Arvind Kejriwal
-
ఢిల్లీ కొత్త సీఎంకు ‘ఏడు’ సవాళ్లు.. రూపు ‘రేఖ’లు మారేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే మంత్రులకు శాఖలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.మరోవైపు, బీజేపీ కొత్త ప్రభుత్వానికి ఢిల్లీలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు తీర్చాల్సి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం హామీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే...1. మహిళలకి నెలకు రూ.2500 ఉచిత ఆర్థిక సహాయం, గర్భిణులకు 21 వేల రూపాయల ఆర్థిక సహాయం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం.2. యమునా నది ప్రక్షాళన 3. వాయు కాలుష్య నిర్మూలన 4. మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం 5. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలు సహా సంక్షేమ పథకాల అమలు 6. మహిళల భద్రత 7. దేశ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం. -
‘మఫ్లర్ మేన్’ మాటపై నిలబడతారా?
చెప్పులో రాయి, చెవిలో జోరిగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటిలోని తగువు.. సామెత మనకందరికీ తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి.. అధికారాన్ని కోల్పోయిన ‘మఫ్లర్ మేన్’కు సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. ఒకప్పుడు అండగా నిలబడిన నాయకులే ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే అధినాయకుడిపై విరుచుకుపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal).. కేజ్రీవాల్‌కు కంట్లో నలుసులా మారారు.తనపై కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగిందని గతేడాది మే నెలలో స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలబడలేదన్న అక్కసుతో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లేఖాస్త్రం సంధించి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మిగిలింది. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవి దళితుడికి ఇవ్వాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేజ్రీవాల్‌కు ఆమె లేఖ రాశారు.మీకు ఇదే మంచి అవకాశం‘ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. మీరు(కేజ్రీవాల్) మాట నిబడేందుకు ఇది మీకు మంచి అవకాశం. విపక్ష నేతగా దళిత ఎమ్మెల్యేను నియమించండి. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం కోసం బలమైన ముందడుగు అవుతుంద’ని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో స్వాతి మలివాల్ పేర్కొన్నారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తానని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ఆమె గుర్తు చేశారు. కాగా, ఢిల్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో సహా అగ్రనేతలు ఓటమి పాలయిన సంగతి తెలిసింది. మాజీ సీఎం ఆతిశీ మాత్రం ఒడ్డున పడ్డారు.బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి మలివాల్ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీసీఎంలు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వచ్చినట్టు ఎక్కడా కనబడలేదు. అయితే ‘ఆప్’ ఎంపీ స్వాతి మలివాల్ మాత్రం ప్రమాణ స్వీకారం హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ఆసక్తిగా ముచ్చటిస్తూ ఆమె కనిపించారు. రేఖా గుప్తాతో కరచాలనం చేసి స్వయంగా అభినందలు కూడా తెలిపారామె.చదవండి: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటాకాగా, కేజ్రీవాల్‌తో విభేదాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వచ్చిన ఊహాగానాలపై స్వాతి మలివాల్ స్పందించారు. ఈ విషయంపై ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని. ఈ పార్టీలోనే కొనసాగుతాను. ప్రశ్నలను సంధించినందుకు నన్ను రాజీనామా చేయంటున్నారు. నేనేం తప్పులేదు. రాజీనామా ఎందుకు చేయాల’ని ఆమె ఎదురు ప్రశ్నించారు. -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్‌కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్‌లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
ఢిల్లీలో ఆప్ ఓటమి.. నెక్ట్స్ పంజాబే : స్వాతి మలివాల్
ఢిల్లీ : పంజాబ్‌లో ఇసుక తవ్వకాలు, బదిలీ పోస్టింగ్‌లలో భారీ అవినీతి జరుగుతుందని ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. కొంతమంది పంజాబ్‌ను తమ వ్యక్తిగత ఏటీఎంలా భావిస్తున్నారు. పరిస్థితుల్ని సరిదిద్ధకపోతే ఢిల్లీలాగే పంజాబ్‌ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీలో ఓటమి తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు, ఆప్ నేతలతో కేజ్రీవాల్ సమావేశం వంటి పరిణామల నేపథ్యంలో మలివాల్ మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ తన గూండా బిభవ్ కుమార్‌ను భగవంత్ మాన్ ముఖ్య సలహాదారుగా నియమించారు. పంజాబ్‌లో దోచుకున్న మొత్తాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. పంజాబ్ ఇసుక మాఫియా గుప్పిట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో బదిలీ పోస్టింగ్‌ల విషయానికి వస్తే ప్రతి దశలోనూ అవినీతి జరుగుతుందని దుయ్యబట్టారు. ఢిల్లీ ఓటమి తర్వాత పంజాబ్‌లో ఆప్ సీఎం,ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడాన్ని కూడా మలివాల్ ప్రశ్నించారు. ఈ అత్యవసర సమావేశం కారణంగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు గందరగోళం, కోపంతో ఉన్నారు. ఢిల్లీలో ఓటమి తర్వాత కేజ్రీవాల్ పంజాబ్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకి క్రేజీవాల్ పంజాబ్‌కి ఏం చేశారు?అని ప్రశ్నించారు. -
కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా?
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచు కోట బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానా లతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ‘కర్ణుని చావుకు సవా లక్ష కారణాలు’ ఉండొచ్చేమోగానీ, కేజ్రీవాల్ ఓటమికి వేళ్ల మీద లెక్క బెట్టదగ్గ కారణాలే ఉన్నాయి.కేజ్రీవాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే 1999లో ‘పరివర్తన్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, ఢిల్లీ ప్రజలకు పన్నులతో పాటు ఇతర సామాజిక విషయాల మీద అవగాహన కల్పించే వారు. సమచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని వెలికి తీశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో ‘రామన్ మెగసెసే అవార్డు’ లభించడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. 2011లో ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ వద్ద అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ లోక్ పాల్’ బిల్లును తీసుకురావాలని అన్నా హజా రేతో కలిసి దీక్ష చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ‘జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఏ పదవీ చేపట్టను. యాక్టివిస్టుగానే ఉంటా’ అని ప్రకటించు కున్న కేజ్రీవాల్, అనూహ్యంగా 2013లో రాజకీయా ల్లోకి అడుగుపెట్టారు. మొత్తానికి ఢిల్లీ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఆప్ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. దాని పర్యవసా నమే 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.సామాన్యుల సీఎంనని, ప్రభుత్వ బంగ్లా తీసు కోనని చెప్పి... ఖరీదైన శీష్ మహల్ నిర్మించుకోవడాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు. ఈ అంశాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా ‘కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ కాదు, కాఫీ ఆద్మీ’ అని ప్రచారం చేసింది. అవినీతికి వ్యతి రేకంగా వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ, దీనికి విరుద్ధంగా ఆయనతో పాటు ఆయన మంత్రులు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో విశ్వసనీ యత కోల్పోయారు. అవినీతి ఆరోపణలు వస్తే నాయకులు రాజీనామా చేయాలని చెప్పిన కేజ్రీవాల్, తాను జైల్లో ఉన్నా రాజీనామా చేయలేదు. సిసోడి యాని అరెస్టు చేయగానే, రాజీనామా చేయించిన కేజ్రీవాల్, తను జైల్లో ఉండి కూడా చాలాకాలం కుర్చీని వదల్లేదు. దీంతో అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి పార్టీగా మారిందని బీజేపీ ప్రచారం చేసి జనాన్ని తనవైపు తిప్పుకుంది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక రాజీనామా చేసి, కీలుబొమ్మ లాంటి ఆతిశీని సీఎం చేయడం ఒక నాటకంలా ప్రజలు భావించారు. కేజ్రీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కుర్చీలో కూర్చొని మీడియాతో మాట్లాడేవారు. అదే కుర్చీని ‘కేజ్రీవాల్ పట్ల తనకున్న గౌరవం’ పేరుతో ఖాళీగా వదిలేసి ఆతిశి మరో కుర్చీలో కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆప్ నేతలు ఒకవైపు కేసుల్లో ఇరుక్కోవడం, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆప్ అంతకుముందు ఐదేళ్లలో చేసినట్టుగా ఈసారి పరిపాలించలేక పోయింది. 2020 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికల ముందు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని చేసిన కీలక ప్రకటన... మధ్యతరగతిని బీజేపీ వైపు తిప్పింది. ఇది ఉద్యోగులు అధికంగా ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీ వాల్ ఓటమికి కూడా కారణమైంది. 2015, 2020 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఢిల్లీలో తనకు ఎదురేలేదని భావించిన కేజ్రీవాల్ అతి విశ్వాసంతో దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించు కోవడానికి ప్రయత్నాలు చేశారు. పంజాబ్ విజయంతో ఈ అతివిశ్వాసం మరింత మితిమీరింది. గోవా, గుజరాత్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీతో కలవ నని చెప్పిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల సమయంలో మాటమార్చి ‘ఇండియా’ కూటమితో కలిశారు. ఆరు నెలలు తిరగకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్తో తెగదెంపులు చేసుకోవడంతో రెండు పార్టీలు ఎవ రికి వారే పోటీ చేశారు. ఢిల్లీలో ఈసారి దాదాపు 6 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్, చాలా చోట్ల ఓట్లను చీల్చి ఆప్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ముస్లిం, ఎస్సీ ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడటంతో బీజేపీకి కలిసొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓట మితో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడంతో ‘ఆయనకు క్రేజ్ తగ్గిందా’ అనే చర్చలు ప్రారంభ మయ్యాయి. కేజ్రీవాల్‌కు మళ్లీ క్రేజ్ పెరగడంతోపాటు ఆప్‌కు ఆదరణ పెరగాలంటే ఆయన గతంలోవలే ఢిల్లీ లోని కాలనీలు, గల్లీలు, మొహల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయితే, మరో ఐదేళ్లలో ఆయనకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి.జి. మురళీ కృష్ణ వ్యాసకర్త సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ -
‘మీకు శాపం తగిలింది.. అందుకే ఓడిపోయారు’.. అతిషీతో సక్సేనా!
