Annamayya District News
-
ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
లక్కిరెడ్డిపల్లి: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–మార్చి 1వ తేది నుంచి 2026, జనవరి 31వ సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పథకం కింద రూ. 13 కోట్ల, 51 లక్షల, 5వేల, 488లు మంజూరైందని, ఈ మొత్తం నిధులు 1188 పనులకు ఖర్చు పెట్టినట్లు సామాజిక తనిఖీ సమావేశంలో వెల్లడించారు. పంచాయతీరాజ్ కింద రూ. 13 కోట్ల, 39 లక్షల, 3 వేల, 502 మంజూరు కాగా దీంతో సిమెంట్ రోడ్లు పనులు చేపట్టారు. అయితే ఈ పనులకు గాను కొన్ని గ్రామాలలో అక్రమాలకు పాల్పడ్డారని సామాజిక తనిఖీలో బయటపడటంతో రూ. 1 లక్ష, 56 వేల, 582లు రికవరీ చేసినట్లు ఉపాధి సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి అక్రమాలకు చోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జి రాంజీ పథకం ప్రవేశపెట్టిందని ఈ పథకంలో ఎలాంటి అక్రమాలు జరగవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ బాబు, ఎస్ఆర్కె సూర్య, చక్రం, డిఆర్పీలు, టీఏలు, ఎస్ఏలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్‌ఫ్రైడే
● నేడు శుభ శుక్రవారం ● చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు రాజంపేట టౌన్: క్రీస్తు అనగానే క్షమ, కరుణ గుణాలు గుర్తుకు వస్తాయి. లోకంలోని పాపులను పరిశుద్ధులు చేసేందుకు, వారికి క్షమను అందించేందుకు కరుణామయుడైన ఏసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను బలిపెట్టిన రోజే గుడ్‌ఫ్రైడే. దీనినే శుభ శుక్రవారం అని కూడా అంటారు. తన ఆత్మబలిదానంతో పాపులకు దేవుని పరిశుద్ధసన్నిధిలో స్థానం కల్పించిన ఈ శుక్రవారాన్ని ప్రపంచంలోని క్రైస్తవులందరూ శుభ శుక్రవారంగా భావిస్తారు. దయామయుడైన క్రీస్తు శిలువపై చిందించిన రక్తం మానవాళికి శుభాలను చేకూర్చింది. అందువల్ల క్రైస్తవులు, విశ్వాసులు గుడ్‌ఫ్రైడేని భక్తిశ్రద్దలతో నిర్వహించుకుంటారు. గుడ్‌ఫ్రైడే నాడే కల్వగిరిపై క్రీస్తును శిలువపై శిక్షించారు. ఘనంగా ఏర్పాట్లు జిల్లాలో గుడ్‌ఫ్రైడే వేడుకలను నిర్వహించుకునేందుకు క్రైస్తవులు, విశ్వాసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా పాస్టర్లతో పాటు క్రైస్తవులు, విశ్వాసులు చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు చేయనున్నారు. ఏసు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించి ఆరాధించే వారికి పరలోకపు ద్వారాలు తెరుచుకొని ఉంటాయని విశ్వాసుల ప్రగాఢ నమ్మకం. ఏసు మరణం సృష్టిలో ఓ అద్భుతమైన త్యాగపూరిత మరణం. దేవునితో మానవునికి శాశ్విత బంధాన్ని ఏర్పరిచిన గొప్ప మరణం అని పాస్టర్లు చెబుతున్నారు. రేపటితో ముగియనున్న లెంట్ డేస్ గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని క్రైస్తవులు, విశ్వాసులు 40 రోజుల పాటు లెంట్‌డేస్ (శోకదినాలు) నిర్వహిస్తారు. ఇవి శనివారంతో ముగియనున్నాయి. లెంట్డేస్ను పురస్కరించుకొని అనేక మంది క్రైస్తవులు గత నలబై రోజులుగా శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. అలాగే దైవధ్యానంలోనే గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ప్రార్దనలు చేస్తున్నారు. కాగా శుక్రవారం గుడ్‌ఫ్రైడేని, ఆదివారం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు, విశ్వాసులు ఘనంగా నిర్వహించుకోనున్నారు. పునరుత్తానమే ఈస్టర్ కల్వరి కొండమీద శిలువపై మరణించిన క్రీస్తును....అక్కడి కొండ గుహలో సమాధి చేస్తారు. మూడోరోజు ఏసుక్రీస్తు పునరుత్తానం పొంది తిరిగి తన శిష్యులకు దర్శనమిచ్చినట్లు పాస్టర్లు చెబుతున్నారు. ‘నేను జీవమును’ అన్న మాటకు నిదర్శనంగా నిలిచి లోకానికి తన దివ్య మహిమను చాటారు. ప్రభువు పునరుత్తానం చెందిన ఆదివారాన్ని ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. అశాంతితో తల్లడిల్లుతున్న నేటి ప్రపంచానికి క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ, క్షమ గుణాలు ఆదర్శం కావాలని పాస్టర్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో పలు చర్చిల్లో క్రీస్తు ఆత్మబలిదానం, శిలువయాగం తదితర ఘట్టాలను ప్రదర్శించనున్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు చేయనున్నారు. ఈసందర్భంగా పాస్టర్లు ఏసు ప్రభువు కల్వరి కొండపై బలిదానం చేసిన ఘట్టాలను క్రైస్తవులు, విశ్వాసులకు తెలియచేయనున్నారు. -
భార్య భర్తలపై కర్రలతో దాడి
మదనపల్లె టౌన్: పశువులు పంట నష్టం చేశాయని నిలదీసిన పాపానికి భార్య భర్తలపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. ఈ సంఘటన గురువారం రామసముద్రం మంలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నారిగానిపల్లె పంచాయతీ, దిగవలంబంవారిపల్లెకు చెందిన దంపతులు రమణ, గాయత్రి లు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ వ్యవసాయ భూమిలో పలు రకాల కూరగాయల పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన మంజుల తన పాడి పశువులను మేతకు తోలుకెళ్లి పంటలు నష్టపరిచాయని నిలదీశారు. దీంతో ఆమె వెళ్లి జరిగిన గొడవ విషయం ఇంట్లో చెప్పడంతో మంజుల కుటుంబీకులు మూకుమ్మడిగా వచ్చి దంపతులపై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. బాధితులను వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకురావడంతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మణప్పురం రితు మేనేజర్‌పై చీటింగ్ కేసు
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో సంచలనం రేకెత్తించిన మణప్పురం రితు జువెలరీస్ మోసాలపై పోలీస్ యంత్రాంగం స్పందించింది. ‘సాక్షి’లో మదనపల్లె మణప్పురం రితు జువెలరీస్ మోసాలపై, వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సీరియస్ అయ్యారు. ఎస్పీ ఆదేశాలతో స్థానిక వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మణప్పురం రితు జువెలరీస్ మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ గురువారం మాట్లాడుతూ.. మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉంటున్న మణప్పురం రితు జువెలరీస్ సంస్థలో ప్రజలు తరుగు, కూలి లేకుండా తక్కువ ధరకే బంగారం ఇస్తామని ఆ సంస్థ సిబ్బందితో పాటు మేనేజర్ సూరజ్ చీటీలు కట్టించుకున్నారు. ఆ డబ్బులు సంస్థలో జమ చేయకుండా సూరజ్ తన సొంత ఖాతాలకు మల్లించుకుని ఇటు ఖాతాదారులు, ప్రజలతో పాటు సంస్థను భారీగా మోసం చేయడం పాఠకులకు విధితమే. మణప్పురం రితు జువెలరీస్ మోసాల గుట్టును పట్టణానికి చెందిన డాక్టర్ లతశ్రీ గత నెల 30 రాత్రి బయట పెట్టారు. తాను సుమారు ఏడు లక్షలు మణప్పురం రితు జువెలరీస్‌లో రెండు వేర్వేరు చీటీల రూపంలో డబ్బు కట్టి మోసం పోవడాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టడం తెలసిందే. ఈమెతో పాటు పట్టణ, రూరల్, జిల్లా పరిధిలోని ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కోసం డబ్బు చీటీల రూపంలో కట్టి రూ. కోట్లల్లో మోసపోయినట్లు వరుసగా బాధితులు ఆరోపణలు చేశారు. మదనపల్లె మణప్పురం రితు జువెలరీస్ మోసాలపై బాధితులు గగ్గోలు పెట్టడంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పందించారు. మణప్పురం మోసాలపై సిఐ రాజారెడ్డిని ఆదేశించడంతో సిఐ, ఎస్ఐ లు సమస్థ మోసాలపై రెండు రోజుల పాటు విచారణ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం అదే సమస్థలో పనిచేస్తున్న విష్ణుసోమసుందర్ ఫిర్యాదుతో గతంలో మదనపల్లె మణప్పురం రితు జువెలరీస్‌లో పనిచేసిన కేరళకు చెందిన మేనేజర్ సూరజ్‌పై ఛీటింగ్ ఇతర సెక్షన్లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రత్యేక పాలన షురూ
మదనపల్లె: జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ సర్పంచు, పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం నుంచి గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులు సర్పంచుల స్థానంలో పరిపాలన సాగించనున్నారు. మరోసారి.. గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల ద్వారా పరిపాలన సాగించడం కొత్తేమీ కాదు. 1986లో జరిగిన సర్పంచుల పదవీకాలం 1992లో పూర్తికాగా వెంటనే ఎన్నికల జరపలేదు. 1995 జూన్ లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. తర్వాత 2000, 2006లో పంచాయతీ ఎన్నికలు గడువు మీరిన తర్వాత వెంటనే నిర్వహించారు. ఈ రెండు ఎన్నికల్లో పంచాయతీలకు ప్రత్యేక పాలన రాలేదు. 2006 ఎన్నిక తర్వాత 2011లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా జరపలేదు. 2013 జూన్‌లో ఎన్నికలు నిర్వహించగా అప్పటిదాకా పంచాయతీలను ప్రత్యేక అధికారులు పాలించారు. 2018లో ఎన్నికలు జరగాల్సిన ఉండగా అప్పటి ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో ప్రత్యేక అధికారులు మళ్లీ పాలించారు. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికై గురువారం నాటికి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. దాంతో మరోసారి ప్రత్యేక అధికారుల పరిపాలన వచ్చింది. అధికారులకు అవగాహన: ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టే అధికారులకు పంచాయతీ పాలనపై అవగాహన కల్పించడం కోసం జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోని పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వారికే పంచాయతీ పాలనపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం కలెక్టర్ నిర్ణయం మేరకు సమావేశాలు ఎలా నిర్వహించాలన్న దానిపై పరిశీలిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ గురువారం చెప్పారు. జిల్లాలోని 25 మండలాల్లో 411 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,749 పల్లెలు ఉండగా, అందులో 2011 జనాభా లెక్కల ప్రకారం 3.54 ల క్షల మంది ఉన్నారు. మేజర్, అత్యధిక ఆదాయం వస్తున్న పంచాయతీలు ఉన్నాయి. వీటితోపాటు నామమాత్రపు ఆదాయంతో పథకాలు, గ్రాంట్లపై ఆధారపడి నడుస్తున్న పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల బాధ్యతను ప్రభుత్వం మండల స్థాయి అధికారులకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ఆయా మండలాల గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరంతా బాధ్యతలు చేపట్టి పంచాయతీ పాలనను సాగించాల్సి ఉంది. జిల్లాలో 411 పంచాయతీలకుప్రత్యేక అధికారులు నేటి నుంచి మండల స్థాయిఅధికారులకు అధికారం -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. వరిరైతుల పాలిట శాపం
రాయచోటి: ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకున్న వరి, ఇతర పంటలకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం శాపంగా పరిణమించింది. రాయచోటి ట్రాన్స్‌కో కార్యాలయ పరిధిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఆడింది ఆట, వదిలిందే విద్యుత్ సరఫరా అన్న రీతిలో సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో నెలకొన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరించడంలో లైన్మెన్లు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాయచోటి రూరల్ మండలం, మాధవరంలో విద్యుత్ లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికి వచ్చిన వరిపంట ఎండపెట్టుకుంటున్న సంఘటన అక్కడ రైతులను కలచివేస్తోంది. గత ఐదు రోజులుగా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు దెబ్బతిని విద్యుత్ మోటార్లకు అందాల్సిన సరఫరా ఆగిపోయింది. ట్రాన్స్ఫార్మర్ను బాగు చేయించి సరఫరాను అందివ్వాలని స్థానిక రైతులు లైన్మెన్ను బతిమలాడినా ఫలితం లేదని తమటంవారిపల్లికి చెందిన రైతు ఎం రఘునాథ్ చెబుతున్నాడు. ఒక ఎకరం పొలంలో వరిపంటను సాగు చేసుకొని కోత దశకు చేరుకుంటున్న సమయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పంటను ఎండపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకుండా వరిపంటకు నష్టం కల్గించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతోపాటు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. -
పరిమళించిన.. ఆధ్యాత్మిక సుగంధం
కమలాపురం: కమలాపురంలో పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రీ, హజరత్ దస్తగిర్ షా ఖాద్రీ, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రీ, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రీ ఖుద్దస సిర్రహుం వార్ల గంధోత్సవం ఘనంగా జరిగింది. దర్గా పీఠాధిపతి (ముతవల్లి) సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో గంధోత్సవం వైభవంగా నిర్వహించారు. అశేష భక్తజన సందోహం తరలిరాగా.. గురువారం రాత్రి గంధోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. పీఠాధిపతి నివాసం నుంచి గంధం సామగ్రిని బస్టాండు సమీపంలోని గంధం ఇంటికి మేళతాళాలతో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో గంధంను ఊరేగించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన డప్పు వాయిద్యాలు అలరించాయి. గంధోత్సవం ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్, సంబటూరు బస్టాండు మీదుగా దర్గా చేరుకుంది. పీఠాధిపతి దర్గాలోని స్వామి వార్ల మజార్లపై పూల చాదర్ సమర్పించి గంధం ఎక్కించారు. అనంతరం భక్తులందరికీ గంధం పంచి పెట్టారు. గంధోత్సవం ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు గగుర్పొడిచాయి. తలలోకి పెద్ద ఇనుప కడ్డీని గుచ్చుకొని దానిపై టెంకాయలు పగులగొట్టి అబ్బుర పరిచారు. ఈ విన్యాసాలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అలరించిన ఖవ్వాలి ఫోటీ కమలాపురం గఫార్ షా ఖాద్రీ ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఖవ్వాలీ పోటీ అలరించింది. బెల్గాంకు చెందిన ప్రఖ్యాత ఖవ్వాల్ ఉస్తాద్ మురాద్ ఆతిష్, యూపీకి చెందిన రాజా సర్ఫరాజ్‌ల మధ్య రాత్రంతా ఖవ్వాలీ పోటీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా ఉరుసు మహోత్సవాలకు తరలివచ్చారు. స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం పొందారు. కాగా ఉరుసు మహోత్సవానికి వచ్చిన భక్తులకు మోహన్ బీడీ కంపెనీ యాజమాన్యం అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో దర్గా– ఏ– గఫారియా గంధమహోత్సవం నేడు ఉరుసు -
ముత్యాలతలంబ్రాల కోసం..
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణంలో పంపిణీ చేయగా మిగిలిన ముత్యాతలంబ్రాలను గురువారం ఒంటిమిట్ట రామాలయంలో స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు టీటీడీ అధికారులు పంపిణీ చేశారు. ముత్యాలతలంబ్రాలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న భక్తులు ఒంటిమిట్ట రామాలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తుల మధ్య తోపులా కూడా జరిగింది. భక్తులకు ఇవ్వాల్సిన ముత్యాతలంబ్రాలు అధిక మొత్తంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులకు, సిబ్బందికి టీటీడీ అధికారులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు, భక్తుల మద్య కాసింత వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. -
నాటు సారా అమ్ముతున్న నిందితుడిపై పీడీయాక్ట్
మదనపల్లె టౌన్: ప్రభుత్వ నిషేధిత నాటు సారాను నిరంతరంగా అమ్ముతున్న నిందితుడిపై ఎకై ్సజ్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించి గురువారం స్థానిక ఎకై ్సజ్ సీఐ భీమలింగ మీడియాకు తెలిపిన వివరాలు.. పట్టణంలోని బుగ్గ కాలువకు చెందిన మూడే బాలాజి నాయక్ (32) గత కొంత కాలంగా ప్రభుత్వ నిషేధిత నాటు సారాను ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణలతో చెలగాటం ఆడుతున్నాడు. పలు మార్లు పట్టుకుని కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. జైలుకు వెళ్లి తిరిగి వచ్చినా తీరు మార్చుకోలేదన్నారు. ఇప్పటికే బాలాజి నాయక్ పై మొత్తం ఆరు సారా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ నాటు సారా అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతుండంతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి కలెక్టర్ ఆదేశాలతో బాలాజి నాయక్ పై పీడీ యాక్టు ప్రయోగించినట్లు సీఐ తెలిపారు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపించామని చెప్పారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా సారా తయారీకి బెల్లం విక్రయించినా, నాటు సారా తయారుచేసి విక్రయాలకు పాల్పడినా వారిపై పీడీ యాక్టు ప్రయోగించడం జరుగుతుందని హెచ్చరించారు. -
కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
మదనప్లె టౌన్: కారు ఢీకొని మేసీ్త్ర తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం వెలుగు చూసింది. ప్రమదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకు చెందిన వై. రామాంజులు(48) మేసీ్త్ర పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే బుధవారం మదనపల్లెకు భవన నిర్మాణం పనులు సిబ్బందితో చేయించడానికి వచ్చాడు. రాత్రి పొద్దుపోయే వరకు మదనపల్లె లోనే ఉండిపోయాడు. పని పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంలో అర్థ రాత్రిలో తంబళ్లపల్లెకు బయలుదేరాడు. బైక్ కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరక్షించి మెరుగైన వైద్య చికిత్సలు అందించి, బాధితుడి చెవి నుంచి రక్తం ఆగకుండా వస్తోదని తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదపుతప్పి ఇద్దరికి.. గాలివీడు: మండల పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సూర్యప్రతాప్ రెడ్డి (పందికుంట), ఖాజావలి కుమారుడు అమీనుల్లా (గాలివీడు) పరీక్ష ముగిసిన సందర్భంగా వెలిగల్లు ప్రాజెక్టును సందర్శించేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కింద పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అమీనుల్లా కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. సూర్యప్రతాప్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు., మెరుగైన వైద్యం కోసం అమీనుల్లాను తిరుపతికి, సూర్యప్రతాప్ రెడ్డిని రాయచోటికి తరలించినట్లు తెలిసింది. -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యమొద్దు
కురబలకోట: వివిధ పనులపై ఆఫీసులకు వచ్చే వారి సమస్యలను సత్వరం పరిష్కరం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ సూచించారు. గురువారం ఆయన కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, ప్రజల వినతు లు, పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రతి రోజు సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. ఫేసియల్ అటెండెన్స్ విధానాన్ని విధిగా అనుసరించాలన్నారు. ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ లో నమోదైన వినతులను సత్వరం పరిష్కరించాలన్నారు. తహశీల్దారు, ఎంపీడీఓ పాల్గొన్నారు.కలెక్టర్ నిశాంత్‌కుమార్ -
వృద్ధుడిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
బాధితుడి పరిస్థితి విషమంమదనపల్లె టౌన్: మదనపల్లె చిత్తూరు బస్టాండులో ఆర్టీసీ బస్సు వృద్ధుడిపైకి దూసు కెళ్లింది. గురువారం జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ, రాంగారెడ్డి కాలనీకి చెందిన వెంకటరెడ్డి(63) సొంత పని మీద స్థానిక చిత్తూరు బస్టాండు వద్దకు వచ్చాడు. అక్కడపని ముగించుకుని తిరిగి ఇంటికి నడిచి వెళుతుండగా, చిత్తూరు బస్టాండుకు వస్తున్న మదనపల్లె – కందూరు మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సు పాదచారునిపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితున్ని స్థానికుల సాయంతో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సుబ్రమణ్యం ఓ ఆటోలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, తిరుపతికి తరలించాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సహోదర ప్రేమను సమాజానికి పంచాలి
ప్రతి ఒక్కరు ఏసుచూపిన మార్గాన్ని అనుసరించి, క్షమా గుణాన్ని అలవరుచుకొని సమాజానికి సహోదర ప్రేమను పంచాల్సిన అవసరం ఎంతైనావుంది. ఇతరుల కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగివుంది అనే పరమ సత్యాన్ని చాటడానికి క్రీస్తు శిలువ ఎక్కి రక్షకుడయ్యాడు. ఏసుక్రీస్తు పరిశుద్దుడు, ఏ పాపము చేయని వాడు కనుకే తనకు తానే శిలువకు అప్పగించుకున్నాడు. మనుషుల పట్ల అవాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలోనే చూడగలము. – కస్తూరి ఫోనిక, సిస్టర్, నిజస్వరూపుని మందిరం, రాజంపేట -
పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
పుంగనూరు: మున్సిపాలిటీ పరిధిలోని నగరివీధిలో గల యూపీ స్కూల్లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఫుడ్‌సేఫ్టి ఇన్స్పెక్టర్ గురులక్ష్మీ తనిఖీ చేశారు. బుధవారం సాంబారులో బల్లి రావడం పాఠకులకు విధితమే. దీనిపై ఆమె పాఠశాలను, వంట గదిని, సరుకులతో పాటు నూనెలు, శుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించి విచారణ చేశామని, వైద్యుల రిపోర్టును పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడప అర్బన్: వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్’కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో రాచకుంట మేఘశ్యామ్ (24) గురువారం విష ద్రావణం తాగడంతోపాటు, బ్లేడుతో గొంతును కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిన రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం మేరకు పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన రాచకుంట జయశంకర్ కుమారుడు రాచకుంట మేఘశ్యామ్(24) అదే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం మంచిది కాదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలుమార్లు మేఘశ్యాంకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాక వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇదే అంశంపై పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదులు చేసుకోవడంతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వివాహితను, ఆమె పిల్లలను తన తల్లిదండ్రులు, బంధువులు దాచి పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ యువడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారస్థితిలో, వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో బాధితుడు రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ కార్యాలయంలో విధుల్లో వున్న కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు యువకుడు మేఘశ్యాంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప వన్‌టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య తెలియజేశారు. -
ఉపాధికి ఊరట!
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) ఏప్రిల్ 1 నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ–2025 (వీబీజీ రామ్‌జీ) అమలు కావాల్సి ఉంది. అయితే విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1వ తేదీ వరకు ఈ పథకం అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఉపాధిహామీ పథకానికి భారీగా ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోపు పూర్తి చేసుకునేందుకు అవకాశం వచ్చింది. మరిన్ని పనిదినాలు పెరిగేందుకు వీలు కలిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర వాటాల్లో వీబీజీ రామ్‌కు ప్రస్తుతం ఉన్న ఉపాధిహామీ పథకానికి చాలా తేడాలు ఉండడం వల్ల ప్రగతిలో ఉన్న పనులను మే 1వ తేదీలోగా పూర్తి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గుతుంది. ఒకవేళ మిగిలిపోతే కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంలో కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. మేల్కొని హుషారు పడితేగానీ గడువులోపల పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంలో 18,572 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇందులో మెటీరియల్, రోడ్లు, డ్రైనేజీ, తారు, మెటల్ రోడ్లు, పశువుల పాక (క్యాటిల్షెడ్లు), కొత్త స్మశాన వాటికల అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి. పీపీ–2 కింద మరిన్ని పనులు పల్లె పండుగ (పీపీ–2) పథకం కింద ఉపాధిహామీలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. గతేడాది జూన్‌లో ప్రారంభమైన ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం వీబీజీ రామ్‌జీ వాయిదా పడడంతో పీపీ–2 కింద పనులు కొనసాగేందుకు అవకాశం ఉంది. అభివృద్ధి పనుల్లో వివిధరకాల రోడ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 800 పనులకు సంబంధించి రూ. 59 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు. బీటీ రోడ్డు 74 పనులకు రూ. 26.09 కోట్లు, 71మెటల్ రోడ్డు పనులకు రూ. 16 కోట్లు, 17 పాఠశాలల ప్రహారీ గోడల పనులకు సంబంధించి రూ. 1.57 కోట్లు, 34 గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణాలకు రూ. 2 కోట్లు, మైదుకూరు నియోజకవర్గంలో 720 క్యాటిల్ షెడ్లు (పశువుల పాక)కు సంబంధించి రూ. 12.50 కోట్లు, ఇందులో శ్మశానాల అభివృద్ధికి 34 పనులకు రూ. 6 కోట్లు, 63,47,000 పనిదినాలకు సంబంధించి రూ. 173.37 కోట్లు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 8 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మెటీరియల్‌కు రూ. 145 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 140 కోట్లు పెండింగ్‌లో ఉండగా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉపాధిహామీ పథకానికి మే 1 నుంచి అమలు చేసే వీబీజీ రామ్‌జీ పథకానికి కేంద్ర, రాష్ట్ర వాటాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుత పథకంలో 90 శాతం కేంద్రం, కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, వీబీజీ రామ్‌జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలైన 13 రాష్ట్రాలకు వెసలుబాటు కల్పించి పాత పద్ధతిలోనే నిధులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చోటు కల్పించుకోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. 2014లోనే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, ఉత్త చేతులతో ఉన్నామని, ఉన్న 10 శాతం కూడా చెల్లించలేమని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం వీబీజీ రామ్‌జీ పథకం వచ్చినప్పటికీ మౌనంగా ఉన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కొత్త పథకంపై పార్లమెంట్లో గళం విప్పగా, కూటమి ఎంపీలు మాత్రం మౌనం వహించడం గమనార్హం. చంద్రబాబుకు అవకాశం ఉన్నా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సఫలం కాకపోవడంతో ప్రజలనుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పది శాతమే కష్టమన్న చంద్రబాబు 40 శాతం వాటా చెల్లించే పరిస్థితి ఉందా? అని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.వీబీజీ రామ్‌జీ పథకం మే 1వ తేదీకి వాయిదా వేయడంతో ఉపాధిహామీ పథకానికి ఊరట లభించింది. 140 కోట్లు కూలీల వేతనాలకు చెల్లించే పరిస్థితి వచ్చింది. 50 లక్షల పనిదినాలు చేసుకునేందుకు వీలు కలిగింది. మెటీరియల్ (నిర్మాణాత్మక పనులు)కు రూ. 93 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. మే 1కి వీబీజీ రామ్‌జీ పథకం వాయిదా ప్రగతిలో 18,572 పనులు 50 లక్షల పనిదినాలుకలిసివచ్చే అవకాశం మెటీరియల్ పనులు కూడాచేసుకునేందుకు మార్గం సుగమం పాత పద్దతిలోనే పనులు పూర్తి చేయాల్సిన అవసరం వెసులుబాటు కలిగింది కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ, విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. మే 1లోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప -
చిన్న పిల్లలపై పిచ్చికుక్క దాడి
మదనపల్లె టౌన్: మదనపల్లెలో ఓ పిచ్చి కుక్క చిన్నపిల్లపై దాడి చేసి తీవ్రంగా గాయ పరచింది. గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటనపై బాధితుల తల్లి దండ్రులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోళ్ల బైలు గ్రామం, బాబు కాలనీలోకి ఎక్కడి నుంచో ఒక పిచ్చి కుక్క సాయంత్రం వచ్చింది. ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా దాడి చేసి పలువురు పిల్లలను కరచింది. స్థానికులు గమనించి కుక్కను చంపడానికి ప్రయత్నాలు చేసినా దొరక కుండా పారి పోవడంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక పిల్లలను తల్లిదండ్రులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు. వీరంగం చేసిన పిచ్చి కుక్క మళ్లీ ఎక్కడ వస్తుందోనని కాలనీ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో చోరీ పెద్దతిప్పసముద్రం: మండలంలోని టి.సదుం సమీపంలో పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన శ్రీ పార్వతీ సమేత సంఘమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆలయ ముఖద్వార తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న పురాతన కాలం నాటి మూడు గంటలను, హారతి పళ్లెం,, దీపహారతిలను అపహరించుకెళ్లారు. గురువారం విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ నిర్వాహకులు అక్కడకు వెళ్లి చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. పెళ్లయిన ఐదు నెలలకే యువతి ఆత్మహత్యాయత్నం మదనపల్లెటౌన్: పెళ్లై ఐదు నెలలు కూడా కాకముందే ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మదనపల్లెలో గురువారం వెలుగు చూసిన ఘటనపై పోలీసుల కథనం.. మదనపల్లె పట్టణం, పుంగనూరు రోడ్డులోని బసినికొండలో కాపురం ఉంటున్న వినోద్ భార్య హరిత (22), భర్తతో తగవులాడి ఆవేశానికి లోనైంది. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ఆమెకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. శునకాల దాడిలో ఆవు మృతి రామసముద్రం: రామసముద్రం మండలం పెద్ద కురపల్లి గ్రామంలో శునకాల దాడిలో పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన గౌనివారి సుబ్రహ్మణ్యంకు చెందిన పాడి ఆవును పొలం వద్ద మేత కోసం కట్టేశారు. ఈ నేపథ్యంలో మేత మేస్తున్న పాడి ఆవుపై శునకాల గుంపు దాడి చేశాయి. తీవ్రగాయాలతో ఆవు మృతిచెందినట్లు రైతు తెలిపారు. మృతి చెందిన పాడి ఆవు సుమారు రూ.50వేల ఉంటుందని రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైలు కిందపడి వృద్ధుడు అత్మహత్య కొండాపురం: మండల పరిధిలోని రేగడిపల్లె–కొండాపురం రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి చిన్నుగాల గోపాల్(68) ఆత్మహత్య చేసుకొన్నట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ భాస్కర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈఘటన పై విచారించగా మృతుడు అప్పులు ఎక్కువ చేశాడని, తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చెప్పారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అరటి తోట దగ్ధం లింగాల : మండల కేంద్రమైన లింగాలలోని బాలశేఖరరెడ్డి అనే రైతు పొలంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. అరటి తోటలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు తోటలో పడటంతో గెలలతో ఉన్న అరటి తోట అగ్నికి ఆహుతైంది. డ్రిప్ పరికరాలు, పీవీసీ పైపులు కాలిపోవడంతో సుమారు రూ.50వేల దాకా నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. -
ఘనంగా ప్రారంభమైన ఉరుసు
కమలాపురం: పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా, జహీరియా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా పీఠాధిపతి సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రీ ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో అశేష భక్త జన సందోహం నడుమ బుధవారం సాయంత్రం ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్ (జెండా)ను ఊరేగింపుగా తీసుకువచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్, సంబటూరు బస్టాండు మీదుగా పెద్ద దర్గాకు చేరుకుంది. ఊరేగింపులో ప్రత్యేక డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ యువత వివిధ రకాల నృత్యాలు చేశారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ఉత్సవాల ప్రారంభానికి సూచికగా నషాన్ను దర్గా ఆవరణలో ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష భక్త జనుల సమక్షంలో హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్దీన్ షా ఖాద్రి, హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రీల మజార్లపై పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహా చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, సర్ఫరాజ్, ఇస్మాయిల్, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి. హుసేన్ మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. నేడు గంధ మహోత్సవం: కమలాపురం పెద్ద దర్గాగా విరాజిల్లుతున్న దర్గా–ఏ–గఫారియా ఖాదరియాలో గురువారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్‌ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు. నషాన్ ఊరేగింపులో పాల్గొన్న పీఠాధిపతి, సోదరులు ఉరుసు ప్రారంభానికి సూచికగా నషాన్ను ఊరేగిస్తున్న భక్తులు -
గజ వాహనంపై కల్యాణరాముడు
ఒంటిమిట్ట: శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి కల్యాణోత్సవం అనంతరం గజవాహనంపై కల్యాణరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణం అనంతరం ఉత్సవమూర్తులను రామాలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు, 9.30 గంటల నుంచి 10.30 వరకు స్వామివారు ఆలయ మాఢవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రామాలయం భక్తులతో కిటకిటలాడింది. కోదండరాముడి రాజసం శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శివధనుర్భంగాలంకారణంలో శ్రీ కోదండరాముడు రాజసం భక్తులను కనువిందు చేసింది. చెక్కభజనలు, కేరళవాయిద్యాలు, మంగళవాయిద్యాలు న డుమ స్వామివారి ఊరేగింపు కోలాహాలంగా జరిగింది. డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూ పరింటెండెంట్ హనుమంతయ్య పాల్గొన్నారు. పోలీసు ఆంక్షలతో భక్తులు ఇబ్బందులు రాములోరి కల్యాణోత్సవ సందర్భంగా పోలీసులు అమలు చేసిన అంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒంటిమిట్ట సర్పంచ్ కత్తి సుజాత, పలువురు ప్రజా ప్రతినిధులకు వీఐపీ పాసు ఉన్నా పోలీసులు ఆంక్షలు చూపి, కల్యా ణ వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒంటిమిట్టలో సీఎం బస ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా సీఎంను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడారు. -
