Niloufer Hospital
-
HYD: లిఫ్టు ప్రమాదం విషాదాంతం.. బాలుడు అర్ణవ్ మృతి
సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్(6) తాజాగా మృతిచెందాడు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ణవ్ మృతిచెందినట్టు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే, లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో, బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు. ప్రమాదం ఇలా జరిగింది..నాంపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.అంతలోనే అర్ణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు.రెండు గంటల పోరాటం..మొదట గ్యాస్కటర్తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించి.. అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
Hyderabad : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ (6) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలోఫర్ వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌కు చెందిన ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు కేకలు వేశాడు. కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లిఫ్ట్-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని నాలుగు గంటల పాటు శ్రమించి వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బయటకు తీశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. -
Niloufer Hospital: నీలోఫర్‌లో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం
నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు ఆచూకీ లభించింది. శిశువును అపహరించి ఏపీలోని అనంతపురం జిల్లాకు తరలిస్తుండగా జాతీయ రహదారి 44పై గద్వాల జిల్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ బాష దంపతులకు నెల రోజుల క్రితం జహీరాబాదు ఏరియా ఆసుపత్రిలో మగ శిశువు జని్మంచాడు. చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్థానిక వైద్యుల సలహా మేరకు తల్లిదండ్రులు గత నెల 20న శిశువును నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెల రోజుల పాటు నిలోఫర్‌లో చికిత్స పొందిన శిశువును శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి చేసే ముందు శిశువు తల్లి, అమ్మమ్మ ఆరోగ్య శ్రీ వార్డుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచి్చన బుర్ఖా ధరించిన గుర్తు తెలియని మహిళ వృద్ధురాలితో మాటలు కలిపి తాను ఇక్కడే పనిచేస్తానంటూ చెప్పింది. చిన్నారి ముద్దుగా ఉన్నాడంటూ చేతిలో తీసుకుని వృద్ధురాలి దృష్టి మరల్చి శిశువును తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో శిశువు తల్లి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు బృందాలుగా రంగంలో దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ ఆచూకీని గుర్తించి వెంటాడారు. వారసుడి కోసమే... అనంతపురం జిల్లా, ముదిగుబ్బ కు చెందిన షాహీన్ బేగం, మేకల చెరువు ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటే‹Ù, అతడి భార్య రేష్మ అలియాస్ రేణుక ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి ఫస్ట్‌లాన్సర్‌లో ఉంటున్నారు. అబ్దుల్లా, రేష్మలకు 2009లో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేష్మ ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన వారు మగశిశువును తెచ్చుకుని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను నిలోఫర్ ఆస్పత్రిని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు సాయంగా ఉండేందుకు రేష్మ తన సోదరి షాహీన్ బేగంను హైదరాబాదుకు రప్పించింది. పథకం ప్రకారం గర్భంతో ఉన్న రేష్మ చికిత్స కోసం నిలోఫర్‌కు వచి్చనట్లుగా నటించారు. ఆమెకు సహయకురాలిగా షాహీన్ బేగం ఉంది. అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ ఆసుపత్రి వద్ద వేచి ఉంది. షాహీన్ బేగం ఆసుపత్రిలో నుంచి మగ శిశువుతో బయటికి వస్తున్న వృద్ధురాలు( శిశువు అమ్మమ్మ) దగ్గరకు వెళ్లి ఆమె దృష్టి మరల్చి వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుని ఆటోలో అక్కడి నుంచి పారిపోయింది. సీసీ కెమెరాలే పట్టించాయి... నిందితులను పట్టుకునేందుకు డీసీపీ నేతృత్వంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. నిలోఫర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. సీసీ పుటేజీల్లో లభించిన ఆధారాల ప్రకారం.. ఆటోలో నుంచి నిందితులు బైక్‌పైకి మారారు. మాసాబ్ ట్యాంక్ నుంచి ఎన్‌హెచ్–44 హైవేపైకి చేరుకున్న తర్వాత వారు మారుతీ ఓమ్నీ వాహనంలోనికి షిప్టు అయ్యారు. మెహిదీపట్నం మీదుగా బైక్ కర్నూల్ హైవే రోడ్డు వైపు వెళ్తుండగా గమనించిన మధ్య మండలం డీసీపీ గద్వాల్ ఎస్పీకి సమాచారం అందించారు. ఆయన మానవపాడు, ఉండవల్లి పీఎస్‌లను అప్రమత్తం చేశారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఎస్సైలు పుట్టా మహేష్ గౌడ్, ఎస్సై చంద్రకాంత్ వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో ఉన్న మగ శిశువు, నిలోఫర్‌లో కిడ్నాప్‌నకు గురైన శిశువు ఒక్కటేనని ధృవీకరించుకున్న తర్వాత శిశువును విచారణాధికారిగా ఉన్న నాంపల్లి ఎస్సై సాయి కుమార్‌కు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. కిడ్నాప్ కేసును చేధించిన నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, డీఐ ఎం.సైదేశ్వర్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్సైలు సాయి కుమార్, డి.శాంతికుమార్, పి.ప్రదీప్, కానిస్టేబుల్స్ నాగరాజు, సాగర్, రవి వర్మ, దీపక్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. సం‘జాయ్’కుమార్! సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు ఆర్.సంజయ్‌కుమార్. మొదటి ఫొటో ఆయన నాంపల్లి ఠాణా ఇన్స్పెక్టర్గా పని చేసిన 2017 అక్టోబర్ నాటిదైతే.. రెండోది సైఫాబాద్ ఏసీపీగా (నాంపల్లి ఠాణా కూడా ఈ డివిజన్లోనిదే) ఉండగా ఆదివారం (24 నవంబర్ 2024) తీసింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ ఉదంతాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. నిలోఫర్ ఆస్పత్రి, పబ్లిక్‌గార్డెన్స్, నాంపల్లి రైల్వేస్టేషన్ తదితరాలు దీని పరిధిలో ఉండటమే దీనికి కారణం. అప్పట్లో నాంపల్లి ఇన్స్పెక్టర్గా ఉన్న సంజయ్‌కుమార్ ఆ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్న తల్లి ఒడి నుంచి కిడ్నాపైన ఫయాజ్ ఖాన్‌ను (4 నెలలు) 15 గంటల్లో కాపాడారు. శనివారం నిలోఫర్ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన నెల రోజుల వయసున్న బాబును ఆదివారం తల్లి ఒడికి చేర్చారు. రెండు సందర్భాల్లోనూ తల్లి చేతికి చిన్నారులను అందిస్తుండగా కెమెరా కళ్లకు చిక్కిన అరుదైన దృశ్యాలివీ. 2017 నాటి ఫొటో అప్పట్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో మీడియాను ఆకర్షించింది. నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్ -
కిడ్నాప్ కు గురైన నెలరోజుల పసికందు సురక్షితం
-
నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్
నాంపల్లి: నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..జహీరాబాద్‌కు చెందిన హసీనాబేగం, గఫార్ దంపతులకు నెల రోజుల క్రితం ఒక మగ శిశువు జని్మంచారు. శిశువుకు పచ్చ కామెర్ల వ్యాధి సోకింది. దీంతో బాబును నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి నుంచి కోలుకున్న శిశువును శనివారం డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక శిశువు తల్లి, శిశువు అమ్మమ్మ పైఅంతస్తులోని వార్డు నుంచి కిందకు చేరుకున్నారు. మందులు తీసుకునేందుకు తల్లి కౌంటర్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో శిశువు అమ్మమ్మ చేతిలో ఉంది. ఇదే సమయంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ అక్కడకు చేరుకుంది. తాను ఆసుపత్రి సిబ్బంది అని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుంది. కాసేపు ఎత్తుకుని మాట్లాడిస్తున్నట్లు నటిస్తూ రోగులు ఉన్న గుంపులోకి వెళ్లింది. అక్కడ నుంచి ని్రష్కమించిన ఆ మహిళ మళ్లీ కనిపించలేదు. దీంతో తల్లి, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శిశువు ఆచూకీ కోసం ఆసుపత్రి ప్రాంగణమంతా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు చేసేదేమి లేక నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించారు. ఆసుపత్రి నుంచి శిశువును ఎత్తుకొని బయటకు వెళ్లిన మహిళ బుర్ఖాలో వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఆటోలో వెళ్లిన మహిళ కొంతదూరం వెళ్లాక ఆటో దిగి మరో ద్విచక్ర వాహనాన్ని ఎక్కి పారిపోయింది. -
నిలోఫర్‌లో ‘కుర్చీ’ కుస్తీ !
నాంపల్లి: ప్రముఖ నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య కొట్లాట జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియతో ఈ వైరం మొదలైంది. సూపరింటెండెంట్ పోస్ట్ నీదా... నాదా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్‌కు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఏడాది కూడా పూర్తికాక ముందే తనపై బదిలీ వేటు వేశారని, అక్రమ బదిలీని నిలుపుదల చేయాలంటూ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్‌కు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, న్యాయస్థానంలో డాక్టర్ ఉషారాణికి అనుకూలంగా తీర్పు వచి్చంది. కోర్టు ఆదేశాలతో డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. అయితే అక్కడ ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్ రవికుమార్ ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించారు. చెక్కుబుక్స్, సెల్‌ఫోన్‌ను తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రొఫెసర్ పోస్టులో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఉడుంపట్టు... అన్యాయంగా, అక్రమంగా తన పోస్టులో కొనసాగుతున్నారని డాక్టర్ ఉషారాణి ఆరోపిస్తుండగా, కాదు తనకే బాధ్యతలు ఇచ్చారంటూ డాక్టర్ రవి కుమార్ అంటున్నారు. ఇద్దరూ ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. డాక్టర్ రవికుమార్ పూర్తిస్థాయి బాధ్యతల కోసం కోఠిలోని డీఎంఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాను దళితుడినని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దళితుడేనని, ఎలాగైనా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అయితే ఈ వివాదాన్ని డీఎంఈ కార్యాలయం కూడా ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పడేసింది. మరోవైపు నిలోఫర్‌లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వైరల్ జ్వరాలు సోకి బాధితులతో కిక్కిరిసిపోతోంది. నిలోఫర్‌లో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌తో కలిపి మొత్తం 1,300 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ పడకలు ఎటూ సరిపోవడం లేదు. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేనికారణంగా నెల రోజులుగా పాలనంతా అస్తవ్యస్తమైంది. ఇప్పటికైనా నిలోఫర్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని రోగులు, రోగి సహాయకులు, ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. -
'హైదరాబాద్ కోహినూర్': ఆమెలా మరెవ్వరూ చనిపోకూడదని..!
కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు పట్టుకుపోయారని కథకథలుగా విన్నాం. కానీ మన హైదరాబాద్ కోహినూర్‌గా పిలిచుకునే మన నిజాం మహారాణి గురించి వినిలేదు కదా..!. ఆ రోజుల్లోనే ష్యాషన్‌కి ఐకాన్‌గా ఉండేది. ఆమె అందానికి తగ్గట్టు గొప్ప గొప్పదాతృత్వ సేవలకు కూడా పేరుగాంచింది. మన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నిర్మించడానికి కారణమే ఆమె. ఎవరీమె..? ఎలా మన హైదబాద్ నిజాం కుటుంబానికి కోడలయ్యింది తదితరాలు గురించి చూద్దాం.!మార్చి 3, 1924న టర్కీ పార్లమెంట్ ఖలిఫాను రద్దు చేసింది. ఖలీఫా అంటే వారసత్వం. దీని కారణంగా 101వ ఖలీఫా అబ్దుల్మెసిడి II కుటుంబం సామ్రాజ్యం నుంచి బహిష్కిరించబడింది. దీంతో వారిలో చాలామంది ఫ్రెంచ్ నగరాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన నీలూఫర్ హన్‌సుల్తాన్ కూడా ఒకరు. ఆమె తండ్రి మరణంతో తల్లి అడిలే సుల్తాన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో ఉండేవారు. అయితే హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్నకుమారుడు మోజమ్ తన అన్నయ్యతో కలిసి ఫ్రాన్స్‌కి వచ్చాడు. మోజమ్ అన్నయ ఆజం జా నీలూఫర్ బంధువైన డుర్రూషెహ్వార్ సుల్తాన్‌ను వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇక అతడి తమ్ముడు మోజామ్ ఒట్టోమన్ యువరాణి మహ్పేకర్ హన్‌సుల్తాన్‌తో పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే మోజామ్ నిలూఫర్‌ని చూసి ఆమె అందానికి మంత్రముగ్దుడై వెంటనే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరీ నీలోఫర్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఆమెను వివాహం అనంతరం నీలూఫర్ ఖానుమ్ సుల్తాన్ బేగం సాహిబా అని పిలిచేవారు. అలా నీలోఫర్ నిజాంకి చెందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు అయ్యింది. ఆమె నిజాం కోటలో ఆధునికత యుగానికి నాంది పలికింది. నిజాంను పాపా అని సంభోదించగలిగేది కూడా నీలూఫర్‌నే. అతడి కుమార్తెలు సైతం అతడిని సర్కార్ అని పిలిచేవారు. ఇక నీలోఫర్ తన బంధువు డుర్రోషెహ్వార్‌తో కలిసి మహిళల విముక్తి కోసం పనిచేసింది. మహిళలను ముసుగులు తొలిగించి స్వతంత్రంగా బతికేలా ప్రోత్సహించేవారు. ఇక నీలూఫర్ అందచందాలకు భర్త దాసోహం అన్నట్లుగా ఉండేవాడు. అందులోనూ ఆమె ఫ్యాషన్ శైలి ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె ధరించే చీరలు, ఆభరణలు నిజాం పాలనలో మంచి ట్రెండ్ సెట్ చేసేవి. అప్పట్లోనే ఆమె చీరలను ముంబైకి చెందిన డిజైనర్ మాధవదాస్ డిజైన్ చేసేవారు. ఆమె ఒట్టోమన్ మూలాలు నిజామీ సంస్కృతితో అందంగా కలిసిపోయాయి. అంతేగాదు ఆమె చీరలు ఎంతో ప్రజాధరణ పొందేవి. అవి ఇప్పటికీ న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీలో ప్రదర్శనగా ఉన్నాయి. అంతేగాదు ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచింది. పైగా ఆమెను ముద్దుగా 'హైదరాబాద్ కోహినూర్' అని పిలుచుకునేవారు కూడా. ఇక ఆమె బంధువు డుర్రూషెహ్వార్ ఒక కొడుకుకి జన్మనివ్వగా, నీలూఫర్ గర్భం దాల్చలేకపోయింది. అందుకోసం యూరప్‌లోని నిపుణులెందరినో కలిసింది. ఆ టైంలో వైద్య సదుపాయాలు బాగా కొరతగా ఉండేవి. దీని కారణంగానే ఆమె పనిమనిషి ప్రసవ సమయంలో మరణించింది. ఇది ఆమెను బాగా కుంగదీయడమే గాక మహిళల కోసం ఆస్పత్రిని నిర్మించేందుకు దారితీసింది. తన పనిమినిషిలా ఎంతమంది రఫాత్‌లు మరణిస్తారంటూ ప్రసూతి ఆస్పత్రిని నిర్మించింది. అదే నేడు నాంపల్లిలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి చరిత్ర గురించి నిజాం కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నజాఫ్ అలీఖాన్ చెబుతుంటారు.కాగా, నీలూఫర్ గర్భందాల్చకపోవడంతో ఆమె భర్త రెండోవ వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె తన తల్లితో జీవించడానికి తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె సామాజికి సేవలో ఎక్కువ సమయం గడుపుతుండేది. అలా 1963లో పారిస్‌లోని దౌత్యవేత్త, వ్యాపారవేత్త ఎడ్వర్డ్ జూలియాస్ పోప్‌ను వివాహం చేసుకుంది. ఇక శేషజీవితాన్ని పారిస్‌లోనే గడుపుతూ.. 1989లో మరణించింది. (చదవండి: దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!) -
నిలోఫర్ అగ్నిప్రమాదంపై అధికారుల స్పందన
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, అస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు. అయితే జరిగింది స్వల్ప అగ్ని ప్రమాదమేనని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి మీడియాకు తెలిపారు. ‘‘ల్యాబ్ లో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. మొదటి అంతస్తులో ల్యాబ్ లోని ఫ్రిడ్జ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా.. .. ఫ్రిడ్జ్ దగ్గరలో రబ్బరు పదార్థాల వల్ల ఎక్కువ పొగ వచ్చింది. దీంతో పేషంట్స్ అటెండర్స్ కొంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే మా సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదం లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సిబ్బంది ఫైర్ సేఫ్టీ పై ట్రైన్ అయ్యి ఉండడం వల్ల వెంటనే మంటలు ఆర్పివేశారు అని ఉషారాణి వెల్లడించారు. -
తెలంగాణలో కరోనా టెన్షన్ ...పెరుగుతున్న కేసులు
-
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కరోనా
-
పుట్టిన పిల్లలు బతుకుతలేరని.. బాలుడి కిడ్నాప్
హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి నుంచి గత గురువారం అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి ఆచూకీ దొరికింది. బాన్సువాడలో ఆ చిన్నారికి రెస్క్యూ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్య మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలనే మమకారం తప్ప ఎలాంటి ఇతర కోణం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే నిందితులపైనా పోలీసులు మానవత్వం చూపడం కొసమెరుపు. కుమారుడి వైద్యం కోసం రాగా.. ► కామారెడ్డి జిల్లా కొత్తాబాద్ తండాకు చెందిన కె.మమత, కూరగాయల వ్యాపారి శ్రీను దంపతులు. వీరికి గతంలో ఇద్దరు మగ పిల్లలు పుట్టినా హైపర్ విస్కోసిటీ సిండ్రోమ్ అనే జన్యుపరమైన వ్యాధితో చనిపోయారు. ఇటీవలే మమతకు మరో బాబు పుట్టాడు. పది రోజుల వయసున్న అతడికీ అదే వ్యాధి సోకిందని, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. దీంతో ఓ మగ శిశువుని కిడ్నాప్ చేసి పెంచుకుందామని ఈ దంపతులు పథకం వేశారు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఇద్దరూ కలిసి తమ చిన్నారితో గత గురువారం నగరానికి చేరుకున్నారు. ► గండిపేట్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఫరీదా బేగానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు (4) అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో ఆమె పెద్ద కుమారుడు, చిన్న కుమారుడిని (6 నెలలు) తీసుకుని కలిసి గత గురువారం ఉదయం నిలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. పెద్ద కుమారుడిని తండ్రి వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా.. ఫరీదా బేగం తన చిన్న కుమారుడితో కలిసి వెయిటింగ్ హాల్లో ఉంది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బాలుడు నిద్రించడంతో ఆమె బాలుడిని అక్కడే పడుకోపెట్టి ఆహారం కోసం బయటికి వెళ్లింది. అప్పటికే ఆమెతో మాటలు కలిపిన మమత తన కుమారుడి వైద్యం కోసం వచ్చానని చెప్పింది. సొంతూరికి వెళితే అనుమానిస్తారని.. ఫరీదా తన చిన్న కుమారుడిని వదిలి వెళ్లడంతో అదను కోసం వేచి చూసిన మమత.. తన కుమారుడిని అక్కడే వదిలేసి ఆరు నెలల బాలుడిని తీసుకుని ఉడాయించింది. అక్కడ నుంచి ఆటోలో జూబ్లీబస్ స్టేషన్‌కు చేరుకోగా.. లక్డీకాపూల్ ప్రాంతంలో వేచి ఉన్న ఆమె భర్త శ్రీను బస్సులో వెళ్లాడు. అక్కడ కలుసుకున్న ఇద్దరూ కొన్నిరోజులు స్వగ్రామానికి వెళ్లకూడదని భావించారు. తమ పది రోజుల శిశువు స్థానంలో ఆరు నెలల బాలుడిని తీసుకువెళ్తే ఎవరైనా అనుమానిస్తారని, ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు బాన్సువాడలో తల దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. బాన్సువాడలో ఉన్న తన స్నేహితుడి ద్వారా శ్రీను ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. గత శుక్రవారం నుంచి నిందితులు ఇద్దరూ కిడ్నాప్ చేసిన బాలుడితో అందులోనే ఉంటున్నారు. ఈ శిశువుకు మమత బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పాలు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లు నిలోఫర్‌లో వదిలేసిన బాలుడిని అదే రోజు గుర్తించిన వైద్య సిబ్బంది నాంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదైంది. ఫరీదా ఫిర్యాదు మేరకు మరో కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేశారు. -
