EPS scheme
-
ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టం
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో చేరి పదేళ్లు పూర్తి కాలేదా..? ఉద్యోగుల పింఛను స్కీం (ఈపీఎస్)లో జమైన డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు వచ్చే నగదు కొంతమేర తగ్గనుంది. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల్లో ఈపీఎఫ్‌వో మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో పని చేసిన సర్వీసును ఇప్పటివరకు ఏడాది పరంగా లెక్కగట్టేవారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం సంస్థలో ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డీలో కార్మికశాఖ సవరణలు చేసింది.ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..ఉద్యోగి ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్ సర్వీసు పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను వస్తుంది. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను చెల్లించదు. కనీస సర్వీసు లేనివారు మాత్రమే ఈ నగదు తీసుకునేందుకు అర్హులు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొంతమంది రెండు, మూడేళ్లకో సంస్థ మారుతూ అప్పటికే ఈపీఎస్‌లో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..ఎలా లెక్కిస్తారంటే..ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమవుతుంది. పనిచేస్తున్న సంస్థ అంతేమొత్తంలో 12 శాతం వాటాను ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే సంస్థ చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం సంస్థ చెల్లించే 12 శాతం వాటా (రూ.1,800)లో 8.33 శాతం అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే రాజీనామా చేసినా, రిటైర్డ్ అయినా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఒకవేళ మూలవేతనం, డీఏ కలిపి రూ.15000 ఉందనుకుందాం. ఉద్యోగి ఏడేళ్ల ఏడు నెలలు పని చేశాడనుకుంటే గతంలోని నిబంధన ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలను ఎనిమిదేళ్లుగా పరిణించేవారు. రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మూలవేతనం రూ.15000 ఉన్నందున ఈపీఎస్ టేబుల్-డీ ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి 8.22 నిష్పత్తి చొప్పున చెల్లించేవారు. అంటే రూ.15,000 X 8.22 చొప్పున రూ.1,23,300 వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలు అంటే 91 నెలలు అవుతుంది. 91 నెలల కాలానికి నిష్పత్తి 7.61 అవుతుంది. అంటే రూ.15000 X 7.61 లెక్కన రూ.1,14,150 చెల్లిస్తారు. -
ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ అమలుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉపక్రమించింది. ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వా త ఇప్పటివరకు అత్యంత పరిమితంగానే నెలవారీ పెన్షన్ పొందుతున్నారు. తాజాగా ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేందుకు చేసిన సవరణ అమలు కానుంది. 2014 నాటి సవరణ ప్రకారం పెన్షన్ రూ.6,500 నుంచి రూ.15 వేల మధ్యలో పొందేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ పెంపును వేతన పరిమితి ఆధారంగా నిర్ణయించేలా గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశా లకు లోబడి వర్తింపజేసేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఈపీఎఫ్ఓ జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు సర్క్యూలర్ చేసింది. సేవా విభాగం ఏర్పాటుకు ఆదేశం ఉద్యోగులు, యాజమాన్యాలు ఉమ్మడి ఆప్షన్ దర ఖాస్తును ఈపీఎఫ్ఓ క్షేత్ర కార్యాలయాలకు సమర్పించాలని సంస్థ ఆదేశించింది. ఉద్యోగుల అవగా హనకు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు ప్రకటనను నోటీసుబోర్డులో ఉంచాలని, అ«ధిక పెన్షన్ కోసం సేవావిభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతి జాయింట్ ఆప్షన్ అప్లికేషన్‌ను రిజిస్టర్ చేసి, డిజిటల్‌గా లాగ్ఇన్ చేసి, రసీదు సంఖ్యను ఉద్యోగికి అందించాలని సూచించింది. సీలింగ్ కన్నా ఎక్కువ వేతనమున్న ఉద్యోగులు అధిక పింఛన్ కోసం సమర్పించే దరఖాస్తును ప్రాంతీయ పీఎఫ్ వో అధికారులు పరిశీలించి, నిర్ణయాన్ని పోస్టు ద్వారా, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి ఈపీఎస్ అధిక పెన్షన్‌కు అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి. జాయింట్ ఆప్షన్ దరఖాస్తు విధానం, వివరాలు, గడువు తేదీని సంబంధిత ఆర్పీఎఫ్సీ వెల్లడిస్తారు. అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్ విషయమై ఉమ్మడి ఆప్షన్ ఫారంలో ఉద్యోగి అంగీకారం కచి్చతంగా వెల్లడించాలి. అధిక పెన్షన్ అమలుపై యాజమాన్యాలకు అవగాహన కలి్పంచడం, సమస్యలను పరిష్కరించడం, సందేహాల నివృత్తిరి ఈపీఎఫ్‌వో కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. చదవండి: రాష్ట్రంలోనే మొదటి గాడిదల డెయిరీ ఫామ్.. లీటరు ధర రూ. 4 నుంచి 5 వేలు! -
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న పెన్షన్..!
