Jagitial District News
-
పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం
కరీంనగర్: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల అంచనాలు యుద్ధప్రాతిపదికన తయారుచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమ్‌రాజ్‌పల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటలను బుధవారం వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 6,160 ఎకరాల్లో మామిడి, 1,029 ఎకరాల్లో వరి, 1,520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వుపంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయన వెంట సర్పంచ్, కొలగాని శ్రీలత, డీఏవో భాస్కర్, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో రవీందర్రావు, ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, ఏవో కరుణ, భీమ్‌రాజ్‌పల్లి ఉప సర్పంచ్ బొమ్మన రాజమ్మ, గొల్లపల్లి సర్పంచ్ నేరెల్ల నీరజ, లక్ష్మీపూర్ సర్పంచ్ రాజశేఖర్, నేరెళ్ల ఉపసర్పంచ్ గురుజాల బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
రైతుల గోడు పట్టని ప్రభుత్వం
మల్లాపూర్: రాష్ట్రంలో రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని, అన్నదాతలు రోడ్డెక్కి విలపిస్తుంటే.. సీఎం, మంత్రులు ఆటల్లో మునిగితేలుతున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మండలకేంద్రంలోని భరతమాత కూడళి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతు మొక్కజొన్న పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోందన్నారు. అకాలవర్షాలు, ఈదురుగాలులతో పంట నష్టపోయి.. అరకొరగా వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే మద్దతుధర లేక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు కోరుకున్న చోట కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎస్సై లక్ష్మయ్య చేరుకుని వారితో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, రైతుబంధు కమిటీ మాజీ జిల్లా సభ్యుడు డీలర్ మల్లయ్య, బీఆర్ఎస్ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఘనంగా మంత్రి అడ్లూరి జన్మదినం
ధర్మపురి: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెప్పించిన భారీ కేక్ కట్ చేశారు. అంతకుముందుగా మంత్రి అడ్లూరి శ్రీలక్ష్మీనృసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో మంత్రిని సన్మానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ బాదినేని రాజేందర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
ధాన్యం కొనుగోలుకు సిద్ధంకండి
జగిత్యాల: యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రణా ళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్ అన్నారు. కలెక్టరేట్లో రైస్‌మిల్లర్లు, అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లాలో 4.83 లక్ష ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉ న్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. మొ త్తం 435 కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మిల్లర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. లా రీ యజమానులు వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం వయోవృద్ధుల సంక్షేమం, భద్రత ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ– పర్యవేక్షణ బిల్లు ఆమోదం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశా రు. ఉద్యోగులు తమ వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, తల్లిదండ్రుల అవసరాలు తీర్చేందుకు వేతనం నుంచి 15శాతం లేదా.. రూ.10 వేలను కేటాయించి వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవన్నా రు. ఫిర్యాదు స్వీకరించిన 60 రోజుల్లోపే సమస్య పరిష్కరించేలా కమిటీ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బిల్లు సమాజానికి అవసరమన్నా రు. వయోవృద్ధుల కోసం జగిత్యాలలో ఏర్పాటు చేసిన సదన్ భవనానికి ప్రహరీ నిర్మించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బిల్లును సమర్థవంతంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే..
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారి చిన్న జయంతి సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటుచూసినా కాషాయ దుస్తులు ధరించిన దీక్షాపరుల సందడి కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన పెద్ద ఎత్తున స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు జై హనుమాన్.. జైశ్రీరామ్.. నినాదాలతో కొండగట్టుకు తరలివస్తున్నారు. వీరంతా అర్ధరాత్రి తర్వాత దీక్ష విరమణ చేయనున్నారు. చిన్న జయంతికి తరలివచ్చే భక్తులకు అన్ని రకాల మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని డీఎంహెచ్‌వో సుజాత తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గుట్టపై వివిధ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. ఐదుచోట్ల 108అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామని మండల వైద్యురాలు మౌనిక, ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈదురుగాలులకు కూలిపోయిన చలువ పందిళ్లు కోనేరు సమీపంలో వేసిన చలువ పందిళ్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పలువురికి గాయాలైనట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ ఈవో అంజనారెడ్డి స్పందించారు. ఈదురుగాలులకు పందిళ్లు కూలిపోయింది నిజమే అయినా.. భక్తులెవరికీ ప్రమాదం జరగలేదని, పుకార్లు నమ్మవద్దని కోరారు. కొండగట్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జయంతి సందర్భంగా ఆలయ ఆవరణలో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ఆలయ పరిసరాలు, ప్రవేశ ద్వారాలు, భక్తుల రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. భారీగా తరలివస్తున్న భక్తులు పోటెత్తిన స్వామివారి సన్నిధి నేడు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభించిన ఈవో అంజనా రెడ్డి -
అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమకారుడి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ నేత ఎన్నమనేని శ్రీనివాస్‌రావు (65) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. శ్రీనివాస్‌రావు తెలంగాణ సాధన కోసం అనేక ఉద్యమాలు చేశారు. మొదటిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి పట్టణంలోని కొత్తబస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేయించారు. ఆయన మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జగిత్యాల పరిధిలో యువకుడు ఆత్మహత్య జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మునుగురి పవన్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ ఇంటర్ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ కోసం కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. జాబ్ రాకపోవడంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ ఉన్నత చదువులు చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నానన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. యూనిఫాంలో మద్యం సేవించిన కానిస్టేబుల్మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ బెల్ట్‌షాపులో మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిగువ కొండగట్టులోని ఓ బెల్ట్‌షాపులో కానిస్టేబుల్ యూనిఫాంలోనే మద్యం సేవించడం చర్చనీయాంశమైంది. -
నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. మల్లాపూర్‌లో హనుమాన్ పల్లకీ సేవమల్లాపూర్ :మండలకేంద్రంలో బుధవారం హనుమాన్ పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. స్థానిక హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. హనుమాన్ దీక్షాపరులు జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ నినాదాలతో పల్లకీసేవలో పాల్గొన్నారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, హనుమాన్ దీక్షాపరులు కళ్లెం మహిపాల్‌రెడ్డి, కాసారపు భూమారెడ్డి, చింతలూరి రంజిత్, లవంగ శివకుమార్, వార్డుసభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. గాలికుంటూ నివారణ టీకాలు వేయించాలిమెట్పల్లిరూరల్: పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. మెట్పల్లి మండలం చౌలమద్దిలో టీకాల కార్యక్రమాన్ని బుధవారం తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక పశువైద్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. రైతులతో సమావేశమై గాలికుంటూ లక్షణాలు, నష్టాలు వివరించారు. వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వచ్చి నీరసించిపోతాయని, బొబ్బలు ఏర్పడి పుండ్లుగా మారుతాయని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి తగ్గి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఆయన వెంట మెట్పల్లి మండల పశువైద్యాధికారి కొమ్మెర మనీషాపటేల్, ఉపసర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, సిబ్బంది రమణయ్య, చిరంజన్, దిలీప్, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంసిద్ధం కావాలిజగిత్యాల: ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, 48 గంటల్లోనే డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. ఈసారి రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. డీఏవో భాస్కర్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ జితేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
జగిత్యాలరూరల్: అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం అర్పపల్లి, పెంబట్లల్లో అకాల వర్షాలతో నేలకొరిగిన మొక్కజొ న్న, నువ్వు, లక్ష్మీదేవిపల్లిలో బీరతోటలను పరిశీలించారు. నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం అందించేలా చూడాలని మంత్రి అడ్లూరిని కోరారు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లిందని, వెంటనే పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కాసుల వర్షం
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో కాసుల వర్షం కురిసింది. కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ రూరల్, భీమదేవరపల్లి, మల్యాల, కోరుట్ల, మంథని, సుల్తానాబాద్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామగుండం, మెట్పల్లి, వేములవాడ, జగిత్యాలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 82,249 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.210.83 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆదాయం వివరాలు -
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
మేడిపల్లి: మండలంలోని కట్లకుంట, మన్నెగూడెం గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. కట్లకుంటలో 28 మంది, మన్నెగూడెంలో 49 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మండలకేంద్రంలోని పెద్ద చెరువు నుంచి ఊర చెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు పంపింగ్ చేసే విషయమై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. సూరంపేట నుంచి తాండ్య్రాల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. మన్నెగూడెం నుంచి తక్కళ్లపల్లికి రోడ్డు వేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, ఏనుగు రమేశ్‌రెడ్డి, చేపూరి నాగరాజు, మాదం వినోద్, బొంగోని రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఫ్ విక్రయాన్ని అడ్డుకున్న హనుమాన్ భక్తులు
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో బుధవా రం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ నుంచి అక్బల్, ఆనఫ్ వ్యక్తులు ఎద్దు మాంసం విక్రయించడానికి రావడంతో హనుమాన్ భక్తులు అడ్డుకున్నారు. వారితో విక్రేతలు వా గ్వివాదానికి దిగారు. పైగా హనుమాన్ భక్తుల కాలర్ ప ట్టుకోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంట నే ఎస్సై నవీన్‌కుమార్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన అక్బల్, ఆనఫ్ను మెట్పల్లి ఆసుపత్రికి తరలించా రు. గ్రామంలో గొడవలు జరగకుండా డిచ్పల్లి నుంచి 35 మంది పోలీసులు, మల్లాపూర్ ఎస్సై అనిల్, ఏఆర్ ఎ స్సై వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం హనుమాన్ భక్తులను విచారణ పే రిట పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో విషయం తెలు సుకున్న హనుమాన్ భక్తులు, గ్రామస్తులు స్టేషన్ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చారు. వారిపై ఎలాంటి కేసులు న మోదు చేయవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూప్‌రావు, న్యాయవాది నరేందర్‌రెడ్డి పోలీసులకు సూచించారు. మీడియా ను మాత్రం స్టేషన్లోకి అనుమతించలేదు. అక్బల్, అనఫ్పై దాడి చేసిన కొంతమంది హనుమాన్ భక్తులను గు ర్తించి కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. వర్షకొండలో ఉద్రిక్తత -
కాంగ్రెస్ పాలనలో అందని చేపలు, గొర్రెలు
కోరుట్ల/ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ పాలనలో చేపలు, గొర్రెలు అందించడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో బుధవారం 30మంది లబ్ధిదారులకు రూ.9.11 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బడ్జెట్లో కొత్త పింఛన్ల ఊసు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ రైతుబంధు అందిందని, ఈ ప్రభుత్వంలో యాసంగి పంటలు చేతికొచ్చినా స్పందన లేదని పేర్కొన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించినా.. ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి, సర్పంచు బద్దం గోపి, ఉప సర్పంచు నాంపెల్లి రమేశ్, మాజీ కో–ఆప్షన్ ఏలేటి చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.29 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
రైల్వే టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు
రామగుండం: భారతీయ రైల్వేలో టికెట్ బుకింగ్, రద్దు, రిఫండ్ తదితర సేవల్లో చేసిన మార్పులు ఈనెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. తద్వారా టికెట్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, ప్రయాణికులకు సరిపడా సీట్లు అందించడం సులభతరం కానున్నాయి. కొత్త నిబంధనలు ఇవీ.. ● రైలు బయలుదేరడానికి 8 గంటల్లోపు కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేస్తే రిఫండ్ ఉండదు. రైలు బయలుదేరు సమయానికి 8–24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం, 24–72 గంటలకు ముందు రద్దు చేసుకుంటే రద్దు చార్జి మినహా మొత్తం రిఫండ్ చేస్తారు. ● రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ సమయాన్ని 4 గంటల నుంచి 9–18 గంటలకు పెంచారు. ఫలితంగా ప్రయాణానికి 18 గంటల ముందే రిజర్వేషన్ సీటింగ్ పొజిషన్ తెలుస్తుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయం చూసుకునే వీలుంటుంది. ● బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునేందుకు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తాము ఎక్కబోయే రైల్వేస్టేషన్‌ను మార్పు చేసుకునే వీలు కల్పించారు. ఇది ప్రయాణికులకు ఎంతోసౌకర్యంగా ఉంటుంది. ఉదా: శబరిమలై యాత్రికులు ఢిల్లీ నుంచి త్రివేండ్రం రిజర్వేషన్ చేసుకుని బోర్డింగ్ రామగుండం నమోదు చేస్తారు. తద్వారా రైల్వేశాఖ ఢిల్లీ నుంచి రామగుండం వరకు మరో ప్రయాణికుడికి సీటు కన్ఫర్మ్ చేసుకోవడంతో రైల్వేశాఖకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ● గతంలో ప్రయాణికుడు తీసుకున్న బుకింగ్ కౌంటర్లోనే తమ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉండేది. నూతన విధానం ద్వారా ఏ రైల్వేస్టేషన్లోనైనా రద్దు అవకాశం ఉంటుంది. నిమిషం వ్యవధిలో బుకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. అమలులోకి వచ్చిన రూల్స్ -
ప్రజాపాలన వాయిదా వేయాలి
జగిత్యాల/జగిత్యాలటౌన్: హనుమాన్ చిన్న జయంతి కావడంతో ప్రజాపాలన దినోత్సవాన్ని వాయిదావేయాలని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు మంత్రి అడ్లూరిని కోరారు. మంత్రికి బుధవారం వినతిపత్రం అందించారు. గురువారం జయంతి నేపథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు లింగంపేట శ్రీనివాస్, చీటి చంద్రశేఖర్‌రావు, జిట్టవేని అరుణ్, బిట్టు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పురిట్లోనే శిశువుకు గాయాలుమెట్పల్లి:ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డకు గాయాలయ్యాయని ఉదయ్ అనే వ్యక్తి ఆరోపించాడు. పట్టణంలోని వెంకట్రావ్‌పేటకు చెందిన భవానీని గత నెల 29న ప్రసవం కోసం కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అదేరోజు శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు. పుట్టిన శిశువు ఓ చేయి వాపుతోపాటు పలు చోట్ల గాయాలు ఉండడాన్ని గమనించిన తండ్రి ఉదయ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అందులో చేయి విరిగిందని తేలడంతో అందోళన చెందిన ఆయన ప్రభుత్వ వైద్యులను నిలదీశాడు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువుకు గాయాలయ్యాయని, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కమిషనర్‌పై కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదుకోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్‌పై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫోన్ ద్వారా కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని, జవాబుదారీతనం లేకుండా పోయిందని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి కమిషనర్ తీరు విచారకరమని, ప్రజాప్రతినిధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని చెప్పారు. ఆస్తి పన్ను కోసం పేదల ఇంటి కరెంట్ కట్ చేసి ఇబ్బందికి గురిచేశారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం. -
జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నర్సయ్య
ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులు జగిత్యాలరూరల్: జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎర్ర నర్సయ్య ఎన్నికయ్యారు. కోర్టు ఆవరణలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా మర్రిపెల్లి సత్యప్రకాష్, కోశాధికారిగా జున్ను రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా అందె మారుతి, సంయుక్త కార్యదర్శిగా బెజ్జారపు ప్రవీణ్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా బోగ ఓంప్రకాశ్, తుమ్మనపల్లి రమేష్, న్యాయవాదులు రామిడి జగన్, ఇనుగుర్తి శివాణి, గట్టుపల్లి సురేష్ పాల్గొన్నారు. -
మహిళల భాగస్వామ్యం..ప్రజా రవాణా బలోపేతం
జగిత్యాలటౌన్: మహిళల భాగస్వామ్యంతో ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం అవుతోందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు రూ.10వేల కోట్లు ఆదా చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. బస్టాండ్‌లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే మహిళలను సన్మానించారు. డిపో మేనేజర్ కల్పన, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ’ ఇళ్లను పూర్తి చేయాలి మల్లాపూర్: మండలంలోని ముత్యంపేటలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన చోట వేగం పెంచాలన్నారు. ఆర్థిక సమస్యలుంటే స్వశక్తి సంఘాల నుంచి రుణం పొందాలని సూచించారు. మెట్పల్లి ఆర్డీవో నరసింహరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. గోదాములు పరిశీలించి, యాసంగి ధాన్యం నిల్వకు అనువుగా ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు. క్షయ నివారణలో జిల్లాకు మూడోస్థానం జగిత్యాల:క్షయ నివారణలో జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాతను అభినందించి అవార్డు అందించారు. వైద్యసేవలు మరింత మెరుగుపర్చేలా చూడాలని ఆదేశించారు. రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు నైపుణ్యం అభివృద్ధి చేసుకోవాలని శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో రెండురోజులుగా నిర్వహిస్తున్న ఎన్జీవో, అభివృద్ధి రంగంపై అవగాహన అంశంపై మాట్లాడారు. ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కమ్యునికేషన్ స్కిల్స్ ఎంతో ముఖ్యమని, టెక్నాలజీ, పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు అవసరమన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా గ్రామీణ సమస్యలను కూడా అర్థం చేసుకోవాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలపై ఆధ్యయనం చేయాలన్నారు. ప్రిన్సిపాల్ అశోక్, ప్రొఫెసర్ శ్రీధర్, శ్రీనివాస్, కె.శ్రీనివాస్, ఎన్సీసీ ఆఫీసర్ రాజు పాల్గొన్నారు. -
బీజేపీకి కార్యకర్తలే బలం
కథలాపూర్: క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే బీజేపీకి బలమని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో కార్యకర్తలకు మంగళవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వ్యక్తిగతం కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శిక్షణ తరగతులతో కార్యకర్తల్లో చైతన్యం వస్తుందని, పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. వక్తలు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు నరెడ్ల రవి, కథలాపూర్ మహేశ్, ఆరె శివ, ఆనంద్‌రెడ్డి, సత్యం, శ్రీనివాస్, మహేశ్, నవీన్, రాజం తదితరులు పాల్గొన్నారు. -
అకాలవర్షం.. రైతుకు తీరని నష్టం
జగిత్యాలరూరల్: భారీ ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సోమవారం అర్ధరాత్రి నుంచి బలమైన గాలులు వీయడంతో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. కోత దశకు చేరిన వరి నేలవాలింది. జగిత్యాలరూరల్ మండలంలో మామిడి, మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయింది. నువ్వు పంటకు నష్టం కథలాపూర్: మండలకేంద్రంతోపాటు భూషణరావుపేట, సిరికొండ, కలిగోట, అంబారిపేట, తాండ్య్రాల, తక్కళ్లపల్లి గ్రామాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, నువ్వుల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలను ఏవో యోగితా, ఏఈవోలు హరీశ్, శేఖర్ పరిశీలించారు. సుమారు 500 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. రాయికల్‌లో ఈదురుగాలులు రాయికల్: పట్టణంతోపాటు మండలం వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచే ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మొక్కజొన్న, మామిడి నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేలకొరిగిన పంటలు బుగ్గారం: మండలంలోని యశ్వంతరావుపేట, గంగాపూర్, శెకెల్ల, వెల్గొండ, గోపులాపూర్ గ్రామాల్లో మొక్కజొన్న, వరి నేలకొరిగాయి. కోరుట్లలో 1820 ఎకరాల్లో మామిడికి నష్టం ఇబ్రహీంపట్నం/కోరుట్లరూరల్: ఈదురుగాలులు, వర్షంతో కోరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో 1820 ఎకరాల్లో మామిడి నేలరాలిందని ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. నేలరాలిన మామిడి పంటలను మంగళవారం పరిశీలించారు. కోరుట్లలో 510 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 150, మల్లాపూర్‌లో 840, మెట్పల్లిలో 320 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట హెచ్‌ఈవో శ్రీలత, రైతులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వర్షం మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసిపోయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పెగడపల్లిలో ఈదురుగాలులు పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో మామిడి కాయలు రాలాయి. అరవెల్లి, రాజరాంపల్లి గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. మామిడి తోటలను ఉద్యానశాఖ ఏఈవో అనిల్, మొక్కజొన్న, వరిని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం అంచనా వేశారు. -
కొండగట్టుకు జయంతి శోభ