నిలోఫర్ ఆస్పత్రిలో మిస్సైన బాలుడి ఆచూకీ లభ్యం
-
HYD: నిలోఫర్ ఆసుపత్రిలో దారుణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో నుంచి ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో, ఘటన ఆసుపత్రిలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నిలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల బిడ్డ అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఆసుపత్రి నుంచి ఎత్తుకెళ్లారు. అయితే, బిడ్డ తల్లి భోజనం కోసం వెళ్లగా చిన్నారిని దుండగులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో బాధితురాలు నాంపల్లి పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. నిలోఫర్ ఆసుపత్రి ట్రీట్మెంట్ వార్డులో సీసీ కెమెరా లేకపోవడంతో దర్యాప్తు చేయడం పోలీసులకు సమస్యగా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం -
హైదరాబాద్ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు. ► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. ► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. నిలోఫర్‌లో సర్జరీలు వాయిదా నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్ 4 ప్యాక్డ్ సెల్స్, ఏడు ప్లాటింగ్ ప్యాక్చర్స్ (క్రయోన్స్) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది. దాతలు ముందుకు రావడం లేదు కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం. – లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్‌బ్యాంక్స్ అసోసియేషన్ బ్లడ్ బ్యాంక్‌లన్నీ తిరిగాను మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్‌కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. – సీహెచ్.లక్ష్మి, బడంగ్పేట్ -
గంటల వ్యవధిలోనే పాపను కాపాడి.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
-
నిలోఫర్‌లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్ప్రత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు తెలిసింది. డాకర్టులు వేసిన ఇంజెక్షన్లు వికటించడం వల్లే తమ పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్లు వల్లే చిన్నారులు చనిపోయారని కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. చిన్నారులను ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే వారి ఆరోగ్యం విషమించిందని తెలిపారు. చనిపోయింది ఒకరే.. ఇద్దరు కాదు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయింది ఒక చిన్నారని, ఇద్దరు కాదని వెల్లడించారు. ఈ నెల 28న చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకోని వచ్చారని తెలిపారు. రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ సిండ్రోమ్ వ్యాధితో ఆ చిన్నారి బాధ పడుతుందని అన్నారు. 7వ నెలలో పుట్టిన ఒక కేజీ బరువుతో ఉన్న ఆ చిన్నారి బుధవారం ఉదయం సుమారు 6గంటల సమయంలో మృతి చెందినట్లు చెప్పారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు లోపల అవయవాలు ఎదుగుదల ఉండదని అన్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ మీద ఉంచామని తెలిపారు. బాధలో ఉన్న తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వలన తప్పిదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి కేటీఆర్ భరోసా
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): చిన్నారి విష్ణువర్ధన్ వైద్యానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఈనెల 28న పసివారికి ప్రాణం పోయండి అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచూరితమైన కథనాన్ని కవ్వాల్ గ్రామానికి చెందిన తిరుపతి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి, ఆదుకోవాలని కోరారు. మంత్రి ఆఫీస్ నుంచి స్పందిస్తూ బాధిత కుటుంబ వివరాలను తెలియజేయాలని గురువారం రీట్వీట్ చేశారు. దీంతో విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా లభించినట్లేనని చిన్నారి తండ్రి రమేశ్ తెలిపారు. అదేవిధంగా పలువురు దాతలు ఆన్లైన్ ద్వారా సాయమందించినట్లు ఆయన పేర్కొన్నారు. నీలోఫర్‌కు ‘నెలరోజుల బాబు’ ఖానాపూర్: మండలంలోని సేవ్యానాయక్ తండాకు చెందిన బి.గబ్బర్‌సింగ్, సుమలత దంపతుల నెలరోజుల వ యస్సు గల శిశువు అనారోగ్య పరిస్థితిపై ‘వెంటిలేటర్‌పై నెలరోజుల బాబు’ అనే శీర్షికతో ఈనెల 29న ‘సాక్షి’లో ప్రచూరితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వినిత్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఖానాపూర్ ఆరోగ్యమిత్ర సునీత గ్రామంలోని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు నిర్మల్ నుంచి నిజామాబాద్ తీసుకెళ్లిన ఆరోగ్యం కుదుట పడలేదన్నారు. దీంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ రెఫర్ చేశామని ఆరోగ్యమిత్ర సునీత గురువారం ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కేకేకు కోవిడ్ పాజిటివ్ -
నిలోఫర్‌ను 1,800 పడకల ఆస్పత్రిగా మారుస్తాం: మంత్రి హరీశ్
నాంపల్లి (హైదరాబాద్): ఆరోగ్యరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని ఆర్థిక, వైద్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లో దేశ సగటు కన్నా ముందంజ లో ఉన్నామని చెప్పారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు విశేషమని అభినందించారు. నిలోఫర్‌ను 1,800 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీఇచ్చారు. శనివారం నిలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్టైనర్ సంయుక్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.18 కోట్లు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎలాంటి పరికరాలున్నాయో సీఎం కూడా అవే పరికరాలను అందజేసినట్లు హరీశ్ తెలిపారు. ‘హైదరాబాద్ నలువైపులా నాలుగు మెడికల్ టవర్స్ తెచ్చి కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం నిర్ణయించారు. మెడికల్ కాలేజీల సంఖ్య కూడా పెంచుతాం. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 5 నుంచి 21కి పెంచాం’అని వివరించారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేం దుకు రాష్ట్రప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని, ఇందుకు రూ.133 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. చిన్న పిల్లల కోసం 5 వేల పడకలు సిద్ధం చేశామని హరీశ్ పేర్కొన్నారు. -
Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. ఫీవర్ ఆస్పత్రిలో క్యూలైన్.. నిలోఫర్ ఆవరణలో కిక్కిరిసి.. -
నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదు.. వార్డుల్లో పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల వార్డుబాయ్ 100 రూపాయల కోసం ఆక్సిజన్‌ను మార్చడం వలన ఒక పసివాడి నిండు ప్రాణం పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బాధితుల బంధువులు మూకుమ్మడిగా ఆస్పత్రి లోపలికి వచ్చారు. దీంతో.. ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధిత బంధువులు.. ఎక్కడ దాడిచేస్తారోనని భయపడిపోయారు. తక్షణం.. తమకు సరైన భద్రత కల్పించాలని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు -
వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది
సాక్షి,నాంపల్లి(హైదరాబాద్): ఆస్పత్రి అటెండర్ కక్కుర్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన శనివారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ ఆజం కుమారుడు షేక్ ఖాజా(3) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 27న నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి వెంటిలేటర్ అమర్చి వైద్యం అందిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సుభాష్ అనే అటెండర్ శనివారం ఆ వార్డుకు వచ్చాడు. పక్క బెడ్ మీద ఉన్న రోగి సహాయకుల నుంచి వంద రూపాయలు తీసుకుని షేక్ ఖాజాకు సంబంధించిన వెంటిలేటర్‌ను మార్చేశాడు. కొద్దిసేపటికే షేక్ ఖాజా శ్వాస అందక మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించారు. చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి.. -
చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి గ్రేటర్ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్‌గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్ రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ సహా నల్లకుం ట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. హైదరాబాద్ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది. ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్లెట్ కౌంట్స్ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్ డెంగీ కేసుగా అడ్మిట్ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. డెంగీకి కారణాలివే – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా ►ఎడిస్ ఈజిప్టే (టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. ►కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి. ►ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలి. ►వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. ►ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి. సీజన్ మారుతుండటం వల్లే – డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి. -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్‌నకు చెందిన సురేష్‌బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్‌మాల్‌కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నీలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేష్‌బాబు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేష్‌బాబు పోలీసులు అరెస్ట్ చేశారు. పేషెంట్లకు ఇచ్చే డైట్ బిల్స్‌లో సురేష్‌బాబు అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఇందులో రూ.కోటి 20లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. నీలోఫర్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
థర్డ్ వేవ్ కోసం భారీగా పడకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ థర్డ్‌వేవ్ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను సమకూర్చుకోవడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిలోఫర్‌లో 1000 పడకలుండగా వీటిని 2000 పడకలకు పెంచనున్నారు. 100 పడకలతో సేవలందిస్తోన్న మలక్ పేట, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మల్కాజిగిరి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రులను 200-250 పడకలకు పెంచనున్నారు. నాలుగు వారాల్లోగా అదనపు ఏర్పాట్లు పూర్తవుతాయని వైద్య వర్గాలు తెలిపాయి. -
పీడియాట్రిక్ అధ్యయన కేంద్రంగా నిలోఫర్
నాంపల్లి: ‘కోవిడ్ థర్డ్‌వేవ్ అంటూ వస్తే ఫ్రెండ్‌లాగా వస్తుంది. మనందరి ఆలోచనల్లో అది రాకూడదనే ఉంటుంది. కానీ, ఒకవేళ వస్తే మన సేవల్లో లోటుపాట్లు ఉండకూడదు. రోగాన్ని నిరోధించడానికి 200 శాతం మనం సిద్ధంగా ఉండాలి’అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ చిన్నపిల్లల ఆస్పత్రి అయిన నిలోఫర్ వైద్యులకు సూచించారు. ‘థర్డ్ వేవ్ నివారణకు కావాల్సిన మందులు, డయాగ్నోస్టిక్స్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఆర్డర్ చేశాం. వీటితోపాటు అదనపు సిబ్బందిని సమకూర్చుకొని సూపర్ స్పెషాలిటీ కోవిడ్ నోడల్ కేంద్రంగా నిలోఫర్ పనిచేయాలి. ఈ ఆస్పత్రి వైద్యసేవలు అందించడంతోపాటు అధ్యయన కేంద్రంగా మారాలి. ఇతర జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కూడా చిన్న పిల్లలకు ఎలాంటి వైద్యసేవలు అందాలో మీరే ఒక ప్రణాళికను రూపొందించాలి. చిన్న పిల్లల మరణాలను పూర్తిస్థాయిలో తగ్గించే దిశగా ఆలోచనలు మెరుగుపడాలి’అని అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్, పాత భవనసముదాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడారు. ‘థర్డ్‌వేవ్ గురించి వింటున్నప్పటి నుంచి నేను నిలోఫర్‌కు రావాలని, ఇక్కడేమి జరుగుతుందో చూడాలని భావించానన్నారు. ఎన్ని కేసులు వచ్చినా... నిలోఫర్ ఆస్పత్రిలో పడకల సంఖ్య రెట్టింపైతే ఏ కేసు వచ్చినా ఎదుర్కొనగలుగుతామని, వైద్యులకు నిరంతర శిక్షణ సాగాలని సీఎస్ అన్నారు. ప్రస్తుతం ఇక్కడ థర్డ్‌వేవ్ లక్షణాలు కలిగిన ఐదారు కేసులు ఉన్నాయని, నిలోఫర్‌ను ఆరువేల పీడియాట్రిక్స్ పడకలు, 1,500 కోవిడ్ పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన వారే కాదు, మన ప్రక్కన ఉన్న నాలుగు రాష్ట్రాలకు చెందిన రోగులు వస్తారు. వారికి కూడా మనమే చూడాలన్నారు. ఆస్పత్రి భవనం టెర్రస్ మీదకు వెళ్లి.. నిలోఫర్ ఆస్పత్రి భవనం టెర్రస్ మీదకు సోమేశ్ కుమార్ వెళ్లి ప్రాంగణాన్ని పూర్తిగా సర్వే చేశారు. తాత్కాలిక షెడ్లు వేస్తే ఎన్ని పడకలు అందుబాటులోకి వస్తాయంటూ అధికారులతో చర్చించారు. అనంతరం పాత భవనం పైకప్పుపై కలియదిరిగారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడున్న పీడియాట్రిక్ విభాగాలను పరిశీలించారు. సుమారు గంటన్నరపాటు ఆసుపత్రిలో ఉంటూ వైద్యులతో థర్డ్‌వేవ్‌పై సమీక్షించారు. అక్టోబర్‌లోగా అందరికీ వ్యాక్సిన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని, అక్టోబర్ నెలాఖరు నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బ్యాంక్ అధికారులు, సిబ్బందికి చేపట్టాల్సిన వ్యాక్సినేషన్‌పై శనివారం ఆయన వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
నిలోఫర్‌లో చిన్నారుల తారుమారు
గన్‌ఫౌండ్రీ: అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారైన ఘటనలు అప్పుడప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇదే తరహా ఘటన నిలోఫర్ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబీబ్ నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం రాత్రి నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అదే సమయంలో అబ్దుల్ బాసిద్ అనే వ్యక్తి భార్య సైతం ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అబ్దుల్ జాఫర్‌కు చెందిన చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వార్డు బాయ్ సూచించడంతో అతడి సోదరి ఫరీదాబేగం చిన్నారిని పరీక్షల నిమిత్తం తీసుకెళ్లింది. పరీక్షల అనంతరం చిన్నారి రంగు, దుస్తులు మారిపోవడంతో జాఫర్ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో బాసిద్ చిన్నారిని సైతం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువచ్చారని, ఈ సమయంలో చిన్నారుల తారుమారు జరిగిందని జాఫర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు చిన్నారులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఎవరి బిడ్డను వారికి అప్పగిస్తామని తెలిపారు. ( చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం ) -
లోకం చూడకముందే కళ్లు మూస్తున్నారు
‘నల్లగొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సుజాత నాలుగు రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. బిడ్డను తీసుకుని ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికిచేరుకున్నారు. అయితే ఉదయం వరకు బిడ్డను ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. రెండు రోజుల క్రితం బండ్లగూడకు చెందిన రాగిణి పేట్లబురుజు ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కడుపులో ఉండగా ఉమ్మనీరు తాగడంతో బిడ్డను చికిత్స కోసం నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో శిశువు మృతి చెందింది‘. ఇలా ఒక్క సుజాత, రాగిణిల బిడ్డలే కాదు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న అనేక మందికి ఇదే అనుభవం ఎదురవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం..సకాలంలో వైద్యం అందకపోవడంతో అనేక మంది శిశువులు మృత్యువాతపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ బకాయిలు పేరుకపోవడంతో ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బాధితులకు చికిత్సలను నిరాకరిస్తుండటంతో వారంతా నిలోఫర్‌ను ఆశ్రయిస్తున్నారు. సీరియస్ కండిషన్లో వస్తున్న రోగుల సంఖ్య ఇటీవల రెట్టింపైంది. ఆస్పత్రిలో వీరికి ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడం, చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతోంది. ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దులోని మహారాష్ట్ర, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుండటం, నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించడం, పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడం, అవయవాల నిర్మాణం సరిగా లేకపోవడం, ఉమ్మనీరు మింగడం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. నిజానికి 2014తో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ (ఎమర్జన్సీ వార్డు)వచ్చాక అదనంగా మరో 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వెంటిలేటర్లు, ఆల్ట్రా సౌండ్, ఎక్సరే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వైద్యపోస్టులు కూడా చాలా వరకు భర్తీ అయ్యాయి. మౌలిక సదుపాయాల పెంపు తర్వాత మరణాల రేటు తగ్గాల్సిందిపోయి...ఏటా మరింత పెరుగుతుండటం తల్లిదం డ్రులకు తీవ్ర ఆందోళన కలి గిస్తుంది. సంరక్షకులే నర్సుల అవతారం.. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో 130 మందే ఉన్నారు. 200 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 75 మంది, జనరల్ వార్డులో ప్రతి ఐదుగురు శిశువులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, యాభై మందికి ఒకరు, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లో ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, ఇరువై మందికి ఒక నర్సు మాత్రమే ఉంది. ప్రతి వెంటిలేటరుకు కనీసం నాలుగు రౌండ్లకు కలిపి కనీసం నలుగురు నర్సులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పని చేస్తున్న పదిహేడు వెంటిలేటర్లకు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఆస్పత్రిలో సరిపడా నర్సులు లేకపోవడంతో ఆ బాధ్యత కూడా సంరక్షకులే నిర్వహించాల్సి వస్తోంది. వీరంతా కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకుండా పాదరక్షలతోనే వార్డుల్లోకి వెళ్తున్నారు. ఆసుపత్రికి ప్రస్తుతం 289 మంది నర్సుల అవసరం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం జీవో నెంబరు 88 ప్రకారం ఆ పోస్టులు మంజూరు చేసి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమాకాలు చేపట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తల్లిదండ్రులకు తప్పని గుండె కోత.. హృద్రోగ సమస్యలతో నిత్యం 100 మంది వరకు శిశువులు వస్తుంటారు. వీరికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయాలి.ఆస్పత్రిలో ఈ మిషన్లు లేక పోవడంతో రోగులను ఉస్మానియాకు తరలిస్తున్నారు. అప్పటికే అక్కడ రోగుల రద్దీ ఎక్కువ ఉండటంతో శిశువుల వైద్యపరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యూరోసర్జరీ, న్యూరోఫిజీషియన్, నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్నీ వైద్య నిపుణులు లేకపోవడంతో ఆయా సమస్యలతో బాధపడుతున్న శిశువులను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక టెస్టులన్నీ కేవలం గంట వ్యవధిలోనే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి అమలు కావడం లేదు. ఇన్ వార్డులతో పాటు క్యాజువాలిటీ, సర్జికల్, ప్రసూతి వార్డుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు కన్పించడం లేదు. ఒక వేళ ఉన్నా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కళ్లముందే కన్నబిడ్డ మృవాత పడుతుండటంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో వైద్యులపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
