Nirmala Sitharaman
-
గేమ్ ఛేంజర్ బడ్జెట్
-
Union Budget 2025: కొత్త టెక్నాలజీలకు రాచబాట
కొత్త పరిశోధనలు, అభివృద్ధి కోసం శాస్త్ర–సాంకేతిక శాఖకు రూ.20 వేల కోట్లు భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ‘డీప్ టెక్’ ఫండ్ ఆఫ్ ఫండ్స్న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ. 55,679 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు.. ⇒ కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు కేటాయించారు. ⇒ బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు. ⇒ అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు. ⇒ అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు. -
రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
కేంద్రబడ్జెట్ 2025-26లో నిర్మలా సీతారామన్ సామాన్యుడికి రూ.13 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలామందికి ఇది ఎలా వర్తిస్తుందో అనుమానాలున్నాయి. అయితే ఒక ఉదాహరణతో దీనిపై స్పష్టతకు వద్దాం. మీ వార్షిక వేతనం రూ.13 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. ఎందుకంటే మీ ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీ సంపాదన రూ.13 లక్షల నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా మిగిలిన రూ.12.25 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.ఇందులో రూ.4 లక్షలవరకూ జీరో ట్యాక్స్‌రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలుమిగిలిన నాలుగు లక్షలు.. రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలుమిగిలిన 25 వేలపై 15 శాతం అంటే రూ.3,750గా లెక్కిస్తారు.మొత్తంగా రూ.4-8 లక్షలు- 5 శాతం ట్యాక్స్ రూ.20,000రూ.8-12 లక్షలు(మిగిలిన రూ.4 లక్షలనే పరిగణిస్తారు)-10 శాతం ట్యాక్స్ రూ.40,000రూ.12-16 లక్షలు(మిగిలిన రూ.25,000కు)- 15 శాతం ట్యాక్స్ రూ.3,750మొత్తం కలిపి రూ.13 లక్షలు ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.63,750.ఇదీ చదవండి: స్టార్టప్‌లకు జోష్రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని అని గుర్తుంచుకోవాలి.అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రైవేట్ రంగానికి పీఎం గతి శక్తి డేటా..
చివరి అంచె వరకు డెలివరీ సేవలు అందేలా చూసేందుకు, మౌలిక సదుపాయాల ఆధారిత యాప్‌లను రూపొందించేందుకు ఉపయోగపడేలా పీఎం గతి శక్తి పోర్టల్‌లోని నిర్దిష్ట డేటా, మ్యాప్‌లను ప్రైవేట్ రంగానికి అందించే దిశగా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ప్రైవేట్ రంగానికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ శాఖలు అందించే రైల్వే స్టేషన్లు, గూడ్ షెడ్లు, జాతీయ.. రాష్ట్ర రహదారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు, ఎంఎంఎల్‌పీలు (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు) మొదలైన డేటా, ప్రైవేట్ రంగం లాస్ట్ మైల్ డెలివరీ సేవలను మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడనుంది. అలాగే, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌ను రూపకల్పన, టెక్ ఆధారిత లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అవసరాలకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. -
కస్టమ్స్ టారిఫ్‌లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్‌లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్‌ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్‌లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్‌లను 70 శాతం టారిఫ్‌లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్‌కు ఇది అమలవుతుందన్నారు. -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
టీడీఎస్ ఖుషి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎవరికి ప్రయోజనం..?తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్‌లు/ఎన్జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది. ఇప్పుడు వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్‌లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు. కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్ ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు. కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్‌లపై టీసీఎస్ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్‌లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్‌లపై టీసీఎస్‌ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం. కామినేని శశిధర్ఎండి, కామినేని హాస్పిటల్స్సిమెంట్ రంగ వృద్ధికి..హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్‌ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.మెడికల్ టూరిజంకు బూస్ట్..దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్‌కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది. – బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్పోటీతత్వాన్ని పెంచడానికి.. ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. – అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.ఈవీల ఉత్పత్తికి బాసట.. బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య. – గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్. ఉద్యోగాలను సృష్టించడానికి..వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి. – సంజీవ్‌పురి, ప్రెసిడెంట్, సీఐఐపట్టణ సంస్కరణలకు.. ఊతంప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు అంకితం. – వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. -
చిన్న సంస్థలకు.. భారీ బూస్ట్
