Top Stories
ప్రధాన వార్తలు

తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్‌లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్‌లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్‌లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

కాళేశ్వరం కమిషన్: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆర్కే భవన్లో జరిగిన ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 40 నిమిషాల్లో 19 ప్రశ్నలను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈటలకు వేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన మంత్రి(ఆర్థిక శాఖ)గా పని చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్ ఈ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన వ్యక్తి ఈటల రాజేందర్. తొలుత.. ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్‌తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌లపైనే కమిషన్ ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: కాళేశ్వరం కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల మ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఈటలకేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టాం: ఈటలకేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం: ఈటలమహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం: ఈటలమూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగింది: ఈటలరీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?: కాళేశ్వరం కమిషన్మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు: ఈటలహరీష్ రావు చైర్మన్‌గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం: ఈటలఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది: ఈటలరీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? : కాళేశ్వరం కమిషన్రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది: : ఈటలబ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ డిటైల్స్ మీద మాకు అవగాహన ఉండదు.. అంతా నిపుణులే చూసుకున్నారు: ఈటల నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది?: కాళేశ్వరం కమిషన్తొలుత రూ. 63 వేల కోట్లతో అనుకున్నాం. తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో నాకు తెలియదు: ఈటలబ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?: కాళేశ్వరం కమిషన్ఫైన్సాన్స్ ఖాశాఖకు అన్ని వివరాలు తెలియవు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే తెలిసి ఉంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి: ఈటల ఇలా మొత్తం 19 ప్రశ్నలు వేసింది. ‘‘నేనేం చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. వాళ్లకే అన్నీ తెలుసు’’ అని నాటి ఇరిగేషన్ శాఖను ప్రస్తావిస్తూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలను ఈటల కమిషన్‌కు చూపించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన అధికారులను మాత్రమే ఇప్పటిదాకా విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్(kaleshwaram Commission). ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది. ఈ మేరకు.. ఈటలను తొలుత విచారించింది. మరోవైపు.. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకూ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీన జరగాల్సిన కేసీఆర్ విచారణ ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు.

జమ్మూ కశ్మీర్: చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు.. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జి నిర్మించారు. 1,315 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ శుక్రవారం.. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా, రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు.ఈ క్రమంలో పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే కాట్రా- శ్రీనగర్ మధ్య వందే భారత్ ట్రైన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభంతో కాట్రా-శ్రీనగర్ మధ్య దూరం తగ్గనుంది. కేవలం మూడు గంటలోనే రైలు చేరుకుంటోంది. భారత్‌లో తొలిసారిగా రూపొందించిన కేబుల్ రైల్వే బ్రిడ్జి అంజి బ్రిడ్జిని మోదీ ప్రారంభించనున్నారు. 43,780 కోట్ల రూపాయల వ్యయంతో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు ప్రకటన ప్రధాని మోదీ చేయనున్నారు.సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.350 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న శ్రీమాతా వైష్ణో దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్ట్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.#WATCH | J&K: Prime Minister Narendra Modi inspects Chenab Bridge. He will inaugurate the bridge shortly. Chenab Rail Bridge, situated at a height of 359 meters above the river, is the world's highest railway arch bridge. It is a 1,315-metre-long steel arch bridge engineered to… pic.twitter.com/IMf6tGOZH7— ANI (@ANI) June 6, 2025

దాచటం దేశభక్తిని చాటడమా?
దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్ సిందూర్’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్.) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో ‘బ్లూమ్‌బర్గ్’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. రఫేల్ కూలిందనగానే కలకలంయుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. పైగా, పహల్గామ్ దురంతం, ఆపరేషన్ సిందూర్‌ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్’ మొదలై పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్‌కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్‌కు ఫ్రాన్స్ సరఫరా చేసిన రఫేల్ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్‌లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.అందుకు కారణం మిగ్‌ల కన్నా ఎక్కువగా రఫేల్ విమానాలు కూలి పోవటం! రఫేల్ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం. ‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలుమరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్ దస్సాల్ట్ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్ ఇంటిలిజెన్స్ ధ్రువీకరించింది. ఇంతకూ రఫేల్‌ను కూల్చగలిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్దూ కంపెనీ స్టాక్స్ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్ స్టాక్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అయిన ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్‌లో అయినా జనరల్ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. ‘క్రికెట్ మ్యాచ్‌లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్ చౌహాన్ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

ట్రంప్‌కు చుక్కెదురు.. హార్వర్డ్‌కు ఊరట
బోస్టన్: విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ప్రవేశం నిషేధించిన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విధిస్తూ బోస్టన్(మసాచుసెట్స్) ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్‌కు తాత్కాలిక ఊరట లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిర్ణయం సహేతుకం కాదని న్యాయస్థానంలో హార్వర్డ్ సవాల్ చేసింది. అయితే వాదనలు ఇరు పక్షాల వాదనలు వినడానికి ముందే జడ్జి అలిసన్ బర్రౌస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయం యూనివర్సిటీ ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక నిషేధం విధిస్తునన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16వ తేదీన జరగనుంది.కాగా.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే యూనివర్సిటీలో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జిలో ఉన్న క్యాంపస్‌లో విదేశీ విద్యార్థులను హార్వర్డ్‌లో చేర్చుకోవడం వల్ల జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ముప్పుందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అమెరికాలోనే అతి పురాతనమైన యూనివర్సిటీగా హార్వర్డ్‌కి పేరుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా హార్వర్డ్ మారిందని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 2.2 బిలియన్ డాలర్ల కోత విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఆపై మరో 450 మిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్‌హౌజ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది కూడా. అదే సమయంలో విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్ అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొడుతూ వస్తున్నారు. ఏ రాజకీయ భావజాలంతో యూనివర్సిటీ పని చేయట్లేదని.. విద్యార్థులను ఎంపిక చేయడంలో తాము జాతిని కాకుండా వారి ప్రతిభ, ప్రత్యేక లక్షణాలను చూసి ఎంపిక చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. మరోవైపు.. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ నిర్ణయాలపై హార్వర్డ్ దావా వేసింది.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.(ఇదీ చదవండి: సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్' శుభశ్రీ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)అమెజాన్ ప్రైమ్సింగిల్ - తెలుగు సినిమాసుశీల సుజిత్ - మరాఠీ మూవీబెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ - హిందీ సినిమామట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఅంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీగుల్కండ్ - మరాఠీ సినిమాపారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్స్టార్దేవిక & డానీ - తెలుగు సిరీస్గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమావై 2 కే - ఇంగ్లీష్ మూవీనెట్ఫ్లిక్స్కె.ఓ - ఇంగ్లీష్ సినిమామెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్స్ట్రా - ఇంగ్లీష్ మూవీద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్గోల్డెన్ సిక్స్టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షోజాట్ - తెలుగు సినిమాజీ5ఛల్ కపట్ - హిందీ సిరీస్సన్ నెక్స్ట్లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమాజిగేల్ - తెలుగు మూవీఆహావడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమాలయన్స్ గేట్ ప్లేచౌర్య పాఠం - తెలుగు సినిమాకోడ్ 8 - ఇంగ్లీష్ మూవీహై ఫోర్సెస్ - చైనీస్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్లఫంగే - హిందీ సిరీస్బుక్ మై షోద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్పట్త్ - మలయాళ సినిమా(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ)

