European Union
-
ఏకపక్ష నిర్ణయాలు.. ట్రంప్‌కు ఝలక్
బ్రస్సెల్స్: అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే 27దేశాల యూరప్ కూటమి ఘాటుగా స్పందించింది. అర్ధరహిత టారిఫ్‌లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వానికి తగు సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీర్ లియాన్..‘ట్రంప్ టారిఫ్ సవాలుకు దీటుగా బదులిస్తాం. అవి చెడ్డ పన్నులు. వ్యాపారస్తులకూ చెడ్డవే. వినియోగదారులకు గుదిబండలు. యూరోపియన్ యూనియన్‌కు భారంగా మారిన ఈ టారిఫ్‌లకు దీటైన సమాధానం చెప్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరువైపులా విపరిణామాలు ఈయూ కూటమిలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ సైతం అమెరికా స్టీల్, అల్యూమినియంలపై టారిఫ్‌లు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పందించారు. అమెరికా మాకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే యురోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిమీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుంది. అప్పుడు అంతిమంగా ఆర్థికయుద్ధం మొదలై ఇరువైపులా దాని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’అని ఒలాఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈయూ కూటమి ఏ స్థాయిలో టారిఫ్‌లు పెంచుతుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ముఖ్యంగా టారిఫ్ పెంచాలని యోచిస్తున్నట్లు వాణిజ్యరంగ విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్‌లో వ్యాపారంపై ఈఎఫ్టీఏ ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్‌కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 2024లో ఈఎఫ్టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, నార్వే, లీష్టెన్స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 24 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్‌లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. -
ఐరోపా సమాఖ్యపైనా టారిఫ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్‌లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది. 27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు. వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.ప్రతీకారం తప్పదన్న ఈయూకెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్‌లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్‌ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్‌తో దాదాపు 45 నిమిషాలు ఫోన్లో మంతనాలు జరిపారు. -
ఈఫిల్ టవర్‌పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్‌కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్‌ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్‌లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్‌కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్‌కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్‌కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్‌లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్‌సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్‌లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్‌లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్‌ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్‌కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్‌లకు అల్విదా సిరియాలో అసద్‌ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
ఈయూ అనుభవం నేర్పే పాఠాలు
జన్యుమార్పిడి(జీఎం) పంటలపై కేంద్రప్రభుత్వం ఆమోదయోగ్యమైన విధానాన్ని తేవాలని సుప్రీంకోర్టు కోరింది. జీఎం పంటలను చాలా రాష్ట్రాల వ్యవ సాయ సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనుషులు, జంతువులు, మొక్కల మీద వీటి ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం, జీఎం జనరే టర్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ పంటలను సులభంగా ఆమోదించడానికి దూరంగా ఉన్నాయి. ఒకనాటి హరిత విప్లవం ఫలితంగా ఉత్పాదకత పెరిగింది. కానీ ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే జీఎం సాంకేతికతకు సంబంధించిన ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.జన్యుమార్పిడి పంటలపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఇటీవల సుప్రీంకోర్టు కోరింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జన్యుమార్పిడి పంటల ప్రవేశాన్ని సంశయవాదులు అడ్డుకోగలిగారు. పర్యావరణం, వ్యవ సాయ వైవిధ్యం, మానవులు, జంతువుల ఆరోగ్యంపై జన్యుమార్పిడి పంటల ప్రభావాలపై 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ సంఘాల నాయకులు గత వారం ఒక జాతీయ సదస్సును నిర్వహించారు. జన్యుమార్పిడి పంటలను వారు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారు.జన్యుమార్పిడి జీవులకు సంబంధించి తగిన ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి భారతదేశం పోరాడుతోంది. యూరో పియన్ యూనియన్(ఈయూ) తన సభ్య దేశాలలో జన్యుమార్పిడి ఉత్పత్తులు, విత్తనాల ప్రవేశాన్ని నియంత్రించడానికి చాలా కాలం కుస్తీ పట్టింది. సమగ్రమైనది కానప్పటికీ, మంచి విధానాన్నిరూపొందించగలిగింది. ఇది భారత్‌కు పాఠాలను అందిస్తుంది.ప్రపంచం ఇప్పటివరకు మూడు ‘హరిత విప్లవాలను’ చూసిందని వ్యవసాయ వృద్ధి చరిత్ర చెబుతోంది. మొదటిది 1930లలో యూరప్, ఉత్తర అమెరికాలో ప్రారంభమైంది. ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, వ్యవసాయ నిర్వహణను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఇది మొక్కజొన్న, ఇతర సమశీతోష్ణ వాతా వరణ పంటలలో త్వరిత దిగుబడిని పెంచింది. రెండో హరిత విప్లవం కొన్ని భారతీయ రాష్ట్రాలతోపాటు 1960లు, 1970లలో చోటు చేసు కుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఉష్ణమండలంలోపండించే పంటలకు అదే విధమైన సాంకేతికతను బదలాయించింది. స్థానిక పరిశోధనలను ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికతలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.జన్యుమార్పిడి ఉత్పత్తులు, ముఖ్యంగా వ్యవసాయంలో జన్యు ఇంజినీరింగ్ ఉపయోగించి ఉత్పత్తి చేసిన విత్తనాలు 1970లలో కని పించాయి. వీటిని 1990లలో ప్రధానంగా ఉత్తర అమెరికాలో వాణిజ్యీ కరించారు. ఈ సాంకేతికతను ప్రబోధించినవారు వ్యవసాయ ఉత్పాద కతలో ఇది మరొక అపారమైన పెరుగుదలకు దారితీస్తుందనీ, ఆహార సరఫరాలో గుణాత్మక మెరుగుదలను అందజేస్తుందనీ పేర్కొన్నారు. మొదటి రెండు హరిత విప్లవాలకూ, మూడవ దానికీ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, నిశ్చయాత్మకమైన కుతూహలంతో దీనిని ప్రపంచం స్వీకరించలేదు. మానవులు, జంతువులు, మొక్కల ఆరోగ్యంపై ఈ సాంకేతికతలోని ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.అందుకే వీటి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. అయితే అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్ చాలా వరకు వ్యవసాయ బయోటెక్ అను వర్తనాలను అనుమతించాయి. భారత్‌తో సహా చాలా ఇతర దేశాలు ఈ విషయంలో సరైన మార్గం కోసం పోరాడుతున్నాయి.యూరోపియన్ దేశాలు ఈ సాంకేతికతను మొట్టమొదట గట్టిగా వ్యతిరేకించి, తర్వాత తీవ్రమైన నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. చాలా యూరోపియన్ ప్రభుత్వాలు, యూరోపియన్ యూని యన్ కూడా జన్యుమార్పిడి జీవులతో ముడిపడి ఉన్న ప్రమాదాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడా నికి బదులుగా ముందు జాగ్రత్త విధానాన్ని స్వీకరించాయి.ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం, ‘అదే’ తరహా ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలంటే, బలమైన శాస్త్రీయ సాక్ష్యం అవసరమని అమెరికా వాదిస్తోంది (అదే తరహా ఉత్పత్తిఅంటే నేరుగా పోటీ పడే లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తి). దిగుమతి దారులు లేదా దిగుమతి చేసుకునే దేశాలు తప్పనిసరిగా జీఎం విత్తనం లేదా ఉత్పత్తి మానవ లేదా జంతువు లేదా మొక్కల ఆరోగ్యానికి సుర క్షితం కాదని తిరస్కరించలేని శాస్త్రీయ ఆధారాలను అందించాలి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విత్తనం లేదా ఉత్పత్తి ‘సురక్షి తమైనది’ అని రుజువు చేయాల్సిన బాధ్యత జీఎం విత్తన ఉత్పత్తిదారు లపై లేదా దాని ఎగుమతిదారులపై లేదు; అది ‘సురక్షితం కానిది’ అని నిరూపించాల్సిన బాధ్యత దిగుమతిదారులపై ఉంది. మరో మాటలో చెప్పాలంటే, సురక్షితమని నిరూపించడం విక్రేత బాధ్యత కాదు, అది కొనుగోలుదారు బాధ్యత. కాబట్టి, హానికారకం అని రుజువయ్యేంత వరకూ అది సరైనదే అని అన్ని దేశాలూ భావించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదించిన స్వేచ్ఛా వాణిజ్య విధానంలో, బలమైన శాస్త్రీయ సాక్ష్యం లేనప్పుడు అమెరికా నుండి జన్యుమార్పిడి దిగుమతులను ఈయూ నియంత్రించలేదు. అయితే అమెరికా దృక్పథంతో విభేదిస్తూ, ఈయూ తన సభ్య దేశాలచే జన్యుమార్పిడి విత్తనాలు/ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించింది. ఈ పంట రకాల ఆమోదాన్ని తాత్కాలికంగా నిలుపుదల (1998–2004) చేస్తూ దాని చర్యలను ప్రారంభించింది.ఈ నిలుపుదలను ఆగ్రహించిన అమెరికా, అర్జెంటీనా, కెనడా దేశాలు ఈయూ నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా 2003లోప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక దావాను ప్రారంభించాయి. ఈయూ విధానం చట్టవిరుద్ధమైన వాణిజ్య పరిమితులను సృష్టిస్తోందని పేర్కొ న్నాయి. దాంతో డబ్ల్యూటీవో వివాద పరిష్కార ప్యానెల్ 2006 సెప్టెంబరులో ఫిర్యాదు చేసిన దేశాలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా తన ఆమోద ప్రక్రియను తేవాలని యూరోపియన్ యూనియన్ను కోరింది.డబ్ల్యూటీవో నిర్ణయానికి ముందే యూరోపియన్ యూనియన్ తన విధాన ప్రక్రియను మార్చుకుంది. అయితే అది ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. సభ్య దేశాల శాస్త్రీయ సంస్థలతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా నష్టంపై అంచనా వేయడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని బహిరంగ సంప్రదింపుల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈయూ నిబంధనల ప్రకారం, అనేక రకాల కారణాల ఆధారంగాపంట సాగును నిలిపివేయడానికీ, నిషేధించడానికీ లేదా పరిమితం చేయడానికీ సభ్య దేశాలకు హక్కు ఉంటుంది. పర్యావరణం, వ్యవ సాయ విధాన లక్ష్యాలు, సామాజిక–ఆర్థిక ప్రభావం వంటివి కారణా లుగా చూపొచ్చు. ఫలితంగా, ఐరోపాలో వాణిజ్యీకరణ కోసం చాలా తక్కువ వ్యవసాయ బయోటెక్ అప్లికేషన్లను ఆమోదించారు.ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం నుండి స్థిరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈయూ సభ్యదేశాలు, ఇతర యూరప్ దేశాలు జన్యుమార్పిడి పంటలను, ముఖ్యంగా ఆహార గొలుసులో భాగమైన వాటిని సులభంగా ఆమోదించడానికి నిరంతరం దూరంగా ఉన్నాయి. ఈయూ, ఇతర దేశాల విముఖత అనేది ప్రభుత్వాలపై డబ్ల్యూటీవో, జన్యుమార్పిడీ టెక్నాలజీ జనరేటర్ల ఒత్తిడిని బలహీనపరిచింది. ఇది భారతదేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంతో సాయపడుతుంది.జన్యుమార్పిడి జీవులపై సముచితమైన, ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు సరిగ్గానేకేంద్రానికి అప్పగించింది. భారతీయ విధాన రూపకర్తలు తప్పనిస రిగా యూరోపియన్ అనుభవాన్ని పరిశీలించాలి. ఇంతకుముందు మనం హరిత విప్లవ సాంకేతికతను అంగీకరించాం. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది; కానీ కొన్ని దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే ఈసారి, జన్యుమార్పిడిసాంకేతికతకు సంబంధించిన సానుకూల, ప్రతికూల ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీమాజీ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్‌లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 (తొలి రౌండ్లో మూడోస్థానం) వచ్చాయి. తొలి రౌండ్లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) రెండో రౌండ్లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్ఎన్ పార్టీ తొలి రౌండ్లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్లోని అయిదు స్థానాల్లో ఆర్ఎన్ తొలి రౌండ్లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.రాజకీయ అస్థిరత ఫ్రాన్స్‌కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్‌లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది. ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్ఎన్లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్‌లోనూ మేక్రాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు. అన్బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌దే. నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్‌లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు. అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న! -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు. -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
ఉక్రెయిన్‌కు ఈయూ భారీ సాయం
బ్రస్సెల్స్: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ చెప్పారు. గురువారం బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఈయూలోని 27 సభ్య దేశాల నేతలు ఉక్రెయిన్‌కు 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.48 లక్షల కోట్లు)సాయం ప్యాకేజీని అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తీర్మానంపై కేవలం గంటలోపే చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సాయానికి సంబంధించిన తీర్మానాన్ని వీటో చేస్తామంటూ సభ్య దేశం హంగెరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ కొంతకాలం చేస్తున్న హెచ్చరికలను కూడా పట్టించుకోలేదన్నారు. -
మహ్సా అమినికి
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
యూరప్ ఎకనమిక్ అవుట్‌లుక్ అధ్వాన్నం
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. -
ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు ధీటుగా, దేశాల మధ్య వేగవంతమైన అనుసంధానమే ధ్యేయంగా భారత్, అమెరికా తదితర దేశాలు ప్రతిష్టాత్మక ఆర్థిక నడవా(ఎకనామిక్ కారిడార్)ను తెరపైకి తీసుకొచ్చాయి. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ నూతన ప్రాజెక్టును భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు శనివారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై వారు సంతకాలు చేశారు. ఈ కారిడార్‌తో ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య భౌతిక అనుసంధానం మాత్రమే కాదు, ఆర్థిక అనుసంధానం సైతం మరింత పెరుగుతుందని నిర్ణయానికొచ్చారు. దేశాల నడుమ అనుసంధానాన్ని ప్రోత్సాహిస్తూనే అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కనెక్టివిటీని ప్రాంతీయ సరిహద్దుల వరకే పరిమితం చేయాలని తాను అనుకోవడం లేదన్నారు. దేశాల నడుమ పరస్పర నమ్మకం బలోపేతం కావాలంటే అనుసంధానం పెరగడం చాలా కీలకమని స్పష్టం చేశారు. రెండు భాగాలుగా ప్రాజెక్టు ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో రెండు వేర్వేరు కారిడార్‌లో ఉంటాయి. ఇందులో ఈస్ట్ కారిడార్ ఇండియాను, పశి్చమ ఆసియా/మధ్య ప్రాచ్యాన్ని కలుపుతుంది. ఉత్తర కారిడార్ పశి్చమ ఆసియా/మిడిల్ఈస్ట్ను యూరప్‌తో అనుసంధానిస్తుంది. సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఇదొక సీమాంతర షిప్–టు–రైలు ట్రాన్సిట్ నెట్వర్క్. దీంతో దేశాల నడుమ నమ్మకమైన, చౌకైన రవాణా సాధ్యమవుతుంది. వస్తువులను సులభంగా రవాణా చేయొచ్చు. రైలు మార్గం వెంట డిజిటల్, విద్యుత్ కేబుల్స్, క్లీన్ హైడ్రోజన్ ఎగుమతి కోసం పైపులు ఏర్పాటు చేస్తారు. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది చరిత్రాత్మకమని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివరి్ణంచారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. -
ఆన్లైన్ దిగ్గజాల కట్టడిపై ఈయూ దృష్టి - ఎక్కువ కానున్న నిఘా!
