Hrithik Roshan
-
హృతిక్ రోషన్ క్రిష్-4.. బిగ్ షాకిచ్చిన నిర్మాత!
హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి మిల్ గయా'. ఈ మూవీకి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం క్రిష్. ఈ మూవీలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన క్రిష్ -3లో హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించారు. అలా ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.అయితే ఈ సిరీస్‌లో క్రిష్-4 రానుందని చాలాకాలంగా బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారని టాక్ వినిపించింది. ఈ మూవీకి తాను డైరెక్షన్ చేయడం లేదని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.అయితే తాజాగా ఈ నిర్మాణ బాధ్యతల నుంచి సిద్ధార్థ్ ఆనంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.700 కోట్ల భారీ బడ్జెట్ కావడంతోనే సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచనలో పడ్డారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగారని సమాచారం. తాజా పరిణామాలు చూస్తే అతనితో పాటు కరణ్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ తప్పుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్-4 ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.సిద్ధార్థ్ ఆనంద్‌తో పాటు కరణ్ తప్పుకోవడంతో ఈ మూవీకి కొత్త దర్శకత్వంలో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొత్త టీమ్‌తో మళ్లీ బడ్జెట్‌ను అంచనా లు తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాకేష్ రోషన్ కూడా తాను దర్శకుడిగా చేయడం లేదని చెప్పడంతో మరో డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. కాగా.. క్రిష్, క్రిష్ -3 చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే క్రిష్-4 కూడా ఆయనే డైరెక్ట్ చేస్తాడని అభిమానులంతా భావించారు. కానీ తాజా ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం చేయడం లేదని చెప్పేశారు. ఈ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించనున్నట్లు వెల్లడించారుయ. అయితే ఇప్పుడు తాను డైరెక్ట్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. అందుకే దర్శకత్వం మార్పు అవసరమని స్పష్టం చేశారు. -
అఫీషియల్: అనుమానాల్లేవ్.. చెప్పిన టైంకే 'వార్ 2'
ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ మూవీ 'వార్ 2'. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. మొన్నీమధ్యే డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తూ హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని రూమర్స్ వినిపించాయి. కానీ వీటికి చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. మరోసారి తేదీపై క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?)'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్.. గతేడాది 'దేవర'గా వచ్చాడు. ఈ ఏడాది 'వార్ 2'తో రాబోతున్నాడు. తాజాగా ట్విటర్ లో ఓ మీమ్ పేజ్.. ఈ మూవీ కోసం వీడియో చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్.. ఆగస్టు 14న 'వార్ 2' థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో తొలుత 'ఏక్ థ టైగర్'(2012) వచ్చింది. దీని కొనసాగింపుగా 'టైగర్ జిందా హై' (2017), 'వార్' (2019), 'పఠాన్'(2023) వచ్చాయి. వీటిలో భాగమైన 'వార్ 2'.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది క్రిస్మస్ కి ఈ యూనివర్స్ లో భాగమైన 'ఆల్పా' కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 🔥😎💥😱💪 ... there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… 😈⚠️‼️🚨🤯 https://t.co/eVmQRLLJtG— Yash Raj Films (@yrf) March 16, 2025 -
ఎన్టీఆర్ వార్ 2 అప్డేట్ బాలీవుడ్ షేక్ కావాల్సిందే!
-
మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్‌కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్ సెంటర్లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది. -
బ్యాడ్ న్యూస్ ఇప్పట్లో వార్ 2 రిలీజ్ కష్టమే..!?
-
'వార్2'లో గాయపడిన స్టార్ హీరో.. సినిమా వాయిదా..!
'వార్2' విడుదల కోసం పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వార్త వారిని కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా తారక్, హృతిక్ రోషన్ మధ్య ఒక సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు హృతిక్ గాయపడినట్లు బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే, తాజాగా ఫైనల్ సాంగ్ కోసం షెడ్యూల్‌ను మేకర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ముంబయిలోని యశ్‌రాజ్ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్‌ను ఆపేశారట. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటనతో వార్2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో బిజినెస్ మొదలుపెట్టిన హృతిక్ రోషన్ మాజీ భార్య (ఫోటోలు)
-
అతడి వెయిట్‌లాస్ జర్నీకి నటుడు హృతిక్ రోషన్ ఫిదా..!
ఎందరో తమ వెయిట్ లాస్ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్‌గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్నెస్ ఇన్‌ప్లుయెన్సర్ ఫుర్కాన్ ఖాన్. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్ చేసింది. 23 ఏళ్ల ఫుర్కాన్ ఖాన్ తన ఫిట్నెస్ జర్నీని డాక్యుమెంట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్‌తో తన వెయిట్ లాస్ జర్నీ వీడియోలు షేర్ చేసేవాడు. ఆ వీడియోలో పుర్కాన్ జనవరి 19 2024 జిమ్‌లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్‌తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్నెస్ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే అంతలా జిమ్‌లో వర్కౌట్లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్‌గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్లు స్కిప్ చేయకూడదని చెబుతుంటాడు. ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్ రోషన్ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. హృతిక్ సదరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫుర్కాన్ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Furkan Khan (@flexwithfurru) (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..) -
'ది రోషన్స్' సిరీస్ పార్టీ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో బాలీవుడ్ చిత్రం ది రోషన్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ జీవితమనే చక్రంలో కొందరి వంతు వస్తుంది, కొందరి వంతు ముగుస్తుంది. ముగిసిన వారి జ్ఞాపకాలు మన మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో ఎందరో మహానుభావులుంటారు. వారి జ్ఞాపకాలైతే మనం నెమరువేసుకోవచ్చేమో కానీ ఆ కాలంలో వారు పడ్డ కష్టం, ఆనందం కానీ మనకు తెలియవు. అటువంటి వారి జీవిత చక్రానికి వెండితెర రూపమిస్తే మన ఆనందం అవధులు దాటుతుంది.ఆ కోవకు చెందినదే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది రోషన్స్’ టీవీ షో. ఇదో డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి జీవిత చక్రాలకు తెర రూపమే ఈ షో. బాలీవుడ్ దిగ్గజ రోషన్ కుటుంబానికి చెందిన నాటి సంగీత కళాకారులు రోషన్ లాల్ నాగ్రత్ నుండి నేటి తరం నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు... వారి జీవిత ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు.ఈ డాక్యుమెంటరీలో. ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ షో ద్వారా నాలుగు తరాలు ప్రయాణిస్తాం. ముందుగా రోషన్ కుటుంబం నుండి రోషన్ లాల్ నాగ్రత్ సంగీత ప్రయాణంతో ఈ షోప్రారంభమై ఆ పై అతని కొడుకు రాజేష్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో సాగి, ఆ తరువాత ఆయన కొడుకు రాకేశ్ రోషన్ నటనా ప్రయాణంతో పాటు ప్రోడ్యూసర్‌గా ఎలా రాణించారు? అన్నది చూపిస్తూ నేటి తరం కథానాయకుడు హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో షో ముగుస్తుంది.ఈ షో ద్వారా నాటి బాలీవుడ్ సంగీతం నుంచి నేటి తరం సినిమాల వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోని అప్పటి ఒడిదుడుకులను ఇప్పటి పట్టు విడుపులను సవివరంగా చూపించారు. ఈ రోషన్ కుటుంబానికి బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న నాటి, నేటి దిగ్గజాలు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు చెప్పడం మరింత బావుంది. అందుకే ‘ది రోషన్స్’ చూసి నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడు తమ వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోదగ్గ డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. వర్త్‌ఫుల్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు.. తర్వాత విడాకులు తీసుకున్నవారు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)- సుజానే (Sussanne Khan) దంపతులు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందే హృతిక్ సుహానేను ప్రేమించాడు. 2000వ సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఈ దంపతులకు హ్రెహాన్, హృదాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. విడాకుల తర్వాత స్నేహితులుగా..తర్వాత ఏమైందే ఏమో కానీ 2014లో హృతిక్- సుజానే విడిపోయారు. అలా అని శత్రువులుగా మిగిలిపోకుండా మంచి మిత్రులుగా తమ మధ్య అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉండగా సుజానే.. అర్స్‌లన్ గోనీతో లవ్‌లో ఉంది. ఈ రెండు ప్రేమ జంటలు తరచూ షికార్లకు, డిన్నర్ డేటింగ్‌కు వెళ్తూ మీడియాకు చిక్కుతూ ఉంటారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్- సుజానే విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నది చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. (చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా)విడిపోయినంత మాత్రాన..తాజాగా దీనిపై హృతిక్ తండ్రి, దర్శకనిర్మాత, నటుడు రాకేశ్ రోషన్ (Rakesh Roshan) స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. జరిగిందేదో జరిగిపోయింది. విడిపోయినంత మాత్రాన సుజానే మాకు ఏమీ కాకుండా పోదు. ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్లిద్దరు! అభిప్రాయభేదాలు వచ్చిందీ వారిమధ్యే! అప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సిందీ వారిద్దరే! ఏదేమైనా తను ఇప్పటికీ మా ఇంటికి వస్తూ ఉంటుంది. తనను మా కుటుంబసభ్యురాలిగానే భావిస్తాం అని చెప్పాడు.నేనంటే భయంకుమారుడు హృతిక్, కూతురు సునయన గురించి చెప్తూ.. వీళ్లిద్దరికీ నేనంటే భయం. అదెందుకో నాకు తెలియదు. ఎవరిమీద పడితే వాళ్లపై అరిచేవాడినీ కాదు, అనవసరంగా తిట్టేవాడినసలే కాదు. కాకపోతే క్రమశిక్షణగా ఉంటాను. చిన్నప్పుడు ఈ పిల్లలిద్దరూ నాతో నిర్భయంగా మాట్లాడేవారే కాదు. కానీ ఇప్పుడు సరదాగా ఉంటారు. అందరం ఫ్రెండ్స్‌లా కలిసిపోయి మాట్లాడుకుంటాం అని చెప్పుకొచ్చాడు. రాకేశ్ రోషన్ ఫ్యామిలీపై ఇటీవల ద రోషన్స్ అని డాక్యుమెంటరీ రిలీజైంది. ఇకపోతే రాకేశ్ గతంలో గొంతు క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు.చదవండి: 300 కోట్ల బడ్జెట్.. హీరోగా సూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు! -
హృతిక్ రోషన్ vs జూనియర్ ఎన్టీఆర్ భీభత్సమైన డ్యాన్స్ పోటీ
-
హృతిక్, జూ.ఎన్టీయార్ల మధ్య ‘వార్’కి టైమ్ బాగుందట!
ప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయర్ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.బాలీవుడ్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్ చంద్రరమణి హృతిక్ జ్యోతిష శాస్త్ర చార్ట్‌ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ తన కెరీర్లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్–టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కహో నా... ప్యార్ హై’ (2000) సమయంలోనూ హృతిక్ విజయంలో వీనస్ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్ అంటున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా హృతిక్‌కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్ వ్యక్తిగత వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే అవకాశం ఉందనీ, జనవరి ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్, స్టాక్‌లు లేదా ప్రైవేట్ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు. బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. హృతిక్ గత చిత్రాలలో ’వార్’ (2019) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ’విక్రమ్ వేద’ (2022), ’ఫైటర్’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్ రోషన్ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో, ఆయనకు ఇది మరో విజయవంతమైన సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్న వార్ 2 హిందీ సినిమాల్లో రికార్డ్–బ్రేకింగ్ ఓపెనర్‌గా అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న జూ.ఎన్టీయార్(Jr NTR) బాలీవుడ్ కెరీర్ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. -
హృతిక్ రోషన్ వర్కౌట్లు చూస్తే మతిపోవడం ఖాయం..!
బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే నటులలో ఒకరు హృతిక రోషన్. ఆయన వైవిధ్యభరితమైన నటనకు గానూ ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల తోసహా ఇతర అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఎంతో స్టైలిష్‌గా ఉంటే హృతిక్‌కి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో క్రేజ్ ఉంది. ఆయన ఫిట్నెస్ బాడీకి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే. అంతలా కండలు తిరిగిన దేహంతో ఓ యోధుడిలా ఉంటాడు. ఐదు పదుల వయసులో కూడా ఆయన అంతే యంగ్‌గా ఫిట్‌గా ఎలా మెయింటైన్ చేస్తున్నాడా అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే దీనికి మాములు డెడీకేషన్ సరిపోదు మరీ..హృతిక్ కండలు తిరిగిన దేహం వెనుక ఎంతో శ్రమ, కఠిన వర్కౌట్లు ఉంటాయి. ఫిట్నెస్ పరంగా ఎలాంటి వర్కౌట్లు చేస్తాడో తెలిస్తే మతిపోవడం ఖాయం. అతడు చెమటలు పట్టేలా చేసే.. బరువులు(లాగడం/ఎత్తడం)తో కూడిన వ్యాయామాలు చూస్తే మనకే నొప్పులొచ్చేస్తాయి. అవి చెమటోడ్చి పనిచేసే వాళ్ల మాదిరిగా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే మూటలు ఎత్తేవాళ్లు చేసేవిలా ఉంటాయి. అవి అలాంటి ఇలాంటి కఠినమైన వ్యాయామాలు కాదు. వెయిట్‌లిఫ్ట్ క్రీడాకారులు మాదిరిగా ఉంటాయి. చూస్తే మాత్రం..ఇంతలానా వర్కౌట్లు అని నోరెళ్లబెడతారు. ఈ కొత్త ఏడాది తన వ్యాయమాల ప్లాన్ ఏంటీ అంటూ క్యాప్షన్‌తో తన వర్కౌట్ల సెషన్ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాడు. ఆ వీడియోల్లో చాలా నొప్పితో కూడిన జిమ్ ఎక్స్‌ర్‌సైజుల చూస్తే బాబోయ్ అనిపిస్తుంది. కష్టం, నొప్పితో కూడిని ఈ కఠినతరమైన వ్యాయామాలతోనే నటుడు హృతిక్ ఇంతలా బాడీ మెయింటెయిన్ చేస్తున్నాడా అని విస్తుపోతారు. అందుకు చాలా గట్టి నిబద్ధత కావాలి. ఇంతలా మనసు పెట్టి చేస్తున్నాడు కాబట్టి అతడికి అంతమంది అభిమానులు కాబోలు అనిపిస్తుంది. ఈ శరీరాకృతి కారణంగానే హృతిక్‌కి మంచి మంచి రోల్స్(క్యారెక్ట్ర్స్) వచ్చాయి. ముఖ్యంగా క్రిష్ సినిమాలో కండలు తిరిగిన దేహంతో చేసే ఫైటింగ్‌లు, అద్భుతాలు ప్రేక్షకుల్ని కళ్లప్పగించి చూసేలా చేస్తాయి. తన కష్టానికి ప్రతిఫలమే ఈ స్టార్డమ్ అని చెప్పొచ్చు. ఏదీ ఏమైన హృతిక్ డెడికేషన్‌కి సలాం కొట్టాల్సిందే కదూ..! View this post on Instagram A post shared by HRX (@hrxbrand) (చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!
చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు స్లిమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. అలాగే ఆరోగ్యంపై సరైన అవగాన కల్పిస్తున్నారు కూడా. కొంతమంది వారిని ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గుతున్నారు కూడా. ఇప్పుడు తాజాగా అదే కోవలోకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా కూడా చేరిపోయారు. కిలోల కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సునైనా వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె సునైనా బొద్దుగా అందంగా ఉండేది. చాలమందికి తెలుసు ఆమె చాలా లావుగా ఉంటుందని. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతలా స్లిమ్‌గా మారిపోయింది. దాదాపు 50 కిలోలు బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆమెకు కామెర్లు వంటి ఆరోగ్య సమస్యలున్నప్పటికీ విజయవంతంగా బరువు తగ్గినట్లు వెల్లడించిది. నిజానికి ఆమె గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్‌తో పోరాడుతోంది. ఆమె ఇన్ని అనారోగ్య సమస్యలను అధిగమించి మరీ..బరువు తగ్గేందుకు ఉపక్రమించడం విశేషం. తన అనారోగ్య భయమే తనను సరైన ఆహారం తీసుకునేలా చేసిందంటోంది సునైనా. తాను పూర్తిగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. "సరైన జీవనశైలితో కూడిన ఆహారం కామెర్లు సమస్యను తగ్గుముఖం పట్టేలా చేసింది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. తన తదుపరి లక్ష్యం పూర్తి స్థాయిలో ఫ్యాటీలివర్ని తగ్గిచడమే". అని ధీమాగా చెబుతోంది సునైనా View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) ఫ్యాటీ లివర్‌తో బరువు తగ్గడం కష్టమా..?ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఆ సమస్యతో ఉండే వ్యక్తులు బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది జీవక్రియ చర్యలకు అంతరాయం కలిగించి బరువు పెరిగేలా చేస్తుంది. పైగా దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసి కండరాల పనితీరుని, శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గించేస్తుంది. ఫలితంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..) -
ఐ యామ్ లెజెండ్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 15న విడుదల కానుంది. కాగా ‘వార్ 2’ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా చేస్తారనే మాట కొన్నిరోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఐ యామ్ లెజెండ్’ (2007) రీమేక్ హక్కులను హృతిక్ రోషన్ దక్కించుకున్నారని బీటౌన్ సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్‌లో హృతిక్ తొలుత నటిస్తారని, ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్. -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్‌లో హృతిక్–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్‌కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
ఆలియా ‘ఆల్ఫా’లో అతిథిగా స్టార్ హీరో!
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’. శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్లో జరుగుతోంది. ఆలియా, శార్వరీ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఓ అతిథి పాత్ర చేయనున్నారని, ఆయన పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్
హీరోహీరోయిన్లు అనగానే.. వాళ్లకేంటి బోలెడన్ని డబ్బులున్నాయని అనుకుంటారు. అది నిజమే కానీ కొందరు హీరోయిన్లు చాలావరకు అద్దెకు ఉంటుంటారు. మన దగ్గర చాలామందికి సొంతిళ్లు ఉంటాయి. బాలీవుడ్లో మాత్రం రెంట్ కల్చర్ ఎక్కువే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అదే ఫాలో అయిపోయింది. స్టార్ హీరో ఇంటిని అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా కపూర్.. తాజాగా 'స్త్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదలా పక్కనబెడితే శ్రద్ధా.. ఇప్పుడు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న హీరో హృతిక్ రోషన్ ఇంటిని అద్దెకు తీసుకునే ప్లాన్‌లో ఉందట. బీచ్‌కి ఎదురుగా ఉంటే ఈ బిల్డింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ఉండటం విశేషం.శ్రద్ధా కపూర్ ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఇప్పుడు కాస్త విస్తరించి రీ మోడలింగ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వేరే ఇంట్లో కొన్నాళ్ల పాటు అద్దెకు ఉండాలి. అలా ఇప్పుడు హృతిక్ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రానుందనమాట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
హృతిక్ రోషన్‌తో ‘జీప్’ ప్రచార కార్యక్రమం
హైదరాబాద్: కార్ల తయారీ సంస్థ ‘జీప్ ఇండియా’ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్ రాంగ్లర్ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది.‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్ ఇండియా ప్రకటించింది. హృతిక్ రోషన్‌ను జీప్ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్ పార్ట్నర్గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
హైదరాబాద్‌లో యుద్ధం
హైదరాబాద్‌లో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వారిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోగా దూసుకెళుతున్న ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీపై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ముంబై, గోవాతో పాటు విదేశాల్లోనూ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ముంబై షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్ రోషన్ పాల్గొన్నారు. కాగా ‘వార్ 2’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు.ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్‌లపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఇంటర్వెల్లో వచ్చే ఈ ఫైట్ సినిమాలో ఓ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ ని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది. కాగా 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
విడాకుల తర్వాత మరొకరితో లవ్.. సంతోషంగా ఉందన్న తల్లి
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే ఖాన్.. చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు కలిసున్నారు. పరిస్థితులు తారుమారవడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్ మరో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపించడం వల్లే ఈ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.విడాకుల తర్వాత ప్రేమలో..అయితే విడాకులు తర్వాత ఇద్దరూ శత్రువుల్లా మారిపోకుండా పిల్లల కోసం ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అలాగని ఒంటరిగానూ మిగిలిపోలేదు. అటు హృతిక్.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో పడగా ఇటు సుజానే.. నటుడు అర్స్‌లన్ గోనిని లవ్ చేస్తోంది. తాజాగా సుజానే ప్రేమాయణం గురించి ఆమె తల్లి జరీన్ మాట్లాడింది. సుజానే పార్ట్నర్ అర్స్‌లన్ న్యాయవిద్యను అభ్యసించాడు. జమ్ములో పేరున్న రాజకీయ కుటుంబానికి చెందినవాడు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకోవాలనేం లేదునటనారంగంలోనూ తను రాణించాలని ఆశిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులు కూడా ఎంతో మంచివారు! సుజానే, అర్స్‌లన్ కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒకరితో మనకు సంతోషం దక్కుతుందంటే మంచిదే కదా.. అలా అని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం కంటిన్యూ అవుతుందనేం లేదు. అర్స్‌లన్, సుజానేలు వారి కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. వారిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో! -
హృతిక్ రోషన్ అలా చేస్తాడనుకోలేదు: బాలీవుడ్ నటుడు
డబ్బులిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధం అనేవాళ్లు చాలామంది! స్టార్ హీరోలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్లాది రూపాయలు ఆశ చూపిస్తే చాలు.. పాన్ మసాలా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో కనిపిస్తారు. అవి మంచివి కావని తెలిసినా యాడ్స్‌లో నటించి జనాలను ఎంకరేజ్ చేస్తారు. ఈ ధోరణి అస్సలు మంచిది కాదంటున్నాడు ప్రముఖ నటుడు గోవింద్ నాందేవ్.హృతిక్ రోషన్ అంటే అభిమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నటీనటులు బాధ్యతగా వ్యవహరించాలి. కొత్త జనరేషన్‌కు వారొక దిక్సూచీలా ఉండాలి. అభిమానులను పెడదారి పట్టించే పనుల జోలికి వెళ్లకూడదు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం.. తనపై ఎంతో అభిమానగౌరవం ఉండేది. కానీ చివరకు తను కూడా గుట్కా యాడ్‌లో కనిపించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అది చూసి నాకు తల తిరిగిపోయింది. ఈయన ఎందుకిలాంటివి చేస్తున్నాడనిపించింది. అది తప్పు కాదా?యాడ్‌లో గుట్కా, బెట్టింగ్ మంచిదేనని హీరోలు పొగిడితే జనాలు అవి అలవాటు చేసుకోరా? అనుకరించరా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా నటులు బాధ్యతగా ఉండొచ్చు కదా! జనాల వల్లే హీరోలుగా అందనంత ఎత్తులో ఉన్నప్పుడు వారికి హాని చేసేవాటిని ఎంకరేజ్ చేయడం తప్పు కాదా? అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పటికీ బాధపడుతున్నా20 ఏళ్ల క్రితం తనకంత అవగాహన లేక ఓ పాన్ మసాలా యాడ్‌లో నటించానని, అందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు గోవింద్ నాందేవ్ తెలిపాడు. అప్పట్లో నటుడిగా బాధ్యతగా వ్యవహరించాలన్న జ్ఞానం లేకపోవడం వల్లే సదరు ప్రకటనలో కనిపించానన్నాడు. తర్వాత అలాంటి తప్పు మళ్లీ ఎన్నడూ రిపీట్ చేయలేదన్నాడు.చదవండి: దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్.. -
మాజీ ప్రియురాలికి సపోర్ట్ చేసిన స్టార్ హీరో
హీరోయిన్ కంగనా రనౌత్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అనే పదమే. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ చేసింది గానీ తర్వాత తర్వాత మూవీస్ కంటే వివాదాల వల్లే పేరు తెచ్చుకుంది. రీసెంట్గా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించింది. కానీ గెలిచిన తర్వాత రోజే ఈమెకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కంగన చెంప చెళ్లుమనిపించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో భిన్నాబిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)గతంలో ఖలీస్థానీ ఉద్యమం గురించి కంగన చేసిన కామెంట్స్ వల్ల సదరు మహిళా అధికారి కంగన చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు మహిళా అధికారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ తదితరులు మాత్రం కంగనకు జరిగిన అవమానంపై తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కంగనకు అండగా నిలబడుతున్నారు.మిగతా వాళ్ల సంగతేమో గానీ తాజాగా సీఐఎస్ఎఫ్ అధికారికి వ్యతిరేకంగా పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కంగన-హృతిక్ ప్రేమించుకున్నారు. పరిస్థితులు అనుకూలించక విడిపోయారు. మధ్యలో పోలీస్ కేసుల వరకు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు మాజీ ప్రియురాలికి పరోక్షంగా హృతిక్ సపోర్ట్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్) -
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
-
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
హిందీ వార్‌లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ ‘వార్’లో అడుగుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్‌రోషన్‌కు సంబంధించిన చాలా సీన్లు మేకర్స్ చిత్రీకరించేశారు. తాజాగా తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. వార్2 కోసం ఎన్టీఆర్ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్, తారక్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్దరు కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ పనులతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తారక్ వచ్చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by ɴᴛʀ ғᴀɴs ᴄʟᴜʙ™ (@ntrloversoffl) -
వార్‌కు రెడీ!
