breaking news
Donald Trump
-
మా భూమిపై కాలు పెడితే అంతే.. ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కొవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతబలగాలు ట్రిగ్గర్‌పై వేలు ఉంచాయన్నారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వైపు తమ భద్రతా బలగాలు కదిలాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ" మా శక్తివంతమైన సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి వేలు ట్రిగ్గర్స్ పై ఉన్నాయి. మా గాలిపై, భూమిపై, సముద్రంపై, ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కొవడానికి వారు రెడీ అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన న్యాయమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని తెలిపారు.అయితే ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. అణ్వయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తమ తదుపరి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దీనికోసం అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నేవీ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలిపారు. -
ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు
-
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా హెచ్-1బీ వీసా(H-1B Visa) దరఖాస్తుదారులకు బిగ్ షాక్ తగిలింది. అమెరికాలోని టెక్సాస్ స్టేట్ కాలేజీల్లో హెచ్-1బీ వీసా ఉద్యోగుల నియామకాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో, హెచ్-1బీ వీసాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.ఈ సందర్భంగా వీసాదారులపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్ రాష్ట్ర ఏజెన్సీలు, విశ్వవిద్యాలయాల హెచ్-1బీ పిటిషన్లు తక్షణమే నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే చెందాలని వ్యాఖ్యలు చేశారు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని అన్ని రాష్ట్ర సంస్థలను ఆదేశిస్తున్నట్టు అబాట్ ఏజెన్సీ అధిపతులకు రాసిన లేఖలో తెలిపారు. కాగా, వీసాల నిలిపివేత మే 31, 2027 వరకు కొనసాగుతుందని చెప్పారు. అమెరికాలోని సంస్థలు విదేశీ కార్మికులను ఉపయోగించుకునే ముందు అర్హత కలిగిన అమెరికా కార్మికులను నియమించుకోవాలన్నారు.ఇక వచ్చే ఏడాదే.. ఇదిలా ఉండగా.. భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్-1బీ (H-1B visa) వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది. భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్ లాగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. వాస్తవానికి డిసెంబర్ 2025లో వీటిల్లో తొలిసారి జాప్యం చోటుచేసుకొంది. నాడు ఇంటర్వ్యూలను మార్చి 2026కు మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తేదీలు అక్టోబర్‌కు.. ఇప్పుడు 2027కు మారినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు తర్వాతకు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి. దీంతో, ఇమిగ్రేషన్ నిపుణులు ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్‌కు వెళ్లవద్దని సూచిస్తున్నారు. మరోవైపు ఈ సమస్యను మరింత జఠిలం చేసేలా అమెరికా విదేశాంగ శాఖ కొన్నాళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకొంది. దీని ప్రకారం భారతీయులు మరో దేశంలోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశాన్ని నిలిపివేసింది. దీంతో భారతీయ కాన్సులేట్లలో అపాయింట్మెంట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. -
దక్షిణ కొరియాకు ట్రంప్ బెదిరింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పటి వరకు అమలు చేయని కారణంగా దక్షిణ కొరియాపై టారిఫ్‌లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.ఈ సందర్భంగా ఔషధాలు, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులపై 15 నుంచి 25 శాతం వరకు టారిఫ్‌లను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య గతేడాది జూలైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ‘వాణిజ్య ఒప్పందాలు మాకు చాలా ముఖ్యమైనవి. ఒప్పందాలు కుదిరిన చోట్ల టారిఫ్‌లు తగ్గించుకుంటూ వస్తున్నాం. భాగస్వామ్య దేశాలు కూడా ఇదే రీతిలో స్పందిస్తాయని భావిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలపై దక్షిణ కొరియా ప్రభుత్వం స్పందించింది. హామీ ఇచ్చిన విధంగా అమెరికాలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, ఒప్పందంలోని ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపింది. -
మీ పాలసీ మాకొద్దు.. అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై USAలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. తాజాగా జరిపిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. అమెరికాను గొప్పగా చేస్తానంటూ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ఆ దేశ ప్రజలలో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుంది. "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అనేది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నినాదం యుఎస్ఎను మరోసారి స్ట్రాంగ్ చేస్తానంటూ ప్రచారం చేసిన ట్రంప్ ఎట్టకేలకు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా సొమ్మును వేరే దేశాల వారు దోచుకుంటున్నారంటూ హంగామా చేసి ఇష్టారీతిన ఇమిగ్రేషన్ పాలసీని మార్చి వలస కార్మికులపై కఠిన నిబంధనలు విధించారు. తాజాగా ఇప్పుడు ఆ నిబంధనలే ఆయనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా చేశాయి.అమెరికాలో వలస నియంత్రణ కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల దాడులు ఇటీవల శృతిమించుతున్నాయి. గతేడాది వీరు జరిగిన దాడుల్లో 32మంది మరణించగా ఇటీవల మిన్నెసోటా రాష్ట్రంలో జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వలసవిధానంపై అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. కేవలం 39 శాతం ప్రజలు మాత్రమే ట్రంప్ వలస విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే గత నెలలో ఈ సంఖ్య 41శాతంగా ఉంది. దీనిని 53 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఆయన నిర్ణయాలకు 50 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అయితే మెుత్తంగా ఆయన నిర్ణయాలకు జనవరిలో 41శాతం మంది ఆమెదం తెలుపగా ప్రస్తుతం ఆ సంఖ్య 38 శాతానికి దిగజారింది -
నన్ను ఎలా గుర్తుంచుకుంటారో.. ట్రంప్ అంతర్గత మథనం?
గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదంటూ పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆయనకు వయసైందని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ట్రంప్ వీటన్నిటిని కొట్టిపడేసి ఐయామ్ ఆల్రైట్ అన్నారు. అయితే తన వృద్ధాప్యం నేపథ్యంలో ట్రంప్ మనసులోని మాటపై న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఒక ఆసక్తికర కథనం ప్రచురించిందిన్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రచురించిన కథనంలో డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ప్రజలు తనను ఏఅంశంలో గుర్తుంచుకుంటారో అనే విషయంపై అధికంగా ఆలోచిస్తున్నారని ప్రచురించింది.అయితే ట్రంప్ తన జుట్టుకు గోల్డ్ కలర్ వేయడానికి ఇష్టపడట్లేదని దానిని నేచురల్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. ఆయన మనస్సులో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారని తెలిపిందిఅయితే ట్రంప్ వ్యక్తిత్వంపై ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ మాట్లాడుతూ "ట్రంప్ మూఢనమ్మకం గల వ్యక్తి, ఆయనమరణం గురించి ఆలోచించడానికి ఇష్టపడడు. అతను భవిష్యత్తు కంటే వర్తమానంలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఎదో విధంగా ఆయన అందరి మనస్సులో ఉన్నారు. ఆయనకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి". అన్నారు.అయితే ఇటీవల వైట్ హౌస్ ఆయనను అత్యంత శక్తివంతమైన అధ్యక్షుఽడిగా అభివర్ణించింది. ఆయనకు సగటు మనిషికంటే ఎక్కుువ ఓర్పు,శక్తి ఉన్నాయి. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంది. ఆయన ప్రస్తుతం మరింతగా కష్టపడి పనిచేయగలరు. అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్ ఆయన వైద్యులు సూచించిన దాని కంటే అధిక మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటానన్నారు. తనకు 81 మి.గ్రా సూచించగా తాను మాత్రం రోజుకు 325 మి.గ్రా. ఆస్పిరిన్ తీసుకుంటానని వెల్లడించాడు, క్యాబినెట్ సమావేశాల్లో నిద్రపోతున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అంతర్గత మథనంపై టైమ్స్ మ్యాగజైన్ ఆసక్తికర నివేదిక ప్రచురించింది. -
ఈసారి రాజకీయ దావోస్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్‌కు బదులు రాజకీయ దావోస్ అయింది.మిత్రుల మధ్యే భేదాభిప్రాయలుతిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్‌లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్‌పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్‌లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్‌ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్‌లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.గ్రీన్‌ల్యాండ్‌తో పైపైకి...ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్‌ల్యాండ్‌ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్‌కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్‌లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్‌లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.ఢీ అంటే ఢీపరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్‌ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్‌ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్‌ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్‌లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
'ముందు 50 శాతం డాడీ ట్యాక్స్ చెల్లించండి': ట్రంప్ పోస్ట్!
సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్యను ప్రశంసిస్తూ.. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు.. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అబద్దాలకోరు ఉర్సులా & భారత బృందం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే, వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు, అతను ఓవల్ ఆఫీస్‌లో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని పోస్టులో వెల్లడించారు.అంతే కాకుండా.. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు!. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50 శాతం డాడీ ట్యాక్స్ (టారిఫ్‌లు!) చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.భారత్ - ఈయూ డీల్ ప్రయోజనాలుఇండియా.. యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా.. మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించడంతో.. వీటి ధరలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా.. మన దేశంలో ప్రీమియం కార్ల ధరలు, మెడిసిన్స్ ధరలు, మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా.. ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలపైన, ఉక్కు & రసాయన ఉత్పత్తులపైన ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. -
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్‌టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్‌తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
ట్రంప్ కు బిగ్ షాక్...యూరప్ భారత్ మెగా డీల్
-
అలాంటి ఉద్దేశం ట్రంప్‌నకు లేనే లేదు, కానీ..
అమెరికాలో వలస నియంత్రణ కోసం పని చేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో మిన్నెసోటా స్టేట్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లలో ఆందోళన పెరిగిపోతుండగా.. ఐస్ వ్యతిరేక నిరసనలు ఒకసారిగా ఉధృతం అయ్యాయి. మరోవైపు.. ట్రంప్ సర్కార్ మానవ హక్కులను కాలరాస్తోందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరుడు జరిపిన దాడుల్లో.. 32 మంది మరణించారు. ఈ ఏడాదిలో మొన్నమధ్యే మిన్నెసోటా రాష్ట్రంలో ఐస్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. జనాల ప్రాణాల్ని తీస్తున్న ట్రంప్ సర్కార్ అంటూ డెమోక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రిపబ్లికన్ పార్టీ మాత్రం ఈ దాడుల్ని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ అమెరికన్లలో లేనిపోని భయాలను డెమోక్రాట్లే సృష్టిస్తున్నారని తిట్టిపోస్తోంది. ఇటు.. ప్రజాభిప్రాయ సర్వేలు మాత్రం అమెరికన్లలో మెజారిటీ ఐస్ దాడుల పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు.వైట్ హౌస్ స్పందనమిన్నెసోటా ఘటనపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా వీధుల్ని నెత్తరోడ్చడం అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని పేర్కొంది. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోనీన్ లెవిట్ మాట్లాడుతూ.. జనాల్ని గాయపర్చడమో.. చంపడమో ట్రంప్ ఉద్దేశం కాదని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారామె. ఈ పరిస్థితికి డెమోక్రటిక్ నాయకులే కారణమని ఆరోపించారామె. ఫెడరల్ అధికారులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, మేయర్ జాకబ్ ఫ్రేలపై ఆమె మండిపడ్డారు. ఇలాంటివి అవసరమా?న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ICE దాడులను “క్రూరమైనవి, మానవత్వరహితమైనవి” అభివర్ణించారు. ఆయన ఈ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ ది వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి సంస్థకు అమెరికాలో స్థానం లేదన్నారు. అలాంటి దాడులు న్యూయార్క్ నగరం దాకా రానివ్వబోనని సవాల్ చేశారు.2026 మధ్యంతర ఎన్నికల్లో ఐస్ వ్యవహారం కీలకంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ నడుస్తోంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లు, 35 సెనేట్ సీట్లు, అలాగే 39 రాష్ట్రాల్లో గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. ఇవి అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి రెండో దఫా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌నకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమనే చెప్పొచ్చు. హౌస్ లేదంటే సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం కోల్పోతే.. ఆయనపై ఇంపీచ్మెంట్ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్-యూరప్ డీల్.. కొత్త టెన్షన్!
భారత్, యురోపియన్ యూనియన్ల ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి రావడం అమెరికాకు ఏమాత్రం నచ్చనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అండ్ టీం వరుస ప్రకటనలు ఇస్తోంది. తాజాగా.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమపై యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నాయని వ్యాఖ్యానించారాయన. ‘‘ఈ ఒప్పందం ద్వారా యూరప్ తన భద్రతను తానే బలహీనపర్చుకుంటోంది. ఉదాహరణకు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూశారా?. ఇప్పుడు యూరోపియన్లు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ ఓ విషయం గమనించాలి. రష్యన్ చమురు తొలుత భారత్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని యూరప్ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమ తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’’ అంటూ బెసెంట్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్యం, ఇంధన రంగం మళ్లీ అమెరికా–యూరప్ సంబంధాల్లో ప్రధాన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందించారాయన. మరోవైపు.. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా చెప్పారాయన. తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోనే ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో యూరప్ దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు. అయితే అంతపెద్ద త్యాగాలు ఏంటన్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు. డీల్ సెట్2007లో ప్రారంభమైన చర్చలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముగింపు దశకు చేరుకున్నాయి. ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయని.. ఈమేరకు ఒప్పందం ఖరారైనట్లు భారత వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఆదివారం వెల్లడించారు. భారత్ కోణం నుంచి ఈ ఒప్పందం సమతుల్యంగా, దూరదృష్టితో కూడి ఉందని చెప్పారు. ఇరువైపులా వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు, ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత టెక్స్ట్టైల్స్, కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, లెదర్ వస్తువులు, ఆటోమొబైల్స్, ఫుట్‌వేర్ వంటి రంగాలకు డ్యూటీ-ఫ్రీ లభించనుంది. ఒక రకంగా ఈయూతో ట్రేడ్ డీల్.. ఆర్థిక పరంగా ఇది భారత్‌కు ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. రష్యా చమురు దిగుమతులు తగ్గుతున్నప్పటికీ(డిసెంబర్లో భారత్ రష్యా చమురు దిగుమతులు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. అదే సమయంలో, OPEC దేశాల నుండి చమురు దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి).. యూరప్‌తో వాణిజ్య ఒప్పందం ద్వారా కొత్త మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచగలదు. -
ట్రంప్ ‘టారిఫ్’ పిడుగు: మరో దేశంపై ప్రతీకారం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశంపై ‘టారిఫ్’ పిడుగు కురిపించారు. దక్షిణ కొరియా నుండి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్, కలప, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో దక్షిణ కొరియా విఫలమైందని ఆయన ఆరోపించారు. 2025 జూలై 30న అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని, అలాగే అక్టోబర్ 29న తన పర్యటనలో తాను చెప్పిన అంశాలను అక్కడి పార్లమెంటు ఇంకా ఎందుకు ఆమోదించలేదని ట్రంప్ ప్రశ్నించారు. దీనికి ప్రతిచర్యగా తాను సుంకాలను 15శాతం నుండి 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికాకు వాణిజ్య ఒప్పందాలనేవి అత్యంత ముఖ్యమని, తాము కుదుర్చుకున్న ప్రతి డీల్‌లోనూ ఒప్పందం ప్రకారం సుంకాలను తగ్గించామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. తమ వాణిజ్య భాగస్వాములు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా వాషింగ్టన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లను తగ్గించేలా నవంబర్ నుండి దక్షిణ కొరియా చర్యలు చేపడుతోంది. మరోవైపు, డేటా లీక్ కారణంగా అమెరికాకు చెందిన ఈ కామర్స్ సంస్థ ‘కూపాంగ్’పై జరుగుతున్న దర్యాప్తు విషయంలో కూడా సియోల్ అధికారులు అమెరికా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.అమెరికాకు దక్షిణ కొరియా కీలక వాణిజ్య భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఏటా సుమారు $150 బిలియన్ల(సుమారు రూ. 12.5 లక్షల కోట్లు) విలువైన వస్తువులు అమెరికాకు ఇక్కడి నుండే దిగుమతి అవుతాయి. గత ఏడాది జూలైలో ఇరు దేశాల అధ్యక్షులు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ, అమెరికా కోరిన పెట్టుబడి హామీల విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలతో ఈ ప్రక్రియ స్తంభించింది. అనంతరం అక్టోబర్‌లో ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగా, అమెరికాలో $350 బిలియన్ల(రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో నవంబర్‌లో వైట్ హౌస్ ఒక ‘ఫ్యాక్ట్ షీట్’ విడుదల చేస్తూ, దిగుమతి సుంకాలను 15 శాతానికి పరిమితం చేసింది. అయితే అమెరికా ప్రస్తుత నిర్ణయంతో ఆ సుంకాలు తిరిగి పాత స్థాయికి చేరుకోనున్నాయి. 2025 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా ‘లిబరేషన్ డే’ సందర్భంగా మొదట 25 శాతం టారిఫ్ ప్రకటించగా, అది మార్కెట్లను కుదిపేసింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ అమలులోకి తెచ్చారు. గతంలో కెనడాపై 10 శాతం, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై, ఇటీవల కెనడాపై 100 శాతం టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికల తర్వాత ఈ తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్ -
ట్రంప్‌కే ఇష్టం లేదు!
వాషింగ్టన్: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే ఇష్టం లేదంటూ టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ బాంబు పేల్చారు. ఆయన అధికార రిపబ్లికన్ పార్టీ నేతే కావడం విశేషం! అంతేగాక ఈ విషయమై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలది కూడా అదే వైఖరి అని ఆయన చెప్పుకొచ్చారు. పారీ్టకి విరాళాలిచ్చే దాతలతో భేటీ సందర్భంగా క్రుజ్ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 2025 జూన్ నాటి ఆ టేపులను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన మీడియా సంస్థ ఆక్సియోస్ తాజాగా ఈ మేరకు కథనం వెలువరించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చాలాకాలంగా పెండింగ్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. దానిపై ఇరుదేశాల నడుమ అత్యున్నతాధికారుల స్థాయిలో పలు దఫాలుగా చర్చలు జరిగినా తుది నిర్ణయం, ఒప్పందం మాత్రం ఇప్పటికీ జరగలేదు. ట్రంప్ భేషజాలకు పోవడం వల్లే ఈ ఒప్పందం ఆగిపోయిందనే అర్థంలో అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవలే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ‘‘నిజానికి ఆ ఒప్పందం ఎప్పుడో దాదాపుగా తుదిరూపునకు వచ్చింది. అయితే దానికోసం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా తనతో ఫోన్లో మాట్లాడాలని ట్రంప్ ఆశించారు. అలా జరగకపోవడం వల్లే ఒప్పందాన్ని పక్కన పెట్టారు’’అని లుట్నిక్ చెప్పుకొచ్చారు. క్రుజ్ వ్యాఖ్యలు కూడా దాన్ని బలపరిచేలానే ఉండటం విశేషం. భారత్‌పై ట్రంప్ అత్యధికంగా 50 శాతం టారిఫ్‌లు వేయడం, దాంతో ఇరుదేశాల నడుమ ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. అమెరికాతో సంబంధాలు కూడా కొంతకాలంగా తిరోగమన బాట పట్టాయి. టారిఫ్‌లతో ట్రంప్ పదవికే ఎసరు ఆడియో టేపుల ప్రకారం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ఎవరని ఒక దాత క్రుజ్‌ను అడిగారు. ‘నవారో, వాన్స్. కొన్నిసార్లు ట్రంప్ కూడా’’అని ఆయన బదులిచ్చారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ గతేడాది ఏప్రిల్‌లో ఎడాపెడా టారిఫ్‌లు విధించడం తెలిసిందే. అది సరికాదని, వాటిని వెనక్కు తీసుకోవాలని ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదని క్రుజ్ చెప్పారు. ‘‘పలువురు సెనేటర్లు ఈ విషయమై ట్రంప్‌కు ఫోన్ చేసి అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడాం. కానీ ఆయన మా మాట వినిపించుకోలేదు. పైగా మాపై తిట్లకు లంకించుకున్నారు. నన్నైతే బూతులు తిట్టారు’’అంటూ వాపోయారు. ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థనే భారీగా దెబ్బ తీస్తాయని, అంతిమంగా ఆయన పదవీచ్యుతికి దారితీసినా ఆశ్చర్యం లేదని క్రుజ్ అన్నారు. అంతేగాక రానున్న మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పారీ్టకి ఓటమి కూడా తప్పకపోవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటూ ట్రంప్ మెడపై నిత్యం పదవీచ్యుతి కత్తి వేలాడుతూనే ఉంటుందన్నారు. -
సడలిన అమెరికా వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్‌పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది. భారత్‌పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్‌పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం. కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్‌కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్‌కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు. తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్‌టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే! -
భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ సందేశం
న్యూఢిల్లీ: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశంలోని ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో భారత్-అమెరికాలది హిస్టారిక్ బాండ్ అంటూ కోడ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్ధం వచ్చేలా ఉంది ట్రంప్ షేర్ చేసిన ఫోటో. భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను అమెరికా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అని ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి యూఎస్ ఎంబసీ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈరోజు అంతకముందే భారత్‌కు అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్‌తో తమది చారిత్రాత్మక బంధం అంటూ అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆపై అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. “On behalf of the people of the United States, I extend my heartfelt congratulations to the government and people of India as you celebrate your 77th Republic Day. The United States and India share a historic bond as the world’s oldest and largest democracies.” - President… pic.twitter.com/oC9x3Qs9y3— U.S. Embassy India (@USAndIndia) January 26, 2026 ఇదీ చదవండి: మనది చారిత్రాత్మక బంధం: అమెరికా శుభాకాంక్షలు -
అమెరికా చెప్పేవన్నీ అసత్యాలే: WHO
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగడానికి అమెరికా చెప్పిన కారణాలు అసత్యమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ స్పష్టం చేశారు. ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క ఆదేశానికి కాకుండే ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ మాట్లాడుతూ..అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడానికి చూపిన కారణాల్లో ఎలాంటి వాస్తవం లేదు. డబ్ల్యూహెచ్ఓ అమెరికాతో పాటు అన్ని సభ్య దేశాలతో వారి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ పనిచేస్తుంది’ అని సూచించారు.అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగిందని ప్రకటించారు. కోవిడ్-19 సమయంలో డబ్ల్యూహెచ్‌వో పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వో అమెరికాను తక్కువ చేసి, స్వతంత్రతను దెబ్బతీసింది. అలాగే,కోవిడ్ సమయంలో కీలక సమాచారం అందించకుండా కాలయాపన చేసింది. ఫలితంగా దేశంలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందన్నారు.అమెరికా చేస్తున్న ఈ ఆరోపణల్ని డబ్ల్యూహెచ్ఎవో ఖండించింది.అమెరికాతో నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాము. కోవిడ్ సమయంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెంటనే ప్రపంచానికి తెలియజేశాం. మాస్క్‌లు, టీకాలు, భౌతిక దూరం పాటించమని సూచించాము. కానీ ఎప్పుడూ మాస్క్ మాండేట్లు, టీకా మాండేట్లు లేదా లాక్డౌన్లు విధించమని చెప్పలేదు. అవి ప్రతి దేశం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు’ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. -
ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..
-
ఇండియన్ టెకీలకు షాక్ ఇచ్చిన ట్రంప్
-
Venezuela: డెన్సీ రోడ్రిగ్జ్ వీడియో టేపుల కలకలం
కారకస్: ‘మేం చెప్పినట్లు వింటారా? లేదంటే మరో 15 నిమిషాల్లో మీ ప్రాణాలు తీయమంటారా?’ అంటూ తమని బెదిరించారంటూ అమెరికాపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ చేసిన కామెంట్స్ తాలుకూ వీడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. జనవరి 3న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’(Operation Absolute Resolve) పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మిలటరీ ఆపరేషన్‌లో డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా వెనెజువెలా రాజధాని కారాకస్‌లోని ఫోర్ట్ టియునా సైనిక స్థావరంలోకి ప్రవేశించి మదురో దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే, మదురో దంపతుల్ని నిర్భందించిన 15 నిమిషాల తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదురోను అమెరికా దళాలు పట్టుకున్న తర్వాత.. తమ డిమాండ్లను అంగీకరించాలని తమ మంత్రివర్గ సభ్యులకు బెదిరింపులను అమెరికా బెదిరించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ అంతర్గత సమావేశంలో మాట్లాడిన వీడియో టేపులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు వినకపోతే 15 నిమిషాల్లో మంత్రి వర్గ సభ్యుల ప్రాణాలు తీస్తామని అమెరికా దళాలు బెదిరించాయని డెల్సీ రోడ్రిగ్స్ మాట్లాడిన మాటలు ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం. -
చైనాతో ఒప్పందం చేసుకుంటే... 100 శాతం టారిఫ్‌లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాగ్ని తాజాగా కెనడా వైపు మళ్లింది. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగా ముందుకెళ్తే కెనడాపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వస్తువులు, ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్చజూస్తున్నారని ఆరోపించారు. ‘‘కార్నీ ఉద్దేశం అదే అయితే గనక ఆయన చాలా పొరబడుతున్నారు. అలా జరిగేందుకు నేనెప్పటికీ అనుమతించబోను’’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని ‘గవర్నర్’గా సంబోధించడం విశేషం. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా విలీనం కావాలని ఆయన పలుమార్లు సూచించడం తెలిసిందే. ఈ సంబోధన తాలూకు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ట్రంప్, కార్నీ నడుమ కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్‌వి ఏకపక్ష పోకడలంటూ ఇటీవల కార్నీ దుయ్యబట్టారు. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్, అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాల మీద అంటూ దావోస్ వేదికగా ఎద్దేవా చేశారు. దీనిపై కార్నీ స్పందిస్తూ, నియంతృత్వ పోకడలకు తల వంచకుండా ప్రపంచానికి కెనడా ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ బదులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాజా పునర్నిర్మాణానికి తలపెట్టిన శాంతిమండలిలో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్‌లను తగ్గించేలా కెనడాతో కొంతకాలంగా బేరసారాలాడుతోంది. ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఈ మేరకు ఒప్పందం దిశగా వాటి మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాను ఆర్థికంగా, సామాజికంగా చైనా పూర్తిగా కబళించేస్తుందని ఇటీవలే ఆయన హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదిత గోల్డెన్‌డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా నిరాకరించడంపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. -
ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో మరొకరు మృతి
అమెరికాలో మినయాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా జరగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం (జనవరి 24, 2026) ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో మరో అమెరికన్ పౌరుడు మరణించాడు. మరణించిన వ్యక్తిని 37 ఏళ్ల మినయాపాలిస్ నివాసిగా అధికారులు గుర్తించారు.మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సదరు వ్యక్తి వద్ద తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్లు ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే అధికారులపైకి తిరగబడటంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మినయాపాలిస్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని రోజుల క్రితం రెనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళను ఫెడరల్ ఏజెంట్లు ఆమె కారులోనే కాల్చి చంపారు.ఈ క్రమంలో వరుస కాల్పుల ఘటనలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ఫెడరల్ ఏజెంట్లు బాష్పవాయువు ప్రయోగించారు. అయితే ఇదే సమయంలో ఓ ఐసీఈ ఏజెంట్ నిరసనకారులను వెక్కిరిస్తూ గట్టి అరిచాడు.దీంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందించారు. మిన్నెసోటా ప్రజల సహనం నశించింది. ఇది అత్యంత క్రూరమైన చర్య. అధ్యక్షుడు ట్రంప్ వెంటనే ఈ ఆపరేషన్‌ను నిలిపివేయాలి. వేల సంఖ్యలో ఉన్న ఈ ఫెడరల్ అధికారులను వెంటనే మిన్నెసోటా నుండి వెనుక్కి పిలవాలి అని వాల్జ్ డిమాండ్ చేశారు.కాగా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు మినయాపాలిస్ వంటి నగరాలకు పంపారు. -
రెచ్చిపోతున్న బంగారం.. గోల్డ్ దూరం చేసిన ఘనుడు!
-
వెనక్కి తగ్గిన ట్రంప్.. గ్రీన్ ల్యాండ్ పై కొత్త రాగం..
-
ఇరాన్-అమెరికా.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
ఇరాన్ అమెరికా మధ్య కమ్ముకుంటున యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ సైన్యం ఇరాన్‌కు బయల్దేరింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇరాన్ వైపు కదులుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వేళ.. అక్కడి ప్రజల తీవ్ర నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. భద్రతా బలగాల ప్రతిఘటనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించారని హక్కుల సంఘాలు నివేదికలు ఇచ్చాయి. అలాగే వేల మందిని జైల్లో పెట్టారని.. వాళ్లలో కొందరిని దేశద్రోహులుగా ఉరి తీయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ అణచివేతపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాము చూస్తూ ఉండబోమని.. ఇరాన్ నిరసనకారులకు అవసరమైన సాయం పంపిస్తామని ప్రకటించారు. ఈ లోపు పరిస్థితులు చల్లబడి ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో నిరసనకారుల ఉరితీత ఆగిపోయింది. అయితే.. తన వల్లే నిరసనకారుల ఉరి ఆగిందంటూ ట్రంప్ ప్రకటించుకోగా.. ఇరాన్ దానిని తోసిపుచ్చింది. కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదన్నట్లు ఖమేనీ ప్రభుత్వం సంకేతాలు పంపించింది. దీంతో ట్రంప్‌నకు మళ్లీ కోపమొచ్చింది. ఈలోపు.. ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న అనుమానాలూ వ్యక్తం చేసిన ఆయన.. గట్టి వార్నింగే ఇచ్చారు. సైనిక చర్యే చివరి ఆప్షన్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో సైన్యం మోహరింపు ఆదేశాలు జారీ చేసిన ఆయన.. అదనపు బలగాలనూ సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఐదు వేల మంది సిబ్బందితో కూడిన బలగాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు ట్రిగ్గర్‌పైనే ఉందంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇరాన్‌ను నిశితంగా గమనిస్తున్నాం. భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. వాటిని మేం ఉపయోగించకపోవచ్చు. ఏం జరుగుతోందో చూద్దాం అని ట్రంప్ దావోస్ సదస్సు అనంతరం వ్యాఖ్యానించారు. అయితే.. ట్రంప్ ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా.. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండటంతో పరిస్థితి హీటెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్‌లాండ్‌పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్‌ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్‌లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. -
ఇక అమెరికా-భారత్ బంధానికి బీటలు!
శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్‌లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.భారత్ ఆందోళనలు ఏంటంటే..జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్‌కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.జమాత్ బ్యాక్‌గ్రౌండ్ ఇది.. 1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్‌కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్‌పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.అమెరికా మరోలా.. ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్‌తో ఫ్రెండ్షిఫ్ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.రాజకీయ వాతావరణంహసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్‌ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. -
శాంతి మండలిపై ట్రంప్ కొత్త రాగం..
న్యూయార్క్/వాషింగ్టన్: అంతర్జాతీయ వేదికపై కొత్తగా శాంతి మండలి ఆవిర్భావం ఐక్యరాజ్యసమితికి కూడా మేలు చేసే అంశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐరాస తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించడంలో విఫలమైందని ఆక్షేపించారు. గురువారం దావోస్ నుంచి అమెరికా తిరిగి వెళ్తూ ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘గాజాలో శాంతి స్థాపనకు మాత్రమే కాదు, అంతకుమించి కూడా మరెన్నో అంశాల్లో ఐరాసతో కలిసి గొప్పగా పని చేస్తాం. ఒక సంస్థగా ఐరాసకు ఉన్న సామర్థ్యం అంతా ఇంతా కాదు. కానీ అందుకు తగ్గట్టుగా పని చేయడంలో, ఫలితాలు సాధించడంలో ఐరాస విఫలమైంది. నేను ఏకంగా ఎనిమిది యుద్ధాలు ఆపాను. కానీ దీని గురించి ఐరాసతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అన్నారు.దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ స్పందించారు. ‘ట్రంప్ ప్రకటనలు (శాంతి మండలిని ఉద్దేశిస్తూ) చూశాం. అయితే సార్వత్రిక సభ్యత్వమున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఐరాసే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి దిశగా తమ కృషి, ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజాలో అత్యధిక పరిమాణంలో మానవతా సాయాన్ని పంచింది ఐరాస మాత్రమేనని స్టీఫన్ గుర్తు చేశారు. -
నాటో పాత్రను చులకన చేస్తారా!
