Allu Arjun
-
అల్లు అర్జున్‌కు షాక్.. పోలీసుల నోటీసులు
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల..అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.మధ్యంతర బెయిల్..అయితే అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ అయిన రోజే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరుసటి ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం)అసలే జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేక అతనిపై దుష్ప్రచారం
-
KA Paul: రేవతి కుటుంబానికి 300 కోట్లు ఇస్తా
-
సంధ్య ధియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వివాదం
-
సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం
పుష్ప-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాలుడి చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డిఇక ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని.. సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. రూమర్స్ ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. -
పుష్ప-2 మూవీపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సీతక్క
-
బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలని డిమాండ్.. బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
-
గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
-
పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. -
అల్లు అర్జున్ పై కాదు..ప్రజలపై దృష్టి పెట్టు..
-
అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
హైదరాబాద్, సాక్షి: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, నటుడు అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి.. పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు భంగపాటే ఎదురైంది. సోమవారం ఉదయం గాంధీభవన్‌కు చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లోనూ పని చేశారు. ప్రస్తు కాంగ్రెస్ నుంచి నాగార్జున సాగర్ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి 2011 మార్చి 6వ తేదీన వివాహం జరిపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది.ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో హైడ్రామా -
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా: ఎంపీ డీకే అరుణ
-
‘అల్లు అర్జున్‌కు ఆ సలహా ఇచ్చిందెవరు?’
హైదరాబాద్: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడని, ఆయనకు సలహా ఇచ్చింది ఎవరని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశ్నించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని తాను దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. పుష్ప సినిమా టికెట్ రేట్‌ను సీఎం రేవంత్ రెడ్డి పెంచారు.. ఈ విషయం అల్లు అర్జున్ ఆలోచించాలని.. పుష్ప సినిమాకు వచ్చిన లాభాలలో కొంత మొత్తం యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయండని సూచించారు. -
ఫార్ములా ఈ-కేసు..డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేసుల కేసుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ విషయమై డీకే అరుణ సోమవారం(డిసెంబర్23) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బీజేపీకి సంబంధం ఏంటి ?ఈ కార్ రేసుల కేసులో ఈడీ తన పని తాను చేస్తోంది. హీరో అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా కావాలని రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా. ఈ విషయంలో ఎంఐఎం,కాంగ్రెస్ ఒక్కటై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎం రేవంత్‌రెడ్డి కావాలని ప్రశ్న అడిగించారు’అని డీకే అరుణ చెప్పారు. ఇదీ చదవండి: కేటీఆర్‌కు త్వరలో నోటీసులు..? -
అల్లు అర్జున్ కేసులో పొలిటికల్ ఫైట్
-
KSR Live Show: పుష్ప.. వివాదం.. పొలిటికల్ వైల్డ్ ఫైర్ గా మారబోతోందా?
-
అల్లు అర్జున్ Vs పోలీస్.. భిన్న వాదనలు.. ఏది నిజం?
-
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పుష్ప పొలిటికల్ రగడ.. ఏది నిజం? ఏది అబద్దం?
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. ఆరుగురు నిందితులకు రిమాండ్
-
‘అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్ నివాసం వద్ద దాడి ఘటనపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఎక్స్ వేదికగా పిలుపు ఇచ్చారు.‘‘సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారాయన. అయితే.. అంతకు ముందు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానుప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది.— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 23, 2024అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమని, ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. -
'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య దూరం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇదే అంశంపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.'ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇదే కనిపిస్తుంది. ఈ ఘటన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనలు ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.. అలా కాకుండా మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి.. పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.’ అని పేర్కొన్నారు.పుష్ప2 సినిమా విడుదల సమయంలో డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ నాయకుల కామెంట్లు వల్ల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా రేవతి మరణం గురించి వ్యాఖ్యలు చేయండంతో పాటు ఆ సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు బాగాలేదని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఆపై పలు రాజకీయ పార్టీ నేతలు బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడటంతో వివాదం మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్
సాక్షి,హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడికి కారకులైన ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం(డిసెంబర్23) ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే.. వీరికి అప్పటికప్పుడే బెయిల్ మంజూరు అయ్యింది. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు.. ఒక్కొకరికి రూ.10వేల పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినవారిలో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఉన్నారు. నిందితులపై బీఎన్ఎస్ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. నిందితులు మీ పార్టీ వాళ్లంటే.. మీ పార్టీ వాళ్లంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్లు పరస్పర ఆరోపణలకు దిగాయి.కాగా, సంధ్య థియేటర్లో పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందన సరిగా లేదని ఓయూ జేఏసీ పేరిట పలువురు ఆయన ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు వేయడంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: పుష్ప అభిమాని అరెస్ట్ -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అసలేం జరిగిందంటే.. (చిత్రాలు)
-
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!?
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎన్నో అనుమానాలు..వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముందు నుంచే దుష్ప్రచారం ‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పని చేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు.