Donald Trump
-
ట్రంప్, మోదీలపై మెలోని కీలక వ్యాఖ్యలు
రోమ్:ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రపంచ వామపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిది ద్వంద్వ విధానాలతని విమర్శించారు. తాను,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీలు ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు.తామంతా తమ దేశాల ప్రయోజనాలను,సరిహద్దులను కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్నామని,కానీ తమ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని లెఫ్ట్ పార్టీల నేతలు విమర్శిస్తున్నారన్నారు. ప్రపంచం ఇక ఎంత మాత్రం లెఫ్టిస్ట్ విధానాలను నమ్మబోదని మెలోని చెప్పారు. తాను,ట్రంప్,మోదీ ప్రపంచవ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తుంటే లెఫ్ట్ లిబరల్స్‌లో ఆందోళన మొదలైందని ఎద్దేవా చేశారు. 90వ దశకంలో అమెరికాలో బిల్ క్లింటన్, బ్రిటన్‌లో టోనీ బ్లెయిర్‌లను లెఫ్ట్ నేతలు రాజనీతిజ్ఞులని కీర్తించారని, తమను మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నారని మెలోని మండిపడ్డారు. -
ఈ కారణాలతోనే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది. ట్రంప్ రక్షణాత్మక విధానం, యుఎస్ డాలర్ హెచ్చు & తగ్గుల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం మరియు ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి.శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తర్వాత.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఎనిమిదవ వారం లాభాన్ని & దేశీయ మార్కెట్లో వరుసగా ఏడవ వారం లాభాన్ని నమోదు చేశాయి. ఈ ఏడు వారాల్లో, 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏడు వారాల్లో సుమారు రూ. 9,500 కంటే ఎక్కువ పెరిగింది.2025 జనవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరగడానికి అనేక కీలక అంశాలు కారణమయ్యాయి. ఇందులో ట్రంప్ ప్రారంభించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల రేటు కోతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు, ముఖ్యంగా USకి బంగారం వెళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.యూరోపియన్ దేశాల నుంచి USకి ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో.. అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా యూరప్ కంటే అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి కేంద్ర బ్యాంకులు లండన్ వాల్ట్‌ల నుంచి బంగారాన్ని తరలిస్తున్నాయి. గత ఎనిమిది వారాల్లో NY COMEX వాల్ట్‌లలో బంగారం నిల్వలు సుమారు 20 మిలియన్లు పెరిగాయి, ఇది లండన్ క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్‌ను ప్రేరేపించింది.స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం పెరగడానికి కారణాలను గురించి, ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' మాట్లాడుతూ.. అమెరికా & యూరప్ మధ్య సుంకాల వివాదం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులను సృష్టించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని అన్నారు. అల్యూమినియం, ఉక్కుపై ఇటీవల 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ పరిపాలన బంగారంపై సుంకాలు విధించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ అంచనా అమెరికాలో డిమాండ్‌ను పెంచింది, బంగారం ధరలను పెంచిందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన 'అనుజ్ గుప్తా' మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమెరికన్ బ్యాంకుల కంటే వెనుకబడి లేదు. భారత సెంట్రల్ బ్యాంక్ 2024 మే, అక్టోబర్లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని రవాణా చేసిందని ఆయన అన్నారు. దీనితో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి, వీటిలో 510.5 టన్నులు భారతదేశంలో నిల్వ ఉన్నాయని అన్నారు.మొత్తం మీద.. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ట్రంప్ సుంకాల విధానం మాత్రమే కారణం కాదు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు, తక్కువ ఆర్థిక వృద్ధి గురించి ఆందోళనలు కూడా. భారతదేశంలో కొనుగోలుదారుల సంఖ్య, లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. -
భారత్, చైనాలకు ట్రంప్ మార్క్ షాక్!
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్, చైనా దేశాలు ఏ స్థాయిలో అయితే దిగుమతి సుంకాలు వేస్తున్నాయో అంతే శాతం దిగుమతి సుంకాలు తామూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తాజాగా వాషింగ్టన్లో వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికాపై ఏదైనా కంపెనీ లేదంటే ఒక దేశం ఎంత పన్నులు విధిస్తే మనమూ ఇకపై అంతే సుంకాలు వసూలు చేద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ లేదా చైనాలు మనపై ఎంత పన్నుల భారం మోపుతాయో అమెరికా సైతం అంతే పన్నుల భారాన్ని వాటిపై వేయనుంది. త్వరలోనే ఈ కొత్త పన్నులను తీసుకొస్తాం. ఇదొక అనులోమానుపాత సిద్ధాంతం అనుకోండి. అటు ఎంత పెరిగితే ఇటు అంతే పెరుగుతుంది. అటు ఎంత తగ్గితే ఇటూ అంతే తగ్గుతుంది. వాళ్లు మనకు ఛార్జీ వేస్తున్నారు. మనమూ వాళ్లకు ఛార్జీ వేద్దాం’’అని అక్కడి అమెరికన్లనుద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘మనం గతంలో ఇలా ఎప్పుడూ ప్రతిస్పందించలేదు. కానీ ఈసారి మాత్రం మనం అవతలి దేశాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకోబోతున్నాం’ అని అన్నారు. గత మంగళవారం సైతం ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా తనను కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఇదే విషయం స్పష్టంచేశానని ట్రంప్ చెప్పారు. ‘మంత్రి హొవార్డ్ సారథ్యంలోనే అమెరికా విదేశాలపై కొత్త పన్నుల విధానాన్ని అమలుచేయబోతోంది. నూతన వాణిజ్య మంత్రి హొవార్డ్కు వాణిజ్య సంబంధాలపై మంచి పట్టు ఉంది’ అని పొగిడారు. నా నాలుగో ఫేవరెట్ పదం కొద్దిసేపు ట్రంప్ సరదాగా మాట్లాడారు.‘నాకిష్టమైన పదాలను చెప్పాలంటే దేవుడికి అగ్రస్థానం ఇస్తా. ఇందులో మరో మాటే లేదు. ప్రచారంవేళ కాల్పుల ఘటనల నుంచి తప్పించుకున్నా. దేవుడు రక్షించాడు. నా మొదటి ఫేవరెట్ పదం దేవుడు. తర్వాత కుటుంబం, ఆ తర్వాత రిలేషన్ఫిప్’ అని అన్నారు. పదే పదే టారిఫ్ అని వల్లెవేస్తున్నారుగా అని అక్కడి మీడియా ప్రశ్నించగా ‘అవును. టారిఫ్ ఇప్పుడు నా ఫేవరెట్ నాలుగో పదం. దీన్నే ఖాయం చేసుకోండి’ అని ట్రంప్ అన్నారు. -
ఈవిడ... పాస్‌పోర్ట్‌లో ‘అతను’
వాషింగ్టన్: జన్మత: అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ప్రముఖ హెచ్‌బీవో ‘యుఫోరియా’సిరీస్ నటి హంటర్ షాఫెర్ అమెరికా నూతన ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పాస్‌పోర్ట్‌లో తన పేరుకు ముందు అబ్బాయి అని పేర్కొనడాన్ని నటి తీవ్రంగా తప్పుబట్టారు. 1998లో జన్మించిన హంటర్ 2019 ఏడాదిలో శస్త్రచికిత్స తర్వాత అమ్మాయిగా మారారు. ఆనాటి పాస్‌పోర్ట్‌లో అమ్మాయి అనే ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లోనూ అలాగే ఉంది. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక లెస్బియన్, గే తదితర ఎల్జీబీటీక్యూ+ లింగమార్పిడి వర్గాల కోసం ప్రత్యేకంగా ‘ఎక్స్’వంటి పదాలను ఉపయోగించబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్జీబీటీక్యూ+ వర్గాల వ్యక్తులను అమ్మాయి లేదా అబ్బాయిగా మాత్రమే ప్రభుత్వం పరిగణిస్తుంది. పుట్టినప్పటికి స్థితిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. దీంతో హంటర్ కొత్త పాస్‌పోర్ట్‌లో అబ్బాయి అని వచ్చింది. దీనిపై హంటర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘విదేశాల్లో సినిమా షూటింగ్ వేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా. దాంతో కొత్తగా దరఖాస్తు చేస్తే అబ్బాయి అని పేర్కొంటూ కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చారు. మారిన వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం పట్టించుకోదా?. ప్రజాస్వామ్య అమెరికాలో పౌరుల హక్కులకు విలువ లేదా?. అబ్బాయి అని పేర్కొనడంతో నాకెన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాల్లో ‘అబ్బాయి’అని ఉంటే విమానాశ్రయాల్లో, మరెన్నో చోట్ల చాలా సమస్యలొస్తాయి’’అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. -
మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవాలి
న్యూఢిల్లీ: ఓటింగ్ కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు చేసిన సూచనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. మనదేశ ఎలక్టోరల్ విధానం సమగ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు బ్యాలెట్ విధానమే సరైన సమాధానమని పేర్కొంది. అమెరికాలో ఇటీవల జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈవీఎంల విధానం చాలా ఖరీదైన వ్యవహారం. దీనికి బదులుగా బ్యాలెట్ విధానాన్ని, ఒకే రోజు ఓటింగ్ చేపట్టడం వంటివి తీసుకురావడం మంచిది’అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. ‘ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా లక్షల సంఖ్యలో ఓటర్లు పెరిగారు. అదేసమయంలో, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారు. ఇవన్నీ తెలిస్తే మోదీ మిత్రుడు ట్రంప్ సైతం షాకవుతారు’అని పేర్కొన్నారు. ‘ఈవీఎంలతో ఎన్నికల విధానాన్ని తారుమారు చేయవచ్చని ప్రపంచానికంతటికీ తెలిసినా బీజేపీ మాత్రం అమాయకత్వం ప్రదర్శించటం విషాదకరం. పారదర్శకతకు దూరంగా పారిపోయే బీజేపీ వైఖరి చూస్తే వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది’అని తెలిపారు. -
అమెరికాలో ముగ్గురు సైనికాధికారులపై వేటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముగ్గురు కీలక సైనాధికారులకు ఉద్వాసన పలికారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ చార్లెస్ సీక్యూ బ్రౌన్(ఛార్లెస్ క్వింటన్ బ్రౌన్) జూనియర్‌పై హఠాత్తుగా వేటువేశారు. ఎయిర్‌ఫోర్స్ జనరల్ అయిన బ్రౌన్ గత 16 నెలలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అత్యంత కీలకమైన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ పదవిని అధిరోహించిన రెండో నల్లజాతి అధికారిని ఉన్నట్టుండి పదవి నుంచి తొలగించడం అమెరికా సైనిక వర్గాల్లో సంచలనాత్మకంగా మారింది. ‘‘అమెరికాకు 40 ఏళ్లకుపైగా సేవలందిస్తున్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన ఒక గొప్ప అధికారి. సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన నాయకుడు. బ్రౌన్‌తోపాటు ఆయన కుటుంబం భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’అని సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పోస్టు చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ నూతన చైర్మన్‌గా రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డాన్ రజిన్ కెయిన్‌ను నామినేట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు హత్య చేసినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. వర్ణవివక్ష పూర్తిగా అంతం కావాలని డిమాండ్ చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పేరిట జరిగిన ఉద్యమానికి చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నల్లజాతి ప్రజల పట్ల ఆయన సానుభూతి చూపుతుంటారు. అమెరికా సైన్యంలో బ్రౌన్ వ్యతిరేకులు చాలామందే తయారయ్యారు. సైనిక వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని, అవసరం లేదని సిబ్బందిని ఇంటికి సాగనంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బ్రౌన్కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో ఇద్దరు సీనియర్ సైనిధికారులను పదవి నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. నావల్ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టీ, స్టాఫ్ ఆఫ్ ద ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ జనరల్ జిమ్ స్లైఫ్ను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.5,400 మంది ప్రొబేషనరీ సిబ్బందికి ఉద్వాసనే సైన్యంలో పనిచేస్తున్న 5,400 మంది ప్రొబేషనరీ వర్కర్స్కు ఉద్వాసన పలకబోతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. వచ్చేవారం నుంచే వారిని తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. నూతన నియామకాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఏడాది కంటే తక్కువ కాలం పని చేసినవారిని తొలగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఇలాంటి వారికి సివిల్ సర్వీసు ప్రొటెక్షన్ ఉండదు. సైన్యంలో యూనిఫామ్ సర్వీసు మినహా ఇతర విభాగాల్లో 5 నుంచి 8 శాతం సిబ్బందిని తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యూఎస్ ఫారెస్టు సర్వీసు నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో పనిచేస్తున్న 7 వేల మందిపై త్వరలో వేటు వేయబోతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల తొలగింపుపై రక్షణ మంత్రి హెగ్సెత్ గతవారం సోషల్ మీడియాలో నర్మగర్భమైన పోస్టు చేశారు. ‘‘శరీరం నుంచి అనవసరమైన కొవ్వును తొలగించుకుంటే కండరాలు బలపతాయి’’అని పేర్కొన్నారు. సైన్యంలో కొన్ని కార్యక్రమాలకు కత్తెర వేసి 50 బిలియన్ డాలర్లు ఆదా చేయాలని ఆదేశించారు. ఈ సొమ్మును అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతల జాబితాలో ఉన్న కార్యక్రమాలకు మళ్లించాలని పేర్కొన్నారు. 50 బిలియన్ డాలర్లు అంటే అమెరికా సైనిక బడ్జెట్లో 8 శాతం. -
Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్‌కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్‌లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్‌లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్‌తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్‌కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్‌కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్‌లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్‌కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్‌కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్‌కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్ -
సుంకాల భారం అమెరికాపైనే!
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఔషధ ఎగుమతుల్లో యూఎస్ మార్కెట్ తొలి స్థానంలో ఉంది. అలాగే అమెరికా వినియోగిస్తున్న జనరిక్స్‌లో దాదాపు సగం వాటా భారత్ సమకూరుస్తోంది. దీంతో ట్రంప్ ని ర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.ఔషధ దిగుమతులపై ఆధారపడ్డ యూఎస్ ప్రతీకార పన్నుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉందని భారతీయ ఫార్మా కంపెనీలు, నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. యూఎస్ వెలుపల అత్యధిక యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ ప్లాంట్లు ఉన్నది భారత్‌లోనే. పైగా ఇప్పటికిప్పుడు డిమాండ్‌కు తగ్గట్టుగా మందులను సరఫరా చేసే స్థాయిలో అక్కడి కంపెనీల సామర్థ్యం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ ఔషధాలపై ప్రతీకార పన్నులు విధిస్తే తమపై ప్రభావం తక్కువేనని, దిగుమతుల భారం యూఎస్పైనే ఉంటుందని భారతీయ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ బ్యూరోప్రధాన మార్కెట్‌గా యూఎస్.. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో తొలి స్థానంలో ఉన్న యూఎస్ వాటా ఏకంగా 30 శాతంపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి రూ.75,385 కోట్ల విలువైన ఔషధాలు యూఎస్‌కు చేరాయి. ఇక యూఎస్ నుంచి భారత్‌కు వచ్చిన మందులు కేవలం రూ.5,199 కోట్ల విలువైనవి మాత్రమే. 2023–24లో భారత్ నుంచి వివిధ దేశాలకు మొత్తం ఔషధ ఎగుమతులు రూ.2,40,887 కోట్లు. ఇందులో జనరిక్ ఫార్ములేషన్స్ (ఫినిష్డ్ డోసేజ్) రూ.1,64,635 కోట్లు. అంతర్జాతీయంగా జనరిక్స్ మార్కెట్ పరిమాణం రూ.39,85,900 కోట్లు. 2030 నాటికి ఇది రూ.68,45,350 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ సమయానికి భారత మార్కెట్ ఎగుమతులతో కలుపుకుని రూ.9,53,150–10,39,800 కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది రూ.4,76,575 కోట్లు. చవకగా నాణ్యమైన ఔషధాలు.. నాణ్యమైన ఔషధాలను చవకగా తయారు చేయడం భారతీయ జనరిక్ కంపెనీల ప్రత్యేకత. కోట్లాది రూపాయలు వెచ్చించి యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్స్ దక్కించుకున్న కంపెనీలు.. యూఎస్‌లో ఉన్న అపార అవకాశాలను కాదనుకునేందుకు సిద్ధంగా లేరని ఓ కంపెనీ ప్రతినిధి అన్నారు. ఎఫ్‌డీఏ ఆమోదం అంటేనే ప్రతిష్టగా భావిస్తారని అన్నారు. భారతీయ మందుల కారణంగా 2013–2022 మధ్య యూఎస్ ఆరోగ్య రంగం రూ.1,12,64,500 కోట్లు ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను తెలిపారు. నూతన, వినూత్న ఔషధాలను యూఎస్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. సిద్ధం కావడానికి నాలుగేళ్లు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం కలిగిన తయారీ ప్లాంట్లు భారత్‌లో 650 దాకా ఉన్నాయి. ఈ ధ్రువీకరణ రావాలంటే ప్రమాణాలకు తగ్గట్టుగా ప్లాంటును సిద్ధం చేయడం, ఏఎన్‌డీఏ ఆమోదం, అనుమతులకు నాలుగేళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు మరో దేశం నుంచి ఔషధాలను దిగుమతి చేసుకుందామని అనుకున్నా యూఎస్‌కు సాధ్యం కాదు. కోవిడ్ మహమ్మారి సమయంలో చైనా, భారత్‌లో ఎఫ్‌డీఏ తనిఖీలు ఆలస్యం అయ్యాయి. దీంతో సరఫరా తగ్గి యూఎస్‌లో ఔషధాల కొరత వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో టారిఫ్‌లు విధించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. యూఎస్ నుంచి వచ్చే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని భారత్ ఎత్తివేసే చాన్స్ ఉంది. యూఎస్‌లో తయారీ ప్లాంట్లు పెట్టాలన్నా అంత సులువు కాదు. – రవి ఉదయ భాస్కర్, మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్వినియోగదారులపైనే భారం.. భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలపై అమెరికా ప్రస్తుతం కేవలం 0.1 శాతం సుంకాన్ని విధిస్తోంది. ఇందుకు విరుద్ధంగా భారత్ 10 శాతం వసూలు చేస్తోంది. యూఎస్ వినియోగిస్తున్న జనరిక్స్‌లో సింహ భాగం భారత్ సమకూరుస్తోంది. భారత్‌లో తయారైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్పై (ఏపీఐ) యూఎస్ ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రతీకార సుంకాలు కొన్ని జనరిక్స్ లాభదాయకతను ప్రభావితం చేయవచ్చు. కానీ ఆ భారాన్ని తుది వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసరెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ గ్రూప్ఏపీఐ కంపెనీలకు.. సుంకాలు విధిస్తే ఔషధాలు ప్రియం అవుతాయి. ఇదే జరిగితే యూఎస్ ప్రజలపైనే భారం పడుతుంది. అయితే దీని ప్రభావం ఫినిష్డ్ డోసేజ్ కంపెనీలపైనే ఉంటుంది. ఇక ఏపీఐ త యారీ సంస్థలకు మంచి రోజులు రానున్నాయి. భారత కంపెనీల నుంచే వీటి దిగుమతికి యూఎస్ ఆసక్తిగా ఉండడమే ఇందుకు కారణం. ప్రధానంగా ఆంకాలజీ విభాగంలో అవకాశాలు ఎక్కువ. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం ఉన్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. – ఆళ్ల వెంకటరెడ్డి, ఎండీ, లీ ఫార్మా -
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్‌వర్క్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్‌వెల్ట్‌తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్‌లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్‌ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?
మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ 3 (Grok 3).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది. దీనికి సంబంధించిన చాట్‌బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేశారు.అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్‌ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. చాట్‌బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్స్టీన్ పేరును పేర్కొంది.అయితే జఫ్రీ ఎప్స్టీన్ ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్‌బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్‌ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్డేట్ చేసింది.మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.ది వెర్జ్ కూడా గ్రోక్‌ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్‌బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే పేర్కొంది. ది వెర్జ్తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్‌లోని ఎర్రర్‌ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్‌బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.హానికర సలహాలుఏఐ చాట్ బాట్లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్‌బాట్ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది. -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఎవరీ అలెక్సీస్? వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా మేనల్లుడు లండన్ నుండి వచ్చారని పేర్కొన్నాడు. తన అందమైన ప్రేయసి అలెక్సిస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి. WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:"Anyone who thinks the American Dream is dead, look right here. You're talking to a first-generation Indian kid who is about to lead the law enforcement community in the greatest nation on God's Earth." pic.twitter.com/PQrCkme9az— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025కాశ్ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకెన్ అమెరికా టూర్లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది. 2023లో డేటింగ్ ప్రారంభించారు.చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమBirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలుఅలెక్సీస్ వినాష్ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనేక స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్లో పుట్టింది. అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది. -
ట్రంప్‌కు పీఎం ట్రూడో కౌంటర్
ఒట్టావా:కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న కామెంట్లకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. బోస్టన్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అమెరికాను ఓడించిన తర్వాత కెనడా ప్రధాని ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. మా దేశాన్ని,మా ఆటను మీరు తీసుకోలేరు’అని ట్రంప్‌కు చురకంటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెనడాపై అమెరికా టీమ్ విజయం సాధించాలని,కెనడా త్వరలో అమెరికా 51వ రాష్ట్రంగా అవతరించాలని ట్రంప్ ఒక పోస్టులో ఆకాంక్షించారు. దీనికి బదులుగా హాకీ మ్యాచ్‌లో కెనడా అమెరికాపై విజయం సాధించిన తర్వాత కెనడా ప్రధాని ట్రంప్‌కు కౌంటర్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.You can’t take our country — and you can’t take our game.— Justin Trudeau (@JustinTrudeau) February 21, 2025అమెరికా,కెనడా మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లలో గత 50 ఏళ్లలో ఎక్కువ మ్యాచ్‌లు కెనడానే గెలుపొందడం గమనార్హం.కాగా4, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత పొరుగు దేశమైన కెనడాపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. -
పుతిన్, జెలెన్స్కీ కలిసిపోవాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్.రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl— ANI (@ANI) February 21, 2025అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్‌ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు.. ట్రంప్ ఇప్పటికే జెలెన్స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. -
చరిత్రలో అతిపెద్ద మోసం.. 4 లక్షల కోట్లు ఏమయ్యాయి?
-
ట్రంప్‌ను కలిసిన యాపిల్ సీఈఓ
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది.వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని చైనా దిగుమతులపై 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చైనాలో ఉత్పత్తి అవుతూ అమెరికాలోకి వస్తున్న యాపిల్ ఉత్పత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది కంపెనీ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సుంకాల నుంచి యాపిల్ ఉత్పత్తులను రక్షించడం తన ప్రాథమిక లక్ష్యంగా కుక్ భావించారు. దాంతో ట్రంప్‌ను ప్రత్యక్షంగా కలిసి టారిఫ్ మినహాయింపులు కోరినట్లు తెలిసింది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.గోప్యతా విధానాలపై చర్చవాణిజ్య సమస్యలతో పాటు యాపిల్ గోప్యతా విధానాలపై ట్రంప్, టిమ్కుక్ల మధ్య చర్చ జరిగింది. సమర్థంగా చట్టాలను అమలు చేసేందుకు న్యాయబద్ధమైన సంస్థల కోసం కొన్ని ఐఫోన్లను అన్‌లాక్ చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో కుక్ వినియోగదారుల గోప్యతకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారని సమాచారం.ఇదీ చదవండి: బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధంబలమైన సంబంధంట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు కుక్ కృషి చేస్తున్నారు. యాపిల్ వ్యాపార కార్యకలాపాలపై, సుంకాల ప్రభావాన్ని తగ్గించే మార్గాలపై చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. -
ఎఫ్ బీఐ డైరెక్టర్ గా భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్
-
‘బ్రిక్స్’ దేశాలపై ట్రంప్ సెటైర్లు
వాషింగ్టన్:‘బ్రిక్స్’ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 150 శాతం సుంకాల దెబ్బకు ‘బ్రిక్స్’ ముక్కలయ్యాయని సెటైర్లు వేశారు. డాలర్‌ను ఆధిక్యతను దెబ్బతీయాలని ప్రయత్నించినందుకు ఆ దేశాలకు ఇది జరగాల్సిందేనన్నారు.‘డాలర్‌ను నాశనం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశాను. డాలర్ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150 శాతం సుంకం విధిస్తానని చెప్పాను.మీ వస్తువులు మాకు అవసరం లేదు. నా దెబ్బకు బ్రిక్స్ దేశాలు ముక్కలయ్యాయి’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో భారత్‌కు కూడా మినహాయింపు ఇవ్వలేదు.బ్రిక్స్ కూటమిలో భారత్,రష్యా,చైనా సహా మొత్తం పది దేశాలున్నాయి. -
మస్క్ ప్రతిపాదన నచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: ఫెడరల్ వ్యవస్థ తగ్గింపుతో పొదుపు చేసిన డబ్బు ఖర్చుపై డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించారు. వ్యయ తగ్గింపుతో మిగిల్చిన మొత్తంలోని కొంత డబ్బును అమెరికా పౌరులకు డివిడెండ్ రూపంలో తిరిగి ఇచ్చే ఆలోచన తనకు నచ్చిందన్నారు. మయామీలో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మస్క్ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. వ్యయ తగ్గింపులతో మిగిలే మొత్తంలో 20 శాతాన్ని అమెరికా పౌరులకు డివిడెండ్‌గా ఇవ్వాలని, మరో 20 శాతాన్ని జాతీయ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని డోజ్ ప్రతిపాదించింది. ఈ సొమ్ము ప్రజల ఖాతాల్లోకి వెళ్లడం ద్వారా.. వృధాను అరికట్టేందుకు వారే ముందుకొస్తారన్నారు. -
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్‌వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
ఉదారతకు ట్రంప్ వీడ్కోలు!
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మొదలు వ్యవస్థల్ని ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచ దేశాలకు ఉదారంగా సాయం అందించే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్)పై పడింది. గత నెల 27నే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపేస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. దాన్నుంచి విడుదలయ్యే నిధుల గురించి సమీక్షించి ఆ పంపిణీని ‘మరింత సమర్థంగా’, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగా వుండేలా రూపుదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు దాని తాలూకు సెగలూ పొగలూ మన దేశాన్ని కూడా తాకాయి. ఆ సంస్థ నుంచి లబ్ధి పొందింది ‘మీరంటే మీర’ని బీజేపీ, కాంగ్రెస్‌లు వాదులాడుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గాలించి గత చరిత్ర తవ్వి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వెనకా ముందూ చూడకుండా చొరవగా దూసుకెళ్లే బీజేపీయే ఈ వాగ్యుద్ధానికి అంకు రార్పణ చేసింది. కాంగ్రెస్, మరికొన్ని పౌర సమాజ సంస్థలూ యూఎస్ ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం. పనిలో పనిగా ప్రపంచ కుబేరుడు జార్జి సోరోస్‌తో కాంగ్రెస్‌కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి యూఎస్ ఎయిడ్‌కు ప్రధానంగా నిధులు వస్తాయి గనుక దాన్నుంచి నిధులందుకున్నవారంతా మచ్చపడినవారేనని బీజేపీ అభియోగం. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి యూఎస్ ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని తేల్చారు. దేశద్రోహులు అనే మాటైతే వాడలేదుగానీ... ఆ చట్రంలో ఇమిడే కార్యకలాపాలన్నిటినీ పరోక్షంగా కాంగ్రెస్‌కూ, ఇతర సంస్థలకూ అంటగడుతూ ఏకరువు పెట్టారు. అటు కాంగ్రెస్ ఊరుకోలేదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒకప్పుడు యూఎస్ ఎయిడ్ రాయబారిగా పనిచేయటం, నీతి ఆయోగ్, స్వచ్ఛభారత్ వంటి సంస్థలకు నిధులు రావటం వగైరాలను ప్రస్తావించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యా లయం వెబ్సైట్ సమాచారం ప్రకారం యూఎస్ ఎయిడ్ మన ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయం, తాగునీరు, ఇంధనం వగైరాలకు సాయపడుతున్నది.ఇదంతా చూస్తుంటే ‘గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏర డం’ నానుడి గుర్తుకొస్తుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఏలుబడిలో ప్రారంభమైన ఈ సంస్థనుంచి నిధులందుకున్న పార్టీలూ, స్వచ్ఛంద సంస్థలూ కొల్లలుగా ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమా లకు కూడా అది సాయపడింది. అమెరికా తన బడ్జెట్లో ఒక శాతాన్ని అంతర్జాతీయ సాయానికి కేటాయిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మానవతా సాయాన్ని అందించే ఏకైక దేశం అమెరికాయే. అంతర్జాతీయంగా నిరుడు వివిధ దేశాలకు అందిన సాయంలో అమెరికా వాటా 40 శాతం. 2025 ఆర్థిక సంవత్సరానికి యూఎస్ ఎయిడ్ ద్వారా 5,840 కోట్ల డాలర్లు వ్యయం కావొచ్చన్న అంచనా ఉంది. ట్రంప్ ప్రస్తుతం దాన్ని నిలుపుదల చేశారు గనుక ఇందులో ఎంత మొత్తానికి కత్తెరపడుతుందో అంచనా వేయటం కష్టం. మనకైతే ఇకపై రాక పోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశంలో భారత్ సంపన్న దేశం. 2021 నుంచి నిరుడు డిసెంబర్ వరకూ మన దేశానికి 2 కోట్ల డాలర్లు కేటాయించగా అందులో కోటీ 25 లక్షల డాలర్లు అందించి నట్టు లెక్కలున్నాయి. ఇదంతా ‘ప్రజాతంత్ర భాగస్వామ్యం’, పౌర సమాజం కోసం అని యూఎస్ ఎయిడ్ అంటున్నది. ఇందులో 55 లక్షల డాలర్లు నిరుడు జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున వోటర్లు పాల్గొనేలా చూడటానికి అందించారు. ఏ సంస్థ ఎంత పొందిందన్న వివరాలు మాత్రం లేవు. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల రక్షణ, ఆఫ్రికాలో వ్యాధులు అరికట్టడానికి, ఆడపిల్లల విద్యకు, ఉచిత మధ్యాహ్న భోజనానికి సాయం చేయగా... రష్యా ఇరుగు పొరుగు దేశాల్లో దాని ప్రభావం తగ్గించటానికి, యుద్ధక్షేత్రమైన సిరియాలో ఆస్పత్రుల కోసం, ఉగాండాలో అట్టడుగు తెగల అభ్యున్నతికి, కంబోడియాలో మందుపాతరల తొలగింపునకు, బంగ్లాలో పౌరసమాజం కోసం... ఇలా భిన్నమైన పథకాలకూ, కార్యక్రమాలకూ అమెరికా తోడ్పడుతోంది. అసలు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? వ్యక్తుల వరకూ చూస్తే తమ ఎదుగుదలకు కారణమైన సమాజానికి తిరిగి ఏదో ఇవ్వాలన్న కృతజ్ఞతా భావన కారణం కావొచ్చు. కానీ ఏ ఉద్దేశమూ లేకుండా అయా చితంగా ఖండాంతరాల్లోని సంపన్న దేశాలు వేరే దేశాలకు ఎందుకు తోడ్పాటునిస్తున్నాయి? చరిత్ర తిరగేస్తే దీని వెనకున్న మతలబు అర్థమవుతుంది. అప్పట్లో సోవియెట్ యూనియన్ ప్రభావం నుంచి ప్రపంచాన్ని ‘రక్షించే’ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని అమెరికా ఈ సాయం మొద లెట్టింది. అటు సోవియెట్ సైతం ఆ పనే చేసేది. ప్రపంచం దాదాపు రెండు శిబిరాలుగా చీలిన ఆ కాలంలో అమెరికా, సోవియెట్లకు ఈ ఉదారత ఎందుకంటిందో సులభంగానే గ్రహించవచ్చు. సాధారణ ప్రజానీకంలో తమపట్ల అనుకూల భావన కలిగితే అవతలివారిని సగం జయించినట్టేనని ఆ రెండు దేశాలూ భావించేవి. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యర్థులుగా కనబడుతున్న వర్తమానంలో అమెరికాకు ఉదారత అవసరం ఏముంది? ‘నేను ఆదేశించింది పాటించటమే తప్ప నాతో తర్కానికి దిగొద్ద’ని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సాయాన్ని ముందే తిరస్కరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ఇవ్వబోమని అమర్యాదకరంగా చెప్పించుకోవటం ఆత్మాభిమానం గల భారతీయులందరికీ చివుక్కుమనిపించే సంగతి. పాలకులు గ్రహిస్తారా? -
బంగారం.. అందుకే ఆల్‌టైమ్ హై!