‘గారె’ వాసనకు పడిపోయారు!
నోరూరుంచే వంటను చూసినా.. వాసనొచ్చినా మనసాగదు మనకు. ‘‘ఎవరింట్లోనో వంట అద్దిరి పోతోంది గురూ’’ అనుకుంటాం. ఆ ఇద్దరు అమెరికన్లదీ సేమ్ ఫీలింగ్ కానీ ఆ వంటేదో తెలియదు. ఆకలిమీదున్నారో... తెలియని వంటపై ఆసక్తో తెలియదు కానీ.. ఆ వాసన వెంటపడ్డారు.ఓ భారతీయ సంతతి మహిళ ఇంటి తలుపు తట్టారు వారు. ‘‘మీ ఇంట్లోంచి భలే వాసనొస్తోంది. ఎం వండుతున్నారు’’ అని వారు అడగడం... గారెలని ఆ ఇంటావిడ సమాధానం చెప్పడం విశేషం కాదు కానీ... ‘‘ఇంద.. మీరు ఓ రెండు గారెలు తినండి’’ అని కొబ్బరి చట్నీలతోపాటు ప్లేట్లలో వడ్డించడం మాత్రం నెట్టింట వైరల్ అయిపోయింది.పది రోజుల క్రితం అమెరికాలోని మినసోటాలో జరిగిందీ ఘటన. పేవ్మెంట్లను శుభ్రం చేస్తున్న ఇద్దరు అమెరికన్లు భారతీయ వంటకం వాసనకు పడిపోయిన ఈ ఘటనను కంపెనీ స్వయంగా వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేసింది.పది రోజుల్లో సుమారు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి ఈ వైరల్ వీడియోకి.. చూసినొళ్లు కూడా ‘‘ఇదీ భారతీయం అంటే’’ అని, ‘‘అతిథి దేవో భవకు అసలైన నిదర్శనం’’ అని రకరకాల కామెంట్లు చేస్తూ భారతీయ సంసృ్కతిని, ఆతిథ్యాన్ని నోరార కొనియాడటం ఇంకో విశేషం! ఊరకే అన్నారా...‘‘వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి అని!!

ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 5.5 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) జూన్ 04న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్‌లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారీ తిరిగి మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6 శాతం నుంచి తాజాగా 5.5 శాతానికి చేరింది.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దాంతో ప్రపంచ వృద్ధి, వాణిజ్య అంచనాలను సవరిస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం కేంద్ర బ్యాంకులకు సవాలుగా మారుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యోల్బణ అంచనాలను 3.7 శాతానికి తగ్గిస్తున్నాం. గతంలో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసిన 4 శాతం కంటే ఇది తక్కువే. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం. రూ.2.5లక్షల కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నాం. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి రూ.9.5లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చాం. విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరో 11 నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు2026 ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా వృద్ధి ఇలా..క్యూ1-6.5 శాతంక్యూ2-6.7 శాతంక్యూ3-6.6 శాతంక్యూ4-6.3 శాతం

ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..
ప్రస్తుతం ఈ రోజుల్లో ఏ వ్యాపారమైన క్లిక్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో వైఫల్యాల అనంతరం గానీ లాభాల బాటపట్ట లేరు. కానీ కొందరూ పెట్టుబడితో పనిలేకుండా..ప్రస్తుత అవసరాలు, డిమాండ్ వంటి వాటికి అనుగుణంగా..పెట్టుబడితో పని లేకుండా తెలివిగా వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అవుతుంటారు. అలాంటి వ్యక్తే ఈ ఆటోడ్రైవర్. జస్ట్ వినియోగదారుల నమ్మకాన్ని పొందడమే వ్యాపారానికి పెట్టబడిగా చేసుకుని లక్షలార్జిస్తున్నాడు. అతడు ముంబైలోని ఓ సాధారణ ఆటో రిక్షా డ్రైవర్. డ్రైవింగ్ చేయకుండానే లక్షలు గడిస్తున్నారు. యూఎస్ కాన్సులేట్ వెలుపల అతడి వ్యాపారం సాగుతుంది. తన వ్యాపారానికి ఆధారమే ఆ యూఎస్ కాన్సులేట్. ఎందుకంటే అక్కడకు వీసా కోసం చాలమంది వ్యక్తులు వస్తుంటారు. అయితే వారి కూడా లగేజ్‌ని అనుమతించారు. దీన్నే ఈ డ్రైవర్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాడు. వ్యాపారంగా మార్చుకున్నాడు. సుమారు రోజుకి దగ్గర దగ్గర ఓ 20 నుంచి 30 మంది దాక ఈ యూఎస్ కాన్సులేట్ వద్దకు వీసా కోసం వస్తుంటారు. వారు పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వారి లగేజ్‌ని సేఫ్‌గా ఉంచుతాడు ఈ డ్రైవర్. అందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1000లు వసూల్ చేస్తాడట. స్థానిక పోలీసులు భాగస్వామ్యంతో లగేజ్ కోసం లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నాడు అతను. చెప్పాలంటే ఐటీ డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేంజ్లో నెలకు సుమారు రూ. 5 నుంచి రూ. 8 లక్షలు ఈజీగా ఆర్జిస్తున్నాడని లెన్స్‌కార్ట్ ఉత్పత్తిదారుడు లింక్డ్ ఇన్పోస్ట్లో తెలిపారు. తాను వీసా కోసం యూఎస్ కాన్సులెట్ వద్దకు వచ్చినప్పుడే ఈ డ్రైవర్ గురించి తెలిసిందన్నారు. తనను కూడా సెక్యూరిటీ లగేజ్ అనుమతించనని చెప్పినప్పుడు..ఏం చేయాలో తోచక ఫుట్‌పాత్‌పై నిలబడి ఉంటే ఈ ఆటో డ్రైవర్ చేయి ఊపి..లగేజ్ సురక్షితంగా ఉంటుంది. జస్ట్ రూ. 1000 ఛార్జ్ చేస్తే చాలు అని చెప్పినప్పుడూ అతడి వ్యాపారం గురించి తెలిసిందని చెప్పుకొచ్చారు. అతడి వద్ద వ్యాపార నైపుణ్యం, సాంకేతిక, నిధులు లేకపోయినా.. జస్ట్ నమ్మకంతో కస్టమర్లకు భద్రత అందించి ప్రీమియం వసూలు చేస్తూ..వ్యాపారం చేస్తున్నాడు. సమయస్ఫూర్తితో చేస్తున్న అతడి వ్యాపారదక్షతను పోస్ట్‌లో ప్రశంసించారు రూపానీ. ప్రస్తుం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అవసరాలకు, డిమాండ్‌కు అనుగుణమైన వ్యాపారం ఆటోమేటిగ్గా క్లిక్ అవుతుందని ఈ ఆటో డ్రైవర్ ప్రూవ్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం అంతలా డబ్బులు ఛార్జ్ చేస్తున్నా.. పోలీసులతో కలిసి షేర్ చేసుకోవాల్సిందేగా అని ఒకరు, కాన్సులేట్ లోపల లాకర్ సౌకర్యం ఉందని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. గమనిక: ఇది వాస్తవమేనా అనేది తెలియాల్సి ఉంది. ఎన్డీటీవి ఇంగ్లీష్ ఆర్టికల్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. (చదవండి: డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్‌గా నం.1 స్థానం..)

కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు శుబ్‌మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్‌లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు
పాక్‌కు మరోసారి ప్రధాని మోదీ గట్టి వార్నింగ్
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
హరిహర వీరమల్లు విడుదల లేనట్లే.. ప్రకటించిన నిర్మాత
ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు
నా నిర్ణయంతో మా నాన్న చాలా ఫీలయ్యారు: రోహిత్ శర్మ
రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
ఆర్బీఐ ఒక్క నిర్ణయం.. హోమ్‌లోన్ ఈఎంఐ తగ్గింపు
ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
చదువు పేరుతో సహజీవనం..!
బతికి ఉన్నంత వరకు అలా మాట్లాడను'.. నటుడు రాజేంద్రప్రసాద్
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
మనది నేషనల్ లెవల్ సార్! వెన్నుపోటులో మనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
దాచటం దేశభక్తిని చాటడమా?
మా పేరేంట్స్‌కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్‌స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
పాక్‌కు మరోసారి ప్రధాని మోదీ గట్టి వార్నింగ్
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
హరిహర వీరమల్లు విడుదల లేనట్లే.. ప్రకటించిన నిర్మాత
ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు
నా నిర్ణయంతో మా నాన్న చాలా ఫీలయ్యారు: రోహిత్ శర్మ
రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
ఆర్బీఐ ఒక్క నిర్ణయం.. హోమ్‌లోన్ ఈఎంఐ తగ్గింపు
ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
చదువు పేరుతో సహజీవనం..!
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
మనది నేషనల్ లెవల్ సార్! వెన్నుపోటులో మనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
దాచటం దేశభక్తిని చాటడమా?
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
మా పేరేంట్స్‌కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్‌స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
ఖైదీలు పరారయ్యారని చెప్పా!..భూకంపం వచ్చినట్లు ఫీలయ్యారు!
ఇది వరకు మూడు నాలుగు రోజులు తీసుకునేవాళ్లం... ఇప్పుడు ఓ పదిరోజులు తీసుకుందామా సార్!!
సినిమా

కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనిపించబోవని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా టాలీవుడ్లో నెలకొన్న సంక్షోభం గురించి ఓ ట్వీట్ చేశాడు.ఈ ట్రెండ్ కొనసాగితే..ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజీ సిస్టం గురించి మాట్లాడుకునేబదులు... ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలా? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి? అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.పెద్ద హీరోలు ఆలోచించాలిఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో సినిమా, మూడేండ్లకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింగిల్ స్క్రీన్స్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అని రాసుకొచ్చాడు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025 చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' ... చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా.. మరో హీరోయిన్గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన 'మసాలా' మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్‌గా ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే?మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్‌కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్' శుభశ్రీ)గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం.. రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది.మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్ పన్ నెక్స్ట్ లెవల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్‌గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో నీలిరంగు ముసుగుల వెనక ఓ గ్యాంగ్ అందర్నీ నవ్వించేందుకు రెడీగా ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్లో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఉండటం విశేషం.హాలీవుడ్ హీరోతో పనిచేసిన సెన్సేషనల్ బ్యూటీసోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మ్యాడ్నెస్ మొదలైందిఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు శుబ్‌మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్‌లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు

తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విచారణలో బెంగళూరు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మెరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెనెజ్మెంట్పై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను శుక్రవారం అరెస్టు చేశారు.ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్‌పై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. కాగా బుధవారం (జూన్ 4) జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.ఇక ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాలని సిద్దరామయ్య సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, డీసీపీ శేఖర్, ఇన్స్పెక్టర్ గిరీశ్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు

IND Vs ENG: ఇంగ్లండ్‌కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది. జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్‌కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.కాగా ఈ సిరీస్‌కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్‌కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్‌లో దుమ్ములేపుతున్నాడు.తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్‌లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్‌ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి.ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ మొదలవుతుంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్ బౌలర్ అండర్సన్ 188 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా, భారత్‌లో జరిగే సిరీస్‌ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్ జరిగినా దాన్ని ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లను ఇదే మాదిరిగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
బిజినెస్

ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 5.5 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) జూన్ 04న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్‌లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారీ తిరిగి మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6 శాతం నుంచి తాజాగా 5.5 శాతానికి చేరింది.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దాంతో ప్రపంచ వృద్ధి, వాణిజ్య అంచనాలను సవరిస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం కేంద్ర బ్యాంకులకు సవాలుగా మారుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యోల్బణ అంచనాలను 3.7 శాతానికి తగ్గిస్తున్నాం. గతంలో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసిన 4 శాతం కంటే ఇది తక్కువే. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం. రూ.2.5లక్షల కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నాం. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి రూ.9.5లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చాం. విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరో 11 నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు2026 ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా వృద్ధి ఇలా..క్యూ1-6.5 శాతంక్యూ2-6.7 శాతంక్యూ3-6.6 శాతంక్యూ4-6.3 శాతం

అందరిచూపు ఆర్బీఐ వైపు.. ఫ్లాట్‌గా మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 21 పాయింట్లు నష్టపోయి 24,727కు చేరింది. సెన్సెక్స్(Sensex) 158 ప్లాయింట్లు దిగజారి 81,293 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.53 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.83 శాతం దిగజారింది.ఈ రోజు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో నిన్న మార్కెట్లు పుంజుకున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈసారి రెపో రేటులో ఆర్బీఐ కోత విధిస్తే ఇది వరుసగా మూడోసారి అవుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీరేట్లును తగ్గించారు. తర్వాత ఏప్రిల్‌లోనూ కుదించారు. డిసెంబర్లో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వడ్డీరేట్లును తగ్గిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది. ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలే ఇలా టెస్లా షేరు విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన షేరు ధర ఇద్దరి మధ్య వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వస్తున్న వరుస కథనాలకు భారీగా కుప్పకూలుతోంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి 916 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది.ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం..ఇటీవల బహిరంగంగా మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.ఈవీ క్రెడిట్లు లేకపోవడంపై అసంతృప్తిఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలాన్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. ఇకపై కలిసి పని చేస్తామో లేదో తెలియదు. (ఇటీవల డోజ్ నుంచి మస్క్ వైదొలిగారు) ట్రంప్ ఇటీవలి చర్యలకు నేను ఆశ్చర్యపోయాను’ అంటూ కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రెడిట్లు లేకపోవడంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంభవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్లుట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా మస్క్ వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, డెమ్స్ సభను నియంత్రించేవారని, సెనేట్‌లో రిపబ్లికన్లు 51-49తో గెలిచేవారని పేర్కొన్నారు. మస్క్ ఇటీవల బలమైన రాజకీయ వైఖరిని తీసుకున్నారు. కొత్త బడ్జెట్ బిల్లు అసహ్యంగా ఉందని, దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

భారత్‌లో ఓపెన్ఏఐ అకాడమీ
న్యూఢిల్లీ: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ, కేంద్ర ఐటీ శాఖలో భాగమైన ఇండియాఏఐ మిషన్ కలిసి భారత్‌లో ఓపెన్ఏఐ అకాడమీని ప్రారంభించాయి. ఇందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న డెవలపర్ల కమ్యూనిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు.. ఆవిష్కర్తల నెట్‌వర్క్‌కు ఏఐపరంగా కావాల్సిన విద్యావనరులు, సాధనాలు దీనితో అందుబాటులోకి వస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది. విద్య, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ఇది కీలక ముందడుగని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అకాడమీ లో డిజిటల్, ఇన్–పర్సన్ లెరి్నంగ్ విధానంలో ఇంగ్లీష్, హిందీలో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా జోడించనున్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సివిల్ సర్వెంట్లు, చిన్న స్థాయి వ్యాపారవర్గాలు మొదలైన వారందరికీ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇండియాఏఐ మిషన్ ఆమోదించిన 50 ఫెలోస్/స్టార్టప్‌లకు 1,00,000 డాలర్ల వరకు విలువ చేసే ఏపీఐ క్రెడిట్స్ లభిస్తాయి.
ఫ్యామిలీ

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..!
ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. గానీ కొన్ని గమ్మత్తైన విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎలా తెలుసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్నింటి గురించి తెలుసుకుందామా..!ఇరవైనాలుగు ఏళ్ల వయసులో రోమ్ సామ్రాజ్య పాలకుడైన కలిగ్యులా తన గుర్రానికి సెనెటర్ హోదా ఇచ్చాడు.అబ్రహం లింకన్ టాప్ హ్యాట్ ఫేమస్. ఫ్యాషన్ యాక్సెసరీగా మాత్రమే కాదు... వేరే రకంగా కూడా టాప్ హ్యాట్‌ను వినియోగించేవారట లింకన్.. ముఖ్యమైన నోట్స్, పేపర్లను టాప్ హ్యాట్లో స్టోర్ చేసేవారట.ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం... జెబ్లాక్బర్డ్ వయోలిన్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏమిటంటే... ఈ వాయిద్య పరికరాన్ని కలప నుంచి కాకుండా రాయితో తయారుచేస్తారు.‘ది మ్యాట్రిక్స్’ సినిమాలోని ‘గ్రీన్ కోడ్’కు మూలం... జపనీస్ సుషి కుక్ బుక్.ప్రపంచంలోనే అతి పెద్ద టీ–షర్ట్‌ను ప్లాస్టిండియా ఫౌండేషన్ తయారుచేసింది. రీసైకిల్ చేసిన 2,100,000 ప్లాస్టిక్ బాటిల్స్‌తో దీన్ని తయారుచేశారు. ఈ టీ–షర్ట్ పొడవు 96.86 మీటర్లు.‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంగ్’ పుస్తకం 1558లో విడుదలైంది. ఇప్పటికీ ప్రింట్లో ఉంది. ఈ పుస్తకం రాసిన లూయిజీ కార్నరో వంద సంవత్సరాలు బతికాడు.

శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...తొమ్మిది సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది మహిరమ. పదో ఏట స్నేహితులతో కలిసి చిన్న కథ రాసింది. ఆ తరువాత దీనినే నవలగా రాయాలనుకుంది. నవలగా పూర్తిరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. 500 పేజీల ఈ నవల పేరు...రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్.సంగీతంలోనూ మహీరమ రాణిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఫోర్త్ గ్రేడ్‌లో శిక్షణ తీసుకుంటోంది. హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఫ్రెంచి కూడా నేర్చుకుంటోంది. హైదరాబాద్‌లో 9వ తరగతి చదువుతున్న చల్లా మహిరమ ‘రూబీ బ్లూస్ట్రీమ్ అండ్ ద స్కీమ్ ఆఫ్ టైమ్’ పేరుతో మరో పుస్తకానికి శ్రీకారం చుట్టింది.అందరూ చదివేలా...నేను రాసిన ఫాంటసీ నవల ‘రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్’ పిల్లలే కాదు అన్ని వయసుల వారూ చదివేలా రాశాను. ఫాంటసీ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రకృతితో ముడిపడి ఉన్న అంశాల ఆధారంగా నవల రాశాను. భూమి, నీరు, గాలి, అగ్ని...వీటితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉంటుందనే విషయం చుట్టూ నవల సాగుతుంది. – చల్లా మహిరమ (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..)

