pok
-
‘పీఓకే’పై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
జమ్ము:పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్(Jammukashmir) అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnathsingh) అన్నారు.అఖ్నూర్ సెక్టార్‌కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.పాకిస్తాన్‌కు పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు.అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తోందని మండిపడ్డారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హఖ్ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు.కశ్మీర్ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయన్నారు.దీంతో ఇక్కడి సోదరసోదరీమణులు ఢిల్లీకి చేరువ కాలేకపోయారన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని ప్రశంసించారు.గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో భాగమేనని, తాము దానిని దానిని తీసుకుంటామన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్లో శాంతి నెలకొందన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తోందన్నారు. కాగా,పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ గతంలో తప్పు పట్టింది. పాకిస్తాన్లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉండడం గమనార్హం. -
‘పీవోకే’ భారత్‌లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలను ప్రస్తావిస్తూ.. పీవోకే భారత్‌లో భాగమే. మేం దానిని తీసుకుంటామని అన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్లో శాంతి నెలకొందని పశ్చిమ బెంగాల్ సేరంపోరే నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగించారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తుంది. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించింది. అయితే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఆజాదీ నినాదాలు వినిపించగా, ఇప్పుడు పీఓకేలో కూడా అదే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ రాళ్లు రువ్వేవారని, ఇప్పుడు పీఓకేలో రాళ్లు రువ్వుతున్నారు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చొరబాటుదారులు కావాలా లేదా శరణార్థులకు సీఏఏ కావాలా అనేది పశ్చిమ బెంగాల్ నిర్ణయించుకోవాలి. జిహాద్‌కు ఓటు వేయాలా లేదా వికాస్‌కు ఓటు వేయాలా అనేది బెంగాల్ నిర్ణయించుకోవాలి అని అమిత్ షా పిలునిచ్చారు. -
పీఓకే అంశంలో నెహ్రూది హిమాలయమంతటి తప్పిదం: అమిత్ షా
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంలో మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. పీవోకే సమస్యకు నెహ్రూదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. పీవోకే విషయంలో నెహ్రూ చేసింది చిన్న తప్పు కాదు.. హిమాలయమంతటి తప్పిదమని ధ్వజమెత్తారు. దేశంలో చాలా భూభాగాన్ని నెహ్రూ వదిలివేశారని తప్పుబట్టారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగించారు. #WATCH | Union Home Minister Amit Shah says, "Two mistakes that happened due to the decision of (former PM) Pandit Jawaharlal Nehru due to which Kashmir had to suffer for many years. The first is to declare a ceasefire - when our army was winning, the ceasefire was imposed. If… pic.twitter.com/3TMm8fk5O1 — ANI (@ANI) December 6, 2023 మాజీ ప్రధాని నెహ్రూ రెండు భారీ తప్పులు చేశారని షా అన్నారు. మొదటిది కాల్పుల విరమణ చేయడం కాగా రెండోది.. మన అంతర్గత పీఓకే అంశాన్ని ఐరాసకు తీసుకువెళ్లి నెహ్రూ మరో తప్పిదం చేశారని అమిత్ షా చెప్పారు. అప్పట్లో కాల్పుల విరమణ మరో మూడు రోజులు చేయకుండా ఉంటే.. పీఓకే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో భాగంగా ఉండేదని తెలిపారు. పీఓకే ఎప్పటికైనా భారత్‌దే అని షా పునరుద్ఘాటించారు. కాగా.. నెహ్రూ గురించి అమిత్ షా మాట్లాడుతుంటే.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌంట్ చేసింది. ప్రస్తుతం పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు షా పేర్కొన్నారు. గతంలో జమ్మూలో 37 సీట్లు ఉండగా, ఇప్పుడు 43 ఉన్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలు ఉన్నాయి. పీఓకేకు 24 సీట్లు కేటాయించామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పీఓకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
పీవోకే మనదే: పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీవోకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీవోకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "A few people also tried to underestimate it...someone said that only the name is being changed. I would like to… pic.twitter.com/7W5KkHbxlP — ANI (@ANI) December 6, 2023 జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. అణగారిని వారిని పైకి తీసుకురావడమే రాజ్యాంగ మూల సూత్రమని పేర్కొన్నారు. దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం తీవ్రంగా పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి హక్కులు కల్పించబడతాయని చెప్పారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "There was an era of terrorism after the 1980s and it was horrifying. Those who lived on the land considering it… pic.twitter.com/j1O6JIcOIq — ANI (@ANI) December 6, 2023 "కశ్మీర్‌పై పాకిస్థాన్ 1947లో దాడి చేసింది. ఆ సమయంలో దాదాపు 31,789 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. 1965, 1971 యుద్ధాల సమయంలో 10,065 కుటుంబాలు వలసబాట పట్టాయి. 1947, 1969, 1971 యుద్ధాల్లో మొత్తం 41,844 కుటుంబాలు శరణార్థులుగా తరలివచ్చాయి. ఈ బిల్లు ఆ ప్రజలకు హక్కులు కల్పించడానికి వచ్చిందే" అని అమిత్ షా అన్నారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "Pakistan attacked Kashmir in 1947 in which around 31,789 families were displaced...10,065 families were… pic.twitter.com/WerMOQreco — ANI (@ANI) December 6, 2023 -
పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమవడంతో అక్కడి వారు దొడ్డిదారిలో సంపాదన కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ అవయవాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు. ఒక బాధితుడు తమవద్దకు వచ్చి కొందరు తనను బలవంతంగా ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకోమని వేధించారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూపీ మొత్తం లాగారు. పాకిస్తాన్లో ఓ అనామక డాక్టర్ గుట్టుగా నిర్వహిస్తోన్న మానవ అవయవాల స్మగ్లింగ్ గుట్టును రట్టు చేశారు పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు. ధనికుల అవసరానికి తగ్గట్టుగా కిడ్నీలను సమకూర్చే క్రమంలో ఈ ముఠా వందల మందికి సర్జరీలు నిర్వహించి వారి కిడ్నీలను తొలగించారు. డాక్టర్ ఫవాద్ నేతృత్వంలో సాగుతున్న ఈ దందా గురించిన వివరాలు అక్కడి ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ బయటపెట్టారు. మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. డాక్టర్ ఫవాద్ ఇప్పటివరకు మొత్తం 328 సర్జరీలు నిర్వహించారని వీటి ద్వారా సుమారుగా 35000 యూఎస్ డాలర్లు( రూ.28.27 లక్షలు) కొల్లగొట్టారునై అన్నారు. ఈ ముఠాలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒక కారు మెకానిక్ పేషేంట్లకు అనస్థీషియా ఇవ్వడంలో సహకరించేవాడని వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరిన పేషేంట్లను లాహోర్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అక్కడ గుట్టుగా ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేనందున అక్కడ వీరు యథేచ్ఛగా సర్జరీలు చేసేవారని అన్నారు. ఈ ముఠా నిర్వహించిన సర్జరీల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని, మిగిలిన విషయాలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. నిందితుడు డాక్టర్ ఫవాద్ ఇదే కేసులో గతంలో ఐదు సార్లు అరెస్టయ్యారని కానీ న్యాయపరమైన లొసుగులను అడ్డంపెట్టుకుని బయటకు వచ్చేవారని అన్నారు. ఆశ్చర్యకరంగా సర్జరీలు జరిగిన చాలామందికి తమ కిడ్నీని తొలగించిన విషయం కూడా తెలియదు. ఈ ముఠాసభ్యుల్లో ఒకరు తనవద్దకు వచ్చి ప్రైవేటు ట్రీట్మెంట్ కోసం బలవంత పెట్టారని.. ఇప్పుడు వేరొక డాక్టర్ వద్దకు వెళ్తే తనకు ఒక కిడ్నీలేదని చెప్పారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: 2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్ -
పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్‌లో కలిసిపోతుందన్నారు. #WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm — ANI (@ANI) September 12, 2023 ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. Every smallest move was so well planned in #G20BharatSummit How #Chinese Premier Li Qiang was greeted on his arrival? 1. Received by VK Singh, EX-ARMY General. 2. Considering #China 's LOVE for Northeast...Assamese song was played in background. Entire reception had NSA Ajit… pic.twitter.com/vCvE4RAse0 — BhikuMhatre (@MumbaichaDon) September 12, 2023 ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. #WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp — ANI (@ANI) September 8, 2023 ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ -
మంచుచరియల కింద సజీవ సమాధి
గిల్గిట్: పాకిస్తాన్లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో చిన్నారి సహా 10 మంది సజీవ సమాధి కాగా, మరో 25 మంది గాయపడ్డారు. ఆక్రమిత కశ్మీర్‌లోని కెల్ ప్రాంతంలోని సంచార గిరిజనులు మేకలను మేపుకుంటూ పక్కనే గిల్గిట్–బల్టిస్తాన్ ప్రాంతంలోని ఎస్తోర్‌కు వెళ్లారు. శనివారం తిరిగి వస్తుండగా షౌంటర్ పాస్‌లోని చంబేరి వద్ద వారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు, నాలుగేళ్ల బాలుడు సహా 10 మంది చనిపోయారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. అననుకూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. -
‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన టైం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌పై(పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీన పరిస్థితుల్లో ఉందని, పీఓకేను వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పీఓకేను సొంతం చేసుకోవటం మన బాధ్యత అని సూచించారు. పీఓకేను తిరిగి పొందాలనే భారత లక్ష్యం ఎన్నటికీ నెరవేరదని, తమ దేశాన్ని రక్షించుకునేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పాక్ సైన్యాధిపతిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పీఓకే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పీఓకేను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. దానికి స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవటం మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. పీఓకేను తిరిగి తీసుకోవటం మోదీ ప్రభుత్వ అజెండాలో భాగమని నమ్ముతున్నాను. కేవలం చర్చలకే పరిమితం కాకూడదు. పాకిస్థాన్ ప్రభుత్వం బలహీనంగా ఉంది. పీఓకేను తిరిగి పొందేందుకు ఇదే సరైన సమయం.’ అని పేర్కొన్నారు హరీశ్ రావత్. అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ 28న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పీఓకేపై సూత్రప్రాయ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని శరణార్థులు తిరిగి తమ స్వదేశానికి వస్తారని పేర్కొన్నారు. పీఓకేను తిరిగి పొందేందుకు తమ సైన్యం సిద్ధమవుతున్నట్లు భారత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్‌ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
‘పీవోకే’ అంశంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు!
సిమ్లా: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్. ‘1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని పేర్కొన్నారు రాజ్‌నాథ్. అనంతరం హమిర్పుర్ జిల్లాలోని నదౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. గతంలో భారత్ రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ నిలిచిందన్నారు. 8 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.13,000 కోట్లు చేరిందని గుర్తు చేశారు రాజ్‌నాథ్. 2047 నాటికి రూ.2.7లక్షల కోట్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేషించుకున్నట్లు చెప్పారు. మానవత్వం కోణంలో భారత్ ఏదేశంపై దాడులు చేయాలేదని, ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదన్నారు. కానీ, భారతలో శాంతికి విఘాతం కలిగంచాలని చూస్తే ధీటైన సమాధానం ఇస్తామని శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవలే రాజ్‌నాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇదీ చదవండి: ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ -
చైనా వక్రబుద్ధి.. పాకిస్థాన్ ఆర్మీ కోసం పీఓకేలో నిర్మాణాలు
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్‌గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రానికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్‌ను గ్వాదర్ పోర్ట్‌తో అనుసంధానించాలని భావించారు, అయితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా దూరంలో ఉంది. ఇదీ చదవండి: చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్ -
చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)కి సంబంధించిన బహుళ బిలియన్ డాలర్ల కనెక్టివిటీ కారిడార్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా చైనా ఈ సీపెక్ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మూడో దేశాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో భారత్ ఆగ్రహంతో పాక్, చైనా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇటువంటి కార్యకలాపాలు స్వభావసిద్ధంగా 'చట్ట విరుద్ధం' అని నొక్కి చెప్పింది. ఇది ఆమోద యోగ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే భారత్ తదను గుణంగా వ్యవహరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గట్టిగా హెచ్చరించారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూభాగంలోని ఈ ప్రాజెక్టులను భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అంతేగాదు ఇవి నేరుగా భారత్ సార్వ భౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలని అన్నారు. వాస్తవానికి సీపెక్ అనేది చైనాకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగం. ఈ సీపెక్ 2013లో ప్రారంభమైంది. ఇది పాకిస్తాన్ రోడ్డు, రైలు ఇంధన రవాణా అవస్థాపనను మెరుగుపరచడమే కాకుండా సముద్రపు నౌకాశ్రయం గ్వాదర్‌ను చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతుంది. ఐతే సీపెక్ చొరవలో భాగంగా ఈ బీఆర్ఐని ఆది నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. (చదవండి: యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్!) -
పీవోకేలో ఆమె పర్యటన.. భగ్గుమన్న భారత్
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడంపై భారత్ భగ్గుమంది. సంకుచిత మనస్తత్వ రాజకీయాలకు ఇది నిదర్శనమని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమాలియాలో పుట్టిపెరిగి, అమెరికా చట్టసభ్యురాలైన ఇల్హాన్ ఒమర్(39) మొదటి నుంచి భారత వ్యతిరేకి. నాలుగు రోజుల పాక్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య పాక్‌లో పర్యటించనుంది. ఈ తరుణంలో ఇల్హాన్ ఒమర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇంటికెళ్లి మరీ కలిసింది. ఆపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యి కశ్మీర్ అంశంపైనా చర్చించింది కూడా. ఈ తరుణంలో ఆమె పీవోకే పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాఘ్ఛి స్పందించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కశ్మీర్‌లోని భారత కేంద్రపాలిత అంతర్భాగాన్ని ఆమె పర్యటించాలనుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకురాలు.. తమ సంకుచిత రాజకీయాలను ఆచరించాలని కోరుకుంటే, అది ఆమె ఇష్టం. కానీ, అలాంటి ఆమె ఇంట చేసుకోవాలి. అంతేగానీ ఆ ముసుగులో భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా. కశ్మీర్ అంశంపై ఒమర్‌తో జరిగిన భేటీ గురించి.. స్వయంగా ప్రధాని షెహబాజ్ మీడియాకు వివరించారు. లాహోర్‌తో పాటు ‘‘ఆజాద్ జమ్ము కశ్మీర్’’ల గురించి ఆమెకు తెలుసని, ఆ ప్రాంతాల్లో ఆమె సందర్శిస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. చదవండి: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు -
భారత్‌పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన చైనా -
పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 22 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహయంతో సహయక చర్యలు ప్రారంభించారు. బస్సు బలోచ్ ప్రాంతం నుంచి రావల్పిండి వెళ్తుండగా సుద్నోతి జిల్లాలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు.. బ్రేకులు సరిగా పడకపోవడం వలన అదుపుతప్పి 500 మీటర్ల పాటు.. రోడ్డుకిందకు వచ్చి పడింది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
బీసీసీఐ బెట్టు.. ఆ టోర్నీపై నీలి నీడలు?