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) మరింత ఊతమిచ్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను పెంచడం, రుణ హామీ పథకం కవరేజీని పెంచడం, ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు కస్టమైజ్ చేసిన క్రెడిట్ కార్డులు అందించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచుతూ బడ్జెట్లో మంత్రి ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 10 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను ’సూక్ష్మ’ సంస్థలుగా వర్గీకరిస్తారు. రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ’చిన్న’ తరహా సంస్థలుగా, రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులతో రూ. 500 కోట్ల లోపు టర్నోవరు ఉన్న సంస్థలను ’మధ్య’ తరహా సంస్థలుగా వ్యవహరిస్తారు. ఎంఎస్ఎంఈల విషయంలో ప్రకటించిన చర్యలను పరిశ్రమ స్వాగతించింది. దేశ ఎకానమీలో తయారీ రంగ వాటాను పెంచే దిశగా ఇది కీలకమైన అడుగని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తెలిపారు. కీలకమైన రెండో ఇంజిన్.. దేశాభివృద్ధికి కీలకమైన రెండో ఇంజిన్‌గా ఎంఎస్ఎంఈలను నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఉత్ప త్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మె రుగుపర్చుకునేందుకు, మరింతగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాజా ప్రతిపాదనలు ఉపయోగపడతాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించేందుకు, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు లఘు సంస్థలకు ధీమా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి పైగా ఉన్న రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు, సుమారు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో వీటి వాటా 36 శాతంగాను, ఎగుమతుల్లో దాదాపు 45%గా ఉంది. మరిన్ని విశేషాలు.. → 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఎంట్రప్రెన్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి కొత్త ప్రతిపాదన ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించేందుకు తోడ్పడుతుంది. → లఘు, చిన్న సంస్థలకు రుణ హామీ కవరేజీని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. దీనితో వచ్చే అయిదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు లభిస్తాయి. → స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు. → ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు. → మేడిన్ ఇండియా ఆట»ొమ్మలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఇంటర్నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు. -
నిధుల్లో మేజర్
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.ఆధునీకరణ కోసం.. మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లుదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు..కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)’కు ఈ బడ్జెట్లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ⇒ మొత్తం బడ్జెట్లో 13.45%⇒ మన దేశ జీడీపీలో 1.91%⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు) -
బీమాకు 100% దన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ తాజా బడ్జెట్లో బీమా రంగానికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు)ను అనుమతించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం బీమాలో 74 శాతంవరకూ ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఆధునికతరం ఫైనాన్షియల్ రంగ సంస్కరణలలో భాగంగా ఇందుకు తెరతీశారు. అయితే మొత్తం ప్రీమియంను దేశీయంగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు మాత్రమే పెంచిన పరిమితి వర్తించనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. వెరసి విదేశీ పెట్టుబడుల పరిమితులను సమీక్షించడంతోపాటు సరళతరం చేసినట్లు వెల్లడించారు. ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు వీలుగా ప్రభుత్వం బీమా చట్టం 1938, జీవిత బీమా చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత చట్టం 1999లకు సవరణలు చేయనుంది. మరిన్ని సంస్థలు ప్రవేశించడం ద్వారా బీమా విస్తృతి పెరగడంతోపాటు భారీ ఉద్యోగ అవకాశాలకు తెరలేవనుంది. కొన్ని నిబంధనలు, విధానాలను సరళతరం చేసే ముసాయిదా బిల్లు త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఇంతక్రితం 2021లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం హెచ్చించింది. అంతకుముందు 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు అనుమతించింది. -
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు
న్యూఢిల్లీ: కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికి మించి సెస్సు లేదా సర్‌చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు. -
బాహుబలికి కళ్లెం..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది. మార్కెట్లో మరిన్ని సంగతులు → కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. కావేరీ సీడ్స్ , పారదీప్ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్ బయో–జీన్స్, బేయర్ క్రాప్‌సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో చంబల్ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. → ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్ గ్లోబల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియలిటి, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. → లెదర్ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్‌వేర్ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్ 20% ఎగసి అప్పర్ సర్క్యూట్ తాకింది. క్యాంపస్ ఆక్టివేర్ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్ 4%, లెహర్ ఫుట్‌వేర్స్ 3%, రిలాక్సో పుట్వేర్స్ ఒకశాతం పెరిగాయి. ట్రేడింగ్ సాగిందిలా...స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్‌పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.