వారియర్స్‌పై వైరస్ పంజా!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్–19 బాధితుల సేవ లో ఉన్నవారినీ కరోనా వదలడంలేదు. డాక్ట ర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేసే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగిని గాంధీ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందు తూ మరణించడంతో వారిలో తీవ్ర భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. తాము వైరస్ బాధితులకు చికిత్స చేస్తున్నందున ఎక్కువగా ప్రభావితం అవుతున్నామని, ప్రభుత్వం తమ కు సాయం చేయాలని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వేడుకుంటున్నారు. కరోనా పోరాటంలో అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పిస్తూ బుధవారం రాత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అందని కేంద్ర బీమా సాయం... కరోనాతో చనిపోయిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం బీమా కల్పించింది. ఆ బీమా కింద చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల బీమా అందిం చాలి. అయితే ఇప్పటివరకు 12 మంది చనిపోతే ఒక్కరికి కూడా ఆ స్కీం కింద బీమా సొమ్ము అందలేదని వైద్య సంఘాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చనిపోయిన ఇద్దరు నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షలు మంజూరయ్యాయని, అయితే వారి చేతికి ఇంకా డబ్బు అందలేదని చెబుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బీమా సంస్థ అనేక కొర్రీలు పెడుతుందని వైద్య సంఘాలు అంటు న్నాయి. కరోనాతో చనిపోయినవారిలో ఎవరికైనా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయా అన్న విషయంలో మెలిక పెడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అటువంటివారికి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆ సంఘాలనేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కరోనా బీమా నిబంధనల్లో అటువంటి షరతు ఏమీ లేదంటున్నారు. వైరస్ నియంత్రణ విధుల్లో ఉంటూ ప్రమాదవశాత్తు చనిపోయి నా బీమా సొమ్ము ఇవ్వాలన్న నిబంధన ఉన్న ట్లు చెబుతున్నారు. కానీ, మెలికల వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చనిపోయే వైద్య సిబ్బంది వివరాలు లేకపోవడంతో ఆయా కుటుంబాలకు ఎటువంటి సాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమే కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి... కేంద్ర సాయంతో సంబంధం లేకుండా కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ నరహరి ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ తరతమ భేదం లేకుండా అందరికీ కోటి రూపాయలు అందించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు కేంద్ర బీమా నుంచి ఇప్పటివరకు ఒక్కపైసా రాలేదని విచారం వ్యక్తంచేశారు. ఇటీవల చనిపోయిన డాక్టర్ నరేష్ కుటుంబానికి తామే రూ.40 లక్షలు వసూలు చేసి ఇచ్చామన్నారు. ఇక కరోనా సోకి పరిస్థితి తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది అందరికీ గాంధీ ఆసుపత్రిలో కాకుండా నిమ్స్‌లోనూ, అవసరమైతే ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధునాతన వైద్యం అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో 1,500 మంది సిబ్బందిపై కరోనా రాష్ట్రంలో అనేకమంది డాక్టర్లు, నర్సులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బంది కరోనా బారిన పడ్డారు. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కలుపుకొని 1,500 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో వెయ్యిమంది కరోనాకు గురయ్యారని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే 12 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు. చనిపోయినవారిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా కారణంగా ఎంతమంది చనిపోయారన్న సమాచారం తమకు అందలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
‘నిలోఫర్’ ఫుడ్ కాంట్రాక్టర్‌పై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేశ్‌బాబు అవినీతికి పాల్పడినట్లు తేలినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవినీతిపరుడైన అతనికే మరో రెండు ఆసుపత్రుల ఫుడ్ కాంట్రాక్టును ఎలా అప్పగిస్తారని నిలదీసింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిలోఫర్ ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ సురేశ్‌బాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలంటూ నగరానికి చెందిన డాక్టర్ భగవంతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. సురేశ్‌బాబు తప్పుడు బిల్లులు పెట్టి అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారుల విచారణలో తేలిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. ‘అవినీతికి పాల్పడ్డాడని తేలినా వెంటనే చర్యలు తీసుకోకుండా ఇంకా ఎందుకు అతన్ని ఉపేక్షిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా తప్పు చేసిన వ్యక్తికే మరో రెండు ఆసుపత్రుల ఫుడ్ కాంట్రాక్టును అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారుల విచారణ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలి’అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా విచారణ జరిపి, వివరణ ఇచ్చే అవకాశమిచ్చిన తర్వాతే సురేశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నివేదించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ 3 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, వాటిని వివరిస్తూ నివేదికను సెప్టెంబర్ 16న తమకు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. రూ.1.13 కోట్ల అవినీతి.. నిలోఫర్ ఆసుపత్రి ఫుడ్ కాంట్రాక్టర్ సురేశ్ బాబు 2017–2020 మధ్య రూ.1,13,28,320 అవినీతికి పాల్పడ్డాడని విచారణ కమిటీ నివేదికలో తేలిందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డాక్టర్ల ఆహారానికి రూ.86, సాధారణ ఆహారానికి రూ.40, హైప్రొటీన్ ఆహారానికి రూ.56 చొప్పున చెల్లించేవారని తెలిపింది. అయితే డాక్టర్లు, పోషకాహార నిపుణులు సూచించకుండానే 90 నుంచి 95 శాతం రోగులకు సాధారణ ఆహారాన్నే ఇచ్చి హైప్రొటీన్ ఆహారాన్ని ఇచ్చినట్లుగా సురేశ్ బాబు తప్పుడు రికార్డులు సృష్టించాడని వివరించింది. -
సురేష్‌పై ఎందుకంత ప్రేమ? : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ అక్రమాలపై విచారణ జరపాలన్న పిల్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ కమిటీ నివేదిక ఇచ్చి ఐదు నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై ఎందుకంత ప్రేమ? అని ధర్మాసనం ప్రశ్నించింది. (చదవండి : జిల్లాకు రూ.లక్ష ఏం సరిపోతాయి?) కాంట్రాక్టర్ సురేష్ కుమార్‌ను అందరూ వెనకేసుకొస్తున్నట్టు కనిపిస్తోందని, కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్టర్ సురేష్‌కుమార్ పనితీరును పరిశీలించి, ఆగష్టు 17లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
2 నెలల శిశువుకు కరోనా.. క్వారంటైన్లోకి వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి వచ్చిన 2 నెలల శిశువుకి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. అతనికి వైద్యం అందించిన వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసిన అన్ని విభాగాల సిబ్బందిని క్వారంటైన్‌కి వెళ్లాలని ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 200 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు సహా ఇతర సిబ్బంది ఉన్నారు. (చదవండి : క్వారంటైన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం) నారాయణపేట్ జిల్లా అభంగాపూర్‌కు చెందిన ఓ మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక రెండు నెలల వయసున్న చిన్నారి అస్వస్థత గురవడంతో నిలోఫర్‌కు తరలించారు. పరీక్షల్లో చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు పంపించారు. ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. -
2 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్
-
ఇంక్యుబేటర్ కంటే తల్లి పొత్తిళ్లే ఎంతో మేలు
సాక్షి,సిటీబ్యూరో: నెలలు నిండకుండా.. తక్కువ బరువుతో జన్మించే శిశువుల కోసం నిలోఫర్ ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘కంగారూ మదర్ కేర్’ (కేఎంసీ) సర్వీసులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంక్యుబేటర్ సపోర్ట్ సహా పైసా ఖర్చు లేకుండా స్వయంగా తల్లే తన బిడ్డను కాపాడుకునేఅవకాశం ఉండడంతో ఈ సేవలకు డిమాండ్ బాగా పెరిగింది. శిశు మరణాల రేటును 40 శాతం తగ్గించడమే కాకుండా 55 శాతం ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల శిశువులు నెలలు నిండకుండా తక్కువ బరువుతో జన్మిస్తుండగా, మనదేశంలో 8 మిలియన్ల మంది పుడుతున్నారు. వీరిలో 60 శాతం మందికి ‘కంగారూ మదర్ కేర్’ సర్వీసులు అవసరం అవుతుంటాయి. ప్రతిష్ఠాత్మాక నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో రోజుకు సగటున 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతుంటే, వీటిలో ఆరు నుంచి ఏడుగురు శిశువులకు ‘కేఎంసీ’ సర్వీసులు అవసరమవుతున్నాయి. ఇంక్యుబేటర్ విధానం ఖర్చుతో కూడుకున్నది కాగా.. ‘కేఎంసీ’లో ఎలాంటి ఖర్చు ఉండదు. దీంతో నిరుపేద తల్లులు తమ బిడ్డలను సంరక్షించుకునేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. తల్లీ,బిడ్డల మధ్య ఆత్మీయ స్పర్శను పెంచుతుంది. ఆశించిన స్థాయిలో మానసిక, శారీరక ఎదుగుదల ఉండడంతో పాటు ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ అయ్యేందుకు దోహదపడుతుంది. 14 వేల మంది పిల్లలకు సేవలు జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తొలుత నల్లగొండ జిల్లా, సిద్దిపేట ఆస్పత్రుల్లో ఈ సేవలను ప్రారంభించింది. తర్వాత 2017 నవంబర్‌లో నిలోఫర్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఈ ‘కంగారూ మదర్ కేర్’ యూనిట్లో రోజుకు సగటున 20 మంది శిశువులకు సేవలు అందిస్తున్నారు. ఇలా గత రెండేళ్లలో 14 వేలకు పైగా శిశువులకు సేవలను అందించారు. తల్లే తన బిడ్డను సంరక్షించుకునే అవకాశం ఉండడంతో కేవలం నిలోఫర్‌లో ప్రసవించిన తల్లిబిడ్డలకే కాకుండా ఇతర ఆస్పత్రుల్లో జన్మించి, కేఎంసీ సర్వీసులు అవసరమైన తక్కువ బరువుతో జన్మించిన(ఆరోగ్యం నిలకడగా ఉన్న) శిశువులకు రోజుకు సగటున నాలుగు నుంచి 12 గంటల పాటు ఈ కేఎంసీ సేవలు అందిస్తున్నారు. ‘‘సాధారణంగా నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టిన శిశువు శరీర ఉష్ణోగ్రతను కాపాడేందుకు వైద్యులు కొన్ని రోజుల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఇందులో తల్లి ఓ చోట.. బడ్డ మరోచోట ఉంటారు. అయితే, ‘కంగారూ మదర్ కేర్’లో అలాంటి బిడ్డను ఓ గుడ్డలో చుట్టి తల్లి ఛాతిపైనే పడుకోబెడతారు. దీని ద్వారా తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకు అందడంతో తల్లి పాలు తాగేందుకు వీలుంటుంది. ఫలితంగా బిడ్డ త్వరగా బరువు పెరిగి వేగంగా కోలుకోడడంతో పాటు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పైగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందడదు. తల్లి ఛాతిపై బిడ్డ పడుకోవడంతో ఆమె గుండె చప్పుడు, పల్స్‌ను వినడం ద్వారా బిడ్డలో వినికిడి శక్తి పెరుగుతుంది. వాస్తవానికి పుట్టిన బిడ్డకు మీటర్ దూరం దాటిన వస్తువులను, మనుషులను చూడలేదు. కానీ ‘కంగారూ మదర్ కేర్’ ద్వారా తల్లిని తరచూ చూడ్డంతో చూపు కూడా వేగంగా మెరుగుపడుతుంది.’’ కేఎంసీతో ఎన్నో లాభాలు.. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ‘కంగారూ మదర్ కేర్’ను సూచిస్తారు. స్కిన్ టచ్ వల్ల తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత, అనురాగాలు మెరుగుపడుతాయి. ఆకలితో బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలను పడుతుండడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ మెరుగుపడుతుంది. తల్లిపాలలోని బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతోంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ. త్వరగా జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది. బిడ్డ శ్వాస నాళాల పనితీరు మెరుగుపడడంతో పాటు భవిష్యత్‌లో శ్వాస సంబంధ సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు.– డాక్టర్ రమేష్, ఆర్ఎంఓ, నిలోఫర్ -
క్లినికల్ ట్రయల్స్‌లో ఉల్లంఘనలు
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్‌లో జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో ఉల్లంఘనలు జరిగినట్లు త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. అయితే అవేవీ పెద్దవి కావని, చిన్నపాటి ఉల్లంఘనలేనని కమిటీ పేర్కొంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రభుత్వానికి మంగళవారం నివేదిక అందజేశారు. ఆ నివేదికను అధికార వర్గాలు గోప్యంగా ఉంచుతు న్నాయి. నిలోఫర్‌లో చిన్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు, కొన్ని ఉల్లంఘనలు, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సర్కారు కదిలింది. నిలోఫర్‌లో జరిగిన ఔషధ ప్రయోగాల డాక్యుమెంట్లను పరిశీలించి ఒక్క రోజులోనే త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసింది. నివేదికలో ఉన్న అంశాలను ఉన్నత స్థాయి వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చిన ఎథిక్స్ కమిటీ, ఆ తర్వాత ఔషధ ప్రయోగాలు ఎలా జరుగుతున్నాయో తరచుగా పర్యవేక్షించలేదని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరిపినప్పుడు ఎథిక్స్ కమిటీ అనుమతి మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కూడా తప్పనిసరి. కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరిపినట్లు కమిటీ గుర్తించింది. క్లినికల్ ట్రయల్స్ సమయంలో వచ్చే శాస్త్రీయమైన, న్యాయపరమైన చిక్కులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తేలినట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ ఎన్నాళ్లు నిర్వహిస్తున్నారన్న దానిపైనా నిర్ధిష్ట కాలపరిమితి పేర్కోలేదని తేలింది. ట్రయల్స్ వివరాలను క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (సీటీఆర్ఐ)లో నమోదు చేయలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి నుంచి పూర్తిస్థాయి ఆమోదం తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది. ప్రతిష్ట దెబ్బతినకూడదన్న భావన.. నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని, కాబట్టి క్లినికల్ ట్రయల్స్‌లో ఏవైనా పొరపాట్లు జరిగినా వాటిని భూతద్దంలో చూపకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే మొదట్లో నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కొందరు వైద్యాధికారులు ఇప్పుడు చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు. పరస్పరం కొందరు డాక్టర్ల మధ్య వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ విషయం.. ఇప్పుడు ఆయా వర్గాల మధ్య రాజీ తీసుకురావడం ద్వారా క్లినికల్ ట్రయల్స్‌లోని లోపాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని వైద్యాధికారులు కొందరు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కొద్దిపాటి ఉల్లంఘనలు వాస్తవం: ఈటల నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌లో కొద్దిపాటి ఉల్లంఘనలు జరిగిన మాట వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అంగీకరించారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన చర్యలు: డీఎంఈ నిలోఫర్ సంఘటన నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఎథిక్స్ కమిటీలకు ట్రయల్స్‌పై దిశానిర్దేశం చేశామన్నారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ట్రయల్స్ జరుగుతున్నాయో సమగ్ర సమాచారం కావాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడ అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నిలోఫర్‌లో ట్రయల్స్‌పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపామన్నారు. వివరాలు వెల్లడించడానికి ఆయన అంగీకరించలేదు. -
క్లినికల్ ట్రయల్స్‌పై నూతన విధానం
