Tiger Shroff
-
ప్రముఖ డిజైనర్ దుస్తుల్లో రాయల్‌లుక్‌లో మెరిసిన తారలు
ముంబైలో ఫ్యాషన్ టూర్–2025 సందర్భంగా టైగర్ ష్రాఫ్ . మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారుముంబైలో జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ లో బాలీవుడ్ తారలు టైగర్ ష్రాఫ్ ,మానుషి చిల్లర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేశారు.శనివారం రాత్రి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ముంబైలో అద్భుతంగా జరిగింది. తరుణ్ తహిలియాని కోచర్ మాస్టర్ క్లాస్ లో టైగర్ ష్రాఫ్ మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారు టైగర్ ఎంబ్రాయిడరీ సూట్లో, మనుషి పాస్టెల్ లెహంగాలో ఆకట్టుకున్నారు. ట్రెడిషనల్ హ్యాండ్‌మేడ్, సమకాలీన ఫ్యాషన్ ట్రెండ్ పరిపూర్ణ సమ్మేళనంతో రూపొందించిన దుస్తుల్లో మోడల్స్ హైలైట్‌గా నిలిచారు. ముఖ్యంగా టైగర్, మానుషి ఇద్దరూ ఆత్మవిశ్వాసం, అధునాతనతకు ప్రతి రూపాలుగా ఫ్యాషన్ ఔత్సాహికులను ఆశ్చర్యపరిచారు. ఈ ఫ్యాషన్టూర్కి సంబంధించిన వీడియోను తరుణ్ తహిలియానీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Tarun Tahiliani (@taruntahiliani)ఇదీ చదవండి: సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది! టైగర్ ష్రాఫ్ డీప్ ప్లంజింగ్ సిల్క్ షర్ట్, ఫిట్టెడ్ బ్లాక్ ప్యాంటుతో కూడిన బ్లాక్ ఎంబ్రాయిడరీ సూట్లో మెరిశాడు. ముఖ్యంగా అతని పొడవైన, నల్ల జాకెట్, సంక్లిష్టమైన అలంకరణలు,బోల్డ్ కళ్ళజోడు ,లేయర్డ్ బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ రాజ వైభవాన్ని తెచ్చిపెట్టింది.మరోవైపు, మనుషి చిల్లార్ మృదువైన పాస్టెల్-రంగు లెహంగాలో ఆధునిక మహారాణిలా కనిపించింది. విలాసవంతంగా ఎంబ్రాయిడరీ చేయబడిన స్కర్ట్ అద్భుతంగా కనిపించింది. హెరిటేజ్ పోల్కి, పచ్చ ఆభరణాలతో విశేషంగా నిలిచాయి. చోకర్ ,మాంగ్ టిక్కాతో సహా, సొగసైన బన్ ఆమె రూపానికి రాయల్ లుక్ తీసుకొచ్చింది. -
తండ్రితో పోటీపడిన బుడ్డోడు.. ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?!
ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ (Sonu Nigam) కుమారుడు నీవన్ (Neevan Nigam) గుర్తున్నాడా? తండ్రితో పాటు అనేక వేదికలపై, స్టూడియోలలో ముద్దుముద్దుగా పాడుతూ ఆకట్టుకునేవాడు. ఆన్లైన్ కన్సర్ట్‌లో తండ్రితో కలిసి షో కూడా చేశాడు. ఇప్పుడీ పిల్లవాడు చాలా పెద్దోడయ్యాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు. ఫస్ట్ పోస్ట్‌తోనే అందరినీ ఇన్స్పైర్ చేశాడు.తన రెండేళ్ల ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో మొదట బొద్దుగా, పొట్టతో ఉన్న నివాన్ ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో కనిపించాడు. రెండేళ్లలో నా జీవితాన్నే మార్చేసుకున్నా అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన సోనూ నిగమ్.. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టి ఫస్ట్ పోస్ట్ పెట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కామెంట్ చేశాడు. హీరో టైగర్ ష్రాఫ్.. గ్రేట్ వర్క్ బ్రో అని ఫైర్ ఎమోజీతో కామెంట్ పెట్టాడు. అతడి అంకితభావాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.చదవండి: నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్ -
డబుల్ ధమాకా
పంజాబీ నటి సోనమ్ భజ్వా బాలీవుడ్లో డబుల్ ధమాకా కొట్టారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, సంజయ్‌దత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. తరుణ్ మన్సుఖాని ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సోనమ్ భజ్వా. ఈ చిత్రంలో సోనమ్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకముందే మరో బాలీవుడ్ చిత్రం ‘బాఘీ 4’లో హీరోయిన్గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు సోనమ్ భజ్వా.టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించనుండగా, సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్లో నటిస్తారు. ‘బాఘీ, హౌస్‌ఫుల్’.. ఈ రెండూ బాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీలే. అలాగే ఈ రెండు సినిమాలకు నిర్మాత సాజిద్ నడియాద్ వాలాయే కావడం విశేషం. ‘‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకుండానే, ‘బాఘీ 4’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సోనమ్ భజ్వా. -
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ మంచి మనసు చాటుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న సినిమా టెక్నీషియన్ రవి కుమార్‌కు ఆర్థిక సాయం చేశాడు. టైగర్ ష్రాఫ్ తొలి సినిమా 'హీరోపంతి'కి రవి కుమార్ ఫోకస్ పుల్లర్ (అసిస్టెంట్ కెమెరామన్)గా పని చేశాడు. తాజాగా రవి కుమార్ మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్‌తో మా అన్న ప్రసాద్ కలిసి పని చేశాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో మా అన్న చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆపరేషన్‌కు జాకీ సర్ సాయం చేశాడు.అప్పుడు ఆయన.. ఇప్పుడు..ఇప్పుడు ఆయన కుమారుడు నాకు సాయపడ్డాడు. నేను హీరోపంటి సినిమాకు వర్క్ చేశాను. అలా ఆయన నాకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. టైగర్ తల్లి ఆయేషా ష్రాఫ్ నాకు మంగళవారం ఫోన్ చేసి మాట్లాడింది. టైగర్ ఫస్ట్ సినిమాకు నేను పని చేశానని బహుశా తనకు గుర్తుండకపోవచ్చు. అయినా మంచి మనసుతో నన్ను ఆదుకున్నాడు అని తెలిపాడు.దాచుకుందంతా అయిపోయిందికాగా రవి కుమార్ పని చేస్తున్న పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఇంకా జీతం అందలేదని తెలుస్తోంది. ఓ పక్క రావాల్సిన డబ్బు ఆగిపోగా, మరోపక్క యాక్సిడెంట్ వల్ల ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితమైన పరిస్థితి! దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోవడంతో సాయం కోసం ఎదురు చూశాడు. ఇంతలోనే టైగర్ ష్రాఫ్ పెద్ద మనసుతో అతడి చికిత్సకు, ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బు సమకూర్చాడు. అది లక్షల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: ఆ స్టార్ హీరోల ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్ -
రకుల్ భర్త జాకీ భగ్నానికి అండగా నిలిచిన అక్షయ్ కుమార్
అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడేమియా ఛోటేమియా’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే నష్టాలు మిగిలాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషి చిల్లర్, అలయా ఎఫ్ ,ఇమ్రాన్ హష్మి, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.‘బడేమియా ఛోటేమియా’ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సంస్థపై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, ఆయన తండ్రి వాసు భగ్నానీ అనేక చిత్రాలను నిర్మించారు. కానీ, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం కోసం రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో వారికి కేవలం రూ. 110 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు కూడా పూర్తి చెల్లింపులు చేయలేకపోయింది. బాలీవుడ్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనుసు చేసుకొని తమకు అండగా నిలిచారని ఆ చిత్ర నిర్మాత కుమారుడు జాకీ భగ్నాని తాజాగా తెలిపారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని ఆయన అన్నారు. అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్‌కే ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయినా సరే తనను నమ్మి సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఇబ్బందులో పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వారి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ముందకు వచ్చారట.ఈ క్లిష్ట సమయంలో తన సహాయాన్ని అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జాకీ భగ్నాని కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్ తనని ఇటీవల కలిశారని పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారని జాకీ తెలిపాడు. 'అక్షయ్ సర్ .. కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు. మా పట్ల ఆయన చూపించిన ప్రేమకు మేము చాలా కృతజ్ఞులం' అని జాకీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం!
భారీ బడ్జెట్ సినిమాలు క్లిక్కయితే లాభాల వరద పారుతుంది.. తేడా వచ్చిందంటే మాత్రం రక్తకన్నీరు కారుతుంది. చాలా సినిమాల విషయంలో ఇది రుజువైంది కూడా! బాలీవుడ్ బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్కు ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, తన తండ్రి వాసు భగ్నానీతో కలిసి ఈ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.రూ.250 కోట్ల అప్పు.. అయినా..ఈ బ్యానర్లో ఇటీవల బడే మియా చోటే మియా, గణపత్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలకుగానూ అతడికి రూ.165 కోట్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. అది కూడా కంపెనీపై అధిక భారానికి కారణమైందన్నది చర్చ! తాజాగా దీనిపై నిర్మాత సునీల్ దర్శన్ స్పందించాడు.అప్పట్లో సక్సెస్..మీరు అనుకుంటున్న మొత్తానికి కాస్త అటూఇటుగా హీరో టైగర్ ష్రాప్‌కు రెమ్యునరేషన్ చెల్లించాం. అయితే అదెంత అనేది బయటకు చెప్పలేను. కానీ ఓ విషయం చెప్పాలి.. 1990'స్లో వాసు భగ్నానీ.. డేవిడ్ దావణ్‌తో కలిసి అర డజను సినిమాలు చేసి సక్సెస్ రుచి చూశాడు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి! ఇప్పుడు వారి స్ట్రాటజీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇకపోతే పూజా బ్యానర్లో అక్షయ్ కుమార్.. బడే మియా చోటే మియా, బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, కట్‌పుత్లి సినిమాలు చేశాడు.చదవండి: -
ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్ సినిమా
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో ఉన్న అక్షయ్‌కుమార్ ‘బడేమియా ఛోటేమియా’తో హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం మారలేదు. మరో డిజాస్టర్ ఆయన ఖాతాలో చేరిపోయింది. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాకు కేవలం రూ. 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తే.. సానాక్షి సిన్హా ఓ కీలక పాత్రలో కనిపించింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో భారీ తారాగణంతో పాటు కావాల్సినంత సాంకేతిక హంగులు, మంచి లొకేషన్లు ఉన్నాయి. యాక్షన్ సీన్స్‌లలో గన్నులు, ట్యాంకర్లు, హెలికాఫ్టర్లు అడుగడుగునా ఉపయోగించి భీకర పోరాటాలు చేసినా సరైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్ అయింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బడేమియా ఛోటేమియా'ను ఇంట్లోనే చూసేయండి. -
ఫిట్నెస్ ఫ్రీక్,స్టార్ కిడ్ కృష్ణ ష్రాఫ్: క్రేజీ ఫోటోస్
-
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్‌వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లాగా సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
దిల్ సే సోల్జర్స్... దిమాక్ సే సైతాన్స్!
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ చిత్రం ‘బడే మియా చోటే మియా’. మానుషీ చిల్లర్, ఆలయ హీరోయిన్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ , సోనాక్షీ సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వసు భగ్నాని, దీప్సిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరు నువ్వు..’, ‘ప్రళయం నేను..’, ‘ప్రపంచం ఇలాంటి ఓ యుద్ధాన్ని ఇప్పటివరకూ చూసి ఉండదు. మీ దగ్గర మూడే రోజులు ఉన్నాయి. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిందే’, ‘అలాంటి ఓ సైకోని పట్టుకోవాలంటే ... ఆ సైకోను మించి సైకోలుగా మేం మారాల్సిన అవసరం ఉంది’, ‘దిల్ సే సోల్జర్స్.. దిమాక్ సే సైతాన్స్ హై ఓ’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఓ సైకో సైంటిస్ట్‌ను ఇద్దరు భారత సోల్జర్స్ ఏ విధంగా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథ. -
యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. 'బడే మియా చోటే మియా' వచ్చేస్తున్నారు!
ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. REAL ACTION ka ek bada dose lekar aa rahe hain #BadeMiyanChoteMiyan!#BadeMiyanChoteMiyanTrailer out on March 26! 👊 🤜🤛 IN CINEMAS ON 10th APRIL! #BadeMiyanChoteMiyanOnApril10 #BadeMiyanChoteMiyanOnEid2024 pic.twitter.com/Wzw1BbpwYf — Akshay Kumar (@akshaykumar) March 23, 2024 -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. జోష్‌గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్‌తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్‌లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. -
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్‌తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్‌కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్‌పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్‌నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్‌పై ధనుష్ కామెంట్ -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
బడే మియా ఛోటే మియా మూవీ టీజర్
-
'మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..' బాలీవుడ్ మూవీ టీజర్ చూశారా?
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. ఇందులో అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్లో రిలీజ్ డేడ్ను కూడా ప్రకటించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కానుంది. టీజర్ రిలీజ్ గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. "ప్రళయం రాబోతోంది.. ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను మార్చేస్తుంది... ఆ మహా ప్రళయం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలను శాశ్వతంగా నిర్ములిస్తుంది. హిందుస్తాన్ నాశనమైపోతుంది. మమ్మల్నెవరు ఆపుతారు? అన్న డైలాగ్ వినిపిస్తుంది. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం.. సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగిన ఇద్దరు హీరోలను చూపిస్తారు. 'సైనికుడి వీరత్వం, సైతాన్ క్రూరత్వం మా సొంతం. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం' అనే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రంజాన్‌కు పెద్దోడు.. చిన్నోడు...
రంజాన్‌కు థియేటర్స్‌కు వస్తున్నారు ‘బడే మియా చోటే మియా’ (పెద్దోడు.. చిన్నోడు). అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘బడే మియా చోటే మియా’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షీ సిన్హా, మానుషీ చిల్లర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్కాట్లాండ్, యూఎస్, ఇండియా, లండన్ వంటి లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు, ఈ ఏడాది రంజాన్ సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రపంచం అంతం అవుతుందన్నప్పుడు మా హీరోలు మాత్రం రైజ్ అవుతుంటారు’ అనే క్యాప్షన్‌ని ఈ పోస్టర్‌కు జత చేశారు. -
ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!
దసరా సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటితో పాటే సందట్లో సడేమియా అన్నట్లు బాలీవుడ్ నుంచి 'గణపథ్' మూవీ కూడా రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ కాగానే దీన్ని ప్రభాస్ 'కల్కి'తో దీన్ని పోల్చారు. తీరా చూస్తే డిజాస్టర్ కా బాప్ అనేలా టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ అయితే ఘోరం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) 'గణపథ్' కథేంటి? అది 2060 సంవత్సరం. ప్రపంచం రెండుగా విడిపోయుంటుంది. సిల్వర్ సిటీలో కేవలం ధనవంతులే ఉంటారు. ఇక్కడ మనుషుల కంటే రోబోలు, డ్రోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. గరీబొంకి బస్తీలో పేదవాళ్లు మాత్రమే ఉంటారు. తమని కాపాడేందుకు గణపథ్ వస్తాడని వేయి కళ్లతో వీళ్లు ఎదురుచూస్తుంటారు. అయితే డబ్బునోళ్ల వైపు ఉన్న గణపథ్(టైగర్ ష్రాఫ్).. పేదవాళ్లవైపు ఎలా వచ్చాడు? అనేదే స్టోరీ. ఎలా ఉంది? ఈ డైరెక్టర్ ఎవడో గానీ సినిమాతో ప్రేక్షకులకు నరకం అంటే చూపించాడు. ట్రైలర్ చూసి అందరూ 'కల్కి'తో పోలికలు ఉన్నాయన్నారు గానీ అంత సీన్ లేదు. హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన మ్యాడ్ మాక్స్, డ్యూన్, ఎలిసియం లాంటి సినిమాల్ని 'గణపథ్' కోసం డిటోకి డిటో దర్శకుడు కాపీ కొట్టేశాడు. అమితాబ్ లాంటి స్టార్‌ని ఒక్క శాతం కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక హీరో అయితే బాడీ ఉంది కదా అని అవసరమున్నా లేకపోయినా చూపిస్తూనే పోయాడు. అది అయితే చిరాకు తెప్పించింది. ఓవరాల్ గా థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకుడు.. చివరివరకు కూర్చుంటే గ్రేట్ అనేంత డిజాస్టర్ కా బాప్, పెద్ద కళాఖండం ఈ సినిమా. ఇకపోతే తొలిరోజు రూ 2.5 కోట్లు వచ్చాయి. టైగర్ ష్రాఫ్ కెరీర్ లో ఇది చాలా తక్కువ. అలా కూడా చెత్త రికార్డ్ సెట్ చేశాడీ హీరో. (ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!) -
కొత్త బాయ్ ఫ్రెండ్‌తో స్టార్ హీరోయిన్.. అతడిని వదిలేసి!?
స్టార్ హీరోయిన్ దిశా పటానీ తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే తనతో పాటు కలిసి నటించిన ఓ హీరోతో ఈమె గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు తెగ రూమర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి పార్టీలో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరతడు? ముంబయి బ్యూటీ దిశా పటానీ.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఈమె చాలాకాలం నుంచి రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి: నటి పవిత్ర లోకేష్‌కు బిగ్ షాక్...) ఎందుకంటే 2018లో 'భాఘీ 2' వచ్చింది. దీని తర్వాత దిశా-టైగర్ కలిసి ఒక్క సినిమా మాత్రమే చేశారు. కానీ పార్టీలు-పబ్బులు-ఈవెంట్స్ అని ఎక్కడి పడితే అక్కడ కనిపించేవారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా సరే డేటింగ్ చేస్తున్నారా అనిపించేది. అలాంటిది వీళ్లకు బ్రేకప్ అయిందని గతేడాది రూమర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత పలు సందర్భాల్లో టైగర్.. దిశా తనకు ఫ్రెండ్ లాంటిదని చెప్పుకొచ్చాడు. అయితే దిశా-టైగర్ ష్రాఫ్ విడిపోలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాంటిది దిశా ఇప్పుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో ఓ పార్టీలో కనిపించింది. అతడిని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆమె.. కొత్త బాయ్ ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసేసిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి టైగర్ పరిస్థితి ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. దిశా కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఎవరో కాదు టైగర్ ఫిట్నెస్ కోచ్. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్) -
జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర అక్షరాలా..
Tiger Shroff BMW: బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'టైగర్ ష్రాఫ్' (Tiger Shroff) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆయన ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మూవీజ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఇందులో కారుని స్పష్టంగా చూడవచ్చు. టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్ఐ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 258 పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!) డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, 190 పీఎస్ పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటాకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ లభిస్తాయి. -
గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. అయితే గతంలో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఈ బాలీవుడ్ బ్రేకప్ చెప్పేసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ తాను సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) అయితే తాజాగా ఓ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశా పటానీ, ఆమె మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ జంటగా కనిపించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఈ మాజీ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దిశా, టైగర్ మళ్లీ కలిసిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా దిశా పటానీ విష్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ లవర్‌కు విషెస్ చెప్పింది. కాగా.. దిశా పటాని ప్రస్తుతం యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్, బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) Tiger and Disha together again 😍#TigerShroff #DishaPatani pic.twitter.com/LrThURuSgO — $@M (@SAMTHEBESTEST_) July 2, 2023 Disha Patani with Tiger Shroff @DishPatani @iTIGERSHROFF #DishaPatani #TigerShroff pic.twitter.com/gChdDXIVS7 — Disha Patani Fan Club ❤️ (@satyam20157) July 1, 2023 View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారంపై క్లారిటి ఇచ్చిన తల్లి
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్‌లో ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్.. కానీ బ్రేకప్ చెప్పుకున్నారంటూ బీటౌన్‌లో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. వారిద్దరూ మౌనంగా ఉన్నప్పటికి, టైగర్ తల్లి అయేషా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో క్లారటీ ఇచ్చింది. టైగర్, దిశా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడల్లా తాను నవ్వుకుంటానని, సరదాగా ఉంటుందని వెల్లడించింది. (చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్? ) అంతేకాక దిశాతో టైగర్ డేటింగ్ అనేది నిజం కాదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘దిశతో టైగర్ డేటింగ్ అనే దాంట్లో వాస్తవం లేదు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఆ రూమర్‌ని నమ్మొద్దు. దిశాతో నాకు కూడా మంచి స్నేహం ఉంది’ అని అయేషా చెప్పుకొచ్చింది. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) ఇక టైగర్ నటించిన సినిమాల్లో వార్, హీరోపంతి2 సినిమాలంటే ఇష్టమని తెలిపింది. దిశా పటానీకి టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా తనూ వెళ్తూ ఉంటుంది. ఇలా చక్కగా వారి కుటుంబంతో కలిసిపోయేది. కానీ ఈ రూమర్స్ వల్ల ప్రస్తుతం దూరంగా ఉంటుందని టాక్. ఏదేమైనా బాలీవుడ్లో చూడచక్కని ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. పుకార్లను పక్కన పెడితే వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. గాయపడ్డ స్టార్ హీరో అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ గాయపడ్డారు. షూటింగ్ సెట్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా అనుకోకుండా అక్షయ్‌కు గాయమైంది. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్లో బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో భాగంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్ సీన్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ అక్షయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించడం విశేషం. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్, టైగర్లతో పాటు సోనాక్షి సిన్హా ఇందులో నటిస్తుంది. ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు మూవీ టీం స్కాట్లాండ్కు పయనమయ్యారు. -
ఫారిన్ స్టోరీ.. బాలీవుడ్ మూవీ
విదేశీ కథలపై హిందీ దర్శక–నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది విదేశీ చిత్రాలు రీమేక్ రూపంలో హిందీ తెరపై కనిపించనున్నాయి. ఆ ఫారిన్ చిత్రాల్లోని కథలు ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటంతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఫారిన్ స్టోరీతో రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. స్పానిష్ స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామా ‘చాంపియన్స్’ (2018) హిందీ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా కోసం ఆమిర్, సల్మాన్‌లు కలిసి చర్చించుకున్నారు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారట. ఒకవైపు ఈ రీమేక్ గురించి చర్చిస్తూనే మరోవైపు సౌత్ కొరియన్ డిటెక్టివ్ డ్రామా ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ దర్శక –నిర్మాత అతుల్ అగ్ని హోత్రి దక్కించుకున్నారు. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ (2015) హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ రీమేక్‌కి అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే షూటింగ్ ఆరంభించలేదని టాక్. కాగా, ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ట్రాన్స్పోర్టర్’ (2002) హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు నిర్మాత విశాల్ రానా. ఇందులో హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అమెరికన్ సూపర్‌హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ర్యాంబో’ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్నారని ప్రకటన వచ్చిoది. ఇక షాహిద్ కపూర్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)కు రీమేక్ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అదే విధంగా సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ (2011) హిందీ రీమేక్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘కోడ’ (2021) రీమేక్‌ను దర్శకుడు విశాల్ బాల్ తెరకెక్కించనున్నారని, అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ (2003) రీమేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా విదేశీ చిత్రాల హిందీ రీమేక్ జాబితాలో మరికొన్ని కూడా ఉన్నాయి. -
ఆ ముగ్గురిలో ప్రభాస్‌నే పెళ్లాడతా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటిసారి ప్రభాస్‌తో నటిస్తోంది భామ. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్‌తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ నటి కావడంతోనే కృతిసనన్ బాగా ఫేమస్ అయింది. (చదవండి: ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్) దీంతో ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్‌కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్ కూడా' అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. 'కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్, టైగర్‌తో డేటింగ్. ఇక ప్రభాస్‌తో పెళ్లి' అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ. ప్రస్తుతం ఆమె భేదియా(తోడేలు) ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నారు. If ever get a chance I will marry #Prabhas. -@kritisanon ❤ Ok ika fix aipondi North Vadina ani 🥳🥳🥰 #Prakrithi pic.twitter.com/Q67ppL7WIy — Dps Nayak™ 💔 (@NayakTweetz) November 25, 2022 -
ఆ హీరో చేసిన పనికి ఆగిపోయిన రష్మిక సినిమా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‌తో రష్మిక క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. సౌత్ సహా నార్త్‌లోనూ వరుస ఆఫర్లతో యమ బిజీగా అయిపోయింది ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు గట్టి షాక్ తగిలింది. ఆమె నటిస్తున్న సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఇంతకీ ఏమైందంటే.. టైగర్ ష్రాఫ్‌తో కలిసి రష్మిక 'స్క్రూ ఢీలా' అనే చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం టైగర్‌కు రూ 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేశాడు. అయితే షూటింగ్ మొదలయ్యాక టైగర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని కరణ్ అతన్ని కోరాడట. ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని కరణ్ అడిగాడట. ఇందుకు ఇందుకు టైగర్ ససేమీరా అనడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు బీటౌన్ టాక్. దీంతో టైగర్ చేసిన పనికి రష్మికకు కూడా మంచి ఛాన్స్ మిస్సయినట్లైంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 'ఆంటీ' అంటూ ట్రోలింగ్.. పోలీస్ కంప్లైట్ ఇచ్చిన అనసూయ -
ప్రియుడితో బ్రేకప్!.. హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
బాలీవుడ్ క్రేజీ కపుల్ టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ జోడీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కలిసి పార్టీలు, వెకేషన్లతో బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్న టైగర్-దిశా పటానీ మధ్య ఏమైందో తెలియదు గానీ కొంతకాలంగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట. దీంతో రీసెంట్గా ఎవరి దారులు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. దీంతో అతడితో దిశా బ్రేకప్ చేసుకుందట. ఇక టైగర్‌తో బ్రేకప్ రూమర్స్ మధ్య తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఏముందంటే.. "మీకు తెలిసిన ప్రతిదానిపై మీరు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అని ఎవరూ చెప్పకపోయినా సరే మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి'' అంటూ దిశా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రియుడు టైగర్‌తో బ్రేకప్ నడుమ దిశా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఆ హీరోయిన్‌తో బ్రేకప్, వెంటనే మరొకరితో హీరో డేటింగ్?
