Devendra Fadnavis
-
బీజేపీతో భేటీకి గౌతమ్ అదానీ హాజరు..?: ఫడ్నవీస్ క్లారిటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి ముదురుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడానికి అదానీయే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంతేగాక 2019లో అదానీ తన ఢిల్లీ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరారని శరర్ పవార్ ఆరోపించారు. ఈ సమావేశానికి తనతోపాటు, అమిత్ షా, తన మేనల్లుడు అజిత్ పవార్, అదానీ హాజరైనట్లు తెలిపారు.అయితే ఆ ఆరోపణలను తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. గౌతమ్ అదానీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో అదానీ తమ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఫడ్నవీస్, అమిత్ షాలతో సహా బీజేపీ అగ్రనేతలు, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్సీపీకి చెందిన నేతలంతా అదానీ ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన చర్చల్లో భాగమయ్యారని అజిత్ పవార్ కూడా ఆరోపించారు. -
మహా ప్రభుత్వంలో విభేదాలు.. అజిత్ పవార్ Vs ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు భయపడుతున్నాయి. ఇటీవల హర్యానా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అనే నినాదం చేశారు.ఈ నినాదాన్ని మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి అన్వయించడాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఘండ్, ఇతర రాష్ట్రాల్లో ఈ నినాదం పనిచేస్తుందేమో కానీ..మహారాష్ట్రలో పనిచేయదని వ్యాఖ్యానించారు.దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్ధం చేసుకోవాలని సూచించారు. అజిత్ పవార్ దశాబ్దాలుగా లౌకిక, హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతోనే ఉన్నారు. సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారిలో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడమే లౌకికవాదమని భావించే వ్యక్తులతో ఆయన కొనసాగుతూ వచ్చారు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికినాయనకు కొంత సమయం పడుతుంది’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.గతంలో మాతో కలిసున్నవారు (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) దీనిని అర్ధం చేసుకోలేరని విమర్శించారు. ‘ఈ వ్యక్తులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేరు లేదా ఈ నినాదం అర్థం చేసుకోలేరు లేదా మాట్లాడేటప్పుడు వారు వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు’ అని మండిపడ్డారు. మరోవైపు ఫడ్నవీస్‌తోపాటు ప్రముఖ బీజేపీ నాయకులు పంకజా ముంబే, అశోక్ చవాన్ కూడా ఈ నినాదాన్ని విభేదించారు. దీంతో మోదీ ఈ నినాదాన్ని ‘ఏక్ హై తో సేఫ్ హై’గా మార్చారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో గురువారం నాటి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చశనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
ఫడ్నవీస్‌పై ఇజ్రాయెల్ దాడికి ప్లాన్ చేస్తోందా?.. సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నీవీస్‌కు భద్రత పెంచడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఫడ్నవీస్ మీద ఇప్పుడేమైనా ఇజ్రాయెల్ లేదా లెబనాన్ దాడికి దిగుతున్నాయా? అని ప్రశ్నించారు.మహారాష్ట్రలో ఎన్నికల వేళ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు అదనపు భద్రత పెంచుతున్నారనే సమాచారం వచ్చింది. ఫడ్నవీస్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. ఆయన కోసం అదనపు ఫోర్స్ వన్ కమాండోలను నాగపూర్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ భద్రతపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు.ఈ సందర్బంగా రౌత్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు ఆకస్మికంగా భద్రతను పెంచడానికి కారణం ఏంటి?. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. తన కోసం భద్రతను పెంచుకోవడం ఏంటి?. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?. ఫడ్నవీస్ నివాసం వెలుపల ఫోర్స్ కమాండోలు నిలబడి ఉన్నారు. నాగపూర్ మరో 200 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు అంత భయపడుతున్నారు. ఆయనపై దాడి జరగబోతోందా..? అలా ఎవరు చేయాలనుకుంటున్నారు..? ఇజ్రాయెల్ లేదా లెబనాన్ ఏమైనా ఆయనపై దాడికి దిగుతున్నాయా..? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో భద్రతను పెంచడంపై ఫడ్నవీస్, డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దవ్థ్రాకే శివసేన వర్గం పట్టుదలతో ప్రచారంలో బిజీ ఉంది. #WATCH | Mumbai: Shiv Sena (UBT) Sanjay Raut says "The Home Minister of this state, who is a former Chief Minister (Devendra Fadnavis), has suddenly increased his security. The Home Minister gives security to others but he increased his own security. Suddenly we saw Force One… pic.twitter.com/yvDaJwNBIp— ANI (@ANI) November 3, 2024 -