ఢిల్లీ: ‘నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా. యమునాతో పెట్టుకోవద్దు. మీ కొంప మునుగుతుంది అని. అయినా మీరు నా మాట విన్నారా. వినలేదు. పెడ చెవిన పెట్టారు. ఇప్పుడు అనుభవించండి’ అంటూ ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనాతో (Atishi Marlena) లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (lieutenant governor V K Saxena) అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషీ మర్లేనా తన రాజీనామాను లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. ఆ సమయంలో ఇరువురు మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (delhi assembly elections) బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ తరుణంలో కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో యమునా నదిని శుభ్రం చేయకుండా కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ప్రధాన కారణమని సమాచారం.యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్‌ను నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించా’ అని గవర్నర్ సక్సేనా అతిషితో చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. కేజ్రీవాల్‌కు యమునా నది శాపం ఏంటి?యమునా నది కాలుష్యం కోరలు చాచడంతో జనవరి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నది పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి యమునా నదిని శుభ్రపరచే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. అందుకు ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణలు తొలగించడం, 11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడం పూర్తయింది. నదిలో నీటి ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అప్పుడే యమునా నదిని శుభ్రం చేసిన ఘనత తమకు దక్కదనే దురుద్దేశ్యంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో యమునా నదిని శుభ్రం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. తత్ఫలితంగా, యమునా నదిని పరిశుభ్రం చేసే పనులు ఐదు నెలల తర్వాత ఆగిపోయాయి. ఆ విషయంలో కేజ్రీవాల్ విజయం సాధించినా నదిని శుభ్రపరిచేందుకు గత 16 నెలలుగా ఒక్క పని కూడా చేయలేదు’అని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గతేడాది నవంబర్‌లో ఓ కార్యక్రమంలో ఆరోపణలు గుప్పించారు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన రాజీనామా సమర్పించేందుకు వచ్చిన అతిషీ మర్లేనాకు ‘యమునా నది పునరుజ్జీవనం’ శాపం అంశం గురించి గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా,ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అటు అతిషీ కానీ, ఎల్జీ రాజ్‌భవన్ వర్గాలు నిరాకరించాయి.👉చదవండి : మాజీ సీఎం కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన ఎవరీ పర్వేష్ వర్మ? -
కేజ్రీవాల్ ఓటమికి అదే ముఖ్య కారణం: ప్రశాంత్ కిషోర్
పాట్నా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కేజ్రీవాల్ ఓటమిపై జన్ సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో బెయిల్ పొందిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన చేసిన పెద్ద తప్పిదం అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ రాజీనామా పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వ్యాఖ్యలు చేశారు.జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతనే మొదటి కారణం. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా రెండో కారణం. మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. అయితే, బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేయడం, ఎన్నికలకు ముందు మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అయ్యింది.అలాగే, ఇటీవలి కాలంలో కేజ్రీవాల్ రాజకీయ వైఖరి కూడా మారింది. ఇండియా కూటమిపై ఆయన నిర్ణయాలు కొంత దెబ్బతిశాయి. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో కూటమితో కాకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఆప్ పనితీరుపై ప్రభావం చూపించింది. కేజ్రీవాల్ పరిపాలనలోని లోపాలను ప్రజలు ఎత్తి చూపించినా ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఆప్ రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే. ఇక, ఎంతో కష్టపడితే కానీ, కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. -
ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Election 2025) గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. దీనికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి సహా గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆప్ ఓటమికి సంబంధించిన కారణాలపై ుసుదీర్ఘంగా విశ్లేషించారు. ాపార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ చర్చించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఎవరు అనే అంశంపై ఎటువంటి చర్చ జరగలేదని భేటీ తర్వాత మీడియాకు స్పష్టం చేశారు అతిషి.ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు..ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని అతిషి విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందని ఆమె మండిపడ్డారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా , మద్యాన్ని కూడా ఏరులై పారించారన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులే సాక్ష్యమన్నారు అతిషి. పోలీసుల సాక్షిగానే బీజేపీ(BJP) అక్రమాలకు పాల్పడిందన్నారు. ఇందులో పోలీసులదే ప్రధాన పాత్ర అయితే ఇంకెవరికి చెప్పుకుంటామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తప్పు చేసిన వాళ్లు పోలీసులే అయితే ఇక జైల్లో ఎవరిని పెడతారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని ఆమె దుయ్యబట్టారు.కాగా, నిన్న(శనివారం) వెలువరించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లతో అధికారాన్ని కైవసం ేచేసుకుంటే, ఆప్ 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. రెండు పర్యాయాలుగా ఢిల్లీ పీఠాన్ని సాధిస్తూ వస్తున్న ఆప్.. ఈసారి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది.ఆప్ నుంచి పోటీ చేసిన కీలక నేతల్లో అతిషి మినహా మిగతా వారు ఓటమి చెందారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం ఆ పార్టీకి గట్టి ఎదురుబెబ్బ తగిలినట్లయ్యింది. -
‘ఇక ఆప్‌కు ముగింపు ప్రారంభమైంది’
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Assembly Election 2025) తర్వాత ఆప్ శకం ముగిసిందని అంటున్నారు మాజీ ఆప్ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఈసారి ఢిల్లీలో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ముగింపు ప్రారంభమైందని విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు ప్రశాంత్ భూషణ్.ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆప్.. ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకతతో పరిపాలించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆ పార్టీ సహజ స్వరూపాన్ని కోల్పోయి స్వలాభం కోసం రాజకీయాలు చేయడంతోనే ఆప్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. లోక్‌పాల్ సిద్ధాంతాలతో రాజకీయ ప్రవేశం చేసిన ఆప్.. ఇప్పుడు సొంత లోక్‌పాల్‌ను సృష్టించుకుందన్నారు. ఇది ఆప్ ఓటమికి కారణమని ప్రశాంత్ భూషణ్ ేపేర్కొన్నారు.2015లో ఆప్ నుంచి బహిష్కరించబడ్డ ప్రశాంత్ భూషణ్..ఆప్ అనేది అవినీతిలో కూరుకుపోయిందన్నారు. Kejriwal is largely responsible for AAP’s Delhi debacle. A party formed for alternative politics which was supposed to be transparent, accountable & democratic was quickly transformed by Arvind into a supremo dominated, non transparent & corrupt party which didn’t pursue a Lokpal…— Prashant Bhushan (@pbhushan1) February 8, 2025 నిన్న(శనివారం) వెలువడ్డ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాదించగా, ఆప్ అధికారాన్ని కోల్పోయింది. 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో విజయం సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, ఆప్ మాత్రం 22 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్రకు సిద్ధమైంది. -
కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. ఎవరీ పర్వేష్ వర్మ?
ఢిల్లీ: 27ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా, కొరకరానికి కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ని బీజేపీ చిత్తు చేతింది. ఆ పార్టీ చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బీజేపీ (bjp) మూడోసారి విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు?హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు దీరనుంది? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. రేపటి నుంచి నాలుగు రోజులపాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. పర్యటన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుత ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ మార్లేనా తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. అతిశీ రాజీనామా అనంతరం, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఉత్తర్వులు వెలువరించారు.ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కావడంతో కేజ్రీవాల్‌ను ఓడించి జైంట్ కిల్లర్‌గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ (parvesh verma) గవర్నర్ సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలతో ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా,బీజేపీ తరఫున చివరి సారిగా పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్లతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, వర్మకు 30,088ఓట్లు వచ్చాయి. వర్మ అంతకుముందు 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వచ్చించారు. ఎవరీ పర్వేష్ వర్మ?ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. పర్వేష్ వర్మ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముండ్కా నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.పర్వేష్ వర్మ విజయంపై ఆయన కుమార్తెలు త్రిష, సనిధి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.‘అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఎప్పటికీ చేయరు మా తండ్రి గెలుపుతో పాటు పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూశాం. ఆ సమయం రానే వచ్చింది.ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని వ్యాఖ్యనించారు. -
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్‌పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్‌పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ కోట చిక్కింది!
న్యూఢిల్లీ: 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో పదేళ్లుగా కంట్లో నలుసుగా, కొరకరాని కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఎట్టకేలకు చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో రెండు వరుస పరాభవాల అనంతరం ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘనవిజయం సాధించింది. సరిగ్గా పోలింగ్‌కు ముందు మోదీ సర్కారు గురిచూసి సంధించిన ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపు అస్త్రం బీజేపీ పాలిట రామబాణంలా పని చేసింది. కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దాంతో శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. కాంగ్రెస్‌తో పొత్తు వద్దనుకోవడం ఆప్ భాగ్యరేఖలనే పూర్తిగా తలకిందులు చేసింది. ఎందుకంటే 14 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌పై బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. స్వయానా ఆప్ సారథి కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఆయన పరాభవానికీ కాంగ్రెసే కారణంగా నిలిచింది. అక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు ఎక్కువ ఓట్లొచ్చాయి. అలా కాంగ్రెస్‌తో కటీఫ్ నిర్ణయం కేజ్రీవాల్‌తో పాటు మొత్తంగా ఆప్ పుట్టినే ముంచేసింది. బీజేపీ హవాలో ఆప్ నేత, సీఎం ఆతిషి కనాకష్టంగా గట్టెక్కగా ముగ్గురు మినహా ఆప్ మంత్రులంతా ఓటమి బాట పట్టారు. ఆప్ దిగ్గజ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఓటమి చవిచూశారు. అయితే ఆప్‌కు కోలుకోలేని షాకివ్వడం మినహా కాంగ్రెస్ కూడా బావుకున్నదేమీ లేదు. ఢిల్లీలో వరుసగా మూడోసారి కూడా ఖాతాయే తెరవలేక చెత్త హ్యాట్రిక్‌ను మూటగట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల ఏకంగా డిపాజిట్లే కోల్పోయారు! బీజేపీకి 45.56 శాతం ఓట్లు రాగా ఆప్‌కు 43.57 శాతం వచ్చాయి. కాంగ్రెస్ 6.34 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2020 ఎన్నికల్లో ఆప్ 53.57 శాతం ఓట్లతో 62 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ 38.51 శాతం ఓట్లతో కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2015లో ఆప్ ఏకంగా 67, బీజేపీకి కేవలం 3 సీట్లొచ్చాయి. 2013లో ఆప్ తన తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ అసెంబ్లీలో 28 సీట్లు నెగ్గి సత్తా చాటింది. బీజేపీ ఢిల్లీలో చివరగా 1993 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఐదేళ్లలోనే ముగ్గురు సీఎంలను మార్చి అప్రతిష్ట మూటగట్టుకుంది. దాంతో 1998లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. అప్పట్నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తినలో సాగిన కాంగ్రెస్ హవాకు ఆప్ ఆవిర్భావంతో తెర పడింది. ఆద్యంతం బీజేపీదే పైచేయి అటు బీజేపీ, ఇటు ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. కాసేపటికే ట్రెండ్స్ వెలువడ్డాయి. వాటిలో మొదటినుంచీ బీజేపీ హవాయే కొనసాగుతూ వచ్చింది. అడపాదడపా ఒకట్రెండు రౌండ్లలో మినహాయించి కేజ్రీవాల్ మొదటినుంచీ వెనుకంజలోనే కొనసాగుతూ వచ్చారు. మధ్యలో రెండు పార్టీల మధ్య అంతరం తగ్గినట్టు కన్పించినా చూస్తుండగానే బీజేపీ దూసుకెళ్లింది. దాంతో ఆ పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. నేతలు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుళ్లు, వాయిద్యాల హోరుతో హోరెత్తించారు. ఆప్, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు బోసిపోయి కన్పించాయి. ఇటీవలే హరియాణాతో పాటు కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో దూకుడు మీదున్న బీజేపీ అదే ఊపులో ఇప్పుడు ఢిల్లీనీ చేజిక్కించుకుంది. దాంతో దేశవ్యాప్తంగా కాషాయశ్రేణులు సంబరాల్లో మునిగిపోగా ఆప్, కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ డీలాపడ్డాయి. తాజా ఫలితాలతో విపక్ష ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ విజయాన్ని చరిత్రాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచగా ప్రజాతీర్పును అంగీకరిస్తున్నామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఆతిషి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఆప్కే అగి్నపరీక్షగా నిలిచాయని తప్ప తమకు కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా చెప్పుకొచ్చారు. పర్వేశే సీఎం! బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన జెయింట్ కిల్లర్‌గా మారిన పర్వేశ్‌సింగ్ పేరే ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి సాహెబ్‌సింగ్ వర్మ కూడా 1993–98 మధ్య ఢిల్లీ సీఎంగా చేయడం విశేషం. సీఎం ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని పర్వేశ్‌తో పాటు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ కూడా చెప్పుకొచ్చారు. -
మోదీ రెండాకులు ఎక్కువే చదివారు.. అందుకే కేజ్రీవాల్‌కు మాస్టర్ స్ట్రోక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్‌కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్‌కు మైనస్‌గా మారింది.అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు కేజ్రీవాల్.నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్‌కు వరంలా మారింది. -
Kejriwal: కేజ్రీవాల్ ముందున్న సవాళ్లు!
