urmila matondkar
-
ఆర్జీవీతో విభేదాలు.. స్పందించిన హీరోయిన్
చిత్ర పరిశ్రమలో రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై రూమర్స్ రావడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే ఓపెన్‌గానే మాట్లాడతాడు. అంతేకాని తన ప్రవర్తనతో నటీనటులకు ఇబ్బంది మాత్రం కలగనీయడని సినీ ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ.. హద్దులు దాటి ప్రవర్తించరు. అందుకే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఆర్జీవీపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తోంది. అలనాటి అందాల తార ఊర్మిళా మాతోండ్కర్(Urmila Matondkar)తో ఆర్జీవీకీ గొడవైందని, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్లో వార్తలు వినిపించాయి.తాజాగా ఈ రూమర్స్‌పై ఊర్మిళ స్పందించింది. ఆర్జీవీతో తనకు ఎలాంటి అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేసింది.ఆర్జీవీ దర్శకత్వంలో నటించినందుకు గర్విస్తున్నాఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’ సినిమాల్లో ఊర్మిళ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ‘ఆగ్’(2007) తర్వాత ఊర్మిళ మళ్లీ ఆర్జీవీ చిత్రాల్లో నటించలేదు. దీంతో బాలీవుడ్లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ‘సత్య’(satya) రీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్జీవీతో విభేదాలు వచ్చాయట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఊర్మిళ సమాధానం చెబుతూ..‘మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఆయనతో నాకు మంచి స్నేహమే ఉంది. ఆయన తెరకెక్కించిన ‘కంపెనీ’ (2002), ‘రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్’ (2007) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించాను. ఆ తర్వాత మేం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. ఆయన దర్శకత్వంలో నటించినందుకు గర్వపడుతున్నా. అవకాశం వస్తే రామ్‌గోపాల్ వర్మ, మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి మళ్లీ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని ఊర్మిళ చెప్పుకొచ్చింది.‘రంగీలా’తో ఫేమస్ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది. 2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది. -
భర్తతో విభేదాలు.. విడాకుల కోసం కోర్టుకు నటి ఊర్మిళ మటోండ్కర్!
-
'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!
రాంగోపాల్ వర్మ 'రంగీలా' సినిమాతో దేశవ్యాప్తంగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈమెనే విడాకుల కోసం అప్లై చేసింది. భర్తకు ఇష్టం లేకపోయినా సరే ఈమె విడిపోవాలని అనుకుంటోందట. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)పెళ్లి-ఫ్యామిలీ విషయానికొస్తే.. 2014లో ఓ పెళ్లిలో కశ్మీరి బిజినెస్‌మ్యాన్ మోసిన్ అక్తర్‌ని కలిసింది. అలా మొదలైన వీళ్ల పరిచయం రెండేళ్లు తిరిగేసరికి పెళ్లి అనే బంధంగా మారింది. ముంబైలోని ఊర్మిళ ఇంట్లో అతికొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పటివరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు బాగానే ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం ఊర్మిళ అప్లై చేసిందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటోందని, కానీ భర్త ఇది నచ్చకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. అక్కడ కూడా అచ్చిరాకపోవడంతో తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటోంది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
కంజీవరం-వెండి సీక్విన్ చీరలలో ఊర్మిళ స్టన్నింగ్ లుక్స్..!(ఫొటోలు)
-
షారుక్ వీడియోపై నటి ఊర్మిళ స్పందన, ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?
లెజెండరి సింగర్, గాన కొకిల లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ నివాళులు అర్పిస్తుండగా ఉమ్మివేసిన వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రయల్లో తన మేనేజర్‌తో కలిసి హజరైన షారుక్ లతాజీ భౌతికఖాయం వద్ద ముస్లిం పద్దతిలో నమస్కారం చేస్తూ ప్రార్థించాడు. అనంతరం మాస్క్ తీసి ఉమ్మాడు. దీంతో షారుక్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: అవును.. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, అతనెవరో చెప్పేస్తా.. కానీ: హీరోయిన్ లతాజీ కాళ్ల వద్ద ఉమ్మి షారుక్ ఆమెను అవమాన పరిచారంటూ నెటిజన్లు ఆయనను విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఈ ట్రోల్స్‌పై స్పందించిన కొందరు ఇది ముస్లిం ప్రార్థనలో భాగమంటూ అసలు సంగతి వివరించారు. ఈ క్రమంలో షారుక్‌కు పలువురు నటీనటులు మద్దతుగా నిలుస్తారు. తాజాగా సీనియర్ నటి ఊర్మిళ మాటోండ్కర్ కూడా షారుక్‌కు మద్దతుగా నిలిచింది. చదవండి: వెనక్కి తగ్గిన సరయూ, కాసేపట్లో పోలీస్ స్టేషన్‌కు పిటిషనర్.. ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఊర్మిళా మాట్లాడుతూ... ప్రార్థనను కూడా ఉమ్మివేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ ఫార్మేట్లో నిలబెట్టిన షారుక్‌పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం బాధించిందంటూ ఊర్మిళ వ్యాఖ్యానించింది. కాగా ఇండియన్ నైటింగల్‌గా పేరు తెచ్చుకున్న గాయని లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Shah Rukh Khan paying his respects at the last rites of #LataMangeshkar Ji 🙏 pic.twitter.com/b0gAt8ztDQ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 6, 2022 -
'రంగీలా' భామ ఊర్మిళకు కరోనా పాజిటివ్
Urmila Matondkar Tests Positive For COVID-19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవలె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు కరోనో సోకగా తాజాగా నటి ఊర్మిళ మాటోండ్కర్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, హోం క్వారంటైన్లో ఉండి, చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించేకోవాలని తెలిపింది. అంతేకాకుండా ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరింది. చదవండి: అంచనాలు పెంచేసిన 'ఆర్ఆర్ఆర్'...విజువల్ అదిరిపోయింది పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్ View this post on Instagram A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) -
భయపడుతూనే నటుడి బనియన్ వేసుకున్నా: ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ మాటోండ్కర్, హీరో అమీర్ ఖాన్, నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగీలా' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఊర్మిళ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో తన్హ తన్హ యహా పె జీన్.. సాంగ్ కూడా ఎంతో పాపులర్. తాజాగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ఊర్మిళ. ఈ సాంగ్ ప్రారంభంలో ఊర్మిళ ఒక బనీన్ వేసుకుని బీచ్ ఒడ్డున పరిగెడుతూ ఉంటుంది కదా, ఆ బనీన్ నటుడు జాకీ ష్రాఫ్‌ది అన్న సీక్రెట్‌ను బయటపెట్టింది. 'ఈ పాట చాలా సహజంగా రావాలనుకున్నాం, దీంతో జాకీ తన బనియన్ ధరించమని చెప్పాడు. నేను కొంచెం భయపడుతూనే దాన్ని వేసుకుని సాంగ్ షూట్ చేశాం. మొత్తానికి ఈ పాట హిట్టై ప్రశంసలు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను' అని ఊర్మిళ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. -
నేడు ఆర్జీవి భామ ఊర్మిళ బర్త్‌డే..
-
కోట్లలో ఊర్మిళ కార్యాలయం ఖరీదు
సాక్షి, ముంబై : శివసేనలో ఇటీవలే ప్రవేశించిన బాలీవుడ్ నటి ఊర్మిళా మాతోండ్కర్ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్ కోసం ముంబైలో రూ. 3.75 కోట్లు విలువజేసే కార్యాలయాన్ని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన ఆమె, లోకసభ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే శివసేనలో చేరిన ఆమెకు మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ పదవి కోసం సిఫారసు చేసింది. ఇలా శివసేనలో చేరి రాజకీయాల్లో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ఊర్మిళా అత్యంత ఖరీదైన కార్యాలయాన్ని ముంబైలోని ఖారులో కొనుగోలు చేశారు. పశ్చిమ ఖార్ లింకింగ్ రోడ్డుపై 6వ అంతస్తులో 96.61 చదరపు మీటర్లు (1039.901 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉన్న కార్యాలయం కోసం ఆమె రూ. 3.75 కోట్లు వెచ్చించారు. ఒక్కో చదరపు అడుగుకి సుమారు రూ. 36 వేల ధరతో కొనుగోలు చేయడం విశేషం. అయితే భవనం కొనుగోలు చేయడానికి రాజకీయాలు లేదా శివసేనలో చేరడానికి ఎలాంటి సంబంధం లేదని ఊర్మిళ చెబుతున్నారు. -
నాకు అలాంటివి నచ్చవు: ఊర్మిళ
ముంబై: కాంగ్రెస్ పార్టీతో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని శివసేన నాయకురాలు ఊర్మిళ మటోంద్కర్ అన్నారు. పార్టీని వీడినంత మాత్రాన విమర్శించాల్సిన అవసరం లేదని, తనకు అలాంటివి నచ్చవని పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్మిళ మాట్లాడుతూ.. తన రాజకీయ, సినీ జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘ఆర్నెళ్ల కంటే తక్కువ కాలమే ఆ పార్టీతో కలిసి పనిచేశాను. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 28 రోజులు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాను. నిజానికి నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. కానీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత వారి ఆఫర్ స్వీకరించడం సరైంది కాదు. అందుకే నేనేమీ మాట్లాడలేదు. వారిని నిందించడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. వివేకం, విచక్షణతో మెలగడమే నాకు అత్యంత ముఖ్యమైనది. కేవలం ఓటమి కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడానన్న వార్తల్లో నిజం లేదు. ప్రేక్షకులు నన్ను సినిమా స్టార్‌ను చేశారు. నేను ప్రజా నాయకురాలిని కావాలనుకున్నాను. ఏసీ గదుల్లో కూర్చుని, ట్వీట్లు చేయడం నాకు సరిపడదు. కులమతాలకు అతీతంగా అందరికీ సేవ చేయడమే నాకు ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు. ఇక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వ పనితీరుపై ఊర్మిళ ప్రశంసలు కురిపించారు. (చదవండి: నన్ను నా భర్తను లక్ష్యంగా చేసుకుని..) ‘‘ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఏడాది పాలన అత్యద్భుతం. కోవిడ్-19, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు అమోఘం’’ అని పేర్కొన్నారు. ఇక తాను శివసేనలో చేరడం గురించి మాట్లాడుతూ.. ‘‘పదవిని ఆశించి పార్టీలో చేరలేదు. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్, శివసేన సిద్ధాంతాలు వేర్వేరు. సెక్యులర్ అన్న పదానికి ఇటీవల కాలంలో అర్థం మారింది. సెక్యులరిస్టు అంటే ఏ మతాచారాన్ని పాటించని వారు అని ఎక్కడా లేదు. శివసేన హిందుత్వ పార్టీ అయినంత మాత్రాన ఇతరులను ద్వేషించడం లేదు. హిందూమతం గొప్పది’’ అని ఊర్మిళ తెలిపారు. కాగా శివసేన, గవర్నర్ కోటా కింద ఆమెను శాసన మండలికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు ముందు ఓ వెబ్‌సిరీస్‌కు సైన్ చేశానని, అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఊర్మిళ పేర్కొన్నారు. -
నన్ను నా భర్తను లక్ష్యంగా చేసుకుని..
ముంబై: తనను, తన భర్తను ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారని నటి ఊర్మిళ మటోండ్కర్ పేర్కొన్నారు. ఇటీవల ఊర్మిళ శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసన్ అక్తర్, ఇతర కుటుంబ సభ్యలపై ట్రోలర్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు. తన భర్త మొహిసిన్‌ను పాకిస్తానీ అని ఆయన ఓ టెర్రరిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని, అవి మితిమీరితే సహించేది లేదని ట్రోలర్స్‌పై మండిపడ్డారు. అయితే తన భర్త పాకిస్తాన్ ముస్లిమని, ఆయన ముస్లిం కావడమే ట్రోల్స్‌కు ప్రధాన కారణమన్నారు. అదే విధంగా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారని చెప్పారు. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసిన్ లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక గతంలో కూడా తన వికీపీడియా వివరాలను తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. ఇందులో తన తండ్రి పేరును శివీందర్ సింగ్ అని, తల్లి పేరును రుక్సానా అహ్మద్‌గా మార్చారని తెలిపారు. కానీ తన తల్లిదండ్రుల పేర్లు సునీతా, శ్రీకాంత్ మటోండ్కర్ అని ఊర్మిళ స్పష్టం చేశారు. కాగా ఊర్మిళ-మొహిసిన్‌లు 2016లో సీక్రెట్‌గా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి డిజైనర్ మనీష్ మల్హోత్రా మాత్రమే ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. -
కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!
న్యూ ఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగన రనౌత్ మరోసారి తన మాటలతో సమస్యల్లో చిక్కుకుంది. షహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానోపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయి. నిరసనలలో కనిపించడానికి బిల్కిస్ బానో రూ.100 తీసుకుంటారని కంగన చేసిన ట్విట్‌పై దూమరం రేగింది. (చదవండి: శాసన మండలికి ఊర్మిళ?) ' హా హా హా ఏ దాదీ అయితే అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో చూసామో ఆమె ఇప్పుడు వంద రూపాయలకి నిరసనలలో అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రజాసంబంధ సంస్థను భారతదేశానికి సంబంధించి కాకుండా, పాకిస్తాన్‌కి సంబంధించి ఎంచుకున్నారు. ఇటువంటి వాటి గురించి అంతర్జాతీయంగా మాట్లాడటానికి సొంత వాళ్లు కావాలి' అని కంగనా ట్వీట్ చేశారు. ఎంఎస్ మొహిందర్ కౌర్‌ని చూసి బిల్కిస్ బాను అనుకోని కంగనా ట్వీట్ చేసినందుకు లీగల్ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్ సింగ్ పేర్కొన్నారు. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్ చెక్' అనే ఆన్లైన్ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని, ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ దర్యాప్తు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన రనౌత్ నిత్యం ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెను చిక్కుల్లో పడేశాయి. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చినందుకు శివసేన పార్టీ నాయకులు ఆమెపై దుమ్మెత్తిపోశారు.(చదవండి: యూపీ సీఎంతో బాలీవుడ్ హీరో భేటీ) మంగళవారం నటి ఊర్మిళ శివసేనలో చేరిన సంగతి విధితమే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...' కంగనకు కావాల్సిన ప్రాముఖ్యత దక్కింది. నేను తనతో మాటల యుద్ధంలో పాల్గొనాలని అనుకోవడంలేదు. నేను ఆమె అభిమానిని కాదు. మనమందరం తన గురించి తను కోరుకున్నదానికంటే ఎక్కువగానే మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదని అనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్యదేశంలో నివసిస్తున్నాం ప్రతి పౌరుడికి వాక్ స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు ఏం చేయానుకుంటున్నారో చేయోచ్చు' అని అన్నారు. -
శాసన మండలికి ఊర్మిళ?
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, రంగీలా భామ ఊర్మిళ మాటోండ్కర్ (46) మంగళవారం శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ముంబై నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఊర్మిళ పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముంబై యూనిట్ పనితీరు నచ్చక పార్టీని వీడినట్లు ఊర్మిళ సన్నిహితులు గతంలోనే తెలిపారు. పార్టీలో ఊర్మిళకు ఏమాత్రం సరైన ప్రాధాన్యత కల్పించని కారణంగా కాంగ్రెస్‌లో చేరిన ఐదు నెలల్లోనే హస్తం గూటిని వీడాల్సి వచ్చింది. పార్టీని వీడిన విషయంపై తాజాగా స్పందిస్తూ.. తాను వీడింది కేవలం కాంగ్రెస్ పార్టీనే తప్ప ప్రజా సేవను కాదని చెప్పారు. కంగనాపై ఫైర్... ఊర్మిళను శాసనమండలికి పంపాలని శివసేన భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల గవర్నర్ కోటా నుంచి శాసనమండలికి నియమించాల్సిన 12మంది సభ్యుల పేర్ల జాబితాను, మహావికాస్ అఘాడి ప్రభుత్వం గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఈ విషయంపై ఊర్మిళ స్పందిస్తూ.. తాను చట్టసభకు ఎంపికైతే మహిళల సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన చేస్తున్న ప్రజా సేవను గుర్తించి పార్టీలో చేరుతున్నట్లు తెలిపింది. ముంబై నుంచి బాలీవుడ్ తరలిపోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ముంబై ఫిల్మ్ సిటీ వేలాది మంది కార్మీకుల కష్టం మీద నిర్మితమైందని అన్నారు. బాలీవుడ్‌ను రక్షించుకోవడం కోసం అందరూ ఏకం కావాలని అన్నారు. ఇటీవల ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) తో పోల్చినందుకు సంచలన నటి కంగనా రనౌత్‌ను ఊర్మిళ విమర్శించారు. కంగనాకు లేనిపోని ప్రాముఖ్యత కల్పించారని విమర్శించారు. -
శివసేన పార్టీలో చేరిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి, రంగీలా ఫేమ్ ఊర్మిళ మతోంద్కర్ మహారాష్ష్ర్ట సీఎం, పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నివాసంలో మంగళవారం మధ్యాహ్నం శివసేన పార్టీలో చేరారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాక గవర్నర్ కోటా నుంచి ఆ పార్టీ తరపున ఆమె మహారాష్ష్ర్ట శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ష్ర్ట పాలక మహావికాస్ అగాది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమి ఇప్పటికే 11 మంది పేర్లతోపాటూ ఆమె పేరును కూడా మహారాష్ష్ర్ట గవర్నర్ కోశ్యారీకి పంపడం జరిగింది. అయితే కేబినేట్ సిపారసు మేరకు మహారాష్ట్ర శాసన ఎగువ సభకు 12 మంది సభ్యుల జాబితాకు గవర్నర్ కోశ్యారీ ఆమోదం తెలపాల్సి ఉంది. (చదవండి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం) 46 సంవత్సరాల ఊర్మిళ మతోంద్కర్ గత మార్చిలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సెప్టెంబర్‌లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత రాజకీయాలతో ఆమె పార్టీని వీడారు. ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగన రనౌత్ నెపోటిజంపై కూడా ఊర్మిళ స్పందించారు. బాలీవుడ్లో కొందరు డ్రగ్స్ యూస్ చేసినంత మాత్రానా డ్రగ్ మాఫియా అనడం కరెక్ట్ కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన విషయాల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఊర్మిళ తన స్వరం వినిపించింది. -
రేపు శివసేనలోకి ఊర్మిళ
ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ గ్లామర్ తళుకులు అద్దుకుంటోంది. బాలీవుడ్ నటి, రంగీలా భామ ఊర్మిళ మటోండ్కర్ శివసేన గూటికి చేరనున్నారు. మంగళవారం ఆమె పార్టీలో చేరనున్నట్టుగా శివసేన నాయకుడొకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ ఆ తర్వాత అయిదు నెలలకే పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. ఆ తర్వాత ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె హఠాత్తుగా శివసేన గూటికి చేరనున్నట్టుగా తెలుస్తోంది. చదవండి: (తలైవా తేల్చేనా...నాన్చేనా..?) గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో ఊర్మిళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో తన పాత్రపై ఆమె తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. పరిమితమైన పాత్రలో ఉండలేనంటూ పార్టీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ మీడియాలో లీక్ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ శివసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. -
ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?
సాక్షి, ముంబై : చట్టసభలోకి అడుగుపెట్టాలనుకుంటున్న రంగీలా ఫేమ్ ఊర్మిళా మటోండ్కర్ ఆశలు అడియాశలు అయ్యేలానే కనిపిస్తున్నాయి. అధికార శివసేన నుంచి శాసనమండలికి నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాష్ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మూడు పార్టీల నేతలు ఓ అంచనాకు సైతం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. (చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!) గవర్నర్ నామినేటెడ్ సభ్యుల కోటాలోంచి బాలీవుడ్ నటి ఉర్మిళా మాతోండ్కర్ను విధాన పరిషత్‌కు పంపడం ఖాయమని తేలడంతో శివసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఉర్మిళ కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటపడ్డారు. ఇప్పుడు శివసేన అధిష్టానం ఆమెను ఏకంగా విధాన పరిషత్‌కు పంపించనున్నట్లు తెలియడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన బెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నేరుగా మండలికి పంపడంపై సరైంది కాదని చర్చించుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే మేం ఇలాగే పార్టీలో ఉండిపోవాలా..? అని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా,శివసేన ఇచ్చిన ఆఫర్‌ను ఊర్మిళా మాతోండ్కర్ ఆమోదించినట్లు తెలిసింది. అయితే కార్యకర్తల అభిప్రాయాలను శివసేన పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి. -
చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!
సాక్షి, ముంబై : బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ త్వరలో చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. మహారాష్ట్ర శాసనమండలికి జరుగనున్న ఎన్నికల్లో అధికార శివసేన నుంచి ఆమెను ఎగువసభకు ఎన్నికకానున్నారు. మండలిలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గవర్నర్ కోటాలో ఊర్మిళను నామినేట్ చేస్తారని శివసేన వర్గాల ద్వారా తెలిసింది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమైన మహా వికాస్ ఆఘాడీ నేతలు ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా వస్తున్న వార్తలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఊర్మిళను మండలికి నామినేట్ చేస్తున్నారనే వార్తలు వాస్తమేనన్నారు. అయితే దీనిపై మూడు పార్టీల నేతలు మరోసారి చర్చించి.. అనంతరం అభ్యర్థులు జాబితాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపుతామన్నారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని రౌత్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్ బండేకర్, సింగర్ ఆనంద్ షిండేతో పాటు సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకు రాజీనామా చేసిన ఖడ్సే ఇటీవల ఎన్సీపీలో చేరారు. దీంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఊర్మిళ మటోండ్కర్ అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. (డ్రామాలాడుతున్న కంగనా : ఉర్మిళ) పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని, పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. స్థానిక నాయకుల మధ్య సమన్వయ లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడగట్టడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిధులు అందించడం వంటివి సరిగా చేయలేదని నిందించారు. గత మార్చిలో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె ముంబై ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం కొంతకాలానికే శివసేన గూటికి చేరారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ముంబైపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఊర్మిళ మరోసారి వార్తల్లో నిలిచారు. -
‘భారతదేశపు నిజమైన ప్రజలకు ధన్యవాదాలు’
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు, సినీయర్ నటి ఉర్మిలా మటోండ్కర్‌ను అసహాస్యం చేస్తూ ‘సాఫ్ట్ పోర్నో స్టార్’గా అంటూ సంచలన వ్యాఖ్యల చేసిన అనంతరం తనకు మద్దతు నిచ్చిన సినీ ప్రముఖులకు ఆమె శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ముంబై వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఊర్మిళ, కంగనాల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో కంగనా, ఉర్మిలాపై చేసిన వ్యాఖ్యలపై వివాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత అనుభవ్ సిన్హా, నటుడు స్వరా భాస్కర్లతో సహా పలువురు నటీనటులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఊర్మిలా 25 సంవత్సరాల సినీ జీవితంలో తన లాంటి వ్యక్తిని చూడలేదని, దయ, జాలితో పాటు మంచి వ్యక్తిత్వం ఉన్న నటి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కంగనాపై విరుచుకుపపడ్డారు. దీంతో ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ఊర్మిలా ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: గట్టిగా అరిస్తే అన్నీనిజాలు అయిపోతాయా ?) Thank you the “Real People of India” and a rare breed of unbiased,dignified media for standing by me. It’s Your victory over fake IT trolls n propaganda. Deeply touched..humbled 🙏🏼#JaiHind — Urmila Matondkar (@UrmilaMatondkar) September 18, 2020 ‘‘నాకు మద్దతుగా నిలిచిన భారతదేశపు నిజమైన ప్రజలకు’ ధన్యవాలు. నిష్పాక్షికమైన, గౌరవప్రదమైన మీడియాకు కృతజ్ఞతలు. ఇది నకిలీ ప్రచారం, ట్రోల్స్‌పై విజయం. జైహింద్’ అంటూ ట్విట్ చేశారు. అయితే ఇటీవల ముంబైపై చేసిన కంగనా అనుచిత వ్యాఖ్యలపై ఉర్మిలా ఘాటుగా స్పందించారు. కంగనా తనేదో బాదితులురాలిన హైడ్రామాలాడుతుందని, ముంబైని పాకిస్తాన్ అక్రమిత కశ్మీర్‌గా పిలిచిన కంగనా తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్ మాదకద్రవ్యాలకు మూలం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ ఘూటుగా స్పందించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఓ ఇంటర్యూలో కంగనా ఆమెను సాఫ్ట్ పోర్న్ స్టార్‌గా పిలిచిన విషయం తెలిసిందే. అంతేగాక జయబచ్చన్ వద్ద ఆమె షాట్లు కూడా తీసుకుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
డ్రామాలాడుతున్న కంగనా : ఉర్మిళ
ముంబై : కంగనా రనౌత్ కావాలనే తనేదో బాధితురాలు అన్నట్లు డ్రామాలాడుతుందని కాంగ్రెస్ నాయకురాలు, రంగీలా ఫేమ్ ఉర్మిలా మటోండ్కర్ మండిపడ్డారు. ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా.. తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్ మాదకద్రవ్యాలకు మూలం అన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా అంటూ విరుచుకుపడుతున్న కంగనా మొదట తన పోరాటాన్ని సొంత రాష్ర్టం నుంచే ప్రారంభించాలని తెలిపారు. పెద్దగా నోరేసుకొని మాట్లాడినంత మాత్రానా ఆమె మాట్లాడేవన్నీ నిజాలు అయిపోవని ఫైర్ అయ్యారు. ప్రజల ట్యాక్స్ డబ్బులతో వై-ప్లస్ క్యాటగిరీ అనుభవిస్తున్న కంగనా డ్రగ్స్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. (అందుకే నాపై కక్ష గట్టారు.. చూద్దాం: కంగన) అది విఫలమైతే విమెన్ కార్డు తీస్తారు పబ్లిసిటీ కోసమో, స్వార్థ ప్రయోజనాల కోసమో ముంబైని కించపరిచేలా మాట్లాడితే తను సహించబోనని హెచ్చరించారు. కంగనా వ్యాఖ్యలు ముంబై ప్రజలను అవమానించేలా ఉన్నాయని దుయ్యబట్టారు. అంతేకాకుండా కొందరు ఎప్పటికప్పడు బాధితురాలు అన్నట్లు డ్రామాలాడుతారు. అవి విఫలమైతే మహిళా హక్కులు అంటూ విమెన్ కార్డు ఉపయోగిస్తారు అంటూ కంగనా గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇక జయబచ్చన్‌పై కంగనా వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమెదయోగ్యం కాదని, ఓ సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఊర్మిళ అన్నారు. బాలీవుడ్ గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా నిజనిజాలు మాట్లాడితే తమకు ఎక్కడ సమస్యలు వస్తాయో అని బీటౌన్ ఇండస్ర్టీ సైలంట్‌గా ఉందని తెలిపారు. కులతత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ పాయల్ తద్వి ఆత్మహత్య గురించి ఎవరూ మాట్లాడట్లేదని, సుశాంత్ మరణాన్ని కేవలం రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. (అభిషేక్ ఆత్మహత్య చేసుకుంటే ఏమంటారు: కంగనా) -
‘సంజయ్ జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు’
ముంబై: సంజయ్‌దత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆయనతో పాటు నటించిన ఊర్మిళ, రితేష్‌దేశ్ ముఖ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మంగళవారం ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి కారణంగా సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. హీరోయిన్ ఊర్మిళ.. సంజూ భాయ్‌తో 1997లో కలిసి నటించిన దౌడ్ చిత్రంలోని ఒక ఫోటోను షేర్ చేస్తూ... ‘సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చేరారనే భయంకరమైన, బాధాకరమైన వార్తను విన్నాను. ఆయన తన జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. అదే విధంగా రితేష్ దేశ్‌ముఖ్ కూడా సంజయ్‌దత్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంజయ్‌దత్ అలియా భట్ నటిస్తున్న సడక్ 2లో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. View this post on Instagram Such an upsetting n horrible news that @duttsanjay has been diagnosed of cancer..but then again he has been such a fighter all his life..here is wishing him a speedy recovery 👍🏻 #prayersforspeedyrecovery #getwellsoon 🤗❤️ A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on Aug 11, 2020 at 7:30pm PDT చదవండి: 'సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు' -
సీఏఏపై ‘రంగీలా’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు, రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ చట్టాన్ని బ్రిటీషర్లు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టంతో పోల్చారు. ఈ చట్టాన్ని నల్ల చట్టంగా ఆమె అభివర్ణించారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం ముంబైలో ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఊర్మిళ మాట్లాడుతూ.. సీఏఏ చట్టాన్ని తప్పుబట్టారు. బ్రిటీషర్లు దేశాన్ని వదలివెళ్లిన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అశాంతిని రేకెత్తించటానికి రౌలత్ చట్టం లాగే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. నల్లచట్టాల సరసన సీఏఏకు కూడా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ మన దేశానికే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శమైన మహనాయుడని అన్నారు. ప్రజలంతా గాంధీజీ బాటలో నడవాలని.. కానీ గాంధీ ఆశయాలను తూట్లు పొడిచేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సే ముస్లిం, సిక్కు వర్గానికి వ్యక్తి కాదని.. ఆయన హిందువు అన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. -
నేను ఏ పార్టీలో చేరడం లేదు: నటి
ముంబై: తాను ఏ పార్టీలో చేరడం లేదంటున్నారు నటి ఊర్మిళ మటోండ్కర్. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడిన ఊర్మిళ, శివసేనలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఏ పార్టీలో చేరడం లేదు. మీడియాకు నా విన్నపం ఒక్కటే.. మీరు బయటి వ్యక్తుల ద్వారా విన్న విషయాలను ప్రచారం చేయకండి. ఏదో ఓ పార్టీలో చేరుతున్నాని ప్రచారం చేయడం సముచితం కాదు. ప్రస్తుతం నేను ఏ పార్టీలో చేరాలనుకోవడం లేదు’ అన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఊర్మిళ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పీఏ మిలింద్ నవ్రేకర్‌తో భేటీ కావడంతో ఆమె శివసేనలో చేరతారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో ఊర్మిళ ఈ వార్తలపై స్వయంగా స్పందించాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ పట్టుమని 6 నెలలు కూడా గడవక ముందే ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో విసిగిపోవడం వల్లే ఆ పార్టీని వీడుతున్నానని ఊర్మిళ ప్రకటించారు.(చదవండి: ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!) -
శివసేన గూటికి ఊర్మిళ..?
ముంబై : కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన నటి ఊర్మిళ మటోండ్కర్ శివసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పీఏ మిలింద్ నవ్రేకర్‌తో ఊర్మిళ భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. థాకరే పీఏతో ఊర్మిళ సమావేశం కావడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపింది. మరోవైపు తాను శివసేనలో చేరతాననే ప్రచారాన్ని ఊర్మిళ తోసిపుచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే మిలింద్ నవ్రేకర్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఊర్మిళ త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె తదుపరి అడుగులు ఎటు వైపనే ఆసక్తి నెలకొంది. -
ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!
ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిల మంటోడ్కర్ రాజీనామాపై ముంబై కాంగ్రెస్ మాజీ చీఫ్ మిలింద్ దేవరా తాజాగా స్పందించారు. ఊర్మిళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి నార్త్ ముంబై లీడర్లే కారణమని ఆయన విమర్శించారు. ఆమె రాజీనామాకు వారే బాధ్యత వహించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఊర్మిళకు తాను మనస్ఫూర్తిగా సహకరించానని, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో ఆమెకు అండగా నిలబడ్డానని ఆయన పేర్కొన్నారు. ఊర్మిళను పార్టీలోకి తీసుకొచ్చిన నాయకులే ఆమెను రాజకీయంగా తొక్కేశారని, ఆ సమయంలోనూ ఆమెకు తాను మద్దతుగా నిలబడ్డానని చెప్పారు. ఆమె రాజీనామాకు ఉత్తర ముంబై కాంగ్రెస్ నాయకులే కారణమన్న వ్యాఖ్యలతో తాను వందశాతం ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రతి పార్టీలోనూ అంతర్గత విభేదాలు ఉంటాయని, ఊర్మిళ తన రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కోరారు. బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు. -
కాంగ్రెస్‌కు రంగీలా భామ గుడ్‌బై
ముంబై: బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు. ఊర్మిళ రాసిన లేఖ వెలుగులోకి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు అంత దారుణంగా ఓడిపోయిందో, దానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఊర్మిళ మే 16న ముంబై కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడు మిలింద్ దేవరాకు లేఖ రాశారు. ఎంతో గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖ మీడియాలో ప్రచారం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ‘‘కాంగ్రెస్ పార్టీ నన్ను నిలువునా మోసం చేసింది. పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న వర్గ పోరుతో నన్ను బలిపశువును చేయాలని చూశారు‘‘అంటూ ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్నిరుపమకు అత్యంత సన్నిహితులైన సందేష్ కోండ్విల్కర్ , భూషణ్ తీరుతెన్నులపై ఊర్మిళ ఆ లేఖలో విమర్శించారు. గత మార్చిలో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె ముంబై ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. తన ఓటమికిగల కారణాలను ఊర్మిళ ఆ లేఖలో వివరిస్తూ స్థానిక నాయకుల మధ్య సమన్వయ లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడగట్టడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిధులు అందించడం వంటివి సరిగా చేయలేదని నిందించారు. మొత్తంగా చూస్తే పార్టీ నేతల్లో నిజాయితీ, సమర్థత, సమన్వయం కొరవడ్డాయని అందుకే తనతో సహా పార్టీలో చాలా మంది ఓటమి పాలయ్యారని ఊర్మిళ ఆ లేఖలో పేర్కొన్నారు. పేర్లతో సహా రాసిన ఆ లేఖను అత్యంత గోప్యంగా ఉంచాల్సింది పోయి మీడియాలో ప్రచారం కావడంతో చివరికి ఆమె పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. -
కాంగ్రెస్‌కు ఆ సెలబ్రిటీ షాక్..
ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి ఊర్మిళా మటోండ్కర్ ఆరు నెలలు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఊర్మిళ రాజీనామాతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు తోడు నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో విసిగి ఆ పార్టీకి రాజీనామా చేశానని ఊర్మిళ పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దియోరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బహిర్గతం కావడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలో కొన్ని వర్గాలు పనిచేశాయని ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మోదీ సర్కార్‌పై మండిపడ్డ నటి
ముంబై: మోదీ సర్కార్ ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నటి, కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిలా మాటోండ్కర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్ ప్రజలు ఎన్ని రోజులు భద్రతా బలగాల నీడలో నివసించాలని ఆమె ప్రశ్నించారు. ఏదయినా సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తన భర్త వారి తల్లిదండ్రులతో మాట్లాడి 22రోజులయిందని ఆమె వాపోయారు. తన అత్తమామలిద్దరు చక్కెర వ్యాధి, హైబీపీతో బాధపడుతున్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఇంట్లో మందులు సైతం అందుబాటులో ఉన్నాయో లేదో తెలియదని ఆమె మదనపడ్డారు. గత ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్ తరుపున ముంబై నుంచి పోటీ చేసిన విషయం విదితమే. -
ఊర్మిళపై అభ్యంతరకర పోస్ట్ : పుణే వ్యక్తిపై కేసు
పుణే : బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మటోండ్కర్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ చేసినందుకు పుణేకు చెందిన 57 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ధనుంజయ్ కుడ్తార్కర్ తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించి ఊర్మిళా మటోండ్కర్‌పై అభ్యంతరకరమైన పోస్ట్ అప్లోడ్ చేశారని పుణేలోని విశారామ్బాగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి వెల్లడించారు. ధనుంజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. బాలీవుడ్ సహా పలు భాషా చిత్రాల్లో నటించిన ఊర్మిళ లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి గోపాల్ షెట్టి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. -
రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ
తన గ్లామర్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఊపేసిన ఊర్మిళ మతోండ్కర్ ఈ జనరల్ ఎలక్షన్స్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే తొలి ప్రయత్నం ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఉత్తర ముంబై నుంచి పోటి చేసిన ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య శెట్టి కన్నా నాలుగున్న లక్షల ఓట్ల వెనకపడ్డారు. దీంతో ఓటమిని అంగీకరించిన ఊర్మిళ.. ‘ఇది తొలి అడుగు మాత్రమే ఓడిపోయినా రాజకీయాల్లో కొనసాగుతా’ అన్నారు. సినీ రంగ ప్రముఖులు ఎక్కువగా బీజేపీకి జై కొడుతుంటే ఊర్మిళ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఊర్మిళ ముంబై నార్త్ నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు. తొలి ప్రయత్నంలో బలమైన బీజేపీ నేత గోపాల్ చినయ్య శెట్టితో ఆమె తలపడ్డారు. గత ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధించిన ఆయన ఈ సారి కూడా అదే స్థాయిలో ఘనవిజయాన్ని అందుకున్నారు. -
అటువంటి కామెడీ సినిమాల కంటే..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం హాస్యాస్పద విషయం అని కాంగ్రెస్ నాయకురాలు, ముంబై నార్త్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోంద్కర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ బయోపిక్ వంటి కామెడీ సినిమాలు తీసే బదులు, ఆయన అబద్ధపు హామీలపై సినిమా నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. ‘ ఎప్పుడూ తన 56 ఇంచుల ఛాతీ గురించి మాట్లాడుతూ పబ్బం గడిపే మోదీ జీవిత చరిత్రను తెరకెక్కించడం కంటే పెద్ద జోక్ ఇంకేమీ ఉండదు. నిజానికి అందుకు ఆయన అర్హుడు కూడా కాదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని అటువంటి వ్యక్తి గురించి సినిమా తీస్తే ప్రజాస్వామ్యాన్ని, పేదరికాన్ని, భారతదేశ లక్షణం భిన్నత్వంలో ఏకత్వాన్ని అపహాస్యం చేసినట్లే’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగా నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి ఊర్మిళ ముంబై నార్త్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి గోపాల్ శెట్టి(బీజేపీ), నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ దూకుడు పెంచిన ఊర్మిళ.. ఇటీవల తన సభలో గందరగోళం సృష్టించిన ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యకర్తల కారణంగా తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పోలీసులను ఆశ్రయించారు. -
ఊర్మిళ ప్రచారంలో రభస
ముంబై: నార్త్ ముంబై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సినీ నటి ఊర్మిళా మటోండ్కర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బోరివెలీ రైల్వేస్టేషన్ సమీపంలో ఆమె ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు అనుచితంగా ప్రవర్తించారు. ‘మేం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు 25 మంది బీజేపీ మద్దతుదారులు పార్టీ జెండాలతో ర్యాలీలోకి చొచ్చుకువచ్చారు. మోదీ పేరిట నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేశారు’అని ఊర్మిళ మండిపడ్డారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. -
ఊర్మిళ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
వల్గర్‌గా డ్యాన్సులు చేస్తూ..
ముంబై : తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని ముంబై నార్త్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోంద్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊర్మిళ సోమవారం.. తన నియోజకవర్గంలోని బోరివలీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రసంగించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలు చేస్తూ ఆటంకం కలిగించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్నారని, మహిళా కార్యకర్తల పట్ల అవమానకరంగా వ్యవహరించారంటూ ఊర్మిళ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం గురించి ఊర్మిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మేము ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో 15 నుంచి 29 మంది వచ్చి మాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలని మా కార్యకర్తలకు సూచించాను. కానీ కాసేపటి తర్వాత వల్గర్‌గా డ్యాన్సులు చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారు. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తల మీద దాడి చేస్తూ అభ్యంతకరంగా వ్యవహరించారు. మమ్మల్ని భయపెట్టేందుకు దిగజారుడు చర్యలకు పాల్పడ్డారు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో వారు మరింత హింసకు పాల్పడే అవకాశం ఉంది. నా ప్రాణానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని పేర్కొన్నారు. కాగా ఊర్మిళకు పోటీగా ముంబై నార్త్ నుంచి బీజేపీ తరఫున గోపాల్ శెట్టి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
రంగీలా తారని కాదు.. రాజకీయ నేతను
90వ దశకంలో హిందీ, తెలుగు చిత్రాలలో నటించిన ‘రంగీలా’ సుందరి ఊర్మిళా మటోండ్కర్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే నాటి తారగా కాకుండా ప్రజల ప్రతినిధిగానే ఈ ఎన్నికల్లో నిలబడుతున్నానంటోది ఊర్మిళ. ‘నాకున్న స్టార్ ఇమేజ్‌తో నేను ప్రజల వద్దకు వెళ్లట్లేదు. పూర్తిగా ప్రజల గురించి తెలుసుకుని వారికి దగ్గరవుతాను. ఇదంతా సులవు కాదని తెలు’సం టూ తన రాజకీయ అరంగేట్రంలో సవాళ్లను గురించి పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఊర్మిళ ఈ ప్రాంతంలో తిరుగుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇళ్లు, నీటి కొరత, మురుగు పారిశుధ్య సమస్యలున్నాయని ఆమె తెలిపారు. ఈ సమస్యలకి ఒక్క రాత్రిలో పరిష్కారం చూపటం సాధ్యం కాదు. చాలా మంది ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ కావాలని, గోరాయి ప్రాంతంలో నీళ్ల సమస్య గురించి చెబుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, లోకల్ ట్రెయిన్స్, కనీస వసతులు పెంచాలని తాను తెలుసుకున్నానని ఆమె చెబుతున్నారు. వాడిగా వేడిగా.. రాజకీయాలంటే మాట ఇవ్వటం, ఏదేమై నా ఆ మాటకు కట్టుబడటం అని గట్టిగా చెబుతున్నారు ఊర్మిళ. బీజీపీ అభ్యర్థి గోపాల్ శెట్టితో ఆమె పోటీ పడనున్నారు. రాజకీయ అనుభవం ఉన్న ఆయన, ఊర్మిళకు రాజకీయం జ్ఞానం సున్నా అని విమర్శించారు. ఆమె ఈ మాటలేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. కానీ ఆయన తీరును మాత్రం ఆమె బాగా అర్థం చేసుకున్నారు. ‘‘ఆయన మాటలను బట్టి ఆయన తీరు అర్థమవుతోంది. ఆయన నా గురించి హేళనగా, తప్పుగా మాట్లాడుతున్నారు. దీని వెనుక రెండు విషయాలు ఉండవచ్చు. ఆయనకు తన మీద విశ్వాసం తగ్గిపోవటం, లేదా లోపల దాగి ఉన్న భయాలన్నీ ఈ రూపంలో బయటకు వస్తుండవచ్చు. ఆయన, ఆయన పార్టీ వాళ్లు ఎక్కువగా ఆవేశపూరిత వాతావరణంలోకి అవతల వాళ్లని నెట్టాలని ప్రయత్నిస్తుంటారు. మతాత్మక, సామాజిక–ఆర్థిక అంశాలతో ప్రజలను బిజీగా ఉంచుతారు. దీని వల్ల ప్రజలు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టరు. అలాంటప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?’’ అని ప్రశ్నించారు ఊర్మిళ. ఒకవేళ అలాంటి రాజకీయాలు నాకు తెలియవని ఆయన అంటే, అలాంటి రాజకీయాల్లో నేను జీరోగా ఉండటమే తనకు సంతోషం అని అన్నారామె. సమాజానికి ఏమైనా చేయాలని.. 45 ఏళ్ల ఊర్మిళ చివరిసారిగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించారు. ఇకపై సమాజానికి ఏమైనా చెయ్యాలి అని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకోలేదని, ఏదైనా పార్టీలో చేరి వారి కోసం ప్రచారం చెయ్యాలనుకున్నానని తెలిపారు. కానీ పార్టీలో చేరిన తర్వాత, బెస్ట్ అందించాలి అందుకే ఈ పోటీకి సిద్ధమయ్యానన్నారు. అసాధారణ ప్రధాని కాగలరు.. చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతతో పెరిగానని, స్త్రీల సమస్యలు, బాలల విద్య, ఎయిడ్స్ అవగాహన లాంటి అంశాలపై ఆమె పనిచేశానన్నారు. ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఆయన దేశానికి అసాధారణ ప్రధాని కాగలడని అన్నారు. ఆయనను అపోజిషన్ వాళ్లు నిరంతరం ట్రోల్ చేస్తూ, విమర్శిస్తూ చులకన చేస్తు వస్తూన్నారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఈ ఐదేళ్లు విరామం లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. దాని ప్రతిఫలమే కాంగ్రెస్ మ్యానిఫెస్టో. ఆయన అధికారంలోకి వస్తే వాటిని సమర్థవంతంగా అమలు చెయ్యగలరు. సినిమాలు లేవు.. సవాళ్లే... తాను పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించనున్నట్టు ఊర్మిళ తెలిపారు. ప్రస్తుతం తాను ఏ చిత్రాలు చెయ్యటం లేదని చెప్పారు. సినిమా వాళ్లకీ సాధారణ ప్రజలకుండే కష్టాలున్నాయన్నారు. మన మాట్లాడే స్వేచ్ఛ హరించుకు పోవటం చాలా ప్రమాదకరమని అమె అన్నారు. అదే మీడియా, సినిమా పరిశ్రమ, సాధారణ ప్రజలు కూడా దీనిని ఎదుర్కుంటున్నారని తెలిపారు. -
రంగీలా హంగామా
ముంబై నార్త్ లోక్‌సభ స్థానానికి గ్లామర్ డాల్ ఊర్మిళా మతోండ్కర్ పేరుని కాంగ్రెస్ ఖరారు చేసిన తక్షణమే బాలీవుడ్ అందాల తార, రాజకీయవేత్త ఆహార్యంలోకి మారిపోయారు. చిట్టిపొట్టి గౌనుల్లో నుంచి ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన చీరలూ, పెద్దరికాన్ని తెచ్చిపెట్టే వదులైన దుస్తులు ధరించి ప్రచారం సాగిస్తున్నారు. దుమ్మూ, ధూళీ మధ్య మండుటెండల్లో ఎన్నికల ప్రచార వేళ బహుశా ఈ దుస్తులు మతోండ్కర్ సౌకర్యం రీత్యా ఎంచుకొని ఉంటారు. ఇప్పటికే కొన్ని రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజల సమస్యలపై పరిణతి చెందిన రాజకీయవేత్త తరహాలో వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఊర్మిళ. ఆమెలోని పఠానాసక్తీ, సామాజిక సమస్యలపై ఆసక్తీ ఆమె ఉపన్యాసాల్లోనూ ప్రతిబింబిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వోద్యోగ కుటుంబం నుంచి వచ్చి, చిత్ర పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఊర్మిళ బీజేపీ పునాదులు బలంగా ఉన్న ముంబై నార్త్‌లో రాణిస్తారా అన్నది ఇప్పుడు అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, ఎస్ఏ.డాంగే, వీకే కృష్ణమీనన్ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంపై ఈ రెండు ప్రధాన పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. మాటల మరాఠీ.. ముంబై నార్త్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల చుట్టుముట్టిన ఫొటోగ్రాఫర్లూ, మీడియా ప్రతినిధుల మధ్య ఏ జంకూ గొంకూ లేకుండా అశోక్ సుత్రాలే తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్మికుల సమక్షంలో మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పి మెప్పించారు ఊర్మిళ. ఇరవయ్యవ శతాబ్దపు సంస్కరణవాది మహారాష్ట్రకు చెందిన పాండురంగ సదాశివ్ సేన్ గురూజీ బోధనలను అనర్గళంగా వల్లె వేస్తోన్న ఊర్మిళను స్థానిక మరాఠీలూ, భారతీయ జనతా పార్టీ సానుభూతిపరులు చెవులు రిక్కించి వింటూంటే స్థానికులను ఆమె ఉపన్యాసాలు సమ్మోహన పరుస్తున్నాయి. మొహంపై చిరునవ్వుని చెదరనివ్వకుండా ఊర్మిళ ప్రస్తుత సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతోన్న మతం, దేశభక్తీ, వ్యక్తిగత స్వేచ్ఛ తదితరాంశాలపై ప్రత్యర్థి వర్గంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండటం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. మరాఠీ ఓట్లపైనే ఆశ ముంబై నార్త్‌లో మొత్తం 17.8 లక్షల మంది ఓటర్లుంటే అందులో అత్యధికంగా 40 శాతం మంది గుజరాతీయులు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్రియన్లు, ఉత్తరభారతీయులు, ముస్లిం మైనారిటీలూ, క్రిస్టియన్లూ, జైన సామాజిక వర్గానికి చెందిన వారూ ఉన్నారు. ఊర్మిళ ప్రవేశంతో ఈ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా ఉన్న మరాఠీల ఓట్లను ఈమె ఆకట్టుకోగలరని ఊర్మిళ ప్రచార ప్రణాళిక రచిస్తోన్న జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గన్‌శ్యాం తెలిపారు. అయితే స్థానిక ప్రజలకు సుపరిచితుడూ, గుజరాతీలో అనర్గళంగా మాట్లాడే బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి ముందు ఊర్మిళ ఛరిష్మా ఏమాత్రం పనిచేయదని బీజేపీ వాదిస్తోంది. గెలుపు కల్ల అంటోన్న బీజేపీ ఊర్మిళ అంశాన్ని పక్కనపెడితే మోదీ వేవ్ విస్తృతంగా వీచిన 2014లో ఎన్నికల్లో శెట్టి విన్నింగ్ మార్జిన్ 4.47 లక్షల ఓట్లు. అది 2019 ఎన్నికల్లో 5.50 లక్షలకు మించవచ్చునని ముంబై బీజేపీ ఉపాధ్యక్షుడూ, ముంబై నార్త్ ఇన్చార్జ్, ప్రముఖ లాయర్ జెపి.మిశ్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. శివసేనకి ఒకరు, కాంగ్రెస్‌కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ మొత్తం 42 మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ శివసేనలకి కలిసి 39 వచ్చాయి. అందుకే ఇక్కడ మతోంద్కర్ గెలుపు ప్రసక్తే లేదని బీజేపీ కొట్టిపారేస్తోంది. అయితే స్థానికంగా బీజేపీకి పట్టున్న ఈ స్థానంలో ఊర్మిళ పోటీ తమని విజయతీరాలకు చేరుస్తుందన్న ధీమాని వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. మొత్తం మీద బీజేపీ– కాంగ్రెస్ రెండూ ఈ స్థానంపై ఆశలు పెట్టుకొన్నాయి. పుస్తక ప్రియురాలు బాలీవుడ్ సినీతార ఊర్మిళ మతోండ్కర్ సింధుదుర్గ్‌లో శ్రీకాంత్, సునీత దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి శ్రీకాంత్ రిటైర్డ్ బ్యాంకు అధికారి. తల్లి సునీత విశ్రాంత ప్రభుత్వోద్యోగి. ఊర్మిళ శతాబ్దాల చరిత్ర కలిగిన దాదర్‌లోని కింగ్ జార్జ్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత రూపరేల్ కాలేజ్‌లో డిగ్రీ చేరినప్పటికీ ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, సినిమాల్లో బిజీ అయిపోయారు. అనతి కాలంలోనే చిత్రపరిశ్రమలో గుర్తింపు పొందిన ఊర్మిళకు.. ‘రంగీలా’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. సినీ ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే కశ్మీరీ వ్యాపారి ఎంఏ.మిర్ని పెళ్లి చేసుకున్నారు. ముంబైలో నివసిస్తోన్న ఊర్మిళ సోదరి మమత.ఎ.భాలేకర్ మాజీ సినీ నటి. ఆ తరువాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఊర్మిళ అన్న రిటైర్డ్ సైనికోద్యోగి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సామాజిక సమస్యల గురించి నిత్యం ఆలోచించే ఊర్మిళ పుస్తక ప్రియురాలు. దాదాపు ప్రముఖ సాహిత్యాన్నంతా చదివిన అనుభవం, సదాశివ్ సేన్ గురూజీ బోధనలు ఆమెను బాగా ప్రభావితం చేశాయి. సామాజిక సమస్యలపై అవగాహన కలిగిన ఊర్మిళ సినిమాల్లో నటించినా, సామాజిక కార్యకర్తగా ఉన్నా, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా నిబద్ధతతో పనిచేస్తారని ఆమె తండ్రి శ్రీకాంత్ కితాబునిచ్చారు. -
ఊర్మిళ ఆస్తులు రూ. 68 కోట్లు
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళ మటోండ్కర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తనకు రూ.68.28 కోట్ల ఆస్తులు(మార్కెట్ విలువ మేరకు) ఉన్నట్లు ఊర్మిళ తెలిపారు. ఇందులో రూ.40.93 కోట్ల చరాస్తులు ఉండగా, రూ.27.34 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. 2013–14 ఆర్థిక సంవత్సరానికి రూ.1.27 కోట్ల ఆదాయాన్ని అర్జించినట్లు పేర్కొన్నారు. 2017–18 నాటికి తన ఆదాయం రూ.2.85 కోట్లకు చేరుకుందన్నారు. అలాగే తన భర్త పేరుపై రూ.32.35 కోట్ల చరాస్తులు, రూ.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. -
‘బ్రెయిన్ లేదనుకుంటున్నారా.. ఏడుస్తూ కూర్చోను’
ముంబై : ‘బాలీవుడ్ నుంచి వచ్చాను కదా అని నాకు మెదడు లేదని అనుకుంటున్నారేమో. ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదు. ఇండస్ట్రీలో భాగమైనందుకు నేను ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా’ అని ముంబై నార్త్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళా మటోంద్కర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంధేరీలో ఏర్పాటు చేసిన ‘యూత్ మీట్’కు పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ యువతను వినియోగించుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యువతకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని మండిపడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించగానే కొంతమంది తనను విపరీతంగా ట్రోల్ చేశారని.. అయితే అంతమాత్రాన ఏడుస్తూ కూర్చోనని పేర్కొన్నారు. ఇటువంటి వేదికలపై ఆ విషయాలను ప్రస్తావించి సానుభూతి పొందాలనుకోవడం లేదని.. ఎంపీగా గెలిచితీరతానే నమ్మకం ఉందని ఊర్మిళ చెప్పుకొచ్చారు. కాగా ముంబై నార్త్ నియోజకవర్గంలో గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఊర్మిళ, ముంబై నార్త్ వెస్ట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు హార్ధిక్ పటేల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 2014లో యూత్‌కు మోదీ పట్ల బాగా క్రేజ్ ఉండేది. కానీ అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కి ఆయన యువతను మోసం చేశారు. ఇందుకు తగిన సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఇక వికీపీడియాలోని ఊర్మిళ ప్రొఫైల్ పేజీలో ఆమె పేరు, మతం, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని మార్చేసి కొంతమంది ఆకతాయిలు తప్పుడు వివరాలను అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడగా, బీజేపీ సోషల్‌మీడియా విభాగం ఈ నీచమైన ప్రచారానికి దిగిందని కాంగ్రెస్ విమర్శించింది. ఊర్మిళ ప్రస్తుత పేరు మరియమ్ అక్తర్ మిర్ అనీ, 2015లో ఆమె కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్ అక్తర్ మిర్‌ను పెళ్లిచేసుకున్నారంటూ ట్రోల్ చేశారు. -
రంగీలా నటి..అమాయకురాలు..!
ముంబై : బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్‌పై ముంబై నార్త్ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇక్కడ గోవిందా ఎంపీగా గెలిచినంత మాత్రాన మళ్లీ అలాగే జరుగుతుందని ఆమె భ్రమ పడ్డారని చురకలంటించారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని ఊర్మిళాను కాంగ్రెస్ పోటీకి దించిందని ఎద్దేవా చేశారు. ఊర్మిళా రాజకీయంగా ‘భోలీ భోలీ లడ్కీ’ (అమాయకురాలు) అని అభివర్ణించారు. ‘కేవలం ఊర్మిళ సినిమా తార కాబట్టే ఆమె ప్రచారంలో జనం కనిపిస్తున్నారు. కానీ, ఎవరికి ఓటు వేయాలో జనానికి తెలుసు’ అన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాని, ఈ సారి కూడా విజయం తనదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, 2009లో ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీచేసిన సంజయ్ నిరుపమ్ బీజేపీ అభ్యర్థి రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. అయితే, 2014 ఎన్నికల్లో బీజేపీ గోపాల్ శెట్టిని బరిలో నిలిపింది. ఆయన సంజయ్‌పై తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా సంజయ్‌కి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. కానీ, ఆయన అక్కడ నుంచి పోటీకి విముఖత చూపించారు. వాయువ్య ముంబై నుంచి బరిలోకి దిగుతున్నారు. 2004 ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ తరపున గోవిందా విజయం సాధించారు. -
ఊర్మిళ ఓ ముస్లిం.. ఆమె పేరు మరియం
ముంబై : కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్ నటి ఊర్మిళ మతోంద్కర్ వ్యతిరేకంగా ఆకతాయిలు ట్రోలింగ్ చేశారు. వికీపీడియాలోని ఊర్మిళ ప్రొఫైల్ పేజీలో ఆమె పేరు, మతం, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని మార్చేసి తప్పుడు వివరాలను అప్లోడ్ చేశారు. దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడగా, బీజేపీ సోషల్‌మీడియా విభాగం ఈ నీచమైన ప్రచారానికి దిగిందని కాంగ్రెస్ విమర్శించింది. ఊర్మిళ ప్రస్తుత పేరు మరియమ్ అక్తర్ మిర్ అనీ, 2015లో ఆమె కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్ అక్తర్ మిర్‌ను పెళ్లిచేసుకున్నారని ఆకతాయిలు వికీపీడియాలో పోస్ట్‌చేశారు. ట్రోలింగ్ చేసిన వారిపై వికీపీడియా చర్యలు తీసుకోవాలని ఊర్మిళ తండ్రి శ్రీకాంత్ మటోంద్కర్ డిమాండ్ చేశారు. -
రంగీలా తార ప్రచారానికి బాలీవుడ్ నటులు
ముంబై : ఉత్తర ముంబై లోక్‌సభ స్ధానం నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్ తనకు సాయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బాలీవుడ్ ఫ్రెండ్స్ పలువురు ముందుకొచ్చారని చెప్పారు. అయితే వీరందరిలో ఎంతమంది ప్రచారంలో పాల్గొంటారో చూడాలని రంగీలా నటి అన్నారు. తనకు మద్దతుగా ఏ కొద్ది మంది ప్రచారంలో పాల్గొన్నా సంతోషమేనని, వారు ప్రచారంలో పాల్గొనకపోయినా మంచిదేనని చెప్పుకొచ్చారు. ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి పోటీలో దిగిన ఊర్మిళ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలు ప్రార్ధనా స్ధలాలనూ ఆమె సందర్శించారు. రాజకీయ ప్రస్ధానం ఇప్పుడే మొదలైందని, తనకింకా విసుగు రాలేదని చెప్పారు. సినీ రంగంలోనూ తాను ఎంతో కష్టపడి పేరుతెచ్చుకున్నానని, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తానని అన్నారు. నిజాయితీతో పనిచేయడమే తన విలక్షణతని ప్రజలు తనను ఎన్నుకుంటే వారికి నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. -
మోదీ మంచోడే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వాడివేడి విమర్శలకు పదును పెడుతున్నాయి. మోదీ కాంగ్రెస్‌ను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే, ప్రధాని లోపభూయిష్ట విధానాలతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశంలో అసహనం పెరిగిపోతుండటం పట్ల నరేంద్ర మోదీ సర్కార్ తీరును బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్ తప్పుపట్టారు. మోదీ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే అయినా ఆయన విధానాలు సరైనవి కావని ధ్వజమెత్తారు. తాను గాంధీ, నెహ్రూల గురించి ఎంతో విన్నానని, తమ కుటుంబం కాంగ్రెస్ సిద్ధాంతాలను అనుసరిస్తుందని ఆ పార్టీలో చేరికపై వ్యాఖ్యానించారు. భారత్ ప్రజాస్వామిక దేశమని, ఇక్కడి ప్రజలు తమకు నచ్చినట్టు మాట్లాడేందుకు, ఇష్టమైన ఆహారాన్ని తీసుకునేందుకు స్వేచ్ఛ ఉందని చెప్పుకొచ్చారు. కానీ దేశంలో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.మతం ప్రాతిపదికన ప్రజల మధ్య విభజన రేఖలు గీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రజల్లో తీవ్ర ద్వేషభావం నెలకొంది..మతం పేరుతో ప్రజలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నా’రని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌లో ప్రజలు సంతోషంగా లేరు..ఆయన తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారని, దేశమంతటా నిరుద్యోగం తాండవిస్తోందని ధ్వజమెత్తారు. కాగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అనే దానిపై తనకు ఇంకా స్పష్టత లేదన్నారు. -
ముంబై బరిలో ‘రంగీలా’..?
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిల మతోండ్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముంబై లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలవడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర ముంబై సీటు ఊర్మిలకు దక్కినట్టుగా తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. కాంగ్రెస్ అధిష్టానం ఊర్మిల అభ్యర్థిత్వం గురించి సీరియస్‌గా ఆలోచిస్తోందని, దాదాపుగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని వినిపిస్తోంది. ముంబైలోని ఆరు ఎంపీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ ఊర్మిలకు ఎంపీ సీటు దక్కితే, సిట్టింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోపాల్ షెట్టిని ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గతంలో బాలీవుడ్ దిగ్గజం సునీల్ దత్ 5 సార్లు గెలుపొందారు. మరాఠీ చిత్రం జకూల్ (1980)తో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన ఊర్మిల మతోండ్కర్ (45), శశి కపూర్ చిత్రం కల్యుగ్ (1981)తో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. బాలనటిగా ఈ రెండు చిత్రాల్లో కనబర్చిన నటనకు మెచ్చి.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ మాసూమ్ (1983) సినిమాలో ఊర్మిలకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు చాలా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత హీరోయిన్గా బాలీవుడ్‌ను షేక్ చేసింది ఊర్మిల. ఆమె నటించిన రంగీలా, ఇండియన్, దావూద్, సత్య, భూత్, మైనే గాంధీ కో నహీ మారా, స్పీడ్‌తో పాటు ప్రాంతీయ భాషా చిత్రాలు ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. -
స్క్రీన్ టెస్ట్
1960–70లలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది అంటే ఆ పాటల కోసం స్పెషల్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. 90లలో సీన్ మారింది. స్పెషల్ ఆర్టిస్టులతో దాదాపు పని లేకుండా పోయింది. అందుకే అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, హలం, సిల్క్ స్మితల్లా ఇప్పుడు బోలెడంత మంది ఐటమ్ డ్యాన్సర్స్ లేరు. స్పెషల్ సాంగ్స్‌ను హీరోయిన్లు కూడా చేస్తున్నారు. సినిమా మార్కెటింగ్‌కు ఇదో కొత్తరూట్ అన్నమాట. ఏది ఏమైనా ‘ఐటమ్ సాంగ్’ అంటే కిక్కే వేరు. ఇలాంటి మస్త్ మసాలా పాటలకు కాలు కదిపిన తారల గురించి ఈ వారం క్విజ్. సరదాగా ఓ లుక్కేయండి. 1 ‘ఓ సుబ్బారావో ఓ అప్పారావో ఓ వెంకట్రావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా...’ అనే పాట యన్టీఆర్, శ్రీదేవి, జయచిత్ర నటించిన ‘బొబ్బిలిపులి’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత ఎవరు? ఎ) వేటూరి బి) దాసరి నారాయణరావు సి) సిరివెన్నెల డి) కొసరాజు 2 ‘ఇప్పటికింకా నా వయను నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... ఈ ఒకే ఒక్క పాటతో యూత్ మొత్తానికి దగ్గరైన నటి ఎవరు? ఎ) గాబ్రియేలా బి) ముమైత్‌ఖాన్ సి) ఆండ్రియా డి) ముంతాజ్ 3 1980–90ల దశకంలో ఐటమ్ సాంగ్‌లతో ఓ వెలుగు వెలిగారు ప్రముఖ డ్యాన్సర్ అనూరాధ. అమె దాదాపు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 330 బి) 550 సి) 700 పైన డి) 1000 చిత్రాలు పైనే 4 సూపర్‌హిట్ సాంగ్ ‘లే లే లే లేలేలే నా రాజా..’ ప్రేమనగర్’ చిత్రంలోనిది. ఈ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) పి. సుశీల బి) ఎస్. జానకి సి) జిక్కీ డి) ఎల్.ఆర్. ఈశ్వరి 5. ‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకలో...’ అంటూ చిందులేసిన ప్రముఖ హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) అనుష్క సి) నయనతార డి) లావణ్యా త్రిపాఠి 6 1974లో ‘ఆడదాని అదృష్టం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు జయమాలిని. ఆమెను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? ఎ) కె.వి. రెడ్డి బి) విఠలాచార్య సి) వి. మధుసూదన్‌రావు డి) పి.సి. రెడ్డి 7 ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల’ పాట చాలా ఫేమస్. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) వయ్యారిభామలు వగలమారి భర్తలు బి) స్త్రీజన్మ సి) దేవుడు చేసిన మనుషులు డి) విచిత్ర కుటుంబం 8 ‘అ అంటే అమలాపురం ఆ ఆంటే ఆహాపురం...’ సూపర్‌హిట్ సాంగ్‌లో నటించిన నటి పేరేంటి? ఎ) నటాలియా కౌర్ బి) అభినయశ్రీ సి) రచనా మౌర్య డి) స్కార్లెట్ విల్సన్ 9 ‘నా ఇంటిపేరు సిల్క్ నా వంటి రంగు మిల్క్...’ అంటూ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చిందేసిన బ్యూటీ పేరేంటో? ఎ) శ్రియ బి) రాశీఖన్నా సి) సమంత డి) తమన్నా భాటియా 10 ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే...’ అనే పాటలో ప్రభాస్‌తో కాలు కదిపిన భామ ఎవరో? ఎ) మధుశర్మ బి) హంసానందిని సి) జబీన్ ఖాన్ డి) అల్ఫోన్సా 11 ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణి...’ అంటూ ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ స్టెప్పులేసిన భామ పేరేంటి? ఎ) కియరా అద్వానిæ బి) శ్రుతీహాసన్ సి) అమీ జాక్సన్ డి) పూజా హెగ్డే 12 దర్శకుడు శేఖర్ కమ్ముల మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాలు చేస్తారని పేరుంది. సందర్భానుసారంగా ఆయన కూడా ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఆ సాంగ్‌లో నటించింది ప్రముఖ టీవి యాంకర్. ఎవరా యాంకర్? ( క్లూ: ఆ పాట ఏంటంటే.. ‘రాజశేఖరా నీపై మోజూ తీరలేదురా, రాజసాన ఏలరా రాజా రాజా...’) ఎ) శిల్పాచక్రవర్తి బి) ఉదయభాను సి) అనసూయ డి) సుమ 13. ‘కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నేనెల్తుంటే, కెవ్వుకేక....’ అనే పాటలో నటించిన బాలీవుడ్ హాట్ లేడీ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) ఊర్మిళా మటోండ్కర్ సి) కత్రినాకైఫ్ డి) మలైకా అరోరా 14 ‘డియో డియో డిసక డిసక...’ అంటూ యూత్‌ను ఎట్రాక్ట్ చేసిన నటి పేరేంటి? ఎ) సన్నీ లియోన్ బి) రాఖీ సావంత్ సి) సెలీనా జైట్లీ డి) యానా గుప్తా 15 ‘బావలు సయ్యా మరదలు సయ్యా, రింబోల రింబోలా..’ అంటూ కోట శ్రీనివాసరావు, బాబుమోహన్లను ఓ ఆట ఆడించిన నటి ఎవరో గుర్తుందా? ఎ) డిస్కో శాంతి బి) ‘సిల్క్’ స్మిత సి) విజయలలిత డి) కుయిలీ 16 ‘చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ...బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే ’అని అంజలి ఏ హీరోతో డ్యాన్స్ చేశారు? ఎ) రామ్‌చరణ్ బి) మహేశ్‌బాబు సి) యన్టీఆర్ డి) అల్లు అర్జున్ 17. ‘వెల్కమ్ టూ సక్కుబాయ్... గరమ్ చాయ్ తాగేసెయ్.. మజాచెయ్...’ అని చార్మీ ఏ హీరోతో స్టెప్పులేశారో గుర్తుందా? ఎ) నాగార్జున బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) రానా 18 ‘పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సాంగ్‌లో యన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేసిన ప్రముఖ డ్యాన్సర్ ఎవరో కనుక్కోండి? ఎ) హలం బి) అనురాధ సి) జయమాలిని డి) జ్యోతిలక్ష్మీ 19 ‘అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి...’ అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన ‘కొత్తజంట’ చిత్రంలోని పాట ఇది. ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కేథరిన్ బి) హన్సిక సి) మధురిమ డి) ఈషా రెబ్బా 20, ‘బళ్లారి బావ...’ అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి హీరోలు వెంకటేశ్, రానాలతో కలిసి చిందేశారు. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) క్రిష్ సి) సుకుమార్ డి) కృష్ణవంశీ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) సి 4) డి 5) ఎ 6) బి 7) సి 8) బి 9) డి 10) బి 11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) సి 19) సి 20) బి -
స్క్రీన్ టెస్ట్
