.. ఇవి యూపీలోని అలీఘర్కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు వీడియో కాల్లో తన తండ్రితో పలికిన మాటలు.సోషల్ మీడియా వేదికగా ఓ అమ్మాయిని ప్రేమించి, సరిహద్దులు దాటి, శత్రు దేశానికి చేరుకున్న ఓ యువకుడు వీడియో కాల్లో తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాక్ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి బెయిల్ లభించలేదు. పాక్ యువతి ప్రేమలో పడిన భారతీయ యువకుడు ఇప్పుడు ఆ దేశంలో పడరానిపాట్లు పడుతున్నాడు.అలీఘర్కు చెందిన బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో అక్రమంగా సరిహద్దులు దాటి పాక్ చేరుకున్నాడు. తరువాత జరిగిన పరిణామాలతో డిసెంబర్ నుంచి జైలులోనే ఉన్నాడు. జనవరి 24న బాదల్ బాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. చార్జిషీట్ అందకపోవడంతో అతని బెయిల్ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో తిరిగి అతడిని జైలుకు తరలించారు. ఈ కేసు తరుపరి విచారణ ఫిబ్రవరిలో ఉండనుంది.బాదల్ తండ్రి కృపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను వీడియో కాల్లో న్యాయవాది ఫయాజ్‌తో మాట్లాడినట్లు భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. పాకిస్తాన్ నివాసి సనా రాణి, ఆమె తల్లి ఆహ్వానించడంతోనే తన కుమారుడు పాకిస్తాన్ వెళ్లి , అక్కడ చిక్కుకుపోయాడని కృపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సనాను కలుసుకునేందుకు బాదల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహావుద్దీన్ జిల్లాలోని మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు.అయితే సనా అతనిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. కాగా బాదల్ బాబు వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. దీంతో పాక్ పోలీసులు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం బాదల్ బాబు యూపీలోని అలీఘర్‌లోని నాగ్లా ఖట్కారి గ్రామ నివాసి. అతనికి ఫేస్బుక్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ రోజూ చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో పాకిస్తాన్ చేరుకున్నాడు. తన గుర్తింపును మార్చుకుని అక్కడే ఉన్నాడు. అయితే గత డిసెంబర్లో స్థానికులకు అనుమానం వచ్చి బాదల్ బాబు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతనిని బహావుద్దీన్ నగరంలో అరెస్టు చేసి, తరువాత కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు. విచారణలో బాదల్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గతంలో రెండుసార్లు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించానని, మూడోసారి విజయం సాధించానని బాదల్ బాబు తెలిపాడు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
అలీఘర్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం
యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు(బుధవారం) యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఎఎంయు తరచూ ఏదోఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. హోలీ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులపై మరో వర్గం దాడి చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సివిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.గత మే నెలలోనూ ఎఎంయూలోని ఎస్ఎస్ హాల్ క్యాంపస్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గాయపడిన బీటెక్ విద్యార్థిని వెంటనే వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు. -
‘ఏడడుగులు’ వారివి.. ఎనిమిదో అడుగు అందరిదీ’
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఇదేవిధంగా ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ముద్రితమైన ఓ పెళ్లి కార్డు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. యూపీలోని అలీఘర్‌లో త్వరలో ఓ ఇంట వివాహ వేడుక జరగనుంది. ఇందుకోసం వారు ముద్రించిన పెళ్లి కార్డు అతిథులకు ఓటు హక్కు విలువను తెలియజేస్తోంది. సాధారణంగా పెళ్లిలో వధూవరులు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేస్తారు. అయితే ఈ కార్డులో ఎనిమిదో అడుగు ప్రస్తావన కూడా ఉంది. అలీఘర్కు చెందిన అంకిత్, సుగంధిల వివాహం ఏప్రిల్ 21 న జరగనుంది. అంకిత్ తండ్రి ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో పెళ్లి కార్డు ముద్రింపజేశారు. అంకిత్ తండ్రి కాళీచరణ్ వృత్తిరీత్యా బేకరీ వ్యాపారి. ఆయన తన కుమారుని పెళ్లి శుభలేఖలో ‘ఓటు వేసే రోజున మీ పనులన్నీ పక్కన పెట్టి ఓటు వేయండి. దేశాన్ని ఉద్ధరించేవాడిని ఎన్నుకోండి’ అని రాశారు. పెళ్లిలో నూతన దంపతులు సాధారణంగా ఏడడుగులు వేస్తారని, అయితే భరత మాత సాక్షిగా పెళ్లి జంటతోపాటు అతిథులంతా ఎనిమిదో అడుగు వేయాలని, అది ఓటు వేసేందుకు చేసే ప్రమాణం లాంటిదని పేర్కొన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కాళీచరణ్ పేర్కొన్నారు. అలీఘర్‌లో ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
ఫాదర్ ఆఫ్ రింకుసింగ్
ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రింకుసింగ్ తండ్రి ఖాన్చందర్సింగ్ ఇప్పటికీ ఆలిగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్)లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చందర్‌సింగ్ ఎల్పీజి సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చందర్ వృత్తినిబద్ధతకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు చాలాసార్లు చెప్పాను. అయితే పనిని ప్రేమించే నాన్న విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పని చేస్తేనే నేను చురుగ్గా ఉంటాను అని చెబుతుంటారు’ అంటున్నాడు రింకుసింగ్. ‘కాస్త పేరు, కాస్త డబ్బు రాగానే చాలామంది గతాన్ని మరిచిపోయి గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి ఈ చిన్న వీడియో క్లిప్ కనువిప్పు కలిగిస్తుంది’ ‘కొడుకును ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా తయారుచేయడానికి ఈ తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు. అప్పుడూ , ఇప్పుడూ తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. గ్రేట్ ఫాదర్!’...కామెంట్ సెక్షన్లో ఇలాంటివి చాలా కనిపించాయి. -
ట్రైన్లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం -
దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అలీఘడ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు. తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు. దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
అలీగడ్.. హరిగఢ్ ఎందుకయ్యింది? రామాయణంతో సంబంధం ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్ పేరు మారింది. తాజాగా అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్ పేరు మార్పు వెనుక ఒక ప్రత్యకత, ఘనమైన చరిత్ర ఉంది. అలీగఢ్‌ను పూర్వకాలంలో అంటే 200 ఏళ్ల క్రితం కోయిల్ లేదా కోల్ అని పిలిచేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కౌశిరివ్ పేరు కనిపిస్తుంది. అతనిని యుద్ధంలో ఓడించిన కోల్ అనే రాక్షస రాజు ఈ ప్రదేశానికి పాలకునిగా మారతాడు. అతని పేరును అనుసరించి ఈ ప్రదేశానికి కోల్ అని పేరు పెట్టారు. కాగా సయ్యద్ రాజవంశం కాలంలో కోల్ ప్రాంతం పేరు అలీగఢ్గా మారింది. అలీగఢ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. దీనిని లాక్ సిటీ అని కూడా అంటారు. మొఘలుల కాలం నుండి తాళాల తయారీకి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు తమ చదువులను పూర్తి చేస్తున్నారు. భారతీయత ఉట్టిపడాలనే ఉద్దేశంతోనే అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది? -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్‌లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్‌కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం
అలీగఢ్ (యూపీ): అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు. ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమరి్పస్తారు. -
పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు
అత్తా కోడళ్ల గొడవలనేవి తెగని పంచాయితీ.. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ గొడవలు పెద్దవై భార్యభర్తలు విడిపోవడం, లేదా వేరే కాపురం పెట్టే వరకు పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అత్తా కోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. ఒకవేళ వెళ్లినా.. లేదా అటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక తలలు పట్టుకోవాల్సిందే. తాజాగా ఇద్దరు అత్తా కోడళ్లు గొడవపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది అట్టాంటి ఇట్టాంటి పంచాయితీ కాదు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు భయంకరంగా దాడి చేసుకునే వరకు పోయింది. వంటింట్లో కూర్చొని ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. అరవింద్ కుమార్, ప్రీతి దేవి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ తన తల్లిదండ్రులు భూప్ ప్రకాష్, రాణి దేవితో కలిసి గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివిసిస్తున్నారు. అరవింద్ నిరుద్యోగి కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గతంలో ప్రీతి తన అత్త రాణి దేవిపై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి రాణి కోడలపై దాడి చేసింది. ఆమెను తలను నేలకేసి కొట్టడం, కాలితో తన్నడం, గోడకేసి నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కోడలు ఏడుస్తూ అత్తను ఆపడం కూడా చూడవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే ఈ తంతంగాన్ని మొత్తం మహిళా కొడుకే వీడియో తీయడం కొసమెరుపు. అంతేగాక దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వంట పేరుతో అత్త రోజు దూషించేదని, మగ పిల్లాడిని కనలేదనే కారణంతో వేధించేదని కోడలు ప్రీతి ఆరోపించింది. అయితే అత్త వర్షన్ ఇందుకు విరుద్దంగా ఉంది. తనకు ఒక్కడే కొడుకు కావడం, ఇతర సంతానం ఏం లేకపోవడంతో వారు నివసించే ఇంటిని తన పిల్లల పేరు మీద రాయాలని కోడలు బలవంతం చేస్తుందని రాణి ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సదరు మహిళలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #उत्तरप्रदेश : #अलीगढ़ में बहू के तीन बेटियां पैदा होने पर नाराज सास ने बहू से की मारपीट#Violence #fightvideos #viralvideo #UttarPradesh #DelhiRains #OperationVijay #Gadar2Trailer #Haryanaclerk35400 #KargilVijayDiwas #अध्यात्म_के_शिरोमणि pic.twitter.com/XDLtOPeNs6 — NCR Samachar (@ncrsamacharlive) July 26, 2023 -
రింకూ సింగ్ గొప్ప మనసు.. తనలా కష్టపడకూడదని
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు రింకూ సింగ్. మూడు నాలుగేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాని గుర్తింపు ఆ ఒక్క మ్యాచ్‌తో వచ్చేసింది. అతను కొట్టిన ఐదు సిక్సర్లు కేకేఆర్ అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. అయితే రింకూ సింగ్ మంచి క్రికెటర్ మాత్రమే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఐపీఎల్ ద్వారా డబ్బు సంపాదిస్తూ రింకూ సింగ్ జీవితంలో స్థిరపడ్డాడు. అయితే తాను స్థిరపడడానికి ముందు అనుభవించిన కష్టాలు తెలిసినోడు గనుక.. పేద క్రికెటర్లకు అండగా నిలబడాలనుకున్నాడు. కనీస సౌకర్యాలు లేని పేద క్రికెటర్లకు హాస్టల్ నిర్మించాలనుకున్నాడు. ఈ విషయాన్ని రింకూ సింగ్ చిన్ననాటి కోచ్ జాఫర్ చెప్పాడు. కాగా రింకూ కోచ్ జాఫర్ అలీగఢ్ జిల్లాలో క్రికెట్ సంఘానికి చెందిన 15 ఎకరాల్లో అలీగఢ్ క్రికెట్ స్కూల్, అకాడమీ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే రింకూ సింగ్ హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు. రూ. 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హాస్టల్లో మొత్తం 14 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీ క్రికెటర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్లో ఏర్పాటు చేయనున్న క్యాంటీన్లోనే క్రికెటర్లు ఆహారం తినేలా వసతులు కల్పించారు. రింకూ సింగ్ నిర్మిస్తున్న హాస్టల్ ''క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో రింకూ సింగ్ హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నాడు. మూడు నెలల కింద పని మొదలైంది. మరో నెల రోజుల్లో హాస్టల్ నిర్మాణం పూర్తవనుంది. ఐపీఎల్ పూర్తయ్యాకా రింకూ సింగ్ ఈ హాస్టల్‌ను ప్రారంభించనున్నాడు'' అని కోచ్ జాఫర్ పేర్కొన్నారు. 2017లో అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(ప్రస్తుతం కింగ్స్ పంజాబ్) రింకూ సింగ్‌ను కొనుగోలు చేసింది. 2017లో పంజాబ్‌కు ఆడిన రింకూ.. 2018లో రూ.80 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 2021లో మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రింకూ సింగ్‌ను 2022లో జరిగిన మెగావేలంలో మరోసారి కేకేఆర్ రూ.55 లక్షలకు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ 425 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 58గా ఉంది. చదవండి: ధోని చేసిన తప్పు థర్డ్ అంపైర్‌కు కనిపించలేదా? "Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX — JioCinema (@JioCinema) April 9, 2023 -
షాకింగ్.. 24 ఏళ్ల కుమారుడ్ని దారుణంగా కొట్టి చంపిన తండ్రి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. కన్నతండ్రే కుమారుడ్ని దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగులో తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టాడు. ఈ ఘటనలో మృతుడ్ని రవి(24)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి జయప్రకాశ్ నేరాన్ని అంగీకరించాడు. రవి వారం రోజులుగా కన్పించకపోవడంతో అతని మామ శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తన కుమారుడు తరచూ ఊర్లోవాళ్లతో గొడవపడుతున్నాడని, తనతో పాటు తల్లిపై కూడా దాడి చేస్తున్నాడని జయప్రకాశ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నాడని, అందుకే ఆగ్రహంతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. కుమారుడ్ని హత్య చేసిన అనంతరం జయప్రకాశ్ ఊరి వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. కేసు విచారణకు కూడా మొదట సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడే హత్యా నేరాన్ని అంగీకరించాడని వివరించారు. చదవండి: అమ్మా.. నన్ను క్షమించు.. అక్కను బాగా చూసుకో.. -
యూపీలో వర్షాలకు 10 మంది బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా బర్గద్వా సయీఫ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
12 ఏళ్లపాటు మహిళపై అత్యాచారం
లక్నో: 12 ఏళ్లపాటు ఓ అమ్మాయిపై వరుసకు చిన్నాన్న (సవితి తండ్రి సోదరుడు) అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. బాలికకు ఏడేళ్ల వయస్సున్నప్పుడు మొదలైన కామాంధుడి బలత్కారం.. ఆమెకు 19 ఏళ్లు వచ్చే వరకు పాల్పడుతూనే ఉన్నాడు. దాదాపు మూప్పై ఏళ్ల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్ ప్రాంతానికి చెందిన బాలికకు చిన్నప్పుడే తండ్రి మరణించాడు. దీంతో తల్లి మరొకరిని వివాహం చేసుకుంది. సవితి తండ్రి సోదరుడు బాలికపై కన్నేశాడు. ఆమెకు 7 ఏళ్లు ఉన్నప్పుడు తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాలిక తన తల్లికి వివరించగా.. ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించింది. అంతేగాక కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చి ఆమె నోరూమూయించింది. దీంతో మరింత రెచ్చిపోయిన కామాంధుడు పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతనితోపాటు మరో మేనమామ కూడా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా బాలికకు 19 ఏళ్ల వచ్చే వరకు వివిధ ప్రదేశాల్లో బాధితురాలిపై బలత్కారం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత వీలయినంత వరకు వాళ్ళని ఆపడానికి యువతి తన శాయశక్తులా ప్రయత్నించింది. ఆమెకు 2011లో ఆర్మీ జవాన్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.పెళ్లైన తరువాత కూడా ఎప్పుడూ పుట్టింటికి వెళ్లినా వాళ్లు తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చదవండి: ఫేస్బుక్లో యువకుడితో పరిచయం.. ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే అయితే మళ్లీ ఆ దుర్మర్గులకు చిక్కకుండా జాగ్రత్త పడింది. చివరకు మానసిక గాయాన్ని తట్టుకోలేక చివరికి తన భర్తకు తెలియజేసినట్లు ఆ మహిళ తెలిపింది. భర్త సహకారంతో 28 ఏళ్ల తర్వాత అలీఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఇంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని బాధితురాలు వాపోయింది. తరువాత జాతీయ మహిళా కమిషన్, ఎస్ఎస్పీ, ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌ను ఆశ్రయించడం ద్వారా చివరికి పోలీసులు కేసు స్వీకరించారు. ఐపీసీ 376, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా..
దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంతో ఏళ్లు గడిచినా బాధితులు తమ ఆవేదనను బయటకి చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలో చోటుచేసుకుంది. తండ్రే.. తన కూతురుపై 32 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాధితురాలు తండ్రి తన చిన్నతనంలోనే మరణించారు. దీంతో, తల్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాధితురాలి వయస్సు ఏడేళ్లు. అనంతరం.. ఆమెపై కన్నేసిన తండ్రి.. బెదిరించి బలాత్కారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం తల్లికి చెబితే ఊరుకొమ్మని నోరు మూయించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న కసాయి తండ్రి.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో 2011లో ఆమెకు అలిగఢ్‌కు చెందిన ఓ జవానుతో వివాహం జరిగింది. తనకు వివాహం జరిగిన తర్వాతైన విముక్తి కలుగుతుందని భావించిన ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె.. పుట్టింటికి వచ్చిన ప్రతీసారి తన లైంగిక వాంఛను తీర్చుకుంటూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్తపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేస్తానని బెదిరించేవాడు. దీంతో, తన భర్త ఆమెను.. పుట్టింటికి వెళ్తావా అని అడిగిన ప్రతిసారీ భయంతో వణికిపోయేది. ఇదిలా ఉండగా.. ఇటీవలే తన భర్త ఆర్మీ నుంచి వీఆర్ఎస్ తీసుకొని అలిగఢ్‌లోనే ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓరోజున తనకు జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పి బోరున ఏడ్చేసింది. ఆమె మాటలు విని షాకైన భర్త.. భార్యకు సపోర్టుగా నిలిచాడు. అనంతరం, వారిద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సవితా ద్వివేది మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నాము. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త!
లక్నో: భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భర్త విడాకులు కావాలని అడగడం పక్కన పెడితే ఇందుకు అతను చెప్పిన కారణం మాత్రం వింతంగా ఉంది. భార్య రోజూ స్నానం చేయడం లేదని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. క్వార్సీ గ్రామానికి మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో రోజూ భార్య స్నానం చేయడం లేదని, స్నానం చేయాలని అడిగిన ప్రతిసారి ఆమె తనతో గొడవ పడుతుందని ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. అయితే భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వివాహిత వెల్లడించింది. ప్రస్తుతం ఈ జంటకు అలీగఢ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ అందిస్తోంది. చదవండి: లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి ప్రతిరోజూ స్నానం చేయడం లేదనే సాకుతో భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని ఒక మహిళ తమకు వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిందని వుమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ తెలిపారు. వారి వివాహ బంధాన్ని కాపాడటానికి భర్తభర్తలిద్దరితోపాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తున్నామన్నారు. వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని, భర్తతో ఆమె సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కౌన్సిలర్ తెలిపారు. అయితే భర్త మాత్రం తనకు విడాకులు కావాలనే పదేపదే చెబుతున్నాడని, భార్య నుంచి విడాకులు తీసుకోవడంలో సాయం చేయాలని తమకు ఓ అప్లికేషన్ కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. కానీ చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని తాము సూచించినట్లు తెలిపారు. విడాకులతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పి అతన్ని నచ్చజేప్పుతున్నట్లు పేర్కొన్నారు. వారికి ఆలోచించడానికి మహిళా రక్షణ సెల్ కొంత సమయం ఇచ్చింది. అంతేగాక విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి, పిటిషన్ ముందుకు సాగదన్నారు. కౌన్సిలింగ్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చదవండి: హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్ -
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో... యూపీకి ప్రయోజనం
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో 2017కి ముందు గూండాలు, మాఫియాలు రాజ్యమేలారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో పరిస్థితులన్నీ మారిపోయాయని అన్నారు. యూపీలోని అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి ప్రధాని మంగళవారం శంకుస్థాపన చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉండడంతో యూపీ ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్న యోగి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలంటే అడుగడుగునా అడ్డంకులే ఉండేవని, యోగి సీఎం అయ్యాక సంక్షేమ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు. రాజా ప్రతాప్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితాలు ఎలా త్యాగం చేశారో నేటి తరానికి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇంటి భద్రత కోసం వేసే తాళాలకు అలీగఢ్ ఎలా ప్రఖ్యాతి వహించిందో, సరిహద్దుల్లో రక్షణ అంటే కూడా అలీగఢ్ పేరే ఇక వినిపిస్తుందని మోదీ అన్నారు. అలీగఢ్ యూపీకే ఒక రక్షణ హబ్‌గా మారబోతోందని వ్యాఖ్యానించారు. అలీగఢ్‌లో ఏర్పాటు కానున్న రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని సందర్శించారు. రక్షణ రంగంలో భారత్ సంపూర్ణ స్వావలంబన సాధించిందని అన్నారు. ఒకప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే వారిమని, ఇప్పుడు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలకి సంబంధించిన పరికరాలన్నీ మేడ్ ఇన్ ఇండియావేనని ప్రధాని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని! జాట్ సామాజిక వర్గానికి చెందిన రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు చేయనుండటం ఎన్నికల స్టంటేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్ సింగ్ పేరుతో లోధా, జరౌలి గ్రామాల్లోని 92 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 395 కాలేజీలు పని చేస్తాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ సామాజిక వర్గం బలంగా ఉంది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతన్నల ఆందోళన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై జాట్లు ఆగ్రహంగా ఉన్నారు. వారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికే అదే సామాజిక వర్గానికి చెందిన రాజా ప్రతాప్ సింగ్ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆగమేఘాల మీద ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. -
మహిళ ఒత్తిడితో 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) హాస్టల్లో 24 ఏళ్ల టీచర్ ఉరి వేసుకుని మరణించడం కలకలం రేపింది. బాధితుడు అలీగఢ్‌లోని ఏఎన్సీ కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సక్సేనాగా పోలీసులు గుర్తించారు. సక్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అభిషేక్ గత వారం రోజులుగా తన వసతి గృహాన్ని ఖాళీ చేసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. అయితే ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడి కారణంగానే అభిషేక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆమె నా సోదరుడిని బ్లాక్మెయిల్ చేసింది’ అని బాధితుడి సోదరుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని సివిల్ లైన్స్ ఎస్హెచ్ఓ రవీంద్ర కుమార్ దుబే తెలిపారు. -
ఆడపిల్లలకు సెల్ఫోన్లెందుకు?