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఆమెకు దూరమైన సమయంలో టైగర్ మరో నటికి దగ్గరయ్యాడంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసనోవా మ్యూజిక్ వీడియోలో తనతో పాటు కలిసి నటించిన ఆకాంక్ష శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ 2.0 మ్యూజిక్ వీడియోలో కూడా కలిసి నటించారు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆకాంక్షతో ప్రేమలో పడలేదని క్లారిటీ ఇచ్చిన టైగర్.. దిశాతో బ్రేకప్ నిజమేనా? కాదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ త్వరలో ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా, రాంబో చిత్రాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ పెళ్లి ఆలోచనలు లేవు.. మలైకాతో రిలేషన్‌పై హీరో కామెంట్స్ -
బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే!
హిందీ చిత్రపరిశ్రమలోని అందమైన జంటల్లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ పెయిర్ ఒకటి. సినిమాల్లో వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి టైగర్ ష్రాఫ్-దిశా పటానీ డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత కొంత కాలంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. టైగర్ ష్రాఫ్-దిశా బ్రేకప్ చెప్పుకున్నట్లు గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలతో వారి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్ ఇదిలా ఉంటే మరోవైపు వారిద్దరి రిలేషన్ సరిగ్గానే ఉందని ఇటీవల టైగర్ షేర్ చేసిన ఓ వీడియో పోస్ట్ చెబుతోంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న వీడియోను టైగర్ ష్రాఫ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. 'నిజానికి ఇవాళ ట్రైనింగ్ తీసుకున్నట్లు లేదు. ఎందుకంటే తమను కొట్టాల్సిందిగా వారు చెప్పారు. అది నా ఐడియా అయితే కాదు' అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని దిశా పటానీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, రిప్లై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిశా పటానీ రిప్లైతో వారి మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఇక వారు డేటింగ్లో ఉన్నారా? లేదా బ్రేకప్ చెప్పుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
ఆరేళ్ల లవ్వాయణానికి బ్రేక్, స్టార్ జంట బ్రేకప్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్‌లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్. అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ వీరు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. వాళ్ల మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయని, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. ఇక దిశా పటానీ టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా వెళ్తూ అతడి కుటుంబంతోనూ చక్కగా కలిసిపోయేది. ఏదేమైనా చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించని వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూ వారి పోస్ట్‌లకు కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా సినిమలతో బిజీ ఉన్నాడు. దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ -
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
Rashmika Mandanna Shoot With Tiger Shroff: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల రష్మిక మందన్నాపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక రూమర్ నిజమే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. రష్మిక మందన్నా, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఒక యాడ్‌లో కలిసి నటించారు. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ స్టోరీని టైగర్ ష్రాఫ్ షేర్ చేస్తూ 'షూట్ చేయడం సరదాగా ఉంది. నువ్ ఎప్పటిలాగే అదరగొట్టావ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. సో.. రష్మిక నిజమని చెప్పిన రూమర్ ఇదన్నమాట. చదవండి: అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ View this post on Instagram A post shared by 🆃🅸🅶🅴🆁🆂🅷🆁🅾🅵🅵 (@tigershroff_fp__) -
ఆడిషన్స్ ఇచ్చా కానీ.. రెండుసార్లు రెజెక్ట్ చేశారు: ప్రముఖ హీరో
Tiger Shroff Says Hollywood Is His Goal But I Have Failed In Auditions: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటించిన చిత్రం 'హీరోపంతి 2'. 2014లో వచ్చిన రొమాంటిక్-యాక్షన్ మూవీ 'హీరోపంతి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్గా యాక్ట్ చేసింది. సాజిద్ నడియద్వాలా నిర్మించగా, ఇందులో లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో 'మీరు హాలీవుడ్‌కు వెళ్లే సమయం వచ్చిందా' అని అడిగిన ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ ఆసక్తిర విషయాలు తెలిపాడు. 'హాలీవుడ్లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది. అయితే హాలీవుడ్ నుంచి నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు సార్లు ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు టైగర్ ష్రాఫ్. కాగా సైబర్ నేరాలను అరికట్టేందుకు లైలాతో బబ్లూ (టైగర్ ష్రాఫ్) అనే వ్యక్తి ఎలా తలపడ్డాడనేదే 'హీరోపంతి 2' కథ అని తెలుస్తోంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ హీరోను నామినేట్ చేసిన సమంత.. ఎందుకో తెలుసా ?
మనకు ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి విన్నాం. ఇప్పుడు సెలబ్రిటీల్లో 'ఎటాక్ ఛాలెంజ్' నడుస్తోంది. ఈ ఎటాక్ ఛాలెంజ్‌తో సినీ తారలు మరింత ఫిట్‌గా మారనున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్ కొటేషన్స్, టూర్ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్‌లతో నిత్యం అలరిస్తూనే ఉంటుంది సామ్. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వర్క్ అవుట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సామ్ హై ఆక్టేన్ వర్క్ అవుట్ చేస్తూ కనువిందు చేసింది. చదవండి: అందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: సమంత ఈ వర్క్ అవుట్ వీడియోను ఎటాక్ ఛాలెంజ్‌లో భాగంగా షేర్ చేసింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేసింది. 'నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్ ష్రాఫ్. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేస్తున్నా. చూద్దాం మీరు ఎలా చేస్తారో.' అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు 'నేను కచ్చితంగా ఇలా చేయలేను' అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ ఎటాక్ ఛాలెంజ్‌ను టైగర్ ష్రాఫ్‌కు కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సవాలు విసిరింది. తర్వాత వారి వెర్షన్లను చూపించమని సమంత, నిర్మాత జాకీ భగ్నానీలను నామినేట్ చేశాడు టైగర్ ష్రాఫ్. చదవండి: సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన చిత్రం 'ఎటాక్: 1'. లక్ష్య రాజ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రకుల్ ప్రీత్, జాక్వెలిన్ ఈ 'ఎటాక్ ఛాలెంజ్'ను నిర్వహించారు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్
Tiger Shroff Shares Heropanti 2 New Look: బాలీవుడ్ యాక్షన్ హీరోగా జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ పేరుపొందాడు. 'హీరోపంటి' సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన ఈ యంగ్ యాక్షన్ హీరో బాఘీ, బాఘీ 2, బాఘీ 3, వార్ చిత్రాలతో అలరించాడు. మరోసారి తన యాక్షన్ విన్యాసాలతో అబ్బురపరిచేందుకు రెడీ అవుతున్నాడు. టైగర్ తొలి చిత్రమైన హీరోపంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న హీరోపంటి 2 కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ భారీ యాక్షన సీక్వెన్స్‌ను రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలోని ఓ భారీ పోరాట సన్నివేశం కేసం అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు టైగర్ ష్రాఫ్. 'హీరోపంటి స్థాయిని ఈ షెడ్యూల్ రెట్టింపు చేసింది. అత్యంత ఛాలెంజింగ్ సీక్వెన్స్‌లలో ఒకదాని కోసం షూటింగ్ చేస్తున్నాం. దాని గ్లింప్స్ షేర్ చేసుకునేందుకు వేచి ఉండలేను.' అని టైగర్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తుండగా తారా సుతారియా హీరోయిన్గా నటిస్తోంది. అయితే టైగర్ పోస్ట్‌కు 'వేచి ఉండలేను' అని కామెంట్ చేసింది బీటౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని. టైగర్ ష్రాఫ్, దిశా రిలేషన్లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్‌కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు -
సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్‌కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు
Tiger Shroff Got Eye Injury During Ganapath Movie Shoot: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గణపత్: పార్ట్ 1' (Ganapath Movie). ఇందులో టైగర్‌కు సరసన బీటౌన్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూకేలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం మొదటి భాగం 2022 డిసెంబర్లో విడుదల కానుంది. యాక్షన్ స్టంట్స్‌తో అలరించే టైగర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలో తను చేసే యాక్షన్ సీన్స్‌ను చిన్నపాటి వీడియో రూపంలో పంచుకుంటూ అభిమానులకు టచ్‌లో ఉంటాడు టైగర్. తాజాగా టైగర్ ష్రాఫ్ తనకు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కంటికి స్వల్ప గాయమైనట్టు ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. దీనికి 'షిట్ హ్యాపెన్స్.. గణపత్ ఫైనల్ కౌంట్‌డౌన్' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు టైగర్. ఈ గాయం గణపత్ షూటింగ్లో జరిగినట్లుగా తెలుస్తోంది. యూకేలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. దానికి అనూహ్య స్పందన వచ్చింది. అంతకుముందు ఈ సినిమా కోసం తాను ఎలా సిద్ధం అవుతున్నాడో తెలిసేలా పలు గ్లింప్స్‌ను కూడా షేర్ చేశాడు టైగర్. గణపత్ సినిమాలో టైగర్.. బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో టైగర్‌కు తండ్రిగా నటించేందుకు బిగ్‌బీ అమితాబ్‌ను సంప్రందించిందటా మూవీ యూనిట్. అయితే దీనికి సంబంధించిన ఏ విషయం అధికారికంగా వెలువడలేదు. టైగర్ నటిస్తున్న మరో సినిమా 'హీరోపంటి 2' కూడా 2022 డిసెంబర్లోనే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ చెల్లెలి హాట్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ -
మైనస్ 1 డిగ్రీ చలిలో.. షర్ట్ తీసేసి పరుగులు పెడుతున్న హీరో.. వీడియో వైరల్
గతంలో సినిమా హీరోలు నటన, డాన్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ట్రెండ్ మారుతుండడంతో కాలానుగుణంగా హీరోలలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం హీరోలు తమ శరీరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఒకప్పుడు సిక్స్ ప్యాక్ హీరోల జాబితాలో ఒకరో ఇద్దరో ఉంటే ప్రస్తుతం చాలా మంది ఆ జాబితాలో చేరిపోయారు. ఇక ప్రత్యేకంగా బాలీవుడ్లో.. టైగర్ ష్రాఫ్ తన బాడీ ఫిట్‌గా ఉంచడంలో ఏ మాత్రం రాజీ పడడన్న విషయం తెలిసిందే. అలా శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టే బీ టౌన్లో రకరకాల స్టంట్స్ చేస్తూ యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా టైగర్ ‘గణ్‌పత్’ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ అంతటి చలి వాతావరణంలో కూడా ఉదయాన్నే లేచి షర్టు లేకుండా కేవలం షార్ట్స్ ధరించి అలా జాగింగ్ చేశాడు. ఆ వీడియోని తన ఇన్‌స్టా అకౌంట్లో షేర చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అందులో దిషా పటానీ.. ‘లోల్’, రకుల్.. ‘వావ్! అంత చలిలో ఎలా?’ అంటూ స్పందించారు. ‘గణ్‌పత్’ చిత్రంలో టైగర్ సరసన కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రం జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరు హీరోపంతీ అనే సినిమాలో కలిసి నటించారు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) చదవండి: Vicky Kaushal-Katrina Kaif: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన కత్రినా, విక్కీ కౌశల్ -
టైగర్ ష్రాఫ్ చెల్లెలి హాట్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్
Tiger Shroff Sister Krishna Shroff Hot Photoshoot Goes Viral: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె తన తండ్రి జాకీ ష్రాఫ్, సోదరుడు టైగర్ ష్రాఫ్‌ల బాలీవుడ్ స్టార్ కాదు. కానీ ఆమెకు గణనీయమైన అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తన టోన్డ్ బికినీ బాడీ చిత్రాలతో ఇన్‌స్టా గ్రామ్‌లో హీట్ పెంచుతూ ఉంటుంది. ఇటీవలే ఆమె 'రాశీ సూద్' పంజాబీ సాంగ్ 'కిన్ని కిన్ని వారి'లో డెబ్యూగా నటించింది. అలాగే కృష్ణ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక ఫొటోషూట్‌కు కృష్ణ హాట్‌హాట్‌గా ఫోజులివ్వడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) కొన్ని మ్యాగజైన్ల కవర్‌పై వచ్చిన కృష్ణ ష్రాఫ్ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బోల్డ్ ఫొటోషూట్ కోసం 28 ఏళ్ల కృష్ణ మొత్తం బ్లాక్ డ్రెస్‌లో హాట్‌గా ఫొజులిచ్చింది. ఆమె రాకీస్టార్ బాడీసూట్ ధరించి మోకాళ్ల వరకు ఎత్తైన బూట్లను మ్యాచింగ్‌గా వేసుకుంది. ఈ ఫొటోపై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ 'వావ్' అని కామెంట్ చేసింది. దిశా పటానీకి, టైగర్ ష్రాఫ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు రావడం తెలిసిందే. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) కృష్ణ ష్రాఫ్ తన డ్రెస్సింగ్, ఫ్యాషన్, ఫొటోషూట్ల విషయంలో విభిన్న శైలీ కలిగి ఉంది. అందుకే ఆమె ఏం పోస్ట్ చేసిన ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కృష్ణకు ఆమె సోదరుడు, తండ్రిలా బాలీవుడ్‌లోకి వచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. అయినా ఆమె తాజా పోస్ట్‌లు, ఫొటోషూట్లతో తనకు విపరీతంగా అభిమానులు పెరిగారు. కృష్ణ ష్రాఫ్ ముంబైలోని ఎమ్ఎమ్ఎ మ్యాట్రిక్స్ ఫిట్నెస్ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తుంది. -
‘జేమ్స్ బాండ్’ కోసం లండన్ థియేటర్ మొత్తం బుక్ చేసిన బాలీవుడ్ నిర్మాత
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరోపంతి 2’. లండన్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం గురువారం విడుదలై జేమ్స్ బాండ్ సిరీస్ ‘నో టైమ్ టు డై’ సినిమాను అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసింది. ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చూసేందుకే నిర్మాత సాజిద్ నడియద్వాలా ‘హీరోపంత్ 2 మూవీ టీం, క్రూడ్ కోసం ఏకంగా లండన్‌లోని థియేటర్ మొత్తం బుక్ చేశాడట. లండన్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెలబ్రెషన్స్‌లో భాగంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి చిత్రం బృందంతో కలిసి ఆయన సినిమా చూశాడు. చదవండి: ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు నిర్మాతతో పాటు హీరో టైగర్ ష్రాఫ్, నటి తార సుతరియా, డైరెక్టర్ అహ్మద్ ఖాన్‌తో పాటు మిగతా తారగణం, క్రూడ్ ఉన్నారు. నెల రోజుల పాటు లండన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ‘హీరోపంత్ 2’ టీం ఈ నేపథ్యంలో ‘నో టైమ్ టూ డై’ సినిమాను చూసి సెలబ్రెట్ చేసుకున్నారు. కాగా ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హీరోపంత్ 2’ వచ్చే ఏడాది మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా! -
అప్పులపాలు, ఇల్లు కోల్పోయాను, కానీ..: జాకీ ష్రాఫ్
మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి 'హీరో' సినిమాతో వెండితెరపై కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు జాకీ ష్రాఫ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన హీరోగా, విలన్‌గా పలు హిందీ చిత్రాల్లో నటించాడు. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన జీవితంలో చవిచూసిన కష్టనష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "ఏదో ప్రయత్నించాను, కానీ ఇంకేదో జరిగి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది, అప్పులబారిన పడ్డాను. ప్రతి ఒక్కరికీ రుణాలను చెల్లించి కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తపడ్డాను. అయినా వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. కొన్నిసార్లు పై నుంచి కిందపడటం, కింద నుంచి మళ్లీ పైకి ఎదగడం జరుగుతూ ఉంటాయి. కానీ నా కొడుకు టైగర్ ష్రాఫ్ మాత్రం నేను కోల్పోయిన ఇంటిని తిరిగి నాకు అప్పజెప్తానని మాటిచ్చాడు. తన తల్లిదండ్రులకు ఇల్లు ఉండాలన్న వాడి ఆలోచనకు ముచ్చటపడిపోయాను. నా పిల్లలను చూస్తుంటే గర్వంగా అనిపించింది" "నిజానికి ఆ ఇంటిని తిరిగి తీసుకోవడం నా భార్యకు అస్సలు ఇష్టం లేదు. పోయిందేదో పోయింది.. ఇక దాని గురించి పట్టించుకోకు అని చెప్తూ ఉండేది. కానీ మాకిష్టమైన ఆ ఇంటిని తిరిగివ్వాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. మా పిల్లలెప్పుడూ మమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకున్నారు" అని చెప్పుకొచ్చాడు. కాగా అప్పులపాలైన సమయంలో జాకీ తన ఇంట్లోని ఒక్కో వస్తువును అమ్ముతూ ఆఖరికి తన బెడ్‌ను కూడా అమ్మేసి కటిక నేల మీద పడుకున్నాడు. తన జీవితంలో అవి అత్యంత దుర్దినాలని గతంలో ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ 'ఓకే కంప్యూటర్' అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఇందులో ఆయన ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా కనిపించాడు. సైన్స్‌ని వ్యతిరేకించే వ్యక్తిగా ఆకులు, పువ్వులను శరీరానికి కప్పుకునే పాత్రలో ఆకట్టుకున్నాడు. చదవండి: ఆ నటుడిని హాఫ్ బాయిల్ అన్న గూగుల్! -
అమ్మ బాబోయ్.. వార్నర్ మళ్లీ ఇరగదీశాడు
సిడ్నీ: ఆసీస్ విధ్వంసకర క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా అంటే విపరీతమైన అభిమానం చూపించే వార్నర్ పాటలు, డైలాగ్స్, డ్యాన్స్ వీడియోలతో అలరిస్తే వచ్చాడు. తాజాగా స్వాప్ వీడియోతో ముందుకు వచ్చిన వార్నర్ టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. స్వాపింగ్ యాప్‌తో టైగర్ ష్రాఫ్ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్ చేసి వీడియోను రిలీజ్ చేశాడు. ఇదంతా నా అభిమానుల డిమాండ్ మేరకే అంటూ వార్నర్ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం వార్నర్ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ కరోనా కారణంగా రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్ 15రోజుల పాటు సిడ్నీలోని హోటల్లో కఠిన క్వారంటైన్లో గడిపాడు. ఇటీవలే ఐసోలేషన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత తమ కుటుంభసభ్యులను కలుసుకోవడంతో ఆటగాళ్లంతా ఎమెషన్‌కు గురయ్యారు. ఇక ఆస్ట్రేలియా జూలైలో విండీస్‌లో పర్యటించనుంది. విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. చదవండి: 'నేను నిన్ను ప్రేమిస్తున్నా'.. నా భార్యకు ఏం అర్థం అయిందో! View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
బాలీవుడ్ లవ్ బర్డ్స్‌పై కేసు: హీరో తల్లి ఏమందంటే?
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్ ప్రేమజంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు. దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్ తల్లి ఆయేషా. "మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి" అని మండిపడింది. 'టైగర్ ష్రాఫ్.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి' అని ఆయేషా చెప్పుకొచ్చింది. In the ongoing ‘War’ against the virus, going ‘Malang’ on the streets of Bandra cost dearly to two actors who have been booked under sections 188, 34 IPC by Bandra PStn . We request all Mumbaikars to avoid unnecessary ‘Heropanti’ which can compromise on safety against #COVID19 — Mumbai Police (@MumbaiPolice) June 3, 2021 చదవండి: దిశా మాజీ ప్రియుడి ఫొటోలు.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్! -
కారులో బాలీవుడ్ లవ్ బర్డ్స్, అడ్డుకున్న పోలీసులు
ముంబై: బాలీవుడ్ ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ప్రయాణిస్తున్న కారును మంగళవారం ముంబై పోలీసులు అడ్డుకున్నారు. రాకపోకలకు వీలు లేని రహదారిలోకి చొచ్చుకురావడంతో వారి కారును ఆపేసినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్రవేశించిన దారిలో రోడ్డుకు మరమ్మత్తులు చేస్తున్నందున ఇతర మార్గం గుండా వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. టైగర్, దిశా.. జిమ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా టైగర్, దిశా కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఇంతవరకు అధికారికంగా ధృవీకరించనేలేదు. కానీ, ఎక్కడికైనా కలిసే వెళ్లడం, ఎవరింట్లో పార్టీ ఉన్నా ఇద్దరూ ప్రత్యక్షమవడం, కలిసి విహారయాత్రలకు చెక్కేయడం.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టుల మీద మరొకరు ప్రేమ కురిపించడం వంటివి చూశాక వారి మధ్య ఇష్క్ ఉందని అభిమానులతో పాటు బాలీవుడ్ మీడియా కూడా ఫిక్సైపోయింది. ఇదిలా వుంటే టైగర్ చివరిసారిగా హృతిక్ రోషన్ 'వార్' సినిమాలో కనిపించాడు. దిశా.. సల్మాన్‌ఖాన్‌తో 'రాధే' చిత్రంలో నటించింది. ఇందులో టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ దిశాకు పెద్దన్నయ్యలా నటించాడు. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్ ప్రేమజంటలు -
అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నా సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వాలు నెత్తీ నోరు ముత్తుకుంటున్నా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రం అది చెవికెక్కడం లేదు. ఇటీవలె బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటిజనులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ శృతి హాసన్ సైతం స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వారికి హాలిడే దొరికినందుకు సంతోషం, వారు దానికి అర్హులు కూడా. అయితే విహారయాత్రలకు ఇది సరైన సమయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఎంతోమంది కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పాండమిక్ సమయంలో వెకేషన్ ట్రిప్పులకు వెళ్లడం కరెక్ట్ కాదు' అని పేర్కొంది. శృతి సహాన్ పాటు రోహిణి అయ్యర్, కాలమిస్ట్ శోభా దే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీల విహారయాత్రలను తప్పుబడుతున్నారు. చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
ప్రభాస్ ఆ సినిమాలో నటించడం లేదంట
ముంబై: గత కొన్ని రోజులుగా హిందీ రీమేక్ ‘రాంబో’లో టైగర్ ష్రాఫ్‌కు బదులుగా ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలు బాలీవుడ్లోనే కాక టాలీవుడ్‌లోనూ షికార్లు కొడుతున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ‘రాంబో’ చిత్రం లో టైగర్ నటించడం లేదని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ష్రాఫ్ క్లారిటీ ఇచ్చాడు. ‘రాంబో’ చిత్రంలో తానే లీడ్ రోల్ పోషిస్తున్నట్లు పేర్కొన్న ష్రాఫ్ డేట్స్ కుదరక తనకు బదులుగా మరొక హీరోను తీసుకున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లని తెలిపాడు. అలాగే చిత్ర దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కూడా ప్రభాస్‌ను రాంబో కోసం సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎందుకంటే తను ఇంకా రాంబో యూనిట్‌తో టచ్‌లోనే ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాట వాస్తవమే అలాగే దర్శకుడు సిద్దార్థ్ కూడా షారఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో సిద్దార్థ్ కూడా ఖాళీ లేకపోవడం కారణంతో రాంబో సినిమా కొంచం సమయం పడుతోంది తప్ప మరే కారణం లేదని వివరణ ఇచ్చాడు. సిల్వెస్టర్ స్టలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి రిమేక్. ఈ చిత్రం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి బాలీవుడ్లో ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ( చదవండి: 6 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న దీపికా ) -
మరో సినిమా ప్రకటించనున్న ప్రభాస్?