► నాగార్జున నటించిన ‘రాజన్న’ సినిమా యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసిన దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) హరీష్ శంకర్ ► మహేశ్‌బాబు పలు సందర్భాల్లో ‘నాకు లైఫ్ మొత్తం ఒకే ఒక్కరంటే చాలా భయం’ అని చెప్పారు. ఆయన ఎవరికి భయపడుతుంటారు? ఎ) రమేశ్ బాబు (అన్న) బి) కృష్ణ (తండ్రి) సి) మంజుల (అక్క) డి) గల్లా జయదేÐŒ (బావ) ► ఐఐయంలో గ్రాడ్యుయేట్ చేసిన నటుడిగా నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన మరో నటుడు ఎవరో తెలుసా? ఎ) అవసరాల శ్రీనివాస్ బి) తనీష్ సి) విజయ్ దేవరకొండ డి) నిఖిల్ ► రజనీకాంత్ నటించిన ఓ సినిమాకి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకం విడుదలైంది. అది ఏ సినిమానో తెలుసా? ఎ) బాషా బి) అరుణాచలం సి) నరసింహా డి) బాబా ► గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తెలుగు హాస్యనటుడు ఎవరు? ఎ) బ్రహ్మానందం బి) అలీ సి) కోటా శ్రీనివాసరావు డి) పద్మనాభం ► హాలీవుడ్ సినిమా ‘లైఫ్ ఆఫ్ పై’లో హీరో తల్లి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు. ఆమె తెలుగు, తమిళ్, హిందీలోనూ ఫేమస్ హీరోయిన్. ఎవరామె? ఎ) కంగనా రనౌత్ బి) టబు సి) మాధురీ దీక్షిత్ డి) మనీషా కోయిరాల ► అంతం, గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) సాక్షి శివానంద్ సి) సోనాలి బింద్రే డి) జియా ఖాన్ ► డి.వి.వి. ప్రొడక్షన్స్‌లో మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్గా కియరా అద్వాని నటించారు. అదే బ్యానర్లో ఆమె మరోసారి నటిస్తున్నారు. ఈ సారి హీరో మారారు. ఎవరా హీరో? ఎ) ఎన్టీఆర్ బి) రామ్ చరణ్ సి) ప్రభాస్ డి) అల్లు అర్జున్ ► ఈ నలుగురిలో మలయాళ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? (చిన్న క్లూ: తెలుగు ‘ప్రేమమ్’లో ఆమె నటించారు) ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) షాలినీ పాండే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 25 సినిమాలకు పనిచేసిన పాటల రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) భాస్కరభట్ల రవికుమార్ సి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి ► ‘తేనె మనసులు’ సినిమాలో నటించిన బాలనటి తర్వాతి కాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది. ఎవరో గుర్తు తెచ్చుకోండి ఓ సారి? ఎ) సుహాసిని బి) శ్రీదేవి సి) జయసుధ డి) జయప్రద ► నటి రాశీఖన్నా ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) దిస్ ఈజ్ రాశీ బి) మై నేమ్ ఈజ్ రాశీ సి) రాశీఖన్నా డి) యువర్స్ రాశీఖన్నా ► ‘ఏస్కో నా గుమా గుమా చాయ్ ’ అనే పాట నాగార్జున, అనుష్క జంటగా నటించిన ‘ఢమరుకం’ చిత్రంలోనిది. ఆ స్పెషల్ సాంగ్‌లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) చార్మీ కౌర్ డి) త్రిష ► ‘ప్రేమించిన మనిషిని వదులుకోవటం అంటే.. ప్రేమను వదులుకోవటం కాదు..’ అనే ౖyð లాగ్ శర్వానంద్ నటించిన ‘శతమానంభవతి’ లోనిది. ఆ సినిమా మాటల రచయితెవరు? ఎ) పరుచూరి బ్రదర్స్ బి) సతీశ్ వేగేశ్న సి) అబ్బూరి రవి డి) బెజవాడ ప్రసన్న ► నాగార్జునతో రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు చేస్తున్న ఆఫీసర్ సినిమా వారిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో సినిమా? ఎ) మూడో సినిమా బి) నాలుగో సినిమా సి) ఐదో సినిమా డి) ఏడో సినిమా ► ‘హలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ‘కల్యాణి ప్రియదర్శన్’ ఏ నటి కుమార్తె? ఎ) అంబికా బి) రాధ సి) లిజి డి) వాణీ విశ్వనాథ్ ► 2017వ సంవత్సరంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాలో ప్రతి నాయకుని పాత్రలో నటించిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) జగపతిబాబు బి) శ్రీకాంత్ సి) జె.డి.చక్రవర్తి డి) రాజేంద్రప్రసాద్ ► సమంతలో మంచి నటి ఉందని గుర్తించి. హీరోయిన్గా స్క్రీన్‌కి పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) విక్రమ్.కె. కుమార్ బి) గౌతమ్ మీనన్ సి) వంశీ పైడిపల్లి డి) దేవా కట్టా ► యస్వీ రంగారావు, ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) నర్తనశాల బి) భూకైలాస్ సి) దీపావళి డి) ఇంద్రజిత్ ► ఈ ఫొటోలోని చిన్నారి ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్. ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) భానుప్రియ బి) శోభనసి) జయప్రద డి) మీనా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) సి 14) బి 15) బి 16) సి 17) బి18) బి19) డి20) బి నిర్వహణ: శివ మల్లాల -
మిడిల్ క్లాస్ మేల్ బ్లాక్‌మేల్
ఒకరి బలహీనత ఇంకొకరికి ఆసరా. అవసరాన్ని తీర్చే మార్గం. మరీ మధ్యతరగతి వర్గన్ని బతికిస్తున్నవి ఇలాంటి బలహీనతలే! ఇదే బ్లాక్‌మేల్ సినిమా! చాలా సీరియస్ విషయాన్ని హాస్యాన్ని జోడించి ఎంతో చతురంగా చెప్పిన చిత్రం! కథ... దేవ్ (ఇర్ఫాన్ ఖాన్) టిష్యూ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సేల్స్ మ్యాన్. బాధ్యతలు తప్ప సుఖం, సంతోషం లేని మిడిల్‌క్లాస్ హజ్బెండ్. ముద్దుముచ్చటా లేని కాపురం. ఆఫీస్‌లో అందరూ వెళ్లిపోయే వరకు ఉండి, వీడియో గేమ్ ఆడి, భార్య నిద్రపోయాక ఇంటికెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద చల్లారిన భోజనాన్ని ఓవెన్లో పెట్టి, డైనింగ్ హాల్కీ బెడ్రూమ్కీ మధ్య ఉన్న తలుపు కన్నంలోంచి... ఆదమరిచి నిద్రపోతున్న భార్య అందాన్ని ఆస్వాదిస్తాడు. ఈలోపు ఓవెన్లో భోజనం వేడి అయిపోయినట్టు అలారమ్ వస్తుంది. నిట్టూర్చి భోజనం అయిందనిపించి వెళ్లి పడుకుంటాడు. ఇంచుమించు ఇదే దిన చర్య దేవ్ది. గులాబీపూలు... నిజాల ముళ్లు దేవ్ ఉదాసీనతను చూసి అతని కొలీగ్ ఆనంద్.. ‘‘కొన్నాళ్లుగా చూస్తున్నా. ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నావ్? అసలు కొత్త కాపురంలోని మొగుడులాగా ఉన్నావా? ఎందుకు ఏమైంది? కలహాలా?’’ అంటూ స్నేహితుడిని అడుగుతాడు. ముభావంగా ఉంటాడు దేవ్. ‘‘పువ్వులు ఇష్టపడని భార్య ఉండదు. సో.. ఈ రోజు పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికెళ్లి నీ భార్యకు సర్ప్రయిజ్ ఇవ్వు’’ అని దేవ్‌ను ఉత్సాహపరుస్తాడు ఆనంద్. అన్నట్టుగానే పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికొస్తాడు దేవ్. ఎప్పటిలాగే డైనింగ్ హాల్, బెడ్రూమ్కి మధ్యనున్న కన్నంలోంచి చూస్తాడు. షాక్... రీనా (కీర్తి కుల్హరి) ఇంకో వ్యక్తితో కనిపిస్తుంది. ఆవేశం పొంగుతుంది. వెళ్లి భార్య పక్కనున్న అతణ్ణి చంపేయాలనుకుంటాడు. ఏమీ చేయలేక.. భార్యనూ నిలదీయలేక నిస్సహాయంగా వెనుదిరుగుతాడు. తన ఇంట్లోంచి ఆ వ్యక్తి బయటకు వచ్చే వరకు అపార్ట్మెంట్ కాంపౌండ్‌లో నిరీక్షించి ఆ వ్యక్తి బయటకు వచ్చాక అతణ్ణి ఫాలో అవుతాడు. బ్లాక్‌మెయిల్స్... భార్య స్నేహితుడి పేరు రంజిత్ అని, ఓ బడా వ్యాపారి అల్లుడని తెలుసుకుంటాడు ఆ ఇంటి వాచ్‌మన్ ద్వారా. నిజానికి రంజిత్ (అరుణోదయ్ సింగ్), రీనా (దేవ్ భార్య)పెళ్లికి ముందే ప్రేమికులు. కాని డబ్బు కోసం డాలీ (దివ్య దత్తా)ను పెళ్లిచేసుకుంటాడు. జిమ్ ట్రైనర్ అయిన రంజిత్ వేరే పనేమీ లేకుండా అత్తింటి సొమ్ము మీద బతుకుతుంటాడు. దాంతో భర్తంటే చాలా చులకన డాలీకి. ఇంచుమించు పెంపుడు కుక్కలా ట్రీట్ చేస్తుంటుంది అతనిని. దాంతో ఆత్మాభిమానం దెబ్బతిని మళ్లీ పాత స్నేహితురాలు రీనాతో సంబంధం పెట్టుకుంటాడు రంజిత్. అలా వాళ్లిద్దరి స్నేహం కొనసాగుతుంది. ఈలోపు దేవ్‌కు నెల తిరిగేసరికల్లా ఇంటి ఈఎమ్ఐ, కార్ ఈఎమ్ఐ, కేబుల్ పేమెంట్.. ఎట్సెట్రా తడిసిమోపెడవుతాయి. ఆఫీస్‌లో ఆ నెల ఇంక్రిమెంట్ ఉంటుంది కదా.. అన్నీ తీర్చేయొచ్చు అనుకుంటే.. ‘‘కంపెనీ సేల్స్ మందగించాయి, పైగా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఇంక్రిమెంట్స్ లేవు’’ అంటూ చావు కబురు చల్లగా చెప్తారు. టెన్షన్లో పడ్తాడు దేవ్. అప్పుడు ఒక బేసిక్ మోడల్ ఫోన్ కొని, దాన్లో ప్రీపెయిడ్ సిమ్ వేసి, రాత్రి దొంగతనంగా భార్య ఫోన్లోంచి రంజిత్ ఫోన్ నంబర్ తస్కరించి ‘‘పెళ్లయిన మహిళతో అఫైరా?’’ అంటూ బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్‌కు. భయపడ్డ రంజిత్.. ‘‘ఏం కావాలి?’’ అని అడుగుతాడు. ఈఎమ్ఐల లెక్కలు వేసుకొని లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాడు. క్రాస్‌బ్రీడ్ డాగ్స్ బిజినెస్ చేస్తున్నాను, ఒక లక్ష రూపాయలివ్వమని అబద్ధం చెప్పి భార్య దగ్గర డబ్బులు తీసుకొని దేవ్కిస్తాడు రంజిత్. అలా భార్య ఎఫైర్‌ను మనీ సంపాదన వనరుగా మార్చుకుంటాడు దేవ్. మధ్యతరగతి విలువలు అతనిని కుళ్లబొడుస్తుంటాయి. ఆ అపరాధ భావనను ఓ రోజు బార్లో కొలీగ్ ఆనంద్‌తో పంచుకుంటాడు. ఆనంద్ ఆ విషయాన్ని తన ఆఫీస్‌లోని కొత్త ఫీమేల్ కొలీగ్ ప్రభకు చెప్తాడు. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభ మళ్లీ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే బిజినెస్ పేరుతో కూతురు దగ్గర అల్లుడు డబ్బు తీసుకున్నాడని తెలిసి డాలీ తండ్రి రంజిత్‌ను బెదిరిస్తాడు రెండు రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమని. ఏం చేయాలో పాలుపోక ఒక డూప్లికేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి గర్ల్ ఫ్రెండ్ రీనాకు బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్– ‘‘పెళ్లయిన వాడితో ఎఫైరా?’’అంటూ. ఈ విషయం నీ భర్తకు తెలియకుండా ఉండాలంటే లక్షా 30 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. రీనా తండ్రి కిడ్నీ జబ్బుతో బాధపడ్తుంటాడు. డబ్బు కోసం తల్లి దగ్గరకు వెళ్తుంది రీనా. ఉన్న డబ్బంతా మీ నాన్న కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడానికే అయిపోయిందంటుంది తల్లి. దాంతో రీనా తన భర్తనే అడుగుతుంది తండ్రి వైద్య పరీక్షల కోసమని. రంజిత్ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేస్తాడు. మళ్లీ రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇలా ఈ సైకిల్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ల, ఆ విషయం తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. ప్రైవేట్ డిటెక్టివ్.. ఈ బ్లాక్మెయిల్ బెడద తొలగించుకోవాలని రంజిత్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను మాట్లాడుకుంటాడు. ఆ డిటెక్టెవ్ రంజిత్‌కు ఫోన్ చేస్తున్న నంబర్ రీనా భర్తదేనని తెలుసుకుంటాడు. రంజిత్‌కు చెప్పకుండా పరిశోధన పేరుతో డ్రాగ్ చేస్తూ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు.. ‘‘నీ బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది నీ భర్తనేని నీ భార్యతో చెప్తాన’’ంటూ. ఖంగు తింటాడు దేవ్. ఈలోపు ప్రభ ఒత్తిడి ఎక్కువవుతుంది దేవ్‌కి. ఆమెను కన్విన్స్ చేయడానికి వాళ్లింటికి వెళ్దామనుకొని ఆమె ఇంటి అడ్రస్ కోసం ఆనంద్‌ను అడుగుతాడు. ఆ రాత్రి ప్రభ వాళ్లింటికి వెళ్తాడు దేవ్. వాదోపవాదాలు జరిగి దేవ్ వెళ్లిపోతుంటే ఆయనను ఆపడానికి వెళ్లి బాటిల్ మీద కాలు పడి జారి వెనకాల అల్మారాకు కొట్టుకుంటే అల్మారా మీద పడి ప్రభ చనిపోతుంది. భయపడి పారిపోతాడు దేవ్. కాలనీ వాసులు ఆయనని తరుముతాడు. అయినా తన అనవాలు చిక్కనివ్వకుండా తప్పించుకుంటాడు. మర్నాడు ఆఫీస్‌కు పోలీస్‌లు వస్తారు ఎంక్వియిరీ కోసం. ఆనంద్‌కు దేవ్ మీద డౌట్ వస్తుంది. ప్రభ అంటే ఆనంద్ ఇష్టపడుతున్నాడని పోలీసులకు చెప్పి డౌట్ ఆనంద్ మీదకు మళ్లేట్టు చేస్తాడు దేవ్. ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్చేస్తారు. అప్పుడు తన భార్య ఎఫైర్ విషయం తెలిసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ విషయం ప్రభకు తెలిసి... దేవ్‌ను ప్రభ బ్లాక్మెయిల్ చేసిందని అందుకే దేవే ఆమెను చంపి ఉంటాడని పోలీసులకు చెప్తాడు ఆనంద్. ఇన్స్పెక్టర్ దేవ్‌ను బెదిరిస్తాడు. ఈ లోపు ప్రైవేట్ డిటెక్టివ్ పోరు ఎక్కువవుతుంది దేవ్‌కి. అటు రంజిత్‌కు మామ పోరూ ఎక్కువవుతుంది. డాలీకి భర్త ఎఫైర్ విషయం తెలిసి, భర్తను చంపేయాలనుకుంటుంది. కాని అంతకుముందే రంజిత్ ప్రైవేట్ డిటెక్టివ్ చెప్పిన వ్యక్తి దగ్గర ఒక నాటు తుపాకీ కొనుక్కుంటాడు. కత్తితో తన వెనకాల పొడిచిన భార్యను తుపాకితో కాల్చి చంపేస్తాడు. డబ్బు కోసం మళ్లీ రీనాను బ్లాక్మెయిల్ చేస్తాడు రంజిత్ అపరిచిత మెయిల్ ద్వారా. రీనా మళ్లీ దేవ్‌ను డబ్బులు అడుగుతుంది తండ్రి వైద్యం కోసం. ఇవ్వనంటాడు. అపాలజీ చెప్పడానికి రీనా తల్లికి ఫోన్ చేస్తే రీనా అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది దేవ్‌కి. అప్పుడు మొత్తం విషయం తెలుస్తుంది. తను డబ్బు కోసం రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేయడం, రంజిత్ రీనాను బ్లాక్ మెయిల్ చేయడం. ఆ నిజాన్ని సాక్ష్యాలతో సహా రీనాకు పంపిస్తాడు దేవ్. రియౖలైజై రంజిత్ స్నేహానికి స్వస్తి చెప్పి అతని నంబర్ డిలీట్ చేస్తుంది రీనా. ఆనంద్‌కూడా దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆలోచించి ఓ ప్లాన్ వేస్తాడు దేవ్. ‘‘నువ్వు అడిగినంత డబ్బిస్తాను. కాని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది ఆనంద్ అని రంజిత్‌తో చెప్పు’’అంటాడు దేవ్.. ప్రైవేట్ డిటెక్టివ్‌తో. అలాగే చెప్తాడు ప్రైవేట్ డిటెక్టివ్. ఈ బ్లాక్‌మెయిలర్‌కు గుణపాఠం చెప్పాలనే ఆవేశంతో ఉన్న రంజిత్... ప్రైవేట్ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారంతో ఆనందే అసలు బ్లాక్‌మెయిలర్ అనుకొని అతనిని చంపేస్తాడు. ఈ క్రమంలో తన కూతురిని చంపింది అల్లుడే అన్న నిజమూ తెలుస్తుంది రంజిత్ మామకు. అలా రంజిత్ దోషిగా దొరికిపోతాడు. దేవ్ కోసం రీనా ఆ రాత్రి భోజనం వండి టేబుల్ మీద సర్ది ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడొస్తావ్ ఇంటికి అని మెస్సేజ్ పెట్టి. ఆ మెస్సేజ్ వచ్చేటప్పటికీ దేవ్ ఎప్పటిలా రాత్రి ఆఫీస్‌లో వీడియో గేమ్ ఆడ్తుంటాడు. చిత్రంగా విన్ అవుతాడు. భార్య మెస్సేజ్ చూసి ఆమె నంబర్ డిలిట్ చేసేస్తాడు. సామాన్యుడు తనే సమస్యలను సృష్టించుకుని ఆ సుడిగుండంలో కొట్టుకుపోతాడు అనే సారాంశం ఈ బ్లాక్మెయిల్. దేవ్‌గా ఇర్ఫాన్ అద్భుతం. రంజిత్‌గా అరుణోదయ్ కూడా సూపర్బ్. ఇక కీర్తి కుల్హరి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. సున్నితమైన హాస్యంతో గొప్ప సమస్యను చిత్రీకరించిన తీరు అద్భుతం. మల్టీప్లెక్స్‌ల్లో ఆడుతోంది. తప్పక చూడండి. – శరాది -
‘రంగీలా’ సెకండ్ ఇన్నింగ్స్
యాయిరే...యాయిరే...వారెవా ఇది ఏం జోరే... ఈ సాంగ్ అందరికి గుర్తుంటుంది. అప్పట్లో ఈ పాట ఒక సెన్సేషన్. ఏఆర్ రెహమాన్ బీట్‌కు ఊర్మిళ స్టెప్స్ అదిరిపోయాయి. ఊర్మిళ అనగానే అందరికి మొదట గుర్తొచ్చేది ఈ సాంగే . అంతగా పాపులర్ అయింది ఈ సాంగ్. అయితే ఊర్మిళ సినిమాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. దాదాపు పది సంవత్సరాల తరువాత ఊర్మిళ మళ్లీ తెరపైకి రాబోతోంది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘బ్లాక్మెయిల్’ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో ఊర్మిళ నర్తిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ విడుదల కాబోతోంది. దీంతో ఊర్మిళ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఊర్మిళ మ్యాజిక్ చేస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. అభినయ్ డియో దర్శకత్వం వహించిన బ్లాక్ మెయిల్ సినిమా ఏప్రిల్ 6న విడుదల కాబోతోంది. ఊర్మిళ 2008 వరకు సినిమాలు చేసింది. 2014లో మొహసిన్ అక్తర్ మీర్ ను పెళ్లి చేసుకుని సినిమా కెరీర్ నుంచి విరామం తీసుకుంది. మళ్లీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది రంగీలా బ్యూటీ. ఈ సాంగ్‌పై వర్మ ట్వీట్ చేశాడు. రంగీలా బ్యూటీ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అంటూ ట్వీట్ చేశాడు. Wowwwww👍👍👍 The Rangeela girl is as Rangeeli as ever ..Watch the Forever Green Urmila in https://t.co/p9CKHDRbM8 — Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2018 -
43 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్‌లో..!
రంగీలా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి ఊర్మిళ మతోండ్కర్. నార్త్ తో పాటు సౌత్ లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటి 2008 రిలీజ్ అయిన కర్జ్ సినిమా తరువాత సినీ రంగానికి దూరమైంది. అడపాదడపా టీవీ షోలతో పాటు మరాఠి సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటి, త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే సీనియర్ హీరోయిన్లందరూ తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తుంటే ఊర్మిళ మాత్రం స్పెషల్ సాంగ్ తో రానుంది. 43 ఏళ్ల ఈ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రైతా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. అభినయ్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. -
ఆలస్యమైనా ఆమె పెళ్లిచేసుకోవడం సంతోషం
ముంబై: బాలీవుడ్ వెటరన్, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా.. నటి ఊర్మిలా మతోండ్కర్ కు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అసలు వివాహం చేసుకోకపోవడం కంటే ఆలస్యంగానైనా ఉర్మిల వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉర్మిల (42), కశ్మీరీ వ్యాపారవేత్త, మోడల్ మొహ్సిన్ అఖ్తర్ మిర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఊర్మిల, మొహ్సిన్ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని దేవుడిని కోరుకుంటున్నట్లు శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. ఉర్మిల పెళ్లికి బాలీవుడ్ నుంచి ఆమకు సన్నిహిత ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హొత్రా మాత్రమే హజరయ్యారు. -
30 దాటినా ఇప్పటికీ ఒంటరే....
బెంగాలీ బ్యూటీ రాణి ముఖర్జీ ఎట్టకేలకు 36 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కింది. ఎప్పుడో 30 దాటిన ప్రీతీజింటా, ఊర్మిళా మతోంద్కర్, టబూ వంటి బ్యూటీలు మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్లుగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా, అమృతారావు వయసు కూడా మూడు పదులు దాటిపోయింది. హాలీవుడ్ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ప్రియాంక, హర్మన్ బవేజా, షహీద్ కపూర్‌తో డేటింగ్ చేసినా ఎవరినీ మనువాడలేదు. లేటు వయసులోనూ హాట్‌గా నటించే బిపాసా బసు కూడా డినో మోరియా, జాన్ అబ్రహంతో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. జాన్‌కు 2011లో గుడ్‌బై చెప్పేసింది. తాను మళ్లీ ప్రేమలో పడ్డానంటూ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. అతడు ఎవరో కాదు.. ‘వాట్స్ యువర్ రాశి’ ఫేం హర్మన్ బవేజా! వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కునాల్ ఖేముతో పీకల లోతు ప్రేమలో ఉన్న సోహా అలీఖాన్‌కు 30 ఏళ్లు ఎప్పుడో దాటాయి. పెళ్లి గురించి ఈమె కూడా ఏమీ మాట్లాడడం లేదు. మరో బ్యూటీ నేహా ధూపియా కొన్నాళ్లు రిత్విక్ భట్టాచార్య అనే క్రీడాకారుడితో డేటింగ్ చేసింది. వెనెజులా నటుడు జేమ్స్ సిల్విస్టర్తోనూ చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు వార్తలు వచ్చాయి. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ ఏదో ఉందంటూ కథనాలు వినిపించాయి. నేహ వీటి గురించి ఎప్పుడూ స్పందించలేదు. పెళ్లి గురించి కూడా మాట్లాడలేదు. 32 ఏళ్ల వయసున్న ఉన్న అమృతారావు మొదట పాక్ గాయకుడు ఫర్హాన్ సయీద్‌ను ప్రేమించింది. తరువాత ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌తోనూ సన్నిహితంగా ఉంది. అయితే వీరిలో ఎవరినీ అమృత పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. కహోనా ప్యార్ బ్యూటీ అమిషా పటేల్, మరో బెంగాలీ బ్యూటీ రైమాసేన్ కూడా లేడీ బ్యాచిలర్లే!