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)కి చుక్కెదురైంది. మరోసారి గెలిచి అధికారాన్ని నెలబెట్టుకోవాలన్న ‘ఆప్’ ఆశలపై హస్తినవాసులు నీళ్లు చల్లారు. దశాబ్ద కాలం పైగా ఢిల్లీలో పాగా వేసిన ఆప్ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ (BJP) హస్తినలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 27 ఏళ్ల తర్వాత హస్తినలో కాషాయ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. తాజా విజయంతో కమలనాథులు సంబరాల్లో మునిగిపోగా, ఆప్ శిబిరం నిరాశలో మునిగిపోయింది.కేజ్రీవాల్‌కు ముళ్లబాటఢిల్లీలో అధికారం కోల్పోవడంతో మాజీ సీఎం, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పాటు పలు అవినీతి ఆరోపణలకు గురయ్యారు. లిక్కర్ స్కామ్‌లో జైలుకు కూడా వెళ్లొచ్చారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్.. అవినీతి ఆరోపణలతోనే జైలుకు వెళ్లడం గమనార్హం. ఇప్పుడు ఈ కేసుల్లో ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముంది. కేసులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహచరులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా?తాజా ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కేజ్రీవాల్‌కు పెద్ద సవాలు కానుంది. అధికారానికి దూరమైన ఆప్ శాసనసభ్యులు బీజేపీలో చేరకుండా కాచుకోవడం అంత సులువేం కాదని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ నాయకులు కూడా అధికార పార్టీవైపు చూసే అవకాశముంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ పార్టీ నాయకులను కేజ్రీవాల్ ఎలా కాపాడుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.నాయకత్వం ప్రశ్నార్థకంతాను పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో 3 వేలకు పైగా ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. జంగ్‌పురాలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా ఓడిపోయారు. తాను జైలుకు వెళ్లినప్పుడు సీఎం పగ్గాలు ఆతిశికి అప్పగించిన కేజ్రీవాల్.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి ఎలా బాధ్యత వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పగిస్తారా లేక తానే కొనసాగుతారా అనేది వేచిచూడాలి. బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని సీఎం ఆతిశి విజయం సాధించడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరటకలిగించే అంశం.భవిష్యత్ వ్యూహం ఏంటి?ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేజ్రీవాల్ మున్ముందు ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళతారనేది చర్చనీయాంశంగా మారింది. కుదేలైన పార్టీని పునర్ నిర్మించడానికి ఆయన ఏం చేస్తారో చూడాలి. అధికారంలో లేనప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్‌ను పావుగా వాడుకుని కేజ్రీవాల్‌ను బీజేపీ ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీని దీటుగా ఎదుర్కొని నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.చదవండి: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాహజారే రియాక్షన్కేజ్రీవాల్ మారతారా?అవినీతి వ్యతిరేక పోరాటంతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. అధికారం చేపట్టాక సంప్రదాయక పొలిటిషియన్‌గా మారిపోయారన్న వాదనలు విన్పిస్తున్నాయి. మధ్యతరగతి ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఆయన తర్వాత ఆ వర్గానికి దూరమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాన్యుడిని అని చెప్పుకుని ‘శీష్‌మహల్’ కట్టుకున్నారన్న విమర్శలు ఎన్నికల ప్రచారంలో బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి ఆయన ఎలా మారతారనేది చర్చనీయాంశంగా మారింది. -
ఆప్‌కు బిగ్ షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతల ఓటమి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆప్ అగ్ర నేతలకు ఢిల్లీ ఓటర్లు షాకిచ్చారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆయనతో పాటు పార్టీ అగ్ర నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓడిపోయారు. దీంతో, ఆప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్ పార్టీకి ఓటర్లు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఆప్ అగ్ర నేతలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో, ఎన్నికల్లో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్రజైన్ ఓటమిని చవిచూశారు. వీరు ముగ్గురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. దీంతో, వీరిని ప్రజలు ఓడించారు. మరోవైపు.. కల్కాజీ నియోజకవర్గంలో మాత్రం సీఎం అతిశి విజయం సాధించారు.ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్ చేతిలో మనీష్ సిసోడియా పరాజయం పాలయ్యారు. షాకుర్ బస్తీలో సత్యేందర్ జైన్ సైతం ఓటమిని చవిచూశారు. #WATCH | AAP candidate from Jangpura constituency, Manish Sisodia concedes defeat, says, "Party workers fought well; we all did hard work. People have supported us as well. But, I lose by 600 votes. I congratulate the candidate who won. I hope he will work for the constituency." https://t.co/szW8leInSp pic.twitter.com/B1VVvsbfNI— ANI (@ANI) February 8, 2025 -
అరవింద్ కేజ్రీవాల్ ముందంజ
-
బీజేపీ దూకుడు.. ఆప్ అగ్ర నేతలు వెనుకంజ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అగ్ర నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిషి, పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులు పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, కపిల్ మివ్రా ముందంజలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.మరోవైపు.. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. As per early official trends, BJP leading in Vishwas Nagar and Shahdara assembly seats out of the total 70 seats in Delhi#DelhiElections2025 https://t.co/GMgILZrcTR pic.twitter.com/hlOgMsbull— ANI (@ANI) February 8, 2025ఫలితాల్లో ఇలా..న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజ.కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆధిక్యంకాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజజంగ్పురలో మనీశ్ సిసోదియా వెనుకంజషాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజగాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజబద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజబిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజపత్పర్గంజ్లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజఇదిలా ఉండగా.. ఢిల్లీ (Delhi)లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36 కావాల్సి ఉంది. ఢిల్లీలో 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కేజ్రీవాల్ పార్టీ పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంతకుముందు 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. -
Delhi Results Live: ఢిల్లీ ప్రజలకు పండుగ రోజు: ప్రధాని మోదీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్.. -
‘కేజ్రీవాల్.. ఇది చాలా సీరియస్ ఆరోపణ.. విచారణకు సిద్ధంకండి’
న్యూఢిల్లీ: ‘కేజ్రీవాల్.. మీరు విచారణకు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన ఆరోపణ చాలా పెద్దది. ఇందులో నిజా నిజాలు నిగ్గు తేల్చాలి. మీరు విచారణకు అందుబాటులో ఉండాలి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులిచ్చింది.తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ(BJP) రూ. 15 కోట్ల ఆఫర్ ఇవ్వడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఆశ చూపిందని కేజ్రీవాల్ ఈరోజు(శుక్రవారం) ఆరోపించారు. దీనిపై తన సోషల్ మీడియా ‘ఎక్స్’లో కేజ్రీవాల్ సుదీర్ఘమైన పోస్టుపెట్టారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ..ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. దీనిపై విచారణకు ఆదేశించాలని బీజేపీ లేఖ ద్వారా కోరింది.దాంతో వీకే సక్సేనా.. ఢిల్లీ ఏసీబీని విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ముందుగా నోటీసులిచ్చింది ఏసీబీ. ఐదు ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చింది. ‘ మీరు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఏసీబీ.. ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్ ముందు ఉంచింది.ఏసీబీ నోటీసులో పేర్కొన్న ఐదు ప్రశ్నలు ఇవే..1. మీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ ీమీరు చేసిందేనా?.. లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా?2. మీ 16 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందని చేసిన ట్వీట్‌తో మీరు ఏకీభవిస్తారా?3. ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా రూ. 15 కోట్ల ఆఫర్ పొందారో.. వారి వివరాలు మాకివ్వండి4, మీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఆఫర్ చేశారో వారి వివరాలు ఇవ్వండి. వారి వ్యక్తిగత వివరాలు కానీ, వారి ఫోన్ నంబర్లు కానీ మాకు ఇవ్వండి.5. మీరు ేచేసిన ఆరోపణలపై మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలుంటే మాకు సమర్పించండి.రేపు(శనివారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ కావాలనే బీజేపీపై ఆరోపణ చేశారా.. లేక నిజంగా బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందా అనేది విచారణలో తేలనుంది. -
అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్
-
ఎల్జీ ఆదేశం.. ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ
న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కోక్కరికీ రూ. 15 కోట్లు చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ఫలితాలకు ఒక రోజు ముందు కేజ్రీవాల్.. ీబీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ సిద్ధమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించిన బీజేపీ.. ఇందులో భాగంగా ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. ఆప్ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని బీజేపీ(BJP) కోరింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లేఖ ద్వారా ఎల్జీని కోరింది. దీనిపై స్పందించిన ఎల్జీ.. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు.ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీఎల్జీ ఆదేశాలతో దర్యాప్తుకు సిద్ధమైన ఏసీబీ(ACB).. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటితో ాపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో సోదాలు ప్రారంభించింది. దీనిలో ఏసీబీకి చెందిన బృందాలు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే దీనిపై ఆప్ ేనేత సంజయ్ సింగ్ మండిపడుతున్నారు. ఏసీబీ డ్రామా ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవడానికి బదులు సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని ఆయన అన్నారు.కాగా, ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్‌ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.అయితే కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
కేజ్రీవాల్‌కు బీజేపీ హెచ్చరిక!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కాషాయ పార్టీ కౌంటరిచ్చింది. కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(శనివారం) ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్‌ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటరిచ్చింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందనే కారణంగా ఆ పార్టీ నేతలంతా నిరాశతో ఉన్నారు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. బీజేపీ ఫోన్ కాల్స్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు చేసిన ఆరోపణలను నిరూపించాలి. లేదంటూ అది ఫేక్ అని క్షమాపణలు చెప్పాలి. అలా చేయకపోతే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము’ అని హెచ్చరించారు. -
Exit Polls: ఢిల్లీలో అంచనాలు తప్పేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలావరకు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతోందని, నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే.. ఆప్ మాత్రం ‘హ్యాట్రిక్’ విజయంపై ధీమాతోనే ఉంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls)ను ఆప్ తిరస్కరిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్‌పోల్స్ ప్రతిబింబించవని చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విషయంలో ఎప్పుడూ తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోందని చెబుతోంది. అంతేకాదు.. గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలనూ సైతం ప్రస్తావిస్తోంది.‘‘ఈ ఎగ్జిట్ పోల్స్(Exit Polls)ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయి. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ, వాస్తవానికి జరిగింది ఏంటి?. రెండుసార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది’’ అని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్‌పోల్స్ నివేదికలతో ఫుల్ జోష్‌లో ఉంది. బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీన) ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే.వీప్రిసైడ్(Weepresie), మైండ్ బ్రింక్లు మాత్రం ఆప్ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్ సున్నా నుంచి 3 సీట్లలోపే పరిమితం కానుందని చెప్పాయవి. అయితే ఎగ్జిట్‌పోల్స్‌పై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది.అధికారంపై బీజేపీ ఆశలు1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని తప్పించి.. సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. రెండున్నరేళ్ల తర్వాత.. చివర్లో సుష్మా స్వరాజ్‌ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్(AAP) విజయం కైవసం చేసుకోగా.. 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం.. ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఆప్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేయనుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని విడుదల చేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌ను అధికార ఆమ్ ఆద్మీ కొట్టి పారేసింది. శనివారం విడుదల కానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం తమదేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.ఎగ్జిట్ పోల్స్అంచనాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కొద్ది సేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అప్ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా జాతీయ మీడియాతో మాట్లాడారు. 2015, 2020 ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అప్పడు మేం అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. VIDEO | Delhi Elections 2025: On exit poll predictions, AAP leader Reena Gupta (@Reena_Guptaa) says: "You look at any exit poll historically, AAP is always given a smaller number of seats, whether its 2013, 2015 or 2020. But whatever is shown, AAP gets a lot a greater number of… pic.twitter.com/KZmGNzg6XK— Press Trust of India (@PTI_News) February 5, 2025మరో నేత సుశీల్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఇది మా నాలుగో ఎన్నిక. ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఎగ్జిట్ పోల్స్ అన్నీ మాకు వ్యతిరేకంగా వచ్చాయి. కానీ మేం ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేశాం. విజయం సాధిస్తూ వచ్చాం. ఈ సారి కూడా అంతే. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పనిచేశారు. మా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. తిరిగి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’ అని అన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్ పల్స్-కొడిమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి.ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.పీపుల్స్‌పల్స్-కొడిమోబీజేపీ-51-60ఆప్- 10-19కాంగ్రెస్-0ఇతరులు-0ఏబీపీ-మ్యాట్రిజ్బీజేపీ- 35-40ఆప్ - 32-37కాంగ్రెస్- 0-1టైమ్స్ నౌబీజేపీ-39-45ఆప్-29-31కాంగ్రెస్-0-2చాణక్య స్ట్రాటజీస్బీజేపీ-39-44ఆప్-25-28రిపబ్లికన్ పీ మార్క్ బీజేపీ 39-41ఆప్ 21-31ఆత్మసాక్షిబీజేపీ 38-47ఆప్ 27-30కాంగ్రెస్ 0-3పీపుల్ ఇన్సైట్ బీజేపీ-40-44ఆప్- 25-29కాంగ్రెస్- 0-1జేవీసీబీజేపీ 39-45ఆప్ 22-31కాంగ్రెస్ 0-2 -