కొండగట్టుకు చేరుకుంటున్న భక్తులుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. జయంతి సందర్భంగా ఆలయ సింహద్వారం, గోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ మాల విరమణకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, నిజా మాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్నారు. దీక్ష విరమణ మండపం, కోనేరు, క్యూలైన్లు, లడ్డూప్రసాదం వద్ద ఇబ్బందులు తలెత్తకుండా భద్రత ఏర్పాటు చేశారు. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఘాట్ రోడ్డు వెంట భక్తులకు కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కొండపైన వైద్య బందాన్ని అందుబాటులో ఉంచారు. మెట్లదారిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పటిష్ట బందోబస్తు హనుమాన్ చిన్న జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మల్యాల క్రాస్ రోడ్‌లోని కన్వెన్షన్ హాల్లో పోలీసు సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. 914 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నేరాలకు తావులేకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఓపికతో సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మాలవిరమణ వద్ద భక్తులు క్యూలైన్ పాటించేలా చూడాలని, ప్రతిఒక్కరూ స్వామివారిని దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని పేర్కొన్నారు. కాలినడకన వచ్చే భక్తులు వాహనాలను గమనిస్తూ ముందుకు సాగాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, వెంకటరమణ, ఎస్బీ అరీఫ్ అలీఖాన్, సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి, సురేశ్, అనిల్, రిజర్వ్ ఇన్స్స్టెక్లర్లు సైదులు, కిరణ్‌కుమార్, వేణు, వివిధ జిల్లాల సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అంజన్న చిన్న జయంతికి ఏర్పాట్లు
మల్యాల: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జయంతి ఏర్పాట్లను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఆలయం పరిసరాల్లోనే 64 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్‌సెంటర్, వైద్య శిబిరాలు, మెట్లదారిలో లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీక్ష విరమణ, ప్రసాదాల కౌంటర్లు, క్యూలైన్ల వద్ద బందోబస్తు కల్పించాలన్నారు. పార్కింగ్ స్థలంతోపాటు నీటి వసతి, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 24గంటలు అంతరాయం లేకుండా సేవలు కొనసాగాలన్నారు. పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. స్వామివారి దీక్షాపరుల కోసం వేములవాడ, జగిత్యాల, కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, డీపీఓ మదన్ మోహన్, ఆలయ ఈఓ అంజనారెడ్డి, మల్యాల సీఐ నీలం రవికుమార్, ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్ వసంత, ఎస్సై నరేశ్‌కుమార్, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పాల్గొన్నారు. -
సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి
కోరుట్ల: డ్రైవర్లు వాహనాలను భద్రంగా నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల, మెట్పల్లి లారీ, ఐచర్ ఇతర వాహన డ్రైవర్లు, ఓనర్లకు సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించటం అరైవ్ అలైవ్ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, నివారణ చర్యలే అవసరమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం వాహనాలకు రేడియం స్టిక్కర్లు అతికించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు, సీఐలు అనిల్, సురేష్ బాబు, ఎస్సైలు చిరంజీవి, రాంచంద్రం, కిరణ్, శ్రీధర్ రెడ్డి, రవికిరణ్, లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
పరీక్షకు అనుమతించండి
జిల్లాకేంద్రంలోని పురాణిపేట హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాను. నవంబర్‌లో అమ్మ ఆరో గ్యం బాగాలేక నూకపెల్లి వెళ్లి ధరూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరాను. పురాణిపేట బడిలో టీసీకి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం స్కూల్లో నా పేరు లేదంటున్నారు. ధరూర్‌లో టీసీ ఇవ్వనందుకు పరీక్ష రాయ డం కుదరదంటున్నారు. టీసీ ఇప్పించి ఆదుకోండి. (స్పందించిన కలెక్టర్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఇరు పాఠశాలల బాధ్యులతో మాటా ్లడి పరీక్షలు రాసేలా చూస్తానని డీఈవో హామీ ఇచ్చారు.) – గ్రీష్మ, ఏడో తరగతి విద్యార్థిని, జగిత్యాల -
సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి
మెట్పల్లి: నిందితులను గు ర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకురావాలని డీఎస్పీ రాములు అన్నారు. పట్ట ణంలోని 26వార్డులో కౌన్సిలర్ బొడ్ల రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రితో కలిసి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పోలీసులకు ఆయుధంగా మారాయన్నా రు. కెమెరాలు నిరంతరం పని చేస్తూ ఎంతో భద్రతను ఇస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వీధిలో ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని, ఇందుకు తమవంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. బల్దియా వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్ తదితరులున్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుని అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శనివారం రాత్రి బాలాజీనగర్‌కు చెందిన తుమ్మల లోకేశ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఓరుగంటి వివేక్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. తహసీల్ చౌరస్తా వద్దనున్న అమృత విల్లాస్ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న లోకేశ్, అదే హోటల్లో మేనేజర్ వివేక్ మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో లోకేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో తన వద్దనున్న సర్జికల్ బ్లేడ్‌తో వీపుపై పొడవగా బలమైన రక్తగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సారెస్పీ కాలువలో దూకి మహిళ ఆత్మహత్యమేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి పరిధి ఎస్సారెస్పీ కాలువలో దూకి మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. కాలువలోని తుమ్మచెట్టుకు మహిళ మృతదేహం కనిపించిందన్న బాటసారుల ద్వారా తెలుసుకున్న మేడిపల్లి పోలీస్‌లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఆశా’ల ఆందోళన
● కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలి ● సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు సులోచన జగిత్యాలటౌన్: ఆశా కార్యకర్తలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల కొత్తబస్టాండ్‌లోని పటేల్చౌక్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా సులోచన మాట్లాడుతూ అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎంగా పదోన్నతి కల్పించాలన్నారు. 2023లో 15 రోజుల సమ్మె సందర్భంగా హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు చెల్లించాలన్నారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు రాయికంటి దివ్య, ప్రేమలత, బత్తిని వసంత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
మీ‘సేవ’ మరింత భారం
కోరుట్ల: మీ సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేది నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. మీ సేవ దరఖాస్తులకు గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవలో దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరిలు రెండు రకాలు ఉండగా రెండింటిలోనూ చార్జీల పెంపు జరిగింది. రెట్టింపు చార్జీలు.. మీ సేవలో దరఖాస్తులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ–ఏ కింద వచ్చే దరఖాస్తులకు ఇదివరకు రూ.35 యూజర్ చార్జీ కాగా.. పెంచిన రేటు ప్రకారం రూ.62 కానుంది. కేటగిరీ–బీ కింద వచ్చే దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 చెల్లిస్తుండగా.. రేపటి నుంచి రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ. 4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడం..దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం భారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇంటిగోడ కూల్చివేశారు
మాది మల్యాల మండలం రామన్నపేట. సొంత ఇంటి ప్రహరీని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో కూల్చివేశారు. మల్యాల క్రాస్ రోడ్డు నుంచి రాంపూర్ వెళ్లే ఆర్అండ్బీ మెయిన్ రోడ్డు వెడల్పు పేరుతో సుమారు రూ.3లక్షల విలువైన 27గజాల ప్రహరీని కూల్చివేసిన గ్రామ అభివృద్ధి కమిటీ, సర్పంచ్, సిబ్బందిపై చర్యలు తీసుకుని మాకు పరిహారం ఇప్పించండి. – బండారి శంకర్రావు సోదరులు, రామన్నపేట నూకపెల్లి డబుల్బెడ్రూం ఇళ్ల కాలనీలో డ్రైనేజీ నిర్మించిన అధికారులు మురుగునీరు నిలిచేలా సంప్, మోటార్ల ద్వారా పంపింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. సంపు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ప్రారంభించలేదు. సంప్ నిండి దుర్గంధం వ్యాపిస్తోంది. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. కాలనీలో పారిశుధ్య పనులు నిర్వహించడం లేదు. – నూకపల్లి డబుల్ ఇళ్లవాసులు మాది రాయికల్ మండలం మైతాపూర్ గ్రామం. గిరిగుట్టపైన ఉన్న కనకదుర్గదేవి అమ్మవారి ఆలయానికి నక్షా ప్రకారం దారి ఉంది. సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఎంపీ దీవకొండ దామోదర్‌రావు నిధులు సమకూర్చారు. పనులు కొనసాగుతుండగా పక్కనే ఉన్న భూమి యజమాని అడ్డుకోవడంతో నిలిచిపోయాయి. ఆలయ రోడ్డుకు హద్దులు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించండి. – మైతాపూర్ గ్రామస్తులు -
రాజారాంపల్లి వారసంత రూ.60 లక్షలు
వెల్గటూర్: మండలంలోని రాజారాంపల్లి పశువులు, కూరగాయల వారసంత వేలానికి భారీ స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన వేలంలో 37 మంది పాల్గొన్నారు. రూ.60.75లక్షలకు సంగ రాములు దక్కించుకున్నారు. గతేడాది రూ.35.11 లక్షలు పలికిన వేలం.. ఈ ఏడాది రూ.60 లక్షలు దాటడంతో గ్రామ పంచాయతీకి రూ.25లక్షలకు పైగా అదనపు ఆదాయం సమకూరిందని సర్పంచ్ సంగ రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీవో విమల, ఎంపీడీవో కృపాకర్, కార్యదర్శి మల్లేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలిజగిత్యాల: విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలని ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అన్నారు. సోమవారం కళాశాలలో ఎన్జీవోలు అభివృద్ధి రంగంపై ఒరింటేషన్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఎప్పుడూ పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజసేవలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.74.74లక్షలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. ఈవో అంజనా రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో 13 హుండీలకు 38 రోజుల్లో భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని శ్రీలలిత ట్రస్టు సభ్యులు లెక్కించారు. ఇందులో రూ.74,74,174 సమకూరింది. మిశ్రమ వెండి, బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో వేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అంజనారెడ్డి, ఏఈవో హరిహరనాథ్, ప్రధాన అర్చకులు రఘు, స్థానాచార్యులు కపీందర్, ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, అశోక్, ఏఎస్సై శ్రీనివాస్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులను చీపురుతో
కొట్టిన హాస్టల్ కుకింగ్ హెల్పర్జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ కుకింగ్ హెల్పర్ శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులను ప్రతిరోజు చీపుర్లతో కొడుతూ వేధిస్తున్నాడు. విషయాన్ని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించారు. అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. తమను కొడుతూ.. వేధిస్తున్నట్లు విద్యార్థులు తెలపడంతో నివేదికను కలెక్టర్‌కు అందించారు. ఆయన వెంటనే శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ ఇటీవలే డిప్యూటేషన్‌పై తాళ్లధర్మారం నుంచి ఇక్కడికి వచ్చాడు. -
గడిబురుజులను రక్షించండి
కోరుట్ల: పట్టణంలోని చారిత్రకస్థలంగా గుర్తింపు పొందిన గడిబురుజులను పరిరక్షించాలని కోరుట్ల ప్రజాసంఘాల నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించా రు. కొందరు రియల్టర్లు చారిత్రక స్థలాలను అమ్ముకోవాలని చూస్తున్నారని, వారికి రాజకీయ నాయకులు, అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. చాళుక్యుల కాలం నాటి చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లంచాలు తీసుకుని వేసిన వీఎల్టీలను రద్దు చేసి అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. అధికారులు, నాయకులు కళ్లు తెరిచి గడి బురుజులను రక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తప్పవన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ముజాహిద్, శ్రీనివాస్, చింత భూమేశ్వర్, న్యాయవాది బోయిని సత్యం, కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు సుతారి రాములు, సీపీఎం పట్టణ అధ్యక్షులు శంకర్, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, హాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి షాహిద్, పోతని సత్యం, ముజబుర్రహ్మాన్, ఉప్పుగండ్ల అశోక్, బెక్కం అశోక్, మ్యాకల గణేశ్ పాల్గొన్నారు. -
విద్యార్థులను గాలికొదిలేసిన ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను చిన్నచూపు చూస్తోందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల ఎస్టీ హాస్టల్లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో విద్యార్థులను కొడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలా సోషల్ గురుకులాల్లో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. దళిత ఆదివాసులకు పదవులు ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై ఎందుకు చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. -
రైలు నుంచిపడి యువకుడి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్గేట్ వద్ద ఆదివారం రాత్రి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలునుంచి పండి బిహర్ రాష్ట్రం ఖైమూరు బాబువ జిల్లా ఆసన్ గ్రామానికి చెందిన అఫరోజ్ అన్సారీ(21) మృతిచెందాడు. రామగుండం జీఆర్ఫీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. సూర్యాపేటలో కూలీ పనులు చేసేందుకు దీల్దయాల్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్ నుంచి తన సోదరులతో కలిసి సంఘమిత్ర రైలులో ఖమ్మం ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలోని పొత్కపల్లిలో అఫరోజ్ అన్సారీ ప్రమాదవశాత్తు కిందపడి తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. శవపరీక్ష చేయించి మృతుడి తమ్ముడికి అప్పగించారు. -
పీఏసీఎస్ సొమ్ము రికవరీ అయ్యేనా..?
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం మెట్లచిట్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అప్పట్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించినా.. డబ్బులు రికవరీలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు రైతులు రుణాలు తీసుకోకున్నా ఇచ్చినట్లు చూపడం.. ఎరువుల విక్రయాలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చిన సొమ్ము పక్కదారి పట్టడంతో అధికారులు విచారణ జరిపి నిజమేనని గుర్తించారు. ఆ సొమ్ము సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తేల్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2018 వరకు కొనసాగిన పాలకవర్గం సమయంలో జరిగిన ఈ అక్రమాలపై అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినప్పటికీ.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రికవరీ మాత్రం చేయలేదు. శ్రీపోయింది మా సొమ్ము కాదు కదాశ్రీ అన్నట్లు.. అధికారుల తీరు ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.45.48 లక్షలు అక్రమాలు జరిగినట్లు.. మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ పరిధిలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. 2018 వరకు కొనసాగిన పాలకవర్గం సమయంలో రైతులకు తెలియకుండా వారి పేరిట రూ.27.77 లక్షలు రుణం కింద తీసుకున్నారు. అలాగే యూరియా, విత్తనాల అమ్మకాలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో వచ్చిన సొమ్ము నుంచి రూ.17.71 లక్షలు పక్కదారి పట్టించారు. సొసైటీ అక్రమాల తంతు విషయం ఉన్నతధికారుల దృష్టికి వెళ్లగా విచారణ జరిపి అవినీతి జరిగినట్లు తేల్చారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అనంతరం పాలకవర్గం రద్దు చేయడంతో పాటు అప్పటి సీఈవోను విధుల నుంచి తొలగించారు. రికవరీ విషయంలో నిర్లక్ష్యం.. పక్కదారి పట్టించిన సొమ్మును బాధ్యుల నుంచి రికవరీ చేసే విషయంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నారు. ఈ అక్రమాలు బయటపడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ సొమ్మును బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయలేదు. అక్రమాల వ్యవహారం బయటపడిన సమయంలో కేసు నమోదు చేశారే తప్ప రికవరీ మాత్రం చేయలేదు. మరోవైపు సొమ్ము రికవరీ కానిపక్షంలో బాధ్యులకు నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ స్పందించని పక్షంలో ఆస్తులు జప్తుచేసేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలిసింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి పక్కదారి పట్టించిన సొమ్మును రికవరీ చేస్తే ఆ సొమ్ము సొసైటీ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
చివరికి అందడం లేదు
ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తున్నట్లు చెపుతున్నప్పటికీ కాలువ చివరి భూములకు నీరు రావడం లేదు. ప్రధాన కాలువే కాకుండా, చిన్న కాలువలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎక్కువ నీరు విడుదల చేస్తే కాలువ గట్లు దెబ్బతింటున్నాయి. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లిఏటా మరమ్మతు చేయాలి ప్రతి ఏడాది కాకతీయ కాలువతో పాటు ఇతర కాలువలకు మరమ్మతు చేయాలి. గట్ల వెంబడి ఉన్న చెట్లను తొలగించాలి. కాలువలో ఉన్న మట్టిని తొలగించేందుకు ఉపాధి హామీని అనుసంధానం చేయాలి. – వామన్‌రెడ్డి, అంతర్గాం, జగిత్యాల రూరల్ -
ఫీజు ఇవ్వరు.. పన్ను కట్టరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గ్రానైట్ కటింగ్, పాలీిషింగ్ పరిశ్రమల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుమతులు పొందే సమయంలో ఒక విధంగా, నిర్మాణ సమయంలో మరో విధంగా కట్టడాలు చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పలు పరిశ్రమలు ఇంటి నంబర్లు పొందకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. సామాన్యుడు ఇంటి నిర్మాణం చేపడితే క్షణాల్లో వాలిపోయే అధికారులు.. గ్రానైట్ పరిశ్రమల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల నిర్వహణ కొనసాగుతున్నా సంబంధిత అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. పరిశ్రమల అనుమతులపై అనుమానాలు? కొత్తపల్లి మండలంలోని గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు పొందిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం పరిశ్రమ స్థాపనకు అనుమతి పొందాలంటే టీఎస్ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివిధ ప్రభుత్వశాఖల నుంచి ఎన్వోసీ పత్రాలు జతచేస్తూ దరఖాస్తు పూర్తి చేయాలి. సింగిల్‌విండో పద్ధతిలో అనుమతి మంజూరు కోసం సాంకేతిక(టెక్నికల్) అనుమతికి సుడా/డీటీసీపీ(డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్)కు దరఖాస్తు ఫార్వర్డ్ చేయబడుతుంది. పరిశ్రమ స్థాపించేందుకు పరిపాలన అనుమతుల కోసం సంబంధిత గ్రామ పంచాయతీలకు సుడా /డీటీసీపీ ఆ దరఖాస్తును ఫార్వర్డ్ చేస్తుంది. పంచాయతీ అనుమతి వచ్చాక సుడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశ్రమకు సంబంధించిన నిర్మాణం కొలతలపై విచారణ చేపట్టి సాంకేతిక (టెక్నికల్) అనుమతి ఇవ్వాలి. అప్పుడు పంచాయతీ గ్రామసభ అనుమతి పొందాక సంబంధిత పరిశ్రమ యజమాని నిర్మాణ ఫీజు, బెట్టర్‌మెంట్ చార్జ్, డెవలప్మెంట్ చార్జిలు చెల్లించాక అనుమతులివ్వాలి. అప్పుడే పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టాలి. కానీ వాటిని తుంగలో తొక్కుతూ సుడా అనుమతి ఉందంటూ గ్రామ పంచాయతీలకు ఫీజు చెల్లించకుండా నిర్మాణాలు పూర్తి చేస్తున్నాయి. దీంతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. అనుమతులు ఒకలా..నిర్మాణాలు మరోలా కొత్తపల్లి మండలంలోనే 300 పైగా గ్రానైట్ కలింగ్, పాలీషింగ్ పరిశ్రమలుండగా జిల్లావ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలది ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, బద్ధిపల్లి, కమాన్‌పూర్ గ్రామాల్లోని పలు పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను విస్మరించాయి. అనుమతుల సమయంలో ఒకలా.. నిర్మాణ సమయంలో మరోలా కట్టడాలు చేపట్టారు. గ్రానైట్ పరిశ్రమల అనుమతులపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగవేత గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు ఇంటి శిస్తుతో పాటు ట్రైడ్ లైసెన్స్ ఫీజు కూడా ఎగవేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 100 హార్స్పవర్(హెచ్‌పీ)పైన విద్యుత్ వినియోగిస్తున్న పరిశ్రమలు ఏడాదికి రూ.7 వేలు, 100 హెచ్‌పీ లోపు విద్యుత్ వినియోగిస్తే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేవీ చెల్లించకుండా గ్రానైట్ పరిశ్రమల యజమానులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమైన జిల్లా పంచాయతీ అధికారిని ఫోన్లో వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
మరమ్మతు లేక.. నీరు కదలక..
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లాకు సాగునీరు అందించే కాకతీయ కాలువ శిథిలావస్థకు చేరింది. కాలువకు ఇరువైపులా పెద్దపెద్ద చెట్లు పెరిగి సిమెంట్ లైన్లు పగిలిపోయాయి. ఎక్కడికక్కడే కాలువ దెబ్బతింటోంది. నీటి ప్రవాహం ఒత్తిడికి కాలువకు గండ్లు పడుతున్నాయి. దీంతో కాలువకు అత్యధికంగా 8,300 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని వదలాల్సి ఉండగా.. కేవలం 6,000 క్యూసెక్కులకు మించి వదిలే పరిస్థితి లేకుండా పోయింది. కాలువ పరిస్థితిని బట్టి నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనంగానే మారింది. జిల్లాలో 94 కిలోమీటర్ల వరకు కాకతీయ కాలువ కాకతీయ కాలువ ప్రారంభం నుంచి ఎల్ఎండీ వరకు 146 కిలోమీటర్ల వరకు ఉండగా.. జిల్లాలో 94 కిలోమీటర్ల వరకు కాకతీయ కాలువ ప్రవహిస్తుంది. ఒక్క జిల్లాలోనే దాదాపు లక్ష ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. కాకతీయ కాలువకు గతంలో వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, చెట్లు విరిగి, నీటికి అడ్డంకిగా మారడంతో నీటి ఒత్తిడి పెరిగి గండ్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతు చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో కాలువ శిథిలమవుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రపంచబ్యాంకు నిధులతో అక్కడక్కడ మరమ్మతు చేసినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాకతీయ కాలువలో ప్రస్తుతం ఉన్న లోతుకు అదనంగా మీటర్ లోతు పెంచాలని, వెడల్పు పెంచి, అధిక నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి, ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. కాకతీయ కాలువకు గండ్లు మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో కాకతీయ కాలువకు గండ్లు పడ్డాయి. ఆ సమయంలో రైతులు సాగు చేసిన పంట పొలాలు దెబ్బతిన్నాయి. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా రైతులకు నష్టపరిహారం రాలేదు. కాకతీయ కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీలు, సబ్ డిస్టిబ్యూటరీలు, ఉపకాలువల లైనింగ్ దెబ్బతిన్నాయి. తూములు పడిపోయాయి. షట్టర్లు విరిగిపోయాయి. ప్రధాన కాలువకు ఉన్న యూటీలు, అక్విడెట్లు, డ్రాపులు, సూపర్ ప్యాసెజ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువకు ఎప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ యూటీలు, అండర్ప్యాసెజ్ల వద్ద నీరు లీకేజీ అవుతూనే ఉంది. దీంతో పూర్తి స్థాయిలో కాలువకు నీటిని విడుదల చేయకపోవడం.. కొద్దిపాటి నీటిని విడుదల చేస్తే, కాలువకు ఇరువైపులా మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం గగనంగా మారింది. కాలువ పర్యవేక్షణ అంతంతమాత్రమే నీటి పారుదల శాఖ పరిధిలో ఉండే ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడం, పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో.. ఎక్కడికక్కడే కాలువలు శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి. కాలువకు నీరు విడుదల చేసే ముందు కాలువలో ఉన్న చెత్తాచెదారాన్ని, విరిగిన చెట్లు, కాలువ గట్ల నుంచి వచ్చేవరద నీటితో చేరిన మట్టిని తొలగించడం లేదు. దీంతో కాలువలో ఉన్న కట్టెలు, చెత్తాచెదారం కొట్టుకొచ్చి డ్రాపుల వద్ద ఆగుతుండడంతో నీరు ఆగి, కాలువ గట్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాకతీయ కాలువకు మరమ్మతు శూన్యం ఏటా తగ్గుతున్న కాలువ నీటి సామర్థ్యం నిధులు లేవు.. పర్యవేక్షణ అంతంతే -
ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల్లేవ్..