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ‘రాంబో’ టైగర్ కి బదులుగా ప్రభాస్ నటించనున్నాడనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. సిల్వెస్టర్ స్టలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి రిమేక్. టైగర్ ష్రాఫ్ ‘వార్’ చిత్రం తర్వాత రాంబోని పట్టాలెక్కించాలని దర్శకుడు భావించాడు. అయితే టైగర్ గణపథ్ పార్ట్ 1 ,2, హీరోపంటి 2, బాఘి 4లకు ఇంతకు ముందే డేట్స్ ఇచ్చేశాడు. ఇక తన బిజీ షెడ్యూల్ చూస్తే వచ్చే ఏడాది చివరి వరకు డేట్స్ దాదాపుగా ఖాళీ లేనట్టే కనపడుతోంది. ఈ కారణంగా ‘రాంబో’ కోసం కాల్షీట్స్ని సర్దుబాటు చేయలేకపోతున్నాడు. ఇప్పటికే సినిమా ప్రకటించి చాలా కాలం గడవడంతో దీని ప్రభావం సినిమాపైన పడుతుందని చిత్ర దర్శకుడు భావిస్తున్నాడు. దాంతో ప్రభాస్‌ని ‘రాంబో’ సినిమా కోసం సిద్ధార్థ్ సంప్రదించాడట. వారు చెప్పిన కథ కూడా నచ్చడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. పైగా ప్రభాస్ నటిస్తే ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్టుగా మారుతుందని, అది సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం టైగర్ లానే ప్రభాస్ కూడా వరుస సినిమాలతో కాల్ షీట్స్ ఖాళీ లేకుండా బీజీబిజీగా గుడుపుతున్నాడు. మరి ఈ కాంబో కుదిరి ‘రాంబో’ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే మరి. ( చదవండి: వామ్మో 'ఆర్ఆర్ఆర్'కు ఓ రేంజ్లో బిజినెస్! ) -
మళ్లీ కెమెరాలకు చిక్కిన టైగర్-దిశా
ముంబై : బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా...ఇద్దరూ కలిసి హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ బీ-టౌన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా టైగర్ ష్రాఫ్ తన 31వ పుట్టినరోజు వేడుకలను ముంబై బాంద్రాలోని ఓ స్టార్ హోటల్లో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న ఈ బర్త్‌డే వేడుకల్లో ఆయన గర్ల్‌ప్రెండ్ దిశా పటానీ కూడా కనిపించింది. దీంతో ఫ్యామిలీకి సమానమైన రిలేషన్ దిశాతో ఉందంటే ఇక వీరిద్దరూ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పట్టాలెక్కనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పార్టీలో దిశా- టైగర్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి అయేషా ష్రాఫ్, సోదరి కృష్ణ ష్రాఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నటుడి చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారు. దిశా పటానీ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇదిలా ఉండగా, టైగర్ ష్రాఫ్ గతేడాది శ్రద్ధాతో కలిసి నటించిన బాఘి-3 సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన వికాస్ దర్వకత్వంలో తెరకెక్కనున్న 'గణపత్' సినిమాలో నటించనున్నాడు. ఇక దిశా దిశా పటానీ సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా ఈ ఏడాది ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది.ఇదిలా వుంటే దిశా పటానీ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'లో నటించింది. ఈ చిత్రం ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. చదవండి : (Disha Patani: ఫోటోకు స్టార్ హీరో కామెంట్) (మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్!) View this post on Instagram A post shared by Ayesha Shroff (@ayeshashroff) -
యాక్షన్ హీరోకు గాయాలు, పరిగెత్తుకొచ్చిన ప్రియురాలు
ముంబై: యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని బీటౌన్ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పైగా వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ క్రమంలో తాజాగా టైగర్ ష్రాఫ్ ముంబైలో ఫుట్‌బాల్ ఆడుతున్న మైదానానికి దిశా పటానీ కూడా వెళ్లింది. కాసేపు ప్రియుడితో కలిసి ఫుట్‌బాల్ ఆడింది. ఆ తర్వాత వాళ్ల ఆటను ఎంజాయ్ చేస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఎంతో ఉత్సాహంగా గేమ్ కొనసాగుతుండగా టైగర్ ష్రాఫ్ సడన్‌గా మైదానంలో కింద పడిపోయాడు. దీంతో మెడికల్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దిశా పటానీ కూడా తన ప్రియుడికి ఏమైందోనన్న కంగారుతో పరుగు పరుగున అతడిని సమీపించి పరీక్షించింది. స్వల్ప గాయాలపాలైన టైగర్‌కు దగ్గరుండి ప్రాథమిక చికిత్స చేయించి అండగా నిలబడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ దిశాకు అభినందనలు తెలుపుతూ హార్ట్ ఎమోజీ పెట్టింది. ఇదిలా వుంటే దిశా పటానీ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'లో నటించింది. ఈ చిత్రం ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఇక టైగర్ ష్రాఫ్ త్వరలో 'గణపత్' సినిమాలో నటించనున్నాడు. వికాస్ బాల్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో కృతీ సనన్ టైగర్‌తో జోడీ కట్టనుంది. చదవండి: Disha Patani: ఫోటోకు స్టార్ హీరో కామెంట్ -
‘దిశా.. యమ హాట్‌గా ఉన్నావ్’
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ బీ-టౌన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా తన ఫ్రెండ్ పెళ్లికి హాజరైన దిశా ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షేన్ పీకాక్ లెహెంగాలో ఎంతో అందంగా మెరిసిపోతున్న దిశా..హేర్, అండ్ మేకప్అప్ చేసుకుంది నేనే అంటూ ఓ క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్ చేసింది. దీనికి టైగర్ ష్రాఫ్ కామెంట్ చేస్తూ 'హాట్' అనే ఎమోజీతో కామెంట్ చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక తమ రిలేషన్షిప్ గురించి రీసెంట్గా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. 'టైగర్ పట్ల నాకెంతో ఆరాధనా భావం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో తను కాకుండా వేరే స్నేహితులెవరూ లేరు’ అని చెప్పుకొచ్చింది. గతేడాది న్యూ ఇయర్ సెలబబ్రేషన్స్ కోసం ఇద్దరూ కలిసి జంటగా మాల్దీవులకు వెళ్లొచ్చారు. అయితే ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. టైగర్‌తోనే కాకుండా అతడి తల్లి అయేషా, చెల్లి క్రిష్ణతో కూడా దిశా తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి.సినిమాల విషయానికి వస్తే..ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ..బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న కెటీనా అనే చిత్రంలోనూ నటించనుంది. చదవండి : (టైగర్ ష్రాఫ్ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్) (ఏడేళ్ల వివాహ బంధం.. విడాకులు కోరిన స్టార్ కపుల్) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) -
ఇంత త్వరగా మూవ్ ఆన్ అయ్యావా: మాజీ లవర్
ముంబై: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురుగానే గాకుండా జిమ్ యజమానిగా తనకంటూ గుర్తింపు దక్కించుకున్నారు క్రిష్ణా ష్రాఫ్. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్నారు. ఇక తన వృత్తిగత అంశాలతోనే గాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఆమె తరచూ వార్తల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్తో ప్రేమలో పడిన ఆమె.. తమ పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇందుకు బదులుగా ఇబాన్, క్రిష్ణను వైఫీ అని సంబోధిస్తూ కామెంట్లు చేయడంతో వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ అప్పట్లో బీ-టౌన్లో టాక్ వినిపించింది. క్రిష్ణ ఈ వార్తలను ఖండించినప్పటికీ ఇబాన్‌తో ప్రేమలో ఉన్నట్లు మాత్రం ధ్రువీకరించారు.(చదవండి: నోరు పారేసుకున్న హీరో: ఐదుగురు అవుట్!) ఈ క్రమంలో కొన్ని వారాల క్రితం తాము విడిపోయినట్లుగా ప్రకటించిన క్రిష్ణ.. తాజాగా ఇన్‌స్టా వేదికగా తన కొత్త రిలేషన్‌షిప్‌ను బయటపెట్టారు. టర్కిష్ చెఫ్ సాల్ట్ బేను ముద్దాడిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘బే టైమ్’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఇక ఇందుకు స్పందించిన ఇబాన్.. ‘‘ఇంత త్వరగా మూవ్ అయిపోయావా’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీనికి బదులుగా.. ‘‘నువ్వు కూడా తనను ఆదర్శంగా తీసుకో’’ అని నెటిజన్లు అతడికి సలహా ఇవ్వగా, ‘‘నాకు అంత తొందరేం లేదు.. అయినా మీకు థాంక్స్’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా ఇబాన్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయవద్దవంటూ క్రిష్ణ ఇటీవల తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇకపై తామిద్దరం కలిసి ఉండబోయేది లేదని పేర్కొన్నారు. తమ బంధం గురించి అందరికీ తెలుసునని, ఇప్పుడు అది ముగిసిపోయిందని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ షో మ్యాన్ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఖల్నాయక్’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ చేసినది యాంటీ హీరో రోల్ అయినప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 27 ఏళ్ల తర్వాత దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ చిత్రం సీక్వెల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి భాగంలో సంజయ్ దత్ చేసిన విలన్ బల్లూ పాత్రను సీక్వెల్లో వేరే హీరో చేయబోతున్నారు. ‘ఖల్నాయక్’ చిత్రంలో హీరో పాత్రను చేశారు జాకీ ష్రాఫ్. ఇప్పుడు ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ మలి భాగంలో యాంటీ హీరో రోల్ చేయనున్నారు. ‘వార్’ సినిమా తర్వాత విలన్‌గా టైగర్ ష్రాఫ్‌కి మంచి మార్కులు పడటంతో మరో పవర్ఫుల్ విలన్ ‘ఖల్నాయక్’ పాత్రకు టైగర్ సై అన్నారట. జైలు నుండి బయటకు వచ్చే సంజయ్ దత్ పాత్రతో సినిమా కథ ప్రారంభమవుతుందని తెలిసింది. తొలి భాగంలో గంగ పాత్ర చేసిన మాధురీ దీక్షిత్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. కథానాయిక పాత్రకు ఓ ప్రముఖ నటిని అనుకుంటున్నారు. ‘ఖల్నాయక్’ని గ్యాంగ్‌స్టర్ కథగా తీశారు. సీక్వెల్‌ను డ్రగ్ మాఫియా నేపథ్యంలో చిత్రీకరించాలనుకుంటున్నారని సమాచారం. -
‘స్విమ్ ఫొటో’.. క్షమించమని అడిగిన హీరో!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా షేర్ చేసిన మాల్దీవుల ఫొటో నెట్టింట హల్చల్ చేస్తుంది. టైగర్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ దిశ పటానీతో కలిసి బుధవారం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం టైగర్ ష్రాఫ్ స్విమ్మింగ్ పూల్ వద్ద తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. చిన్న పసుపు రంగు షాట్ ధరించి ఉన్న ఈ ఫొటోకు అతడు పెట్టిన టైటిల్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ‘ప్లీజ్ నా ఎల్లో హాట్ ప్యాంట్‌కు క్షమించండి.. ఈ లాక్డౌన్లో నేను పెరిగానా లేక నా ప్యాంట్స్ షింక్ అయ్యిందో అర్థం కావడం లేదు’ అంటూ చమత్కరించి నెటిజన్లను నవ్వించాడు. (చదవండి: టైగర్ ష్రాఫ్ ఎన్ని కిలోలు ఎత్తాడో తెలుసా?) View this post on Instagram Pls excuse the yellow hot pants 😅Either ive grown or my shorts have shrunk this lockdown ☀️ @intercontinental_maldives #islandlife🌴 #intercontinentalmaldives #intercontinentallife A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on Nov 11, 2020 at 8:45pm PST ఇటీవల టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ నటించిన ‘భాగీ-3’ ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. తన తండ్రి జాకీష్రాఫ్‌తో కలిసి నటించిన మొదటి సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ప్రస్తుతం ‘టైగర్’ భాగీ సీక్వెల్ ‘భాగీ-4’తో పాటు ‘హీరోపంటి-2’లో నటిస్తున్నాడు. (చదవండి: అక్షయ్ అడిగేసరికి భయమేసింది: హీరో) -
టైగర్ వర్కవుట్ విన్యాసాలు, దిశా ప్రశంసలు
-
టైగర్ ష్రాఫ్ ఎన్ని కిలోలు ఎత్తాడో తెలుసా?
కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్నెస్ కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తూ ఉంటారు. నెలల తరబడి విరామం తర్వాత షూటింగ్స్ మళ్లీ ప్రారంభవమవుతుండటంతో ఎక్స్ట్రా డోసులో వ్యాయామం చేస్తున్నారు. తన ఫిట్నెస్ స్టూడియోలో చెమటలు చిందిస్తున్న వర్కవుట్ వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో అతను అత్యంత బరువున్న దాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టైగర్ దాన్ని కొంత వరకు మాత్రమే ఎత్తగలిగి విఫలమయ్యారు. కాసేపటికి మరోసారి దాన్ని పై వరకు గాలిలో ఎత్తి ఉంచగలిగి సఫలమయ్యారు. (చదవండి: బాలీవుడ్ నటి తండ్రికి కరోనా పాజిటివ్) ఈ వీడియోను చూసి అభిమానులు అబ్బురపడుతున్నారు. ఆమె ప్రేయసిగా భావిస్తున్నబాలీవుడ్ నటి దిశా పటానీ కూడా అతని ప్రతిభను ప్రశంసిస్తూ చప్పట్లు కొడుతున్న ఎమోజీలను పెట్టారు. ఇంతకీ టైగర్ ఎన్ని కిలోల బరువు ఎత్తారని భావిస్తున్నారు? యాభయ్యో, వందో కిలోలో కాదు, ఏకంగా 220 కిలోలు. కాగా ఆయన ప్రస్తుతం "హీరో పంతి 2" చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ రీమేక్‌లో నటించనున్నారు. ఇది 2021 చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. (చదవండి: వారిద్దరిప్పుడు కలిసి జీవించడం లేదు: కృష్ణ ష్రాఫ్) -
దర్శకుడు మారారు
హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు, హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ‘రాంబో’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు రోహిత్ ధావన్. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అక్షయ్ ఎదుట హీరో తైక్వాండో విన్యాసాలు
-
అక్షయ్ అడిగేసరికి భయమేసింది: హీరో
ముంబై: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫీట్లకు బోలెడంతమంది అభిమానులు ఉన్నాడు. ఎన్నో రకాల విన్యాసాలను సైతం ఆయన అలవోకగా చేసేవాడు. ఈ క్రమంలో ఓ టోర్నమెంటులో తైక్వాండో విన్యాసాలు చేసిన పాత వీడియోను టైగర్ సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో అక్షయ్ కుమార్ కూడా ఉండటం విశేషం. టైగర్ తైక్వాండో చేస్తుండగా అక్షయ్ మరిన్ని కిక్కులు కొట్టమంటూ అతన్ని ప్రోత్సహించాడు. అక్కడున్న అభిమానులు సైతం అతనిలోని ప్రతిభకు అబ్బురపడిపోతూ చప్పట్లు, ఈలలతో ఉత్తేజాన్ని నింపారు. (టైగర్ ష్రాఫ్ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్) ఆనాటి ఈ సంఘటన గురించి యాక్షన్ హీరో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. "సహజంగానే నాకు స్టేజ్ ఎక్కాలంటేనే భయం. అలాంటిది లెజెండరీ హీరో అక్షయ్.. నన్ను ప్రేక్షకులకు కొన్ని కిక్స్ చూపించమని అడుగుతుంటే మరింత భయపడిపోయాను. కానీ ఎలాగోలా తడబడకుండా విన్యాసాలు చేసినందుకు సంతోషించాను" అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. లాక్డౌన్ కాలంలో షూటింగ్స్‌కు బ్రేక్ పడటం, తనకు కావాల్సిన సమయం దొరకడంతో ఈ హీరో సోషల్ మీడియాలో అభిమానులకు మరింత చేరువయ్యాడు. (సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా) -
టైగర్ ష్రాఫ్ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్
ముంబాయి: టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ , తల్లి ఆయేషా ష్రాఫ్ తో కలిసి చేసిన ఒక సరదా పోస్ట్‌ను దిశా పటాని తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ ముగ్గురు టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయిన ‘హూస్ మోస్ట్ లైక్లీ టు’ ఛాలెంజ్‌ను తీసుకున్నారు. ఈ వీడియోను చూడటం ద్వారా చాలా ఆసక్తికర విషయాలను తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. " హాటెస్ట్ కుర్రాళ్ళతో ఎవరు బయటకు వెళ్ళారు" వంటి ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. (‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!) ఈ వీడియోని చూస్తుంటే కృష్ణ ష్రాఫ్, ఎబాన్ హయామ్స్‌తో తన సంబంధాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ష్రాఫ్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ఎబాన్ హయామ్స్‌తో రిలేషన్ షిప్లో ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. “మొదట ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అనే ప్రశ్నకు ముగ్గురు కృష్ణ వైపే చేతిని చూపించారు. దీనిని బట్టి చూస్తే కృష్ణ త్వరలో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్ ప్లాన్) -
దిశా ఇప్పుడు అన్నయ్యతో లేదు
లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తన గర్ల్‌ఫ్రెండ్ దిశాపటాని కలిసి నివసిస్తున్నారన్న వార్తలపై టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ స్పందించారు. వారిద్దరూ ప్రస్తుతం కలిసి జీవించడం లేదని కృష్ణా స్పష్టం చేశారు. దిశాతో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటారని, ఇద్దరు కలిసి సరదాగా గడుపుతారని ఆమె తెలిపారు. మిజోరాంలో నివసిస్తున్న కృష్ణ లాక్డౌన్ వల్ల ప్రస్తుతం అన్నయ్య టైగర్, ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో కలిసి ముంబైలో జీవిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దిశా తమతో కలిసి లేదని అన్నారు. అయితే తమ ఇంటి సమీపంలోనే నివసిస్తుందని, కిరాణా వస్తువులు కొనడానికి షాప్‌కి వెళ్లినప్పుడు తరుచుగా ఆమెను కలుస్తామని వెల్లడించారు. (సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా) దిశా పటాని, టైగర్ మధ్య సన్నిహిత్యం గురించి మాట్లాడుతూ.. దిశా, టైగర్ మంచి స్నేహితులని, దిశాతో తమ కుటుంబమంతా బాగా కనెక్ట్ అయ్యామని తెలిపారు. అన్నయ్య టైగర్.. దిశాతో ఎక్కువ సమయం గడపడుపుతుంటే ఆమె మంచి అమ్మాయి అని అర్థమైందని, అన్నయ్యను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోందన్నారు. ఇక అన్నయ్య గురించి చెబుతూ... సినిమా షూటింగ్‌ల కారణంగా ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండలేక పోయేవాళ్లం. లాక్డౌన్ కారణంగా సాధారణ సమయాల్లో కంటే ఇప్పుడు టైగర్‌తో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మా మధ్య బంధం మరింత మెరుగు పడింది. ప్రతి రోజు కలిసే తింటున్నాం. కలిసి ఆటలు ఆడుతున్నాం.’ అని టైగర్ గురించి చెప్పుకొచ్చారు సోదరి కృష్ణ ష్రాఫ్. (సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు!) View this post on Instagram This is how we do it #quarintinelife @kishushroff 👭🤣 A post shared by disha patani (paatni) (@dishapatani) on Mar 24, 2020 at 2:01am PDT -
సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా
విలక్షణమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు హీరో సుధీర్ బాబు. ఫిట్నెస్, డ్యాన్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడని విషయం తెలిసిందే. తన ఫిట్‌నెస్‌కు సంబంధించి విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్ అయిన సందర్భాలు అనేకం. తాజాగా సుధీర్ డ్యాన్స్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ఫిదా అయ్యాడు. అంతేకాకుండా సుధీర్ డ్యాన్స్ మూమెంట్స్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తన డ్యాన్స్‌కు కాంప్లిమెంట్ ఇచ్చిన టైగర్‌కు సుధీర్ ధన్యవాదాలు తెలిపాడు. ఇంతకీ విషయం ఏంటంటే? సుధీర్ సినిమాలలోని బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్‌కు సంబంధించి ఓ వీడియోను సుధీర్ బాబు ప్రొడక్షన్స్ రూపొందించింది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన సుధీర్ బాబు మీకు నచ్చిన బెస్ట్ డ్యాన్స్ మూమెంట్ ఏంటో చెప్పండి అంటూ ఫ్యాన్స్‌ను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Thank you Tiger man ❤️ We had a fight against each other and hopefully, we can dance together someday 😬😄 https://t.co/atnymZmyL6 — Sudheer Babu (@isudheerbabu) April 18, 2020 I know I haven't danced my heart out in a while ... But here are some of my favourite moves from my films ... Let me know which one or ones do you like the most 😬??? https://t.co/1Ex8Gl7zKw — Sudheer Babu (@isudheerbabu) April 17, 2020 చదవండి: 10 కోట్ల వ్యూస్.. సంబరంలో మహేశ్ ఫ్యాన్స్ పుష్ప కోసం హోమ్‌వర్క్ -
‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’
బాలీవుడ్లో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోల్లో టైగర్ ష్రాఫ్ ఒకరు. ఫిట్‌గా ఉండటంతో పాటు, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన ఫోటోలు, ఫిట్‌గా ఉండే తన బాడీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా టైగర్ ష్రాఫ్ ఒక త్రోబాక్ (పాత ఫోటో)ను ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో టైగర్.. తన దృఢమైన కండలను చూపిస్తున్నట్లు ఉంటాడు. ఈ ఫోటోకు ‘మరో రోజు ఆడవిలో’ అనే క్యాప్షన్ పెట్టాడు టైగర్. తన అభిమాన హీరోలకు సంబంధించిన అన్ని మ్యాట్రిక్స్ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నట్లు టైగర్ ఓ వీడియోలో పేర్కొన్నాడు. View this post on Instagram Just another day in the jungle... A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on Apr 6, 2020 at 11:01pm PDT అదేవిధంగా తన అభిమాన హాలీవుడ్ నటుడు కీను రీవ్స్ సినిమాలను మూడింటిని ఒక దాని తర్వాత ఒకటి చూసినట్లు టైగర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలను చూసిన అనంతరం తన అభిమానుల కోసం శ్వాస తీసుకునే వ్యాయామ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రజలు కరోనా వైరస్‌ను ఎదుర్కొవాలనే ఆకాంక్షతో ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలు రూపొందించిన ‘ముస్కురాయోగా ఇండియా’ అనే సందేశాత్మకమైన పాటను టైగర్ తన ట్విటర్ పోస్ట్ చేశాడు. ఇక ఈ పాటలో టైగర్‌తో పాటు విక్కీ కౌషల్, రాజ్‌కుమార్‌రావు, కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ కురానా, భూమి పెడ్నేకర్, సిద్దార్థ్ మల్హోత్రా, అక్షయ్ కుమార్ నటించారు. View this post on Instagram Glad to be part of this initiative! Thank you @jjustmusicofficial & #CapeOfGoodFilms for making this happen! #MuskurayegaIndia, do watch & share! @akshaykumar @jackkybhagnani @vishalmishraofficial #CapeOfGoodFilms A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on Apr 6, 2020 at 5:50am PDT -
అల్లు అయాన్‌కు బాలీవుడ్ హీరో ఇన్విటేషన్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎంత ఫేమస్సో.. అతని పిల్లలు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. వీళ్ల అల్లరి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వైరల్‌గా మారాయి. ఇక ఈ మధ్యే అల్లు అర్హ నిఖిల్ 18 పేజీస్ చిత్రం ముహూర్త కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా అయాన్‌కు కూడా పిలుపు వచ్చింది. కానీ ఈ సారి దక్షిణాది నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. అది కూడా అతనికి ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి. అయాన్‌కు అతని సినిమాల్లో ఫైటింగ్ సీన్లు, యాక్షన్ మూమెంట్స్‌ను దగ్గర నుంచి చూడాలనుందట. దీంతో ‘టైగర్ స్క్వాష్.. నన్ను సెట్స్‌కు పిలవ్వూ’ అంటూ ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ నవ్వుతూ ఎందుకు అని అడిగితే.. ‘అతని గన్ ఫైటింగ్ సీన్లు చూడాలనుంద’ని తెలిపాడు. ఈ వీడియో కాస్తా హీరో టైగర్ ష్రాఫ్ కంట్లో పడింది. వెంటనే దానికి రిప్లై ఇస్తూ ‘నా కొత్త పేరు ఎంతగానో నచ్చింది. అల్లు అర్జున్ సర్.. అయాన్ కేవలం భాగీ షూటింగ్‌కే కాదు.. ఏ సినిమా షూటింగ్స్కైనా రావచ్చు’ అని తెలిపాడు. కాగా టైగర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమా ‘రాంబో’ రీమేక్‌లో నటిస్తున్నాడు. వార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ హీరో 2014లో వచ్చిన ‘హీరో పంటి’ చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. ఇది బన్నీ హిట్ సినిమాల్లో ఒకటైన ‘పరుగు’ రీమేక్ కావడం విశేషం. View this post on Instagram Ayaan ❤ ▪ ▪ ▪ ▪ #alluarjun❤ #stylishstaralluarjun #tollywoodhero #bollywood #alavaikuntapuramulo #samajavaragamana #buttabomma #son #dad #mom #familylife #actinglife #alluarjunonline #alluarjunarmy #alluarjunforever❤️ #alluarjunofficial #bunnyholics #bunnyicons #myworld❤️ #fanforever❤️ #inspiration #bunnylovee ______________ @alluarjunonline @allusnehareddy @allusirish _____________ A post shared by 🇦 🇱 🇱 🇺 🇦 🇷 🇯 🇺 🇳 (@bunny_holics_) on Mar 15, 2020 at 5:27am PDT -
కరోనా: పాజిటివ్ వార్తను చెప్పిన హీరో
కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడింది. దీని దెబ్బకు పలు చోట్ల థియేటర్లు సైతం మూతపడ్డాయి. అంతేకాక పలు సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్ కార్యక్రమాలు, విడుదల వాయిదా పడ్డాయి. దీంతో సినిమా తారలు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. జనాల్లో కరోనా భయాన్ని తొలగించి అవగాహన కల్పించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటూ కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇందుకోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ రంగంలోకి దిగగా.. ఇప్పుడీ లిస్టులో భాగీ హీరో టైగర్ ష్రాఫ్ చేరాడు. కరోనా గురించి ఓ పాజిటివ్ న్యూస్‌ను ఫొటోతో సహా అభిమానులకు షేర్ చేశాడు. ‘గొప్ప వార్త. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాదిగ్రస్తులు సగానికిపైగా కోలుకున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే వారు చనిపోవడం ఖాయం అనేది అపోహ. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి మామూలు స్థాయికి వచ్చేస్తారు’ అనేది ఆ పోస్టు సారాంశం. కాగా చైనాలోని వూహాన్లో బయటపడ్డ ఈ మహమ్మారి నానాటికీ వివిధ దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగా ఇటలీ, ఇరాన్లో మాత్రం మృత్యు ఘంటికలు మోగిస్తోంది. (‘టైగర్, మీకు ఎంతమంది గాళ్‌ఫ్రెండ్స్’) -
కరోనానూ ఢీకొన్న టైగర్..
