vellampally srinivas
-
చంద్రబాబుకి మసాజ్ చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు: వెల్లంపల్లి
-
అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తాం: వెల్లంపల్లి
-
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు. చదవండి: ‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. -
జనసేన కాదు ..గూండా సేన : వెల్లంపల్లి
-
లోకేష్ కు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్
-
దేశభక్తిని పెంపొందించే విధంగా... సాక్షి టీవీ సామాజిక విప్లవం..
-
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
-
చర్చలకు వచ్చిన 48 గంటల్లోనే సమస్య క్లోజ్: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-
మత రాజకీయాలు ఇక్కడ సాగవు
-
రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు
-
పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు
-
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
-
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
అమరావతి: శారదా పీఠంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడే పీఠం అడిగినప్పుడు స్థలం ఇవ్వడంలో తప్పేంటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు ప్రభుత్వాలలో కూడా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కొన్నెళ్ల క్రితం చిన్నజీయర్ సంస్థ కి భూములు కేటాయించాం.. ఇప్పుడు శారదా పీఠంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ కి కూడా ఇస్తున్నామని తెలిపారు. కాగా, చంద్రబాబు హయాంలో మాత్రం.. రాయపాటి, నారా లోకేష్ లకు అప్పనంగా భూములు ఇచ్చారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మం కాపాడే పీఠానికి భూములు ఇస్తుంటే టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి మీడియా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే హిందువులు ఆంధ్రజ్యోతి ని బహిష్కరిస్తారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చదవండి: అమిత్ షాను కలిసిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంద్రకీలాద్రి: నేడు రెండు అవతారలలో దుర్గమ్మ దర్శనం.. ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో నేడు ఐదవరోజు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రెండు అవతారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. పంచమి, షష్టి తిథులు ఏకమవ్వడంతో అమ్మవారికి రెండు అలంకారాలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాలక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. (చదవండి: దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి) తిరుమల: మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్స మండపంలో శ్రీమలయప్పస్వామివారు మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహన సేవ ఉంటుంది. చదవండి: టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్ కల్యాణ్: మంత్రి వెల్లంపల్లి
-
డ్రగ్స్‌పై టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు : వెల్లంపల్లి
-
మహిళలంతా సీఎం వెంటే ఉన్నారు : వెల్లంపల్లి
-
పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి
-
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలోనే తెర
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు ఆయన వెంట ఉన్నారు. కాగా బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారసులతో మంత్రి వేర్వేరుగా మంత్రి చర్చలు కొనసాగిస్తున్నారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలో తెరపడనుందనే సంకేతాలు ఇచ్చారు. వివాదానికి కారణమైన రెండు వర్గాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి రావాలని కోరిన ఆయన త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది. చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి! -
మాన్సాస్ ట్రస్ట్‌పై ఫోరెన్సిక్ ఆడిట్
సాక్షి, విశాఖపట్నం: అక్రమాల పుట్టగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందుకోసం దేవదాయశాఖ కమిషనర్ ప్రత్యేకాధికారిగా నలుగురు జాయింట్ కమిషనర్లతో ఫోరెన్సిక్ ఆడిట్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరునాటికి ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ వ్యవహారాలపై పదేళ్లుగా ఆడిట్ జరగలేదని చెప్పారు. విశాఖ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విశాఖఫట్నం, విజయనగరం జిల్లాల్లో దేవదాయశాఖ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. మాన్సాస్ ట్రస్టు భూముల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోను, అనంతరం మీడియా సమావేశంలోను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఈరోజు దొడ్డిదారిన చైర్మన్ అయిన అశోక్‌గజపతిరాజు పంచగ్రామాల్లో 12 వేల ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌లో విజయం సాధించి అశోక్‌గజపతిరాజును ఆ కుర్చీ నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌కు ఉన్న 14 వేల ఎకరాలకుపైగా భూములను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీకాకుళం సీతారామస్వామి దేవస్థానాల నుంచి సుమారు 6 వేల ఎకరాలను బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగరం సంస్థానానికి చెందిన పీవీజీ రాజుకు లీజుకు ఇచ్చారని తెలిపారు. ఈ లీజు భూములు ఎవరి పేరుమీద ఉన్నాయో, అర్బన్ ల్యాండ్‌సీలింగ్ కింద ఎందుకు ప్రకటించలేదో అశోక్‌గజపతిరాజు చెప్పాలన్నారు. పీవీజీ రాజు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒకరోజు ముందు మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన భూముల్లో కొన్ని మాన్సాస్ ట్రస్ట్‌కు, కుటుంబసభ్యులకు ఇచ్చారని, కొన్ని భూములు ఆయన పేరు మీదే ప్రభుత్వ రికార్డుల్లో ఉంచేశారని చెప్పారు. ఆ భూముల్ని ఎన్వోసీల పేరుతో అమ్ముకుంటూ ఏడుగురు కుటుంబసభ్యులు వాటాలు పంచుకుంటున్నారని తెలిపారు. విజయనగరంలో లెప్రసీ ఇన్స్టిట్యూట్కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాన్సాస్ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని, వీటన్నింటిపైనా విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సింహాచలం భూముల సమస్య త్వరలోనే తీరుతుంది దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం జిల్లాల్లో గ్రామ దేవతల నుంచి పెద్ద ఆలయాల వరకు ఉన్న భూములు, వాటిలో ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయనే వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. సింహాచల భూముల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా ట్రస్టు ఆస్తుల్ని సొంత ఆస్తులుగా అనుభవించడం మంచిపద్ధతి కాదని అశోక్‌గజపతిరాజు తెలుసుకోవాలని సూచించారు. పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్టుకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారంటే.. అశోక్‌గజపతిరాజు ధనదాహాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయాల వరకు మాత్రమే తనకు అధికారాలున్నాయని, విద్యాసంస్థల కార్యకలాపాలను కరెస్పాండెంట్ ద్వారా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
104 కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు బలోపేతం
-
మున్సిపల్ ఎన్నికల సమయంలో బాబు వ్యాఖ్యలు సరికావు
-
వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన కార్యకర్తలు
సాక్షి, విజయవాడ: టీడీపీతో జనసేన లోపాయికారి ఒప్పందం నచ్చకపోవడం వల్లే చాలా మంది ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తమకు జనసేనలో అన్యాయం జరిగిందని ఎవరైనా బయటకు వస్తే వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఫాంహౌజ్‌కే పరిమితం కావడం వల్ల స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకోలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఆయనకు తన పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. విజయవాడలోని 64 డివిజన్లు తామే గెలుస్తామని మంత్రి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు జనసేన కార్యకర్తలు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన అభ్యర్థి హరీష్ కుమార్ సహా ఇతర కార్యకర్తలకు కండువా కప్పి వెల్లంపల్లి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘జనసేన అభ్యర్ధిగా బీ-ఫామ్ ఇచ్చి, గెలుపు కోసం కాకుండా టీడీపీ గెలవాలని స్ధానిక జనసేన నాయకులే సొంతక్యాడర్‌ను ఓడించేందుకు ప్రయత్నించడం బాధాకరం. టీడీపీ- జనసేన ఒప్పందం నచ్చకే ఈ వలసలు. చంద్రబాబుతో పవన్ అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఫాంహౌజ్‌లో ఉండే పవన్.. ఇకనైనా కళ్లు తెరవాలి. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వారు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్నారు. స్ధానికంగా జనసేన-టీడీపీ నేతలు చేసుకున్న ఒప్పందం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వైఎస్సార్ సీపీని ఓడించేందుకు, టీడీపీ జనసేనకు, జనసేన టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలనే దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రజలంతా గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం -
ఇంద్రకీలాద్రి: ఆషాఢ సారె మహోత్సవం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 20 వరకు సారె మహోత్సవం.. వచ్చే నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం
సాక్షి, అమరావతి : శాసన మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని అన్నారు. ఫొటోలు తియోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యల తీరుతో మండలికి వెళ్లాలంటేనే బాధేస్తోందని పేర్కొన్నారు. ( ‘ఆయనకు టీడీపీ క్షమాపణ చెప్పాలి’ ) తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలచేత తిరస్కరించబడిన లోకేష్.. మండలిలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించరాదని అన్నారు. ప్రజలకు మేలు జరగకూడదనే.. ప్రజలకు మేలు జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ ఎమ్మెల్సీలు బిల్లులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుంటున్నారు. మండలిలో అంగబలం ఉంది.. సంగతి చూస్తామంటున్నట్టు టీడీపీ వ్యవహరించింది. మండలి ఛైర్మన్ గతంలో రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఛైర్మన్ స్థానంలో కూర్చుని డిప్యూటీ ఛైర్మన్ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. గన్ మెన్లను తొలగించారంటూ డిప్యూటీ ఛైర్మన్ చైరులో కూర్చొని కామెంట్లు చేయడం సరి కాదు. చైరులో కూర్చున్న డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం టీడీపీ వాళ్లని మా వాళ్లని సంబోధిస్తున్నారు. రూల్ 90 కింద చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడేశారు. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారు. డిమాండ్ల మీద మంత్రులే సమాధానం చెప్పాలి కాబట్టి మండలికి వెళ్లాం. బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి శునకానందం పొందగలరు తప్ప.. లాభం ఏముంటుంది..?. ప్రజల కోసం మేం భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరు. బిల్లు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు శాసనమండలిలో బిల్లులు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు. చంద్రబాబు వ్యవహార శైలి శాసనసభలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉంటుంది. అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. సంఖ్యా బలం ఉందని మాత్రమే మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారు. మండలిలో డిప్యూటీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఛైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి. దొడ్డిదారిన యనమల తెచ్చిన రూల్ 90 నోటీసును చర్చకు అనుమతించారు. యనమల ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణలో అరెస్టైన నేతలు మాకు నీతులు చెప్తున్నారు. వీర సైనికుడు సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు.. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ గొప్ప వ్యక్తి. శాసనసభ కూడా సంతోష్‌కు ఘనంగా నివాళులు అర్పించింది. సంతోష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.