ప్రపంచవ్యాప్తంగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold prices) రోజుకో కొత్త గరిష్టాన్ని చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్త సుంకాల భయం నేపథ్యంలో పసిడిని సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ డబ్బును అందులో పెట్టుబడి పెట్టడానికి తొందరపడటంతో బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో బులియన్ ఔన్సు ధర 2,935 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 2,947.01 డాలర్ల తాజా రికార్డు స్థాయిని తాకింది. ఇక భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 2025 ఏప్రిల్ ఫ్యూచర్స్‌కు బంగారం 10 గ్రాములకు రూ.85,879 వద్ద ట్రేడైంది. గరిష్ట ధర రూ. 86,592.అమెరికాలోకి వచ్చే ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఔషధ దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని గత మంగళవారం ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, రష్యా సీనియర్ అధికారులు మొదటి రౌండ్ చర్చల కోసం సమావేశమైన తర్వాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు దోహదపడే మరో అంశం.ఇది చదివారా? బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు2024లోనే బంగారం పావు వంతుకు పైగా పెరిగింది. 2025లో, ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల బంగారం అనేక రికార్డు గరిష్టాలను తాకింది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా బంగారం కోసం సంవత్సరాంతపు లక్ష్యాన్ని ఔన్సుకు 3,100 డాలర్లకు పెంచింది. సెంట్రల్-బ్యాంక్ కొనుగోలు ఊహించిన దానికంటే బలంగా ఉండటం కీలకమైన చోదక శక్తిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక విధానంపై విస్తృత అనిశ్చితి కొనసాగితే (ముఖ్యంగా సుంకాలపై) బులియన్ ధర 3,300 డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడింది. -
ట్రంప్ బెదిరిస్తే భయపడలా?: మెక్సికో అధ్యక్షురాలు
పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారామె. ‘‘ట్రంప్ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారామె. వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే.. మెక్సికోపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగించేందుకు టెస్లా చర్యలకు పూనుకుంది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయం ‘చాలా అన్యాయం’ అని తెలిపారు. మస్క్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారీగా టారిఫ్లుప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ యూఎస్‌ను బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. భారత్ అందుకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉందని, దేశంలో కార్లను విక్రయించడం టెస్లాకు దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమన్నారు. భారత్‌లోని సుంకాలను ఉద్దేశించి సమన్యాయం, న్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆవశ్యకతను ట్రంప్ నొక్కిచెప్పారు. ఇదీ చదవండి: యాక్టివ్‌గా ఉన్న కంపెనీలు 65 శాతమేసుంకాలు తగ్గింపుమోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై విమర్శలు ఉన్నప్పటికీ భారతదేశం ఇటీవల హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. ఇది భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైల్లో షోరూమ్‌ల కోసం స్థలాలను గుర్తించినట్లు ప్రకటించింది. భారతదేశంలో పని చేసేందుకు మిడ్ లెవల్ పొజిషన్లను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. అధిక టారిఫ్‌లు ఉన్నప్పటికీ భారత మార్కెట్లో టెస్లా తన ఉనికిని చాటేందుకు చర్యలు చేపట్టింది. -
బైడెన్.. ఎవరిని గెలిపించేందుకు భారత్‌కు డబ్బులిచ్చారు?: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాజీ అధ్యక్షుడు జో బైడెన్, భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతం కోసం 21 మిలియన్ డాలర్లను అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి? అని ప్రశ్నించారు. ఎవరినో గెలిపించేందుకే బైడెన్ ఇలా చేశారని ఆరోపించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తాజాగా మియామీలో ఓ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి?. భారత్‌లో మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. ఎవరి కోసం బైడెన్ డబ్బులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే కీలక ముందడుగు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా డబ్బులు ఎందుకు?. 21 మిలియన్ డాలర్లు ఇవ్వడమేంటి?. భారత్ వద్దే చాలా సొమ్ము ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని మోదీ పట్ల చాలా గౌరవం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, "... Why do we need to spend $21 million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government... This is a total… pic.twitter.com/oxmk6268oW— ANI (@ANI) February 20, 2025 -
అమెరికా పొమ్మంటోంది.. ఖర్చులు రమ్మంటున్నాయ్..
హైదరాబాద్‌లోని మీర్జాలగూడ (Mirjalguda) నివాసితులైన దంపతుల కుమారుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పీజీ చేస్తున్నాడు.. ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండాలని, అక్కడే ఒక హోటల్లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అది కూడా వారానికి రెండు రోజులు మాత్రమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉద్యోగం మానేయాలా వద్దా? లేక అమెరికా(United States of America) నుంచి తిరిగి వచ్చేయాలా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నగరంలో నివసించే దంపతుల ఇద్దరు కుమారులూ అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అక్కడ పంజాబ్‌కు చెందిన ఆభరణాల వ్యాపారుల దగ్గర మంచి వేతనానికి పనిచేస్తున్నారు. వీరు ఇంకా ఉద్యోగం మానమని చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులు వీరి గురించి ఆందోళన చెందుతున్నారు. ⇒ కొన్నేళ్లుగా అటు చదువు.. ఇటు పార్ట్ టైమ్ ఉద్యోగాలతో(Part time Job) అటు చదువు కోసం చేసిన అప్పుల్ని అమెరికాలో జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పలువురు నగర విద్యార్థుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో బహిష్కరణ భయాల మధ్య యునైటెడ్ స్టేట్స్(యూఎస్)లోని మన విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా.. మధ్యతరగతికి చెందినప్పటికీ స్థోమతకు మించి విదేశీ విద్యను ఎంచుకున్న మన విద్యార్థుల్లో అత్యధికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువు కోసం చేసిన భారీ రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు అక్కడి జీవన వ్యయాలను భరించడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతూ వచ్చిన విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది తదుపరి ఉన్నత చదువులకు అడ్మిషన్లపై ప్రభావం చూపక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నిన్నా మొన్నటి దాకా అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపిన మన రాష్ట్రం నుంచి భవిష్యత్తులో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నవారిని ఈ పరిస్థితులు పునరాలోచనలో పడేస్తున్నాయి.ఉద్యోగాలకు అనుమతి ఉన్నా..హెచ్–1 వీసాలపై అమెరికాలో ఉన్న విద్యార్థులు తాము చదువుతున్న క్యాంపస్‌లోనే వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే కాలేజీ క్యాంపస్‌లలో పనిచేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ అక్కడ తగినన్ని ఉద్యోగావకాశాలు లేకపోవడం లేదా అక్కడ ఆశించిన ఆదాయం రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఖర్చుల్ని భరించడం కోసం క్యాంపస్ వెలుపల రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో అనధికారికంగా పనిచేస్తున్నారు.⇒ కాలేజీ సమయం ముగిసిన తర్వాత ఒక చిన్నకేఫ్లో ప్రతిరోజూ 6 గంటలు పని చేసేవాడిని. గంటకు 7 డాలర్లు చొప్పున లభించేవి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన వైఖరితో వారం రోజుల క్రితం పని వదిలేశా.. ఇది ఇబ్బంది పెట్టే సంగతే.. అయినా ఇక్కడ చదువుకోవడానికి 50,000 డాలర్లు(సుమారు రూ.43.5 లక్షలు) రుణం తీసుకున్నా. జాబ్ కోసం చదువును పణంగా పెట్టే పరిస్థితిలో లేను’ అని ఇల్లినాయిస్లో గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి ధ్రువన్ చెప్పాడు.⇒ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా చెల్లుబాటయ్యే వర్క్ వీసాలు కలిగిన వ్యక్తులను మాత్రమే నియమించుకోవడం ప్రారంభించాయి. గతంలో స్థానిక వ్యాపారాలు, ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మన విద్యార్థులపై ఆధారపడేవి. ఇప్పుడు, వారు విద్యార్థులను తొలగించి, చెల్లుబాటు అయ్యే జాబ్ వీసాలో ఉన్నవారిని నియమించుకుంటున్నారు. న్యూయార్క్‌లో మాస్టర్స్ చదువుతున్న ఓ విద్యార్థిని నేహా మాట్లాడుతూ ‘పని ప్రదేశాలలో తనిఖీలు చేస్తున్నారు.. దాంతో నన్ను నా ఫ్రెండ్స్‌ను పార్ట్‌టైమ్ ఉద్యోగాలు మానేయాలని మాకు జాబ్స్ ఇచ్చినవారు వెళ్లగొట్టారు. ఇది చాలా కష్టం, కానీ పూర్తి బహిష్కరణకు గురికావడం లేదా మా విద్యార్థి వీసా స్థితిని కోల్పోవడం మరింత నష్టం. నన్ను ఇక్కడికి పంపించడానికి నా తల్లిదండ్రులు ఇప్పటికే చాలా రకాల త్యాగాలు చేశారు’ అని చెప్పింది. ఈ పరిస్థితులపై ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ ‘విద్యార్థులు క్యాంపస్ వెలుపల పనిచేయడం అక్కడ చట్టవిరుద్ధం. మునుపటి పాలకుల్లా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హెచ్1బీ, గ్రీన్కార్డ్లతో పాటు తమ భవిష్యత్ ఇమ్మిగ్రేషన్ అవకాశాల గురించి విద్యార్థులు భయపడుతుండటం సహజమే’ అని చెప్పారు. -
భారత్‌కు సాయం అనవసరం
వాషింగ్టన్: భారత్‌లో ఓటింగ్‌ను పెంచడానికంటూ అందిస్తూ వస్తున్న 2.1 కోట్ల డాలర్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్‌కు అసలు ఇంతకాలంగా ఆ మొత్తం ఎందుకు ఇస్తూ వచ్చినట్టని ప్రశ్నించారు. విదేశాలకు సహాయ నిధులకు కోత పెడుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన అనంతరం మంగళవారం తన నివాసం మార్–ఎ–లాగోలో అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ దగ్గర చాలా డబ్బుంది. అమెరికా నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మాపై వాళ్ల టారిఫ్‌లు చాలా ఎక్కువ. అలాంటి దేశానికి 2.1 కోట్ల డాలర్లు ఎందుకిస్తున్నామో అర్థం కావడం లేదు!’’ అన్నారు. అయితే భారత్ పట్ల, ఆ దేశ ప్రధానిపై నాకెంతో గౌరవముందని చెప్పుకొచ్చారు. భారత్‌తో పాటు పలు దేశాలకు అందిస్తున్న మొత్తం 72.3 కోట్ల డాలర్ల సహాయ నిధులకు డోజ్ ఆదివారం మంగళం పాడటం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ స్పందించారు. భారత్‌లో ఓటింగ్ శాతం మెరుగు పరిచేందుకు అమెరికా నుంచి 2.1 కోట్ల డాలర్లను ఇన్నేళ్లుగా ఎవరు అందుకుంటూ వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న వార్తలను కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ఇప్పటికే ఖండించడం తెలిసిందే. 2012లో తాను సీఈసీగా ఉండగా ఈ మేరకు అమెరికా ఏజెన్సీ నుంచి ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.‘స్పేస్’లో మస్క్ జోక్యముండదుఅంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జోక్యం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ ప్రధానంగా డోజ్ ద్వారా ప్రభుత్వానికి ఖర్చులను తగ్గించే పనిమీద ఉంటారన్నారు. ‘‘ఆయనను మీరు ఉద్యోగి అని పిలవవచ్చు. కన్సల్టెంట్ అనొచ్చు. మీకు నచ్చినట్లుగా పిలవవచ్చు, కానీ ఆయన దేశభక్తుడు’’ అని చెప్పుకొచ్చారు. మస్క్ ప్రభుత్వోద్యోగి కాదని, ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలూ లేవని వైట్‌హౌస్ సోమవారం పేర్కొనడం తెలిసిందే.టారిఫ్‌లపై తగ్గేదే లేదుపరస్పర టారిఫ్‌ల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. ‘భారత్‌కు మినహాయింపు లేదు. మీరెంత విధిస్తే మేమూ అంతే విధిస్తా’మని ప్రధాని మోదీకి స్పష్టం చేశానని చెప్పారు. ప్రతి దేశానికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఎలాన్ మస్క్‌తో కలిసి ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్ వంటి రంగాల్లో అమెరికాపై భారత్ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ చెప్పగా అవునంటూ మస్క్ శ్రుతి కలిపారు.‘బైడెన్ అటార్నీ’లకు ఉద్వాసనమాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన అటార్నీలందరినీ తొలగించాలని ట్రంప్ ఆదేశించారు. న్యాయశాఖను గత నాలుగేళ్లలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయమయం చేశారంటూ ఆక్షేపించారు. అందుకే ఆ శాఖలో ‘బైడెన్ శకం’ ఆనవాళ్లను తొలగించాలని ఆదేశించినట్టు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘‘నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ఇంటిని ప్రక్షాళన చేయాల్సిందే. స్వర్ణయుగపు అమెరికాలో నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ రోజు నుంచే అది మొదలవుతుంది’’ అన్నారు. యూఎస్ అటార్నీలుగా పిలిచే ఫెడరల్ ప్రాసిక్యూటర్లను నామినేట్ చేయడం అధ్యక్షుడి బాధ్యత. అమెరికాలో ప్రస్తుతం 93 మంది అటార్నీలున్నారు. ప్రభుత్వ చట్టాల అమలు వీరి బాధ్యత. రిపబ్లికన్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి న్యాయ శాఖ తీవ్ర ప్రకంపనలకు గురవుతోంది. పలువురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు.ఉక్రెయిన్‌లో సైనిక పాలనజెలెన్స్కీకి స్వదేశంలో ఆదరణ పూర్తిగా అడుగంటిందని ట్రంప్ అన్నారు. ‘‘జెలెన్స్కీ రేటింగ్స్ 4 శాతానికి పడిపోయాయి. ఆయ నకు ధైర్యముంటే తక్షణం ఎన్నికలకు వెళ్లాలి’’ అని సవాలు కూడా చేశారు. రష్యా కోరిక మేరకే ఇలా ఉక్రెయిన్‌లో ఎన్నికలకు డిమాండ్ చేస్తున్నానన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘నాతో పాటు చాలా దేశాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ లో ఏళ్లుగా సైనిక పాలన నడుస్తోంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖర్లోగా పుతిన్‌తో తాను భేటీ అయ్యే అవకాశముందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై ట్రంప్ తాజా వ్యాఖ్యలను డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ పూర్తిగా సమర్థించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘‘జెలెన్స్కీకి శాంతి ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిందల్లా మరింత డబ్బు, అధికారం మాత్రమే’’ అంటూ ఆక్షేపించారు. -
భారత 'శ్రమ'కు మస్త్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్నదేశం మనదే. అత్యధికంగా ఉద్యోగ, కార్మిక శక్తి లభ్యత ఉన్న దేశం కూడా భారతే. ఈ భారతీయ వర్క్‌ఫోర్స్‌ను ఇప్పుడు కొన్ని దేశాలు కళ్లకద్దుకొని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత ఉద్యోగ, కార్మిక శక్తికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.అమెరికా వద్దన్నా..డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత అమలుచేస్తున్న కఠిన నిబంధనలతో ఆ దేశంలో భారతీయులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆసియా, యూరప్‌లో మనవాళ్లకు అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారత కార్మిక శక్తికి ఇప్పటికే పశ్చిమాసియా అతిపెద్ద జాబ్ మార్కెట్‌గా ఉంది. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ దేశాల్లో 30 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు లభించవచ్చని కేంద్ర కార్మికశాఖ అంచనా వేసింది.ఒక్క సౌదీ అరేబియాలోనే పదేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు ఉపాధి లభించవచ్చని పేర్కొంది. ఆ దేశంలో నిర్మాణ, రిటైల్, రవాణా, స్టోరేజీ, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో భారతీయులకు మంచి డిమాండ్ ఉన్నట్టు గుర్తించారు.సీఐఐతో కలిసి ‘ఫ్రేమ్‌వర్క్’ తయారీసౌదీ, ఖతార్, ఒమన్, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియాలో భారత వర్క్‌ఫోర్స్‌కు అవకాశాలు పెంచేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తో కలిసి కేంద్ర కార్మికశాఖ ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. కార్మికుల నైపుణ్యాలు, విద్యార్హతలను గుర్తించి పై దేశాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చటం ఈ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమని అధికారవర్గాలు తెలిపాయి. ఒమన్‌లో ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఖతార్‌లో ఆతిథ్యం, ఏవియేషన్, స్పోర్టింగ్ ఈవెంట్లతో ముడిపడిన పరిశ్రమలు.. జపాన్‌లో నర్సింగ్, ఆతిథ్యం, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్టేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) రంగాల్లో భారతీయులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. టర్కీ, దక్షిణాఫ్రికా, కువైట్, గుయానా, కెనడా, మలేసియాలలో కూడా భారత వర్కర్లకు అవకాశాలు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.యూఏఈ అతిపెద్ద మార్కెట్వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. మనదేశంలో అందుబాటులో ఉన్న వర్క్‌ఫోర్స్ తదితర అంశాలపై విశ్లేషణ కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో నమోదైన డేటాను కేంద్ర కార్మికశాఖ విశ్లేషించింది. దీని ప్రకారం యూఏఈ భారత వర్కర్లకు అతిపెద్ద గమ్యస్థానంగా నిలుస్తున్నట్టు వెల్లడైంది. 2023–24లో ఇజ్రాయెల్‌లో భారత వర్కర్లకు గణనీయంగా ఉద్యోగాలు లభించాయి. నిపుణులకు జర్మనీ ఆహ్వానంజర్మనీలో వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల మంది భారతీయ వర్కర్లకు ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. జర్మనీ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2035 నాటికి ఆ దేశంలో 70 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఏర్పడనుంది. ఆస్ట్రేలియాలో నర్సులు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఫిన్లాండ్లో హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, ఉత్పత్తి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం భారతీయులకు కాంట్రాక్టు, ప్రాజెక్టు ఆధారిత ఉపాధి అధికంగా ఉంది. కానీ, ఫుల్‌టైమ్ ఉద్యోగాల కల్పనకు మనదేశం మొగ్గుచూపుతున్నట్టు కార్మికశాఖ చెబుతోంది. -
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్‌కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్‌లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్‌లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. అమెరికా–సోవియెట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే. అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది. ఈ పరిణామాలే పుతిన్‌ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్‌ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్‌పై దండెత్తటం వర్తమాన చరిత్ర.యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్‌లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి. ఉక్రెయిన్‌కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్‌లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్కాఫ్లే అందుకు కారణం కావొచ్చు. పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి. -
‘రాజకీయ కారణాలతోనే బైడెన్ వారిని వదిలేశారు’
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఆయన సన్నిహితుడు ఇలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాల వల్లే సునీతా విలియమ్స్,విల్మోర్లను బైడెన్ అంతరిక్షంలో వదిలేశారని చెప్పారు. మంగళవారం(ఫిబ్రవరి 18)ట్రంప్, మస్క్ సంయుక్తంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడి ఆదేశాల మేరకు వ్యోమగాములిద్దరిని నాలుగు వారాల్లో భూమికి తీసుకువస్తామని మస్క్ తెలిపారు. గతంలో చాలా మంది వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చిన చరిత్ర తన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీకి ఉందన్నారు. ఇంతలో ట్రంప్ జోక్యం చేసుకుని వారిని త్వరగా తీసుకు రావాలని మస్క్‌ను కోరారు. గతంలో బైడెన్ వ్యోమగాములను తీసుకువచ్చేందుకు ‘స్పేస్ ఎక్స్’కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని ట్రంప్ చెప్పారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి(ఐఎస్ఎస్) 10 రోజుల కోసం వెళ్లిన సునీత,విల్మోర్లు బోయింగ్ వ్యోమనౌకలో సమస్యల వల్ల ఇప్పటికీ భూమికి తిరిగి రాలేదు. వీరిని మార్చి మొదటి వారంలో మస్క్‌కు చెందిన స్పేస్ క్స్ క్రూ డ్రాగన్ భూమికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్:భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయాన్ని ఇటీవల అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్ మంగళవారం(ఫిబ్రవరి 18) సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి. వాళ్ల దగ్గరే చాలా డబ్బులున్నాయి. అమెరికాపై వాళ్లు భారీగా పన్నులు వేస్తున్నారు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది’అని ట్రంప్ అన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్ 2 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన ముగిసిన వెంటనే బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) భారత్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం భారత్‌కే కాకుండా బంగ్లాదేశ్,పాకిస్తాన్ తదితర దేశాలకు అందించే సాయాన్ని కూడా అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో భాగంగా డీవోజీఈ ఆపివేసింది. -
అమెరికా కీలక ఒప్పందం.. భారత వలసదారులు ఇక కోస్టారికాకు!