ముంబై : టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్లు జోడీగా విడుదలైన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ భాగీ 3 తొలి వీకెండ్లో రూ 50 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ మూవీపై మిశ్రమ సమీక్షలు వచ్చినా కరోనా భయాలు, పరీక్షల హడావిడిని అధిగమించి మెరుగైన వసూళ్లను రాబట్టింది. శుక్రవారం తొలిరోజు రూ 17.50 కోట్లు రాబట్టిన భాగీ 3 రెండవరోజు రూ 16.03 కోట్లు, ఆదివారం రూ 20.3 కోట్లను వసూలు చేసి మూడు రోజుల్లో మొత్తం రూ 53.83 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మాస్ సెంటర్లలో ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతోందని, మెట్రోల్లోనూ మూడోరోజు పుంజుకుందని ఆయన ట్వీట్ చేశారు. భాగీ ఫ్రాంచైజీ టైగర్‌కు కలిసివచ్చిందనే చెప్పాలి. తొలి, మూడు పార్ట్‌ల్లో శ్రద్ధా కపూర్ టైగర్‌తో జతకట్టగా, భాగీ 2లో దిశా పటానీ టైగర్ సరసన ఆడిపాడింది. అహ్మద్‌ఖాన్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన భాగీ 3లో రితీష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండేలు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. -
భాగీ 3: మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే!
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నటించిన తాజా చిత్రం భాగీ-3. యాక్షన్ మూవీగా శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. హోళీ సీజన్ బరిలో దిగి.. ప్రపంచ వ్యాప్తంగా రూ 17. 50 కోట్లు సాధించి.. తన్హాజీ రికార్డును బ్రేక్ చేసింది. తన్హాజీ మొదటిరోజు రూ. 15.10 కోట్లు వసూలు చేయగా భాగీ 3.. 17.50 కోట్లు సాధించింది. కాగా అభిమానులను అలరించిన ఈ సినిమా విమర్శకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. (‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!) ఓ వైపు దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే అవేవీ పట్టించుకోకండా బరిలో దిగిన భాగీ3 పై కరోనా ప్రభావం ఎంతమాత్రం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏడు నెలల పాటు ఈ సినిమాను వాయిదా వేయడంతో భాగీ సినిమాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. లేకుంటే భాగీ కలెక్షన్లలో భారీ కోత ఏర్పడేదని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ఫ్రాఫ్‌తో కలిసి మొదటి సారి నటించారు. సినిమాలో కూడా వారు తండ్రి, కొడుకులుగా నటించడం విశేషం. అదే విధంగా రితేష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. (అదిరిపోయిన ‘భాగీ-3’ ట్రైలర్) ఇక భారత్‌లో 4500, ఓవర్సీస్లో1100 థియేటర్లతో కలిపి ప్రపంచ వ్యాప్తగా 5,500 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ టైగర్ ఫ్రాఫ్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలించింది. భాగీ 3.. భాగీకి సిక్వెల్ అన్న విషయం తెలిసిందే. 2016లో విడుదలైన మొదటి భాగంలో టైగర్ ఫ్రాఫ్, శ్రద్ధా నటించగా, రెండవ భాగంలో టైగర్, దిశా పటానీ నటించగా ఈ మూవీ 2018లో విడుదలైంది. మళ్లీ భాగీ 3లో టైగర్‌తో శ్రద్ధా జతకట్టారు. ఇక మొదటిరోజే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో మిగిలిన రోజుల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ⭐️ #CoronaVirus scare ⭐️ #Pre-#Holi dull phase ⭐️ #Examination period Yet, #Baaghi3 takes a big start on Day 1... Emerges biggest opener of 2020 [so far]... Fifth film of #TigerShroff to open in double digits... Single screens excel, plexes decent... Fri ₹ 17.50 cr. #India biz. — taran adarsh (@taran_adarsh) March 7, 2020 -
లిప్‌లాక్ ఫోటోను షేర్ చేసిన హీరో సోదరి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిమానులతో పంచుకుంటారు. తన కుంటుంబమంతా సినీ ఇండ్రస్టీలో సెటిల్ అవ్వగా.. కృష్ణ మాత్రం ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 26 ఏళ్ల కృష్ణ ష్రాఫ్.. ప్రస్తుతం తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రొమాంటిక్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను కృష్ణ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా గతంలో కూడా ఎబాన్ హ్యామ్స్‌తో కలిసి ఉన్న రొమాంటిక్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. -
‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్లు జంటగా నటిస్తున్న చిత్రం భాగీ-3. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది. కాగా అన్నదమ్ముల అనుబంధానికి, యాక్షన్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అహ్మద్. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్న పాత్రలో హీరో రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. కాగా ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న దిశా పటానీ ఓ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమ్మడు ‘డు యూ లవ్ మీ’ అంటూ టైగర్ ష్రాఫ్ వెంట పడుతూ డ్యాన్స్ చేసిన ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఫోటోగ్రాఫర్‌తో హీరోయిన్ బాడీగార్డ్ వాగ్వాదం కాగా ఈ సాంగ్‌లో బికినీ ధరించిన దిశా తన అందంతో టైగర్‌తో పాటు అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతే కాదు కొన్ని అదుర్స్ అనిపించే స్టెప్పులేసి అదరగొట్టారు కూడా. ఈ నెల 25న విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్, ట్విటర్ ట్రెండింగ్ జాబితాలోకి చేరిపోయింది. ఇక మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ దాదాపు కోటి 16 లక్షల వ్యూస్‌ను రాబట్టింది. అంతేగాక దిశా కూడా ఈ సాంగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. కాగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో భాగికి సీక్వెల్‌గా భాగీ-2 వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భాగి-3ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Get ready to groove on with me. #DoYouLoveMe song out tomorrow. #SajidNadiadwala’s #Baaghi3 @tigerjackieshroff @shraddhakapoor @riteishd @khan_ahmedasas @wardakhannadiadwala @tanishk_bagchi @nikhitagandhiofficial @tseries.official @adil_choreographer @foxstarhindi @nadiadwalagrandson A post shared by disha patani (paatni) (@dishapatani) on Feb 25, 2020 at 11:43pm PST -
అదిరిపోయిన ‘భాగీ-3’ ట్రైలర్
ఉగ్రమూక ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) దురాగతాలతో.. నిరంతరం బాంబుల వర్షంతో మోతమోగే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి దేశంలో టెర్రరిస్టుల చేతికి చిక్కిన తన సోదరుడిని కాపాడుకునేందుకు హీరో చేసిన పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా భాగీ 3. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్‌ను మలుపుతిప్పిన భాగీ ప్రాంఛైజీలో వస్తున్న మూడో సినిమా ఇది. రితేశ్ దేశ్‌ముఖ్, టైగర్ ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. భాగీ సినిమాలో హీరోయిన్గా కనిపించిన శ్రద్ధా కపూర్.. ఈ సినిమాలోనూ టైగర్‌తో జోడీతో కట్టారు. కాగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. దాదాపు 4 నిమిషాల నిడివి గల అద్భుతమైన యాక్షన్ ఫీట్లతో అదిరిపోయింది. సోదరుడిని కాపాడుకునేందుకు హీరో ఉగ్రమూకతో తలపడే తీరు వన్ మ్యాన్ షోను తలపించింది. ఇక ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గుమ్మడికాయ కొట్టారు
‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ‘భాగీ3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హీరోయిన్గా శ్రద్ధాకపూర్ కనిపిస్తారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్‌లా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. -
ఆన్లైన్ గ్రీకు వీరుడు హృతిక్!
‘ఏషియన్ సెక్సియెస్ట్ మేల్స్ 2019’ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అగ్రస్థానంలో నిలిచాడు. బ్రిటిష్ ఈస్టర్న్ సంస్థ ఆన్లైన్ పోల్ ఆధారంగా బుధవారం లండన్‌లో విడుదల చేసిన ఈ జాబితాలో హృతిక్ మొదటి స్థానంలో నిలిచి ఆన్లైన్ గ్రీకువీరుడిగా అవతరించాడు. సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచి నెటిజన్లను ఆకర్షించే సెలబ్రిటీల గురించి చేపట్టిన ఓటింగ్ ఆధారంగా బ్రిటీష్ విక్లీ ఈస్టర్న్ ఐ సంస్థ వార్షిక ‘సెక్సియెస్ట్ ఏషియన్ మేల్’ జాబితాను తయారు చేసింది. దీంతో ఈ ఏడాది సూపర్ 30, వార్ చిత్రాలతో బాక్సాఫీస్ హిట్స్‌తో దూసుకుపోయిన ఈ 45 ఏళ్ల హీరో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అదేవిధంగా హృతిక్ గత పదేళ్ల నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తూ.. ఓవరాల్ ర్యాంకింగ్‌లో కూడా ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నాడు. ఈ విషయం గురించి హృతిక్ మాట్లాడుతూ.. ‘ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ నేను ఎప్పుడూ దీనిని పోటీగా చూడలేదు. నన్ను ఆకర్షణీయ వ్యక్తిగా గుర్తించి ఆన్లైన్లో నాకు ఓటువేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చాడు. ‘కేవలం ఓ వ్యక్తి రూపంతో మాత్రమే ఈ జాబితా రూపొందలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రమే నేను తుది తీర్పుగా భావించడం లేదు’ అని హృతిక్ చెప్పాడు. అలాగే ఈస్టర్న్ ఐ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్, ఈ జాబితా రూపకర్త అజ్సాద్ నజీర్ మాట్లాడుతూ.. ఈ జాబితాను గత పదహారేళ్లుగా తయారు చేస్తున్నామని, అప్పటి నుంచి హీరో హృతిక్‌కు నెటిజన్లు ఎక్కువ ఓట్లు వేస్తున్నారని తెలిపాడు. గ్రీకు దేవుడిని తలపించేలా హృతిక్ దేహదారుడ్యం ఉండటం వల్లే నెటిజన్లు ఎక్కువగా ఆయనకు ఆకర్షితులయ్యారని పేర్కొన్నాడు. అలాగే హృతిక్‌తో పాటు ఈ జాబితాలో షాహిద్ కపూర్ రెండవ స్థానంలో ఉండగా, టెలివిజన్ నటుడు వివియన్ మూడో స్థానం, బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌లు నాలుగవ స్థానంలో నిలవగా, బ్రిటిష్ పాప్ స్టార్ జయాన్ మాలిక్ 5వ స్థానంలో ఉన్నట్లు నజీర్ వెల్లడించాడు. -
వార్ వసూళ్లు: మరో భారీ రికార్డు
ముంబై : బాలీవుడ్ టాప్ హీరోలైన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమా వార్.. ఈ సినిమా ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన వార్.. అప్రతిహతంగా కలెక్షన్లు రాబడుతూ.. మూడు వారాల్లోనే రూ. 300 కోట్ల క్లబ్బులోకి ఎంటరైంది. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా వార్ రికార్డులకెక్కింది. వరుసగా మూడో వీకెండ్లోనూ వార్ కలెక్షన్లు పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం. గాంధీ జయంతికి విడుదలై తొలిరోజే 50 కోట్లకుపైగా వసూలు చేసి.. బాలీవుడ్లోనే హైయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన వార్.. దసరా సీజన్‌ను కూడా సద్వినియోగం చేసుకుంటూ దుమ్మురేపింది. ఇప్పుడు దీపావళి వరకు బాక్సాఫీస్ వద్దకు వార్‌కు గట్టి పోటీ లేకపోవడంతో వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది. మూడో వీకెండ్లో గత శుక్రవారం రూ. 2.80 కోట్లు, శనివారం రూ. 4.35 కోట్లు, ఆదివారం సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసిన వార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలపుకొని రూ. 301. 75 కోట్లు సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ వాటా.. సుమారుగా 288.30 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్లు వసూలు చేయడం ద్వారా ఈ ఏడాది విడుదలైన కబీర్ సింగ్ లైఫ్‌టైమ్ వసూళ్లను వార్ అధిగమించింది. అదేవిధంగా ఆమీర్ ఖాన్ ‘ధూమ్-3’ రికార్డును కూడా దాటింది. యష్‌రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్)కు ఈ సినిమా అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. వైఆర్ఎఫ్ నిర్మించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా గత ఏడాది దీపావళికి విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ నష్టాలను మిగిల్చిన ఆ ఘోర పరాభవం నుంచి వార్ సినిమాతో వైఆర్ఎఫ్ గట్టెక్కింది. అంతేకాకుండా వార్ జోరు కొనసాగించేందుకు త్వరలోనే మరో సీక్వెల్‌ను పట్టాలెక్కించబోతుంది. ఈ సినిమాలో హృతిక్ ఒక హీరోగా కొనసాగనున్నాడు. టైగర్ స్థానంలో మరో స్టార్ హీరోను సీక్వెల్లో తీసుకోనున్నారు. ఇక, ఓవర్సీస్లో సత్తా చాటిన వార్ సినిమా అంతర్జాతీయ మార్కెట్లో వందకోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది. -
'కబీర్ ట్రాన్స్‌పార్మేషన్ ఫర్ వార్'
-
రూ. 250 కోట్ల మార్క్‌పై కన్నేసిన 'వార్'
ముంబై : బాక్సాఫీస్ వద్ద వార్ జోరు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 2 గాందీ జయంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన వార్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. విడుదలైన తొలి వారంలోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వార్ సినిమా 250 కోట్ల మార్క్‌పై కన్నేసింది. తాజాగా రెండో వారంలోకి అడుగుపెటిన ఈ సూపర్ కాంబినేషన్ సినిమా ప్రతిరోజు రూ. 9 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తూ తొమ్మిదిరోజులకు గానూ రూ. 238 కోట్లు వసూలు చేసింది.10 వ రోజున వీకెండ్ కావడం, బాలీవుడ్లో మంచి సినిమాలు లేకపోవడంతో ఆదివారంతో వార్ సినిమా రూ. 250 కోట్ల మార్క్‌ను ఈజీగానే క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఇక తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు నుంచే కలెక్షన్లను అదరగొడుతూ రెండో వారం నుంచే లాబాలు తీసుకోవడం మొదలుపెట్టింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యువ సంచలనం టైగర్ ష్రాఫ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఇప్పటికే సల్మాన్ ఖాన్ భారత్ లైఫ్‌టైమ్ బిజినెస్‌ను అధిగమించి 2019 ఏడాదిలో రెండో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబడింది. ఇక 2019లో బాలీవుడ్ అత్యధిక వసూళ్లు సాధించిన కబీర్‌సింగ్ మూవీ( రూ. 379 కోట్లు)ని అధిగమిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇక హృతిక్ రోషన్ 'వార్' సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్ క్యారక్టర్స్‌లో నటించిన హృతిక్, టైగర్ ష్రాఫ్‌ల నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా హృతిక్ తన లుక్స్, బాడీ ఫిజిక్, యాక్షన్ సీన్స్‌తో యూత్‌కు పిచ్చెక్కించాడు. ఇక టైగర్ ష్రాఫ్ చేసిన యాక్షన్ సీన్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే వార్ సినిమా కోసం హృతిక్ రోషన్ తన బాడీనీ మేకోవర్ చేసిన విధానాన్ని 'కబీర్ ట్రాన్స్‌పార్మేషన్ ఫర్ వార్' పేరుతో వీడియో రూపంలో సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన బాడీ ఫిజిక్‌ను మార్చుకోవడానికి హృతిక్ భారీ కసరత్తులే చేయాల్సి వచ్చింది. తాజాగా వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బాస్టర్ రన్‌ను కొనసాగిస్తుడంతో ఆ కష్టాన్ని మరిచిపోయేలా చేసింది. -
డిష్యుం డిష్యుం
బాలీవుడ్లో యాక్షన్ హీరోగా టైగర్ ష్రాఫ్‌కు మంచి పేరుంది. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాక్షన్ స్టంట్స్‌ను చేస్తూ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటారాయన. తాజాగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘భాగీ 3’ సినిమా కోసం దాదాపు 400 కార్లు ఉండే ఓ జంక్‌యార్డ్‌లో విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారట టైగర్. ముంబైలో జరుగుతున్న ఈ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందట. ఈ షూటింగ్ సెట్‌ను రెడీ చేయడానికి టీమ్ 15 రోజులు కష్టపడ్డారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ అన్న పాత్రలో పోలీసాఫీసర్‌గా రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తున్నారు. ముంబై షెడ్యూల్ తర్వాత ‘భాగీ 3’ బృందం నవంబరులో సెర్బియా వెళ్లనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. -
బాక్సాఫీస్ వసూళ్లు: సైరా వర్సెస్ వార్
ఈసారి గాంధీ జయంతి సందర్భంగా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ఒకేసారి, ఒకేరోజు విడుదల అయ్యాయి. వరుస సెలవులను క్యాష్ చేసుకోవడానికి పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఆ సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో భారీ మల్టీస్టారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘వార్’ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా.. సౌత్‌లో చారిత్రక సినిమాగా భారీ బడ్జెట్‌తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలైంది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాల మధ్యే ప్రేక్షకులను పలుకరించాయి. చారిత్రక నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి జీవిత కథతో సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లోనూ భారీఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అటు బాలీవుడ్ బడా స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టార్ సినిమా వార్ కూడా భారీ అంచనాలతో గత బుధవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా.. గురుశిష్యులుగా నటించడం.. ఒళ్లు గగుర్పొడిచే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రమోట్ చేశారు. దుమ్మురేపిన కలెక్షన్లు.. భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... మెగాస్టార్ స్టామినాను చాటుతూ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే, ఈ సినిమా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలోనే జోరుగా దూసుకుపోతుంది. సౌత్‌లోని ఇతర రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్నా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయింది. హిందీలో తొలిరోజు రూ. 2.6 కోట్లు సాధించి.. పర్వా లేదనిపించిన సైరా.. ఆ తర్వాత పుంజుకోలేక చతికిలపడింది. ఓవర్సీస్లోనూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద గట్టిగా సత్తా చాటుతున్న ఈ సినిమా తొలి మూడురోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్లకు పైగా సాధించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఈ సినిమా రూ. 32 కోట్లు రాబట్టినట్టుసమాచారం. దసరా సెలవులు కావడం.. పాజిటివ్ టాక్ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సైరాకు కలిసివస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) రివీల్ చేశారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. రికార్డుల సృష్టిస్తున్న వార్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అయిన వార్ మూవీ ఊహించినరీతిలో భారీ వసూళ్లే రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. హిందీపరంగా విస్తారమైన మార్కెట్ ఉండటంతో వార్.. దసరా పండుగ సీజన్లో అత్యంత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. హిందీ వెర్షన్లో తొలిరోజు రూ. 51 కోట్లు, రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించిన వార్.. . తొలి మూడు రోజుల్లోనే రూ. 96 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక, తెలుగు, తమిళ వెర్షన్లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తంగా రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ వసూళ్లు తిరుగులేని రీతిలో ఉండటం ఇందుకు తార్కాణం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. మొత్తానికి చూసుకుంటే.. తమకు గట్టి పట్టున్న మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద సైరా, వార్ పోటాపోటీగా కలెక్షన్లు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. -
వారెవ్వా ‘వార్’... కలెక్షన్ల తుఫాన్!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.. బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్‌గా, బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రమోటైన ‘వార్’కు పాజిటివ్ రివ్యూలతోపాటు ఆడియెన్స్ టాక్ కూడా బలంగా ఉండటంతో తొలిరోజు నుంచే రికార్డుస్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన వార్.. రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించింది. తొలి మూడు రోజుల్లోనే హిందీ వెర్షన్లో రూ. 96 కోట్లు, తెలుగు, తమిళ వెర్షన్లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తం రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ తిరుగులేని రీతిలో వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు రికార్డు.. బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్ నిలిచింది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీస్టారర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. రూ. 53.35 కోట్లతో ఆ రికార్డును వార్ చెరిపేసింది. ఈ రెండు సినిమాలు యష్‌రాజ్ ఫిల్మిమ్స్ తీసినవే కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజు వసూళ్లు సాధించిన సినిమాగా వార్ మొదటిస్థానంలో ఉండగా.. భారత్ (42.30 కోట్లు), మిషన్ మంగళ్ ( 29.16 కోట్లు), సాహో (24.40కోట్లు), కళంక్ (21.60కోట్లు) వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రభావం వార్‌పై ఉంటుందని భావించారు. కానీ, అంతగా ఆ ప్రభావం లేదని వసూళ్లు చాటుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులుగా ఎందుకు మారారు అన్నదే వార్ కథ. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. -
వార్ టీం సక్సెస్ పార్టీ..