లండన్: ఆన్లైన్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయడంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త డిజిటల్ చట్టాల కింద ఆరు కంపెనీలను ఆన్లైన్ ‘గేట్‌కీపర్స్‘ పరిధిలోకి చేర్చింది. వీటిలో యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ఉన్నాయి. గేట్‌కీపర్లుగా ఈ సంస్థలపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా కంపెనీలు డిజిటల్ మార్కెట్స్ చట్టాలను పాటించడం మొదలుపెట్టేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. చట్టం ప్రకారం తమతో పాటు ఇతర కంపెనీలు కూడా తమ తమ ఉత్పత్తులు, సర్వీసుల పనితీరులో గణనీయంగా మార్పులు, చేర్పులు చేయాల్సి రానున్నట్లు గూగుల్ తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మెసేజింగ్ సేవల సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు టెలిగ్రామ్ లేదా సిగ్నల్ యూజర్లు తమ టెక్ట్స్ లేదా వీడియో ఫైల్స్‌ను వాట్సాప్ యూజర్లకు కూడా పంపించుకోవచ్చు. ఇక ప్లాట్‌ఫామ్‌లు సెర్చి రిజల్ట్‌లో తమ ఉత్పత్తులకు .. పోటీ సంస్థల ఉత్పత్తులు, సర్వీసులకు మించిన రేటింగ్ ఇచ్చుకోకూడదు. కాబట్టి అమెజాన్ లాంటివి థర్డ్ పార్టీ వ్యాపారుల ఉత్పత్తుల కన్నా తమ ఉత్పత్తులే సులభంగా కనిపించేలా చేయడానికి ఉండదు. అటు ఆన్లైన్ సేవల సంస్థలు .. నిర్దిష్ట యూజర్లు లక్ష్యంగా పంపే ప్రకటనల కోసం వివిధ వేదికల్లోని యూజర్ల వ్యక్తిగత డేటాను కలగలిపి వాడుకోవడానికి కుదరదు. ఉదాహరణకు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ సర్వీసులను వినియోగించుకునే యూజర్ల డేటాను వారి సమ్మతి లేకుండా ఆయా వేదికల మాతృసంస్థ మెటా కలగలిపి వినియోగించుకోవడానికి కుదరదు. -
యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూరప్‌లో వారంపాటు పర్యటించనున్నారు. మంగళవారమే ఆయన భారత్ నుంచి బయల్దేరారు. సెప్టెంబర్ ఏడున బ్రస్సెల్స్‌లో యురోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో రాహుల్ భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే కొందరు ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు ఉదయం కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ జరగనుంది. మధ్యా హ్నం పత్రికా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఆయన పారిస్‌కు చేరుకుని సెపె్టంబర్ ఎనిమిదో తేదీన మరో పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సెపె్టంబర్ తొమ్మిదో తేదీన ఫ్రాన్స్ పార్లమెంటేరియన్లతో ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి సైన్స్ పొ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడతారు. సెపె్టంబర్ పదో తేదీన రాహుల్ నెదర్లాండ్స్‌కు వెళ్తారు. 400 ఏళ్ల నాటి లీడెన్ యూనివర్సిటీలో పర్యటించి అక్కడి విద్యార్థులతో మాట్లాడతారు. సెప్టెంబర్ 11వ తేదీన నార్వేకు వెళ్తారు. ఓస్లోలో ఆ దేశ పార్లమెంటేరియన్లతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో, ఓస్లో వర్సిటీ విద్యార్థులతోనూ మాట్లాడతారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి రాహుల్ భారత్‌కు తిరుగుపయనమవుతారు. -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
యూజర్ల డేటా అమెరికాకు బదిలీ, మెటాకు భారీ జరిమానా!
ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియా నిబంధనల్ని ఉల్లంఘించిందుకు ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిందని ఆరోపిస్తూ ఐర్లాండ్ రెగ్యులేటర్ రికార్డ్ స్థాయిలో మెటాకు 1.2 బిలియన్ యూరోల (1.3 బిలియన్ డాలర్లు) ఫైన్ విధించింది. యూరోపియన్ యూనియన్‌కి చెందిన ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) 1.2 బిలియన్ యూరోలను మెటా నుంచి వసూలు చేసే బాధ్యతలను యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (ఈడీపీబీ)కి అప్పగించింది. ఇక 2020 నుంచి ఫేస్బుక్ మాతృసంస్థ ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిన అంశంపై విచారణ ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా మెటా యురోపియన్ కేంద్ర కార్యాలయం డుబ్లిన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కేంద్రం నుంచే మెటా యూజర్లు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించేలా వ్యహరించిందంటూ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ (సీజేఈయూ) అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ జరిమానాను మెటా వ్యతిరేకించింది. లోపభూయిష్టంగా, అన్యాయంగా ఇచ్చిన తీర్పు ఇతర కంపెనీలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. రెగ్యులేటర్ విధించిన జరిమానా, ఇతర అంశాలపై చట్టపరంగా పోరాటం చేస్తామని మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ చీఫ్ లీగర్ అధికారి జెన్నీఫెర్ న్యూస్టెడ్ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు. చదవండి👉 అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్! -
డేటా లీకేజీ ఉదంతం... చాట్‌జీపీటీపై ఇటలీ నిషేధం
పారిస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్‌జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే. ఎందుకు? యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్‌జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్‌జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది. ‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్‌జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్‌జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్ పిల్లల కంటపడే రిస్కుంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది. చాట్‌జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్ లైన్లు, చాట్ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్‌జీపీటీని కొంతకాలం ఆఫ్‌లైన్ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది. 20 రోజుల్లో నివేదించాలి నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్‌జీపీటీని నిషేధించాయి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్‌గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్‌ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్‌కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్‌కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్‌పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్‌కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్‌ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
Ukraine-Russia war: మాకు మరిన్ని ఆయుధాలు కావాలి
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్స్కీ చెప్పారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్‌తో సన్మానించారు. బ్రస్సెల్స్‌లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. -
బ్యారెల్ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక
బ్రసెల్స్: ఉక్రెయిన్‌పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్ యూనియన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. రూటు మార్చిన రష్యా రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నల్ల మార్కెట్‌కూ తరలించొచ్చు... ఆర్థిక మందగమనం దెబ్బకు ఒకవేళ సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు వాడకం తగ్గినా ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చము రు ఉత్పత్తి ఆపితే పునఃప్రారంభించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. కాబట్టి మధ్యేమార్గంగా ఇరాన్, వెనెజువెలా దారిలోనే రష్యా కూడా బ్లాక్ మార్కెట్లో చమురును అమ్ముకునే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. పైగా దీనిద్వారా హెచ్చు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కోణంలో చూసినా ఈయూ పరిమితి వాటికే బెడిసికొట్టేలా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 తొలి త్రైమాసికాంతం నాటికి చమురు ధరలు ఒకవేళ బాగా పెరిగితే పరిమితి రష్యాపై ఎంతోకొంత ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. -
డిసెంబర్ క్వార్టర్లో మాంద్యంలోకి యూరప్ దేశాలు
ఫ్రాంక్ఫర్ట్: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. -
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం.. యాపిల్ కంపెనీకి పెద్ద దెబ్బే!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి ఇకపై కామన్ ఛార్జింగ్ పోర్ట్ ఉండాలంటూ కొత్త నిబంధనలతో కూడిన చట్టాన్ని ఆమోదించింది. 2024 కల్లా ఈ నిబంధన పూర్తిగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపించనున్నాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్ ఛార్జర్లే అన్ని డివైజ్లకీ ఉండాలి. వీటితో పాటు ఇ-రీడర్లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇతర సాంకేతిక పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ (Apple iPhone)లతో పాటు పలు సంస్థలు కూడా వారి ఛార్జింగ్ పోర్ట్‌ను మార్చవలసి ఉంది. యూరోపియన్ కస్టమర్లకు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించే సంస్థలలో యాపిల్ ప్రధాన సరఫరాదారుడు, దీంతో ఈ నిర్ణయం ఐఫోన్ కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ నిబంధన ఎందుకంటే! కస్టమర్లు డివైజ్ కొనుగోలు చేసిన ప్రతీసారి కంపెనీలు కొత్త ఛార్జర్లను కూడా ఇస్తుంటాయి. దీంతో పాతది వాడకుండా వ్యర్థంగా మారడం సహజంగా మారుతోంది. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించడంతో పాటు, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై ఈయూలో చాలా ఏళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగిల్ ఛార్జర్ వినియోగించడం వల్ల దాదాపు EUR 250 మిలియన్లు (దాదాపు రూ. 2016 కోట్లు) ఆదా అవుతుందని యూరోపియన్ కమిషన్ అంచనా. 2018లో మొబైల్ ఫోన్లతో విక్రయించిన సగం ఛార్జర్లు USB మైక్రో-USB కనెక్టర్‌ను కలిగి ఉండగా, 29 శాతం USB టైప్-సి కనెక్టర్‌ను కలిగి ఉన్నారు. 21 శాతం మంది లైట్నింగ్ కనెక్టర్ చార్జర్‌ను కలిగి ఉన్నారు. చదవండి: Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
ఈయూలోకి ఉక్రెయిన్!
కీవ్: యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్‌లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాలో కోత రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్‌కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్‌లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్ చాలా కీలకం. ఉక్రెయిన్‌లో బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. కీవ్‌కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్ జాన్సన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను జాన్సన్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసింది. -
Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు
మాస్కో/కీవ్: భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుంది. అక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం. మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టాం. ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ తమకు యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.‘గ్రేజోన్’ పేరిట ఉక్రెయిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా రష్యా దండయాత్రకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. ఫిన్లాండ్ నుంచి మరిన్ని ఆయుధాలు! ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ఫిన్లాండ్ ముందుకొచ్చింది. ఫిన్లాండ్ గతంలోనే రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. ► యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయేన్ తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. యుద్ధానికి ముగింపు, ఆహార సంక్షోభంపై చర్చించారు. యుద్ధం వల్ల నష్టపోయిన వారికి తాము అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ► ఉక్రెయిన్‌లో ముగ్గురు విదేశీయులకు రష్యా అనుకూల వేర్పాటువాదుల కోర్టు మరణ శిక్ష విధించడంపై ఐరాస మానవ హక్కుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యుద్ధనేరమని వ్యాఖ్యానించింది. ► తూర్పు ఉక్రెయిన్‌లో తమ బలగాలు ప్రత్యర్థి రష్యా సైనికులపై పైచేయి సాధిస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవిరోడోంటెస్క్‌లో కీలక పారిశ్రామిక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను ఉక్రెయిన్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయన్నారు. రష్యా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాళ్ ఫ్రెండ్ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి ► తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులకు తూర్పు ఉక్రెయిన్‌లో మరణ శిక్ష విధించడం దారుణమని, ఇందుకు రష్యానే బాధ్యత వహించాలని బ్రిటిష్ మంత్రి రాబన్ వాకర్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ పౌరులైన ఐడెన్ అస్లిన్(28), షౌన్ పిన్నర్(48)కు రష్యా అనుకూల కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో మొరాకో పౌరుడు సాదౌన్కు కూడా మరణశిక్ష విధించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ► రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యంలో నిత్యం 200 మంది దాకా జవాన్లు బలవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆధునిక ఆయుధాలు వస్తేనే తమ సైనికుల ప్రాణత్యాగాలకు తెరపడుతుందన్నారు. ► ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు. ఆయన తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. తమ సేనలు ఖర్కీవ్నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాయని జెలెన్స్కీ చెప్పారు. ► డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్టాఖనోవ్పై ఉక్రెయిన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు. -
Russia Ukraine war: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం
కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది. రష్యా క్రూర దాడులు: జెలెన్స్కీ తూర్పు డోన్బాస్లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్స్క్, బఖ్‌ముత్‌లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. లీసిచాన్స్క్.. 60 శాతం ధ్వంసం తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్‌స్క్‌లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్ముత్–లీసిచాన్స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది. షోల్జ్‌తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో పౌర మరణాలు 4,945: ఐరాస రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది. -
పుతిన్‌కు ఊహించని షాక్.. అధికారానికి బీటలు!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్ అల్లుడు వాలెంటిన్ యుమషేవ్ పుతిన్ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ఎల్త్సిన్ హయాం నుంచీ అధ్యక్ష సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పుతిన్ అధికారానికి బీటలు పడుతున్నాయని, సైన్యం మీదా ఆయన పట్టు తగ్గుతోందని వస్తున్న వార్తలకు బలం చేకూరింది. యుమషేవ్ కూతురు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇదిలా ఉండగా.. యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్(ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. మరోవైపు.. డెన్మార్క్‌కు మంగళవారం నుంచి చమురు సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వేదేవ్ దుయ్యబట్టారు. అంతకుముందు బల్గేరియా, పోలాంట్, ఫిన్లాండ్లకు చమురు ఎగుమతులను రష్యా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: పెళ్లయిందని ప్రకటించిన 4 నెలలకే తల్లయిన స్టార్ హీరోయిన్ -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
పార్లమెంట్లో అమ్మాయిల డ్యాన్స్ స్టెప్పులు.. వీడియో వైరల్
యూరప్ పార్లమెంట్లో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు. వివరాల ప్రకారం.. ఇటీవల యూరప్ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్లో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న అంశంపై చర్చించారు. కాగా, ఈ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా కొందరు యువతీయువకులు ప్రత్యక్షమై 10 నిమిషాల పాటు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) భవిష్యత్తు ఇదే అయితే.. మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లేనని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌కు చెందిన మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈయూతో బ్రేకప్ పట్ల సంతోషంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. మరోవైపు తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. #EU Interpretive dance performed at European Parliament But Emmanuel Macron looked unimpressed as the European Parliament was treated to a nine-minute youth dance session “to embody the French Presidency of the European Council” on Monday ahead of his key speech to the assembly pic.twitter.com/g9Gqe9Qamx — Freedom Truth Honor 🇺🇳 (@FreedomHonor666) May 10, 2022 ఇది కూడా చదవండి: ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది: మనికే మగే హితె సింగర్ యోహానీ -
ఈయూతో ఎఫ్‌టీఏ దిశగా అడుగులు