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఉన్న జనరల్ ఆస్పత్రి జిల్లాలోనే పెద్దది. ఇక్కడ మెడికల్ కళాశాల కూడా ఏర్పడటంతో రోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కానీ వారికి సరిపడా అత్యవసరమైన మందులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నా రు. ఈ పరిస్థితి కొన్ని రోజులుగా నెలకొన్నా.. అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు మెడికల్ షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు కల్పించినా.. మందులు లేకపోవడం.. ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి రావడంపై రోగులు పెదవి విరుస్తున్నారు. నిత్యం వెయ్యి మందికి పైగానే.. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున్న ఉన్న నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఈ జనరల్ ఆస్పత్రికి వస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ వెయ్యి మందికి ఓపీ ఉంటుంది. జ్వరం, ఇతరత్రా రోగాలతో బాధపడుతు న్న వారు చికిత్స చేయించుకుంటారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నమాటేగానీ.. వారికి కావాల్సిన మందులు లేకపోవడంతో వైద్యులు రాసిచ్చిన చీట్టీ తీసుకెళ్లి బయట ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది పేదలు, మధ్యతరగతి వారిపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. చిన్నచిన్న మందులు కూడా ఆస్పత్రికి రావడం లేదని, ఇందుకు బడ్జెట్ లేకపోవడమే ప్రధాన కారణమని ఆస్పత్రివర్గాల వారే పేర్కొంటున్నారు. కొరత ఉన్న మందులు లాబెటలాల్, నెపెంటిన్, లివోప్రిన్, బివీవైకై న్, ఎనామిన్, మెపెంట్రినిన్ వంటి మందులతో పాటు, పారాసిటమాల్, ఇతరత్రా చిన్నచిన్న మందులు కూడా లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఆస్ప త్రి సిబ్బందికి కావాల్సిన గ్లౌస్లు కూడా లేవని పేర్కొంటున్నారు. చిన్నచిన్న మందులతో పాటు, గ్లౌస్లు, సర్జికల్‌కు సంబంధించిన సామగ్రి వెంటనే తెప్పించేలా చూడాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ చొరవ తీసుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అత్యవసర గోళీలు కూడా కరువే.. ఇబ్బంది పడుతున్న రోగులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు బడ్జెట్ లేకపోవడమేనంటున్న ఆస్పత్రి వర్గాలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు -
మహిళా సమాఖ్యకు అవార్డు
● రుణాల చెల్లింపులో రాష్ట్రంలోనే మొదటి స్థానం మెట్పల్లి: వ్యాపారం, రుణాల చెల్లింపుల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను మెట్పల్లి పట్టణ మహిళా సమాఖ్య రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన సీ్త్రనిధి 13వ సర్వసభ్య సమావేశంలో సమాఖ్య అధ్యక్షురాలు బబ్బూరి లక్ష్మీ, మెప్మా టీఎంసీ సోమిడి శివకు మంత్రి సీతక్క చేతులమీదుగా అవార్డు అందించి అభినందించారు. గతంలో కూడా మెట్పల్లి సమాఖ్య మొదటి స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో మెప్మా ఏఓ శ్రీనివాస్, సీ్త్ర నిధి మేనేజర్ గంగాజలలు ఉన్నారు. -
మహిళలకు ‘అక్షర’ పరీక్ష
జగిత్యాలరూరల్: నిరక్షరాస్యత నిర్మూలనకు మహిళా సంఘాల ద్వారా కృషి చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రఘువరణ్ తెలిపారు. ఆదివారం ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలంతోపాటు గొల్లపల్లెలో మహిళలకు నిర్వహించిన పరీక్షను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువురాని మహిళలను ముందుగా గ్రామసంఘాల సహాయకుల ద్వారా గుర్తించి వారికి సాయంత్రం పూట అక్షరాలు నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పాఠశాలల్లో పరీక్ష నిర్వహించామన్నారు. జిల్లాలో దాదాపు 22 వేల మంది మహిళలు ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారన్నారు. విద్యాశాఖ సహకారంతో అన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామైక్య సభ్యులు, వీవోఏలు, సీసీలు, ఏపీఎంలు పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా అదనపు ప్రాజెక్ట్ అధికారి పి.సునీత, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి మండల కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఐబీ ఏపీఎం ఓదెల గంగాధర్, ఏపీఎం రమాదేవి, సీసీలు మహేశ్, గంగారాం, గంగాధర్, ఆయా మండలాల అధ్యక్షురాలు, గ్రామ సమైక్య అసిస్టెంట్లు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఖాళీస్థలాలు.. అపరిశుభ్రతకు నిలయాలు
రాయికల్: పట్టణంలో ఖాళీస్థలాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. రాయికల్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు బల్ది యాలో స్థలాలు కొనుగోలు చేసి వదిలివేయడంతో వాటిలో చెట్లు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం, డ్రైనేజీలోకి చేరడంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పట్టణంలో పర్యటించిన కలెక్టర్ సత్యప్రసాద్ ఖాళీస్థలాలు అపరిశుభ్రంగా, పిచ్చిమొక్కలతో నిండి ఉన్నా వెంటనే సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజును ఆదేశించినప్పటికీ ఆచరణలోకి మాత్రం రావడం లేదు. పట్టణంలోని భీమన్నవాడ, కేశవనగర్, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా, మాదిగకుంట, కోరుట్ల క్రాసింగ్రోడ్ తదితర కాలనీల్లో ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో విష పురుగులు, పాములు తిరుగుతున్నాయి. అపరిశుభ్రంగా ఉన్న స్థలాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. అయినా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. కొరవడిన పర్యవేక్షణ స్థల యజమానులు ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు చేపట్టాలి. కానీ కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకుని వదిలేస్తున్నారు. దీంతో ఆ స్థలాలు మురికికూపాలుగా మారుతున్నాయి. సంబంధిత యజమానులకు అధికారులు అప్పుడప్పుడు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ పట్టణంలో కొందరి వివరాలు తెలియక మున్సిపల్ అధికారులు నోటీసులు సైతం ఇవ్వడం లేదు. ఖాళీ స్థలం ఉంటే పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అసలు బల్దియా పరిధిలో ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయో మున్సిపల్ అధికారుల వద్ద వివరాలు లేవు. -
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ఎన్ఆర్ఐలు ముందుకెళ్లాలి
రాయికల్: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఎన్ఆర్ఐలంతా పార్టీ కోసం సైనికులా పనిచేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌టీసీ మాజీ చైర్మన్ కూర్మాచలం అనిల్ పిలుపునిచ్చారు. శనివారం లండన్‌లో బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎత్తిచూపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేవరకు సోషల్ మీడియా ద్వారా నిరసన చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు హరిగౌడ్, సత్యమూర్తి, మాజీ అధ్యక్షుడు దూసరి అశోక్‌గౌడ్, జనరల్ సెక్రటరి రత్నాకర్, అడ్వైజరి బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా దినేశ్
జగిత్యాల/ధర్మపురి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ధర్మపురికి చెందిన సంగనభట్ల దినేశ్‌ను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు పోటీపడినా.. మాజీమంత్రి, దివంగత జువ్వాడి రత్నాకర్‌రావుకు నమ్మినబంటుగా పనిచేసిన దినేశ్కే పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య మొన్నటి వరకు వార్ జరి గిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేయకముందు జీవన్‌రెడ్డి కొందరి పేర్లను ప్రతిపాదించారు. అయినా అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కూడా మరికొందరి పేర్లను ప్రతిపాదించారు. వారి ద్దరి మధ్య గొడవలు జరగడంతో నామినేషన్ పదవుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో గ్రంథాలయ చైర్మన్ పదవిని దినేశ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు చెందిన నియోజకవర్గం కావడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దక్కించుకున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి నుంచి చాలామంది పదవి కోసం పోటీపడినప్పటికీ చివరకు దినేశ్‌ను పదవి వరించింది. -
సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
జగిత్యాల: ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, బడ్జెట్లో ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ పర్యటనలకే పరిమితయ్యారని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ సీఎం సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. తన కార్యాలయంలో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. నియోజకవర్గంలోని 24 మందికి రూ.5 లక్షల విలువైన చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
గడువు మూడురోజులే..!
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026జగిత్యాల: మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తి పన్నే ప్రధాన ఆదాయం. ఈ నిధుల ద్వారానే పారిశుధ్యంతోపాటు, వీధిదీపాల వంటి వసతులు కల్పిస్తారు. కార్మికులకు వేతనాలు ఇస్తుంటారు. కానీ ఆస్తిపన్ను వసూలు మాత్రం లక్ష్యం చేరడ లేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడురోజులే గడువు ఉంది. ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో బకాయి పడిన వారికి రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ చెల్లించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తుల జప్తునకు చర్యలు చేపడతారు. రెడ్ నోటీసులు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. అతిపెద్ద బల్దియా అయిన జగిత్యాలలోనే అధికమొత్తంలో బకాయిలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను వదిలేసినా ప్రైవేటు బిల్డింగ్ యజమానులే ఒక్కొక్కరు రూ.13 లక్షల నుంచి రూ.15లక్షలకు పైగా బకాయి ఉన్నారు. ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నా.. చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈనెల 31లోపు చెల్లించకుంటే ఆస్తులు జప్తుచేస్తామని బల్దియా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. వసూలయ్యేనా..? అధికారుల ఉదాసీనతా..? ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణమో తెలియదుగానీ జిల్లాకేంద్రమైన జగిత్యాల బల్దియాలోనే ఆస్తిపన్ను తక్కువ శాతం నమోదైంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. అయినా ఇప్పటివరకు వసూళ్లు సగానికి కూడా చేరుకోలేదు. జగిత్యాలలో డిమాండ్ రూ.1401.31 కోట్లు. వసూలైంది మాత్రం రూ.685.73 కోట్లు. మొదటి స్థానంలో కోరుట్ల బల్దియా ఉంది. ఇక్కడ రూ.570.02 కోట్ల డిమాండ్‌కు రూ.515.80 కోట్లు వసూలైంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అధికారులు వసూళ్ల కోసం హడావుడి చేయడమే తప్ప గడుపులోపు పూర్తయింది ఎప్పూడూ లేదు. ఈనెల 31లోపు వందశాతం వసూలు అయితేనే కేంద్రప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది. బల్దియా ఇళ్లు డిమాండ్ వసూలు (రూ.కోట్లలో) జగిత్యాల 27,877 14 685.73 కోరుట్ల 19,714 5.70 515.80 మెట్పల్లి 13,823 4.78 387.12 ధర్మపురి 4,849 1.85 74.36 రాయికల్ 5,527 1.34 101.72 మొత్తం 71,790 27.69 17.64.73 లక్ష్యం చేరని ఆస్తి పన్ను వసూళ్లు చెల్లించకుంటే రెడ్ నోటీసులు జారీ జప్తు చేసేందుకు ప్రత్యేక వాహనాలు -
ఆస్తి పన్ను కట్టకుంటే కరెంట్ కట్
కోరుట్ల: కోరుట్లలో ఆస్తి పన్ను వసూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో అధికారులు ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటే పొరపాటు పడ్డట్టే.. ఇప్పటికే 90 శాతం ఆస్తి పన్ను వసూళ్లు పూర్తయి రాష్ట్రస్థాయిలోనే మూడో స్థానంలో ఉంది. అయినా ఇంత కఠినంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారంటే.. స్పెషల్ గ్రాంట్ కోసం అని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఏమిటీ గ్రాంట్..!? మార్చి 31 వరకు 95 నుంచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేసిన మున్సిపాలిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పెషల్ గ్రాంట్ కింద రూ. 3 కోట్లు వచ్చే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలో కొన్నిచోట్ల మున్సిపాలిటీలకు చెందిన అధికార యంత్రాంగం ముందువెనకా చూడకుండా పన్నుల వసూళ్లకు పూనుకుంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో మొత్తం మున్సిపాలిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట 91 శాతం, హుజూరాబాద్ 90.05 శాతంతో మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. కోరుట్ల 90 శాతంతో మూడో స్థానంలో ఉంది. అయినప్పటికి టార్గెట్ రీచ్ కావడానికి కొందరు మున్సిపల్ అధికారులు ఎక్కడలేని తాపత్రాయం చూపుతున్నారు. నల్లా కనెక్షన్లు తీసేయడం మున్సిపల్ అధికారుల పరిధిలోకి వచ్చేది కావడంతో ఎవరు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కొంతమంది అధికారులు మరి కాస్త ఉత్సుకత చూపి కరెంట్ మీటర్లు కట్ చేసే వరకు వెళ్లడం కలకలం రేపుతోంది. సంక్షేమ స్ఫూర్తికి దెబ్బ.. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వారందరికి జీ రో బిల్లు ఇచ్చి ఆదుకుంటోంది. కానీ.. ప్రభుత్వ సంక్షేమ స్ఫూర్తికి విరుద్ధంగా నిరుపేదల ఇంటి పన్నుల వసూళ్లకు మున్సిపల్ అధికారులు కరెంటు కనెక్షన్లు కట్ చేయడం విడ్డూరం. ఈ విషయం విద్యుత్ శాఖ అఽధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఏకంగా పోల్ పైకి ఎక్కి సర్వీస్ వైర్లను మున్సిపల్ సిబ్బంది కట్ చేయడం విచిత్రం. విద్యుత్ శాఖ అధికారులకు తెలపకుండా కరెంట్ సరాఫరా నిలపకుండా పోల్ ఎక్కితే విద్యుత్ షాక్ వంటి సమస్యలు వచ్చి పన్ను వసూలుకు వెళ్లిన ఉద్యోగులు చిక్కుల్లో పడితే బాధ్యులు ఎవరన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్‌ను వివరణ కోరితే తాము కలెక్టర్ ఆదేశాల మేరకు ఆస్తి పన్ను చెల్లించని వారి ఇళ్లకు కరెంటు కట్ చేస్తున్నామని చెప్పడం విశేషం. ‘అయ్యా.. నా పేరు దండుగుల లత.. మేం పేదోల్లం. మాకు కోరుట్ల అయోధ్యనగర్‌లో ఇల్లు ఉంది. మా మామ కనకయ్య ఇంటిపై ఆస్తి పన్ను రూ.2,300 ఉంది. ఆ పన్ను కట్టాలని పొద్దున్నే నలుగురు మున్సిపాల్టీ వాళ్లు వచ్చారు. వద్దు సార్.. పన్ను కడతామని చెప్పినా వినకుండా మిషన్ భగీరథ కనుక్షన్ కట్ చేశారు. కరెంట్ కనెక్షన్ తీసేసి వెళ్లిపోయారు. అసలే ఎండాకాలం.. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పినా వినలేదు. ఆస్తి పన్ను కట్టండి.. కరెంట్ పెట్టిస్తాం’.. అని చెప్పి వెళ్లారు. అలా అదే ఏరియాలో మరో మూడు ఇళ్లకు కరెంట్ కట్ చేసి వెళ్లారు. ఇదీ..కోరుట్ల మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లకు అధికారులు చేపట్టిన వింత పోకడ. -
రమణయ్య మరణం తీరని లోటు
జగిత్యాల: ప్రముఖ చరిత్రకారుడు రమణయ్య మరణం చరిత్రకు, ప్రజలకు తీరని లోటు అని చరిత్ర రాష్ట్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి అన్నారు. చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు శనివారం నివాళులర్పించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, కోటలు అనే గ్రంథాలు నేటి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఆయన డైరీ రూపంలో చరిత్రను రాసి ఒక నూతన ఒరవడి చుట్టారని తెలిపారు. సమితి సభ్యులు సుదర్శన్, నరేశ్, నిర్మల, రజిత పాల్గొన్నారు. -
సంతలో నిలిచిపోయిన అమ్మకాలు
ధర్మపురి: పట్టణంలని వారసంతలో అమ్మకాలు నిలిపివేయడంతో తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రతి శనివారం వారసంత సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది వాపారులు తమత మ వస్తువులను విక్రయించుకుంటారు. చింతామణి చెరువు కట్టపై కొందరు బట్టలు అమ్ముకుంటారు. బట్టల వ్యాపారులు రోడ్డుపై విక్రయాలు చేపట్టొద్దని మున్సిపల్ అధికారులు అడ్డుకోవడంతో తెచ్చుకున్న బట్టల మూటలన్నీ అలాగే ఉండిపోయాయి. 20ఏళ్లుగా ఇక్కడ అమ్మకాలు చేస్తున్నామని, దూర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న అద్దె వాహనాలతో నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా.. గోదావరి పుష్కరాల సందర్భంగా రోడ్డు పనులు జరుగుతున్నందున రోడ్డుపై అమ్మకాలు నిలిపివేశామని, చెరువు కట్ట వాకింగ్ ట్రాక్‌పై పెట్టుకోవాలని సూచించామని, వ్యాపారులు బెట్టుకుపోయి అమ్ముకోలేదన్నారు. ఆస్తి తీసుకుని పోషించడంలేదని..కథలాపూర్: ఆస్తి తీసుకుని తనను పోషించడంలేదని మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రండం పుల్లయ్య తన చిన్న కూతురు లావణ్యతో కలిసి శనివారం కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోతారం గ్రామానికి చెందిన రండం పుల్ల య్యకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్లి అయ్యింది. పెద్ద కూతురు భర్తతో కలిసి పోతారంలో నివసిస్తోంది. చిన్న కూతురు లావణ్య కోరుట్లలో ఉంటోంది. తన ఆస్తి మొత్తాన్ని గ్రామంలో ఉంటున్న పెద్ద కూతురు తీసుకుందని, వృద్ధాప్యంలో ఉన్న తనను పోషించడంలేదని పుల్లయ్య చిన్న కూతురితో కలిసి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. గతంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. తనను పోషించాలని పెద్ద కూతురుకు చెప్పారని తెలిపారు. దీంతో విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తామని ఆర్డీవో వృద్ధుడికి సూచించడంతో కూతురుతో కలిసి వెళ్లిపోయాడు. -
లోక్ అదాలత్‌లో 3034 కేసుల పరిష్కారం
జగిత్యాలక్రైం: జిల్లాలోని వివిధ కోర్టుల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో 3034 సివిల్, క్రిమినల్, మోటార్ వాహనాల కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. సివిల్ 37, క్రిమినల్ 2,473, పెండింగ్ 2,510, ప్రిలిటిగేషన్ 524 కలిపి మొత్తం 3034 కేసులు పరిష్కారమయ్యాయి. మోటారు వాహనాల కేసుల్లో రూ.6,05,000 బాధితులకు పరిహారం ఇప్పించారు. కోర్టు కేసుల్లో ఉన్న ఇద్దరు దంపతులను రాజీమార్గం కుదిర్చి న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఏకం చేయించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రమణ్యశర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. ధర్మపురిలో 456 కేసుల పరిష్కారం ధర్మపురి: ధర్మపురి సివిల్ కోర్టులో 456 కేసులు పరిష్కరించినట్లు సివిల్ కోర్టు జడ్జి శ్రీనిజ తెలిపారు. చిన్నచిన్న తప్పులతో షరతులకు పోకుండా రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, న్యాయవాదులు రామడుగు రాజేశ్, గడ్డం సత్యనారాయణరెడ్డి, బత్తిని ఇంద్రకరణ్, జాజాల రమేశ్ తదితరులు ఉన్నారు. లోక్ అదాలత్‌లోనే సత్వర న్యాయం మెట్పల్లి: లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం అందుతుందని సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. 300 కేసులు పరిష్కరించారు. ఇందుకు కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులను అభినందించారు. జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దయ్య రాజారాం, ఏపీపీ ప్రణయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు కిరణ్‌కుమార్, నవీన్, అనిల్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
జగిత్యాల: హజ్ యాత్రకు వెళ్లేవారికి జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగిత్యాల విద్య, వైద్యానికి హబ్‌గా మారిందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుజాత, శ్రీనివాస్, ఆనంద్ పాల్గొన్నారు. దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదుజగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్‌రోడ్ టీపాయింట్ వద్ద లాక్కాకుల మనోజ్‌పై దాడిచేసిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన మనోజ్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్ దీక్షిత్‌కు రూ.80 వేలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల అడగగా.. ఈనెల 17న సాయంత్రం ఇస్తానని, టీ పాయింట్ వద్దకు రమ్మని తెలిపాడు. మనోజ్ అక్కడికి చేరుకోగానే దీక్షిత్‌తోపాటు, కుసుంబ నిఖిల్, రాయికల్ నరేశ్ కూల్‌డ్రింక్ సీసాతో తలపై కొట్టారు. అతడి వద్ద ఉన్న రూ.2 వేలు లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుప్రియ కేసు నమోదు చేశారు. రౌడీషీటర్ దీక్షిత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
మ్యూల్ అకౌంట్లతో రూ.138 కోట్ల స్కాం
కరీంనగర్ క్రైం: అమాయకులకు డబ్బు ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాల ద్వారా విదేశాల్లోని సైబర్ నేరగాళ్లలో లావాదేవీలు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు మ్యూల్ అకౌంట్లకు మళ్లించారు. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్బీఎల్) కోఆపరేటివ్ సొసైటీ వేదికగా ఆ కుంభంకోణం జరగగా.. కరంట్ అకౌంట్లు పొంది సైబర్‌నేరాల్లో పాల్పంచుకున్న 13మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన బండారి సాయిరాం(30) అమాయకులతో పాటు డబ్బు అవసరం ఉన్నవారితో నగరంలోని ఆర్బీఎల్ బ్యాంకులో కరంట్ ఖాతాలు తీయించాడు. ఇతనికి బ్యాంకు మేనేజర్ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్(52), క్యాషియర్ నగరానికి చెందిన చెందిన ఆయేషా బేగం(30) సహకరించారు. బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌కు చెందిన అనుమండ్ల రంజిత్(36), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన అలిగెటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన బోగ రాకేశ్(35), రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన బండి ప్రణయ్(25), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన నాతర్ల శ్రీనివాస్(39), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేశ్(27), వరంగల్‌కు చెందిన కర్రె రాజు(35)లకు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.138 కోట్ల లావాదేవీలు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో జరిపినట్లు ఆపరేషన్ క్రాక్‌డౌన్ ద్వారా పోలీసులు గుర్తించారు. బండారి సాయిరాం కీలకంగా వ్యవహరిస్తూ.. సదరు ఖాతాదారులకు కమీషన్లు అందించినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 24మంది ఉన్నట్లు గుర్తించి, పై 13మందిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు తిరుమల్, సృజన్‌రెడ్డి, రాంచందర్‌రావు, సరిలాల్ను సీపీ అభినందించారు. -
గురి తప్పని బాణం
కరీంనగర్‌స్పోర్ట్స్/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ స్టేజ్–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో రజత్ చౌహాన్, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్లో కజకిస్థాన్‌పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు. -
కాశీకి వెళ్తూ... అనంత లోకాలకు..