సాక్షి, హైదరాబాద్: ఔషధ ప్రయోగాలపై నూతన విధానాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఈ ఏడాది తీసుకొచ్చిన క్లినికల్ ట్రయల్స్–2019 మార్గదర్శకాలకు అనుగుణంగా మరింత పకడ్బందీగా రాష్ట్రంలోనూ తీసుకురావాలని భావిస్తోంది. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయమూర్తి నేతృత్వంలో క్లినికల్ ట్రయల్స్‌పై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ నివేదికను బయటకు తీసి కేంద్ర నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని తీసుకురావాలనేది సర్కారు ఆలోచన అని వైద్య విద్యా వర్గాలు తెలిపాయి. నిలోఫర్ ఆసుపత్రిలో పసిపిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివాదాస్పదం కావడంతో సర్కారు నూతన విధానంపై దృష్టిసారించింది. ఇక నిలోఫర్ సంఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఉల్లంఘన జరిగితే ఉపేక్షించొద్దని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. విచారణ షురూ: నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్ వ్యవహారాన్ని తేల్చేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం సుదీర్ఘ విచారణ జరిపింది. ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ విమలాథామస్, ప్రొఫెసర్ లక్ష్మీ కామేశ్వరి నేతృత్వంలోని కమిటీ 5 గంటల పాటు నిలోఫర్‌లో విచారించింది. సుమారు 260 మందిపై 5 రకాల ట్రయల్స్ నిర్వహించినట్టు కమిటీ తేల్చినట్లు సమాచారం. వీళ్లలో ర్యాండమ్ గా కొందరితో కమిటీ సభ్యులు ఫోన్లో మాట్లాడి ట్రయల్స్ జరిగినట్టు తెలుసా లేదా అని ప్రశ్నించి సమాధానాలు రికార్డు చేశారు. సాయం త్రం వైద్య విద్యా సంచాలకులు రమేశ్‌రెడ్డికి కమిటీ ప్రాథమిక నివేదిక ఇచి్చనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగానే..! విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎథిక్స్ కమిటీ అనుమతులున్నా ట్రయల్స్ మాత్రం నిబంధనల ప్రకారం జరగలేదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. అధికారులపై కొన్ని ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ వివరాలను అందజేయాలని రమేశ్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఎథికల్ కమిటీలను ఆదేశించారు. -
నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: తీవ్ర దుమారం రేపిన నిలోఫర్ ఆసుపత్రిలోని క్లినికల్ ట్రయల్స్‌పై సోమవారం విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సోమవారం నిలోఫర్ బోర్డు రూమ్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు రవికుమార్‌ను విచారించింది. వీరితోపాటు ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాజారావు, లక్ష్మీకామేశ్వరి, విమల థామస్‌లను కమిటీ విచారిస్తోంది. బాధితులుగా వందలాది మంది పిల్లలు నిలోఫర్‌లో వందలాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్ ట్రయల్స్ బాధితులుగా మిగిలారు. గతేడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఇన్పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. 300 మందిలో 100 మంది ని జనరల్ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్ ప్రయోగించారు. తద్వారా వారిపై అదెలా పనిచేసిందో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ పదే ళ్లలో 13 ట్రయల్స్ జరిగాయని, ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు. అది విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. -
మరో సారి హైకోర్టును ఆశ్రయించిన ఫర్నీక తండ్రి
సాక్షి, హైదరాబాద్: గౌచర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీకకి వైద్యం అందించడంలో నిలోఫర్ వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పాప తండ్రి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీక వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, మెరుగైన చికిత్స అందించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలను వైద్యులు పట్టించుకోవడం లేదని, తమ కూతురుకి చిక్సిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫర్నీక తండ్రి మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని, ఒక్కో బెడ్ మీద నలుగురు పిల్లలు ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో పాపను ఎలా ఉంచాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పాటించి ఫర్నీకకు మెరిగైన చికిత్స అందించాలని కిరణ్ డిమాండ్ చేశారు. (చదవండి : చిన్నారి చికిత్సకు హైకోర్టు కీలక ఆదేశాలు) అరుదైన వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాపకు ప్రత్యేక బెడ్, వార్డు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని తండ్రి కిరణ్ కోరారు. చికిత్స కోసం ఎక్కువ ఖర్చు అవుతుండటం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఫర్నీక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నారికి తక్షణమే చికిత్స అందించాల్సిందిగా నిలోఫర్ ఆస్పత్రి, తెలంగాణ మెడికల్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
300 మంది క్లినికల్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్‌లో వంద లాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్ ట్రయల్స్ బాధితులుగా మిగిలారు. గతేడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఇన్పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. 300 మందిలో 100 మంది ని జనరల్ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్ ప్రయోగించారు. తద్వారా వారిపై అదెలా పనిచేసిందో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ పదే ళ్లలో 13 ట్రయల్స్ జరిగాయని, ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు. అది విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. వయసు వారీగా వర్గీకరించి.. క్లినికల్ ట్రయల్స్ జరిపిన పిల్లలను వయసు వారీగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు. సాధారణ వార్డులో నెల నుంచి ఏడాది వయసున్న పిల్లలు 18 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల వరకు 34 శాతం, 5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు 48 శాతం ఉన్నారు. పీఐసీయూలో నెల నుంచి ఏడాది వరకు 44 శాతం, 1 నుంచి ఐదేళ్ల వయసు వారు 32 శాతం, 5 నుంచి 12 ఏళ్ల వారు 24 శాతం ఉన్నారు. ఎన్ఐసీయూలో నెల నుంచి ఏడాది వయసు పిల్లలు 58 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల వరకు 28 శాతం, 5 నుంచి 12 ఏళ్ల పిల్లలు 14 శాతం ఉన్నారు. సాధారణ వార్డులో మగ పిల్లలు 64%, ఆడ పిల్లలు 36 శాతం ఉన్నారు. పీఐసీయూలో మగ పిల్లలు 54 శాతం, ఆడ పిల్లలు 46 శాతం ఉన్నారు. ఎన్ఐíసీయూలో మగ పిల్లలు 48%, ఆడ పిల్లలు 52% ఉన్నారు. వీరంతా వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రిలో చేరినవారే. రోగాల వారీగా కూడా పిల్లలను ఎంపిక చేసి వారిపై ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం అక్కడ రోటా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. అంతా పేద పిల్లలే.. నిలోఫర్‌కు వచ్చే పిల్లల్లో 99 శాతం మంది పేద పిల్లలే కావడం గమనార్హం. క్లినికల్ ట్రయల్స్‌కు అను మతి పేరుతో వారిపై జరిగిన ప్రయోగాల్లో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు అనుమానాలున్నాయి. దీనిపై విచారణ జరగాలని నిపుణులు కోరు తున్నారు. కేంద్ర నివేదికలో పిల్లల వివరాలు, ఎప్పుడు ఈ క్లినికల్ ట్రయ ల్స్ పూర్తయ్యాయన్న సమాచారాన్ని పేర్కొనలేదు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రుల్లోనూ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తేలింది. ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ జరిగాయని రిజిస్ట్రీ తన నివేదికలో తెలిపింది. కాగా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు శనివారం నిలోఫర్‌కి వచ్చి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్లినికల్ ట్రయల్స్‌కు బాధ్యులైన వారిపై బదిలీ వేటు పడే అవకాశాలున్నట్లు వైద్య విద్యా విభాగం వర్గాలు చెబుతున్నాయి. -
క్లినికల్ ట్రయల్స్‌పై దుమారం
సాక్షి, హైదరాబాద్/వరంగల్: నిలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌పై దుమారం చెలరేగింది. అక్కడ జరుగుతున్న ట్రయల్స్‌పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారానికి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఫార్మా కంపెనీలు తయారుచేసిన కొత్త మందులతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లలపై ప్రయోగం చేస్తున్నారని చర్చ జరుగుతున్న నేప థ్యంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ను సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. క్లినికల్ ట్రయల్స్‌ను బాలల హక్కుల సంఘం ఖండించింది. నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండ టాన్ని తప్పుబట్టింది. ప్రైవేటు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొందరు డాక్టర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. బాధ్యులైన డాక్టర్లను సస్పెం డ్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రయల్స్ నిర్వహిస్తున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. రోగులకు తెలియకుండానే.. నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అయితే అవి అనుమతి మేరకే జరుగుతున్నట్లు కొందరు వైద్యులు ప్రకటించారు. ఎథికల్ కమిటీ అనుమతి మేరకే చేస్తున్నామని తెలిపారు. కొత్త మందు బయటకు రావాలంటే ఇలాంటివి తప్పద ని కొందరు సమర్థిస్తున్నారు.అయితే క్లినికల్ ట్రయల్స్‌లో పేదలు, పేద పిల్లలనే లక్ష్యంగా చేసుకుంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లినికల్ ట్రయిల్స్‌పై పేదలు, పెద్దగా చదువు, అవగాహన లేకపోవడంతో ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడుతున్న పరిస్థితి ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయమే తల్లిదండ్రులకు తెలియట్లేదు. క్లినికల్ ట్రయల్స్‌ను వీడియో రికార్డింగ్ చేయాలన్న నిబంధన ఉందని, ఆ ప్రకారం జరగట్లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అనధికారిక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో డబ్బు వంటి ప్రలోభాలకు గురవుతారని ఐసీఎంఆర్ తెలిపింది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన సమీక్షకు హాజరైన వెద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి క్లినికల్ ట్రయల్స్ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మీడియాకు తెలిపారు. ‘నిలోఫర్’ ఘటనపై గందరగోళం వద్దు: ఈటల నిలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఎవరూ గందరగోళం చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఎవరైనా సరే నిబంధనలకు లోబడే వ్యవహరించాలని సూచించారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో శుక్రవారం డాక్టర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. క్లినికల్ ట్రయల్స్ వ్యవహారంలో ఇప్పటికే డీఎంఈ చర్యలు చేపట్టారని తెలిపారు. నిజానిజాలను తేల్చేందుకు కమిటీ వేశా మని చెప్పారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై కారి్మక శాఖ చూసుకుంటోందని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీఎంఈ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిలోఫర్‌లో పసి కూనలపై ప్రయోగాలు?
సాక్షి, హైదరాబాద్ : పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నిలోఫర్ ఆస్పత్రిలో వారిపైనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలకు నిలోఫర్ ఆస్పత్రిలోని కొందరు డాక్టర్లు సహకరిస్తున్నారు. కొన్ని రకాల నిషేధిత డ్రగ్స్ కూడా ట్రయల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలకు పాల్పడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారన్న విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి గురువారం సాయంత్రం విచారణకు ఆదేశించారు. నిలోఫర్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ బాగోతం.. పీడియాట్రిక్స్ విభాగంలోని ఓ ప్రొఫెసర్ ఫార్మా కంపెనీలతో కలసి అనధికారికంగా ట్రయల్స్ చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ, రొటా, హెచ్‌పీవీ, ఎంఆర్ వ్యాక్సిన్లను సదరు ప్రొఫెసర్ పిల్లలకు ఇస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల రక్త నమూనాలు సేకరిస్తున్నట్టు కొందరు డాక్టర్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా సూపరింటెండెంట్ గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సదరు ప్రొఫెసర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను అన్ని అనుమతులు తీసుకునే ట్రయల్స్ చేస్తున్నట్లు సదరు ప్రొఫెసర్ చెబుతున్నారు. గొడవతో విషయం బయటకు.. ఇటీవల ఇద్దరు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటపడింది. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సమక్షంలోనే చాలా రోజుల నుంచి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈవ వ్యవహారం నడుస్తున్నా సంబంధిత అధికారులు కళ్లు మూసుకుని పట్టించుకోకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి వరకు అనేకమంది భాగస్వామ్యం ఉన్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్టు సమాచారం. అందులో కొందరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలిసింది. ఈ విషయాలు బయటికి రాకుండా కొందరు డాక్టర్లు, అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ అంటే.. పరిశోధనశాలల్లో అభివృద్ధిపరిచిన ఏదైనా మందులు, వ్యాక్సిన్లు మనుషులపై లేదా రోగులపై సరిగా పనిచేస్తాయా లేదా అనే విషయాలను ధ్రువీకరించుకునేందుకు చేసే పరీక్షలనే క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఒకవేళ మందు వికటిస్తే సైడ్ ఎఫెక్ట్లు, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం తదితర చట్టాల నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అనుమతి లభించడం చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కఠినమైన నిబంధనలతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టే చాలా కంపెనీలు గుట్టుగా ఈ ట్రయల్స్‌ను జరుపుతాయి. -
నిలోఫర్‌లో డిష్యూం..డిష్యూం
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ సమక్షంలోనే ఇద్దరు వైద్యులు నువ్వెంత..? అంటే నువ్వెంత...? అంటూ ఒకరిపై మరొకరు, కుర్చీలు పైకెత్తి కొట్టుకునేందుకు యత్నించడంతో పాటు పరుష పదజాలంతో దూషించుకోవడంతో తోటివైద్యులు విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలో ఆర్ఎంఓగా పని చేస్తున్న డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ రవికుమార్ మధ్య గతకొంత కాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. పీజీలకు ఉపకార వేతనాల చెల్లింపు విషయంపై సోమవారం సూపరింటెండెంట్ మురళీకృష్ణ ప్రొఫెసర్ రవికుమార్ మధ్య చర్చ జరుగుతుండగా, అక్కడే ఉన్న లాలూప్రసాద్ జోక్యం చేసుకుని మాట్లాడటంతో రవికుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఇద్దరు తీవ్ర పరుష పదజాలంతో పరస్పరం దూషించుకుంటూ కొట్టుకునేందుకు కుర్చున్న కుర్చీలను పైకెత్తారు. దీంతో అక్కడే ఉన్న సూపరింటెండెంట్ సహా పలువురు వైద్యులు నివ్వెరపోయారు. ఇదిలా ఉండగా పీజీల హాజరు పట్టికను ఎప్పటికప్పుడు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు పంపించకుండా, ప్రభుత్వం మంజూరు చేసిన ఉపకారవేతనాలను వారికి చెల్లించకుండా పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొ ఫెసర్ రవికుమార్ జాప్యం చేస్తున్నాడని డాక్టర్ లాలూప్రసాద్ ఆరోపించగా, అకాడమిక్ విషయాల్లో ఆర్ఎంఓలకు సంబంధం ఏమిటని ప్రొఫెసర్ రవికుమార్ ప్రశ్నించారు. చర్య తీసుకుంటాం పీజీలకు ఉపకార వేతనాలు చెల్లించక పోవడంపై సంబంధిత విభాగాధిపతి నుంచి వివరణ కోరతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఉన్నత మైన వైద్యవృత్తిలో కొనసాగుతూ ఆస్పత్రి ఆవరణలో రోగుల సమక్షంలో దుర్భాషలాడుకోవడం, ఆరోపణలు చేసుకోవడంతో సంస్థకు చెడ్డపేరు వస్తుంది. ఆస్పత్రికి ప్రతిష్టకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రమేష్‌రెడ్డి, డీఎంఈ -
'డై' యేరియా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డయేరియా (నీళ్ల విరేచనాలు) చాపకింది నీరులా విస్తరిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 3.5లక్షల మంది డయేరియా బారినపడుతుండగా... సగానికిపైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదువుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 41,441 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. సీజన్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడుఆయా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడాదీన్ని పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో 13 శాతం డయేరియాతోనే సంభవిస్తున్నట్లు సమాచారం. డయేరియాకు అనేక రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నప్పటికీ... రోటావైరస్ ద్వారా సోకే డయేరియా అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. నీళ్ల విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాం తులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 40 శాతం కేసులకు ఈ రోటావైరస్నే ప్రధాన కార ణమని ఇప్పటికే వైద్యుల పరిశీలనలో తేలింది. కలుషిత ఆహారంతో... నగరంలో చాలా వరకు వాటర్ బోర్డు సరఫరా చేసే మంచినీటిపైనే ఆధారపడుతుంటారు. పాతబస్తీ సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. మంచినీటి సరఫరా లైన్ల పక్కనే డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. పైపులకు లీకేజీలు ఏర్పడి చుట్టూ నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీ నీరు పైపుల్లోకి చేరడం వల్ల మంచినీరు కలుషితమవుతోంది. ఈ నీరు తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనికి తోడు ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేక చాలా మంది ఫాస్ట్‌ఫుడ్డు సెంటర్లు, హోటళ్లపై ఆధారపడుతున్నారు. కొన్ని హోటళ్లు రాత్రి మిగిలిపోయిన వంటలను ఉదయం వడ్డిస్తున్నాయి. వంటశాలలు శుభ్రంగా లేకపోవడం, ఆహారపదార్థాలపై ఈగలు, దోమలు వాలడం, చల్లారిన ఆహార పదార్థాలనే మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడం వల్ల కూడా డయేరియా వ్యాపిస్తోంది. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1200 మంది రోగులు వస్తే వారిలో 150 నుంచి 200 మంది కలుషిత ఆహార బాధితులే ఉంటున్నారు. చిన్నారులకు టీకాలు... డయేరియాను రూపుమాపేందుకు ప్రభుత్వం కొత్తగా రోటావ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 96 దేశాల్లో ఇది అమలవుతోంది. దేశంలో తొలిసారిగా జాతీయ రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టింది. గత పది రోజుల నుంచి హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 6, 10, 14 వారాల శిశువులకు 2.5 ఎంఎల్ చొప్పున ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రతి బుధ, శనివారాల్లోనూ ఈ టీకాలను వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. జాగ్రత్తలు అవసరం... కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీటితో డయేరియా వస్తుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ కడుపులోకి చేరిన మూడు రోజుల తర్వాత ప్రతాపం చూపుతుంది. నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒంట్లోని నీరు, లవణాల శాతం తగ్గి నీరసంతో స్పృహ తప్పుతుంటారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి భారి నుంచి కాపాడుకోవచ్చు.– డాక్టర్ రమేశ్ దంపూరి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్ -
పేషెంట్ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..
