Koratala shiva
-
త్రివిక్రమ్ ని పక్కన పెట్టి.. కొరటాలకు లైన్ క్లియర్ చేసిన ఐకాన్?
-
'దేవర'కు 50 రోజులు... ఎన్ని కేంద్రాల్లో అంటే..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఆఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయిందని చెప్పుకునేందుకు కలెక్షన్స్ కొలమానం అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ఆడిందనే మాట వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పాటు ఆడిందని మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు. చాలారోజుల తర్వాత ఇలా సెంటర్స్ లిస్ట్ చూడటం జరిగిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుక చేసుకుంటున్నాడు. దీంతో నేడు థియేటర్స్ అన్నీ మళ్లీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, దేవర సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్‌గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ అనడం లేదు. అలా అని తీసిపారేయదగ్గ మూవీ అయితే కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ బీజీఎం టమెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయితే అవుతాడు. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ 'బాహుబలి'ని గుర్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మూవీలోని సీన్లు కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాలని పోలినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఏదేమైనా 'దేవర' సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు. ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది. సరిగా గమనిస్తే బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇంతకీ అవేంటి? సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు. ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువన పాయింట్స్ చదవండి. లేదంటే మళ్లీ ట్విస్టులన్నీ చెప్పేశామని అంటారు.'దేవర' చూసిన తర్వాత సందేహాలుసినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?అంత మత్తులో ఉన్నాసరే తనని చంపడానికి వచ్చిన వాళ్లని అందరినీ 'దేవర' మట్టుబెడతాడు. అలాంటి 'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? 'దేవర' ఊరు వదలి వెళ్లిపోయాడని ఇంటర్వెల్లో చెబుతారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషులు చనిపోతారు. అప్పటికీ వర ఇంకా చిన్న పిల్లాడే. మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు?'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా? సీక్వెల్ లో ఆమె పాత్ర తీరు ఇంతేనా?పైన చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలనే రెండో పార్ట్‌లో స్టోరీగా చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత 'దేవర 2' ఉంటుందా? లేదంటే వీటితో సమాంతరంగా ఏమైనా చేస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) -
దేవరకు ఎన్ని సీక్వెల్స్ వస్తాయి...
-
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట. -
తెలంగాణలో 'దేవర'కు అదనపు షోలకు అనుమతి.. టికెట్ ధరలు ఇలా
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.తెలంగాణలో టికెట్ ధరలు ఇలాదేవర సినిమాకు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 27న అర్ధరాత్రి 1గంట షో కోసం 29 థియేటర్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు తాజాగా జీఓ విడుదల చేసింది. అయితే, టికెట్ ధర విషయంలో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అదే రోజు ఉదయం 4 గంటల ఆటతో పాటు మొత్తం 6 షోల వరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ అన్నీ థియేటర్స్ కూడా ఆ ఒక్కరోజు టికెట్ ధర రూ. 100 పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మాత్రం రోజుకు 5 షోల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ తొమ్మిది రోజులకు టికెట్ ధరల్లో మార్పులు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే టికెట్‌పై రూ. 25, మల్టీఫ్లెక్స్ అయితే రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర విడుదల రోజు సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 295 ఉంటే మల్టీఫ్లెక్స్‌లో మాత్రం రూ. 413 ఉంటుంది.ఏపీలో టికెట్ ధరలు ఇలా'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్‌కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి. #Devara Nizam 1 AM Shows permitted screens. Total 29 properties 👌👍 pic.twitter.com/gFGaXqDtbP— Vinay Gudapati (@gudapativinay) September 23, 2024 -
'దేవర'ఈవెంట్ రద్దుకు కారణం ఇదే.. ఆర్గనైజర్ల వివరణ
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో జూ ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరుత్సాహం చెందారు. దీనంతటికి కారణం ఈవెంట్‌ను నిర్వహించిన శ్రేయాస్ సంస్థ అంటూ నిర్వాహకులపై ఫ్యాన్స్ మండిపడ్డారు. దీంతో తాజాగా తారక్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ అధికారికంగా ఆ ఆర్గనైజేషన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.'దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్న దురదృష్టకర పరిస్థితి వల్ల మేము చింతిస్తున్నాం. ఎన్టీఆర్ పట్ల మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఈవెంట్ రద్దు కావడంతో మీలో చాలామంది ఎంత నిరుత్సాహానికి లోనయ్యారు. దానిని తెలుసుకుని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ని విడుదల చేస్తున్నాం. దయచేసి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని , మీకు జరిగిన అసౌకర్యానికి మా నుంచి క్షమాపణలు కోరుతున్నాం. వాస్తవంగా తారక్ అభిమానులను దృష్టిలోపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని అనుకున్నాం. అందుకు తగ్గట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించాం. అనుమతి కోసం చాలా ప్రయత్నంచాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నోవాటెల్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది.వాస్తవంగా మేము 5500 మంది వ్యక్తులకు సరిపడేలా నోవాటెల్‌లో హాల్ 3 నుంచి హాల్ 6 వరకు బుక్ చేశాం. 4వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉండేలా పోలీసుల నుంచి అనుమతి పొందాం. ఆమేరకు మాత్రమే పాస్‌లను ముద్రించాం. అంతకు మించి అదనపు పాస్‌లు మేము ఇవ్వలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, 30వేలకు పైగానే అభిమానులు వచ్చారు. మేం అంచనా వేసినదానికంటే పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడి గేట్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొందరు తప్పని పరిస్థితిలో బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ సమయంలో పరిస్థితి కంట్రోల్ తప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. గతంలో మా ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలతో కూడా భారీ ఈవెంట్లను విజయవంతంగా చేశాం. ఈ క్రమంలోనే దేవర ఈవెంట్‌ను కూడా మరింత సక్సెస్ చేయాలని 100కు పైగా యూట్యాబ్ చానల్స్‌లో లైవ్ కూడా ఏర్పాటుచేశాం.ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా సింగిల్‌గా వస్తుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తారక్ మీద ప్రేమతో చాలా దూరప్రాంతాల నుంచి వచ్చారు. అయితే, మీ అందరినీ చాలా నిరుత్సా నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఎన్టీఆర్‌పై మీ ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆయన కోసం ఇంతలా తరలి వచ్చారు. తారక్‌పై మీ ప్రేమ, బలం ఎంతటిదో నిన్న రాత్రి ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ, మికు అసౌకర్యం కల్పించినందుకు చింతిస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ మీ సపోర్ట్ మాపై ఉంటుందని ఆశిస్తున్నాం.' అని శ్రేయాస్ మీడియా లేఖ విడుదల చేసింది.దేవర ఈవెంట్ రద్దు అయిన తర్వాత జూ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఒక వీడియో ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
'దేవర' కోసం జాన్వీ ఇలా ముస్తాబు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు (ఫొటోలు)
-
Devara Pre Release Event: 'దేవర' అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవర. సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో దేవర ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నేడు సెప్టెంబర్ 22న హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో దేవర ప్రీరిలీజ్ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే, అక్కడ కేవలం 5వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కానీ, సుమారు 15 వేలకు మంది పైగానే అభిమానులు చొచ్చుకుని వచ్చారు.ఇదీ చదవండి: 'దేవర' రెండో ట్రైలర్ విడుదలదేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందే అంచనా వేశారు. అందువల్ల ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం తారక్ అభిమానుల కోసం 5వేలు పాస్‌లు మాత్రమే జారీ చేశారు. కానీ, ప్రీరిలీజ్ కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు నుంచే సుమారు 15వేలకు పైగానే ఫ్యాన్స్ వచ్చారు. వారందరూ ఒక్కసారిగా హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ లోపలికి రావడంతో అక్కడి ఫర్నీచర్ కూడా ధ్వంసం అయింది. ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటునోవాటెల్ యాజమాన్యానికి సుమారుగా రూ. 11 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈవెంట్ పాస్‌లు లేని వారు కూడా భారీ సంఖ్యలో లోపలికి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే దేవర అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.Police boss warning ichhi vellaru ippatlo start ayyela ledu #Devara@tarak9999#Devaraprereleaseevent pic.twitter.com/oFqC2Wi5na— మాచర్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ (పల్నాడు జిల్లా) (@ntrkaadda) September 22, 2024To any other hero this is a night mare.But, for #ManOfMassesNTR this is sample.దీన్ని మించిన ప్రీరిలీజ్ ఈవెంట్ గాథరింగ్ ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ #దేవర #Devara #DevaraJatharaaBegins pic.twitter.com/HoKgGaB2om— B1_Viking (@B1Viking) September 22, 2024 -
'దేవర' రెండో ట్రైలర్ విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. నేడు సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పాల్గొననున్నారు.'దేవర' రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల సమయంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 2:07 నిమిషాలకు దేవర రెండో ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటులో ఉంది.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
వాణిజ్య రాజధాని ముంబైలో 'దేవర'.. ప్రమోషన్స్‌లో బిగ్ ప్లాన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం రిలీజ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముంబై వేదికగా ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. పాన్ ఇండియా రేంజ్లో ట్రైలర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఓవర్సీస్లో కూడా దేవర క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ఇదీ చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. ఆయన అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ నిమజ్జనం దాదర్ చౌపత్తి బీచ్ వద్దే జరుగుతుంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు. నిమజ్జనం రోజున సుమారు 10 లక్షల మంది అక్కడి బీచ్‌కు చేరుకుంటారని అంచనా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదే బీచ్‌లో భారీగా దేవర పోస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. సినిమాకు ఈ అంశం భారీగా కలిసొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్లో దేవరను కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు.సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల (సుమారు 178 నిమిషాలు) రన్టైమ్తో రానుంది. అంటే దాదాపు మూడు గంటల నిడివి ఉండనుంది. దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పవర్ఫుల్ విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.#Devara cutout is standing tall in the sea at Dadar Chowpatty in Mumbai ❤️#DevaraOnSep27th pic.twitter.com/fI0oKTlcap— NTR Arts (@NTRArtsOfficial) September 14, 2024 -