ముంబై: యూరోపియన్ యూనియన్‌తో (ఈయూ) వచ్చే ఏడాది నాటికి భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► దేశం ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)సహా ఇతర దేశాలు లేదా బ్లాక్‌లతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుపుతోంది. ► ఇటలీకి చెందిన విదేశాంగ మంత్రితో సహా ఒక ప్రతినిధి బృందం దేశ రాజధానితో పర్యటిస్తోంది. ఎఫ్‌టీఏపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి. ► ఇప్పటికే బ్రిటన్‌తో మూడు దఫాల చర్చలు జరిగాయి. త్వరలో నాలుగో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉంది. మే 26–27 తేదీల్లో బ్రిటన్ ప్రతినిధులతో కీలక సమావేశం జరగనుంది. ► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశంలో వృద్ధిని పెంచుతాయి. భారీ ఉపాధి కల్పనకు వీలు కలుగుతుంది. భారత్ ఇతర దేశాలు లేదా కూటములతో న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన, విజయవంతమైన భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తోంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు జరిపి రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో దేశం ఎన్నడూ లేని విధంగా 38 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవుతాయన్న విశ్వాసం ఉంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తుల తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మౌలిక రంగం పురోగతికి చర్యల తత్సబంధ కార్యక్రమాల ద్వారా దేశం ఆశించిన ఫలితాలను సాధిస్తోంది. ► ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు స్థాయలో రూ. 1.67 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల జరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఆశాజనకం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌లు కూడా ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ, పునరుద్ధరణను సూచిస్తున్నాయి. ► 2021లో దేశం 82 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఏ) ఆకర్షించింది. ఇది ఎన్నడూ లేనంత అత్యధికం. చట్టబద్ధమైన పాలన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, పారదర్శక న్యాయ వ్యవస్త, వ్యాపారాలను ఆకర్షించే స్థిరమైన విధానాల వంటి అంశాలు ఈ రికార్డుల సాధనకు కారణం. ఆస్ట్రేలియా దిగుమతుల్లో కొన్నింటికే సుంకాల మినహాయింపు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 29.8 శాతం ఉత్పత్తులకు సుంకాలపరమైన మినహాయింపులు వర్తించవని కేంద్రం వెల్లడించింది. డైరీ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు, విలువైన లోహాలు, ఆభరణాలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. దేశీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మినహాయింపులు వర్తించే ఉత్పత్తుల జాబితా నుంచి వీటిని తొలగించినట్లు కేంద్రం తెలిపింది. భారత్–ఆస్ట్రేలియా మధ్య కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఇండ్‌ఆస్ ఈసీటీఏ) సంబంధించిన సందేహాల నివృత్తి కోసం వాణిజ్య శాఖ ఈ మేరకు వివరణ (ఎఫ్ఏక్యూ) జారీ చేసింది. ఏప్రిల్ 2న కుదిరిన ఈ ఒప్పందం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఎఫ్ఏక్యూ ప్రకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత 27.5 బిలియన్ డాలర్ల నుంచి 45–50 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇండ్‌ఆస్ ఈసీటీఏతో వచ్చే 5–7 ఏళ్లలో 10 లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. -
మోదీతో ఈయూ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకారం తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా సోమవారం మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కూడా ఉర్సులా భేటీ అయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు. -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్‌కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్‌కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్‌పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్‌పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్‌ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్‌కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్‌తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
రికార్డులు బద్దలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎన్నిక
France election.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో, అధికారిక ఫలితాలు వెలువడక ముందే లీపెన్ తన ఓటమిని అంగీకరించారు. ఈ క్రమంలో మాక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్, యూరోపియన్ జెండాలను ఊపారు. కాగా, ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపెన్‌పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ఇక, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మాక్రాన్ మరోసారి విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు అందుతున్నాయి. మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు" అని అన్నారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు -
Russia-Ukraine war: పుతిన్ కుమార్తెలపై ఈయూ ఆంక్షలు
బ్రసెల్స్: పుతిన్ కుమార్తెలిద్దరిపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. రష్యాను నిలవరించేందుకు పలు కంపెనీలపై, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఈయూ తాజాగా మరి కొందరితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో పుతిన్ కుమార్తెలు మారియా, కేటరీనా ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరి ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు వీరి ప్రయాణాలపై నిషేధాన్ని విధించారని ఈయూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పుతిన్ కూతుర్లపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్‌లో రష్యా క్రూర చర్యలకు పాల్పడిందన్న వార్తలకు సాక్ష్యాలున్నాయంటూ ఈయూ తాజా ఆం క్షల జాబితాను విడుదల చేసింది. రష్యాలో రిజిస్టరైన నౌకల ను ఈయూ రేవుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. కోల్ బ్యాన్ రష్యా బొగ్గు దిగుమతులను నిషేధించాలని కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో తొలిసారి రష్యా ఇంధన ఉత్పత్తులు ఆంక్షల జాబితాలోకి చేరినట్లయింది. ఆగస్టు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే చమురు, సహజవాయు దిగుమతులపై మాత్రం సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఏటా దాదాపు 440 కోట్ల డాలర్ల బొగ్గును రష్యా నుంచి ఈయూ దిగుమతి చేసుకుంటోంది. యూఎస్ తదితర దేశాల నుంచి బొగ్గు దిగుమతులు పెంచుకోవడం ద్వారా రష్యా దిగుమతుల నిషేధ లోటును ఎదుర్కోవాలని ఈయూ నిర్ణయించింది. రష్యా బొగ్గుదిగుమతులపై నిషేధంతో ఈయూలోని కొన్ని దేశాల్లో కరెంటు చార్జీలు విపరీతంగా పెరగనున్నాయని రైస్టాడ్ ఎనర్జీ అంచనా వేసింది. చమురు, సహజవాయువుల విషయంలో మాత్రం ఈయూలోని చాలా దేశాలు అత్యధికంగా రష్యాపై ఆధారపడినందున నిషేధంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకవేళ వీటిపై నిషేధం విధించినా రష్యాకు పెద్దగా సమస్య ఉండదని, తక్కువ ధరకు ఇండియా, చైనాకు రష్యా అమ్ముకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలు భారీ రేట్లకు ఈయూ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తాయని, దీనివల్ల ఆయా దేశాలపై పెను భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
Russia-Ukraine war: రష్యా గ్యాస్‌కు యూరప్ గుడ్‌బై!
బ్రసెల్స్: గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త ఒప్పందాలు: జర్మనీ బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది. తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని, ఆచరణసాధ్యం కాదని జర్మనీ చాన్స్‌లర్ ఒలాప్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రకటించారు. రష్యాతో నిమిత్తం లేకుండా యూరప్ గ్యాస్ అవసరాలను అమెరికా, ఇతర దేశాలు తీర్చడం సా ధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే యూరప్‌కు భారీగా గ్యాస్ సరఫరా చేస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో అంతకుమించి సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధపడ్డా దాన్ని దిగుమతి చేసుకునే, పంపిణీ చేసే వ్యవస్థలు యూరప్‌లో ప్రస్తుతానికి లేవు. -
Putin: పుతిన్.. ఏం మెలిక పెట్టావయ్యా!
ఆంక్షలతో రష్యాను ఇరకాటంలో పెట్టాలని అమెరికా, పాశ్చాత్య దేశాలు(ఈయూ దేశాలతో కలిపి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తగ్గేదే లే అనుకుంటూ ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఈ క్రమంలో.. రష్యా ఆర్థిక స్థితి కొద్దికొద్దిగా దిగజారుతోంది. తాజాగా పుతిన్ ‘మిత్రపక్షంలో లేని దేశాలకు’ పెద్ద షాకే ఇచ్చాడు. సహజ వాయువుల ఉత్పత్తులు కావాలంటే చెల్లింపులను రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లో మాత్రమే చెల్లించాలంటూ కండిషన్ విధించాడు. లేదంటే ఉత్పత్తిని ఆపేస్తానని హెచ్చరించాడు. క్రెమ్లిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు, రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. యూరోపియన్ దేశాల కరెన్సీ విశ్వసనీయతపై ప్రభావవంతంగా ఒక గీతను గీయడం, ఆ కరెన్సీల నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా.. తన దారికి తెచ్చుకోవాలన్నది పుతిన్ ఫ్లాన్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యూరోలు, డాలర్లకు బదులు.. రష్యన్ రూబుల్స్‌లోనే రష్యన్ గ్యాస్ కోసం చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా ఈ షరతు పుతిన్‌కు పెద్ద అడ్వాంటేజే. ఒకవేళ ఈ షరతు.. రష్యాకు మునుముందు ఇబ్బందికరంగా గనుక మారితే వెంటనే ఎత్తేసే ఆలోచనలోనూ పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ మొత్తం 90 శాతం సహజ వాయువుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. కరెంట్ తయారీకి, ఇళ్ల వెచ్చదనానికి, పరిశ్రమల కోసం ఈ గ్యాస్లనే ఉపయోగించుకుంటున్నాయి. అందులో 40 శాతం ఉత్పత్తి రష్యా నుంచి కావడంతోనే.. ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూబుల్ ఎలా ఉంటుందో తెలీదు ఇదిలా ఉంటే పుతిన్ రూబుల్ షరతుపై యూరోపియన్ యూనియన్ దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. ‘నాకు తెలిసి యూరప్‌లో.. ఏ దేశానికీ రష్యా రూబుల్ ఎలా ఉంటుందో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రూబుల్స్‌లో ఎలా చెల్లిస్తారు?’ అని స్వోవేనియా ప్రధాని జనెజ్ జన్సా అంటున్నారు. జర్మన్ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి తదితరులు కూడా ఇవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్జియం లాంటి దేశం.. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పుతిన్ గనుక ఇదే ధోరణితో ముందుకు వెళ్తే గనుక.. కాంట్రాక్ట్ ఉల్లంఘనల కింద చర్యలకు దిగుతామని కొన్ని దేశాలు చెబుతున్నాయి. చదవండి: పుతిన్ పక్కన కూర్చోవడమా? నా వల్ల కాదు! -
ముట్టడిలో మారియుపోల్.. నగరంలో 20 వేలకు పైగా పౌరుల మృతి?
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా ముట్టడి తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రేవుపట్టణం మారియుపోల్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా సైన్యం తీవ్రతరం చేసింది. నగరం వీడాల్సిందిగా ఉక్రెయిన్ దళాలకు సోమవారం సూచించింది. ‘‘తెల్ల జెండాలు ఎగరేసి, ఆయుధాలు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డవాళ్లంతా హ్యుమానిటేరియన్ కారిడార్ల గుండా సురక్షితంగా వెళ్లిపోయేలా చూస్తాం. మరుక్షణమే నగరంలోకి అత్యవసరాల సరఫరాను అనుమతిస్తాం’’ అని కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ అందుకు నిరాకరించింది. దాంతో రష్యా దళాలు రెచ్చిపోయాయి. ఎడాపెడా క్షిపణి, బాంబు దాడులతో కనీవినీ ఎరగని రీతిలో నగరంపై విరుచుకుపడుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 20 వేల మంది దాకా మరణించి ఉంటారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి! దీనిపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసింది. మారియుపోల్‌లో వేలాదిగా పౌరులను అతి కిరాతకంగా, విచక్షణారహితంగా పొట్టన పెట్టుకుంటున్న తీరు దుర్మార్గమని ఈయూ విదేశీ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విమర్శించారు. ‘‘రష్యా నైతికంగా అధఃపాతాళానికి దిగజారింది. యుద్ధంలోనూ నీతీ నియమాలుంటాయని మర్చిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సాక్ష్యాలను సేకరిస్తోంది. కీవ్... కదనరంగం: రాజధాని కీవ్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా మరింత ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో జనసమ్మర్ధ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ నేలమట్టమైంది. కనీసం ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం. రాజధానిని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సమీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 50 టన్నుల భారీ ట్యాంక్ నుంచి అమోనియా లీకయింది. దాంతో చుట్టుపక్కల రెండున్నర కిలోమీటర్ల మేర వాతావరణం బాగా కలుషితమైనట్టు సమాచారం. తీవ్ర ప్రయత్నాల తర్వాత లీకేజీని అరికట్టారు. ఇతర నగరాలనూ సుదూరాల నుంచి క్షిపణి దాడులతో రష్యా బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా సైన్యంపై చాటునుంచి దాడులు చేసి పారిపోతూ గెరిల్లా వ్యూహం అనుసరిస్తున్నాయి. ఆహారం తదితర అత్యవసర సరఫరాలను అడ్డుకుంటున్నాయి. రివెన్ సమీపంలో సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణులతో దాడి చేసి 80 మందికి పైగా ఉక్రెయిన్, కిరాయి సైనికులను చంపేసినట్టు రష్యా చెప్పింది. రేవు పట్టణం ఒడెసాపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారు. దాంతో రష్యా సేనలు యుద్ధ నౌకల నుంచి పౌరులపైకి కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. బెనెట్‌కు థాంక్స్: జెలెన్స్కీ చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ స్కూలుపై బాంబు వేసిన పైలట్‌ను హతమార్చి తీరతామన్నారు. చర్చల్లో సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయని బెనెట్ చెప్పారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లను రష్యా స్థానిక కోర్టు నిషేధించింది! మొరాయించిన చెర్నోబిల్ మానిటర్లు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని రేడియేషన్ మానిటర్లు పని చేయడం లేదు! ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్లాంటు సమీపంలోని అడవులను కాపాడేందుకు అవసరమైన సంఖ్యలో అగ్నిప్రమాపక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఫలితంగా రేడియేషన్ లీకేజీని అడ్డుకోవడం కష్టం కావచ్చు’’ అని హెచ్చరించింది. శనివారం పోలండ్‌కు బైడెన్ అత్యవసర చర్చల కోసం ఈ వారాంతంలో యూరప్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్రిప్‌లో భాగంగా శనివారం పోలండ్‌లో కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాటో నేతలతో శిఖరాగ్ర భేటీలో బైడెన్ పాల్గొంటారు. తర్వాత బ్రసెల్స్ నుంచి పోలండ్ వెళ్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జాన్ సాకీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షోల్జ్, ఇటలీ, ఇంగ్లండ్ ప్రధానులు మారియో డ్రాగీ, బోరిస్ జాన్సన్‌లతో కూడా సోమవారం బైడెన్ చర్చలు జరిపారు. -
రష్యాది ఉగ్రవాదం.. ఎవరూ మర్చిపోబోరు, క్షమించలేరు
రష్యాది ఉగ్రవాదమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తూర్పారబట్టారు. నానాటికీ పాశవికంగా ప్రవర్తిస్తోందని, యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతోందని దుయ్యబట్టారు. ఖర్కీవ్‌లో సెంట్రల్ ఫ్రీడం స్క్వేర్ భవనంపై మిసైల్ దాడి చేసిన తీరు యుద్ధం నేరానికి ఏమాత్రం తీసిపోదన్నారు. రష్యా పైశాచికత్వాన్ని ‘‘ఎవరూ మర్చిపోలేరు. ఎవరూ క్షమించబోరు’’ అన్నారు. తర్వాత యూరోపియన్ పార్లమెంటును ఉద్దేశించి ఆయన భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ‘‘మేం శాయశక్తులా పోరాడుతున్నాం. ఈ పోరాట పటిమ ద్వారా మేమేంటో అందరికీ చూపిస్తున్నాం. తోటి యూరప్ దేశాలతో సమానులుగా నిలవాలన్నది మా ఉద్దేశం. మడమ తిప్పని పోరాటంతో దాన్నిప్పటికే రుజువు చేసుకున్నామని భావిస్తున్నాం’’ అన్నారు. ఇప్పటికైనా పోరాటంలో తమతో మరింతగా కలిసి రావాలని యూరప్ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈయూలో చేర్చుకోవాలన్న తమ విజ్ఞప్తిపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. చర్చల్లో ఏ విషయంలోనూ తాము వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రాణాంతక ఆయుధాలతో యుద్ధానికి దిగి, మరోవైపు సర్దుకుపొమ్మనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. తగ్గేదే లేదు: రష్యా ప్రపంచమంతా దుమ్మెత్తిపోస్తున్నా రష్యా మాత్రం తగ్గేదే లేదంటోంది. తమ లక్ష్యాలను సాధించేదాకా వెనకడుగు వేసేది లేదని రష్యా రక్షణ మంత్రి మంగళవారం పునరుద్ఘాటించారు. యూరప్ తమపై ఆర్థిక యుద్ధానికి దిగుతోందని ఆంక్షలనుద్దేశించి ఆయన దుయ్యబట్టారు. అది నిజమైన యుద్ధంగా మారినా ఆశ్చర్యం లేదంటూ వాటిని హెచ్చరించారు. విధ్వంసం మధ్యే సేవలు... చుట్టూ బాంబులు, క్షిపణుల మోతలు హోరెత్తిపోతున్నా ఉక్రెయిన్ వైద్య సిబ్బంది మాత్రం వెరుపు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖర్కీవ్‌లోని ఓ ఆస్పత్రిలో ప్రసూతి వార్డును తాత్కాలికంగా బాంబ్షెల్టర్గా మార్చారు. గర్భిణులను, నవజాత శిశువులను జాగ్రత్తగా అందులోకి చేర్చి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. -
Russia - Ukraine war: ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన నిర్ణయం
గత కొద్ది రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన శాంతి చర్చలు కూడా విఫలం కావడంతో ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు యుద్ధ ప్రణాళికలు రచిస్తూ ఇరు దేశాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు తమ దేశంలోని యుద్ధ అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తానని ప్రకటించారు. యుద్ధంలో పాల్గొనే ఖైదీలకు విముక్తి ప్రసాదిస్తానని పేర్కొన్నారు. మీ ప్రాణాలు కాపాడుకోండి ఉక్రెయిన్‌లోని రష్యన్ సైనికులను తమ ఆయుధాలు వదిలి తిరిగి వెల్లాల్సిందిగా పిలుపునిచ్చాడు. దాంతో పాటు ‘మీ ప్రాణాలను కాపాడుకోండి లేదా వదిలివేయండి’ అంటూ వారికి జెలెన్స్కీ హెచ్చరికను కూడా జారీచేశారు. అంతేగాక జెలెన్స్కీ రష్యన్ సైనికులనుద్దేశించి మాట్లాడుతూ.. మీరు మీ కమాండర్లను, ప్రచారకర్తలను నమ్మవద్దు. మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలని తెలిపారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 4,500 మంది రష్యా సైనికులు మరణించారని ఆయన ప్రకటించారు. రాబోయే 24 గంటలు తమ దేశానికి కీలకమైన కాలమని జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం బెలారస్ దేశ సరిహద్దులో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం, రష్యా ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా దేశ రాజధాని కీవ్‌లో ప్రసంగించిన సందర్భంగా జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కుగా భావిస్తున్నానని, అలాగే ఇది సాధ్యమవుతుందని కూడా భావిస్తున్నట్టు జెలెన్స్కీ తెలిపారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడి: ప్రపంచదేశాలు ఏమంటున్నాయంటే..?