చిత్ర యాత్ర
తల్లిగా, చెల్లిగా, కూతురుగా... పలు రూ పాల్లో లోకాన్ని ముందుకు నడిపించే శక్తి స్త్రీ మూర్తి. ఆ శక్తి స్వరూ పాన్ని తన ఛాయాచిత్రాల్లో ఆవిష్కరించడానికి పన్నేండేళ్ల కాలాన్ని అంకితం చేస్తూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు భరద్వాజ్ దయాల. 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించాలనేది ఆయన లక్ష్యం....సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన భరద్వాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో మూవీ గ్రాఫిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ‘జీవితం చాలా చిన్నది. ఉన్న సమయంలోనే ప్రపంచాన్ని చూసెయ్యాలి. వీలైనంత మందితో మాట్లాడాలి’ అనేది భరద్వాజ్ లక్ష్యం. ఇందులో భాగంగా మహిళామణుల చిత్రాల ఆల్బమ్ రూపకల్పనకు సంకల్పించారు. ఈ డాక్యుమెంటరీలో మిలియ న్ అమేజింగ్ ఉమె న్ (10లక్షల మంది అసాధారణ మహిళలు)కు చోటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించే పనికి శ్రీకారం చుట్టారు.ఒంటరిగా... కెమెరా ఆయుధంగాప్రపంచంలోని మిలియ న్ (10లక్షల) మహిళామణుల ముఖకవళికలపై డాక్యుమెంటరీ తీయడానికి భరద్వాజ్ 100 మిల్లీమీటర్లు, 2.8 లెన్స్ గల కెమెరాను భుజాన వేసుకొని లక్ష్యం దిశగా ముందుకు కదులుతున్నారు. 55 ఏళ్ల భరద్వాజ ఒంటరిగానే, ఎవరి సాయం లేకుండా ప్రపంచయాత్ర చేస్తున్నారు. ఒక కారును తన ప్రయాణానికి అనుగుణంగా మార్చుకున్నారు. ఏడు ఖండాలు తిరిగి. 12 ఏళ్లలోగా అంటే 2037 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తన లక్ష్యం.మహిళా దినోత్సవం రోజు శ్రీకారంప్రస్తుతం భరద్వాజ్ చేపడుతున్న మిలియన్ అమేజింగ్ మహిళ చిత్రసేకరణ ప్రాజెక్టు యాత్ర రెండోది. దీన్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించారు. మిలియన్ అమేజింగ్ మహిళా ఫొటోల సేకరణలో గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 500 మంది మహిళల చిత్రాలను కెమెరాల్లో బంధించారు. ఆల్బమ్‌లో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మహిళల వరకు ఉన్నారు.రాజమాతతో ప్రారంభం...గుజరాత్ రాష్ట్రం వడోదరలోని రాజవంశానికి చెందిన రాజమాత శుభాంగిణిరాజే చిత్రంతో ఈ మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ప్రాజెక్టు ప్రారంభమైంది. రాజమాత జీవితానికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రాన్ని తీశారు. రెస్టారెంట్ నడుపుతూ, నెలకు 8 లక్షల రూ పాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న గిరిజన మహిళతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గృహిణులు, విద్యార్థినులకు చోటు కల్పించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో భరద్వాజ్ పర్యటన సాగుతోంది.అమ్మకు ప్రేమతో...మా అమ్మకు ఐదుగురు సంతానం. మా అందరినీ పెంచి పెద్ద చేయడంలో ఆమె చూపిన కృషి అనిర్వచనీయం. అందుకే అమ్మకు ప్రేమతో ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఆ ఆలోచనలో భాగమే మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ఆల్బమ్. ప్రస్తుతం నా ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చునంతా నేనే భరిస్తున్నాను. నా కంపెనీ తరపున ఆ న్ లై న్ లో జాబ్ చేస్తూ వచ్చిన వేతనంతో టూర్‌ను కొనసాగిస్తున్నాను. – భరద్వాజ్ దయాల – కరుకోల తిరుమలరావు, సాక్షి, విజయవాడ

మేకప్ ప్రొడక్ట్స్‌తో బికేర్‌ఫుల్..! పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ..
మేకప్ వేసుకోవడం అంటే చాలామంది అతివలకు ఇష్టం. అదీగాక యూట్యూబ్‌ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో సౌందర్య సాధనాలతో చేసేపనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్‌లు సైతం మేకప్ ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెట్టేస్తారు. అలానే ఇక్కడొక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నిర్లక్ష్య ధోరణితో చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. వివరాల్లోకెళ్తే..సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే ఈ తైవాన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేకప్ ముక్‌బాంగ్‌కు ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్‌కి సంబంధించిన వీడియోలతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సింపుల్ చిట్కాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడం తోపాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్ టేస్ట్ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గరి నుంచి లిప్‌స్టిక్ వరకు అన్ని టేస్ట్ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ . సోషల్ మీడియా స్టార్డమ్ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్డమ్ సంపాదించుకుంది గానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్ ఉత్పత్తులను టేస్ట్ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించడం గమనార్హం. నిపుణుల వార్నింగ్..దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్ ప్రొడక్ట్స్‌లో వాడే కెమికల్స్ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. అంతేగాదు మేకప్ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. అలాగే మేకప్‌తో అలానే అస్సలు పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు. View this post on Instagram A post shared by 芭樂水水 (@guava_beauty_) (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..)
ఫొటోలు
అంతర్జాతీయం

అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్!
సాక్షి, హైదరాబాద్: ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’’ ఎన్నికల సందర్భంగా ట్రంప్ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి.. అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తూండగా.. కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటునానయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనా విషయంలోనైతే ఏకంగా 155 శాతం పన్నులకు సిద్ధపడ్డాడు కూడా. పన్నుల విషయంలో భారతీయులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ హెచ్1-బీ వీసాలపై నిబంధనలు, గ్రీన్‌కార్డులున్నా హద్దుమీరితే పంపేస్తామన్న హెచ్చరికలు, స్వదేశానికి పంపే డబ్బులపై ఐదు శాతం వరకూ పన్నులు వంటి చర్యలు భారతీయులు, భారతీయ సంతతి అమెరికన్లకు ఇబ్బందికరంగానే మారాయి. అయితే ఈ వైఖరి ట్రంప్‌కు... అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.టూరిజం విషయాన్ని చూద్దాం... ట్రంప్ అధ్యక్షుడు కాకమునుపు అంటే 2024లో అమెరికా సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్శించింది. రవాణా, షాపింగ్, ఆహార పానీయాల వంటి వాటికి వీరు ఖర్చు పెట్టిన మొత్తం ఎకాఎకి 155 బిలియన్ డాలర్లు. హోటళ్లు, దుకాణాలు కళకళలాడుతూండేవి. కానీ.. అధ్యక్షడైన తరువాత ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు, చేస్తున్న ప్రకటనల పుణ్యమా అని ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.మార్చి నాటికి ఈ తగ్గుదల 14 శాతం వరకూ ఉందని అంచనా. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పొరుగున ఉన్న కెనెడా నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఐదో వంతు పడిపోయిందట. ఫలితంగా ఇప్పటివరకూ పర్యాటకులు పెట్టే ఖర్చు 900 కోట్ల డాలర్ల వరకూ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రభావం కాస్తా హోటళ్లు, దుకాణాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.వెనకడుగు వేస్తున్న కంపెనీలు..అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్‌ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో తాము ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించగా... వైద్య పరికరాల తయారీ సంస్థ బెల్లూస్కూరా కూడా దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.బ్రిటన్ బొమ్మల కంపెనీ క్యారెక్టర్ గ్రూప్, మద్యం తయారీ దిగ్గజం డియాగోలు కూడా మెక్సికో, కెనెడాలపై అమెరికా విధించిన పన్నుల నేపథ్యంలో తమ వ్యాపారల ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. ఫలితంగా ఒక్క డియాగో సంస్థకు 200 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.భారత్‌లో తయారీ చేపడితే భారీ సుంకాలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఐఫోన్ సీఈవో టిమ్ కుక్ పట్టించుకోని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అమెరికాలో వినియోగించే ఐఫోన్లో అత్యధికం భారత్‌లోనే తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా అమెరికాలో బాగా పాపులర్ అయిన ట్రాక్టర్ తయారీ సంస్థ ‘జాన్ డీర్’ కూడా టారిఫ్‌ల హెచ్చరికలను తోసిరాజంటూ... తయారీ రంగాన్ని కెనెడాకు తరలించే ఆలోచనలో ఉంది. ఏతావాతా... ట్రంప్ ధోరణి కాస్తా అమెరికాకు చేటు చేసేట్టే కనిపిస్తోంది!- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

ఎంపీ మహువా మొయిత్రా రహస్య వివాహం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) మరోమారు వార్తల్లో నిలిచారు. ఆమె మే మూడవ తేదీన రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీగానీ, మహువా మొయిత్రా గానీ వెల్లడించలేదు. ఈ విషయమై మీడియా ప్రముఖ టీఎంసీ ఎంపీని అడుగగా, ఆయన తనకు తెలియదని చెప్పారు. The other Operation Sindoor: Trinamool MP @MahuaMoitra marries in quiet wedding in Germany https://t.co/AALx1OgY5Y pic.twitter.com/Yugc1cWsfV— The Telegraph (@ttindia) June 5, 2025అయితే వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ ప్రచురించిన ఫోటోలో మహువా మొయిత్రా బంగారు రంగు చీరలో మెరిసిపోతూ, భర్త పక్కన కనిపించారు. వారి వివాహం జర్మనీలో జరిగినట్టు తెలుస్తోంది. మహువా మొయిత్రా భర్త పేరు పినాకి మిశ్రా. ఆయన బిజు జనతాదళ్‌కు చెందిన నేత. పూరీ లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు. 50 ఏళ్ల మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో దాదాపు మూడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే.. మహువా డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నైతిక విలువల కమిటీ తేల్చిచెప్పింది. ఆ దరిమిలా మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇది 2023 డిసెంబర్లో జరిగింది. ఇది కూడా చదవండి: అన్నివైపుల నుంచి తోపులాట.. ప్రత్యక్ష సాక్షులు

‘తలపై గురిపెట్టేవారితో మాట్లాడేదే లేదు’: ఎంపీ శశి థరూర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తీరుపై ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) మండిపడ్డారు. ఉగ్రవాద బెదిరింపులు కొనసాగుతున్నంత కాలం పాకిస్తాన్‌తో భారత్ మాట్లాడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్షానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. తమ ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తూ, పాక్ తీరును ఎండగడుతున్నదన్నారు.వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ‘మా తలపై తుపాకీ గురిపెట్టేవారితో చర్చలు జరిపేదేలేదని’ ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని అమెరికాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ఎదుట స్పష్టం చేసినట్లు థరూర్ పేర్కొన్నారు. భారత్-పాక్ చర్చలను ప్రోత్సహించడంలో అమెరికా ప్రమేయంపై ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ విషయంలో భారత వైఖరిని అమెరికా అర్థం చేసుకున్నదన్నారు. భారత్ సూత్రప్రాయంగా సంభాషణకు సిద్ధంగా ఉందని, అయితే అది బలవంతంగా ఎప్పటికీ జరగదని ఆయన అన్నారు.వాణిజ్యాన్ని సాకుగా చూపిస్తూ, భారత్-పాక్ యుద్ధాన్ని నియంత్రించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) చేసిన వాదనను కాంగ్రెస్ ఎంపీ తిరస్కరించారు. తనకు అలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లకు వచ్చిన పోన్ కాల్స్ చూపిస్తూ, ఆ సంభాషణల్లో ఎప్పుడూ వాణిజ్యాన్ని ప్రస్తావించనే లేదని ఆయన అని పేర్కొన్నారు. భారతదేశానికి ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదని, వారు ఆగిపోతే, మేము ఆగిపోతామని, తాము ఆత్మరక్షణ దిశగా వ్యవహరించామని థరూర్ పేర్కొన్నారు.భారత్‌కు చెందిన కొందరు ఎంపీలు, అమెరికాలోని మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో కూడిన భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన దరిమిలా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి భాగస్వామ్య దేశాలకు వివరించడమే లక్ష్యంగా అఖిలపక్ష సభ్యుల పర్యటన సాగుతోంది. ఈ బృందంలో థరూర్‌తో పాటు, బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి ఉన్నారు. అలాగే శివసేన నుంచి మిలింద్ దేవరా, మల్లికార్జున్ దేవరా, శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా),జీఎం హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ) ఉన్నారు.ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట: మృతులంతా 40 ఏళ్లలోపు వారే..

జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్
బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్‌లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్‌లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్‌లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50శాతం మేరకు బుకింగ్‌ల తగ్గుదల ఉందని హాంకాంగ్‌లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.చెప్పినవి చెప్పినట్లే జరిగాయి1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్ జపాన్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’
జాతీయం

శర్మిష్ఠ పనోలీకి హైకోర్టు బెయిల్
కోల్‌కతా: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలీ(22)కి కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మతపరమైన కామెంట్లు చేసినట్లు నమోదైన ఫిర్యాదు మేరకు కలకత్తా పోలీసులు గతవారం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉండగా అరెస్ట్ చేశారు. లా స్టూడెంట్ అయిన శర్మిష్ట ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్‌లోని ఓ వర్గం నటులు మౌనంగా ఉన్నారంటూ మే 7న చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఆన్లైన్లో వైరలయ్యింది. తీవ్రమైన కామెంట్లు రావడంతో మరునాడే మే 8న వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పింది. బెదిరింపులు రావడంతో కుటుంబంతో సహా వేరే చోటుకు మకాం మార్చింది. అయినప్పటికీ, ఆమె తన వీడియో ద్వారా మత విద్వేషాలను ప్రేరేపించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. దీంతో మే 30వ తేదీన గురుగ్రామ్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు కోల్‌కతాకు తరలించారు. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్థనపై జస్టిస్ రాజా బసు చౌదరి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు వింది. గురువారం తీర్పు విడుదల చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని, కేసు విచారణలో అధికారులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. అదేవిధంగా, పనోలీకి తగు భద్రత కల్పించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.

స్వయం సమృద్ధ భారతే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్వయం సమృద్ధ, సమీకృత భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ప్రతి పౌరుడికీ లభించాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ కాలం ఈ నెల 9వ తేదీ నాటికి 11 ఏళ్లు పూర్తి కానుంది. మూడో టర్మ్‌లో తొలి ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల్ యోజన, జన్‌ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో ప్రజలకు పక్కా నివాస గృహాలు, వంట గ్యాస్, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)తో చివరి లబ్ధిదారుడికి సైతం మేలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. గత 11 ఏళ్లలో మా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేస్తాం. నేరుగా వారి వద్దకే వెళ్తాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మన భూగోళాన్ని కాపాడుకుందాం... మనం నివసిస్తున్న ఈ భూగోళాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. భూమిని రక్షించుకొనే విషయంలో అన్ని రకాల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ దేశాలన్నీ స్వప్రయోజనాలు పక్కనపెట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కలపాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదమని గుర్తుచేశారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ కోసం తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ క్రమంగా పెరుగుతోందని, లక్షలాది మంది నిత్య జీవితంలో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ విధానం పాటిస్తున్నారని చెప్పారు. సిందూర్ మొక్క నాటిన ప్రధాని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో సిందూర్ మొక్క నాటారు. బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడానికి 1971లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళలు ఆయనకు ఈ మొక్క బహూకరించారు. ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా మోదీ సిందూర్ మొక్కను స్వహస్తాలతో నాటారు. సిందూర్ మొక్క మన దేశ మహిళల శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సిందూర్ మొక్క నాటే గొప్ప అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల గుజరాత్‌లోని కచ్‌లో పర్యటించినప్పుడు మహిళలు తనకు ఈ మొక్కను బహూకరించారని, 1971లో పాకిస్తాన్‌పై భారత్ సాగించిన యుద్ధంలో వారంతా అసాధారణ పరాక్రమం, దేశభక్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. సిందూర్ మొక్క నాటిన వీడియోలు, ఫొటోలను మోదీ షేర్ చేశారు.

ఈశాన్యాన భగభగలు
ఈశాన్య భారతంలో పచ్చదనానికి మారుపేరైన అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో అటవీ విస్తీర్ణం శరవేగంగా తగ్గిపోతోంది. కార్చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేయకపోవడం, విచ్చలవిడి పోడు వ్యవసాయం, గంజాయి వంటివాటి అక్రమ సాగు, రోడ్లు, రైల్వే తదితర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ తదితరాలు ఇందుకు కారణమని ప్రముఖ భూ పరిశీలన, విశ్లేషణ సంస్థ సుహోరా టెక్నాలజీస్ అధ్యయనం వెల్లడించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి గత నాలుగేళ్ల ఉపగ్రహ డేటాను లోతుగా విశ్లేíÙంచిన మీదట ప్రమాదకర అంశాలు వెలుగులోకి వచి్చనట్టు తెలిపింది. ముఖ్యంగా దట్టమైన అడవుల లోపలి, మారుమూల ప్రాంతాల్లో రేగే కార్చిచ్చులు పెను నష్టానికి కారణమవుతున్నాయి. అరుణాచల్‌లోని నందిపార్ ప్రాంతంలో గత ఏప్రిల్ 24న రేగిన భారీ కార్చిచ్చు భారీ నష్టం మిగిల్చింది. ఒక్క రోజులోనే ఏకంగా 10 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం బుగ్గిగా మారింది. ప్లానెట్స్కోప్ ఉపగ్రహ చిత్రాల సాయంతో జరిపిన విశ్లేషణ ద్వారా సుహోరా ఈ మేరకు వెల్లడించింది. ఇలాంటి కార్చిచ్చులను ఉపగ్రహ డేటా సాయంతో ఆదిలోనే గుర్తించి అదుపు చేయవచ్చని పేర్కొంది. ఇక జీవవైవిధ్యానికి మారుపేరైన మణిపూర్‌లో 2001 నుంచే అటవీ విస్తీర్ణంలో భారీ తగ్గుదల నమోదవుతూ వస్తోంది! రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 21,100 హెక్టార్ల అటవీ భూమి మాయమైనట్టు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ పేర్కొంది. ఇందులో ఏకంగా 17,800 హెక్టార్ల అటవీ భూమిని ఒక్క 2024లోనే కోల్పోయిందని వెల్లడించింది. ఫలితంగా 91 కోట్ల మెట్రిక్ టన్నుల అదనపు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనట్టు పేర్కొంది. కార్చిచ్చుకు తోడు పోడు, గంజాయి వంటివాటి అక్రమ సాగు, జనం వంట చెరుకుపై ఆధారపడుతుండటం, రోడ్లు, రైల్వే వంటి మౌలిక ప్రాజెక్టులు ఇందుకు కారణమని అధ్యయనం తేల్చింది. పచ్చదనపు తొడుగు లేకపోవడంలో కొన్నేళ్లుగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరగడమే గాక వర్షపాత ధోరణులు కూడా బాగా మారిపోయినట్టు వివరించింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఈశాన్య భారతంలో పెను పర్యావరణ సంక్షోభం తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్

