Chhapaak Movie
-
పెళ్లి కావాల్సిన అమ్మాయిని కదా.. అందుకే..
ముంబై: తనకు ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతం చేయడం వల్ల తన తల్లి, సోదరుడు ఆవేదనకు గురయ్యారని బిగ్‌బాస్ భామ, టీవీ నటి ఆర్తీ సింగ్ అన్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్-13లో పాల్గొన్న ఆర్తీ సింగ్.. బిగ్‌బాస్ హౌజ్‌లో 140 రోజుల పాటు కొనసాగారు. తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోయారు. ఈ క్రమంలో.. ‘ఛపాక్’ మూవీ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ దీపికా పదుకునె హౌజ్‌లో అడుగుపెట్టినపుడు.. ఆర్తీ సింగ్ తన వ్యక్తిగత విషయాలను ఆమెతో పంచుకున్నారు. పదమూడేళ్ల వయసులో తనపై అత్యాచారయత్నం జరిగిందని.. తమ ఇంట్లో పనిచేసే వ్యక్తి.. ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని ఆర్తీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆర్తీ సోదరుడు కృష్ణ... ఆర్తీకి అటువంటి అనుభవాలు ఎదురుకాలేదని... తనేదో ఊరికే అలా మాట్లాడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ అన్నాచెల్లెళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి.(నాపై అత్యాచారయత్నం జరిగింది) ఇక ప్రస్తుతం షో ముగిసిన నేపథ్యంలో... ఇంటికి చేరుకున్న ఆర్తీ.. తన సోదరుడి వ్యాఖ్యలపై స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎదురైన భయానక అనుభవం గురించి షోలో చెప్పడం తన సోదరుడిని బాధపెట్టిందని పేర్కొన్నారు. ‘‘కృష్ణ.. నా సోదరుడు. నాపై అత్యాచారయత్నం జరిగిందని చెప్పడం తనకు, మా అమ్మకు అసలు నచ్చలేదు. పెళ్లి కావాల్సిన అమ్మాయిని కదా.. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడం ఎందుకని వారి ఉద్దేశం. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని.. మా అమ్మ నన్ను అడిగింది. ‘ఎంతో మంది చిన్నారులు.. నాలాగే ఇలాంటి అఘాయిత్యాల బారిన పడి ఉంటారు.. అలాంటి వాళ్లు నా మాటలు విని పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం చేస్తారు. దాంతో వారిపై అమానుష చర్యలు ఆగిపోతాయి. అందుకే నేనలా మాట్లాడాన’ని తనకు చెప్పాను. తను కూడా అర్థం చేసుకుంది. ఇక ప్రతీ అన్నా.. తన చెల్లి గురించి ఇలాగే స్పందిస్తాడు.. ఇది సహజం.. కాబట్టి కృష్ణను విమర్శించడం తగదు’’అని చెప్పుకొచ్చారు. కాగా బాలికా వధు ఫేం సిద్దార్థ్ శుక్లా హిందీ బిగ్‌బాస్-13 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. (బిగ్‌బాస్ విన్నర్: ఊహించిందే నిజమైన వేళ..) -
‘ఛపాక్’ తక్కువ రేటింగ్‌పై దీపిక కౌంటర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తాజాగా నటించిన చిత్రం ‘ఛపాక్’. ఇప్పటివరకు సుమారు రూ.40 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా భావించిన దీపిక యాసిడ్ బాధితుల కోసం క్యాంపెయిన్ సైతం నిర్వహించింది. అంతేకాక దేశంలో యాసిడ్ అమ్మకాలు ఏమేరకు జరుగుతున్నాయని సోషల్ ఎక్స్పర్మెంట్ చేసి విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీపిక ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో తాను జేఎన్‌యూను సందర్శించించడాన్ని తప్పుపడుతూ ప్రఖ్యాత వెబ్సైట్ ఐఎమ్‌డీబీలో ‘ఛపాక్’ సినిమాకు దారుణమైన రేటింగ్ ఇవ్వడంపై స్పందించింది. ‘వాళ్లు ఐఎమ్‌డీబీ రేటింగ్ మార్చవచ్చేమో.. కానీ నా మేధస్సును కాదు’ అని కౌంటర్ ఇచ్చింది. కాగా ఈ సినిమా విడుదల సమయంలో పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థులపై ముసుగు ధరించిన దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో ఆ దాడులకు నిరసనగా నలుపు రంగులు ధరించిన దీపిక జేఎన్‌యూను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించింది. సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేసిందంటూ పలువురు ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ట్విటర్లో #BoycottChhapaak అంటూ ఓ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ప్రతీకారంగా.. సినిమా రివ్యూలకు కేరాప్ అయిన ప్రఖ్యాత వెబ్సైట్ ఐఎమ్బీడీలో ఎక్కువ మంది.. తక్కువలో తక్కువ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీంతో ఛపాక్ సినిమాకు ఆ వెబ్సైట్లో అతి తక్కువగా 4.6 రేటింగ్ నమోదైంది. అయితే సినీ విశ్లేషకులు మాత్రం ఈ సినిమాను కొనియాడటం గమనార్హం. కాగా దీపిక ప్రస్తుతం ‘ద ఇంటర్న్’ అనే హాలీవుడ్ రీమేక్‌కు ఓకే చెప్పింది. చదవండి: దీపికకు చేదు అనుభవం.. ట్విటర్లో ట్రెండింగ్! జేఎన్‌యూలో దీపిక -