కశ్మీర్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహణపై నెమ్మదిగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. భారత్-పాక్ ‘కశ్మీర్’ వివాదాల నడుమ తలదూర్చడం తనకు ఇష్టం లేదని పనేసర్ ఓ ట్వీట్ కూడా చేశాడు. దీంతో పనేసర్ దారిలో మరికొందరు ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందని, టోర్నీ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఓ భారత మీడియా హౌజ్‌తో మాట్లాడిన పనేసర్.. బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. రాజకీయాలు-ఆటలు ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం. నాకు ఈసీబీ(ఇంగ్లండ్ బోర్డు) నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. అయితే ఆడితే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో ఆ ఆటగాళ్లకు తెలుసు’ అంటూ పనేసర్ వ్యాఖ్యలు చేశాడు. I have decided not to participate in the KPL because of the political tensions between India and Pakistan over kashmir issues. I don't want to be in the middle of this , it would make me feel uncomfortable. #KPL2021 #Kashmir #india #Cricket #Pakistan #ENGvIND #TheHundred — Monty Panesar (@MontyPanesar) August 1, 2021 ఇక దాయాది దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న టైంలో.. పీవోకేలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ లీగ్‌ను నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని, జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీకు నిన్న ఒక లేఖ రాసింది కూడా. దీంతో పాక్ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐపై మండిపడ్డారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది. మరోవైపు పీవోకే లీగ్‌లో ఆడబోయే ఆటగాళ్లపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందనే, ఈ మేరకు భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో నిషేధం విధిస్తామని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షల్ గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. కేపీఎల్ ఆడితే.. ఇక తనను ఏ టోర్నీలకు తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్బాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ టోర్నీ నిర్వహణకు మరో నాలుగు రోజుల టైం ఉండగా.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులోనే ఉంది. -
పీఓకేలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బల్టిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ విజయం సాధించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 45 సీట్లకుగానూ 25 సీట్లను పీటీఐ గెలుచుకుంది. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సీట్లు పీటీఐ గెలుచుకున్నట్లు అయింది. పీఓకేలో ఇమ్రాన్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోవడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 11 సీట్లను, పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) 6 సీట్లను గెలుచుకోగా.. ముస్లిం కాన్ఫరెన్స్ (ఎంసీ), జమ్మూకశ్మీర్ పీపుల్స్ పార్టీ (జేకేపీపీ)లు చెరో సీటును గెలుచుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్ కారణంగానే ఇమ్రాన్ పార్టీ గెలిచిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అయితే ఆయా పార్టీలు తమను నిందించే బదులు వారి పనితీరును పరిశీలించుకోవాలంటూ పీటీఐ తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్ గతంలోనే తప్పుబట్టింది. ఆయా ఎన్నికలకు న్యాయ ప్రాతిపదిక లేదంది. -
ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు
జమ్మ-కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కెరాన్ సెక్టార్ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు శనివారం తిప్పికొట్టాయి. మిషన్ గంగానది ఒడ్డున కూడా అక్రమంగా ఆయుధాలను తరలించేందు ముష్కరులు ప్రయత్నించారు. పాక్ అక్రమిత కశ్మీర్(పీఓకే) నుంచి ఓ ట్యూబ్‌ను తాడుతో కట్టి దాని ద్వారా ఉగ్రవాదులు ఆయుధాలు తరలించాలని చుశారు. ఉగ్రవాదుల కుట్రకు భారత బలగాలు భంగం కలిగించి ఏకే 47 రైఫిల్స్‌తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను భారత్ స్వాధీనం చేసుకుంది. -
పాక్ వైఖరిపై భారత్ ఘాటు స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించబోతున్నామని పాకిస్తాన్ ప్రకటించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ ఆక్రమిత ప్రాంతమైన గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఎన్నికలు పెడతామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. ఇక దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ చర్యలను భారత్ ఖండించింది. ఇలా ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్రపాలిత భూభాగాలైన జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లను పాకిస్తాన్ తన ఆధీనంలోకి తీసుకోలేదని పేర్కొంది. ఇది అక్కడ ఉన్న ప్రజల హక్కులను కాలరాయడమేనని, వారి స్వేచ్ఛను హరించడమే అని ధ్వజమెత్తింది. ఏడు దశాబ్ధాల నుంచి అక్కడ ప్రజలు నివసిస్తున్నారని తెలిపింది. ఈ చర్యలు చూస్తుంటే తన ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి అందమైన అలంకరణ చేసినట్లుగా ఉందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. చదవండి: గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం -
‘ముంబై పీఓకే’.. ఉద్ధవ్ ఠాక్రే స్పందన
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా కంగనా రనౌత్ ముంబైని పీఓకేతో పోల్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల శివసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ వేదికగా సోమవారం కంగన వ్యాఖ్యలపై స్పందించారు. జీవనోపాధి చూపించిన నగరం పట్ల కృతజ్ఞత లేదని పరోక్షంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొందరు తమకు జీవనోపాధి కల్పించిన నగరం పట్ల అమిత ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తారు. కానీ కొందరు అలా ఉండరు. అనిల్ భయ్యా(అనిల్ రాథోడ్)ని తీసుకొండి. ఆయన రాజస్తాన్ నుంచి వచ్చాడు. కానీ మహారాష్ట్రను తన ఇంటిగా మార్చుకున్నాడు. తను శివసేన వీరాభిమాని అన్నారు’ ఉద్ధవ్. (చదవండి: కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన) ఇక ముంబైని పీవోకే అని వర్ణించడంతో కంగనా, శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కంగనా తనకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరడంతో ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. దాంతో కంగనా అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్ రౌత్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సంజయ్ బహిరంగంగా తనకు వార్నింగ్ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. -
కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి
ముంబై: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్‌దాస్ అతవాలే కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచారు. ముంబాయి నగరం పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను తలపిస్తుందంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి రామ్‌దాస్ మాట్లాడుతూ, ‘నాకు పూర్తిగా నిజమేమిటో తెలియదు, కానీ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ నటిని ఉద్దేశించి అలా మాట్లాడటం మాత్రం ఖండించదగ్గ విషయం. కంగనా చేస్తున్న పోరాటంలో మేం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు. శివసేన మహిళ విభాగం నేతలు కంగనారనౌత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఆమె పోస్టర్లపై చెప్పులతో దాడి చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ భార్య అమృత స్పందిస్తూ ‘ మేం ముంబాయి గురించి అలా అనడాన్ని సమర్థించం. కానీ ప్రతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. నటి పోస్టర్లపై చెప్పులతో దాడిచేయడం అనే చర్యలు హేయమైనవి’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా మారిందని కామెంట్ చేసిన కంనా ఆ తరువాత ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని తాలిబన్లతో పోల్చింది. దీనిపై మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ స్పందిస్తూ కంగనాకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. అంత అభద్రతా భావం ఉంటే మహారాష్ట్రని వదిలి వెళ్లిపోవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసుల గురించి తప్పుగా ఎలా మాట్లాడుతుంది’ అని మండిపడ్డారు. చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
కశ్మీర్‌కు నేనే కెప్టెన్‌గా ఉండాలి: అఫ్రిది
కశ్మీర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి వక్రబుద్ధిని చూపెట్టాడు. కశ్మీర్ తమదేనని అర్థం వచ్చేలా మరింత అగ్గిరాజేశాడు. తొలుత భారత ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది.. కశ్మీర్ జట్టును పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చేశాడు. పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీ ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. వచ్చే పీఎస్ఎల్ సీజన్ నాటికే కశ్మీర్ టీమ్ ఏర్పాటుకు కృషి చేయాలంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరో అడుగు ముందుకేసి తన చివరి పీఎస్ఎల్ సీజన్లో ఆ జట్టుకు తానే నాయకత్వం వహించాలన్నాడు (మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం) ‘పీసీబీకి ఇదే నా విన్నపం. తదుపరి పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీని తయారు చేయండి. ఈ జట్టుకు నేనే సారథిగా వ్యహరించి పీఎస్ఎల్కు వీడ్కోలు చెబుతా. కశ్మీర్ జట్టుకు సారథిగా చేసే అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటా. కచ్చితంగా పీఎస్ఎల్లో కశ్మీర్ జట్టు ఉండాల్సిందే’ అంటూ ఒకవైపు విజ్ఞప్తి, మరొకవైపు డిమాండ్ అనే విధంగా అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కశ్మీర్లకు ఒక స్టేడియం, ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయాలన్నాడు. దీనికి తాను కరాచీ నుండి వచ్చి సాయం చేస్తానంటూ ఎప్పుడూ లేని ప్రేమను కురిపించాడు. ఇక్కడ దాదాపు 125 క్రికెట్ క్లబ్‌లు ఉన్నట్లు విన్నానని, వీటి మధ్య టోర్నమెంట్లు నిర్వహించే దిశగా ఏర్పాట్లు కూడా చేయాలని పీసీబీకి కొత్త తలపోటును తెచ్చిపెట్టాడు. కశ్మీర్లో మ్యాచ్‌లు చూడటానికి సంతోషంగా ఇక్కడకి వస్తానని, నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి తనతో పాటు కరాచీకి తీసుకువెళ్తానన్నాడు. వారంతా తనతోపాటు ఉండవచ్చని, వారికి ప్రాక్టీస్‌తో పాటు ఎడ్యుకేషన్ కూడా తానే చూస్తానని భరోసా ఇస్తూ లేనిపోని ఆశలు కల్పించాడు అఫ్రిది. (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?) కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పీఓకేలో పర్యటించాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించందంటూ వ్యాఖ్యానించాడు.. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందని విషం వెళ్లగక్కాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు.. అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అఫ్రిది నీ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించగా, భజ్జీ, యువరాజ్ సింగ్‌లు సైతం మండిపడ్డారు.తీవ్ర దుమారాన్ని రేపిన అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. -
మోదీపై విషంకక్కిన అఫ్రిది: పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఇప్పటికే అనేకసార్లు భారత్‌పై విషంకక్కిన పాకిస్తానీ.. మరోసారి నోరుపారేసుకున్నాడు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అన్యాయంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పర్యటించాడు. (ఆర్టికల్ 370 రద్దు: స్పందించిన అఫ్రిది) ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన షాహిద్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించింది. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది’ అని వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు) కాగా పాక్ ఆటగాడు చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు తమదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. జాతియవాదంలో ఎప్పుడూ ముందుండే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా అఫ్రిదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కశ్మీర్లో భారత ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని మోహరించిందని ఓ 16 ఏళ్లు వృద్ధుడు విషయం కక్కుతున్నాడు. భారత్ సొంతమైన కశ్మీర్ కోసం 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తూనే ఉన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వా, అఫ్రిది లాంటి వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. ఏం చేసినా కశ్మీర్ ఎప్పిటికీ భారతతీయుల సొంతమే’ అంటు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక అఫ్రిది వ్యాఖ్యలను యువరాజ్ సింగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, హర్బజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం అఫ్రిది వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. -
కశ్మీర్‌పై ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను ఆక్రమించాలంటూ భారత్‌లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కశ్మీర్, పీఓకే అంశాలపై మాట్లాడారు. పీఓకేను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అక్కడి ప్రజలు కోరుకుంటే ప్రజాభిప్రాయసేకరణ (రిపరెండమ్) నిర్వహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇమ్రాన్ స్పష్టం చేశారు. పాక్ ఆధీనంలోకి కశ్మీర్‌తో పోల్చుకుంటే భారత్‌లోని కశ్మీర్‌లోని మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్-భారత్‌లోని కశ్మీర్లో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నానని పాక్ ప్రధాని పేర్కొన్నారు. ‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాను. అప్పుడే భారత్-పాక్ సంబంధాలను పునరుద్ధరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కానీ దురదృష్టవశాత్తు మోదీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తోంది. హిట్లర్ అనుసరించిన నాజీయిజం సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ పాటిస్తోంది. దానిలో భాగంగానే పాక్‌తో చర్చలకు భారత్ దూరంగా ఉంటోంది. కశ్మీరీ ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా భారత ప్రభుత్వం గత ఏడాది ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. భారత్ ఆధీనంలోని కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన విపరీతంగా సాగుతోంది. కానీ భారత్ ఆరోపిస్తున్నట్లు పీఓకేలో ఘర్షణ వాతావరణం లేదు. అక్కడ పరిస్థితి ఎప్పుడూ సాధారణంగానే ఉంటుంది. అక్కడి ప్రజలు కోరుకుంటే రెపరెండమ్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా ఇక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించవచ్చు’ అని అన్నారు. -
రెడీ టూ యాక్షన్..!