మాహింలో ఎమ్మెన్నెస్‌కే మద్దతు
ముంబై: ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు, మాహిం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెన్నెస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మాహిం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వడంపై బీజేపీ, సీఎం శిందే ఏకాభిప్రాయంతో ఉన్నారని ఫడ్నవీస్ తెలిపారు. మాహింలో శివసేన(శిందే)నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ , శివసేన(యూబీటీ) అభ్యర్థిగా మహేష్ సావంత్, అమిత్ ఠాక్రేతో తలపడనున్నారు శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ సంప్రదాయ ఓటర్లు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మారతారని వాదించడంతో దీంతో బీజేపీ, శిందే వర్గం అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలో దింపేందుకు అంగీకరించింది. మహాయుతి కూటమి మిత్రపక్షమైన శివసేన(శిందే) కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫడ్నవీస్ తెలిపారు.చాలా మంది రెబెల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా పార్టీ వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందని, అయితే కొన్ని స్థానాల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ తప్పదని వెల్లడించారు. రాజ్ ఠాక్రే సారథ్యం లోని ఎమ్మెన్నెస్ మహాయుతిలో భాగం కానప్పటికీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అధికార కూటమికి మద్దతు ఇచ్చింది. మాహిం 1966లో అవిభక్త శివసేన పుట్టుకకు సాక్షీభూతంగా నిలిచిన ప్రాంతం. అనంతరం 2006లో ఎమ్మెన్నెస్ పార్టీ ప్రకటన కూడా ఇక్కడినుంచే జరిగింది. ‘అజిత్ పవార్–ఆర్.ఆర్.పాటిల్’పై నో కామెంట్..రాష్ట్రంలోని ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుబాటుదారుల సవాళ్లను ఎదుర్కొంటోందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.ముఖ్యంగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం తన ఒకప్పటి సహచరుడు,అప్పటి హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ తనను వెన్నుపోటు పొడిచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల కుంభకోణానికి పాల్పడ్డారంటూ తనపై బహిరంగ విచారణ కోరారని తెలిపారు. 2014లో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ పాటిల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫైల్‌ను తనకు చూపించారని పవార్ పేర్కొన్నారు. పవార్ ప్రకటనపై ఫడ్నవీస్ స్పందన ఏమిటని ప్రశి్నంచగా ని అడగ్గా, ‘కాంగ్రెస్, అలాగే అప్పటి అవిభక్త నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అజిత్ పవార్‌పై దర్యాప్తు ప్రారంభించిన మాట వాస్తవమేనని కానీ ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి నేనెలాంటి వ్యాఖ్యలూ చేయనని బదులిచ్చారు. -
సమతా పథంలో సాగాలంటే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది. నిజానికి ఆర్ఎస్ఎస్కు, విశ్వహిందూ పరిషత్‌కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్‌లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే. ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది. ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్ఎస్ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది. అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు. ఆయన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మహారాష్ట్ర పోల్స్.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఆదివారం(అక్టోబర్20) విడుదల చేసింది.99 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.ఈ జాబితాలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. ఫడ్నవిస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే కామఠీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. శివసేన,ఎన్సీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గాలకు నవంబరు 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: వయనాడ్ ఎవరిది..? నవ్య వర్సెస్ ప్రియాంక -
