Khammam District Latest News
-
సాగు.. బాగయ్యేలా !
● కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి ● రైతులకు విత్తనాల కిట్ల పంపిణీ ● ఐదేసి రకాలతో జిల్లాకు 1,250 చొప్పున కిట్లు ఖమ్మంవ్యవసాయం: కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ఉద్యాన శాఖ ఉచితంగా రైతులకు విత్తనాల కిట్లు పంపిణీ చేస్తోంది. రైతులు కొంత కాలంగా వరి, ఇతర వాణిజ్య పంటల సాగుపైనే దృష్టి సారిస్తుండడంతో జనాభాకు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరల సాగు కావడం లేదు. ఫలితంగా కూరగాయలను సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండగా, ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వం కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి దిగుమతి చేసుకున్న కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను కిట్లుగా రూపొందించారు. ఒక్కో కిట్లోరూ.500 విలువైన ఐదు రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు ఉంటాయి. టమాట, పచ్చిమిర్చి, బెండ, తోటకూర, పాలకూర విత్తనాలు ఉండగా, వీటిని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది. అక్కడి నుంచి నేషనల్ సీడ్ కార్పొరేషన్ దిగుమతి చేసుకోగా, ప్రతీ జిల్లాలో 1,250 కిట్ల పంపిణీకి ఉద్యాన శాఖ శ్రీకారం చుట్టింది. కిట్లను ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా, సత్తుపల్లి ఉద్యాన డివిజన్ల వారీగా రైతులకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అర ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూమి ఉన్న ఆసక్తి, అర్హత ఉన్న రైతులకు ఈ మినీ కిట్లు అందిస్తారు. ఆసక్తి కలిగిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటోతో ఉద్యాన అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఉద్యాన శాఖ సరఫరా చేస్తున్న కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను వేసవిలో సాగు చేసుకోవచ్చు. నీటి వనరులు ఉన్న రైతులు తమ క్షేత్రాల్లో సాగు చేస్తే తక్కువ కాలపరిమితిలోనే పంటలు చేతికి వస్తాయి. పాలకూర, తోటకూర వంటివి 25 రోజుల్లో, టమాట 50 రోజుల్లో, పచ్చిమిర్చి, బెండ 40 రోజుల్లో దిగుబడి మొదలవుతుంది. వేసవిలో కూరగాయలకు డిమాండ్ ఉన్నందున రైతులు మంచి ఆదాయం సమకూరడమే కాక ప్రజలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ధరలో లభిస్తాయని చెబుతున్నారు.జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసిన విత్తనాల కిట్లను ఆసక్తి ఉన్న రైతులకు పంపిణీ చేస్తున్నాం. మా శాఖ అధికారులు వేసవిలో కూరగాయల, ఆకుకూరల సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. – ఎంవీ.మధుసూదన్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి -
సాగర్ జలాలతో వరద కాలువ కళకళ
చింతకాని: వుండలంలోని నేరడలో వరద కాలువ బుధవారం సాగర్ జలాలతో నిండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరడ రెవెన్యూ పరిధి నల్లకుంట, ఊడుగులకుంట చెరువులను అనుసంధానించడంతో పాటు వర్షాకాలంలో పొలాల్లోని నీటిని మళ్లించేందుకు ఎన్నో క్రితం వరద కాలువను నిర్మించారు. ఇప్పుడు ఆ కాలువ సాగర్ జలాలలో కళకళలాడుతోంది. జనవరి వస్తే పశువులు తాగేందుకు సైతం నీరు ఉండని నల్లకుంట, ఊడుగులకుంట చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చొరవతో నిర్మించిన కొదుమూరు – వందనం ఎత్తిపోతల పథకంతోనే ఇది సాధ్యమైందని రైతులు వెల్లడించారు. -
ఆదాయం మైనస్
రిజిస్ట్రేషన్లు భేష్.. గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. తాజాగా ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 52,265 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు స్టాంపుల విక్రయాలు, మార్టిగేజ్లు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.221,05,30,100 ఆదాయం వచ్చింది. అయితే, 2024–25తో పోలిస్తే ఇది రూ.2.27కోట్లు తక్కువ కావడం గమనార్హం. గత ఏడాది కంటే డాక్యుమెంట్లు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. – ఖమ్మంమయూరిసెంటర్స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు తగ్గిన రాబడి -
ధాన్యం సేకరణకు ప్రణాళిక
ఖమ్మంసహకారనగర్: ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లా రైతాంగం సాగు చేస్తున్న వరి ధాన్యంలో 2.37 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, మిల్లర్లతో సమీక్షించారు. రైస్ మిల్లర్లు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకునేందుకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే, నాణ్యమైన గన్నీ సంచులనే కొనుగోలు కేంద్రాలకు అందించాలని తెలిపారు. మిల్ పాయింట్ వద్దే సంచుల నాణ్యత పరిశీలన ఉంటుందని వెల్లడించారు. కాగా, ధాన్యం రవాణాకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రభుత్వానికి సమర్పించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.ఏర్పాట్లపై సమీక్షించిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
హనుమాన్ జయంతికి ఏర్పాట్లేవి?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జై శ్రీరామ్ నినాదం వినిపించడంలో అగ్రస్థానం ఎప్పుడూ హనుమంతుడిదే. సిరియ తంబిగా రాముడి చేత ప్రశంసలు హనుమంతుడికి దక్కాయి. అందుకే ఆంజనేయుడి భక్తులు శ్రీరాముడి చెంతన హనుమాన్ దీక్షా విమరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఎంతో భక్తితో వచ్చే దీక్షాపరులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయి. రెండుసార్లు జయంతి ఉత్సవాలు హనుమంతుడి భక్తుల్లో వేర్వేరు సంప్రదాయాలను, క్యాలెండర్లను పాటించేవారు ఉన్నారు. దీని ప్రకారం హనుమాన్ జయంతిని ఏటా రెండు వేర్వేరు తేదీల్లో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2, మే 12వ తేదీల్లో హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఏప్రిల్ 2న జరిగే వేడుకలను చిన్న జయంతిగా, మే 12న జరిగే వేడుకలను పెద్ద జయంతిగా గుర్తిస్తున్నారు. చిన్న జయంతి సందర్భంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయం ఉన్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకి వెళితే, పెద్ద జయంతి సందర్భంగా సీతారాములు కొలుదీరిన భద్రాచల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శబరిమల తరహాలో.. ఏటా లక్షలాది మంది భక్తులు హనుమాన్ మాల ధరిస్తున్నారు. వీరిలో కొందరు చిన్న జయంతి రోజున మాల విరమణ చేస్తే, మరికొందరు అదే రోజున మాల ధరించి పెద్ద జయంతి రోజున విరమిస్తున్నారు. చిన్న జయంతికి కొండగట్టు క్షేత్రంలో దీక్ష తీసుకునే భక్తులు పెద్ద జయంతికి భద్రాచలంలో మాల విరమణ చేస్తున్నారు. ఫలితంగా గడిచిన దశాబ్దకాలంగా పెద్ద జయంతి రోజున వేలాదిగా హనుమాన్ మాలధారులు భద్రాచలం చేరుకుంటున్నారు. క్రమేణా అయ్యప్ప మాల ధరించిన వారికి శబరిమల ఎలాగో హనుమాన్ మాలధారులకు భద్రాచలం క్షేత్రం అలాగే అన్నట్టుగా భక్తుల్లో నమ్మకం, విశ్వాసం పెరుగుతోంది. మూడో వేడుకగా.. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వందల ఏళ్లుగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ ముందు రోజు తెప్పోత్సవం సైతం కనుల పండువగా జరుపుతున్నారు. ఈ రెండు వేడుకలు కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఇప్పుడు అదే స్థాయిలో హనుమాన్ జయంతి సందర్భంగా కూడా భద్రగిరికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతిని భద్రాచలంలో జరిగే మూడో అతిపెద్ద వేడుకగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కావాలి కార్యాచరణ శ్రీరామనవమి, ముక్కోటి పండుగల తరహాలో హనుమాన్ జయంతి సందర్భంగా దేవస్థానం, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం లేదు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమాన్ మాలధారులకు ఇబ్బంది రాకుండా డార్మిటరీలు, తాగునీరు వంటి అదనపు సౌకర్యాలు, మాల విరమణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, భజన మందిరం వంటివి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. పెద్ద జయంతికి ఇంకా నలభై రోజుల సమయం అందుబాటులో ఉన్నందున కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాళ్లకు బొబ్బలు వస్తున్నా.. నడి వేసవిలో రామభక్తితో భద్రాచలం వచ్చే దాసాంజనేయ మాలధారులకు కనీసం నీడ కరువైపోతోంది. గొంతెండితే గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చే దీక్షాపరులకు మండే ఎండల ధాటికి ఆలయం నుంచి గోదావరినదీ తీరానికి వెళ్లి వచ్చే సరికి కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. చలు వ పందిళ్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక క్యూలైన్లు వంటి ఏర్పాటు చేస్తే దీక్షా పరులకు ఇబ్బందులు తొలగిపోతాయి.భద్రగిరికి పోటెత్తుతున్న హనుమాన్ మాలధారులు -
సీఈగా బాధ్యతలు చేపట్టిన మంగళపూడి
ఖమ్మంఅర్బన్: జిల్లా జల వనరుల శాఖ ముఖ్య ఇంజనీర్(సీఈ)గా మంగళపూడి వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు, జలవనరుల శాఖ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్, ఇరిగేషన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌తో పాటు నాగేశ్వరరావు, రర్ లెనిన్, బీబు సాహెబ్, భీముడు, చారి, వెంకట్రావు, గోపయ్య, శ్రీనివాసరావు, సంధ్యారాణి, వీణాకుమారి, జి.శ్రీనివాసరావు, హిమబిందు, రవితేజ, రాజ్యలక్ష్మి, అర్జున్, ముత్యాల దేవి, ప్రసాద్, రామయ్య, సుదర్శనం తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల జాబితాలో కేఎంసీతో పాటు వైరా, ఇల్లెందు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీతోపాటు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు మున్సిపాలిటీకి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.6,38,97,777 నిధులు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో టైడ్, అన్‌టైడ్ నిధులుగా విభజించారు. టైడ్ గ్రాంట్లలో 50 శాతం వర్షపునీటి నిల్వ, రీసైక్లింగ్‌తో తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుంది. అన్‌టైడ్ నిధుల్లో 50 శాతం ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కాగా, ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.4,91,14,895 నిధులు కేటాయించగా, ఇందులో టైడ్ నిధులు రూ.2,94,68,937, అన్‌టైడ్ నిధులు రూ.1,96,45,958 ఉన్నాయి. అలాగే, వైరా మున్సిపాలిటీకి రూ.74,53,356 మంజూరు చేశారు. ఇందులో టైడ్ నిధులు రూ.44,72,014, అన్‌టైడ్ నిధులు రూ.29,81,342గా వెల్లడించారు. ఇక ఇల్లెందు మున్సిపాలిటీకి రూ.73,29,526 నిధులు మంజూరు చేయగా.. టైడ్ నిధులు రూ.43,97,716, అన్‌టైడ్ నిధులు రూ.29,31,810 ఉన్నాయి. విద్యుత్ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి ఖమ్మంవ్యవసాయం: క్షేత్ర స్థాయిలో పనులు నిర్వహించే ప్రతీ విద్యుత్ ఉద్యోగి తప్పక భద్రతా పరికరాలు ధరించాలని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆదేశించారు. ప్రధానంగా హెల్మెట్, గ్లౌజ్‌లు, ఎర్త్ రాడ్ వంటి పరికరాలు లేకుండా పనిచేయొద్దని బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేసినా కొందరు పరికరాలు ఉపయోగించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈమేరకు నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఆయన.. భద్రతా చర్యల్లో భాగంగా ఎల్సీ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
మద్యం అమ్మకాల్లో కిక్కు!
వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2025–26)లో లెక్కకు మిక్కిలిగా పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2024 – 2025లో రూ.167.11కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2025–26లో మాత్రం రూ.2,297 కోట్లుగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్త షాపులు, ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 204 వైన్ షాపులు, 52 బార్లు, మూడు క్లబ్‌లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో వైన్స్ దక్కించుకున్న వారు భారీగా సరుకు కొనుగోలు చేశారు. అంతేకాక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయాన మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్టస్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, మార్చి 31న మంగళవారం ఒకేరోజు రూ.24.20కోట్ల విలువైన మద్యాన్ని వైరాలోని డిపో నుంచి వైన్స్, బార్ల యజమానులు తీసుకెళ్లారు. మొత్తం సంవత్సరంలో 27,576 కేసుల మద్యం, 1,63,1729 కేసుల బీర్ల అమ్మకాలు కొనసాగాయి. 2025–26లో రూ.2,297 కోట్లుగా నమోదు -
నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి..
ఖమ్మంమయూరిసెంటర్: అమరుల త్యాగాలు, కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కడమే కాక పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఖమ్మం జెడ్పీ సెంటర్లో నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ, బీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు కొత్త సీతారాములు, సింగు నరసింహారావు, విష్ణువర్ధన్, జి.రామయ్య, సాదినేని వెంకటేశ్వరరావు, పాషా మాట్లాడుతూ ప్రధాని మోదీ అవలంబిస్తున్న కార్మికవర్గ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు నారల నరేష్‌నాయుడు, గాదె లక్ష్మీనారాయణ, నవీన్‌రెడ్డి, కె.శ్రీనివాస్, సుభాహన్, పాల్వంచ కృష్ణ, సిద్ధల నాగేష్, ఫజల్, రామకృష్ణ, దొంగల తిరుపతిరావు, రామదాసు, పట్ట రవి, సైదులు, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్, లెనిన్, సత్తార్మియా, స్వామి తదితరులు పాల్గొన్నారు.నల్ల జెండాలతో కార్మిక సంఘాల నిరసన -
పుణ్యక్షేత్రాల సందర్శనలో రోడ్డుప్రమాదం
●ప్రయాగలో వైరా వాసి మృతి వైరా: పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన వైరావాసి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వైరాకు చెందిన బండారు తిరుపతిరావు(58) మరో 60మందితో కలిసి గత నెల 28న ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు రైలులో వెళ్లాడు. అక్కడ వీరంతా బృందాలుగా విడిపోయి వాహనా ల్లో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈక్రమాన తిరుపతిరావు, పలువురు శనివారం ప్రయాగలో దర్శనం అనంతరం వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురవడంతో తిరుపతిరావుకు తీవ్రగాయాలు, మిగతా కొందరికి స్వల్ఫగాయాలయ్యాయి. ఈమేరకు చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందగా అంబులెన్స్‌లో మృతదేహాన్ని బుధవారం ఇక్కడకు తీసుకొచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, తిరుపతిరావు మృతిపై వైరామాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, కౌన్సిలర్ బొర్రా ఉమాదేవి, మార్కెట్ చైర్మన్ బోళ్ల రంగారావు, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, దార్న రాజశేఖర్, వేముల రత్నాకర్, మోర్ శ్రీకాంత్ తదితరులు సంతాపం ప్రకటించారు. బిడ్డ పుట్టిన ఆనందం తీరకుండానే.. కొణిజర్ల: కుమార్తెను పుట్టిందన్న ఆనందంతో భార్యాబిడ్డను తీసుకెళ్దామని వచ్చిన వ్యక్తి రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఆయన వెళ్తున్న ఆటో వేగం కారణంగా అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరి గింది. ఘటనకు సంబంధించి వివరాలు... హైదరాబాద్‌కు చెందిన నంబి ఫణిధర్(31) హైదరాబాద్ శంషాబాద్ సమీపాన ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన పెద్దగోపతికి చెందిన యువతి రేణుకను వివాహం చేసుకోగా, మూడు నెలల క్రితం ఆమె కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో రెండు రోజుల క్రితం పెద్దగోపతి వచ్చిన ఫణిధర్ భార్యాకుమార్తెను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఫణిధర్ – రేణుక దంపతులతోపాటు ఆయన బావమరిది జయసాయిరామ్, తదితరులు ఆటోలో పెద్దగోపతి నుంచి ఖమ్మం వెళ్తుండగా తనికెళ్ల సమీ పాన ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఫణిధర్ రోడ్డు పక్కన పడిపోగా ఆయన తలకు రాయి తాకడంతో తీవ్ర గాయమైంది. ఆయనను 108లో ఖమ్మం తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జయసాయిరామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.సూరజ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లు స్వాధీనం ఖమ్మంక్రైం: గృహా అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను హాటళ్లలో వినియోగిస్తుండగా ఖమ్మం టాస్క్‌ఫోర్స్, టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు బుధవారం చేపట్టిన తనిఖీల్లో నెహ్రూనగర్‌లోని చక్క వెంకట్ ఫణీంద్రబాబు హాటల్ నుంచి నాలుగు, కొనికి చంద్రశేఖర్‌కు చెందిన ఉడిపి ఆరాధ్య టిఫిన్ సెంటర్ నుంచి నాలుగు సిలిండర్లు స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.రోడ్డుప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి -
ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించేలా చేపట్టిన ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఖమ్మం టూటౌన్లో ప్రారంభించి మాట్లాడారు. పాలక వర్గాలు ప్రజలను విస్మరించి పాలన సాగిస్తుండడమే కాక వసతుల కల్పనలో విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కార్యదర్శి దండి సురేష్, ఎస్.కే.జానీమియా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మహ్మద్ సలాం, పోటు కళావతి, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, గాదె లక్ష్మీనారాయణ, ఎస్కే.సైదా, వరదా నర్సింహారావు, జ్వాలా నర్సింహారావు, మందా వెంకటేశ్వర్లు, మాడుగుల నాగేశ్వరరావు, చానా తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, విస్తరణ సీపీఐ విస్తరణ, బలోపేతమే లక్ష్యంగా శ్రేణులు ముందుకు సాగాలని హేమంతరావు పిలుపునిచ్చా రు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణానికి గాను అన్ని డివిజన్లలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ ఈనెల 15 నాటికి పూర్తి చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, జానీమియా, పోటు కళావతి, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏనుగు గాంధీ, వరదా నర్సింహారావు పాల్గొన్నారు. ‘ఇంటింటికీ సీపీఐ’ని ప్రారంభించిన బాగం -
స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలకు 63 మంది
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలా ల నుంచి 63మంది బాలబాలికలు హాజరుకాగా, ఇందులో బాలురు 38, బాలికలు 25 మంది ఉన్నారు. వీరి ఎత్తు, బరువు కొలతలు వేయడంతో పాటు షటిల్ రన్, పరుగు పందెం తదితర పోటీలు నిర్వహించారు. ఈమేరకు బాలురు, బాలికలు పది మంది చొప్పున రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వీరు ఈనెల 29వ తేదీన సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటార ని డీవైఎస్ఓ తుంబూరు సునీల్‌రెడ్డి తెలిపారు. ఎంపిక పోటీల్లో అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, మేనేజర్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. చికెన్ షాపులు బంద్ ఖమ్మంవ్యవసాయం: పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు తగ్గించాయని పేర్కొంటూ చికెన్ సెంటర్ల నిర్వాహకులు షాపులు బంద్ చేశారు. అసోసియేషన్ పిలుపుతో బుధవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 750 చికెన్ సెంటర్లు మూతపడ్డాయి. ఇదే సమయాన పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాలతో చికెన్ సెంటర్ల ఓనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు చర్చలు ప్రారంభించారు. కాగా, సెంటర్ల బంద్‌తో ఉమ్మడి జిల్లాలో 120 టన్నుల చికెన్ క్రయవిక్రయాలు నిలిచిపోయాయని అంచనా. బంద్‌తో సెంటర్లపై ఆధారపడి జీవించే వారు ఇబ్బంది పడనున్నందున మార్జిన్ల తగ్గింపు చర్యలను ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ ఖమ్మం అధ్యక్షుడు పారా సత్యనారాయణ కోరారు. డీఏ బకాయిలు విడుదల చేయండి ఖమ్మంసహకారనగర్: సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు. డీఏ బకాయిల విడుదలతో పాటు పీఆర్సీ అమలుచేయాలనే డిమాండ్‌తో బుధవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం ఆర్అండ్బీ కార్యాలయంలో జరిగిన నిరసనలో శశిధర్ మాట్లాడారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏల బకాయిలు వాయిదా రూపంలో కాకుండా ఏకమొత్తంలో చెల్లించాలన్నారు. అంతేకాక వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఈయూ నాయకులు శ్వేత, రమణ, రవి, విజయ్, సాయి, కృష్ణభాను, శ్రీకాంత్, గోపి, కిరణ్, ఉదయ్, నరసింహారావు, వీర మహేష్, ప్రకాష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
‘మీ సేవ’ మరింత భారం
సుజాతనగర్: మీ సేవ కేంద్రాల్లో యూజర్ చార్జీలు పెరిగాయి. ఈనెల 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవ దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు ఉండగా, రెండింటిలోనూ చార్జీలు పెంచారు. కేటగిరీ–ఏ దరఖాస్తులకు గతంలో యూజర్ చార్జీ రూ.35 ఉంటే రూ.62కు పెంచారు. కేటగిరీ–బీ దరఖాస్తుల చార్జీని రూ.45 నుంచి రూ.80 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం కూడా మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు.యూజర్ చార్జీలు రెట్టింపు చేసిన ప్రభుత్వం -
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణీ బుధవారం ప్రారంభమైంది. గతంలోనే చీరలు జిల్లాకు చేరగా, కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేశాక నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈమేరకు ఖమ్మం 26వ డివిజన్ సుగ్గుల వారి తోటలో కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య చీరలు అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులే కాక అర్హత కలిగిన ప్రతీ మహిళకు చీరలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాస్, అనిల్‌కుమార్, మెప్మా టీఎంసీ సుజాత, నాయకులు బొడ్డుబోయిన శ్రీను, కనకరాజు, ప్రసాద్, యాకూబ్, బుజ్జి, మాధవి, సైదా, సలీం, మదార్ పాల్గొన్నారు. -
రూ.1,030 కోట్ల టర్నోవర్‌తో భద్రాద్రి బ్యాంక్
ఖమ్మంగాంధీచౌక్: భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,030కోట్ల టర్నోవర్ సాధించిందని చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 29ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధి సాధిస్తూ ఏటా వాటా దారులకు 18శాతం డివిడెండ్ చెల్లిస్తున్నామని తెలి పారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 25 బ్రాంచ్‌లతో విస్తరణకు వాటాదారులు, ఖాతాదారులు, సిబ్బంది సహకారమే కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా గత డైరెక్టర్లు, వ్యవస్థాపక డైరెక్టర్లు గుర్రం ఉమాహేశ్వరరావు, రేఖల భాస్కర్, మద్ది బాబు, అర్వపల్లి నిరంజన్ను సన్మానించారు. వైస్ చైర్మన్లు సన్నె ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు దేవత రాజారావు, మద్ది పిచ్చయ్య, కపిలవాయి జయప్రద, రాజా పురోహిత్ చైన్ సింగ్, రంగనాగ శ్రీనివాస్, దారా జీవన్, సీఈఓ దాసరి వేణుగోపాల్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూదాన్ భూముల నుంచి పేదలను తొలగించిన ప్రభుత్వం, ఇప్పటికీ పునరావాసం కల్పించకపోవడం గర్హనీయమన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం ధర్నాచౌక్ నుంచి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత నాయకులతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. మొత్తం 729 కుటుంబాలు ఇళ్లు కోల్పోగా పలువురికి వెలుగుమట్లలో, ఇంకొందరికి స్వగ్రామాల్లో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాగా, కేటాయింపుల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో పునఃపరిశీలన చేస్తున్నామని, జాబితాలో అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు బండారు రమేశ్, షేక్ మీరాసాహెబ్, ఎస్.నవీన్‌రెడ్డి, షేక్ నాగుల్‌మీరా, బోడపట్ల సుదర్శన్, బేగం, బాగం అజిత, ఏవీ రెడ్డి, కూచిపూడి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు -
పథకాలు, నిధులను వివరించండి..
ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటితో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించేలా గ్రామసభలు నిర్వహించాలని డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వీసీ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బుధవారం నుంచి జరిగే గ్రామసభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించా లని తెలిపారు. ఈ సభల్లో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారి పేర్లుప్రకటించడమే కాక ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అందుకుంటున్న వారితో మాట్లాడించాలని తెలిపారు. అలాగే, ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ తదితర అంశాలను వివరించాలని, ఇప్పటి వరకు ఆయా ప్రాంతాలకు మంజూరైన నిధుల వివరాలు వెల్లడించాలని సూచించారు. వీసీకి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హాజరు కాగా, ఆ తర్వాత అధికారులతో సమావేశమైన ఆమె గ్రామసభల నిర్వహణపై సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, సీపీఓ శ్రీనివాస్, డీపీఓ రాంబాబు, డీఎల్పీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
మహిళలకు అండగా ప్రభుత్వం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని.. అందులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోందని మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మొదలయ్యాక ఈ నెల 30వ తేదీ వరకు రూ.10 కోట్ల మేర టికెట్ చార్జీల రూపంలో మహిళా ప్రయాణికులకు ఆదా అయ్యాయి. ఈ నేపథ్యాన మంగళవారం ఖమ్మం కొత్త బస్టాండ్‌లో ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు ఆదా అవుతున్న నగదు కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ఆర్ఎం సరిరాం మాట్లాడగా.. మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ఐదుగురిని సన్మానించారు. ఖమ్మం డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, అకౌంట్స్ ఆఫీసర్ జ్యోత్స్న, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘మహాలక్ష్మి’సమావేశంలో మేయర్, ఆర్టీసీ ఆర్ఎం -
రామయ్యకు వసంతోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం వసంతోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి బేడా మండపంలోని నిత్యకల్యాణ వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర ప్రత్యేక పూజలు చేశాక, పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆపై మూలమూర్తులు, లక్ష్మీ అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు, భద్రుని గుడి, ఆంజనేయ స్వామి వార్లకు చివరగా ఉత్సవ మూర్తులపై వసంతాన్ని చల్లారు. అంతేకాక నూతన వధూవరులైన సీతారామయ్యను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. అలాగే, సూర్యప్రభ వాహనంపై స్వామి వార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. కాగా, శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాల్లో చివరిరోజైన బుధవారం చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన స్వామి వారి నిత్యకల్యాణాలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు -
కేఎంసీకి రూ.37.40 కోట్ల ఆదాయం
ఖమ్మంమయూరిసెంటర్: 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం నగర పాలక సంస్థకు ఆస్తి పన్నుల ద్వారా రూ.37.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒకేరోజు రూ.2.35 కోట్ల పన్నులు వసూలు చేశారు. గతేడాది రూ.34.97 కోట్లు వసూలు చేయగా.. ఈసారి రూ.37.40 కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. కాగా, లక్ష్యం మేర ఆస్తి పన్నులు వసూలు చేసే మున్సిపల్, కార్పొరేషన్లకు ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయనుండగా, కేఎంసీ అర్హత సాధించిందని తెలిపారు. హిమాలయాలపై వైఎస్సార్సీపీ జెండా ఖమ్మంమయూరిసెంటర్: హిమాలయ పర్వత శిఖరాలపైకి వెళ్లిన వైఎస్సార్ కుటుంబ అభిమా ని అక్కడ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గణపారపు మురళి ముదిరాజ్ మార్చి 29న హిమాలయ పర్వతం అధిరోహించారు. ఆ సమయాన తనతో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చిత్రంతో కూడిన వైఎస్సార్సీపీ జెండాను తీసుకెళ్లి ఎగురవేయడం ద్వారా అభిమానాన్ని చాటుకున్నారు. నేటి నుంచి అగ్నివీర్‌కు దరఖాస్తులు ఖమ్మంరాపర్తినగర్: భారత సైన్యంలో చేరేందుకు అగ్నివీర్లో భాగంగా ఈ నెల 1 నుంచి జూలై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. వివాహం కాని పురుషులు, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం www. joinindianaarmy. nic. in వెబ్సైట్లో పరిశీలించాలని ఆయన సూచించారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సన్మానం ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సన్మానించారు. ఖమ్మంలోనిసీపీ కార్యాలయంలో సోమ వారం వారిని సన్మానించాక ఆయన మాట్లాడారు. సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన వారు శాఖకు ఎనలేని సేవలందించారారని కొనియాడారు. ఏఆర్ ఏసీపీ నర్స య్య, ఆర్ఐలు కామరాజు, సురేశ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు బంకా శ్రీను, కంపెనీ కమాండర్లు వెంకటేశ్వర్లు, డి.రమేశ్, డి.రవి, ఈజీ నాగరాజు, నాగరాజుతో పాటు ఉద్యోగ విరమణ చేసిన కె.కోడెత్రాచు, ఎస్కే మదార్, జి.భీమా, బి.పుల్లారావు, వీవీ చార్యు లు, బి.హరిబాబు, వి.బాబురెడ్డి, వై.జాన్ పాల్గొన్నారు. రోడ్డుప్రమాదంలో పూజారి మృతి పెనుబల్లి: మండలంలోని వీఎం బంజరలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాత కారాయిగూడెంకు చెందిన ఉప్పలమ్మ పూజారి నరకుల్ల నాగేశ్వరరావు(60) కాలినడక వెళ్తూ వీఎం బంజరలోని సోమ్లానాయ క్ తండా వద్ద రోడ్డు దాటుతుండగా ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయన సోమ్లానాయక్ తండాలో ఉప్పలమ్మ పూజ నిర్వహించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. కేసు నమోదు చేసినట్లు వీఎంబంజర్ ఎస్ఐ కె.వెంకటేశ్ తెలిపారు. -
ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు బ్యాంకు లింకేజీతో ఆర్థిక మద్దతు, బ్యాంకు లింకేజీ లేని పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు తెలిపారు. అభ్యర్థులు tsobmms.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఆతర్వాత దరఖాస్తు కాపీకిపత్రాలను జతచేసి ఎంపీడీఓ/మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. రేపు పాపన్న గౌడ్ వర్ధంతి ఖమ్మం సహకారనగర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 2న నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈమేరకుఉదయం 10 గంటలకు ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, 3వ తేదీన దొడ్డి కొమురయ్య జయంతిని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నేడు పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు బుధవారం నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారు నేరుగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 8గంటలకు రిపోర్టు చేయాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన అధికారులు నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు మంగళవారం సందర్శించారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్‌నాయక్ క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు. పురావస్తు శాఖ ఏఈ శంకర్, నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రీన్వే ఎన్విరాన్మెంటల్ సొసైటీ అధ్యక్షుడు దుడ్డెల రవి తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ సీఈగా వెంకటేశ్వర్లు ఖమ్మంఅర్బన్: జిల్లా జలవనరుల శాఖ సీఈగా మంగళపూడి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇన్చార్జ్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న ఈఎన్సీ రమేష్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఖమ్మం ఎస్ఈగా ఉన్న వెంకటేశ్వర్లుకు సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన బుధవా రం బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది. -
ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జైపాల్
ఖమ్మంసహకారనగర్: టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకోగా ఉమ్మడి జిల్లా నుంచి జడ్ఎస్.జైపాల్‌కు స్థానం దక్కింది. ఆయన మంగళ వారం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీ కరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు జైపాల్‌ను టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఆ తర్వాత టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును జైపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రైవేట్ పాఠశాల బస్సు దగ్ధం ఖమ్మంఅర్బన్: ఖమ్మం గోపాలపురంలో పార్క్ చేసిన ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు దగ్ధమైంది. గత నెల 15వ తేదీన రాత్రి పాఠశాల ప్రాంగణంలో పార్క్ చేసిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోయింది. ఘటనపై పాఠశాల యజమాని ఆలస్యంగా ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెనుబల్లికి చెందిన రేగళ్ల శ్రీరామ్ (21) శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలయ్యా యి. దీంతో పెనుబల్లిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కాగా, నెలల క్రితమే శ్రీరామ్ తండ్రి కృష్ణ అనారోగ్యంతో మృతిచెందగా, ఇప్పుడు కుమారుడి మృతితో ఆయన తల్లి, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. పాము కాటుతో మహిళ.. కొణిజర్ల: పాముకాటుతో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని క్రాంతినగర్ సమీపాన మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, తోటి కూలీల కథనం ప్రకారం.. మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన బానోత్ వాలి (43) అదే గ్రామానికి చెందిన కూలీలతో కలిసి మండలంలోని క్రాంతినగర్ సమీపాన ఓ రైతు సాగు చేస్తున్న చేనులో కంకులు విరవడానికి వెళ్లింది. ఆమె పని చేస్తుండగా రక్త పింజర పాము కాటు వేయడంతో వాలి కేకలు వేస్తూ పడిపోయింది. దీంతో తోటి కూలీలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, వాలికి భర్త చిన్న శ్రీనుతో పాటు ఇద్దరు కుమారులున్నారు. -
ప్రమాద రహితంగా తీర్చిదిద్దుదాం..