-
పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం
న్యూఢిల్లీ: ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మొత్తం భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఎప్పుడో తీర్మానం చేసింది. ఒకవేళ ఆ భూభాగం మళ్లీ మన స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తే కచ్చితంగా ఆ విషయంపై చర్యలు చేపడతాం’ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే స్పష్టం చేశారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 13 లక్షల మంది ఉన్న ఆర్మీ.. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. పీఠికలోని విషయాలకు లోబడి ఉంటుందన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గ్రేట్.. త్రివిధ దళాలన్నింటినీ సమన్వయ పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నరవాణే చెప్పారు. ఇది విజయవంతం అయ్యేందుకు ఆర్మీ తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు. భారత సైన్యం పాక్‌లా దొంగ దెబ్బ తీయదని, నైపుణ్యంతోనే పని చేస్తుందని చెప్పారు. నైతిక విలువలకు సైన్యం కట్టుబడి ఉంటుందన్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేలను మూడింటినీ సమన్వయం చేస్తూ.. మిలటరీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఓ కన్నేసి ఉంచాలి.. ఆర్మీకి సైనికులే బలమని నరవాణే చెప్పారు. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, ఎలాంటి వారు ఉన్నారన్నదే తమ మంత్రమని చెప్పారు. ఇదే సైనిక ఆయుధాలకూ వర్తిస్తుందన్నారు. భారత బలగాలు సియాచిన్ ప్రాంతంలో ఓ కన్నేసి ఉంచాలని నరవాణే వ్యాఖ్యానించారు. పాక్, చైనాల మధ్య ఈ ప్రాంతం గురించి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు
జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. సాయుధులైన ఉగ్రవాదులకు, ఇద్దరు భారత సైనికుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికులు మరణించారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ బుధవారం చెప్పారు. ఈ ఘటన మంగళ, బుధవారాల మధ్య రాత్రిలో జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో చోటుచేసుకుందని తెలిపారు. ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సైనికులు నాయక్ సావంత్ సందీప్ రఘునాథ్ (29), రైఫిల్‌మ్యాన్ అర్జున్ తపా మగర్ (25)లకు దేశం రుణపడి ఉంటుందన్నారు. వీరిలో సావంత్ మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవ్యక్తి కాగా, అర్జున్ నేపాల్‌లోని గోర్ఖా జిల్లాకు చెందినవారు. కాల్పుల అనంతరం ఉగ్ర కదలికలు ఉన్నట్లు అనుమానించిన చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ‘చైనా సరిహద్దుల్లో సామర్థ్యం బలోపేతం’ చైనాతో సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటే.. క్రమంగా సరిహద్దు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె పేర్కొన్నారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో మిలటరీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. -
ఆర్మీ ఆపరేషన్‌లో 18 మంది ఉగ్రవాదులు హతం..
న్యూఢిల్లీ : పీఓకేలోని నీలం వ్యాలీతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సైనిక అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించకపోయినా ఈ ఆపరేషన్‌లో పలువురు పాక్ సైనిక సిబ్బంది సహా 18 మంది వరకూ మరణించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భారత సైన్యం దాడుల్లో జైషే మహ్మద్ సహా ఇతర జిహాదీలకు చెందిన టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను ఆర్టిలరీ ఫైరింగ్‌తో ధ్వంసం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటం, కవ్వింపు చర్యలకు పాల్పడటానికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. పాక్ ఆర్మీకి చెందిన ఆయుధ సామాగ్రి, రేషన్ డిపోలను కూడా సైన్యం ధ్వంసం చేసింది. -
పాకిస్తాన్‌కు మరో చావుదెబ్బ
భారత బలగాలు భారీగా కాల్పులతో విరుచుకుపడటంతో ధ్వంసమైన పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్ర శిబిరాల నుంచి వెలువడుతున్న పొగ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతీకార కాల్పులు న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ను మరోసారి భారత్ చావుదెబ్బ తీసింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు. మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో స్థావరాన్ని భారీగా నష్టపరిచిన భారత జవాన్లు.. ఆ స్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా భారత పోస్ట్‌లపై కాల్పులు జరపడం కోసం అదే ప్రాంతంలో ఉన్న పాక్ జవాన్ల స్థావరాలను సైతం నేలకూల్చారు. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా శనివారం తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు. ప్రతిగా ఆదివారం పీఓకే లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ తీవ్రస్థాయిలో దాడులు ప్రారంభించింది. భారత్ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35 వరకు ఉండొచ్చని, వారు జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందినవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ జవాన్లు కూడా భారీగానే హతమయ్యారని పేర్కొన్నాయి. ఆదివారం సాయంత్రం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు. వీరమరణం పొందిన భారత జవాన్లు పదమ్ బహదూర్, గమిల్ కుమార్ పీఓకేలోని ఉగ్రస్థావరాల నెట్వర్క్ చాలావరకు ధ్వంసమైందన్నారు. ‘మూడు ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. నాలుగోది దాదాపు ధ్వంసమైంది. పక్కా సమాచారంతోనే దాడులు చేశాం’ అన్నారు. ‘దీపావళి పండుగ సమీపిస్తోంది. భారత్‌లో దాడులు చేసేందుకు కొందరు ఉగ్రవాదులు పీఓకేలోని నీలం లోయలో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాల్లో సిద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారమందింది. వారు చొరబాటుకు ప్రయత్నించే వరకు ఎదురుచూడకుండా.. ముందే పక్కా ప్రణాళికతో దాడులు చేశాం’ అని వివరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆగస్ట్ 5వ తేదీ నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మాకు వస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ రావత్ వ్యాఖ్యానించారు. నెల రోజులుగా గురెజ్, మచిల్, కేరన్ సెక్టార్ల ద్వారా పలు చొరబాటు ప్రయత్నాలు జరిగాయన్నారు. ‘భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలను పాక్ నిలిపేయకపోతే.. మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’ అని రావత్ స్పష్టం చేశారు. ‘కశ్మీర్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. ఒక్కో స్థావరంలో 10 నుంచి 15 మంది జమ్మూకశ్మీర్‌లోని తంగధర్ సెక్టార్‌కు ఆవలివైపు పీఓకేలో ఉన్న నీలం లోయలోని ఒక్కో ఉగ్రస్థావరంలో భారత్ దాడులు చేసిన సమయంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్ జవాన్లు చనిపోయారన్న భారత్ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులను ఉగ్రస్థావరాలున్నాయని భారత్ చెబుతున్న నీలం లోయ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారే నిజానిజాలను నిర్ధారిస్తారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ సవాలు చేశారు. పాకిస్తాన్లో భారత రాయబారి గౌరవ్ అహ్లూవాలియాను పాక్ ప్రభుత్వం పిలిపించి భారత్ కాల్పులకు నిరసన తెలిపింది. భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు. పాక్ వాదనను భారత ఆర్మీ తోసిపుచ్చింది. ‘ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు వీలుగా శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అందుకు ప్రతిగా భారత్ జరిపిన కాల్పుల్లో పీఓకేలోని పలు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్‌లు ధ్వంసమయ్యాయి’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పేరును వాడుకోవడం బీజేపీ నేతలు ఇకనైనా ఆపేయాలి’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. పఠాన్‌కోట్.. ఉడి. పుల్వామా! 2016 జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న వైమానిక స్థావరంపై 2016 జనవరి 2వ తేదీ వేకువజామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది నేలకొరగగా నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాత్రి సమయంలో వైమానిక స్థావరంలోకి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ప్రవేశించిన ఉగ్రవాదులు పేలుళ్లు, కాల్పులతో విధ్వంసం సృష్టించారు. ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు సైన్యానికి 17 గంటలకుపైగా సమయం పట్టింది. 2016 సెప్టెంబర్ 28 ఉడి సైనిక స్థావరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రగిలిపోయిన భారత్.. సరిగ్గా పది రోజుల తర్వాత పగ తీర్చుకుంది. 2016 సెప్టెంబర్ 28వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు కమాండోలతో కూడిన వైమానిక దళం విమానాలు ఎల్వోసీలోకి ప్రవేశించాయి. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకుని వెళ్లి భింబేర్, కేల్, హాట్ స్ప్రింగ్, లిపా సెక్టార్లలోని 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా 38 మంది ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికులను హతం చేశాయి. నాలుగు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించి, పూర్తిగా విజయవంతమైందని సైన్యం ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 14 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వస్తున్న భద్రతా బలగాల కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనంతో ఢీకొట్టాడు. భారీ విస్ఫోటం సంభవించి 40 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం భారత్ మరోసారి ఎల్వోసీలోకి వైమానికదళాన్ని పంపింది. బాలాకోట్‌లో నడుస్తున్న ఉగ్ర శిక్షణ శిబిరంపై భీకర దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించింది. అనంతరం సరిహద్దుల్లో పాక్ ఎఫ్–16 కూల్చివేత, తదనంతర పరిణామాల్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పట్టుబడటం, పాక్ అతడిని సురక్షితంగా విడిచి పెట్టడం తెలిసిందే. -
పాక్‌కు భారీ షాక్ : ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన ఆర్మీ
-
పాక్‌కు భారీ షాక్ : ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన ఆర్మీ
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, టెర్రర్ లాంఛ్ ప్యాడ్ల లక్ష్యంగా భారత సైన్యం ఆదివారం దాడులు చేపట్టింది. తాంగ్ధర్ సెక్టార్‌కు ఎదురుగా పీఓకేలోని నీలం ఘాట్ ప్రాంతంలో ఆర్మీ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ వైపు భారీ నష్టం జరిగినట్టు సమాచారం. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసింది. కుప్వారాలోని తాంగ్ధర్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడటంతో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించిన కొద్ది గంటల్లోనే భారత సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నందుకు ప్రతీకారంగా భారత సేనలు పీఓకేలో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులు చేపట్టాయని భారత సైన్యం ప్రతినిధి వెల్లడించారు. నీలం ఘాట్‌లోని ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ఫిరంగులతో టార్గెట్ చేసింది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు ఈ ఆపరేషన్‌లో పది, పదిహేను మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. ఉగ్ర శిబిరాలపై దాడి, ఆపరేషన్ వివరాలను ఆర్మీ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. -
పీఓకేను స్వాధీనం చేసుకుంటాం
సాక్షి, మహబూబ్‌నగర్: త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ను స్వాధీనం చేసుకుం టామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నా రు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన జనజాగరణ అభియాన్‌లో ఆయన మాట్లాడారు. జమ్మూ–కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తీసుకురావడానికే ఆర్టికల్ 370 రద్దు చేశామన్నారు. ఆనాడు దేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్, జనాఘడ్, కశ్మీర్ భారతదేశంలో విలీనం కాలేదన్నారు. సర్దార్‌వల్లభాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్‌ను విలీనం చేసి 1948 లో జాతీయజెండా ఎగురవేశారన్నారు. నెహ్రూ నిర్ణయాల వల్లే కశ్మీర్‌ను అప్పట్లోనే విలీనం చేయలేకపోయారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కశ్మీర్లో ప్రత్యేక రా జ్యంగం అమలు, పాకిస్తాన్ దేశస్తులకు పౌరసత్వం కల్పిం చడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయన్నారు. దీంతో అక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోవడానికి కారణమైందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ప్రజలకు ఎ దురయ్యే ఇబ్బందులపై ఇంతవరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలు, మాజీ మంత్రులు డి.కె. అరుణ, పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎమ్మెల్యే చిం తల రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పడాకుల బాల్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రామమందిరం తథ్యం ఎన్నికలముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నరేంద్రమోడీ నాయకత్వంలో అయోద్యలో రామమందిరం నిర్మాణం తథ్యమని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ స్వాతంత్ర ఫలాలు అందుకోలేకపోయారని, ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు స్వచ్ఛా స్వాతంత్రాలు కల్పించారన్నారు. అనంతరం మాజీ మంత్రి డీకె.అరుణ మాట్లాడారు. గత పాలకులు చేయని సాహసం బీజేపీ చేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. -
పీవోకేలో భారీ భూకంపం
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సంభవించిన తీవ్ర భూకంపంతో 26 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు ఉత్తర ప్రాంతంలోని పలు నగరాల్లో భూమి కంపించింది. దీని ప్రభావంతో భారత్‌లో..రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ల్లోనూ భూమి కంపించింది. తీవ్ర ప్రకంపనలు రాకవడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాలు వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. పంజాబ్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతం జీలం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని తీవ్రత 7.1 వరకు ఉందని సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ ఛౌదరి అన్నారు. భూకంప కేంద్రం పీవోకేలోని న్యూ మీర్పూర్ సమీపంలో ఉందని అమెరికా తెలిపింది. పీవోకేలోని మిర్పూర్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్రంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మీర్పూర్లో ఓ భవనం కుప్పకూలింది. ఓ మసీదు కూడా దెబ్బతింది. భూకంపంతో మీర్పూర్, చుట్టుపక్కల జరిగిన విధ్వంసంలో 26 మంది మృతి చెందగా, మహిళలు, చిన్నారులు సహా 300 మంది వరకు గాయపడ్డారని మీర్పూర్ డీఐజీ గుల్ఫరాజ్ ఖాన్ తెలిపారు. భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి. పగుళ్లిచ్చిన రోడ్లలో కార్లు ఇరుక్కుపోయాయి. పెషావర్, రావల్పిండి, లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్, అబోటాబాద్, ముల్తాన్, నౌషెరాల్లో భూమి కంపించింది. పరిపాలనా యంత్రాంగానికి తోడుగా తక్షణమే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా సైన్యాన్ని ఆదేశించారు. వైమానిక దళం, వైద్య బృందాలను పంపినట్లు సైన్యం తెలిపింది. నష్టం ఎక్కువగా మీర్పూర్, జీలం ప్రాంతాల్లో జరిగిందని జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం చైర్మన్ లెఫ్టినెంట్ మొహమ్మద్ అఫ్జల్ తెలిపారు. అయితే, మీర్పూర్ సమీపంలో ఉన్న మంగ్లా జలాశయానికి ఎటువంటి ముప్పు లేదన్నారు. జలాశయం వద్దనున్న 900 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని అధికారులు ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రకంపనల కారణంగా జీలం కాల్వకు గండ్లు పడటంతో నీరు లోతట్టు ప్రాంత గ్రామాలను ముంచెత్తింది. ఉత్తర భారతంలోనూ అలజడి ఉత్తర భారతంలోని దేశ రాజధాని ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత 6.3గా ఉందని అధికారులు ప్రకటించారు. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని వెల్లడించారు. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, హరియాణాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాలను వదిలి రోడ్లపైకి చేరుకున్నారు. -
‘అదే జరిగితే ఏ శక్తి పాకిస్తాన్‌ను కాపాడలేదు’
పట్నా: ఒకవేళ పాకిస్తాన్ 1965,1971 కాలంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయాలని చూస్తే.. ఈ సారి ప్రపంచంలోని ఏ శక్తి పాక్‌ను కాపాడలేదంటూ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ పునర్వ్యస్థీకరణ తర్వాత పాక్ దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ హెచ్చరికలు చేయడం ప్రాధన్యత సంతరించుకున్నాయి. ఆదివారం బిహార్ పట్నాలో నిర్వహించిన ‘జన్ జాగరణ్’ సభకు రాజనాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్ 1965,1971లో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయాలని చూస్తే.. అప్పుడు వారు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) గురించి ఆలోచించుకోవాలి. బలూచ్, పస్తూన్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల గురించి ఆలోచించుకోవాలి. అలాకాకుండా పాక్ గనక దుందుడుకు చర్యలకు పాల్పడితే.. అప్పుడు భారత్ కోపాగ్ని నుంచి ప్రపంచలోని ఏ శక్తి పాకిస్తాన్‌ని కాపాడలేదు’ అంటూ రాజ్‌నాథ్ హెచ్చరించారు. (చదవండి: రాజ తేజసం) ‘నెహ్రూ కారణంగా వచ్చిన ఆర్టికల్ 370 అనే రాచపుండు ఏళ్లుగా దేశంలో రక్తపాతం సృష్టించింది. గతంలో ఈ ఆర్టికల్ గురించి నెహ్రూ ఇది కేవలం తాత్కలికమే అని.. భవిష్యత్తులో ఈ ఆర్టికల్‌ను తొలగిస్తామని తెలిపారు. కానీ అలా జరగడానికి దాదాపు 72 ఏళ్లు పట్టింది. నాడు కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ సరి దిద్దింది. కశ్మీర్‌లోని మూడొంతుల ప్రజలు కేంద్రం నిర్ణయాలను ఆమోదిస్తున్నారు. ఆర్టికల్ 370 పట్ల బీజేపీ ఎప్పుడు కఠినంగానే ఉంది. మా పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది అనడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్లో ఉగ్రవాదం పెరిగింది. ఫలితంగా 41,500 అమాయక ప్రజలు, 5,500 మంది రక్షణ సిబ్బంది ప్రాణాలు కొల్పోయారు’ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాతే పాక్‌తో చర్చలు జరుపుతామని.. అది కూడా పీఓకే గురించి మాత్రమే అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాక రానున్న ఐదేళ్లలో జమ్మూకశ్మీర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని.. భూతల స్వర్గం అనే మాటను నిజం చేస్తామని పేర్కొన్నారు. -
పీవోకే భారత్‌దే.. పాక్ తీవ్ర స్పందన
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని భారత్ చేసిన వ్యాఖ్యలపై దాయాది పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ దుందుడుకుగా చేస్తున్న వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా పరిగణించాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా, అసంబద్ధంగా భారత్ ప్రకటనలు చేస్తోందని, దీనితో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయి.. ఉపఖండంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశముందని పాక్ చెప్పుకొచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశంపై ప్రజలు ఏమంటారోనని ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరంలేదని, కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని, త్వరలోనే సద్దుమణుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
పీవోకే భారత్‌లో భాగమే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమేనని, దానిపై ఎప్పటిౖకైనా భౌతిక అధికార పరిధి కలిగి ఉండాలని కేంద్రం భావిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అన్నారు. కశ్మీర్ అంశంపై ప్రజలు ఏమంటారోనని ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరంలేదని ఆయన స్పష్టంచేశారు. కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని, త్వరలోనే సద్దుమణుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఇక భారత్ పొరుగు దేశం నుంచి ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సరిహద్దు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టంచేశారు. భారత్–అమెరికాల మధ్య సంబంధాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. వాణిజ్య వ్యవహారాలు సాధారణ స్థితిలో ఉన్నాయన్నారు. పాత మార్గాల్లోనే మళ్లీ కొత్తగా శ్రీనగర్: కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్ సైన్యం దొంగచాటు మార్గాల గుండా 60 మంది ఉగ్రవాదులను దేశంలోకి పంపించిందని అధికారులు వెల్లడించారు. ఎత్తైన పర్వత ప్రాంతాలైన ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, గుల్మార్గ్, జమ్మూలోని పూంఛ్, రాజౌరీ సెక్టార్ల గుండానే చొరబాట్లు ఎక్కువగా జరిగినట్లు నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి అంచనాకు వచ్చామన్నారు. ఉగ్రవాదులు గతంలో ఈ మార్గాల ద్వారానే దేశంలోకి ప్రవేశించేవారని తెలిపారు. అయితే, చొరబాట్లపై సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ అనుమానాల నేపథ్యంలోనే భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. -
పీవోకేలో ఇమ్రాన్ ఖాన్‌కు దిమ్మతిరిగే షాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్‌లో పర్యటించిన ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముజఫరాబాద్ ప్రజలు ‘గో బ్యాక్ నాజీ’ అంటూ ఇమ్రాన్‌కు స్వాగతం పలికారు. ఆయన పర్యటన సందర్భంగా ‘కశ్మీర్ హిందుస్తాన్‌దే’ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంతో రగిలిపోతూ.. భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ముజఫరాబాద్ పర్యటనకు వెళ్లారు. భారత్‌లోని కశ్మీరీల దుస్థితిని, కశ్మీర్లో విధించిన ఆంక్షలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేందుకంటూ ఆర్భాటంగా ఇమ్రాన్ ముజఫరాబాద్ వచ్చారు. ఇక్కడ ‘బిగ్ జల్సా’ (ర్యాలీ)లో పాల్గొంటానని చెప్పారు. కానీ, పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముజఫరాబాద్ స్థానికులు ఇమ్రాన్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేక నినాదాలతో షాక్ ఇచ్చారు. చదవండి: పరువు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ -
దేనికైనా రెఢీ!
-
పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13న జరిగే జల్సా (ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. – న్యూఢిల్లీ/గ్వాలియర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జల్సా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగంగా చేసుకోవడమే ప్రభుత్వం తదుపరి లక్ష్యమంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోకేను స్వాధీనం చేసు కోవడంతోపాటు దేనికైనా మేం సంసిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13వ తేదీన జరిగే జల్సా(ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేపై ప్రత్యేక వ్యూహం ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. మన బలగాలు పీవోకేలోకి ప్రవేశించేందుకు సదా సన్నద్ధంగా ఉన్నాయి.. అయితే, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘పీవోకే విషయంలో ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి విషయాలను బహిర్గతం చేయరాదు’అని తెలిపారు. -
భారత్ బలగాలు పీవోకేలోకి వెళ్లేందుకు సిద్ధం..
శ్రీనగర్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం స్పష్టం చేశారు. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనిక చర్యకు తాము సిద్ధమని పేర్కొన్నారు. పాకిస్తాన్ చేతుల నుంచి పీవోకేను తిరిగి సాధించడమే భారత తదుపరి అజెండా అని బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పీఓకే స్వాధీనం దిశగా కేంద్రం అనుమతి కోసం వేచిచూస్తున్నామని, ఆదేశాలు రాగానే వెంటనే ఆపరేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దేశంలోని వ్యవస్థలు పనిచేస్తాయని, ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తదుపరి భారత్ అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 1994లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన తీర్మానంలోనూ ఈ విషయం పొందుపరిచారని ఆయన ప్రస్తావించారు. -
2022 నాటికి పీవోకే భారత్‌దే
ముంబై: ‘2022నాటికి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో కలిసిపోతుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక త్వరలోనే పీవోకే కూడా భారత్ స్వాధీనం చేసుకుంటుంద’ని శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు శివసేన సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. సంజయ్ రౌత్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘కశ్మీర్ మా అంతర్గత అంశమని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విస్పష్టంగా చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ (పాక్ పీఎం) బాడీ లాగ్వెంజ్ చూడండి. కశ్మీర్ పూర్తిగా భారత్ నియంత్రణలోకి వచ్చేసింది. ఆర్టికల్ 370ను రద్దు చేశారు. త్వరలో పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమవుతుంది. 2022నాటికి అఖండ భారత స్వప్నం సాకారమవుతుంది’ అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పీవోకేను కూడా భారత్‌లో అంతర్భాగంలో చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంజయ్ ఈ మేరకు కామెంట్ చేశారు. సంజయ్ రౌత్ -
పీఓకేలో పాక్ శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో పాటు భారత్‌లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను, పాక్ శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది. పాక్ సైనిక శిబిరాలకు చేరువగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్‌ను నిర్వీర్యం చేసింది. లీపావ్యాలీలోని ఉగ్ర శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేశాయి.పాకిస్తాన్ సేనలు భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతున్నాయి. పాక్ సేనల సహకారంతో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజహిదిన్, లష్కరీ తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్ధలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు భారత్‌లో ఉగ్ర దాడులతో పాటు భారత సైన్యం కన్నుగప్పి చొరబాట్లకు ఎలా పాల్పడవచ్చనే అంశాలపై తర్ఫీదు ఇస్తారు. -
భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు !
శ్రీనగర్ : భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పథక రచన చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రమూకల సంస్థలతో కలిసి సెస్టెంబర్ చివరి వారంలో లేక అక్టోబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పాకిస్తాన్ బిగ్రేడ్‌కు చెందిన 2000 మందితో కూడిన బలగాలను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని పూంచ్ ఏరియాకు చెందిన బాగ్, కోట్లీ సెక్టార్‌కు తరలించినట్లు సమాచారం అందింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) నుంచి భారత భూభాగంలోకి చొరబడేజైష్-ఎ-ముహమ్మద్ (జెఎమ్), లష్కర్-ఎ-తొయిబా తీవ్రవాదులకు ఈ బలగాలు సహకరించనున్నాయి. ప్రస్తుతం ఈ బలగాలు నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్జి కమాండోలతో కలిసి ఎల్ఇటి, జైషే ఉగ్రవాదులు ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్లలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో ఈ ఉగ్రవాద గ్రూపుల కోసం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. జమాత్-ఎ-ఇస్లామి ఈ శిబిరాలకు నాయకత్వం వహిస్తుండగా, జైష్-ఎ-ముహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఎల్ఈటీ తమ వంతు సహకారం అందించనున్నట్లు తెలిసింది. వజీరాస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు ఐఎస్ఐ పెద్ద మొత్తంలో జాబితాను తయారు చేసినట్లు, దీనికంతటికి హిజ్బుల్ కమాండర్ షంషేర్‌ఖాన్ నాయకత్వం వహించనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
కశ్మీర్‌పై మీ ఏడుపు ఆపండి
లేహ్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఆ దేశం ఏడుపు ఆపాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్తాన్‌కు సూచించారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు ఒక విధానమంటూ లేదని, ఆ విషయంలో ఆ దేశం చేస్తున్న యాగీకి అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతు ప్రకటించలేదని రక్షణ మంత్రి చెప్పారు. ‘నేను పాకిస్తాన్‌ను ప్రశ్నిస్తున్నా.. మీకేం సంబంధం ఉందని కశ్మీర్ విషయంలో రోదిస్తున్నారు? నిజానికి పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన ప్రాంతమే. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, గిల్గిత్, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రోదించండి’అని పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలని పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాలను ఏ దేశమూ సమర్థించలేదని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్–జవాన్ విజ్ఞాన్ మేళా’సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న పొరుగు దేశంతో చర్చలు అసాధ్యమని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్‌తో సత్సంబంధాలనే కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్ మొదట ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించడం మానుకోవాలి. కశ్మీర్‌పై మాట్లాడేముందు వారు పీవోకే, బలూ చిస్తాన్‌పై మాట్లాడాలి అని రాజ్‌నాథ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. -
ఇక పీవోకేపైనే చర్చలు: రాజ్‌నాథ్
కల్కా/జమ్మూ: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మాని, వారిపై చర్యలు తీసుకుంటేనే పాకిస్తాన్‌తో చర్చలుంటాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆ చర్చలు కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అంశంపై మాత్రనేనన్నారు. అలాగే, పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగం కావాలంటూ మరో మంత్రి జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు. హరియాణాలోని కల్కాలో ఆదివారం రాజ్‌నాథ్ బీజేపీ జన్ ఆశీర్వాద్‌యాత్రను ప్రారంభించి, ప్రసంగించారు. ‘పాక్‌తో చర్చలంటూ జరిగితే అది పీవోకేనే తప్ప మరే అంశంపైనా కాదు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ భయపడింది. ఆ దేశానికి అది చాలా త్రీవమైన అంశం. అందుకే ప్రతి దేశం గుమ్మం తడుతూ సాయం ఆర్థిస్తోంది. మనల్ని భయ పెట్టాలని చూస్తోంది. అయితే, అగ్రరాజ్యం అమెరికా కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకోండని సలహా ఇవ్వడంతో దిక్కులు చూస్తోంది’ అని అన్నారు. ‘ఏ అంశంపై అయినా మనం పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? అసలు చర్చలు ఎందుకు జరపాలి? ఒకవేళ చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వడం మానేయాలి’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్‌ను బలహీనపర్చాలని, ముక్కలు చేయాలని పాక్ కుట్ర పన్నుతోంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌పై వైమానిక దాడి చేయించడం ద్వారా 56 అంగుళాల ఛాతీ ఉందని మన ప్రధాని మోదీ నిరూపించారు’ అని వ్యాఖ్యానించారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన.. ‘రఫేల్ జెట్లు మన వద్ద ఉన్నట్లయితే బాలాకోట్ దాడులను కూడా మన భూభాగం నుంచే జరిపే వీలుండేది. అందుకే ఆ విమానాలను కొనుగోలు చేసి తీరుతాం’ అన్నారు. పీఎంఓలో రక్షణ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ.. మూడు తరాల వారి త్యాగాల ఫలితంగా ఆర్టికల్ 370 రద్దయింది. ఇలాగే, పీవోకే స్వాతంత్య్రం లభించాలని, అది కూడా భారత్‌లో అంతర్భాగం కావాలని, మనం స్వేచ్ఛగా ముజఫరాబాద్ ‘పీవోకే రాజధాని) వెళ్లి వచ్చే సమయం రావాలని ప్రార్థిద్దాం’ అని అన్నారు. ఆర్టికల్ రద్దు సరైనదే హరియాణ మాజీ సీఎం హూడా రోహ్తక్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కాంగ్రెస్ సీనియర్ నేత, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా అన్నారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ భక్తి విషయంలో తగ్గే ప్రసక్తే లేదని భూపిందర్ అన్నారు. అందుకే బీజేపీ నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు 25 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కమిటీ తెలిపే ఫలితాలను చండీగఢ్‌లో వెల్లడిస్తామన్నారు. పార్టీ అధిష్టానం ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వక పోవడంతో పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
నాలుగు యుద్ధాలు
1947 పీఓకే జననం ఈ యుద్ధాన్ని మొట్టమొదటి కశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతి పెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ హిందూ మతానికి చెందిన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటీష్ పాలకులు వారి ఇష్టానికే వదిలిపెట్టారు. భారత్‌లో కలుస్తారా, పాక్‌లో కలుస్తారా ? లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణయించుకోవాలని తెలిపారు. రాజా హరిసింగ్ భారత్‌లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్ 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌పై దండయాత్ర చేసింది. ఇస్లాం ఆదివాసీలు పాక్ ఆర్మీ అండదండ చూసుకొని కశ్మీర్‌పై దాడికి దిగాయి. దీంతో మహారాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్లు సాగింది. కశ్మీర్లో అత్యధిక భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్, వాస్తవాధీన రేఖ ఏర్పడ్డాయి. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. కశ్మీర్ లోయలో రెండింట మూడు వంతుల భాగం భారత్ కిందకి వచ్చాయి. ఇక పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ గిల్జిట్ బల్టిస్తాన్ అని పిలుస్తారు. 1965 పాక్ పలాయనం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ 1965లో భారీ కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో భారత్‌లో మారణహోమం సృష్టించడానికి పన్నాగాలు రచించింది. దీంతో భారత్ పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధట్యాంకులు వినియోగించింది ఈ యుద్ధంలోనే. దీనినే రెండో కశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్ తోక ముడిచింది. పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. అదే సమయంలో అమెరికా, రష్యా దౌత్యపరమైన జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్ డిక్లరేషన్ అమల్లోకి వచ్చింది. 1971 బంగ్లా విముక్తి ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్ కశ్మీర్లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పాలకుడు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు అండగా భారత్ నిలబడింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాక్‌తో యుద్ధం చేసింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. భారత్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. రెండువారాల పాటు ఉ«ధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. 1999 కార్గిల్ చొరబాటు 1999 మొదట్లో పాకిస్తాన్ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్లోకి చొచ్చుకువచ్చాయి. కార్గిల్ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాక్ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలటరీ చర్యకి భారత్ దిగింది. రెండు నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్ మిలటరీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుంచి 80శాతం వరకు తిరిగి భారత్ అధీనంలోకి వచ్చేశాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4 వేల మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా ఆ దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్ యుద్ధాన్ని నిలిపివేసింది. అలా కార్గిల్ యుద్ధంతో భారత్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. -
సైన్యం.. అప్రమత్తం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. వారిని అదుపు చేయాలి: కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది. -
రెండో అడుగు పీవోకే స్వాధీనమే!
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై రాజ్యసభలో ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఇక ప్రభుత్వ తదుపరి అడుగు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే. ఆ ప్రాంతాన్ని భారత్‌కు తిరిగి అప్పగించమని పాకిస్తాన్ ప్రధానికి చెప్పడం తప్ప, ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమీ మిగలలేదు, ఆర్టికల్ 370 రద్దుపై సాహసోపేత చర్య తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు అభినందనలు. పీవీ నరసింహారావు ప్రభుత్వ సమయంలోనూ పీవోకేను భారత్‌లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆర్టికల్ 370ని రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న కాంగ్రెస్ వాదన వారి అజ్ఞానాన్ని సూచిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటోంది. ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంటుకు తెలియజేయడాన్ని సముచిత చర్యగా భావిస్తున్నాను. ఆర్టికల్370 రద్దు ఇప్పటికే ఆలస్యమైంది. ఆర్టికల్ రద్దు ఏకపక్షమని వాదించేవారికి.. 5లక్షల మంది కాశ్మీరీ పండిట్లను, సిక్కులను తరిమివేసిన రోజు గుర్తులేదా. స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి’ అని అన్నారు. -
ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్‌పేయి ఆదేశం!
2001, డిసెంబర్ 13న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించారు. పాక్ తన శిబిరాన్ని వేరే చోటుకు మార్చడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అమెరికాపై అల్ ఖాయిదా దాడి(9/11) నేపథ్యంలో ఆఫ్ఘన్‌పై యుద్ధానికి దిగిన అమెరికాకు మద్దతివ్వాలని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. దానివల్ల క కలిగే నష్టాలను గుర్తించిన వాజ్‌పేయి దౌత్యనీతిని ఉపయోగించి నిర్ణయాన్ని దాటవేశారు. ‘ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్: మెమరీస్ ఆఫ్ ఏ మిలటరీ చీఫ్(గుర్తుంచుకోదగిన ప్రధాని:సైన్యాధిపతి జ్ఙాపకాలు) పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్ కుమార్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. పార్లమెంటుపై దాడి జరగ్గానే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాలతో సమావేశమయ్యారు. పీవోకేలో ఉన్న ఉగ్ర శిక్షణా శిబిరంపై దాడికి అన్ని నిర్ణయించాం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, పాకిస్తాన్ ఆ శిబిరాన్ని ఒక స్కూలు, హాస్పటల్ మధ్యకి మార్చినట్టు చివరి నిముషంలో తెలిసింది. శిబిరంపై దాడి చేస్తే జననష్టం జరుగుతుందన్న భావంతో ప్రధాని వాజ్‌పేయి దాడి చేయవద్దన్నారు. అని సుశీల్ తన 135 పేజీల పుస్తకంలో పేర్కొన్నారు. -
‘ఉగ్ర శిబిరాల మూసివేతను నిర్ధారించలేం’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాద శిబిరాలు మూతపడ్డాయనే వార్తలను తాము నిర్ధారించబోమని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాక్ చర్యలతో నిమిత్తం లేకుండా తమ సరిహద్దుల వెంబడి భారత సైన్యం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. పీఓకేలో ఉగ్ర శిబిరాలు మూతపడ్డాయని వచ్చిన వార్తలతో పాటు తమ భూభాగంలో ఉగ్ర కార్యకలాపాలను పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేయాలని అమెరికా పాక్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. కాగా, ఇండో-పాక్ సరిహద్దులో నిఘాను పటిష్టం చేసేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సేనలు 2,500కు పైగా బంకర్లు నిర్మించాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ము, కథువా, సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో పదివేలకు పైగా బంకర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. -
పాక్‌ను వెంటాడుతున్న బాలాకోట్
ఇస్లామాబాద్ : బాలాకోట్ దాడుల భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. ప్రతీకార దాడులపై ఆందోళనతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపింది. భారత్ చెబుతున్న వివరాల ప్రకారం పీఓకేలో ముజఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లో ఐదేసి చొప్పున, బర్నాలాలో ఒక క్లస్టర్ సహా 11 ఉగ్రవాద శిబిరాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోట్లీ, నికైల్ ప్రాంతంలో లష్కరే తోయిబా నిర్వహిస్తున్న కొన్ని శిబిరాలు మూతపడ్డాయి. పాలా, బాగ్ ప్రాంతంలో జైషే మహ్మద్ నిర్వహిస్తున్న ఉగ్ర శిబిరాలు కూడా మూతపడగా, కోట్లి ప్రాంతంలో హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్ర శిబిరం షట్‌డౌన్ అయింది. మరోవైపు ముజఫరాబాద్, మిర్పూర్ ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలు కూడా మూతపడ్డాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే టెర్రర్ లాంచ్‌ప్యాడ్స్ కూడా చురుకుగా లేవని సమాచారం. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం భారత్‌లోకి పీఓకే నుంచి చొరబాట్ల ప్రయత్నాలు పెద్దగా సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. -
‘కోట్ల మంది ఆగ్రహం, కసి ఆ దాడుల్లో కనిపించాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన చేపట్టిన వైమానిక దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం భారత్‌లో తీవ్ర ఆగ్రహం, ఆందోళన పెల్లుబికిందని కోట్లాది భారతీయుల ఆగ్రహాన్ని నేటి వైమానిక దాడులు ప్రతిబింబించాయని భారత వాయుసేనను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో ప్రశంసించింది. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడులతో యావత్ దేశం తీవ్ర ఆగ్రహం, ఆందోళనలో మునిగిపోయిందని, వైమానిక దాడులతో పాక్‌లోని జైషే ఉగ్రశిబిరాలను మట్టుబెట్టడం ద్వారా కోట్లాది భారతీయుల ఆగ్రహం, ఆందోళనలను సైన్యం శత్రువుపై విరుచుకుపడుతూ నేరుగా ప్రతిబింబించిందని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పుల్వామా ఉగ్ర దాడి అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ చీఫ్ సురేష్ భయ్యాజీ జోషీ డిమాండ్ చేశారు. -
స్పాట్‌కు అంతర్జాతీయ మీడియా: పాకిస్తాన్
ఇస్లామాబాద్: భారత వైమానిక దళాలు మెరుపు దాడులు జరిపిన ఘటనా స్థలం (పీఓకే) వద్దకు అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత వైమానికి దళాలు తెల్లవారుజామున ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఖురేషీ స్పందిస్తూ.. పీఓకేలో ప్రస్తుతం పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, హెలికాఫ్టర్లు కూడా వెళ్లలేని స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు. భారత చర్యను ఖండించేందుకు పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం అంతర్జాతీయ మీడియాను అక్కడికి తీసుకెళ్లి.. వివరిస్తామని స్పష్టంచేశారు. భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపు దాడులు జరిపిన నేపథ్యంలో పాక్ సైన్యం అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశం అనంతరం పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారత దాడిని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. పాక్- భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎన్ఎస్సీ ఆదేశాల మేరకు పాక్ సైన్యం అలర్టయ్యింది. -
పీవోకేలో పాక్ వ్యతిరేకంగా నిరసనలు
ముజఫరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నీలం-జీలం నదిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్మించబోయే హైడ్రోపవర్ప్లాంట్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ.. ముజఫరాబాద్ ప్రజలు రొడ్డెక్కారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని, మరే ఇతర ప్రాజెక్టులను చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ జీవనం దెబ్బతింటోందని, వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పుడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతికేకంగా గత వారం రోజులుగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. Protests held against Pakistan in Muzaffarabad, Pakistan Occupied Kashmir (PoK), demanding immediate termination of the hydropower plant project underway on the Neelum-Jhelum river & also demanded authorities to refrain from sanctioning any further projects pic.twitter.com/MQ45cWTGv1 — ANI (@ANI) 19 December 2018 -
పాక్–చైనా బస్సు సర్వీస్.. వయా పీవోకే!
