Chandrababu Naidu
-
చెప్పాడంటే.. చేయడంతే మా బాబే..!
-
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదు
సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న బాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచి్చన నిరుద్యోగ భృతి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు భృతి అందించే ప్రతిపాదనే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని శుక్రవారం శాసన సభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది. పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకూ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమలుపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం నిరుద్యోగ భృతికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొక్కరు చొప్పున వేసుకున్నా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలి. అంటే ఏడాదికి సుమారు రూ.57,600 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి ఖర్చవుతుంది. అయితే రాష్ట్రంలో 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు బాబు ప్రభుత్వం వెల్లడించడం యువతను మోసగించడమేనని పలువురు చెబుతున్నారు.ఉచిత బస్సు మరింత దూరం..!మరోవైపు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కూడా బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. అధికారం చేపట్టి ఐదు నెలలు దాటినా ఈ హామీ అమలుపై కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శాసన సభలో రాతపూర్వకంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, మార్గదర్శకాలు, విధివిధానాలు అంటూ హామీ అమలును దాటవేస్తున్నారు. ఇప్పుడూ ఇదే చెప్పడంపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలకు బస్ ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ అవసరం లేదని, ఉన్న బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి మార్గదర్శకాల రూపకల్పన అంటూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని నిలదీస్తున్నారు. -
ఏది నిజం?
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్‌లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్‌ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆరి్థక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచి్చన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్‌లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది. యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది? -
నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్‌కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్‌కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్‌పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్సీ, ఏపీఈఆర్సీ’ ఎందుకు అనుమతిస్తాయి?2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదిటీడీపీ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే! చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది? -
పెద్దిరెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్
-
మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో iTDP సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు
-
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
-
జగన్ ఉన్నప్పుడు అదానీ పెట్టుబడులు పెడితే మీకు చేదు
-
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
-
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?
-
చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్‌ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.‘‘రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్‌ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలయింది. జగన్‌కు రూ.1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతా?. పైగా ఇంటర్నేషనల్‌గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘అదానీ చంద్రబాబును కలిస్తే ఆహాఓహో అంటూ ఈనాడు రాసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటూ పేజీల నిండా రాసింది. అదే అదానీ జగన్‌ను కలిస్తే పోర్టులు, మైనింగ్ అంతా అదానీకే దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాసింది. ఇలా రాస్తే జనం నవ్వుతారని కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలు రాసింది. కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముంది?’’ అని పేర్ని నాని చెప్పారు.‘‘రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా?. అదే రూ.2.49లకే జగన్ కొనుగోలు చేస్తే అవినీతా?. అడ్డగోలు ఒప్పందాలతో చంద్రబాబు జనం మీద భారం వేస్తే అది ఈనాడుకు కనపడదా?. రామోజీరావు సంతాప సభ కోసం ప్రజల సొమ్ము రూ.25 కోట్లు ఖర్చు చేశారు. అందుకని చంద్రబాబు రుణం తీర్చుకోవటానికి ఈనాడు పచ్చి అబద్దాలను అచ్చోసింది. చంద్రబాబు దిగేనాటికి కరెంటు కంపెనీలకు రూ.22 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు’’ పేర్ని నాని స్పష్టం చేశారు.‘‘కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరం. జగన్ కంటే సంవత్సరంన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల అధిక ధరలతో కొనుగోలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు జరిగితే చంద్రబాబు ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేశారు?. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలి. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చింది. అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుంది?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.ఇదీ చదవండి: సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం? -