నేలకొండపల్లి: జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దే ప్రయత్నానికి అందరూ సహకరించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు ‘అరైవ్.. అలైవ్’ పేరిట నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ఆధ్వర్యాన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, ఈ మేరకు రహదారిపై వెళ్లే సమయాన తమ కోసం కుటుంబం ఎదురుచూస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. తొలుత మండల కేంద్రంలో పలుచోట్ల వేగ నియంత్రణ సూచిక బోర్డులను సీపీ స్వయంగా ఏర్పాటు చేశారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సై సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే పరిశీలన వైరా: వైరా మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేను సీపీ సునీల్‌దత్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ దివ్యతో కలిసి మంగళవారం పరిశీలించారు. సోమవరం గ్రామం నుంచి వైరా రింగ్ రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్‌బీ అధికారులకు సూచించారు. అలాగే, వైరా రింగ్ రోడ్డు సెంటర్లో అక్రమణలు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. వైరా ఏసీపీ సారంగపాణి, సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐలు రామారావు, పవన్ పాల్గొన్నారు.పోలీస్ క మిషనర్ సునీల్‌దత్ -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు ఖమ్మంవైద్యవిభాగం: అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో పీసీపీఎన్డీటీ–1994 చట్టాన్ని తప్పక అమలుచేయాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డి.రామారావు హెచ్చరించారు. ఖమ్మంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షల కట్టడికి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన రేడియాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ మాత్రమే స్కాన్ కేంద్రాలను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు వారి పరిధిలో గర్భం దాల్చిన మహిళల వివరాలు నమోదు చేసి ప్రసవం వరకు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని అల్ట్రాసౌండ్ కేంద్రాల నుంచి అందిన 14 దరఖాస్తులపై చర్చించి కలెక్టర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయించారు. డీసీహెచ్ఎస్ రాజశేఖర్, అదనపు డీఎంహెచ్ఓ చందునాయక్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి బాబురత్నాకర్, డీపీఆర్ఓ గౌస్, డీసీపీఓ విష్ణువందన, ఐఎంఏ అధ్యక్షురాలు రెహనాబేగం తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పక మందులు వాడాలి హెచ్ఐవీ బారిన పడినవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహరం తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు సూచించారు. ఆశా పాజిటివ్ పీపుల్ అసోసియేషన్ కేర్, సపోర్ట్ సెంటర్ ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత హెచ్ఐవీ పాజిటివ్ బాధితులు మాట్లాడాక డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. బాధితుల కోసం ప్రభుత్వ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు చేసుప్తన్నామని తెలిపారు. ఆశా పాజిటివ్ పీపుల్ అసోసియేషన్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్.శంకర్, సీనియర్ వైద్యాధికారులు మోహన్‌రావు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానవనానికి ఊతం..
ఏన్కూరు: సంప్రదాయ పంటలు సాగు చేసి వాటికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు ఉద్యానవన పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఆయిల్‌పామ్ సాగు ఒకసారి సాగు చేస్తే 30ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి కబరుస్తున్నారు. ఫలితంగా తక్కు వ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే ఆయిల్‌పామ్ సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటేటా పెరుగుతోంది. అత్యధికంగా ఇక్కడే... రాష్ట్రంలో ప్రస్తుతం 2.50లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా 1.20 ఎకరాలతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలి చింది. ఖమ్మం జిల్లాలో 40వేల ఎకరాలు, భధ్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో 80వేలఎకరాల్లో పంట సాగవుతోంది. ఈ సాగువలన కోతులబెడద కూడా లేకపోవడంతో సాగుపై ఆదరణ పెరుగుతోంది. సంప్రదాయ పంటలను మార్కెట్లో విక్రయించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుండగా.. అయిల్‌పామ్ సాగుచేసిన రైతులకు దళారీలు లేకుండా నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేయడంతో గిట్టుబాటు ధర పొందుతున్నారు. ఆయిల్ ప్రతి ఇంట్లో నిత్యావరస వస్తువు కాగా ప్రతీ మనిషి ఏడాదికి 19.5 కేజీలు వాడుతున్నారు. దీంతో ఆయిల్‌పామ్ సాగు చేసినప్పటికీ అది సరిపోకపోవడంతో మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి 71లక్ష మెట్రిక్ టన్నుల ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులను ప్రోత్సహిస్తుండగా.. ఆ సాగుకష్టాలు తీర్చే కల్పతరువు అయింది. ఆయిల్‌పామ్ సాగు 2022 లో ఉమ్మడి జిల్లాలో 50వేల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం ఉమ్మడిజిల్లాలో 1.20లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. పెట్టుబడులు ఇలా ఆయిల్‌పామ్ సాగు ఎకరానికి మొక్కలు, ఎరువులు కలిపి రూ,25వేల వరకు పెట్టుబడులు అవుతాయి. సాగు చేసినప్పటి నుంచి 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు దిగుబడి వస్తూ ఏటేటా పెరుగుతూ ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి ఎకరానికి 12 టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్‌పామ్ టన్ను రూ. 21,450 పలుకుతుంది. దీంతో ఆయిల్‌పామ్ సాగు కు డిమాండ్ పెరగడంతో కౌలు ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సి డీ కింద సుమారు ఎకరానికి రూ.51వేల వరకు ఇస్తుంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, పంట చేతి కోచ్చే వరకూ నాలుగేళ్ల వరకు రైతుకు అండగా ఉంటుంది. రైతులకు ఆయిల్‌పామ్ మొక్క ఒకటి రూ. 193 ఉంటుంది, రైతు మాత్రం మొక్కకు రూ.20 చొప్పున చెల్లిస్తే ఎకరానికి 57మొక్కలు అందిస్తారు. తద్వారా రైతుకు రూ.11వేల వరకు ఆదా అవుతుంది. ఇక డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.23,200 ఇస్తుంది. రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసిన నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ 4,200 చొప్పున అకౌంట్లో పడుతుంది. దీంతో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి వారిని ప్రొత్సహిస్తుంది. ఆయిల్‌పామ్ సాగులో ఉమ్మడి జిల్లా ప్రథమం ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు నానాటికి పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్‌పామ్ సాగుచేయగా 2026 నాటికి 1.20లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీ ఇచ్చి గిట్టుబాటు ధర రావడంతో పాటు కోతుల బెడద కూడా లేకపోవడంతో చాలామంది రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – ఎం.వి మధుసూదన్, ఉద్యానవన శాఖాధికారి, ఖమ్మం -
భూసేకరణే కీలకం
జిల్లాలో సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో వేగం పెంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారడంతో అధికారుల చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాల్వల నిర్మాణానికి రైతుల పట్టా భూములతో పాటు అటవీశాఖ భూమి సేకరించాల్సి ఉంది. ఈమేరకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించినా పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. – ఖమ్మం అర్బన్● ‘సీతారామ’ పనులకు అదే అడ్డంకి ● టెండర్లు పిలిచినా భూమి లేక ఇక్కట్లు ● ఇటీవల కలెక్టర్ ప్రత్యేక దృష్టితో వేగంటెండర్లలోనూ అవాంతరాలు డిస్ట్రిబ్యూటరీలను జిల్లాలో నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో ఆరో ప్యాకేజీకి టెండర్లు ఖరారైనా భూసేకరణ పూర్తయితే తప్ప పనులు చేసే అవకాశం కానరావడం లేదు. ఇక 3వ ప్యాకేజీ టెండర్లు ఆహ్వానిస్తే ఒకే టెండర్ నమోదైంది. దీంతో ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశారు. అలాగే, 4, 5వ డిస్ట్రిబ్యూటరీల కోసం ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. ఫలితంగా మరోమారు టెండర్లు ఆహ్వానించేలా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి భూసేకరణపై దృష్టి సారించడం ద్వారా పనులు ప్రారంభించేలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రైవేట్, అటవీ భూములు ప్యాకేజీల వారీగా నిర్మాణానికి అవసరమైన నిధుల లెక్కలు తేల్చారు. ఈ నిధులతోనే అనుబంధంగా మైనర్లు, సబ్స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాక ఎంత భూమి సేకరించాలో కూడా నివేదిక సిద్ధమైంది. ఇందులో ప్యాకేజీ–3కి 700 భూమి అవసరం కాగా, ఇది పూర్తిగా అటవీ శాఖ పరిధిలో ఉంది. అలాగే, ఐదో ప్యాకేజీకి అవసరమైన 924 ఎకరాల్లో 790 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూమి ఉండగా, మిగతా అటవీ భూమి సేకరించాలి. దీంతో ప్యాకేజీల వారీగా అన్ని అడ్డంకులను అధిగమించి టెండర్లు పూర్తిచేసినా భూసేకరణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం కష్టమేననన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్ ప్రత్యేక దృష్టి భూసేకరణ అంశంపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు రెవెన్యూ, జల వనరుల శాఖతో పాటు అటవీ శాఖ అధికారులతో తరచుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటవీ భూములకు సంబంధించి అంతే మేర భూమిని కేటాయిస్తేనే అంగీకరించే అవకాశముంటుంది. దీంతో అటవీ శాఖకు ప్రభుత్వ భూమి కేటాయించేలా అధికారులు జల్లెడ పట్టి కొంతమేర గుర్తించినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో సర్వే అనంతరం కేటాయిస్తే సీతారామ ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంటుంది. -
మున్సిపల్లో ఏసీబీ తనిఖీలు
● పన్ను వసూళ్ల రికార్డులు పరిశీలన ● రాత్రి వరకు కొనసాగిన సోదాలు సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయాన ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వాన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 15 మంది సిబ్బంది కూడిన బృందం కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే తలుపులు మూసివేసి వారు సిబ్బంది సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఖమ్మంలో సమావేశానికి వెళ్తూ మధ్యలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహను వెనక్కి పిలిపించారు. ఆపై ఉద్యోగులను తప్ప మిగతా వారెవరూ లోనకు రాకుండా కార్యాలయం గేట్లు కూడా మూసివేయించారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల సమచారం బయటకు పొక్కడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, అధి కారులు కార్యాలయంతో పాటు కమిషనర్ నర్సింహ, మేనేజర్ శ్రీనివాసరావు గృహాల్లో తనిఖీ చేయగా రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. పన్నులపై ఫిర్యాదులు రావడంతో.. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి, నీటి పన్నుల వసూళ్లకు సంబంధించి రికార్డుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీ చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈమేరకు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగులను విడివిడిగా విచారించడమే కాక రికార్డులను పరిశీలించామని వెల్లడించారు. పరిశీలన పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. -
నాలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వేంకటాచలపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తల్లాడ తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డి, అంతర్జాతీయ చెస్ చాంపియన్ శీలం రఘురామిరెడ్డి ప్రారంభించగా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ పరిశీలన ముదిగొండ: మండలంలోని యడవల్లి, యడవల్లి లక్ష్మీపురంల్లో పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు వేసేందుకు మంగళవారం శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను జిల్లా పశువైద్యాధికారి బి.పురంధర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఈ నెల 10వ తేదీలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ముదిగొండలోని పశువైద్యశాలలో రికార్డులను తనిఖీ చేశారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్, ఉద్యోగులు ఇందిర, బాలాజీసింగ్, కల్పన పాల్గొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నా... ఆదుకోండి!నేలకొండపల్లి: ‘హలో పంచాయతీ కార్యదర్శియేనా.., నేను ఆర్డబ్ల్యూఎస్ డీఈఈని, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను, కొంత డబ్బు సర్దితే రేపు ఉదయం తిరిగి ఇచ్చేస్తా...’అంటూ పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మాజీ సర్పంచ్‌లకు ఫోన్ చేసిన వ్యక్తి వసూళ్లకు పాల్పడ్డాడు. మండలంలోని పలువురికి మంగళవారం ఫోన్ చేసిన సదరు వ్యక్తి కొందరికి పేరు విరూపాక్ష అని, మరికొందరికి నాగేశ్వరరావు అని చెప్పుకున్నాడు. ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేశాక ఆరోగ్య పరిస్థితులు బాగా లేనందున రూ.2 వేలు అడగగా, మరికొందరికి ఆలయానికి వెళ్తే పర్స్ చోరీ అయిందని డబ్బు అడిగాడు. దీంతో పలువురు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బు పంపించాక ఆ పేరుతో ఎవరూ లేరని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఓంప్రకాష్‌ను వివరణ కోరగా.. తప్పుడు పేర్లతో గుర్తుతెలియని వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసిందని, ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్చు పాటదారుడికే సంత బాధ్యత కామేపల్లి: మండలంలోని కొమ్మినేపల్లి (పండితాపురం) శ్రీకృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత నిర్వహణ బాధ్యతలను హెచ్చు పాటదారుడికి అప్పగించినట్లు పంచాయతీ కార్యదర్శి శంకర్ తెలిపారు. గత నెల 24న వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన భూక్యా వీరన్న రూ.2.09 కోట్లకు పాడారు. అంతకు ముందు మూడు సార్లు వేలం నిర్వహించినా ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో వాయి దా పడింది. చివరకు రూ.2.09 కోట్లకు పాడిన వీరన్నకు సంత ఇచ్చేలా జీపీ పాలకవర్గం తీర్మానించి ఉన్నతాధికారులకు నివేదిక పంపగా వారి ఆదేశాలతో అప్పగించారు. గతేడాది కంటే ఈసారి జీపీకి రూ.33.30 లక్షలు ఆదాయం తగ్గింది.డీఈఈ పేరిట ఫోన్ చేసి వసూళ్లు -
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదు, వినతిపత్రాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఏదైనా దరఖాస్తులను తిరస్కరిస్తే స్పష్టమైన కారణాలు వెల్లడించాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మ శ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. కామేపల్లి మండలం శివారు లల్లా తండా వాసులు తమ గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఖమ్మం రూరల్ మండలంలోని మున్నేటి వద్ద లంబాడీ పూర్వీకుల సమాధి స్థలాన్ని రక్షించాలని, ఇందుకోసం సర్వీస్ రోడ్డు, కాలువ డిజైన్ మార్చాలని నాయకులు శేఖర్‌నాయక్ వినతిపత్రం అందజేశారు. అలాగే, చింతకాని మండలం ప్రొద్దుటూరులో కుక్కల బెడదపై పి.నాగుల్ మీరా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఖమ్మం కార్పొరేషన్ శ్రీరామ్‌నగర్ వాసులు కోరారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
మున్నేరులో పడి బాలుడి మృతి
పోలీసులతో కుటుంబీకుల వాగ్వాదం, కార్పొరేటర్ బంధువుపై దాడి ఖమ్మంక్రైం: ఖమ్మంలోని మున్నేరులో పడి ఓ బాలుడు మృతి చెందగా.. మృతదేహం పోస్టుమార్టానికి నిరాకరించిన కుటుంబీకులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. దీనికి తోడు బాలుడి మృతికి అధికార పార్టీ కార్పొరేటర్ మరిదే కారణమని ఆయన ఇంటిపై దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం సుందరయ్యనగర్‌కు చెందిన బత్తుల క్రాంతికుమార్ కుమారుడు హదృత్య(9) అలియాస్ బిట్టూ ఆదివారం స్నేహితులతో కలిసి పంపింగ్‌వెల్ రోడ్డులోని మున్నేటిలో ఈతకు వెళ్లాడు. అక్కడ ప్రమాదశశాత్తు గుంతలో మునిగిపోగా, స్నేహితులు ఇచ్చిన సమాచారం కుటుంబీకులు బయటకు తీసేసరికి మృతి చెందాడు. కార్పొరేటర్ మరిదిపై దాడి పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతంలో కరకట్ట నిర్మాణం జరుగుతుండగా తన పొలం పోతోందని అధికార పార్టీ కార్పొరేటర్ మరిది తోట వెంకటరమణ కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. ఒకవేళ కరకట్ట నిర్హాణం జరిగితే బాలుడు మున్నేటిలోకి వెళ్లేవాడు కాదంటూ ఆగ్రహించిన ఆయన కుటుంబీకులు ఆదివారం రాత్రి వెంకటరమణపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టారు. ఆపై సోమవారం ఉదయం బాలుడి మృతదేహనికి పోస్ట్‌మార్టం చేయించేందుకు సిద్ధం కాగా, కుటుంబీకులు వాగ్వాదానికి దిగారు. చివరకు త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు వారికి సర్దిచెప్పి మృతదేహన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలుడి అంత్యక్రియలకు స్థానికులు పెద్దసంఖ్యలో రావడంతో బందోబస్తు చేశారు. కాగా, బిట్టూ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
పర్యాటక సర్క్యూట్లో చేర్చాలి
నేలకొండపల్లి స్థూపంపై లోక్‌సభలో ఎంపీ రఘురాంరెడ్డి నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించాలని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో సోమవారం మాట్లాడిన ఆయన ప్రాచీన వారసత్వ కట్టడమైన బౌద్ధ స్థూపాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన క్షేత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నందున సరైన రహదారి నిర్మించడంతో పాటు సదుపాయాలు కల్పించాలని కోరారు. అంతేకాక జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్లో చేరిస్తే దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించొచ్చని, స్థానికులకు ఉపాధి మెరుగుపడతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి ఖమ్మం లీగల్: బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. ఇటీవల కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న మందడపు శ్రీనివాసరావుకు సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రాజగోపాల్ మాట్లాడుతూ ఖమ్మం నుంచి బార్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఉండడం సంతోషకరమన్నారు. కౌన్సిల్ మాజీ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావుతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. చట్టాల పునరుద్ధరణ డిమాండ్‌తో రేపు ‘బ్లాక్ డే’ఖమ్మంమయూరిసెంటర్: రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చట్టాల పునరుద్ధరణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు డిమాండ్‌తో బుధవారం బ్లాక్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ అధ్యక్షతన సోమవారం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి, యాజమాన్యాలకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని తెలిపారు. వీటిని రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో చేపడుతున్న బ్లాక్ డేకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు తోట రామాంజనేయులు, రావి శివరామకృష్ణ, టి.విష్ణువర్ధన్, సీవై.పుల్లయ్య, కె.శ్రీనివాస్, కె.రామకృష్ణ, సిద్దెల నగేష్, సుభానీ పాల్గొన్నారు. ఎఫ్ఎల్ఎస్ సర్వే ప్రారంభం ఖమ్మం సహకారనగర్: ఎంపిక చేసిన పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల విద్యాసామర్థ్యాలను అంచనా వేసేందుకు చేపట్టిన ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్)సర్వే సోమవారం ప్రారంభమైంద. రెండో రోజుల పాటు సాగే ఈ సర్వే కోసం జిలాల్లోని ఖమ్మం మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బల్లేపల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ డిసెల్స్ స్కూల్, ముస్తఫానగర్‌లోని జెమ్స్ స్కూల్‌తో పాటు ముదిగొండ మండలం కమలాపురంలోని సాయిమెరిట్ స్కూల్‌ను ఎంపిక చేశారు. తొలిరోజు ఆయా పాఠశాలల్లో సర్వేను డీఈఓ చైతన్యజైనీ పరిశీలించి వాస్తవ వివరాలు నమోదు చేసేలా జాగ్రత్త వహించాలని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్వే ద్వారా మూడో తరగతి విద్యార్థుల్లో తెలుగు, ఉర్దూ, గణితంలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం సామర్థ్యాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరు కాదని.. దిక్కు లేదని
వలస కూలీలతో మూడు నెలల పాటు పని చేయించుకున్న ఓ కాంట్రాక్టర్ డబ్బు ఇవ్వకుండా కాలం గడుపుతున్న వైనం బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 28 మంది కూలీలు రఘునాథపాలెం మండలం కోటపాడుకు చెందిన కాంట్రాక్టర్ సూచనతో పొట్టకూటి కోసం వచ్చారు. పలువురు రైతుల మిర్చి చేన్లలో మూడు నెలల పని చేయించగా రూ.6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే డబ్బు ఇవ్వకపోగా ముఖం చాటేయడంతో వారంతా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. కానీ పోలీసులు వారిని అనుమతించకపోవడంతో బయట వేచిఉన్నారు. చివరగా కాంట్రాక్టర్‌కు ఫోన్ చేయడంతో మాట్లాడదామని పిలవగా 10మంది వెళ్లారు. అయితే సాయంత్రం వరకు వారికి డబ్బు ఇవ్వలేదని వాపోయారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
అభివృద్ధి, సంక్షేమం దిశగా బడ్జెట్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఖమ్మంమయూరిసెంటర్: అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే రూ.3.24 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు కేటాయింపులు చేశారని వెల్లడించారు. అలాగే, ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఇక అంగన్వాడీల్లో పిల్లలకు అల్పాహారం సమకూర్చనున్నారని చెప్పారు. బడ్జెట్ రూపకల్పన, రాష్ట్ర అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. అయితే, భట్టి ప్రవేశపెట్టిన అత్యుత్తమ బడ్జెట్‌ను ఓర్వలేక ప్రతిపక్షాలు ఆయనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
యాప్‌తో పారదర్శకంగా ఇసుక సరఫరా
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంవ్యవసాయం: ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.. అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలుచేయాలని తెలిపారు. ఈసమావేశాల్లో డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, మైనింగ్ ఏడీ ఆర్.సాయినాథ్, డీఎంహెచ్ఓ రామారావు, డీసీఎస్ఓ చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, డీఏఓ డి.పుల్లయ్య, డీసీఓ గంగాధర్, డీఎంఓ ఎం.ఏ.అలీంతో పాటు కె.శ్రీనివాసరావు, కె.మంగపతిరావు, చావా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం సహకారనగర్: అక్రమాలు జరగకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా చేసేలా ‘మన ఇసుక వాహనం’ యాప్‌ను తీసుకొచ్చామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన యాప్‌ను అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించాక మాట్లాడారు. ఇన్నాళ్లు ఇసుక తరలింపునకు కూపన్లు జారీ చేస్తుండగా, ఈ విధానంలో ఎదురవుతున్న అవకతవకలకు అరికట్టేందుకు యాప్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే క్యూ ఆర్ కోడ్ వస్తుందని వెల్లడించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చేనెల 2వ తేదీన గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి అన్ని శాఖల అధికారులు పాల్గొని సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించాలని తెలిపారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని శాఖల అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే కాక రద్దీ ప్రాంతాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఎనిమిది కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని, తద్వారా రైతులకు సకాలంలో నగదు అందుతుందని తెలిపారు. అలాగే, కేంద్రాల్లో టార్పాలిన్లు, టెంట్లు, తాగునీటి వసతిపై సూచనలు చేశారు. -
‘యుద్ధంతో ప్రశ్నార్థకంగా మానవ మనుగడ’
ఖమ్మంసహకారనగర్: యుద్ధం మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తోందని ప్రముఖ విద్యావేత్త ఎల్.వీ.రమణారావు అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన ‘ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం – పరిణామాలు‘ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో రమణారావు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ పాలకుల వ్యక్తిగత స్వార్థాలకు ప్రతీకగా ఈ యుద్ధం నిలిచిందని చెప్పారు. యుద్ధ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. సెమినార్లో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, నాయకులు పి.నాగిరెడ్డి, మనోహర్‌రాజు, సంధ్యారాణి, ఉమాదేవి, మల్ల య్య, గరిక శ్రీను, ెవెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు నెలల బియ్యం
ఖమ్మం సహకారనగర్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ (బుధవారం) నుంచి పంపిణీ మొదలుకానుండగా.. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తారు. ఇందుకోసం కావాల్సిన బియ్యంలో కొంత మేర ఇప్పటికే రేషన్ షాప్‌లకు చేరవేశారు. ఈ నిల్వలు తగ్గే కొద్ది దశల వారీగా సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 4.69లక్షల కార్డులు జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ షాప్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,69,865 కార్డులకు గాను 13,28,400 మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. వీరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా, నెలకు 84,90,620 కేజీలు, మూడు నెలలకు కలిపి 2,54,71,860 కేజీల బియ్యం అవసరమవుతాయి. ఈమేరకు బియ్యం పంపిణీ సజావుగా సాగేలా జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలతతో కలిసి సమీక్షించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి షాప్‌లకు రవాణా, లబ్ధిదారులకు పంపిణీపై సూచనలు చేశారు. 30రోజుల పాటు పంపిణీ గత వర్షాకాలంలో కూడా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. అప్పట్లో 1నుంచి 15వ తేదీ వరకే గడువు విధించగా, సర్వర్ సమస్యతో లబ్ధిదారులు గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి రావడంతో గడువు పొడిగిస్తూ వెళ్లారు. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కావొద్దని ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులందరికీ బియ్యం అందేలా నెల మొత్తం షాపులు తెరిచి ఉంచాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే షాపుల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా బియ్యం సరఫరా చేశాం. డీలర్లు నిబంధనలు పాటించేలా నిరంతరం పర్యవేక్షించనున్నాం. – చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
హక్కుల వైపు అడుగులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్ని చట్టాలు తెచ్చినా సాదాబైనామా సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు దీనికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం జీఓ 76 విడుదల చేయడంతో తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన భూముల క్రమబద్ధీకరణ సాఫీగా జరగనుంది. జిల్లాలో పెండింగ్ ఉన్న 1,11,443 దరఖాస్తులకు పరిష్కారం లభించనుండగా.. సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూభారతిలోనూ సమస్య ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల కోసం సెక్షన్ 6, రూల్ 6లో నిబంధనలు పొందుపరిచింది. దీని ప్రకారం ఆర్డీఓలు క్షేత్ర స్థాయిలో విచారించి భూమి చుట్టుపక్కల రైతులతోనూ మాట్లాడి రాతపూర్వక ఆధారాలను పరిశీలించాలి. పీఓటీ, సీలింగ్, ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొనుగోలుదారుడు, అమ్మకందారుడి అఫిడవిట్లు ఇవ్వాలన్న నిబంధనతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భూభారతి చట్టంలోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. ఒకరు ఇస్తే చాలు.. భూముల క్రమబద్ధీకరణ కోసం 2014 జూన్ 2కు పూర్వం తెల్లకాగితాలపై రాతకోతలు సాగించిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో భూమి అమ్మకం, రుణానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ఈనెల 18న జీఓ 76 విడుదల చేసింది. ఈ జీఓ ద్వారా కొనుగోలుదారుడు మాత్రమే ఆఫిడవిట్ ఇస్తే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఎలా చేస్తారంటే.. సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీఓల నేతృత్వాన జరగనుంది. 2014 జూన్ 2 కన్నా ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, 12ఏళ్ల పాటు భూమి అనుభవంలో ఉన్నట్లు చూపాలి. సన్న, చిన్నకారు రైతులు అంతేకాక 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 మధ్య అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్డీఓ నేతృత్వాన క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఆతర్వాత హక్కుల రికార్డులో నమోదు చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారు. ఏళ్ల క్రితం భూ క్రయవిక్రయాలు సందర్భంగా తెల్లకాగితాలపైనే రాతకోతలు సాగేవి. అయితే, భూములపై చట్టబద్ధత, హక్కుల్లో ఇబ్బంది ఎదురవుతుండడంతో క్రమబద్ధీకరించాలని 2016 ఏడాదిలో నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం 112 జీఓ ద్వారా మరోసారి మీ సేవ కేంద్రాల్లో ఫారం 10 ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ ఏడాది అక్టోబర్ 31తో గడువు ముగిసినా.. ఆ తర్వాత నవంబర్ 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్పుడు మొత్తం 1,11,443 దరఖాస్తులు వచ్చాయి. కానీ ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు పొందుపర్చకపోవడం, హైకోర్టు స్టే విధించడంతో దరఖాస్తులన్నింటికీ పక్కన పెట్టారు. జీఓ 76తో ‘సాదాబైనామా’లకు తొలగిన చిక్కులు కొనుగోలుదారుడి అఫిడవిట్ ఉంటే క్రమబద్ధీకరణమండలం దరఖాస్తులు పెనుబల్లి 14,333కల్లూరు 8,314కొణిజర్ల 7,846తిరుమలాయపాలెం 7,607కూసుమంచి 7,193వేంసూరు 6,791సింగరేణి 6,681ఏన్కూరు 6,179 -
సంఘటితంగా ఉంటేనే అభివృద్ధి
యాదవ ప్రజాప్రతినిధుల సన్మానంలో కూరాకుల ఖమ్మంఅర్బన్: ఐక్యంగా ఉంటూ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తూనే సమాజాభివృద్ధిలోనూ ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవాలని తెలంగాణ యాదవ మహాసభ వ్యవస్థాపకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సూచించారు. ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన యాదవ ప్రజాప్రతినిధులను మహాసభ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మం మధురానగర్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. తద్వారా ప్రజల మన్ననలు పొందడమే కాక రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరొచ్చని చెప్పారు. జిల్లా కార్యదర్శి గుమ్మ రోశయ్య మాట్లాడుతూ యాదవ సమాజం ఐక్యంగా ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీసీ సంఘం, కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకులు గుండాల కృష్ణ, అమరగాని వెంకన్న గౌడ్, డాక్టర్ బిశం వెంకటేశంయాదవ్, కోడి లింగయ్య, పగడాల నాగరాజు, మేకల సుగుణారావు, బారి మల్సూర్, చిత్తారు ఇందుమతి, ముక్కాల కమల, జడ మల్లేష్, మూడుముంతల గంగరాజు, మల్లీదు హైమావతి తదితరులు పాల్గొన్నారు. తీరని గ్యాస్ కష్టాలు వైరా: గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అవాంతరాలు లేవని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. వైరాలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లు సరిగా సరఫరా చేయడం లేదని వినియోగదారులు వైరా–జగ్గయ్యపేట రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏజెన్సీ నిర్వాహకులు ఎలాంటి సమాచారం లేకుండా గోదాంను మూసివేయడంతో వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. దీంతో వైరా ఆదనపు ఎస్ఐ పవన్ చేరుకుని వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. కాగా, వినియోగదారుల ఆందోళన విషయం తెలియడంతో సాయంత్రం డీసీఎస్ఓ చందన్‌కుమార్ కాణిపాకం గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేల్స్ ఆఫీసర్‌తో ఫోన్లో మాట్లాడి మరో ఏజెన్సీ ద్వారా అయినా గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