అలీగఢ్(యూపీ): ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి యువతులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇంట్లోని ఆడపిల్లలు పరాయి యువకులతో కలిసి లేచిపోవద్దని అనుకుంటే సెల్ఫోన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వయసొచ్చిన కుమార్తెలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని తల్లులకు హితబోధ చేశారు. ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దన్నారు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జాగ్రత్త పడాలన్నారు. యువతులు ఫోన్లలో యువకులతో మాట్లాడుతున్నారని, తర్వాత ఇద్దరూ కలిసి లేచిపోతున్నారని మీనాకుమారి తప్పుపట్టారు. సమాజంలో నేరాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఆడపిల్లలను కాపాడుకోవడంలో తల్లిదే ప్రధాన పాత్ర అని చెప్పారు. తల్లుల నిర్లక్ష్యం వల్లే బిడ్డలు లేచిపోవడం వంటి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా... -
పెరుగుతున్న అలీగఢ్ కల్తీ మద్యం మృతుల సంఖ్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 22కు చేరింది. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలియజేశారు. వారంతా జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. లోధా, ఖైర్, జవాన్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో 15 మంది వ్యక్తులు ఈ కల్తీ మద్యం కారణంగా మరణించారని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ శుక్రవారం వెల్లడించారు. కేసుకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలానిది నైతాని చెప్పారు. లిక్కర్ కల్తీకి కారణమని భావిస్తున్న అనిల్ చౌధరి కూడా వారిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. అనిల్ సన్నిహితులైన రిషి శర్మ, విపిన్ యాదవ్‌ల కోసం గాలిస్తున్నామన్నారు. వారిపై రూ 50 వేల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. అనిల్ చౌధరికి మంచి రాజకీయ పలుకుబడి ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. (చదవండి: అనాథ పిల్లలకు ఉచిత విద్య) -
దారుణం: చిన్నారిపై 12 కుక్కలు ఒక్కసారిగా..
లక్నో: 7 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో జరిగింది. రోడ్డు మీద ఓ బాలిక తన దారిన తాను దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆ దారిలోని కుక్కలు ఆమె మీదకు ఉరికాయి. దీంతో ఆ బాలిక భయపడి వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తింది. ఈ క్రమంలో ఆ పరిసరాల్లోని 12 కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడిగా బాలిక మీదకు ఉరికాయి. దీంతో చేసేదేమిలేక బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపుల విని సమీంలోని ప్రజలు ఆమెను రక్షించడానికి పరుగెత్తారు. అక్కడ ఉన్న కుక్కలను తరిమేసి బాలికను రక్షించారు. అయితే ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ( చదవండి: వైరల్ వీడియో: అయ్యయ్యో.. తెలిసిపోయిందా ) -
దారుణం: ‘ప్లీజ్ మా చెల్లి వెంటపడొద్దు’
లక్నో: తన చెల్లి వెంట ఒకరు వెంట పడుతున్నాడని తెలిసి సోదరుడు కల్పించుకుని అతడికి సర్ది చెప్పాడు. ఇదే ఆ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. తన చెల్లి వెంటపడొద్దని హితవు పలికిన అతడిని నలుగురు వ్యక్తులు కలిసి స్కార్ఫ్‌తో దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తామని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా బజ్హేర గ్రామానికి చెందిన సురేంద్ర పాల్ ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తన చెల్లి వెంట స్థానికుడు శివకుమార్ వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన చెల్లి వెంట పడొద్దని హితవు పలికాడు. దూరంగా ఉండాలని.. ఇకపై కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివకుమార్ సరే అని చెప్పాడు. అయితే ఆమెకు దూరంగా ఉండడం శివ తట్టుకోలేకపోయాడు. జరిగిన విషయాన్ని శివ తన స్నేహితుడు భూపేంద్రకు చెప్పాడు. శివకు ఓదార్చిన భూపేంద్ర దీనికి ఓ పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సురేంద్ర పాల్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. సురేంద్ర, భూపేంద్ర దూరపు బంధువులు. ఈ చనువుతో సురేంద్రను మద్యం సేవిద్దామని భూపేంద్ర పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. అయితే సురేంద్రకు పీకల దాక భూపేంద్ర మద్యం తాగించాడు. అనంతరం స్కార్ఫ్‌తో సురేంద్రను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మధురకు సమీపంలోని యమున నదిలో విసిరేశాడు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తాం’ అని బెదిరించారు. కంగారు పడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో శివకుమార్, రాహుల్ సింగ్, రతన్ సింగ్ పాత్ర కూడా ఉందని తేలింది. దీంతో వారిని అలీఘర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 364 ఏ, 302, 201 సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. యమున నది తీరంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెల్లి ప్రేమ అన్న ప్రాణం మీదకు వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై ఫిర్యాదు చదవండి: ఆడియో క్లిప్ వైరల్: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’ -
బొమ్మల ఫ్యాక్టరీలో పేలుడు; ముగ్గురు మృతి
అలీఘడ్ : ఉత్తరప్రదేశ్ అలీఘఢ్‌లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలీగఢ్ ఢిల్లీ గేట్ ప్రాంతంలోని ఖాతికన్ ప్రాంతంలోని ఒక భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలీఘఢ్‌లోని బొమ్మల తయారీ కర్మాగారంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. పరిసరాల్లోని పలు ఇండ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా, భవనం పైకప్పు కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై శిథిలాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. కాగా క్షతగాత్రులను జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ దవాఖాన, మల్ఖన్ సింగ్ జిల్లా ఆసుపత్రులకు తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచే శిథిలాలను తొలగించే పని చేపట్టారు. స్థానిక వలంటీర్ల బృందాలు సహాయక చర్యలకు సహకరిస్తున్నాయి. కాగా ఏదైనా పేలుడు కారకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారని నగర పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ తెలిపారు. -
ప్లాన్ బెడిసికొట్టింది.. ఈసారి భార్య కూడా
లక్నో: మనుషుల్లో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని తప్పులైనా చేసేందుకు నేరగాళ్లు వెనకాడటం లేదు. హత్యలు చేస్తూ, మహిళలపై అకృత్యాలు కొనసాగిస్తున్న మృగాళ్లు, ఆధారాలను మాయం చేసే క్రమంలో ఘాతుకాలకు పాల్పడుతున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి కేసు నుంచి బయటపడేందుకు పక్కా పథకం రచించి అడ్డంగా దొరికిపోయాడు. డబ్బు ఆశజూపి ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు. సినిమా స్టోరీని తలపించే ఆ ఘటన వివరాలు.. యూపీకి చెందిన కుమార్‌పై హత్యానేరం, లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనలో గతంలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. మృతి) తన గుర్తింపును మాయం చేసేందుకు ఈ క్రమంలో అతడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చాడు. కేసుల భయం వెంటాడటంతో ఎలాగైనా వాటి నుంచి విముక్తి పొందాలని భావించాడు. ఈ విషయం గురించి భార్య, తన అనుచరులతో చర్చించి ఓ పథకం రచించాడు. తన పోలికలతో ఉన్న వ్యక్తి కోసం అన్వేషించాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 23న బులంద్‌షహర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న మత్తులో జోగుతున్న బాధితుడికి డబ్బు ఇచ్చి మరింత మద్యం సేవించేలా ప్రోత్సహించాడు. ఆ తర్వాత తన దుస్తులు కూడా ఇచ్చి వేసుకోమని చెప్పాడు. ఇందుకు అతడు వెంటనే అంగీకరించి, కుమార్ చెప్పినట్లుగా చేశాడు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న కుమార్ భార్య, అనుచరుడు, బాధితుడిని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు. అనంతరం అతడి జేబులో కుమార్ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టారు. ముఖం ఆనవాలు తెలియకుండా బండరాళ్లతో నుజ్జునుజ్జు చేశారు. ఆ తర్వాత కుమార్ అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లగా, సహ నిందితులు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన కార్డుల ఆధారంగా అది కుమార్‌దేనని తొలుత భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో కుమార్ ఇంటికి వెళ్లి అతడి భార్యను ప్రశ్నించిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమార్ జాడను ట్రేస్ చేశారు. అలీఘడ్‌లో అతడిని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో హత్య, అత్యాచారం కేసు నమోదైందని, తన స్థానంలో మరో వ్యక్తి శవాన్ని పెట్టి, తన గుర్తింపును మాయం చేసేందుకే కుమార్ ఈ నేరానికి పాల్పడ్డట్లు వెల్లడించారు. -
‘నిరూపిస్తే.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతాను’
లక్నో: బీజేపీ మాజీ మేయర్ ఒకరు ముస్లిం యువతుల మతం మార్చి.. వారికి హిందూ యువకులతో వివాహం జరిపిస్తున్నారని ఒక ముస్లిం యువతి ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యువతి అలీగఢ్ బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతిపై సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మేయర్ తన సోదరిపై ఒత్తిడి తెచ్చి.. మతం మార్చి హిందూ యువకుడితో వివాహం చేశారని ఆరోపించింది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువతి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ హిందూ యువకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరి ఇంట్లో నుంచి బంగారు నగలు, డబ్బు తీసుకుని ఓ హిందూ యువకుడితో పరారయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలించడం ప్రారంభించారు. (వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) ఈ లోపు యువతి కుటుంబ సభ్యులు బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతి ముస్లిం యువతుల మతం మార్చి.. వారిని హిందూ యువకులకు ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే తన సోదరికి హిందూ యువకుడితో వివాహం చేసిందని తెలిపారు. పోలీసులు ఇంటి నుంచి వెళ్లి పోయిన యువతిని గుర్తించి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సదరు యువతి తన ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి పోయి.. హిందూ యువకుడిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. తాను మేజర్‌నని.. వివాహం విషయంలో ఎవరి బలవంతం లేదని పేర్కొంది. ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తన సోదరి అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించింది. ఇందులో మాజీ మేయర్‌కు ఎలాంటి సంబంధం లేదంది. తాను హిందూ యువకుడిని వివాహం చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నది. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని సదరు యువతి పోలీసులకు తెలిపింది. ఈ ఆరోపణలపై శకుంతల భారతి స్పందించారు. ‘సదరు యువతి వివాహం గురించి నాకు ఏం తెలియదు. అనవసరంగా నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. వారు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. నేను రాష్ట్రం విడిచి వెళ్లి పోతాను’ అన్నారు. -