దళితులను అణగదొక్కడానికి కూటమి ప్రభుత్వం కుట్ర
యమలా సుదర్శన్మదనపల్లెఅర్బన్: దళితులను అణగదొక్కడానికే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్ ఆరోపించారు. బుధవారం స్థానిక మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు క్రైస్తవ మతంలోకి చేరితే కులం మారుతుందని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రకటించడం అన్యాయమన్నారు. ఇవన్నీ దళితుల మధ్య చిచ్చుపెట్టే మాటలన్నారు. ఇలాగైతే కులవ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించకుండా బీజేపీ చెప్పినట్లు చట్టాలను అమలు చేయడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. దళితులను అణగదొక్కుతూ..చిచ్చుపెడుతున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహానాడు నాయకులు మాణిక్యం, చంద్రయ్య, గుండా మనోహర్, నటరాజు, శ్రీనివాసులు, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
కలికిరి రహదారి కష్టాలు తీర్చండి
మదనపల్లె/పీలేరు: మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న కలికిరి ఫ్లైఓవర్ వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు లేకపోవడంతో కలికిరి, మిగతా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ లోక్‌సభపక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని మిథున్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రహదారి సమస్యపై వినతిపత్రాన్ని అందించిన మిథున్‌రెడ్డి ఇక్కడి ప్రజలు పడుతున్న రహదారి కష్టాలు, సమస్య పరిస్థితిని మంత్రికి వివరించారు. వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ సమస్యను మంత్రి సావధానంగా ఆలకించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని మిథున్‌రెడ్డికి హామీ ఇచ్చారు. కలికిరి పట్టణం సమీపంలో ఉన్న ఎన్‌న్‌హెచ్–71 ఫ్లైఓవర్ వద్ద తక్షణం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేయాలని కోరారు. కలికిరిలో సుమారు 60 వేల జనాభా ఉండగా ఇటీవల నిర్మించిన 40 మీటర్ల వెడల్పు ఫ్లైఓవర్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ, ప్రధాన రహదారికి చేరుకునే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు లేకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం సమీప ప్రవేశ మార్గం దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, స్థానిక ప్రజలు, బస్సులు, ఇతర వాహనాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాయని మిథున్‌రెడ్డి మంత్రికి తెలిపారు. ఈ పరిస్థితి కలికిరి పట్టణానికి సమీప గ్రామాల రవాణా సౌకర్యాలకు ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో సర్వీస్ రోడ్లకు యాక్సెస్ మార్గాలు కల్పించాల్సి ఉందని గుర్తుచేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ మిథున్‌రెడ్డి వినతి తక్షణ చర్యలకు హామీ -
రాజకీయ నిరుద్యోగులకు ఊరట
మదనపల్లె: మున్సిపాలిటీల్లోని రాజకీయ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. ఇప్పుడున్న మున్సిపల్ కౌన్సిల్ స్థానాల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న సంఖ్యకు మించి కొత్తగా కౌన్సిలర్లుగా పదవులు పొందేందుకు అవకాశం ఏర్పడింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 28 కౌన్సిల్ స్థానాలు పెరగనున్నాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పి.సంపత్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు. మదనపల్లె: సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన మదనపల్లెలో ఇప్పుడు 35 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 1,36,444 మంది ఉండగా ప్రస్తుతం రెండు లక్షల చేరింది. ఇక్కడ 38,837 నివాస గహాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే మున్సిపాలిటీ జనాభా పెరగడంతో పాటు విస్తరణ జరిగింది. ఇక్కడ కొత్తగా 13 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. దీంతో కొత్త కౌన్సిల్లో స్థానాల సంఖ్య 48కి పెరుగుతాయి. పుంగనూరు: పుంగనూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం 31 వార్డులో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కడ 54,746 మంది ఉన్నారు. ప్రస్తుతం జనాభా 63 వేలకు చేరింది. నివాస గహాల సంఖ్య 16,403 ఉండగా ఈ మధ్యకాలంలో మున్సిపల్ జనాభా పెరగడంతో పాటు విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా మరో ఐదు కౌన్సిల్ స్థానాలు పెరగనున్నాయి. రాయచోటి: రాయచోటి మున్సిపాలిటిలో 34 కౌన్సిల్ వార్డులు ఉన్నాయి. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 90814 మంది ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 1.27 లక్షలకు చేరింది. ఈ మున్సిపాలిటి లో జనాభాతో పాటు విస్తరించింది. ఇక్కడ ఇళ్ల సంఖ్య 33,250 ఉన్నాయి. కొత్తగా పది మున్సిపల్ వార్డులు పెరగనున్నాయి. ● మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చెబుతున్న పార్టీల నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. కౌన్సిల్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల అమలు ఉండడంతో కొందరు పోటీ చేరిన పరిస్థితి నెలకొంటూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని వార్ఢుల సంఖ్య పెంచడం వీరిలో ఆశలు చిగురుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జి.ఓ ప్రకారం మున్సిపాలిటీలలో సభ్యుల సంఖ్యను నిర్దిష్ట నిబంధనల మేరకు నిర్ణయించాల్సి ఉండగా, ఆ అధికారాన్ని కమిషనర్లకు అప్పగించారు. తాజాగా నిర్ణయం తీసుకుని మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్యను పెంచారు. ఈ మార్పులు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. జనాభా పెరుగుదల, పట్టణ ప్రాంతాల విస్తరణ అంశాలను పరిగణనలోకి తీసు కుని వార్డుల సంఖ్యను సవరించినట్లు పేర్కొన్నారు. చిన్న పట్టణాలు, నగర పంచాయతీలలో కూడా వార్డుల సంఖ్య 20 నుంచి 23 లేదా 28 వరకు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణాల విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలన సౌలభ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్లు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఈ కొత్త వార్డులతో కలిపి జరపనున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెంచిన ప్రభుత్వం జిల్లాలో పెరగనున్న 28 వార్డులు కమిషనర్లకు అధికారం -
పనుల పరిశీలన
పెద్దమండ్యం: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న సంప్ పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ బుధవారం పరిశీలించారు. మండలంలోని కలిచెర్ల పంచాయతీ పోలేరమ్మ గుడికి సమీపంలో వాటర్‌గ్రిడ్ సంప్ పనులను ఇటీవల చేపట్టారు. గండికోట రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందించేందుకు 2,350 కోట్లతో పనులు చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సంప్ నిర్మాణం, సామర్థ్యం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఆర్‌ఈవో సతీష్, డీఈ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దార్ తేజస్వి, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అశోక్‌కుమార్, వీఆర్వో ఆంజనేయులు నాయక్, విలేజ్ సర్వేయర్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: చౌడేపల్లె మండలానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరి వేసకుని ఆత్మహత్యకు యత్నించాడు.బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎల్లకుంట్ల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (46) కూలి పనులు చేస్తూ భార్య పిల్లలను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం నిద్దురలేచి ముందే తెచ్చుకున్న మద్యం మళ్లీ తాగి, ఆ మత్తులో తాను ఉంటున్న బెడ్ రూంలో తాడుతో ఉరి వేసుకోబోయాడు. పిల్లలు గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సుబ్రమణ్యంను ఉరి నుంచి తప్పించి వెంటనే అక్కడి పిహెచ్సీకి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. చౌడేపల్లె పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సమస్యలతో రైతు.. గన్నేరు పప్పు తిని రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాచవీటి వారిపల్లె పంచాయతి, బురుజు మదిగపల్లెకు చెందిన రైతు రమణ(55), వ్యవసాయ పనులతో పాటు అడపా దడపా కూలిపనులకు వెళుతుంటాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపం చెందాడు. ఊరికి సమీపంలో ఉన్న గన్నేరు చెట్టుకు బెరడు తొలగించి, ఆ పప్పును తిన్నాడు. వాంతులు చేసుకుని తీవ్ర ఇబ్బంది పడుతుండగా కుటుంబీకులు గమనించి బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఆత్మహత్యకు యత్నించిన సుబ్రమణ్యంచికిత్స పొందుతున్న రమణ -
నేర రహిత జిల్లానే లక్ష్యం
ఎస్పీ ధీరజ్ కునుబిల్లిమదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. బుధవారం మదనపల్లె జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన శ్రీనెలవారీ నేర సమీక్షలో ఆయన పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు యంత్రాంగం అనుసరించాల్సిన కీలక వ్యూహాలను వివరించారు. నిషేధిత ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, జనసంచారం ఎక్కువగా ఉండే చోట్ల డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలని సూచించారు. పేకాట, కోడి పందేలు, బహిరంగ మద్యపానం వంటి చట్టవ్యతిరేక పనులను అరికట్టడానికి సాంకేతికతను ముమ్మరంగా వాడాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, గంజాయి మూలాలను వెలికితీసి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పిలుపునిచ్చారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినుల భద్రతపై రాజీ పడకూడదన్నారు. శక్తి బందాలు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటించాలన్నారు. శక్తి యాప్, 112 అత్యవసర నంబర్ల నుండి వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరించి, జైలు శిక్ష పడేలా చర్యలు తీసు కోవాలన్నారు. పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పోలీసుల పర్యవేక్షణ లోపం వల్ల కోర్టులో కేసులు వీగిపోతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కష్ణమోహన్, జిల్లాలోని సీఐలు ఎస్ఐ లు పాల్గొన్నారు. -
టపాసులు పేలి పూరిళ్లు దగ్ధం
మదనపల్లె టౌన్: అమ్మవారి విగ్రహం ఊరేగింపు సమయంలో గ్రామస్తులు టపాసులు పేల్చారు. నిప్పులు పొర పాటున పక్కనే ఉన్న ఓ పూరింటి మీద పడడంతో ఆ ఇళ్లు కాలిపోయి రూ. రెండు లక్షల ఆస్తి నష్టం వాటిళ్లింది. మదనపల్లె మండలంలో బుధవారం వెలుగుచూసిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బొగ్గిటివారిపల్లెలో గంగమ్మ విగ్రహ ప్రతిష్ట బుధవారం నిర్వహించాలని మంగళవారం రాత్రి గ్రాముస్తులు మొదట అమ్మవారికి శాంతి పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చారు. నిప్పులువెళ్లి పొరపాటున గంగులప్పభార్య లక్షుమమ్మ పూరింటి మీద పడడంతో మంటలు చెలరేగి నిమిషాల్లోనే కాలిపోయింది. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నం విఫలం కాగా, ఇట్లో ఉన్న లక్షుమమ్మను రక్షించారు. అయితే ఇంట్లో ఉన్న ఫర్నిచర్, దుస్తులు, ఆహారధాన్యం కాలిపోయాయి. సుమారు రెండు లక్షల వరకు ఆస్థి నష్టం వాటిల్లింది. తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గ్రామంలో రెండు వర్గాల మద్య గొడవలు ఉన్నాయి. ఇళ్లు కాలడానికి వేరే ఇతర కారణలు ఏవైనా ఉన్నాయా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భాకరాపేట ఘాట్ రోడ్డులో కారు దగ్ధం
రొంపిచెర్ల: తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్‌లో చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెంకు చెందిన ఒక కారు బుధవారం మధ్యాహ్నం కాలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత దాసరిగుడెంకు చెందిన వెంకటేష్ ఏపీ10 ఏవై1978 స్కోడా కారు ఉంది. వెంకటేష్ బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. అయితే కారు మరమ్మతులకు గురి కావడంతో మూడు రోజుల క్రితం సర్వీసింగ్ చేయాలని వెంకటేష్ కుమారుడు విష్ణువర్ధన్ (16), కారు డ్రైవర్ రామయ్యతో కలసి తిరుపతికి తీసుకెళ్లి బాగు చేయించారు. తిరిగి బుధవారం స్వగ్రామం రొంపిచెర్లకు వెళుతుండగా భాకరాపేట ఘాట్ రోడ్డులో కారు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. వెనక వస్తున్న వాహనదారులు గమనించి కారు డ్రైవర్ రామయ్యకు చెప్పారు. దీంతో ఇద్దరు కారు నుంచి దూకి ప్రాణాలతో బయట పడ్డారు.కారు కాలి బుడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భాకరాపేట ఎస్ఐ కృష్ణయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలేరో వాహనం.. పెద్దతిప్పసముద్రం: మండలంలోని రంగసముద్రం పంచాయతీ తోటవారిపల్లికి చెందిన మహేష్ అనే వ్యక్తి బొలేరో వాహనం బుధవారం ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. సదరు వ్యక్తి డ్రిప్ పరికరాలను వాహనంలో ఉంచి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఈ తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు సమీప పొలాల్లోని పిచ్చి మొక్కలను తొలగించేందుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా ఎగసి పడటంతో అక్కడ నిలిపి ఉన్న బొలేరో వాహనంతో పాటు అందులో ఉన్న డ్రిప్ పరికరాలన్నీ కాలి బూడిదయ్యాయి. -
ప్రజారోగ్యం గాలిలో దీపం
బి.కొత్తకోట: కూటమి పాలనలో పేదల ఆరోగ్యం గాలిలో దీపంగా మారిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం విమర్శించింది. బుధవారం బి.కొత్తకోటలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కమిటీ చర్చించింది. రూ.3వేల కోట్ల బకాయిల కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాక కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిందని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. ఆస్పత్రులలో జీతాలు లేక మందుల కొరతతో వైద్యం అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న నిర్ణయం తగదన్నారు. మతం మారినా కుల వివక్ష మారదని, దళిత క్రైస్తవులు ఇప్పటికీ సామాజికంగా అదే వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్లు తొలగిస్తే దళిత క్రైస్తవులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడతారన్నారు. సమాజంలో కులవివక్ష కొనసాగుతున్న పరిస్థితుల్లో మతాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎస్సీ హక్కులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్,సహయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, సాంబశివ, మురళి, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సుమిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వైభవం..ధ్వజావరోహణం
చక్రస్నానం నిర్వహిస్తున్న వేదపండితులు హంసవాహనంపై విహరిస్తున్న రామచంద్రుడువాల్మీకిపురం: వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణతో ముగిశాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కోలిపి శుద్ధి, తోమాలసేవ, కొలువు, పంచాగశ్రవణం, అర్చన, బలి, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 7గంటలకు వసంతోత్సవం అనంతరం స్వామివారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. సీతారామలక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం జరిపారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8గంటలకు వాహన మండపంలో సీతారామలక్ష్మణులను హంసవాహనంపై కొలువదీర్చారు. స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 10గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీ పట్టాభిరామస్వామి శ్రీ పరాభవనామ సంవత్సర సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, సిబ్బంది నాగరాజ, భక్తులు పాల్గొన్నారు.ముగిసిన పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలు -
ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
రామాపురం: మండలంలోని రాయచోటి వేంపల్లి రహదారి మార్గంలో ఉండే ఏకిలపల్లి క్వారీలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన ఘటన బుధవారం జరిగింది. రాయచోటి మాసాపేటకు చెందిన జాబీద్ పదోతరగతి అనే 10వ తరగతి విద్యార్థి పరీక్ష అనంతరం తోటి విద్యార్థులతో కలసి ఈతకు వెళ్లాడు. తర్వాత అతని ఆచూకీ తెలియలేదు.లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. జాబీద్ కనిపించకపోవడతో తల్లిదండ్రులు,బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని బండ్లపెంట సమీపంలో సుమారు 65–70 మధ్య వయస్సు ఉన్న పురుషుడి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ బివి చలపతి తన సబ్బందితో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ వృద్ధుడిని ఎవరైనా గుర్తిస్తే తమకు . 9121100559/ 9121100560/ 9121100561 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ పేర్కొన్నారు. మహిళతో అసభ్య ప్రవర్తన – యువకుడికి దేహశుద్ధి పుంగనూరు: ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని, అతనికి చెప్పుల దండ వేసి, దేహశుద్ధి చేసి ఊరేగింపు చేసిన సంఘటన పుంగనూరులో మంగళవారం జరిగింది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు రావడంతో ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణ – ముగ్గురికి గాయాలు రొంపిచెర్ల: పాత కక్షలతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ముగ్గురు గాయపడిన సంఘటన రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ గాజులపల్లెలో మంగళవారం రాత్రి జరిగింది. గాజులపల్లెకు చెందిన ప్రభాకర్‌కు ఈశ్వరయ్య, చంద్రయ్యకు పాత కక్షలు ఉన్నాయి. ఇరువర్గాల వారు రొంపిచెర్ల పోలీసుస్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించారు. అయితే మంగళవారం రాత్రి ప్రభాకర్ రొంపిచెర్ల నుంచి ఇంటికి వెళుతుండగా అడ్డగించి దాడి చేశారని ఫిర్యాదు ఇచ్చారు. అదే విధంగా ఈశ్వరయ్య, చంద్రయ్య తమ ఇళ్లపై దాడి చేసి గాయ పరిచారని ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో చంద్రయ్య తలకు గాయమైంది అలాగే ఈశ్వరయ్యకు కూడా చేతి వేలుకు గాయమైంది. ఇద్దరు పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడు ఆత్మహత్య
మదనపల్లె టౌన్: బి.కొత్తకోట మండలానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మొగసాల మర్రికి చెందిన సుబ్బారెడ్డి కొడుకు శ్యాంరెడ్డి(23) బీటెక్ వరకు చదువుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఎందుకు చిన్న మనసు చేసుకున్నాడో ఏమో తెలియదు. తాను ఉంటున్న ఇంటిలోనే తాడుతో ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రు గమనించి వెంటనే ఉరి నుంచి తప్పించారు. కొన ఊపితో ఉన్న కుమారుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, చికిత్స అందించేలోపే శ్యాంరెడ్డి మరణించాడు. జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు బి.కొత్తకోట పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు దర్యాప్తు చేపట్టారు. శ్యాం రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. బీటెక్ చదివిన బిడ్డ తమను ఉద్దరిస్తాడు అనుకునేలోపే దేవుడు ఇలా మాకు దూరం చేసి కడుపుకోత మిగిల్చాడని తల్లి దండ్రులు గుండెలవిసేలా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. నీలగిరి తోటకు నిప్పు – తప్పిన ప్రమాదం మదనపల్లె టౌన్: నీలగిరి తోటలో వ్యాపిస్తున్న మంటలను అగ్ని మాపక అధికారులు సకాలంలో అదుపు చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మదనపల్లె మండలంలో వెలుగు చూసిన ఘటనపై అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలు.. మండలంలోని వలసపల్లె గ్రామం, 150వ మైలు రాయి సమీపంలో ఉన్న ఓ నీలగిరి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తోటలో మంటలు వ్యాపించడం గమనించిన పక్కనే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది స్థానిక అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో వెళ్లి నీలగిరి తోటలో మంటలను అదుపుచేశారు. సకాలంలో అగ్ని మాపక అధికారులు స్పందించక పోయి ఉంటే మంటలు పెట్రోల్ బంకు వద్దకు వచ్చి ఉండేవనీ.. భారీ ప్రమాదం జరిగేదని అధికారులు ఆందోళన చెందారు. సకాలంలో మంటలు అదుపు చేయడంతో స్థానికులు, పెట్రోల్ బంకు సిబ్బంది సంతోషం వ్యక్తంచేశారు. -
సంఘ బహిష్కరణతో మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : మహిళను వేధింపులకు గురిచేసి, ఆపై సంఘ బహిష్కరణ చేయడంతో ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితురాలి తల్లి ఎండి విజయశ్రీ తెలిపిన వివరాలు.. కొత్తపల్లె గ్రామం శాంతిపురానికి చెందిన మోసెస్ భార్య లీనా(30) సీఎస్ఐ ఎస్టీ పాల్ చర్చికి సభ్యురాలుగానూ, సీ్త్రల మైత్రిలో చురుగ్గానూ ఉంటోంది. సంఘం డబ్బును చర్చి పాస్టర్ యషియ, సరిత, రజిత, రవి, శారద, వినోద్ తదితరులు అనవసరంగా ఖర్చు చేస్తుండడంతో లీనా అడ్డుకుందని ఆమెను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. డబ్బులు ఇవ్వకుండా నిరాకరించడంతో సంఘానికి నీవు పనికి రావని పాస్టర్ చర్చిలోనే లీనాను సంఘ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించాడని తెలిపింది. దీంతో తన కూతురు వారం రోజులుగా చర్చికి కూడా వెళ్లకుండానే ఇంట్లోనే మధనపడుతూ కుమిలిపోయి చనిపోవాలని చిన్న మనసు చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా బాధలో ఉండగానే వారంతా లీనా ఇంటికి వెళ్లి పరుష పదజాలంతో దూషించడాన్ని జీర్ణించుకోలేక ఇంట్లో ఉన్న బీపీ, షుగర్, నిద్ర మాత్రలు కలిపి మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సలు అందించారు. లీనాను సంఘ బహిష్కరణ చేసిన ఘటపై పోలీసులు లోతుగా విచరణ చేపట్టి బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. -
సమాధానం చెప్పాలి
రైతాంగ ప్రయోజనాలను కాలరాస్తున్న చంద్రబాబు ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశారో సమాధానం చెప్పాలి. సొంత నియోజకవర్గ కుప్పానికి కృష్ణా జలాలు తరలించిన ఘనత జగనన్నది. ఆయన హంద్రీనీవా పనులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చి చూపించారు. ఇప్పుడు ఇదే కాలువలో నీటిని తరలించుకుంటూ నేనే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. కుప్పానికి మాత్రమే నీళ్లు తీసుకుపోతున్న చంద్రబాబు..నీళ్లు లేక అల్లాడుతున్న పెద్దమండ్యం, తంబళ్లపల్లె గురించి ఎందుకు పట్టించుకోవడంలేదు. చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరాల్సిందే. –పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే -
కుటుంబ సమస్యలతో..
కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పుంగనూరు నక్కబండకు చెందిన ఎరగడ్డల వ్యాపారి క్రిష్ణమూర్తి(48) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపం చెందాడు. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిండంతో వైద్యం అందించారు. అనంతరం డాక్టర్ల సలహాపై అక్కడి నుంచి వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు రావడంతో వారు మెరుగైన వైద్యం అందించారు. దీంతో క్రిష్ణమూర్తికి ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల సమాచారంపై పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రికార్డులు ఉన్నట్టా.. లేనట్టా!
పెద్దతిప్పసముద్రం : స్థానిక గ్రామ సచివాలయంలో రూ.లక్షల నిధులకు సంబంధించి రికార్డులు, బిల్ బుక్కులు ఉన్నాయా లేవా అని విచారణ అధికారుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈవోఆర్డీ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లి డీఎల్పీవో నాగరాజు 10 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు స్థానిక సచివాలయానికి వచ్చి రికార్డులు పరిశీలించారు. గత మూడేళ్ల వ్యవధిలో పంచాయతీకి వివిధ పన్నుల రూపంలో వచ్చిన నిధులకు సంబంధించి రికార్డులు లేనందున, ఇక్కడ పంచాయతీ కార్యదర్శులుగా పని చేసిన ముగ్గురికి సంజాయిషీ కోరుతూ మెమోలు సైతం జారీ చేశారు. ఈ తరుణంలో మంగళవారం ఇక్కడికి వచ్చిన డీఎల్పీవో వారపు సంత, జంతు వధశాల, బస్టాండ్ గేటు వసూళ్ల కోసం బహిరంగ వేలంలో దక్కించుకున్న హెచ్చు పాటాదారులను పిలిపించారు. సదరు హెచ్చు పాటాదారులకు కార్యదర్శులు రశీదులు ఇచ్చారా, ఇచ్చి ఉంటే రికార్డుల్లో నమోదైన డబ్బుకు, రశీదుల్లో వ్యత్యాసం ఉందా, సదరు డబ్బు ప్రభుత్వ ఖజానాకు జమ చేశారా అని ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఇంటి, నీటి పన్ను వసూలు చేసిన వారితోపాటు పక్కా గృహాల అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించి వారు ఎంత సొమ్ము చెల్లించారు, ఆన్లైన్ రశీదులు ఇచ్చారా లేదా అని అధికారులు లోతుగా విశ్లేషిస్తూ విచారణ చేపడుతున్నారు. వారం, పది రోజుల్లో రికార్డుల తనిఖీ, పక్కదారి పట్టిన నిధుల వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలుసదుం : రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడ్డ సంఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ బోయపల్లెకి చెందిన రాజేశ్ రెడ్డివారిపల్లె బస్‌స్టాప్ సమీపంలో బైక్ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన బైక్‌తోపాటు పడిపోయి ఉండగా స్థానికులు గుర్తించారు. రోడ్డు పక్కన పడిపోవడంతో ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తరువాత గమనించారు. 108లో అతనిని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పీలేరుకు తీసుకుపోయారు. అతనే అదుపుతప్పి పడ్డాడా.. లేక ఏదైనా వాహనం ఢీకొందా అన్న విషయం తెలియరాలేదు. తల్లీకూతురు ఆత్మహత్యతొండూరు : తొండూరు మండల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మల్లేల గ్రామంలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు షేక్ బీబీ (56), ఆమె కుమార్తె షేక్ ఇమామ్‌బీ (33)లు తమ ఇంటిలోని ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి షేక్ ఇమామ్‌బాషా ఇంటిలో కనిపించకుండా పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పుల బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
సీమ లిఫ్ట్ కోసం సమర శంఖం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆదినుంచి రైతు వ్యతిరేకంగానే మిగిలిపోయారన్నారు. వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవచ్చని వ్యంగ్యంగా విమర్శించిన చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తోడేసుకుంటోందని దాంతో రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గుర్తించిన వైఎస్.జగన్ .. ఇక్కడి రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు, దుర్భిక్ష పరిస్థితులను దూరం చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దీనివల్ల జగన్‌కు కీర్తి ప్రతిష్టలు వస్తాయన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకం పనులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరగానే నిలిపివేశారని దుయ్యబట్టారు. సీమ ఎత్తిపోతల పనుల పూర్తి కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి గ్రామస్థాయిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మదనపల్లె: రాయలసీమ ఎత్తిపోతల పథకం అసంపూర్తి పనులను పూర్తి చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ నినదించింది. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మదనపల్లె నుంచి సమరశంఖం పూరించింది. మదనపల్లెలో మంగళవారం ఆ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది. రాయల సీమ రైతులకు వరమైన ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం కోసం పణంగా పెట్టారని, తక్షణమే అసంపూర్తి పనులను పూర్తిచేసి కృష్ణా జలాలు రైతాంగానికి అందించాలని వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం రైతాంగ ప్రయోజనాలను బలి చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. లిఫ్ట్ లేకుంటే కష్టాలే.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయలసీమ లిఫ్ట్ సాధన కో–ఆర్డినేటర్ సాకే శైలజానాథ్ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి సమగ్రంగా వివరించారు. ఈ పథకం చంద్రబాబు నిలిపివేయడం వల్ల సీమ రైతాంగానికి కలుగుతున్న నష్టం, దెబ్బతింటున్న సాగు ప్రయోజనాల గురించి విపులంగా అవగాహన కల్పించారు. సీమ లిఫ్ట్ ద్వారా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, గండికోట రిజర్వాయర్ లకు అందాల్సిన సాగునీరు అందకుండా పోతే ఈ ప్రాంత రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుందో, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కూలంకశంగా వివరించారు. సీమ ప్రయోజనాలను కాపాడేలా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు, రైతాంగానికి కలిగిన ప్రయోజనాల గురించి రౌండ్ టేబుల్ సమావేశ వేదికపై వివరించారు. సాగు, తాగునీటి కోసం ఆ ఇద్దరు నేతలు చేసిన కృషి, ఎగువ రాష్ట్రం తెలంగాణ కుతంత్రాలను అడ్డుకున్న తీరు, మన రైతుల ప్రజా ప్రయోజనాలను కాపాడిన విధానాన్ని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పథకాన్ని నిలిపివేసి రైతులకు చేస్తున్న ద్రోహం, దీన్ని అధిగమించే ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణ పై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ● మాజీ ఎమెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి, ఎస్ఈసీ మెంబర్ జి.షమీంఅస్లాం, సీనియర్ నేత తిమ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజ, పార్టీ పరిశీలకులు ఉదయ్ , జింకా వెంకటా చలపతి, వీఎస్ రెడ్డి, రేవతి,వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ మంజునాథ్ పాల్గొన్నారు.మరో ఉద్యమం రాయలసీమ పథకాన్ని పూర్తి చేయించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. కేంద్ర కమిటీ ఆదేశాలు పాటిస్తూ రైతు ప్రజలను చంద్రబాబు ఏ విధంగా తెలంగాణకు తాకట్టు పెట్టారో వివరించాలి. క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసే ఎత్తిపోతల పథకం పూర్తి చేయించడం కోసం నడుం బిగించాలి. –నిసార్ అహ్మద్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మదనపల్లె సాహసోపేత నిర్ణయం రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ చేపట్టడం సాహసోపేతమైన నిర్ణయం. జగనన్న చేతల్లో రైతు సంక్షేమాన్ని చూపిస్తే, చంద్ర బాబు సీమ ప్రజలపై ప్రేమ లేకున్నా నటిస్తున్నారు. రైతాంగ కష్టాలు తెలిసినా ద్రోహానికి పాల్పడుతున్నారు. అమరావతిలో వేలకోట్ల అభివృద్ధి పేరుతో దోపిడీ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్‌కు రూ.3 వేల కోట్లు ఇవ్వలేకపోవడం దారుణం. మదనపల్లె, తంబళ్లపల్లె, ప్రాంతాలకు కృష్ణా జలాలు తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత రైతులకు ఎప్పుడూకష్టాలే, పనులు లేక వలసలు పోతున్నారు. బాబు చేస్తున్న ద్రోహాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. –ఆర్.రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు మెడలు వంచైనా పనులు చేయిద్దాం రాజధాని పేరుతో రూ.వేల కోట్ల దోపిడీ లిఫ్ట్ పనులకు రూ.3వేల కోట్లు లేవా మొదటినుంచి చంద్రబాబురైతు వ్యతిరేకి మదనపల్లె రౌండ్ టేబుల్ సమావేశంలోమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, శైలజానాఽథ్, వైఎస్సార్సీపీ నేతలు -
శ్రీశైలం ప్రాజెక్టే దిక్కు
దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యామలం చేసేందుకు జగనన్న సీమ లిఫ్ట్ పథకం తీసుకొచ్చారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టు దిక్కు. దీని ఆధారంగా చేపట్టిన సీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. మన రైతాంగానికి దక్కాల్సిన నీటి వాటా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 800 అడుగుల నుంచే నీటిని తోడుకుని సీమ ప్రాజెక్టులకు అందించేలా చేపట్టిన లిఫ్టు పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలి. –దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మదనపల్లె -
పట్టాలతోపాటు కోర్టు స్టే ఉన్నా బెదిరింపులు
2023లో ఇక్కడ 150 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. దీంతో ఇళ్లు కూడా కట్టుకున్నాం. ఇంకొందరు పునాదులు వేసుకున్నారు. ఇళ్లు కట్టిన వారిని ఖాళీ చేయాలని పునాదులు వేసిన వారిని తొలగించాలని బెదిరిస్తున్నారు. ఇక్కడ అంతా పేదలే. అప్పుడప్పుడు వచ్చి హెచ్చరించి వెళుతున్నారు. అందరికీ కోర్టు స్టే కూడా ఉన్నా దౌర్జన్యానికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అష్టకష్టాలు పడి కట్టుకున్న పునాదిని జేసీబీతో ధ్వంసం చేశారు. నేను ఒంటరి మహిళను. దిక్కుతోచడం లేదు. – మొబీనా, బాధితురాలు, అంగళ్లు గ్రామం, కురబలకోట మండలం -
ఉరి వేసుకుని..
ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. బాధితుని కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన నారాయణ కొడుకు ఆర్.రమేష్ (22) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జలధార చెరువు పరిశీలన
కురబలకోట : జలధార కింద నిండిన మండలంలోని రంగమ్మ చెరువును సీఏడీఏ కమిషనర్ ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ఈ చెరువుకు ఎగువున్న నాలుగు కాలువలను ముందుగా ఉపాధి హామీ కింద రూ.4.53 లక్షలతో బాగు చేయడంతో వర్షపు నీరు చెరువులోకి సునాయసంగా నిండిందని అధికార యంత్రాంగం తెలియజేశారు. ఇందులో ఓ కాలువ ద్వారా హంద్రీనీవా నీటిని వదలడంతో ఈ చెరువు నిండడంతోపాటు పక్క మండలంలోని సీటీఎం చెరువు కూడా నిండిందని తెలిపారు. చెరువు కిందనే కాకుండా మొరవ నీటి ద్వారా కాలువ పరివాహక ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పెరగడం ఆపై బోర్లులో నీటి మట్టం పెరిగిందన్నారు. తాగు సాగునీటి సమస్య లేకుండా ఉందని తెలియజేశారు. దీంతో ఆమె సంతోషించారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేసేలా చూడడం జరుగుతుందని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కూడా మాట్లాడారు. ఆయకట్టు ద్వారా సాగు శాతం పెరిగిందని రైతులు తెలియజేశారు. మూగజీవాలకు తాగునీరు, పశుగ్రాస పెంపకం చేపట్టినట్లు తెలిపారు. ఉద్యాన పంటలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
పురుగుల నివారణ మందు తాగి..
