Odisha News
-
పులిచర్మాల కేసులో.. ఆరుగురికి జైలు శిక్ష
రాయగడ: పులి చర్మాల సగ్లింగ్ కేసులో విచారించిన సీజేఎం అపర్ణా మహాపాత్రో ఆరుగురు నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించలేని పక్షంలో నిందితులు అదనంగా మరో 8 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవీంద్ర పిడిక, అక్షయ కుమార్ ఒడియా, సింహాచల్ సబర్, నిఖిల్ గంట, హలధర్ సబర్, సంగాన కడ్రకలు 2024 మే 9వ తేదీన పులిచర్మాల విక్రయ కేసులో అరెస్టయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం 8 మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ మేరకు తుది తీర్పును సీజేఎం వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాణిపిండ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు పెడిగుడ గ్రామానికి చెందిన బలిష్ట దిశారి (35)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అంబొదల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృదేహాన్ని పోస్టుమార్టం కోసం మునిగుడ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అంబొదలలో కొనసాగుతున్న అమ్మవారి పండగను చూసి ఇంటికి సైకిల్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడు సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 6 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం రాయగడ: వంటగ్యాస్ కృత్రిమ కొరత నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక స్క్వాడ్ బుధవారం ఆకస్మిక దాడులను నిర్వహించింది. పట్టణంలోని వివిధ హోటళ్లలో నిర్వహించిన దాడులో ఆరు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నియమాలకు విరుద్ధంగా డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాడులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అదనపు తహసీల్దార్ దేవాశీస్ బిశ్వాస్ నేతృత్వంలో సమితి, మున్సిపాలిటీ పరిధిలోని పౌరసరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లు మానవ్ రంజన్ సున, మహేద్ర రాయక్లు దాడుల్లో పాల్గొన్నారు. ఈ బృందం పట్టణంలోని 16 ప్రాంతాల్లొ నిర్వహించిన దాడుల్లో భాగంగా స్థానిక అభిరుచి హోటల్ నుంచి రెండు, హోటల్ గుండిచా నుంచి మూడు, హోటల్ జగన్నాథ్ నుంచి ఒక సిలండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. జన గణనలో అందరూ పాల్గొనాలి భువనేశ్వర్: సమ్మిళిత వృద్ధికి దోహదపడే జన గణనలో ప్రజలందరూ పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం తన స్వీయ గణనను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతీ ఇంటినీ లెక్కించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ ఈ ముఖ్యమైన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో భాగంగా రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉదాహరణగా నిలిచారు. ఇతరులు కూడా అలాగే చేయాలని ప్రోత్సహించారు. జనాభా గణన అభివృద్ధికి పునాది వేసే సమర్థవంతమైన ప్రణాళిక అన్నారు. ప్రస్తుతం ఇళ్ల జాబితా దశ కొనసాగుతుంది. ఈ లెక్కింపులో ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం ప్రాతినిధ్యం లేకుండా మిగిలిపోకుండా ఉండేందుకు పౌరులు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సేవా భవన్లో స్వీయ గణన కార్యక్రమానికి ఒడిశా జనగణన కార్యకలాపాల డైరెక్టర్ నిఖిల్ పవన్ కల్యాణ్, భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్ చంచల్ రాణా హాజరయ్యారు. -
ఉత్సాహంగా మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
రాయగడ: చల్లని తల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవాలు ఉత్సాహంగా కొసాగుతున్నాయి. మార్చి 29వ తేదీన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరున్న మజ్జిగౌరీ అమ్మవారికి ఈ ఉత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రసాదాలను పంపిణీ చేస్తుండగా మరికొందరు అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కనిపించింది. ఇదిలాఉండగా అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి సిందూరం, తాయెత్తులు విక్రయాలకు గిరాకీ పెరిగింది. ఎటువంటి దుష్టశక్తులు బారిన పడకుండా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజారులు తయారు చేసే తాయత్తులను ఖరీదు చేసుకున్న భక్తులు వాటిని చేతికి కట్టుకుంటారు. అదే చిన్నపిల్లలకు మెడలో కడతారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు వీటిని ప్రగాఢంగా నమ్ముతారు. తాయత్తలు కట్టుకోవడంతో పాటు అమ్మవారి సిందూరాన్ని తమతో తీసుకెళ్తున్నారు. నేడు పూర్ణాహుతి అమ్మవారి చైత్రోత్సవాల్లో ప్రధాన ఘట్టం చండీహోమం. చండీ హోమం పూర్ణాహుతి గురువారం రాత్రితో ముగుస్తుంది. దీంతో ఉత్సవాలు ముగిసినట్లుగా భావిస్తారు చండీ హోమంలో భక్తులు కొబ్బరికాయ, నెయ్యి తదితరమైనవి సమర్పించుకుంటారు. హోమంలో (పూర్ణాహుతి)లో వీటిని వేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తులు భావిస్తారు. అలాగే ముగింపు ఉత్సవాల్లో భాగంగా మల్లెలు తొక్కడం, ఎర్రని నిప్పులపై నడవడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
ఎస్పీ జ్యోతింద్ర పండాకు వీడ్కోలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కు మార్ పండా మంగళవారం తన పదవీ విరమ ణ చేశారు. ఈ సందర్భంగా రాణిపేట డీపీఓ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభను సిబ్బంది ఏర్పాటు చేశారు. గంజాం జిల్లా బరంపురం ఎస్పీ ఎం.శరవణా వివేక్ గజపతి జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు స్వీకరించా రు. 2015 ఐ.పి.ఎస్ బ్యాచ్‌కు చెందిన వివేక్ శరవణా గజపతి జిల్లాకు అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఆర్.ఉదయగిరి) రాకేష్‌కు మార్ (ఐ.పి.ఎస్.), అదనపు జిల్లా ఎస్పీ సునీ ల్ కాంత మహంతి, పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత్ భూపతి, మోహనా పోలీసు ఐఐసీ ఓం నారాయణ పాత్రో, ఇతర సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు తెలిపారు. భువనేశ్వర్: ఒడిశా కు చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు, స్థానిక డాక్టర్ అభిన చంద్ర హోమియోపతి వై ద్య కళాశాల మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ నందా భార త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత వైద్యుడి గా నియమితులైనట్లు భారత ప్రభుత్వ ఆయు ష్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రాష్ట్ర, జాతీయ స్థాయిలో హోమియో పతి చికిత్స మరియు పరిశోధన రంగంలో విశేష కృషి చేశారు. జగత్సింగ్పూర్ జిల్లా ము డిపూర్ పంచాయతీకి చెందిన ప్రముఖ కవి, ప్రజా నాయకుడు బైకుంఠనాథ్ నందా పెద్ద కుమారుడైన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ నందా హోమియోపతి వైద్య రంగంలో సుప్రసిద్ధులు. ప్రొఫెసర్ నంద హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆయుష్ పరిశోధన, అభివృద్ధి విభాగానికి ఛైర్మన్‌గా సేవలందించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అనురాధ రిలీవ్‌కు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఆమెకు బీసీ సంక్షేమ శాఖ అధికారి నుంచి ఏబీసీగా డిమోషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆమె ఎవరికీ చెప్పకుండా విజయవాడ వెళ్లిపోయారు. దీంతో ఆమెను రిలీవ్ చేయడంలో సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదు. మార్చి 25న ఆమెకు రివర్షన్ ఉత్తర్వులు వస్తే, ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆమె రిలీవింగ్‌పై ఎటువంటి చర్యలు లేవు. కాగా బుధవారం నాడు కలెక్టర్‌కి అధికారులు ఫైల్ పెట్టారు. అయితే ఈ జాప్యం వెనుక కూడా డీబీసీ హస్తం ఉందని తెలుస్తోంది. తనకు రిలివీంగ్ జాప్యం చేస్తే, విజయవాడ నుంచి మరలా అక్కడ ఉన్నవారిచే సర్దుబాటు చేయించుకొనే ప్రయత్నం చేయడం జరుగుతుందని ఇక్కడ అధికారులను తన రిలీవింగ్ను నొక్కి పెట్టించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆ కార్యాలయం వర్గాలు తెలుపుతున్నారు. డీబీసీ అనురాధ రిలీవింగ్ ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్ బుధవారం సాయంత్రంకి కలెక్టర్ చాంబర్కి చేరింది. గురువారం నాటికి ఆమె రిలీవింగ్ ఉత్తర్వులు రానున్నాయి. ప్రభుత్వం డీబీసీ అనురాధను ఏబీసీగా డిమోషన్ చేసి బదిలీ చేసింది తప్ప, ఆమె స్థానంలో జిల్లాకు డీబీసీని నియమించలేదు. దీంతో ఇన్చార్జిని వేయడం తప్పనిసరి. అలాగే డీబీసీగా ఆమె పనిచేసిన కాలంలో జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో బదిలీలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియమాకాలు ఇచ్చారు. అంతేకాకుండా జిల్లాలో ఆమె చేసిన అవినీతిపై డైరక్టరేట్‌లో చర్చ జరుగుతోంది. ఈసారి ఆమైపె విచారణలో ఈ అవినీతి రుజువైతే, ఆమె నాలుగేళ్లు పొందిన అలవెన్సులు, జీతం సైతం రికవరీకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. 10 నుంచి నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: ఈనెల 10వ తేదీ నుంచి బాపూజీ కళామందిర్లో శ్రీముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనునట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కేతిరెడ్డి రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు బ్రోచర్‌ను బుధవారం విడుదల చేశారు. రోజుకు రెండు నాటికల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 12న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె.శ్యామ్ కుమార్, పొగిరి సత్యం, రమేష్, ప్రసాద్దు, కీర్తి, కుమారి, సంతోషి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రాయగడ: రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రోడ్డు భద్రతా కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఎక్కడబడితే అక్కడ నిలిపివేయడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి అనధికార పార్కింగ్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను నిలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధితశాఖ అధికారులకు ఆదేశించారు. అందుకు ప్రత్యేకమైన ఎన్‌ఫొర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో సీపీ కెమెరాల వ్వవస్థ మరింత మెరుగుపరచాలని సమావేశంలొ పాల్గొన్న ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సూచించారు. దీనిపై మున్సిపాలిటీ యంత్రాంగం స్పందించాలన్నారు. గత మూడేళ్లలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను ఆర్టీఓ వినయ్ కుమార్ వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ లేకుండా నడపడమే కారణమన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై తరచూ జరిమానాలు వేయడంతోపాటు వారికి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, ఏడీఎం నవీన్‌చంద్ర నాయక్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ధ్యానంతో మానసిక ప్రశాంతత
రాయగడ: ధాన్యంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని విశాఖపట్నం నుంచి వచ్చిన ధ్యానగురు టి.రేవతి దేవి అన్నారు. స్థానిక సాయిప్రియ లేడీస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాంబాబు అపార్ట్మెంట్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవుని నిత్యజీవితం ఒత్తిడితో కొనసాగుతుందన్నారు. ఒత్తిడిని నియంత్రించాలంటే ధ్యానమే ప్రధాన అస్త్రమని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధాన్యం చేయాలని సూచించారు. క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లాడి చంద్రమౌళి, క్లబ్ కార్యదర్శి మాధురి, కోశాధికారి నిర్మల పట్నాయక్ పాల్గొన్నారు. -
ఘనంగా పోలీసు వ్యవస్థాపక దినోత్సవం
జిల్లా అదనపు ఎస్పీ సునీల్ మహంతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్ఐ సునీల్‌కుమార్ శెఠి, కానిస్టేబుల్ సుభ్రత్ కుమార్ పండా పర్లాకిమిడి: ఒడిశా పోలీసు–91వ ప్రతిష్ట(వ్యవస్థాపక) దినోత్సవాన్ని బుధవారం బెత్తగుడలో పోలీసు రిజర్వడ్ గ్రౌండ్స్‌లో అదనపు ఎస్పీ సునీల్ కాంత మహంతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 1936 ఏప్రిల్ 1వ తేదీన ఒడిశా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒడిశా పోలీసు ప్రతిష్ట ఆవిర్భవించింది. పోలీసుశాఖలో అసువులు బాసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ కాంత మహంతి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పోలీసు బెటాలియన్, ఓ.ఎస్.ఏ.పి, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ కవాతు చేపట్టారు. ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం 2025–26 సంవంత్సరానికి పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హవల్దార్లు పది మందికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ బహుమతులు పొందిన పోలీసు అఽధికారుల్లో చంద్రగిరి పోలీసు స్టేషన్ ఎస్ఐ సునీల్ కుమార్ శెఠి, కై లాష్ చంద్ర ముదులి, కానిస్టేబుల్ సుభ్రత్ కుమార్ పండా, ననీల్కుమార్ రోథో, కానిస్టేబుల్ ధీరజ్‌కుమార్ పోరిచ్చా, హవల్దార్ యు.వాసుదేవరావు, ఓ.ఎస్.ఏ.పి భుబేంద్ర కుమార్ బెహరా, శ్రేష్ట సిపాయిగా దాశరథి శోబోరో ఉన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
జయపురం: జయపురం సమితి మొకాపుట్ గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపు రం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొరాపుట్ జిల్లా శిశు సంక్షేమ సమితి అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయత్రీదేవి హాజరయ్యారు. బాల్య వివాహాలు సమాజానికి అనర్థదాయకమన్నారు. బాల్య వివాహాల నిరో ధక చట్టం ప్రకారం 21 ఏళ్ల కన్నా తక్కువ వయసు పురుషుడు, 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న మహిళ వివాహం చట్ట విరుద్ధమని వివరించారు. ఈ శిబిరం యొక్క ప్రధాన లక్ష్యం బాల్య వివాహాల నివారణ, బాధితులకు రక్షణ సహాయం, పునరావాసం కల్పించటం, జాతీయ న్యాయ సేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘ఆశా’ కార్యక్ర మం ద్వారా బాల్య వివాహాలను అరికట్టేందుకు సమగ్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్ర మోద్కుమార్దాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.దివాకర్‌రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజ కిశోర్పాయిక్రాయ్ పాల్గొన్నారు. -
రాష్ట్ర అవతరణలో పర్లాకిమిడికి ప్రత్యేక స్థానం
పర్లాకిమిడి: రాష్ట్ర అవతరణలో పర్లాకిమిడికి ప్రత్యేక స్థానం ఉందని జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ అన్నారు. మహారాజా క్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విశేష కృషి జరిపి బ్రిటీష్ వారితో పోరాడి ఉత్కళ రాష్ట్రాన్ని భారత స్వాతంత్య్రానికి పూర్వమే సాధించారని కొనియాడారు. జిల్లా స్థాయి ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, డీఎఫ్‌వో కె.నాగరాజు గౌరవ అతిథిగా జిల్లా పరిషత్తు సీడీవో దయామయ పాఢి, ఆదనపు కార్యనిర్వాహణాధికారి ఫృథ్వీరాజ్ మండళ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక సంఘం ఈవో లక్ష్మణముర్ములు విచ్చేశారు. తొలుత ఉత్కళ రాష్ట్ర వైతాళికులు, త్యాగమూర్తులు పర్లాకిమిడి మహారాజా గజపతి, మధుసూదన్ దాస్, పండిత గోపబంధుదాస్, గంగాధర్ మెహార్, మధుసూదన్ దాస్ తదితరుల చిత్రపటాలకు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒడిశాలో దేశంలో లేని వివిధ సంస్కృతులు, కళా, ఆదివాసీ సంప్రదాయం, ప్రత్యేక మందిరాలు ఉన్నాయన్నారు. ఒడిశా రాష్ట్రం ఏర్పడి 2036 సంవత్సరానికి వందేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి మోహాన్ చరణ్‌మఝి వికసిత్ ఒడిశా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నడుం బిగించారని కలెక్టర్ అగార్వాల్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు నిర్వహించిన వక్తృత్వ, డ్రాయింగ్, రచన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. -
అందరికీ చేరాలి
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సంక్షేమ ఫలాలు..రాయగడ: సంక్షేమ ఫలాలు అందరికీ చేరువ కావాలని వక్తలు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు అధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయగడ జిల్లా వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. పట్టణంలోని వివిధ కూడళ్లలోని మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక గాంధీపార్క్‌లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు నవీన్ చంద్ర నాయక్, నిహారి రంజన్ కుహరో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక బిజూ పట్నాయక్ అడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు వేదికపై బహుమతులను అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా గోపబంధుదాస్, మధుసూదన్ దాస్ తదితర మహానీయులు వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. రాష్ట్ర మాజీమంత్రి, బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాధ సరక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్నాన గౌరీశంకర్ రావు, అనసూయా మాఝి తదితరులు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడిః: ఒడిశా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి పేరుతెచ్చి ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికి పట్టం కట్టిన పర్లాకిమిడి మహారాజా శ్రీక్రిష్ణచంద్రగజపతికి ఘనంగా ప్రముఖులు నివాళులర్పించారు. పలు కూడళ్లలోని మహారాజా విగ్రహాలకు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కుమ్మరివీధి వద్ద మహారాజా క్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ సమాధి వద్ద జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఏడీఎం ఫల్గునీ మఝి ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మార్కెట్ జంక్షన్ వద్ద మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి భేతాళ సమరవాహినీ యోధుల కత్తి, కర్రసాముల విన్యాసాలను కలెక్టర్, ఏడీఎం, ఇతర అధికారులు తిలకించారు. స్థానిక సరస్వతీ శిశువిద్యామందిర్ నుంచి పట్టణంలోని సత్యసాయి ఇంగ్లిషు మీడియం, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఒడిషా రాష్ట్ర పోరాటపటిమకు చిహ్నామైన పర్లాకిమిడి మహారాజా, ఉత్కళ మాత, మధుసూదన్ దాస్, ఒడియా సంస్కృతిక అద్దం పట్టే బోయితోబోంధన్ వేషాధారణ, కత్తి, కర్రసాము, పాయక్ యుద్ధవీరుల గాధలను తెలియజేస్తూ ర్యాలీని మార్కెట్ వరకూ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా పరిషత్తు కార్యనిర్వాహణ అధికారి, సీడీవో దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక ఈవో లక్ష్మణ ముర్ము, జిల్లా కల్చరల్ అధికారి అర్చనా మంగరాజ్, బినోద్ జెన్నా, భరత్ భూషణ్ మహాంతి, ఫృథ్వీరాజ్ మండళ్ పాల్గొన్నారు. -
రెండు ఓఎస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభం
పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓ.ఎస్.ఆర్.టి.సి) ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్స వం పురస్కరించుకుని బుధవారం పూరీ, గజపతి జిల్లా అడవ, కటమాకు రెండు బస్తులు వేసింది. బస్సుల ప్రారంభోత్సవ సభకు అతిథిగా ఏ.డి.ఎం ఫల్గుణి మఝి విచ్చేశారు. గజపతి ప్రైవేటు బస్సు యాజమాన్యం సంఘం అధ్యక్షులు ఛిత్రి సింహాద్రి, కార్యదిర్శి ఇంజా వెంకటరమణ, పురపాలక కౌన్సిలర్ బబునా బెహరా, బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, బీజేపీ నాయకుడు డుల్లు మిశ్రా, భరత్ భూషణ్ మహంతి తదితరులు విచ్చే సి మాట్లాడారు. పర్లాకిమిడి నుంచి ఉదయం ఏడు గంటలకు పూరీ ఎక్స్‌ప్రెస్ బస్సు బయలుదేరి జిరంగో, మహేంద్రగిరి బైపాస్, తుంబ, పాత్రపురం, జోరడా–చికిటి, బరంపురం మీదుగా ఛత్రపురం, గంజాం, చందన్‌పూర్ మీదుగా పూరీకి మధ్యాహ్నం చేరుకుంటుంది. పూరీ నుంచి రాత్రి ఏడు గంటల కు బయలుదేరి తెల్లవారుజామున పర్లాకిమిడికి చేరుకుంటుంది. మరో బస్సు పర్లాకిమిడి నుండి ఉప్పలాడ, రాయఘడ, ఆర్.ఉదయగిరి, చంద్రగిరి, మోహానా మీదుగా కటమా (బ్రాహ్మణగాం సరిహ ద్దు) వరకు ప్రయాణిస్తుంది. ఈ బస్సు వల్ల గిరిజన గ్రామాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని ఓ. ఎస్ ఆర్టీసీ జిల్లా మేనేజర్ తన్మయి కుమార్ ప్రధాన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువజ న నాయకుడు కోట్ల యువరాజ్, దారపు చిట్టి, తదితరులు పాల్గొన్నారు. -
వాడవాడలా రాష్ట్ర అవతరణ దినోత్సవం
జయపురం: జయపురం జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించా రు. ఉత్కళ అవతరణ 90వ వార్షికోత్సవాన్ని పలు సంస్థలు విద్యాలయాల్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో పవిత్ర ఉత్కళ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. విశ్వవిద్యాలయ కులపతి మహేశ్వర చంద్రనాయి క్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షులు.. విశ్రా ంత ప్రధాన ఉపాధ్యాయులు హరిహర కరసుధా పట్నాయక్, ఎగ్జామినేషన్ విభాగ అధికారి ప్రొఫెస ర్ రంజన్ కుమార్ ప్రధాన్, డాక్టర్ కమళ మహంతి హాజరై రాష్ట్రావతరణ ప్రాముఖ్యతను వివరించారు. ఉత్కళ గౌరవ మహుసూధన దాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించా రు. ఈ సందర్భంగా మహరిహర కరసుధా పట్నాయక్‌ను వర్సిటీ అధికారులు సత్కరించారు. అలాగే జయపురం తెలుగు సంస్కృతిక సమితి ద్వారా నిర్వహిస్తున్న స్టానిక సిటీ ఉన్నత పాఠశాలలో ఉత్క ళ అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతిక సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ అధ్యక్షత వహించారు. -
నిషికాంత్ దూబే వ్యాఖ్యలతో.. అసెంబ్లీలో దుమారం
భువనేశ్వర్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసన సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా సభ నినాదాలతో మార్మోగింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం నుంచే బిజూ జనతా దళ్ (బీజేడీ), కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు సభలో నినాదాలు చేశారు. ఈ గందరగోళానికి తోడుగా, సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం సమీపంలో నిరసన చేపట్టారు. దివంగత నాయకుడికి సంఘీభావం, గౌరవం తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. నిరసనలు ఆగకుండా కొనసాగడంతో స్పీకర్ సభను ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ సభ్యుడు నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పథ్వీరాజ్ హరిచందన్ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను అనుచితమైనవిగా, ఆమోదయోగ్యం కానివిగా పేర్కొన్నారు. బిజూ పట్నాయక్ గురించి ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ప్రభుత్వం గమనించింది. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆ వ్యాఖ్య అనుచితమైనది, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అది ముఖ్యమంత్రితో సహా ప్రజలలో తీవ్ర ఆవేదనను కలిగించింది. ఆ వ్యాఖ్యపై స్పందించడం, లేదా ఈ విషయాన్ని రాజకీయం చేయడం వల్ల ఒడిశాలో బిజూ బాబుకు ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఈ విషయంపై తదుపరి చర్చలకు దూరంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని న్యాయశాఖ మంత్రి పథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. -
హక్కులు, చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో సర్వజననీ సేవా అధికార చట్టంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఓ.ఆర్.టి.పి.ఎస్.ఏ డిప్యూటీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సరితా కనుంగో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులతోపాటు ఒడిశా ప్రజాసేవల చట్టం, హక్కుల అధికారి శ్రేయా పాత్రో, రిజిస్ట్రార్ డాక్టర్ అనితాపాత్ర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సేవా హక్కుల చట్టం, వాటి నిబంధనలను ప్రాజెక్టు కో ఆర్డినేటరు సరితా కనుంగో స్టూడెంట్ వలంటీర్లు, ఫ్యాకల్టీ సభ్యులకు ఆవగాహన కల్పించారు. దాదాపు 200 మంది జాతీయ సేవా వాలంటీర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ శిక్షణలో సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్ర, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ రితీష్ కుమార్, డీన్(అడ్మిన్ ) డాక్టర్ ఎస్.పి.నందా, డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నిహాల్.ఆర్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజంలో మహిళలకు .. సముచితస్థానం ఇవ్వాలి
పర్లాకిమిడి: సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని, నారీమణులు నాలుగు గోడల మధ్య ఉండకుండా తమ హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ చైర్పర్సన్ సోహానా మహంతి అన్నారు. పర్లాకిమిడిలో బ్లాక్‌స్థాయి న్యాయ చట్టాలపై అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గ్రామీణ మహిళా స్వయం ఉపాధి శిక్షణా కేంద్ర హాల్లో మంగళవారం మహిళా చట్టాలు, వాటి అమలుపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏడీ ఎం.ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, ప్రొటెక్షన్ ఆఫీసర్ సరలా పాత్రో, జ్యువెనెల్ బోర్డు ప్యానల్ మహిళా న్యాయవాది భాగ్యలక్ష్మీ నాయక్, జిల్లా జీవనోపాధులశాఖ అధికారి శివాణీ పాణిగ్రాహి, సి.డబ్ల్యూ.సీ మాజీ చైర్మన్ ప్రమోద్ రవుళో, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. నారీమణులు సమాజంలో గౌరవం పొందాలంటే వంటింటి నుంచి బయటకురావాలన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాల్లో లైంగిక వేధింపులు, ఉద్యోగం ఇస్తామని మోసం చేసిన వారిపై న్యాయపరంగా పోరాడాలన్నారు. బాల్య వివాహాలు అరికట్టాలని, గృహాహింసపై అనేక చట్టాలు మహిళా హక్కులను కాపాడుతున్నాయని, వాటి గురించి తెలుసుకోవాలన్నారు. కొందరు మహిళా సర్పంచ్‌లు, బ్లాక్ చైర్ పర్సన్లు, ప్రజాప్రతినిధులు తమ పదవులను, అధికారాలను భర్తలకు తాకట్టుపెట్టే తత్వాన్ని వదులుకోవాలన్నారు. అప్పుడే ఒడిశా రాష్ట్రంలో మహిళలు సమానమైన హక్కులు పొంది ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. సమాజంలో ఉత్తమ సేవలు అందించిన ఆశ వర్కర్లు, ప్రజాప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలతో మహిళా చైర్పర్సన్ సత్కరించారు. కొంతమంది మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, భర్తలు, అత్తమామాల నుంచి వేధింపుల కేసులను విన్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
రాయగడ: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి బారినపడి ప్రజలు అల్లాడిపోకుండా జిల్లాలోని బిసంకటక్ సమితి కార్యాలయం నీటి ఎద్దడి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. సమితిలో మొదటి విడతగా పది నీటి ట్యాంకర్లను సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం వాటికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. సమితి పరిధిలో గల చంచాడిగుడ, హటొమునిగుడ, పాయికొడాకులుగుడ, సహడ, జిగిడి, డుకుం. డుమురినెలి, భాత్పూర్, కుంభారిధాముని, కుట్రాగుడ పంచాయతీలకు ఈ ట్యాంకర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ వేసవి తీవ్రత కారణంగా గొట్టపుబావులు మోరాయిస్తాయని, దీంతో ఆయా ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆయా పంచాయతీలకు ఒకొక్కటి చొప్పున ట్యాంకర్లను సిద్ధం చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి వంటి సమస్యలకు సంబంధించి అందిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేశామని తహసీల్దార్ కె.వెంకటరెడ్డి, బీడీఓ శివప్రసాద్ పట్నాయక్, సమితి వైస్ చైర్మన్ దేవీ ప్రసాద్ పట్నాయక్, ఆయా పంచాయితీల సర్పంచులు తెలియజేశారు. వైభవంగా శ్రీరామనవమి వేడుకలు పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ హడ్డుభంగి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు, యాత్ర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు కోదండ రామాలయాన్ని సందర్శించారు. కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షుడు కోరేటి బాబూరావు, కాశీనగర్ జోన్–2 మండల అధ్యక్షుడు కె.జీవన్ రావు, సి.హెచ్.లోకనాథం, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు, క్యాడర్ పాల్గొన్నారు. కోడూరునారాయణ రావుకు హడ్డుభంగి కోదండ సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షుడు కోరేటి బూబూరావు స్వాగతం పలికి సన్మానించారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి మల్కన్‌గిరి: పిల్లల ఆరోగ్యం పట్ల అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అధికారులు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పోషణ 15 యోజన కింద ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రూప్ డెవలప్మెంట్ అధికారి అశ్వినీ మహపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి పరిధిలోని వివిధ ప్రాంతాం నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ.. పిల్లల ఎదుగుదల, మానసిక అభివృద్ధి నిర్ధాంచడం, పోషణ ట్రాకర్ యూప్‌లో పిల్లల వివరాలను ఆప్‌లోడ్ చేయాలని అంగన్వాడీలకు సూచించారు. గ్రామ కంఠం భూమి ఆక్రమణ రణస్థలం: లావేరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 242లో ఉన్న ప్రభుత్వ భూమి (గ్రామకంఠం)ని ఒక టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామ పెద్దలు ఎన్నిసార్లు వారించినా వినకుండా తనపని చేసుకుంటున్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో ఈ స్థలం ఆక్రమణకు విశ్వ ప్రయత్నాలు చేసినా గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆక్రమణ పర్వానికి తెరలేపాడు. తన ఇంటికి ఆనుకుని 40 అడుగుల పొడవునా, 4 అడుగుల వెడల్పున ఆక్రమించేలా పక్కాగా కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై కొంతమంది కలెక్టర్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినా మండల, గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలు అడ్డుకోవాలని కోరుతున్నారు. -
ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
జయపురం జమాల్ వీధిలోని శ్రీరామ మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా కల్యాణ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవంలో హిందూ సంప్రదాయంగా శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పురోహితులు నిర్వహించారు. ముత్తైదువులు పసుపు దంపుడు, అక్షింతలు పంపిణీ, మంగళ వాయిద్యాలతో వెళ్లి బంగారు శతిమానాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు. వివాహ మహోత్సవంలో వారణాశి సత్యనారాయణ, సుంకరి ఈశ్వరరావు దంపతులతో పాటు పదిమంది దంపతులచే ఆలయ పూజారులు గన్నవరపు కోటేశ్వరవర ప్రసాద్, శర్మ, ఉలిమిరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. జయపురం -
విశేష పూజలు
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మజ్జిగౌరి అమ్మవారికి..రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం కావడంతో మందిరంలో విశేష పూజలను నిర్వహించారు. స్వర్ణాలంకరణ, సింధూర రంగులో ధగధగా మెరుస్తున్న అమ్మవారి దివ్యమైన రూప దర్శనం భక్తులను తన్మయత్వానికి గురి చేసింది. చైత్రోత్సవాల్లో మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో పూజారులు వంట శాలలో ప్రత్యేకమైన వంటలను చేసి అమ్మవారికి భోగాన్ని సమర్పించారు. అన్నం, పప్పు, కలగాయ కూరతో పాటు కక్కరాలు, పాయసం (ఖిరీ) వంటివి నైవేద్యంగా సమర్పించారు. పూజారి వీధిలో ఉన్న మహిళలు కూడా చైత్రమాసం ఆఖరి మంగళవారం కావడంతో ఇంటిలో తయారు చేసిన పిండివంటలతో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన నెయ్యిలు (మరమరాలు)తో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించారు. భోగం సమర్పించే సమయంలో సుమారు గంట సమయం వరకు (మధ్యాహ్నం) దర్శనాన్ని నిలిపివేస్తారు. అమ్మవారి గర్భగుడి తలుపులను పూర్తిగా మూసి అమ్మవారికి భోగంతో పాటు తయారు చేసిన వివిధ వంటకాలను అమ్మవారి ముందు పెట్టి తలుపులను తిరిగి మూసి వేస్తారు. అనంతరం కొంత సేపు తర్వాత పూజారి ముందుగా గర్భగుడి ప్రధాన ద్వారాన్ని తట్టిన తర్వాత తెరుస్తారు. గర్భగుడి లోపలకు వెళ్లిన పూజారి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతినిస్తారు. అనంతరం అమ్మవారి దర్శనం యథాతథంగా రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రారంభమైన చండీ హోమం అమ్మవారి చైత్రోత్సవాల్లో ప్రధాన ఘట్టం చండీ హోమం. మంగళవారం నుంచి హోమ కార్యక్రమం కొనసాగింది. మందిరం ప్రాంగణంలో ఉన్న మండపంలో పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పురొహితులు హోమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాత్రి పూర్ణాహుతి జరుగుతుంది. దీంతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, కమిటి సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, వడ్డాది శ్రీనివాస్ రావు, పాలకొండ ప్రకాష్, పెద్దీన వాసు దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు పురోహితులు మందిరం ప్రాంగణంలో వేసిన సూర్య చక్రం మధ్యలో కలశం ఉంచి సూర్య ఆవాహన, విశేష పూజలను నిర్వహించారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు ర్యాలీ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడలో అడవిలో అగ్ని ప్రమాదాల నివారించేందుకు బొయిపరిగుడ అటవీ విభాగం సమితి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. వేసవి ఇంకా ప్రారంభం కాకపోయినా బొయిపరిగుడ సమితిలోగల అడవుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో అటవీ విభాగ అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే రోజుల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ర్యాలీ చేశామని బొయిపరిగుడ ఫారెస్టు రేంజర్ సందీప్ కుమార్ పాణిగ్రహి వెల్లడించారు. ముఖ్యంగా చైత్ర పర్వ్ పండగలో అడవులలో మంటలు పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బొయిపరిగుడ సమితి బహుళ ఆదివాసీ ప్రాంతం అని అడవులు తగ్గి పోతుండటం వల్ల పర్యావరణంపై పడే ప్రభావం గురించి ప్రజలలో అవగాహన తక్కువ అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సచేతన ర్యాలీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. -
మావో డంప్, పేలుడు సామగ్రి స్వాధీనం
రాయగడ: పోలీస్ డీవీఎఫ్ సిబ్బంది జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లలో భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలు, తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ మంగళవారం డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంతో వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో నిఖిల్, ఇందులతొ సహా 15 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయిన తర్వాత కలహండి, రాయగడ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మునిగుడ, అంబొదల పోలీస్ స్టేషన్ల పరిధిలో గల పజిగరేగ, అంబ్రికొల్, పటానాని తదితర గ్రామాల్లో గల అటవీ ప్రాంతాల్లో డీవీఎఫ్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాల్లొ మావోయిస్టుల డంప్‌లను గుర్తించారు. ఆయా డంప్‌లలో 415 డిటోనేటర్లు, 8 కార్డెక్స్ కట్టలు, 29 కిలొల 3 గొనె సంచుల్లొ అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు, 2 సింగిల్ షాట్ తుపాకీలు, మరొ బీజీఎల్ తుపాకీ, ఒక ల్యాప్‌టాప్, చార్జర్, రెండు విద్యుత్ తీగల కట్టలు, ఎర్రటి గుడ్డ, ప్లాస్టిక్ కంటైనర్లు తదితరమైనవి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల కదలికలు జిల్లాలో లేవని ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. -
బాణం దాడిలో యువకుడికి గాయాలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మాంగిపల్లి గ్రామంలో భూవివాదాలతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ దాడిలో బుధినాధ్ కబాసీ గాయపడ్డాడు. అతను మహువా పూలు ఏరడానికి అడవికి వెళ్లాడు. అక్కడ కొందరు గ్రామస్తులు బాణంతో అతడిపై దాడి చేశారు. దీంతో ఆయన రక్తమోడుతూ పరుగులు పెట్టుకుంటూ గ్రామానికి వచ్చేశాడు. కుటుంబ సభ్యులు కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆయన భార్య సుకాంతి కబాసీ కలిమెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన భీమా కబాసీ, లక్ష్మణ్ కబాసీ, సోమనాధ్ కబాసీపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్నాథ్ సాగర్ పరిసరాల్లో నిర్మాణాలపై సర్వే జయపురం: జయపురంలో చారిత్రాత్మక జగన్నాథ్‌సాగర్ పునర్ నిర్మాణ పనులతోపాటు సాగర్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ నుంచి సీనియర్ బృందం సర్వే జరిపి ఆయా పనులకు వ్యయపు అంచచా రిపోర్టు సమర్పించేందుకు కంట్రాక్ట్ తీసుకుంది. ఆ సంస్థ నుంచి వచ్చిన సీనియర్ సర్వేయర్లతో పాటు జయపురం మున్సిపాలిటీ జూనియర్ ఇంజినీర్ హేమంత పండ, నిర్మాణ విభాగ అధికారి దేవప్రసాద్ నాయిక్ పాల్గొన్నారు. జగన్నాథ్ సాగర్ ఒకవైపున పైపులతో ప్రహరీ నిర్మాణం, మొక్కలు నాటటం మొదలగు నిర్మాణాలపై సర్వే నిర్వహించి వాటిని తక్కువ ఖర్చుతో పూర్తి చేసేలా నివేదిక తయారుచేస్తారని మున్సిపల్ ఇంజినీర్ అజయ జాని వెల్లడించారు. జయపురం జగన్నాథ్ తవ్వకాలు, మట్టి తొలగింపు, పరిశుభ్రత పనులకు రూ. 16 కోట్లు, సాగర్ పరిసరాల అభివృద్ధి పనులకు రూ. 6 కోట్లు కేటాయించినట్లు అధికారులు చెప్పారు. బడ్జెట్‌పై అవగాహన మల్కన్‌గిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మల్కన్‌గిరి జిల్లా పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో మంగళవార బడ్జెట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పరిపాలనా పారదర్శకతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ‘మన బడ్జెట్ తెలుసుకుందాం’కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అదనపు జిల్లా కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభంలో జిల్లా పంచాయతీ అధికారి సరోజ్ కుమార్ ప్రధాన్ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు వివరించారు, బడ్జెట్ తయారీ నుంచి అమలు వరుకు ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే విషయంపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతి పథకం విజయవంతం కావడానికి బడ్జెట్ నిర్వహణ చాలా అవసరమని అన్నారు. ప్రజలకు బడ్జెట్‌పై అవగాహన ఉంటేనే తమ ప్రాంత సమస్యలు అభివృద్ధి కోసం డిమాండ్ చేయగలరన్నారు. డిప్యూటీ కలెక్టర్ బిమల్ కుమార్ లెంక, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ట్రాన్స్జెండర్లు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలి
పర్లాకిమిడి: ట్రాన్స్జెండర్లు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అన్నారు. వీరు కూడా మగ, ఆడ వారి వలే సమాజంలో స్వతంత్రంగా, గౌరవపూర్వకంగా జీవించే హక్కు సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు మేరకు కలిగి ఉన్నారన్నారు. స్థానిక కలెక్టరేట్ నాలుగో హాల్లో అంతర్జాతీయ తృతీయలింగ దృశ్యమాన్యత దినోత్సవం 2025–26ని మంగళవారం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అంతకు ముందు పర్లాకిమిడి మహారాజా బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏడీఎం ఫల్గునీ మఝి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పట్టణ పురవీధులతో పాటు కలెక్టరేట్ వరకూ సాగింది. అనంతరం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్‌గీతా బోడోరయితో అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో ఏడీఎం ఫల్గునీ మఝి, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఒడిశా జీవనోపాధుల శాఖ అధికారిని శివాణీ పాణిగ్రాహి, ఎస్‌డబ్ల్యూడబ్ల్యూఎస్ టీఐ అధికారి సునీత, ట్రాన్స్‌జెండర్స్ సంఘం కార్యదర్శి జాస్మిన్ షేక్, అధ్యక్షురాలు మధుబోరాడో, ఆదనపు తహసీల్దార్ కిసాన్ బెహారా, జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి లక్కోజు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. గజపతి జిల్లాలో 79 మంది హిజ్రాలు ఉండగా అందులో 38 మందికి గుర్తింపు పత్రాలు అందజేశామని సబ్ డివిజనల్ సామాజిక సురక్షా అధికారిని ఉత్సర్‌గీతా బోడోరయితో తెలియజేశారు. జిల్లాలో ముగ్గురు ట్రాన్స్జెండర్లకు స్వయం సహాయక గ్రూపుగా గుర్తించి రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. అలాగే 20 మంది హిజ్రాలకు ప్రభుత్వ మధుబాబు పింఛన్ పథకం ద్వారా నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. హిజ్రాలకు ప్రభుత్వ పరంగా వారికి టెర్రకోటా బొమ్మలు తయారుచేసి అమ్మడానికి వారికి నెలరోజుల పాటు శిక్షణ అందజేశామన్నారు. హిజ్రాలపై దాడులు చేసే వారిపై తగు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ అనుప్‌పండా అన్నారు. వారికి సమాజంలో సమాన హక్కులు కల్పించడంతోపాటు విద్య, ఉపాధి, ఆరోగ్యం, వాణిజ్యం చేసుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. అందువల్ల యాచక వృత్తికి దూరంగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి పథకాలు అందిపుచ్చుకోవాలని ఏడీఎం మఝి అన్నారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. -
పన్నెండేళ్ల తర్వాత ఇంటికి..
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిఖాల్ పంచాయతీ నియమగిరి పర్వత ప్రాంతమైన సనొడెంగుడి గ్రామానికి చెందిన సోని సికక 12 ఏళ్ల క్రితం తప్పిపోయింది. సొమవారం నాడు పోలీసులు కేరళ రాష్ట్రంలో ఉన్న సోనిని పట్టుకుని తిరిగి వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈ విషయమై మునిగుడ పోలీస్ స్టేషన్ ఐఐసీ కేశవ్ షడంగి పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నియమగిరి పర్వత ప్రాంతమైన సనొడెంగుడి గ్రామంలొ నివసిస్తున్న కంధారి సికకకు ఇద్దరు కూతుళ్లు. ఇందులొ సోని సికక చిన్నది. మానసికంగా దివ్యాంగురాలైన సోనిని చూసి కుటుంబీకులు ఎంతో బాధపడుతుండేవారు. 2013 వ ఏడాది తన కుటుంబీకులతో సోని మునిగుడ వచ్చింది. అనంతరం తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన సోని కేరళ వెళ్లే ఒక ట్రైన్‌ను ఎక్కింది. తప్పిపోయిన తన కూతురు ఆచూకీ కొసం పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం అప్పట్లో ఫిర్యాదు చేయడంతో పాటు వారు కూడా అన్ని చోట్లా వెతకడం ప్రారంభించారు. ఇదిలాఉండగా కేరళలో గల ప్రభుత్వ మానసిక దివ్యాంగుల ఆస్పత్రి నుంచి మునిగుడ పోలీసులకు సమాచారం అందింది. కొంత కాలంగా తమ ఆస్పత్రిలో సోని చికిత్స పొందుతున్నట్లు వారు మునిగుడ పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది రోజుల క్రితం ఆమె మానసికంగా కోలుకోవడంతో తాను ఉంటున్న వివరాలను చెప్పింది. దీంతో స్పందించిన హస్పటల్ వర్గాలు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు చొరవ తీసుకుని అక్కడి వారితో సంప్రదింపులు చేసి ఎలాగోలా సొనీని తిరిగి మునిగుడ పోలీస్ స్టేషన్ కు చేరేవిధంగా కృషి చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సోనీ ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులకు సమాచారం అందించడంతో ఎంతో ఆనందించిన సోనీ కుటుంబీకులు మునిగుడ పోలీస్ స్టేషన్‌కు సొమవారం చేరుకుని 12 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కూతురిని చూసి ఆనందంతో పరవశించి పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసి తమ గ్రామానికి చేరుకున్నారు. -
ముగిసిన వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ట ఉత్సవాలు
రాయగడ: స్థానిక పెద్ద పోస్టాఫీసు సమీపంలోని సంతోషిమాత మందిరం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మందిరంతో పాటు శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, సంపత్ వినాయక, విశ్వకర్మ విగ్రహాల పునఃప్రతిష్టోత్సవాలు అత్యంత ఘనంగా సోమవారంతో ముగిశాయి. గత నెల 28వ తేదీ నుంచి ప్రతిష్టోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం నుంచి వచ్చిన ప్రముఖ పండితులు వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగాయి. విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకులు పొట్నూరి భాస్కరరావు నేతృత్వంలో విగ్రహ, కొత్తగా నిర్మించిన మందిర ప్రతిష్టోత్సవాలు జరిగాయి. సోమవారం శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛణల మధ్య పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అనంతరం జరిగిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఎనిమిదో తరం వారసులు వీరభద్ర స్వామి దంపతులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టోత్సవాల్లో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, మంజుల మినియాకలు పూర్ణాహుతి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన అరటికట్ల సత్యనారాయణ, కడారి శ్రీను, రాలి రవికేశవ, అంపల్లి నాగరాజు, మాధవ ఆచారి సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
హై టెక్ సముదాయంలో అధునాతన వైద్య సౌకర్యాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో వైద్య రంగంలో సంచలనాత్మక సదుపాయాలు కల్పిస్తున్న హై టెక్ వైద్య విద్యా బోధన సముదాయం సరికొత్త వైద్య, చికిత్స హంగుల్ని ప్రవేశ పెట్టింది. హై టెక్ వైద్య బోధన ఆస్పత్రిలో కొత్త ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, అత్యాధునిక ఎక్స్ రే వ్యవస్థని ప్రారంభించారు. వీటి సేవల్ని సాధారణ ప్రజా సేవలకు అంకితం చేసినట్లు హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. హై టెక్ ఆస్పత్రి సముదాయం 2వ అంతస్తులో అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, గ్రౌండ్ ఫ్లోర్లో అత్యాధునిక 800 ఎస్ఏ డీఆర్ఎఫ్ ఎక్స్ రే వ్యవస్థ ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. అవయవ మార్పిడి వంటి అత్యంత క్లిష్టమైన చికిత్స విధానంలో అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ విభాగం దోహదపడుతుంది. ఈ సందర్భంగా డెర్మటాలజీ, జనరల్ సర్జరీ విభాగాల భవన సముదాయం విస్తరించారు. ఈ అత్యాధునిక వ్యవస్థతో, రోగులు చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స, అవయవ మార్పిడి సౌకర్యాలను పొందగలరని చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, డైరెక్టర్ మధుస్మిత త్రిపాఠి, ప్రొఫెసర్ రవీంద్రనాథ్ బెహెరా, సీఓఓ డాక్టర్ జ్యోతిర్మయి పండా, వైద్యులు, పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. -
మున్సిపల్ కార్మికుల నిరసన
ఇచ్ఛాపురం: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయు అను బంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్మికులు సోమవారం మున్సిపల్ మస్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలి యజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు జీతాలను పెంచి వాటిని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయకుండా అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం 23 నెలలుగా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచా లని కోరారు. మున్సిపల్ కార్మికులు రమేష్, తిరుపతి, లిమ్మాయి, జనార్దన పాల్గొన్నారు. -
రక్తదానం సామాజిక బాధ్యత
జయపురం: రక్తదానం సామాజిక బాధ్యత అని స్థానిక రోయల్ డిగ్రీ కళాశాల ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ పాత్రో అన్నారు. సోమవారం రోయ ల్ డిగ్రీ కళాశాల, యువ రెడ్‌క్రాస్‌లు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్తహీనులు, క్షతగాత్రులు, గర్భిణుల ప్రాణ రక్షణకు రక్తం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశా పక్షోత్సవాల సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 40 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రక్త దా తలకు కళాశాల ప్రిన్సపాల్ హరిహర భట్ ప్రశంసా పత్రాలు అందజేశారు. రక్తదాతల మహాసంఘ సభ్యులు నిరంజన్ పాణిగ్రహి, బి.గంగాధర్, గీతా పండ, అజయకుమార్ గౌడ, రవీంద్రకుమార్ మి శ్రా, రక్తదాన శిబిర నిర్వాహకులకు పూర్తి సహాయం అందించారు. కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వై ద్య కళాశాల మెడికల్ రక్త నిధి సేకరణ టీమ్ దాతల నుంచి రక్తం సేకరించారు. ప్రిన్సిపాల్ హరిహర భ ట్ నేతృత్వంలో నిర్వహించిన శిబిరంలో ఆశిష్‌కు మార్ పండా, ప్రతీక్షా మిశ్ర, సుధీర్ పండా, సంతో ష్ మదలా, శ్వేత ప్రహరాజ్, స్మరణికా మిశ్రా, ఎ.సౌజన్య ప్రధాన పాత్ర వహించారు. -
త్వరితగతిన అర్జీల పరిష్కారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు 113 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 58 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 24, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 5, పేదరిక నిర్మూలన సంస్థ 16, మున్సిపల్ కార్పొరేషన్ 11, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 7 తదితర శాఖలకు సంబంధించి 113 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించినవారిలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ●పొందూరు మండలంలోని లోలుగు రెవెన్యూ పరిధిలో ఉన్న డీజీఆర్ జ్యూట్‌మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మిషనరీ అక్రమ అమ్మకాలపై అధికారులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకొని తనకు వివరాలు అందజేయాలని కోరారు. ●శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రశాంతి వృద్ధాశ్రమం వెనుక కలెక్టర్ ఆఫీసు రోడ్డులో డీటీసీపీ అప్రూవల్ పొందిన లేఅవుట్ శ్రీసాయి శ్రీనివాసనగర్ నివాసాల మీదుగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఆ ప్లాన్ రద్దు చేయాలని శ్రీసాయినగర్ వాసులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనివలన సుమారు 200 కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫార్మసీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పర్లాకిమిడి: ఒడిశా స్కిల్ డెవలప్మెంట్, బొల్లినేని మెడీస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్, వేర్‌హౌసింగ్ అసోసియేట్ (ఫార్మసీ) కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గజపతి జిల్లా ఉద్యోగ నియామక అధికారి స్మృతిరంజన్ త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నట్టు బొల్లినేని మెడీస్కిల్స్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తెలియజేశారు. ఒడిశాలోని ఏ జిల్లాలకు చెందినవారైనా పీఆర్ఏ కోర్సులకు అర్హులన్నారు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 80088 89395, 799501 34220 నంబర్లను సంప్రదించాలన్నారు. భార్య హత్య కేసులో.. భర్తకి యావజ్జీవ శిక్ష రాయగడ: భార్యను గొంతునులిమి హత్య చేసిన కేసుకు సంబంధించి భర్తకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ గుణుపూర్ ఏడీజే దేవదత్త పట్నాయక్ సంచలన తీర్పునిచ్చారు. సోమవారం విచారణలోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించి తుది తీర్పును వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 ఏప్రిల్ 18వ తేదీన గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడియాఖల్ గ్రామానికి చెందిన సంతోషి బౌరిని ఆమె భర్త సురేంద్ర సొబొరొ గొంతునులిమి హత్య చేశాడు. దీనికి సంబంఽధించి గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్లో సంతోషి బౌరి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు సురేంద్ర సొబొరొను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన ఏడీజే పట్నాయక్ ఈ మేరకు తీర్పునిచ్చారు. పిడుగుపాటుకు యువకుడి మృతి రాయగడ: పిడుగు పాటుకు యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక అంబాగుడ ప్రాంతానికి చెందిన జితు నాయక్ (19)గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సా యంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జితు నాయక్ తన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మైదానానికి ఆడుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలొ పిడుగు పడటంతో అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు వెంటనే కుటుంబీకులకు సమా చారం అందించారు. అనంతరం జితును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. భువనేశ్వర్: లిఫ్ట్ ఇస్తామనే నెపంతో రాజధాని నగరంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనలో 2 మంది నిందితుల్ని స్థానిక కమిషనరేట్ పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. ఈ ఘటన టొమాండో పోలీస్ ఠాణా పరిధిలోని రొణొసింగ్పుర్లో జరిగింది. నయగఢ్ ప్రాంతానికి చెందిన బిచిత్ర సాహు, నారాయణ్ స్వంయిలను నిందితులుగా గుర్తించారు. ఇద్దరు నిందితులు ఆ మహిళకు లిఫ్ట్ ఇచ్చి దారి మళ్లించి ఆమెను ఒక అద్దె ఇంటికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమైపె అత్యాచారం చేశారని ఆరోపణ. భర్తతో గొడవపడి రోడ్డుపై ఒంటరిగా ఏడుస్తున్న బాధిత బెంగాలీ మహిళను ఇద్దరు నిందితులు చూశారు. ఆమెకు సహాయం చేస్తామని, రైల్వే స్టేషన్లో దింపుతామని మభ్య పెట్టి ఆమెను తమ అద్దె ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలియడంతో టొమాండో ఠాణా పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితుల ను అదుపులోకి తీసుకుని నిలదీశారు. ప్రాథమిక విచారణలో వీరివురు అంబులెన్స్ డ్రైవ ర్లుగా గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. -
1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరు
శ్రీకాకుళం: జిల్లాలోని 1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నెలలో నిధులు వస్తాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమన్నారు. పట్టణ హౌసింగ్ స్కీం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఈడబ్ల్యూడీసీ డైరక్టర్ పీఎంజే బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ రమాకాంత్, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పైడిశెట్టి జయంతి, డీఈ సత్యాజీ, ఏఈ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
అడవులను పరిరక్షించాలి
జయపురం: అడవుల పరిరక్షణపైన, వణ్య జంతువుల సంరక్షణపైన ప్రత్యేక దృష్టి సారించాల ని జయపురం అటవీ విడిజన్ అధికారికి జయపురం సమితిలో ప్రముఖ సమాజ సేవకుడు బి.హరిరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం జయ పురం అటవీ డివిజన్ అధికారిని కలిసి వినతిప త్రం అందజేశారు. నేను ఒక సామాన్య పౌరుడి ని అని, మా ప్రాంత అడవుల్లో జరుగుతున్న కొన్ని సమస్యలు, అక్రమాలు మీ దృష్టికి తీసుకురావాల్సి వస్తున్నందుకు విచారంగా ఉందన్నారు. ముఖ్యంగా అడవుల్లో అక్రమ చర్యలు పెరుగుతున్నాయన్నారు. అడవుల్లో చెట్లు విస్తృతంగా నరుకుతున్నా అటవీ విభాగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అడవులు తగ్గిపోతూ వన్య ప్రాణులకు ఆహార కొరత ఏర్పడ డంతో జనవాసాల్లోకి వస్తున్నాయన్నారు. పంటలకు నష్టం కల్పిస్తున్నామన్నారు. అడవులు తగ్గటం వలన పర్యావరణం ప్రభావితమై సమ తుల్యతకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా వెంకట్రామన్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఈవోగా శ్రీకాకుళంలో పనిచేస్తూ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం కొద్దిరోజుల క్రితం బదిలీ అవ్వగా, తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళంలో నియమించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ఎంపీడీవోగా కూడా పనిచేశారు. మంగళవారం ఈయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదు ల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవె న్సు) కార్యక్రమంలో ప్రజల నుంచి 44 వినతు లు అందాయి. అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీని వాసరావు వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రణస్థలం: లావేరు మండలంలో బొంతుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఇసుక టిప్పర్ లారీని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ అబ్దుల్లా షేద్కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పోలీసులు, లావేరు పోలీసుల సాయంతో క్రేన్ సాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. కాగా ఇసుక టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్యాబిన్లో ఇరుకుపోయిన డ్రైవర్ అబ్ధుల్లా షేద్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడు. దీనిపై ఇంకా లావేరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. -
రామనవమి వేడుకల్లో గవర్నర్
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సాంస్కృతిక సమితి ప్రధాన వార్షిక ఉత్సవం శ్రీరామనవమి వేడుకల్లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆయన సతీమణి జయశ్రీ కంభంపాటితో కలిసి పాల్గొన్నా రు. సమితి ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో గవర్నర్ దంపతు లు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. రాష్ట్రం, దేశంలో శాంతి, సామరస్యం, సుసంపన్నత వెల్లివిరియా లని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ దంపతుల సందర్శనను ఏసీఏ అధ్యక్షుడు గన్నవరపు ఆనంద రావు, కార్యదర్శి ఆర్. సత్య సాయి పర్యవేక్షించారు. -
గ్యాస్ ఏజెన్సీపై చర్య తీసుకోవాలని వినతి
ఇచ్ఛాపురం: వినియోగదారులకు, హోటళ్లకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా సమీపంలోని ఒడిశా ప్రాంతానికి తరలించి అధిక మొత్తానికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శ్రీస్వేచ్ఛావతి హోటల్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్ఛాపురం మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి సోమవారం వినతి పత్రం అందజేశా రు. స్థానికంగా ఉన్న హోటళ్ల యజమానులు, సిబ్బంది గ్యాస్ ఏజెన్సీ తీరుని నిరసిసూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్యాస్ కొరత కారణంగా హోటళ్ల నిర్వహణ చాలా కష్టతరంగా మారిందన్నారు. దీనికితోడు గ్యాస్ ఏజెన్సీవారు కూడా సక్రమంగా సహకరించడం లేదన్నారు. దీనికి నిరసనగా మంగళవారం హోటళ్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎ.గవర య్య, గౌరవ అధ్యక్షులు యు.తులసయ్యరెడ్డి, కార్యదర్శి జి.హేమకుమార్ ప్రతినిధులు, ఎస్.శంకర్, బబుల్లా, మురళీ, ఆనంద్, మోహనరావు, పూర్ణచంద్ర, లక్ష్మణరావు పాల్గొన్నారు. పలాస: ప్రభుత్వం చేపడుతున్న 2027 జనగణ న కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని పలాస తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి చెప్పా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమ వారం జనగణనపై మండలంలోని ఆర్వోలు, సూపరువైజర్లు, వీఎస్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్వో రెన్యూమరేషన్ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు చేశారు. -
కొలువుదీరిన ఘటాలు
