Samantha
-
ఒంటరి జీవితం చాలా కష్టం.. సమంత పోస్ట్ వైరల్
అనారోగ్యం కారణంగా సినిమాల సంఖ్య తగ్గించిన సమంత(Samantha).. ఇటీవల మళ్లీ పుంజుకుంది. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. అయితే షూటింగ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండలేదు. తన సినిమా అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆరోగ్య చిట్కాలు, ధైర్యాన్ని నింపే విషయాలను కూడా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ తన విహారయాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మూడు రోజుల పాటు ఫోన్‌కి దూరంగా ఉండి..ఒంటరి జీవితాన్ని గడిపానని చెబుతూనే ఎలాంటి అనుభూతి పొందిందో వివరించింది.(చదవండి: భారీ రెమ్యునరేషన్.. అమ్మకి ఖరీదైన గిఫ్ట్‌గా ఇచ్చిన మోనాలిసా!)‘మూడు రోజులు మౌనంగా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన పనుల్లో ఒకటి. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’ అని సమంత తన అభిమానులకు సూచించింది.సమంత సినిమాల విషయాలకొస్తే..అటు వెబ్ సిరీస్‌లతో పాటు ఇటు విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ఇటీవల అమెజైప్ ప్రైమ్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ఆదిత్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతుంది.నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్గా సిటాడెల్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్‌ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్‌కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్ ఉంది. నెట్‌ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. -
సమంత వెబ్ సిరీస్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruthprabhu) నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. బెస్ట్ వెబ్ సిరీస్‌గా అవార్ట్‌ను దక్కించుకుంది. ఈ సందర్భంగా హనీ బన్నీ డైరెక్టర్ డీకే సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెబ్‌సిరీస్ తీయడం వెనుక చాలా మంది కష్టముందని.. అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డేటింగ్ రూమర్స్..కాగా.. సమంత ఇటీవల పికిల్ బాల్ లీగ్‌లో మెరిసింది. చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఇద్దరూ కలిసి పికిల్ బాల్ కోర్టులో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. -
ఈ ప్రపంచంలో మీకు నచ్చినట్లు ఉండొచ్చు: సమంత పోస్ట్ వైరల్
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత సామ్ పేరు ఏదో ఒక సందర్భంలో బయటికి వినిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్‌తో డేటింగ్లో ఉందంటూ మరోసారి రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సమంత చేసిన తాజా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగచైతన్య సైతం తన పెళ్లి, విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో సమంత చేసిన క్రిప్టిక్ పోస్ట్‌పై నెట్టంట చర్చ మొదలైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం పదండి.సమంతా తన పోస్ట్‌లో ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కోటేషన్‌ను షేర్ చేసింది. అందులో.. 'ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏదీ స్థిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు.' అని ఆ కోట్లో రాసి ఉంది. ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. విడాకులపై స్పందించిన నాగచైతన్య..టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు.నా లైఫ్‌లో రియల్ హీరో ఆమెనే..నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు.కాగా.. సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర నిర్ణయంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏ మాయ చేసావే'లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఆ తర్వాత వివాహానికి ముందు పలు చిత్రాలలో నటించారు.ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. -
ప్రకృతిని ఆస్వాదిస్తోన్న దేవర భామ.. నేపాల్‌లో శ్రియా శరణ్ చిల్!
ప్రకృతి అందాలు ఆస్వాదిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్..రాయ్‌పూర్‌లో డాకు మహారాజ్ భామ ఊర్వశి రౌతేలా..సమంత బ్లాక్ అండ్ వైట్ లుక్స్..బ్లాక్ డ్రెస్‌లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..ఫ్యామిలీతో నేపాల్‌లో చిల్ అవుతోన్న శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
సమంత వెబ్ సిరీస్.. ప్రతిష్టాత్మక అవార్డుల్లో నిరాశ
సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను(Critics Choice Awards) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా పోటీపడ్డాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్‌ల జాబితాలో నామినేట్ అయిన హనీ బన్నీ అవార్డ్‌ను సాధించలేకపోయింది. ఈ కేటగిరీలో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్-2 అవార్డ్‌ను దక్కించుకుంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సీజన్-2 2024లో విడుదలైంది. అంతేకాకుండా ఈ సిరీస్ సీజన్-3 ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి రానుంది.అయితే బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన మూవీ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ఈ మూవీకి కూడా నిరాశే ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం అవార్డ్ సాధించలేకపోయింది. దీంతో మన దేశం నుంచి పోటీలో నిలిచిన చిత్రాలకు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే గతేడాది కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్‌ను పాయల్ కపాడియా చిత్రం దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుక శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో జరిగింది.క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేతలు వీరే..ఉత్తమ విదేశీ వెబ్ సిరీస్ : స్క్విడ్ గేమ్ 2ఉత్తమ చిత్రం : అనోరాఉత్తమ నటుడు: డెమి మూర్ఉత్తమ నటి : కియేరన్ కుల్కిన్ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కుల్కిన్ఉత్తమ సహాయనటి : జోయ్ సల్దానా -
'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సామ్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించండ లేదు. మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత అతనితో రిలేషన్లో ఉందంటూ కామెంట్స్ చేశారు. దీంతో నెట్టింట మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిలేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఉన్న సంబంధాలపై మాట్లాడింది. ఈ సందర్బంగా జీవితంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది సామ్. అందుకే ప్రస్తుతం రిలేషన్ గురించి ఆలోచించట్లేదని వెల్లడించింది. అంతే కాకుండా గతంలో రిలేషన్షిప్లో ఉన్న వారిపట్ల తనకేలాంటి అసూయ, కోపం ఉండవని తెలిపింది. ఎందుకంటే అసూయ అన్నీ చెడులకు కారణమని చెబుతోంది సమంత.కాగా.. గతంలో టాలీవుడ్ నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2017లో వివాహం చేసుకున్న చైతూ- సామ్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటున్నారు.నాగచైతన్య రెండో పెళ్లి..నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఇన్‌స్టాలో పికిల్ బాల్ టోర్నీ ఫోటోలు షేర్ చేసిన సామ్
-
ఆ డైరెక్టర్‌తో సమంత.. వైరల్‌గా మారిన ఫోటోలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. టాలీవుడ్లో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన కనిపించింది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు సామ్.అయితే మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్‌తో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. గతంలోనే చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్‌ను కొనుగోలు చేసిన సమంత తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లో సమంత సందడి చేసింది. తన టీమ్‌కు సపోర్ట్ చేస్తూ కనిపించింది.రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని..అయితే ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్లో మెరిసింది. ఇద్దరు జంటగా కనిపించి సందడి చేశారు. దీంతో మరోసారి వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. గతంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓకే వేదికపై జంటగా కనిపించడంతో డేటింగ్లో రూమర్స్ నిజమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు ఆమె షేర్ చేసిన ఫోటోల్లో దర్శకుడి చేతిని పట్టుకున్నట్లు సామ్ కనిపించింది. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. కాగా.. వీరిద్దరు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత, రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నీలో సన్నిహితంగా ఉండడం చూసిన ఫ్యాన్స్ సామ్ డేటింగ్లో మునిగి తేలుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. -
నిజాలు బయటకు రావాలి.. వారిని కఠినంగా శిక్షించాలి: సమంత
ర్యాగింగ్ భూతానికి ఓ కేరళ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్(15)(Mihir) అనే బాలుడు..తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత(Samantha) కూడా ఈ ఘటనపై స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈమేరకు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థం, ద్వేషం కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. వేధింపులు, ర్యాగింగ్ వంటికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మన దగ్గర ఎన్నో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. లోలోనే కుమిలి పోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా.నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’అని సమంత కోరింది. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి.. తన కుమారుడితో తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారని మిహిర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మిహిర్‌ను తోటి విద్యార్థులు కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని, అవన్నీ భరించలేకనే తన క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.మ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మిహిర్ తల్లి ఆరోపణలను సదరు స్కూల్ యాజమాన్యం ఖండించింది. -
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
రెండేళ్లుగా ఆ పద్ధతినే పాటిస్తున్నా.. అదే నా గేమ్ ఛేంజర్: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత చివరిసారిగా సిటాడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇందులో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో ఫుల్ బిజీగా ఉంది. గతంలో చాలాసార్లు ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.అయితే తాజాగా సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండేళ్లుగా తాను ఓ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నట్లు తెలిపింది. ఇది తన కష్టతరమైన క్షణాల నుంచి బయపడేసిందని వెల్లడించింది. అంతేకాదు ఇది చాలా సులభమైన, శక్తివంతమైందని సామ్ అంటోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నా. ఇది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలిగించింది. ఇది చాలా సులభమైంది.. అంతే కాదు శక్తివంతమైనది కూడా. ప్రస్తుత ఎక్కడ ఉన్నాను.. అలాగే మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీరు కాస్తా సాఫ్ట్‌గా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ అది నిజం కాదు.. ఇది మీకు సహాయపడుతుందని నిరూపించడానికి తన వద్ద తగినంత సమాచారం ఉంది' రాసుకొచ్చింది.సామ్ తన పోస్ట్‌లో.. 'రైటింగ్ అనేది మీకు సహజంగా వచ్చినట్లయితే.. ఈ రోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయండి. అవి పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నిజాయితీగా ఉండాలి. కానీ రాయడం కష్టంగా, బలవంతంగా అనిపిస్తే మీరు బాగా విశ్వసించే వారితో షేర్ చేయండి. అంతే కాదు ఏమీ చేయకపోయినా కొన్నిసార్లు సైలెంట్‌గా కూర్చున్నా చాలు. ఈ చిన్న అభ్యాసం మొదట చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ప్రతిదీ మీరు చూసే విధానాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది.' రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన అబ్బాయి.. ఎవరంటే?