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. మరింత తీవ్రమైన ఆంక్షలతో రష్యాను దారికి తీసుకువస్తామని ప్రతినబూనాయి. ఉక్రెయిన్ను సైనికపరంగా రక్షించలేని పరిస్థితుల్లో యూరప్‌లో యుద్ధమేఘాలు కమ్ముకోకుండా చూడటమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నాటో ఇప్పటికే రష్యా వైపు తన పశ్చిమ విభాగం సైనికదళాలను సిద్ధం చేసింది. ►తన వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితులను చవిచూస్తారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం నాటో నేతల వర్చువల్ సమావేశం జరగనుంది. ►యూరోపియన్ యూనియన్(ఈయూ), నాటో సభ్యదేశం లిథువేనియా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌కు, రష్యా మిత్రదేశం బెలారస్‌కు అతి సమీపంలో ఈదేశం ఉంది. ►నాటో దేశాలు తమకున్న 100 జెట్ విమానాలు, 120 యుద్ధ నౌకలను యుద్ధసన్నద్ధం చేశాయి. నాటో సభ్య దేశాలపై ఎలాంటి దాడి జరిగినా, అంగుళం భూమిని ఆక్రమించినా కాపాడుకుని తీరుతామని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. ఉక్రెయిన్ నాటో సభ్యదేశం కాదు. ►ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఒక స్వతంత్ర దేశంపై రాక్షసత్వంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా పేర్కొన్నారు. రష్యా చర్యలతో యూరప్ మాత్రమే కాదు, ప్రపంచదేశాల భద్రతకు ముప్పువాటిల్లిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈయూ దేశాలు బ్రస్సెల్స్‌లో అత్యవసర భేటీ అయి, రష్యాలోని కీలక రంగాలపై కఠిన ఆంక్షల ప్రతిపాదనలపై చర్చించనున్నాయి. ►యుద్ధ జ్వాలలు యూరప్‌లో వ్యాపించడం ఎవరికీ ఇష్టం లేకపోవడంతో ఏ దేశం కూడా ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపి ఆదుకుంటామని హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉక్రెయిన్‌కు సాయంగా ఇప్పట్లో తమ సైన్యాన్ని పంపిస్తామంటూ అమెరికా సహా పశ్చిమదేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ►‘ఆర్థికంగా, దౌత్యపరంగా, రాజకీయంగా కఠిన ఆంక్షలు విధించి రష్యాను మా దారికి తెచ్చు కుంటాం. చివరికి పుతిన్ విఫలం కాకతప్పదు’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చ రించారు. ప్రస్తుత పరిణామాలను అంచనా వేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచారు. చదవండి: (గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్ ఉక్కిరిబిక్కిరి) చైనా ఏం చేసింది? చైనా మినహా దాదాపు అన్ని దేశాలు కూడా రష్యా చర్యను ఖండించాయి. రష్యాపై చర్యల విషయంలో అగ్రదేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. రష్యా దురాక్రమణను చైనా ఖండించకపోగా అమెరికా, దాని మిత్ర దేశాలే ఈ పరిస్థితులకు కారణమంటూ నిందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమల ఎగుమతిదారైన రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనికి విరుగుడుగా, ఆ దేశం నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటామంటూ చైనా ప్రకటించింది. ఫలితంగా, ఆంక్షల ప్రభావం చాలా వరకు తగ్గి, రష్యాకు ఆర్థిక వెసులుబాటు లభించనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం) -
30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం
నేషనల్ డెస్క్, సాక్షి: ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పటిది కాదు. ఉక్రెయిన్ వందలాది ఏళ్లుగా రష్యన్ సామ్రాజ్యంలో భాగమే. తర్వాత కూడా అవిభక్త సోవియట్ యూనియన్‌లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. 30 ఏళ్ల క్రితం, అంటే 1991లో ప్రచ్ఛనయుద్ధానంతరం సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైంది. నాటి నుంచీ రష్యాతో విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరప్ దేశాల వైపు మొగ్గుతుండటం రష్యాను కలవరపెడుతూ వచ్చింది. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోరడంతో పాటు తనను నాటోలో చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామం రష్యాను మరింత కలవరపెట్టింది. నాటో కూటమి ఉక్రెయిన్‌లో తిష్ట వేస్తే తన భద్రతకు పెను ముప్పన్నది రష్యా ఆందోళన. పైగా నాటోలో చేరితే అమెరికా సహా సభ్య దేశాల సైనిక దన్నుతో ఉక్రెయిన్ బలోపేతమవుతుంది. ఈ పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టింది. 2000లో రష్యా పగ్గాలు చేపట్టిన నాటినుంచే ఉక్రెయిన్‌పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్) వివాదాల్ని ఎగదోసి... ఉక్రెయిన్‌లో తమ కీలుబొమ్మ సర్కార్లను ఏర్పరచడం ద్వారా ఆ దేశ వ్యవహారాలను నియంత్రించేందుకు పుతిన్ ప్రయత్నించారు. పుతిన్ దన్నుతో ఉక్రెయిన్ అధ్యక్షుడైన విక్టర్ యాంకోవిచ్ రష్యా అనుకూల వ్యవహారాలతో వివాదాస్పదునిగా నిలిచారు. 2014లో యూరోపియన్ యూనియన్‌లో చేరేందుకు నిరాకరించారు. దీనిపై జనాగ్రహం పెల్లుబికి ఆందోళనలు చెలరేగడంతో పదవి నుంచి దిగిపోయారు. ఈ కల్లోల సమయంలో రష్యా హఠాత్తుగా దాడికి దిగి దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యన్ల మెజారిటీ ప్రాంతమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి తనలో కలిపేసుకుంది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్‌లో డొనెట్స్క్, లుహాన్స్క్ల సమాహారమైన డోన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు అన్నివిధాలా మద్దతిస్తూ వచ్చింది. అక్కడ చెలరేగిన హింసాకాండకు 14 వేల మందికి పైగా బలయ్యారు. చదవండి: (Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!) మిన్స్క్ ఒప్పందం ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యూరప్ దేశాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా 2015లో బెలారస్ రాజధాని మిన్స్క్లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం వేర్పాటువాదులు ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్ వ్యవహారాల్లో ఉక్రెయిన్ వేలు పెట్టరాదు. యథాతథ స్థితి కొనసాగింపునకు రష్యా అంగీకరించాలి. కానీ ఒప్పందాన్ని గౌరవించడం లేదంటూ రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌కు మూడువైపులా భారీ సైనిక మోహరింపులకు పుతిన్ తెర తీసి పశ్చిమ దేశాలకు కంటిపై కునుకు లేకుండా చేశారు. యుద్ధం ఆలోచన లేదంటూనే మోహరింపులను రెండు లక్షల దాకా పెంచారు. బెలారస్లో వేలాది సైనికులతో అణు విన్యాసాలు చేస్తూ వచ్చారు. తాజాగా డోన్బాస్కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించడమే గాక, ఉక్రెయిన్‌కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు. వెనువెంటనే దానిపైకి యుద్ధానికి దిగి యూరప్‌లో పెను సంక్షోభానికి తెర తీశారు. ఇలా మొదలైంది.. 2021 మార్చి ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా సైన్యాల మోహరింపు ఆరంభం 2021 డిసెంబర్ సరిహద్దుల వద్ద దాదాపుగా లక్ష దాకా మోహరించిన రష్యా సైన్యాలు 2022 జనవరి ►ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యా, నాటో మధ్య చర్చలు. ►సేనలను అప్రమత్తం చేసిన నాటో 2022 ఫిబ్రవరి ►తూర్పు ఉక్రెయిన్‌లోని 2 రెబెల్ ప్రాబల్య ప్రాంతాల్లోకి రష్యా సైన్యం ►రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలు ►ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి రష్యా శ్రీకారం -
పోర్చుగల్‌లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్‌లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్‌లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్‌లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్‌కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్‌పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్‌కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్‌కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట! -
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్‌పై 2.42 బిలియన్ యూరోల జరిమానా విధిస్తూ యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గూగుల్ చేసిన అభ్యర్థనను యూరోపియన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గూగుల్‌పై జరిమానా సరైందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసలు విషయానికి వస్తే.. 2017లో పోటీదారులకు హాని కలిగించేలా సందర్శకులను దాని స్వంత షాపింగ్ సర్వీసుకు అనుకూలంగా వ్యవహరించడం కోసం గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ గూగుల్‌పై 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. అయితే, ఈ జరిమానాను వ్యతిరేకిస్తూ యూరోపియన్ కమిషన్ జనరల్ కోర్టులో గూగుల్ అప్పీల్ చేసింది. గూగుల్ చేసుకున్న ఈ అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చడంతో పాటు జరిమానాను సమర్థించింది. యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా 2017లో మార్పులు చేసినట్లు గూగుల్ తెలిపింది. "మా కొత్త విధానం మూడు సంవత్సరాలకు పైగా విజయవంతంగా పనిచేసినట్లు" గూగుల్ ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఖండంలో ఆన్లైన్ దిగ్గజం ప్రాబల్యాన్ని అరికట్టడానికి యూరోపియన్ రెగ్యులేటర్లు చేసిన ప్రయత్నంలో ఈ జరిమానా భాగం. ఆ తర్వాత గూగుల్‌పై మరో రెండు యాంటీట్రస్ట్ పెనాల్టీలు విధించాయి. మొత్తం 8.25 బిలియన్ యూరోల($9.5 బిలియన్)కు సంబంధించి కంపెనీ కూడా అప్పీల్ చేసుకుంది. (చదవండి: కొత్త ఎలక్ట్రిక్ ఆటోపై అదిరిపోయే ప్రారంభ ఆఫర్!) -
జన్యుమార్పిడి బియ్యం కలకలం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం జన్యుమార్పిడి (జీఎం) బియ్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్ నుంచి ఎగుమతి అయిన బియ్యపు నూకల్లో జన్యుమార్పిడి రకాలున్నట్లు యూరోపియన్ యూనియన్ ఫిర్యాదు చేసింది. వీటి వినియోగంతో అనారోగ్యం బారిన పడడమే కాకుండా..పలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే వాదనలను తెరపైకి తీసుకొచ్చింది. అయితే జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ నుంచి జూన్‌లో ఎగుమతి అయిన 500 టన్నుల బియ్యం ప్రస్తుతం పలు యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివాదానికి కేంద్రబిందువయ్యాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేసే యూరోపియన్ కమిషన్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఉన్న విషయం బయటపడింది. ఫ్రాన్స్‌కు చెందిన వెస్తోవ్ కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై ఫ్రాన్స్ ప్రభుత్వం పలు దేశాలను అప్రమత్తం చేసింది. దీంతో అమెరికాకు చెందిన మార్స్ ఆహార ఉత్పత్తుల కంపెనీ జీఎం అవశేషాలున్నాయనే భయంతో తాను ఉత్పత్తి చేసిన క్రిస్పీ ఎంఅండ్ఎం ప్రోడక్ట్‌ను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించింది. సేంద్రియ బియ్యంగా భావించి తాము ఇండియా నుంచి వచ్చిన ఆ బియ్యంతో ఈ ప్రోడక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. అమెరికా కంపెనీ చేసిన ఈ పనితో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వచ్చిన బియ్యాన్ని చాలా దేశాలు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. రంగంలోకి ఐఏఆర్ఐ.. భారత్ నుంచే జన్యుమార్పిడి బియ్యం ఎగుమతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడెక్కడ జన్యుమార్పిడి వంగడాలను సాగు చేస్తున్నారనే దానిపై ముమ్మర తనిఖీ ప్రారంభించింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలోనూ ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలు లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు జీఎం రైస్‌ను ప్రయోగాత్మకంగానైనా పండిస్తున్నాయా అనే విషయంపై ఆరా తీస్తోంది. తమిళనాడుకు చెందిన నాలుగు సేంద్రీయ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులను రద్దు చేయడం, కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వరిపై చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలే ఇందుకు సాక్ష్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రూ.65వేల కోట్ల నష్టం? భారత్ నుంచి ఏటా సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వరి ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ చేసిన ఫిర్యాదే గనుక నిజమైతే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుంది. జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించదు. అయితే కొన్ని పరిశోధన కేంద్రాల్లో జీఎం రైస్‌పై క్షేత్రస్థాయి పరిశీలనలు సాగుతున్నాయి. దీన్ని ఐఏఆర్ఐ కూడా ధ్రువీకరించింది. ఇదే సందర్భంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగైదు సేంద్రియ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులు రద్దు చేసింది. ఏమీ లేనప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని యూరోపియన్ యూనియన్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. ఎక్కడి నుంచి బియ్యం వెళ్లాయి? మహారాష్ట్ర అఖోలాలోని హోల్‌సేల్ బియ్యం వ్యాపారి ఓమ్ ప్రకాష్ శివప్రకాష్‌కి చెందిన సంస్థ నుంచి యూరప్‌కి పంపిన బియ్యంలో జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జెనిటికల్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ, ఐఏఆర్‌ఐకి చెందిన వ్యవసాయ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలాఖరులోపు ఈ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రైవేటు విత్తన సంస్థల ప్రయోగ క్షేత్రాలను, ఇటీవల విడుదల చేసిన హైబ్రీడ్ వరి వంగడాలను కూడా ఈ బృందం తనిఖీ చేస్తోంది. -
ఈయూతో బంధం పదిలం
రోమ్: యూరోపియన్ యూనియన్(ఈయూ), భారత్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్‌లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ పచ్చదనం నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు. మోదీకి ఈయూ అభినందనలు భారత్‌లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ పేర్కొన్నారు. జాతిపితకు ప్రధాని నివాళులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్‌లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్‌లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్‌లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్‌లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్‌కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్‌లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్‌తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్‌పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్‌ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్‌కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్‌లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్‌కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
అమెజాన్‌కు ఈయూ భారీ షాక్!