సాక్షి, హైదరాబాద్ : పేషెంట్ బెడ్ మీద ఉన్న బ్యాగు తీసి పక్కన పెట్టిన జూనియర్ డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చర్యకు ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు సదరు జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు..మంగళవారం విధుల్లో ఉన్న ఓ జూనియర్ డాక్టర్ రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఆస్పత్రిలో చేరిన పేషెంట్స్ బెడ్ కోసం చూస్తుండటాన్ని గమనించారు. ఈ క్రమంలో అప్పటికే ఆస్పత్రిలో చేరిన మరో రోగి బ్యాగు బెడ్‌పై ఉండటాన్ని గమనించిన జూనియర్ డాక్టర్ దానిని తీసి పక్కన పెట్టి కొత్త పేషెంట్స్‌కు బెడ్ వాడుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో కోపోద్రిక్తులైన సదరు రోగి బంధువులు జూనియర్ డాక్టర్‌ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నీలోఫర్ ఆస్పత్రి హెచ్‌వోడీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిలోఫర్‌లో బాలుడి మృతి.. తల్లిదండ్రుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నిలోఫర్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే దూల్‌పేట్‌కు చెందిన వీర్ సింగ్‌కు డెంగీ జ్వరం రావడంతో అతని తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మృతి చెందాడు. అయితే బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
నిలోఫర్‌లో సేవలు నిల్
నాంపల్లి: ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా మారింది నిలోఫర్ ఆసుపత్రి పరిస్థితి. రోగుల రద్దీకి తగ్గట్లుగా సేవలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర విభాగంతో పాటు వార్డుల్లోనూ మంచాలు దొరకడం లేదు. దీంతో ఒకే పడకపై ఇద్దరు చిన్నారులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం మంచాలపై బెడ్షీట్లు కూడా లేకపోవడంతో రోగుల ఇక్కట్లు మరింత రెట్టింపయ్యాయి. ఆరునెలలుగా బెడ్ షీట్లు బంద్.. ఆసుపత్రిలో దాదాపు 1100 పడకలు ఉన్నాయి. అయితే ఈ మంచాలపై వేసే బెడ్షీట్ల కొరత అధికంగా ఉంది. ప్రతిరోజూ పడకపై బెడ్షీట్లను మార్చాల్సి ఉండగా.. కానీ ఆసుపత్రిలో గత ఆరు నెలలుగా పడకలపై బెడ్షీట్లను వేయకుండానే మానేశారు. దీంతో రోగులు తమ వెంట తెచ్చుకున్న బెడ్ షీట్లనే వాడుకుంటున్నారు. మెషిన్లకు మరమ్మతులు జరిగేనా..? నిలోఫర్‌లో ఒకప్పుడు దోభీలతో బెడ్షీట్లను ఉతికించి రోగులకు సేవలందించే పడకలపై ప్రతి రోజూ మార్చేవారు. దోభీల స్థానంలో వాషింగ్ మెషిన్లు వచ్చేశాయి. ఈ మెషిన్ల కొనుగోలుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. ప్రస్తుతం ఈ మెషిన్లు రిపేర్ కావడంతో సిబ్బంది బెడ్షీట్లను ఉతకడం మానేశారు. దీంతో వారం, పది రోజుల పాటు చికిత్సలకు వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఒక రోగి స్థానంలో మరో రోగి అలానే పడకలను కేటాయిస్తుండడంతో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి రోగుల పడకలపై బెడ్షీట్లను మార్చాలని రోగి సహాయకులు కోరుతున్నారు. కొత్త పన్నాగం.. పాడైన వాషింగ్ మెషిన్లకు మరమ్మతులు చేయించాల్సిన అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని రోగుల సహాయకులు మండిపడుతున్నారు. వీటి స్థానంలో కొత్త మెషిన్లను కొనుగోలు చేసేందుకు అధికారులు కొత్త పన్నాగం ఎత్తుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తవాటితో కొంత కమీషన్ వస్తుందనే ఆశతో ఉన్న వాటిని రిపేర్ చేయించకుండా ఉంటున్నట్లు సర్వత్రా∙విమర్శలు వస్తున్నాయి. కొత్త మెషిన్లు మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖలు కూడా రాసినట్లు తెలిసింది. ఈ కొత్త మెషిన్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందో లేక పాత మెషిన్లకే మరమ్మతులు చేస్తారో వేచిచూడాల్సిందే. కాగా.. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ మురళికృష్ణను ఫోన్లో వివరణ కోరే ప్రయత్నం చేయగా స్పందించలేదు. -
‘నిలోఫర్’లో మరణ మృదంగం
సాక్షి, సిటీబ్యూరో: తల్లి కళ్ల ముందే బిడ్డ కన్ను మూస్తోంది. అమ్మకు కడుపుకోత మిగులుతోంది. నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో మరణ మృదంగం మోగుతోంది. నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించే శిశువులకు ఇక్కడ కనీస వైద్య సేవలూ అందడం లేదు. గతేడాది 4వేలకు పైగా మంది శిశువులు మరణించగా... ఈ ఏడాది ఇప్పటికే 2వేలకు పైగా మంది శిశువులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదివారం కామారెడ్డికి చెందిన నవజాత శిశువు మృతి చెందడంతో ఆస్పత్రి వైద్యులపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిశువును కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందని పీడియాట్రిక్ వైద్య నిపుణుడు డాక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. సిబ్బంది కొరత... దేశంలోనే రెండో అతిపెద్ద నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రమైన నిలోఫర్ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సమీప కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా బాధితులు వస్తుంటారు. వీరిలో నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు, ప్రసవ సమయంలో ఉమ్మనీరు మింగినవారు, గుండెకు రంధ్రాలు, అవయవ లోపాలతో జన్మించినవారు, పుట్టుకతోనే కామెర్లతో జన్మించిన శిశువులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో వచ్చిన ప్రతి రోగిని చేర్చుకోవాల్సి ఉంటుంది. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి అనుగుణంగా వైద్యులు, నర్సులను నియమించలేదు. గత 15రోజులుగా సీటీ స్కాన్ పనిచేయడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. అప్పటికే అక్కడ వెయిటింగ్ జాబితా భారీగా ఉండడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ డయాగ్నోస్టిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకురావాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ పేరుతో అవినీతి... ప్రస్తుతం ఆస్పత్రిలో 100 మంది వైద్యులు ఉండగా, 130 మంది నర్సులు ఉన్నారు. నిజానికి నవజాత శిశువుల చికిత్సల్లో నర్సుల పాత్రే కీలకం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 1:1 చొప్పున, సాధారణ వార్డుల్లో ప్రతి 20 మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో ఈ మేరకు నర్సులు లేరు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కొంతమందిని విధుల్లోకి తీసుకున్నట్లు, వారికి నెలసరి వేతనాలు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పుతున్నప్పటికీ... ఆ మేరకు ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ స్టాఫ్ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రతినెలా వారి పేరుతో బిల్లులు మంజూరు చేస్తుండడాన్ని పరిశీలిస్తే... ఆస్పత్రిలో అవినీతి ఎలా పేరుకపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్తో ఇబ్బందులు... నర్సుల కొరతతో శిశువుల సంరక్షణ బాధ్యతలను కూడా వెంట వచ్చిన బంధువులే చూసుకోవాల్సి వస్తోంది. అసలే చిన్న పిల్లలు చికిత్స పొందే వార్డులు.. ఆపై పెద్దవాళ్లు కూడా రోజంతా పడకల పక్కనే ఉండడం, వారు సరైన శుభ్రత పాటించకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకుతోంది. రెండు రోజుల్లో నయం కావాల్సిన జబ్బులు వారం పది రోజులైనా తగ్గకపోగా మరింత ముదురుతోంది. ఆస్పత్రిలో చేరిన శిశువులకు జబ్బు నయం కాకపోగా, కొత్తగా రకరకాల ఇన్ఫెక్షన్లు సోకి, చివరికి వారు మృతికి కారణమవుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్య నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ‘కీలక’ ఇన్చార్జి డుమ్మా.. పడకల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండడం, వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు సరిపడా వైద్యులు ఆస్పత్రిలో లేకపోవడం, ఉన్నవారు కూడా సెలవుల్లో ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన శిశువులకు కనీస వైద్యసేవలు అందక మృత్యువాతపడుతున్నారు. పసిపిల్లల ప్రాణాలు కళ్లముందే పోతుండడంతో వెంటవచ్చిన బంధువులు ఏమీ చేయలేక ఆగ్రహంతో వైద్యులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు లేకపోలేదు. ఆస్పత్రిలోని ఓ కీలక విభాగం ఇన్చార్జి గత 15 రోజులుగా ఆస్పత్రికే రావడం లేదు. కనీసం అధికారికంగా సెలవు కూడా పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత డాక్టర్‌పై కనీస చర్యలు తీసుకోవడం లేదంటే ఆస్పత్రి ఉన్నతాధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుండెకు రంధ్రాలు పడితే? జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న శిశువుల్లో చాలామందికి పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడుతుంటాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఆస్పత్రికి వస్తున్న చిన్నారుల్లో రోజుకు సగటున 15–20 మంది శిశువులు ఇదే సమస్యతో బాధపడుతుంటారు. వీరికి చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవు. దీంతో 2డీఎకో, ఈసీజీ పరీక్షల కోసం వీరిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఇందుకు రెండు అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ... నిర్వహణ లోపం, డీజిల్ ఖర్చులకు నిధులు లేకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అనివార్య పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ వాహనాల్లో అక్కడికి చేరుకుంటే అప్పటికే అక్కడ అనేక మంది వెయిటింగ్లో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. టెస్టుల కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తోంది. రిపోర్టు తీసుకొని తిరిగి ఆస్పత్రికి చేరుకుంటే తీరా ఇక్కడ గుండెకు ఏర్పడిన రంధ్రాలకు చికిత్స చేయరని చెప్పి తిప్పి పంపుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునే స్తోమత లేక, నిలోఫర్‌లో చికిత్సలు అందక అనేక మంది పిల్లలు చనిపోతుండడం తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తోంది. పరిస్థితి విషమించడంతోనే... నాంపల్లి: క్రిటికల్ కండిషన్లో శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చారని, పరిస్థితి విషమించడంతోనే మృతి చెందిందని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని డాక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన బాలమణికి ఆదివారం ఉదయం 4గంటలకు కాన్పు అయింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అయితే శిశువుకు ఊపిరాడడం లేదని మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బంధువులు శిశువును ఉదయం 7గంటలకు నిలోఫర్‌లో చేర్పించారు. శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12గంటలకు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఉద్రిక్తతకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించారని, పరిస్థితి విషమించడంతోనే శిశువు మృతి చెందిందని డాక్టర్ రవికుమార్ వివరణ ఇచ్చారు. -
నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి మృతి
గన్‌ఫౌండ్రీ: సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ బాలుడి చికిత్స విషయంలో వైద్యుల జాప్యం అతని మృతికి కారణమైన సంఘటన మంగళవారం నిలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సకాలంలో వైద్యులు స్పందించనందునే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, కుల్కచర్ల గ్రామానికి చెందిన శివ(12) సైకిల్‌పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సైకిల్ హ్యాండిల్ అతని కడుపులో బలంగా తాకడంతో పేగులు, కాలేయం, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రెండ్రోజుల క్రితం వైద్యులు అత్యవసర విభాగంలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. అతడికి ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పిన వైద్యులు అతని కుటుంబ సభ్యులతో సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే శస్త్రచికిత్స చేయడంలో జాప్యం జరగడంతో మంగళవారం ఉదయం శివ మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. అనంతరం మృతుడి బంధువులు సూపరింటెండెంట్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బాలుడి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలోనే అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. -
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
-
‘మందులు ఇచ్చిన నర్సులను విచారిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఇచ్చిన వ్యాక్సిన్ వికటించడంతో.. ఓ చిన్నారి మృతి చెందటం.. మరికొంతమంది చిన్నారులకు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. టీకాల అనంతరం ఇవ్వాల్సిన మందులు కాకుండా వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు మందులు ఇచ్చిన నర్సులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సునీత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న 92 మంది చిన్నారులకు టీకాలు ఇచ్చాము. సాయంత్రం నుంచి టీకాలు తీసుకున్న చిన్నారుల్లో కొంతమంది అసౌకర్యంగా ఉన్నారంటూ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వెంటనే డిస్ట్రిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాము. టీకాలు తీసుకున్న పిల్లలందర్నీ మళ్లీ పిలిపించి అందరికీ వైద్య పరీక్షలు చేసి నిలోఫర్ ఆసుపత్రికి పంపించాము. డాక్టర్ రుబీనా, ఫార్మసిస్ట్ మోహన్, నర్స్ మెహ్రాలు పిల్లలకు టీకాలు ఇచ్చారు. పిల్లలకు టీకాల అనంతరం శాంతాబాయి, గీతా, కౌసర్, కవితాలుగా గుర్తించాము. ప్రస్తుతం వీరందరిని కోఠిలోని డీఎమ్హెచ్ఓలో అధికారులు విచారిస్తున్నార’ని తెలిపారు. చదవండి : వికటించిన వ్యాక్సిన్.. 15 మందికి అస్వస్థత నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం -
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం చోటుచేసకుంది. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ వికటించడంతో ఫైజల్ అనే చిన్నారి మృతి చెందారు. మరో 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వైద్యులు 70 మందికి పైగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తర్వాత ఇచ్చే ట్యాబ్లెట్స్ మారడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నగరంలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం నిలోఫర్‌లో 15 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు అనుభవం లేని నర్సులు వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. -