సీతారాములకు మహదాశీర్వచనం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సీతారాములకు పండితులు మహదాశీర్వచనం అందజేశారు. కల్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామి వారికి మహదాశీర్వచనం అందజేయడం సంప్రదాయమని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. వైభవంగా నదీ హారతిభద్రాచలం టౌన్: భద్రాచలం గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి కార్యక్రమం కనువిందుగా సాగింది. పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి స్నానఘట్టాల వద్ద పూజలు, దీపోత్సవం నిర్వహించారు. -
మద్యం మత్తులో ఆటో నడపడంతో ప్రమాదం
కారేపల్లి: మద్యం మత్తులో ఉన్న డ్రైవర్... చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని చక్కర్లు కొట్టడమే కాక చిన్నారిని ఆటో హ్యాండిల్ అప్పగించడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులను ఎక్కించుకొని జమాళ్లపల్లి రోడ్డు వైపు బయలుదేరాడు. ఈక్రమాన ముందు సీటులో తన పక్కన కూర్చున్న ఓ చిన్నారిని ఆటో నడపమని సూచిస్తూ హ్యాండిల్ అప్పగించాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో యశ్వంత్, స్నేహిత్, భరత్, తేజా, చింటు, ప్రవీణ్ గాయపడగా ప్రాథమిక చికిత్స అనంతరం యశ్వంత్, స్నేహిత్‌ను ఖమ్మం తరలించారు. రోడ్డుప్రమాదంలో ఢీకొని యువకుడి మృతి తిరుమలాయపాలెం: నడిచి వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కొక్కిరేణి స్టేజీ సమీపాన ఆదివారం జరిగింది. మండలంలోని పాపాయిగూడెంకు చెందిన కందుకూరి ఈశ్వరి కుమారుడు శ్రీనివాస్(33) పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఆదివారం రాత్రి కొక్కిరేణి సమీపాన పెట్రోల్ బంక్ వద్ద నుంచి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తల పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన తండ్రి వెంకన్న చిన్నతనంలో మృతి చెందగా తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఈమేరకు పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ కె.జగదీష్ తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి..ఖమ్మంక్రైం: మండుతున్న ఎండలతో వడదెబ్బ బారిన పడిన ఓ ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల మండలం బస్వాపురానికి చెందిన ఉపేందర్(31) ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని కొబ్బరి బోండాల షాప్‌లో పనిచేస్తున్నాడు. ఎండల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఆదివారం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. -
ఆగండి.. చూసి వెళ్లండి
పెరిగిన ట్రాఫిక్ హైదరాబాద్ తదితర నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఈ రహదారి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు నిత్యం ఆర్టీసీ బస్సులే కాక లారీలు, కార్లు తిరుగుతుంటాయి. సరుకు రవాణాకు ఇది ప్రధాన మార్గం కావడంతో రాత్రీపగలు తేడా లేకుండా రద్దీ ఉంటుంది. అయితే, ఇది సింగిల్ రోడ్డు కావడంతో కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోంది. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా చేసే లారీల డ్రైవర్లు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇక్కడే ప్రమాదాలు.. ఖమ్మం–తల్లాడ రహదారిలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు దివ్యాంగులుగా మిగులుతున్నారు. ప్రధానంగా తనికెళ్ల, కొణిజర్ల ప్రధాన రహదారి, వైరా రింగ్ సెంటర్, వైరా బ్రిడ్జి, తల్లాడ సెంటర్లలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరికల బోర్డులు, ఇతర చర్యలు చేపడతామని చెప్పినా ప్రమాదాలు తగ్గడం లేదు. దూరప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులకు రహదారిపై అవగాహన లేక అతివేగంగా వెళ్తూ గుంతలను తప్పించే క్రమాన ఇతర వాహనాలను ఢీకొడుతున్నారు. గతంలో జిల్లాలో హామ్ (హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్) రోడ్లు నిర్మిస్తామని చెప్పినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులకే నిర్ణయించి.. హామ్ నిధులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వినియోగించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే మొదలైతేనే.. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఆలస్యమైంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే భారీ వాహనాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన వాహనాలన్నీ ఆ మార్గంలోనే వచ్చివెళ్తాయి. దీంతో ఖమ్మం – తల్లాడ రహదారిపై ట్రాఫిక్ తగ్గనుంది. ఈ రహదారి మే నెలలో హైవే అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రమాదకరంగా ఖమ్మం–తల్లాడ రహదారి ఖమ్మం నుంచి వి.వెంకటాయపాలెం వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉన్నా ఆ తర్వాత సింగిల్ రోడ్డు ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో రోడ్లు మరింతగా దెబ్బతిని గుంతల్లో నీరు నిలుస్తుండగా.. ఈ విషయాన్ని గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ప్రధానంగా కొణిజర్ల సమీపాన అధ్వానంగా మారిన రోడ్డుపై గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు పెద్దవై, ప్రమాదాలు జరిగి విమర్శలు వచ్చినప్పుడే కంకర, ఇసుక, తారుతో తాత్కాలికంగా పూడుస్తుండడంతో కొద్దిరోజులకే సమస్య పునరావృతమవుతోంది. దీనికి తోడు తాత్కాలిక మరమ్మతులు చేయడంతో రోడ్డు ఓచోట ఎత్తుగా.. మరోచోట దిగుడుగా మారి వాహనదారులు అదుపు తప్పుతున్నారు. -
రెండు కుటుంబాల్లో తీరని శోకం
సత్తుపల్లిటౌన్: కళ్ల ముందు గుంత నిండా నీళ్లు.. మరోపక్క వేసవి తాపం... వెరసి సరదాగా ఈత కొడదామని ముగ్గురు బాలురు అందులోకి దిగారు.. ఈ విషయాన్ని గుర్తించి సమీపాన ఉన్న ఓ మహిళ ధైర్యం చేయడంతో ఒకరు ప్రాణాలతో బయటపడగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సత్తుపల్లిలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన వెంకటేశ్వరరావు, జానకికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి మూడో కుమారుడు నాగబాబు కుంచపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో 7వ తరగతి చదివేవాడు. అయితే, దంపతుల మధ్య కలహాల నేపథ్యాన ఐదు నెలలుగా తల్లి జానకి తన పుట్టినిల్లయిన సత్తుపల్లి ఎన్టీఆర్నగర్లో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెతో పాటు ఉండే నాగబాబు(12) స్కూల్‌కు వెళ్లకుండా అమ్మమ్మ గేదెలు మేపుతున్నాడు. రోజులాగే వెళ్లి... ఆదివారం కూడా రోజులాగే రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు నాగబాబు వెళ్లాడు. ఆయనతో పాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవా(11), షేక్ సైదులు సైతం వెళ్లారు. పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు ఒకరి తర్వాత ఒకరు దూకినా క్వారీ గుంత లోతు అంచనా వేయలేక నీళ్లల్లోకి జారిపోతూ కేకలు వేశారు. సమీపాన గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగి మరీ షేక్ సైదులు(చెర్రి)ను కాపాడింది. మరో ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించినా నీళ్లల్లో మునిగిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో ఎస్సై వీరప్రసాద్, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ రెహానాకమల్పాషా, బండారు శరత్చంద్ర, జగన్నాథం శ్రీను చేరుకున్నారు. గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా దేవా, నాగబాబు మృతదేహాలు లభించాయి. ఒకే కాలనీ చెందిన ఇద్దరు బాలుర మృతితో కాలనీ వాసులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుమారుడుఎన్టీఆర్నగర్కు చెందిన వంటిపులి శివ, తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు దేవా ఉన్నారు. పిల్లల చిన్న వయస్సులో తండ్రి శివ మృతి చెందాడు. ఇప్పుడు ఎన్టీఆర్నగర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఏడో తరగతి చదువుతున్న దేవా మృతితో ఆ కుటుంబంలో విషా దం అలుకుముంది. పాఠశాలకు సెలవు కాకున్నా ప్రాణా లు దక్కేవని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ప్రమాదం నుంచి బయటపడిన షేక్ సైదులు(చెర్రి) ఎన్టీఆర్నగర్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు.మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టాలిసీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ -
నాలుగో తరగతి ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా బిక్కు, సహాయ కార్యదర్శిగా ఓదేలు, ఉపాధ్యక్షులుగా మురళీమోహన్, జి.కృష్ణయ్య, బి.వీరమణ, సత్యప్రసాద్, కార్యదర్శిగా వెంకరటమణ, సహాయ కార్యదర్శులుగా బుర్రి వెంకన్న, సీహెచ్.నారాయణరావు, ఎం.అరుణ, కోశాధికారిగా అజ్మత్ బేగ్ ఎన్నికయ్యారు. అలాగే, కార్యాలయ అబ్దుల్ గపూర్, కె.రవికుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎస్.కే.హమీద్, సూరారెడ్డి, ప్రచార కార్యదర్శులుగా జె.నర్సింహరావు, డి.వీరేందర్, క్రీడా కార్యదర్శిగా బి.వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా చంద్రశేఖర్, ఎస్కె.రహీం, ఝాన్సీ, అఫ్ణాన్ బీ, టి.శ్యామల ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.శ్రీరామ్ వెల్లడించారు. నూతన కార్యవర్గం మూడేళ్లు కొనసాగుతుందని తెలిపారు. టీఎన్జీవోస్ రాష్ట్ర కమిటీకి జిల్లా నేతల సన్మానం ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికై న మారం జగదీశ్వర్, ఎస్ఏ.హుస్సేనీ ముజీబ్‌లను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్, కొణిదన శ్రీనివాస్ తదితరులు హైదరాబాద్‌లో ఆదివారం సన్మానించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గాలు పాల్గొన్న ఈ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నియ్యారని తెలిపారు. అంతేకాక జిల్లాకు చెందిన జైపాల్‌కు రాష్ట్ర కమిటీలో చోటు దక్కిందన్నారు. నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, గంగవరపు బాలకృష్ణ, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్‌ల్యాండ్‌లో అధ్యయనానికి బృందం
నేలకొండపల్లి ఎంఈఓ, చిలుకోడు ప్రిన్సిపాల్‌కు అవకాశంఖమ్మం సహకారనగర్/నేలకొండపల్లి: ఫిన్‌ల్యాండ్ దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో అమలవుతున్న విద్యావ్యవస్థ అధ్యయనానికి రాష్ట్రం నుంచి బృందం వెళ్లనుంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు 28 మందితో పాటు 18 మంది అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో నేలకొండపల్లి మండల విద్యాశాఖాధికారి బాలిన చలపతిరావుకు అవకాశం దక్కింది. అంతేకాక ఖమ్మం వాసి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణభాను కూడా ఎంపికయ్యారు. ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్’ పేరుతో ఈ బృందం సభ్యులు ఏప్రిల్ 20నుంచి 24వ తేదీ వరకు ఫిన్‌ల్యాండ్‌లో విద్యావ్యవస్థను అధ్యయనం చేయనున్నారు. మొదటి రెండు రోజులు ఫిన్‌ల్యాండ్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నాక, చివరి రెండు రోజులు పాఠశాలల్లో బోధనా విధానాలు, ఫలితాలను పరిశీలిస్తారు. కాగా, బృందంలో స్థానం దక్కించుకున్న కృష్ణభాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 892 పీఎంశ్రీ పాఠశాలల్లో చిలుకోడు మోడల్ స్కూల్‌ను మొదటిస్థానాన నిలిపారు. ఆమె భర్త డాక్టర్ పాపబండ్ల రఘునందన్ జిల్లాలో పీడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
‘అమ్మకు అక్షరమాల’తో అందరికీ చదువు
రాష్ట్ర వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ భాస్కర్నేలకొండపల్లి: చదువు మధ్యలో మానేసిన వారితో పాటు పూర్తిగా నిరక్షరాస్యులకు కనీస విద్య నేర్పించడమే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. మండలంలోని ఆరెగూడెం, ఆచార్లగూడెం, గువ్వలగూడెం గ్రామాల్లో ఆదివారం ఉల్లాస్ అభ్యాసకుల పరీక్ష సెంటర్లను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో 29,922 మంది, భద్రాద్రి జిల్లాలోని 22మండలాల్లో 19,194 మంది అభ్యాసకులు ఉన్నారని తెలిపారు. వీరికి ఆదివారం పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. 15 – 45 ఏళ్ల లోపు వయస్సు కలిగి చదువు మధ్యలో మానేసిన వారికి కనీస విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ మంగపతి, నేలకొండపల్లి ఎంఈఓ బి.చలపతిరావు, ఐకేపీ కోఆర్డినేటర్లు సురేందర్, కోలేటి సుజాతతో పాటు సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఈ ఏడాది వసూళ్లు కష్టమే..
ఖమ్మంవ్యవసాయం: పన్నుల వసూళ్లలో వ్యవసాయ మార్కెట్లు బాగా వెనకబడ్డాయి. మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యానికి జిల్లాలోని పలు మార్కెట్లు అందనంత దూరాన నిలిచాయి. జిల్లాలో సాగయ్యే పంటలు, ధరలు, ఇతర వనరుల ఆధారంగా వ్యవసాయ మార్కెట్ల వారీగా పన్నుల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. వీటిని వసూలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా లక్ష్యాన్ని సాధించే పరిస్థితులు కానరావడం లేదు. ఎనిమిది మార్కెట్లు, 21చెక్ పోస్టులు జిల్లాలో ఖమ్మం ప్రధాన మార్కెట్ కాగా, మధిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లు కూడా ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఎనిమిది వ్యవసాయ మార్కెట్లకు బకాయిలతో కలిపి ఈ ఏడాది (2025–26)కి రూ.69.37 కోట్ల పన్నులను లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, ఇందులో ఇప్పటి వరకు రూ. 45.16 కోట్లే వసూలు చేయగలిగారు. కల్లూరు మార్కెట్ మినహా మిగిలిన అన్నీ బాగా వెనకబడిపోవడం గమనార్హం. రెండు రోజులే గడువు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్లు చేరే పరిస్థితి కనిపించటం లేదు. జిల్లాలోని ఎనిమిది మార్కెట్ల పరిధిలో రూ.69.37కోట్లకు రూ.45.16 కోట్లు వసూలు కాగా ఇంకా రూ.24 కోట్లకు పైగా పైచిలుకు బకాయి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు రోజులే గడువు ఉన్నందున వసూళ్లు కష్టమేనని తెలుస్తోంది. గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కమిటీలు లక్ష్యానికి దూరంగా నిలిచాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 57.80 కోట్లు, 2024–25లో రూ.65.56 కోట్లు వసూలు చేయగా, ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి రూ. 45.16 కోట్లే వసూలు చేయగలగడం గమనార్హం. గత ఏడాది యాసంగి నుంచి ఈ ఏడాది వానాకాలం పంటల వరకు వ్యవసాయ మార్కెట్లు పంటల క్రయవిక్రయాలపై వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ(రాష్ట్ర ప్రభుత్వం), పత్తి కొనుగోలు చేసిన సీసీఐ(కేంద్రప్రభుత్వం) నుంచి కూడా పన్నులు అందకపోవడం లక్ష్యసాధనలో ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. ఇందులో ధాన్యానికి సంబంధించి సుమారు రూ.7కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు సీరియస్.. మార్కెట్ ఫీజు లక్ష్యసాధనలో వెనకబడడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కార్యదర్శులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించి వివరణ అడిగినట్లు తెలిసింది. అంతేకాక పలువురు అధికారులు, కార్యదర్శులను మందలించినట్లు సమాచారం. వసూళ్లలో పురో గతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. వ్యాపారుల మొండి‘చేయి’ జిల్లాలో పంటలు కొనుగోలు చేసే కొందరు ప్రధాన వ్యాపారుల నుంచి రూ. కోట్లలో పన్నులు వసూలు కావాల్సి ఉంది. వీరిని మార్కెట్ అధికారులు కలిసి మాట్లాడినా ఫలితం కానరావడం లేదు. ఇందులో పలువురు రాజకీయ నాయకులుగా చెలామణి అవుతుండడమే కాక ప్రభుత్వ పెద్దల మనుషులుగా చెప్పుకుంటూ పన్నుల చెల్లింపునకు మొండికేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీరి తీరు తలనొప్పిగా మారిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మార్కెట్ లక్ష్యం ఇప్పటివరకు శాతం వసూళ్లు ఖమ్మం 35.32 17.60 49.84 వైరా 6.29 5.26 83.56 సత్తుపల్లి 5.12 4.37 85.32 మధిర 5.01 4.00 80.07 ఏన్కూరు 4.96 2.07 41.70 నేలకొండపల్లి 4.00 3.08 76.77 మద్దులపల్లి 3.23 2.98 92.56 కల్లూరు 5.44 5.80 106.50 మొత్తం 69.37 45.16 65.10 -
ఆలయ నిర్మాణానికి రూ.6లక్షల విలువైన స్థలం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 1వ డివిజన్ కై కొండాయిగూడెంలో ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి తుళ్లూరు మాధవరావు–కోటేశ్వరి దంపతులు 60 గజాల స్థలాన్ని విరాళంగా అందించారు. ఈ స్థలం విలువ రూ.6 లక్షలు ఉండగా, గ్రామస్తులు వారిని ఆదివారం అభినందించారు. కాగా, గ్రామంలో మే 11వ తేదీన శివాలయం వద్ద ధ్వజస్తంభం, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరగనుండగా, ఇందుకోసం రూ.40 లక్షల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగటి ఉపేందర్, మద్దినేని ప్రసాద్, తుళ్లూరు కృష్ణయ్య, నాగటి శ్రీనివాసరావు, గద్దల చిన్నప్ప, ఆళ్ల రమేష్, శీలం వీరబాబు, గిరిశాల రామారావు, పి.తిరుపతిరావు, భూక్యా ఉపేందర్ పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం మామిళ్లగూడెం: ఏపీపీఎస్సీ గ్రూప్–4 ద్వారా 1984లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికై న పలువురు ఆతర్వాత పదోన్నతులతో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఈమేరకు వీరంతా ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ సమ్మేళనాన్ని టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ప్రారంభించగా..వి.రాఘవాచార్యులు, సాంబశివరావు, గాలిశెట్టి వేణుగోపాల్, జి.సుదర్శన్‌రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. విధుల్లో ఎదురైన అనుభవాలు, కుటుంబ వివరాలను పంచుకోవడమే కాక వయస్సును పక్కనపెట్టి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా జనార్ధన్, వి.కిషోర్, సత్యనారాయణ తమ పాటలతో అలరించారు. ‘పీఎం కుసుమ్ ’గడువు పొడిగింపు ఖమ్మంగాంధీచౌక్: పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుల గడువును పొడిగిస్తూ కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బ్యాంకుల, ఆర్థిక సంస్థల నుంచి రుణాల మంజూరులో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ఫైనాన్షియల్ క్లోజర్ గడువును 2026 సెప్టెంబర్ 30 వరకు, ప్రాజెక్టు కమీషనింగ్ గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే, 2025 డిసెంబర్ 31 ముందు దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టులకే ఈ గడువు వర్తిస్తుందని వెల్లడించింది. -
సెలవు రోజూ పన్నుల వేట!
● వసూళ్లపై కేఎంసీ ప్రత్యేక దృష్టి ● ఒకేరోజు రూ.2.48కోట్లు జమఖమ్మం మయూరిసెంటర్: ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు రోజుల సమయమే ఉండడంతో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో వంద శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సెలవు రోజైన ఆదివారం కూడా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వసూళ్లలో నిమగ్నమయ్యారు. కొందరు కార్పొరేటర్లు సైతం అధికారులకు సహకరిస్తూ పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.62 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నా, ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించే లక్ష్యమైనా చేరేలా ప్రణాళిక రూపొందించారు. సెలవు రోజున సైతం.. గడువు సమీపించిన నేపథ్యాన ఆదివారం కూడా కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలతో కేఎంసీలోని అన్ని విభాగాల అధికారులు విధులకు హాజరయ్యారు. రెవెన్యూ విభాగంతో పాటు ఇంజనీరింగ్, అకౌంట్స్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాలకు చెందిన ఏఈలు, ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు వార్డుల్లో పర్యటిస్తూ భారీ బకాయిలు ఉన్న వారు చెల్లించేలా అవగాహన కల్పించారు. మరో రూ.5.37 కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరం కేఎంసీ పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించినా, లక్ష్యాన్ని మాత్రం చేరలేదు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రూ.33.83 కోట్ల మేర వసూలయ్యా యి. ఇందులో ఆదివారమే రూ.2.48 కోట్లు జమ అయ్యాయి. అయితే, ఆర్థిక సంఘం నిధుల సాధనకు అర్హత కోసం వసూలు చేయాల్సిన రూ.38 కోట్లలో ఇంకా రూ.4కోట్లకు పైగా వసూలు కావాలి. దీంతో మిగిలిన రెండు రోజుల్లో వసూలు చేయాలనే పట్టుదలతో అధికారులు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యాన వసూళ్లలో వెనుకబడిన డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ అధికారికి లక్ష్యాన్ని కేటాయించి రోజువారీ ఎంత వసూలు చేశారో ఆరా తీస్తున్నారు. అంతేకాక మొండి బకాయిదారులు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు చేస్తున్నారు. వసూళ్లలో వేగం పెంచేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక కేంద్రాలను రాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను, నల్లా బిల్లుల బకాయిలు కూడా చెల్లించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తి పన్ను చెల్లించకపోతే ఏప్రిల్ 1–2 శాతం అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని వివరిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ముందుగానే పన్ను చెల్లించి అదనపు భారం నుండి తప్పించుకోవాలని సూచిస్తున్నారు. -
రైస్ మిల్లులో మహిళ మృతి
వరిపొట్టు పడడంతో ఊపిరి ఆడక ఘటన నేలకొండపల్లి: నిబంధనలు విస్మరించిన ఓ రైస్ మిల్లు యాజమాన్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే, ఘటన జరిగాక కూడా యాజమాన్యం స్పందించలేదని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచల రైస్ మిల్లులో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన పప్పుల కళ్యాణి (34) రోజువారీ కూలీ పనులకు వస్తోంది. ఆదివారం కూడా ఆమె వరి పొట్టు తీస్తుండగా పొట్టు ఒక్కసారిగా మీద పడడంతో కూరుకుపోయింది. సహచర కూలీలు ఆమెను బయటకు తీసి సీఆర్పీ చేసి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదంలో యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణి మృతదేహంతో నేలకొండపల్లి సెంటర్లో రాస్తారోకోకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడమే కాక మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు సీపీఎం మండల కార్యదర్శి కే.వీ.రెడ్డి, సీపీఐ నాయకుడు కర్నాటి భానుప్రసాద్ తదితరులు సంఘీభావం తెలపగా ఖమ్మం – కోదాడ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు చేరుకుని దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
తపాలా లావాదేవీలకు నాలుగు రోజుల విరామం
ఖమ్మంగాంధీచౌక్: ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల నేపథ్యాన పోస్టల్ సేవింగ్ బ్యాంక్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 31న మంగళవారం మహావీర్ జయంతి సందర్భంగా సెలవు కాగా, ఏప్రిల్ 1, 2వ తేదీల్లో నూతన ఆర్థిక సంవత్సరం లావాదేవీల కోసం విరామం ఇవ్వనున్నారు. అలాగే, 3వ తేదీ శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవుతో నాలుగు రోజుల పాటు పీఓఎస్‌బీ సేవలు ఉండవని అధికారులు వెల్లడించారు. పోరాటాలతోనే హక్కుల సాధన ఖమ్మంగాంధీచౌక్: సమస్యల పరిష్కారం, హ క్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమని ఎన్‌ఎఫ్‌పీఈ(నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్) రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్‌కుమార్ అన్నా రు. ఎన్‌ఎఫ్‌పీఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ద్వైవా ర్షిక మహాసభ ఆదివారం ఖమ్మంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో జరిగింది. యూనియ న్ ప్రతినిధులు ఏలూరి శ్రీనివాసరావు, వై.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం మోపుతోందని విమర్శించారు. ఈనేపథ్యాన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. యూనియన్ నాయకులు మహేందర్, మధుసూదన్‌రావు, లెనిన్ శ్రీనివాస్, ఎస్వీ.రావు, రామశాస్త్రి, నాగేశ్వరరావు, జయరాజు, ఖాజామోహినుద్దీన్, మౌ లాలి, రాజ్యలక్ష్మి, సుబేదాబేగం, ఖమ్మం డివిజ న్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టుమెన్ల సంఘం అధ్యక్షుడిగా వై.సత్యనారా యణ, కార్యదర్శిగా పెరుగు నాగేశ్వరరావు, క్లాస్–3 యూనియన్ అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా బందెల నాగరాజు, కోశాధికారిగా రవీందర్‌ను ఎన్నుకున్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన నూతన కార్యవర్గం
ఖమ్మం లీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ బాధ్యులు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ను కలిశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్ ఆధ్వర్యాన వారు కలవగా, న్యాయమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో రవి, జానీమియా, శిరీష, రాధమ్మ, కళ్యాణి,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రికార్డులు కొట్టుకుపోయాయి.. ఖమ్మంరూరల్: మండలవ్యాప్తంగా 2024–25 సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సామాజిక తనిఖీ సమావేశం శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను క్షేత్రస్థాయి సహాయకులు వివరించగా, అధికారులు నివేదికలను తనిఖీ చేశారు. అయితే, పనులకు సంబంధించి రికార్డులను పరిశీలించేందుకు అధికారులు సిద్ధం కాగా, 2024లో మున్నేటికి వచ్చిన వరదతో జలగంనగర్‌లోని ఎంపీడీఓ కార్యాలయ రికార్డులు పాడైపోయాయని బదులిచ్చారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 మార్చి వరకు రికార్డులే ఉన్నాయని చెప్పగా వాటిని పరిశీలించారు. ఆపై కొందరికి చేసిన పని కంటే రూ.6,509 ఎక్కువ చెల్లించినట్లు తేలడంతో రికవరీకి నిర్ణయించారు. అలాగే, విధులు సరిగ్గా నిర్వర్తించని సిబ్బందికి రూ.52 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఆర్డీఓ శ్రీదేవి, ఉద్యోగులు పద్మావతి, సక్రియా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తూతూ మంత్రంగా ఓపెన్ ఫోరం -
యుద్ధంతో సామాన్యులపై భారం
ఖమ్మంమయూరిసెంటర్: అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో కార్మికులు, కర్షకులు, సామాన్యుల శ్రమశక్తి కాలిపోతోందని ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డి.పాపారావు పేర్కొన్నారు. దేశీయ ఇంధన అవసరాలు 80 శాతానికి పైగా దిగుమతిపై ఆధారపడడంతో యుద్ధం కారణంగా ప్రభావితమవుతున్న దేశాల్లో భారత్ కూడా ఉందని తెలిపారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బీవీకే) ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం ‘సామ్రాజ్యవాద యుద్ధం – ప్రజలపై ప్రభావం’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో పాపారావు మాట్లాడారు. యుద్ధం తో భవిష్యత్‌లో ఎరువుల కొరత తీవ్రమవుతుందని చెప్పారు. సహజ వాయువును పైప్‌లైన్ ద్వారా తీసుకువచ్చే ప్రాజెక్టు నుంచి అమెరికా ఆంక్షల కారణంగా భారత్ వైదొలగపోతే చౌక ధరకు సహజవాయువు అందేదని చెప్పారు. కాగా, ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపించేది కమ్యూనిస్టులు మాత్రమేనని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడగా బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బండారు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.ఆర్థిక, సామాజిక విశ్లేషకులు పాపారావు -
సాగర్ జలాలను కొనసాగించాలి
వైరా: జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలు చివరి దశలో ఉన్నందున ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘఽం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. వైరాలోని సీపీఎం కార్యాలయంలో శనివారం జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు మండలాల్లో వరి పంట సాగవుతున్నందున ఏప్రిల్ చివరి వారం వరకు నీటి తడులు అవసరమవుతాయని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి విడుదల కొనసాగించాలన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని, మక్కల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడగా, నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, తాతా భాస్కరరావు, దుగ్గి కృష్ణ, రచ్చా నరసింహారావు, ఎస్కే.మీరా, బండి రమేష్, బిక్కసారి గంగాధర్, గొడవర్తి నాగేశ్వరరావు, శీలం ఫకీరమ్మ, దొండపాటి నాగేశ్వరరావు, రావుల రాజబాబు, గుడ్డూరి ఉమ, మల్లెంపాటి రామారావు, బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు
ఖమ్మంమయూరిసెంటర్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కేంద్రం ఆయిల్ ధరలను తగ్గించినా సామాన్యులకు మేలు జరగదని చెప్పారు. ఖమ్మం గిరిప్రసాద్భవన్లో శనివారం సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం నేపథ్యాన ముందస్తు చర్యలు చేపట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. యాసంగి చివరి దశలోనూ రైతు భరోసాగా ఒక ఎకరానికే నిధులు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు శాఖల నిర్మాణం, ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, జాగర్లమూడి రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ నాయకుడు బాగం హేమంతరావు -
సస్పెండ్ చేస్తావా.. కోర్టుకు వెళ్తా !
నేలకొండపల్లి: బాధ్యత కలిగిన ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే కాక జిల్లా అధికారితో వాగ్వాదానికి దిగిన ఘటన ఇది. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న పంతులు శనివారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఏం.ఏ.అలీం సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వెళ్లగా ఈ విషయాన్ని గుర్తించారు. మద్యం తాగి రావడం ఏమిటని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వాగ్వాదానికి దిగాడు. అంతేకాక ‘ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా, చేసుకోండి... కోర్టుకు వెళ్తా’ అంటూ గొడవ పడ్డాడు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మార్కెట్ చైర్మన్‌కు ఫోన్లో వివరించిన డీఎంఓ.. 108 వాహనం పిలిపించి వైద్యపరీక్షల కోసం ఆయనను ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. ఇటీవల పంతులు కార్యాలయ సిబ్బందిని కూడా దూషించినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఓ అలీంను వివరణ కోరగా.... మద్యం మత్తులో విధులకు హాజరైన కార్యదర్శిపై వైద్యుల నుంచి నివేదిక వచ్చాక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.మద్యం మత్తులో డీఎంఓతో మార్కెట్ కార్యదర్శి వాగ్వాదం -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌అదాలత్
ఖమ్మం లీగల్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. కాలయాపన లేని సత్వర పరిష్కారం, అప్పీలు లేని తుదితీర్పు లభిస్తుందని వెల్లడించారు. ఖమ్మం న్యాయ సేవాసదన్‌లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌ను జిల్లా జడ్జి ప్రారంభించి మాట్లాడారు. రాజీ మార్గంలో ఎలాంటి ఫీజు లేకుండా న్యాయసేవాసంస్థ సహకారంతో కేసులు పరిష్కారమవుతాయని తెలిపారు. తద్వారాకోర్టు చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఆదా కావడమే కాక మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక ఇక్కడ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ ఉండదని చెప్పారు. గత లోక్ అదాలత్‌లో 8,490 కేసులు పరిష్కరించి జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలవగా, 63 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్క రించడం ద్వారా రూ.4,28,98,000 పరిహారం అందించామని తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ మెంబర్ మందడపు శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడగా, రాజీ పడిన మూడు కేసుల్లో కక్షిదారులు, ప్యానల్ న్యాయవాదులకు జిల్లా జడ్జి మొక్కలు అందజేశారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన అధ్యక్షతన లోక్ అదాలత్ నిర్వహించగా వివిధ కోర్టుల న్యాయమూర్తులు ఉమాదేవి, అర్చన కుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, శివరంజని, దీప, రజిని, బిందుప్రియ, అఖిల, నాగలత, పీపీ శంకర్, న్యాయవాదులు గంగాధర్, హరిందర్‌రెడ్డి, సీతారామారావు, స్వర్ణ రాంబాబుతో పాటు బార్ అసోసియేషన్ కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. 6,500 కేసుల పరిష్కారం జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 6,500 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎం.కల్పన తెలిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2,730, సివిల్ కేసులు 37, చెక్‌బౌన్స్ కేసులు 48, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3,544తో ఇతర కేసులు ఉన్నాయని వెల్లడించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ -
సింహాసనం అధిష్టించగా..