వినిమయ షేర్లు పరుగులు ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్ షేర్లు పరుగులు పెట్టాయి. → వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్ 13% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్ 8%, హావెల్స్ 6%, వోల్టాస్ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్‌పూల్ 3% చొప్పున, టైటాన్ 2% ఎగిశాయి. → ఎఫ్ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్‌యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి. → ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్ మోటార్స్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, బజాజ్ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి. మౌలిక రంగ షేర్లు డీలా ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక, ఇంధన ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి. . → రైల్వే రంగ షేర్లైన టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్స్, జుపిటర్ వేగన్స్ , టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్సీటీసీ, రీట్స్ షేర్లు 3% నష్టపోయాయి. → రోడ్లు, కస్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ 8%, ఎన్బీసీసీ, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్ ఇ్రన్ఫా, ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్అండ్టీ, అజాద్ ఇంజనీరింగ్స్ షేర్లు 3–6% క్షీణించాయి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్ లక్ష్యం.బ్యాటరీల తయారీకి దన్ను ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల (మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్ మహాజన్ చెప్పారు. బలమైన అడుగులు.. క్యాన్సర్ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్ టూరిజం, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు. సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్‌లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్.వైద్య సంరక్షణ కేంద్రంగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్ ఇన్ ఇండియా మిషన్ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్‌ను ఉంచు తుంది. – ప్రతాప్ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్.పెట్టుబడులకు ఊతం.. వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.వృద్ధికి ఇంధనం.. తయారీ, గ్రీన్ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్. కస్టమర్లకు ఉపశమనం లేదు.. విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్ గూడ్స్) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. పంకజ్ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్.ఇంధన శక్తిలో అగ్రగామిగా.. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్ మీటరింగ్ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. – నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. -
పర్లేదు సార్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్‌కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 బడ్జెట్లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్‌ను స్వాగతించారు. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. ఐఐటీల విస్తరణ.. 2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు. నైపుణ్యాల పెంపు.. విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు. ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది. ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్వేర్ సర్విసెస్)రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు ఐఐటీలు, ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను పెంచడం వల్ల పీహెచ్డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్స్పష్టత ఇవ్వాల్సింది సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్‌కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360జాతి వృద్ధికి ఊతం ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్ఏటా కుదింపులు.. ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి -
5 ఏళ్లలో 75 వేల సీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.99,858.56 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా, ఈసారి 11 శాతం మేర పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. ఈ పెంచిన సీట్ల ద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారి కల సాకారమైనట్లేనన్నారు. కాలేజీల్లో మెడికల్ సీట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీటు రాక.. మరో ఏడాదిపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏడాదికి 10 వేల సీట్ల చొప్పున ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతున్నట్లు శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025–26 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.1 లక్షల అండర్ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లుఇటీవల కాలంలో కేన్సర్ బారిన పడుతూ ఎంతోమంది రోగులు ఆసుపత్రుల్లో బారులుతీరుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఆ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2025–26లో సుమారు 200 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.కేటాయింపులు ఇలా...» వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లను కేటాయించగా, ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.3,900.69 కోట్లు కేటాయించారు.» ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,992.90 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.3,497 కోట్లను కేటాయించారు.. ఇప్పుడు 14.15 శాతం పెంపు.» జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.37,226.92 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.36,000 కోట్లు.» ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు (ఏబీపీఎం–జేఏవై) రూ.9,406 కోట్లు.» స్వయంప్రతిపత్తి గల సంస్థలకు రూ.20,046.07 కోట్లు కేటాయించారు. 