కుటుంబ సమస్యలతో ఓ రైతు పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు మంగళవారం తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం, కుక్కరాజు పల్లెకు చెందిన వీరప్ప కొడుకు రైతు వెంకటరమణ(55) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రైతు టమాటా చెట్లకు కొట్డానికి తెచ్చి ఇంట్లో పెట్టిన పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా, గమనించిన కుటుంబీకులు, బాధిత రైతును వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం రైతు పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు వెంటనే తిరుపతి రుయాకు తరలించాలని రెఫర్ చేశారు. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల సమాచారంతో తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నేడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
మదనపల్లె: స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ జిల్లా కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు స్థానిక సబ్‌రిజిస్ట్రార్ గురుస్వామి నాయుడు తెలిపారు. స్థానికు కురవంకలోని మైసూర్ బ్యాంకు బ్రాంచీ కార్యాలయం వద్ద తమ జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో మంగళవారం ఒంటిమిట్టలో కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తో కలిసి కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఈ రిహార్సల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ వెళ్లే మార్గంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. మదనపల్లె అర్బన్: స్పష్టమైన ప్రణాళిక..సమష్టి కృషితో జలధార ప్రాజెక్ట్ విజయవంతమైందని కలెక్టర్ నిషాంత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కమాండ్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అధ్యయనం చేయడానికి వచ్చిన అధికారులు, జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందంతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అన్నిశాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని వివరించారు. ముఖ్యంగా ఉపాధిహామీ పథకం ద్వారా లేబర్ బడ్జెట్‌ను నీటి సంరక్షణ పనులకు వినియోగించడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కమిషనర్ ప్రశాంతి మాట్లాడారు. అనంతరం జలధార ప్రాజెక్ట్, నీటి సంరక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించారు. -
చతుర్దశినాడు... పున్నమి వెలుగుల్లో కల్యాణం
ఏకశిలానగరి శ్రీ కోదండ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా సీతారాముల వివాహ మహోత్సవాలు అన్ని ఆలయాల్లోనూ నవమి నాడే అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. భద్రాచలం రామక్షేత్రంలో, తిరుపతి కోదండ రామాలయంలోనూ దాదాపు అన్ని చోట్ల చైత్ర శుద్ధపాడ్యమి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. ఇలా అనేక చోట్ల పగలు రామయ్య పెళ్లి జరిగితే ఒక్క ఒంటిమిట్టలోనే రాత్రి వేళ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. ఆలయ దివ్య దర్శనం ప్రజలకు అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. -
అశ్వవాహనంపై ప్రతాపరాముడి పార్వేట
వాల్మీకిపురం : వాల్మీకిక్షేత్రంలోని పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం రాత్రి 8గంటలకు స్వామివారు అశ్వవాహనంపై పార్వేటకు బయల్దేరారు. ఉదయం సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, తిరుచ్చిలో స్వామివారి అలంకరణ, 8 నుంచి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం ఊంజల్ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం వాహన మండపంలో స్వామివారిని విల్లంబులు ధరింపజేసి పార్వేటకు సిద్ధం చేశారు. అశ్వవాహనంపై విల్లంబులతో భక్తులకు ప్రతాపరాముడిగా దర్శనమిచ్చారు. పార్వేట మండపంలో సలహాదారులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు రాములవారి పార్వేట ఉత్సవం గురించి కథారూపంలో భక్తులకు తెలియజేశారు. వేట అనంతరం స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి మహిళ మృతి
పీలేరు రూరల్ : రైలు కింద పడి మహిళ మృతి చెందిన సంఘటన పీలేరు టౌన్ చిత్తూరు రోడ్డు మార్గం రైల్వేగేటు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. స్థానిక చెన్నారెడ్డి కాలనీకి చెందిన గుండ్లూరు మనోహరమ్మ (65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ధర్మవరం వెళ్తున్న నర్సాపురం ఎక్స్‌ప్రెస్ కిందపడి మృతి చెందింది. పీలేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీకొన్న కార్లు.. తప్పిన ప్రమాదంమదనపల్లె : మదనపల్లెలో మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఓ ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తిరుపతిరోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చేందుకు సిటిఎం రోడ్డులో వస్తుండగా విద్యుత్ కేంద్రం వద్ద కాన్వాయ్‌లోని వాహనాలకు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి వస్తున్న ఫార్చ్యూనర్ కారు ఢీకొంది. ఇదే కారుకు వెనుక వస్తున్న నాయకులు శివారెడ్డి, పద్మజారెడ్డి కార్లు ఢీకొన్నాయి. దాంతో మూడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొని ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. అయితే వాటిలో ప్రయాణిస్తున్న నాయకులు ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఫ్యాప్టో చైర్మన్‌గా నర్రెడ్డి సంగమేశ్వర్రెడ్డికడప ఎడ్యుకేషన్ : కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌గా నర్రెడ్డి సంగమేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. కడప వి.వి.ఆర్ ఎస్టీయూ భవన్లో జరిగిన ఫ్యాప్టో సభ్య సంఘాల కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఫ్యాప్టో చైర్మన్‌గా ఉన్న ఇలియాస్ బాషా ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ప్రస్తుత ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంగమేశ్వరరెడ్డిని ఫ్యాప్టో చైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికపరమైన, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ఉద్యమాలే శరణ్యమని అన్నారు. గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి లబ్ధి పొంది నేడు ఇచ్చిన హామీలు మరిచి వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా 12వ పీఆర్సిపై అతీగతీ లేదని అన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉమ్మడి ఉద్యమాలకు అందరనీ కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. -
కాలనీ ఖాళీ చేస్తారా.. కూల్చి వేయమంటారా?
● టీడీపీ నేత పేరుతో అనుచరుల బెదిరింపులు ● జేసీబీతో పునాదుల తొలగింపు యత్నం ● కోర్టు స్టే ఉన్నా బరితెగింపు ● జిల్లా కలెక్టర్‌కు కాలనీ వాసుల ఫిర్యాదుకురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి వద్దనున్న కాలనీ భూమి మాది.. వెంటనే ఖాళీ చేయాలి.. లేదంటే కూల్చి వేస్తామని మదనపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడి పేరుతో అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 150 మంది దాకా ఇంటి పట్టాలు పొందారు. కొందరు పక్కా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. మరి కొందరు ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసుకున్నారు. అయితే ఈ కాలనీ ఉన్న డీకేటీ భూమి తమదేనని ఖాళీ చేయకపోతే కూల్చి వేస్తామని హెచ్చరించారు. సోమవారం కూడా జేసీబీతోపాటు రౌడీ గ్యాంగ్‌లతో కాలనీలో చొరబడి భయభ్రాంతులకు గురిచేసిట్లు చెబుతున్నారు. అంగళ్లుకు చెందిన మొబీనా ఇంటి పునాదిని కూడా జేసీబీతో ధ్వంసం చేశారు. కొంత కాలంగా బెదిరింపులు ఎక్కువ కావడంతో అప్పటికీ కాలనీవాసులు కోర్టుకు వెళ్లి స్టే కూడా పొందారు. అయినా ఖాళీ చేయకపోతే కాలనీ ఇళ్లను కూల్చి వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంటి పట్టాలు, కోర్టు స్టే ఉన్నా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తగు న్యాయం చేసి టీడీపీ నాయకుల బెదిరింపుల నుంచి ఆదుకోవాలని కోరుతున్నారు. -
కల్యాణోత్సవానికి అదనపు బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి క్షేత్రంలో బుధవారం జరిగే స్వామి వారి కల్యాణోత్సవాన్ని అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ డిపోల నుంచి బస్సులు నడుస్తాయని ఆయన వివరించారు. కడప డిపో నుంచి 35, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, ప్రొద్దుటూరు 7, రాజంపేట, రాయచోటి డిపోల నుంచి 17 బస్సులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 40 బస్సులు కలిపి మొత్తం 145 బస్సులు స్వామి వారి కల్యాణోత్సవ సందర్బంగా నడుస్తాయని తెలిపారు. అలాగే కడప వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణోత్సవం జరిగే ప్రదేశం వరకు 12 ఉచిత బస్సులు, రాజంపేట వైపు సాలాబాద్ క్రాస్ పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణోత్సవం ప్రదేశం వరకు 8 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
తాగునీటి కోసం ఘర్షణ
మదనపల్లె టౌన్ : తాగునీటి కోసం ఇరువర్గాలు ఘర్షణ పడిన సంఘటన మంగళవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు.. మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరి వాండ్లపల్లెకు చెందిన క్రిష్ణమ నాయుని భార్య పుష్పావతి(60), లోకేశ్వరి(20)లు వీధిలో ఉన్న కుళాయి వద్దకు తాగునీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మల్లయ్యకు అక్కడ ఉన్న మహిళలు దారి ఇవ్వకుండా ఉండటంతో ఆయన పుష్పావతి, లోకేశ్వరిలపై గొడవకు వెళ్లాడు. మాటకుమాట పెరిగి ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లయ్య తన వద్ద ఉన్న కొడవలితో దాడి చేయడంతో పుష్పావతి, లోశ్వరి గాయపడ్డారు. ప్రతి దాడిలో మల్లయ్య, ఆయన భార్య లక్షుమ్మ సైతం తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు బాధితులను చికిత్సల కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్‌తోపాటు మరో ఇద్దరు సస్పెన్షన్లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లి సబ్ రిజిస్ట్రార్ సి.రామాంజులతోపాటు గతంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఎ.సురేష్, ప్రస్తుత జూనియర్ అసిస్టెంట్ బి.ప్రశాంతిలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కడప రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ రామలక్ష్మీ పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. 22ఏ పరిధిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను డబ్బులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్, ఐజీ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలో బట్టబయలు కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉదయ్ కిరణ్‌రెడ్డిని లక్కిరెడ్డిపల్లి ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆటో బోల్తా.. డ్రైవర్‌కు గాయాలుసిద్దవటం : సిద్దవటం– భాకరాపేట ప్రధాన రహదారి అయ్యప్పస్వామి గుడి సమీపాన భాకరాపేట నుంచి సిద్దవటంకు వస్తున్న ఆటో .. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి మంగళవారం బోల్తా పడింది. ఆటో డ్రైవర్ భవనాసి వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. -
అంజనీసుతుడిపై కౌసల్య తనయ
● భక్తులను కరుణించిన కోదండరాముడు ● తిలకించి పులకించిన భక్తజనం మాడ వీధుల్లో హనుమంత వాహనంపై అభయమిస్తున్న కోదండ రాముడు గ్రామోత్సవంలో కోలాట బృందం, భక్తులు ఒంటిమిట్ట : కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం రాత్రి కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. త్రేతా యుగంలో రామభక్తుడిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్దిగాంచిన వాడు హనుమంతుడు. దాస భక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాముల వారు ముగ్దమనోహరంగా దర్శనమిచ్చారు. నవనీతకృష్ణాలంకారంలో రామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త జన బృందాలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. చిన్ని కృష్ణుడిని లీలలను గుర్తు చేస్తూ రాముల వారు వెన్నకుండతో భక్తులకు దర్శన మిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు మంగళవారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 7 నుంచి 9:00 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు. -
రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు
మైదుకూరు : జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 25న బుధవారం పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి బైపాస్ సర్వీస్ రోడ్డు వద్ద పాల వ్యాన్ ఢీకొని ద్విచక్రవాహనంలో వెళుతున్న దువ్వూరుకు చెందిన మొగిలిచర్ల భానుప్రకాష్ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్‌పై ఉన్న మరో యువకుడు గంగా ప్రసాద్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ధర్మవరం నుంచి చాపాడు మండల పరిధిలోని ఓ పాల ఫ్యాక్టరీకి పాలను తీసుకొచ్చి తిరిగి వెళుతూ బైక్‌ను ఢీకొన్న పాలవ్యాన్ డ్రైవర్ షేక్ మస్తాన్‌ను సోమవారం శ్రీనగరం వద్ద అరెస్టు చేసి, పాల వ్యాన్‌ను సీజ్ చేశారు. జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన ప్రకాశం జిల్లా దర్శికి చెందిన డ్రైవర్ మస్తాన్‌పై హత్య కేసుకు సమానమైన సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ రమణారెడ్డి తెలిపారు. -
భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
కమలాపురం : పరిశ్రమల్లో పని చేసే ప్రతి ఒక్కరూ భద్రతను బాధ్యతగా తీసుకుని పని చేయాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(డీసీఐఎఫ్) చిన్నారావు తెలిపారు. సోమవారం మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్)లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్లాంట్ హెడ్ రామమూర్తి, సీటీఓ అతుల్ ప్రియదర్శి, చీఫ్ మేనేజర్ భార్గవ్‌రెడ్డి, సేఫ్టీ ప్రతినిధి అమూల్య, సేఫ్టీ ఇన్చార్జి మహేశ్వర్ రెడ్డిలతో కలసి జాతీయ భద్రతా జెండాను ఆవిష్కరించారు.అలాగే ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన పని ప్రదేశంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పీపీఈ(పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) స్టాల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీసీఐఎఫ్ చిన్నారావు మాట్లాడుతూ భద్రత నాతో ప్రారంభం అవుతుంది అనే భావనతో ప్రతి వ్యక్తి అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా థీమ్‌ను ఉదహరణలతో వివరించారు. ప్లాంట్ హెడ్ రామ మూర్తి మాట్లాడుతూ భద్రత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగమై ఉండాలన్నారు. ప్లాంట్‌లో ప్రతి పనిని భద్రతతో చేయడం అత్యంత అవసరన్నారు. సీటీఓ అతుల్ ప్రియదర్శి మాట్లాడుతూ పని ప్రదేశంలో ఉన్న అసురక్షిత పరిస్థితులను తక్షణం గుర్తించి వాటిని సరిదిద్దాలన్నారు. అనంతరం భద్రతపై చిన్నారులు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భద్రతపై చైతన్యం పెంపొందించడంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు, పాఠశాల, పాలిటెక్నిక్ విద్యార్ధులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టను నియోజకవర్గకేంద్రంగా ప్రకటించాలి
● రాష్ట్ర అధికారిక రామాలయం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి ● కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిరాజంపేట : డిలీమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఒంటిమిట్టను నియోజకవర్గ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ధానిక శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో కలిసి సీతారామ,లక్ష్మణ విగ్రహమూర్తులను దర్శించుకున్నారు. అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను ఎంపీకి వివరించారు. భక్తులకు అభివాదం చేశారు.క్యూలో భక్తులు ఎంపీని ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం ఆలయం బయట ఎంపీ మీడియాతో మాట్లాడారు. డిలీమిటేషన్ అనేది కళ్లముందు కనిపిస్తోందన్నారు. ఒంటిమిట్టకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఒంటిమిట్టకు ఉన్న ప్రాముఖ్యత, చరిత్రను ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఆ దిశగా నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండబోతున్నాయన్నారు. ఒంటిమిట్ట నియోజకవర్గ కేంద్రమైతే బాగుంటుందని, ఆదిశగా తాను కూడా ఏకీభవిస్తునని ఎంపీ తమ మనోగతం తెలియచేశారు. రైళ్ల హాల్టింగ్స్పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి రాష్ట్ర విభజన తర్వాత అధికారిక రామాలయం ఒంటిమిట్ట శ్రీ కోదంరామాలయం గుర్తింపులోకి వచ్చిందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో స్ధానిక ఎంపీ పీవీమిథున్రెడ్డి, తాను ఢిల్లీలో ఇది వరకే పలుమార్లు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో అన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. రాష్ట్ర నలుమూలలే నుంచి కాకుండా, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట రామాలయానికి భక్తులు వచ్చేలా రైళ్ల సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం బ్రహ్మోత్సవాల తరుణంలోనే కాకుండా ఏడాదిపాటు అన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామాలయ చరిత్రను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, భక్తులకు రైలుప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నామన్నారు. శ్రీరామచంద్రుని జీవితం ఆదర్శనీయం శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. తాగ్యానికి, ధర్మానికి మారుపేరు కోదండరాముడన్నారు. ప్రజలు, రైతులు బాగుండాలని కోదండరామున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఏప్రిల్ 1న జరిగే దాశరథి కల్యాణోత్సవంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కల్యాణం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. టీటీడీ, ప్రభుత్వం సమన్వయంతో కల్యాణోత్సవంను జయప్రదంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నామన్నారు. ఎంపీతోపాటు ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరిసుధా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్, మాజీ మేయర్లు సురేష్‌బాబు, పాకా సురేష్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, జెడ్పీమాజీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియన్ నేత ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, మాజీ ఉపమేయరు నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు
● మే 1 నుంచి 31వరకు జిల్లా వ్యాప్తంగా శిక్షణ తరగతులు ● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ మదనపల్లె సిటీ: జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వార్షిక కోచింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 1 నుంచి 31వతేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. చిన్న వయస్సులోనే (8 నుంచి 14 ఏళ్లు) పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించడం, వారిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం శిబిరాల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి శిబిరంలోనూ 25 మంది బాలురు, 25 మంది బాలికలకు అవకాశం కల్పిస్తామన్నారు. బాస్కెట్‌బాల్, పుట్‌బాల్, చెస్, అథ్లెటిక్స్, ఖో–ఖో, బ్యాడ్మింటన్, జూడో,కబడ్డీ, హ్యాండ్‌బాల్, షూటింగ్‌బాల్, ఫెన్సింగ్, కరాటే, తైక్వాండో, రెజ్లింగ్,హాకీ, వాలీబాల్, బాక్సింగ్లతో పాటు ఇతర క్రీడల్లో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ శిబిరాలను నిర్వహించేందుకు ఆసక్తిగల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, సీనియర్ కోచ్‌లు, క్రీడా అసోసియేషన్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శిక్షకులుగా వ్యవహరించదలచిన వారు తమ దరఖాస్తులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు మదనపల్లెలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
మంత్రి సమక్షంలో టీడీపీ పంచాయితీ
● ఎమ్మెల్యే, వ్యతిరేక వర్గాల పరస్పర ఫిర్యాదు ● గౌరవం లేదంటూ కార్యకర్తల ఆగ్రహం మదనపల్లె: మదనపల్లె టీడీపీ వర్గపోరు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వద్దకు చేరింది. సోమవారం ఆయన మదనపల్లె పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గంతో పాటు, వ్యతిరేక వర్గీయులు చేరుకున్నారు. మొదట మంత్రితో ఏకాంతంగా ఎమ్మెల్యే తీరుపైన, పార్టీలో గౌరవం లేకపోవడంపై, కనీస ప్రాధాన్యత దక్కకపోవడంపై నాయకులు తమ ఆగ్రహాన్ని మంత్రి ఎదుట వెళ్లగక్కారు. పార్టీ సీనియర్లమై ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీడీపీకి కష్ట కాలమేనని మంత్రి ఎదుట కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. తర్వాత ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తర్వాత కొంతసేపటికి ఎమ్మెల్యే రావడంతో ఇరువర్గాలను ఆయన సమక్షంలో మంత్రి మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఫిర్యాదులతో ఇబ్బందుల వద్దంటూ హితబోధ చేసినట్లు తెలిసింది. కార్యాలయం వెలుపల కొందరు కార్యకర్తలు తీవ్ర అగ్రహంతో కేకలు పెట్టారు. ఎవరికి వారు వర్గపోరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తాము ఏ వర్గం వైపు వెళ్లాలని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమం కదా అని ఎవరో ఒకరి వెంట వెళితే మిగతా వర్గీయులు తమకు వ్యతిరేకమవుతున్నారని, ఈ పరిస్థితి లేక కొన్ని సాగితే పార్టీ పరువు పోతుందని ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు. నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆవేశంతో ప్రశ్నించారు. ఇదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ రావడంతో ఆయనతో వాగ్వాదం చేశారు. కాగా మంత్రి జనార్దన్ రెడ్డి మదనపల్లిలో పార్టీ పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసి నట్లు తెలిసింది. తాను మదనపల్లెకు వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య వస్తోందని అసంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈమధ్య వర్గపోరు మరింత ముదిరిందని ఆయన అసహనం చెందినట్లు సమాచారం. -
జాంబవంతుని శోభ.. అజరామరం
● 108 అడుగుల విగ్రహం ఏర్పాటుపై కసరత్తు ● దాశరథి కల్యాణంరోజున విగ్రహానికి శంకుస్థ్ధాపన?రాజంపేట : ఏకశిలానగరికి జాంబవంతుని శోభ సంతరించుకోనుంది. జాంబవంతుడు సీతారామ,లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించినందుకు ఇప్పుడు జాంబవంతుని కీర్తిప్రతిష్టలు ఇనుమడించనున్నాయి. ఏపీలో రామారాధనకు ప్రముఖ కేంద్రంగా ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచేలక్ష్యంతో రామాయణంలో కీలక పాత్ర పోషించిన జాంబవుంతుని విగ్రహాన్ని రాములోరి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టించాలని యోచిస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్గొంటున్నాయి. ఏకశిలానగరం(ఒంటిమిట)లో ఇప్పుడు రామాలయం సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటు దిశగా టీటీడీ మాస్టర్‌ప్లాన్ తీసుకొచ్చింది. ఆలయాన్ని అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో సాంస్కృతిక పర్యాటకాన్ని పెంపొదించడానికి రూపొందించిన బృహత్ ప్రణాళికలో జాంబవంతుడు విగ్రహం ఏర్పాటు ఒక భాగమని టీటీడీ వర్గాలు తెలిపాయి. అన్నమయ్య విగ్రహం తరహాలో.. తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి సందర్భంగా 108 అడుగుల విగ్రహాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది రాజంపేటకే ల్యాండ్‌మార్క్‌గా మారింది. ఇదే తరహాలోనే ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఏకశిలానగిరికి ల్యాండ్ మార్క్‌గా నిలిచేలా రూపకల్పన జరుగుతోంది. భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. కాగా ఇప్పటికే దాశరధి కల్యాణమండపం సమీపంలో నామమాత్రంగా జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అధ్యాతిక్మ క్షేత్రంగా.. ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లోని శ్రీ కోదండరామాలయం అధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది ఒంటిమిట్ట చెరువు జాతీయరహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో వైపు జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. వచ్చెనెల 1న రాము లోరి కల్యాణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అదే రోజున సీఎం చేతుల మీదుగా జాంబవంతుని విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా టీటీడీ ఇంకా ప్రకటించలేదు. మరోవైపు విగ్రహానికి సంబంధించి డిజైన్ తుదిదశకు చేరుకున్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన
మదనపల్లె: ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఓ కళ్యాణమండపంలో 2026–27 బడ్జెట్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ అమలు, కేటాయింపులు, లక్ష్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో ప్రతి అధికారి బడ్జెట్ అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు బడ్జెట్ కేటాయింపులు కేవలం పత్రాల పరిమితిలో ఉండకుండా, ప్రజలకు వాస్తవ లాభాలుగా మారేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎమ్మెల్యే షాజహన్‌బాషా, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ మంత్రి జనార్దనరెడ్డి -
● ఎత్తిపోతల పథకం ఎందుకుంటే...
● కృష్ణాలో తగ్గిన వరద నీటి రోజులు ● పోతిరెడ్డిపాడు ఒక్కటే నీటి అవసరాలు తీర్చలేదు ● మాజీ సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ‘సీమ ఎత్తిపోతల’కు శ్రీకారం ● సీఎం చంద్రబాబు అండ్ కో కుతంత్రాలతో ఆగిన పనులు ● నేడు మదనపల్లెలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతల రౌండ్ టేబుల్ సమావేశం సాక్షి ప్రతినిధి, కడప: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగంలోకి తెస్తూ, దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటి భద్రతను చేకూర్చాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడమే లక్ష్యంగా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరాక తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి ఎత్తిపోతల పనులు నిలిపివేయంతో ఇక్కడి ప్రజానీకంలో తీవ్ర ఆందోళన, అభద్రత నెలకొంది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల స్థాయి నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ.3,825 కోట్లుకు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసుకొని ఎత్తిపోతల పనులు ఎన్నికలకు ముందు శరవేగంగా సాగాయి. ఎన్నికలు పూర్తి అయ్యాక రాయలసీమ ఎత్తిపోతల పథకం మరుగున పడింది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని నిలిపివేయించినట్లు ప్రకటించారు. దాంతో ఒక్కమారుగా రాయలసీమకు చోటుచేసుకున్న అన్యాయం బహిర్గతమైంది. శాశ్వత ప్రయోజనం కోసమే... రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే రాయలసీమ, నెల్లూరు జిల్లాలు పూర్తి స్థాయిలో సుభిక్షం అవుతాయి. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా రెండో దశలో ఉమ్మడి వైఎస్సార్ కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి– హంద్రీ–నీవా సుజల స్రవంతిని అనుసంధానిస్తూ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించిన నీటిని గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా హంద్రీ–నీవా రెండో దశకు తరలించి, ఆ నీటిని నిల్వ చేసేందుకు ముదివేడు, నేతిగుంటపల్లి, అవులపల్లి వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ సర్కారే ఆ మూడు ప్రాజెక్టుల కోసం రూ.669కోట్లు వెచ్చించింది. ఆ రిజర్వాయర్లు ద్వారా 1.10లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులను వైఎస్ జగన్ సర్కార్ పరుగులెత్తించారు. ఈ పసులకు కూడా చంద్రబాబు సైంధువుడిలా అడ్డుపడ్డారని రాయలసీమ వాసులు వాపోతున్నారు. రాయలసీమకు శాశ్విత ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్టును అర్థాంతరంగా నిలబెట్టిన ఘనత చంద్రబాబు సర్కార్‌దేనని విశ్లేషకులు వాపోతున్నారు. ప్రత్యక్ష ఆందోళనకు వైఎస్సార్సీపీ శ్రీకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం వైఎస్సార్సీపీ ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్నీ జిల్లాల పరిధిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను వివరిస్తూ గళమెత్తారు. ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో కార్యాచరణ కోసం గ్రేటర్ రాయలసీమ పరిధిలో అన్నీ జిల్లాలకు చెందిన నాయకులు కడప కేంద్రంగా ఏకమయ్యారు. కార్యచరణ దిశగా మంగళవారం మదనపల్లె కేంద్రంగా ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సాకే శైలజానాథ్, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, రమేష్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబు, మదనపల్లె ఇన్ంఛార్జి నిస్సార్‌అహమ్మద్ తదితరులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో క్షేత్రస్థాయి కార్యచరరణ నిమిత్తం ప్రణాళికలు చేపట్టనున్నారు. -
పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు
సదుం : పిచ్చికుక్క దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చెరుకువారిపల్లెలో సోమవారం సాయంత్రం జరిగింది. ఇంటి వద్ద కూర్చొని ఉన్న మస్తాన్‌పై పిచ్చికుక్క దాడి చేసింది. గాయపడిన బాలుడిని సదుం సీహెచ్‌సీకి వైద్యం కోసం తరలించారు. కుక్కల బెడద అరికట్టాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. అదృశ్యమైన వ్యక్తి మృతిపెద్దతిప్పసముద్రం : బి.కొత్తకోట మండలానికి చెందిన చలపతి (55) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అదృశ్యమైనట్లు బాధిత కుటుంబీకులు అక్కడి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతి కమ్మవారిపల్లి సమీపంలోని రోడ్డు పక్కన అచేతనస్థితిలో పడి ఉండటాన్ని సోమవారం గుర్తించిన పశు కాపరులు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎస్ఐ పరమేశ్ నాయక్ సిబ్బందితో వెళ్ళి సమగ్రంగా విచారించగా మృతుడు చలపతిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ఢీకొనితల్లీ కుమారుడికి తీవ్ర గాయాలుమదనపల్లె టౌన్ : కారు ఢీకొని తల్లీ కుమారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. మదనపల్లె పట్టణం, రామిరెడ్డి లే ఔట్ వినాయకుని గుడి వద్ద నివాసం ఉంటున్న జానకి, ఆమె కుమారుడు నిఖిల్ ఇద్దరూ వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి శ్రీరామ నవమి వేడుకలకు ఆదివారం వెళ్లారు. తిరిగి రాత్రి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తుండగా కాశీరావు పేట సమీపంలోని హైవేరోడ్డు మేకలవారిపల్లె బస్ స్టాఫ్ వద్ద, కారు బైక్‌ను ఢీకొని వెళ్లి పోయింది. ఈప్రమాదలో తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు గమనించి ఆటోలో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మోత్సవాల డ్యూటీలు తప్పుల తడక కడప కార్పొరేషన్ : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని మల్టీపర్పస్ బృందాలుగా ఏర్పాటు చేసి డ్యూటీలు వేశారు. కాలమ్ నంబర్ 11లో వీఆర్లకు మాత్రమే డ్యూటీలు వేశారు. అయితే ఈ ప్రొసీడింగ్స్ అన్నీ తప్పుల తడకగా ఉన్నాయని తెలుస్తోంది. మరణించిన వారికి, బదిలీ అయిన వారికి, పదోన్నతి వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సైతం ఇక్కడ డ్యూటీలు వేయడం పట్ల ఉద్యోగులు విస్తుపోతున్నారు. 2025 సచివాలయ ఉద్యోగుల డేటా తీసుకొని ఆదరా బాదరాగా డ్యూటీలు వేసినట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది. సీరియల్ నంబర్.6లో డి. గంగన్న సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో వీఆర్ఓగా ఉండి రెండు నెలల క్రితం చనిపోయారు. ఆయనకు బ్రహ్మోత్సవాలకు డ్యూటీ వేశారు. సీరియల్ నంబర్–42లో దేవానంద కుమార్ అన్నమయ్య జిల్లా రాయచోటికి బదిలీ అయ్యారు. సీరియల్ నంబర్–7లో డి. సుబ్రమణ్యం పోరుమామిళ్లకు, సీరియల్‌నంబర్–8లో ఏ.సురేష్ రాజంపేటకు బదిలీ అయ్యారు. అలాగే జి.మధుసూదన్ బద్వేల్‌కు, బి.శ్రీనివాసులు వల్లూరుకు, బి.రామచంద్రారెడ్డి పోరుమామిళ్లకు. జి.గురు నరసింహ సిద్దవటంకు ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు. సీరియల్‌నంబర్–30లో ఉన్న కుమార్ సిద్దార్థ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఈయనకు కూడా బ్రహ్మోత్సవాల్లో డ్యూటీ వేశారు. సీరియల్ నంబర్–91 వై. వేణుగోపాల్ సస్పెండ్ అయ్యారు. సీరియల్ నంబర్–44లో ఉన్న శేషారెడ్డి మూడేళ్ల క్రితం పదోన్నతి పొంది సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. ఆయనకూ డ్యూటీ వేశారు. కె. సుబ్బరామయ్య అనే వీఆర్ఓకు నందలూరులో, కడపలో రెండు చోట్లా డ్యూటీ వేయడం గమనార్హం. -
తేరు కదిలె.. భక్తులు మురిసె