లండన్: అఫ్గానిస్తాన్‌లో యుద్ధం సమయంలో అమెరికా బలగాలు మాత్రమే ముందుండగా నాటో దేశాల బలగాలు దూరంగా ఉండిపో యాయని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందాను. ఆ వ్యాఖ్యలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే దేశ ప్రజలకు తీవ్ర వేదన కలిగించాయి’అని స్టార్మర్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌లో నాటో బలగాలు సాహసోపేతంగా పోరాడాయని, దేశం కోసం త్యాగాలు చేశాయని స్టార్మర్ కొనియాడారు. నాటో బలగాల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ట్రంప్‌ను ఆయన కోరారు. అవసరమైనప్పుడు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నాటో సిద్ధంగా ఉంటుందన్న తనకు నమ్మకం లేదని ట్రంప్ దావోస్‌లో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మాకు నాటో అవసరం ఎప్పుడూ రాలేదు, మేం వారిని నిజానికి ఏమీ అడగలేదు. నాటో దేశాల వారు అఫ్గానిస్తాన్‌కు, ఇతర ప్రాంతాలకు కొన్ని దళాలను పంపించారు. కానీ, వారు ముందు వరుసలో ఉండటానికి బదులు వెనుకనే ఉండిపోయారు’అని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. -
ఈ మండలి శాంతికేనా?!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. గాజాలో ‘శాంతి నెలకొల్పడమే’ లక్ష్యంగా 19 సభ్యదేశాలతో ‘శాంతిమండలి’ ఏర్పాటై నట్టు గురువారం ప్రకటించారు. అర్జెంటీనా మొదలుకొని వియత్నాం, పాకిస్తాన్ వరకూ పోటీ పడి ఇందులో సభ్యత్వం తీసుకోగా, ఈ అర్థరహిత విన్యాసానికి మన దేశందూరంగా ఉండి మంచి పని చేసింది. అమెరికా చిరకాల సన్నిహిత దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లొవేనియాలు ఇందులో చేరబోమని ప్రకటిస్తే, మనతోపాటు రష్యా, చైనా, జర్మనీ, యూరోపియన్ యూనియన్(ఈయూ), సింగపూర్ వగైరాలు తటస్థంగా ఉండి పోయాయి. అమెరికా ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెండేళ్ల పాటు గాజాలో నరమేధం సాగించిన ఇజ్రాయెల్ సైతం ‘తగుదునమ్మా’ అంటూఇందులో చేరటం కొసమెరుపు. ‘నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు గనుక, ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ప్రకటించిన ట్రంప్, వారం తిరిగేసరికల్లా అంత ర్జాతీయ శాంతిదూత అవతారం ఎత్తడం ఒక వైచిత్రి.భద్రతామండలి తన 70 ఏళ్ల చరిత్రకు కళంకం తెచ్చుకునే విధంగా గత నవంబర్‌లో గాజా శాంతికి అగ్రరాజ్యాలు చొరవచూపాలని కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్ ఈ చర్యకు సాహసించారు. రష్యా, చైనాలు వీటో చేసివుంటే ఆ తీర్మానానికి ఆమోదముద్ర పడేదికాదు. కానీ గైర్హాజరుతో సరిపెట్టి ఈ వైపరీత్యానికి వారూ తోడ్పడ్డారు. దురాక్రమణలు, నరమేధాలు, ఊచకోతలు, సైనిక కుట్రలు తదితరాలను ఎదుర్కొనటానికి అంతర్జాతీయంగా ఆమోదించిన అనేక చట్టాలున్నాయి. వాటిల్లో ఏ చట్టాలు విఫలమైనాయని, ఎలాంటి ప్రయత్నాలు చేసిందని నవంబర్ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందో భద్రతామండలి చెప్పాలి. గాజాలో అకారణంగా, అన్యాయంగా వేలాదిమందిని హతమారుస్తుంటే, విధ్వంసకాండను కొనసాగిస్తుంటేకంటితుడుపు ప్రకటనలు చేయటం మినహా, ఆ సంస్థ పక్షాన జరిగిన యత్నాలేమీ లేవు. కానీ అకృత్యాలకు పాల్పడినవారికే దాన్ని ఉద్ధరించేందుకు లైసెన్సునిచ్చింది. ఈ‘శాంతిమండలి’ అమెరికా కోసం కాదు... ఏకంగా ప్రపంచ ఉద్ధరణకేనని దావోస్ లోట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో శాంతి నెలకొల్పగానే అది ప్రపంచంలోని ఇతర ఘర్షణలపై దృష్టిసారిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు.ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి ఎంతగా విఫలమైనా, వాటికి ఉజ్జ్వలమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధం మానవాళికి తెచ్చిపెట్టిన లాంటి ఉత్పాతం భవిష్యత్తులో ఎన్నడూ సంభవించనీయబోమని వాగ్దానం చేస్తూ అవి ఆవిర్భవించాయి. కానీ ఇప్పుడు పుట్టుకొచ్చిన ‘శాంతిమండలి’ ట్రంప్ అల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి జేర్డ్ కుష్నెర్ మానసపుత్రిక. 3,000 కోట్ల డాలర్ల వ్యయంతో గాజా సాగరతీరాన కళ్లు చెదిరే భవంతులు, రిక్రియేషన్ క్లబ్‌లు, క్యాసినోలు నిర్మించాలని ఆయనగారి తపన. తరతరాలుగా పేదరికంలో మగ్గిన పాలస్తీనియన్లు ఈ అభివృద్ధి చూసి మూర్ఛపోతారని ట్రంప్ చెబుతున్నారు. శాంతిమండలిలో చేరిన నెతన్యాహూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధనేరారోపణలు ఎదుర్కొంటున్నారు. స్విట్జర్లాండ్‌లో అడుగుపెడితే అరెస్టవుతానని తెలిసి ఈ సంబరానికి దూరంగా ఉండిపోయారు. నిర్మానుష్యమైన తూర్పు జెరూసలేంలోని ఐక్యరాజ్యసమితి సహాయసంస్థ భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయించిన మర్నాడే ఆయన ‘శాంతిమండలి’లో చేరటం గమనార్హం. ఇంతవరకూ ట్రంప్‌కు అంటిన మరకలు ఇకపై శాంతిమండలి సభ్యులకూ తప్పవు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశాధ్యక్షుణ్ణి అపహరించటం, అక్కడి ముడిచమురుపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటం, గ్రీన్‌ల్యాండ్‌ను కాజేయాలని ఆత్రపడటం, మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధించటం, ప్రపంచం నలుమూలలా సైనిక స్థావరాల ఏర్పాటు యత్నాలు వంటి ట్రంప్ అనాలోచిత చర్యలకూ, ఆయన బెదిరింపు ధోరణు లకూ ఇకపై ఈ మండలి సైతం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సమితికి సంబంధించిన కర్తవ్యాలు శాంతిమండలి స్వీకరిస్తుందని ట్రంప్ చెప్పటంతోపాటు భవిష్యత్తులో సమితికి కాలం చెల్లుతుందనటాన్ని గమనిస్తే ఇదంతా చివరకు ఎటుపోతుందో... ఏమవు తుందో సులభంగానే గ్రహించవచ్చు. -
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సిబ్బందిని యూఎస్ వెనక్కి పిలిపించింది. డబ్ల్యూహెచ్‌వోకు అగ్రరాజ్యం రూ.2 వేల కోట్లు బకాయిపడింది. బకాయిలు చెల్లించేవరకు యూఎస్ ఉపసంహరణ పూర్తికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పిందికొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందంటూ యూఎస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఆరోపించింది. సభ్య దేశాల రాజకీయ ప్రభావం కూడా కారణమేనని తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే, డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ఉపసంహరణ అమెరికాకే కాకుండా ప్రపంచ మొత్తానికి ఒక నష్టమని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ పేర్కొన్నారు.సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా చెప్పగానే సరిపోదని.. సంస్థకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లించేవరకు డబ్ల్యూహెచ్‌వో నుంచి యూఎస్ ఉపసంహరణ సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికారిక వర్గాలు స్పందిస్తూ.. సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదంటూ కొట్టిపారేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ట్రంప్ ఈ ఉపసంహరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. -
ట్రంప్ ఓవరాక్షన్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.ఇరాన్లో నిరసనలు.. ఇదిలా ఉండగా.. ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మందికిపైగా మృతిఇరాన్లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. -
అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..!
అమెరికా-కెనడాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ అగ్గి రాజేస్తుంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ పీస్ బోర్డుకు కెనడా సమ్మతి తెలపకపోవడంతో అది మరొక వివాదానికి దారి తీసింది. తమకు సహకరించని దేశాలను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించిన ట్రంప్.. కెనడాపై మాత్రం పెరు పెట్టి మరీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కెనడా కృతజ్ఞత లేని దేశం అంటూ నిప్పులు చెరిగారు. తమ వల్లే ఆ దేశం మనుగడలోకి వచ్చిందని, ఇప్పటికీ తామే ఆదేశానికి ఆధారమని ధ్వజమెత్తారు. దీనిపై కెనడా ఘాటుగా స్పందించింది. ట్రంప్.. ఇక మీ మాటలు చాలంటూ ఘాటుగా బదులిచ్చింది. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ.. తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉన్నాయన్నారు. ‘ అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదు. కెనడా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే మనం కెనడియన్లం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో బోర్డ్ ఆఫ్ పీస్‌లో తమను జాయిన్ అవ్వమని ట్రంప్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని కార్నే అంగీకరించారు. ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన భాగస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తమకు ప్రత్యేక అభిప్రాయాలుంటాయనే విషయాన్ని కార్నే తేల్చిచెప్పారు. ఆ బోర్డుకు అత్యధిక మొత్తంలో చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెప్పేశాకాగా, ఇక దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోఅమెరికా ఆధిపత్యంపై సెటైర్లు వేశారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతున్నదని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ శాంతి కూటమికి కెనడా దూరంగా ఉంది. అయితే ట్రంప్ మాత్రం కెనడాపై రెచ్చిపోయి ప్రసంగించడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి:Trump: మరో కొత్త తలనొప్పి..! -
Trump: మరో కొత్త తలనొప్పి..!
డొనాల్డ్ ట్రంప్.. కాసేపు యుద్ధం అంటారు..అంతలోనే శాంతి అంటారు. కాసేపు అది మాకు కావాలంటారు.. మరికాసేపటికి మాకు సహకరించకపోతే వారిని గుర్తు పెట్టుకుంటామంటారు ఎలా చెప్పుకున్నా ట్రంప్ వైఖరి గంటకో అవతారం అన్న మాదిరిగా ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. వరల్డ్ ఎకానిమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగర వేదికగా బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ఏర్పాటు చేశారు. దీనికి 35 దేశాల మద్దతు తెలుపగా, భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. దీనికి భారత్ దూరంగా ఉండటానికి కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే.. ప్రధాన కారణం మాత్రం ఈ మండలి యొక్క న్యాయబద్ధతపై సందేహాలు ఉంటమేనని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ ధోరణి మరొక కారణం. ట్రంప్ స్వ ప్రయోజనాలతో ఏర్పడిన కూటమా?ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ కొత్త కొలిమిని ఏర్పాటు చేసినా. అది ట్రంప్ స్వప్రయోజనాలతో ముడిపడి ఉందనే విషయాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆకస్మికంగా ట్రంప్ శాంతి కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన సొంత లాభం లేకపోతే ఎందుకు ఏర్పాటు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా UN General Assembly లాంటి సర్వసభ్యత్వం లేకపోవడం వల్ల ఇది అంతర్జాతీయంగా సమగ్రతను కోల్పోయందనేది విశ్లేషకుల మాట. మరొకవైపు మండలిలో పాలస్తీనా వర్గాల ప్రత్యక్ష భాగస్వామ్యం స్పష్టంగా లేకపోవడం భారతదేశానికి ఆందోళన కలిగించింది.భారతదేశం ఎప్పటినుంచో రెండు దేశాల సమస్య పరిష్కారానికి మద్దతు ఇస్తూ వస్తోంది.ఇది భారీ ఆర్థిక బాధ్యత.. అదే సమయంలో ఈ కూటమి భారీ ఆర్థిక బాధ్యతతో కూడుకున్నది. ఇందులో ఉన్న సభ్య దేశాలు $1 బిలియన్ (సుమారు ₹8,300 కోట్ల రూపాయలు) చెల్లించాల్సిన నిబంధన ఉంది. అంటే భారీ ఆర్థిక భారాన్ని సభ్య దేశాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశానికి భారీ ఆర్థిక బాధ్యతగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానానికే భారత్ పెద్దపీటభారత్ ఎప్పుడూ స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుంది. అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మండలిలో చేరడం వల్ల అంతర్జాతీయంగా పక్షపాత భావన కలగవచ్చని భారత్ భావించినట్లు కనబడుతోంది. భారత్ ఇప్పటికే యూఎన్ ఏజెన్సీల ద్వారా గాజాకు సహాయం అందిస్తోంది. ట్రంప్ మండలిలో చేరకుండా కూడా పునర్నిర్మాణం, సహాయం అందించగలదని భారత్ నమ్ముతోంది.ఇది కూడా గుర్తు పెట్టుకుంటారా?తమకు సహకరించిన, సహకరించిన దేశాలను గుర్తు పెట్టుకుంటామని అదే దావోస్ వేదికగా ట్రంప్ చెప్పుకొచ్చారు. తాము చేసేది మహాయజ్ఞం అన్న చందంగా బిల్డప్ ఇచ్చిన ట్రంప్.. సహకరించకపోతే మాత్రం తప్పుకుండా మదిలో పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి కూటమికి భారత్, రష్యాలతో పాటు చైనా కూడా తటస్థ వైఖరిని అవలంభించింది. ఇప్పుడు ఈ కూటమికి అంత సీన్ లేదనే ఈ మూడు దేశాలు భావించే కాస్త దూరంగా ఉన్నాయి. అలాగని కూటమిలో చేరడం లేదని కానీ, భవిష్యత్‌లో చేరే ఉద్దేశం కూడా లేదని కానీ చెప్పలేదు. మరి ఈ మూడు అగ్రదేశాలను ఒప్పించి, మెప్పించే పని ట్రంప్ చేస్తారా? అనేది మరొక ప్రశ్న. ఇప్పటికే భారత్‌పై పూర్వపు ప్రేమను ట్రంప్ కురిపిస్తున్నారు. భారత్ తమక మిత్రదేశమని, త్వరలో అతి పెద్ద ట్రేడ్ డీల్ ఉంటుందని కూడా చెప్పేశారు. ఇక రష్యా విషయానికొస్తే.. ఆ దేశం కూడా ట్రంప్ వైఖరిని చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రీన్లాండ్ అంశానికి సంబంధించి కూడా రష్యా సానుకూలంగానే స్పందించింది. అది ట్రంప్‌కు, నాటో దేశాలకు సంబంధించిన విషయమని, ఇక్కడ రష్యా జోక్యం ఉండదని చాలా కామ్ అండ్ నీట్‌గా పుతిన్ తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూల్‌గా వెళ్లిపోతేనే బెటర్ అనే భావనలో పుతిన్ ఉన్నారు. అందుకు గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వైఖరిని ఖండించలేదు. ఇక చైనా ఎప్పుడూ అమెరికాకు పోటీనే. మరి ఇప్పుడు ఆ దేశం కూడా ట్రంప్ శాంతి కూటమికి దూరంగానే ఉంది. కానీ భవిష్యత్‌లో జరగబోయే పరిణామాల దృష్యా చైనా ఒక నిర్ణయానికి రావొచ్చు. లేకపోతే శాశ్వతంగా ఈ కూటమికి దూరంగా కూడా ఉండొచ్చు. అమెరికా మాదిరిగానే చైనా కూడా స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందనేది కాదనలేని సత్యం. ఇక్కడ చైనాకు ఏమైనా ప్రయోజనాలు ఉంటేనే అందులో చేరుతుంది. అందుచేత అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కూటమిని చైనా నిశితంగా గమనించిన తర్వాతే ఒక్క నిర్ణయానికి రావొచ్చు.ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్లుఘా కూటమిలో చేరమని తేల్చేయగా, ఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోలు కూటమిలో చేరాయి. తటస్థంగా ఉన్న దేశాలు ఇవి..రష్యా, భారత్, సింగపూర్, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై మస్క్ సెటైర్లు
దావోస్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దుమ్మెత్తి పోశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని బోర్డ్ ఆఫ్ పైస్ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.దావోస్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫిక్ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్ బోర్డు పీస్ బదులుగా పైస్ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే గ్రీన్లాండ్ పైస్,వెనిజువెలా పీస్ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్ కాదు పీస్ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్‌తో నవ్వులు పూయించారు. ELON MUSK: "I heard about the formation of the peace summit? And I was like, is that piece or peace? Like little piece of Greenland a little piece of Venezuela." 😂 pic.twitter.com/QxmbOrH2wC— DogeDesigner (@cb_doge) January 22, 2026 -
తగ్గేదేలే.. ఇరాన్ వైపునకు భారీగా అమెరికా బలగాలు
చల్లారుతుందనుకున్న అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ట్రంపరితనంతో మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఇరాన్‌ను హెచ్చరించారాయన. అయితే.. ఈ చర్యపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రకటించింది.ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళ్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు నాకు నివేదికలు అందిస్తున్నారు. పరిస్థితిని నేనే స్వయంగా సమీక్షిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అయితే సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నా. ఒకవేళ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని గనుక కొనసాగిస్తే.. అమెరికా కచ్చితంగా కఠినంగా స్పందిస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు.ఇప్పటికే అమెరికా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధవిమానాలను మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ హెచ్ఆర్ఏఎన్ఏ లెక్కల ప్రకారం ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇరాన్ అధికారులు మాత్రం ఆ సంఖ్య 5,000 దాకా ఉండొచ్చని అంటున్నారు. మృతుల్లో వందలాది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లలో కొందరిని దేశద్రోహం కింద ఉరి తీయాలనే ఆలోచనతో ఉన్నారు.అయితే వాళ్లను ఉరి తీసే ప్రయత్నాలు చేస్తే.. ఇరాన్‌పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో.. తమ ఒత్తిడి కారణంగానే ఇరాన్ నిరసనకారులను ఉరి వేసే ప్రణాళికను రద్దు చేసిందని మొన్నీమధ్య ప్రకటించారు కూడా. ఈ నిర్ణయం కారణంగానే ఆ దేశంపై సైనిక చర్య విషయంలో తాను వెనక్కి తగ్గినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే తాజాగా.. సుమారు 837 మందిని ఉరి తీయకుండా నేను కాపాడాను అంటూ ఆయన ప్రకటించారు.‘అణు’ వార్నింగ్దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా మళ్లీ చర్యలు తీసుకుంటుంది, కానీ పరిస్థితి శాంతియుతంగా ముగియాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. ఐరాస విభాగం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణంగా నెలకు ఓసారి ‘అణు తనిఖీ’ చేపట్టాలి. కానీ, గత ఏడు నెలలుగా ఇరాన్‌లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని సమాచారం. దీంతో అధిక స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ఖబడ్దార్.. అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. అమెరికా బేస్‌లు ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు. -
మాకు సంబంధం లేదు
మాస్కో: గ్రీన్‌లాండ్‌ను తమ స్వాధీనం చేయా లంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న డిమాండ్‌తో నాటో ఐక్యతకు బీటలు వారుతున్న వేళ ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. గ్రీన్లాండ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. బుధవారం రాత్రి మాస్కోలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఒక కాలనీ మాదిరిగా పరిగణిస్తోంది. అక్కడి ప్రజల విషయంలో క్రూరంగా కాకున్నా, కఠినంగా వ్యవహరించిందన్నది నిజం. అది వేరే విషయం. గ్రీన్‌లాండ్‌పై ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి ఉంటుందా అంటే అనుమానమే’అని పేర్కొన్నారు. ‘గ్రీన్లాండ్కు సంబంధించిన పరిణామాలపై మాకెలాంటి ఆందోళన లేదు. ఈ అంశాన్ని వాళ్లే పరిష్కరించుకుంటారని భావిస్తున్నా’అని పుతిన్ తెలిపారు. ‘1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు అమ్మేసింది. ఆ మాట కొస్తే రష్యా 1867లో అలా స్కాను అమెరికాకు 72 లక్షల డాలర్లకు విక్రయించింది’అని ఆయన చరిత్రను గుర్తు చేశారు. -
మన తక్షణ కర్తవ్యమేంటి?
బ్రస్సెల్స్: గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మొండిపట్టు పట్టడంతో తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. గురువారం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సారథ్యంలో ఐరోపా మండలి సమావేశాలు ఆరంభమయ్యాయి. డెన్మార్క్ విషయంలో తమకు మద్దతివ్వని ఏడు యూరోపియన్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తానన్న తన నిర్ణయం నుంచి ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో ఆయా దేశాలు కాస్తంత ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఈ సమావేశాలు జరగడం గమనార్హం. ట్రంప్ శాంతి మండలిలో చేరేందుకు కొన్ని యూరప్‌దేశాలు విముఖత వ్యక్తంచేశాయి. గ్రీన్లాండ్ విషయంలోనూ ట్రంప్‌తో విబేధించాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట అమెరికాతో ఏదైనా తేల్చుకునేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని, ఐక్యంగానే ముందడుగు వేయాలని యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యదేశాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
తగ్గిన ట్రంప్..మార్కెట్ జంప్
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్‌ల్యాండ్ స్వా«దీనం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్ ట్రేడ్ డీల్ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్‌లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్ 2.43%, క్యాపిటల్ గూడ్స్ 2.03%, ఇండ్రస్టియల్స్ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్ 1.43%, మెటల్స్ 1.34%, ఎఫ్ఎంసీజీ 1.22%, కమోడిటిస్ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. → డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
డొనాల్డ్ ట్రంప్‌పై కాసుల వర్షం.. ఒకే ఏడాదిలో 12 వేల కోట్లకు పైగా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కూడా ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న ఐరోపా దేశాల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అయితే ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక 'ఎకనామిక్ మిరకిల్' అని ట్రంప్ అభివర్ణించారు. తన టారిఫ్ విధానాల వల్ల దేశంలోకి $18 ట్రిలియన్ల (సుమారు రూ. 1,512 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాల వల్ల, అమెరికా దిగుమతిదారులు ఎక్కువ పన్ను కడుతున్నారు. దీంతో వస్తువుల ధరలు పెరిగి సామాన్య అమెరికా ప్రజలే నష్టపోతున్నారు.ట్రంప్‌పై కాసుల వర్షంఅయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే ట్రంప్ ఆస్తులే ఎక్కువగా పెరిగనట్లు తెలుస్తోంది. న్యూయర్క్ టైమ్స్ ప్రకారం.. రెండోసారి అధ్యక్షుడైన ఆయన కేవలం ఒకే ఏడాదిలో $1.4 బిలియన్లు (సుమారు రూ. 12,810 కోట్లు) సంపాదించినట్లు సమాచారం. ట్రంప్ తన క్రిప్టోకరెన్సీ వెంచర్ల నుంచి గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించారంట. ఆయన కుటుంబానికి చెందిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్', 'మీమ్ కాయిన్'($TRUMP) ద్వారా వందల మిలియన్ల డాలర్లు వచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒమన్,సౌదీ అరేబియా, వియత్నాం వంటి దేశాల్లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టుల ద్వారా కోట్లాది రూపాయలు లైసెన్సింగ్ ఫీజుల రూపంలో ట్రంప్ 23 మిలియన్ డాలర్లు సంపాదించారని సమాచారం. -
కొలువైన ట్రంప్ శాంతి మండలి
దావోస్/న్యూఢిల్లీ: మాటలతోనే పెనుకుంపట్లు రాజేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికాముకుడి అవతారమెత్తి ప్రపంచ యవనికపై కొత్త కూటమిని కొలువుతీర్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగరంలో 19 దేశాల అగ్రనేతల సమక్షంలో బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అగ్రనేతల సమక్షంలో సంబంధిత పత్రంపై ట్రంప్ సంతకం చేసి కొత్త కూటమిని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా తన కనుసన్నల్లో పనిచేసేలా గాజా పునర్నిర్మాణ, అభివృద్ధి మాటున శాంతి మండలిని ఏర్పాటుచేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ‘‘ శాంతి మండలిలో భాగస్వాములుగా ఉండేందుకు ప్రతి దేశం అమితాసక్తి కనబరుస్తోంది. ఇవేగాక మరెన్నో దేశాలతో కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తా. ఇప్పుడిప్పుడే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా, పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఏడాది క్రితం యుద్ధాలతో ప్రపంచం అగ్నిగోళంగా ఉండేది. ఇది చాలా మందికి తెలీదు. సమకాలీన పరిస్థితుల పర్యవసానంగా ఏర్పడిన ఈ ‘శాంతి మండలి’ అంతర్జాతీయ కూటముల్లో ఒకటిగా గొప్పదిగా ఉండబోతోంది. శాంతి మండలి అనేది ప్రపంచానికి చాలాచాలా ప్రత్యేకమైంది. ఐక్యరాజ్యసమితిలో ఎంతో సత్తా ఉంది. ఒక పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధమేకాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ముగింపు కోసం ఐరాసతో కలిసి పనిచేస్తా. ఐరాస, కొత్త శాంతి మండలి కలిసి పనిచేస్తే అది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా పశ్చిమాసియాకు కొత్త రోజులొస్తాయి. గాజా యుద్ధం దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నా వాటిని మనం ఆపేయబోతున్నాం. వాగ్దానం చేసినట్లు హమాస్ వాళ్లు ఆయుధాలు విడనాడాలి. ఆయుధాలను త్యజించని రోజున అదే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. కొత్త కూటమితో ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.35 దేశాలతో మొదలు..35 దేశాలతో శాంతి మండలిని ఆరంభిస్తున్నామని ట్రంప్ తెలిపారు. వేదికపై ఆసీనులైన పలువురు అగ్రనేతలను ట్రంప్ పేరుపేరున పొగిడారు. తనతో కలిసి ముందడుగువేస్తున్నందుకు అభినందించారు. ‘‘మేమంతా ఎంతో కీలకమైన పనులు చేయబోతున్నాం. ఇంతటి ఘనకార్యాలు చేయడానికి ఇంతకు మించిన వేదిక మరోటి లేదు. వ్యవస్థాపక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. గర్వంగానూ ఉంది’’ అని ట్రంప్ అన్నారు. శాంతి మండలి డాక్యుమెంట్‌పై ట్రంప్ సంతకంచేశాక అక్కడి 19 దేశాల అగ్రనేతలను సంతకాలుచేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం కార్యక్రమంలో పాల్గొని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముష్కరులను ముద్దుచేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి అశాంతిని రాజేసే పాకిస్తాన్.. శాంతికాముక∙బోర్డ్‌లో చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాలు శాంతి మండలిలో చేరేందుకు ఆసక్తి చూపించగా ఐరోపా సమాఖ్యలోని కొన్ని సభ్యదేశాలు నిరాకరించాయి. ఆహ్వానం అందుకున్నా ఇంకొన్ని దేశాలు తమ వైఖరిని బయటపెట్టలేదు. భారత్ సైతం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉండిపోయింది.నేనింకా రియల్ ఎస్టేట్ మనిషినే..గాజా పునర్నిర్మాణలో భాగంగా గాజాను సము ద్రతీర ప్రాంతాలకు, రవాణా, ఇంధన మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అన్నారు. ఇదే వేదికపై ఆయన నూతన గాజా ఇలా ఉండబోతోందంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ‘‘ సముద్రతీర ప్రాంతం ఎంత బాగుందో చూడండి. బీచ్‌లతో అలరారుతున్న గాజా స్ట్రిప్‌లో ఆకాశహ ర్మ్యామ్యలను నిర్మించబోతున్నాం. తీరప్రాంత పర్యాటకం ఊపందుకోబోతోంది. ఇన్నాళ్లూ ఇదే ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గిపోయిన పాలస్తీనియన్లు మేం చేసే అభివృద్ధి తర్వాత అద్భుతజీవనం కొనసాగిస్తారు. భవిష్యత్‌లో సాక్షాత్కారం కాబోయే ఈ భవంతులను చూస్తుంటే నాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి మేల్కొంటున్నాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ వ్యక్తినే’’ అని ట్రంప్ అన్నారు.మండలిలో చేరతామన్న దేశాలుఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోసమ్మతి తెలపని దేశాలు..ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్తటస్థ వైఖరితో ఉన్న దేశాలురష్యా, భారత్, సింగపూర్, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
గాజా శాంతి మండలిని ఆవిష్కరించిన ట్రంప్
దావోస్: గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. దావోస్ వేదికగా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’ సంతకాలు జరిగాయి. అయితే, గాజా ’బోర్డ్ ఆఫ్ పీస్‌కు కార్యక్రమానికి భారత్ దూరంగా ఉంది. అయితే, గాజా శాంతిమండలిలో పాకిస్తాన్ సభ్య దేశంగా చేరింది. గాజా పునర్నిర్మాణం, శాంతి కోసమే బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ చెబుతున్న ట్రంప్.. ఆయుధాలు వీడకపోతే బూడిద చేస్తామంటూ హమాస్‌ను ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తామని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, శాంతి మండలిలో చేరాలని 50 మందికిపైగా ట్రంప్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.మధ్యప్రాచ్యంలో శాంతిని సుస్థిరం చేయడానికి, ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ఉద్దేశించిన ఈ బోర్డులో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ లేఖ రాశారు. ఈ బోర్డులో చేరిన దేశాల్లో ప్రస్తుతం పాకిస్థాన్‌తో పాటు బహ్రెయిన్, మొరాకో, అర్జెంటీనా, అర్మేనియా, అజర్బైజాన్, బల్గేరియా, హంగేరి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, కొసోవో, పరాగ్వే, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, మంగోలియా ఉన్నాయి.గాజా శాంతి మండలిలో చేరాలంటూ ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ మండలిలో పాకిస్థాన్ చేరికను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ గడ్డపై పని చేస్తున్న లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు, హమాస్‌కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి స్థానంలో ట్రంప్ ఈ గాజా శాంతి మండలిని తీసుకువస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.ఈ బోర్డుకు ట్రంప్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మండలిలో ఉప విభాగాలు ఏర్పాటు, రద్దు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉంటాయిట్. ట్రంప్ ఎంపిక చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు రెండేళ్ల పదవీకాలం కలిగి ఉంటారు. వైట్ హౌస్ (అధ్యక్ష పదవి) నుండి వైదొలిగినా, ట్రంప్ స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు ఆయనే ఛైర్మన్‌గా కొనసాగేలా నిబంధనలు రూపొందించారు. -
గ్రీన్లాండ్: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్లాండ్. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.ఇంటి కొనుగోలు, భూమి పరిమితులుగ్రీన్లాండ్లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.గ్రీన్లాండ్లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.ఆస్తి ఎవరు కొనొచ్చు..గ్రీన్లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్గ్రీన్లాండ్లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి. -
ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
అప్పుడు మేం అలస్కాను యూఎస్‌కు అమ్మేశాం: పుతిన్
గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని మద్దతు లభించింది. ఇప్పటివరకూ అమెరికా- గ్రీన్లాండ్ అంశంపై రష్యా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం.. యూఎస్‌కే దాదాపు మద్దతు తెలిపాడు. జాతీయ భద్రతా మండలిలో పుతిన్ మాట్లాడుతూ.. ‘ గ్రీన్లాండ్ అంశం మాకు సంబంధం లేదు. అది యూఎస్-నాటోలు చూసుకుంటాయి. గ్రీన్లాండ్ మా జోక్యం ఉండదు. అది అసలు రష్యాకు సంబంధం లేని అంశం. ఆ విషయాన్ని నాటో ఆర్గనైజేషన్-అమెరికాలు చూసుకుంటాయి. గ్రీన్‌లాండ్‌పై మధ్యలో మేము దూరాల్సిన అవసరం లేదు. గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఎప్పుడూ కాలనీగా చూస్తుంది. గ్రీన్‌లాండ్‌పై క్రూరత్వం ప్రదర్శించకపోయినా.. దానిపై డెన్మార్క్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా.. ఏం జరిగినా గ్రీన్లాండ్ ఎపిసోడ్ అనేది మాకు అనవసరం. వాళ్ల వాళ్లు చూసుకుంటారు. మాకైతే సంబంధమే లేదు. 1917లో వర్జిన్ దీవుల్ని అమెరికాకు డెన్మార్క్ అమ్మేసింది. మేం కూడా అలస్కా(ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న 49వ రాష్ట్రం) ను యూఎస్‌కు అమ్మేసాం. 1867లో సుమారు 7.2 మిలియన్ డాలర్లకు అలస్కాను అమ్మేశాం’ అని పుతిన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. -
గ్రీన్లాండ్ టారిఫ్‌లు.. వెనక్కి తగ్గిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై విధించబోయే సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ వేదికగా గ్రీన్లాండ్.. యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. యూరప్‌లో తమ మిత్రదేశాలపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన భేటీలో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పనపై అంగీకారం కుదిరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 1న అమలులోకి రావాల్సిన సుంకాలను విధించబోను. గ్రీన్లాండ్కు సంబంధించిన "గోల్డెన్ డోమ్" అంశంపై అదనపు చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు ముందుకు సాగేకొద్దీ మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ఈ చర్చలు, ఒప్పందాలు అమెరికా మరియు నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. చర్చల బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు ఇతరులు నిర్వహిస్తారు. వారు నేరుగా నాకు నివేదిస్తారు.. అని ట్రంప్ తన పోస్టులో తెలియజేశారు. అంతకు ముందు.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అయితే ఇందుకోసం బలప్రయోగం(సైనిక చర్య) చేయబోమని.. అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూనే ఇటు యూరప్ మిత్రదేశాలనూ ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే యూరప్‌ను రక్షించింది. ఆ సంగతి మరిచిపోకూడదు. అలాగే.. నాటోకు మేమెంతో సాయం అందించాం. కాబట్టి మా అభ్యర్థన చిన్నదే అని అనుకుంటున్నాం అంటూ గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడకూడదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. మేం బలప్రయోగం జరిపితే పని తేలికగా అవుతుంది. కానీ, అలా చేయం. ఆ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్కు అమెరికా భద్రత కోసం అవసరమని, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇది కీలకమని ఆయన వాదించారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందన్నారు. ఒకవేళ.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలను యూరోపియన్ దేశాలు ఖండించాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్.. అమెరికా సుంకాలు విధిస్తే యూరప్ ఒక్కటిగా.. కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు. అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గ్రీన్లాండ్ భవిష్యత్తుపై సుంకాల బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అన్నారు. మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం చేసింది. ఈలోపు దావోస్‌లో ట్రంప్ ప్రసంగం, నాటో చీప్తో భేటీ జరిగిన కాసేపటికే యూరప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు. రియాక్షన్ ఇదే.. దావోస్ వేదికగా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రభుత్వం స్పందించింది. తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అమెరికాకు స్పష్టం చేసింది. మరోవైపు.. ఇది తమ దేశాన్ని అవమానించడమేనని గ్రీన్లాండ్ భావిస్తోంది. ట్రంప్ అనిశ్చితి కలిగించే నాయకుడంటూ తిట్టిపోస్తోంది. అయితే సైనిక చర్య ఉండదని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. గ్రీన్లాండ్ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ఐదు రోజుల పాటు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం నిల్వ చేసుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు సూచనలు చేసింది. నూక్ నగరంలోని ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
తొంబై ఒకటోసారి..