2024–25లో రూ.18,978.72 కోట్లు కేటాయించారు.36 మందులకు సుంకం మినహాయింపు» కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం అందించేందుకు వారు వాడే మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయించను న్నారు. వారు చికిత్సకు వినియోగించే 36 రకాల జీవ ఔషధాలపై ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే, ఫార్మాకంపెనీలు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కింద రోగులకు అందించే మరో 37 రకాల మందులతోపాటు 13 కొత్త ఔషధాలకు బీసీడీని మినహాయించనున్నారు. దీంతో ఆయా మందులను రోగులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. » ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో దేశంలో మెడికల్ టూరిజం, ‘హీల్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంతోపాటు, సులభతర వీసా విధానాన్ని తెస్తామని చెప్పారు. » ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక స్కూళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.మెరుగైన ఆరోగ్య జీవితం కోసం...ఈ బడ్జెట్ మెరుగైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు దోహదపడుతుంది. దేశంలో 200 డేకేర్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు, కేన్సర్, దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చర్యలు సంక్రమణేతర వ్యాధులపై పోరాటానికి, రోగుల జేబులపై భారం తగ్గించేందుకు దోహదపడతాయి. కొత్త విద్యావకాశాలతోపాటు ఉపాధి కల్పనకు కూడా ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.– ప్రతాప్ సి.రెడ్డిఅపోలో హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ -
గ్రామాలే మన బలగం
న్యూఢిల్లీ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా మోదీ 3.0 సర్కారు తాజా బడ్జెట్లో పూర్తి అండదండలు అందించింది. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ఫ్లాగ్షిప్ పథకాలకు కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు పుష్కలంగా నిధులు కేటాయించారు. అలాగే, ఉపాధికి ఢోకా లేకుండా.. గ్రామీణ రోడ్లు పరుగులు తీసేలా.. బడ్జెట్లో ఫోకస్ చేశారు. ఇక తాగునీటి పథకం.. జల్ జీవన్ మిషన్‌ను 100% పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పొడిగించి, నిధుల వరద పారించారు. భారత్‌నెట్ గొడుగు కింద ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ సెకండరీ స్కూళ్లు, పీహెచ్‌సీలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం దక్కనుంది. సొంతింటికి ఫుల్ సపోర్ట్ (పీఎంఏవై) 2025–26 కేటాయింపులు: రూ.74,626 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.46,096 కోట్లు (సవరించిన అంచనా)పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి ఫుల్ సపోర్ట్ లభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పీఎంఏవై 2.0 స్కీమ్ కింద చేపట్టనున్నట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే. పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అదనంగా కోటి ఇళ్లు అందించే పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.19,794 కోట్లు కేటాయించారు. 2025–26లో గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందుకు మొత్తం రూ.3,500 కోట్లను కేటాయించారు. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,832 కోట్లు దక్కాయి. 2029 మార్చికల్లా రూ.3.06 లక్షల నిధులతో 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2024–25లో 40 లక్షల ఇళ్ల లక్ష్యానికి గాను డిసెంబర్ నాటికి 18 రాష్ట్రాల్లో 27.78 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామీణ రోడ్లు.. టాప్ గేర్2025–26 కేటాయింపులు: రూ.19,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.14,500 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్ ప్రకటించగా.. ఇప్పుడు జోరందుకుంటోంది. 25,000 ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు దృష్టిపెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 17,570 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 35,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘గ్రీన్’టెక్నాలజీతో 18,000 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు.‘ఉపాధి’కి ఢోకా లేదు2025–26 కేటాయింపులు: రూ.86,000కోట్లు2024–25 కేటాయింపులు: రూ.86,000కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారీ నిధుల ‘హామీ’దక్కింది. అయితే, 2024– 25 సవరించిన అంచనాల (రూ.86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కేటాయించారు. రా ష్ట్రాల్లో లక్ష్యాలు, అవసరాలను బట్టి అవసరమైతే మరి న్ని నిధులను కేటాయించే అవకాశం ఉంది. 2023– 24లో రూ.60,000 కోట్లు కేటాయించగా, వాస్తవ వ్యయం రూ.89,153 కోట్లు కావడం గమనార్హం.జల్‌జీవన్ మిషన్... మరో మూడేళ్లు పొడిగింపు2025–26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రా>మ్ను అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు. కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025–26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్ లక్ష్యం. కాగా, ‘జన్ భాగీధారీ’ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.కనెక్ట్ టుభారత్ నెట్.. 2025–26కేటాయింపులు: రూ.22,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 6,500 కోట్లు (సవరించిన అంచనా)దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్ స్పాట్స్, 12,21,014 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించనుండగా... 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.స్వచ్ఛ భారత్.. విస్తరణ2025–26 కేటాయింపులు: రూ. 12,192 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 9,351 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2025–26లో 2 లక్షల వ్యక్తిగత టాయిలెట్లు, 20,000 కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించనున్నారు. 98 శాతం వార్డుల్లో ఇంటింటికీ ఘన వ్యర్థాల సేకరణను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 89,000 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణలోకి తీసుకురానున్నారు. 60,000 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు. అలాగే 800 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ 2.0 కింద తాగునీరు, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల కోసం 100 నగరాలను గుర్తించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
రైల్వేలకు పాత పద్దే!