బాలీవుడ్ ‘వార్’కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ మొదలైందని, హృతిక్‌రోషన్ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్. కాగా ఈ వారంలో ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట అయాన్ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఈ సారి హాలీవుడ్ రేంజ్ లో క్రిష్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్న హృతిక్
-
మహేష్‌కు సరైన విలన్‌ను సెలెక్ట్ చేసిన రాజమౌళి
-
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ నేటి నుంచి ప్రారంభం
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) తొలి ఎడిషన్ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్ లీగ్ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు.. ఐఎస్పీఎల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. చీఫ్ మెంటార్‌గా రవిశాస్త్రి.. ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చీఫ్ మెంటార్‌గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, జతిన్ పరంజపే సెలెక్షన్ కమిటీ హెడ్లుగా పని చేయనున్నారు. అమితాబ్ వర్సెస్ అక్షయ్.. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో అమితాబ్ మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. సచిన్ జట్టుతో తలపడనున్న అక్షయ్ టీమ్.. ఇవాళ జరుగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. -
సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?
హిందీ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ మల్టీస్టారర్ మూవీ అనే విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. -
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ -2 చిత్రంపై కీలక అప్డేట్
ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైమ్ కూడా ఉండదేమో అని తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. వార్ 2 లో ఈ సారి హృతిక్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట. గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నారు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ప్రధాన కారణం తారక్ ఫిబ్రవరి, మార్చి నెలలో వార్ 2 చిత్రం కోసం డేట్స్ కేటాయించడమే అని తెలుస్తోంది. ఈ చిత్రం డార్క్ థీమ్‌లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రంపై ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే. వచ్చే ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. -
వార్ 2 నుండి కిక్కెక్కించే న్యూస్
-
హృతిక్ రోషన్‌కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్ 'వార్- 2' మరింత ఆలస్యం
ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి స్టార్స్‌తో పాటు అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఫోటోలో హృతిక్ రోషన్‌ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. 'వార్' మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 'ఫైటర్' సినిమాతో హిట్ కొట్టారు హృతిక్ రోషన్. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్‌వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్‌లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్‌లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్‌ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
వార్ 2తో బాలీవుడ్ రేంజ్ నెక్స్ లెవెల్ కి కానీ !
-
‘ఫైటర్’తో 14వ సారి 100 కోట్ల క్లబ్ లోకి హృతిక్ రోషన్!
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో 14వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్ కి మరో రికార్డ్ కూడా దక్కింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఫైటర్ మూవీ ఆడియన్స్ ని అలరిస్తోంది. (చదవండి: ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ) ఓవర్సీస్ లో సైతం ఫైటర్ మూవీ అద్భుతంగా రాణిస్తోంది.వార్ తర్వాత సింగిల్ డే లో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా ఫైటర్ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో సైతం హృతిక్ కెరీర్ లో ఫైటర్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. ఫైటర్ చిత్రం సాధించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ చిత్రంతో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో పాటు క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లో 100 కోట్లు సాధించాయి. హృతిక్ రోషన్ కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు లివే! కభీ ఖుషి కభీ గమ్ క్రిష్ ధూమ్2 జోధా అక్బర్ 5.జిందా న మిలేగా దోబారా అగ్నిపథ్ క్రిష్ 3 బ్యాంగ్ బ్యాంగ్ మొహంజదారో కాబిల్ 11,సూపర్ 30 వార్ విక్రమ్ వేద ఫైటర్ -
దీపికా పదుకొణ్ మసాలా సాంగ్‌ను తొలగించిన 'ఫైటర్' టీమ్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ జోడీగా నటించిన ఫైటర్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. సినిమా బాగుందని మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్‌ను తొలగించేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లోకి వచ్చిన రోజు నుంచి దీపికా అందాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్‌లో సాంగ్‌ను చూసినవారు థియేటర్లో కూడా చూడొచ్చు అనుకుంటే ఫైటర్ మేకర్స్ షాక్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్‌పై ఈ సాంగ్ కనిపించకపోయేసరికి వారిలో కొంతమేరకు నిరాశ కలిగింది. ఈ సాంగ్‌లో హీరోయిన్ దీపికా పదుకొణ్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కీలకమైన పదవిలో ఉంటూ ఇలాంటి అసభ్యకరమైన సాంగ్‌లో చూపించడం కరెక్ట్ కాదని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్‌గా ఆ సాంగ్‌ను దర్శక నిర్మాతలు సినిమా నుంచి తొలగించడం జరిగింది. గతంలో పఠాన్ సినిమాలో కూడా దీపికా పదుకొణ్ మితిమీరిన అందాల ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె దుస్తుల మీద కూడా వివాదం చెలరేగింది. కానీ ఆ సమయంలో షారుక్ ఖాన్ వివరణ ఇవ్వడంతో ఆ సాంగ్ థియేటర్లో కూడా రన్ అయింది. ప్రస్తుతం ఫైటర్ సినిమా విషయంలో ఎయిర్ ఫోర్స్ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్‌ను తొలగించేశారు. యూట్యూబ్‌లో మాత్రం ఈ సాంగ్‌ను చూడవచ్చు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి దేశభక్తి సినిమాలో ఆ సాంగ్ లేకపోవడమే మంచిదని కూడా కామెంట్లు వస్తున్నాయి. -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్‌మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
ఫైటర్ మూవీ ట్రైలర్
-
స్టార్ హీరో దేశభక్తి సినిమాపై వివాదం.. ఆ దేశాల్లో నిషేధం
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. దేశభక్తి నేపథ్యంలో తీసిన ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న అంటే గురువారమే థియేటర్లలోకి రానుంది. హిందీలో ఒకింత పర్లేదు గానీ తెలుగులో అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా చాలామందికి తెలియదు. అలాంటిది విడుదలకు కొన్ని గంటల ముందు ఈ చిత్రబృందానికి మరో షాక్ తగిలింది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) బాలీవుడ్ మరీ దారుణంగా తయారవుతోంది. ఈ మధ్య కాలంలో దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ తరహా మూవీస్ మరీ ఎక్కువైపోతున్నాయి. పఠాన్, టైగర్.. ఇలా లెక్కకు మించి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఇలాంటి కథతోనే తీసిన ఏరియల్ యాక్షన్ మూవీ 'ఫైటర్'. హృతిక్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటించారు. అలానే 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింట్లోనూ 'ఫైటర్' సినిమాపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల లాంటి అంశాలతో తీసిన చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. రీసెంట్గా సల్మాన్ 'టైగర్ 3' ఇలానే నిషేధానికి గురవగా, ఇప్పుడు 'ఫైటర్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. యూఏఈలో మాత్రం పీజీ 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించారు. ఇకపోతే గల్ఫ్ కంట్రీస్‌లో నిషేధం వల్ల 'ఫైటర్' మూవీకి మిలియన్ డాలర్ల వసూళ్లు నష్టం ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
అబ్బురపరిచే విజువల్స్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా కనిపించనున్నారు. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. గతంలో లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా మెప్పించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ట్రైలర్ చూస్తే హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్‌తో హృతిక్ రోషన్ నటన ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్‌లో బాలీవుడ్ హీరో లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్‌గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సరికొత్త అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. दिल आसमान के नाम, और जान देश के नाम । जय हिन्द! 🇮🇳#FighterTrailer OUT NOW. https://t.co/8b4COYyiWy#Fighter Forever. #FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D. pic.twitter.com/ANMv5FreCv — Hrithik Roshan (@iHrithik) January 15, 2024 -
హృతిక్ రోషన్ ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టిన ట్రైనర్
ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండాలంటే ఫిట్నెస్ తప్పనిసరి! సినిమా స్క్రిప్టుకు తగ్గట్లుగా తమ శరీరాకృతిని మార్చుకుంటూ ఉంటారు హీరోహీరోయిన్లు. ఇందుకోసం కఠినమైన డైట్, వర్కవుట్స్ పాటిస్తుంటారు. అందుకే 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ తమ క్రేజ్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అందగాడు, గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఫిట్నెస్ సీక్రెట్‌ను బయటపెట్టాడు అతడి ట్రైనర్. ఏది వర్కవుట్ కాదో బాగా తెలుసు హృతిక్ దగ్గర దశాబ్దకాలం పాటు ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేస్తున్న క్రిస్ గెతిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'హృతిక్ తన నెక్స్ట్ సినిమా ఫైటర్ కోసం తన బాడీని సిద్ధం చేస్తున్నాడు. వేకువజామున ఐదు గంటలకు నిద్ర లేచి, రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాడు. ఏకాగ్రతతో, పట్టుదలగా ఉండేవారితో కలిసి పని చేయడమంటే నాకెంతో ఇష్టం. హృతిక్ అలాంటి కోవకే చెందుతాడు. తను చాలా తెలివైనవాడు. ఏది చేస్తే బాగుంటుంది? ఏది వర్కవుట్ కాదనేది తనకు బాగా తెలుసు. ఫైటర్ కోసం ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచే హృతిక్ ఆరింటికల్లా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాడు. ఐదు రోజులే వర్కవుట్స్ ఆ తర్వాత మేము 45 నిమిషాల పాటు జిమ్‌లో కష్టపడుతాం. వర్కవుట్స్ గంట కన్నా ఎక్కువసేపు అవసరం లేదు. చేసిన కాసేపైనా చాలా కష్టంగా ఉండేవాటినే సెలక్ట్ చేస్తాను. కంటి నిండా నిద్రపోతే వారంలో ఐదు రోజులు వర్కవుట్స్ సరిపోతుంది. సరిగా నిద్ర లేకపోతే నాలుగు రోజులే షెడ్యూల్ ఉంటుంది. హృతిక్ రోజుకు ఒకటీరెండు సార్లు కార్డియో ఎక్సర్సైజ్ చేస్తాడు. కార్డియో అంటే రన్నింగ్, స్టెయిర్ మాస్టర్, ఎలిప్టికల్, స్విమ్మింగ్.. ఇలా చాలా ఉంటాయి. బోరింగ్ ఫుడ్.. అతడు రోజుకు ఆరేడు సార్లు తింటాడు. ఒకవేళ తినకపోతే వాటినే జ్యూస్‌లుగా తీసుకుంటాడు. ఫైటర్ కోసం అతడు తినే ఫుడ్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ అతడి చెఫ్ బోరింగ్ వంటల్ని కూడా రుచికరంగా మార్చేస్తాడు. నా దగ్గరకు వచ్చే చాలామంది హృతిక్ రోషన్‌లా తమ లుక్ మార్చేయమని అడుగుతారు. ప్రతి ఒక్కరూ అతడిలా మారిపోవడం అంత ఈజీ కాదు. అవతలి వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండవు. మనలో ఉన్నవి అవతలివారిలో ఉండవు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ -
సూపర్ హీరో బర్త్‌డే.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
బాలీవుడ్ అందగాడు, సూపర్ హీరో హృతిక్ రోషన్ బుధవారం (జనవరి 10న) 50వ పడిలోకి అడుగుపెట్టారు. ప్రేమకథ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, ఫిక్షనల్.. ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించి అన్ని వయసులవారి మనసులు గెలుచుకున్నాడు. ఇకపోతే హృతిక్ రోషన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ తమ అభిమాన హీరో బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఉన్న కొన్ని అనాథాశ్రమాల్లో అన్నదానం చేశారు. అలాగే మంగళగిరి, వైజాగ్‌లో మొక్కలు నాటారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేక్ కటింగ్ ద్వారా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. చెన్నై సిటీలో ట్రక్కులో ఫుడ్ పంపిణీ చేశారు. అలాగే కొంతమంది ఫ్యాన్స్ హృతిక్ రోషన్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేశారు. తమ అభిమాన హీరో సినిమా ఫైటర్ జనవరి 25న విడుదల అవుతున్న సందర్బంగా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: నత్తోడు అని హేళన..బురదనీళ్లతోనే స్నానం..హృతిక్ పడ్డ కష్టాలెన్నో.. -
Hrithik Roshan: కష్టాన్నీ ప్యార్ కియా.. సూపర్‌హీరో బన్‌గయా!
హాలీవుడ్ సినిమాలకి ఎంతోమంది సూపర్ హీరోలు. సూపర్ మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్, ఫెంటాస్టిక్ ఫోర్... ది లిస్ట్ నెవర్ స్టాప్స్... మరి మనకు సూపర్ హీరో? క్రిష్.. క్రిష్ 1.. క్రిష్ 2.. క్రిష్ 3... అందం ఉంది, నటన ఉంది, పర్సనాలిటీ ఉంది, ఎనర్జీ ఉంది, సిక్స్ ప్యాక్ ఉంది... వీటన్నింటికి తోడు ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే ఆత్మశక్తి ఉంది. అందుకే హృతిక్... సూపర్ రోషన్. దేవుడు మనకు ఏదైనా అదనంగా ఇస్తే సంతోషించాలి. కానీ హృతిక్ విషయంలో అది రివర్స్ అయ్యింది. దేవుడు అతనికి ఒకటి అదనంగా ఇచ్చాడు. ఏమిటో తెలుసా? కుడి చేతికి ఆరో వేలు. స్కూల్లో పిల్లలు అతణ్ణి వింతగా చూసేవారు. వెక్కిరించేవారు. వికృత పిల్లవాడి కింద జమకట్టేవారు. కుడి చేతి బొటన వేలు పక్కన ఇంకో బొటన వేలు ఉండటం హృతిక్ లోపం. దానిని కట్ చేసి తీసేయలేము. అలాగని ఉంచుకోలేము. ఎటువంటి ఇతర సమస్యలేని ఈ సమస్య చిన్నారి హృతిక్‌ని ఛిన్నాభిన్నం చేసింది. ఎవరితోనూ కలిసేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు. ఫలితం... నత్తి. చిన్నప్పుడు హృతిక్ రోషన్‌కు నత్తి ఉండేది. మాట్లాడటానికి తడబడేవాడు. స్కూల్లో ఓరల్ టెస్టులు ఉంటాయి కదా. లేచి నిలబడి ఏదో ఒకటి ఒప్పజెప్పాలి. ఆ రోజు తప్పనిసరిగా స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఇంట్లో ఇదంతా పెద్ద నరకం. జె.ఓం ప్రకాష్ పేరు ఎవరైనా వినే ఉంటారు. ఇతడు నిర్మాత– దర్శకుడు. ‘జైజై శివశంకర్’ వంటి రాజేష్ ఖన్నా సూపర్‌హిట్ పాటలున్న ‘ఆప్ కి కసమ్’ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇతడే. ఇతని కుమార్తెనే నటుడు రాకేష్ రోషన్ వివాహం చేసుకున్నాడు. వీళ్లకు పుట్టినవాడే హృతిక్ రోషన్. తాత జె.ఓం ప్రకాష్ మాత్రం హృతిక్ మానసిక, శారీరక సమస్యలను పట్టించుకునేవాడు కాదు. తన మనవడు పెద్దయ్యి పెద్ద హీరో అవుతాడని అతడి నమ్మకం. అందుకే తాను తీసే సినిమాల్లో చైల్డ్ అప్పియరన్స్ ఇప్పించేవాడు. హృతిక్ అలా అరడజను సినిమాల్లో నటించాడు. సినిమా వాతావరణం అలా తెలుసు. తండ్రి రాకేష్ రోషన్ హీరో కనుక అలా కూడా సినిమాలు తెలుసు. బాబాయ్ రాజేష్ రోషన్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా కుటుంబంలో పుట్టిన హృతిక్ కచ్చితంగా సినిమా హీరోయే కావాలి. కాని అదంత సులభం కాలేదు. తండ్రులు కొడుకులను కాపాడాలనుకుంటారు. రాకేష్ రోషన్ కూడా హృతిక్‌ని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే అతడి జీవితం సాఫీగా సాగలేదు. హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. నిర్మాతగా ట్రై చేశాడు. అందులోనూ ఫ్లాప్స్ చూశాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇక చివరి ప్రయత్నంగా దర్శకుడిగా మారి ‘ఖుద్గర్జ్’ సినిమా తీశాడు. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఖూన్ భరీ మాంగ్’, ‘కిషన్ కన్హయ్య’ వంటి భారీ హిట్స్ ఇచ్చాడు. అయినా సరే గ్యారంటీ లేని ఈ రంగంలోకి వచ్చే ముందు ఏదో ఒక బతుకు విద్య ఉండాలని కొడుకు విషయంలో భావించాడు. ‘అమెరికా వెళ్లి స్పెషల్ ఎఫెక్ట్స్ నేర్చుకునిరా’ అన్నాడు హృతిక్‌ని. హృతిక్ అంగీకరించాడు. దానికి ముందు ఏదైనా టెక్నికల్ కోర్సు కూడా చదివించాలని నిర్ణయించుకున్నాడు. దానికీ సరే అన్నా హృతిక్ మనసు చెబుతోంది– ఇవన్నీ తన పనులు కాదని, తను పుట్టింది వీటి కోసం కాదని, తను హీరో కావాలని. ఒకరోజు నేరుగా వెళ్లి తండ్రి వద్ద చెప్పేశాడు– నాన్నా... ఇవన్నీ నా వల్ల కాదు. నేను హీరోనే అవుతా. రాకేష్ రోషన్ పరికించి చూశాడు. ‘సరే... స్క్రీన్ మీద ఏదైనా ఒకటి జరగాలంటే స్క్రీన్ వెనుక ఎంత కష్టం ఉంటుందో నీకు తెలియాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరు’ అని ఆదేశించాడు. హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు– ఆరో అసిస్టెంట్ డైరెక్టర్‌గా. రాకేష్ రోషన్ కొడుకు అన్న అదనపు గౌరవం సెట్లో హృతిక్‌కు ఏ మాత్రం ఉండేది కాదు. అందరిలాగే కష్టపడాలి. అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి ఉండాలి. ‘కోయ్లా’, ‘కరణ్ అర్జున్’ సినిమాలకు అలా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. నైరోబీలో షూటింగ్ జరుగుతుంటే అందరూ ముందే స్నానాలు చేసి వెళ్లిపోతే తను ఆరోవాడు కనుక ఆఖరు చేయాల్సి వచ్చేది. అప్పటికి నీళ్లు అయిపోయి బురద నీళ్లు వచ్చేవి. ఆ బురదనీళ్లలోనే స్నానం చేసి షూటింగ్‌కు వెళ్లేవాడు. పైకి రావాలంటే కష్టం చేయాలి. పైకి వచ్చిన ప్రతివాడూ ఇలాంటి కష్టం తప్పనిసరిగా చేసే ఉంటాడు. హృతిక్‌ని హీరోగా లాంచ్ చేయాలి. తాను హీరోగా ఫ్లాప్ అయ్యాడు... కాని తన కొడుకు హీరోగా ఫ్లాప్ కాకూడదు అనుకున్నాడు రాకేష్ రోషన్. కానీ ఈ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి. హృతిక్‌కు ఉన్న నత్తి ఒక సమస్య. రెండు అతడి వెన్నులో, మోకాలిలో మరో సమస్య. డాక్టర్ పరీక్షించి చూసి ‘నువ్వు జన్మలో డాన్స్ చేయలేవు. చేయకూడదు’ అని చెప్పాడు. ఓడిపోయేవాడైతే ఆ మాట విన్న వెంటనే పోతాడు. కానీ హృతిక్ గెలవాలని నిశ్చయించుకున్నవాడు. అంతే ఆ మాటనే సవాలుగా చేసుకుని డాన్స్ క్లాసుల్లో చేరాడు. మోకాలూ వెన్నూ విరగనీ.. నాశనం కానీ తాను మాత్రం బెస్ట్ డాన్సర్‌గా నిలవాలి అని ప్రాక్టీస్ చేశాడు. డాక్టర్ చెప్పిన సమస్య ఎటు పోయిందో ఏమో. హృతిక్ ఇప్పుడు బెస్ట్ డాన్సర్ అయ్యాడు. ఇక నత్తి విషయం. స్పీచ్ థెరపీ తీసుకున్నాడు. అంతే కాదు అర్ధరాత్రి రెండు గంటలకు లేచి ఏదో ఒక సినిమాలోని ఏదో ఒక డైలాగును గుర్తు చేసుకుని నత్తి లేకుండా దానిని చెప్పడానికి పొద్దున వరకూ ప్రాక్టీసు చేసేవాడు. నత్తి పోయింది. డాన్స్ వచ్చింది. ఇక హీరో కావడానికి రెడీగా ఉన్నాడు. కానీ అందుకు దారిలో మూడు కొండలు అడ్డంగా నిలుచుని ఉన్నాయి. ‘కహో నా ప్యార్ హై’ 2000 సంవత్సరంలో వచ్చింది. కానీ అప్పటికి ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ బాలీవుడ్‌ను ఏలుతున్నారు. బాలీవుడ్ అంటే ఈ ఖాన్ త్రయమే. దీనిని బద్దలు కొట్టే హీరో కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. అలాంటి వారు ఎవరూ రారనే ధైర్యంతో ఖాన్లు ఉన్నారు. ఇప్పుడు హృతిక్ వస్తే వీరి చరిష్మాను బ్రేక్ చేసే స్థాయిలో రావాలి. అలా అతణ్ణి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రాకేష్ రోషన్ ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. లవ్ స్టోరీ, మంచి పాటలు, కొత్త రకమైన డాన్సులు, అందంగా కనిపించే హీరోయిన్ అమీషా పటేల్.... జనవరి 14, 2000 సంవత్సరంలో ‘కహో నా ప్యార్ హై’... విడుదలైంది. ఖాన్ త్రయం పేరుతో అలుముకున్న ఆకాశం బద్దలైంది. జనం ఆమిర్, షారుక్, సల్మాన్ ఖాన్‌లను తాత్కాలికంగా మర్చిపోయారు. ఎక్కడ చూసినా హృతిక్ రోషన్ జపమే. రాజేష్ ఖన్నా తర్వాత ఆ స్థాయిలో ఆడపిల్లలు వెర్రెత్తి పోయింది హృతిక్ రోషన్ కోసమే. దేశంలో ఎక్కడ కనిపించినా వేలాది మంది మూగిపోవడం మొదలుపెట్టారు. నెల్సన్ మండేలా అంతటి వాడు తమ దేశంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావలసిందిగా హృతిక్‌కు వర్తమానం పంపాడు. హిమాలయాల్లో ముక్కు మూసుకొని ఉండే సాధువులు కూడా గుంపులుగా ముంబై వచ్చి హృతిక్‌ని చూసి వెళ్లారనేది నిజంగా జరిగిన నిజం. కొందరు హృతిక్‌ని కొత్త అవతార్ అన్నారు. మీడియా దీనికి ‘హృతిక్ మేనియా’ అని పేరు పెట్టింది. హృతిక్ ఓవర్‌నైట్ సూపర్ స్టార్. కాని ప్రకృతి బేలెన్స్ చేయడం లేదు. ఎగరేసిన వస్తువు కింద పడాలి. అది రూలు. పడ్డాక స్థిరత్వం వస్తుంది. ఎగిరినా సరే కాళ్లు నేల మీద ఉండాలన్న తత్త్వం తెలిసొస్తుంది. ‘కహో నా ప్యార్ హై’ తర్వాత హృతిక్ రోషన్ వరుస పెట్టి ఫ్లాప్స్ ఇచ్చాడు. ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’, ‘యాదే’, ‘ఆప్ ముఝే అచ్ఛే లగ్నే లగే’, ‘ముజ్సే దోస్తీ కరోగే’, ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’... ఈ సినిమాల్లో యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారి సినిమా ఉంది. ప్రఖ్యాత దర్శకుడు సూరజ్ భరజ్యాతా దర్వకత్వం వహించిన సినిమా కూడా ఉంది. కానీ ఏవీ బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. రెండేళ్లలో ఆరేడు ఫ్లాప్స్ ఇచ్చే సరికి ఖాన్ త్రయం బహుశా ముసిముసిగా నవ్వు కొని ఉంటుంది. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని అనుకొని ఉంటుంది. మీడియా అయితే హృతిక్ ఒన్ ఫిల్మ్ వండరనీ అతడి పని అయిపోయినట్టేనని శాసనాలు దండోరా వేయించింది. కానీ అయిపోయిందంటే అయిపోయినట్టు కాదు. తిరిగి మొదలైనట్టు. తండ్రి దర్శకత్వంలో హృతిక్ హీరోగా మళ్లీ మొదలైన సినిమా ‘కోయి మిల్గయా’. హీరోకి బుద్ధిమాంద్యం... తోడుగా ఒక అంతరిక్ష జీవి... ‘కోయి మిల్గయా’ ఆడకపోయి ఉంటే కథ ఎలా ఉండేదో కానీ ఆబాల గోపాలం ఆ సినిమా చూసింది. తండ్రీ కొడుకులు మళ్లీ హిట్ కొట్టారు. వాళ్లు ఒకటి అనుకున్నారు. హృతిక్ మిగిలిన దర్శకుల దర్శకత్వంలో భిన్నమైన సినిమాలు చేస్తూ ఉంటాడు... కానీ తండ్రి మాత్రం రెగ్యులర్‌గా అతడితో కమర్షియల్ సినిమాలు తీస్తూ ఉంటాడు అని. అందుకనే హృతిక్ బయట దర్శకుల దర్శకత్వంలో ‘జోధా అక్బర్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి సినిమాలు చేస్తే తండ్రి దర్శకత్వంలో ‘క్రిష్’, ‘క్రిష్ 3’ వంటి సూపర్ హీరో సినిమాలు చేసి హాలీవుడ్‌కి స్పెడర్ మేన్, ఐరన్ మేన్ ఉన్నట్టు మనకు ఒక ‘క్రిష్’ ఉన్నాడని, ఉండగలడని నిరూపించాడు. అయితే అతడు కేవలం కమర్షియల్ హీరో మాత్రమే కాదని అతడిలో ఒక మంచి నటుడు ఉన్నాడని ‘జోధా అక్బర్’, ‘జిందగీ నా మిలేగి దొబారా’ నిరూపించాయి. హృతిక్ ఎంతో కష్టపడి చేసిన ‘మొహంజొదారో’ ఆడలేదు. కానీ అంధుడుగా నటించి, విడుదల చేసిన ‘కాబిల్’ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
50వ వసంతంలోకి అడుగుపెడుతోన్న కండలవీరుడు హృతిక్ రోషన్
-
'ఫైటర్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. వింటుంటే అలా!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. వార్, పఠాన్ చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాట విడుదల చేశారు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) ఇప్పటికే 'ఫైటర్' మూవీ నుంచి టీజర్, సాంగ్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలానే అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా 'హీర్ ఆస్మాని' అని మరో పాటని రిలీజ్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ లుక్‌లో హృతిక్ రోషన్ వావ్ అనిపిస్తున్నాడు. పాట కూడా వినసొంపుగా ఉంది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
ఇష్క్ జైసా కుచ్..