ముంబై : విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రూ 53 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి భారీ కమర్షియల్ హిట్ కొట్టిన వార్ మూవీ టీం సక్సెస్ జోష్‌లో మునిగితేలుతోంది. బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు తెరను పంచుకున్న ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణతో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. వార్ గ్రాండ్ సక్సెస్‌తో చిత్ర బృందం ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోస్‌లో ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. సక్సెస్ పార్టీలో హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, మూవీ హీరోయిన్ వాణికపూర్ పాల్గొని సందడి చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన వార్ మూవీకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన ఎదురైనా వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది. -
బాక్సాఫీస్‌పై ‘వార్’ దండయాత్ర..
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.. ఊహించినట్టుగానే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్‌గా, బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రమోటైన ‘వార్’కు పాజిటివ్ రివ్యూలతోపాటు ఆడియెన్స్ టాక్ కూడా బలంగా ఉండటంతో తొలిరోజు రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన వార్ సినిమా తొలి రోజు రూ. 53.35 కోట్లు రాబట్టింది. హిందీలో ఈ సినిమా 51.60 కోట్లు రాబట్టగా.. తమిళం, తెలుగు భాషల్లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. తొలిరోజే ఏకంగా 53 కోట్లు వసూలు చేసిన ‘వార్’ పలు రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్ నిలిచింది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీస్టారర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. ఆ రికార్డును వార్ చెరిపేసింది. ఈ రెండు సినిమాలు యష్‌రాజ్ ఫిల్మిమ్స్ తీసినవే కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజు వసూళ్లు సాధించిన సినిమాగా వార్ మొదటిస్థానంలో ఉండగా.. భారత్ (42.30 కోట్లు), మిషన్ మంగళ్ ( 29.16 కోట్లు), సాహో (24.40కోట్లు), కళంక్ (21.60కోట్లు) వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రభావం వార్‌పై ఉంటుందని భావించారు. కానీ, అంతగా ఆ ప్రభావం లేదని వసూళ్లు చాటుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులుగా ఎందుకు మారారు అన్నదే వార్ కథ. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. -
'బాగీ-3లో మణికర్ణిక ఫేమ్ అంకితా లోఖండే'
మణికర్ణిక ఫేమ్, పవిత్ర రిష్తా సీరియల్‌తో టీవీ ప్రేక్షకులకు చేరువైన నటి అంకితా లోఖండే తాజాగా మరో భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రాన్ని చేజిక్కించుకుంది. హీరో టైగర్‌ష్రాఫ్, సాహో ఫేమ్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న బాగీ-3 చిత్రంలో అంకితాకు నటించే అవకాశం దక్కింది. కాగా బాలీవుడ్‌లోకి అంకితా లోఖండే డెబ్యూ మూవీ మణికర్ణికతో అడుగుపెట్టారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీలో ఆమె రితేష్ దేశ్ముఖ్తో పాటు నటిస్తున్నారని ఈ మేరకు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ-3లో ఆమె శ్రద్ధాకపూర్‌కు అక్కగా నటిస్తుండగా, మరోవైపు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రంలో టైగర్‌కు అన్నగా నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తనని మునుపటి కంటే కొత్తగా చూపనున్నారని, ప్రేక్షకులకు తన పాత్ర బాగా నచ్చుతుందని అంకితా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రం మార్చి 2020లో రిలీజ్ కానుంది. -
యాక్షన్ ప్లాన్
శత్రువులపై దాడి చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్. ఈ ప్లాన్‌లో నేనూ పాలుపంచుకుంటాను అంటున్నారు శ్రద్ధా కపూర్. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ‘భాగీ 3’. ౖటైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్ దర్శకుడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. టైగర్, శ్రద్ధా, రితేష్ దేశ్‌ముఖ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. అక్టోబ రులో ‘భాగీ 3’ బృందం జార్జియా వెళ్లనుందని టాక్. -
మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి
ముంబై : తనకు రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు క్రిష్ణా ష్రాఫ్ అన్నారు. తన పెళ్లి గురించి క్రేజీ వార్తలు ఎందుకు ప్రచారం అవుతున్నాయో అర్థం కావడం లేదని వాపోయారు. ‘భాగీ’ ఫేం, తన అన్నయ్య టైగర్ ఫ్రాఫ్‌తో కలిసి క్రిష్ణా ఓ ఫిట్నెస్ సెంటర్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీల సందడితో ఈ స్టార్ కిడ్స్ జిమ్ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాకు బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్ పరిచయమయ్యాడు. ఇక అప్పటి నుంచి టైగర్ బెస్టీగా గుర్తింపు పొందిన ఇబాన్.. క్రిష్ణాతో ప్రేమలో పడ్డాడంటూ బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇబాన్ తన ఇన్‌స్టా స్టోరీలో క్రిష్ణ గురించి చెబుతూ ‘వైఫీ’ అని సంబోధించడంతో వారి పెళ్లి అయిపోందని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. సోదరుడు టైగర్‌తో క్రిష్ణా ష్రాఫ్ అదే విధంగా..‘మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్..ఇదే మేము కోరుకుంటున్న స్వర్గం..ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఇదే మా గమ్యం’ అంటూ తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోను క్రిష్ణ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఈ విషయంపై స్పందించిన క్రిష్ణ మాట్లాడుతూ...‘ బిగ్గరగా నవ్వాలని ఉంది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయి. మేము రహస్యంగా వివాహం చేసుకున్నామనడం క్రేజీ. ఇలాంటి వార్తలు విని మా అమ్మ కూడా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతోంది. అసలేం జరిగిందో చెప్పమంటూ పోరు పెడుతోంది. ఇబాన్, టైగర్ ఐదేళ్లుగా మంచి స్నేహితులు. అలా నాకు కూడా తను పరిచయం. వాళ్లిద్దరూ కలిసి బాస్కెట్ బాల్ ఆడటం నేను ఎంజాయ్ చేస్తా’ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపడేశారు. కాగా తన సోదరుడు టైగర్.. హీరోయిన్ దిశా పటానీతో కలిసి బాహాటంగానే చక్కర్లు కొడుతున్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదంటూ క్రిష్ణ తన సోదరుడి ప్రేమ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోదరుడితో పాటు తన రిలేషన్షిప్ గురించి కూడా క్రిష్ణ బాగానే కవర్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram Minding our own business like it’s our own company, this is destiny, we meant to be, something so special, like it’s heavenly. ♾ #justforyou @ebanhyams @doitall23 A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on Sep 3, 2019 at 9:50am PDT -
‘అర్జున్ నీకు ఆ స్థాయి లేదు’
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో తన స్నేహితులు, సహా నటుల పోస్ట్‌లకు హాస్యాస్పద కామెంట్లు పెట్టి సరదా పట్టిస్తుండాడు. అలా సామాజిక మాద్యమాల్లో ఫన్నీ కామెంట్ల స్పెషలిస్ట్‌గా పేరున్న అర్జున్ ఈ సారి బొల్తాపడ్డాడు. తన కామెంట్‌తో నెటిజన్లకు కోపం తెప్పించాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ల అభిమానులు హీరో అర్జున్ కపూర్‌పై మండిపడుతున్నారు. తమ అభిమాన హీరోలను ‘సాధారణ హీరోలు’ అన్నందుకు అగ్గిమీద గుగ్గిలంలా అవుతున్నారు. టైగన్ ష్రాఫ్ తన వార్ కోస్టార్ హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్‌ల ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్‌పై స్పందించిన అర్జున్ కపూర్‌పై ఈ స్టార్ హీరోల అభిమానులంతా ఫైర్ అయ్యారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు నటిస్తున్న చిత్రం వార్ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో హృతిక్, టైగర్ ష్రాఫ్‌లు నేలపై కుర్చుండగా.. దర్శకుడు సిద్దార్థ్, కుర్చీలో కూర్చున్న ఫోటోను పోస్ట్ చేశాడు. దానికి అర్జున్ కపూర్ దర్శకుడు సిద్దార్థ్‌ను ఉద్దేశిస్తూ..‘లెజెండ్‌తో సాధారణ నటులు’ అంటూ సరదాగా కామెంట్ పెట్టాడు. దీంతో హృతిక్, టైగర్ ష్రాఫ్‌ల అభిమానులంతా అర్జున్‌పై కామెంట్లతో దాడికి దిగారు. ఓ నెటిజెన్ ‘అర్జున్ కనీసం నవ్వు టైగర్ ష్రాఫ్‌తో కూడా పోల్చుకోలేవు’ మరో నెటిజెన్ ‘ అర్జున్ నీకు ఆస్థాయి లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. టైగర్ పెట్టిన పోస్ట్‌పై దర్శకుడు సిద్దార్థ్‌తో పాటు హీరో హృతిక్ రోషన్ కూడా స్పందించారు.‘ ఇంకా ఒక్కరోజు షూటింగ్ మిగిలి ఉంది..ఆ తర్వాత నీతో కలిసి పని చేసే అవకాశం ఉండదు టైగర్’అంటూ కామెంట్ చేశాడు. ఈ ఏడాది బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న వార్ సినిమాను యష్ రాజ్ ప్రొడక్షన్లో ఆదిత్య చొప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్, టైగర్ల మధ్య యాక్షన్, భారీ ఛేజింగ్ సీన్స్ ఫీన్లాండ్ రోడ్లపై చిత్రీకరించినట్లు సినిమా యూనిట్ తెలిపింది. View this post on Instagram I got your back sir @hrithikroshan and hopefully hes @itssiddharthanand got ours! 😋🤪 #onemonthtogo #2ndoct #war #hrithikvstiger A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on Sep 1, 2019 at 5:44am PDT -
గురుశిష్యుల మధ్య ‘వార్’
భారతీయ వెండితెర మీద భారీ చిత్రాలు సందడి చేస్తున్నాయి. సౌత్ నుంచి సాహో, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా బాలీవుడ్ నుంచి అంతుకు మించి అన్నట్టుగా సినిమాలను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ వార్. ఇప్పటికే టీజర్‌తో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 25 సెకన్ల ట్రైలర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చూసేలా చేస్తోంది. సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులగా ఎందుకు మారారు అన్నదే వార్ కథ. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమూవీని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
7 దేశాల్లోని 15 నగరాల్లో.. ‘వార్’
బాలీవుడ్ టాప్ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం వార్. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగనుంది. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను 7 దేశాల్లోని 15 ప్రధాన నగరాల్లో చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు పనిచేసిన పాల్ జెన్సింగ్స్ని, ఐ ఇన్ ద స్కై, డెత్‌రేస్ ఫేం ఫ్రాంజ్ స్పిల్హాస్, ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్, స్నో పియర్సర్ ఫేం సీ యంగ్‌ని, శాన్ ఆండ్రియాస్, టైగర్ జిందాహై, మేరీకోమ్, కేసరి చిత్రాల స్టంట్ మాస్టర్ పర్వేజ్ షేక్ నేతృత్వంలో చిత్రీకరించారు. కేవలం యాక్షన్ సీన్స్‌ను దాదాపు ఏడాది పాటు డిజైన్ చేశారు. హృతిక్, టైగర్లు పోటాపోటిగా నటించిన ఈ సినిమా యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి విపరీతంగా నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్టార్ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!
ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ ఫైటింగ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌కు ఓ అభిమాని ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చింది. అభిమానులతో సరదాగా గడిపేందుకు టైగర్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం రాత్రి ఓ కార్యక్రమం మొదలెట్టాడు. అయితే ఓ ఆకతాయి .. ‘ఇంతకూ మీరు వర్జినా’ అని ప్రశ్నించాడు. దీంతో టైగర్ కాస్త కలవరపడ్డాడు. వెంటనే తేరుకుని.. ‘ఓ సిగ్గులేని వెధవ. ఇన్‌స్టాలో మా అమ్మానాన్నా కూడా నన్ను ఫాలో అవుతున్నారు’అని ఘాటుగా స్పందించాడు. ఇక మరో అభిమాని ‘మీకు ఎంతమంది గాళ్‌ఫ్రెండ్స్’అని ప్రశ్నించగా.. ‘చెప్పడానికేం లేదు. గాళ్‌ఫ్రెండ్స్ లేరు’అంటూ బదులిచ్చాడు. ఇక భాగి-2 సినిమాలో తనతో జోడి కట్టిన దిశా పటానితో టైగర్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరిదీ హాట్ జోడీ అని బీ-టౌన్లో ప్రచారం సాగుతోంది. ‘మీరు దిశాతో డేటింగ్లో ఉన్నారా..?’అని ఓ అభిమాని అడగ్గా.. ‘చెబితే వినకుంటే నేనేం చేయలేను. ఐ డోంట్ కేర్’అన్నాడు. తమ మధ్య ఉన్న బంధాన్ని టైగర్, దిశా ఇంతవరకూ బయటపెట్టకపోవడం గమనార్హం. -
గన్‌దరగోళం
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ను ఢీ కొట్టడానికి టైగర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మెషీన్‌గన్ ‘గాట్లింగ్’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్ చోప్రా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్‌లో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్గన్తో సిటీని ధ్వంసం చేస్తూ గన్‌దరగోళం సృష్టిస్తారట టైగర్. ఈ సీన్స్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తాయట. వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
విదేశాల్లో వార్
భూమి, సముద్రం, మంచుపై మాత్రమే కాదు గాలిలో కూడా ఫైట్ చేస్తున్నారట హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్. ఈ పవర్ఫుల్ ఫైట్స్‌ని పావెల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్హాస్, సా యంగ్ ఓహ్, పర్వేజ్ షేక్ ఈ నలుగురు హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్’. ఇందులో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి టీజర్లో. ఇటీవల ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో ఓ భారీ కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పావెల్ జెన్నింగ్స్ డిజైన్ చేశారు. ఇంతకు ముందు డార్క్ నైట్, జాక్ రేచర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు పావెల్. ఈ సీన్ కోసం హృతిక్, టైగర్ ముందుగా బాగా ప్రాక్టీస్ చేశారట. ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో యాక్షన్ సీన్‌ను తెరకెక్కించిన తొలి బాలీవుడ్ మూవీ ఇదేనట. ఇండియా లొకేషన్స్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పీడన్ దేశాల్లోని పదిహేను ముఖ్యనగరాల్లో ఈ సినిమా చిత్రీకరణను టీమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ‘వార్’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. -
యుద్ధానికి సిద్ధం
బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్క్రీన్‌మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మరి వీళ్ల ఫైట్ దేనికోసమో తెలియాలి. హృతిక్, టైగర్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. బైక్ స్టంట్స్, గన్ ఫైరింగ్, చేజ్లు, ఫైట్స్‌తో నిండిన ఈ టీజర్ భారీ యాక్షన్ చిత్రాన్ని అందించనున్నాం అనే ప్రామిస్ చేస్తోంది. హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 2న ‘వార్’ సినిమా విడుదల కానుంది. -
ఉత్కంఠ భరితంగా ‘వార్’ టీజర్
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్స్ హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న ‘వార్’ చిత్రం టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వాణికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. టీజర్ చూస్తుంటే సినిమా ప్రేమికులకు ఓ భారీ కానుకలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ఒకరికొకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వీరోచితంగా కనిపిస్తున్నారు. ఈ దృష్యాలు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎవరికి ఎవరు తీసిపోకుండా ఇద్దరు సమవుజ్జీవులుగా పోరాడుతూ కనిపిస్తున్నారు. చిత్ర డైరెక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాకు వార్ అనే టైటిల్ సరిగా ప్రతిబింభిస్తుందని, ఇద్దరు స్టార్లను ఒకే సినిమాలో విలన్‌లాగా చూపించాలంటే ఈ టైటిల్ మాత్రమే సరిపోతుందని అనిపించిందన్నారు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకులకు ముందుకు రానుంది. -
ఫైటర్ హీరో!
బాలీవుడ్లో యాక్షన్ సన్నివేశాల స్టాండర్డ్‌ను సినిమా సినిమాతో పెంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. యాక్షన్ సన్నివేశాలే ‘భాగీ’ సిరీస్‌ను బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుపుతున్నాయి అనొచ్చు. తాజాగా ఈ సిరీస్‌లో మూడో పార్ట్ ‘భాగీ 3’తో సిద్ధమయ్యారు టైగర్. ఈ సినిమాలో స్టంట్స్‌ను సొంతంగా కంపోజ్ చేసుకుంటున్నారట టైగర్. ఆల్రెడీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో టైగర్ ష్రాఫ్‌కు మంచి అనుభవం ఉంది. కానీ ‘భాగీ 3’ యాక్షన్ మరింత కొత్తగా ఉండటం కోసం కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారట. 2020 మార్చి 6న ‘భాగీ 3’ థియేటర్స్‌లోకి రానుంది. -
‘అవును వారిద్దరూ విడిపోయారు’
ముంబై : బాలీవుడ్ ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు విడిపోయారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీలు, ఈవెంట్లలో సన్నిహితంగా మెలగడంతోపాటు దీర్ఘకాలం రిలేషన్షిప్లో ఉన్న వీరి బ్రేకప్ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత కొద్ది వారాలుగా వీరిద్దరి మధ్య చెడిందని, ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఇప్పుడది అధికారికంగా బ్రేకప్‌కు దారితీసిందని ఇద్దరికీ సన్నిహితంగా మెలిగేవారు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. గతంలోనూ వారిద్దరూ స్నేహితులే తప్ప అంతకుమించిన బంధం ఏమీ లేదని, అలాంటప్పుడు ఇక బ్రేకప్‌కు అవకాశం ఏముందని వారి సన్నిహితులు ప్రశ్నిస్తున్నట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. దిశా, టైగర్లు తొలిసారిగా మ్యూజిక్ వీడియో బేఫిక్రాలో తొలిసారిగా తెరను పంచుకోగా, బాగి-2లో కలిసి నటించారు. దిశా పటానీ సల్మాన్ సరసన భారత్‌లో ఆడిపాడారు. ఇక టైగర్ ష్రాఫ్ చివరిసారిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో సందడి చేయగా, హృతిక్ రోషన్‌తో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ మూవీలో కనిపించనున్నారు. ఇక బాగీ 3ని చేయాలని కూడా టైగర్ ష్రాఫ్ సన్నాహాలు చేస్తున్నారు. -
దిశాను కాపాడిన టైగర్
ముంబై: బాలీవుడ్ అందాల నటి దిశా పటానికి చేదు అనుభవం ఎదురైంది. తన 26వ పుట్టిన రోజు సందర్భంగా దిశా తరుచూ వెళ్లే బేస్టియన్ రెస్టారెంట్‌కి.. తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. అయితే ఆమె రాక తెలుసుకున్న దిశా అభిమానులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకోడానికి అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. వారంతా ఒక్కసారిగా దగ్గరికి రావడంతో ఆమె కిందపడబోయారు. దీంతో వెంటనే తేరుకున్న ష్రాఫ్ ఆమె పడకుండా చేయిపట్టుకుని రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైగర్ ష్రాఫ్‌తో పాటు సన్నిహితుల మధ్య దిశా పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీలో దిశా పటాని నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. -
‘టైగర్ బతికి ఉన్నాడా లేదా?!’
బాలీవుడ్ భామ దిశా పటాని నటనతోనే కాదు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు 26వ పుట్టిన రోజు జరుపుకొంటున్న ఈ బ్యూటీ.. తాను ఆడంబరాలకు దూరంగా ఉంటానన్నారు. ఈ బర్త్‌డేకు ఎటువంటి ప్లాన్ చేయలేదని..ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘మలంగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారన్నారు. ఇక హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా డేటింగ్లో ఉన్నారంటూ బీ- టౌన్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు.. శివసేన పార్టీ యువసేన అధ్యక్షుడు ఆదిత్యా థాక్రేతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దిశా పటానీ తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘దిశా.. టైగర్‌ను వదిలేసి.. రియల్ టైగర్‌తో తిరుగుతుంది’ అని కొందరు.. ‘అయ్యో... టైగర్ బతికున్నాడా లేదా’ అంటూ మరికొందరు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అయితే తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ ట్రోల్స్‌పై.. దిశా కాస్త ఘాటుగానే స్పందించారు. ‘ స్నేహితులతో డిన్నర్, లంచ్‌కి వెళ్తే తప్పేంటి? నా దృష్టిలో స్నేహితులు అంటే అర్థం ఒకటే. అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే అంతా నాకు సమానమే. నేను ఎలాంటి లింగ వివక్షను చూపించను’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా సల్మాన్ ఖాన్‌తో కలిసి దిశా నటించిన భారత్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దుమ్ము లేపుతున్న ఈ సినిమాలో తాను కూడా భాగమవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
ఎంత ట్రై చేసినా.. అతను పడటం లేదు
అబ్బాయిలు పడగొట్టాలి, అమ్మాయిలు పడిపోవాలి. అది ఆనవాయితి అని ఓ సినీ కవి చెప్పాడు. కానీ దీనికి విరుద్ధంగా నేనెంత పడగొట్టినా టైగర్ నాకింకా పడటం లే దంటున్నారు దిశా పటానీ. బాలీవుడ్లో యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ విషయంపై ఇద్దరూ మౌనవ్రతం వహించారు. ఇటీవల కొంచెం మాట్లాడుతున్నారు. టైగర్‌తో ఉన్న అనుబంధం గురించి దిశా పటానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘నీ కోసం, జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, బ్యాక్ ఫ్లిప్ చేశాను అని చెప్పినప్పటికి తను ఇంప్రెస్ కావడం లేదు. ఇంకేం చేయాలి? తను చాలా స్లో. మేం కేవలం ఫ్రెండ్స్‌లా కాకుండా మా రిలేషన్షిప్ పెరగాలని కోరుకుంటున్నాను. నా శక్తి మేరకు ఇంప్రెస్ చేస్తున్నాను, తను మాత్రం పడటం లేదు’’ అని పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే దిశా కీలక పాత్రలో నటించిన సల్మాన్‌ఖాన్ ‘భారత్’ జూన్ 5న రిలీజ్. -
‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తలను మరింత బలోపేతం చేస్తున్నారు ఈ యంగ్ కపుల్. ఇలా బయట కలిసి కనిపిస్తూ ఉన్నా కూడా వీరిద్దరు తమ రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే రీసెంట్గా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ‘ మేమిద్దరం పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాం. హార్డ్‌వర్క్ చేస్తాం. అయితే టైగర్ నా కంటే ఎన్నో రెట్లు అధికంగా శ్రమిస్తాడు. మా ఇద్దరికీ జీవితంలో కొన్ని ఆశయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. టైగర్ పట్ల నాకెంతో ఆరాధనా భావం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో తను కాకుండా వేరే స్నేహితులెవరూ లేరు’ అని దిశా పేర్కొన్నారు. అంతేతప్ప తమ మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు దిశా. కాగా టైగర్ ష్రాఫ్-దిశా పటాని భాగీ 2 సినిమాలో జంటగా నటించారన్న సంగతి తెలిసిందే. టైగర్‌తోనే కాకుండా అతడి తల్లి అయేషా, చెల్లి క్రిష్ణతో కూడా దిశా తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ఇక వృత్తిగత విషయానికి వస్తే..సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్‌లతో కలిసి దిశా నటించిన భారత్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. -
మొదటి వారంలో రూ. 50 కోట్ల కలెక్షన్లు
ముంబై : టైగర్ ష్రాఫ్ తాజా సినిమా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ కలెక్షన్లు మాత్రంగా స్థిరంగా ఉన్నాయి. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా ఇండియాలో మొదటి వారంలో రూ. 57.90 కోట్ల కలెక్షన్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రెండో వారం వసూళ్లు ఈ సినిమాకు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది విడుదలైన ‘బాగీ2’ సినిమా మొదటి వారంలోనే వంద కోట్లు పైగా (రూ. 112.85 కోట్లు) సాధించి టైగర్ ష్రాఫ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. 2016లో వచ్చిన ‘బాగీ’ సినిమా తొలి వారంలొ రూ. 59.72 కోట్లు రాబట్టింది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూలో టైగర్ ష్రాఫ్ సరసన చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే, తార నటించారు. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. -
టైగర్‌తో ఆ సన్నివేశంపై అనన్య రియాక్షన్..