దీపిక టిక్‌టాక్ ఛాలెంజ్.. నెటిజన్లు ఫైర్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన ఛపాక్ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేశారు. అయితే ఆ సినిమా ప్రమోషన్ కోసం దిపికా చేసిన పనికి సోషల్ మీడియా తిట్టిపోస్తోంది. ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారుడు పని చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి : ఛపాక్ : మూవీ రివ్యూ) అసలేం జరిగిందంటే.. సినిమా ప్రమోషన్లో భాగంగా దీపికా చాలామంది టిక్ టాక్ స్టార్లను కలిసింది. అందులో ఒకరిని తన సినిమాల్లో గెటప్‌లకు టిక్ టాక్ చేయాలంటూ కోరింది. వాటిలో ఒకటి ఓం శాంతి ఓంలో క్యారెక్టర్, పీకూలో క్యారెక్టర్, మూడోది ఛపాక్ మూవీలో లక్ష్మీ క్యారెక్టర్ చేయమని కోరింది. అవి తన ఫెవరేట్ క్యారెక్టర్లు అని కూడా చెప్పింది. దీపిక విసిరిన చాలెంజ్ ను ఫాబీ అనే ఓ మేకప్ ఆర్టిస్ట్ తీసుకుంది. ఆ గెటప్‌లతో 39 సెంకడ్ల నిడివి గల టిక్ టాక్ వీడియో తీసి పోస్టు చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం దీపికా చీప్ స్టంట్లన్నీ చేస్తుందంటున్నారు. ఛపాక్ లో యాసిడ్ దాడి జరిగిన ముఖంతో టిక్ టాక్ చేయమని చెప్పడం ఏ రకమైన ప్రమోషన్ ఆలోచించావా? ‘ఇది యాసిడ్ దాడి బాధితుల్ని కించపరచడమే’, ‘నిన్నుచూస్తే సిగ్గుగా అనిపిస్తోంది’, ‘ఇది సరియైన ప్రమోషన్ కాదు. ఆ మూవీ నీ మెకప్కు సంబంధించినది కాదు. ఓ యాసిడ్ బాధితురాలి జీవితం. ఇలాంటి ప్రమోషన్‌తో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయావు’ జెఎన్యూను సందర్శించడం కూడా ప్రమోషన్ కోసమే. యాసిడ్ బాధితురాలి మొఖం నీకు ఫెవరేట్ ఫేస్ ఎలా అవుతుంది. ఇది వారిని అవమానించడమే. మీరు ఏం చేసిన డబ్బు కోసమే చేస్తారు’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తాజాగా నటించిన చిత్రం ఛపాక్. లక్ష్మీ అగ్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక యాసిడ్ బాధితురాలిగా నటించింది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఇక యాసిడ్ అమ్మకాలను నియంత్రిచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా? అని దీపికకు సందేహం తలెత్తింది. దీంతో దీపిక టీమ్ ఓ సామాజిక ప్రయోగానికి(సోషల్ ఎక్స్పర్మెంట్) పూనుకుంది. ఇందులో భాగంగా బృంద సభ్యులు ప్లంబర్, మెకానిక్, బిజినెస్మెన్, గృహిణి ఇలా రకరకాలుగా వేషాలు కట్టి ముంబైలోని పలు దుకాణాలకు వెళ్లి యాసిడ్ కావాలంటూ అడిగారు. దీనికి కొందరు షాపు యజమానులు అడగ్గానే సులువుగా ఇచ్చేయగా ఒకరిద్దరు మాత్రం ఎందుకు? ఏమిటి? ఆరా తీశారు. గుర్తింపు కార్డు చూపించని వారికి యాసిడ్‌ను అమ్మకూడదన్న నిబంధనలను సైతం దుకాణదారులు బేఖాతరు చేశారు. కేవలం ఒక్కరు మాత్రమే ఐడీ కార్డ్ అడిగి, చివరకు యాసిడ్ బాటిల్‌ను అతని చేతికందించాడు. ఇంత విచ్చలవిడిగా యాసిడ్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసి దీపిక టీమ్ సభ్యులు ఆశ్చర్యపోయారు. దీన్నంతటినీ సీక్రెట్‌గా వీడియో తీస్తుండగా ఈ ప్రయోగాన్ని కారులో కూర్చొని పర్యవేక్షిస్తున్న దీపికకు నోట మాట రాలేదు. మన దేశంలో యాసిడ్‌ను ఇంత సులభంగా కొనుగోలు చేయవచ్చన్న విషయం తెలుసుకున్న ఆమె నిశ్చేష్టురాలైంది.(‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు) దీనిపై దీపిక పదుకొనే స్పందిస్తూ ‘సుప్రీంకోర్టు యాసిడ్ అమ్మకాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అయినా కూడా మేము ఒక్కరోజులోనే 24 యాసిడ్ బాటిళ్లను కొనుగోలు చేశామంటే నమ్మలేకపోతున్నాను. దుకాణదారులతోపాటు ఎవరైనా చట్ట విరుద్ధంగా యాసిడ్ అమ్మినా, కొనుగోలు చేసినా ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉంది. యాసిడ్‌ను కొనుగోలు చేయకండి, దాన్ని ఎవరూ అమ్మకండి’ అని పిలుపునిచ్చింది. కాగా గతంలోనూ దీపిక ఓ ఎక్స్పర్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఛపాక్ సినిమా షూటింగ్ సమయంలో మాలతి వేషంలో ఉన్న దీపిక పలు షాపులకు వెళ్లింది. యాసిడ్ బాధితురాలిగా ఉన్న దీపికను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. పైగా ఆమెను చూడగానే కొందరు మొహం తిప్పుకుని వెళ్లిపోగా మరికొందరు చిరునవ్వుతో పలకరించారు. ఇలా ఆమెకు జరిగిన అనుభవాలను వీడియో తీసి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఛపాక్ ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్!
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘ఛపాక్’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఛపాక్ ఇప్పుడు అసలు సిసలైన విజయాన్ని ముద్దాడబోతోంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘ఛపాక్’. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అద్భుత నటనను ప్రదర్శించింది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా సగటు ప్రేక్షకునితోపాటు ఓ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. యాసిడ్ బాధితుల కోసం పెన్షన్ అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. యాసిడ్ బాధితులు సగౌరవంగా బతికేందుకు వారికి ప్రతినెల రూ.5000 నుంచి రూ.6000 అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్లో ప్రతిపాదన తీసుకొస్తామని, అది ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం ద్వారా ధీర వనితలు వారి ఆశయాలను సాధించడంలో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఛపాక్ మూవీ రివ్యూ) -