● వైభవంగా పట్టాభిరాముడి రథోత్సవం ● మార్మోగిన రామనామస్మరణవాల్మీకిపురం : శ్రీ పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవర్లను శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువుదీర్చిరు.తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల రామనామస్మరణతో ఆప్రాంతమంతా మార్మోగింది. డప్పు, వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, సంకీర్తనల నడుమ కోలాహాలంగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.రథోత్సవం అనంతరం రథం యథాస్థానానికి చేరిన తర్వాత స్వామివారిని తిరుచ్చిలోకి వేంచేపు చేసి హారతి ఇచ్చారు. వేకువజామున మూలవర్లకు తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం,అర్చన, మొదటి గంట, శాత్తుమొర కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది, జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8నుంచి 9గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, 10 నుంచి స్నపన తిరుమంజన, సాయంత్రం 6 నుంచి ఊంజల్ సేవ, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారి పార్వేట ఉత్సవం. -
పట్టా భూమిని అక్రమించుకున్నారు
రొంపిచెర్ల : పట్టా భూమిని కొందరు డీకేటీ పట్టాతో అక్రమించుకున్నారని బాధితులు సయ్యద్ గఫూర్‌సాబ్ మనవళ్లు సయ్యద్ బాషా, సయ్యద్ అజంతుల్లా, సయ్యద్ ఇదాంతుల్లా రొంపిచెర్ల తహసీల్దార్ కిరణ్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మా తాత సయ్యద్ గఫూర్‌సాబ్ పేరుతో సర్వే నంబరు 558–17లో 4 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇప్పుటికి కూడా అన్లైన్లో ఆమర పేరుతోనే ఉందన్నారు. అయితే రొంపిచెర్లకు చెందిన కొందరు మాకు తెలియకుండానే పట్టా భూమిని డీకేటీ పట్టా తీసుకుని అక్రమించుకున్నారని, మామిడి చెట్లు నాటారని తెలిపారు. దీనిపై గత 10 సంవత్సరాలుగా మండల, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. మా పట్టా భూమి ఎక్కడ ఉందో కొలతలు వేసి చూపించాలని మండల రెవెన్యూ అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. మాకు ఉన్న ఆస్తిని కూడా బెదిరించి కాజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అధికారులు న్యాయం చేయకపోతే ఆత్యహత్యలే శరణమన్నారు. నోటీసులు జారీ చేశాం: తహసీల్దార్ గతంలో రిజిస్టర్ అయిన పట్టా భూమికి డీకేటీ పట్టా మంజూరు చేసి ఉన్నారు. దీనిపై బాధితులు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశాం. త్వరలోనే భూమిని కొలతలు వేసి వాస్తవాలను తెలుసుకుంటాం. సయ్యద్ గఫూర్‌సాబ్ భార్య, ఇద్దరు కుమారులు మరొకరికి అగ్నిమెంట్ రాసి ఇచ్చినట్లు కూడా మాకు ఫిర్యాదు వచ్చింది. రిజిస్టర్ భూమిని అగ్రిమెంట్ చేసుకున్నా చెల్లదన్నారు. విచారణ చేసి పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు.న్యాయం చేయాలని తహసీల్దార్‌కు వినతి -
మదనపల్లె మణప్పురంలో మోసం
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో మనప్పురం రీతు జువెలరీస్ దుకాణంలో భారీ మోసం వెలుగు చూసింది. తరుగు, కూలీ లేకుండా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మ బలికి అమాయక ప్రజలు, వినియోగారులు, ఖాతాదారుల చెంత రూ.కోట్లల్లో డబ్బులు వసూలు చేసిన మేనేజర్ పరారవడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రీతు జువెలరీస్‌లో కేరళకు చెందిన సూరజ్ మేనేజర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో మణప్పురం జువెలరీ సంస్థ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. తరుగు, కూలీ లేకుండానే బంగారం ఇస్తాం అంటూ ఊదరగొట్టి, చీటీల రూపంలో నెల నెల సాధారణ ప్రజలు, ఖాతాదారులు,వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు పథకంలో పట్టణంతో పాటు జిల్లాలోని అనేక మందిని చేర్పించినట్లు తెలిసింది. వీరి దగ్గర డబ్బు పొగుచేసిన మేనేజర్ సూరజ్ పైకం మెత్తాన్ని ఐడీల ద్వారా దొంగ రశీదులు తయారుచేసి తన సొంత అకౌంట్‌కు వేయించుకున్నట్లు సమాచారం. ఇలా సుమారు రూ.2.5 కోట్లకుపైగా వినియోగదారుల డబ్బులు దారి మళ్లించి ఇటీవల సూరజ్ సంస్థకు కూడా కూడా బురిడీకొట్టించి పరారయ్యాడు. కంతులు తీరిన బాధితులు, చీటీలు కట్టిన వారు క్యూ కడుతున్నా వారికి యాజామాన్యం నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. దీంతో బాధితులు విసిగిపోయి సోమవారం రాత్రి మణప్పురం రీతు జువెలరీ దుకాణం వద్దకు చేరుకుని ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్ మోహన్ ను నిలదీశారు. తాము సూరజ్ చేతిలో మేసపోయామన్నారు. తాము సంస్థను చూసి పెట్టుబడి పెట్టామని తమకు సంస్థనే పూచిపడి ఎప్పట్లోగా ఇస్తారో తేల్సాల్చి ఉందని బాధితులు నిలదీశారు. సంస్థ మేనేజర్ నుంచి సమాధారం రాక పోవడంతో బాధితులు నిరసన తెలిపారు.ఈ విషయమై ప్రస్తుత మణప్పురం మేజర్ మోహన్ మాటాడుతూ.. తాను ఇరవై రోజుల క్రితమే వచ్చానని, తనకు ఏమి తెలియదని సమాధానం ఇచ్చాడు. ఒకటో పట్టణ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించిన జువెలరీ మేనేజర్ -
కడప, కర్నూలు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్‌లు కొనసాగాయి. సోమవారం వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కడప–నెల్లూరు జట్లు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. నిర్ణీత 37.2 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది.జట్టులోని రణధీర్ రెడ్డి 51, సుదర్శన్ 45 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సయ్యద్ షాహుల్ హామీద్ 5 వికెట్లు తీశాడు. భార్గవ్ మహేష్ 2, భార్గవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 37.5 ఓవర్లల్లో 231 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని మన్విత్ కుమార్‌రెడ్డి 50, సూతేజ్‌రెడ్డి 32 పరుగులు చేశారు. కడప జట్టులోని మహ్మద్ ఆయూబ్ 5 వికెట్లు, రాజేష్ 2, ఆదిల్ హుస్సేన్ 2 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది, ● కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్‌గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. జట్టు లోని నాయిముల్లా 103, సాయి సూర్య తేజరెడ్డి 134 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 2, గౌతమ్ కృష్ణతేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 43.2 ఓవర్లకు 265 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని తేజరెడ్డి 131, చరణ్‌జిత్ 86 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాబ్జాన్బాషా 5, రెహమాన్ 2, సాయి సూర్యతేజరెడ్డి 2, తీశారు. దీంతో 76 తేడాతో కర్నూలు జట్టు విజయం సాధించింది. -
పేదల ఇళ్లకు ఆర్థికసాయం
– కలెక్టర్ నిశాంత్‌కుమార్ మదనపల్లె: పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. సోమవారం మదనపల్లె మండలం కోళ్లబయలు పంచాయతీ ఒకటవ సచివాలయం పరిధిలో హౌసింగ్ లేఅవుట్లో నిర్వహించిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇళ్లు మంజూరై పూర్తికాని ఇళ్లకు సంబంధించి బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడి రమేష్ రెడ్డి, ఎంపీడీవో తాజ్ మస్రూర్, హౌసింగ్ ఏఈ దీనదయాల్ రాజు, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓగా రామచంద్రారెడ్డి కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారిగా ఆర్.రామచంద్రారెడ్డిని నియమిస్తూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌శాఖ సోమవారం జీఓఆర్టీ నెంబరు 228 జారీ చేసింది. పత్తికొండలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డిని సీఈఓగా పదోన్నతి కల్పించి కడపకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సొంతింటి కల సాకారం – ఇన్‌ఛార్జి మంత్రి సవిత కడప సెవెన్‌రోడ్స్ : పట్టణ పేదల సొంతింటి కలనురాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అన్నారు. సోమవారం కడప నగరం లక్ష్మీనగర్ టిడ్కో కాలనీలో నిర్మించిన ఇళ్లను మంత్రి సవిత ప్రారంభించారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని వివరించారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు సొంతింటి కల నిజం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కడప నగర పరిధిలో 2432 జీ+3 గృహాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, జేసీ డాక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి టైలరింగ్‌లో శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మహిళలు, యువతులకు టైలరింగ్‌లో (31 రోజులు), బ్యూటీ పార్లర్లో (35) రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని 18–50 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. హుండీ ఆదాయం లెక్కింపు గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి హుండీ ద్వారా రూ. 4.11,573 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. సోమవారం స్థానిక ఆలయంలో నాలుగునెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ్ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం ద్వారా ఆల యానికి 25.450గ్రాముల బంగారు, 305గ్రా ముల వెండి ఆభరణాలు, నగదు రూపంలో రూ.4.11,579 ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. ఆలయఽ చైర్మన్ రాజన్ననాయుడు, ఆలయ పాలకమండలి సభ్యులు, పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా మద్యం దందా
● రాయచోటిలో నిరంతరం మద్యం అమ్మకాలు ● పట్టించుకోని అధికారులురాయచోటి : మందు బాబులకు న్యాయమైన మందును తక్కువ ధరకే విక్రయిస్తామని మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మందుబాబుల రక్తాన్ని డబ్బు రూపంలో పీల్చుతున్నారు. రాయచోటి పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లోనే నిరంతరం మద్యం విక్రయాలు సాగుతున్నాయి. సాధారణంగా ఉదయం 10 నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాల్లో మందును విక్రయించాల్సి ఉంది. రాయచోటి పట్టణంలో మాత్రం ప్రధాన షాపుల్లో తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్లినా ఒకడోరు తెరిచి మద్యాన్ని విక్రయించడం కనిపిస్తోంది. పట్టణ శివారుల్లో ఉన్న కూల్ డ్రింక్స్ షాపుల్లో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం ఏ రీతిలో మద్యం విక్రయాలను సాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏ పల్లె, మారుమూల గ్రామానికి వెళ్లినా బెల్టు షాపులు లెక్కలేనన్ని కనిపిస్తాయి. గుడి, బడి, జనవాసాలు అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మద్యం దుకాణాల యజమానులే అమ్మకాలను పెంచుకోవడానికి వీటిని నిర్వహిస్తున్నారని ప్రచారం ఉంది. ప్రతినెల మద్యం షాపులు, బార్లు, బెల్టు షాపుల నుంచి ముడుపులు ముడుతుండటంతో సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల మేరకు విక్రయాలు చేయించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో మద్యం వ్యాపారుల దందా మూడు చీప్‌లు.. 30 లిక్కర్లుగా సాగుతోంది. సంసారాలు నాశనం అవుతున్నాయని మహిళలు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా అధికారులు మాత్రం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విక్రయిస్తున్న మద్యం షాపులు, బెల్టు షాపులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వానికి లెక్కలు చూపడానికి ఒకటి రెండు కేసులు నమోదు చేయడం తప్పా సీజ్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యాపారంపై, బెల్టుషాపులపై చర్యలు లేకపోవడం గమనార్హం. రాయచోటి పట్టణ పరిధిలో పది షాపులు.. మూడు బార్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా సమీప ప్రాంతాల్లోనే హోటల్ ప్రత్యేక గదుల్లో మద్యం తాపిస్తూ వారి నుంచి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. బెల్టుషాపుల్లో చీప్ లిక్కర్‌పై రూ. 20లు.. మిగిలిన మద్యంపై రూ. 50 నుంచి రూ. 100ల వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. రాయచోటి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లోనే మద్యం, గంజాయి సేవించి సమీప ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నా.. ఎకై ్సజ్, పోలీసుల చర్యలు కనిపించలేదు. రాయచోటిలోని మదనపల్లె, చిత్తూరు, గున్నికుంట్ల, సుండుపల్లి, గాలివీడు, వేంపల్లి, కడప, వీరబల్లి మార్గాల పరిధిలోని కూల్ డ్రింక్స్ షాపులలో సైతం మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నారు. రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లలో సైతం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయించి మద్యం తాపిస్తున్నా చర్యలు మాత్రం కనిపించలేదు. రాయచోటి పట్టణ పరిధిలో అనధికారికంగా మద్యం..అవే దుకాణాల్లో గంజాయి విక్రయాలు కూడా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఎకై ్సజ్, పోలీసు శాఖలు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
బైక్‌ను ఢీకొన్న మినీ బస్సు
చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని చిన్నకొండామర్రి వద్ద బైక్‌ను మినీ బస్సు ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి జరిగింది. తిరుపతి పట్టణం అవిలాలకు చెందిన నాగరాజ(45) బోయకొండ మార్గంలోని పరిసర ప్రాంతంలో పందులు మేపుతు సొంతపనిపై బైక్‌లో చౌడేపల్లెకు వచ్చాడు. మార్గమద్యలోని చిన్నకొండామర్రి వద్ద చిత్తూరుకు చెందిన ఓ మినీబస్సు ఢీకొంది. ఈ ఘటనలో నాగరాజ తలకు, కాలికి తీవ్ర గాయలయ్యాయి. అపస్మారస్థితికి చేరుకొన్నాడు. స్థానికులు 108 సహాయంతో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి కుటుంభ సభ్యులు ఎవరు లేకపోవడం, గాయపడిన వ్యక్తి ఎవరని సందిగ్ధతతో సుమారు గంటన్నరసేపు క్షతగాత్రుడు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న ఘటన పలువురిని కలిచివేసింది.గాయపడిన వ్యక్తి జేబులో సుమారు లక్షకుపైగా నగదు ఉండడంతోపాటు అతని సెల్‌ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి చేరుకొని , 108 డీఎంతో ఫోన్లో మాట్లాడారు. 108 వాహనంలో నాగరాజను మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని జేబులో ఉన్న నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదుచేసి ధర్యాప్తుచేస్తున్నట్లు ఎ్‌స్‌ఐ వివరించారు.ఒకరికి తీవ్రగాయాలు -
ఆటో బోల్తా : ఐదుగురికి తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్ : ఆటోబోల్తా పడి ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు, మదనపల్లె జిల్లా ఆస్పత్రిఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. బీరంగి కొత్తకోటకు చెందిన హమీదా, మోసీన మరో ముగ్గురు ఓ ఆటోలో బీసి కాలనీకి బయలుదేరారు. ఆటోలో వెళుండగా దారిలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చిక్సిలు చేయించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంపై నుంచి పడి యువకుడికి.. మదనపల్లెటౌన్ : శ్రీరామ నవమి ఉత్సవాలను పురష్కరించుకొని రామాలయానికి డెకరేషన్ లైట్లు వేసే క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఆలయం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె మండలంలో ఆదివారం జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రానికి చెందిన శ్రీనివాసులు కొడుకు రాంబాబు (19), మదనపల్లె మండలంలోని వేంపల్లెలో ఉన్న రామాలయానికి శ్రీరామ నవమి సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. వీరితో పాటు పనులకు ఉనక్రమించిన రాంబాబు ఆలయం పై భాగంలో డెకరేషన్ లైట్లు అమర్చుతుండగా ప్రమాద వశాత్తు ఆలయం పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని వద్దురాలికి.. మదనపల్లెటౌన్ : ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వృద్దురాలు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని చెర్లోపల్లె గ్రామం, పాలకుంటవారిపల్లెకు చెందిన అనసూయమ్మ(62) రోడ్డు దాటుతుండగా చిన్నమండెం, మండలం, బోనమలకు చెందిన ఓ స్కూటరిస్టు వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయాడు. బాధితురాలిని కుటుంబీకులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం ఆమెను అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రకేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కమనీయం.. సీతారాముల కల్యాణం
వాల్మీకిపురం : జిల్లాలో ప్రసిద్ధి చెందిన వాల్మీకిక్షేత్రం శ్రీ పట్టాభిరామస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం రాత్రి 8నుంచి 10గంటల వరకు ఆశ్లేష నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన, మొదటి గంట, శాత్తుమొర, అనంతరం ఉదయం 8 నుంచి 9గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అలాగే 10నుంచి 12గంటల వరకు స్నపన తిరుమంజనానికి విచ్చేసిన భక్తులు కార్యక్రమాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. సాయంత్రం ఊంజల మండపంలో స్వామివారికి ఊంజల్ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 8నుంచి 10గంటల వరకు పట్టణ పరిధి తోటవీధిలోని టీటీడీ స్థలంలో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలను అందించారు. కల్యాణోత్సవానికి జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు రావడంతో తోటవీధి కిక్కిరిసింది. ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు నూతన వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, భక్తులు పాల్గొన్నారు. గరుడవాహనంపై రఘురాముడి విహారం వాల్మీకిపురం : వాల్మీకిక్షేత్రం శ్రీ పట్టాభిరామస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం రాత్రి కల్యాణోత్సవ అనంతరం సీతారామలక్ష్మణలు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.. మహిళలు స్వామివారికి టెంకాయలు, కర్పూర నీరాజనాలతో స్వాగతం పలికారు. ఉభయదారులు నిర్వహించిన బాణా సంచాప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి. నేడు రథోత్సవం వాల్మీకిపురం : శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7గంటలకు రథారోహణం, 9:10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందు కోసం రథాన్ని శుద్ధి చేసి, రంగురంగుల పుష్పాలు, మామిడి ఆకుల తోరణాలు, అరటి కొమ్మలతో అలంకరించారు. -
వైభవంగా సింహ వాహనసేవ
కలకడ : మండలంలోని కదిరాయచెర్వులో గ్రామ దేవత శ్రీచౌడేశ్వరిదేవి ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. ఆదివారం అమ్మవారు సింహవాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ ఇంటింటి పూజలు అందుకున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన జ్యోతి ఉత్సవాలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. తొగటవీరక్షత్రియుల కుల దైవమైన శ్రీచౌడేశ్వరి దేవికి బోనం సమర్పించారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులు ప్రతి ఇంట మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. మారీచ చలనచిత్రం పోస్టర్ ఆవిష్కరణమదనపల్లె సిటీ : మదనపల్లె యువ కళాకారులు నటించిన మారీచ చలనచిత్రం పోస్టర్లను ఆదివారం స్థానిక కురవంకలో సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.మునిగోపాలకృష్ణ ఆవిష్కరించారు. చిత్ర నిర్మాత ప్రకాష్, డైరెక్టర్ శివాజీ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన ఆమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. సందేశాత్మక విలువతో చిత్రం నిర్మించామన్నారు. కథానాయకుడు సంతోష్ మాట్లాడుతూ అందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వీఏఎఫ్ ఫౌండర్ భానుప్రకాష్, సయ్యద్ అజామ్, మల్లీశ్వరి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిపీలేరురూరల్ : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన ఎస్. వంశీకృష్ణ (40) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలో కల్యాణమండపం వద్ద మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. -
ఘరానా మోసగాళ్ల ముఠా అరెస్టు
● రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా మోసం ● 15 పోలీస్స్టేషన్లలో కేసుల నమోదురాయదుర్గం : అమాయకులకు లాభాల ఆశ చూపి.. వారి నుంచి నగదు వసూలు చేసుకుని మోసగిస్తూ.. ఎవరైనా నిలదీస్తే చంపుతానని బెదిరింపులకు దిగుతూ, అప్పుడప్పుడూ దారిదోపిడీలకు సైతం తెగబడుతున్న ముఠా గుట్టును రాయదుర్గం రూరల్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు ఈ ముఠాపై 15 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త ఓబులేసు నార్పల చుట్టుపక్కల ప్రాంతాల్లో గుజిరీ వ్యాపారం చేసేవాడు. అయితే ఇందులో వచ్చే ఆదాయం చాలడం లేదని చక్కెర, సిగరెట్ల హోల్‌సేల్ వ్యాపారిగా అవతారమెత్తాడు. ఈ క్రమంలో పామిడికి చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడికి చెందిన బెస్త మహేంద్రతో జత కట్టాడు. స్కార్పియో వాహనం తీసుకుని తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఓబులేసు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ మనోహార్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చక్కరరెడ్డి పేర్లతో దుకాణాదారులను కలిసి తనవద్ద రూ.లక్ష సరుకు కొంటే రూ.10వేలు ఆదాయం పొందవచ్చని ఆశ చూపించాడు. దీంతో చాలామంది అతడి మాటలు నమ్మి డబ్బు చెల్లించారు. ఒక్కో ప్రాంతంలో కోటి రూపాయల దాకా వసూలు చేశాక అక్కడి నుంచి మరొక చోటుకు మకాం మార్చేసేవాడు. కొన్ని ప్రాంతాల్లో గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఎక్కువ ఖరీదు కట్టి.. అడ్వాన్సు చెల్లించి గొర్రెలను తీసుకెళ్లి.. తర్వాత డబ్బు చెల్లించకుండా తప్పించుకునేవాడు. బాధితుడి ఫిర్యాదుతో.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ గోవిందును కలిసి.. అతనివద్ద ఉన్న గొర్రెలను కొనడానికి బేరం కుదరకపోవడంతో వెనుదిరిగాడు. అయినా రెండు రోజులుగా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. బోయగోవిందు ఎత్తి ఎత్తినబూదేహాళ్లో బంధువుల వద్ద రూ.1.50 లక్షల నగదు తీసుకుని స్వగ్రామం నేమకల్లుకు ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో యూనిక్ క్రషర్ చెక్‌పోస్టు వద్ద స్పార్పియో వాహనంలో వచ్చిన ఓబులేసు బృందం అడ్డుకుంది. చాకుతో బెదిరించి అతడి జేబులోని నగదును దోచుకుని ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో విచారణ జరిపితే అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉద్దేహాళ్‌లోని ఓ గదిని ఓబులేసు బృందం అద్దెకు తీసుకుని, ఫేక్ ఐడీలతో సిమ్‌లు కొనడం, అవసరం తీరాక తీసేయడం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం నేమకల్లు సమీపంలో ఇన్చార్జ్ ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియోలో వచ్చిన ఓబులేసు బృందాన్ని పట్టుకుని విచారణ చేయడంతో వీరి మోసాలు బయటపడ్డాయి. ఓబులేసు, పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, బెస్త మహేంద్రలపై తాడిపత్రి, యర్రగుంట, ప్యాపిలి, ఆత్మకూరు, మెలకలచెరువు, కలికిరి, నల్లచెరువు, నెల్లూరు, యర్రగొండపాళ్యం, సోమందేపల్లి, గార్లదిన్నె, కూడేరు, ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తేలాయి. ఘరానా మోసగాళ్ల ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన రూరల్ సీఐ వెంకటరమణ, సిబ్బందిని ఎస్పీ జగదీష్, డీఎస్పీ రవిబాబు అభినందించి, రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో కణేకల్లు ఎస్ఐ నాగమధు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అత్యవసర సమయాల్లో ప్రజలే ప్రాణదాతలు
● స్వాస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన ● పల్స్ బ్రోచర్స్ ఆవిష్కరించిన ముంతాజ్ అలీమదనపల్లె రూరల్ : ప్రజలు ప్రథమచికిత్సపై అవగాహన పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో చొరవ చూపి ప్రాణాలను రక్షించడం ద్వారా ప్రాణదాతలుగా మారవచ్చని సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ శ్రీ ఎం (ముంతాజ్‌అలీ) అన్నారు. అత్యవసర సమయాల్లో అందించాల్సిన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు స్వాస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్స్‌ను ముంతాజ్ఆలీ చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం ముంతాజ్ఆలీ మాట్లాడుతూ...మానవత్వానికి కులం, మతం లేదన్నారు. అత్యవసర సమయంలో ఎవరైతే స్పందించి ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వస్తారో వారు భగవంతుడితో సమానమన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో చికిత్స అందక చాలామంది చనిపోతుంటారన్నారు. అత్యవసర సమయంలో వైద్యుల వద్దకు వెళ్లేలోపు, కీలకమైన మొదటి గంట గోల్డెన్ అవర్‌లో బాధితుడికి అందించే సహాయం అమూల్యమైనదన్నారు. ఈ సమయంలో సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. స్వాస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో అత్యవసర సమయాల్లో స్పందించేందుకు సాధారణ ప్రజలు నేర్చుకోగల నైపుణ్యాలను నేర్పేందుకు ప్రత్యేకంగా పల్స్ కార్యక్రమం రూపొందించామన్నారు. ఇందులో భాగంగా 8వతరగతి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకునేలా అత్యవసర సమయాల్లో ప్రదర్శించాల్సిన నైపుణ్యాలను పల్స్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తామన్నారు. గుండెపోటు, ప్రమాదాలు, బ్రెయిన్ డ్యామేజీ తదితర ఘటనల్లో వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్సలు అందించేందుకు ముందుగా చేయాల్సిన చికిత్సా విధానాలు(సీపీఆర్) శిక్షణ రూపంలో తెలియజేస్తామన్నారు. వీటిని నేర్చుకోవడం వల్ల అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో స్వాస్థ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్.వెంకటరమణ, డాక్టర్.శోభ వెంకట్, డాక్టర్.మంజునాథ్ శర్మ, పల్స్ కో ఆర్డినేటర్ పద్మా నాయుడు, ఆర్ఎంఓ డాక్టర్.ఆదర్శ్, ఫీల్డ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ : నగలు, నగదు అపహరణ
పుంగనూరు : మండలంలోని చిన్నతాండలో నివాసం ఉన్న దేవిప్రసాద్నాయక్ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళాలు పగులగొట్టి బీరువాలోని 56 గ్రాముల బంగారునగలు, రూ.10 వేలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు పీలేరురూరల్ : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీఎస్ఆర్ కల్యాణమండపంలో ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయులు టెట్ నిబంధన విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంటే, పరిష్కార చర్యలు చేపట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ఉండడం మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్ ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలోనూ ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, ఐఆర్‌పై ప్రభుత్వ మొండి వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్. సాయిశ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎ. శివారెడ్డి, ఎస్టీయూ నాయకులు కె.వి. శేఖర్, గాజుల నాగేశ్వరరావు, పి. రమణారెడ్డి, బాలగంగిరెడ్డి, పోకల మధుసూదన, జగన్మోహన్రెడ్డి, కడియాల మురళి, మోహన్, వేణుగోపాల్‌రెడ్డి, గంటా మోహన్ పాల్గొన్నారు. 2029లో వైఎస్సార్సీపీ గెలుపొందాలని ప్రార్థనలు పుంగనూరు : రాష్ట్రంలో 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందాలని అజ్మీర్ దర్గాలో ఆదివారం స్థానిక ముస్లింలు ప్రార్థనలు చేశారు. మైనార్టీ నాయకులు రజీఅహమ్మద్, మస్తాన్, ఫకృద్ధీన్, ఖాదర్‌బాషాలు అజ్మీర్‌కు వెళ్లారు. అజ్మీర్దర్గాలో చాదర్ అందజేసి దువ్వా చేశారు. పుంగనూరులో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కుటుంబం బాగుండాలని, వైఎస్సార్సీపీ రాష్ట్రమంతా గెలుపొంది, వైఎస్. జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి -
‘సీమ’ హక్కులు సాధించుకుందాం
మదనపల్లె: సీఎం చంద్రబాబునాయుడు తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తెలంగాణకు తాకట్టు పెట్టారని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు సాధించుకుందామని వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశాల మే రకు స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాలులో మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్య నేత లతో సదస్సు జరుగుతుందని తెలిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేస్తారని, రాజంపేట ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, రమేష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీకులు సురేష్‌బాబు, ఇతర ముఖ్య నేతలు హజరవుతున్నట్టు చెప్పారు. ఈ సదస్సులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చిస్తామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత, రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరాలు, సాగునీటి విస్తరణ, రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చలు, అభిప్రాయాలు పంచుకోవడం జరుగుతుందని తెలిపారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సాధించేందుకు పార్టీ కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రేపు మదనపల్లెలో వైఎస్సార్సీపీ సదస్సు వెల్లడించిన నిసార్ అహ్మద్ -
ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు
కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరా యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ పరిసరాలు, కళ్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పీ బి.రమణయ్య, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పీ విభుకృష్ణ, రాజంపేట ఏ.ఎస్.పీ హెగ్డే పాల్గొన్నారు. పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం
కడప సెవెన్‌రోడ్స్: క్రైస్తవులు క్రిస్మస్ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈస్టర్ పండుగను కూడా అలాగే నిర్వహిస్తారు. ఆదివారం వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మట్టల ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈస్టర్ పండుగకు వారం రోజుల ముందు పామ్ సండేను నిర్వహించడం పరిపాటి. కడప నగరంలో క్రైస్తవులు ఉదయాన్నే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈత మట్టలు ధరించి ఆయా చర్చిల చుట్టూ ప్రదర్శనలు నిర్వహించారు. ఏప్రిల్ 3వ తేది గుడ్‌ఫ్రైడే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను చర్చిలలో ప్రసంగీకులు భక్తులకు వినిపిస్తారు. ఏప్రిల్ 4వ తేది నాటికి ఉపవాస దీక్షలు ముగుస్తాయి. మరుసటిరోజు ఆదివారం క్రీస్తు పునరుత్తానం కనుక ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ఐజాక్ వరప్రసాద్‌తో పాటు విశ్వాసులు పాల్గొన్నారు. -
నేడు జేసీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎ్‌స్
మదనపల్లె: స్థానిక కలెక్టరేట్లో సోమవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమ నిర్వహణ జరుగుతుందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రితో కలెక్టర్ సమావేశాలు ఉండటంతో ఆయన అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను జేసీకి విన్నవించుకోవచ్చని కోరారు. అలాగే ఆన్లైన్ వెబ్సైట్లోనూ ఫిర్యాదులు నమోదు చేసుకో వచ్చని తెలిపారు. ఈ విధానంతో కలెక్టరేట్‌కు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. గుర్రంకొండ: చల్లంగా చూడు..రెడ్డెమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారి ఎదుట ప్రణమిల్లారు. మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మ వారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. మదనపల్లెటౌన్: మదనపల్లెలో ఆదివారం జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి లోకేష్ బాబు మాట్లాడుతూ స్థానిక బెంగుళూరు రోడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉండే బీటీ కళాశాల పీజీ హాస్టల్లో జిల్లా ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఇకపై మదనపల్లె జిల్లా కేంద్రంలోనే ట్రెజరీ సేవలనుసద్వినియోగం చేసుకోవచ్చనన్నారు. కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సేవలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్టీఓ లు రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, నజీర్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్‌రోడ్స్: వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవితా సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. నేరుగా కడప ఆర్ అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఉద యం 10 గంటల నుంచి ఒంటిమిట్ట టీటీడీ కార్యాలయంలో కోదండ రామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవం నిర్వహణపై నిర్వహించే సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారని వివరించారు. మదనపల్లె అర్బన్: ప్రతి ఒక్కరూ మానవ హక్కులపై అవగాహన పెంచుకుని అభివృద్ధి చెందాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టీస్ కమిషన్ సంస్థ వైస్ చైర్పర్సన్ వాణి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ సభ్యులు మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ లీగల్‌సెల్ జాయింట్ సెక్రటరీ తుర్లు ఆనంద్యాదవ్ను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కోవర్టులు.. కోటరీలోనే!
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్‌లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ● కడప టీడీపీలో జోష్ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టుడుగు స్థానానికి వచ్చిందని గతంలో సీనియర్ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టేసిందని ఆరోపించారు. దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచీ టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు. కనుమరుగవుతున్న పాతతరం నేతలు... సాక్షాత్తు టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకొండారెడ్డిపై ప్రత్యక్ష దాడి చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వారు ఓ డివిజన్ టీడీపీ ఇంఛార్జి వెంకటేష్‌పై మూకుమ్మడి దాడి చేశారు. కీలక నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనం అంటూ పాత తరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఎమ్మెల్యే కోవర్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో..పాత తరం వారే కోవర్టులని సర్దిచెప్పుకుంటుంటే...పాత తరం వారు మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కోవర్టులంటూ చెప్పుకొస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్య ఇప్పటికే సీనియర్లకు ప్రాధాన్యత లేదని కేడర్‌లో ఆవేదన -
విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి
గాలివీడు: మండలంలోని గరుగుపల్లె పంచాయతీ పరిధిలోని ఇడపన్ చేనుపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటలను అడవి జంతువుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది.గ్రామానికి చెందిన పందికుంట సాయికుమార్ రెడ్డి (19) తన సొంత పొలంలోని వేరుశనగ పంట వద్ద విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు కథనం మేరకు ప్రతిరోజూ పంట కాపలాకు తండ్రి ఇరగం రెడ్డి లేదా తల్లి ఆకులమ్మ వెళ్లేవారు.ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సంఘటన జరిగిన రోజు సాయికుమార్ రెడ్డి తన తండ్రికి భోజనం తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించలేదు.ముందుకెళుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తండ్రి ఇరగం రెడ్డి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సాయికుమార్ రెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఇరగం రెడ్డికి ముగ్గురు సంతానం. సాయికుమార్‌రెడ్డి రెండవ కుమారుడు.ఇతను గాలివీడులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసినట్లు తెలిసింది. -
కేజీబీవీ నైట్ వాచ్మెన్ ఆత్మహత్యాయత్నం
పెద్దమండ్యం: ఆకారణంగా తనను నైట్ వాచ్మెన్ విధుల నుంచి తొలగించారని మహిళా వాచ్మెన్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రిన్సిపల్, ఎంఈవో–2 ల వేధింపులే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కలిచెర్లకు చెందిన విశ్వనాథ భార్య వైజయంతి సిద్దవరం కేజీబీవీలో నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆంగళ్లుకు సమీపంలోని చేనేతనగర్‌లో నివాసం ఉంటూ రోజువారీగా విధులకు వచ్చి వెళతోంది. ఈ క్రమంలో కేజీబీవీలో విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోలు హల్చల్ చేశాయి. పత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. దీంతో సంబంధిత అధికారులు అప్పట్లో విచారణ నిర్వహించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు ఎప్పుడో తీసినవని అధికారులు నివేదించినట్లు సమాచారం. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి కేజీబీవీలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నైట్‌వాచ్‌మెన్‌కు ఒకటిన్నర సంవత్సర కాలంగా జీతం చెల్లించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌కు, నైట్‌వాచ్‌మెన్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. విధుల నిర్వహణ విషయంలో తన భార్యకు ఇచ్చే నోటీసులపై వివరణ ఇచ్చినా ఉన్నతాధికారులకు పంపకుండా ప్రిన్సిపల్, పాఠశాల తనిఖీ కోసమని వచ్చే ఎంఈవో 2, వేధింపులకు గురి చేసి, నిందలు మోపి ఉన్నతాధికారులకు నివేదించారని భర్త ఆరోపిస్తున్నాడు. విధుల నుంచి తొలగించారని వాట్సప్ ద్వారా సమాచారం అందడంతో చేనేతనగర్‌లో నివాసం ఉన్న ఇంటిలో విషద్రావణం తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. నైట్‌వాచ్‌మెన్ సంఘటనపై ప్రిన్సిపల్ రాణికుమారిని వివరణ కోరగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి నైట్‌వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ విషయమై తనకు ఎటువంటి సంబంధం లేదని ఎంఈవో–2 జి రామకృష్ణ తెలిపారు. ప్రిన్సిపల్, ఎంఈవో–2 వేధింపులే కారణమని ఆరోపణ -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తంబళ్లపల్లె మండలం, కన్నె మడుగు కు సాకలపల్లికు చెందిన వరుణ్ (25) మదనపల్లెలో డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో సొంత పని మీద బైకులో బోయకొండకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. బైక్ కురబలకోట మండలం, దాదాంవారిపల్లి దగ్గరకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఆటో ఢీకొని భవన కార్మికుడికి.. మదనపల్లె టౌన్: ఆటో ఢీకొని భవన కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుని కథనం మేరు... మండలంలోని సీటీఎం గంగాపురానికి చెందిన భవన కార్మికుడు బాలాజి(27) రోజూ మాదిరిగానే భవన నిర్మాణం పనులు చేయడానికి మదనపల్లెకు వచ్చాడు. సాయంత్రం వరకు పనులు చేసి చీకటి పడగానే బైకులో ఇంటికి బయలు దేరాడు. సీటీఎం రోడ్డు, ఐదోమైలు రాయి వద్ద ఉండే పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చాడు. అదే సమయంలో ఓ ఆటో వేగంగా వచ్చి బాలాజి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రకి తరలించగా డాక్టర్లు వైద్యం అందించారు. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల నిర్లక్షం.. పూలతోటల్లోకి నీరు
పుంగనూరు: ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్షంతో కౌలురైతు సాగు చేస్తున్న పూలతోటల్లోకి హంద్రీనీవా నీరు వదలడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మండలంలోని గుడిసెబండకు చెందిన నాగరాజు చెండుమల్లెపూలతోట సాగు చేశాడు. శనివారం అధికారులు హంద్రీ–నీవా నీటిని చెరువుల్లోకి వదిలారు. కాలువలును సక్రమంగా నియంత్రించకపోవడంతో నీళ్లు వేగంగా వచ్చి పూలతోటలు, వరిపంటల్లోకి వచ్చాయి. పూలు కుల్లిపోయి రూ. లక్షల నష్టం వాటిల్లింది. తమకు నష్టపరిహారం అందించాలని రైతు నాగరాజుతో పాటు పలువురు కోరుతున్నాడు. హత్య కేసులో నిందితుడి ఇళ్లు ధ్వంసం మదనపల్లెటౌన్: మదనపల్లె మండలం, వలసపల్లె గ్రామం, అరవాండ్లపల్లెకు చెందిన పూల దివాకర్ జనవరిలో అదే ఊరికి చెందిన గణేష్ చేతిలో దారుణ హత్యకు గురికావడం తెలసిందే. ఈ కేసులో స్థానిక తాలూక పోలీసులు నిందితులను అరెస్టుచేసి జైలుకు పంపారు. అయితే పూల దివాకర్‌ను హత్య చేసిన నిందితునిపై ప్రతీకారం పెంచుకున్న దివాకర్ కుటుంబీకులు గణేష్ ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో గణేష్ కుటుంబీకులు మదనపల్లె తాలూకా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే తాలూకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో అరవవాండ్లపల్లెకు వెళ్లి గ్రామస్తులను విచారించారు. ఒకే ఊరికి చెందిన వారు కావడంతో సంయమణం పాటించాలని సూచించారు. గొడవలుపడుతూ సమస్యలు తీసుకు వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని సిఐ హెచ్చరించారు. కంకర తొలగించమన్నందుకు గొడ్డలితో దాడి ప్రొద్దుటూరు క్రైం : రహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంకరను తొలగించమని చెప్పిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సూపర్‌బజార్ రోడ్డులోని శ్రీకాళహస్తి వీధికి చెందిన దుద్యాల హరి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. ఆయన ఇంటి వద్దనే ఎలక్ట్రికల్ పని చేసే సత్యం అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై కంకర తోలాడు. రోడ్డుకు అడ్డంగా కంకర ఉండటంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడేవారు. ఈ క్రమంలో హరి కూడా బైక్‌లో అదే దారిలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతను అక్కడే ఉన్న సత్యం వద్దకు వెళ్లి దీన్ని ప్రశ్నించాడు. రోడ్డుకు అడ్డంగా కంకర వేస్తే వాహనదారులకు ఇబ్బంది కదా.. కావున తొలగించాలని హరి సూచించాడు. ఆగ్రహించిన సత్యం నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ హరిని పరుష పదజాలంతో ధూషించాడు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లెవరూ నన్ను ప్రశ్నించలేదు, నువ్వు ప్రశ్నిస్తావా నిన్ను చంపితే ఎవరు కాపాడతారు అంటూ గొడ్డలి తీసుకొని హరి తలపై కొట్టడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. సత్యం భార్య విజయ కూడా గొడ్డలి తిరగేసి హరిని కొట్టింది. హరికి తలతో పాటు శరీరంపై గాయాల య్యాయి. హరి తల్లి సావిత్రమ్మపై కూడా ఇరువురు దాడి చేయగా ఎడమ చేతికి గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డు పడి హరిని, సావిత్రమ్మను కాపాడటంతో ప్రమాదం తప్పింది. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తనను చంపడానికి యత్నించిన సత్యం, అతని భార్య విజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భర్తతో కాపురం చేయనివ్వడం లేదు
మైదుకూరు : అత్తామామలు, ఆడపడుచులు తనను భర్తతో కాపురం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ ఓ యువతి అత్తింటి వద్ద బైఠాయించిన సంఘటన శనివారం మైదుకూరు పట్టణంలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన తప్పెట సునీత అనే బాధిత యువతి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సునీతకు మైదుకూరుకు చెందిన గోపవరం నవీన్ కుమార్‌తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందే యువతి హైదరాబాద్‌లో, నవీన్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. వివాహం తర్వాత ఇద్దరం కలిసి కాపురం పెడదామని సునీత కోరినా కొన్నాళ్లు ఆగాలని భర్త చెప్పాడు. రెండున్నరేళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరితో కాపురం పెట్టిస్తామని పెద్ద మనుషులు చెప్పడంతో సునీత హైదరాబాద్ వెళ్లిపోయింది. తర్వాత తనకు తన భార్య సునీతతో ప్రాణహాని ఉందని నవీన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు తీసుకునేందుకు సమ్మతి తెలిపిందని పత్రాలు సృష్టించి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి రెండు మూడు రోజులుగా సునీత అత్తింటి వద్దకు రాగా అత్తా మామలు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో శనివారం సాయంత్రం అత్తింటి వద్ద బైఠాయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, తల్లిదండ్రులు వివాహ సమయంలో 16 తులాలు బంగారు ఆభరణాలు పెట్టారని, రూ.7లక్షలు ఖర్చు చేసి పుట్టింటి వారే వివాహం జరిపించారని తెలిపింది. పెళ్లి తర్వాత కాపురం పెట్టాలని కోరగా తన భర్త వాయిదా వేస్తూ వచ్చాడని పేర్కొంది. తాను పండుగ రోజుల్లో హైదరాబాద్ నుంచి వస్తే అత్త, ఆడపడుచులు ఇంట్లోకి రానివ్వరని ఆరోపించింది. అదనపు కట్నంగా స్థలాలు, ఇల్లు రాయించుకుని రావాలని అత్త లక్ష్మీదేవి తనను వేధిస్తోందని తెలిపింది. వేధింపులు తాళలేక మైదుకూరు పోలీసులను ఆశ్రయించగా ప్రొద్దుటూరులో ఫిర్యాదు చేయాలని చెప్పారని, ప్రొద్దుటూరు టూటౌన్ పోలీసుల వద్దకు వెళితే మైదుకూరులో ఫిర్యాదు చేయమన్నారని వాపోయింది. దిక్కు తోచక వారం కిందట ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయినా ఇంత వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని అన్నారు. తాను ఇంటి వద్దకు రాగానే అత్తా మామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి సునీత కోరుతోంది. -
మనోహరం..మోహినీస్వరూపం
మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తిసూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న ప్రతాప రాముడు వాల్మీకిపురం: జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన వాల్మీకిక్షేత్రంలోని శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి పల్లకీలో మోహినీ అవతారంలో తేజోమూర్తిగా మురిపిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన నిర్వహించారు.అనంతరం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సూర్యప్రభ వాహన సేవ అనంతరం 10 గంటల నుంచి స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం 6 గంటల నుంచి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి 8గంటలకు పల్లకీలో మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, చెక్కభజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 8గంటల నుంచి తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ఊంజల్‌సేవ, 8నుంచి 10గంటల వరకు శ్రీరామ కల్యాణోత్సవం, 11నుంచి 2.30గంటల వరకు గరుడసేవ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వాల్మీకిపురం: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలల్లో భక్తులు తరలిరానున్నారు.ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్థానిక తోటవీధిలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రేపు రథోత్సవం శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7గంటలకు రథారోహణం, 9:10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం రథాన్ని, రంగురంగుల పుష్పాలు, అరటి కొమ్మలతో అలంకరించారు. సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీరాముడి విహారం -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
ప్రొద్దుటూరు క్రైం : మూడు రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసిన మల్లెపూల భువనేశ్వరి (30) చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్కు చెందిన భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ తాపించి ఆమె కూడా అదే కూల్‌డ్రింక్ తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. భువనేశ్వరి, పెద్ద కుమార్తె సుష్మల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు తల్లీకూతుళ్లిద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే సాయంత్రానికి ఇద్దరూ స్పృహలోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి భువనేశ్వరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ముగ్గురు పిల్లలు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కోలుకుంటున్న ముగ్గురు పిల్లల -
బంతి.. బంతికీ బెట్టింగ్
రాయచోటి/రాయచోటి జగదాంబసెంటర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2026 (ఐపీఎల్) 19వ సీజన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ఉత్కంఠగా సాగే ఈ క్రికెట్ మ్యాచ్‌లను అభిమానులు ఆసక్తిగా చూస్తారు. అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగనున్నారు. శ్రీమీ ఫేవరెట్ టీమ్ గెలుస్తుందా.. నిజంగా టీమ్‌పై అభిమానం ఉంటే బెట్టింగ్ కట్టవచ్చు కదా.. సరదాకు సరదా.. డబ్బులూ గెలుచుకోవచ్చూ.. అంటూ ముగ్గులోకి దించుతున్నారు. బెంగళూరు కేంద్రంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు మండలాల కేంద్రాలకు.. గ్రామాలకు బెట్టింగ్ వ్యవహారం విస్తరిస్తోంది. ఇదేమీ గుట్టుగా కాదు ఆన్‌లైన్‌ద్వారా బహిరంగంగానే సాగిస్తున్నారు. బెట్టింగ్ అంతా సెల్ఫోన్లోనే సాగుతోంది. ఇరువురు ఫోన్లలోనే కాంటాక్టు చేసి బెట్టింగులు కాయిస్తున్నారు. గెలిచిన వారి నుంచి కమీషన్ పొందేలా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఎంతో మంది యువకులు బెట్టింగ్‌లో ఓడి అప్పుల పాలవడం, కొందరు అప్పుల్లోకి కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకున్న సంఘటనలు గతంలో జరిగాయి. టాస్ వేసే సమయం నుంచి బ్యాటింగ్ ఎవరు ఎంచుకొంటారు.. బౌలింగ్ ఎవరు చేస్తారు.. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు తీస్తాడు.. ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయి.. ఎవరు గెలుస్తారు.. ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తి కానుంది.. ఇలా ప్రతి దానికీ ఒక పందెం ఉంటుంది. ప్రత్యేక యాప్‌ల ద్వారా: అండ్రాయిడ్ సెల్ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు కొన్ని యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం.. మ్యాచ్ చూసేందుకు ఒకటి.. బెట్టింగ్ కాసేందుకు మరో మొబైల్ వినియోగించి ఆన్లైన్లో క్రికెట్ బుకీలు సంప్రదింపులు జరుపుతూ కమీషన్ పొందనున్నారు. పెద్ద పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ యువత పోగై తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకొని బెట్టింగ్‌లకు దిగుతున్నారు. గతంలో ఎవరెవరు బెట్టింగ్‌లకు పాల్పడింది గుర్తిస్తే బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా పెట్టి తగ్గించవచ్చు. బెట్టింగ్ వ్యవహారం అంతా కోడ్ లాంగ్వేజీలోనే సాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. సెల్ఫోన్లోనే ఎస్.. నో.. ఓకే.. డన్.. ఈటింగ్ వంటి పదాలు దీనికోసం వాడనున్నారు. గ్రౌండ్లో చూసే ఆటకు.. టీవీల్లో చూసే వారికి రెండు నుంచి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. ఆట ముందే తెలుసుకొని బెట్టింగులు కాసే వారి జేబులను బుకీలు గుల్ల చేస్తుంటారు. ఇది యువత గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు అభిమానుల ఆసక్తిపై బుకీల వల బెట్టింగ్‌లోకి దింపి.. గుల్ల చేస్తున్న వైనం క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో యువతను ఊబిలోకి దింపి ఆన్లైన్లో, ప్రత్యేక యాప్‌ల ద్వారా నేరుగా ఆడించి కమీషన్లు పొందే వారిపై కఠినచర్యలు తప్పవు. యువత కూడా క్రికెట్ మోజులో పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. పోలీసులు అధునాతన టెక్నాలజీతో పర్యవేక్షిస్తున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. – కృష్ణమోహన్, డీఎస్పీ, రాయచోటి -
ప్రమాదాల నివారణపై కార్యాచరణ
మదనపల్లె: ప్రమాదాల నివారణపై రూపొందించిన కార్యాచరణ పక్కాగా అమలు జరగాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. శనివారం కలెక్టరేట్లో రహదారుల భద్రతపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అధికారుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రహదారుల భద్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు, హిట్ అండ్ రన్ కేసులు, రహదారులపై భద్రత అవగాహన కార్యక్రమాలు, ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై తీసుకున్న చర్యలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయరహదారిని కలిపే ప్రాంతాల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. రాయచోటి, చిన్నమండెం, మదనపల్లె ప్రాంతాల్లో బైక్‌లు, కారు ప్రమాదాలు అధికంగా ఉన్నాయన్నారు. మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకొని అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో జాతీయ రహదారులపై 18 బ్లాక్ స్పాట్లను గుర్తించామని వీటి మరమ్మత్తులు జరగాల్సి ఉందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే రహదారుల వద్ద, అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్పీడ్ బ్రేకర్లు, బ్లాక్ స్పాట్స్ వద్ద వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 10 లోపు చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, డిఎంహె చ్ఓ లక్ష్మీనరసయ్య, ఆర్ అండ్‌బీ ఈఈ అరవిందాదేవి, డిస్కం ఈఈ గంగాధరం, డీఎం వెంకటరమణారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి, హైవే అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
●రోడ్డు పనుల నిలిపివేతపై నిలదీత
● అరటి రైతులను ఆదుకోవాలి ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తక్షణమే చేపట్టాలని, జిల్లాలో అకాల వర్షాలతోపాటు పశ్చిమాసియా సంక్షోభం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతూ జిల్లా పరిషత్‌సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ‘సీమ’జీవనాడి ఎత్తిపోతల తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ తదితర సాగునీటి ప్రాజెక్టులకు జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలంటూ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని తెలిపారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అల్మట్టి ఎత్తు పెంచుతోందన్నారు. ఈ నేపధ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉపయోగం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ఎత్తిపోతలకు అనుమతులు లేవంటున్న టీడీపీ నేతలు పట్టి సీమను ఎలా చేపట్టారని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించకపోవడం వల్ల పర్యావరణ అనుమతులు రాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.సీమ ఎత్తిపోత పనులు తిరిగి చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసేందుకు తొలుత ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అభ్యంతరం చెప్పినా చివరకు అంగీకరించక తప్పలేదు. తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపా రు. జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల అరటి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారన్నారు. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ధరలు దారుణంగా పడిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో అరటి రైతులను ఆదుకునేందుకు ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సోలార్ భూములకు పరిహారం ఇవ్వాలి పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లె సర్వే నెంబరు 676లో బీసీ, ఎస్సీ పేదలు 51.67 ఎకరాల భూమిని చాలాకాలంగా సాగు చేసుకుంటున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ తెలిపారు. ఆ భూములను సోలార్ ప్రాజెక్టు యాజమాన్యానికి తహసీల్దార్ అప్పగించారని చెప్పారు. ఇప్పుడు సోలార్ యాజమాన్యం రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందన్నారు. రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కలెక్టర్ బదులిస్తూ ఆ భూములు ఎస్సీ, బీసీలకు అసైన్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. అందుకే సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చామన్నారు. నిజంగా ఆ భూములుసాగు చేస్తున్నారా? లేదా? అని ఆర్డీఓ విచారణ నిర్వహిస్తారన్నారు. దౌర్జన్యంగా భూముల స్వాధీనం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సోలార్ ప్లాంటు పనులను చేపడుతున్నారని తెలిపారు. రైతులతో అగ్రిమెంటు లేకుండా, లీజు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా పట్టా భూముల్లో కూడా దౌర్జన్యంగా పనులు చేపట్టారని ఆరోపించారు. ● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 16 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయన్నారు. ఇందువల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఖాళీగా ఉన్న విద్యుత్ ఏఈ పోస్టులు భర్తీ చేయాలని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి కోరారు. కారుణ్య నియామకాలపై చర్చ: జిల్లా పరిషత్‌లో బోగస్ సర్టిఫికెట్లతో కారుణ్య ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు పత్రికల్లో వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి కోరారు. 10మంది అనర్హులు బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినమాట నిజమేనని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లు జీతాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీమా, పంట రుణాలపై వాగ్వివాదం పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన బీమా సొమ్ములు ఇప్పించాలని వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి కోరారు. జిల్లాకు బీమా కింద మంజూరైన రూ.173 కోట్లు ఎక్కడుందో చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఒకే డీకేటీ భూమిపై నలుగురు రుణాలు గతంలో పొందారని తెలిపారు. బద్వేలులో ఒకరు అరెస్టు కూడా అయ్యారని పేర్కొన్నారు. దీనిపై బద్వేలు జెడ్పీటీసీ చిన్న పోలిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2025 ఖరీఫ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 25 కోట్లు బీమా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోరారు. కడప వ్యవసాయ మార్కెట్ యార్డులో జంబోషెడ్, టాయిలెట్లు నిర్మించాలని కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా కోరారు. ● ఈ సమావేశంలో జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్ఠాది శారద, పిట్టు బాలయ్య యాదవ్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తాగునీరు లేక అనేక గ్రామాల ప్రజలు అలమటిస్తున్నారని చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెలిగల్లు నుంచి తమ మండలంలోని గ్రామాలకు నీరిచ్చే పథకాలను చేపట్టాలన్నారు. మెగా కంపెనీ అలసత్వం కారణంగా పులివెందుల తాగునీటి పథకం నుంచి తమకు నీరు రావడం లేదన్నారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ 35 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీలు తాగునీటి సమస్యపై గళమెత్తారు. -
రాయంచపై రాములోరి విహారం
ప్రధాన గోపురం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరిన ఒంటిమిట్ట రామయ్య హంస వాహనంపై ఊరేగుతున్న స్వామివారు... గ్రామోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో తదితరులుఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ కనులపండువగా సాగింది. రాయంచపై రాములోరు కొలువై మాడ వీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి ఆధ్వర్యంలో సాగిన ఈ సేవలో వేలాది మంది భక్తులు పాలుపంచుకున్నారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు.హారతి కర్పూరాలతో భక్తులు తమ కోర్కెలు తీర్చాలని రాములవారికి ప్రణమిల్లారు. భక్తుల విన్నపాలను ఆలకిస్తూ..అభయమిస్తూ ..జీవన విధానానికే ఒకే సందేశమిస్తూ స్వామివారు ముందుకు కదిలారు. వేణుగానాలంకారంలో.. అంతకుముందు ఉదయం స్వామివారు వేణుగానాలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయి ద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అన్నారు. శనివారం వారు ఒంటిమిట్ట కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను, ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు సమన్వయం చేసుకుని, సమిష్టికిగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జేసీ నిధిమీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దె పాల్గొన్నారు. కనుల పండువగా హంస వాహన సేవ రామయ్య సన్నిధిలోప్రణమిల్లిన భక్తజనం -
రొంపిచెర్ల ఏడీఏ కార్యాలయం రెడ్డిగుంటకు మార్పు
రొంపిచెర్ల : రొంపిచెర్ల మండల ట్రాన్స్‌కో ఏడీఏ కార్యాలయాన్ని సదుం నుంచి చిత్తూరు అవతల ఉన్న రెడ్డిగుంటకు మార్పు చేశారు. సదుం ఏడీఏ కార్యాలయం అన్నమయ్య జిల్లాలో కలవడంతో.. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలకు రెడ్డిగుంట ఏడీఏ కేంద్రంగా ప్రభుత్వం శుక్రవారం మంజూరు చేసింది. ఈ రెండు మండలాలకు సదుం అనుకూలంగా ఉండేదని, ఏవైనా సమస్యలు ఉంటే వినియోగదారులు, రైతులు నేరుగా ఏడీఏను కలిసి పరిష్కరించుకునే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. అయితే సదుం నుంచి రెడ్డిగుంటకు రెండు మండలాలను కలపడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే పక్కనే ఉన్న సదుం, సోమల మండలాలకు సదుంలోనే ఏడీఏ కార్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రావారిపాల్యెం, చిన్నగొట్టిగల్లు మండలాలకు చిన్న గొట్టిగల్లులో ఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలకు పులిచెర్లలో ఏడీఏ కార్యాలయం ఏర్పాటు చేస్తే సరి పోతుందని రైతులు తెలిపారు. అయితే రెడ్డిగుంటకు పోవాలంటే 75 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం రైతులు ఏడీఏ కార్యాలయానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం రొంపిచెర్ల మండలంలో విద్యుత్ శాఖలో 50 శాతం సిబ్బంది కొరత ఉందని, ఇలా చేయడం వల్ల ఉన్న సిబ్బంది పూర్తిగా ఇతర మండలాలకు బదిలీపై వెళ్లే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు. త్వరలో మళ్లీ నియోజకవర్గాలు మారే అవకాశం ఉందని, అప్పటి వరకు యాథావిధిగా ఏడీఏ కార్యాలయాలు ఉండాలని, లేకపోతే వినియోగదారులకు సౌకర్యంగా పులిచెర్లలో ఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వినియోగదారులు, రైతులు కోరుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు -
చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
మదనపల్లె టౌన్ : శ్రీరామ నవమి రోజే ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండుగ పూట చింతకాయలు కోయడానికి కూలీకి వెళ్లిన యువకుడు చెట్టుపై నుంచి కిందపడి మృత్యువాత పడ్డాడు. పిటిఎం మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై మృతుడి కుటుంబీకులు, పిటిఎం పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కమ్మచెరువుకు చెందిన నరసింహులు కుమారుడు పి.విశ్వనాథ్(33)కు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఊరిలో అందరూ నవమి పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పక్క వీధికి చెందిన ఓ వ్యక్తితో కలసి చింత కాయలు కోయడానికి కూలీ పనికి విశ్వనాథ్ వెళ్లాడు. చాకలోని బావి వద్ద చెట్టెక్కి కాయలు కోస్తుండగా పట్టుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఓ ప్రయివేట్ వాహనంలో హుటా హుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితున్ని తిరుపతికి తరలిస్తుండగా వాల్మీకిపురం సమీపానికి వెళ్లగానే విశ్వనాథ్ మృతి చెందాడు. పండుగ రోజు విశ్వనాథ్ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ యజమాని ఇక లేడని తెలియగానే భార్య సునీత, వారి పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీరామ నవమి పండుగను కూడా చేయనీకుండా ఆదేవుడు తన భర్తను పైకి తీసుకెళ్లాడని విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది. ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని పిటిఎం పోలీసులు తెలిపారు. -
విలేకరి ముసుగులో బ్లాక్ మెయిల్
మదనపల్లెటౌన్: విలేకరి ముసుగులో అక్రమాల పేరుతో సబ్రిజిస్ట్రేషన్శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ కొదండరామయ్యతో కలిసి చేసిన బ్లాక్ మెయిల్ కారణంగా ఇద్దరూ జైలుపాలయ్యారు. మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని వాటిని బహిహిర్గతం చేయకుండా ఉండాలంటే తాము అడిగింది ఇవ్వాలంటూ సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఇంటిస్థలం ఇవ్వాలని బెదిరించి కేసులో ఇరుక్కున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం మదనపల్లె వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలు..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నేల్లపల్లి గ్రామానికి చెందిన బూరగన్ దొరస్వామి(45), చిత్తూరులో విలేకరిగా చెలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయి సొసైటీ కాలనీలో నివాసం ఉంటున్న కోదండ రామయ్యతో కలిసి గత కొంతకాలంగా ప్రస్తుత మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లొసుగులు తమవద్ద ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్బడ్డారు. వాటి ఆధారంగా రూ.50 లక్షలు డబ్బు డిమాండ్ చేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా గురుస్వామి వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించి ఫోన్ చేస్తూ, వాట్సప్ మేసేజ్‌ల ద్వారా నిత్యం బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్మెయిల్ చేశారు. బంధువులకు చెందిన ఇళ్లవద్దకువెళ్లి ఫొటోలు తీయడం, వాటిని వాట్సాప్‌లో పంపిస్తూ ఒత్తిడి చేసేవారు. దీంతో గురుస్వామి పోలీసులను ఆశ్రయించి బుధవారం ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ రహీముల్లా దొరస్వామి, కోదండ రామయ్యలపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.50 లక్షల నగదు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ సహా ఇద్దరు అరెస్ట్ -
జాతీయ శిబిరం..భవితకు వరం
మదనపల్లె సిటీ: సమాజ సేవే పరమార్థంగా.. ఉన్నత అవకాశాలే లక్ష్యంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో భాగస్వాములవుతున్నారు. కేవలం చదువులకే పరిమి తం కాకుండా తమ సత్తా ఏమిటో నేటి ప్రపంచానికి చాటి చెబుతామని అంటున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ వి ద్యార్థినులు. కళాశాలకు చెందిన పద్మప్రియ, పవిత్ర, చైతన్య, కె.అఖిల ఈనెల 9వత తేదీ నుంచి 13వతేదీ వరకు డార్జిలింగ్‌లో జరిగిన జాతీయ శిబిరానికి హాజరయ్యారు. వీరికి గైడ్‌గా అధ్యాపకురాలు మోహన్‌వల్లి వ్యహరించారు. డార్జిలింగ్‌లో జరిగిన వివిధ సాహస కృత్యాలు చేసి పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. పలు అంశాలపై అవగాహన విద్యార్థులకు సామాజిక సేవ, దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంపై అవగాహన కల్పించారు. శిబిరంలో పలు రారష్ట్రాలకు చెందిన వారు ఉంటడటంతో అందరితో స్నేహపూర్వక భావనతో మెలిగారు .ఎల్తైన గుట్టలు, అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న వారి స్థితిగతులను తెలుసుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి బాష, పరిజ్ఞానం ఆధారంగా బృందాలుగా విభజించి వివిధ రకాల పోటీల్లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాహస కృత్యాలు విద్యార్థినులు ఐదురోజుల పాటు డార్డిలింగ్లో స్కై, స్లైకింగ్, ట్రెక్కింగ్, షూటింగ్, హైకింగ్, అర్చరీ వంటి కృత్యాల్లో పాల్గొన్నారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, థైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించాయి. -
మలుపు.. ప్రమాదాలకు పిలుపు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడది కేంద్రం, పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. అందులో ప్రధానంగా ప్రొద్దుటూరు మలుపుగా పిలిచే మూడో మలుపు అతి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఎప్పుడు ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఎవరు ఆస్పత్రి పాలవుతారో తెలియక ఆందోళన గురవుతున్నారు. గతవారం వరుసగా మూడు ప్రమాదాలు జరగడం పర్యాటకల్లో భయాందోళనలు కలిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు హార్సిలీకొండపై సేద తీరేందుకు వస్తుంటారు. వీరిలో అత్యధికలు కర్ణాటక, తమిళనాడు,అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పర్యాటకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రమాదాలతో ఘాట్ రోడ్డు ప్రయాణం ఆందోళనకరంగా మారింది. తొమ్మిది కిలోమీటర్ల ఘాట్ హార్సిలీకొండపైకి వెళ్లాలంటే తొమ్మిది కిలోమీటర్లు ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాండ్లమడుగు నుంచి మొదలయ్యే ఘాట్ కొండపై వరకు ప్రమాదకరమైన మలుపులతో, వంపులతో, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించినంత మలుపులు ఉంటాయి. మలుపుల వద్ద అతి జాగ్రత్తగా వాహనాలు నడపకపోతే ప్రమాదం తప్పదు. దీనికి తోడు అతివేగం అనర్ధం చేస్తుంది. నిత్యం ప్రమాదాలే హార్సిలీహిల్స్‌పై ప్రమాదాలు ఒకటి రెండు కాదు నిత్యం జరుగుతున్నాయి. కార్లు బోల్తా పడటం, గంగోత్రి దాటాక మలుపు వద్ద నీలగిరి వృక్షానికి బైక్, కార్లు ఢీకొనడం, కొండపైన నిలిపిన వాహనాలు కిందకు పడిపోవడం, వ్యూపాయింట్ల వద్ద సందర్శకులు ప్రమాదాలకు గురి కావడం, ఇలా లెక్కలేనన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవి కాక కొండ పూర్తిగా దిగాక అతివేగాలకు ఆటో, రవాణా వాహనాల ప్రమాదాలతో చాలామంది మృత్యువాత పడ్డారు. చర్యులు శూన్యం హార్సిలీహిల్స్‌పై జరుగుతున్న వరుస ప్రమాదాలను, భవిష్యత్తు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఒక్కటి లేవు. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేవు, కనీసం సూచికలు కూడా లేవు. పర్యాటకులను అప్రమత్తం చేసే చర్యలు లేవు. బయట ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులకు ఘాట్ రోడ్డుపై అవగాహన ఉండదు. అతివేగంగానో, నిర్లక్ష్యంగానో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూచికలు, వేగ నియంత్రణ పద్ధతులను పాటించకపోతే ఈ ప్రమాదాలకు అంతే ఉండదు. మద్యం ప్రభావం కూడా... హార్సిలీహిల్స్‌కు వచ్చే పర్యాటకులు మద్యం తాగడానికి ఇష్టపడతారు. వెంట మద్యం తీసుకొచ్చి విందులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి బైక్, కార్లు, రవాణా వాహనాలు నడిపే వారిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. కొండ దిగేటప్పుడు వీరు మద్యం తాగారా లేదా అన్న పరీక్షలు నిర్వహించడం మొదలుపెడితే చాలా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం ఈ విషయంలో ప్రణాళిక రూపొందించి పర్యాటకులకు ఏ ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హర్సిలీహిల్స్పై నిత్య ప్రమాదాలతో పర్యాటకుల్లో ఆందోళన ట్రాఫిక్ సూచనలు లేవు, వేగ నియంత్రణపై చర్యలు లేవు మద్యం మత్తులో వాహనాలు నడపడంపై తనిఖీలు శూన్యం కొండ కింద నుంచి పైకి వెళ్లేటప్పుడు మూడో మలుపును ప్రొద్దుటూరు మలుపుగా పిలుస్తారు. దీనికి కారణం ఏమంటే 40 ఏళ్ల క్రితం హార్సిలీ హిల్స్ సందర్శనకు వచ్చిన పెళ్లి బందం బస్సు కొండపై పర్యటించి తిరుగు ప్రయాణంలో ఈ మలుపు కుడివైపున కు తిరగకుండా నేరుగా లోయలోకి దూసుకెళ్లిపడిపోయింది. ఈ ఘటనలో పెళ్లి వారంతా చనిపోయారని స్థానికులు చెబుతుంటారు. అప్పటినుంచి దీనికి ప్రొద్దుటూరు మలుపుగా పేరు నిలిచిపోయింది. ఈ ప్రమాదంతోనే ఇక్కడ ఘటనలు ఆగిపోలేదు. నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. బైక్ నుంచి కార్లు, రవాణా వాహనాలు ఒకటి కాదు ప్రతిదీ మలుపు వద్ద కిందికి దిగేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఇరుకై న మలుపు. దిగేటప్పుడు వేగం పూర్తిగా తగ్గించి ఎదురుగా రోడ్డు ఎలా ఉందో గమనించి వాహనాలు నడిపితే తప్ప ప్రమాదాల నుంచి బయటపడలేరు. దీంతో ఈ మలుపు వద్ద బలమైన గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్స్ కూడా ప్రమాదాల ధాటికి దెబ్బతిన్నాయి. ప్రమాదాలు నివారించాలని చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. లోయలోకి పడకుండా చేశారే తప్ప ప్రమాదం జరగకుండా నివారించలేకపోతున్నారు. దెబ్బతిన్న గ్రిల్స్, పిట్టగోడ మధ్యలో పెద్ద బండరాళ్లు వేసి ఉంచారు. -
ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె మండలం ఆర్సి వడ్డిపల్లికి చెందిన సుధాకర్(45) కులబలకోట మండలం అంగళ్లులో కాపురం ఉంటూ ఆటో నడుపుకొని భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులలో చూపించినా డబ్బు ఖర్చు తప్ప జబ్బు నయం కాలేదు. శుక్రవారం మరోసారి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో భరించలేక పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి వృద్ధురాలి మృతి గాలివీడు : మండలంలోని నూలివీడు పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన నరసమ్మ(86) నూలివీడు కస్పాకు సమీపంలోని బావిలో పడి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నాగూరువాండ్లపల్లికి చెందిన నరసమ్మ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడి కంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేదని, అక్కడ స్థానికులు కనుగొని తమకు అప్పగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. గురువారం రాత్రి కూడా తమ ఇంటిలోని ఉన్నదని, అర్ధరాత్రి సమయంలో లేచి వెళ్లిపోయిందని, ఉదయం చూసేటప్పటికి ఇంటిలో లేకపోవడంతో చుట్టుపక్కల గాలించామన్నారు. ఈ క్రమంలో నూలివీడుకు సమీపంలోని బావిలో శవమై తేలిందని తెలిపారు. ఈ సంఘటనను స్థానిక పోలీసులకు తెలియజేశామన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇంటి సామగ్రి దగ్ధం
గాలివీడు : మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి పెద్దూరుకు వెళ్లే మార్గంలో మసీదు సమీపంలో నివాసం ఉంటున్న మునిరాజు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. బొలేరో ఢీకొని తాత, మనవరాలికి గాయాలు మదనపల్లె టౌన్ : బొలేరో ఢీకొని తాతా మనవరాలు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప తన మనవరాలు హిమశ్రీ(7)ని ద్విచక్ర వాహనంలో కూర్చో పెట్టుకుని మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి బయలు దేరాడు. బైక్ మార్గంమధ్యలోని మదనపల్లె పట్టణం రింగ్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాత, మనవరాలిని స్థానికులు 108లో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై రెండో పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు చికిత్స కోసం వేర్వేరు రోజుల్లో వచ్చిన ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వేర్వేరు సమయాలలో మృతి చెందారు. వారి మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. గాయపడిన తాత, మనవరాలు వీరప్ప, హిమశ్రీ -
పెద్దశేష వాహనంపై రఘురాముడు
● సర్వభూపాలుడిపై శ్రీరామచంద్రడు ● వైభవంగా పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు పెద్దశేష వాహనంపై శ్రీరాముల వారి ఊరేగింపు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తున్న శ్రీరామచంద్రుడు వాల్మీకిపురం : వాల్మీకి క్షేత్రంలోని శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామి వారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవ అనంతరం 10 గంటల నుంచి స్నపన తిరుమంజనం వేడకగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల మండపంలో శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనసేవ కోలాహాలంగా సాగింది. స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మహిళలు పెద్దశేష వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి నేతి దీపాలతో తిరుమాడ వీధుల్లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, అర్చకులు, వైఎస్సార్సీపీ నాయకులు చింతల ఆనందరెడ్డి, నీళ్లభాస్కర్, రఘు, సత్య, శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, 10 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల సేవ, సాయంత్రం 6:30 గంటలకు చంద్రప్రభ వాహనసేవ, 8:30 గంటలకు పల్లకీలో మోహినీ అవతారోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారు. నమో నాగాంజనేయం నాగ ఆంజనేయస్వామి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. శ్రీ రామనవమి పురస్కరించుకుని మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ మైదానం వద్దనున్న వరాల ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారు నాగ ఆంజనేయస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి తలపై నాగదేవతలు, స్వామి తోకకు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. – మదనపల్లె సిటీ -
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిమ్మనపల్లి మండలం బండ్లపై గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు ఆనంద్(27) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తండ్రిపై తనయుడి దాడి మదనపల్లె టౌన్ : మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై తనయుడు కరత్రో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన శుక్రవారం కురబల కోట మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని ఎగువ చెన్నామర్రికి చెందిన రైతు వెంకటరమణ(58) కుమారుడు నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. నాగరాజు ప్రతి రోజు మద్యం తాగి ఇంటికొచ్చి అనుచితంగా ప్రవర్తించేవాడు. శ్రీరామ నవమి పండుగ రోజు కూడా ఇంట్లో మనశ్శాంతి లేకుండా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. తన వద్ద డబ్బులేదని చెప్పడంతో ఆగ్రహించిన నాగరాజు తండ్రి అని కూడా చూడకుండా కరత్రో దాడి చేసి తీవ్రంగా గాయ పర్చాడు. బాధితున్ని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. గుండెపోటుతో వ్యక్తి మృతి ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తుండగా అంజి(44) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తున్న అంజి అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో 108 సహాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100582, 9121100581 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మదనపల్లె టౌన్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె యువకుడు దుర్మరణం చెందాడు. కర్ణాటక పోలీసులు మదనపల్లె తాలూకా పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ కళావెంకటరమణ తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన సమీర్‌బాషా(38) కర్ణాటక రాష్ట్రం చింతామణికి సొంత పని మీద ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. పని ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున మదనపల్లెకి తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని సమీర్ బాషా ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే సమీర్ బాషా మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రాయల్పాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ అనంతరం కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాని అప్పగించారు. -
క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
రామసముద్రం : మండల కేంద్రంలోని దిగుపేటలో క్షుద్ర పూజలు చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా పూజలు చేశారన్న వార్తలు దావానంలా వ్యాపించడంతో మండల ప్రజల్లో కలకలం రేగింది. దిగువపేటకు చెందిన చాంద్ బాషా ఇంటి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి క్షుద్రపూజలు చేసి అక్కడే ఒక పాలిథిన్ కవర్లో కోడి కాళ్లు, పసుపు, కుంకుమ, దారాలు పెట్టి వదిలేసి వెళ్లారు. ఉదయం గమనించిన ఆయన భార్య కుషిద్ బేగం భయాందోళనకు గురై కుటుంబీకులకు సమాచారం అందించింది. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో స్థానిక, మండల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. -
నేడు ఒంటిమిట్టకు ఎంపీ మిథున్‌రెడ్డి రాక
రాజంపేట: ఏకశిలానగిరి (ఒంటిమిట్ట)లో జరుగుతున్న శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు శనివారం రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రానున్నట్లు రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయంలోని సీతారామలక్ష్మణలను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్డ్డితో కలిసి దర్శించుకుంటారన్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు. వీరి వెంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పాల్గొంటారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) పరీక్షకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. ఉపకులపతి స్వయంగా యూజీసీ నెట్/ఏపీ సెట్ ఉచిత శిక్షణా తరగతులు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు (రెగ్యులర్ తరగతులకు ఇబ్బంది కలుగకుండా) నిర్వహిస్తున్నారు. ఈనెల 28 , 29 తేదీలలో సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం శ్రీరామనవమి పండుగ అయినప్పటికీ శుక్రవారం బోధన చేశారు. పరీక్షల్లో రాదగిన అంశాలు, ఎలా ఆన్సర్ చేయాలో వివరించారు. పేపర్–1 లో అధిక మార్కులు స్టోర్ చేస్తే సెట్లో అర్హత సాధించడం సులువుతుందని విద్యార్థులకు తెలిపారు. కొండాపురం: గండికోటజలాశయం నుంచి కృష్ణాజలాలను మైలవరం జలాశయానికి 2500 క్యూ సెక్కులు విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఈఈ ఉమమహేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గండికోట ప్రాజెక్టు నుంచి ఒక గేట్ ఎత్తి మైలవరం జలాశయం పరిధిలో తాగునీటి ఆవసరాలకోసం నీటిని పంపిస్తున్నట్లు వివరించారు. మైలవరం ప్రాజెక్టుకు 2 టీఎంసీలు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. కడప సెవెన్‌రోడ్స్: కడప నగర శివార్లలోని శిల్పారామంలో శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.స్వామి నాయుడు ఆదేశాల ప్రకారం చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్‌లను కేటాయించనున్నట్లు ఇన్చార్జి అధికారి వెంకట సుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేనేత వృత్తులతోపాటు కొండపల్లి బొమ్మలు,కుమ్మర్లకు స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే చిన్నపిల్లలు, పెద్దవారికి సంబంధించిన వినోదాత్మకమైన గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆసక్తి కలవారికి ఈఓఐ పద్ధతి ద్వారా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సంబందిత వర్గాలు ఏప్రిల్ 6వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కడప శిల్పారామం ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు. సౌమ్యనాఽథున్ని దర్శించుకున్న గుంతకల్ డీఆర్ఎం నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని గుంతకల్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం)చంద్రశేఖర్ గుప్తా దంపతులు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. అర్చకులు సునీల్, సాయికృష్ణ డీఆర్ఎం దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పూలమాల, శాలువాతో సత్కరించారు. అనంతరం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయనకు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి డీఆర్ఎంకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
మొరుసుపల్లిలో ఏఎస్పీ, డీఎస్పీల విచారణ
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కమ్మచెరువు పంచాయతి మొరుసుపల్లికి చెందిన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనను కిడ్నాప్ చేసి, ఓ గృహంలో నిర్బంధించి, కులం పేరుతో దూషించాడని ఇదే గ్రామనికి చెందిన ఓ మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, ములకలచెరువు సీఐ వెంకటేశులు, పీటీఎం ఎస్ఐ పరమేశ్ నాయక్‌లు మొరుసుపల్లి గ్రామానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. జరిగిన ఘటనపై ఆరా తీసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని పోలీసులు వెల్లడించారు. మహిళపై దాడి: తీవ్రగాయాలు మదనపల్లెటౌన్: ఇంట్లో ఇంటరిగా ఉన్న మహిళపై దాడి జరిగిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు స్థానిక రామారావు కాలనీకి చెందిన రెడ్డెప్ప భార్య పి.ఉషారాణి(45) కాలనీకి చెందిన ఓ ఉంట్లో అద్దెకు ఒంటరిగా ఉంటోంది. అదే ఇంట్లో పై పోర్షన్లో ఉంటున్న మజ్జిగ కృష్ణారెడ్డికి చెందిన కుక్కలకు కృష్ణారెడ్డి కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి ఉషారాణి ఇంటి గేటు ముందు వేయడంతో ఆమె కృష్ణారెడ్డితో గొడవ పడింది. దీంతో మాటా మాట పెరి గి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉషారాణిపై ఇనుప రా డ్డుతో దాడిచేశాడు. ఘటనలో తీవ్రంగా గాయప డిన బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. మదనపల్లెటౌన్: ద్విచక్రవాహనం పైనుంచి పడి రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని బయప్పగారిపల్లె పంచాయతీ, గుండావాండ్లవారిపల్లెకు చెందిన మిత్రుడు శివారెడ్డితో కలసి సొంత పనిపై బైక్‌లో స్థానిక గుంతవారిపల్లెకు బయలుదేరారు. గుంతవారిపల్లెకు చేరే సమయంలో బైక్ పైన కూర్చొని ఉన్న రైతు చిన్న వెంకటరమణ ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడన అతన్ని స్థానికుల సాయంతో కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంటున్నాడు. మదనపల్లెటౌన్: దాడిలో తండ్రీ కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. బాధితులు పెద్దమండ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని కనకంటివారిపల్లెకు చెందిన రైతులు పాపిరెడ్డి, మల్ రెడ్డిలకు అదే ఊరికి చెందిన రైతు చంద్రశేఖర్‌రెడ్డితో గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వస్తున్నారని టమటా కట్టెలను తమ పొలంలో లేకుండా దౌర్జన్యంగా తొలగించడాన్ని ప్రశ్నించడంతో, తమను కర్రలతో దాడి చేసి చంద్రశేఖర్ రెడ్డి కొట్టినట్లు బాధితులు ఆరోపించారు. -
అంగన్వాడీ ఆయాపై అత్యాచార యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో పని చేస్తున్న అంగన్వాడీ ఆయా పై అదే గ్రామానికి చెందిన రిపోర్టర్ చంద్ర దాడి చేసి అత్యాచారయత్నానికి ఒడి గట్టాడు. గురువారం గ్రామంలో ఉన్న ఆయాను లైంగికంగా వేధిస్తుండగా బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో భర్త, మామ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తీసుకెళ్లారు. గతంలో కూడా ఈమైపె పలుమార్లు లైంగిక దాడగికి ప్రయత్నించడం, సదరు మహిళ ప్రతిఘటించడం పోలీస్ స్టేషన్లో ఫిద్యాదు చేయడం జరిగాయి. ప్రస్తుతం అదే కేసు నడుస్తున్నప్పటికీ తిరిగి లైంగిక దాడికి పాల్పడడం పై గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో జరుగుతుండటంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన రిపోర్టర్ ఇలాంటి అఘాయిత్యాలకు ఒడి గట్టడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్ర పై తక్షణం పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన వసతల కల్పనకు రైల్వే అధికారులు కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజంపేట రైల్వేస్టేషన్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈ రైల్వేస్టేషన్లో రెండు ఎక్సలేటర్లు, లిప్ట్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇక్కడ పార్శిల్ ఆఫీసు ఉండేదన్నారు. అప్పట్లో ఈ ప్రాంతం నుంచి నిమ్మకాయల ఎగుమతి జరిగేవన్నారు. అలాగే ఉద్యానవనపంటలు రైళ్ల ద్వారా ఎగుమతి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే పార్శిలాఫీసు బలోపేతం దిశగా రైల్వే అధికారులు యోచించాలన్నారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి నేతృత్వంలో రాజంపేట రైల్వేస్టేషన్లో మెరుగైన సౌకర్యాల కల్పించే దిశగా ముందుకెళతామన్నారు. అమృత్‌భారత్ పథకం కింద రాజంపేటను చేర్చడంలో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కృషి ఉందన్నారు. రాజంపేట సబ్వేలో త్వరిగతిన మార్గం సుగమమం చేసే విధంగా రైల్వే అధికారులుతో ఇదవరకే మాట్లాడానని, ఆ దిశగా చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు.గుంతకల్ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, కడప సీసీ జనార్ధన్, ఆర్పీఎఫ్ ఎస్ఐ త్రివేణి, స్టేషన్‌మేనేజరు గోపి వైఎస్సార్సీపీ నేతలు డీలరు సుబ్బరామిరెడ్డి, పాపినేని విశ్వనాథరెడ్డి, జీవీసుబ్బరాజు, అమర్, దండుగోపి,శివశంకర్, చికెన్ శ్రీనివాసులగౌడ్, మణి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు
రొంపిచెర్ల ఇన్చార్జి తహసీల్దార్ కిరణ్‌కుమార్‌తో మాట్లాడుతున్న జెడ్పీటీసీ రెడ్డిశ్వర్ రెడ్డి, రొంపిచెర్ల పోలీసు స్టేషన్లో ఉన్న జేసీబీ రొంపిచెర్ల: ప్రజాసమస్యల పరిష్కారంలో రొంపిచెర్ల ఇన్చార్జి తహసీల్దార్ కిరణ్‌కుమార్‌కు నిర్లక్ష్యం తగదని జెడ్పీటీసీ రెడ్డిశ్వర్ రెడ్డి అన్నారు. అయన గురువారం తహసీల్దార్‌ను కలసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ బండకిందపల్లె గ్రామపంచాయతీలోని పెద్ద చెరువులో షబీర్ జేసీబీతో మట్టి తోలుకుంటున్నారని జేసీబీని తహసీల్దార్ సీజ్ చేశారని తెలిపారు. అయితే 13 రోజులుగా బాధితుడు కార్యాలయం చూట్టు తిరుగుతున్న పట్టించుకోక పోవడం తగదన్నారు. మండలంలో జేసీబీలు, ట్రాక్టర్, టిప్పర్లు నిత్యం మట్టి తరలిస్తున్నా కన్నెత్తి చూడని తహసీల్దార్ సొంతానికి మట్టి తోలుకుంటున్న షబీర్ జేసీబీని సీజ్ చేయడం భావ్యం కాదన్నారు. ఇన్చార్జి తహసీల్దార్ ఏకపక్షంగా పని చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయలని కోరారు. బాధితుడు షబీర్ మాట్లాడుతూ తన జేసీబీని అన్యాయంగా సీజ్ చేశారని తెలిపారు. మండలంలో చెరువులలో ఎక్కడ చూసినా జేసీబీలతో మట్టి తరలిస్తున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రంజాన్ పండుగ సందర్భంగా మనోవేదనకు గురి చేశారని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్యహత్యే శరణ్యం అని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు విజశేఖర్, హరికృష్ణారెడ్డి, శ్రీనాధ నాయుడు, అల్లాబక్షు, ప్రశాంత్ రెడ్డి, బావాజీ, ఓబులేసు, కరుణాకర్, రామ నారాయణ రెడ్డి, నరేష్, కిషోర్, ఉమాపతి నాయుడు, మహబుబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఏడీ మైన్స్‌కు అప్పగించాం: తహసీల్దార్ కిరణ్‌కుమార్ బండకింఒదపల్లె గ్రామ పంచాయతీలోని చెరువులో మట్టి తరలిసున్నారని అందిన సమాచారం మేరకు తనిఖీ చేసి జేసీబీని సీజ్ చేశాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ఏడీ మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాం. చట్టానికి అందరు సమానమే . అనుమతి లేకుండా చెరువులలో మట్టి తరలించడం నేరం. మట్టి తరలింపుపై ఫిర్యాదు వస్తే సీజ్ చేస్తాం. -
జీఎస్టీ వసూళ్లపై దృష్టి సారించాలి
మదనపల్లె అర్బన్: జిల్లా ఖజానా ఆదాయం పెంపే లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు హాలులో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో ఆదాయ సాధన పురోగతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో పాటు ఆదా య వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నా రు. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీరాజ్ పను ల్లో జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చూడాలన్నారు. అలాగే బిల్లులు ప్రాసెస్ చేసే సమయంలో జీఎస్టీ యాక్టీవ్ స్థితిని పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో జరిగే పనులకు ఉపయోగించే ఇంధనాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మైన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, అటవీ శాఖల లావాదేవీలను క్రమబద్ధంగా నమోదు చేసి పన్నుల వసూళ్లను మరింత పెంచాలని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రెవెన్యూ వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలంటూ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత తంబళ్లపల్లె: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. గురువారం తంబళ్లపల్లె మండలంలో పర్యటించారు. స్థానిక శ్రీనివాసకాలనీలో రూ.36 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్లు, కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. గత 45 రోజుల్లో జిల్లాలో రూ.37 కోట్ల అంచనాతో 92 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సంఘం (పీఎఫ్ఓ) కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల నుంచి నేరుగా హార్టికల్చర్ పంటలను సేకరించి గ్రేడింగ్, నాణ్యమైన ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయాలన్నారు. పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారిణి సుభా షిణి, డీపీఓ రాధమ్మ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ బాపూజీపట్నాయక్, ఎంఈఓ త్యాగరాజు, డీఈ మునిరాజ, జేఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నిషాంత్‌కుమార్ -
బి.కొత్తకోట సీఐపై ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లెటౌన్: తాము మేజర్లమని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను బి.కొత్తకోట సిఐ గోపాల్ రెడ్డి విడదీసి, అమ్మాయిని తల్లిదండ్రుల వెంట పంపేశాడని గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధిత యువకుడు మదనపల్లెలో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. ములకలచెరువు మండలం, మద్దినాయునిపల్లె పంచాయతీ, బూడిదగడ్డపల్లెకు చెందిన ముక్కండ్ల ఉత్తన్న కొడుకు వినోద్ కుమార్ భవన కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలం, సూరపువారిపల్లె పంచాయతీ, దయ్యాలవారిపల్లెకు చెందిన జయరామిరెడ్డి కుమార్తె హారిక ప్రేమించు కుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలసి పెళ్లికి నిరాక రించడంతో వెళ్లిపోయి ఒరిస్సాలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ తమను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఇద్దరం మేజర్లు అయినా కొట్టి విడదీసి వేరుచేశారని ఆరోపించారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ కి బాధితుడు వినోద్ కుమార్ ఫిర్యాదు చేశాడు. -
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ములకలచెరువు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని, మద్దినాయునిపల్లె గ్రామం, బూడిదగడ్డలో కాపురం ఉంటున్న సురేంద్ర(45) కూలి పనులతో భార్య పిల్లలను పోషించు కుంటున్నాడు. గత కొంత కాలంగా కూలి పనులకు వెళ్లి వచ్చే సంపాదనను సురేంద్ర తాగుడుకు ఖర్చు చేస్తుండడంతో ఇంట్లో మందలించారు. దీంతో అతను వారితో గొడవపడి మనస్థాపం చెందాడు. జీవితంపై విరక్తి చెంది టమాటా తోటలో గడ్డి మొలవ కుండా కొట్టడానికి తెచ్చి ఇంట్లో ఉంచిన గడ్డి నివారణ మందు తాగాడు. కుటుంబీకులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. -
శాంతియుతంగా పండుగ చేసుకోండి
మదనపల్లెటౌన్: శాంతియుత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకోవాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలను స్వరించుకుంటూ ధర్మం, న్యాయం, ప్రేమ ఆయన జీవితంలో ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు.వాటిని మన జీవితాల్లో కూడా ఆచరించాలని సూచించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా డీజే లాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. మై నర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదుచేయాలని పోలీసులకు ఎస్పీ ఆదేశించారు. మదనపల్లెటౌన్: మదనపల్లె రిటైర్డ్ సబ్ రిజిస్టర్ కోదండరాంను బ్లాక్ మెయిల్ చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన పెన్ పవర్ విలేకరి దొరస్వామిపై పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం మేరకు.. కోదండరాం మదనపల్లె సబ్ రిజిస్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ ల్యాండ్ రిజిస్టర్ విషయంలో గోల్ మాల్ జరిగిందని, చిత్తూరు జిల్లాకు చెందిన విలేకరి దొరస్వామి మదనపల్లెకు వచ్చి సదరు సబ్ రిజిస్టర్‌ను రిజిస్టర్ జరిగిన ల్యాండ్ వివరాలు అడిగినట్లు తెలిసింది. వార్త రాకుండా ఉండాలంటే రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన కోదండరాం స్థానిక ఒకటవ పట్టణ పోలీసులను ఆశ్రయించి రాత్రి రిపోర్టర్లపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన వన్‌టౌన్ పోలీసులు దొరస్వామిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పీలేరురూరల్: అన్నమయ్య జిల్లాలో రోజుకు ఆర్టీసీ ఆదాయం రూ. 90 లక్షలు వస్తోందని డీపీటీఓ రాము అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 490 బస్సులను 1.91 లక్షల కిలోమీటర్లు నడుపుతున్నట్లు తెలిపారు. అందులో ఆన్‌కాల్ డ్రైవర్స్ అన్నమయ్య జిల్లాలో 319 మంది, చిత్తూరు జిల్లాలో 178 మంది పని చేస్తున్నారని చెప్పారు. మహాశిరాత్రి ఉత్సవాల్లో భాగంగా పీలేరు డిపో పరిధిలో తలకోన శివరాత్రి స్పెషల్ కార్యక్రమంలో అత్యధిక ఈపీకే సాధించిన సిబ్బందికి ప్రశంశాపత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. శివరాత్రి ఉత్సవాల్లో రూ. 18 లక్షలు ఆదాయం సాధించిన సిబ్బందిని అభినందనలు తెలిపారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.రూ: 35.56లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు.బంగారం 10గ్రాములు , వెండి 136 గ్రాములు వచ్చిందన్నారు. అలాగే ఆలయం వద్ద ఉచిత అన్నదాన పథకం నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక హుండీ ద్వారా రూ:12,444 సమకూరినట్లు చెప్పారు. ఈ ఆదాయం 31 రోజులకు వచ్చినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉప్పరపల్లె టీచర్ విధుల నుంచి తొలగింపు మదనపల్లె సిటీ: వీరబల్లి మండలం ఉప్పరపల్లె ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పని చేసే పి.జగన్మోహన్రెడ్డిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. 2022 జులై నుంచి ఎటువంటి సమాచారం కానీ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి ద్వారా నోటీసు పంపారన్నారు. నోటీసుకు ఎలాంటి సంజాయిషీ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపలేదన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హజరుకావడంపై ఎపీసీసీఏ రూల్స్ 199 నిబంధనల మేరకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. భూవివాదంలో ఘర్షణ – తల్లి, కుమారుడిపై దాడి:తీవ్రగాయాలు మదనపల్లెటౌన్: భూ వివాదం రెండువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గురువారం పెద్దమండ్యం మండలంలో చోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. మండలంలోని శివపురం పంచాయతీ, కనకంటివారిపల్లెకు చెందిన రైతు కొంకల చంద్రశేఖర్ రెడ్డి(45) తన వ్యవసాయ భూమిని సర్వే చేయించడానికి ఇటీవల పెద్దమండ్యం తహసీల్దార్ కార్యాలయంలో చలానా కట్టాడు. దీంతో సర్వేయర్ చంద్రశేఖర్ రెడ్డి భూమిని సర్వే చేయడానికి గురువారం పొలం వద్దకు వస్తామని చెప్పడంతో వారు పొలంలో ఉన్న ముల్లపొదలు, టమాటా చెట్లకు ఉపయోగించే కట్టెలను పక్కకు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు పాపిరెడ్డి, మల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిలు కర్రలు, రాడ్లను తీసుకొచ్చి మూకుమ్మడిగా రైతు చంద్రశేఖర్ రెడ్డిపై దాడిచేసి కొట్టినట్లు ఆరోపించారు. కుమారుడిని పాపిరెడ్డి వర్గీయులు కొడుతుండగా వెళ్లి అడ్డుకున్న సీతమ్మ పైనా దాడి చేయడంతో తల్లి, కుమారుడు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెద్దమండ్యం పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏం జరిగింది.. ఎలా జరిగింది..
● గోడౌన్లో నిల్వలు సక్రమంగా ఉన్నాయన్న జిల్లా మేనేజర్ ● వ్యత్యాసం ఉందన్న విజిలెన్స్ అధికారులు ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని పౌరసఫరాల సంస్థ గోడౌన్లో సంస్థ జిల్లా మేనేజర్ నాగ సుధ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిల్వలను పరిశీలించారు. పరిశీలన అనంతరం జిల్లా మేనేజర్‌ను మీడియా ప్రతినిధులు వివరాలను కోరగా గోడౌన్లో నిత్యావసర వస్తువుల నిల్వలన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందన్నారు. విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీ చేసి గోడౌన్లో ఉన్న నిల్వల్లో భారీగా వ్యత్యాసం ఉందని ఇచ్చిన నివేదికపై వివరణ కోరగా మాకు వారు ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తమ అధికారులతో కూడా సంతకాలు తీసుకోలేదని తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి విషయం తెలిపామన్నారు. జేసీ సూచనల మేరకే ఈ రోజు గోడౌన్లో తనిఖీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నాగసుధతోపాటు ప్రొద్దుటూరు తహసీల్దార్ వి.గంగయ్య, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు. విజిలెన్స్ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. బస్తాలను లెక్కించారు. గోడౌన్ డిప్యూటీ తహసీల్దార్ లింగస్వామి, గోడౌన్ సిబ్బంది సమక్షంలోనే తనిఖీలు నిర్వహించారు. నిల్వలలో 50.2 క్వింటాలు బియ్యం, 43 క్వింటాలు చక్కెర, 7 క్వింటాలు జొన్నలు, తదితర నిత్యావసర వస్తువుల్లో తేడాలు ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లా మేనేజర్ నాగ సుధ నిల్వలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని, కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందని అన్నారు. రెండు శాఖల అధికారులు వేర్వేరుగా ఇచ్చిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏమి జరిగింది.. ఎలా జరిగిందనేదానిపై అందరు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
లేగ దూడల సంరక్షణకు శ్రద్ధ చూపాలి
కలికిరి: పాడి రైతులు లేగ దూడల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జి.గుణశేఖర్ పిళ్లై అన్నారు. మండలంలోని గుండ్లూరులో గురువారం రాష్ట్రీయ గోకుల మిషన్, రాష్ట్రీయ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లేగ దూడల ప్రదర్శనకు హాజరైన పాడి రైతులకు ప్రోత్సాహక బహుమతులను అందచేశారు. కలికిరి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డా. కె.వెంకటమునినాయుడు, పశువైద్యాధికారులు గిరినాథ్‌రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కీర్తి పాల్గొన్నారు. -
‘జాక్‌పాట్’ అమలు చేస్తే లైసెన్స్ రద్దు
ములకలచెరువు: ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో 15 కేజీల టమాట బాక్సులు అమలు చేయాలని మార్కెటింగ్ జేడీ రామాంజులు ఆదేశించారు. గురువారం ఆయయ ములకలచెరువు మార్కెట్‌యార్డును సందర్శించి వేలం పాటలను పరిశీలించారు. అనంతరం మండీ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుర్రంకొండ, మదనపల్లి మార్కెట్‌యార్డుల్లో 15 కేజీల టమాట బాక్సులు అమలు చేయించామని, ఇక్కడ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జాక్‌పాట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పారు. జాక్‌పాట్ విధానం అమలు చేసే మండీ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. -
ఎన్నియ్యల్లో.. ఎన్నికల్లో.. చంద్రంమామా!
‘చందమామ రావే.. జాబిల్లి రావే అని పిల్లలకు కథలు చెప్పినట్లు.. ఎన్నికలు రావు.. నోటిఫికేషన్ రాదు అంటూ కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోంది. ఊరూరా తిరుగుతూ అసాధ్యమైన హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎన్నియల్లో ఎన్నికల్లో చంద్రంమామా.. అంటూ ప్రజలు ఆటపట్టిస్తున్నారు‘ బద్వేలు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్‌కు ఇప్పుడు ’స్థానిక’ సెగ తగులుతోంది. ఎన్నికల ముందు కొండంత ఆశలు చూపి, అధికారం చేపట్టాక ప్రజల గొంతు కోసిన చంద్రబాబు అండ్ కో.. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలను ఇప్పటికే అటకెక్కించిన సర్కార్, ఇప్పుడు పంచాయతీల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైంది. జనం తిరగబడతారని, ఘోర పరాభవం తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో.. ఎన్నికల ఊసే ఎత్తకుండా ప్రత్యేకాధికారుల పాలనను రుద్దేందుకు కుతంత్రాలు పన్నుతోంది. దోపిడీ పర్వం.. పడగ విప్పిన పచ్చదండు! అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమిలోని చోటా మోటా నాయకులు ’అందినకాడికి దోచుకో.. అడ్డంగా పంచుకో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వాగులు, వంకలు ఇసుక మాఫియా పరం కాగా, కొండలు, గుట్టలను సైతం కంకర రూపంలో కరిగించేస్తున్నారు. గ్రామకంఠం భూములను పచ్చ నేతలు కబ్జా చేస్తుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ సామాన్యుల రక్తాన్ని తాగుతున్నారని మహిళా లోకం నిప్పులు చెరుగుతోంది. నిధులపై కన్నేసి.. సర్పంచ్‌లను ముంచేసి! పంచాయతీల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక పెద్ద కుట్రే ఉంది. పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను కాజేసేందుకే ఈ వాయిదా పర్వమని తెలుస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగియగానే, తహసీల్దార్లు, ఎంపీడీఓల వంటి ప్రత్యేకాధికారులను నియమించి.. వారి ద్వారా ఆ నిధులను తమ అనుయాయులకు, పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. కూటమి అడ్రస్ గల్లంతు తప్పదు ‘ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా కూటమి అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం. రెండేళ్లుగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. –బాల అంకిరెడ్డి, ఇ.రామాపురం, కలసపాడుప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంది ‘కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ప్రత్యేకాధికారులతో పాలన సాగించాలని చూస్తున్నారు. –జి. హనుమంతరెడ్డి, కాశినాయన మండలం. నిధుల దోపిడీ కోసమే వాయిదా పన్నాగం ‘పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను దోచుకోవడానికే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకాధికారుల ద్వారా ఆ డబ్బును టిడిపి కార్యకర్తలకు పంచిపెట్టేందుకు కుతంత్రం పన్నుతున్నారు. –రామకృష్ణారెడ్డి, బి.కోడూరు మండలంవైఎస్సార్ కడప జిల్లాలో దాదాపు 95 శాతం పంచాయతీలు వైఎస్సార్సీపీ మద్దతుదారుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ బలాన్ని తట్టుకోలేక, ప్రజాబలంతో గెలవడం అసాధ్యమని భావించే.. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా అంటూ కుంటి సాకులు వెతుకుతున్నారు. పీకల్లోతు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికే ఈ ’వాయిదా’ డ్రామా ఆడుతున్నారని జనం చర్చించుకుంటున్నారు. ఎన్నికలంటేనే ‘ఎల్లో గ్యాంగ్’కు వణుకు జనం తిరగబడతారనే’స్థానిక’ వాయిదా! నమ్మించి గొంతు కోసిన కూటమి సర్కార్‌పై కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ల గడువు..ఊసేలేని నోటిఫికేషన్! నిధుల దోపిడీ కోసమే పక్కా స్కెచ్.. -
ఓపిక, పట్టుదలతో విజయం దాసోహం
మిట్స్ అశ్వ్ ఫెస్ట్‌లో సందడి చేసిన సినీ హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్సినీ హీరో శర్వానంద్‌ను సత్కరిస్తున్న మిట్స్ చాన్స్‌లర్ విజయభాస్కర్ చౌదరి కురబలకోట: ఓపిక, పట్టుదలతో ముందుకు సాగితే విజయం దాసోహం అవుతుందని సీనీ హీరో శర్వానంద్ సూచించారు. గురువారం రాత్రి మిట్స్ యూనివర్సిటీలో జరిగిన అశ్వ్–2కె26 జాతీయ ఫెస్టివల్ చాన్స్‌లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిధిగా హీరో శర్వానంద్‌తో పాటు హీరోయిన్ మాళవిక నాయర్ హాజరై సందడి చేశారు. హీరో శర్వానంద్ఽ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజమని అయితే ముందుకు సాగడానికి అధ్యయనం, అభ్యాసం, శిక్షణ, పరిశోధన, స్కిల్స్ తప్పనిసరి అని అన్నారు.. దైనందిన జీవితంలో ఓపిక పట్టుదల కూడా అవసరమన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ ఉంటే సాధ్యం కానిది లేదన్నారు. కష్టపడే తత్వం ఉన్నవారి వెంట విజయం నడుస్తుందన్నారు. జబర్ద్‌స్త్ టీమ్ నవ్వులు పువ్వులు పూయించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కార్యక్రమాలు మంత్ర ముగ్దులను చేశాయి. మదనపల్లెఎమ్మెల్యే షాజహాన్ బాషా, ప్రో చాన్స్‌లర్ నాదేళ్ల ద్వారకనాఽథ్ తదితరులు పాల్గొన్నారు. మిట్స్ అశ్వ్ జాతీయ ఫెస్ట్‌లో సినీ హీరో శర్వానంద్ -
ఎత్తిపోతల పథకంతోనే సీమకు న్యాయం