'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్
ఎన్టీఆర్ (NTR)పై అభిమానాన్ని చాటుకున్నారు సంగీత దర్శకుడు రవి బస్రూర్ (Ravi Basrur). ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ ఎన్టీఆర్‌పై ప్రత్యేక పాటను రూపొందించారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రవి బస్రూర్ స్టూడియోను సందర్శించారు. తన స్టూడియోకు ఎన్టీఆర్ వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ను కానుకగా ఇచ్చారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్- రవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. 'వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం' అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంది. అలా తారక్‌పై తనకున్న అభిమానాన్ని రవి బస్రూర్ చాటుకున్నాడు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పు ఎన్టీఆర్-నీల్ సినిమాకు రవి బస్రూర్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్ అని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.. పాన్ ఇండియా రేంజ్లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దేవర రన్‌టైమ్'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో విడుదల కానున్న సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీగా రెస్పాన్స్ వస్తుంది. సప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేవర సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. దేవర్ రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. -
Devara Trailer: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ సుమారు 11 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగింది.దేవర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ముంబైలో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మేకర్స్ ప్రారంభించారు. బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్లో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ షేడ్‌లో కనిపించే విజువల్స్‌తో పాటు సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు కేక పుట్టించేలా ఉన్నాయి.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
ఏకైక ఇండియన్ సినిమాగా 'దేవర' రికార్డ్
సముద్ర తీరంలో కెరటంలా సోషల్‌మీడియాలో 'దేవర' విరుచుకుపడుతుంది. కొద్దిరోజులుగా ఈపేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా మెప్పిస్తున్నాయి. జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఓవర్సీస్ నుంచి దేవరకు మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ ఇప్పటికే ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. టికెట్స్ అన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయి రికార్డ్ కొట్టింది.దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అయితే, ఓవర్సీస్లో ఇప్పటికే టికెట్స్ సేల్ ప్రారంభమైంది. సినిమా రిలీజ్ కావడానికి ముందే అక్కడ వన్ మిలియన్ (పది లక్షలు) 'దేవర' టికెట్స్ సేల్ అయ్యాయి. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ మార్క్‌ను వేగంగా అందుకున్న సినిమాగా 'దేవర' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అక్కడ ఈ రికార్డ్ అందుకోలేదు. దీంతో మొదటి భారతీయ చిత్రంగా 'దేవర' రికార్డు నెలకొల్పింది. కేవలం తారక్ మాత్రమే దానిని నెలకొల్పాడంటూ ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కనీసం ట్రైలర్ కూడా విడుదల కాకుండానే ఇలా భారీ రికార్డ్స్ కొట్టేస్తే.. సెప్టెంబర్ 10న సాయింత్రం ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంకెన్ని లెక్కలు మారిపోతాయో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ముంబైలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. తెలుగు, తమిళ్,కన్నడ,మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. -
ముంబైలో దిగిన 'దేవర'
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో అడుగుపెట్టాడు తారక్. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్లో భారీగా క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే దేవర సినిమా ప్రమోషన్లను తారక్ ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన సెప్టెంబర్ 10న ట్రైలర్ కార్యక్రంలో పాల్గొననున్నారు. ఇదే ఈవెంట్లో హిందీ మీడియాతో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది.ధర్మతో దేవర'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్‌కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట 'బాహుబలి' సినిమాను బాలీవుడ్ పబ్లిక్‌లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్లో దేవర వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర ట్రైలర్ కోసం ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. -
'దేవర' ట్రైలర్ విడుదలపై జూ ఎన్టీఆర్ ప్రకటన
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ విడుదల తేదీని తారక్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్న సమయంలో తారక్ గుడ్‌న్యూస్ చెప్పారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవర ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ చేస్తున్నట్లు తారక్ ప్రకటించారు. బాలీవుడ్లో దేవర మార్కెట్ పెంచుకునేందుకు ముంబైలో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఒవర్సీస్లో అడ్వాన్స్ బుక్కింగ్స్ దేవర అదరగొడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ స్టార్ట్ చేశారు. USA, కెనాడాలో టికెట్లు ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ప్రీ సేల్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటికి సుమారు రూ. 6 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను దేవర దాటేశాడు. ఇంకా రిలీజ్ కు 20 రోజుల ముందుగానే ఈ రికార్డ్స్‌ను తారక్ నమోదు చేశాడు .దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
జూ ఎన్టీఆర్ 'దేవర' టికెట్లు.. ఫస్ట్ షో ఎప్పుడంటే..?
