Pakistan Super League
-
ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అతడి సారథ్యంలోని కరాచీ కింగ్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. కరాచీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లోనూ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.అయితే రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం వార్నర్, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదో విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బహిరంగంగానే అలీపై గట్టిగా కేకలు వేస్తూ డేవిడ్ భాయ్ కన్పించాడు. కరాచీ టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ జోక్యంతో గొడవ సద్దమణుగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. షేక్ హ్యాండ్స్ విషయంలో గొడవ తలెత్తినట్లు సమాచారం. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇది కేవలం టీమ్ బాంటర్ మాత్రమే అని వార్నర్ స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన డేవిడ్ భాయ్?ఇక ఇది ఇలా ఉండగా.. డేవిడ్ వార్నర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న పెషావర్‌తో తలపడనుంది. అయితే దాదాపు వారం రోజుల విశ్రాంతి లభించడంతో వార్నర్ తన స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం.అతడు తిరిగి మ్యాచ్‌కు ముందు జట్టుతో కలవనున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా సోషల్ మీడియాలో మాత్రం వార్నర్ కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీపై అలిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కరాచీ కింగ్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.చదవండి: IPL 2026: ఆర్సీబీ, సన్‌రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే! -
మొయిన్ అలీతో డేవిడ్ వార్నర్ గొడవ?
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘మీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు భాయ్’’ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..హాఫ్ సెంచరీడేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో బిజీగా ఉన్నాడు. కరాచీ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ దంచికొట్టాడు. ఓపెనర్‌గా వచ్చిన వార్నర్ 36 బంతుల్లో 50 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడికి తోడు ఆజం ఖాన్ (34 బంతుల్లో 74) రాణించడంతో కరాచీ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.మొయిన్ అలీతో గొడవ?ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం డేవిడ్ వార్నర్ సహచర ఆటగాడు మొయిన్ అలీతో సీరియస్‌గా ఏదో అన్నట్లు కనిపించింది. ఇంతలో కరాచీ టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ వచ్చాడు. వార్నర్ భుజంపై చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. అతడి చేయిని తీసేసిన వార్నర్ పక్కకు వెళ్లమని సైగ చేశాడు.క్లారిటీ ఇచ్చిన వార్నర్ఆ తర్వాత మరోసారి హైదర్ వార్నర్ భుజాలపై చేయి వేసి నడిపించగా.. అటూ ఇటూ చూపిస్తూ వార్నర్ అతడికి ఏదో వివరించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. వార్నర్ తాజాగా స్పందించాడు. ‘‘ముందు వెళ్లి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయమని నేను హైదర్‌కు చెప్పాను’’ అని వార్నర్ స్పష్టం చేశాడు. తాను సరదాగా చేసిన పనిని అపార్థం చేసుకున్నారని పేర్కొన్నాడు.మరోవైపు.. హైదర్ అజర్ ఈ వైరల్ దృశ్యాలపై స్పందిస్తూ.. ‘‘ఇందులో నిజం లేదు. వాళ్లిద్దరు (వార్నర్, అలీ) నాతో మజాక్ చేస్తున్నారు అంతే’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత వీరు వివరణ ఇవ్వడం గమనార్హం.చదవండి: ముస్తాఫిజుర్ రహమాన్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్I said to @HaiderAzhar to go first and shake hands 🤣🤣🤣 https://t.co/tiTbSjZIyG— David Warner (@davidwarner31) April 2, 2026 -
తగ్గేదేలే అంటున్న ఫఖర్.. పీఎస్ఎల్ బ్యాన్పై సవాల్
ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ వివాదం ఇప్పటిలో సద్దుమణిగేలా కన్పించడం లేదు. పీఎస్ఎల్-2026లో భాగంగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమాన్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నిర్ధారించారు. దీంతో అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విధించింది.అయితే ఈ నిర్ణయాన్ని ఫఖర్ ఇప్పుడు సవాల్ చేశాడు. కాగా పీఎస్ఎల్ (PSL) క్రమశిక్షణా కమిటీ విచారణలో ఫఖర్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. తను బంతిని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించలేదని అతడు చెప్పుకొచ్చాడు. కాగా ఈ విచారణలో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది, టీమ్ డైరెక్టర్ సమీన్ రానా కూడా ఫఖర్‌కు మద్దతుగా నిలిచారు. అతడితో పాటు షాహీన్, సమీన్ రానా కూడా విచారణకు హాజరయ్యారు. అతడి బ్యాన్పై మరో 24 గంటల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. ఒకవేళ ఫఖార్ జమాన్ అప్పీల్ తిరష్కరిస్తే, ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్‌తో గడ్డాఫీ స్టేడియంలో, ఏప్రిల్ 9న కరాచీలో జరిగే మ్యాచ్‌లకు జమాన్ దూరం కానున్నాడు.అసలేమి జరిగిందంటే?లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఈ నెల 29న కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో హరీస్ రౌఫ్‌కు బంతిని ఇచ్చే ముందు ఫఖర్ బంతిని చేతి గోర్లతో రుద్దుతూ కన్పించాడు. ఇది గమనించిన అంపైర్ వెంటనే బంతిని మార్చేయడం కాకుండా లహోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.14 ప్రకారం అతడిపై లెవల్ 3 నేరాన్ని మోపారు. అయితే ఫఖర్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకుండా, విచారణను కోరాడు. విచారణలో కూడా తన వాదనలను బలంగా వినిపించాడు. అయినప్పటికి పీఎస్ఎల్ విచారణ కమిటీ అతడిపై రెండు మ్యాచ్ బ్యాన్ విధించింది. ఇప్పుడు జమాన్ అప్పీల్ చేయడంలో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.చదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కనందు వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను వదిలివేసినట్లు తెలిపాడు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఆడేందుకు డబ్బే కారణం అంటూ జంపా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.డబ్బుకు డబ్బు.. పేరు పేరుకాగా ప్రపంచంలోనే ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్లో ఆడటం ద్వారా డబ్బుకు డబ్బు.. పేరు పేరు సంపాదించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్లో ఆడేందుకు పీఎస్ఎల్ను వీడిన ఆటగాళ్లు కూడా కోకొల్లలు.పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లోతాజాగా 2026 ఎడిషన్‌లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (Dasun Shanaka), ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ తదితరులు పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరారు. అయితే, వీరికి ఆడం జంపా మాత్రం భిన్నంగా ఉన్నాడు. ఐపీఎల్లో తన ప్రతిభకు తగ్గ ధర దక్కలేదని.. అందుకే పీఎస్ఎల్లో చేరినట్లు తెలిపాడు.జంపా మాత్రం రివర్స్‘‘నేను రేసులో లేను. అందుకే ఐపీఎల్-2026 మినీ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. ఆ టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకొన్నా. నిజం చెప్పాలంటే... నాలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాడి కంటే ఇతరులకు ఎక్కువ డబ్బు లభిస్తోంది.అందుకే అక్కడ ఉండటం సరైన నిర్ణయం కాదనిపించింది. అందుకే ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకున్నా. విరామం తీసుకున్నా. ఇంతలో పీఎస్ఎల్ నుంచి పిలుపు వచ్చింది’’ అని ఆడం జంపా చెప్పుకొచ్చాడు. కాగా 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జంపా తొలుత రూ. 30 లక్షల జీతం అందుకోగా.. క్రమేణా ఆ మొత్తం 2.40 కోట్ల రూపాయలకు చేరింది. తాజాగా పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్‌తో జంపా రూ. 1.51 కోట్లకు (పాకిస్తాన్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) ఒప్పందం చేసుకున్నాడు.చదవండి: మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా -
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్.. స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026ను బాల్ టాంపరింగ్ వివాదం కుదిపేస్తోంది. ఆదివారం గడాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై లెవల్-3 నేరాన్ని మోపారు.ఏమి జరిగిందంటే?కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది పేసర్ హరీస్ రవూఫ్‌కు అప్పగించాడు. అయితే ఈ క్రమంలో ఫఖర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వద్ద మాట్లాడుకున్నారు. ఈ సమయంలో బంతికి ఒకరు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.అయితే బంతిని ఫఖర్ తన చేతి వేలితో గీకినట్లు కన్పించింది. దీంతో వెంటనే అంపైర్ బంతిని అతడి చేతి నుంచి తీసుకుని టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో బంతిని మార్చడంతో పాటు లహోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది.పీసీబీ సీరియస్మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తదుపరి విచారణ వచ్చే 48 గంటల్లో మరో విచారణ జరగనుంది అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఒకవేళ విచారణలో బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు రుజువైతే జమాన్‌పై ఒక్క మ్యాచ్ నిషేదం పడే అవకాశముంది. కాగా గతంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆసీస్ స్టార్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్ పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన విషయం తెలిసిందే.చదవండి: PSL 2026: పాక్ స్టార్ ప్లేయర్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే? -
పాక్ స్టార్ ప్లేయర్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం గడ్డాఫీ స్టేడియం వేదికగా లహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో హద్దు మీరి ప్రవర్తించిన కరాచీ కింగ్స్ స్పీడ్ స్టార్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు హసన్ అలీకి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా పీసీబీ విధించింది.ఏమి జరిగిందంటే?లహోర్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన హసన్ అలీ.. చివరి బంతికి ప్రత్యర్ధి బ్యాటర్ హసీబుల్లా ఖాన్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ సమయంలో హసన్ అలీ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. హసీబుల్లాను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దూకుడుగా సైగలు చేశాడు.ఈ విషయాన్ని పీసీబీ సీరియస్‌గా తీసుకుంది. హసన్ ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు పాక్ క్రికెట్ బోర్డు తేల్చింది. హసన్ అలీ తన తప్పును అంగీకరించడంతో పీసీబీ కేవలం ఫైన్‌తోనే సరిపెట్టింది.అయితే ఇదే మ్యాచ్‌లో లహోర్ స్టార్ ప్లేయర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు . చివరి ఓవర్లో కరాచీ విజయానికి 14 పరుగులు కావల్సిన సమయంలో, ఫఖర్ జమాన్ బంతి రూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ అంపైర్లకు దొరికిపోయాడు. అంపైర్లు వెంటనే బంతిని మార్చడమే కాకుండా, లాహోర్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఈ ఘటనసై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతోంది.చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..? -
వద్దు అన్నా.. హోటల్‌కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం లహోర్ వేదికగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఖలందర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, ఆల్ రౌండర్ సికందర్ రజా ఓ వివాదంలో చిక్కుకున్నారు.భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై స్థానిక పోలీసులు సీరియస్ అయ్యారు. లహోర్ డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్‌కు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఏమి జరిగిదంటే?షాహీన్ అఫ్రిది సారథ్యంలోని ఖలందర్స్ జట్టు లహోర్‌లోని ఓ హోటల్లో బస చేస్తోంది. అయితే సికిందర్ రజా తన ఉండే గదిలోకి నలుగురు గెస్ట్‌లను అనుమతించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరాడు. కానీ అతడు చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఈ విషయంలో లాహోర్ ఖలందర్స్ యజమాని సమీన్ రాణా కూడా జోక్యం చేసుకున్నారు. ఆ నలుగురును అనుమతించాలని సీఈఓ నసీర్‌ను సమీన్ అభ్యర్ధించాడు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ విన్నపాన్ని అధికారులు తోసిపుచ్చారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టిమరి షాహీన్, రజా ఆ నలుగురిని హోటల్ లోపలికి తీసుకెళ్లారు.ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో వీరిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇదే విషయాన్ని సీఈఓ సల్మాన్ నసీర్‌కు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై లాహోర్ ఖలందర్స్ మీడియా హెడ్ ఉమర్ ఫరూక్ స్పందించారు.మా ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించిన ఈ ఘటనపై మాకు స్పష్టత ఉంది. మేమే పీఎస్ఎల్ మేనెజ్మెంట్తో చర్చలు జరపుతున్నాము అని ఉమర్ ఫరూక్ తెలిపారు. అయితే షాహీన్, రజాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. -
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్లబంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే తాజాగా బాల్ టాంపరింగ్ వివాదం పీఎస్ఎల్లో కలకలం రేపుతోంది. ఆదివారం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ ఖలందర్స్ బంతిని ట్యాంపరింగ్ చేసినట్లు అంపైర్లు అనుమానించారు. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. కరాచీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను హారిస్ రవూఫ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధారణకు వచ్చిన అంపైర్ లాహోర్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్యం ఒక్కసారిగా 14 పరుగుల నుంచి 9 పరుగులకు తగ్గింది. దీనిపై లాహోర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం అఫ్రిది స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాల నడుమ మొదలైన పీఎస్ఎల్లో బాలా టాంపరింగ్ అంశంతో మరింత రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముహమ్మద్ వసీమ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026చదవండి: IPL 2026: ముగ్గురు మొనగాళ్లు! -
ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీకసలు కామన్సెన్స్ ఉందా? అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డొమినిక్ కార్క్ పట్ల ముస్తాక్ ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం.అసలు విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో క్వెటా గ్లాడియేటర్స్- కరాచీ కింగ్స్‌కు మధ్య మ్యాచ్‌కు ముందు పిచ్ పరిస్థితుల గురించి చర్చించే క్రమంలో డొమినిక్, ముస్తాక్ మైదానంలోకి వచ్చారు.నువ్వు జీనియస్ఈ క్రమంలో పిచ్‌ను చూపిస్తూ.. ‘నువ్వు జీనియస్. రెండు చేతులతోనూ బంతిని తిప్పేయగలవు. ఇక్కడ ఆడం జంపా ఉన్నాడు. ఈ పిచ్‌పై బౌలింగ్ చేసే విషయంలో అతడికి నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తావు?’ అని డొమినిక్ ముస్తాక్‌ను అడిగాడు.ఇందుకు బదులుగా.. ‘ఆడం జంపా కంటే ముందు నీకు ఓ విషయం చెప్పాలి. టెస్టు, వన్డే, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో నేను ఎన్నిసార్లు నిన్ను అవుట్ చేశానో గుర్తుందా? నాకైతే ఆ విషయం చాలా బాగా గుర్తుంది’ అని ముస్తాక్ పొంతనలేని సమాధానం ఇచ్చాడు.నన్ను ఒకసారి అవుట్ చేశావుఅయితే, డొమినిక్ కార్క్ .. ‘ముషీ.. నువ్వు నన్ను ఒకసారి అవుట్ చేశావు’ అని బదులిచ్చాడు. అయితే, ముస్తాక్ మాత్రం.. ‘లేదు.. లేదు.. చాలాసార్లు నిన్ను అవుట్ చేశాను’ అని పునరుద్ఘాటించాడు.ఇందుకు డొమినిక్ కార్క్.. ‘నేనైతే బ్యాటింగ్ చేయలేను కదా!.. నన్ను అవుట్ చేసే విషయం గురించి ఇప్పుడెందుకు గానీ.. టాపార్డర్‌పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది’ అని కౌంటర్ వేశాడు.ముందు ఈ పిచ్ గురించి మాట్లాడదామా?అయితే, ముస్తాక్ మరోసారి అదే టాపిక్ తీసుకువచ్చాడు. ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు ఇంగ్లండ్ తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడేవాడివి’ అని పేర్కొన్నాడు. దీంతో డొమినిక్‌కు చిర్రెత్తుకు వచ్చింది. ‘మనం ముందు ఈ పిచ్ గురించి మాట్లాడదామా? ఆడం జంపా గురించే నేను మాట్లాడదలచుకున్నాను’ అని బదులిచ్చాడు.వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో డొమినిక్ హుందాగా పిచ్ గురించి మాట్లాడుతుంటే.. ముస్తాక్ మాత్రం అతడిని తక్కువ చేసే విధంగా పాత విషయాలు తవ్వడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఇదేం పద్ధతి?