కర్ణాటకకు చెడ్డపేరు వచ్చింది
బనశంకరి: ‘వందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు.ఆర్సీబీ జట్టు బెంగళూరుకు వస్తుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదని, భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు, యువత చేరడంతో పరిస్థితి అదుపుతప్పిందని ఆయన తెలిపారు. ‘ఓ బాలుని శవానికి పోస్టుమార్టం చేయరాదని తల్లిదండ్రులు వేడుకున్నారు. కానీ ఇందుకు చట్టం ఒప్పుకోదు’అని చెప్పారు. బీజేపీ నేతల ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, బీజేపీ, జేడీఎస్ నాయకులు శవాలపై రాజకీయం చేస్తారని డీకే ఆరోపించారు. తొక్కిసలాటకు డీకే బాధ్యుడని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి విమర్శించారని చెప్పగా, ఆయనకు తరువాత సమాధానం ఇస్తానని తెలిపారు.
ఎన్ఆర్ఐ

పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్‌ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్‌కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్‌స్ట్రీట్‌లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్‌స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్‌స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్‌లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్‌స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్‌లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్‌లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్‌లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్‌కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్‌కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్‌కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు.

మావోయిస్టు సుధాకర్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చర్ల: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విప్లవ రాజకీయ పాఠశాల ఇన్చార్జ్ తెంటు లక్ష్మీ నరసింహాచలం (67) మరణించాడు. ఆయనకు గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి అలియాస్ రామరాజు అలియాస్ బాలకృష్ణ అలియాస్ అరవింద్ అనే పేర్లు కూడా ఉన్నాయి.సుధాకర్ పేరుతో పార్టీలో ఆయన సుప్రసిద్ధుడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించి నెల తిరక్కముందే మరో కీలక నేతను కోల్పోవటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయ్యింది. కీలక నేతలున్నారన్న సమాచారంతో..: ఇంద్రావతి అటవీ ప్రాంతంలో సుధాకర్‌తోపాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, మరికొంతమంది కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసు బలగాలు బుధవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని, అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా సుధాకర్ మృతదేహం లభించిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47 తుపాకీ, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. సుధాకర్‌పై రూ.40 లక్షల రివార్డు ఉంది. శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నక్సలైట్లతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ తండ్రి రామకృష్ణుడు, తల్లి సరస్వతి. వీరికి సుధాకర్ 6వ సంతానం. సత్యవోలులో సుధాకర్ సోదరుడు తెంటు ఆనందరావు నివసిస్తున్నారు. సుధాకర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన చింతలపూడి మండలం ప్రగడవరంలో 10వ తరగతి, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 1972లో చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. చివరిసారిగా 1983లో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడ్డానికి వచ్చి నపుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో 2013లో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించాడు. సుధాకర్ 43 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. 2024–25 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 403 మంది మావోయిస్టులు మృతి చెందారని సుందర్రాజ్ వెల్లడించారు.

రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గులం సుల్తాన్ అహ్మద్‌ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు గంజాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..!
మంచిర్యాలక్రైం: మరొక్క రోజు గడిస్తే కొడుకు కాలేజీకి వెళ్తాడని తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. పదో తరగతి పూర్తి చేసిన తనయుడిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించేందుకు ఫీజు కూడా చెల్లించారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఏసీసీ క్వారీకి వెళ్లిన విద్యార్థి.. స్నానానికి క్వారీలోకి దిగి మృత్యువాత పడ్డాడు. కాలేజీకి వెళ్తాడనుకుంటే కనిపించకుండా పోయాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారికి కలిచివేసింది. ఈ సంఘటన మంచిర్యాల పోలీసుస్టేషన్ పరిధిలోని ఏసీసీ క్వారీ వద్ద చోటు చేసుకుంది.ఎస్సై తిరుపతి, విద్యార్థి కుటుంబ సంభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని జాఫర్‌నగర్‌లో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి సాదుల ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లావణ్య కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు హర్షిత్ (15), ధనుష్ ఉన్నారు. çహర్షిత్‌ను హైదరాబాద్‌లోని పాఠశాలలో చదివించారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా ఇంటర్ కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. ఈ నెల 5న కాలేజీకి వెళ్లాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు చేశారు.స్నేహితులతో వెళ్లి..హర్షిత్ చిన్ననాటి స్నేహితులు అందరూ పదో తరగతి పూర్తి చేసి వేర్వేరు కళాశాలల్లో చేరారు. గురువారం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మంగళవారం ఏసీసీ క్వారీకి వెళ్లారు. బిర్యానీ పార్టీ చేసుకుని ఫొటోలు దిగారు. స్నానం చేసేందుకు హర్షిత్ పాటు మరో స్నేహితుడు క్వారీలోకి దిగారు. హర్షిత్ లోతుకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. గమనించిన స్నేహితులు భయంతో బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక రోదిస్తూ వెళ్లిపోయారు. హర్షిత్ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి ప్రసాద్ స్నేహితులను ఆరా తీయగా.. సాయంత్రం క్వారీకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా.. స్కూటీ, నీటిమడుగు పక్కనే డ్రెస్, చెప్పులు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా çహర్షిత్ మృతదేహం లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. క్వారీ ప్రాంతంపై నిఘా పెంచాలి ఏసీసీ క్వారీ దట్టమైన అటవీ ప్రాంతం. అత్యంత ప్రమాదకరమైన క్వారీ. పెద్ద పెద్ద నీటి మడుగులు ఉంటాయి. పైగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వడం కష్టమే. ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతం వద్ద అధికారులు నిషేధం విధించారు. అయినా సరదాగా గడిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు ఏసీసీ క్వారీ అడ్డాగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏసీసీ క్వారీ ప్రాంతంపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.