ఛపాక్ : మూవీ రివ్యూ
టైటిల్ : ఛపాక్ నటీనటులు: దీపికా పదుకొనే, విక్రాంత్ మాస్సే, మధుర్జీత్ సర్ఘీ, వైభవి ఉపాధ్యాయ, పాయల్ నాయర్ దర్శకత్వం: మేఘనా గుల్జార్ యాసిడ్ దాడుల నేపథ్యంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ‘ఛపాక్’. టాప్ విమెన్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ భారీ సూపర్‌హిట్ సినిమాల తర్వాత దీపిక.. తల్వార్, రాజీ వంటి బలమైన సామాజిక చిత్రాల తర్వాత మేఘనా గుల్జార్ కాంబినేషన్లో తెరకెక్కడం.. దీపిక పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యమున్న వుమెన్ ఓరియెంటెడ్ సినిమా చేయడంతో ‘ఛపాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో యాసిడ్ అటాక్ విక్టిమ్గా, ఫైటర్‌గా మాలతి(దీపిక) పోరాటమేమిటంటే.. కథ: 19 ఏళ్ల మాలతిపై ఓ రోజు అకస్మాత్తుగా యాసిడ్ దాడి జరుగుతుంది. తెలిసిన వాడే ప్రేమిస్తున్నానంటూ వేధించి.. తన ప్రేమను ఒప్పుకోకవడంతో యాసిడ్ దాడి చేస్తాడు. ఈ ఒక్క దాడితో ఆమె ఉనికి సమస్తం మారిపోతోంది. జీవితం తలకిందులవుతుంది. కలలు ఛిద్రమవుతాయి. అయినా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో తాను ఎలా పోరాటం చేసింది? ఎలా న్యాయాన్ని సాధించింది? ఎలా తోటి బాధితులకు అండగా నిలిచిందనేది మిగతా కథ. విశ్లేషణ: యాసిడ్ దాడి.. నిత్యం దేశంలో ఎక్కడోచోట జరిగే దుర్మార్గమిది. యువతులు, మహిళల జీవితాన్ని ఛిద్రం చేస్తున్న దారుణమిది. ఈ తీవ్రమైన సమస్యను ఒక నిజజీవిత పోరాటం ఆధారంగా మేఘనా గుల్జార్ తెరమీద ‘ఛపాక్’గా ఆవిష్కరించారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా అత్యంత బలంగా, బాధితుల కోణంలో సున్నితంగా మేఘనా ఈ సినిమాను రూపొందించారు. తల్వార్, రాజీ వంటి సినిమాలు తెరకెక్కించి భేష్ అనిపించుకున్న మేఘనా తాజా సినిమా ‘ఛపాక్’ను వాస్తవానికి దగ్గరగా, సున్నితంగా మలిచారు. ఈ క్రమంలో కథ, కథనాలు కొంత నెమ్మదించినా.. సినిమా స్లోగా సాగుతున్నట్టు అనిపించినా.. డైలాగులు, పాటలు సినిమాకు ప్రాణం పోశాయి. యాసిడ్ దాడి బాధితురాలిగా తొలిసారి డీ గ్లామరైజ్ పాత్రను పోషించిన దీపిక తన పాత్రలో ఒదిగిపోయింది. పాత్రకే కాదు, సినిమాకు న్యాయం చేసింది. ఒక యాసిడ్ బాధితురాలిగా శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే వేదన, సర్జరీలు, న్యాయం కోసం చేసే కోర్టుల చుట్టూ తిరుగుతూ రావడం, తోటి బాధితులకు అండగా ఉండటం, నిరుపేద నేపథ్యం, కుటుంబసమస్యలు.. వీటన్నింటి మధ్య ధైర్యంగా నిలబడి, పోరాటం చేసి విజయం సాధించిన ధీరవనితగా దీపికా పదుకొనే నటన సహజత్వానికి దగ్గరగా అదుర్స్ అనిపిస్తుంది. సమాజం పట్ల ఫ్రస్టేట్ అవుతూ.. యాసిడ్ బాధితులకు అండగా ఉండే ఎన్జీవో కార్యకర్తగా, మాలతిని అర్థం చేసుకునే సైలెంట్ ప్రేమికుడిగా విక్రాంత్ మాస్సే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాలతి లాయర్ అర్చనగా మధుర్జీత్ సర్ఘీ, ఇతర పాత్రలు పోషించిన నటులు తమ పరిధిమేరకు చక్కగా నటించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, నేపథ్య సంగీతం అన్ని సినిమాకు చక్కగా అమిరాయి. గాంభీరమైన యాసిడ్ బాధితుల సమస్యను తెరపై చూపే క్రమంలో దర్శకురాలు మేఘనా గుల్జార్ అంతగా నాటకీయతకు ప్రాధాన్యమివ్వలేదు. సినిమా ప్రారంభంలో మాలతిపై యాసిడ్ దాడి జరగడం, నిందితుడ్ని పట్టుకోవడం, కేసు కోర్టుకు వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక, కోర్టుల్లో మాలతి చేసిన పోరాటం, యాసిడ్ అమ్మకాలను నిషేధించాలంటూ పిల్ వేయడం, యాసిడ్ దాడి దోషులకు కఠిన శిక్ష విధించేందుకు ప్రత్యేకంగా సెక్షన్ 326ను తీసుకురావడం వంటివి సహజాత్వానికి దగ్గరగా దర్శకురాలు చూపారు. ఈ క్రమంలో చాలా సీన్లు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. యాసిడ్ దాడి బాధితురాలు చనిపోతూ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో చదువుతుంటే ప్రేక్షకులు కదిలిపోవడం ఖాయం. చదవాలి, జీవితంలో ఎదగాలనుకునే అమ్మాయిలు టార్గెట్‌గా యాసిడ్ దాడులు జరుగుతున్నాయని, ఈ ఒక్క దాడితో చిటికెలో (ఛపాక్ అంటే అర్థం ఇదే) వారి ఉనికి, గుర్తింపే నామరూపాలు లేకుండా పోవడం ఎంత విషాదమో చూపిస్తూ.. కేవలం ముఖం మీద దాడి చేశారు కానీ, తమ దృఢసంకల్పం మీద కాదన్న బాధితుల మనోధైర్యాన్ని, పోరాటాన్ని చాటుతూ దర్శకురాలు ‘ఛపాక్’ను తెరమీద ఆవిష్కరించారు. సినిమా స్లోగా అనిపించినా.. మూస సినిమాలకు భిన్నంగా కథలో కొత్తదనం, నిజజీవిత పోరాట స్ఫూర్తి కోరుకునేవారు ఈ సినిమాను చూడవచ్చు. ఇక, సినిమాలో భాగంగా వచ్చే పాటలు కథకు బలాన్ని చేకూర్చడమే కాదు సినిమాకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు బలాలు దీపికా పదుకొనే నటన మేఘనా గుల్జార్ దర్శకత్వం, పాటలు ఒక తీవ్రమైన సమస్యను సెన్సిబుల్‌గా తెరకెక్కించడం బలహీనతలు స్లో నరేషన్ నాటకీయత అంతగా లేకపోవడం - శ్రీకాంత్ కాంటేకర్ -
దీపికకు రణ్వీర్ భావోద్వేగ లేఖ!