సీఎం అభ్యర్థిపై ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి చేపట్టబోయేది ఎవరో బీజేపీ కీలక నేత,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హింట్ ఇచ్చారు. శివసేనకు చెందిన వ్యక్తే తమ కూటమి తరపునన సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. బుధవారం(అక్టోబర్16) ముంబయిలో ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్డు కార్డు విడుదల చేస్తూ ఫడ్నవిస్ మాట్లాడారు. తమ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారని,దమ్ముంటే మహావికాస్అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు సవాల్ విసిరారు. మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు. మా సీఎం ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం లేదు. శరద్‌పవార్‌కు సవాల్ విసురుతున్నా. ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండి’అని ఫడ్నవిస్ శరద్‌పవార్‌ను కోరారు. కాగా, ఎన్డీఏ కూటమిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: షిండే సీఎం కాదు.. కాంట్రాక్టర్ మంత్రి -
నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్
ముంబై : బద్లాపుర్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడు అక్షయ్ షిండేది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్ని మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. నిందితులు పోలీసులపై కాల్పులు జరుపుతుంటుంటే చప్పట్లు కొట్టరు కదా అని ప్రశ్నించారు.విపక్షాలు చేస్తున్న విమర్శలపై దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. బద్లాపుర్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిని నుంచి ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు ఫడ్నవిస్ స్పష్టం చేశారు. అయితే ‘తాను ఎన్కౌంటర్లకు పూర్తి వ్యతిరేకమన్న ఫడ్నవీస్.. నిందితులు దాడులు చేస్తే పోలీసులు చప్పట్లు కొట్టరు’ కదా అని అన్నారు.పోలీసులపై అక్షయ్ షిండే దాడికి యత్నంబద్లాపుర్ పాఠశాలలో చిన్నారులపై లైంగిక దాడి ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో నిందితుడు అక్షయ్ షిండేపై అతడి మొదటి భార్య ఫిర్యాదు చేసింది.ఆ ఫిర్యాదుతో విచారించేందుకు నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపుర్‌కు పోలీసులు బయలుదేరారు. ముంబ్రా బైపాస్కు చేరుకున్న సమయంలో పోలీసు వాహనంలో ఉన్న నిందితుడు అక్షయ్ షిండే తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించాడు. పోలీసులుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఫడ్నవీస్‌ను కీర్తిస్తూ.. ఆ ఘటన తర్వాత ముంబైలోని పలు ప్రాంతాల్లో ఫడ్నవీస్‌ను అభినందిస్తూ హోర్డింగ్‌లు వెలిశాయి. ఈ హోర్డింగ్‌లలో ఫడ్నవీస్ తుపాకీని పట్టుకుని ఉండగా.. అందులో బద్లా పురా (ప్రతీకారం పూర్తి) అనే క్యాప్ష్ను జోడించారు. హోర్డింగ్‌లపై గురించి ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా..ఇలాంటి హోర్డింగ్‌లు పెట్టడం పూర్తిగా తప్పు. ఇలా హోర్డింగ్‌లు పెట్టకూడదు అని డిప్యూటీ సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. -
ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం.. 4000 మందికి ఉద్యోగావకాశాలు
బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' మహారాష్ట్రలో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం సంస్థ ఏకంగా రూ. 2000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.బిడ్కిన్, ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (AURIC)లో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. బ్యాటరీలను కూడా తయారు చేయనున్నట్లు ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.ఏథర్ ఎనర్జీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడిగా దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏటా 10లక్షల కంటే ఎక్కువ వాహనాలను, బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఇందులో ఒకటి బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి వాహనాల అసెంబ్లింగ్ కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న కంపెనీ ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 4.3 లక్షల బ్యాటరీ ప్యాక్‌లు & 4.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు.మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ బ్రాండ్ వాహనాలను విరివిగా ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వేగంగా డెలివరీ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్ & సిటీఓ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.Big investment in Maharashtra in automotive sector!Welcome to Maharashtra, Ather !Just got done with a meeting with the Founder of Ather Energy, Shri Swapnil Jain and I’m glad to share that he informed about their great decision that Ather Energy, the leading electric scooter… pic.twitter.com/Hc8EeaDdM6— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 26, 2024 -
డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా.. ఫడ్నవీస్ యూటర్న్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీ కూటమికి తక్కువ సీట్లు రావడంపై నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎంగా వైదొలగాలని ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా తన నిర్ణయంపై ఫడ్నవీస్ యూటర్న్ తీసుకున్నారు.రాజీనామా విషయంలో తన ఆలోచన మార్చుకున్నట్లు చెప్పారు. పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఫడ్నవీస్ రాజీనామా విషయం తెలుసుకున్న అమిత్ షా.. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని కోరిన మరుసటి రోజే ఫడ్నవీస్ నుంచి తాజా ప్రకటన వచ్చింది.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అందరి ముఖాల్లో సంతక్షషం కనిపిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మార్పోగుతోందన్నారు. మూడో సారి ప్రధానిగా ఎన్డీయే మోదీ పేరును ఏకగ్రీవంగా అంగీకరించిందని తెలిపారు. ఈసారి మహారాష్ట్రలో తాము ఆశించిన సీట్లు గెలుచుకోలేకపోయినట్లు చెప్పారు. కానీ నేటి సమావేశంతో భవిష్యత్తు వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీకి నేనే నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే కారణమని భావిస్తున్నాను. అందుకే నన్ను పదవి నుంచి తప్పించాలని కోరాను. దీనివల్ల త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్ర స్థాయి నుంచి పని చేయొచ్చు. కానీ కొందరు నాపై విశ్వాసం చూపించారు. ఫలితాలతో నేను నిరాశ చెందాను అని కొందరు అనుకున్నారు, కానీ నేను పారిపోను. మా స్ఫూర్తి ఛత్రపతి శివాజీ. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోలేదు, నా దృష్టిలో వ్యూహం ఉంది.కాగా శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో ఫడ్నవిస్ సమావేశమయ్యారు. అక్టోబరులో జరిగే అవకాశం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలనిి ఫడ్నవీస్‌ను షా కోరినట్లు తెలిసింది. -
డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటా: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కూటమి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని తెలియజేయనుట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోనే విషయంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇక నుంచి కేవలం పార్టీ కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించారు.కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయం చెందడంతో ఫడ్నవీస్ రాజీనామా నిర్ణయం తెరమీదకొచ్చింది. 2019 ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను సొంతం చేసుకున్న కాషాయ పార్టీ.. ఈసారి కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే 14 స్థానాలను చేజార్చుకుంది. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ సీట్లకు కోత పడటంలో యూపీ, మహారాష్ట్రనే ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేవలం 240 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇది మెజార్టీ మార్కుకు(272) 32 స్థానాలు తక్కువ కావడం గమనార్హం.ఇక 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించింది. ఉద్దవ్ వర్గం శివసేన 9 స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 9 స్థానాల్లో, శివసేన(ఏక్నాథ్ షిండే)7 చోట్ల, ఎన్సీపీ( అజిత్ పవార్) ఒక చోట విజయం సాధించింది. ఓ స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. -
రెండో లిస్ట్‌లో అయినా గడ్కరీ పేరు ఉంటుందా?
Nitin Gadkari : మహారాష్ట్రలో అధికార కూటమి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మొదటి స్థానంలో ఉంటుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడం తెలిసిందే. నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుండి గడ్కరీకి లోక్‌సభ టిక్కెట్‌ను ఆఫర్ చేయడంపై విరుచుకుపడ్డారు. "గడ్కరీ మా ప్రముఖ నాయకుడు. ఆయన నాగ్‌పూర్ నుండి పోటీ చేస్తారు. అభ్యర్థుల (బీజేపీ) మొదటి జాబితా విడుదలైనప్పుడు మహాయుతి భాగస్వాముల మధ్య (బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ) చర్చలు జరగలేదు. ఈ చర్చలు పూర్తవ్వగానే గడ్కరీ పేరే ముందుగా (అభ్యర్థుల జాబితాలో) వస్తుంది" అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. "ఉద్ధవ్ థాకరే సొంత పార్టీనే చితికిపోయింది. గడ్కరీ వంటి జాతీయ స్థాయి నాయకుడికి అటువంటి పార్టీ అధినేత ఆఫర్ ఇవ్వడం అనేది స్థాయిలేని వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని ఆఫర్ చేయడం లాంటిది" అన్నారు. కాగా గురువారం జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ నితిన్ గడ్కరీ మహారాష్ట్ర పౌరుషాన్ని చూపించాలని, ఢిల్లీ ముందు తల వంచేందుకు బదులుగా రాజీనామా చేయాలని అన్నారు. తాము ఆయన్ను ఎంవీఏ తరఫున అభ్యర్థిగా ఎన్నుకుంటామని థాకరే చెప్పారు. -
రూ.150 ఖర్చుతో 300 కిమీ ప్రయాణం.. కొత్త కారుతో సత్తా చాటిన రైతుబిడ్డ!
గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' (Devendra Fadnavis) ఈ కారుని వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు ప్రత్యేకమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంత గొప్ప కారుని తయారు చేసిన నక్షనేనిని 'దేవేంద్ర ఫడ్నవిస్' కలిసి అభినందించారు. అంతే కాకుండా అతన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గ్రీన్ కలర్లో కనిపించే ఈ కారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ 'సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్' పొందినట్లు హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనకు తానుగానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఈ హైడ్రోజన్ కారుని తయారు చేయడానికి హర్షల్ నక్షనేనికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. ఈ కారు కేవలం రూ.150 హైడ్రోజన్‌తో ఏకంగా 300 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపాడు. ఫెరారీ కారుని తలపించే డోర్స్, సన్‌రూఫ్ వంటివి ఇందులో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ హోమ్మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల ఖచ్చితమైన లాంచ్ గురించి వివరించలేదు. అంతే కాకుండా ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించాల్సి ఉంది. దీనికోసం Aicars.in వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఇలాంటి వాహనాలు భారతదేశంలో చట్టవిరుద్ధం హర్షల్ నక్షనేని అద్భుతమైన సృష్టి అందరి ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇలాంటివి పబ్లిక్ రోడ్డుమీద ఉపయోగించడానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒక వాహనం రోడ్డు మీదికి రావాలంటే ఖచ్చితంగా 'ఏఆర్ఏఐ' (Automotive Research Association of India) దృవీకరించాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి ఒక వాహనం పబ్లిక్ రోడ్ల మీదికి రావాలంటే సంబంధిత వివిధ అధికారుల నుంచి ఆమోదం పొందాలి. లేకుంటే ఇవి ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించి, రేసింగ్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు మాత్రమే పరిమితం చేస్తారు. పబ్లిక్ రోడ్లలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ ప్రస్తుతం మన దేశంలో హైడ్రోజన్ కార్ల వినియోగానికి కావాల్సిన కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ కార్ల కంటే ఎక్కువ పరిధిని, తక్కువ కాలుష్యం కలిగించే ఇలాంటి వాహనాలను వినియోగించాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హైడ్రోజన్ కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Blazing a trail from Chandrapur, Maharashtra, this AI-powered hydrogen car is a game-changer! It was great meeting Maharashtra's Innovative Genius, Harshal Nakshane, a farmer's son from Chandrapur, yesterday in Mumbai. He cracked a groundbreaking innovation - an AI-controlled… pic.twitter.com/tdANS9YNIp — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 29, 2023 -