Perni Nani: పుష్ప ఈ మధ్యన ఇంటర్నేషనల్... చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్
-
PAC ఛైర్మన్ ను ప్రతిపక్షానికే ఇవ్వాలి
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్‌గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్‌గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్‌గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్‌ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
గ్రామ సచివాలయ వాలంటీర్లకు స్వచ్ఛందంగా ద్రోహం చేసిన బాబు
-
నా భర్తను ఎందుకు కలవనివ్వడం లేదు..? ఇంటూరి రవికిరణ్ భార్య సంచలన వ్యాఖ్యలు
-
పీఏసీ ఎన్నికల విషయంలో YSRCP కీలక నిర్ణయం
-
మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైఎస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారుఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ..‘సభలో బాధ్యత గల మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచితమైన వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడుతున్నారు. మంత్రి సవిత మహిళలను అవమానించేలా మాట్లాడారు. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. మహిళలు గంజాయి, మద్యానికి బానిసలైపోయారనడం దారుణం. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత వ్యాఖ్యానించారుఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు. మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని అన్నారు. -
‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పొగడ్తలు అతిగా మారుతున్నాయి. వీటి వెనుక ఉన్న నిజాయితీ ఎంత? వ్యూహమెంత? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల చర్చ. చంద్రబాబు ఈ ఐదేళ్లు మాత్రమే కాకుండా.. మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగాలన్నది పవన్ పొగడ్తల్లో ఒకటి. అంటే.. సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పకనే చెప్పడమన్నమాట. ఇంకోలా చూస్తూ,, లోకేష్ సీఎం కాకూడదన్న ఆలోచనతో పవన్ ఈ మాట అన్నారేమో అనే చర్చ కూడా నడుస్తోంది. .. ఈ ప్రకటనతో పవన్ సీఎం పదవిపై ఆశ వదలుకున్నారని సందేశమూ తన సామాజిక వర్గమైన కాపులకు పంపినట్లు కనిపిస్తోంది. అయితే కాపుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి కావాలన్నది వారి చిరకాల ఆకాంక్ష. సినీనటుడు చిరంజీవి ద్వారా ఆ కోరిక తీరుతుందని వారు ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. కేంద్రంలో కొంతకాలం పాటు మంత్రి పదవి అనుభవించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టి తొలుత టీడీపీకి ఆ తరువాత వామపక్షాలు, బీఎస్పీలతో జట్టు కట్టి పోటీచేశారు అప్పట్లో పవన్ ఎక్కడకెళ్లినా అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ యువత సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసేది. దానికి ఆయన కూడా సంబరపడేవారు. కానీ.. 2019 ఎన్నికలలో ఆయన రెండుచోట్ల పోటీచేసి ఓడిపోవడం, పార్టీ ఒక్క సీటుకే పరిమితమైపోయాయి. ఆ వెంటనే పవన్ ప్లేటు మార్చి బతిమలాడకుని మరీ మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. ఆ ఎన్నికలలో టీడీపీ కూడా ఓటమి పాలవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరంగా ఉంటే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ ను ముందుగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలోకి ప్రవేశింప చేసి, తన తరపున రాయబారం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటారు. .. ఆ తర్వాత కాలంలో పవన్‌ను చంద్రబాబు తన వెంట తిప్పుకున్నారు. చివరికి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో పవన్ ఆయనను పరామర్శించడానికి వెళ్లి పొత్తులపై మాట్లాడారు.అప్పటికే పవన్ కల్యాణ్ కు ఒక భయం పట్టుకుంది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే మళ్లీ ఓడిపోతానని సందేహించారు. పవన్ కల్యాణ్, జనసేన మద్దతు లేనిదే టీడీపీ అధికారంలోకి రాలేదని చంద్రబాబూ భావించారు. ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా పని చేయాలంటే కేంద్రంలోని బీజేపీతో స్నేహం అవసరమని కిందా, మీద పడి ఆ పార్టీని ఒప్పించారు. నిజానికి జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేయడం ద్వారా ఏపీలో తమ బలాన్ని పెంచుకోవచ్చని బీజేపీ అనుకుంది. పవన్‌ను సీఎం అభ్యర్ధిగా కూడా బీజేపీ కేంద్ర నేతలు కొందరు ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తు చర్చల సమయంలో పవన్‌కు ముఖ్యమంత్రి పదవిని ప్రతిపాదించి రెండేళ్లపాటు అవకాశం ఇవ్వాలని బీజేపీ సూచించింది. .. అలాగే సీట్ల పంపిణీ టీడీపీకి సగం, జనసేన, బీజేపీలకు సగంగా జరగాలని బీజేపీ పెద్దలు అభిప్రాయపడినా, పవన్ దానికి కూడా పట్టుబట్టకుండా జారిపోయారు. పవన్ కల్యాణ్ అసలు తాను గెలుస్తానో, లేదో అన్న భయంతో షరతులు లేకుండా టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లారన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. బీజేపీని