బీజింగ్: ఈ నెల 3వ తేదీ నుంచి చైనా, పాక్‌ల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు కాస్గర్– పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం లాహోర్ మధ్య ఈ బస్సు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా ఈ బస్సును నడపాలన్న నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవోకే కూడా తమదే అని పేర్కొంటున్న భారత్.. ఆ భూభాగం గుండా బస్సు సర్వీసు నడపడం తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగకరమని తెలిపింది. సీపెక్ ప్రాజెక్టు చైనా–పాక్ దేశాల ఆర్థిక సహకారానికి సంబంధించింది మాత్రమేననీ, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదని చైనా తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటి చైనా పర్యటన ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా బస్సు సర్వీసు నిర్ణయం వెలువడటం గమనార్హం. -
చైనా పాక్ ఒప్పందం.. భారత్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్ చర్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా నిర్మించిన బస్ సర్వీస్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లనున్న ఈ బస్ సర్వీస్ భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని అన్నారు. (పాకిస్తాన్లో మోదీ మంత్ర) చైనా-పాకిస్తాన్ మధ్య రూపుదిద్దుకున్న ‘సరిహద్దు ఒప్పందం 1963’ అక్రమమైనది, కాలం చెల్లినది’ అని రవీష్ పేర్కొన్నారు. విలువలేని ఈ ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ ఆమోదించబోదనీ, ఈ బస్ సర్వీస్ ముమ్మాటికీ ఉల్లంఘనలతో కూడుకున్నదేనని ఉద్ఘాటించారు. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్ సర్వీస్ నవంబర్ 13న ప్రారంభం కానుందని సమాచారం. 50 బిలియన్ డాలర్లతో 2015లో మొదలైన సీపీఈసీలో భాగంగా పాకిస్తాన్, చైనాల మధ్య విరివిగా రోడ్డు రైల్వే మార్గాలు నిర్మించనున్నారు. (క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు) -
పాక్ సైనిక కార్యాలయంపై భారత్ కాల్పులు
జమ్మూ: నియంత్రణ రేఖ దగ్గర్లో ఉన్న పాకిస్తాన్ సైనిక పాలక ప్రధాన కార్యాలయంపై భారత్ కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 23న జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, ఝల్లాస్‌ల్లో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా కాల్పులకు దిగిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఖ్యురత్త, సమానీ ప్రాంతాలపై కూడా భారత జవాన్లు దాడులు జరిపారనీ, పీవోకేలో పొగలు వస్తున్నట్లు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చెప్పారని ఓ అధికారి వెల్లడించారు. పాకిస్తానీ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి పొగ వస్తున్నట్లు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టినా భారత్ ఇన్నాళ్లూ నిగ్రహాన్ని పాటించిందనీ, తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామనేందుకు తాజా కాల్పులు పాక్‌కు గట్టి సంకేతమని తెలిపారు. పీవోకేలోని పౌర ప్రాంతాలపై ఆర్మీ కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మరో వీడియో
-
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ : తాజా వీడియో
సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్ స్ట్రైక్స్) జరిపింది. తోటి సైనికుల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు ‘టెర్రర్ లాంచ్ పాడ్’లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను నరేంద్ర మోదీ ప్రభుత్వం గత జూన్‌లో బహిర్గతం చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగి శుక్రవారం(సెప్టెంబరు 29)కి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా గురువారం మరో వీడియోను విడుదల చేసింది. సత్తా చాటిన భారత సైన్యం.. కశ్మీర్ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా సత్తా చాటారు. 2016 సెప్టెంబర్ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి. ప్రణాళికలో ఆయనదే కీలక పాత్ర.. జమ్మూ రీజియన్‌లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రాజేంద్ర నింబోర్కర్ వ్యవహరించారు. సర్జికల్ దాడులకు ప్రణాళిక రచించడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నింబోర్కర్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించే క్రమంలో పాటించిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చారు. చిరుతలు చేసిన పరోక్ష సాయం! ‘దాడులకు సంబంధించిన ప్రణాళిక రచించే విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాం. ప్రణాళిక అమలు పరిచేందుకు.. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ మాకు ఒక వారం సమయం ఇచ్చారు. దాడులు చేయడానికి ఒకరోజు ముందు మాత్రమే మా దళంతో లక్ష్యిత ప్రాంతం గురించి చెప్పాను. ప్రణాళిక అమలుపరిచే క్రమంలో నియంత్రణ రేఖ అవతలి గ్రామాల్లోని కుక్కలు సైన్యాన్ని చూసి మొరిగే అవకాశం ఉంది. అదే జరిగితే వాటి అరుపులకు శత్రు దళాలు అప్రమత్తమవుతాయి. ఇందుకు పరిష్కార మార్గం కనుగొనటానికి నా పాత అనుభవం పనికివచ్చింది. చిరుతలకు కుక్కలు భయపడుతాయనే విషయాన్ని నౌషేరా సెక్టార్లో బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్న సమయంలో నేను గమనించాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మా సైనికులు చిరుత మల, మూత్రాలను చల్లుకుంటూ వెళ్లారు. అలా శత్రు మూకలు అప్రమత్తం కాకుండా జాగ్రత్తపడ్డాం’ అంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. -
నిజంగా షాక్ష్‌గాం వ్యాలీలో ఏమీ లేదా?
న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నా, మరోవైపు డ్రాగన్ దేశం మాత్రం ఇండియా సరిహద్దుల్లో నిర్మాణాల పనులు ఆపడం లేదు. డొక్లాంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని షాక్ష్‌గాం వ్యాలీలో అన్ని రకాల వాతావరణాల్లో ఉపయోగించగల రోడ్లను చైనా నిర్మిస్తోంది. భారత్‌కు రక్షణ పరంగా అత్యంత కీలక ప్రాంతం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌కు ఉత్తరాన షాక్ష్‌గాం ఉంది. షాక్ష్‌గాంలో చైనా ఇప్పటికే పది మీటర్లు వెడల్పైన 75 కిలోమీటర్ల రోడ్డు వేసినట్లు తెలిసింది. రోడ్డును మరింతగా విస్తరించేందుకు షాక్ష్‌గాం నదికి తూర్పు తీరం వెంబడి తాత్కలిక షెల్టర్లు, సామగ్రిని చైనా సిద్ధం చేసినట్లు సమాచారం. డొక్లాం ఉద్రిక్తతల అనంతరం ఈ ప్రాంతంలో చైనా రోడ్డును వేయడం ప్రారంభించినట్లు తెలిసింది. షాక్ష్‌గాం వ్యాలీ సగటున 7 వేల మీటర్ల ఎత్తైన దుర్భేద్యమైన పర్వతాలు, కొండలు, గుట్టల నడుమ ఉంటుంది. చలికాలంలో ఇక్కడి ఉష్ట్రోగ్రతలు ఆర్కిటిక్‌ను తలపిస్తాయి. అయితే, షాక్ష్‌గాం వ్యాలీలో చైనా నిర్మాణాలు జరుపుతోందన్న వార్తలను భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు. సియాచిన్‌కు అతి ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతం ఓ లోయ అని, ఇక్కడ రోడ్లను వేయడం కష్టాసాధ్యమని అన్నారు. షాక్ష్‌గాం వ్యాలీలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని చెప్పారు. 1963లో పాకిస్తాన్, చైనాల మధ్య జరిగిన ఓ ఒప్పందంలో పీవోకేలోని కొంత భూభాగాన్ని పాక్, డ్రాగన్ దేశానికి ఇచ్చింది. అయితే, భారత్ ఈ భూ మార్పిడి ఒప్పందాన్ని గుర్తించలేదు. -
భారత్ సర్జికల్ స్ట్రైక్ వీడియో..!
-
సర్జికల్ దాడులకు వీడియో సాక్ష్యం..!