ఖమ్మందక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో శనివారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. పంచారాత్ర ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ వేడుక నిర్వహించగా, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రభుత్వం తరఫున శ్రీరాముడికి పట్టువస్త్రాలను సమర్పించారు. రాజాధిరాజుగా కొలువుదీరిన స్వామివారిని వీక్షించి భక్తులు తరించారు. Iఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026భద్రాచలం: సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడిని ప్రధాన ఆలయం నుంచి మాడ వీధులు గుండా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన, పుణ్యావాచనం చేశాక, పండితులు రుత్విక్కులైన వశిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమపై ఆవాహన చేసుకున్నారు. రుత్వికరణం తర్వాత పండితులు మండపత్ర పూజలు ప్రారంభించారు. పట్టాభిషేకం వేదిక దిగువ భాగంలో ఏర్పాటు చేసిన మూడు కలశాల్లో సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని, అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఆపై త్రిదండి దేవనామ రామానుజాచార్యులు శ్రీరాముడి పాలన విశిష్టతను వివరించారు. రాజ లాంఛనాలతో.. రాజలాంఛనాలతో పట్టాభిషేక అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. అనంతరం రాజముద్రికను తొడిగారు. ఆ తర్వాత రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకరించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలను ఉంచారు. ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింప చేశారు. ఆ తర్వాత రుత్విక్కులు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేశారు. మంగళహారతితో పట్టాభిషేక తంతు ముగిసింది. పట్టాభిషేకం అనంతరం సీతమ్మవారు ఆంజనేయుడి మెడలో ముత్యాల దండ ధరింపచేస్తూ ఆంజనేయ పట్టాభిషేకాన్ని చేశారు. వేడుకగా పట్టాభిషిక్తుడైన రాముడిని పల్లకీలో ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే మిథిలా స్టేడియానికి చేరుకుని సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివా రికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.రథోత్సవంలో దర్జాగా రామయ్యపట్టాభిషేకం జరుపుకున్న సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య శనివారం రథంలో విహరించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చా రు. భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామనామస్మరణల నడుమ తాతగుడి సెంటర్ వరకు వేడుక జరిపారు. ఇళ్లముందుకు వచ్చిన స్వామివారికి భక్తులు హారతులతో స్వాగతం పలికిమొక్కులను తీర్చుకున్నారు. ‘రథస్థం రాఘవందృష్ట్యా పునర్జన్మ నవి ద్యతే’ అని బ్రహ్మ పురాణం చెబుతోందని, రథోత్సవంలో శ్రీ రాముని సేవించిన వారికి ముక్తి లభిస్తుందని స్థల పురాణం చెబుతోందని అర్చకులు వివరించారు. -
శ్రీవారికి చక్రస్నానం, మహాపూర్ణాహుతి
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజ పతాకాన్ని అవనతం చేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు. మత్కేపల్లి మార్కెట్ అభివృద్ధికి రూ.8 కోట్లు నేలకొండపల్లి: జిల్లాలోని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.8కోట్లు కేటా యించనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం తెలిపారు. ఇందుకోసం ఖమ్మం మార్కెట్ నుంచి రూ.7 కోట్లు, నేలకొండపల్లి నుంచి రూ.కోటి అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నేలకొండపల్లి మార్కెట్‌ను శనివారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. జిల్లాలోని మార్కెట్ల ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.45.07 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. అలాగే, 21 చెక్‌పోస్టుల ద్వారా రూ.69.50 కోట్లకు గాను రూ.45.07 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయీస్ శాఖ నుంచి రూ.3.92 కోట్లు, ప్రైవేట్‌గా రూ.3 కోట్లు రావాల్సి ఉందని డీఏఓ తెలిపారు. -
వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన పనులు
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో లబ్ధిదారులకు మౌలిక వసతులు కల్పిస్తూ మోడల్ కాలనీని అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వెలుగుమట్లలో పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమిషనర్ సునీల్‌దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీలో విద్యుత్ స్తంభాలు, లైట్ల ఏర్పాటు పూర్తికాగా, ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతర్గత రోడ్లు కూడా నిర్మించి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆర్అండ్బీ ఎస్ఈ యాకుబ్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి.జయచందర్, సైదులు, విద్యుత్‌శాఖ డీఈ రామారావు, నాయకులు మిక్కిలినేని నరేంద్ర, రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
దిద్దుపూడిలో డంపింగ్ యార్డ్
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి దిద్దుపూడి రెవెన్యూలోని రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని డంపింగ్ యార్డ్‌గా వాడుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. యార్డ్ స్థలాన్ని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, అధికారులతో కలిసి శనివారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. డంపింగ్ యార్డ్‌కు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు షెడ్డు నిర్మాణం చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం, తహసీల్దార్ సురేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు. ●కారేపల్లి: కారేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆమె, క్రీడా మైదానంలో ఏర్పాట్లు, బాలుర వసతి గృహ నిర్మాణంపై ఎంపీడీఓ శ్రీనివాసరావుకు సూచనలు చేశారు. ఎంపీఓ రాజేంద్రప్రసాద్, గ్రామ కార్యదర్శి నెహ్రూ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీజ -
కాంగ్రెస్ – బీఆర్ఎస్ వర్గీయుల ఘర్షణ
కొణిజర్ల: వైరా మున్సిపాలిటీ పరిధి కొణిజర్ల మండలం లాలాపురంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామి ఊరేగింపు జరుగుతుండగా మొదలైన వివాదం రాళ్ల దాడిగా మారడంతో పలువురు గాయపడ్డారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాలు.... కాంగ్రెస్ వర్గీయులు సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తుండగా, బీఆర్ఎస్ వర్గీయుల ఊరేగింపు ఎదురురావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమాన రాళ్లు రువ్వుకోగా కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలియడంతో వైరా సీఐ వెంకటప్రసాద్ నేతృత్వాన కొణిజర్ల, వైరా, చింతకాని పోలీసులు చేరుకుని ఇరువర్గాల చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆపై గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటుచేశారు. మొక్కజొన్న యంత్రం దగ్ధం ముదిగొండ: విద్యుత్ తీగలు తాకడంతో మొక్కజొన్న యంత్రం దగ్ధమైన ఘటన ఇది. ముదిగొండ మండలం గంధసిరిలోని ఓ రైతు పొలంలో శుక్రవారం యంత్రంతో మొక్కజొన్న కోస్తున్నారు. ఈసమయాన పైన ఉన్న విద్యుత్ తాకడంతో యంత్రం కాలిపోయింది. మంటలు మొదలుకాగానే అప్రమత్తమైన డ్రైవర్ హుసేన్ కిందకు దూకడంతో గాయాలతో బయటపడ్డాడు. లాలాపురంలో రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు -
ప్రపంచ శాంతి కోసం ‘రన్ ఫర్ జీసస్’
ఖమ్మంగాంధీచౌక్: పశ్చిమ దేశాల యుద్ధం సమసిపోయి ప్రపంచ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఏప్రిల్ 4వ తేదీన ఖమ్మంలో రన్ ఫర్ జీసస్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్సీఎం బిషప్ సగిలి ప్రకాష్ తెలిపారు. ఈమేరకు ఖమ్మంలోని బిషప్ హౌస్‌లో కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన నిర్వహించే రన్ ఫర్ జీసస్ 4వ తేదీన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వద్ద సాయంత్రం 6 గంటలకు మొదలై ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ వరకు కొనసాగుతుందని, ఫాదర్లు, ఫాస్టర్లు, విశ్వాసులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ తప్పెట్ల శౌరి, మత గురువులు సూరేపల్లి ఐజక్, విజయ్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ● మణుగూరుకు చేరిన సేవ్ సింగరేణి పోరుజాతా
హైవేపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేయాలి నేలకొండపల్లి: కోదాడ – ఖమ్మం జాతీయ రహదారిపై నేలకొండపల్లి వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా నేలకొండపల్లికి శుక్రవానం వచ్చిన ఖమ్మం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డికి ఏటుకూరి రామారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఇటీవల మృతి చెందిన వాక రంగయ్య కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఆతర్వాత కొత్తకొత్తూరు, నాచేపల్లి, మంగాపురంతండాల్లో కూడా పర్యటించగా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంగాపురంతండా సర్పంచ్ ధీరావత్ అశోక్‌రాణి వినతిపత్రం ఇవ్వడంతో పాటు సన్మానించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, వెంకన్న, బొందయ్య, భద్రయ్య, ధీరావత్ రాధాకృష్ణమూర్తి, కుక్కల నరేష్, కడియాల నరేష్, మేకల వెంకటేశ్వర్లు, గొబ్రియా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బకాయిలు చెల్లించాలిమణుగూరు టౌన్/మణుగూరు రూరల్: ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.51 కోట్ల బకాయిలు విడుదల చేయడంతోపాటు మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఏఐటీయూసీ ఆధ్వర్యాన సేవ్ సింగరేణి పేరిట చేపట్టిన పోరుజాతా(బస్సు యాత్ర) శుక్రవారం మణుగూరుకు చేరింది. యాత్ర మణుగూరు ఏరియాలోని గనులు, జీఎం కార్యాలయ ప్రాంతాల్లో కొనసాగింది. అనంతరం భారీ బైక్ ర్యాలీ నడుమ మణుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు చేరాక అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ర్యాలీగా పీవీ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయానికి చేరుకున్నారు. పలు చోట్ల జరిగిన సమావేశాల్లో సీతారామయ్య మాట్లాడుతూ యాజమాన్యం స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. మణుగూరు పీకేఓసీ డీప్ సైట్ బ్లాకుతో పాటు అన్ని బొగ్గు బావులను సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, వై.రాంగోపాల్, మేకల ఈశ్వర్రావు, ఎం.వీ.రాంనర్సయ్య, ఆవుల నాగరాజు, సురేందర్, శ్రీనివాసరావు, కుమారస్వామి, గంఽగాధర్రావు, రాజశేఖర్, సరెడ్డి పుల్లారెడ్డి, దుర్ాగ్యల సుధాకర్, గడ్డం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. హామీల అమలు డిమాండ్‌తో పర్యటన భద్రాచలం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపడుతున్నట్లు రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. యాత్రను శుక్రవారం భద్రాచలంలో ప్రారంభించడంతో పాటు భక్తులతో కలిసి రైతుల మహాగర్జన పోస్టర్లు ఆవిష్కరించారు. రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు, కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించాలనే డిమాండ్‌తో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
అడుగడుగునా ఆంక్షలు
● ప్రముఖులకూ తప్పని అడ్డంకులు ● ఖమ్మం జడ్జి, రామదాసు వారసుడికి సైతం అనుమతి నిరాకరణ భద్రాచలం/భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శుక్రవారం జరిగిన శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 36 గంటల ముందు నుంచే ఆంక్షలు విధించారు. రామాలయానికి వెళ్లే దారిలో ముఖద్వారం వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలనే అనుమతించడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణంలో పాల్గొనడానికి సారపాక నుంచి భద్రాచలం వస్తున్నారని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ 30 నిమిషాల పాటు నిలిపివేశారు. కల్యాణం ముగిశాక కూడా మరో పావు గంట, ఆతర్వాత బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వెళ్లే వాహనాలను మళ్లించే క్రమాన ప్రతి 15 నిమిషాలకు వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రముఖులకూ తప్పలేదు.. సీఎం పర్యటన నేపథ్యాన పటిష్ట బందోబస్తు ఉన్నా, పలు చోట్ల శ్రుతిమించడంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. వీఐపీలు, వీవీఐపీలకు సైతం ఈ బెడద తప్పకపోవడం గమనార్హం. స్వయాన భద్రాచలం ఆలయ ఈఓ దామోదర్‌రావు ఆలయానికి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి అడ్డుకోగా.. సిబ్బంది సర్దిచెప్పినా దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మిథిలా స్టేడియంలో కల్యాణానికి వస్తున్న ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ అడ్డుకున్నారు. పాస్ చూపించినా వినకపోవడంతో ఆమె భద్రాచలం జడ్జిని కలిసి.. ఆ తర్వాత సెక్టార్‌లోకి వెళ్లారు. ఇక భక్త రామదాసు వారసుడిగా దేవస్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే కంచర్ల శ్రీనివాసరావు దంపతులను సైతం అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పాస్, అనుమతి పత్రాలను చూపించినా అధికారులు ససేమిరా అనడంతో గంట అనంతరం పలువురు చెప్పడంతో అనుమతించారు. ఇదే సమయాన పోలీసు సిబ్బంది, చోటామోటా రాజకీయ నాయకులను మాత్రం అడ్డగోలుగా సెక్టార్లలోకి అనుమతించటం విశేషం. -
నేడు జాతీయ లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: ఖమ్మంలోని న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఉదయం 10–30గంటలకు ప్రారంభిస్తారు. కాగా, ఎక్కువ కేసులు పరిష్కరించేలా ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులతో జిల్లా జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన పలుమార్లు సమావేశమయ్యారు. ఈమేరకు కేసుల పరిష్కార నిమిత్తం పలు బెంచ్‌లను ఏర్పాటుచేస్తుండగా కక్షిదారులు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. -
●భూమిపూజ
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, పునర్జీవం పనులతోపాటు వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.351 కోట్లతో చేపట్టబోయే పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయంలో ఈశాన్య మూలలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజు ఇచ్చే సమయాన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించకుండా వెనకబడిపోయారు. దీంతో సీఎం కల్పించుకుని ‘ తెల్లం ముందుకురా అంటూ’ పిలిచారు. కాగా, రూ.351 కోట్లలో.. రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరి సరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. -
భద్రశైల రాజమందిరా..
భక్తుల జయజయ ధ్వానాలు.. శ్రీరామనామ స్మరణ.. వేద మంత్రోచ్ఛరణల నడుమ.. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పోటెత్తగా, మిథిలా స్టేడియం కిక్కిరిసింది. రామయ్య స్వామి, సీతమ్మ తల్లి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. సీఎం రేవంత్‌రెడ్డి సతీ సమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. – భద్రాచలం సంప్రదాయబద్ధంగా ఉదయం 8 గంటల సమయంలో గర్భగుడిలో మూల మూర్తులకు లఘు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం పూజలు గావించి.. అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్య ధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాలు పోసి, హారతి ఇవ్వడంతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములను గరుడ, గజ వాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగించారు. సీఎం హోదాలో తొలిసారిగా 2025 భద్రాచలంలో జరిగిన కల్యాణానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో ప్యాంట్, షర్ట్‌లో ఆయన నేరుగా ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో పూజలు నిర్వహించాలంటే పంచె తప్పనిసరి. దీంతో ఆయన ఆలయ ప్రాంగణంలో పంచె ధరించారు. ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్ నుంచే పంచె, షర్ట్ ధరించి భద్రాచలానికి బయలుదేరారు. అదే వస్త్రధారణలో ఆలయ దర్శనం, భూమిపూజ, కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు అందజేశారు. సీతారాముల కల్యాణం చూసేందుకు రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మిథిలా స్టేడియం నిండిపోయింది. కల్యాణ వేడుకల్లో దేవేరులు వచ్చినప్పుడు, ఆభరణాలు ధరింప చేసినప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు భక్తితో తన్మయత్వం చెందారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విరివిగా చలివేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పుచ్చకాయలు అందజేశారు. పానకం, మజ్జిగ కేంద్రాల్లో కోలాహలం నెలకొంది. సీఎం రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అంతకుముందే దేవస్థానానికి చేరుకునే రోడ్లకు అడ్డంగా బారికేడ్లు కట్టడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో పాటు ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య హాజరయ్యారు. డీజీపీ శివధర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉదయం 9:58 : కల్యాణ మండపానికి దేవేరుల ఆగమనం ఉదయం 10:25 : విశ్వక్సేన పూజ ఉదయం 10:43 : పుణ్యావాచనం ఉదయం 10:55 : శ్రీయోద్వాహం ఉదయం 11:18 : యోక్త్రా బంధనం, యజ్ఞోపవీత ధారణ ఉదయం 11:25 : శ్రీరాముడి కాళ్లు కడిగిన జనక మహారాజు ఉదయం 11:30 : అలంకరణ ఉదయం 11:32 : మధుపర్క నివేదన ఉదయం 11:37 : మహా సంకల్పం ఉదయం 11: 50 : కన్యాదానం ఉదయం 11:51 : పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12:00 : అభిజిత్ లగ్నంలో వధూవరులపై జీలకర్ర బెల్లం మధ్యాహ్నం 12:11: మాంగళ్య ధారణ మధ్యాహ్నం 12:24 : తలంబ్రాలు మధ్యాహ్నం 12:40 : హారతివైభవోపేతంగా సీతారాముల కల్యాణం -
నాయబ్ తహసీల్దార్లకు ఉద్యోగోన్నతి
ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలో పలువురు నాయబ్ తహసీల్దార్లకు తాత్కాలికంగా తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేసేందుకు ఈ నిర్ణయం తీసుకోగా, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన కె.బ్రహ్మేశ్వరరావు, ఎం.వినయేందర్‌రెడ్డి, డి.జయచందర్‌కు పదోన్నతి కల్పించి జిల్లాకు కేటాయించారు. అయితే, వీరికి పోస్టింగ్ ఇచ్చిన మండలం కాకుండా మరో మండలంలో డిప్యూటేషన్‌పై ఇచ్చారు. అంతేకాక జిల్లాలో ఇంకో ఆరుగురు తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించారు. కాగా, సింగరేణి తహసీల్దార్ ఏ.రమేష్ డిప్యూటేషన్‌ను రద్దు చేసి కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిప్యూటేషన్‌పై నియమితులైన తహసీల్దార్లు వెంటనే విధుల్లో చేరాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.జిల్లాకు ముగ్గురి కేటాయింపు, మరికొందరికి స్థానచలనం -
సాయం సమయాన కల్యాణం
ముదిగొండ: ముదిగొండ మండలం ముత్తారంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశమంతా రామయ్య కల్యాణం పగటి పూట జరిగితే, రెండో భద్రాద్రిగా పేరున్న ముత్తారంలోని సాయం సంధ్యాసమయాన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఉదయం ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు ఉత్సవం నిర్వంచారు. అలాగే, గోటితో వలిచిన తలంబ్రాలను భక్తులు సమర్పించగా, తలంబ్రాలు, పట్టువస్త్రాలను వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు సమర్పించారు. అనంతరం పండితుల వేదమంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు, శ్రీనివాసాచార్యులు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ క్రతువు నిర్వహించారు. ముదిగొండ, నేలకొండపల్లి, చింతకానితో పాటు పలు ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు కల్యాణాన్ని తిలకించారు. ఆలయ చైర్మన్ తుళ్లూరి లత, ముత్తారం, వనంవారికిష్టాపురం సర్పంచ్‌లు ఎల్.మమత, పర్ణకోల జ్ఞానసరళ ఆరోగ్యమేరి, వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు, ఆలయ పునర్నిర్మాణ దాత పరుచూరి ప్రసాదరావు, ఈఓ సమత, ఎంపీడీఓ భాస్కర్‌రావు, ఆలయ మాజీ చైర్మన్ తుళ్లూరి జీవన్‌బాబు, పాలకమండలి సభ్యులు, నాయకులు మల్లెల అజయ్, మట్టా బాబురామిరెడ్డి పాల్గొన్నారు.ముత్తారంలో వేడుకగా క్రతువు -
సుబాబుల్ మాదే.. కాదు మాది
● చివరి ఫలసాయంపై ‘సీతారామ’ నిర్వాసితుల ఆశలు ● పరిహారం ఇచ్చాం.. ప్రభుత్వానిదే అంటున్న యంత్రాంగం ● మంత్రులు, కలెక్టర్ చొరవ చూపాలని వేడుకోలు కారేపల్లి: ఏళ్ల తరబడి వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన సుబాబుల్ పంట చేతికి వచ్చిందని, ఆ పంటను చివరిసారి తీసుకునే హక్కు తమకే కల్పించాలని సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసిత రైతులు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ అయినందున ఫలసాయం ప్రభుత్వానికే చెందుతుందని అధికారులు అడుగడుగునా అడ్డుకుంటుండడంతో ఆందోళనలు జరుగుతున్నాయి. అంతేకాక తమను అడ్డుకుంటున్న అధికారులు బెదిరింపులకు పాల్పడడమే కాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా మంత్రులు, కలెక్టర్ స్పందించి సన్నకారు రైతులమైన తమకు చివరి ఫలసాయం దక్కేలా చూడాలని కోరుతున్నారు. 168 ఎకరాల సేకరణ సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ– 13లో భాగంగా కాల్వ నిర్మాణానికి పలువురు రైతుల నుంచి ప్రభుత్వం భూమి సేకరించింది. సింగరేణి మండలంలో రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం రెవెన్యూ పరిధిలో 168 ఎకరాలను సుమారు 100మంది రైతుల వ్యవసాయ భూములను సేకరించారు. అంతేకాక నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ.18.50లక్షల చొప్పున పరిహారం జమ చేశారు. అలాగే, వ్యవసాయ భూముల్లో బోర్లు, పైపులైన్లు, డ్రిప్ పరికరాలు, ఫెన్సింగ్‌కు పరిహారం చెల్లించారు. పదేళ్లకు పైగా కష్టం ఇక్కడి రైతులు 10నుంచి 15ఏళ్లు కష్టపడి సాగు చేయగా సుబాబుల్ తోటలు చేతికి వచ్చాయని చెబుతున్నారు. భూమి సేకరించి పరిహారం చెల్లించి న మాట వాస్తవమే అయినా అది గిట్టుబాటు కాద ని.. దీనికి తోడు చేతికి వచ్చిన పంట తీసుకోకుండా అడ్డుకోవద్దని కోరుతున్నారు. ప్రస్తుతం సుబాబుల్ టన్నుకు రూ.8వేల వరకు ధర పలుకుతున్నందున తమకే దక్కేలా చూడాలని విన్నవిస్తున్నారు. అధికారుల వాదన ఇలా... రేలకాయలపల్లి రెవెన్యూ పరిధి 67ఎకరాల్లో సువాబుల్ తోటలను 36మంది రైతులు నరికిస్తుండగా అధికారులు ఇటీవల అడ్డుకున్నారు. అలాగే, కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు తమపై బెదిరింపులను అరికట్టి చివరిపంట తీసుకునేలా మంత్రులు, అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ఇదే సమయాన అధికారులు మాత్రం చీమలపాడు, బాజుమల్లాయిగూడెం తదితర ప్రాంతాల్లో సుబాబుల్ కోత తామే చేపట్టి టెండర్ ద్వారా ఐటీసీకి అప్పగించినట్లు చెబుతున్నారు. మిగతా పంట కూడా టెండర్ ద్వారా ఇస్తామని చెబుతుండగా.. రైతులు చివరి పంట తామే తీసుకుంటామని ముందుకొస్తుండడంతో వాగ్వాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ విషయమై జలవనరుల శాఖ వైరా డివిజన్ ఈఈ బాబురావు వివరణ కోరగా... భూసేకరణలో భాగంగా భూమితో పాటు పంటలకు కూడా పరిహారం చెల్లించామని తెలిపారు. రెవెన్యూ శాఖ పంచనామా అనంతరం భూమి స్వాధీనం చేసుకుని అందులో సుబాబుల్‌ను టెండర్ ద్వారా ఐటీసీకి అప్పగించామని వెల్లడించారు. కానీ రైతులు అడ్డుకుంటుండడంతో సమస్య నెలకొందని తెలిపారు. -
శ్రీ సీతారాముల కల్యాణ వైభోగమే..
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా సాగింది. తొలుత యాగశాల నుంచి కల్యాణమూర్తులను అర్చకులు, అధికారులు పల్లకీలో కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. అనంతరం ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ దంపతులు సమర్పించారు. అనంతరం కల్యాణ వేడుకను పురాణం రవికుమార్‌శర్మ నిర్వహించగా, వ్యాఖ్యాతగా ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ వ్యవహరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు పానకం, ప్రసాదం పంపిణీ చేయడమే కాక అన్నదానం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామంలో హనుత్ వాహనంపై ఊరేగింపు చేశారు. సర్పంచ్ తుళ్లూరు నిర్మల, సొసైటీ మాజీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్తగూడెం కేంద్రంగా డివిజన్ నెలకొల్పండి
● కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం స్టేషన్ ఏర్పడి వందేళ్లు సమీపిస్తున్నందున చారిత్రక నేపథ్యాన్ని కొనసాగిస్తూ డివిజన్ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం టూర్ ఇలా..
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం భద్రాచలం రానున్నారు. మూడు గంటల పది నిమిషాలపాటు సీఎం జిల్లాలో పర్యటించనున్నారు. కల్యాణ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆలయ విస్తరణ, పుష్కర ఘాట్ల విస్తరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఉదయం 9గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10–10 గంటలకు సారపాక పాఠశాలలోని హెలిప్యాడ్‌లో దిగుతారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 10–40 గంటల నుంచి 11గంటల వరకు దైవదర్శనం చేసుకుంటారు. ఉదయం 11–05 నుంచి 11–30 గంటల వరకు అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత 11–35నుంచి మధ్యాహ్నం 12–25 వరకు కల్యాణ వేడుకల్లో పాల్గొంటారు. ఆపై మధ్యాహ్నం 12–35 గంటలకు గెస్ట్‌హౌస్‌కు వెళ్లి.. 1–20 గంటలకు హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ బయల్దేరతారు. -
శ్రీవారికి వైభవంగా పుష్పయాగం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామికి సుప్రభాత సేవ, పంచామృతంతో అభిషేకం నిర్వహించాక స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. ఆతర్వాత పద్మావతి, అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామికి 11 రకాల పూలతో పుష్పయాగంతో పాటు నిత్యకల్యాణం, పల్లకీసేవగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోన్రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నెరవేరేలా చేయూత
తిరుమలాయపాలెం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి దశ నిర్మాణం చేపట్టడంలో ఆర్థిక సమస్యలు ఎదురైతే మహిళా సంఘాల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తద్వారా దశల వారీగా నిర్మాణం పూర్తిచేస్తుంటే ప్రభుత్వం నుంచి రూ.5లక్షల నగదు అందుతుందని చెప్పారు. తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు ఆరాతీస్తూ త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ తిరుమలాయపాలెం మండలంలో 802 ఇళ్లు మంజూరు చేయగా, 736 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పునాది స్థాయి నిర్మించుకోలేని వారికి వారికి మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు అవగాహన కల్పిస్తూ గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలని సూచించారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, హౌజింగ్ డీఈ జగ్రాం, ఏఈ నవ్య, సర్పంచ్ ఇస్లావత్ సునీత, పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
పటిష్ట భద్రత..
సూపర్‌బజార్(కొత్తగూడెం)/భద్రాచలంఅర్బన్: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భద్రాచలం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. రెండు వేల మంది పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కాగా, డీజీపీ శివధర్‌రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాగా ఎస్పీ రోహిత్‌రాజు ఘన స్వాగతం పలికారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. -
ఎస్ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్‌లో అప్రెంటిస్‌షిప్ కోర్సులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు అప్రెంటిస్ షిప్ డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్ గ్రాఫిక్ డిజైన్–డిజిటల్ అడ్వర్టైజింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీకాం బీఎఫ్ఎస్ఐ కోర్సులు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉండగా, డిగ్రీ చదువుతూనే పరిశ్రమల్లో పని అనుభవం, స్టైఫండ్ పొందేలా వీటిని రూపొందించినట్లు వెల్లడించారు. టీపీహెచ్‌డీఏ నూతన కార్యవర్గం ఎన్నికఖమ్మంవైద్యవిభాగం: తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం(టీపీహెచ్‌డీఏ) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ టి.శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా ఎన్.బాలకృష్ణ, కోశాధికారిగా బి.అర్జున్ గౌతమ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ అమన, సాయిలుతో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీకాంత్‌ను గురువారం జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, ఉద్యోగులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య సేవలు మరింత బలోపేతమయ్యేలా కృషి చేయడంతో పాటు వైద్యుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాడతానని తెలిపారు. పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తులు ఖమ్మం అర్బన్: కేంద్రప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన అమలుచేస్తున్న పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి అర్హులై న యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరి శ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.సీతారాం సూచించారు. ఈ పథకం ద్వారా యువతకు దేశవ్యాప్తంగా రెండువేల కంపెనీల్లో సీఎస్ఆర్ ద్వారా శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని తెలి పారు. ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 6–9 నెలలు ఉండగా, ఎంపికై తే నెలకు గరిష్టంగా రూ.9వేల స్టైఫండ్, ఒకసారి రూ.6వేల గ్రాంట్ అందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు 18–25 ఏళ్ల వయస్సు కలిగి ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ చదివిన, చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండాలని వెల్లడించారు. సెల్ నంబర్, ఈ మెయిల్, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన ఆధార్ నెంబర్, మార్కుల మెమోలతో అధికా రిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీఎం సూచించారు. అభ్యర్థులు మూడు ఇంటర్న్‌షిప్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా, వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1800 11 6090లో సంప్రదించాలని ఆయన తెలిపారు. -
ఏకతాటిపైకి కేఎంసీ ఉద్యోగులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులను ఏక తాటిపైకి తీసుకొస్తామని టీజేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంటీఎన్జీవోస్ భవన్లో అన్ని ఉద్యోగ సంఘాల మద్దతుతో గురువారం కార్పొరేషన్ ఉద్యోగ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం కేఎంసీలోని 1,200మంది ఉద్యోగులతో జేఏసీ ఏర్పాటుకు చర్చించామని తెలిపారు. కాగా, కొందరు కార్పొరేటర్లు తమకు తెలియకుండా తీర్మానం కాపీలపై సంతకాలు సేకరించారని పలువురు ఉద్యోగ సంఘాల నేతల వద్ద చెప్పగా, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని నేతలు వెల్లడించారన్నారు. టీఎన్జీవోస్, టీజీవోస్ జిల్లా కార్యదర్శులు కొణిదన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, నాయకులు తాళ్లూరి శ్రీకాంత్, సుధాకర్, శ్రీనివాస్, బిక్కు, రమణ, బుర్రి వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, నాగేశ్వరరావు, హేమంత్, కవిత పాల్గొన్నారు.టీజేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు -
నేడు ‘నిధి ఆప్ కే నికట్’
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం రూరల్: ఉద్యోగుల భవి ష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యాన శుక్రవారం నిధి ఆప్ కే నికట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ వై.డీ.శ్రీనివాస్ తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెంలోని జీవీ మాల్ గోదాంలో జరిగే కార్యక్రమంలో సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పింఛనుదారులకు విధివిధానాలు, పీఎం వికసిత భారత్ రోజ్‌గార్ యోజనపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం 9–30నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఐఐటీహెచ్ నుంచి డాక్టరేట్ కల్లూరు: మండలంలో ని వెన్నవల్లి మాజీ సర్పంచ్ కొండపల్లి శ్రీమన్నారాయణ కుమార్తె మాధవికి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ సి.కృష్ణమోహన్ పర్యవేక్షణలో ఆమె వాతావరణ మార్పులపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి ఐఐటీ హైదరాబాద్ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాధవిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు అభినందించారు. -
సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం కమనీయంగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారి వంశాల విశిష్టతలను, గొప్పతనాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుని వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం రెండు సముమూహాలుగా ఏర్పడిన అర్చకులు స్వామి వారు, అమ్మవారి వంశాల గొప్పదనాన్ని పోటీపడి వివరించారు. సీతమ్మ వారివైపు స్థానాచార్యులు స్థలశాయి బృందం, రామయ్య వారివైపు పండితులు ఎస్టీజీ కృష్ణమాచార్యుల బృందం చేరి వేడుక నిర్వహించారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురావు, ఆలయ ఈఓ దామోదర్‌రావు, స్థానాచార్యులు వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, రామకోటి స్వరూప్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ ్వరరావు, కలెక్టర్ అంకిత్ భక్తులను అలరించిన ఎదుర్కోలు ఉత్సవం -
రెండు కిలోల గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం కొత్త బస్టాండ్ పరిసరాల్లో గురువారం తనిఖీలు చేపట్టిన ఎకై ్సజ్ స్టేషన్–1 పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద తనిఖీచేయగా 2.990 కిలో ల గంజాయి లభించింది. వారిని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ టైలర్కాలనీకి చెందిన సి.శ్రీకాంత్, భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన నాగంటి నవీన్‌గా గుర్తించారు. పాల్వంచలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలడంతో వారిని రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బి.కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ రేష్మసుల్తానా, ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘పెదవాగు’ను సందర్శించిన పీఓఈ బృందం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును పీఓఈ(ప్యానెల్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్) బృందం గురువారం సందర్శించింది. భారీవర్షాలు, వరదలతో రెండేళ్లక్రితం పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు సేఫ్టీ, పున:నిర్మాణానికి జలవనరుల శాఖ నిపుణులతో నివేదిక ఇవ్వాల్సిందిగా సీఫార్సు చేశారు. స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ ఐదుగురితో కూడిన పీఓఈ బృందాన్ని నియమించగా, వారిలో డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ అశోక్‌కుమార్ గంజు, జీయాలజీ ఎక్స్పర్ట్ ఎం.రాజు, రిటైర్డ్ ఎస్ఈ ఎన్.సంజీవ్, హైడ్రాలజీ ఎక్స్పర్ట్ భవానిరాంశర్మ, సీవిల్ ఎక్స్పర్ట్ బి.లక్ష్మణ్‌రావు ప్రాజెక్టును పరిశీలించారు. పునర్నిర్మాణం, డిజైన్, గేట్ల పెంపుతోపాటు నూతన డిజైన్‌తో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో పాటు, సీఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.సింగరేణి రక్షణ, కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంరుద్రంపూర్: సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల, ఉద్యోగుల భద్రత, హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్బీకేఎస్) గౌరవ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన జీఎల్బీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి పరీవాహకంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నా నూతన గనుల ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం సింగరేణికి నష్టం కలిగిస్తోందని తెలిపారు. ఇదే సమయాన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేలా ఏఐటీయూసీ చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో జనరల్ సెక్రటరి జె.సీతారామయ్య, నాయకులు ఎ.వెంకన్న, ఎండీ రాసుద్దీన్, బ్రహ్మానందం, రామకృష్ణ, కాపు కృష్ణ, తోట రాయమల్లు, సంతు, సంజీవరావు, నాజర్‌పాషా పాల్గొన్నారు. పశువులకు టీకాలు తప్పనిసరి తిరుమలాయపాలెం: ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు తప్పక వేయించాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి పురంధర్ సూచించారు.మండలంలోనిమేకలతండాలో గురువారం ఏర్పాటుచేసిన నిర్వహించిన టీకాల శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గాలికుంటు వ్యాధితో పశువులకు నష్టం జరగకుండా ముందస్తుగా టీకాలు వేస్తున్నామని తెలిపారు. సుబ్లేడు పశువైద్యాధికారి ఎస్.కే. జానీ, ఉద్యోగులు ఎండీ.అక్బర్‌పాషా,రంగారావు, వీరబాబు, నారాయణ, భాస్కర్ పాల్గొన్నారు. అటవీ ఉత్పత్తులతో ఆర్థికాభివృబ్ధి ఖమ్మంవ్యవసాయం: అటవీ ఉత్పత్తుల ఆధారంగా వన సంరక్షణ సమితి సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ సూచించారు. తల్లాడ రేంజి పరిధి గూడూరుకు చెందిన వన సంరక్షణ సమితి సభ్యులతో గురువారం ఆయన ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగావన ఆధారిత జీవనోపాధి కార్యకలా పాలు, ఆదాయం, అభివృద్ధిపై చర్చించి సూ చనలు చేశారు. అలాగే, వెదురు ఉత్పత్తుల తయారీ, విక్రయాలు, ఎకో టూరిజం కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్
ప్రధాన కార్యదర్శిగా రవి విజయం ఖమ్మం లీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులుగా ఎడ్లపల్లి రమేష్, కొప్పుల రవి ఎన్నికయ్యారు. కార్యవర్గంలోని మిగతా పదవులు ఏకగ్రీవంగా కాగా.. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పలువురు పోటీ పడడంతో గురువారం పోలింగ్ నిర్వహించారు. ఈమేరకు అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న రమేష్‌కు 349, మోజస్ క్రిస్టోఫర్‌కు 255ఓట్లు రావడంతో రమేష్ 64కోట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలా గే, ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన కొప్పుల రవికి 478ఓట్లు, వెంకటనారాయణకు 200 ఓట్లు పోలయ్యాయి. దీంతో 278 ఓట్లతో రవి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
భద్రాచలం ఉత్సవ కమిటీలో స్థానం
వైరా/నేలకొండపల్లి: భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యాన జరిగే శ్రీరామనవమి వేడుకల నిమిత్తం దేవా దాయశాఖ ఉత్సవకమిటీని ఏర్పాటుచేశారు. శ్రీ రామనవమి వేడుకలు విజయవంతంగా సాగేలా పర్యవేక్షణకు 14మందితో ఏర్పాటుచేసిన కమిటీ 26నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈమేరకు భక్తరామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిమండలం నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. నేలకొండపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసపాటి చంద్రశేఖర్, మండలంలోని రాజేశ్వరపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు దండా సత్యనారాయణను నియమించారు. ఇందులో సత్యనారాయణను రాజేశ్వరపురంలో గురువారం కాంగ్రెస్ నాయకులు పగిళ్ల పృధ్వీ, చిట్యాల రమేష్ తదితరులు సన్మానించారు. అలాగే, వైరాకు చెందిన మిట్టపల్లి నాగేశ్వరరావు(నాగి), రంగా జనార్దనరావు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమ ఎంపికకు సహకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, ఽడీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భూదాన్ భూముల్లో ఇళ్ల కోసం పోరాటంఖమ్మంఅర్బన్: భూదాన్ భూమిలో ఇళ్లు కోల్పోయి పట్టాలు రాని వారు ఖమ్మంలోని టీఎన్జీఓస్ హాల్లో గురువారం సమావేశమయ్యారు. సుమారు 300 మంది హాజరుకాగా, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల సాధన కమిటీ బాధ్యులు జి.సత్యనారాయణరెడ్డి, వరగాని కోటేశ్వరరావు, బొల్లు వెంకట్, జంగం రామచంద్రయ్య మాట్లాడారు. ప్రభుత్వం పట్టాలు, ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
నేలకొండపల్లి: నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీ లు హోరా హోరీగా సాగుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలస్థాయి పోటీల్లో భాగంగా శుక్రవారం నాలుగు మ్యాచ్‌లు జరిగగా.. పోటీలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో ఆడి ఉత్సాహపరిచారు. స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి వీక్షించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు, నిర్వాహకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జెర్రిపోతుల అంజని, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేశ్, కొడిరెక్క వినోద్, మన్నె నరేశ్, కాసాని సందీప్, సొడెపొంగు ప్రశాంత్, రాయపూడి రోహిత్నాథ్, తోట వాసు, చింతమళ్ల వెంకటేశ్, కె.రమేశ్, మహేశ్, కొడిరెక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భద్రగ్రిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టినేలకొండపల్లి: గత పాలకులు భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ అభివృద్ధిని విస్మరిస్తే, తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.560 కోట్లు కేటాయించిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కోరట్లగూడెంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రుల చొరవతో భద్రగిరి ఆలయ అభివృద్ధికి రూ.560 కోట్లు కేటాయించడంతో పాటు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. అంతేకాక అర్హులకు తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో పాటు రూ.5 లక్షల బీమా చేయించనున్నట్లు చెప్పారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని, అందులో భాగంగా ఇటీవల పదవులు కేటాయించామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, నాయకులు దుర్గాప్రసాద్, కొడాలి గోవిందరావు, వెంకన్న, భద్రయ్య, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ‘విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేక నష్టం’ కొణిజర్ల: రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోగా, సీఎం వద్దే ఉండడంతో పాటు అన్ని శాఖలను ఒకే కార్యదర్శి చూసుకోవాల్సి రావడంపై విద్యాశాఖపై పర్యవేక్షణ కొరవడిందని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జె.సదానందగౌడ్ అన్నారు. కొణిజర్లలో గురువారం ఆయన సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. ఉపాధ్యాయులకు జీపీఎస్, జీఎల్ఐ, సరెండర్‌లీవ్ బకాయిలు రాకపోవడంతో రాష్ట్రంలో 18 వేలకు పైచిలుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక రెగ్యులర్ డీఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు ఉద్యోగులు లేక పాఠశాలలపై పర్యవేక్షణ తగ్గిందని వెల్ల డించారు. కాగా, పాఠశాలల రేషనలైజేషన్‌కు తాము వ్యతిరేకం కాకున్నా పాఠశాలలకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించి బలోపేతం చేయాలని సూచించారు. యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్ పర్వతరెడ్డి, నాయకులు వేముల మాధవరావు, షేక్ కరామత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
వివాదాస్పద భూమిపై సర్వే
చింతకాని: మండలంలోని మత్కేపల్లిలో వివా దాస్పదంగా మారిన భూమిని రెవెన్యూ ఉద్యోగులు గురువారం సర్వే చేశారు. మత్కేపల్లి రెవెన్యూ పరిధి 367వ సర్వే నంబర్లో 12.35 ఎకరాల పట్టా భూమి ఉండగా, ఇందులో ఎస్సీలకు ఇళ్ల స్థలాల కోసం 1981లో 4.32 ఎకరాలను ప్రభుత్వం అందజేసింది. మరో 7.04 ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటుండగా 39 కుంటలను కొందరు ఆక్రమించుకోవడంతో వివాదం ఏర్పడింది. ఈవిషయమై ఘర్షణ జరగగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆపై వివరాలను తేల్చేందుకు తహసీల్దార్ ఆదేశంతో గ్రామపెద్దల సమక్షాన సర్వే చేపట్టగా పట్టాదారులకు చెందిన 39 కుంటల భూమి ఆక్రమణకు గురైందని అధికారులు నిర్ధారించారు. సర్వేలో ఉద్యోగులు ఏకవీర, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న రెండు జిల్లాలస్థాయి చెస్ పోటీలు రుద్రంపూర్: కొత్తగూడెంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్లో ఈ నెల 29న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అండర్–12, 15 విభాగాల్లో జరిగే పోటీల్లో మొదటి 15 స్థానాలు సాధించే బాలబాలికలకు 30 ట్రోఫీలు అందిస్తామని వెల్లడించారు. స్విస్ లీగ్ పద్ధతిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు 94401 62749, 91822 25496 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత చెస్బోర్డ్తో ఆదివారం ఉదయం 9 గంటలకు గౌతమ్‌నగర్‌లోని గీతాంజలి పబ్లిక్ స్కూల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. సమావేశంలో చెస్ క్రీడాకారుడు సీహెచ్ గోపీకృష్ణ, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆదర్శ ఉద్యమనేత వెంకటస్వామి
ఖమ్మంసహకారనగర్: ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్(యూటీఎఫ్) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి ఆదర్శనీ యులని, ఆయన నేటిఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తారని రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని అన్నా రు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన వెంకటస్వామి వర్ధంతి సభలో ఆమె మా ట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి అనేక హక్కులు సాధించారని తెలి పారు. అనంతరం విశ్లేషకులు ఐ.వీ.రమణారావు మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దేశాల మధ్య ఇబ్బంది ఏర్పడినప్పుడు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలకు కట్టుబడి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు వెంకన్న, ష మీ, రాంబాబు, రాందా స్, సురేష్, ఉద్దండ్, పద్మ, నాగేశ్వరరావు, సుధాకర్, ప్రశాంతి పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ కిడ్నాప్
● ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు ● భూవివాదమే కారణమని అనుమానాలుముదిగొండ: ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త పాలు శిల్వరాజును బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయనను వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు గుర్తించి గంటల వ్యవధిలోనే రక్షించి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బుధవారం వేకువజామున శిల్వరాజు సెల్‌ఫోన్ ఇంట్లోనే పెట్టి వాకింగ్‌కు వెళ్లాడు. ఈ సమయాన బొలేరో వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ముసుగు వేసి వాహనంలో తీసుకెళ్లారు. ఆ వాహనం హైదరాబాద్ వైపు వెళ్తుండగా గుర్తించిన రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్ చేయడంతో... శిల్వరాజు కిడ్నాప్ అయినట్లు తెలియడంతో ఆయ న భార్య, ప్రస్తుత సర్పంచ్ పాము స్వర్ణలత పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయాన శిల్వరాజు తన కుటుంబీకులతో మాట్లాడతానంటూ కిడ్నాపర్లలో ఒకరి సెల్ నుంచి ఫోన్ చేయగా పిల్లలు మాట్లాడారు. ఆపై విషయాన్ని స్టేషన్లో ఉన్న స్వర్ణలతకు చెప్పడంతో నంబర్ తీసుకున్న సీఐ మురళి ఆదేశాల మేరకు ఎస్ఐ అశోక్, సిబ్బంది విచారణ మొదలుపెట్టారు. సెల్‌నంబర్ లొకేషన్ ఆధారంగా విచారిస్తుండడంతో వాహనం హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి శిల్వరాజును కిడ్నాపర్ల చెర నుంచి రక్షించి ఆరు గంటల్లోగా ముదిగొండకు తీసుకొచ్చారు. అప్పటికే స్టేషన్ వద్ద స్థానికులు పెద్దసంఖ్యలో ఉండడంతో వారి సమక్షాన ఆయనను కుటుంబానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకోవడమే కాక గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను అభినందించారు. భూమి పంచాయితీ పెద్దగా... పంగ్రేడుపల్లిలో ఒక భూమికి సంబంధించి కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో రెండు కుటుంబాల నడుమ ఘర్షణ పెరగగా, ఇరువర్గాల పెద్దమనుషులు పంచాయితీ చేసిన పరిష్కా రం కాలేదు. దీంతో రెండు కుటుంబాల నడుమ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న శిల్వరాజును ఒక వర్గం వారు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే భూవివాదాన్ని పరిష్కరించాలంటూ కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి విచారణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ మురళి తెలిపారు. -
అంతరాయం లేకుండా బొగ్గు రవాణా
సత్తుపల్లి: సత్తుపల్లి ఓసీల నుంచి బొగ్గు రవాణాలో అంతరాయం ఎదురుకాకుండా పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల్‌కృష్ణన్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన సత్తుపల్లి జేవీఆర్బీ సైడింగ్, సిగ్నలింగ్, ట్రాఫిక్ సిస్టమ్‌తో పాటు సిబ్బంది రన్నింగ్ రూంలోని వసతులను పరిశీలించారు. అంతేకాక సత్తుపల్లి సీహెచ్‌పీ వద్ద రైల్వే వ్యాగన్లలో బొగ్గులోడింగ్ను సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించి వివరాలు ఆరాతీశారు. అనంతరం రైల్వే, సింగరేణి అధికారులతో సమావేశమైన డీఆర్ఎం వ్యాగన్ల కేటాయింపు, లోడింగ్, బొగ్గురవాణాపై సమీక్షించారు. సింగరేణి అధికారులు బొల్లం శ్రీనివాస్, ప్రహ్లాద్, సోమశేఖర్‌రావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కారేపల్లిలో ఆగకుండానే... కారేపల్లి: కారేపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ పనులను డీఆర్ఎం ఆర్.గోపాలకృష్ణన్ బుధవారం పరిశీలిస్తారని, ఇందులో భాగంగా అధికారులు ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన కొత్తగూడెం స్టేషన్లో పరిశీలన తర్వాత కారేపల్లి స్టేషన్‌కు వస్తారని అధికారులు వెల్లడించారు. దీంతో డబ్లింగ్ లైన్ నిర్వాసితులతో పాటు ఇతర సమస్యలపై డీఆర్ఎంకు వినతిపత్రం ఇవ్వాలని సింగరేణి సర్పంచ్ టోనీవీరప్రతాప్, గ్రామస్తులు మధ్యాహ్నం 3గంటల నుంచి స్టేషన్లో వేచి ఉన్నారు. కానీ సాయంత్రం 4గంటల సమయాన డీఆర్ఎం ఉన్న రైలు కారేపల్లి స్టేషన్లో ఆగకుండానే డోర్నకల్ వైపునకు వెళ్లిపోవడంతో స్థానికులు నిరాశ చెందారు. సొమ్ము స్వాహాపై విచారణ కారేపల్లి: సింగరేణి మండలంలోని మోట్లగూడెం, మాధారం, పేరుపల్లి, గుట్టకిందిగుంపు, చీమలపాడు, భాగ్యనగర్‌తండా గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల్లో అవకతవకలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బుధవారం కారేపల్లి ఐకేపీ కార్యాలయంలో అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ ఆధ్వర్యాన విచారణ చేపట్టారు. తొలుత సుమారు రూ.12లక్షల మేర అవకతవకాలు జరిగాయనే ఆరోపణలతో మోట్లగూడెంలో వీఓలను విచారించారు. మిగతా గ్రామాల్లోనూ సీ్త్రనిధి పెండింగ్ నగదు వసూలు చేసి ఖాతాలో జమ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వారం తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపడుతామని తెలిపారు. ఈ విచారణలో డీపీఎం ఆంజనేయులు, సీ్త్రనిధి ఆర్ఎం రవీందర్‌నాయక్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రమేష్, ఏపీఎం పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సుపరిపాలనలో వార్డుసభ్యులే కీలకం తల్లాడ: గ్రామాల్లో ప్రజలకు సుపరిపాలన అందాలంటే వార్డుసభ్యులు కీలకంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు సూచించారు. తల్లాడ రైతు వేదికలో వార్డు సభ్యులకు బుధవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంలో సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు సహకరించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, ఇతర సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎంపీడీఓ శ్రీధర్‌రాజు, ఎంపీఓ సురేష్‌బాబుతో పాటు ఉద్యోగులు పరశురామ్, కృష్ణారావు పాల్గొన్నారు. -
పెసర రైతుల విలవిల
● మద్దతు ధర దక్కక ఆందోళన ● ప్రభుత్వ కొనుగోళ్లు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం ● క్వింటాకు రూ.1,500కు పైగా నష్టంఖమ్మంవ్యవసాయం: యాసంగిలో పెసర పంట సాగు చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పెసలు క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం యాసంగిలో సాగు చేసిన పెసర పంట చేతికి వస్తుండగా, కొందరు రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వపరంగా కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు గరిష్టంగా రూ.7,600 మించి చెల్లించడంలేదు. నాణ్యత తక్కువగా ఉంటే రూ.5వేలుగా ధర నిర్ణయిస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. తగ్గిన సాగు ఈ ఏడాది జిల్లాలో యాసంగి పంటగా పెసరను రైతులు 5వేల ఎకరాల్లో సాగు చేశారు. గతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ సాధారణంగా యాసంగిలో సుమారు 20 వేల ఎకరాల వరకు సాగు చేస్తారు. కానీ పెసరతో పోలిస్తే మొక్కజొన్నతో అధిక ఆదాయం ఉండడం, నీటి వనరులు పెరగడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పెసర విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది పెసర ఎకరాకు 5 – 6 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ... పెసల కొనుగోళ్లలో వ్యాపారులు నిర్ణయించిందే ధర అన్నట్టు సాగుతోంది. కేంద్రప్రభుత్వం క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించినా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటా రూ.5వేల నుంచి రూ.6,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రూ.5,500 నుంచి రూ.7,600 వరకు ధర పలుకుతోంది. పంటకు డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నాణ్యత లేదంటూ కోత పంట నాణ్యతగా ఉన్నా మద్దతు ధరతో పోలిస్తే క్వింటాకు రూ.1,500పైగా రైతులు నష్టపోతున్నారు. ఇక నాణ్యత లేని పంటకు రూ.5,500 మించి చెల్లించడం లేదు. మూడేళ్ల క్రితం వరకు నాఫెడ్ సహకారంతో మార్క్‌ఫెడ్ పెసలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కూడా ప్రభుత్వం రంగంలోకి దిగితే తప్ప రైతులకు న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు. -
జిల్లా జడ్జిని కలిసిన బార్ కౌన్సిల్ సభ్యుడు
ఖమ్మం లీగల్: ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది మందడపు శ్రీనివాసరావు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్నును కలిశారు. ఈ సందర్భంగా జడ్జి ఆయనను అభినందించారు. న్యాయవాదులు ఏడునూతల శ్రీనివాసరావు, దంతాల నారాయణ, ఇమ్మడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రేపు డాక్ అదాలత్ ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలకు సంబంధించి ఈనెల 27వ తేదీన శుక్రవారం ఉదయం 11గంటలకు ఆన్లైన్లో డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను ‘డాక్ అదాలత్’ పేరిట గురువారం వరకు ఖమ్మం పోస్టల్ డివిజన్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఫిర్యాదువెంట సెల్ నంబర్, ఈ–మెయిల్ పొందుపరిస్తే ఆన్లైన్లో జరిగే అదాలత్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. -
అనాథలకు అండగా కలెక్టర్
‘ఆసరా’ అందించాలని అధికారులకు ఆదేశం ఖమ్మంఅర్బన్: అనాథలు, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడైన అన్నం శ్రీనివాసరావు కలెక్టరేట్లో ఇటీవల జరిగిన సమావేశంలో తమ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథలు, వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన అనాథ శరణాలయంలోని అర్హులకు అవసరమైన ఆధార్, రేషన్‌కార్డులు, సదరం సర్టిఫికెట్లు ఇప్పించడమే కాక ఆసరా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈమేరకు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, బీసీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి, ఐటీ, ఆధార్ ఇన్చార్జ్ దుర్గాప్రసాద్ శరణాలయాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మానసిక సమస్యలు ఉన్నవారిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించేలా పోలీస్, న్యాయస్థానం సహకారంతో చర్యలు చేపడుతామని తెలిపారు. కాగా, అనాథ శరణాలయంలో ఉంటున్న వారికి పదేళ్ల తర్వాత ప్రభుత్వ సాయం అందేలా చొరవ చూపిన కలెక్టర్ అనుదీప్‌కు అన్నం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్చార్జ్ ఎంవీఐగా స్వర్ణలత వైరా: వైరా ఇన్చార్జ్ ఎంవీఐగా ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న స్వర్ణలతను నియమించారు. ఇక్కడ ఎంవీఐగా ఉన్న ఏ.వరప్రసాద్ మంగళవారం ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. ఈ మేరకు స్వర్ణలతకు బాధ్యతలు అప్పగించగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. -
వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి
ఖమ్మం సహకారనగర్: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) రాష్ట్ర కార్యదర్శి మేరి ఏసుపాదం డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా పెన్షనర్ల విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈమేరకు బుధవారం బ్లాక్ డేగా పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనలో ఆమె జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్యతో కలిసి మాట్లాడారు. ఇప్పటికే నూతన పెన్షన స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసిన కేంద్రప్రభుత్వం పెన్షనర్ల మధ్య కూడా చిచ్చుపెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈమేరకు వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాయల రవికుమార్, గుర్రాల శ్రీనివాసరావు, పెదమళ్ల సత్యనారాయణ, ఊడుగు వెంకటేశ్వర్లు, జల్లా వెంకటేశ్వర్లు, తాడి అంజలి పాల్గొన్నారు. పండితాపురం సంతలో కత్తితో దాడి కామేపల్లి: మండలంలోని పండితాపురం సంతలో ఓ వ్యక్తి నిర్వాహకులపై కత్తితో దాడిచేశాడు. ఏపీ రాష్ట్రంలోని వత్సవాయికి చెందిన మటన్ వ్యాపారులు షేక్ మస్తాన్‌వలీ, నాగసైదులు సంతలో ఐదు మేకపోతులను కొనుగోలు చేశారు. అయితే, రుసుము నాలుగింటికే చెల్లించి తీసుకెళ్తుండగా నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులు కత్తితో దాడిచేయగా బాదావత్ నాగరాజు, బోడాలక్ష్మాకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే, శీలం నాగేశ్వరరావు, బండిఉపేందర్కు గాయాలు కాగా, మరికొందరిపైనా దాడిచేసేందుకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ బోనకల్: మండలంలోని రావినూతలలో బుధవారం ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ అయింది. గ్రామానికి చెందిన షేక్ బేగం పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటి తలుపు కొట్టగా స్థానికులు పాల కోసం వచ్చారని ఆమె తెరిచింది. దీంతో సదరు వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పొదిలి వెంకన్న తెలిపారు. హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ ఖమ్మంవైద్యవిభాగం: హజ్ యాత్రకు ఎంపికై న వారికి ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో బుధవారం వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ ఆధ్వర్యాన 58 మంది యాత్రికులకు పరీక్షలు నిర్వహించి మెదడువాపు, ఫ్లూ జ్వరం నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్లు వేశారు. డీఐఓ ప్రదీప్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాదవ్, ఆర్ఎంఓ రాజేంద్రప్రసాద్, వైద్యులు శ్రీకాంత్, రాంప్రసాద్, నివేదిత, శ్యామల, ఉద్యోగులు రమణ, డీ నాగరాజు, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
నేడు ఎదుర్కోలు ఉత్సవం
● భద్రగిరి రామయ్య కల్యాణంలో కీలక ఘట్టం ● హిందూ, ముస్లిం మతసారమస్యం పెంపొందేలా భక్తులపై గులాల్ ● బ్రహ్మోత్సవాల్లో కమనీయంగా గరుడాధివాసంభద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. కల్యాణ మహోత్సవంలో కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం సాయంత్రం నిర్వహించనున్నారు. ‘మా అందమైన రామయ్య వంశమే గొప్పది’ అంటూ కొందరు, మరో వైపు ‘చక్కని సీతమ్మ తల్లి వంశమే గొప్పది’ అంటూ మరికొందరు అర్చకులు సమూహాలుగా విడిపోయి లయబద్ధంగా నాట్యమాడుతూ మిథిలా స్టేడియంలో సందడి చేయనున్నారు. హిందూ ఆచారం ప్రకారం ప్రతి ఇంటా కల్యాణంలో ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. ఆదర్శ జంటకు ప్రతీకలైన శ్రీ సీతారాముల పెళ్లి సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియం సీతమ్మవారికి మిథిలా నగరం కాగా, మరో పక్కనున్న వైకుంఠ ద్వారం రామయ్యకు చెందిన అయోధ్యగా అభివర్ణిస్తారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరును చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాచల దేవస్థానంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. కాగా నవాహ్నిక తిరుకల్యాణోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, శనివారం పట్టాభిషేక మహోత్సవాలు జరపనున్నారు. ధ్వజారోహణం, గరుడ ప్రసాదం పంపిణీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ మహా విష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవా కాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన జరిపి, కర్మణ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన జరిపారు. యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకొని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకములను తర్పానందంగాా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేని వారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ దామోదర్‌రావు దంపతులు, ఏఈఓలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారి కల్యాణం
ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈమేరకు బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈఓ జగన్మోహన్రావు దంపతులు, గ్రామపంచాయతీ తరపున సర్పంచ్ తుళ్లూరు నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు సమర్పించారు. అనంతరం ఉప్పల విజయదేవశర్మ దంపతులతో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ కల్యాణ క్రతువు చేయించారు. ఆ తర్వాత గ్రామ పెద్ద చెరువులో శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఽవ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, మాజీ జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, మాజీ సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఖమ్మంలీగల్: 2026–27 ఏడాదికి గాను జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి అధ్యక్ష, కార్యదర్శులు తప్ప మిగిలిన పోస్టులన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఈమేరకు అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్, యడ్లపల్లి రమేష్, వెంకటేశ్వరరావు గుప్తా, విజయరాఘవ, కార్యదర్శి పదవికి కందుల అమరనాధ్, కొప్పుల రవికుమార్, తాళ్ల వెంకట నారాయణ పోటీలో ఉన్నారు. కాగా, 980మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, గురువారం ఉదయం 10నుంచి సాయంత్రం 4–30గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎన్నికల అధికారులు పీఏజే.శేఖర్‌రాజ్, ఎంఏ.తౌఫిక్, ఎం.శ్రీనివాసరావు, పి.వెంకన్న తెలిపారు. బార్ అసోసియేషన్ హాల్లో జరిగే పోలింగ్‌కు ఓటర్లు గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర చింతకాని: ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటుచేసిన కేంద్రాల్లోనే మొక్కజొన్నలకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని తిమ్మినేనిపాలెం, తిరుమలాపురంల్లో బుధవారం ఆయన మొక్కజొన్న పంటను పరిశీలించి మాట్లాడారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటుచేసే కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మొక్కజొన్నలు తీసుకొస్తే మద్దతు ధర దక్కుతుందని తెలిపారు. అంతేతప్ప ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు. సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, ఏఈఓ కార్తీక్, రైతులు పాల్గొన్నారు. 2వ తేదీ వరకు దరఖాస్తు అవకాశం ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల కోసం ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా బ్యాంకు లింకేజీతో, లింకేజీ లేని పథకాల మంజూరుకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వాహనాలతో పాటు వ్యవసాయ డ్రోన్లు, పాడి పశువులు తదితర యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయేతర పథకాలకు 21నుంచి 50ఏళ్లు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 60ఏళ్ల వయస్సు వరకు అర్హులని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌తో tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని, కాపీలకు పత్రాలు జతచేసి ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి 30న జిల్లా స్థాయి పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 30న జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ పి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు మూడో తరగతి పాస్ సర్టిఫికెట్తో పాటు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఐదు పాప్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ఉదయం 8గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. మండల స్థాయి ఎంపికలకు హాజరు కాని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫామ్‌తో నేరుగా హాజరుకావొచ్చని తెలిపారు. -
రైతుల ప్రయోజనాలే లక్ష్యం
● వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి ● డీసీసీబీ మహాసభలో కలెక్టర్ అనుదీప్ఖమ్మంవ్యవసాయం: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సహకార సంఘాలు కృషి చేయాలని కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి అనుదీప్ దురిశెట్టి సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) 128వ మహాజన సభ బుధవారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. సహకార సంఘం ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడమే కాక వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే, పీఏసీఎస్‌ల్లో వివరాలు నమోదు చేసే సమయాన పొరపాట్లతో రైతులకు నష్టం జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొరపాట్లను పదిహేను రోజుల్లో సవరించకపోతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, రుణాలు సకాలంలో చెల్లించేలా రైతులకు అవగాహన కల్పిస్తూ, వారు ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. తొలుత బ్యాంక్ ప్రగతి, పీఏసీఎస్‌ల బలోపేతంపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసమావేశంలో నాబార్డ్ డీడీఎం ఎల్.సుజిత్‌కుమార్, టీఎస్ సీఏబీ డీజీఎం కె.రవికాంత్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, భద్రాద్రి డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ పనులు తనిఖీ ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని జిల్లా గ్రంథాల యం అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూనే గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించా రు. లైబ్రరీ ఆవరణలో అదనపు భవనం, ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి అధికా రులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు, ఇంకా ఏమైనా పుస్తకాలు అవసరమా అని ఆరా తీశా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు భాస్కర్‌రావు, అఖిల్, రవిబాబు పాల్గొన్నారు. -
రూ.15కోట్ల ప్రగతి కానుక !
