KCR
-
తండ్రిని తిట్టి.. అమ్మ ఎలా అవుతావు?: కవితపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కవిత సింగిల్‌గా పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్‌ను కవిత తిట్టడం బాధగా ఉంది. ఒక ఉద్యమకారుడి బిడ్డ అనే తనకు గుర్తు ఉంది. తండ్రి అంటే కూతురికి ప్రేమ ఉండాలి. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడంతో తను మర్యాద పోగొట్టుకుంది. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు.మద్యం కుంభకోణంలో తనకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు.. కేసు పూర్తి కాలేదు. టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదం. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం పాన్ షాపు పెట్టినంత సులువు అయిపోయింది. పార్టీ కాదు తను సొంతంగా పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ అధిష్టానం నాకు హామీ ఇచ్చింది.. నాకు పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తా’ అని తెలిపారు. -
అన్ని కమిటీలు రద్దు త్వరలో BRS మెంబర్ మెంబర్షిప్ డ్రైవ్
-
ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘ఇది ఒక చిల్లర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలేంటి, ఆ కూతలేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోందో నాకు అర్ధం కావడం లేదు. బొందలో పడినట్లు అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేతకావడం లేదు. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ ఉపసంఘం ఏ ర్పాటు అంటూ ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. దళారుల ప్రమేయం లేకుండా వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతుబంధు పథకాన్ని నిర్వీర్యం చేసి ఒక్కో దఫాలో ఒక్కో ఎకరాకు డబ్బులు ఇస్తూ రైతులను ప్రభుత్వం వంచిస్తోంది..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం కోసం నడుం బిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం ఉధృతం చేయాలన్నారు. భారత్ రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహా సుమారు 400 మంది పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి నుంచి వివిధ అంశాలపై కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సుమారు రెండు గంటల పాటు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి ‘బీఆర్ఎస్కే తెలంగాణ పట్ల తడి, ఆర్తి ఉంది. తేజస్వీ సూర్య అనే వెధవ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా నిశ్చలంగా మారారు. వారి ని్రష్కియాపరత్వం స్పష్టంగా కనిపించింది. అదే లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగంగా మారేది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు కనిపించింది. బీజేపీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి దేశ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. మహిళలకు చట్ట సభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో తీర్మానం చేసి పంపింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను అనేక రకాలుగా అవమానాలు, క్షోభను అనుభవించా. హైదరాబాద్ లేని తెలంగాణకు అంగీకరిస్తే వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత సోనియా చెప్పినా నేను అంగీకరించలేదు. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా..’ అని కేసీఆర్ చెప్పారు. ‘సర్’లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్, బిహార్ తరహాలో లక్షలాది మంది ఓట్లు తొలగించిన నేపథ్యంలో బూత్ స్థాయిలో పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు కావడం వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలైనట్లు గుర్తించాం. ‘సర్’లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా గ్రామ స్థాయి మొదలుకుని అన్నిరకాల కమిటీలు రద్దు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు నియోజకవర్గానికి 200 మంది చొప్పున శిక్షణ ఇచ్చి తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసేలా తీర్చిదిద్దుతాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీ టికెట్లు ఇస్తాం. జీవన్‌రెడ్డి సేవలు వినియోగించుకుంటాం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవల పార్టీలో చేరిన టి.జీవన్‌రెడ్డిని కేవలం జగిత్యాలకు పరిమితం చేయకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటాం. రాజ్యసభ ఎంపీగా ఇటీవల రిటైరైన కేఆర్ సురేశ్‌రెడ్డి బాగా పని చేశారు..’ అంటూ కేసీఆర్ ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఇటీవల పారీ్టలో చేరిన జీవన్‌రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. -
బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... అంతా ఆ తానులోని ముక్కలే... ‘బీఆర్ఎస్కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే. వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా... కేసీఆర్ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్‌చానెల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్‌హౌజ్‌లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్‌లో లేరు. కేసీఆర్‌కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి. కోర్టు ఏం చెప్పింది..? కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై కేసీఆర్, హరీశ్‌రావులు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్ రిలీఫ్ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్ సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్ చేయాలా? ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. ఎలిమినేషన్ జరుగుతోంది రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి. ఆ నాలుగు వేటికవే..! దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్‌సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్‌సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్‌రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్ఎస్ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్‌సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘కేసీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి’
హనుమకొండ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు.తెలంగాణ విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తాను పార్లమెంట్‌లోనే ఖండించినట్లు కడియం కావ్య గుర్తుచేశారు. ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా అవి అనుచిత వ్యాఖ్యలని నిలదీశానని తెలిపారు. అలాగే పార్లమెంట్ నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పారు.ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ముక్తకంఠంతో ఖండించడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి చేరలేదని, లేదా ఆయన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోలేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కేసీఆర్‌కు కావ్య సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు.తెలంగాణ అభివృద్ధికి సంబంధించి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఇవ్వాలని కోరుతూ, ప్రజా సమస్యలపై చర్చలు జరపడం ద్వారా రాష్ట్రానికి మేలు చేకూరుతుందని కడియం కావ్య పేర్కొన్నారు. -
కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను: కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘15రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కాదు.. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది,. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు. -
తేజస్వీ సూర్య ఒక వెదవ
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్‌కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్‌ది చిల్లర ప్రభుత్వం’అని ధ్వజమెత్తారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు’అని అన్నారు. -
తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. బీఆర్ఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ జీవన్‌రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం జీవన్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. -
ఎర్రవెల్లి - హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్
-
BRS ఆవిర్భావ దినోత్సవం.. కవిత కొత్తపార్టీ పై కేసీఆర్..!?
-
BRS Party: కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆవిర్భావ వేడుకల దృష్ట్యా ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11గం.కు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఎగరేయనున్నారు. మధ్యాహ్నాం అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా నిశబ్దంగా ఉండిపోయిన ఆయన.. మొన్నటి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉరిమారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే కొత్త సవాళ్లపై ఆయన స్పందిస్తారా?.. పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో? అనే కుతూహలం ఇప్పుడు నెలకొంది.తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట కొత్త పార్టీ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే తాను టీఆర్ఎస్ పెట్టి యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారామె. అదే సమయంలో ఆమె నేరుగా ‘తెలంగాణ తొలి సీఎం విఫలం’, ‘సారు మారిపోయారు’.. ‘ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్’ అంటూ నేరుగా తండ్రిపైనే విమర్శలు గుప్పించారు. కవిత పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా సెటైర్లు వేసింది. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఆమె ఆరోపణలపై స్పందించింది లేదు. ఈ తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు సైతం ‘‘సారు ఏం మాట్లాడతారో..? కవిత విమర్శలకు స్పందిస్తారా? లేదంటే కేవలం కాంగ్రెస్ సర్కార్‌పైనే ధ్వజమెత్తుతారా?? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
రాజకీయ కవితావేశం!
అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్ జరిగిన వంగ (బెంగాల్) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్‌లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్‌లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్‌గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్‌పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్‌ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్‌లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్‌కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్‌తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్‌తో నడిపించే ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి కేసీఆర్ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్ఎస్ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.. బీఆర్ఎస్ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్ కాదు.. మారిన కేసీఆర్. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. మన కేసీఆర్ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.ఇదీ చదవండి: అందుకే మన పార్టీ పేరు టీఆర్ఎస్సీఎం రేవంత్‌పై.. ఇప్పుడు ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు గుప్పించారు. బీజేపీపై.. బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. మెడ మీద తలలేని ఓ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాక్‌తో పోల్చాడు. బీజేపీ బానిస ఎంపీలు ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చూడండి అంటూ సవాల్ విసిరారామె. -
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులపై 2011లో మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 2011, మార్చి 10న ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ జరిగింది.కాగా, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సహా సుమారు 50 మంది తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమ వద్ద కెమెరా, మైకులు లాక్కుని దాడి చేశారని, వీడియో కెమెరాను ట్యాంక్ బండ్లోకి విసిరేశారని జర్నలిస్టులు రాజు, ప్రసాద్, సూర్యప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ట్రయల్‌కోర్టు వీరిపై విచారణ చేపట్టి.. ఇతర నిందితులంతా నిర్దోషులని 2013లో తీర్పునిచి్చంది. అయితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను మాత్రం ’పరారీలో ఉన్న నిందితులుగా’ పేర్కొంది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం విచారణ చేపట్టి.. కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్ గతేడాది జూన్ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్ ఘోష్ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీ¯న్ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. కమిషన్ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం.. కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం కాదు. నిర్లక్ష్యమే కారణమన్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు. కమిషన్ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు ‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్‌కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు. సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. సెక్షన్ 8బీ కమిషన్‌పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్ పార్టెమ్’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది. సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
కుట్రలు కూలిపోయాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, భూమిపై గోదావరి నది పారినంత కాలం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అభాండాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, రాహుల్‌గాందీని మేడిగడ్డకు తెచ్చి సీఎం రేవంత్ గోబెల్స్‌ను మించి చిల్లర ప్రచారం చేసినా రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌పై చేసిన కుట్రలు, కుతంత్రాలు కోర్టు తీర్పుతో కూలిపోయాయన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యాన్ని కనిపించకుండా చేయాలనే కుట్రలు వీగిపోయాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడిన వారి గూబ గుయ్యిమంది. నిజం బయట పడింది. ఘోష్ కమిషన్ ట్రాష్ (చెత్త) కమిషన్ అని తేలిపోయింది. మేము గతం నుంచీ చెప్తున్నట్లుగానే ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది. కోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకుని చిల్లర ప్రచారం ఆపి మేడిగడ్డ బరాజ్‌కి మరమ్మతులు చేయాలి. నటించడం మానుకుని నీటిని ఎత్తిపోయాలి. మేడిగడ్డ పేల్చివేతపై విచారణ జరపాలి మేడిగడ్డ బరాజ్ పేల్చివేతపై నెలకొన్న అనుమానాల విషయంలో బీజేపీ స్వతంత్ర విచారణ జరపాలి. నిక్షేపంగా ఉన్న బరాజ్ పిల్లర్లు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలా కూలిపోయాయో తేలాల్సి ఉంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఆగమేఘాల మీద స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ).. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం ఘటన, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం, చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై స్పందించకుండా ఎక్కడ చచ్చింది? కేసీఆర్ మీద కక్షతో రెండున్నరేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతు చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు. ఇప్పటికైనా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో కారుకూతలు, బూతులకు స్వస్తి చెప్పి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి. రేవంత్ ఇకనైనా గాసిప్స్ మీద కాకుండా గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ హితవు పలికారు. ఘోష్ కమిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు వృథా చేసిందని, సుప్రీంకోర్టులో ఏదో చేస్తామని ప్రభుత్వం అనుకోవడం వృథా ప్రయాస అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ ‘పగలు కాంగ్రెస్‌తో ఉంటూ రాత్రి బీజేపీతో అంటకాగుతున్న రేవంత్‌రెడ్డి ఒక హైబ్రిడ్ సీఎం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. చీకటి, దొంగ ఒకటి అయినట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఒక్కసారి కూడా రేవంత్‌ను విమర్శించడం లేదు. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రం నుంచి మూటలు వెళ్తుంటే, సంజయ్ స్పందించకుండా కరీంనగర్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి అక్రమాలకు రక్షణ గోడలా నిలుస్తున్నాడు. అమృత్ స్కీమ్, సింగరేణి కుంభకోణాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు విచారణ జరపడం లేదు? రేవంత్‌ను ఎవరు కాపాడుతున్నారు? కెమెరాలకు చిక్కిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌లా రేవంత్ కూడా ఓటుకు నోటు కేసులో కెమెరాలకు చిక్కాడు. అయినా ఆయనను ఎవరు కాపాడుతున్నారో బీజేపీ నేతలు చెప్పాలి. రేవంత్ భవిష్యత్తులో కాంగ్రెస్‌ను బొందపెట్టి బీజేపీలో చేరడం ఖాయం..’అని కేటీఆర్ అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
kaleshwaram: లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న ప్రభుత్వం
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని లీగల్ టీమ్ చెబుతోంది. మొదటిది సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. కోర్టు తీర్పుపై రేపు కేబినెట్లో చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌కు అడ్వకెట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. రేపటి సమావేశానికి అడ్వకేట్ జనరల్ హాజరుకానున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. కాగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొంది. -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట
-
చర్యలు వద్దు.. కేసీఆర్, హరీష్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాగా, ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.కరీంనగర్‌లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అమృత్- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు..ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకొనితింటున్నారు. కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుంది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది.తేజస్వీ సూర్య కామెంట్స్‌పై.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే.. అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు చేశారు. -
BRSలో చేరిన తొలి స్పీచ్ ఆ ఘనత కేసీఆర్ దే..
-
సీఎం సీఎం అంటూ దద్దరిల్లిన జగిత్యాల
-
లాగులు పగిలే దాకా... బాబుకు వార్నింగ్ ఇచ్చా దెబ్బకు..
-
హెలికాప్టర్ దిగగానే జీవన్ రెడ్డిని కేసీఆర్ చూడగానే..
-
యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)
-
యజ్ఞం ప్రారంభిస్తున్నా
జగిత్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ చావాలా..? నువ్వు వేయి జన్మలెత్తినా చావను.. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా..? ఈ వెధవలు చావాలని అనుకుంటే చస్తానా? మీ ఆశీర్వాదాలు ఉంటే అన్ని వర్గాల ప్రజలు గర్వంగా, సంతోషంగా ఉండేలా, అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా. చివరి శ్వాస దాకా 50 ఏండ్ల వారిలా నేనూ, జీవన్‌రెడ్డి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతాం. రాష్ట్రం ఎందుకు బాగుపడదో చూస్తాం‘ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన కేసీఆర్ గంట పాటు ప్రసంగించారు. ‘తెచ్చిన తెలంగాణలో మంచి, చెడు చూసే బాధ్యత నాకు అప్పగిస్తే కొత్త కుండలో ఈగ చొచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక స్థితిపై అవగాహన లేకున్నా నిపుణుల సహాయంతో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేశాం. కానీ కేసీఆర్‌కు పాలన చేతకావడం లేదు... మాకు పాలనలో అనుభవం ఉంది. ఆరు చందమామలు, ఏడు సూర్యులను పెడతామని అధికారంలోకి వచ్చి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. అందువల్ల ప్రజలు సంఘటితమై తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మొదలు పెట్టాలి. గ్రహచారం బాగాలేదని కూర్చుంటే దెబ్బతింటాం. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ శక్తులను పునరేకీకరణ చేస్తూ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభిస్తున్నా.. ముందుకెళ్లి విజయం సాధిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మూడో కిస్తీ కోసం మరో సభ పెట్టాలా... ‘ఉత్తి మాటలు.. గప్పాలు కొట్టుడు కాదు.. మిషన్ భగీరథ ఐదేండ్లలో పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని నిండు అసెంబ్లీలో చెప్పిన సీఎంను ఎవరైనా చూశారా? మరిప్పడు ఏం రోగం వచ్చింది. పని చేయని వారిని లాగులు పగిలేదాకా సంపాలి. పొదరిల్లు లాంటి తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని ఏడు వేల మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు పెంచి క్షణం కూడా కరెంటు పోకుండా చేశాం. మరిప్పుడు ఏం బీమారి వచ్చింది. రైతుబంధు కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి. జగిత్యాలలో సభ పెడితే రైతుబంధు రెండో కిస్తీ ఇస్తున్నారు. మూడో కిస్తీ కోసం కేసీఆర్ మరో సభ పెట్టాలా. రైతుబంధు వేసేందుకు కాటారంలో సభ పెట్టారు. రెండు నెలలకోమారు ఎకరానికి ఆరు వేలు వేసి సిపాయిల్లా డప్పు కొట్టుకుంటున్నరు’ అని కేసీఆర్ అన్నారు. ..అందుకే బయటకు రాలేదు ‘బీఆర్ఎస్ పాలనలో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేస్తారో లేదో కూడా చెప్పడం లేదు. ఉద్యోగులకు 72శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇస్తే ఈ ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల బకాయిలతోపాటు కనీసం ఏడు శాతం జీతం కూడా పెంచలేదు. ఉచిత బస్సుతో ఆటో కార్మీకులు ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ తిరగేస్తే సింగరేణి, పౌరసరఫరాలు సహా అనేక కుంభకోణాలు, భూ కబ్జాలు జరుగుతున్న తీరు చూస్తే బాధ కలుగుతోంది. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, అరెస్టుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకున్నా నేను ఒకటి రెండుమార్లు తప్ప బయటకు రాలేదు. ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చారు. మంచి జరగాలని కోరుకున్నా.. కానీ ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం, గొప్ప స్కీమ్ లేదు. అందుకే జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు ‘‘కాంగ్రెస్ పోవాలే.. బీఆర్ఎస్ రావాలే అంటున్నడు’’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి సంతకంతోనే హైడ్రా రద్దు ‘మేము మూడున్నర లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే హైడ్రాతో పిల్లలు పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు చేస్తున్నరు. హైడ్రాను జిల్లాల్లో కూడా తెస్తామని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం’ అని కేసీఆర్ మండిపడ్డారు. జీవన్‌రెడ్డి.. నేను దగ్గరి మిత్రులం‘జీవన్‌రెడ్డి గురించి ఎక్కువ చెప్తే మాది మేము డబ్బా కొట్టుకున్నట్లు అయితది. 45 ఏండ్ల నుంచి దగ్గరి మిత్రులం అయినా భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశాం. కానీ మంచి చెడ్డలు, కష్టసుఖాలు, అభిప్రాయాలు కలిసి పంచుకునే వాళ్లం. జగిత్యాల ప్రాంతం గురించి ప్రాణం పెట్టి పనిచేసిన నాయకుడు జీవన్‌రెడ్డి. నేను సీఎం అయిన తరువాత కరీంనగర్లో సభ పెడితే అక్కడికి వచ్చి బోర్నపల్లి బ్రిడ్జి అవసరం అని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడిగారు. వెంటనే రూ. 80 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించిన. ఇటీవల కొన్ని సర్వేలు జరిగితే బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరిక ఆటంబాంబుగా పేలడంతోపాటు జగిత్యాలతోపాటు పొరుగు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందని తేలింది. నేనూ, జీవన్‌రెడ్డి అన్నదమ్ముల్లా, పారీ్టకి పిల్లర్లుగా పనిచేస్తాం. ఆయన జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లాలకే పరిమితం కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలన్నీ చూసుకోవాలి. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచే అపాయింట్ చేస్తున్నా. ఆరు నూరైనా.. వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇది నామాట. జగిత్యాల యుద్ధం కార్యకర్తల వంతు. తెలంగాణ యుద్ధం మా వంతు’ అని కేసీఆర్ ప్రకటించారు. అలిశెట్టి కవితతో ప్రారంభం జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ కవితతో కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. ’చీకట్లో దడుసుకుంటే.. ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై బయపెడుతది.. గుండెంటూ ఉంటే ... అదే నీకు సైన్యం అయి నిలుస్తది’ అన్నారు. ఈ సభకు వచ్చిన మీరు, రోడ్ల మీద అశేషంగా నిలిచిన జీవన్‌రెడ్డి అభిమానుల ఆశీర్వాదంతో నాకు గుండె ధైర్యం వచ్చింది. జీవన్‌రెడ్డి అన్నకు, ఆయన వెంట వచ్చిన వారికి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా స్వాగతం’ అంటూ కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ⇒ ’బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం. మూసీ ప్రాజెక్టుతో వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం సహా ప్రాజెక్టులను పండబెట్టి అబద్దాలు ఆడుతున్నారు’ ⇒ ‘కాంగ్రెస్ మాటలు కోటలు దాటాయి. కాకికి పెడదామంటే కుష్కడు లేవు... పిట్టకు పెడదామంటే పిడికెడు లేవు అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దోపిడీతో ఎవరూ సంతృప్తిగా లేరు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు’ ⇒ ‘దరిద్రులకు రాజ్యం అప్పజెప్తే రైతుల పొలాలు ఎండుతున్నాయి. తెలంగాణ రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య. రైతు బంధుకు రాం..రాం.. దళితబంధుకు జై భీమ్ అంటరని, మోసపోతే గోస పడతామని ఎన్నికకు ముందు చెప్తే నా మాటను కొందరు వినలేదు’ -
కేసీఆర్ కాస్కో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్లైన్లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి ‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది. దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం.. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు. జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది.. ఫామ్‌హౌస్‌లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్‌లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్‌లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు తావు లేదు.. ‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్‌కుమార్‌గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్‌ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్‌ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం అనుకుంటున్నావో’ : కేసీఆర్
సాక్షి,జగిత్యాల: మీరు చావాలనుకుంటే నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తానని’ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటుంటున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగదు మీరు చావాలనుకుంటే నేను చావను. మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. వడ్డించిన విస్తరిలా మీకు తెలంగాణను అప్పగించాం. అన్నీ రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపి మీకిచ్చాం. మా హయాంలో తెలంగాణ ఎలా ఉంది. మీ హయాంలో తెలంగాణ ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఇప్పుడు అవినీతి, స్కాం, భూకబ్జాలు తప్ప అభివృద్ధి లేదు. సివిల్ సప్లై, సింగరేణిలో దోచుకుంటున్నారు. ఏ రైతును పలకరించినా తప్పు జరిగిందని బాధపడుతున్నారు. రాష్ట్రమంతా ఖాళీ, అంతా దోచుకున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడడ్రాను తొలగిస్తాం. మొదటి సంతకంతోనే హైడ్రాను తొలగిస్తాం. పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంటి? ఇది మూసీ సుందరీకరణ కోసం కాదు,రియల్ ఎస్టేట్ కోసం. ప్రజల కోసం ఒక్క స్కీం తీసుకురాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసేస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
మొదటి సంతకంతోనే హైడ్రాను అవతల పారేస్తా: కేసీఆర్
జగిత్యాల: మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుండె ధైర్యమున్న నేత అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపారేస్తామన్నారు. గరీబోళ్లను ఏడిపిస్తూ మూసీ వెంట పడ్డారని తెలిపారు. మూసీ సుందరీకరణ ఓ రియల్ ఎస్టేట్ దందా అని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టారని వ్యాఖ్యానించారు.40 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీల్లో పనిచేశామని చెప్పారు. జగిత్యాల ప్రాంతం కోసం జీవన్‌రెడ్డి ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు. ఎమ్మెల్యేగా మంత్రిగా చిత్తశద్ధితో పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. తన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్‌రెడ్డి ఏదైనా చేస్తారని తెలిపారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా..‘ఇవాళ తెలంగాణ అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ అనొద్దని నాడు దాడి చేసిన్రు. చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా. తెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించా. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను.రోషయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణ వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా. చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు. వచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం. బిహార్ లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం. మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం. మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప..?’ అని వ్యాఖ్యానించారు. 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది..చీకట్లో దడుసుకుంటే చెట్టే నీ చుట్టూరా భయపెడతదంటూ జగిత్యాల దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్‌ను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ‘జీవన్ రెడ్డి జగిత్యాలకు మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. నేను ముఖ్యమంత్రి అయ్యాక కరీంనగర్ లో నన్ను బోర్నపల్లి గురించి అడిగిండు. తన నియోజకవర్గం పట్ల జీవన్ రెడ్డి కన్సర్న్ ఏంటో అందరికీ తెలిసిందే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే మంచి ప్రభావం ఉంటుందని సర్వేల్లో కూడా చాలా మంది చెప్పారు. నేను, జీవన్ రెడ్డి ఇకపై ఒక కుటుంబంలా, అన్నదమ్ముల్లా పని చేయనున్నాం. నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. జీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారు. ఈ కాంగ్రెసోళ్లు రాగానే కరెంట్ కాకెత్తుకుపోయింది. అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి. రైతులు చనిపోతున్రు. గుండెల్లో తడి లేని దుర్మార్గులు గెలిస్తే రైతుబంధుకు రాం రాం పాడిన్రు. లోన్స్ మాఫీ అన్నాడు ఐనయా? అడ్డమైన హామీలతో ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. 1.7 శాతంతో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. వచ్చినోళ్లు మంచిగా పని చేయాలిగా..? చిల్లర మాటలు తప్ప ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక పథకం చేపట్టిందా? బంగారుమయమైన తెలంగాణను రెండున్నర ఏళ్లల్లో ఆగం చేసిన్రు. దుకాణాల్లో లేని బస్తాలు యాప్ లో వస్తయా? కాంగ్రెస్ వస్తే చెప్పులతో క్యూలు తప్పుతలేవు. ఇది అసమర్థమైన ప్రభుత్వం.తెలంగాణా ఆగమాగమైపోయింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి అన్నివర్గాల ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని తెలిపారు. -
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’
సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం జీవన్ రెడ్డి గుండె ధైర్యమున్నోడు40ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డి,నేను స్నేహితులం భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాంతెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేశారుజగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారుఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారుతన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్ రెడ్డి ఏదైనా చేస్తారుజీవన్ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శంపదవులు జీవన్‌రెడ్డికి కొత్తకాదుబీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి నియామకంసభలో ప్రకటించిన కేసీఆర్ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డికి చెప్పామేం అధికారంలోకి రాగానే జీవన్‌రెడ్డికి మంచి పదవి కల్పిస్తాకరీంనగర్ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డి పని చేయాలితెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేదిఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్ ఛార్జీలు పెంచారుఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారుపక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడిందితెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని ముందుకు సాగాంఐదేళ్లలో మిషన్ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాంపదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసుమా హాయంలో మిషన్ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదునూటి నూరుశాతం మళ్లీ బీఆర్ఎస్సే వస్తుందిజీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారుజీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందివినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రుచంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశాతెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించాబషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించానురోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడుఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరాచిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారువచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయంబిహార్లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్‌ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాంమిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాంమిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్. 40 మంది అనుచరులతో పాటు బీఆర్ఎస్లో చేరారు జీవన్‌రెడ్డి. ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి జీవన్‌రెడ్డి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌పై అసంతృప్తిలో బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు జీవన్‌రెడ్డి. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్లో చేరికతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ కొనియాడారు. కేసీఆర్ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. -
కేసీఆర్ భారీ బహిరంగ సభ జగిత్యాల గులాబీమయం
-
నేడు జగిత్యాలలో గులాబీ గర్జన
సాక్షి, హైదరాబాద్ /జగిత్యాల: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి సోమవారం జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభను పార్టీ శ్రేణులు జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తున్నాయి. 2023లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి జగిత్యాల సభతో పూర్వ వైభవం సాధిస్తుందనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత... 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కేసీఆర్ అడపాదడపా మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక శస్త్ర చికిత్సతో కొద్దినెలలు ఎర్రవల్లి నివాసానికి పరిమితమయ్యారు. కొద్దిగా కోలుకున్న కేసీఆర్ 2024 ఫిబ్రవరి 13న ‘చలో నల్గొండ’పేరిట సభ నిర్వహించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఈ సభలో మండిపడ్డారు. 2024 ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రోడ్‌షోలు, బస్సుయాత్రలో కేసీఆర్ పాల్గొన్నారు. గత ఏడాది వరంగల్‌లో ‘రజతోత్సవం’ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద ‘రజతోత్సవ సభ’నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ భేటీలో కేసీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటంతో జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్‌రెడ్డి చేరికతో కొత్త ఉత్సాహం నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా పేరొందిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతుండటంతో పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి పార్టీకి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. జీవన్‌రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణలో పార్టీకి కొత్త ఊపునిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. జగిత్యాల సభ వేదికగా బీఆర్ఎస్ ప్రస్థానం, పదేళ్ల పాలన, కాంగ్రెస్ పాలనావైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్ ప్రసంగించే అవకాశముంది. పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల సభ బీఆర్ఎస్ ప్రస్థానంలో మైలు రాయిగా నిలవడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో ‘గేమ్ ఛేంజర్’గా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. లక్ష మందికి పైగా సభకు వచ్చేలా... జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు లక్షకు పైగానే జనాన్ని తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేలా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల సభలో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.45కు ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్లో కేసీఆర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరంసాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి బహిరంగ సభ ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుంటారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మినీస్టేడియం పట్టణం నడి»ొడ్డున ఉండటంతో అత్యధికంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు పర్యటించి ప్రజల కోసం 3 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. -
తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి...సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్లో చేరిక ఆ పార్టీకి మోరల్ బూస్ట్, కాంగ్రెస్‌కు పరీక్షగా మారనుంది. ఒక్కటవుతున్న ప్రత్యర్థులుతెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా.ఆసక్తికరంగా సీఎం పర్యటనఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్ఎస్పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. -
ప్లీనరీ కాదు.. ప్రతినిధుల సభ!
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ప్లీనరీతో కాకుండా కేవలం ప్రతినిధుల సభతోనే సరిపెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ 25 సంవత్సరాల నేపథ్యంలో గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీంతో ఈసారి ప్లీనరీ కాకుండా ముఖ్య నాయకులతోనే రెండురోజుల ప్రతినిధుల సభను పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ముందు ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోనే మరో సభ నిర్వహించడంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతినిధుల సభకే పరిమితం కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మె ల్యేలు, పార్టీ కార్యవర్గం, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులను కలుపుకొని మొత్తంగా సుమారు 450 మంది ముఖ్య నేతలు ప్రతినిధుల సభకు హాజరవుతారు. అయితే పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ ప్రతినిధుల సభకు హజరవుతారా? లేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షత వహిస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం! గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా పార్టీ సభలు, సమావేశాలకు హాజరు కాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టి.జీవన్‌రెడ్డి ఈ నెల 20న జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై స్పందిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీశ్ జగిత్యాల సభకు సుమారు 2 లక్షల మందిని సమీకరించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. సభ ఏర్పాట్ల బాధ్యతలను ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జగిత్యాలతో పాటు మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటీఆర్ పార్టీ ఇన్చార్జిలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం జగిత్యాలకు వెళ్తున్నారు. నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 20న మేడిగడ్డ బరాజ్ పరిశీలనకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ సహా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు శనివారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
కేసీఆర్‌కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీనియర్ నేత జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్‌కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్‌రెడ్డి చెప్పారు. -
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
-
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె. ‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్‌దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్‌ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
కాంగ్రెస్ లో TDP నేతలు.. జీవన్ రెడ్డికి పొగ బెట్టారా?
-
అన్నా.. దేవుడే పంపిండు!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. అన్నా.. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది..’ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో అన్నారు. బీఆర్ఎస్లో చేరుతున్నట్టు గురువారం ప్రకటించిన జీవన్‌రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు.తొలుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి జీవన్‌రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డా.కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జీవన్‌రెడ్డి వెంట ఆయన కుమారులు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డితో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేశ్ కూడా ఎర్రవల్లికి వచ్చారు.కాగా జీవన్‌రెడ్డిని ఆత్మియ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి తన నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సమయంలోనే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతల సమక్షంలో ఇష్టాగోష్టి అనంతరం జీవన్‌రెడ్డి బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కేసీఆర్, జీవన్‌రెడ్డి నడుమ సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికకు తేదీ ఖరారైంది. రాజకీయ పరిస్థితులపై చర్చ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జీవన్‌రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవడంతో పాటు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం, పదేళ్ల బీఆర్ఎస్ పాలన వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనా తీరు తదితరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం తిరోగమన దిశలో ఉందనే కోణంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జగిత్యాలలో 2 లక్షల మందితో సభ జీవన్‌రెడ్డి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో జరిగే బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు ఆదేశాలు అందాయి. సభ నిర్వహణ బాధ్యతను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక నేతలకు అప్పగించినట్లు సమాచారం. సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని శనివారం బీఆర్ఎస్ నేతలు సందర్శించి ఖరారు చేయనున్నారు. సుమారు 2 లక్షల మందితో సభ నిర్వహించేలా మైదానం ఎంపిక చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జీవన్‌రెడ్డికి సెక్రటరీ జనరల్ హోదా జీవన్‌రెడ్డికి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు ఈ పదవిలో కొనసాగారు. కాగా జీవన్‌రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ముఖాముఖి సమావేశం సందర్భంగా పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జీవన్‌రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది ⇒ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ⇒ మీడియాతో జీవన్‌రెడ్డి సాక్షి, సిద్దిపేట: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం పట్టు కోల్పోయిందని మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే తన విషయంలో పీసీసీ తప్పు చేసింది కానీ ఏఐసీసీని నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు. శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా, రూలర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం సీఎం అదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయింది.మరోవైపు రేవంత్‌రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నా..’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. తనకు 14 సార్లు బీ ఫామ్ ఇచ్చారంటే కంటెంట్ ఉన్న నాయకుడినే కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన అన్నారు. కాగా జీవన్‌రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణలు మీడియాకు తెలిపారు. -
బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్
సిద్ధిపేట: ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరనున్నారు. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలోనే జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 10వ తేదీ) సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలో సుమారు ఐదు గంటల పాటు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికపై స్పష్టత నిచ్చారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తుంది. నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది. మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. -
KCRతో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్
-
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
-
గులాబీ దళపతి కేసీఆర్‌తో భేటీ
-
కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
-
కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కాళేశ్వరం కమిషన్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడింది. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు వాయిదా వేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే.. ఇవాళ విచారణ జరగ్గా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి
-
CM Revanth : కేసీఆర్ లేకపోతే నేను లేను
-
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్‌రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. -
రేషన్‌కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్‌కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్‌చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్‌ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్‌జోన్‌లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్‌హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్‌కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్‌కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్‌రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్‌టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్‌రావు చెబుతుండడం తప్పు. చక్రధర్‌గౌడ్ పంజగుట్ట పీఎస్‌లో తనను హరీశ్‌రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్‌రావు బెదిరించినట్టు చక్రధర్‌గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్‌ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్‌రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్‌కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్‌లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్‌రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
స్కామ్ కథ కంచికేనా?
కథలన్నీ కంచికి చేరతాయో లేదోగానీ... రాజకీయ ప్రయోజనాలనాశించి పెట్టే కేసులన్నీ, సీబీఐ, ఈడీల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఆ వరసలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తాజా ఉదాహరణ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతోపాటు 23 మందిపై అవినీతి, కుంభకోణం ఆరోపణలు చేస్తూ 2022లో సీబీఐ దాఖలు చేసిన కేసులో అందరూ నిర్దోషులని ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సీబీఐకి చెంపపెట్టు. పనిలో పనిగాతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవితను కూడా నిందితురాలిగా చేర్చారు. ఆమె సైతం ఇప్పుడు నిర్దోషిగా తేలారు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూరేలా మద్యం విధానం తీసుకొచ్చిందంటూ ఈ కేసు అల్లారు. అధికారంలో కొచ్చిన ఏ రాజకీయ పక్షమైనా అమల్లో ఉన్నవాటిని కాదని, తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతుంది. అవన్నీ సరైనవి కాకపోవచ్చు. వాటి వెనక స్వీయ ప్రయోజనాలుండొచ్చు. ఆ నిర్ణయాల పర్యవసానంగా ఖజానా నష్టపోతే, ప్రజల ప్రయో జనాలు దెబ్బతింటే చర్యలు తీసుకోవాల్సిందే. వాటినెవరూ ప్రశ్నించరు. కానీ అందుకు తగిన మౌలిక ఆధారాలు, ప్రాతిపదిక ఉండాలి. విధానం మార్చడం దానికదే ఒక కుంభ కోణంగా చిత్రించటం, ఆ పేరిట కేసులు, అరెస్టులతో వేధించటం, ఏళ్ల తరబడి దర్యాప్తు, చివరకు నిరూపించలేక న్యాయస్థానాలతో చీవాట్లు తినడం ఏం మర్యాద? ఇందువల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత దెబ్బతినడం లేదా? తాత్కాలికంగా మీడియాలో భారీ యెత్తున ప్రచారం జరగొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదని జనం అభిప్రాయపడేలా చేయొచ్చు. ఎన్ని చేసినా ఆరోపణల్ని రుజువు చేయటం అంతిమంగా దర్యాప్తు సంస్థ బాధ్యత. పత్రికల్లో రోజుల తరబడి పతాక శీర్షికలు ఆక్రమించి, టీవీ చానెళ్లలో గంటల తరబడి చర్చలకు కారణమైన కేసులు చివరకు దూదిపింజెల్లా తేలిపోవటం, గాలి పోగేయటం తప్ప ఇందులో ఆవగింజంతైనా వాస్తవం లేదని తేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ కేసుల్ని ఆధారం చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు ఇష్టానుసారం వ్యాఖ్యా నాలు చేయటం, అవమానించేలా శీర్షికలు పెట్టడం మరో ప్రహసనం. ఎవరికీ తెలియని ‘సౌత్ గ్రూప్’ను సృష్టించి, దానికి లబ్ధి కలిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చిందని, ఇందులో రూ. 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. 2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియానూ, 2024 మార్చిలో కవితనూ, కేజ్రీవాల్‌నూ అరెస్టు చేశారు.అన్ని కేసుల్లో మాదిరే ఇక్కడ కూడా మనీశ్ సన్నిహితుడు దినేశ్ అరోరా, ఏపీకిచెందిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వంటివారిని అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఈ ముగ్గురూ పూసగుచ్చినట్టు చెప్పారంటూ లీకులిచ్చారు. కానీ అలా అంటే సరిపోదు... వాటిని ధ్రువపరిచే సాక్ష్యాలుండాలి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తే కాదు... అంత మొత్తం ఎలా ప్రయాణించిందో, ఏయే ఖాతాలకు మళ్లిందో చూపాలి. అడుగడుగునా ఆధారాలుండాలి. ఫలానా అంశాలు రాబట్టామని ఏకరువు పెట్టినంత మాత్రాన కుదరదు. వాటిమధ్య పరస్పర సంబంధాన్ని సందేహాతీతంగా రుజువు పరచాలి. ఆ సంగతలా ఉంచి కనీసం అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 7, 13 కింద ఆరోపించిన లంచం ఆరోపణల్ని కూడా సీబీఐ ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. అందుకే కాబోలు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యకు కోర్టు ఆదేశించింది.అయితే ఈ కేసులో సీబీఐ అప్పీలుకెళ్లింది. అంటే ఈడీ దర్యాప్తు ఇంకా సాగుతూనేఉంటుందనుకోవాలి. కాకపోతే ఇందులో అవినీతిపరుడిగా ముద్రపడిన కేజ్రీవాల్నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. నిందితులంతా కారాగారవాసంతో సహా మూడున్నరేళ్లపాటు నానా కష్టాలు పడ్డారు. బహుశా వారిని ఆర్థికంగా కూడాకుంగదీసి ఉండొచ్చు. కానీ దర్యాప్తు పేరిట ప్రజాధనం, న్యాయస్థానాల విలువైన సమయం వృథా కావటం మాటేమిటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణులు కొనసాగనీయటం అవాంఛనీయం, ప్రమాదకరం. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయి: కేటీఆర్
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,. ఢిల్లీ లిక్కర్ కేసు సాకుతో కేజ్రీవాల్ సర్కారు కూల్చారని, ఆ కేసు వల్ల బీఆర్ఎస్ నష్టపోయిందన్నారు కేటీఆర్. ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయమన్నారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసు అని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫామ్‌హౌజ్‌కు కేటీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో..కేటీఆర్ భేటీ కానున్నారు.తాజా పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌తో పాటు కవితకు క్లీన్చిట్ అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇవి కూడా చదవండి:లిక్కర్ కేసులో క్లీన్చిట్.. కవిత స్పందన ఇదేలిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగం -
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తుంటే..బావ, బావమరిది హరీశ్‌రావు, కేటీఆర్ తెలంగాణ సమాజంపైన, ప్రభుత్వంపైన విషం కక్కుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు సూచించారు.గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, మాధవరెడ్డితో కలసి ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 2023 జూలై 15న వెలుగుమట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇళ్లను కూలగొట్టించిందని చెబుతూ అప్పటి కూల్చివేత సంఘటనల ఫొటోలను మీడియాకు చూపారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా, మంత్రి పొంగులేటి పైవిధంగా స్పందించారు.హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్యాయం చేశారని ఆరోపించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని, పేదలే ఇందిరమ్మ ప్రభుత్వానికి పేటెంట్ అని మంత్రి వ్యాఖ్యానించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామన్నారు. ‘వెలుగుమట్లలో అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తాం. ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూస్తాం’అన్నారు. పేదల కష్టాలు తీర్చేందుకు జలయజ్ఞం ప్రారంభించారు తన పాదయాత్రలో భాగంగా పేదల కష్టాలను నేరుగా తెలుసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి..వారి కష్టాలు తీరాలంటే గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణంతో రైతన్నకు సమృద్ధిగా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. జలయజ్ఞంతో ప్రాణహిత–చేవెళ్ల సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బావ బావమరుదులు హరీశ్‌రావు, కేటీఆర్ వచ్చి మాట్లాడాలి. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఉండకుండా సాకులతో బయటకు పోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని..కానీ తాము కచ్చితంగా అవకాశం ఇస్తామని, సభకు వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని పొంగులేటి కోరారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించారు. ⇒ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినందువల్లే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా మారిందని విమర్శించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. -
కమిషన్ ఏర్పాటు కుట్రపూరితం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదిక చెల్లదని, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదించారు. ప్రతిపక్ష నేతలను ఇరికించాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ప్రభుత్వం కమిషన్‌ను నియమించిందన్నారు. అనంతరం కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. రెండున్నర గంటల వాదనల తర్వాత తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలొద్దంటూ గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వా నికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మా సనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, పి.శ్రీరామ్, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. బాధ్యులెవరో తేల్చాలని కమిషన్ ఎలా వేస్తారు? సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ప్రభు త్వం ముందే ఓ నిర్ణయానికి వచ్చి ంది. దానికి బాధ్యులెవరో తేల్చాలని కోరుతూ 2024, మార్చి 14న జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియ మిస్తూ జీవో 6 జారీచేసింది. ఇది ఒక రకంగా తాము చెప్పిన విధంగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరడమే. ఇలా కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం నోటీసులు జారీ చేయలేదు. సాక్షిగా పిలిచి దోషిగా చూపే ప్రయత్నం చేయడం అభ్యంతరకరం.నివేదిక పేరిట తీర్పు చెప్పే అధికారం కమిషన్‌కు లేదు. 2025, జూలై 31న సర్కార్‌కు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సమ ర్పించింది. అంతకుముందే నివేదికలోని అంశాలు బహిర్గతం చేశారు. సీఎం, మంత్రులు.. హరీశ్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. పవర్ పాయి ంట్ ప్రజెంటేషన్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించడం, నిరాధార ఆరోపణలు చేయడం పరువుకు భంగం కలిగించడమే. ఏకపక్షంగా నివేదికలోని వివరాలను 60 పేజీలకు కుదించి మీడియాకు విడుదల చేశారు. చట్టప్రకారం, కేబినెట్ అనుమతితోనే అన్ని చర్యలు చేపట్టినందున సీబీఐ విచారణకు ఆదేశించినా ఎదుర్కొంనేందుకూ సిద్ధం’అని చెప్పారు.రాజకీయ కక్షలో భాగంగానే.. ‘కేంద్ర ప్రభుత్వ అధీనంలోని వ్యాప్కో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించింది. హరీశ్‌పై సాక్షులెవరూ తప్పుడు ఆరోపణలు చేయలేదు. గత జూన్ 9న హాజరై కమిషన్ అడిగిన సమాచారం, కేబినెట్ తీర్మాన కాపీలన్నీ అందజేశారు. అయినా, సహేతుకమైన అవకాశం ఇవ్వకుండా ఆరోపణలు చేయడం చెల్లదు’అని సుందరం చెప్పారు. దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్‌ను దోషిగా చూపించాలని ఉద్దేశంతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏకపక్షంగా జీవో జారీ చేశారు’ అని చెప్పారు. అనంతరం కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. -
KCRకు YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు
-
కేసీఆర్‌కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
‘కేసీఆర్ కాదు..తెలంగాణకు అసలైన జాతిపితను నేనే’
సాక్షి,నల్గొండ: తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాదని, తానే అసలైన జాతిపిత అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ జాతిపిత కాదు.జాతిపిట్ట. అసలైన జాతిపితను నేనే. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశా. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న జీతం వెంటనే వెనక్కి ఇవ్వాలి’అని డిమాండ్ చేశారు. -
‘ప్రాణహిత – చేవెళ్ల’ను పునరుద్ధరిస్తాం
వికారాబాద్: దివంగత సీఎం వైఎస్సార్ డిజైన్ చేసి, శిలాఫలకం వేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పిన సబితమ్మ కేసీఆర్‌తో ప్రాణహిత– చేవెళ్లను ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణ్‌పూర్ శివారులో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాకు 300 టీఎంసీల నీరు ఇవ్వటానికి చేతకాలేదా..? ప్రాజెక్టు డిజైన్ మార్చి ఉమ్మడి జిల్లా పొలాలను ఎండబెడుతుంటే సబితమ్మ ఏం చేశారని ఎద్దేవా చేశారు.పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే భూసేకరణ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓ పక్క బీజేపీ, బీఆర్ఎస్లపై ఘాటైన విమర్శలు చేస్తూనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి జిల్లాకు నీరందించేందుకు దివంగత నేత వైఎస్సార్ ప్రాజెక్టులు మంజూరు చేస్తే.. కేసీఆర్ రద్దు చేశాడని విమర్శించారు. గోదావరి జలాలను తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతగిరిలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఓ సంస్థతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వికారాబాద్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా మీదుగా ట్రిపుల్ఆర్ నిర్మించటంతోపాటు ఓఆర్ఆర్ టు జిల్లా వరకు రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వారివి చీకటి ఒప్పందాలు ‘బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఎవరికి తెలియనివి? బీజేపీ వాళ్ల బీ ఫారంలు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు. ఇది తాండూరులో రుజువైంది’అని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..కల్వకుంట్ల కిషన్‌రావు అని రాసుకుంటే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్ అన్ని వర్గాలను వంచించారని, ఆయన ఎస్సీలను సీఎం చేస్తానని వంచిస్తే, మేము ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్ చేశాం.. ఆ సామాజిక వర్గాలకు మంత్రి పదవులిచ్చామని సీఎం స్పష్టం చేశారు. చెరిగిపోని నీచ చరిత్ర కేసీఆర్‌ది..కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు, కేటీఆర్ తనను విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘కేసీఆర్‌ది దొంగనోట్లు, పాస్‌పోర్టు బ్రోకర్ల చరిత్ర .. ఆ చరిత్ర నేను చెరిపేస్తే పోయేదా? కేసీఆర్‌పై దొంగనోట్ల కేసు నమోదైందని మీ పక్కన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమారే చెప్పిండు. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిపినా చెరిగిపోదు.. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. కావాలంటే ఆ చరిత్రను మావాళ్లకి చెప్పి గోడలపై రాయించి భద్రపరుస్తా’అని సీఎం ఎద్దేవా చేశారు. రంజిత్‌రెడ్డిని మున్సిపల్ మంత్రిని చేస్తా..చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రంజిత్‌రెడ్డిని గెలిపించి ఉంటే ఢిల్లీలో మన బలం పెరిగి ఉండేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయినా, రంజిత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి మీకు అండగా నిలబడతారని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఇస్తామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిని చేసి ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదం అనుమానాస్పదం: కిషన్ రెడ్డి
సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. -
వారిదే ఫెవికాల్,ఫెవిక్విక్ బంధం
సాక్షి.హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఫెవికాల్, ఫెవిక్విక్ బంధం ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైందని, నేటికీ కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో ‘ఓటుకు కోట్లు’కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడితే, నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌లు కూలినపుడు కేవలం వాటి పైనే జస్టిస్ ఘోష్ కమిషన్‌ను వేసి రేవంత్ చేతులు దులుపుకున్నారని, అయితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందని చెప్పారు.శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జిలు అశోక్ పర్మాణి, రేఖాశర్మ, మాజీ ఎంపీ పి.రాములు, పార్టీ నేతలు డా.ఎన్.గౌతమ్‌రావు, ఎన్వీ సుభాషలతో కలిసి.. ‘వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం’పేరిట మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. కమీషన్ల సర్కార్ నడిపిస్తున్నారు.. ‘ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ విజయం తథ్యమని తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ అంటున్నారు. జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో చిట్టా మా వద్ద ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ఏ జిల్లాకు ఎంత నిధులు ఇచ్చారో రేవంత్ చెప్పగలరా? ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటూ కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారు..’అని రాంచందర్‌రావు విమర్శించారు. కేంద్రంలో మా సర్కార్ ఉందని మరిచిపోవద్దు ‘మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు అనవసర కేసులు, దాడులు, బెదిరింపుల వంటి అరాచకాలకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉందని పోలీసులు మరిచిపోవద్దు. జాతీయ మానవహక్కుల కమిషన్ వద్దకు లాక్కెళ్లి నిలబెడతాం. శనివారం మంచిర్యాలలో ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తుంటే.. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులను కొట్టి, బెదిరించి ఉపసంహరింపజేసిన ఉదంతాలను సీరియస్‌గా తీసుకుంటాం. కర్ణాటకలో మాదిరిగా హేట్‌స్పీచ్ యాక్ట్ (విద్వేషపూరిత వ్యాఖ్యల చట్టాన్ని)ను బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తెలంగాణలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని తీసుకొస్తే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిపై మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టినందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది..’అని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ ప్రధాన హామీలివే.. ⇒ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు ⇒ ఆన్లైన్, సింగిల్ విండో సిస్టం ద్వారా వారం రోజుల్లో ఇంటి అనుమతులు ⇒ ప్రతి వార్డు/డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు ⇒ అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం ⇒ మున్సిపాలిటీ/కార్పొరేషన్లను గ్రీన్ టౌన్/క్లీన్ సిటీలుగా తీర్చిదిద్దుతాం ⇒ అన్ని చోట్లా 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం ⇒ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ⇒ ఏఐ సాంకేతికత సహకారంతో అవినీతి రహితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ⇒ 100% ఇంటింటి చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణతో చెత్త రహిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు -
రేవంతుద్దీన్ అంటే నాకు సంతోషమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నన్ను రేవంతుద్దీన్ అని ముస్లిం పేరుతో పిలిచారు. ఈ పిలుపును నేను సంతోషంగా స్వీకరిస్తా. అయితే రాంచందర్‌రావు పక్కన కూర్చున్న కిషన్‌రెడ్డి మాత్రం కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్‌ను జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. కేసీఆర్‌కు కేటీఆర్ అనే దొంగ పుత్రుడు ఉండగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావు దత్తపుత్రుడిగా మారాడు.ఈ దత్తపుత్రుడు కేసీఆర్, హరీశ్‌రావులను కాపాడుతున్నాడు. గతంలో మోదీ రాష్ట్రానికి వచి్చనప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఆరు నెలల్లో జైలుకు పంపుతామని చెప్పిన కిషన్‌రెడ్డి ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నాడు?..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కోరుతున్నా అని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేశాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారు? ‘కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారని కిషన్‌రెడ్డి, ఎంపీ అరి్వంద్లను ప్రశి్నస్తున్నా. కేసీఆర్, హరీశ్‌రావులను జైల్లో పెట్టి చిప్ప కూడు తినిపించాలని «ఎంపీ ధర్మపురి అరి్వంద్ అంటుంటారు. మేం కాళేశ్వరం విషయమై శాసనసభలో చర్చ పెట్టి కేసును సీబీఐకి ఇచ్చాం. ఇప్పటివరకు సీబీఐ పట్టించుకోలేదు. కేసీఆర్, హరీశ్‌రావులను చర్లపల్లి జైలులో పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? దీనిపై ధర్మపురి అరి్వంద్ ఎందుకు మాట్లాడరు?..’అని సీఎం ప్రశ్నించారు. అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తా.. ‘బ్రిటిష్ హయాం తర్వాత 100 ఏళ్ల వరకు బీసీ కులగణన జరగలేదు. ఇప్పుడు కులగణన చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ నన్ను గతంలో రేవంత్‌గౌడ్ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడంతో మంత్రి దామోదర రాజనర్సింహ రేవంత్ మాదిగ అన్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వాకిటి శ్రీహరిని మంత్రిని చేస్తే ముదిరాజ్ వర్గం నన్ను రేవంత్ ముదిరాజ్ అని వ్యాఖ్యానించింది. అనిల్‌కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపిస్తే రేవంత్ యాదవ్ అని పిలిచారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తానన్నందుకు సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని పిలిచారు.ఇవన్నీ నాకు సంతోషం కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఆ వర్గానికి అనేక పదవులు ఇచి్చంది. షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో గెలవకపోయినా పదవి ఇచ్చాం. ఎమ్మెల్యేగా ఓడిపోయినా అజహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నాం. 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. కాబట్టి రాంచందర్‌రావు నన్ను రేవంతుద్దీన్ అని పిలిచినా సంతోషంగా తీసుకుంటా. నాకు ఎలాంటి సమస్య లేదు. అన్ని కులాలు, మతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తా. తెలంగాణను నంబర్ వన్‌గా తయారు చేస్తా..’అని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లది వీణావాణి బంధం ‘కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్ ఇస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అమలు చేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా మూసీలో వేసినట్లే. ఈ రెండు పార్టీలది వీణావాణి బంధం.. ఫెవికాల్ బంధం..’అని సీఎం విమర్శించారు. నేను, మహేశ్‌గౌడ్ జోడెద్దుల్లా పనిచేస్తున్నాం.. ‘నేను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జోడెద్దుల్లాగా కలిసి పని చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ సారథ్యంలో 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేశ్‌గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాం. 2028లోనూ నేను సీఎంగా, మహేశ్‌గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్‌షిట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్‌షిట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ సైతం పూర్తి కావడంతో అభియోగపత్రాల తయారీ ప్రారంభించారు. మరోవైపు ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మార్చి 10న మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆలోగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. తుది చార్జ్షిట్లో కొన్ని సెక్షన్లతోపాటు నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక అరెస్టులు ఉండవని.. నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం. అలా నమోదై... ఇలా మారి... ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆపై 2023 మార్చి 13న ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు.అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్‌ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్‌లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది. అందరి వేళ్లూ ఆ అధికారుల వైపే... ట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు.మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్ని ప్రశ్నించిన సిట్ ట్యాపింగ్‌తో పాటు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుల ఎక్స్‌టెన్ వివరాలు ఆరా తీశారు. అవన్నీ పోలీసు విభాగం నిర్ణయాలని పేర్కొన్నారు. ఇలా అన్ని వేళ్లూ అప్పట్లో పని చేసిన ఉన్నతాధికారుల వైపే వెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు వారి విచారణపై సిట్ నిర్ణయం తీసుకోలేదు. వారిని ప్రశ్నించకుంటే కోర్టు విచారణలో కేసుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేసీఆర్ సిట్ విచారణ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులు, విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉద్యమకారుడిని అవమానిస్తారా? అని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఉద్యమాలు నడపలేదా?. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు?. గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా?. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.రాష్ట్రంలో పదవులన్నీ తీసుకున్నారు. భూములు పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకుని.. చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పు చేస్తే విచారణ తప్పదు.. విచారణ చేయొద్దని ఎక్కడా లేదు. ఇప్పుడు చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్ విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాయాలని బీజేపీ SIRను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెప్పుకొచ్చారు. -
ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మళ్లీ నిన్న మాకు గుర్తొచ్చింది: కేటీఆర్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని, మమ్మల్ని తట్టిలేపిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది.మంత్రి వాహనంపై దాడి జరగడం, మొదటిసారి. నిన్న కేసీఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదు. చట్టం అంటే కేసీఆర్‌కు గౌరవం. అందుకే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న మా ఇంటి చుట్టు వెయ్యి మంది పోలీసులను పెట్టారు. లా అండ్ ఆర్డర్ పై పోలీసులు దృష్టి పెడితే బావుంటుంది. సుల్తాన్ బజార్లో పట్టపగలే ATM దగ్గర చోరి జరిగింది.నల్లమల సాగర్ తో నీళ్ల దోపిడి జరుగుతుందిఅపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి , సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళాడు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలి. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలి. సృజన్ రెడ్డి కాల్ డాటా బయట పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయి.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రౌడిలను వేసుకొని తిరుగుతున్నాడు. కేసు పెట్టిన సీఐ హాబీబుల్లా ఖాన్‌ను అందుకే ట్రాన్సఫర్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు. హరీష్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందిఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలి.సజ్జనార్ అయిన, ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా?, సజ్జనార్ జడ్జి కాదు , పోలీస్ అధికారి మాత్రమే. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జి అయ్యాడేమో నాకు అయితే తెలియదు. బిజెపి జాతీయ అధ్యక్షుడుకి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో... పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి’ అని విమర్శించారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ -
KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం
-
నాలుగున్నర గంటలు.. కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్లింది. అక్కడి రెండో అంతస్తులోని ఓ గదిలో నగర సంయుక్త సీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి, ఐపీఎస్ అధికారి నారాయణరెడ్డి, నాన్ కేడర్ ఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ కేఎస్ రావు, ఏసీపీ సీహెచ్ శ్రీధర్‌లు కేసీఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఫైళ్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, వీటితోపాటు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల పత్రాలను రెండు ట్రంక్ పెట్టెల్లో తీసుకెళ్లారు. విచారణ ముగించుకొని రాత్రి తిరిగి వెళుతున్న సమయంలో సిట్ బృందం వీటిని తమ వెంట తీసుకెళ్లింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీకి వెళ్లిన అధికారులు సిట్ చీఫ్‌గా ఉన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ విచారణ తీరుతెన్నుల్ని ఆయనకు వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలోపోలీసులు నందినగర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు గత వారంలో సిట్ అధికారులు కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసు తర్వాత కేసీఆర్ సమయం కోరుతూ ఎర్రవల్లికి రావాలంటూ లేఖ రాశారు. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్ మరో నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లో విచారణకు సిద్ధమంటూ ఆయన శనివారం ప్రకటించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సిట్ అధికారులు అప్పటికప్పుడు ప్రశ్నావళిని సిద్ధం చేయడానికి ఉపక్రమించారు. దీంతో రాత్రంతా కూర్చున్న సిట్ బృందం కేసీఆర్‌ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు నియామకాలు, వీరి ఉద్యోగ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వడం తదితరాలపై ప్రశ్నించింది. అప్పట్లో రాధాకిషన్‌రావు, భుజంగరావు పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లిరావడం, ట్యాపింగ్‌కు ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లు, కొందరు బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాప్ కావడం, వ్యాపారుల ఫోన్లపై నిఘా, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రావడం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగింది. సిట్ సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో కలిపి నాలుగున్నర గంటల విచారణ సాగింది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాదులకూ అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు కేసీఆర్ ఒక్కరినే ఉంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు కేసీఆర్ వాంగ్మూలాన్నీ నమోదు చేసుకొని వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని నివాసం నుంచి ఎర్రవల్లికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉద్విగ్నం.. ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉద్విగ్న వాతావరణం నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు కేసీఆర్ వస్తారో లేదోననే ఉత్కంఠకు తెరదించుతూ ఎర్రవల్లి నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌లోని నందినగర్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. ఎర్రవల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్ వెంట వందకు పైగా వాహనాలు అనుసరించాయి. రహదారుల వెంట బారులు తీరిన పార్టీ శ్రేణులు కేసీఆర్ వాహనంపై పూల వర్షం కురిపించారు. తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత.... ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు చేరుకోవడానికి కేసీఆర్ కాన్వాయ్‌కు సుమారు 3 గంటలు పట్టింది. కేసీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికి నివాసంలోకి తోడ్కొని వెళ్లారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోశ్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఉదయం నుంచే నందినగర్ నివాసంలో వేచి ఉండటంతోపాటు సిట్ విచారణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్ బృందం వేచి చూస్తున్న గదిలోకి కేసీఆర్ తన న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, రామచంద్రరావుతో కలిసి వెళ్లారు. పోలీసు దిగ్బంధంలో బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణ భవన్ వద్ద ఆదివారం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏ ర్పాటు చేశారు. మొత్తంగా 750 మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మొత్తం 52 పికెట్లు, నలుగురు డీసీపీ లు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుళ్లతోపాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తిన నందినగర్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన నివాసానికి చేరుకోకముందే పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కొంతమంది యువకులు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేసీఆర్ ఇంటి వైపు పరుగులు తీస్తుండగా, అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. పార్టీ కేడర్, నేతలకు కేసీఆర్ అభివాదం సుమారు నాలుగున్నర గంటల సిట్ విచారణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిసింది. సిట్ అధికారులు ని్రష్కమణ తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలివారు. బయట భారీ సంఖ్యలో వేచి ఉన్న కేడర్‌కు కేసీఆర్, కేటీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నివాసం ఎదుట గుమికూడిన పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’నోటీసులు జారీ చేయడానికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి. 12 వేలకు పైగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేశా రు. నల్ల జెండాలతో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నా లు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాల నేప థ్యంలో పలుచోట్ల పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నందినగర్‌కే రావాలని పట్టుబట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి తెలంగాణ భవన్‌కు ర్యాలీగా చేరుకున్న పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌గౌడ్ తదితరులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం వ్యతిరేక నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టి»ొమ్మకు ఉరి వేసి తెలంగాణ భవన్‌కు వేలాడదీశారు. సచివాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్లో గాయకులు మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. మంత్రుల నివాస సముదాయం ముట్టడి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నే తృత్వంలో మంత్రుల నివాస సముదాయాన్ని ము ట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరిట రేవంత్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశా లు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు బీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హత్యానేరం కన్నా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతున్న వేళ.. మరోవైపు సీఎల్పీ మీడియా హాల్లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారుఅన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్ఎస్లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లోనే లేడు. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్ అన్నారు. -
కేసీఆర్ ఒక్కరికే అనుమతి! సిట్ విచారణ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు.. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు.. ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందినగర్ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను గంటల తరబడి సిట్ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
సిట్ విచారణకు కేసీఆర్.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)
-
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ.. అప్డేట్స్కాసేపట్లో ఎర్రవెల్లి తన నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ బయల్దేరాక మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్,హరీష్ రావుబీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభివాదంవిచారణ అనంతరం బయటకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసిన కేసీఆర్కేసీఆర్ నందినగర్ వివాసానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులునందినగర్కు బీఆర్ఎస్ నేతలుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను నందినగర్‌కు పిలిచిన కేటీఆర్తెలంగాణ భవన్ నుంచి నందినగర్‌కు బీఆర్ఎస్ నేతలుపార్టీ నేతలతో కేసీఆర్ సమావేశంసిట్ విచారణ పరిణామాలను పార్టీ నేతలతో వివరించనున్న కేసీఆర్ నంది నగర్లో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణనాలుగు గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణఆధారాలను ముందు పెట్టి కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్ బృందంగతంలో విచారణకు హాజరైన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించిన అధికారులుకేసీఆర్ స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసిన సిట్ బృందంకేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంనందినగర్ కేసీఆర్ ఇంట్లో కొనసాగుతున్న సిట్ విచారణ మూడుగంటలకు పైగా కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ సభ్యులు కేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంతెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తతప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన తెలంగాణ భవన్‌కు భారీగా తరలి వచ్చిన శ్రేణులునందినగర్కు అనుమతి లేదన్న పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులురోడ్డుపై బైటాయించిన బీఆర్ఎస్ శ్రేణులునందినగర్ కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు యత్నంకేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణంతెలంగాణ భవన్ నుంచి నందినగర్ వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలుఅనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులుపోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటతోపులాటలో క్రింద పడిపోయిన మహిళసీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలునందినగర్ కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తతఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నంబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసనపలువురు బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టునందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ బృందంసిట్ బృందంలో రీతిరాజ్, విజయ్‌కుమార్, అరవింద్‌కుమార్, నారాయణరెడ్డి, కేఎస్ రావు హరీష్‌రావుతో పాటు అందరినీ బయటకు పంపించేసిన అధికారులుకేసీఆర్ న్యాయవాదులకు అనుమతి నిరాకరణనంది నగర్ కేసీఆర్ నివాసం పై డ్రోన్ కలకలంకొనసాగుతున్న కేసీఆర్ సిట్ విచారణనందినగర్ నివాసం పై డ్రోన్ కలకలంఅప్రమత్తమైన పోలీసులు నంది నగర్ కేసీఆర్ నివాసంలో ప్రారంభమైన సిట్ విచారణ.రెండో అంతస్తులో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న నలుగురు అధికారుల బృందం.మొత్తం విచారణలో పాల్గొన్న 15 మంది అధికారులు.కేసీఆర్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న సిట్ బృందంసిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావున్యాయ సహాయం కోసం అందుబాటులో రామచంద్రరావుకుటుంబ సభ్యుడిగా ఇంట్లోనే మరో ఫ్లోర్ లో ఉండనున్న కేటీఆర్విచారణ తర్వాత నందినగర్ నివాసంలో పార్టీ ముఖ్యనేతలను కేసీఆర్ కలిసే అవకాశంవిచారణ ముగిశాక నందినగర్ కు తరలివెళ్ళనున్న బీఆర్ఎస్ క్యాడర్బాల్కానీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అబివాదం చేసే అవకాశం?ట్రంక్ పెట్టెలు,డాక్యుమెంట్స్ కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ బృందంసిట్ బృందంలో నారాయణ రెడ్డి, రవీందర్.సిట్ అధికారులతో పాటు మరో ఐదుగురు సీఐ స్థాయి అధికారులు.రెండు ట్రంక్ పెట్టెలు, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన సిట్ బృందంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు కేసీఆర్ ఇంటిలోని రెండో అంతస్తు గదిలో విచారణ విచారణ గదిని పరిశీలించిన అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావువిచారణ దృష్ట్యా కేసీఆర్ నందినగర్ నివాసంలో మూడంచెల భద్రతవిచారణ గదిలోకి లాయర్ల అనుమతి నిరాకరించిన సిట్ బృందం కేసీఆర్ ఒక్కరినే విచారణ చేయనున్న అధికారులు డీఐజీ విజయ్ కుమార్ ఆధ్వరంలో నలుగురు అధికారులు బృందం విజయ్ కుమార్, వేంకటగిరి,కేఎస్ రావు, శ్రీధర్ అధికారుల బృందం మూడు గంటలకు ప్రారంభం కానున్న విచారణ కేసీఆర్ వెంట డాక్యుమెంట్స్..నందినగర్ నివాసం వద్ద కేసీఆర్‌ని రిసీవ్ చేసుకున్న కేటీఆర్.ఫామ్ హౌస్ నుంచి ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన కేసీఆర్.సిట్ అడిగే ప్రశ్నలను నోట్ చేసుకోనున్న కేసీఆర్.నంది నగర్ ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.కేసీఆర్ నివాసానికి చేరుకున్న విచారణ యంత్ర సామాగ్రి.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్.మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ విచారణ ప్రారంభం.కేసీఆర్‌ను ప్రశ్నించే సిట్ టీం ఇదేఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్మధ్యాహ్నాం 3గం. ప్రారంభం కానున్న విచారణనందినగర్లోని నివాసం వద్ద భారీ బందోబస్తునాలుగు అంచెల పోలీస్ వ్యవస్థ.. వందల మంది పోలీసుల కాపలాఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ఇంతకు ముందు విచారణలో క్రియాశీలకంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి.. ఇవాళ్టి విచారణకు మాత్రం దూరం!కేసీఆర్‌ను విచారించే టీంలో.. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్‌కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావులువిచారణ గదిని క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు ఎస్పీ కేఎస్ రావుఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతల విచారణబీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యల విచారణకల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. బీఆర్ఎస్ కీలక నేతలు.. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావుల విచారణఇప్పుడు కేసీఆర్ విచారణనందినగర్ చేరుకున్న కేసీఆర్..కేసీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు.మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను విచారించనున్న సిట్. విచారణను వీడియో తీయనున్న పోలీసులు. కేసీఆర్ ఇంటికి సిట్.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ బృందం, పోలీసులు. నందినగర్ కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో విచారించనున్న సిట్.కేసీఆర్ ఇంట్లో విచారణ గదిని పరిశీలిస్తున్న పోలీసులు.కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం.నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరణ.కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్, సంతోష్‌కు మాత్రమే అనుమతి.విచారణను వీడియో రికార్డు చేయనున్న అధికారులు.ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ బృందం.పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు. భారీగా ట్రాఫిక్ జామ్.. రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్.గజ్వేల్ నుండి వంటి మామిడి వరకు భారీ ట్రాఫిక్.వంటి మామిడి దగ్గర కేసీఆర్ కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి.మిగతా వాహనాలను నిలిపివేసిన పోలీసులు.తుర్కపల్లి దాటిన కేసీఆర్ కాన్వాయ్.కాసేపట్లో నందినగర్ చేరుకోనున్న కేసీఆర్పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు.కేసీఆర్ నివాసానికి వెళ్లే వీధులన్నీ మూసివేసిన పోలీసులు.నందినగర్ వద్ద నాలుగు అంచెల పోలీసు భద్రత. నందినగర్ నివాసంలో ఉన్న హరీష్ రావు. రోడ్లన్నీ గులాబీమయం..ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌కు బయలు దేరిన కేసీఆర్.కేసీఆర్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ అభిమానులు. రోడ్డు మార్గంలో అభిమానులకు అభివాదం చేసిన కేసీఆర్.వందలాది వాహనాల్లో కేసీఆర్ వెంట నందినగర్‌కు వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..ఖమ్మం జిల్లా..మాజీ సీఎం కేసీఆర్‌కు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై నిరసనలు.ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..అజయ్ కుమార్ కామెంట్స్...ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధండైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేసీఆర్‌కు నోటీసులు..ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్‌కి ఏం సంబంధం?గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టి ఏం చేశారు?.ఇది మరొక ఫేక్ కేసు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు..ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్. కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పుకాస్త ఆలస్యంగా నందినగర్ నివాసానికి కేసీఆర్మరికాసేపట్లో బయల్దేరనున్న బీఆర్ఎస్ అధినేత12.30కి నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశంబీఆర్ఎస్ నేతల భేటీ వాయిదా పడే చాన్స్?నేరుగా సిట్ విచారణకే హాజరు కానున్న గులాబీ బీస్??తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కేసీఆర్ సిట్ విచారణ వేళ.. తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్‌లు పంపిన ఇంటెలిజెన్స్బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాలుముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారుల ఆదేశాలువిచారణ పూర్తయ్యే దాకా అప్రమత్తంగా ఉండాలని సూచనఎక్కడికక్కడే అప్రమత్తమైన పోలీసులురాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎక్కడికక్కడే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుఇప్పటికే విచారణ జరిగే నందినగర్ నివాస ప్రాంతంలో 1,000 మంది దాకా పోలీసుల మోహరింపుతెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ నేతలను ఎక్కడిక్కడే హౌజ్ అరెస్ట్ చేసే అవకాశంఎర్రవల్లి గ్రామస్తుల వెరైటీ నిరసనఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్ద వినూత్న నిరసనసీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలుకేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆగ్రహంకేసీఆర్ ఫొటోకు దిష్టి తీసిన ఎర్రవల్లి గ్రామస్తులుఫాంహౌజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులురాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుతెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలుకేసీఆర్కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నిరసనలుబైక్ ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేస్తున్న కేడర్ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులుకేసీఆర్ సిట్ విచారణ టైంలో.. తెలంగాణ భవన్‌లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలంతాతెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ వేళ.. నగరంలో ఉద్రిక్త వాతావరణంతెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులుతెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ ఆంక్షలుభవన్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు11 గంటల నుంచి తెలంగాణ భవన్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలునందినగర్లో.. 800 మంది పోలీసులునందినగర్ ఏరియాలో భారీగా పోలీసుల ఆంక్షలుకేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాస పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపునందినగర్ బస్టాప్, బసవతారకం, స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ మార్గాల్లో డైవర్షన్లు.. భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల కంట్రోల్‌కు బారికేడ్లు సైతం ఏర్పాటుమరికాసేపట్లో నందినగర్ నివాసానికి రానున్న కేసీఆర్నందినగర్ నివాస పరిసరాల్లో.. ఐదు అంచల భద్రతసుమారు 800 మంది పోలీసుల మోహరింపుమధ్యాహ్నాం విచారణకు రానున్న సిట్ అధికారులుHeavy police deployment was seen near KCR’s residence in Nandi Nagar as the former chief minister prepares to appear before the SIT. The state police have been placed on high alert as a precautionary measure.#KCR #NandiNagar #Telangana #TelanganaPolitics #SITInquiry… pic.twitter.com/3lQzn6fr1g— Hyderabad Mail (@Hyderabad_Mail) February 1, 2026మరికాసేపట్లో నందినగర్ నివాసానికి కేసీఆర్ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్‌కు నివాసానికి పాముల పర్తి, గౌరారం, ములుగు, వంటి మామిడి, షామీర్ పేట, జేబీఎస్ మీదుగా చేరుకోనున్న బీఆర్ఎస్ అధినేత ఫామ్‌హౌజ్‌లో విచారించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిట్నగర పరిధిలోనే విచారణ సాధ్యమని పేర్కొంటూ.. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ఆధారంగా నందినగర్ నివాసానికి నోటీసులునందినగర్ నివాసంలో కీలక భేటీ నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీసిట్ విచారణ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యతమరికాసేపట్లో నివాసానికి చేరుకోనున్న కేసీఆర్రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్న హరీష్ రావుకేటీఆర్తో పాటు మరికొందరు కీలక నేలలతో కాసేపు చర్చించనున్న కేసీఆర్ఇటు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు నగర శివారు ముఖ్య నేతలకు గులాబీ బాస్ ఆదేశంకేసీఆర్ విచారణకు నిరసనగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన ర్యాలీలు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ నేపథ్యంలో నిర్ణయంఎక్కడిక్కకడ శాంతియుత నిరసనలు చేయాలని కీలక నేతల పిలుపు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధానికి బీఆర్ఎస్ శ్రేణుల ప్రయత్నాలుఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామంఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణఇప్పటిదాకా పోలీస్ అధికారులు, కేసీఆర్ పేషీ అధికారులు, బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించిన సిట్వాళ్ల నుంచి వాంగ్మూలాల సేకరణఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశామన్న పోలీస్ ఉన్నతాధికారులువాళ్ల వాంగ్మూలాలను ముందుంచి కేసీఆర్‌ను విచారించే అవకాశంట్యాపింగ్ కేసులో సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కేసీఆర్‌కు నోటీసులుసాక్షిగానే కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నాం 3గం.ల నుంచి కేసీఆర్‌ను విచారించనున్న సిట్ అధికారులుకేసీఆర్ను ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్ పీఎస్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం -
నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ'
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసుల తీరుపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని ఇంటి గోడపై అంటించిన నోటీసు చట్టబద్ధంగా లేదన్నారు. తనకు నోటీసు జారీ చేసే అధికారం సిట్‌కు లేదన్నారు. తన వాంగ్మూలాన్ని ఎర్రవల్లి నివాసంలోనే నమోదు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సిట్‌పై ఉందన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి శనివారం కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. సుప్రీం తీర్పుల ఉల్లంఘన కిందకే.. ‘సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన నా వాంగ్మూలాన్ని నేను నివసిస్తున్న చోటే నమోదు చేయాలి. నేను కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నా. భవిష్యత్తులో నాకు పంపే నోటీసులు ఎర్రవల్లి చిరునామాకే పంపాలని జనవరి 29న మీకు లేఖ రాశాను. నా లేఖకు ప్రతిస్పందనగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మీ సంతకంతో ఉన్నట్లుగా పేర్కొంటున్న లేఖను జనవరి 30న హైదరాబాద్ నందినగర్‌లోని ఇంటి గోడకు అంటించారు. మీ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపితే దానిపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ విధమైన చర్యలు రాజ్యాంగం, చట్టం పట్ల మీకు గౌరవం లేదనే భావనను కలిగిస్తున్నాయి. వాట్సాప్ లేదా గోడపై నోటీసులు అంటించడం వంటి పద్ధతులు చెల్లవని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచి్చంది’అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. నోటీసు జారీ చేసే అధికారం మీకు లేదు ‘చట్టవిరుద్దంగా ఇచ్చిన నోటీసును నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నేను మీ పోలీస్ స్టేషన్ లేదా అనుబంధ స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి నాకు నోటీసు జారీ చేసే మీకు అధికారం లేదు. నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవల్లి నివాసంలో విచారణకు అంగీకరించడం లేదని జనవరి 30న నాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి వాస్తవంగా నివసిస్తున్న స్థలానికే ప్రాధాన్యత ఉంటుంది. నేను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నందున నా నివాసంలోనే విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు నందినగర్‌కు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో క్రైమ్ నెం.243/2024 దర్యాప్తునకు సంబంధించి సిట్ ఎదుట హాజరు కావాల్సిందిగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఈనెల 29న కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో రోజున హాజరవుతానని కేసీఆర్ అదేరోజు ఏసీపీకి లేఖ రాశారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాను ఉంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కేసీఆర్‌కు ఏసీపీ మరో నోటీసు జారీ చేస్తూ ఎర్రవల్లిలో విచారణ కుదరదని, నందినగర్ నివాసానికి రావాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ ఆదివారం ఏసీపీకి మరో లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పక్కన పెట్టి నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ ఆదివారం ఉదయం నందినగర్‌కు చేరుకోనున్నారు. -
రేపు సిట్ విచారణకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. విచారణకు హాజరుకావాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ రానున్నారు.సిట్‌కు కేసీఆర్.. ఆరుపేజీల లేఖ రాశారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు(ఫిబ్రవరి 1, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానన్న కేసీఆర్.. తన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చన్నారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాను. కానీ హైదరాబాద్ పరిధిలోనే విచారణ జరపాలని మీరు పేర్కొన్నారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదు...హరీష్‌రావు ఆఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్ అడ్రస్‌గా నందినగర్ పెట్టుకున్నా. గత రెండేళ్లుగా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పరిధులు అవసరం లేదు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్ సహకరిస్తా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాను. పోలీసుల చర్యలు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. -
KTR: రాత్రి పూట వచ్చి నోటీసులు అంటిస్తారా?
-
కేసీఆర్ ఇంటి గోడకు నోటీసు..!
-
రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ను సిట్ విచారణను పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. రేపు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. బైక్ ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించాక విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు.కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. -
సిట్ విచారణకు కేసీఆర్.. నందినగర్ కు రానున్న మాజీ సీఎం
-
‘రేవంత్ కక్ష సాధింపు.. తెలంగాణ తేవడమే కేసీఆర్ నేరమా?’
సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్ఎస్పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది.ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. -
కేసీఆర్‌పై దుర్మార్గ వైఖరి.. అర్థరాత్రి గేటుకు నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. రేపు(ఫిబ్రవరి 1న) మధ్యాహ్నాం 3గం. టైంలో నందినగర్ నివాసంలో విచారణకు తమకు అందుబాటులో ఉండాలని ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో విచారణ జరపాలన్న ఆయన విజ్ఞప్తిని టెక్నికల్ రీజన్ చూపిస్తూ తిరస్కరించింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉందని.. అందుకే ఆ ఇంటికి నోటీసులు అంటించామని సిట్ చెబుతోంది. అయితే గోడకు అంటించే నిబంధన ఏదీ లేదని.. పైగా ఇలా అంటించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లీగల్ టీం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అంతేకాదు.. హరీష్‌రావు అఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉందని.. అయినప్పటికీ హైదరాబాద్ అడ్రస్‌కే సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేసు విచారణకు సంబంధించి నోటీసులు పంపడం కోసం రిజిస్టర్డ్ పోస్టు, కోర్టు తదితర ప్రక్రియల ద్వారా సర్వ్ చేయడం మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. గోడకు అతికించడం సరైన నోటీసు సర్వ్ చేసినట్లుగా పరిగణించబడదని.. ఈ లెక్కన కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవని అంటోంది. అయితే.. దీనిపై న్యాయ నిపుణుల మాట మరోలా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024 డిసెంబర్ 17న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో.. (రాజేంద్ర కుమార్ వర్సెస్ యూపీ అవాస్ ఎవమ్ వికాస్ పరిషత్ సివిల్ అప్పీల్ నెం. 14604 of 2024 ప్రకారం).. ఇంటి గోడలపై నోటీసులు, ప్రకటనలు అతికించడం వంటి చర్యలు చట్టబద్ధం కాదు. ఇది ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కిందకే వస్తుంది. దీనికిగానూ జరిమానా, శిక్షలు విధించవచ్చు. కానీ, కేసీఆర్‌కు సిట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం జారీ చేసింది. దర్యాప్తు జరుగుతున్న కేసులో సాక్షిగా లేదంటే విచారణ కోసం ఓ వ్యక్తిని పిలిచే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది సాధారణంగా అఫిక్స్డ్ నోటీసు (Affixed Notice) అనే ప్రక్రియలో భాగమేనని అంటున్నారు. ఒక వ్యక్తి నోటీసు స్వీకరించనప్పుడు లేదంటే ఆ నోటీసుల స్వీకరణకు గనుక అందుబాటులో లేకపోతే కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థలు ఇలా ఇంటి గోడలకు నోటీసులు అతికించడం ద్వారా సర్వ్ చేసినట్లుగా పరిగణిస్తాయి. కాబట్టి.. ఈ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడం తప్ప బీఆర్ఎస్కు మరొ మార్గం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపే విచారిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అతికించారు. ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా.. ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్‌లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. సీఆర్పిసీ సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. తొలిసారిగా గురువారం ఇచి్చన నోటీసులకు స్పందించిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్‌కు లేఖ రాయడం విదితమే. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన సిట్ అధికారులు తాజా నోటీసులు ఇచ్చారు. ఓ వ్యక్తి నుంచి ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు ఇస్తారు. సుదీర్ఘంగా చర్చించి.. కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో..గురువారం ఇచి్చన నోటీసుల్లో సిట్ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. లేదంటే హైదరాబాద్‌లో మీరు చెప్పిన చోటుకే మేము వస్తామని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, విచారణకు మరో తేదీ ఎంచుకోవాలని కేసీఆర్ కోరారు. విచారణ కోసం ఎర్రవల్లికి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సిట్ శుక్రవారం న్యాయ నిపుణులతో భేటీ అయింది.సుదీర్ఘ మంతనాల తర్వాత కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల అఫిడవిట్లు, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల్లో ఉన్న నివాస చిరునామా ప్రకారం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ‘మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, అలాగే సీఆర్పీసీ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం, అధికారిక రికార్డుల్లో ఉన్న మీ నివాస చిరునామాలోనే విచారణ నిర్వహించేందుకు దర్యాప్తు అధికారి నిర్ణయించారు..’అని వెల్లడించారు మీరు కోరినట్లుగా ఎర్రవల్లిలో విచారించడం కుదరదని చెప్తూ.. అధికారిక రికార్డుల్లో ఉన్న నివాసాన్నే (నందినగర్‌లోని ఇల్లు) విచారణ స్థలంగా నిర్ణయించిన విషయం మరొకసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.అదే సమయంలో..‘విచారణ సందర్భంగా అనేక సున్నిత ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డుల పరిశీలన అవసరం. వాటిని ఎర్రవల్లికి తరలించడం కష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా హైదరాబాద్ నివాసం (నందినగర్)లో విచారణకు అందుబాటులో ఉండగలరు..’అని సిట్ స్పష్టం చేసింది. కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ సీఆర్పిసీలోని సెక్షన్ 160 ప్రకారం జరిగే ఈ విచారణకు సంబంధించి చట్టంలో కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. 15 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడి పురుషులు, మహిళలతో పాటు దివ్యాంగులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలకు చెందిన వాళ్లు ఫలానా ప్రాంతానికి వచ్చి తమ వాంగ్మూలం నమోదు చేసుకోవాలని కోరే అవకాశం ఉంది. దీంతో ఈ రెండో నోటీసుపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. -
Phone Tapping Case: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్‌ను విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ
-
కేసీఆర్‌తో కేటీఆర్, జగదీష్‌రెడ్డి భేటీ
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన తనయుడు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిలు భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, జగదీష్‌రెడ్డిలు సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశాం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు శుక్రవారం(జనవరి 30వ తేదీ) హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొనగా, అందుకు కేసీఆర్ తనకు సమయం కావాలని అడిగారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, అందుచేత కొంత సమయం కావాలని సిట్‌ను కోరారు. అదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్‌కు కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. -
కేసీఆర్ అడిగిన చోటే.. సిట్ విచారణ
-
కేసీఆర్‌కు సిట్ సెకండ్ నోటీసు!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని సిట్ పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళే రెండో నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్‌కు సిట్ గురువారం నోటీసులు ఇచ్చింది. వయసురిత్యా(65 ఏళ్లు పైబడడంతో) పీఎస్కే రావాల్సిన అవసరం లేదని.. నగర పరిధిలోనే ఎక్కడైనా తామే వచ్చి విచారణ జరుపుతామని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు నోటీసులను నందినగర్‌లోని నివాసానికి వెళ్లి కేసీఆర్ సిబ్బందికి సిట్ అధికారులు అందజేశారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడి నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్‌కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. కానీ ఫాంహౌజ్‌లోనే తనను విచారణ జరపాలని సిట్‌ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం భావిస్తోంది. వీలైతే ఇవాళ సెకండ్ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ జరపొచ్చని తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
కేసీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సాక్షిగా పరిగణిస్తూ సీఆరీ్పసీలోని సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తెలిసిన సమాచారం ఇవ్వాలని ఆయన్ను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటివరకు కొందరు ప్రభుత్వ అత్యున్నత అధికారులు మినహా అందర్నీ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలోనే విచారించారు. అయితే కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో సిట్ అధికారులు చట్ట ప్రకారం ఆయనకు ఓ వెసులుబాటు ఇచ్చారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. అలా కాకుంటే మీరు కోరిన చోటుకే తాము వస్తామంటూ పేర్కొన్నారు. నందినగర్ నివాసానికి వెళ్లి.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఈ మేరకు నోటీసులు అందజేశారు. 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తొలుత ఇందులో కేవలం ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉన్నారు. దీని దర్యాప్తు కోసం తొలుత అనధికారిక సిట్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడిస్తూ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారింది. సిట్ బృందం ప్రణీత్‌రావుతో పాటు మాజీ అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేసింది.మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా.. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత ఏడాది వరకు సిట్ అధికారులు కేవలం కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, బాధితులతో పాటు ఇతరుల్నీ విచారించారు. కాగా గత నెలలో ఈ కేసు దర్యాప్తు కోసం డీజీపీ బి.శివధర్‌రెడ్డి అధికారిక సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్‌ను దీనికి చీఫ్‌గా నియమించారు.ఆ తర్వాత దూకుడు పెంచిన సిట్ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకు నోటీసులు జారీ చేయడం మొదలెట్టింది. ఈ నెల 19న మాజీ మంత్రి హరీశ్‌రావు, 22న మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 27న మాజీ ఎంపీ సంతో‹Ùరావులకు నోటీసులు జారీ చేసి సిట్ కార్యాలయంలో విచారించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించడంతో పాటు వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎర్రవల్లి నివాసంలో కుదరదు..! విచారణ జరిగే ప్రాంతానికి కేసు దర్యాప్తు అధికారితో పాటు మరికొందరు కూడా రావాల్సి ఉంటుందని కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ వివరించింది. ఎర్రవల్లి నివాసంలో విచారణ కుదరదని పరోక్షంగా స్పష్టం చేస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రాంతాన్ని చెప్పాలని కోరింది. ఎక్కడకు వచ్చి విచారించాలనే సమాచారాన్ని కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి తెలపాలని సూచించింది. బందోబస్తుపై పోలీసుల దృష్టి.. కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తుపై దృష్టి పెట్టారు. ఆయన జూబ్లీహిల్స్ ఠాణాకు వచి్చనా.. అధికారుల బృందం నందినగర్‌లోని ఇంటికి వెళ్లాల్సి వచి్చనా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. గురువారం మధ్యాహ్నం ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆయా మార్గాలతో పాటు పరిసరాలనూ గమనించారు. ఎక్కడెక్కడ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి? ఎక్కడ నుంచి ట్రాఫిక్ మళ్లింపులు విధించాలి? అనే అంశాలను పరిశీలించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహంబంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజ రుకావాలంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గురువారం బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలతో పా టు ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప డింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మరిచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. -
విచారణకు రండి.. 'రెడీ'.. కానీ మరో రోజు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్‌కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా.. ‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే.. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే.. – హరీశ్‌రావుతో సమావేశంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది ‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
కేసీఆర్ లేఖపై సిట్ స్పందన
హైదరాబాద్: తాను రేపు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీపై రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తాను సిట్ విచారణకు రేపు(శుక్రవారం, జనవరి 30) రాలేనని కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్ స్పందించింది. -
రేపు సిట్ విచారణకు రాలేను: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు.ఇవాళ.. కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR
-
రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్
-
సిట్ నోటీసులపై కేసీఆర్ ఏమన్నారంటే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోందిసిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ముఖ్యనేతలు, లీగల్సెల్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్‌కు బయల్దేరారుఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. -
‘కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ కుట్రలు’
హైదరాబాద్: తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలను కొనసాగిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనన్నారు హఱీస్. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు హరీష్ ట్వీట్ చేశారు. ‘కేసీఆర్‌పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు… అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు’ అని ట్వీట్లో మండిపడ్డారు.తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం…— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2026 -
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ
-
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. రేపు(శుక్రవారం, జనవరి 30న) కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించనుంది. మధ్యాహ్నాం 3గం. విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటిదాకా నోటీసులు అందుకున్నవాళ్లు.. దర్యాప్తు కార్యాలయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో అధికారుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. వయసురిత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేసీఆర్ పీఏతోనూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రేపటి విచారణకు మాత్రం సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ ప్రస్తావించడం గమనార్హం.ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి దశలో బీఆర్ఎస్ హయాంలో పని చేసిన పోలీస్ అధికారులను, కేసీఆర్ పేషీలో పని చేసిన ఉన్నతాధికారులను సిట్ ప్రశ్నించింది. వీళ్లిచ్చిన స్టేట్మెంట్లతో రెండో దఫా విచారణలో.. వరుసగా రాజకీయ నేతలను సిట్ విచారణ జరుపుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది.అయితే ఇదొక లొట్ట పీసు కేసు అని, పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నోటీసుల అంశంపై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
అవసరమైతే న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శనివారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీలో ‘సిట్’విచారణ తీరు తెన్నులను ఇద్దరు నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. పార్టీ ముఖ్య నేతల పర్యటనలు, మంత్రులుగా తీసుకున్న నిర్ణయాలు, పలువురు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారితో సంబంధాలు, పరిచయాల గురించి పోలీసులు తమను ప్రశ్నించారని వివరించారు. పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చిన సంస్థల వివరాలపై ఆరా తీసినట్లుగా కేసీఆర్‌కు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విచారణతో సంబంధం లేని అంశాలను సిట్ అధికారులు అడిగిన వైనాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలోనే సంబంధం లేని విషయాల్లో విచారణల పేరిట ప్రభుత్వం హడావుడి చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిట్ విచారణకు సహకరిస్తూనే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం కూడా చేయాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ సూచనలు మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి చేరికలు వంటి అంశాలపై ఇద్దరు నేతలు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు మున్సిపాలిటీల వారీగా పర్యవేక్షక బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ఇన్చార్జిలు పర్యవేక్షించడంతో పాటు నాయకులు, కేడర్ నడుమ క్షేత్ర స్థాయిల్లో సమన్వయం కోసం పనిచేస్తారు. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలో భేటీ అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్‌లో కేటీఆర్, హరీశ్‌రావు కొందరు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల వారీగా నియమించాల్సిన ఇన్చార్జిల జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. భేటీ అనంతరం ఈ జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు
-
కాసేపట్లో ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్.. కేసీఆర్‌తో భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠను రేపింది. మరోవైపు.. కాసేపట్లో ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ వద్దకు కేటీఆర్, హారీష్ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్ విచారణపై చర్చించే అవకాశం ఉంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్, మెదక్‌లో హరీష్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో వీరిద్దరూ ఎర్రవల్లి చేరుకుంటారు. అయితే, సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ చర్చించే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సైతం సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. రేపు సిట్ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్దమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రేపు తెలంగాణభవన్‌కు రావాలని బీఆర్ఎస్ సూచించింది. -
పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? : సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ప్రజా సమస్యలు, ప్రాజెక్టులపై శాసనసభ వేదికగా చర్చించాలని సవాల్ విసిరా. రోజంతా చర్చ పెట్టినా ప్రతిపక్ష నాయకుడు రాకుండా పారిపోయారు. నిజంగా వారు తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి ఉంటే.. సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తే ఎందుకు పారిపోయారు? చర్చకు రాకుండా పారిపోయి మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం మహ బూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పునరుద్ధరణ, బలోపేతం వంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎలా పాలించాలో మాకు తెలుసు ‘నేను సీఎం అయి రెండేళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ ఏమైనా మీ జాగీరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తినా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. పాలన ఎలా చేయాలో.. సమస్యలు ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు. ఇంకా పదేళ్లు మేమే ఉంటాం. నచ్చితే ఆశీర్వదించు. నచ్చకపోతే నీ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకో. శుక్రాచార్యులు, మారీచులు, సుబాహులు, రాక్షసులను కట్టడిచేసే సత్తా పాలమూరు బిడ్డకు ఉంది. గొప్పలు చెబుతున్న ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నవారు మేము విజయాలు సాధించామని గొప్పలు చెబుతున్నారు. కానీ తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాకు ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా మంజూరు చేసిండా? లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయింది. డిండి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి పాలమూరు ఎంపీ విఠల్‌రావు పాలమూరు పథకం గురించి నాటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన అకాల మరణం తర్వాత దీంతో పాటు జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ పథకానికి రూ.25 వేల కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి, ఉద్ధండాపూర్ నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? కల్వకుర్తి ప్రాజెక్టు భూసేకరణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? బీమా–1లో భాగంగా సంగంబండ రిజర్వాయర్ కాల్వకు అడ్డుగా బండ ఉంటే.. దాన్ని తొలగించేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు. నేను సీఎం అయిన తర్వాత వీటికి నిధులు మంజూరు చేశా. జూరాల వద్ద నూతన బ్రిడ్జి కావాలని అడిగితే రూ.123 కోట్లు మంజూరు చేశాం. కేసీఆర్ ఈ పనులు ఎందుకు చేయలేదు?..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష? ‘మక్తల్–నారాయణపేట–కొడంగల్ పథకం ఆషామాషీగా రాలేదు. అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి.. అప్పటి సీఎం వైఎస్సార్‌తో మాట్లాడి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతలు అవసరమని, బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. కానీ వారి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నేను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంటపడటంతో రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి జీఓ 69 జారీ చేశారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష చూపించారు? గత ప్రభుత్వంలో సీఎంను కలిసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడిగేందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ధైర్యం చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చి.. మేము పనులు చేస్తుంటే తప్పు పడుతుండడం మీ చేతగానితనం..’ అని రేవంత్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల లెక్కలేవి? ‘కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఖర్చు చేసిన రూ.20 లక్షల కోట్ల వివరాలు చెప్పలేదు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఈ రూ.20 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారనేది ఎందుకు చెప్పడం లేదు? పాలమూరులో ఐఐఎం! రేవంత్‌రెడ్డి పదేపదే ప్రధాని మోదీని కలుస్తున్నారని నేనంటే గిట్టనివాళ్లు కొందరు అంటున్నారు. తెలంగాణకు నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలిస్తే తప్పేంటి. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు మొదటి సీఎం కాగా.. 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు రెండోసారి రాష్ట్రానికి సీఎంగా అయ్యే అవకాశం దక్కింది. ఇక్కడి ఎంపీ డీకే అరుణతో కలిసి మోదీని కలుస్తాం. తెలంగాణకు ఐఐఎం ఇవ్వమని అడుగుతా. దీన్ని పాలమూరులో ప్రారంభించుకుందాం. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు. ఉచితంగా ఏమి ఇచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. విజ్ఞానం ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థాయికి చేరతాం. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో పైకి రావాలి..’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి...దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
దటీజ్ కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా.. మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్‌గా మారింది. మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP— Telangana Congress (@INCTelangana) January 8, 2026కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి. -
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు
-
మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం.. ఎర్రవల్లికి సురేఖ, సీతక్క
సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్‌కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.బాగున్నరా.. అమ్మ !కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపుఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారంగురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు. -