కూడా ఒప్పించారు!. ఈవీఎంల మేనేజ్ మెంటా? లేక ప్రజలు ఓట్లు వేశారా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ, ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి చెందారు. ఆ తర్వాత ఎన్ని అరాచకాలు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పవన్ తొలుత నోరు మెదపలేదు. కారణం తెలియదు కానీ, సడన్ గా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారన్న వాస్తవాన్ని పవన్ ప్రకటించారు. ఆ సందర్భగా హోం మంత్రి అనిత సమర్థతను ప్రశ్నిస్తూ, తానే హోం మంత్రి అవుతానని హెచ్చరించారు. అది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది. .. ఆ మీదట చంద్రబాబు ఏమి చెప్పారో కానీ, వెంటనే స్వరం మార్చి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల గురించి కాకుండా సోషల్ మీడియా లో అసభ్య పోస్టింగ్లపైకి దారి మళ్లించారు. పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులు చేయిస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలోని సూపర్ సిక్స్ తదితర అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం బాగా పని చేస్తోందని ప్రచారం ఆరంభించారు. అదే సందర్భంలో చంద్రబాబు అనుభవం.. అంటూ పవన్ తెగ పొగుడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తుంటే ప్రశంసించవచ్చు. నిత్యం అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని పవన్ అనడంలో ఆంతర్యం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ఆయన సనాతన ధర్మం అంటూ బీజేపీ ఎజెండా ప్రకారం రాజకీయం చేస్తూ ,మరో వైపు చంద్రబాబును పొగడడం ద్వారా టీడీపీతో సత్సంబంధాలు ఉంచుకునేలా జాగ్రత్త పడుతున్నారు. సినీ నటుడు కూడా అయిన పవన్ కల్యాణ్ గ్లామర్ ను ఉపయోగించుకుని ఏపీలో ఎదగాలని బీజేపీ భావనగా ఉందని అంటున్నారు. భవిష్యత్తులో టీడీపీతో తేడా వస్తే ఈ వ్యూహంలోకి బీజేపీ వెళ్లవచ్చన్నది కొందరి అనుమానం. ఈలోగా చంద్రబాబుతో గొడవ లేకుండా పవన్ పొగుడుతుండవచ్చు. మరో విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం స్థానంలో ఎప్పుడు కూర్చుంటారా అని లోకేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అమెరికా వెళ్లి వచ్చిన సందర్భంగా టీడీపీకి చెందిన 18 మంది మంత్రులు స్వాగతం చెప్పడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. కుటుంబ పరంగా లోకేష్‌కు సీఎం పదవి సాధ్యమైనంత త్వరగా కట్టబెట్టాలన్న ఒత్తిడి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ లోకేష్ కు సీఎం పదవి అప్పగిస్తే పవన్ ఆయన క్యాబినెట్ లో ఉంటారా? లేదా? అన్నది చెప్పలేం. పవన్ కల్యాణ్ కు అది పెద్ద సమస్య కాదని, ఆయన పదవికి అలవాటు పడ్డాక దానిని వదులు కోలేరన్నది కొంతమంది వాదన. అయితే బీజేపీతో స్నేహం నడుపుతున్న పవన్ వ్యూహాత్మకంగా లోకేష్ కు సీఎం పదవి ఈ టరమ్‌లో రాకుండా చూడడానికే ఈ ప్రకటన చేశారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. అంతే కాకుండా, పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని అన్నారంటే, ఆ పదవి తనకే కాకుండా లోకేష్ కు కూడా రాదని చెప్పడమే అవుతుంది. ఇది ఒకరకంగా చంద్రబాబుకు కూడా కొంత ప్రయోజనకరం కావచ్చ. లోకేష్‌ను ఈ టరమ్‌లో సీఎంగా చేస్తే పవన్ ఒప్పుకోరని, ఆయన పొత్తు వీడిపోతే టీడీపీకి ఇబ్బంది అవుతుందని కుటుంబానికి నచ్చ చెప్పడానికి ఇది ఉపయోగపడవచ్చన్నది మరో అభిప్రాయం. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఈ టరమ్ పూర్తి అయ్యేసరికి 79 ఏళ్లకు చేరతారు. ఆ తర్వాత పదేళ్లు అంటే 89 ఏళ్లు వస్తాయి. వచ్చే టరమ్‌లో తిరిగి కూటమి గెలుస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. ఆ పరిస్థితి ఎలా ఉన్నా 90 ఏళ్లు వచ్చే వరకు చంద్రబాబు సీఎం గా ఉండాలని పవన్ అంటున్నారంటే, అది ముఖస్తుతి కోసం, లోకేష్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే కావచ్చన్నది జనసేనలో జరుగుతున్న చర్చ. నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ మాటే నడుస్తోందని, మంత్రులు ఎవరూ ఏమీ చేయడానికి లేదని అంటున్నారు. చివరికి పవన్ కల్యాణ్ శాఖలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు లోకేష్ ద్వారానే జరుగుతున్నాయని అంటారు. లోకేష్‌ను నేరుగా ఎదిరించే ధైర్యం పవన్ ప్రస్తుతం చేయడం లేదని చెబుతున్నారు. కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులను ఒక టీమ్‌గా పెట్టుకుని లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒకరినొకరు పొగుడుకుంటూ కాలం గడుపుతుంటే, అసలు పెత్తనం అంతా లోకేష్ చేస్తున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ నిస్సహాయ స్థితిలోనో, లేక వ్యూహాత్మకం గానో లోకేష్ సీఎం కాకుండా అడ్డుపడే లక్ష్యంతో ఈ ప్రకటన చేశారేమో అనే విశ్లేషణలు సోషల్ మీడియాలో కూడా విస్తారంగా వస్తున్నాయి. రాజకీయాలలో అతిగా పొగిడితే కూడా పలు సందేహాలు వస్తుంటాయి. ఏది ఏమైనా పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే యోగం ఎప్పటికైనా ఉంటుందా? అన్నది ఆయన అభిమానులకు లక్ష డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. తాలిబన్లు మాత్రమే ప్రతిపక్షానికి PAC ఇవ్వలేదు
-
ఒప్పందం కేంద్ర సంస్థతో.. జగన్ పై బురద జల్లుడు.. ఎల్లో మీడియా కారు కూతలు
-
ప్రతిపక్షం లేకుండా బాబు కుట్ర..
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు.