srivari brahmotsavam
-
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో గురువారం ధ్వజారోహణం శాస్త్రోక్తం గా నిర్వహించారు. వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) సా. 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంలో అర్చకులు ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా రామకృష్ణ దీక్షితులు క్రతువును నిర్వహించి మంగళ ధ్వనులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనం (పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. శనివారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం ఇక శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువ్రస్తాలు సమర్పించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. అనంతరం.. ప్రభుత్వం తరఫున చంద్రబాబు పట్టువ్రస్తాలను తలపైన పెట్టుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం చంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించారు.శ్రీవారి ఆలయంలో ఇష్టారాజ్యం.. మరోవైపు.. శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టువ్రస్తాలు సమర్పించే సమయంలో సీఎంఓ సిబ్బంది, నాయకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనుమతిలేకపోయినా సుమారు 25 మంది వరకు ఆలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబుతో నాయకులు, అధికారులు యథేచ్ఛగా ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిక్లరేషన్‌లో సంతకం పెట్టకుండానే ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. -
సిట్ విచారణ నిలిపివేత
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ నిలిచిపోయింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని.. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుమలలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని.. మూడు రోజుల పాటు టీటీడీలో సిట్ దర్యాప్తు సాగిందన్నారు. ప్రస్తుతానికి సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3 రోజుల దర్యాప్తు వివరాలను సిట్ చీఫ్ తమకు అందజేశారని చెప్పారు.బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని డీజీపీ తెలిపారు. 5,145 మంది పోలీస్ సిబ్బందిని బ్రహోత్సవాలకు వినియోగిస్తున్నామన్నారు. గరుడ వాహనం రోజున ప్రత్యేకంగా మరో 1,264 మందిని భద్రత కోసం నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో 24 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను గుర్తించామని, వీటిలో 8 వేల వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వీటిలో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు. -
తిరుమలలో భక్తుల రద్దీ అప్డేట్స్..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 66,233 మంది దర్శించుకున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.71కోట్లుగా ఉంది. తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. #తిరుమల తిరుమలలో నేటి పౌర్ణమి గరుడ సేవ#Tirumala Today's Paurnami Garuda Seva at Tirumala pic.twitter.com/S1hLwjC6z2 — kshetradarshan (@kshetradarshan) September 29, 2023 ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. -
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఏడో రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా సూర్యప్రభ వాహనంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పాల్గొన్నారు. ఇక, స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పడుతున్నారు. కాగా, ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఉండనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ ఉండనుంది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,884గా ఉంది. నిన్న హుండీ ఆదాయం 2.70 కోట్లుగా ఉంది. ఇక, 32,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - గజ వాహనం #gajavahanam #tirumala #tirumalatirupatidevasthanam #TTD #Brahmotsavam #brahmotsavalu #Tirupati #tirupatibalajitemple #venkateswaraswamy #venkateswara #govinda #spiritual #spirituality #devotional #devotion #hinduism #hindhudharmam pic.twitter.com/hqnjwqENi1 — SVBCTTD (@svbcttd) September 23, 2023 -
Tirumala: వైభవంగా గరుడోత్సవం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు.. శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వైభవంగా మొదలైంది. గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. చిరు జల్లులతో వరుణుడు స్వాగతం పలికారు. తిరు వీధులు భక్తులతో నిండిపోయి.. గోవింద నామ స్మరణతో మారుమోగాయి. వేద పండితుల మంత్రాలు, భక్తుల గోవింద నామాలు , మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచే చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క మండలాల నుంచి భక్తులు తుమ్మలగుంటకు అధికంగా తరలివచ్చారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో అలంకరించారు. ఏడాది మొత్తంలో.. గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్నది తెలిసిందే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు అంచనా. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డుకు భక్త సంద్రం తరలి వచ్చింది. గరుడోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించారు. ఇస్కాన్ ప్రతినిధులు ఆలయం వద్దకు చేరుకుని సారె సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి సారె సమర్పణ శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. సుమారు వెయ్యి మంది గ్రామస్తులు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు తీసుకు వచ్చి స్వామి వారికి సమర్పించారు. ఉదయం మోహినీ అవతారంలో నిత్య కళ్యాణ శోభితుడు అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కల్యాణ వెంకటేశ్వర స్వామి మోహినీ అవతారంలో పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంకు వున్న ప్రత్యేకత ఏమంటే మోహినీ అవతారం లో వున్న స్వామి భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల ఆభరణాలు ధరించి.. కుడి చేతిలో చిలుకను పట్టుకుని.. ముందు ఏర్పాటు చేసిన అద్దంలో ముఖాన్ని చూస్తూ వుంటారు. స్వామి వారి పల్లకీ సేవలో భక్తులు తరించి పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాల్లో రేపు.. కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేపు గరుడోత్సవం..భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!
-
ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనం
-
TTD: ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!
-
చినశేష వాహనంపై ఊరేగిన స్వామివారు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అష్టవినాయక అతిథిగృహంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన టికెట్లు. అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. త్వరలో తిరుచానూరులో మహా వరుణయాగం ఉంటుంది. అష్ట వినాయక అతిథిగృహాంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తాం. వికాస్ నిలయంను ఆధునీకరించి భక్తులకు అందుబాటులోకి తెస్తాం. స్వామివారి అభిషేకానికి కావాల్సిన నెయ్యి తిరుపతి గోశాల నుంచే వస్తోంది. వచ్చే ఏడాదికి గోశాలలో నెయ్యి ప్లాంట్ సిద్ధం చేస్తాం. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 22.25 లక్షలు. ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.085కోట్లు. ఆగస్టు నెలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 9.07లక్షలు. ఆగస్టు నెలలో లడ్డూ విక్రయాలు 1.09కోట్లు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు 43.07లక్షలు అని తెలిపారు. ఇది కూడా చదవండి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ -
సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి ప్రారంభం కానున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరధం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామన్నారు. చదవండి: జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం బ్రహ్మోత్సవాల సమయంలో అధిక రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏడు రోజులు ఏటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా, సాంప్రదాయంగా టీటీడీ సిబ్బందితో పాటుగా, అన్ని విభాగాల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నమని భూమన కరుణాకర్ పేర్కొన్నారు. భక్తులకు భద్రత విషయంతో ఎటువంటి లోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని కోరారు. -
తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: అధిక మాసం కారణంగా.. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. సోమవారం అన్నమయ్య భవన్లో అన్నివిభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సోమవారం సమావేశం నిర్వహించి.. బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి.. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబరు 18 నుండి 26 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుండి 23 వరకు తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వెల్లడించారాయన. ఈ ఏడాదిలో అధిక మాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రంను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22వ తారీఖున గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటుందని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారాయన. ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14-18వ తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారాయన. అక్టోబర్ 18వ తారీఖున గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్ధాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చన్నారాయన. పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. టీడీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు. -
తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
Tirumala : అశ్వవాహనంపై మలయప్పస్వామివారు (ఫొటోలు)
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేకంగా నిలిచిన స్వామి వారి అలంకరణలు (ఫొటోలు)
-
Tirumala : సూర్యప్రభ వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : గరుడు వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : సింహ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి (ఫొటోలు)
-
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : హంస వాహనంపై విహరించిన మలయప్ప స్వామి (ఫొటోలు)
-
Tirumala : వైభవంగా స్నపన తిరుమంజనం (ఫొటోలు)
-
Tirumala : తిరుమలలో రెండవ రోజు చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు (ఫొటోలు)
-
తిరుమలలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
-
తిరుమల: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. రంగనాయకుల మండపంలో సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత నూతన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు. రూ.22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరకామణి భవనం నిర్మించారు. భక్తుల మధ్య శ్రీవారి కానుకలు లెక్కించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు. చదవండి: శ్రీవారి సేవలో సీఎం పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులతో తిరువీధులు కిటకిట (ఫొటోలు)
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అలరించిన పుష్ప ప్రదర్శనం (ఫొటోలు)
-
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: తిరుమాడ వీధుల్లో విశ్వ సేనాధిపతి (ఫొటోలు)
-
Tirumala: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...
ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవంగా ప్రఖ్యాతిపొందిన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండపై అన్ని విశేషాలే, అన్నీ ప్రత్యేకతలే. శ్రీవారి దర్శనార్థం ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామి వారికి హుండీ ద్వారా ఏటా లభించే ఆదాయం రూ.800 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక సేవ నిర్వహిస్తుంటారు. అలాగే, ప్రతివారం వారోత్సవాలు, ప్రతిమాసం మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యం టీటీడీ ఇస్తుంది. శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికీ లేవు. ఆ దేవదేవునికి ప్రతినిత్యం నిర్వహించే అలంకరణకు 1093 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా, స్వామి వారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏమీ ఉండదు. శ్రీవారికి ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. శ్రీనివాసునికి సాటిరాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేడు అని భక్తుల నమ్మకం. శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజూ అరవై వేలు మొదలుకొని లక్ష మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఇక శ్రీవారికి 1958లో హుండీ ద్వారా లభించే ఆదాయం లక్ష రూపాయల వరకు ఉంటే ఇప్పుడు స్వామివారికి ప్రతి రోజూ లభించే హుండీ ఆదాయం రెండున్నర కోట్ల పైమాటే. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అలిపిరి నుంచి స్వామి వారిని కొలుచుకుంటూ ఎంతో ప్రయాసతో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి కష్టాలన్నీ ఒక్కసారిగా మరచిపోతారు. స్వర్ణ పుష్పాలంకరణలతో కూడిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతికి లోనవుతారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడట, ఎంతటి అలంకరణ ప్రియుడో అంతటి భక్తజనప్రియుడట! శ్రీవారి అలంకరణకు టీటీడీ అధిక ప్రాధ్యానం ఇస్తోంది. స్వామివారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవుడికీ, మరే ఆలయంలోనూ ఉండవు. శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తే, తిరిగి గురువారం ఉదయం సడలింపు చేస్తారు– అంటే అలంకరణలను తీసివేస్తారు. మరో వైపు పుష్పాలంకరణ మాత్రం శ్రీనివాసునికి ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తోమాలసేవలో స్వామి వారికి మూడువందల కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి అలంకరించే పుష్పాలను పూల అర అనబడే పుష్ప మండపంలో భద్రపరిచేవారు. అటు తరువాత రద్దీ పెరగడంతో ఈ కార్యక్రమాన్ని ఆలయం వెలుపలకు మార్చేశారు. శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే చామంతి, లిల్లీ, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, తులసి, తామరలు, కలువలు, మల్లెలు, కనకాంబరాలు వంటి పన్నెండు రకాల పుష్పాలతో రూపొందించిన మాలలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలు అవసరమవుతాయి. తిరుమల కొండ మీద కేవలం ముప్పయి కిలోల పువ్వులే లభిస్తుంటే, మిగిలిన 270 కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయటి నుంచి తెప్పిస్తుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడే ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు. ఇక సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో అలంకరిస్తారు. తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు. తర్వాత వక్షస్థల లక్ష్మీ మాలలను అలంకరిస్తారు. స్వామివారి వక్షస్థలంలో కొలువుండే శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. శంఖు చక్రాలకు ఒకొక్క మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. ఇక స్వామివారి బొడ్డున ఉండే నందక ఖడ్గానికి కఠారి సరం అనే రెండు మూరల మాలను అలంకరిస్తారు. తావళాలు అనే హారాలను రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపైన, మోకాళ్ల నుంచి పాదాల వరకు వేలాడేలా మూడు దండలను అలంకరిస్తారు. వీటిలో ఒకటి మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటాయి. చివరిగా ఒక్కొక్క మూర ఉండే తిరువడి దండలను శ్రీవారి పాదాల చుట్టూ అలంకరిస్తారు. ఇవి కాకుండా భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామికి మూడు దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి మూడు దండలు, సీతారామలక్ష్మణులకు మూడు దండలు, రుక్మిణీ శ్రీకృష్ణులకు రెండు దండలు, చక్రత్తాళ్వారుకు ఒక దండ, అనంత గరుడ విష్వక్సేనులకు మూడు దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు, ద్వార పాలకులకు రెండు దండలు, గరుడాళ్వర్, వరదరాజస్వామి, వకుళమాతలకు మూడు దండలు, రామానుజాచార్యులకు రెండు దండలు, యోగనరసింహస్వామి, విష్వక్సేనులతో, పోటు తాయారు, బేడి ఆంజనేయస్వామికి నాలుగు దండలు, వరాహస్వామి ఆలయానికి మూడు దండలతో ప్రతి నిత్యం అలంకరిస్తారు. ప్రతి గురువారం శ్రీవారికి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరణ చేస్తారు. పూలంగి సేవగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక శ్రీవారికి ప్రతినెలా నిర్వహించే ఉత్సవాలకు విశేష పుష్పాలంకరణలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. విశేష పర్వదినాలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆలయాన్ని మూడు నుంచి ఐదు టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు. వివిధ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం నుంచి ఆలయ ప్రాకారం వరకు అలంకరిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తిథులలో మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారాన్ని రెండు టన్నుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా చేసే అలంకరణ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. తెలుగు వారి నూతన సంవత్సరాది రోజు అయిన ఉగాది పర్వదినాన కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తారు. సాధారణ రోజులలో అలంకరణకు ఉపయోగించే చామంతి, తులసి, లిల్లి, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, మల్లెలు, కలువలు, తామరలు, కనకాంబరాలు వంటివే కాకుండా కురివేరు, వట్టివేరు, తీగ సెంటు జాజులు, కట్ రోజెస్ వంటి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉగాది రోజున ఐదు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీనివాసునికి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మాసం ఏదో ఒక సేవ నిర్వహిస్తున్నా ప్రతి ఏటా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకు అనుగుణంగానే పుష్పాలంకరణకు టీటీడీ అధిక ప్రాధాన్యమిస్తుంది. తొమ్మిది రోజులపాటు పద్నాలుగు రకాల వాహనాలపై స్వామివారు మాడ వీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉత్సవాలకు ముప్పయి టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తుంది. వివిధ పుష్పాలతో చేసే దేవతా మూర్తుల ఆకృతులను తిలకించే భక్తులకు తిరుమల క్షేత్రమే ఇలలో వెలసిన వైకుంఠంగా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే పుష్పయాగం న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. పది టన్నుల పద్దెనిమిది రకాల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. తరువాత ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలపల్లకిలో ఉరేగిస్తారు. మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది. ఇన్నిరకాల పూలతో అలంకరిస్తే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉంటుందా? దిష్టి తగిలితే తగులుతుందేమో నని, శ్రీవారికి అలా దిష్టి తగలకుండా ఉండటానికి అర్చకులు సన్నని వెంట్రుకలా ఉండే కురువేరు అనే వేరును ఉపయోగిస్తారు. ఈ కురువేర్లు తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయట! (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) స్వామివారి పుష్పాలంకరణల కోసం తమిళనాడులోని చెన్నై, సేలం, శ్రీరంగం, కోయంబత్తూరు, దిండిగల్, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి 60 శాతం పుష్పాలు విరాళాలుగా అందితే, మిగిలిన 40 శాతం పుష్పాలను కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతం నుంచి దాతలు విరాళాలుగా అందిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో అలంకరించేందుకు ప్రత్యేక పుష్పాలను కూడా టీటీడీ... బెంగళూరు నుంచే తెప్పిస్తుంది. మన దేశం నుంచే కాకుండా సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ నుంచి కూడా భక్తులు స్వామి వారికి పుష్పాలను విరాళంగా అందిస్తున్నారు. శ్రీవారికి పుష్పాలు విరాళాలుగా అందించడానికి దాతలు ముందుకు వస్తే టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. మరోవైపు స్వామివారి పుష్ప కైంకర్యానికి వినియోగించే పుష్పాలను టీటీడీ ద్వారానే పండించేందుకు ఏర్పాట్లును మొదలు పెట్టింది. పలమనేరులో 750 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న గో సంరక్షణశాల ప్రాంతంలో 25 ఏకరాల స్థలాన్ని పూలతోటల కోసం టీటీడీ కేటాయిస్తోంది. (క్లిక్ చేయండి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం) -
బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ‘కరోనా’ కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ‘కరోనా’ తొలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు... బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారా..? సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 26న రాత్రి 7–8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతాయి. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనసేవ మాత్రం రాత్రి 7 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తాం. అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తాం. తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. రెండేళ్ల ‘కరోనా’ మహమ్మారి తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తుల నడుమ జరుగుతున్నందున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తిరుమలలో రెండేళ్ల తరువాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడవీథుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా జరిగాయి. దూరప్రాంతాల నుంచి సొంత వాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ముఖ్యకూడళ్లలోనూ విద్యుద్దీపాలంకరణలను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు సేవలందించేందుకు మూడున్నర వేల మంది శ్రీవారి సేవకులను ఇప్పటికే ఆహ్వానించాం. ఫొటో ఎగ్జిబిషన్, మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ, అదనంగా ఐదువేల మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకున్నాం. వైద్యవిభాగం ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచుతాం. నిర్దేశిత ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతాం. భక్తుల రాకపోకల సౌకర్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచుతాం. ప్రధాన కల్యాణకట్టతో పాటు పది మినీ కల్యాణకట్టల్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా తలనీలాలు సమర్పించు కునేలా ఏర్పాట్లు చేశాం. టీటీడీలోని 337 మంది రెగ్యులర్ క్షురకులు, 852 మంది పీస్‌రేటు క్షురకులు కలిపి మొత్తం 1189 మంది ఉన్నారు. వీరు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచేలా ఏర్పాట్లు చేశాం. ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నాం. అక్టోబర్ 1న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ట్రస్టుల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్లైన్లోను, ఆఫ్‌లైన్‌లోను గదుల కేటాయింపు ఉండదు. దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. టీటీడీ చైర్మన్‌గా మీరు రెండోసారి బాధ్యతలు చేపట్టారు. స్వామివారి సేవలో మరోసారి అవకాశం దక్కడంపై ఎలా భావిస్తున్నారు? శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రథమ సేవకుడిగా సేవచేసే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఆ కొందరిలో నేను కూడా ఉండడం స్వామివారు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నాను. టీటీడీలో చైర్మన్, బోర్డు సభ్యులే కాదు అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు స్వామివారి అనుగ్రహం లేనిదే పనిచేసే అవకాశం రాదు. ఈ విషయాన్ని మనసా వాచా కర్మణా ప్రగాఢంగా నమ్ముతాను. స్వామివారి అనుగ్రహం వల్లే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నాకు రెండోసారి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పనిచేసే అవకాశం కల్పించారు. భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాను. (క్లిక్ చేయండి: శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...) -
బ్రహ్మోత్సవాలకు తిరునగరి ముస్తాబు
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండేళ్ల అనంతరం బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహిస్తుండటం..ఈ ఏడాది ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 20వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని టీటీడీ సంకల్పించింది. శ్రీవారి వాహనసేవలు జరిగే ఆలయ మాడ వీధులతో పాటు తిరుమలను ఇప్పటికే సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. కళ్లు చెదిరే రంగులు, విద్యుత్ దీప కాంతులతో తిరు వీధులను దేదీప్యమానంగా అలంకరిస్తోంది. పటిష్టమైన బ్యారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. తిరుమలలోని ప్రధాన మార్గాల్లో పలు చోట్ల భారీ ఆరీ్చలను నిర్మిస్తోంది. కాటేజీలు, కార్యాలయాలు, భక్తజన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, లైటింగ్ కటౌట్లను ఏర్పాటు చేస్తోంది. బ్రహ్మోత్సవ వాహన సేవల్లో అపురూపమైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కళాకారులు వాహన సేవల్లో పాల్గొననున్నారు. వాహన సేవల సమయంలో విశిష్టతను తెలియజేసేందుకు ప్రముఖ పండితులు వ్యాఖ్యానం చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు విస్తృత ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు భక్తులకు విస్తృత ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఆయన టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్‌తో కలిసి మాడ వీధుల్లోని వివిధ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది పెరటాశి మాసం, అక్టోబర్ 1న గరుడ సేవతో పాటు అన్ని వాహన సేవలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సర్వ దర్శనానికి 18 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,540 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,339 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.91 కోట్లు వేశారు. వాహన సేవల సమయాల్లో మార్పు.. ఈ ఏడాది వాహన సేవల సమయాల్లో టీటీడీ పలు మార్పులు చేసింది. గతంలో ప్రతి వాహన సేవ ఉదయం, రాత్రి వేళల్లో 9 గంటలకు ప్రారంభమయ్యేది. ఈ సారి నుంచి ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకే వాహన సేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. 26న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. 27న సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు శ్రీవారికి ధ్వజారోహణ నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం 7గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పిస్తారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్ద శేషవాహనంతో బ్రహ్మోత్సవ సంబరం మొదలవుతుంది. -
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి) -
Tirumala: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల: రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడసేవ నిర్వహించనున్నారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశముంది. ఈ క్రమంలో వారి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈనెల 20న ఉ. 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. (క్లిక్: ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్) -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
-
భక్తులకు గమనిక: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే..
Tirumala Srivari Brahmotsavam.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరువీది ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. - సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. - సెప్టెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. - అక్టోబర్ 1న గరుడ సేవ - సర్వదర్శనం ప్రతీరోజులాగే కొనసాగుతుంది. స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం. ఇక, తిరుమలలోని పార్వేట మండపం ఆధునీకరణ కోసం రూ. 2.20 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. అలాగే, అమరావతిలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్ధికి రూ. 2.20 కోట్లు కేటాయింపు. టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం. బేడీ ఆంజనేయ స్వామి కవచాలకు బంగారు తాపడం. ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. దీని కోసం ఆగమశాస్ర్తం పండితులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే తిరుప్పావడ సేవను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్, డైరీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుమల బ్రహ్మోత్సవాలు: సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: చిన్న శేషవాహనంపై శ్రీవారు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ధ్వజారోహణం
-