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపిక పదుకొనే లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. శుక్రవారం(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిమీయర్ షోకి వెళ్లిన దీపికా భర్త, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ భావోద్వేగానికి లోనవుతూ దీపిక, చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. దర్శకురాలు మేఘనా గుల్జార్‌ను అభినందిస్తూ.. ‘ మేఘనా.. మీ చిత్రం ప్రేక్షకుల్లో.. జీవితంపై ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. సినిమా ద్వారా మంచి, చెడుల మధ్య రంగులు మారే మనిషి మానవత్వాన్ని చూపించారు. యాసిడ్ హింస వల్ల బాధితులు ఎదుర్కొనే కఠిన పరిస్థితులను నిశితంగా చూపించారు. నేను ఖచ్ఛితంగా చెప్పగలను.. రాజి, తల్వార్ల తరువాత ఛపాక్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఓ గొప్ప దర్శకురాలిగా నిలబెడుతుంది’ అంటూ రాసుకొచ్చాడు. అదేవిధంగా దీపికా పదుకొనే గురించి చెబుతూ.. ‘మై బేబీ.. నువ్వు ఈ సినిమా కోసం నిరంతరం కృషి చేశావని చెప్పడానికి నేనే సాక్ష్యం. దీనిని రూపొందించడానికి నువ్వు ఇంజన్‌లా పనిచేశావు.. ‘ఛపాక్’కు నువ్వు ఆత్మ. నీ సినిమా కెరీర్లోనే ఇది అత్యంత ప్రాముఖ్యత ఉన్న చిత్రం. దీని కోసం నువ్వు, నీ టీమ్ భయాలను, సమస్యలను అధిగమించారు. అలాగే పరిస్థితులతో పోరాడి వాటిని అధిగమించి చివరకు నువ్వు, నీ చిత్ర బృందం కలిసి ప్రస్తుతం పరిశ్రమలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించారు’ అంటూ రణ్వీర్, దీపిక, చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. అలాగే ‘ఛపాక్’లో దీపికా పాత్రపై స్పందిస్తూ.. ‘నేను ఊహించిన దాని కంటే అద్భుతంగా నటించి నన్ను కదిలించావు. నీ నటన నన్ను ఆశ్చర్యపరించింది. బలహీనతకు బలాన్ని జోడించి మాల్తి పాత్రకు గౌరవాన్నితెచ్చావు. నేను నీ కంటే గొప్పవాడిని అని ఎన్నడూ గర్వించలేదు... ఐ లవ్ యూ బేబీ’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. కాగా రణ్వీర్ తన తల్లిదండ్రులు, దీపిక తల్లిదండ్రులతో కలిసి ఛపాక్ ప్రీమియర్ షోకు వెళ్లాడు. ఇక ఛపాక్‌కు దీపిక నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. View this post on Instagram Meghna, your film gives the audience hope and courage. It shows you the best and worst of humanity in a kaleidoscopic cinematic spectrum. It elucidates a subject that we’ve only ever heard of but never really fully understood. It offers a definitive and insightful deep-dive into the horrific gamut of acid violence. The story shakes you to your core and then lifts you heroically until your emotions soar. Talvar, Raazi and now Chhapaak..may I say “Bravo!” And “Encore!” ❤️ My baby. I’ve witnessed you toil relentlessly to create this special piece of work. You’ve been an engine behind the project, and are the soul of the film. This is the most important instalment in your body of work. You laboured with such honesty in intent and action. You dug deep and fought through your challenges, faced your fears, overcame your struggles and today you and your team stand triumphant as the creators of one of the films of our times. Your performance is way more than everything I thought it could and would be. It’s moved me, stirred me and stayed with me. You blended strength with vulnerability and lent dignity to an immensely complex portrayal in such a fine manner that I’m simply awestruck at your craft. Its staggering and astonishing what you’ve achieved with Malti. A glowing gem in your repertoire. I love you baby. I’ve never been more proud of you. @deepikapadukone #chhapaak A post shared by Ranveer Singh (@ranveersingh) on Jan 9, 2020 at 7:15am PST -
దీపికాకు ఊరట.. ఛపాక్‌కు కాంగ్రెస్ బంపరాఫర్
భోపాల్ : యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రంలో దీపికా పదుకొనే నటించిన ఛపాక్ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను దీపికా పరామర్శించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆమె జేఎన్‌యూకి వెళ్లిన మరుక్షణం నుంచి సోషల్ మీడియా వేదికపైగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలని పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఛపాక్ సినిమాకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అండగా నిలిచాయి. ఈ సినిమాకు పన్ను పసూలు నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఈ మేరకు మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే ఛత్తీస్‌గఢ్ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ఆమె అభిమానులు రెండు రాష్ట్రాల సీఎంలకు అభినందనలు తెలుపుతున్నాయి. (దీపికపై ట్రోలింగ్.. స్పందించిన కనిమొళి) అయితే పన్ను మినహాయింపు నిర్ణయం మరో కొత్త చర్చకు దారి తీసింది. దీపికా జేఎన్‌యూ వెళ్లడంతో బీజేపీ, ఏబీవీపీకి చెందిన కొందరు ఆమెను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఛపాక్ చిత్రాన్ని బహిష్కరించాలంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రానికి పన్ను మినహాయింపు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆమెకు అండగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో విడుదలకు ముందు ఈ చిత్రం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఛపాక్ శుక్రవారం ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలపై పలు ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. సినియాలోని రాజేష్ పాత్రపై కోర్టుకు వెళతామంటూ బీజేపీ ఎంపీల నుంచి బీజేపీ యువజన కార్యకర్తలు, సానుభూతిపరుల వరకు ట్వీట్ల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. -