మైలవరం: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడేప్రమాదం ఉంందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని మైలవరం జలాశయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేసీ ఆయకట్టు కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని, అందుకు కారణం కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరువస్తుందనే ఉద్దేశంతో ఇక్కడి కూటమి నాయకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్‌కు నీరు వచ్చే పరిస్థితి లేదని, అదే రాయలసీమ ఎత్తిపోతకం ప్రారంభమై ఉంటే ఈ ప్రాంత వాసులకు తాగు, సాగునీరు వచ్చి ఉండేదన్నారు. కేసీ కెనాల్‌కు మైలవరం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని, వారి తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఈ నీటిని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. మైలవరం టీబీసీ కాలువ ద్వార తీగలేరు వాగుకు పంపించి కేసీ కెనాల్‌కు నీటిని కుందూ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద మోటార్లు బిగిస్తే పథకం ప్రారంభమవుతుందని, అయితే వైఎస్ జగన్‌కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోవడం లేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం గండికోటప్రాజెక్టు, మైలవరం, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో కుంటలు చెరువులు నీటితో నింపుకోగల్గుతున్నామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, జిల్లా అదికార ప్రతినిధి మోహన్‌రెడ్డి,జమ్మలమడుగు పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు ధన్నవాడ మహేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, మండల నాయకుడు ఆంజేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
సింహవాహనంపై పట్టాభిరాముడు
కల్పవృక్ష వాహనంపై వీరప్రతాపరాముడు. సింహవాహనంపై ఊరేగుతున్న పట్టాభిరాముడు. వాల్మీకిపురం: వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరాములవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు గురువారం ఉదయం స్వావివారు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజన సేవ, సాయంత్రం ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చారు. తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీక్రిష్ణదేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేరళ, కర్ణాటక, తమిళనాడు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8గంటలకు సర్వభూపాల వాహనం, 10గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6గంటలకు ఊంజల సేవ, రాత్రి 8గంటలకు పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు. -
ప్రజల ఇబ్బందులపై రైల్వే దృష్టి సారించాలి
రాజంపేట: నియోజకవర్గ పరిధిలో ఆర్యూబీ వల్ల గ్రామీణుల పడుతున్న ఇబ్బందులపై రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజంపేట–రాయచోటి సబ్వే, హస్తవరం ఆర్‌యూబీతో పాటు పలు ఆర్యూబీల స్ధితి గతులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాజంపేట సబ్వే ద్వారా తాత్కాలిక రహదారి సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. త్వరలో గంగమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో రాజంపేట స్టేషన్‌కు ఆవలివైపు ఉన్న వారు రాకపోకలు సాగించాలంటే తప్పనిసరిగా సబ్వే తప్పనిసరి అన్నారు. అలాగే రాజంపేట రూరల్ ఏరియాలోని హస్తవరం వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జిని మరమ్మతులు చేయించాలని తెలిపారు. హస్తవరం లెవల్ క్రాసింగ్ గేటు 110 వద్ద ఆర్యూబీని మంగళవారం రాజంపేట ఏడీఎన్ వాసుదేవనాయుడుతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు.గుంతకల్లు డివిజనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు తల్లంభరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ సెక్షన్లో ఆర్యూబీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనరు దొడ్డిపల్లె భాస్కరరాజు, రైల్వేకోడూరు దళితనేత తిప్పన నాగభూషణం, నాయకుడు సానిగారి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
వంగ రైతుకు ధరల బెంగ
● మార్కెట్లో కిలో రూ.5 ● వంగసాగుతో నష్టాలబాటలో రైతులు తోటల్లో కోయకుండా వదిలేస్తున్న వైనంగుర్రంకొండ : జిల్లాలో వంగసాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 5 వరకు ధరలు పలుకుతున్నాయి. కోతకూలీలు, రవాణా ఖర్చులు కూడా మిగలకపోవడంతో రైతులు వంగ కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు,కర్ణాటకా రాష్ట్రాలకు వెళుతున్న వంగకు ధరలు లేక పోవడంతో అక్కడి వ్యాపారులు కొనుగోలుకు మొగ్గుచూపడం లేదు. దీంతో జిల్లాలో 850 ఎకరాల్లో వంగసాగు చేసిన రైతులకు రూ.12.75 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. జిల్లాలో 850 ఎకరాల్లో వంగసాగు జిల్లాలో ఈ సీజన్లో 850 ఎకరాల్లో వంగ సాగు చేపట్టారు. ఎకరం సాగుకు దుక్కుల దగ్గర నుంచి కాయలు కోతకు వచ్చే వరకు రూ. 1.25 లక్షలనుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు ఎదుగుదలకు, పూతపిందె నిలవడానికి వారానికి ఒక సారి మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. చెట్టుకు సత్తువ ఇచ్చి కాయలు ఎక్కువ కాయడానికి పురుగుల మందు కోసం ప్రతి వారం సుమారు రూ. 8వేల నుంచి రూ.10వేలవరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన 90 రోజులకు కాయలు కాయడం మొదలవుతుంది. సుమారు మూడు నెలల పాటు కాయల కోత ఉంటుంది. గిట్టుబాటు ధర ఏది? ఎకరం సాగుకు 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు వంగ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ:5 లోపే వూత్రమే ధర పలుకుతోంది. రైతులు 60 కేజీల బస్తాల్లో మార్కెట్లకు తరలిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో బస్తా ధర రూ.300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. ఇందులో కోతకూలీలు, మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణాఖర్చు, మార్కెట్లో మండీల యజమానులు తీసుకొనే కమీషన్ లెక్కిస్తే పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో వంకాయలు మార్కెట్ తరలించడానికి రవాణాఖర్చు రూ.1.50పైసలు, కమీషన్ రూ.1, కోత, ఇతర కూలీలు రూ.3 మొత్తం రూ.5.50 ఖర్చు వస్తుంది. ప్రస్తుతం కిలో ధర రూ.5తో పోల్చితే మార్కెట్‌కు తరలించే రైతుకు చేతి నుంచి అదనంగా ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఓవైపు టమాటా, మరోవైపు పూల తోటల సాగుతో భారీగా రైతులు నష్టపోయారు. కనీసం వంగపంట అయినా తమకు గట్టెక్కిస్తుందన్న ఆశ ఉన్న రైతుల ఆశలు అడయాసలయ్యాయి. నెలరోజుల ముందు వరకు ఆశించిన మేరకు వంగ ధరలు ఉన్నాయి. అయితే రోజురోజుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వంగ ధరలు పూర్తిగా పతనమవడంతో ఆ ప్రభావం జిల్లా రైతులపై పడింది. మన జిల్లా నుంచి 90 శాతం వంగ పంట తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పూర్తిగా పక్కరాష్ట్రాలపై మన జిల్లా రైతులు ఆధారపడి వంగ పంటను సాగు చేస్తుంటారు. అక్కడ స్థానికంగా దిగుబడులు మార్కెట్లో పెరుగుతున్న కారణంగా ఇక్కడి పంటకు ధరలు లేక పోవడం గమనార్హం. అక్కడ వంకాయలన్ని కొనేవారు లేక వదిలేసి వస్తున్నారు. గత నెలరోజులుగా వంగధరలు పతనమవడంతో నష్టాలు భరించలేక కాయలను కోయకుండా రైతులు తోటల్లోనే వదిలేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో వంగతోటల్ని రైతులు దున్నేస్తున్నారు. ఇందులో కోతలు ఇంకా మొదలవని తోటలు ఉండడం దారుణం. ప్రస్తుతం ఉన్న పంటను కాపాడుకోవాలంటే ఎరువులు, పురుగుల మందులకు వేలాది రుపాయలు ఖరు చేయాల్సి ఉంటుంది. పోనీ భవిష్యత్తులోనైనా వంగ ధరలు పెరుగుతాయనే నమ్మకం లేకపోవడంతో చేసేదిలేక తోటలను దున్నేసి ప్రత్యామ్నాయ పంట సాగుల కోసం పొలాలను సిద్ధం చేసుకొంటున్నారు. జిల్లాలో రూ.12.75 కోట్ల మేరకు నష్టం ఈ సీజన్లో జిల్లాలో వంగ పంట సాగు చేసిన రైతులు రూ. 12.75 కోట్ల మేరకు నష్టపోయారు. జిల్లాలో 850 ఎకరాల్లో వంగతోటలు సాగు చేపట్టారు. ఎకరం వంగతోటల సాగకు రూ. 1.25లక్షలు నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వంగ ధరలు రూ.5 లోపే ఉన్నాయి. మార్కెట్‌కు వంకాయల్ని తీసుకెళ్లినా గిట్టుబాటు ధరలు లేక పోవడంతో నష్టపోయారు.కోయకుండా తోటల్లోనే వదిలేశాం ఎకరం పొలంలో వంగపంట సాగు చేశాను. పంట సాగుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేశాను. కాయలు మంచి అదను మీద ఉన్న సమయంలో ధరలు పూర్తిగా పడిపోయాయి. మార్కెట్లో కిలో రూ. 5వరకు ధరలు పలుకుతున్నాయి.. కాయలు మార్కెట్‌కు తీసుకెళితే చేతి నుంచి డబ్బులు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చేసేదిలేక కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేశాం. – అమరనాథ్, రైతు, గుర్రంకొండగిట్టుబాటు ధరలు లేవు ప్రస్తుతం మార్కెట్లో వంగ ధరలు దారుణంగా పడిపోయాయి. టమాటాతో నష్టపోయిన రైతులకు వంగ సాగుతో కొంత ఊర ట వస్తుందనుకొంటే ఇది కూడా నట్టేట ముంచింది. మార్కెట్లో నెలరోజులుగా ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. పంట సాగుకు ఖర్చు చేసిన పెటుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు లేక పోవడంతో వంగపై పెట్టుకొన్న ఆశలు అడియాసలు అయ్యాయి. – ఆంజినేయులు, వంగరైతు, తలారివాండ్లపల్లె -
108 నిర్వాకం
మదనపల్లెటౌన్ : వాల్మీకిపురం 108 సిబ్బంది నిర్వాకంతో ఎలుకల మందు తాగిన ఓ మహిళా రోగికి ప్రాణ సంకటంగా మారింది. ఇందుకు సంబంధించి బాధితురాలి భర్త తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లె పంచాయతీ, నక్కలదిన్నె సమీపంలోని పప్పిరెడ్డి పల్లెలో నివాసం ఉంటున్న వాటర్ క్యాన్లు ఇంటింటికి తోలుకునే శ్రీరాములు భార్య లక్ష్మీదేవి(30), కుటుంబ సమస్యలతో బుధవారం ఎలుకల మందుతాగింది.బాధితురాలని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మీదేవి భర్త శ్రీరాములు వెంటనే 108కు ఫోన్ చేశాడు. వాల్మీకిపురం నుంచి వచ్చిన 108 వాహన సిబ్బంది లక్ష్మీదేవిని పరీక్షించి ఆమెకు బీపీ, షుగర్, సాచిరేషన్ బాగానే ఉందని విజయవాడలో ఉన్న ఈఆర్‌టీపీ డాక్టర్‌కు సమాచారం అందించారు. ఆ డాక్టర్ లక్ష్మీదేవిని తిరుపతికి తరలించడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 108 సిబ్బంది రోగిని జిల్లా ఆస్పత్రిలోనే వదిలేసి తిరిగి వాల్మీకిపురానికి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీరాములు తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోయినా 108 సిబ్బంది తిరుపతికి తీసుకుపోలేదని మండిపడ్డాడు. ఎలుకల మందుతాగిన తన భార్యకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు 108 సిబ్బందితో పాటు విజయవాడకు చెందిన ఈఆర్‌టీపీ డాక్టరే బాధ్యులని తెలిపారు. ఈ విషయమై వాల్మీకిపురం 108 సిబ్బంది మాట్లాడుతూ.. తమకు విజయవాడ ఈఆర్‌టీపీ డాక్టర్ అనుమతి ఇస్తేనే రోగిని మరో ఆస్పత్రికి తరలించే రైట్స్ ఉన్నాయన్నారు. ఆయన అనుమతి ఇవ్వకపోవడంతో తాము మదనపల్లె లోనే రోగిని వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని వాల్మీకిపురం 108 సిబ్బంది వివరణ ఇచ్చారు.చావు బతుకుల మధ్య రోగి -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి కురబలకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు.. కడప శ్రీనివాస వీధికి చెందిన యాసీన్ (22), అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు జశ్వంత్(22) మదనపల్లె మిట్స్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఇద్దరు సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని అదే రాత్రే అంగళ్లులో ఉన్న హాస్టల్‌కు బయలుదేరారు. కురబలకోట మండలం, చేనేతనగర్ వద్దకు రాగానే కల్యాణ మండపానికి పెళ్లికి వచ్చిన కనసానవారిపల్లెకు చెందిన గంగుల్ రెడ్డి(60) రోడ్డు క్రాస్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థుల బైకు ఢీకొంది. ఈ ఘటనలో గంగుల్ రెడ్డితో పాటు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంగుల్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధురామ చంద్రడు తెలిపారు. -
ఇద్దరు యువకులపై కత్తితో దాడి
కడప అర్బన్ : కడప నగరం ఎరమ్రుక్కపల్లె సర్కిల్ సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద బుధవారం రాత్రి రవి,భాస్కర్ అనే యువకులపై కొందరు యువకులు కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో వన్ టౌన్ ఎస్ఐ ప్రదీప్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిని యువకులను వైద్య పరీక్షల కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసు అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు కడపకు చెందిన త్రిపుర పాటి భాస్కర్, తన స్నేహితుడు రవి, స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. వైన్ షాప్ నుంచి బయటికి రాగానే భాస్కర్,రవిలపై కొందరు కత్తులతో దాడి చేశారు.నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాయచోటిలో గ్యాంగ్ వార్ రాయచోటి : రాయచోటిలో తెలుగుతమ్ముళ్ల గ్యాంగ్‌వార్ పోటాపోటీగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారపార్టీలోని కొంతమంది నాయకులు తమకు అనుకూలమైన గ్యాంగ్‌లను ఏర్పాటు చేసి దాడులు, దందాలకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పలుపర్యాయాలు రాయచోటిలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. బుధవారం సాయంత్రం మదనపల్లె మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కె. రామాపురం గ్యాంగ్‌కు చెందిన లతీష్ (20)పై ఎన్ఎన్ కాలనీ గ్యాంగ్ దాడిచేసింది. సుమారు 30 మంది సభ్యులు వారివెంట తెచ్చుకున్న స్టిక్స్, రాడ్లు, చైన్లతో క్రికెట్ ఆడుతున్న లతీష్‌ను కొట్టారు. తీవ్ర గాయాలతో పడిపోయిన లతీష్‌ను అక్కడ వదిలేసి ఎస్ఎన్ కాలనీ బ్యాచ్ వెనుదిరిగింది. విషయాన్ని తెలుసుకున్న కెఆర్ పురం గ్యాంగ్ సుమారు 50 మంది యువకులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన వారికోసం గాలింపు చేపట్టినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన లతీష్‌ను చికిత్సనిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లతీష్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. దాడిచేసిన వర్గం మంత్రి అనుచరవర్గానికి చెందినది కావడంతో పోలీసులు కేసు నమోదు చేసే విషయంలో పరిశీలన చేస్తున్నట్లు తెలియవచ్చింది. అరటి పంట దగ్ధంకాశినాయన : మండలంలోని ఆకులనారాయణపల్లె గ్రామానికి చెందిన కర్ర రఘునాథ్ రెడ్డి అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి పంట బుధవారం దగ్ధమైంది. రైతు కథనం మేరకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి రెండు ఎకరాల్లో అరటి పంట కాలిపోయిందన్నారు. రూ.2లక్షల మేర నష్టం వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీ ఆదాయన్ని లెక్కించారు. బుధవారం స్వామి వారి ఆలయంలో 51 రోజులకు సంబంధించి ప్రధాన అలయంతో పాటు ఉప ఆలయాల హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చెందిన హుండీ ద్వారా రూ.15.39,540లు, అమ్మవారి ఆలయానికి సంబంధించి రూ.2,90,340,శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.78,500లు, అఘోరలింగేశ్వర స్వామి ఆల యంలో రూ.72,894, సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీకాల కాలభైరవుడు, నవగ్రహ మండపం హుండీ ఆదాయం రూ.49,020లుగా లెక్కంచారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో జమ చేసినట్లు, అన్నదాన కార్యక్రమానికి రూ.86,570 స్టేట్ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్‌కుమార్, ఆలయ ఈవో డివి రమణారెడ్డిలు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. పాముకాటుతో మహిళా రైతుకు అస్వస్థతమదనపల్లెటౌన్ : మహిళా రైతును విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. కోటవారిపల్లె పంచాయతీ, పాలెం దొనకు చెందిన రైతు జయచంద్ర భార్య తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. పాడి పశువులకు గడ్డి కోసి వేసే సమయంలో గడ్డిలో ఉన్న ఓ విష సర్పం శైలజ కాలిపై కాటేసింది. ఆమె కేకలు వేయడంతో భర్త, కుటుంబీకులు గమనించి శైలజ వద్దకు వెళ్లారు. పరిసరాలను పరిశీలించి విషసర్పాన్ని గుర్తించి చంపేశారు. అనంతరం బాధితురాలిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటోంది. అరటి రైతును ఆదుకోవాలి: షర్మిల కడప సెవెన్‌రోడ్స్ : అకాల వర్షాలు, ధరల పతనంతో నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం కడపలో జాయింట్ కలెక్టర్ నిధి మీనాకు ఆమె వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో టన్ను రూ. 26 వేలు పలికిన అరటి ధర, ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ. 10–12 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. పులివెందుల ప్రాంతంలో జీ–9 రకం అరటి సాగు ఎక్కువగా ఉన్నందున, అక్కడ కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు, 2023–24 ఏడాదికి సంబంధించిన బీమా సొమ్మును తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.అంతకుముందు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి, తన తండ్రి సమాధికి ఘనంగా నివాళులర్పించారు. -
13 మంది నిందితులకు జైలు శిక్ష
పెద్దతిప్పసముద్రం : ఒంటరిగా ఉన్న ఓ మహిళపై 13 మంది దాడి చేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తు సామగ్రి, వ్యవసాయ యంత్ర పరికరాలు ధ్వంసం చేసిన కేసులో 13 మంది నిందితులకు తంబళ్లపల్లె కోర్టు న్యాయమూర్తి బుధవారం శిక్షతో పాటు జరిమానా విధించారు. ఎస్ఐ పరమేశ్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పులికల్లు పంచాయతీ గుడ్డంపల్లికి చెందిన లచ్చన్నగారి శివన్న, సరస్వతి దంపతుల కుమారుడు వినోద్ ఇదే గ్రామానికి చెందిన సందే ఏసప్ప కుమార్తె భవానీ అనే యువతితో కలసి 2017 ఆగస్టు 3న ఎటో వెళ్లిపోయారు. తమ కుమార్తె ఎక్కడుందో కనిపెట్టి తమకు అప్పగించాలని భవాని కన్నవాళ్లు యువకుడి కన్నవాళ్ళను హెచ్చరించారు. అనంతరం అదే రోజు యువకుడి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండగా యువతి కన్నవాళ్లు, బంధువులైన చాకివేలు శంకర్, ఆదెప్ప, వెంకటరమణ, సుధాకర్, నారప్ప, బత్తెప్ప, ప్రతాప్, భాస్కర్, దేవి, సుబ్బలమ్మ, లక్ష్మిదేవి, సుమిత్ర, శారదలు మూకుమ్మడిగా మారణాయుధాలతో ఇంట్లోకి జొరబడి విలువైన వస్తువులతో పాటు ఇనుప గేట్లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఒంటరిగా ఉన్న సరస్వతిని చంపుతామని బెదిరించారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడికి పాల్పడి భయబ్రాంతులకు గురి చేశారు. అనంతరం సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న బోరు సామగ్రి, విద్యుత్ పరికరాలను ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై బాధిత మహిళ సరస్వతి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేశారు. 9 ఏళ్ల నుంచి కొనసాగుతున్న కేసుకు సంబంధించి బుధవారం తంబళ్లపల్లి కోర్టులో తుది విచారణ కొనసాగింది. బాధితురాలి తరఫున ఏపీపీ వీరాంజనేయులు వాదించారు. తుది వాదనలు విన్న సివిల్ జడ్జి ఏ. ఉమర్ ఫరూక్ దాడికి పాల్పడిన 13 మంది నిందితులకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఒకొక్కరికి రూ.2 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐతో పాటు కోర్టు కానిస్టేబుల్ బావాజాన్‌లు వెల్లడించారు. -
ఆటోనగర్ రహదారి ధ్వంసం
మదనపల్లెటౌన్ : మదనపల్లె మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆటో నగర్‌కు వెళ్లే రహదారులను ధ్వంసం చేయడం వివాదానికి దారితీసింది. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ, మొలకలదిన్నె సమీపంలోని ముంబై టు చెన్నయ్ జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వం ఆటోనగర్, ఏసీఐఐసీ, ఎంఎస్ఎంఈ లకు కేటాయించిన స్థలాల్లో వ్యాపారులు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీలు నెలకొల్పారు. ఫ్యాక్టరీలు నడుస్తున్న నేపథ్యం లో స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు రణయ్య, మోహన్‌లు తమకు ఉన్న పట్టా భూమిలో రోడ్డు ఉందని రహదారిని జేసీబీతో ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుకు అడ్డంగా బండరాళ్లను వేశారు. దీంతో ఇండస్ట్రీలోకి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. అటుగా పల్లెలకు వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యను గుర్తించిన ఫ్యాక్టరీల యజమానులు స్థానిక తాలూక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కళా వెంకటరమణ ఘటనాస్థలానికి చేరుకుని వివాదానికి గల కారణాలపై ఆరాతీశారు. ఆటో నగర్లో నడుస్తున్న కుటీర పరిశ్రమలకు అంతరాయం కల్పించ వద్దని రమణయ్య, మోహన్‌లకు సీఐ సూచించారు. సమస్యపై సంబంధిత అధికారులతో మట్లాడి పరిష్కరించుకోవాలే గాని ఇలా ప్రజలను ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.స్తంభించిన రాకపోకలు -
హనుమంతవాహనంపై శ్రీరాముడి తేజసం
వాల్మీకిపురం : పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం స్వామివారు తన ప్రియభక్తుడైన హనుమంతునిపై పురవీధుల్లో విహరిస్తూ .. భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఊంజల మండపంలో ఊంజల్ సేవ నయనానందకరంగా నిర్వహించారు. బుధవారం రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు స్వామివారికి నేతి దీపాలతో తిరుమాడ వీధుల్లో స్వాగతం పలికారు. టీడీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, భక్తులు పాల్గొన్నారు. నేడు : బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8గంటలకు సింహ వాహన సేవ.వైభవంగా ముత్యపుపందిరి వాహనం -
బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కడప జిల్లా ఎస్పీ ఎస్. నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భద్ర తా ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, విజిలెన్స్ ఎస్పీ మురళీకృష్ణ, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేతో కలిసి పరిశీలించారు. ముందుగా వారు ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల క్యూలైన్లు, సీఎం గెస్ట్ హౌస్, కల్యాణ వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పట్లపై పోలీసులకు దిశానిర్దేశం ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుమారు 3 వేల మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
● భక్తుల కోసం వసతి, అన్నప్రసాద సౌకర్యాలు
ఒంటిమిట్ట/రాజంపేట: ఆధ్యాత్మికతకు నిలయం, భక్తి భావానికి చిరునామా అయిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట.. మరోసారి రామనామ స్మరణతో మారుమోగనుంది. జగదభిరాముడైన శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమంతుడు లేని విశిష్ట ఆలయం: దేశంలోని ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్ట ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై ఉన్నప్పటికీ, గర్భాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. శ్రీరాముడు వనవాస సమయంలో హనుమంతుడిని కలవక ముందే ఈ ప్రాంతంలో విశ్రమించారని పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ స్వామివారిని ’జగదభిరాముడు’గా భక్తులు కొలుచుకుంటారు. ముస్తాబైన ఏకశిలా నగరం: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఏకశిలా నగరానికి సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేడుకల షెడ్యూల్: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, వివిధ వాహన సేవలు, శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ వరకు భక్తులు స్వామివారి దివ్య దర్శనాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేశారు. ● ఈ బ్రహ్మోత్సవాలు మరియు సీతారాముల కల్యాణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ● టీటీడీ జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కడప జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం తరఫున హాజరవుతారు. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు కల్యాణ వేడుకల్లో పాల్గొంటారు. 1. వసతి సౌకర్యాలు: ఒంటిమిట్ట ఒక చిన్న గ్రామం కావడంతో ఇక్కడ వసతి గదులు పరిమితంగా ఉంటాయి. టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం కింది ఏర్పాట్లు చేశాయి: టీటీడీ అతిథి గృహాలు: ఆలయ సమీపంలో ఉన్న టీటీడీ డార్మిటరీ హాల్స్ మరియు కొన్ని గదులు అందుబాటులో ఉంటాయి. ఇవి ముందుగా వచ్చి న వారికి ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. ప్రభుత్వ వసతి: స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు కళ్యాణ మండపాలను భక్తుల విశ్రాంతి కోసం తాత్కాలిక వసతి కేంద్రాలుగా మారుస్తారు. కడప లేదా రాజంపేట: ఎక్కువ మంది భక్తులు కడప (25 కి.మీ) లేదా రాజంపేట (30 కి.మీ) పట్టణాల్లోని ప్రైవేట్ హోటళ్లలో బస చేసి, ఉత్సవాలకు వస్తుంటారు. అక్కడి నుండి బస్సు సౌకర్యం నిరంతరం ఉంటుంది. తాత్కాలిక షెడ్లు: సీతారాముల కల్యాణం రోజున వేలాది మంది భక్తుల కోసం కల్యాణ వేదిక సమీపంలో భారీ జర్మన్ షెడ్లను నిర్మిస్తారు. ఇక్కడ ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉంటుంది. 2. అన్నప్రసాదం – తాగునీరు: బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ఆకలి తీర్చడానికి టీటీడీ అన్నప్రసాద విభాగం భారీ ఏర్పాట్లు చేస్తోంది: ఉచిత అన్నప్రసాదం: ఆలయ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజూ ఉదయం 11:00 నుండి రాత్రి వరకు భక్తులకు నిరంతరంగా భోజన సౌకర్యం ఉంటుంది. కల్యాణం రోజు ప్రత్యేక పంపిణీ: ఏప్రిల్ 1న కల్యాణం జరిగే ప్రాంగణంలోనే లక్ష మందికి పైగా భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి పొట్లాలు పంపిణీ చేస్తారు. తాగునీటి సౌకర్యం: ఎండల తీవ్రత దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో, కల్యాణ వేదిక వద్ద ’జలప్రసాదం’ (మంచినీటి) కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. ముత్యాల తలంబ్రాల పంపిణీ: కల్యాణం అనంతరం భక్తులందరికీ స్వామివారి కల్యాణ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం ప్యాకెట్లను క్యూలైన్లలోనే అందజేస్తారు. ముఖ్య సూచనలు: ఎండల దృష్ట్యా: చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే వారు గొడుగులు, తలకు టోపీలు వెంట తెచ్చుకోవడం మంచిది. వైద్య సౌకర్యం: అత్యవసర పరిస్థితుల కోసం కల్యాణ వేదిక వద్ద మరియు ఆలయ సమీపంలో మొబైల్ క్లినిక్‌లు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. (బ్రహ్మోత్సవాల రోజుల్లో...) సాధారణ రోజుల కంటే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, టీటీడీ ప్రత్యేక సమయాలను కేటాయించింది. సర్వదర్శనం: ఉదయం 4:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు (కై ంకర్యాల సమయం మినహా). అభిషేకం: ఉదయం 5:30 నుండి 6:30 వరకు (ముందుగా టికెట్ తీసుకున్న వారికి). విరామ సమయం: మధ్యాహ్నం 1:00 నుండి 2:00 వరకు ఆలయ శుద్ధి మరియు నైవేద్యం కోసం దర్శనాలు నిలిపివేస్తారు. కల్యాణోత్సవం రోజు (ఏప్రిల్ 1): ఆ రోజు సాయంత్రం కల్యాణం ఉన్నందున, గర్భాలయ దర్శనం మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం నుంచి బహిరంగ ప్రాంగణంలో కల్యాణ వేడుకలు జరుగుతాయి. హనుమ లేని ఏకై క రామాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న దాశరథి కోవెల ఏకశిలానగరానికి ఆధ్యాత్మిక శోభ రేపటి నుంచి ఏప్రిల్ 5వ వరకు బ్రహ్మోత్సవాలు శ్రీరామ నవమికి పోటెత్తనున్న భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమైన టీటీడీ అధికారులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ప్రత్యేక కథనం. -
గ్యాస్ కొట్టొద్దు సారూ!
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో వంటగ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తు న్నా సిలిండర్లు ఇంటికి చేరకపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.ఓ వైపు ఏజెన్సీ నిర్వాహకులు స్టాక్ లేదని చేతులెత్తేస్తుంటే, మరోపక్క అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ కలరింగ్ ఇస్తుండటం గమనార్హం. ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం సున్నా కడప బీకేఎం వీధికి చెందిన వై.చాముండేశ్వరి ఈనెల 15న గ్యాస్ బుక్ చేయగా, 18న క్యాష్ మెమో కూడా వచ్చింది. 24 గంటల్లో సిలిండర్ వస్తుందని ఆశించినా ఫలితం లేదు. ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీని సంప్రదిస్తే స్టాక్ తక్కువగా ఉందని, మరికొన్ని రోజులు ఆగాలని బదులిచ్చారు. అలాగే హబీబుల్లావీధికి చెందిన శివకుమార్ ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించినా, గరిశా ఏజెన్సీ నుంచి సిలిండర్ రాక అల్లాడుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల బుజ్జగింపులు.. వాస్తవాలు వేరు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు నమ్మవద్దని, తగిన నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా సగానికి పడిపోయిందని కడప ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తేజ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జిల్లాలో ఎల్పీజీ సరఫరా అస్తవ్యస్తంగా మారిన తరుణంలో బ్లాక్ మార్కెట్ యథేచ్ఛగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం గృహ అవసరాలకే గ్యాస్ అందించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. బడా హోటళ్లకు ‘అండ’.. చిన్నోళ్లపై ‘దండయాత్ర’ కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోయినా, నగరంలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఏజెన్సీల ద్వారా గృహ వినియోగ సిలిండర్లు భారీగా పక్కదారి పడుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పౌరసరఫరాల అధికారులు, ప్రత్యేక బృందాలు ఈ అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనధికార రీఫిల్లింగ్ కేంద్రాల్లో కిలో గ్యాస్ రూ. 300 వరకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ఆరోపణలపై చర్యలేవి? వంటి అంశాలపై ‘సాక్షి’ బుధవారం వైఎస్సార్ కడప జిల్లా పౌరసరఫరాల అధి కారి రఘురామ్‌ను వివరణ కోరగా, ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎల్పీజీ సరఫరాపైఅధికారుల అబద్ధాలు కొరత లేదంటూ మభ్యపెడుతున్న అధికారులు సరఫరా సగం పడిపోయిందంటున్న నిర్వాహకులు సిలిండర్లను పక్కదారిపట్టిస్తున్న ఏజెన్సీలు గ్యాస్ అందక వినియోగదారుల తిప్పలుఎల్పీజీ లేక తిప్పలు పది రోజుల క్రితం బుక్ చేశాను. ఓటీపీ కూడా వచ్చింది. కానీ సిలిండర్ రాలేదు. ఏజెన్సీకి వెళ్తే మరో 15–20 రోజులు ఆగాలని చెబుతున్నారు. గ్యాస్ లేక వంట చేయడానికి చాలా అవస్థలు పడుతున్నాం. –జమీల, హబీబుల్లావీధి, కడపడబ్బు చెల్లించినా ఫలితం లేదు డెలివరీ బాయ్స్ చెబితే ఈనెల 14న ఫోన్–పే ద్వారా రూ. 963 చెల్లించాను. అకౌంట్ నుంచి డబ్బు కట్ అయింది కానీ గ్యాస్ రాలేదు. ఏజెన్సీ వాళ్లేమో మరికొన్ని రోజులు ఆగమంటున్నారు. –శివకుమార్, హబీబుల్లావీధి, కడప -
భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు, సీతారాముల కల్యాణానికి శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా జరిపించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, మహిళా శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పసుపు కొమ్ములు దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సిద్ధం చేసిన పసుపును స్వామి వారికి నిర్వహించే స్నపన తిరుమంజనంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని విని యోగిస్తారు. ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మీ ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిధ్రా ఘట నం నిర్వహించారు. పసుపు కొమ్ములు దంచి వచ్చి న పసుపు పొడిని స్వామి వారికి సమర్పణ చేసి, తాంబూలం అంజేయడంతో కార్యక్రమం ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ఎ.ప్రశాంతి, ఎలక్ట్రికల్ డీఈ సరస్వతి పాల్గొన్నారు. రోళ్లులో పసుపు కొమ్ములను దంచుతున్న డిప్యూటీ ఈవో ప్రశాంతి, చిత్రంలో డీఈ సరస్వతి, పీఆర్వో ఎఫ్ఏసీ నీలిమ దంచిన పసుపును ఉత్సవ మూర్తులకు అభిషేకిస్తున్న ఆర్చకులు -
● విష్ణు దర్బ సమర్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 27న జరిగే ధ్వజారోహణానికి పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన దర్బ చాప, తాడును టీటీడీ, అటవీశాఖ అధికారులు బుధవారం ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ విష్ణు దర్బని అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేకంగా తయారు చేశారు. సుమారు 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు కలిగి, 60 కిలోల బరువు ఉన్న దర్బ చాపతో పాటు 225 మీటర్ల పొడవు గల తాడును ఏటా ధ్వజారోహణానికి వినియోగిస్తారు. ఈ పవిత్ర విష్ణు దర్బను శుద్ధి చేసి, ఎండబెట్టి ధ్వజస్తంభానికి చుడతారు. ఈ తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభాన్ని సూచిస్తా రు. టీటీడీ ఇంచార్జ్ డీఎఫ్‌వో డాక్టర్ ఏ.వి.ఎన్ శివకుమార్, డీఎఫ్‌వో విజయకుమార్, డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమగ్ర నివేదిక ఇవ్వండి
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటి సమగ్ర నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటి ప్రత్యేకాధికారి శివ్ నారాయణ శర్మ అన్నారు. మంగళవారం ఆయన చాంబర్లో ఎస్ఓగా బాధ్యతలను స్వీకరించారు. కమిషనర్ కే.ప్రమీల, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కమిషనర్‌తో చర్చించారు. అభివృద్ధి పనులు, సమస్యలు, పట్టణ వివరాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. పట్టణ పరిస్థితులు, తాగునీటి, నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై సమీక్షించారు. లక్కిరెడ్డిపల్లి: అనంతపురం గంగమ్మ దేవత అమ్మవారి హుండీ ఆదాయం లెక్కించగా రూ. 11,45,267లు వచ్చినట్లు ఈఓ గ్రేడ్ వన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏసీ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 17, 18,19వ తేదిలలో జరిగిన గంగమ్మ జాతర అనంతరం నాలుగు ఆదివారాలకు సంబంధించిన హుండీని లెక్కించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలి పారు. నగదుతోపాటు ఏడు గ్రాములు బంగా రం, 94 గ్రాములు వెండి వచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అట్లూరు: ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంతరాయం లేని విద్యుత్‌ను సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రమణ తెలిపారు. మంగళవారం కరెంటోళ్ల జన బాట కార్యక్రమంలో భాగంగా అట్లూరు, బద్వేలు మండలం చింతపుత్తయ్యపల్లి గ్రామాలను ఎస్ఈ సందర్శించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. అట్లూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు విద్యుత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా సూచనలు, ప్రమాదాల నివారణ చర్యలను వివరించారు. లైన్లు, ట్రాన్సఫార్మర్లు, కనెక్షన్లు, లోడ్ పరిస్థితులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి ఎస్ఈ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ కుల్లాయప్ప, ఏఈలు షర్మిల, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఖాజీపేట: ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని వైఎస్సార్ కడప జిల్లా సోషల్ వెల్ఫ్‌ర్ డీడీ సరస్వతి అన్నారు. ఖాజీపేట లోని ఇంటిగ్రేడ్ హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు. హాస్టల్ గదులతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న హాస్టల్ వార్డన్ పనితీరు సక్రమంగా లేని కారణంగా సస్పెండ్ చేశామన్నారు. ఇన్చార్జ్ వార్డన్‌తో పనిచేయిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెను ప్రకారం భోజనం అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేంది లేదని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కడప రూరల్: క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దామని వైఎస్సార్ కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీసుకన్య ఆరోపణలు అవాస్తవం
మదనపల్లె అర్బన్ : చీటీ డబ్బుల విషయంలో లక్ష్మీసుకన్య తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమంటూ నక్కలదిన్నెకు చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య చీటీ డబ్బుల విషయంలో తనపై లేనిపోని అభాండాలు వేస్తోందన్నారు. తన వద్ద చీటీలు వేసిందని, దాంతో తానే ఆమెకు రూ.80 లక్షలు చెల్లించాలంటూ ఆరోపణలు చేస్తోందన్నారు. అయితే చీటీలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన భర్త కృష్ణారెడ్డి రాజ్‌భవన్ రాజా వద్ద పూచీపడి ఆమెకు రూ.40 లక్షలు చీటీ డబ్బులు తీసిచ్చాడన్నారు. అదే విధంగా తన కుమారుడి పెళి్ల్ సమయంలో జీఎస్టీ లేకుండా తక్కువ ధరకు బంగారు కొనిస్తానని ఆశ చూపి తన నుంచి రూ.30 లక్షలు తీసుకుందన్నారు. బంగారు కొనివ్వకపోగా, రూ.40 లక్షలు చీటీ డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. మొత్తం రూ.70 లక్షలు బాకీ ఉందన్నారు. ఈ డబ్బులు అడిగినందుకు తనపై అభాండాలు వేసిందన్నారు. తానే రూ.80 లక్షలు చెల్లించాలంటూ ఆరోపణలు చేస్తూ.. కలెక్టర్‌కు, తాలూకా పోలీసులకు ిఫిర్యాదు చేసిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేసి తనకు రావాల్సిన నగదు రికవరీ చేసి న్యాయం చేయాలంటూ బాధితురాలు విన్నవించింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు హరిశర్మ, శ్రీనివాసులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు విజయ, గౌరీ, భాగ్యమ్మ, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
పోరుమామిళ్ల యర్రగుంట్ల లక్కిరెడ్డిపల్లె ?