‘ఇదేం పద్ధతి? కాస్తైనా సంస్కారం లేదా? పిచ్ గురించి అభిప్రాయం చెప్పమంటే ఇలా మాట్లాడటం సరికాదు’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా ఇంగ్లండ్ తరఫున 37 టెస్టులు, 32 వన్డేలలో కలిపి పేస్ బౌలర్ డొమినిక్ కార్క్ 172 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. ముస్తాక్ పాక్ తరఫున 52 టెస్టులు, 144 వన్డేలుఆడి 300కు పైగా వికెట్లు పడగొట్టాడు.చదవండి: PSL: పాకిస్తాన్‌కు మరో షాక్!.. ఈసారి..🚨🚨Mushtaq Ahmed embarrassed dominic cork on camera- i meam he was just simply asking him a question and all of sudden Mushtaq Ahmed just embarrassed him,• Lack of manners or what ? pic.twitter.com/5Uw0VcFGX0— SheR•ALI (@Sher__Ali) March 27, 2026 -
పాకిస్తాన్ క్రికెటర్‌కు ఊహించని షాక్
పాకిస్తాన్ పేసర్ నసీం షా చిక్కుల్లో పడ్డాడు. పాక్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నసీం షాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.సీఎంను ఆహ్వానించిన పీసీబీఅసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మార్చి 26న ఆరంభమైన సంగతి తెలిసిందే. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్ వీక్షించాల్సిందిగా పీసీబీ పంజాబ్ సీఎం మరియం నవాజ్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మన్ జట్ల ఫ్రాంఛైజీ యజమానులకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. మరియంను పరిచయం చేశాడు.ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్ చేస్తున్నారుఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు అత్యంత గౌరవం ఇవ్వడాన్ని తప్పుబట్టిన నసీం షా.. ‘లార్డ్స్ (ఇంగ్లండ్ మైదానం)లో రాణిలా.. ఇక్కడిలా ఈమెను ఎందుకు చూస్తున్నారు? ఎందుకింత హడావుడి?’ అని నసీం షా ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చాడు. దీంతో వివాదం చెలరేగింది.నా అకౌంట్ హ్యాక్ అయిందిఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన నసీం షా.. తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని.. తాను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. అయితే, పీసీబీ మాత్రం నసీం షా చర్యను తీవ్రంగా పరిగణించింది. అతడు సెంట్రల్ కాంట్రాక్టు, మీడియా నిబంధనలు ఉల్లంఘించాడని.. అలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాగా పీఎస్ఎల్లో నసీం షా రావల్పిండి పిండిజ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇక పాకిస్తాన్ తరఫున ఇప్పటికి 20 టెస్టులు, 34 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు నసీం షా. 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం ఫాస్ట్‌బౌలర్ ఖాతాలో 60 టెస్టు వికెట్లు, 60 వన్డే వికెట్లు, 32 టీ20 వికెట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో చివరగా పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు నసీం షా.చదవండి: PSL: పాకిస్తాన్‌కు మరో షాక్!.. ఈసారి.. -
PSL: పాకిస్తాన్‌కు మరో షాక్!.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై గత కొంతకాలంగా విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాక్ సూపర్-8 దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుకు దాదాపు పదకొండేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్ (Rashid Latif), అహ్మద్ షెజాద్ పాక్ బోర్డు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ, సెలక్టర్ల అనుచిత నిర్ణయాల వల్లే పాక్ క్రికెట్ నాశనమవుతోందని మండిపడ్డారు.ఐపీఎల్‌తో పోటీపడి.. బొక్కబోర్లాఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ద్వారా పాక్ బోర్డు మెరుగైన ఆదాయం వచ్చేది. అయితే, గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది పీసీబీ. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఐపీఎల్ వైపే మొగ్గుచూపుతుండగా.. ఇక్కడ అమ్ముడుపోని ప్లేయర్లు పీఎస్ఎల్లో ఆడేందుకు వెళ్తున్నారు.పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో..అయితే, ఐపీఎల్ జట్లలోని ఆటగాళ్లు గాయాలు, ఇతరత్రా కారణాల వల్ల దూరమైతే పీఎస్ఎల్ను వీడి.. ఐపీఎల్లో చేరడానికి వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో కేకేఆర్ జట్టులో చేరగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సైతం ఇదే బాటలో నడిచాడు.సామ్ కర్రాన్ స్థానంలో షనక రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాథన్ ఎల్లిస్ స్థానంలో సీఎస్కేలోకి వచ్చాడు. ఓవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లే నిర్వహిస్తున్న పీసీబీకి.. ఆటగాళ్లు అర్ధంతరంగా వెళ్లిపోవడం తలనొప్పిగా మారింది.కామెంటేటర్లు సైతం అదే బాటలోఈ నేపథ్యంలో ఇలాంటి ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని పీసీబీ లీకులు ఇచ్చింది. అయినప్పటికీ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరే ఆటగాళ్లు వెనుకడుగు వేయడం లేదు. ఇక ఈ జాబితాలో ఇప్పుడు కామెంటేటర్లు కూడా చేరినట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ తొలుత పీఎస్ఎల్ కామెంట్రీ ప్యానెల్లో ఉన్నాడు. తాజాగా అతడి పేరు ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్లో దర్శనమిచ్చింది. దీనర్థం ఇప్పుడు కామెంటేటర్లు కూడా పీఎస్ఎల్ వీడి ఐపీఎల్‌తో జట్టు కడుతున్నారు.స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్లో భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, వీరేందర్ సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తదితరులతో కలిసి నిక్ నైట్ వ్యాఖ్యానం చేయనున్నాడు. కాగా మార్చి 26న పీఎస్ఎల్ ఆరంభం కాగా.. మార్చి 28న ఐపీఎల్-2026 సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: IPL 2026: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
‘సిగ్గుచేటు.. ఇలాంటిదెన్నడూ చూడలేదు’
పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ తొలిరోజే బంతి విషయంలో వివాదం చోటుచేసుకుంది. లాహోర్ వేదికగా లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుపు రంగు బంతి కాస్తా ఉదారంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇక బంతి ఇలా వేరే రంగులోకి మారిపోవడం తన క్రికెట్ కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదంటూ హైదరాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ పేర్కొన్నాడు. లబుషేన్ మాట్లాడుతూ.. 'నిజానికి రెండో ఓవర్లోనే బంతి రంగు మారడాన్ని గమనించాను. ఇదే విషయమై అంపైర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాను. అసలు ఏం జరుగుతోంది? బంతి రంగు ఎందుకు మారుతోందంటూ అంపైర్లను అడిగాను. అయితే బంతి దుస్తులకు అదే పనిగా రాయడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నా. కానీ నా కెరీర్లో ఇలాంటి ఘటన మాత్రం ఎన్నడూ చూడలేదు. అయితే బ్యాట్‌పై ఉన్న ఏదైనా స్టిక్కర్‌పై బంతి పడి అది దానికి అతుక్కుపోవడం వల్ల బంతి రంగు మారడం చూశాను.కానీ దుస్తులకు బంతిని పదే పదే రుద్దడం ద్వారా వేరే రంగులోకి మారడం మాత్రం అరుదైన విషయమని చెప్పొచ్చు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి జరగకుండా లీగ్ నిర్వాహకులు జాగ్రత్త పడతారని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ తమ ‘ఎక్స్’ వేదికగా..‘ తొలి పింక్ బాల్ మ్యాచ్‌లో విజయం సాధించిన లాహోర్ ఖలందర్స్‌కు మా అభినందనలు’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (53) అర్థసెంచరీతో రాణించగా, హసీబుల్లా ఖాన్ (40 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, హసన్ ఖాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లబుషేన్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో హారిస్ రవూఫ్, సికందర్ రజా, ఉబైద్ షా తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ తలపడనున్నాయి.🚨🚨Marnus Labuschagne on the change of ball color"I did say to the umpires after the second over, What’s going on? The ball is red, it must be from the clothes or something like that. I’ve never seen anything like pic.twitter.com/VHSXouHZYx— SheR•ALI (@Sher__Ali) March 26, 2026చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! -
PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!