ఖమ్మం కార్పొరేషన్‌కు నిధుల మంజూరు ● ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీల నిర్మాణానికి కేటాయింపు ● భక్త రామదాసు కళాక్షేత్రం పునరుద్ధరణకు పచ్చజెండాఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటైన ఖమ్మంలో సుందరీకరణ పనులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యవసర, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.15 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్(సీడీఎంఏ) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానిక అవసరాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజల జీవన ప్రమాణాల పెంపును దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరపు ప్రత్యేక గ్రాంట్ల ప్రణాళికలో భాగంగా కమిషనర్ అభిషేక్ అగస్త్య పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పక్కా ప్రణాళిక కేఎంసీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులతో వివిధ డివిజన్లలో ప్రాధాన్యత కలిగిన పది పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా వైరా రోడ్డు, ఇల్లెందు రోడ్డు, లకారం చెరువు పరిసర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. వీటికి అనుసంధానంగా మురుగునీటి పారుదలను మెరుగుపరిచేందుకు డ్రెయిన్ల నిర్మాణం చేపడుతారు. కళాకారుల కోసం.. ఖమ్మం నగర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు రూ.కోటి నిధులు కేటాయించడంపై కళాకారులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో కళాక్షేత్రంలో సౌకర్యాలు మెరుగుపడి మరిన్ని ప్రదర్శనలకు వేదిక కానుంది. కళాక్షేత్రం ఆధునికీకరణ చేశాక నిర్వహణ బాధ్యతలు, ఉద్యోగుల వేతనాలు చెల్లింపు కేఎంసీ ద్వారా చేపడతారు. ఇందుకోసం త్వరలోనే కళాక్షేత్రం నిర్వహణ కేఎంసీ పరిధిలోకి తీసుకోనున్నారు. అలాగే, నయాబజార్ ప్రాంతంలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో కేఎంసీ శాశ్వత ఆదాయ వనరులు సమకూరనున్నాయి. పర్యవేక్షణ బాధ్యతలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరుకావడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు నాణ్యతతో వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్‌ను సీడీఎంఏ డైరెక్టర్ ఆదేశించారు. అలాగే, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అటు కలెక్టర్, ఇటు కమిషనర్‌కు సూచించినట్లు సమాచారం. -
కొరత ప్రచారంతో బంక్‌ల్లో బారులు
సత్తుపల్లిరూరల్: యుద్ధం ప్రభావంతో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడగా.. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగ్గుతున్నాయనే ప్రచారం వాహనదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈమేరకు బుధవారం రాత్రి సత్తుపల్లిలోని బంక్‌ల్లో పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులు క్యూ కట్టారు. పలువురు వాహనాల ట్యాంకుల్లో ఇంధనం నింపించడమే కాక 10, 20, 50 లీటర్ల క్యాన్లలో తీసుకెళ్లడం కనిపించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. ప్రతిరోజు ట్యాంకర్లు వస్తున్నాయని బంక్‌ల యాజమానులు చెప్పినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. -
అప్రమత్తంగా వ్యవహరించాలి
వైరా: ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా నియోజకవర్గ స్థాయి అధికారులకు వైరాలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సవరించాలని తెలిపారు. అలాగే, 18ఏళ్లు నిండి వారి నమోదు, అనర్హుల తొలగింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమనే అంశాన్ని వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐదు మండలాల తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మెగా జాబ్‌మేళాలో 214 మంది ఎంపిక
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కళాశాల కెరీర్ గైడెన్స్ ప్లేస్మెంట్ సెల్ – టీఎస్కేసీ సం యుక్త ఆధ్వర్యాన మంగళవారం మెగా జాబ్‌మేళా నిర్వ హించారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన జాబ్‌మేళాకు 423మంది నమోదు చేసు కోగా, ఇంటర్వ్యూల అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 214మంది ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. వీరికి నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ప్లేస్ మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ చందా సుధాకర్, టీఎస్కేసీ కోఆర్డినేటర్ ఎం.మాధవి, వివిధ విభాగాల బాధ్యు లు డాక్టర్ రమాసత్యవతి, డాక్టర్ ఎం.సునంద, యాలాద్రితో పాటు వై. రమేశ్, నరేశ్, మోజెస్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ ఉద్యోగికి గాయాలు
కొణిజర్ల: విధుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కార్యాలయానికి వెళ్తున్న ‘సాక్షి’దినపత్రిక ఉద్యోగి ప్రతా పురం శ్రీనివాస్‌ను లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మంగళవారం సాయంత్రం బైక్‌పై వస్తూ కార్యాలయంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాల య్యాయి. దీంతో ఉద్యోగులు, స్థానికులు ఆయనకు తనికెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, లారీ పశ్చిమబెంగాల్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొణిజర్ల పోలీసులు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
తెలంగాణలో ఫార్మా సెజ్‌లకు ప్రాధాన్యత
చెల్లని చెక్కు కేసులో రెండేళ్ల జైలుశిక్ష ఖమ్మంలీగల్: ఖాతాలో సరిపడా నగదు లేకున్నా చెక్కు జారీ చేసిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం శ్రీరామ్ హిల్స్‌కు చెందిన బెల్లం మనోహర్‌రావు వద్ద ప్రశాంతినగర్‌కు చెందిన షేక్ ఖద్దూస్ అప్పు తీసుకున్నాడు. ఆపై 2024 నవంబర్‌లో రూ.25 లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో మనోహర్‌రావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణలో ఆయనపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. కాగా, మరో కేసులో ఖమ్మం పాకబండబజార్కు చెందిన మహమ్మద్ అంజాద్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఆబ్కారీ కోర్టు న్యాయమూర్తి అఖిల తీర్పు చెప్పారు. కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం? కారేపల్లి: కారేపల్లిలో నకిలీ మద్యం అమ్ముతున్నారనే సమాచారం కలకలం రేపింది. బెల్టు దుకాణాల్లో మద్యం సీసాల మూతలు తెరిచి, ఆపై కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ప్రచారంతో సోమ, మంగళవారం ఎకై ్సజ్ సీఐ స్రవంతి, ఎస్ఐ వసంతలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది తనిఖీలు చేపట్టారు. లావుడ్యాతండా, భాగ్యనగర్ తండాల్లోని బెల్ట్ షాపుల్లో మూతలు తెరిచి ఉన్న 114 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలోని ఒకే వైన్స్ నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అయిందనే అనుమానంతో విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై సీఐ స్రవంతిని వివరణ కోరగా.. బెల్టు షాపుల్లో మద్యం సీసాల మూతలు వదులుగా ఉండడంతో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఖమ్మంరూరల్: మండలంలోని పడమటితండాకు చెందిన మాలోతు జగ్గా (41) అప్పుల బాధ తాళ లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ న చికిత్సతో పాటు కుటుంబ అవసరాలకు రూ.4లక్షల అప్పులు చేశాడు. ఇవి తీర్చే మార్గం లేక ఈనెల 7న ఇంట్లో ఎవరూ లేని సమయాన గడ్డి మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స చేయిస్తుండగా మంగళవారం మృతి చెందాడు. ఘటనపై జగ్గా కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో ఔషధరంగ అభివృద్ధికి ప్రత్యేక ఆర్థికమండలి (ఎస్ఈజెడ్లు/సెజ్‌లు) కీలకంగా మా రుతున్న నేపథ్యాన తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీరామ సహాయం రఘు రాంరెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం 15ఫార్మా ఎస్ఈజెడ్లు నోటిఫై అయ్యాయని వెల్లడించారు. తెలంగాణలో ఫార్మారంగ అభివృద్ధికి ఇవికీలకంగా మారుతుండగా, 56 ఔషధ యూనిట్లు కొనసాగుతున్నాయని వివరించారు. -
పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
నిరసనలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యో గులకు సంబంధించి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీ, పెండింగ్ డీఏలు ప్రకటించా లని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మంగళవారం చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించకుండా స్కూళ్లు కలపడం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు నిర్ణయం సరికాదన్నారు. అంతేకాక సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్వో పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనకు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవికుమార్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంజన్ సంఘీభావం తెలపగా టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ, రాష్ట్ర, జిల్లా నాయ కులు ఆర్.రమాదేవి, ముత్తయ్య, శ్యాంసుందర్, కె.వెంకటేశ్వరరావు, బి.వీరబాబు, గంధసిరి మల్లయ్య, కె.సంధ్యారాణి, జి.వెంకటేశ్వరరావు, హన్మంతరావు, ఎం.నాగిరెడ్డి, ఎం.ఉమాదేవి, ఆకుల నాగేశ్వరరావు, గరికి శ్రీనివాస్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. కామేపల్లి: మండలంలోని కొమ్మినేపల్లి (పండితాపురం)లో జరిగే శ్రీ కృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత బహిరంగ వేలం మూడోసారి కూడా వాయిదా పడింది. సంత ఆవరణంలో మంగళవారం సర్పంచ్ ధరావత్ అనురాధ అధ్యక్షతన వేలం నిర్వహించగా భూక్యా వీరన్న, ధరావత్ విన్నిబాబు, గుగు లోత్ వినోద్‌బాబు, బోడా శ్రీను పాల్గొన్నారు. గత వారం నిలిచిపోయిన రూ.1,82,80,000 వద్ద వేలం మొదలుపెట్టగా చివరకు రూ.2.09 కోట్లతో భూక్యా వీరన్న హెచ్చు పాటదారుడిగా నిలిచాడు. అయితే, ప్రభుత్వ మద్దతు ధర రానందున వాయిదా వేస్తున్నట్లు కల్లూర్ డీఎల్పీఓ విజయలక్ష్మి ప్రకటించారు. కానీ అధికారులు మొద టి, రెండో హెచ్చు పాటదారుడి డిపాజిట్ తిరిగి చెల్లించ లేదు. సంత కౌలు బాధ్యతలు అప్పగించే విషయమై బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గం నుంచి నివేదికను ఉన్నతాధికారులకు పంపించి, వారి సూచనలతో నిర్ణయం వెలువరిస్తామని కార్యదర్శి శంకర్ తెలిపారు. కాగా, ప్రభుత్వ మద్దతుధర తగ్గించి, సంతలో వసతులు కల్పించాలని డీసీసీబీ మాజీ డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్, కొండాయిగూడెం పీఏసీఎస్ మాజీ చైర్మన్ ధనియాకుల హన్మంతరావు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శాస్త్రి, ఉపసర్పంచ్ మేకల మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలుఎర్రుపాలెం: మండలంలోని జమలాపురంలో శ్రీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఆరో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిత్య పూజలతో స్వామికి పుష్పయాగం నిర్వహించారు. అలాగే, శేష వాహనంపై గిరి ప్రదక్షిణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, సూపరింటెండెంట్ సోమయ్య, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో పోడు వివా దంమళ్లీ రాజు కుంది. కాకర్లపల్లి బీట్‌లోని 157, 158 ఫారెస్ట్ కంపార్ట్మెంట్లలో 25ఎకరాల అటవీభూమికి పట్టాలు ఇవ్వాలని సత్తుపల్లి ఒకటో వార్డుకు చెందిన నాయకపోడు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2022లో అప్పటి ప్రభుత్వం 75 ఎకరాలకు పట్టాలు ఇచ్చినా, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అటవీశాఖ అధికారులు 25ఎకరాల్లో జామాయిల్ ప్లాంటేషన్ వేయాలని ట్రెంచ్ కొట్టిస్తున్నారు. మంగళవారం కూడా ఎఫ్ఆర్ఓ స్నేహలత ఆధ్వర్యాన పనులు చేపడుతుండగా గుడిపాడు కాలనీకి చెందిన పూచి వరలక్ష్మి, రాజిని దుర్గ ఆధ్వర్యాన నాయకపోడు మహిళలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. సీఐ టి. శ్రీహరి సిబ్బందితో చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమ యి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్‌తో మాట్లాడే వరకు సంయమనం పాటించాలని సూచించడంతో ఆందోళన విరమించారు. -
క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
నేలకొండపల్లి: గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో జాతీ య స్థాయికి ఎదగాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలస్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభను వెలికితీసేలా ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. నేలకొండపల్లి లో మినీ స్టేడియం ఏర్పాటు అంశా న్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. నిర్వాహకులు కోడిరెక్క వినోద్‌తో పాటు మార్కెట్ చైర్మన్ వెన్న పూసల సీతారాములు, కాంగ్రెస్ నాయకులు కోడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, వెంకన్న, పసుపులేటి ఉపేందర్, బొందయ్య, మైశా శంకర్, రాయపూడి రోహిత్, జెర్రిపోతుల సత్యనారాయణ, దోస పాటి శేఖర్, ధీరావత్ రాధాకృష్ణమూర్తి, కడియాల నరేశ్, నల్లాని మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలతో చిన్నాభిన్నం
ఖమ్మంక్రైం: మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితమే కాక కుటుంబ వ్యవస్థ, సామాజిక భద్రత చిన్నాభిన్నమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యాన ఖమ్మం సెయింట్ మేరీస్ హైస్కూల్లో మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజం నుంచి మాదకద్రవ్యాలను తరిమికొట్టేలా అందరూ కలిసి రావాలని సూచించారు. విక్రయాలు, వినియోగం సమాచారం తెలిస్తే పోలీసులకు కానీ 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ఉపాధ్యాయులు గమనిస్తూ వారిని సన్మార్గంలో నడిపించాలని సూచించారు. కాగా, ఖమ్మం గాంధీచౌక్ వద్ద గోల్డెన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సదస్సులో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడారు. మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర ఏసీపీ రమణమూర్తి, డీడబ్ల్యూఓ విజేత, జిల్లా ఎకై ్స జ్ శాఖాధికారి నాగేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రవీణ్‌కుమార్, కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, కృష్ణ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లానే లక్ష్యం ఖమ్మంఅర్బన్: జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం బాలాజీ నగర్‌లోని యూపీహెచ్‌సీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాటు జిల్లాలోని 94 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా బాధితులను గుర్తిస్తామన్నారు. టీబీ ఉన్నట్లు తేలినవారికి చికిత్స అందిచడం ద్వారా నిర్మూలనే లక్ష్యమని తెలిపారు. అనంతరం మేయర్ పి.నీరజ మాట్లాడగా బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. డీఎంహెచ్ఓ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడాలి ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ సమావేశంలో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు 36 శాతం మంది పిల్లలు మాత్రమే 21 రోజుల కంటే ఎక్కువగా వస్తుండడానికి కారణాలు ఆరా తీయాలని తెలిపారు. సీడీపీఓలు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించి పిల్లలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఖమ్మం అర్భన్, మధిర మండలంలో పరిస్థితి మెరుగుపడకపోతే బాధ్యులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. డీడబ్ల్యూఓ వేల్పుల విజేత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రదీప్‌బాబు, ిసీడీపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
పోలీసు పంజా
అక్రమార్కులపైఏసీబీకి చిక్కిన ఎంవీఐబుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలోని భూదాన్ భూములను అడ్డుగా పెట్టుకుని సాగిన కోట్లాది రూపాయల భూదందా వ్యవహారాన్ని నిగ్గు తేల్చేలా పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిరుపేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిన పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే సమయాన బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ము రాబట్టడమే లక్ష్యంగా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిద్ధమవుతున్నారు. ఇక ఇళ్లు కోల్పోయిన వారిలో 311మందికి ప్రభుత్వం భూదాన్ భూముల్లోనే ఇప్పటికే ఇళ్ల స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, మరో 101మందికి వారి స్వగ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ప్రస్తుతం భూదాన్ భూముల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్న అధికారులు, ఇంకా అర్హుల ఉంటే గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నారు. 31.7 ఎకరాలు స్వాధీనం.. భూదాన్ భూముల్లో స్థలాలు ఇప్పిస్తామని చెప్పిన అక్రమార్కుల మాటలను అమాయకులు నమ్మడంతో యథేచ్ఛగా విక్రయించారు. స్థలం వస్తుందనే ఆశతో బాధితులు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నిందితులకు అప్పగించారు. ఆపై రేకుల షెడ్లు, గుడిసెలు, కొందరు స్లాబ్ వేసుకోగా నిర్మాణాలకు అనుమతులు లేవని తేలడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గత 24న కూల్చివేసింది. దీంతో అక్రమార్కులను నమ్మి నిర్మాణాలు చేపట్టిన నిరుపేదలు రోడ్డున పడ్డారు. ఈమేరకు దాదాపు రూ.250 కోట్ల విలువైన 147, 148, 149 సర్వే నంబర్లలోని 31.7 ఎకరాల భూదాన్ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆస్తుల గుర్తింపు, రికవరీ నిందితులు ముఠాగా ఏర్పడి ఒక్కో ప్లాట్‌ను ముగ్గురు, నలుగురికి విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాక పేదల నుంచి వసూలు చేసిన సొమ్ముతో నలుగురు నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను పోలీసులు గుర్తించారు. చట్టపరంగా ఈ ఆస్తులను విక్రయించి లేదా జప్తు చేసి రికవరీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముగ్గురు సీఐలతో కూడిన బృందం సొమ్ము రికవరీపై దృష్టి సారించగా.. మరికొందరు నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసేలా అధికారులకు సిఫారసు చేశారు. పలువురిపై పీడీ యాక్ట్? భూదాన్ భూముల్లో అక్రమాలకు పాల్పడిన నిందితుల్లో ప్రధాన వ్యక్త్తులపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. నిందితులు పథకం ప్రకారం అమాయకులను మోసం చేసినందున పకడ్బందీ కేసులు నమోదు చేయడంతోపాటు పీడీ యాక్ట్ కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తద్వారా నిందితులకు శిక్ష పడడంతో పాటు భవిష్యత్‌లో మోసాలకు పాల్పడకుండా ఉండేలా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు అండగా.. అక్రమార్కుల మాటలు నమ్మి భూదాన్ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రభుత్వం అక్కడే ఇళ్ల స్థలాల కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడతలో సర్వేలో 415మంది అర్హులను గుర్తించి, అందులో 311 మందికి భూదాన్ భూముల్లోనే స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మరో 101 మందికి జిల్లాలోని వారి స్వస్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పత్రాలు అందజేశారు. అయితే, బాధితులు మరికొందరు ఉండడంతో సర్వే కొనసాగిస్తున్నారు. మరోపక్క భూదాన్ భూమిని చదును చేయడం, మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి.భూదాన్ భూమిలో వేసిన భగీరథ పైపులైన్భూముల ఆక్రమణ, పేదలను మోసగించిన వారిపై ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాధితుల నుంచి నిందితులు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదులతో జిల్లాలోని ఆరు పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 24 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 60 మంది నిందితులు ఉండగా, 16మంది అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులైన పోలెబోయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను మెజిస్ట్రేట్ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు.‘భూదాన్’ వ్యవహారంపై వేగంగా విచారణ -
నాణ్యతా లోపంపై ఆగ్రహం
పెనుబల్లి/కల్లూరు: పెనుబల్లి మండలంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన ఆమె కాలేజీ భవన మరమ్మతు పనుల్లో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతాలోపంతో జరుగుతుండగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈమేరకు కాంట్రాక్టర్‌తో పాటు పీఆర్ జేఈ, కళాశాల ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత ప్రభుత్వాస్పత్రిలో పరిశీలించి డాక్టర్ కిరణ్‌కుమార్‌కు సూచనలు చేశారు. అలాగే, కల్లూరు మున్సిపల్ కార్యాలయం, నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్, మున్సిపల్ చైర్మన్ డి.మోహన్ నాయక్, ఇన్చార్జ్ కమిషనర్ కె.నరసింహారావు, మేనేజర్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.పలువురికి షోకాజ్ నోటీసులు -
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం 16వ డివిజన్ సీతారాంపురం(అగ్రహారం)లోని ఆలయాల సముదాయంలో దేవతామూర్తుల విగ్రహాలు, బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ వీరాంజనేయ, శ్రీ దాసాంజనేయ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మైసమ్మ అమ్మవార్ల దేవాలయాలు, గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠా పూజలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అర్చకుడు బొర్రా వాసుదేవాచార్యులు బృందం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా సోమవారం జలబిందెల ఊరేగింపు, విగ్రహాల గ్రామోత్సవం జరిగింది. అలాగే, బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, నిరీశతో పాటు తుమ్మ అప్పిరెడ్డి, ఆళ్ల అంజిరెడ్డి, ఆకుల నర్సింహారావు, బొమ్మిశెట్టి రమేష్, చెరుకూరి కోటేశ్వరరావు, నర్ల శ్రీను, మల్లేశ్వరి, రమాదేవి, సుజాత, ఆదూరి రాజవర్దన్‌రెడ్డి, నల్లగట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీవారిని పెళ్లి కుమారుడిగా, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించడంతో పాటు స్నాతకం, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి తరఫున పెళ్లి పెద్దలుగా ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్‌శర్మ, అమ్మవార్ల తరఫున వేద పండితులు, అర్చకులు మారుతీ రఘురామకృష్ణ, మారుతి వెంకటరమణ వ్యవహరించారు. ఈ సందర్భంగా గోత్ర ప్రవరలు, గుణగణాలను వర్ణిస్తూ ఇరువర్గాల సంవాదం ఉత్సాహంగా సాగింది. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, సూపరింటెండెంట్ సోమయ్య, అర్చకులు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.ఎస్సెస్సీ పరీక్ష విధుల నుంచి ముగ్గురి తొలగింపు ఖమ్మం సహకారనగర్: పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిని తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ తెలిపారు. బోనకల్ జెడ్పీహెచ్ఎస్లో ఇన్విజిలేటర్ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో రిలీవ్ చేయడమే కాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్ల డించారు. అంతేకాక సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను సైతం విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కాగా, సోమవారం జరిగిన పరీక్షకు 16,936మంది విద్యార్థుల్లో 16,918మంది హాజరు కాగా 18మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలోని పలు కేంద్రాలను తనతో పాటు అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని డీఈఓ తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం 3.35లక్షల మంది ఖాతాల్లో రూ.169.35 కోట్లు ఖమ్మంవ్యవసాయం: రైతు భరోసా పథకం కింద రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన పెట్టుబడి సాయం తొలి విడత నిధులు సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుత యాసంగి కాలానికి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో ఎకరం విస్తీర్ణం వరకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. జిల్లాలో మొదటి విడతగా 3,35,062 మంది రైతులు అర్హత సాధించారు. వీరి ఖాతాల్లో రూ.169.35 కోట్లు జమ కాగా, మిగతా వారికి విడతల వారీగా జమ అవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. బార్ కౌన్సిల్ మెంబర్‌గా శ్రీనివాసరావు ఖమ్మం లీగల్: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్‌గా ఖమ్మం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, సోమవారం చేపట్టిన లెక్కింపులో ఆయన విజయానికి అవసరమైన 1,085 ఓట్లు సాధించినట్లు తేలింది. దీంతో శ్రీనివాసరావు విజయాన్ని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఈమేరకు పలువురు న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజావాణి దరఖాస్తుకు స్పందన
ఖమ్మం సహకారనగర్: రెండు వారాల క్రితం ప్రజావాణిలో అందిన దరఖాస్తుపై స్పందించి మానవీయ కోణంలో చర్యలు చేపట్టామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రాయల రమేశ్ – సులోచన దంపతులు 20 ఏళ్ల క్రితం ఖమ్మంకు వలస వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు అజయ్(18)కు మెదడు ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమయ్యాడు. సొంత ఇల్లు లేక, పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు రమేష్ దంపతులు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో విన్నవించారు. దీంతో స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. ఈమేరకు సోమవారం అల్లీపురంలోని డబుల్ బెడ్రూం సముదాయం ఐదో బ్లాక్‌లో జీ7 ఇంటిని కేటాయిస్తూ పత్రాలను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు వారికి అందజేశారు. ఈమేరకు తమ సమస్యపై స్పందించి ఇల్లు కేటాయించిన అధికారులకు రమేష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు -
కేన్సర్‌ను కట్టడి చేసేలా...
● జిల్లాలో కొనసాగుతున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ● ఎనిమిది సెంటర్లలో బాలికలకు టీకాలు ● ఇప్పటి వరకు 2,230 మందికి పూర్తిఖమ్మంవైద్యవిభాగం: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతనెల 28వ హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఆపై ఈనెల 8వ తేదీన ఖమ్మం పెద్దాస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ దుదిశెట్టి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా జిల్లాలో అందుబాటులోకి వచ్చినట్లయింది. జిల్లావ్యాప్తంగా 14 ఏళ్లు పూర్తయి 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు ఈ టీకా వేయనున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, మధిర, వైరా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వ సెలవులు మినహా ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాలికలకు టీకా వేస్తుండగా, ఇప్పటివరకు 2,230 మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. దశల వారీగా విస్తరణ హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం జిల్లాలో మూడు నెలల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం ఎనిమిది కేంద్రాల్లో టీకా వేస్తుండగా, త్వరలోనే 24 గంటలు నడిచే బనిగండ్లపాడు, చింతకాని, ఏన్కూరు, సింగరేణి ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా పీహెచ్‌సీల్లో కూడా టీకాను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇన్ఫెక్షన్లతో కేన్సర్ జిల్లాలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గార్డాసిల్–4 అనే టీకా వేయనుండగా, ఇది బాలికల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌ను అరికడుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వయస్సు బాలికల్లో హర్మోన్ల మార్పుల కారణంగా ఇన్ఫెక్షన్లు సోకుతాయని, సరైన చికిత్స తీసుకోకపోతే గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు కేన్సర్‌ను అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన బాలికలు సుమారు 15వేల మందికి పైగా ఉంటారనే అంచనాకు వచ్చారు. వీరందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 2,230మంది బాలికలకు వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు. సెంటర్లలో సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున, అపోహలు విడనాడి టీకా వేయించుకుని సర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఆస్పత్రి, సబ్‌స్టేషన్‌కు 35కుంటల స్థలం
కల్లూరు: కల్లూరు మండలంలోని నారాయణపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు సోమవారం 35 కుంటల భూమిని వితరణ చేశారు. పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సోమవారం భూమి పత్రాలను ప్రభుత్వ వైద్యాధికారి నవ్యకాంత్, విద్యుత్ ఏడీఈ సగ్గుర్తి రామారావుకు అందజేశారు. ఆరోగ్య కేంద్రానికి సర్వే నంబర్ 137లోని 20కుంటలు, సబ్‌స్టేషన్‌కు 15 కుంటలు కేటాయించారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు భూమి పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దేవర వాసుదేవరావుతో పాటు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పి.అంజిరెడ్డి, కె.కృష్ణారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వితరణ చేసిన మంత్రి పొంగులేటి కుటుంబం -
లెక్క.. పక్కాగా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జనగణన కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కేంద్రప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఈ ఏడాది మే నెలలో ఇళ్ల గుర్తింపు, జనాభా గణన బ్లాక్‌లను గుర్తించనున్నారు. ఇందుకోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నియమితులైన అధికారులకు ఈనెల 15 నుంచి 17 వరకు కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఈసారి జనగణన మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో చేపడతారు. నియామకాలు పూర్తి జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జనగణన కోసం అధికారుల కసరత్తు వేగిరమైంది. జిల్లా నుంచి మండల స్థాయి వరకు అధికారుల నియామకాలను పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి అదనపు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, డీఆర్ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే, జెడ్పీ సీఈఓ, సీపీఓ, డీఈఓ, డీపీఓ, డీఐఓ, స్టాటిస్టికల్ ఆఫీసర్, ప్రణాళిక శాఖ ఏడీలు అదనపు జిల్లా సెన్సెస్ అధికారులుగా ఉంటారు. మరోవైపు సబ్ డివిజన్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, మండల స్థాయిలో అధికారులకు బాధ్యతలను అప్పగించారు. మూడు రోజుల శిక్షణ జనగణన లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా జరిగేలా ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు గణన అధికారులకు కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్లు, మేనేజర్లకు జనగణన విభాగం డైరెక్టరేట్‌కు చెందిన సంయుక్త సంచాలకులు శ్రీకాంత్, మాస్టర్ ట్రెయినర్ రవికుమార్ శిక్షణను ఇచ్చారు. ఇంటి జాబితా, ఎన్యుమరేషన్ బ్లాక్‌ల ఎంపికతోపాటు వచ్చే ఏడాది జరిగే జనగణన పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. వీరు మండల స్థాయిలో అధికారులకు ఈనెల 28, 29, 30వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి.. ఈ ఏడాది మే నెలలో ప్రాథమిక సర్వే చేపట్టనుండగా.. పూర్తి స్థాయి జనగణన 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. తొలిసారి డిజిటల్ విధానంలో గణన చేపడుతున్నందున ప్రజలు వెబ్ ఆధారంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇక జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం పథకాల రూప కల్పన, అమలుకు జనగణన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. తొలిసారి డిజిటల్ విధానంలో గణన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు వెబ్ ఆధారంగా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశముంది. మొదటి దశలో ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ఈ ఏడాది మే 11నుంచి జూన్ 9వరకు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశ జన గణన ఉంటుంది. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ప్రధాన జనగణన ఇబ్బంది లేకుండా చేపట్టాలనే ఉద్దేశంతో అధికారులు ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు సర్వే చేపడతారు. తొలుత ఒక ప్రాంతంలో నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను సేకరించడమే కాక వాటికి నంబర్లు కేటాయించి జాబితా రూపొందించారు. అలాగే, ఎన్యుమరేషన్ బ్లాక్(జనాభా గణన బ్లాక్‌లు)లు కూడా ఏర్పాటవుతాయి. ఆపై జనగణనను సులువుగా చేపట్టేలా పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్న ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతీ బ్లాక్‌కు కేటాయించే అధికారి వారి పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారు. ఏ ఇల్లు కానీ, వ్యక్తిని కానీ వదిలేయకుండా వివరాలు క్రమపద్ధతిలో సేకరించేలా ఇళ్ల జాబితా, జనాభా గణన బ్లాక్‌లను రూపొందిస్తారు. దీన్ని జన గణనలో ప్రాథమిక దశగా వ్యవహరిస్తారు.జనగణనకు యంత్రాంగం కసరత్తు -
అక్కడక్కడా చినుకులు
ఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సోమవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. గేటుకారేపల్లిలో 2.8మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, కామేపల్లి మండలం లింగాల, రఘునాథపాలెం, ఖమ్మంలోని ప్రకాష్‌నగర్, శ్రీనివాసనగర్, సుందరయ్యనగర్, వ్యవసాయ మార్కెట్ తది తర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మొక్కజొన్న, వరి, మిర్చి కోతలు జోరుగా సాగుతున్నాయి. దీంతో కోసిన పంటపై టార్పాలిన్ పట్టాలు కప్పుతూ రక్షించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సోమవారం పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37.1, కనిష్టంగా 33.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల్లో 40 డిగ్రీలకు చేరే అవకాశముందని తెలుస్తోంది. కాగా, వేంసూరు మండలంలోని మర్లపాడు, కందుకూరు తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో వడ్లగండ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న పంట నేలవాలింది.అన్నదాతల్లో గుబులు -
వరికి ‘తాలు’ కాటు..