మెకానిక్ కొడుకు.. అమెరికన్ స్కూల్ టాపర్
లక్నో: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉండాలేగాని పేదరికం మనల్ని ఏం చేయలేదు అనేది పెద్దల మాట. ఈ మాటల్ని రుజువు చేసే ఘటనలు మన ముందు కొకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ స్కాలర్షిప్ పొంది హై స్కూల్ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు ఓ మెకానిక్ కొడుకు. ఆ వివరాలు.. అలీఘర్కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘కెన్నడి లూగర్ యూత్ ఎక్స్చేంజ్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. దీని ద్వారా షాదాబ్‌కు రూ. 20లక్షలు వచ్చాయి. దాంతో హై స్కూల్ చదువుల నిమిత్తం షాదాబ్ అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హై స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 వందల మంది చదువుతున్న ఈ అమెరికన్ హై స్కూల్లో గత నెల షాదాబ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. ఈ క్రమంలో షాదాబ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా గొప్ప విజయం. అమెరికన్ స్కాలర్‌షిప్‌తో ఇక్కడ చదువుకోడానికి వచ్చిన నేను టాపర్‌గా నిలిచాను. అయితే దీని కోసం ఎంతో శ్రమించాను. ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగుండేది కాదు. నేను నా కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. వారిని గర్వపడేలా చేస్తాను’ అని తెలిపాడు. అంతేకాక విదేశాల్లో భారత జెండా ఎగరవేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.(చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్) షాదాబ్ తండ్రి గత 25 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. కొడుకు గురించి అతడు ఎంతో గర్వపడుతున్నాడు. తన కొడుకు కలెక్టర్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. కానీ షాదాబ్ మాత్రం ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల అధికారిగా పని చేయాలని ఉందని తెలిపాడు. -
ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం
లక్నో: వివాహాలకు 50, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయం విదితమే. కానీ ఇక్కడ మాత్రం ఓ గోవు అంత్యక్రియలకు వందలాది జనాలు తరలి వచ్చి లాక్డౌన్ నిబంధనలను తుంగలో తుక్కారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. అలీఘర్‌లోని మెమ్దీ గ్రామంలో దినేశ్ చంద్ర శర్మ అనే వ్యక్తికి చెందిన ఆవు గురువారం మరణించింది. దానికి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాలని గ్రామస్థులు తలిచారు. అనుకున్నదే తడవుగా 150 - 200 మంది జనాలు ఊరేగింపుగా బయలు దేరారు. (5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు) కనీసం మాస్కు ధరించకుండా, సామాజిక ఎడబాటును సైతం పట్టించుకోకుండా వీధులు, రోడ్ల వెంబడి తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న సుమారు 150 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో వంద మంది మహిళలే ఉండటం గమనార్హం. ఇక ఈ ఘటనపై ఆవు యజమాని శర్మ మాట్లాడుతూ.. "అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వచ్చినవారిని ఎలా అడ్డుకోగలను? నేను ఆవును ఖననం కోసం తీసుకెళుతుంటే గ్రామస్థులూ వచ్చారు. ఇందులో తప్పేముంది? అయిన్పటికీ దీన్ని తప్పుగా పరిగణించి మాపై చర్యలు తీసుకుంటానంటే అందుకు సిద్ధమే"నని బదులిచ్చాడు. (ప్లాట్‌ఫామ్‌పై ఆహార పొట్లాలు.. ఎగబడ్డ జనం!) -
గోవు అంత్యక్రియలు: గుంపులుగా జనం
-
‘భారత్ ఇష్టం లేదంటే.. పాకిస్తాన్ ఉందిగా’
లక్నో : భారత్‌లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అలీఘర్ బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ అన్నారు. హిందుస్తాన్‌పై అక్కసు వెళ్లగక్కే దేశద్రోహులకు పాకిస్తాన్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు. అలీఘర్‌లో జరిగిన పౌరసత్వ నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ కవి మునవ్వార్ రాణా కూతురు సుమైయా దేశంలో పరిస్థితులు బతికేందుకు అనువుగా లేవని, ఇక్కడ ఉండలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుమైయా వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు కొదవ లేదని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఎంపీ సతీశ్ గౌతమ్ తెలిపారు. అయిష్టంగా, ఇబ్బందులు పడుతూ హిందుస్తాన్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటని, సుమైయా స్వేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అన్నారు. చదవండి : కన్నడ బీజేపీ వివాదాస్పద ట్వీట్ సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు? -
యువకుడిపై యువతి యాసిడ్ దాడి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను మోసం చేశాడనే కోపంతో ఓ అమ్మాయి యువకుడిపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... జీవన్‌ఘడ్‌కు చెందిన ఫైజద్ అనే 20 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య విభేదాలు తలెత్తడంతో నెల రోజులుగా ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు యువతి ఎందుకిలా చేస్తున్నావని అతడిని నిలదీసింది. ఇన్నాళ్లు తనతో సన్నిహితంగా ఉండి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకంటూ గొడవపడింది. ఈ క్రమంలో ఫైజద్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతడి ముఖంపై పోసింది. ఈ ఘటనలో ఫైజద్ తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా యాసిడ్ దాడికి పాల్పడినందుకు సదరు యువతిని ఐపీసీ సెక్షన్ 326ఏ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక బాధితుడి తల్లి మాట్లాడుతూ... తన కొడుకుకు సదరు అమ్మాయితో సంబంధం ఉందని.. అయితే వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఫైజద్‌ను వేధించగా అతడు తిరస్కరించాడని.. అందుకే దాడి చేసి ఉండవచ్చని పేర్కొంది. -
భార్యను రేప్ చేసిన ప్రొఫెసర్!
అలీగఢ్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ దారితప్పాడు. భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన సదరు ప్రబుద్ధుడు.. అనంతరం విడిగా భార్యపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటన అలీగఢ్‌లో జరిగింది. 58 ఏళ్ల నిందితుడిపై పోలీసులు లైంగిక దాడి (376), క్రిమినల్ బెదిరింపులు (506) తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన నిందితుడు ఏడాదిన్నర కిందట భార్యకు సత్వర త్రిపుల్ తలాఖ్ ద్వారా విడాకులు ఇచ్చాడు. 2017లో వాట్సాప్ ద్వారా, ఎస్సెమ్మెస్ ద్వారా అతడు తనకు ట్రిపుల్ తలాఖ్ చెప్పినట్టు భార్య తెలిపారు. ఈ క్రమంలో కొడుకు, కూతురితో కలిసి తాను అతనితో వేరుగా ఉంటున్నానని, కానీ, పిల్లలను చూసే నెపంతో అతడు తరచూ తన ఇంటికి వచ్చేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గత నెల 29న అతడు తాము ఉంటున్న ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనను తుపాకీతో బెదిరించి.. తనపై లైంగిక దాడి జరిపాడని ఆమె పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌తో తనకు భర్త అన్యాయం చేశాడని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని 2017లో బాధితురాలు ఆలీగఢ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎదుట ఆందోళన నిర్వహించారు. -
‘అందుకే కారులో హెల్మెట్ పెట్టుకుంటున్నా’
లక్నో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక తప్పిదాల కారణంగా నిబంధనలు పాటించిన వారికి సైతం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పీయూష్ వర్ష్నే అనే వ్యక్తికి ఈ-చలాన్ ద్వారా రూ. 500 జరిమానా విధించారు. అయితే తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విధమైన చలాన్ రావడంతో అతడు కంగుతిన్నాడు. ఇక అప్పటి నుంచి కారులో కూడా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నాడు. ఈ విషయం గురించి పీయూష్ మాట్లాడుతూ...‘అసలే పెరిగిన జరిమానాలతో భయంభయంగా గడుపుతున్నాం. మళ్లీ చలాన్ వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే కారులో వెళ్తున్నపుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నాను. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా నా కారు నంబరు పేరిట గతంలో చలానా వచ్చింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్ ఎస్పీ.....‘డేటా తప్పిదాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కారు నంబరు ఆధారంగా చలాన్‌ను వెరిఫై చేసి ఒకవేళ నిజంగా హెల్మెట్ లేని కారణంగానే చలాన్ వెళ్లిందని తేలితే దానిని రద్దు చేస్తాం. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడతాం’ అని వివరణ ఇచ్చారు. కాగా భారీ జరిమానాల కారణంగా పలువురు వాహనదారులు మోటార్ వాహన సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. చదవండి: ట్రాఫిక్ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు -
అలీగఢ్‌లో కుప్పకూలిన విమానం
లక్నో : ఓ ప్రైవేట్ శిక్షణ విమానం మంగళవారం ఉదయం అలీగఢ్‌లోని ధనిపూర్‌లో ల్యాండవుతుండగా రన్‌వేపైనే కూలిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. విమానంలో ఉన్న ఆరుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ప్రైవేట్ విమానం వీటీ-ఏవీవీ జెట్ అలీగఢ్‌లో ఉందని, విమానం ల్యాండవుతున్న సమయంలో విమానం వీల్స్‌కు కరెంట్ తీగలు తగలడంతో కుప్పకూలిందని తెలిసింది. కూలిన విమానానికి మంటలు అంటుకునే లోపే ఆరుగురు ప్రయాణీకులు అందులోంచి బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
బీజేపీలో చేరికతో ముస్లిం మహిళకు వేధింపులు
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తూ బీజేపీలో చేరిన ముస్లిం యువతిని తన ఇంటి యజమాని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించిన ఘటన అలీగఢ్‌లో చోటుచేసుకుంది. గులిస్తాన్ అనే మహిళ బీజేపీలో సభ్యత్వం తీసుకునే క్రమంలో ఆమె ఫోటో వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో రావడంతో ఆగ్రహించిన ఆమె ఇంటి యజమాని బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించాడు. బీజేపీలో చేరాననే కోపంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి తమ యజమాని తనను దుర్భాషలాడుతూ బలవంతంగా బయటకి గెంటివేశాడని బాధిత మహిళ పేర్కొన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో మహిళ ఇంటి యజమాని, ఆయన కుటుంబ సభ్యులపై స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా యజమాని సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. యజమాని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
సమోసా, కచోరీలతో కోట్లకు కొలువుతీరి..