రాయగడ: చల్లని తల్లి మజ్జిగౌరీ చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు కొలువదీరాయి. అమ్మవారి గర్భగుడికి సమీపంలో గల ప్రత్యేక గదిలో వీటిని ఏర్పాటు చేశారు. ముందుగా బాల పేరంటాలుగా వీటిని ముస్తాబు చేసిన అనంతరం భక్తుల దర్శనార్ధం ఘటాలను ఉంచారు. ఘటాలను పూజించి దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. పళ్లు, పసుపు, కుంకుమ, గాజులు తదితరమైనవి ఘటాల ముందు పెట్టి పూజించారు. తమ కోర్కెలు తీర్చాలని మొక్కుకుని భక్తులు అమ్మవారి ప్రతిరూపాలకు పసుపును అద్దుతారు. నగర పరిక్రమణ అమ్మవారి ఘటాలు పురవీధుల్లో తిప్పుతారు. దీనినే నగర పరిక్రమణగా పిలుస్తారు. సోమవారం సాయంత్రం ఈ ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. దుష్టశక్తులు లోపలకు చొరబడకుండా అమ్మవారు ఇలా నగర పరిక్రమణ పేరిట తిరిగి ప్రజలను వాటి నుంచి కాపాడుతారని స్థల పురాణం. అదేవిధంగా సంప్రదాయాలకు అనుకూలంగా ఘటాలను పూజించి ఊరేగించారు. ఇలా ఉత్సవాలు ముగింపు వరకు కొనసాగుతాయి. ఈ ఘటాల ఊరేగింపు సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ వాయిద్యాలు ఘటాల ముందు ఉంటాయి. వీటతో పాటు చాకలి మండుతున్న దివిటీని పట్టుకుని ఘటాల ఊరేగింపులో పాల్గొంటారు. అలాగే మంగలి అమ్మవారి పాల జంగిడి వద్ద రత్నాల పొదిగిన గొడుగును పట్టుకుని ఉంటారు. అమ్మవారి ఘటాలు ఊరేగింపు సమయంలో పుర ప్రజలు అమ్మవారి ఘటాల్లో పళ్లు, ఫలాలతో పాటు బియ్యం, చిల్లర పైసలను వేస్తారు. ఇలా ఘటాల్లో వేసిన అనంతరం పూజారి పసుపు బియ్యంతో తయారు చేసిన బొట్టును అందిస్తారు. ఈ బొట్టును నుదట పెట్టుకోవడంతో పాటు చిన్న పిల్లలకు నీళ్లలో ఆ బొట్టును వేసి తాగిస్తారు. ఇలా చేస్తే ఏ దుష్టశక్తి పిల్లల దరిచేరదన్నది ఇక్కడి వారి నమ్మకం. ఇదే తరహా ఉత్సవాల్లో కొనసాగుతుండటం విశేషం. చండీహోమం అమ్మవారి ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం చండీ హోమం . ఉత్సవాల ప్రారంభమైన రెండో రోజు నుంచి చండీ హోమాన్ని నిర్వహిస్తారు. అందుకు గంజాం జిల్లా నుంచి ప్రత్యేకంగా పురోహితుల బృందాన్ని రప్పించారు. మూడు రోజుల పాటుగా ఈ హోమం కొనసాగుతుంది. ఏప్రిల్ రెందో తేదీ వరకు కొనసాగే హోమం రాత్రి పూర్ణహుతితో ముగుస్తుంది. సోమవారం సూర్య వాహన పూజల్లో భాగంగా హోమం నిర్వహించే ప్రాంగణంలో జగన్నాధుని చిత్రాన్ని పిండితో పురోహితులు వేశారు. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజల్లో మందిరం కమిటీ సభ్యులు రాయిసింగి బిడిక, ఇప్పిలి సన్యాసిరాజు, పాలకొండ ప్రకాష్, వడ్డాది శ్రీనివాసరావు, పెద్దీన వాసు దంపతులు పాల్గొన్నారు. -
ఆర్.ఉదయగిరి గ్రీవెన్స్‌లో 45 వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామ ముఖిపరిపాలన, గ్రీవెన్స్‌సెల్‌కు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, జిల్లా పరిషత్తు ఆదనపు ముఖ్యకార్యనిర్వాహణాధికారి దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45 వినతులు అందగా.. వాటిలో ఆరు వ్యక్తిగతం, 39 గ్రామసమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. ఆర్.ఉదయగిరి పంచాయతీలో గ్రామీణ త్రాగునీరు, వృద్ధాప్య పింఛన్లు, పీఎం ఆవాస్ యోజన పథకం క్రింద ఇళ్లు మంజూరు చేయాలని వినతులు అందాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్.ఉదయగిరి సమితి అధ్యక్షులు లక్ష్మీనారాయణ శొబోరో, తహసీల్దార్ జ్యోతిర్మయి దాస్ ఉన్నారు. చిత్రకొండ సమితిలో 77 వినతులు.. మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియాలోని జాంత్రీ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే గ్రీవెన్స్‌సెల్‌ను సోమవారం నిర్వహించగా.. 77 వినతులు స్వీకరించారు. వాటిలో కొన్ని అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్ని వినతుల ను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆ శాఖా ల అధికారులను ఆదేశించారు. అనంతరం జాంత్రీ పంచాయతీలోని మాన్సూర్ వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జాంత్రీ–బిశోయిగూఢ, జాంత్రీ–దిశారిగూఢ గ్రామాల మధ్య జలాశాయం నుంచి వంతెన పనులు పూర్తి కోసం ఇంజినీర్లతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాభు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీ–4తో పేదరికం నిర్మూలన సాధ్యం
శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమంతో పేదరికం నిర్మూలన సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీ–4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపా రు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీఆర్వో విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధి కారి లక్ష్మీప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పాతపట్నం: ఆకలి తీర్చడానికి చనుబాలు లేవు.. ఏడుపు ఆపడానికి తల్లి పొత్తిళ్లు లేవు.. ఒంటి నిండా చీమల కాట్లు.. కంటి నిండా కన్నీటి బొట్లు. వారం వయసున్న పిల్లాడు పొదల మధ్య పడిన అవస్థ ఇది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలోని సత్యనారాయణ ఆలయం పక్కన ఘంసీ పుల్లాయ్ ఇంటి పెరటిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరో పసి కందును పడేసి వెళ్లిపోయారు. ఆ పసికందు గుక్కపట్టి ఏడవడంతో భూదేవి అనే మహిళ బాబును రక్షించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో బాబుకు సపర్యలు చేసి, శరీరాన్ని శుభ్రం చేశారు. బాబుకు వైద్య సేవల కోసం మంగళవారం ఉదయం తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం బాబు భూదేవి అనే మహిళ వద్ద గ్రామస్తులు ఉంచారు. -
అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పేద విద్యార్థులను కించపరిచేవిధంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గరికపాటి వ్యాఖ్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలపై అసభ్యంగా మాట్లాడిన గరికపాటిపై ప్రభుత్వం, బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చందు, ఖగేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, ఐద్వా నాయకురాలు టి.ప్రవీణ, యూనియన్ నాయకులు ఎ.రాధ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో కొత్తరోడ్‌లోని కాశ్యప్ నర్సింగ్ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన జల్లాస్థాయి అండర్–9 చెస్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. ఈ ఎంపిక పోటీల్లో బాలురు విభాగంలో అన్నెపు శశాంక్, శనుగును శివ, సనపల రిత్విక్‌సాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిపిక కారుణ్య, కొల్ల భవిష్య, రేష్మిక మొదటి మూడు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వీరంతా ఏప్రిల్ 18, 19 తేదీల్లో అన్నవరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్–9 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆలిండియా చెస్ ఆన్ స్కూల్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు తెలిపారు. అంతకుముందు ఈ ఎంపిక పోటీలను తంగుడు సుధీర్ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు. మత్స్యానందం..! సాధారణంగా చేప 1 కిలో నుంచి 3 కిలోల వరకు ఉంటుంది. 5 కిలోలు ఉంటే గొప్పగా చూస్తారు. అటువంటిది ఏకంగా 16 కిలోల చేప ఎల్‌ఎన్‌పేట మండలంలోని చింతలబడవంజలో పట్టుబడింది. గ్రామస్తులు చెరువులో చేపలు పెంచుతున్నారు. ఆదివారం చేపల కోసం వలలు వేయగా 16 కిలోల చేప దొరికింది. దీంతో ఆశ్చర్యానికి గురయ్యారు. – హిరమండలం -
దిగువస్థాయి నుంచి ఎదిగాను
● హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహిపర్లాకిమిడి: చాలా దిగువస్థాయి నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల చైర్మన్ స్థాయికి ఎదగటానికి కారణం కష్టపడి పనిచేసే తత్వం వల్లే సాధ్యపడిందని, పర్లాకిమిడి కర్మభూమి నన్ను ఎక్కడికో తీసుకెళ్లిందని హైటెక్ ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం, పాతమిత్రుల కలయిక సభలో తిరుపతి పాణిగ్రాహి మాట్లాడారు. ఆత్మీయ కలయిక సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సన్మాన అతిథులుగా విశ్రాంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.బి.ఎస్.రామచంద్రరావు, సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతిరావు, వి.యస్.ఎన్.రాజు, అంబటిపూడి లక్ష్మీనర్శింహం, రాంప్రసాద్ (సి.ఏ.), ఉమాచరణ్ పట్నాయక్, ఇందుపల్లి బాబ్జీ విచ్చేశారు. డాక్టర్ సయ్యద్ రహింతుల్లా, తెలగం సీతారాం అతిథి పరిచయం చేశారు. నృత్యాలతో సభికులను ఆనందపరిచారు. సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధికల్పనకు 200 మందితో ఇన్వెస్టర్స్ మీట్ పెట్టడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఫార్మా, హెల్త్, గార్మెట్, ఫుడ్ టెక్నాలజీ కంపెనీలు ముందుకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. పర్లాకిమిడి జన్మస్థలంలో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం ద్వారా గురువులు, పెద్దల పరిచయం సంతోషం కలిగించిందన్నారు. పర్లాకిమిడికి చెందిన విశ్రాంత సీఎం ప్రధాన కార్యదర్శి సి.బి.ఎస్.రామచంద్రరావు మాట్లాడుతూ, నా తండ్రి పర్లాకిమిడి కృష్ణచంద్ర గజపతి కళాశాలలో 1947లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జామి పోలిశెట్టి, జవ్వాది సూర్యారావు, వి.ఎస్.ఎన్.రాజులు ఆత్మీయ సమ్మేళనానికి సహరికంచారు. స్థానిక కళాకారులు దాండియా, నృత్యాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా అనేక మంది ప్రముఖులకు మెమొంటోలతో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సత్కరించారు. -
విలువలు ఆధారంగానే విద్య
భువనేశ్వర్: విలువలతో కూడిన విద్య శాంతియుత, ప్రగతిశీల సమాజాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. జాతి శక్తివంతమైన పురోగతి పౌరుల సౌశీల్యంతో ముడి పడి ఉంది. విద్యార్థులలో జ్ఞానంతో పాటు శీలాన్ని కూడా పెంపొందించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా, దేశ నిర్మాతలుగా కీలక పాత్ర పోషిస్తారు. మార్గనిర్దేశం, ఆదర్శం ద్వారా యువత ఆలోచనలను తీర్చిదిద్దుతారని ఆయన ఉద్ఘాటించారు. స్థానిక రామకృష్ణ మిషన్ వివేకానంద హాల్లో ఆదివారం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన విలువ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. విద్య అంతర్గత పరిపూర్ణత, బలం మరియు శీలం యొక్క వ్యక్తీకరణ అనే స్వామి వివేకానంద నినాదం మార్గదర్శకంగా విద్యాభ్యాసం, బోధన కొనసాగాలని ప్రోత్సహించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆదర్శాల నుండి స్ఫూర్తి పొంది రామకృష్ణ మిషన్ మేధో, నైతిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను సమగ్రపరిచే సమతుల్య విద్యా వ్యవస్థను నిరంతరం ప్రోత్సహిస్తోందని గవర్నరు అభినందించారు. సంప్రదాయ విద్యా వ్యవస్థలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస బోధన విలువలు దైనందిన జీవితంలో ఆచరించాల్సిన సూత్రాలుగా పేర్కొన్నారు. సంఘర్షణలు, అస్థిరతలతో తల్లడిల్లుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అవగాహన, సహనం, సంభాషణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉదన్నారు. నిర్భయమైన ఆలోచనలతో చేతలలో కారుణ్యం, మానవ సేవకు కట్టుబడి ఉండేలా కనీసం ఒక్క విద్యార్థికై న మార్గనిర్దేశం చేయాలని గవర్నర్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పరివర్తన చెందిన ఒక్క వ్యక్తి కూడా సామాజిక మార్పుకు గణనీయంగా దోహదపడగలడని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం కార్యదర్శి స్వామి బోధమయానంద, స్థానిక రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి ఆత్మప్రభానంద, అధ్యక్షుడు డాక్టర్ చండీ దాస్ తదితరులు ప్రసంగించారు. -
ఘనంగా భవానీ అమ్మవారి పండగ
పర్లాకిమిడి: గుసాని సమితి జాజిపురం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న మా నికిటి భవానీ అమ్మవారు గ్రామదేవత ఉత్సవాలను ఆదివారం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, హైటెక్ విద్యాసంస్థల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతి రావు సందర్శించారు. ఐదేళ్లకు ఒకసారి జాజిపురంలో నిర్వహించే అమ్మవారి పండుగ అత్యంత ఆడంబరంగా జరుపుకుంటున్నారు. ఏప్రిల్ ఒకటితో ముగుస్తున్న ఈ అమ్మవారి పండుగలలో సాయంత్రం వేల ఒడియా చలన చిత్ర గాయనీగాయకులు శక్తిమిశ్రా, టి.శౌరీ సంగీత కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామప్రజలు విచ్చేశారు. సాయంత్రం నికిటి భవానీ అమ్మవారు జాజిపురం గ్రామసందర్శనకు వెళ్లిన సమయంలో భక్తులు అధిక సంఖ్యలో సందర్శించుకున్నారు. -
‘పోర్టు పేరుతో టీడీపీ నాయకులు పబ్బం గడుపుకున్నారు’
టెక్కలి: జిల్లాలో పోర్టు నిర్మాణం పేరుతో ప్రజల్ని ఊరిస్తూ టీడీపీ నాయకులు దశాబ్దాల కాలంగా పబ్బం గడుపుకుని అధికారం వెలగబెట్టుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. దివంగత ఎర్రన్నాయుడు నుంచి ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు సైతం భావనపాడులో పోర్టు కడతామంటూ ఏళ్ల తరబడి ఓటు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సంకల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అప్పలరాజు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు క్రెడిట్‌ను దోచుకునే విధంగా టీడీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టడానికి మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ (భూ సమస్యలపై) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు నేరుగా లేదా ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడమైనదని, ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా తాపీపని చేస్తున్న బార రామారావు (45) విద్యుత్ ఘాతానికి గురై ఆదివారం మృతి చెందాడు. పని చేస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బార్ అప్పన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్ చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం (అగ్రహారం)కు చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూ ర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురు గా వస్తున్న ఆర్టీసీ బస్ స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి పోలాకి: మండలంలోని సుసరాం ర్యాంపుల వద్ద స్కూటీ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఉర్జాం గ్రామానికి చెందిన సంపతిరావు తేజ అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. మరో మహిళతో కలిసి ఒక ఫంక్షన్లో మెహందీ పెట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలం వద్ద నుంచి పోలీసుల సహకారంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తేజ మృతి చెందింది. మృతురాలి భర్త ప్రకాశ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతనికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మెహందీ పెట్టేందుకు తేజ వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జిల్లాకు ఇన్చార్జి మంత్రి కొండపల్లి రాక నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటకు విజయనగరం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. జీరో పావర్టీ పీ–4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో విజయనగరం చేరుకుంటారని వివరించారు. -
మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పెద్ద రెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. సభను కోశాధికారి ఎం.సింహాచలం ఫెడరేషన్ జమా ఖర్చుల వివరాలతో ప్రారంభించారు. జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులను వివరించారు. అనంతరం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల కార్గిల్ పార్క్‌ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి జిల్లాలోని సైనికులకు స్ఫూర్తిని నింపడంపై నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, గౌరవ ప్రెసిడెంట్లు తమ్మినేని కృష్ణారావు, టి.కృష్ణారావు, ఎస్.ఎల్.రావు, మహిళా సెక్రటరీలు కె.జగ్గమ్మ, డి.భారతి, అడ్వైజర్లు ఎ.వి.జగన్మోహన్ రావు, పి.రామారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పి.జమున, మెట్ట ఈశ్వరమ్మ, డి.రత్నమాల, బి.రాంబాబు, డి.వాసుదేవరావు, ఎన్.లక్ష్మీ నారాయణ, ఎం.రాములు, పి.శ్రీనివాసరావు, పి.చిన్నారావు, ఎం.నాగభూషణరావు, ఎస్.అప్పలసూరి, కె.రాజశేఖర్, వి.గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చైతన్యమే ‘ఓం శాంతి’ లక్ష్యం
● జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిజయపురం: సమాజంలో ఆధ్యాత్మక చైతాన్యాన్ని పెంపొందించటం, ప్రజలలో మనశ్శాంతి కలిగించటం, నైతిక విలువలు బలోపేతం చేయటమే ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థ ప్రధాన లక్ష్యమని మౌంట్ అబూ బ్రహ్మకుమారి ఆశ్రమానికి చెందిన బ్రహ్మకుమారి ఉషాదీది అన్నారు. స్థానిక లాల్గుడ ప్రభుత్వ ఆస్పత్రి వెనుక కొత్తగా నిర్మించిన ఓం శాంతి విశ్వకల్యాణ భవన ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ శాంతి, సమాజ శ్రేయస్సు కోసం ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. బ్రహ్మకుమారి ఉషాదీది ప్రసంగిస్తూ నేడు ప్రారంభించిన నూతన భవనం ప్రపంచ శాంతి, మానవ సంక్షేమానికి అంకితమైన ఆధ్యాత్మిక కేంద్రమన్నారు. ఈ కేంద్రం ద్వారా అన్నివర్గాల ప్రజలకు ధ్యానం, యోగా, ఆధ్యాత్మక చింతన ద్వారా ఆరోగ్యకరమైన, సానుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు మార్గదర్శకం అవుతోందన్నారు. జయపురంలో 39 ఏళ్లుగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు. కొరాపుట్ జిల్లాలో 25 శాఖలు పని చేస్తున్నాయని మరో 21 ేసేవా విభాల ద్వారా యువత ప్రగతికి, మహిళల సాధికారత, సామాజిక పురోగతికి నిరంతరం కృషి జరుపుతున్నట్లు పేర్కొన్నారు. యువత సరైన మార్గంలో పయనించేందుకు యోగా ఎంతో అవసరమన్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో నిండిన జీవితాలకు శాంతి, మమతలకు ఏకై క మార్గం ఆధ్యాత్మకతేనని అన్నారు. కార్యక్రమంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి హసన్ మధాని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంతరాయ్, నవరంగపూర్, జయపురం ప్రాంతాలకు చెందిన ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చైత్రోత్సవాలు
వైభవంగా మజ్జిగౌరి అమ్మవారిరాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు సందర్భంగా అమ్మవారు సునా భెషోలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్థానిక ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచిన అమ్మవారి బంగారు ఆభరణాలు శనివారం మందిర కమిటీ సభ్యులు తీసుకువచ్చారు. ట్రెజరీ వద్ద మందిరం ప్రధాన అర్చకులు చంద్ర శేఖర్ బెరుకొ ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం జిల్లా ట్రెజరీ అధికారి అనుమతితో లాకర్లొ ఉంచిన బంగారు ఆభరణాలను తీసుకువచ్చారు. పోలీసుల పూర్తి బందోబస్తుతొ మందిరానికి చెందిన ప్రత్యేక బస్సులో ఆభరణాలను తీసుకువచ్చి మందిరంలో నిలిపారు. శనివారం అర్ధరాత్రి అమ్మవారికి ముస్తాబు చేశారు. అమ్మవారి బంగారు ఆభరణాల అలంకరణతో పాటు అజ్ఞాత దాతలు సమర్పించిన 35 కిలొల వెండితో రూపొందించిన మకర తోరణాన్ని కూడా అమ్మవారి గర్భగుడిలో అలంకరించారు. ఆదివారం తెల్లవారు 4 గంటలకు మంగళహారతులు ఇచ్చాక అమ్మవారి మందిరం తలుపులు తెరిచారు. దీంతో అమ్మవారు సునా భెషోలో భక్తులు దర్శనం ఇచ్చారు. బంగారు ఆభరణాలతో పాటు ఎర్రని సింధూరంతొ అమ్మవారి ముఖం ప్రత్యేకంగా కనిపించడంతొ ఈ సుందర దృశ్యం వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. జంఝావతి నది వద్ద పూజలు అమ్మవారి ఉత్సవాలకు ముందు మందిరం కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం సమీపంలో గల జంఝావతి నది వద్ద గంజాం జిల్లా నుంచి వచ్చిన పురొహితుల మంత్రోచ్ఛరణలతో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి అమ్మవారి మందిరంలో శుద్ధి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు నది వద్దకు ఎంతో మంది వెళ్లి పూజా కార్యక్రమాలను తిలకించారు. ఆదివారం నాడు ఉదయం మందిరం మేనేజింగ్ ట్రష్టీ రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దీన వాసు, వడ్డాది శ్రీనివాస్ దంపతులు సూర్యావాహన పూజలు చేశారు. ఈ ఐదు రోజులు ఈ పూజల్లో కూర్చున్న దంపతులు నియమ నిష్టలతో పాటు ఉపవాస దీక్షలను చేసి అమ్మవారికి పూజలను నిర్వహిస్తారు. ప్రతి రొజు షొడొపొచార పూజలతో ప్రారంభమై చండీపఠనం, పూర్ణాహుతి వరకు ఈ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. -
లక్ష్మణ్ నాయక్‌కు ఘనంగా నివాళులు
జయపురం: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు గిరిజన నేత సహిద్ లక్ష్మణ నాయక్ 84 వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రజా సంఘాల నేతలు ఘన నివాళులు అర్పించారు. పట్టణ ప్రధాన మార్గం గుప్తేశ్వర్ కాప్లెక్స్ ప్రాంగణంలో నెలకొల్పిన లక్ష్మణ నాయక్ విగ్రహానికి జయపురం సబ్‌డివిజన్ అధికారి సబ్ కలెక్టర్ తృప్తిమయి బరాల్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు జయపురం సబ్ డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీమతి యశోద గదబ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం జయపురం పూజ్యపూజ సంసద్ ప్రతినిధులు స్వాతంత్ర సమర యోధునికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంసద్ కార్యదర్శి తపన్ కిరణ్ త్రిపాఠీ మాట్లాడుతూ ఒక ఆదివాసీ కుటుంబంలో జన్మించిన లక్ష్మణ నాయక్ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. తమ ప్రాంతంలో సారా బట్టీలపైన తన అనుచరులతో దాడులు జరుపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తిరుగు బాటుకు ప్రేరేపించారని తెలిపారు. మత్తిలిలో 1942 ఆగస్టు 21 వ తేదీన జరిగిన వారసంత నాడు వేలాది మంది ఆదివాసీ ప్రజలను సమీకరించి బహిరంగ సభలో మన నేత గాంధీ అని, మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రకటించి మత్తిలి పోలీసు స్టేషన్ పై దాడికి వెళ్తుండగా పోలీసులు వారిపై ముందు హెచ్చరిక లేకుండా లాఠీ చార్జీతో పాటు కాల్పులు జరిపారని వివరించారు. ఆ కాల్పులలో ఒక ఫారెస్టు గార్డుతో పాటు పలువురు ఉద్యమకారులు మృతి చెందగా అప్పటికే లక్ష్మణ నాయక్ పై నిఘా పెట్టిన ఆంగ్ల పాలకులు ఫారెస్టు గార్డును లక్ష్మణ నాయక్ అతడి అనుచరులే హత్య చేశారని కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు. ఆ కేసులో లక్ష్మణ నాయక్ తో పాటు 50 మందిని అరెస్టు చేసారని వివరించారు. కోర్టు లక్ష్మణ నాయక్‌కు ఉరిశిక్ష విధించి బరంపురం జైలులో ఉరితీశారని గుర్తు చేశారు. స్వర్గీయ నాయక్ వ్యక్తి కాదని ఆయన మహాశక్తి అన్నారు. కార్యక్రమంలొ పూజ్య పూజ సంసద్ అద్యక్షులు ఇంజనీర్ కేదారనాత్ బెహర, బైరాగి సాహు లక్ష్మణ నాయక్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం ఉత్కళ సమ్మిళినీ జయపురం శాఖ నేతలు బినోద్ మహాపాత్రో, జిల్లా అధ్యక్షుడు మదన మోహణ నాయిక్, రాజేంధ్ర గౌఢ, కార్యదర్శి నవీణ మదల, కృష్ణ చంద్ర హొత తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: ఒడిశా వరపుత్రుడు, ఆదివాసీల ఆశాదీపం సహీద్ లక్ష్మణ్ నాయక్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక రైతుల కాలనీ సమీపంలొ గల లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, బొమ్మాళి కాంతారావు, విద్యావేత్త డాక్టర్ దుస్మంత్ కుమార్ మహంతి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించి లక్ష్మణ్ నాయక్ సేవలను కొనియాడారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. మహిళలకు ప్రతిభా పోటీలు
రాయగడ: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం స్థానిక సంస్కృతి భవనంలో ఆదివారం మహిళల మధ్య వంటలు, ముగ్గుల పోటీలను నిర్వహించింది. పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ రంగవళ్లికలతో పాటు పిండివంటల పోటీలకు స్థానం కల్పించారు. పోటీలకు జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సస్మిత బౌరి, మిమాంశు పాండ్య, లయవు మాఝి ,అసిస్టెంట్ కలెక్టర్ కై లాస్ స్వయి, సంగ్రాం నిమ్మల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ సభలో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
జూన్ ఒకటి నుంచి గ్రామదేవత ఉత్సవాలు
రాయగడ: రాయగడ పట్టణ ప్రజల ఆరాధ్యాదైవం, గ్రామదేవతగా పూజలందుకుంటున్న భైరవీధిలో వెలసియున్న బురదల పోలమ్మ వార్షిక ఉత్సవాలు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు మందిరం ప్రాంగణంలో ఆదివారం పట్టణ ప్రముఖులు సమావేశమై ఉత్సవాల తేదీని ఖారారు చేశారు. తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు జూన్ పదో తేదీతో ముగుస్తాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సాహిత్యం, నృత్య బంధం బలమైనది భువనేశ్వర్: పుస్తకాలు, పాఠకులు సమాజంలో ఒక భాగమని, సాహిత్యంలో నృత్యం మేళవింపు పాఠకులను విభిన్నంగా ఆకట్టుకుంటుంది. సాహిత్యం, నృత్య బంధం విడదీయరానిదని కటక్ నగర పాలక సంస్థ మేయరు సుభాష్ సింగ్ తెలిపారు. కటక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కటక్ మహానది తీరం బాలి జాతర మైదానంలో నిర్వహించిన తొలి పుస్తక ప్రదర్శన కటక్ సాహిత్య సరోవర్–2026 కార్యక్రమంలో మేయరు ప్రసంగించారు. ఈ వేదికపై ఒడియా భాష, సాహిత్యం అధ్యాపకుడు, ఒడిస్సీ నృత్యకారుడు డాక్టర్ చిత్తరంజన్ సహాని దర్శకత్వం, డాక్టర్ సంగీత సాహు సమన్వయంతో గణేష్ వందన, జయదేవ గీతా గోవింద ఆధారంగా ప్రదర్శించిన ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కంటైనర్‌లో చెలరేగిన మంటలు భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద 18వ నంబరు జాతీయ రహదారి బెత్తొనటి సమీపంలో కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. క్యాబిన్లో డ్రైవర్ సిలిండర్‌తో వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తు ఈ వాహనంలో వంట చేస్తున్న డ్రైవర్, హెల్పర్ ప్రాణాలతో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను నివారించారు. పూరీ కారాగారంలో ఖైదీ అనుమానాస్పద మృతి భువనేశ్వర్: పూరీ కారాగారంలో ఆదివారం విచారణలో ఉన్న ఖైదీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు గుర్తించారు. జైలు స్నానపు గదిలో ఆయన శవం వేలాడుతున్నట్లు గుర్తించారు. మృత ఖైదీ పూరీ జిల్లా సాక్షి గోపాల్ దహన కుంభార్‌పడా నివాసి దీప్తి రంజన్ స్వంయిగా గుర్తించారు. అత్యాచార కేసులో అరెస్టు అయిన తర్వాత అతను 2023 నుంచి ఈ జైలులో ఖైదీగా ఉన్నాడు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఆది వారం ఉదయం పూరీ – కోణార్క్ రోడ్డులోని జైలు ప్రాంగణంలో విచారణ ఖైదీ మృతదేహం లభ్యమైంది. అనంతరం మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. బాత్రూమ్లో తన టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడినట్లు మృతుని కుటుంబానికి తెలియజేశారు. ఈ సమాచారం అందడానికి కాసేపు ముందు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన సోదరితో మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. త్వరలో అతని బెయిల్ కోసం న్యాయ స్థానానికి ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకోవడం కలచి వేస్తుందని కుటుంబీకులు భోరుమన్నారు. ఈ ఘటన నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
ముగిసిన జాతీయ సెమినార్
● వివిధ అంశాలపై చర్చజయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పీజీ చరిత్ర విభాగం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ ఆదివారంతో ముగిసింది. ఒడిశా ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు వివిధ కళారూపాల వికాసం, రూపం, వాటి ప్రభావాలపై విశ్లేషించటం, ఒడిశా కళా ఆర్కిటెక్చర్‌పై మధ్య భారత్, దక్షిణ భారత్, పశ్చిమ బెంగాల్, గ్రీకు ప్రభావాలు, వాటి పరస్పర ప్రభావాలపై సెమినార్లో వక్తలు చర్చించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సంరక్షణ సమస్యల సవాళ్లపై అవగాహన కల్పించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ప్రధానంగా శిలా కళ, ప్రాచీన చారిత్రిక కళ, టెర్రకోట్, బౌద్ధ కళా (రతనగిరి, ఉదయగిరి, లలితగిరి)జైన కళ (ఖండగిరి, ఉదయగిరి) కళింగ శైలిదేవాలయాలు, శిల్ప కళ, పటచిత్ర, ప్రతిమ శాస్త్రం, హస్త కళలు, ఇస్లామిక్, వలస పాలన కాలపు కళలు, ఆదివాసీ కళల (సౌర, కోంధ్, బోండా)పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకంగా కోణార్క్ సూర్య, జగన్నాథ దేవాలయాలు.. ప్రాచీన ఆలయ నిర్మాణాలతోపాటు కళింగ శైలి దేవాలయాల రేఖ, పీడ, ఖఖరా రూపాలు, ఆదివాసీ కళల సరలత, ప్రముఖంగా ప్రస్తావించారు. జయపురం మహారాజు 1947లో కళాశాలను స్థాపించగా 2023లో ప్రభుత్వం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసిన విషయాన్ని సెమినార్లో ప్రస్తావించారు. విశ్వవిద్యాలయంలో చరిత్ర విద్యార్థులను పురాతన వారసత్వ పరిశోధన, సంరక్షణల వైపు ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సెమినార్లో ముఖ్యఅతిథిగా డాక్టర్ సునీల్ కుమార్ పట్నాయక్ పాల్గొనగా.. వక్తలుగా కిస్ విశ్వవిద్యాలయ డాక్టర్ రత్నాకర్ మహాపాత్రో, జేఎంయూ సంబల్పూర్ నుంచి సంతోష్ కుమార్ మల్లిక్, జయపురం విక్రమదేవ్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, గుణుపూర్ కళాశాల నుంచి డాక్టర్ సత్యవాన్ గరడ, న్యూఢిల్లీ పురావస్తు నిపుణులు డాక్టర్ ఆశిష్ రంజన్ సాహు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర పాల్గొని సెమినార్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. యూనివర్సిటీ చరిత్ర విభాగాధిపతి డాక్టర్ శృష కుమార్ సాషాహు ధన్యవాదాలు తెలిజేశారు. -
రారండోయ్ వేడుక చూద్దాం..!
● నేటి నుంచి మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు ● ఐదు రోజులు జరగనున్న ఉత్సవాలు● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీరాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మందిరం పరిచాలన కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిలో భాగంగా మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మందిరం ప్రాంగణంతో పాటు అమ్మవారి గర్భగుడి, అమ్మవారిని పూలతో అలంకరించేందుకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి పూలను రప్పించారు. పూజా కార్యక్రమాలు చైత్రోత్సవాల్లో భాగంగా మందిరానికి సమీపంలోని జంఝావతి నది వద్ద ముందుగా పూజలను నిర్వహిస్తారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన శుద్ధ జలాలను మందిరంలో ఉంచడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈనెల 29వ తేదీన సాయంత్రం 6.48 గంటల నుంచి రాత్రి 9.17 నిమిషాల మధ్య తల్లి పాదాలు తీసుకొస్తారు. మందిరంలోనే ప్రత్యేక పూజలను నిర్వహించి ఈ పాదాలను తీసుకువచ్చి పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో నిలుపుతారు. అనంతరం అమ్మవారి ఘటాలను రూపొందిస్తారు. అదేరోజు ఉదయం 8.40 గంటలకు సూర్యపూజ, యజ్ఞశాల పూజ, ముఖ్య దేవత పూజ, చండీపాఠం, హారతి, పుష్పాంజలి పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం అగ్ని సంస్కార హోమం, హారతి, పుష్పాంజలి కార్యక్రమాలు ఉంటాయి. 30వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ప్రతి నిత్యం ఉదయం సూర్యపూజతో ప్రారంభమై మహాస్నానం, శాలపూజ, చండీపాఠం, దేవీ మహాస్నానం, షోడోపచార పూజలు కొనసాగుతాయి. పూజల్లో ప్రధాన ఘట్టాలు చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఐదు రోజుల్లో భాగంగా చివరి రోజు రాత్రి పూజారి మల్లెలు తొక్కడం (అగ్గిపై నడవడం), ముళ్లతో రూపొందించిన ఊయలలో పూజారి కూర్చుని ఊగడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అమ్మవారిని నిత్యం కొలిచే ఖండాయిత్ తెగకు చెందినవారు ఈ పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రధాన ఘట్టాలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అదేవిధంగా ఉత్సవ పూజల్లో భాగంగా చండీపాఠం, హోమం వంటి పూజలను నిర్వహించేందుకు గంజాం జిల్లా కవిసూర్యనగర్ నుంచి ప్రత్యేక పూజారుల బృందంను పరిచాలన కమిటీ రప్పిస్తారు. అమ్మవారి ప్రత్యేక దినాలు ప్రతినిత్యం పూజలు అందుకునే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజున అమ్మవారికి భోగం సమర్పించే సమయంలో ప్రత్యేకమైన వంటకాలను పూజారులు వండి సమర్పిస్తారు. పాయసం (ఖిరి), అన్నభోగం, పప్పు, కలగాయకూర, తోటకూర వంటివి అమ్మవారికి సమర్పించిన భోగంలొ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం అమ్మవారికి అన్న భోగాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తులకు అమ్మవారిని దర్శనాన్ని సుమారు గంటపాటు నిలిపివేస్తారు. అనంతరం దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. సంధ్యా హారతి ప్రతిరోజూ అమ్మవారికి సాయంత్రం సంధ్యా హారతి ని ఇస్తుంటారు. ఆదివాసీ మేళతాళాలు, డప్పులు వంటి వాయిద్యాల నడుమ హారతిని సమర్పిస్తారు. ఈ హారతిని తిలకిస్తే సర్వపాపాలు పోయి.. అంతా సుఖశాంతులతో ఉంటారని ఒక నమ్మిక కావడంతో భక్తులు హా రతిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇత్తడి గుర్రం విశేషం మందిరం ఎదురుగా ఇత్తడి గుర్రం ఉంటుంది. ఇది అమ్మవారి వాహనంగా చెబుతుంటారు. రాత్రి సమయంలో అమ్మవారు పురవీధుల్లో గుర్రంపై ఊరేగి దుష్టశక్తుల బారి నుంచి ప్రజలను కాపాడుతారని స్థల చరిత్ర. దానికి అనుగుణంగా మందిరం పరిచాలన కమిటీ ఇత్తడి గుర్రాన్ని రూపొందించి మందిరం ఎదుట ప్రతిష్టించారు. ఉత్సవాల సమయంలో గుర్రాన్ని పూర్తిగా ముస్తాబు చేసి పూజిస్తారు. పాదాల గుడి మజ్జిగౌరి అమ్మవారి భక్తులకు కేవలం ముఖం మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. ఎర్రటి సింధూర రంగులో అమ్మవారి ముఖం మనకు కనిపిస్తుంది. మరి కొంతదూరంలో అమ్మవారి పాదాలు ఉంటాయని పూర్వీకులు చెబుతుంటారు. అదేవిధంగా మిగతా భాగం మందిరానికి కొద్ది దూరంలోని మెయిన్ రోడ్డు వద్ద ఒక చెట్టు కింద ఉంటుందని భావిస్తుంటారు. ఇదే జెన్న బౌలి మందిరంగా మనకు దర్శనం ఇస్తుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక రాయిని తీసుకువచ్చి ఇక్కడ వేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. రూ.5 లక్షలతో ఉత్సవాలు ప్రతీ ఏడాది మాదిరిగా ఈసారి కూడా అమ్మవారి చైత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.15 లక్షలు కేటాయించాం. ఐదు రోజులు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇదిలా ఉండగా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే విధంగా సుమారు రూ.26 కోట్లతో అభివృద్ధి పనులకు నాంది పలికాం. ప్రస్తుతం మందిరం ప్రాంగణంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. – రాయిసింగి బిడిక, మేనేజింగ్ ట్రస్టీ, మజ్జిగౌరి దేవాలయం ఇదీ చరిత్ర 15వ శతాబ్ధంలో జయపురం సంస్థానానికి చెందిన రాజా విశ్వనాథ్ దేవ్ తన పరిపాలనను విస్తరిస్తారు. ఈ క్రమంలో రాయగడను పాలించిన విశ్వనాథ్ దేవ్ అమ్మవారిని ఇష్టదైవంగా కొలుస్తారు. తాను నిర్మించిన కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్టించి పూజించడంతో అమ్మవారిని మఝిఘొరియాణిగా పిలుస్తారు. విశ్వనాథ్ దేవ్‌కు 108 మంది రాణులు ఉంటారు. కాలక్రమేణ యుద్ధంలో ఆయన మరణిస్తారు. దీంతో ఆయన సతీమణులు కూడా కోటలోనే సతీసహగమనం చేస్తారు. దీనినే సతీ కుండంగా పిలుస్తారు. ఇప్పటికీ మందిరానికి కుడివైపున సతీకుండం ఉంది. ప్రతీ మాస సంక్రాంతి నాడు ఈ సతీకుండం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు. రాజా విశ్వనాథ్ దేవ్ మృతి చెందడంతో కోట పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది. కోటలొ ఉన్న అమ్మవారి మందిరం ఆలనాపాలన కరువవ్వడంతో కూలిపోతుంది. ఇదిలా ఉండగా 1936వ సంవత్సరంలో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న సమయంలో విజయనగరం నుంచి రాయిపూర్ వరకు రైలు మార్గం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జంఝావతి నదిపై వంతెన నిర్మించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. ఎన్నిసార్లు కట్టినా అర్ధాంతరంగా కూలిపోతుంటుంది. ఒకరోజు వంతెన నిర్మించేందుకు వచ్చిన కాంట్రాక్టర్ నిద్రిస్తున్న సమయంలో అమ్మవారు అతడి కలలో కనిపించి ఈ ప్రాంతంలో నేను ఉన్నాను. నాకు మందిరం నిర్మించి పూజలు కొనసాగిస్తే వంతెన నిర్మాణం పూర్తవుతుందని చెబుతుంది. ఉలిక్కిపడి లేచిన కాంట్రాక్టర్ సమీపంలో వెదకడంతో శిథిలావస్థలో ఉన్న మందిరం కనిపిస్తుంది. అనంతరం కాంట్రాక్టర్ మందిరం నిర్మించి అమ్మవారిని ప్రతిష్టించి పూజలను నిర్వహిస్తారు. దీంతో వంతెన నిర్మాణ పనులు పూర్తవుతాయి. -
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
జయపురం: సబ్ డివిజన్ పరిధి కోట్పాడ్ సమితి బతాసన గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ బొతాసన శాఖ కార్యదర్శి పూర్ణచంద్ర సుర కోరారు. గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సమావేశం పార్టీ నేత కుమురునాథ్ భొత్ర అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భూముల్లోని ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు కోట్పాడ్ తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుదిష్టర్ రౌళో మాట్లాడుతూ.. భూమి ఆక్రమణలతో పాటు పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ఏప్రిల్ 2వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాలని సూచించగా అందుకు సమావేశం అంగీకరించింది. కోట్పాడ్ సమితి గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ శాఖలు ఏర్పాటు చేయాలని, సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టాలని రౌళో పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ నేతలు గోవర్ధన భొత్ర, త్రిపతి భొత్ర, గోపబందు హరిజన్, ముకుంద భొత్ర తదితరులు పాల్గొన్నారు. -
డెంగాజానీగుడ ప్రజలను రక్షించండి
● పార్లమెంట్లో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఆవేదన కొరాపుట్: జిల్లాలోని దశమంతపూర్ సమితి డెంగాజానీగుడ గ్రామంలో గిరిజనుల జీవితాలపై పార్లమెంట్లో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో దమంజోడిలోని భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో) వినియోగించిన బూడిద వలన రెడ్మెడ్ పాండ్ ఏర్పడిందన్నారు. దానివలన గిరిజనులు అనారోగ్యాల బారిపడుతున్నారని వాపోయారు. ఇప్పటికే కొందరు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారని తెలిపారు. అందువలన అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. కేంద్ర గనుల శాఖ మంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బిసంకటక్‌లో భారీవర్షం రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో శనివారం భారీవర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. కాలువల్లోని మురుగు నీరు రోడ్లపైకి రావడంతో చెత్తతో రోడ్లు నిండిపోయాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్ నుంచి గౌడవీధి, డుకుం రోడ్డు, మెయిన్ రోడ్డు, తెల్లివీధి, బొడొద్వారా వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. గత కొద్దికాలంగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆత్మీయ సమ్మేళనం నేడు పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో తెలుగు ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సీబీ రామచంద్రరావు (ఐఏఎస్), హైటెక్ మెడికల్ కళాశాలలు, ఆస్పత్రుల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి, సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్‌రావు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావులను సన్మానించనున్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భువనేశ్వర్ నుంచి మిరాకిల్ డ్యాన్సు, కూచిపూడి నృత్యాలు ఉంటాయని డా.సయ్యద్ రహింతుల్లా తెలిపారు. చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ప్రారంభం పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా పోలీస్‌స్టేషన్‌లో చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్‌ని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు నితి శేఖర్ శనివారం ప్రారంభించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే కక్షిదారులు, బాధితుల పిల్లలు ఈ గదిలో బొమ్మలతో ఆడుకునే సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్‌కుమార్, మోహనా ఐఐసీ ఓం నారాయణ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక దళం మాక్‌డ్రిల్ మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అగ్నిమాపక దళం అధికారులు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు సపాన్ కుమార్ పిండా, నర్సింగ్ ఆఫీసర్ ఇన్చార్జి సంజులతా సేఠీ, ఆస్పత్రి మేనేజర్ విశ్వజీత్ తదితరులు పాల్గొన్నారు. -
టవర్ ఎక్కిన ప్రేమికుడు
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి సింగరాజకొండ గ్రామానికి చెందిన ఒక యువకుడు, ప్రేమించిన అమ్మాయి కాదనడంతో మనస్థాపం చెంది సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని కలకలం రేపాడు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఓడ్రాప్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సుమారు 3 గంటలు పాటు శ్రమించి ఆ యువకుడిని రక్షించారు. యువకుడిని విచారించగా తనది మల్కన్‌గిరి సమితి ఎంవీ 7 గ్రామమని తెలిపారు. తాను ప్రేమించిన అమ్మాయి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానన్నాడు. దీంతో పోలీసులు జాగ్రత్తలు చెప్పి విడిచిపెట్టారు. -
త్రివేణి సంగమం రామచంద్ర శతకం
శ్రీకాకుళం కల్చరల్ : భక్తి, జ్ఞాన, వైరాగ్యాల త్రివేణి సంగమం శ్రీరామచంద్ర శతకమని వక్త మేడూరి సత్యనారాయణమూర్తి అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరంలో వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో శనివారం రామచంద్ర శతకంపై ప్రసంగించారు. ఆదిభట్ల నారాయణదాసు రచించిన సుమారు 1200 గ్రంథ రాజములలో శ్రీరామచంద్ర శతకం ఒకటని చెప్పారు. అనంతరం డాక్టర్ కోమలరావు వక్తను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు గుమ్మా నగేష్, కామేశ్వరరావు, అప్పలకొండ, శరత్‌బాబు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, పట్నాయక్, నరసింహమూర్తి, ఈశ్వరరావు, పతంజలి శాస్త్రి, వెంకటరమణ, మురళీకృష్ణ, సూరిబాబు, ఉమాదేవి, పి.శాంతమ్మ, పద్మావతి, అరుణకుమారి, కృష్ణవేణి పాల్గొన్నారు. -
ఘనంగా గంతాయత్ జయంతి వేడుకలు
పర్లాకిమిడి: స్థానిక ఒడ్డిమంగళి వీధిలోని ఉత్కళ హితేషినీ సాంస్కృతిక హాల్లో సీనియర్ జర్నలిస్టు, దివంగత నబీనానంద గంతాయత్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉత్కళ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ద్విజేంద్రనాథ్ పాడి, కార్యదర్శి ప్రదీప్‌నాయక్, జర్నలిస్టు గరుఢ ధ్వజ చౌదరి, రఘురాజ్ రాజగురు, డాక్టర్ శంకర్ ప్రసాద్ భక్షి తదితరులు పాల్గొని మాట్లాడారు. నబీనా నంద గంతాయత్ కుమారుడు బిబేకానంద గంతాయత్ తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్రిక రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రచయిత నాగరాజు దంపతులకు సన్మానం రాయగడ: ప్రముఖ రచయిత, కవి, సీనియర్ పాత్రికేయుడు భళ్లమూడి నాగరాజు, శేషసాయి దంపతులను ఉత్కళ ఆంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. స్థానిక బాలాజీనగర్‌లోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు రేజేటి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ.. నాగరాజు సమాజ వ్యవస్థాపక సభ్యులే కాకుండా.. కార్యదర్శిగా సేవలు అందించి ఉన్నతికి కృషి చేశారని తెలిపారు. అనివార్య కారణాలతో వారి కుటుంబం హైదరాబాద్ వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయనకు సాహితీరత్న, సాహితీ శిరోమణి వంటి బిరుదులు లభించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. నాగరాజు సతీమణి శేషసాయి రచయిత్రిగానే కాకుండా.. నటి, గాయకురాలిగా అందరికి సుపరిచితం అన్నారు. వేద పండితులు భాస్కరాచార్యులు, రేజేటి శ్రీనివాస్ శర్మ, కొల్లూరు గౌరి, శంకర్శాస్త్రి, పి.గణపతి శాస్త్రిలు వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఏవీ నారాయణ మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్లూరు సూర్యనారాయణ శర్మ, కోశాధికారి టీఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు అరెస్టు మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు సైబర్ మోసంతో ప్రమేయం ఉన్నటువంటి ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ సమితి చితాపారి–3 పంచాయతీ సదాశివపూర్ గ్రామానికి చెందిన భీమ కిస్సానీ ఇంటి నుంచి ఈనెల 20వ తేదీ రాత్రి ఒక సెల్‌ఫోన్ చోరీకి గురయ్యింది. భీమ 23వ తేదీన బ్యాంక్‌కు వెళ్లినప్పుడు అతని ఖాతా నుంచి రూ.75 వేలు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే బలిమెల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐఐసీ దీరాన్ పట్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ట్రాకింగ్ ద్వారా నవరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితి చాటిగుడా గ్రామానికి చెందిన దిలీప్ హరిజన్, ఇంద్రపాంకా అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.65 వేల నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. సోమవారం ఇద్దరినీ కోర్టుకు తరలిస్తామని ఐఐసీ దీరాన్ పట్నాయిక్ వెల్లడించారు. -
బహు భాషావేత్త నారాయణాచార్యులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పుట్టపర్తి నారాయణాచార్యులు కవి, బహు భాషావేత్తని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగు సాహిత్యానికి, ప్రాచీన అధ్యయనాలకు చేసిన అపారమైన సేవలకు గౌరవసూచకంగా ఏటా మార్చి 28న ఆయన జయంతిని జరుపుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, సెట్‌శ్రీ సీఈఓ అప్పలనాయుడు, పర్యాటక అధికారి నారాయణరావు, సి–సెక్షన్ పర్యవేక్షకులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి తమిళనాడులోని తిరువూర్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అజిత్‌కుమార్, గోకుల్ శక్తివేల్లను నరసన్నపేట పోలీసు లు శనివారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వ ద్ద నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనంలో వెళ్తున్న అజిత్‌కుమార్ పట్టుబడినట్లు సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈయన వద్ద 12.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన అజిత్‌కుమార్ ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తుండగా అదే కంపెనీలో పనిచేసే పద్మచరణ్ దిగల్ బత్తుతో పరిచయం ఏర్పడింది. ఈయన సహకారంతో అజిత్‌కుమార్ భువనేశ్వర్‌లో తక్కువ ధరకు గంజాయి కొని తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయాలు చేయడం ప్రారంభించాడు. మంచి ఆదాయం వస్తుండటంతో ఈ నెల 21న తిరువూర్ నుంచి బయల్దేరి పద్మచరణ్ సూచించిన వ్యక్తి వద్దకు వెళ్లి తన స్నేహితుడు గోకుల్ శక్తివేల్‌తో కలసి గంజాయి కొనుగోలు చేసి తిరిగి తిరువూర్ వెళ్తుండగా మడపాం వద్ద శనివా రం పట్టుపడినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి తమిళనాడుకు 3.060 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలజబాద్కి చెందిన నాగరాజుమురుగన్, రాజీలు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు.వీరిని విచారించగా ఒడిశా సమంతపూర్ చంచలకులో గ్రామానికి చెంది న బరుజోదోళాయి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకి తీసుకెళ్తుండగా పోలీసుల కు పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది ఉన్నారు. రెండు కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు ఆమదాలవలస: బీఆర్ నగర్ సమీపంలో రెండు కేజీల గంజాయితో పట్టుబడిన ఆమదాలవలస పట్టణానికి చెందిన సయ్యద్ తాహిర్, మన్యాల నరేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు. గంజాయి సేవిస్తున్న అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వీరి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. -
బార్ అధ్యక్షుడిగా బ్రజసుందర్ నాయక్
రాయగడ: రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది బ్రజసుందర్ నాయక్ విజయం సాధించారు. ఉదయం 7 గంటలకు కోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా 201 మంది న్యాయవాదుల్లో 195 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి బ్రజసుందర్ నాయక్, బిరజా పాత్రోలు పోటీపడ్డారు. సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో బ్రజసుందర్ నాయక్‌కు అనుకూలంగా 105 ఓట్లు పోలవ్వగా, బిరజా పాత్రోకు 86 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 4 చెల్లనట్టుగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఉమాకాంత మిశ్రో తెలియజేశారు. దీంతో బ్రజసుందర్ నాయక్ తన ప్రత్యర్థి బిరజా పాత్రోపై 19 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడి బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం ఉదయం జిల్లా కోర్టులోని బార్ రూమ్‌లో జరిగాయి. ఎన్నికల అధికారిగా మలయమారుతీ దేవి, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా జీఎస్ పట్నాయిక్‌లు వ్యవహరించారు. మొత్తం బార్ అసోసియేషన్‌లో 127 మంది ఓటర్లకు గాను, 108 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బార్ అధ్యక్షుడిగా రామకృష్ణ నాయక్ 63 ఓట్ల తేడాతో హీరాచంద్పై గెలుపొందారు. అలాగే కార్యదర్శిగా కాశీనాథ్ దాస్, ఉపాధ్యక్షుడిగా శివప్రసాద్ పాణిగ్రాహిలు గెలిపొందారు. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా యడ్ల శివకుమార్, కోశాధికారిగా సందీప్ కుమార్ పట్నాయిక్, లైబ్రేరియన్‌గా రఘునాథ పాత్రో, కార్యవర్గ సభ్యులుగా బండి విశ్వనాథం, చందన్ పట్నాయిక్, సైలాడ శ్రీరాములు, సత్యనారాయణ పాడి, అశోక్ అధికారి, గగారియన్ సొబొరోలు ఎన్నికయ్యారు. -
గాలిలో తుపాకీ పేల్చిన ఎమ్మెల్యే
● అంగరక్షకుడికి నోటీసులు జారీ భువనేశ్వర్: పవిత్ర శ్రీరామ నవమి పురస్కరించుకుని బొలంగీర్ జిల్లా టిట్లాగడ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే నవీన్ జైన్ గాలిలోకి తుపాకీ పేల్చిన ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సమగ్ర దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో బట్టబయలైనట్లు సమాచారం. టిట్లాగడ్లోని శాస్త్రి స్క్వేర్, ఓల్డ్ బ్యాంక్ స్క్వేర్‌లో వరుసగా 2 సార్లు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే తన అంగరక్షకులు మరియు పోలీసు సిబ్బంది సమక్షంలో బహిరంగంగా గాలిలోకి తుపాకీ కాల్చడం కనిపించింది. దీంతో టిట్లాగడ్ ఎమ్మెల్యే నవీన్ జైన్ వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్ఓ)కి బొలంగీర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వివరణ కోరుతు నోటీసు జారీ చేసింది. ఎమ్మెల్యే నవీన్ జైన్ నాటకీయంగా, సినీ శైలిలో తుపాకీ పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రసారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే పదేపదే గాలిలో తుపాకీ కాల్పులు జరుపుతుండగా, ఆ సమయంలో ఆయన అంగరక్షకుడు స్పష్టంగా సాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా అది బొమ్మ తుపాకీ అని, ఊరేగింపులో పాల్గొన్నవారిని ప్రోత్సహించడానికే తాను కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే నవీన్ జైన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రారంభం
రాయగడ: స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని సంతోషిమాత మందిరం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంతో పాటు సంపత్ గణపతి, విరాట్ విశ్వకర్మ, గోవిందమాంబ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. విశ్వ బ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకుడు పొట్నూరు భాస్కరరావు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు విఘ్నేశ్వర పూజలతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి కలశ యాత్రను నిర్వహించారు. యాత్రలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
నాటక రంగాన్ని పరిరక్షించాలి
జయపురం: సమాజాన్ని చైతన్యపరచి అభ్యుదయ మార్గంలో నడిపించే కళల్లో నాటక కళ ప్రధానమైందని, కాల క్రమేణా కనుమరుగవుతున్న నాటక రంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని కళాకారుడు, నాటక రచయిత నిరంజన్ పాణిగ్రహి అన్నారు. శుక్రవారం ప్రపంచ నాటక దినోత్సవాన్ని స్థానిక కొత్తవీధి సీనియర్ నాగరిక కమిటీ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం ఆల్ ఇండియా రేడియో విశ్రాంత అధికారి ఉదయ శంకర జాని మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతల నుంచి సమాజాన్ని కాపాడడంలో నాటక రంగం ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. జయపురంలో అనేక మంది సీనియర్ కళాకారులతో పాటు, ఔత్సాహిక నాటక కళాకారులు ఉన్నారని, వారిని సమైఖ్యపరచి నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో ప్రముఖ నాటక కళాకారుడు గోపాల సామంతరాయ్, రచయిత కళాకారుడు కృష్ణచంద్ర హోత్త, సంగీత కళాకారుడు ధిరెన్ మోహన్ పట్నాయిక్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, కళాకారుడు ప్రకాశ మహంతి, సాహితీవేత్త లక్ష్మీకాంత పాఢీ, మహ్మద్ షరీఫ్, రబీ పాత్రో, సురేష్ హోత్త, గుప్త పాణిగ్రహి, డాక్టర్ గాయిత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● ఇద్దరు మృతి భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లాలో కాల వైశాఖి బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి బరిపద ప్రాంతంలో ఈదురు గాలులతో భారీగా వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు, స్తంభాలు కుప్పకూలాయి. పూరి గుడిసెలు దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదాల్లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 18వ నంబర్ జాతీయ రహదారిపై చెట్టు కూలడంతో ఒక యువ బైకర్ మృతి చెందాడు. బరిపద – కులియానా రోడ్డులోని ఒసొనొజొడ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. బరిపద – ఉదొలా మార్గంలో ఖుంటా వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో మరో బైకర్ మృతి చెందాడు. -
ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా
● ఐదుగురు దుర్మరణం ● 40 మందికి గాయాలు భువనేశ్వర్: నయగఢ్ జిల్లా దసపల్లా హనుమాన్ ఘాటి సమీపంలోని కొండ ప్రాంతంలో పర్యాటక బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సు ప్రయాణికులతో నిండి ఉంది. ఈ ప్రమాదంలో 5 మంది దుర్మరణం పాలయ్యారు. 40 మందికి పైబడి గాయపడ్డారు. మా సింగేశ్వరి అనే పేరు కలిగిన ఈ ప్రైవేటు బస్సు బరంపురం నుంచి హరిశంకర్ ఆలయానికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద అదుపు తప్పి బండ రాతిని ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ధాటికి బస్సులోని పలువురు ప్రయాణికులు బయటకు తుళ్లిపడ్డారు. మరికొందరు బోల్తా పడిన బస్సులో చిక్కుకున్నారు. స్థానిక అధికారులు, నివాసితులు తక్షణమే రంగంలోకి దిగి సత్వర సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో డ్రైవర్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన ప్రయాణికుల్లో చాలా మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో గంజాం మరియు బరంపురం ప్రాంతానికి చెందిన 50 మందికి పైబడి యాత్రికులు ప్రయాణిస్తున్నారు. పరిహారం ప్రకటన దసపల్లా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆర్థిక పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేసి, మృతులైన 5 మంది కుటుంబీకులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
వాట్సాప్ ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ
నరసన్నపేట: కోమర్తికి చెందిన దుంగ దిలీప్ కుమార్ సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్‌కు నాలుగు రోజుల కిందట ఒక వాట్సాప్ మెసేజీ వచ్చింది. ఆ మెసేజీ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.52 వేలు ఖాళీ అయ్యిందని శనివారం తెలిపారు. వెంటనే తేరుకొని బ్యాంకు అధికారులను సంప్రదించానని, పోలీసులను ఆశ్రయించాలని సూచించడంతో నరసన్నపేట సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా పరిశీలన చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి న విద్యార్థులకు ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్‌గా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల యువతీ యువకులు అర్హు లని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచితవసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న ట్లు చెప్పారు. వివరాలకు 7995013422 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల పైబడి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమాంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, జి.సురేష్, జిల్లా నాయకులు బి.శ్యాం, వైకుంఠరావు, ఎల్.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మందస : కార్గో ఎయిర్‌పోర్టు వల్ల విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడతామని మందస మండలం రాంపురం పంచాయతీ రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం, తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు వల్ల గ్రామంలో 115 మంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, ఉపాధి కోల్పోయి కోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ అనివెట్టి మండపంలో కొట్నం దంపు(సుగంధ ద్రవ్య మర్దనం) ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు సంప్రదాయ కీర్తనలు ఆలపిస్తూ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యనిర్వహణాధికారికె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ పాల్గొన్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
హోటళ్లలో తనిఖీలు
రాయగడ: వంట గ్యాస్ కృత్రిమ కొరతను నివారించి వినియోగదారులకు సకాలంలో వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం ఈ మేరకు జిల్లాలోని గుణుపూర్‌లో సంబంధితశాఖ అధికారులు హోటళ్లు, వ్యాపార సంస్థల్లో శుక్రవారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. హోటళ్లలో వాణిజ్యపరమైన గ్యాస్‌కు వినియోగించడానికి బదులు డొమెస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు అధికారులు దాడులను నిర్వహించారు. గుణుపూర్‌లో గల పలు హోటళ్లలో అధికారులు దాడులను నిర్వహించారు. కమర్షియల్ వంట గ్యాస్‌కు బదులు డొమెస్టిక్ వంట గ్యాస్‌ను వినియోగిస్తున్న మూడు హోటళ్లలో మూడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గుణుపూర్ అదనపు తహసీల్దార్ అభిలాష్ శతపతి, రామనగుడ అదనపు తహసీల్దార్ దీపరాణి బెహరా, సివిల్ సప్లయ్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మునిగుడలో తహసీల్దార్ ఎం.అనురాధ నేతృత్వంలో అదనపు తహసీల్దార్ బ్రజగొపాల్ దాస్, సిబ్బంది దాడులను నిర్వహించారు. రామనగుడలో తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి నేతృత్వంలో రామనగుడలో గల వివిధ హోటళ్లలో దాడులు చేపట్టారు. పద్మపూర్, గుడారి, బిసంకటక్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ దాడులను ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని కుచేయిపొదొరో గ్రామ సమీపంలొ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి పనొబొంధా గ్రామానికి చెందిన సహదేవ్ కుంభార్గా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామం నుండి టికిరి వెళుతుండగా కుచేయిపొదొరొ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై పడిపోవడంతో తల వెనుకభాగం తీవ్రంగా గాయపడింది. అటువైపుగా వెళుతున్న కొందరు ఆంబులెన్స్‌కు సమాచారం అందించి టికిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు . సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండిచా ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ భువనేశ్వర్: శ్రీమందిరం పాలక మండలి సభ్యులు శ్రీగుండిచా ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఆలయంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఈ బృందం పర్యవేక్షించింది. పాలక మండలి సభ్యులు, శ్రీమందిరం సీనియర్ అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. నాట్య మండపంలో ఎయిర్ కండిషన్ వ్యవస్థ ఏర్పాటును తనిఖీ చేశారు. పనులన్నీ నిర్ధేశించిన సమయంలోగా పూర్తిచేయాలని నొక్కి చెప్పారు. -