వికటించిన వ్యాక్సిన్.. 15 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేసుకున్న 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమమంగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్లు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. దాంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు విధించారు. నిమ్స్ ఆసుపత్రిలోనూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు. ఇష్టారాజ్యంగా ఎవరుపడితే వారు ఆసుపత్రుల్లో ని రోగుల వార్డుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుం టున్నారు. పాసులున్న వారు మాత్రమే నిర్ణీత వేళ ల్లో వెళ్లొచ్చేలా నిబంధనలు కట్టుదిట్టం చేశారు. బోధనాసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల (జూడా)పై రోగుల బంధువులు తరచూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ ఆంక్షలున్నా పూర్తిస్థాయి లో అమలు కావట్లేదని, ఇకపై కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. జూడాలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ పోస్టర్లు అంటించాలని నిర్ణయించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం.. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆస్పత్రులకు రోజూ దాదాపు 20 వేల మంది చొప్పున వస్తుంటారు. దీంతో వారికి వసతి సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారుతోంది. మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం గగనం గా మారుతోంది. పేదలు కావడంతో రాత్రిళ్లు కూడా ఆరు బయట లేదా రోగుల వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. బోధనాసుపత్రుల వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు తక్కువ ధరకే భోజనం అం దిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఉచితంగా టిఫిన్, భోజనం అందజేస్తున్నాయి. దీంతో రోగుల సహా యకులు ఎక్కువ మంది వస్తూ ఇక్కడే ఉండిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. భారీగా రోగుల బంధువులు, స్నేహితులు గుమిగూడుతుండటం తో ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. రోగుల వద్దకు ఒక సహాయకుడే వెళ్లాల్సి ఉండ గా, గేట్ల వద్ద ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకుని లోపలికి పంపుతున్నారన్న విమర్శలున్నా యి. ఆసుపత్రిలో రోగుల బంధువులు, సహాయకులతోనే నిండిపోతున్నాయి. డబ్బులు తీసుకుని లోపలికి పంపే వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు. ఒక్కోసారి రోగి చనిపోతే బంధువులు డాక్టర్లపై దాడులు చేస్తున్నారు. దీంతో వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. -
అట్టుడికిన నిలోఫర్
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక నిలోఫర్ ప్రభుత్వ ఆస్పత్రి దాడులు, ఆందోళనలతో అట్టుడికింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ శిశువు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆగ్రహించిన శిశువు తరఫు బంధువులు విధి నిర్వహణలో ఉన్న ఓ జూనియర్ వైద్యుడిపై దాడి చేయగా అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడిని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన జూనియర్ డాక్టర్లు శనివారం మెరుపు సమ్మెకు దిగి ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించారు. బయటి వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి వైద్యులపై దాడి చేస్తుంటే సెక్యురిటీ సిబ్బంది పేక్షకపాత్ర వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మంది ప్రైవేటు సెక్యురిటీపై వేటువేసి దాడి ఘటనపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మరో వైపు తమకు మూడు నెలలుగా వేతనాలు, ఏడాది నుంచి పీఎఫ్ చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అదే సమయంలో ఆందోళనకు దిగారు. ఒకవైపు జూనియర్ డాక్టర్లు, మరోవైపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో వైద్యసేవలు స్తంభించిపోయాయి. దాడికి కారణం ఇదీ.. కార్వాన్కు చెందిన అస్రా ఫాతిమా(10 నెలలు) తరచూ జ్వరం, ఫిట్స్‌తో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు ఈ నెల 7వ తేదీన నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వైద్యులు శిశువును ఈఎస్ఆర్ యూనిట్–3లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులకు వివరిస్తూనే ఉన్నారు. శిశువుకు పాలు పట్టించవద్దని వైద్యులు సూచించినప్పటికీ.. తల్లిదండ్రులు వినకుండా శుక్రవారం పాలు పట్టించారు. అయితే, ఆ పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో శిశువును కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. శిశువు మృతి చెందింది. దీనిపై శిశువు తల్లిదండ్రులు, బంధులు ఆగ్రహంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిదని ఆరోపిస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో హల్చల్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వైద్యుడు అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన డాక్టర్ రాహుల్ అతడిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డులు దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆందోళనకు దిగిన జూ.డాలు నిలోఫర్ ఆస్పత్రిలో సెక్యురిటీ లోపం వల్లే వైద్యులపై దాడి జరిగిందని జూనియర్ డాక్టర్లంతా శనివారం ఉదయం విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఆస్పత్రిలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాల్లో సేవలుకు తీవ్ర విఘాతం కలిగింది. వైద్యులకు రక్షణ కల్పించడంలో ఆస్పత్రి సెక్యురిటీ పూర్తిగా విఫలమైందని సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్న సెక్యురిటీ సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సూపరింటెండెంట్ మురళీకృష్ణ పది మంది ప్రైవేట్ సెక్యురిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దాడి ఘటనపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో జూనియర్ వైద్యులు శాంతించారు. ఇదే సమయంలో తమకు మూడు నెలుగా వేతనాలు చెల్లించడం లేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. దీంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆస్పత్రిలో రోజంతా ఏం జరుగుతుందో అర్థంగాని పరిస్థితి తలెత్తింది. సూపరింటెండెంట్ సూచనల మేరకు తక్షణమే రెండు నెలల వేతనాలు చెల్లించనున్నట్లు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ప్రకటించడంతో వారు ఆందోళనను విరమించారు. -
కాన్పు కోసం వస్తే కాదన్నారు
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి సిబ్బంది ఓ నిండు గర్భిణికి వైద్య సాయం అందించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కాన్పు కోసం వచ్చిన ఆ మహిళను హైదరాబాద్ వెళ్లాలంటూ సిబ్బంది ఉచిత సలహా ఇవ్వగా.. బయటకు రాగానే నొప్పులు తీవ్రమై ఆ గర్భిణి ఆస్పత్రి ముఖద్వారం వద్దే ప్రసవించిన ఘటన ఇది. మహబూబ్‌నగర్ ధన్వాడ మండల కేంద్రానికి చెందిన బాలకిష్టమ్మను కాన్పు కోసం మంగళవారం ఉదయం ధన్వాడ పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడి సిబ్బంది జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి పంపించారు. దీంతో సాయంత్రం 5 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. బాలకిష్టమ్మకు వైద్యం చేయాల్సిందిగా కుటుంబీకులు కోరినా అక్కడి వైద్యులు, సిబ్బందిని స్పందించలేదు. బుధవారం ఉదయం బాలకిష్టమ్మకు 2 సూదులు ఇచ్చి శిశువు బరువు తక్కువగా ఉన్నందున హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. తాము పేద వాళ్లమని, హైదరాబాద్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నందున ఇక్కడే ప్రసవం చేయాలని కోరినా నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కలసి బాలకిష్టమ్మను ఆమె భర్త బాలస్వామిని ఆస్పత్రి బయటకు పంపారు. బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లో బాలకిష్టమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. మళ్లీ ఆమె భర్త లేబర్ రూంలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలి దగ్గరకు వెళ్లి బయటకు రావాలని కోరినా స్పందించలేదు. ఉదయం 11 సమయంలో అక్కడ ఉన్న మహిళల సాయంతో బాలకిష్టమ్మ ఆస్పత్రి ముఖద్వారం వద్దే మగశిశువుకు జన్మనిచ్చింది. మీడియా సిబ్బంది వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా బాలకిష్టమ్మ, శిశువును ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. హైదరాబాద్ వెళ్లాలని సూచించినా వెళ్లలేదు.. దీనిపై జిల్లా జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరిం టెండెంట్ డాక్టర్ జీవన్‌ను వివరణ కోరగా, బాలకిష్టమ్మకు బుధవారం ఉదయం ఉమ్మ నీరు పోతుంటే లేబర్ రూంకు తరలించి పరీక్షలు చేయగా శిశువు బరువు తక్కువగా ఉన్నట్లు తేలిందని, దీంతో హైదరాబాద్ నిలోఫర్‌కు వెళ్లాలని సూచించినా వాళ్లు వెళ్లకుండా అక్కడే ఉన్నారని తెలిపారు. దీంతో నొప్పులు తీవ్రమై ప్రసవించిందన్నారు. శిశువు బరువు తక్కువగా ఉండడంతో చికిత్స చేస్తున్నామని చెప్పారు. -
బిడ్డ కడుపు నిండగా..
సాక్షి, సిటీబ్యూరో: నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించి, తల్లికి దూరంగా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న నిరుపేద శిశువుల పాలిట ‘ధాత్రి– తల్లిపాల నిధి’ ఓ వరంగా మారింది. ఆస్పత్రిలో ప్రసవించి పాలు సంమృద్ధిగా ఉన్న తల్లుల నుంచి ముర్రుపాలు సేకరించి, ఆకలితో బాధపడుతున్న శిశువులకు సరఫరా చేసేందుకు నిలోఫర్ ఆస్పత్రిలో మదర్స్ మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఇది పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా పరోక్షంగా తల్లుల ఆరోగ్యాన్నీ కాపాడుతోంది. ధాత్రి ఫౌండేషన్, ప్రభుత్వం సంయుక్తంగా రూ.కోటితో గతేడాది నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను నెలకొల్పింది. ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మందికిపైగా శిశువులు చికిత్స పొందుతుండగా, వీరిలో సగానికిపైగా నెలలు నిండకముందు, తక్కువ బరువుతో జన్మించిన వారే ఉంటున్నారు. వీరిలో చాలా మంది రోజుల తరబడి తల్లికి దూరంగా చికిత్స పొందుతుంటారు. ఇలా తల్లికి దూరంగా ఉన్న.., వైద్యులు సిఫార్సు చేసిన 1.5 కేజీల లోపు శిశువులకు మదర్స్ మిల్క్ బ్యాంకు ముర్రు పాలు సరఫరా చేస్తుంది. ఇలా నెలకు సగటున 400 మంది పిల్లల ఆకలి తీర్చతుండటం విశేషం. ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిలోఫర్ మదర్స్ మిల్క్ బ్యాంక్ సేవలపై ప్రత్యేక కథనం. తల్లుల ఆరోగ్యానికి భరోసా ఆస్పత్రిలో రోజుకు సగటున 25 ప్రసవాలు జరుగుతుండగా, వీరిలో చాలా మందికి ప్రసవం తర్వాత రెండు మూడురోజుల వరకు పాలు పడటం లేదు. పాలు పడని తల్లులే కాకుం డా పాలు సమృద్ధిగా లభించే తల్లుల పాలి ట ఈ కేంద్రం ఓ వరం గా మారింది. పాలు పడని తల్లులకు కౌన్సి లింగ్ ఇవ్వడంతో పా టు అవసరమైన వైద్య సేవలు అందజేస్తుంది. తల్లి వద్ద సమృద్ధిగా పాలు ఉన్నప్పటికీ..శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తాత్కాలికంగా ఫీడింగ్ నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా స్వచ్ఛందంగా తల్లిపాల నిధికి చేరుకుని తమ పాలను దానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వీరు రొమ్ము కేన్సర్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ కేంద్రానికి వస్తుండటం విశేషం. ఇక్కడ రోజుకు 450 మంది పిల్లలకు సరిపడా పాలను నిల్వ చేసే సౌలభ్యం ఉంది. అత్యంత భద్రంగా నిల్వ పాల సేకరణకు ముందే వీరికి హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెచ్ఎస్బీసీ వంటి వైద్య పరీక్షలు చేసి, ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాలను సేకరిస్తున్నారు. ఇలా వీరి నుంచి సేకరించిన పాలను ప్రాసెస్ చేసి మైనస్ 20 డిగ్రీల వద్ద భద్రపరుస్తున్నారు. వీటిని ఆరు మాసాల వరకు వాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ దేశంలోనే అత్యధికంగా మూడు వేల లీటర్ల పాలు నిల్వ చేసే సామర్థ్యం ఉండటం విశేషం. తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రొటీన్లతో పాటు శారీరక, మానసిక, ఆరోగ్య వికాసానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల తల్లిపాలలో 65 కిలో కేలరీల శక్తినిస్తాయి. ఇందులో విటమిన్ ఎ సహా థయామిన్, రైబోఫ్లెవిన్, బి12, బి6, సెనథోనిక్ ఆమ్లం, బయో టిక్, ఫోలిక్ ఆమ్లం, సీ,డీ,ఇ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, వంటి ఖనిజ లవ ణాలు లభిస్తాయి. బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలు తాగించాల్సి ఉంది. ఇలా కనీసం ఆరు మాసాల పాటు తల్లి పాలే అందించాలి. -
కొడుకును ఆటోకేసి కొట్టిన తండ్రి
హైదరాబాద్: పరిచయమున్న ఓ మహిళ తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. తమ కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆదివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్‌ను అరెస్టు చేశారు. ఉప్పల్‌కు చెందిన శివగౌడ్‌కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటున్న మరో మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంలో భార్యాపిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శివగౌడ్ ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్ చేసి ‘నీ కుమారుడిని చంపుతా’నంటూ బెదిరించాడు. భయాందోళనకు గురైన ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్(3)ను బయటకు తీసు కొచ్చి అక్కడున్న ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రిత్విక్‌ను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా శివగౌడ్ భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించి శివగౌడ్‌పై కేసు నమోదు చేశారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు
గోవిందరావుపేట : ఒకే నంబర్‌తో పల్సర్ టూవీలర్ బండ్లు రెండు కనిపించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే చల్వాయికి చెందిన సాయబోయిన భిక్షపతి, మోహన్ అన్నదమ్ములు. భిక్షపతి హన్మకొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్దే ఉంటున్న తమ్ముడికి బైక్ కొని ఇచ్చాడు. మోహన్ భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకోగా అతనికి టీఎస్ 25 0468 నెంబర్‌ను కేటాయించారు. ఈ క్రమంలో అదే నెంబర్‌పై హైదరాబాద్‌లో ఓ బ్లాక్పల్సర్ బండిపై మరో వ్యక్తి తిరుగుతున్నాడు. గత 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు బండి విషయంలో తప్పులు దొర్లడంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆదారంగా అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తూ ఆ నెంబర్‌పై రిజిస్ట్రేషన్‌లో ఉన్న మోహన్ సెల్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో అన్నయ్య భిక్షపతికి తెలుపగా ఆన్లైన్లో చూశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో హెల్మెట్ లేకుండా, నీలోఫర్ ఆస్పత్రి ఎదుట రెండు రోజుల పాటు నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపినందుకు రెండు సార్లు జరిమానాలు విధిస్తున్నట్లు కనిపించింది. దీంతో అవాక్కయిన మోహన్ జరిగిన విషయాలను పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
నీలోఫర్ హాస్పిటల్లో ఘోరం
-
నిలోఫర్‌లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్ నిలోఫర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్‌కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవగాహనా రాహిత్యం వల్లే.. కాగా, ధృవన్ అంశంపై నిలోఫర్ సూపరెండెంట్ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్ గ్రూప్ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్ విశ్వధాత కావున సదరు బ్లడ్ గ్రూప్ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు. -
ఏమీ సేతుర లింగా!