మానకొండూర్: తన తల్లి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు మానకొండూర్‌కు చెందిన రామోజు శ్రీనివాస్(55) కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. శ్రీనివాస్ కుల వృతి(గోల్డ్ వర్క్) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తల్లి మణెమ్మె 3 నెలల క్రితం చనిపోగా.. ఆమె అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు గురువారం ఉదయం రైలులో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బయలు దేరారు. మార్గమధ్యలో మహారాష్ట్ర సేవాగ్రామ్ వద్ద శ్రీనివాస్ తాగునీరు కోసం గురువారం రాత్రి రైలు దిగాడు. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొనడంతో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. -
రామణీయం.. కల్యాణం
జగిత్యాలటౌన్: కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణంజగిత్యాలటౌన్: సీతారామాంజనేయస్వామి ఆలయంలో భక్తులు ధర్మపురి: కల్యాణ వేడుకలకు హాజరైన భక్తజనం పల్లె, పట్టణాలు శ్రీరామ నామ స్మరణతో మారుమోగాయి. శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై శ్రీసీతారాముల కల్యాణం నయనానందంగా జరిపారు. దొంతాపూర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వామివారలను దర్శించుకున్నారు. జగిత్యాల పట్టణం విద్యానగర్ శ్రీసీతారామచంద్రస్వామి తదితర ఆలయాల్లో స్వామివారల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ధరూర్ క్యాంపు శ్రీకోదండరామాలయంలో కౌన్సిలర్ బోయినిపల్లి ప్రశాంత్‌రావు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లాపూర్ మండలం సిరిపూర్‌లోని శ్రీరామాలయం, రాయికల్ మండలం అయోధ్యలో నిర్వహించిన వేడుకలకు భక్తులు తరలివచ్చి కల్యాణం తిలకించారు. – సాక్షి నెట్వర్క్ మల్లాపూర్: సిరిపూర్‌లోని శ్రీరామాలయంలో.. రాయికల్: అయోధ్యలో కల్యాణం తిలకిస్తున్న భక్తులుధర్మపురి: దొంతాపూర్‌లో స్వామివారలను దర్శించుకుంటున్న మంత్రిరాయికల్: చిన్నారుల వేషధారణ -
11 కేవీతో 30 ఏళ్ల సమస్య పరిష్కారం
ధర్మపురి: ముప్పైఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల సమస్యకు 11 కేవీ విద్యుత్ లైన్‌తో పరిష్కారం లభించిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ లైన్‌ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. శ్రీరాములపల్లె నుంచి ధర్మపురి వరకు రోడ్డు పక్కనున్న ఇళ్ల మీదుగా 11 కేవీ లైన్ పోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించామని వివరించారు. ధర్మపురిలో బస్‌డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గేదెలకు నష్ట పరిహారం కింద ఐదుగురు రైతుల కుటుంబాలకు రూ.1.67 లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేశ్, వేముల రాజు, ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం, కౌన్సిలర్లు తదితరులున్నారు. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలిపెగడపల్లి(ధర్మపురి): ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కమార్ అన్నారు. మండలంలోని అయితిపల్లి, ఎల్లాపూర్ రామాలయాల్లో శుక్రవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. రాత్రి నంచర్లలో జరిగిన స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజలపై రాముని ఆశీస్సులు ఉండి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు అంజమ్మ, రాజేశం, రమణాకర్, మాజీ జెడ్పీటీసీ రాజేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
దారిలో కలిసి.. తోడుగా నడిచి..
వారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన హనుమాన్ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలుదేరారు. దారిలో ఓ శునకం ఎదురుపడగా దానికి ఓ బిస్కట్ ఇచ్చారు. దీంతో ఆ శునకం దీక్షాపరులతో పాటు కొండగట్టు వరకు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేస్తున్న శునకానికి కాళ్లనొప్పులు రావడంతో సాక్స్‌లు సైతం తొడిగారు. ఐదురోజులుగా పాదయాత్ర చేస్తుందని, వెళ్లగొట్టినా పోవడం లేదని, సుమారు 130 కి.మీ దూరం తమతో నడిచి వచ్చిందని దీక్షాపరులు తెలిపారు. శుక్రవారం కొండగట్టుకు చేరుకున్నామని పేర్కొన్నారు. – జగిత్యాల -
రమణయ్య మృతి తీరనిలోటు
జగిత్యాల: ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య మృతి తీరని లోటని ప్రముఖ సాహితీవేత్త, రచయిత కేవీ.నరేందర్ అన్నారు. రమణయ్య మృతికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ అస్థిత్వాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో రచించడంతో పాటు, వాటిని పలు భాషల్లో ముద్రించారని, గ్రామీణ చరిత్రను ఎంతో వెలికితీశారని అన్నారు. ఆయన మృతి యావత్ తెలంగాణకు తీరని లోటన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎంపీ కృషిరాయికల్(జగిత్యాల): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో సీతారాముల క ల్యాణ వేదికకు ఎంపీ నిధులు మంజూరు చే యగా నిర్మించిన కల్యాణ వేదికను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు ఆకుల మహేశ్, పట్టణ అధ్యక్షుడు కు ర్మ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు కోల శంకర్, నాయకులు బోయిని నరేందర్, ఎనుగంటి రాజు, ఆర్మూర్ నరేందర్, కనికారపు రాజేశ్, గంగారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
కోరుట్లరూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పెల్లి గ్రామానికి చెందిన కొండ్ర రాజేశ్ (36) 20 రోజుల క్రితం దుబాయ్‌లో మృతిచెందగా శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజేశ్ పదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. ఇక్కడే సోరియాసిస్ వ్యాధి సోకింది. వ్యాధి నివారణ కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు 3 నెలల క్రితం మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అక్కడ వ్యాధి మరింత వ్యాప్తి చెంది శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించగా దుబాయ్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై 20 రోజుల క్రితం మృతిచెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
గడువులోగా ఆస్తిపన్ను చెల్లించాలి
జగిత్యాల/రాయికల్/ధర్మపురి: ఆస్తిపన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం జగిత్యాల, రాయికల్, ధర్మపురి మున్సిపాల్టీల్లో ఆస్తిపన్ను వసూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బకాయిదారులు ఈనెల 31లోపు పన్ను చెల్లించకుంటే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. సకాలంలో చెల్లించకుంటే నల్లా కనెక్షన్లు తొలగించాలని పేర్కొన్నారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్లు స్పందన, కీర్తి నాగరాజు, శ్రీనివారావు, తహసీల్దార్ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రిగారు.. ధాన్యం మాకొద్దు
జగిత్యాలరూరల్: జిల్లాలోని పారాబాయిల్డ్ రైస్‌మిల్లర్లకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించినా ఆ సమయంలోగా బియ్యం సేకరించకపోవడంతో మిల్లుల్లో వేలాది మెట్రిక్ టన్నుల వరిధాన్యం పేరుకుపోతోంది. కాగా, మళ్లీ 15 రోజుల్లో రబీ ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిల్లర్లు తాము ధాన్యాన్ని తీసుకోలేమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగారావుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. మిల్లర్లకు తప్పని కష్టాలు జిల్లాలో పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు 100 ఉండగా గతంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీల ద్వారా మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు బియ్యాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా కేంద్రం రెండు పంటలకు సంబంధించిన బియ్యం తీసుకోవడం లేదు. మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. దీంతో జిల్లాలో రెండునెలలుగా మిల్లులను మూసివేశారు. ఈనేపథ్యంలో హమాలీ చార్జీలు, ఆపరేటర్లు, వర్కర్లకు నెలనెలా వేతనాలు, కరెంట్ బిల్లులు మీద పడుతుండటంతో మిల్లర్లకు ఆర్థికంగా సంక్షోభంలో పడుతున్నారు. దీంతో రబీ సీజన్ ధాన్యాన్ని తీసుకోమని ప్రభుత్వానికి ముందస్తుగానే సమాచారం అందిస్తున్నారు. సంక్షోభంలో మిల్లర్లు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మిల్లులు నెలకొల్పిన యజమానులు నిర్వహణ భారంతో సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వరిధాన్యం గోదాముల్లో పేరుకుపోయి తుప్పు పట్టే పరిస్థితి ఉండగా, ప్రభుత్వం మాత్రం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం అప్పగించాలని సూచిస్తుంది. ఏళ్ల తరబడి నిల్వ ఉన్న ధాన్యం రంగుమారే అవకాశాలు ఉండటంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ● మంత్రి అడ్లూరికి వినతిపత్రం సమర్పించిన మిల్లర్లు -
పొద్దుపొద్దున్నే ఘోరం
జగిత్యాలక్రైం/రాయికల్/రుద్రంగి: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీమేసీ్త్ర రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచ్చిన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్తీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో తాపీమేసీ్త్ర వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్ శ్రీరామనవమి సందర్భంగా వారివారి స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్‌లో బుధవారం సాయంత్రం 4.30గంటలకు బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. ఘటనలో దేవండ్ల రామయ్య కూడా మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టి డబ్బులు కట్టేందుకు.. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్ అయోధ్యలో పోలయ్య తాపీమేసీ్త్ర వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చీటీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్‌తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేసీ్త్రగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే.. రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్ విలపిస్తూ చెప్పాడు. రామయ్య కుటుంబసభ్యుల్లో ఆందోళన కాలి బూడిదైన బస్సులో రుద్రంగికి వలస వచ్చిన తాపీమేసీ్త్ర దేవాండ్ల రాములు ఉండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన రాములు నాలుగేళ్లుగా రుద్రంగిలో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ప్రమాదం జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేణుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సు దగ్ధమై మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో బూడిదవడంతో మృతి చెందాడా..? లేదా..? అన్నది డీఎన్ఏ ఆధారంగా నిర్ధారిస్తామని పోలీసులు తెలిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
ఫొటోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు
జగిత్యాలజోన్: ఓ వివాహిత తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. చాటుగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్ చేసి.. ఆమెను శారీరకంగా లోబర్చుకున్న కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిట్ల నర్సయ్య కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. తన భర్తకు స్నేహితుడైన అదే మండలం నర్సాపూర్‌కు చెందిన నరేండ్ల మహేందర్ అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. మహేందర్ ఓ రోజు ఇంటికి వచ్చిన సమయంలో మహిళ స్నానం చేస్తోంది. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియా తీసి.. ఆమె భర్తకు ఆమె గురించి చెడుగా చెప్పాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మహిళ పుట్టింటికి చేరింది. దీంతో మహేందర్ తన ఫోన్లో ఉన్న మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. 2022 ఏప్రిల్ 19న కూడా రాత్రి సమయంలో వచ్చి వీడియోలు తొలగిస్తానని చెప్పి మళ్లీ శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీడియోలు తీసేయమంటే, తాను అడిగినప్పుడల్లా కోరిక తీర్చాల్సిందేనని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తనకు జరుగుతున్న అన్యాయాన్ని గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడైన మహేందర్‌ను అరెస్ట్ చేసి..కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, బి.రాజు, వి.శ్రీధర్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో పరిశీలించిన అనంతరం మహేందర్‌కు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
కానిస్టేబుల్ అవయవాలు దానం
జగిత్యాలక్రైం: తాను మరణించినా మరో ఇద్దరి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అవయవాలు దానం చేశారు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు. కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నల్లాల లక్ష్మీరాజం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. దుఃఖంలో ఉన్నప్పటికీ ఆయన భార్య రాధ భర్త రెండు కిడ్నీలను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది. బైక్ ఢీకొని వృద్ధురాలు మృతికోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట సమీపంలో గుర్తు తెలియని ద్విచక్రవాహనం ఢీకొని అదే ప్రాంతానికి చెందిన కల్లెం లింగవ్వ(63) మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. లింగవ్వ వేములవాడ రోడ్ దాటుతుండగా కోరుట్ల నుంచి అతి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టి వెళ్లిపోయింది. లింగవ్వ తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావటంతో కోరుట్ల, అక్కడి నుంచి జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. లింగవ్వ కుమారుడు కల్లెం రాంచంద్రం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఇంధన నిల్వలు ఉన్నాయి
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026జగిత్యాల: జిల్లాలో ఇంధన నిలువలు ఉన్నాయని, ప్రజలు వదంతులు నమ్మవద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలు ఒక్కసారిగా బంకుల్లోకి రావడంతో విక్రయాలు పెరిగాయని, తద్వారా తాత్కాలికంగా నోస్టాక్ బోర్డులు పెట్టారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ముందుగానే సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యాసంగి కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ డివైడర్‌ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్‌లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. రాచర్ల బొప్పాపూర్‌లో విషాదం -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
డ్రంకెన్ డ్రైవ్‌లో 84 మందికి జరిమానాలు
వేములవాడ: పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ 84 మందిని కోర్టులో హాజ రుపరిచినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 17 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 46 మంది కి రూ.2వేలు చొప్పున జరిమానా, 21 మందికి రూ.4వేలు చొప్పున జరిమానా విధిస్తు వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెల్లడించినట్లు వివరించారు. మందుబాబులకు ఎస్సైలు రామ్మోహన్, సముద్రాల రాజు కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వారికి జైలుశి క్ష, జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్చార్జి జ డ్జి మంజుల బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫి క్ సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామ న్నారు. వారిలో శాంతినగర్‌కు చెందిన నల్గొండ కోటేశ్వర్కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌కు చెందిన జగదీశ్‌కు మూ డురోజులపాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారని వివరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సమ్మర్ స్పెషల్ రైలు రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్ – గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–గోరఖ్‌పూర్ (07075) వైపు ఏప్రిల్ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్‌పూర్ – హైదనాబా ద్(07076) వైపు ఏప్రిల్ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్, నిజామా బాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెండిళ్లలో చోరీచొప్పదండి: రెవెళ్లిలోని రెండిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇరుగురాల సరీన్ కుమార్ నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో బంధువు చనిపోతే ఇంటికి తాళం వేసి కుటుంబంతో వెళ్లాడు. బుధవారం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. పోలీసుల విచారణలో సరీన్ ఇంటిలో అరతులం బంగారం పోయినట్లు గుర్తించారు. క్లూస్ టీంతో విచారణ జరుపుతున్నారు. కాగా సరీన్ ఇంటి సమీపంలో నివాసం ఉండే రేకుల లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. లక్ష్మారెడ్డి ఖమ్మం జిల్లాలో ఉండే తన చిన్న కూతురు దగ్గరకు వెళ్లడం, అక్కడే ఉండటంతో చోరీకి ఏ వస్తువులు గురయ్యాయో తెలియలేదు. సరీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్‌క్రైం: సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాన్ని వేగవంతం చేయడంతో పాటు అవినీతి అధికారులకు అనుకూలంగా మారుతోంది. ఒకప్పుడు కవర్లలో, బ్యాగుల్లో దూరే నగదు, బళ్ల కింద నుంచి వెళ్లే లంచాలు ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ రూపంలో అకౌంట్లలో చెలామణి అవుతున్నాయి. ‘నగదు దొరికితేనే కేసు’ అనే పాత భావన నుంచి తప్పించుకోవడానికి అధికారులు డిజిటల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి మార్గాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసదాడులు చేపడుతున్నారు. యూపీఐ ద్వారా లంచం తీసుకున్న అధికారులను ఆధారాలతో సహా పట్టుకుని కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు. -
లక్కీ మిరానీ.. మిరాకిల్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌కు చెందిన లక్కీ మిరానీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతున్నాడు. బాల్యంలోనే చూపు కోల్పోయినప్పటికీ, సంకల్పం, క్రమశిక్షణతో చీకటిని జ్ఞాన వెలుగుగా మలచుకుంటూ తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడుతున్న దృష్టి లోపం గల యువకుడిగా లక్కీ మిరానీ రికార్డు సాధించాడు. మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 95.80శాతం మార్కులు సాధించాడు. యూజీసీ ఎంట్రెన్స్‌లో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించి, తొలి ప్రయత్నంలోనే యూజీసీ నెట్ క్లియర్ చేశాడు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటాడు. గోల్‌బాల్ క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. లక్కీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీ నిలవడం విశేషం. ప్రస్తుతం పాలిటికల్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్కీ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్‌లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
బల్దియా లైన్మెన్కు విద్యుత్ షాక్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న బొమ్మకల్‌కు చెందిన లైన్మెన్ శివ విద్యుత్‌షాక్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అలుగునూరులో స్ట్రీట్ లైట్ బిగిస్తున్న స మయంలో పక్కనే ఉన్న 11 కేవీ లైన్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మేయర్కొలగాని శ్రీనివా స్ వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకొని, శివ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సి పల్ కార్మికులకు భద్రతా పరికరాలు అందించాలని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. విద్యుత్‌షాక్‌తో గా యపడిన శివను ఆసుపత్రిలో పరామర్శించారు. రూ.3.46 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తులువీర్నపల్లి(సిరిసిల్ల): ఆన్లైన్ మోసగాళ్ల ఉచ్చులో ప డి ఓ రైతు భారీగా నగదు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలంలో అడవిపదిరలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన పొలగాని లచ్చయ్యకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. తాము ధని బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించారు. భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో పలు విడతల్లో రూ.3,46,799 కాజేశారు. నగదు పంపిన తర్వాత సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య పోలీసులను బుధవారం ఆశ్రయించారు. -
పాముకాటుతో వృద్ధురాలి మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్‌రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
అవమానాలు భరించలేకే..