‘నేనే త్రివర్ణ పతాకాన్ని’ కవితా సంకలనం ఆవిష్కరణ
రాయగడ: ప్రముఖ కవి, రచయిత జయదేవ్ శెఠి స్వియ కవితా సంకలనం ‘నేనే త్రివర్ణ పతాకాన్ని’ పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక రింగ్ రోడ్డు సమీపంలోని మా మాంగళ మందిరం ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు బాదల్ కుమార్ థా, జోగేశ్వర్ దాస్, కలహండి జిల్లా శాఖ ధర్మ జాగరణ సమన్వయకర్త పర్వత్ కుమార్ మహాపాత్రో, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జితేంద్ర కుమార్ రథ్, మా మంగళ మందిరం పరిశీలన కమిటీ అధ్యక్షులు రాజు సాహు తదితరులు పాల్గొన్నారు. సంకలనంలో 37 కవితలు ఉన్నట్లు రచయిత, జయదేవ్ శెఠి వెల్లడించారు. ప్రతీ కవిత దేశభక్తిని చాటుతూ జాతీయ ఆలోచనలు, భావాలనుచాటి చెప్పేవిధంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ. దేశ భక్తిని చాటే ఇటువంటి తరహా కవితలు యువతకు ఎంతో అవసరమని అన్నారు. -
మత్స్యకారుల సమస్యలపై సైకిల్‌యాత్ర
మందస : మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 700 కిలోమీటర్లు మేర సైకిల్‌యాత్ర చేపడుతున్నట్లు కవిటి మండలం కపాసుకుద్ధి గ్రామానికి చెందిన గుడార ప్రసాద్ తెలిపారు. డొంకూరులో ఈ నెల 13న ప్రారంభమైన యాత్ర శుక్రవారం గెడ్డవూరు గ్రామ తీరానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 55 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశానని, తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు ప్రసాద్‌ను అభినందించారు. -
ఆర్మీ చీఫ్ జనరల్‌కు గవర్నర్ అభినందనలు
భువనేశ్వర్: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి లోక్ భవన్లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా దేశం పట్ల అచంచలమైన అంకిత భావం, ఆదర్శప్రాయమైన సేవకు నిదర్శనమైన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసినందుకు ద్వివేదిని, భారత సైన్యాన్ని గవర్నర్ అభినందించారు. గవర్నర్‌తో కలిసి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది లోక్ భవన్‌లోని అటల్ వనం సందర్శించారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి అంకితం చేసిన ఈ ప్రదేశం, ప్రకృతిని, జాతీయ గర్వాన్ని అర్థవంతంగా ఏకం చేస్తుందని ద్వివేది తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అటల్ వనంలో ఏర్పాటు చేసిన టీ– 55 యుద్ధ ట్యాంక్, 1971 యుద్ధంలో మన సైన్యం పాత్రకు, మన వీర సైనికుల ధైర్యానికి గర్వకారణంగా నిలుస్తుందని కొనియాడారు. -
గ్యాస్ కొరతతో హోటళ్ల బంద్
పర్లాకిమిడి: పట్టణంలో గ్యాస్ కొరత కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీ, భారత్‌గ్యాస్ కంపెనీలకు శుక్రవరాం రెండు ట్రక్కుల గ్యాస్ సిలిండర్ల స్టాక్ వచ్చింది. నలభైరోజులకు గ్యాస్ కార్డుపై ఒక సిలిండర్‌ను వివిధ గ్యాస్ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల స్టాకు రాకపోవడంతో పట్టణంలో అనేక హోటళ్లు, తోపుడు బండ్ల టిఫిన్ సెంటర్లు మూతబడ్డాయి. దీంతో కొందరు చిరు వ్యాపారులు ఇదే అదనుగా ఎక్కువ ధరకు బ్లాకులో గ్యాస్ సిలిండర్లు రూ.రెండు వేలు, రూ.2500 అమ్మి సోమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని హోటళ్లలో జీడి తోక్కుతో వంటలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో చాలా హోటళ్లలో ఇడ్లీ, వడ వంటి టిఫిన్లుకు రేట్లు పెంచారు. ఈ విషయమై గ్యాస్ కంపెనీలకు అడగ్గా.. ప్రస్తుతం 45 రోజులకు వంట గ్యాసును సరఫరా చేస్తున్నామని, బ్లాకులో అమ్మేవారు రేపొద్దున్న గ్యాస్ సిలిండరు దొరక్క అనేక బాధలు పడుతూ రూ.2వేలు, రూ.2,500 ధరకు కొనాల్సి వస్తుందని గ్యాస్ కంపెనీల యజమాని దేవేందర్ సాహు అన్నారు. -
చీలికకు శ్రీకారం
శ్రీ జగన్నాథుని రథ కలపభువనేశ్వర్: శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. సంస్కృతి, సంప్రదాయ రీతిలో సకాలంలో పనులు చేపట్టి పూర్తి చేయడం విశేషం. ఈ ఏడాది జరగనున్న యాత్ర కోసం రథాల తయారీ కోసం కలప దుంగల సేకరణ కొనసాగుతుంది. ఏటా శ్రీ రామ నవమి పురస్కరించుకుని రథాల తయారీలో కీలకభాగంలో వినియోగించే భారీ కలప దుంగల్ని ఎంపిక చేసి లాంచనంగా చీలిక పనులు ప్రారంభించడం ఆచారం. కటక్ ఖుపురియా ప్రభుత్వ కలప మిల్లులో పండితుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రతి పని స్వామి ఆజ్ఞతో జరగాల్సిందే. అందుకు సంకేతంగా పూరీ శ్రీ మందిరం రత్న వేదికపై కొలువై ఉన్న మూల విరాటు ఆజ్ఞకు సంకేతంగా ప్రత్యేక పూల మాలని అత్యంత భక్తి శ్రద్ధలతో కలప మిల్లు ప్రాంగణానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో స్థానికులు ఆసక్తితో పాలుపంచుకున్నారు. రథంలో కీలక భాగం తయారీలో వినియోగించే 12 అడుగుల పొడవైన 3 ధవురా కలప దుంగల్ని ఎంపిక చేశారు. వాటిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని రథాల తయారీలో ఒక్కోటి వంతున వినియోగిస్తారు. -
రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు రేపు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రగ్బీ జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెన్ అండ్ ఉమెన్ కేటగిరిలో నిర్వహిస్తున్న ఎంపికల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500007272, 7842423423 నంబర్లకు సంప్రందించాలని కోరారు. 108లో గిరిజన గర్భిణి ప్రసవం కొత్తూరు: చిన్నరాజపురం గ్రామానికి చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ సవర జ్యోతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కొత్తూరు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చేరుకొని గర్భిణిని హిరమండలం పీహెచ్‌సీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో హిరమండలం పీహెచ్సీలో చేర్చించినట్లు ఈఎంటీ ఎం.కృష్ణ, పైలట్ గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గొంటివీధి సమీపంలో ఓ ప్లై వుడ్ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో శుక్రవారం వేకువఝామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపాడురోడ్డులోని కిల్లిపాలెం యూనియన్ బ్యాంకు సమీపంలో అద్దె ఇంట్లో 62ఏళ్ల వృద్ధుడు దుర్గ విజయ్‌కుమార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. గొంటివీధిలో అద్దెషాపులో ప్లై వుడ్, ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 2.05 గంటలకు షాపులో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందడంతో సిబ్బందిని పంపించి మంటలను అదుపు చేశామని ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు తెలిపారు. ఇన్వాల్వ్డ్ మెటీరియల్, డ్రెస్సింగ్ టేబుల్ మెటీరియల్, గ్లాస్, కంప్యూటర్, ప్రింటర్, రివాల్వింగ్ కుర్చీలు, ఫర్నిచర్ మెటీరియల్ కాలి బూడిదయ్యాయని చెప్పారు. బ్యాంకు రుణాలతో గొంటివీధి, న్యూకాలనీలో అద్దె షాపులు నడుపుతున్నానని, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, కుమార్తెలకు వివాహం చేయాల్సిన సమయంలో ఈ కష్టమొచ్చిందని బాధితుడు వాపోయాడు. హోటళ్లలో విజిలెన్స్ దాడులు పొందూరు: మండలంలోని పలు హోటళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఏడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై 6ఏ కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో ఇన్చార్జి ఆర్ఐ జగదీష్, వీఆర్వో రేవతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి నరసన్నపేట: మండల పరిధిలోని కామేశ్వరిపేట, దాసరివానిపేట వద్ద రైల్వేలైన్‌పై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్‌సీ మధుసూదనరావు తెలిపిన వివరాలు మేరకు.. కామేశ్వరిపేట వద్ద వంశధార వంతెనపై ట్రాక్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తున్న తిలారుకు చెందిన కోట అప్పారావు(29) ప్రమాదవశాత్తూ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. అలాగే దాసరివానిపేట వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని రైలు ఢీకొని గంజాం జిల్లా కాలీకట్ ప్రాంతానికి చెందిన ఎస్.బి.పాణిగ్రహి(35) మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని హెచ్‌సీ తెలిపారు. -
వణికించిన వడగళ్లు
● రబీ వరి పంటపై తీవ్ర ప్రభావం ● పలుచోట్ల నేలవాలిన పైరు ● రాలిన మామిడిపిందెలు సారవకోట/మెళియాపుట్టి: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రబీ వరి పంటతో పాటు మామిడి, మిరప సాగులపై అకాల వాన తీవ్ర ప్రభావం చూపుతోంది. సారవకోట మండలంలోని పొప్పంగి సమీపంలో రంగసాగరం ఆయకట్టును నమ్ముకుని ఈ ఏడాది రబీలో స్థానిక రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. గత ఏడాది కరాకు సుమారు 35 నుంచి 40 బస్తాలు రాగా, ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు సుమారు 8 నుంచి 10 బస్తాల వరకు పొల్లు గింజలు వచ్చాయని సారవకోట, గొర్రిబంద గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగసాగరం ఆయకట్టు ప్రాంతంలోని జగన్నాథపురం, జగ్గయ్యపేట, బురుజువాడ, రైవాడ, కొత్తూరు, అగదల, సవరపేట, సారవకోట, గోపాలపురం, వండానవలస తదితర గ్రామాలలో ఈ ఏడాది సుమారు 2000 ఎకరాలలో వరి సాగు చేశారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో కోత దశకు వచ్చిన పంట చాలా వరకు నేల రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా వడగళ్లు పడటంతో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పొల్లు గింజల వల్ల దిగుబడి తగ్గిపోగా తాజాగా వడగళ్ల వానతో పంట నేల రాలి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు 82 కేజీల ధాన్యాన్ని రూ.1200కే దళారులు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మెళియాపుట్టి మండలం జోడూరు గ్రామానికి చెందిన కమిరి సోమేశ్వరరావు, బి.ధర్మారావులకు చెందిన మిరప, నువ్వు, మామిడి పంట అంతా రాలిపోయింది. అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేలవాలింది.. గురువారం కురిసిన వడగళ్ల వానతో వరి పంట చాలా వరకు నేలవాలింది. ఇంత వరకు ఎన్నడూ చూడని విధంగా వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా రావడంతో దిగుబడి బాగా తగ్గింది. – చెంచల చంద్రరావు, రైతు, గొర్రిబంద, సారవకోట మండలం -
జగదాత్రిపూర్ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం
● వైద్యులతో సమీక్ష జయపురం: జయపురం పట్టణంలోని జగధాత్రిపూర్ (పాత జయపురం సబ్‌డివిజన్ ఆస్పత్రి) ఆస్పత్రి కార్యకలాపాలను పరిశీలించే క్రమంలో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ బృందం శుక్రవారం సందర్శించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ ఆరోగ్యశాఖ తరఫున ఆస్పత్రిలో నాణ్యతను పరిశీలించేందుకు డాక్టర్ రూప్ కుమార్ బయ్యా, సంతోష్ కుమార్ వచ్చారు. గతంలో జయపురం జగదాత్రిపూర్ ఆస్పత్రి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణాలతో ఉత్తీర్ణత సాధించింది. ఆస్పత్రికి చేరిన బృందం ఇక్కడ అందుతున్న సేవలపై అధికారులతో సీమీక్షించింది. ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ స్వర్ణప్రభా బెహర తెలిపిన వివరాల ప్రకారం ఆస్పత్రిలోని 12 విభాగాలలో సేవలను కేంద్ర బృందం వెల్లడించింది. అవి సాధారణ క్లినిక్, డ్రస్సింగ్ రూం, కుటుంబ నియంత్రణ విభాగం, సంక్రమణ వ్యాధులు (అంటు వ్యాధులు)టీకాకరణ, ప్రయోగ శాల, ఔషధ పంపిణీ విభాగం, రికార్డుల నిర్వహణ, నవజాత శిశు, బాలల ఆరోగ్యం, మహిళల ఆరోగ్య విభాగాలను కేంద్ర బృందం సమీక్షిస్తుందని వెల్లడించారు. 12 విభాగాల సమీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారంతో పాటు అదనపు నిధులు సమకూరుతాయన్నారు. కేంద్ర బృందానికి ఆస్పత్రి ఇన్చార్జి అధికారి డాక్టర్ స్వర్ణప్రభా బెహర, వైద్యాధికారి డాక్టర్ అరుణ కుమార్ పాఢీ, డాక్టర్ శతాబ్ది మిశ్ర, టీకా అధికారి ప్రసన్న కుమార్ సాహు, డాటా ఆపరేటర్ లింగరాజు పాఢీ, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. -
ఒడిశా దినోత్సవం ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
మల్కన్‌గిరి: వచ్చేనెల ఒకటో తేదీన జరగనున్న ఒడిశా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే అన్నారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయించాలని, కార్యాలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాభు పాల్గొన్నారు.కోర్సండ గ్రామంలో సిమెంటు బెంచీలు ప్రారంభం పర్లాకిమిడి: జిల్లాలోని గుసాని సమితి కోర్సండ గ్రామంలోని రామాలయం ఆవరణలో సిమెంటు బెంచీలను శుక్రవారం ప్రారంభించారు. స్వర్గీయ గొట్టిపల్లి మల్లేశు, ఆదమ్మ, పారిశెల్లి శ్రీరాములు సరస్వతీ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు బెంచీలను సమకూర్చారు. వీటిని సర్పంచ్ గుంపు రామకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యయు ధర్మాన కామేశ్వరరావు నాయుడు ప్రారంభించారు. పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యాయ ఆవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు, గ్రామస్థులు పాల్గొన్నారు. భవనాన్ని ఢీకొట్టిన రుకుణ రథం భువనేశ్వర్: లింగ రాజు మహా ప్రభువు యాత్రలో శుక్రవారం అపశృతి చోటు చేసుకుంది. గురువారం అర్ధాంతరంగా ఆగిపోయిన రుకుణ రథం శుక్రవారం మధ్యాహ్నం 2.56 గంటలకు బయల్దేరడంతో యాత్ర పునఃప్రారంభమైంది. ఘంటానాథంతో ముందుకు కదులుతున్న రథం అదుపు తప్పి వీధిలోని ఓ భవంతి పైభాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో భవనం కొంత మేరకు దెబ్బతింది. రథాన్ని సరిచేసి ముందుకు నడిపించేందుకు అనుబంధ సేవాయత్ వర్గం భారీగా కసరత్తు చేయాల్సి వచ్చింది. దాదాపు గంట సేపు నిర్విరామంగా శ్రమించి రథాన్ని సరైన మార్గంలో నడిపించి యాత్ర కొనసాగించారు. ఈ ఘటన పట్ల భక్తుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంది. అంచెలంచెలుగా చేరుతున్న రథం కలప భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న శ్రీ జగన్నాథుని రథ యాత్ర నిమిత్తం రథం కలప దుంగలు అంచెలంచెలుగా శ్రీ మందిరం సింహ ద్వారం సమీపంలో రథాల తయారీ శాలకు చేరుతున్నాయి. మూడో విడత కలప దుంగలు శుక్రవారం ఈ ప్రాంగణానికి చేరాయి. పవిత్ర అక్షయ తృతీయ నుంచి రథాల నిర్మాణం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఎలాంటి నమూనా చిత్రాలు, యంత్రాలు, కొలత సాధనాలు లేకుండా యాత్రకు అవసరమైన 3 భారీ రథాలు ఏటా తయారు చేయడం విశేషం. తరతరాల అనుభవ జ్ఞానం, నైపుణ్యం అంది పుచ్చుకున్న నేటి తరం వడ్రంగి వర్గం వారసత్వ వృత్తి నైపుణ్యం ప్రదర్శించడం విశేషం. తరాల నుంచి తరాలకు వారసత్వంగా వస్తున్న సంప్రదాయంగా కొనసాగుతుంది. -
సాంకేతిక నైపుణ్యం కీలకం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలోని ఓపెన్ ఆడిటోరియంలో ట్రిపుల్ఈ శాఖ టెక్నికల్ టెస్ట్, ఈ–ఫ్లెయిర్ను ప్రొఫెసర్ ఎ.కె.పండా (ఐ.టీ. కన్సల్టెంట్ ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్) గురువారం ప్రారంభించారు. ట్రిఫుల్ఈ హెడ్ డాక్టర్ ప్రభాత్ కుమార్ పట్నాయక్ ముక్య వక్తగా వ్యవహరించారు. ఈ టెక్నికల్ టెస్ట్, ఈ–ఫ్లెయిర్లో కన్సల్టెంట్ సి.కె.వి.ప్రదీప్, రాకతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ (డీన్ అడ్మిన్) మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం ముఖ్యమని, అంకితభావంతో నూతన ఆవిష్కరణలు ప్రదర్శించాలన్నారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాజెక్టులు, సహకార అభ్యాసం ద్వారా అవశ్యకత పెరుగుతుందని డీన్ (వ్యవహారాలు) డాక్టర్ రితీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ (సోయెట్) డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా పాల్గొని నూతన ఆవిష్కరణలు, ప్రాడెక్టు డెవలప్మెంట్, రియల్ వరల్డ్ పొల్యూషన్స్‌పై మాట్లాడారు. -
శ్రీరామ నవమి ముందు పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
జయపురం: జయపురంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్‌మార్చ్‌లో పోలీసు ఉన్నతాధికారులు, బీఎస్ఎఫ్, ఆర్మ్డ్ పోలీసు జవాన్లు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ సమస్యాపూరిత ప్రాంతాల్లో కూడా నిర్వహించారు. జయపురం పోలీసు స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ ప్రధాన మార్గాల మీదుగా దసర పొడియ మైదానానికి చేరుకుంది. శ్రీరామ నవమి ఉత్సవాల్లో పట్టణంలో శాంతి భధ్రలు పరిరక్షించటంలో ప్రజలు సహకరించాలని అధికారులు పిలుపు నిచ్చారు. ఈ ఫ్లాగ్ మార్చ్ అనంతరం జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో దక్షిణ ఒడిశా డీఐజీ కన్వర్ విశాల్ సింగ్ శ్రీరామ నవమి వేడుకల్లో శాంతి భధ్రతలపై సమీక్షించారు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో శాంతిభధ్రతలు కాపాడేందుకు 13 ప్లాటూన్ల తోపాటు ట్రాఫిక్ పోలీసులను నియమించటం జరుగుతుందని ఎస్డీపీఓ పర్యవేక్షణలో వారుంటారని ఎస్పీ రోహిత్ వర్మ వెల్లడించారు. రాయగడలో పెట్రోల్, డీజిల్ కొరత రాయగడ: పట్టణంలో గల ఫిల్లింగ్ స్టేషన్లలో ఇంధనం దొరక్కపోవడంతో వినియోగదారులు నిరాశతో వెనుదిరిగారు. పెట్రెల్, డీజిల్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడే దిశకు చేరుకున్నాయి. జిల్లాలో దాదాపు 57 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా ఇందులో దాదాపు 20 ఫిలింగ్ స్టేషన్లలో డీజిల్, పెట్రోల్ కొరత కనిపిస్తుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డీజిల్ కొరత కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అనేక లారీలు, భారీ వాహనాలు జిల్లాలోని గుణుపూర్ సమితిలోని జగన్నాథపూర్, రామనగుడ, కేదార్‌పూర్ తదితర ప్రాంతాల్లో నిలిచిపొయాయి. మరోవైపు తెరిచి ఉన్న పెట్రోల్ బంకులలో వినియోగదారుల రద్దీ కనిపిస్తుంది. పెట్రొల్, డీజిల్ లభించడం లేదన్న వదంతులు వస్తుండటందతో కొంత మంది ఇంధనాన్ని భారీ డ్రమ్ములు తదితరమైన వాటిలొ నింపి స్టోరేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో రాయగడ పట్టణంలో ఎలాంటి ఇంధన కొరత లేదని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాలపై చర్చ భువనేశ్వర్: ప్రచార కార్యక్రమాలుబలోపేతం చేసి ప్రజలకు తాజా సమాచారం సకాలంలో చేరదీయాలని రాష్ట్ర గవర్నర్కోరారు. లోక్ భవన్లో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటితో సంభాషించిన సందర్భంగా ఈ విషయం ప్రతిపాదించారు. -
శ్రీ మందిరంలో అశోకాష్టమి క్రతువు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం పవిత్రమైన అశోకాష్టమి క్రతువు వైభవంగా నిర్వహించారు. ప్రాతః ధూపం పూర్తయిన తర్వాత శ్రీ మందిరం ఉత్తర ద్వారం వద్ద కొలువై ఉన్న ఈశానేశ్వర మహాదేవునికి శ్రీ లోకనాథ ఆలయానికి పల్లకీ ఊరేగింపుతో అత్యంత వైభవంగా తీసుకువెళ్లారు. ఆ ప్రాంగణంలో వివిధ క్రతువులు నిర్వహించి శ్రీ జగన్నాథ వల్లభ మఠానికి తరలించారు. ఈ ప్రాంగణంలో పూజాదులు, నైవేద్య సమర్పణ ముగియడంతో మహా దేవుని మారు యాత్ర (బహుడా) కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 గంటలు దర్శనం నిలిపివేత పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా పూరీ ఆలయంలో శ్రీరామ జన్మ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్ర వారం భక్తులకు రత్న వేదికపై మూల విరాటుల సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తారు. మధ్యాహ్నం ధూప సమర్పణ తర్వాత సర్వ దర్శనానికి అనుమతించరు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం మూసివేయబడుతుందని దేవస్థానం అధికార వర్గాలు తెలిపాయి. -
వడగళ్లు.. రైతుకు కడగండ్లు
సారవకోట: మండలంలో గురువారం కురిసిన వడగళ్ల వానతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత మూడు రోజుల నుంచి రబీలో వరి కోతలు చేపట్టి ధాన్యం జాతీయ రహదారి 326ఎపై ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే వర్షం కురవడంతో రైతులు వాటిని చక్కబెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రైస్ మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం బస్తాల పై టార్పాలిన్లు కప్పి ధాన్యం బస్తాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సుమారు అరగంటకు పైగా వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో కొన్ని దగ్గర ధాన్యం తడిసి పోయాయి. హిరమండలం: హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో గురువారం వడగళ్ల వాన ముంచెత్తింది. మధ్యాహ్నం వరకూ ఎండ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై వడగళ్లు పడడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. జీడి మామిడి పూత దశలో నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు కాసేపు బెంబేలెత్తిపోయారు. రైతులకు తీవ్ర నష్టం బూర్జ: మండలంలో గురువారం సాయంత్రం పడిన వడగళ్ల వర్షంతో పండ్ల తోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇటీవల తేనె మంచు ప్రభావంతో జీడిమామిడితోట లు పూర్తిగా పువ్వు, పింజ దశల్లో మాడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పడిన ఆకాల వర్షంతో మామిడి, జీడి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. -
ఆరోగ్య కార్యకర్తలకు అవార్డులు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని ఏడు సమితి కేంద్రాల్లో ఉన్న పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ కాయకల్ప్ అవార్డులను కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో గురువారం ప్రదానం చేశారు. జాతీయ నాణ్యత హామీ కమిటీ మరియు ధ్రువీకరణ పురస్కార సన్మాన వేడుక పురస్కరించుకొని అవార్డులను అందించారు. మొత్తం 67 ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న 33 మందికి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యవైద్యాధికారి, పీహెచ్‌వో డాక్టర్ సంతును పాఢి, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ మహాపాత్రో, అదనపు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డా.ఎం.ఎస్.మున్నీర్, డీపీఎం సునీతా మహాపాత్రో, ఏఎంక్యూఏ డాక్టర్ ప్రభుకుమార్ జెన్నా, పర్యవేక్షకులు ప్రాణ్ రంజన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల లొంగుబాటుపై హర్షం
కొరాపుట్: కొందమాల్‌లో మావోయిస్టుల లొంగుబాటుపై మాజీ కానిస్టేబుల్, బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హర్షం వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లిలో మావోయిస్టుల సమస్యపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత పాలకులు మావోయిస్ట సమస్యపై ఏనాడు దృష్టి సారించలేదన్నారు. మావోయిస్టులు పోలీసులపై దాడి చేసేవారన్నారు. తిరిగి పోలీసులు కూడా మావోయిస్టులపై దాడి చేయడానికి వెళ్తే అడ్డుకొనేవారని వాపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మావోయిస్టుల సమస్య 2026 మార్చి ఆఖరు అంతం చేస్తామన్నారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఒడిశాలోని 30 జిల్లాలకు గాను కేవలం కొందమాల్ జిల్లాలోనే మావోయిస్టుల సమస్య ఉందన్నారు. ప్రస్తుతం కొందమాల్‌లో రూ.55 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కోసా సోడి అలియాస్ సుక్రు తన అనుచరులతో లొంగిపోవడంలో పోలీసుల కృషిని అభినందించారు. మావోయిస్టుల పునరావసంలో ఒడిశా ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందనన్నారు. వారికి ఉపాధి, ఇల్లు, నెలవారీ పింఛన్, రివార్డు (నగదు), తదితర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అందువలన రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్లు అధికంగా ఉన్నాయన్నారు. కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు సభ్యులు, మరో 27 మంది సీనియర్ మావోయిస్టులు లొంగిపోయారన్నారు. అదేవిధంగా మావోయిస్టుల ప్రాంతంలో పని చేసే పోలీసులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. డీవీఎఫ్, ఎస్ఓజీ పోలీసులకు రూ.20 వేలు అధికంగా వేతనం ఇస్తున్నామన్నారు. మల్కన్‌గిరి కలెక్టర్ కిడ్నాప్‌పై అనుమానాలు.. గతంలో మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినిల్ కృష్టని మావోయిస్టులు అపహరించుకుపోయిన విషయం అసెంబ్లీలో లేవనెత్తారు. ఆ రోజు కలెక్టర్ కిడ్నాప్ విషయం అందరూ టీవీలలో చుశామన్నారు. కానీ మరునాడు మావోయిస్టుల చెరలో ఉన్న కలెక్టర్ ఇసీ్త్ర చేసిన దుస్తులతో ఫొటోల్లో కనిపించారన్నారు. కిడ్నాప్ అయిన వ్యక్తికి దట్టమైన అడవిలో ఇసీ్త్ర చేసిన దుస్తులు ఎలా లభించాయన్నారు. అంతేకాక పూర్తి షేవింగ్తో కనిపించారన్నారు. నాడు బీజేడీ పాలకులకు మావోయిస్టులకు ఉన్న సంబంధాలను ఈ ఘటన రుజువు చేస్తుందన్నారు. నాడు రాష్టంలో కందిపప్పు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ నాటకం ఆడారన్నారు. -
అర్ధంతరంగా ఆగిన రుకుణ రథ యాత్ర
భువనేశ్వర్: పవిత్ర అశోకాష్టమి సందర్భంగా గురువారం ఏకామ్ర క్షేత్రవాసుడు లింగరాజ స్వామి రుకుణ రథ యాత్రకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం ప్రభావంతో కాలవైశాఖి తాండవంతో ఈ భారీ రథ యాత్ర అర్ధంతరంగా నిలిచి పోయింది. కాల వైశాఖి తాండవంతో కురిసిన భారీ వర్షం మధ్య లింగ రాజు మహా ప్రభువు రుకుణ రథం ముందుకు సాగలేక పోయింది. గమ్యం చేరడంలో అంతరాయం తలెత్తింది. స్థానిక బొఢెయ్ బొంకొ కూడలి సమీపంలో లింగరాజ స్వామి రథం ఆగిపోయింది. కాల వైశాఖి ప్రభావంతో శక్తివంతమైన గాలులు, భారీ వర్షం పతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కొంత వరకు సాగిన యాత్రలో భక్తులు గొప్ప ఉత్సాహం, భక్తిశ్రద్ధలతో పవిత్ర రథాన్ని లాగడం కొనసాగించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 2.30 గంటల ప్రాంతంలో లాగడం తిరిగి ప్రారంభమవుతుంది. సేవాయత్కు గాయాలు యాత్ర కోసం రుకుణ రథం సిద్ధం చేస్తుండగా ప్రమాదవశాతు సేవాయత్ రథం పైనుంచి జారడంతో గాయపడ్డాడు. తక్షణమే స్థానిక క్యాపిటలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సేవాయత్ కాలు విరగడంతో ముఖం, తలకు మోస్తరు గాయాలు అయినట్లు ప్రకటించి చికిత్స కొనసాగిస్తున్నారు. -
4.06 టన్నుల గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా పీఎస్ పరిధి కసారిగూడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున సబ్ డివిజనల్ పోలీసుఅధికారి రాకేష్ సాహు నేతృత్వంలో అడవ, మోహన పోలీసులు దాడులు చేసి భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. కసారిగూడ గ్రామంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 202 ప్లాస్టిక్ బ్యాగుల్లో గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. మోహన తహసీల్దార్ సమక్షంలో గంజాయి బస్తాలు కాటా వేయగా పట్టుబడిన గంజాయి 4060 కిలోలు (4.06 టన్నులు)గా నిర్ధారించినట్టు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా విలేకరులకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను మోహన కోర్టులో హాజరుపరిచారు. జిల్లా కేంద్రాస్పత్రి సమస్యలను పరిష్కరించండి జయపురం: జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. సమాజ సేవకుడు బి.హరి రావు నేతృత్వంలో గ్రామ ప్రజలు జయపురం సబ్‌కలెక్టర్, ఐటీడీఏ పీఓ తృప్తి బొరాయికు గురువారం మెమోరాండం సమర్పించారు. ఎంతో కాలం తర్వాత జయపురంలో జిల్లా కేంద్రాస్పత్రి ఏర్పాటు చేశారని, అందువల్ల సబ్ డివిజన్లో గల ప్రజలకు సముచిత వైద్య సేవలు లభించగలవని ఆశించామని, అయితే నేడు హాస్పిటల్ స్పెషలిస్టు డాక్టర్లు లేరని ఆరోపించారు. జూనియర్ డాక్టర్లతో హాస్పిటల్ నడుపుతున్నారని వెల్లడించారు. సీరియస్, ప్రమాదాల్లో క్షతగాత్రులు సరైన చికిత్స పొందలేకపోతున్నారని, వారిని కొరాపుట్‌లో గల సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలిస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచి వారిని బరంపురం, భువనేశ్వర్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నామని ఆరోపించారు. మరికొంత మంది రోగులు మెరుగైన చికిత్స కోసం వైజాగ్ వెళ్తున్నారని తెలిపారు. ఇక్కడ నిపుణులను నియమించాలని కోరారు. -
శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.91 లక్షలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వ రుని హుండీ ఆదాయం రూ. 1,91,175గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు గురువారం తెలిపారు. ఆలయ అధికారులు, సత్యసాయి సేవాసమితి సభ్యులు, అర్చకుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్య క్రమంలో రావివలస ఎండల మల్లికార్జునస్వా మి, దేవాలయ ఆలయ ఈఓ జి.గురునాథరా వు, పాలక మండలి చైర్మన్ శివప్రసాద్ పాడి భక్తులు పాల్గొన్నారు. చీటింగ్ కేసులో నలుగురికి జైలుశిక్ష పలాస: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన కేసులో విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన వాండ్రాశి సన్యాసిరావు, ఎన్ఏడీ కొత్త రోడ్డుకు చెందిన రావాడ నాగేశ్వరరావు, పాతగాజువాకకు చెందిన కలుపూరి ఆదినారాయణ, పెదగంట్యాడకు చెందిన ముంజేటి శ్రీనులకు ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.4500లు జరిమానా విధిస్తూ పలాస జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి గురువారం తీర్పు చెప్పారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2014 జూన్ 6న పలాస ఉదయపురం గ్రామానికి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసి రూ.6లక్షలు తీసుకున్నట్టు, పలాస పరిసర గ్రామాల నుంచి మరో 11 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు చొప్పున తీసుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పి.రమేష్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నలుగురికీ జైలు శిక్ష, జరిమాన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని సూర్యమహల్ జంక్షన్ సమీపంలో పొట్నూరు సంతోష్‌కుమార్‌కు చెందిన ఎస్వీఎస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్కు సర్క్యూట్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే రెండు ఫ్రిడ్జ్‌లు, ఫర్నిచర్ కాలిపోయాయి. సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి శ్రీనుబాబు తెలిపారు. నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడు కె.శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు.ఈ నెల 27, 28, 29 తేదీల్లో ‘శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు’ పేరిట జరిగే పోటీల్లో ఆఫీస్ సబోర్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సహాయ సహకారాలతో కార్యకర్మం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, ఉద్యోగుల్లో ఐక్యత పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్ అయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్ఎస్ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి సంప్రదించవచ్చునన్నారు. సంబంధిత పాఠశాలలు వెబ్సైట్లో చూడవచ్చునని, ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీన లోగా ఎంపికై న పాఠశాలల్లో జాయిన్ అవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 18004258599 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