ఈ పదవి రేపు ఉంటుందో లేదో నాకు తెలియదు: అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైరుహాజరవ్వడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. పూణేలోని బారామతిలో ఇదే రోజున సహకార రంగానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ రంగానికి సంబంధించిన సంస్థలు షుగర్ మిల్లులు ఆర్ధికంగా బలపడాలని చెబుతూనే.. ఈరోజు నేను ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్నాను. రేపు ఈ పదవి ఉంటుందో లేదో నాకు తెలియదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయాంతో అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వాలతో ఏమైనా చెడిందా ఏంటనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పూణే కార్యక్రమంలో తన పదవిపై అనిశ్చితిని వ్యక్తం చేసిన ఆయన అమిత్ షా కార్యక్రమానికి గైర్హాజరవడంపైన కూడా స్పందించారు. ఈ రోజు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అమిత్ షా కార్యాలయానికి ముందుగానే తెలిపానని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు రాష్ట్రానికి విచ్చేసిన అమిత్ షా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ గృహాలకు వెళ్లి గణేషుడిని దర్శించుకున్నారు. ఇటీవల అజిత్ పవార్ విద్యాసంస్థల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార భాగస్వాములు బీజేపీ, శివసేన సుముఖంగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కానీ మరో విషయంలో కానీ అధికార పార్టీతో అజిత్ పవార్‌కు సత్సంబంధాలు ఉన్నంతవరకే ఉనికి ఉంటుందని.. అదే గనుక బెడిసికొడితే అజిత్ పవార్ బృందం పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు. “आपल्या संस्था मजबूत झाल्या पाहिजेत त्या टिकल्या पाहिजेत. आज आपल्याकडे अर्थखातं आहे ते पुढे टिकेल ना टिकेल हे सांगता येत नाही” उपमुख्यमंत्री अजित पवार यांचं बारामतीत बोलताना विधान! #AjitPawar #MaharashtraPolitics pic.twitter.com/n6K4sKPFdV — Abhijit Karande (@AbhijitKaran25) September 25, 2023 ఇది కూడా చదవండి: ఈ ఎన్నికల్లో హామీలకు 'మోదీ గ్యారెంటీ' -
ఖలునికి నిలువెల్లా విషము గదరా సుమతీ!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో పాపులర్. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. జంతుప్రేమికురాలైన అమృత పాము, ఒకరకం బల్లితో దిగిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు... ‘అత్యంత ప్రమాదకరమైన, విషతుల్యమైన జంతువు మనిషి మాత్రమే’ అనే కాప్షన్ ఇచ్చింది అమృత. ‘ఫోటోల కంటే మీ కాప్షన్ అద్భుతంగా ఉంది’ ‘సాటిజీవుల పట్ల మనకు ఉండాల్సిన ప్రేమను అందంగా అద్దం పట్టిన ఫొటోలు ఇవి’... అంటూ నెటిజనులు స్పందించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో బ్యాంకర్, ప్లేబ్యాక్ సింగర్, సోషల్ వర్కర్ అని రాసుకుంది అమృత. -
ఆర్థిక శాఖ.. ఫడ్నవీస్ చేతి నుంచి అజిత్ పవార్‌కు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రెబల్ నేత, అజిత్ పవార్ చేతికి వెళ్లింది. మహారాష్ట్ర మంత్రివర్గంలో జూలై 2న చేరిన (ఎన్నీపీ) ఎమ్మెల్యేలకు శుక్రవారం నాడు శాఖల కేటాయింపు జరిగింది. ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ కీలకమైన ఆర్థిక శాఖను సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటివరకూ ఆర్థికశాఖ బాధ్యతలు కూడా ఫడ్నవీస్ వద్దనే ఉంది. అయితే ఆర్థికశాఖపై కన్నేసిన అజిత్ పవార్ పంతం పట్టీ మరీ ఈ శాఖను దక్కించుకున్నారు. ఈ బాధ్యతల్ని వెంటనే ఆయన స్వీకరించారు. బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్‌లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నారు. తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. అనిల్ పటేల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ కేటాయించారు. అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు. ముఖ్యమైన పోర్ట్‌పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు బుజ్జగించాయి. చదవండి: సుఖేష్ సంచలన ఆరోపణలపై కేటీఆర్ రియాక్షన్.. వాడెవడో కూడా తెలీదంటూ.. -
మహా కిరికిరి.. ఫడ్నవిస్ సీటుకే ఎసరు పెట్టి..