న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్లో రైల్వేశాఖ పద్దుల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. 2025–26 బడ్జెట్లో ఈ శాఖకు మొత్తం రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు మొత్తం రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తాయని అంచనా వేశారు. మరో 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు ప్రవేశపె ట్టేందుకు అనుమతి ఇచ్చారు. వచ్చే నాలుగేళ్ల లో మొత్తం రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రకటన అనంతరం శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదాయ అంచనా రూ.3 లక్షల కోట్లు2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అన్ని మార్గాల ద్వారా రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2024–25 బడ్జెట్లో సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.2,79,000 కోట్లుగా ఉంది. గత బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ఆదాయం 2024–25లో రూ.80,000 కోట్లు ఉండగా, 2023–24లో రూ.70,693 కోట్లు వచ్చింది. 2024–25 బడ్జెట్లో సరుకు రవాణా ద్వారా రూ.1,80,000 కోట్ల ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. 2023–24లో ఇది 1,68,199 కోట్లుగా ఉంది. రైల్వేల్లో భద్రతాపరమైన చర్యల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,14,062 కోట్లు ఉండగా, 2025–26 బడ్జెట్లో దీనిని రూ.1,16,514 కోట్లుగా అంచనా వేశారు. అయితే, ఇంతగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ రైల్వేలకు వస్తున్న ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుదల ఉండటం లేదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్, టెలి కమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్రకుమార్ గోయెల్ చెప్పారు. మరో 200 వందేభారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా మరో 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తక్కువ దూరంగల పట్టణాల మధ్య ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను మరో 100 ప్రారంభిస్తామని చెప్పారు. 17,500 కొత్త కోచ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వివరించారు. -
ధన ధాన్య కృషి రైతే మహర్షి
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా పథకాలు, కేటాయింపులు ప్రకటించింది. రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సబ్సిడీతో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగాల్లో వ్యవసాయం మొదటిదని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..2025–26 బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి కార్యక్రమాలకు కలిపి రూ.1.45 లక్షల కోట్లు కేటాయించారు. అయితే కొత్త పథకాలకు కేటా యింపులపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.1.47 లక్షల కోట్లను తాజా బడ్జెట్ అధిగమించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 2.75 శాతం తక్కువ బడ్జెట్‌ను ప్రకటించినప్పటికీ, కేంద్రం కీలక పథకాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అయితే అను బంధ రంగాలకు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమకు 37 శాతం అధికంగా రూ.7,544 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు 56 శాతం అధికంగా రూ.4,364 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) మొత్తంగా రూ.1.57 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం ప్రతిపాదించింది.ఆహార భద్రతపై దృష్టి .. తాజా బడ్జెట్లో ఆహార భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేంద్రం.. తక్కువ సాగు, ఉత్పాదకతతో వ్యవసాయంలో వెనుకబడిన దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ఈ పథకంతో..ధాన్యం ఉత్పాదకత పెంపు, పంటల్లో వైవిధ్యం, పంటల కోత అనంతర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి .. పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) లక్ష్యంగా ఆరేళ్ల పప్పు ధాన్యాల కార్యక్రమాన్ని (పల్సెస్ మిషన్) కేంద్రం ప్రకటించింది. కంది, మినప, ఎర్రపప్పు (మసూర్) ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్లు రైతులతో లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుని నాలుగేళ్ల పాటు ఈ పప్పు ధాన్యాలను సేకరిస్తాయి. పండ్లు, కూరగాయలు.. పత్తికి ప్రత్యేక కార్యక్రమాలుకూరగాయలు, పండ్ల ఉత్పాదకతను పెంచే సమగ్ర ఉద్యాన కార్యక్రమానికి, అలాగే మంచి (పొడవైన పింజ) పత్తి రకాలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కాటన్ (పత్తి) మిషన్‌కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించా రు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం.. తాజా బడ్జెట్లో బిహార్‌కు రూ.100 కోట్లతో మఖానా (తామర గింజ (ఫాక్స్ నట్) బోర్డును మంజూరు చేసింది. అదేవిధంగా మరో రూ.100 కోట్లతో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాల అభివృద్ధి లక్ష్యంగా ఓ పరిశోధనా వ్యవస్థను ప్రకటించింది. అసోంలోని నామ్రూప్లో 12.7లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఓ యూరియా కర్మాగారాన్ని కూడా ప్రతిపాదించారు.