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అన్నారు. రెండు దేశాలు అణు యుద్ధానికి సిద్ధమయ్యాయని, ఆ యు ద్ధాన్ని ఆపి తాను లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత తనదని చెప్పుకొ చ్చారు. తన రెండవ పదవీకాలం వార్షికోత్స వం సందర్భంగా ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. తనను కలిసిన పాక్ ప్రధాని ‘మిస్టర్ ట్రంప్.. మీరు కోటి మంది, అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలే కాపాడారు’ అని చెప్పారనన్నారు. మిగిలిన దేశాల యుద్ధాల వల్ల నష్టపోయేది లక్షలాది మందేనని, కానీ భారత్, పాకిస్తాన్ లో మాత్రం కోటి, కోటిన్నర, రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ జనాభా కూడా అయి ఉండొచ్చన్నారు. ఇది చాలా పెద్ద విషయమ ని చెప్పారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతోనే ఆగిందని గతేడాది మే 10న ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అదే విషయాన్ని సుమారు 90 సార్లు పేర్కొన్నారు. అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా ఈ వాదనను పదేపదే ముందుకు తెస్తున్నారు. ‘365 రోజుల్లో 365 విజయాలు’ట్రంప్ 2.0 మొదటి ఏడాదిలో సాధించిన విజయాల సమగ్ర సంకలనాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. ‘365 రోజుల్లో 365 విజయాలు’ పేరుతో విడుదల చేసిన ఆ ప్రకటన ఆధునిక అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి పదవీకాలంలో సాధించని అద్భుతమైన విజయాలు అధ్యక్షుడు ట్రంప్ సాధించారని పేర్కొంది. వలసలు తగ్గించడం, హత్యల రేటు రికార్డు స్థాయిలో తగ్గటం, దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు, యుద్ధాలు ముగించి శాంతి ఒప్పందాలు, రికార్డు స్థాయిలో ఇంధన ఉత్పత్తి, బ్యూరోక్రసీలో భారీకోతలు అన్నీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాఏ సాధ్యమ య్యాయని తెలిపింది. అత్యవసరమైన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ట్రంప్ అమలు చేశారని, ఇది ప్రారంభం మ్రాతమేనని ప్రకటించింది. ట్రంప్ జనవరి 20, 2025న రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంవత్సరంలో సాధించిన విజయాల్లో ‘భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతిని నెలకొల్పడం’ కూడా ఉందని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ – ఇరాన్, ఈజిప్టు – ఇథియోపియా, అర్మేనియా – అజర్బైజాన్ మధ్య యుద్ధాలను ముగించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని కూడా ట్రంప్ అన్నారు. తాను సంఘర్షణను ముగించిన ప్రతి దేశంలోని నాయకులు నోబెల్ శాంతి బహుమతికి తననే నామినేట్ చేశారని చెప్పారు. ఆ దేశాల నాయకులు తనకు బహుమతి ఇవ్వాలని కోరుతూ బలమైన సిఫార్సులను కూడా పంపారని ఆయన తెలిపారు. శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే నార్వేజియన్ నోబెల్ కమిటీపైనా ఆయన మండిపడ్డారు. అధికారులు తమకు సంబంధం లేదని చెబుతున్నా, నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని నార్వేనే నిర్ణయిస్తుందని తాను భావిస్తున్నా న్నారు. ఆమెకు దక్కిన నోబెల్ శాంతి–2025 బహుమతిని తనకు అందజేసిన వెనిజువెలా ప్రతిపక్ష నాయ కురాలు మచాడోపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ఎనిమిది యుద్ధాలను ముగించినందుకు నోబెల్ బహుమతికి అర్హత మీకే ఉందని, ఆ బహుమతికి తాను అర్హురాలిని కాదని ఆమె చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. -
త్వరలో భారత్‌తో బిగ్ ట్రేడ్ డీల్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో బుధవారం పాల్గోన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ఆయన అన్నారు.ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో తన ప్రసంగం ముగిసిన తర్వాత భారత్‌కు చెందిన 'మనీకంట్రోల్' వార్తా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. "మీ ప్రధానమంత్రిపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు మంచి మిత్రుడు. త్వరలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము" అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా భారత్-యూఎస్ బీటీఎ ఒప్పందం మొదట దశకు చాలా దగ్గరగా ఉందని భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ గురుంచి ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $191(సుమారు ₹15.8 లక్షల కోట్లు) బిలియన్లుగా ఉంది. అయితే ఈ కొత్త డీల్ ద్వారా 2030 నాటికి దీనిని $500 బిలియన్లకు (సుమారు ₹41 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌కు ప్రస్తుతం అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం వాటా అమెరికాదే. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. దీంతో భారత ఎగుమతులు సుమారు 8.5 శాతం తగ్గాయి. అయితే దావోస్ సదస్సులో భారత్‌పై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఈ సుంకాలు తగ్గే అవకాశముంది. -
ట్రంప్ ఏడాది పాలన... ప్రపంచానికి పీడకల
డొనాల్డ్ ట్రంప్ 2.0 క్రమంగా ప్రపంచానికి మర్చిపోలేని పీడకలగా మారుతోంది. అమెరికా అధ్యక్షునిగా రెండో టర్మ్‌లో ఆయన తొలి 12 నెలల పాలన అన్ని దేశాలనూ చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురి చేసింది. 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్నీ ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్ర రాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్లకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడటం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలిస్తూ దేశాధినేతలనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇక ప్రతి దేశంపైనా ఎడాపెడా భారీ టారిఫ్‌లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్నే అతలాకుతలం చేసేశారు ట్రంప్. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్‌లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డపేరు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలన ఘనతలపై మంగళవారం మీడియాతో ట్రంప్ ఏకంగా గంటా నలభై నిమిషాల పాటు ప్రసంగించారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించానంటూ గొప్పలకు పోయారు. అమెరికాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేయడంతో పాటు పలు అద్భుతాలు చేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో మూడొంతులకు పైగా అర్ధసత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాలను అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్నీ అడ్డంగా సమర్థించుకున్నారు. ఈ పెడ పోకడలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే బదులిచ్చి సరిపెట్టారు. గడచిన ఏడాదికాలంలో అటు సొంత ప్రజలను, ఇటు ప్రపంచాన్ని ట్రంప్ హడలెత్తించిన తీరుపై ఫోకస్...టారిఫ్‌లే టారిఫ్లుటారిఫ్లు. ఈ ఏడాది పొడవునా ట్రంప్‌కు ఫేవరెట్‌గా మారిన పదం ఇదేనంటే అతిశయోక్తి కాదు. మిత్రులు, ప్రత్యర్థులు, శత్రువులు అని తేడా లేకుండా ప్రతి దేశంపైనా ఎడాపెడా సుంకాల బాదుడుకు దిగారు ట్రంప్. పిడుగుకూ, బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతిదానికీ టారిఫ్‌లనే అస్త్రంగా ప్రయోగిస్తూ వచ్చారు. తద్వారా మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులనే అతలాకుతలం చేసి వదిలారు. సగటున అమెరికాతో వాణిజ్యం నెరుపుతున్న ప్రతి దేశంపైనా కనీసం 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. భారత్‌పై అత్యధికంగా 50 శాతం మేరకు బాదారు. ఈ టారిఫ్‌లు, పన్నులు, ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా 287 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు ఆ దేశ ట్రెజరీ విభాగం గణాంకాలే చెబుతున్నాయి. తద్వారా సగటు అమెరికన్లకు ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదని యేల్ వర్సిటీ బడ్జెట్ ల్యాబ్ తేల్చింది. ట్రంప్ మతిలేని టారిఫ్‌ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరల దెబ్బకు గత ఏడాది కాలంలో ఒక్కో అమెరికన్ కుటుంబంపై కనీసం 1,500 డాలర్ల మేరకు అదనపు భారం పడ్డట్టు అంచనా వేసింది! ఏడు దేశాలపై దాడులు!యుద్ధాలకు తెర దించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానని రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెట్టుకున్న ఒట్టును ట్రంప్ సింపుల్‌గా గట్టుమీద పెట్టేశారు. ఈ ఏడాది కాలంలో కనీసం ఏడు దేశాలపై దాడులకు తెగబడ్డారు! బాధిత దేశాల్లో ఇరాక్‌తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యెమన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనెజువెలా దాకా ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి పేరు గ్రీన్లాండే అయ్యేలా కన్పిస్తోంది. ఆ దీవిని ఆక్రమించేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు! 2024 జనవరి 20 నుంచి ఈ జనవరి దాకా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి కనీసం 658 వాయు, డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటర్ పేర్కొంది!6 లక్షల మంది గెంటివేతట్రంప్ ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.05 లక్షల మందిని గెంటేశారు! నిర్బంధం, అధికారుల బెదిరింపులు తదితరాలను తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తమ్మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గత ఏడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేగాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు! వీటికితోడు, ఏకంగా 75 దేశాలవారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీల్లేకుండా ట్రంప్ నిషేధం విధించారు.బెదిరింపుల దౌత్యందౌత్య మర్యాదలకు, సాటి దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస గౌరవాదరాలకు కనీవినీ ఎరగని రీతిలో పాతర వేశారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్‌హౌస్ ముఖాముఖిలో మీడియా సాక్షిగా దారుణంగా అవమానించి ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు. పలువురు దేశాధినేతలను ఉద్దేశించి మీడియాముఖంగా బెదిరింపులకు దిగడం, వారితో తన ప్రైవేట్ సంభాషణలను బయటపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా తనతో భేటీ అంటేనే వాళ్లు తీవ్ర విముఖత చూపేదాకా తెచ్చుకున్నారు.228 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు2025 జనవరి 20న ప్ర మాణస్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ రికార్డు స్థాయి లో 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు (ఈఓ) జారీ చేశా రు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆప ద్ధర్మంగా మాత్రమే ఈవో అస్త్రం వాడాలన్న మర్యాదను అటకెక్కించారు. తొలి టర్ములో నాలుగేళ్లలోనూ కలిపి 220 ఈఓలు ఇస్తే, రెండో టర్ములో తొలి ఏడాది కాలంలోనే ఏకంగా 228 ఈవోలు జారీ చేసి మరో రికార్డు సృష్టించారు! పైగా ఆ ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఉండొద్దన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కూడా తుంగలో తొక్కారు. దాంతో ట్రంప్ ఈవోలు చాలావరకు కోర్టు కేసులకు దారితీశాయి.పర్యావరణం గాలికిఅగ్రరాజ్యంగా అమెరికాను పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ముందు నిలపాల్సింది పోయి, ఆ బాధ్యతలను క్రమంగా పూర్తిగా వదిలించుకుంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటున్నారు. పారిస్ ఒప్పందంతో పాటు పలు కీలకమైన పర్యావరణ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ దిశగా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 30కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పారేశారు. పైగా సముద్రాల్లో ఏకంగా 25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్కు పచ్చజెండా ఊపారు!!ఉద్యోగాలు హుష్‌కాకి!ప్రపంచ దేశాల మీదే కాదు, తన ను నమ్మి గద్దెనె క్కించిన అమె రికన్లపై కూడా ట్రంప్ ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం 10 నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 3.17 లక్షల ఉద్యోగాలను పీకిపారేశారు! అమెరికాను తిరిగి శక్తిమంతమైన దేశంగా మార్చేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తెచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) వ్యయ నియంత్రణ పేరుతో ఇలా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తూ పోయింది. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (డీఈఐ) కార్యాలయాలన్నింటకీ మూత వేసింది. అంతర్జాతీయ అభివృద్ధి విభాగాన్నే నామరూపాల్లేకుండా చేసేసింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
అదో ఐసు ముక్క!.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలు
దావోస్: గ్రీన్‌లాండ్‌ను కేవలం ‘ప్రపంచానికి మారుమూలగా ఉన్న ఒక మంచు ముక్క’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు! అయితే, ‘‘వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రాంతం గనుకనే ప్రపంచ శాంతిభద్రతల నిమిత్తం దానిపై అమెరికా నియంత్రణ ఉండాలని కోరుతున్నా. అంతే తప్ప అక్కడున్న అరుదైన ఖనిజ నిల్వల కోసం కాదు’’ అని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరే దేశానికీ లేదని చెప్పుకొచ్చారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం ట్రంప్ గంటకు పైగా మాట్లాడారు. ‘ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా, కొందరు శత్రువులారా!’ అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. ‘గ్రీన్‌లాండ్‌పై హక్కులు, యాజమాన్యం, సార్వ¿ౌమాధికారం... అన్నీ అమెరికాకే కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. గ్రీన్లాండ్కు, యూరప్‌కు, ముఖ్యంగా డెన్మార్క్‌కు దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా తాను అడుగుతున్నది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ‘‘అందుకు ఆ దేశాలు అవుననవచ్చు, కాదనీ అనవచ్చు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. కాదన్న దేశాలను నేను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా’’ అంటూ హెచ్చరించారు! అంతేకాదు, గ్రీన్లాండ్ స్వా«దీనం కోసం బలప్రయోగం చేయబోనని కూడా ట్రంప్ ప్రకటించారు. ‘‘నేను సైనిక చర్యకు దిగుతానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే లేదు. గ్రీన్‌లాండ్‌పై బలప్రయోగానికి దిగను’’ అని స్పష్టం చేశారు. అయితే, ‘‘గ్రీన్లాండ్ ఉన్నది ఉత్తర అమెరికా ఖండంలో. కనుక అది మా భూభాగమే’’ అంటూ వాదించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను అమెరికాయే డెన్మార్క్‌కు అప్పగించింది. అది నిజంగా తెలివితక్కువ పని. ఆ దీవిని కాపాడే సత్తా డెన్మార్క్‌కు లేదు’’ అన్నారు. ట్రంప్ ప్రసంగం వినేందుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో దావోస్ వేదిక కిటకిటలాడిపోయింది. యూరప్‌ను ప్రేమిస్తా, కానీ... యూరప్ అంటే తనకెంతో ప్రేమ అని ట్రంప్ చెప్పుకున్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆ ఖండాన్ని కాపాడింది అమెరికాయేనని చెప్పారు. కానీ కొంతకాలంగా యూరప్ మాటలు, చేతలు సరైన దిశలో సాగడం లేదని ఆక్షేపించారు. యూరప్ దేశాలపైనా, నాటో కూటమిపైనా ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టారిఫ్‌లు మొదలుకుని పర్యావరణం, వలసల దాకా ప్రతి విషయంలోనూ యూరప్ దేశాలు పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నాయన్నారు. తమ గ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు అవి కలిసిరాకపోవడం ఘోర తప్పిదమని పదేపదే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయమై తక్షణం సంప్రదింపుల ప్రక్రియకు యూరప్ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వా«దీనం చేసుకోవడానికి నాటో కూడా మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. అమెరికా గత అధ్యక్షులపై, ముఖ్యంగా జో బైడెన్‌పై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ‘‘అమెరికాను బైడెన్ దివాలా స్థాయికి దిగజార్చారు. నేనొచ్చాక ఏడాదిలోనే దేశ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా తీర్చిదిద్దా’’ అని చెప్పుకున్నారు. యూరప్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో ఆర్థికంగా అతలాకుతలం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘చైనా నుంచి యూరప్ గాలిమరల్ని కొంటోంది. చైనా ఆర్థికంగా బలపడటం, యూరప్‌లో పక్షులు చనిపోవడం తప్ప వాటివల్ల ఒరిగేదేమిటి? చైనాలో ఎక్కడైనా గాలిమరల్ని వాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రపంచమంతటికీ ఆర్థిక ఇంజన్ అమెరికాయే. అమెరికా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచమంతా అభివృద్ధి సాధిస్తుంది’’ అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో గ్రీన్లాండ్కు బదులుగా పదేపదే ఐస్లాండ్ అని పేర్కొనడం విశేషం! భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని దావోస్ వేదికపై కూడా ట్రంప్ పాత పాటే పాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికైనా తెర దించకపోతే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ మూర్ఖులే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు! అయితే, వాళ్లు మూర్ఖులు కాదని తనకు తెలుసంటూ ముక్తాయించారు. ట్రంప్ కాన్వాయ్ దావోస్ వేదిక వద్దకు వస్తుండగా నిరసనకారులు దారి పొడవునా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాక్రాన్ కళ్లద్దాలపై చెణుకులు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ధరించిన కళ్లద్దాలపై దావోస్ వేదికగా ట్రంప్ చెణుకులు విసిరారు. ‘‘నిన్న దావోస్ వేదికపై మాక్రాన్ అందమైన కళ్లద్దాలు ధరించడం చూశా. పాపం, ఆయనకు ఏమైందసలు?’’ అంటూ ప్రశ్నించడంతో సభికులంతా ఘెల్లున నవ్వారు. తాత్కాలిక కళ్ల సమస్య కారణంగా వాటిని ధరించక తప్పడం లేదని మాక్రాన్ చెప్పడం తెలిసిందే.మావల్లే మీ ఉనికి! కెనడాపై ట్రంప్ ఫైర్ మార్క్, నోరు జాగ్రత్త! ప్రధానికి హెచ్చరికలు దావోస్ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ గుప్పించిన విమర్శలపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కూడా అదే వేదిక నుంచి ఆయనకు గట్టిగా చురకలు వేశారు. అమెరికా వల్లే కెనడా బతికి బట్టకడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్క్ (కెనడా ప్రధానిని ఉద్దేశించి)! దశాబ్దాలుగా అమెరికా నుంచి కెనడా ఎన్నో తాయిలాలు అందుకుంటూ వచ్చింది. ఇకపై ఏ వ్యాఖ్యలైనా చేసేముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకో’’ అంటూ హెచ్చరించారు. తమ సాయం పట్ల కెనడాకు కృతజ్ఞతే లేదంటూ ఆక్షేపించారు. అమెరికా ఏకపక్ష పోకడలను కార్నీ మంగళవారం దావోస్ సదస్సులో ఏకిపారేయడం తెలిసిందే. -
ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరేందుకు నో చెప్పిన చైనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షాకిచ్చింది. గాజా పునర్నిర్మాణం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం ట్రంప్ ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్"లో చేరేందుకు చైనా నిరాకరించింది. ఐక్యరాజ్యసమితికి సంబంధం లేని ఏ వ్యవస్ధలోనూ చేరే ఉద్దేశం తమకు లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పష్టం చేశారు."ప్రపంచ పరిస్థితులు ఎలా మారినా చైనా మాత్రం ఐరాస చట్టాలకు, అంతర్జాతీయ నిబంధనలకే కట్టుబడి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ 'బోర్డ్ ఆఫ్ పీస్' ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా మార్చాలనే వ్యూహంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా.. ట్రంప్ శాంతి మండలి విజయవంతమైతే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఆహ్వానాన్ని చైనా తిరస్కరించింది.కాగా ట్రంప్ శాంతి మండలికి యూరప్ నుంచి కూడా ఊహించని వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు ట్రంప్ శాంతి మండలిలో చేరబోమని స్పష్టం చేశాయి. తాజాగా ఇటలీ కూడా తమ దేశ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఈ మండలిలో చేరలేమని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి 20 దేశాలు ఈ మండలిలో చేరేందుకు అంగీకరించినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయోల్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చేరింది. తొలుత టర్కీ, ఖతార్ వంటి దేశాలకు చోటు కల్పించడంపై అభ్యంతరాలు ఇజ్రాయోల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ ఈ పీస్ బోర్డులో చేరాలని ఇజ్రాయోల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించుకున్నారు. ఈ బోర్డులో భాగస్వామి కావడానికి పాకిస్తాన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే భారత్‌కు కూడా ఈ శాంతి మండలిలో చేరాలని ఆహ్వానం అందింది. కానీ దీనిపై భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్‌లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్‌ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్‌ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్‌లోని డెన్మార్క్‌కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్‌ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, యూరప్‌లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్‌తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్‌తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్‌ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్‌ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్‌కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్‌కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్‌లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దావోస్: గ్రీన్లాండ్ మాక్కావాలి..
గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలుఅధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.యూరప్ సరైన దిశలో లేదుడబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.గ్రీన్లాండ్ కావాల్సిందే..అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదని ట్రంప్ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్లాండ్లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్‌లాండ్‌ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు. -
బ్రిటన్-మారిషస్ ఒప్పందంపై ప్లేట్ మార్చిన ట్రంప్
-
ట్రంప్ విమానానికి తప్పిన ప్రమాదం.. అసలేమైందంటే..?
-
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్ అలర్ట్!
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్‌టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..తాజాగా.. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐస్ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.. తెలుగోడా!పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్మెంట్తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్ మీడియాలో ఓ యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.. అమెరికాలో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో భారతీయుల మీద పెరుగుతున్న వ్యతిరేకత..ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్న అమెరికా లాయర్ న్యూమన్ గ్రూప్..అమెరికాలో సినిమాల కోసం, రాజకీయాల కోసం అతి చేయొద్దు అని ముఖ్యమైన సలహా ఇస్తున్న లాయర్లు..సినిమా ఇంకా… pic.twitter.com/uIZKc9TGKD— UttarandhraNow (@UttarandhraNow) January 21, 2026 -
ట్రంప్ విమానంలో విద్యుత్‌కు అంతరాయం.. యూటర్న్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అలాగే వెనక్కి మళ్లింది. చిన్నపాటి విద్యుత్ సమస్య వల్లే ఇలా జరిగిందని.. విమానం సురక్షితంగానే దిగిందని వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఆయన బయల్దేరారు. అయితే కాసేపటికే విద్యుత్ సమస్య తలెత్తడంతో.. ప్రెస్ కేబిన్‌లోని లైట్లు ఆరిపోయాయి. దీంతో సిబ్బంది సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని తిరిగి యూఎస్ బేస్‌కు మళ్లించారు. #AirForce one is returning back to Washington DC because the crew detected a minor electrical issue. @POTUS Trump and staff are safe. pic.twitter.com/4EBPfEMw8w— @BeeNewsDailyB (@BeenewsdailyB) January 21, 2026వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ మరో విమానంలో(బ్యాకప్ ఎయిర్‌ఫోర్స్ వన్) దావోస్‌కు వెళ్లినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిటీ స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధారణమని తెలిపారామె. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష పదవి చేపట్టాక.. భారీ ఖర్చుతో బోయింగ్ 747-200 మోడల్ విమానాలు రెండింటికీ మార్పులు(ఒకటి బ్యాకప్) చేయించారు. ట్రంప్ ప్రయాణించే విమానాలు ఎయిర్‌ఫోర్స్ వన్(Air Force One) నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. ఒక్క గంట ప్రయాణానికి సుమారు 2,00,000–2,50,000 డాలర్లు (రూ.16–20 కోట్లు) వరకు ఖర్చు అవుతుంది(ఇంధనం, సిబ్బంది, భద్రతా, నిర్వహణ.. అన్నీ కలిపి). ఈ భారం పన్నుల రూపంలో మోసేది అమెరికన్లే. అయితే.. అధికారిక పర్యటనలే కాదు తన వ్యక్తిగత పర్యటనలకూ ఆయన ఈ విమానాన్ని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్
‘‘నన్ను చంపేస్తే.. ఇరాన్‌ను భూస్థాపితం చేస్తాం’’ అంటూ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించారు. 'న్యూస్ నేషన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుణ్ని ఏ దేశమైనా చంపితే, అమెరికా సైన్యం సైలెంటుగా ఎందుకు ఉంటుంది? కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ట్రంప్.. తనను ఇరాన్ చంపితే, ఆ తర్వాత భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా.. మా వాళ్లకు ముందే ఆదేశాలిచ్చానంటూ వ్యాఖ్యానించారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 37 ఏండ్ల దుష్ట పాలనను అంతం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్లో అశాంతి ఇలాగే కొనసాగితే దేశం మొత్తం పేలిపోతుందంటూ మరో వార్నింగ్ ఇచ్చారు. కాగా, నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇటీవల పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే..@POTUS on threats from Iran: "I've left notification, anything ever happens... the whole country's going to get blown up." pic.twitter.com/oD6WpeWVoY— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026 మరోవైపు, ట్రంప్.. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించారు. -
‘అణుయుద్ధం ఆపా.. కోటి మందిని కాపాడా’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని తానే నివారించానని, లేదంటే పరిస్థితి అణుయుద్ధానికి దారితీసేదని మరోమారు పేర్కొన్నారు. తన రెండో విడత పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయని, ఆ సమయంలో ఎనిమిది విమానాలు కూల్చివేశారని అన్నారు.తాను అధికారంలోకి వచ్చిన దరమిలా కేవలం పది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని, అందులో భారత్-పాక్ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనదని, వారు అణుయుద్ధానికి సిద్ధమయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది మే 10న భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి, ఈ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ ఇప్పటికి 80 సార్లు పైగా చెప్పడం గమనార్హం. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. #WATCH | US President Donald Trump says, "...I ended eight unendable wars in 10 months...Pakistan and India. They were really going at it. Eight planes were shot down. They were going to go nuclear, in my opinion. The Prime Minister of Pakistan was here and he said, President… pic.twitter.com/kTDa912iLQ— ANI (@ANI) January 20, 2026‘పాకిస్థాన్ ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు.. అధ్యక్షుడు ట్రంప్ సుమారు కోటి మంది ప్రాణాలను కాపాడారని చెప్పారని ట్రంప్ అన్నారు. తన కారణంగానే కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని, అయితే ఈ విషయంలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను నిలువరించినప్పటికీ, ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించడం లేదని వాపోయారు. నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. వెనెజువెలాలో సైనిక చర్య చేపట్టినందుకు అక్కడి మహిళా నేత మరియా మచాడో తన నోబెల్ బహుమతిని తనకు అంకితం చేశారని ట్రంప్ గుర్తు చేశారు.కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న వాదనలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. 2025 ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, దానికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి, పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మే 10న స్వయంగా భారత అధికారులను సంప్రదించి, కాల్పుల విరమణ కోరారని భారత అధికారులు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా జరిగిందే తప్ప, ఇందులో మూడో పక్షం పాత్ర లేదని మోదీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ట్రంప్ వాదనలను ఖండించింది.ఇది కూడా చదవండి: లక్షల్లో ‘బిహారీ’ బందీలు.. 50 ఏళ్లుగా.. -
ఇదంతా మాదే! మూడు దేశాలను కలుపుకుని అమెరికా కొత్త మ్యాప్
-
చాగోస్లా కావొద్దనే...
లండన్/దావోస్: గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాను చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ‘‘బ్రిటన్ వంటి దేశమే మారిషస్ నుంచి అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన చాగోస్ దీవులపై అధికారాన్ని అకారణంగా తిరిగి ఆ దేశానికి వదిలేసుకుంటోంది. అక్కడి డీగో గార్షియా దీవుల్లో అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నావిక, బాంబర్ స్థావరాలున్నాయి. వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు.గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటిది జరగొద్దనే ఆ దీవి అమెరికా చేతిలో ఉండాలని చెబుతున్నాను’’ అని సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌లో రాసుకొచ్చారు! ‘నాటోకు చెందిన అత్యంత తెలివైన సభ్య దేశం’ ఇలాంటి తెలివి తక్కువ పనికి దిగుతోందంటూ బ్రిటన్ను ఎద్దేవా కూడా చేశారాయన. ‘‘బ్రిటన్ కనబరిచిన ఈ బలహీనతను చైనా, రష్యా కచ్చితంగా గమనించే ఉంటాయి. గ్రీన్‌లాండ్‌పై మరింత దూకుడు పెంచే ఆలోచన కూడా చేస్తుండి ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను బ్రిటన్ ఖండించింది.చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించాలన్న నిర్ణయం పూర్తిగా సబబేనని పేర్కొంది. చాగోస్ దీవుల్ని రెండు శతాబ్దాల క్రితం మారిషస్ నుంచి బ్రిటన్ కారుచౌకగా కొనుగోలు చేసింది. వాటిని మారిషస్‌కు తిరిగిచ్చేలా, డీగో గార్షియా దీవిని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటనే అట్టిపెట్టుకునేలా గతేడాది ఒప్పందం కుదిరింది. అప్పుడు దాన్ని స్వాగతించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం తప్పుబడుతున్నారు!ట్రంప్ విశ్వసనీయత కోల్పోయారు: ఉర్సులాగ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు మద్దతివ్వనందుకు పలు యూరప్ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ తూర్పారబట్టారు. ఈ నిర్ణయాన్ని ఘోర తప్పిదంగా అభివర్ణించారు. ‘‘ఈయూపై ఇక టారిఫ్‌లు విధించబోనని గతేడాది ఇచ్చిన హామీని ట్రంప్ సునాయాసంగా తుంగలో తొక్కారు. ఆయనకు అసలు విశ్వసనీయత అన్నది ఏమైనా ఉందా?’’ అంటూ ఆమె మండిపడ్డారు. ‘‘వ్యాపారంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఒప్పందమంటే ఒప్పందమే. ఈయూ సమైక్యంగా నిలుస్తుంది. ట్రంప్ టారిఫ్‌లపై దీటుగా స్పందిస్తుంది’’ అని ప్రకటించారు. కాస్త వెన్నెముక చూపండి!టారిఫ్‌ల వ్యవహారంలో యూరప్ దేశాలు పిరికిగా వ్యవహరిస్తున్నాయంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎద్దేవా చేశారు. ఆ దేశాలకు అసలు వెన్నెముక అనేదే లేదా అంటూ తూర్పారబట్టారు. ట్రంప్ టారిఫ్‌లను కలసికట్టుగా, దీటుగా ఎదుర్కోవాలని వాటికి సూచించారు. అలాగే గ్రీన్లాండ్కు కూడా యూరప్ దేశాలన్నీ సమైక్యంగా మద్దతిచ్చి ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు.అమెరికాపై ట్రేడ్ బజూకా?ట్రంప్ టారిఫ్‌లకు అదే విరుగుడుఈయూ దేశాలకు మాక్రాన్ పిలుపుదావోస్: గ్రీన్లాండ్ స్వాధీ నానికి అంగీకరించడం లే దంటూ పలు యూరప్ దేశా లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ మరోసారి ధ్వజమెత్తారు. అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపులను దీటుగా ఎదుర్కోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం అవసరమైతే ‘ట్రేడ్ బజూకా’గా పిలిచే యాంటీ కొయెర్షన్ ఇన్స్ట్రుమెంట్ (ఏసీఐ) ఆయుధాన్ని వాడేందుకు కూడా ఈయూ కూటమి వెనకాడొద్దన్నారు. మంగళవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరంలో మాట్లాడుతూ మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయూ కూటమి చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధం ఏసీఐ.ప్రస్తుత కఠిన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అమెరికాపై వాడేందుకు ఈయూ దేశాలు ఏమాత్రం వెనకాడొద్దు’’ అని అభిప్రా యపడ్డారు. ఈయూ దేశాలపై ఆర్థిక, ఇతరత్రా ఒత్తిళ్లు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ఆ సమాఖ్య రూపొందించుకున్న వాణిజ్య అస్త్రం ట్రేడ్ బజూకా. దీనిద్వారా కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాల విధింపుతో పాటు పలు ఇతరత్రా ఆంక్షలు విధించే అధికారం ఈయూకు దఖలు పడింది. అలాగే ఈయూకు చెందిన ఎలాంటి బిడ్డింగుల్లోనూ సదరు దేశాలు పాల్గొనేందుకు వీలుండదు. కూటమేతర దేశాలను, ముఖ్యంగా చైనా, రష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ట్రేడ్ బజూకాను మిత్రదేశమైన అమెరికాపైనే ఈయూ ప్రయోగించే పరిస్థితులు కన్పిస్తుండటం విశేషం! -
కెనడాపైనా ట్రంప్ కన్ను!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనెజువెలాతో పాటు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగుదేశం కెనడా పైనా పడింది. ఆ మూడు దేశాలనూ అమెరికా మ్యాప్‌లో చేర్చేసి మురిసిపోయారాయన! కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌తో కలిపిన అమెరికా మ్యాప్‌ను సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ మంగళవారం పోస్టు చేశారు. తద్వారా అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు! ఈ మేరకు ట్రంప్ పోస్టు చేసిన ఏఐ ఫొటో వైరల్‌గా మారింది. అందులో వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో పలువురు దేశాధినేతలతో ఆయన ఏదో సీరియస్‌గా చర్చిస్తూ కన్పిస్తున్నారు.నేపథ్యంలో మూడు దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కన్పిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టె తదితరులు ఫొటోలో ఉన్నారు. తద్వారా... కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదముందని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ట్రంప్ అక్కడితో ఆగలేదు! గ్రీన్లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫొటోలో కన్పిస్తున్నారు. ‘‘గ్రీన్లాండ్, అమెరికా భూభాగం, స్థాపితం: 2026’ అని రాసిన బోర్డు కూడా ఫొటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక డెన్మార్క్ అధీనంలోని స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ స్వాధీ నానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తు న్నాయి. డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్లాండ్ స్పష్టం చేసింది.గ్రీన్లాండ్కు యూఎస్ విమానం!డెన్మార్క్‌తో నానాటికీ తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నడుమ, గ్రీన్లాండ్లోని అమెరికా సైనిక స్థావరంలో యుద్ధ విమానాన్ని మోహరించాలని ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణ యం తీసుకున్నారు. అక్కడి పిటుఫిక్ స్థావరంలో దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఈ చర్య చేపడుతున్నట్టు వైట్‌హౌస్ చెప్పుకొచ్చింది. -
'ట్రంప్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ ప్రతిపక్ష నేత, లిబరల్ డెమొక్రాట్ పార్టీ అధ్యక్షుడు ఎడ్వర్డ్ జోనాథన్ డేవీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బ్రిటీష్ పార్లమెంట్లో ప్రసంగించిన సర్ ఎడ్ డేవీ.. ట్రంప్‌ను అత్యంత ఘాటైన పదజాలంతో విమర్శించాడు. ఆయన ట్రంప్‌ను ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా అభివర్ణించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడు అని సర్ డేవీ మండిపడ్డారు.ఈ విమర్శలకు కారణమేంటంటే..?డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించాలని లేదా తమ దేశంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది.డెన్మార్క్ నిర్ణయానికి బ్రిటన్‌తో పాటు పలు ఐరోపా దేశాలు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆగ్రహించిన ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో తమకు సపోర్ట్ చేయని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఎనిమిది యూరప్ దేశాలపై ఫిబ్రవరి నుంచి 10 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సర్ డేవీ మాట్లాడుతూ.. ట్రంప్ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌లా ప్రవర్తిస్తున్నారు. మిత్రదేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, ఆర్థిక ఒత్తిడితో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు" అని విమర్శలు గుప్పించారు. కేవలం పుతిన్, షీ జిన్‌పింగ్ వంటి వారే ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారని, ఇది నాటో కూటమిని బలహీనపరుస్తుందని ఆయన పేర్కొన్నాడు.ఫ్రాన్స్‌తో కూడా విభేదాలుట్రంప్ కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్‌ను కూడా హెచ్చరించాడు. ట్రంప్ ప్రతిపాదించిన 'బోర్డ్ ఆఫ్ పీస్' లో చేరనందుకు, ఫ్రెంచ్ వైన్, షేంపేన్లపై 200 శాతం సుంకం విధిస్తామని బెదిరించాడు. దీనిని ఫ్రాన్స్ తీవ్రంగా ఖండించింది. -
ట్రంప్ సంచలనం.. అమెరికా కొత్త మ్యాప్ రిలీజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. వెనెజువెలా, కెనడా, గ్రీన్లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్‌ను ట్రంప్ తాజాగా విడుదల చేశారు. దీంతో, ట్రంప్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ట్రంప్.. మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పోస్టులో గ్రీన్లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై ‘గ్రీన్లాండ్ అమెరికా భూభాగం-2026లో ఏర్పాటైంది’ అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది. మరో పోస్టులో ఏకంగా అమెరికా మ్యాప్‌ను మార్చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే, ఆ ఫొటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌లో కెనడా, గ్రీన్లాండ్, వెనిజువేలా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. దీంతో, అమెరికా మ్యాప్ ఇప్పుడు సంచలనంగా మారింది.గ్రీన్‌లాండ్‌లోకి యుద్ధ విమానం..మరోవైపు.. ట్రంప్ తొలి పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్ఓఆర్ఏడీ) ఎక్స్ వేదికగా కీలకమైన ట్వీట్ చేసింది. ఒక యుద్ధ విమానాన్ని గ్రీన్లాండ్లోని పిటుఫిక్ వైమానిక స్థావరానికి పంపుతున్నామని ఎన్ఓఆర్ఏడీ కమాండ్ ప్రకటించింది. గ్రీన్లాండ్ భద్రత కోసం రూపొందించిన పలు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసమే ఆ విమానాన్ని పంపుతున్నామని వెల్లడించింది. డెన్మార్క్, గ్రీన్లాండ్ల సమన్వయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం..2025 సంవత్సరం మే నెల చివరి వారంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. కెనడా అనేది అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందన్నారు. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా గవర్నర్ అవుతారని కామెంట్ చేశారు. కానీ కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవదని తేల్చి చెప్పారు. అయినా ట్రంప్ తన వాదనను కొనసాగించారు. -
H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. హెచ్1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.జామా ఆందోళనది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల సామాజిక-ఆర్థికంగా అత్యంత బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్ కేర్ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు. -
ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు
-
స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్‌లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు! -
మాట వినని మాక్రాన్.. ట్రంప్ మరో హెచ్చరిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలనే ఆలోచనతో ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు.అయితే, గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మాక్రాన్ తప్పకుండా శాంతి మండలిలో చేరాల్సిందే. లేని పక్షంలో ఫ్రాన్స్ వైన్, షాంపైన్ దిగుమతులపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తాను అని హెచ్చరించారు. అనంతరం, ఫ్రాన్స్‌పై టారిఫ్‌లు విధిస్తే.. మాక్రాన్ శాంతి మండలిలో చేరాల్సిన అవసరం ఉండదు అని సెటైర్లు సైతం వేయడం గమనార్హం. మరోవైపు.. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.ABSOLUTE CINEMA 😳Trump threatens 200% tariffs on French wine and champagne after Paris signals it may decline his invitation to join his proposed “Board of Peace.”Trump also shared on Truth Social a private message he received from President Macron regarding Greenland. pic.twitter.com/i8MSN28DwW— Sharp Sighter (@SharpSighter) January 20, 2026ఇదిలా ఉండగా.. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం కావాలని భారత్ సహా కొన్ని దేశాలను డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. ఈ క్రమంలో గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ, పాలన పర్యవేక్షణకు మండలిని తొలుత ఉద్దేశించారు. ఇక, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ రెండోదశలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారు. అయితే, ట్రంప్ ఆహ్వానాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ట్రంప్ హెచ్చరికలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. -
పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు..
నుయుక్: పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు.. ట్రంప్‌నకు అధికారాన్ని తెచ్చిన మాగా (MAGA) నినాదమే గ్రీన్లాండ్ వీధుల్లో వ్యంగ్యంగా మారింది. ఒకప్పుడు అమెరికా గర్వానికి ప్రతీకగా నిలిచిన ఆ నాలుగు పదాలు, ఇప్పుడు నిరసనకారుల చేతిలో ఎరుపు టోపీలపై ఆయుధంగా మారాయి.‘మాగా’ అనేది ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపించిన స్లోగన్. 1980లో రోనాల్డ్ రీగన్ ‘Let’s Make America Great Again’ అనే నినాదాన్ని వినిపించగా, ట్రంప్ దాన్ని ‘Make America Great Again’గా మార్చి 2015లో అధికారికంగా ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు. ఎరుపు టోపీపై తెల్ల అక్షరాలతో రాసిన ఈ నినాదం ఆయన మద్దతుదారులలో ఐకానిక్ గుర్తుగా నిలిచింది.2016లో ట్రంప్ సభల్లో మాగా నినాదం భావోద్వేగాన్ని రగిలించింది. ఒక ఆశగా, ఒక ఉద్యమంగా మారింది. మద్దతుదారులు దీన్ని అమెరికా శక్తి, జాతీయ గర్వం, సరిహద్దుల రక్షణకు ప్రతీకగా చూశారు. విమర్శకులు మాత్రం దీన్ని విభజనాత్మకంగా భావించారు. అనూహ్యంగా, డెన్మార్క్.. గ్రీన్లాండ్లో ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కొత్త రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘Make America Great Again’ కాస్తా అక్కడి వీధుల్లో ‘Make America Go Away’గా మారింది. ఈ నినాదంతో ఎరుపు రంగు టోపీలు ధరించి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మంచులో గడ్డకట్టే స్థితిలో వేలాది మంది ప్రజలు ఈ టోపీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. గ్రీన్ లాండ్‌ను సైనికంగా స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు, అలాగే యూరప్‌పై కొత్త టారిఫ్‌లు విధించాలన్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఈ నిరసనలో పాల్గొన్నవారు అమెరికా అధ్యక్షుడి విధానాలను వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ, గ్రీన్ లాండ్ స్వతంత్రతను కాపాడాలని గట్టిగా నినదించారు.నిరసనకారులు కేవలం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకే కాకుండా, ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో కూడా వీధుల్లోకి వచ్చారు. యూరప్‌లోని అనేక దేశాలు కూడా డెన్మార్క్, గ్రీన్లాండ్కు మద్దతు తెలుపుతూ..ట్రంప్ చర్యలు పాశ్చాత్య భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించాయి. మొత్తం మీద, ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం ప్రయత్నాలు యూరప్‌లో తీవ్ర ప్రతిఘటనకు దారితీశాయి. ‘Make America Go Away’ క్యాప్స్ ఇప్పుడు గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రజల నిరసనకు ప్రతీకగా మారాయి. ఇది కేవలం సెటైరికల్ నినాదం మాత్రమే కాదు.. అమెరికా విధానాలపై యూరప్ ప్రజల అసహనాన్ని స్పష్టంగా చూపించే చిహ్నంగా నిలిచింది. -
ట్రంప్ నోబెల్ బహుమతి చెల్లదంతే!
నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. ఇక శాంతి గురించి ఆలోచించను. అమెరికా ప్రయోజనాల కోసం గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని తీరతా అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన ఆరోపణలపై నార్వే ప్రభుత్వం స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ స్పందించారు. నోబెల్ శాంతి బహుమతికి, నార్వే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. "నోబెల్ బహుమతులను ఒక స్వతంత్ర కమిటీ నిర్ణయిస్తుంది తప్ప మా ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేస్తూ స్పష్టంగా ఓ లేఖ రాశాను" అని స్టోర్ తెలిపారు.ఇక తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి గౌరవాన్ని.. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ట్రంప్‌నకు అందజేసిన సంగతి తెలిసిందే. మచాడో నుంచి అవార్డును స్వీకరించిన అనంతరం ట్రంప్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ధన్యావాదాలు కూడా తెలిపారు. అయితే.. దీనిపై నోబెల్ కమిటీ తాజాగా మరోసారి స్పందించింది.‘‘ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత.. దానిని రద్దు, బదిలీ చేయడం లేదంటే ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఒకవేళ గ్రహీతలు దానిని అమ్మేసుకున్నా.. వేలం వేసుకున్నా.. అది వాళ్ల ఇష్టం. కానీ, ఆ గౌరవం మాత్రం మచాడో పేరు మీదనే ఉంటుంది. కాబట్టి ఆయన బహుమతి చెల్లదు’’ అని కమిటీ తాజాగా మరో ప్రకటనలో తెలిపింది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో తనకు అభ్యంతరాలు చెబుతున్న యూరప్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారీ సుంకాల పెంపును ప్రతిపాదించారు కూడా. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నార్వే ప్రధాని స్టోర్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సంయుక్తంగా ట్రంప్‌నకు ఒక సందేశం పంపారు. అయితే దానికి బదులుగా ట్రంప్.. ‘‘సుమారు ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు మీ దేశం (నార్వే) నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు’’ అంటూ రిప్లై ఇచ్చారు. -
గ్రీన్ల్యాండ్పైకి అమెరికా యుద్ధ విమానాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేయబోతున్నారా?.. గ్రీన్‌ల్యాండ్‌ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారా?.ఈ క్రమంలోనే సైన్యాన్ని గ్రీన్ల్యాండ్లోకి దింపబోతున్నారా?. ఈ తరుణంలో డెన్మార్మ్ ఆందోళనలో అర్థం ఉందా?.. అసలు దీనంతటికి కారణమైన నోరాడ్ అంటే ఏంటసలు?..గ్రీన్‌ల్యాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కి అమెరికా తన యుద్ధ విమానాలు పంపడం ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అగ్రరాజ్యం చర్యపై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిగా డెన్మార్క్ తన సైన్యాన్ని ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌లో మోహరింపజేసింది. అయితే.. నోరాడ్ (ఉత్తర అమెరికా వైమానిక రక్షణ కమాండ్) మాత్రం ఇది రొటీన్ ఆపరేషన్స్ అంటూ చెబుతోంది.అమెరికా సైనిక విమానాలు త్వరలో గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్ (మునుపటి తులే ఎయిర్‌ఫోర్స్ బేస్) వద్దకు చేరనున్నాయి. దీనిని దీర్ఘకాలిక రక్షణ కార్యకలాపాల భాగంగా పేర్కొంటూ.. అమెరికా, కెనడా, డెన్మార్క్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని నోరాడ్ చెబుతోంది. అయితే.. అమెరికా చర్యలను డెన్మార్క్ మాత్రం ఖండిస్తోంది.ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవడం అమెరికా ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అయితే.. తమ ఆధీనంలో ఉన్న స్వయం పాలక గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగితే అది తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనని డెన్మార్క్ భావిస్తోంది. అదే జరిగితే నాటోలో విబేధాలు తప్పవని డెన్మార్క్ ప్రధాని ఇప్పటికే ట్రంప్‌కు స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. తాజా పరిణామంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఏమిటీ నోరాడ్NORAD అంటే "North American Aerospace Defense Command". ఇది అమెరికా-కెనడా కలిసి ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక రక్షణ సంస్థ. దీని ప్రధాన పని ఉత్తర అమెరికా మీదకు వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపై హెచ్చరికలు ఇవ్వడం.. గగనతల నియంత్రణ చేయడం, అలాగే సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేయడం. నోరాడ్ గ్రీన్‌ల్యాండ్‌లో ప్రధానంగా.. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటోంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన సైనిక స్థావరం కూడా. పిటుఫిక్ బేస్‌లోని రాడార్ వ్యవస్థలు రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ దాడులను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడతాయి.గ్రీన్‌ల్యాండ్ స్వయం పాలనలో ఉన్నప్పటికీ.. విదేశాంగం, రక్షణ వ్యవహారాలు ఇంకా డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయన్నది తెలిసిందే. కాబట్టి NORAD కార్యకలాపాలకు డెన్మార్క్ అనుమతి కచ్చితంగా అవసరం. నాటో సభ్యదేశమైన డెన్మార్క్.. నోరాడ్లో కార్యకలాపాల్లో భాగస్వామి కూడా. ఈ మేరకు అమెరికాతో 1951లో ప్రత్యేక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమెరికా చర్యలను అడ్డుకోవడానికి లేదు. కానీ, గ్రీన్‌ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలను మాత్రం అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
వాణిజ్య యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదు
లండన్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునే క్ర మంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, యూకే ఎప్పటిలా గానే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగు తాయన్న ఆయన..వాణిజ్య యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్‌లాండ్‌ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్ని స్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్‌లను అస్త్రంగా ప్రయో గించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో, యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యతన్నారు. ‘అందుకే, భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్‌తోపాటు యూరప్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్‌తో ఫోన్లో మాట్లాడా. ఎందుకంటే, బలమైన కూట ములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఆ విధంగానే కాపాడుకుంటాయి’అని వ్యాఖ్యా నించారు. ట్రంప్‌తో క్రమం తప్పక మాట్లాడు తూనే ఉంటానన్న స్టార్మర్..విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖా ముఖి చర్చించి పరిష్కరించుకోవడమే పరిణతి చెందిన కూటముల లక్షణమని చెప్పారు. -
నాకు నోబెల్ ఇవ్వలేదు కాబట్టి.. శాంతి గురించి ఆలోచించను..!
ఓస్లో: గ్రీన్లాండ్ అంశంపై ఉద్రిక్త తలు కొనసాగుతున్న వేళ నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. నోబెల్ శాంతి బహుమ తిని, గ్రీన్‌లాండ్‌తో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు తనకో సందేశం పంపారని చెప్పారు. ‘నోబెల్ శాంతి బహుమతి నాకు లభించలేదు. కాబట్టి, శాంతి గురించి మాత్రమే మాట్లాడాల్సిన బాధ్యత ఎంతమాత్రం నాకు లేదు’అని అందులో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిపారు. ‘ఎనిమి దికి పైగా యుద్ధాలను ఆపినందుకుగాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించింది. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్య త నాకు ఉందని అనుకో వడం లేదు. శాంతికి ఎప్పు డూ ప్రాధాన్యత ఉంటుంది, కానీ, ఇప్పుడు అమెరికాకు ఏది మంచిది, ఏది సరైనది అనే దానిపైనే నేనిప్పుడు ఆలోచిస్తా. గ్రీన్‌లాండ్‌పై మాకు పూర్తి, సమగ్ర నియంత్రణ ఉంటే తప్ప ఈ ప్రపంచం సురక్షి తంగా ఉండదు’అని ఆయన అందులో పేర్కొ న్నట్లు జొనాస్ వివరించారు. ట్రంప్ నోబెల్ వాదనపై జొనాస్.. ‘నోబెల్ శాంతి బహుమతి ఎంపిక బాధ్యత నార్వేజి యన్ నోబెల్ కమిటీయే తప్ప నార్వే ప్రభు త్వం కాదు. కమిటీ ఒక స్వతంత్ర విభాగం. అందులోని ఐదుగురు సభ్యులను నార్వే పార్లమెంట్ నియమిస్తుంది’అని వివరించారు. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్‌లో భాగమైన కీలకదీవి గ్రీన్‌ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్‌తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్‌కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్‌లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్‌నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్‌లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్‌నూ, రష్యా ఉక్రెయిన్‌నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
అమెరికాలో.. స్వేచ్ఛకు తూట్లు..! పెరుగుతున్న పేదరికం..!!
వాషింగ్టన్ డీసీ: ‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని.. అందరూ అంటుంటారు రామరామ.. అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అని సినీకవి అన్న మాటలు అగ్రరాజ్యం అమెరికాకు సరిగ్గా నప్పుతాయి..! స్వేచ్ఛాసమానత్వాల భూమిగా అమెరికా గడ్డకు పేరుంది. కానీ, ఆ పేరు వెనక విరోధ భావాలు కూడా ఉన్నాయి. అణచివేత ధోరణులూ ఉన్నాయి. మరో కోణంలో అమెరికాను చూస్తే.. విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన నేపథ్యంలో.. ‘అమెరికా మరో పార్శ్వం’పై సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ రిపోర్ట్..గన్‌కల్చర్‌కు అమెరికా పెట్టింది పేరు..! ఎప్పుడు ఏ బడిలో తూటా పేలుతుందో తెలియదు..! ఎప్పుడు ఏ పబ్లిక్ ఈవెంట్‌పై ఉన్మాదుల తుపాకీ గర్జిస్తుందో ఊహించలేం..! మనుషుల కంటే తుపాకులే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం అమెరికా. విద్యార్థులు పరీక్షలకు కాకుండా.. గన్ షూటింగ్‌కు సన్నద్ధమవుతుంటారు. తొమ్మిది.. పదేళ్ల వయసులోనే బ్యాగులో తుపాకీ తెచ్చుకుని, కోపంతో టీచర్లు, తోటి విద్యార్థులపై గురిపెడతారు. 33.5 కోట్ల జనాభాకు 40 కోట్ల గన్స్ ఉండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. 2024లో తుపాకీ తూటాలకు 40 వేల మంది బలవ్వగా.. వారిలో 1,200 మంది చిన్నపిల్లలున్నారు. అమెరికాలో తల్లిదండ్రులు ఏకంగా తమ పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు, దుస్తులు కొనే పరిస్థితి అక్కడ నెలకొంది. తుపాకీ కారణంగా అమెరికాలో పౌరులు బిక్కుబిక్కుమంటూ గడిపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పౌరులకు స్వేచ్ఛ ఉన్నట్లా..? లేనట్లా..?స్వేచ్ఛావాయువులు అమెరికాలో బలంగా వీస్తాయంటారు. ఇంకా చెప్పాలంటే.. ఫలానా దేశంలో స్వేచ్ఛేలేదంటూ రిపోర్టులిచ్చే ఎన్నెన్నో ఏజెన్సీలకు అమెరికా ఆలవాలం. ఫలానా దేశంలో ఫలానా మతస్థులను ఊచకోత కోస్తున్నారంటూ గగ్గోలు పెట్టే మీడియా అమెరికాకు సొంతం. అయితే.. ఇదంతా గురివింద చందమే..! అమెరికాలో జాతి వివక్ష ఏమాత్రం తగ్గ లేదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికా జైళ్లలో ఉంటున్న ఖైదీల్లో శ్వేత జాతీయుల కంటే.. నల్ల జాతీయుల సంఖ్య ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. అమెరికాలో జీఈ, న్యూస్ కార్ప్, డిస్నీ, వియాకామ్, టైమ్ వార్నర్, సీబీఎస్ అనే ఆరు సంస్థల చేతుల్లో 90% మీడియా ఉంది. ఈ సంస్థలేవీ అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను బయటి ప్రపంచానికి చూపించవు. కానీ, భారత్ లాంటి దేశాల్లో స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడతాయి. అమెరికా జైళ్లలో రెండు మిలియన్ల ఖైదీలుండగా.. వీరిలో సింహభాగం శ్వేతజాతీయులు కాని వారే. 21 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరితో జైళ్లలో బండ చాకిరీ చేయించుకుని, ముష్టి పారేసినట్లు గంటకు 25 సెంట్ల చొప్పున కూలీ ఇస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కడో స్లమ్‌లలో పరిస్థితులను భూతద్దంలో చూపించే అమెరికా మీడియా.. ఆయా దేశాల్లో పేదరికం పేట్రేగుతోందని, ప్రజలు కూడు, గూడు, గుడ్డకు నోచుకోవడం లేదని చూపడం సహజమే..! అయితే.. అమెరికాలో అంతా సంపన్నులే ఉన్నారా? పేదలే లేరా? అనే ప్రశ్నకు పాశ్చాత్య మీడియా కూడా నోరు మెదపదు. నిజమేంటంటే.. అమెరికాలో 18శాతం మంది పౌరులు నిరాశ్రయులు. ఆరున్నర లక్షల మంది పౌరులు వంతెనల కింద, రోడ్లపైనే నిద్రిస్తుంటారు. సైనికులు ఏర్పాటు చేసే టెంట్లలో 40 వేల మంది నిద్రిస్తారని అంచనా..! ఇక లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ ప్రాంతాల్లో ఏకంగా ‘టెంట్ సిటీస్’ పేరుతో పేదల బస్తీలు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో.. బిలియనీర్ల సంపద ఒక్క కొవిడ్ సమయంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మేర పెరగడం గమనార్హం..! ఏటా వైద్యంపై 4.5 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని అమెరికా గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. అనారోగ్యంతో సరైన వైద్యం అందక అమెరికాలో చనిపోతున్న వారి ఏటా 50 వేల మంది చనిపోతున్నట్లు ఓ నివేదిక ఉంది. అమెరికా అంటేనే వైద్య బీమా తప్పనిసరి అంటారు. అది కేవలం ఇమిగ్రెంట్లకేనని తెలుస్తోంది. ఇప్పటికీ అమెరికాలో 2 కోట్ల 70 లక్షల మంది పౌరులకు బీమా అందడం లేదని, ఐదు లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా దివాళా తీస్తున్నాయని పలు నివేదికలు వచ్చాయి. వైద్యం ప్రాథమిక హక్కు అని చెప్పుకొనే అమెరికాలో ఒక సర్జరీ కాస్ట్ 50 వేల డాలర్లుగా.. అంబులెన్స్ చార్జీలు కనీసం రెండు వేల డాలర్లుగా ఉండడం గమనార్హం..! అంటే.. అమెరికాలో రోగి ప్రాణాన్ని ధనమే నిర్ణయిస్తుందని స్పష్టమవుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు అమెరికాలో ధరాభారం పెరిగింది. అమెరికాలో ఒక సగటు ఉద్యోగి జీతం తీసుకుని ఒక్కరోజు గడవక ముందే.. మళ్లీ జీతం రావడానికి ఎన్నిరోజులు ఉందా? అని లెక్కలేసుకుంటున్నాడు. ఈ కోవలో 60శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు, అద్దెలు, విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అన్నీ చుక్కలనంటుతున్నాయి. దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లతో ధరలు పెరిగి, అమెరికా పౌరులు విలవిల్లాడుతున్నారు. వేతనాలు పెరగవు.. ధరలు తగ్గవు అంటూ నిట్టూరుస్తున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేసే అమెరికాలో.. ఎన్నికలు కూడా అత్యంత ఖరీదుతో కూడుకున్నవే..! ట్రంప్ విజయం సాధించిన 2024 ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. ఇందుకు 16 బిలియన్ డాలర్ల మేర ఖర్చయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖర్చులో కార్పొరేట్ కంపెనీల విరాళాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఆయా సంస్థలు తమకు అనుకూల చట్టాలు తెప్పించుకుంటాయి. నేతల స్టాక్ పోర్ట్‌ఫోలియోలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. 2023లో 50 మంది నేతలు ఈ తరహాలో వ్యాపారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక అమెరికాలో ట్రంప్ వంటి పాలకుల కారణంగా.. పౌరుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రీ చెబుతుంగా.. ఈ కారణాలతో 15 – 34 ఏజ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరితనం, ఒత్తిడి, డ్రగ్స్ వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా తెలుస్తోంది. యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు అత్యధికంగా అమెరికాలోనే వినియోగమవుతున్నట్లు సమాచారం. ఓహియో, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ఓవర్ డోస్ మరణాలు కూడా ఇక్కడ ఎక్కువే..! ఇక్కడి యువత డీ-అడిక్షన్ ఔషధాల కోసం వేల డాలర్లు ఖర్చుపెడుతోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ డేటా ఈ విషయాలను చెబుతోంది.ఇక టెక్నాలజీ.. డిజిటల్ యుగం అని చెప్పే అమెరికాలో యువత చదువు కోసం విలవిల్లాడుతోంది. విద్య ఓ హక్కు అయినా.. మన విద్యావేత్త చుక్కా రామయ్య లాంటి వారు రాసిన ‘అమెరికా పాఠం’ వంటి పుస్తకాల్లో ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను చక్కగా వివరించినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విద్యలో ఒకప్పుడు అమెరికా నాయకత్వ ధోరణిలో ఉన్నా.. ఇప్పుడు విద్యపై అప్పులు పెరుగుతున్నాయి. స్టూడెంట్ డెబ్ట్ ఇప్పుడు 1.7 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు అంచనా. సగటు కాలేజీ విద్యార్థి 38 వేల డాలర్ల మేర అప్పును భరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం పాఠశాలల బడ్జెట్‌ను తగ్గిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు భారీ లాభాల్లో ఉంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు విద్య అంటే ఆలోచనల సృష్టి కాదు. ఉద్యోగుల తయారీ వ్యాపారం అనే స్థాయికి చేరుకుంది. ఇక కాలుష్యంలోనూ అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారు కావడం తెలిసిందే. ఏటా 5 బిలియన్ టన్నుల మేర కార్బన్-డై-యాక్సైడ్ ఆ దేశంలో ఉత్పత్తి అవుతోంది. క్లైమేట్ యాక్షన్, పారిస్ ఒప్పందాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేది కూడా అమెరికానే. ప్రపంచాన్ని పాలించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుంటే.. ఆ ప్రపంచాన్ని నాశనం చేసే రేంజ్లో కాలుష్యం వెదజల్లుతోంది అమెరికా..! ఇప్పుడు చెప్పండి.. ఇంతటి దరిద్రాలను కలిగి ఉన్న అమెరికాకు వెళ్లడం.. అక్కడ సెటిల్ అవ్వాలని, గ్రీన్‌కార్డు పొందాలని ఆశించడం సరైనదేనా?? -
నార్వే ప్రధాని లేఖలో తేల్చిచెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ టంప్‌కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్‌కు దక్కలేదు. తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్‌పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.ఆలేఖలో ట్రంప్ ... "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా గుర్తించలేదు. అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్లాండ్కు ఎప్పటికైనా చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.అయితే గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్‌తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు. -
బాబోయ్ ట్రంపూ.. అప్పుడే ఏడాది పూర్తి
2024 జనవరి 20.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్‌ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితార అయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.. వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.. ఇదేగాక.. వీసా టఫ్ రూల్స్.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో.. హెచ్1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్.. 2025 డిసెంబర్లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్ పౌరుడొకడు వాషింగ్టన్లో గన్ ఫైర్ ఎటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.టారిఫ్ కింగ్.. 2025లో ట్రంప్‌ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్ టారిఫ్ వార్లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్ ట్రేడ్‌లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.ఫెడరల్ టు స్టేట్స్.. 2024 నవంబర్‌లో ట్రంప్ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్‌లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది.వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్‌తో వాణిజ్య వివాదాలు.. పాక్‌తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్ మెడల్‌ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాలు.. వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్‌ను తిట్టిపోసేలా చేశాయి. -
‘సమయం ఆసన్నమైంది’.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కీలక ప్రకటన!
వాషింగ్టన్ డీసీ: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై డెన్మార్క్‌తో సహా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు నీళ్లు చల్లాయి. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. ట్రేడ్ బజూకా పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించాయి. ఈ క్రమంలో ఆ హెచ్చరికలపై ట్రంప్ పరోక్షంగా స్పందించారు. డెన్మార్క్‌పై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘రష్యా నుంచి గ్రీన్లాండ్కు ముప్పు ఉంది. దాన్ని నుంచి బయటపడేందుకు డెన్మార్క్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభావం పెరుగుతోంది. అందుకే గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకుని, దానిపై రష్యా ముప్పును తొలగిస్తామని ప్రకటించారు. అమెరికా తన మిత్రదేశాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.గ్రీన్లాండ్ భౌగోళికంగా ఆర్కిటిక్ సముద్ర మార్గాలకు కీలకమైన ప్రాంతం. అమెరికా దీన్ని తన రక్షణ వ్యవస్థలో భాగంగా చూస్తోంది. థూల్ ఎయిర్‌బేస్ అమెరికా సైనిక వ్యూహంలో ప్రధాన కేంద్రంగా ఉంది. అదే సమయంలో ఆర్కిటిక్‌లో రష్యా సైనిక స్థావరాలు పెంచడం వల్ల అమెరికా, నాటో మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం. అమెరికా, డెన్మార్క్‌తో కలిసి రక్షణ చర్యలు చేపడుతోంది. డెన్మార్క్ ప్రభుత్వం కూడా ఆర్కిటిక్‌లో రష్యా ఉనికిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా–రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న పోటీని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. రష్యా కొత్త సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తుండగా, అమెరికా దీనిని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది. -
ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
అమెరికా ఓవల్ ఆఫీస్‌లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్‌ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్‌నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్‌హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.ఆరంభంలో సంకోచం.. ఆపై..ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలుద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్‌లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్‌లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.అమెరికా కంటే ప్రపంచమే ముందంజట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..ఎస్ అండ్ పీ 500: +16%నాస్డాక్: +20%డౌ జోన్స్: +14%ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.ఏఐ బూమ్ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.అసలైన పరీక్ష ముందే?ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్‌కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.. -
ట్రంపరితనం.. బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన ఈయూ
గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వ్యతిరేక గళం వినిపిస్తున్న యూరప్‌పైనా టారిఫ్ యుద్ధం ప్రకటించారాయన. అయితే ఆ వార్నింగ్‌కు కౌంటర్ యాక్షన్ ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్ (EU) సిద్ధమైంది. తొలిసారి తన వాణిజ్య బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. ఎక్కువ చేస్తే.. దీనిని అగ్రరాజ్యంపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చింది. ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో యూరప్‌పై టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యుకే నుంచి వచ్చే వస్తువులపై 10% దిగుమతి పన్ను విధిస్తానన్నారు. అంతటితో ఆగకుండా.. జూన్ 1 నుంచి ఈ పన్ను 25% వరకు పెరగవచ్చని హెచ్చరించారు. అయితే.. ఈయూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది బ్లాక్‌మెయిలింగ్ అవుతుందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే శక్తివంతమైన ‘ఏసీఐ’(Anti-Coercion Instrument)ను తెరపైకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్ల (coercion) నుంచి ఈయూ సభ్య దేశాలను కాపాడుకునేందుకు రూపొందించిందే ఏసీఐ. వాణిజ్య బ్లాక్‌మెయిలింగ్‌లు లేదంటే రాజకీయ ఒత్తిడి ప్రయత్నాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం దీని ఉద్దేశం. ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతకాలం కాగితానికే పరిమితమైన దానిని.. తొలిసారిగా ఏకంగా అమెరికాపై ప్రయోగించేందుకు ఈయూ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏసీఐ(Anti-Coercion Instrument).. దీనిని ట్రేడ్ బజుకాగా అభివర్ణిస్తారు. అమెరికాపై దీనిని ప్రయోగిస్తే గనుక.. అమెరికాపై భారీ టారిఫ్‌లు, ఈయూ దేశాల్లో అమెరికా సింగిల్ మార్కెట్ యాక్సెస్‌ను నిరోధించడం, ఎగుమతులను పరిమితం చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే పెట్టుబడులపై నియంత్రణలు విధించే అవకాశం లేకపోలేదు. తద్వారా ఈయూలో వ్యాపారం చేసే అమెరికా సంస్థలకు అదనపు అడ్డంకులు ఎదురవుతాయి. ట్రేడ్ బజుకా ద్వారా సుమారు 93 బిలియన్ పౌండ్ల(రూ11.31) లక్షల కోట్లు విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంతోనైనా గ్రీన్‌ల్యాండ్ టారిఫ్‌ల విషయంలో అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా పలువురు నాయకులు దీన్ని ప్రయోగించాలని అంటున్నారు.ఈయూ చర్యను ట్రంప్ చర్యలకు కౌంటర్‌గా తీసుకున్న అత్యంత కఠినమైన వాణిజ్య ప్రతీకార చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా అమెరికాపై భారీ టారిఫ్‌లు విధించవచ్చు. అయితే.. ఇది అమెరికా–యూరప్ వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆదోళన వ్యక్తం అవుతోంది. -
ట్రంప్ కు షాక్ ఇచ్చిన యూరోపియన్ యూనియన్
-
ట్రంప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు. ఆ ప్రకటన తర్వాతే.. మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్‌కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిపశువుల్ని చేశారా?ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్‌గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు. -
మిన్నెపొలిస్‌లో ‘వలస’ల రగడ
మిన్నెపొలిస్: ట్రంప్ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్ డౌన్టౌన్లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్లాంగ్ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్ ఉన్నారు. ఆయన బేస్‌బాల్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్.. ఫ్లోరిడాలోని యూఎస్ సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మిన్నెపొలిస్, సెయింట్ పాల్ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్ సిటీస్‌లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పి చంపారు. దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ అన్నారు. -
చాబహర్ పోర్టుపై రాజకీయ రగడ
ఇరాన్‌లోని చాబహర్ ఓడ రేవు భారత్‌లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్‌హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్‌పై పెత్తనం చేయడానికి ట్రంప్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. గ్వాదర్ పోర్టుకు పోటీగా.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్‌కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్‌పై సెప్టెంబర్‌లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్‌కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్‌కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది. ఎందుకంత కీలకం? చాబహర్ ఓడ రేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్‌లోని గ్వాదర్ పోర్ట్‌కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్‌పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్‌లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహర్లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది. సుంకాలతో భారత్‌కు నష్టమే చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్‌కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్‌కు అందించింది. చాబహర్‌పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్‌పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు. పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్‌పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాంతి మండలిలో సభ్యత్వం... బిలియన్ డాలర్లే!
వాషింగ్టన్: గాజా పునర్నిర్మాణ క్రతువు కోసం కొలువుదీరే ‘శాంతి మండలి’లో శాశ్వత సభ్యత్వం కోసం ఒక్కో దేశం 100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.9,071 కోట్లు) చెల్లించాలట! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ మేరకు ప్రకటించారు!! ఈ మండలికి ఆయనే సారథ్యం వహిస్తుండటం తెలిసిందే. గాజా పునర్నిర్మాణం కోసమే శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్) అని తొలుత చెప్పినా నిజానికి దీన్ని ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రతిపాదిత మండలికి సంబంధించిన ముసాయిదా చార్టర్‌లోని వివరాలను అంతర్జాతీయ మీడియా సంపాదించింది. అందులోని అంశాలతో కథనాలు వెలువడ్డాయి. ఐరాస, దాని అనుబంధ శాఖలు, సంస్థలు, కమిషన్లు, సలహా మండళ్లలో ఇతర దేశాల ఆధిపత్యం కొనసాగుతుండటంతో విసిగిపోయిన ట్రంప్ తన కనుసన్నల్లో పనిచేసే శక్తిమంతమైన అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు మొగ్గుచూపి ఆ మేరకే కొత్తగా ఈ శాంతిమండలిని తెరమీదకు తెచ్చారు. తనకు నచ్చిన దేశాలకు ఇష్టానుసారం సభ్యత్వం ఇస్తున్నారు. దీనిపై అమెరికా ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. ‘‘దేశాలకు మూడేళ్ల వరకు శాంతి మండలి సభ్యత్వం ఉచితం. ఆ తర్వాత శాశ్వత సభ్యత్వం కోసం కనీసం 100 కోట్ల డాలర్లు చెల్లించాల్సిందే. అది కూడా నగదు రూపంలో. ఐదేళ్ల గడువులో పూర్తి మొత్తాలను చెల్లించాలి. శాశ్వత సభ్యత్వం ఎవరికివ్వాలనే విషయంలో తుది నిర్ణయం ట్రంప్‌దే. శాంతి మండలిలో తీసుకునే నిర్ణయాలపై ప్రతి దేశం ఓటు హక్కు కల్గిఉంటుంది. కానీ ఆ ఓటు చెల్లుబాటయ్యేదీ లేనిదీ ట్రంప్ నిర్ణయిస్తారు. మండలి ఆర్థిక వ్యవహారాలు చైర్మన్ ఆదేశాల మేరకు జరుగుతాయి. సభ్యులను తొలగించే అధికారమూ పరోక్షంగా ఆయనదే’’ అని చెప్పారు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉండాలంటూ భారత్‌కు ట్రంప్ స్వయంగా ఆహ్వానం పంపారు. -
ఖమేనీని సాగనంపాల్సిందే
వాషింగ్టన్: ఇరాన్లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
భారత్‌కు ట్రంప్ ఆహ్వానం.. గాజా 'బోర్డ్ ఆఫ్ పీస్'లో ఆఫర్
గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాటు చేయనున్న ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భాగస్వామిగా చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఆహ్వానించారు. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ చొరవ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికలో భాగంగా, రెండో దశ అమలుకు సంబంధించినదిగా తెలుస్తోంది.ప్రపంచ స్థాయిలో భారత్‌కు ఉన్న విశ్వసనీయత, సమతుల్య విదేశాంగ విధానం, శాంతి ప్రయత్నాల్లో దాని పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం ఇచ్చినట్లు సమాచారం. గాజాలో పరిస్థితిని పర్యవేక్షించడం, మానవతా సహాయం, పునర్నిర్మాణం, సంఘర్షణ నివారణకు సంబంధించిన చర్యలను ఈ బోర్డు సమన్వయం చేస్తుంది. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. భారత్ ఈ చొరవలో భాగమైతే, పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియలో తన పాత్ర మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.బోర్డు సభ్యుల వివరాలువైట్ హౌస్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సభ్యుల జాబితాను విడుదల చేసింది. గాజాలో శాంతి, స్థిరత్వం, పునర్నిర్మాణం, దీర్ఘకాలిక అభివృద్ధిని పర్యవేక్షించనున్న ఈ బోర్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.ఈ బోర్డులోని ప్రముఖ సభ్యులు:* అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో* బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్* ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్* ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా* ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్* అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సీఈఓ మార్క్ రోవాన్* అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ గాబ్రియేల్* తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్* ఖతారీ దౌత్యవేత్త అలీ అల్ తవాడిసభ్యత్వ రుసుముపై స్పష్టీకరణగాజా శాంతి బోర్డులో చేరేందుకు దేశాలు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్న మీడియా కథనాలను వైట్ హౌస్ ఖండించింది. బోర్డులో చేరేందుకు ఎలాంటి కనీస రుసుము నిర్ణయించలేదని స్పష్టం చేసింది. శాంతి, భద్రత, శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధత చూపే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని వైట్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
గ్రీన్లాండ్ వివాదం.. ట్రంప్‌నకు యూరప్ షాక్!