అది దేశంలోనే పిల్లల రెండో పెద్దాస్పత్రి.. కానీ అవసరమైనంత మంది వైద్యులు ఉండరు. ఉన్నవి 500 పడకలే.. వెయ్యి మంది శిశువులకు చికిత్స చేస్తుంటారు. ఐసీయూలోని రెండు బెడ్లకు ఒక నర్సు.. జనరల్ వార్డులో ప్రతి ఐదు పడకలకు ఒకరు ఉండాలి. ఇక్కడ మాత్రం సగటున 25 మంది రోగులకు ఒక్క నర్సే సేవలందిస్తున్నారు. సుమారు 200 మంది వైద్యులు అవసరమున్నచోట 88 మందితోనే సరిపెడుతున్నారు. అవసరమైన యంత్ర సామగ్రి, వైద్య పరికరాలు అసలే ఉండవు. ఇది నిలోఫర్ ఆస్పత్రి పనితీరుపై ఒక కోణం..ఇక బాలింతలు, శిశువుల మరణాలు.. అపహరణలు..ఆందోళనలు మరోకోణం. ఇవన్నీ నవజాత శిశువుల ఆరోగ్య వరప్రదాయినిగా పేరొందిన ‘నిలోఫర్’ ఆస్పత్రి ప్రతిష్టనుదిగజారుస్తున్నాయి. ఇక్కడి దుర్ఘటనలపై మానవ హక్కుల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆస్పత్రిలో11 నెలల శిశువు మరణంతో తొమ్మిది మంది వైద్యులు, సిబ్బందికి తాజాగా పోలీసులునోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం తగినంత మంది సిబ్బందినిఇవ్వకుండా.. సౌకర్యాలు కల్పించకుంటే తామేం చేస్తామని గురువారం ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువు ఆరోగ్య కేంద్రం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రెండేళ్ల క్రితం ఒకేరోజు ఆరుగురు బాలింతలు చనిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అంతకు ముందు అనేక మంది శిశువులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక అపహరణ ఘటనలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితిపై హైకోర్టు సహా మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఓ పదకొండు మాసాల శిశువు మృతి వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, సర్జరీ చేసిన వైద్యులతో పాటు అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సుల(తొమ్మిది మంది)కు బుధవారం నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వ వైద్యవర్గాల్లో కలవరం మొదలైంది. ఈ నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి జోక్యం చేసుకుని వైద్యులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అసలెందుకిలా జరుగుతుందంటే.. దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా నిలోఫర్ ఆస్పత్రికి గుర్తింపు ఉంది. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను వైద్యం కోసం తీసుకొస్తుంటారు. ప్రభుత్వ ఆస్ప త్రి కావడంతో అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మాత్ర వస్తున్న రోగులకు సరిపోయే వసతులు మాత్రం లేదు. పడకలతో పాటు ఇంకుబేటర్లు, వార్మర్లు, వెంటిలేటర్లు లేవు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 వెంటిలేటర్లు ఉండగా, మరో 50 అవసరం. 150 వార్మర్లు ఉండగా, మరో 150 అవసరముంది. 70 ఫొటోథెరపీ యూనిట్లు ఉండగా, మరో వంద వరకు అవసరం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదు ఆల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నాయి. సత్వర వైద్యసేవలు అందాలంటే మరో ఐదు మిషన్లు అవసరముంది. ఒక్కో పడకపై ఇద్దరు ముగ్గురు శిశువులకు వైద్యం అందించాల్సి వస్తోంది. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఏటా 30 శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం 88 మంది వైద్యులు ఉండగా, వెయ్యి మందికి చికిత్స అందించాలంటే మరో 100 మంది అత్యవసరం. ఇటీవల ప్రభుత్వం 560 పోస్టులను మంజూరు చేసింది కానీ ఇప్పటి వరకు ఒక్కటీ భర్తీ చేయలేదు. 1000 మంది శిశువులకు135 మంది నర్సులు.. వైద్యులు శిశువులకు సర్జరీ చేశాక వారి సంరక్షణ బాధ్యత స్టాఫ్ నర్సులదే. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ఐసీయూలోని ప్రతి రెండు పడకలకు ఒక స్టాఫ్ నర్సు, జనరల్ వార్డులోని ప్రతి ఐదు పడకలకు ఒక స్టాఫ్ నర్సు సేవలందించాలి. ప్రస్తుతం నిలోఫర్‌లో మాత్రం 135 మంది నర్సులే ఉన్నారు. వెయ్యి మంది శిశువులకు ఒక్కో షిప్ట్ చొప్పున 45 మందే అందుబాటులో ఉంటున్నారు. వీరిలో నిత్యం ఐదు నుంచి పది మంది నర్సులు సెలవుల్లో ఉంటారు. ఒక్కో నర్సు సగటున 25 మంది పిల్లల పరిరక్షణ చూడాల్సి రావడంతో రోగుల బంధువులే నర్సుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన నర్సులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందక శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోగుల నిష్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇలాంటి వాతావరణంలో శిశువులకు వైద్యం అందించాలంటేనే భయంగా ఉందని ఓ సీనియర్ వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేసు ఎందుకు నమోదైందంటే.. జియాగూడకు చెందిన గౌతం ఉగ్డె కుమారుడు షాహిల్ ఉగ్డె(11 నెలలు) పుట్టుకతోనే మూత్రనాళం సమస్య ఉంది. నాళం సరిగా తెరుచోకక మూత్ర విసర్జన సమయంలో నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు శిశువును మార్చి చివరి వారంలో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించి ‘ఫైమోసిస్’తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల అంగీకారంతో మార్చి 31న బాలుడి తుంటికి శస్త్రచికిత్స చేశారు. చికిత్సకు ముందు ఆరోగ్యంగా ఉన్న శిశువు సర్జరీ చేసి, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు తరలించిన తర్వాత మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు సహా బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్నో క్లిష్టమైన చికిత్సలు చేసిన అనుభవం ఉన్న వైద్యుల చేతిలో సాధారణ చికిత్స ఎలా విఫలమవుతుందని ప్రశ్నించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని, సదరు వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరుతూ గౌతం ఉగ్డె నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పీడియాట్రిక్ సర్జన్స్‌తో సహా అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సులకు బుధవారం విచారణ నోటీసులు అందజేశారు. పోలీసుల నుంచి నోటీసులు రావడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఆందోళనకు గురయ్యారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులను సంరక్షించే నర్సింగ్ స్టాఫ్ మాత్రం తక్కువగా ఉంది. నిత్యం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందే నీలోఫర్‌లో కేవలం 135 మందే ఉన్నారు. ఇక్కడి శిశువులకు సత్వర వైద్యసేవలు అందాలంటే మరో 300 మంది నర్సులు అవసరం. ఈ అంశంపై అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా పట్టించుకోలేదు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడానికి, శిశు మరణాలకు ఇదే ప్రధాన కారణం. ఒక్క నిలోఫర్‌లోనే కాదు ఉస్మానియాతో సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి.– తెలంగాణ వైద్యుల సంఘం, నిలోఫర్ యూనిట్ -
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
-
వింత శిశువుకు నిలోఫర్‌లో చికిత్స
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి దవాఖానాలో ఒకే కాలుతో జన్మించిన శిశువుకు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమణి తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన సువర్ణ అనే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలను ప్రసవించింది. మొదట జన్మించిన శిశువు ఆరోగ్యంగా తల్లితో ఉండగా.. ఒకే కాలుతో వింత రూపంలో పుట్టిన మరో ఆడ శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ శిశువుకు నడుం పైభాగం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కిందిభాగం మాత్రం ఒకే కాలుతో ఉందన్నారు. ఇలా పుట్టడాన్ని వైద్య పరిభాషలో మెరిమైడ్ సిండ్రోంగా వ్యవహరిస్తామని వైద్యులు తెలిపారు. ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తారన్నారు. ఈ శిశువుకు జననేంద్రియాలు లేవని, జీర్ణాశయం సరైన స్థితిలో పని చేయడం లేదని వైద్యులు తెలిపారు. -
నిత్యాన్నదాత
అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాడు. వారున్న చోటకే వెళ్లి ఆహారంఅందిస్తున్నాడు. నేనున్నానంటూ నిరాశ్రయులు, అనాథలకు భరోసా ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు విద్యార్థి ఎండీ సుజాతుల్లా. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీ చదువుతున్న ఎండీ సుజాతుల్లా(24) సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సమాజసేవలో మమేకమవుతూ సేవా దృక్పథాన్ని చాటుతున్నాడు. ప్రతిరోజు ఉదయం 2వేల మందికి అల్పాహారం అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఏకంగా ఏడాదిన్నరగా నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ నిత్యాన్నదాతగా మారాడు. ముషీరాబాద్‌కు చెందిన సుజాతుల్లా ఈ కళాశాలలోనే బీ–ఫార్మసీ పూర్తి చేశారు. మలుపు తిప్పిన సబ్జెక్టు... సుజాతుల్లా బీ–ఫార్మసీ మూడో సంవత్సరంలో ఒక సబ్జెక్టు తప్పాడు. అందులో పాస్ అయితే 10 మందికి భోజనం పెడతానని దేవుడికి మొక్కుకున్నాడు. మొత్తానికి ఆ సబ్జెక్టులో పాస్ అయ్యాడు. ఆ తెల్లవారే ఓ హోటల్లో పది మందికి భోజనం ప్యాక్ చేసుకొని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిరాశ్రయులకు అందించేందుకు వెళ్లాడు. అయితే 50 మంది వరకు వచ్చి మాకు కూడా ఇవ్వవా.. అంటూ అర్థించారు. ఇంతమంది ఆకలితో ఉంటున్నారా? అని ఆయన మనసు కలిచి వేసింది. మరుసటి రోజు కూడా పది అన్నం ప్యాకెట్లు తీసుకెళ్లి అక్కడే పంపిణీ చేశాడు. అప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘హ్యూమానిటీ ఫస్ట్’ స్థాపన... దీంతో యూఎస్ఏ, యూకేలలోని బంధుమిత్రులను సంప్రదించాడు సుజా తుల్లా. ‘మేం సహాయం చేస్తాం..’ రోజూ భోజనం పంపిణీ చేయమని వారు ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సుజాతుల్లా ‘హ్యూమానిటీ ఫస్ట్’ ఫౌండేషన్ స్థాపించాడు. మొదట వారంలో నాలుగు రోజులు రాత్రిపూట వివిధ ఆస్పత్రుల వద్ద 150 మందికి భోజనం పంపిణీ చేసేవాడు. ఇక గత ఏడాదిన్నర కాలంగా ప్రతిరోజు ఉదయం 2వేల మందికి అల్పాహారం పంపిణీ చేస్తున్నాడు. వానొచ్చినా, వరదొచ్చినా ఈయన సేవా దృక్పథంలో ఏ మాత్రం మార్పు రాలేదు. తన తల్లిదండ్రులు, సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ అనుపమా కోనేరుల ప్రోత్సాహంతో ఈ సేవలు విజయవంతంగా కొనసాగిస్తున్నానని చెప్పారు సుజాతుల్లా. ఇదీ దినచర్య... ప్రతిరోజు తెల్లవారుజామునే టిఫిన్ బాక్సు ఆటోలో తీసుకొని కోఠిలోని మెటర్నిటీ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రుల వద్దకు వెళ్తాడు. 9గంటల వరకు టిఫిన్ పంపిణీ చేస్తాడు. అనంతరం కాలేజీకి వెళ్తాడు. అల్పాహారం, భోజనానికి ప్రతిరోజు రూ.3,500 ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పాన్ మండే.. నోరు పండే!
హిమాయత్‌నగర్: పంచ భక్ష్య పరమాన్నంతో భోజనం చేశాక పచ్చని తమలపాకులతో చక్కగా ఓ పాన్ చుట్టి నోట్లో వేసుకుంటే.. ఆ మజానే వేరు. అప్పుడే కదా విందు చేసిన సంతృప్తి ఉండేది. భోజన ప్రియులు ఎవరన్నా ఇలాగే చెబుతారు. అంతలేకున్నా కడుపు నిండా ఇష్టమైన భోజనం చేశాక పాన్ వేసుకునేవారు చాలామందే ఉన్నారు. ఇక దమ్ బిర్యానీ లాంగిచేశాక ఓ పాన్ వేసుకుంటే బాగా జీర్ణమవుతుందనా చాలామంది సిటీవాసులు అభిప్రాయం అదే నమ్మకంతో చాలామంది పాన్ కోసం క్యూ కడతారు. సిటీలో ఎన్ని పాన్‌షాపులు ఉన్నా.. ఒక్కో షాపుది ఒక్కో ప్రత్యేకత. ఇదే కోవలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నిలోఫర్ ఆస్పత్రి సమీపంలోని ‘ఎన్ఎన్ఎస్ పాన్ మహల్’ వారు. ‘భగభగ మండే’ పాన్‌తో పాన్ప్రియులను అలరిస్తూ సిటీకే ‘ఫైర్’ టాపిక్‌గా మారారు. ఓల్డ్‌సిటీలోని హుస్సేనీ ఆలంకు చెందిన నజర్నభీ సాలార్ (ఎన్ఎన్ఎస్)కు పాన్ అంటే అమితమైన ప్రేమ. ఈ ప్రేమతోనే 1950లో ఓల్డ్‌సిటీలో ‘షేరాన్ పాన్’ పేరుతో ‘ఫైర్ పాన్’ను ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడ దొరికే ఈ ఫైర్ పాన్ కోసం నగరవాసులు బారులు తీరేవారు. అనుకోకుండా కొంతకాలానికి పాన్ అమ్మకాలను నిలిపివేశారు. ఆ తర్వాత నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో ఎన్ఎన్ఎస్ కుటుంబ సభ్యులు ‘ఎన్ఎన్ఎస్ పాన్ మహల్’ పేరుతో ఫైర్‌పాన్ అమ్మకాలను ప్రారంభించారు. ప్రత్యేకత ఏమిటి.. ఫైర్పాన్లో ‘స్ట్రాబెర్రీ ఫ్లేవర్, హాట్చీజ్, ఇంట్లో తయారు చేసిన గుల్హాకన్, కోకోనట్, డౌట్స్, ఖర్జూర, స్వీట్మసాలా, హెర్బల్ మసాలా’తో పాన్ తయారు చేస్తారు. తమలపాకుపై ఇవన్నీ వేసిన తర్వాత మంటను వెలిగిస్తారు. భగభగ మండుతున్న ఆ పాన్‌ను నోట్లో వేసుకుంటే ఓ కరమైన కూల్, హాట్, స్వీట్ వంటి టేస్ట్లు నాలుకకు తగలడం విశేషం. నాలుక ఎర్రగా పండడంతో పాటు రోజంతా నోరు ఫ్రెష్‌గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంత టేస్ట్ కలిగిన ఈ పాన్‌ను ప్రస్తుతం రూ.50కి విక్రయిస్తున్నారు. రోజుకు 100కు పైగానే.. ఫైర్‌పాన్ తయారీ, విక్రయం దేశంలోనే మాది ఫస్ట్ ప్లేస్. మా తాత నజర్నబీ సాలార్ (ఎన్ఎన్ఎస్) చూపించిన ఈ చక్కటి అవకాశాన్ని వంశ పారంపర్యంగా కొనసాగిస్తున్నాం. ఫైర్పాన్కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ప్రతిరోజూ వందకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీకెండ్స్‌లో అయితే ఐదారొందల మంది తింటుంటారు. – మహ్మద్ జయుద్దీన్, పాన్‌షాపు యజమాని టేస్ట్ మస్తుంది.. నిలోఫర్‌లో మా బంధువుల్ని చూసేందుకు కొద్దిరోజుల క్రితం వచ్చాను. ఇక్కడ ఫైర్‌పాన్ బాగుంటుందని అందరూ అనుకుంటుంటే విన్నా. ఫ్రెండ్స్‌తో వచ్చి మరీ టేస్ట్ చేశా. ఓ పక్క మంట మండుతుండగానే నోట్లో పెట్టుకోవాలంటే ముందు భయపడ్డా, తింటుంటే టేస్ట్ మస్త్ ఉంది.– చందుగౌడ్, ప్రైవేట్ ఉద్యోగి -
నీలోఫర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి పక్కనే ఉన్న తులసి ప్రింటింగ్ ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. నీలోఫర్ ఆస్పత్రి ప్రహరీ గోడకి అనుకుని ఉన్న ఎస్ఎస్వీ ప్రింటర్స్తో పాటు మరో మూడు ప్రెస్‌లలో మంటలు వ్యాపించాయి. ఉదయం అయిదు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్‌లో ఉన్న యంత్రాలు, పేపర్లు పూర్తిగా దగ్దం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా పక్కనే నిలోఫర్‌లోని పిల్లల వార్డుతో పాటు పలు అపార్ట్మెంట్లు కూడా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది గంటలోపే మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆస్పత్రిలో రోగులతో పాటు, అటెండర్లు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఆస్పత్రి చుట్టూ ఉన్న మరి కొన్ని ప్రింటింగ్ ప్రెస్‌లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పక తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. -
నిలోఫర్ ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేద చిన్నారులకు చికిత్స అందించే నిలోఫర్ ఆస్పత్రిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, మూడురోజులైనా ఆస్పత్రిలోని బెడ్‌షీట్స్ మార్చడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెడ్షీట్లు మార్చకపోవడంతో అస్వస్థతతో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో కనీసం డాక్టర్లు, నర్సులు కూడా అందుబాటులో లేరని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఆర్‌ఎంవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో చికిత్స కోసం వచ్చిన చిన్నారులు అనేక అవస్థలు పడుతున్నారంటూ రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. -
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
కదిలించిన చిన్నారుల కథనం
నల్లగొండ: శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న అనాథ చిన్నారులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు చేపడ తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. బుధ వారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘చిన్నారుల మృత్యు ఘోష’ కథనంపై జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. డీఆర్వో, ఆర్డీవో, సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ శిశుగృహను సందర్శించి ప్రాథమికవిచారణ జరిపారు. సాయంత్రం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డీఎంహెచ్‌వో భానుప్రసాద్, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ వైద్యులతోపాటు మహిళా శిశు కో–ఆర్డినేటర్ మాలె శరణ్యారెడ్డి శిశుగృహను సందర్శించారు. సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలకు ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం, శిశుగృహ అభివృద్ధి కోసం మహిళా అధికారులతో కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌష్టికాహారం, శానిటేషన్‌కు సూచనలిచ్చేందుకు ఐదుగురు వైద్యులతో మరో కమిటీని నియమి స్తున్నట్లు తెలిపారు. శిశువుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు శాశ్వతంగా వైద్యుడిని ముగ్గురు స్టాఫ్ నర్సులను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రికి తరలించే పిల్లలపై శ్రద్ధ తీసుకునేలా సూపరిం టెండెంట్‌తో మాట్లాడతానని చెప్పారు. నిలోఫర్, కామినేని ఆసుపత్రులకు తరలించే చిన్నారుల ఆరోగ్యంపై వైద్యులు, అధికారులతో మాట్లాడేందుకు ఐదుగురు వైద్యుల కమిటీ పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. చిన్నారుల నివేదికలు పరిశీలించి, అందుకు గల కారణాలను తెలుసుకున్న తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌లో శిశువుల ఆకలి తీర్చే మదర్ మిల్క్ బ్యాంక్
-
తల్లడిల్లిన తల్లి గుండె!