గ్రామీణ ప్రగతి కార్యక్రమం..గ్రామీణ నిరుద్యోగితకు పరిష్కారంగా సమగ్ర ‘గ్రామీణ ప్రగతి..స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పా రు. వలసలు అనేవి తప్పనిసరి కాకుండా ఓ ప్రత్యా మ్నాయంగానే ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని ఆర్థికమంత్రి వివరించారు. గ్రామీణ మహిళలు, యువత, యువ రైతులు, సన్న చిన్నకారు రైతులు, భూముల్లేని కుటుంబాలపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్ .. రూ.60 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ. చేపలు, ఆక్వాకల్చర్ ఉత్తత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఓ సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ప్రపంచ సీఫుడ్ మార్కెట్లో భారత్ పోటీ తత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా..ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి)పై కనీస దిగు మతి సుంకాన్ని (బీసీడీ) 30% నుంచి 5 శాతానికి తగ్గించింది. కృషి వికాస్ యోజనకు రూ.8,500 కోట్లురాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి 41.66 శాతం పెంపుతో రూ.8,500 కోట్లు కేటాయించారు. కృషియోన్నతి (రూ.8వేల కోట్లు), నమో డ్రోన్ దీదీ, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి, మత్స్య సంపద యోజన తదితర పథకాలకు నిధులు గణనీయంగా పెంచారు.కిసాన్ క్రెడిట్ కార్డులతో మరింత రుణం రైతులకు రుణ భద్రతను మరింత పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి. ఈ కార్డుపై ఇప్పటిదాకా రూ.3 లక్షల రుణ పరిమితి ఉండగా..దీన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచడంతో దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు లబ్ధి పొందనున్నారు. పెంచిన పరిమితి మేరకు వీరు స్వల్పకాలిక రుణాలు పొందేందుకు అవకాశం ఉంది.పరిశ్రమ వర్గాల హర్షం బడ్జెట్లో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) అధ్యక్షుడు సంజీవ్ అస్థానా, ఫెడ రేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ)చైర్మన్ అజయ్ రాణా, అదాని విల్మార్ సీఈఓ అంగ్షు మాలిక్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఎండీ సైమన్ వీ బుష్‌లు హర్షం వ్యక్తం చేశారు.దూరదృష్టి బడ్జెట్..‘ఇది దూరదృష్టితో కూడిన బడ్జెట్. విశ్వాసం అనే పరిమ ళం ఇందులో ఉంది. అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం తపన ఇందులో ఉంది. స్వయం సమృద్ధి భారత్ దిశగా ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించింది..’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.రైతు సంఘాల అసంతృప్తి.. 5న ధర్నా అన్ని పంటలకు చట్టబద్ధమైన గ్యారంటీతో కూడిన కనీస మద్దతు ధర కల్పించాలనే తమ దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోక పోవడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు, కారి్మక, పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 5న ధర్నా నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తదితర సంఘాలు ప్రకటించాయి. -
మహిళా, శిశు అభివృద్ధికి రూ.26,889కోట్లు
న్యూఢిల్లీ : మహిళా, శిశు అభివృద్ధి శాఖకు నిధుల కేటా యింపులు స్వల్పంగా పెరిగాయి. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.26,889.69 కోట్లు కేటా యించింది. 2024–25లో సవరించిన అంచనా రూ.23,182.98 కోట్లు కాగా, తాజాగా బడ్జెట్లో మరో రూ.3,706.71 కోట్లు పెంచారు. మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లను ‘సాక్షం అంగన్వాడీ’, పోషణ్ 2.0 కార్య క్రమాలకు ఖర్చు చేయనున్నారు. చిన్నారులు, కౌమార దశలోని బాలికల్లో పోషకాహార లేమిని అరికట్టా లని, శిశు సంరక్షణను బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ బోతోంది. సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్మన్)కు అదనంగా రూ.120 కోట్లు కేటాయించారు. ఈ నిధులను 75 గిరి జన జాతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యయం చేస్తారు. గిరిజనాభివృద్ధి కోసం ధార్తి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. బాలల రక్షణ సేవలకు గాను ‘మిషన్ వాత్సల్య’ కోసం గతేడాది రూ.1,391 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు. మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల రుణం తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ.2 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేయనుంది. 5 లక్షల మందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల కోసం ‘మాన్యుఫాక్చరింగ్ మిషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు మహిళా సాధికారతే ధ్యేయంగా ‘మిషన్ శక్తి’ అమలుకు రూ.3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో.. బేటీ పడావో, వన్‌స్టాప్ సెంటర్లు, నారీ ఆదాలత్‌లు, ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.629 కోట్లు ఖర్చు చేస్తారు. స్వధార్ గృహాలు, ప్రధాని మాతృ వందన యోజన, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, నేషనల్ క్రెష్ స్కీమ్‌కు రూ.2,521 కోట్లు వెచ్చిస్తారు. నిర్భయ నిధికి రూ.30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్‌కు రూ.28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్మెంట్కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)కు రూ.14.49 కోట్లు కేటాయించారు. -