ఈయూ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)ను ఉల్లంఘిస్తూ వ్యక్తిగత డేటాను సేకరించినందుకు అమెజాన్ పై యూరోపియన్ యూనియన్ 886.6 మిలియన్ డాలర్ల (రూ.6,593 కోట్లు) జరిమానా విధించినట్లు ఈ కామర్స్ దిగ్గజం నేడు(జూలై 30) తెలిపింది. లగ్జెమ్‌బర్గ్ నేషనల్ కమిషన్ ఫర్ డేటా ప్రొటెక్షన్(సీఎన్ పీడీ) అమెజాన్ యూరోప్ కోర్ పై జూలై 16న జరిమానా విధించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. "అర్హత లేకుండా సీఎన్ పీడీ నిర్ణయం ఉందని మేము నమ్ముతున్నాము, ఈ విషయంలో మమ్మల్ని మేము రక్షించుకోవాలని భావిస్తున్నాము" అని అమెజాన్ తన ఫైలింగ్ లో తెలిపింది. జీడీపీఆర్ కంపెనీలు తమ వ్యక్తిగత డేటాను ఉపయోగించడానికి ముందు ప్రజల సమ్మతిని కోరాలి లేకపోతే అక్కడి చట్టాల ప్రకారం తీవ్రమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా నిబందనలను ఉల్లంఘిస్తే యూరోపియన్ యూనియన్ గోప్యతా చట్టం కింద సంస్థకు 425 మిలియన్ డాలర్లకు పైగా జరిమానా విధించవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ జూన్ లో నివేదించింది. గతంలో అమెజాన్ 300 మిలియన్ డాలర్ల(250 మిలియన్ యూరోలు) పన్నులు చెల్లించాలంటూ యూరోపియన్ కమీషన్ జారీ చేసిన ఆదేశాలను స్థానిక కోర్టు రద్దు చేసింది. లగ్జెమ్‌బర్గ్ ప్రభుత్వంతో అమెజాన్ కుదుర్చుకున్న పన్ను ఒప్పందానికి సంబంధించి 2017లో యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ బెంచ్ పన్ను ఆదేశాలను జారీ చేసింది. -
కార్ల కంపెనీలకు భారీ షాక్, ఏకంగా రూ.7,470 కోట్ల జరిమానా
బ్రసెల్స్: కాలుష్య ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అమలు చేయకుండా కుమ్మక్కయినందుకు గాను జర్మనీకి చెందిన నాలుగు దిగ్గజ కార్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) గట్టి చర్యలు తీసుకుంది. 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,470 కోట్లు) జరిమానా విధించింది. దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్షె కంపెనీలు పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే టెక్నాలజీ విషయంలో పోటీపడకుండా కుమ్మక్కై వ్యవహరించాయని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు చేసిన ఈయూ నాలుగు సంస్థలపై తాజా పెనాల్టీ ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని వెల్లడించినందుకు గాను దైమ్లర్‌ను విడిచిపెట్టింది. ధరల విషయంలో కుమ్మక్కయినందుకు కాకుండా టెక్నాలజీలను అమలు చేయనందుకు గాను యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే ప్రథమం. ‘ఈయూ ఉద్గారాల ప్రమాణాలకు తగిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ తయారీ సంస్థలు వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టాయి. ఇది చట్టవిరుద్ధమైన చర్య. దీనివల్ల తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కస్టమర్లు కోల్పోయారు‘ అని ఈయూ యాంటీట్రస్ట్ చీఫ్ మార్గరెత్ వెస్టాజెర్ వ్యాఖ్యానించారు. సాధారణంగా డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కార్లలో యాడ్‌బ్లూ అనే యూరియా సొల్యూషన్‌ను ఉపయోగిస్తుంటారు. దీనికోసం వాహనాల్లో ప్రత్యేక ట్యాంకు ఉంటుంది. దీని పరిమాణం పెద్దగా ఉంటే ఉద్గారాల విడుదల మరింత తగ్గుతుంది. అయితే, వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశ్యంతో సదరు వాహన తయారీ సంస్థలు తమ కార్లలో యాడ్‌బ్లూకి సంబంధించి చిన్న ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాయనేది ఆరోపణ. -
Corona Vaccine: ఒప్పుకోండి లేకుంటే ఇబ్బందులే!
వాక్సినేషన్ పాస్‌పోర్ట్ విషయంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సర్టిఫికేషన్‌ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. బదులుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. న్యూఢిల్లీ: ఈయూ దేశాల్లో.. అలాగే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్‌పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ల లిస్ట్‌లో భారత్‌లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండడం తెలిసిందే. ఎక్కువ మంది భారతీయలు తీసుకుంటున్న కొవిషీల్డ్‌కూ సైతం చోటు దక్కకపోవడంతో.. భారతీయ ప్రయాణికులకు ఇబ్బందికర అంశమనే ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని సీరం సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో.. కేంద్రం త్వరగతిన స్పందించింది. తక్షణమే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని, లేకుండా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పదని పేర్కొంది. ఆ ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను అనుమతించమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)ని హెచ్చరించింది కేంద్రం. ఒకవేళ అనుమతిస్తే మాత్రం.. క్వారంటైన్ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లిస్ట్‌లో మనదగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లకు మొదటి ఫేజ్‌లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం.. కనీసం కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లకైనా అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్ వ్యాక్సిన్లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు కూడా చోటు ఇవ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రతిపాదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు. ఈయూ వివరణ ఇక తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) స్పందించింది. కొవిడ్ నేపథ్యంలో ఈయూ సభ్యదేశాల మధ్య ఆటంకాల్లేని ప్రయాణం కోసం గ్రీన్‌పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం ఫైజర్/బయోఎన్‌టెక్, మెడెర్నా, వాక్స్‌జెర్విరియా, జన్‌స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే ఈఎంఏ ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి. అయితే కొవిషీల్డ్‌ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలంటూ అభ్యర్థనలేవీ రాలేదని ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ కొవీషీల్డ్ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని, అందుకు నెల టైం పట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: కొవిషీల్డ్ డోస్ గడువు మళ్లీ పెంపు.. ఈసారి ఎంతంటే.. -
Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’
‘‘అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు’’ వెబ్‌డెస్క్: గ్రీస్ నుంచి లిథువేనియా వెళ్లాల్సిన రియాన్ఎయిర్ విమానం 4978 అది. దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆ విమానం బెలారస్ వైపు మళ్లింది. యుద్ధ విమానం వెంబడి రాగా ఆ దేశ రాజధాని మింక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. లోపల ఉన్న ప్రయాణికులకు అసలేమీ అర్థం కాలేదు. లిథువేనియా వెళ్లాల్సిన విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆపేశారు.. ఇందుకు గల కారణాలేమీటో వారికి అంతుపట్టలేదు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం వెంటనే జరిగే పరిణామాలను ఊహించి, లగేజ్‌బ్యాగ్ నుంచి వడివడిగా తన లాప్టాప్, మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న అమ్మాయికి అందించాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న బెలారస్ పోలీసులు 26 ఏళ్ల ఆయువకుడిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు 7 గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ లిథువేనియాకు చేరుకోవడంతో ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు గానీ ఆ యువకుడి పరిస్థితి ఏమౌతుందో అనే ఆలోచన వాళ్ల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. యూరోపియన్ దేశాలు సహా అమెరికా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తోంది. అసలు ఆ విమానాన్ని ఎందుకు ఆపారు? ఇందుకు బెలారస్ చెప్పిన కారణం ఏమిటి? ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడిని ఎందుకు తీసుకువెళ్లారు? ఫొటో కర్టెసీ: రాయిటర్స్ ఎవరా యువకుడు? రోమన్ ప్రొటాసెవిక్.. జర్నలిస్టు. నెక్స్టా గ్రూపు మాజీ ఎడిటర్. గతేడాది బెలారస్లో జరిగిన ఆందోళనకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించాడు. అందుకుగానూ అతడిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే రోమన్‌పై అనేక అభియోగాలు నమోదుకాగా.. ఎప్పుడెప్పుడు అతడిని అరెస్టు చేయాలా అన్న అలోచనలో ఉంది. దీంతో అతడు పొలాండ్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆదివారం లిథువేనియాకు వెళ్లే క్రమంలో బెలారస్లో రోమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణం తప్పదన్నాడు ఈ విషయం గురించి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. నిజానికి అతడు అరవడం లేదు, కానీ తను చాలా భయపడిపోతున్నట్లు అర్థమైంది. ఒకవేళ కిటికీ గనుక తెరిచే అవకాశం ఉంటే, కచ్చితంగా దూకేవాడేనేమో. తనను కిందకి తీసుకువెళ్లి ఏవేవో ప్రశ్నలు అడిగి తీసుకువెళ్లారు’’ అని పేర్కొన్నారు. హైడ్రామా.. ఏం చెప్పి విమానాన్ని ఆపారు? విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అత్యవసరంగా మింక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాలంటూ బెలారస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సందేశం వచ్చింది. అంతలోనే ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వస్తున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు ఉన్న ఆనవాలు కనిపించలేదు. కానీ, రోమన్‌ను బయటకు పిలిచారు. అతడితో పాటు ఓ మహిళను పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బెలారస్ అధికార మీడియా ధ్రువీకరించింది. ‘‘బాంబు బెదిరింపు రావడంతో మిస్టర్ లుకాషెంకో వ్యక్తిగత ఆదేశాలు జారీ చేశారు. విమానాన్ని మింక్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు మిగ్-29 ఫైటర్ ఎస్కార్టుగా ఉండేందుకు అనుమతించారు’’ అని పేర్కొంది. అయితే, అప్పటికే విమానం మింక్ కంటే కూడా, లిథువవేనియా విల్నూయిస్కే దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెలారస్ ఉద్దేశపూర్వకంగానే రోమన్ కోసం ఫ్లైట్‌ను మళ్లించి, బాంబు నాటకం ఆడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా రియాన్ ఎయిర్.. ప్రయాణికులను క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రోమన్ మద్దతుదారులు మాత్రం. ‘‘రియాన్ఎయిర్ ... రోమన్ ఎక్కడ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫొటో కర్టెసీ: రాయిటర్స్ భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం ఒక జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్ ఇంతటి సాహసానికి పూనుకోవడం సరికాదంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెలారస్‌పై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి విమానయాన విభాగం ఐసీఏఓ.. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయించారు. ఇది చికాగో కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించడమే’’ అని పేర్కొంది. కాగా చికాగో కన్వెన్షన్‌లో గగనతలం, విమానాల సురక్షిత ప్రయాణాలకై పలు నిబంధనలు ఉన్నాయి. ‘‘సాధారణ పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఇలా ఆపడం అంటే హైజాక్ చేసినట్లే. ఇంతటి దుస్సాహసానికి పూనుకున్న బెలారస్ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని పోలండ్ ప్రధాని మండిపడ్డారు. ఇక బెలారస్‌లోని అమెరికా రాయబారి జూలీ ఫిషర్.. ‘‘అంతర్జాతీయ సమాజం, పౌరులకు వ్యతిరేకంగా లుకాషెంకో ప్రభుత్వం వ్యవహరించింది. బాంబు ఉందన్న అబద్ధపు సందేశంతో మిగ్-29ను పంపించి రేనార్ను మళ్లించింది. నెక్స్టా జర్నలిస్టుపై రాజకీయ కక్షతో నమోదైన అభియోగాల నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు చేపట్టిన ఈ చర్య చాలా ప్రమాదకరం’’ అని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇక లాటివియా, లిథువేనియా ఏకంగా బెలారస్ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. రాజకీయ ప్యత్యర్థిని కిడ్నాప్ చేయడం కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టిన బెలారస్ గగనతలంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలని సూచిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపే విధంగా అమెరికా యూరోపియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. Lukashenka and his regime today showed again its contempt for international community and its citizens. Faking a bomb threat and sending MiG-29s to force @RyanAir to Minsk in order to arrest a @Nexta journalist on politically motivated charges is dangerous and abhorrent. — Julie Fisher (@USAmbBelarus) May 23, 2021 Today’s hijacking of #Ryanair flight by Lukashenko regime shows that Belarusian airspace is not safe, people’s lives were put at risk and kidnaping of a political opponent took place. Belarusian airspace must be closed for all international flights. — Edgars Rinkēvičs (@edgarsrinkevics) May 23, 2021 -
వచ్చేవారం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
బ్రసెల్స్: ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా దేశాల మధ్య వచ్చేవారం పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలతో ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితి విధించే దిశగా ఒప్పందం కుదిరే అవకాశముంది. మధ్యవర్తుల ద్వారా ఈ చర్చలు జరుగుతాయని శుక్రవారం ఇరాన్, అమెరికా ప్రకటించాయి. ఇప్పటికే ఈ అంశంపై ఇరుదేశాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడేళ్ల కిత్రం అమెరికా వైదొలగింది. 2015 నాటి ఒప్పందం మేరకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్వీయ ఆంక్షలు విధించుకోవాలి. అలాగే, అమెరికా, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇరాన్‌కు ఆంక్షల సడలింపుతో పాటు ఆర్థిక సాయం అందించాలి. ఇరాన్‌తో ఒప్పందానికి ప్రాధాన్యత ఇస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. చర్చలు వియెన్నాలో మంగళవారం ప్రారంభమవుతాయని అమెరికా హోం శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. ఇది సరైన ముందడుగు అని, అయితే, వెంటనే సానుకూల ఫలితాలను ఆశించలేమని వ్యాఖ్యానించారు. అమెరికా–ఇరాన్ మధ్య ఈ పరోక్ష చర్చలు ప్రారంభం కావడానికి యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వం చేసింది. -
జీతం పెరిగింది.. ఎవరికి ఎంత?