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘ఇష్క్ జైసా కుచ్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ‘‘హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌ల మధ్య వచ్చే ఫుల్ రొమాటింక్ సాంగ్ ‘ఇష్క్ జైసా కుచ్..’. దీపిక, హృతిక్ డ్యాన్స్ అదరగొట్టారని ప్రేక్షకులు అంటారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా (పాటీ) కనిపించనుండగా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నీగా (దీపికా) కనిపిస్తారు’’ అని మేకర్స్ అన్నారు. -
ఫైటర్ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్..
-
హృతిక్-దీపిక రొమాంటిక్ సాంగ్.. రెచ్చిపోవడంలో పీక్స్!
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ సాగుతున్నాయి. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ఇష్క్ జైసా కుచ్' అని సాగే ఓ రొమాంటిక్ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో హృతిక్, దీపిక ఫుల్ రొమాటింక్ మోడ్‌లో రెచ్చిపోయారు. ఇక వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించైతే చెప్పడానికి ఇంకేం లేదు. అంతలా అదరగొట్టేశారు! వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు 'ఫైటర్' సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా.. దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనున్నారు. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?) -
హృతిక్ రోషన్, దీపికా పదుకొనె 'ఫైటర్' నుంచి పార్టీ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫైటర్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఎక్కువగా ఏరియల్ యాక్షన్ సన్నివేశాలే ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నాటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని 2024 జనవరి 25న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. తాజాగా ఫైటర్ మూవీ నుంచి "షేర్ కుల్ గయ" అనే పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్లో గతంలో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలు వచ్చాయి. అవి రెండూ కూడా సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'ఫైటర్' టీజర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- దీపికా పదుకోన్ కాంబినేషన్లో ఫైటర్ చిత్రం రానుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో సాగే భారతీయ మొదటి ఏరియల్ యాక్షన్‌గా ఈ సినిమాను నిర్మించారు. 'ఫైటర్' టీజర్లో జెట్ ఫ్లైట్స్ విన్యాసాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్ ఎండ్ వరకు ఫైట్ జెట్స్తో వాళ్లు చేసే సాహసాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే ఏడాదిలో షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మళ్లీ ఫైటర్ చిత్రంతో అదే రేంజ్ విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ మేరకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో దీపికా పదుకోన్- హృతిక్ రోషన్ల మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కానుంచి ఫైటర్. ఇదే ఏడాది అదే తేదీన పఠాన్ రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. ఏకంగా షారుక్ ఖాన్‌కు కమ్‌బ్యాక్ చిత్రంగా అది నిలిచి రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసింది. -
War-2 Movie: హృతిక్ రోషన్- ఎన్టీఆర్ వార్-2 రిలీజ్ ప్రకటన వచ్చేసింది
హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'వార్'. 2019లో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ సినిమా భారీ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'వార్2' వస్తుంది. 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగష్టు 14న వార్ 2 విడుదల అవుతుందని ప్రకటించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తోన్న ఆరో సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. 2024 జనవరి నుంచి వార్ 2 సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. 2025 ఆగష్టులో వార్-2 ఉండటంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. #War2 gets one of the best possible release date in 2025 with plenty of Holidays. Aug 14th - Release Day Aug 15th - Independence Day Aug 16th - Janmashtami Aug 17th - Sunday Aug 22nd To 24th Weekend 2 Aug 27th -… pic.twitter.com/GBSSlE8t1A — Manobala Vijayabalan (@ManobalaV) November 29, 2023 -
స్టార్ హీరో గర్ల్ఫ్రెండ్లో ఈ టాలెంట్ కూడా ఉందా?
ఆమె ఆ స్టార్ హీరో గర్ల్‌ఫ్రెండ్. ఇప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అతడితో ప్రేమలో పడింది. పలు సందర్భాల్లో ఈ జంట కలిసి కనిపిస్తుంటారు. ఆమె నటి అని చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు ఎవరికీ తెలియని ఓ కొత్త టాలెంట్ ని బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) బాలీవుడ్ స్టార్ హీరోల్లో హృతిక్ రోషన్ కాస్త డిఫరెంట్. త్వరగా సినిమాలు చేసేయకుండా విభిన్న కథలతో మూవీస్ చేస్తుంటాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే దాదాపు 14 ఏళ్లపాటు సంసారం చేసిన సుస్సానే ఖాన్‌కి విడాకులు ఇచ్చేశాడు. ప్రస్తుతం నటి, డైరెక్టర్ సబా ఆజాద్‌తో రిలేషన్లో ఉన్నాడు. హృతిక్ కంటే సబా ఆజాద్‌ది చాలా చిన్న వయసు. ఈ విషయమై అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు. సరే అదంతా పక్కనబెడితే రీసెంట్గా ఓ ఫ్యాషన్ షోలో పాటలు పాడిన సబా ఆకట్టుకుంది. ఇప్పటివరకు అందరికీ ఈమె నటి అని మాత్రమే తెలుసు. ఇప్పుడు అదిరిపోయే ర్యాప్ సాంగ్స్ పాడి ఆశ్చర్యపరిచింది. అయితే ఈమె ఎప్పటినుంచో సింగర్ అని, సొంతంగా ఓ బ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
ఏప్రిల్‌లో సెట్స్‌కి...
వరుస సినిమాలతో మరింత బిజీ కానున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి ΄ార్ట్ షూటింగ్ డిసెంబరు కల్లా పూర్తవుతుందని, అప్పట్నుంచి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోని ‘వార్ 2’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ్ర΄ారంభం కానుందని యూనిట్ వెల్లడించింది. -
వార్ 2 స్టోరీ లైన్ మామూలుగా లేదు..
-
రజనీకాంత్‌తో ఉన్న ఈ పిల్లాడు స్టార్ హీరో.. గుర్తుపట్టారా!?
అప్పుడప్పుడు కొన్ని పాత ఫొటోలు బయటపడుతుంటాయి. అలానే తాజాగా ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అయింది. 'జైలర్'తో హిట్ కొట్టి మంచి ఊపుమీదున్న రజనీకాంత్‌తోపాటు ఓ పిల్లాడు ఉన్నాడు. అతడెవరా అని నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరి మీరేమైనా కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? రజనీకాంత్ దాదాపు రెండు మూడు జనరేషన్లని కవర్ చేసిన హీరో అనొచ్చు. ఎందుకంటే అప్పటితరం హీరోలకు పోటీ ఇచ్చాడు. ఇప్పటి హీరోలకి కూడా పోటీ ఇస్తూ అసలు సిసలైన సూపర్‌స్టార్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. సరే పైన పిక్ విషయానికొచ్చేద్దాం. మీలో పలువురు గెస్ చేసింది కరెక్టే. రజనీతో ఉన్నది ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. (ఇదీ చదవండి: నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!) రజనీ విషయానికొస్తే.. 'రోబో' తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయిన ఈయన రీసెంట్గా 'జైలర్'తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇక తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు అడపాదడపా చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న హృతిక్ రోషన్.. ప్రస్తుతం 'ఫైటర్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'వార్ 2' చేయబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ది హీరోగా నటించబోతున్నాడు. హృతిక్ వ్యక్తిగత విషయాలకొస్తే.. సుస్సానే ఖాన్‌తో 14 ఏళ్లు సంసారం చేసిన తర్వాత విడిపోయాడు. ప్రస్తుతం షబా ఆజాద్ అనే యంగ్ బ్యూటీతో రిలేషన్లో ఉన్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) -
స్టార్ హీరో ఖర్చు.. అతడికి ప్రతినెలా రూ.20 లక్షలు!
ఆ హీరో వయసు 50 ఏళ్లు. కానీ అస్సలు అలా కనిపించడు. సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు. యాక్షన్ సీన్స్, గ్రేస్‌తో స్టెప్పులు వేయాలంటే ఆ ఇండస్ట్రీలో మనోడి తర్వాత ఎవరైనా. ఒక్కో సినిమాకు కోట్లకు కోట్లు తీసుకునే ఇతడు.. ఫిట్నెస్ కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి సంగతి? బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు చెప్పగానే చాలామందికి క్రిష్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు ప్రేక్షకులకు అలా బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం హిందీలో యాక్షన్ తరహా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇద్దరు పిల్లలకు తండ్రి అయినప్పటికీ.. బాడీ మంచి షేప్‌లో ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. డైలీ వర్కౌట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోడు. (ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇప్పుడు లాయర్‌గా!) అయితే తన బాడీ ఫిట్, షేప్‌లో ఉండటం కోసం పర్సనల్‌గా ట్రైనర్ క్రిస్ గెతిన్ అనే ఫారెనర్ ని పెట్టుకున్నాడు. అయితే ఇతడికి ప్రతినెలా దాదాపు రూ.20 లక్షల మొత్తాన్ని ఫీజుగా చెల్లిస్తున్నాడట. ఇది తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఏడాదికి లెక్కేసుకుంటే రూ.2.4 కోట్లు అనమాట. బహుశా ఫిట్నెస్ కోసం ఈ రేంజులో ఖర్చు పెడుతున్న స్టార్ హీరో ఇతడే అయ్యుంటాడు. ప్రస్తుతం 'ఫైటర్' మూవీ చేస్తున్న హృతిక్.. దీని తర్వాత 'వార్ 2'లో నటిస్తాడు. ఇందులో హృతిక్ తో పాటు జూ.ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తాడు. ఇప్పటికే ఈ కాంబో ఫిక్స్ అయింది. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలు కానుండగా, తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. 2025 జనవరి 25న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) -
నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్
'కోయ్.. మిల్ గయా'.. బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ ఈ చిత్రంలో అమాయకపు పిల్లవాడిగా నటించాడు. ఈ మూవీలో జరిగిన కొన్ని సంఘటనలు అతడి నిజ జీవితంలోనూ జరిగాయట. హృతిక్ రోషన్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కోయ్.. మిల్ గయా. ఈ సినిమా వచ్చి నేటికి (ఆగస్టు 8) 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా చేస్తున్నప్పుడే దీనితో నేను బాగా కనెక్ట్ అయ్యాను. నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని ఈ సినిమా చేయలేదు. నా మనసుకు నచ్చి చేశాను. సినిమాకు సంతకం చేసేటప్పుడు రోహిత్‌గా నా పాత్ర ఎలా ఉంటుంది? దీనికోసం నేను ఏం చేయాలి? ఇలాంటివేవీ నేను ఆలోచించలేదు. తొలిసారి ఆ కథ విన్నప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ మొదలుపెట్టాక నన్ను నేను అన్వేషించుకున్నాను. ఒక నటుడిగా ఎలా ఉండాలి? ఎటువంటి సినిమాలు ఎంచుకోవాలి? ఎలాంటి కథలో భాగస్వామ్యం కావాలి? అనేది తెలుసుకున్నాను. రోహిత్ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే రోజుల్లో నాకు నత్తి ఉండేది. అది చూసి అందరూ వెక్కిరించేవారు. నేనేం మాట్లాడినా ఎగతాళి చేసేవారు. సినిమాలో రోహిత్ స్కూటీని ధ్వంసం చేస్తారు. అది నా లైఫ్‌లో కూడా జరిగింది. కాకపోతే అప్పుడు నేను సైకిల్ తొక్కేవాడిని. చిన్నతనంలో అదంటే నాకు ప్రాణం. కొందరు సీనియర్స్ వచ్చి నా సైకిల్‌ను నాశనం చేశారు. చాలా బాధేసింది. రోహిత్‌లాగే నాకూ పట్టరానంత కోపం వచ్చింది. ఈ అనుభవం వల్లే సినిమాలో ఆ సీన్లో సహజంగా నటించగలిగాను. దాని తీవ్రతను అర్థం చేసుకోగలిగాను. తొలిసారి రేఖ మేడమ్‌తో నటించింది ఈ చిత్రంలోనే! ఓ సీన్లో ఆమె నా చెంప పగలగొట్టాల్సి ఉంటుంది. నిజంగా కొడితేనే ఎమోషన్స్ వాటంతటవే వస్తాయని చెప్పి మరీ కొట్టింది. చాలా గట్టిగా కొట్టింది. ఈ చెంపదెబ్బ ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని చెప్పుకొచ్చాడు హృతిక్. కాగా కోయ్.. మిల్ గయా సినిమాకు హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించి నిర్మించాడు. అతడి సోదరుడు రాజేశ్ రోషన్ సంగీతం అందించాడు. చదవండి: అనాథలా రేకుల షెడ్డులో జీవితం వెల్లదీసిన హీరోయిన్.. ప్రసాదంతో కడుపు నింపుకుని పస్తులు -
అతని పెళ్లి ఒక బూటకం.. వాళ్లను నాశనం చేస్తా: కంగనా
బాలీవుడ్ సూపర్స్టార్లపై కంగనా రనౌత్ తాజాగా భారీ కామెంట్లే చేసింది. హృతిక్ రోషన్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి పరోక్షంగా బయటపెట్టింది నటి కంగనా. బాలీవుడ్లో ఒక వ్యక్తి తన ప్రతినిధిగా (కంగనా) నటిస్తూ ఇతరులను స్కామ్ చేస్తున్నాడని, వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నాడని కొందరు ఆమెకు చెప్పడంతో కంగనా రియాక్ట్ అయింది. ఒకప్పుడు హృతిక్‌గా నటిస్తూ కొందరు తనకు కూడా పోస్ట్ చేశారని అప్పుడు తాను కూడా మోసపోయానని కంగనా గుర్తు చేసుకుంది. బాలీవుడ్ కక్షలు, బంధుప్రీతిపై ఎప్పుడూ తన స్వరం పెంచే కంగనా తాజాగా ఓ బాలీవుడ్ నటుడిని టార్గెట్ చేసింది. ఓ సూపర్ స్టార్ తనను డేట్‌కు రమ్మని అడిగాడని పేరు చెప్పకుండానే చెప్పింది కంగనా. అంతే కాదు పరోక్షంగా మరోసారి హృతిక్ రోషన్‌పై మండిపడింది. హృతిక్ రోషన్‌ని టార్గెట్! హృతిక్ రోషన్‌తో తనకున్న ఎఫైర్ గురించి కంగనా రనౌత్ మరోసారి ఓపెన్ అయ్యింది. కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒకదాని తర్వాత ఒకటి అనేక పోస్ట్‌లను షేర్ చేసింది. తన ఖాతా కూడా హ్యాక్ అయిందని ఆమె ఇలా పేర్కొంది. 'బాలీవుడ్ ఫిల్మ్ మాఫియా ఎప్పుడూ నేర కార్యకలాపాలలో పాల్గొంటుంది. గతంలో నేను డేటింగ్ చేసిన సూపర్ స్టార్ కూడా ఇలాంటి పనే చేశాడు. అతను నాతో చాట్ చేయడానికి వేర్వేరు నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించాడు. ఒకానొక సమయంలో అతను నా ఖాతాను కూడా హ్యాక్ చేసి తప్పుగా ఆపరేట్ చేశాడు. ఆ సమయంలో అతను విడాకులు తీసుకుంటున్నాడని నేను అనుకున్నాను, కానీ అతని అనుమానాస్పద ప్రవర్తనకు దానితో సంబంధం లేదని నాకు తరువాత తెలిసింది.' అని కంగనా పేర్కొంది. 'ఫిల్మ్ మాఫియా' తరగతి బాలీవుడ్లో ఇదొక్కటే కాదు, ఒక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే 'ఫిల్మ్ మాఫియా' ఎలా పనిచేస్తుందో కూడా కంగనా ప్రస్తావించింది. 'సినిమా విడుదల అయ్యాక వారు పెద్దమొత్తంలో నకిలీ టిక్కెట్లను కొనుగోలు చేస్తారు. అలా ఆ సినిమా కలెక్షన్స్‌ను తారుమారు చేస్తారు. దానిని జనాలకు ఎక్కువగా చూపుతారు. ఈ మాఫియా ఒక స్పై గా కొందరి కోసం పనిచేస్తుంది. ప్రముఖుల వాట్సాప్ డేటాను కూడా కొనుగోలు చేస్తారు, అలా నా సినిమా ఒప్పందాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తస్కరించారు. (ఇదీ చదవండి: 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!) ఈ దోపిడీల గురించి నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను, చెబుతున్నాను. ఇలాంటి పనులు చేసేది ప్రతిభ లేని వారు మాత్రమే. అలాంటి వారు తెలివి తక్కువ వ్యక్తులు.... వారికి నేర ప్రవృత్తి ఉంది... చాలా భయానకంగా ఉంది... @cybercrimehelp.mumbai దయచేసి చర్య తీసుకోండి. అని పరోక్షంగా రణబీర్ కపూర్, అలియాను కంగనా లాగింది. రణబీర్‌పై ఆరోపణలు? కంగనా మరొక ఇన్‌స్టా కథనంలో ఇలా రాసింది, 'బాలీవుడ్లో ఉమనైజర్ అని పిలువబడే మరో సూపర్ స్టార్ నా ఇంటికి వచ్చి అతనితో డేటింగ్ చేయమని అడిగాడు. అయితే దీనిని పూర్తిగా గోప్యంగా ఉంచాలన్నాడు. ఎందుకని కారణాన్ని నేను అడిగినప్పుడు, అతను తాను 'పాపా కి పరి'తో డేటింగ్ చేస్తున్నానని చెప్పాడు. అంటే వారి మధ్య ప్రేమ లేదు. అతని కోరికకు నేను అంగీకరించలేదు. తిరస్కరించాను. ఆ తర్వాత వివిధ నంబర్ల నుంచి నాకు కాల్ చేయడం ప్రారంభించాడు. అతని నంబర్లన్నీ బ్లాక్ చేశాను. అప్పటి నుంచి అతను నా సోషల్ మీడియా ఖాతాలతో పాటు.. నా ఫోన్లను కూడా హ్యాక్ చేయడం ప్రారంభించాడు. తర్వాత అది నేను గ్రహించాను. చివరకు తన పెళ్లి కూడా ఒక బూటకం. అతను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. తన సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలా ఎత్తుగడలు వేశాడు. అవన్నీ తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఇంత నైతికంగా అవినీతికి పాల్పడతారా అని నమ్మలేకపోయాను. వాళ్లు మనుషులు కాదు, రాక్షసులు.. అందుకే వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను'. 'ధర్మానికి ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఆధర్మాన్ని నాశనం చేయడమే. ఇదే శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. కంగనా తెలిపిన ఈ స్టోరీలో డైరెక్ట్‌గా ఎవరి పేరు చెప్పకున్నా పరోక్షంగా రణబీర్ కపూర్, అలియాకు లింక్ అయ్యేలా చెబుతూ వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె అభిమానులు కూడా కామెంట్ల రూపంలో చెబుతున్నారు. -
వీకింగ్స్ సిరీస్ పాత్రల్లో సౌత్, బాలీవుడ్ నటులు.. ఏఐ మాయాజాలం! (ఫొటోలు)
-
ఆ సినిమాలో అన్యాయం.. అందుకే ఇండస్ట్రీని వదిలేశా: ప్రముఖ విలన్
మన దేశంలో వచ్చిన సూపర్‌హీరో సినిమాల్లో 'క్రిష్' ఓ సంచలనం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలొచ్చాయి. నాలుగో దానికోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ సిరీస్ లో నటించిన ప్రముఖ నటుడు సంచలన కామెంట్స్ చేశాడు. ఈ చిత్రం వల్లే తాను ఏకంగా ఇండస్ట్రీకి పరోక్షంగా దూరం కావాల్సి వచ్చిందని అన్నాడు. ఏం జరిగింది? హృతిక్ రోషన్, ప్రీతి జింతా జంటగా నటించిన 'కోయి మిల్ గయా'.. 2003లో థియేటర్లలో విడుదలైంది. కొన్నాళ్లకు తెలుగులోనూ విడుదల చేస్తే ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇందులో నటుడు రజత్ బేడీ విలన్ గా నటించాడు. తన వంతుగా ఆకట్టుకున్నాడు. అయితే ఇతడి పాత్రకు సంబంధించి చాలా సన్నివేశాలు తీశారట. వాటిని ఎడిటింగ్ లో కత్తిరించారట. ఈ విషయాన్ని స్వయంగా రజత్ బేడీనే చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టాడు. ఇదికాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) ఏం చెప్పాడు? 'కోయి మిల్ గయా సినిమాలో నా పాత్ర హీరోహీరోయిన్లకు సమానంగా ఉంటుంది. కానీ ఫైనల్ ఎడిట్ లో నా సీన్స్ అన్నీ తీసేశారు. ప్రీతితో చాలా సన్నివేశాలు ఉంటాయి. వాటన్నింటినీ లేపేశారు. ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. ఇలా జరిగేసరికి చాలా బాధగా అనిపించింది. నా పాత్రకు అస్సలు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో చాలా నిరాశచెందాను' అని రజత్ బేడీ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే నటన వదిలేశా 'అయితే ఇండస్ట్రీని విడిచిపెట్టడానికి 'కోయి మిల్ గయా' సినిమా ఒక్కటే రీజన్ కాదు. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సన్నీ డియోల్ తో కలిసి ఓ మూవీ చేస్తే.. నాకు రెమ్యునరేషన్ చెక్ రూపంలో ఇచ్చారు. అదేమో బౌన్స్ అయింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా స్నేహితులేమో రూ.2000 కోట్ల టర్నోవర్ తో కంపెనీలు నడుపుతుంటే.. ఇక్కడేం చేస్తున్నానా అనిపించింది. పాపులారిటీ వస్తోంది కానీ సంపాదన కూడా ముఖ్యం అనిపించింది' అని రజత్ బేడీ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య) -
జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. మధ్యలో కియారా!
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయింది. మన ప్రేక్షకులైతే అదీ ఇదీ అని తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని మూవీస్ చూసేస్తున్నారు. మన హీరోలు కూడా తెలుగు వరకు మాత్రమే పరిమితమైపోకుండా ఎక్కడ ఛాన్స్ వస్తే ఆ భాషల్లో నటించేస్తున్నారు. అలా తారక్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే న్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. 'ఆర్ఆర్ఆర్'లో నటించి, మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జూ.ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. నవంబరులోపు దీని షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని టాక్. ఇది పూర్తయిన వెంటనే తారక్.. బాలీవుడ్ లో 'వార్ 2'లో నటించబోతున్నాడు. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అని సమాచారం. యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో 'వార్-2' మూవీ ఒకటి. తొలి భాగంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించగా.. సీక్వెల్ లో మాత్రం హృతిక్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో హృతిక్ కు హీరోయిన్ గా కియారా అడ్వాణీని ఎంపిక చేశారని అంటున్నారు. అధికారికంగా చెప్పనప్పటికీ ఇదే నిజమనిపిస్తోంది. మరి ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్ చేయనుందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తోంది. Into the Spy Universe!🎬❤️#KiaraAdvani will reportedly join #HrithikRoshan and #JrNTR in #War2. pic.twitter.com/UfQBs8irjp — Filmfare (@filmfare) June 17, 2023 (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
భారీ స్థాయిలో మరో రామాయణం సీతగా సాయి పల్లవి.. రాముడు ఎవరంటే?