దీపికా పదుకొనేపై మరో వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : దీపికా పదుకొనే నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఛపాక్’పై మరో వివాదం చెల రేగింది. ఇందులో దీపిక నటించిన ‘మాలతీ’ పాత్రపై యాసిడ్ పోసిన వ్యక్తిని రాజేష్‌గా, అంటే హిందువుగా చూపించారన్నది కొత్త వివాదం. ఇదే నిజమైతే ఆ సినిమాపై కోర్టుకు వెళతామంటూ బీజేపీ ఎంపీల నుంచి బీజేపీ యువజన కార్యకర్తలు, సానుభూతిపరుల వరకు ట్వీట్ల ద్వారా స్పందించారు. జేఎన్‌యూలో దుండగులు జరిపిన దాడిలో గాయపడిన బాధితులను బుధవారం దీపికా పదుకొనే పరామర్శించడంపై వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన బీజేపీ నాయకులు దీపికా పదుకునే నటించిన ‘ఛపాక్’ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునివ్వడం తెల్సిందే. ఇప్పుడు అదే సినిమాపై ఈ కొత్త వివాదం రాజుకుంది. ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటా బేస్) వెబ్సైట్లో ఇచ్చిన పాత్రల పేర్ల ఆధారంగా దీపికా పాత్రపై యాసిడ్ పోసిన వ్యక్తిని రాజేష్‌గా చూపారన్నది వారి ఆరోపణ. దీనిపై లీగల్ చర్యలకు నోటీసు తయారు చేస్తున్నానని ఇష్కారన్ సింగ్ బండారీ అనే న్యాయవాది ట్వీట్ చేశారు. దీపికా పదుకునేతోపాటు ఆ సినిమా నిర్మాతలకు పంపించేందుకు ఇష్కారన్ లీగల్ నోటీసు తయారు చేస్తున్నారని బండారీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. ‘2005లో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో మాలతీ అనే అమ్మాయిపై నదీమ్ ఖాన్ అనే ముస్లిం యువకుడు యాసిడ్ పోయగా... మాలతీగా దీపికా నటించిన ‘ఛపాక్’ లో నదీమ్ ఖాన్ పేరును రాజేష్‌గా మార్చారు. సెక్యులరిజం స్వరూపాన్ని రక్షించేందుకు ఇలా చేశారు’ అని బీజేపీ హర్యానా ఐటీ సెల్ హెడ్ అరుణ్ యాదవ్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ బీజేపీ యువజన నాయకుడు, పార్టీ జాతీయ మీడియా ఇంచార్జీ రోహిత్ చహాల్ కూడా ఇదే ఆరోపణ చేశారు. నయీమ్ పేరును రాజేష్‌గా మార్చారంటూ బీజేపీ సానూకూల పత్రిక ‘స్వరాజ్య’ కూడా ఆరోపించింది. ‘నదీమ్ పేరును రాజేష్‌గా మార్చడం సెక్యులరిజమా, మీ సెక్కులరిజాన్ని తగలెయ్యా!’ అని నూపుర్ శర్మ అనే మరో బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇంతకు ఏది వాస్తవం? ఒక్క ‘స్వరాజ్య’ పత్రిక తప్పా బీజేపీ నాయకులంతా నయీమ్ ఖాన్ పేరును నదీమ్ ఖాన్‌గా తప్పుగా పేర్కొన్నారు. సినిమాలో మాలతీ అనే అమ్మాయిపై యాసిడ్ పోసిన వ్యక్తిని నయీమ్ లేదా నదీమ్ లేదా రాజేష్‌గా చూపలేదని, బషీర్ ఖాన్‌గా చూపారని సినిమా ప్రివ్యూ చూసిన పలువురు మీడియా రిపోర్టర్లతోపాటు జాతీయ మహిళా కమిషనర్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. రాజేష్ అన్న వ్యక్తి సినిమాలో మాలతీ స్నేహితుడని వారంతా చెప్పారు. అయితే ‘ఛపాక్’ బయోపిక్ చిత్రం అయినప్పుడు నయీమ్ పేరును బషీర్ ఖాన్‌గా మార్చాల్సిన అవసరం లేదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’ వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక ఆ చూపులు మారాలి: హీరోయిన్ లక్ష్మీని ఓదార్చిన దీపిక! వివాదాల్లో ‘ఛపాక్’ సినిమా లీటర్ యాసిడ్‌తో నాపై దాడి చేశాడు అద్దంలో చూసుకొని వణికిపోయింది.. మంచి పనిచేశా: దీపిక భావోద్వేగం ఛపాక్ : కన్నీళ్లు పెట్టుకున్న దీపిక -
పబ్లిసిటీ స్టంట్ అయితే ఏంటి?
న్యూఢిల్లీ: ‘ఇది పబ్లిసిటీ స్టంట్ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతకు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు’ అంటూ బాలీవుడ్ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్ ప్రమోషన్ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్ చేస్తూ.. సినిమాకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. (‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’ ) ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ... ‘ఆయిషీ ఘోష్ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు.. ‘నీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను’ అని చెప్పడం. తన చర్య ఎంతో మందికి ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీపిక.. జేఎన్యూకు వెళ్లడం ద్వారా ఆ భయాన్ని జయించింది. అందుకే తన పేరు మారుమ్రోగిపోతుంది’ అని దీపికపై ప్రశంసలు కురిపించాడు. తను ఇచ్చిన స్పూర్తితో భయంతో విసుగెత్తిపోయిన ప్రజలు... దానిని దాటుకుని ముందుకు సాగుతారని అభిప్రాయపడ్డాడు. (ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు: దీపికకు కేంద్రం అండ) ఇక అనురాగ్ కశ్యప్ సైతం ట్రోలింగ్ బాధితుడన్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూలో దాడిని నిరసిస్తూ.. మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాల ఫోటోను ట్విటర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో దీపిక ఫొటో పెట్టి మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. కాగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దీపిక ఓ నిర్మాతగా వ్యవహరించాన్న సంగతి తెలిసిందే.(ప్రొఫైల్ పిక్ మార్చిన డైరెక్టర్.. ట్రోలింగ్!) -
దీపికపై ట్రోలింగ్.. స్పందించిన కనిమొళి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. బుధవారం జేఎన్యూకు వెళ్లిన కనిమొళి యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనేపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తప్పుబట్టారు. తను చాలా వరకు హిందీ సినిమాలు చూడనని.. కానీ దీపికకు మద్దతుగా ఛపాక్ సినిమాను చూస్తానని చెప్పారు. కాగా, మంగళవారం సాయంత్రం జేఎన్యూకు వెళ్లిన దీపిక.. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దీపికకు థ్యాంక్స్: కంగన భావోద్వేగం
ముంబై: తన అభిప్రాయాలను నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా వెల్లడించే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. బంధుప్రీతిపై విరుచుకుపడే ఈ ఫైర్‌బ్రాండ్.. ఈసారి తోటి హీరోయిన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతకీ విషయమేమిటంటే.. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛపాక్’ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా.. మేఘనా గుల్జార్ రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛపాక్పై స్పందించిన కంగన... ఈ మూవీలో దీపిక నటన తన సోదరి రంగోలిని గుర్తుచేసిందని భావోద్వేగానికి గురయ్యారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ చిత్ర బృందానికి కృతఙ్ఞతలు తెలియజేశారు. (దీపికకు చేదు అనుభవం.. ట్విటర్లో ట్రెండింగ్!) ఈ మేరకు... ‘యాసిడ్ దాడి బాధితుల స్ఫూర్తివంతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న దీపికా పదుకొనె, మేఘనా గుల్జార్, ఛపాక్ చిత్ర బృందం మొత్తానికి.. కంగనా రనౌత్, ఆమె కుటుంబం ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఛపాక్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. నా సోదరి రంగోలి చెందేల్‌కు ఎదురైన అనుభవాలు మరోసారి గుర్తుకువస్తున్నాయి. విపత్కర సమయంలో రంగోలి చూపిన ధైర్యం, కఠిన పరిస్థితుల్లో తను వ్యవహరించిన తీరు నాకెంతగానో స్ఫూర్తినిచ్చింది. తన చిరునవ్వు నన్ను విషాదం నుంచి తేరుకునేలా చేస్తుంది’ అని ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. కాగా కంగనా సోదరి రంగోలిపై గతంలో యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమను నిరాకరించినందన్న కారణంతో ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. యాసిడ్ ధాటికి తన అవయవాలు కరిగిపోవడంతో వాటి కోసం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే 54 సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పటికీ డాక్టర్లు రంగోలి చెవి భాగాన్ని మాత్రం పునర్నిర్మించలేకపోయారు. ఈ విషయాల గురించి రంగోలి గతంలో అభిమానులతో పంచుకున్నారు. ఇక కంగన నటించిన తాజా చిత్రం.. ‘పంగా’ విడుదలకు సిద్ధంగా ఉంది. కబడ్డీ క్రీడా నేపథ్యంలోజనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌పై దీపిక కూడా ప్రశంసలు కురిపించడం విశేషం. కాగా జేఎన్‌యూలో విద్యార్థులకు పరామర్శించినందుకు గానూ దీపికను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలి... కంగనా సినిమా పంగాను ప్రోత్సహించాలి’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా వీడియో విడుదల చేయడం ద్వారా అలాంటి వారికి గట్టి కౌంటర్ ఇచ్చారంటూ మరికొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.(ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్) View this post on Instagram Kangana Ranaut and family would like to thank @deepikapadukone, @meghnagulzar and the entire team of #chhapaak for their incredible feat in bringing stories of acid attack victims to the forefront. A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Jan 7, 2020 at 9:17pm PST -
‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె నటించిన తాజా సినిమా ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ అధిక సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో #boycottchhapak అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీని దీపిక మంగళవారం సందర్శించిన విషయం తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. విద్యార్థులతో భేటీ అయ్యారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తన సినిమా ప్రచారం కోసం దీపిక నీచానికి దిగజారిందని.. దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. (వాళ్లను చూస్తే గర్వంగా ఉంది: దీపిక ) ‘కన్హయ్య కుమార్, ఆయిషీ ఘోష్ వంటి వారికి దీపిక మద్దతు తెలిపింది. మరి దాడిలో గాయపడిన ఏబీవీపీ వాళ్ల సంగతేంటి. నకిలీ ఫెమినిజంతో దీపిక ఎన్నాళ్లు నెట్టుకువస్తావు. ఛీ.. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముంది. దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదువుకోవాలని తపిస్తున్నారు. వాళ్ల కోసం నీ విలువైన సమయాన్ని కేటాయించవచ్చు కదా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక దీపిక అభిమానులు సైతం.. ‘నాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే నా ఫేవరెట్ హీరోయిన్ అయినా.. మరెవరైనా. అయితే దీపిక లాంటి సినిమా హీరోయిన్ కోసం కాకపోయినా.. నిజమైన హీరో లక్ష్మీ అగర్వాల్ కోసం ఈ సినిమా చూడాలి’ అని ఆమె తీరును తప్పుబడుతున్నారు.(‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు) ఇంకొంత మంది మాత్రం...‘ దీపికా సినిమాలను అడ్డుకోవాలని చూసిన ప్రతీసారి... ఆమె రేంజ్ అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సినిమాల వసూళ్లు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు ఛపాక్ కూడా అదే స్థాయిలో రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఆమె నిజమైన హీరో’ అంటూ దీపికకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో #boycottchhapak ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఛపాక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీపిక తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. #boycottchhapaak#boycottChhapaak Cheap Publicity Stunt. #boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapak pic.twitter.com/CAOCm5yZ68 — Neeraj kumar (@KumarNe31356548) January 8, 2020 1. Make a film based on a social issue 2. Try 2 market it by showing concern towards d issue 3. If it dsn't work, find a problem in d country 4. Take a stand (w/o uttering a word), 2 gain (negative) publicity 5. Increase ur viewership n make money 6. Go to step 1 #boycottChhapaak pic.twitter.com/OCNZE4WSHG — Vinita Hindustani🇮🇳 (@Being_Vinita) January 8, 2020 Cancelled booking. .#boycottChhapaak @deepikapadukone #BoycottChhapaak pic.twitter.com/gl3snHWNrn — Me (@Manjuna76120410) January 8, 2020 #DeepikaPadukone I applaud your commitment...and your courage! You are a HERO!! 👍👏😇🙏🇮🇳 — Simi Garewal (@Simi_Garewal) January 7, 2020 -
వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక
న్యూఢిల్లీ: తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం కోసం ప్రజలు వీధుల్లోకి రావడం బాగుందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అన్నారు. దేశం గురించి.. దేశ భవిష్యత్తు గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించడం మంచి విషయమని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రజలకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వారికి సంఘీభావం తెలుపుతున్నారు. అదే విధంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులపై ముసుగు దుండగుల దాడిని బీ-టౌన్ తీవ్రంగా ఖండించింది.(జేఎన్‌యూలో దీపిక) ఈ నేపథ్యంలో దీపిక ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ ఒక్కొరు భావాలను నిర్భయంగా పంచుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. తాము నమ్మిన సిద్ధాంతానికి నేటి యువత కట్టుబడి ఉండటం ముచ్చట గొలుపుతుందన్నారు. తమ గళం వినిపించడం కోసం ప్రజలు బయటికి రావడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. ఇక దీపిక పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. దాదాపు 10 నిమిషాల పాటు క్యాంపస్‌లో ఉన్నారు. దాదాపు 7.40 గంటలకు క్యాంపస్‌లోకి వచ్చిన ఆమె.. అక్కడ జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే, విద్యార్థులనుద్దేశించి దీపిక ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. కాగా దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛపాక్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక.. ‘ఛపాక్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ.. దీపిక విద్యార్థుల కోసం తన సమయాన్ని కేటాయించడం విశేషం.(ఆ చూపులు మారాలి: హీరోయిన్) -
‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు
-
ఆ చూపులు మారాలి: హీరోయిన్