శాన్‌జోస్: భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అగ్రరాజ్యం తమతో ఒప్పందం చేసుకున్నట్టు కోస్టారికా వెల్లడించింది. అందులో భాగంగా వలసదారుల తొలి విమానం బుధవారం తమ దేశానికి రానున్నట్టు కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చావెస్ రోబెల్ కార్యాలయం ప్రకటించింది.ఈ సందర్బంగా రొడిగ్రో మాట్లాడుతూ..‘భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వస్తున్నారు. అనంతరం వారిని మాతృదేశాలకు పంపేస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తాం’ అని తెలిపారు. అయితే 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు.అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను ఆ సంస్థే చూసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతీయులను స్వదేశానికి పంపించింది. ఇదిలా ఉండగా.. పనామా హోటల్లో భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులు ఉన్నారు. యూఎస్ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది. వలసదారుల్లో ఇరాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. Costa Rica Will Take Central Asian and Indian Migrants Deported by U.S.Costa Rica is the second Central American nation to accept migrants from distant countries as the Trump administration ramps up deportation flights. pic.twitter.com/AhCqKhiOIt— Deportation Counter (@DeportedNumber) February 18, 2025 -
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
మారాల్సిన దౌత్యం తీరు
దౌత్య కెమిస్ట్రీ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు ఒక నిర్మాణాత్మక వాతావరణాన్ని అందిస్తుంది. ఇలాంటి సంబంధం ఉద్రిక్తతలను తగ్గిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దౌత్యం అనేది పూర్తిగా నాయకత్వ స్థాయి కెమిస్ట్రీ పైనే ఆధారపడదు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు అదృష్టవ శాత్తూ పరస్పర ప్రయోజనం, ప్రజా మద్దతుకు చెందిన దృఢమైన చట్రంపై ఆధారపడి ఉన్నాయి. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి, బహుళ రంగాలలో అనేక సంవత్సరాల పరిణామ క్రమంపై కూడా ఇవి నిర్మితమై ఉన్నాయి. అయితే మనం జీవిస్తున్నది విచ్ఛిన్న మవుతున్న ప్రపంచం. దీంట్లో ఆత్మసంతృప్తికి కాలం చెల్లిపోయింది.మారిన సవాళ్లునేడు మనం ఎదుర్కొంటున్న వాస్తవాలు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలానికి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ దౌత్య చలనశీలత మారిపోయింది. యుద్ధం– సంఘర్షణ, కొల్లగొట్టే పోటీ, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచీకరణకు చెందిన క్షీణిస్తున్న ఆకర్షణలు భౌగోళిక రాజకీయాలను నిర్వచిస్తున్నాయి. ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదా నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ రాజకీయాల్లో జన రంజక, స్థానికవాదపు ఉప్పెనపై ఆయన స్వారీ చేస్తున్నారు.మోదీ అమెరికా పర్యటన ఫలితాలను మీడియా మొత్తంగా విశ్లే షించింది. ఇప్పుడు భారతదేశంపై ట్రంప్ ప్రాపంచిక దృక్పథం చూపిన ప్రభావం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ట్రంప్ విలువ ఇవ్వలేదని కాదు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గగనతలం, భూమి, సముద్రం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌తో సహా వివిధ రంగాలను ఉన్నతీకరించడానికి, సైనిక సహకారాన్ని పెంచడానికి ఇరు పక్షాలూ ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టమైంది. ఎఫ్–35 జెట్ల వంటి అధు నాతన విమానయాన వ్యవస్థల అమ్మకాలకూ, సహ ఉత్పత్తికీ ప్రణాళి కలు ఉన్నాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ వాణిజ్యం, వలసల కోసం ఉమ్మడి వ్యూహాత్మక దృష్టి కూడా ఉంది. ఇవి మరింత సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ‘ప్రతీకార’ సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ప్రాథమికంగా దెబ్బతీస్తాయి, వ్యాపార అనిశ్చితులు పెరుగుతాయి, భౌగోళిక రాజకీయ అంతరాలు తీవ్రమ వుతాయి. దేశాలు అమెరికాతో తమ వాణిజ్య సంబంధాలను తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పర్చిన సరఫరా గొలు సులు, అలాగే ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కూడా ప్రభావితం కావచ్చు. అమెరికా సుంకాలను విధించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు ప్రభావిత మవుతాయి. ఇది వినియోగదారులను దెబ్బతీస్తుంది. అధిక ద్రవ్యో ల్బణానికి దోహదం చేస్తుంది. వాస్తవానికి, చైనాకు దూరం జరు గుతూ, తన సరఫరా గొలుసులను అమెరికా వైవిధ్యపరిచినందు వలన, మన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంతో ఆర్థిక సంబంధాలపై ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానం భారత్‌కు సవాళ్లను కలిగిస్తుంది. వాటిని తక్కువ అంచనా వేయకూడదు.బ్రిక్స్ దేశాలకు బెదిరింపుఅమెరికాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడానికి జాగ్రత్తగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రతీకార సుంకాల విధానం భారత్ తన సొంత సుంకాలను హేతుబద్ధీకరించుకోవడా నికి తోడ్పడుతుంది. ఈ సంవత్సరం చివరిలోపు రెండు దేశాలు కుదుర్చుకోవాలనుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఒప్పందాన్ని చేరుకోవడం మన చర్చల నైపుణ్యాలకు నిజమైన పరీక్ష అవుతుంది. వలసల విషయానికి వస్తే, సంకెళ్లలో బంధించి మరీ, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరిస్తున్న విధానం చాలా మందికి రుచించలేదు. ఇంతవరకూ అనుసరించిన బహిష్కరణ విధా నాలు తీవ్రమైన వివాదానికి దారితీశాయి. మన జాతీయులతో అమా నుషంగా ప్రవర్తించారనే భావన దేశీయుల్లో ఉంది. విదేశాలలోని మన పౌరులను రక్షించడంలో వైఫల్యంగా దీన్ని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా తన పౌరులను రక్షించుకోగల సామర్థ్యం స్మార్ట్ పవర్లో ఒక భాగం. చట్టపరమైన వలసలను, హెచ్–1బీ వీసా సమస్యలను రెండు దేశాలు నిస్సందేహంగా దీటుగా ఎదుర్కోగలవు. కానీ మానవ అక్రమ రవాణా పరిశ్రమను మన ఏజెన్సీలు ఎలా సమర్థంగా అణచివేయగలవనేదే మన సమస్య.బ్రిక్స్ దేశాలకు ట్రంప్ చేసిన హెచ్చరిక మరొక ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికన్ డాలర్ శక్తి ఆధారంగా ట్రంప్ ప్రపంచ ఆధిప త్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని నిరోధించే ప్రత్యా మ్నాయ ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ దేశాలు అనుసరిస్తే బ్రిక్స్‌కు మరణ శాసనం లిఖిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. బ్రిక్స్ సభ్యదేశమైన దక్షిణాఫ్రికా, శ్వేత ఆఫ్రికనర్ మైనారిటీని ప్రభావితం చేసే భూ విధా నాల కారణంగా చిక్కుల్లో పడింది. దీనిని ఎలాన్ మస్క్ ‘జాత్యహంకార యాజమాన్య చట్టాలు’గా ఎత్తి చూపారు. మస్క్ దక్షిణాఫ్రికాలో తన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ కోసం సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఫలి తంగా దక్షిణాఫ్రికాకు తాను అందించే అన్ని ఆర్థిక సహాయాలనూ అమెరికా నిలిపివేసింది. పైగా జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విధాన ‘సూత్రాల’కు నష్టం కలుగుతున్నట్లు కనిపిస్తే దౌత్య సంబంధాలను త్యాగం చేయడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇది చెబుతోంది.బహుళ ధ్రువ ప్రపంచంబహుళ ధ్రువ ప్రపంచం గురించి నేడు చాలా చర్చ జరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ఇంట ర్వ్యూలో ‘ప్రపంచానికి ఏక ధ్రువ శక్తి ఉండటం సాధారణం కాదు’ అని అంగీకరించారు. ఇది ఓదార్పునిచ్చే మాటగా అనిపించవచ్చు. కానీ ‘అమెరికా ఫస్ట్’ అనే ప్రాపంచిక దృక్పథం అమెరికా ప్రాధాన్యం గురించిన అంతర్లీన అంచనాలను కలిగి ఉంది. పైగా బ్రిక్స్‌కు హెచ్చ రిక బహుళ పక్ష సమూహాలకు కూడా మేల్కొలుపు కానుంది: గట్టిగా కోరుకుంటే ఉనికిలో ఉండండి, కానీ అమెరికన్ నియమాల ప్రకారం ఆడండి. అందుకే కొందరు ట్రంప్ కొత్త అధ్యక్ష పదవిని తనదైన ’సామ్రాజ్యవాదం’ అని పిలుస్తున్నారు.అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ ఇటీవల మాట్లాడిన ‘స్పష్ట మైన వ్యూహాత్మక వాస్తవాలు’ యూరప్ రక్షణ నుండి అమెరికా వైదొలగుతుందనీ, ఈ బాధ్యతను యూరోపియన్లకు వదిలివేస్తుందనీ సూచిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదంలో శాంతి అంటే రష్యా బలమైన పక్షం అని, ఉక్రెయిన్ ‘నాటో’లో భాగం కాలేదని లేదా రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందాలని అది కోరు కోలేదని ఆయన మాటలు సూచిస్తున్నాయి. విజేత అన్నింటినీ ఆక్ర మించగలదని భావించే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఛాంపియన్ కాబట్టి పాలస్తీనియన్లు సర్వం కోల్పోయారని పీట్ మాటలు చెబుతున్నాయి. చైనా విషయానికొస్తే, వాణిజ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఇతర రంగాలలో సహకారాన్ని విస్తరించ డానికి లేదా కనీసం ఆయనతో ఒక నిలకడైన పద్ధతిలో వ్యవహరించ డానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత సంద ర్భంలో స్నేహితులు, శత్రువులు ఎవరూ లేరు. కేవలం లావాదేవీలు జరపాలి, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. భారతదేశం తదనుగుణంగా తన దౌత్య దిక్సూచిని నిర్దేశించుకోవాలి.నిరుపమా రావు వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
ది డెటోనా 500 మోటార్ కార్ రేసులో ట్రంప్ బీస్ట్ (ఫొటోలు)
-
ఎవరినీ వదిలేది లేదు: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న్యాయంగా ఉంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్ విధానంపై సోమవారం(ఫిబ్రవరి 17) ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. తమ వాణిజ్య విధానంలో ఎక్కువ, తక్కువలకు చోటుండదన్నారు. అందరూ సమానమేనన్నారు.ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత సుంకాలు విధిస్తాయో తామూ అంతే విధిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఏ దేశమైనా భావిస్తే ముందు ఆ దేశం అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో ఉత్పత్తి, వస్తువుల తయారీ చేపడితే సుంకాలు ఉండవని తెలిపారు.సుంకాల విషయంలో అమెరికా మిత్ర,శత్రు దేశాలు చాలా కాలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యకక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. -
అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షంతో పాటుగా భారీ గాలులు వీస్తున్న కారణంగా పలు భవనాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు.)అమెరికాలో భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.Floodwaters are creeping toward homes as heavy rain triggers dangerous flash flooding across the south-central U.S., including Kentucky, West Virginia, Virginia, and Tennessee. pic.twitter.com/4PY8tAMLvg— AccuWeather (@accuweather) February 16, 2025అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. వర్జీనియా(#Virginia), పశ్చిమ వర్జీనియా, టేనస్సీలో కూడా వరదలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల పాటు వర్షాలు, భారీ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.Parts of West Virginia, Virginia, Kentucky, Arkansas, and Tennessee are experiencing severe flooding. I wonder what they think about Donald Trump wanting to get rid of FEMA right about now? pic.twitter.com/VLts0ltv5s— Art Candee 🍿🥤 (@ArtCandee) February 16, 2025మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. Amerika'yı fırtına vurdu!ABD’nin Tennessee, Kentucky, Virginia ve Georgia eyaletlerinde meydana gelen fırtına ve selde, ilk belirlemelere göre 9 kişi hayatını kaybetti. pic.twitter.com/vSe020el2I— 23 Derece (@yirmiucderece) February 17, 2025 #BREAKING: Powerful overnight storm leaves at least 9 dead in Kentucky & Georgia, officials say#tnwx #Georgia #Floods #Tornado #Tennessee#Kentucky #Virginia pic.twitter.com/by2i750f1o— JUST IN | World (@justinbroadcast) February 16, 2025 -
స్నేహితుడికి ట్రంప్ వెన్నుపోటు
-
ఉక్రెయిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్:రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి16) ఫ్లోరిడాలో జరిగిన డేటోనా 500 కార్ రేసులకు విచ్చేసిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు.అయితే ఈ వారం సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు జెలెన్స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్నదానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. గత వారం రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుదీర్ఘచర్చలు జరిపారు.దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో స్పందించారు.రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా తమను కూడా భాగస్వామిని చేస్తే బాగుండేదన్నారు. అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని, తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కేవలం యుద్ధానికి విరామం ఇచ్చి ఇంకా శక్తి కూడగట్టుకుంటున్నారని చెప్పారు. యూరప్‌కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు. కాగా, గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో రష్యాతో యుద్ధం చేయడానికిగాను ఉక్రెయిన్‌కు భారీ సాయం అందిన విషయం తెలిసిందే. -
నేడు యూరప్ అధినేతల అత్యవసర భేటీ!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. -
భారత్‌కు 2.1 కోట్ల డాలర్ల... ఎన్నికల నిధులు ఆపేశాం
వాషింగ్టన్: విదేశీ నిధులకు కత్తెర వేసే చర్యల్లో భాగంగా భారత్‌కు అందజేస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్టు అమెరికా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు కోట్లాది డాలర్ల ఎన్నికల నిధులిచ్చే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ఆదివారం ప్రకటించింది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేస్తున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్థిక వనరుల వృథాకు ముకుతాడు వేసేందుకు డోజ్‌ను అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తెలిసిందే. ‘‘భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి 2.1 కోట్ల డాలర్ల చొప్పున ప్రత్యేకిస్తూ వస్తున్నాం. ఇకపై ఆ ఫండింగ్‌ను నిలిపేస్తున్నాం’’ అని డోజ్ వెల్లడించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో భేటీ అయిన మూడు రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే భారత్‌కు ఇస్తున్నట్టు చెబుతున్న ఈ 2.1 కోట్ల డాలర్లను ఎప్పటినుంచి, ఎంత తరచుగా, ఎవరికి అందజేస్తూ వస్తోందన్న దానిపై స్పష్టత లేదు. ఈ వ్యవహారంపై బీజేపీ తక్షణం స్పందించింది. ఇది కచ్చితంగా భారత ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమేనంటూ దుయ్యబట్టింది. ‘‘ఓటింగ్ పెంచడానికి 2.1 కోట్ల డాలర్లా? దీని వల్ల ఎవరికి లాభం చేకూరుతూ వస్తున్నట్టు? కచ్చితంగా అధికార పారీ్టకైతే కాదు!’’ అంటూ పార్టీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నిధులను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే పొందిందని ఆరోపించారు. ‘‘2012లో నాటి ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.వై.ఖురేషి నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తాలూకు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్‌తో ఒప్పందం చేసుకుంది. అలా మన ఎన్నికల వ్యవస్థను విదేశాలకు అప్పగించడానికి కూడా వెనకాడలేదు! ఇప్పుడు వాళ్లే సీఈసీ నియామకంలో పారదర్శకత లేదని గగ్గోలు పెడుతున్నారు’’ అని దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులను ఈసీ వంటి సంస్థల్లోకి చొప్పించేందుకు యూపీఏ వీలు కల్పించిందని డోజ్ ప్రకటనతో స్పష్టమవుతోందన్నారు. బంగ్లాదేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 2.9 కోట్ల డాలర్లను కూడా నిలిపేస్తున్నట్టు డోజ్ పేర్కొంది. మరో 15 పై చిలుకు దేశాలకు ఇస్తున్న నిధులకూ మంగళం పాడుతున్నట్టు తెలిపింది. -
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్‌కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
మోదీ-ట్రంప్ భేటీ తర్వాతే భారత్‌కు అమెరికా భారీ షాక్!