-
అదిరిపోయిన ప్రశాంత్ నీల్ ప్లానింగ్?
-
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
జూ ఎన్ టిఆర్ పై హ్రితిక్ రోషన్ ట్వీట్ కి షైక్ అవుతున్న హాలీవుడ్
-
యుద్ధ భూమిలో కలుద్దాం తారక్.. హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ బర్త్‌డే నేడు(మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాత్రం అందరికంటే కాస్త భిన్నంగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశాడు. (చదవండి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!) త్వరలోనే వీరిద్దరు వార్ 2 చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని హృతిక్ పరోక్షంగా తెలియజేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే తారక్. ఈ ఏడాది మరింత సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం యుద్ధ భూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంతవరకు నీ ప్రతి రోజు సంతోషంగా, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. అంతేకాదు చివర్లో ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ తెలుగు టచ్ కూడా ఇచ్చాడు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఇక వార్ 2 విషయానికొస్తే.. యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace …until we meet 😉 Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻 — Hrithik Roshan (@iHrithik) May 20, 2023 -
మరోసారి విలన్‌గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే..
ఎన్టీఆర్‌లో నెగటివ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపించిన చిత్రం ‘జై లవ కుశ’. ఆ చిత్రంలో ‘జై’ పాత్రలో విలన్‌గా విజృంభించారు ఎన్టీఆర్. పాజిటివ్ షేడ్స్ ఉన్న లవ, కుశలో హీరోయిజం చూపించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్న రోల్లో కనిపించనున్నారని టాక్. అది కూడా హిందీ తెరపై. బాలీవుడ్ యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. (చదవండి: నాన్న చనిపోయాక అప్పు తీర్చలేక ఆస్తులమ్మేశాం: శివ బాలాజీ ) హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, అలాగే ఆయన పాత్ర నెగటివ్‌గా ఎందుకు మారుతుంది? అనేదానికి ఓ బలమైన కారణం ఉండేలా అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో కథానాయికల పాత్రల కోసం దీపికా పదుకోన్, శర్వరీ వాఘ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. (చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్, అప్పటి క్షణాలను తలుచుకుంటూ.. ) అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇక ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
వార్ కి టైమ్ అవుతుంది..
-
ఇది అన్యాయం.. అప్పుడు చరణ్ తో, ఇప్పుడు హృతిక్ తో
-
ప్రభాస్ నో చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్!.. ఏకంగా వంద కోట్లు
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా విజయంతో మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక హీరోగానే కాకుండా యంగ్ టైగర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఇదివరకే జై లవకుశ సినిమాలో చూపించాడు. ఆ సినిమాలో నెగిటివ్ రోల్లో దుమ్ముదులిపాడు తారక్. ఇప్పుడు మరో స్టార్ హీరోతో తలపడితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ -2లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే వార్-2కి విలన్‌గా ఎన్టీఆర్ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయట. అందులో మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దగ్గరకి ఆఫర్ వెళ్లిందట. అయితే ఇప్పటికే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ సున్నితంగా నో చెప్పాడట. అంతేకాకుండా మల్టీస్టారర్ కూడా అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. ఇక ఎన్టీఆర్‌కు ముందు విజయ్ దేవరకొండను ఈ ప్రాజెక్టులో తీసుకోవాలని మొదట భావించారట. కానీ లైగర్ సినిమా రిజల్ట్ తర్వాత అంచనాల తలకిందులయ్యాయి. దీంతో విజయ్ స్థానంలో ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే..ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రూ. 45కోట్ల పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్ వార్-2 కోసం రూ. 100కోట్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. -
ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్
నేల మీద సాగే కథలను మనం వెండితెరపై చాలానే చూశాం.. చూస్తున్నాం. నింగి నేపథ్యంలో సాగే కథలు అరుదుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్లో కొన్ని సినిమాల కథలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ♦ బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్’, ‘బేబీ’ వంటి సినిమాల్లో విమానంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న ‘స్కై ఫోర్స్’లో అక్షయ్ కుమార్ పైలట్‌గా నటించనున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా దినేష్ విజన్ నిర్మాతగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాతో సందీప్ కెల్వానీ, అభిషేక్ కపూర్లు దర్శకులుగా పరిచయం కానున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అలాగే ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సూర్య హీరోగా నటించిన చిత్రం ‘శూరరై పో ట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని ఎయిర్‌ఫోర్స్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న సూర్య, ఇందులో ఓ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ♦ ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి హిట్ ఫిల్మ్స్ తర్వాత బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొం దుతున్న సినిమా ‘ఫైటర్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ క΄ాడియా, అనిల్ కపూర్ కీ రోల్స్ చేస్తున్నారు. దాదాపు యాభై శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ జెట్ పైలట్‌గా నటిస్తున్నారని సమాచారం. జ్యోతీ దేశ్΄ాండే, అజిత్ అంధరే, మమతా ఆనంద్, రామన్, అంకు ΄ాండే, సిద్ధార్థ్ ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 25న విడుదల కానుంది. ♦ పూర్తిగా ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొం దుతున్న సినిమా ‘ది క్రూ’. ఎయిర్‌లైన్ సెక్టార్లో ఉద్యోగాలు చేసే ముగ్గురు మహిళల జీవితాల ఆధారంగా రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. కాగా ఏక్తా కపూర్, రేఖా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘‘ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో పని చేసే ముగ్గురు మహిళలు ఊహించని ఘటనలు జరిగినప్పుడు ఎలా రియాక్టయ్యారు? అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ♦ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా ముంబైకి వెళ్తున్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో హీరోయిన్ మానుషీ చిల్లర్ తెలుగుకి వస్తున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పైలట్‌గా కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్ ఇంటర్ నేషనల్ప్రొడక్షన్స్ సహకారంతో నందకుమార్ అబ్బినేని, సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ఇవే కాదు... మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొం దుతున్నాయి. -
వార్-2లో జూనియర్ ఎన్టీఆర్.. ఎంట్రీతోనే రికార్డ్ రెమ్యునరేషన్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంతో యంగ్ టైగర్ గ్లోబర్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. దీంతో ఎన్టీఆర్ రాబోయే చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. అలాగే బాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ -2లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమాపై అటూ బి-టౌన్‌లోనూ.. ఇటూ టాలీవుడ్‌లోనూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వార్- 2కు తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.40 నుంచి రూ.50 వరకు కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్ వార్- 2 కోసం ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోలు రూ.100 కోట్ల క్లబ్లో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్ కుమార్ లాంటి హీరోలు ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్లకు పైగానే ఫీజు వసూలు చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం వార్- 2 మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. -
కొత్తగా 3 కోట్ల యూజర్లు లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ ఈ ఏడాది కొత్తగా దాదాపు 3 కోట్ల మంది యూజర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 9 కోట్లుగా ఉందని, దీన్ని సుమారు 12 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఐటెల్ మాతృసంస్థ ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజిత్ తాలపత్ర తెలిపారు. తాజాగా అధిక సామర్థ్యాలు గల ఎ60, పీ40 స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టడం, బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ను నియమించుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యాపార విస్తరణ క్రమంలో టీవీలు, ట్యాబ్లెట్లు వంటి విభాగాల్లోకి కూడా ప్రవేశించినట్లు వివరించారు. 5జీ సేవల విస్తరణ నేపథ్యంలో తాము కూడా ఈ ఏడాది మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అరిజిత్ చెప్పారు. దీని ధర రూ. 10 వేల లోపే ఉంటుందని పేర్కొన్నారు. మేడిన్ ఇండియాపై మరింతగా దృష్టి.: ఫీచర్ ఫోన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించడంపైనా.. దేశీయంగా తయారీపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నామని అరిజిత్ చెప్పారు. దేశీయంగానే లభ్యమయ్యే పరికరాలు, విడిభాగాలను కొనుగోలు చేయడాన్ని పెంచుకుంటున్నట్లు వివరించారు. నోయిడాలో తమకు మూడు తయారీ ప్లాంట్లు ఉన్నాయని, వీటిలో దాదాపు 4,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అరిజిత్ చెప్పారు. కోవిడ్‌పరమైన సవాళ్ల కారణంగా కొంతకాలం సెమీకండక్టర్ల కొరత నెలకొన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం రూ. 10 వేల లోపు ఫోన్ల సెగ్మెంట్లో తమకు 25 శాతం పైగా మార్కెట్ వాటా ఉందన్నారు. మొత్తం స్మార్ట్ఫోన్లకు సంబంధించి రూ. 8 వేల లోపు విభాగంలో తాము 12% వాటా దక్కించుకున్నామని అరిజిత్ చెప్పారు. తమ ఆదాయాల్లో దక్షిణాది మార్కెట్ వాటా 20% ఉంటుందని ఆయన చెప్పారు. ట్రాన్షన్ సంస్థ ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో బ్రాండ్ల పేరిట మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. -
Jr NTR - Hrithik Roshan: హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ యుద్ధం.. ఇది కదా అసలైన మల్టీస్టారర్!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్‌గా మారారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలిద్దరు తమ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. రామ్ చరణ్ ఆర్సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉంటే.. తారక్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ‘NTR30’ ప్రారంభించారు. రీసెంట్గా సెట్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇలా వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్న తారక్.. ఇప్పుడు పెద్ద యుద్దమే ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్’ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘వార్’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అప్పుడే ఈ సినిమా సీక్వెల్‌ని రూపొందిస్తామని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ ప్రకటించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ 2కి స్టేజి ఇప్పుడు సెట్ అయ్యింది. అయితే ‘వార్’ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే... ‘వార్ 2’కు మాత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది. వార్ 2’ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు నిన్న వార్తలు వినిపంచాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ కాంబో ఖరారై చాలా రోజులే అయినట్టుంది. ‘బ్రహ్మాస్త్ర’ విడుదల సమయంలో ఆ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అప్పటికే వార్ 2లో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. IT’S OFFICIAL… HRITHIK - JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7 — taran adarsh (@taran_adarsh) April 5, 2023 -
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
ఆ హీరో అంటే క్రష్.. పెళ్లి రోజు నా గుండె పగిలింది: మీనా
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణించింది. కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. పెళ్లికి ముందు తనకు ఓ బాలీవుడ్ హీరో అంటే క్రష్ ఉండేదని, అలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. మీనా మనసు పడ్డ హీరో ఎవరో కాదు... బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్‌పై తనకు ఉన్న ప్రేమ గురించి చెబుతూ.. ‘హృతిక్ రోషన్‌ను చాలా ప్రేమించాను. నాకు హృతిక్ లాంటి అబ్బాయి కావాలి అని పెళ్లి ప్రపోజ్ చేస్తున్న మా అమ్మతో చెప్పాను. హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అని మీనా చెప్పుకొచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్వరలోనే సెట్స్‌పైకి హృతిక్‌రోషన్ వార్-2
హీరో హృతిక్ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ (2014), ‘వార్’ (2019) చిత్రాలు సూపర్‌హిట్టయ్యాయి. ప్రస్తుతం వీరి కాంబినేషన్లోనే ‘ఫైటర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘వార్ 2’ ప్రస్తావన బాలీవుడ్లో మరోసారి తెరపైకి వచ్చింది. ‘వార్’ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా ‘వార్ 2’ ని వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారట. దీంతో ‘ఫైటర్’ తర్వాత హృతిక్ రోషన్ చేయబోయేది ‘వార్ 2’ అని, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ‘క్రిష్ 4’పై హృతిక్ ఫోకస్ పెడతారని బాలీవుడ్ టాక్. అయితే ‘వార్’ ని తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనే ‘వార్ 2’ వస్తుందా? రాదా? అనే విషయంపై త్వరలో ఓ స్పష్టత రానుందని బాలీవుడ్లో వినికిడి. -
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్రభాస్- హృతిక్ రోషన్ కాంబో
బాలీవుడ్లో ‘బ్యాంగ్ బ్యాంగ్’(2014), ‘వార్’ (2019), ‘పఠాన్’(2023) వంటి సూపర్ హిట్స్ సాధించారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మల్టీ స్టారర్‌గా ఈ మూవీ రూపొందనుందని, ఇందులో ప్రభాస్, టైగర్ ష్రాఫ్‌లు కలిసి నటిస్తారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో 2019లో ‘వార్’ సినిమా వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్ కూడా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ లతో పాటుగా ‘రాజాడీలక్స్’(ప్రకటన రావాల్సి ఉంది) సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో పాటు హృతిక్ రోషన్–సిద్ధార్థ్ ఆనంద్‌ల ప్రస్తుత కమిట్మెంట్ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే వీరి ముగ్గురి కాంబినేషన్ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశాలుఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం అంతఇంతా కాదు. రీసెంట్ ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ, డైరెక్టర్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిల పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్లో నిలవడంతో జక్కన్న కొద్ది రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మీడియాతో ముచ్చటించిన ఆయన గతంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా హృతిక్‌ను కించపరస్తూ చేసిన కామెంట్స్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..? దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ‘‘ఇది జరిగి చాలా కాలం అవుతుంది. దాదాపు 15-16 ఏళ్లు గడిచింది. అప్పుడు నేను చేసిన కామెంట్స్ ఇప్పుడేందుకు బయటకు వచ్చాయో తెలియదు. అది బిల్లా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో అన్నాను. ఆ ఈవెంట్‌కు నేను గెస్ట్‌గా వెళ్లాను. ‘ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్’ అన్నాను. అలా అనడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదు. కానీ హృతిక్ రోషన్ కించపరచడం నా ఉద్దేశం కాదు. అతను అంటే నాకు చాలా గౌరవిస్తాను’’ అంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసి చాలా మంది ఆయనను పొగడ్తలతో ముంచెత్తున్నారు. చదవండి: ఈ సంక్రాంతి మాకు కొత్త ఆరంభం: ఉపాసన స్పెషల్ పోస్ట్ ‘తప్పును అంగీకరించడం మీ గొప్పతనం’, మరోసారి మీ వినయాన్ని చూపారు’ అంటూ నెటిజన్లు జక్కన్నపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా అప్పుడు బిల్లా మూవీ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. ‘ధూమ్ 2 మూవీ చూసి.. ఎందుకు బాలీవుడ్‌యే ఇలాంటి క్వాలిటి మూవీస్ తీస్తుందని ఆశ్చర్యపోయాను. ఎందుకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నా. కానీ బిల్లా ట్రైలర్, పోస్టర్స్, పాటలు చూశాక ప్రభాస్ ముందు హృతిక్ రోషర్ నంథింగ్ అనిపించింది. హాలీవుడ్ రేంజ్లో బిల్లా మూవీ తీసిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు ధన్యవాదాలు’ అని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఇప్పుడ అవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఏమున్నాడ్రా బాబూ.. హృతిక్ 8 ప్యాక్ లుక్ వైరల్
హైటూ, వెయిటూ, లుక్స్.. అన్నీ పర్ఫెక్ట్గా ఉండే హీరో హృతిక్ రోషన్. అమ్మాయిల గుండెల్లో నిద్రపోయే ఈ అందగాడు తాజాగా ఓ ఫోటో షేర్ చేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలోకి మరింత ఫిట్‌గా అడుగు పెడుతూ ఎయిట్ ప్యాక్‌తో దర్శనమిచ్చాడు. ఆల్రైట్.. ఇక ముందుకు వెళ్దాం అంటూ #2023 హ్యాష్‌ట్యాగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. 48 ఏళ్ల వయసులో ఎయిట్ ప్యాక్ బాడీతో కనిపించడమేంటని షాకవుతున్నారు ఫ్యాన్స్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సేమ్ బాడీ.. ఏం మారలేదు. దమ్ముంటే మాలా పొట్ట పెంచు అంటూ వెరైటీగా సవాల్ విసురుతున్నారు. అమ్మాయిలైతే.. ఏమున్నాడ్రా బాబూ అంటూ ఫోటోలు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పటినుంచి మేము కూడా డైట్ పాటిస్తామని కొందరంటుంటే అయినా మీ డెడికేషన్ మాకు సాధ్యం కాదులేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Alright. Let’s go. #2023 pic.twitter.com/gM62h8r5l1 — Hrithik Roshan (@iHrithik) January 2, 2023 చదవండి: నటి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెల రోజులకే దుకాణం బంద్ చేసిన కిరాక్ ఆర్పీ -
హృతిక్ రోషన్ రూ.100 కోట్ల భారీ ఖర్చు.. లవర్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ స్టార్ రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. కొంత కాలంగా అతని స్నేహితురాలు, సింగర్ సబా ఆజాద్‌తో రిలేషన్ కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆ మూడు అంతస్తుల భవనాల్లోకి మారునున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. (చదవంండి: హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్) హృతిక్ రోషన్ 2014లో తన సతీమణి సుజేన్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సబా ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ జంట ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముంబైలో డిన్నర్ డేట్ తర్వాత మొదటిసారి కనిపించిన ఈ జంట.. అప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. రోషన్ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్లో సబా పాల్గొనటం, పార్టీల్లో ఇద్దరు చేతులు పట్టుకుని కనిపించడంతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. హృతిక్ చివరిసారిగా ఇటీవల విడుదలైన విక్రమ్ వేదలో కనిపించారు. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విక్రమ్ వేద బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్, యోగితా బిహానీ, షరీబ్ హష్మీలతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. మరోవైపు సబా తదుపరి చిత్రంలో నమిత్ దాస్, గీతాంజలి కులకర్ణితో కలిసి నటించనుంది. ఈ సినిమాలో ఆమె ఫ్రెంచ్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం సాంగ్ ఆఫ్ ప్యారడైజ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. -
వాయిదాపడిన దీపికా, హృతిక్ రోషన్ల 'వార్'
‘వార్’ (2019) సినిమా తర్వాత హీరో హృతిక్‌రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘ఫైటర్’. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హృతిక్, దీపిక ఎయిర్‌ఫోర్స్ పైలెట్స్‌గా కనిపిస్తారు. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ మరోమారు మారింది. తాజాగా ‘ఫైటర్’ సినిమాను జనవరి 25, 2024న రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు మేకర్స్. తొలుత ‘ఫైటర్’ సినిమాను 2023 జనవరిలో, ఆ తర్వాత సెప్టెంబరులో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఆ హీరోతో కలిసి పని చేస్తే ఖతమన్నారు: సైఫ్ అలీ ఖాన్
సుమారు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి నటించాడు సైఫ్ అలీ ఖాన్. వీరిద్దరూ కలిసి నటించిన విక్రమ్ వేద ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే! ఇందులో పోలీస్ విక్రమ్‌గా సైఫ్, గ్యాంగ్‌స్టర్ వేదగా హృతిక్ నటించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హృతిక్‌తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. అతడితో కలిసి బాగా నటించాలనుకున్నా. సాధారణంగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను ఎవ్వరినీ పట్టించుకోను. కానీ ఈ హీరో ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా అందరి దృష్టి అతడివైపే మళ్లేది. దీంతో అతడితో పని చేస్తే మీ పని ఖతమే, మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి అతడితో కలిసి నటించకపోతే మంచిదంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. వాటిని నేను గౌరవిస్తాను. అతడితో కలిసి నటించడం గొప్ప విజయంగా భావిస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన తమిళ చిత్రం విక్రమ్ వేదకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజైంది. చదవండి: ఆస్పత్రిలో ఖుష్బూ, ఏమైందంటే? ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపి బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
ఇద్దరి చెడ్డవారి కథే ‘విక్రమ్ వేద’.. ట్రైలర్ అదుర్స్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: వింత జీవులతో సైనికుల పోరాటం.. ‘కెప్టెన్’ ఎలా ఉందంటే?) ‘ప్రతి కథలో మంచీ, చెడూ ఉంటాయి. కానీ ఇది ఇద్దరి చెడ్డవారి కథ’అంటూ ప్రారంభమమయ్యే ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించగా.. సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ రీమేక్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. -
అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్
హీరోలు అంటే పడిచస్తుంటారు కొంతమంది జనాలు. వారు కనిపించినా, ఒక్క సెల్ఫీ దిగినా చాలని సంబరపడిపోతుంటారు. కొన్నిసార్లైతే స్టేజీపై హీరో కనిపించగానే వెంటనే సెక్యురిటీ సిబ్బందిని దాటి మరీ స్టేజీ ఎక్కి వారి మీద పడిపోతుంటారు. హీరోల పాదాలు తాకి జన్మ ధన్యమైపోయినట్లే ఫీలవుతారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు మనం చాలానే చూశాం. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఓ స్టార్ హీరో అందరూ చూస్తుండగానే తన అభిమాని పాదాలకు నమస్కరించాడు. శనివారం నాడు జరిగిన ఓ ఫిట్నెస్ ఈవెంట్లో హృతిక్ రోషన్ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చి హీరో కాళ్లు మొక్కాడు. దానికి ప్రతిచర్యగా హృతిక్ కూడా అభిమాని పాదాలకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు నువ్వు ఎంత గొప్పవాడివి హృతిక్ అంటూ అతడి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా హృతిక్ ప్రస్తుతం విక్రమ్ వేద సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: మోహన్‌లాల్ కొడుకుగా టాలీవుడ్ హీరో! 'మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను' -
హృతిక్.. కంగనా ప్రైవేట్ ఫొటోలు చూపించాడు
బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదకు రీమేక్ ఇది. మాతృకను తెరకెక్కించిన గాయత్రి, పుష్కర్ హిందీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 24న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. బాలీవుడ్ హీరోహీరోయిన్లు, వారి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎక్కడలేని విషాన్ని కక్కే కమల్ రషీద్ ఖాన్ అనే రివ్యూయర్ ఈ ట్రైలర్ ఎలా ఉందో చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే కేఆర్కే.. ఈ సినిమా గురించే కాకుండా అతడి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడాడు. 'హృతిక్.. నీకు, కంగనాకు మధ్య ఏం జరిగిందో నాకు పూసగుచ్చినట్లు చెప్పావుకదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పైగా నీ ల్యాప్‌ట్యాప్‌లో కొన్ని ప్రైవేట్ ఫొటోలు చూపించావు, అవి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు వాటి గురించి కూడా ఓ వీడియో చేస్తా' అని చెప్పుకొచ్చాడు. కాగా తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే కేఆర్కే.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. It’s my review of #VikramVedhateaser! Watch and share pls. #VikramVedha! ... https://t.co/rD3FEGF4WI via @YouTube — Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022 I challenge #HrithikRoshan! If his film #VikramVedha will become a HIT then I will stop reviewing films. And if #VV will become flop then he will cut his 6th finger.🤪😁 — Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022 చదవండి: నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్ సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్ ఉందని చెప్పలేదు -
వివాదంలో జొమాటో యాడ్.. హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Hrithik Roshan Zomato Ad Get Angers Mahakaleshwar Temple Priests: బాలీవుడ్ హీరోలను చూస్తుంటే జాలి వేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద వివాదమై కూర్చొంటుంది. ఇప్పటికే హిందీ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, దేవుళ్లపై నమ్మకం లేదు, బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్‌తో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', తాప్సీ 'దొబారా' కలెక్షన్లు రాక విలవిల్లాడాయి. విడుదలైన వాటిని పక్కన పెడితే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలను సైతం బాయ్‌కాట్ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చిత్రం 'విక్రమ్-వేద' కూడా ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన పనితో ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. ఇంతకీ హృతిక్ రోషన్ చేసిన పని ఏంటంటే? ప్రముఖ ఫుడ్ డెలీవరి యాప్ జొమాటో యాడ్‌లో నటించడమే. ఇటీవల జొమాటో ఫుడ్ డెలీవరి యాప్ హృతిక్ రోషన్‌తో ఒక యాడ్ షూట్ చేసి బయటకు వదిలింది. ఈ యాడ్‌లో హృతిక్ చెప్పిన డైలాగ్‌లు, చూపించిన పేర్లు వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని సదరు మతస్థులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? ఈ యాడ్‌లో కమాండో అయిన ఆకలి వేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. మిగతా కమాండోలు 'ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?' అని అడగ్గా.. 'నేనే. నాకు ఆకలి వేసింది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్ నుంచి తాలీ ఆర్డర్ చేశా' అని హృతిక్ రోషన్ అందరికీ చెబుతున్నట్లు ఉంటుంది. ఈ సంభాషణపై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆలయం నుంచి భక్తులకు, యాత్రికులకు తాలీ అనే పేరుతో ప్రసాదాన్ని అందిస్తారు. అయితే అందులో మహాకాళేశ్వరం ఆలయాన్ని కాకుండా మహాకాల్ రెస్టారెంట్‌ను చూపించలేదు. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం మహాకాల్ అనేది పరమ శివునికి మరో పేరు. హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలా ఎంతో పవిత్రంగా భావించే తాలీ ప్రసాదాన్ని ఫుడ్‌గా, అలాగే మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్‌గా పేర్కొని పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించడం పట్ల ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు 'బాయ్‌కాట్ జొమాటో' అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్‌పై అసహనం వ్యక్తం చేశారు. వారికి (బాలీవుడ్ వాళ్లకు) సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్ చేశారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు ఈ గొడవపై జొమాటో తాజాగా స్పందించింది. 'ఇదంతా లోకల్ రెస్టారెంట్లను ప్రమోట్ చేసే పాన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగం. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాల్ రెస్టారెంట్ నుంచి తరచూ అత్యధిక ఆర్డర్లు వస్తాయి. అలాగే అక్కడి మెనూలో తాలీ పేరుతో ఫుడ్ ఐటమ్ కూడా ఉంది. ఆ ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు' అని ట్విటర్ హ్యాండిల్లో పేర్కొంది జొమాటో. ఇదంతా చూస్తుంటే పాపం హృతిక్ రోషన్ అనిపిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సినిమాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ Logically looking at the biased history of @deepigoyal's @zomato, none can negate that @iHrithik's ad trivializing Bhagwan #Mahakal was a deliberate attempt to demean Hindu Dharma thereby hurting Hindus' sentiments. O Hindus, its high time to resort to financially #BoycottZomato pic.twitter.com/BgbATbiKcZ — Sanatan Prabhat (@SanatanPrabhat) August 21, 2022 -
ప్రభాస్ ‘సలార్’-‘హృతిక్’ ఫైటర్ ఢీకొట్టనున్నాయా?!