సినిమా తారలకు డబ్బింగ్ చెబుతారని మనకు తెలిసిందే. సాధారణంగా మగవారికి మేల్ వాయిస్ ఆడవారికి ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. కానీ, అమ్మాయిలకు అబ్బాయి డబ్బింగ్ చెబితే..! ఆశ్చర్యమనిపించక మానదు...ఎంబీబీఎస్ చేసిన ఆద్య హనుమంత్ ఇప్పటి వరకు సమంత (Samantha), సాయిపల్లవి, అవికాగోర్.. ఇలా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటి వరకు 175 సినిమాలలకు డబ్బింగ్ చెప్పిన ఆద్య హనుమంత్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ వాసి. కర్ణాటకలోని రాయచూరులో ఉంటున్న ఆద్య హనుమంత్‌కి ఇలాంటి క్రేజీ వాయిస్ ఎలా అబ్బిందో, సినిమాలకు స్పెషల్ వాయిస్ ఆర్టిస్ట్ (Voice Artist)గా ఎలా మారారో అతని మాటల్లోనే తెలుసుకుందాం..నా వయసు ఇప్పుడు 22 ఏళ్లు. పదమూడేళ్ల వయసు నుంచి డబ్బింగ్ చెబుతున్నాను. స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నా వాయిస్ బాగుంటుందని సీరియల్స్‌లోని చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పించేవారు. తర్వాత్తర్వాత హీరోయిన్లకు నా వాయిస్ కనెక్ట్ అయ్యింది.నాలుగు భాషల్లో...సాధారణంగా ఇతర భాషల్లోని డబ్బింగ్ ఆర్టిస్టులు మన దగ్గర ఫేమస్‌గా ఉంటారు. నేను మాత్రం తెలంగాణ నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సమంత, సాయిపల్లవి, ఐశ్వర్య, అవికా... ఇలా ప్రముఖ హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పాను.ఒక పూట తిండి అయినా మానేస్తా!నా గొంతు అమ్మాయిల మాదిరి ఉంటుందని, మరింత స్పెషల్‌గా ఉంటుందని అంతా అంటుంటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అదంతా దేవుడి దయ. ఇష్టమైన పని కావడంతో డబ్బింగ్, చదువు రెండింటినీ ప్రేమిస్తాను. కష్టంగా ఉన్నా ఒక పూట తిండి అయినా మానేస్తాను. కానీ, చదువుతోపాటు డబ్బింగ్ కూడా నాకు ప్రాణమే. ఎప్పుడు ఈ గొంతు మారబోతుందో చెప్పలేను. కానీ, ప్రేక్షకులు ఎంత కాలం కోరుకుంటే అంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతాను. ప్రత్యేకించి ప్రాక్టీస్ ఏమీ ఉండదు. డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం పలికిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుంది.వెక్కిరించారు... ‘ఆడపిల్లలా ఆ గొంతేంటి?’ అని వేళాకోలం అడినవారు ఉన్నారు. మొహమ్మీదనే చులకనగా మాట్లాడిన వారూ ఉన్నారు. కానీ, మా అమ్మ ఒకసారి చెప్పింది. ‘దేవుడు, నీకు మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకిచ్చాడో గమనించు. మనం చేయాలనుకున్న పని సాధారణంగా ఉండకూడదు. ఎంత రిస్క్ అయినా ఒక్క అడుగు ముందుకే వేసి చూడు’ అని చెప్పేది. ఆ మాటలు నాకు ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తున్నాయి. చాలా మంది తమ సమస్యలను నాతో చెప్పుకోవడానికి ఇష్టపడుతుండేవారు. దీంతో ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు సైకియాట్రీ ఎంచుకోవాలనుకున్నాను. సైకియాట్రీలో పీజీ చేస్తున్నాను. మెడికల్, సినీ ఫీల్డ్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణించాలనుకుంటున్నాను. శని, ఆదివారాలు డబ్బింగ్‌కి ఎంచుకుంటున్నాను. మిగతా రోజుల్లో చదువు, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తాను. యూనివర్శిటీ ప్రొఫెసర్లు నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు.వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా... సోషల్ మీడియా అనగానే అప్‌కమింగ్ స్టార్స్ అందరూ అక్కడే ఉంటారు. దీంతో నేనూ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటూ వచ్చాను. ‘ఇట్లు మీ సీతా మహాలక్ష్మి’ అనే పేజీ ప్రారంభించాను. సోషల్‌మీడియా ద్వారా ఎంతో మంది నాకు స్నేహితులయ్యారు. తెలుగు నుంచి తమిళ్, కన్నడ నుంచి తెలుగు ప్రముఖుల కవిత్వాలను అనువాదం చేస్తుంటాను. సోషల్ మీడియా ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరంలోని ఓ కుటుంబానికి నాకు స్నేహం కుదిరింది. దీంతో సంక్రాంతి పండగకు సీతానగరం వచ్చేశాను. గోదావరి అందం, వారి పలకరింపులు, ఆప్యాయత, పిండివంటలు ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికీ వాయిస్ ఇలాగే ఉంటుంది అని చెప్పలేను. ఇప్పటికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కర్నాటకలో ఉన్నా నాకు మాత్రం తెలుగు ఇండస్ట్రీనే బాగా సపోర్ట్ చేసింది. మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెబుతాడు ఈ ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్.– నిర్మలారెడ్డి View this post on Instagram A post shared by dr. adhyaa (@adhyaahanumanthuofficial) View this post on Instagram A post shared by dr. adhyaa (@adhyaahanumanthuofficial)చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య -
చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!
కాస్త ఆరోగ్యం బాగోలేకపోతే చాలు చాలామంది ముసుగు తన్నిపడుకుంటారు. కానీ సమంత మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పక్కన పెట్టలేదు. చికెన్ గున్యాతో సతమతమవుతున్న ఆమె ఒళ్లు నొప్పులున్నా సరే జిమ్‌లో చెమటలు చిందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చికెన్‌గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోంది.చికెన్ గున్యాతో బాధపడుతున్న సామ్శరీరం సహకరించకపోయినా తను పట్టుదలతో వ్యాయామం చేస్తుండటం చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత (Samantha) చివరగా సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ షూటింగ్లో ఓ రోజు సామ్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సడన్‌గా స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లలేదుకళ్లు తెరిచేసరికి నాకు ఎవరి పేర్లూ గుర్తు రావడం లేదు. కొద్ది క్షణాలపాటు బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనిపిస్తోంది. ఏ ఒక్కరూ హాస్పిటల్‌కు వెళ్దామనలేదు అని చెప్పుకొచ్చింది. కాగా సమంత కొన్నేళ్లుగా మయోసైటిస్‌తో బాధపడుతోంది. తను ఈ వ్యాధి బారిన పడిన విషయాన్ని 2022లో వెల్లడించింది. అది కూడా నిర్మాతల బలవంతం వల్లే చెప్పింది. (చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)బలవంతం వల్లే..2022లో శాకుంతలం సినిమా రిలీజైంది. ఆ సమయంలో సమంత ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మయోసైటిస్ తనను శారీరకంగా కుంగదీసింది. మరోవైపు సినిమా ప్రమోషన్స్ చేయాలి. నీకున్న బాధ బయటపెడితే తప్పేంటని నిర్మాతలు ఒత్తిడి తేవడంతో సామ్ మయోసైటిస్‌తో సతమతమవుతున్న విషయాన్ని బయటకు చెప్పింది. వారి ఒత్తిడి వల్లే నాకు మయోసైటిస్ ఉందని అందరికీ చెప్పానని, లేదంటే నిశ్శబ్ధంగానే ఆ వ్యాధితో పోరాటం చేసేదాన్ని అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సినిమాఏ మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమంత. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో సెన్సేషన్ హీరోయిన్గా మారింది. బృందావనం, ఎటో వెళ్లిపోయింది మనసు, జబర్దస్త్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, మనం, అల్లుడు శీను, రభస, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, జనతా గ్యారేజ్, బ్రహ్మోత్సవం, రంగస్థలం, ఓ బేబీ, మజిలి, యశో, శాకుంతలం, ఖుషి.. ఇలా ఎన్నో చిత్రాలతో మెప్పించింది. పుష్ప:ద రైజ్ మూవీలో ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా అనే ఐటం సాంగ్‌తో పాన్ ఇండియాను ఊపేసింది.సిటాడెల్ సిరీస్ఓటీటీలో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో అలరించిన ఆమె చివరగా సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించింది. సిటాడెల్ సిరీస్ విషయానికి వస్తే.. ఇందులో సమంత ఏజెంట్‌గా నటించింది. సీతా ఆర్ మీనన్ కథ అందించగా రాజ్ అండ్ డీకే (Raj Nidimoru and Krishna DK) డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్ 7న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్, కేకే మీనన్, సాఖిబ్ సలీమ్, సికిందర్ ఖేర్ ప్రముఖ పాత్రలు పోషించారు. "Recovering from Chikungunya is so fun 😌 😌 😌 The joint pains and ALL"~Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#CitadelHoneyBunny #RaktBramhand#MaaIntiBangaram pic.twitter.com/m94S1yMV8R— Samcults (@Samcults) January 10, 2025 చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు -
సమంత సందేశం ధైర్యాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్
స్టార్ హీరోయిన్ సమంతకు ‘మహానటి’ కీర్తి సురేశ్ థాంక్స్ చెప్పింది. ఆమె వల్లే తనకు ‘బేబీ జాన్’ అవకాశం వచ్చిందని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సినిమాలో నటించానని చెప్పింది. కీర్తి సురేశ్ నటించిన తొలి హిందీ సినిమా ‘బేబీ జాన్’.వరుణ్ ధావన్ హీరోగా కాలీస్ దర్శకత్వంలో అట్లీ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. తమిళ మూవీ ‘తెరి’ని హిందీలో రీమేక్ చేయాలని భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళ్లో ఆమె పోషించిన పాత్రను నేను హిందీలో చేయడం ఆనందంగా ఉంది. సామ్ వల్లే నాకు హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘తెరి’లో సమంత నటన నాకెంతో ఇష్టం. ఆ పాత్రలో నేను నటించాలని చెప్పగానే భయపడ్డాను. కానీ సమంత నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మేకర్స్ నా పేరు వెల్లడించగానే.. ‘నువ్వు తప్ప ఈ పాత్రలో మరెవ్వరు చేయలేరు’ అని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాకు చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచింది. సమంత స్ఫూర్తితోనే ధైర్యంగా షూటింగ్ పూర్తి చేశాను. ఈ మూవీలో నటించనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. కాగా, గతంలో కీర్తి, సమంత కలిసి ‘మహానటి’లో నటించారు. -
బేబీ బంప్‌తో సమంత.. వైరల్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్
టెక్నాలజీ సాయంతో తిమ్మిని బమ్మి చేయొచ్చు.. బమ్మిని తిమ్మి చేయొచ్చు. లేనివారు ఉన్నట్లు, ఆడుతున్నట్లు, పాడుతున్నట్లు.. ఇలా ఏదైనా చేసేయొచ్చు. కానీ కొన్ని సార్లు టెక్నాలజీ దుర్వినియోగం మితిమీరిపోతోంది. ఆ మధ్య డీప్ ఫేక్ ఉపయోగించి రష్మిక వీడియో సృష్టించారు. ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సమంత (Samantha) బేబీ బంప్ ఫోటోలు తయారు చేశారు. పిచ్చిపనులువీటిని సోషల్ మీడియాలో వదలగా విపరీతంగా వైరలవుతున్నాయి. ఇలాంటివి చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పనులకు సెలబ్రిటీలను వాడేసుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అని పుకారు సృష్టించడం నీచమని కామెంట్లు చేస్తున్నారు.అంతా కోరుకునేది..ఇకపోతే సమంత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కొన్నిసార్లు పరిగెత్తడం మానేసి కూర్చుంటే బాగుంటుంది. కాసేపైనా ఆ హడావుడిని పక్కన పెట్టేయాలి. ఈ బిజీ ప్రపంచంలో మనమంతా కోరుకునేది ఒక సామాన్య జీవితం. అసలు ఏం చేయాలన్న ప్రణాళిక లేకపోవడం కూడా ఒక ప్లానేమో! అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రశాంతంగా..అందులో తన పూజగదిని, ప్రకృతిని చూపించడమే కాకుండా మంచంపై హాయిగా, ప్రశాంతంగా నిద్రిస్తున్న ఫోటోలను సైతం పంచుకుంది. కాగా గతేడాది శాకుంతలం, ఖుషి (Kushi Movie) చిత్రాలతో పలకరించిన సమంత ఈ ఏడాది 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో అలరించింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: సల్మాన్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా -
ఈ ఏడాది ఒక్క సినిమా చేయని హీరోయిన్లు వీళ్లే (ఫొటోలు)
-
ప్రభాస్ నంబర్ వన్ ... సమంత హ్యాట్రిక్
రికార్డ్ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీలపై సర్వే నిర్వహించి, టాప్ ΄పోజిషన్లోని వారి జాబితాలను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా నవంబరు నెలకుగాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించగా హీరో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సమంత తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు... కథానాయికల జాబితాలో సమంత వరుసగా మూడో సారి (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.ప్రభాస్ వరుసగా రెండో సారి (అక్టోబర్, నవంబర్) నిలిచారు. ఇక నవంబర్ నెలకు ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ తర్వాతి స్థానంలో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్‌బాబు, సూర్య, రామ్‌చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే... సమంత తొలి స్థానంలో నిలిచారు. వరుసగా మూడు నెలలపాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచి, హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించారు సమంత. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ జాబితాలో సమంత తర్వాతి ప్లేస్‌లలో ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకోన్, త్రిష, కాజల్ అగర్వాల్, రష్మికా మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. -
Recap 2024: ఈ ఏడాది ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది సామెత. చిత్ర పరిశ్రమలో నటీనటులకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి అటు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు కూడా పెంచుకోవాలి. అయితే పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. వారు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోయిన్ల జాబితా డజనుకుపైగానే ఉంది. నయనతార, సమంత, అనుష్క, తమన్నా, త్రిష, సాయి పల్లవి, కీర్తీ సురేష్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్, మెహరీన్... వంటి పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. ఆ వివరాల్లోకి... 202రెండు సినిమాలతో జేజెమ్మతెలుగు చిత్ర పరిశ్రమలో జేజమ్మగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు అనుష్క. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన అనుష్క నాలుగేళ్లుగా కాస్త నెమ్మదించారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత మూడేళ్ల అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆమె. అయితే 2024ని మాత్రం పూర్తిగా మిస్ అయ్యారు అనుష్క. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో ఆమె కమిటైన చిత్రం ‘ఘాటీ’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లోని ‘ఘాటీ’ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ సినిమా నుంచి విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూ΄÷ందుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమా ద్వారా మలయాళ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు అనుష్క. ‘ఘాటీ’, ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో 2025లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు అనుష్క. వచ్చే ఏడాదైనా... సౌత్‌లోని స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంతది ప్రత్యేక స్థానం. అందం, అభినయంతో దక్షిణాదిలోనే కాదు... ఉత్తరాదిలోనూ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఆ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె ఈ మధ్య స్లో అయ్యారు. 2023లో ‘శాకుంతలం, ఖుషి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ 2024లో మాత్రం వెండితెరపై కనిపించలేదు. అయితే ‘సిటాడెల్ హనీ–బన్నీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా వెబ్ ప్రేక్షకులను మాత్రం అలరించారామె. విజయ్ దేవరకొండకి జోడీగా సమంత నటించిన ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కమిటైన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రకటించారు సమంత. అంతేకాదు... తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మెడలో నల్లపూసలు, చీర కట్టు, పెద్ద బొట్టుతో ఉన్న సమంత లుక్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో గన్, ముఖం మీద రక్తపు మరకలు, ఆమె వెనకాల టెడ్డీ బేర్, స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్... ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో మరొక కోణం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించలేదు. మరి 2025లో అయినా సమంత వెండితెర ప్రేక్షకులను అలరిస్తారా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నారు సమంత. డాక్యుమెంటరీతో మాత్రమే... దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనగానే నయనతార పేరును టక్కున చెబుతారు ఆమె అభిమానులు. ఓ వైపు హీరోలకి జోడీగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఐదు తమిళ, రెండు మలయాళ, ఒకటి కన్నడ చిత్రం ఉంది. కాగా చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ (2022) సినిమాలో చిరంజీవి సోదరిగా నటించారు నయనతార. ఆ చిత్రం విడుదలై రెండేళ్లు దాటినా మరో తెలుగు సినిమా కమిట్ కాలేదామె. ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్లనో లేకుంటే సరైన కథ కుదరకనో ఆమె తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపలేదు. ఆ విధంగా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా దూసుకెళుతున్న నయనతార కూడా 2024లో ప్రేక్షకులను పలకరించలేక΄ోయారు. ఆమె నటించిన ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాక΄ోవడంతో ఆమె ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. అయితే 2025లో మాత్రం దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... ఓటీటీలో ప్రసారమవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీతో ఈ ఏడాది నయనతార కనిపించడం ఆమె అభిమానులకు ఓ చిన్న ఊరట. ప్రత్యేక పాటతో... చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం త్రిషది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి, తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారామె. అందం, అభినయంలో ఇప్పటికీ నేటి తరం యువ హీరోయిన్లకు గట్టి ΄ోటీ ఇస్తున్నారు త్రిష. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా దూసుకెళుతున్న ఆమె నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. అయితే విజయ్ హీరోగా రూ΄÷ందిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్) సినిమాలో మాత్రం ఓ ప్రత్యేక ΄ాటలో నటించారు త్రిష. అలాగే ‘బృంద’ అనే ఓ వెబ్ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారామె. అవి మినహా 2024లో పూర్తి స్థాయిలో ఆమె ప్రేక్షకులను అలరించలేదు. అయితే వచ్చే ఏడాది పలు చిత్రాలతో తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళ సినిమాలతో ΄ాటు తెలుగులో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ కావడం విశేషం. ఇదిలా ఉంటే... 2025లో త్రిష నటించిన ఐదారు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని స్పష్టం అవుతోంది. 2023లో మూడు... ఈ ఏడాది నో నటి, గాయని, మ్యూజిక్ కం΄ోజర్... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు శ్రుతీహాసన్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా దూసుకెళుతున్నారామె. 2023లో తెలుగులో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య (చిరంజీవి), వీరసింహారెడ్డి (బాలకృష్ణ), సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్ (ప్రభాస్) ’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలతో గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ 2024లో మాత్రం తన అభిమానులను నిరాశపరిచారు. ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు శ్రుతీహాసన్. అలాగే ‘చెన్నై స్టోరీ’లోనూ నటిస్తున్నారామె. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.వచ్చే ఏడాది స్ట్రయిట్ సినిమాతో... 2021లో ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ‘విరాట పర్వం’ చిత్రాలతో తెలుగు తెరపై కనిపించారు సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకోలేదు. 2022లో ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్గీ’ తెలుగులోనూ విడుదలైంది. ఇక తమిళ చిత్రం ‘అమరన్’ తెలుగులోనూ విడుదల కావడంతో ఈ ఏడాది ఆ విధంగా తెలుగు ప్రేక్షకులను పలకరించారీ బ్యూటీ. సాయి పల్లవి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘తండేల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సో... 2025లో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో కనిపిస్తారామె. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. వచ్చే ఏడాది నాలుగు చిత్రాలతో... తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గోపికమ్మా, బుట్ట బొమ్మగా స్థానం సం΄ాదించుకున్నారు పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. పదేళ్ల కెరీర్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, అఖిల్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి హీరోలకి జోడీగా నటించారు పూజా హెగ్డే. ‘ఆచార్య’ (2022) సినిమాలో రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ బ్యూటీ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ‘ఎఫ్ 3’ చిత్రంలో ఓ ΄ాటలో నర్తించారు. 2023లో ఆమె నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ రిలీజైంది. అయితే ఈ ఏడాది మాత్రం పూజ నటించిన ఏ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మాత్రం రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ చిత్రాలున్నాయి. 2024 గ్యాప్‌ని 2025లో భర్తీ చేయనున్నారు పూజ. వచ్చే ఏడాది నాలుగు చిత్రాల్లో పూజా హెగ్డే కనిపించే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... తమన్నా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, నిధీ అగర్వాల్, మెహరీన్ వంటి తారలు నటించిన ఏ భాషా చిత్రం కూడా 2024లో విడుదల కాలేదు. కీర్తీ సురేష్, రాశీ ఖన్నా, ప్రియమణి వంటి వారు 2024లో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. కానీ, ఇతర భాషల ప్రేక్షకులను అలరించారు.– డేరంగుల జగన్ -
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
-
2024లో ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన సినిమా స్టార్స్
-
' ఆ విషయం నాకు మాత్రమే తెలుసు'.. శోభిత పెళ్లిని తలచుకుని సమంత ఎమోషనల్!
ఈనెల 4వ తేదీన టాలీవుడ్ హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహావేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు విక్టరీ వెంకటేశ్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఈ పెళ్లి వేడుకలో శోభిత సిస్టర్ డాక్టర్ సమంత కూడా సందడి చేశారు. అక్క పెళ్లి దిగిన ఫోటోలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్.. అక్కా.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా.. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో.. అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు.. అత్యంత గౌరవప్రదమైన జంట అక్క- చైతూ అని నాకు తెలుసు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)కాగా.. శోభిత సిస్టర్ డాక్టర్ సమంత వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె 2022లోనే పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) -
రానా కోసం సమంత పోస్ట్.. సోషల్‌మీడియాలో వైరల్
రానా దగ్గుబాటి, సమంత ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో పాటు స్నేహం కూడా ఉంది. వారిద్దరూ కలిసి పలుమార్లు టాక్ షోలలో సరదాగా మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, తాజాగా సమంత షోషల్‌మీడియాలో రానా కోసం ప్రత్యేకంగా విషెష్ తెలిపింది.రానా కోసం బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ సమంత ఇలా తెలిపింది. ' హ్యాపీ బర్త్‌డే రానా. నీవు చేసే ప్రతి పనిలోను 100శాతం ఎఫర్ట్ పెట్టి శ్రమిస్తావు. నేను కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నీ మాదిరే నేను కూడా ప్రతి పనిని ఇంకా బాగా చేయాలి అనే కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని ఆమె తెలిపింది.సమయం కుదిరినప్పుడల్లా సమంతతో తాను మాట్లాడుతుంటానని రానా గతంలోనే చెప్పారు. సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె అనారోగ్య సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు. వీరిద్దరూ ‘బెంగళూరు డేస్’ తమిళం రీమేక్ కోసం కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రీసెంట్గా జిగ్రా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో కూడా సమంత మాట్లాడుతూ.. రానా తనకు అన్న లాంటి వ్యక్తి అని సామ్ చెప్పింది. ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో రానా కూడా సమంత మై సిస్టర్ అని పిలిచాడు. -
Sam: ఇంతకీ సమంత మనసు దోచిన వ్యక్తి ఎవరు
-
2025లో ప్రేమించే భాగస్వామి, సంతానం కూడా! సామ్ పోస్ట్ వైరల్
కాలం పరుగులు పెడుతూనే ఉంది. 2024 మొన్నే ప్రారంభమైందనుకులోపే ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లోనే 2025 ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఏడాది తన రాశికి ఎలా ఉంటుందో చెబుతూ సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. వృషభం, కన్య, మకరం.. ఇలా మూడు రాశులవారి గురించి రాసుంది.రాశిఫలాలుఅందులో ఏమని ఉందంటే.. ఏడాదంతా బిజీగా ఉంటారు. మీ వృత్తి జీవితంలో ఎదుగుల చూస్తారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ప్రేమ, విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు. ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలు పొందుతారు. శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసుంది.కొత్త లైఫ్?ఇందులో చాలావరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి. మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి! కాగా సామ్‌తో విడిపోయిన నాగచైతన్య ఇటీవలే శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సామ్ కూడా గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: Bigg Boss 8 : గౌతమ్ హిస్టరీ క్రియేట్ చేసేనా? -
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
స్కూల్ ఫంక్షన్ లో పిల్లలతో సరదాగా హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
'ఆ ప్రేమను మించింది మరొకటి లేదు'.. సమంత మరో పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సామ్ ఇటీవల మరోసారి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.కానీ అంతలోనే సమంత చేసిన మరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'షాషా(పెట్ డాగ్) ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అది కాస్తా వైరల్ కావడంతో నెట్టంట చర్చ మొదలైంది. ఏదేమైనప్పటికీ సామ్‌కు మాత్రం తన పెట్ డాగ్ ప్రేమ కంటే ఈ లోకంలో మరేదీ లేదని చెబుతోంది.గతంలోనూ ప్రేమపై పోస్ట్గతంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. "చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు." అంటూ పోస్ట్ చేసింది. -
మోస్ట్ పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత
-
సమంత మా ఇంటిమనిషి, రూ. 25 లక్షలిచ్చా: బెల్లంకొండ సురేశ్
హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురైనప్పుడు రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశానంటున్నాడు నిర్మాత బెల్లంకొండ సురేశ్. తాను చేసిన సాయాన్ని సామ్ ఎప్పటికీ మర్చిపోలేదని చెప్తున్నాడు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సురేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమంత మా ఇంటిమనిషిలాగే! మాతో మూడు సినిమాలు చేసినప్పుడు మా ఇంటి నుంచే క్యారేజీ వెళ్లేది. ఎవరూ సాయం చేయలేదుఅప్పట్లో తనకు చర్మ వ్యాధి సోకింది. అప్పుడు నేనే సాయం చేశాను. బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి తనకు సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అక్కడే ఉంచాను. ట్రీట్మెంట్ కోసం డబ్బు కావాలని పలువురు నిర్మాతలకు ఫోన్ చేసింది.. కానీ ఎవరూ స్పందించలేదు.నాలుగు నెలల్లో కోలుకుందిదాంతో నేనే చికిత్స కోసం రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేశాను. మూడు, నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకున్నాక తన ఆరోగ్యం కుదుటపడింది. నేను చేసిన సాయం సమంత మనసులో బలంగా ఉండిపోయింది' అని పేర్కొన్నాడు. కాగా బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన అల్లుడు శ్రీను మూవీలో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే! ఇకపోతే సమంత రెండేళ్లుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. -
సమంతను దాటేసిన శోభిత ధూళిపాళ్ల.. టాప్ ర్యాంక్‌లో ఎవరంటే?