స్త్రీ పురుష ఉద్యోగుల జీతాలు, వేతనాల్లో అసమానతలను తొలగించాలని ఇ.యు. తన పరిధిలోని దేశాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఫలిస్తే.. తక్కిన దేశాలూ ఆచరిస్తే.. స్త్రీ పురుషులు ఇక ఈక్వల్ ఈక్వల్. సమాన పనికి సమాన వేతనం. లిస్ట్ ఇవ్వండి జెండర్ ‘పే గ్యాప్’ను తొలగించే చర్యలలో భాగంగా.. 27 సభ్య దేశాల్లోని కంపెనీలు తమ సిబ్బందిలో ఎవరికి ఎంత జీతం ఇస్తున్నాయో తక్షణం బహిర్గత పరచాలని ‘ఐరోపా సమాఖ్య’ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వాన్ డెర్లెయన్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంస్థలు తమ సిబ్బందికి గోప్యంగా, విడివిడిగా జీతాలు పెంచుకుంటూపోతున్న కారణంగానే సమానమైన పనికి కూడా స్త్రీలకు తక్కువ ప్రతిఫలం లభిస్తోందని ఆమె గుర్తించడం.. ఈ ఏడాది ‘ఉమెన్స్ డే’ కి తమకు లభించిన బోనస్ అని ఆ దేశాలలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పని. ఒకే విధమైన పని గంటలు. కానీ వేతనం ఒకటే కాదు. పురుషులకు ఎక్కువ, స్త్రీలకు తక్కువ! ప్రపంచమంతటా ఇంతే. ఏళ్లుగా ఇంతే. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం రావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో చెప్పలేం. స్త్రీ పురుషుల వేతనాల్లో హెచ్చు తగ్గుల్ని లేకుండా చేయడానికైతే శతాబ్దాలు అక్కర్లేదు. దశాబ్దాలూ అక్కర్లేదు. కొంత టైమ్ ఇచ్చి, ఆ టైమ్ లోపు ‘ఈక్వల్ పే’ ఉండాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే చాలు.. వేతనాల్లో, జీతాల్లో అసమానత్వాలు, అంతరాలు సమసిపోతాయి. మరి ప్రభుత్వాలు చెయ్యకనేనా నేటికీ మహిళా ఉద్యోగులు, మహిళా శ్రామికులు పురుషులకన్నా తక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్నారు! శ్రమదోపిడికి గురవుతున్నారు! కాదు. కంపెనీలే స్త్రీ పురుష వివక్ష ను పాటిస్తున్నాయి. ‘మీరు చెప్పినట్లే ఈక్వల్ ఈక్వల్‌గా ఇస్తున్నాం’ అని పైపై లెక్కలు చూపిస్తున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే విధమైన పనిని, ఒకే పనిగంటల్లో చేస్తే వారిద్దరికీ ఒకే విధమైన జీతభత్యాలు ఇస్తున్నామని చెబుతున్నాయి. చెప్పడం వరకే. చేస్తున్నది వేరే. పురుషులకు ఎక్కువ. స్త్రీలకు తక్కువ! అలా ఎలా చేయగలుగుతున్నాయంటే.. గోప్యత. రహస్యం! నిజంగా ఎంతిస్తున్నదీ కంపెనీలు బయటపెట్టడం లేదు. ఇక ఇలాక్కాదని చెప్పి, ప్రతి ఉద్యోగికీ మీరెంత జీతం ఇస్తున్నదీ పేర్లతో సహా బహిర్గతం చేయండి అని ఐరోపా దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ ‘యూరోపియన్ యూనియన్’ (ఇ.యు) కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్లెయన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కాస్త ముందు ఆమె ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం యాదృచ్ఛికమే అవొచ్చు కానీ ఇ.యు. పరిధిలోని 27 దేశాల మహిళా ఉద్యోగులు దీనినొక ఉమెన్స్ డే బోనస్‌గా భావిస్తున్నారు. ∙∙∙ నిజమే. వేతనాల్లో వివక్షతో కూడిన వ్యత్యాసం తగ్గాలంటే.. అసలు ఎవరికి ఎంత వేతనం ఇస్తున్నదీ ముందు తెలియాలి. అందుకే ఆ లిస్ట్‌ను బహిర్గతం చెయ్యమని వాన్ డెర్లియన్ ఆదేశించారు. ఇ.యు. దేశాలు స్త్రీల పట్ల సహానుభూతితో ఉంటాయనే పేరుంది. అయితే అక్కడ కూడా వేతనాలలో మిగతా దేశాలలో ఉన్నట్లే మహిళలపై వివక్ష ఉంది! ఇ.యు. 1957లో ఏర్పడింది. అప్పట్నుంచీ ‘పే గ్యాప్’ ను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. కావడం లేదు. జీతాలు, వేతనాలు, పని వేళలు, పెన్షన్లు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నిటా సంస్థల యాజమాన్యాలు ఈ గ్యాప్‌ను పాటిస్తూనే ఉన్నాయి. గత 30–40 ఏళ్లలో ఇ.యు. ఎంతగానో పాటు పాడితే తగ్గిన వేతన అంతరం 30 శాతం మాత్రమే. ఇది నూరు శాతం అవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో! అయితే వాన్ డెర్లెయన్ అంతవరకు ఆగదలచుకోలేదు. ఏడాది క్రితం కమిషన్ అధ్యక్షురాలిగా వచ్చిన నాటి నుంచీ ఐరోపా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ క్రమంలో బుధవారం జారీ చేసినవే.. ప్రతి కంపెనీ తమ పే లిస్ట్‌ను బయటపెట్టి తీరాలన్న ఆదేశాలు. అప్పుడు ఎవరికి ఎంతిస్తున్నదీ తెలుస్తుంది. స్త్రీలకు ఎంత వస్తున్నదీ బయటపడుతుంది. ఆ ప్రకారం కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి వీలుంటుంది. చర్యల భయం ఉంటే కంపెనీలూ వాటికై అవి వేతన అంతరాలను తొలగించేందుకు ముందుకు వస్తాయి. ∙∙∙ ఆదేశాలతోపాటు కొన్ని ప్రతిపాదనలకు ఆదేశ రూపం ఇచ్చేందుకు కూడా కమిషన్ సభ్యులను సోమవారం సమావేశ పరచబోతున్నారు వాన్ డెర్లెయన్! కంపెనీలు ఇకపై ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించే ముందు కానీ, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు గానీ వారి పూర్వపు వేతనాన్ని (మునుపటి కంపెనీలో వాళ్లకు వస్తున్న వేతనం) అడగకూడదు. ఫలాన పోస్టుకు ఇంత జీతం అని ప్రకటించాక ఆ తర్వాత పురుషుడు అని పెంచడం గానీ, స్త్రీ అని తగ్గించడం కానీ చేయకూడదు. ఉద్యోగానికే జీతం తప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి జీతం కాదు అన్నట్లు ఉండాలి. మహిళలైతే తాము చేరబోయే సంస్థలో స్త్రీ పురుషుల జీతాలలో వ్యత్యాసం ఏ మేరకైనా ఉందా అని ముందే ఆ సంస్థ యాజమాన్యాన్ని అడిగే హక్కు కలిగి ఉండాలి. కనీసం 250 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ తమ జీతాల్లోన్ని జెండర్ వ్యత్యాసం గురించి విధిగా తమ మహిళా అభ్యర్థులకు తెలియపరచాలి. ఇప్పటికే పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తాము ఎంతకాలంగా తక్కువ జీతాన్ని పొందుతున్నారో, ఆ తగ్గిన మొత్తాన్ని అడగవచ్చు. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుంచి యాజమాన్యాలు తొలగించకూడదు. ఇవీ.. ఆ ప్రతిపాదనలు. కంపెనీలతోపాటు, కోవిడ్ కూడా మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు, ఆఖరికి ఉపాధిని కూడా లేకుండా చేసింది. ఆ పరిహారాన్ని కూడా కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు వాన్ డెర్లెయన్ మరొక ఆదేశ పత్రం ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే పెద్ద కష్టం.. నిమ్మరసం అమ్ముతూ.. -
బ్రెగ్జిట్తో మారేవేంటంటే...
లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే.. 1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్‌టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. 2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు. 3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి. 4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి. 5. తమ వాహన లైసెన్స్‌తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి. 6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి. 7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు. ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
చైనా–ఈయూ ఒప్పందం
కరోనా అనంతర కాలంలో ఆర్థికంగా దెబ్బతిన్న దేశాలు దాన్నుంచి కోలుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సహజంగానే ఈ పరిణామం వేరే దేశాలతో పోలిస్తే కాస్త మెరుగైన స్థితిలో వున్న చైనాకు లాభించే అంశం. అమెరికాకు సమస్యాత్మకం. అందులోనూ దీర్ఘకాలంగా అమెరికాతో సన్నిహితంగా వుంటూ, దాని నేతృత్వంలోని నాటో కూటమిలో కొనసాగుతున్న యూరొపియన్ యూనియన్(ఈయూ) సైతం చైనా వైపు చూడటం మరింతగా కంటగింపయ్యే విషయం. ఇప్పుడు జరిగింది అదే. చైనా–ఈయూల మధ్య బుధవారం పెట్టుబడులకు సంబంధించి సూత్రప్రాయమైన అవగాహన కుదిరింది. ఆన్లైన్లో అటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఈయూ కమిషన్ అధ్యక్షు రాలు ఉర్సులా వోన్‌డెర్ లెయన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, యూరొపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ తదితరుల సమక్షంలో ఇదంతా పూర్తయింది. ఒప్పందంపై లాంఛనంగా సంతకాలు పూర్తికావటమే మిగిలింది. అమెరికా అభ్యంతరం, యూరప్ దేశాల్లో వినబడుతున్న నిరసన స్వరాల సంగతలా వుంచితే అవసరం ఎంత పని చేయిస్తుందో చెప్ప టానికి ఈ తాజా ఒప్పందం ఉదాహరణ. మరే దేశంతోనూ చైనా ఇంత సరళమైన ఒప్పందం కుదు ర్చుకోలేదని, ఇది ఎంతో ప్రయోజనకరమైనదని ఈయూ వాణిజ్య కమిషనర్ వాల్డిస్ అంటున్నారు. అటు చైనా సైతం ఒప్పందంపై చాలా ఉత్సాహంగా వుంది. వాస్తవానికి ఇదేమీ ఇప్పుడే హడావుడిగా కుదిరిన ఒప్పందం కాదు. ఏడేళ్లుగా దీనిపై చర్చలు సాగుతున్నాయి. అప్పటినుంచీ అమెరికా ఈయూను వెనక్కి లాగుతూనే వుంది. అమెరికాతో ఈయూకి ఇతరత్రా వుండే అవసరాలు, చైనా విధిస్తున్న షరతులు ఈ ఒప్పందం సాకారం కావటానికి ఇన్నాళ్లూ అవరోధంగా మారాయి. ఇప్పుడు మారిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెండు పక్షాలూ ఒప్పందానికి సిద్ధపడ్డాయి. అమెరి కాలో అధికార మార్పిడి పూర్తయ్యాక ఈయూపై ఒత్తిళ్లు పెరుగుతాయని గ్రహించిన చైనా చకచకా పావులు కదిపింది. అందువల్లే ఇది సాధ్యమైంది. అమెరికాలో నాలుగేళ్ల డోనాల్డ్ ట్రంప్ పాలన మరికొన్ని రోజుల్లో ముగుస్తోంది. ఆయన స్థానంలో జో బైడెన్ రాబోతున్నారు. బైడెన్, ట్రంప్‌ల మధ్య ఇతరత్రా అంశాల్లో ఎన్ని విభేదాలున్నా చైనా విషయంలో వారిది ఏకాభిప్రాయం. అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరున్నా దేశానికి చెందిన బహుళజాతి కార్పొరేషన్ల ప్రయోజనాలు కాపాడటానికి ప్రాధాన్యతనిస్తారు. హార్లీ డేవిడ్సన్ బైక్‌లపై భారత్‌లో అధిక టారిఫ్‌లు విధిస్తున్నారని ట్రంప్ తన హయాంలో ఎన్నిసార్లు విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. ట్రంప్ తన నోటి దురుసుతో, ఏకపక్ష విధానాలతో సన్నిహిత దేశాలపై సైతం ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేసి వాటిని దూరం చేసుకున్నారు. అందువల్లే ఎవరూ ఆయనతో కలిసి రాలేదు. చివరకు చైనాతో ఒంటరి పోరాటం చేయాల్సివచ్చింది. దీన్ని బైడెన్ సరిచేయదల్చు కున్నారు. చైనా టెక్నాలజీ పరిశ్రమలపై ఆంక్షలు విధించటం ద్వారా దాన్ని ఆర్థికంగా ఊపిరాడ కుండా చేసి దారికి తేవాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని కొనసాగిస్తూనే మళ్లీ పాత నేస్తాలకు సన్నిహితం కావాలని బైడెన్ ఆలోచిస్తున్నారు. ఇందుకోసమే ఈయూ–చైనాల ఒప్పందంపై చర్చలు తుది దశలో వున్నాయని తెలిసిన వెంటనే ఈయూ కమిషన్ అధ్యక్షురాలు, జర్మనీ చాన్సలర్ వగైరాలకు బైడెన్ బృందం వర్తమానం పంపింది. ఒప్పందానికి తొందరపడొద్దని కోరింది. చైనా వాణిజ్య విధానాలకూ, వీగర్ ప్రాంతంలో ముస్లింలపట్ల అది అనుసరిస్తున్న అమానుష ధోరణులకూ వ్యతిరేకంగా సమష్టిగా పోరాడి, ఒత్తిడి తేవాల్సివుంటుందని సూచించింది. బైడెన్ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు కాబోతున్న జేక్ సులివాన్ గత వారం ట్విటర్ వేదికగా ఈయూ నేతలకు మరోసారి విజ్ఞప్తిచేశారు. అయినా ఈయూ వెనక్కి తగ్గలేదు. నిజానికి ఈ విషయంలో చైనానే మెచ్చుకోవాలి. అమెరికా కదలికలను పసిగట్టిన వెంటనే అది ఒప్పందంలోని సమస్యాత్మక అంశాలు కొన్నిటిపై రాజీకొచ్చి, ఆన్లైన్ భేటీకి ఆగమేఘాలపై అందరినీ ఒప్పించింది. దీనిపై అమెరికాకు అభ్యంతరాలుంటాయన్న వాదనను ఈయూ పెద్దలు తోసిపుచ్చుతున్నారు. ట్రంప్ హయాంలో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా అమెరికా–చైనాల వాణిజ్యంలో కొంతమేర సమతుల్యత ఏర్పడిందని, తాజా ఒప్పందంతో ఆ ప్రయోజనమే తమకూ కలిగే అవకాశం వున్నదని ఈయూ వాణిజ్య కమిషనర్ అభిప్రాయం. అసలే అంతంతమాత్రంగా వున్న ఈయూ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దెబ్బకు మరింత కుదేలైంది. దాని వాణిజ్యావసరాలకు విస్తృతమైన మార్కెట్లు తక్షణావసరం. అటు చైనా తన విద్యుత్ ఆధారిత వాహనాల విక్రయానికి ఆటంకాలు వుండరాదని చూస్తోంది. ఈయూ కమిషన్ లేవనెత్తు తున్న అభ్యంతరాలు దానికి అవరోధంగా వున్నాయి. ఈ ఒప్పందం సాకారమైతే సమస్యలు సమసి పోతాయని చైనా ఆశ. అలాగే పునర్వినియోగ ఇంధన వనరులకు సంబంధించిన సాంకేతికతకు ఈయూలో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు చైనా ఇస్తున్న రహస్య సబ్సిడీలకు తాజా ఒప్పందంతో వీలుండదని ఈయూ అంటున్నది. వీగర్ ముస్లింలతో బలవం తంగా వెట్టి చేయిస్తున్నారన్న అంశంలో చైనా నుంచి గట్టి హామీ తీసుకున్నామని, అది అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒడంబడికలకు లోబడి వుండటానికి అంగీకరించిందని, కనుక మానవ హక్కుల ఉల్లంఘన జరగబోదని ఈయూ పెద్దలు చెబుతున్న మాటలు అక్కడి మానవ హక్కుల కార్యకర్తలకు రుచించటం లేదు. యూరప్ దేశాలు నమ్ముతున్న విలువలకు ఈయూ పోకడ విఘాతం కలిగిస్తుం దని వారి ఆరోపణ. పైగా ఒప్పందం వల్ల అన్నివిధాలా చైనాకే మేలు కలుగుతుందని ఆర్థిక నిపు ణులు వాదిస్తున్నారు. తాజా ఒప్పందం వల్ల ఈయూకి కలిగే ప్రయోజనమెంతో, దీని పర్యవసా నంగా అమెరికా–ఈయూ సంబంధాల్లో కలిగే మార్పులేమిటో మున్ముందు చూడాల్సివుంది. -
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
ఈయూలో టీకా షురూ
లండన్/రోమ్: ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. స్పెయిన్‌లో 96 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అండ్రెజ్ బబీస్ కూడా ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు. వారికే మొదటి ప్రాధాన్యత.. ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో డోసు కేవలం 2 పౌండ్లు ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కాల్ సొరియొట్ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. ధర ఒక్కో డోసుకు కేవలం 2 పౌండ్లు. 10 కోట్ల ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా డోసుల కోసం యూకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మార్చికల్లా 4 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. -
ఈయూ, బ్రిటన్లతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలు!