ఘివురిగుడలో ఘటజాతర
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి అసన గ్రామ పంచాయతీ ఘివురిగుడలో అనాదిగా వస్తున్న సంప్రదాయ ఘట జాతర బుధవారం ముగిసింది. ఈ ఘట జాతరలో జయపురం మహారాజు విశ్వంభర దేవ్ చంద్ర చూడ్ పాల్గొన్నారు. ఆయనకు తన స్వతంత్ర సేవకులు మహారాజుల సంప్రదాయం ప్రకారం చథ్రం(గొడుగు) పట్టి వింజామరలతో విసురుతూ స్వాగతం పలికారు. రాజును గ్రామ దేవత పీఠం నుంచి ఒక స్వతంత్ర సింహాసనంపై భుజాలపై మోసుకుంటూ బొండాఘాట్ వరకు తోడ్కొని వెళ్లారు. అక్కడ దేవికి పూజలు నిర్వహించి ఆయనను గ్రామం లోనికి తీసుకు వచ్చారు. అక్కడ గ్రామ ప్రజలంతా చేరి రాజ దర్శనం చేసుకున్నారు. రాజుల కాలంలో ఘట జాతర ఉత్సవాల్లో గ్రామ పెద్దలు జయపురం వెళ్లి మహారాజుల ఆశీశులు పొంది తరువాత జాతర జరిపేవారని, అయితే నేడు రాజే స్వయంగా రావటం తమకెంతో ఆనందంగా ఉందని ప్రజలు వెల్లడించారు. ఘివురిగుడ ఘట జాతరకు రాజు తో పాటు రాజ కుటుంబ పూజారి పురుషోత్తమ నందో,రాజు పెర్సనల్ కార్యదర్శి కిశాన్ రథోడ్, రాజు కుటుంబ సేవకులు నరశింగ నాయుడు, భాగ్ధేరి ముఠా ప్రతినిధి తులా చంధ్ర సాహు ఘఠజాత్ర పూజారి సీతారాం కటియ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో అమ్మవారి ఘఠజాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర అవతరణ వేడుకలు, మహారాజా కృష్ణచంద్ర గజపతి జయంతి సందర్భంగా స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను గురువారం జిల్లా సాంస్కృతిక, భాష శాఖ నిర్వహించింది. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి ఉన్నత, కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఒడిశా సాహిత్య అకాడమీ మాజీ సభ్యుడు బిచిత్రానంద బెబర్తా, శులతా శుభదర్శిని, రమాశంకర్ గంతాయత్, చిత్రా రోథో, సుమిత్రా కుమారీ జెన్నా, పద్మిణి కుమారి పండా, సంజుతా నోందో, సురేంద్ర కుమార్ పాత్రో, అనితా దాస్ ప్రముఖ్యలు వ్యవహరించారు. ఏప్రిల్ ఒకటి ఒడిశా దివాస్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆర్.శెట్టి కాన్పరెన్స్ హాల్లో జరుగనున్న వేడుకల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని డి.పి.ఆర్.ఓ తుషార్ సేనాపతి తెలిపారు. -
జనాల్లోకి కమ్యూనిస్టు నాయకులు
జయపురం: కొరాపుట్ జిల్లా గ్రామాల్లో నెలకున్న సమస్యలను తెలుసుకోవానికి జనాల్లోకి వెళ్లాలని సీపీఐ నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలసి సమస్యలపై చర్చించాలని, మే నెలలో గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ పరిషత్ సమావేశం నిర్ణయించింది. స్థానిక కార్మిక భవన్లో బుధవారం పార్టీ నేత కామ్రెడ్ కుమార్ జాని అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ మూడు నెలల పార్టీ కార్యక్రమాల నివేదికను సభికులకు వివరించారు. అనంతరం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు కామ్రెడ్ ప్రమోద్ కుమార్ మహంతి ఇటీవల జరిగిన రాష్ట్ర పార్టీ పరిషత్ తీసుకున్న నిర్ణయాలను సభికులకు వివరించారు. ప్రతి ఏడాదిలాగనే ఈ సంవత్సరం కూడా సభ్యత్వ సేకరణ జాబితాను వెంటనే రాష్ట్ర కమిటీకి సమర్పించాలని, ఏప్రిల్ ఐదో తేదీన జరగనున్న అఖిల భారత దళిత హక్కుల రాష్ట్రస్థాయి సమావేశంలో కొరాపుట్ జిల్లా నుంచి ప్రతినిధులను పంపే విషయాన్ని వివరించారు. పార్టీ నాయకులు ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సహాయ, సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నవీ లేనివీ తెలుసుకొని జాబితాను తయారు చేయాలని పార్టీ పిలుపునిచ్చిందని వెల్లడించారు. పార్టీ నేతలు గ్రామీణ ప్రజల నుంచి సేకరించిన సమస్యలపై మే నెలలో గ్రామ పంచాయతీ స్థాయిలలోఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సమావేశం ప్రారంభంలో వందేళ్ల శతాయుస్మాన్ కమ్యూనిస్టు పార్టీ నేత నల్లకన్ను సోమనాథ్ పాత్రో, అలాగే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ దాడులలో ఇరాన్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అగ్రనేత అయితొల్లా ఆలీ ఖామెనెయి, మరణించిన వారికి , కటక్ భంజీ మెడికల్ కళాశాల ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత దాస్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టు పార్టీ పాత్రపై వివరించారు. సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి కామ్రెడ్ ఝుధిస్టర్ రౌళో, సహాయ కార్యదర్శులు బురుదా బొడనాయిక్, కురమ్నాత్ భొత్రో, పూర్ణ చంద్రసువార్, నంద హరిజన్, రూపధర్ పూజారి ఉన్నారు. -
అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంని దండకారణ్య క్రీడా మైదానం అండన్–17 గ్రీష్మకాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రతి సమితి నుంచి క్రీడాకారులను పిలిచి ఎంపిక పోటీలు నిర్వహించారు. వారిలో మల్కన్‌గిరి, కలిమెల, పోడియా నుంచి ఎక్కువ మంది ప్రతిభ కనబర్చారు. వారిలో కొంతమందిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఐదు జట్లుగా విభజించి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. టోర్నమెంట్ 11 రోజులు జరుగుతాయి. ఏప్రిల్ ఐదో తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి ఫారుక్, కార్యదర్శి హృదానంద సాహు, భారత్ క్రికెట్ మాజీ మేనేజర్ సత్వీర్ సింగ్, కోచ్ విశాల్ మాలాకర్ పాల్గొన్నారు. -
షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ నోటీఫైడ్ ఏరియ కౌన్సిల్ (ఎన్ఏసీ) పరిధి హాట్పొదర్లో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను కొట్‌పాడ్ శాసనసభు్యు రూపు భొత్ర బుధవారం ప్రారంభించారు. రూ. 30 లక్షల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా రూపు భొత్ర మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటువంటి స్టాల్స్ నిర్మించి నిరుద్య్గో యువతకు సమకూర్చుతే వ్యాపారాలు చేసుకొని స్వయం ఉపాధి పొందగలరన్నారు. కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కొట్‌పాడ్ ఎన్ఏసీ కార్యనిర్వాహక అధికారి కమలేసు మహంతి ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. కొట్‌పాడ్ ఎన్ఏసీ సర్వాంగ ఉన్నతికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కొట్‌పాడ్ ఎన్ఏసీని మున్సిపాలిటీగా ప్రకటించాలని తాను ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, వైస్‌చైర్మన్ ఎం.సంతోషీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్ శేఖర్
శ్రీకాకుళం కల్చరల్: ప్రత్యక్షదైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని బుధవారం ఉదయం హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కూర్మనాథుని సన్నిధిలో... గార: విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీసీడీ శేఖర్ బుధవారం దర్శించుకున్నారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర మహాత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు తెలియజేశారు. ఆయనతో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ఆలయ ఈవో టి.వాసుదేవరావు, తహసీల్దార్ ఎం.చక్రవర్తి తదితరులు ఉన్నారు. -
ఈదురుగాలులకు దెబ్బతిన్న రేకిల్లు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 90 గ్రామంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు సురేంద్ర హరిజన్ ఇంటి పైకప్పు (రేకులు) పూర్తిగా ఎగిరిపోయాయి. ఆ సమయంలో అందరూ ఇంటిలోనే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సురేంద్రకు కొద్ది నెలల క్రితం జరగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. శస్త్రచికిత్స చేయడంతో సరిగా నడవలేసి స్థితి. కూలి పనులు వెళ్లలేక ఇట్టి వద్దే ఉంటున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ఇల్లును కూడా కోల్పాయ్యారు. వీరికి ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రోడ్డున పడిన టమాటా
● పెరిగిన దిగుబడి.. తగ్గిన అమ్మకాలు ● చెల్లని టమాటాను సాయంత్రం పూట పారబోస్తున్న వ్యాపారులు శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో పలుచోట్ల టమాటాలను వ్యాపారులు రోడ్డుపైనే పారబోశారు. కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పతనమైంది. హోల్‌సేల్‌లో 25 కిలోల ట్రే రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. రిటైల్ మూడు కేజీలు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. రోజురోజుకు దిగుబడి పెరుగుతుండగా, అమ్మకాలు తగ్గుతుండడంతో వ్యాపారులు చెల్లని టమాటాలను సాయంత్రంపూట రోడ్లపై పడేసి వెళుతుండగా వాటిని పశువులు తింటున్నాయి. ఐదు నెలల క్రితం 25 కేజీల టమాటా ట్రే రూ.1600 వరకు ధర పలికింది. ఆ సీజన్లో జిల్లాలో పంట ఉండ దు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతా ల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ జిల్లాలోనే పంట ఉండడంతో ఇవన్నీ అమ్మకాలు కాక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జగన్నాథుని ఆభరణాల జాబితా తయారీ
భువనేశ్వర్: దీర్ఘ కాలం తర్వాత పూరీ శ్రీజగన్నాథుని వజ్ర, రత్న, వైడూర్య, బంగారు ఆభరణాల లెక్కింపు అనుబంధ జాబితా తయారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ముందస్తు నిర్ధారిత సుముహూర్త ఘడియల ప్రకారం ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు. 48 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. స్వామి రత్న భాండాగారంలోని ఆభరణాల జాబితా తయారీ పురస్కరించుకుని శ్రీమందిరం లోపల ప్రత్యేక నిపుణుల బృందం ఆలయం లోనికి ప్రవేశించింది. జాబితా తయారీ కోసం శ్రీమందిరం పాలక మండలి ప్రతిపాదించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఓపీ) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దీని ప్రకారం ఈ ప్రక్రియ ఆరంభించారు. నిరంతరాయంగా దర్శనం.. అమూల్యమైన రత్న సంపద లెక్కింపు, జాబితా రూపకల్పన సందర్భంగా సాధారణ భక్తులకు నిరంతరాయ సర్వదర్శనం సౌకర్యానికి ప్రాధాన్యత కల్పించారు. మరోవైపు రత్న వేదికపై కొలువుదీరిన మూల విరాట్లు, ఇతర మూర్తుల దైనందిన నిత్య సేవాదులు, పూజల్లో ఎటువంటి అంతరాయం చోటు చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించారు. జాబితా తయారీ ఇలా.... రత్న భాండాగారంలోని ఆభరణాల జాబితా అనంతరం ఆభరణాలను 1978 నాటి జాబితాతో సరిపోల్చి చూస్తారు. సరిపోల్చిన వివరాలతో వాటిని తూకం వేస్తారు. ఆభరణాలను గుర్తించడానికి ఇద్దరు రత్న శాస్త్రవేత్తలను నియమించారు. డిజిటల్ ఫొటోగ్రఫీ ఆభరణాల జాబితాకు ప్రత్యేక హంగుగా జోడిస్తారు. ఆభరణాలు గుర్తించి, లెక్కించి, తూకం వేసిన తర్వాత వస్తువులను 2, 3 పొరలలో చుట్టి ఒక పెట్టెలో భద్రంగా ఉంచుతారు. ఈ ప్రక్రియలో పసుపు, తెలుపు, ఎరుపు రంగు వస్త్రాల్ని వినియోగిస్తారు. 6 పెట్టెల్లో అమూల్య ఆభరణాలను పదిలపరుస్తారు. బంగారు ఆభరణాలను పసుపు రంగు వస్త్రంపై ఉంచి వరుస క్రమంలో పెట్టెలో పేర్చుతారు. వెండి ఆభరణాలను తెల్ల వస్త్రం చుట్టి భద్రపరుస్తారు. ఇతర ఆభరణాలను భద్రపరిచేందుకు ఎరుపు రంగు వస్త్రం వినియోగిస్తారు. ఈ లెక్కింపులో దేవాలయ ఆభరణాల ప్రముఖులు, ప్రభుత్వ బ్యాంకు ఆభరణాల నిపుణులు, రత్న శాస్త్రవేత్తలు, భారత రిజర్వు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించడంలో సేవకులు, అధికారులు , భక్తులు ఇలా అన్ని వర్గాల సహకారాన్ని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టర్ అరవింద్ కుమార్ పాడీ కోరారు. భక్తుల ప్రవేశం యథాతథం.. రత్న భాండాగారం లెక్కింపు జరుగుతున్నప్పటికీ దేవుళ్ల పూజాదికాలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ కార్యకలాపాలతో ముడిపడిన అధీకృత సేవకులకు జగమోహన్, గర్భ గృహంలోనికి ప్రవేశించేందుకు అనుమతించారు. భద్రతా కారణాల దృష్ట్యా లోపలి గడప నుంచి భక్తులకు సర్వ దర్శనం నివారించి, వెలుపలి వాకిలి నుంచి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనాన్ని పరిమితం చేశారు. -
ట్రాఫిక్ నియమాలపై అవగాహన
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండటం వంటి ట్రాఫిక్ నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–3 పీవో డా.ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈనెల 29వ తేదీ వరకు శిబిరం కొనసాగనుంది. ఆర్థిక సాయం అందజేత శ్రీకాకుళం: జిల్లాలోని పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగులు ఇటీవల మృతి చెందిన డీపీవో కార్యాలయ ఉద్యోగి కిషోర్ కుమార్ కుటుంబానికి తమ వంతు సాయం అందించారు. వీరంతా రూ.1,77,000ల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు కిల్లారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడులు పెరిగాయి గార: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం గారలో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రికి చెందిన టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు దళిత మహిళపై హేయమైన మాటలు ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా దళితులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శాలిహుండంలో దళితులు 15 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వం పునరాలోచించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హుండీ ఆదాయం లెక్కింపు గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయ హుండీలను బుధవారం లెక్కించగా రూ.19,76,584లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో టి.వాసుదేవరావు తెలిపారు. ఆలయంలోని హుండీలతో పాటు సమీప పాతాళ సిద్ధేశ్వేర ఆలయ హుండీలను లెక్కించారు. 98 రోజులకు ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి టి.గురునాథం తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని నైరా, బట్టేరు గ్రామాల్లో మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దంత, గుండె, పల్మనరీ, ఈసీజీ, గైనిక్ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.జి.జోగినాయుడు, సర్పంచ్ అరవల రామ్‌ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. 29న చెస్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–9 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఈనెల 29వ తేదీన జరగనున్నాయని చెస్ ఇన్ స్కూల్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం బలగ నుంచి రాగోలుకు వచ్చే కొత్తరోడ్ జంక్షన్ సమీపంలోని కశ్యప్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచినవారు త్వరలో జరగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 2017 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఈనెల 28వ తేదీలోగా క్రీడాకారులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99125 59735 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఆలయ ప్రతిష్ట రణస్థలం: మండలంలోని కోష్ట పంచాయతీ పరిధి పైడిపేట గ్రామంలో రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
● బంద్ ప్రశాంతం
మల్కన్‌గిరి: జిల్లాలో అన్ని మండీలలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు జరగకపోవడాన్ని నిరసిస్తూ, గ్యాస్, పెట్రోల్ సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మల్కన్‌గిరి జిల్లా కాంగ్రీస్ కమిటీ బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కలిమెల సమితిలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు గోవింద పాత్రో, కలిమెల సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మిసీ్త్ర నాయకత్వంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు మాలా మాడీ, ల్యాంప్ అధ్యక్షుడు బుద్రా కబాసి తదితరులు జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని దిగ్బంధించారు. పలు దుకాణాలు మూసివేయించారు. సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి నిరసనకారుల వద్దకు వచ్చి ఈ నెల 30లోగా మండీలో ధాన్యం కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చారు. -
ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
జయపురం: నేటి బాలల నవ్వులే బావి భారత రత్నాలని పలువురు వక్తలు అన్నారు. స్థానిక పాయిక సాహిలో ఉన్న సరస్వతీ బాల మందిర ప్రాంగణంలో ఆ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు హరిహర కరసుధా పట్నాయక్ ముఖ్య అతిథిగా, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విభాగ అధికారి చందన కుమార్ నాయక్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. నేటి చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్య అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. సిఆర్సిసి రుద్ర ప్రసన్న పాణిగ్రహి, రామేశ్వర పండా, విజయలక్ష్మీ స్వైన్ ప్రసంగించారు. విజ్ఞాన ప్రదర్శనలు, మహానుబావుల చిత్రపటాలు, వివిధ రకాల పువ్వులు, ఔషధ మొక్కలు, ఆహార పదార్థాలు, ఆయుధాలు, వివిధ రకాల ధాన్యాలు, కొలతల పరికరాలు, హస్తకళల పరికరాలను ప్రదర్శించారు. బాలబాలికలకు పాటలు, నృత్యం, కథలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు, జయపురం ప్రముఖులు ఎం.డి షరీఫ్, పద్మ చరణ్, పద్మిణీ పాడీ, సుస్మితా మహంతి, ఉదయ శంకర జానీ, గోపాల్ సామంతరాయ్, రామనాథ్ త్రిపాఠీ, కిశోర్ త్రిపాఠీ, రాధామోహన్ పండా, ధిరెన్ మోహన్ పట్నాయక్, సుధాకర పట్నాయక్, పాఠశాల కార్యదర్శి అనూప్ కుమార్ సామంతరాయ్, కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, పాఠశాల డైరెక్టర్ రితాలీ సాహు పాల్గొన్నారు. -
కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలు
రాయగడ: సదరు సమితి తొలొగుమ్మ ఘాటీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి అదుపుతప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. సమాచారం తెలుసుకున్న కుంభొకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం .. కొరాపుట్ జిల్లా జయపురం నుంచి సుమన్ సస్మాల్, మీనతీ సాహు, సునీతసాహు, అలిస్కా సాహులు అస్కా వెళ్లేందుకు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో తొలొగుమ్మ ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక సైకిల్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమన్ సస్మాల్, మీనతి సాహులకు తీవ్రగాయాలయ్యాయి. సునీత సాహు, అలిస్కా సాహులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. బోల్తా పడిన కారులో ఇరుక్కుపోయిన సుమన్, మీనతీసాహులను బయటకు తీయడానికి క్రేన్ సహాయం అవసరమయ్యింది. మీనతి కుడి చేతికి చెందిన రెండువేలు తెగిపొగా సుమన్‌కు తలపై బలమైన గాయాలయ్యాయి. అస్కా వెళ్లేందుకు జయపురం నుంచిబయలు దేరినవీరు రాయగడ జిల్లాలో ప్రమాదానికి గురకావడంతో స్థానికంగా వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
ప్రతిపక్షాల నిరసన
భువనేశ్వర్: శాసనసభ వద్ద బుధవారం ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై విపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెసు సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం మారుమోగింది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు నల్లని దుస్తులు ధరించి నిరసన ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన, తీవ్ర నినాదాలతో సభాకార్యకలాపాలు ప్రభావితం అయ్యాయి. విపక్ష సభ్యులు నల్ల టీ షర్టులు ధరించి సభలోకి ప్రవేశించారు. కటక్ ఎస్‌ిసీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు వినూత్న రీతిలో చేపట్టిన నిరసన అధికార పక్షానికి ఇబ్బంది కలిగించింది. బలహీన ముఖ్యమంత్రి – బలమైన ఆరోగ్య శాఖ మంత్రి నినాదంతో రాసి ఉన్న టీ షర్టులు ధరించి ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకు నల్ల టీ షర్టులు ధరించి నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే బ్యోమకేష్ రాయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి ఆరోగ్య శాఖ మంత్రి అంటే భయమని ఎమ్మెల్యే రాజన్ ఎక్కా ఎద్దేవా చేశారు. 13 మంది ప్రాణాలు బలిగొన్న కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్రి ప్రమాదం సంఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
సభలో శ్వేత పత్రం సమర్పణ
భువనేశ్వర్: రాష్ట్ర హోం శాఖ బుధవారం శాసన సభలో శ్వేత పత్రం ప్రవేశపెట్టింది. 2025లో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిపై ఈ శ్వేతపత్రాన్ని ప్రచురించారు. 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. 2025లో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిని ఈ శ్వేత పత్రం ప్రతిబింబించింది. 2025లో 2,29,881 నేరాలు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 1,55,223 కేసులు క్రిమినల్ అభియోగాల కింద దాఖలయ్యాయి. వీటిలో 2,994 అత్యాచార కేసులు ఉన్నాయి. నమోదైన 1,304 హత్య కేసులలో 1,218 కేసులు రుజువయ్యాయి. ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపాటు.. సభలో ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతల వ్యవస్థని బట్టబయలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ప్రభుత్వం వెల్లడించిన శ్వేత పత్రం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నేరాలు పెరిగాయని స్పష్టం అవుతుందని ఆరోపించారు. నేరాలు పెరగడంతో నిరుద్యోగం పెరిగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చట్టం అమలు, కార్యాచరణ నిర్వీర్యం అయిందని కాంగ్రెసు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైభవంగా పాయికా మహోత్సవ్–2026
భువనేశ్వర్: ఒడిశా నదుల ఆధ్యాత్మికత ఆధారంగా సాంస్కృతిక చైతన్య కార్యక్రమం పాయికా మహోత్సవం–2026లో హైటెక్ విద్యా సంస్థల ఒడియా భాషా సాహిత్య విభాగం సీనియర్ అధ్యాపకులు, ఒడిస్సీ నృత్యకారులు డాక్టర్ చిత్తరంజన్ సహాని ఆధ్వర్యంలో కటక్ నృత్య శాల కళాకారుల బృందం ఒడిస్సీ నృత్య రూపకం ప్రదర్శించింది. పురాణాలలో వర్ణించబడిన పాయికా నదీ తీరంలో గత 15 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ పాయికా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆహ్వానం మేరకు డాక్టర్ చిత్తరంజన్ సహాని ఆధ్వర్యంలో నృత్య శాల ఒడిస్సీ నృత్యకారులు డాక్టర్ సంగీత సాహు, అభిలిప్స సెఠి, బైష్ణబి సాహు బృందం ప్రదర్శించిన ఆధ్యాత్మిక, భావోద్వేగభరితమైన ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. -
నబరంగ్‌పూర్ ఐఐసీకి డీజీపీ డిస్క్ మెడల్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్ ఐఐసీ సంబిత్కుమార్ బెహరాకు డీజీపీ డిస్క్ మెడల్ లభించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్ర పొలీసు అవతరణ దినోత్సవం సందర్భంగా రాజధానిలో జరిగే కార్యక్రమంలో డీజీపీ ఈ అవార్డును బహూకరిస్తారు. విధి నిర్వహణలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన పోలీసులకు డీజీపి డిస్క్ మెడల్‌ను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా సంబిత్‌ను సహచర పోలీసులు బుధవారం అభినందించారు. బాలుడి కిడ్నాప్‌కు యత్నం! రాయగడ: పన్నెండేళ్ల బాలుడుని కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని దుండగుడు ప్రయత్నించాడని సదరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదయ్యింది. స్థానిక సాయిప్రియనగర్లో నివాసముంటున్న చందన్ విశ్వకర్మ 12 ఏళ్ల కొడుకు ఆయుష్ పనిమీద మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు స్కూటీపై వచ్చి బాలుడితో అడ్రాస్ అడిగే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడు అతని దగ్గర నుంచి చాకచక్యంగా తప్పించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన వారు సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడుతోపాటు అతని తల్లిదండ్రులతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఆధారంగా దుండగుని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సింగిపురంలో హనుమాన్ మందిర ప్రతిష్ట పర్లాకిమిడి: జిల్లాలోని కాశీనగర్ బ్లాక్ సింగిపురం గ్రామంలో బుధవారం హనుమాన్ మందిర ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, బీజేపీ నాయకులు దారపు రాజేష్ కుమార్, సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, సర్పంచ్ తేజ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలుగా హనుమాన్ మందిర నిర్మాణాలు జరుగుతుండగా నేటికి ప్రాణప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. ఐదు రోజులు జరిగే మందిర ప్రతిష్టకు ఎమ్మెల్యే ల్యాడ్ నిధుల నుంచి రూ. 3 లక్షలు, నవీన్ పట్నాయిక్ ప్రభుత్వ హయాంలో రూ. 15 లక్షలు నిధులు అందజేశారు. ప్రతిష్టా మహోత్సవం అనంతరం అన్నప్రసాదాలు భక్తులకు అందజేశారు. పర్లాకిమిడిలో ఈదురుగాలులు పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం సాయంత్రం దట్టమైన మేఘాలతో ఈదురుగాలులు వీచాయి. రామగిరి, రాయఘడలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. నువాగుడలో రూటేజ్ స్మార్ట్ విలేజ్ ప్రారంభం జయపురం : జయపురం సబ్ డివిజన్ కుంద్రా సమితి నువాగుడ గ్రామంలో ఎం.ఎస్.స్వామినాథన్ పరిశోధన కేంద్రం, జయపురం, నాబార్డ్ సంస్థలు సంయుక్తంగా రూటేజ్ స్మార్ట్ విలేజ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపుభొత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూటేజ్ స్మార్ట్ విలేజ్ అనేది కొత్త ఆలోచన అని, దీని ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ జ్ఞానం, నైపుణ్యాభివృద్ధిని ఆన్లైన్ సేవల ద్వారా అందుతుందన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం
పర్లాకిమిడి : కొంతమంది బీజేడీ పార్టీలో ఉన్నామని చెబుతూ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరడం ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదని బిజూ జనతా దళ్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. స్థానిక రాంనగర్లో హైటెక్ ప్లాజాలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, గుసాని జెట్పిటిసి బాలరాజు, మాజీ సర్పంచ్ (గారబంద) నీరోభుయ్యాన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎరగాన రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండేళ్లుగా అన్ని వర్గాలనూ మోసం చేస్తోందన్నారు. రైతుల వద్ద ధాన్యం కొంటామని మోసం చేసిందని, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం లేదని, ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు కొన్ని ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని దుయ్యబట్టారు. అనంతరం గుసాని సమితి బిజేపీ సర్పంచ్ నిరంజన్ కుమార్ శోబోరో బీజేడీలో చేరారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరికొందరు మద్దతుదారులు బీజేడీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, గారబంద బీజేడీ నాయకులు నీరోభుయ్యాన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం బలహీనుడు
● వైద్యశాఖ మంత్రి బలవంతుడు ● కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీ పతి ఎద్దేవా కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత బలహీనుడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీ పతి ఎద్దేవ చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి అత్యంత బలవంతుడని అభివర్ణించారు. ఆయనకు న్యూఢిల్లీలో బలమైన లాభీయింగ్ ఉందన్నారు. అందుకే ఎస్సీబీ మెడికల్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 12 మంత్రి చనిపోయినా మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్నారు. వాస్తవంగా సీఎం చేతులోనే మంత్రుల రాజీనామా వ్యవహారం ఉంటుందన్నారు. కానీ ప్రస్తుత సీఎంకు అ బలం లేదన్నారు. బతకడానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చావుని కొనితెచ్చుకున్నా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నార. గత ప్రభుత్వంలో మంత్రులు తప్పు చేస్తే చర్యలు ఉండేవన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో తప్పులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు కొనసాగించడం ప్రజాస్వామ్య హత్యగా పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లులో బీజేపీ తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి వీలుగా మార్పులు చేస్తున్నారన్నారు. బీజేడీ పార్టీతో తమకు పొత్తు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనదైన పద్ధతిలో పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు. -
పోర్టు బహిరంగ సభ విజయవంతం చేయండి
సంతబొమ్మాళి: నౌపడ మూడు రోడ్లు జంక్షన్ వద్ద ఈ నెల 30న జరిగే మూలపేట పోర్టు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. మంగళవారం నౌపడ మూడురోడ్లు జంక్షన్ వద్ద స్థలం లెవలింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపేట పోర్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. పార్టీ తరఫున ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టు, పరిసర ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పిలక రవికుమార్‌రెడ్డి, చిన్ని జోగారావు యాదవ్, బడ్డ రాజేష్ తదితరులు ఉన్నారు. -
ఉద్యోగులకు శిక్షణ
పర్లాకిమిడి: ప్రభుత్వ కార్యాలయాల్లో ఒడియా భాషలో ప్రత్యుత్తరాలు రాయాలని కోరుతూ రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని అదనపు జిల్లా మాజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానంగా మంగళవారం కలెక్టరేట్ హాల్లో ప్రారంభించారు. ఈ శిబిరంలో జిల్లాలోని ప్రభుత్వ అడ్మిన్‌స్ట్రేటివ్ సిబ్బంది ఒడియా భాషలో ఎలా ప్రత్యుత్తరాలు ఎలా రాయాలో ఒడియా భాషా వ్యవహార ప్రతిష్టాన్ డైరెక్టర్ సిద్ధార్థ శంకర పాడీ వివరించారు. ఈ శిబిరంలో ఒడియా భాష పండితులు, భువనేశ్వర్ డాక్టర్ రబినారాయణ పండా, శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల (ఒడియా విభాగం) డాక్టర్ రమేష్ చంద్ర మల్లిక్, సాహిత్యకారులు పూర్ణచంద్ర ప్రధాన్ పాల్గొని పలు అంశాలను వివరించారు. ఇంగ్లిష్ నుంచి ఒడియా భాషకు తర్జుమా, ఒడియా శబ్ధకోశం, గ్రామర్, తదితర అంశాలను తెలియజేశారు. ఒడియా భాష, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ శిబిరానికి జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
● అధికారులూ.. మీ మాటలన్నీ ‘గ్యాస్’యేనా!