న్యూఢిల్లీ : దాదాపు రెండేళ్ల క్రితం (దాదాపు 636 రోజుల కిందట) పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) వీడియోలు తాజాగా విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన ‘టెర్రర్ లాంచ్ఫాడ్’లను ధ్వంసం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా భావిస్తున్నారు. కశ్మీర్ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి జొరపడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను మట్టుపెట్టారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా తమ సత్తా చాటారు. 2016 సెప్టెంబర్ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి. ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్న విపక్షాలు... 2016లో జరిగిన దాడులను ఓటుబ్యాంక్‌గా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం తాజాగా వీడియోలు విడుదల చేసిందని కాంగ్రెస్ విమర్శించింది.సర్జికల్ స్ట్రయిక్స్ నుంచి ఓట్లరూపంలో ప్రయోజనం పొందాలని చూస్తోందని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. గతంలో సర్జికల్ స్ట్రయిక్స్‌కు మద్దతు తెలిపిన ఎన్డీఏ మిత్రపక్షం జేడీ(యూ) కూడా అప్పటి మెరుపుదాడులతో ఏమి సాధించారని ప్రశ్నించింది. ఇప్పుడు వీడియోలు బయటపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోపై కాంగ్రెస్ స్పందన పాకిస్తాన్ టెర్రరిస్టులను ప్రోత్సహించేదిగా ఉందంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ విరుచుకుపడ్డారు. అసలప్పుడేం జరిగింది ? పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఎంచుకున్న ఉగ్రవాద లక్ష్యాల గురించి వివరించే పటంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. దాడిలో పాల్గొన్న సైనికులకు అమర్చిన కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ) ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులను చిత్రీకరించారు. దాడులకు ముందు, ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా తెలిసేలా రికార్డ్ చేశారు. ఈ కెమెరాల ద్వారా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి, ఆ తర్వాత రాకెట్ లాంఛర్లు, యాంటీ బంకర్ మిసైల్స్‌ని ప్రయోగించి పాక్ టెర్రర్ బంకర్లు ధ్వంసం చేయడాన్ని మొదటి వీడియోలో చిత్రీకరించారు. రెండు నిముషాల వ్యవధిలోనే రెండో లక్ష్యంపై దాడి చేయడాన్ని యూఏవీల ద్వారా రికార్డ్ చేశారు. మరో 20 సెకన్ల వ్యవధిలోనే జరిపిన దాడిలో ఉగ్రవాదుల బంకర్ ధ్వంసం కావడాన్ని కెమెరాల్లో బంధించారు. ఈ విధంగా మొత్తం 8 దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతం కావడం కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. జమ్ము,కశ్మీర్ సరిహద్దులోని ఆధీనరేఖ (ఎల్ఓసీ)కు కొన్ని కి.మీ లోపలికి వెళ్లి పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు నెలమట్టం చేయడానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఈ స్థావరాల్లో తీవ్రవాదులు, సైనికులు కలగలిసి స్వేచ్ఛగా తిరగడం ఈ వీడియోల్లో రికార్డయింది. దాడి జరిగిన తేదీ, సమయం కూడా వీడియోల్లో స్పష్టంగా నమోదైంది. గతంలోనూ ‘సర్జికల్ స్ట్రయిక్స్’... గత రెండుదశాబ్దాల్లో పలు సందర్భాల్లో మెరుపుదాడులు జరిగాయని కాంగ్రెస్ నేత సుర్జేవాలా వెల్లడించారు. ఆ జాబితా ఇదే... –2000 జనవరి 21న నీలం నది వ్యాప్తంగా నడాలా ఎన్‌క్లేవ్‌లో... –2003 సెప్టెంబర్ 18న ఫూంచ్‌లోని బారా సెక్టర్లో... –2008 జూన్ 19న ఫూంచ్‌లోని భట్టల్ సెక్టర్లో... –2011 సెప్టెంబర్ 1న నీలంనది లోయలోని కెల్ (శారద సెక్టర్) ప్రాంతంలో... –2013 జనవరి 6న సావన్ పత్ర చెక్‌పోస్ట్... –2013 జులై 27–28 తేదీల్లో నజాపిర్ సెక్టర్లో... –2013 ఆగస్టు 6న నీలం లోయలో... –2014 జనవరి 14న మరో మెరుపు దాడి జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. -
కశ్మీర్‌పై ఐరాస నివేదిక
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాం డ్ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో నివేదిక రూపొందించినట్లు ఉందంది. ఈ మేరకు భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను ఘాటు వ్యాఖ్యలతో ఐరాసకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఈ నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించేలా ఉందంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మొత్తం భారత్‌లో అంతర్భా గమని, పాక్ చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్ లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. యూఎన్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జమ్మూకశ్మీర్(కశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ ప్రాంతాలు), పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్(ఆజాద్ జమ్ముకశ్మీర్, గిల్గిట్–బల్టిస్తాన్)లపై 49 పేజీల నివేదికను విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు శిక్షలు పడకపోవడం, న్యాయం పొందే అవకాశం లేకపోవడం జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎదురవు తున్న సవాళ్లని ఐరాస తన నివేదికలో పేర్కొంది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు బదులుగా ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ అనే పదాలను ఐరాస ఉపయోగించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత భూభాగం గురించి నివేదికలో తప్పుగా పేర్కొనడం తప్పుదారి పట్టించేలా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, అసలు ఆజాద్ జమ్మూకశ్మీర్, గిల్గిత్ బల్టిస్తాన్ అనేవి లేనేలేవని పేర్కొంది. శాంతియుత కార్యకర్తలను అణచివేసేందుకు, వారిని హింసించేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేసే చర్యలను నిలిపివేయాలని ఐరాస పాకిస్తాన్‌ను కోరింది. 2016 నుంచి జమ్మూ కశ్మీర్లో చెలరేగిన ఆందోళనలు, భద్రతాదళాల చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. -
‘మోదీ హత్య-భారత్ ముక్కలు..’
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అనుచరుడొకడు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు గురవుతారని, ఆ వెంటనే భారత దేశం ముక్కలు అవటం ఖాయమని సంచలన ప్రకటన చేశాడు. రంజాన్ సందర్భంగా శుక్రవారం పీఓకే పరిధిలోని రావాలాకోట్ నగరంలోని ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జమాత్-ఉద్-దవా(జేయూడీ) నేత మౌలానా బషీర్ హాజరయి ప్రసంగించాడు. ‘త్వరలో ఇస్లాం జెండా.. అమెరికా, ఇండియాల్లో ఎగురుతుంది. భారత ప్రధాని మోదీ హత్యకు గురవుతారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎంతో మంది అమరులవుతారు. ఆయా దేశాలు ముక్కలు కావటం ఖాయం’ అని బషీర్ వ్యాఖ్యానించాడు. జిహాద్(పవిత్ర యుద్ధం) రంజాన్ పవిత్ర నెలలోనే జరగాలని, అలాంటప్పుడే అసువులు బాసినా యుద్ధ వీరులు స్వర్గానికి వెళ్తారని బషీర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. జేయూడీ వర్గాలు భారత్ నాశనాన్ని, కశ్మీర్ స్వతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయని, పీఓకేలో ఉన్న ప్రజలంతా తమ ఇంట్లోని పిల్లలను జిహాద్‌కు సిద్ధం చెయ్యాలని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. అవసరమైతే ఆర్థిక సాయం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ ప్రసంగం తాలూకు వీడియోలు కశ్మీర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. -
భారత్‌తో విభేదాలు ఇష్టం లేదు : చైనా
బీజింగ్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా వెళ్తున్న చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ) ప్రాజెక్టుపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సోమవారం చైనా ప్రకటించింది. సీపీఈసీపై భారత్‌కు అభ్యంతరాలు ఉన్నాయని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబవాలే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా సీపీఈసీపై భారత్‌కు ఉన్న అభ్యంతరాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. సీపీఈసీ వల్ల ఇరుదేశాల మధ్య విభేదాలు తలెత్తడం ఇష్టంలేదని చెప్పింది. ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలు సీపీఈసీ కారణంగా ప్రభావితం అవకుండా ముందే చర్చలు జరపడం మేలని తెలిపింది. సీపీఈసీ కేవలం ఓ ఆర్థిక సహకార ప్రాజెక్టు అని పేర్కొంది. ఎవరినో లక్ష్యంగా చేసుకుని తాము ఈ ప్రాజెక్టును ప్రారంభించలేదని చెప్పింది. భారత్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలకు వస్తే.. బలమైన సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా, 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రారంభిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా వెళ్లడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో గల గ్వాదర్ పోర్టు నుంచి చైనాలోని గ్జిన్జియాంగ్ ప్రావిన్సును సీపీఈసీ ప్రాజెక్టు కలుపుతుంది. -
14 వేల బంకర్లు
జమ్మూ: పాకిస్తాన్‌తో అంతర్జాతీయ, పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వద్ద 14,460 బంకర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ మోర్టార్లతో దాడు లు చేస్తున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ బంకర్లను నిర్మించనున్నారు. కాగా, ఈ బంకర్ల నిర్మాణానికి కేంద్రం రూ.415.73 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఈ భూగర్భ బంకర్లలో ఎల్వోసీ వెంట పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో 7,298, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, కథువా, సాంబా జిల్లాల్లో 7,162 బంకర్లను నిర్మించనున్నారు. ఇందులో 13,029 వ్యక్తిగతమైనవి కాగా, 1,431 సామాజిక బంకర్లున్నాయి. వ్యక్తిగత భూగర్భ బంకర్లు 160 చదరపు అడుగులు (ఎనిమిది మంది ఉండేందు కు వీలుగా), సామాజిక బంకర్లు 800 చదరపు అడుగులు (40 మంది ఉండేందుకు వీలుగా) ఉంటాయి. గతేడాది పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా 35 మంది (23 మంది సైనికులు, 12 మంది పౌరులు) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం బంకర్ల నిర్మాణానికి చొరవతీసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
పాక్ సైనికులను వేటాడిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ : భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎల్వోసీని దాటి వెళ్లిన భారత ఆర్మీ సైనికుల బృందం ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. గత శనివారం ఎల్వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. భారత్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో జైషే ఈ మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌పై పాకిస్తాన్ మీడియా ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు పేర్కొంది. మరొకరికి కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. -
‘భారత్-అమెరికా కుట్రలు పనిచేయవు’
బీజింగ్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ తప్పకుండా విజయవంతమవుతుందని చైనా స్పష్టం చేసింది. ఓబీఓర్ ప్రాజెక్ట్‌పై చైనా 50 బలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్-అమెరికాలు సంయుక్తంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌పై కుట్రలు పన్నుతున్నాయని.. పాకిస్తాన్ రక్షణ శాఖ రెండు రోజుల కిందట చైనాకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చైనా బుధవారం స్పందించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఒన్‌బెల్ట్ ఒన్రోడ్లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చేయాంగ్ స్పష్టం చేశారు. ఓబీఓఆర్‌లో భాగంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్.. వివాదాస్పద ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతున్న విషయం తెలిసిందే. పీఓకేలో సీపీఈసీ ప్రాజెక్ట్ వెళుతుండడంపై ఇప్పటికే భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సీపీఈసీ ప్రాజెక్ట్ ద్వారా పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి చైనాలోని జిన్జియాంగ్ వరకూ కనెక్టివిటీ ఏర్పడుతుంది. చైనా-పాకిస్తాన్ల మధ్య సుదీర్ఘకాలం స్నేహ సంబంధాలను కాపాడేందుకు ఎకనమిక్ కారిడార్ దోహదం చేస్తుందని హువా చేయాంగ్ చెప్పారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఇది చైనా, పాక్‌లతోపాటు మొత్తం దక్షిణాసియా దేశాల అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌కు ఇతర దేశాల నుంచి ఊహించని మద్దతు లభిస్తుందన్నారు. -
‘ముజ్రా’ పార్టీలో పీఓకే అధ్యక్షుడు
లండన్ : అంతర్జాతీయ సమాజం ముందు నిస్సిగ్గుగా పాకిస్తాన్ తన ద్వంద్వ విధానాలను మరోసారి ప్రకటించుకుంది. ఆర్థిక అవసరాల కోసం, ఎంతటి నీచానికైనా దిగజారేందుకు సిద్ధమని నిరూపించుకుంది. ఆక్రమిత కశ్మీర్‌కు నిధులు సమకూర్చే క్రమంలో లండన్‌లో ముజ్రా పార్టీని పాకిస్తాన్ ఆర్మీ పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆక్రమిత్ కశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ మసూద్ ఖాన్ హాజరుకావడం, పార్టీని ఆస్వాదిస్తున్నట్లు వీడియోల్లో స్పష్టంగా తేలడంతో పెనువివాదం చెలరేగింది. ముజ్రాపార్టీలో మహిళలు అభ్యంతరకర రీతిలో చేస్తున్న నృత్యాలకు ఇతర అతిథులతో పాటు మసూద్ ఖాన్‌కూడా ఆనందంగా ఆస్వాదించారు. ఆక్రమిత కశ్మీర్లో విద్యాభివృద్ధికై నిధుల తోడ్పాటు కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దౌత్యవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గతంలో చేసిన ప్రయత్నాలన్నీ అభాసుపాలయ్యాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు బుద్ధి రాలేదని పలువురు పాకిస్తాన్ పౌరులు ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమిత కశ్మీర్లో భారత్‌ను నిలువరించేందుకు ప్రయత్నించే మసూద్ ఖాన్.. ముజ్రా డ్యాన్సర్లను ఆపకపోవడం విచారకరమని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఆక్రమిత కశ్మీర్ కోసం నిధుల సేకరణ అంటూ జరిపిన ఈ ముజ్రా డ్యాన్స్ ప్రోగ్రాం.. పాకిస్తాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందని మీడియా చెబుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. పాకిస్తాన్ అతిథులు పాల్గొన్న ఈ ముజ్రా పార్టీలో.. భారతీయ యువతులు నృత్యాలు చేయడం.. వారితో అక్కడి పెద్దలు పాదం కలడం మొత్తం పాకిస్తాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిందని అక్కడి మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. #Pakistan stoops to a new low. Prime Minister of Pakistan occupied Kashmir holds erotic 'Mujra' in London to express solidarity with Kashmiris.Pak agents are collecting huge money in the name of Kashmiris every where.Big shame pic.twitter.com/7xJ9rifMM0 — Rajesh Raina راجیش (@rainarajesh) November 21, 2017 -
భారత్‌ను ఇంకా ఎన్ని ముక్కలు చేస్తారు?