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాది సినీతారల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2024లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఊహించని విధంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా తర్వాత వరుసగా బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా -3 సినిమాల్లో నటించింది. దీంతో దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్‌ను అధిగమించింది.ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, సమంత, శోభిత ధూళిపాళ్ల మాత్రమే చోటు దక్కించుకున్నారు. శోభిత టాప్-5లో నిలవగా.. సమంత 8, ప్రభాస్ పదోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కల్కి మూవీతో అలరించిన దీపికా పదుకొణె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్ ప్లేస్ దక్కడం పట్ల త్రిప్తిడ డిమ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమని.. నా అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.కాగా.. ఏడాది నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్లో నటించిన ఇషాన్ ఖట్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ్ల ఐదోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మంకీ మ్యాన్ మూవీతో శోభిత అలరించారు. ఆ తర్వాత వరుసగా శార్వరి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సమంత, అలియా భట్, ప్రభాస్ నిలిచారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్- ఐఎండీబీ -2024ట్రిప్తి డిమ్రీదీపికా పదుకొణెఇషాన్ ఖట్టర్షారుఖ్ ఖాన్శోభితా ధూళిపాళ్లశార్వరిఐశ్వర్యరాయ్ బచ్చన్సమంతఅలియా భట్ప్రభాస్ -
నాగచైతన్య- శోభిత పెళ్లి.. వైరల్‌గా మారిన సమంత పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో అక్కినేని వారి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నాగచైతన్య-శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టడంతో అందరిదృష్టి చైతూ మాజీ భార్య సమంతపై పడింది. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. కొత్త జంటకు విషెస్ చెబుతుందా? మరేదైనా ఉంటుందా? చాలామంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సామ్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఓ రెజ్లింగ్ పోటీలో బాలిక, బాలుడు తలపడుతున్న వీడియోను పంచుకుంది. ఇందులో బాలుడిని ఒక్క పట్టుతో కిందపడేస్తుంది.. అంటే బాలిక పట్టుదల ముందు బాలుడి తలవంచాల్సిందే అన్న అర్థం వచ్చే విధంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ నాగచైతన్య- శోభిత పెళ్లి రోజే చేయడంతో మరింత ఆసక్తిగా మారింది. -
సమంత ఇంట్లో తీవ్ర విషాదం
-
కుటుంబంలో విషాదం..బాధలో హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కొంత సమయం క్రితం కన్నుమూశారు. సోషల్‌మీడియా ద్వారా సమంత ఈ విషయాన్నితెలిపారు. మళ్లీ మిమ్మల్ని కలిసేంత వరకు.. సెలవు నాన్న అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అయితే, ఆయన మరణానికి సంబంధించిన వివరాలు ఆమె వెళ్లడించలేదు. కానీ, అనారోగ్య సమస్యల వల్ల చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జోసెఫ్ మరణించారని తెలుస్తోంది.తన తండ్రి గురించి సమంతో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. 'నా చిన్నతనంలో గుర్తింపు కోసం చాలా పోరాటం చేసేదాన్ని. అయితే, నేను ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి ఎక్కువగా అనుకునేవారు. నా కాలేజీ రోజుల్లో కూడా నన్నొక చిన్నపిల్లలా ఆయన చూసేవారు. ఈ విషయంలో మా నాన్న మాత్రమే కాదు.. చాలా మంది భారతీయ తల్లిదండ్రుల తీరు ఒకేలా ఉంటుంది. తమ పిల్లలను అలాగే చూస్తారు. అయితే, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి.'సమంత తండ్రి ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. తెలుగు ఆంగ్లో-ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు మలయాళి కుటుంబానికి చెందిన నినెట్ ప్రభును వివాహం చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత ఆర్థికంగా తన తండ్రికి చాలా సపోర్ట్‌గా ఉండేదని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తనకు చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ కుటుంబ స్థోమతను గ్రహించిన ఆమె పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అయితే, మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా వెళుతుంటే మొదట్లో కొందరు కుటుంబ సభ్యులు నెగెటివ్‌గా ప్రచారం చేసినా తన తల్లిదండ్రులు సపోర్ట్ చేశారని ఆమె చాలాసార్లు గుర్తు చేసుకున్నారు. తాను ప్రస్తుతం ఇంతటి స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం తండ్రే అంటూ సమంత పలుమార్లు గుర్తుచేసుకున్న విషయం తెలిసిందే. -
పబ్‌లో వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్న సమంత (ఫొటోలు)
-
సెకండ్ హ్యాండ్ అంటున్నారు.. బాధపడుతున్న సమంత..
-
సెకండ్ హ్యాండ్.. అమ్మాయిలకే అలాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఏళ్లు గడుతుస్తున్నా..ఇప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తున్నే ఉన్నాయి. అయితే అటు చైతూ కానీ ఇటు సామ్ కానీ వాటిని పెద్దగా పటించుకోకుండా తమ పనిలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఇక సమంత ఇటీవల విడుదలైన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి సరదా చిట్ చాట్ నిర్వహించింది. అందులో తన మాజీ భర్త నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఖరీదైన బహుమతులు ఇచ్చాసమంతతో వరుణ్ ధావన్ ‘స్పైసీ రాపిడ్ ఫైర్’ నిర్వహించాడు. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేకపోతే పచ్చిమిర్చి తినాలి. ఈ క్రమంలో వరుణ్ అడుగుతూ.. ‘నీ జీవితంలో అవసరం లేకపోయినా అత్యధిక డబ్బులు దేని కోసం ఖర్చు చేశారు?’ అని అడిగాడు.వరుణ్ ప్రశ్నకు సమంత సమాధానం చెబుబూత.. ‘నా మాజీ కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశాను’ అని చెప్పింది. ‘వాటి ధర ఎంత ఉంటుంది?’అని వరుణ్ అడగ్గా.. ‘కాస్త ఎక్కువే..ఇక విషయం మాట్లాడదామా’ అంటూ ఆ టాపిక్కు అక్కడితో చెక్ పెట్టింది. సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్యలు 2017లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. అమ్మాయిలకే ఎందుకలా?ఇక మరో ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ‘ ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారన్నారు. విడాకుల తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగులను తలిగిస్తుంది. ‘సెకండ్ హ్యాండ్,యూజ్డ్’ అనే ట్యాగ్స్‌ని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు యాడ్ చేస్తారో అర్థం కాదు. కష్టాల్లో ఉన్న అమ్మాయికి ఇలాంటి మాటలు మరింత బాధను కలిగిస్తాయి. నా విడాకుల విషయంలో కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవన్నీ అబద్దాలే కాబట్టి నేను స్పందించలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుతో పాటు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు’ అని చెప్పారు. -
కిస్సిక్ సాంగ్‌పై సమంత రివ్యూ
ఊ అంటావా మామ.. కిస్సిక్ అంటావా మావా.. సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ! పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఐటం సాంగ్ ఏ రేంజ్లో హిట్టయిందో తెలిసిందే! ఆమె అందం, స్టెప్పులు చూసి యూత్ ఫిదా అయ్యారు. ఏ ఫంక్షన్లో అయినా ఆ పాట మార్మోగుతూనే ఉంది. అప్పుడు సమంత.. ఇప్పుడు శ్రీలీలఇక పుష్ప 2లో కూడా ఐటం సాంగ్ ఉందని, కాకపోతే ఈసారి సమంతకు బదులుగా శ్రీలీల రంగంలోకి దిగిందని ప్రచారం మొదలైనప్పటినుంచి అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. అసలే యంగ్ సెన్సేషన్, అందులోనూ డ్యాన్సింగ్ క్వీన్.. ఇంకేముంది.. బన్నీ ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు శ్రీలీల కరెక్ట్ మ్యాచ్ అనుకున్నారంతా! కిస్సిక్ పాట రిలీజ్ కాగానే ఎగబడి చూశారు. కిస్సిక్ అదిరిందన్న సామ్ఈ క్రమంలోనే పలువురూ పుష్ప 1 ఐటం సాంగే బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఫుల్ వీడియో వస్తే కానీ శ్రీలీల పర్ఫామెన్స్‌కు ఇప్పుడప్పుడే మార్కులు ఇవ్వలేమంటున్నారు. ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్ వీక్షించిన సామ్ సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చింది. శ్రీలీల చంపేసిందంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేసింది. పుష్ప 2 ఆగమనం కోసం ఎదురుచూడండి అని రాసుకొచ్చింది. ఇకపోతే అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
వృథా ఖర్చు.. చైతూపై సమంత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ పలు సందర్భాల్లో నాగచైతన్య ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరోవైపు నాగచైతన్య కూడా మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. డిసెంబరు తొలివారం పెళ్లి జరగనుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సమంత చేసిన ఓ కామెంట్స్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. 'మయోసైటిస్' వ్యాధి బారిన తను పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అలా కొన్నాళ్లపాటు చికిత్స తీసుకోవడంతో సరిపోయింది. దీంతో సినిమాలు పెద్దగా చేయలేదు. తెలుగులో చివరగా 'ఖుషి' చేసింది. ఇది వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈమె చాన్నాళ్ల క్రితం చేసిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'.. ఈ నెల ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపించాయి.ఆ సిరీస్ గురించి అందరూ చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు మరోసారి ప్రమోషన్లో భాగంగా వరుణ్ ధావన్-సమంత ర్యాపిడ్ ఫైర్ ఆడిన ఓ వీడియోని అమెజాన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ గురించి పరోక్షంగా సామ్ మాట్లాడింది. 'దేనికోసమైనా ఖర్చు చేసిన డబ్బు పనికిరాకుండా పోయిందా?' అని వరుణ్ ధావన్ అడగ్గా.. 'నా ఎక్స్ (మాజీ భర్త) ఖరీదైన గిఫ్ట్స్ కోసం' అని సమంత సమాధానమిచ్చింది. సరిగ్గా చైతూ రెండో పెళ్లికి కొన్నిరోజుల ముందు సామ్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభుత్వ ఉద్యోగం)When spies get spy-cy, it's very rapid, very fiery!🔥#CitadelHoneyBunnyOnPrime, watch now! pic.twitter.com/dNXZx5D55g— prime video IN (@PrimeVideoIN) November 23, 2024 -
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్ ట్రైనర్స్. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్‌గా పేరొందిన కొందరి పరిచయం.. నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్‌గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్దీప్ సేథ్.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన జిమ్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్ చరణ్ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.సమంత..సత్తా.. అఖిల్‌కూ ఆయనే.. నటి సమంత తన ‘నాగిన్ మొబిలిటీ డ్యాన్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు వర్కవుట్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. అతని గురువు ముస్తఫా అహ్మద్‌ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన జునైద్, స్పెషల్ వర్కవుట్ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్లలో అఖిల్ అక్కినేని, మోడల్–డిజైనర్ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.ఎన్టీఆర్‌కూ లాయిడ్.. సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్‌ని మార్చడం స్టార్స్‌కు తప్పనిసరి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్స్‌నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్ జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కి శిక్షణ ఇచ్చారు.మహేష్‌కి మినాష్.. ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ గత ఐదేళ్లుగా మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్ సెట్లో, సెట్ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్‌స్టార్ స్టూడెంట్‌ని ప్రశంసిస్తారాయన.అనసూయ.. ఆర్జీవి.. అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్‌గా కనిపించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఫిట్నెస్ శిక్షకునిగా పనిచేశారు విజయ్ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్ జిమ్స్‌లో ట్రైనర్‌గా పనిచేసిన విజయ్.. టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్‌గా పేరొందారు.వారి ఆసక్తినిబట్టే.. ‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్ చేశా. అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్ చేసే టైమ్‌లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్ క్లయింట్.’ – జునైద్ షేక్, ఫిట్నెస్ ట్రైనర్ -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేసింది. అయితే కెరీర్ తొలినాళ్లలో చేసిన ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సామ్ ఓ బ్యూటీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎల్లో కలర్ డ్రెస్‌లో నవ్వుతూ డ్యాన్స్ చేస్తోంది.తను సమంతానా?ఈ వీడియోలో సామ్‌ను చూసి అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. సమంత అప్పటికంటే ఇప్పుడే యంగ్‌గా కనిపిస్తోంది.. తను సమంతే అని పోల్చుకోవడానికే చాలా కష్టంగా ఉంది.. అని నెటిజన్లు రకరకాలుగా కామంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. నిజంగా తను సమంతాయేనా? అని ప్రశ్నిస్తున్నారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో, ముఖంలో మార్పులు సహజమే అని అభిమానులు అంటుంటే కొందరు మాత్రం తను ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. రష్మిక అనుకున్నామే!మరికొందరైతే తనను చూసి రష్మిక మందన్నా అనుకున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సామ్ నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 6న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. View this post on Instagram A post shared by TEA Music | The Entertainment Assignment Music (@teamusicdaily) చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి -
హల్లో హీరోయిన్ గారు.. నెక్ట్స్ ఏంటి?