‘పెన్షన్ స్కీమ్-1995’ కింద కనీస పింఛను పెంచాలని కార్మిక వర్గం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో కార్మిక వర్గానికి శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగులకు మెరుగైన స్థిర పెన్షన్ల అందించేందుకు కొత్త ఫిక్సిడ్ పెన్షన్ పథకాన్ని తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది. కొత్త పెన్షన్ ప్లాన్‌లో ఫిక్సిడ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉద్యోగికి ఉంటుంది. అయితే, మీరు కోరుకున్న పెన్షన్ కోసం ఆ మేరకు మీరు సహకారం అందించాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. జీతం, మిగిలిన సర్వీస్ ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఉద్యోగుల పెన్షన్ స్కీం-1995 ఆప్షన్ కొరకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది. ఈపీఎస్'లో ప్రస్తుతం ఉన్న మొత్తం పూర్తిగా పన్ను రహితం. అయితే, దీని కింద లభించే కనీస పెన్షన్ మొత్తాన్ని వాటాదారులు పెంచాలని తరచుగా కోరుతున్నారు. ప్రస్తుతానికి, కనీస పెన్షన్ నెలవారీ విరాళం పరిమితి రూ.1250గా ఉంది. అందుకే, ఉద్యోగులకు మరింత పెన్షన్ సదుపాయం కల్పించడానికి ఈపీఎఫ్ఓ సిద్దపడుతుంది. ఈపీఎస్ ప్రస్తుత నియమం ఏమిటి? ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లో సభ్యుడైన ప్రతి ఒక్కరూ ఈపీఎస్'లో సభ్యుడు అవుతారు. ఈపీఎస్ ప్రస్తుత నియమం ప్రకారం.. ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12% కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఉద్యోగి మాత్రమే కాకుండా, అంతే మొత్తం యజమాని ఖాతా నుంచి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కానీ, యజమాని కంట్రిబ్యూషన్ చేసే మొత్తంలో 3.67 శాతం పీఎఫ్'లో, 8.33 శాతం ఈపీఎస్'లో జమ చేస్తుంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే గొడుగు కిందకు రైల్వే సేవలు..!) -
ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే రూ.7 లక్షలు రానట్లే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్లైన్ సేవలు అందిస్తుంది. దీంతో చిన్న చిన్న పనుల కోసం ప్రతిసారీ ఈపీఎఫ్ఓ సంస్థ కార్యాలయానికి సందర్శించాల్సిన అవసరం లేదు. ఈపిఎఫ్ ఈ-నామినేషన్ సర్వీస్ అనేది అలాంటి ఒక కొత్త ఫెసిలిటీ, దీనిని ఆన్లైన్లో ఉపయోగించుకోవచ్చు. ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్ఓ తన తాజాగా ట్వీట్ లో తెలిపింది. తాజా పీఎఫ్ నామినేషన్ లో పేర్కొన్న నామినీ పేరును ఫైనల్ గా పరిగణిస్తారు. అయితే ఖాతాదారుని తాజా నామినేషన్ తర్వాత ఇంతకు ముందు నామినేషన్ క్యాన్సిల్ చేసినట్లు పరిగణిస్తారు. ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినీ జత చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు. #EPF सदस्य मौजूदा EPF/#EPS नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/rm3G2FaqKy — EPFO (@socialepfo) November 18, 2021 ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: 2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ?) -
ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త తెలిపింది. రూ. 868 కోట్ల పెన్షన్ నిధులతో పాటు రూ.105 కోట్ల పెన్షన్ బకాయిలను విడుదల చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ సోమవారం తెలిపింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈపీఎస్ 95 (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్) లబ్డిదారులకు ఎంతో మేలు కలుగుతుందని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 65 లక్షల మంది పెన్షనర్లు లబ్దిదారుల జాబితాలో ఉన్నారని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సభ్యుల నివేదిక ఆధారంగానే పెన్షన్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్‌ను భారీగా లాగేశారు.. -
తగ్గనున్న ఈపీఎఫ్.. పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్‌లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది. తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
ఈపీఎస్‌లో మూడేళ్ల వాటానుచెల్లించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి తొలి మూడేళ్లపాటు ఈపీఎస్ (ఉద్యోగుల పెన్షన్ పథకం) యాజమాన్యం వాటాను పూర్తిగా కేంద్రం చెల్లించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరి, రూ.15 వేలలోపు వేతనం అందుకునే ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ఇది వర్తిస్తుంది. అలాగే ఎవరైనా 2016 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారుంటే.. అలాంటి వారి పెన్షన్ ఖాతాలకు సంబంధించి తొలి మూడేళ్లలో ఇప్పటి నుంచి మిగిలిన కాలానికి కేంద్రం యాజమాన్యం వాటాను చెల్లిస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఫాస్ఫరిక్ అండ్ పొటాషియం (పీ అండ్ కే) ఎరువులపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వనున్న రాయితీ రేట్లనూ కేబినెట్ ఆమోదించింది. పొటాష్, సల్ఫర్లకు రాయితీని పెంచిన కేంద్రం నైట్రోజన్, ఫాస్ఫరస్లకు తగ్గించింది. సవరించిన ధరల ప్రకారం కేజీ పొటాషియంపై రూ.15.2, సల్ఫర్పై రూ.2.7, నైట్రోజన్‌పై రూ.18.9, కేజీ ఫాస్ఫరస్పై రూ.11.12 రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. మరికొన్ని నిర్ణయాలు: ఈశాన్య రాష్ట్రాల్లో పలు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివిధ పథకాలను 2020 మార్చి వరకు పొడిగించింది. ఈశాన్య మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టే అన్ని పనులకూ 100 శాతం నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆయుష్ (ఆయుర్వేద,యోగ, న్యాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) వైద్యులు ఓ బ్రిడ్జి కోర్సు చేసి ఆధునిక వైద్య సేవలు ప్రారంభించేందుకు ఉన్న వెసులుబాటును మంత్రివర్గం తొలగించింది. అలాగే ఇకపై దేశంలోని ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ ఉమ్మడిగా నెక్స్ట (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరుతో తుది పరీక్షలను నిర్వహించనుంది. ప్రాక్టీసు లైసెన్సు కోసం మరో పరీక్షతో పనిలేకుండా నెక్స్›్టలో అర్హత సాధించిన వారికి దేశంలో