ముంబై : స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇదే మూవీలో హీరో టైగర్ ష్రాఫ్‌తో ముద్దు సన్నివేశంపై స్పందించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన అనన్య తాను వేరొకరికి ముద్దు పెట్టడం ఇదే తొలిసారని, సో దీన్ని మరో కిస్‌తో పోల్చలేనని, అయితే తన తొలి బెస్ట్ కిస్ ఇదేనని చెప్పారు. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌కు సీక్వెల్‌గా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూ తెరకెక్కింది. ఒరిజినల్లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్ధ్ మల్హోత్రాలను కరణ్ జోహార్ బాలీవుడ్‌కు పరిచయం చేశారు. మరోవైపు సీక్వెల్లో టైగర్ ష్రాఫ్‌తో అలియా భట్ ఓ పాటలో ఆడిపాడారు. కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూను పునీత్ మల్హోత్రా తెరకెక్కించారు. -
ఆ భయం లేదు
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు అనన్యా పాండే. 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ఇది సీక్వెల్. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరో. తారా సుతారియా ఈ సినిమాలో మరో హీరోయిన్. ‘‘మీ తొలి సినిమాలోనే ఇంకో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పోటీగా ఫీల్ అయ్యారా? అని అనన్యా పాండేని అడిగితే... ‘‘నాకు ఎటువంటి అభద్రతాభావం లేదు. కథ నచ్చితే నాతోపాటు పదిమంది హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. పైగా నా స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గుతుంది. సినిమాలో అంతమంది ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ‘స్టూ్టడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది. -
నాన్నతో కలిసి నటించను
... అంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో, జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్. ఎవ్వరైనా తమ తల్లిదండ్రులతో యాక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ టైగర్ మాత్రం భయపడుతున్నాడు. ఆ భయానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘‘నాన్న, నేను కలసి నటించాలంటూ చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ సరైన స్క్రిప్ట్ రావాలి. అలాగే ప్రస్తుతానికి నాన్నగారితో నటించలేను. నాన్న, నేను ఒకే ఫ్రేమ్‌లో ఉంటే కచ్చితంగా నేను ఫ్రీజ్ అయిపోతాను. అందుకే ఇప్పట్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసు కోను’’ అన్నాడు. మరి మీ సినిమాలను గురించి నాన్నతో డిస్కస్ చేస్తారా? అని అడగ్గా – ‘‘నేను ఏ సినిమా చేస్తున్నాను, స్క్రిప్ట్ విషయాలు ఎప్పుడూ నాన్నతో డిస్కస్ చేయను. సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే నాన్నకు చూపిస్తాను. చూశాక, ‘బిందాస్. చాలా బావుంది. పాస్ అయ్యావు’ అని మాత్రం చెబుతారు. నాన్నే నా పెద్ద విమర్శకుడు అని భావిస్తాను’’ అని చెప్పారు. -
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ట్రైలర్ లాంచ్
-
యాక్షన్ సీక్వెల్లో మరోసారి శ్రద్ధా
బాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ బాఘీ. ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అవుతోంది. తెలుగు సూపర్ హిట్ వర్షం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బాఘీలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్లు జంటగా నటించారు. తరువాత మరో తెలుగు సూపర్ హిట్ క్షణంకు రీమేక్‌గా తెరకెక్కిన బాఘీ 2లో టైగర్‌కు జోడిగా దిశాపటాని అలరించారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న మూడో భాగానికి మరోసారి శ్రద్ధానే హీరోయిన్గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని నిర్మాత సాజిద్ నడియావాలా సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు.అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సాహోతో పాటు స్ట్రీట్ డ్యాన్సర్, చిచోరే సినిమాల్లో నటిస్తున్న శ్రద్ధా త్వరలోనే బాఘీ టీంతో జాయిన్ కానున్నారు. 💥 B O O M 💥#NGEFamily welcomes our very own @ShraddhaKapoor back to the franchise 🤩#BAAGHI3 it is 🔥@iTIGERSHROFF #SajidNadiadwala @khan_ahmedasas @foxstarhindi @WardaNadiadwala pic.twitter.com/rshCzA2S4A — Nadiadwala Grandson (@NGEMovies) 12 February 2019 -
దిశా పోయె సారా వచ్చె!
మనదని రాసి పెట్టి ఉంటే కాస్త ఆలస్యమైనా మనకు రాక మానదు. ప్రస్తుతం ఇది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌కు సరిపోయేలా ఉంది. ఈ నెలలో రిలీజైన ‘కేదార్నాథ్’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు సారా. కానీ అన్నీ సవ్యంగా జరిగి ఉంటే టైగర్ ష్రాఫ్ హీరోగా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ చిత్రంతో ఆమె ఎంట్రీ జరగాల్సింది. టైగర్ ష్రాఫ్‌తో నటించే చాన్స్ సారాకు మిస్ అయ్యింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ ‘సింబా’ సినిమాలో కూడా నటించేశారు సారా. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ సరసన ‘భాగీ 3’ చిత్రంలో సారాకి చాన్స్ దక్కిందని బాలీవుడ్ సమాచారం. ‘భాగీ 1, భాగీ 2’ చిత్రాల్లో టైగర్ ష్రాఫ్ హీరో అన్న విషయం తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ ‘భాగీ 2’ లో నటించిన దిశా పాట్నీనే ‘భాగీ 3’లో కూడా నటిస్తారని అప్పుడు వార్తలు వచ్చాయి. ౖపైగా టైగర్, దిశా లవ్‌లో ఉన్నారని టాక్ ఉంది. మరి ఇప్పుడు ‘భాగీ 3’ చిత్రం కోసం సడన్‌గా సారా ఎందుకు లైన్లోకొచ్చారు? అనేది బాలీవుడ్లో జరుగుతున్న చర్చ. ఈ సంగతి ఇలా ఉంచితే.. సారా నటించిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
టైగర్.. టాక్సీవాలా
బాలీవుడ్ ఫైటింగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ గురువారం నగరంలో సందడి చేశాడు. కొత్తగూడలో ఏర్పాటు చేసిన లైఫ్‌స్టైల్ స్టోర్‌ను ప్రారంభించి అభిమానులనుఅలరించాడు.టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ బంజారాహిల్స్‌లో మెరిశాడు. కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ డిజైనర్ స్టోర్‌ను ప్రారంభించాడు. జూబ్లీహిల్స్ :ఫ్యాషన్ డిజైనర్ దంపతులు రామ్–చంద్రికలు బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 10లో ఏర్పాటు చేసిన ‘ రామ్జ్ ఫ్యాషన్ డిజైనర్ స్టోర్ ’ను సినీహీరో విజయ్ దేవరకొండ ప్రారంభించారు. రామ్ దంపతులు తయా రు చేసిన డిజైన్ చేసిన దుస్తులు తనకెంతో ఇష్ట్రమన్నారు. రామ్ దంపతులు మాట్లాడుతూ ప్రఖ్యాత లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తమ కలెక్షన్లు ప్రదర్శించామన్నారు. ఈ స్టోర్‌లో ప్రత్యేకించి పురుషుల డిజైన్లు అంది స్తున్నాని వారు చెప్పారు. కొత్తగూడలో ‘లైఫ్‌స్టైల్’ స్టోర్ ప్రారంభం రాయదుర్గం: ఫ్యాషన్‌కు ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘లైఫ్ స్టైల్’ స్టోర్ కొత్తగూడ కూడలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం అభిమానుల కోలాహలం మధ్య బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్, లైఫ్‌స్టైయిల్ ఎండీ వసంత్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం టైగర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ తనకెంతో ఇష్టమని, తనకు ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారన్నాడు. హైదరాబాద్‌లో బిర్యానీ, కబాబ్ ఇష్టమన్నాడు. తెలుగు హీరో అల్లు అర్జున్ అంటే ప్రత్యేకమైన అభిమానంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు గాల్లోకి ఎగిరి ఓ స్టంట్ చేసి అలరించాడు. సంస్థ ఎండీ వసంత్ కుమార్ మాట్లాడుతూ.. 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75 స్టోర్స్‌ను ప్రారంభించామన్నారు. నగరంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణతో మూడో స్టోర్‌ను శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో మరో స్టోర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
టైగర్‌తో లంచ్..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హాట్ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్లో ఉన్నారని, వీరి మధ్య సంబంధాలు ఇటీవల బెడిసికొట్టాయని వచ్చిన వార్తలకు ఈ జంట బ్రేక్ వేసింది. వీరిద్దరు కలిసి ఇటీవల ముంబైలోని ఓ రికార్డింగ్ స్టూడియోలోకి చేరుకుంటూ తమపై వచ్చిన వదంతులను కొట్టిపారేశారు. అప్పటినుంచి పలు సందర్భాల్లో వీరు సన్నిహితంగా ఉంటూ కెమెరాల కంట పడ్డారు. తాజాగా దిషా, టైగర్లు బాంద్రాలో సెలబ్రిటీలు తరచూ సందర్శించే ప్రముఖ రెస్టారెంట్ బాస్టిన్‌లో బ్రంచ్ చేశారు. అయితే ఇప్పటివరకూ తమ మధ్య ఉన్న సంబంధం గురించి వీరు నోరుమెదపకపోవడం గమనార్హం. ఇక వృత్తిపరంగా దిశా పటానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్‌లో మెరవనున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతూ కత్రినా కైఫ్, టబు, సునీల్ గ్రోవర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2019 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టైగర్ ష్రాఫ్ కరణ్ జోహార్ నిర్మించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్నారు. అనన్య పాండే తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది. -
హాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ యాక్షన్ హీరోల లిస్ట్‌లో టైగర్ ష్రాఫ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఏ ‘ప్లైయింగ్ జాట్, భాగీ సిరీస్’ చిత్రాల్లో టైగర్ యాక్షన్ టాలెంట్ ఏంటో చూశాం. ఇప్పుడీ యాక్షన్ హీరో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. ఇటీవల టైగర్ ష్రాఫ్‌ను హాలీవుడ్ నిర్మాత లారెన్స్ కసోనోఫ్ మీట్ అవ్వడమే ఇందుకు కారణం. టైగర్ ఫిజిక్కు లారెన్స్ ఇంప్రెస్ అయ్యారట. తాను తీయాలనుకుంటున్న యాక్షన్ మూవీకి టైగర్ నప్పుతాడని భావించారట. గతంలో ‘బ్లడ్ డిన్నర్, ఫార్ ఫ్రమ్ హోమ్, ట్రూ లైస్’ వంటి భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు లారెన్స్. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ఫిల్మ్ ‘రాంబో’ హిందీ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. -
స్నేహం కాదు... అంతకు మించి!
బాలీవుడ్ యంగ్ యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, దిశా పాట్నీ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా టాక్. హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తను మరింత బలోపేతం చేస్తోంది ఈ జంట. ఇలా బయట కనిపిస్తూ ఉన్నా కూడా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఈ ఇద్దరూ. కానీ రీసెంట్గా జరిగిన ఓ ఈవెంట్లో టైగర్ ష్రాఫ్‌ను.. దిశా పాట్నీకు, మీకు రిలేషన్షిప్ ఏంటి? అని అడగ్గా ‘మేం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ’ అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘దిశా, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు దానికంటే ఎక్కువ. దిశా చాలా ఇన్స్పైరింగ్, హార్డ్ వర్కింగ్ అమ్మాయి. సక్సెస్‌ని, టాలెంట్‌ని తలకెక్కించుకోని గుణం ఆమెది. ఫస్ట్‌లో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది’’ అంటు దిశాపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంతకీ వాళ్ల ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టైగర్. -
200 కోట్ల బడ్జెట్.. పది దేశాల్లో షూటింగ్..!
భారతీయ చిత్రాలు విదేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన దర్శక నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పద్మావత్, తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, టైగర్ జిందాహై లాంటి చిత్రాలకు 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.. చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో భారీ చిత్రం చేరనుంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల కాంబినేషన్లో యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు 10 దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ హీరోగా బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాన్ని తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి ఫొటోనూ చిత్ర హీరోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్!
ప్లేటులో పెట్టిన బిర్యానీ ప్లేటులోనే ఉంది. ఇప్పుడు తినకపోతే నేను కరిగిపోతా అని ఐస్‌క్రీమ్ ఆశగా చూసినా ఊహూ... ఐసు, మనసు వాటి మీద ఉంటేనే కదా. వెళ్లింది లంచ్ డేట్‌కే అయినా కారణం వేరు. స్వీట్లు, హాటులు తినడంకన్నా స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలన్నదే మెయిన్ రీజన్. కారణం ఏదైనా లంచ్ డేట్‌కి వెళ్లిన ప్రేమ పక్షుల మీదే అందరి చూపు. ముంబైలోని రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌లో రెండు జంటలు లంచ్ డేట్‌కి వెళ్లి హాట్ టాపిక్‌గా మారారు. ఒక జంట మథియాస్ బో–తాప్సీ అయితే మరో జంట టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ. ‘‘మీరంతా అనుకున్నట్లు మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్. అయినా లవ్‌లో పడితే మేమే చెబుతాం’’ అని ఈ రెండు జంటలూ కొన్ని సందర్భాల్లో చెప్పారు. మరి.. ఏమీ లేకపోతే ఈ లంచ్ డేటులూ, డిన్నర్ డేటులూ ఏంటమ్మా? అంటే.. నో ఆన్సర్. ‘‘మేమే చెబుతాం’’ అన్నారు కదా సమాధానం ఎదురు చూడటం కూడా కరెక్ట్ కాదేమో. ఇంతకీ మథియాస్ బోతో తాప్సీ లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి కదా.. ఆ మథియాస్ ఎవరంటే డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓసారి మ్యాచ్ చూడ్డానికి వెళ్లినప్పుడే ఇద్దరి కళ్లూ కలిశాయని, పరిచయం ప్రేమగా మారిందని టాక్. ఇక, టైగర్, దిశా గురించి చెప్పాలంటే, రెండేళ్ల క్రితం ‘బేఫిక్రా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారని వార్త. ఆ తర్వాత ఇద్దరూ ‘భాగీ 2’ సినిమాలో జంటగా నటించారు. ప్రేమ రోజు రోజుకీ పెరుగుతోందట. కానీ మేం క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఏదేతైనేం ఔత్సాహికరాయుళ్ల నోటికి ఈ జంటలు మంచి మేత ఇస్తున్నాయి. -
2.0 ఎఫెక్ట్!
పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్యా పాండే ముఖ్య తారలుగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’. దాదాపు ఆరేళ్ల క్రితం కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. తొలుత ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ను ఈ ఏడాది నవంబర్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు కరణ్ జోహార్ వెల్లడించారు. అంతేకాదు.. తొలి పార్ట్‌లో నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్, వరుణ్ ధావన్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో గెస్ట్ రోల్స్ చేయనున్నారని టాక్. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటించిన ‘2.0’ చిత్రం నవంబర్ 29న రిలీజ్ కానుండటమే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమా వాయిదా పడటానికి కారణం అని బీ టౌన్ టాక్. -
బాలీవుడ్ హీరోకి జిరాక్స్ కాపీ...!
సినిమాల్లో హీరోలకు డూప్‌లు ఉండటం సర్వ సాధారణం. వారిని కాస్తా దూరం నుంచి చూస్తే నిజంగా హీరోలేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి మాత్రం ఎవరికి డూప్ కాదు. కానీ ఒక బాలీవుడ్ హీరోకి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. బాఘీ హీరో టైగర్ ష్రాఫ్‌కు అచ్చు గుద్దినట్లు ఉండే ఓ వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో అతడి గురించే చర్చ. నెటిజన్లు టైగర్ ష్రాఫ్ - 2 గా పిలుచుకుంటున్న ఈ వ్యక్తి అస్సాంకు చెందిన డేవిడ్ సహరియా. ఫిట్నెస్ ఔత్సాహికుడు మాత్రమే కాక మోడల్ కూడా కావడంతో తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. దాంతో ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. Old post Being Inspiration# Shredded # Way to go A post shared by David Messi (@davidmessi_official) on May 5, 2018 at 10:16am PDT -
సిరియా మిలటరీలో శిక్షణ తీసుకోనున్న హీరో
‘దేశీ ర్యాంబో’ టైగర్ ష్రాఫ్ మరోసారి తన యాక్షన్ విశ్వరూపం చూపించడానికి రెడి అయ్యాడు. బాగీ మొదటి రెండు సీక్వెల్స్‌లో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసి, సీనియర్ యాక్షన్ హీరోలు అక్షయ్, జాన్ అబ్రహాం ప్రశంసలు పొందిన ఈ దేశీ ర్యాంబో ప్రస్తుతం ‘బాగీ 3’ కోసం రెడి అవుతున్నట్లు సమాచారం. ‘బాగీ’ చిత్ర నిర్మాత సజీద్ నదియవాలా ‘బాగీ 3’ని కూడా నిర్మిస్తానని ‘బాగీ 2’ విడుదల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించనున్నారు. ‘బాగీ 3’లో యాక్షన్ సన్నివేశాలు గత రెండు చిత్రాలను మించేలా ఉంటాయంటున్నారు చిత్ర దర్శకుడు అహ్మద్. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం టైగర్ ష్రాఫ్ ఏకంగా సిరియా మిలటరీ క్యాంప్‌లో శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. ‘బాగీ 3’లో యాక్షన్ సన్నివేశాల్లో అధునాతన ‘ఎమ్16’, ‘ఏటీ4’, రాకెట్ లాంచర్ వంటి ఆయుధాలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. శిక్షణ తీసుకోవడం కోసం ఈ ఏడాది నవంబర్‌లో టైగర్ ష్రాఫ్ సిరియా మిలటరి క్యాంప్‌కు వెళ్లనున్నాడని చిత్ర దర్శకుడు అహ్మద్‌ఖాన్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న టైగ్ర్ ష్రఫ్ ‘బాగీ’, ‘బాగీ 2’ చిత్రాలలోని యాక్షన్ సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. -
టైగర్‌తో డేటింగ్‌పై దిశా..
సాక్షి, న్యూఢిల్లీ : బాఘీ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్లో ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం సాగుతున్నా దీనిపై వీరిద్దరూ ఇంతవరకూ నోరుమెదపలేదు. దిశా, టైగర్లు కలిసి పలు సందర్భాల్లో కెమెరాల కంటపడుతూనే ఉన్నారు. వీరిద్దరూ ఈ ఏడాది జనవరి 1న శ్రీలంకలో ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే టైగర్ ష్రాఫ్‌తో తన అనుబంధంపై దిశా పటానీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. తాను తన జీవితాన్ని వీలైనంత వరకూ వ్యక్తిగత విషయంగా చూస్తానని, తాను ఏది ప్లాన్ చేసినా దాన్ని బహిరంగంగా పంచుకోనని కుండబద్దలు కొట్టారు. అది ఇల్లయినా, కారయినా, జీవితమైనా ఏదైనా వాటిని ప్రైవేటు అంశాలుగానే పరిగణిస్తానని స్పష్టం చేశారు. టైగర్ ష్రాఫ్ తనకు మంచి స్నేహితుడని, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చారు. టైగర్ పాటించే నియమాలు, పని పద్ధతులు ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. టైగర్ అందరికీ ఆదర్శప్రాయుడుని కితాబిచ్చారు. ఇక సినిమాల పరంగా దిశా పటానీ సల్మాన్ ఖాన్‌కు జోడీగా భరత్‌లో నటించనుంది. -
చీట్ మీల్స్ కోసం యంగ్ హీరో
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకు సీక్వల్గా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లో మ్యాన్లీ హంక్ టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరిలో జరగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైగర్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న తారా సుతారియా, అనన్య పాండేలు షూటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. తాజాగా హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఓ ఆసక్తికర వీడియోనూ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. మరో నలుగురితో కలిసి రన్నింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన టైగర్ ‘నా చీట్ మీల్స్(డైట్ ప్లాన్‌లో లేని జంక్ ఫుడ్) కోసం ఇలా పరిగెడుతున్నాను’ అంటూ కామెంట్ చేశారు. హిరో యష్ జోహర్, అపూర్వ మెహతాలో కలిసి కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాను నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హీరో టైగర్ ష్రాఫ్ ఓ ఆసక్తికర వీడియో
-
ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2’ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతోన్న అనన్య షూటింగ్లో గాయపడినట్లు సమాచారం. చిత్రీకరణలో భాగంగా అనన్య కారు నడుపుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొన్నారు. ఊహించని పరిణామానికి అనన్య షాక్ గురైనట్లు సమాచారం. అయితే అనన్యకు పెద్దగా గాయాలేమీ కాలేదని, అయినప్పటికీ చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు యూనిట్ సిబ్బంది తెలిపారు. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరిలో షూటింగ్ జరుగుతోంది. -
టైగర్‌ను చూసి గర్విస్తున్నా..
సాక్షి, ముంబయి : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుమారుడు టైగర్ ష్రాఫ్ విజయాలను చూసి మురిసిపోతున్నారు. తనను టైగర్ తండ్రిగా పిలవడాన్ని గర్వంగా భావిస్తానని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. సినిమాల ఎంపికపై తాను టైగర్‌కు సలహాలు ఇవ్వనని, తన కెరీర్ గురించి ఏమాత్రం ఆందోళన చెందనని చెప్పారు. కఠోరశిక్షణతో టైగర్ ష్రాఫ్ తన శరీరాన్ని తీర్చిదిద్దుకున్నాడని, మానసికంగా ధృడంగా మారాడని కొడుకుకు కితాబిచ్చారు. తాజాగా బాఘీ 2తో టైగర్ ష్రాఫ్ సూపర్ హిట్ అందుకున్నారు. టైగర్ ఎన్నో విజయాలు, పరాజయాలను చూస్తూ పెరిగాడని, రిస్క్ తీసుకోవడాన్ని సవాల్‌గా భావిస్తాడన్నారు. అందరికీ ప్రేమను పంచడం, అపజయాలను హృదయానికి తీసుకోకపోవడం అలవరుచుకున్నాడని అన్నారు. నటుడు కావాలని తానెన్నడూ కలలు కనలేదని అన్నారు.తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా బాలీవుడ్లో ఎదిగానని, ఏదిచ్చినా దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తానని చెప్పారు. నా సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు వస్తే తాను సంతృప్తిగా ఫీలవుతానని అన్నారు. -
స్కూల్ స్టార్ట్.. అడ్మిషన్స్ క్లోజ్
క్లాసులు స్టార్టయ్యాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. అరె.. ఇదేమన్నా జూన్ నెలా! అడ్మిషన్స్ ఓపెన్ అవ్వడానికి. ఏప్రిల్ బాబూ.. సమ్మర్‌ను ఫుల్‌గా ఏంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అంటే.. నిజమే.. కాకపోతే ఇది రియల్ స్కూల్ కాదు కదా. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమా కోసం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఓపెన్ చేసిన స్కూల్. అందుకే వేసవిలో ఓపెన్ చేశారు. గతేడాది నవంబర్‌లో అడ్మిషన్స్ స్టార్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా పునీత్మల్హోత్రా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’. ఆరేళ్ల క్రితం కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమాతోనే వరుణ్‌ధావన్, అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం స్టార్ యాక్టర్స్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందని చిత్రబృందం అనౌన్స్ చేసింది. అనన్యపాండే సెలక్ట్ అయ్యిందనీ, మిగిలిన హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ లేదా సారా అలీఖాన్‌ను ఎంచుకునే స్కోప్ ఉందని బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఫైనల్‌గా ఎవరు నటించనున్నారన్నది ఈ రోజు ఎనౌన్స్ చేస్తామని నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. నవంబర్‌లో ఓపెన్ అయిన కరణ్‌జోహార్ స్కూల్ అడ్మిషన్స్ ఈ రోజుతో క్లోజ్ కానున్నాయన్నమాట. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
నా కూతురు పుట్టుకతోనే నటి..
బాలీవుడ్‌లోకి మరో యువకథాయిక ఎంట్రీ ఇవ్వబోతోంది. అలనాటి హీరో చుంకీ పాండే పెద్ద కూతురు అనన్య పాండే సినీ అరంగేట్రం మొదలవనుంది. వస్తూ వస్తూనే యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మాతగా పునిత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కెనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాతో 19 ఏళ్ల అనన్య పాండే బాలీవుడ్‌కు పరిచయం కానున్నారని తెలుస్తోంది. ఆమె పుట్టుకతోనే నటి.. అనన్య టైగర్ ష్రాఫ్ పక్కన నటించనున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె తండ్రి చుంకీ పాండే సమాధానం దాటవేశారు. ‘నా కూతురు పుట్టుకతోనే నటి. ఆమె నటిగా జీవించడానికే పుట్టింది’ అంటూ చమత్కరించారు. సినిమాల్లో రాణించేందుకు ఆమె నటనలో శిక్షణ తీసుకుందని చుంకీ తెలిపారు. టైగర్ ష్రాఫ్ అద్భుతమైన నటుడని కితాబిచ్చారు. భాగీ-2 సినిమాలో అతని నటన అదిరిపోయిందంటూ టైగర్ని ప్రశంసించారు. అనన్య గతేడాది పారిస్‌లోని ‘లే బాల్ దేస్ డిబ్యూటాంటిస్’ ఫ్యాషన్ షోలో పాల్గొని తన అందంతో ఆకట్టుకుంది. -
‘బాగీ-2’: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్!
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతూ 2018లో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు, రెండో రోజు రూ 20.40 కోట్లు వసూలు చేసిన బాగీ 2.. వీకెండ్ చివరి రోజైన ఆదివారం ఏకంగా రూ. 27.60 కోట్లు రాబట్టింది. మొత్తానికి మొదటి వారాంతంలో ఈ సినిమా రూ. 73.13 కోట్లు వసూలు చేసింది. ‘ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్..ప్రతిచోటా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ వసూళ్లతో దూసుకెళుతోంది. అసాధారణమైన ఓపెనింగ్ వసూళ్లు సాధించింది... మొత్తం రూ. 73.10 కోట్లు రాబట్టింది’ అని ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2018లో బాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ‘బాగీ-2’ రెండోస్థానంలో నిలిచిందని, భన్సాలీ ‘పద్మావత్’ సినిమా రూ. 114 కోట్లతో మొదటిస్థానంలో ఉందని ఆయన తెలిపారు. అయితే, ‘పద్మావత్’ సినిమా హిందీతోపాటు తమిళం, తెలుగు భాషలను కలుపుకొని ఈ మొత్తం కలెక్షన్లు రాబట్టిందని పేర్కొన్నారు. 2018 టాప్-5 ఓపెనింగ్ వసూళ్ల జాబితాలో రైడ్ (రూ. 41.01 కోట్లతో) మూడోస్థానంలో, పాడ్‌మ్యాన్ (రూ. 40.05 కోట్లతో) నాలుగో స్థానంలో, సోను కే టిటు కి స్వీటీ (రూ. 26.57 కోట్లతో) ఐదోస్థానంలో ఉందని తెలిపారు. తెలుగులో వచ్చిన ‘క్షణం’సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘బాగీ-2’లో టైగర్ ష్రాఫ్ చేసిన రిస్కీ ఫైట్లు, అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టైగర్‌ను ప్రశంసిస్తూ.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ట్వీట్ చేశారు. -
అద్దె కట్టలేని పరిస్థితి వచ్చింది: హీరోయిన్
బాలీవుడ్లో ప్రస్తుతం భాగీ 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో భాగీ 2 సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తోంది. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో అడివి శేష్ నటించిన క్షణం సినిమాకు రీమేక్. భాగీ 2 చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ జంటగా నటించారు. సినిమా విజయవంతం కావడంతో దిశా పఠానీ మీడియా ముందుకు వచ్చి తన ఆనందాన్ని పంచుకుంది. మీడియాతో మాట్లాడుతూ... ‘నేను బ్యాక్‌గ్రౌండ్‌తో రాలేదు. నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను మొదటిసారిగా ముంబైకి వచ్చినప్పుడు నా చేతిలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లాను. ఒకనాకొ సమయంలో ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి కూడా వచ్చింది. ఒక అమ్మాయి.. ఎవరూ తెలియని నగరానికి వచ్చి బతకడం ఎంతో కష్టం’ అంటూ తన జ్ఞాపకాలను పంచుకుంది. ‘నేను కష్టాల నుంచే ఎన్నో నేర్చుకున్నాను. నాకు ఈ రంగం కొత్త. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్నేహితులు కూడా ఉండేవారు కాదు. నటన, ఇల్లు, నిద్ర ఇవి తప్ప నాకు వేరే ఆలోచనే ఉండేది కాదు. నేను ఒక సినిమాకు ఒప్పుకున్నాను. తర్వాత అనూహ్యంగా నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. ఇది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన విషయం. అప్పటి నుంచి పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాను. బాధల్లోంచే ఎంతో నేర్చుకున్నాను’ అంటూ దిశా తన మనసులోని మాటలను తెలిపింది. భాగీ 2 సినిమా సక్సెస్‌లో మీకు భాగస్వామ్యం ఇవ్వడం లేదని కోపంగా ఉన్నారట అన్న ప్రశ్నకు బదులిస్తూ...‘ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో తెలియదు. నేను, టైగర్ష్రాఫ్తో కలిసి అన్ని ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నాకు అలాంటి ఫీలింగ్ లేద’ని చెప్పింది. ఈ భామ ఎం.ఎస్.ధోని, లోఫర్ సినిమాల్లో మెరిసింది. -
భారత రాష్ట్రపతి ఎవరు?.. చాలా కష్టం!
సాక్షి, ముంబై : నటన సంగతి ఏమోగానీ.. సినిమా వాళ్లకి బయటి విషయాల్లో పరిజ్ఞానం కాస్త తక్కువేనని అలియా భట్ లాంటి వాళ్లు తరచూ నిరూపిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఇప్పుడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా చేరిపోయాడు. టైగర్ నటించిన భాఘీ-2 రిలీజ్ అయ్యి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏబీపీ న్యూస్ ఇంటర్వ్యూకు గర్ల్ ఫ్రెండ్, ఈ చిత్ర హీరోయిన్ దిశా పఠానీతో టైగర్ హాజరయ్యాడు. వ్యక్తిగత విషయాల తర్వాత యాంకర్.. భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు? అని టైగర్‌ను ప్రశ్నించింది. ‘ఇది చాలా కష్టతరమైన ప్రశ్న’... అంటూ తటపటాయించిన టైగర్ ‘మిస్టర్ ముఖర్జీ(ప్రణబ్ ముఖర్జీ)’... అని పేర్కొన్నాడు. ఆ సమాధానానికి కంగుతిన్న యాంకర్.. మైక్‌ను దిశపఠానీ ముందు ఉంచేసరికి ఆవిడ ‘రామ్ నాథ్ కోవింద్’ అని చెప్పేసింది. కెరీర్ తొలినాటి నుంచి టైగర్ ష్రాఫ్‌ను ట్రోల్ చేస్తున్న వాళ్లకు ఈ వీడియో దొరికితే ఊరుకుంటారా? ఇప్పుడు చెలరేగిపోతున్నారు. -
భారత రాష్ట్రపతి ఎవరు?.. చాలా కష్టతరమైన ప్రశ్న!
-
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న భాగీ-2
బాలీవుడ్లో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే ఫస్ట్‌డే కలెక్షన్స్. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ కలిసి నటించిన ‘భాగీ-2’ శుక్రవారం విడుదలై వసూళ్ల సునామీ సృష్టించింది. విడుదలైన ఒక్కరోజులోనే దాదాపు 25కోట్లు కొల్లగొట్టింది. ఇది సల్మాన్‌ఖాన్ ‘కిక్’ చిత్రం కంటే ఎక్కువ. అడివి శేష్, ఆదాశర్మ కలిసి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క్షణం’ సినిమా రీమేక్‌గా భాగీ-2ను తెరకెక్కించారు. బాలీవుడ్లో ఈ సినిమాను యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. విమర్శకులు సినిమాపై పెదవి విరిచినా... వసూళ్లు మాత్రం దుమ్ముదులిపాయి. యంగ్‌హీరోల్లో రణబీర్ కపూర్ బేషరమ్, యే జవానీ హై దివానీ సినిమాలతో మొదటిరోజే 25 కోట్ల వసూళ్లు రాబట్టాడు. తరువాత టైగర్ ష్రాఫ్ భాగీ-2 చిత్రంతో ఆ మార్క్ చేరుకున్నాడు. సల్మాన్ నటించిన టైగర్ జిందా హై మొదటిరోజు దాదాపు 34 కోట్లు వసూళు చేసింది. అజయ్ దేవగన్ రెయిడ్, రాణీ ముఖర్జీ హిచ్కి లాంటి సినిమాలు ఉన్నా భాగీ-2 సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది..!
బాలీవుడ్లో కపిల్ శర్మ షోకు ఉన్న పాపులారిటీనే వేరు. ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే...కపిల్ పిలిస్తే షోకు వస్తారు. అయితే కొంతకాలంగా కపిల్ అతిథులను ప్రోగ్రాంకు పిలవడం...అవి అనివార్య కారణాలతో వాయిదా పడటమో, రద్దు కావడమో జరుగుతోంది. తాజాగా భాగీ 2 టీం టైగర్ ష్రాఫ్, దిశాపటానీ షోకు ఆహ్వానించి తరువాత షూటింగ్ వాయిదా పడినట్టు ప్రకటించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు, త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తామని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ షోకు పెద్ద స్టార్స్‌ను ఆహ్వానించడం... తర్వాత ఏవో కారణాలు చూపి వాయిదా వేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కపిల్ శర్మ ఆరోగ్యం సహకరించడం లేదనీ, సినీ కార్మికుల బంద్‌లు జరుగుతున్నాయనీ యాజమాన్యం చెప్పుకొస్తోంది. గతంలో బిగ్‌బీ అమితాబ్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, పరేశ్ రావల్, మనోజ్ తివారి, అనిల్ కపూర్, అర్జున్‌కపూర్ లాంటి వారు వచ్చినప్పుడు కూడా కపిల్ శర్మ షో షూటింగ్‌లు రద్దు అయ్యాయి. -
ఏక్..దో..తీన్ అంటున్న టాప్ హీరోయిన్!
-
ఏక్..దో..తీన్ అంటున్న టాప్ హీరోయిన్!
ఏక్ దో తీన్, వన్ టూ త్రీ.. ఏంటి ఈ హిందీ, ఇంగ్లీష్ అంకెల గోల! అనుకుంటున్నారా..!! విషయం ఏంటంటే..1998లో తేజాబ్ సినిమాలోని ఈ పాటలో అందాల నటి మాధురీ దీక్షిత్ ఏక్ దో తీన్ అంటూ అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపిన విషయం తెలిసిందే.సినీ ప్రియులకు మళ్లీ ఆ పాటను తెరపై చూసే అవకాశం వచ్చింది. కుర్రకారుకు మతి పోగొడుతున్న ‘కిక్’ స్టార్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఈ పాట రీమిక్స్‌లో తన స్టెప్పులతో మనందరి చేత మళ్లీ ఏక్ దో తీన్ అనిపించబోతోంది. త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ‘భాగీ 2’ చిత్రంలో ఫెర్నాండెజ్ అతిథి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో దిగ్గజ నటి మాధురి దీక్షిత్ ఎవర్గ్రీన్ సూపర్‌హిట్ సాంగ్ ఏక్‌దో తీన్ పాట రీమిక్స్‌ను చేస్తున్నారు. మాధురి దీక్షిత్ సూపర్‌హిట్ సాంగ్ ఏక్ దో తీన్ పాటలో నటిస్తున్నానంటూ ఈ శ్రీలంక అందాల తార అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. 25 సెకన్ల నిడివి గల ఈ సాంగ్ టీజర్‌ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు. -
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్..!
దేశీ ర్యాంబో టైగర్ ష్రఫ్ మళ్లీ బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. ‘అతడే ఒక సైన్యం’గా విలన్ల భరతం పట్టబోతున్నాడు. ‘బాఘీ-2’తో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. బాలీవుడ్ ప్రేమజంటగా పేరొందిన టైగర్ ష్రఫ్, దిశా పటానీ ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. ఈ సినిమాలో దిశా నేహా పాత్ర పోషించగా.. ఆమె మాజీ ప్రేమికుడిగా టైగర్ ష్రఫ్ రోనీ పాత్రలో కనిపించనున్నారు. నేహా కూతురు కిడ్నాప్ అవుతుంది. తన కూతురిని కాపాడమంటూ నేహా రోనీని బతిమిలాడుకుంటుంది. ఆ చిన్నారిని కాపాడేందుకు బయలుదేరిన రోనీ చేసిన సాహసాలేమిటి? ఈ క్రమంలో విలన్లు, పోలీసులు, డ్రగ్స్ మాఫియా, దుష్టులను అతను ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమా ఇతివృత్తంగా కనిపిస్తోంది. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘క్షణం’ సినిమాకు ఇది రీమేక్.. మూలకథను యథాతథంగా తీసుకొని.. యాక్షన్ సీక్వెన్స్‌ను మరింత హైరేంజ్లో తీర్చిదిద్దినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ బుధవారం ఆన్లైన్లో రిలీజ్.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ట్రైగర్ మరోసారి తన దేహధారుఢ్యంతో, అద్భుతమైన యాక్షన్ స్టంట్స్‌తో అదరగొట్టాడు. ‘వన్ మ్యాన్ ఆర్మీ.. అతడే ఒక సైన్యం’ అంటూ ట్రైలర్‌లోని డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ర్యాంబో, మిషన్ ఇంపాజిబుల్ తరహాలో హై యాక్షన్ సీక్వెన్స్..రిస్కీ ఫైట్స్ ట్రైలర్లో దర్శనమివ్వడంతో యాక్షన్ జానర్ అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. -
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్..!
-
ఆన్ ద వే!
సినిమా రిలీజ్ కాలేదు. బాక్సాఫీసు లెక్కలు తేలలేదు. కానీ ‘భాగీ’ ప్రాంచైజీలో నెక్ట్స్ చిత్రం ‘భాగీ 3’ ఎనౌన్స్ చేశారు. అంటే..‘భాగీ 3’ ఆన్ ద వే అన్నమాట. టైగర్ ష్రాఫ్, దిశా పాట్నీ జంటగా ఆహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ‘భాగీ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ‘భాగీ 2’. మంగళవారం ఫస్ట్ లుక్‌ను, బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫుల్యాక్షన్ ప్యాకేజీగా ట్రైలర్ ఉంది. ఇది తెలుగు ‘క్షణం’ చిత్రానికి రీమేక్ అని టాక్. ముందుగా సెకండ్ పార్ట్‌నీ ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నారు చిత్రబృందం. -
రిలీజ్ కాకముందే సీక్వెల్!
సాక్షి, సినిమా : బాలీవుడ్లో మరో సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించేశారు. భాఘీ నుంచి మరో చిత్రం రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించటం విశేషం. టైగర్ ష్రాఫ్ హీరోగానే బాఘీ 3 సినిమా ఉండబోతున్నట్లు చెప్పేశారు. నిర్మాత సాజిద్ నడియా వాలా సొంత బ్యానర్ లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కబోతోంది. బాఘీ 2 తెరకెక్కిస్తున్న అహ్మద్ ఖాన్ మూడో పార్ట్‌ను డీల్ చేయబోతున్నాడు. మిగతా తారాగణం త్వరలో ప్రకటించనున్నారు. బాఘీ మొదటి పార్ట్ తెలుగు వర్షం చిత్రం రీమేక్‌గా తెరకెక్కింది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. రెండో పార్ట్‌ను క్షణం రీమేక్‌గా అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. దిశా పఠానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. క్లాసిక్ మూవీ బేతాబ్ లో మాధురి సాంగ్ ‘ఏక్ దో తీన్’ పాట రీమిక్స్‌పై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులు వేయనుంది. మార్చి 30న బాఘీ-2 విడుదల కానుంది. Drumrolls 🥁🎷 Our excitement level has just tripled! We are thrilled to share the 3rd instalment of #SajidNadiadwala’s Baaghi franchise starring @iTIGERSHROFF directed by @khan_ahmedasas#Baaghi3 @WardaNadiadwala pic.twitter.com/ijYdyIqbVs — Nadiadwala Grandson (@NGEMovies) 19 February 2018 -
డెసిషన్ మీట్?
బాలీవుడ్ యంగ్ లవ్ బర్డ్స్ అనగానే వినిపిస్తున్న పేర్లు టైగర్ ష్రాఫ్, దిశా పాట్నీ. వాళ్ల రిలేషన్షిప్ గురించి ప్రస్తావించిన ప్రతీసారి ఈ ఇద్దరూ ‘మేము క్లోజ్ ఫ్రెండ్స్’ అంటున్నారు తప్పితే తమ రిలేషన్ స్టేటస్‌ను రివీల్ చేయట్లేదు. కానీ.. కాఫీ షాపుల్లో, పార్టీల్లో, పబ్బుల్లో తరచూ కనిపిస్తూనే ఉందీ జంట. ఈ ప్రేమ జంట లవ్‌ను టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీ కూడా ఓకే చేసినట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జాకీ ష్రాఫ్ 61వ బర్త్‌డే డిన్నర్ వేడుకల్లో టైగర్ ఫ్యామిలీతో దిశా కూడా పాల్గొన్నారట. పార్టీ జరిగిన తర్వాత రెస్టారెంట్ నుంచి టైగర్ ఫ్యామిలీతో కబుర్లు చెబుతూ బయటకు వస్తూ జనాల దృష్టిలో పడ్డారు దిశా. టైగర్ ష్రాఫ్ మదర్, సిస్టర్‌తో దిశా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారని సమాచారం. ‘టైగర్– దిశా ప్రేమను టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీ అంగీకరించలేదు’ అంటూ ఆ మధ్య వచ్చిన రూమర్స్‌ను కొట్టి పారేస్తున్నట్టుగా ఉంది ఈ డిన్నర్ మీట్. తాజాగా వేలంటైన్స్ డే సందర్భంగా ‘డిన్నర్ మీట్’ని ప్లాన్ చేసుకున్నారు ఈ యంగ్ పెయిర్. చాటుమాటుగా డిన్నర్ కానించేద్దామనుకుని ఉంటారు కానీ ఈసారీ నలుగురి దృష్టిలో పడ్డారు. దాంతో ఫ్యామిలీ అంగీకారం వచ్చినట్టే అని కొంతమంది బలంగా ఫిక్సయ్యారు. మరి అధికారికంగా ఈ జోడీ తమ ప్రేమను ఎప్పుడు ప్రకటిస్తారో? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ డిన్నర్ మీట్‌నే డెసిషన్ మీట్‌లాగా తీసుకోవచ్చా? అంటే తెలియాల్సి ఉంది. -
మళ్లీ ఏక్ దో తీన్
‘‘ఏక్ దో తీన్..’’ అనగానే మనందరికి గుర్తొచ్చేది మాధురీ దీక్షిత్. మోహినిగా తను వేసిన స్టెప్పులను దశాబ్దాలు దాటిపోయినా ఎవ్వరూ మరచిపోయి ఉండరు. మాధురీ దీక్షిత్‌ను ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసి, డ్యాన్సింగ్ క్వీన్ అంటూ బాలీవుడ్ అభిమానుల కితాబులు పొందేలా చేసిందీ సాంగ్. ప్రస్తుతం‘భాగీ 2’ చిత్రం కోసం ఆ పాటను రీమిక్స్ చేస్తున్నారు. నయా మోహినిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న చిత్రం ‘భాగీ 2’. 2016లో వచ్చిన ‘భాగీ’ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పుడు మాధురీ కోసం ప్యారీలాల్ కంపోజ్ చేసిన ఆ పాటకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు సరోజ్ ఖాన్ శిష్యుడు, ‘భాగీ 2’ చిత్ర దర్శకుడు ఈ పాటను రీమిక్స్ చేయాలనుకోవడం విశేషం. ‘ఏక్ దో తీన్...’ సాంగ్‌లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించిన గణేష్ ఆచార్యనే ఈ రీమిక్స్‌కు కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఈ సాంగ్ రీమిక్స్ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఏక్ దో తీన్’ అనే పాట ఆల్ టైమ్ హిట్. గణేష్ మాస్టర్‌ను సేమ్ సరోజ్ ఖాన్ స్టైల్లోనే కంపోజ్ చేయమని అడిగాను. అలాగే మాధురీ దీక్షిత్ ధరించిన పింక్ కలర్ డ్రెస్‌ను దృష్టిలో ఉంచుకొనే జాక్వెలిన్‌కు డ్రెస్ డిజైన్ చేయమని మనీష్ మల్హోత్రాను కోరాను. జాక్వెలిన్‌తో ఇంతకు ముందు ‘కిక్’లో ‘జుమ్మే కీ రాత్ హై’, ‘రాయ్’ సినిమాలో ‘చిట్టియన్ కలయ్యా’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ చేశాం. ఆమె ఫెంటాస్టిక్ డ్యాన్సర్. అందుకే ‘ఏక్ దో...’ సాంగ్‌ను రీక్రియేట్ చేయటానికి జాక్వెలిన్ మంచి ఛాయిస్ అనుకున్నాను’’ అన్నారు. ఈ సాంగ్‌ను మూడు రోజులు షూట్ చేస్తారట. ‘భాగీ 2’ మార్చి 30న విడుదల కానుంది. మాధురీ దీక్షిత్ గురించి సరోజ్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘బేసిక్‌గా మాధురీ కథక్ డ్యాన్సర్. అందుకే బాలీవుడ్ స్టైల్ పాటలను అడాప్ట్ చేసుకోవటానికి కొంచెం ఇబ్బంది పడేవారు. ‘ఏక్ దో...’ సాంగ్‌ను నేను కేవలం 20 నిమిషాల్లో కంపోజ్ చేశాను. కానీ ఆ హిప్ మూమెంట్స్‌ను క్యాచ్ చేయటానికి ఆమె బాగా కష్టపడ్డారు. దానికోసం పదిహేడు రోజులు ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ ప్రాక్టీస్ చేసేవారు. పదో రోజు కల్లా తన స్టెప్స్‌లో పర్ఫెక్ట్ అయ్యారు మాధురి. ఇక ప్రాక్టీస్‌కు రావద్దులే అంటే మిగతా 7 రోజులు కూడా డ్యాన్స్ స్టూడియోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవారామె’’ అన్నారు. -
మూర్ఖంగా చేయకండి.. అభిమానికి హీరో ట్విట్ !
ముంబై: హీరోలు సినిమాలో చేసే స్టంట్స్ అభిమానులపై ప్రభావం చూపుతాయి. బాహుబలి-2 సినిమాలో ప్రభాస్ ఏనుగు తొండంపై పైకి ఎక్కుతాడు. ఆ విధంగా చేయాలని కేరళకు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఏమైందో ఏమో గజరాజుకి కోపం వచ్చి తొండంతో ఆ వ్యక్తిని దూరంగా విసిరేసింది. తీవ్రగాయాలై ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విధంగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి సాహసామే చేశాడు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌కి అమన్ అనే వ్యక్తి అభిమాని. తన సినిమాల్లో టైగర్ డూప్ లేకుండా స్టంట్లను చాలా ఈజీగా చేస్తుంటారు. 2016లో వచ్చిన ‘ప్లయింగ్ జాట్’ సినిమాలో టైగర్ చాలా స్టంట్లు చేశారు. అమన్ తన హీరో చేసిన స్టంట్‌నే ప్రయత్నించాడు. దాదాపుగా 13 అడుగుల గోడపై నుంచి దూకేశాడు. అతను దూకుతున్నప్పుడు తీసని వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘ నేను భయాన్ని జయించాను. అంత పై నుంచి దూకడం అంత ఈజీ కాదు అందుకు చాలా ధైర్యం కావాలి. కింది నుంచి చూస్తే ఏలాంటి భయం ఉండదు.. కానీ గోడపైకి ఎక్కితే భయం అనేది తెలుస్తుంది. నాకు నేనే హీరోగా ఫీలై అలా కిందకు దూకాను. నాకు ఈ స్పూర్తిగా నిలిచిన టైగర్ ష్రాఫ్‌కు కృతజ్ఞతలు’ అని అమన్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్విట్ చేశాడు. ఈ వీడియో చూసిన హీరో టైగర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి..‘ నువ్వు ఈ విధంగా చేయడం చాలా మూర్ఖత్వం. నీ లైఫ్‌ను ఈ విధంగా ఎప్పుడు రిస్క్ చేయవద్దు. చిత్ర షూటింగ్ సమయంలో ఈ విధమైన స్టంట్లు చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. ఈ విధమైన విన్యాసాలను స్వతహగా చేయకండి’ అని టైగర్ అమన్‌ను ఉద్దేశించి ట్విట్ చేశారు. -
కొత్త స్టూడెంట్ టైగరే!
ఎందులో? ప్రముఖ హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహర్ కాలేజ్‌లో! వచ్చే ఏడాది (2018) కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తామని కరణ్ అనౌన్స్ చేశారు. బట్, టైగర్ ష్రాఫ్‌కి ఆల్రెడీ అడ్మిషన్ ఇచ్చేశారు. ఈ యంగ్ హీరోకి ఓ సీట్ కన్ఫర్మ్ చేశారు! నెక్ట్స్ ఎవరికి (హీరోయిన్) అడ్మిషన్ ఇస్తారో మరి? కరణ్ జోహార్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ వైఫ్ గౌరి, కరణ్ మదర్ హీరూ యశ్జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. అయితే... దీనికి కరణ్ దర్శకుడు కాదు, నిర్మాత మాత్రమే. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2’లో టైగర్ ష్రాఫ్ హీరో. సారా అలీఖాన్, దిశా పాట్నీ, అనన్యా పాండేల పేర్లు హీరోయిన్ల రేసులో వినబడుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరికి కాలేజ్‌లో సీట్ ఇస్తారో!! ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, ఆలియా భట్ నటించారు. ఇప్పుడు వాళ్లందరూ హిందీలో క్రేజీ స్టార్స్. టైగర్ ష్రాఫ్ కూడా క్రేజీ స్టారే. అయితే... కరణ్ జోహార్ సంస్థలో సినిమా ఒప్పుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ సిన్మాలు చేసిన టైగర్, స్టూడెంట్‌గా ఎలా నటిస్తారోననే ఆసక్తి హిందీ ప్రేక్షకుల్లో నెలకొంది!! -
స్టూడెంట్ కి జోడిగా స్టార్ డాటర్
బాలీవుడ్ దర్శక నిర్మాత ఓ ఆసక్తికరమైన సినిమాను ప్రకటించారు. తన బ్యానర్ లో రూపొంది ఘనవిజయం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సీక్వల్ గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తెరకెక్కనున్నట్టుగా ప్రకటించిన కరణ్, హీరో టైగర్ ష్రాఫ్ తో టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపించనున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పరిచయం అవుతుందన్న ప్రచారం జరిగింది. తరువాత సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ పేరును కూడా పరిశీలించారు. అయితే వీరిద్దరు ప్రస్తుతం తొలి సినిమాలతో బిజీగా కావటంతో మరో స్టార్ వారసురాలు అనన్య పాండే పేరును పరిశీలిస్తున్నారట. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చుంకీ పాండే కూతురు అనన్యకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందే. అందుకే ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే సినిమా ప్రమోషన్ విషయంలో కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. -
బేఫికర్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్..!
నాలుగేళ్ల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన ఓ బాలీవుడ్ హీరోయిన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. శుద్ దేశీ రొమాన్స్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన వాణీ కపూర్ తరువాత సౌత్ లో ఆహా కళ్యాణం, బేఫికర్ సినిమాల్లో నటించినా.. సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించనుంది. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో వాణీకపూర్ హీరోయిన్ గా నటించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణీ హృతిక్ రోషన్ కు జోడిగా నటించనుందట. ఈ సినిమాలో హృతిక్, టైగర్ లు ఒకరితో ఒకరు తలపడే పాత్రల్లో నటించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. .@Vaaniofficial | @iHrithik | @iTIGERSHROFF pic.twitter.com/NAlSBPuvbe — Yash Raj Films (@yrf) 12 October 2017 -
నా కొడుకు ఓ రేసుగుర్రం: నటుడు
ముంబయి: బాలీవుడ్ వెటరన్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా తెరంగ్రేటం చేసినా.. తనకంటూ పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్. కుమారుడు సక్సెస్ అవుతున్నప్పుడు ఆ తండ్రి చూపే పుత్రవాత్సల్యాన్ని మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ అదే స్థితిలో ఉన్నారు. ఇటీవల ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన తన కొడుకు గురించి మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ ఓ రేసుగుర్రం లాంటి వాడన్నారు. ఎప్పుడూ పని మీద శ్రద్ధ చూపించే వ్యక్తులలో టైగర్ ఒకడని కొనియాడారు. టైగర్ వ్యక్తిత్వం అందరికంటే కాస్త భిన్నమైనది. స్కూల్ రోజుల్లో వాడు బాస్కెట్ బాల్ ఆడేవాడు. ఎంతలా అంటే.. ప్రత్యర్ధి స్కూలు జట్లు కూడా టైగర్ ఆటను మెచ్చుకునేవి. ఏదైనా పని మొదలుపెడితే ఇతర వ్యాపకాలపైకి ఆకర్షితుడు కాడు. వాడు రేసుగుర్రంలా బరిలో దిగుతాడని నా అభిప్రాయం. తొలి మూవీ ‘హీరో పంతీ’లో రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకున్న టైగర్ .. 'భాఘీ'తో యాక్షన్ సీన్లతోనూ మెప్పించాడు. ఇలా రోజురోజుకూ నటనలో ఓ మెట్టు ఎదుగుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని' జాకీ ష్రాఫ్ వివరించారు. -
'తను తప్పు చేసిందని అనుకోవడం లేదు'
ముంబయి: ప్రముఖ నటి సోహా అలీ ఖాన్‌కు మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ అండగా నిలిచారు. ఆమె చీరకట్టుకోవడంలో తప్పేముందని అన్నారు. సోహా ఏ తప్పు చేసినట్లు తనకు అనిపించడం లేదని దన్నుగా నిలిచారు. బాలీవుడ్ నటి అయిన సోహా అలీఖాన్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతి అయిన ఆమెకు ఇంట్లో సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోహా అలీఖాన్ ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇళ్లంతా అలకరించిన బెలూన్ల నడుమ.. గులాబీ రంగు చీర కట్టుకొని, భర్త , ఆమె భర్త కునాల్ ఖేముతో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. అయితే, ఆమెచీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నందుకు విమర్శలు చేశారు. ముస్లిం మతంలో నుంచి హిందువుగా మారిపోయావా అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన టైగర్ ష్రాఫ్.. 'ప్రతి ఒక్కరికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. తమకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో దాని ప్రకారం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సోహా అందరూ గర్వించదగిన నటి, పౌరురాలు. ఆమెకు నచ్చినది ఏదో ధరించినంతమాత్రానా ఆమె తప్పు చేసిందని నేను అనుకోవడం లేదు.. కానీ, ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది' అని అన్నారు. అదే సమయంలో తాను నటిస్తున్న మున్నా మైఖెల్ చిత్రం గురించి స్పందిస్తూ 'నేను చాలా అసంతృప్తితో ఉన్నాను. నా మూడో చిత్రం ద్వారానైనా నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను' అని చెప్పారు. -
రోడ్డున పడ్డ యంగ్ హీరోయిన్!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రోడ్డున పడ్డారు. మున్నా మైఖేల్ మూవీలో టైగర్ సరసన నటించిన నిధి అగర్వాల్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. సినీ ప్రపంచంలో వెలుగు వెలగాలని కర్ణాటక నుంచి ముంబైకి వచ్చిన నిధి ఆమె రోడ్డున పడటం సంగటి ఏంటంటారా.. గతేడాది నుంచి ముంబైలోని బాంద్రాలో ఓ అపార్ట్మెంట్లో స్నేహితురాలితో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల హైసింగ్ సొసైటీ వారు ఆమెకు ఓ షాకిచ్చారట. సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నది వారి డిమాండ్. 'ఆరు నెలలుగా స్నేహితురాలితో కలిసి ఇక్కడ ఉంటున్నాను. అయితే ఒంటరిగా ఉన్న నటిపై, మోడల్‌పై వీరిది చాలా చిన్న చూపు. నేను సింగిల్‌గా ఉన్నందున ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నానేమోనని సొసైటీ భావిస్తోంది. నాకే కాదు ఇలా ఎవరు వచ్చిన మహిళలు మొదట్లో ఇల్లు కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సినిమా వాళ్లు షూటింగ్స్ వల్ల ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదు. దాంతో పొరుగువారికి ఇది నచ్చడం లేక ఫిర్యాదు చేశారు. వారి అనుమానాలను మరికొందరు సమర్థించడంతో నాలాంటి ఒంటరి ఆడపిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు. నువ్వు సింగిల్ ఆ.. సినిమాలో నటిస్తున్నావా అంటూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నా పరిస్థితి రోడ్డున పడ్డట్లు తయారైంది' అని బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ వాపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షబానా అజ్మీ, ఇమ్రాన్ హష్మీ, తదితరులు కూడా ఇలాంటి కష్టాలు పడ్డారు. -
ఆ హీరో సిస్టర్ ఫొటోలు హల్చల్!
కండలు తిరిగిన దేహంతో, హై యాక్షన్ సినిమాలతో బాలీవుడ్లో తనదైనరీతిలో దూసుకుపోతున్నాడు టైగర్ ష్రాఫ్.. సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని.. తండ్రికి తగ్గ తనయుడిగా టైగర్ సత్తా చాటుతుండగా.. అతని సోదరి కృష్ణ ష్రాఫ్ కూడా తనదైన స్టైల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం యాక్టింగ్ కోర్సును చేస్తున్న కృష్ణ తాను కూడా తండ్రి, సోదరుడి బాటలో సినిమాల్లో నటించేది లేనిది స్పష్టం చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో ఆమె తనదైన ఫొటోలు, పోస్టులతో.. అభిమానులను అలరిస్తున్నది. ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటికి ఇప్పటికే రెండు లక్షలకుపైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు, అప్డేట్స్తో ఈ బ్యూటీ నిత్యం తన ఫాలోవర్లకు టచ్‌లో ఉంటోంది. తాజాగా బికినీలో దిగిన మరో ఫొటోను ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సుందరాంగి జోరు చూస్తుంటే త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టవచ్చునేమో అని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ హీరోతో డేటింగ్ చేయలేదు.. చేయను!
బాలీవుడ్ లో ఏదైనా కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే చాలు ఆ సినిమా హీరో, హీరోయిన్లపై పుకార్లు ప్రచారంలోకి వస్తాయి. సరిగ్గా ఇలాంటి విషయమే బాలీవుడ్ కు పరిచయం అవుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఎదురైంది. ఈ విషయంపై నిధి చాలా ఘాటుగానే స్పందించింది. సినిమాకు అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు హీరోతో డేటింగ్ చేస్తానని తాను ఎక్కడా చెప్పలేదు అంటోంది. అన్ని క్లాజ్ లు చదివిన తర్వాతే మూవీకి ఓకే చెప్పానని స్పష్టం చేసింది. హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, సినిమా పబ్లిసిటీ కోసం రొమాన్స్ అంటూ అలాంటి విషయాలలో తలదూర్చడం తనకు ఇష్టం ఉందని చెప్పింది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కించనున్న 'మున్నా మైఖెల్'లో టైగర్ ష్రాఫ్ తో ఈ భామ జోడీకట్టనుంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సినిమా అంటే హీరోతో ఎక్కడ పడితే అక్కడ తిరగాలా, పబ్లిసిటీ కోసం డేటింగ్ చేయడం లాంటివి తనకు నచ్చవని.. మూవీ కోసం నటనలో నూటికి నూరుపాళ్లు శ్రమిస్తానని బాలీవుడ్ భామ పేర్కొంది. గతంలో జాకీ ష్రాఫ్ తో నటించిన హీరోయిన్లు అందరితో అతడు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నిధి కూడా అదేబాట పట్టనుందా అన్న అనుమానాలను పటాపంచలు చేసింది. -
ఈసారి యాడ్ కోసం జత కట్టింది
వారణాసి: ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ మరోసారి టైగర్ ష్రాఫ్ సరసన నటించబోతుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ రాయ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 'టైగర్, ఆనంద్ సర్ తో నేను' అంటూ ఆమె ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి టైగర్ ష్రాఫ్, ఆనంద్ రాయ్ తో బెనారస్ లో ఓ సెట్ లో ఉన్న ఫొటో ట్విటర్ లో పెట్టి 'సర్ప్రైజ్ సర్ప్రైజ్' అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. 2014లో వీరిద్దరు కలిసి 'హీరోపంతి' అనే చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ చిత్రం తర్వాత గత ఏడాది చివర్లో ఓ వీడియో సాంగ్ లో వీరిద్దరు నటించారు. ఆనంద్ రాయ్ తనువెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను: రిటర్న్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే, అంత సర్ ప్రైజ్ గా పేరు కూడా తెలియకుండా తీస్తున్న ఈ చిత్రం ఏమై ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటుండగా అది ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ అట. -
మూడు రోజుల్లో రూ. 20.45 కోట్ల కలెక్షన్లు
ముంబై: టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'ఎ ఫ్లయింగ్ జాట్' బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 20.45 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ నెల 25న ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు రూ. 7.10 కోట్లు, రెండో రోజు రూ. 6 కోట్లు మూడో రోజు రూ. 7.35 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. 'ఎ ఫ్లయింగ్ జాట్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో అనుకున్నస్థాయిలో ఆరంభ వసూళ్లు రాలేదు. రెమో ఫెర్నాండెజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. కీలకపాత్రలో నాథన్ జోన్స్ నటించాడు. -
ఆ హీరో అమాయకుడిలా కనిపించాడు : డైరెక్టర్
త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం 'ఎ ఫ్లయింగ్ జాట్' కోసం అమాయకంగా కనిపించే వ్యక్తి కోసం చాలా ప్రయత్నించానని ఆ మూవీ డైరెక్టర్ రెమో డిసౌజా తెలిపాడు. ఆ కారణంగానే తన మూవీలో బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ కు అవకాశం ఇచ్చానని వెల్లడించాడు. ఇందుకోసం టైగర్ అరంగేట్ర మూవీ 'హీరోపంటి'లో నటించక ముందే అతడితో తన మూవీ గురించి చర్చించానన్నాడు. హీరో టైగర్ ష్రాఫ్ ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో బిజిబిజీగా గడుపుతున్నాడు. తన వద్ద ఓ సూపర్ హీరో తరహా కథ సిద్ధంగా ఉందని చెప్పగానే టైగర్ ఒప్పేసుకున్నాడని డిసౌజా హర్షం వ్యక్తంచేశాడు. ఈ మూవీలో టైగర్ సరసన జాక్వెలైన్ ఫెర్నాండేజ్ కనిపించనుంది. అయితే కీలకపాత్రలో నాథన్ జోన్స్ నటించాడు. వాస్తవానికి ఇలాంటి తరహా మూవీలు చేస్తున్నామంటే నాన్సెన్స్ అంటారు. కానీ ఇదే తరహా సూపర్ హీరో సినిమాలను హాలీవుడ్ లో తీస్తే మాత్రం కచ్చితంగా ఇష్టపడతారని డైరెక్టర్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తుల ఆలోచనధోరణిలో మార్పు వస్తే ఎన్నో మంచి చిత్రాలు తీసేందుకు అవకాశం ఉంటుందన్నాడు. 'ఎ ఫ్లయింగ్ జాట్' మూవీ ఈ 25న విడుదల కానుంది. -
ఆమె గురించి నోరు విప్పిన టైగర్ ష్రాఫ్
టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లపై టైగర్ తొలిసారి పెదవి విప్పాడు. తన తదుపరి చిత్రం 'ఫ్లయింగ్ జాట్' ప్రమోషన్ కార్య క్రమంలో మీడియాతో మాట్లాడిన టైగర్.. దిశా గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీ ఇద్దరిపై వస్తున్న పుకార్లు విని చింతిస్తున్నారా అని ప్రశ్నించగా.. లేదు, నటుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధారణమే కదా.. పెద్దగా ఆలోచించడం లేదంటూ చెప్పాడు. మరి దిశతో మీ రిలేషన్ మాటేంటి అని ప్రశ్నించగా.. 'అవును, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను దాచాలనుకోవడం లేదు. ఆమెతో సమయం గడపడం నాకిష్టం. బయట తిరుగుతాను, కాఫీకి కూడా వెళ్తుంటాం. అయితే అంతకు మించి మాత్రం ఏమీ లేదు' అంటూ బదులిచ్చాడు ఈ యువ హీరో. ఇకనైనా ఈ రూమర్లకు తెరపడతాయో లేదో చూడాలి మరి. కాగా పూరీ సినిమా 'లోఫర్'తో తెలుగుతెరకు పరిచయమైన దిశా.. 'ఎమ్మెస్ ధోనీ' సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. -
ఆ సినిమాతో వారసురాళ్ల తెరంగేట్రం?
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాను యువ హీరో టైగర్ ష్రాఫ్‌తో చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ హిట్ అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ పార్ట్‌లో ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉండగా.. రెండో భాగంలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో ఉండబోతున్నారు. హీరో పాత్రకి టైగర్ ష్రాఫ్ ఎంపిక కాగా.. హీరోయిన్ల వేట మొదలైంది. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్, శ్రీదేవి కూతురు జాన్వి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసే అవకాశాలున్నాయట. అదే విషయమై వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్ వారసురాళ్లను ఇంట్రడ్యూస్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే నూతన నటీనటుల పరిచయంపై ఓ ట్రేడ్ అనలిస్ట్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిర్మాణ సంస్థలు ఓ స్టార్ హీరోయిన్‌తో సినిమా చేయడం కంటే ఓ నూతన తారను పరిచయం చేయడమే సేఫ్ అన్నారు. సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయం పక్కన పెడితే.. కొత్త తారలతో కుదుర్చుకునే ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాల వరకు నిర్మాణ సంస్థకు రాబడి వస్తూనే ఉంటుందట. ఉదాహరణకు ఏదైనా ఓ నిర్మాణ సంస్థ కొత్తవారిని పరిచయం చేయాలనుకుంటే.. ముందే వారితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది. వచ్చే ఐదేళ్ల వరకు వారి సంపాదనలో 20% సదరు నిర్మాణ సంస్థకు చెల్లిస్తూ ఉండాలి. ఒక్క సినిమాల విషయంలోనే కాదు.. ప్రకటనలు, లైవ్ షోలు, డ్యాన్స్ షోలు, ప్రత్యేక కార్యక్రమాల్లో వేటిలో పాల్లొన్నా సరే.. వాటి నుంచి వచ్చిన సంపాదనలో 20% మాత్రం వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిందేనట. ప్రముఖ దర్శక, నిర్మాత అయిన ఆదిత్య చోప్రా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారట. కాగా 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన అలియా భట్, సిద్ధార్ధ్, వరుణ్ ధావన్ ల నుంచి ఇప్పటికే కోట్ల రూపాయలు ఆ నిర్మాణ సంస్థకు అంది ఉంటాయన్నది ఆసక్తికర విషయం. ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 విషయానికొస్తే.. జాన్వి, సారాలు ఈ సినిమా ద్వారా తెరకు పరిచయమవుతారా లేదా అన్నది చూడాలి. -
అతడితో డేటింగ్ చేయలేదు: హీరోయిన్
ముంబై: యువ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేయడం లేదని హీరోయిన్ దిశా పటానీ తెలిపింది. తామిద్దం మంచి స్నేహితులం మాత్రమేనని వెల్లడించింది. టైగర్ ష్రాఫ్ లో క్లోజ్ గా తిరిగినంత మాత్రానా అతడితో తాను డేటింగ్ చేస్తున్నట్టు కాదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్ పట్ల టైగర్ ఫ్రాష్ కు ఉన్న ఆసక్తి కారణంగానే తాను జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటుందన్న వాదనలో నిజం లేదని తెలిపింది. టైగర్ బాగా డాన్స్ చేస్తాడని, అతడితో ఎవరూ డాన్స్ చేయలేరని ఆకాశానికెత్తేసింది. అతడు తప్ప బాలీవుడ్ లో తనకు స్నేహితులు లేరని చెప్పింది. ప్రియాంక చోప్రా తన రోడల్ మోడల్ అని వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనుకున్నానని తెలిపింది. 'లోఫర్' తెలుగు సినిమాతో తెరంగ్రేటం చేసిన దిశా పటానీ... జాకీచాన్ తో కలిసి 'కుంగ్ ఫూ యోగా' నటించింది. ఆమె హిందీలో నటించిన 'ఎంస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' సెప్టెంబర్ 30న విడుదల కానుంది. -
టైగర్స్ కోసం టైగర్ ష్రాఫ్..
బాలీవుడ్ యువ కెరటం టైగర్ ష్రాఫ్.. పులుల సంరక్షణ కోసం కేంద్రమంత్రికి లేఖ రాశాడు. శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా టైగర్.. టైగర్స్ గురించి తన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం అడవులను సంరక్షించాలని, అంతరించిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇతర జంతువులను, విలువైన అడవులను రక్షించాలని విన్నవిస్తూ పెటా సభ్యుడైన టైగర్ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దేవ్ ను తన లేఖలో కోరాడు. ఇప్పటికే టైగర్ ఓ జూలో ఉన్న ఓ ఆడపులికి సంరక్షకుడిగా ఉన్నాడు. సామాజిక స్పృహ కలిగిన హీరో టైగర్ తన తదుపరి చిత్రం 'ఫ్లయింగ్ జాట్'లో సూపర్ హీరోగా కనిపించనున్నాడు. We tigers gotta stick together :D Make every day a happy one for the Tigers :) #InternationalTigerDay pic.twitter.com/yKgaDb1JyW — Tiger Shroff (@iTIGERSHROFF) July 29, 2016 -
నేను మోసగాడిని కాదు: హీరో
ముంబై: బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ నాలుగో సినిమా 'మైఖేల్ మున్నా' షూటింగ్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. టైగర్ ష్రాఫ్, సబీర్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం తన కథను దొంగిలించారని కృతిక్ కుమార్ పాండే అనే రచయిత పోలీసు కేసు పెట్టారు. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ వీరాభిమాని కథతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నానని, దీన్ని టైగర్ ష్రాఫ్ ను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను రాసిన కథను అతడికి వినిపించానని వెల్లడించాడు. పాండే ఆరోపణలను టైగర్ ష్రాఫ్ తోసిపుచ్చాడు. 'ఈ విషయం గురించి నాకు తెలియదు. మేము ఇక్కడే ఉన్నాం. ఎలాంటి చోరీకి పాల్పడలేదు. నేను దొంగను కాదు. నేను అబద్ధాలు ఆడను. నేను మోసగాడిని కాద'ని విలేకరులతో టైగర్ ష్రాఫ్ అన్నాడు. 'ఎ ఫ్లెయింగ్ జాట్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చాడు. 'ఎ ఫ్లెయింగ్ జాట్' సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. -
సూపర్ మ్యాన్ సాహసాలు వికటిస్తే..!
సూపర్ మ్యాన్ అనగానే మనకు కళ్లు తిరిగే సాహసాలు గుర్తొస్తాయి.. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా.. మెరుపువేగంతో స్పందించి.. ఆపదలతో పోరాడి సూపర్ మ్యాన్లు బాధితులను కాపాడుతుంటారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మన్ ఇలా అందరూ అద్వితీయమైన సాహసాలు చేసినవారే.. ఇదే కోవలో మన ఇండియన్ సూపర్ హీరో ‘ఫ్లయింగ్ జాట్’ కూడా సాహసాలు చేయబోతాడు. కానీ అవి వికటిస్తాయి. ఆపదలోని బాధితుల్ని కాపాడబోయి తానే కష్టాల్లో పడతాడు. అన్నీ ఉల్టాపల్టా చేయబోతాడు.. ఇలా విచిత్రమైన సాహసాలతో ’ఫ్లయింగ్ జాట్’గా కండలు తిరిగిన యువహీరో టైగర్ ష్రఫ్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాలో అతీత శక్తులున్న సూపర్ హీరోగా టైగర్ కనిపించనున్నాడు. అయితే, అతడు చేసే సాహసాలన్నీ మొదట్లో వికటిస్తాయి. ఆ తర్వాత విలన్లు ఎంట్రీ అవుతారు. మొత్తానికీ, రెగ్యులర్ సూపర్ హీరో సినిమాల మాదిరిగా కాకుండా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందినట్టు కనిపిస్తోంది. టైగర్ కు జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఫేస్బుక్లో విడుదలైంది.