7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయించనున్నారు. హిందూ ధర్మ ప్రచారం, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలను టీటీడీ నిర్మించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో వెనుకబడిన వర్గాల భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురానున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గం మధ్యలో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. దర్శన టికెట్లు ఉంటేనే అనుమతి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గానీ, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్టు గానీ తప్పనిసరిగా తీసుకురావాలని సోమవారం టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నామని తెలిపింది. ఇతర ఆలయాల్లోనూ టీటీడీ విధానాలు! 9 కమిటీలతో అధ్యయనం భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీలో అమలు చేస్తున్న విధానాలను.. దేవదాయ శాఖ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన వారం కిందట జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల మేరకు దేవదాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. ఆన్లైన్లో పూజ టికెట్ల జారీ, బంగారు ఆభరణాల డిజిటలైజేషన్, నిర్వహణ, ఆలయ భద్రత, అవసరమైన సామగ్రిని పారదర్శకంగా కొనుగోలు చేయడం తదితర అంశాలపై దేవదాయ శాఖలో పనిచేసే కీలక అధికారులతో 9 కమిటీలను ఏర్పాటు చేస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఆయా కమిటీల్లోని సభ్యులు 2 విడతల్లో తిరుమల ఆలయాన్ని సందర్శించి.. టీటీడీలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ నెల 5–9 తేదీల మధ్య 4 బృందాలు, 18–22 తేదీల మధ్య 5 బృందాలు తిరుమల సందర్శనకు వెళ్లాలని ఆదేశించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: మహారథంపై శ్రీవారి వైభవం
-
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతోన్న శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. గడచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేసిన స్వామివారు ఈ రోజు ఉదయం మహారథంపై ఊరేగారు. రాత్రి జరిగే అశ్వవాహన సేవతో స్వామివారి సేవలు పరిసమాప్తం కానున్నాయి. అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. కలియుగాంతంలో దుష్టశిక్షణ... శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ట చేసే కల్కిమూర్తి రూపం నిజంగా అపురూపం. బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవతో స్వామి వారి వాహన సేవలు ముగియనున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు: మహారథంపై శ్రీవారి వైభవం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాముని అవతారంలో హనుమంతునిపై శ్రీనివాసుడు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: మోహినీ రూపంలో శ్రీనివాసుడు
-
తిరుమల : చిన్నశేష వాహనంపై శ్రీవారు
-
రెండోరోజు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండవరోజు వైభవంగా జరుగుతున్నాయి. మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ తిరుమాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం... శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనంపై దర్శిస్తే కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రాత్రికి హంసవాహన సేవ జరగనుంది. -
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
-
వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం
టీటీడీ చరిత్రలోనే అరుదైన ఘట్టం సోమవారం ఆవిష్కృతమవుతోంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం వైఎస్సార్ కుటుంబానికి దక్కబోతోంది. ముఖ్యమంత్రి హోదాలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పించే అద్భుత ఘట్టం. ఆ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, అమరావతి : టీటీడీ చరిత్రలో వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కనుంది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కనుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకుముందెప్పుడు జరగలేదు. తిరుమల వెంకటేశుని ఆశీస్సులతో వైఎస్ కుటుంబానికే ఈ గౌరవం దక్కింది. శ్రీవారిపై వైఎస్సార్ కుటుంబానికి అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించడానికి ముందు, దిగ్విజయంగా పాదయాత్ర పూర్తయిన తర్వాత వెంకన్నను కాలినడకను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రా సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్ర్తంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్ర్తాలు తీసుకెళ్తారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించి, గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందిస్తారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్శిక బ్రహ్మోత్సవాలకు వసంత మండపంలో ఆదివారం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులోభాగంగా విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో భూమిపూజతో మట్టిని సేకరించి ఛత్ర, చామర మంగళవాయిద్యాలతో మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో శాలి, వ్రహి, యవ, మద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలతో అంకురార్పణ చేశారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటలలోపు మీనలగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 8గంటలకు పెదశేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈవో సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా అర్బన్ జిల్లా ఎస్పీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తిరుమల రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -
నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
-
తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అం కురార్పణ జరగ నుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమ మోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవా లకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’ (మృత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాయిద్యాలతో ఊరేగు తూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 పాళికలలో (మూకుళ్లు)– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు. కార్యక్రమానికి సోము డు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 8 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనం (పెద్దశేషవాహనం)పై తిరుమల మాడవీ ధుల్లో భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారు. -
ఆపదమొక్కులవాడికి రాయలవారి కనకాభిషేకం
ఆతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి కనకరత్న కవాట కాంతులిరుగడ గంటి అనుపమ మణియమగు కిరీటము గంటి కనకాంబరము గంటి గక్కన మేలు గంటి అరుదైన శంఖుచక్రాదులి వరుగడ గంటి సరిలేని అభయ హస్తమును గంటి తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి అంటూ ఐదు వందల ఏళ్ల క్రితం శ్రీవేంకటేశ్వర సాక్షాత్కారం పొందిన అన్నమయ్య తన్మయత్వంతో స్వామివారిని వర్ణించిన తీరు ఇది. నాటి నుంచి నేటి వరకు స్వామి దివ్యమంగళమూర్తి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేధ పుష్యరాగాది నానా రత్నఖచితాభరణాలతో కోటి సూర్యప్రభల వెలుగులతో అలరారుతోంది. భక్తులకు వెన్నెల వరాలను ప్రసాదిస్తూ నయనానందకరమై వర్ధిల్లుతోంది. తిరుమల శ్రీవెంకటేశ్వరునికి ఎన్ని కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయో దేవస్థానం వద్దే లెక్కలు లేవు. ఉన్న వాటికి వెలకట్టలేని పరిస్థితి. శ్రీవారికి ఉన్న ఆభరణాల విషయానికొస్తే భక్తులకు వెంటనే గుర్తు వచ్చేది వజ్రకిరీటం. అయితే గత కొన్ని వందల సంవత్సరాలుగా రాజుల నుంచి సామాన్యుల వరకు స్వామి వారిని సందర్శించి కనకాభిషేకం చేస్తున్నారు. ఆ విశేషాలు శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకం.కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. కోరిన కోరికలు తీర్చే ఆపదమొక్కుల వాడికి భక్తులు నిలువుదోపిడీ సమర్పించుకుంటారు. మరికొందరు అపురూపమైన, విలువైన కానుకలను హుండీలో వేస్తుంటారు. వందల ఏళ్ల కిందట కొందరు రాజులు విలువైన మాన్యాలను స్వామి సేవకు కైంకర్యం చేసిన సందర్భాలు ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆరు వందల ఏళ్ళ నాడే దేశ, విదేశాల నుండి భక్తులు వందల వేల మైళ్ళు నడిచి తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునేవారు. విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 1513–1524 సంవత్సరాల మధ్య కాలంలో తన దేవేరులైన చిన్నాదేవి, తిరుమలాదేవిలతో అనేకసార్లు స్వామిని సందర్శించి అమూల్య రత్నఖచిత ఆభరణాలను స్వామికి సమర్పించారు. కృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన కానుకల వివరాలకు సంబంధించి ఆలయంలో యాభై శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలలో మకరకంటి ప్రధానమైనది. నాటి స్వర్ణకారుల కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణానికి వెలకట్టే సాహసం ఎవరూ చేయలేదు. కళింగసామ్రాజ్యాన్ని జయించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతూ 1515 అక్టోబర్ 25న శ్రీకృష్ణదేవరాయలు అరుదైన, అపురూపమైన మకరకంటిని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ ఆభరణం బరువు 31,124 యూనిట్లుగా శాసనాలలో ఉంది. ఈ ఆభరణంలో 10,994 కెంపులు, 754 మణులు, 530 నీలాలు, 930 వజ్రాలు, 3,933 ముత్యాలు, నాలుగు పెద్ద మణులు, వందల సంఖ్యలో పచ్చలు, వైఢూర్యాలు 45, ఎగేట్లు 74, టోపాజ్‌లు పొదిగించి తయారు చేయించారు. 1513 ఫిబ్రవరి 10న కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించిన సమయంలో 3308 క్యారెట్ల నవరత్న కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు. ఈ కిరీటంలో 1076 యూనిట్ల బంగారం వాడారు. దీనితో పాటు 61 క్యారెట్ల పచ్చ, ముత్యాలు, మణులు, నీలాలు పొదిగిన మూడుపేటల కంఠహారాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించారు. రాణి చిన్నాదేవి 374 క్యారెట్లు గల రెండు బంగారు పాత్రలను స్వామివారి ఏకాంత సేవలో పాలు ఇచ్చేందుకు కానుకగా సమర్పించారు. తిరిగి 1513 మే 2న, జూన్ 13న కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి ఉడుదార అనే పేరు గల విలువైన ఆభరణాన్ని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. ఐదు వజ్రాలతో, 17 అడ్డకేసుల ముత్యాలు, కెంపులు, నీలాలు పొదిగిన ఆభరణం అది. ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు ఇచ్చారు. కృష్ణదేవరాయలు పలు విలువైన ఆభరణాలను స్వామి వారికి సమర్పించినట్టు శాసనం వుంది. ∙వజ్రాలు, కెంపులు, నీలాలు, రత్నాలు, ముత్యాలతో పొదిగిన 326 యూనిట్ల బరువు గల బంగారు కత్తి. ∙ కెంపులలో పొదిగిన 132 యూనిట్ల బరువు కలిగిన మరో కత్తి ∙ముత్యాలు పొదిగిన మరో చిన్న కత్తి ∙ముత్యాలు – కెంపులు, వజ్రాలు పొదిగిన పొది ∙87 క్యారెట్ల వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు ఆభరణం ∙వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలు పొదిగిన 573 యూనిట్ల భుజకీర్తులు ∙ప్రతిరోజూ విగ్రహానికి అలంకరించేందుకు మరో మూడు భుజకీర్తులు ∙వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, రత్నాలు పొదిగిన మరో రెండు బంగారు కంఠహారాలు బరువు 481 యూనిట్లు ∙ఉత్సవమూర్తులకు వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగిన మూడు బంగారు కిరీటాలు. ఈ కానుకలన్నీ కృష్ణదేవరాయలు ఒక్కరోజులోనే శ్రీవారికి బహూకరించారు. ∙1514 జూలై 6న కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకొని తన రాజ్యానికి తిరిగి వెళుతూ తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ముప్పయివేల బంగారు వరహాలతో స్వామివారికి కనకాభిషేకం చేశారు. ∙ముత్యాలు, కెంపులు పొదిగిన 250 యూనిట్ల బంగారు హారాన్ని, ఒక జత బంగారు కడియాలను బహూకరించి, తలిలవమా అనే గ్రామాన్ని స్వామి నిత్యసేవకు కానుకగా ఇచ్చారు. ∙రాణి చిన్నాదేవి కూడా అదే రోజు వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన ఒక బంగారుహారాన్ని, రాణీ తిరుమలదేవి వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన 225.5 యూనిట్ల బరువుగల మరో కంఠాహారాన్ని స్వామివారికి కానుకలుగా ఇచ్చారు. స్వామి నిత్యసేవకు ముదియారు అనే గ్రామాన్ని కూడా ఆమె కానుకగా ఇచ్చారు. ∙కళింగదేశాన్ని జయించి సింహాద్రి పాట్నూరులో విజయçస్తంభం నాటించి తిరిగి వస్తూ కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించారు. ఆ సమయంలో రెండు పెద్ద బంగారుహారాలను కానుకగా ఇచ్చి, ఆలయ విమానం బంగారు పూత కోసం మరో 30 వేల బంగారు వరహాలను ఇచ్చారు. ∙1521 ఫిబ్రవరి 17న∙రాణి తిరుమలదేవి, తిరుమలకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తొమ్మిది రకాల మణులతో కూడిన పీతాంబర వస్త్రాన్ని, ముత్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన తలపాగా, నవరత్నాలు పొదిగిన మరో హారాన్ని, ఒక పెద్ద బంగారు హారాన్ని, పదివేల బంగారు వరహాలను కానుకగా సమర్పించారు. ఇవే కాకుండా కృష్ణదేవరాయలు తిరుమల వేంకటేశ్వరునికి కోట్లు విలువ చేసే ఆభరణాలెన్నో కానుకలుగా సమర్పించారు. వందల ఏళ్ళనాటి ఆభరణాలలో కొన్ని ఈనాటికీ స్వామి సన్నిధిలోనే ఉన్నాయి. ∙1740 సంవత్సరంలో మరాఠా రాజు రాఘోజీ భోంస్లే చిత్తూరు జిల్లాలోని దామల్ చెరువు వద్ద నవాబ్ దోస్త్ అలీని ఓడించి చంపేశాడు. ఆ సమయంలో మరాఠా రాజు భోంస్లే తిరుమలలో ఆలయాన్ని సందర్శించి అప్పట్లోనే రూ.33వేలు విలువ చేసే కెంపులు పొదిగిన బంగారుహారాన్ని, రూ. 56వేలు విలువ చేసే రెండు ముత్యాల హారాలను, రూ.8,500 విలువ చేసే కలికి తురాయిని, రూ.45వేలు విలువ చేసే వజ్రాలతో కూడిన ఐదు వరసల ముత్యాల దండను స్వామి వారికి కానుకగా ఇచ్చారు. ఈ కానుకలు ఇప్పటికీ ఆలయంలోని ‘రాఘోజీవారి పెట్టె’లో భద్రపరచినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ ఆభరణాల విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. హిందూ రాజులే కాకుండా, 1820–27 సంవత్సరాల మధ్య మద్రాసు గవర్నర్‌గా ఉన్న లార్డ్ థామస్ మన్రో కూడా స్వామి వారి నిత్యాన్న సేవకు భూమిని కానుకగా ఇచ్చారు. స్వామి మన్రోకు ఒకరోజు కలలో కనిపించడంతో ఆయన కాలినడకన తిరుమలకు వెళ్ళి స్వామిని సేవించి ధన్యుడయ్యాడు. అలా ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అందరూ తరతరాలుగా స్వామివారిని సేవించి తరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం స్వామివారికున్న ఆభరణాలు విలువ లెక్కగట్టే సాహసమే ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. స్వామివారికి ఉన్న ఆభరణాలు, ఆ ఆభరణాలలో పొదిగిన అమూల్యమైన రాళ్ళు ఎన్ని కోట్లు చేస్తాయన్నది ఈ నాటికీ దేవస్థానం దగ్గర లెక్కలు లేవు. ధగద్ధగాయమానం వజ్రకిరీటం తిరుమల శ్రీవారికి గల ఆభరణాలలో కలికితురాయి ‘‘వజ్ర కిరీటం’’. శ్రీవారికి ఏదైనా ఒక పెద్ద ఆభరణం చేయించాలనే ఆలోచనలతో టీటీడీ ఈ వజ్రకిరీటం తయారు చేయించాలని సంకల్పించింది. ప్రపంచమంతా తిరిగి వేలాది వజ్రాలు పరిశీలించి చివరికి బ్రెజిల్, ఆస్ట్రియా వంటి దేశాలలో వజ్రాలు సేకరించింది. అప్పట్లో అరున్నర కోట్ల ఖరీదు చేసిన ఈ వజ్రకిరీటం తయారీకి సుమారు సంవత్సరకాలం పట్టింది. కాగా ఈ వజ్రకిరీటాన్ని అప్పట్లో హడావుడిగా తయారు చేయించడంతో కొన్ని వజ్రాలు సరిగా తాపడం అవలేదు. ఆ కారణంగా ఈ వజ్రకిరీటంలోని కొన్ని వజ్రాలు రాలేందుకు సిద్ధంగా ఉండటంతో 1990 జనవరి నుంచి శ్రీవారికి వజ్రకిరీటం అలంకరించలేదు. అదే ఏడాది సెప్టెంబర్ 22 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటంతో శ్రీవారి వజ్రకిరీటానికి లోపలి వైపు బంగారు రేకు తయారు చేయించి, వజ్రాలు రాలకుండా ఏర్పాటు చేశారు. ఈ వజ్రకిరీటాన్ని తిరిగి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజున శ్రీవారికి అలంకరించారు. ప్రస్తుతం కిరీటం ఖరీదు సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. వజ్రకవచధారి అయిన శ్రీవారు ఈ కిరీటధారణతో వజ్రకిరీటధారిగా తన దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. -
బ్రహ్మోత్సవ పతికి బ్రహ్మాండ నీరాజనం
భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈసారి అక్టోబర్ 10 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంకురార్పణతో ఆరంభం... వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారం నుంచి లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్తికా సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో (కుండలు)– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలైన నవ ధాన్యాలను పోసి ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను అర్పింపచేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం న భూతో న భవిష్యత్ అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీనిని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. ఈ పటాన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండ మీదే ఉంటూ ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు విశదీకరిస్తున్నాయి. పెద్ద శేషవాహనం – మోక్షప్రాప్తి ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరిన ప్రదేశం శేషాద్రి, ధరించేది శేష వస్త్రం, పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు. చిన్న శేషవాహనం రెండోరోజు ఉదయం స్వామి తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. పెద్ద శేషవాహనం ‘ఆదిశేషుడి’గా, చిన్న శేషవాహనం ‘వాసుకి’గా భావించవచ్చు. శుద్ధ సత్వానికి ప్రతీక అయిన పరమశివుని హస్తాభరణంగా, గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో తరిస్తున్నారు. హంసవాహనం – జ్ఞానప్రాప్తి రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్ళు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా హంస వాహనం అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందువల్ల తుచ్ఛమైన కోర్కెలు అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటుతారని ఐతిహ్యం. సింహవాహనం – కీర్తి ప్రతిష్ఠలు బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహ వాహనమెక్కి వేంకటనా«థుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహనాన్ని గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు కనువిందు చేస్తారని ఆర్యోక్తి. ముత్యపు పందిరి వాహనం – శాంతి సౌభాగ్యాలు మూడోరోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి జరిగే సుకుమార సేవగా ముత్యపుపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు. కల్పవృక్ష వాహనం – ఇహపరలోక సుఖం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వేంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యం ప్రసాదిస్తాడు. నాలుగో రోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు. సర్వభూపాల వాహనం – అధికార ప్రాప్తి లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుతీరుతాడు. సర్వభూపాల వాహన సేవ... జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం – అజ్ఞాన నాశనం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదో రోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు. గరుడవాహనం – సాయుజ్య ప్రాప్తి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఐదో రోజు రాత్రి ఊరేగుతాడు. స్వామివారి మూల మూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. వేంకటేశ్వరుడిని అనేక విధాల కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. గరుడునితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహనం – కైంకర్య లాభం ఆరో రోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. స్వర్ణ రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన స్వర్ణ రథోత్సవం ద్వారా తెలియజేస్తాడు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. గజ వాహనం – వైకుంఠ దర్శనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతాడు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం – ఆరోగ్యప్రాప్తి బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసార«థిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగుతాడు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతాడు. చంద్రప్రభ వాహనం – మనోధైర్యం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తాడు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తాడు. రథోత్సవం – సద్విద్యా సాధనం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య గోవిందుడు ఈ ఉత్సవంలో ఊరేగుతాడు. అశ్వవాహనం – మనో నిగ్రహం ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతాడు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం – పాప ప్రక్షాళనం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ధ్వజారోహణం ఉదయం చక్రస్నానం నిర్వహించిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. – తిరుమల రవిరెడ్డి, తిరుపతి -
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
-
సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి
-
తిరుమల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
-
సింహవాహనంపై శ్రీనివాసుడు
-
న్యూజెర్సీలో ఘనంగా శ్రీవారి వైభవోత్సవాలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:ఈవో
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం తిరుమలలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని... 3న ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మూడో తేదీన స్వామివారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకుర 24 గంటలూ ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయని సాంబశివరావు వెల్లడించారు. -
చిన్నశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
-
బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం
-
తిరుమలకు శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ
-
సొంత విద్యుత్‌కు టీటీడీ ప్రణాళిక
సాక్షి, తిరుమల: తిరుమలకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగానే సమకూర్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపకల్పను రూపొందిస్తున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథి గృహంలో విభాగాధిపతులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సుమారు 30 శాతం వరకు పవన విద్యుత్(విండ్ పవర్) ద్వారా సమకూర్చుకుంటున్నామన్నారు. దీంతో పాటు 10 మెగావాట్లను సోలార్ ద్వారా, మరో 7.5 మెగావాట్ల పవన విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచామన్నారు. దీనివల్ల మరో తొమ్మిది నెలల తర్వాత తిరుమలకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగానే సిద్ధం చేసుకునే అవకాశం ఉందన్నారు. భవిష్యత్‌లో టీటీడీ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తుందని, కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండబోదన్నారు. వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పక డ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. వర్షాల కోసం త్వరలోనే వరుణయాగం నిర్వహిస్తామన్నారు. 24న ధర్మకర్తల మండలి సమావేశం ఈనెల 24వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో చర్చించాల్సిన అంశాల ఎజెండాను ఈవో దొండపాటి సాంబశివరావు రూపొందిస్తున్నారు. మంగళవారం హుండీ కానుకలు రూ.3.42 కోట్లు లభించింది. -
సర్వరక్షాకరం...శ్రీవారి చక్రస్నానం