ఇదే బీఆర్ఎస్ రాసిన మొదటి మరణ శాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్‌ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది...బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది...ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్‌లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు...21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్‌లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. రేపటి నుంచి శాసనసభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇక, ఈరోజు అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్‌కాయ్ చేశారు. అనంతరం, బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద స్పీకర్ వైఖరిపై నిరసన తెలియజేస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం. అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారు. ప్రజాస్వామ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ కొనసాగించారు. బీఏఎసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు వేరు. బీఏసీ మీటింగ్ ఎజెండాను మార్చేసి, సభను తప్పుదోవ పట్టించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడారు. అసెంబ్లీని ముఖ్యమంత్రి బూతుల మయం చేశారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శంచవద్దని ఎలా చెబుతారు?. పార్లమెంట్లో రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని విమర్శించడం లేదా?. మేము మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ. మూసీ కంటే ముందు.. ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలి. మూసీకి మేము వ్యతిరేకంగా కాదు.. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక స్ట్రీట్ రౌడీవా?. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన మొదలు పెట్టిందే బీఆర్ఎస్. బాడీ షేమింగ్ సరికాదు. ముఖ్యమంత్రి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే సభను వాకౌట్ చేసాం. స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అవినీతికి రేవంత్ అడ్డాగా మారాడు. భవనానికి పర్మిషన్ కావాలంటే ఆర్ఆర్ టాక్స్ పెట్టాడు. రేవంత్ మాట్లాడే రైట్ లేదు.. అన్నింటికి రేవంత్ ఒక రేటు పెట్టాడు. ప్రజాస్వామ్య విలువలు సభలో లేవు అని మండిపడ్డారు. -
కవిత కన్ఫ్యూజన్.. కోమటిరెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే... ఊరూరా తిరుగుతున్నావ్’’ అంటూ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్, హరీష్‌రావులను ఉరితిసినా తప్పు లేదా? సమాధానం చెప్పాలన్నారు.బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత విమర్శిస్తుంది. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుంది. కవిత బీఆర్ఎస్లో ఉన్నదా అనే అనుమానం ఉందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్‌ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదు. కవిత కన్ఫ్యూజన్లో ఉంది. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకుంది. సంతోషం. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.‘‘నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసా.. నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం, ఆయనను ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తా. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదు. నాకు, మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవు. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కవితకు సలహా మాత్రమే ఇచ్చా’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. -
‘కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా.. మనం మనవాటా వాడుకోలేని స్థితి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరైన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టు మార్పు చేశారని.. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్ట్ అంటూ దుయ్యబట్టారు.కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్న రేవంత్.. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. పంపులు పెరిగితే కమీషన్లు ఎక్కువ వస్తాయనేది బీఆర్ఎస్ ప్లాన్. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను కేసీఆర్ వినిపించలేదు’’ అంటూ సీఎం విమర్శించారు.‘‘ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు చేపట్టారు. ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ కూడా తయారు చేయలేదు. రూ.32వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్‌రావు,. సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లన నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను బీఆర్ఎస్ నియమించింది. ఇక మండలిలో బీఆర్ఎస్ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, వికారాబాద్: రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారనే అనుమానం కలుగుతుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదు? గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము దైర్యం ఉందా?. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయాయి?. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా?. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి సమయం లేదా?. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, పాలన గాలికి వదిలేశారు’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. -
ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య
-
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్-రేవంత్ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు. ‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్ అన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. -
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్
-
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్.. పట్టుమని అరగంట కూడా ఉండకుండా వెళ్లిపోయారు. అయితే ఈలోపే సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడోసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆపై శాసన సభ ప్రారంభం అయ్యి.. జాతీయ గీతం ఆలాపన దాకా ఉన్నారు. అంతకంటే కాస్త ముందు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత వద్దకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి తప్ప అంతా నిల్చున్నారు. ఆపై మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సహా అధికార పార్టీ విప్‌లు కూడా కేసీఆర్‌ను పలకరించారు. నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్‌ను పలకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే.. ఆ తర్వాత ఆయన సభలో కనిపించలేదు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన అనంతరం జీరో అవర్ ప్రారంభం కాకముందే కేసీఆర్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆయన నేరుగా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కాగా, కృష్ణా జలాల పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందనతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడీవేడిగా జరగనుందని తెలుస్తోంది. ఈసారి కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. అయితే నేటి పరిణామం నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగనుంది. -
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్వారం రోజులు సభ నడపాలని బీఏసీ నిర్ణయంవారం తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం20 రోజులు సభ నడపాలని బీజేపీ,15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్, సీపీఐ పట్టునెక్ట్స్ బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం తెలంగాణ ఉభయ సభలు జనవరి 2కు వాయిదాకాసేపట్లో బీఏసీ సమావేశందేని మీద చర్చ పెడుతున్నారో తెల్వదు: కేటీఆర్ముఖ్యమంత్రి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అని అడుగుతారుభాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వని ముఖ్యమంత్రి రేవంత్పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహా దారుడువీళ్ళు నీటిపారుదల శాఖ పై చర్చ అంటున్నారుదేనిమీద చర్చ పెడుతున్నారో తెల్వదునీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారుకేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు అని చర్చకు మంత్రులు ప్రిపేర్ అవుతున్నారుకౌశిక్ రెడ్డి సభలో ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని అన్నాడుబూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా సభను పెడతారుసభ లో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారుహుజురాబాద్ లోని చెక్ డ్యాం పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పాత్ర ఉన్నది.ఆనాడు మేడిగడ్డ ను పేల్చారు అని ఇంజనీర్లు పిర్యాదు చేశారు.. అలాంటప్పుడు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదురష్యా ఉద్యమం లో కాకువ డ్యాంను పేల్చారు.అలానే ఇక్కడ కూడా మేడిగడ్డను పేల్చారనీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారుకేసీఆర్ కాసేపైనా ఉండాల్సింది: కోమటిరెడ్డిసభా సమరం.. మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా? బావుంది అని చెప్పారు.నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు... బావుందని చెప్పా.మాజీ ఎమ్మెల్యే లకు సంతాపం తెలిపితే సభలో లేకుండా కేసీఆర్ వెల్లిపోవడం సరైంది కాదుమౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేదిఅధికార-ప్రతిపక్షం నడుమ బాంబుల గొడవతెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షం నడుమ బాంబుల గొడవబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారంమేడిగడ్డ ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిమేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యామ్‌ను కూడా బాంబుతో పేల్చేశారు: కౌశిక్రెడ్డికౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల తీవ్ర అభ్యంతరంకౌశిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్ బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటి?.: ఎమ్మెల్యే నాగరాజు కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: ఎమ్మెల్యే నాగరాజుసభలో కాసేపు ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదంశాసనమండలి వాయిదాశాసన మండలిలో ముగిసిన సంతాప ప్రకటనలుదివంగత నేతలకు సంతాపం ప్రకటించిన మండలితెలంగాణ శాసనమండలి జనవరి 2కు వాయిదాబీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.రెండేళ్ల పాలనలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అధికారులు సమీక్ష చేయలేదు.సిద్దిపేట ఇరిగేషన్ ను మంత్రి పట్టించుకోవడం లేదు.మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ పై లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉంది.ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ పై సమీక్ష చేయాలిఆ ఎమ్మెల్యేలు అలా.. ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలుట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన స్పీకర్ట్రెజరీ బెంచీలవైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీలలో కూర్చోవడాన్ని గతంలో తప్పు పట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుభాషపై బీజేపీ అభ్యంతరం.. మంత్రి వివరణవెంకటరమణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే @ అసెంబ్లీదిగజారి భాష మాట్లాడటం సరికాదుఒకరిని మించి మరొకరు మాట్లాడితే ఎలా ?ఒకరు తప్పు మాట్లాడితే మరొకరు సరిచేయాలిబూతు లు మాట్లాడటమే రాజకీయమా ?నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ వరకు మంత్రులు కూడా దిగజారి మాట్లాడుతున్నారుహైదరాబాద్ వరల్డ్ క్లాస్ అంటున్నారు.. మాటలు మాత్రం థర్డ్ క్లాస్ గా ఉంటున్నాయిశ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి వివరణ.. మాకు భేషజాలు లేవువెంకటరమణ రెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలిగౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తాంశాసనసభలో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కరచలనంప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లి మరీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన సీఎం, మంత్రులుఆశీర్వాదం తీసుకున్న జూబ్లీహిల్స్ నూతన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్వందేమాతరం తర్వాత సభలో కనిపించని ప్రతిపక్ష నేతఅసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన కేసీఆర్అనంతరం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గులాబీ బాస్ఇటు ఫిరాయింపుల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనక కూర్చున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పార్టీ ఫిరాయింపు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రకటించిన స్పీకర్తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలుదివంగత నేతలకు సంతాపం తెలిపిన ఉభయ సభలుఅసెంబ్లీలో జీరో అవర్ ప్రారంభంప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభంహాజరైన సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్దివంగత నేతలకు సంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న గడ్డం ప్రసాద్ఇటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభందివంగత నేతలకు మండలిలో సంతాపంసంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న చైర్మన్ గుత్తా సుఖేందర్అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డిమరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులుకేసీఆర్.. అటెండెన్స్‌కే పరిమితం కావొద్దు: కాంగ్రెస్‌ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలుకేసీఆర్ కేవలం అటెండెన్స్‌కే పరిమితం కావొద్దుహరీష్, కేటీఆర్ మధ్య గొడవలు పెరిగాయని.. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని పరజలు అనుకుంటున్నారుఅందుకే అసెంబ్లీలో జరిగే చర్చలోనూ కేసీఆర్ పాల్గొనాలిఅసెంబ్లీలో కేసీఆర్ భేటీమరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేతబీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో సమావేశంఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలుమీడియా చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలుఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యే లు చెప్పుకోలేకపోతున్నారుఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ఆ స్థానంలో ఇక కొత్తవారికి అవకాశంగ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందిసర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు దెబ్బ తగిలిందిబీఆర్ఎస్కు 80 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయికాంగ్రెస్కు అందుకే భయం మొదలింది.. మున్సిపల్ ఎన్నికలు పెడుతలేరుమున్సిపల్ ఎన్నికలకల్లా నన్ను లేకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోంది నేను లోపలకు పోయినా.. బయట పార్టీ చూసుకుంటదినేను ఎవరికీ.. దేనికి భయపడనుఅసెంబ్లీ వద్ద ఉద్రిక్తతఅసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణంఅసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్లుపెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్గన్ పార్క్ వద్ద అదుపులో తీసుకున్న పోలీసులుఅసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్!మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్నందినగర్ నివాసం నుంచి బయల్దేరిన కాన్వాయ్కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్రెడ్డిఅసెంబ్లీ వద్ద 1000 మంది పోలీసులుతెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులుఅసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటుచేసిన పోలీసులు..దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు..ఈరోజు మాజీ సర్పంచ్ లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి పిలుపుదీంతో ముందస్తుగా మాజీ సర్పంచ్ అరెస్టు చేసిన పోలీసులుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలకు ఇటు అధికార కాంగ్రెస్.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్.. అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. ఎవరి తోలు ఎవరు తీస్తారో చూద్దామంటు సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే.. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఇవ్వడం గమనార్హం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తోలు తీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్‌గా సీఎం రేవంత్ చేసిన ప్రతివ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొని ఆ ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ ప్రతిసవాల్ విసిరింది. మరోపక్క కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్ తన పదేళ్ల హయాంలో ఎందుకు పెట్టలేదని అధికార పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ తరుణంలో కేసీఆర్ తొలిసారి సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తామని ఒకవైపు మంత్రులు.. మరోవైపు అధికార ఎమ్మెల్యేలు, హామీల ఎగవేతతో పాటు జల వనరుల విషయంలో ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణిని బయటపెడతామని బీఆర్ఎస్.. ఇంకోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్లు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ అంటోంది. ఈ సెషన్లోనే శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే.. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.షెడ్యూల్ ఇలా.. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలుత.. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క చర్చల కోసం వివిధ పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత.. సమావేశాల ఎజెండా ఖరారు, ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఇరిగేషన్ ప్రధానాంశంగా..ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని పట్టుబడుతోంది గులాబీ పార్టీ. దానికి కౌంటర్‌గా.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇలాంటి చర్చే గనుక జరిగితే తమకూ పీపీటీ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోలేదు.హైదరాబాద్‌కు కేసీఆర్కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారనే అంశంపై బీఆర్ఎస్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటిదాకా ఆయన రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఆయన ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోవడంతో కచ్చితంగా హాజరు కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఉదయం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!
-
కేసీఆర్.. రూ.2 వేల కోట్ల లెక్క చెప్పు
నల్లగొండ టూటౌన్: ‘అల్లుళ్లు హరీశ్‌రావు, సంతోశ్రావులు రూ.2 వేల కోట్లు దోచుకున్నారని కేసీఆర్ సొంత కూతురు కవితే చెప్పింది. వాళ్లు దోచుకున్న రూ.2 వేల కోట్లకు లెక్కలు చెప్పు కేసీఆర్’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.గత 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రూ.1.20 కోట్ల జీతం తీసుకున్నారని మంత్రి విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎవరూ భయపడరని, ఆ మొనగాడిని ఉతికి ఆరేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ, గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక్క రేషన్‌కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. అమరావతికి రోడ్డు.. నల్లగొండ జిల్లా కనగల్ –గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని అమరావతి వరకు రూ.20 వేల కోట్లతో నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌వే రహదారి సర్వే ప్రారంభమైందని, ఈ రోడ్డు కనగల్, గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి వెళుతుందని స్పష్టం చేశారు. కాగా, పదవులు శాశ్వతం కాదని తాను ఢిల్లీకి వెళ్లకున్నా మంత్రి పదవి వచ్చిందని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వింటర్లో వాటర్ వార్!
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల పంపిణీ అంశమే ప్రధాన ఎజెండాగా సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరగనుంది. ఇందుకోసం అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా, కాంగ్రెస్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టడంతోపాటు తాము తీసుకున్న పకడ్బందీ చర్యలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ రెండు పార్టీలు నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఎదురుదాడి చేస్తామని బీజేపీ చెబుతుండగా, ఈ చర్చలో తమ వంతు పాలుపంచుకునేందుకు ఎంఐఎం, సీపీఐ కూడా రెడీ అయ్యాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కూడా హాజరుకానుండటంతో చలికాలంలో అసెంబ్లీ వేదికగా నీటి మంటలు పుట్టనున్నాయి. తొలిరోజే ఆర్డినెన్సులు సభ ముందుకు శీతాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసన మండలి సోమవారం ఉదయం 10:30 గంటలకు కొలువు తీరనున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏడు ఆర్డినెన్సులను తొలిరోజే అసెంబ్లీ ముందుకు తేనున్నారు. ఈ జాబితాలో జీహెచ్ఎంసీ వివస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, శివారులోని 27 మున్సిపాలిటీల విలీనం, జీఎస్టీ సవరణ, ముగ్గురు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తదితరాలున్నాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ)–2025 ఆర్డినెన్సును సభ ముందుంచుతారు.ఆ తర్వాత ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ)–2025, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (రెండో సవరణ)–2025, తెలంగాణ మున్సిపాలిటీస్ (రెండో సవరణ)–2025 ఆర్డినెన్సులను ప్రవేశపెడతారు. అనంతరం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సర్వ శిక్ష అభియాన్, పీఎం శ్రీ ఆడిట్ నివేదికలను ప్రవేశపెడతారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ (సవరణ)–2025, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ (రెండో సవరణ)–2025 ఆర్డినెన్సులను సభ ముందుకు తేనున్నారు.అనంతరం పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ)–2025 ఆర్డినెన్సు, ఎంపీపీ, జెడ్పీ ఎన్నికలకు సంబందించిన గెజిట్ నోటిఫికేషన్లను సభ ముందు పెట్టనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హారి్టకల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదిక ప్రవేశపెట్టనువ్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యేలు ఆర్.దామోదర్ రెడ్డి (సూర్యాపేట), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల) మృతి పట్ల సంతాపం తెలుపుతూ స్పీకర్ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లోనే కవి అందెశ్రీ కుమారుడి ఉద్యోగం కోసం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్సు, రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కూడా తేనున్నట్టు సమాచారం. మండలిలో ఇలా... ఇక, మండలిలో తొలి రోజు రెండు సంతాప తీర్మానాలను పెట్టనున్నారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీలుగా పనిచేసి చనిపోయిన మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్‌షబ్బీర్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం మండలి వాయిదా పడుతుందని సమాచారం. అసెంబ్లీ, మండలి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సోమవారం సమావేశంకానుంది. శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలన్నది నిర్ణయిస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మళ్లీ జనవరి 2న ప్రారంభం కానుంది. మూడు లేదా నాలుగు రోజులపాటు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది. రాజకీయ ‘రణరంగమే’ కృష్ణా జలాల పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందనతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడీవేడిగా జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఆయన ఆదివారమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈసారి కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది.అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాలు తమ వాదనలను సమర్థవంతంగా వినిపించడం ద్వారా ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేయనున్నాయి. అందులో భాగంగా ఈనెల 1న ప్రజాభవన్‌లో అధికార పక్షం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తోంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న పకడ్బందీ చర్యల గురించి వివరించనున్నారు. శీతాకాల సమావేశాల్లో బలమైన వాణి వినిపించేలా ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సిద్ధం చేయనున్నారు. సజావుగా జరిగేలా చర్యలు: స్పీకర్ సమావేశాల నిర్వహణ, వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్లపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ కమిటీ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి, అసెంబ్లీ కార్యదర్శులు నర్సింహాచార్యులు, రెండ్ల తిరుపతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ విజయ్‌కమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సజ్జనార్, అవినాశ్ మహంతి, సు«దీర్‌బాబు, కార్తికేయ (ఇంటెలిజెన్స్), కరుణాకర్ (అసెంబ్లీ చీఫ్‌మార్షల్) హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు.సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు సభకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. సభ జరుగుతున్న సయంలో ధర్నాలు, ఆందోళనలకు తావు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. నోడల్, లైజనింగ్ అధికారులను నియమించాలని, సమావేశాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రేపు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి హైదరాబాద్: సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం కోసం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌లో గల తన నివాసానికి బయిలుదేరినట్లు పేర్కొంది. రేపు జరిగే అసెంబ్లీ సెషన్‌కు అక్కడి నుంచి కేసీఆర్ హాజరు కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సెషన్లకు హాజరయ్యారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వగా రెండోసారి బడ్జెట్ ప్రసంగానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించింది. కాగా ఇటీవలే కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించారు. వాటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆరాతీశారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
ఫామ్‌హౌస్‌లో ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయా?
సాక్షి, మహబూబాబాద్: ‘ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు తెలుస్తాయి.. ఫామ్‌హౌస్‌లో ఉండి ఢాంబికాలు మాట్లాడితే సమస్యలు తెలుస్తాయా.. అసెంబ్లీలో చర్చించేందుకు రావాలి’ అని రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి నూకల రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకోవడం కాదని, ఆ పరిజ్ఞానం అసెంబ్లీలో ప్రజలకోసం మాట్లాడటంలో చూపించాలని కోరారు. ఓడిపోయిన తర్వాత రెండేళ్లు ఫాంహౌస్‌లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి కారుకూతలు కూస్తే ప్రజలు నమ్మరని అన్నారు.రేవంత్‌రెడ్డి పాలనను మెచ్చి పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించారని చెప్పారు. కేవలం 25 శాతం గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ల కోసం మహబూబాబాద్ వచ్చి కేటీఆర్ గొప్పలు చెప్పకోవడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టంచేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నాలుగుసార్లు మంత్రిగా పనిచేసి తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడిన నూకల రాంచంద్రారెడ్డి తెలంగాణ గరి్వంచదగిన నాయకుడని పొంగులేటి కొనియాడారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవిందర్‌రావు, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. జీఓలో అవసరమైతే మార్పులు ఖమ్మం రూరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే జర్నలిస్టులకు అత్యధికంగా అక్రిడిటేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శనివారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జీవో 252లో పొరపాట్లు ఉన్నా, మార్పులు అవసరమనిపించినా సరి చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. డెస్క్ కార్డులున్న వారికి కూడా ఫీల్డ్ మీడియా కార్డులతో సమానంగా అన్ని సౌకర్యాలు కలి్పస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
అసెంబ్లీ తర్వాతే 3 జిల్లాల్లో ‘పాలమూరు’ సభలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ తలపెట్టిన పోరుబాట బహిరంగ సభల షెడ్యూల్‌ను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే ఖరారు చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ పథకానికి నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరి«ధిలో బహిరంగ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుతోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో సభల నిర్వహణ షెడ్యూల్‌పై చర్చించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఖరారు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే బహిరంగ సభల తేదీల ఖరారు కోసం ఎదురుచూడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ పథకంతో ప్రయోజనం చేకూరే అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి నియో జకవర్గ స్థాయి వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభలు, సమావేశాల పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మరోవైపు ఈ నెల 29న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి రోజు భేటీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం.అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏయే అంశాలను చర్చిస్తారనే ఎజెండాను చూసిన తర్వాత మిగతా రోజుల్లో సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్‌కు సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా ప్రజాసమస్యలన్నింటిపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా ఫీజు రియింబర్స్‌మెంట్, పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎరువుల కొరత వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టాలని ఆదేశించారు. -
అసెంబ్లీకి కేసీఆర్?.. మాస్టర్ ప్లాన్ ఇదేనా!
సాక్షి,హైదరాబాద్: వచ్చే వారంలో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన వెలువడనుంది.శుక్రవారం పార్టీ నేతలతో కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ జరిగింది. సమావేశంలో నేతలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని, అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఈ రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు లేదని స్పష్టం చేశారు. -
సై అంటే సై.. ఎవరి వాదన కరెక్ట్?
-
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్‌లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. రేవంత్ మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది. కేసీఆర్ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని, తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రెస్మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్‌లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ తదితర కొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు. కేసీఆర్ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్‌ను వాడుకోవడానికి శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ బృందం ప్రయత్నిస్తోంది. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు ప్రయోనం కలిగిస్తాయా?లేక గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసీఆర్‌పై రేవంత్ భాష కరెక్ట్ కాదు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యల చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై రేవంత్ మాట్లాడిని భాష సరికాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో, బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై మాట్లాడిన భాష సరికాదు. సీఎం రేవంత్ తన భాషపై పునరాలోచన చేయాలి. రేవంత్ భాషతో ఆయనకే నష్టం జరుగుతుంది. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో కృష్ణా జలాలపై స్పందిస్తూ..‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నది కేసీఆర్. ఆ విషయాన్ని బయట పెట్టింది నేను. ముడుపుల కోసం కేసీఆర్ 575 టీఎంసీలు కావాలని అడగలేదు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు. కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాలు అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ ద్రోహి. ఇందుకే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఏం సరిపోతాయి. ప్రతీ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలి. మార్చి నాటికి మూడువేల కోట్లు ఇస్తామని రేవంత్ అంటున్నారు.. అవి కేంద్రం ఇచ్చే నిధులే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించుకున్నారు. భూములు కొల్లగొడుతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులు భవిష్యత్‌లో జైలుకు వెళ్లడం ఖాయం. వారిపై నివేదిక తయారు చేస్తున్నాం. గెలిస్తే కాంగ్రెస్ పార్టీనా?పార్టీ గుర్తుపై జరిగే MPTC, ZPTC ఎన్నికలకు వెళ్లకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళను తమ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినా స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిజాయితీ పరులు.. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. మావోయిస్టుల లిస్టులో పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు’ అని కామెంట్స్ చేశారు. బీజేపీ బలంగానే ఉంది.. మా పార్టీ నేతలమంతా కలిసికట్టుగానే ఉన్నాం. మేం కలిసి భోజనాలు కూడా చేశాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం జీవోలను దాచిపెడుతోంది. ఆరు గ్యారెంటీలు చర్చ జరగకుండా చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఎన్ని ఇళ్లు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో నలుగురు రోహింగ్యాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఓట్ల కోసం వారిని ప్రోత్సహిస్తున్నారు. భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ మేయర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. గతంలో కొద్ది తేడాలో మేయర్ స్థానం పోగొట్టుకున్నాం. ఈసారి సింగిల్‌గా మేయర్ పీఠం మాదే. ఎంఐఎంకు అనుకూలంగా హైదరాబాద్‌లో డివిజన్ల డీలిమిటేషన్ చేశారు.కాంగ్రెస్ పార్టీ మాయలో ఉంది. భాగ్యనగరంలో ఎంఐఎంతో సహవాసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎవరూ వేయడానికి సాహసం చేయరు. జూబ్లీహిల్స్ ఓటమితో కార్యకర్తలు ఆవేదన చెందారు. ఖైరతాబాద్‌లో కార్యకర్తలు కసితో ఉన్నారు. ఈ దేశంలో మైనార్టీ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మాత్రం హిందువులను హతమారుస్తున్నారు’ అని అన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ది కంపు నోరు.. మురుగు కాల్వ కంటే అధ్వాన్నం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అవసరం ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బండ రాయి కట్టి మూసీ నదిలో పడేస్తారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ తోలు కాదు, ప్రభుత్వం తోలు వలుస్తాం.కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే తమ బట్టలు ఇప్పుతాడనే భయంతోనే ఫ్రస్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ భాషకి ప్రజాక్షేత్రంలో తప్పక శిక్ష పడుతుంది. ప్రజలే రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ముందు రేవంత్ బచ్చా. ఇరిగేషన్ మంత్రి ఒక అజ్ఞానపు మంత్రి. ఉత్తమ్ కుమార్‌కు కనీస అవగాహన లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత’ అని వ్యాఖ్యలు చేశారు. -
అసెంబ్లీకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి వచ్చినా ఏడాదిగా ప్రభుత్వం స్పందించక పోవడం.. 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఓ వైపు అధికార పక్షం సవాలు విసురుతుండగా, దీటుగా ప్రతిస్పందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నదీజలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం వైఖరి తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినట్స్‌ను సేకరించే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకూ అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సన్నద్ధమవుతోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాతే కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశముంది. సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతోపాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే నెల జనవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయనే ప్రచారమున్న నేపథ్యంలో ఆ తర్వాతే సభల నిర్వహించేలా షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. సభల నిర్వహణ తేదీలు, వేదికలు ఖరారు చేసేందుకు ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించే అవకాశముంది. 26న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఈ భేటీల్లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, నల్లగొండ జిల్లా పరిధిలో మల్లేపల్లిలో సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర లేదా నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించే సభా వేదికను ఖరారు చేయాల్సి ఉంది. జన సమీకరణ, నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై కేసీఆర్‌తో జరిగే భేటీలో స్పష్టత వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్
వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచ్‌లకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు.విద్యతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యం. కొడంగల్ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనూ అందిస్తాం. కావాల్సిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, డీలిమిటేషన్‌తో 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నీ రాజకీయమేందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఓ కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్ లేదు. రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్సే’అని రేవంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం కొడంగల్ నియోజక వర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నూతన సర్పంచ్‌లకు శాలువాలు కప్పి సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మీరు రండి.. ముఖాముఖి చర్చిద్దాం.. ‘కేసీఆర్.. నీ వయసు, అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినవన్నీ చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి.. వెనుక ఉరుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడుదామా చెప్పండి. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పులా, నీళ్లా, మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైనా.. దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్‌కు వచ్చి.. పది మంది చెంచాలను పెట్టుకుని వారి ముందు పొంకనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నేను వద్దన్నానా. ఎన్నికలు ముగిసినయ్.. ఇంకా సందులకు రమ్మంటే ఎలా? చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరేం మాట్లాడుతారో వారు వింటరు. ఆ తర్వాత విజు్ఞలైన ప్రజలే తీర్మానం చేస్తరు. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా.. కేసీఆర్ తన ఫామ్హౌస్నే బందీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి, చంచల్‌గూడకు పంపించినా ఇదే అయితది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్ నా మీద 181 కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకుండ్రు. కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకుని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నడు. వాళ్ల పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుం ఇరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా? నన్ను గెలక్కు.. అన్నీ చూశా.. నా తోలు తీస్తానని అంటావా.. షేక్‌పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటడు. ఆయన రోజూ మేకలు కోసి మండి నడుపుతుంటడు. కేసీఆర్ ఖాళీగా ఉన్నడు. తోలు తీస్తడు.. ఆయనకు నౌకరీ ఇవ్వమని చెప్పిన. నౌకరీ అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్‌కు ఉచితంగా ఇంత బోటి, కాళ్లు, తలకాయ పెట్టు పాపం.. సాయంత్రం రెండేసేటప్పుడు తీసుకుంటడని. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది. మేము ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క, తోలు అంటవా. మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడ్తరు. కొడంగల్ వస్తవా.. మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా. ఒక్కటైనా అక్కరకొచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు. నేను అన్నీ చూసిన. నల్లమల అడవుల నుంచి వచ్చిన. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ విమర్శిస్తడు. తండ్రి ఏమో ప్రభుత్వం రియల్ దందా చేస్తోందంటడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. నేను అయ్య పేరు చెప్పి మంత్రిని కాలే. పాస్‌పోర్టు బ్రోకర్ల దందా చేయలే. ఆంధ్రలోని గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి. మీ జాతినంతా తెచ్చుకో.. మా ఊరికొస్తవా? లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్ వచ్చి చూడు అన్నావ్. లక్షల మంది కార్యకర్తలతోపోయి తొక్కితే పాతాళానికి పోయినవ్. మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం. ఎవరి సొమ్ము గురించి ఆలోచన చేయం. మా కాళ్లలో కట్టెలు పెడితే మాత్రం ఊకోం. మా సంగతి చూపిస్తాం. ఇప్పటికైనా మారండి.. సొంత బిడ్డ అని చూడకుండా ఇంటి అల్లుడి ఫోన్లనే ట్యాపింగ్ చేసిండ్రు. ఇంతకన్న సిగ్గులేనోడు ఉంటడా అని వాళ్ల బిడ్డ వాళ్లే అంటుండ్రు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టనోడు ఒక మనిషా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్ విసురుతుండు. నా సంగతి నీకు తెల్వదు. మీ నాయనను అడుగు.. నా గురించి చెబుతడు. ఇంకో ఆయన కేసీఆర్ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు, ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మేం నాటు కోడి తోలు తీసి, పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నయ్. ఇప్పటికైనా మారండి. లేకపోతే దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గుపోతది. -
కేసీఆర్.. నిన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం: సీఎం రేవంత్
సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తాకేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పరువు తీసిన KCR.. స్ట్రాంగ్ రిప్లై..
-
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
పార్టీ నాకు కన్నతల్లిలాంటిది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్‌రావు అన్నారు. రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు. -
‘చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడింది వంద శాతం కరెక్ట్’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన. చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన. అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు. -
ఆ MOU లు అంతా బోగస్.. నిజం బయటపెట్టిన KCR
-
వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు
-
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
-
ఏం చేద్దాం ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు. -
కేసీఆర్‌వి 90% అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 90 శాతం పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని దారుణంగా, దుర్మార్గంగా నాశనం చేసింది ఆయనే అని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపం, అసమర్థత, చేతకానితనంతో 10 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు జీరో ప్రయోజనం చేశారని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లు కూలిపోవడానికి.. సీఎంగా, నీటిపారుదల, ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌దే బాధ్యత అని, కేసీఆరే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తేలి్చందని అన్నారు. ఆదివారం రాత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం చేపట్టకుంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. ‘కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం మరొకటి జరగదేదని ఘోష్ కమిషన్, విజిలెన్స్, కాగ్ ఎన్డీఎస్ఏ తేల్చాయి. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతున్నాం. అంతర్జాతీయ నిపుణులతో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణను వాటి నిర్మాణ సంస్థలతోనే పూర్తి చేయిస్తాం. రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్ల పనులు పూర్తయ్యాక అధిక కమీషన్ల కోసం అర్ధాంతరంగా వదిలేసి దాని స్థానంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం చేపట్టకుండా ప్రాణహిత–చేవెళ్లనే నిర్మిస్తే మిగిలిపోయే రూ.65 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..’ అని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ‘కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటైనా పూర్తి చేశారా? మార్పులు చేయకుంటే రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. పాలమూరు కింద ఎకరా ఆయకట్టు ఇవ్వలేదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారు. దాని కింద ఒక్క ఎకరమైనా ఆయకట్టు ఇచ్చారా? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు గత ప్రభుత్వమే సవరించగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2023 ఏప్రిల్ 12న కేంద్రం తిప్పి పంపింది. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి కేసీఆరే..’ అని ఉత్తమ్ చెప్పారు. 45 టీఎంసీలకు తగ్గింపు అబద్ధం... ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేందుకు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చాం. తొలి విడత ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతించింది. గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచి్చన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకి కేటాయించాలని కేంద్రంతో మేము నిరంతరం కొట్లాడుతున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి కేసీఆర్ సహకరించారు ‘ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్యలో ఏపీ రోజుకి 4.1 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోగా, తెలంగాణ వచ్చాక కేసీఆర్ సహకారంతో రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తరలించుకునేలా సామర్థ్యాన్ని పెంచుకుంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు కేసీఆర్ సహకరిస్తే మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను ఆపివేయించాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ 2004–14 మధ్యలో 727 టీఎంసీలను అక్రమంగా తరలించగా, కేసీఆర్ సీఎం అయ్యాక 2014–23 మధ్యలో 1442 టీఎంసీలను అక్రమంగా తరలించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేసీఆర్ సహకరించారు. ఆయన కాలంలోనే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ఉత్తమ్ తెలిపారు. -
ప్రభుత్వాన్ని ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నందినగర్ నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటినుంచి రాత్రి ఏడున్నరకు ఆయన తిరిగి వెళ్లేంత వరకు అక్కడ ఉత్సాహపూరిత సందడి వాతావరణం నెలకొంది. కాగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టేలా బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ చేపట్టడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ.. ఈ మూడు జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణ, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దశల వారీగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల తీరును వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, నల్లగొండ జిల్లా మల్లేపల్లితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదో ఒక చోట బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో సభను నిర్వహించేందుకు ఒకటి రెండు రోజుల్లో జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మహబూబ్‌నగర్ సభను సంక్రాంతి లోపు నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ‘పాలమూరు’కు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదులో డంబాచారం వద్దు పార్టీ సభ్యత్వ నమోదును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చేయాలనే అంశంపై పార్టీ నేతల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు కోరారు. రెండు విధానాల్లో సభ్యత్వ నమోదు చేయాలని, సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలను నియమించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పార్టీ సభ్యత్వ నమోదు పేరిట డంబాచారాలకు పోకుండా పార్టీ పట్ల నిబద్ధత ఉండే వారికే సభ్వత్యం ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూలును సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సభ్యత్వ నమోదు ఉచితంగా కాకుండా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించేలా నిబంధనలు ఉండాలని నేతలు సూచించారు. సభ్యత్వం తీసుకునే వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కేంద్రంగా పనిచేయడంతో నష్టం! ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగడంతో కొంత మేర నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఈ భేటీలో కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు క్షేత్ర స్తాయిలో కేడర్‌తో సమన్వయంతో చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు సాధించిన పలితాపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తాం చెక్‌డ్యామ్‌ల పేల్చివేత అంశంపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి న తర్వాత బాధ్యులు పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ సహజ శైలిలో సాగిన ప్రసంగంలో ఆయన సీఎం రేవంత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత 26 ఏళ్లుగా ప్రత్యర్థులు తన చావును కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇలావుండగా కేసీఆర్ రాకమునుపే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపం వద్ద నివాళి అరి్పంచారు. కేసీఆర్ రాక సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డికి స్వల్ప గాయం అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతియేటా పార్టీ తరపున చాదర్ సమరి్పంచే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ ఆదివారం చాదర్ అందజేశారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అందజేశారు. 15 మంది విద్యార్థులకు ఈ చెక్కులు అందజేశారు. -
ముందు అసెంబ్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు ‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. మూతి దగ్గర కాకుండా తోక దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం. తేలు కుట్టిన దొంగలా.. మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను. అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్ ఐరన్‌లెగ్ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పులు చేసి గుల్ల చేశారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