లక్నో : యూపీలోని అలీగఢ్‌లో సమోసాలు, కచోరీలు అమ్ముకునే చిరు వ్యాపారికి ఐటీ నోటీసులు అందాయి. అది చూసేందుకు చిన్న షాపే అయినా అమ్మకాలు మాత్రం ఏటా రూ 60 లక్షల నుంచి రూ కోటి వరకూ ఉండటంతో జీఎస్టీ కింద నమోదు చేసుకుని పన్ను చెల్లించాలని పేర్కొంటూ వ్యాపారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖేష్ కచోరి పేరుతో సీమా సినిమా హాల్ సమీపంలో ఉన్న ఈ దుకాణాన్ని రోజూ ఉదయాన్నే తెరిచి రాత్రి పొద్దుపోయేదాకా నడిపిస్తారు. ఇక్కడ వండివార్చే సమోసాలు, కచోరీలకు స్ధానికుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రోజూ కస్టమర్ల తాకిడితో కౌంటర్ కళకళలాడటంతో అంతా బాగానే ఉన్నా ఈ షాప్‌పై వచ్చిన ఫిర్యాదుపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. షాప్ ఎదురుగా ఉన్న మరో దుకాణంలో కూర్చున్న అధికారులు అక్కడ జరిగే తంతును గమనించారు. ముఖేష్ కచోరీలు, సమోసాలపై ఏటా రూ 60 లక్షల నుంచి రూ కోటికి పైగానే ఆర్జిస్తాడని అంచనా వేశారు. అధికారులు ఆరా తీయడంతో కంగుతిన్న ముఖేష్ తనకు ఇవేమీ తెలియవని, గత 12 ఏళ్లుగా తాను ఈ షాపును నడిపిస్తున్నా ఈ లాంఛనాలు ఉంటాయని తనకు ఎవరూ చెప్పలేదని చెప్పుకొచ్చాడు. తాను బతికేందుకు చిన్న స్ధాయిలో ఈ వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ముఖేష్ తన వ్యాపారం గురించి పూర్తిగా చెప్పాడని, ఎంత ఆదాయం వస్తుంది నూనె, సిలిండర్ వంటి ముడి సరుకులకు ఎంత ఖర్చవుతుందనేది చెప్పాడని ఈ కేసును విచారించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) సభ్యుడు తెలిపారు. రూ 40 లక్షల వార్షిక టర్నోవర్‌ను మించిన వారంతా జీఎస్టీ రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని, సిద్ధం చేసిన ఆహారంపై 5 శాతం పన్ను విధిస్తారని చెప్పారు. ముఖేష్‌కు నోటీసు జారీ చేసిన అధికారులు అతనితో జీఎస్టీ రిజిస్ర్టేషన్ చేయించి పన్ను వసూలు చేసే ప్రక్రియను చేపట్టారు. అసంఘటిత రంగంలో ఇలాంటి వ్యాపారులు ఎందరో అవగాహన లేమితో జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారని, వారందరినీ పన్ను వ్యవస్ధలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
చిన్నారి హత్య: బీజేపీపై శివసేన ఫైర్
సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెళ్లువెత్తుతున్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు రక్షణ కల్పించడంలో యోగి సర్కారు తీవ్రంగా విఫలమయిందంటూ శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు తీవ్రంగా వినిపించాయి. అప్పుడు ఆందోళన చేపట్టినవారు నేడు ప్రభుత్వంలో ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు రాలేదు. ముఖ్యంగా యూపీలో చిన్నారులపై ఆత్యాచారాలు మరింత పెరిగాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా దారుణం. చిన్నారులకు రక్షణ కల్పించేందుకు యోగి ప్రభుత్వం వెంటనే చర్యలను చేపట్టాలి. భేటీ బచావో.. భేటీ పడావో నినాదంతో ముందుకెళ్లాలి. మానవత్వానికి మాయని మచ్చలా అలీగఢ్ ఘటన నిలిచింది’ అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. (పాశవిక హత్యపై ప్రకంపనలు) కాగా టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయిన బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పోమరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితుల్లో ఒకరైన జహీద్ సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఏడేళ్ల కూతురిపై 2014లో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో అతను అరెస్టయ్యాడని, బెయిల్‌పై తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తాజా కేసుతో కలిపి మొత్తం అతనిపై నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక నిందితులు జహీద్, అస్లాంను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. -
పాప రేప్‌పై సోషల్ మీడియా గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మూడేళ్ల పాపను రేప్ చేసి హత్య చేశారు. ఆ పాప రెండు కనుగుడ్లను పీకేసారు. ఓ చేయి విరిచేశారు. శరీరంపై యాసిడ్ పోశారు. ఆ తర్వాత కుక్కలు పీక్కుతినేలా చెత్త కుండీలో పడేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది జాహిద్, అస్లాం అనే యువకులు’.. ఈ వార్త చదవగానే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఆ వెంటనే రక్తం సలసలా కాగిపోతుంది. ఆ పాశవిక నేరస్థులు కళ్లముందు కనిపిస్తే పెట్రోలు పోసి తగుల బెట్టాలనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇది. ‘రేప్‌లకు మతం లేదనే వారు నేడెక్కడికి పోయారు? కశ్మీర్‌లోని కథువాలో ఎనిమేదేళ్ల బాలికపై హిందూ యువకులు సామూహిక అత్యాచారం జరిపారంటూ గగ్గోలు ఎత్తిన వారు నేడెక్కడా ?’ అంటూ వరుసగా వెలువడుతున్న ట్వీట్లతో నేడు అలీగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చేతిలో నేరాన్ని తెలియజేసే బోర్డు పట్టుకున్న ఫొటోతో మాధుర్ అనే వ్యక్తి ఈ నెల ఐదవ తేదీన చేసిన ట్వీట్ మొట్టమొదట అలజడి సృష్టించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా వరుసపెట్టి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇంత దారుణ సంఘటనలో నిజం కొంతే. అసలేం జరిగిందీ...? జూన్ రెండవ తేదీన చీర కొంగులో చుట్టిన రెండున్నర ఏళ్ల పాప మతృదేహం ఓ ఖాళీ స్థలంలో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అలీగఢ్ పోలీసులు అక్కడికి వెళ్లి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. అనంతరం రిపోర్టు కూడా వచ్చింది. పాపపై ఎలాంటి రేప్ జరగలేదని, గుడ్లు పీకేయడం, చేయి విరిచేయడం లాంటి దారణాలు కూడా జరగలేదని, గుంతు పిసకడం వల్ల ఊపిరాడక పాప మరణించిందని అలీగఢ్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ కుల్హరి మీడియా ముఖంగా తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగా పాపను చంపేస్తామని బెదిరించిన హంతకులు అన్యాయంగా పాపను పొట్టనపెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో జాహిద్, అస్లాం అనే యువకులను అరెస్ట్ చేశామని చెప్పారు. -
పాప రేప్‌పై సోషల్ మీడియా గగ్గోలు
-
ఆమే నా ప్రపంచం..
అలీగఢ్ : తన కూతుర్ని కిరాతకంగా చంపిన దుర్మార్గులను బహిరంగంగా ఉరి తీయాలని అలీగఢ్ సమీపంలో హత్యకు గురైన చిన్నారి తండ్రి భన్వీలాల్ శర్మ డిమాండ్ చేశారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించివుంటే తన కూతురు బతికేది ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్ వెళ్లాలని ఎంతో ఆరాటపడిందని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా కూతురు చాలా తెలివైంది. స్వయంగా అక్షరాలన్నీ గుర్తుపడుతుంది. ఆమె నవ్వు చాలా బాగుంటుంది. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమే నా ప్రపంచంగా బతికాన’ని భన్వరీలాల్ చెప్పారు. తమ కూతురు ఇంకా తమ చుట్టూ తిరుగుతున్నట్టే ఉందని, ఆమె మళ్లీ కనిపిస్తుందన్న ఆశతో జీవిస్తున్నట్టు చిన్నారి తల్లి శిల్పా శర్మ తెలిపారు. చిన్నారి హత్య మానవత్వానికి మాయని మచ్చ అయినప్పటికీ, ఈ దారుణోదంతం మత సామరస్యాన్ని దెబ్బతీయలేదని ఆమె బంధువు దశరథ్ శర్మ అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలోని టప్పల్ పట్టణంలో మూడేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనలో జహీద్, అస్లాం అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: పాశవిక హత్యపై ప్రకంపనలు) -
ఆ కిరాతకుడు అతి కిరాతకుడే..!