జమ్మూ: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర వైఖరితో దేశం మరిన్ని ముక్కలయ్యే అవకాశముందని హెచ్చరించారు. ‘మీరు ఇప్పటికే ఒక పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇంకా ఎన్ని పాకిస్థాన్‌లు సృష్టిస్తారు. భారత్‌ను ఎన్ని ముక్కలు చేస్తారు’ అని శనివారం జమ్మూలో జరిగిన ఒక ర్యాలీలో పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం తాను వ్యాఖ్యలను ఫరూఖ్ సమర్థించుకున్నారు. ’ఔను! పీవోకే పాక్‌దేనని నేను అన్నాను. వారు (పాక్) ఏమైనా గాజులు తొడుక్కునారా? వాళ్ల వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మేం చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’ అని ఫరూఖ్ అన్నారు. ’మీరు ప్యాలెస్‌లలో నివసిస్తున్నారు. సరిహద్దుల్లో నివసిస్తున్న పేదవారి గురించి ఆలోచించండి. నిత్యం వారు బాంబు దాడులు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు. పీవోకేను భారత్ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్ కాదని ఫరూఖ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్ ఏమీ బలహీన దేశం కాదు. వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని ఫరూఖ్ గతంలో అన్నారు. -
ట్రై చేస్తే పీవోకే భారత్‌దే.. ఎవరూ అడ్డుకోలేరు!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్దేనంటూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఖండించారు. పీవోకే భారత్‌దేనని, గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఈ ప్రాంతం పాక్ ఆధీనంలోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. ’ మనం ప్రయత్నిస్తే పీవోకే మళ్లీ మన సొంతం అవుతుంది. ఎందుకంటే అది మన హక్కు. పీవోకే తిరిగి మనం అధీనంలోకి తెచ్చుకునేందుకు మేం కృషి చేస్తాం’ అని హన్స్‌రాజ్ తెలిపారు. ఫరూక్ వివాదాస్పద వ్యాఖ్యలివే..! పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం వ్యాఖ్యలు చేసిన ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. పీవోకేను భారత్ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్ కాదని ఆయన బుధవారం అన్నారు. బారాముల్లా జిల్లాలోని ఉడీ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా ప్రసంగించారు. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్ ఏమీ బలహీన దేశం కాదు.వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని అబ్దుల్లా అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు ప్రత్యేక వెసులుబాట్లు, రాయితీలు తదితరాలు కల్పిస్తూ 1953లో తెచ్చిన చట్టాలన్నింటినీ తొలగించే కాలం కూడా వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. -
పాక్ అంత బలహీన దేశమేం కాదు: ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం వ్యాఖ్యలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. పీవోకేను భారత్ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్ కాదని ఆయన బుధవారం అన్నారు. బారాముల్లా జిల్లాలోని ఉడీ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా ప్రసంగించారు. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్ ఏమీ బలహీన దేశం కాదు.వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని అబ్దుల్లా అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు ప్రత్యేక వెసులుబాట్లు, రాయితీలు తదితరాలు కల్పిస్తూ 1953లో తెచ్చిన చట్టాలన్నింటినీ తొలగించే కాలం కూడా వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. -
‘అవి బుద్ధిలేని వ్యాఖ్యలు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆక్రమిత కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు అనుకూలగా వ్యాఖ్యలు చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మండిపడ్డారు. పీఓకే విషయంలో ఫరూఖ్ అబ్దుల్లా తన అభిప్రాయాలు మార్చుకోవడం.. చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లాపై బీహార్‌లో రాజద్రోహం కేసు నమోదైంది. జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌కు చెందినదేని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఫరూఖ్ అబ్దుల్లాకు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని రామ్‌మాధవ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. ఈ ప్రాంతాన్ని వెంటనే పాకిస్తాన్ ఖళీ చేయాలని భారత పార్లమెంట్ 1994 ఫిబ్రవరి 22న ఏకగ్రీవ తీర్మానం చేసిందని రామ్‌మాధవ్ గుర్తు చేశారు. భారతీయ జనతాపార్టీ, భారత్ ఈ తీర్మానికే కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, ఆక్రమిత కశ్మీర్లు భారత్‌లో అంతర్భాగమని రామ్‌మాధవ్ ప్రకటించారు. -
‘పీఓకేకు స్వేచ్ఛనివ్వాలి’
జెనీవా: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత్ మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తన ధృఢవైఖరిని ప్రకటించింది. పీఓకేకు పాకిస్తాన్ స్వేచ్ఛను ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ (యూపీఆర్) కమిటీ ముందు భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ పీఓకేలో హింసను తక్షణం ఆపాలని, ముస్లిం మైనారిటీలపై దాడులను నిలిపివేయాలని, మానవహక్కులను కాపాడాలని భారత్ యూపీఆర్లో డిమాండ్ చేసింది. ఇకనైనా పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ ప్రజలను వేధించడం మానుకోవాలని భారత్ స్పష్టం చేసింది. జెనీవాలో నవంబర్ 13న జరిగిన మూడో యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ సామావేశంలో పీఓకే విషయంలో భారత్ తన ధృఢ వైఖరిని మరోమారు స్పష్టం చేసింది. భారత్ ప్రధాన డిమాండ్లు ఇవే ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్ జోన్లను పాకిస్తాన్ వెంటనే ధ్వంసం చేయాలి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మిలటరీ కోర్టు తీర్పుల నుంచి పఘాకే పౌరులకు మినహాయింపులు ఇవ్వాలి. ఆక్రమిత కశ్మీర్లో అంతర్జాతీయ మానవహక్కుల పరిశీలకులకు ప్రవేశం కల్పించాలి. పీఓకేలోని ముస్లి, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పించాలి. హిందు, క్రైస్తవ, సిక్కులను పెళ్లి పేరుతో చేస్తున్న మత మార్పిడులపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ప్రాంతాల్లో రాజకీయ విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని పాకిస్తాన్ తక్షణం ఆపాలి. India's Statement on the Universal Periodic Review of Pakistan pic.twitter.com/LXEgO2SFom — India at UN, Geneva (@IndiaUNGeneva) 13 November 2017 -
చనిపోయేలోపు పాక్‌కు వెళ్లాలని ఉంది: హీరో
ముంబై: అనాటి హీరో రిషి కపూర్ ఒక్కసారిగా పాకిస్తాన్‌పై ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడూ పాక్‌పై కామెంట్లు చేసి, భారత్‌కు మద్దతు తెలిపేవారు. కానీ చనిపోయేలోపు పాకిస్తాన్‌కు వెళ్లి రావాలని ఉందంటున్నారు. రిషి కపూర్ ఎందుకు ఈ విధంగా అన్నారంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పాకిస్తాన్‌కే చెందుతుందని , భారత్-పాక్ మధ్య దీని కోసం ఎన్ని యుద్ధాలు జరిగినా పరిస్థితిలో మార్పు ఉండబోదని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుఖ్ అబ్దుల్లా శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన మాటలకు రిషి కపూర్ స్పందించి.. ‘ ఫరుక్ అబ్దుల్లా జీ సలాం.. మీరు అన్న మాటలను నేను ఏకీభవిస్తున్నాను. జమ్ముకశ్మీర్ మనది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పాకిస్తాన్ వారిది. నా వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు. మరణించే లోపు పాకిస్తాన్‌కు వెళ్లి రావాలన్నది నా కోరిక. నా పిల్లలు అక్కడి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టండి జీ’ అని తన ట్విట్టర్ అకౌంట్లో ట్విట్’ చేశారు. -
‘పీఓకే.. పాకిస్తాన్‌దే’’
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. పీఓకే పాకిస్తాన్లో అంతర్భాగమని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు సినీ నటుడు రిషి కపూర్ సంచలన ప్రకటన చేశారు. ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు దఖలు పరిస్తేనే.. కశ్మీర్ సమస్యకు శాంతియుత, శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సమర్థిస్తూ రిషి కపూర్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను చనిపోయేముందు ఒక్కసారి అయినా పాకిస్తాన్‌ను చూడాలి.. మా పూర్వీకులు మూలాలను స్పృశించాలని ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై రిషి కపూర్ ట్విటర్ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు, కొందరైతే తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే.. మరికొందరు మాత్రం ఇటువంటి ట్వీట్లు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. Farooq Abdhulla ji, Salaam! Totally agree with you,sir. J&K is ours, and PoK is theirs. This is the only way we can solve our problem. Accept it, I am 65 years old and I want to see Pakistan before I die. I want my children to see their roots. Bas karva Dijiye. Jai Mata Di ! — Rishi Kapoor (@chintskap) 11 November 2017 -
పీఓకే పాకిస్తాన్‌దే
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పాకిస్తాన్‌కే చెందుతుందని, భారత్–పాక్ మధ్య దీని కోసం ఎన్ని యుద్ధాలు జరిగినా పరిస్థితిలో మార్పు ఉండబోదని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన భారత్, చైనా, పాక్ మధ్య కశ్మీర్ ఉందని, స్వతంత్ర కశ్మీర్ గురించి చర్చ అనవసరమన్నారు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాని ఖకాన్ అబ్బాసీ స్వతంత్ర కశ్మీర్ ఆలోచనను తిరస్కరించారు. వాస్తవంలో ఇది సాధ్యంకాదన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఫరూఖ్ తాజా కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ‘ ఆజాదీ(స్వతంత్ర కశ్మీర్) గురించి చర్చ అనవసరం. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్, ఇంకోవైపు భారత్.. ఇలా మూడు దేశాల మధ్య మేము ఉన్నాం. ఈ మూడు దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉంది. అందువల్ల అల్లా పేరు తప్ప ఇంక దేని గురించీ ఆశించరాదు’’ అని అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజాదీ గురించి వేర్పాటువాదులు మాట్లాడటం తప్పు అని పేర్కొన్నారు. అంతర్గత స్వయంప్రతిపత్తి తమ హక్కని, కేంద్రం దానిని పునరుద్ధరించాలని, అప్పుడే కశ్మీర్లో శాంతి నెలకొంటుందని చెప్పారు. పీవోకే భారత్‌కే చెందుతుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ చేసిన వ్యాఖ్యలను అబ్దుల్లా తప్పుపట్టారు. భారత ప్రభుత్వం, మహారాజ్ హరిసింగ్ మధ్య జరిగిన విలీన ఒప్పందాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. దాని ప్రకారం పీవోకే పాక్ చెందుతుందని, ఒకవేళ అది మనకే చెందుతుందని చెపితే.. విలీన నిబంధనలపైనా మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. -
పీఓకే కూడా భారత్‌దే
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత్ కశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ అప్పటి భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్, ఆక్రమిత్ కశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారాన్నికనుగొంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. -
హోరెత్తుతున్న పాక్ వ్యతిరేక ఆందోళనలు
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజాఫర్‌బాద్‌లో కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమతో సేవలు చేయించుకుంటున్న ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా తీరని అన్యాయం చేస్తోందని పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యంతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో తమతో వెట్టి చాకిరి చేయించుకుంటూ.. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అటు పాక్‌లోనూ, ఇటు పీవోకేలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వాలు తమపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని నినదిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. 2012లో తమను రెగ్యులరైజ్ చేసినట్లు సాక్షాత్తు పాక్ సుప్రీం కోర్టే తీర్పిచ్చినప్పటికీ వాటిని పాక్, కశ్మీర్ (పీవోకే) ప్రభుత్వాలు లెక్క చేయకుండా తమను కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. -
జమ్ముకశ్మీర్-పీఓకే మధ్య మళ్లీ బస్సు!
సాక్షి, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్-పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రాంతానికి నడిచే బస్సును సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. పూంచ్-రావల్కోట్ రోడ్డు మార్గంలో సరిహద్దు రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఈ బస్సు ప్రయాణిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బస్సు సర్వీసును గత నాలుగు నెలలుగా నిలిపివేశారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి పదే పదే కాల్పులు, మోర్టార్ల ప్రయోగం కారణంగా జూలై 10న ఈ బస్సును నిలిపివేశారు. అప్పటినుంచి చకన్-దా-బాగ్ వైపు నుంచి సరిహద్దు రేఖ దాటి బస్సు నడవలేదు. అయితే సరిహద్దు రేఖ వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో బస్సు ప్రయాణం, వ్యాపారాలను కొనసాగించాలని రెండు దేశాల సీనియర్ అధికారులు నిర్ణయించారు. వారానికొకసారి ఎల్ఓసీని దాటే ఈ బస్సు రేపటినుంచి పునరుద్ధరణ జరగవచ్చని భావిస్తున్నట్లు పూంచ్ సెక్టార్ ఎల్ఓసీ నియంత్రణాధికారి మొహమ్మద్ తన్వీర్ చెప్పారు. జమ్ముకశ్మీర్-పీఓకే ప్రాంతాల్లో విభజిత కుటుంబాల ప్రయాణ, వ్యాపార అవసరాల నిమిత్తం ఈ బస్సును శ్రీనగర్-ముజఫరాబాద్ రోడ్డు వరకు నడిచేలా 2005 ఏప్రిల్‌లో ప్రారంభించారు. పూంచ్-రావల్కోట్ మార్గంలో 2006 జూన్ 20న ప్రారంభించారు.