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీలో 20 నెలలుగా ఎదురవుతున్న అవమానాలు భరించలేకే 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని వీడాల్సి వచ్చిందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని బండారి గార్డెన్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సభలో అభిమానులు, అనుచరుల సమక్షంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా రు. ఆయనకు మద్దతుగా వివిధ హోదాల్లో ఉన్న నా యకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి కొనసాగిన కాంగ్రెస్ పార్టీని వీడడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పలేదన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఎన్నికల సభలు, విజయోత్సవ సభలు నిర్వహించానని, పార్టీ వీడేందుకు ఇలాంటి సభ పెట్టాల్సి రావడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో తనకు పేరు రావడానికి కారణమైన అనుచరులు, అభిమానులు, నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు. విజయలక్ష్మి రాజీనామా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలి పదవితోపాటు కాంగ్రెస్ పార్టీకి తాటిపర్తి విజయలక్ష్మి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా రాజీనామా చేశారు. జీవన్‌రెడ్డితో తుల ఉమ భేటీ జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ జీవన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బీఆర్ఎస్ మహిళా నాయకురాలైన ఉమ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బతికపల్లి సర్పంచ్.. పెగడపల్లి: మండలంలోని బతికపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి పార్టీతోపాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. మాజీ సర్పంచులు తాటిపర్తి ప్రభాకర్‌రెడ్డి, నంచర్ల మాజీ సర్పంచ్ గోలి మహేందర్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. నర్సింహులపల్లి వార్డు సభ్యుడు.. కొడిమ్యాల: మండలంలోని నర్సింహులపల్లెకు చెందిన రెండో వార్డు సభ్యుడు మేడిపల్లి బాపురెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జీవన్‌రెడ్డికి విలువ లేని చోట తాము ఉండలేమని పేర్కొన్నారు. వెల్గటూర్ ఏఎంసీ చైర్పర్సన్.. వెల్గటూర్: వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుండాటి గోపిక తన పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీవన్‌రెడ్డి తమకు రాజకీయ గురువు అని, ఆయనకు గౌరవం లేని పార్టీలో తాము ఉండలేమని పేర్కొన్నారు. పదవుల కన్నా ఆత్మాభిమానం గొప్పదని, విలువ లేని చోట ఉండలేమని తెలిపారు. కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా 40 ఏళ్ల అనుబంధానికి భావోద్వేగ వీడ్కోలు ఆయనకు మద్దతుగా పలువురి రాజీనామా -
జేఎన్టీయూలో ఘనంగా వార్షికోత్సవం
కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి) వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైస్ చాన్స్‌లర్ కిషన్ రె డ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తామన్నారు. విద్యార్థులకు పతకాలు, ప్రశంసపత్రాలు అందించారు. ఫైనలియర్ విద్యార్థులు తమ అనుభవాలు, కళాశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు 24 గంటలు ప్రయోగశాలలు తెరచి ఉంచాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. అతిథులకు ప్రిన్సిపల్ నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జగిత్యాల
34.0/21.0గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 20267గరిష్టం/కనిష్టంఅట్రాసిటీ కేసులు పరిష్కరించాలిజగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.4,52,12,000 మంజూరయ్యాయని, విడుదల కాగానే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. ఎండవేడిమి అధికం అవుతుంది. -
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
మెట్పల్లి: పట్టణంలోని ఆర్టీసీ ఇన్‌గేట్ వద్ద బుధవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు పారాయణం చేశారు. గేట్ పక్కనున్న హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని అక్కడి నుంచి పక్కనే మరోచోట ఏర్పాటు చేసి పూజ లు చేశా రు. డిపో మేనేజర్ సరస్వతీ సిబ్బంది తో కలిసి అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రికత్తకు దారి తీసింది. బస్సుల ప్రవేశానికి ఇబ్బందులు కలగకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సహకరించాలని డీఎంను కోరారు. మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండిమెట్పల్లిరూరల్: జగ్గాసాగర్‌లో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాస్‌కు సర్పంచ్‌లు, రైతులు బుధవారం వినతిపత్రం అందించారు. జగ్గాసాగర్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఇబ్బందులుండవ న్నారు. సర్పంచ్‌లు జగన్, తిరుపతి, కాంగ్రెస్ నాయకుడు విజయ్, రైతులు రాజారెడ్డి, అంజయ్య, లింగం, రాజేశ్, మల్లేశ్ పాల్గొన్నారు. ఐస్‌క్రీం అమ్మితే రూ.ఐదువేల జరిమానా ● గ్రామాల్లో వెలుస్తున్న ఫ్లెక్సీలు ● తీర్మానిస్తున్న పాలకవర్గాలుమెట్పల్లిరూరల్: గ్రామాల్లో ఐస్‌క్రీం విక్రయాలపై పంచాయతీలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో బెల్ట్‌షాపులు, ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానాలు చేసిన పాలకవర్గాలు.. తాజాగా ఐస్‌క్రీం విక్రయాలను నిషేధిస్తున్నాయి. మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐస్‌క్రీం విక్రయాలు చేపట్టవద్దంటూ పాలకవర్గాలు తీర్మానించాయి. నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. దీనంతటికీ కారణం ఐస్‌క్రీం నాణ్యతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనడమే. ఇప్పటికే మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, వెల్లుల, వేంపేటలో ఐస్‌క్రీం బండ్లపై నిషేధం విధించారు. గ్రామంలో ఐస్‌క్రీం బండ్లకు అనుమతిలేదని, అమ్మితే జరిమానా విధిస్తామని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలాచోట్ల సొంతంగా ఐస్‌క్రీంలు తయారుచేసి విక్రయిస్తున్నారని, వాటిలో నాణ్యత లేక పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని పాలకవర్గాలు, ,గ్రామపెద్దలు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. కొండగట్టు టెండర్లు మరోసారి వాయిదామల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ టెండర్లు మరోసారి వాయిదాపడ్డాయి. బుధవారం కరీంనగర్‌లోని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించగా.. ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 30న తిరిగి కొండగట్టులో టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ పర్యవేక్షణ అధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వైద్య ఉద్యోగి శ్రీధర్ సెక్షన్ మార్పు జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్ నవీన ఏయిమ్స్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన ఎన్వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌పై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన ఆరోగ్య శాఖ అధికారులు ఎన్వోసీ జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీధర్ సెక్షన్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పైసా కొట్టు.. సర్టిఫికెట్ పట్టు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవినీతి చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈ ఆస్పత్రికి సుమారు 280 మంది నర్సింగ్ ఆఫీసర్లు వచ్చారు. ప్రొహిబిషన్ కాలం పూర్తి చేసుకున్న వారు రెగ్యులరైజేషన్ ఫైల్‌ను డీపీహెచ్‌కు పంపాలంటే ఇక్కడి అధికారులు అమ్యామ్యాలు అడుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇస్తేనే ఫైల్ పంపిస్తామని సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు బాహాటంగానే పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్వోసీ కోసం.. ఇక్కడ పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లు ఏయిమ్స్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం. ఆ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ఆస్పత్రి శాఖలో పనిచేస్తున్న అధికారులు రూ.15వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వాడు అడిగినంత ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటుండగా.. మరికొందరు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఓ నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. అడిగినంత ఇస్తేనే... జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అడిగినంత ఇస్తేనే ఫైల్స్ ముందుకు కదులుతాయట. నర్సింగ్ ఆఫీసర్లు ఇందులో 280 మంది పనిచేస్తుండగా.. వారి రెగ్యులరైజేషన్‌కు సంబంధించి డీపీహెచ్‌కు ఫైల్ పంపించాల్సి ఉంటుంది. వీటికోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. పైఅధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిసింది. అధికారులపై విచారణ నర్సింగ్ ఆఫీసర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఆ సెక్షన్లో పనిచేస్తున్న అధికారులను వేరే శాఖకు పంపించినట్లు తెలిసింది. ఏదేమైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పేర్కొంటున్నారు. జనరల్ ఆస్పత్రిలో అవినీతి బాగోతం ఎన్వోసీ కోసం లంచం డిమాండ్ డబ్బులిస్తేనే ఫైల్ కదిలేది..‘జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పని చేస్తున్న ఓ నర్సింగ్ ఆఫీసర్ ఏయిమ్స్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి నోఆబ్జక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అందులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించగా.. రూ.15వేల లంచం డిమాండ్ చేసినట్లు సదరు అధికారి ప్రజావాణిలో ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేసింది. అందులో పనిచేస్తున్న ఆర్ఎంవో, ఏడీ కూడా మాటలతో వేధిస్తూ.. మానసిక వేధనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.’ -
పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
వెల్గటూర్: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ సత్యప్రసాధ్ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పనులను బుధవారం పరిశీలించారు. ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎండపల్లి మండలం పాతగూడూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి, పాఠశాల పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు పరిశీలించి, పనులు నాణ్యతగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెల్గటూర్ మండలం సంకెనపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. వెల్గటూర్‌లోని పీహెచ్‌సీని పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. డీఈవో రాము, డీఎంహెచ్‌వో సుజాత, డీపీవో మదన్మోహన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, పీఆర్ ఈఈ లక్ష్మణ్‌రావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాధ్ -
ఇంధనం కొరత లేదు
● ప్రజలు ఆందోళన చెందవద్దు ● టోల్‌ఫ్రీ నంబరు 1800 2333 555 ● ‘సాక్షి’తో పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.జితేందర్రెడ్డిజగిత్యాల: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజీల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలు అవసరాన్ని మించి తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయని, ఏజెన్సీలు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు డబ్బాలు, ఇతర బాటిళ్లలో పెట్రోల్ పోయొద్దని ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పుకార్లతోనే పెట్రోల్ కోసం బారులు.. పెట్రోల్‌బంక్‌ల్లో బారులు తీరుతున్నట్లు సమాచారం వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్ కడుతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తోంది. దీంతో వాహనదారులు అవసరానికి మించి తీసుకెళ్తున్నా రు. ఫుల్ ట్యాంక్ చేయించాలని వాహనదారులు ఒత్తిడి తెస్తే వారికి అవసరం మేరకు పెట్రోల్ పోయాలని ఆదేశాలిచ్చాం. వాస్తవానికి జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి. కావాలని కొందరు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
పెద్దపల్లి: విద్యుత్ సంస్థలోని 23,667మంది ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016కు ముందు అన్నిఅర్హతలు ఉన్న వారందరినీ, ఆన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. అన్నివిభాగాల వారికి జీవో నంబర్11 ప్రకారం కనీస వేతన చట్టం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 26, 30వ తేదీల్లో డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు చేస్తామని, ఏప్రిల్ 7న వరంగల్ డీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని, అయినా స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. పాలకుర్తి మండలం బసంత్నగర్ధిలో పనిచేస్తున్న అర్టిజన్ గడ్డం జయదేవ్‌ను వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఖలీమొద్దీన్, ఎం.కృష్ణారెడ్డి, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా జేఏసీ నేత నాగరాజు -
ఘనంగా ‘సాక్షి’ వార్షికోత్సవం
ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీకోదండ రామాలయంలో మంగళశారం సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘సాక్షి’ పాఠకులు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరణ పొంది ఉన్నతస్థాయిలో నిలిచిందన్నారు. అనంతరం స్థానిక రిపోర్టర్ రంగు తిరుపతిని సన్మానించారు. సాక్షి యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచులు మండిగ రాయనర్సయ్య, బాసంపల్లి కొండయ్య, బూర్ల వెంకటసత్యం, మాజీ ఎంపీటీసీ గొల్లే భూమేశ్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీశ్‌బాబు, అంబేడ్కర్ సంఘం నాయకుడు కవ్వంపల్లి చంద్రయ్య, వివిధ సంఘాల నాయకులు బుర్ర అజయ్, బుర్ర గణేశ్, మహేందర్, రాకేశ్, రాంరెడ్డితోపాటు ‘సాక్షి’ పాఠకులు, అభిమానులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో మేకల కాపరి మృతి
సైదాపూర్: విద్యుత్ షాక్‌తో మేకల కాపరి, రెండు మేకలు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారంగా సర్వాయిపేటకు చెందిన బొల్లి సమ్మయ్య(49) ఆకునూర్ శివారులో మేకలు మేపుతున్నాడు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్‌కు చెందిన ఓ రైతు కోతుల బెడద తప్పించుకునేందుకు వరి చేను చుట్టూ కరెంట్ షాక్ పెట్టాడు. మేకలు మేపుతూ అటువైపుగా వెళ్లిన బొల్లి సమ్మయ్యకు రెండు మేకలకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, సైదాపూర్ ఎస్సై స్వాతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య సరవ్వ, కుమారుడు ఉన్నారు. సీఎంకప్లో తృతీయ స్థానంకరీంనగర్: సీఎం కప్–2025లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా తృతీయస్థానం సాధించింది. హైదరా బాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, షట్లర్ సైనా నెహ్వల్ చేతుల మీదుగా డీవైఎస్వో శ్రీనివాస్ ట్రోఫీ అందుకున్నారు. ఆదిలాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా కరీంనగర్ 79.4పాయింట్లతో తృతీయ స్థానం సాధించింది. కలెక్టర్ చిత్రామిశ్రా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సైపై వేటు?మెట్పల్లి: పేకాట ఆడుతూ పట్టుబడిన మెట్పల్లి ఏఎస్సై సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పట్టణంలోని రాంనగర్లో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి దాడి చేశారు. అందులో పట్టుబడిన పలువురిలో ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ చేసే సత్యనారాయణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మత్తు మందు చల్లి బంగారం చోరీజమ్మికుంట: మాటమాట కలిపి.. మత్తు మందు చల్లి రెండు తులాల బంగారం చోరీ చేసిన ఘటన జమ్మికుంట మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మడిపల్లి గ్రామానికి చెందిన కస్తూరి రమ పిండిగిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చి, పిండి పడుతారా అంటూ మాట కలిపి ముఖంపై మత్తుమందు స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోగానే మెడలోని రెండు తులాల పుస్తెలతాడు చోరీ చేసి పారిపోయాడు. రమ స్పృహలోకి వచ్చి లబోదిబోమంటూ బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. కారు ఢీకొని ఒకరి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్– మోరపల్లి గ్రామాల మధ్య జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు గాడిపల్లి లక్ష్మణ్ (40) మృతిచెందాడు. రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై చల్గల్ నుంచి సింగరావుపేటకు వెళ్తున్నాడు. కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి లక్ష్మణ్ బైక్‌ను ఢీకొనడంతో కిందపడిపోయిన లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోక్సో కేసులో ఒకరి అరెస్ట్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన పుట్టకొక్కుల రంజిత్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల డీఏస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాలు.. రంజిత్ కొన్నినెలలుగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా అనుభవించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాహుల్‌రెడ్డి కేసు నమోదు చేశారు. డీఏస్పీ నాగేంద్రచారి కేసు దర్యాప్తు చేశారు. రంజిత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదుజమ్మికుంట: కులంపేరుతో దూషించిన ఇద్దరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి ఇంటి స్థలం ఎదుట ఇసుక పోయించిన నూరి రామకృష్ణ, మేడిపల్లి సదానందంను ప్రశ్నించాడు. దీంతో వారు కులంపేరుతో దూషించి, దాడికి యత్నించారు. భాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం బీర్పూర్ మండలకేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రూ.1.43 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. ఎంపీడీవో భీమేష్, తహసీల్దార్, సుజాత, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజగోపాల్రావు పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం కోనాపూర్, వడ్డెరకాలనీ, రేచపల్లి, సారంగాపూర్‌లో మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో సలీం, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం అభినందనీయం లక్ష్మీపూర్ మహిళా సంఘాలు తీసుకున్న ప్లాస్టిక్ నిషేధం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే రెండు మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ నల్ల కవిత, ఎంపీడీవో రమాదేవి, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, డీఈ మిలింద్, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, తహసీల్దార్ వరందన్, ఆర్ఐ భూమయ్య, ఎంపీవో రవి బాబు, ఏపీఎం రాజయ్య, మండల సమైక్య అధ్యక్షురాలు మారు సత్తవ్వ పాల్గొన్నారు. -
భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు
గోదావరిఖని/జ్యోతినగర్: దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ అందించడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు అగ్రభాగాన నిలిచిందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో మంగళవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఈడీ మాట్లాడారు. ప్రాజెక్టులోని 200 మెగావాట్ల రెండో యూనిట్, 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్లు(4వ, 6వ) వార్షిక మరమ్మత్తులు పూర్తిచేసుకుని విద్యుత్‌లోకి వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ స్టేజ్–2కు రానుందని, తెలంగాణ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రజెక్టులో బొగ్గు , ఇంధన నిల్వలు.. థర్మల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఈడీ సామంత అన్నారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉండగా, ఈనెలలోనే 176 మెగావాట్ల (120 మెగావాట్లు గ్రౌండ్, 56 మెగావాట్లు ఫ్లోటింగ్) సోలార్ ప్రాజెక్టులు కమిషనింగ్‌కు సిద్ధమయ్యాయని తెలిపారు. గ్రిడ్ నుంచి ఫస్ట్ టైమ్ చార్జింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టు 13.4 బిలియన్ యూనిట్లు(86.3 శాతం), తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు 9.3 బిలియన్ మెగావాట్లు(91.4శాతం ) విద్యుత్ ఉత్పత్తి చేశాయని ప్రకటించారు. పారదర్శకత, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పర్యావరణ హిత చర్యలు పటిష్టం విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ స్పష్టం చేశారు. తక్కువ కార్బన్ ఉద్గారాల దిశగా బ్యాటరీ స్టోరేజ్ యూనిట్, కార్బనేటెడ్ బ్రిక్స్ తయారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనల అమలులో భాగంగా ఎఫ్‌జీడీ వ్యవస్థ తెలంగాణ ప్రాజెక్టులో అమల్లో ఉండగా, రామగుండంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎఫ్‌జీడీ ద్వారా 1.35 టన్నుల జిప్సం సేకరించామని పేర్కొన్నారు. సంస్థ ప్రభావిత, పునరావాస గ్రామాల్లో విద్య, వైద్యం, వసతుల కల్పనకు సామాజిక సేవా బాధ్యతా పథకం నిధులు రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, అభిజిత్ దత్తా, బినోయ్ జోస్, తెలంగాణ ప్రాజెక్టు హెచ్‌వోడీ డీఎస్ రావత్, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, సీఎస్సార్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్ సామర్థ్యాల పెంపు వేసవి డిమాండ్‌కు ముందస్తు ఏర్పాట్లు సమృద్ధిగా బొగ్గు, ఇందన నిల్వలు రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత -
రూ.మూడు కోరుట్ల ముచ్చట
కోరుట్ల: ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.మూడు కోట్లు నిధులు. నిధుల లేమితో విలవిలాడుతున్న మున్సిపాలిటీలకు జీవం పోసే అవకాశం. దీనిని వినియోగించుకోవాలని జిల్లాలోని ఐదు బల్దియాలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నా.. నిధులు అందుకునే అవకాశం కేవలం కోరుట్లకే దక్కనుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆస్తి పన్ను వసూళ్లలో బల్దియా రాష్ట్రస్థాయిలో మూడో స్థానం.. జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండడం. వందశాతం లక్ష్యం చేరితే కేంద్రం రూ.3 కోట్ల గ్రాంట్ అందించనుంది. జిల్లాలో టాప్.. బల్దియాల్లో ఆస్తి పన్ను వసూళ్లకు ఈనెల 31వరకు అవకాశం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఐదు బల్దియాల్లో కోరుట్ల మొదటిస్థానంలోనే కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం రూ.5.70 కోట్ట ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా కాగా.. ఇప్పటివరకు రూ.5.05 కోట్ల వసూళ్లయ్యాయి. ఈ లెక్కన 89.52 శాతానికి చేరుకుంది. మరో వారం రోజులు అవకాశం ఉన్న క్రమంలో వంద శాతం చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ప్రకారం కోరుట్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ రూ.3 కోట్లు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ధర్మపురి పూర్.. కోరుట్ల 89.52శాతం వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా.. ధర్మపురి 37 శాతంతో కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన జగిత్యాలది కేవలం 45శాతమే. రాయికల్ మున్సిపాలిటీ 72 శాతంతో మెరుగైన స్థితిలోఉంది. మెట్పల్లిలో 77.50 శాతం పన్నుల వసూలు అయ్యాయి. కోరుట్లలో సమష్టి కృషి.. కోరుట్ల మున్సిపాలిటీలో కమిషనర్ రవీందర్, ఉద్యోగులు సమష్టి కృషితో పనిచేయడం కలిసొచ్చింది. ఉద్యోగులు పట్టుదలతో పండుగల సమయంలోనూ ఆస్తి పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఉద్యోగుల కృషి ఫలితంగా బల్దియా వందశాతం వసూళ్లకు చేరుకుంటే కేంద్ర నుంచి రూ.3 కోట్ల గ్రాంట్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ కింద నిధులు వచ్చే అవకాశాలున్నాయి. -
‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో ప్రతిభ
రామగుండం: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో నిర్వహించే ‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో భాగంగా పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రామగుండం రైల్వే భద్రత దళానికి చెందిన ఏఎస్ఐ మాసాని నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్‌కుమార్ నిర్వహించిన ఆపరేషన్ యాత్రి సురక్షాలో ఓ దొంగను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు 8 దొంగిలించినటు్ల్ ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.61వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ నాగరాజు, హెచ్‌సీ ప్రదీప్‌కుమార్‌ను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రకుమార్వర్మ ప్రకటించారు. ఈవిషయాన్ని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులను డివిజనల్ కమిషనర్ ఆలకుంట నవీన్‌కుమార్, రామగుండం ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతి తదితరులు అభినందించారు. ఈనెలలో రూ.61వేల విలువైన వస్తువుల రికవరీ ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన రైల్వే అసిస్టెంట్ కమిషనర్ -
కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 28 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యల కేసుల పరిష్కారాని కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జిల్లా కోర్టులో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెళ్లు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు చిన్నచిన్న సమస్యలకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారని, అలా పేరుకుపోయిన సమస్యలు గుర్తించి, ఇరువర్గాలతో మాట్లాడి వారిని తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మోటార్ వాహనాల కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ఇన్సూరెన్సు సంస్థలు, న్యాయవాదులతో మాట్లాడామన్నారు. రూ.2లక్షల లోపు చెక్ బౌన్స్ కేసులకు మోక్షం కలిగించనున్నట్లు వివరించారు. రాజీ చేసుకోదగిన ప్రతి కేసు పరి ష్కారం అయ్యేలా పోలీసులతో సమావేశం నిర్వహించామన్నారు. గతంలో జిల్లాలో 17,500 కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిని 16,844కు తగ్గించామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి నారాయణ, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్య శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. రాజీతో కేసులు పరిష్కరించుకోండి జగిత్యాలక్రైం: పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. క్రిమినల్, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్, డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు చిన్నచిన్న కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. పోలీస్ అధికారులు రాజీ పడదగిన కేసులను గుర్తించి.. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదుర్చాలన్నారు. -
తండ్రి పేరిట ఉన్న నగదు దేశ రక్షణ నిధికి జమ
రామగుండం: ఓ రిటైర్డ్ హెచ్ఎం తండ్రి పేరిట ఉన్న నగదును దేశ రక్షణ నిధికి జమ చేసి దేశంపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడుకు చెందిన కోట వెంకటశివశాస్త్రి రామగుండం హైస్కూల్లో సుదీర్ఘకాలం హెచ్ఎంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తన తండ్రి ప్రఖ్యాత హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి వయోభారంతో 2024 సెప్టెంబర్‌లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరిట ఉన్న రూ.లక్ష నగదును సోమవారం భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని నూజివీడు ఎస్బీఐ బ్యాంకులో దేశ రక్షణ నిధి అకౌంట్ నంబర్‌కు డిపాజిట్ చేశారు. ఈ విషయమై సదరు రిటైర్డ్ హెచ్ఎం తన పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. రిటైర్డ్ హెచ్ఎంకు పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. రిటైర్డ్ హెచ్ఎం నిర్ణయంపై హర్షం -
కాంగ్రెస్ ప్లాన్ బీ
● ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం ● పార్టీ వీడకుండా పదవుల ఆశలు ● జీవన్‌రెడ్డి అనుచరులకు ఫోన్లు? జగిత్యాల: సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్న నేపథ్యంలో అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించకపోవడంతో ఆ పార్టీ ప్లాన్ బీ అమలు చేస్తున్నట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి వెంట ఎవరెవరు ఉన్నారు..? ఏ నాయకులు ఎటువైపు వెళ్తున్నారు..? అని ఆరా తీస్తున్నారు. జీవన్‌రెడ్డి అనుచరులకు ఫోన్లు చేస్తూ పార్టీని వీడవద్దని, మంచి భవిష్యత్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో జీవన్‌రెడ్డి బండారి గార్డెన్స్‌లో బుధవారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో అతని వెంట ఎవరూ వెళ్లకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీ వైపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతో పనులు చేయించుకోవచ్చని, మిగిలిన నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ ద్వితీయ శ్రేణి నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెంట వెళ్లేనా..? పదవి ఉన్నా.. లేకపోయినా జీవన్‌రెడ్డిని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అతని వెంటనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అగ్రనేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్న నేపథ్యంలో అందరూ వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో వారికి పదవుల ఆశ చూపడంతోపాటు, డబ్బులు ఇచ్చేలా చూస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఎవరు ఉంటారో..? ఎవరు పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా కోర్టులో బాంబ్ డిస్పోజల్ టీం తనిఖీలుజగిత్యాలక్రైం: జిల్లా కోర్టు, సబ్ కోర్టుల్లో బాంబ్ డిస్పోజల్ టీం, పోలీసు జగిలాలతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కోర్టులోకి వచ్చేదారితోపాటు వెళ్లేదారి, పార్కింగ్ స్థలాలు, పరిసర ప్రాంతాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులను తెరిచి చూశారు. కోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. క్షయ నిర్మూలనకు అవగాహన కల్పించాలిజగిత్యాల: క్షయ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు. రైతులంటే చిన్నచూపా..?జగిత్యాలరూరల్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు అని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్‌పల్లిలో మొక్కజొన్న పంటను మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా, రుణమాఫీ చేయక రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. మక్కలను మద్దతు ధర రూ.2400 చొప్పున కొనాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్‌రావు, మాజీ సర్పంచ్‌లు అంజయ్య, బుర్ర ప్రవీణ్‌గౌడ్, నాయకులు సోమిశెట్టి రాజేష్, పొడేటి అంజయ్య లైశెట్టి శంకర్, భీమయ్య, ఓడ్నాల రాములు పాల్గొన్నారు. -
‘పారాక్వాట్’ను నిషేధించాలి
కరీంనగర్: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో ని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ మా ట్లాడుతూ.. పారాక్వాట్‌కు కచ్చితమైన విరుగుడు లే కపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరి మాణంలో సేవించినా ప్రాణాపాయం తప్పదని, ఆసుపత్రికి చేరినా చికిత్స అందించడం కష్టమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మందులను రైతులకు అందుబా టులోకి తేవాలని సూచించారు. బీఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డిమందు నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్ పి.రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో సులభత కోసం వాడుతున్న ఈ రసాయనం ప్రాణాంతకమైందని, రైతుల భద్రత దృష్ట్యా దీని వినియోగాన్ని నియంత్రించా లన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కటారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఈ మందు అందుబాటులో ఉండటం వల్ల క్షణికావేశంలో సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నా రు. బీఎన్.రావు మాట్లాడుతూ ఈ మందు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని, సురక్షిత ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేశ్ బాబు, ట్రెజరర్ నీలిమా, అలీం, కాంగ్రెస్ డాక్టర్ వింగ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రీధర్, కిరణ్, రాంచందర్ పాల్గొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.కిషన్ -
జాగ్రత్తలు తప్పనిసరి
ఒంటిపూట బడి..పెద్దపల్లి: ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులను గ్రహించాలి. పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో.. ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి. జాగ్రత్తలు అవసరం ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను కంట కనిపెట్టాల్సిందే.. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూస్తే బెటర్పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. – డాక్టర్ ఉదయ్ కుమార్, పీహెచ్సీ, గర్రెపల్లి -
హనుమాన్ చిన్న జయంతికి పకడ్బందీ చర్యలు
మల్యాల: హనుమాన్ చిన్న జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కొండగట్టు ఆలయంలో ఏప్రిల్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఎస్పీ అశోక్‌కుమార్, ఆలయ ఈవో అంజారెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ వహించాలన్నారు. తాగునీరు, వసతులు కల్పించాలని సూచించారు. వైద్య శిబిరాల ఏర్పాటు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీపీవో మదన్ మోహన్, తహసీల్దార్ వసంత, ఎంపీడీఓ స్వాతి, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నల్లగుంటపల్లికి చెందిన రైతు వేల్పుల ఐలయ్య(65) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఐలయ్య తాను సాగు చేసిన కూరగాయాలను కరీంనగర్ మార్కెట్‌కు తరలించాడు. తిరిగి టీవీఎస్ ఎక్సెల్‌పై నల్లగుంటపల్లికి వెళ్తున్నాడు. దుర్శేడ్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం
మల్లాపూర్: శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలు పెగడపల్లి: ముస్తాబైన నంచర్ల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం మల్లాపూర్/పెగడపల్లి: మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద గోదావరి నది తీరంలో కొలువుదీరిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. 25న ఉదయం 5గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. 26న ఉదయం 8గంటలకు స్వామివారికి తెప్పోత్సవం, కుంకుమార్చన, 27న ఉదయం 11.52 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం జరిపించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు అన్నప్రసాద వితర చేస్తారు. పెగడపల్లి మండలంలోని నామాపూర్, నంచర్ల, ఎల్లాపూర్, అయితిపల్లి, ల్యాగలమర్రిలోని శ్రీరామచంద్రస్వామి ఆలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. -
అయోధ్య రామయ్య... ఉప్పుమడుగు సీతమ్మ
రాయికల్: రాయికల్ మండలంలోని అయోధ్యలో 39ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడకు వచ్చాడని, అందుకే గ్రామంలో కోదండ రామాలయం నిర్మించామని ప్రజలు చెబుతుంటారు. అయోధ్యతోపాటు ఉప్పుమడుగు గ్రామాలు కలిసి ఉంటాయి. కాలక్రమేణా రెండు గ్రామాల ప్రజలు కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. 1987లో ఇరుగ్రామాల ప్రజలు శ్రమదానంతో గ్రామంలో శ్రీకోదండరామాలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఆలయ కమిటీలో ఇరుగ్రామాల ప్రజలు పాల్గొని ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడి వద్దకు ఉప్పుమడుగు నుంచి సీతమ్మ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి నవమి రోజు కల్యాణం చేస్తారు. కల్యాణానికి ప్రభుత్వం తరఫున తహసీల్దార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈనెల 27న (శుక్రవారం) శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు అంగడి భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. 27న శ్రీసీతారాముల విగ్రహాలను ఎదుర్కొని వచ్చి 11.28 గంటలకు కల్యాణం జరిపించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
కొత్తగా ఐదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకొంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుంద నే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాతవాటితోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీస్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే మహిళలకు కేటాయించే స్థానాలు ఏమిటి..? మహిళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారు..? అనే అంశాలపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వేడ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్‌గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్‌తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగిత్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పోక్సో కోర్టు మాజీ పీపీ త్రిపుర మృతి
జగిత్యాలజోన్: పోక్సో జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముదుగంటి త్రిపుర సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. జేఎన్టీయూలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ.. న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. జిల్లా కోర్టులో తొలితరం మహిళా న్యాయవాది. బార్ అసోసియేషన్‌లో మహిళా న్యాయవాదుల ప్రతినిధిగా ఐదా రేళ్లు పనిచేశారు. జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పడగా.. తొలి పీపీగా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న త్రిపుర కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. త్రిపుర అంత్యక్రియలు మల్యా ల మండలం తక్కళ్లపల్లిలో మంగళవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ శ్రీరాములు, అందె మారుతి సంతాపం తెలిపారు. జేఎన్టీయూలో టెక్నికల్ సింపోజియం ప్రారంభంకొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూలో రెండురోజులపాటు నిర్వహించనున్న స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం–2026 సోమవారం ప్రారంభించారు. ప్రిన్సిపల్ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి సింపోజిఎంలు ఉపయోగపడతాయన్నారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను ప్రదర్శించే దిశగా విద్యార్థులు ఆలోచించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్షయ నిర్మూలనలో జిల్లా రెండోస్థానంజగిత్యాల: క్షయవ్యాధి నిర్మూలనలో జిల్లాకు రెండోస్థానం లభించిందని డీఎంహెచ్‌వో సుజాత తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం వరల్డ్ టీబీ ఉత్సవాల్లో ఉత్తమ పురస్కారం అందిస్తారన్నారు. వైద్యసిబ్బంది బాధ్యతగా తోడ్పడ్డారని క్షయ నిర్మూలన అధికారి శ్రీనివాస్ అన్నారు. నరేందర్, రవీందర్, సత్యనారాయణ, హరీశ్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ అవార్డుకు జగిత్యాల వాసి
జగిత్యాలజోన్: జగిత్యాలకు చెందిన నలమాసు ఓంకార్ రసాయనశాస్త్రంలో అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, ఇంజినీరింగ్ రసాయనశాస్త్ర విభాగంలో వివిధ దేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు ఎంపిక కాగా.. వారిలో ఓంకార్ ఒకరు. భారీ పరిశ్రమలకు అవసరమైన పరికరాల రూపకల్పన, తయారీలో ఓంకార్ సిద్ధహస్తులు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పీహెచ్డీ పట్టా పొందిన ఓంకార్.. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో ఎటీఅండ్ టిబెల్ పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. కాలిఫోర్నియాలో అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. చైనా, కెనడ, దక్షిణకొరియా, జపాన్ దేశాల రసాయన శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. దాదాపు 200 పరిశోధన వ్యాసాలను వివిధ అంతర్జాతీయ పత్రికలకు రాయడం విశేషం. అంతర్జాతీయ అవార్డు పొందడంపై ఓంకార్ శ్రేయాభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాలలోనే విద్యాభ్యాసం జగిత్యాలలో పదో తరగతి వరకు చదివిన ఓంకార్.. సిద్దిపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ఇంటర్మీడియట్ చదివారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో బీఎస్సీ చదివిన సమయంలో అప్పటి తెలుగు అకాడమీ డైరెక్టర్ వి.కొండల్రావు చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసారు. -
గ్రంథాలయాలకు సెస్ చెల్లించాలి
జగిత్యాల: గ్రంథాలయాలకు మున్సిపాలిటీలు, పంచాయతీలు సెస్ చెల్లించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. గ్రంథాలయం, మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం 8 శాతం పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పైడిమడుగు సంఘానికి కలెక్టర్ అభినందనలుజగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: కోరుట్ల మండలం పైడిమడుగు సహకార సంఘం జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు పొందడంపై కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు. సోమవారం సంఘం అధికారులను పిలిచి సన్మానించారు. రైతులకు మరిన్ని సేవలు అందించి ఇతర సంఘాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, పైడిమడుగు సంఘం పర్సన్ ఇన్చార్జి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసద్, కార్యదర్శి రాజేందర్, శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. సిబ్బంది నిబద్ధతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఆయన వెంట డీఈవో రాము, ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయండిజగిత్యాలటౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. -
ఐసీడీఎస్‌కు నిధులు కేటాయించాలి
జగిత్యాలటౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనం రూ.18వేలకు పెంచాలని, బడ్జెట్లో ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటి చంద్రశేఖర్ కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని కోరారు. ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని కోరారు. టీచర్లు, ఆయాలకు వేసవి సెలవులు మంజూరు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన, కార్యదర్శి స్వప్న, జయప్రద, సురేఖ, శోభ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
గొల్లపల్లి: మండలంలోని వెన్గుమట్ల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. అన్నప్రసాదవితరణ, తీర్థప్రసాద చేశారు. కార్యక్రమంలో సర్పంచులు శిరీష, నక్క స్రవంతి, ఎల్లాల గోపాల్‌రెడ్డి, ఎల్లాల నారాయణరెడ్డి, కనపర్తి దామోదర్‌రావు, ద్యావనంది రాజేశ్వర్, ఆవునూరి శ్రీధర్, ద్యావనంది జలేందర్ పాల్గొన్నారు. -
కలిగోట శివారులో పులి వదంతులు
● హైనాగా గుర్తించిన అటవీశాఖ అధికారులు కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో పులి సంచరించినట్లు గ్రామంలో వదంతులు వ్యాపించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో పర్యటించారు. పాదముద్రలను పరిశీలించిన అధికారులు హైనాగా నిర్ధారించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో మెట్పల్లి ఎఫ్ఆర్వో పద్మారావు, సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్ ఆలీ, బీట్ ఆఫీసర్ శ్రావణ్, సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు. దేవాదాయ కమిషనర్‌కు సన్మానంధర్మపురి: ధర్మపురిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 12వరకు నిర్వహించిన శ్రీలక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సోమవారం దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావును హైదరాబాద్‌లోని ఆయన చాంబర్లో ఈవో శ్రీనివాస్ కలిశారు. స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు అందించారు. పుష్కరాలకు ఏర్పాట్లు ఘనంగా చేయాలిజగిత్యాల: గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ప్రతిపాదనలు రూపొందించామని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆమెకు వివరించారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేతమల్లాపూర్: మండలంలోని గోదావరి నది, పెద్దవాగు తీరప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీనివాస్ హెచ్చరించారు. మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించి సాతారం శివారులో రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యలయానికి తరలించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్ఐలు రాజేష్, అశోక్, జీపీవోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
హనుమాన్ చిన్న జయంతికి ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 3వరకు కొండగట్టులో నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్, లైటింగ్, భద్రత కల్పించాలని, రాత్రివేళల్లో సరిపడా లైటింగ్ ఉంచాలన్నారు. దీక్షాపరులకు ఉపశమనం కలిగించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మాలవిరమణ, కేశఖండన, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీకెమెరాలు, వైద్యసేవలు, పారిశుధ్యం, అగ్నిమాపక చర్యలు చేపట్టాలన్నారు. రాత్రివేళల్లో నడిచి వచ్చే భక్తులకు రేడియం స్టిక్కర్లు కనిపించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో అంజనరెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని డీపీవో మదన్మోహన్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస రైతువేదికలో ఇటీవల ఎన్నికై న వార్డు సభ్యులకు మొదటి విడతగా 15 గ్రామాలకు చెందిన 130 మందికి సోమవారం శిక్షణ ప్రారంభించారు. శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన వసతులు గుర్తించాలని, అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం 16 అంశాలపై వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎల్పీవో విమల, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో కందుకూరి రవిబాబు పాల్గొన్నారు. -
ఉత్తమ అటవీశాఖ అధికారిగా రవికుమార్
జగిత్యాలక్రైం: సారంగాపూర్ డిప్యూటీ రేంజ్ అధికారి రవికుమార్ ఉత్తమ అటవీశాఖ అధికారిగా ఎంపికయ్యారు. సోమవారం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ మహ్మద్ నదీం చేతుల మీదుగా రవికుమార్ అవార్డు అందుకున్నారు. అటవీ సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు ఈ అవార్డు అందించారు. జగిత్యాల సెక్షన్ అధికారి పూర్ణిమకు.. జగిత్యాల అటవీశాఖ సెక్షన్ అధికారి కె.పూర్ణిమ ఉత్తమ అటవీశాఖ అధికారిగా ఎంపికయ్యారు. -
మహిళా సంఘాలకు చేయూత
జగిత్యాలరూరల్: మహిళాసంఘాలకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని, వడ్డీలేని రుణాలిస్తూ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట, మోతె, రూరల్ మండలం తిమ్మాపూర్, పోరండ్ల, సోమనపల్లి, తాటిపల్లిలో మహిళా సంఘాల భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబర్‌పేట అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం ఉపాధి హామీ పేరు మార్చి కఠిన నిబంధనలు పెట్టడంతో కూలీలకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. ఏటీసీ కేంద్రంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో వాసవి, సర్పంచులు గంగాధర్, మహేష్, నక్క హరీశ్, చెవుల గంగన్న, ఏఈలు రాజమల్లయ్య, విజయ్, ఆర్ఐలు నరేందర్, భూమయ్య, నాయకులు దామోదర్‌రావు, ఎల్లారెడ్డి, నక్కల రవీందర్‌రెడ్డి, బాల ముకుందం, రౌతు గంగాధర్, సందీప్‌రావు, ములసపు మహేష్ పాల్గొన్నారు. వడ్డీలేని రుణాలిస్తూ మహిళలకు అండగా ప్రభుత్వం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు ఆదివారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. కూరగాయల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులకు విత్తనాలు, నారు అందిస్తోందన్నారు. రైతుబజార్ బ్రాండ్‌గా మారడంతో.. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు జగిత్యాలకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల చుట్టుపక్క గ్రామాల రైతులు సంప్రదాయ పంటలతోపాటు అదనపు ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో త్వరలో రూ.9 కోట్లతో నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభం కానుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి, హెచ్‌ఈవో అనిల్, ‘ఆత్మ’ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, రైతు నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, సమిండ్ల శ్రీనివాస్, రౌతు గంగాధర్, బాల ముకుందం, మహేష్, నారాయణలు పాల్గొన్నారు. -
నాణ్యత.. అధికారుల బాధ్యత
బుగ్గారం: ప్రభుత్వ భవనాల నాణ్యత విషయంలో అధికారులదే బాధ్య త అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆదివా రం శంకుస్థాపన చేశారు. బుగ్గారంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10లక్షలతో వీవో భవనం, వెల్గొండలో రూ.5 లక్షలతో చేపట్టే డ్రైనేజీ నిర్మాణం, రూ.15 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించే పనుల్లో కాంట్రాక్టర్లు రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత పరిశీలించాలని సూచించారు. మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. వెల్గొండలో ఓ వికలాంగుడికి ట్రైసైకిల్ ఇప్పిస్తానన్నారు. పాఠశాలల్లో ఆధునిక వంట గదులు పెగడపల్లి: వచ్చే విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వంట గదులు నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో రూ.30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన వంట గదిని ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ ఒరుగల అరుణ, మోడల్ స్కూల్ పిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, డీఈ అశ్విన్, సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయంగా ఎదగాలి
మెట్పల్లి: మున్నూరు కాపులు రాజకీయంగా రాణించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గ పటేల్స్ యూత్ ఆధ్వర్యంలో కాపు ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుల అభ్యున్నతికి కాపులంతా ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి తదితరులు ఉన్నారు. -
సూరమ్మ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తాం
కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మత్తడి నిర్మాణం పూర్తయ్యిందని, మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం గతంలో ప్రతినెల 22న నిరసనలు, ధర్నాలు, పాదయాత్ర చేపట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో 43 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. కాలువ పనుల భూసేకరణ కోసం రూ.45.5 కోట్లు విడుదల చేశామన్నారు. నీటిపారుదలశాఖ ఎస్ఈ ప్రకాశ్‌రావు, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు న్యావనంది శేఖర్, కల్లెడ గంగాధర్, పులి హరిప్రసాద్, చెదలు సత్యనారాయణ, వాకిటి రాజారెడ్డి, ఎండీ.హఫీజ్, రాజు, బోదాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సనాతన ధర్మాన్ని కాపాడాలి
ధర్మపురి: సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశోకతీర్థ స్వామీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జైనాలోగల సీతారామకల్యాణ మండపంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశోకతీర్థ స్వామిజీ, జిల్లా సంఘచాలక్ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సనాతన ధర్మం ద్వారా ప్రపంచశాంతి జరుగుతుందని అన్నారు. చిన్నారుల నాట్యప్రదర్శనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. సర్పంచ్‌లు గడ్డి లక్ష్మి, రమాదేవి, పత్తి ప్రభాకర్ మహిళ వక్త రజిత ఉన్నారు. -
మక్కల కొనుగోలుకు