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్/కల్వకుర్తి: కిడ్నాపైన తమ కొడుకు క్షేమంగా తిరిగొస్తాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. చివరికి మృతదేహంగా కళ్లముందు మిగిలే సరికి తల్లడిల్లిపోయారు. పొత్తిళ్లలో వేసి లాలించకముందే తిరిగిరానంత దూరం వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లిలో బుధవారం కనిపించిన బాధాకర దృశ్యమిది. సత్తూరి మంజుల అనే మహిళ హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఆదివారం మగశిశువును అపహరించడం, ఆ శిశువు ఆరోగ్యం బాగాలేక మృతి చెందడంతో బండోనిపల్లిలో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు.. నిందితురాలిని బుధవారం అరెస్టు చేశారు. ఆమెను, శిశువు తల్లిదండ్రులను బుధవారం బండోనిపల్లికి తీసుకెళ్లి.. పూడ్చిపెట్టిన శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే పోస్టుమార్టం కూడా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో శిశువు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇక మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించిన ఫోరెన్సిక్ వైద్యులు.. వాటిని తల్లిదండ్రుల డీఎన్ఏతో పోల్చేందుకు లేబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. శిశువు మరణానికి అనారోగ్యమే కారణమా లేక మరేదైనా ఇతర అంశం ఉందా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని పేర్కొన్నారు. భర్తను ఏమార్చేందుకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, బండోనిపల్లికి చెందిన కుమార్‌గౌడ్‌లు హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఉన్న ఓ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అప్పటికే వివాహమై భార్యకు దూరంగా ఉంటున్న కుమార్ మూడేళ్ల కింద మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలుత గర్భం దాల్చిన మంజులకు మూడో నెలలోనే గర్భస్రావమైంది. ఈ ఏడాది రెండోసారి గర్భం దాల్చగా.. ఐదున్నర నెలలకు అబార్షన్ అయింది. ఈ విషయాన్ని భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిన మంజుల.. గర్భంతోనే ఉన్నట్లు నటించింది. గత శనివారం ప్రసవం కోసం వెళ్తున్నానని భర్తకు చెప్పి.. పేట్లబురుజు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎవరైనా శిశువులను ఇస్తారేమోనని ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన నిర్మల, ఆమె బంధువులతో పరిచయం పెంచుకుని.. వారి మగశిశువును నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ బిడ్డ తమ బిడ్డేనని చెప్పి భర్తతో కలసి బండోనిపల్లిలోని అత్తవారింటికి వెళ్లింది. అయితే అప్పటికే అనారోగ్యంతో ఉన్న శిశువు సోమవారమే మరణించాడు. దాంతో కుమార్‌గౌడ్, ఆయన తల్లి బాలమ్మ కలసి గ్రామ సమీపంలోని ముళ్ల పొదల మధ్య శిశువును పూడ్చిపెట్టారు. అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు తిరిగి వచ్చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మంగళవారం రాత్రి నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. -
నిలోఫర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
నిలోఫర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ కిడ్నాప్ కేసులో మరో కొత్త కోణం బయటికొచ్చింది. శిశువును కిడ్నాప్ చేసిన మంజుల అనే మహిళ శిశువు తనకే పుట్టినట్టు భర్త కుమార్ గౌడ్, అత్త, బంధువులను నమ్మించింది. తనకు 5 నెలల క్రితమే అబార్షన్ అయినా భర్త, కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియనీయకుండా మంజుల జాగ్రత్తలు తీసుకుంది. బాబు పుట్టాడు అని భర్త కుమార్‌కు కిడ్నాప్ చేసిన రోజు ఫోన్ చేసి పేట్ల బురుజు ఆసుపత్రికి రప్పించింది. మంజుల మాటలను నమ్మి ఆసుపత్రికి వెళ్లి బాబుని తీసుకుని స్వగృహానికి కుమార్ గౌడ్ వచ్చాడు. సోమవారం ఉదయం బాబు చనిపోవడంతో తన బాబే చనిపోయినట్టు భావించి పూడ్చి పెట్టినట్లు పోలీసుల ఎదుట కుమార్ గౌడ్ చెప్పారు. తన భార్య మంజుల మోసం చేసిందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. పూడ్చిన బాబును బయటకి తీశాక డీఎన్ఏ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరు కుటుంబాలు నాగర్ కర్నూలు జిల్లా బండోపల్లిలో చిన్నారిని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్నాయి. శిశువు సమాధి వద్ద కన్నతండ్రి భోరున విలపించడం అక్కడున్నవారిని కదిలిచింది. పోలీస్ బందోబస్తు నడుమ వైద్యుల బృందం శిశువు మృతదేహాన్ని వెలికితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు స్థానికులు ఇక్కడికి భారీగా తరలివచ్చారు. -
ఆ అమ్మకు కన్నీరే మిగిలింది
-
ఆ అమ్మకు కన్నీరే మిగిలింది
సాక్షి, హైదరాబాద్/వెల్దండ: కన్నకొడుకును కళ్లారా చూసుకోకముందే ఆ అమ్మకు కన్నీరు మిగిలింది.. పుట్టిన మూడు రోజులకే దూరమైన బిడ్డ చివరిచూపు కూడా దక్కకుండానే శాశ్వతంగా దూరమైపోయాడు.. ఆదివారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి వద్ద కిడ్నాపైన శిశువు ఉదంతం విషాదాంతమైంది. సోమవారం ఉదయమే ఆ శిశువు మరణించాడని.. కిడ్నాపర్ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లి గ్రామంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తేలింది. కిడ్నాపర్‌ను సత్తూరి మంజులగా గుర్తించిన పోలీసులు.. మంగళవారం ఆమెను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయాగా పరిచయం చేసుకుని.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తీసుకువస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లికి చెందిన కుమార్‌గౌడ్ కొన్నేళ్ల కింద హైదరాబాద్‌లోని కాటేదాన్ పారిశ్రామికవాడకు వలస వచ్చారు. అక్కడ వారికి పరిచయం ఏర్పడి మూడేళ్ల కింద వివాహం చేసుకున్నారు. మంజుల పలు గర్భం దాల్చినా వరుసగా అబార్షన్లు కావడంతో తమకు పిల్లలు పుట్టే అవకాశం లేదని భావించింది. రెండు నెలల కింద ఆరు నెలల గర్భం కూడా పోయింది. అయినా భర్తకు చెప్పకుండా దాచిన ఆమె.. ప్రసవం కోసమంటూ ఓ మహిళతో కలసి పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. అక్కడ ఎవరైనా తనకు శిశువును ఇస్తే.. తమ బిడ్డగా భర్తకు చూపాలని భావించింది. శనివారం రోజంతా ఆస్పత్రిలోనే ఉండి.. ఆయాగా చెప్పుకుంటూ తిరిగింది. చివరికి ఆస్పత్రిలో నిర్మల కుమారుడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుని.. వారితో పరిచయం పెంచుకుంది. ఆదివారం శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా తాను సహాయంగా ఉంటానంటూ మంజుల కూడా వెళ్లింది. నీలోఫర్ ఆస్పత్రిలో స్కానింగ్ తీసిన అనంతరం శిశువు బంధువులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి.. శిశువును ఎత్తుకుని పరారైంది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా.. నీలోఫర్ ఆస్పత్రి వద్ద శిశువును కిడ్నాప్ చేసిన మంజుల.. అక్కడి నుంచి లక్డీకాపూల్ వరకు ఆటోలో, తర్వాత బస్సులో పేట్లబురుజు ఆస్పత్రి వద్దకు వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అనంతరం తనను డిశ్చార్జి చేశారని, బిడ్డను తీసుకుని వెళదామని భర్తను ఆస్పత్రి వద్దకు పిలిపించుకుంది. అక్కడి నుంచి శిశువుతో సహా భార్యాభర్తలు బైక్‌పై తమ స్వగ్రామం బండరోనిపల్లికి చేరుకున్నారు. అయితే అప్పటికే శిశువు అనారోగ్యంతో ఉండగా.. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో శిశువును గ్రామంలోనే పూడ్చిపెట్టారు. అయితే శిశువును తీసుకెళుతున్న మహిళ బస్సులో ప్రయాణించిన విషయం తెలుసుకున్న పోలీసులు... మంగళవారం వెల్దండ వెళ్లి విచారించారు. కిడ్నాపర్ చిత్రాలు చూపించగా సత్తూరి మంజులగా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు మంజులను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు బుధవారం శిశువు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ’నీలోఫర్’ శిశువు కిడ్నాప్ ఘటన విషాదాంతం -
‘నిలోఫర్’ నుంచి శిశువు అపహరణ
హైదరాబాద్: కన్నబిడ్డను ఆ తల్లి కడుపారా చూసుకోక ముందే అపహరించారు. ఆయాగా వచ్చిన మహిళ.. శిశువు అమ్మమ్మ కళ్లు గప్పి ఈ దారుణానికి పాల్పడింది. ఆదివారం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన పాండూ భార్య నిర్మల శుక్రవారం పాతబస్తీలోని పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. అదే రోజు ఆసుపత్రిలో నిర్మల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు నిమోనియా ఉండటంతో శిశువును నిలోఫర్‌కు తీసుకెళ్లాలంటూ వైద్యులు సలహా ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు బాలింతను పేట్ల బురుజు ఆసుపత్రిలోనే ఉంచారు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ తాను ఆయానంటూ నిర్మల, ఆమె తల్లి కల్పనకు పరిచయమయింది. శిశువును తీసుకుని ఆయాతో సహా కల్పన నిలోఫర్ ఆసుపత్రికి చేరుకుంది. అత్యవసర కేసు కావడం తో తొలుత శిశువుకు ఎక్స్‌రే తీశారు. ఆదివారం సెలవు దినం కావడంతో వెంటనే శిశువును చూసే వైద్యులు అందుబాటులో లేరు. ఎక్స్‌రేను వైద్యులకు చూపించాల్సి ఉండటంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం నుంచి కల్పన ఏమీ తినకపోవడంతో శిశువును ఆయా వద్ద ఉంచి టీ తాగి వస్తానని బయటికి వచ్చింది. ఆసుపత్రి బయటి గేటు వద్దకు వచ్చి టీ తాగి వెళ్లి చూడగా శిశువు, ఆయా కనిపించలేదు. ఆసుపత్రి ప్రాంగణమంతా కలియతిరిగినా ఆయా కానరాలేదు. దీంతో బాధితురాలు నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ ఇతర పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లిన తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారన్న విషయం తెలుసుకున్న నిర్మల తీవ్ర ఆందోళనకు గురైంది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా శిశువు ఆచూకీ లభించలేదు. -
తల్లి ఒడికి చేరిన సరోగసీ చిన్నారి
సాక్షి, హైదరాబాద్: సరోగసీ ద్వారా జన్మించి, అనారోగ్యంతో నిలోఫర్ ఆస్ప త్రిలో చికిత్స పొందిన శిశువు 4రోజుల తర్వాత గురువారం తల్లి చెంతకు చేరింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళ సరో గసీ ద్వారా గర్భందాల్చి.. ఈ నెల 20న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలి సిందే. పుట్టిన బిడ్డ నిలోఫర్‌లో చికిత్స పొందుతుండగా, అద్దె గర్భం పేరుతో మోసపోయిన బాధితురాలు పేట్లబురుజు ఆస్పత్రి అత్యవసర విభాగానికే పరిమి తమైంది. పాప ఆరోగ్యం మెరుగుపడటం తో ఆస్పత్రి నుంచి డిశ్చార్జిచేసి, పేట్లబు రుజు ఆస్పత్రిలో ఉన్న తల్లికి అప్పగిం చారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఇదిలా ఉంటే సరోగసీ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసుల నుంచి ఓ స్పష్టత వచ్చే వరకు తల్లీపిల్లలను ఆస్పత్రిలోనే ఉంచనున్నట్లు పేట్లబురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమణి తెలిపారు. ఆ తర్వాతే వారిని డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేశారు. -
సర్కారీ కాదు.. ‘కార్పొరేట్’ దవాఖానా!
నీలోఫర్, పేట్లబురుజు, మలక్‌పేట్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వసతులు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు..’ ఇది ఒకప్పటి మాట..! ‘నేను పోను బిడ్డో కార్పొరేట్ ఆస్పత్రికి..’ ఇదీ ఇప్పటి మాట..! పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కారీ దవాఖానా లను తీర్చిదిద్దుతోంది. ట్రాలీలు, వీల్చైర్లు, అత్యాధునిక హైడ్రాలిక్ పడకలు, ఖరీదైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. రోజుకో రంగు చొప్పున దుప్పట్లు మారుస్తూ.. కార్పొరేట్ లుక్ తెస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుండటంతో రోగులు కార్పొరేట్ ఆస్పత్రులను వదిలి ప్రభుత్వాస్పత్రుల బాట పడుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం వల్ల కూడా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ రూపుమారిన ‘మలక్‌పేట్’ 100 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 800–900 మంది గర్భిణు లు వస్తుండగా.. ఇక్కడ నిత్యం వంద మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 8 ప్రసవాలు జరుగుతున్నాయి. రూ. 1.05 కోట్లతో రోగుల నిష్పత్తికి తగినన్ని హైడ్రాలిక్ పడకలతో పాటు వీల్చైర్లు, ట్రాలీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో శిథిలావస్థకు చేరిన టాయ్లెట్లను తొలగించి పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, మరో ఓటీని సిద్ధం చేయడంతో ఒకేసారి నాలుగు ప్రసవాలు చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, నాంపల్లి, గోల్కొండ, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులు సైతం కార్పొరేట్ హంగులు సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్‌ను తలపిస్తున్న నీలోఫర్.. నీలోఫర్ ఆస్పత్రి.. దేశంలోనే అతిపెద్ద రెఫరల్ సెంటర్. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి రోగుల వస్తుంటారు. ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 600 మంది రోగులు వస్తుంటారు. రూ.68 కోట్లతో నిర్మించిన రాజీవ్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్‌ను ప్రభుత్వం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. దీంతో పడకల సంఖ్య వెయ్యికి పెరిగింది. గర్భిణులు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక వసతులను కల్పించింది. హైడ్రాలిక్ పడకలతో పాటు వెంటిలేటర్లు, బెడ్‌సైడ్ మానిటర్లు, ఫొటో థెరపీ యూనిట్లను సమకూర్చింది. వైద్య పరీక్షల కోసం 24 గంటల ల్యాబ్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గ్రూప్ రక్తాన్ని అందజేసేందుకు అత్యాధునిక బ్లడ్‌బ్యాంక్‌ను, బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. తీవ్రమైన రక్తస్రావం, బీపీ, షుగర్ ఇతర సమస్యలతో బాధపడుతున్న బాలింతలకు అత్యవసర చికిత్స అందించేందుకు 10 పడకలతో అత్యాధునిక ఎంఐసీయూ అందుబాటులోకి తెచ్చింది. కిలోకన్నా తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులకు చికిత్స అందించేందుకు లెవల్–3 ఇన్టెన్సివ్ కేర్ యూనిట్‌తో పాటు నాలుగు హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. రోగులు కూర్చునేందుకు వార్డుల్లో కుర్చీలు, ట్రాలీలు, మంచినీటి ట్యాంక్‌లను, పడకలపై దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు అధునాతన లాండ్రీని ఏర్పాటు చేశారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజులో.. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చి ల్యాబ్‌లను ఆధునీకరించారు. 600 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజులో రోజుకు సగటున 40–60 ప్రసవాలు జరుగుతుండగా, 400 పడకలున్న సుల్తాన్‌బజార్‌లో రోజుకు సగటున 25–30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో అధునాతన ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేసి 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పోస్టుల అమ్మకం!
►అనుభవం, అర్హత లేకున్నా... ►గుట్టుగా నాలుగో తరగతి ఉద్యోగుల నియామకం ►ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగుతున్న దందా ►తాజాగా నిలోఫర్ హెల్త్ ఇన్స్పెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని నాలుగో తరగతి ఉద్యోగాలు కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయాలు, స్వీపర్లు, డ్రైవర్లు, వార్డుబాయ్‌లు, టెక్నికల్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి ఉద్యోగ ఖాళీలను ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలతో పాటు ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ. 50 వేల వరకూ.... ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొలువులు కావడంతో నిరుద్యోగుల నుంచి వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేకుండానే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఆయా ఆస్పత్రుల్లోని కార్మిక సంఘాల నాయకులు, అధికారులు... ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన వారితో ఈ పోస్టులను భర్తీ చేసుకున్నారు. ఇందు కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిలోఫర్‌లో బహిర్గతం... నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పని చేసేందుకు కొత్తగా వంద పోస్టుల (నర్సులు, ఆయాలు, వార్డు బాయ్‌లు, డ్రైవర్)ను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. కానీ అప్పుడే వసూళ్ల పర్వం మొదలైంది. ఇప్పటికే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కింద పని చేస్తున్న వారితో బేరసారాలు మొదలయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై ఇటీవల నిలోఫర్ ఆస్పత్రికి చెందిన ఓ హెల్త్ ఇన్స్పెక్టర్పై పారిశుద్ధ కార్మికులు నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కొసమెరుపు. అభివృద్ధి కమిటీలు.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సహాయంగా ఉండేందుకు పేషంట్ కేర్ ప్రొవైడర్స్ (క్లాస్ 4 ఉద్యోగాలు) పేరుతో రాష్ట్రంలోని 11 ఆస్పత్రుల్లో 1001 ఫోస్టులను (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఇప్పటికే ఆయా ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు 475 మందిని ఎంపిక చేసుకోగా, మిగిలిన 526 వాటిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించింది. ఉస్మానియాలో 416 పోస్టులకు గాను ఇప్పటికే 199 మంది ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కింద పని చేస్తున్నారు. మిగిలిన 217 పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. ఇక గాంధీలో 27 పోస్టులు ఉండగా, వీటిలో ఇప్పటికే 20 మంది పని చేస్తుండగా, మిగిలిన ఏడు ఖాళీల భర్తీకి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా వైద్య కళా శాలలో 162 ఖాళీలకు, 79 మంది ఇప్పటికే పని చేస్తుండగా, మరో 83 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇక సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో 72 ఖాళీల్లో ఇప్పటికే 16 మంది పని చేస్తుండగా , మిగిలిన 56 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫీవర్ ఆస్పత్రిలో 55 ఖాళీలకు 35 మంది పని చేస్తుండగా, మిగిలిన 20 ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ అయ్యాయి. -
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువ
వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి,హైదరాబాద్: బాలింతల మరణాలు ఈ మధ్య కాలంలో సంభవిస్తున్నాయని, అలా ఎందుకు జరుగుతున్నాయన్న అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి మంగళవారం సమీక్షించా రు. ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బాలింతలు, శిశు మరణాలు సంభవిస్తున్నాయని, 50 శాతం మరణాలకు కారణాలు తెలియడం లేదన్నారు. అయినా మన రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, దాన్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, వైద్యులపై ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు రాజేశ్వర్ తివారీ, వాకాటి కరుణ పాల్గొన్నారు. ‘నిలోఫర్‌లో మదర్ మిల్క్ బ్యాంకు’ తల్లి పాలు అందని పిల్లలకు ఆ పాలను అందించే బృహత్తర కార్యక్రమానికి ధాత్రి, డాక్టర్ ఫర్ సేవ సంస్థలు నడుం బిగిం చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మదర్ మిల్క్ బ్యాంకు పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లి పాలు అందక తల్లడిల్లుతున్న వారికి మేమున్నామం టూ ముందుకు వచ్చిన ఆ సంస్థలు.. నిలోఫర్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంకుని పెట్టాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. తల్లుల నుం చి ఒక్కోసారి ఎక్కువగా ఉత్పత్తి అయిన పాలను సేకరించి వాటిని పిల్లలకు అందజేస్తారని చెప్పారు. ఈ నెల 30 నుంచి కార్యక్రమాన్ని నిలోఫర్‌లో ప్రారం భిస్తున్నారన్నారు. దేశంలో కేవలం 15 మిల్క్ బ్యాంకులే ఉన్నాయని, రాష్ట్రంలో మొదటిసారి మదర్ మిల్క్ బ్యాంకుని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.