ఓం భీమ్ తుస్.. గురజాడ నామస్మరణ.. ఏపీ విస్మరణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్లో కూడా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో నిధుల వర్షం కురిపించారు. గత బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.ఏ మేలూ లేని బడ్జెట్‌పై పొగడ్తలా?అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. గత బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్‌కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది. గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు. గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అందజేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జెట్లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్ నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్‌కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. మోదీ సారథ్యంలోని వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. – ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుందికేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది. – కె.పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు 2025–26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్లో చేసిన అన్యాయంపై పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. – పీవీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేతకూటమి చేతకానితనం వల్లే అన్యాయంబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్‌కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
లక్కీ భాస్కర్ లెక్కలివి..
(సాక్షి, అమరావతి) : ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. మేమంతా ‘లక్కీ భాస్కర్’లమే అని మధ్య తరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపా దనలు చేశారు. ఈ రకంగా చూస్తే.. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా... వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!. శనివారం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ... అత్యధిక పన్నురేటు30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా... ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్‌కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక కొత్త పన్ను చట్టంఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా... ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా... పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో... ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ... దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల. వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో.... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి. నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే.... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.రూ.80వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభంకొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్‌ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.సీనియర్ సిటిజన్లకు ఊరటవడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.ప్రస్తుతం ఈ వడ్డీఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారురెమిటెన్స్లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్లై టీసీఎస్‌ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు. ఇక నుంచి అధిక టీడీఎస్‌ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో... చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని. అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ఉదాహరణకు... మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే... దీన్లో రూ.4 లక్షలవరకూ జీరో... రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం... అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే... రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క. ఇది మరిచిపోకండి... జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
సాగుకు ఊతమేది?
భారత్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
అసలు లాభం కోటి మందికేనా?