దక్షిణాది ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అందరి అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ ఆగస్ట్ 14న చిత్రం బృందం ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించాడు ప్రభాస్. ఈ పోస్టర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ భారీ చిత్రం ఫైటర్‌ను కూడా అదే రోజున విడుదల చేస్తామని సలార్ మూవీ కంటే ముందే ప్రకటించారు. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండియన్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హృతిక్ జోడిగా దీపికా పదుకొనె నటించనుండగా.. అగ్ర నటుడు అనిల్ కపూర్ కీ రోల్ పోషించనున్నాడు. అంతేకాదు ప్రముఖ హాలీవుడ్ యాక్టర్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రెండు భారీ యాక్షన్ చిత్రాలు ఒకే రోజున బాక్సాఫీసు వద్ద తలపడితే? ఎలా అని అందరిలో ఆసక్తినెలకొంది. దీంతో ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనదని, భారతీయ సైనిక వీరత్వాన్ని చాటిచెప్పే విధంగా అంత్యంత ప్రతిష్టాత్మగా ఫైటర్‌ను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తానని డైరెక్టర్ సిద్ధార్థ్ చెప్పాడు. చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార అంతేకాదు ఈ సినిమాను సెప్టెంబర్ నెలాఖరున రిలీజ్ చేస్తానని చెప్పడం, ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ అప్పుడే ఉండటంతో ఈ రెండు చిత్రాలు ఒకవేళ ఢీ కొంటే? దేని ఫలితం ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సలార్ బడ్జెట్ రూ. 200 కోట్లు కాగా.. ఫైటర్‌ను రూ. 250 కోట్లు. ఫైటర్ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. అయితే ఇప్పటికీ ఈ మూవీ సంబంధించిన ఎలాంటి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయకపోవడం గమనార్హం. ఇప్పటికి ఇంకా సెట్స్‌పైకి రానీ ఫైటర్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు తలపడితే ఏది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది.. మరి డార్లింగ్ కోసం హృతిక్ వెనక్కి తగ్గుతాడా? లేదా చూడాలి. -
బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ, మరో స్టార్ హీరోపై విరుచుకుపాటు
ప్రస్తుతం బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ అట్టుకుంది. నిన్న మొన్నటి వరకు మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో విసృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో అశాంతి ఉందంటూ గతంలో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు, పలు సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. దీంతో ఆయన లేటెస్ట్ మూవీ లాల్సింగ్చద్ధాను బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. చదవండి: సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు దీంతో తనని క్షమించాలని, తన చిత్రం చూడాల్సిందిగా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు ఆమిర్. అయినప్పటికి లాల్‌సింగ్ చద్ధా చూసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఆమిర్‌కు మరో స్టార్ హీరో మద్దతు ఇవ్వడంతో ఆయన సినిమాను సైతం బాయ్‌కాట్ చేయాలంటే ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ‘గ్రీకువీరుడు’ హృతిక్‌రోషన్. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న హృతిక్ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఆమిర్‌కు సపోర్ట్ చేశాడు. ‘ఇప్పుడే లాల్ సింగ్ చద్ధా చూశా. Just watched LAAL SINGH CHADDA. I felt the HEART of this movie. Pluses and minuses aside, this movie is just magnificent. Don’t miss this gem guys ! Go ! Go now . Watch it. It’s beautiful. Just beautiful. ❤️ — Hrithik Roshan (@iHrithik) August 13, 2022 ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని అస్సలు మిస్ చేయకండి, ఇప్పుడే వెళ్లి సినిమా చూడండి’ అని ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుపడుతున్నారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని అప్పుడేందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదంటూ హృతిక్‌పై మండిపడుతున్నారు. అంతేకాదు ఆయన తదుపరి చిత్రం విక్రమ్ వేదను బహిష్కరించాలంటూ హృతిక్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘బాయ్కాట్విక్రమ్వేద’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: చాలా కష్టాలు పడ్డా.. జీవితం చాలా పాఠాలు నేర్పింది: హీరోయిన్ #TheKashmirFiles support would have been #Secular but #LalSinghChadha is a Gem ? How many such Yum Cee in #Bollywood who lick the boots of Ant! Nat!0n@ls ?? https://t.co/sIZaa2cSPf — JP 🇮🇳 (@JPulasaria) August 13, 2022 Where were you at the time of the Kashmir Files release? Underground?#BoycottLalSinghChaddha #BoycottLaalSinghChaddha #BoycottVikramVedha https://t.co/1Hoxus9S8R — Ronak Patel (@ronakom) August 14, 2022 Did you watch #KashmirFiles ? You and your ex wife are spreading dirt of dirty marital affairs on media stop this non sense 1st our kids are getting wrongly affected u #BollywoodDirt https://t.co/Xq2WoDlETV — MAHENDRA JAIN 🇮🇳 (@mahendra3) August 14, 2022 Gone#BoycottVikramVedha #BoycottVikramVeda U will taste this too in September and that time Aamir Khan will write Guys watch Vikram Vedha It's an amazing movie Bas tum logon ko ab ek dusre ki movie dekh kar Mann behelana hai😂😂 https://t.co/DzVbRG1r4c — RiseOfBurnol🇮🇳 (@RiseofBurnol) August 14, 2022 Kashmir files ke time kaha tha 🧐your heart 🤡 https://t.co/0RcjzIZ0QV — ๑ N⁷๑ ||🇮🇳•••♩♪♬♫ (@THEKOOISH) August 13, 2022 -
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్- సుసానే ఖాన్లు 2014లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ బాలీవుడ్ నటి, సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరుద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సుసానేకు ఇది రెండో వివాహం. వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగనుందని సమాచారం.అయితే వివాహ వేడుక, తేది ఎప్పుడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో అందరికి తెలిసిందే. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,డిన్నర్ డేట్స్‌కు,పార్టీలకూ జంటగానే హాజరయ్యేవారు. అంతేకాకుండా బర్త్‌డే లాంటి స్పెషల్ డేస్‌లోనూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగానే ప్రేమను వ్యక్తపరిచేవారు. అయితే ఇప్పుడీ జంట పెళ్లిపీటలెక్కుతుందని వార్తలు రావడంతో మరి హృతిక్- సబా అజాద్‌లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ప్రియురాలితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హృతిక్ రోషన్
హృతిక్ రోషన్- సబా ఆజాద్.. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా తిరిగేవారు. కానీ వారి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా దరువేసి మరీ చెప్పడంతో ఇప్పుడు నిర్మొహమాటంగా అందరి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పార్టీలకు సైతం కలిసే వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమజంట యూరప్‌లో ఉంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ప్రతిక్షణాన్ని మధుర జ్ఞాపకంగా మలుచుకుంటోంది. తాజాగా హృతిక్‌తో రోడ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న సబా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇందులో వాళ్లిద్దరు కనిపించకపోయినప్పటికీ హృతిక్ వేలికి ఉన్న రింగు మాత్రం కనిపించింది. బహుశా అతడే కారును డ్రైవ్ చేస్తున్నట్లున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. 'మీ సంతోషకరమైన క్షణాలను మాతో పంచుకుంటున్న చాలా థ్యాంక్స్. మీ ఇద్దరినీ ఇలా చూస్తుండటం బాగుంది. ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి', 'త్వరలోనే పెళ్లి చేసేసుకోండి' అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) చదవండి: తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి పక్కనోడి లైఫ్ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్ కౌంటర్ -
అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే
దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరోలదరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాలతో ఆమె కెరీర్లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటించే అవకాశం అందుకుంటుంది. చదవండి: బిగ్‌బాస్ 6లోకి వడ్డే నవీన్.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్! ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ ‘కభీ ఈథ్ కభీ దివాలీ’ సర్కస్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పూజా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కెరీర్లో సక్సెస్, ఫెల్యూయిర్స్పై స్పందించింది. ‘తెలుగులో నేను నటించిన 6 సినిమాలు వరుసగా హిట్ అవ్వడం నా కెరీర్ అది బిగ్గెస్ట్ సక్సెస్. ఇక లోయేస్ట్ పాయింట్ వచ్చేసి నా డెబ్యూ(మొహంజోదారో) చిత్రమే బాక్సాఫీసు వద్ద పరాజయం పొందడం. నా కెరీర్లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. నా లీస్ట్ చిత్రాల్లో అది ఒక్కటే. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు. చదవండి: క్రేజీ రూమర్.. ఆ దర్శకుడితో మహేశ్ బాబు 30వ సినిమా! ఈ సినిమా ఫ్లాప్‌తో నాకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. ఈ క్రమంలో తెలుగు చిత్రం అలా వైకుంఠపురంలో నాకు బ్రేక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా నా కెరీర్‌ను అద్భుతంగా మార్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా పూజా బాలీవుడ్ మూవీ మొహంజోదారోతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో పూజా జతకట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో పూజా జనగనమణ మూవీతో పాటు పలు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది. -
హృతిక్ చేతికి ఆరో వేలు..సర్జరీకీ ససేమిరా, కారణం ఇదేనట!
వినోద రంగంలో సెంటిమెంట్లు, జాతకాలు, గుడ్డి నమ్మకాలకు విలువెక్కువ. ప్రతిభ కన్నా అదృష్టానికి గౌరవం ఎక్కువ. అందుకే ఆ ప్రభావం ప్రొడ్యూసర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీస్.. వాళ్ల నమ్మకాలను పట్టుకొచ్చాం ఈ శీర్షిక కోసం.. అసౌకర్యం కాదు అదృష్టం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఆరువేళ్ల అందగాడు హృతిక్ రోషన్ ఒక చేతికున్న ఆ ఆరోవేలుతో చాలా అసౌకర్యంగా ఉన్నా.. భరిస్తూ ఉంటాడు. ‘అంత భరించాల్సిన అవసరం లేదు భై.. సర్జరీతో సిక్త్ ఫింగర్‌ను తీసేయొచ్చు..’ అని డాక్టర్లు సూచించినా.. ససేమిరా అన్నాడట ఆ హీరో. కారణం.. అతనింట్లో పెద్దవాళ్లు ‘ఆ ఆరోవేలే నీ అదృష్టం’ అని సెలవిచ్చారట. సో.. అదలా కంటిన్యూ అవుతోందన్నమాట. అతని చేతికి ఆ ఆరోవేలు కనిపించినంత కాలం ఆ అంధవిశ్వాసాన్ని ఆ హీరో ఫాలో అవుతున్నట్టే అని అభిమానులు ఫిక్స్ అయ్యారట కూడా. ‘కె’ క్వీన్ టెలివిజన్ డ్రామా క్వీన్.. ఏక్తా కపూర్ విజయ రహస్యమేంటనుకుంటున్నారూ.. సాస్, బహూ సీరియల్స్ అనా? కాదు.. కానే కాదు.. ‘కె’ వర్డ్ .. సీక్రెట్ ఆఫ్ హర్ సక్సెస్. ఒక్కసారి ఆ సీరియల్స్‌ను గుర్తు తెచ్చుకోండి.. క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, కుమ్కుమ్ భాగ్య, కుండలి భాగ్య, కసౌటీ జిందగీ కే, కసమ్, కసమ్ సే, కలశ్ ఏక్ విశ్వాస్, కవచ్, కస్తూరీ ఎట్సెట్రా.. అన్నీ ఇంగ్లిష్ ‘కె’ వర్డ్ లేదా హిందీ ‘క’ పదంతో మొదలైనవే. ఒకవేళ తొలి అక్షరం ‘కె’ తో స్టార్ట్ అవకపోయినా సీరియల్ టైటిల్లో ఎక్కడైనా ‘కె’ ఉండేట్టు చూసుకుంటుందట ఏక్తా. ‘నా పర్యవేక్షణలో ఉండే సీరియల్స్ టైటిల్స్ విషయంలో నాకు ఈ కె సెంట్మెంట్ ఉన్న మాట నిజమే. అయితే చాలా మంది దాన్ని మూఢ నమ్మకం అంటారు. కానీ నాకైతే అది ఒక నమ్మకం. ఎవరేమనుకున్నా నేనేం ఫీలవను’ అంటుంది ఏక్తా కపూర్. అవుటాఫ్ కంట్రీ..| హీరో అక్షయ్ కుమార్‌కు.. ప్రాక్టికల్ మ్యాన్ అని కితాబు బాలీవుడ్లో. కానీ తన సినిమా విడుదల సమయం ఆసన్నమయ్యే సరికి సెంటిమెంటల్ ఫూల్‌లా వ్యవహరిస్తాడనీ కామెంట్.. అదే ఇండస్ట్రీలో. తన సినిమా రిలీజ్ అప్పుడు తాను ఇండియాలో ఉంటే బాక్సాఫీస్ బద్దలు కొట్టదని భయమట అతనికి. అందుకే రిలీజ్ డేట్ డిసైడ్ కాగానే విదేశానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలా సినిమా రిలీజ్‌కు తను దేశంలో లేనప్పుడల్లా ఆ సినిమా కమర్షియల్‌గా సూపర్ డూపర్ హిట్ అవడం.. ఇక్కడే ఉంటే ఫట్ అవడం.. అతనిలో ఆ సెంట్మెంట్ బలపడ్డానికి కారణమట. హే..వి..టో!! సిల్లీ... శిల్పా శెట్టి నటే కాదు ఐపీఎల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా. నటిగా క్షణం తీరికలేని షెడ్యూల్స్‌ను హ్యాండిల్ చేసినప్పుడు ఆమెకు ఎలాంటి నమ్మకాలుండేవో కానీ రాజస్థాన్ రాయల్స్‌కు యజమాని అయింతర్వాత మాత్రం సిల్లీ (అని ఆమే అంటుంది) సెంటిమెంట్లను ఫాలో అవుతోందట. అవేంటో ఆమె మాటల్లోనే విందాం.. ‘ ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లేప్పుడు మరచిపోయి రెండు వాచ్‌లు పెట్టుకెళ్లాను. అప్పుడు మా జట్టే గెలిచింది. ఇంకోసారి మా జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చోని.. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌కి రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను.. అప్పుడూ మా టీమే గెలిచింది. తర్వాత ఒకట్రెండు మ్యాచ్‌లకూ అలాగే రెండ్ వాచ్‌లు పెట్టుకెళ్లడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం.. ఆ మ్యాచ్‌లూ గెలవడంతో ఆ అలవాట్లను సెంటిమెంట్లుగా మార్చేసుకున్నాను. సిల్లీనే.. కానీ సెంట్మెంట్ ఈజ్ సెంట్మెంట్ కదా..’ అంటూ కనుబొమలు ఎగరేస్తూ .. పళ్లు కనపడకుండా నవ్వుతుంది శిల్పా శెట్టి. -
మాజీ భర్త హృతిక్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్‌పై సుసానే ఆసక్తికర కామెంట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విడాకుల అనంతరం యంగ్ నటి సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ హృతిక్, సబా ఈ రూమర్లపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం, డిన్నర్ డేట్స్‌కు, జంటగా పార్టీలకు హజరవుతున్నారు. దీంతో ఈ వార్తలు నిజమే అంటూ బి-టౌన్లో గుసగులాడుకుంటున్నారు. మరోపక్క హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ కూడా మరో నటుడితో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి తరచూ ఆమె, నటుడు అర్స్లాన్ గోనితో చట్టాపట్టాలేసుకుని ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు ఈ మాజీ కపుల్స్ తమ కొత్త పార్ట్‌నర్స్‌తో ఒకే పార్టీలో సందడి చేస్తున్నారు. వారి తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన మాజీ భర్త రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌ను సుసానే నిక్ నేమ్‌తో పిలిచి అందరికి షాకిచ్చింది. ఇటీవల సబా ఆజాద్ షేర్ చేసిన ఓ పోస్ట్‌పై సుసానే కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సబా మిర్రర్ ముందు హోయలు పోతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చదవండి: ట్రోలర్స్‌కు షాకిచ్చిన ప్రభాస్, స్టైలిష్ లుక్‌లో ‘డార్లింగ్’ ‘దీనికి సరిపోయే స్మార్ట్ క్యాప్షన్ ఏంటో రావడం లేదు’ అంటూ పంచుకుంది. ఇక ఈ పోస్ట్‌పై సుసానే స్పందిస్తూ ‘వావ్ సబూ.. హాట్‌గా ఉన్నావ్’ అంటూ కామెంట్ చేసింది. తన మాజీ భర్త గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్‌కు ససానే ఈ విధంగా స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె రియాక్షన్ చూసి పలువురు షాకవడమే కాకుండా.. సబాకు నిక్ నేమ్ కూడా పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 50వ బర్త్‌డేకు హృతిక్, సబాతో జంటగా హజరయ్యాడు. ఈ సందర్భంగా సబాను తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
కేజీయఫ్ 3లో హృతిక్ రోషన్!
ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా,యశ్ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నా....వారిద్దరిని మాత్రం కేజీయఫ్ 3 వదలడంలేదు.ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ లేదని తెల్సినా సరే కేజీయఫ్ 3పై రూమర్స్ ఆగడం లేదు.కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడం ఆలస్యం.. చాప్టర్ 3 కి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాకీభాయ్ ఫ్యాన్స్.దాంతో కేజీయఫ్ 3 సోషల్ మీడియాలో కంటిన్యూ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రూమర్స్ కేజీయఫ్3 పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీయఫ్ 2 బాలీవుడ్ స్టార్స్ డామినేషన్ కనిపించింది.రమికా సేన్ పాత్రలో రవీనాటాండన్, అలాగే అధీరా రోల్ ను సంజయ్ దత్ పోషించాడు.వీరిద్దరి కాంబినేషన్, కేజీయఫ్ లో రాకీభాయ్ ఎలివేషన్ ఈ సీక్వెల్ కు నార్త్ లోనే 430 కోట్లను అందించింది.బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన రెండవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీయఫ్2. కేజీయఫ్ సిరీస్ పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు,ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో డైరెక్ట్ గా అక్కడి స్టార్ హీరో హృతిక్ ను రంగంలోకి దింపుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రొడ్యుసర్ విజయ్ కిరంగదూర్ మాత్రం ఈ ఏడాదిలో కేజీయఫ్-3 ఉండదని, ఈ చిత్రంలో హృతిక్ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.'సలార్' సినిమా మేకింగ్‌లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారని.. అటు యష్ కూడా కొత్త ప్రాజెక్ట్‌కు ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తామన్నారు ఈ సంగతి ఇలా ఉంటే,ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం పెంచారని శాండల్ వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా బడ్జెట్ ను 200 కోట్లు అనుకున్నారట. ఇప్పుడు కేజీయఫ్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ,సలార్ లో అంతకు మించి యాక్షన్ ఉండాలని దాదాపు 40 కోట్లు బడ్జెట్ హైక్ చేసాడట డైరెక్టర్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోంది. -
పార్టీ టైమ్: ప్రియురాలితో హృతిక్, ప్రియుడితో హీరో మాజీ భార్య
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ సైతం హాజరయ్యారు. అంతేకాదు మాజీ దంపతులు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి ఫొటోలకు పోజులిస్తూ పార్టీలో సందడి చేశారు. అలాగే మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుశానే ఖాన్ వారి లవర్స్‌తో పార్టీలో తళుక్కుమని మెరిశారు. హృతిక్ ప్రేయసి సబా ఆజాద్‌ను వెంటేసుకుని రాగా, సుశానే తన ప్రియుడు అర్శ్లన్ గోనీతో విందుకు హాజరైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by kaunbolaabollywood (@kaunbolaa_bollywood) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి 👇 బంపరాఫర్, సామాన్యులకు బిగ్‌బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ విడాకుల తర్వాత కలిసి కనిపించిన మాజీ స్టార్ కపుల్ -
అప్పుడు నా గుండె ముక్కలైపోయింది: పూజా హెగ్డే
Pooja Hegde Reveals Her Heart Broken Moment With Hrithik Roshan: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చెర్రీకి సరసన పూజా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది పూజా హెగ్డే. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో 'కోయీ మిల్గయా' ఒకటి. ఈ సినిమా సమయంలో జరిగిన విషయాలను పూజా హెగ్డె చెప్పుకొచ్చింది. 'కోయీ మిల్గయా సినిమా సమయంలో నాకు పన్నెండేళ్లు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షోకు వెళ్లాను. కానీ ఫొటో కోసం ప్రయత్నిస్తుంటే హృతిక్ స్టేజి దిగి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది.' అని తెలిపింది. (చదవండి: పూజా హెగ్డేపై దిల్‌రాజు కామెంట్స్.. షాక్ అయిన ఆడియెన్స్) అయితే సుమారు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా 'మొహంజొదారో' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తున్న సర్కస్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెస్తోపాటు పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే) -
అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ?
కరోనా కల్లోలంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లు మారిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ప్లాట్ఫ్లామ్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌లతో సినిమాలు రూపొందిస్తోంది నెట్‌ఫ్లిక్స్. సినిమాలతోపాటు విభిన్న జోనర్లో వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ దిగ్గజ సంస్థ స్టైలిష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు స్పెషల్ శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం (ఏప్రిల్ 29) ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాకుండా బన్నీతోపాటు మరో ముగ్గురు తారలకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీఫుల్ మాధురి దీక్షిత్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అల్లు అర్జున్, బీటౌన్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌కు స్పెషల్‌గా విష్ చేసింది నెట్‌ఫ్లిక్స్. చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. ఈ విషెస్‌తోపాటు ది ఫేమ్ గేమ్, మేర్సల్, అలా వైకుంఠపురములో, లక్ష్య చిత్రాల్లోని వారి డ్యాన్స్ స్టెప్పుల ఫొటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ చేస్తూ 'ప్రతి ఒక్కరీకీ హ్యాపీ ఇంటర్నేషనల్డ్యాన్స్ డే. కానీ ప్రత్యేకంగా వీరికి..' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ సినిమాలన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే మాధురి దీక్షిత్, విజయ్, బన్నీ, హృతిక్ రోషన్ డ్యాన్స్‌లో తమదైన ప్రత్యేకతను చాటిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ 3 నెలల్లో సుమారు 2 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోయింది. చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. Happy International Dance Day to everyone, but especially to them 💃🕺 pic.twitter.com/zOcVDtQNJZ — Netflix India (@NetflixIndia) April 29, 2022 -
ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు..
Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నెటిజన్స్‌ను అలరిస్తోన్న మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'రాకెట్ బాయ్స్'. సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్.. ప్రఖ్యాత భారతీయ సైంటిస్టులు హోమీ జె. బాబా, విక్రమ్ సారాబాయ్ జీవితాలకు సంబంధించిన కథగా తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను పొగుడ్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు హృతిక్ రోషన్. 'మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొత్తం టీం వర్క్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇండియాలోని మనవాళ్లే ఇది చేశారంటే గర్వంగా ఉంది.' అని రాసుకొచ్చాడు. చదవండి: నా కొడుకు హృతిక్ రోషన్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్ ఈ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్‌లో హృతిక్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ నటించింది. తన నటనను మెచ్చుకుంటూ ప్రశంసించాడు హృతిక్. సబా ఆజాద్ గురించి 'నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు. మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు.' అంటూ కితాబిచ్చాడు ఈ బాలీవుడ్ గ్రీక్ గాడ్. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో సౌత్ బ్యూటీ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4, 2022 నుంచి ప్రసారం అవుతోంది. చదవండి: రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్.. ఆమెతోనే ఏడడుగులు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పెళ్లయిన హీరోలు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం 'లాకప్' అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ షో రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా ఈ షోలో కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 'ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లయిన పురుషుల ఆకర్షణలో పడిపోతున్నారు. ఇది నా వ్యక్తిగత అనుభవం నుంచే చెబుతున్నాను. పెళ్లయి, పిల్లలున్న మగాళ్లు అమ్మాయిలను ఆకట్టుకునేందుకు కట్టుకథలతో రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు, హీరోలు సైతం ఇలాంటి పనులు చేస్తూ అందమైన అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారు. ఇది నా జీవితంలో జరిగిన ఒక పెద్ద కుంభకోణం. వారు చాలా కథలు చెబుతుంటారు. అందువల్ల ఆ పెళ్లయిన వ్యక్తిని అతని భార్య నుంచి రక్షించగలిగేది తామేనని చాలామంది యువతులు భావిస్తారు.కానీ వారి భార్యల వైపు స్టోరీ వింటే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారు అని పేర్కొంది. అయితే కంగనా చేసిన ఈ కామెంట్స్ ఆమె మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌ని ఉద్దేశించినవేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా హృతిక్ యంగ్ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కంగనా చేసిన ఈ కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. -
హాట్‌టాపిక్.. ప్రియురాలితో హృతిక్ రోషన్.. పక్కనే మాజీ భార్య కూడా!
బాలీవుడ్ మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ ఒకే పార్టీలో జంటలుగా సందడి చేసిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. సీనియర్ నటి పూజ బేడీ గోవాలో హోస్ట్ చేసిన ఈ పార్టీకి హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్ హజరయ్యాడు. అలాగే సుసాన్నే ఖాన్ తన రూమార్డ్ బాయ్‌ఫ్రెండ్ అర్స్లాన్ గోనితో పాల్గొంది. దీంతో మరోసారి ఈ మాజీ దంపతులు వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజ బేడీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది. చదవండి: ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు నేనూ పెళ్లి చేసుకోను: బిగ్‌బాస్ బ్యూటీ దీంతో ఈ పొటోలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా మంగళవారం రాత్రి ఈ లవ్‌బర్డ్స్ జంటలుగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోల్లో హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్ చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ కనిపించాడు. అలాగే సుసాన్నే సైతం తన ప్రియుడు అర్స్లాన్ గోని చేతిలో చేయి వేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళుతూ కనిపించింది. దీంతో ఈ మాజీ దంపతులు కొత్త జంటలతో ఒకే పార్టీకి హాజరుకావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. చదవండి: హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా ఈ పార్టీకి వీరితో పాటు ఫరా ఖాన్ అలీ, దర్శకుడు అభిషేక్ కపూర్లతో పాటు తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా షారుక్, సబాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై ఈజంట ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరు మంచి స్నేహితులే అంటూ హృతిక్ సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరోవైపు సుసానే ఖాన్ కొంతాకాలంగా అర్స్లాన్ గోనితో సీక్రెట్ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో ?
Is Hrithik Roshan And Saba Azad Getting Married Soon: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే యంగ్ హీరోయిన్గా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్ లంచ్ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా మరో వార్త బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ అందగాడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014లో పరస్పర అంగీకారంతో సుస్సన్నే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు హృతిక్ రోషన్. తర్వాత బీటౌన్ బ్యూటీ సబా ఆజాద్‌తో హృతిక్‌కు పరిచయం ఏర్పడింది. వరిద్దరూ గత కొంతకాలంగా సన్నిహింతగా ఉన్నట్లు తెలిపే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబాను పరిచయం చేయగా వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందని తెలుస్తోంది. హృతిక్ ఎక్స్ వైఫ్ సుస్సన్నే ఖాన్ సైతం సబాతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. టైం కుదిరినప్పుడల్లా హృతిక్ ఇంటికి వెళ్తోందట సబా. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే వారిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. -
ప్రియురాలిపై హృతిక్ రోషన్ పొగడ్తలు!
బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్, హీరోయిన్, సింగర్ సబా ఆజాద్ డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఇద్దరూ కలిసి డిన్నర్‌కు బయటకు వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో డేటింగ్ నిజమేనంటున్నారు నెటిజన్లు. అంతెందుకు, ఈ మధ్య ఏకంగా హీరో ఇంటికే భోజనానికి వెళ్లింది సబా. ఇదిలా ఉంటే తాజాగా సబాపై పొగడ్తల వర్షం కురిపించాడు హృతిక్. సబా ఆజాద్ తాను పాట పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'అస్వస్థతో ఇంట్లో ఉన్న నాకు పాడటం తప్ప ఇంకేం చేయలేను అనిపించింది. నా చిన్నతనంలో పేరెంట్స్ గూపీ జిన్ బఘ బైన్ అనే సినిమా పాటల క్యాసెట్ టేప్ తెచ్చారు. నాకు బంగ్లా అర్థం కాదు, కానీ సినిమా చూసి చాలా ఆనందించాం. అది నా ఫేవరెట్ క్యాసెట్‌గా మారిపోయింది. నాకు ఆ పాటల్లోని ఒక్క పదానికి కూడా అర్థం తెలియకపోయినా అన్నింటిని నేర్చేసుకున్నాను. అదే సంగీతం గొప్పతనం, సంగీతానికి భాషతో సంబంధం లేదు. కొంతకాలం క్రితం ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్నప్పుడు పాటలు పాడుకున్నాం. నాకింకా అన్ని లిరిక్స్ గుర్తున్నాయని నాకప్పుడే అర్థమైంది. అందులో నాకు చాలా ఇష్టమైన పాటను మీకోసం పాడుతున్నాను. కాస్త ధైర్యం వస్తే మిగతా అన్నింటినీ పాడుతాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై హృతిక్ స్పందిస్తూ నువ్వు అద్భుతమైన వ్యక్తివి అని ప్రశంసించాడు. View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తొలిసారి పోస్ట్ చేసిన హృతిక్ రోషన్
Hrithik Roshan Posts First Time For Rumoured Girl Friend Saba Azad: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే యంగ్ హీరోయిన్గా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్ లంచ్ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. చదవండి: 'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్ తాజాగా హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘కిల్ ఇట్ యూ గాయ్స్’’అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనికి సబా సైతం హృతిక్‌కి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. కాగా సబా, ఇమాద్ జంటగా ఓ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు సపోర్ట్‌గా హృతిక్ పోస్ట్ చేయడంతో వీరి డేటింగ్ రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. చదవండి: రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌పై సుప్రీత ఓపెన్ అప్ -
రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్.. ఆమెతోనే ఏడడుగులు?
బాలీవుడ్ స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ నటి సబా అజాద్‌తో ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ బీ-టౌన్లో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే హృతిక్ ఈ మధ్య సబా ఆజాద్‌తో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కెమెరా కంట పడుతున్నాడు. దీంతో ఈ పుకార్లు నిజమేనేమోనంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు హృతికి ఈ వార్తలను ఖండించలేదు. పైగా ఇటీవల సబాను ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సబా హృతిక్ ఫ్యామిలీతో కలిసి లంచ్ చేసి, సరదాగా వారితో సమయాన్ని గడిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. చదవండి: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ ట్వీట్ దీంతో హృతిక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ప్రస్తుతం హాట్‌టాపిక్ మారింది. త్వరలోనే హృతిక్, సబా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా ఇటీవల ఫర్హాన్ అక్తర్ తన ప్రేయసి శిబానీ దండేకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల, కుటుంబ సభ్యుల మధ్య ఫర్హాన్-శిబానీల వివాహం ప్రైవేట్‌గా జరిగింది. ఈ వేడుకకు హృతిక్ కూడా హజరయ్యాడు. దీంతో ఫర్హాన్ తరహాలోనే తాను కూడా కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నాడట. జీవితంలో ఒక తోడు అవసరమని భావించిన హృతిక్ తొందర్లోనే ప్రేయసి సబాను.. శ్రీమతిగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: మూడో భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్ చేసిన నటుడు నరేష్ మరి ఇందులో ఎంత నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా హృతిక్ తరచూ సబాతో కలిసి డిన్నర్, లంచ్ డేట్లకు వెళ్లడం, కెమెరాలకు కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూస్తుంటే వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది నిజమేనని, త్వరలోనే ఈ వార్తలు నిజకానున్నాయేమో అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్లో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హృతిక్, సుశానే ఖాన్లు 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2014లో ఈ దంపతులు విడిపోయారు. -
ప్రేయసిని ఇంటికి తీసుకెళ్లిన హృతిక్ రోషన్!
Saba Azad: హృతిక్ రోషన్ ప్రేమలో పడ్డాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కుర్ర కథానాయిక సబా ఆజాద్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని బట్టి వారిద్దరూ కచ్చితంగా లవ్‌లో ఉన్నారని అంటున్నారు. ఈ మధ్య తరచూ డిన్నర్, లంచ్ డేట్లకు కలిసి వెళ్లడం, కెమెరాలకు కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడాన్ని చూస్తుంటే వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా హృతిక్ ఫ్యామిలీని కలిసింది సబా. ఈమేరకు హృతిక్ అంకుల్ రాజేశ్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటో వదిలాడు. 'సంతోషం అనేది ఎల్లప్పుడూ మా చుట్టూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆదివారం, అందులోనూ మధ్యాహ్న భోజన సమయంలో!' అని దానికి కాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలో హృతిక్ కుటుంబసభ్యులందరితో పాటు సబా కూడా ఉంది. ఈ పోస్ట్‌పై హృతిక్ స్పందిస్తూ.. 'అవును చాచా, ఇది మాత్రం వాస్తవం. నువ్వైతే భలే నవ్విస్తావ్' అని రిప్లై ఇచ్చాడు. సబా కూడా 'అద్భుతమైన ఆదివారం' అంటూ కామెంట్ వదిలింది. హృతిక్ ఈసారి సబాను ఏ రెస్టారెంట్‌కు తీసుకెళ్లకుండా ఏకంగా ఇంటికే వెంటపెట్టుకు వెళ్లాడన్నమాట అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.+ View this post on Instagram A post shared by Rajesh Roshan (@rajeshroshan24) చదవండి: Saba Azad: అప్పుడు సహజీవనం, ఇప్పుడు హృతిక్‌తో హీరోయిన్ డేటింగ్? -
అతడితో ఏడేళ్ల సహజీవనం, ఇప్పుడు హృతిక్‌తో డేటింగ్?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుర్ర హీరోయిన్ సబా ఆజాద్ డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అసలీ సబా ఎవరని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. సజా ఆజాద్.. 'దిల్ కబడ్డీ', 'ముజే ఫ్రెండ్షిప్ కరోగే', 'రాకెట్ బాయ్స్' చిత్రాల్లో నటించింది. కాగా గతంలో ఆమెకు ఓ లవ్ ట్రాక్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా తనయుడు ఇమాద్‌తో 2013లో ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరూ ఏడేళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ 2020 సంవత్సరంలో ఇమాద్, సబా విడిపోయారు. ఇక ఇటీవల హృతిక్ ఆమె చేయి పట్టుకుని నడవడం చూసి సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మరి వాళ్ల మధ్య లవ్ మొదలైందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించేవరకు ఆగాల్సిందే! -
యంగ్ హీరోయిన్‌తో హృతిక్ సీక్రెట్ డేటింగ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఓ యంగ్ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు నటి సబా ఆజాద్. విరిద్దరు తరచూ కలుసుకోవడం, సన్నిహితంగా మెలగడంతో హృతిక్, సబాలు మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ నడుస్తోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో హృతిక్ ఆమె చేయి పట్టుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. ఈ క్రమంలో హృతిక్, సబాల రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సబా, హృతిక్‌ను జంటగా చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హృతిక్ మళ్లి డేటింగ్లో ఉన్నాడా? అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సుశానేతో విడాకులు అనంతరం హృతిక్ లైఫ్‌లో మూవ్ ఆన్ అయ్యాడని, వీరిద్దరిని ఇలా చూస్తే ఆమె కుళ్లు కోవడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు సబా, హృతిక్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, వారిద్దరు డిన్నర్ డేట్‌కు వెళ్లడం వెనక అసలు కారణం బయటకు వచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హృతిక్, సబాలు కలిశారట. అప్పటి నుంచి వీరిద్దరూ క్లోజ్‌గా ఉంటున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. అంతేకాదు తరచూ వీరిద్దరూ కలుసుకుంటుంటారట. సబా ఓ ఇండి మ్యూజిషియన్ అని, తనకు ఓ బ్యాండ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి పరిచయం తర్వాత హృతిక్ తన మ్యూజిక్‌ను బాగా ఇష్టపడుతున్నాడట. ఈ క్రమంలోనే సబాను తరచూ కలుస్తుంటాడని, అంతేకాదు వీరిద్దరూ కలిసి వర్క్ చేయాలనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వర్క్ గురించి చర్చించేందుకే వారిద్దరు కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సబా 2008లో ‘దిల్ కబడ్డి’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజా ఆమె ‘రాకేట్ బాయ్స్’లో నటించింది. ఇది త్వరలోనే సోని లైవ్‌లో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
బర్త్‌డే పార్టీ, మాజీ భార్యతో హృతిక్ రోషన్ సెల్ఫీ
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఆయన మాజీ భార్య సుశానే ఖాన్‌ను కలిశాడు. అంతేకాదు, ఆమెతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం హృతిక్ రోషన్ సోదరి సునయన బర్త్‌డే జరుపుకుంది. ఈ బర్త్‌డే పార్టీకి హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా బర్త్‌డే గర్ల్‌తో పాటు మాజీ భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. 'కొన్ని బంధాలకు అంతం లేదు, అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. డార్లింగ్ నిక్కూ.. నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ హృతిక్, సునయనలను ట్యాగ్ చేసింది. వారి ముఖంపై కనిపిస్తున్న చిరునవ్వులే వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా హృతిక్, సుశానే ఖాన్లు 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2014లో ఈ దంపతులు విడిపోయారు. -
బాలీవుడ్ హీరోల పారితోషికం.. కోట్లు లేదంటే వాటాలు!
రోజులు మారుతున్నాయి.. కథల ఎంపిక కూడా మారుతోంది.. హీరోలు ఎన్ని సినిమాలు చేస్తున్నామనే కాదు.. సినిమాకు ఎంత తీసుకుంటున్నామన్నది కూడా లెక్కలేసుకుంటున్నారు. మూవీ బడ్జెట్‌ను బట్టి, దర్శకుడు అడిగే కాల్షీట్లను బట్టి ఇదిగో నాకింత కావాలంటూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు ఒక్క సినిమాకే కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు? ఎవరి రెమ్యునరేషన్ ఎంత? అన్న విషయాలు తెలియాలంటే ఇది చదివేయండి.. అక్షయ్ కుమార్ బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన రమారమిగా ఒక్క సినిమాకు రూ.135 కోట్లు అందుకున్నట్లు సమాచారం. లేదంటే సినిమా రిలీజయ్యాక దానికి వచ్చే లాభంలో 40 నుంచి 50 శాతం వరకు వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటాడట! సూర్యవంశి చిత్రానికి రూ.70 కోట్లు, బచ్చన్ పాండేకు రూ.90 కోట్లు తీసుకుంటూ వచ్చిన ఆయన బెల్ బాటమ్‌కు ఏకంగా రూ.117 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఇండియాలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరో సల్మాన్ ఖాన్. 2016లో సుల్తాన్ చిత్రానికి వంద కోట్లు వెనకేసిన ఆయన ఆ మరుసటి ఏడాది వచ్చిన టైగర్ జిందా హైకి రూ.130 కోట్లు అందుకున్నాడు. కొన్ని చిత్రాలకు నిర్మాతలను డబ్బులు డిమాండ్ చేయడం మానేసి సినిమా డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఇన్కమ్గా మార్చుకున్నాడు. భారత్ సినిమా డిజిటల్ రైట్స్‌కు రూ.80 కోట్లు, శాటిలైట్ రైట్స్‌కు రూ.40 కోట్లు రాగా ఈ మొత్తాన్ని అంటే రూ.120 కోట్లను తన జేబులో వేసుకున్నాడు సల్లూ భాయ్. అంటే ఈ భాయ్‌జాన్ సినిమా చేయాలంటే అతడు అడిగినంత డబ్బులు ముట్టజెప్పాలి లేదంటే లాభాల్లో దాదాపు 70% వాటా ఇవ్వాలి, అదీ కాదంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మితే వచ్చిన డబ్బులను అతడికి అప్పజెప్పాలన్నమాట! షారుక్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో షారుక్ ఖాన్ సినిమాకు సైన్ చేసేటప్పుడే దాని లాభాల్లో ఎంత వాటా ఇస్తారో మాట్లాడుకుంటాడట! ఇన్ని కోట్లు పారితోషికం కావాలని డిమాండ్ చేయకుండా సినిమా లాభాల్లో 60% వాటా ఇవ్వమని కోరుతాడట. అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కూడా రెమ్యునరేషన్‌ను పట్టించుకోకుండా సినిమా లాభాల మీదనే ప్రత్యేక దృష్టి పెడతాడని తెలుస్తోంది. అందుకే ఆయన నటించిన ఏ సినిమా అయినా రిలీజయ్యాక దానికి వచ్చే ప్రాఫిట్లో నుంచి 75 శాతం వరకు వాటా తనే తీసుకుంటాడని సమాచారం. హృతిక్ రోషన్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్ కూడా షారుక్, అమీర్ బాటలోనే నడుస్తున్నాడు. తన ప్రతి సినిమాకు వచ్చే ఆదాయంలో నుంచి 50-55% మధ్య వాటా తన జేబులో వేసుకుంటాడని తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' సినిమాకు రూ.65-70 కోట్లు తీసుకోగా రణ్వీర్ సింగ్ 'సర్కస్' చిత్రానికి రూ.50 కోట్లు పుచ్చుకున్నాడట. వరుణ్ ధావన్ కూడా పారితోషికం కంటే ప్రాఫిట్లో కొంత వాటా తీసుకోవడమే నయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'సత్యమేవ జయతే'కి రూ.7 కోట్లు తీసుకున్న జాన్ అబ్రహాం దాని సీక్వెల్‌కు రూ.21 కోట్లు తీసుకున్నట్లు భోగట్టా. 'జెర్సీ'కి షాహిద్ కపూర్ రూ.31 కోట్లు సంపాదించాడట. మొన్నటిదాకా రూ. 30 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటున్న టైగర్ ష్రాఫ్ 'గనపత్' సినిమాకు మాత్రం ఏకంగా 40 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ అందుకున్నాడట. అంతేకాదు, 'బడే మియా చోటే మియా'కు ఏకంగా రూ.50 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక అజయ్ దేవ్గన్ రూ.35-40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నా దానితో సరిపెట్టుకోకుండా ఆ సినిమాకు వచ్చే లాభాల్లో 50 శాతం వాటా తీసుకుంటాడని సమాచారం! -
నా కొడుకు హృతిక్ రోషన్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్
Kristen Stewart Wants Her Child Is Look Like To Hrithik Roshan: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అందం, ఆహార్యం, అద్భుత నటనతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తాడు. హృతిక్‌కు ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ నుంచి అభిమానులు ఉన్నారు. జనవరి 10న హృతిక్ పుట్టినరోజు సందర్భంగా సినీ స్టార్స్ బర్త్‌డే విషెస్ చేశారు. దీపికా పదుకొణె నుంచి రణ్వీర్ సింగ్ వరకు అనేక మంది బాలీవుడ్ తారలు హృతిక్ పట్ల ప్రేమను వ్యక్తం చేశారు. ఈ క్రిష్ పట్ల హాలీవుడ్ నటులు సైతం ప్రేమాభినాలు చూపకుండా ఉండలేకపోయారు. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ కూడా హృతిక్ అంటే ఎంత ఇష్టమో చెప్పి అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఇప్పుడు చెప్పలేదు. క్రిస్టెన్ నటించిన ప్రముఖ చిత్రాల్లో ఒకటైనా 'ట్విలైట్: బ్రేకింగ్ డాన్ పార్ట్ 2' సినిమా సమయంలో ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌పై ఇష్టాన్ని వ్యక్తపరిచింది. 'ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే బాలీవుడ్ చిత్రంలో నటించాలని ఉంది. హృతిక్ రోషన్‌తో కలిసి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. అతను చాలా అద్భుతమైన నటుడు, అందంగా కూడా ఉంటాడు. ఒకవేళ నాకు కొడుకు ఉన్నట్లయితే, హృతిక్‌లా ఉండాలని, అతనిలా కనిపించాలని కోరుకుంటా. కానీ కళ్లు మాత్రం రాబ్ల (క్రిస్టెన్ ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్) ఉండాలి.' అని చెప్పింది ఈ హాలీవుడ్ భామ. ఇదీ చదవండి: రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్ -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్‌గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్‌లో హృతిక్ రఫ్ లుక్‌లో అట్రాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్‌గా వెద ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్
కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో మునిగితేలుతొందంటూ బీ-టౌన్లో గుసగులు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌తో విడాకుల అనంతరం అర్స్లాన్ గోనితో ఆమె సన్నిహితంగా ఉండటంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే దీనిపై ఇంతవరకు సుసానే ఖాన్ కానీ అర్స్లాన్ గోని కానీ స్పందించలేదు. ఈ రూమర్లను కూడా వారెప్పుడు ఖండించలేదు. ఈ క్రమంలో అర్స్లాన్ గోని, సుసానే రూమార్డ్ బాయ్‌ఫ్రెండ్‌గా మీడియాలో పేర్కొంటున్నారు. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఇదిలా ఉంటే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనడానికి సుసానే తాజా పోస్ట్ మరోసారి ఉదాహరణగా నిలిచింది. డిసెంబర్ 20న అర్స్లాన్ గోని బర్త్‌డే. ఈ సదర్భంగా సుసానే అతడితో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే. నీ జీవితంలో నీవు కోరుకునేవన్నీ ఉండాలని, స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నా. నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూసిన ఒక అందమైన శక్తివి నీవు' అంటూ రాసుకొచ్చింది. దీనికి గోనీ స్పందిస్తూ.. ‘లవ్ యూ’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు కొందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు కొందరు మద్దతుగా కామెంట్ చేస్తుండగా.. చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే.. మరికొందరూ విమర్శిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్టోబర్‌లో సుసానే పుట్టినరోజు సందర్భంగా గోనీ కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘హ్యాపీ బర్త్ డే డాలింగ్. నీ జీవితం అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో నేను చూసిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తివి నీవు. నీవు కోరుకున్నదంతా భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ గ్రీటింగ్స్ చెప్పాడు. కాగా హృతిక్ రోషన్ చిన్ననాటి స్నేహితురాలైన సుసానేను 2000 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే విభేదాల వల్ల 2014లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) -
హృతిక్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న బ్యూటీ