సత్తుపల్లిరూరల్: నకిలీ వరి విత్తనాలతో నట్టేట మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి వంగడాన్ని సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, గౌరిగూడెం, రేజర్లతో పాటు వేంసూరు మండలంలోని భీమవరానికి చెందిన రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా సాగు చేశారు. అయితే, కంపెనీనే నకిలీ విత్తనాలను సరఫరా చేసిందని, తద్వారా తాలు కంకులు రావడంతో నష్టపోయామని చెబుతున్నారు. పెట్టుబడి కూడా రాక... వరి విత్తనాలను 20 కేజీల ప్యాకెట్ రూ.1,300 చొప్పున కొనుగోలు చేశామని రైతులు చెబుతున్నారు. ఒక్కో రైతు ఐదు నుంచి పది ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ 15048 విత్తనాలతో సాగు చేయగా ప్రస్తుతం పంట వయస్సు 130 రోజులు దాటింది. అయితే, కోతకు వచ్చినా కంకులు తాలు కావడంతో కోసే పరిస్థితి లేదని.. కూలీలకు డబ్బు చెల్లించడం తప్ప కనీసం పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి పెడితే, 50 – 70శాతానికిపైగా తాలు కుంకులు రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్ దుకాణం యజమాని శ్రీరామ సీడ్స్ కంపెనీకి చెందిన ఈ వంగడంతో మంచి దిగుబడి వస్తుందని చెప్పడంతో నమ్మిన తాము మోసపోయామని వెల్లడించారు. ఈ విషయమై డీలర్ దృష్టికి తీసుకెళ్లడమే కాక కంపెనీ యజమానులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈమేరకు కంపెనీపై అధికారులు చర్యలు తీసుకుని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. శాస్త్రవేత్తల పరిశీలన సత్తుపల్లి మండలంలోని గౌరిగూడెం, సిద్ధారం, రేజర్లల్లో సాగు చేసిన శ్రీరామ అగ్రి జెనిటిక్స్ కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్–15048 వరి రకం పంటలో తాలు ఎక్కువగా వచ్చిందని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ టి.పావని, పీఎస్ఎం.ఫణిశ్రీ, వరంగల్ విత్తన ధ్రువీకరణ అధికారి టి.వేణుమాధవ్, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓ కె.ఆశాజ్యోతి సోమవారం పొలాలను పరిశీలించారు. పంటల నమూనాలను సేకరించగా, పరీక్షల అనంతరం వివరాలు వెల్లడవుతాయని వారు తెలిపారు. రైతులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రసాద్, గొర్ల సోమిరెడ్డి, దేవదాసు, సాలి దేవదాసు, మరీదు నాగేశ్వరరావు, లింగారెడ్డి, రామారావు, గొర్ల నాగిరెడ్డి, సోమిరెడ్డి, చింతల శివనాగిరెడ్డి, పుచ్చా వసంతరావు, ములకలపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. -
రామదాసు మందిరంలో నవమి వేడుకలు ప్రారంభం
నేలకొండపల్లి: భద్రాచలం దేవస్థానం నిర్మాత, భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(భక్తరామదాసు) జన్మస్థలమైన నేలకొండపల్లిలో శ్రీ రామనవమి వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈమేరకు రామదాసు ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం స్థానిక మహిళలు పసుపు దంచడంతో పాటు ముత్యాల తలంబ్రాలు కలిపారు. అనంతరం గండికోట వెంకటలక్ష్మి ఆధ్వర్యాన రామదాసు కీర్తనలు ఆలపించారు. సర్పంచ్ శీలం వెంకటలక్ష్మితో పాటు పెండ్యాల శ్రీమతి, జక్కేపల్లి ఉష, లక్ష్మి, రాయపూడి ఉష, మల్లికాంబ, పూజారి సౌమిత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ‘భూదాన్’ కేసులో మరో నలుగురి అరెస్ట్ ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్, ప్రభుత్వ భూమిలో ప్లాట్లు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసిన కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం అర్బన్ స్టేషన్లో సీఐ భానుప్రకాశ్‌తో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేయగా, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితులైన పోలెబోయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను రిమాండ్‌కు తరలించగా, మెజిస్ట్రేట్ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాక తిరిగి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయడంతో పాటు వారి అక్రమ ఆస్తులను చట్టప్రకారం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా ఖమ్మం లీగల్/మధిర: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ప్రియ సోమవారం తీర్పు చెప్పారు. తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన తూము వీరభద్రరావు వద్ద మధిర టీచర్స్ కాలనీకి చెందిన ఎండీ.ముస్తఫా 2018 ఆగస్టు, సెప్టెంబర్‌లో రూ.10లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2020 సెప్టెంబర్‌లో రూ.14.50 లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వీరభద్రరావు తన న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం ముస్తఫాపై నేరం రుజువు కావడంతో 18నెలల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.14.50లక్షల పరిహారం చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. దాతలు స్పందిస్తేనే జీవితం తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంకు చెందిన ఇస్నేపల్లి మహేష్(24) మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ముత్తగూడెం వద్ద కుక్క అడ్డు రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా కింద పడడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. దీంతో మహేష్‌కు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఆయనకు తండ్రి లేకపోవడం, తల్లి యశోదది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి కావడంతో చికిత్సకు సమస్య ఎదురవుతోంది. ఈమేరకు దాతలు ఆర్థికంగా ఆదుకుని తన కుమారుడి ప్రాణాలు కాపాడాలని ఆమె వేడుకుంటోంది. సాయం చేయాలనుకునేవారు 98660 29654, 99084 60315 నంబర్లకు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి ఆదుకోవాలని యశోద ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు.. కొణిజర్ల: తల్లి మరణించిందనే బాధతో ఉన్న విద్యార్థికి బంధువులు నచ్చచెప్పి పదో తరగతి పరీక్ష రాయించగా.. ఆతర్వాత తలకొరివి పెట్టి బాధ్యత తీర్చుకున్నాడు. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన పాలెపు ఉమ(36) అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు రాంచరణ్, నవదీప్ ఉన్నారు. నవదీప్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ సెయింట్ అలోషియస్ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు. ఈక్రమాన సోమవారం పరీక్షకు సిద్ధమవుతుండగానే ఆయన తల్లి మృతి చెందింది. విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా బంధువులు నచ్చచెప్పడంతో దుఃఖాన్ని దిగమింగుకుని కన్నీటితో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ముగిశాక తల్లికి తలకొరివి పెట్టాడు. -
కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఖమ్మంక్రైం: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న పలువురు హెడ్‌కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి పొందారు. ఈమేరకు రవీంద్రనాధ్, ప్రకాష్‌రావు, శ్రీనివాస్ భద్రాద్రి జిల్లాకు బదిలీపై వెళ్తుండగా సీపీ సునీల్‌దత్ సోమవారం అభినందించారు. అలా గే, వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించారు. ఈసీఆర్ ఒత్తిడి తగ్గించాలి ఖమ్మం సహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమంతో ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా చిన్నపాటి కారణాలతో షోకాజ్ నోటీసులు జారీచేసి ఒత్తిడికి గురి చేయడం సరికాదని టీఎస్ యూటీయఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇకనైనా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని వారు సోమవారం డీఈఓ చైతన్య జైనీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నచిన్న తప్పిదాలకు ఉపాధ్యాయులను నెలల తరబడి సస్పెండ్ చేయడం, వేతనంలో కోత విధించడం వంటి చర్యలు మానుకోవాలన్నారు. అలాగే, ఒంటిపూట బడి సమయాన మధ్యాహ్నం 1–30వరకు పనిచేయాలని పెనుబల్లి మండల అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. కాగా, పదో తరగతి మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు 2022, 2023 – 2025 బకాయిలు చెల్లించపోతే ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, సురేష్, రామకృష్ణ, కే.వీ.మురళీకృష్ణ, బి.రమేష్ పాల్గొన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడి ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ సమావేశాల్లో రూ.18 వేల వేతనం ప్రకటించాలనే డిమాండ్‌తో సోమవారం ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎన్జీవోస్ భవనం నుండి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు మంత్రి కార్యాలయం వద్ద చేరుకోగా, లోనకు వెళ్లకుండా టూటౌన్ పోలీసులు బారికేడ్లు అమర్చారు. అయినా ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు లోనకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18వేల వేతనం ప్రకటించడంతో పాటు రూ.50 లక్షల బీమా, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నింటి రమ్య, ఎస్.నవీన్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్టీయూ ఆధ్వర్యాన... ఖమ్మంవైద్యవిభాగం: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీవై.పాషా డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆశా కార్యకర్తలు పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించడమే కాక బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు శైలజ, సులోచన, సుమతి, కవిత, నాగమణి, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వద్దకే
రాములోరి తలంబ్రాలు..ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో ఈనెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కల్యాణ తలంబ్రాలను చేర్చేలా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ లాజిస్టిక్ సేవల ద్వారా ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు చేరుస్తారు. గతంలో మంచి ఆదరణ రావడంతో ఈసారి మరిన్ని తలంబ్రాల ప్యాకెట్లు పంపిణీ చేసేలా యా జమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందస్తుగానే తలంబ్రాల బుకింగ్‌ను ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ప్రారంభించింది. 8 వేల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యం.. ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో 8 వేల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యంగా ఆర్టీసీ కార్గో అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది 8,500 ప్యాకెట్లను రీజియన్‌లో బుక్ చేయగా.. రూ.12.83 లక్షలు ఆదాయం సంస్థకు లభించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో బుకింగ్‌ల కోసం ఆర్టీసీ కార్గో సేవలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి బుకింగ్‌లను ప్రారంభించారు. భక్తుల నుంచి ఆదరణ.. శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే భక్తులు కోరుకున్న చోటే ప్యాకెట్లను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. 2022 ఏడాది నుంచి ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించగా.. రెండేళ్ల క్రితం వరకు ఒక్కో ప్యాకెట్ ధర రూ. 116లుగా ఉంది. అయితే గత రెండేళ్ల నుంచి ఆ ధరను రూ.151కి పెంచింది. అయినా తలంబ్రాల ప్రాధాన్యత దృష్ట్యా భక్తుల నుంచి ఆదరణ తగ్గకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్గో అధికారులు భావిస్తున్నారు. నేరుగా లేదా ఆన్లైన్లో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడుడిపోల్లో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్ల నుంచి స్వామివారి తలంబ్రాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించారు. అంతేకాక www. tgsrtc. gov. in వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నా రు. తలంబ్రాలను బుక్ చేసుకున్న వారికి స్వామి వారి కల్యాణ అనంతరం ఇంటి వద్దకే తలంబ్రాలు చేరవేస్తామని తెలిపారు. రాముల వారి ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే సాక్షాత్తు రాముల వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు ఈ తలంబ్రాలు చల్లే ఆనవాయితీ ఉంది. అలాగే తలంబ్రాలను ఇళ్లలో పెట్టుకుని చిన్న వారిని ఆశీర్వదిస్తూ వారి కోరికలను ఫలించాలని కోరుకుంటుంటారు. ఇలా అన్నిరకాలుగా ప్రాధాన్యత ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వీటి కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. సెంటర్ సెల్ నంబర్ ఖమ్మం 91542 98583 మధిర, సత్తుపల్లి 91542 98585 కొత్తగూడెం, ఇల్లెందు 91542 98582 భద్రాచలం, మణుగూరు 91542 98586 కార్గోలో పంపిణీకి ఏర్పాట్లు -
ఇకపై ఆ ట్యాక్స్ రద్దు..
ఖమ్మంక్రైం: ఏదైనా వాహనదారుడికి అతడి పేరుపై ఆర్సీ కార్డు కలిగి ఉండి అతడు మరో వాహనం కొనాలంటే ప్రభుత్వానికి కచ్చితంగా రెండుశాతం అదనంగా లైఫ్‌ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ట్యాక్స్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులకు ఊరట కల్గించినట్లయింది. ఇది నేడు(సోమవారం) నుంచి అమల్లోకి రానుండడంతోటూ,త్రీ, ఫోర్ వీలర్స్ ఏదైనా కొనుగోలు చేసినా అదనపు ట్యాక్స్ ఉండదు. ఈవీల రాకతో.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్‌ను చక్కదిద్దే క్రమంలో భాగంగా కొత్త వాహనాలు కొనుగోళ్లను కంట్రోల్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అదనపు ట్యాక్స్ అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్యాక్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలకాలంలో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో కాలు ష్యాన్ని నివారించడానికి ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోవాహనాల కొనుగోళ్లు మరింత పెరిగేఅవకాశం ఉంది. ఈక్రమాన జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం 100కు పైగా వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఇటీవలకాలంలో షోరూమ్స్‌లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో వాహనదారులు షోరూమ్‌కు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుండడం గమనార్హం. కేంద్ర వాహన్ పోర్టల్‌లోకి.. తెలంగాణ రవాణాశాఖ ఈనెల23నుంచి జిల్లా రవాణా శాఖ పరిధిలోని వాహనాల డేటాను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వాహన్ పోర్టల్‌లోకి చేరవేయనుంది. నేషనల్ డేటాబేస్‌తో అనుసంధానం చేయడం ద్వారా వాహనాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది. అదేవిధంగా సెకండ్‌హ్యాండ్ వాహనాల కొనుగోలు విషయంలో జరిగే మోసాలను అరికట్టవచ్చు. ముఖ్యంగా దొంగ వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లకు చెక్ పడే అవకాశం ఉంది. పెరగనున్న పారదర్శకత.. ఈ వాహన్ పోర్టల్ డిజిటల్ విధానంతో రవాణా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరగడంతో పాటు ఏజెంట్ల జోక్యం తగ్గి వాహనదారుడికి రవాణా సేవలు వేగంగా అందుతాయి. అంతేకాక ఆర్సీ డూప్లికేట్ కాపీ, పేరు, చిరునామా మార్పు, లోన్ తొలగింపు వంటిసేవలను నేరుగా ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవ చ్చు. ఫలితంగా ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన పనిలేకపోవడంతో పాటు వాహనదారులు తమ వాహన వివరాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు. డిజిటల్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో భద్రపర్చుకోవచ్చని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. వాహనదారులకు లైఫ్‌ట్యాక్స్ నుంచి ఊరట -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్..
ఖమ్మంవైరారోడ్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ, అప్పుల ఊబి లోకి నెట్టేలా బడ్జెట్ రూపుదిద్దుకుందన్నారు. ఆది వారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రూ. 2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లల్లోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలకు ప్రయోజనం లేకుండా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. నిధుల మళ్లింపు, సింగరేణి ఫండ్స్ డైవర్షన్, భూముల తాకట్టుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు పునరుద్ధరించిన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతు భరోసా, మహాలకి్ష్మ్ పథకం, నిరుద్యోగ భృతి హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, ఉన్నం బ్రహ్మ య్య, వేముల వీరయ్య, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ -
రేపటి నుంచి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
షార్ట్ సర్క్యూట్‌తో.. రూ.50 వేల ఆస్తినష్టంట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలురఘునాథపాలెం: కూలి పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తికి ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాంకుడోతు అమరయ్య పొలంలో పెసలు తూర్పాల పట్టేందుకు కూలి పనులకు వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు అతని కుడి చేతి భుజానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 108లో ఖమ్మానికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సత్తుపల్లిరూరల్: ఇంట్లోని వారంతా డాబాపై నిద్రిస్తున్న సమయాన ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. వివరాలిలా.. సత్తుపల్లి మండలం బేతుపల్లి ఎస్టీ కాలనీలో శనివారం అర్ధరాత్రి వడ్డంగి అశోక్ తన కుటుంబంతో డాబాపై నిద్రిస్తున్నాడు. ఈక్రమాన అర్ధరాత్రి దాటాక కాలిన వాసన వస్తుండడంతో కిందకు వెళ్లి చూడగా.. ఇంట్లో నుంచి మంటలు వస్తుండడంతో డోర్లు తీసి మంటలను అదుపు చేశారు. ఈక్రమాన వంట గదితో షార్ట్ సర్క్యూట్ అయి ఫ్రిజ్, గ్రైండర్, మిక్సీ, టీవీ, ఫ్యాన్లు, విద్యుత్ బోర్డులన్నీ కాలిపోయాయని, గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని కుటుంబసభ్యులు వాపోయారు. ఈక్రమంలో బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకోగా సుమారు రూ.50వేల ఆస్థినష్టం వాటిల్లినట్లు బాధితుడు వివరించాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరారు. నేలకొండపల్లి: శ్రీరామనవమి సందర్భంగా నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపా రు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగే ఈ పోటీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డిలు ప్రారంభిస్తారని తెలిపారు. మొదటి బహుమతి రూ.20,016, రెండో బహుమతి రూ.15,016, మూడో బహుమతి రూ.10,016, నాల్గవ బహుమతి రూ.8,016, ఐదో బహుమతి రూ.5,016 నగదుతో పాటు షీల్డ్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 78936 94778, 99638 66092లను సంప్రదించాలని కోరారు. -
కోల్డ్ స్టోరేజ్‌లో ఆగిన మంటలు..
మధిర: మధిర మండలంలోని ఆత్కూరు సమీపంలో ఉన్న శ్రీసాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు ఆదివారం అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగ వస్తూనే ఉంది. ఈ కోల్డ్స్టోరేజ్లోని ఆరవ అంతస్తులో ఈనెల 21న విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 350 మంది రైతులకు చెందిన 32 వేల మిర్చి బస్తాలు అంటే సుమారు 12,800 క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉంది. గతేడాది, ఈ ఏడాది పండిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 80 శాతం మంది ఆంధ్ర రైతులతో పాటు మధిర, బోనకల్, వైరా ప్రాంతానికి చెందిన మరి కొంతమంది రైతులు ఈ స్టోరేజ్‌లో నిల్వ చేశారు. కాగా, 2027 మార్చి వరకు స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించింది. ఈనెల 21 నుంచి నిరంతరాయంగా 9 ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈక్రమాన బాధిత రైతులు సుమారం 150 మంది ఘటనా స్థలానికి చేరుకుని బస్తాలకు సంబంధించిన రశీదులను అధికారులకు అందజేశారు. స్ఫూర్తినింపిన అవయవాల దానం●బ్రెయిన్‌డెడ్ వ్యక్తి లివర్, కిడ్నీలు దానం ఖమ్మం రాపర్తినగర్: ఇంటి పెద్ద దిక్కు మరణించి పుట్టెడు దుఖం:లో ఉన్నా.. అవయదానం చేయడంతో కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఆవుల వెంకటరమణ (45) రోజువారిలాగే ఈ నెల 15న ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ కిందపడ్డాడు. చాలా సమయం తర్వాత గుర్తించిన స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి ఆపై హైదరాబాద్‌కు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి తలలో బ్లడ్‌క్లాట్ అయిందని గుర్తించారు. ఈక్రమంలో 18న ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. ఆ తర్వాత అవయవదానంపై జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ, ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయకర్తలు వివరించగా.. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. ఈక్రమంలో జీవన్‌ధాన్ ఆధ్వర్యాన అవసరం ఉన్నచోటుకు అవయవాలను తరలించనున్నట్లు తెలిపారు. కాగా, మృతుడు వెంటకరమణ నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుండడంతో పాటు ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావడంతో పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. -
ఉపాధికి చేయూత
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (టీజీఎస్సీసీడీసీ) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన మొత్తం 540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.516.43 లక్షల సబ్సిడీని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – ఖమ్మం మయూరిసెంటర్రవాణా, వ్యవసాయ రంగాలకు పెద్దపీట జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. 256 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 128 త్రీ వీలర్లను నిరుద్యోగ యువతకు అందించనున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 27 మంది ఎస్సీ రైతులకు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు మొత్తం 129 మంది యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, వారిని వేతన, స్వయం ఉపాధి వైపు మళ్లించనున్నారు. 24 వరకు దరఖాస్తు గడువు.. అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ ద్వారా ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రవాణా వాహనాలకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, సోలార్ పంప్సెట్ల కోసం కనీసం రెండెకరాల భూమి, పట్టాదార్ పాస్‌బుక్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపికై న వారికి శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏప్రిల్ 16 లోపు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసి యూసీలను అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. యూనిట్ ఆధారంగా సబ్సిడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే స్వయం ఉపాధి, ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది. యూనిట్ ధర ప్రకారం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 90 శాతం, రూ.1,00,001 నుంచి రూ.2లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం, రూ.4,00,001 నుంచి రూ.5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పోను మిగిలిన యూనిట్ విలువను బ్యాంక్ రుణంగా ఇప్పించనుంది. ఉపాధి శిక్షణకు సంబంధించి యూనిట్ విలువకు పూర్తి సబ్సిడీ ఇవ్వనుంది.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని అర్హతలు, నిబంధనలు విధించింది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. గత ఐదేళ్లలో ఏదైనా ప్రభుత్వ ఉపాధి పథకం పొందిన వారు, దళిత బంధు లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కేటాయింపులో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.ప్రణాళిక ఖరారు చేసిన ఎస్సీసీడీసీ అధికారులు -
పైసా విదల్చదు
● బ్రహ్మోత్సవాలకు నిధులు కేటాయించని ప్రభుత్వం ● భక్తుల కానుకలతోనే శ్రీరామనవమి, ముక్కోటి వేడుకలు ● భద్రగిరికి ఫెస్టివల్ ఫండ్ ప్రకటించాలని కోరుతున్న భక్తులు భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27న శ్రీరామనవమికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే భక్తులు సమర్పించే హుండీ ఆదాయంతోనే ఉత్సవాలు నిర్వహించాల్సి వస్తోంది. ఏటా ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి సరిపెట్టుకుంటోంది. వేడుకల నిర్వహణకు ఫెస్టివల్ ఫండ్ కేటాయించాలని ఏళ్లుగా భక్తులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తకోటి మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తోంది. తాత్కాలిక పనులకే అధిక వ్యయం ముక్కోటికి, శ్రీరామనవమి వేడుకల సందర్భంగా దేవస్థానం అధికారులు తాత్కాలిక పనులు చేపడుతున్నారు. లైటింగ్, పెయింటింగ్, తాత్కాలిక పనులు, చలువ పందిళ్లు, ఏసీలు, ఎల్ఈడీలు తదితర పనుల నిమిత్తం అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. ముక్కోటికి రూ.80 లక్షలకు పైగా, శ్రీరామమనవమికి రూ. కోటిన్నర వరకు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. మిథిలా స్టేడియాన్ని ఆధునికీకరిస్తే షెడ్లు, షామియానాలు, బారికేడ్లు తదితర పనుల వ్యయం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. కలగా మారిన ప్రభుత్వ ఫెస్టివల్ ఫండ్.. శ్రీరామనవమికి ప్రభుత్వం రూపాయి విదల్చకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర మాదిరిగా ఏటా రామయ్య ఉత్సవాలకు ఫెస్టివల్ ఫండ్ ప్రకటించాలని కొన్నేళ్లుగా కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో ఉత్సవాలు నిర్వహిస్తే వసతులు, సౌకర్యాలు పెరగటంతోపాటు ఆలయ ఆదాయం అభివృద్ధికి, ఇతర పనులకు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. సుమారుగా ఏడాదికి రూ. ఏడు కోట్లు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీరామనవమికి సమర్పించే పట్టువస్త్రాలకు సైతం నిధులు విడుదల చేయటం లేదనే అపవాదు ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. గత ప్రభుత్వం రామాలయంపై శీతకన్ను వేసిందంటూ, అభివృద్ధి చేసి చూపిస్తామంటూ భద్రాచలంలో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి సీఎంగా నిలబెట్టుకోవాలని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలు ముక్కోటి, శ్రీరామనవమి. నవమి వేడుకలకు సుమారు రూ.2.5 కోట్లు ముక్కోటికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరు భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే. దీన్ని నుంచే అఽధికారులు, ఉద్యోగుల జీత భత్యాలు చెల్లించాలి. దేవస్థానం నిర్వహణ, ఉత్సవాలకు వ్యయం చేయాలి. శ్రీరామనవమికి సెక్టార్ టికెట్ల విక్రయం ద్వారా కొద్దిమేర ఆదాయం సమకూరుతుంది. అయితే ఉత్సవాల ఖర్చు కంటే వ్యయం అధికమని లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఉభయదాతల టికెట్లు వెయ్యి ఉండేవి. వాటి విక్రయం ద్వారా అధిక ఆదాయం లభించేది. కాలక్రమేణా సీఎం సెక్టార్‌తోపాటు వీవీఐపీ, వీఐపీ సెక్టార్లు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉభయదాతల టికెట్లను 600కు కుదించారు. దీంతో ఆ ఆదాయం కూడా తగ్గింది. -
కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం శ్రీవారి పాదాలకు అర్చకులు అష్టోత్తర కలశాభిషేకం చేశారు. ఆ తర్వాత సుప్రభాత సేవ నిర్వహించి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. వేదమంత్రాలతో మండపారాధన, నవగ్రహం హోమం గావించారు. అనంతరం గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. చివరగా శ్రీపద్మావతి అలివేలు మంగా సమేతుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని హంస వాహనంపై కొలువుదీర్చి భక్తుల కోలాటాల నడుమ ఆలయ గిరి ప్రదక్షణ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు. పెనుబల్లి యువకుడికి ‘విశ్వగురు’ అవార్డుపెనుబల్లి: దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, రష్యాలోని మౌంట్ ఎల్బ్రూన్ వంటి శిఖరాలను విజయవంతంగా అధిరోహించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన పెనుబల్లికి చెందిన బర్మావత్ మోతీకుమార్ ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు’ అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ సిటీ సీపీ శంఖబ్రతా బగ్చి, ఐఆర్ఎస్ అధికారి రవిశంకర్ మలిశెట్టి, సినీ నటుడు రాజీవ్ కనకాల, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ సత్యవోలు రాంబాబు తదితరులు ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా, మోతీకుమార్ అత్యున్నత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆయన దాతలతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యాప్‌తో విద్యుత్ ఉద్యోగుల భద్రత ఖమ్మంవ్యవసాయం: క్షేత్ర స్థాయిలో విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం ఆన్లైన్ ఎల్సీ(లైన్ క్లియరెన్స్) యాప్ రూపొందించినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఫీడర్ల ఎంపికలో లోపాలు, సమాచార లోపంతో ఉద్యోగులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు యాప్ రూపొందించినట్లు తెలిపారు. తద్వారా పని చేయాల్సిన ఫీడర్, పంపిణీ లైన్ వివరాలు స్పష్టంగా తెలుస్తాయని, ఎలాంటి పొరపాట్లు జరగకపోగా సిబ్బంది మధ్య సమాచార మార్పిడి సులువవుతుందని వెల్లడించారు. అగ్నివీర్‌కు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మం రాపర్తినగర్: భారత సైన్యంలో నియామకాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని అధికారులు తెలిపారు. ఈమేరకు జిల్లాలో ఆసక్తి ఉన్న అవివాహిత యువత అగ్నివీర్ ద్వారా ఎంపికకు ఏప్రిల్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయో పరిమితిని 21నుంచి 22ఏళ్లకు పెంచగా, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టులకు ఎనిమిది నుంచి పదో తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో లేదా 040–27740059 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కాగా, నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. -
నీటి సంరక్షణకు కృషి చేయండి
రఘునాథపాలెం: నీటి సంరక్షణకు అందరూ కృషి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్‌రెడ్డి అన్నారు. జల మహోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ జల్’లో భాగంగా మండలంలోని రేగులచలకలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. అమూల్య వనరైన నీటిని వృథా చేయొద్దని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహిచారు. నీటిని సంరక్షిస్తూ బాధ్యతగా వినియోగిస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఓ రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్‌భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, డీఈ ఓంప్రకాష్, ఏఈ ఇందిరా జ్యోతి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు యండపల్లి రమాదేవి, బలుసుపాటి శేషయ్య, కొటేరు నర్సిరెడ్డి, నున్నా వెంకటేశ్వరరావు, మాదంశెట్టి హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి ఆదాం, ఉపాధి హమీ పథకం ఏపీఓ పద్మయ్యనాయుడు, డీఆర్ఓ వి.సల్మాన్‌రాజు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్‌రెడ్డి -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మధిర: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలెలా అందుతున్నాయని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. మరింత నాణ్యమైన సేవలు అందేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా గైర్హాజరైన వైద్యులు, ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. వైద్యుల హాజరు వివరాలను రెగ్యులర్‌గా తనకు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తేనే ఎక్కువ మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారని తెలిపారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్ వెంట మధిర తహసీల్దార్ రాంబాబు, తదితరులు ఉన్నారు.కలెక్టర్ అనుదీప్ హెచ్చరిక -
దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
● నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు ● అగ్నిప్రమాద బాధిత రైతులకు న్యాయం చేస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర/బోనకల్: దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యకోసం పెట్టే ప్రతీ రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా అబివర్ణించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. బీమా ప్రకారం సొమ్ము చెల్లించాలి.. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిర మండలం ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడుతూ.. శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం ఉన్న మిర్చికి సంబంధించిన రైతులకు బీమా ద్వారా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మధిర మార్కెట్లో కూడా మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల భవనాల పరిశీలన.. మధిర మండలం సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, ఐటీఐ భవనాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీఈ నాగేశ్వరచారి, ఏఈలు నాగేశ్వరావు, సురేష్, కాంట్రాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు. -
సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించాలి
చింతకాని : పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. నాగులవంచ రైతువేదికలో ఆదివారం వరి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా విత్తుకునే వరి సాగుతో ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ విధానంలో పాటించాల్సిన పద్ధతులు, కలుపు యాజమాన్యం, ఎరువులు, మందుల వాడకంపై వివరించారు. రైతులు పామాయిల్ సాగుపై కూడా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో మధిర ఏడీఏ స్వర్ణ విజయ్‌చంద్ర, డివిజన్ ఉద్యాన అధికారి విష్ణు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కొప్పుల గోవిందరావు, గ్రామసర్పంచ్ నారగాని రాంబాయి, ఆదర్శ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామకృష్ణ, ఏఓ సోములపల్లి మానస, ఏఈఓలు కళ్యాణి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎం ఫార్మసీ విద్యార్థినికి ఆర్థిక సాయం
ఖమ్మంసహకారనగర్: ఎంఫార్మసీ చదువుతున్న కందిమళ్ల వైష్ణవి ఫీజులు, ఇతర అవసరాల నిమిత్తం పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు శనివారం ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్ వద్ద అందించారు. ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులు తాళ్లూరి శ్రీకాంత్, సూరంపల్లి రాంబాబు, రుక్మారావు, విద్యార్థి తల్లి ఉషారాణి పాల్గొన్నారు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిచారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు, వాహనాల వివరాలను పరిశీలించారు. సరిహద్దు రాష్ట్రం నుంచి ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. అలాగే, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి నేలకొండపల్లి: గడ్డి మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బోదులబండకు చెందిన ఎ.మధు (32) రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు నేలకొండపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి, ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా, మధు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కాంగ్రెస్ కమిటీని నియమించడంపై డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ను కలిసిన ఆయన సన్మానించాక మాట్లాడారు. అనాదిగా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న నేతలతో పాటు యువతరానికి ప్రాతినిధ్యం కలిస్తూ కమిటీ ఏర్పాటు చేశారని, సామాజిక సమతుల్యతను కూడా పాటించారని ఆయన వివరించారు. అయితే, పార్టీ కోసం పనిచేసినందున మరికొందరు యువకులు, మహిళలతో రెండో జాబితా సిద్ధం చేయాలని డీసీసీ అధ్యక్షుడికి టీపీపీ చీఫ్ సూచించారు. -
● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిఇల్లెందు రూరల్: మండలంలోని మసివాగు తండా వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఇల్లెందు మీదుగా మసివాగుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పాఖాల నుంచి ఇల్లెందు వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుగులోతు స్వప్న(58), బానోతు లక్ష్మి(55) మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108లో క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాణోత్ రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన నలుగురికీ ఇల్లెందు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి మృతితో నిద్రకు వెళ్తుండగా.. కారేపల్లి మండలం చీమలపాడు సమీపంలోని బోటితండాకు చెందిన స్వప్న తండ్రి బానోతు నంద్యా ఇటీవల చనిపోయాడు. దీంతో స్వప్న కుటుంబసభ్యులను నిద్ర కోసం ఆమె చెల్లెలు స్రవంతి తన స్వగ్రామమైన మసివాగుకు ఆహ్వానించింది. ఈక్రమంలో స్వప్న కుటుంబసభ్యులు మొత్తం ఏడుగురు ఆటోలో శనివారం రాత్రి బోటితండా నుంచి బయల్దేరారు. ఇల్లెందు దాటే వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. మరికొన్ని క్షణాల్లో మసివాగు చేరుకుంటారనగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఆటోను సైడ్ నుంచి ఢీ కొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న బాణోత్ స్వప్న, లక్ష్మికి తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే ప్రాణాలొదిలారు. మిగిలిన వారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలతో రక్తసిక్తమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఆ దారిలో వెళ్లేవారు 108కు సమాచారం ఇచ్చారు. ఈలోగా స్థానికులు చేరుకుని గాయపడినవారికి సాయం చేశారు. మద్యం మత్తులో కారుడ్రైవర్.. కారు నడుపుతున్న వ్యక్తి అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనగా ఒక్కసారిగా కారు ఆటోపైకి దూసుకొచ్చిందని, అప్పటికీ ఆటో డ్రైవర్ ప్రేమ్ చాకచక్యంగా పక్కకు వెళ్లినా, ప్యాసింజర్ సీటు భాగం వద్ద కారు బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. ఇంత జరిగినా కారు నడిపే వ్యక్తి కనీసం కిందకు దిగకుండా మత్తులో అందులోనే కూర్చున్నాడని చెబుతున్నారు. చివరకు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను మత్తులో నుంచి బయటకు రాలేదు. రోదనలతో మార్మోగిన ఆస్పత్రి రాత్రి 9:30 గంటలకు ప్రమాదం జరగగా పది గంటల సమయంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలుసుకున్న బోటి తండాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం విషాదభరితంగా మారింది. కాగా, ప్రమాదంలో బాణోతు ప్రేమ్, బాణోత్ శ్రీను, వనజ, మనోజ్ గాయపడ్డారు. బీటీపీఎస్‌లో విద్యుత్‌కు అంతరాయంమణుగూరురూరల్: మండల పరిధిలోని చిక్కు డుగుంట సమీపంలో గల బీటీపీఎస్ రెండో యూనిట్లో శనివారం సాంకేతిక లోపం తలెత్తి 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. బాయిలర్‌లోని పైప్ లీకవడంతో సమస్య ఏర్పడిందని, ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు సరఫరాకూ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వెంటనే మరమ్మతు పనులు చేయిస్తున్నామని, రెండురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఈ బిచ్చన్న తెలిపారు. రెండో యూనిట్లో సాంకేతిక లోపం.. -
భద్రగిరిలో భక్తుల సందడి
భద్రాచలం: భద్రగిరి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. ఉగాది, రంజాన్‌తో పాటు వా రాంతపు సెలవులు వరుసగా రావడంతో భక్తులంతా భద్రాచలం బాట పట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానా లను ఆచరించారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జోరుగా టికెట్ల విక్రయాలు శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వెబ్సైట్లో ఉంచిన టికెట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. శనివా రం నాటికి 3ఏ సెక్టార్‌లోని రూ.7,500 విలువైప ఉభయదాతల టికెట్లు 400కు గాను 293 అమ్ముడుపోగా 107 మాత్ర మే మిగిలి ఉన్నాయి. రూ.2,500 విలువైన సెక్టార్ 3బీ టికెట్లు 550కి 419, రూ.2వేల విలువైన సెక్టార్ 3సీ 190కి 30 మాత్రమే ఉన్నాయి. ఇక రూ.1000 విలువైన సెక్టార్ 3డీలో 85 పూర్తిగా అమ్ముడు పోగా, 3ఈలో 315కు 19, 3 ఎఫ్‌లో 390కి 321 టికెట్లు ఉన్నాయి. సెక్టార్ 4ఏలో రూ. 300 విలువైన టికెట్లు 368కి మొత్తం, సెక్టార్ 4బీ లో రూ.300వి 385కు 385, సెక్టార్ 4సీలో 295కు 144 టికెట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ.150 విలువైన టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్లో వేగంగా నవమి టికెట్ల విక్రయం -
మైనింగ్ ఆదాయం భేష్..