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన అలా ముగించి ఇలా వచ్చారో లేదో.. భారత్‌కు ట్రంప్ భారీ షాకిచ్చారు. భారత్, బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అందించే మిలియన్ డాలర్ల నిధుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOSE) శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నిర్వహిస్తున్నారు. ఎలోన్ మస్క్ సూచన మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మోదీ గతవారం అమెరికాలో పర్యటించారు. పర్యటన సమయంలో ఇద్దరు నేతలు అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేసేలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి కేటాయించే 21 మిలియన్ల డాలర్లను, బంగ్లాదేశ్ రాజకీయాల్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన 29 మిలియన్ల డాలర్ల మొత్తాన్ని తగ్గించాలని అమెరికా నిర్ణయించినట్లు ఎలోన్ మస్క్ ప్రభుత్వ సామర్థ్య విభాగం డోజ్ ఆదివారం ప్రకటించింది. ఇదే విషయాన్ని డోజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్‌ని ప్రధాని మోదీని కలిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం.మరోవైపు బంగ్లాదేశ్‌లో, రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పాలనను మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అమెరికా ఆదేశానికి 29 మిలియన్ డాలర్లను కేటాయిస్తుండేది. తాజాగా ఆ నిధుల కేటాయింపుల్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది.హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించడంతో దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నప్పటికీ, రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వం తన విదేశాంగ విధాన వ్యూహాల్లో భాగంగా వివిధ దేశాలలో ప్రజాస్వామ్యం, పాలన కార్యక్రమాలకు తరచుగా నిధులు సమకూరుస్తుంది. అలా భారత్‌లో ఓటింగ్ శాతం పెరగడానికి డబ్బు ఖర్చు చేస్తుంది. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాల్ని ప్రోత్సహించడం ద్వారా చైనా వంటి దేశాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. -
వలసదారులపై ట్రంప్ కొరడా
-
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. న్యాయమూర్తులను తొలగిస్తూ..
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు. అంతకు ముందు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులను, ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను నోటీసు లేకుండా తొలగించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్ తెలిపారు. ఇలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఆ వ్యాజ్యాలపై ట్రంప్ స్పందించారు. ‘తన దేశాన్ని కాపాడుకునే వారు ఎన్నటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించరూ’ అంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల జారీఈ ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అమెరికా ఫస్ట్ నినాదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం,పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు,ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దుల్ని మూసివేయడం, అమెరికా- మెక్సికో మధ్యన గోడ నిర్మించడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ఇలా మెరుపు వేగంతో పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లను జారీ చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వరుస వ్యాజ్యాలుఅయితే, వాటిల్లో అక్రమ వలసలపై కొనసాగుతున్న కఠిన చర్యలు, లింగమార్పిడి వ్యక్తులను అమెరికా సైన్యంలో పనిచేయకుండా నిషేధించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడం అంశాలపై వ్యతిరేకత ఎదురైంది. అమెరికా వ్యాప్తంగా పలువురు ట్రంప్ నిర్ణయాలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిల్లో, అక్రమ వలసలపై అణిచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేసే ఏడు వ్యాజ్యాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు జనవరి 2021 కాపిటల్ అల్లర్లపై బ్యూరో దర్యాప్తులో పాల్గొన్న ఎఫ్‌బీఐ ఏజెంట్లు, సిబ్బంది పేర్లను వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ట్రంప్‌పై పలు కేసులు నమోదయ్యాయని అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నెపోలియన్‌ను ప్రస్తావిస్తూఈ వరుస పరిణామలపై ట్రంప్ స్పందించారు. తన దేశాన్ని రక్షించేవాడు ఏ చట్టాన్ని ఉల్లంఘించడు అని ట్రూత్ సోషల్ యాప్‌లో పోస్ట్ చేసారు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడానికి ముందు 1804లో నెపోలియన్ కోడ్ ఆఫ్ సివిల్ లాను రూపొందించిన ఫ్రెంచ్ సైనిక నాయకుడి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ, ఇది ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించే సమయంలో నెపోలియన్ తరచూ ఈ కొటేషన్‌ను వినిపించేవారు. కోర్టు తీర్పులకు తాను కట్టుబడి ఉంటానని ట్రంప్ చెబుతుండగా, ఆయన సలహాదారులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దాడి చేసి, వారిపై అభిశంసనకు పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధమైన అధికారాన్ని నియంత్రించడానికి న్యాయమూర్తులకు అనుమతి లేదు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత వారం ట్వీట్ చేశారు. -
భారత్‌కు ట్రంప్ దెబ్బ.. ఐటీ, ఫార్మాకు బిగ్ షాక్!
ఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దూకుడు పెంచారు. ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ఇదే సమయంలో భారత్‌పై కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే.. టారిఫ్‌లు తగ్గించేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మనదేశ ఎగుమతులు, దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే.. మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. మనదేశ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. 2021-24 మధ్య కాలంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారతదేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.ట్రంప్ టారిఫ్‌లు ఎందుకు విధిస్తున్నట్లు?విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతి దేశమూ పన్నులు/సుంకాలు (టారిఫ్/కస్టమ్స్ సుంకం) విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తుంటారు. ప్రతీకార సుంకం అంటే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే, అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్‌లు విధిస్తుంది.ఇక, 2023-24లో భారతదేశంతో కూడా అమెరికాకు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3% అయితే, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17% ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్‌లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా ఈ కింది దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది. డెయిరీ ఉత్పత్తులు: 188%, పండ్లు మరియు కూరగాయలు: 132%, తృణ ధాన్యాలు: 193%, నూనెగింజలు, కొవ్వులు, నూనెలు: 164%, పానీయాలు మరియు పొగాకు: 150%, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు: 53%, చేపల ఉత్పత్తులు, రసాయనాలు: 35% నుంచి 56%. -
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్‌షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్‌షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్‌షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను అరెస్ట్‌చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్‌లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్‌ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్‌షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్‌షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్‌పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్‌పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా ఇదే మగ్‌షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్‌షాట్‌ను వైట్‌హౌస్‌లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్‌చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్‌లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ఈ ఫొటోఫ్రేమ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్‌గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్‌షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్‌ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్‌హౌస్‌లో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్‌హౌస్‌లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్‌గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్‌హౌస్, ఎయిర్‌ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్‌హౌస్‌లోని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్‌సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్‌లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్‌లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుకుంటూ.. మిత్ర దేశాలను, శత్రుదేశాలను భయానికి గురిచేస్తున్నారు. పన్నుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు.. సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్ల మీద మాత్రమేనా.. ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద కూడా సుంకాలను విధిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమానతలను పరిష్కరించడానికి సుంకాలు విధించడం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం ఆ దేశంలోనే తయారవుతున్నాయి. దిగుమతులలో సగం మెక్సికో.. కెనడా నుంచి వస్తున్నాయి. మిగిలిన సగం జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ దేశాలు దిగుమతి చేస్తున్నాయి.ఉక్కు, అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకం ప్రకటించినప్పుడు.. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కార్ల ధరలను విపరీతంగా పెంచుతుందని, మా సరఫరా గొలుసులకు కూడా అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ పరిపాలనలోనే చర్చలు జరిపిన యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందానికి (USMCA) కూడా ప్రతికూలత కలుగుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలకు సంబంధించిన ప్రణాళికలను అధ్యక్షుడు ఇటీవల నిర్ధారించారు. అయితే డెట్రాయిట్ ఆటోమేకర్లు జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్ వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ కౌన్సిల్.. మెక్సికో & కెనడాపై ప్రతిపాదిత సుంకాలను తగ్గించాలని ట్రంప్‌కు పిలుపునిచ్చింది. -
రెండు అగ్రదేశాలు.. ఇద్దరు అగ్రనేతలు..
-
డాలర్‌తో గేమ్స్ ఆడితే 100% సుంకాలు!
వాషింగ్టన్: భారత్‌తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్‌తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్‌ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్‌ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, ‘‘డాలర్‌తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు. బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్‌పై 100 శాతం టారిఫ్‌లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. -
మోదీకి స్పెషల్ గిఫ్ట్
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్‌హౌస్‌లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫొటోలో ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరు గ్రేట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటన ‘హలో ట్రంప్’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్‌మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫొటో కూడా ఉంది. ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్ చొరవ, స్పేస్ ఫోర్స్ ఏర్పాటు, జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు. -
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్‌ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్‌కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా అఫ్గాన్‌కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్‌కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
India-U.S relations: ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
వాషింగ్టన్: ట్రంప్ 2.0తో మోదీ 3.0 తొలి భేటీ బంపర్ హిట్టయింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెండింతలకు పెంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా భారత్‌కు అమెరికా అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను అందజేయడమే గాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతులను ఇతోధికంగా పెంచనుంది. భారీగా చమురు, సహజవాయువు కూడా సరఫరా చేయనుంది. ఇరు దేశాలూ పౌర అణు సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జరిపిన సమావేశం ఇలాంటి పలు కీలక ఒప్పందాలకు వేదికైంది. రెండు రోజుల అమెరికా పర్యటన(Usa Tour)లో భాగంగా అధ్యక్షునితో మోదీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ అయ్యారు. మోదీ మూడోసారి ప్రధానిగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం. మోదీని ట్రంప్ అత్యంత ఆత్మీయంగా స్వాగతించారు. చాలాసేపటిదాకా కరచాలనం చేయడమే గాక ప్రధానిని గట్టిగా హత్తుకున్నారు. ‘మీరో అద్భుతమైన వ్యక్తి. గొప్ప మిత్రుడు. మిమ్మల్నెంతగానో మిస్సయ్యాం’ అంటూ అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అనంతరం భారత్, అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తర్వాత 44 నిమిషాల పాటు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. అమెరికాకు మోదీ చిరకాల మిత్రుడంటూ మీడియా ముఖంగా కూడా ట్రంప్ పదేపదే ప్రశంసించారు. భారీ వర్తక ఒప్పందం: ట్రంప్ చైనాతో పాటు పలు దేశాలపై దూకుడైన టారిఫ్‌ల యుద్ధం ప్రకటించిన ట్రంప్, భారత్‌పై టారిఫ్‌ల విషయంలో మాత్రం కాస్త సున్నితంగానే స్పందించారు. కాకపోతే పరస్పర టారిఫ్‌ల విషయంలో మాత్రం అస్సలు మొహమాటపడబోమని మోదీ సమక్షంలో ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అమెరికాపై భారత్ విధించే సుంకాలనే తామూ విధించి తీరతామన్నారు. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా హెచ్చుగా, ఏకపక్షంగా ఉన్నాయంటూ సంయుక్త మీడియా భేటీలోనే ఆక్షేపించారు. అయితే, అమెరికా నుంచి చమురు, సహజవాయువు దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచేందుకు మోదీ సమ్మతించారని అధ్యక్షుడు వెల్లడించారు. ఆ రెండింట్లో భారత్‌కు తామే అతి పెద్ద సరఫరాదారులం కాబోతున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌తో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు రక్షణ హార్డ్‌వేర్ తదితర ఉత్పత్తుల ఎగుమతులను ఈ ఏడాది నుంచి ఏటా బిలియన్ డాలర్ల మేరకు పెంచనున్నాం. అంతేగాక ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లను భారత్‌కు అందజేస్తాం. భారత్‌తో అతి త్వర లో భారీ వర్తక ఒప్పందం కుదరనుంది. పౌర అణు ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇందులో భా గంగా అమెరికా అణు పరిజ్ఞానాన్ని భారత్ తన మార్కెట్లలోకి అనుమతించనుంది’’ అని వెల్లడించారు. భారత్–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్ దిశగా కృషి చేయాలని అంగీకారానికి వచ్చామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేసే దిశగా అధినేతల భేటీలో మరిన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో భాగంగా భారత్‌కు మరో 6 అత్యాధునిక పీ–8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, స్ట్రైకర్ యుద్ధ వాహనాలను భారత్‌లో సంయుక్త తయారీ తదితరాలకూ సమ్మతించింది. పదేళ్లకు రోడ్‌మ్యాప్: మోదీ భారత్, అమెరికా పరస్పర సహకారాత్మక బంధం మెరుగైన ప్రపంచానికి బాటలు పరుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వచ్చే పదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్ రూపొందించుకుంటామని చెప్పారు. అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. 2025ను అమెరికా–భారత్ పౌర అంతరిక్ష సహకార సంవత్సరంగా అభివర్ణించారు. ‘‘అన్ని విషయాల్లోనూ అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తారు. ఇది నేనెంతగానో అభినందించే విషయం. భారత ప్రయోజనాలకు నేను కూడా అంతే’’ అని వివరించారు. వ్యాపారవేత్త గౌతం అదానీ వివాదంపై ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా వ్యక్తులను గురించి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు. చైనాతో లద్దాఖ్ వివాదాన్ని ప్రస్తావించగా సరిహద్దు ఘర్షణలు ఎవరికీ మంచివి కావని అభిప్రాయపడ్డారు. ట్రంప్ జోక్యం చేసుకుని చైనా, భారత్, రష్యా, అమెరికా కలసికట్టుగా సాగాలని అభిలషించారు. ట్రంప్‌తో భేటీ అద్భుతంగా సాగిందని అనంతరం మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన భారత్ బయల్దేరారు. ముంబై దోషుల్ని శిక్షించాల్సిందే ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా సంఘీభావం ప్రకటించింది. దాన్ని రూపుమాపేందుకు సంయుక్తంగా పోరాడతామని ట్రంప్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్ర దాడుల దోషులందరికీ శిక్ష పడేలా చూడాల్సిందేనని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. ఆ దాడుల్లో నిందితుడైన తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నట్టు సంయుక్త విలేకరుల భేటీలో అధ్యక్షుడు ధ్రువీకరించారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత హింసాత్మక వ్యక్తుల్లో ఒకరిని భారత్‌కు అప్పగిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ముంబై ఉగ్ర దాడులకు పాల్పడ్డందుకు అక్కడ న్యాయ విచారణను ఎదుర్కొంటాడు. త్వరలో మరికొందరిని కూడా అప్పగిస్తాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను తదితరులకు పరోక్షంగా హెచ్చరిక సంకేతాలిచ్చారు. రాణా అప్పగింత పట్ల అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా తొలినుంచీ కలసికట్టుగా పని చేస్తున్నాయని గుర్తు చేశారు. ముంబై తరహా దాడులను నివారించేందుకు, అల్‌ఖైదా, ఐసిస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్ర సంస్థల ఆట కట్టించేందుకు సంయుక్త కృషిని కొనసాగిస్తామని ఇరు దేశాల సంయుక్త ప్రకటన కూడా పేర్కొంది. పాక్ మూలాలున్న రాణా కెనడా జాతీయుడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైల్లో ఉన్నాడు. భారత్‌లో అమెరికా వర్సిటీల క్యాంపస్‌లు పలు ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయాలు త్వరలో భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని కూడా నిశ్చయించారు. ఇందుకోసం పరస్పర సంయుక్త డిగ్రీలు తదితర పథకాలతో పాటు జాయింట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షలకు పై చిలుకు భారత విద్యార్థుల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్ల దాకా అందుతోందని నేతలిద్దరూ గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని భారత సమాజానిది ఇరు దేశాల బంధంలో అతి కీలక పాత్ర అని మీడియా భేటీలో ట్రంప్ చెప్పారు. లాస్ ఏంజెలిస్, బోస్టన్ నగరాల్లో త్వరలో భారత కాన్సులేట్లు తెరవనున్నట్టు వెల్లడించారు.మానవ అక్రమ రవాణాపై పోరు: మోదీ మనుషుల అక్రమ రవాణా భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ప్రపంచ సమస్యగా అభివరి్ణంచారు. పెద్ద కలలు కనే సాధారణ కుటుంబాలకు చెందిన అమాయకులను పరాయి దేశాల్లో అక్రమ వలసదారులుగా మారుస్తున్న ఈ జాఢ్యంపై దీనిపై దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సి ఉందన్నారు. ‘‘పరాయి దేశంలో అక్రమంగా ప్రవేశించే వారెవరికీ అక్కడ నివసించే హక్కుండబోదు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు తేలిన భారతీయులందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. ఈ అంశం ట్రంప్–మోదీ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు.తటస్థం కాదు, శాంతివైపే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ శాంతివైపే నిలిచింది తప్ప ఏనాడూ తటస్థ వైఖరితో వ్యవహరించలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై కొన్ని దేశాలకు ఉన్న అభిప్రాయం అపోహ మాత్రమేనన్నారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి సాధనకు దౌత్యమే మార్గం తప్ప యుద్ధం కాదు. ఈ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నా. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టంగా చెప్పా’’ అని చెప్పారు.బేరాల్లో నాకన్నా మొనగాడు: ట్రంప్ట్రంప్, మోదీ సంయుక్త మీడియా సమావేశం అత్యంత స్నేహపూర్వకంగా, పలు సందర్భాల్లో సరదా మాటలతో సాగింది. ఇద్దర్లో ఎవరు మెరుగ్గా బేరమాడతారని మీడియా ప్రశ్నించగా ఆ విషయంలో మోదీదే పై చేయంటూ ట్రంప్ టక్కున బదులిచ్చారు. ‘‘మోదీ నా కంటే చాలా గట్టిగా, మెరుగ్గా బేరమాడగలరు. ఆయనతో పోటీ కూడా పడలేను. అందులో అనుమానమే లేదు’’ అంటూ నవ్వులు పూయించారు. భేటీ పొడవునా మోదీని అధ్యక్షుడు పదేపదే ప్రస్తుతించారు. ‘‘ఆయనో గొప్ప నాయకుడు. ప్రధానిగా అద్భుతంగా రాణిస్తున్నారు. దేశాధినేతలతో పాటు ఎవరిని చూసినా ఆయన గురించే మాట్లాడతారు. భారత్‌లోనూ, అమెరికాలోనూ మోదీ, నేను ఎంతో సమయం కలిసి గడిపాం. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. అందమైన భారతదేశంలో ఐదేళ్ల కింద పర్యటించా. నా భార్య మెలానియాతో కలిసి అద్భుతమైన సమయం గడిపా. అప్పుడు మోదీ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడాయనకు అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు మోదీకి మరోసారి స్వాగతం పలికినందుకు ఎంతో థ్రిల్లవుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. జనవరి 20న ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలో పర్యటించిన తొలి విదేశీ నేతల్లో మోదీ ఉన్నారు.మాగా.. మిగా కలిస్తే మెగా ట్రంప్ నినదించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ–మాగా) స్ఫూర్తితో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (ఎంఐజీఏ–మిగా) నినాదం ఇస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. రెండూ కలిసి మెగా భాగస్వామ్యంగా మారతాయని ధీమా వెలిబుచ్చారు.మిషన్ 500భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భా గంగా పరస్పర సుంకాలను బాగా తగ్గించుకోవాలని, మార్కెట్ యాక్సెస్‌ను పెంపొందించుకోవాలని తీర్మానించాయి. మోదీ–ట్రంప్ భేటీ అనంతరం ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యాంశాలు... → ఈ సంవత్సరాంతానికల్లా ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ) కుదరనుంది. ఇరు దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు లోతుగా చర్చిస్తారు. → సైనిక భాగస్వామ్యం, వేగవంతమైన వాణిజ్య, సాంకేతిక బంధం దిశగా అవకాశాలను నిశితంగా పరిశీలించేందుకు ఉద్దేశించిన ‘కాంపాక్ట్’ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తారు. → వస్తువులు, సేవల రంగంతో పాటు అన్నింటా వరక్త వాణిజ్యాలు మరింత వేగవంతం అవుతాయి. → నాసా–ఇస్రో సంయుక్త ఆక్సియోమ్ మిషన్ ద్వారా భారత వ్యోమగామి తొలిసారి ఐఎస్ఎస్కు వెళ్లనున్నాడు. → త్వరలో నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (నిసార్) మిషన్‌ను ప్రయోగించనున్నాం. → ట్రాన్స్‌ఫారి్మంగ్ ద రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (ట్రస్ట్) పథకం ద్వారా రక్షణ, ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధన, అంతరిక్ష తదితర రంగాల్లో ప్రభుత్వాల, ప్రైవేటు స్థాయిలో పరస్పరం మరింత సహాయక సహకారాలు. -
అమెరికా టూర్లో మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్
-
140 కోట్ల భారతీయులకూ అది అవమానమే!
డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో, ద్వంద్వ నీతితో, మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ముడిపడ్డవే. విద్య, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను (Indians) అవమానకరంగా వెనక్కి పంపింది. వీళ్లంతా నేరస్తులు కాదు. ఆ దేశం అక్రమ వలసదార్ల వల్ల భారీ లాభాలు గడించింది. వలసదార్ల రంగు నలుపైనా, చట్టం అక్రమ వలసదార్లని చెప్పినా, వారి సాంకేతిక నైపుణ్యం అమెరికన్ కార్పొరేట్లకి అంటరానిది కాదు. ట్రంప్ సర్కార్ వచ్చాక మన వాళ్ళను క్రిమినల్స్‌లాగా వేటాడి నిర్బంధించింది. సంకెళ్ళతో అమెరికా సైనిక విమానాల్లో కుక్కి అమృతసర్‌లో దింపేసి వెళ్ళింది. అది ఆ 104 మందికే కాదు మొత్తం 140 కోట్ల భారతీయులకూ అవమానమే!అమెరికా (America) నుంచి భారత్‌కు చేరుకున్న వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారి దీన గాథలు వింటే కడుపు తరుక్కు పోతుంది. ఏజంట్ల మాటలకు మోసపోయి లక్షలు చెల్లించి వెళ్లిన వీరు అమెరికా భూమిపై అడుగు పెట్టడానికి పడిన పాట్లు వర్ణనాతీతం. మైళ్ల కొద్దీ కాలినడక, చిన్నబోటులో ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించి అమెరికా గడ్డపై కాలు పెట్టడం, ఆ వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు చీకటి గదుల్లో బంధించడం... వీరి ప్రస్థానంలో మరపురాని ఘట్టాలు. అక్కడ వేలాది మంది పంజాబీ యువకులూ, పిల్లలూ కనిపించారనీ, అందరిదీ ఒకటే దుఃస్థితి అనీ తిరిగివచ్చిన వారు చెబుతున్నారు.ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంత మంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంతలో కొంత మిగుల్చుకుని తల్లిదండ్రులకు పంపేవారు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు జమచేస్తూ ఉంటారు. ఇదీ చదవండి: వెనక్కి పంపేస్తే నష్టమే!చదువు కోసం వెళ్లిన వారు కూడా ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యా సంస్థలు, యూనివర్సిటీ క్యాంపస్‌ల బయట చేయడానికి వీలు లేదన్న నిబంధనను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు నెలకు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకూ పంపించాల్సి వస్తోంది.ఇదీ చదవండి: అమెరికాలో భగ్నస్వప్న గాథ! అట్లాంటా, ఒహాయో, క్యాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, డల్లాస్‌లలో తెలుగు విద్యార్థులు (Telugu Students) ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక సమస్య అయితే ఓపీటీ పూర్తయిన తర్వాత ఏ ఉద్యోగం దొరక్క అమెరికాలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కక్షకట్టింది. అక్కడ ఒత్తిడిలో ఉన్న యువత ఫోన్లు ఎత్తకపోతే కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వారు ఏ ఆపదలో ఇరుక్కుపోయారో అనే ఆందోళన ఇందుకు కారణం. ఇది కేవలం భారతీయులకు, భారత దేశానికి చెందిన సమస్యే కాదు. ఎన్నో ప్రపంచ దేశాల సమస్య. అందుకే ట్రంప్ దుందుడుకు విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా మానవత్వంతో వ్యవహరించాలి.– వెంకటేష్, పీడీఎస్‌యూ -
న.మో. అమెరికా.. భారత ప్రధానికి అగ్రరాజ్య అప్యాయ పలకరింపు (చిత్రాలు)
-
ఆ విషయంలో మోదీనే గ్రేట్.. నేను పోటీ పడలేను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం, దేశాధినేతలిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన కంటే కఠినమైన సంధానకర్త అని ట్రంప్ చెప్పుకొచ్చారు.భారత ప్రధాని మోదీతో ట్రంప్ భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో మీ ఇద్దరిలో ఎవరు మంచి సంధానకర్త అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ స్పందిస్తూ.. మోదీ నా కంటే కఠినమైన సంధానకర్త. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఆ విషయంలో మోదీతో నేను పోటీ పడలేను. మోదీనే గ్రేట్ అంటూ బదిలిచ్చారు. ట్రంప్ సమాధానంతో మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే భారత్‌కు తిరుగు పయనం అయ్యారు.#WATCH | Washington, DC: US President Donald Trump says, "He (PM Narendra Modi) is a much tougher negotiator than me and he is a much better negotiator than me. There is not even a contest."(Video: ANI/DD) pic.twitter.com/V8EzU0FfE9— ANI (@ANI) February 13, 2025మోదీకి ట్రంప్ బహుమతి..మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు ట్రంప్ ఓ బహుమతి అందజేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్‌ను ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్’ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు. BIG NEWS 🚨 World's most powerful leader Donald Trump pulls chair for Indian PM Narendra Modi. Extraordinary Moment.US President Donald Trump gifts a signed copy of his book 'Our Journey Together' to PM Narendra Modi.The book features pictures from 'Howdy Modi', 'Namaste… pic.twitter.com/tMA3fHWFZ5— Times Algebra (@TimesAlgebraIND) February 14, 2025 President Trump gifts Prime Minister Modi his book, Our Journey Together, and shows the photo of his 2020 visit to the Taj Mahal 🇺🇸🇮🇳 pic.twitter.com/MYhPyX0LZD— Margo Martin (@MargoMartin47) February 13, 2025 US President Donald Trump gifted PM Narendra Modi the book ‘Our Journey Together’ when they met at the White House in Washington DC, on 13th February. Showed him several photos from 'Howdy Modi' and 'Namaste Trump' events, which are a part of the book pic.twitter.com/GgRy6C85NH— ANI (@ANI) February 14, 2025 Trump pulled a chair for PM Modi; it's a not an ordinary thing!!That's the Power of Bharat 🔥 pic.twitter.com/u4cG0SUdD7— BALA (@erbmjha) February 14, 2025 -
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈ సారి ఎంతమందంటే?
వాషింగ్టన్ : అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఇటీవల కొందరు భారతీయులను పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాల్లో అక్రమ వలసదారుల్ని భారత్‌కు పంపనున్నట్లు సమాచారం. వీరందరూ ఫిబ్రవరి 15న అమృత్‌సర్‌కి రానున్నట్లు తెలుస్తోంది. . అమెరికాలో భారత అక్రమ వలసదారుల్ని గుర్తించింది. ఫిబ్రవరి 5న 104 మంది వలసదారుల్ని అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌కు తరలించింది. అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. అమెరికాలో 487 మంది అక్రమ భారత వలసదారుల్ని గుర్తించింది. వారిని స్వదేశానికి తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వం మరింత మందిని భారత్‌కు పంపనుంది. మరోవైపు, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడం విమర్శలు దారితీస్తోంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విమానాలు అమృత్‌సర్‌లో దించడం ద్వారా కేంద్రం పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది. హర్యానా లేదంటే గుజరాత్లో ఎందుకు దించకూడదు? అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా మా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నమే అని మండిపడ్డారు.VIDEO | Gujarat: Indians deported from the US arrive at Ahmedabad airport. A US military aircraft carrying 104 illegal Indian immigrants landed at Amritsar, Punjab, yesterday. Sources said that 33 of the 104 deportees are from Gujarat.#GujaratNews(Full video available on PTI… pic.twitter.com/2y1P9Zoo6R— Press Trust of India (@PTI_News) February 6, 2025 -
అమెరికాలోకి భారతీయుల వలసలు.. ట్రంప్‌తో మోదీ ఏమన్నారంటే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం భారతీయుల అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని చెప్పుకొచ్చారు.వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్న భారతీయుల అంశంపై మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు.యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులు (Illegal Migrants)గా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఇక, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసిందే.#WATCH | Washington, DC: On the illegal immigration issue, PM Narendra Modi says, "...Those who stay in other countries illegally do not have any legal right to be there. As far as India and the US are concerned, we have always said that those who are verified and are truly the… pic.twitter.com/Qa0JEnAjyp— ANI (@ANI) February 13, 2025ఇదిలా ఉండగా, అంతకుముందు.. వెస్ట్ వింగ్ లాబీలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని భారత ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇదే సమయంలో ట్రంప్ గతంలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా దిగిన ఫోటోలను ఇద్దరు నేతలు తిలకించారు. ఈ క్రమంలో మోదీకి పుస్తకాన్ని ట్రంప్ బహుమతిగా ఇచ్చారు. US President Donald Trump gifted PM Narendra Modi the book ‘Our Journey Together’ when they met at the White House in Washington DC, on 13th February. Showed him several photos from 'Howdy Modi' and 'Namaste Trump' events, which are a part of the book pic.twitter.com/GgRy6C85NH— ANI (@ANI) February 14, 2025 -
భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం
-
‘నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యాను మిత్రమా’.. మోదీతో ట్రంప్
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi US Visit) రెండురోజుల అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump)తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ వైట్ హౌస్ (white house) వెస్ట్ వింగ్ లాబీలో ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.వెస్ట్లాబీలో ఉన్న ట్రంప్‌తో మోదీ కరచాలనం చేశారు. అనంతరం, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘మిత్రమా నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యాను’అంటూ ట్రంప్‌తో మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సైతం ట్రంప్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆ ఆసక్తిర సన్నివేశాన్ని వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#WATCH | Washington, DC | PM Narendra Modi and President Donald Trump share a hug as the US President welcomes the PM at the White HousePresident Trump says, "We missed you, we missed you a lot." pic.twitter.com/XTk1h7mINM— ANI (@ANI) February 13, 2025ఇక ట్రంప్‌తో మోదీ భేటీ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్, యుఎస్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సహా భారత ప్రతినిధి బృందం పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్‌తో సమావేశానికి ముందు ప్రధాని మోదీ యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డిఎన్ఐ) తులసి గబ్బార్డ్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారుఅంతకుముందు, ప్రధాని మోదీ రాకకు ముందు వైట్‌హౌస్‌లో భారత జెండాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత అమెరికాలో పర్యటించిన అతి కొద్ది మంది దేశాది నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. ట్రంప్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమెరికాలో పర్యటించాలని మోదీకి ఆహ్వానం అందింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌తో మోదీ రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. -
భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే, సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఇరు దేశాధినేతలు. మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో వ్యాఖ్యానించిన ట్రంప్. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని బదులిచ్చారు ప్రధాని మోదీ. I've watched Modi for a decade now. No one on the world stage can hold a candle to him. He's respected by all other leaders and loved by Trump. They have a very strong friendship that's going to be mutually beneficial for the coming years. Very exciting. pic.twitter.com/53OrGGYNRl— Patrick Brauckmann 🕉️ (@vonbrauckmann) February 13, 2025 Prime Minister Narendra Modi met US President Donald Trump at White House in Washington, DC on 13th February. This meeting was the first between the two leaders after the inauguration of President Trump as the 47th US President on January 20, 2025. pic.twitter.com/SlKZcYrVxG— ANI (@ANI) February 14, 2025డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..‘భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణం. మోదీ నాకు మంచి మిత్రుడు. రానున్న నాలుగేళ్లు మా స్నేహాన్ని కొనసాగిస్తాం. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్‌కు కావాలి. భారత్‌కు ఎఫ్ 35 యుద్ధ విమానాలు విక్రయిస్తాం. ఈ ఏడాది భారత్‌కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతామన్నారు. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లు జెట్లు అందులో భాగమని పేర్కొన్నారు. అలాగే, భారత్ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తాం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.PM Narendra Modi tweets, "President Trump often talks about MAGA. In India, we are working towards a Viksit Bharat, which in the American context translates into MIGA. And together, the India-USA have a MEGA partnership for prosperity." pic.twitter.com/w0o70KrJWI— ANI (@ANI) February 14, 2025అనంతరం, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించినందుకు 140 కోట్ల భారతీయుల తరఫున ట్రంప్‌నకు శుభాకాంక్షలు. వైట్‌హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ను చూడటం ఆనందంగా ఉంది. మరో నాలుగేళ్లు ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషం. ట్రంప్‌లాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. మేం రెట్టింపు వేగంతో పని చేస్తాం. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇరు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలన్నదే మా ఆకాంక్ష. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుంది. శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారు’ అని తెలిపారు. #WATCH | Washington, DC: PM Modi says, " Our teams will work on completing a trade agreement that will mutually benefit the two countries. We will strengthen oil and gas trade to ensure India's energy security. In the energy infrastructure, investment will increase. In the… pic.twitter.com/TMfLY7q9jJ— ANI (@ANI) February 13, 2025 -
ట్రంప్ బృందంలో పాల్ కపూర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్.పాల్ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సెనేట్ పరిశీలించి ధ్రువీకరిస్తే ప్రస్తుత సహాయ కార్యదర్శి అయిన డొనాల్డ్ లూ స్థానంలో పాల్కపూర్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా దౌత్య సంబంధాల్లో కపూర్ కీలక పాత్ర పోషించనున్నారు. కపూర్ ప్రస్తుతం నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2020 నుంచి 2021 వరకు స్టేట్ డిపార్ట్మెంట్ పాలసీ ప్లానింగ్ సిబ్బందిగా పనిచేశారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండో–పసిఫిక్ , అమెరికా–ఇండియా సంబంధాలకు సంబంధించిన సమస్యలపై పనిచేశారు. అంతకుముందు కపూర్ క్లేర్మోంట్ మెకెనా కళాశాలలో బోధించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన ‘జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ: ఇస్లామిక్ మిలిటెన్సీ’, ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ది పాకిస్తానీ స్టేట్’, ‘దక్షిణాసియాలో సంఘర్షణ’తదితర పుస్తకాలు రచించారు. ‘ఇండియా, పాకిస్తాన్ అండ్ ది బాంబ్: డిబేటింగ్ న్యూక్లియర్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా’అనే పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించారు. ‘ది ఛాలెంజెస్ ఆఫ్ న్యూక్లియర్ సెక్యూరిటీ: యూఎస్ అండ్ ఇండియన్ పర్సె్పక్టివ్స్’కు సహ సంపాదకత్వం వహించారు. -
మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం: జెలెన్స్కీ
కెమెల్నిత్స్కీ (ఉక్రెయిన్): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక.. జెలెన్స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్‌లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హీలి అన్నారు. -
సమానంగా వడ్డిస్తాం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి.. ఆయా దేశాలపై వారితో సమానంగా టారిఫ్‌లు విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంతమొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో.. అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతులపై తాము దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం.. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ‘ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. వారితో సమానంగా వడ్డించే సమయం వచ్చింది’ అని ట్రంప్ అంతకుముందు తన సొంత సోషల్‌మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’లో గురువారం పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు ట్రంప్ తాజా నిర్ణయం మింగుడుపడనిదే. భారీగా సుంకాలు విధిస్తే.. మార్కెట్లో ధరలు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. -
పుతిన్‌తో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్‌కు షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జెలెన్స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.తాజాగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. అనంతరం, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా అధినేత పుతిన్‌తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు.మరోవైపు.. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అలాగే, కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో, ఉక్రెయిన్‌కు డబుల్ స్ట్రోక్ తగిలింది.REPORTER: The borders and the lack of NATO membership -- ultimately these are both demands Russia has made. Is there not a danger of handing Russia a win?TRUMP: Well I think if you look at the war, the way the war is going, you'll have to make your own determination pic.twitter.com/ZGQru3Of2g— Aaron Rupar (@atrupar) February 12, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో ఫోన్‌కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ..‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రపంచాన్ని కొనడం కష్టం సార్! ప్రస్తుతనికి గాజాను కొనేయండి సార్!