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ తదనంతర వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, భారత్ కూడా ఆ రెండు ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్నది ఇప్పుడే పూర్తి స్థాయిలో మదింపుచేయడం కష్టమని విశ్లేషిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), నిర్మాణం, పరిశోధనా–అభివృద్ధి, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి సేవల విషయంలో ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉంటుందని వారి విశ్లేషిస్తున్నారు. ఈయూ–బ్రిటన్ ఒప్పందం సేవల రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ అంచనాకు ప్రధాన కారణం. జనవరి 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ పూర్తిగా వైదొలగనుంది (బ్రెగ్జిట్). ఈ పరిస్థితుల్లో రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంపై అవరోధాలను తొలగించుకోవడానికి గురువారం జరిగిన చర్చలు కొంతవరకూ సఫలీకృతం అయ్యాయి. సేవల రంగానికి ప్రయోజనం... భారత్ వస్తువులకు ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటు బ్రిటన్ ఇటు ఈయూ మార్కెట్లలో సేవల రంగానికి సంబంధించి మనం చక్కటి అవకాశాలను సొంతం చేసు కోవచ్చు. దీనికి తగిన వ్యూహముండాలి. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డీజీ కేంద్రానికి సిఫారసు చేశాం... యూరోపియన్ యూనియన్, బ్రిటన్లతో ఎఫ్టీఏలకు ఇప్పటికే ప్రారంభమైన చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. వచ్చే నెల్లో భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తున్న సందర్భంగా దీనిపై చర్చలు జరగాలని ప్రభుత్వాన్ని కోరాం. – శరద్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ బ్రిటన్‌తో వాణిజ్య అవకాశాలు... ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలను ముందుకు తీసుకుని వెళ్లడానికి భారత్‌కు ఎన్నో క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని భావించవచ్చు. – బిశ్వజిత్ ధర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
పాకిస్తాన్‌కు భారీ షాక్..!
న్యూఢిల్లీ: తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనన్న ప్రకటన పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్ కుంభకోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన పైలట్ లైసెన్సులు జారీ చేసిన నేపథ్యంలో సంస్థ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా పైలట్ శిక్షణ, లైసెన్సింగ్ జారీ ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ ఐసీఏవో, నవంబరు 3న పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీకి లేఖ రాసింది. ఈ విషయం గురించి అనేకమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారడం లేదని, కాబట్టి పాకిస్తాన్ విమానాలు, పైలట్లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయం గురించి పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్(పీఏఎల్‌పీఏ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఇదే గనుక నిజమైతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. పాక్ పౌరవిమాన రంగం కుప్పకూలిపోతుంది. గత ఆర్నెళ్లుగా ఈ విషయం గురించి మేం అధికారుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం. కానీ వారు పట్టించుకోలేదు. నిర్లక్ష్య వైఖరి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ స్కామ్ కారణంగా యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) ఇప్పటికే పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పాక్ ఎయిర్‌లైన్స్ విమానాలను ఈయూ సభ్య దేశాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొంటూ జూలైలో నిషేధం విధించింది. ఇక ఇప్పుడు ఏకంగా 188 దేశాలకు వీటి రాకపోకలు నిషేధించేందుకు ఐసీఏవో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ ఏడాది మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో 97 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్‌దేనంటూ ప్రకటన చేశారు. అదే విధంగా ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన పాక్ ప్రభుత్వం.. తమ దేశంలో సుమారు 262 మంది బోగస్ పైలట్లు ఉన్నారని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పీఐఏపై నిషేధం విధిస్తూ ఈఏఎస్ఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
నారికేళం.. యూరప్ పయనం!
అమలాపురం: ఆంధ్రా నుంచి కొబ్బరి దిగుమతి చేసుకునేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన యునైటెడ్ కింగ్డమ్ (యూకే), బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలోని కొబ్బరి రైతులు, ఎగుమతిదారులతో చర్చలు జరిపేందుకు యూరోపియన్ వ్యాపారులు సిద్ధమయ్యారు. విశాఖ కేంద్రంగా డిసెంబర్లో ఓ సదస్సు నిర్వహించనున్నారు. అన్నీ అనుకూలిస్తే.. మన రాష్ట్రం నుంచి కొబ్బరితోపాటు కోకో, అరటి, మిరియాల ఎగుమతులకూ మార్గం సుగమం కానుంది. కొబ్బరి ముక్క, నీరు, నూనె, కొబ్బరి పాలు, ఇతర ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కారణంగా యూరప్ వాసుల ఆహారంలో కొబ్బరి వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే మలేషియా, థాయ్‌లాండ్, మన దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యూరప్‌కు కొబ్బరి ఎగుమతి అవుతోంది. అవసరాలకు తగినట్టు దిగుమతులు లేకపోవడంతో ఆంధ్రా నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని అక్కడి వ్యాపారులు నిర్ణయించారు. డిసెంబర్లో సదస్సు యూరోపియన్ దేశాలకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)తో పాటు కొందరు దిగుమతిదారులు మన రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపారులు, రైతులతో ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపారు. గడచిన సెప్టెంబర్‌లోనే ఇక్కడి రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారులతో యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు సదస్సు నిర్వహించాలని యోచించారు. కానీ.. కరోనా ఉధృతి వల్ల వాయిదా పడింది. వచ్చే డిసెంబర్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. చర్చలు ఫలించి కొబ్బరి ఎగుమతులు ప్రారంభమైతే అరటి, కోకో, మిరియం వంటి ఎగుమతులు కూడా పెరుగుతాయి. కాగా, తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లికి చెందిన ఆదర్శ కొబ్బరి రైతు విళ్ల దొరబాబును యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు ఏపీలో తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకున్నారు. -
తప్పుడు ప్రచారం తడాఖా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కూ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కూ రూపురేఖల్లోనే కాదు... అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్ నిరూపించారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపో వాలా వద్దా అన్న అంశంపై నాలుగేళ్లనాడు జరిగిన రెఫరెండంను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ వెలువరించిన నివేదిక గమనిస్తే జాన్సన్ ప్రభుత్వ సహాయ నిరాకరణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాస్తవానికి ఈ నివేదిక తయారై తొమ్మిది నెలలు దాటింది. గత ఏడాది అక్టోబర్‌లో దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కానీ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇందులోని అంశాలు తెలిస్తే జనంలో ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయని, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో జనం తమను తిరస్కరించే అవకాశం వున్నదని కన్సర్వేటివ్ పార్టీ భయపడింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మొరాయిస్తూనే వుంది. కానీ ఈ విషయంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో గత్యంతరం లేక నివేదికను బయట పెట్టింది. అయితే ఇది రష్యా ప్రమేయం వుండొచ్చునని మాత్రమే తేల్చింది. లోతుగా దర్యాప్తు జరి పించి నేర నిర్ధారణ చేయాల్సింది మాత్రం జాన్సన్ ప్రభుత్వమే. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు శక్తిమంతమైనవి. ప్రపంచ రాజకీయా లను అవి దశాబ్దాలపాటు శాసించాయి. ఎన్నో దేశాల్లో వాటి మాటే చెల్లుబాటయింది. ఇప్పటికీ అవుతోంది. తాము చెప్పినట్టు వినడానికి సిద్ధపడని నేతల్ని అధికారం నుంచి కూలదోసిన చరిత్ర కూడా ఆ దేశాలకుంది. అలాంటి దేశాల అంతర్గత రాజకీయాల్లో రష్యా గుట్టు చప్పుడు కాకుండా జోక్యం చేసుకుని, తనకు అనుకూలంగా వుండే నేతల్ని అధికార పీఠాలపై కూర్చోబెట్టిందంటే వినడానికి ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఇది వాస్తవమని నిరుడు అమెరికాలో రాబర్ట్ మ్యూలర్ నివేదిక చెప్పింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చెబుతోంది. ఇంతకూ రష్యా తన కార్య సాధన కోసం ఏం చేస్తుంది? కోట్లాదిమంది ఓటర్లను మాయా జాలంలో ముంచెత్తే మంత్రదండం ఏమైనా పుతిన్ దగ్గర వుందా? బయటి దేశాలవారెవరో చేసిన ప్రచారానికి అమెరికా, బ్రిటన్ ప్రజలు బోల్తా పడ్డారా? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా ఖచ్చితమైన జవాబుల్లేవు. కానీ నిరుడు ఏప్రిల్‌లో అమెరికాలో వెల్లడైన రాబర్ట్ మ్యూలర్ నివేదిక 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం వున్నదని నిర్ధారించింది. ఇందులో నేరుగా ట్రంప్ బాధ్యత ఎంత అన్న అంశంపై ఆ నివేదిక ఏం చెప్పిందో ఇంతవరకూ తెలియదు. ఏ నివేదికనైనా ఎంతవరకూ బయటపెట్టాలో నిర్ణయించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్‌కు వుంటుంది. ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు. నివేదిక తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ట్రంప్ చేసుకున్న ప్రచారాన్ని మాత్రం స్వయానా మ్యూలరే ఖండించారు. రష్యా తీరుపై గత అయిదారేళ్లుగా కథలు కథలుగా మీడియాలో వెల్లడవుతూనే వున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం దండిగా వున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాల నిండా ఆమెకు వ్యతిరేకంగా భారీయెత్తున అబద్ధాలు ప్రచారమయ్యాయి. అవి ఏ స్థాయిలో వున్నాయంటే వాటిని ఖండించడానికి హిల్లరీ టీమ్‌కు బోలెడంత సమయం పట్టింది. వాటికి జవాబిచ్చేలోగా మరిన్ని ప్రచారంలోకొచ్చేవి. బ్రిటన్‌లోనూ స్కాట్లాండ్ రెఫరెండం సమయంలో, బ్రెగ్జిట్ ఓటింగ్ సమయంలో మార్ఫింగ్ ఫొటోలనూ, తప్పుడు కథనాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలో ట్రంప్ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ఇతరులు రష్యా ప్రచారానికి అండదండగా నిలిచారు. వీరు కేంబ్రిడ్జి ఎనలిటికా ఆసరా తీసుకోవడంతోపాటు ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వగైరా సామాజిక మాధ్యమాల్లో దొంగ పేర్లతో అకౌంట్లు తెరిచి నకిలీ సమాచారాన్ని, తప్పుడు వార్తల్ని వ్యాప్తిలోకి తెచ్చారని మ్యూలర్ నివేదిక తేల్చింది. తమ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలనూ ప్రస్తావించింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చూసినా ఇలాంటి అంశాల ప్రస్తావనే వుంది. బ్రిటన్‌లో న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఎస్టేట్ ఏజెంట్లు తెలిసో తెలియకో రష్యా ప్రచారంలో వాహకులుగా మారారని, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని కొందరు ఎంపీలు సైతం రష్యాలో తమ కున్న వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇందులో తలదూర్చారని ఆ నివేదిక అంటోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ సభ్యులతో పోలిస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులకు అదనపు హక్కులుంటాయి. ఈ పారదర్శకత లేమినే రష్యా ఉపయోగించుకుంటున్నదని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నివేదిక వెల్లడయ్యాక ఎప్పటిలాగే బ్రిటన్ ప్రభుత్వం రష్యా ప్రమేయాన్ని తోసిపుచ్చింది. 2019 ఎన్నికల్లో వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా అదేమీ ఫలించలేదన్నది ప్రభుత్వ వాదన. కమిటీ కోరుతున్నట్టు దర్యాప్తు అవసరం లేదన్నదే దాని భావన. కానీ ఇదంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదు. 2014లో స్కాట్లాండ్ రెఫరెండం జరిగినప్పుడు ట్విటర్లోని 4,000కుపైగా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగింది. అందులో 3,841 ఖాతాలు రష్యాకు, 770 ఖాతాలు ఇరాన్‌కి చెందినవని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ 2018లోనే వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా ఒక రోజంతా కోటి ట్వీట్లు విడుదలయ్యాయని కూడా అది లెక్కేసింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు కూడా నిస్సహాయంగా వుండటం, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బ్రిటన్ లేదా అమెరికా సమస్య మాత్రమే కాదు... రష్యాను ఆద ర్శంగా తీసుకుని తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూసేవారు అన్ని దేశాల్లోనూ బయల్దేరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతోపాటు, ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఉపాధికి నైపుణ్య మంత్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య స్థితిగతులు, మార్కెట్ రంగంలో అనూహ్య మార్పులు చేసుకుంటున్న వేళ నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని యువతకు పిలుపునిచ్చారు. వరల్డ్ యూత్ స్కిల్ డేని పురస్కరించుకొని మోదీ బుధవారం యువతకు వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మిషన్ ద్వారా గత అయిదేళ్లలో 5 కోట్ల మందికి పైగా వివిధ రంగాల్లో తమ నైపుణ్యాల్ని మెరుగుపరచుకున్నారన్నారు. తద్వారా యువతకి స్థానికంగా, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. కరోనాతో మారిన ప్రపంచం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో త్వరితగతిన మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నిపుణులైన యువతకి చాలా ప్రాధాన్యముంటుందని మోదీ చెప్పారు. కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయని, పనిచేసే పరిస్థితుల్లో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీ కూడా దీనిపై ప్రభావం చూపిస్తోందన్నారు. కొత్త తరహా ఉద్యోగాలు, కొత్త తరహా పనితీరుతో మన దేశంలో యువత కొత్త నైపుణ్యాలను పెంచుకుంటోందని ప్రధాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానాలు, మార్కెట్ పరిస్థితుల్లో త్వరితగతిన వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఎలా మారాలన్న ప్రశ్నలు ఎక్కువమంది తనను అడుగుతున్నారని, దానికి తన దగ్గరున్న ఒకే ఒక్క సమాధానం ‘స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్’ అని చెప్పారు. నైపుణ్యం, దానిని మెరుగుపరచుకోవడం, ఇతరులకు నైపుణ్యాన్ని నేర్పించడమే యువతకు ఉపాధి కల్పించే మంత్రమని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘నైపుణ్యం వంటిది మరోటి లేదు. అది మిమ్మల్ని విభిన్నంగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం ఒక జ్ఞాన సంపద వంటిది. దానిని మీ నుంచి ఎవరూ తీసుకువెళ్లలేరు. నైపుణ్యం స్వయంసమృద్ధి వంటిది. దాని వల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాదు, మీరే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు’’అని నైపుణ్యం ప్రాధాన్యతను వివరించారు. నిపుణులైన కార్మికుల్ని గుర్తించడానికి ఇటీవల ఒక పోర్టల్ ప్రారంభించామని, తిరిగి గ్రామాలకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధినివ్వడంలో దీనిని వినియోగించుకోవాలన్నారు. చర్చల ద్వారా వాణిజ్య వివాదాలు పరిష్కారం భారత్, ఈయూ సదస్సులో నిర్ణయం స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి చర్చలు జరపాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. రక్షణ, అణు ఇంధనశక్తి, ఆరోగ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా సంబంధా లను బలోపేతం చేయాలని, దానికి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. బుధవారం జరిగిన 15వ ఈయూ– ఇండియా సదస్సు వీడియో సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈయూలో ఉన్న 27 దేశాలతో సత్సంబంధాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
పాక్ ఎయిర్‌లైన్స్‌కు ఈయూ షాక్!