● ఇప్పటికే రూ.124 కోట్లకు పైగా వసూళ్లు ● గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికం ఖమ్మంఅర్బన్: జిల్లాలో మైనింగ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 44 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.86.34 కోట్లు వసూలైతే, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.124.32 కోట్లకుపైగా వసూళ్లు నమోదు కావడం విశేషం. తద్వారా గత ఏడాదితో పోలిస్తే రూ.37.99 కోట్ల లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరినట్లయింది. గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు జిల్లాలో ప్రధానంగా బ్లాక్ గ్రానైట్, కంకర, స్టోన్ క్రషర్లు తదితర మైనింగ్ కార్యకలాపాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి కావడంతో మైనింగ్ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన రాబడి వస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో వివిధ రకాల మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, కూసుమంచి తదితర మండలాల్లో క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల ద్వారా ఆదాయం అధికంగా వస్తోంది. ఇటీవల జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతుండగా మట్టి, కంకర, గ్రానైట్ వినియోగంతో పాటే ఆదాయం మరింత పెరిగింది. ఇక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవడం ద్వారా కూడా మైనింగ్ శాఖకు చెప్పుకోదగిన స్థాయిలో ఆదాయం లభించింది. అక్రమంగా మైనింగ్ సామగ్రి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం, క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కార్యకలాపాలను గుర్తించి జరిమానా రూపంలో సుమారు రూ.4.03 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 639 వాహనాలపై చర్యలు తీసుకుని రూ.1.45 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 శాతం అధిక ఆదాయం సాధించాం. ప్రభుత్వం రూ.150 కోట్లు లక్ష్యంగా నిర్దేశిస్తే, ఇప్పటివరకు రూ.124 కోట్లకుపైగా వసూలయ్యాయి. అక్రమ మైనింగ్‌పై నిరంతరం నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తూ పెనాల్టీల రూపంలో కూడా గణనీయమైన ఆదాయం సాధిస్తున్నాం. –సాయినాథ్, జిల్లా మైనింగ్ అధికారి (ఏడీ) -
రెండు ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధం
● షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానాలు ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్ సమీపాన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ వద్ద శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు వాహనాలు కాలిపోయాయి. షోరూం బయట వాహనాలు నిలిపి ఉంచగా, మధ్యాహ్నం వేళ ఎండ ప్రభావంతో అకస్మాత్తుగా మంటలు మొదలయ్యాయి. దీంతో రెండు వాహనాలు కాలిపోతూ దట్టమైన పొగలు వెలువడగా, మూడో వాహనానికి కూడా మంటలు అంటుకునే పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు స్థానికులు, వాహనదారులు నీరు, ఇసుక చల్లుతూ మంటలను ఆర్పుతూనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వాహనంతో వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో షోరూంలో పెద్దసంఖ్యలో ఉన్న వాహనాలకు ముప్పు తప్పినట్లయింది. అయితే, వాహనాలకు చార్జింగ్ పెట్టిన సమయాన షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిన ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, కచ్చితమైన కారణాలను షోరూమ్ నిర్వాహకులు వెల్లడించాల్సి ఉంది. యూ టర్న్ వద్ద మూడు వాహనాలు ఢీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం మమత రోడ్డులోని ఈఆర్ఆర్ రిసార్ట్స్ సమీపాన యూ టర్న్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో మూడు వాహనాలు ఢీకొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందిరానగర్ జంక్షన్ వైపు వచ్చిన వాహనదారుడు యూ టర్న్ వద్ద తిరుగుతుండగా, ట్యాంక్ బండ్ వైపు నుంచి వచ్చిన వాహనం ఢీకొంది. ఇదే సమయాన వెనుకాల ఉన్న మరో వాహనదారుడు కూడా ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, పలువురు గాయపడడమే కాక కొందరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, సరైన మార్కింగ్ లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడమే కాక వాహనదారులు వేగంగా వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
కల్యాణోత్సవానికి డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
ముదిగొండ: ఎక్కడా లేని విధంగా ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా శ్రీరామనవమి రోజున రాత్రివేళ శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈనెల 27న జరిగే కల్యాణోత్సవానికి హాజరుకావాలని ప్రజాప్రతినిధులు, ఆలయ బాధ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈమేరకు హైదరాబాద్‌లో శనివారం భట్టిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. దేవస్థానం చైర్పర్సన్ తుళ్లూరి లత, సర్పంచ్ ఎల్.మమత, కాంగ్రెస్ నాయకులు మల్లెల అజయ్, తుళ్లూరి జీవన్, ఎల్.బుచ్చయ్య, పి.తిరపయ్య, వీరయ్య, రంగారావు పాల్గొన్నారు. మూడో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు -
చేరువలో..
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026ఆదాయం పైకి.. స్థానం కిందకు.. తలసరి ఆదాయంలో జిల్లా రాష్ట్రంలో 18వ స్థానాన నిలిచింది. రంగారెడ్డి జిల్లా 11,29,735తో మొదటి స్థానం దక్కించుకోగా, ఖమ్మం జిల్లా రూ.2,83,744తో ఉంది. పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం రూ.3,69,420తో ఐదో స్థానాన నిలవడం విశేషం. నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ప్రతీ వ్యక్తికి లభించే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయంగా గణిస్తారు. ఇది ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను అంచనా వేసేందుకు దోహదపడుతుంది. అయితే గత ఏడాది జిల్లా తలసరి ఆదాయం రూ.2,49,517తో 14వ స్థానాన ఉండగా, ఈసారి ఆదాయం పెరిగినా స్థానం మాత్రం 18కి పడిపోవడం గమనార్హం. జీడీడీపీ రూ.47,184 కోట్లు స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ) ప్రస్తుత ధరల వద్ద 2024–25 ఏడాదికి రూ.47,184 కోట్లుగా ఉంది. ఇందులో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానాన నిలిచింది. ఏడాది కాలంలో జిల్లాలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మార్కెట్‌ను జీడీడీపీగా పిలుస్తారు. జీడీడీపీలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే భద్రాద్రి జిల్లా రూ.48,354 కోట్లతో ఏడో స్థానాన నిలిచింది. ఖమ్మం జిల్లా గత ఏడాది రూ.41,576 కోట్లతో 8వ స్థానంలో ఉండగా, ఈసారి కూడా అదే స్థానం దక్కింది. అక్కడ అక్షరాస్యత.. ఇక్కడ అక్షరాస్యులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉండగా.. అక్షరాస్యత శాతం మాత్రం పట్టణ ప్రాంతంలో ఎక్కువగా నమోదైంది. జిల్లా అక్షరాస్యత 65.95 శాతం ఉంటే, గ్రామీణప్రాంతాల్లో 60.86 శాతంగానే ఉంది. ఇదే సమయాన పట్టణాల్లో అక్షరాస్యత 83.35శాతంగా ఉంది. విద్యావంతులు జిల్లాలో 8,32,320 మంది ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 5,94,262 మంది కాగా.. పట్టణ ప్రాంతాల్లో 2,38,058 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా, 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 14,01,639 మంది జనాభా ఉన్నారు. ఇందులో 10,84,811 మంది గ్రామీణ ప్రాంతాల్లో, 3,16,828 మంది పట్టణ ప్రాంతాల్లో ఉండడంతో అక్షరాస్యుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదైంది.జిల్లా తలసరి ఆదాయం రూ.2,83,744 -
మక్కల కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
● పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్ ద్వారా కేంద్రాలు ● ఉమ్మడి జిల్లాలో 41కేంద్రాల ఏర్పాటుఖమ్మంవ్యవసాయం: యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట సాగు చేసిన ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించినా ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించడం లేదు. దీంతో క్వింటాకు రూ.800 మేర రైతులు నష్టపోతుండడంతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వం మక్కల కొనుగోళ్లకు ముందుకొచ్చింది. ఎప్పటిలాగే మార్క్‌ఫెడ్‌కు కొనుగోలు బాధ్యతలు అప్పగించగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సూచనలతో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పంట సాగైన ప్రాంతాల్లో.. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యాన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా మక్కల కొనుగోళ్లు చేపడతారు. పంట అత్యధికంగా సాగైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది యాసంగి పంటగా ఖమ్మం జిల్లాలో 1.67 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 72 వేల ఎకరాల్లో మక్కలు సాగయ్యాయి. ఖమ్మం జిల్లాలోని చింతకాని, కొణిజర్ల, బోనకల్, రఘునాథపాలెం, ముదిగొండ, ఏన్కూరు తదితర మండలాలు, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి తదితర మండలాల్లో మక్కల సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. పంట ఎక్కువగా సాగైన మండలాల్లో రెండు నుంచి మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తంగా ఖమ్మంలో జిల్లాలో 30, భద్రాద్రి జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి కేంద్రాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభించగా, ఏప్రిల్ మొదటి వారంకల్లా అన్ని కేంద్రాలను దశల వారీగా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
అభివృద్ధి పనుల్లో వేగం !
● ‘భద్రాచలం పునర్ నిర్మాణం, పునరుజ్జీవం’ పేరుతో చర్చ ● మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రభుత్వం ● ప్లాన్‌లో పెరిగిన అంచనా వ్యయంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ‘భద్రాచలం పునర్ నిర్మాణం, పునరుజ్జీవం’ పేరుతో ఇక్కడ చేపట్టాల్సిన పనులపై మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీని వాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో శుక్రవారం, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ నివారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ప్రధాన ఆలయం, గోదావరి తీరం, పట్టణంలో చేపట్టాల్సిన పనులపై ఇందులో చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడ చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.. నాలుగు కాదు.. మూడు గతంలో భద్రాచలం ఆలయం, పట్టణ అభివృద్ధి కోసం రూ.350 కోట్లు కేటాయించాలని నిర్ణయించా రు. అందులో తొలివిడతలో రూ.100 కోట్లతో పను లు చేపట్టాలని భావించారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత నాలుగు దశల్లో వేర్వేరు విధాల పనుల కోసం మిగిలిన నిధులు ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ గత 12 ఏళ్లుగా భద్రాచలంలో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోవడం, నానాటికీ భక్తుల తాకిడి పెరగడంతో ముందుగా వేసిన అంచనాల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రాకు దీటుగా తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెరిగిన భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని మూడు దశ ల్లోనే పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. పెరిగిన అంచనా వ్యయం పుష్కరాల పనులను మినహాయించి భద్రాచలంలో ప్రధాన ఆలయం వద్ద వేర్వేరు పనుల కోసం ముందుగా నిర్ణయించిన రూ.350 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 560 కోట్లకు పెంచినట్టు సమాచారం. ఇందులో తొలి విడత పనుల కోసం తక్షణమే రూ.200 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలు స్తోంది. గర్భగుడిని కదిలించకుండా ఈ నిధులతో లోపలి భాగంలో వివిధ పనులు, ఆలయ ప్రాకారం, మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పనులకు సుమారు రూ.120కోట్ల వరకు వ్యయం కానుండగా మిగిలిన నిధులతో క్యూ లైన్ల నిర్వహణ, సామూహిక వసతి, బస, రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర పనులు ఉంటాయి. ఈనెల 27న శ్రీరామనవమి రోజున పనులు ప్రారంభించి 2027 జూలైలో పుష్కరాల నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. రెండు, మూడు దశల్లో ప్రస్తుతం ఉన్న కల్యాణ మండపం (మిథిలా స్టేడియం) పునరుద్ధరణతో పాటు పట్టణంలో శాశ్వత ప్రాతిపదికన భక్తులు/పర్యాటకులకు ఆధ్యాత్మక, పర్యాటక పరంగా సౌకర్యాలు కల్పించేలా పనుల చేపట్టేందుకు వీలుగా అంచనాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం దేశంలో పేరెన్నిక గల కన్సల్టెన్సీకి పనులు అప్పగించాలని నిర్ణయించారు. పుష్కరాల నాటికి ప్రధాన ఆలయం వద్ద చేపట్టే తొలి విడత పనులు పూర్తయితే, ఆ తర్వాత రెండు, మూడో విడత పనులు చేపట్టి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మేడారం, భద్రాచలంలో చూపించిన మార్పులు తమకు లాభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. -
కాళీమాత ఆలయంలో విరూపాక్ష స్వామి పూజలు
మణుగూరు టౌన్: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాళీమాత ఆలయాన్ని హంపి విరూపాక్ష భారతీ స్వామి శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు.. బీటీపీఎస్ రైలు మార్గం నిర్మాణంలో ఆలయంలో కొంతభాగం పోతుందని స్వామి వారి కి వివరించగా, ప్రభుత్వం ఆలయానికి స్థలం కేటాయించిన తర్వాత పునఃనిర్మాణానికి పూర్తి గా సహకరిస్తామని స్వామిజీ ప్రకటించారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పండితులు శ్రీకాంత్, దుర్గాప్రసాద్, సంతోష్, భార్గవ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
39 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో అక్రమంగా నిల్వ చేసిన 39గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. రఘునాథపాలెం మీ సేవ కేంద్రం వద్ద నిల్వ చేసిన 32 సిలిండర్లు స్వాధీనం చేసుకొని మీ సేవ ఆపరేటర్ జె.దుర్గారావుపై 6ఏ కేసు నమోదు చేశామని వెల్లడించా రు. అలాగే, రఘునాథపాలెంలోని సితారా హోటల్లో నాలుగు, ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని భవాని హోటల్లో మూడింటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చట్టవిరుద్ధంగా వాణిజ్య అవసరాలకు గృహోపయోగ సిలిండర్లు వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీ ల్లో డీటీ విజయ్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం’
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, సమస్యలను గాలికొదిలేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు సమస్యల పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు డిమాండ్‌తో శుక్రవారం కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ దుర్మార్గానికి ఒడిగట్టినందున ఇకనైనా తప్పు సరిదిద్దుకుని పేదలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు పుల్లారావు, రవికుమార్, రవిరాథోడ్, గుత్తా వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నాగేశ్వరరావు, మేకల నాగేందర్, సరస్వతి, రమేష్, నర్సింహారావు, నరేష్ పాల్గొన్నారు. -
ముంచిన నకిలీ విత్తనం
సత్తుపల్లిటౌన్: ఆరుగాలం కష్టించి పండించిన వరి చేతికొచ్చే సమయాన తాలు గింజలు రాగా.. నకిలీ విత్తనాలే కారణమని రైతులు లబోదిబోమంటున్నారు. సత్తుపల్లి మండలం సిద్ధారం, గౌరిగూడెం, రేజర్ల, నారాయణపురం, వేంసూరు మండలం భీమవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 500 ఎకరాల్లో శ్రీరామా సీడ్స్ కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 విత్తనాలు సాగు చేశారు. 20 కేజీల ప్యాకెట్‌ను రూ.1,300 చొప్పున సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్ దుకాణంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ వంగడంతో అధిక దిగుబడులు వస్తాయని డీలర్ చెప్పాడని.. తీరా పంట చేతికొచ్చే సమయాన వరి కంకుల్లో తాలు వచ్చిందని వాపోయారు. కంపెనీ బాధ్యులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తన దుకాణం ముందు నిరసన నకిలీ విత్తనాల కారణంగా తాము నష్టపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతులు తాలు కంకులతో సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్ దుకాణం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. అయితే యజమాని వారం రోజులుగా దుకాణం తీయటం లేదని తెలియడంతో పోలీసులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఎకరానికి రూ.35వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన తమను ఆదుకోవాలని కోరారు. రైతులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రసాద్, ప్రభాకర్, సాలి దేవదాసు, గోర్ల నాగిరెడ్డి, సోమిరెడ్డి, చింతల శివనాగిరెడ్డి, పుచ్చా వసంతరావు, ములకలపాటి సత్యనారాయణ, మరీదు నాగేశ్వరరావు, లింగారెడ్డి రామారావు పాల్గొన్నారు. కాగా, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం నాయకుడు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలం సిద్ధారంలో వరి పొలాలను ఆయన నాయకులు కె.లక్ష్మణ్‌రావు, కృష్ణ, ప్రసాద్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రమేష్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
● రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్ను చెల్లించిన మున్సిపల్ కార్మికుడు ● పరిశీలించకుండానే ఇంటి నంబర్ కేటాయించిన ఉద్యోగి వైరా: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు మున్సిపల్ సిబ్బంది ఒకరు ప్రభుత్వ భూమిపై కన్నేయగా.. మనోడే కదా అనుకున్నారేమో కానీ ఆయనకు మున్సిపల్ ఉద్యోగి సహకరించడం విమర్శలకు తావిస్తోంది. భూమి ప్రభుత్వానిదని తెలిసినా ఆక్రమించుకున్న స్థలంలో ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ ఇచ్చిన ఘటన ఇది. చివరకు విషయం బయటపడడంతో నంబర్‌ను రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. దర్జాగా రిజిస్ట్రేషన్ వైరా నడిబొడ్డున వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆనుకుని 60 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని మున్సిపాలిటీ కార్మికుడు శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎలా చేయించుకున్నాడు, ఎవరెవరు సహకరించారో స్పష్టత లేకున్నా ఖాళీ స్థలంలోఇల్లు ఉందని చెబుతూ రూ.1,164 పన్ను చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలన మాటెత్తకుండా ఆర్ఐ ప్రదీప్ నంబర్ కేటాయించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే ఇంటి నంబర్‌ను ఆన్లైన్లో రద్దు చేశారు. ఆపై ఇన్చార్జి తహసీల్దార్ సురేష్, ఆర్ఐ నవీన్ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ గురులింగాన్ని వివరణ కోరగా మున్సిపల్ సిబ్బందికి నోటీసులు ఇచ్చి విచారణ చేపడతామని తెలిపారు. -
ద్విచక్రవాహనాల దొంగలు అరెస్ట్
● ఏడుగురి అరెస్ట్, 17బైక్‌లు స్వాధీనం ఖమ్మంక్రైం: ఖమ్మంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఏడుగురిని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శుక్రవారం నగర ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. మామిళ్లగూడెం, కమాన్బజార్కు చెందిన కొండమీద యోగీశ్వర్, మేడ సాయికుమార్‌తో పాటు నలుగురు మైనర్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేసి అమ్మేసి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఈమేరకు వాహనాల తనిఖీల సందర్భంగా సీఐ మోహన్‌బాబు వీరిని విచారించగా వ్యవహారం బయటపడింది. దీంతో ఆరుగురితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన కొణిజర్ల మండలం తీగల బంజరకు చెందిన ముద్దంగుల నరేష్, హరీఫ్, నునావత్ వినోద్‌పైనా కేసులు నమోదు చేశారు. ఇందులో హరీఫ్, వినోద్ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి రూ.11లక్షల విలువైన 17 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సీఐ మోహన్‌బాబు, ఉద్యోగులను ఏసీపీ అభినందించారు. నిందితును కోర్టుకు రిమాండ్ చేసారు. రూ.3కోట్లు మోసపోయామని ఆందోళన ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురంలోప్రైవేట్గా చీటీలు నడిపే కె.రామచంద్రరావు కానరాకుండా పోయాడని స్థానికులు ఆరోపించారు. సుమారు రూ.3కోట్ల డబ్బు ఇవ్వాల్సి ఉండగా కోర్టులో ఐపీ దాఖలు చేశాడని ఆరోపిస్తూ పలువురు శుక్రవారం ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వ్యాపారి ఆచూకీ తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్ టి.నిర్మలకుమారి, ఉప సర్పంచ్ పార్వతి సమస్యను ఎస్ఐ రమేష్‌కుమార్‌కు వివరించగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. పోక్సో కేసు నమోదు ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారులోని ఓ గ్రామంలో మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన ప్రవీణ్ అనే వ్యక్తి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించగా, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. పులిగుండాలలో పక్షుల వీక్షణ ! ఖమ్మంవ్యవసాయం: పెనుబల్లి మండలంలోని పులిగుండాల అడవిలో 70కు పైగా జాతులకు చెందిన పక్షులు నివాసముంటున్నాయని గుర్తించారు. ఈ పక్షులను సులువుగా వీక్షించేలా అటవీ శాఖ ద్వారా రాష్ట్రంలోనే తొలిసారి ప్రత్యేక నివాసాన్ని ఏర్పాటు చేశారు. వీక్షకులకు ఇబ్బంది లేకుండా బైనాక్యులర్లతో ఈ నివాసాన్ని రూపొందించారు. పక్షుల వీక్షణకు వచ్చే వారికి గైడ్‌గా బీట్ ఆఫీసర్‌ను కేటాయించనున్నట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. -
నిధుల వరద!
ప్రాజెక్టులకుసీతారామ ప్రాజెక్టు (ఫైల్ )సీతరామకు తగ్గించి.. ఎర్రుపాలెంకు పెంచి.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. సీతారామ ప్రాజెక్టుకు గత ఏడాదితో పోలిస్తే నిధులు తగ్గినప్పటికీ ఎర్రుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు పెంచారు. గత ఏడాది సీతారామ ప్రాజెక్టుకు రూ.699.35కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.336.78 కోట్లతో సరిపెట్టారు. ఈ నిధులతో భూసేకరణతోపాటు టన్నెల్ పనులు, ఇతర పెండింగ్ పనులు చేపడతారు. ఎర్రుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు గత ఏడాది రూ.39.99 కోట్లే కేటాయిస్తే ఈసారి అది రూ.370.99 కోట్లకు చేరింది. ఈ పథకం పూర్తయితే మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 33,025 ఎకరాలకు నీరు అందుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు నిధులు పెంచగా, భక్తరామదాసు, తాలిపేరు, లంకాసాగర్, కిన్నెరసాని ప్రాజెక్టులకు సైతం నిధులు అందనున్నాయి. ఇందిరమ్మ రెండో విడత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లాలో మరింత మంది నిరుపేదలకు ఇళ్లు దక్కనున్నాయి. మొదటి విడతగా 16,524 ఇళ్లు కేటాయించగా కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక రెండో విడత మంజూరు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 2026–27 విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం సమకూర్చనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి రానుంది. అంతేకాక పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు కేటాయింపు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 కొత్త కోర్సులపై ప్రకటన వెలువడింది. దీంతో జిల్లాలోని 1,400 పాఠశాలల్లోని 70వేల మంది విద్యార్థులు, 21 జూనియర్ కళాశాలల్లోని 6,500 మంది విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. కొత్త పింఛన్లకు మోక్షం చేయూత పథకానికి నిధులు కేటాయించిన నేపథ్యాన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో అన్నిరకాల పింఛన్‌దారులు 1,82,752 మంది ఉన్నారు. ఇదే సమయాన కొత్తగా పింఛన్ల కోసం 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన క్రమాన వీరిలో అర్హులకు మంజూరు కానున్నాయి. బీమాతో ధీమా ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలోనే ప్రభుత్వం ప్రమాదబీమా పథకాన్ని ప్రకటించింది. అలాగే క్యాష్‌లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లను ప్రకటించింది. ఇందుకు గాను నిధులు కేటాయించడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు భరోసా లభించనుంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో జిల్లాలోని 13,317 మంది ఉద్యోగులు, 13,048 మంది పెన్షనర్ల చికిత్సకు అవకాశం ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలకు పుష్కలంగా.. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి (200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్), రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు పలు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో జిల్లాలోని లబ్ధిదారులకు ఉపయోగపడనున్నాయి.ఎర్రుపాలెం లిఫ్ట్, సీతారామకు రూ.700కోట్లకు పైగానే.. -
టీపీఎస్‌ల నిర్మాణానికి డిజైన్లు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టీపీఎస్)గా అభివృద్ధి చేయనున్నందున డిజైన్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది స్కూళ్లలో 800నుంచి వేయి మంది విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించేలా లే ఔట్లు సిద్ధం చేయాలన్నారు. నాబార్డ్ నుంచి నిధులు రానున్నందున మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆతర్వాత పలు డిజైన్లను పరిశీలించి సూచనలు చేశారు. డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు వెంకట్‌రెడ్డి, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ప్రతీ చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగడమే లక్ష్యంగా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని బాలల సదనాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన నిర్వహణతో పాటు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి మెనూ అమలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ చిన్నారి ఆరోగ్యం, భద్రతపై సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, దత్తత ప్రక్రియలో చట్టపరమైన విధానాలను అమలుచేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, జిల్లా శిశు సంరక్షణ అధికారి విష్ణువందన పాల్గొన్నారు. ●ఖమ్మంఅర్బన్: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో పనిచేస్తూ ప్రమాదంలో కుడిచేయి కోల్పోయిన కార్మికుడికి రూ.31.31లక్షల నష్టపరిహారం అందింది. హెచ్‌జీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ తరపున పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరవేష్ గత ఏడాది జూలై 30న ప్రమాదంలో చేయి కోల్పోయాడు. ఈమేరకు యాజమాన్యం రూ.31,31,000 డిపాజిట్ చేయడంతో చెక్కును శుక్రవారం బాధితుడికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందజేశారు. కార్మికశాఖ ఉప కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి వైరా: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యమని బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు. వైరా బ్రాహ్మణపల్లిలో బ్యాంకు నూతన బ్రాంచ్‌ను రీజినల్ మేనేజర్ ప్రసన్నకుమార్‌తో కలిసి శుక్రవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.5కోట్ల రుణాల చెక్కులు అందజేశాక మాట్లాడారు. రాష్ట్రంలో 933 శాఖలు, రూ.80వేల కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు కొనసాగుతోందని తెలిపారు. మహిళలు, రైతులు, చిరువ్యాపారులతో పాటు పారిశ్రామికవేత్తలకు రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ పి.సూరిరెడ్డి, సీనియర్ మేనేజర్ ప్రకాశ్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, హబ్ మేనేజర్ సంపత్ పాల్గొన్నారు. ‘భూదాన్’ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు ఖమ్మంమయూరిసెంటర్: భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేశాక అర్హులకు ప్రభుత్వం స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. వీరు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు రుణాల మంజూరు చేయించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణ ప్రారంభ ఖర్చు కోసం డీసీసీబీ ద్వారా రూ.లక్ష రుణంగా ఇప్పిస్తారు. ఈమేరకు లబ్ధిదారుల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు మెప్మా అధికారులు డీసీసీబీ ద్వారా రుణం మంజూరు చేయించనున్నారు. ఎవరైనా మహిళలు సంఘంలో సభ్యులుగా లేకపోతే వారితో సంఘాలను ఏర్పాటు చేయించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు 31మంది మహిళలు సంఘంగా ఏర్పడేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మూడోసారి కూడా వాయిదా కామేపల్లి: కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణప్రసాద్ సంత వేలం పాట మూడోసారి కూడా వాయిదా పడింది. మొదటి సారి పోలీసుల సూచనతో, రెండోసారి మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడిన విషయం విదితమే. ఈమేరకు శుక్రవారం సర్పంచ్ ధరావత్ అనురాధ అధ్యక్షతన వేలం నిర్వహించగా బోడా శ్రీను, ధరావత్ విన్నిబాబు, గుగులోత్ వినోద్‌కుమార్, బాదావత్ నాగరాజు ధరావత్తు, సాల్వెన్సీ సొమ్ము రూ.35లక్షల చొప్పున చెల్లించి పాల్గొన్నారు. చివరికి బోడా శ్రీను రూ.1,82,80,000 హెచ్చు పాటదారుడిగా నిలిచినా ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో వాయిదా వేశారు. కాగా, మద్దతు ధర తగ్గిస్తేనే పాల్గొంటానని నాగరాజు మధ్యలోనే తప్పుకున్నాడు. కల్లూరు డీఎల్పీఓ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ మేకల మల్లికార్జున్‌రావు, ఎంపీఓ వీ.వీ.శాసీ్త్ర, కార్యదర్శులు శంకర్, నెహ్రూ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం అనంతరం ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. అలాగే, శ్రీవారి వాహనరూపుడైన గరుత్మంతునికి నివేదించిన ప్రసాదాన్ని సంతానం ఆశించే దంపతులకు అందజేశారు. ఆతర్వాత మయూర వాహనంపై స్వామి, అమ్మవార్లను గిరి ప్రదక్షిణ చేయించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.