ముంబై: సంక్షోభ రాజకీయాలకు నెలవైన మహారాష్ట్రలో ముక్కోణపు పార్టీ అధికార కూటమి.. చీలికలకు గురికాకుండా జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన ఎన్సీపీ(రెబల్) నేత అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్‌లో గ్రాండ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. ఎన్సీపీ నేత, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేతికి వెళ్లనుంది. ముఖ్యమైన పోర్ట్‌పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో షిండే కూటమి(శివసేన)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్.. పోర్టుపోలియోల కేటాయింపులో బెట్టు ప్రదర్శిస్తూ వచ్చారు. కీలకమైన ఆర్థికంతో పాటు ప్రణాళిక మంత్రిత్వ శాఖల్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు కూడా. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానాన్ని నేరుగా కలవకుండా.. ఎన్సీపీ(రెబల్) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ద్వారా హస్తిన నేతలతో చర్చలు నడిపించారు అజిత్ పవార్. ఫలితంగా.. మంత్రివర్గ విస్తరణ ఆసల్యం అవుతూ వచ్చింది. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా సాగిన చర్చల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ప్రఫుల్ పటేల్ సమస్య పరిష్కారం అయ్యిందంటూ ప్రకటించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో పోర్ట్పోలియోల కేటాయింపు జరగవచ్చని తెలుస్తోంది. ఇక జులై 18వ తేదీన ప్రధాని మోదీని తాము కలవబోతున్నామని.. ఎన్డీయే సమావేశానికి తమకూ ఆహ్వానం అందిందని ప్రఫుల్ పటేల్ తెలిపారు. జులై 17 నుంచి ఆగస్టు 4వ తేదీల నడుమ మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి సమావేశాలు ఎన్సీపీ సంక్షోభంపైనా హీటెక్కే అవకాశం లేకపోలేదు. అంచేత సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ మూడేళ్లుగా జరుపుతున్న దర్యాప్తు గురించి స్పందిస్తూ.. 'మొదట్లో ఈ కేసులో వాళ్లూవీళ్లు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది. ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఈ కేసు గురించి ఇంతకంటే ఏం చెప్పలేను' అన్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. మొదట ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన నాగార్జున -
నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజా
ముంబై: నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి అర్చకులు భూమి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నామన్నారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మింస్తున్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు.. నవీ ముంబైలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబైలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణంపూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. -
అహ్మద్‌నగర్ కాదు.. అహల్యానగర్
ముంబై: దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాలు, వీధులకు పేర్లను మారుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలో షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి చర్యకే దిగింది. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చేసింది. బుధవారం చౌండీలో జరిగిన అహల్యాదేవి జయంతోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా ఈ ప్రకటన చేశారు. 18వ శతాబ్దంలో ఇండోర్ స్టేట్‌ను పాలించిన వీరవనితే అహల్యాదేవి హోల్కర్. ఆమె జన్మస్థలంలోనే.. అదీ 298 జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం షిండే ఈ ప్రకటన చేయడం విశేషం. అహ్మద్‌నగర్, పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని అహ్మద్ నిజాం షా పాలించారు. ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి అహ్మద్‌నగర్ పేరొచ్చిందని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ, అహల్యాదేవి హోల్కర్ లాంటి వాళ్లను ఆరాధ్యులుగా భావించి మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అహల్యాదేవి హోల్కర్కు సముచిత గౌరవం అందించాలనే ప్రజలందరి అభిష్టం మేరకు ఈ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చాం అని షిండే ప్రకటించారు. ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘‘మా కూటమిది పక్కా హిందుత్వ ప్రభుత్వమని, అహల్యాదేవి లాంటి వాళ్లు లేకపోతే కాశీ లాంటి సుప్రసిద్ధ క్షేత్రాలు ఉండేవే కావ’’ని చెప్పుకొచ్చారు. అంతకు ముందు షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఒస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన విషయాన్ని సైతం ఫడ్నవిస్ ప్రస్తావించారు. ఇదీ చదవండి: తన వేలితో తన కన్నే పొడుచుకున్న రాహుల్! -
థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్.. మీకు ఆ పదాలు సూట్ కావు అంటూ..
ముంబై: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పు పట్టింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. కాబట్టి స్టేటస్కోను పునరుద్ధరించడం సాధ్యం కాదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఉద్దవ్ థాక్రేకు పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫడ్నవీస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే వర్గానికి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్‌కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఉద్దవ్ వర్గంపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం -
సుప్రీం కోర్టులో స్వాగతించిన ఫడ్నవీస్
-
షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..?