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలో హోటళ్లు, టిఫిన్ షాపులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొందరు కట్టెల పొయ్యిపై నెట్టుకొస్తున్నా ఒకటి రెండు రోజుల తర్వాత ఇక తమ వల్లకాదంటూ చేతులెత్తేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తుండటం పట్ల హోటల్ నిర్వాహకులు మండిపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం మూతపడిన అమ్మా మెస్ తాత్కాలికంగా సెలవు అంటూ బోర్డు -
జనగణనపై శిక్షణ ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియ కౌన్సిల్(ఎన్ఏసీ) కార్యాలయంలో జన గణనపపై మూడు రోజుల శిక్షణ శిబిరం మంగళవారం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శిబిరం నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జనగణన ఇన్చార్జి, కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ కార్యనిర్వాహక అధికారి కమలేశు మహంతి, ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, ఫీల్డ్ ట్రైనర్ దుర్గాప్రసాద్ నాయక్ పర్యవేక్షణలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు స్వాగతం పలికి ప్రతిజ్ఞ చేయించారు. 50 మంది ఉపాధ్యాయులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. వారికి జనాభాను లెక్కించే విధానంపై ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. జిల్లా జనగణన బాధ్యతల పర్యవేక్షకులు కె.గుణవర్ధన్ శిక్షణ ఉద్దేశాన్ని వివరించారు. జనగణన 2027 కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమనిరేషన్, ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్ నిర్వహణ ఉంటుందన్నారు. రెండవ విడత జనగణన కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో ఉంటుందన్నారు. నిబంధల ప్రకారం పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. 2011లో జనాభా లెక్కులు జరిగాయని.. తరువాత 2021లో చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ప్రక్రియ జరగలేదు. -
ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● ముగ్గురు డిగ్రీ విద్యార్థులకు గాయాలు నరసన్నపేట : తామరాపల్లి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు గాయపడ్డారు. కోటబొమ్మాళి వైపు నుంచి విద్యార్థులతో నరసన్నపేట వస్తున్న ఆటోను మార్కెట్ కమిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డిగ్రీ విద్యార్థులు కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురానికి చెందిన రాజాపు సంతోష్, హర్ష, నిమ్మాడకు చెందిన శిమ్మ మాధురిలకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీజల్ కోసం బస్సు రాంగ్రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టిందని ఆటో డ్రైవర్ వీరాస్వామి తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తరలించి గాయపడ్డ విద్యార్థులకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
23 తులాల బంగారం చోరీ
● రూ.లక్షన్నర నగదు మాయం ● అవలింగి గ్రామంలో ఘటన సారవకోట: అవలింగి గ్రామంలో ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కప్ బోర్డులో దాచిన 23 తులాల బంగారం, లక్షన్నర నగదు మాయమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. గౌరినాయుడు తన తల్లి హేమలత, భార్య పావని, ఆరు నెలల పాపతో కలిసి అవలింగిలో సొంతింట్లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండు రోజులు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుని వెళ్తుంటాడు. శనివారం సాయంత్రం తల్లి హేమలత ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా, గౌరినాయుడు భార్య పావని చంటి బిడ్డతో ఇంట్లోనే ఉంది. ఆదివారం పావని తన బిడ్డను చూస్తుండమని పక్కింట్లో ఉండే ఓ బాలుడికి చెప్పి దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి వచ్చేసింది. సోమ వారం అత్తయ్య హేమలత క్యాంపు నుంచి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం బ్యాంకు ఖాతాలో జమైన రూ.4వేలు విత్‌డ్రా చేసి కప్‌బోర్డులో పెట్టేందుకు చూడగా, ఆ కప్‌బోర్డులో ఉండాల్సిన 23 తులాల బంగారు నగలు, ఇంటి పనుల కోసం తెచ్చిన రూ.లక్షన్నర నగదు కనిపించలేదు. దీంతో కుమారుడు గౌరినాయుడుకు సమాచారమివ్వగా ఆయన వచ్చి మంగళవారం సారవకోట పోలీసుల కు సమాచారం అందించారు. క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. -
అదరగొట్టిన సిక్కోలు క్రికెట్ జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కెప్టెన్, స్టార్ ఆటగాడు ఎస్డీఎన్వీ ప్రసాద్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో 388 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విజయనగరం జిల్లాలోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్‌జిల్లాల సీనియర్స్ పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో మంగళవారం తూర్పుగోదావరి జిల్లాతో శ్రీకాకుళం తలపడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తూ.గో. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. జిల్లా జట్టులో సాయియశ్వంత్, ఎన్.హిమకర్ తలా రెండు వికెట్లు, నంబళ్ల సుశాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్యసాధనతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా 48.4 ఓవర్ల 391 పరుగులు సాధించి ఔరా అనిపించింది. ప్రసాద్ 59 బంతుల్లోనే 146 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సిక్కోలును విజయపథంలో నిలిపాడు. బెందాళం సాత్విక్ 70 బంతుల్లో 84 పరుగులు, కె.సాయిసాత్విక్ 71 బంతుల్లో 78 పరుగులతో రాణించారు. జట్టు రికార్డు లక్ష్యసాధన పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. ఎస్డీఎన్వీ ప్రసాద్ బి.సాత్విక్ సాయిసాత్విక్ -
గిరిజనులకు అండగా నిలుద్దాం
● ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, వారికి రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. గిరిజన ఉద్యోగులపై పని ప్రదేశాల్లో వేధింపులు జరిగితే సహించేది లేదన్నారు. ఐటీడీఏ పరిధిలోని పనులన్నింటిలోనూ గిరిజనులకే తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గిరిజనుల ముసుగులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, అక్రమంగా సంఘాలు నడుపుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కలర్ గ్రానైట్ పర్మిషన్ల అంశంపై చర్చిస్తూ గిరిజనులకు ఇబ్బంది కలిగించే వారి లీజులపై పునః సమీక్షించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ఎస్టీలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతేడాది 5 కేసులు నమోదయ్యాయని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై ఐటీడీఏ పీవో స్వప్నల్ పవార్‌తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు చౌదరి లక్ష్మీనారాయణ, గేదెల రమణమూర్తి, బిడ్డిక తేజేశ్వరరావు, సవర కుమారి, సవర తులసి, ధరణి బైరిసింగి, బి.పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్‌కు ఏసీఏ ఆహ్వానం
భువనేశ్వర్: ఈ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఏసీఏ కార్యదర్శి ఆర్.సత్యసాయి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి.ఆనందరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటికి ప్రత్యేకంగా ఆహ్వా నించారు. ఉత్సవాలకు ప్రత్యక్షంగా హాజరవుతా నని ప్రతినిధి బృందానికి గవర్నర్ తెలియజేశారు. ఎంపీ అపరాజిత షడంగి, ఎమ్మెల్యే అనంత నారాయణ జెనాకు ఏసీఏ ఆహ్వాన పత్రికలు అందజేసింది. -
దళితుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ●జెడ్పీలో వినతుల స్వీకరణ శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. దళితులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన దళితుల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఏపీఈపీడీసీఎల్, తదితర శాఖల అధికారులతో ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగిన వెంటనే పోలీసుల స్పందించి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు 9701305417 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ, న్యాయం అందించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఎస్సీ కమిషన్ 59 ఉప కులాలకు రక్షణ కవచం వంటిదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అధికారులను కోరారు. అంతకుముందు సీతారాంకి జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దళిత నాయకులు బోకర నారాయణరావు, కల్లేపల్లి రామ్‌గోపాలరావు,, డి.గణేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.వినాయకం, భూ గర్భ గణులు శాఖ ఉప సంచాలకులు మోహనరావు, డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోధ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డాక్టర్ కంఠ వేణు, ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పి.ఎం.జె.బాబు తదితరులు పాల్గొన్నారు. -
12న దండ జాతర
జయపురం: జయపురం పారాబెడలో దండ జాతర నిర్వహణ కోసం సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఏప్రిల్ 12వ తేదీ దండ జాతర నిర్వహించేందుకు సమావేశం నిర్ణయించింది. పారాబెడ ఝంఖరదెయి మందిరం ప్రాంగణంలో కాళీమాతకు 12వ తేదీ రాత్రి పూజలు జరపాలని సమావేశం నిర్ణయించింది. ఆ రాత్రి పారాబెడ కూడలి ప్రాంతంలో అపేరాతో పటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శివ ప్రసాద్ పందా, దృభచరణ మహంతి, హరి బోరడ, పంచానన నాయక్, శివ ప్రసాద్ తియాడి, జి.సూర్యనారాయణ పాత్రో, జగబందు పండా, ఆర్.బినోద్ రెడ్డి, రాజేంద్ర పాణిగ్రహి, పవిత్ర కుమార్ నాయక్, లక్ష్మీనారాయణ పాడీ, రామప్రసాద్ పాడీ, రాజేంద్ర కుమార్ గౌడ, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో వడ్డింపు
కొత్తూరు: గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులే తోటి విద్యార్థులకు వడ్డించారు. విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించ కూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పాఠశాల వార్డెన్ అప్పన్నమ్మ వద్ద ప్రస్తావించగా కమాటి అనారోగ్యం వల్లత హాజరు కాలేదని, కుక్ ఒక్కరే ఉన్నందున విద్యార్థులు వడ్డించినుట్ల చెప్పారు. యురేకా సైన్స్ ఎక్స్పో ఫలితాలు విడుదల శ్రీకాకుళం: యురేకా సైన్స్ ఎక్స్పో–2026 రాష్ట్ర, జిల్లా స్థాయి ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.లక్ష్మణరావు, తవ్వా సురేష్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి పైడి భీమవరం, ఇప్పిలి హైస్కూళ్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పైడి భీమవరం, కొల్లిపాడు హైస్కూల్ తొలి రెండు స్థానాలు సాధించాయి. మూఢ నమ్మకాలు–శాసీ్త్రయ దృక్పథం అంశంలో జర్జంగి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందారు. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తామని గిరిధర్ తెలిపారు. సమగ్ర చైతన్యయాత్ర ప్రారంభం ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ సాధనకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర చైతన్య, రాష్ట్ర సర్వే యాత్రను చేపట్టినట్లు రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమగ్ర చైతన్య రాష్ట్ర సర్వే యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై.శంకర్రావు, ఉపాధ్యక్షుడు కె.పాల్రాజు, కార్యదర్శి బి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి, కోశాధికారి ఎం.శ్రీధర్, స్వేచ్ఛావతి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు రంగాల శ్రీనివాసరావు, కార్యదర్శి చిలకలపూడి కృష్ణారావు, ధర్మసాహు, దానేష్రెడ్డి, కాయశ్రీను, దుదిష్టి, కె.మణి పాల్గొన్నారు. ఆదిత్యలో సావి–3 సినిమా పోస్టర్ ఆవిష్కరణ టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సావి–3 సినిమా పోస్టర్‌ను డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీలక్ష్మి కృష్ణ ఫిల్మ్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ కృష్ణమాయ, నిర్మాత విజయ్ తదితరులు తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో నాలుగు రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నటులు సామ్రాట్‌రెడ్డి, లిఖిత, డిమాన్ పవన్, టెంపర్ వంశీ, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని ఇన్చార్జి డి.యుగంధర్, శాక్ ఇన్చార్జి సురేష్, ఎస్టేట్ మేనేజర్ పిరియా రమేష్, డీన్ డి.విష్ణుమూర్తి పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని ఓ గ్రామంలో తోటలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామపెద్దల వద్ద పంచాయితీ జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జనార్దనరావు తెలిపారు. యాత్రలో పాల్గొన్న ఎలక్ట్రికల్ యూనియన్ ప్రతినిధులు -
జాబ్‌మేళాకు స్పందన
సోంపేట: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి.చంద్రమౌళి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలోని కె.ఆర్.కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. 13 ప్రెవేటు కంపెనీల ప్రతినిధులు హాజరై 256 మంది నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 105 మందిని వివిద కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి ఎం.వంశీకృష్ణ, కళాశాల కరస్పాండెంట్ కొంచాడ శేషాద్రి, ప్రిన్సిపాల్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కుల బహిష్కరణ
● కుమార్తెకు కులాంతర వివాహం చేయాలని నిర్ణయించడమే కారణం కొరాపుట్: కాలం మారుతున్నప్పటికీ కుల రక్కసి ప్రజలను వీడడం లేదు. అందుకు అగ్ర, వెనుకబడిన కులాలనే తేడాలేదు. ఎంతటి వారైనా దీనికి బలికాకతప్పడం లేదు. ప్రతిపక్ష బీజేడీ పార్టీకి చెందిన నబరంగ్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని కుటుంబాన్ని ఆ సమాజిక వర్గం కుల బహిష్కరణ చేసింది. గిరిజనులలో బోత్ర తెగకి చెందిన సదాశివని బోత్ర జాతి కుల సంఘం కులం నుంచి బహిష్కరించింది. అతని కుటుంబాన్ని ఎటువంటి శుభ, అశుభ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని కులపెద్దలు తీర్మానం చేశారు. అలాగే అతని ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరు కావద్దని బోత్ర కులం చెందిన వారికి హెచ్చరించారు. జోరిగాం సమితిలో జరిగిన బోత్ర సమాజ్ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. సదాశివ కుమార్తెకి ఒడియా బ్రాహ్మణ యువకునితో ప్రేమ వివాహం జరగనుంది. వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్ధం జరిపారు. ఇది తెలిన బోత్ర సమాజ్ పెద్దలు తమ గిరిజన యువతి బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకొంటుండంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇదే గిరిజనులకు చెందిన బోత్ర సమాజ్ అతన్ని కులం నుంచి బహిష్కరించింది. విమానాశ్రయంలో విలువైన గంజాయి స్వాధీనం భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 3 కోట్లకు పైబడి విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం ఉదయం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేపట్టిన ఒక భారీ దాడుల్లో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం బ్యాంకాక్ నుంచి వచ్చిన 6ఈ–1066 విమానం ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఇద్దరు ప్రయాణికుల నుంచి నిషేధిత పదార్థం గంజాయి బయటపడింది. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా డీఆర్ఐ బృందం కూలంకషంగా తనిఖీ నిర్వహించగా ఇద్దరు నిందితుల నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వారివురు తమిళనాడు నివాసులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగులై మాతకు ప్రత్యేక పూజలు భువనేశ్వర్: జట్నీ మున్సిపల్ మండలి జేఎంసీ పరిధిలోని కుదియారి గ్రామ దేవత జగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాల్లో సప్తమి తిథిని పురస్కరించుకుని జగులాయి మాత పీఠంలో సాల మండన్, సూర్యపూజ తదితర పూజాదులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం అభిషేకం అనంతరం రూపకార్ విజయ్ పండా దేవీని కాళ రాత్రి రూప ధారణతో అలంకరించారు. షోడశ ఉపచార పూజలు, సప్త సతీ చండీ ఆహుతి అర్ధరాత్రి వరకు క్రమ పద్ధతిలో కొనసాగాయి. మహా అష్టమి పురస్కరించుకుని బుధవారం జగులై మాత మహాగౌరీ అలంకరణలో దర్శనం ఇస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు వినోద్ పండా తెలియజేశారు. -
ఆభరణాల జాబితా తయారీ
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026శ్రీ జగన్నాథుని.. భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలో భద్రపరిచిన అమూల్య ఆభరణాల జాబితా తయారీ, ధ్రువీకరణ బృహత్తర ప్రక్రియ బుధవారం నుంచి ఆరంభం అవుతుంది. దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియ వివరణాత్మక ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) ప్రకారం చేపడుతున్నట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సవివరంగా అనుబంధ వర్గాలకు పూర్తి అవగాహన కల్పించినట్లు వివరించారు. సుదీర్ఘంగా 48 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రక్రియను చేపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుముహూర్తం ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ప్రక్రియ బుధ వారం మధ్యాహ్నం 12.09 గంటల నుండి 1.45 గంటల మధ్య శుభ ముహూర్తంలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆభరణాలను 1978లో తయారు చేసిన జాబితాతో సరిపోల్చడం ద్వారా సమగ్ర ఽధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ఆభరణాన్ని విడివిడిగా జాగ్రత్తగా పరిశీలించి తూకం వేస్తారు. సరైన డాక్యుమెంటేషన్న్ నిర్ధారించడానికి అధికారులు ప్రతి వస్తువును గుర్తించి ట్యాగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఆభరణాల విలువను నిర్ధారించబోమని అధికారులు స్పష్టం చేశారు. భౌతిక ధ్రువీకరణతో పాటు ప్రతి ఆభరణం సమగ్రమైన, సురక్షితమైన రికార్డును రూపొందించడానికి డిజిటల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, 3డీ మ్యాపింగ్ వంటి ఆధునిక డాక్యుమెంటేషన్ పద్ధతులను ఉపయోగించనున్నారు. దైనందిన సేవలు యథాతథం జాబితా ప్రక్రియ సమయంలో దేవతల దైనందిన పూజలు, మతపరమైన ఆచారాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు పూజల పవిత్రతను కాపాడటమే ప్రధాన ధ్యేయమని ఆలయ అధికారులు నొక్కి చెప్పారు. మహా లఘు దర్శనం ఈ నేపథ్యంలో భక్తులకు మహా లఘు దర్శనం వెలుపలి వాకిలి నుంచి కల్పిస్తారు. భక్తులకు నిరవధికంగా సర్వ దర్శనం కల్పించడం ఈ చొరవ లక్ష్యంగా పేర్కొన్నారు. -
శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు
జయపురం: జయపురంలో శ్రీరామ నవమి ఉత్సావాలను వైభవంగా నిర్వహించేందుక కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఉత్సవ కమిటీలకు, ప్రజలకు ఆహ్వాన పత్రాలను మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభించారు. జయపురం సనాతని ఏకతా యాత్ర, గురు రెస్పెక్ట్ ఆహ్వాన్ అభిజాన్ 2026ను శ్రీరామ నిర్వాహక కమిటీ నిర్వహించింది. ఆ కమిటీ కార్యకర్తలు శ్రీరామ భక్తులు బెనాసూర్, ముండాగుడ, రనస్పూర్, బిసింగపూర్, కుములి, భుమక్తపొదర్, చారుముల్ల, నారిగాం, గుమడ,బొడిగాం, కమత, బొరిగుమ్మ గ్రామాల్లో పర్యటించి గ్రామ పెద్దలను కలిసి ఉత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చందాలను వసూలు చేశారు. -
అగ్నివీర్‌పై కలెక్టర్ సమీక్ష
మల్కన్‌గిరి: భారతీయ సైన్యంలో అగ్నివీర్ నియామకానికి సంబంధించి మల్కన్‌గిరి జిల్లాలో యువతలో అవగాహన, నమోద్ సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే అధ్యక్షతన మంగళవారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జయపూర్ ప్రాంతీయ విద్యా డైరెక్టర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అధికారి, జిల్లా సబ్ కలెక్టర్, జిల్లా విద్యశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి, ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, గోపాలపూర్ ఏఆర్వో, సైనిక నియామక కార్యాలయ డైరెక్టర్ పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్నివీర్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు మల్కన్‌గిరి జిల్లాలో కేవలం 25 మంది అభ్యర్థులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇది రాష్ట్రంలోనే అతి తక్కువ సంఖ్య. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేసి మరింత మంది యువతను తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో అగ్నివీర్ నమోద్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నట్టు కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ తెలిపారు. -
‘బాల్య వివాహం హక్కుల ఉల్లంఘనే’
మల్కన్‌గిరి : ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సుజాతా నాయక్ మంగళవారం మల్కన్‌గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల కోసం అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, వారి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎంవీ–03 అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె తమసా ఆశ్రమ పాఠశాల, మల్కన్‌గిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్య హక్కు చట్టం సరైన అమలుపై దృష్టి సారించి పిల్లల భద్రతను నిర్ధారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తమసా గ్రామ పంచాయతీలో నిర్వహించిన పంచాయతీ స్థాయి బాలల సంక్షేమ, కమిటీ సమావేశంలో పాల్గొన్న సభ్యురాలు మాట్లాడుతూ, బాల్య వివాహం అనేది బాలల హక్కులపై ఘారమైన ఉల్లంఘన అని తెలిపారు. దోపిడీ లేని బాల్యం ప్రతి పిల్లవాడి జన్మహక్కు అని పేర్కొన్నారు. సమావేశంలో బాల కార్మికత్వం, భిక్షాటనలో పిల్లలను ఉపయోగించడం లేదా మత్తు పదార్థాల వ్యాపారంలో పిల్లలును వినియోగించడం వంటి నేరాలపై కఠన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కటక్ ఎల్ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
● పలు కీలక పత్రాలు దగ్ధం భువనేశ్వర్: కటక్ నగరం లింక్ రోడ్డులో ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటలు నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. తెల్లవారు జామున కార్యాలయ భవనం నుంచి పొగలు కమ్ముతున్నట్లు స్థానికుల దృష్టికి వచ్చింది. అత్యవసర హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం చేరదీయడంతో అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కసరత్తులో చౌలియాగంజ్, కటక్ నగరం యూనిట్లతో సహా పలు బృందాలను రంగంలోకి దించారు. మొత్తం 20 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. -
సామాజిక అంశాలపై అవగాహన
పర్లాకిమిడి: గజపతి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్, భారతీయ రెడ్ క్రాస్, ఒడిశా ఆధ్వర్యంలో ‘మేక్ ఎ ఛేంజ్ ఇన్సిటివ్’ ఆధీనంలో ఎస్సీ, ఎస్టీలకు స్వశక్తీకరణ, అనాధల కోసం సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమాలు స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ అధికారి సంజీవ్ కుమార్ దాస్, ఆదనపు డీఈఓ ఎస్.గిరిధర్, జిల్లా శిక్షాక్రీడాధికారి సురేంద్ర కుమార్ పాత్రో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, సీనియర్ రిసోర్పర్సన్ సంజయ్ చంద్ర సాహు, గాంధీ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.తిరుపతిరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. జూనియర్ రెడ్‌క్రాస్‌లో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానం, ప్రాథమిక చికిత్స, సైబర్ మోసాల నుంచి సురక్షా, రోడ్డు భధ్రతా, తదితర సామాజిక సేవలు గురించి వివరించారు. కొత్తగా చేరిన రెడ్ క్రాస్ అభ్యర్థులకు బ్యాడ్జీ, పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రీని అందజేశారు. రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ అధికారి లక్ష్మణకుమార్ స్వయిని, మహేంద్రగిరి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణచంద్ర ప్రధాన్‌కు జూనియర్ రెడ్ క్రాస్ అధికారి లక్ష్మణ ముర్ముకు అభినందనలు తెలిపారు. -
నల్ల రిబ్బన్లతో నిరసన
మందస: బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బిడిమి గ్రామంలో ప్రజలు, రైతులు నల్ల రిబ్బన్లతో సమావేశంలో పాల్గొని నిరసన తెలిపారు. గత 18 నెలలుగా కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నామన్నారు. సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతు కొంతమంది వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్ వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారాన్ని చేస్తున్నారని,కానీ అది పూర్తిగా అసత్యమని అన్నారు. కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తున్న రైతులు -
పూరీ బస్టాండ్‌లో బస్సు దగ్ధం
భువనేశ్వర్: పూరీ బస్ స్టాండ్‌లో ఒక ప్రైవేట్ బస్సుకు నిప్పంటుకుంది. మంగళ వారం రాత్రి పొద్దుపోయాక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. చాలా సేపటి తర్వాత అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కొంత మంది దుండగులు కావాలనే నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. జనగణనపై శిక్షణ మల్కన్‌గిరి: దేశంలో మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ జనగణన –2027ను విజయవంతం చేయడానికి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే పర్యవేక్షణలో సోమవారం శిక్షణ ఇచ్చారు. మల్కన్‌గిరి నోడల్ హైస్కూల్ ప్రాంగణంలో మల్కన్‌గిరి తహసీల్దార్ పరిధిలోని ఎన్యూమరేటర్లు (లెక్క గణకులు), సూపర్వైజర్లు కోసం మొదటి బ్యాచ్ శిక్షణ శిబిరం విజయవంతంగా పూర్తియింది. రెండో విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేధ్బ్ర్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా జనగణన అధికారి మునా తురుక్, మల్కన్‌గిరి తహసీల్దార్ విశ్వరంజన్ విశ్వస్ శిక్షణార్థులకు మార్గదర్శనం చేశారు. ఫీల్డ్ ట్రైనర్‌గా భాగ్యరంజన్ లెంకా, హరప్రసాద్ మహాపాత్రో పాల్గొని మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిణకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం జనగణన (జనభ లెక్కలు) పనుల కోసం 1269 మంది ఎన్యూమరేటర్లు, 227 మంది సూపర్ వైజర్లను నియమించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 6వ తేదీ వరుకు జరుగుతుంది. అనంతరం ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి డిజిటల్ విధానంలో సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు. -
సనాతన ధర్మ ప్రచారం కోసం..