చక్రం పూర్ణత్వానికి ప్రతీక. ఈ విశ్వమంతా చక్రమండలమయమే. ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జలమండలాలన్నీ చక్రాలే! ఒక్కమాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. ఆ చక్రాన్ని ధ్యానించి, అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం భూదేవీ సమేత మలయప్పస్వామివారిని సుదర్శన చక్రత్తాళ్వార్‌తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీచక్రత్తాళ్వార్‌ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టిచక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు. శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రశస్తి ఎంత మహత్తరమో గుర్తిస్తే- చక్రస్నాన మహత్యం భక్తులకు అంతగా స్వానుభవానికి వస్తుంది. శ్రీనివాసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వార్గా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది సుదర్శనమొక్కటే! భక్తై సుఖేన దృశ్యత ఇతి... అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరన్నమాట. శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజించడం ఒక ప్రత్యేకత. దేవశిల్పి అయిన విశ్వకర్మ... సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి, చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి, మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి, కుడిచేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారు. గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు. భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో... దుర్వాసునికి బుద్ధి చెప్పి, అంబరీషుని రక్షించేందుకై శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో, విజ్ఞతతో ప్రవర్తించిందో గమనిస్తే, అది సాక్షాత్తూ నారాయణ రూపమే అని గోచరిస్తుంది. శివబ్రహ్మాదులైన ఏ దేవతలూ ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్నీ పుణికిపుచ్చుకుంది. దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే, భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది. సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు. ధ్వజారోహణం నాడు గరుత్మంతునితోబాటు చక్రత్తాళ్వార్‌నీ ఆహ్వానిస్తారు. అప్పుడు చక్రగద్యంతో స్వాగతం పలుకుతారు. అనంతరం... ‘అఖిల జగదభివృద్ధిరస్తు’ అని మంగళవాచకం చెప్పి, తాళ లయాత్మకంగా ఆహ్వానించి, సుదర్శన దేవతకు ప్రీతికరంగా...‘చక్రస్య షట్పితా పుత్రతాళం స్వస్తిక నృత్తకమ్ శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితమ్’ అని పఠిస్తారు. ఇందుకు తగినట్లే మంగళవాద్యకులు శంకరాభరణం, షట్పితా పుత్రతాళం, స్వస్తిక నృత్తం, చక్రవాద్యం కావిస్తారు. నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు. ఇదే పద్ధతిని అనుసరించి, చక్రగద్యాదికం పఠించి, అర్చించి, ధ్వజావరోహణం నాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు. బ్రహ్మోత్సవ సేవలలో తక్కినవన్నీ ఒక ఎత్తు... చక్రస్నానం ఒక ఎత్తు. శ్రీమన్నారాయణాభేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శచే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతోపాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం. చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి! ఈ స్నాన మహిమ అవాఙ్మానస గోచరం. ఆత్మైక వేద్యం. (రేపు శ్రీవారికి చక్రస్నానం సందర్భంగా) - డాక్టర్ కంపల్లె రవిచంద్రన్ తిరుమల తిరుపతి దేవస్థానం -
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఎటు చూసినా గోవిందనామ స్మరణే.. ఎవరిని కదిలించినా భక్తి భావనే.. దేవదేవుడైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వర్ణరథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.. విద్యుద్దీపాల వెలుగుల మధ్య మిరుమిట్లు గొలుపుతున్న స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. అన్నమయ్య కీర్తనలతో కొన్ని బృందాలు, నృత్యాలతో మరికొన్ని బృందాలు కోలాహలంగా సాగుతుండగా.. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య కరుణావీక్షణాలను ప్రసరిస్తూ సాగిన స్వామివారి విహారం భక్తులను పరవశింపజేసింది. -
స్వర్ణ రథంపై శ్రీవారు
రాత్రి గజ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు గురువారం సాయంత్రం స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత తిరుమలేశుడు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6.50 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణ మధ్య అత్యంత వైభవంగా సాగింది. భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి భక్తశిఖామణి హనుమంతునిని వాహనంగా మలచుకుని భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుపై రారాజు విహారం : రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు గజ వాహనంపై ఆశీనుడై భక్తులకు కనువిందు చేశారు. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తన శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై ఊరేగారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, అధికారులు పాల్గొన్నారు. సరస్వతీదేవిగా దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో గురువారం మూల నక్షత్రం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శ్వేతవర్ణపు చీర ధరించి ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో జపమాలతో హంసవాహనాన్ని అధిరోహించిన సరస్వతీదేవిని వర్షంలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పార్థసారథి సతీసమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి బాలరాజు, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. పూల పల్లకిలో మల్లన్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో కాత్యాయని రూపంలో శ్రీభ్రమరాంబాదేవి దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై ఊరేగుతూ వచ్చి పుష్పపల్లకిని అధిష్టించారు. రాత్రి 8 గంటలకు గంగాధర మండపం నుంచి ప్రారంభమైన పుష్ప పల్లకి ఊరేగింపు అంకాలమ్మగుడి, నందిమండపం మీదుగా రథశాలకు చేరుకుంది. అక్కడి నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయప్రాంగణం చేరుకున్నారు. -
అలిపిరి వద్ద ఉద్రిక్తత
అలిపిరి వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదులు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ ఈ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు రానున్నారు. దాంతో భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు సమైక్యవాదులు చెదరగొట్టారు. ఆ సమయంలో సమైక్యవాదులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో సమైక్యవాదులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే తిరుపతిలో బంద్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు లేక తిరమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే నేడు కూడా తిరుపతి నుంచి తిరుమలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6. గంటల వరకు రాకపోకలు బంద్ అయినాయి. -
తిరుపతిలో యూనియన్ నేతలతో భేటీ కానున్న ఎ.కె.ఖాన్
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతోంది. దాంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపించింది. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఏ.కే.ఖాన్ మంగళవారం చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ కార్మిక నేతలతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం ఆర్టీసీ అధికారులు, యూనియన్ నేతలతో ఖాన్ చర్చలు జరుపుతారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులతో ఖాన్ సమావేశం అవుతారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఉద్యమాల ఉధృతిని తగ్గించడానికి ఎవరైన తమపై ఒత్తిడి పెంచితే సహించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు సోమవారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెల్చి చేప్పారు. ఓ వేళ అలా చేస్తే ప్రస్తుతం తిరుమలకు నడుస్తున్న బస్సులను కూడా నిలిపివేస్తామని వారు ప్రభుత్వానికి ఈ సందర్బంగా హెచ్చరించారు.