-
మస్క్... ట్రంప్‌కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు?
వాషింగ్టన్: అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎక్స్(ట్విట్టర్)పై ట్రంప్ దావా వేసిన కారణంగా తాజాగా ఎలాన్ మస్క్ ఆయనకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఈ దావా వేశారు.వివరాల ప్రకారం.. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్‌షీట్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది.ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్.. ట్రంప్ అకౌంట్స్‌ను సస్పెండ్ చేసింది. దీంతో, వారి చర్యలను ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక, తాజాగా మస్క్(Elon Musk) కూడా ట్రంప్‌కు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది.*Elon Musk’s company X settles Trump lawsuit over account suspension*• Social media company X has agreed to pay about $10 million to settle a lawsuit by President Donald Trump, The Wall Street Journal reported.• Elon Musk, X’s billionaire owner, is overseeing DOGE, pic.twitter.com/nw7n2HbUwF— AS ♠️🍌✡︎🪬חי🎗️🤟🫶🧡👑❰̶̶͟͞🍓꙰꙰❱̶𖠧̙̞͢▹͍►͍👑 (@AdelBadel7) February 13, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీ: ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నేతలలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. Landed in Washington DC a short while ago. Looking forward to meeting @POTUS Donald Trump and building upon the India-USA Comprehensive Global Strategic Partnership. Our nations will keep working closely for the benefit of our people and for a better future for our planet.… pic.twitter.com/dDMun17fPq— Narendra Modi (@narendramodi) February 13, 2025ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగే సమావేశంలో అనేక ద్వైపాక్షిక అంశాలును చర్చించే అవకాశం ఉంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.‘కొద్దిసేపటి క్రితమే వాషింగ్టన్ డీసీ చేరుకున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు,భారత్-యుఎస్ఎ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఇరు దేశల ప్రజల ప్రయోజనం కోసం, అత్యుత్తమ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయనున్నాం’ అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.#WATCH वाशिंगटन, डीसी: प्रधानमंत्री नरेंद्र मोदी ब्लेयर हाउस पहुंचे। इस दौरान उन्होंने भारतीय समुदाय से मुलाकात की।प्रधानमंत्री मोदी 12-13 फरवरी को अमेरिका के दौरे पर हैं और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ बैठक करेंगे।(सोर्स-डीडी/ANI) pic.twitter.com/G7OKQaVGK7— ANI_HindiNews (@AHindinews) February 12, 2025అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను కలుసుకున్నారు. అలాగే బ్లెయిర్ హౌస్ చేరుకున్న ప్రధాని ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రధాని ఫిబ్రవరి 12-13 తేదీలలో అమెరికా పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు.ప్రధానిని స్వాగతించడానికి వాషింగ్టన్ డీసీకి తరలివచ్చిన ప్రవాస భారతీయులు ఆయనను చూడగానే ‘వందేమాతరం’,'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరుగుతోంది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. #WATCH | Washington, DC: Indian diaspora braves the harsh winters and gathers outside Blair House to welcome Prime Minister Narendra ModiA member of the Indian diaspora says, " ...We have people on crutches, and they have braved this great winter and snow...we are excited to… pic.twitter.com/Uie1b9p3lk— ANI (@ANI) February 12, 2025ఇది కూడా చదవండి: జేడీ వాన్స్ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ -
పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్‌పై ట్రంప్ ఒత్తిడి
వాషింగ్టన్: గాజా స్ట్రిప్ స్వాదీనం ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్ రాజు అబ్దుల్లాపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. మంగళవారం శ్వేతసౌధంలో అబ్దుల్లాతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నివాసితు లను తరలించడంతోపాటు యుద్ధంతో దెబ్బతిన్న గాజాను పశ్చిమాసియాలో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదలుకోబోనని ట్రంప్ సంకేతం ఇచ్చారు. గాజాను కొనడం లేదని, ఏకంగా స్వా«దీనం చేసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘గాజా స్ట్రిప్‌ను తీసుకుంటాం. పశి్చమాసియాలో ప్రజలకు చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’అని ట్రంప్ పేర్కొన్నారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్ లు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘జోర్డాన్‌లో మాకు కొంత భూమి ఉంటుందని నేను నమ్ముతున్నాను. చర్చలు పూర్తయిన అనంతరం పాలస్తీనియన్లు సంతోషంగా, సురక్షితంగా జీవించడానికి చోటు లభిస్తుందని అనుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికాపై జోర్డాన్, ఈజిప్ట్ ఆధారపడటమే ట్రంప్ అంత బలంగా చెప్పడానికి కారణం. అయితే... జోర్డాన్‌కు సహాయాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ అన్నారు. మద్దతు ఇస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేమని చెప్పారు. ‘‘మేము జోర్డాన్‌కు, ఈజిప్టుకు సహాయాన్ని అందిస్తాం. ఆ సాకుతో బెదిరించాల్సిన అవసరం లేదు. మేం అలాంటి భావజాలానికి అతీతులం అనే అనుకుంటున్నాం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పాలస్తీనియన్లను తమ భూభాగంలోకి తరలించే ప్రక్రియకు రాజు అబ్దుల్లా సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. ట్రంప్ ప్రణాళికను సమరి్థంచకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2,000 మంది చిన్నారులను మాత్రం చికిత్సచేయించేందుకు జోర్డాన్‌కు తీసుకెళ్తామని రాజు చెప్పారు. రాజు నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఏకీకృత అరబ్ వైఖరి’’అని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘పాలస్తీనియన్లను ఇంకెక్కడికీ పంపేయకుండానే గాజా స్ట్రిప్‌ను పునర్ నిర్మించాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి’’అని ఆయన అన్నారు. గాజా అంశంలో అమెరికా కొత్త అధ్యక్షుడు తన ప్రణాళికలను వెల్లడించాక అగ్రరాజ్య అధ్యక్షుడితో భేటీ అయిన తొలి అరబ్ నేత అబ్దుల్లా కావడం గమనార్హం. ఇరువురు నాయకులు ఇతరత్రా అంశాల్లో ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే గాజా గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజు అబ్దుల్లాను ఇబ్బందికర స్థితిలోకి నెట్టాయి. డోలాయమానంలో కాల్పుల విరమణ ట్రంప్ గాజా ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపులో కొత్త సమస్యను తీసుకొచ్చింది. గాజాపై దాడులను నిలిపివేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, తదుపరి నోటీసు వచ్చే వరకు బందీలను విడుదల చేయడం నిలిపివేస్తున్నట్లు హమాస్ సోమవారం తెలిపింది. బందీలందరినీ శనివారం మధ్యాహ్నంలోగా విడుదల చేయకపోతే మీ అంతు చూస్తానని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమాస్ ఏ విధంగా స్పందిస్తుంది, దానికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఏమిటనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. సర్వత్రా వ్యతిరేకత గాజా స్వా«దీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజాను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి 9 తేదీలలో రాయిటర్స్/ఇప్సోస్ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. గాజాను అమెరికా స్వా«దీనం చేసుకుని అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్లను తరలించే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు చెప్పారు. అంటే.. 74 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే. ఈ అంశంపై రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాజా స్వా«దీన ప్రకటనను 55 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 43 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. -
ఉక్రెయిన్‌పై పుతిన్‌తో మాట్లాడా: ట్రంప్
వాషింగ్టన్/మాస్కో: రష్యా దురాక్రమణతో దండెత్తిన దరిమిలా దాదాపు నాలుగేళ్లుగా రావణకాష్టంగా రగిలిపోతున్న ఉక్రెయిన్ భూభాగాల్లో శాంతిపవనాలు వీచే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో ఫోన్లో విడివిడిగా సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మంగళవారం ఉదయం పుతిన్‌తో ట్రంప్ సుదీర్ఘంగా దాదాపు 90 నిమిషాలపాటు ఫోన్లో మంతనాలు జరిపినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే వివరాలను వాళ్లు బయటపెట్టలేదు. కానీ ట్రంప్ మాత్రం తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంతనాల వివరాలను పంచుకున్నారు. ‘‘ ఇకనైనా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోకుండా యుద్ధం ముగిసిపోవాలని ఇరువురం కోరుకున్నాం. ఉక్రెయిన్ అంశంతోపాటు పశ్చిమాసియాలో అనిశ్చితి, ఇంధన రంగం, కృత్రిమ మేథ, అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యం.. ఇలా కీలకమైన అంశాలపై పుతిన్‌తో సుదీర్ఘంగా మాట్లాడా. కలిసి పనిచేయాలని మేమిద్దం నిర్ణయించుకున్నాం. ఎంతో ఫలవంతమైన చర్చలు జరిపాం. మా స్నేహానికి గుర్తుగా త్వరలో నేను రష్యాలో పర్యటిస్తా. పుతిన్ సైతం అమెరికా పర్యటనకు వస్తారు. ఇందుకు పుతిన్ కూడా అంగీకరించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని తక్షణం ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, రష్యా తరఫున మధ్యవర్తిత్వ బృందాలు వెంటనే చర్చలు జరిపాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. పుతిన్‌తో చర్చల సారాంశాన్ని తెలిపేందుకు తర్వాత నేను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశా. పుతిన్ కూడా జెలెన్స్కీకి ఫోన్ చేస్తారేమో’’ అని బుధవారం ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌చేశారు. తమ అధ్యక్షుడితో ట్రంప్ దాదాపు గంటపాటు ఫోన్లో మంతనాలు జరిపారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
సమాంతర పాలన ఉత్తిదే: మస్క్
వాషింగ్టన్: వందల కోట్ల రూపాయల సొంత డబ్బును ఎన్నికల్లో ట్రంప్ కోసం ఖర్చు చేసి, ఆయనను గెలిపించి చివరకు ఆయన చేతుల్లోంచి అమెరికా పాలనాపగ్గాలను తీసుకుని సమాంతర పాలనను సాగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తొలిసారిగా ట్రంప్ సమక్షంలో స్పందించారు. డోజ్‌కు అదనపు అధికారాలు కట్టబెడుతూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై మంగళవారం ట్రంప్ సంతకం చేస్తున్న సందర్భంగా డోజ్ చీఫ్ హోదాలో మస్క్ సైతం అక్కడే ఉన్నారు. వెంట ఆయన కుమారుడు అ– గీజీజీ ను సైతం తీసుకొచ్చారు. అమెరికా అధ్యక్షభవనంలోని ప్రఖ్యాత ఓవెల్ రూమ్‌లో రెజల్యూట్ డెస్క్ వద్ద ఆసీనులైన ట్రంప్ పక్కనే నిల్చుని మస్క్ కొద్దిసేపు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ప్రభుత్వ వ్యయాలు, సిబ్బందిని కుదించే లక్ష్యంతో ఏర్పాటైన డోజ్ విభాగ సారథిగా మాత్రమే పనిచేస్తున్నానని, అధ్యక్ష అధికారాల్లోకి వేలు పెట్టలేదని తొలిసారిగా అధికారికంగా సమాధానమిచ్చారు. ‘‘ ప్రభుత్వ విభాగాల రోజువారీ పనుల్లో నేను, నా డోజ్ బృంద సభ్యులు జోక్యం చేసుకుంటున్నారనేది పచ్చి అబద్ధం. నాపై ఆరోపణలు పైల్స్, అర్షమొలల రోగిపై చేసే పరీక్షలా ఉన్నాయి. నేను ఒక తెరచిన పుస్తకం. అంతా పారదర్శకం. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే విషయంలో మేం క్రూరమైన, విప్లవకారుల మనస్తత్వంతో పనిచేయట్లేము. ఇంగితజ్ఞానంతో పనిచేస్తున్నాం. ఓటర్లు ప్రజాపాలనలో భారీ సంస్కరణలను కోరుకుంటూ ట్రంప్ బృందానికి ఓటేశారు. మేం ఇప్పుడు అదే సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఇదేకదా. మేం చేస్తున్న పని మొత్తం డోజ్ వెబ్సైట్లో అందరికీ కనిపిస్తుంది’’ అని అన్నారు. అయితే డోజ్ వెబ్సైట్లో అలాంటి వివరాలేవీ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పథకాలు, వాటికయ్యే ఖర్చులను డోజ్ తప్పుగా ప్రచురిస్తోందన్న ప్రశ్నకు మస్క్ బదులిచ్చారు. ‘‘ కొన్ని సార్లు తప్పులు దొర్లుతుంటాయి. వాటిని సరిచేయాల్సి ఉంది. ఇచి్చన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయాలన్న తొందరలో మేం చాలా వేగంగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఎవరూ 1,000 శాతం సరిగా ఉండరుగా’’ అని మస్క్ అన్నారు. ‘‘ ప్రజల ద్వారా ఎన్నికైన వ్యవస్థల కంటే ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అత్యంత శక్తివంతమైంది. ప్రభుత్వ అధికారుల్లో కొందరు చాలా మంచి వ్యక్తులున్నారు. అయితే చేసే పనికి వారిని జవాబుదారీగా మార్చాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు. -
పుతిన్‌కు షరతు.. అమెరికాకు జెలెన్ స్కీ బంపరాఫర్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవ చూపాలని చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే మా అధీనంలో ఉన్న కుర్స్క్‌ను వారికి అప్పగిస్తామం’ అని అన్నారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. రష్యా నుంచి తమ భూభాగాలను ఉక్రెయిన్‌కు అప్పగించినందుకు అమెరికాలో పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై పుతిన్‌కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్‌పై యుద్దం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.JUST IN: 🇺🇦🇷🇺 Ukrainian President Zelensky says he's prepared to offer a territory swap with Russia as part of peace deal negotiations to end the war. pic.twitter.com/N9w9uoYfnl— BRICS News (@BRICSinfo) February 11, 2025 -
మస్క్‌కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. ఫెడరల్ వర్క్ ఫోర్స్‌ను మరింతగా కుదించేందుకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య శాఖ (డోజ్)కు అధికారాలు కల్పించారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఓవల్ కార్యాలయంలో టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్‌తో పాటు అతని నాలుగేళ్ల కుమారుని సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. PRESIDENT TRUMP: "I can't imagine a judge saying you got elected to look over the country and make America great again, but you don't have the right to look and see whether or not things are right that they are paying or that things are honest." pic.twitter.com/gUBlUJ0FLY— Rapid Response 47 (@RapidResponse47) February 11, 2025వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు.. ఫెడరల్ వర్క్ ఫోర్స్‌ను పరిమితం చేసేందుకు ఉద్దేశించినది. ఈ విషయంలో డోజ్ ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలని, పెద్ద ఎత్తున ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన స్థానాలలోని సిబ్బందిని మాత్రమే పరిమితం చేయాలని దానిలో ఆదేశించారు.ఈ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ డోజ్ పని తీరును ప్రశంసించారు. ఇది చట్టం పరిధిలో పనిచేస్తుందా లేదా అనే విషయంలో పలు విమర్శలు ఉన్నప్పటికీ టెస్లా సీఈఓ మస్క్ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పనులు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. దేశాభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి , తనకు అన్ని విషయాలు నివేదించే వ్యక్తి ఈ పని చేసేందుకు సమర్థులని భావిస్తున్నానని అన్నారు. అమెరికాను అభివృద్ధి పథాన తీసుకువెళ్లేందుకే తాను ఎంపికయ్యాయని ఒక న్యాయమూర్తి చెప్పడం ఎన్నటికీ మరువలేనిదని ట్రంప్ పేర్కొన్నారు.‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే అక్షరాలు కలిగిన టోపీని ధరించిన మస్క్ మాట్లాడుతూ ప్రభుత్వానికి స్వయంప్రతిపత్తి కలిగిన సమాఖ్య బ్యూరోక్రసీ లేదని, అందుకే ప్రజల తరపున ప్రతిస్పందించే వ్యక్తి అండగా ఉండాలన్నారు. ప్రజలచేత ఎన్నిక కాని అధికారిగా తన పాత్రను సమర్థించుకున్న మస్క్ అమెరికా ప్రభుత్వంలోని వివిధ విభాగాలను తగ్గించే అధికారాన్ని అధ్యక్షుడు తనకు మంజూరు చేశారన్నారు. బ్యూరోక్రసీలో లక్షల డాలర్ల జీతం కలిగిన సిబ్బంది ఉండటం వింతగా ఉందని మస్క్ వ్యాఖ్యానించారు.That was one of the most incredible political press conferences I’ve ever seen.Trump + Elon standing in the Oval Office, telling the American people directly what they are doing… basic financial management of our out of control spending.“This isn’t optional, it’s essential.” pic.twitter.com/DDSGVjnQtW— Geiger Capital (@Geiger_Capital) February 11, 2025తాను ట్రంప్‌తో దాదాపు ప్రతిరోజూ మాట్లాడుతుంటానని ప్రభుత్వంలోని అవినీతిని గుర్తించి, అనవసరఖర్చులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా మస్క్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అతని కుమారుడు లిటిల్ ఎక్స్ తండ్రి చేయి పట్టుకుని, అతనికి కాస్త ఇబ్బంది కలిగించాడు. గతంలో లిటిల్ ఎక్స్‌కు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే.. -
ఏకపక్ష నిర్ణయాలు.. ట్రంప్‌కు ఝలక్
బ్రస్సెల్స్: అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే 27దేశాల యూరప్ కూటమి ఘాటుగా స్పందించింది. అర్ధరహిత టారిఫ్‌లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వానికి తగు సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీర్ లియాన్..‘ట్రంప్ టారిఫ్ సవాలుకు దీటుగా బదులిస్తాం. అవి చెడ్డ పన్నులు. వ్యాపారస్తులకూ చెడ్డవే. వినియోగదారులకు గుదిబండలు. యూరోపియన్ యూనియన్‌కు భారంగా మారిన ఈ టారిఫ్‌లకు దీటైన సమాధానం చెప్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరువైపులా విపరిణామాలు ఈయూ కూటమిలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ సైతం అమెరికా స్టీల్, అల్యూమినియంలపై టారిఫ్‌లు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పందించారు. అమెరికా మాకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే యురోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిమీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుంది. అప్పుడు అంతిమంగా ఆర్థికయుద్ధం మొదలై ఇరువైపులా దాని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’అని ఒలాఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈయూ కూటమి ఏ స్థాయిలో టారిఫ్‌లు పెంచుతుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ముఖ్యంగా టారిఫ్ పెంచాలని యోచిస్తున్నట్లు వాణిజ్యరంగ విశ్లేషకులు చెబుతున్నారు. -
అదానీకి అమెరికాలో ఊరట?