Sanya Malhotra Is Hrithik Roshan's New Neighbour: దీపావళి పండగకు తనకు తానే ఓ ఇంటిని గిఫ్ట్ ఇచ్చుకుందో బాలీవుడ్ భామ. ముంబైలో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది దంగల్ బ్యూటీ సన్య మల్హోత్రా. ఇది హీరో హృతిక్ రోషన్ ఇంటి పక్కనే ఉందట! పూర్తి వివరాల్లోకి వెళితే.. సన్య ముంబైలో జుహు ప్రాంతంలో నివసిస్తున్న సమీర్ భోజ్వానీ అనే వ్యక్తికి చెందిన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది జుహు- వెర్సోవా లింక్ రోడ్‌లోని బేవ్యూ బిల్డింగ్‌లో ఉంది. సన్య, సన్య తండ్రి సునీల్ కుమార్ మల్హోత్రా రూ.14.3 కోట్లు వెచ్చించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. గత నెల 14న ప్రాపర్టీ ఆమె పేరుకు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుస్తోంది. విశేషమేంటంటే గతేడాది హృతిక్ రోషన్ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇదే బిల్డింగ్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. తాజాగా సన్యా కూడా ఈ భవంతిలోనే ఇల్లు కొనడంతో ఆమె హృతిక్‌కు పొరుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక దంగల్ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన సన్య తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు అందుకుంది. 'పటాకా', 'బదాయి హో', 'శకుంతల దేవి', 'లూడో', 'పగ్లైట్' వంటి పలు సినిమాల్లో నటించిన సన్య ప్రస్తుతం 'మీనాక్షి సుందరేశ్వర్' సినిమా చేస్తుంది. ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది. -
ఆర్యన్ డ్రగ్స్ కేసు: హృతిక్‌కి కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్‌లోని ఎంతో మంది ప్రముఖులు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి మద్దతుగా నిలిచారు. అయితే తాజాగా హృతిక్ రోషన్ సైతం ఆర్యన్‌కి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆ హీరోకి కౌంటర్‌గా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అందులో..‘ఇప్పుడు ఆర్యన్ ఖాన్ డిపెండ్ చేయడానికి మొత్తం మాఫియా పప్పు రంగంలోకి దిగింది. మనం తప్పుటు చేస్తాం. కానీ వాటిని గొప్పగా చెప్పుకోం. ఈ తప్పు (డ్రగ్ కేసు) వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నా. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు’ అని అందులో కంగనా ఘాటుగా విమర్శించింది. అయితే భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ కంగనాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అభిప్రాయ భేదాలతో ఈ లవ్ కపుల్ విడిపోయారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు ఎదో విధంగా తమ కోపాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఆర్యన్‌కి సపోర్టుగా ఆ హీరో పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఫైర్ బ్రాండ్ ఈ స్టోరీ పెట్టింది. ఇది తన హృతిక్‌కి కౌంటరేనని నెటిజనులు అనుకుంటున్నారు. చదవండి: ఆర్యన్‌ఖాన్‌కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్ -
ఆర్యన్‌ఖాన్‌కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్
ముంబైలోని క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీకి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (23)కు బాలీవుడ్ ప్రముఖులు సపోర్టుగా నిలిచిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజా భట్ వంటి సెలబ్రీటీలు ఆర్యన్‌కి మద్దతు తెలపగా.. తాజాగా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ అతనికి సపోర్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘నువ్వు (ఆర్యన్) నాకు చిన్న పిల్లాడిగా, పెద్దవాడిగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న అన్ని ఈ పరిస్థితులని అర్థం చేసుకో. ఈ అనుభవాలు నీకు ఉపయోగపడతాయి. నన్ను నమ్ము ఇవి నీకు కచ్చితంగా మంచే చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కోపం, అయోమయం, నిస్సహాయ సిట్యువేషన్స్ నీలోని హీరోని బయటికి తీసుకువస్తాయి. దేవుడు ఎప్పుడు బలమైన వారికే ఎక్కువ కష్టాలను ఇస్తాడు. నువ్వు భవిష్యత్తులో మంచి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నావు’ అంటూ రాసుకొచ్చాడు ఈ ఇండియన్ సూపర్ హీరో. ఆర్యన్‌కు సపోర్టుగా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇంతకుముందే హ్యాండ్సమ్ హీరో భార్య సుసానే ఖాన్ సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపింది. అయితే హృతిక్ రోషన్ ‘క్రిష్’ సినిమాల సిరీస్‌తో ఇండియన్ తొలి సూపర్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రస్తుతం దీపిక పదుకోనే కలిసి‘ఫైటర్’లో నటిస్తుండగా, మరికొన్ని సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. చదవండి: సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
అమ్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన హృతిక్... తడి గోడను పట్టేసిన నెటిజన్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పేరు తెలియని భారతీయ సినీప్రియులు లేరనే చెప్పాలి. ఆయన్ను బాలీవుడ్లో గ్రీకువీరుడు అని పిలుస్తుంటారు. క్రిష్ సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. అప్పటి వరకూ బాలీవుడ్ మాత్రమే ఎక్కువ తెలిసిన ఈ కండల వీరుడు సూపర్ హీరో సినిమాలతో ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట్లో తడి గోడ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వివరణ ఇవ్వడంతో అది వైరల్‌గా అయ్యింది. హృతిక్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. అయితే ఆయన బుధవారం తన తల్లి పింకీ రోషన్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ సమయంలో ఆమె బాల్కనీలో నుంచి బయటకు చూస్తోంది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఓ అభిమాని మాత్రం గోడ తడిగా ఉన్న విషయం గుర్తించి కామెంట్ పెట్టాడు. దీనిపై స్పందించిన హీరో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, త్వరలో సొంత ఇంటికి మారబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా తడి ఉంటే కదా దాన్ని రిపేర్ చేసే విధానాన్ని ఎంజాయ్ చేయెచ్చని అన్నాడు. అయితే గతంలో జుహులోని ఓ అపార్ట్మెంట్లో అద్దె ఉంటున్న ఈ అందగాడు దానికి రూ.8.25 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు ముంబైలోని ఓ మీడియా తెలిపింది. అనంతరం ఆయన మొత్తం 97.5 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్స్ కొన్నట్లు అదే మీడియా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన రెండు ప్రకటనలను ఆగస్టు 26న విడుదల చేసింది. దీంతో ఈ యాడ్స్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగింది. జొమాటో డెలివరీ కార్మికుల పట్ల ఇంత అన్యాయమా అంటూ నెటిజన్లు జొమాటోపై విరుచుకుపడ్డారు. దీంతో జొమాటో స్పందించింది. ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అంటూ ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టింది. తమ తాజా ప్రకటనలను దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకున్నారం టూ జొమాటో ఒక ప్రకటన విడులల చేసింది. తమ ఉద్యోగులను హీరోలుగా నిలబెట్టడంతోపాటు, డెలివరీ భాగస్వాములతో గౌరవంగా మాట్లాడటం, డెలివరీ ఉద్యోగి గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రతి కస్టర్ తమకొక స్టార్ అని పునరుద్ఘాటించడమే ముఖ్య ఉద్దేశమని అని కంపెనీ తెలిపింది. బాలీవుడ్ స్టార్లు హృతికి రోషన్, కత్రినా కైఫ్‌తో యాడ్స్ వివాదానికి సంబంధించిన ప్రకటనలను పరిశీలిస్తే..హృతిక్ రోషన్ నటించిన జోమాటో యాడ్‌లో ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు జొమాటోబాయ్ కస్టమర్( హృతిక్) డోర్‌బెల్ బెల్ మోగిస్తాడు. హృతిక్ రోషన్‌ను చేసిన అతను ఆశ్చర్యపోతాడు. ఇంతలో బాలీవుడ్ స్టార్ అతడిని సెల్ఫీ కోసం వేచి ఉండమంటాడు. దీనికి డెలివరీ బాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కానీ ఇంతలోనే ఫోన్ రింగ్ అవుతుంది. తరువాతి డెలివరీ చేయాల్సిన మరో ఆర్డర్‌కు సంబంధించి కాల్ అది. దీంతో రోషన్‌తో సెల్ఫీ ఛాన్స్ వదులుకొని, మరో ఆర్డర్ డెలివరీకి బయలుదేరతాడు సంతోషంగా. "హృతిక్ రోషన్ హో, యా ఆప్, అప్నేలియే హర్ కస్టమర్ హై స్టార్ (హృతిక్ రోషన్ అయినా,మీరైనా, ప్రతీ కస్టమర్ జోమాటోకి స్టార్) అంటూ యాడ్ ముగుస్తుంది.(Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి) కత్రినా కైఫ్ నటించిన యాడ్‌లో కూడా ఇలాంటి సందేశమే ఉంటుంది. బర్త్‌డే కేక్ డెలివరీ ఇచ్చిన బాయ్‌ని కేక్ తిందువు ఉండమని అభ్యర్థిస్తుంది కత్రినా. ఇంతలో మరొక ఫుడ్ ఆర్డర్ కోసం నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడే జొమాటోకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల పట్ల ఇంత అన్యాయమా, ఇలాంటి ఆనందాలనువారికి దూరం చేస్తారా అంటూ నెటిజన్లు మండి పడ్డారు. డెలివరీ బాయ్‌లకు నిమిషం వ్యవధి కూడా ఇవ్వరా అంటూమరికొంతమంది విమర్శించారు. అంతేకాదు వారికి సరియైన వేతనాలు చెల్లించడం కంటే కంపెనీ సెలబ్రిటీలతో ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జొమాటో స్పందించింది. చాలామంది తమ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించారని, అయితే కొంతమందికి మాత్రమే నచ్చలేదని తెలిపింది. ఇవి ఆరు నెలల క్రితం తయారు చేసినవని వివరించింది. అలాగే తమ డెలివరీ పార్టనర్ల చెల్లింపులపై త్వరలోనే ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రచురిస్తామని తెలిపింది. తమ డెలివరీ పార్టనర్ నెట్ ప్రమోటర్ స్కోర్ 10నుంచి 28 శాతానికి పెరిగిందని ఇది ఇంకా పెరుగుతూనే ఉందని జొమాటో పేర్కొంది. (taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు) The other side of the story... pic.twitter.com/hNRj6TpK1X — zomato (@zomato) August 30, 2021 -
స్టార్ హీరో షర్ట్‌లెస్ ఫొటో.. 21 ఏళ్ల వాడిలా ఉన్నావన్న మాజీ భార్య!
ముంబై: ఫిట్నెస్ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీల అందరి కంటే ఓ అడుగు ముందే ఉంటాడు స్టార్ హీరో హృతిక్ రోషన్. 47 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ కండలు తిరిగిన దేహంతో తనకు తానే సాటి నిరూపించుకుంటున్నాడు. అందంతో, అదరగొట్టే డ్యాన్సులతో అభిమానుల మనసు కొల్లగొట్టే.. ఈ ‘గ్రీక్‌గాడ్’కు సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్.. ఈ షర్ట్‌లెస్ ఫొటోపై చేసిన కామెంట్ అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది. ఫ్యాన్ పేజ్ షేర్ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న హృతిక్... ‘గుడ్ క్యాచ్’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు స్పందించిన సుసానే.. ‘‘నువ్వు 21 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ తన ప్రియమైన ‘స్నేహితుడి’పై అభిమానం చాటుకున్నారు. కాగా చిన్ననాటి స్నేహితులైన హృతిక్- సుసానే 2000, డిసెంబర్ 20న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిధాన్. ఇక బీ-టౌన్ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరు.. అభిప్రాయ భేదాల కారణంగా 2014లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కొడుకుల కోసం స్నేహితుల్లా కొనసాగుతున్నారు. పిల్లల పుట్టినరోజు లాంటి వేడుకలను కలిసి జరిపిస్తూ.. మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. చదవండి: భార్య ఉండగా హీరోయిన్‌తో హృతిక్ రోషన్ ప్రేమాయణం! View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
ఆ హీరోయిన్ వల్లే భార్యకు హృతిక్ రోషన్ విడాకులు!
‘ఆయన గొప్ప నటుడు.. మంచి మనసున్న మనిషి. మహా అందగాడు. ఏ అమ్మాౖయెనా అతనితో ఇట్టే ప్రేమలో పడిపోతుంది’ అని చెప్పింది బార్బరా మోరీ.. హృతిక్ రోషన్ గురించి. ఆమె మెక్సికో దేశస్తురాలు. ‘కైట్స్’ అనే హిందీ సినిమాలో నటించింది హృతిక్ రోషన్ సరసన. ఈ ఉపోద్ఘాతంతో అర్థమైపోయి ఉంటుంది ఈ వారం మొహబ్బతే కథానాయిక, నాయకులెవరో! ‘కైట్స్’ సినిమా.. హృతిక్ రోషన్ వాళ్ల హోమ్ ప్రొడక్షన్. దర్శకుడు అనురాగ్ బసు. ప్రధాన నాయికగా బార్బరా మోరీ. మరో హీరోయిన్ కంగనా రౌనత్. అసలు విషయంలోకి వస్తే.. కైట్స్ సినిమా కోసం బార్బరా మోరీ ముంబై వచ్చింది. ఆమెకు కొత్త అయిన ఈ దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సహజంగానే హృతిక్ రోషన్ కుటుంబం తీసుకుంది. అద్దెకు సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి రాకపోకలకు వాహనాన్ని ఏర్పాటు చేయడం వరకు అన్నీ హృతిక్ రోషనే దగ్గరుండి చూసుకున్నాడు. వాటన్నిటినీ నోట్ చేసుకుంది మీడియా. షూటింగ్ మొదలైంది... సినిమా కంటే ముందే మొదలైన హృతిక్ రోషన్, బార్బరా స్నేహం ఆన్ సెట్స్‌లోనూ కొనసాగింది. కైట్స్ చాలా వరకు అమెరికా, మెక్సికో దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ ప్యాకప్ అయ్యాక కబుర్లు, వాహ్యాళి, లాంగ్ డ్రైవ్‌లతో కాలక్షేపం చేసేవారిద్దరూ. వీటన్నిటినీ ఫొటో జర్నలిస్ట్‌లు రికార్డ్ చేశారు. ఒక్కొక్కటిగా ప్రచురించాయి పత్రికలు. కైట్స్ కన్నా వాళ్ల ప్రేమ కథే ముందు విడుదలైంది. సుజైన్ ఖాన్ కూడా ఆ ప్రేమ చిత్రం వార్తలు విన్నది. బాధ పడింది. భర్త బార్బరాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడన్న వదంతుల గురించి. హృతిక్ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు. ఇష్టపడి.. రెండు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల అన్యోన్య దాంపత్యం బాలీవుడ్లో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి జంట మధ్య బార్బర చిచ్చు పెడుతోందనే వ్యాఖ్యానాలూ సుజైన్కు చేరాయి. ఆ బాధనే హృతిక్‌తో పంచుకుంది. భరోసా ఇచ్చాడు అతను. వాళ్ల కాపురం గురించి పత్రికల వాళ్లు గుచ్చిగుచ్చి అడిగినప్పుడు ‘రబ్బిష్. మీడియా క్రియేట్ చేసే ఈ రూమర్స్‌తోనే ఇద్దరం అప్సెట్ అవుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఎవరో చిచ్చు పెడితే బ్రేక్ అయిపోయేంత బలహీనం కాదు మా బంధం. చాలా స్ట్రాంగ్ ’ అని సమాధానమిచ్చింది సుజైన్. సినిమా సంగతికొస్తే.. కైట్స్ రిలీజ్ అయింది. పెద్దగా ఆడకపోయినా బార్బరా, హృతిక్ ఆన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. ఆ కెమిస్ట్రీ వాళ్ల జీవితంలోనూ కొనసాగింది. నిజంగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. హృతిక్ చాలాసార్లు మీడియా ముఖంగా బార్బరాను స్తుతించాడు. ‘బార్బరా నన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. రియల్ ఫ్రెండ్ అంటే తనే’ అంటూ. ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకొంటూ ఆ ప్రేమ కథను మరింత చిక్కగా అల్లింది మీడియా. సాక్ష్యాలుగా బార్బరా వాడే వేనిటీ వ్యాన్‌ను చూపించింది. అత్యంత విలాస వంతమైన ఆ వాహనాన్ని హృతిక్ రోషనే కానుకగా ఇచ్చాడని.. దాని ధర దాదాపుగా రెండు కోట్లుంటుందనీ రాసింది. అంతేకాదు బార్బరా కోసం తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెనూ హృతికే చెల్లించేవాడనీ చెప్పింది. బార్బరా ముంబైలో ఉన్నప్పుడు రాకేష్ రోషన్ వాళ్లింట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హాజరయ్యేదనీ యాడ్ చేసింది. ఈ వివరాల్లో కొన్నిటినీ హృతిక్ ప్రవర్తనతో సరిపోల్చుకున్నట్టుంది సుజైన్. నిజాన్ని గ్రహించినట్టుంది. మొత్తం విషయం అర్థమైంది. ‘ఇక మనం కలసి ఉండడం కుదరదు’ అని తనిల్లు అనుకున్న ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది పిల్లలను తీసుకొని. ఇరువైపు పెద్దలు వాళ్లిద్దరి మధ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సయోధ్య కుదరలేదు. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. బార్బరా మోరీ, హృతిక్ రోషన్ల మధ్య ఉన్న ప్రేమా నిలువ లేదు. కైట్స్ సమయంలో సుజైన్.. బార్బరాకూ మంచి స్నేహితురాలైంది. తన వల్ల ఆమె బాధ పడిందని, చక్కటి జంట విడిపోయిందనే అపరాధ భావం బహుశా బార్బరాను వెంటాడి ఉండొచ్చు.. అందుకే హృతిక్‌తో తెగతెంపులు చేసుకొని ఉంటుంది. తను దూరమైతే హృతిక్ మళ్లీ సుజైన్కు దగ్గరవుతాడని బార్బరా అనుకొని ఉండొచ్చు అంటారు హృతిక్ సన్నిహితులు. కానీ ఆ ఆలుమగల మధ్య స్పర్థలకు బార్బర మాత్రమే కారణం కాదు.. బార్బరా కూడా ఒక కారణం అంటారు. వాళ్లన్నట్టుగానే బార్బరా వెళ్లిపోయినా హృతిక్, సుజైన్ మళ్లీ కలవలేదు. మంచి స్నేహితులుగా, పిల్లలకు ఏ లోటూ రానివ్వని తల్లిదండ్రులగా కొనసాగుతున్నారు అంతే! - ఎస్సార్ చదవండి: తెరవెనుక మహేశ్, ప్రభాస్ అలా ఉంటారు : సుబ్బరాజు -
Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం
సినీ ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లిళ్లు అసలు నిలబడవనేది తరచూ వినిపించే మాట. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. చివరి వరకు నిలబడే వివాహ బంధాలకన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువగా ఉండటం ఈ అభిప్రాయాలకు కారణం. ముఖ్యంగా బాలీవుడ్లో విడాకులు అనేది కామన్ అయిపోయింది. నచ్చకపోతే విడిపోవడమే మంచిదని వారి భావన. కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్,కిరణ్ రావులు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో భారీగా భరణాలు ఇచ్చి విడాకులు తీసుకున్న జంటల గురించి.. హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలని కోరుకోని అమ్మాయి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని అందరూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అంటూ ఉంటారు. అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుసాన్ ఖాన్‌కు దక్కింది. దాదాపు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ హృతిక్ రోషన్, సుసాన్‌కు మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయారు. సుసాన్ ఖాన్‌కి విడాకులు ఇచ్చాడు హృతిక్. అయితే భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను అడిగిందట సుసాన్. అప్పట్లో ఈ వార్తలు దుమారం లేపాయి. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు బాలీవుడ్లో ప్రచారం జరిగింది. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూడా భరణంగా రీనా దత్తాకు భారీగానే అప్పగించారట. ఆమిర్, రీనా పెద్దల అమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోవాల్సిన స్థితి వచ్చింది. అయితే, ఆమిర్ రూ. కోట్లలో రీనా దత్తాకి ఇచ్చాడని టాక్. ఎంత అనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సైఫ్ అలీఖాన్ కూడా మొదటి భార్య అమృతా సింగ్‌కు భారీ నష్టపరిహారమే చెల్లించాడట. 13 ఏళ్ల కాపురం తర్వాత సైఫ్, అమృత విడాకులు తీసుకున్నారు. భరణంగా తన ఆస్తిలో సగ భాగం అమృత పేర రాసించ్చాడట సైఫ్ అలీఖాన్. అయితే అప్పట్లో ఆయన ఆస్తుల విలువ ఎంత అనేది తెలియరాలేదు. ఇక అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. సంజయ్ దత్, రియా పిళ్లై కూడా విభేదాల కారణంగా విడిపోయారు. సంజయ్ నుంచీ విడిపోతూ రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా పొందిందట! ఇక కొరియో గ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో దేశమంతా చర్చనీయాంశంగా మారింది నయనతారతో ఎఫైర్ కారణంగా భార్య రమాలత్‌తో ప్రభుదేవాకు చెడిందనే వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి, చివరకు విడాకుల వరకు వెళ్లింది. నష్టపరిహారంలో భాగంగా రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, రూ. 20-25 కోట్ల విలువ చేసే ఆస్తులను ఆమె పేరిట రాసిచ్చారని ప్రచారం జరిగింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చాడు. ఆయన రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడపడంతో వారి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. చివరకు అది విడాకుల వరకు వెళ్లింది. అప్పట్లో ఆదిత్య పెద్ద మొత్తంలోనే పాయల్ ఖన్నాకి అప్పజెప్పాడట. ఎంత ఇచ్చాడన్నది బయటకు రాలేదు. కానీ, బడా నిర్మాత కదా పెద్ద మొత్తమే ఇచ్చి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుందని అంటారు. వీటితో పాటు ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా ఆమెకు నష్టపరిహారంగా ఇచ్చాడట. చదవండి : చెల్లం సర్, నాకు పెళ్లెప్పుడు అవుతుంది? ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే! -
ఆర్టిస్టులకు హృతిక్ రోషన్ సాయం
కరోనా అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల షూటింగులు లేక ఎంతోమంది సినీకార్మికులు రోడ్డున పడ్డారు. పని లేక పూట గడవని స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ముందుకు వచ్చాడు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA)కు 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. అంతే కాకుండా సింటా సభ్యులకు నిత్యావసర సరుకులను సైతం అందించాడు. ఈ విషయాన్ని సింటా జనరల్ సెక్రటరీ అమిత్ బేల్ మీడియాకు వెల్లడించాడు. 'హృతిక్ అందించిన డబ్బును నిరుపేద కార్మికులకు అందించాం. ఈ స్టార్ హీరో గతేడాది కూడా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అతడి సాయం మాకెంతగానో ఉపయోగపడుతోంది. నటుడు విక్కీ కౌశల్ రూ.2.5 లక్షలు, నటి ఫ్లోరా సైనా రూ.25 వేలు అందించారు' అని తెలిపాడు. చదవండి: హృతిక్ రోషన్ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్! -
హృతిక్ రోషన్ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్!
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ మాజీ భార్య, ది చార్కోల్ ప్రాజెక్ట్ అధినేత సుసానే ఖాన్ మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్‌ను తీసుకున్నారు. తనతో పాటు తన టీం అందరికీ వ్యాక్సిన్ వేయించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. 'కోవిషీల్డ్ రెండవ డోస్‌ను తీసుకున్నాను. ‘‘నాతో పాటు నా చార్కోల్ టీం 50 మందికి టీకాలు వేశారు. ఇందుకు సహకరించిన నా సోదరి సిమోన్ అరోరా, సోదరుడు అజయ్ అరోరారు ధన్యవాదాలు. ప్రతి ఒక్క భారతీయుడికి టీకాలు త్వరగా అందాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'’ అని పేర్కొంది. ఇక సుసానే ఖాన్ పోస్టుపై ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న అర్స్లాన్ గోని కూడా స్పందించాడు. చప్పట్లు కొడుతున్నట్లున్న ఎమోజీని కామెంట్ రూపంలో తెలియజేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరి లవ్ ఎఫైర్‌పై గత కొంతకాలంగా రూమర్లు వస్తున్నా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే చాలా సార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్యా లవ్ ట్రాక్ నడుస్తుందని బీటౌన్ టాక్. కాగా సుసానే ఖాన్ పోస్టుపై టీవీ నిర్మాత ఏక్తాకపూర్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. తనతో పాటు టీం అందరికి వ్యాక్సిన్ వేయించినందుకు, మీ మనసు మంచిదంటూ ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) చదవండి : అరెస్ట్ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్ -
హృతిక్ రోషన్ చేసిన పనికి చస్తా అనుకున్న
ముంబై: షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ చేసిన పనికి తన పై ప్రాణాలు పైనే పోయాయంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు అభయ్ డియోల్. కొన్ని క్షణాల పాటు మృత్యుదేవత నా కళ్ల ముందే కనిపించిందని, అయితే అదృష్టం బాగుండటంతో ప్రాణాలు దక్కాయంటూ జిందగి నామిలేంగే దొబారా సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. లోయలోకి కారు జోయా అక్తర్ దర్శకత్వంలో హృతిక రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్‌లు కలిసి నటించిన జిందగి నామిలేంగే దొబారా చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సంరద్భంగా అభయ్ ఆ నాటి విషయాలు చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగేప్పుడు హృతిక్ కారు డ్రైవ్ చేస్తుంటే తాను, ఫర్హాన్ అక్తర్ కారు వెనుకు సీట్లో కూర్చున్నామని.. అయితే ఏటవాలుగా ఉన్న ప్రాంతం ప్రయాణించేప్పుడు, సడన్‌గా కారును ఆపి హృతిక్‌రోషన్ బయటకు వెళ్లాడని చెప్పారు. అయితే ఆ సమయంలో కారు హ్యాండ్‌బ్రేక్ వేయడం హృతిక్ మరచిపోయాడని.. దాంతో కారు నెమ్మదిగా లోయలోకి వెళ్లడం ప్రారంభించిందన్నారు. వెంటనే అలెర్టయిన ఫర్హాన్ కారు దిగేందుకు రెడీగా అయ్యాడని, తనకేమో మెదడు మొద్దుబారిపోయి సీటులో అలానే కదలకుండా కూర్చున్నట్టు అభయ్ చెప్పాడు. బ్రేక్ వేసిన హృతిక్ కారులోయలో పడుతుందని.. ఇక తనకు చావు తప్పదని ఫిక్స్ అయిన టైంలో పొరపాటు గ్రహించిన హృతిక్, వెంటనే వెనక్కి వచ్చిబ్రేక్ వేయడంతో ఊపిరి పీల్చుకున్నట్టు ఆనాటి ఘటనను వివరించారు అభయ్. ప్రేక్షకులను రంజిప చేసే ప్రయత్నంలో కొన్ని సార్లు తమకు తెలియకుండానే రిస్క్‌లో పడుతుంటామని చెప్పాడు అభయ్ -
తమిళ రీమేక్ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్
పోలీసు ఆఫీసర్‌గా సైఫ్ అలీఖాన్ అరెస్ట్ చేయాలనుకుంటున్న గ్యాంగ్‌స్టర్ దొరికాడు. హృతిక్ రోషనే ఆ గ్యాంగ్‌స్టర్. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన పుష్కర్-గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ఓ పోలీసు ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ మధ్య సాగే కథే ‘విక్రమ్ వేదా’. తమిళంలో మాధవన్ చేసిన పోలీస్ విక్రమ్ పాత్రను హిందీలో సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్ వేదా పాత్రకు హృతిక్ రోషన్ ఓకే చెప్పినట్లు సమాచారం. -
అందం.. అదితిరావు హైదరి సొంతం
టాలీవుడ్ టు బాలీవుడ్ .. అందంతోనూ, నటనతోనూ మెప్పిస్తున్న నటి అదితిరావు హైదరి. ఇటీవల టాప్ టు బాటమ్ బ్లాక్ ఔట్ఫిట్లో అభిమానుల మైండ్ బ్లాంక్ చేసేసింది. చెట్ల కలప నుంచి తీసిన గుజ్జుతో తయారైన టెన్సిల్ ఫ్యాబ్రిక్‌తో చూపులను చుట్టేసింది. ఈ డ్రెస్‌లో అద్భుతం అనిపించిన హైదరి ఆభరణాల జోలికి వెళ్లలేదు. వేళ్లకు రెండు బంగారు ఉంగరాలు, నలుపు రంగు హీల్స్ మాత్రమే ధరించింది. సహజసిద్దమైన స్కిన్ టోన్ మేకప్, దట్టమైన కనుబొమ్మల తీరు, వదిలేసిన హెయిర్ స్టైల్‌తో మెరిపించింది. ఈ ఫోటోపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందించాడు. స్టన్నింగ్ అంటూ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బాలీవుడ్ టాప్ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్?