బెల్జియం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. గ్రీన్లాండ్ దక్కించునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. అందుకు ఒప్పుకోని యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అయితే, ఈక్రమంలో ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గబోమని, అవసరమైతే అమెరికాతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకుంటామంటూ యూరోపియన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు, తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీలపై సుంకాల పేరుతో ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో అమెరికా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ట్రంప్ తాజా బెదిరింపులు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఆందోళనలను రేకెత్తించాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పుకోని డెన్మార్క్‌తో సహా ఎనిమిది దేశాలపై 10శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే, జూన్ నుంచి ఈ సుంకం 25 శాతం వరకు పెరుగుతుందన్నారు. గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకం. చైనా, రష్యా ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుతున్నందున గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడం అమెరికాకు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.ఈ క్రమంలో డెన్మార్క్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈయూ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా బెదిరింపులకు తలొగ్గం. అవసరమైతే ఒప్పందాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో యూరప్‌లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలపై జరిమానాలు, నిషేధాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది గూగుల్, మెటా, ఎక్స్ వంటి టెక్ దిగ్గజాలకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ట్రంప్ సైనిక చర్య తీసుకోవచ్చనే భయంతో జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ గ్రీన్లాండ్లో దళాలను మోహరించాయి. డెన్మార్క్ కూడా తన సైనిక ఉనికిని పెంచుకుంది. ట్రంప్ సైనిక చర్య తీసుకుంటే నాటో కూటమి కూలిపోతుంది. ఈ పరిస్థితి ట్రాన్స్ అట్లాంటిక్ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.గ్రీన్లాండ్ వివాదం అమెరికా-ఈయూ సంబంధాలను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అన్నీ కలిపి ఇరు దేశాల వాణిజ్య ఒప్పంద భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగంలో ప్రధాన చర్చగా మారనుంది. -
ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్
-
అంతర్జాతీయ పీస్ మిషన్ ప్లాన్‌లో ట్రంప్..?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.ట్రంప్‌కున్న తలబిరుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థలన్నీ అమెరికా దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడతాయని అందుకే ఆ దేశం మాటే చెల్లాలని ఆయన తరచుగా వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ పలుమార్లు విమర్శలు చేశారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు తగ్గించడంతో పాటు కొన్ని సంస్థలను బహిష్కరించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ స్థాపించబోతున్నట్లు బ్లుూమ్బర్గ్ నివేదిక తెలిపింది. అందులో చేరే ప్రతి సభ్యదేశానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పీస్ మిషన్ తీసుకునే ప్రతి నిర్ణయాలకు ఆ సంస్థ అధ్యక్షుడి నిర్ణయం తప్పనిసరై ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.అయితే ఏ దేశమయితే 1బిలియన్ డాలర్లు సంస్థకు విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి సంస్థ యెుక్క శాశ్వత సభ్యత్యం లభిస్తుందని తెలిపింది. ఈ శాంతి ఆర్గనైజేషన్ యెుక్క ఉద్దేశం అంతర్జాతీయంగా శాంతిని సుస్థిరపరచడమేనని పేర్కొంది. అయితే ఈ శాంతిమిషన్లో చేరడానికి 1బిలియన్ డాలర్లు చెల్లించాలనే అనే వాదన పూర్తిగా అవాస్తవం అని వైట్‌హౌస్ తెలిపింది. -
CBS న్యూస్ యాంకర్ కు ట్రంప్ టీమ్ వార్నింగ్
-
ట్రంప్ పన్నులపై భగ్గుమన్న నాటోదేశాలు
గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై తాజాగా ఈయూ ఫారెన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ స్పందించారు. మిత్ర దేశాల మధ్య వైరం వల్ల పరోక్షంగా రష్యా-చైనాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపారు.డెన్మార్క్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. అయితే ఈ అధిక పన్నులను ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దీనిపై మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ ఎక్స్‌లో స్పందించారు. ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ "మిత్రులమధ్య వైరం వల్ల చైనా, రష్యాలు లబ్ధిపొందే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ భద్రత ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. దానిని నాటోలో అంతర్గతంగా చర్చించుకోవాలి. ఈ అధిక పన్నుల వల్ల యూరప్ దేశాలతో పాటు అమెరికా పేదదేశంగా మారే అవకాశం ఉంది". అని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ అంశం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సహయాన్ని పక్కదారి పట్టించేదిగా ఉండకూడదన్నారు.అయితే గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలు, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. ఫిబ్రవరి 10 నుంచి అది అమలులోకి వస్తుందని తెలిపారు. దీనిపై ఆ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
ట్రంప్ బెదిరింపులు.. మాక్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్లాండ్ అంశంలో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలను ట్రంప్ టార్గెట్ చేశారు. తాజాగా ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలు దేశాల అధినేతలు..కాగా, ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. మాక్రాన్ ట్విట్టర్ వేదికగా..‘ట్రంప్ టారిఫ్‌లు అంటూ ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, ప్రపంచంలోని మరెక్కడైనా సరే. ఈ తరహా పరిస్థితుల్లో మేం వెనక్కి తగ్గం. టారిఫ్‌ల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదు. ఈ సందర్భంలో వాటికి ఎలాంటి స్థానం లేదు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో టారిఫ్‌లు అమలయ్యే పరిస్థితి వస్తే యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.France is committed to the sovereignty and independence of nations, in Europe and elsewhere. This guides our choices. It underpins our commitment to the United Nations and to its Charter.It is on this basis that we support, and will continue to support Ukraine…— Emmanuel Macron (@EmmanuelMacron) January 17, 2026ఫ్రాన్స్ ప్రాధాన్యం అదే.. మరోవైపు.. దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతకు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మాక్రాన్ గుర్తు చేశారు. అదే సూత్రాల ఆధారంగానే ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా ఆ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించడం ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మూలస్తంభమని ఆయన చెప్పారు. ‘యూరప్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం మా నిర్ణయాలకు మార్గదర్శకం. అదే కారణంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాం. శాంతి కోసం, భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్న డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10 శాతం సుంకం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ ఒకటో తేదీకల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. -
ట్రంప్ ఓ నేరగాడు
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో సంభవించిన ప్రజల మరణాలు, విధ్వంసాలకు ఆయనే కారణమన్నారు. నిరసనలకు ఆజ్యం పోసింది ట్రంపేనంటూ నిందించారు. ఇటీవల తలెత్తిన అశాంతి వెనుక అమెరికా హస్తం ఉందన్నారు. ఇరాన్‌ను అస్థిరపర్చడం ద్వారా పైచేయి సాధించాలన్నదే ఆ దేశం లక్ష్యమన్నారు. అయితే, తమ దేశాన్ని బలవంతంగా యుద్ధంలోకి నెట్టలేరని కుండబద్దలు కొట్టారు. విధ్వంసానికి కారణమైన దేశీయ, విదేశీ నేరగాళ్లను శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. ఇరాన్ ఎంతో సంయమనం పాటిస్తోందని, అదే సమయంలో హింసకు కారణమైన వారిపై సహనంచూపే ప్రసక్తే లేదన్నారు. ‘దేశంలో జరుగుతున్న ఆందోళనల విషయంలో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడే వారిని ఇరానియన్లుగా పేర్కొన్నారు. నిరసనలపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారు. సైన్యాన్ని మద్దతుగా పంపుతామంటూ ఉసిగొల్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా అశాంతికి ఆజ్యం పోశారు’అని ఖమేనీ విమర్శించారు. అంతర్గత, బాహ్య శత్రువులపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అల్లర్లను కఠినంగా అణచివేయడంతోపాటు రెచ్చగొట్టే వారి వెన్ను విరుస్తామన్నారు. అశాంతికి కారణమైన లోపలి, బయటి నేరగాళ్లను వదలబోమని తెలిపారు.రెండు రోజుల్లోనే 12 వేల మందిదేశంలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలను కఠినంగా అణగదొక్కేందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్లోని కుద్స్ బలగాలు, అనుబంధ సాయుధ గ్రూపులు రంగంలోకి దిగినట్లు చెబుతు న్నారు. ఈ నెల 8, 9వ తేదీ రాత్రుల్లోనే కనీసం 12 వేల మందిని ఇవి పొట్టన బెట్టుకున్నాయని సమాచారం. అధికారిక సమాచారం, ఆస్పత్రుల్లో డేటా ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేనల్ అనే మీడియా సంస్థ పేర్కొంది. అయితే, నిరసనల్లో ఇప్పటి వరకు 3,090మంది చనిపోయినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 2,885మంది నిరసన కారులున్నారంది. ఇలా ఉండగా, శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 8 గంటల సమయంలో జాతిని ఉత్తేజపరిచేలా నినాదాలు చేయాలని ప్రజలకు అమెరికాలో ఉన్న రాజ కుటుంబ వారసుడు రెజా పహ్లావీ పిలుపునిచ్చారు. -
బోర్డ్ ఆఫ్ పీస్‌లో అజయ్ బంగా, రూబియో
న్యూయార్క్/వాషింగ్టన్: గాజా సంక్షోభ నివారణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో రెండో దశ మొదలైంది. గాజా పునరభివృద్ధి కోసం ట్రంప్ సారథ్యంలో బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటైంది. ఇందులో భారత సంతతికి చెందిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితర ప్రముఖులుగా సభ్యులుగా ఉన్నారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ శుక్రవారం ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల పేర్లను విడుదల చేసింది. ‘దౌత్యం, అభివృద్ధి, మౌలిక రంగం, ఆర్థిక వ్యూహం..’ఇలా అన్ని రంగాల్లో అనుభవం గడించిన వారికి ఇందులో చోటు కల్పించినట్లు ప్రకటించింది. వీరిలో మహిళలు, పాలస్తీనియన్లకు చోటుదక్కకపోవడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ పీస్‌లో బంగా, రూబియోలతోపాటు అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపొలో గ్లోబల్ మేనేజ్మెంట్ సీఈవో మార్క్ రొవాన్, యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియెల్ ఉన్నారు. సుస్థిర గాజా, దీర్ఘకాల పురోగతికి సంబంధించి వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బాధ్యతలున్నాయని వైట్ హౌస్ తెలిపింది. అంతేకాదు, అదనపు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులుగా తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్, ఖతార్ దౌత్యవేత్త అలీ అల్–థవాడి, ఈజిప్టుకు చెందిన హస్సన్ రషద్, యూఏఈ మంత్రి రీమ్ అల్ హషిమీ, ఇజ్రాయెల్ వ్యాపారవేత్త యకిర్ గబాయ్, నెదర్లాండ్స్ మాజీ ఉప ప్రధాని సిగ్రిడ్ కాగ్ ఉంటారని వైట్ హౌస్ వివరించింది. గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడిగా బల్గేరియాకు చెందిన ఐరాస పశ్చిమాసియా దూత నికొలాయ్ మ్లాదెనొవ్ను నియమించినట్లు వెల్లడించింది. పునరభివృద్ధి ప్రణాళికను వేగంగా అమలు చేసేందుకు 15 మందితో ఏర్పాటైన నేషనల్ కమిటీ ఫర్ ది అడ్మిని్రస్టేషన్ ఆఫ్ గాజా(ఎన్‌కాగ్)ను పర్యవేక్షిస్తారు. ఐఎస్ఎఫ్ కూడా.. ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్ఎఫ్) కమాండర్‌గా మేజర్ జనరల్ జాస్పెర్ జెఫ్పర్స్ను నియమించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈయన గాజాలో భద్రత, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని నెలకొల్పడంలో కృషి చేస్తారని తెలిపింది. భద్రతా చర్యలకు సారథ్యం వహిస్తూ సమగ్ర డీమిలిటరైజేషన్కు, మానవతా సాయం పంపిణీ, పునర్నిర్మాణ సామగ్రి అందజేత చర్యలను పర్యవేక్షిస్తారంది. గాజా సమగ్ర ప్రణాళిక లక్ష్యాల సాధన కోసం అంతర్జాతీయ సమాజంతోపాటు కీలకమైన అరబ్ దేశాలతో సన్నిహిత భాగస్వామ్యం కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. ఎన్‌కాగ్, బోర్డ్ ఆఫ్ పీస్, ఐఎస్ఎఫ్లకు పూర్తి స్థాయిలో సహకరించాలని సంబంధిత వర్గాలకు అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. కైరోలో ఎన్‌కాగ్ మొదటి భేటీ గాజా రోజువారీ పాలనా బాధ్యతలను చేపట్టే పాలస్తీనా కమిటీ ఎన్‌కాగ్, ఈజిప్టు రాజధాని కైరోలో శుక్రవారం మొదటిసారిగా సమావేశమైంది. అనంతరం, గాజాలో పాలస్తీనా అథారిటీ మాజీ అధికారి, ఇంజనీరింగ్ నిపుణుడు అయిన కమిటీ సారథి అలీ షాథ్ మీడియాతో మాట్లాడారు. గాజాలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు తక్షణమే రంగంలోకి దిగుతామన్నారు. గాజా తిరిగి కోలుకునేందుకు, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు కనీసం మూడేళ్లయినా పడుతుందని చెప్పారు. అత్యవసరాలను సమకూర్చడంతో గూడు కోల్పోయిన పాలస్తీనా వాసులకు ఆశ్రయం కల్పించడానికి మొదటగా తాము ప్రాధాన్యమిస్తామన్నారు. గతేడాది అక్టోబర్ 10వ తేదీన ట్రంప్ ప్రణాళిక అమల్లోకి వచి్చన తర్వాత గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఇజ్రాయెల్ ఉపసంహరించుకోగా, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వేలాది మంది తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం సరిగ్గా అమలయ్యేలా చూడటం, హమాస్ వంటి సాయుధ గ్రూపులను నిరాయుధుల్ని చేయడం అతిపెద్ద సవాలుగా మారాయి. గాజాలో రోజువారీ కార్యకలాపాలను బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షణలో అలీ షాథ్ సారథ్యంలోని కమిటీ చూసుకుంటుంది. -
ట్రంప్‌కు కీలెరిగి వాత!
టారిఫ్‌లను బూచిగా చూపి ప్రపంచ దేశాలన్నింటినీ బెదరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్ కీలెరిగి వాత పెట్టింది! ‘నీవు నేరి్పన విద్యయే...’అన్నట్టుగా అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించి దెబ్బకు దెబ్బ తీసింది. అది కూడా ట్రంప్‌లా నానా హడావుడీ చేయకుండా, నిశ్శబ్దంగానే పని కానిచ్చేసింది. మూడున్నర నెలలుగా వాటిని వసూలు చేస్తోంది కూడా! భారత్‌పై ట్రంప్ గతేడాది టారిఫ్‌ల మోత మోగించడం తెలిసిందే. రోజుకో రకంగా అన్నట్టుగా మారుస్తూ వచ్చి, చివరికి వాటిని 25 శాతానికి ఖరారు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదంటూ మరో 25 శాతం వడ్డించి 50 శాతానికి చేర్చారు! ఇక్కడే భారత్ సైలెంటుగా పావులు కదిపింది. అమెరికా నుంచి దిగుమతయ్యే తృణధాన్యాలపై 30 శాతం టారిఫ్‌లు విధించేసింది! గత అక్టోబర్ 30న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచే ఆ టారిఫ్‌లు అమల్లోకి కూడా వచ్చాయి!! అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పప్పులు, ముఖ్యంగా బఠాణీలకు ఇది వర్తిస్తోంది. ఈ విషయంలో మోదీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టారిఫ్‌ల విధింపుపై అధికారిక ప్రకటన వంటిదేమీ చేయలేదు. అంతేగాక దానికి పెద్దగా ప్రచారం కూడా కల్పించకుండా జాగ్రత్త పడింది. తీవ్ర నష్టం: సెనేటర్లు నార్త్ డకోటా, మొంటానా రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు కెవిన్ క్రేమర్, స్టీవ్ డెయిన్స్ శుక్రవారం ట్రంప్‌కు రాసిన లేఖతో అమెరికా తృణధాన్యాలపై భారత్ టారిఫ్‌ల అంశం వెలుగులోకి వచ్చింది. తమ రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే పప్పులు, ముఖ్యంగా తృణధాన్యాలకు ఈ టారిఫ్‌లు పెద్ద భారంగా మారాయంటూ లేఖలో వారు వాపోయారు. భారతీయులే వాటిని ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తారని గుర్తు చేశారు. అలాంటి తృణధాన్యాలపై 30 శాతం దిగుమతి సుంకం సరికాదంటూ ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తొలగించేలా ప్రధాని మోదీతో సంప్రదింపులు జరపాల్సిందిగా ట్రంప్‌ను వారు కోరారు. ఈ పరిణామంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘టారిఫ్‌ల రంకెలు వస్తున్న అమెరికాకు దాని భాషలోనే భారత్ సైలెంటుగా దీటైన సమాధానమిచ్చింది’, ‘మౌనంగానే దెబ్బకు దెబ్బ కొట్టాం’అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పప్పులు, తృణధాన్యాల వినియోగంలో భారత్ వాటాయే 27 శాతంగా ఉంది. ట్రంప్ తొలి టర్ములో కూడా భారత్ ఇలాగే అమెరికాలో సాగయ్యే పప్పులపై సుంకాలు విధించిందని, అప్పుడు కూడా ఈ అంశాన్ని తామే ఆయన దృష్టికి తెచ్చామని సెనేటర్లు గుర్తు చేసుకున్నారు. దాంతో వాటిని తొలగించాలని కోరుతూ 2020 భారత పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్ స్వయంగా లేఖ అందజేసి మరీ సమస్యను పరిష్కరించినట్టు వారు చెప్పారు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జాబితా నుంచి 2019లో భారత్‌ను తొలగించడంతో మరుసటేడే అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై భారత్ సుంకాలు వేసింది. చర్చలకు విఘాతమే! అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొద్ది నెలలుగా అటూ ఇటూ ఊగిసలాడుతున్న విషయం తెలిసిందే. నిజానికి అది పూర్తిగా కొలిక్కి వచ్చిందని, కేవలం ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయని కారణంగానే పెండింగ్‌లో పడిందని అమెరికా ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొద్ది రోజులుగా దిగజారుతూ వస్తున్నాయి. దానికి తోడు పప్పులు, తృణధాన్యాలపై భారత్ టారిఫ్‌తో పీటముడి మరింత బిగుసుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో మరింతగా చొచ్చుకొచ్చేందుకు అమెరికా చిరకాలంగా ప్రయతి్నస్తూ వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో కూడా ప్రధానంగా ఈ దిశగా నిబంధనల సడలింపుకు పట్టుబడుతోంది. మోదీ సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
8 దేశాలకు షాక్.. కొత్త టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి నుంచి 10 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు ఈ సుంకానికి లోబడి ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 జూన్ 1 నుంచి ఈ దిగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచనున్నట్లు కూడా తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. -
ఫస్టియర్ లో ట్రంప్ ఫెయిల్ బయటపడ్డ సంచలన సర్వే
-
భారత్‌లో ట్రంప్ అధిక పన్నుల ఎఫెక్ట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. ట్రంప్ అధిక పన్నుల ప్రభావంతో ఎగుమతులు లేక చాలా మంది ఉపాధి కోల్పోయారు. అంతే కాకుండా ఫీజులు కట్టలేక తమ పిల్లలను పాఠశాలలకు మాన్పించేస్తున్నారు. తుంటరి ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. స్నేహ హస్తం అందిస్తూనే చేయి తీసేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత అమెరికా- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైతాయని అందరూ ఆశిస్తే దానికి భిన్నంగా జరిగింది. పాకిస్థాన్ అంశంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా నిలిచిన ట్రంప్ అనంతరం రష్యానుంచి చమురు కొనకూడదని భారత్‌కు ఆంక్షలు విధించారు. భారత్ ఆ మాటల్ని ఖాతరు చేయకపోవడంతో పన్నులు 50 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.అయితే ట్రంప్ పన్నుల ఎఫెక్ట్ గుజరాత్ సూరత్‌లోని వజ్రాల కార్మికుల కుటుంబాలపై పడింది. టాక్సులు 50 శాతానికి చేరడంతో వాటి ధరలు పెరిగి అమెరికాకు ఎగుమతయ్యే జువెల్లర్స్ చాలా తగ్గాయి. దీంతో దానిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావంతో వారి పిల్లలు పాఠశాలలు మానేయ్యాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఈ శీతాకాల పార్లమెంటు సెషన్లో విద్యార్థులు స్కూల్ డ్రాపౌట్స్‌పై నివేదిక అందించారు. అందులో 2025-26 గుజరాత్లో పాఠశాల మానేసిన విద్యార్థుల సంఖ్య 2.4 లక్షలుగా ఉంది. గతేడాది 50,541తో పోలిస్తే దాదాపు నాలిగింతలు పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలే కాకుండా సూరత్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనూ దాదాపు 600కు పైగా విద్యార్థులు తమ చదువు మధ్యలో విద్యను ఆపేసినట్లు నివేదికలు తెలిపాయి.ఇండియన్ డైమండ్ ఇనిస్టిట్యూట్ ఛైర్పర్సన్ దినేశ్ నవదీయా మాట్లాడుతూ.. "గతంలో వజ్రాల కార్మికులు నెలకు రూ. 30 నుంచి 35 వేలు సంపాదించేవారు ప్రస్తుతం ఆ మెుత్తం దాదాపు రూ. 20వేలకు పడిపోయింది. దీంతో ఇంటి అద్దెలు , ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి పిల్లలను స్కూలు ఫీజులు కట్టలేకపోతున్నారు" అని తెలిపారు. ట్రంప్ పన్నుల ప్రభావం వజ్రాల పరిశ్రమపై అధికంగా పడిందని పేర్కొన్నారు. అధిక పన్నుల ప్రభావంతో 50వేల మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. ఎంతో మందికి వేతనాలు తగ్గాయన్నారు. కాగా భారత్ నుంచి ఎగుమతయ్యే పాలిష్ చేసిన వజ్రాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వజ్రాలలో దాదాపు 40 శాతం ఆ దేశానికే వెళతాయి. -
ఇరాన్ అంత ఈజీ కాదు.. ఇజ్రాయెల్ సలహాతో వెనక్కి తగ్గిన ట్రంప్
-
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్‌ఫారమ్‌ల గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో విదేశీ విద్యా రుణాలు 30 నుంచి 50 శాతం వరకు క్షీణించాయి.తగ్గుతున్న రుణాల పరిమాణంఅమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ దేశానికి సంబంధించిన రుణాల పరిమాణం ఏకంగా 60 శాతం పడిపోయింది. విద్యార్థులు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అమెరికా యూనివర్సిటీల స్థాయిలో రుణాల పరిమాణం ఉండటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్బీఐ డేటారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన విదేశీ రిమిటెన్సుల గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధుల ప్రవాహంలో (రిమిటెన్సులు) స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరిలో ప్రారంభమయ్యే ‘స్ప్రింగ్ అడ్మిషన్ సీజన్’ను పరిశీలిస్తే.. 2024 జనవరిలో 449 మిలియన్ డాలర్లుగా ఉన్న రిమిటెన్సులు 2025 జనవరి నాటికి 368 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే ఈ కాలంలో సుమారు 18 శాతం మేర తగ్గుదల నమోదైంది.అత్యధిక అడ్మిషన్లు జరిగే ఆగస్టు ‘ఫాల్ సీజన్’లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. 2024 ఆగస్టులో విదేశీ విద్యా అవసరాల కోసం 416 మిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లగా, 2025 ఆగస్టు నాటికి ఆ మొత్తం 319 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఏకంగా 23 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఇది విదేశీ విద్యా రుణ మార్కెట్‌పై ఉన్న ఒత్తిడిని, విద్యార్థుల విదేశీ ప్రయాణాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా సూచిస్తోంది.(గమనిక: పైన తెలిపిన గణాంకాల్లో విద్యార్థుల జీవన వ్యయం కూడా కలిసి ఉంది)నిపుణుల హెచ్చరికఅభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సమీప భవిష్యత్తులో విద్యా రుణాల వృద్ధి మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌క్రెడ్ ఫైనాన్షియల్ తన ఆస్తుల నిర్వహణలో 24 శాతం విద్యా రుణాలు ఉండటంతో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. విద్యా రుణాలిచ్చే బోర్డర్‌ప్లస్ కంపెనీ ఒకటి రెండు సంవత్సరాల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. అవాన్స్, క్రెడిలా వంటి ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నాయి. అమెరికా వీసా విధానాల్లో సానుకూల మార్పులు వచ్చే వరకు ఈ రంగంలో ఇదే రకమైన స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు? -
అ..ఆ అతడు పండక్కి వెళ్లొచ్చాడు... ఆ తరువాత...
ఏమైందో ఏమిటో పండక్కి ఊరు వెళ్లి వచ్చిన కోటి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ‘ఎలాన్ మస్క్ మన ఆఫీసుకు వచ్చాడట... నన్ను ఏమైనా అడిగాడా?’ అని ఆరా తీశాడు. ‘మీకో బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ట్రంప్ మన మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు’ అని బాంబు పేల్చాడు. ‘వీడికి ఏమైంది? పిచ్చిగానీ పట్టిందా?’ అని అరిచాడు అతడి స్నేహితుడు సందేహ్ కుమార్.‘అతడికి పట్టింది పిచ్చి కాదు, పిల్పిడెన్సియా పిలాసాపీయ సోపియా నైజీరియో బరబ్బర’ అని బదులు ఇచ్చింది ఆకాశవాణి.‘పిల్పిడెన్సియా పిలాసాఫీయా సోపీయా!!!!!!!... అదేమిటి?????’ అని మిక్కిలి ఆశ్చర్యపోయాడు సందేహ్ కుమార్.‘గూగుల్ స్టోర్‌లోకి వెళ్లి బ్యాక్ ఫ్లాష్ ట్యాబ్ ఓపెన్ చెయ్యి. ఫ్లాష్‌బ్యాక్ ఏమిటో నీకే అర్థమవుతుంది’ అని క్లుప్తంగా చెప్పింది ఆకాశవాణి. అలాగే చేశాడు సందేహ్ కుమార్. సరిగ్గా కొన్ని రోజుల ముందు...సంక్రాంతి పండక్కి స్వగ్రామానికి వెళ్లాడు కోటి. పండగ రోజు ఊళ్లో వేపచెట్టుకు వేలాడదీసిన పెద్ద బ్యానర్ కంటపడింది. అందులో ఇలా ఉంది...‘సమస్త గ్రామ ప్రజలకు... ఈరోజు కూడా ఇంట్లోనే తినాలా? ఎప్పుడూ అవే వంటకాలా? అందుకే వంటల పోటీ పెడుతున్నాం. కనీవినీ ఎరుగని కొత్త వంటకానికి... అక్షరాలా కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నాం’‘పేరులోనే కోటి... బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష కూడా లేదు’ అని ఎప్పుడూ నిట్టూర్చే కోటికి ఇది తనను వెదుక్కుంటూ వచ్చిన బంపర్ ఆఫర్ అని బలంగా అనిపించింది. నిజానికి కోటికి వంట కాదు కదా కాఫీ చేయడం కూడా రాదు. అయితే అతడిలోని శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం వంటల పోటీలో పాల్గొనేలా చేసింది. తాను కనిపెట్టిన వంటకానికి పిలాసాపియా సోపీయా నైజీరియో బరబ్బర (పి.సో.నై.బ) అని పేరు పెట్టి, దాని ప్రాశస్త్యం గురించి గాలి పోగేసి ఘనంగా చెప్పడం వల్ల... పోటీలో అతడే కోటి రూపాయల విజేత!‘ఒక విజేతగా మీరు ఆవిష్కరించిన వంటకాన్ని మీరే మొదట రుచి చూడాలి’ అని చెప్పారు నిర్వాహక కమిటీ వాళ్లు. టైటానిక్ షిప్లో సముద్రం లోతుల్లోకి మునిగిపోతున్నట్లుగా ముఖం పెట్టాడు కోటి. కానీ... కోటి రూపాయలు దక్కాలంటే టేస్ట్ చేయక తప్పదు కదా! ‘పి.సో. నై. బ’ రెండు గరిటెలు నోట్లో పెట్టుకున్నాడో లేదో... భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరిగినట్లు కోటి తల కోటి విధాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ, చుట్టూ ఉన్నవారి చుట్టూ తిరిగింది.కట్ చేస్తే... కోటి... మునపటి కోటి కాదు! నీతి 2026: కోటి విద్యలు ‘కోటి’ కోసం కాదు..!– యాకుబ్ బాషా -
ఖమేనీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏమైందోగానీ వాటిని వాయిదా వేసింది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసిందట. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా ప్రకటించారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా చెప్పుకొచ్చారు.. నిన్న జరగాల్సిన 800కిపైగా ఉరి శిక్షలను ఇరాన్ నాయకత్వం రద్దు చేసింది. ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. ఈ చర్యతో వాళ్లపై గౌరవం పెరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటిదాకా సైనిక చర్యకు ఉవ్విళ్లూరిన ట్రంప్.. హఠాత్తుగా ఇలా వెనక్కి తగ్గడం అమెరికా–ఇరాన్ సంబంధాల విషయంలో ఒక కొత్త మలుపు అనే చెప్పొచ్చు.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత.. ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని.. బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికి పోయేలా చేశారు. అయితే వేలాది మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. వాళ్లను విదేశీ శక్తులకు సహకరించే శక్తులుగా పేర్కొంటూ ఉరి తీయాలని ఖమేనీ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ నిర్ణయించింది. ఇదీ చదవండి: ఎప్పుడేం చేయాలో ట్రంప్‌నకు తెలుసు ‘‘ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేశాం. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. మేం అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారు. వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులు’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి.అమెరికా అధ్యక్షుడు కూడా ముందుగా ఇరాన్ చర్యలపై హెచ్చరికలు జారీ చేసి.. శిక్షలు అమలు చేస్తే సైనిక చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అదే సమయంలో ఇరాన్‌తో చర్చలు ఉండొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆందోళనకారుల విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ ప్రకటించడంతో ఆయన మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఈ విషయంలో ఇరాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం, ట్రంప్ ధన్యవాదాలు తెలపడం ఒక విధంగా ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం విషయంలో ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. గల్ఫ్ దౌత్యం చేశాయని ప్రచారం ఉంది. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరిందో(అణు చర్చకు సంబంధించి), లేదంటే చర్చల పురోగతిలో ఇది ముందడుగు మాత్రమేనా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తాను చేసిన ఒత్తిడి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుందని కలరింగ్ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అంతర్జాతీయంగా ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చి ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది కూడా. కొసమెరుపు.. ఒకవైపు నిరసనకారుల మరణశిక్ష విషయంలో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గగా.. వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. రాజధాని టెహ్రాన్‌కు చెందిన అహ్మద్ ఖటామీ అనే మతాధికారి శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ‘‘ఇది దేవుని తీర్పు. అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అంటూ జనం కోలాహలం మధ్య ప్రకటించాడు. -
ఇరాన్‌పై దాడులు లేనట్లే!
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెలిగే పలు మధ్య ప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్‌పై దాడులు చేయొద్దని అమెరికాను కోరినట్లు అరబ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్‌పై సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా సంకేతాలిస్తున్నారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే భీకర దాడులకు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఈజిప్టు, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయాదేశాల అత్యున్నత దౌత్యవేత్తలు తాజాగా సమావేశమై చర్చించుకున్నారు. ఇరాన్‌పై ఇప్పుడు సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరంగా మార్చొద్దని విన్నవించారు. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తిని ట్రంప్ మన్నించినట్లే కనిపిస్తోంది. ఆయన కొంత మెత్తబడ్డారు. ఇరాన్‌పై దాడులకు దిగే ఆలోచన లేదని ప్రకటించారు. సానుకూల సంకేతాలు రావడంతో గురువారం చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణ శిక్షను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఫాక్స్న్యూస్లో ప్రచురితమైన వార్తను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎప్పుడేం చేయాలో ట్రంప్‌కు తెలుసు మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ భిన్న స్వరం వినిపించారు. ఇరాన్‌ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ఐచి్ఛకాలు ట్రంప్ చేతిలో ఇప్పటికీ ఉన్నాయని స్పష్టంచేశారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసని ఉద్ఘాటించారు. ఇరాన్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ఆగని ఆందోళనలు ఇరాన్లో పరిస్థితులు కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఖమేనీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం వీధుల్లోకి వచి్చ, ఖమేనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా కనీసం 2,637 మంది మరణించారు. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రసార మాధ్యమాలు చెబుతున్నాయి. ఆ ఆలోచన ఇంకా ఉంది ఇరాన్ సైనిక చర్య అనే ఆలోచన ఇంకా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ పేర్కొన్నారు. గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికాతోపాటు ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ప్రజల ఊచకోతను ఆపడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అందుకోసం అన్ని రకాల అవకాశాలను ఆయన ఉపయోగించుకుంటారని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. -
Trumpపై న్యాయవ్యవస్థ సీరియస్
-
ట్రంప్‌కు నోబెల్ బహుమతి..!