పారిస్: యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఆరు నెలల పాటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయూ సభ్య దేశాల్లో(27)కి పీఐఏ విమానాలను అనుమతించబోమని.. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన పీఐఏ.. ‘‘ఈయూ సభ్య దేశాల్లోకి ఆర్నెళ్ల పాటు పీఐఏ విమానాలకు అనుమతిని ఈఏఎస్ఏ నిషేధించింది. జూలై 1, 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. పీఐఏ ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. (సరిహద్దులు తెరిచిన ఈయూ) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్‌దేనని పేర్కొన్నారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!) ఇక ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈఏఎస్ఏ.. పీఐఏ విమానాలపై నిషేధం విధించడం గమనార్హం. కాగా ఈఏఎస్ఏ తాజా నిర్ణయంతో పాక్ ఎయిర్‌లైన్స్‌లో ఈయూ దేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాన్ని ఆర్నెళ్లపాటు వాయిదా వేసుకోవచ్చని.. లేని పక్షంలో టికెట్ డబ్బు రీఫండ్ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా డాన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ఈయూ ప్రకటించిన విషయం తెలిసిందే. (పాక్‌లో 30 శాతం బోగస్ పైలట్లు) EASA has suspended PIA's permission to operate to EU member states for 6 months w.e.f July 1, 2020: 0000Hrs UTC. PIA is in touch with EASA to allay their concerns and hopes that the suspension will be revoked with our CBMs soon. — PIA (@Official_PIA) June 30, 2020 -
సరిహద్దులు తెరిచిన ఈయూ
పారిస్: యూరోపియన్ యూనియన్ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న అమెరికాను ఈ జాబితా నుంచి మినహాయించారు. చైనాను ఈ జాబితాలో చేర్చి, రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు. అలాగే చైనా కూడా యూరోపియన్ దేశాలకు సహకరించాలనే షరతుతో యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉరుగ్వే దేశాలకు షరతులు లేకుండా సరిహద్దులను తెరిచారు. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్ ఓటింగ్ విధానం ద్వారా అల్జీరియా, జార్జియా, జపాన్, మాంటేనెగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ట్యునీషియా దేశాల సరిహద్దులను తెరిచింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సభ్య దేశాలపై ఉంటుందని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. (ముప్పున్న వారికే ముందుగా టీకా!) -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్‌లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
‘కోవిడ్’ దిగ్బంధనం
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్) విజృంభిస్తుండటంతో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు సోమవారం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మార్చి 18న అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందని సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం నుంచి దేశ అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అన్ని రకాల ప్రయాణికుల రాకపోకలను నిషేధించారు. దేశం మొత్తమ్మీద వైరస్ నియంత్రణ చర్యల పుణ్యమా అని అధికశాతం విద్యార్థులకు ఇళ్లకు పరిమితమైపోగా, ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసే పరిస్థితి ఏర్పడింది. జిమ్‌లు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూసేశారు. కొత్త టోల్‌ఫ్రీ నంబర్ వైరస్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కేంద్రం సోమవారం నుంచి కొత్త టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ఉన్న 011– 23978046తోపాటు 1075 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ncov2019 @gmail. comకు ఈ మెయిల్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. (కరోనా బారిన పడ్డాను) నవోదయకు ముందుగానే సెలవులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని 600 జవహర్ నవోదయ విద్యాలయాలకు ముందుగానే సెలవులు ప్రకటించనున్నారు. పరీక్షలు అయిపోతున్న నేపథ్యంలో వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నామని మార్చి 21 నుంచి మే 25 వరకూ సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఒడిశాలో తొలి కేసు భారతదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి మార్చి 6న ఢిల్లీకి వచ్చి ఆ తరువాత రైలు మార్గం ద్వారా మార్చి 12న భువనేశ్వర్‌కు వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. లదాఖ్, కశ్మీర్, కేరళల్లో నమోదైన ఒక్కో కేసును పరిగణనలోకి తీసుకుంటే దేశం మొత్తమ్మీద సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి కారణంగా మరణించిన ఇద్దరితోపాటు 17 మంది విదేశీయులు, చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు ఈ 114 మందిలో ఉన్నారు. ముంబైలో నలుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడటంతో మహారాష్ట్రలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 37కు చేరుకుంది. దేవాలయాలకు తాళాలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాలు, ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ఒస్మానాబాద్లోని తుల్జా భవానీ ఆలయాలను మూసివేయనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. సిద్ధి వినాయక ఆలయం తదుపరి ఉత్తర్వుల వరకూ మూతపడగా.. తుల్జాభవానీ ఆలయం మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ మూతపడనుంది. సామూహిక సమావేశాలను నివారించాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిద్ధివినాయక ఆలయం ట్రస్టు చైర్మన్ అదేశ్ భండేకర్ తెలిపారు. శక్తివంచన లేకుండా కృషి: మోదీ వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాప్తి నిరోధాల విషయంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. (కరోనా మరణాలు @ 7007) పరిష్కారాలు సూచించండి వైరస్ నియంత్రణకు mygov. in వెబ్సైట్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు సూచించాల్సిందిగా దేశ ప్రధాని మోదీ కోరారు. వ్యాధిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు పౌరులకు తగిన సమాచారం అందడం చాలా ముఖ్యం. కొంతమంది వ్యక్తులు, కంపెనీలు బయో ఇన్ఫర్మాటిక్స్, డేటాసెట్స్, వ్యాధి నిర్ధారణకు అప్లికేషన్ వంటివి అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పరీక్షలు షురూ వాషింగ్టన్: ప్రాణాంతక కోవిడ్‌కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్‌కు ప్రయోగాత్మక టీకా వేశారు. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు చెప్పారు. సియాటెల్‌లోని కైసర్ పెర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. తీవ్రమైన దుష్ప్రభావాలేవీ లేనట్టు నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నామని, ఇందులో వైరస్ ఏదీ లేని కారణంగా టీకా తీసుకున్న వ్యక్తికి కోవిడ్ సోకే అవకాశమూ లేదని వివరించారు. సియెటెల్లో టీకా వేస్తున్న దృశ్యం అమెరికా, జర్మనీ మాటల యుద్ధం క్యూర్‌వ్యాక్ అనే కంపెనీ తయారు చేస్తున్న కరోనా నిరోధక టీకా ఒకటి అమెరికా, జర్మనీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకాపై తాము హక్కులు కొనుక్కుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై జర్మన్లు విరుచుకుపడుతున్నారు. జర్మనీ అమ్మకానికి లేదని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి పీటర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైవెల్ట్ అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. క్యూర్‌వ్యాక్ అభివృద్ధి చేస్తున్న టీకాపై హక్కుల కోసం అమెరికా 100 కోట్ల డాలర్లు ఇవ్వచూపింది. ఆ టీకా అమెరికాలో వాడాలన్నది షరతు. మరోవైపు, క్యూర్వ్యాక్లో పెట్టుబడులు పెట్టిన వారు మాట్లాడుతూ ఏ ఒక్క ప్రభుత్వానికో తాము టీకా అమ్మబోమని స్పష్టం చేశారు. సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తే అది ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు డైట్ హాప్ అనే పెట్టుబడిదారు వ్యాఖ్యానించారు. -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్‌లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్‌లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్‌లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్‌లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్‌కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్‌లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్‌లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్‌లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
బ్రిటన్ కొత్త వీసాకు తుదిమెరుగులు
లండన్: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్ బ్రెగ్జిట్ పాయింట్స్ బేస్డ్ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
ఈయూకు టాటా..
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయం వద్ద బ్రిటన్ జెండాను తీసేస్తున్న అధికారులు ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ‘ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చింది. భారత్ సహా 13 దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం’అనిఅన్నారు. దేశ చరిత్రలో ఇది గొప్ప ఘటన అని బ్రెగ్జిట్ అనుకూల నేత నిగెల్ ఫరాజ్ వ్యాఖ్యానించారు. సంబరాలు.. నిరసనలు ఈ ప్రత్యేక సందర్భంలో లండన్‌లోని పార్లమెంట్ స్వే్వర్తోపాటు డౌనింగ్ స్ట్రీట్ వద్ద బ్రెగ్జిట్ కౌంట్‌డౌన్ తెలుపుతూ భారీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పబ్బులు, క్లబ్బుల్లో ప్రజలు బ్రెగ్జిట్ విందులు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, ఈయూలోనే కొనసాగాలంటూ కొన్ని చోట్ల బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు కూడా జరిగాయి. బ్రిటన్‌తోపాటు తమను కూడా ఈయూ నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ స్కాట్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. మరోసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బ్రెగ్జిట్తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది. మిశ్రమ స్పందన బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. డైలీ ఎక్స్‌ప్రెస్, ది సన్ వంటి పత్రికలు బ్రిటన్ శక్తివంతమవుతుందని వ్యాఖ్యానించగా, ముందున్నది గతులకు బాట అంటూ స్టాండర్డ్ పత్రిక, ది గార్డియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈయూను వీడిన బ్రిటన్ అంటూ బీబీసీ ప్రసారం చేసిన కథనంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా, బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే సమయంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సులోని కలైస్ పోర్టు నుంచి బ్రిటన్‌లోని డోవర్‌కు బయలుదేరిన ఓడలో మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు. ఆ ఓడ బయలుదేరిన సమయానికి ఈయూలో 28 సభ్యుదేశాలుండగా బ్రిటన్‌లోకి అడుగిడే సమయానికి ఈయూ 27 దేశాల సమాఖ్యగా మారనుంది. కాగా, కోట్ డెస్ డ్యూన్స్ అనే ఆ ఓడలో ప్రయాణీకుల్లో చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆడ్రే సెంటినెల్లా అనే మహిళ మాత్రం..‘ఇది విచారకరమైన రోజు. ఈ రోజుతో ఒక శకం ముగియనుంది. ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎన్ని లోటుపాట్లున్నా ఈయూతోనే బ్రిటన్ ముందుకు సాగితే బాగుండేది’అని పేర్కొన్నారు. ఈమె స్విట్జర్లాండ్‌లో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. రేపటి నుంచి ఫెర్రీ క్యాంటిన్లో బ్రిటిష్ ఫిష్, చిప్స్ తినే వారు కనిపించరని ఓడ కెప్టెన్ ఆంటోయిన్ పకెట్ అన్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్‌కు, ఈయూకు నిత్యం రాకపోకలు సాగించడం పెద్ద తలనొప్పిగా మారబోతోందని మరో ప్రయాణికుడు అలెస్సో బార్టన్ అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 దేశాల్లో తిరగగలిగే అవకాశాన్ని చాలా మంది కోల్పోనుండటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులు చెరిగిపోవాల్సిన సమయంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ పరిణామం భవిష్యత్తుకు మంచిది కాదని జర్మనీకి చెందిన మొహమ్మద్ మజోకా తెలిపారు. -
‘బ్రెగ్జిట్’కు బ్రిటన్ పార్లమెంట్ ఓకే
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్‌తో బ్రెగ్జిట్‌పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు. పార్లమెంట్లో ప్రధాని జాన్సన్ (మధ్యలో)