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆదిపురుష్, సలార్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇవే కాక ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రం ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు కొండంత ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్‌కు సంబంధించిన మరో కొత్త అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఓ మల్టిస్టారర్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హృతిక్‌తో తలపడేందుకు ప్రభాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని, వీరిద్దరి మధ్య భారీ ఫైట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. వార్, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఇక ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మన టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్నప్పటికీ.. బాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇక ఇటీవల హృతిక్, టైగర్ ఫ్రాఫ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ వార్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభాస్, హృతిక్ సినిమాకు బీటౌన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాలి. చదవండి: ముంబైలో కొత్తింటి కోసం ప్రభాస్ వెతుకులాట! వైరల్: బ్యాలెన్స్ తప్పిన కృతి.. నెటిజన్ల ట్రోలింగ్! -
హృతిక్ రోషన్ రికార్డులను బ్రేక్ చేసిన 'ఉప్పెన’
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మెదటి రోజే ఈ మూవీ రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది.ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే 14 ఏళ్లుగా ఆ రిక్డార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఉప్పెన సినిమాతో ఆల్ ఇండియా రికార్డులను బ్రేక్ చేశాడు. హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమా ఇండియా వైడ్‌గా రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఇప్పుడు ఉప్పెన బద్దలుకొట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఏప్పెన రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. చదవండి : (గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే.) (Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!) -
ఆ సీన్లో ఆడ ఏనుగులనే ఎందుకు వాడారో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ల పీరియాడికల్ డ్రామా మూవీ ‘జోదా అక్బర్’ విడుదలై నిన్నటికి 13 ఏళ్లు. నిర్మాత అశుతోష్ గోవరికర్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హృతిక్, ఐశ్వర్యరాయ్‌లకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో హృతిక్, ఐశ్యర్యల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. మొఘల్ కాలంలోని జోధా అక్భర్‌ల నిజమైన ప్రేమకథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ చిత్రపరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలోని సన్నివేశంలో డైరక్టర్ భారీ సంఖ్యలో ఏనుగులను ఉపయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం నిర్మాత అశుతోష్ గోవరికర్ కేవలం వంద ఆడ ఏనుగులు మాత్రమే కావాలని చెప్పినట్లు ఈ సందర్భంగా సహా నిర్మాత సునీత గౌవరికర్ తెలిపారు. ఓ పాత వీడియోను ఆమె షేర్ చేస్తూ.. నిర్మాత అశుతోష్ ఈ మూవీలో ఉపయోగించే ఏనుగులు కేవలం ఆడవే అయ్యిండాలని చెప్పారు. ఇందుకు ఆయనకు వంద ఆడ ఏనుగులు కావాలని డిమాండ్ చేసినట్లు ఈ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. అయితే అశుతోష్ నిర్ణయం విని ఆమె షాకయ్యానన్నారు. వెంటనే వంద ఆడ ఏనుగులే కావాలంటున్నారని ఆయను అడగడంతో ఆయన చెప్పిన సమాధానికి ఆశ్చర్యపోయానని చెప్పారు. దీనికి ఆయన మగ ఏనుగులు తొందరగా కోపానికి లోనవుతాయి. వాటివల్ల షూటింగ్‌లోని ప్రజలందరికి ప్రమాదం ఉండోచ్చని, అందుకే కేవలం 100 ఆడ ఏనుగులతోనే షూటింగ్ చేయాలనుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారన్నారు. అంతేగాక ఆ ఏనుగులు అన్ని కూడా ఒకే పరిమాణంలో ఉండాలని తనతో చెప్పారన్నారు. షూటింగ్లో ఆయన వాటిని ఆ పేరు కూడా పెట్టారని వాటిన ఆ పేరుతోనే పిలిచేవారని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రతి విషయంలో ఆశుతోష్ పర్‌ఫక్ట్‌గా ఉంటారడానికి ఈ సంఘటన మరోసారి రుజువు చెసిందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే హీరో హృతిక్ రోషన్ కూడా మూవీ కొన్ని సన్నివేశాలను షేర్ చేస్తూ ఈ చిత్రం సమయంలోని జ్ఞపకాలను గుర్తు చేసుకున్నారు. ‘ఓ వ్యక్తి ఈ చిత్రం నటించడమంటే సాధారణ విషయం కాదు. మొదట ఆశుతోష్ నాతో ఈ మూవీ గురించి చెప్పినప్పడు బయపడ్డాను. నాతో పాటు ఓ వెయ్యి మంది సైనికులను ఆయన ఎలా నడిపించగలడు అనుకున్న. చివరికి ఆయన చేశారు’ అంటూ హృతిక్ రాసుకొచ్చారు. -
ఫైటర్ పైలట్
‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ చిత్రాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హీరో హృతిక్ రోషన్ మూడో సినిమా కోసం కలిశారు. ఆదివారం హృతిక్ రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజా చిత్రాన్ని ప్రకటించారు. ‘ఫైటర్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తారు. ఇందులో పైలట్‌గా కనిపించనున్నారు హృతిక్. ‘సిడ్’ (సిద్ధార్థ్)తో మూడోసారి, దీపికతో తొలిసారి కలసి పని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మీ అందరికీ ఓ సూపర్ రైడ్‌ను అందిస్తాం’’ అన్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాది చివర్లో ‘ఫైటర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. 2022 సెప్టెంబర్ 30న సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
జోడీ కుదిరిందా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ దీపికా పదుకోన్ హిందీలో దాదాపు అందరు స్టార్స్‌తో యాక్ట్ చేశారు. అయితే ఇప్పటివరకూ హృతిక్ రోషన్‌కి జోడీగా నటించలేదీ బ్యూటీ. ఈ ఇద్దరూ కలసి యాక్ట్ చేయాలని ఎప్పటినుంచో ఈ ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలోనే కలసి యాక్ట్ చేయనున్నారని టాక్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కమిట్ అయ్యారట హృతిక్. ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతాడనుకున్నారు.. కానీ..
ముంబై: హృతిక్ రోషన్ జనవరి10న 48వ ఏట అడుగుపెట్టనున్నాడు. అతను ఫీల్డ్‌లోకి వచ్చి 20 ఏళ్లు గడిచిపోయాయి. ‘కహో నా ప్యార్ హై’ (2000) విడుదలైనప్పుడు హృతిక్ కాబోయే సూపర్ హీరో అని అందరూ అనుకున్నారు. అంటే సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ల కంటే పెద్ద స్టార్ అయ్యి ఇండస్ట్రీ నంబర్ 1 అవుతాడని భావించారు. కాని అలా జరగలేదు. అలా జరక్కుండా కూడా ఉండలేదు. హృతిక్ పెద్ద స్టార్‌గా ఉన్నప్పటికీ టాప్ 5లో ఒకడిగా మాత్రమే నిలిచాడు. రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లాంటి ఈ తరం హీరోలు ఉన్న హృతిక్ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. తన కెరీర్లో నటనను, యాక్షన్‌ను బేలెన్స్ చేసుకుంటూ లేడీ ఫ్యాన్స్‌తో పాటు యూత్‌ను కూడా తనను ఫాలో అయ్యేలా చేసుకున్నాడు. ‘కోయీ మిల్ గయా’తో పిల్లల్ని, ‘ధూమ్ 2’, ‘జోధా అక్బర్’ (2008), ‘జిందగీ నా మిలేగి దొబారా’ (2011) సినిమాలు హృతిక్ రోషన్ భుజాలు ఎంత విశాలమైనవో అవి ఎంతెంత పెద్ద సినిమాలు మోయగలవో నిరూపించాయి. అన్నింటి కంటే విశేషం ఏమిటంటే ‘క్రిష్’ పేరుతో హృతిక్ రోషన్ ఒక ఇండియన్ సూపర్ హీరోను ఇవ్వడం. ‘కోయి మిల్ గయా’తో మొదలైన ఈ ఫ్రాంచిస్ క్రిష్ 2, క్రిష్ 3 సినిమాల ఘన విజయంతో కొనసాగింది. దుర్మార్గులను దుష్టులను తన సూపర్ పవర్స్‌తో సంహరించే క్రిష్‌గా హృతిక్ రోషన్ పెద్ద ఇమేజ్‌నే తెచ్చుకున్నాడు. తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాలకు రూపుకల్పన చేసి కొడుకు కెరీర్‌కు పెద్ద సాయం చేశాడు. 2021లో ‘క్రిష్ 4’ ఇస్తానని వాగ్దానం చేశాడు రాకేష్ రోషన్. ‘అభిమానుల డిమాండ్ మేరకు క్రిష్ 4 తీస్తున్నాం’ అని కొంత కాలంగా రాకేష్ రోషన్ చెబుతూ ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఈ ఒక్క సినిమా కోసం పని చేస్తున్నాడని చెప్పాలి. 2019లో హృతిక్ నటించిన ‘సూపర్ 30’, ‘వార్’ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాలక క్రేజ్కె క్రిష్ క్రేజ్ కలిపితే పెద్ద ఫలితం ఉంటుందని తండ్రీ కొడుకులు భావిస్తున్నట్టున్నారు. క్రిష్‌లో హృతిక్ రోషన్ సూపర్ విలన్‌గా, హీరోగా ద్విపాత్రాభినయం పోషిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ 3లో వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటించాడు. ఈసారి హృతిక్ రోషన్‌నే చూడాల్సి రావచ్చు. ఇక హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితం కూడా మెల్లిమెల్లిగా గాడిలో పడుతోంది. భార్య సుశానే ఖాన్‌తో 2014లో విడాకులు తీసుకోవడం హృతిక్‌ను మానసికంగా బాగా దెబ్బ తీసింది. ఇద్దరు కొడుకులతో ఆమె వెళ్లిపోయింది. హృతిక్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ లాక్డౌన్లో హృతిక్ వద్ద సుశానే ఖాన్ ఉండటంతో రాబోయే కాలంలో అతని వ్యక్తిగత జీవితం, వృత్తిజీవితం తిరిగి వస్తుందని ఆయన అభిమానులు, సన్నిహితులు ఆశిస్తున్నాయి. ఇక అది జరగాలని ఆశిద్దాం. -
హోటల్ మేనేజర్‌గా హృతిక్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హోటల్ మేనేజర్‌గా మారబోతున్నారు. హోటల్లో జరిగే అవినీతి పనులు, అవినీతి పరులను అంతం చేసే మిషన్ మీద మేనేజర్‌గా మారుతున్నారు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారాయన. హాలీవుడ్ టీవీ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. సందీప్ మోదీ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. భారీ యాక్షన్ ఉండనున్న ఈ సిరీస్ మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
హృతిక్ విచార గాధ మళ్లీ మొదలైంది: కంగనా
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌పై వ్యంగ్యస్త్రాలు వదిలారు. ఒకప్పుడు హృతిక్, కంగనాల మధ్య పెద్ద వివాదం చెలరెగిన విషయం తెలిసిందే. క్రిష్-3 సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని, ఆ తర్వాత విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కంగనా ఈ-మెయిల్ ఐడి నుంచి తనకు ముకుమ్ముడిగా మెయిల్స్ వస్తున్నాయని అవి చాలా ఇబ్బందిగా ఉన్నాయని ఆరోపిస్తూ సైబర్ సెల్‌కు 2016లో హృతిక్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో తన ఎఫ్ఐఆర్ను క్రైం బ్రాంచ్‌కు తరలించాల్సిందిగా హృతిక్ ఇటీవల సైబర్ సెల్‌ను కోరాడు. దీంతో తన ఎఫ్ఐఆర్ను క్రైం బ్రాంచ్ సీఐయూ(క్రైం ఇంటలీజెన్స్ బ్యూరో)కు తరలించారు. దీంతో కంగనా గురువారం సోషల్ మీడియా వేదికగా హృతిక్‌పై మాటల యుద్దానికి దిగారు. ‘హృతికి విచార గాధ మళ్లీ మొదలైంది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకుని, నాతో విడిపోయి చాలా ఏళ్లు గడిచిపోయాయి. కానీ అతడు తన జీవితంలో ముందుకు వెళ్లలేడాన్ని నిరాకరించాడు. మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. ధైర్యం కూడగట్టుకుని వ్యక్తిగత జీవితంపై ఆశతో ఇక నేను ముందుకుకేళ్తున్న సమయంలో హృతిక్ మళ్లీ పాత కథకు తెరలేపాడు. చిన్నపాటి ఎఫైర్‌ను పట్టుకుని ఇంకా ఎంతకాలం ఏడుస్తావ్’ అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. (చదవండి: హృతిక్ ఇంటి విలువ ఎంతో తెలుసా!) His sob story starts again, so many years since our break up and his divorce but he refuses to move on, refuses to date any woman, just when I gather courage to find some hope in my personal life he starts the same drama again, @iHrithik kab tak royega ek chote se affair keliye? https://t.co/qh6pYkpsIP — Kangana Ranaut (@KanganaTeam) December 14, 2020 కాగా 2013-14 మధ్యకాలంలో కంగన రనౌత్ మెయిల్ ఐడీ నుంచి తనకు వందలాది మెయిల్స్ వచ్చాయంటూ హృతిక్ రోషన్ 2016లో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో హృతిక్ తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ ఇటీవల సైబర్ సెల్ లేఖ రాశారు. ‘2016 నుంచి ఇప్పటి వరకు ఈకేసులో ఎటువంటి పురోగతి లేదు. నటి కంగనా నుంచి వచ్చిన మెయిల్స్ కారణంగా అతడు, తన కుటుంబ సభ్యులు ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో పోలీసులకు ఆయన వివరించారు. అంతేకాదు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఉన్నత పోలీసు అధికారులను అతడు కోరారు. అయినప్పటికి ఈ కేసు విచారణ ముందుకు కదలలేదు. కావునా ఈ కేసును వెంటనే క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సైబర్ సెల్ హృతిక్ ఎఫ్ఐఆర్ను క్రైం బ్రాంచ్‌కు బదిలి చేసినట్లు ఇటీవల ప్రకటించింది. (చదవండి: దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన) -
మాకు బ్రేకప్.. ఏడుపుగొట్టు కథ: కంగన
ముంబై: ‘అతడి ఏడుపుగొట్టు కథ మళ్లీ మొదలైంది. మాకు బ్రేకప్ అయ్యి, అతను విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అవుతోంది. అయినా ముందుకు సాగేందుకు తను ఇంకా ఇష్టపడటం లేదు. వేరే మహిళతో డేటింగ్ చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు అధిగమించి నేను ధైర్యంగా ముందుకు వెళ్తుంటే అతడు మళ్లీ డ్రామా మొదలుపెట్టాడు. ఈ చిన్నపాటి అఫైర్ గురించి ఇంకెంత దూరం వెళ్తావు హృతిక్’అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై మండిపడ్డారు. ఇప్పటికైనా పాత విషయాలు మర్చిపోయి ముందుకు సాగాలని హితవు పలికారు. (చదవండి: బై చెప్పడం బాధాకరమే!) కాగా క్రిష్-3 సినిమాలో కలిసి నటించిన కంగన- హృతిక్‌లు ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కంగన హృతిక్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య ‘మెయిల్’ యుద్ధం నడిచింది. ఈ క్రమంలో తనకు కంగనాతో ఎటువంటి సంబంధం లేకున్నా ఆమె జీమెయిల్ అకౌంట్ నుంచి వందల సంఖ్యలో మెయిళ్లు వచ్చాయని, తన కుటుంబంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్ తరఫు లాయర్ మహేష్ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కంగనా ట్విటర్లో ఈ మేరకు స్పందించారు. -
ఆరు ఎపిసోడ్లు.. తొంభై కోట్లు
వెబ్ సిరీస్‌లు, వెబ్ షోలకు బాగా ఆదరణ పెరగుతోంది. దీంతో టాప్ స్టార్స్‌ను కూడా ఓటీటీ మీడియమ్‌లోకి తీసుకురావడానికి ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ వెబ్ షో చేయబోతున్నారని టాక్. ఇందుకోసం ఆయనకు భారీ పారితోషికం కూడా అందబోతోందని సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ యాక్షన్ నిండిన ఓ వెబ్ సిరీస్ చేయబోతోందట. ఇందులో హృతిక్ లీడ్ రోల్లో కనిపిస్తారని భోగట్టా. ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్‌కుగాను హృతిక్ సుమారు 90 కోట్లు తీసుకోనున్నారట. భారతీయ భాషలన్నింట్లోనూ ఈ సిరీస్ విడుదల కానుందని టాక్. ఈ సిరీస్‌లో హృతిక్ సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సిరీస్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
హృతిక్ ఇంటి విలువ ఎంతో తెలుసా!
టముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ముంబైలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అపార్టుమెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అపార్టుమెంట్ డ్యూప్లెక్స్ పెంట్ హౌజ్ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్ ఇన్ ది ఎయిర్ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని జుహు వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ఈ విశాలవంతమైన భవనం ఖరీదు రూ. 97.5 కోట్లు. ఈ అపార్టుమెంటు దాదాపు 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 6500 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. అంతేగాక ఒక కుటుంబానికి 10 పార్కింగ్ స్థలాలను కేటాయించి ఉంటుందంట. (చదవండి: ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్) డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్ కోసం హృతిక్ రూ .67.5 కోట్లు, 11165 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14వ అంతస్తు అపార్ట్మెంట్ కోసం రూ. 30 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్లో హృతిక్ సముద్ర ముఖం ఉన్న ఈ ఇంటి ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు. దాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనంలో విలాసవంతమైన 4 పడక గదులు, ఒక హాలు, కిచెన్ ఉంది. దీనిని ఇంటీరియర్ డిజైనర్ అశీష్ షా ఒక డెన్, రెండు బెడ్ రూమ్‌లుగా విభజించారు. అలాగే ఇందులో ఒక ఫుట్‌బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ టేబుల్‌తో పాటు చాక్లెట్ వెండింగ్ మెషీన్ కూడా ఉంది. -
హృతిక్ తల్లికి కరోనా
దర్శక–నిర్మాత రాకేష్ రోషన్, హీరో హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయం గురించి పింకీ రోషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతీ 20 రోజులకు ఓసారి మా కుటుంబ సభ్యులందరం, అలాగే మా స్టాఫ్ అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నాం. ఇటీవల చేసిన టెస్ట్‌లో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ లక్షణాలూ లేవు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. క్రమశిక్షణగా యోగా చేయడం, వ్యాయామం వల్ల మీ మీద కోవిడ్ అంత ప్రభావం చూపించలేకపోయింది అని మా డాక్టర్లు అన్నారు. ఇంకో వారంలో మళ్లీ టెస్ట్ చేయించుకుంటాను. కచ్చితంగా నెగటివ్ వస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు. -
ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్
ముంబై : పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషం తెలిసిందే. అస్సాంకు చెందిన ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అరూప్ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్ ధరించి 'వార్' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్ ఫైజన్ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైద్యుడి డ్యాన్స్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఇంకేముంది సదరు డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కరోనా కష్ట కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి తన వృత్తిని కొనసాగిస్తూ, మరోవైపు రోగులను ఉత్తేజపరిచేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం’ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: పీపీఈ కిట్‌లో డాక్టర్ అదిరిపోయే స్టెప్పులు తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. వైద్యుడు డ్యాన్స్ వీడియోను హృతిక్ రీట్వీట్ చేశాడు. 'డాక్టర్ అరూప్ తో చెప్పండి. నేను ఏదో ఒక రోజు అస్సాంలో అతని డ్యాన్స్ స్టెప్పులను నేర్చుకుంటాను. అతనిలా డ్యాన్స్ చేస్తాను. అద్భుత ప్రదర్శన' అంటూ హృతిక్ రోషన్ రీట్వీట్ చేశాడు. కాగా డాక్టర్ స్టెప్పులకు బీటౌన్ ఇండస్ట్రీలోనే గొప్ప డ్యాన్సర్ అయిన హృతిక్ ఫిదా అయిపోయాడంటే అతడి డ్యాన్స్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హృతిక్ స్పందించడంతో అమితానందం వ్యక్తం చేశారు డాక్టర్ అరూప్..“సర్, నేను డాక్టర్ అరుప్. చాలా ధన్యవాదాలు సార్. కహో నా ప్యార్ హై సినిమా నుంచి మీరు నా హీరో, మీలాంటి గొప్ప వారికి డ్యాన్స్ నేర్పే అంత వాడిని కాదు సార్. ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీరెప్పుడైనా అస్సాంకు రావచ్చు. అంటూ డాక్టర్ బదులిచ్చారు. చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్ Tell Dr Arup I’m gonna learn his steps and dance as good as him someday in Assam . Terrific spirit . 🕺🏻 https://t.co/AdBCarfCYO — Hrithik Roshan (@iHrithik) October 19, 2020 -
కామెడీకి రెడీ
‘సూపర్ 30, వార్’ చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఆయన తదుపరి సినిమా ఏంటనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫరాఖాన్‌తో ఓ సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. తర్వాత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. తాజాగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం, గోల్మాల్’ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారట హృతిక్. ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని, హృతిక్ పాత్ర ఆద్యంతం వినోదం పంచేలా ఉంటుందని బాలీవుడ్ టాక్. -
క్యాన్సర్‌ను జయించిన యోధుడు: హృతిక్
ముంబై: బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్ చేశారు. రాకేష్ రోషన్ 71వ పుట్టిన రోజు సందర్భంగా హృతిక్ స్పందిస్తూ తన తండ్రి జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడని, కెరీర్ ప్రారంభంలో పరిమితమైన విజయాలే లభించాయని తెలిపారు. ఆ తర్వాత భయానక క్యాన్సర్ (గొంతు) వ్యాధితో బాధపడ్డాడని, అయినా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా క్యాన్సర్‌ను జయించాడని తెలిపాడు. తన తండ్రి పోరాట యోధుడని కీర్తించాడు. అయితే గతంలో ఓ టివీ చానెల్లో రాకేష రోషన్ స్పందిసు కెరీర్ పరంగా 2017 సంవత్సరంలో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని అన్నారు. నటుడిగా అంత గుర్తింపు రాకున్నా సినిమా నిర్మాణ రంగం, దర్శకత్వ విభాగాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కాగా తన కలలను కొడుకు హృతిక్ రోషన్ నెరవేర్చాడని చాలా సందర్భంలో రాకేష్ తెలిపారు. అయితే 2006 సంవత్సరంలో తన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొందని కనీసం ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవని హృతిక్ గుర్తు చేసుకున్నాడు. (చదవండి: అల్లు అర్జున్, విజయ్ సీక్రెట్ తెలుసుకోవాలి: హృతిక్)