ముంబై: సాటి మనుషులను చూసే విధానం మారాలి అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దీపిక మాల్తీగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఛపాక్‌తో తొలిసారిగా నిర్మాత అవతారమెత్తిన దీపిక... రియాలిటీ షోలకు హాజరవుతూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఛపాక్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యాసిడ్ దాడి బాధితులతో కలిసి ’ఛపాక్’సోషల్ ఎక్స్పెరిమెంట్ పేరిట దీపిక ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. మాల్తీ మాదిరి మేకప్ చేసుకుని... యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరును కళ్లారా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దీపిక.. ‘ ఇలా ఓ రోజంతా గడిపిన తర్వాత.. కొన్ని నిజాలు మన ముందే ఉన్నా.. మనం వాటిని గుర్తించలేము. ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. చూసే చూపుల్లో మార్పు రావాలి అని పేర్కొన్నారు. ఇక దీపిక షేర్ చేసిన వీడియోలో.. కొంతమంది యాసిడ్ బాధితులను ప్రేమ పూర్వకంగా పలకరించగా.. మరికొంత మంది మాత్రం వారిని వికారంగా చూసి చూపులు తిప్పుకోవడం గమనార్హం. -
సల్మాన్‌తో సై అంటున్న స్టార్ హీరోయిన్
ముంబై : ‘ఛపాక్’ సినిమా ప్రమోషన్లో బిజీబిజీ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టేందుకు సిద్ధం అంటున్నారు. సరైన కథ లభిస్తే సల్లూ భాయ్‌తో సినిమా చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. తామిద్దం కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారనీ, తనకు కూడా ఆయనతో నటించాలని ఇష్టంగా ఉందని దీపికా వెల్లడించారు. కండల వీరుడి ‘హమ్ దిల్ దే చుకే సనం’ సినిమా అంటే తనకెంతో ఇష్టమని దీపికా పేర్కొన్నారు. అయితే, సల్మాన్ ఇదివరకు చేయని పాత్రల్లో నటిస్తే చూడాలని ఉందని ఈ ఛపాక్ హీరోయిన్ అన్నారు. అన్నిటీకి కథే ముఖ్యమని చెప్పుకొచ్చారు. (చదవండి : మీరు పర్మిషన్ ఇస్తే ప్లాన్ చేసుకుంటాం..) మరి‘ఛపాక్’ ప్రమోషన్ కోసం సల్మాన్ హోస్ట్‌గా వ్యవరిస్తున్న బిగ్‌బాస్ షోకు వెళ్తారా అన్న ప్రశ్నకు.. ‘బిగ్‌బాస్ షోకు వెళ్లడం లేదు. అలాంటివేం అనుకోలేదు’అని దీపికా బదులిచ్చారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛపాక్’ వచ్చే శుక్రవారం (జనవరి 10) విడుదలవనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు శకున్ బత్రా దర్శకత్వంలో గల్లీ భాయ్ ఫేం సిద్ధాంత్ చతుర్వేదీ, అనన్య పాండేతో కలిసి చేయబోయే సినిమా మార్చిలో ప్రారంభమవుతుందని దీపికా తెలిపారు. (చదవండి : లక్ష్మీతో కలిసి దీపిక టిక్‌టాక్ వీడియో!) -
ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నానా: హీరోయిన్ ఫైర్
ముంబై: ‘నేను గర్భవతిలా కనిపిస్తున్నానా’ అంటూ బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫైర్ అయ్యారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘చపాక్’ సినిమా ప్రమోషన్లలో దీపిక బిజీగా ఉన్నారు. పలు రియాలిటీ షోలు, కార్యక్రమాలకు హాజరవుతూ అభిమానులతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా చపాక్తో పాటు తన తదుపరి సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఆదివారం నాటి ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ.. ‘షకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం అవుతుంది. ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. అయితే 2021, ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్ షోలో చపాక్‌ను ప్రమోట్ చేస్తారా అని విలేకరులు అడుగగా.. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో ఎలాంటి చర్చ జరగలేదన్నారు.(వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు) ఈ విధంగా దీపిక తన మూవీ బిజీ షెడ్యూల్ గురించి ఓపికగా వివరిస్తుండగా.. ‘మీరు గర్భవతట కదా’ అంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా... ‘ ఏంటీ నేను ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నానా? నేనెప్పుడు తల్లిని కావాలో మీరే చెప్పండి. మీరు అనుమతి ఇస్తేనే మేం పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ నిజంగా గర్భవతిని అయితే దాచాల్సింది ఏముంటుంది. అందరికీ కనపడుతుంది కదా’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా గతేడాది రణ్వీర్ సింగ్‌తో దీపిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తల్లికాబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా బీ- టౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ఖండించిన దీపిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించి, నిర్మాతగా వ్యవహరించిన చపాక్ సినిమా జనవరి 10 విడుదల కానుంది. -
వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు
లక్నో : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నిన్న(ఆదివారం) తన పుట్టినరోజును వేడుకగా జరుపుకున్నారు. ఈ రోజుతో దీపికా 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఇటు బాలీవుడ్ ఇండస్టీతోపాటు అటు ప్రముఖుల నుంచి దీపికాకు భర్త్‌డే విషెస్ హోరెత్తాయి. కత్రినా కైఫ్, అలియాభట్, మాధురి దీక్షిత్, తమన్నా బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇంతటి ఆనంద రోజును దీపికా ఇంకా ప్రత్యేకం చేసుకున్నారు. తన పుట్టిన రోజును లక్నోలో యాసిడ్ దాడిలో గాయపడిన మహిళల సమక్షంలో జరుపుకున్నారు. ఈ వేడుకలో భర్త రణ్వీర్, విక్రాంత్ మాసే తప్ప బాలీవుడ్ తారలు ఎవ్వరూ లేకపోవడం విశేషం. భర్త రణ్వీర్, ఛపాక్ నటుడు విక్రాంత్ మాసే, లక్ష్మీ అగర్వాలోపాటు యాసిడ్ బాధితులతో కలిసి దీపికా కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు. బర్త్‌డేకు సంబంధించిన ఫోటోలు లక్ష్మీ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే పార్టీలో దీపికా కేకు కట్ చేసిన వీడియోను ఓ అభిమాని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వేడుకలో దీపికా తన రాబోయే చిత్రం ఛపాక్‌ను ప్రమోట్ చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకలకు ఆదివారం ఉదయమే దీపికా, రణ్వీర్ లక్నోకు చేరుకున్నారు. దీనికి ముందు ముంబై ఎయిర్‌పోర్టులో అభిమానులు తీసుకు వచ్చిన కేకును దీపికా కట్ చేశారు. కాగా ప్రస్తుతం ఛపాక్ సినిమా ప్రమోషన్లలో దీపికా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షించడానికి పలు ప్రోగ్రామ్స్‌లో, రియాల్టీ షోలో ఆమె పాల్గొంటున్నారు. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది View this post on Instagram Best morning khas morning ❤️ Good morning ❤️ With my Loves @pihu_she @deepikapadukone ❣️ A post shared by Laxmi Agarwal (@thelaxmiagarwal) on Jan 5, 2020 at 5:44pm PST View this post on Instagram #deepikapadukone celeberates her birthday in Lucknow today with actual acid victim survivors. What a unique way to celebrate this special day ❤ #ranveersingh #laxmiagarwal #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Jan 5, 2020 at 11:01am PST -
లక్ష్మీని ఓదార్చిన దీపిక!