అలీగఢ్ : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితుల్లో ఒకరైన జహీద్ సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఏడేళ్ల కూతురిపై 2014లో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో అతను అరెస్టయ్యాడని, బెయిల్‌పై తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తాజా కేసుతో కలిపి మొత్తం అతనిపై నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక నిందితులు జహీద్, అస్లాంను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. (పాశవిక హత్యపై ప్రకంపనలు) రూ. 10 వేల కోసం దారుణం.. టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్ శర్మ టప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
బాలిక హత్యపై స్పందించిన సాధ్వి నిరంజన్
లక్నో : సమాజంలో సంప్రదాయ విలువలు, సంస్కృతి మంటగలిశాయని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. అలీగఢ్‌లో రెండేళ్ల చిన్నారిని చంపిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని, కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో మంచి విలువలు నెలకొల్పేలా చొరవ చూపాలని ఆకాక్షించారు. చిన్నారి మరణం దురదృష్టకరమని, ఈ తరహా ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు అప్పు తీర్చలేదన్న కోపంతో వడ్డీ వ్యాపారి వారి రెండున్నరేళ్ల కూతురిని గొంతునులిమి చంపిన ఘటన అలీఘడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే . ఆ వ్యాపారి చిన్నారి కను గుడ్లు బయటకు పీకేసి పాశవికంగా హత్యచేశాడు. బాలిక హత్యపై అలీగఢ్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. నిందితుడికి మరణ శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ దారుణం చోటుచేసుకున్నందున వారిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. -
ఇంత దారుణమా.. మాటలు రావడం లేదు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు సమీపంలో తప్పాల్ ప్రాంతంలో రెండున్నరేళ్ల చిన్నారి ట్వింకిల్ శర్మ అత్యంత పాశవికంగా హత్యకు గురైన దారుణోదంతంపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు గళం విప్పారు. ముక్కుపచ్చలారని చిన్నారిని కర్కశకంగా పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘జస్టిస్ ఫర్ ట్వింకిల్’ పేరుతో ఫ్లకార్డులు పట్టుకుని ట్విటర్లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ నటీమణులు కరీనాకపూర్, సోనమ్‌కపూర్, సన్నీ లియోన్, స్వరభాస్కర్ తదితరులు స్పందించారు. ఈ కిరాతకంపై ఎందుకు గళం విప్పడం లేదని సెక్యులరిస్ట్‌లను ప్రశ్నించారు. ట్వింకిల్ హత్యోదంతం దిగ్భ్రాంతికి గురిచేసిందని, హృదయం ద్రవింపచేసిందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. రెండురేన్నళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన హంతకులను శిక్షించాలని ట్వీట్ చేశారు. ఈ దారుణోదంతం గురించి చెప్పడానికి మాటలు రావడానికి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ట్విటర్లో పేర్కొన్నారు. కోపం కట్టలు తెంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించేందుకు న్యాయవ్యవస్థ తక్షణమే స్పందించాలని ట్విటర్ వేదికగా ప్రముఖులతో పాటు సామాన్యలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. (దారుణం: కను గుడ్లు బయటకు పీకేసి పాశవికంగా..) Just so disgusted and angered hearing about #TwinkleSharma. How can somebody even think of doing such a thing?!?! Speechless…. — Abhishek Bachchan (@juniorbachchan) 6 June 2019 Im sorry Twinkle that you had to you live in a world where Humans no longer understand Humanity!!!! May God look over you for Eternity as you are an Angel !!!! #ImSorry — Sunny Leone (@SunnyLeone) 6 June 2019 Extremely disturbed and heatbroken to know about Twinkle, a 2 and a half year old who was raped and killed in the most horrific way in Tappal near Aligarh. She deserves justice ! — Virender Sehwag (@virendersehwag) 6 June 2019 -
నోట్లో పేలిన పైపు.. మహిళ మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చికిత్సలో భాగంగా నోట్లో వేసిన పైపు పేలడంతో మహిళ మృతి చెందింది. వివరాలు.. బాధితురాలు విషం తాగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. హుటాహుటిన ఆమెను అలీఘడ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంటనే చికిత్స ప్రారంభించిన డాక్టర్లు..విషాన్ని పీల్చడానికి బాధితురాలి నోటిలో పైపు వేసారు. అయితే క్షణాల్లోనే అది పేలడంతో ఆమె మృత్యువాత పడింది. కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. మృతురాలు సల్ఫ్యూరిక్ యాసిడ్ తాగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే నోట్లో పైపు వేయగానే అందులోని ఆక్సీజన్‌తో చర్య జరగడంతో పేలుడు సంభవించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఘటనకు గల కారణాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి అధికార ప్రతినిధి తెలిపారు. -
కులమే కీలకం....అలీగఢ్
ద్వితీయ బ్రిటిష్–మరాఠా యుద్ధానికి అలీగఢ్ ప్రత్యక్ష సాక్షి. భారతదేశం మొత్తంలో బహుశా మహమ్మద్ అలీ జిన్నా ప్రస్తావన కలిగిన ఏకైక నియోజకవర్గం ఈ పార్లమెంటు స్థానమే కావడం విశేషం. ఇటీవల కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో తలెత్తిన వివాదాలు కావచ్చు, స్థానిక ప్రజల చైతన్యం కావచ్చు ఈ పార్లమెంటు స్థానంపై ఇటు బీజేపీ, అటు మహాగఠ్ బంధన్.. రెండూ పట్టు సంపాదించేందుకు చాలా కాలంగా యత్నిస్తున్నాయి. బీజేపీకే పట్టం.. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో అలీగఢ్ ఒకటి. స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పర్యాయాలు అలీగఢ్ ప్రజలు పట్టంగట్టింది కూడా బీజేపీకే. ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి సతీష్ కుమార్ గౌతమ్ ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో షీలాగౌతం బీజేపీ నుంచి నాలుగుసార్లు ఇదే పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, గఠ్బంధన్ అభ్యర్థి అజిత్ బలియాన్.. బీజేపీ అభ్యర్థి సతీష్‌కుమార్ గౌతమ్‌తో తలపడి తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. బీజేపీని నాలుగుసార్లు విజయతీరాలకు చేర్చిన షీలాగౌతమ్‌ను 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించిన బీజేంద్రసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ– గఠ్బంధన్ మధ్యనే ఉండబోతోంది. సిట్టింగ్‌పై అసంతృప్తి.. నిజానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సతీష్‌కుమార్ గౌతమ్ అభ్యర్థిత్వంపై బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్.. సతీష్‌కుమార్‌కు తిరిగి సీటు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. అయితే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా ఫొటోని పెట్టడంపై చెలరేగిన వివాదంలో సతీష్‌కుమార్ గౌతం కీలక భూమిక పోషించడం ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకుని, తిరిగి ఈ సీటుని పొందగలిగారు. 2014లో మోదీ వేవ్‌తో ఈ స్థానాన్ని 3 లక్షల ఓట్లతో కైవసం చేసుకోగలిగినా పెద్ద నోట్ల రద్దు ప్రభావం, జీఎస్టీపై వ్యతిరేకత, స్థానిక సామాజిక సమీకరణలు బీజేపీ–మహాగఠ్ బంధన్ ఎన్నికల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణల ప్రభావం బీజేపీ అభ్యర్థి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారైతే, ఆయనతో ఢీ అంటే ఢీ అంటోన్న మహాగఠ్ బంధన్ అభ్యర్థి అజిత్ బలియాన్ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న చౌధరీ బీజేంద్రసింగ్‌ది సైతం ఇదే సామాజిక వర్గం కావడం విశేషం. ‘‘ఈ ఎన్నికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హిందూ అగ్రకులాల ఓట్లన్నీ బీజేపీ పొందగలుగుతుంది. అయితే స్థానిక దళితుల్లోని మెజారిటీ ఓట్లూ, ఓబీసీల ఓట్లూ, జాట్ల ఓట్లు, ఠాకూర్లు, ముస్లింల ఓట్లు మాత్రం మహాగఠ్ బంధన్ ఉమ్మడి అభ్యర్థికే పడతాయి’ అని స్థానిక ఉపాధ్యాయుడు రాఘవేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం అలీగఢ్‌లో 18.5 లక్షల ఓట్లున్నాయి. ఇందులో 20 శాతం ముస్లింల ఓట్లు. జాట్లు, ఠాకూర్లు కలిపి 15 శాతం ఉంటారు. బ్రాహ్మణులు, వైశ్యుల ఓట్లు కలిపి 10 నుంచి 15 శాతం ఉంటాయి. మిగిలిన వారిలో లోధ్, బఘేల్, సెయినీ, కుమ్మర్లు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో అగ్రవర్ణాల ఓట్లూ, జాట్లు, ఠాకూర్లు, ఓబీసీలూ, దళితుల్లో కొన్ని వర్గాల మద్దతుతో విజయాన్ని సాధిం చారు. ఈసారి సాధారణ యువతరం అంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతోంటే, విద్యావంతులూ, అలీగఢ్ యూనివర్సిటీ ఘటనల నేతృత్వంలో విద్యార్థులూ బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి ఇక్కడ విజయావకాశాలు ఎవరిని వరిస్తాయనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వరదల్లో తప్పిపోయింది.. ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చింది
లక్నో : 2013లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో తప్పిపోయిన అలీగఢ్ బాలిక.. దాదాపు ఐదేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఈ నేపథ్యంలో మనమరాలిని ఇన్నేళ్లుగా క్షేమంగా కాపాడి, ప్రస్తుతం తమ దగ్గరికి చేర్చిన స్వచ్ఛంద సంస్థలకు ఆమె బామ్మాతాతయ్యలు ధన్యవాదాలు తెలిపారు. అసలేం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన చంచల్ అనే మానసిక వికలాంగురాలు 2013లో తన తల్లిదండ్రులతో కలిసి కేదార్నాథ్ యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేదార్‌నాథ్‌లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో చంచల్ కుటుంబం చెల్లాచెదురైంది. ఆమె తండ్రి మరణించగా.. ఆమె తల్లి మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఓ అనాథాశ్రమ నిర్వాహకులు చంచల్‌ను(17) చేరదీసి.. ఐదేళ్లుగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. మానసిక వికలాంగురాలైన చంచల్ తన స్వస్థలం గురించిన పూర్తి వివరాలు వాళ్లకు చెప్పలేకపోయింది. అయితే ఎప్పుడైనా అలీగఢ్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించినపుడు మాత్రం ఆమెలో ఉత్సాహం కనిపించేది. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు.. ఆ దిశగా చంచల్ కుటుంబం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అలీగఢ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి చంచల్ వివరాలు తెలియపరిచారు. చివరికి పోలీసుల సాయంతో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అలీగఢ్‌లో హోమ్ ట్యూటర్ కర్కశత్వం
-
లైవ్ ఎన్కౌంటర్.. మీడియాకు ఆహ్వానం
అలీఘర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మీడియా సాక్షిగా ఇద్దరు హంతకులను పోలీసులు హతమార్చడం సంచలనంగా మారింది. హర్దూగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచువా గ్రామంలో గురువారం నేరగాళ్లు సంచరిస్తున్నారన్న సమాచారాన్ని స్థానిక పోలీసులు తెలుసుకున్నారు. బైక్‌పై వెళుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ముస్తకిమ్, నౌషద్‌లను అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ, పోలీసుల కళ్లుగప్పి సమీపంలోని ఓ పాత బిల్డింగ్‌లో వారు తలదాచుకున్నారు. పెద్దమొత్తంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోవాడానికి ప్రయత్నించగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మరి కాసేపట్లో లైవ్ ఎన్కౌంటర్ ఉంది..మీడియా వచ్చి కవర్ చేయండి అంటూ పోలీసుల నుంచి మీడియాకు ఆహ్వానం వచ్చింది. స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఎన్కౌంటర్ని చిత్రీకరించారు. ఎన్కౌంటర్ గురించి పారదర్శకంగా వ్యవహరించడానికే మీడియాకు ఆహ్వానించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు క్రిమినల్స్ మృతిచెందగా, ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన 6 హత్య కేసుల్లో ముస్తకిమ్, నౌషద్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరికి 10కి పైగా దొంగతనం కేసుల్లో కూడా సంబంధం ఉండటంతో పోలీసులు ఒక్కొక్కరిపై రూ.25 వేల రివార్డు కూడా ప్రకటించారు. -
‘ఆయన ముఖానికి నల్ల రంగు పూస్తే 11వేలు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ముఖానికి నల్ల రంగు పూస్తే వారికి బహుమతిగా 11వేలు నగదు ఇస్తామని అలీగఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువ నాయకుడు ప్రకటించాడు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందని థరూర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై యూపీలోని అలీగఢ్‌కు చెందిన ముస్లిం యూత్ అసోషియేషన్ యువ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించాలని డిమాండ్ చేశారు. కేవలం హిందూవులనే కాక దేశంలోని ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా అయన ప్రకటన ఉందన్నారు. హిందూ, ముస్లింలను విభజించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, బీజేపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని, దేశాన్ని హిందూ దేశంగా మారుస్తుందని శశి థరూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. థరూర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
బాస్ వేధిస్తోందని...