మార్క్‌ఫెడ్ సిద్ధంజగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.3వేలు పలికిన ధర.. రైతుల చేతికి రాగానే క్వింటాల్‌కు రూ.1800కు పడిపోయింది. దీంతో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర రూ.2400 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వంపై రైతులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ అదేశాలు అందిన మరుసటి రోజు నుండే కేంద్రాలను ప్రారంభించాలని అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్రాలకు 9 నుంచి 10లక్షల క్వింటాళ్ల మక్కలు జిల్లాలో వరి తర్వాత మక్కనే 35వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల అంచనా. యాసంగిలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఎకరాకు సగటున 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు సగటున 40వేల నుంచి 80వేల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గన్నీసంచులు, ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ సిద్ధం కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను ప్రధానంగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి గోదాంల్లో నిల్వ చేయనున్నారు. ఇందుకోసం లారీ యజమానులతో మాట్లాడి ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 నుంచి 4లక్షల గన్నీ సంచులను తెప్పిస్తున్నారు. మార్కెట్‌యార్డులు, సింగిల్ విండో కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలుతో వ్యాపారులు దారికి.. ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి మక్కలు వస్తున్నాయంటూ దళారులు ఓపెన్మార్కెట్లో రేటు తగ్గిస్తున్నారు. ప్రభుత్వ ధర.. వ్యాపారులు పెట్టే రేటుకు క్వింటాల్‌కు కనీసం రూ.600 నుంచి రూ.700 నష్టపోతున్నారు. ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగితే, కనీసం వ్యాపారులు ఆ రేటుకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయం జగిత్యాలలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికజగిత్యాల జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్న ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి, రాయికల్, బీర్పూర్, భీమారం, మేడిపల్లి మండలకేంద్రాల్లో 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తీర్ణం, రైతుల డిమాండ్‌ను బట్టి పెంచే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీలు, డీసీఎం, సింగిల్ విండో కేంద్రాల్లో ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. -
సుప్మా అధ్యక్షుడిగా జగన్‌గౌడ్
సిరిసిల్లటౌన్/సిరిసిల్ల ఎడ్యుకేషన్/కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (సుప్మా) నూతన అధ్యక్షుడిగా రాజన్న జిల్లాకు చెందిన గుగ్గిళ్ళ జగన్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఆదివారం సుల్తానాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌కు చెందిన గోవిందవరం కృష్ణ, కోశాధికారి ధర్మపురికి చెందిన సంగోజు అంజయ్యను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శాతవాహన పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్మా పూర్వ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శ్రీపాద నరేశ్, కొలనూరు శేఖర్‌రెడ్డి నూతన ప్రతినిధులను సత్కరించారు. -
ఏఎంసీ డైరెక్టర్ దంపతుల ఆత్మహత్యాయత్నం
ధర్మపురి/వెల్గటూర్: వెల్గటూ ర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ధర్మపురి మండలం రాయపట్నం వంతెనపైకి చేరుకుని గోదావరిలో దూకారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్థంభంపల్లికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. రాత్రిపూట దంపతులిద్దరూ బైక్‌పై రాయపట్నం వంతెన వద్దకు చేరుకుని చెప్పులు, బండి, ఫోన్ వంతెనపై వదిలేసి భార్యాభర్తలిద్దరూ గోదావరిలో దూకారు. లింగయ్యకు ఈత రావడంతో చివరి క్షణంలో మనసు మార్చుకుని మునిగిపోతున్న తన భార్యను వంతెన పిల్లర్ వద్ద ఇనుప కొక్కానికి చీరతో కట్టి తాను కూడా ఇనుప కొక్కెం పట్టుకొని సహాయం కోసం కేకలు వేశాడు. అదే సమయంలో వ్యక్తిగత పని నిమిత్తం అటుగా వచ్చిన మంచిర్యాల జిల్లా గుళ్లకోట గ్రామానికి చెందిన యువకులు వారి అరుపులు విని సమీపంలో ఉన్న జాలర్లకు విషయం తెలపడంతో వారు డైరెక్టర్ దంపతులను కాపాడి తెప్పలపై బయటకు తెచ్చారు. అప్పటికే నీటమునిగి లింగవ్వ అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దంపతులిద్దరినీ అంబులెన్స్‌లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు తెల్సింది. అర్ధరాత్రి గోదావరిలో దూకిన వైనం సమయానికి రక్షించిన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కుటుంబ కలహాలే కారణమా..? -
కొనుగోళ్లతో రైతులకు లాభం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో రైతులకు లాభం జరుగుతుంది. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1800కు మించి కొనడం లేదు. మార్క్‌ఫెడ్ కొంటే క్వింటాల్‌కు రూ.2400 ధర రానుంది. రైతులకు రూ.600 వరకు లాభం జరుగనుంది. – నల్ల రాజిరెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి(మం) మొక్కజొన్న కొనుగోలుకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొనుగోలుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొంటాం. ప్రభుత్వం నుంచి ఒక్కటి రెండు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశముంది. – ఎండీ.హబీబ్, మార్క్‌ఫెడ్ అధికారి, జగిత్యాల -
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: మండలంలోని భర్ధీపూర్ గ్రామానికి చెందిన చెట్టి వెంకటేశ్ (25) గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి అందులోనే పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 21న చేపలు పట్టేందుకు వెళ్లిన వెంకటేశ్ తిరిగి రాకపోవడంతో గోదావరి ప్రాంతంలో వెదికారు. నీటిలో శవమై కనిపించాడు. వెంకటేశ్ తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఒకరు..జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్డులోగల వాసవి కల్యాణ మండపం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని గాయపడిన వొద్ది హరీశ్(54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణంలోని గుట్టరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంతంలో నివాసముండే హరీశ్ శనివారం సాయంత్రం మిత్రులతో కలిసి కరీంనగర్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. పార్కింగ్ చేసిన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. పట్టణానికి చెందిన సయ్యద్ సాహిల్ తన ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా నడుపుతూ హరీశ్‌ను ఢీ కొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అతని మిత్రులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హరీశ్ కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..మెట్‌పల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన నీరటి రాజేశం(47), మగ్గిడి హరీశ్ శనివారం ద్విచక్రవాహనంపై వేంపేట నుంచి మెట్‌పల్లికి పనినిమిత్తం బయల్దేరారు. గెదే అడ్డుగా రావడంతో బైక్‌పై ఉన్న రాజేశం కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజేశంను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
దాతలు స్పందించినా దక్కని ప్రాణం
జ్యోతినగర్: ‘అమ్మా.. బతకాలని ఉంది’ శీర్షికన ‘సాక్షి’ 2024లో కథనం ప్రచురించిన విషయం తెలిసింది. ఈ కథనానికి దాతలు స్పందించారు. చదువులతల్లి సిరి వైద్యానికి అండగా నిలిచారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని అనేకమంది ఆర్థికసాయం అందించారు. అయినా సిరి ప్రాణాలు దక్కలేదు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కూనారపు సిరి(19) కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసముంటున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సిరి చదువులో చాలాముందుండేది. అనారోగ్యంతో ఉన్న క్రమంలో ఆమె చికిత్సకు దాతలు సాయం అందించారు. తండ్రి కూడా తన తాహతుకు మించి వైద్యానికి ఖర్చు చేశారు. రెండు సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతూ సిరి తుదిశ్వాస విడిచింది. సిరి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చదువులతల్లి సిరి కన్నుమూత కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి -
రిమాండ్ ఖైదీకి అస్వస్థత
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిన కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు జగిత్యాల స్పెషల్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఎస్కార్ట్ మధ్య జగిత్యాల ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. తల, మెడనొప్పితో బాధపడుతున్న హరిబాబుకు వైద్యులు చికిత్స అందించారు. మధ్యాహ్నం తిరిగి సబ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సబ్ జైలర్ మొగిలేష్ తెలిపారు. -
కీడు సోకిందని ఊరు ఖాళీ
జమ్మికుంట: జమ్మికుంట మండలం గండ్రపల్లిలో తరచూ ఏవరో ఒకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకిందని ఆదివారం వేకువజామున గ్రామస్తులందరూ ఊరును ఖాళీ చేశారు. ఊరి బయటకు వెళ్లి వంట చేసుకున్నారు. గ్రామంలో రెండు నెలలుగా ఒకరి దినకర్మ పూర్తి కాకుండా, మరొకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకడమే ఇందుకు కారణమని గ్రామస్తులు భయాందోళన చెందారు. పండితుల సలహా మేరకు గ్రామ పెద్దల అలోచనలతో ఆదివారం సూర్యోదయనికి ముందుగా ఊరును ఖాళీ చేశారు. మానేరు పరివాహక, పొలాలు, చెరువు కట్టలపైకి వెళ్లి వంటలు చేసుకుని, అక్కడే భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. -
పీఎస్కే.. బ్రాండ్ సెట్టర్
● కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి.. ● వ్యాపారవేత్తగా రాణిస్తున్న సిరిసిల్ల యువకుడు ● వంద మందికి పైగా ఉపాధి ● నేటి యువతకు స్ఫూర్తి పుల్లూరి శ్రీకాంత్సిరిసిల్ల: ఏం చదివామనేది ముఖ్యం కాదు.. చివరికి ఏ స్థాయిలో ఉన్నామనేదే ప్రధానం. నలుగురు నడిచిన దారిలో వెళ్లడం సాధారణం.. మనమే ఓ దారిని వేసుకెళ్లడం వినూత్నం. ఈ కోవలోకే వస్తారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్. తన పేరుతోనే ఓ కంపెనీని మొదలుపెట్టి ఓ బ్రాండ్‌గా మలచడంలో సక్సెస్ అయ్యారు. వ్యాపార కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదివారు. సాఫ్ట్వేర్ చదివి హార్డ్‌వేర్ వ్యాపారంలోకి దిగారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో హైదరాబాద్‌లో కంపెనీని ఏర్పాటు చేసి హోల్‌సేల్‌గా భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇంజినీరింగ్ చదువు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన శ్రీకాంత్.. ప్రస్తుతం వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీఎస్కే కంపెనీ వ్యవస్థాపకులు పుల్లూరి శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ. – వివరాలు 8లో.. -
పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చాం. చల్గల్లో ఉద్యాన పరిశోధన కేంద్రం లేదా కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి. పండ్ల తోటలతోపాటు పసుపు పంట ఎక్కువగా ఉన్నందున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – బందెల మల్లయ్య, చల్గల్ పండ్ల తోటలకు నేలలు అనుకూలం అన్ని రకాల పండ్ల తోటలకు ఇక్కడి నేలలు అనుకూలం. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉత్తర తెలంగాణలో పెద్ద మామిడి మార్కెట్ ఉంది. కాబట్టి ఉద్యాన పరిశోధన కేంద్రం లేదంటే కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు మరింతగా మేలు జరిగే అవకాశం ఉంది. – కోల నారాయణ, చల్గల్ -
నృసింహాలయంలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. ప్లాస్టిక్‌పై మహిళల పోస్ట్‌కార్డు ఉద్యమంజగిత్యాలజోన్: ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ జిల్లాకేంద్రంలోని గణేశ్‌నగర్ మహిళా కిట్టిపార్టీ సభ్యులు శనివారం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. క్యాన్సర్ నుంచి బయటపడిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ మహిళలు పోస్ట్‌కార్డు ద్వారా ప్రభుత్వ పెద్దలకు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడటం ద్వారా కలిగే అనర్థాల గురించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయిత అనిత వివరించారు. ప్లాస్టిక్‌ను ఇళ్లలో వాడబోమంటూ మహిళలు ప్రతిజ్ఞ చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులుజగిత్యాలటౌన్: బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహసీల్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేశ్ మాట్లాడుతూ బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రూ.3,24,234కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి రూ.26,734 కోట్లు కేటాయించడం సిగ్గు చేటన్నారు. అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే విద్యారంగానికి తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది లేక ఉన్నత విద్యను వదిలేసే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా కన్వీనర్ మాడవేని సునీల్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్, రాహుల్, కిరణ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
కలగానే ఉద్యాన పరిశోధన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకేంద్రం శివారు చల్గల్లోని ఉన్న వాలంతరీ స్థలంపైనే ప్రజాప్రతినిధుల చూపు పడింది. జిల్లాకు మంజూరయ్యే ప్రతి అభివృద్ధి పనికి ఇక్కడి స్థలాన్ని ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తుండడం పారిపాటిగా మారింది. దీంతో విలువైన భూములను రైతులకోసం ఇస్తే.. ఇప్పుడు రైతులను కాదని ఇతర పనులకు వాలంతరీ స్థలాన్ని ఉపయోగించడంపై రైతులు గుర్రుగా ఉన్నారు. సాగునీటి పద్ధతులు వివరించేందుకు.. ఎస్సారెస్పీ నిర్మాణ దశలో సాగునీటిని పంటలకు ఎలా ఉపయోగించాలి..? తక్కువ నీటితో పంటలను ఎలా సాగు చేయాలి..? అనే అంశంపై చల్గల్లో వాలంతరీ సంస్థ(సాగు నీటి యాజమాన్య సంస్థ)ను 120 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. సంస్థ నిధులతో రైతులు, అధికారులకు శిక్షణ ఇచేవారు. వ్యవసాయాధికారులు రకరకాల పంటలను పండించి, ప్రదర్శన క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ పంటలు పండిస్తున్నారు. దాదాపు 40ఏళ్లుగా ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రపంచ బ్యాంకు, వివిధ రాష్ట్రాలు, దేశాల ప్రతినిధులు సందర్శించారు. ఈ ప్రదర్శన క్షేత్రం కోసం చల్‌గల్‌తో పాటు చుట్టుపక్క గ్రామాల రైతులు తమ విలువైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు రూ.కోట్లలో ధర పలికే భూములను రైతులకు పనికొచ్చే పనులకు కాకుండా.. స్టేడియాలు, కాలేజీలు అంటూ ధారాదత్తం చేస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధారాదత్తం చల్గల్ ప్రదర్శన క్షేత్రంలో 120 ఎకరాల స్థలంలో ఇప్పటికే 20 ఎకరాలు మామిడి మార్కెట్‌కు, ఐదెకరాలు రైల్వేలైన్‌కు, ఆరెకరాలు మార్క్‌ఫెడ్ గోదాం, ఎకరం వరకు విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఇచ్చారు. మామిడి మార్కెట్లో షెడ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది చాలదన్నంటూ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు రకరకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయానికి ఐదెకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేట్డే రెసిడెన్సియల్ స్కూల్‌కు 25 ఎకరాలు, క్రీడాకారులు వివిధ ఆటల్లో తర్ఫీదు పొందేందుకు స్టేడియం ఏర్పాటుకు పదెకరాలు కేటాయించాలని కోరారు. మరో పదెకరాలను గోదాంల నిర్మాణానికి ఇవ్వాలని ఎవరికి వారే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నారు. ఉద్యాన పరిశోధన లేదా కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా పూర్తిగా వ్యవసాయాధారితం. ఇక్కడ వరి, మొక్కజొన్న, పసుపు వంటి సంప్రదాయ పంటలతోపాటు 90 వేల ఎకరాల్లో మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇటీవల అభ్యుదయ రైతులు డ్రాగన్ ప్రూట్, జామ, దానిమ్మ వంటి లాభదాయకమైన పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యాన రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే శాస్త్రవేత్తలు మాత్రం అందుబాటులో లేరు. రైతులకు ఉపయోగపడే ఉద్యాన పరిశోధన కేంద్రం లేదా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైతులకు ఉపయోగపడేలా.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చల్గల్లో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యే సమయంలో ఆయన మృతితో ఆగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉత్తర తెలంగాణ రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం రద్దు కావడంతో ఆటకెక్కాయి. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రస్థాయి మామిడి పరిశోధన కేంద్రం చల్గల్లో ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసే కృషి విజ్ఞాన కేంద్రం చల్గల్లో ఏర్పాటు చేస్తామన్నప్పటికీ అతీగతీ లేదు. ఈ లోపలే ఉన్న స్థలం అంతా రకరకాల పనులకు ఉపయోగిస్తున్నారు. -
జీవన్‌రెడ్డిని సంతోషంగా ఆహ్వానిస్తాం
కోరుట్ల: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవన్ రెడ్డి నిరాడంబరమైన వ్యక్తి అని, అవినీతి మచ్చలేని నాయకుడని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే తాను స్వయంగా భుజాలపై ఎత్తుకుని మోసుకొస్తానని వ్యాఖ్యనించారు. ఎమ్మెల్యే అంటే గన్మెన్లతో ఆడంబరాలు చేస్తారని, కొందరు ఎమ్మెల్యేగా గెలవకున్నా పార్టీ ఇన్చార్జులుగా గన్మెన్లను కోరుకుంటూ ఆడంబరాలు చేస్తారని, జీవన్‌రెడ్డి వంటి వారు ఏ ప దవిలో ఉన్నా.. సింపుల్‌గా ఉంటారని తెలిపారు. అందుకే జీవన్‌రెడ్డి అంటే తనకు ఎనలేని గౌరవమని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్.. రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసేలా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇందిరమ్మ బీమాలో కొత్తదనం ఏమీ లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, నేత, గీత, ఆటో రిక్షా కార్మికులందరికీ బీమా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దానినే కాంగ్రెస్ పేరు మార్చింది తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను అటకెక్కించారని పేర్కొన్నారు. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్టుతో తల్లీబిడ్డలు ఆరోగ్యవంతంగా ఉన్నారని, దానిని రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తే.. రెండున్నరేళ్లు నిలిపివేసి ఇప్పు డు పేరుమార్చి ప్రారంభించడం సిగ్గుచేటన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ఫ్లడ్ ఫ్లో కెనాల్ రూ.249.85 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ.449.66 కోట్లు బొక్కలవాగు రూ.34 లక్షలు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు (మొత్తం రాష్ట్రానికి) శాతవాహన యూనివర్సిటీ రూ.25 కోట్లు టీఎస్ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ అండ్ కరీంనగర్ రూ.42.80
దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించి న సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన స్కీంను ప్రారంభించింది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత సాధికారత, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సమతుల్యం దిశగా ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. – సత్తు మల్లేశ్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ అల్పాహారం పథకం పేద,మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వరం. మఽ ద్యాహ్న భోజన పథకానికి ఇది తోడవడంతో డ్రాపౌ ట్స్ మరింత తగ్గుతాయి. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయడం సాహసోపేతమైన నిర్ణయం. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – డాక్టర్ సూరేపల్లి సుజాత, విద్యా కమిషన్ సభ్యురాలు -
యుద్ధంతో పసుపు ధరలు పతనం
జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు పంటకు అంతర్జాతీయంగా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. జిల్లా రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్, జిల్లాలోని మెట్పల్లి, జగిత్యాల మార్కెట్‌కు తరలిస్తారు. ప్రస్తుతం ఆయా మార్కెట్లలో పసుపు ఉత్పత్తులకు పలుకుతున్న ధరలు చూసి రైతులు కంగు తింటున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా పసుపు క్వింటాల్‌కు రూ.12– రూ.13 వేల ధర పలికినా, పశ్చిమాసియా యుద్ధంతో క్వింటాల్‌కు రూ.2 వేలు పడిపోయి, రూ.10 వేల నుంచి రూ.11 వేలు మాత్రమే పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రెండో స్థానంలో జగిత్యాల రాష్ట్రంలో పసుపు సాగులో నిజామాబాద్ తర్వాత జగిత్యాల జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 25 వేల ఎకరాలకు పైగా పంట సాగు చేయగా, ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 7–8 లక్షల క్వింటాళ్ల పసుపు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం 1–2 లక్షల క్వింటాళ్ల వరకే పంట విక్రయించగా, రైతుల వద్దే ఇంకా 5–6 లక్షల క్వింటాళ్లు ఉంది. ప్రపంచ పసుపు పంట సాగులో 70 శాతం వాటా ఇండియాదే. తర్వాత చైనా 8 శాతం, బంగ్లాదేశ్ 3.5, నైజీరియా 3, ఇథియోపియో 3.1, వియత్నాం 2, థాయ్‌లాండ్‌లో 2 శాతం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పెరు, తైవాన్, జమైకా, హైతి, కోస్టారికా దేశాల్లో సాగు చేస్తున్నారు. ఇక దేశంలోని తెలంగాణలో 24 శాతం, ఆంధ్రప్రదేశ్ 22, తమిళనాడు 15, ఒడిశా 13, అస్సాం 6, మహారాష్ట్ర 4, కేరళ 4, కర్ణాటక 3, సిక్కింలో 1 శాతం సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్‌లో పసుపు సాగు చేస్తున్నారు. ఎగుమతులపై ప్రభావం మన దేశంలో పండిన పసుపును ఎక్కువగా గల్ఫ్ దేశాలైన ఇరాన్, యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికా, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏటా దాదాపు రూ.2,000 కోట్ల విలువ గల పంట ఎగుమతి అవుతుంటుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. భద్రత కారణాలు, రవాణా కష్టాల వల్ల పసుపు ఎగుమతిని ఎక్స్‌పోర్టర్లు నిలిపేశారు. ఎగుమతుల్లో డీలా ఏర్పడి, దేశీయంగా ధరలు తగ్గుతున్నాయి. అలాగే మార్కెట్లోకి కొత్త పసుపు భారీగా వస్తుండడం, యుద్ధం ప్రభావంతో వ్యాపారులు కొనుగోలు చేసిన పసుపు నిల్వలు పేరుకుపోవడం, గతేడాది నిల్వలు కూడా ఉండిపోవడం, ఏదో కారణం చెప్పి వ్యాపారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తుండటం తదితర కారణాలతో పసుపు ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. గోదాంలకు తరలింపు పసుపు పంటకు ఎలాగైనా డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది రైతులతో పాటు తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేసేందుకు కోల్ట్ స్టోరేజీలు, గోదాంలకు తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనే ఆశతో కొందరు నిల్వ చేస్తుంటే, మరికొందరు రైతులు ఏదో ధరకు అమ్ముకుంటున్నారు. అయితే, యుద్ధం ఆగిపోయి ఆయా దేశాలు మళ్లీ పసుపును దిగుమతి చేసుకుంటేనే ధరల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. క్వింటాల్‌కు రూ.3 వేల నష్టం మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.13 వేలు పలికిన పసుపు, ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో రూ.3 వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది. నిల్వ చేస్తామంటే ఎప్పుడు యుద్ధం ఆగుతుందో, రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి. – ఎల్క కమలాకర్, సంగెం శ్రీరాంపూర్ -
జనాలను పిచ్చోళ్లను చేసే బడ్జెట్
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ జనాలను పిచ్చోళ్లను చేసే బడ్జెటే తప్ప ఎలాంటి కొత్తదనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీల ఊసే లేదు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 వరకు పింఛన్ పెంపుపై ఎలాంటి కేటాయింపులు లేవు. రాజీవ్ యువవికాసం కోసం గత బడ్జెట్లో రూ.6,000 కోట్లు కేటాయించి ఒక్కపైసా ఖర్చు చేయలేదు. మళ్లీ ఈ బడ్జెట్లో అదే రూ.6,000 కోట్లు కేటాయింపులు చూపించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి కేటాయింపులు లేకపోవడం బాధాకరం. రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు చెల్లించే సెటిల్మెంట్లపై ఎం కేటాయించలేదు. ఆరు గ్యారంటీలకు చెల్లు చీటి పెట్టారు. మొత్తానికి ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. – కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల -
ఉద్యోగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్
జగిత్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్మిక వర్గాన్ని మరోసారి నిరాశకు గురిచేసింది. గత బడ్జెట్ కన్నా రూ.20వేల కోట్లు పెంచినా ఇందులో రాష్ట్ర ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడం శోచనీయం. సమగ్ర బీమా పథ కం పేరుతో ఉద్యోగులు, పెన్షనర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.3,143 కోట్లు కేటాయించినా అంగన్వాడీ టీచర్లు, ఆయాల పారితోషికం పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లక్షలాది కార్మికుల ఆశలు, వారి ఆకాంక్షలను నెరవేర్చకపోగా ప్రజలపై మరింత భారం మోపారు. – కోమటి చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గల్ఫ్ కార్మికులకు మరోసారి మోసం రాయికల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గల్ఫ్ కార్మికులను మరోసారి మోసం చేసింది. ఎన్నికలకు ముందు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్యాకేజీ కేటాయించి, గల్ఫ్ పాలసీ ప్రకటిస్తామని మేనిఫెస్టో ప్రకటించి విస్మరించారు. గల్ఫ్‌లో ఉంటున్న 15 లక్షల మంది కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. – రాధారపు సతీశ్, బహ్రెయిన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు -
బీమా..