ముంబై: మహారాష్ట్రకు త్వరలో కొత్త సీఎం రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు. మీడియా వర్గాలు తనకు ఈ విషయపై కచ్చితమైన సమాచారం అందించాయని పేర్కొన్నారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం పదవికి పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు. 'ఇది నిజమేనా? షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్చుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేకే షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా?' అని క్యాస్ట్రో ట్వీట్ చేశారు. Is this true too??? There is news that Mr.@mieknathshinde has taken 3 days' leave from work. Sources in the media say that he has taken leave as he is upset because @BJP4India wants him to 'switch roles' in the incumbent Maharashtra government with Mr. @Dev_Fadnavis. — Clyde Crasto - क्लाईड क्रास्टो (@Clyde_Crasto) April 25, 2023 మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఇప్పుడు ఎన్సీపీ కూడా సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కాగా.. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపారు షిండే. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షిండేను బీజేపీ బెదిరించిందని, తమతో చేతులు కలపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిందని ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలే చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..! -
మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్.. గడ్కరీ, ఫడ్నవీస్‌కు భంగపాటు!
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమి మద్దతు అభ్యర్థి సుధాకర్ అద్బాలే ఘన విజయం సాధించారు. వివరాల ప్రకారం.. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నాగో గనార్పై మహావికాస్ అగాడీ కూటమి అభ్యర్థి సుధాకర్ అద్బాలే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 34,360 ఓట్ల పోల్ అవగా.. సుధాకర్ అద్బాలే 16,700 ఓట్లు సాధించగా, నాగో గనార్‌కు 8,211 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాగా, నాగపూర్ బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సొంత ప్రాంతం కావడం గమనార్హం. అంతేకాకుండా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం కూడా నాగ్పుర్లోనే ఉండటం విశేషం. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. మరోవైపు.. ప్రస్తుతం నాగపూర్ ఎంపీగా గడ్కరీ ఉండగా, నాగపూర్ (సౌత్ వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నాగ్‌పుర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. కాగా, జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం జరిగింది. -
బీజేపీ నేతపై మిత్రపక్ష వర్గీయుల దాడి
ముంబై: బీజేపీ మద్దతుతో శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి విదితమే. అయితే.. ప్రత్యర్థి పక్షంగా ఉన్న రోజుల నుంచి ఈ రెండు వర్గాల నడుమ కొనసాగుతున్న వైరం.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఉవ్వెత్తున పైకి లేచి.. ఇప్పుడు తారాస్థాయిలో కొనసాగుతోంది. అదీ నియోజకవర్గాల వారీగా కావడం గమనార్హం. తాజాగా షిండే వర్గం మిత్రపక్ష నేతపైనే దాడికి పాల్పడింది. మిత్ర పక్షాల నడుమ పోరు మంచిది కాదని, ఐక్యతతో ముందుకు సాగాలని ఇటు సీఎం షిండే, అటు డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఇస్తున్న పిలుపు ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు చెవికెక్కడం లేదు. థానేలో బీజేపీ ఆఫీస్ బేరర్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ జాదవ్‌కు, షిండే వర్గీయులకు గొడవ జరిగింది. గురువారం వాగ్లే ఎస్టేట్‌లోని పరబ్‌వాడీ దగ్గర బ్యానర్లు, ఫ్లకార్డులు ఏర్పాటు విషయంలో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలను హెచ్చరించి పంపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ జాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని షిండే వర్గీయులకు దాడికి దిగారు. పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఆయన్ని చితకబాదారు. ఈ దాడిలో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం!. ఆపై ఈ గొడవపై ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఇరు పక్షాలు ఎవరికి వాళ్లు అవతలి వాళ్ల మీదే నిందలు వేయడం ప్రారంభించారు. हल्लेखोरांवर तात्काळ कारवाई करा @ThaneCityPolice असले नीच कृत्य करणाऱ्यांचा तिव्र निषेध@CMOMaharashtra @Dev_Fadnavis https://t.co/JfciHraaem — Chitra Kishor Wagh (@ChitraKWagh) December 30, 2022 మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని స్టేషన్ బయట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో మరోసారి గొడవ జరుగుతుందేమోనన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ. ఇక ఈ ఘర్షణలపై బీజేపీ మహిళా మోర్చా పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. దోస్తీకి దోస్తీ.. దెబ్బకు దెబ్బ.. రక్తానికి రక్తం అంటూ ట్వీట్లో పేర్కొంది. పరిస్థితి చల్లార్చేందుకు ఇరు పార్టీలు కీలక నేతలను థానేకు పంపనున్నట్లు సమాచారం.