‘వాట్ నెక్ట్స్’ అంటూ కొందరు స్టార్ హీరోయిన్ల అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. కారణం ఆ కథానాయికలు తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకపోవడమే. అభిమాన నాయికలు వేరే భాషల్లో సినిమాలు చేసినా తెలుగు తెరపై కనిపించక΄ోతే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి నిరుత్సాహంగానే ఉంటుంది. మరి... టాలీవుడ్లో కొత్త సినిమా అంగీకరించని ఆ తారల గురించి తెలుసుకుందాం. మా ఇంటి బంగారం ఏమైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. టాలీవుడ్లో మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి హీరోలకి జోడీగా నటించి సందడి చేశారామె. అలాగే ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అలరించారీ బ్యూటీ. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రంపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఖుషి’ 2023 సెపె్టంబరు 1న విడుదలైంది. ఈ మూవీ రిలీజై ఏడాది దాటిపోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత. అయితే ‘మా ఇంటి బంగారం’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. ఈ సినిమాని తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు కూడా. తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న విడుదల చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. అలాగే సమంత బర్త్ డే తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌పై ఉందా? లేదా అనే సందేహం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రం ఏది? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే హిందీలో సమంత నటించిన ‘సిటాడెల్: హనీ–బన్నీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సమంత. అక్కడ ఫుల్... ఇక్కడ నిల్టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారామె. ఆ తర్వాత ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోల సరసన సినిమాలు చేశారు పూజా హెగ్డే. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు పూజ. ఈ మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో మెరిశారు. అయితే ‘ఆచార్య’ విడుదలై రెండున్నరేళ్లు అవుతున్నా హీరోయిన్గా మరో తెలుగు చిత్రం కమిట్ కాలేదు పూజా హెగ్డే. ఈ గ్యాప్‌లో హిందీ సినిమాలు చేశారామె. షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ‘దేవ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ 69వ చిత్రం, సూర్య 44వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ కాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు. మహానటి అక్కడ బిజీ ‘నేను శైలజ’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు కీర్తీ సురేశ్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా 2016 జనవరి 1న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘నేను లోకల్ (నాని), అజ్ఞాతవాసి(పవన్ కల్యాణ్), మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే (నితిన్), గుడ్ లక్ సఖి, సర్కారువారి పాట (మహేశ్ బాబు), దసరా (నాని), భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేశ్. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ‘భోళా శంకర్’ సినిమాలో హీరో చిరంజీవికి చెల్లెలుగా నటించారు కీర్తి. ఆ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఆ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రానికి కీర్తీ సురేష్ పచ్చజెండా ఊపలేదు. అయితే ఈ గ్యాప్‌లో తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. అంతేకాదు.. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తెలుగులో కీర్తీ సురేష్ నటించనున్న సినిమా ఏంటి? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబమ్మకి గ్యాప్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాని (శ్యామ్ సింగరాయ్), నాగచైతన్య(బంగార్రాజు, కస్టడీ), రామ్ (ది వారియర్), నితిన్ (మాచర్ల నియోజక వర్గం), సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి), శర్వానంద్(మనమే) వంటి యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా ఈ ఏడాది జూన్ 7న రిలీజైంది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా తెలుగులో ఇప్పటికీ మరో సినిమా కమిట్ కాలేదామె. టొవినో థామస్ హీరోగా నటించిన ‘ఏఆర్ఎమ్’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతీ శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెడుతున్నారు. వరుసగా మూడు సినిమాలు (వా వాతియార్, లవ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ, జీనీ) వంటి చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్నారీ బ్యూటీ. కోలీవుడ్‌లో బిజీగా ఉండటంతో తెలుగులో ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదా? అనేది వేచి చూడాలి. నాలుగో సినిమా ఏంటి? తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు మృణాళ్ ఠాకూర్. ‘సీతా రామం’ (2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారామె. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రతో ఆకట్టుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజైంది. ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటినా ఆమె నటించనున్న మరో తెలుగు చిత్రంపై స్పష్టత లేదు. ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాకి కమిట్ కాకపోయినా బాలీవుడ్లో మాత్రం దూసుకెళుతున్నారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మృణాళ్. అయితే రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఎల్ 25’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. మృణాళ్ ఠాకూర్ తర్వాతి తెలుగు సినిమా ఏంటి? అంటే వేచి చూడాలి. ఈ కథానాయికలే కాదు... మెహరీన్, డింపుల్ హయతి వంటి మరికొందరు హీరోయిన్లు నటించనున్న కొత్త తెలుగు సినిమాలపైనా స్పష్టత లేదు. -డేరంగుల జగన్ -
తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత
ఒకప్పటితో పోలిస్తే సినిమాలు చేయడం సమంత చాలా తగ్గించేసింది. గతేడాది వచ్చిన 'ఖుషి' మూవీలో హీరోయిన్గా చేసింది. రీసెంట్గా 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో సమంత కిస్ సీన్స్, గ్లామర్ క్లిప్స్ వైరల్ అయ్యాయి గానీ సిరీస్‌కి ఫ్లాప్ టాక్ వచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే ప్రమోషన్స్‌లో భాగంగా తల్లి కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.'సిటాడెల్'లో ఓ పాపకు తల్లిగా నటించిన సమంత.. నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 'సిటాడెల్లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది. తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు'(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)'తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు. డిసెంబరు తొలివారంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ) -
సమంత కష్టాలు చిన్నవి కావు.. ఒకరోజు ఆక్సిజన్ ట్యాంక్..
బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్, టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ థ్రిల్లర్ షోకి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.సమంత కోసం ఆక్సిజన్ ట్యాంక్అతడు మాట్లాడుతూ.. సమంతతో కలిసి నటిస్తున్నప్పుడు కొంచెం టెన్షన్పడేవాడిని. ఎందుకంటే ఒక రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కళ్లు మూసుకుని ఇది మళ్లీ అలాంటి రోజే అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటలుగా షూట్ చేస్తున్నాం. తర్వాత కాస్త బ్రేక్ చెప్పారు. వెంటనే ఒక ఆక్సిజన్ ట్యాంక్ వచ్చింది. అది సమంత కోసమే! తన పరిస్థితి చూసి భయమేసింది.ఉన్నట్లుండి పడిపోయిందిఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి లీవ్ తీసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయలేదు. పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి ఏమైందంటే.. సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్లో షూటింగ్.. తను నా వెనక పరిగెత్తాలి. నేను పరిగెత్తుతున్నా.. తనూ నా వెనకే వేగంగా వస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్ చెప్పాను.తనొక ఇన్స్పిరేషన్అయితే రాజ్ అండ్ డీకే టెన్షన్ పడొద్దన్నారు. కాసేపటికి తనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అలాంటి కండీషన్లోనూ తను సత్తువ కూడదీసుకుని యాక్ట్ చేస్తుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. సమంత కష్టాల ముందు నావి చాలా చిన్నవి. ఆమె నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు.మయోసైటిస్కాగా మయోసైటిస్ వ్యాధివల్ల సిటాడెల్ సిరీస్ చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనకు బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదించమని అడిగింది. అయినా దర్శకులు సమంతే కావాలని పట్టుపట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు.చదవండి: నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య -
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
-
Pushpa 2 Movie: 'పుష్ప' హంగామా.. ఈసారి హాట్ బ్యూటీస్‌తో
-
బ్లూ శారీలో క మూవీ హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ!
మెహందీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్..సిటాడెల్ లుక్‌లో సమంత స్పెషల్ లుక్స్..బ్లూ శారీలో మెరిసిపోతున్న క మూవీ హీరోయిన్ నయన్ సారిక..అక్టోబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్..పర్వతాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్..కలర్‌ఫుల్ శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
నీ వెనుక నేనుంటా.. నెటిజన్ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్!
సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ ’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్ సిరీస్‌ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్..తాజాగా తన ఫాలోవర్స్, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్‌స్టాలో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ చేశాడు. నెటిజన్ ప్రపోజ్కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్ అయింది. ‘సిటాడెల్’ భారీ అంచనాలుసమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటిచిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’కి ఇది ఇండియన్ వెర్షన్. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. ఆ హీరోయిన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే పుష్ప మూవీలో సమంత ఐటమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ సాంగ్‌కు ఫుల్ క్రేజ్ రావడంతో పార్ట్-2లోనూ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.అయితే పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్దాకపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ తెలుస్తోంది. ఒక్క పాటకు దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. అయితే అంత భారీస్థాయిలో డిమాండ్ చేయడంతో పుష్ప-2 నిర్మాతలు తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఐటమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్ డ్యాన్స్ చూడాలనుకున్నా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే గతంలో సమంతకు కూడా దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పుష్ప-2 ఐటమ్ సాంగ్‌లో గుంటూరు కారం భామ శ్రీలీల కనిపించనున్నట్లు లేటేస్ట్ టాక్. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించిన భామ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బీజీగా ఉంది. శ్రీలీలతో డీల్ ఓకే అయితే పుష్ప-2 తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించనుంది. కాగా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించనుంది. -
ఊ అంటావా మావా అంటున్న శ్రీ లీల.. సమంతతో కలిసి పుష్ప 2 ఐటెం సాంగ్
-
'పుష్ప' ఐటమ్ సాంగ్.. ఒకరు కాదు ఇద్దరు!
మరో నెల రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. కానీ ఇప్పటికే షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినప్పటికీ ఐటమ్ సాంగ్ కోసం సరైన బ్యూటీ దొరక్క దాన్ని అలా పక్కనబెట్టేశారు. తొలి భాగంలో 'ఊ అంటావా మావ' అని సమంత కేక పుట్టించగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అనేది భేతాళ ప్రశ్నగా మారిపోయింది. అయితే ఈసారి ఇద్దరు బ్యూటీస్‌తో పుష్పరాజ్ స్టెప్పులు వేయనున్నాడట.తొలి భాగంలో సమంత తనదైన హస్కీ మూమెంట్స్‌తో రచ్చ లేపింది. చేస్తే గీస్తే 'పుష్ప 2'లో అంతకుమించి ఉండాలి తప్పితే తగ్గకూడదనేది టీమ్ ప్లాన్. అందుకే తృప్తి దిమ్రి, శ్రద్ధా దాస్.. ఇలా చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి. అన్నీ సెట్ అవుతున్నా రెమ్యునరేషన్ దగ్గర తేడాలొస్తున్నాయట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మన హీరోయిన్ల దగ్గర మేటర్ ఆగిందట.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)మొన్నటివరకు శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఐటమ్ సాంగ్‌లో సమంత-శ్రీలీల.. ఇద్దరు పుష్పరాజ్‌తో రచ్చ లేపేందుకు రెడీ అయిపోయారట. మరి ఒకరు కాదు ఇద్దరు అనేది నిజమా లేదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందిలే!అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్ నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే నెల అంటే డిసెంబరు 5న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్.. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని హైప్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో సినిమాపై రూ.1000 కోట్ల అంచనాలు ఉన్నాయి. మరి 'పుష్ప 2' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?) -
ట్రా లా లాలో రెండో సినిమా?
హీరోయిన్ సమంత ఇటీవల ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘సినిమా బండి’ చిత్రంతో ప్రేక్షకుల మనసు గెలిచి, ఇటీవల ‘పరదా’ (ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది) చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల కథకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. తన సొంత నిర్మాణసంస్థ ‘ట్రా లా లా’పై ఈ సినిమాను సమంత నిర్మిస్తున్నారని, త్వరలోనే ప్రకటన రానుందని భోగట్టా. ‘ట్రా లా లా’ బ్యానర్‌పైనే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను గతంలో ప్రకటించారు సమంత. కానీ ఆ తర్వాత మరో అప్డేట్ రాలేదు. ఈలోపు ఈ బేనర్‌పై మరో సినిమా అంటూ... రెండో సినిమా గురించిన వార్త ప్రచారంలోకి వచ్చింది. -
మేకప్ లేకుండా సంయుక్త.. టూర్ వెళ్తున్న సమంత
అడవుల్లో సఫారీకి వెళ్లిన హీరోయిన్ సంయుక్త మేనన్విమానంలో టూర్‌కి వెళ్లిపోతున్న ముద్దుగుమ్మ సమంతఎర్ర చీరలో కేక పుట్టిస్తున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రిచీర కట్టినా సరే అందాలన్నీ చూపిస్తున్న సాక్షి మాలిక్షార్ట్ డ్రస్‌తో వయ్యారాలు ఒలకబోస్తున్న జ్యోతిరాయ్మాల్దీవుల్లో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్దంతేరస్ శుభాకాంక్షలు చెప్పిన సోనాక్షి సిన్హా View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by K sow (@saarya_laxman) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pritha Hari (@pritha10hari) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by VDeviyaniSharma (@vdeviyanisharma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
'సిటాడెల్' రెండో ట్రైలర్.. 'సమంత' కోసమే అనేలా ఉందే
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సమంత భారీ యాక్షన్ సిన్స్‌తో దుమ్మురేపిందని చెప్పవచ్చు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ పేరుతో నవంబర్ 7న రానుంది.చాలారోజుల తర్వాత సమంత ఒక యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సిటాడెల్ ట్రైలర్లో సమంత యాక్షన్ సీక్వెన్స్ లో స్టంట్స్ చేసింది. ఇందులో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు. ముఖ్యంగా రెండో ట్రైలర్లో ప్రధానంగా సమంతను హైలైట్ చేస్తూ చూపించారు. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ భారీగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 7న హిందీ, తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. -
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆయన ఇన్‌స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్‌స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్‌ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. -
సమంత బాటలో శృతిహాసన్?
సినిమా రంగంలో అనుకున్నవన్నీ జరగవు. కొన్నిసార్లు ఊహించనవీ జరుగుతాయి. అలా టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న నటి సమంత కెరీర్ ఒక్కసారిగా సమస్యల్లోకి నెట్టబడింది. భర్త నాగచైతన్య నుంచి విడిపోవడం, అదే సమయంలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. దీంతో సినిమాలకు దూరం అయ్యారు. ఆ వ్యాధి నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. పలు రకాల వైద్యం, యోగాలు, ధ్యానాలు చేశారు. మొత్తం మీద వ్యాధి నుంచి బయట పడ్డారు. అయితే ఇంకా నటనకు సిద్ధం కాలేదు. కారణం వచ్చిన చిత్రాలు వెనక్కి పోవడమేనని సమాచారం. మలయాళంలో మమ్ముట్టికి జంటగా నటించే అవకాశం వచ్చిందన్నారు. సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వీటిలో ఏవీ జరగలేదు. అలాగే చైన్నె లవ్‌స్టోరీ అనే ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కారణాలేమైనా ఆ చిత్రం కూడా చేజారిపోయింది. అయితే ఆ చిత్రంలో నటించే అవకాశాన్ని నటి శృతిహాసన్ చేజిక్కించుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈమె కూడా ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. శృతిహాసన్ అంగీకరించి, వైదొలగడం అనేది ఇది రెండోసారి. ఈమె ఇప్పటికే తెలుగు చిత్రం డెకాయిట్ లవ్‌స్టోరీ అనే చిత్రం నుంచి వైదొలగారు. టాలీవుడ్ నటుడు అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి శృతిహాసన్ నటించడానికి అంగీకరించారు. ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై మంచి ఆదరణ పొందింది. అలాంటి సమయంలో కారణాలేమైన శృతిహాసన్ ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఆంగ్ల చిత్రం చైన్నె లవ్‌స్టోరీ నుంచి వైదొలిగినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీటన్నింటికీ కారణం ఆమె నటిస్తున్న కూలీ చిత్రమేనా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కూలీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తరువాత రజనీకాంత్ అస్వస్థతకు గురి కావడంతో షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో నటి శృతిహాసన్ రజనీకాంత్‌కు కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా కాల్షీట్స్ సమస్య కారణంగానే ఆమె చైన్నె లవ్‌స్టోరీ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. అలా శృతిహాసన్ కూడా నటి సమంత బాటలోనే పయనిస్తున్నారు అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
రామ్‌చరణ్‌కు జోడీగా..?
‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమాను ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.అంతేకాదు... ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత ఈ సినిమాలోనూ హీరోయిన్గా చేస్తారని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సమంత మళ్లీ జోడీగా నటిస్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. -
సమంత హల్దీ ఫంక్షన్.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు)
-
నాడు సమంత సంగీత్ వేడుక.. సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల (ఫొటోలు)
-
మోస్ట్ పాపులర్ హీరోగా విజయ్.. ప్రభాస్ ప్లేస్ ఎంతంటే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ స్టార్స్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తుంది. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగా ప్రతినెల మోస్ట్ పాపులర్ స్టార్స్ పేరిట టాప్ టెన్ జాబితాను రిలీజ్ చేస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆ జాబితాను విడుదల చేసింది.తాజాగా రిలీజైన జాబితాలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌లో విజయ్ మొదటిస్థానంలో నిలవగా.. రెబల్ స్టార్ ప్రభాస్, షారూఖ్ ఖాన్ టాప్-3లో నిలిచారు. ఆ తర్వాత అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.టాప్‌లో సమంత.. రష్మిక ప్లేస్ ఎక్కడంటే?ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంత టాప్‌లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణెలు నిలిచారు. ఆ తర్వాత వరుసగా..నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక మందన్నా, పదో స్థానంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ నిలిచింది.కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆలియా భట్ ఇటీవలే జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మూడో ప్లేస్‌లో ఉన్న దీపికా పదుకొణె కల్కి సినిమాతో అభిమానులను అలరించింది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/wAxa5GF5DP— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 Ormax Stars India Loves: Most popular male film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/ei4bfglzlm— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత
-
నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత
సమంత- నాగ చైతన్యల విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ ఆంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు మహిళా తారల జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని కొండా సురేఖ ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ సమంత, అక్కినేని కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి చేసిన ఆరోపణలపై వారు భగ్గుమన్నారు. అయితే, ఈ విషయం గురించి మరోసారి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు బడుతూ.. సౌత్ ఇండియాలోని సినీ నటీనటులు చాలామంది సమంతకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా మద్ధతిచ్చారు. అయితే, తనకు అండగా నిలిచిన వారి గురించి సమంత ఇలా చెప్పారు. 'నా గురించి ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నా పక్షాన నిలబడింది. వారందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే దానికి కారణం ఇండస్ట్రీతో పాటు ఈ ప్రజలు నన్ను వదులుకోకపోవడమే.. వారి ప్రేమ, నాపై ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా బయటకు వచ్చేలా చేసింది. పరిశ్రమ నాకు సాయం చేయకుండా ఉండుంటే.. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇలాంటి సమయంలో వారే లేకుంటే నేను మరింతగా కుంగిపోయేదానిని. అందరి సపోర్ట్ వల్లే మళ్లీ నేను ఇక్కడ తిరిగి మీ ముందు కూర్చున్నాను.' అని సమంత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్,మహేశ్ బాబు, అల్లు అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా తదితరులు భగ్గుమన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్‌లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
అందుకు భిన్నంగా ఈ సిరీస్‌లో చేశా: సమంత కామెంట్స్
సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పులు వచ్చాయి. అందులో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. స్పై జానర్లో సిరీస్, సినిమా అయినా సరే ఎప్పటికీ పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారికే యాక్షన్, డైలాగ్స్ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కూడా యాక్షన్ చేశా అని తెలిపింది.కాగా.. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్. దీనికి ఇండియన్ వెర్షన్ సిటాడెల్: హనీ -బన్నీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
సమంత గ్లామరస్ లుక్.. 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్‌కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్‌లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత
సమంత సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కొన్నాళ్లు పక్కనబెట్టేసింది. కొత్త మూవీస్ కూడా పెద్దగా ఒప్పుకోలేదు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకులు.. 'సిటాడెల్: హనీ-బన్నీ' పేరుతో ఓ సిరీస్ తీస్తున్నారు. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్)ట్రైలర్ చూస్తే సిరీస్ అంతా ఫుల్ యాక్షన్ ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. ఇందులో సమంత ఓ సీక్రెట్ ఏజెంట్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఏ మిషన్స్ పూర్తి చేశారు అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్లోనే ఫుల్ యాక్షన్ దట్టించారు. గన్ ఫైరింగ్, ఫైటింగ్.. ఇలా సమంత అదరగొట్టేసింది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్‌తోనే బజ్ వచ్చిందంటే మాత్రం సిరీస్‌పై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. సమంత కొత్త ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
హీరోలతో పోటీ పడుతున్న సూపర్ లేడీస్.. ఇప్పుడిదే ట్రెండ్
సినిమాని జనరల్‌గా మేల్ లీడ్ చేస్తుంటారు. ఫిమేల్ లీడ్ చేయడం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కొందరు కథానాయికలు. స్టోరీని లీడ్ చేస్తున్న ఆ లీడ్ లేడీస్ గురించి తెలుసుకుందాం. ప్రతీకారం కేసు పెడదామంటే..‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తెలుగులో కమిటైన చిత్రమిది. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ‘ఘాటీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట క్రిష్. బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఆంధ్రా– ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివశక్తిగా... తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. 2021లో విడుదలై, హిట్‌గా నిలిచిన ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన కెరీర్లో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘ఓదెల 2’ ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలోని ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్గా తమన్నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల 2’లో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, నాగమహేశ్, గగన్ విహారి వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బంగారు బొమ్మ ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత సమంత నటించనున్న తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన బర్త్ డే (ఏప్రిల్ 28న) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు సమంత. తన సొంత డైరెక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. తెలుగులో ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డబుల్ ధమాకా హీరోయిన్ రష్మికా మందన్నా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘సికందర్’, ‘ఛావా’, వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్, ధనుష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి హీరోలకి జోడీగా నటిస్తూ దూసుకెళుతున్న ఈ బ్యూటీ మరోవైపు ‘రెయిన్బో’, ‘ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్బో’లో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ‘చిలసౌ’ (2018) సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గాళ్ ఫ్రెండ్’. ఈ మూవీలోనూ రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కళాశాల విద్యార్థి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మహిళల పరదా పక్కింటి అమ్మాయి, హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ సినిమాలతో రూట్ మార్చారు. గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ముద్దు సీన్స్‌లోనూ నటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మహిళల చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. ఓ భక్తురాలి కథ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో ఎమ్ఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘‘ఆదిపర్వం’ ఓ అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి నటన సరికొత్తగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త థ్రిల్లర్ మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలు తీసిన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసీ దర్శకుడు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది ఈ చిత్రకథ’’ అని సంయుక్తా మీనన్ తెలిపారు. కుమారి ఖండం నేపథ్యంలో..హీరోయిన్గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు శ్రద్ధా దాస్. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ, హారర్ మూవీగా ‘త్రికాల’ రూపొందింది. కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం. పురాణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హత్యలు చేసిందెవరు? ప్రియమణి లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్యూజి: కొటేషన్ గ్యాంగ్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వివేక్ కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్ , సారా అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిలింస్ అధినేత ఎం.వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ‘‘మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘క్యూజి: కొటేషన్’ గ్యాంగ్’ రూపొందింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ ఇది. ఒక హత్య కేసు ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... హీరోయిన్లు నయనతార, కీర్తీ సురేష్. శ్రుతీహాసన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు తమిళ భాషల్లో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. -
బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో సమంత.. చాలా రోజుల తర్వాత!
సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తర్వాత మరింత సామ్ ఒక్కసారిగా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కొచ్చిన సమంత జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో ఆధ్యాత్మిక బాట పట్టింది సామ్. అందులో భాగంగానే ఇటీవల కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సమంత.. తన క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపాదను కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా సమంత నవరాత్రి పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమంతతో కలిసి పూజలు చేసిన పిక్‌ను చిన్మయి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో సమంత తన చేతిలో శారీ పట్టుకుని కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్లో కనిపించనుంది. ఆ తర్వాత బంగారం అనే మూవీలో నటించనుంది. -
హైదరాబాద్ : ఆలియా భట్ 'జిగ్రా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్‌గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్‌తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్‌గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్‌గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్‌కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక
చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంతని త్రివిక్రమ్, ఆలియా భట్ ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదంతా జరిగింది. కొత్త మూవీ ప్రమోషన్ కోసం భాగ్యనగరానికి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. సినిమా గురించి చెప్పడం కంటే సమంతకి ఎలివేషన్స్ ఇచ్చింది. త్రివిక్రమ్‌తో మూవీ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సమంత గురించి మాట్లాడిన ఆలియా భట్.. తెరపైనే కాదు తెరముందు కూడా హీరోనే అని సామ్‌ని ఆకాశానికెత్తింది. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తి దాయకమని, అలాంటి ఆమె తన సినిమాని ప్రొత్సహించేందుకు ముందుకు రావడం చాలా ఆనందం ఉందని చెప్పింది. మంచి సినిమాలను ప్రేమించడంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అని మనోళ్ల ప్రేమ గురించి పొగిడింది. తమ ఇంటికి తెలుగుతో ఎంతో అనుబంధం ఏర్పడిందని, తన కూతురు.. నాటునాటు పాట వినని రోజే ఉండదని ఆలియా చెప్పింది.అలానే సమంత, తనని లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తీయాలని ఇదే వేడుకకు అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ని ఆలియా భట్ కోరింది. అయితే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. త్వరలో అల్లు అర్జున్‌తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గురూజీ అనుకుంటే బన్నీ సరసన సమంత, ఆలియా భట్ని పెడితే పాన్ ఇండియా తగ్గట్లు సరిపోతుంది. మరి ఆలియా కోరిక త్వరలో తీరుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)