ఆగ్రా: బాస్ వేధిస్తుందన్న కారణంతో ఓ ఉద్యోగి చేసిన పని అతన్ని చిక్కుల్లో పడేసింది. విధుల నుంచి సస్పెండ్ కావటంతోపాటు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... అలీఘడ్ జిల్లా కోర్టులో వికాస్ గుప్తా అనే వ్యక్తి ఓ మహిళా సివిల్ జడ్జి దగ్గర ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అతని వ్యవహారశైలిలో మార్పును గమనించిన ఆమె.. తన ఛాంబర్లో సీసీటీవీ ఫుటేజీని ఉంచారు. ఓరోజు ఆమె నీళ్లు అడగ్గా, గ్లాసులో ఉమ్మేసి మరీ ఆమెకు నీటిని అందించాడు. అదంతా సీసీటీవీలో రికార్డయ్యింది. ఫుటేజీని చూసిన ఆమె ఈ విషయంపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతవారం ఈ ఘటన చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ఎంప్లాయిస్ యూనియన్ నేత ఉమా శంకర్ యాదవ్ స్పందించారు. ‘గుప్తా చేసింది ముమ్మాటికీ తప్పే. అయితే గత రెండు నెలలుగా అతనిపై వేధింపులు ఎక్కువయ్యాని తెలిసింది. అప్పటి నుంచి అతని మానసిక స్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బహుశా అందుకే ఇలా చేసి ఉంటాడేమో’ అని యాదవ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా సెషన్స్ న్యాయమూర్తి పీకే సింగ్ ఓ సీనియర్ అధికారితో విచారణకు ఆదేశించారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని జడ్జి ఆ అధికారిని ఆదేశించారు. -
ప్రిన్సిపాల్ వినూత్న ఆలోచన.. విమర్శలు!
లక్నో : విద్యార్థులు కాపీ కొడుతున్నారని వీటిని అరికట్టేందుకు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ వినూత్నంగా ఆలోచించారు. కాలేజీ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు సెట్ చేయించారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ధరం సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేం ప్రకాష్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రెస్సుల్లో ఏదో విధంగా స్లిప్స్ తీసుకొస్తున్నారని, వీటిని అరికట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదని, దాంతో విద్యార్థులు ధర్నాలు చేపట్టే అవకాశం లేదన్నారు. విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారని బాయ్స్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. అయితే కేవలం అబ్బాయిలే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తారా అని కొందరు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదని, అయితే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతించాలని సూచించారు. కాపీయింగ్ చేస్తూ దొరికిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అబ్బాయిలను అవమానించే ఇలాంటి పనులు మంచివి కాదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు. -
దళితుడి ఇంట మంత్రి పార్శిల్ భోజనం
సాక్షి, అలీఘర్ : యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ క్యాబినెట్లో మరో మంత్రి వివాదంలో కూరుకుపోయారు. దళితులను పార్టీకి చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా యూపీ మంత్రి దళితుని ఇంట భోజనం చేయాల్సి ఉండగా, క్యాటరర్ నుంచి తెప్పించిన భోజనం ఆరగించడంతో వివాదం నెలకొంది. యూపీ మంత్రి సురేష్ రాణా వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అలీఘర్‌లోని లోహగఢ్‌లో సోమవారం రాత్రి మంత్రి రాణా ఓ దళిత సోదరుడి ఇంట వారి కుటుంబసభ్యులతో కలిసి విందు ఆరగించారు. అయితే ఆ తర్వాత విడుదలైన వీడియోల్లో మంత్రి ఆరగించిన విందు ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించినదని, దళిత కుటుంబం స్వయంగా వండివార్చింది కాదని వెల్లడైంది. ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారడంతో మంత్రి రాణా ఇబ్బందుల్లో పడ్డారు. అయితే మంత్రి తమ ఇంటికి విందుకు వస్తున్నారని తనకు చివరి నిమిషం వరకూ తెలియదని..ఆహారం..మంచినీరు..పాత్రలు అన్నీ బయటనుంచి తెప్పించారని మంత్రికి ఆతిథ్యం ఇచ్చిన దళితుడు రజనీష్‌కుమార్ చెప్పారు. మంత్రితో పాటు పలువురు ఇతర బీజేపీ నేతలు రెస్టారెంట్ నుంచి తెప్పించిన విందు ఆరగిస్తూ వీడియోలో కనిపించారు. పనీర్ ఐటెమ్స్, దాల్‌మఖానీ, పులావ్, తండూరీ రోటీ, మినరల్ వాటర్ బాటిల్స్ టేబుళ్లపై కనిపించాయి. మంత్రి బృందమే వాటన్నింటినీ ఆర్డర్ చేసి తెప్పించిందని గ్రామస్థులు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి రాణా తోసిపుచ్చారు. తన పర్యటన గురించి దళిత కుటుంబానికి సమాచారం ఉందన్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు : ఏడుగురు మృతి
అలీగఢ్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన అలీగఢ్‌లోని చెర్రా రోడ్డు సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతో పాటూ మరో ఐదుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
బాలికకు చెంపదెబ్బ.. మహిళానేతపై కేసు
-
బాలికకు చెంపదెబ్బ.. మహిళానేతపై కేసు
అలీఘడ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చున్న బాలికను కొట్టిన కేసులో స్థానిక బీజేపీ మహిళా విభాగం నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తండ్రి సవేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ మహిళా నేత సంగీత వర్షిణిపై గాంధీపార్క్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తన కుమార్తెపై అందరూ చూస్తుండగా చేయి చేసుకోవడంతో తమ ప్రతిష్ట దెబ్బతిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ పేరుతో మోరల్ పోలీసింగ్ చేయడం, బెదిరింపులకు దిగే వారిపై చర్య తీసుకోవాలన్నారు. సంగీతపై ఐపీసీ సెక్షన్ 323, 504 కింద కేసు నమోదు చేసినట్టు గాంధీపార్క్ పోలీసుస్టేషన్ సీఐ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చొని ఉందనే నెపంతో బాలికపై సంగీత వర్షిణి బహిరంగంగా చేయిచేసుకుంది. ‘హిందువు ఎవరో, ముస్లిం ఎవరో తెలుసుకోకుండానే ప్రేమిస్తావా. నేను మర్యాదగా చెప్పినా వినవా’ అంటూ బాలికను ఆమె హెచ్చరించింది. చేయి కూడా చేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి కెమెరాతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది సంచలనంగా మారింది. సంగీత వర్షిణి చర్యపై మహిళా హక్కుల పరిరక్షణ సంఘం కార్యకర్త కల్పనా గుప్తా మండిపడ్డారు. -
రేపిస్ట్‌ను కొట్టి చంపిన గ్రామస్తులు
అలీఘఢ్(యూపీ) : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని గ్రామస్తులు కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘఢ్‌లో చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో.. గ్రామస్తులే నిందితున్ని పట్టుకొని చితకొట్టారు. తీవ్రగాయాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు... అలీఘఢ్‌లోని బన్నా దేవి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిని బిహార్‌లోని బదౌన్‌కు చెందిన అర్వింద్ అకా కిడ్నాప్ చేశాడు. బాలిక ఇంటి సమీపంలోనే అర్వింద్ పని చేసేవాడు. మంగళవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలిసిన వారిని విచారించగా, అర్వింద్ బాలికను తీసుకువెళ్తుండగా తాము చూశామని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు సమయానికి స్పందించలేదు. దీంతో గ్రామస్తులే జట్లుగా ఏర్పడి గాలించి అర్వింద్‌ను పట్టుకున్నారు. చిన్నారిని బికామ్పుర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు గ్రామస్తులకు అర్వింద్ తెలిపాడు. తన పేరు ఎక్కడ బయటపెడుతుందో అని బయపడి చిన్నారి గొంతునులిమి హత్య చేసినట్టు గ్రామస్తులకు చెప్పాడు. అనంతరం అర్వింద్ చెప్పిన స్థలంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. అక్కడ చిన్నారి మృతదేహాన్ని చూసిన గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకోవడంతో.. అర్వింద్‌పై మూకమ్మడిగా దాడి చేశారు. అదే సమయానికి పోలీసులు వచ్చి తీవ్రగాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్వింద్ మృతిచెందాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు. -
రెండువేలు ఇచ్చి.. ఆ ‘ఆపరేషన్’ చేశారు!