ఇపుడు యావద్దేశమూ బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను పరిమితి గురించే మాట్లాడుతోంది. తాము భారతదేశ మధ్య తరగతికి ఎనలేని మేలు చేశామని, యావత్తు మధ్య తరగతికీ ఊరటనిచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఇది నిజమేనా? వాస్తవానికి 145 కోట్ల మంది భారతదేశ జనాభాలో 2024–25లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య దాదాపుగా 8.09 కోట్లు. అందులో దాదాపుగా 6 కోట్ల మంది రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉండి జీరో రిటర్నులు వేసినవారే. మిగిలిన వారిలో కోటి మంది రూ.12 లక్షలకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు. అంటే మిగిలిన 1.09 కోట్ల మందికే తాజా నిర్ణయంతో ఎక్కువ మేలు కలుగుతుందన్న మాట. ఎందుకంటే వారు మాత్రమే ప్రస్తుతం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉండి పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నవారు. కాకుంటే.. శ్లాబుల మార్పు వల్ల రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఆదాయం ఉండేవారికి కూడా కొంత ప్రయోజనం కలుగుతుండటం గమనార్హం. మరి ఈ 1.09 కోట్ల మందికి లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని యావత్తు మధ్య తరగతికీ మేలు చేశామని చెప్పటం కరెక్టేనా? అసలు పన్ను పరిధిలోకే రాని 138 కోట్ల మంది సంగతేంటి? వారి బతుకు తెరువేంటి? అలాంటి వారందరినీ కూడా మధ్య తరగతిలోకో కనీసం ఆదాయ పు పన్ను పరిధిలోకో తేవాలంటే వారందరికీ తగిన ఉద్యోగాలు, ఉపాధి ఉండాలి కదా? కాకపోతే ఆ దిశగా ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలేవీ కనిపించలేదు. కాకపోతే ఉద్యోగులంటేనే ఎక్కువగా మాట్లాడేవాళ్లు. వివిధ వేదికలపై వినిపించేది వారి గొంతే. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేదీ వాళ్లే. అందుకే మోదీ వారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టే ఇపుడు దేశమంతా బడ్జెట్లో మిగతా విష యాలు పక్కనబెట్టి ఆదాయపు పన్ను గురించి మాట్లాడుతోంది. లక్ష కోట్లు నష్టపోయి మరీ... ఎందుకిలా? ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య వల్ల ఏడాదికి లక్ష కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. మామూలుగా ఎప్పుడూ ఇంతటి నష్టం వచ్చే చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పటికే రుణాలు పెరిగిపోతున్నాయి. మరి లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవటమంటే మాటలు కాదు కదా? కాకపోతే ప్రభుత్వ ఉద్దేశం వేరు. తాత్కాలికంగా ఉద్యోగుల్ని సంతృప్తి పరచటం ద్వారా తక్షణ ప్రయోజనాలు పొందటమే కాక... పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి ఒక్కరినీ కొత్త పన్ను విధానంలోకి తేవటమన్నది ప్రభుత్వ అసలు లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ పరిమితి పెంపు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పన్ను విధానం నిరర్ధకమైపోతుంది. పన్ను కోసం చేసే సేవింగ్స్, అలవెన్సులు, పన్ను కోసం చేసే బీమా చెల్లింపుల వంటివన్నీ తెరమరుగైపోతాయి. మొత్తంగా అలవెన్సుల వ్యవస్థే కనిపించకుండా పోతుంది. దీనికితోడు మినహాయింపులేవీ ఉండవు కనక అత్యధిక శాతం మందికి పన్ను రిటర్నులు దాఖలు చేయటం అత్యంత సులభమైపోతుంది. రకరకాల ఆదాయాలుండి, వాటిని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నవారికి తప్ప.. ఒక్క జీతంపైనే ఆధారపడ్డ వారెవ్వరికీ పన్ను రిటర్నులు వేయటానికి ట్యాక్స్ అసిస్టెంట్లు, ఆడిటర్ల అవసరం ఉండదు.ఇక ఆదాయపు పన్ను విభాగంలో కూడా రిఫండ్ల వంటి ప్రక్రియ ఉండదు. పన్నుల వ్యవస్థ సరళమైపోతుంది కనక ఆదాయపు పన్ను విభాగాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు సరళమైన పగడ్బందీ పన్ను విధానం అమల్లోకి వస్తుంది. రిబేట్ పరిమితి 12 లక్షల వరకూ ఉంటుంది కనక వృత్తి నిపుణులతో సహా ఎక్కువ మంది రిటర్నులు వేయటానికి ముందుకొస్తారు. ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. మున్ముందు వీరంతా పన్ను చెల్లిస్తే ఆదాయ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. -
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
పంచరంగుల చిత్రం
గమ్యస్థానం: వికసిత భారత్ దారిదీపం: సమష్టి కృషి ఇంధనం: కొత్త తరం సంస్కరణలు స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు. పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే... పరిశ్రమలకు మహర్దశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు. చదువుకు జేజే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. పట్టణాలకు ప్రాధాన్యం పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ఊపు మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.సాగుకు పట్టం...వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలున్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.తాజా బడ్జెట్లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. బడ్జెట్ హైలైట్స్⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది. ⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు ⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం ⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్సీపీఎఫ్లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి. ⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం ⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్‌తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుఅభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్‌కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రిబిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్‌కుమార్, బిహార్ సీఎంకోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్బడ్జెట్లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత వరుసగా 8వసారిదేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తిజీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాంఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్