-
భారత వలసదారులపై కోపమెందుకు?
అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ వలసదారులు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అత్యంత శాంతియుతమైన, విజయవంతమైన వర్గంగా పేరుగాంచిన భారతీయులపై ఇటీవల కాలంలో ఆన్లైన్ వేదికగా, రాజకీయంగా అసహనం పెరుగుతోంది. అమెరికాను వివిధ సంస్కృతుల కలయికగా అభివర్ణించే ‘మెల్టింగ్ పాట్’(Melting Pot- వివిధ సంస్కృతుల సమ్మేళనం) సిద్ధాంతానికి ఈ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.ఆన్లైన్ వేదికలపై..2025 నుంచి సోషల్ మీడియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా నిబంధనలపై జరుగుతున్న చర్చలు ద్వేషపూరిత వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. అమెరికా టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే తప్పుడు ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ మార్కెట్లో వస్తున్న మార్పులు కూడా వలసదారులపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి.రాజకీయ దుమారంప్రస్తుత అమెరికా రాజకీయ పరిణామాలు భారతీయుల్లో మరింత అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. అక్కడి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) గతంలో చేసిన ‘అధిక సంఖ్యలో ఉన్న వలసల వల్ల అమెరికా ప్రయోజనాలు నీరుగారుతున్నాయి’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆయన భార్య భారత సంతతికి చెందిన ఉషా వాన్స్ కూడా ఆన్లైన్లో ట్రోల్ అయ్యారు. నిక్ ఫ్యుయెంటెస్ వంటి తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఉషా వాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామి ఘాటుగా స్పందించారు. ఇటువంటి ద్వేషపూరిత భావజాలానికి పార్టీలో చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.చారిత్రక పునరావృతంచరిత్రను గమనిస్తే అమెరికాలో ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగాల కోత ఉన్న సమయాల్లో వలసదారులపై దాడులు పెరగడం కొత్తేమీ కాదు. గతంలో ఐరిష్, ఇటాలియన్, జపనీస్ వలసదారులు కూడా ఇటువంటి వివక్షను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భారతీయుల పట్ల కనిపిస్తున్న అసహనం కూడా అటువంటి ఆర్థిక అభద్రతాభావం నుంచే పుట్టుకొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.తాజా గణాంకాల ప్రకారం వివక్ష ఇలా..49 శాతం భారతీయ అమెరికన్లు గడిచిన ఏడాది కాలంలో ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొన్నారు. చర్మం రంగు, భాష యాస, మతపరమైన ఆచారాల ఆధారంగా భారతీయులను వేరుగా చూస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న భారతీయ నిపుణులపై ఈ విధమైన అసహనం ప్రదర్శించడం ఇరు దేశాల సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులను విమర్శించడం ఆపేయాలని, ఆన్లైన్లో ద్వేషాన్ని అరికట్టాలని పౌర సమాజం కోరుతోంది.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
ఇజ్రాయెల్‌లో భూకంపం.. అణు పరీక్షలే కారణమా?
ఇరాన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. విరోధి దేశం ఇజ్రాయెల్‌లో భూకంపం సంభవించింది. నెగెవ్ ఎడారిలోని డిమోనా ప్రాంతంలో 4.2 తీవ్రతతో ఇది చోటుచేసుకోగా.. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే.. టెహ్రాన్ హెచ్చరికల నేపథ్యంతో టెల్ అవీవ్ రహస్యంగా అణు పరీక్షలు జరిపి ఉండవచ్చని.. ఇదే భూకంపానికి కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. గురువారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు జెరూసలేం వరకు ప్రభావం చూపాయి. కొన్ని సెకన్లపాటు నేల కంపించగా.. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే.. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్‌లోని అన్ని విద్యాసంస్థల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జరుగుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. దీంతో ఇది సహజసిద్ధమైన భూకంపం కాకపోవచ్చనే చర్చ మొదలైంది. ఇది ఇరాన్‌తో పాటు అమెరికాకు ఇజ్రాయెల్ పంపిన సంకేతం అయి ఉండొచ్చనే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా.. డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు రహస్య అణు పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 1950లలో నిర్మించిన ఈ కేంద్రంలో హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. పైగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల విస్తరణ కూడా ధృవీకరణ అయ్యింది. అయితే అణు పరీక్షలు, అణ్వాయుధాలున్నాయనే ప్రచారాన్ని ఆ దేశం ఏనాడూ అంగీకరించలేదు. అయితే ఇజ్రాయెల్ భూగర్భ శాస్త్ర సంస్థ మాత్రం అధికారికంగా ఇది సహజ భూకంపమేనని ప్రటించడం గమనార్హం.ఇరాన్ అణు ప్రోగ్రామ్‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అది తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశమంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది అమెరికాతో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు కూడా జరిపింది. ఆ సమయంలో ఇరాన్ కూడా అణు పరీక్షలు నిర్వహించినట్లు విస్తృత ప్రచారం జరిగింది.ఇక ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ బ్యాన్, సమాచార వ్యవస్థలను కట్టడి చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఆందోళనకారుల్ని కఠినంగానే అణచివేస్తున్నారనే సమాచారం మాత్రం బయటకు పొక్కుతోంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో మరణాలు(వేలల్లోనే) సంభవించినట్లు, అరెస్టులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై హింసను ఉపేక్షించేది లేదని, అవసరమైతే సైనిక చర్య తప్పదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో చర్చలకు ఆస్కారం ఉందన్న మాటను ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ.. తమ దేశం జోలికి వస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తున్నారు. -
ట్రంప్‌నకు మచాడో నోబెల్ శాంతి బహుమతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తన నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో. గురువారం వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్‌నకు తన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను అందజేసినట్లుగా ఆమె తెలిపారు.వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గంటకు పైగా సాగిన సమావేశం తర్వాత మచాడో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. “మనం అధ్యక్షుడు ట్రంప్‌పై ఆధారపడవచ్చు” అని ఆమె పేర్కొన్నారు. అనంతరం “థ్యాంక్ యూ, ట్రంప్” అంటూ నినాదాలు చేయించారు.అయితే ఆమె సమర్పించిన నోబెల్ పతకాన్ని ట్రంప్ స్వీకరించారా లేదా అనే ప్రశ్నకు మచాడో సమాధానం ఇవ్వలేదు. ఈ చర్యపై గత కొన్ని వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే నోబెల్ శాంతి బహుమతి బదిలీ చేయడం లేదా ఇతరులకు అందజేయడం సాధ్యం కాదని నోబెల్ అవార్డుల నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. -
ట్రంప్ భయం?.. ఉరిశిక్ష రద్దు చేసిన ఇరాన్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. . ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందనే భయంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.గత కొద్దిరోజులుగా ఇరాన్లో తీవ్రనిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిరసన కారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటీకీ ఇరాన్ తన తీరును మార్చుకోలేదు. నిరసనకారులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులలో దాదాపు రెండువేల మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేయడం ఇక తప్పదని అంతా భావించారు. అయితే సడెన్‌గా పరిస్థితి యూటర్న్ తీసుకుంది.అరెస్టు చేసిన నిరసనకారులకు ఉరితీసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపినందుకు గానూ జనవరి 10న ఇర్పాన్ సోల్తానీని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.అనంతరం నిన్న( జనవరి14న)న మరణశిక్ష అమలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఆయన మరణశిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్ధతుగా నిలిచారు. వారిపై దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందంటూ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ చల్లబడడంతో ట్రంప్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపేశారని అలాగే మరణశిక్షలు వాయిదా వేసినట్లు తెలిసింది. అని వాషింగ్టన్లో ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంభించుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు. -
ట్రంప్ టారిఫ్‌లు.. కేంద్రానికి శశిథరూర్ కీలక సూచన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం విషయంలో ఆలస్యం చేయవద్దని శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అమెరికా సుంకాలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని.. మళ్లీ ఇరాన్‌తో వ్యాపారం విషయంలో 25 శాతం సుంకాలు విధిస్తున్నారన్నారు. ఇన్ని టారిఫ్‌లను తట్టుకొని 75 శాతం సుంకాలతో అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యమైనంత ఈజీ కాదు. భారీ నష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు.ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
ఇరాన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తుందనే కారణంగా ఇరాన్.. అకస్మాత్తుగా తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, గగనతం మూసివేస్తున్న సమయంలో ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, ఇండిగో సంస్థ, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించే సమయానికి చాలా విమానాలు తమ మార్గాలను మళ్లించుకున్నాయి. అయితే, ఈ మూసివేత ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇరాన్ గగనతలంలో భారత్‌కు చెందిన ఇండిగో విమానం ప్రయాణంలో ఉంది. జార్జియాలోని టీబీలిసీ నుంచి వస్తున్న ఇండిగో 6E-1808 విమానం ఇరాన్ తన బోర్డర్లను మూసివేయడానికి సరిగ్గా నిమిషాల ముందు గగనతలం చివరి వరకు వచ్చేసింది. సరైన సమయంలో సదరు ఇండిగో విమానం.. ఇరాన్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ గగనతంలోకి ప్రవేశించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఆ సమయంలో ఇరాన్ భూభాగంపై ఉన్న ఏకైక 'నాన్-ఇరానియన్' విమానం ఇండిగోనే కావడం గమనార్హం.విమానయాన సంస్థల సూచనలు..ఇక, ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం అనిశ్చితంగా ఉన్నందున భారత విమానయాన శాఖ (DGCA) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన సమయాలను సరిచూసుకోవాలని సూచించింది. భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి సూచనలే జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.కేంద్రం అడ్వైజరీ..ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. భారతీయులు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమ స్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. అలాగే, ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. IndiGo flight 6E1808 is now the last non-Iran-registered passenger aircraft in Iranian airspace. pic.twitter.com/qEAU83gYrK— Chendur.Vengat (@coolvnkt) January 14, 2026అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న హెచ్చరికలు, ఇరాన్ అంతర్గత అశాంతి నేపథ్యంలో టెహ్రాన్ తన గగనతలాన్ని శత్రు విమానాలకు దొరక్కుండా మూసివేసింది. కమర్షియల్ విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ గగనతంలో జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ గగనతలం మూసివేతతో భారత్ నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. -
ట్రంప్ వార్నింగ్‌తో వెనక్కి తగ్గిన ఇరాన్?
అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో నిరసనకారులకు మరణదండన శిక్షలు వాయిదా పడ్డట్లు ప్రకటించారు. అదే సమయంలో.. సైనిక చర్య ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మరోవైపు.. ఇరాన్ సైతం ఆందోళనకారులను ఉరి తీసే ఆలోచనను ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్లు ధృవీకరించింది. ‘‘ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపిశారని.. అలాగే మరణశిక్షణలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది’’ అని వాషింగ్టన్లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంతో సైనిక చర్యపై వెనక్కి తగ్గుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అక్కడి ప్రభుత్వం నిరసనకారుల్ని హత్యలు చేస్తోంది. ఇప్పుడు వాటిని ఆపేసింది. ఇలాంటి టైంలో వేచి చూసే ధోరణి అవలంభించాలనుకుంటున్నాం అని అన్నారు. దీంతో.. ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చనే సంకేతాన్ని అలాగే ఉంచారు.ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కఠినంగా అణచివేస్తున్నది తెలిసిందే. ఇప్పటివరకు 18,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఘర్షణల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని.. 3,000 మందికి పైగా మరణించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో జరిగిన అత్యంత ఘోర నిరసనలలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే.. అరెస్టైన నిరసనకారుల్ని దేశద్రోహులుగా పరిగణిస్తూ న్యాయవిచారణ జరపకుండానే మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో ఇర్ఫాన్ సోల్తానీ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యాయపరంగా ఎలాంటి సాయం అందకుండా చేసి.. కేవలం 10ని. మాట్లాడుకోవడానికి కుటుంబానికి అనుమతిచ్చి.. సోల్తానీని ఉరి తీసేందుకు బుధవారం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆ ఉరి వాయిదా పడింది. నార్వేలోని హ్యూమన్ రైట్స్ సంస్థ హెన్గావ్ ప్రకారం.. సోల్తానీకి విధించబోయే శిక్షను వారంపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలకు మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్‌హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది. -
‘అప్పుడు మిస్సయిన బుల్లెట్ ఇప్పుడు దిగుతుంది’
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చుతామని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు బహిరంగంగా ప్రసారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇంకా గుర్తుండగానే ఈ బెదిరింపు వెలువడింది. ఆ ఏడాది జూలై 14న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రక్షణగా చేరి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు అక్కడికక్కడే హతమార్చాయి.ఇప్పుడు అదే ఘటనకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్‌తో ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ..‘గతంలో బుల్లెట్ మిస్సైంది.. ఇక మిస్సవ్వదు, ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుంది’ అంటూ ట్రంప్‌ను బహిరంగంగా బెదిరించింది. దాడులకు దిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే అంచనాతో అమెరికా అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలో తన సైనిక స్థావరాలను ఖాళీ చేస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై సైనిక దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, టెహ్రాన్ ఇప్పటివరకు చేసిన అత్యంత బహిరంగ బెదిరింపులలో ఈ ప్రసారం ఒకటిగా నిలిచింది. అదే సమయంలో, అమెరికా తమ దేశంలో అంతర్గత అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు దేశంలో ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ట్రంప్‌పై ఇరాన్ మీడియా చేసిన బెదిరింపులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
గ్రీన్లాండ్ సొంతం కావాల్సిందే!
నూక్ (గ్రీన్లాండ్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ నామజపం నానాటికీ శ్రుతి మించుతోంది. ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశం అయి తీరాల్సిందేనని, అది తప్ప ఇంక దేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు, అందుకు నాటో కూటమి ఇతోధికంగా సాయపడాలని చెప్పుకొచ్చారు. వెనెజువెలాపై సైనిక చర్యతో అధ్యక్షుడు మదురో దంపతులను నిర్బంధించిన అనంతరం ట్రంప్ తన దృష్టినంతా గ్రీన్‌లాండ్‌పై కేంద్రీకరించడం తెలిసిందే. ఇది గ్రీన్‌లాండ్‌తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్‌తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్, అలాగైతే తొలి తూటా పేల్చేది తామేనని డెన్మార్క్ పోటాపోటీ ప్రకట నలతో వాతావరణం బాగా వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఒకవైపు డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్లో భేటీ అవుతుండగా, అంతకు కేవలం కొద్ది గంటల ముందు ట్రంప్ మళ్లీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. ‘అమెరికా జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే. ఆ ప్రయత్నాలకు నాటో కూటమే సారథ్యం వహించాలి. లేదంటే గ్రీన్‌లాండ్‌పై రష్యా, చైనా పట్టు సాధిస్తాయి. అలా జరగనివ్వబోం’ అని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ఆయన వరుస పోస్టులు పెట్టారు. ‘మేం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో గ్రీన్లాండ్ అతి కీలకం’ అని పేర్కొన్నారు. అంతేకాదు, గ్రీన్లాండ్ అమెరికా గుప్పెట్లోకి వస్తే నాటో మరింత బలోపేతమైన శక్తిగా మారుతుందని చెప్పుకొచ్చారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే వైట్‌హౌస్‌లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్‌తో భేటీ అనంతరం సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వారు మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు, గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ, లేదా ఇతర శాఖల నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. వీరిలో ఒకరు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం. శుక్ర, శనివారాల్లో వారి బృందం డెన్మార్క్‌లో పర్యటించనుంది. డెన్మార్క్ ప్రధాని తదితరులతో భేటీ కావాలని వారు నిశ్చయించారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై గ్రీన్లాండ్వాసులు మండిపడుతున్నారు. తాము అమ్మకానికి సిద్ధంగా లేమంటూ నినదిస్తున్నారు. ‘‘మేం డెన్మార్క్‌ను ఎంచుకున్నాం. ఆ దేశంలో భాగంగా, యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా మాత్రమే కొనసాగుతాం. అంతే తప్ప అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడం కల్ల’’ అని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో వారు కుండబద్దలు కొడుతున్నారు. చైనా, రష్యాలతో తమ ద్వీపానికి ముప్పుందన్న ట్రంప్ వాదనను గ్రీన్లాండ్వాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన నోట వస్తున్నవన్నీ కాల్పనిక గాథలని వారు చెప్పు కొచ్చారు. ‘‘ట్రంప్‌కు కావాల్సింది కేవలం మా ద్వీపంలోని అపార సహజ వనరులే. వాటికోసమే ఇలా ఇతర దేశాలను బూచిగా చూపుతూ ప్రయాస పడుతు న్నారు’’ అని మండిపడ్డారు. మరోవైపు, ఫిబ్రవరి 6న గ్రీన్లాండ్లో దౌత్య కార్యాలయం తెరుస్తున్నట్టు నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌లాండ్‌పై దాడి తప్పదన్న బ్లాక్‌మెయిలింగ్‌కు అమెరికా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారొట్ హితవు పలికారు.డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతల యునైటెడ్ ఫ్రంట్!ట్రంప్‌కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ సంఘటితమవుతున్నాయి. ఈ దిశగా సమైక్య పోరు కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. ‘‘గ్రీన్లాండ్ పూర్తిగా డెన్మార్క్‌కు చెందిన భాగమే. కనుక దానికి నాటో సైనిక రక్షణ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని ఇరు దేశాల ప్రధానులు మెట్టె ఫ్రెడరిక్సన్, జీన్స్ నీల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘ప్రియ మైన గ్రీన్లాండ్వాసు లారా.. ఈ రోజు మనమంతా సంయుక్తంగా ఒక్కతాటిపై నిలబడి ఉన్నాం. మున్ముందూ అలాగే ఉండబోతున్నాం’’అని ఫ్రెడరిక్సన్ కోపెన్ హాగెన్‌లో మీడియా భేటీలో ప్రకటించారు. ‘‘అమెరికా, డెన్మార్క్‌లలో ఏదో ఒకదా న్నే ఎంచుకోవాల్సి వస్తే మా చాయిస్ ఎప్పటికీ డెన్మార్కే. నాటోనే. యూరోపియన్ యూని యనే’’ అని నీల్సన్ కుండబద్దలు కొట్టారు. -
దాడులకు అమెరికా రెడీ!
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్‌తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్‌ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. దీటుగా బదులిస్తాం.. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్‌ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్‌లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు ఉద్యమకారులపై పోలీస్‌ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్‌లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్‌లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్‌లోని మెహ్దీ యాహ్యానిజాద్ అన్నారు.ఇరాన్‌ను వీడాలన్న భారత్పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్‌లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. -
ఇరాన్‌పై ఇప్పుడే దాడి చేయొద్దు: ట్రంప్‌ను కోరిన అరబ్ దేశాలు
ఇరాన్‌పై సైనిక దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌తో పాటు కొన్ని అరబ్ దేశాలు కోరినట్లు ఎన్బిసి న్యూస్ నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం ఇంకా అమెరికా దాడితో కూలిపోయేంత బలహీనంగా లేదని ఈ దేశాల అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.ఇరాన్లో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా నిరసనకారుల హత్యలపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన క్రమంలో ఈ నివేదిక వెలువడింది.నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్లో పాలన మార్పునకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేవలం విదేశీ సైనిక దాడితో ఆ లక్ష్యం సాధ్యం కాదని అమెరికా అధికారులకు స్పష్టం చేశారు. అలాంటి దాడి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా పరిస్థితిని మరింత సంక్లిష్టతరం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.సైనిక చర్యలకు బదులుగా, ఇరాన్ ప్రభుత్వాన్ని లోపలినుంచి బలహీనపరిచే వ్యూహాలపై దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇందులో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్లను ఎదుర్కొనేందుకు ఇరానియన్ ప్రజలకు సహాయం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, సైబర్ దాడులు నిర్వహించడం, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఉన్నతాధికారులపై పరిమిత చర్యలు తీసుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా నేతృత్వంలో దాడి చేపట్టేందుకు పొరుగు దేశాల మద్దతు లేదని ఒక అరబ్ అధికారి పేర్కొన్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతీకార చర్యలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అలాగే ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఏకమయ్యే ప్రమాదం కూడా ఉందని మరో అరబ్ అధికారి హెచ్చరించారు. -
ఇరాన్‌పై యుద్ధ సన్నాహాలు?: 75 దేశాలకు అమెరికా వీసాల నిలిపివేత
ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని తమ స్థావరాలను అమెరికా ఖాళీ చేస్తూనే.. 75 దేశాలకు వీసాలను నిలిపివేసింది. ఈ చిట్టాలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తోపాటు.. మన పొరుగున ఉన్న ఆరు దేశాలు కూడా ఉండడం గమనార్హం..!అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన ఓ మెమో ప్రకారం.. ఈ 75 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్నిరకాల వలస వీసాలను రద్దు చేస్తారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగోట్ మాట్లాడుతూ.. ‘‘కొందరు వలసదారులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు గుర్తించాం. అందుకే ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. వీసాల నిలిపివేత అనేది తాత్కాలికమేనని త్వరలో దీనిపై పునఃపరిశీలన జరుగుతుందని వివరించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డారు.నిషేధిత దేశాల జాబితా పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోయినా.. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ చిట్టాలో బంగ్లాదేశ్‌తోపాటు.. డొమినికా, ఆంటిగ్వా, బార్బుడా కూడా ఉన్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి సన్నాహాల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అరబిక్ మీడియా పేర్కొంది. అమెరికా విడుదల చేసిన జాబితాలోని దేశాలివే..ఆసియా: ఆఫ్ఘనిస్థాన్, ఆర్మేనియా, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా (మయన్మార్), కంబోడియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కువైట్, కిర్గిజిస్తాన్, లావోస్, లెబనాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, సిరియా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, యెమెన్.ఆఫ్రికా: అల్జీరియా, కామెరూన్, కేప్ వెర్డే, కోట్ డి ఐవోర్, కాంగో, ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, గాంబియా, ఘనా, గినియా, హైతీ, లైబీరియా, లిబియా, మొరాకో, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, టాంజానియా, టోగో, ట్యునీషియా, ఉగాండా.ఐరోపా: రష్యా, అల్బేనియా, బెలారస్, బోస్నియా, జార్జియా, కొసావో, మాసిడోనియా (ఉత్తర మాసిడోనియా), మోల్డోవా, మాంటెనెగ్రో.ఉత్తర అమెరికా: ఆంటిగ్వా మరియు బార్బుడా, బహామాస్, బార్బడోస్, బెలిజ్, క్యూబా, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్.దక్షిణ - మధ్య అమెరికా దేశాలు: బ్రెజిల్, కొలంబియా, ఉరుగ్వే, గ్వాటెమాలా, నికరాగ్వా. -
పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్
దుబాయ్: తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న అమెరికాను ఇరాన్ మరోసారి హెచ్చరించింది. అమెరికా తమపై దాడికి యత్నించాలనే యత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులకు దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా సైనికా దళానికి పొరుగు దేశాలు ఏమైనా సహకారం అందిస్తే మాత్రం ఆ స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో దాడులకు దిగుతామని పేర్కొంది. ఇరాన్‌కు సమీపంలో అత్యాధునిక డ్రోన్ల నిఘాను అమెరికా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. అమెరికా గనుక వెనక్కి వెళ్లకపోతే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ హెచ్చరించింది. కాగా, గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం. -
ఇరాన్‌పై యుద్ధం.. హింట్ ఇచ్చిన ట్రంప్?!
టెహ్రాన్: ఇరాన్లో నరమేధం సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇరాన్‌పై రాకెట్ దాడులు జరపడానికి అమెరికా సన్నద్ధమవుతోందా?. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన స్థానంలో ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించేందుకు మంతనాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి, ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు, ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయాలని జారీ చేసిన ఆదేశాలు, ట్రంప్ హెచ్చరికలు.. ఈ పరిణామాల మధ్య ఏం జరగనుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్ చర్యలకు ధీటుగా స్పందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, తమ దేశంపై దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ వంటి దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల నుండి అమెరికా సిబ్బందిని ఖాళీ చేస్తోంది. అమెరికా దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు.డిసెంబర్ 28 నుంచి కొనసాగుతున్న నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల ప్రాణాలు తీస్తోంది. ఇలాగే కొనసాగితే అయతొల్లా ప్రభుత్వానికి హాని కలిగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది పౌరులు మరణించారని చెబుతుండగా, ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ 12,000 మందికి పైగా మరణించారని నివేదించింది. -
అందుకేనా నాటోకు దూరం.. రష్యాతో వైరం..?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో లేనిరోజు లేదు. ఇందులో దాదాపు అన్ని వివాదాలే. ఏదొక దేశాన్ని గిల్లడం, లేకపోతే కవ్వించడం, హెచ్చరించడం, ఇవే ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కనిపిస్తున్న పరిణామాలు. ఇటీవల కాలంలో ట్రంప్ దూకుడు మరింత ఎక్కువైంది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, అటు తర్వాత ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించుకోవడం.. డెన్మార్క్ దేశంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవాలనే పన్నాగం, క్యూబాకు వార్నింగ్.. ఇరాన్‌పై కాలుదువ్వడం వంటి జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే కూడా నాటోను దాదాపు దూరం పెట్టడం.. రష్యాను రెచ్చగొట్టడం అయితే ట్రంప్ పోకడలకు మరో మెట్ట అని చెప్పాలి. రష్యాకు చెందిన రెండు ఓడలను ట్రంప్ సీజ్ చేయడం చూస్తే మాత్రం యుద్ధానికి కాలుదువ్వడం గానే కన్పించింది. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ఇప్పుడు పలు దేశాలతో కయ్యానికి సై అంటున్నాడు. అందులో సైనిక పరంగా బలంగా ఉన్న రష్యా, ఇరాన్‌ల విషయంలో కూడా ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి అయోమయంలో పడేస్తుంది. రష్యాను టెస్టు చేస్తున్నాడా?రష్యా ఆర్థిక శక్తి తగ్గిందనే గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాడు. అసలు రష్యా పవర్ ఎంత ఉంది అనే దానిని టెస్ట్ చేయడం కోసం ట్రంప్ సన్నాయి నొక్కులు ప్రారంభించాడు. అయితే సైనిక పరంగా చూస్తే రష్యా ఇప్పటికే టాప్-2లో ఉంది. అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల రష్యా ఆయిల్ షిప్‌లను సీజ్ చేసి.. ఆ దేశాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు ట్రంప్. రష్యా.. తమతో పోరుకు ఎంతవరకూ వస్తుందని టెస్ట్ చేస్తన్నట్లే ఉంది ట్రంప్ వైఖరి. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ చర్యలని గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితి శ్రుతి మించితే మాత్రం రష్యా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. తన సహనాన్ని ట్రంప్ పరిక్షీస్తున్నారనే విషయం పుతిన్ ఈపాటికే అర్థం చేసుకునే ఉంటారు. ఒకవేళ అమెరికా ఏమైనా సైనిక చర్యలకు పాల్పడితే మాత్రం దాన్నితిప్పి కొట్టే సామర్థ్యం రష్యాకు ఉంది.. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితే ఇప్పుడు పుతిన్‌ను కలవర పెడుతోంది. తమ దేశానికి చెందిన రెండు చమురు షిప్‌లను అమెరికా సీజ్ చేసినా.. పుతిన్ నియంత్రణ కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఆ దేశ ఆర్థిక పరిస్థితి. బలహీన పడ్డ రష్యా ఆర్థిక వ్యవస్థ2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయి.. 2024 వచ్చే సరికి అది కాస్తా ముదిరి పాకాన పడింది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇలా రష్యా ఇరకాటంలో పడింది.వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. భారత్‌పై ఆంక్షలు కూడా అందుకేనా?రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దేశాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక చమురును భారత్.. రష్యా నుంచే కొనుగోలు చేస్తూ వస్తుంది. కానీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలును కాస్త తగ్గించింది. ఇలా రష్యా చమురును కొనుగోలు చేయకుండా పలు దేశాలపై ఆంక్షలు విధిస్తే ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రష్యాను ఆర్థికంగా మరింత ఇరకాటంలో పడేయాలనేది ట్రంప్ చర్యలను బట్టి తెలుస్తోంది, నాటో దేశాలు అంత బలంగా లేవా?ఇటీవల నాటోపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. ప్రధానంగా నాటో రక్షణ వ్యయానికి సంబంధించి ఖర్చును అమెరికానే భరించాల్సి వస్తుందని, తమకు ఇక పని లేదని తేల్చిచెప్పేశాడు. అంటే నాటోలో బలమైన దేశాలు లేవనేది ట్రంప్ ఉద్దేశం. నాటోతో ఉన్నా లేకపోయినా తమకు ఏమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చేశాడు ట్రంప్..దాంతో నాటోకు టాటా-బైబై చెప్పేశాడు. నాటోలో యూరప్ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రష్యా చర్యలను ఎక్కువగా వ్యతిరేకించింది నాటో. ఇప్పుడు నాటోక అమెరికా దూరం అయిపోతే.. మరి వారి పరిస్థితి ఏమిటి.? చెప్పుకోవడానికే 32 దేశాలు.. అందులో 30 యూరప్ దేశాలు.. మిగతా రెండు అమెరికా, కెనడా. ఇప్పుడు అమెరికా దూరం జరగడంతో ఆ సంఖ్య 31కు వచ్చింది. నాటో ఉన్న యూరప్ దేశాలన్ని ఆర్థికంగా సైనిక పరంగా అంతగా బలంగా లేవనే విషయం ట్రంప్ కటీఫ్తోనే అర్థమైంది. ట్రంప్ వ్యూహంలో భాగమా..?అమెరికా అండ లేకపోవడంతో రష్యా ఏదొక సమయంలో నాటోపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యాతో యుద్ధం నేపథ్యంలోనే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి కారణమైంది. ఇవన్నీ కూడా పుతిన్‌కు ఆగ్రహం తెప్పించాయి. తనకు నాటో అడ్డుపడింది అనే భావనలో ఉన్నాడు ట్రంప్. ఈ పరిణామాలతో రష్యా-నాటో దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అత్యంత స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ట్రంప్.. ముందుగా నాటో దేశాలు-రష్యా కొట్టుకుంటే చూద్దామనే ప్లాన్‌లో భాగంగానే నాటోకి బైబై చెప్పడం, రష్యాను గిల్లడం చేస్తున్నాడని నిపుణులు అంటున్నారు. తన చర్యలతో ముందు నాటో-రష్యాలను అంచనావేసే ముందస్తు వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఇలా చేశారనేది విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. -
యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులుఅధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.ఎగుమతులు-దిగుమతులుభారత్ నుంచి ఇరాన్‌కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్‌వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.ట్రంప్ హెచ్చరిక - భారత్‌పై ప్రభావంట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.భారత్ ఇరాన్‌కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవుభారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్‌కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బఅమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. కోర్టు తీర్పుపై ట్రంప్‌నకు టెన్షన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టెన్షన్ మొదలైంది. ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. మరోవైపు.. ఒకవేళ కోర్టు టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ తమ ప్లాన్-బీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.. ట్రంప్ ఏం చేస్తారా? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు తీర్పు నేపథ్యంలో స్పందిస్తూ..‘మా ప్రభుత్వం విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు నిలిపివేస్తే ప్రత్యామ్నాయ మార్గాలను తప్పకుండా అన్వేషిస్తాం. ఇతర అవకాశాలను వెతుక్కుంటాం. ప్లాన్-బీ అమలు చేస్తాం. చైనా ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ టారిఫ్‌లపై కోర్టుల్లో కేసులు వేశారు. నేను అమలు చేసిన టారిఫ్‌ల వల్ల తక్కువ కాలంలోనే ఫెడరల్ బడ్జెట్ లోటు సుమారు 27 శాతం వరకు తగ్గింది. ఈ సుంకాల కారణంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. ఈ టారిఫ్‌లను విదేశీ దేశాలే చెల్లిస్తున్నాయి. అమెరికా వినియోగదారులపై ఎలాంటి భారం పడటం లేదు. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదే’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అనేక దేశాలపై సుంకాలు విధించడం ప్రారంభించారు. తన ఇష్టానుసారం పలు దేశాలను బెదిరింపులకు గురిచేస్తూ సుంకాల పేరుతో బాదడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు పరిధిలోకి చేరింది. టారిఫ్‌ల అమలులో ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఒకవేళ సుప్రీంకోర్టు తాను విధించిన సుంకాలను రద్దు చేస్తే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని, ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో, కొంత ఆందోళనకు గురవుతున్నారు. -
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
ఇరాన్ కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. నిరసనకారులను ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో.. అక్కడి నిరసనకారులకు సాయం అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలో అలజడిపై ఇరాన్ సైతం సంచలన ఆరోపణలకు దిగింది. అరెస్టైన నిరసనకారుల్లో ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆందోళనలు కొనసాగితే.. మరికొందరికి అదే పరిస్థితి తప్పదంటూ ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ Truth Socialలో స్పందించారు. అలాంటిదే జరిగితే అమెరికా ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘నిరసనలు కొనసాగించండి.. సహాయం వస్తోంది’’ అని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అయితే ఆ సహాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ వివరించలేదు.దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. వేలాది మంది మరణించి ఉండవచ్చని మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్, కాల్పులు, అరెస్టులు, మరణశిక్షలు వంటి చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 734 మంది మరణించారు. కానీ అసలు సంఖ్య వేలల్లో ఉండవచ్చని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా భారీగానే ఉన్నారని చెబుతున్నాయి. అమెరికా ఆధారిత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం ఇప్పటివరకు 2,403 మంది నిరసనకారులు మరణించగా.. ఇందులో 12 మంది మైనర్లు ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 18,137 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఇరాన్‌కు చెందిన ఓ టెలివిజన్ సంస్థ వేలమంది శవాలుగా మారిపోయారంటూ కథనం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. అయితే.. ఆందోళనకారుల మరణాల సంఖ్యను నిర్ధారించని ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా బలగాల మరణాలను మాత్రం అమరవీరులుగా ప్రకటించి.. పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహిస్తోంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ల హస్తం ఉందని చెబుతూ.. కౌంటర్ వార్నింగులు ఇస్తున్నారు. ట్రంపే ఈ హత్యలకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేస్తూ టెహ్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో రాజకీయ అస్థిరతను ట్రంప్ ప్రొత్సహిస్తున్నారని.. ఇది సార్వభౌమత్వానికి ముప్పు అని యూఎన్‌లో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్‌లు సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనన్నారాయన. అయితే ఒకవైపు అణచివేత ద్వారా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. ప్రజల నుంచి తమకు మద్దతు ఉందని చూపేలా ర్యాలీలను ఖమేనీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది కూడా. అయితే.. నిరసనకారులపై కఠిన చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఓ అడుగు ముందుకేసి ఖమేనీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖమేనీ ప్రభుత్వ పతనం ఖాయమైనట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. విశ్లేషకులు మాత్రం ఇరాన్ పాలన తక్షణమే కూలిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని, అణచివేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. -
ఇక గ్రీన్లాండ్ విలీనమే!
వాషింగ్టన్: డెన్మార్క్‌లో భాగంగా కొనసాగుతూ పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు. సహజ వనరులు, ముడి చమురుతో కూడిన ఆ ప్రాంతాన్ని అమెరికాలో విలీనం చేసుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగా రిపబ్లికన్ సభ్యుడు ర్యాండీ ఫైన్ అమెరికా కాంగ్రెస్‌లో సోమవారం ‘గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్’ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు లభిస్తుంది.అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వా«దీనం చేసుకోక తప్పదని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. వీలైతే సులభ మార్గంలో, లేకపోతే కఠిన మార్గంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలిపేస్తామని ఆయన ప్రకటించారు. బల ప్రయోగానికైనా సిద్ధమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. డబ్బులిచ్చి గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని అమెరికా చెప్పగా అందుకు డెన్మార్క్ నేతలు అంగీకరించలేదు. ఆ ప్రాంతం అమ్మకానికి లేదని తెలియజేశారు.గ్రీన్లాండ్ విలీనం అనేది విస్మరించదగిన అంశం కాదని ర్యాంటీ ఫైన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. గ్రీన్లాండ్ విలీనం లేదా బలవంతపు ఆక్రమణ కోసం చర్యలు చేపట్టడానికి వీలుగా ట్రంప్‌కు అధికారాలు ఇవ్వడానికే బిల్లును తీసుకొచి్చనట్లు తెలిపారు. ఈ ఆర్కిటిక్ ద్వీపం అమెరికాలో ఒక రాష్ట్రంగా మారాలంటే ఫెడరల్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ ఫొటోల్లో ట్రంప్ అంతరంగం గ్రీన్‌లాండ్‌ను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా? అని డొనాల్డ్ ట్రంప్ తెగ ఆలోచిస్తున్నారు. ఆయన మనసంతా అక్కడే ఉంది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ మంగళవారం నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. వీటిని ఒక క్రమపద్ధతిలో అమర్చి చూస్తే ట్రంప్ అంతరంగం బయటపడుతోంది. ఇందులో ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు కిటికీ నుంచి అటువైపున్న గ్రీన్‌లాండ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. తాజా పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నట్లుగా దీనికి శీర్షికను జోడించారు. -
ఇరాన్‌పై టారిఫ్ కొరడా!
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణిచేస్తున్న ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా దాడులతో సమాధానం చెబుతుందని అంతా భావిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా టారిఫ్‌ల కొరడా ఝుళిపించారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, నిరసనలతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఇరాన్‌ను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేలా, వాణిజ్యరంగంలో ఇరాన్‌ను ఏకాకిని చేసేలా ట్రంప్ పథక రచన చేశారు.ఇందులోభాగంగా ఇకపై ఇరాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించే ప్రతి దేశంపై తాము 25 శాతం అదనపు టారిఫ్‌లను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘మాతో వ్యాపారం చేసే దేశాలు ఒకవేళ ఇరాన్‌తోనూ వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే ఆ దేశాలపై అదనంగా 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇదే తుది నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.భారత్‌పై పడనున్న పెను ప్రభావం ట్రంప్ తాజా నిర్ణయం భారత్‌ను ఇరకాటంలో పడేసింది. ఇరాన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటి. చైనా, తుర్కియే, యూఏఈ, పాకిస్థాన్లతో పాటు భారత్ కూడా ఇరాన్‌తో విస్తృతమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే ఆంక్షల వలయంలో ఉన్న భారత్‌పై రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు జరుపుతున్నందుకుగాను, అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించింది. ఇప్పుడు ఇరాన్‌తో సంబంధాల కారణంగా అదనంగా మరో 25 శాతం భారం పడనుంది. దీంతో అధిక టారిఫ్‌లకు భయపడి ప్రపంచదేశాలు ఇరాన్‌తో వాణిజ్యాన్ని పూర్తిగా తగ్గించుకుంటాయి.అంతర్జాతీయ వాణిజ్యం కునారిల్లడంతో విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో ఇరాన్ చివరకు ఏకాకిగా మారుతుందని, అప్పుడు తాను చెప్పిన మాట ఇరాన్ వింటుందని అమెరికా భావిస్తోంది. అయితే అధిక టారిఫ్ కారణంగా ఇకపై ఇరాన్‌తో భారత వాణిజ్య పరిమాణం భారీగా తగ్గే ప్రమాదముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారత్–అమెరికా వాణిజ్య బంధంపైనా తీవ్ర ఒత్తిడి పెరిగే వీలుంది. ఇరాన్‌తో భారత్ వేల కోట్ల వాణిజ్యంఇరాన్తో భారత్ వాణిజ్య బంధం కేవలం వ్యూహాత్మకమే కాదు, ఆర్థికంగానూ కీలకమైనది. 2023లో భారత్ నుంచి ఇరాన్‌కు దాదాపు 1.19 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10,740 కోట్లు) ఎగుమతులు జరిగాయి. ఇందులో సింహభాగం బాస్మతి బియ్యానిదే. ఏటా దాదాపు రూ.6,623 కోట్ల విలువైన బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అవుతోంది. తేయాకు, పంచదార, ఔషధాలు, సోయాబీన్ సైతం ఇరాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఆంక్షల భయంతో ఈ ఎగుమతులు నిలిచిపోతే, దేశీయ మార్కెట్లో ఈ పంటల ధరలు పడిపోయి అన్నదాతలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.అలాగే ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే డ్రైఫ్రూట్స్, రసాయనాల ధరలు భగ్గుమనే అవకాశం లేకపోలేదు. ఇరాన్ నుంచి భారత్ 1.02 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,205 కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో డ్రైఫ్రూట్స్ (ఎండు ద్రాక్ష, అంజీర్), రసాయనాలు, గాజు పాత్రలు ఉన్నాయి. డీజీసీఐఎస్ 2025 గణాంకాల ప్రకారం ధాన్యాల ఎగుమతి 64.9 కోట్ల డాలర్లుగా ఉండగా, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 7.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కృత్రిమ నారలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, కృత్రిమ ఆభరణాల వంటివీ ఇరాన్‌కు ఎగుమతి అవుతున్నాయి.అగమ్యగోచరంగా ‘చాబహార్’ భవిష్యత్తుభారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ అత్యంత కీలకమైనది. పాకిస్థాన్‌ను పక్కనపెట్టి మధ్య ఆసియాకు చేరేందుకు భారత్ దీనిని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. 2024 మే నెలలో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్‌లోని షాహిద్ బెహెష్తీ టెర్మినల్ నిర్వహణ కోసం ఇరాన్‌తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఓడరేవు అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడే అవకాశం ఉంది.భారత్–ఇరాన్ మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధం ఉంది. ఒకవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా.. మరోవైపు వ్యూహాత్మక మిత్రదేశమైన ఇరాన్. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు భారత్‌కు పెద్ద సమస్యగా తయారైంది. డాలర్ ఆధిపత్యం లేకుండా రూపాయి మారకంలో వాణిజ్యం చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్‌ను వదులుకునే సాహసం భారత్ చేయలేకపోవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి దౌత్యపరమైన మంత్రం ప్రయోగిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
అసలు సంక్షోభం అమెరికాదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ప్రపంచం సంక్షోభంలో పడుతున్నదనేది సర్వసాధారణ అభిప్రాయం. స్థూలంగా చూసినపుడు అది సరైన అభిప్రాయమే. కానీ కొంత లోతులకు వెళ్లి పరిశీలించి నట్లయితే, అమెరికాయే సంక్షోభానికి గుర వుతున్నదనీ, ఆ స్థితి నుంచి కాపాడుకు నేందుకే ట్రంప్ ఇటువంటి విపరీత ధోర ణిని అనుసరిస్తున్నారనీ బోధపడుతుంది.వందల సంవత్సరాల పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని గమనించినప్పుడు, అందులో పలు విధాలైన దుర్మార్గాలు కనిపిస్తాయి. హిట్లర్ వంటి వారు తీవ్రమైన మారణకాండకు కూడా పాల్పడ్డారు. కానీ, ట్రంప్ వంటి ఏ నియమ నిబంధ నలూ లేని సర్వతోముఖ అరాచక విజృంభణ ఏ దశలోనూ లేదు. ‘నాకు అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఏ నియమాలూ, చట్టాలూ లేవు. నా మనసుకు తోచింది చేస్తా’నని ఆయన బాహాటంగా ప్రకటిస్తూ, అందుకు తగినట్లే వ్యవహరిస్తున్నట్లు ఇంతవరకు ఏ సామ్రాజ్యవాదీ చేయలేదు.అరాచకానికి కారణాలు?అయితే ఇందుకు మూలకారణం ట్రంప్‌కు గల విలక్షణమైన అరాచక వ్యక్తిత్వం మాత్రమేనా? అమెరికా కొంత కాలంగా ఎదు ర్కొంటున్న రకరకాల తీవ్ర సమస్యలు, ఎదురు దెబ్బలు, ఇతరుల నుంచి సవాళ్ళు తీవ్రమైన ఒత్తిడులను, ఒక కొత్త చారిత్రక దశను సృష్టిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ కారణంగా, ప్రపంచంపై అమె రికా గత పాతికేళ్ళ ఏకధ్రువ ఆధిపత్యం స్పష్టమైన రీతిలో బీటలు వారుతున్నది. పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే మరొక 15–20 సంవత్సరాలలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోవటం తథ్యమన్న భావన పాశ్చాత్య ప్రపంచం సహా ప్రపంచమంతటా ఏర్పడింది. వాస్తవానికి ఈ కోణం కొంతకాలంగా అందరూ చర్చిస్తున్నదే తప్ప కొత్తది కాదు. కానీ ఎందుకోగానీ, వెనిజులాపై ప్రళయ భీకరమన్నట్లు జరిగిన సైనిక చర్య, ఆ వెనువెంటనే ట్రంప్ ఇతర ప్రకటనలతో ప్రపంచం దృష్టి ఈ నేపథ్యం నుంచి మళ్ళీ తక్షణ ఘటనలు, తదనంతర ప్రకటనలే సర్వస్వమన్నట్లు మారింది.ఇంతకూ ట్రంప్‌ను ఈ ఆకస్మిక అరాచక ధోరణికి పురికొల్పిన నేపథ్య పరిణామాలేమిటి? 1991లో సోవియట్ యూనియన్ కుప్ప కూలిన తర్వాత అవతరించిన ఏకధ్రువ ప్రపంచానికి, సుమారు 15 సంవత్సరాలు గడిచేసరికి అదే రష్యా దేశం పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకుంటుండటంతో మొదటి సవాలు మొదలైంది.అందుకే అమెరికా అధ్యక్షులందరూ వరుసగా యూరప్‌తో కలిసి ‘నాటో’ను విస్తరించటం మొదలుపెట్టారు. ఇది జరుగుతుండగా మరొకవైపు చైనా అదే కాలంలో మరొక సవాలుగా ఎదగసాగింది. ఇవి చాలదన్నట్లు అదే సమయంలో (2008) అమెరికాతోపాటు యూరప్ అంతా ఆర్థిక సంక్షోభానికి గురయింది. ఈ పరిణామాలు అక్కడి సమాజాలపై ప్రభావాన్ని చూపటంతో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం (2011) వచ్చి ఆ దేశాలను ఊపివేసింది. పుండుపై కారం చల్లినట్లు చైనా, రష్యాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకో సాగాయి. ఆ పరిస్థితులకు జడిసిన అమెరికా తన సైనిక బడ్జెట్లను ప్రతి సంవత్సరం పెంచసాగింది. ఇదే క్రమం ఇపుడు తాజాగా ట్రంప్, ఆ బడ్జెట్‌ను ఒకేసారి ఏకంగా 50 శాతం పెంచి 1.5 ట్రిలి యన్ డాలర్లకు ప్రతిపాదించే పరిస్థితి వచ్చింది.రక్షణ బడ్జెట్ పైపైకి...21వ శతాబ్దం వచ్చినప్పటి నుంచి అమెరికా పరిస్థితి ఏమిటో సూక్ష్మంగా అర్థం చేసుకునేందుకు బహుశా ఈ వివరణలు సరి పోతాయి. అమెరికా పతన క్రమం గురించి ఎంత తీవ్రమైన ఆందో ళన చెందకపోతే ట్రంప్ రక్షణ బడ్జెట్‌ను ఈ స్థాయికి పెంచజూస్తారు! యథాతథంగానే సుమారు 900 బిలియన్ డాలర్ల మేర గల ఈ బడ్జెట్, అమెరికా తరువాత వరుసలో గల తొమ్మిది దేశాల బడ్జెట్ కన్నా ఎక్కువ. అదిగాక ‘నాటో’ దేశాల బడ్జెట్లు ఉన్నాయి. అవి ఆ మొత్తాలను రెట్టింపు చేయాలని ఇటీవల ఒత్తిడి చేస్తున్నారాయన. ప్రపంచ పరిస్థితులు తమకు వ్యతిరేకమవుతున్నాయనీ, తమ ఆధి పత్యం చేజారుతున్నదనీ, దాని అర్థం వివిధ దేశాల వనరులు, మార్కెట్లు, వాటిపై పరోక్ష రాజకీయ నియంత్రణలు చేజారటమనీ క్రమంగా ఎంతగా భయపడకపోతే ట్రంప్ ఇదంతా చేస్తారో ఆలో చించండి. అది కూడా తమకు ఎటు నుంచీ సైనిక ముప్పు లేనపుడు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రణాళికలో ఒక సంకేతం వంటిదే వెనిజులాపై దాడి. అందువల్ల నిజమైన దీర్ఘకాలిక సంక్షోభం వెనిజులాది కాదు, ప్రపంచానిది కాదు. అది స్వయంగా అమెరికాది! అందుకు అనుబంధంగా యూరప్‌ది, ‘నాటో’ది, సామ్రాజ్యవాదానిది. ముఖ్యంగా సామ్రాజ్యవాద కూటమికి అధిపతిగా అమెరికాకు ఎదురవుతూ వస్తున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి జమిలి ప్రభావాన్నే మనమిపుడు చూస్తున్నాము. ఇదే కాలంలో ఇటువంటి ఇంకా పలు పరిణామాలు అమెరికాను భయపెట్టాయి. కరోనా (2020–22) సమస్యను అమెరికా ఎదుర్కొనలేక పోవటమే గాక ఆర్థికాభివృద్ధి దెబ్బతినగా, చైనా అందుకు విరుద్ధ ఫలితాలు సాధించటం వాటిలో ఒకటి. ప్రపంచంలో అమెరికా అగ్రస్థానానికి ఆధారాలు... సైనిక బలం, ఆర్థిక బలం, శాస్త్ర–సాంకేతిక బలం, డాలర్ బలం, ప్రపంచ వ్యాప్తంగా గల రాజకీయ ప్రాబల్యం. వీటన్నింటికి చైనా, రష్యాల నుంచే గాక బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం కోసం పలు రూపాలలో జరుగుతున్న ప్రయత్నాలు క్రమంగా ముందుకు సాగు తున్నాయి. వాటిని నిరోధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఈ విషయాలు స్వయంగా అమెరికన్, యూరో పియన్ రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులుఅంగీకరిస్తున్నవే!అందుకే ఆక్రమణలుఅమెరికాతోపాటు పాశ్చాత్య సామ్రాజ్యవాద సంక్షోభమంటున్నది ఈ స్థితినే! దీనిని తట్టుకునేందుకు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంతో ఆరంభించి, పదవిని స్వీకరించిన తర్వాత గత ఏడాది కాలంలో కాలుగాలిన పిల్లి తరహా చర్యలు అనేకం ఇంటా బయటా, చివరకు మిత్ర దేశాలపైనా తీసుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితాలతో సంతృప్తి లేక, కనీసం పశ్చి మార్ధ గోళాన్ని, పశ్చిమాసియాను అయినా పూర్తిగా నియంత్రిం చేందుకు గత నవంబర్‌లో ‘జాతీయ భద్రతా వ్యూహపత్రం’ ఒకటి ప్రకటించారు. ‘మన్రో డాక్ట్రిన్’కు తోడు ‘డోన్రో డాక్ట్రిన్’ అంటూ లాటిన్ అమెరికాతో పాటు ఈ ప్రాంతాల వనరులన్నీ చేజిక్కించు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్, పనామా ఆక్రమణలూ ఇందులోకే వస్తాయి. అంతిమంగా ఈ భయకంపిత అరాచక చర్యలు అమెరికా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో పరిష్కరిస్తాయా అన్నది ప్రశ్న. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇరాన్లో నిరసనలు.. రెండు వేల మంది మృతి!
ఇరాన్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మంది మృతిఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు. అయితే ఇరాన్ రెడ్‌లైన్ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.Dozens of black body bags seen in Iran. pic.twitter.com/6PB0y6sNxP— Open Source Intel (@Osint613) January 13, 2026 -
అమెరికా చేతికి గ్రీన్లాండ్?..వెలుగులోకి షాకింగ్ ప్లాన్!
వాషింగ్టన్:గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేస్తోంది. ఆ దీవిని అమెరికాలో కలపాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు రాండి ఫైన్ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్ అనక్సీయేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం, ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించడం వంటి అంశాలు పొందుపరచబడ్డాయి.ఈ మేరకు రాండి ఫైన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బిగ్ న్యూస్. చట్టసభలో గ్రీన్లాండ్ అనక్సీయేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరుతో బిల్లును ప్రవేశపెట్టాను. ఈ బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపాలి. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపాలి’ అని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలుపుకోవడం ద్వారా జాతీయ భద్రత బలోపేతం అవుతుంది. అదే సమయంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికా రాష్ట్రంగా మార్చడం ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా, రష్యా ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు అత్యంత అవసరమని ఆయన అన్నారు.ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. దీనికి స్వంత పార్లమెంట్ ఉన్నప్పటికీ, విదేశాంగం, రక్షణ వ్యవహారాలు డెన్మార్క్ ఆధీనంలోనే ఉంటాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ట్రంప్ డెన్మార్క్‌తో చర్చలు జరిపి గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం లేదా అమెరికాలో కలుపుకోవడం కోసం అధికారం పొందుతారు. గ్రీన్లాండ్ భౌగోళికంగా చాలా ముఖ్యమైనది. ఇది ఆర్కిటిక్ సముద్ర మార్గాలను నియంత్రించగలదు, అలాగే సైనిక రవాణా, వాణిజ్యం, ఇంధన మార్గాలు అన్నీ ఇక్కడి ద్వారా ప్రభావితం అవుతాయి.2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వ్యక్తం చేశారు. ఆ సమయంలో డెన్మార్క్ ప్రభుత్వం దీన్ని ఖండించింది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉంది. ఇది ఆమోదం పొందితేనే గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. Huge News! Today, I am proud to introduce the Greenland Annexation and Statehood Act, a bill that allows the President to find the means necessary to bring Greenland into the Union. Let me be clear, our adversaries are trying to establish a foothold in the Arctic, and we can’t… pic.twitter.com/h28sXU7LAU— Congressman Randy Fine (@RepFine) January 12, 2026 -
కంత్రి ట్రంప్.. అసలు ఉద్దేశం బయటపడిందిగా!
ట్రంప్ ఉద్దేశం నిజంగా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీయడమేనా?. అందుకే ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించారా?.. ఇక మీదట ఏ దేశం కూడా ఇరాన్ వైపు చూడకూడదనేదే ఆయన ఆలోచనా?. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే కాదేమో అనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందాన కనిపిస్తోంది ఆయన వ్యవహారం.‘‘మోదీ-ట్రంప్‌ది నిజమైన స్నేహం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారత్-అమెరికా రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం అనేది చాలా కీలకం. వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇక సుంకాలనేవి పెద్ద విషయమే కాదు. మాకు భారత్ తర్వాతే ఎవరైనా’.. ఇది భారత్‌కు అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో.. ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ సంక్షోభం.. ఏదైనా సరే అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్ నిర్ణయాలు భారత్ పైకే వస్తున్నాయి. ఉక్రెయిన్ యద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ ట్రంప్ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఇరుకున పెడుతున్నామని చెబుతూ.. భారత్‌పై సుంకాల మోత మోగించారాయన. అలాగే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే చేశారు. ఇరాన్‌తో వాణిజ్యం జరిపే టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. అంటే.. ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల పెంపు నిర్ణయం భారత్‌కు వర్తించనుంది. దీంతో ట్రంప్ అసలు టార్గెట్(రష్యా, ఇరాన్..)తో పాటు భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్నేహ హస్తం చాస్తూనే..రెండో దఫా అధికారంలోకి వచ్చాక భారత్‌తో ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. భారత్ అమెరికాకు బాగా కావాల్సిన దేశమని.. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారాయన. అవకాశం ఉన్నా.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం లేదు. కీలక సదస్సులకు కూడా ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీంతో వీళ్ల స్నేహ బంధానికి బీటల వారిందా? అనే చర్చా నడిచింది. అయితే.. ‘‘నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి..’’ అంటూ ఓ వారం కిందట కూడా ట్రంప్ మాట్లాడారు.ఇంకా అయిపోలేదు.. అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ కరెక్ట్‌గా లేదంటూ ప్రతీకార సుంకంగా 25 శాతం.. అటుపై వద్దని చెబుతున్నా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతున్నారంటూ పెనాల్టీ పేరు చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలను ఆయన తన మిత్రదేశం పైనే విధించినట్లైంది. అందునా.. ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకుండానే(నాన్చుతూ వస్తున్నారు) ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఉద్రిక్తతలతో దానిని 75 శాతానికి పెంచారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. రష్యాతో చమురు వాణిజ్యం జరిపే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించే బిల్లుపై ఆయన ఇప్పటికే సంతకాలు చేశారు. ఆ బిల్లును రేపోమాపో అమెరికా చట్ట సభలో ముందుకు కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు అమెరికాతో భారత్ సంబంధాలు బలహీన పడ్డాయి. ఆయన తీరు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరింత అధ్వాన్నం కావొచ్చనే అమెరికా మాజీ విదేశాంగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.ఇరాన్-భారత్.. ఎలాంటి ఎఫెక్ట్రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం వైఖరి మొండిగానే కనిపిస్తోంది. ఎవరి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని.. జాతి ప్రయోజనాలకు తగ్గట్లు తమ నిర్ణయాలు ఉంటాయని మొదటి నుంచి చెబుతోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయకుండా.. దిగుమతిని తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇరాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంభించబోతుంది.. ఇరాన్ నుంచి భారత్ మెథనాల్, పెట్రోలియం బిటుమెన్, లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరాలు, కెమికల్స్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఇరాన్‌కు.. ఆర్గానిక్ కెమికల్స్, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇరాన్-భారత్ మధ్య 2024-2025 వాణిజ్యం విలువ.. అక్షరాల రూ.14,000 కోట్లు. అందులో భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.10,000 కోట్లు కాగా, దిగుమతులు రూ.3,700 కోట్ల పైమాటే. అయితే.. ట్రంప్ 2018లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ మధ్య వాణిజ్యం భారీగా క్షీణించింది. ఎంతగా అంటే.. 2019లో ఆ వాణిజ్యం విలువ రూ.1.5 లక్ష కోట్లుగా ఉండేది. మరి తాజా ఆంక్షలతో ఏం జరుగుతోందో చూడాలి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కొత్త టారిఫ్‌లు కఠినంగా అమలు చేస్తే.. భారత కంపెనీలు అమెరికా మార్కెట్ యాక్సెస్ కాపాడుకోవడానికి ఇరాన్‌తో వ్యాపారాన్ని తగ్గించవలసి రావొచ్చు. అదే జరిగితే.. ఇరాన్‌కు ఎగుమతి చేసే భారత వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.చాబహార్‌పై డైలమా?భారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ పాత్ర అత్యంత వ్యూహాత్మకం. పైగా భారత్ అక్కడ షహీద్ బెహేష్తీ టెర్మినల్ అభివృద్ధి చేస్తోంది. అయితే.. 2018 ఆంక్షల సమయంలో భారత్ విజ్ఞప్తి మేరకు ట్రంప్ సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చారు. తిరిగి.. 2025 సెప్టెంబర్‌లో పరిస్థితుల ప్రభావమని చెబుతూ ఆ మినహాయింపును రద్దు చేశారు. దీంతో ఆ మినహాయింపు ఏప్రిల్ 29తో ముగియనుంది. దీంతో మినహాయింపు గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.ఏమై ఉండొచ్చు.. తనను తాను శాంతి కాముకుడిగా చెప్పుకుని తిరుగుతున్న ట్రంప్.. పెద్దన్న హోదాలో వరుసగా యుద్ధాలను ఆపుతున్నానంటూ హడావిడి చేస్తున్నారు. ఈ వంకతో నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని పక్కా ప్లాన్డ్తో ముందుకు సాగారు. కానీ, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. ట్రంప్‌ను నోబెల్ వరించలేదు. దానికి భారత్ మోకాలు అడ్డుపెట్టిందని ఆయన బలంగా భావించి ఉండొచ్చు. పాక్‌తో ఉద్రిక్తతలు చల్లారడంలో ట్రంప్ ప్రేమయం(మూడో వ్యక్తి) లేదని ఢిల్లీ వర్గాలు తేల్చేశాయి. ఈ ప్రకటన ఆయనకు స్వతహాగా కోపం.. అసహనం తెప్పించి ఉండొచ్చు. పోనీ ఉక్రెయిన్ యుద్ధంతోనైనా నోబెల కల నెరవేరిందా? అంటే అదీ లేదు. వాణిజ్యం ఆపేయకుండా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ పరోక్షంగా సహకరించిందనే కోపమూ ఉండొచ్చు. వీటన్నింటితో పాటు షాంగై సదస్సు వేదికగా.. పుతిన్-జింగ్‌పిన్-మోదీల స్నేహంగా మెదలడమూ ట్రంప్‌కు నచ్చకపోయి ఉండొచ్చు. కారణాలేవైనా.. భారత్ విషయంలో ఆయన అనుకున్నది చేస్తూ పోతున్నారు. -
లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా కారణాలు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో యూఎస్ విదేశాంగ శాఖ ఏడాది కాలంలో ఏకంగా 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వర్క్ పర్మిట్లు ఉండటం గమనార్హం. క్రిమినల్ రికార్డులు లేదా చట్టపరమైన నిబంధనలు అతిక్రమించిన విదేశీ పౌరులపై చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.సురక్షిత అమెరికా లక్ష్యంగా..ఇటీవల తన అధికారిక ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా యూఎస్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి వీసారద్దును, కఠినమైన నిబంధనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలనలో వీసా అమలును కఠినతరం చేయడం, యూఎస్‌లోకి ప్రవేశించిన తర్వాత కూడా వీసా హోల్డర్ల ప్రవర్తనను పర్యవేక్షించే స్క్రీనింగ్ విధానాల విస్తరణ వల్లే ఈ స్థాయిలో రద్దులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.భారతీయులపై ప్రభావంఅమెరికా వీసా హోల్డర్లలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరంగా చైనాను అధిగమించిన భారత్, ఇప్పుడు కఠినమైన యూఎస్ స్క్రీనింగ్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ నెమ్మదించింది. హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత 1,00,000 డాలర్ల ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యూఎస్ కోర్టుల్లో చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్‌లోని రాయబార కార్యాలయం వరుసగా రెండో ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ, ఈ వీసాల రద్దు ఆందోళన కలిగిస్తోంది.🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV— Department of State (@StateDept) January 12, 2026రంగంలోకి భారత ప్రభుత్వంపెరుగుతున్న వీసా రద్దులు, కఠిన నిబంధనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రభావిత భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీసా ఆందోళనలను అధికారికంగా యూఎస్ దృష్టికి తీసుకెళ్లాం’ అని ప్రభుత్వం ప్రకటించింది.ఇదీ చదవండి: పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. -
ట్రంప్ టారిఫ్ తో ఆదేశాలకు ఎఫెక్ట్..
-
ఇరాన్‌కు కొత్త టెన్షన్.. చైనా కరుణించేనా?