అలీగఢ్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో డబ్బులేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి కేవలం రూ. రెండువేల కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. ‘నాకు ఉద్యోగం లేదు. డబ్బు అవసరం చాలా ఉంది. పురుషులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే రూ. 2000 ఇస్తున్నారని విన్నాను. అందుకే నేను కూడా ఆ ఆపరేషన్ చేయించుకున్నాను’ అని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పురాణ్శర్మ తెలిపారు. అయితే, డబ్బులు ఇచ్చి బలవంతంగా పురుషులకు కు.ని. ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ వివాదం చెలరేగడంతో దీనిపై అలీగఢ్ ముఖ్య వైద్యాధికారి స్పందించారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం భార్యను తీసుకొని పురాణ్ శర్మ వచ్చాడని, అయితే, ఆయన భార్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఆపరేషన్ చేయడం కుదరలేదని, కాబట్టి ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్ పథకంలో భాగంగా పురాణ్ శర్మను ఒప్పించి ఆపరేషన్ చేశామని తెలిపారు. -
అలీగఢ్ లో అలజడి
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోని వలసలు, మథురలో చెలరేగిన ఘర్షణలు మరువకముందే అలీగఢ్ మత ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అలీగఢ్ లోని బాబ్రి మండిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉండలేమంటూ మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలు వలస బాట పట్టారు. కొన్ని రోజుల క్రితం 19 ఏళ్ల హిందూ యువతిని కొందరు దుండగలు అవమానించారు. ఇది రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణకు దారి తీసింది. శాంతియుత పరిస్ధితులు నెలకొనేందుకు భద్రతా దళాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదని అందుకే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నామని సుధా వర్షిణి (38) ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు పాఠశాలకు వెలుతుంటే కూడా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా మేజిస్టేట్ అవదేశ్ తివారీ వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు. -
పరీక్ష రాస్తున్న నేహా వద్దకు వచ్చి..!
అలీగఢ్ (ఉత్తరప్రదేశ్): వర్షకాలం కావడంతో వాతావరణం కొంచెం చినుకులతో చల్లగా ఉంది. అలీగఢ్ సమీపంలోని తపాల్లో ఉన్న డీడీఎస్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. 17 ఏళ్ల నెహా శర్మ తరగతి గదిలో కూర్చొని.. తన సమాధానపత్రాన్ని నింపుతోంది. ఇంతలోనే ఓ 18 ఏళ్ల యువకుడు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏం జరగుతున్నది అంటూ టీచర్, మిగతా ఉపాధ్యాయులు వారి వంక ఆసక్తిగా చూశారు. వారు స్పందించేలోపే ఆ యువకుడు తుపాకీ తీసి నేరుగా నెహా తలకు గురిపెట్టి పేల్చాడు. తూటా తలలోంచి దూసుకుపోవడంతో పరీక్ష రాస్తున్న నేహా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ షాక్‌లోంచి తేరుకునే లోపే ఆ యువకుడు తనను తాను కాల్చుకున్నాడు. టీచర్ దిగ్భ్రాంతి చెందింది. రక్తపు మడుగులో ఉన్న ఆ ఇద్దరిని చూసి విభ్రమ చెందిన విద్యార్థులు హాహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తారు. గురువారం జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ను కుదిపేస్తున్నది. ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిని తరగతి గదిలోనే కాల్చి చంపి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని 18 ఏళ్ల సందీప్ మలాన్గా గుర్తించారు. అతను స్థానిక వెటర్నరీ వైద్యుడి కొడుకు. నెహా, సందీప్ ఒకరికొకరు తెలుసునని విద్యార్థులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్న పోలీసులు ప్రేమ వ్యవహారం ఇందుకు కారణం కాదని చెప్తున్నారు. -
వీళ్లు.. మనుషులా.. రాక్షసులా?
అలీగఢ్: పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే నెపంతో ఓ వ్యక్తిని చితక్కొట్టారు. ఏమాత్రం జాలి, కరుణ దయ లేకుండా నిర్ధాక్షిణ్యంగా కిందపడేసి చావు దెబ్బలు కొట్టారు. ఇంత జరుగుతున్న అక్కడ చుట్టూఉన్నవారంతా తాఫీగా ప్రేక్షకులుగా చూస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసిన ఈ వీడియో పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం ఓ యువకుడిని ముందుగా కిందపడేశారు. మరో వ్యక్తి అతడిని కదలకుండా పట్టుకోగా ఓ వ్యక్తి చేతిలో పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ తర్వాత ఓ రాయి తీసుకొచ్చి కాళ్లపైన, ముఖంపైన అదే పనిగా దాడి చేశాడు. దీంతో ఆ యువకుడు సొమ్మసిల్లిపోయాడు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి తాజా చిత్రం 'అలీగఢ్' దేశమంతటా విడుదలైనా.. ఒక్క ప్రాంతంలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. అది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతం. యూపీలోని మిగతా జిల్లాల్లో విడుదలైనా.. అలీగఢ్‌లో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. ఇందుకు కారణం ఈ సినిమా టైటిలే కాదు.. ఇందులోని నేపథ్యం కూడా. డైరెక్టర్ హన్సల్ మొహతా వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఈ సినిమా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడనే నెపంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఏడేళ్ల కిందట సస్పెండ్ చేశారు. ఏఎంయూలోని తన నివాసంలో ఓ రిక్షా కార్మికుడితో ఆయన స్వలింగ సంపర్కం జరుపుతుండగా స్థానిక జర్నలిస్టులు అనుమానాస్పద స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో తప్పుడు ప్రవర్తన కింద వర్సిటీ ఆయనపై వేటు వేసింది. తన సస్పెన్షన్‌పై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన సిరాస్ ఆ తర్వాత వారం రోజులకే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెండితెరకు మీదకు తెచ్చిన ఈ సినిమాపై అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు, కొన్ని సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీని తప్పుడురీతిలో ఈ సినిమాలో చిత్రీకరించారని, ఈ సినిమా టైటిల్ ను వెంటనే మార్చాలని ఏఎంయూ విద్యార్థులు, పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మళ్ళీ 'బీఫ్ బిర్యానీ' గొడవ
అలీగఢ్: దేశంలో మరోసారి బీఫ్ వంటకాల వివాదం వెలుగుచూసింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డించారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు కలకలం సృష్టించాయి. ఈ విద్యాసంస్థ తన స్వభావాన్ని బయటపెట్టేందుకు మరోసారి వివాదానికి తెర తీసిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. శుక్రవారం ఏఎంయూ మెడికల్ కాలేజీ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఫొటోలు తాజా వివాదానికి కారణమయ్యాయి. క్యాంటీన్లో వండినది ఆవు మాంసమే అయినా, గేదె మాంసంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతోపాటు క్యాంటీన్ మెనూ కార్డులోని ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే బీఫ్ బిర్యానీ వడ్డన ఆరోపణను యూనివర్సిటీ ఖండించింది. తమ క్యాంటీన్లో అటువంటిదేమీ జరగలేదని తెలిపింది. -
దుమ్మురేపుతున్న ట్రైలర్
ముంబయి: బాలీవుడ్ చిత్రం అలీఘడ్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఈ ట్రైలర్ విడుదలైన నాలుగు రోజుల్లోనే లక్షల మంది వీక్షించారు. హన్సాల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేశారు. ఇంత భారీ మొత్తంలో స్పందన రావడంపై ఈచిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయి స్పందిస్తూ ట్వీట్ చేశారు. 'ఇప్పటికే అలీఘడ్ చిత్ర ట్రైలర్‌ను 30 లక్షలమంది వీక్షించారు. ఇంకా వీక్షకుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఇంత భారీగా స్పందించిన వారందరికీ ధన్యవాదాలు' అని ఆయన ట్వీట్ చేశారు. స్వలింగ సంపర్కం అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుడనే కారణంగా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విధుల నుంచి తొలగించబడిన ప్రొఫెసర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. -
బాలికపై గ్యాంగ్ రేప్, అనంతరం హత్య
-
బాలికపై గ్యాంగ్ రేప్, అనంతరం హత్య
అలీఘర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దారుణ కాండ ఘటన ఇంకా మరువక ముందే... 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హర్దాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. బుధవారం సాయంత్రం ఆమె ట్యూషన్ ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా మోటార్ బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు అడ్డగించారు. అనంతరం ఆమెను సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి బాలిక దుప్పట్టతో ఉరివేసి హతమార్చారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ దుర్ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించేందుకు నిరాకరించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నలుగురి పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని సీనియర్ పోలీస్ అధికారి రవీందర్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించామని, నివేదిక అనంతరం బాలిక మృతిపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎవని అరెస్ట్ చేయలేదని, కేవలం అదుపులోకి తీసుకున్నారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. -
వారిలో మార్పుకోసం 'బుద్ధి, శుద్ధి' యాగం
సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, సాహితీవేత్తలకు బుద్దిని ప్రసాదించాలని కోరుతూ అలీఘడ్‌లో 'బుద్ధి, శుద్ధి యాగం' నిర్వహించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగం ద్వారా మేధావులైన రచయితలకు బుద్ధి పునర్ప్రాప్తి జరగాలని కోరుకుంటున్నట్లు జాతీయ అధ్యక్షురాలు పూజా శకున్ పాండే తెలిపారు. జాతీయ అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా దేశ ప్రతిష్ఠకు, జాతీయ సమైఖ్యతకు భంగం వాటిల్లే చర్యలకు రచయితలు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రతువు ద్వారా వారిలో మార్పును ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ హేతువాద రచయిత నరేద్ర దబోల్కర్, కన్నడ రచయిత కాల్బుర్గీల హత్యల నేపథ్యంలో ఇటీవల రచయితల హత్యల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 40 మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చారు. దేశంలో భావప్రకటన స్వేచ్చకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ.. రచయితలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. -
బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరి దారుణ హత్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ధర్మేంద్ర చౌదరి దారుణ హత్యకు గురైయ్యారు. ఈ సభలో పాల్గొనేందుకు తన కారులో వెళుతున్న ఆయనను ఇద్దరు దుండగులు ఆపి తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. బన్నాదేవి ప్రాంతంలోని ఓల్డ్ నగర్ నిగమ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ద్రువీకరించారని పోలీసులు తెలిపారు. 2017లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అట్రౌలీ నుంచి పోటీ చేసేందుకు ధర్మేంద్ర టికెట్ సాధించారు.