వైద్య సేవలకు అనుమతులు లభిస్తాయి. విదేశాల్లో వైద్య విద్య చదివిన వారినీ నెక్స్›్టలో అర్హత సాధించాకే దేశంలో ప్రాక్టీసుకు అనుమతిస్తారు. ళీవిద్యా రుణాలకు సంబంధిచిన ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్)’ ‘సెంట్రల్ సెక్టార్ ఇంట్రస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్)’ అనే రెండు పథకాలను కొనసాగించేందుకు ఆమోదం. వీటి కోసం 2017–18 నుంచి 2019–20 మధ్య రూ.6,600 కోట్ల వ్యయం చేయనున్నారు. -
కొంపముంచిన ఈపీఎస్-95
కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీ మును ప్రారంభించి అప్పటివరకు ఉద్యోగులకు దీనిని కంపల్స రీ చేయడం జరిగింది. అప్పట్లో వేతనాన్ని నెలకు రూ. 6,000 లుగా లెక్కగట్టి పెన్షన్‌ను నిర్ణయించడంవల్ల రిటైరైన ఉద్యోగులకు పింఛను నెలకు వెయ్యి రూపాయలలోపే వస్తోంది. దీనికి కరువుభత్యంతో అనుసంధానం చేయకపోవడంవల్ల దశాబ్ద కాలంగా ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. కొంత మంది పెన్షనర్లు తమ అవసరాల నిమిత్తం కొంత భాగాన్ని అమ్ముకు న్నారు. ప్రభుత్వ రూలు ప్రకారం ఈ భాగం తిరిగి పదిహేను సంవత్సరాల తరువాత పెన్షన్‌లో కలసిపోతుంది. కానీ, 95 నాటి ఈపీఎస్ స్కీములో ఉన్నవారికి ఈ రూలు వర్తించదట. అంటే వంద నెలల్లో అమ్మగా వచ్చిన మొత్తం బాకీ తీరిపోగా, వీరు జీవితాంతం కడుతూనే ఉండాలి. మరో విఘాతం ఏమిటంటే, ఈ పెన్షనర్లకు ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ, లేదా బ్యాంకు ఉద్యోగులు.. డిపెండెంట్ల కింద వైద్య సదుపాయం పొందుదామంటే ప్రభుత్వ పెన్షను పొందుతున్నందున వీరు అర్హులుకారట. 1-4-2014 నుండి పెన్షన్‌ను రూ. వెయ్యి చేస్తామన్నారు. మరల 1-9-2014 నుంచి అన్నారు. కానీ రెండు నెలలు గడచినా పెంపు జరగలేదు. 1991లో మొదలైన నూతన ఆర్థిక విధానాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి 2002లో వేలాది ఉద్యోగులను బలవంతంగా వాలంటరీ సపరేషన్ స్కీం కింద తొలగించారు. ఉదాహరణకు అనేక రాష్ట్రాల్లోనున్న ఎరువుల కర్మాగారాలు (నేను రామగుండంలో పనిచేశాను). ఈ సంస్థల్లో 1992, 1997 లో జరగవలసిన వేతన సవరణలను జరపకుండా ఆపివేశారు. ఆ కారణంగా 1987లో ఉన్న వేతనాలమీద 2002లో వి.ఎస్.ఎస్ కింద కొంత అదనంగా కలిపి పంపించి వేశారు. ఈ విధంగా కూడా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఈపీఎస్-95 పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఏ ఉద్యోగం చేయకపోయినా వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు బాగా పెంచారు. దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినవారిని విస్మరిస్తున్నారు. 2002లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్నదీ బీజేపీ ప్రభుత్వమే. ఆవేదనతో రాసిన ఈ లేఖ చూసైనా మా ఈపీఎస్-95 పెన్షనర్లకు 1-1-2015 నుంచి నెలసరి పెన్షన్‌ను రూ. 7,500 లు (ప్రభుత్వం నిర్ణయించిన మినిమమ్ వేతనం 15,000 రూ.లను అనుసరించి) ఇస్తూ దీనివి కేంద్రం ఇచ్చే కరువు భత్యానికి అనుసంధానం చేయాలని విన్నవిస్తున్నాను. - ఎన్.ఎస్.ఆర్.మూర్తి రిటైర్డ్ ఆఫీసర్, రామగుండం ఎరువుల కర్మాగారం