ఢిల్లీ పోలింగ్.. కేజ్రీవాల్‌కు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే.. అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్(Shahbad)కు చెందిన జగ్మోహన్ మంచందా అనే లాయర్, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్ పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష
దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలనుంది. ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్‌కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్‌పై ఉన్న కేజ్రీ వాల్ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ‘ఆప్’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా ‘శీష్ మహల్’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ. అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్‌లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్‌పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్‌కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్ కానున్న సీఈసీపై ఆప్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. -
ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై కేజ్రీవాల్ ధీమా..!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి రేపు(బుధవారం) జరుగనున్న ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి 70 సీట్లకు గాను 55 సీట్లను తాము గెలుచుకుంటామన్నారు. ఒకవేళ బీజేపీ గనుక ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ముగింపు పలకడం ఖాయమన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal).ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ‘ నా అంచనా ప్రకారం మేము 55 సీట్లను గెలవడం ఖాయం. ఒకవేళ మహిళల ఇంకాస్త ముందుకొచ్చి పురుషుల చేత ఓట్లను మాకు పడేలా చేస్తే మాత్రం తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తాం. ఇలా జరిగితే 60 సీట్లకు పైగానే గెలుచుకుంటాం.మీరు(ప్రజలు) కనుక కమలం గుర్తుకు ఓటేస్తే మాత్రం మీరు ఇంటికి వెళ్లేసరికే కరెంట్ పోవడం ఖాయం. దేశంలో అత్యంత చౌకగా కరెంట్‌ను అందిస్తున్నది జాతీయ రాజధాని ఢిల్లీలోనే. ఇక్కడ 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటును ఇవ్వడంతో పాటు 400 యూనిట్లకు రూ. 800 మాత్రమే వసూలు చేస్తున్నాం. అదే సమయంలో 24 గంటల విద్యుత్‌ను కూడా అందిస్తున్నాం. అందుచేత మీరు చీపురు గుర్తు ఉన్న బటన్‌ను ప్రెస్ చేయండి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.2015లో ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Election 2025)కి జరిగిన ఎన్నికల్లో 67 సీట్లను ఆప్ గెలిస్తే. 2020లో 62 సీట్లలో విజయం సాధించింది. మీరు ఎందుకు ఆప్‌కు ఓటేయాలంటే.. ేమేము గత 10 ఏళ్లలో ఎంతో బాధ్యతగా పరిపాలన అందించాం. ిఢిల్లీలో చాలా పనులు ేచేశాం. ఇక ీబీజేపీ అధికారంలో ఉన్న 20 ారాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అనేదే లేదు’ అని ేకేజ్రీవాల్ పేర్కొన్నారు. -
సీఈసీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీవ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్,. సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్.. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారానికి నేటితో(సోమవారం)తెరపడనుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్.. సీఈసీని రాజీవ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు బీజేపీకి దాసోహమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను చూస్తే మనకు అదే కనబడుతుంది. అసలు ఎన్నికల కమిషన్ అనేది ఉనికిలో ఉన్నట్లు కనబడుటం లేదు. ఇది ప్రజల మనస్సుల్లో తలెత్తున్న ప్రశ్న. రాజీవ్ కుమార్ జీ.. మీరు సీఈసీగా ఉన్నారా? లేదా? మీరు సీఈసీ బాధ్యతల్ని తప్పుకోవడానికి ఈనెలే చివరిది అనుకుంటా.మీకు బీజేపీ ఏ పోస్టును ఆఫర్ చేసిందేంటి? మీ రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టును ఆఫర్ చేశారా.. లేక రాష్ట్రపతి పోస్టును ఎరగా వేశారా? అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.‘రాజీవ్ కుమార్ జీ.. మీకు నాదొక విన్నపం.. నా రెండు ేచేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయండి. సీఈసీ బాధ్యతల నుంచి ఉన్నతంగా తప్పుకోండి. అది మీకు చాలా మంచిది. మీ కెరీర్ చివరి దశలో ఉంది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అంతే కానీ దేశాన్ని నాశనం చేయకండి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నా ఎన్నికల కమిషన్ మాత్రం చూస్తూ ఉండిపోవడం తప్పితే చర్యలు ఏమీ తీసుకోవడం లేదన్నారు కేజ్రీవాల్.కాగా, ఫిబ్రవరి 5 వ తేదీ(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఆప్-బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా ఆప్ ధీటుగా ప్రచారం చేసింది బీజేపీ. -
‘కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’
ఢిల్లీ : ‘నా మాటలు రాసిపెట్టుకోండి హస్తిన పీఠంపై కమలం జెండా ఎగురవేయబోతోంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్రిముఖ పోరులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కమలం అధిష్టానం ఉవ్విళ్లూరుతుంది. ఆ దిశగా తన ఎన్నికల ప్రచారాన్ని వేగం చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ‘ఏక్ తక్ బీజేపీ’ (బీజేపీకి అవకాశమివ్వండి) నినాదంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు.ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికలపై జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు భ్రమపడ్డారని, ఇప్పుడు భ్రమలు వీడి వాస్తవంలోకి వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. ఈసారి ఆప్ (AAP-da)కు గుణపాఠం చెప్పాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో విసిగిపోయారు.. ఇప్పుడు దేశ రాజధానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం’ అని అన్నారు. కేజ్రీవాల్ అబద్ధాల ఎన్ సైక్లోపీడియా. ఢిల్లీ ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు. ఆప్ అవినీతి చేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషించడంలో మించి పోయింది. అందులో మద్యం పాలసీ ఒకటి. ఆప్ కన్వీనర్ అవినీతి చేసేందుకు వినూత్న పద్దతుల్ని ఎంచుకున్నారు. జైలుపాలయ్యారని ఆరోపించారు.ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై నడ్డా స్పందించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో వ్యూహం ఉంటుంది. మాకు వ్యూహం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఢిల్లీలో కూడా అంతేనని’ వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
బీజేపీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయి: కేజ్రీవాల్ కొత్త ట్విస్ట్
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే యమునా నది నీటి విషయమై రెండు పార్టీల నేతలు వాదనలకు దిగారు. ఇక, తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఆప్ ఓడిపోతే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మూతపడతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి.ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నేను ఒక బీజేపీ కార్యకర్తను కలిశాను. ఈ క్రమంలో అతడు నాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఏం చేస్తారని అడిగారు. దీనికి మీకు సమాధానం తెలుసుకోవాలి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే.. ఉచిత కరెంటు, నీరు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అన్నీ ఆగిపోతాయి. #WATCH | #DelhiElection2025 | In a video message, AAP National Convenor Arvind Kejriwal addresses BJP supporters, he says, "A few days back I met a 'kattar' BJP supporter, he asked Arvind ji, what if you lose? I also smiled and asked, what will happen to you if I'll lose? I asked… pic.twitter.com/3NFDpL7UZq— ANI (@ANI) February 1, 2025బీజేపీ వీటన్నింటిని ఆపేస్తుంది. అంతేకాక.. మీకు నెలకు రూ.25 వేల ఖర్చు పెరిగిపోతుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో, 24 గంటల కరెంటు ఉందో, లేదో మీకు తెలుసు. బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా.. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. బీజేపీ వీడతారా, లేదా అనేది మీ ఇష్టం. కానీ, ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేయండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు యమునా నది నీటి విషయంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. యమునలో విషం కలిపారని ఆప్ నేతలు కామెంట్స్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనికి బీజేపీ నేతలు ఆప్‌కు కౌంటరిచ్చారు. దీంతో, ఎన్నికల్లో యమునా నది విషయం కొత్త చర్చకు దారి తీసింది. ఇక, మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
మా పథకాలతో రూ.25 వేల ఆదా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.25 వేల వరకు ఆదా అవుతోందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోసారి తమకు అధికారమిస్తే అదనంగా రూ.10 వేలు ఆదా అయ్యేలా కొత్తగా పథకాలను తీసుకువస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన ‘బచత్ పాత్ర’ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంత మేరకు లబ్ధి కలుగుతుందో తెలుసుకునేందుకు తమ వలంటీర్లు ఇంటింటికీ వచ్చి ‘బచత్ పాత్ర’గురించి వివరిస్తారన్నారు. కొత్త పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటివి ఉన్నాయని కేజ్రీవాల్ వివరించారు. ‘సామాన్యంగా బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం, సామాన్యులపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది వంటి అంశాలను తెలుపుతుంది. కానీ, ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి అయ్యే ఆదాపైనే దృష్టి పెడుతుంది’అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం సన్నిహితులైన వాణిజ్యవేత్తలకు ఎలాంటి ప్రయోజనాలను కల్పించాలని యోచిస్తోందని ఆరోపించారు. ముంబైలోని ధారావిలో మురికివాడల వాసుల భూమిని ఇప్పటికే తమ సంబంధీకులకు కట్టబెట్టిందని, ఢిల్లీలో కూడా భూముల్ని ఆక్రమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. 70లో 60 సీట్లు మావే: ఆప్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 5న జరిగే ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 స్థానాలకు 60 సీట్లను చేజిక్కించుకుంటుందని ఆయన చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో జరిగిన జనసభలో ఆయన మాట్లాడారు. -
‘యమున’పై ఈసీకి కేజ్రీవాల్ వివరణ
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయానికి వచ్చారు. యుమునా నదీ జలాల్లో విషం కలిసిందంటూ చేసిన వ్యాఖ్యలపై అధికారులు జారీ చేసిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేసే యమునా జలాల్లో అమోనియాను కలిపి విషపూరితం చేసిందని ఈ నెల 27న కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు ఆ విషయం తెలిసి, వెంటనే ఢిల్లీకి ఆ నీరు రాకుండా ఆపేశారు. ఆ నీరే తాగు నీటిలో కలిసినట్లయితే ఎంతో పెద్ద విపత్తు జరిగి ఉండేది’అని అన్నారు. దీనిపై ఈసీ కేజ్రీవాల్‌కు రెండుసార్లు నోటీసులు పంపించింది. దీనిపై శుక్రవారం కేజ్రీవాల్ ఈసీ అధికారుల ఎదుట తన వాదనను వివరించారు. జనవరి 15న 3.2 పీపీఎం ఉన్న అమోనియా స్థాయిలు జనవరి 27వ తేదీ నాటికి 7 పీపీఎంకు పెరిగినట్లు తెలిపే నివేదికను అందజేశారు. ఆయన వెంట సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. ఈసీని కలిసేందుకు ఆయన ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది గడువు సమీపిస్తున్నందున కేజ్రీవాల్‌తో సమావేశమై ఆయన వాదనను సావధానంగా విన్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వాసులకు విష జలాలను సరఫరా చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రను కేజ్రీవాల్ ఈసీ అధికారులకు వివరించారని అనంతరం ఆప్ తెలిపింది. అమోనియా కలుషితాలున్న విషయం తెలిపేందుకు మూడు బాటిళ్లలో యమునా నీటిని కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపిందని పేర్కొంది. -
బుల్లి కారులో వచ్చి శీష్‌మహల్ స్థాయికి ఎదిగారు
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అబద్ధాలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. రాజకీయాలను మారుస్తానంటూ చిన్న కారులో వచ్చిన ఈ వ్యక్తి నేడు వాగన్ ఆర్ కారులో శీష్ మహల్‌కు వెళ్లే స్థాయికి ఎదిగారంటూ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికార నివాసం శీష్ మహల్లో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈయన ఇప్పుడు ఇతర పార్టీలు అవినీతికి పాల్పడ్డాయంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో అవినీతిలో మునిగి తేలడం, కాలుష్యాన్ని పెంచడం మినహా ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు. సమాజంలో హింసను, విద్వేషాలను బీజేపీ వ్యాపింపజేస్తోందని, తమ కాంగ్రెస్‌పార్టీ మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. తన మంత్రివర్గాన్ని నవ రత్నాలంటూ కేజ్రీవాల్ చెప్పుకుంటున్న వారిలో ఒక్కరూ ఓబీసీ, మైనారిటీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారు లేరన్నారు. అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని రాహుల్ చెప్పారు. ‘ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తెస్తానమంటూ ప్రకటించుకున్న కేజ్రీవాల్.. అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. యమునా నదిలో మునిగి, యమునా జలాలను తాగుతానని ఐదేళ్ల క్రితం చెప్పిన కేజ్రీవాల్ ఆ విషయం మర్చేపోయారు’అని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు అవకాశవాద పోటీ కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మదీపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపైనా విమర్శలు సంధించారు. సమాజంలో కులాలు, భాషల ప్రాతిపదికన విభేదాలు పెంచి, హింసను బీజేపీ ఎగదోస్తోందన్నారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకు, సంపదను బడా పారిశ్రామిక వేత్తల ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. టాప్ 25 పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోదీజీ..ఢిల్లీలోని విద్యార్థులు, చిరు వ్యాపారులు, గృహిణుల రుణాలెన్నిటిని రద్దు చేశారు? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేజ్రీవాల్ ఒక్కటే అవినీతి విషయంలో ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ముస్తాఫాబాద్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె.. విభేదాలు సృష్టించడమే బీజేపీ నైజమని చెప్పారు. మోదీ రాజ్‌మహల్ గురించి ఆప్ నేతలు మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ శీష్ మహల్ గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చేందుకే తప్ప ప్రజలకు రహదారులు, మంచి నీరు, విద్య వంటి వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌కు మోదీకి మధ్య తేడాయేలేదన్నారు. -