వాషింగ్టన్: దాదాపు అర శతాబ్దం నాటి విదేశీ అవినీతి విధానాల చట్టం (ఎఫ్‌సీపీఏ) అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. 60 రోజుల పాటు చట్టాన్ని సమీక్షించాలని, ఈలోగా దాని కింద కొత్తగా విచారణలేవీ చేపట్టరాదని ఆయన సూచించారు.వ్యాపార అవసరాల కోసం కంపెనీలు విదేశాల్లోని అధికారులకు లంచాలిచ్చి అవినీతికి పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చట్టం లక్ష్యం. పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీపై లంచాల ఆరోపణలను ఇదే చట్టం కింద విచారణ చేస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఆయనకు కొంత ఊరట లభించగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.భారత్‌లో సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అధికారులకు లంచాలిచ్చారని, అమెరికాలో నిధులను సమీకరించే క్రమంలో ఆ విషయాలను వెల్లడించలేదని అదానీ తదితరులపై గత ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఏ ప్రకారం అమెరికన్ కంపెనీలైనా, ఇతర దేశాల కంపెనీలైనా వ్యాపార అవసరాల కోసం విదేశాల్లో అధికారులకు లంచాలివ్వడం చట్టవిరుద్ధం. -
ఘర్షణాత్మక ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్‌ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు. గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట. గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది. చివరకు హమాస్‌తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి. అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్‌ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది. వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. 3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్‌కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు. -
దక్షిణాఫ్రికాతో కయ్యానికి కారణాలేంటి?
కొత్తగా దక్షిణాఫ్రికాతో తగువు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకు ఆరంభం ఫిబ్రవరి 3న జరిగింది. దానికి ఆయన చెప్తున్న కారణాలు మూడు: ఒకటి, అక్కడి శ్వేతజాతీయుల భూములను సిరిల్ రామఫోసా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నది. రెండు– తెల్లవారిపట్ల వివక్ష చూపుతున్నది. మూడు– అమెరికాపై, దాని మిత్ర దేశాలపై అంతర్జాతీయంగా వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది. ఇవిగాక, తెల్లవారి విషయంలో ‘చాలా చెడ్డ పనులు చేస్తున్నది’ అని కూడా అన్నారాయన. దక్షిణాఫ్రికాలోని తీవ్ర వాద శ్వేతజాతీయుల సంస్థలు కొన్ని తమపై ‘సామూహిక హత్యా కాండలు సాగుతున్నట్లు’ 1994లో అక్కడ వర్ణ వివక్ష (అపార్థీడ్’) ముగిసినప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ‘చెడ్డ పనులు’ అనటంతో ట్రంప్ ఉద్దేశం అదేనేమో తెలియదు.భూమి చట్టంతో మొదలు...ఈ విధమైన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఆ విషయమై విచారణలు చేస్తున్నామనీ, అవి నిజమైతే దక్షిణాఫ్రికాకు తమ సహాయాన్ని నిలిపి వేయగలమనీ హెచ్చరించారు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవటం వేరు. అంతకన్నా ముందే సహాయం ఆపివేయటం వంటి చర్యలు మొదలై పోయాయి. జీ–20కి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రామఫోసా త్వరలో జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోవటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రకటించేశారు. హెచ్ఐవీ చికిత్సల కోసం తాము చేసే ఆరోగ్య సహాయాన్ని ట్రంప్ ఆపివేశారు. దక్షిణాఫ్రికాలోనే పుట్టి పెరిగిన ట్రంప్ ముఖ్య సలహా దారు ఎలాన్ మస్క్, ట్రంప్ తరహా ఆరోపణలు, హెచ్చరికలు రెండు రోజులకొకసారి చేస్తున్నారు. దక్షిణాఫ్రికా శరణార్థుల కోసం శిబిరాలు సిద్ధం చేయాలంటూ ట్రంప్ తమ అధికారులను ఆదేశించారు కూడా! మరొకవైపు, అమెరికా అధ్యక్షుని ఆరోపణలలో ఎంతమాత్రం నిజం లేదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆఫ్రికాలోగల తీవ్రమైన భూమి సమస్యల దృష్ట్యా ‘నిరుపయోగం’గా ఉన్న భూముల స్వాధీనానికి రామఫోసా ప్రభుత్వం గత నెల ఒక చట్టం చేసింది. నిజానికి ఇటువంటి చట్టాన్ని స్వయంగా అమెరికా కూడా 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన విషయాన్ని రామఫోసా గుర్తు చేస్తున్నారు. ఇండియా మొదలైన అనేక దేశాలలోనూ ఈ చట్టాలు న్నాయి. ఇక తెల్లవారి పట్ల వివక్షలు, హత్యాకాండలున్నట్లు వారి సంస్థలు ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి ఆధారాలూ చూపటం లేదు. ఈ మాట రామఫోసా ప్రభుత్వమే కాదు, దక్షిణాఫ్రి కాకు చెందిన ప్రజాస్వామిక శ్వేతజాతి వర్గాలు, పార్టీలు, పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు అంటున్నదే! అట్లాంటి దేమీ లేదని నేను స్వయంగా అక్కడికి వెళ్లినపుడు గమనించాను.అటువంటి స్థితిలో ట్రంప్ విపరీత వైఖరికి కారణమేమిటి? ప్రధానంగా ఆయన శ్వేతజాతి దురహంకారి కావటమనిపిస్తున్నది. తను మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు (2017–21) కూడా రక రకాల ఆరోపణలు చేశారు. అప్పటికి దక్షిణాఫ్రికాలో ఈ చట్టం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాద సంస్థలు తరచుగా అమె రికా సహా పాశ్చాత్య దేశాలకు వెళ్లి లాబీయింగ్‌లు చేస్తుండేవారు. వారి వాదనలను డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ప్రభుత్వాలు పట్టించు కోలేదు. తమ వంటి లక్షణాలు గల ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వా తనే అందుకు విలువ ఇస్తున్నారు. ఇందుకు ఈసారి మరొక మూడు కారణాలు చేరాయి. ఒకటి– గాజాలో ఇజ్రాయెల్ మారణ కాండపై ప్రపంచంలో మొదట దక్షిణాఫ్రికాయే చొరవ తీసుకుని అంతర్జా తీయ న్యాయస్థానం (ఐసీజే)లో కేసు వేయటం. రెండు– అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి బహుళ ధ్రువ ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా భాగస్వామి కావటం. మూడు– ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీలో 30 శాతం భాగస్వామ్యాన్ని స్థానిక నల్లవారికి ఇవ్వాలన్న షరతు. వాస్తవానికి ఇటువంటి భాగ స్వామ్య నిబంధన అక్కడి టెలికాం లైసెన్సింగ్ చట్టంలో గతం నుంచి ఉంది. తనను మినహాయించాలన్నది మస్క్ వాదన. దానిని ట్రంప్ బలపరుస్తున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వంనిరాకరిస్తున్నది.అన్నీ ఉన్నా వివక్షేనా?పోతే, 1994లో అపార్థీడ్, శ్వేతజాతి పాలన ముగిసిన 30 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇటువంటి భూమి చట్టం ఎందుకు చేయవలసి వచ్చిందన్నది అర్థం చేసుకోవలసిన విషయం. యూరోపియన్లు దక్షిణాఫ్రికాకు రావటం 1600వ సంవత్సరంలో మొదలు కాగా, వారు భూములను అత్యధిక భాగం ఆక్రమించుకున్నారు. వేర్వేరు యూరోపియన్ల మధ్య కూడా కొంతకాలం ఆధిపత్య యుద్ధాలు జరగగా చివరకు అందరూ కలిసి 1948లో శ్వేతజాతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతకుముందే 1913, 1936లో భూమి చట్టాలు చేసి, మొత్తం భూములలో 87 శాతం తెల్లవారికి రిజర్వ్ చేశారు. ఆ పరిస్థితి 1994లో నల్లవారి ప్రభుత్వం ఏర్పడినా కొనసాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే, వివిధ కారణాల వల్ల ఆఫ్రికన్ రైతుల కొద్దిపాటి భూములు కూడా క్రమంగా శ్వేతజాతీయుల పరం కాసాగాయి. ఇది నేను అక్కడి ప్రభుత్వ రికార్డులను బట్టి స్వయంగా గమనించిన విషయం. ట్రంప్ తన ప్రకటనలో, తెల్లవారిలోని ఆఫ్రికానర్ల ప్రస్తావన ప్రత్యేకంగా చేశారు. హాలండ్, ఫ్రాన్స్ నుంచి వలస వచ్చిన జాతీయులను ‘ఆఫ్రికానర్లు’ అంటారు. అక్కడి జనాభాలో వారి శాతం కేవలం నాలుగు. భూములలో అధిక భాగం, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన భాగం వారి అధీనంలోనే ఉన్నాయి. అయినా వివక్ష అని మాట్లాడతారు. ఉదాహరణకు అక్కడ నేనుమౌంటేన్ ఫాక్స్ అనే పేరిట గల డచ్ వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూశాను. ఆ కుటుంబానికి 740 ఎకరాలకు పైగా ఉంది. సొంత వైన్ యార్డ్, అందులో పండించే ద్రాక్షతో సొంత బ్రాండ్ సారాయి ఉన్నాయి. కొన్ని వాహనాలతో రవాణా కంపెనీ ఉంది. ఒక మధ్య తరహా హోటల్, ఒక బొటిక్ ఉన్నాయి. అయినా తమ ఆఫ్రికానర్ల పట్ల వివక్ష ఉందని వాపోతూ హాలండ్‌కు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు కారణం? తమ పిల్లవాడు ఇంజనీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెళితే, అక్కడి కోటాల ప్రకారం ఆ ఉద్యోగం ఒక నల్లవాడికి ఇచ్చారట! అదీ వారనే వివక్ష. ఒక్కొక్కరి వద్ద వేలాది ఎకరాలుండటాన్ని, రహదారుల వెంట ఎంతదూరం వెళ్లినా కంచెలు వేసి పడావు పడటాన్ని చూశాను. పేదరికం వల్ల కొద్దిపాటి భూములు కూడా అమ్ముకుని నగరాలకు వలస వస్తూ చిల్లర పనులతో జీవిస్తున్న నల్లవారినీ కలిసి మాట్లాడాను.ఈ పరిస్థితులలో నల్లవారికి భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. దానితో ముడిబడిన పేదరికం వల్ల అసంతృప్తి పెరుగుతున్నది. 30 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) మొదటిసారిగా సొంత మెజారిటీ కోల్పోవటానికి ఇది ఒక ప్రధాన కారణం. అందువల్ల రామఫోసా ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటం అనివార్యమైంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా ‘మానవ హక్కులను హరిస్తున్న’దనే గొప్ప మాట అన్నారు. అపార్థీ డ్‌ను అమెరికా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాజా, కెనడా, గ్రీన్లాండ్, పనామా వంటి ఇతర దేశాలను ఆక్రమించుకోగలమని బాహాటంగా ప్రకటించే ట్రంప్, తెల్లవారి భూమి హక్కులంటూ ఇంతగా మాట్లాడటాన్ని బట్టి ఆయన తత్త్వం అర్థం చేసుకోవచ్చు.అయితే, తాము బెదిరి లొంగబోమనీ, తమ ప్రజలకు అవసర మైంది చేస్తామనీ రామఫోసా తమ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆ దేశం ఆఫ్రికా ఖండంలో పారిశ్రామికంగా అన్నింటికన్నా పెద్దది. బ్రిక్స్ కూటమిలో ప్రముఖ దేశం. ఇప్పటికే ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల దేశాలతో తగవుకు దిగిన ట్రంప్, ఆఫ్రికాలోనూ అదే ధోరణి చూపటం వల్ల అంతిమంగా అమెరికాకు కలగగల నష్టాల గురించి ఆలోచిస్తున్నట్లు లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శనివారం డెడ్‌లైన్
వాషింగ్టన్: గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు, ఇతర దేశస్తులను శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదల చేయకపోతే హమాస్ అంతుచూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావొచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు.వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఒకటి, మూడు, నాలుగు, రెండు ఇలా కాదు.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీలు అందరూ విడుదలై మా చెంతకు చేరాలి. లేదంటే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తాం. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుచేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశిస్తా’’ అని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ అది వాళ్ల ఇష్టం. నా వరకైతే బందీలను విడుదల చేయకుంటే వాళ్ల పనిపడతా. ఇక కాల్పుల విరమణ అంశంలో వాళ్ల కోణంలో తుది నిర్ణయం ఇజ్రాయెల్‌దే. బందీలను విడుదలచేయకపోతే నా మాటల్లోని తీవ్రత ఎంత అనేది హమాస్‌కు తెలిసేలా చేస్తా’’ అని అన్నారు.ఆలస్యంపై ఇజ్రాయెల్ ఆగ్రహంకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందుకే బందీలను ఆలస్యంగా వదిలేస్తామన్న హమాస్ ప్రకటనను ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది హమాసేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా కేబినెట్‌తో సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నా నికల్లా బందీలను వదిలేయకుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హమాస్‌కు అల్టిమేటమిచ్చారు. మరోవైపు బందీల విడుదల నిలిపివేత ప్రకటన నేపథ్యంలో వారి కుటుంబాలు, మద్దతుదారులు టెల్ అవీవ్ లో ఆందోళనకు దిగారు. ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. 42 రోజుల ఒప్పందంలో మొదటి దశలో విడుదల కానున్న 33 మంది బందీల్లో 16 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ఐదుగురు థాయ్ బందీలను కూడా అనధికారికంగా విడుదల చేశారు. -
యూకేలోనూ అక్రమ వలసదారుల ఏరివేత
లండన్: అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న వేళ.. బ్రిటన్ సైతం అదే బాటలో పయనిస్తోంది. విదేశీ నేరగాళ్లను, మరీ ముఖ్యంగా దొడ్డిదారిన ఆ దేశంలోకి వచ్చిన పనులు చేసుకుంటున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలోనే తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తుండడం గమనార్హం. తాజాగా.. యూకే వైడ్ బ్లిట్జ్(UK-wide blitz) పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలని యూకే హోంమంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ చెబుతున్నారు. హంబర్సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లలో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న వాళ్లను ‘ట్రంప్’ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపించేస్తోంది యూకే. వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. అయితే వాళ్లలో నేరగాళ్లు ఉండడం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు. The public must have confidence in the UK's immigration system.Through our Plan for Change, we have removed almost 19,000 people including failed asylum seekers, foreign criminals and immigration offenders from the UK since July 2024. pic.twitter.com/QY4tpQDqSP— Home Office (@ukhomeoffice) February 10, 2025అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించిన సంగతి తెలిసిందే. ‘బ్రిటన్‌లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది. అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా.. వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని బ్రిటన్ అందోళన వ్యక్తం చేస్తోంది.గతేడాది జులైలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటివరకు దాదాపు 19వేల మంది అక్రమ వర్కర్లను, విదేశీ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి.. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. అయితే, తాజాగా భారతీయ రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.