స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, దేవర్ ఫస్ట్ షో గురించి ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశాయి. మిలియన్ల కొద్ది రీల్స్ రూపంలో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.. ఓవర్సీస్లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈమేరకు UKలో ఇప్పటికే దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు కూడా.. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. సోలోగా దేవర వస్తుండటంతో బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. -
'దేవర' సాంగ్ కాపీపై కామెంట్ చేసిన ఒరిజినల్ కంపోజర్
'దేవర' సినిమా నుంచి రీసెంట్గా రెండో సాంగ్ విడుదలైంది. అయితే, ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కెమిస్ట్రీపై మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ, ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు.శ్రీలంకకు చెందిన మ్యూజిక్ కంపోజర్ చమత్ సంగీత్ 2021లో ‘మనికే మాగే హితే’ అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని దేవర చిత్రంలో 'చుట్టమల్లే' పాటను మేకర్స్ క్రియేట్ చేశారని చర్చ జరుగుతుంది.ఈ వివాదంపై చమత్ సంగీత్ స్పందించారు. సంగీత దర్శకులు అనిరుధ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్‌ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్పూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అని చమత్ పంచుకున్నారు. ఇప్పుడాయన కూడా పరోక్షంగా అచ్చూ తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఈ వివాదంపై అనిరుధ్, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
'దేవర' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది
దేవర సినిమా నుంచి జూ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు రెండో సాంగ్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.దేవర సినిమా నుంచి రెండో పాట ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్లో తారక్ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారు. అందులో జాన్వీ కపూర్‌తో తారక్ ఉన్న ఫోటో తొలిసారి విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. దేవర ఫియర్ సాంగ్ విడుదలైన నుంచి ఈ చిత్రానికి భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు రెండో పాటు విడుదల కానుంది. ఈ మెలోడీ సాంగ్‌కు ఏ రేంజ్లో ట్యూన్స్ ఉంటాయోనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.విడుదల విషయంపై క్లారిటీదేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజా పోస్టర్‌తో తేలిపోయింది. విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.. కొత్త పోస్టర్లో సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. Time for hearts to go full ❤️🔥The most awaited #DevaraSecondSingle arriving on August 5th 🌊💕#DevaraonSep27th#Devara Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts… pic.twitter.com/aJXGD3uqUB— NTR Arts (@NTRArtsOfficial) August 2, 2024 -
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా రేంజ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా దేవర ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్‌విడుదల చేశారు.బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలై ఫియర్ సాంగ్ అభిమానులను మెప్పించేలా ఉంది. ఇందులోని ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాట కోసం గేయ రచయతలు ఎంతో ప్రత్యేకంగా దీనిని రచించారని ఇప్పటికే మేకర్స్ చెప్పారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రచించారు. -
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్‌లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా
గోవాకు వెళ్లనున్నారట దేవర. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. కాగా ‘దేవర’ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అతి త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది తెలిసింది. గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. -
సెట్స్‌లో దేవర
‘దేవర’ తాజా షెడ్యూల్లో జాయిన్ అయ్యారట ఎన్టీఆర్. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైందని తెలిసింది. ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా టాకీ పార్ట్ తీస్తారని తెలిసింది. అలాగే ఈ షెడ్యూల్లోనే ఓ పాట కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉందట యూనిట్. న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్లో జాయిన్ కావడం ఇదే. రెండు భాగాలుగా కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
కొరటాల శివ దేవర సినిమాపై ప్లానింగ్ సూపర్