ఎన్నికల వేళ ఆప్‌కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావన గౌర్ (పాలం), బీఎస్ జూన్ (బిజ్వాసన్) పార్టీని వీడారు. ప్రస్తుత ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో రాజీనామా బాట పట్టారు.జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్‌కు రాజీనామా లేఖ పంపారు. లేఖలో పార్టీ అవినీతిలో మునిగిపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. దయ చేసి నా రాజీనామాను ఆమోదించండి’ అంటూ భావనా గౌర్ తన లేఖలో పేర్కొన్నారు.పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. తొలుత ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఖురాన్‌ను అవమానించిన కేసులో యాదవ్‌కు పంజాబ్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో ఆప్.. టికెట్ నిరాకరించింది. మరో ఐదు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గెలుపే లక్ష్యంగా అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. హామీల వర్షం గుప్పిస్తూ.. ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగలినట్లయింది.ఇదీ చదవండి: రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలుకాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిన్న(గురువారం) మీడియాతో మాట్లాడుతూ, యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. -
ఊహకందని మలుపులు తిరుగుతోన్న ఢిల్లీ ఎన్నికల సమరం
-
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్‌ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్‌సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఆరోపణలు గుప్పించారు. -
‘కేజ్రీవాల్.. ఆ విషం పేరేంటో చెప్పు’
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో యమునా (yamuna) నదిపై రాజకీయ రంగు పులుముకుంది. ఢిల్లీకి జీవనాడి యమునాపై బీజేపీ (bjp) విషం కక్కుతోందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేసే బదులు ఆ విషం పేరేంటే బయట పెట్టాలని సూచించారు. గురువారం రోహిణిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేజ్రీవాల్‌కు అర్ధమైంది. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యమునా వాటర్‌లో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. యమునా నదిలో విషం ఉందన్న ల్యాబ్ రిపోర్టును విడుదల చేయాలి. అబద్ధాల పుట్టఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం మానేయమని కేజ్రీవాల్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నీళ్లలో విషం కలిపిందని అంటున్నారు. యమునాలో విషం కలిపితే ఏ విషం కలిపారు? విషయం ఉన్నట్లు లేబొరేటరీలో గుర్తించారు. అంతేకాదు, ఆప్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చిందని, బదులుగా ఆలయాలు,స్కూల్ పరిసర ప్రాంతాల్లో తెరిచారు. కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యారు’ అని అమిత్ షా ఆరోపించారు.తనను తాను నిజాయితీ పరుడినని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్ మద్యం కుంభకోణం, జల్ బోర్డులో రూ. 28400 కోట్ల కుంభకోణం, రేషన్ పంపిణీలో రూ. 5,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు. -
యమునా నది వివాదం.. ఎప్పుడేం జరిగింది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యమునా నదిపై రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీ జీవనాడిగా భావించే యమునా నదిపై రాజకీయ పార్టీలు వాదోపవాదాలకు దిగాయి. యమునా నది (Yamuna River) కాలుష్యానికి మీరు కారణమంటే.. మీరు కారణమని అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్నాయి. యమునా నది కాలుష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం (Political Heat) రేగింది. న్యాయపరంగానూ ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి.యమునా నదిని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం విషతుల్యం చేస్తోందని బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో రచ్చ మొదలైంది. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తిప్పికొట్టారు. మరోవైపు కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు, ఎన్నికల సంఘం తాఖీదులు పంపాయి. యమునా నది కాలుష్యంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆదేశించాయి. కేజ్రీవాల్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా దీటుగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.హస్తిన జీవనాడిదేశరాజధాని ఢిల్లీకి యమునా నది జీవనాడి వంటిది. హస్తిన జనాభాలో 70 శాతం మందికి నీటిని అందించే ఈ నది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. అయితే దేశంలోని ఇతర ప్రధాన నదుల మాదిరిగానే యమున కూడా కాలుష్యకాసారంగా మారిపోయింది. పట్టణీకరణ బాగా పెరగడం.. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను నిరంతరం నదిలోకి వదులుతుండడంతో యమున కాలుష్యం బారిన పడింది. యమున నదిపై ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల మధ్య ఎన్నో ఎళ్లుగా తగాదాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.యమునా నది జలాల పంపిణీ వివాదం ఇలా...1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పడింది. యమునా నదీ జలాల పంపిణీపై 1994, మే నెలలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. అయితే ఈ వ్యవహారం 1995, మార్చి 31న సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలో తాగునీటి కొరతను తగ్గించేందుకు యమునా నదిలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేలా హరియాణాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు వెలువరించింది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఢిల్లీకి వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించింది. 5 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 1996, ఫిబ్రవరిలోనూ మరోసారి ఇలాంటి ఆదేశాలిచ్చింది. వజీరాబాద్, హైదర్‌పూర్‌లోని రెండు నీటి రిజర్వాయర్లు, ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ఢిల్లీకి నీరు ఇవ్వాలని పేర్కొంది.2018, ఏప్రిల్ నెలలో వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటిమట్టం పడిపోవడంతో అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటేనే నీటిని విడుదల హరియాణాలోని అప్పటి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది.2021, మార్చిలో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. హరియాణాకు వ్యతిరేకంగా ఢిల్లీ జల్ బోర్డు(DJB) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యమునా నీటి పంపిణీపై 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హరియాణా ప్రభుత్వం ధిక్కరించిందని కోర్టుకు తెలిపింది. దీనిపై హరియాణా ప్రభుత్వం సర్కారు స్పందిస్తూ.. తమ తప్పు ఏమీలేదని, హస్తిన సర్కారు అసమర్థత కారణంగానే నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమైందని వాదించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌ను 2021, జూలైలో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.చదవండి: హరియాణాలో ఉన్నది మనుషులు కాదా?2023, జూలైలో దేశ రాజధానికి వరదలు పోలెత్తాయి. ఈ సమయంలో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి ఉద్దేశపూర్వకంగా హరియాణా నీటిని విడుదల చేసిందని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా, యమునా జలాల్లో తన వాటాను విడుదల చేయకుండా ఢిల్లీకి వ్యతిరేకంగా హరియాణా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ 2024, జూన్ నెలలో అప్పటి ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి, ప్రస్తుత సీఎం అతిషి నిరాహార దీక్ష చేశారు. తాజాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో యమున నదీ వివాదం ఢిల్లీ ఎన్నికల్లో తెరమీదకు వచ్చింది. -
యమునా నీటి వివాదంపై ప్రధాని మోదీ ఫైర్
-
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
‘ఆప్’ను ప్రజలు క్షమించరు
న్యూఢిల్లీ: యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆప్ నాయకులకు, చార్లెస్ శోభారాజ్‌కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికికూపంలోనే ఛాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్ కేజ్రీవాల్) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్ పాపాత్ములను మన్నించే ప్రసక్తే లేదు’’అని మోదీ అన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్!
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, ఆప్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో యమనా నది నీటి విషయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. యమునా నీటిలో విషం కలిపారని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగారు. అనంతరం, నీటిని నెత్తిన జల్లుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యుమునా నది నీటిలో విషం కలిపారని హర్యానా బీజేపీ ప్రభుత్వం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. యుమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi) విలేకరులతో మాట్లాడుతూ.. యమునను కలుషితం చేయడం ‘జల ఉగ్రవాదం’ అని అభివర్ణించారు. హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని హర్యానా సీఎం సేవించారు. దీంతో, కేజ్రీవాల్ ఆరోపణలకు ఆయన చెక్ పెట్టారు.बेहिचक और बेझिझक पवित्र यमुना के जल का आचमन किया हरियाणा की सीमा पर।आतिशी जी तो आईं नहीं।कोई नया झूठ रच रही होंगी।झूठ के पांव नहीं होते।इसलिए आप-दा का झूठ चल नहीं पा रहा।दिल्ली की देवतुल्य जनता इन फ़रेबियों को पहचान चुकी है।5 फ़रवरी को आप-दा के फरेब काल का अंत निश्चित है।… pic.twitter.com/EAG4pXjCFr— Nayab Saini (@NayabSainiBJP) January 29, 2025ఇదిలా ఉండగా.. యమునా నదిపై ఆరోపణలను హర్యానా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తాం’ అని అన్నారు.మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా అటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో కూడా ఉన్నారని.. తమ సొంత ప్రజలు తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా?. ఆ నీటిని తాగే వారిలో ప్రధాని కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతారనే కారణంగానే ఆప్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘నేను తాగే నీళ్లలో విషం కలిపారా?’
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ (narendra modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ (aap) నేతలు బీజేపీపై అసహ్యకరమైన అభియోగాలు మోపుతుందని మండిపడ్డారు.ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ విషం కలిపిన నీటిని ఢిల్లీ ప్రజలకు అందిస్తుందని ఆరోపించారు. అంతేకాదు, హర్యానా బీజేపీ ప్రభుత్వం విషయం కలిపిన నీటిని ప్రధాని మోదీ తాగగలరా? అని ఓటర్లను ప్రశ్నించారు.అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ ఘోండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు #WATCH | During a public rally in Delhi, PM Modi says, ": In 'aapda' walon ki lutiya Yamuna mein hi doobegi...""People of 'aapda' say that people of Haryana mix poison in water sent to Delhi. This is not just an insult to Haryana but to all Indians. Ours is a country where… pic.twitter.com/kJoQCAuEi2— ANI (@ANI) January 29, 2025 ఆప్ నేతలు అసహ్యకరమైన అభియోగాలు మోతున్నారంటూ.. ఆ పార్టీ కన్వినర్ కేజ్రీవాల్‌పై మోదీ విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా యమునా (yamuna water) నీటిని తాగే నీరుగా మార్చి ఢిల్లీ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ఏమైంది. నెరవేర్చలేదు. పైగా సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో యమునా నీటి అంశాన్ని అడ్డం పెట్టుకొని తమకు ఓటేయ్యమని అడుగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ పాపాలు చేస్తోంది. అలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు’ అంటూ మోదీ దుయ్యబట్టారు.ఈ సందర్భంగా మోదీ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డెడ్‌లైన్‌పై పరోక్షంగా స్పందించారు. హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం..అక్కడి నుంచి ఢిల్లీ ప్రవహించే నీటిలో అమోనియాను కలిపించదని ఆప్, కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ.. బుధవారం రాత్రి 8 కల్లా తగిన ఆధారాల్ని అందించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలపై మోదీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ను టార్గెట్ చేశారు. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నంలో.. నిందలు మాపై పడతాయని ఆశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. వచ్చే వారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ గందరగోళంలో పడింది. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించకూడదా? ఢిల్లీ ప్రజలతో ప్రధాని మోదీ తాగే నీటిని హర్యానా విషపూరితం చేయగలదా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. చివరిగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్,ఆప్ పాలన చూశారు. ఇప్పుడు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వండి’ అని ఢిల్లీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.👉చదవండి : మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం -
ప్రతి ఇంటికి నెలకు రూ.25వేలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi AssemblyElections)ను దేశం మొత్తంలో జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందన్నారు. పేదలకు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో వందలమంది కార్పరేట్ వ్యక్తుల రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బీజేపీ పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ‘‘ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలను నిలిపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే మీరు ఈ ఖర్చులను భరించగలరా?’ అని ప్రజలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ పార్టీ పథకాల వల్ల ఢిల్లీలో ప్రతి ఇంటికి రూ.25వేల విలువైన లబ్ధి అందుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆప్, బీజేపీ మధ్యే ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. ఇదీ చదవండి: తేనెకళ్ల మోనాలిసా ఇళ్లు ఇదే.. -
యోగీ జీ.. అమిత్ షాకు కాస్త చెప్పండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్‌ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే యోగీ జీ..‘ నిన్న( గురువారం) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒక మంచి విషయం చెప్పారు. దీనికి ఢిల్లీ ప్రజల కూడా మద్దతుగా నిలుస్తారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదని యోగి అన్నారు. దాంతో ఢిల్లీ ప్రజలు వంద శాతం ఏకీభవిస్తారు. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఢిల్లీలో చాలా గ్యాంగ్‌స్టర్ గ్రూపులున్నాయి. వీరంతా ఢిల్లీ నగరాన్ని విభజించి వారి వారి కార్యకలాపాల్ని ఎంతో స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని బెదిరించి వారి అరాచకాల్ని సాగిస్తున్నాయి గ్యాంగ్‌స్టర్ గ్రూపులు. ప్రధానంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారస్తులకు ఏ రోజు సుఖం లేదు. రోజూ ఏదొక గ్యాంగ్స్టర్గ్రూప్ నుంచి వారు బెబెదిరింపు కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబాల్ని చంపేస్తామంటూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని గ్యాంగ్‌స్టర్ గ్రూపులు వసూలు చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో జరిగే గ్యాంగ్ వార్స్‌కి అక్కడి రోడ్లే సాక్ష్యం. ఢిల్లీలో మహిళలు ఇళ్లు ాదాటి బయటకు రావాలంటే చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో చిన్న పిల్లలు, మహిళలు తరచు కిడ్నాప్‌లకు గురౌవుతుంటారు. ఇక్కడ గ్యాంగ్స్టర్లకు కత్తుల్ని వారి వద్దనున్న మారణాయుధాల్ని చాలా బహిరంగంగా వాడుతుంటారు. హత్యలు, చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ ప్రజలు చాలా భయాందోళన మధ్య బ్రతుకుతున్నారనేది నిజం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే..‘యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంతో అమోగంగా ఉందన్నారు. ఒక ఫిక్స్డ్ లా అండ్ ఆర్డర్ యూపీలో ఉందన్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్ గ్రూపులను కట్టడి చేశామని చెప్పారు యోగీ జీ. అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా.. బాలేదా అనేది నాకైతే తెలీదు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల్లో ఉంది. మరి మీరు(యోగీ ఆదిత్యానాథ్) యూపీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే మెరుగైందని చెప్పారో అదే విషయాన్ని అమిత్ షాకు కూడా చెప్పి ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల్ని మెరుగుపర్చండి. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లకు ఎలా అడ్డుకట్ట వేయాలో కాస్త అమిత్ షా జీకి చెప్పండి యోగీ జీ’ అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