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి రావడంతో ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 1.60 లక్షల ఓటర్లు తగ్గకుండా పునర్విభజన చేపట్టాలనే నిర్ణయం కారణంగా ఉమ్మడి కడప జిల్లాలో అదనంగా 4 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓట్ల లెక్కలివే.. ప్రస్తుత ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుంటే జిల్లాలో భారీ మార్పులు సంభవించనున్నాయి. కడప లోక్‌సభ పరిధి: ఈ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,39,066 ఓట్లు ఉన్నాయి. 1.60 లక్షల ఓట్ల నిబంధన ప్రకారం ఇక్కడ మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముంది. కొత్త కేంద్రాలుగా పోరుమామిళ్ల, యర్రగుంట్ల? ప్రాంతాలు మరియు ఓటర్ల లభ్యతను బట్టి మరికొన్ని కొత్త స్థానాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధానంగా పోరుమామిళ్ల కేంద్రంగా ఒకటి, యర్రగుంట్ల కేంద్రంగా మరొక కొత్త నియోజకవర్గం ఏర్పడే చాన్స్ ఉంది. రాజంపేట లోక్‌సభ పరిధి: ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,65,702 ఓట్లు ఉండగా, ఇక్కడ కూడా మరో 3 స్థానాలు పెరగనున్నాయి. దీని ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో (రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు కలిపి) ఒక స్థానంతో పాటు, అన్నమయ్య జిల్లాలో మరో రెండు స్థానాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో గతంలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె తిరిగి నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉందని సమాచారం. తాజా మార్పుల వల్ల రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో అదనంగా మరో ఎంపీ స్థానం కూడా జతయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రేరిపితంగా కాకుండా, కేవలం ఓటర్ల సంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే.. కడప–2, పోరుమామిళ్ల, యర్రగుంట్ల వంటి కొత్త స్థానాలు ఖాయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. సీట్ల పెంపు నిర్ణయం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నేతలకు, రాజకీయ నిరుద్యోగులకు పెద్ద వరంగా మారనుంది. 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా పురుష అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఇన్నాళ్లూ అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు అసెంబ్లీ మెట్లు ఎక్కే అదృష్టం దక్కనుంది. వెరసి, రాబోయే పునర్విభజన జిల్లా రాజకీయ చిత్రపటాన్నే మార్చివేయనుంది. ఈ పునర్విభజనలో నియోజకవర్గాల సరిహద్దు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సగటున నాలుగు లేదా ఐదు మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండాల్సిన దానికంటే సుమారు 1.20 లక్షల ఓట్లు అదనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల కడపను ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలుగా విభజించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. కడప అసెంబ్లీ సీట్ల కోటా పెరగనుంది పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో మరో 4 అసెంబ్లీ స్థానాలు నియోజకవర్గానికి 1.60 లక్షల ఓటర్లప్రాతిపదికన పునర్విభజన కడప ఈస్ట్, వెస్ట్గా జిల్లా కేంద్రం విభజన ద్వితీయ శ్రేణి నేతలు, రాజకీయ నిరుద్యోగులకు వరించనున్న అదృష్టం -
వంటింట్లో మళ్లీ
● దశాబ్దం తర్వాత రేషన్ దుకాణాల్లో కిరోసిన్ సందడి ● అంతర్జాతీయ సంక్షోభంతో ఎల్పీజీ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం ● రేపటి నుంచే పల్లెలు, గిరిజనప్రాంతాల్లో పంపిణీకి శ్రీకారం రాజంపేట: కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న కిరోసిన్ మళ్లీ వంటింట్లోకి అడుగుపెడుతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిరోసిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, గ్యాస్ సిలిండర్ల ఆకస్మిక కొరత వెరసి సామాన్యుడిని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. రేపటి నుంచే జిల్లాలోని పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. హర్ముజ్ సెగ.. వంటింట్లో మంట! పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాధారణ కోటా 1,00,000 కిలోలీటర్లకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించింది. ఒక దశాబ్ద కాలంలో ఇంధన కోటాలో ఇంత పెద్ద పెంపు ఇదే తొలిసారి. నేడు మనం వాడుతున్న కిరోసిన్‌ను కెనడియన్ వైద్యుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెన్నర్ 19వ శతాబ్దంలో కనుగొన్నారు. దీని రంగును బట్టి మన దగ్గర ’కృష్ణ ఆయిల్’ అని పిలుస్తారు. 2013–14 నుండి 2022–23 మధ్య కాలంలో దేశంలో కిరోసిన్ వినియోగం ఏటా 26 శాతం మేర తగ్గిపోయింది. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మళ్లీ కిరోసిన్‌ను వంటగదికి చేరువ చేశాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ – కిరోసిన్ తప్పదు ‘కిరోసిన్ చూసి దశాబ్దం దాటిపోయింది. 2015 నుంచి దశలవారీగా పంపిణీ కనుమరుగైంది. ఇప్పుడు అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రభుత్వం మళ్లీ పంపిణీకి సిద్ధమైంది. ’ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్లుగా పాత విధానాలకే మళ్లీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కిరోసిన్ పంపిణీ ఒక ఉదాహరణ.‘ – గునకల సుబ్బరాయుడు, సీనియర్ రేషన్ డీలరు, రాజంపేటమధ్యాహ్న భోజన పథకానికి ఆసరానివ్వాలి ‘వంట ఏజెన్సీలకు ఇప్పుడు కిరోసిన్ దికై ్కంది. మధ్యాహ్న భోజన పథకానికి ఎల్పీజీ, కట్టెలు సరిపోవడం లేదు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం వెంటనే కిరోసిన్ సరఫరా చేయాలి. గతంలో లాగే కిరోసిన్ పొయ్యిలను కూడా పంపిణీ చేయాలి. రోజుకు కనీసం 4 లీటర్ల కిరోసిన్ అవసరం ఉంటుంది.‘ – పాలెం సాంబశివయ్య గౌడ్, అధ్యక్షుడు, ఏఐటీయూసీ, నందలూరు. వైఎస్సార్ జిల్లా గణాంకాలు జిల్లా పరిధిలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కిరోసిన్ అవసరం ఎంత ఉందో అర్థమవుతుంది: మొత్తం జనాభా: 22.60 లక్షలు రేషన్ కార్డులు: 5.80 లక్షలు గ్రామీణ జనాభా: 14.56 లక్షలు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, తొలుత ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున పంపిణీ ప్రారంభం కానుంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు, చిన్న హోటళ్లు, టీ కొట్టుల యజమానులు మళ్లీ కిరోసిన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. -
భర్త వేధింపులపై ఫిర్యాదు
మదనపల్లె టౌన్: పెళ్లి జరిగిన ఏడాదికే తనను భర్త వేధిస్తున్నాడని మంగళవారం ఓ బాధితురాలు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన నాగరాజన్, రాధమ్మ దంపతుల కుమార్తె పల్లవిని అదే ప్రాంతానికి చెందిన చౌడౌడేశ్వరి నగర్లో ఉండే నవీన్‌కు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన నాలుగు నెలల పాటు బాగానే ఉన్నట్లు పల్లవి తెలిపారు. ఇంతలో ఏం జరిగిందో తన భర్త రోజూ తాగొచ్చి గొడవపడి వేధిస్తుండడంతో బాధ భరించలేక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పుట్టినింటికి తీసుకు వచ్చారని చెప్పారు. తనను కాపురానికి తీసుకు పోకుండా రోజూ వేధిస్తుండటంతో విధి లేక పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. యువకుడి ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అర్థరాత్రి ములకలచెరువులో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక హైస్కూల్ వీధిలో కాపురం ఉంటున్న బావాజాన్ (30) భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది బైకుకు ఉన్న పెట్రోల్ తీసి, ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటల్లో కాలుతున్న బావాజాన్‌ను కుటుంబీకులు గమనించి కాపాడి వెంటనే 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందించి అతన్ని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై ములకలచెరువు ఎస్ఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన యువకుడి మృతి కలికిరి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమా దంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అల్తాఫ్ (20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు లు తెలిపారు. కలికిరి–సోమల రోడ్డు సామగుంటవారిపల్లి బస్టాప్ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు సోమవారం రాత్రి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనంలో పెట్రోలు క్యానుతో వెళుతున్న అల్తాఫ్ క్యాను పగిలి మంటలు వ్యాపించి అంటుకుని గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందినట్లు, రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గుర్రంకొండ : గుర్రంకొండ రైతు సేవా కేంద్రంలో వీహెచ్ఏగా పని చేస్తున్న అక్రమ్‌బాషా ప్రవర్తనా తీరుపై జిల్లా వ్యవసాయ అధికారులు విచారణ జరిపారు. ఇటీవల అక్రమ్‌బాషా తీరుపై మర్రిమాకులపల్లెకు చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ భయ్యారెడ్డితోపాటు పలువురు రైతులు కలెక్టర్‌కు, జిల్లా వ్యవసాయాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యవసాయ కార్యాలయ ఏడీఏ మజీద్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక రైతు సేవా కేంద్రంలో విచారణ నిర్వహించారు. ఫిర్యాదు చేసిన రైతుల అభియోగాలపై మొదట విచారణ జరిపారు. అక్రమ్‌బాషా రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని, ఏదైనా సమాచారం అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని, యూరియా పంపిణీపై సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ రైతులు విచారణాధికారికి ఫిర్యాదు చేశారు. ఇకపై తన తీరు మార్చుకొంటానని రైతులతో దురుసుగా వ్యహరించబోనని అక్రమ్‌బాషా పేర్కొన్నారు. విచారణ నివేదికను జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఏడీఏ మజీద్ అహమ్మద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రత్నమ్మ, రైతులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసం
● ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలి ● బి.కొత్తకోట, మదనపల్లెల్లో సీపీఐ ధర్నాలుమదనపల్లెలో ఆందోళన చేస్తున్న సీపీఐ శ్రేణులు బి.కొత్తకోటలో ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు బి.కొత్తకోట : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని కూటమి పాలకులను సాగనంపుతామని సీపీఐ నేతలు హెచ్చరించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు, మహిళలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పక్కా గృహాలు మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బి.కొత్తకోట పట్టణ పేదలు వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా స్వాధీనం చేయలేదన్నారు. దీని కారణంగా ఇప్పుడు కొత్తగా లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఆన్లైన్లో నమోదు కావడం లేదన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలు రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, పింఛన్లు, రేషన్ కార్డులు, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలకు పింఛన్లు, అర్హులైన వ్యవసాయ కూలీలందరికీ కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ బావాజాన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్.మనోహర్‌రెడ్డి, నాయకులు సింగన్న, హరికుమార్, ఫయాజ్, ఎం.అష్రఫ్అల్లీ, ఎస్.బషీర్ ఖాన్, పి.నారాయణస్వామి, యస్.తంబయ్యశెట్టి, ఎం.గంగులప్ప, జవహార్ బాబు, జి.శంకర, వి.సుధాకర్, దుమ్ము, బాబు, రియాజ్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లెలో.. మదనపల్లె : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం, భూమిలేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి, బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 31 లక్షల మంది పేదలకు ఇంటి స్థలం ఇస్తే.. ఒకటిన్నర సెంటు సరిపోదు, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలయ్యాక విస్మరించారన్నారు. టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టి వీధుల్లో ఉన్న బాధితులను ఆదుకోవాలన్నారు. ఏడు లక్షల మంది పింఛన్లు తీసేసిన ప్రభుత్వం పేదరిక నిర్మూలన చేయడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జనార్ధన్, సాంబశివ, నియోజవర్గ కార్యదర్శి మురళి, పట్టణ కార్యదర్శి మాధవ్, దేవా తిరుమల, తరుణ్, ఇంద్రాణి, కాంతమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు
పులిచెర్ల(కల్లూరు): నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వివిధ కోర్టుల్లో ష్యూరిటీగా వినియోగిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్ఢూడీ ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంపీడీఓ పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ సీళ్లు తయారు చేసి, వాటితో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ద్వారా తిరుపతి, పాకాల, పుంగనూరు, పీలేరు, చిత్తూరు కోర్టుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు ష్యూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సీళ్లు, రబ్బరు స్టాంపులు, ఇంక్‌ప్యాడ్, వ్యాల్యుయేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకొన్నారు. పులిచెర్ల 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన డి.ఆంజనేయులు, సి.రవి, చిన్నగొట్టిగల్లుకు చెందిన నీల వెంకటరమణ, తిరుపతికి చెందిన పి.బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐదుగురు అరెస్ట్ -
హార్సిలీహిల్స్ ఘాట్‌పై ఆటో ప్రమాదం
● ఏడుగురు కడప వాసులకు తీవ్ర గాయాలు ● రెండో మలుపు వద్ద ఘటన ● వరుస ప్రమాదాలతో పర్యాటకుల్లో ఆందోళన బి.కొత్తకోట : రోజూ వరుస ప్రమాద ఘటనలతో.. పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చే పర్యాటకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం టాటా ఏస్ ప్రమాదం, సోమవారం బైక్ ప్రమాదం జరగ్గా.. మంగళవారం కడప పర్యాటకుల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. దీనికి సంబంధించి స్థానికులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం అల్మాస్పేటకు చెందిన ఎస్.యూసుఫ్ (25), ఎస్.జాఫర్ (25), ఎస్.అహమ్మద్ బాషా (26), ఎస్.మస్తాన్ (36), ఎస్.జుబేర్ అహమ్మద్(25), ముస్తఫా(26) మిత్రులు. వీరంతా సరదాగా హార్సిలీహిల్స్ పర్యటనకు వెళ్లాలి, చల్లని వాతావరణంలో సేద తీరాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం మంగళవారం తెల్లవారుజామున ఆటోలో కడప నుంచి హార్సిలీహిల్స్‌కు బయలుదేరారు. వీరు ఉదయం ఏడు గంటలకు కొండపైకి చేరుకున్నారు. కొండపై ప్రకృతి అందాలు తిలకిస్తూ, సంతోషంగా వినోదాలు పంచుకున్నారు. అనంతరం తిరిగి స్వస్థలానికి వెళ్లేందుకు మధ్యాహ్నం కొండపై నుంచి వెనుతిరిగారు. మొదటి మలుపు దాటుకుని కాఫీ తోటల వద్ద రెండో మలుపు దాటే సమయంలో.. బ్రేక్ వైర్ కట్ కావడంతో ఆటో వేగ నియంత్రణ సాధ్యం కాలేదు. దాంతో ఆటో మలుపు వద్ద బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి తల, ముఖం, కాళ్లు, చేతులు, శరీరం పైన తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో బాధితులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. గాయాల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్డుపైన, ఆటోలో బాధితులు ఉండిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వారికి ప్రాథమిక వైద్యం అందించి మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస ప్రమాదాలు హార్సిలీహిల్స్ వచ్చే పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆదివారం మొదలైన ప్రమాదాల పరంపర వరుసగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మదనపల్లి ఎస్టేట్‌కు చెందిన పర్యాటకులు కొండకు వెళ్లి తిరిగి వస్తుండగా మూడో మలుపు వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం ఇదే మలుపు వద్ద గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఆటో ప్రమాదం జరిగి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిరోజు ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటే పర్యాటక కేంద్రం కాస్త ప్రమాదాల కేంద్రంగా మారిపోయే పరిస్థితి ఉంది. తద్వారా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణకు అధికారులు సత్వరమే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. బోల్తా పడిన ఆటో రోడ్డుపై పడిన బాధితుడు -
నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ● కోర్టు మానిటరింగ్ సిబ్బంది, కానిస్టేబుళ్లకు శిక్షణ మదనపల్లె టౌన్ : సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మంగళవారం మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో టీసీఆర్‌బీ ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుళ్లు బాధితులకు, కోర్టుకు వారధిలా పని చేయాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసే కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి కేసుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హత్యలు, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు (పోక్సో), మత్తు పదార్థాల రవాణా కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. నిందితుడికి శిక్ష పడినప్పుడే బాధితుడికి నిజమైన న్యాయం జరిగినట్లని అన్నారు. సాక్షులు భయ పడకుండా వాంగ్మూలం ఇచ్చేలా వారికి రక్షణ కల్పించి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. న్యాయస్థానాలు జారీ చేసే సమన్లు, బెయిలబుల్, నాన్–బెయిలబుల్ వారెంట్ల అమలులో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. పెండింగ్ వారెంట్లను పరిష్కరించి నివేదించాలన్నారు. బీఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, కొత్త నిబంధనల ప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ జరిగాలన్నారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కోర్టు కానిస్టేబుళ్లు తమ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కేసుల పురోగతిని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఏ.ఆదినారాయణరెడ్డి, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ కె.దస్తగిరి, చంద్రశేఖర్, పలువురు ఎస్ఐలు, కోర్టు లైజనింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ములకలచెరువు మండలంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య, భర్తలతోపాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ములకలచెరువు ఎస్ఐ ప్రతాప్ తెలిపిన వివరాలు.. పెద్దతిప్పసముద్రం మండలం కొత్తపల్లికి చెందిన దంపతులు రమణప్ప, కృష్ణవేణి తన కుమారున్ని వెంట తీసుకుని బైకులో సొంత పని మీద ములకలచెరువుకు బయలుదేరారు. స్కూటర్ మార్గంమధ్యలోని ములకలచెరువు మండలంలోని మిడసానిపల్లెకు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి అదుపు తప్పి పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం రమణప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. తల్లి కుమారుడు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన రమణప్ప, చికిత్స పొందుతున్న తల్లీకుమారుడు -
పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● వైభవంగా ధ్వజారోహణం ● గజవాహనంపై స్వామి వారి విహారం ధ్వజారోహణం నిర్వహిస్తున్న వేదపండితులు గజవాహనంపై శ్రీ పట్టాభిరాముడి ఊరేగింపు వాల్మీకిపురం : వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీ పరాభవనామ సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 8.50 మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి టీటీడీ వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపజేశారు. ఈ సందర్భంగా నాగదోష, సంతాన ప్రాప్తి కోసం మహిళలకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ పట్టాభిరాములవారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం ఊంజల్‌సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, అలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు చింతల ఆనంద రెడ్డి, కేశవరెడ్డి, రామక్రిష్ణరెడ్డి, శ్రీనివాసులు, పులిబ్రదర్స్, భక్తులు పాల్గొన్నారు. గజవాహనంపై శ్రీ పట్టాభిరాముడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు పట్టాభిరాముడు రాత్రి 8 గంటల నుంచి గజవాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పట్టాభిరామస్వామి గజవాహనంపై ఊరేగారు. వాహనాల ఎదుట మహిళలు పిండిదీపాలతో స్వాగతం పలికారు. భక్తులు అడుగడునా కొబ్బరికాయలు కొడుతూ... కర్పూర హారతులతో స్వామిని సేవించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, సాయంత్రం ఊంజల్‌సేవ, రాత్రి హనుమంత వాహనం సేవ కార్యక్రమాలు జరుగుతాయి. -
వెలవెలబోయిన షర్మిల పర్యటన
సాక్షి టాస్క్‌ఫోర్స్: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఉమ్మడి కడప జిల్లాలో చేపట్టిన పర్యటన తుతూమంత్రంగా సాగింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఆమె, రైతుల సమస్యల కంటే వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. పర్యటన ఆద్యంతం జనస్పందన కరువవ్వడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. పులివెందుల పర్యటనలో పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, పీసీసీ డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లు కనిపించకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కనీసం వంద మంది కార్యకర్తలు కూడా లేకపోవడంతో షర్మిల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ధృవకుమార్రెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జన సమీకరణ కోసం మహిళలకు రూ. 500 కూలీ ఇచ్చి పిలిపించినా ఫలితం లేకపోయింది. ఈ పర్యటనలో కేవలం జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, కొందరు నియోజకవర్గ ఇన్చార్జిలు మాత్రమే పాల్గొన్నారు. బనానా ప్యాక్ హౌస్‌పై అసత్యాలు పులివెందుల ప్రాంత అరటి రైతుల కోసం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్’పై షర్మిల అబద్ధాలు వల్లించారు. 2024 మార్చి 11న జగన్ దీనిని ప్రారంభించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. అయితే, అసలు జగన్ హయాంలో దీనిని నిర్మించలేదంటూ షర్మిల మాట్లాడటంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. -
అదరగొట్టిన ‘అనంతపురం’
కడప వైఎస్ఆర్ సర్కిల్: అనంతపురం జట్టు అదరగొట్టింది. ఏసీఏ సౌత్‌జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు–అనంతపురం జట్లు పోటీ పడ్డాయి. నెల్లూరు జట్టు 99 పరుగులకు ఆలౌట్ కాగా అనంతపురం జట్టు కేవలం 8.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది. అనంతపురం జట్టులోని ప్రదీప్‌రెడ్డి తన బౌలింగ్‌లో సత్తా చాటి 6 వికెట్లు తీసి నెల్లూరు జట్టును తక్కువ స్కోరుకే అలౌట్ చేయడం విశేషం. మరో మ్యాచ్‌లో అలాగే చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కడప జట్టు కేవలం 119 పరుగులకు ఆలౌట్ కావడంతో చిత్తూరు జట్టు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి సునాయసంగా విజయం సాధించింది. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 16 పాయింట్లు సాధించి విజేతగా నిలవగా, నెల్లూరు, కర్నూలు 8 పాయింట్లు, కడప జట్టు 4 పాయింట్లు మాత్రమే సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 18.5 ఓవర్లకు 99 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రేవంత్‌రెడ్డి 45, సయ్యద్ ఫర్హాద్ ఖాద్రీ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రదీప్‌రెడ్డి చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి 6 వికెట్లు తీసి కర్నూలు బ్యాటర్లను హడలెత్తించాడు. మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 8.5 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆ జట్టులోని దత్తరెడ్డి 22, అర్జున్‌రెడ్డి 56 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తోషిత్ యాదవ్ 1 వికెట్ తీశాడు. దీంతో అనంతరం జట్టు 9 వికెట్లు తేడాతో విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కడప–చిత్తూరు జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 27.4 ఓవర్లకు 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధృవకుమార్‌రెడ్డి 28, పఠాన్ షరీఫ్ 26 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, సయ్యద్ సాజిద్ 2, దీపన్ సాయినాథ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 16.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఆ జట్టులోని దినేష్ వర్మ 57 పరుగులు చేశాడు. దీంతో చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రదీప్‌రెడ్డి, అనంతపురం (6 వికెట్లు) అర్జున్‌రెడ్డి, అనంతపురం (56 పరుగులు) శ్రీకాంత్, చిత్తూరు (5 వికెట్లు) అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ పోటీల్లో విజయం -
దేశానికే మోడల్‌గా స్మార్ట్ కిచెన్ వ్యవస్థ
వైఎస్సార్ కడప కలెక్టర్ శ్రీధర్ కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో వినూత్నంగా చేపట్టిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానం రాష్ట్రానికే కాక దేశంలోనే ఒక ఉత్తమ నమూనాగా నిలుస్తోందని వైఎస్సార్ కడప కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. న్యూఢిల్లీ ప్రగతి విహార్ లోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 23,24 వ తేదీలలో నిర్వహించిన సమ్మిట్ లో వైఎస్సార్ కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. స్మార్ట్ కిచెన్ల నిర్వహణలో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనం అందడమే కాకుండాస్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించ గలుగుతున్నామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి కిచెన్ కార్యకలాపాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధి కి కూడా దోహదం జరుగుతోందన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ వ్యవస్థ అమలు ను పర్యవేక్షించేందుకు ఆధునిక డిజిటల్ వ్యవస్థలు అమలు చేస్తున్నామని, ట్రాకింగ్ ద్వారా వాహనాల కదలికలు, కిచెన్ కార్యకలాపాలు మానిటరింగ్ చేయడం వల్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచ గలుగుతున్నామని కలెక్టర్ వివరించారు. -
తేనె టీగల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : తేనెటీగల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని కోటవారిపల్లె గ్రామం గూటంవారిపల్లెకు చెందిన గోపాల్‌రెడ్డి భార్య సిద్దమ్మ(60) ఊరికి సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింత చెట్టుకింద కూర్చొంది. అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగల గుంపు సిద్దమ్మపై దాడి చేశాయి. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు కేకలు వేడంతో స్థానికులు వచ్చి ఆమెను ఓ ప్రయివేట్ వాహనంలో హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. మినీ బస్సును ఢీకొన్న కారు బి.కొత్తకోట : అంగళ్లు నుంచి బి.కొత్తకోటకు వెళ్తున్న ఓ కళాశాలకు చెందిన మినీబస్సును కారు ఢీకొన్న సంఘటన మంగళవారం మండలంలోని మొగసాలమర్రి వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అంగళ్లకు చెందిన కళాశాల మినీ బస్సు బి.కొత్తకోటలో విద్యార్థులను దింపేందుకు వెళ్తుండగా.. మదనపల్లె నుంచి బి.కొత్తకోటకు కారులో వెళ్తున్న ఎస్ఎల్వీ బేకరి నిర్వహిస్తున్న రవిరాజ్ (36) మినీబస్సును వెనుకవైపు ఢీకొన్నాడు. ఈ ఘటనలో మినీ బస్సు అదుపుతప్పి కుడివైపు పోలాల్లోకి దూసుకెళ్లి ముందరి భాగం ధ్వంసమైంది. కారులో వస్తున్న రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో బాధితున్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రి తరలించారు. -
సేద్యంలో 15 శాతం వృద్ధి సాధించాలి
మదనపల్లె: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వార్షికంగా కనీసం 15 శాతం వృద్ధి సాధించేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మదనపల్లె రూరల్ మండలంలోని అంకిశెట్టిపల్లెలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి చర్చిస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కల్పిస్తున్న ప్రయోజనాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ విధానాలు, పంటల ఎంపిక, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు భూమి రికార్డులు, ఈ–క్రాప్ నమోదు లోపాలు, సర్వే నంబర్ల మార్పులు, బ్యాంకు రుణాల మంజూరు, ఉమ్మడి ఖాతాల కారణంగా పాస్ పుస్తకాల జారీ ఆలస్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ రైతులు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, అధికారులు పాల్గొన్నారు. రాయచోటి: జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాయచోటి పట్టణం, మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు, బీయూలు, సీయూలు, వీవీ ప్యాట్లను అక్కడి భద్రత చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలను కలెక్టర్ సమాధా నం ఇచ్చారు. రాయచోటి ఆర్డీఓ ఏ శ్రీనివాస్, తహశీల్దార్ నరింహ కుమార్, కలెక్టర్ ఎలక్షన్ సెక్షన్ సూపరిటెండెంట్ హరి పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీలో కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఆవుల్లో కోహినూరు!
పుంగనూరు..● ఒక్క ఆవుతో మొదలై.. ఐదుకు చేరిక ● తక్కువ ఖర్చుతో పోషణ.. ఒక్కో దూడ ధర రూ. 1.50 లక్షల వరకు! ● పులిచెర్ల రైతు మురళీమోహన్‌రెడ్డి ‘గో’ మక్కువపులిచెర్ల (కల్లూరు), న్యూస్‌లైన్ : సాధారణంగా పశువుల పెంపకం అంటే శ్రమతో కూడుకున్న పని. గతంలో ప్రతి రైతు ఇంట్లో దేశీయ పశువులు ఉండేవి. కానీ ట్రాక్టర్ల రాకతో వాటి సంఖ్య తగ్గి, కేవలం పాల కోసం పెంచే జర్సీ ఆవులే ఊరూరా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పులిచెర్లకు చెందిన రైతు గోటూరి మురళీమోహన్‌రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవులపై మక్కువతో వాటి పెంపకాన్ని చేపట్టి నేడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమ్మకంతో మొదలై.. లాభసాటిగా మారి ఆరు సంవత్సరాల క్రితం, ఉదయాన్నే పుంగనూరు ఆవును చూస్తే శుభం జరుగుతుందన్న నమ్మకంతో మురళీమోహన్‌రెడ్డి రూ. 75 వేలు వెచ్చించి ఒక ఆవును కొనుగోలు చేశారు. మొదట ఇంటి ఆవరణలోనే పెంచినప్పటికీ, క్రమంగా వీటి సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఐదు ఆవులకు చేరింది. ఇందులో ఒక మగ ఆవు (నంది) కూడా ఉంది, దీని ద్వారానే బ్రీడింగ్ చేయిస్తున్నారు. సంఖ్య పెరగడంతో తన మామిడి తోపులో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి మనుషుల ద్వారా వీటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇపుడు మరో ఆవు కూడా జతచేరనుంది. ఆదాయం ఇలా.. పాల ధర : ఈ ఆవు రోజుకు ఉదయం 2, సాయంత్రం 2 లీటర్ల పాలు ఇస్తుంది. లీటరు ధర మార్కెట్లో రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. దూడల విక్రయం : ఒక్కో దూడ ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోంది. వ్యర్థాలకు డిమాండ్ : కేవలం పాలే కాకుండా, వీటి పేడ మరియు మూత్రానికి ప్రకృతి వ్యవసాయం చేసే వారి నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. బంగారుబాతు : నేటి కాలంలో పాడి పరిశ్రమ అంటే కేవలం పాల దిగుబడి మాత్రమే కాదు, మన దేశీయ పశు సంపదను కాపాడుకోవడం కూడా అని మురళీమోహన్‌రెడ్డి నిరూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ రోగాలతో, అత్యధిక పోషక విలువలున్న పాలను అందించే పుంగనూరు ఆవుల పెంపకం రైతులకు నిజంగానే బంగారు బాతు లాంటిది. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడుకుంటూ, ఆర్థికంగా ఎదగవచ్చని ఆయన చాటిచెబుతున్నారు. -
కిచెన్‌లో చికెన్ కరువు
● కొండెక్కుతున్న కోడి ధరలు ● ఎండల దెబ్బకు కోళ్ల కొరత ● అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్నమదనపల్లె అర్బన్ : మదనపల్లె ప్రాంతంలో మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్, ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది. ఎండల తీవ్రత వల్ల మార్కెట్లో కోళ్ల కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ధరల పెరుగుదల – గణాంకాలు గత జనవరిలో కిలో రూ. 170 నుంచి రూ. 200 మధ్య ఉన్న చికెన్ ధర, ప్రస్తుతం రూ. 250 నుంచి రూ. 270 కి చేరింది. నాణ్యమైన పెద్ద బ్రాయిలర్ కోళ్ల ధర అయితే ఏకంగా రూ. 330 నుంచి రూ. 360 పలుకుతోంది. నాటుకోడి కిలో ధర రూ.600 పలుకుతుండగా, మటన్ ధర కిలో రూ. 900 కి చేరడంతో, ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకీ పరిస్థితి? ఎండల సెగ : ఇటీవల సోకిన బర్డ్ ఫ్లూ వ్యాధి, తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు భారీగా మృత్యువాత పడ్డాయి. నష్టాల్లో రైతు : లక్షలు ఖర్చు చేసి ఫారాలు ఏర్పాటు చేసినా, కోళ్ల మరణాలతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ సెగ : కోళ్ల కంపెనీలు, ట్రేడర్స్ సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తుండటం వల్ల అటువినియోగదారులకు, ఇటు రైతులకు అన్యాయం జరుగుతోంది. భవిష్యత్తు ఏంటి జాతరల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్, జూలై నాటికి మటన్ ధర రూ. 1000 మార్కును తాకే అవకాశం ఉందని, ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా ఆగస్టు (వినాయక చవితి) వరకు తగ్గే సూచనలు లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్
మదనపల్లెటౌన్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా నూతన ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చి న బాధితుల నుంచి అడిషనల్ ఎస్పీ అర్జీలను స్వీకరించారు. సత్వర చర్యలకు సంబంధిత సీఐ, ఎస్ఐలతో ఏఎస్పీ నేరుగా మాట్లాడి పరిష్కారం చూపారు. టీబీ ముక్త్ భారత్‌కు శ్రీకారం –కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె: జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ వ్యాధి రహిత జిల్లాగా మా ర్చాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమంపై ప్రజ ల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభు త్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ రాధిక ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ హాలులో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటరెడ్డి సమాజసేవకు అంకితభావంతో పనిచేసిన మహనీయుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సేవా భావం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, కలెక్టర్ చల్లా కళ్యాణి, కెఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే ఏడి భరత్ కుమార్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి తేజస్విని పాల్గొన్నారు. -
బి.కొత్తకోటలో తప్పిన ప్రమాదం
– నేలపై కూలిన విద్యుత్ స్తంభం బి.కొత్తకోట: స్థానిక కాళికమ్మ గుడి వీధిలో సోమ వారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. వానరాలు విద్యుత్ తీగలపై విన్యాసాలు చేస్తూ గెంతడంతో విద్యుత్ స్తంభం మూడు ముక్కలైంది. ఆ సమయంలో వీధిలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాళికమ్మ గుడి వీధి, పంజూరమ్మ గుడి వీధి మధ్యలో విద్యుత్ సరఫరా లైను సాగుతుంది. వీధి మూలన విద్యుత్ స్తంభం తుప్పు పట్టడంతో దాని విద్యుత్ తీగలపై వానరాలు అటు ఇటు గెంతాయి. విద్యుత్ స్తంభం ఒక్కసారి గా నేల కొరిగింది. ఎదురుగా నిలిపివుంచిన ఖాజాఖాన్‌కు చెందిన ఇన్నోవాపై పడి తర్వాత నేలపై పడింది. దాంతో విద్యుత్ స్తంభం ముక్కలై, విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సమాచారం అందుకున్న డిస్కం ఏఈ విద్యుత్ సిబ్బందిని పంపించి కొత్త స్తంభం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
అంగరంగ వైభవంగా దాశరథి కల్యాణం
రాజంపేట : ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యా ణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వంసిద్ధం చేస్తున్నామని, మార్చి 30నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన టీటీడీ వివిధ విభాగాల అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామాలయం పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద విస్తృతంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మాడవీధులు, క్యూలైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో జర్మన్‌షెడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. తాగునీటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. లేజర్ లైటింగ్, ఎల్ఈడీ తోరణాలు ఏర్పాటు చేసి, ఉత్సవాలకు అధ్యాత్మిక శోభ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. -
వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
పీలేరురూరల్ : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె. అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం పీలేరు వంద పడకల ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయొద్దని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో అన్నమయ్య జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వాల్మీకిపురం, పీలేరు ఆస్పత్రులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు వైద్య బృందా లు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన ఆస్పత్రులకు పారిశుద్ధ్య ఎంపికతోనే ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. ఆస్పత్రులకు కూడా రాష్ట్ర స్థాయిలో కాయకల్ప అవార్డులతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, జిల్లా క్వాలిటీ మేనేజర్లు ప్రభావతి, నాగరాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగవేణి, డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