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా... బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛపాక్’. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ముంబైలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ భావోద్యేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. అలాగే ఈ కార్యక్రమంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, 2005లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్’ చిత్రాన్ని దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాల్తీ పాత్రలో దీపిక లీడ్ రోల్ చేస్తున్నారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇది కేవలం లక్ష్మీ బయోపిక్ మాత్రమే కాదు. ఆమె ప్రయాణం, పోరాటం, విజయం, మానవ ఆత్మకథ’ అంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘ఛపాక్’ సినిమాను ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు దీపిక నిర్మాతగా కూడా వ్యవహరించారు. View this post on Instagram #LaxmiAgarwal & #DeepikaPadukone get emotional as #shankarmahadevan sings the title track of #Chhapaak #ManavManglani #friday A post shared by Manav Manglani (@manav.manglani) on Jan 2, 2020 at 11:23pm PST -
చిన్ననాటి ఫోటో.. మీసంతో దీపికా
ముంబై : ఛపాక్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే. తాజాగా తన అభిమానులందరికీ దీపికా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఏముంది అందరూ చెప్తారు కదా అనుకుంటున్నారా. కాకపోతే దీపికా కాస్తా భిన్నంగాతన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ విషెస్ చెప్పారు. ‘ప్రతి ఆలోచనలో, పనిలో స్పష్టత కలిగి ఉండాలి. హ్యాపీ 2020’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఫోటోను చూస్తుంటే దీపికా చదువుకునే రోజుల్లో స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఒకటిగా తెలుస్తోంది. ఇందులో దీపికా మీసంతో.. తెలుపురంగు చీరలో కనిపిస్తోంది. ఇక దీపికా తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతక ముందు కూడా తన చైల్డ్ హుడ్కు సంబంధించిన అనేక ఫోటోలను పంచుకున్నారు. తన స్నేహితులు దివ్య నారాయణ్, స్నేహ రామచంద్రన్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇక 2018లో విడుదలైన పద్మావత్ చిత్రంలో చివరిగా నటించారు దీపికా. తాజాగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో రూపోందుతున్న ‘ఛపాక్’ మూవీలో నటించగా ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. View this post on Instagram May you always have clarity of thought & action...Happy #2020!🎉 A post shared by Deepika Padukone (@deepikapadukone) on Jan 1, 2020 at 1:41am PST View this post on Instagram cannot wait for these two munchkins!!!❤️ @divya_narayan4 @sneha_ramachander A post shared by Deepika Padukone (@deepikapadukone) on Dec 8, 2019 at 8:55am PST View this post on Instagram post diwali celebrations...💤 #diwali A post shared by Deepika Padukone (@deepikapadukone) on Nov 3, 2019 at 12:34am PDT -
‘దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం’
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే తాజాగా నటిస్తున్న చిత్రం ఛపాక్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా దీపిక ఓ ప్రఖ్యాత టీవీ షోకు హాజరయ్యారు. ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ హిమేశ్ రష్మియాతో కలిసి దీపిక సందడి చేశారు. దీపిక తొలిసారిగా హిమేశ్ రష్మియాతో కలిసి నామ్ హై తేరా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అందులో హిమేశ్ పాడుతూ ఉంటే దీపిక వెనకాల డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటుంది. సరిగ్గా పదమూడేళ్ల తర్వాత తిరిగి స్టేజీపై హిమేశ్ మళ్లీ ఆ పాటను ఆలపించగా దీపిక కాళ్లు కదిపారు. అనంతరం దీపికతో కలిసి దిగిన ఫొటోను హిమేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఛపాక్ సినిమాతో దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం. ఆమె ఎంతో తెలివైనది, నామ్ హై తేరా నుంచి ఛపాక్ వరకు ఎంతో కష్టపడింది. ఆమెను చూసి గర్వపడుతున్నాను. దర్శకురాలు మేఘనా గుల్జార్‌కు హ్యాట్సాఫ్. ట్రైలర్ ఎంతో బాగుంది. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నాడు. కాగా ‘ఛపాక్’ జనవరి 10న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ఎలాంటి కోతలు లేకుండా యు సర్టిఫికెట్ అందుకుంది. భయంకరమైన యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఛపాక్: ధైర్య ప్రదాతలు View this post on Instagram Deepika is going to take the national award and every award of the country for chhapaak , she is historic , from naam hai tera to chapaak , so proud of her , super talent she is , truely blessed , Hats of to Meghna Gulzar , loved the trailer , looking forward to the film , Watch Indian idol sat sunday , amazing talent , amazing show , cheers A post shared by Himesh Reshammiya (@realhimesh) on Dec 29, 2019 at 11:06pm PST -
మంచి పనిచేశా: దీపిక భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ భామ దీపికా పదుకొనే.. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘చపాక్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ప్రముఖ చానల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ షో కంటెస్టెంట్లు దీపికను సర్ప్రైజ్ చేశారు. దీపిక నటించిన సినిమాల్లో హిట్‌గా నిలిచిన పాటలకు.. ఆమె స్టైల్లోనే డ్యాన్స్ చేసి తనకు మధురానుభూతులను మిగిల్చారు. చెన్నై ఎక్స్‌ప్రెస్, బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాల్లోని దీపిక పాటలకు నర్తించి ఆమెపై అభిమానాన్ని చాటుకున్నారు. వారి ప్రేమకు పొంగిపోయిన దీపిక భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపై కన్నీళ్లు పెట్టుకుని.. వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ... ‘ నా సినీ ప్రస్థానం గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. పనిచేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అయితే ఈరోజు నా సినీ ప్రయాణాన్ని కళ్లారా చూసే అవకాశం దక్కింది. అందరికీ వినోదాన్ని అందించే రంగంలోకి వచ్చి మంచి పనిచేశాను అనిపిస్తుంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాతో తెరంగేట్రం చేసిన దీపిక.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో డిప్రెషన్‌కు లోనైనప్పటికీ తిరిగి తేరకుని కెరీర్‌పై దృష్టిసారించారు. హాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. (తను వణికిపోయింది.. చపాక్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక గతేడాది తన చిరకాల స్నేహితుడు రణ్వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం యాసిడ్ బాధితురాలి పాత్రలో చపాక్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో దీపిక నిర్మాతగా అవతారం ఎత్తారు. View this post on Instagram by the contestants of Dance Plus 😭😭🥺🥺❤️❤️ #DeepikaPadukone A post shared by Deepika Padukone Fanpage 🔹 (@deepika.padukone.fanpage) on Dec 26, 2019 at 3:57am PST -
వివాదాల్లో ‘ఛపాక్’ సినిమా
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే తాజాగా నటించిన ‘ఛపాక్’ చిత్రం వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ సినిమా కథ తన దగ్గర నుంచి కాపీ కొట్టారని, తనకు న్యాయం చేయాలంటూ రాకేశ్ భర్తీ అనే రచయిత కోర్టును ఆశ్రయించాడు. చపాక్ చిత్ర రచయితల్లో తనను ఒకరిగా గుర్తించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. యాసిడ్ బాధితురాలి కథను మొదట తాను రాసానని చెప్పుకొచ్చాడు. దీనికోసం నటీనటులను సంప్రదించగా పలువురు అందులో నటించడానికి ఆసక్తి కనబర్చారని పేర్కొన్నాడు. ‘బ్లాక్ డే’ పేరుతో సినిమాను కూడా రిజిస్టర్ చేసుకున్నానని తెలిపాడు. అయితే పలు కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఇంకా మొదలుపెట్టలేదన్నాడు. అయితే తాను రాసుకున్న కథను యథాతథంగా ఛపాక్‌లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఛపాక్ చిత్ర రచయితగా తనకు గుర్తింపు ఇచ్చేవరకు సినిమాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరాడు. ఈ విషయం గురించి మొదట చిత్ర నిర్మాతలను సంప్రదించినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రానందునే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని రాకేశ్ పేర్కొన్నాడు. ఇక ఈ వివాదంపై ఛపాక్ యూనిట్ ఇంతవరకూ స్పందిచలేదు. కాగా యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. -
వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న దీపిక