మరో దాడి.. అది వాళ్ల పనే : కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కారుపై మరోసారి దాడి జరిగింది. గురువారం హరినగర్‌లో అగంతకులు తన కారుపై దాడి చేశారని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘నా కారుపై దాడి జరిగింది. ఇది ప్రత్యర్థి పార్టీ నేతల మద్దతు దారుల పనే. ఢిల్లీ పోలీసులే దాడికి పాల్పడ్డ నిందితుల్ని నా బహిరంగ సభలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దాడి వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) హస్తం ఉంది. ఢిల్లీ పోలీసులను బీజేపీ వ్యక్తిగత సైన్యం’గా ఉపయోగించుకుంటుంది. ‘ఈరోజు హరి నగర్లో జరిగిన పార్టీ బహిరంగ సభలోకి ప్రవేశించడానికి విపక్షాల అభ్యర్థులను పోలీసులు అనుమతించారు. నా కారుపై దాడి చేశారు’ అని ట్వీట్లో తెలిపారు. ఇదంతా అమిత్ షా ఆదేశాల మేరకే జరుగుతోంది. అమిత్ షా ఢిల్లీ పోలీసులను బీజేపీకి వ్యక్తిగత సైన్యంగా మార్చారు. ఇలాంటి దాడులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని విమర్శించారు. ఒక జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, దాని నాయకులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. అయినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు గుప్పించారు. आज हरि नगर में विपक्षी उम्मीदवार के लोगों को पुलिस ने मेरी जनसभा में घुसने दिया और फिर मेरी गाड़ी पर हमला करवाया। ये सब अमित शाह जी के आदेश पर हो रहा है। अमित शाह जी ने दिल्ली पुलिस को बीजेपी की निजी आर्मी बना दिया है। चुनाव आयोग पर बड़े सवाल उठ रहे हैं कि एक राष्ट्रीय पार्टी…— Arvind Kejriwal (@ArvindKejriwal) January 23, 2025జనవరి 18న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఆయన వాహనంపై బీజేపీ మద్దతు దారులు దాడి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ నేత పర్వేష్ వర్మ మద్దతు దారులు తమ పార్టీ అధినేత కారుపై కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆ పార్టీ పేర్కొంది. ఆ ఆరోపణలను వర్మ ఖండించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆప్ ప్రభుత్వం తమకు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికుల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేజ్రీవాల్ కారు ముందుకు సాగింది. కేజ్రీవాల్ కారు ఢీ కొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. కేజ్రీవాల్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆస్పత్రిలో గాయపడ్డ యువకుల్ని పరమర్శించేందుకు నేను ఇప్పుడే వెళ్తున్నాను’ అంటూ బీజేపీ నేత పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడారు. -
ఆప్ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ!
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ (congress party) పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, ఆమ్ (aap) ఆద్మీ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ (Alcohol Affected Party) అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా( pawan khera) గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. మద్యం అలవాటు మనిషిని, అతని కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.शराब स्वास्थ्य के लिए हानिकारक है और शराब की लत इंसान, उसके परिवार और समाज को बर्बाद कर देती है- ये हम सब जानते हैं।लेकिन शराब से पैसा बनाने की लत से न सिर्फ इंसान, समाज बल्कि पूरा शहर खराब हो जाता है। हम सबने देखा है कि कैसे AAP (Alcohol Affected Party) ने शराब के जरिए पूरी… pic.twitter.com/MZld4aS4DP— Congress (@INCIndia) January 23, 2025 కానీ, మద్యం ద్వారా డబ్బు సంపాదించాలనే వ్యసనం కారణంగా కేవలం వ్యక్తి, సమాజం మాత్రమే కాకుండా మొత్తం నగరం కూడా నాశనం అవుతుంది. ఆప్ (ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ ) మద్యం ద్వారా మొత్తం ఢిల్లిని ఎలా నాశనం చేసిందో మనం చూశాం. ఇప్పుడు మీకు ఓ ఆడియో క్లిప్‌ను వినిపిస్తాను. వినండి. అ ఆడియోలో ఆప్ ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన విద్యాశాఖ మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్ ఎలా కుంభకోణం చేశారో తెలుస్తోంది. ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ ఓ మాట అన్నారు. తన వద్ద ప్రతి రోగానికి ఔషధం ఉందని. కానీ ఔషధం కనిపించలేదు.కానీ మద్యం కుంబకోణం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో మొత్తం ప్రభుత్వం మునిగిపోయింది’ అని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పవన్ ఖేరా కామెంట్స్ ఢిల్లీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. -
Delhi Assembly Election: కేంద్రం ముందు 7 డిమాండ్లు పెట్టిన కేజ్రివాల్
-
‘అది కేజ్రీవాల్ పనే .. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్(AAP) ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్‌వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ.‘ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. తమ కార్యకర్తల చేత కుర్చీలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాల్ నగర్ లో నిన్న(ఆదివారం) కుర్చీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ఆప్ నేతలే పని. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో పడ్డారు ఆప్ నేతలు. ఇది కేజ్రీవాల్.. ఆప్ కార్యకర్తల చేత చాలా తెలివిగా చేయిస్తున్నారు. ఒక ట్రాలీలో కుర్చీలను తీసుకెళ్తున్న వ్యక్తి వాటిని పంపిణీ చేస్తున్నాడు. ఆ కార్యకర్త కేజ్రీవాల్ పంపిన కార్యకర్తే’ అని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సైతం జత చేశారు. వెంటనే కేజ్రీవాల్పైఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.వారికి భూములివ్వండి.. నగరానికి వారే బ్యాక్బోన్కాగా, వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కేజ్రీవాల్. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. -
మోదీ జీ.. వారికి భూమిలిచ్చి ఆదుకోండి: కేజ్రీవాల్ మరో లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) మరింత సమీపిస్తున్న వేళ.. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి(Narendra Modi)కి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఇటీవల జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను ప్రధాని మోదీ దృష్టి తీసుకొచ్చారు కేజ్రీవాల్. జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంచితే, గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్‌కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేజ్రీవాల్ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్! -
కేజ్రీవాల్ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారంలో భాగంగా ఈరోజు(శనివారం) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కారులో వెళుతున్న సమయంలో రాయి వేశాడో దుండగుడు. అయితే ఇది బీజేపీ పనే అని ఆప్ ఆరోపిస్తోంది.‘బీజేపీ(BJP)కి భయం పట్టుకుంది. బీజేపీ బాగా భయాందోళనకు గురౌతోంది. దాంతోనే దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ ేజ్రీవాల్ కారుపై దాడి చేశారు’ అని మాటల యుద్ధానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈ మేరకు వీడియోతో పాటు బీజేపీపై పలు ఆరోపణలు చేసింది ఆప్. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. అరవింద్ కేజ్రీవాల్ ను రాళ్లతో టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రచారం చేయలేకపోతున్నారు కాబట్టి రాళ్లతో దాడులకు దిగుతోంది. ఏం జరిగినా కేజ్రీవాల్వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. దీనికి ఢిల్లీ ప్రజలు మీకు గట్టిగానే బుద్ధి చెబుతారు’ అని ఆప్ ట్వీట్లో పేర్కొంది.నల్లరంగు ఎస్యూవీలోకేజ్రీవాల్ వెళుతున్న సమయంలో, చుట్టూ సెక్యూరిటీ ఉండగా కొంతమంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా కేజ్రీవాల్ కారును అడ్డగించారు. ఆ సమయలో ఒక పెద్దరాయి కేజ్రీవాల్ కారుపై వచ్చి పడింది. దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. కేజ్రీవాల్ ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆప్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.Arvind Kejriwal attacked with a stone in New Delhi VS by BJP Gundas😳pic.twitter.com/VxHpJlz0L7— Gss🇮🇳 (@Gss_Views) January 18, 2025 కాగా గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్‌కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
ఉచితంగా కరెంట్, మంచినీరు.. కేజ్రీవాల్ వరాల జల్లు
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aap) విజయం సాధిస్తే.. అద్దె దారులకు ఉచిత కరెంట్, నీటిని అందిస్తామని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (delhi assembly elections) నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘వివిధ కారణాల వల్ల ఉచిత విద్యుత్, నీటి పథకాల ప్రయోజనాలను అద్దెదారులు పొందలేకపోతున్నారు. అద్దెదారులు కూడా ఢిల్లీ నివాసితులేనని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఈ ప్రయోజనాలు వారికి వర్తిస్తాయని ఆయన అన్నారు. బీజేపీ సైతంమరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి.బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయంఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 👉చదవండి : సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ముడా ఉచ్చు? -
చీపురుతో తుడిచేస్తా.. కేజీవాల్ నామినేషన్
-
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాలు షాక్
-
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్,ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ‘ జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్‌కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్ చేశారుమీరు ప్రామిస్ చేశారు.. మరిచిపోయారా?దేశంలోని జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాట్స్‌కు ప్రామిస్ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్మోదీ జీ, అమిత్ షాలను అడుగుతున్నా..ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్ షాలను అడుగుతున్నాను. జాట్స్ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.మీరు మురికివాడలను బాగు చేయండి..ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. -
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్ సర్కార్ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం. -
మీరు అలా చేస్తే.. నేను పోటీనే చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలను ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు.‘ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడలను కూల్చివేయాలని భావిస్తోంది. వారి స్థలాలను ఆక్రమించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ముందు మీ ఓట్లు కావాలి.. తర్వాత మీ స్థలం కావాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఢిల్లీలోని మురికివాడ ప్రజలకు కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించి ఇచ్చింది. ఢిల్లీ మహానగరంలో నాలుగు లక్షలకు మందికి పైగా మురికివాడల్లో ఉన్నారు. మీరు అది చేయాలంటే మీకు వెయ్యేళ్లు పడుతుంది’ అంటూ సెటైర్లు వేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో హోదా అనుభవించడం కోసం కాదని, ప్రజల హోదా పెంచడం కోసమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్న( శనివారం). ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు.మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఢిల్లీలోని మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు. మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ కేజ్రీవాల్‌ను నిలదీశారు. -
బీజేపీ సీఎం అభ్యర్థి బిధూరీకి అభినందనలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి మాజీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. బిధూరీని ఒకట్రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించవచ్చంటూ తనకు సమాచారముందని చెప్పారు. బిధూరీ అయినా మరెవరైనా సరే తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం అతిశీ పోటీ చేసే కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ రమేశ్ బిధూరీని పోటీకి నిలిపింది. శుక్రవారం సీఎం అతిశీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ‘దుర్భాషలాడటంలో ఆరితేరి’న రమేశ్ బిధూరీని ఎంపిక చేసిందని చెప్పారు. సీఎం అతిశీ తన ఇంటి పేరును మర్లెనా నుంచి సింగ్‌కు మార్చుకోవడం ద్వారా తండ్రిని కూడా మార్చేశారని బిధూరీ అన్నారు. అదేవిధంగా, ఢిల్లీలో రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ బిధూరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తను పోటీ చేసే న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ఎంపీలు ఓట్లను దేశవ్యాప్తంగా ఉన్న తమ సొంత నియోజకవర్గాలకు మార్చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాశారు. బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేశ్ వర్మ అధికార నివాసం పేరుతో 33 ఓట్లను బదిలీ చేశారని ఆరోపించారు. విచారణ చేపట్టి, వర్మను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. పోలింగ్ బూత్‌లను కబ్జా చేసుకోవడం కంటే ఇది అధ్వానమైన చర్యగా అభివర్ణించారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ.. సీఎం అతిశీ వర్సెస్ రమేష్ బిదూరి -
మీది శీష్ మహల్.. మీది రాజమహల్
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాజ మహల్లో విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లాల వ్యవహారంలో బుధవారం ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయడానికి ఆప్ అగ్రనేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తమ అనుచరులతో కలిసి మీడియాను వెంటబెట్టుకొని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఈ బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపారు. బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని చెప్పారు. శీష్ మహల్ లోపల ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. ప్రధాని మోదీ అధికార నివాసం ఒక రాజమహల్ అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజ మహల్లోకి మీడియాను అనుమతించే దమ్ముందా? అని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ సమీపంలో బైఠాయించారు. మరోవైపు బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం ఆతిశీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఏబీ 17 మథుర రోడ్‌లోని బంగ్లాను మీడియాకు చూపించారు. ఇప్పటికే అధికారిక బంగ్లాను కేటాయించగా, మరో బంగ్లా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. బంగ్లాల సందర్శన పేరిట ఆప్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
ఆయన తిట్టేది నన్ను కాదు.. నిన్నే!
ఆయన తిట్టేది నన్ను కాదు.. నిన్నే! -
‘శీష్‌మహల్’ ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్
ఢిల్లీ : ‘కోవిడ్-19 సమయంలో ఢిల్లీ ప్రజలు బాధపడుతుంటే.. కేజ్రీవాల్ మాత్రం శీష్‌మహల్‌ను నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యారు. శీష్‌మహల్ (Sheeshmahal) కోసం పెట్టిన ఖర్చు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రజల సంక్షేమం కంటే ఆయనకు విలాసాలు కావాల్సి వచ్చిందంటూ’ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ (Namo Bharat) కారిడార్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం. అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says "The 'AAP-DA' people have left no stone unturned in destroying Delhi's transport system. These people are not paying any attention to the maintenance of buses. The common citizens of Delhi have suffered… pic.twitter.com/I93IqlMaKz— ANI (@ANI) January 5, 2025 అదే సమయంలో కేజ్రీవాల్ అధికారిక నివాసంపై మోదీ ప్రశ్నలు సంధించారు. మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా ప్రాధాన్యమని సూచించారు.అనంతరం, మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ..ఆప్ నాయకత్వం దేశ రాజధాని ఢిల్లీని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. అవినీతి, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు. ‘దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారని మోదీ నొక్కాణించారు.👉చదవండి : ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సెటైర్లు -
కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. కానీ.. ప్రధాన పారీ్టలన్నీ గెలుపుగుర్రాలను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 70అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను శనివారం బీజేపీ 29మందితో తొలి జాబితా విడుదల చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్, తాజా సీఎం ఆతిశీలతో ఇద్దరు మాజీ ఎంపీలు తలపడబోతున్నారు. ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పారీ్టకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా చోటు దక్కింది. కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎంల కుమారులు బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ స్థానం హాట్ స్పాట్‌గా మారింది. ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. రేఖా గుప్తాను శాలిమార్ బాగ్ నుంచి, కుమారి రింకూని సీమాపురి(ఎస్సీ) నుంచి బీజేపీ రంగంలోకి దింపుతోంది. కేజ్రీవాల్ వర్సెస్ ఇద్దరు మాజీ సీఎంల కుమారులు ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ మూడు దఫాలుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగోసారీ ఇక్కడి నుంచే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పోటీ చేయనున్నారు. దీంతో ఈ సీటుపైనే అందరి దృష్టీ పడింది. కల్కాజీ స్థానం నుంచి తొలిసారి ఆప్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం ఆతిశీపై మాజీ ఎంపీ రమేష్ బిదూరిని బీజేపీ పోటీకి దింపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఏకంగా సీఎం ఆతిశీపై పోటీకి నిలపడం గమనార్హం. ఇద్దరు ఆప్ మాజీ మంత్రులకు టికెట్లు ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. పటేల్ నగర్ ఎస్సీ స్థానం నుంచి ఆప్ మాజీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్, ప్రస్తుతం నజఫ్‌గఢ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైలాష్ గెహాŠల్త్కు చోటు కలి్పంచింది. అయితే నజఫ్‌గఢ్‌కు బదులుగా ఆయన స్థానాన్ని మార్చి బిజ్వాసన్ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. గాంధీ నగర్ నుంచి మాజీ కాంగ్రెస్ మంత్రి అరవిందర్‌సింగ్ లవ్లీకి బీజేపీ టికెట్ ఇచి్చంది. అలాగే, ఆప్ నుంచి ఛత్తర్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరిన కర్తాల్ సింగ్ తన్వర్ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇదీ చదవండి: నేను అద్దాల మేడ కట్టుకోలేదు -
టఫ్ ఫైట్ తప్పదా?
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం(జనవరి4) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలకు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. పర్వేష్‌సింగ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. వెస్ట్ ఢిల్లీ నుంచి 2014,2019లో రెండుసార్లు కమలం గుర్తుపై ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లోనైతే ప్రత్యర్థిపై ఏకంగా ఐదు లక్షల 78వేల పై చిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడే పర్వేష్‌సింగ్ వర్మ. త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు పర్వేష్‌సింగ్ వర్మ గట్టిపోటీ ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.సీఎం అతిషిపై పోటీచేయనున్న రమేష్ బిదూరి ఎవరు..ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతిషిపై పోటీ చేయనున్న రమేష్ బిదూరి బీజేపీ సీనియర్ నేత. న్యాయవాది కూడా అయిన బిదూరి రెండుసార్లు ఎంపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత బిదూరి. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన బిదూరి సీఎం అతిషికి సరైన ప్రత్యర్థని భావించి పోటీకి దించిందని తెలుస్తోంది. కాగా, అతిషిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేయనున్నారు. -
RSS చీఫ్ కు వరుస ప్రశ్నలు సంధించిన కేజ్రివాల్
-
పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ మరో వరాల జల్లు కురిపించింది. ఆలయాల్లో పూజారులు, గురుద్వారాల్లో సేవచేసే గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ ఆలయం నుంచి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం అర్చకుల పేర్లను నమోదు చేస్తారు. ఆ తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలకు వెళ్లి పూజారులు, గ్రంథిల పేర్లు నమోదు చేస్తారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సమ్మాన్, సంజీవని యోజన లాగా ‘పూజారి, గ్రం«థి సమ్మన్ యోజన’కు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని వేడుకుంటున్నా. అయినాసరే అడ్డుకుంటామంటే బీజేపీకి మహాపాపం చుట్టుకుంటుంది. పూజారులు, గ్రంథులు మనకు దేవుడికి మధ్య వారధులుగా ఉంటూ మన ఆచారాలను భవిష్యత్ తారాలకు అందజేస్తున్నారు. సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నా వారు ఇన్నాళ్లూ నిర్లక్షానికి గురయ్యారు. దేశంలోనే తొలిసారిగా వీళ్లను ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమల్లోకి వస్తుంది. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనం అర్చకులకు, సేవకులకు చేకూర్చలేదు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అర్చకుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నా’’అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలను తరాలుగా కొనసాగిస్తున్న అర్చకులను ఆదుకునేందుకు ఉద్దేశించిన చక్కని పథకమిది’’అని ఢిల్లీ సీఎం అతిశి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మరోవైపు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ పరిధిలోని మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళకు దిగారు. ఇమామ్‌లకు అందాల్సిన నెలవారీ గౌరవ వేతనం రూ.18,000, ముయేజిన్లకు అందాల్సిన రూ.16వేల గౌరవ వేతనం గత ఏడాదిన్నరగా అందట్లేదని వారు నిరనసన తెలిపారు. -
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీల వర్షం
-
కేజ్రీవాల్ నాయకత్వానికి అగ్ని పరీక్ష
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కు సవాలుగా నిలుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారైనా గద్దె దింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దానికితోడు ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ ఇద్దరు నేతలు నిష్క్రమించడం, దాని మద్దతుదారుల్లో చీలికను సృష్టించింది. అలాగే, పొత్తుకు ఆప్ నిరాకరించడంతో ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా ఉండే ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే, పడినా నిలబడ గలిగే కేజ్రీవాల్ సామర్థ్యం, సంక్షేమంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో పార్టీ ట్రాక్ రికార్డ్ ఆయనకు బలమైన పునాది కాగలవు.2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కూ, ఆమ్ ఆద్మీ పార్టీకీ కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించిన కేజ్రీవాల్‌కు ఇప్పుడు సవాళ్లు పెరుగు తున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ, చావో రేవో అనే పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారు.అవినీతి వ్యతిరేక పోరాట యోధుడి స్థానం నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు కేజ్రీవాల్ సాగించిన ప్రయాణం సాధారణ మైనదేమీ కాదు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘనవిజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను గెలుచుకుని బలీయమైన రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే, అప్పటి నుండి రాజకీయ చిత్రం గణనీయంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు 2025 శాసనసభ ఎన్నికలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.దూకుడు పెంచిన బీజేపీఢిల్లీపై బీజేపీ రెట్టించిన బలంతో వ్యూహాత్మక దృష్టిని కేంద్రీకరించడం దీనికి అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి. ఇప్పటివరకూ ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేక పోయిన బీజేపీ, కేజ్రీవాల్‌ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ పోటీకి దింపింది. దీనితో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది. అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరం కానుంది.కేజ్రీవాల్ పదవీకాలం ఏమీ వివాదాలు లేకుండా సాగలేదు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అవినీతి ఆరో పణలు, తదుపరి న్యాయ పోరాటాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మందు గుండు సామగ్రిని ఇవి అందించగలవు.పైగా, ఆప్‌లోని అంతర్గత చోదక శక్తులు కూడా సవాళ్లను విసిరాయి. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు కారణమైంది. వీళ్ల ఫిరాయింపులు... ఒకప్పుడు ప్రధాన బలాలుగా ఉన్న సామాజిక న్యాయం,అందరినీ కలుపుకొనిపోవడం లాంటి విషయాల్లో ఆప్ నిబద్ధతపైనే ప్రశ్నలను లేవనెత్తాయి.సంక్షేమం కొనసాగింపుఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ ఓటర్లను గెలుచుకోవడానికి తన పాలనా రికార్డును, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ జనాభాలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆప్ అనేక కార్యక్రమాలను ప్రకటించింది. ఇళ్లకు ఉచిత విద్యుత్తు కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సహాయం అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే ‘సంజీవని యోజన’, ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ పథకాలు సంక్షేమం, అభివృద్ధిపై కొనసాగుతున్న ఆప్ దృష్టిని ప్రతిబింబిస్తాయి. ఇది దాని ఎన్నికల వ్యూహానికి మూలస్తంభం.విద్య, ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి ముఖ్యమైన అంశమైంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం, మొహల్లా క్లినిక్‌ల స్థాపన విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆప్ తన వాగ్దానాలను నెరవేర్చే పార్టీగా కీర్తిని పెంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. 2025 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రతికూల కథనాలను ఎదుర్కో వడానికీ, ఢిల్లీ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయ కుడిగా తన ఇమేజ్ను బలోపేతం చేసుకోవడానికీ కేజ్రీవాల్ ఈ విజయాలను హైలైట్ చేసే అవకాశం ఉంది.ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘ఇండియా’ బ్లాక్‌లోని గమనాత్మక శక్తులు కూడా రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆప్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ, అవి ఢిల్లీలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు లేక పోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన సంకీర్ణ రాజకీ యాల సంక్లిష్టతలనూ, ఇండియా కూటమిలో ఐక్యతను కొనసాగించడంలో ఉన్న సవాళ్లనూ నొక్కి చెబుతోంది.బలమైన వర్గాలు కీలకంసాంప్రదాయికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన మద్దతు పునాదిగా ఉన్న దళితుల ఓట్లు 2025 ఎన్నిక లలో కూడా కీలకమైన అంశం కానున్నాయి. కానీ కీలక దళిత నేతల ఫిరాయింపులు, దళిత వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలు ఆప్‌కు అవగాహనా సమస్యను సృష్టించాయి. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ అసంతృప్తిని పెట్టుబడిగా వాడుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఈ ఆందోళనలను శీఘ్రంగా పరిష్కరించాలి. దళిత సంఘాలు ఆప్‌కు తమ మద్దతును కొనసాగించడానికి, చాలా ముఖ్యమైన సమస్యల పట్ల ఆప్ నిజమైన నిబద్ధతను ప్రదర్శించాలి.అదేవిధంగా ఢిల్లీ జనాభాలో దాదాపు 15–18 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా అంతే కీలకం కానున్నాయి. చారిత్రకంగా,ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ముస్లిం సమాజం ముఖ్య పాత్ర పోషించింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో, ఆప్ ఈ విష యంలో గణనీయమైన పురోగతిని చవిచూసింది. 77 శాతం ముస్లిం ఓటర్లు అప్పుడు ఆ పార్టీకి మద్దతునిచ్చారని అంచనా.అయితే, 2020 నాటికి, ఈ మద్దతు కొద్దిగా తగ్గింది. 69 శాతం మంది ముస్లింలు ఆప్‌కు మద్దతు ఇచ్చారు. అయితే, 2025 ఎన్ని కలలో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కాబట్టి, ముస్లిం ఓటర్లలో పెరుగుతున్న పరాయీకరణ భావాన్ని కాంగ్రెస్ త్వరితగతిన ఉపయోగించుకునే వీలుంది. దీనివల్ల ఈ క్లిష్టమైన వర్గంపై ఆప్ ప్రభావం మరింతగా తగ్గుతుంది.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కేజ్రీవాల్ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారు. ఆ యా పార్టీలు గతంలో కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. పైగా సవాళ్లు పెరిగాయి. బీజేపీ దూకుడు ప్రచారం, వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచు తున్నాయి.అయినప్పటికీ, పడినా నిలబడగలిగే సామర్థ్యం, ఓటర్లతో అనుసంధానం కాగలిగే నైపుణ్యం కేజ్రీవాల్ బలాలు. పాలనపై, సంక్షే మంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో తన ట్రాక్ రికార్డ్ వంటివి ఆయన ప్రచారానికి బలమైన పునాదిని అంది స్తాయి. రాబోయే ఎన్నికలు కేజ్రీవాల్ నాయకత్వ పటిమనూ, కల్లోల రాజకీయాల్లో ఎదురీదే ఆయన సామర్థ్యాన్నీ పరీక్షించనున్నాయి.సాయంతన్ ఘోష్ వ్యాసకర్త కాలమిస్ట్, రీసెర్చ్ స్కాలర్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
అరెస్ట్ ఖాయమంటూ కేజ్రీవాల్ కామెంట్స్ .. ఢిల్లీ సీఎం అతిశీకి అధికారిక లేఖ
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్ కానున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) ఖండించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఆ ట్వీట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు.महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया हैउसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్ పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.కేజ్రీవాల్‌తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
‘సంక్షేమం అమలు చేస్తున్నాం.. మరి దానిపై దర్యాప్తు ఏమిటి?’
న్యూఢిల్లీ: తమ పార్టీని అస్థిర పరిచేందుకు బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ఇది బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న సరికొత్త అనుబంధ రాజకీయమంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తే అందులో దర్యాప్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ‘ మేము రెండు వేల ఒక వంద రూపాయలను మహిళా సమ్మన్ యోజన కింద అమలు చేస్తున్నాం. దాంతో పాటు స సీనియర్ సిటిజన్లకు సంజీవని యోజన కింద ఉచిత వైద్యం చేయిస్తున్నాం. ఇవి ఎన్నిలక హామీలో ఇచ్చినవే. దాన్ని అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాం. ఇందులో అంతా దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. దర్యాప్తు చేసుకోండి. అవసరమైతే జైలు కెళ్లడానికైనా సిద్ధమే’ అంటూ తీవ్రంగా స్పందించారు కేజ్రీవాల్‌ఇది బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న సరికొత్త డ్రామా అంటూ విమర్శించారు. అసలు బీజేపీకి మహిళల పట్ల కానీ సీనియర్ సిటిజన్ల పట్ల కానీ ఎటువంటి ఉదారత లేదన్నారు. ఢిల్లీలో బీజేపీ(BJP)కి మరోసారి ఓటమి తప్పదనే కారణంతోనే నైతిక విలువలు మరిచిపోయి వ్యవహరిస్తోందన్నారు. అలా చేయొద్దు.. రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
ఇండియా కూటమిలో బిగ్ ట్విస్.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్!
ఢిల్లీ: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్‌పై కాంగ్రెస్ ఆరోపణలే కారణమని తెలుస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. కూటమి నుంచి కాంగ్రెస్‌ను పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆప్ వర్గాల నుంచి ఇలాంటి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భవిష్యత్‌లో కూటమి రాజకీయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే ఇందుకు కారణం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, ఓడిపోవడంతో కూటమి నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇండియా కూటమికి తాను చీఫ్‌గా ఉండాలనుకుంటున్నట్టు మమతా బెనర్జీ చెప్పడంతో మరింత ఉత్కంఠను పెంచింది. ఈ క్రమంలో కూటమిలో పలు పార్టీల నేతలు కూడా మమతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పరిణామాల మధ్య ఆప్ తాజా నిర్ణయం కూటమిలో చిచ్చు పెట్టిందని పొలిటికల్ సర్కిల్ చర్చ నడుస్తోంది.Congress can criticise Kejriwal & AAP, as there is not alliance in Delhi. but Congress leader @ajaymaken call Kejriwal as anti national. How to accept this arrogance.AAP is the part of INDIA bloc, INC should keep respect with alliance partnerspic.twitter.com/8ix7V9s4G7— Arshad MT (@ArshadMadathodi) December 26, 2024 -
ఢిల్లీలో ‘24 గంటల స్వచ్ఛమైన నీరు’ అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పెద్ద ఎన్నికల హామీలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాగా ఇంతకుముందు, కేజ్రీవాల్ మహిళా యోజన, సంజీవని యోజన, ఆటో డ్రైవర్లకు హామీ మరియు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని వాగ్దానం చేశారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ కాలనీలో మంగళవారం నుంచి 24 గంటల స్వచ్ఛమైన నీటి సరఫరా ప్రారంభిస్తున్నట్లు ఆప్ అధినేత తెలిపారు. త్వరలో మొత్తం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నామ ని వాగ్దానం చేశారు. మంగళవారం బూస్టర్ పంపింగ్ స్టేషన్ ప్రారం¿ోత్సవం తర్వాత, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాండవ్ నగర్ డీడీఏ ఫ్లాట్లకు వెళ్లి... అక్కడ నేరుగా కుళాయిలో నీరు తాగి నీటి నాణ్యతను తనిఖీ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజ న, సంజీవని యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆతిషి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తూర్పు కిద్వాయ్ నగర్ నుంచి మహిళా సమ్మాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 అందించనున్నారు. అదేవిధంగా, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స కోసం సంజీవని యోజన కోసం రిజి్రస్టేషన్లు కూడా జంగ్‌పురా నుంచి ప్రారంభించారు. వీటితో పాటు దళితుల కోసం డాక్టర్ అంబేడ్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించారు. -
ఆప్ Vs బీజేపీ.. ఢిల్లీలో పొలిటికల్ మంటలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ పార్టీపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎజెండానే బీజేపీకి లేదన్నారు. అలాగే, గడిచిన ఐదేళ్ల కాలంలో ఢిల్లీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీకి స్పష్టమైన ఎజెండా లేదు. పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఢిల్లీలో విద్యుత్, మంచి నీరు, మహిళలకు ఉచిత ప్రయాణం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆప్ ఎంతో కృషి చేసింది. కానీ, ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిన వెంటనే నాపై ఛార్జిషీట్లు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఓటర్లను బీజేపీ తొలగిస్తోందని ఆరోపించారు. Forget about becoming CM, Arvind Kejriwal will not become even MLAHis political career may soon be over — Sandeep Dikshit on🔥 pic.twitter.com/6grdNMZYUK— Amoxicillin (@__Amoxicillin_) December 23, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఢిల్లీని కేజ్రీవాల్ సర్కార్ స్కామ్‌లకు రాజధానిగా మార్చిందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ, ఢిల్లీ జల్ బోర్డు, డీటీసీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి కుంభకోణాలకు పాల్పడింది. కేంద్ర నిధులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆప్ విఫలమైంది. కేవలం ప్రకటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఇదే సమయంలో దేశ వ్యతిరేక శక్తులకు ఆప్ మద్దుతు ఇస్తోందని కామెంట్స్ చేశారు. మరోవైపు.. కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక, ఎప్పటికీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాలేరని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని వ్యాఖ్యలు చేశారు. ఇక, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. Forget about becoming CM, Arvind Kejriwal will not become even MLAHis political career may soon be over — Sandeep Dikshit on🔥 pic.twitter.com/6grdNMZYUK— Amoxicillin (@__Amoxicillin_) December 23, 2024 -
‘నన్నెందుకు గుర్తించడం లేదు.. బాధగా ఉంది’.. స్పందించిన సీఎం
భారత చదరంగ క్రీడాకారిణి తానియా సచ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చెస్ ప్లేయర్‌గా తనకు సరైన గుర్తింపునివ్వడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని.. కానీ ఢిల్లీలో మాత్రం దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితి లేదని వాపోయింది.స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూఈ మేరకు.. ‘‘2008 నుంచి దేశం తరఫున వివిధ చెస్ టోర్నీల్లో పాల్గొంటున్నాను. ఎన్నో విజయాలు సాధించాను. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. ఇతర రాష్ట్రాలు మాత్రం తమ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తిస్తూ.. వారి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. 2022 చెస్ ఒలింపియాడ్‌లో చారిత్రక విజయం సాధించి.. కాంస్యం గెలిచిన జట్టులో నేను సభ్యురాలిని. వ్యక్తిగత పతకం కూడా సాధించాను. రెండేళ్ల తర్వాత.. అంటే 2024 చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూ నేను భాగమే.అయినప్పటికీ ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం నుంచి నాకెలాంటి గుర్తింపు లభించలేదు. ఢిల్లీ, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావించే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధగా ఉంది.ఇకనైనా విలువ ఇవ్వండిఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అతిశి మేడమ్, అరవింద్ కేజ్రీవాల్ సర్.. ఇకనైనా క్రీడలు, క్రీడాకారుల విలువను గుర్తించి చెస్ అథ్లెట్లకు అండగా ఉంటారని ఆశిస్తున్నా’’ అని తానియా సచ్దేవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి మర్లెనాతో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌లను ట్యాగ్ చేస్తూ తన విజ్ఞప్తిని తెలియజేసింది.గుకేశ్‌కు భారీ నజరానాకాగా ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచిన భారత జట్టులో తానియా సచ్దేవ్ కూడా ఉంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్‌లతో కలిసి పసిడి పతకాన్ని అందుకుంది.ఇక ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌పై తమిళనాడు ప్రభుత్వం కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 5 కోట్ల భారీ నజరానా అందజేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల తానియా సచ్దేవ్ తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పందించిన సీఎంతానియా సచ్దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిశి మర్లెనా స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని.. ఏ విషయంలో ఆమెకు అసౌకర్యం కలిగిందో చెప్పాలన్నారు. చెస్ ప్లేయర్ల కోసం తాము ఇంకా ఏమేం చేయగలమో చెప్పాలని సూచించారు. తన కార్యాలయం త్వరలోనే తానియాను సంప్రదించి.. అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుందని అతిశి ఎక్స్ వేదికగా చెస్ ప్లేయర్‌కు హామీ ఇచ్చారు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ హీట్
-
లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్ విచారణ
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం (డిసెంబర్ 21) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.డిసెంబరు 5న ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అనుమతి కోరింది. తాజాగా,లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది.Delhi LG VK Saxena has given sanction to the Enforcement Directorate to prosecute AAP chief and Former Delhi CM Arvind Kejriwal in the excise policy case: LG OfficeOn December 5, the Enforcement Directorate sought permission for sanction of prosecution against Arvind Kejriwal.— ANI (@ANI) December 21, 2024 మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్,విడుదలమద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 13న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.మద్యం పాలసీ కేసు కథేంటీ?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. అరెస్టు చేసింది.ఇదే కేసులో కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు సైతం జైలు శిక్షను అనుభవించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈడీకి అనుమతివ్వడం చర్చాంశనీయంగా మారింది. -
ఇండియా కూటమి కథ కంచికేనా?
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!కాంగ్రెస్‌కు పెద్ద సవాలుఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములాఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.కూటముల వైఫల్యం వెనుక...కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.- రషీద్ కిద్వాయి సీనియర్ జర్నలిస్ట్, రచయిత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।My Letter to Shri N Chandra Babu Naidu ji. pic.twitter.com/87pKYTfdDY— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024 बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।श्री नीतीश कुमार जी को मेरा पत्र। pic.twitter.com/YLd7lXrqmn— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్.ఏమన్నారంటే.. భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్ విజయ్ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
ఢీల్లీ సీఎం డౌన్ డౌన్!