కంచిలి: భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్‌తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా నుంచి బయల్దేరి నేపాల్ బోర్డర్ వరకు వెళ్లి, మళ్లీ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. సైకిల్ వినియోగిస్తే డబ్బులు ఆదా కావడంతోపాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గుతుందని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. స్కేటర్ రాజా ఛార్‌దమ్ యాత్ర చేస్తూ 12 శక్తిపీఠాలను దర్శనం చేస్తూ ఆల్ ఇండియా టూర్ చేస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. మొత్తం 15వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని తెలిపారు. వీరిద్దరూ వేర్వేరుగా వీళ్ల ఆల్ ఇండియా యాత్రలు చేపడుతూ, కంచిలి వచ్చేటప్పుడు ఒక్కచోట కలిశారు. వీరికి కంచిలికి చెందిన వ్యాపారి సంజయ్ కుమార్ శర్మ ఆదివారం రాత్రి ఆతిథ్యం కల్పించి సత్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
జయపురం: ఆదివారం రాత్రి జయపురం సమితి పాత్రోపుట్ గ్రామ సమీపంలో తురిడిపుట్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతి చెందిన యువకులు జయపురం పట్టణం దొబాసాహికి చెందిన లాలు ఖొరా, పీతు జానిలుగా గుర్తించారు. రాంచీ–విజయవాడ 326 జాతీయ కారిడార్ మార్గంలో ఒక బొలేరో వాహనం లాలు ఖొరా, పీతు జానిలు వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బైక్ పై వస్తున్న ఇద్దరు సంఘటన స్థలం వద్దనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం జయపురం ఫూల్‌బెడ లో గల జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. లభించిన సమాచారం ప్రకారం మృతులు లాలు ఖొర, పీతు జానిలు జయపురం సమితి డొంగరచించి గ్రామంలో ఒక డాబా హొటల్లో పని చేస్తున్నారు. గత రాత్రి పని ముగించుకొని బైక్ పై జయపురం వస్తుండగా మార్గంలో తురిడిపుట్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకుని మృతదేహాలు చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం మృతుల కుటుంబాల సభ్యులు బంధువులు జయపురం సదర్ పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఆందోళన చేపట్టారు. -
ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాసీ్త్రయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్, ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జన గణన–2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పదేళ్లకొకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచిక తేదీగా తీసుకుని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్దవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్.సాయి శేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక అక్షరాభ్యాసం
మల్కన్‌గిరి: విద్యాశాఖ ఆదేశాల మేరకు మల్కభ్గిరి ముండగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే, ఇతర ఉన్నతాధికారులు విద్యకు కొత్త అధ్యాయాన్ని సామూహిక అక్షరభ్యాసం కర్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు చాక్లెట్లు, పూలు ఇచ్చి ఆహ్వానించారు. కొత్తగా స్కూల్లో చేరే చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. చిన్నారుల భవిషత్ గూర్చి అవగహన కల్పించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రత్యేక ఆహ్వాన పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు. ఏప్రిల్ 2వ తేదీన జిల్లాలో అన్ని పాఠశాలల్లో అక్షరభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా విద్యశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విక్రమ్‌దేవ్ వర్సిటీ సందర్శన
జయపురం: జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ న్యూఢిల్లీ ప్రత్యేక మానిటర్ ప్రొఫెసర్ కనైయ్ త్రిపాఠీ సోమవారం స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు విశ్వ విద్యాలయ సిబ్బంది ఎన్సీసీ క్యాడర్ ఘనంగా స్వాగతం పలికింది. క్యాడెట్ల ప్రతిభను చూసి ప్రశంసించారు. సైబర్ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులతో చర్చించారు. బాలికల హాస్టల్ వద్ద కామన్ టాయిలెట్లలో వెండింగ్ మిషన్ల ద్వారా శానిటరీ ప్యాడ్లు ఉండేలా ఏర్పాటుచేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తదితర విషయాలలో న్యాయం జరిగేలా చూడాలని, పీఎంజీ 4 కింద హాస్టల్ సదుపాయాలు మెరుగు పరచాలని ఆయన యూనివర్శిటీ రిజిస్ట్రార్ మహే్‌ష్ చంద్ర నాయక్‌తో జరిపిన చర్చల్లో సూచించారు. -
బీజేపీలో పలువురి చేరిక
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పదోవార్డుకి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నరేష్కుమార్ సాహు, 13వ వార్డుకు చెందిన అట్టాడ వాసు, గుమ్మా బ్లాక్ ఝమ్మి గ్రామానికి చెందిన దనాన దామోదర్‌లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా కొత్త బస్టాండు నుంచి ఖంజావీధి పార్టీ కార్యాలయం వరకూ మోటారు సైకిల్ ర్యాలీ బీజేపీ శ్రేణులు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షులు నబ కిశోర్శోబోర్ ఆధ్వర్యంలో జరిగిన మిశ్రణపర్వ్ సభలో నరేష్కుమార్, దామోదర్, వాసులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వచ్చే పురపాలక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు. -
కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండనం
కొరాపుట్: కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరో మండన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సోమ వారం కొరాపుట్ జిల్లా కేంద్రానికి సమీపంలో కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జయపూర్ పట్టణంలో ఇద్దరు యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువకులు కులస్తులు వ్యతిరేకించారు. అనంతరం కుల పెద్దలు పంచాయతీ పెట్టి యువకుడు శిరో మండనం చేసుకోవాలని, కులస్తులకు మాంసాహార భోజనం పెట్టాలని, కుల సంఘానికి రూ.90వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు షరతులు అంగీరిస్తూ వారు చెప్పిన ఆదేశాలు పాటించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
కన్నుల పండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
రాయగడ: వసంత నవరాత్రుల్లో భాగంగా స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారి కల్యా ణం కనుల పండువగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుణుపూర్ గ్రీవెన్స్‌లో 86 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అజయ్‌కుమార్ ప్రధాన్ , జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి 86 వినతులను స్వీకరించిన అధికారులు వీటిలో 53 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 33 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మజ్జి గౌరి అమ్మవారికి వెండి మకరతోరణం రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారికి 35 కిలోల వెండి మకర తోరణాన్ని రూపొందించారు. అజ్ఞాత దాతలు ఇచ్చిన వెండితో అమ్మవారికి ఈ వెండి మకర తోరణం రూపొందించామని ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయిసింగి బిడిక తెలియజేశారు. ఈ మేరకు మందిర ప్రాంగణంలో శుద్ధి చేసి పుణ్యాహవచనం నిర్వహించి శక్తి హోమాన్ని జరిపారు. ఆలయ ట్రస్టు సభ్యులు వడ్డాది శ్రీనివాస్ రావు దంపతులు ఈ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమైన అమ్మవారి చైత్రోత్సవాల్లో ఈ తోరణాన్ని అమ్మవారి గర్భగుడిలో అలంకరిస్తారు. సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక జయపురం: జయపురం సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక లంకేశ్వరి ఉద్యాన వనంలో ఎన్నిక ప్రక్రియ సోమవారం జరిగింది. అధ్యక్షులుగా శక్తి ప్రసాద్ పాణిగ్రహి, ఉపాధ్యక్షులుగా నరసింహ పాణిగ్రహి, లక్ష్మీనారాయణ మహంకుడొ, జి.సత్యనారాయణ, కార్యదర్శిగా అక్షయ కుమార్ సాహు, సహాయ కార్యదర్శులుగా నరేంద్రనాథ్ త్రిపాఠీ, అనీల్ పట్నాయక్, కోశాధికారిగా నవీణ చంద్రపాత్రో, సలహాదారులుగా భజన్ సింగ్, దీనబందు అగ్రవాల్ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా గోవింద చంద్రసాహు, గణేష్ ఆచార్య, ప్రఫుల్ల రాయ్, సూర్యనారాయణదాస్, సుభాష్ జైన్, సుభాష్ చంద్రచౌదరి, రమేష్ చంద్ర త్రిపాఠీ, శివ ప్రసాద్ పట్నాయక్, ప్రితీష్ పట్నాయక్‌ను నియమించారు. అనంతరం నూతన కమిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. -
డీజిల్ దొంగల ముఠా
కొరాపుట్ : యుద్ధ ప్రభావంతో కొత్త తరహా దొంగల ముఠాలు ఏర్పడ్డాయి. సోమవారం కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు డీజిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్డీపీఓ సంజయ్ మండల్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. పొడాఘఢ్ ప్రాంతంలో ఒక ట్రక్ నుంచి డీజిల్ దొంగతనం అవ్వడంతో పోలీసులు ముఠా కోసం గాలించారు. మొత్తం 11 మంది ముఠాలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా టునా హరిజన్, ధనుర్జయ్ పరజాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారితో పాటు డీజిల్ కొనుగోలు చేసిన మరో ఆరుగురు దుకాణ యజమానులను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి 470 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రధాన మంత్రికి గవర్నర్ శుభాకాంక్షలు భువనేశ్వర్: 8,931 రోజుల సుదీర్ఘ పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి హదయపూర్వక అభినందనలు తెలిపారు. నిర్ణయాత్మక నాయకత్వం, అంకిత భావం మరియు భారత దేశ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఈ విజయాన్ని అభివర్ణించారు. భావి ప్రయాణంలో ఆయనకు నిరంతర శక్తి, విజయం చేకూరాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆకాంక్షించారు. -
మద్యం మత్తులో తుపాకీ కాల్పులు
కొరాపుట్: మద్యం మత్తులో తుపాకీతో కాల్పులు జరపడంతో యువకుని పరిస్థితి విషమంగా మారింది. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి ఏకంపారా గ్రామానికి చెందిన బిక్షయా సబర్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి కుసుంబల్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో గొడవ పడ్డాడు. గ్రామస్తులు నచ్చజెప్పి అతనిని పంపించేశారు. అనంతరం బిక్షయా సంబర్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో తిరిగి గ్రామానికి వచ్చాడు. గ్రామం మధ్యలో మాట్లాడుతున్న పాండు జానీ అనే వ్యక్తి పై వెనుక నుంచి తుపాకీ తో కాల్పులకు దిగాడు. దీంతో పాండు కుప్పకూలిపోయాడు. వెంటనే గ్రామస్తులు జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఉమ్మర్‌కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే కొరాపుట్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. బాధితుడికి రూ.5 చోట్ల తుపాకీ తూటా గాయాలయ్యాయని, ప్రభుత్వ వైద్యురాలు సుస్మితా నాయక్ ప్రకటించారు. అందులో ఒక బులెట్ వెన్నెముకకి తగిలిందని పేర్కొన్నారు. జొరిగాం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
15 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు సోమవారం మధ్యాహ్నం బలిమెల –చిత్రకొండ ముఖ్య రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంచి పట్టుకొని బస్సు కోసం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా నిలబడి ఉన్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. గంజాయి వెలుగు చూసింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఐఐసీ దీరాన్ పట్నాయక్ నిందితుడిని విచారింగా.. చిత్రకొండలో గంజాయి కొనుగోలు చేసి బీహార్‌కు తరలిస్తున్నట్టు నిందితుడి అంగీకరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 15 కిలోలు ఉంది. దీని విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాన్ తెలిపారు. నిందితుడు బీహార్ రాష్ట్రం ససారాం జిల్లాకు చెందిన కృష్ణ చౌరాసియాగా గుర్తించారు. అతని వద్ద నుంచి గంజాయితోపాటు సెలల్ఫోన్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. -
అపూర్వ కలయిక
జయపురం: అప్పర్ కొలాబ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అప్పర్ కొలాబ్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో 2002 విద్యా సంవత్సరంలో మెట్రిక్ చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం అత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బందుమిలన్ పేరిట ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో.. వివిధ హోదాల్లో స్థిరపడిన 100 మందికిగా పూర్వ విద్యార్థులు 24 ఏళ్ల తరువాత కలుసుకొని సందడి చేశారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగాక్షేమాలు తెలుసుకున్నారు. గ్రూపు ఫొటోను తీసుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా ‘మొ స్కూల్ అభిజాన్’పథకంలో చదువుకున్న పాఠశాలకు 20 వేల రూపాయలను ప్రధాన ఉపాధ్యాయురాలు ధరిత్రి మహారాణ అందజేశారు. చదువు నేర్పిన అప్పటి గురువులను దుశ్శాలువలతో సత్కరించి గౌరవించారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు పి.జ్య్త్స్నోరాణి రావు, ఉపాధ్యాయులు తపన్ కిరణ్ త్రిపాఠీ, రామ మోహనపండ, ఇందుమతి దాస్, సంయుక్త పండా, జగదీష్ ప్రసాద్ స్వైన్ పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోవద్దు
● హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి భువనేశ్వర్: హైటెక్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ‘కుహుడి’ నాటకాన్ని సోమవారం ప్రదర్శించారు. ప్రముఖ నాటక సంస్థ విద్యా కనక సజన సంస్థ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం అందరినీ ఆకట్టుకుంది. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సందేశం ఉన్న ఇలాంటి నాటకాలు రాబోయే తరానికి స్ఫూర్తిదాయకంగా, ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తన జీవితంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను ఆయన వివరించారు. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. ఎందుకంటే వారే తొలి దైవమని అన్నారు. ఒక విరామ ఉద్యోగికి తన సొంత ఇల్లు, కుటుంబం భరించలేని భారంగా మారుతున్న వర్ధమాన సమాజానికి ఈ నాటకం చక్కని మానవీయ సందేశం ప్రసారం చేసిందని నటీనటులు, సాంకేతిక, ఇతర వర్గాల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా కళాకారులను హైటెక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహిని ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. -
వ్యతిరేక దినోత్సవం’
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026‘ఇది సామ్రాజ్యవాదుల.. జయపురం: కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ సంస్థలు అమర వీరుల దినోత్సవాన్ని సామ్రాజ్యవాదుల వ్యతిరేక దినంగా నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఉత్కళ మహిళా సమితి సంయుక్తంగా అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమర వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయపురం శ్రామిక భవనం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన మార్గంలో గల సహిద్ లక్ష్మణ నాయిక్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత దాస్ మాట్లాడుతూ అమర వీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లు బ్రిటిష్ వలస పాలనలో దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రపంచంలో సామ్రాజ్యవాదుల దురాగతాలపై ఆయన నిప్పులు చెరిగారు. అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
మాత్తిలి సమితి గ్రీవెన్స్‌కు 80 వినతులు
మల్కన్‌గిరి: జిల్లాలోని మాత్తిలి సమితి కుమార్‌పల్లి పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి 80 వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు . వాటిలో కొన్నింటిని అక్కడకక్కడే పరిష్కరించారు. 52 సాముహిక గ్రామ సమస్యలు కాగా, 28 వ్యక్తిగత సమస్యలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృధి శాఖ అధికారి దశరథి సరబు, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి పాల్గొన్నారు. వినతుల వెల్లువ పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రాయఘడ బ్లాక్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. 52 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం14, గ్రామ సమస్యలకు సంబంధించినవి 38 ఉన్నాయి. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాయఘడ పంచాయతీ ఉపాధ్యక్షుడు జ్యోతి రంజన్ పాణి, బీడీఓ సంతోష్ కుమార్ బారిక్, తహసీల్దార్ సుకాంత ప్రధాన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
బంగారం దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
మందస: మండలంలోని హరిపురం గ్రామ పెద్దవీధికి చెందిన పొట్టి శాంతి ఇంట్లో ఇటీవల 20 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు నిందుతుడిని సోమవారం పట్టుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు ఉమాకాంత్ బిస్వల్(శంకర్) హరిపురంలోని శ్రీలక్ష్మీ స్వీట్ షాప్‌లో కూలీపని చేసుకుంటున్నాడు. అదే షాపులో పొట్టి శాంతి కూడా పని చేస్తుండగా, ప్రతిరోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకొని షాపునకు వచ్చింది. నిందితుడు శంకర్ ఆమె బ్యాగ్‌లో ఉన్న తాళం చెవిని తీసి శాంతి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పట్టపగలే దొంగలించాడు. దీనిపై ఆమె ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని పట్టుకున్నారు. సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి సోంపేట కోర్టుకు తరలించారు. -
హుండీలో నగదు చోరీ
సోంపేట: బారువ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివా రం రాత్రి హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు దొంగిలించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం వెళ్లే సరికి హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. కమిటీ సభ్యుడు ఎస్.ఆదినారాయణ బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ ఫిర్యా దు మేరకు ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా నిరసన మందస: బిడిమి గ్రామంలో జుత్తు జగన్నాయకులు స్మారక చిహ్నం వద్ద ఆదివారం కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్‌కు వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చె ప్పారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పామన్నారు. కేంద్ర మంత్రికి ఉద్దానం సమస్యలపై పట్టింపు లేదన్నారు. కార్యక్రమంలో తెప్పల అప్పారావు, కృష్ణమూర్తి, గంటు రామస్వామి, దున్న రామారా వు, తామాడ లక్ష్మీ నారాయణ, దున్న సురేష్, మర్ల సంతోష్, లబ్బ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ సీమ రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. సాయంత్రం మూడు గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. -
ఫోజులు కొత్తవి
పనులు పాతవి.. ఈ ఫొటో చూడండి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిపి మరోసారి శంకుస్థాపన చేసిన దృఽశ్యమిది. నాడు మంజూరైన నిధులనే వినియోగిస్తూ దానికి ప్రసాద్ స్కీమ్ రూ. 58కోట్లతో అభివృద్ధి పనులని కలరింగ్ ఇచ్చారు. ఈ ఫొటో చూడండి. 2023 డిసెంబర్ 20వ తేదీన రూ.4కోట్లతో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు నాటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దృశ్యమిది. నిధులు కూడా మంజూరయ్యాయి. పుష్కరిణిలో ఉన్న నీరు అంతా తీసేసి క్లీన్ చేశారు. అప్పటికి కాంట్రాక్టర్ ఖరారు కాలేదు. పనులు చేసే లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. పనులు ముందుకు సాగలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు ప్రభుత్వం వింత అర్థం చెబుతోంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి అభివృద్ధి చేస్తామని అనేక శాశ్వత కట్టడాలను కూల్చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఇప్పటికే రెండు రథసప్తమి వేడుకలు అయిపోయాయి. కూల్చేసిన కట్టడా లు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ మంజూరుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసా ద్ స్కీమ్ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన ఇంద్ర పుష్కరిణి పనులకే మళ్లీ కింజరాపు బాబాయ్, అబ్బాయ్‌లు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రథ సప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రజల సొమ్ముతో సంబరాలు చేసి, వివిధ కార్యక్రమాలతో సోకులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. అట్టహాసం పేరుతో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈ సారి రథసప్తమి దర్శనాల సమయంలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గు రి చేశారు. ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్లో అప్పటికే ఉన్న నిధులను, సుడా నిధులను వాడేసి అభివృద్ధి పనుల ముసుగులో కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. ఆ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాటిని ప్రస్తుతం చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. కార్పొరేషన్ సొమ్మును దుబారా చేయడం తప్ప పనులకు సార్థకత ఉండటం లేదు. వీరు చేసిన పనికి కార్పొరేషన్ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, నిధులు ఖాళీ అయిపోయాయని, కొత్త పనులు చేపట్టడానికి ఏమీ లేదని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఏకంగా నివేదిక ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కొత్త పబ్లిసిటీకి తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి ప్రజల్ని మభ్య పెట్టేడమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్న పరిస్థితులు ఉన్నాయి. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు ఈ జిల్లాకు చేసిన మేలంటూ ఏమీ లేదు. వైఎస్సార్ చేపట్టిన వంశధార ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, వంశధార ఎత్తిపోతల పథకం, కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి పథకం, గత ప్రభుత్వంలో మంజూరైన విద్యా సంస్థలకు పూర్తి సౌకర్యాలు, వసతులు, పనుల పూర్తిపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అధికారం వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగతా మూడేళ్లలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. దానికి అరసవల్లి ఆలయం అభివృద్ధి పనుల పేరుతో కూల్చేసిన కట్టడాల చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నదిదే కొత్తగా మంజూరు కాని నిధులు పాత వాటితో సోకులు అరసవల్లి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్తగా హడావుడి -
చలో ఢిల్లీ విజయవంతం చేయండి
జయపురం: జనజాతుల మౌళిక హక్కుల సాధనకు ఈ నెల 24వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జాతీయ జనజాతీ సురక్షా మంచ్ ఇచ్చిన పిలుపుమేరకు కొరాపుట్ జిల్లా నుంచి జనజాతి సురక్షా మంచ్ ప్రతినిధులను పంపేందుకు ఆదివారం స్థానిక వనవాసి కళ్యాణ మంచ్ కార్యాలయంలో కొరాపుట్ జిల్లా జనజాతి సురక్ష మంచ్ సమావేశమైంది. జిల్లా అధ్యక్షుడు బాలాజీ బెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వనవాసీ కళ్యాణ ఆశ్రమ యువ విభాగ ప్రాంతీయ సమన్వయ కర్త రతికాంత సాహు ఢిల్లీ లో నిర్వహించే ఉద్యమం యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను, మార్గదర్శకాలను వివరించారు. దేశంలో మౌళిక హక్కుల పరిరక్షణ, రాజ్యాంగంలో ఆర్టికల్ 341ను తప్పకుండా కఠినంగా అమలు చేయటం, జనజాతి సంప్రదాయ ప్రజలను ప్రలోబాలు చూపి మతమార్పికి పాల్పడుతున్న వారి నుంచి విముక్తి కల్పించటం ప్రధాన లక్ష్యంగా అఖిల భారత జన జాతి సురక్ష మంచ్ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీకి పిలుపు నిచ్చిందని వెల్లడించారు. రెండు లక్షలకు పైగా జనజాతి ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో కొరాపుట్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లా వన వాసి సమన్వయ కర్త చిత్ర సేన్ మాట్లాడుతూ ర్యాలీలో కొరాపుట్ జిల్లా నుంచి 100 మందితోపాటు అవిభక్త కొరాపుట్ నుంచి 250 మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో వనవాసి కళ్యాణ ఆశ్రమ యువ విభాగ ప్రాంత సహాయ సమన్వయకర్త లక్ష్మీకాంత మిశ్ర, సధా భూమియ, ప్రపుల్ల బిశాయి, దహనాఘీవురియ, ద్రౌపతి నాయక్, దుర్లభ మఝి, వికాస్ చలాన్, తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానంతో మానసిక ప్రశాంతత
రాయగడ: ప్రతి నిత్యం ధ్యానం చేయడంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆర్యోగానికి ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్ లీజారాణి సతపతి అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల సువర్ణజూబ్లీ సమావేశం హాల్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న ధ్యానం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సతపతి మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం గంట సమయం ధ్యానం కోసం కేటాయించాలని కళాశాల విద్యార్థినులకు సూచించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. అనంతరం ధ్యానం చేసే విధానాన్ని వివరిస్తూ శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పకాల్ దినోత్సవం
రాయగడ: స్థానిక జంఝావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయం ప్రాంగణంలో పకాల్ దినోత్సవాన్ని క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వెజ్, నాన్‌వెజ్‌లతో కూడిన కూరల వంటకాలను చేసుకుని చద్దన్నంతో సామూహికంగా తిని ఆనందించారు. చద్దన్నం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా సందేశాన్ని ఇస్తూ అంతా ఆనందించారు. క్లబ్ అధ్యక్షురాలు అనసూయా మాఝి, ఎంజీఎఫ్ రుడి కుండు, ఉపాధ్యక్షురాలు రేణుబాల పాణిగ్రహి, కోశాధికారి బియలక్ష్మీ మిశ్రోల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. -
ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన
జయపురం: జయపురం ఎం.ఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో సెమిలిగుడ సమితి దుధారి గ్రామ పంచాయతీలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐఐఎస్బ్ల్యూ సునాబెడ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతిర్మయి లెంక పాల్గొని నీటి సంరక్షణ, నీటి ప్రాముఖ్యత, శాసీ్త్రయపద్ధతులపై రైతులకు అవగాహణ కల్పించారు. దుధారి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ మహేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. దుదాయి ప్రాంతంలో పెరుగుతున్న నీటి కొరత, నీటి వినియోగ నిర్వహణ, ప్రభుత్వ తాగునీటి సరఫరా, సాగునీటి వనరులు, తదితర విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ లెంక మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి నీటి సంరక్షణలో సమర్థవంతమైన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సంరక్షణకు కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. రిసెర్చ్ సెంటర్ మరో సైంటిస్టు సంతోష్ కుమార్ సాహు మాట్లాడుతూ.. భూగర్భ జల వనరుల సంవరక్షణ, వర్షం నీరు సంవరక్షణ ఎంతో అవసరమన్నారు. మరో అతిథి దీప్తి మయి సాహు మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఎలా వినియోగించాలి, నీటిని ఎలా నిల్వ చేయాలి, తదితర విషయాలను సమగ్రంగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దుధారి పంచాయతీలోని గ్రామాల నుంచి 80 మంది రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గోపీ గొలారి, దిలీప్ కుమార్ సుబుద్ది, ప్రత్యూష్ పాడీ, ఎం.ఎస్.స్వామినాథన్ జయపురం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ, కార్తీక చరణ్ లెంక పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించారు. -
27 ఏళ్ల తర్వాత ఇంటికి..!
● కన్నకొడుకును చూసి కన్నీరుమున్నీరైన తండ్రిఅల్లిపురం (విశాఖ): ఇరవై ఏడు ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి చేరుకుంటే ఆ కుటుంబంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాంటి మధుర అనుభూతిని ఏయూటీడీ సంస్థ ప్రతినిధులు ఆ కుటుంబానికి కల్పించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం, కలహండి జిల్లా, బర్గాన్ గ్రామానికి చెందిన మహేందర్ చత్రియ గతంలో మానసిక అనారోగ్యానికి గురై ఇల్లు వదిలి వచ్చేశాడు. 2024 నవంబర్‌లో విశాఖ రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న అతడిని ఏయూటీడీ సిబ్బంది గుర్తించి చేరదీశారు. ఐదు నెలలుగా ‘శ్రద్ధా’ మందులతో వైద్య సేవలందించారు. చికిత్స అనంతరం మహేందర్ కోలుకోవడంతో, సంస్థ ప్రతినిధులు అతడిని నేరుగా సొంతూరికి తీసుకువెళ్లారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గ్రామానికి చేరుకోవడంతో అక్కడి పరిసరాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఎనిమిదేళ్ల కిందటే మహేందర్ తల్లి మరణించగా, తండ్రి రాకేశ్ కుమార్ చత్రియ మాత్రం కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్లముందు నిలబడటంతో ఆ వృద్ధ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఇక నేను నిశ్చింతగా కన్నుమూస్తాను’ అంటూ ఆయన అన్న మాటలు గ్రామస్తులందరినీ కదిలించాయి. మహేందర్‌ను అతని తండ్రికి, సోదరులకు క్షేమంగా అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపారు. -
క్రీడా పోటీల్లో కిశోర్‌చంద్ర రథ్ ప్రతిభ
పర్లాకిమిడి: హరియాణ రాజధాని చండీగఢ్‌లో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకూ జరిగిన మాస్టర్ గేమ్స్‌లో పర్లాకిమిడికి చెందిన విశ్రాంత అబ్కారీ శాఖ ఉద్యోగి కిశోర్‌చంద్ర రథ్ సత్తాచాటారు. వందమీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్, ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ బహుమతిగా సిల్వర్ పతకాలు సాధించాడు. ఈ గెలుపుతో కిశోర్ చంద్ర రథ్ వచ్చే వరల్డ్ మాస్టర్ గేమ్స్‌లో పాల్గోనేందుకు ఆర్హత సాధించాడు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆథెలెటిక్స్లో అనేక బహుమతులు సాధించాడు. ఆయన గెలుపుపై గజపతి జిల్లాలోని క్రీడాకారులు, జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథసాహు హర్షం వ్యక్తం చేశారు. -
‘అణగారిన వర్గాల గాథలే కవితలు’
జయపురం: కవితలు అణగారిన వర్గాల బాధలను గాథలను ప్రతిబింబిస్తాయని ప్రముఖ కవి డాక్టర్ బాసు దేవ్ సునాని అన్నారు. కవి బలరాం పూజారి 52వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎస్ఆర్ మాల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో బాసుదేవ్ సునానీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ బలరాం పూజారి ప్రజా కవి అని ఆయన కవితలు ప్రజలను చైతన్యపరిచేవిగా ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రముఖ పరిశోధకులు డాక్టర్ పరమేశ్వర ముంఢ, కవయిత్రి డాక్టర్ ప్రీతి ధారా సామల్, కవి బలరామ్ పూజారి సాహిత్య ప్రమాణాలను విశ్లేసిస్తూ ప్రసంగించారు. ప్రముఖ కవి కార్యక్రమ పరిచాలకులు ధర్మ రాజ్ మఝి అధ్యక్షతన జరిగిన బలరాం పూజారి జయంతి వేడుకల్లో కవి చక్రపాణిని సత్కరించారు. ఈ సందర్భంగా కవి బలరాం పూజారికి అంకితంగా ‘కవి కొరాపుట్’ పేరుతో ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించారు. -
ప్రత్యేక పడవలు
సత్తిగూడ ఇకో పార్క్లోమల్కన్గిరి: మల్కన్‌గిరి సమితి సత్తిగూడ డ్యామ్ వద్ద అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజేశిర్కే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకో పార్క్‌లో భాగంగా డ్యామ్‌లో ప్రత్యేక యాంత్రిక పడవలను ప్రారంభించారు. వన్య ప్రాణుల సంరక్షణ గురించి వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ డీఎన్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, అదనపు అటవీ శాఖ అధికారి ప్రియాంక మహుకా, సత్తిగూడ డ్యామ్ ప్రాజెక్ట్ సహాయ ఇంజినీర్ లలిత్ బెహరా తదితరులు పాల్గొన్నారు.