అల్పాహారం!ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రస్తుతం 41 లక్షల కుటుంబాలు (2011 ప్రకారం.. 37 లక్షలు) ఇందిరమ్మ బీమా పొందే కుటుంబాలు: 8,00,000ఉమ్మడి జిల్లాకు కనీస అంచనా రూ.400 కోట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.హైదరాబాద్– కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్‌కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్‌ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్‌పై ప్రకటన, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
ఉమ్మడి జిల్లాలో అల్పాహారం పథకం వివరాలు
స్కూళ్లుసిరిసిల్ల1,82021జగిత్యాల11పెద్దపల్లి8,7001215,000కరీంనగర్ 651పెద్దపల్లి 527కరీంనగర్సిరిసిల్ల 403387108,300కళాశాలలు -
వేంకటేశ్వరునికి క్షీరాభిషేకం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీని వాసచార్యులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విద్యకు సరిపోని కేటాయింపులుజగిత్యాల: జనాకర్షణ పథకాలే తప్ప ప్రస్తుత విద్యావ్యవస్థను బాగు చేసేలా బడ్జెట్ కేటాయింపు లేదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మచ్చ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా శాఖ కార్యాలయంలో మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో విద్య, మానవ వనరులకు కేటాయించింది రూ.26,670 కోట్లు మాత్రమేనని, ఇది బడ్జెట్లో 8.2 శాతమేనన్నారు. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగిందే కానీ, పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంపు గురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్థావన లేదని, గతేడాది 7.58 శాతం కేటాయించగా, ఈసారి 8.22 శాతమే కేటాయించారన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్, ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్ పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలిజగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు, యువత, ఒంటరి మహిళలలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతిలో నమోదు చేసుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు గ్రామాల మధ్య భూ వివాదంజగిత్యాలక్రైం: బీర్పూర్ మండల శివారులోని ఓ స్థలంపై రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. దీంతో బీర్పూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలు.. బీర్పూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో నర్సింహులపల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రార్థన మందిరం ఏర్పాటు చేయడంతో బీర్పూర్ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ప్రార్థన మందిరం ఏర్పాటు చేసుకోవడంపై బీర్పూర్ వాసులు ఆందోళన చేపట్టారు. కాగా, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడకు వెళ్లి రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. బీర్పూర్ గ్రామ శివారులోని 242 సర్వే నంబరులో ఉన్నది ప్రభుత్వ భూమి అని, ఆ భూమిలో ఎవరూ మతపరమైన కట్టడాలు నిర్మించవద్దని బీర్పూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తూ బైఠాయించారు. -
‘పరాభవం’లో అన్ని శుభాలే
మున్సిపల్ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో వేద పండితులు కొండగట్టులో పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధర్మపురిలో ఉత్సవమూర్తులకు అర్చకుల పూజలు పంచాంగ శ్రవణంలో జీవన్‌రెడ్డి తదితరులు జగిత్యాల/మల్యాల/జగిత్యాలటౌన్/ధర్మపురి: పరాభవం నామ సంవత్సరంలో అన్ని శుభాలే కలుగుతాయని వేద పండితులు నంబి వేణుగోపాలాచార్య అన్నారు. జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. చైర్పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి, సంక్షేమం నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి నివాసంలో పాలెపు చంద్రశేఖర్‌శర్మ పంచాంగ శ్రవణం చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు జీవన్‌రెడ్డి ఉగాది పచ్చడి అందించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత పాల్గొని ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. విశ్వహిందూ పరిషత్ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్.రాజు, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆకాంక్షించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుగ్గారపు రాజేంద్రప్రసాద్ పంచాంగశ్రవణం చేశారు. ●● -
మైనార్టీల సంక్షేమానికి కృషి
ధర్మపురి: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా స్థానిక ఎస్‌హెచ్ గార్డెన్లో ముస్లింలకు తోఫాలు పంపిణీ చేశారు. గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి, పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్ పర్సన్ చిలుముల లావణ్య, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆ గ్రామంలో మొదటిసారి పంచాంగ శ్రవణంరాయికల్: మండలంలోని మారుమూల గిరి జన గ్రామం జగన్నాథపూర్ 25 ఏళ్ల క్రితం పంచాయతీగా ఏర్పడింది. ఉగాదికి పంచాంగ శ్రవణమే తెలియదు. మొదటిసారి సర్పంచ్ పరంచ శంకర్ గ్రామంలో ఉగాది వేడుకలతోపాటు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన అర్చకులు రమేశ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేయించారు. నాయకులు పటేల్ సుధాకర్, సిడెం భీం పాల్గొన్నారు. ఇంటర్ మూడో మూల్యాంకనం ప్రారంభంజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) జూనియర్ కళాశాలలో శుక్రవా రం నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుందని నోడల్ అధికారి నారా యణ తెలిపారు. అధ్యాపకులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు. -
అందని మాతాశిశు సేవలు
ధర్మపురి: ధర్మపురిలోని మాతాశిశు ఆస్పత్రి సేవలకు మోక్షం కలగడం లేదు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందాలన్నా.. అప్పుడే పుట్టిన శిశువులకు అవసరమైన చికిత్స అందించాలన్నా.. పరిసర గ్రామాల ప్రజలు అయితే జగిత్యాల.. లేకుంటే కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో స్థానికంగానే ప్రసూతి, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2022 మే నెలలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8.50కోట్లు వెచ్చించి 50పడకల మాతాశిశు ఆస్పత్రికి శ్రీకారం చుట్టింది. ఆ నిధులతో పనులు చేపట్టినా.. ఇంకా కొన్ని పనులు పూర్తికాకపోవడంతో రెండో విడత కింద మరో రూ.రెండు కోట్లు వెచ్చించింది. అన్ని నిధులతో సుమారు 90శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా సాగుతున్న పనులు పట్టణంలోని కస్తూరిబా గురుకులం పాఠశాల వెనుక భాగంలో ఈ మాతాశిశు ఆస్పత్రి నిర్మించారు. 2022లో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ 17,735 స్క్వైర్ ఫీట్లు, మొదటి అంతస్తు 17000 స్క్వైర్ ఫీట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో పనులన్నీ పూర్తయ్యాయి. అయితే కొద్దిపాటి పరికరాలు మాత్రమే వచ్చాయి. వాటితో వైద్యం అందించే వీలు లేకపోవడం.. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటినుంచి ఈ ఆస్పత్రిని పట్టించుకున్న వారు లేరు. ● మాతాశిశు ఆస్పత్రి పనులు పూర్తయిన నేపథ్యంలో సిబ్బందిని నియమిస్తే తల్లీబిడ్డలకెంతో సౌకర్యంగా ఉంటుంది. ● ఆస్పత్రిలో సిబ్బందిని నియమించేందుకు అధికారులు వైద్య విధాన పరిషత్‌కు ప్రతిపాదనలు పంపారు. ● గ్రౌండు ఫ్లోర్లో మొత్తం 8 గదులున్నాయి. ఇందులో ఓపి బ్లాక్, డెలివరీ గది, ట్రమేజ రూం (డెలివరీ తీవ్రతను నిర్ధారించే గది), మత్తు గది, ఈసీజీ, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, గైనకాలజిస్ట్ గదులు పూర్తయ్యాయి. ● ఫస్ట్‌ఫ్లోర్‌లో మూడు ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. ఇందులో ఒకటి సెప్టెక్ ఓటీ, రెండు మేజర్ ఓటీ గదులు. ఆస్పత్రిలోని 50 బెడ్లలో 40 గర్భిణులు, మిగిలిన పది నవజాత శిశువుల కోసం కేటాయించారు. ● ఆస్పత్రి సిబ్బంది, పరికరాలు, ఫర్నిచర్, కాంపౌండ్‌వాల్ పూర్తిచేస్తే సేవలు వినియోగంలోకి రానున్నాయి. ● ఆస్పత్రి వినియోగంలోకి వస్తే ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని బీర్పూర్, సారంగపూర్ మండలాలవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ధర్మపురిలోని ఎంసీహెచ్ ఆస్పత్రి పనులను పూర్తి చేసి టీఎస్ఎంఐడీసీ వారు అప్పగించారు. తదుపరి వైద్య సిబ్బంది కోసం వైద్య విధాన పరిషత్‌కు నివేదిక పంపించాం. వైద్య సిబ్బంది నియామకమై అందుబాటులోకి రావడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశముంది. – రామకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భట్టి బడ్జెట్‌పై ఆశలు..!
● హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల చిరకాలవాంఛ అయిన కల్వల ప్రాజెక్టు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి ఇటీవల డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి ప్రకటన ఉంటుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనసభలో నేడు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభించేనా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ – కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్‌ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్‌పై ప్రకటన, కల్వల ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.● వేములవాడ ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్ అమలు కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసింది. మాస్టర్‌ప్లాన్ సమగ్ర అమలు, ఆలయ నిర్మాణం పూర్తవాలంటే.. మరో రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.● జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దక్క న్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్ర భుత్వం నుంచి ప్రకటన కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. 2015లో మూ తబడిన ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ రూ.172 కోట్ల బ కాయిలు చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 2025లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటి బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.● మనోహరాబాద్ నుంచి కొ త్తపల్లి వరకు రూ.2,780 కోట్లతో రైల్వేప్రాజెక్టు లైన్ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల వరకు లైన్ పూర్తవగా.. సిద్ధిపేట – సికింద్రాబాద్ వరకు రైలు అందుబాటులోకి వచ్చింది. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక వేములవాడ, వెదిర, కొత్తపల్లి వరకు పనులు సాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు, భూసేకరణ వంటి సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఈ రైల్వేలైన్ పూర్తయితే.. ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉమ్మడి జిల్లాకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతో దాని నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రి పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 60వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం రూ.150 కోట్లు నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో భూ కేటాయింపులు, తదితర పనుల జాప్యంతో ముందుకు సాగడం లేదు.● రామగుండం బీ థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేత అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రివర్గంలో మంత్రుల బృందం ఎన్టీపీసీ, జెన్కో సంస్థల్లో ఏది తక్కువ వ్యయంతో ప్లాంట్ నిర్మించి, తక్కువ రేట్‌కు కరెంట్ ఇచ్చే సంస్థకు నిర్మించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాంతవాసుల కోరికై నా ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం పాత బీ థర్మల్ ప్లాంట్ మిషనరినీ తుక్కు కింద విక్రయించేందుకు వివిధ విభాగాల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.● పెద్దపల్లితోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల విడుదలపై ఉమ్మడి జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. -
జనగణనకు ఏర్పాట్లు
జగిత్యాల: కేంద్రప్రభుత్వం జనగణనకు నిర్ణయించడంతో ఆ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్జ్ సెన్సెస్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో హౌస్‌లిస్టింగ్, ఎన్యుమరేషన్, బ్లాక్స్ నిర్ణయించే అవకాశం ఉంది. ప్రతిఇంటికీ ప్రత్యేకంగా ఓ సంఖ్య కేటాయించనున్నారు. ఇప్పటికే జనగణన కసరత్తులో భాగంగా జిల్లా, డివిజన్, మండలస్థాయిలో చార్జ్ సెన్సెస్ అధికారులను నియమించి కలెక్టరేట్లో శిక్షణ కల్పిస్తున్నారు. సెన్సెస్ అధికారిగా అదనపు కలెక్టర్ లత వ్యవహరించనున్నారు. మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు హౌస్‌లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అధికారులకు శిక్షణ కల్పించారు. 15 ఏళ్లు తర్వాత... 2011లో జనగణన చేశారు. వాస్తవానికి 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనాతో ఆగిపోయింది. అప్పటి నుంచి అడుగు ముందుకు పడలేదు. జగిత్యాల జిల్లాగా 2016లో ఆవిర్భవించింది. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి జనగణన చేపడుతున్నారు. ఈ లెక్కన జిల్లా గణాంకాలు పూర్తిగా వెలవడనున్నాయి. గతంలోకంటే జనాభా ఇప్పుడు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు రావడం, విద్య, ఉద్యోగాల నిమిత్తం చాలామంది ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు. పూర్తి ఆధారాలతో... ఈసారి జనగణన డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్‌లో సమాచారం నమోదు చేయనున్నారు. ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్య, ఉద్యోగం, అన్ని యాప్‌లో నమోదు చేయనున్నారు. మొత్తం రెండు విడతల్లో జనగణన నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనగణన ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొలిదశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అధికారులకు శిక్షణ కల్పించాం. భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన గణాంకాలు సిద్ధమవుతాయి. – లత, అదనపు కలెక్టర్ మున్సిపాలిటీలు : 5మండలాలు : 20రెవెన్యూ గ్రామాలు : 286గ్రామాలు : 386మొత్తం జనాభా : 9,83,414అక్షరాస్యత : 54.53 శాతం -
అవినీతి కేసులో ఇద్దరి అరెస్టు
కరీంనగర్‌క్రైం/జగిత్యాలక్రైం: అవినీతి కేసులో ఎకై ్సజ్ సీఐతో పాటు సహకరించిన ఉపాధ్యాయుడిని ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో మామూళ్లు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా దర్యాప్తు చేశారు. రాము ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.20 లక్షలు లభ్యమైంది. ఈ విషయంపై ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ఎకై ్సజ్ సీఐ ఇంట్లో సోదాలు ఏసీబీ అధికారులకు పట్టుబడిన కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ రాములుకు చెందిన జగిత్యాలలోని భవానీనగర్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాములుది జగిత్యాల జిల్లా భీమారం మండలకేంద్రం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బినామీ పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. -
10 సిలిండర్లు పట్టివేత
కరీంనగర్ అర్బన్: వంటగ్యాస్ అక్రమ వినియోగంపై సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వాడుతుండటంపై కన్నెర్ర చేశారు. సివిల్ సప్లయ్ డీటీ సురేందర్, ఎఫ్ఐ శ్రీనివాస్‌రెడ్డి జ్యోతినగర్, మల్కాపూర్ రోడ్డు ప్రాంతాల్లోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసి 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వంటగ్యాస్ వాడితే కేసులు నమోదు చేస్తామని వివరించారు. జగిత్యాలలో 17 సీజ్..● 6ఏ కేసు నమోదు జగిత్యాలక్రైం: పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 17 సిలిండర్లను పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశామని డీఎస్వో జితేందర్‌రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులి● ఆవాసం ఏర్పర్చుకుందంటున్న గ్రామస్తులు కొడిమ్యాల: మండలంలోని సూరంపేట, దమ్మాయిపేట శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రైతు నరహరికి చెందిన ఆవును.. సోమవారం తేజావత్ గోరికి చెందిన చూడి ఆవును చంపిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పులి మొదట చంపిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చింది. ఈ దృశ్యం సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యింది. పులి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండడంతో ఇక్కడే ఆవాసం ఏర్పరచుకుందని సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా.. అలాంటిదేం లేదని రెండు రోజుల్లోగా పులి వేరేచోటుకు వెళ్లిపోతుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి● ఎమ్మెల్సీ రమణ జగిత్యాల: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ రమణ కోరారు. శాసనమండలిలో మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గంలో నిరుపేదలకు అందించిన ఇళ్ల వద్ద వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని, రవాణా సౌకర్యం కల్పించి పేదలను ఆదుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లేక ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాలేదన్నారు. డంపింగ్‌యార్డు కారణంగా ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. లింగ నిర్దారణ చేస్తే చర్యలు● ప్రోగ్రాం అధికారి జైపాల్‌రెడ్డి జగిత్యాల: లింగ నిర్ధారణ చేస్తే చర్యలుంటాయని ప్రోగ్రాం అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ సెంటర్లను బుధవారం తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రతినెలా 5లోపు ఫాం ఎఫ్‌ను సబ్మిట్ చేయాలన్నారు. సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ చేస్తే మూడు నెలల జైలు, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట భూమేశ్వర్, శంకర్, రాజేశం పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలను పెంచాలి
● అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జగిత్యాల: ఉపాధి హామీ పథకంలో కూలీలను పెంచాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. బుధవారం ఎంపీడీవోలు, అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీరోడ్లు, పశువుల పాకలు, కోళ్ల పాకలు మొదలైన పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరణ్, ఏఈ లక్ష్మణ్‌రావు, పాల్గొన్నారు. -
అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త అరెస్ట్
కోరుట్లరూరల్: అదనపు కట్నం కోసం గర్భవతి అయిన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి, గొంతు నులిమి అతి దారుణంగా చంపిన ఆమె భర్త చిత్తరి హరిబాబును కోరుట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీఎస్పీ అడ్లూరి రాములు వివరాలు వెల్లడించారు. మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కూతురు వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత హరిబాబుకు కట్నం కింద రూ.ఐదు లక్షల నగదు, మాదాపూర్‌లో రెండు గుంటల భూమి ఇచ్చారు. అదనంగా మరో రూ.5 లక్షలు కట్నం కావాలని హరిబాబు తల్లి లక్ష్మీ, సోదరులు ఆనంద్, అశోక్ ప్రోద్బలంతో కొంతకాలంగా హరిబాబు వైష్ణవిని వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి వైష్ణవి, హరిబాబు గొడవపడ్డారు. వైష్టవి నిద్రించిన తర్వాత హరిబాబు ఆమె మెడపై కత్తితో పొడిచి, గొంతు నులిపి చంపేసి పారిపోయాడు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా.. కోరుట్ల శివారు కోనరావుపేట రోడ్లోగల డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఉపయోగించిన ద్విచక్రవాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, పోలీసులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు నిందితుడిని రిమాండ్‌కు తరలింపు -
ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు సమకూర్చండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య పరికరాలు సమకూర్చాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, పరికరాల కొరతపై ఎమ్మెల్యే బుధవారం శాసనసభలో ప్రస్తావించారు. రెండున్నరేళ్లుగా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదన్నారు. కోరుట్ల ఆసుపత్రిలో ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్ ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు లేక రోగులకు సరైన వైద్య అందటం లేదన్నారు. వెంటనే పరికరాలు సమకూర్చాలని కోరారు. మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పాత భవనం శిథిలావస్థలో ఉందని, ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని, కొత్త భవనం 90శాతం పూర్తయినా వినియోగంలోకి తేలేకపోతున్నారని తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ -
పార్టీ మారొద్దు..!
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీతో సుధీర్ఘ అనుబంధం కలిగిన జీవన్‌రెడ్డి పార్టీ వీడాలనుకోవడం బాధాకరమని, చివరి నిమిషంలో అద్భుతం జరిగి ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఏఐసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి అన్నారు. అవమానాలు భరించలేక కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు బుధవారం జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీ అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడం పార్టీకి ఆశనిపాతం అవుతుందన్నారు. జీవన్‌రెడ్డి పార్టీలో కొనసాగాలని రాహుల్‌గాంధీ కోరుకుంటున్నారని తెలిపారు. ఆయనను ఒప్పించి పార్టీలో కొనసాగాలని కోరేందుకే పార్టీ దూతగా తాను వచ్చినట్లు తెలిపారు. ఆయన ఎంతో ఆవేదన చెందితే తప్ప పార్టీతో ఉన్న సుధీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవాలని కోరుకోరని, పార్టీ కూడా అలాంటి నాయకుడిని వదులుకునేందుకు సిద్ధంగా లేదని వివరించారు. జీవన్‌రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఏదైనా అద్బుతం జరిగే అవకాశం లేకపోలేదన్నారు. ● మాజీమంత్రి జీవన్‌కు బుజ్జగింపులు ● ఆఖరి నిమిషంలో అద్భుతం జరగొచ్చు ● ఏఐసీసీ పరిశీలకుడు కత్తి వెంకటస్వామి -
విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు నైపుణ్యం పెంచుకుంటే అన్నిరంగాల్లో విజయం సాధించవచ్చని టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ నీరజ అన్నారు. బుధవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నాంది ఫౌండేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో మూడురోజులు శిక్షణ కల్పించారు. విద్యార్థులకు సంఖ్య వాచక సంబంధాలు, రక్త సంబంధాలు, దిశలపై శిక్షణ కల్పించారు. విశ్లేషనాత్మక నైపుణ్యాలు పెరిగి విద్యార్థులు పోటీ పరీక్షల్లో వచ్చే పరీక్షలకు సులభంగా జవాబు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రమోద్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య, సంగీత, సాగర్, పాల్గొన్నారు. -
2.25 లక్షల మంది.. రూ.243.32 కోట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతు భరోసా కింద ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. తొలుత ఈనెల 22న ఎకరం ఉన్నవారికి.. తర్వాత విడతల వారీగా ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో 2,25,406 మంది రైతులు రైతుభరోసాకు అర్హత సాధించారు. వారి వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపించింది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.243,32,69,106 జమ కానున్నాయి. మూడు విడతలుగా రైతు భరోసా గతంలో ఎకరం లోపు వారికి, తర్వాత రెండెకరాలు.. ఇలా ఎకరాల వారీగా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. యాసంగి సీజన్‌కుగాను మొదటి విడత ఎకరం వరకు ఈనెల 22న, 20రోజుల తర్వాత ఏప్రిల్ 15 వరకు రెండో విడత కింద ఐదారు ఎకరాల వరకు, మూడో విడత కింద ఐదారు ఎకరాలపైన ఉండే రైతులందరికి ఏప్రిల్ 30వరకు రైతుభరోసా అందే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధికంగా మెట్పల్లి మండలంలోని 15,516 మంది రైతులకు రూ.16.71 కోట్లు రైతు భరోసా అందనుంది. అలాగే అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో 4,744 మంది రైతులకు రూ.2.78 కోట్లు అందనున్నాయి. రైతుభరోసా డబ్బులు రైతులను ఆపదలో ఆదుకుంటాయి. డబ్బులు వస్తే యాసంగి ఖర్చులకు ఉపయోగపడతాయి. కూలీల, రసాయన ఎరువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. – గణపతి, దొంతాపూర్, ధర్మపురి(మం) అర్హుల జాబితా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. ఆ మేరకు విడతల వారీగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సీజన్లో 2.25 లక్షల మందికి, రూ.243 కోట్ల వరకు రైతు భరోసా అందే అవకాశం ఉంది. – భాస్కర్, డీఏవో -
కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్‌టౌన్ సీఐ రాంచందర్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటూ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లిన చంద్రశేఖర్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఉరేసుకుని యువకుడు..జమ్మికుంట: ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల కిషన్(30) ప్రైవేటు సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి పాతకాల రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
నీడలేక.. నిలబడలేక..
రాయికల్: పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో సౌకర్యాలు లేక మండలంలోని 32 గ్రామాల ప్రయాణికుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాయికల్ మున్సిపాలిటీగా మారి ఆరున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ పాతబస్టాండ్‌లో మాత్రం కనీసం షెడ్ల నిర్మాణం లేకపోవడంతో ఎండాకాలంలో ఎండుతూ.. వర్షకాలంలో నానుతూ ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు కూర్చునేందుకు కనీసం బెంచీలు లేకపోవడంతో పరిసర దుకాణాల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మూలుగుతున్న రూ.30 లక్షల నిధులు బల్దియాలో బస్‌షెల్టర్ నిర్మాణం కోసం ఎన్‌సీసీఎల్ కింద రూ.30 లక్షలు మంజూరయ్యాయి. మున్సిపల్ మొదటి చైర్మన్ మోర హన్మండ్లు అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను కలిసి పట్టణంలో ఎన్‌సీసీఎల్ పథకం కింద రూ.30 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధుల ద్వారా బస్‌షెల్టర్, ఓపెన్‌జిమ్, పార్క్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ.. ఖర్చు చేయకపోవడంతో నిధులు బ్యాంక్‌లోనే మూలుగుతున్నాయి. మున్సి పల్ అధికారులు సంబంధిత అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు పంపించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. మరోవైపు ఆర్టీసీ కోరుట్ల, జగి త్యాల డిపో ల అధికారులు బస్‌షెల్టర్ నిర్మాణం కోసం పలు మార్లు పరిశీలించినప్పటికీ అది కాగి తాలకే పరి మితమయ్యాయి. నూతన పాలకవర్గ సభ్యులైనా పాతబస్టాండ్పై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ ప్రాంతంలో షెల్టర్ నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాయికల్ పాతబస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు షెల్టర్ కోసం రూ.30 లక్షలు మంజూరు అధికారుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం నూతన పాలకవర్గంతోనైనా మోక్షం లభించేనా..? -
అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు
కరీంనగర్‌టౌన్: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఉమ్మడి జిల్లా రైతు గర్జన సమరభేరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న ఓసీ ఐకాస, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో లక్షమందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు పెండ్యాల కేశవ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, అయిత నాగరాజు, బండ గోపాల్ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, చాడ రవీందర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, కొత్తకొండ రవీందర్ రావు, గౌతమ్ శర్మ, చందుపట్ల జనార్ధన్, స్వామి పాల్గొన్నారు. రైతు మహా గర్జన సమరభేరి సభకు వేలాదిగా తరలి రావాలి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పొలాడి రామారావు ఓసీ ఐకాస జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి -
కల్వర్టును ఢీకొన్న కారు
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ బస్టాండ్ సమీపంలో ఫోర్‌లైన్ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో దంపతులు ఎడ్ల శ్రీనివాస్(44), రజిత(40) దుర్మరణం చెందారు. బసంత్‌నగర్ ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ తన భార్య రజితతో కలిసి ఈనెల 15న హైదరాబాద్‌లోని తమ బంధువుల గృహ ప్రవేశ వేడుకకు కారులో వెళ్లారు. ఈనెల 16న సాయంత్రం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని కరీంనగర్లో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుచున్న తన కూతురు రిషిత వద్దకు వెళ్లారు. ఆమెతో కాసేపు సరదాగా గడిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తమ కారులో మంచిర్యాలకు బయలుదేరారు. బసంత్‌నగర్ బస్టాండ్ దాటిన తర్వాత ఫోర్‌లేన్ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు హెచ్‌కేఆర్ టోల్‌ప్లాజా అంబులెన్స్ సిబ్బంది, ఎస్సై శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కూతురు రిషిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతులకు రిషిత ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులను కోల్పోయిన రిషిత రోదనలు మిన్నంటాయి. దంపతుల దుర్మరణం