టెహ్రాన్: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న వేళ ఖమేనీకి కొత్త టెన్షన్ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఇరాన్‌ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తమీర్ హేమాన్ ధృవీకరించారు. దీంతో, ఇజ్రాయెల్ దాడుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా తమీర్ హేమాన్ మాట్లాడుతూ.. ఇరాన్లో ఇటీవలి పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసింది. గడిచిన రెండు వారాల్లో రెండు సార్లు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసే వరకు వెళ్లింది. కానీ, ఇరాన్‌పై అమెరికా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని దాడులు చేయలేదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికాతో చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు లేవు. ఇరాన్లో ఇప్పటికే ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి.ఇక, ఇరాన్లో కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. దీంతో, ఇరాన్‌ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలిసింది.🔥 BREAKING: Israel came this close to striking Iran, twice, in the last few weeks. Former IDF intelligence chief Tamir Hayman just confirmed what many feared: we’re on the edge of something massive.👇— Fouled Anchor 🇺🇸🍊 (@anchor_fouled) January 13, 2026మరోవైపు.. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. చైనాను సాయం కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అంతకుముందు కూడా ఇరాన్‌కు చైనా సాయం అందించింది. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్‌కు పంపినట్లు తెలిసింది. మూడు బోయింగ్-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్ వైపు వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ మూడు విమానాలూ కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వైపు నుంచి ఇరాన్ సమీపంలోని వెళ్లాయి. -
మరో టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలన్నింటిపైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు.ట్రేడింగ్ ఎకనమిక్ డాటా బేస్ ప్రకారం.. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్‌లు ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. పొరుగున ఉండడంతో పాటు చమురు నేపథ్యంలో ఇవి భారీగా వాణిజ్యం చేస్తున్నాయి. అలాగే.. భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఇక భారత్ కూడా ఇరాన్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామే. 2025లో ఇరాన్ ఎగుమతుల్లో సుమారు 7% (5.1 బిలియన్ డాలర్లు) భారతదేశానికి వచ్చాయి. దీంతో భారత్ కూడా మూల్యం చెల్లించుకోవాలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.ఇరాన్‌పై ఇప్పటికే.. అణ్వాయుధాల నేపథ్యంతో ఇరాన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పరిమితం చేయడం, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులపై ఆంక్షలు విధించడం.. తద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు అవాంతరాలను కల్పించడం.. అలాగే.. ఇరాన్ షిప్పింగ్ కంపెనీలు, పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలను అమలు చేస్తోంది. అలాగే.. ఇరాన్ మిలిటరీ, డ్రోన్, మిసైల్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సంస్థలపై నిషేధాలు విధించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సభ్యులు, ఆ దేశం తరఫున మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయడం, వాళ్లు అగ్రరాజ్యానికి రాకుండా నిషేధం విధించడం లాంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఆర్థికంగా మరింత దెబ్బ తీయడానికే.. వాణిజ్య దేశాలపై సుంకాలను విధించినట్లు స్పష్టమవుతోంది.చల్లారని జ్వాలలుఆర్థిక సంక్షోభం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమైన సంగతి తెలిసిందే. అయితే వాటిని అణచివేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అంతే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో.. వందల మంది మరణించగా(646 మంది అని తాజా సమాచారం).. వేల మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. ఉరి తీతలకు కూడా సిద్ధమైంది. అయితే ఈ అణచివేతను చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ అంటున్నారు.చర్చలంటూనే..ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే పబ్లిక్‌గా ట్రంప్ కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇరాన్‌ను వేరే రీతిలో డీల్ చేస్తన్నారని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెబుతున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉంది. కానీ, అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారామె. ఈ తరుణంలో ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ బాంబ్ పేల్చడం గమనార్హం. -
భారతే ముఖ్యం
న్యూఢిల్లీ: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగంలోని పలువురు సలహాదారుల నోటి దురుసు కారణంగా భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా గట్టిగా దృష్టి సారించింది. భారత్‌లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కోణంలో చూసినా అమెరికాకు భారత్ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది, మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని గోర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇరు దేశాల ప్రతినిధుల నడుమ మంగళవారమే తర్వాతి దశ చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధకు సంబంధించి అమెరికా సారథ్యంలో రూపొందుతున్న వ్యూహాత్మక కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అభిలషించారు. ఈ మేరకు ట్రంప్ తరఫున భారత్‌ను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ‘‘భారత్ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం. భారత్, అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు. విడదీయలేని దృఢమైన బంధం కూడా’’ అని అన్నారు. ‘‘భారత్ ఓ అద్భుత దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్ నిర్వచించే సువర్ణావకాశం ప్రస్తుతం ఇరుదేశాల ముందుంది. భారత్, అమెరికా మైత్రి ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత ప్రభావశీల భాగస్వామ్యంగా రూపుదిద్దుకోగలదు’’ అని 38 ఏళ్ల గోర్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ కంటే ఆవశ్యకమైన భాగస్వామి అమెరికాకు ఇంకెవరూ లేరు. రాయబారిగా భారత్‌తో బంధం విషయంలో వచ్చే కొన్నేళ్లకు సంబంధించి ఓ భారీ ఎజెండాయే నా ముందుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం, శక్తి సామర్థ్యాలతో పాటు పరస్పర గౌరవాదరాలు, నాయకత్వ పటిమే పునాదులుగా అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య నిజమైన, దృఢమైన స్నేహముందని గోర్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత రెండు దశాబ్దాల్లోకెల్లా అత్యల్ప స్థాయికి చేరేందుకు కారణమైన విభేదాల పరిష్కారానికి వారి స్నేహబంధం కచ్చితంగా తోడ్పడుతుందని అభిప్రాయç ³డ్డారు. ‘‘నిజమైన మిత్రులు పరస్పరం విభేదించవచ్చేమో. కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు’’ అని అమెరికా–భారత్ నడుమ బంధానికి బీటలు పడ్డట్టు గోర్ పరోక్షంగా అంగీకరించారు. ‘‘ఇరు దేశాల బంధం విషయంలో వాణిజ్యం చాలా ముఖ్యమైన అంశమే. దానితో పాటు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంధనం, టెక్నాలజీ, విద్య, వైద్యం వంటి పలు కీలక రంగాల అంశాల్లో ఇరు దేశాలూ అత్యంత సన్నిహితంగా కలిసి పని చేయనున్నాయి’’ అని గోర్ వివరించారు.బంధానికి బీటలు..ఇటీవలి కాలంలో భారత్, అమెరికా బంధం ఒడిదుడుకుల్లో పడటం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై తాను సంతోషంగా లేనని ట్రంప్ అనడం, టారిఫ్‌లను భారీగా పెంచుతానని హెచ్చరించడం, అందుకు తగ్గట్టే భారత్, చైనాలపై ఏకంగా 500 శాతం టారిఫ్‌ల విధింపుకు అమెరికా బిల్లు సిద్ధం చేస్తుండటం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొంతకాలంగా నేలచూపులు చూస్తూ వస్తున్నాయి. పైగా మోదీ స్వయంగా ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడని కారణంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. వీటికి తోడు భారతీ యులను ప్రధా నంగా లక్ష్యంగా చేసుకుని హెచ్– 1బీ వీసాలపై అమెరికా నానాటికీ ఆంక్షల చట్రాన్ని బిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సన్నిహిత బృందంలో కీలక సభ్యుడైన గోర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తో సంబంధాలను తిరిగి మెరుగు పరు చుకునే ప్రయత్నాల్లో అవి భాగమేనని భావిస్తున్నారు. గోర్ ప్రస్తావించిన పిక్స్ సిలికా కూటమిలో జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇజ్రాయెల్ ఇప్పటికే చేరాయి.మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు‘‘భారత్ బయల్దేరే ముందే ట్రంప్‌తో మాట్లాడా. ఈ అద్భుత దేశం పౌరులకు, ముఖ్యంగా ప్రియ మిత్రుడు మోదీకి శుభాకాంక్షలు అందించాల్సిందిగా ఆయన నాకు చెప్పారు’’ అని గోర్ తెలిపారు. ‘‘రెండు వారాల క్రితం ట్రంప్‌తో మాట్లాడా. ఆయన భారత్ సందర్శన తాలూకు అద్భుత అనుభవాలను నాతో పంచుకున్నారు. ఒకట్రెండేళ్లలో మరోసారి భారత్‌లో పర్యటించాలని కూడా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు’’ అని వివరించారు. ‘‘రాయబారిగా మొట్టమొదటే భారత్ వంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, అతిపురాతన దేశంలో పని చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన రెండు అతి గొప్ప దేశాల బాగస్వామ్యాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం’’ అని గోర్ ప్రకటించారు. -
చర్చలకు దిగొచ్చిన ఇరాన్
దుబాయ్: దాడులు తప్పవన్న తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సామరస్యంగా చర్చించుకుందామని ప్రతిపాదించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఆ దేశ నాయకత్వంతో చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. అయితే నిరసనకారుల మరణాల సంఖ్య ఇలాగే పెరిగితే మాత్రం తాను చర్చలకు బదులు ‘చర్యలు’ తీసుకోవాల్సి రావచ్చని ట్రంప్ హెచ్చరించారు. ‘‘మా సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గట్టి ఆప్షన్లనే పరిశీలిస్తున్నాం’’ అని వెల్లడించారు. అమెరికా దాడికి దిగితే దీటుగా తిప్పికొడతామన్న ఇరాన్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా, ‘వారు అదే చేస్తే కనీవినీ ఎరగని రీతిలో వారిపై విరుచుకుపడతాం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ చర్చల ప్రకటనపై ఇరాన్ ధ్రువీకరించలేదు. అయితే అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధకార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాచీ చెప్పారు. అయితే అవి ఏకపక్షంగా ఉంటే అంగీకరించబోమన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ మాత్రం నిరసనల్లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, రక్తపాతాల ఏకైక ఉద్దేశం తమపై దాడికి అమెరికాకు అవసరమైన సాకు కల్పించడమేనని దుయ్యబట్టడం విశేషం. మరోవైపు మూడో వారానికి చేరిన ఇరాన్ ఆందోళనల్లో మృతుల సంఖ్య599కు చేరుకున్నట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వీరిలో 525 మంది దాకా నిరసనకారులు కాగా మిగతా మృతులు పోలీసు, భద్రతా సిబ్బంది అని పేర్కొంది. క్షతగాత్రుల సంఖ్య 11 వేలు దాటినట్టు తెలిపింది.ప్రదర్శనల్లో అధ్యక్షుడు..నిరసనలు నింగినంటుతున్న వేళ ఇరాన్లో మరో పరిణామం చోటుచేసుకుంది. వాటికి ప్రతిగా ప్రభుత్వ అనుకూలంగా ఉన్న వేలాది మందితో ఇరాన్ సర్కారు రాజధాని టెహ్రాన్‌లో భారీ ప్రదర్శనలకు దిగింది. అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో పాటు విదేశాంగ మంత్రి తదితరులు వీటిలో పాల్గొనడం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ప్రజాగ్రహంగా ఇరాన్ వీటిని అభివర్ణించింది. కెర్మన్, రష్త్ తదితర పట్టణాల్లోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాయి. మరోవైపు, ఇరాన్లో సుస్థిరత నెలకొనాలని చైనా ఆకాంక్షించింది. ఈ విషయంలో బయటి శక్తుల ప్రమేయానికి తావుండరాదని స్పష్టం చేసింది. సొంత ప్రజల మీదే ఇరాన్ యంత్రాంగం ఇంత దారుణంగా దమనకాండకు దిగడం దారుణమని జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ విమర్శించారు. నిరసనకారుల ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.స్టార్ లింక్ సేవలు కట్మిన్నంటుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కట్టడి చేసే యత్నాల్లో భాగంగా ఇరాన్లో స్టార్ లింక్ ఉపగ్రహ సేవలను ఖమేనీ యంత్రాంగం నిలిపేసింది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ ‘కిల్ స్విచ్’ను యాక్టివేట్ చేసినట్టు సమాచారం. ఈ అత్యాధునిక జామింగ్ పరిజ్ఞానాన్ని ఇరాన్‌కు రష్యా లేదా చైనా అందించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్‌వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కొద్దిరోజుల క్రితమే నిలిపేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నెట్వర్క్ ద్వారానే అక్కడి సమాచారం అంతో ఇంతో బయటి ప్రపంచానికి తెలుస్తూ వస్తోంది. తాజాగా ఆ లింకును ఇరాన్ తెంచేసింది. ఏమిటీ కిల్ స్విచ్?స్టార్‌లింక్ ఉపగ్రహాలను జామ్ చేసేందుకు ఇరాన్ యంత్రాంగం వాడిన కిల్ స్విచ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిలిటరీ గ్రేడ్జామింగ్ ఎక్విప్మెంట్. దీని ఖరీదు 15.6 లక్షల డాలర్లని సమాచారం. స్టార్‌లింక్ రిసీవర్లు తమ యూజర్లను లొకేట్ చేసి వారితో కనెక్టయ్యేందుకు జీపీఎస్‌ను వాడతాయి. మిలిటరీ గ్రేడ్ జామర్లు ఆ లింకును తెంపేస్తాయి. అందుకోసం సదరు ఉపగ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో సిగ్నళ్లను విడుదల చేస్తాయి. మొత్తం వ్యవస్థను కలిపి కిల్ స్విచ్‌గా పేర్కొంటారు. 2014 నుంచీ రష్యా ఈ టెక్నాలజీని వాడుతోంది. -
అష్టదిగ్బంధంలో ఇరాన్!
సమస్యలున్నచోట నిప్పురాజేయటం సులభం. నిన్న మొన్నటివరకూ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులతో ఊపిరాడని ఇరాన్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. భవనాలు, బస్సులు, దుకాణాలు తగలబడుతున్నాయి. రాజధాని తెహ్రాన్ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అదొక్కటే కాదు...దేశంలోని 31 ప్రావిన్సుల్లో ఉన్న 180 నగరాలు, పట్టణాలు ఇప్పుడు ఆగ్రహావేశాలతో రగులుతున్నాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ, కరెన్సీ విలువ పడిపోతూ దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న జనం గత రెండువారాలుగా రోడ్లపై వెల్లువెత్తుతుండగా, ఇంతవరకూ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 538 మంది మరణించారు. పదివేలమందిని జైళ్లలోపెట్టారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సాధించలేనిది ఇరాన్లో సునాయాసంగా చేయగలిగారు. వెనిజులాలో ఇదే మాదిరి ప్రేరేపించి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్న సాకుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని ట్రంప్ ఏడాదిగా ప్రయత్నించారు. అది అసాధ్యం కావటంతో నేరుగా సైన్యాన్ని పంపి మదురో దంపతుల్ని అపహరించారు. ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు చేయటానికి అమెరికా సంసిద్ధమవుతోంది.దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్యదేశాలు పగబట్టి అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ప్రాణావసర ఔషధాల కొరత వేధిస్తోంది. తగిన వైద్య సదుపా యాలు కరవై రోగాల బారిన పడిన చిన్నపిల్లలు కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబకటం, నిరసనలు వెల్లువెత్తడంలో ఆశ్చర్య మేమీ లేదు. ఇటీవల ఆందోళనకారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లో విదేశీ మహిళగా భావిస్తున్న ఒకామె అరెస్టయినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రకటన లివ్వాలో చెప్పే వీడియో బయటికొచ్చింది. తమ వెనుక ఎవరూ లేరని... దుర్భర పరిస్థి తుల్ని తట్టుకోలేక నిరసనల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పాలన్న హితబోధ ఉంది. ఇరాన్‌కు ఇలాంటి నిరసనలు కొత్తగాదు. 1979లో ఇరాన్ షా మహమ్మద్ రెజా పెహ్లవీని గద్దెదించిన ఇస్లామిక్ విప్లవం అనంతరం పాశ్చాత్య దేశాలు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి. 2022లో మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, ఉనికి కోసం అంటూ సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయగలిగింది. ఇక అడపా దడపా ఏదో ఒక వంకతో ఇరాన్‌పై క్షిపణుల్ని ప్రయోగించటం, దేశ సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని, అణు శాస్త్రవేత్తలనూ హత్యలు చేయించటం ఇజ్రాయెల్‌కు రివాజు. ఇలా జరిగిన ప్రతిసారీ ద్రోహుల్ని పట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించి, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆందోళనల తీవ్రత ఎక్కువుంది. దిగువ తరగతి ప్రజలతో పాటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. నిరసనలు చల్లార్చటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. దుకాణదారుల డిమాండ్లకు స్పందనగా సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌ను మార్చారు. ప్రతి ఇంటికీ నెలకు ఏడు డాలర్ల మొత్తం ఇచ్చేందుకు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదన్నారు. సాధారణ ప్రజానీకం సమస్యల్ని పరిష్కరిస్తానని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తానని అధికారంలోకొచ్చిన మసూద్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతిని అరికట్టలేక పోయారు. ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నా నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది. పైపెచ్చు నిరసనల్లో పాల్గొంటున్న వారిని ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నార’ంటూ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ప్రజల్ని మరింత రెచ్చగొట్టింది. ఈ నేరారోపణ కింద ఉరిశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించటానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అమెరికాలో స్థిరపడిన ఒకప్పటి నియంత ఇరాన్ షా కుమారుడు రెజా పెహ్లావి తానొచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు. ఛాందసవాద ధోర ణుల్ని తగ్గించుకుని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పితే తప్ప బలప్రయోగంతో నిరసనలు అణిచేయటం అసాధ్యమని ఇరాన్ పాలకులు గుర్తించాలి. -
మేము దాడి చేయకుంటే వాళ్లు చేస్తారు: ట్రంప్
గత కొంతకాలంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్‌ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్లాండ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్‌తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు. -
"భారత్ తర్వాతే మాకు ఎవరైనా": అమెరికా
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్‌కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ ఈ రోజు( సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్రైపాక్షిక సంబంధాలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.తాను ట్రంప్‌తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు. -
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ వార్నింగ్
-
రెడ్ లైన్ దాటేసింది.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం
ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఇరాన్‌కు అమెరికా మరో సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటేసిందని.. ఇక తీవ్ర చర్యలు తప్పదన్నట్లుగా తీవ్ర సంకేతాలు పంపించింది. ఈ మేరకు అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా.. కవ్వింపు చర్యలకు దిగినా.. తాము అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని టెహ్రాన్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(భారత కాలమానం ప్రకారం) ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘‘ఇరాన్ పరిణామాలను అమెరికా సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఆందోళనకారుల పట్ల అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు మేం చూస్తూ ఊరుకోం. మేము బలమైన చర్యలపై పరిశీలిస్తున్నాం. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఆ నిర్ణయం త్వరలోనే ఉంటుంది’’ అని ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చల అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపక్షాలు తనతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అటు అమెరికాలో ఉంటూ ఇరాన్ నిరసనలను ప్రొత్సహిస్తున్న బహిష్కృత ఇరాన్ యువరాజు రేజా పహ్లవి రేపోమాపో ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. దీంతో ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ సలహాదారులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్లు వైట్‌హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. కరెన్సీ పతనం, బడ్జెట్లో సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయాలు, ధరల పెరుగుదల.. ఇలా ఒక్కో నిర్ణయాలు ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలకు విరక్తి కలిగించాయి. గతేడాది డిసెంబర్ 28న తేదీన టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు.. భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి. హక్కుల సంఘాల లెక్క ప్రకారం.. ఇప్పటిదాకా 500 మందికి పైగా మరణించారు. 10,600 మందిని అక్రమ అరెస్ట్ చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆ కథనాలను కూడా వండి వారుస్తున్నట్లు మండిపడింది. ఇరాన్‌పై దాడి జరిగితే, ఇజ్రాయెల్‌తో పాటు అన్ని అమెరికా బేస్‌లు, నౌకలు మా లక్ష్యాలు అవుతాయి అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపు ఇచ్చారాయన. 2022 తర్వాత ఇరాన్లో ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలివే. హిజాబ్ ధరించలేదని ఓ యువతిపై మోరల్ పోలీసింగ్ ప్రయోగించగా.. అనుమానాస్పద రీతిలో ఆమె ఆస్పత్రిలో మరణించింది. దీంతో యువతులు పెద్ద ఎత్తున ఇరాన్ వీధుల్లోకి చేరి ఉద్యమించారు. అయితే ఖమేనీ ప్రభుత్వం వాటిని అణచివేసింది. ఇరాన్‌పై చర్యలకు అమెరికా ముందున్న ఆప్షన్లు: సైనిక దాడులు, సీక్రెట్ సైబర్ ఎటాక్స్, ఇరాన్‌పై అత్యంత కఠిన ఆంక్షలు, చివరగా.. అక్కడి ప్రతిపక్ష నేతలకు, నిరసనలు తెలియజేస్తున్న గ్రూపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం. ఇరాన్లో ఇంటర్నెట్ నిషేధం అమల్లో ఉండడంతో.. అక్కడేం జరుగుతుందో బయటి దేశాలకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో.. టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో మాట్లాడి స్టార్‌లింక్ (శాటిలైట్ ఆధారిత) ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలనుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. -
వెనుజుల అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన..!
-
ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన.. మొట్టమొదటిది కావడం గమనార్హం. In his Truth Social post, US President Donald Trump recognises himself as the 'Acting President of Venezuela' pic.twitter.com/A23DlWqIBw— ANI (@ANI) January 12, 2026డ్రగ్స్ అభియోగాలతో కూడిన నేరాలకుగానూ.. వెనెజువెలా రాజధాని కారకస్‌పై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన రాజధాని నగరంపై మెరుపు దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్లను బంధించి న్యూయార్క్‌కు తీసుకెళ్లింది. సుమారు 150 యుద్ధ విమానాలతో అమెరికా వెనెజువెలాపై నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్ని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.మదురో అక్రమ అరెస్ట్ తర్వాత వెనెజువెలా అధ్యక్ష స్థానంలో.. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు. అయితే.. వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో.. వెనెజువెలాలో స్థిర ప్రభుత్వం కొలువుదీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు. ఇప్పటికే వెనెజువెలా చమురుపై సర్వహక్కులు తమవేనని.. ఏ దేశమైనా తమతోనే డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ప్రకటనకు అసలు చట్టబద్ధత ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది. గతంలో.. గతంలో కొందరు నాయకులు తమ దేశానికి రాజులుగా, అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. నెపోలియన్ బోనపార్టే(ఫ్రాన్స్), అహ్మత్ జోగ్(అల్బేనియా), బోరిస్ స్కోసిరెఫ్(అండోరా).. ఈ లిస్ట్‌లో ఉన్నారు. కానీ చరిత్రలోనే.. ఇలా ఒక దేశ అధ్యక్షుడు మరో దేశంపై అధికారాన్ని ప్రకటించుకున్న దాఖలాలైతే లేవు(మీ దృష్టిలో ఏదైనా ఉంటే.. సోషల్ మీడియాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు). కాబట్టి ట్రంప్ ప్రకటన అత్యంత అరుదైనదిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకటనపై వెనెజువెలా ప్రభుత్వం, ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
దేనికైనా రెడీ.. ట్రంప్‌కు క్యూబా అదిరిపోయే కౌంటర్
హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు క్యూబా కౌంటరిచ్చింది. నిబంధనలను నిర్దేశించే నైతిక అధికారం అమెరికాకు లేదంటూ ఘాటుగా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో క్యూబా ఒక స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర, సార్వభౌమ దేశం. మేము ఏం చేయాలో ఎవరూ నిర్దేశించాల్సిన అవసరం లేదు. క్యూబా ఎప్పుడూ సంఘర్షణను కోరుకోదు. చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ స్పందిస్తూ.. ప్రపంచ శాంతి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది. నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ఉన్నాయి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏ దేశం నుండి అయినా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఉందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా, క్యూబా మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది.ట్రంప్ హెచ్చరికలు.. ఇక, అంతకుముందు క్యూబా విషయమై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు.ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచ్చిన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. -
ఆలస్యం కాకముందే మేల్కోండి
వాషింగ్టన్: వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు తేల్చిచెప్పారు. వెనెజువెలా చమురుకు అతిపెద్ద వినియోగదారు క్యూబా. వెనెజువెలాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని ట్రంప్ సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువుదీరింది. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికపై క్యూబా స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వెనెజువెలా నుంచి చమురు, నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలడం తథ్యం. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్‌కు సిద్ధపడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచి్చన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేíÙస్తున్నారు. -
దాడి చేస్తే అంతు చూస్తాం
టెహ్రాన్/దుబాయ్: నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆక్రోశం తీవ్ర ఆవేశంగా రూపుదాలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్సుల్లోనూ జనాందోళన పెద్దపెట్టున కొనసాగుతోంది. 100కు పైగా నగరాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం నిరసనకారులు వీధుల్లోకి పోటెత్తారు. ఖమేనీ నియంతృత్వ పాలన తమకొద్దంటూ నిరసనలతో హోరెత్తించారు. వాటిని ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటం, దీన్ని చూస్తూ ఊరుకోబోమని, నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను హెచ్చరించడం తెలిసిందే. దాంతో ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. అయితే ఇంటర్నెట్ పడకేయడం, ఫోన్ లైన్లు కూడా మూగబోవడంతో అక్కడ తాజా పరిస్థితి అంచనాలకు అందడం లేదు. వాస్తవ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాక వేలాది మందిని సైన్యం, పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలందుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆందళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ఆదివారం పేర్కొన్నారు. నిండు పార్లమెంటులోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. నిరసనల వెల్లువ! ఇరాన్లో జనాగ్రహం, నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్‌తో పాటు రెండో అతి పెద్ద నగరం మషాద్లోనూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తుతున్నారు. రాత్రుళ్లు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి మరీ నిరసన తెలుపుతున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫుటేజీ ఆన్లైన్లో వైరల్‌గా మారింది. వీధుల నిండా పోలీసు, సైనిక సిబ్బంది పహారా, డ్రోన్ల నిఘా పెరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మషాద్‌లో పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలతో జనం ఘర్షణలకు దిగుతున్నారు. వీధుల నిండా తగలబడ్డ సామాన్లు తదితరాలు కనిపిస్తున్నాయి. కెర్మన్ తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాకుమారుడు రెజా పహ్లావీ ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ టీవీలో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ తదితర నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలను చూపిస్తున్నారు. నిరసనలపై ఉక్కుపాదమే ఇరాన్ పార్లమెంటు కార్యకలాపాలను ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అదుపు చేయడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారంటూ పోలీసులు, రివల్యూషనరీ గార్డ్ సిబ్బందిని స్పీకర్ ఖలిబాఫ్ ప్రస్తుతించారు. నిరసనల్లో అరెస్టయిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గనక ఇరాన్‌పై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని ఆ దేశ సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు తదితరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 538 మందికి పైగా బలి !రెండు వారాలకు పైగా ఇరాన్లో సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కు పెరిగినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ‘యాక్టివిటీ’పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,670 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శవాలతో నిండిన పికప్ ట్రక్కు విజువల్స్ టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇరాన్లో పలు నగరాల్లో ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుంటున్నట్టు మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఉత్తర ఇరాన్లో రస్త్ పట్టణంలోని పౌర్సిన ఆస్పత్రికి ఒక్క శుక్రవారం రాత్రే ఏకంగా 70కి పైగా శవాలు వచి్చనట్టు సమాచారం. టెహ్రాన్‌లో ఒక ఆస్పత్రికి తాజాగా 38 శవాలు వచి్చనట్టు అక్కడి మెడిక్ చెప్పారు. ‘చాలావరకు నేరుగా తలలో ఛాతీలో కాల్చి చంపారు. అంతేకాదు, చాలామంది యువకులు తూటా గాయాలతో వచి ఆస్పత్రిలో చేరుతున్నారు‘ అని ఆయన వివరించారు. అయితే ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో 30 మందిని, కెర్మన్షాలో ఆరుగురు పోలీసులను నిరసనకారులు చంపారని ప్రభుత్వం పేర్కొంది. మషాద్‌లో మసీదుకు నిప్పు పెట్టారని ప్రభుత్వం పేర్కొంది. నిరసనకారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అన్నారు. ‘‘ఐసిస్ తరహాలో పోలీసు, భద్రతా సిబ్బందిని హతమారుస్తున్నారు. సజీవంగా తగలబెడుతున్నారు’’ అని మండిపడుతున్నారు. బలహీనంగా ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగే స్థితిలో ఉందా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశ వైమానిక సంపత్తి చాలావరకు ధ్వంసం కావడం తెలిసిందే. అంతేగాక ఇజ్రాయెల్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ అణు స్థావరాలను భారీ బాంబులతో ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు దిగే దుస్సాహసం ఇరాన్ సుప్రీం లీడర్ 87 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేస్తారా అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలను ఇజ్రాయెల్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పలు అంశాలపై ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు.యూఎస్, ఇజ్రాయెలే ఎగదోస్తున్నాయి: పెజెష్కియాన్ ఇరాన్‌ను అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంలో అవి పనిగట్టుకొని నిరసనలను ఎగదోస్తున్నాయని దుయ్యబట్టారు. అయితే నిరసనకారుల ఆవేదనను సహానుభూతితో ఆలకిస్తామని ప్రకటించారు. ‘‘ప్రజలకు చాలా విషయంలో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారితో చర్చించడం అవసరం’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే అల్లర్ల పట్ల అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. విధ్వంసకారులు మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేసేందుకు ప్రయతి్నస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ఆదివారం ప్రసారం చేసింది. అయితే ఇరాన్‌పై సైనిక దాడి విషయంలో ఉన్నతాధికారులు తాజాగా ట్రంప్‌కు పలు ఆప్షన్లు సూచించారని తెలుస్తోంది. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతుండటం విశేషం. -
అక్షరాలా ఊచకోతే!
వాషింగ్టన్: అమెరికా ఇటీవల వెనెజువెలా రాజధాని కారకస్‌పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోను సతీసమేతంగా నిర్బంధించడం, న్యూయార్క్‌కు మెరుపువేగంతో తరలించిన ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత పెద్ద కిడ్నాప్, తరలింపు ఆపరేషన్‌ను అగ్రరాజ్యం కేవలం అరగంటలో ముగించిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అయితే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆ సందర్భంగా మదురో అంగరక్షకులను, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అక్షరాలా ఊచకోతే కోశాయట! రంగంలోకి దిగింది కేవలం 20 మందే అయినా వందలాది మంది రక్షణ సిబ్బందిని పిట్టల్లా కాల్చి చంపారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న మదురో సెక్యూరిటీ సిబ్బందిని ఉటంకిస్తూ అమెరికా అధికార భవనం వైట్‌హౌస్ ప్రెస్ మహిళా సెక్రెటరీ కరోలిన్ లెవిట్ శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘మీరు ఏం చేస్తున్నా సరే, అర్జెంటుగా ఆపేసి ఇదోసారి చదవండి...’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. అప్పుడేం జరిగిందో సదరు సెక్యూరిటీ గార్డు ఇంటర్వ్యూ తరహాలో చెప్పుకొచ్చారు. ‘‘అంతా హఠాత్తుగా మొదలైంది. ఉన్నట్టుండి మా రాడార్ వ్యవస్థలన్నీ మూగబోయాయి. ఏమైందా అని చూస్తుండగానే మా మీదుగా అసంఖ్యాకంగా డ్రోన్లు ఎగరసాగాయి. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎలా స్పందించాలో తెలియక మేం తికమక పడుతుండగానే హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటినుంచి దాదాపు 20 మంది సైనికులు దిగారు. మేం చాలామందిమి ఉన్నా వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాల ముందు మా సంఖ్యా బలం ఎందుకూ కొరగాకుండా పోయింది. మా జీవితంలో అలాంటి వారితో అప్పటిదాకా ఎప్పుడూ పోరాడలేదు. నేలపై కాలు పెట్టిన క్షణం నుంచీ వారు అక్షరాలా ఊచకోతకు దిగారు. అత్యంత వేగంగా, అంతకుమించిన కచ్చితత్వంతో కాల్పులు సాగించారు. ఒక్కొక్కరూ నిమిషానికి కనీసం ఏకంగా 300 రౌండ్లకు పైగా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు.జీవాయుధమా?దాడి సందర్భంగా అమెరికా సైనికులు తామె న్నడూ చూడని ఒక అత్యాధునిక ఆయుధాన్ని సైతం ఉపయోగించినట్లు మదురోకు రక్షణ విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందిలో ఒకరు చెప్పడం విశేషం. ‘‘ ఆ అత్యాధునిక ఆయుధం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన శబ్ద తరంగాలు వెలువడ్డాయి. వాటి తీవ్రతకు నా తల బద్దలవుతుందా అనిపించింది. మా ముక్కులోంచి రక్తం కారసాగింది. కొందరైతే రక్తం కక్కుకున్నారు. ఆ శబ్దం దెబ్బకు కదల్లేని పరిస్థితిలోకి జారుకున్నాం. వాళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా కనీసం గాయపరచలేకపోయాం. మాలో వందల మందిని పొట్టన పెట్టుకున్నారు’’ అని వివరించారు. ‘‘అమెరికాతో పోరాడగలమని ఇప్పటికీ నమ్ముతున్న లాటిన్ అమెరికా దేశాలన్నింటికీ ఒకటే చెబుతున్నా. అమెరికా సైనిక సామర్థ్యం గురించి మీకసలు ఏమీ తెలియదు’’ అంటూ సదరు గార్డు హెచ్చరికలు కూడా చేయడం విశేషం. -
ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్‌లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.ఇరాన్ సైనిక శక్తివెనిజువెలాతో పోలిస్తే ఇరాన్ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్‌గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.ఇస్లాం దేశాల మద్ధతుఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్‌కు సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.మూడో ప్రపంచ యుద్ధంఅయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం. -
ట్రంప్ అంతరంగ మథనం
డొనాల్డ్ ట్రంప్.. ‘‘వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి గెలిచేశాం. ఇక వెనెజువెలా అంతా మా చేతుల్లోనే’’ట్రంప్‌లోని మరొక మనిషి.. ‘‘ఇక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన వెనెజువెలా ప్రతిపక్ష నేత మచాడో కూడా ఆ పురస్కారాన్ని నాకు ఇస్తానంటుంది.. ఇక తీసుకోవడమే తరువాయి. ఆ బహుమతిని కూడా తీసుకుంటే నా కల తీరిపోతుంది’’నోబెల్ ఇనిస్టూట్యూట్.. ‘ఒకరికి ఇచ్చిన పురస్కారాన్ని వేరే వాళ్లకు ఇవ్వడం కుదరదు. ఆ బహుమతి ఎవరికి ఇస్తే వారికే శాశ్వతం. బదిలీ కుదరదు’ అని స్పష్టంఈ క్రమంలోనే ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ట్రంప్.. భావోద్వేగాల పరంగా చూస్తే ఆయన మనసు కనీసం ఈరోజు సమావేశం అయ్యి ఉండొచ్చు. నోబెల్ కోసం ట్రంప్ మనసు లో సమావేశం జరిగితే ఇలానే ఉంటుందేమో. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ గోడలను వదిలిపెట్టి.. ఏకాంతంగా ట్రంప్ అంతరంగ మథనం ఎలా ఉంటుందో చూద్దాం.ట్రంప్ ప్రధాన అజెండా: ‘నోబెల్ శాంతి బహుమతి నాకు వస్తుందా… లేదా?’అంతర్మథన ప్రతినిధుల వాదనలుఆశావాద వర్గం: ‘ మచాడో ఇచ్చేస్తానంటుంది… ఇక బహుమతి నా చేతిలోనే!నిరాశావాద వర్గం: ‘ నోబెల్ ఇనిస్టిట్యూట్ వద్దు అంటోంది. ఇవ్వరు… ఇవ్వనివ్వరు… ఇది అంతా కలగానే మిగిలిపోతుంది’ప్రచార వర్గం: ‘బహుమతి రాకపోయినా, ట్విట్టర్లో ‘నేనే గెలిచాను’ అని చెప్పేస్తే సరిపోతుంది!’తాజా సర్వేట్రంప్ మెదడులో నిర్వహించిన ఓటింగ్ ప్రకారం:45% ఆలోచనలు ‘నోబెల్ వస్తుంది’ అని నమ్ముతున్నాయి.55% ఆలోచనలు ‘ఇది కుదరదు’ అని నిరాశతో తలదించుకున్నాయి.ట్రంప్ మనసు తుది తీర్మానంనోబెల్ శాంతి బహుమతి రాకపోయినా, ‘నేను శాంతి ప్రతీకనే… కానీ నా మనసులో మాత్రం యుద్ధం కొనసాగుతుంది’ అని ట్రంప్ అంతర్మథన సమావేశం ముగిసింది.మయసభ ఘట్టం మాదిరి.. మహాభారతంలో మయసభ ఘట్టం చాలా ముఖ్యమైంది. ప్రసిద్ధి పొందింది కూడా. పాండవులు అశ్వమేథ యాగం నిర్వహించినప్పుడు.. దుర్యోధనుడు బస చేసిన అద్భుత భవనం మయసభ. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అనేకానేక చిత్ర విచిత్రమైన ఏర్పాట్లతో విశ్వకర్మ దీన్ని నిర్మించాడని ప్రతీతి. అయితే దుర్యోధనుడు ఇక్కడ ఉండగా... నేల అనుకుని నీటి కొలనులో అడుగుపెట్టి కింద పడతాడు. అది చూసి... ద్రౌపది చెలికత్తెలు ఫక్కుమని నవ్వితే.. అది ద్రౌపదేనని నమ్మిన దుర్యోధనుడు అవమానానికి గురైనట్లు ఫీలవుతాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉండి ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతి అన్నది ఆయనకు ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఎన్నో యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ‘నేను నోబెల్ శాంతికి’ అర్హుడినని పదే పదే చెప్పుకున్నారు కూడా. అయితే ఆ పురస్కారం ఆయన దరిదాపుల్లోకి కూడా చేరలేదు. ఇక్కడ కనీసం ఆ పురస్కారాన్ని గెలిచిన వెనెజువెలా ప్రతిపక్ష నేత కొరీనా మచోడా.. ఆ పురస్కారాన్ని ట్రంప్‌కు ఇస్తానని పదే పదే అంటున్నప్పటికీ అది కూడా తీరే పరిస్థితి లేదు.దాంతో తనకు అసలు నోబెల్ శాంతి పురస్కారం వస్తందా.. లేదా.. అది తన భ్రాంతియేనా? అన్నట్ల మారిపోయింది. -
నోబెల్ శాంతికి నేనే బెస్ట్: ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: గతేడాది నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కలేదన్న అక్కసును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెళ్లగక్కారు. అసలు ఆ పురస్కారానికి తనకంటే అర్హుడు చరిత్రలోనే మరెవరూ లేరని చెప్పుకున్నారు. వెనెజువెలా చమురు నిల్వలకు సంబంధించిన ప్రణాళికల గురించి చర్చించేందుకు చమురు, సహజవాయు కంపెనీల ఉన్నతాధికారులతో శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిపిన సమావేశాన్ని ట్రంప్ ఇందుకు వేదికగా మార్చుకోవడం విశేషం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఏమీ చేయకపోయినా నోబెల్ శాంతి పురస్కారం దక్కిందంటూ ఈ సందర్భంగా ఆయన వాపోయారు. ‘‘రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక కేవలం 8 నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 అతి పెద్ద యుద్ధాలను ఆపాను. 36 ఏళ్లు, 32, 31, 28, 25 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాలవి. తద్వారా లక్షలాది మంది ప్రజలు చనిపోకుండా కాపాడా’’అన్నారు. అంతేకాదు, ‘భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం దిశగా వెళ్తున్న భారీ ఘర్షణను కూడా ఆపేశా’నని మరోసారి చెప్పుకున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి లక్షలాదిగా ప్రాణ నష్టాన్ని నివారించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా తనకు కృతజ్ఞతలు కూడా తెలిపారని గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పుకోవడం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. ‘‘అసలు ఒబామాకు నోబెల్ పురస్కారం ఎందుకిచ్చారో ఇప్పటికీ కనీసం ఆయనకు కూడా తెలియదు. నాకు మాత్రం వాస్తవానికి నేను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ శాంతి బహుమతి చొప్పున ఇవ్వాలి’’అని చెప్పుకున్నారు.