ఆంక్షల నడుమ మొదలైన పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ తొలిరోజునే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ సందర్భంగా బంతి రంగు మారడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో వైట్‌బాల్‌ను ఉపయోగించడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా బంతి గులాబీ రంగులోకి మారిపోయింది. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఓవర్ ముగిసిన తర్వాత బంతిని పరిశీలించిన అంపైర్లు దాని స్థానంలో మరొక బంతిని తీసుకొని మ్యాచ్‌ను కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకోవడంతో ఉన్నపళంగా వైరల్‌గా మారిపోయింది. క్రీడాభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోయారు. 'బౌలర్లు పదేపదే బంతిని రుద్దడం వల్లే తెల్లబంతి కాస్తా గులాబీ రంగుకు మారిపోయి ఉంటుంది'.. 'ఇది పీఎస్ఎల్ కాదు పైసా షార్టేజ్ లీగ్ అనుకుంటా'.. 'ఇది అంతర్జాతీయ క్రికెటా లేక గల్లీ క్రికెటా అన్నది అర్థం కావడం లేదు'.. అని కామెంట్లు చేశారు. ప్రేక్షకులు లేకుండానే మొదలైన పీఎస్ఎల్లో తొలి మ్యాచ్ షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్, లబుషేన్ నేతృ త్వంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (53) అర్థసెంచరీతో రాణించగా, హసీబుల్లా ఖాన్ (40 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, హసన్ ఖాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లబుషేన్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో హారిస్ రవూఫ్, సికందర్ రజా, ఉబైద్ షా తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ తలపడనున్నాయి.Peak Pakistan Super League standards 😭During the very first match of PSL 11, the ball literally turned pink every time Hyderabad Kingsmen players rubbed it on their kit.Did they get knockoff kits instead of authentic ones?International league or gully-level experiment? 🤡 pic.twitter.com/Beq5zhmSkb— Brutal Truth (@sarkarstix) March 26, 2026During today’s PSL match, the ball turned pink as early as the second over because players kept rubbing it on their pants, causing the dye to transfer onto the ball.Paisa Shortage League for a reason 🤣 pic.twitter.com/QQf7wlc2qG— Tejash (@Tejashyyyyy) March 26, 2026చదవండి: ధోనిపై మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు! -
పాక్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందు ఆసక్తికర పరిణామం
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెప్టెన్ల ప్రెస్ మీట్లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌డేవిడ్ వార్నర్ సహచర కెప్టెన్లపై ఫైర్ అయ్యాడు. వార్నర్ విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తుండగా ఇతర ఫ్రాంచైజీల కెప్టెన్లు షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ నవ్వుకుంటూ కనిపించారు. 🗣️ “What’s wrong gentlemen? Sorry we’ve got some school kids here” - David Warner on guys being unprofessional at the captains day press conference pic.twitter.com/gJRDtTAw8t— Usman (@jamilmusman_) March 25, 2026దీంతో చిర్రెత్తిపోయిన వార్నర్ వారికి గట్టిగా చురకలంటిచ్చాడు. What’s wrong with you..? Sorry gentlemen, we have got school kids here అంటూ అసహనం ప్రదర్శించాడు. ఎప్పుడూ సరదాగా ఉండే వార్నర్ ఇలా రియాక్ట్ కావడంతో విలేకరులు సహా అక్కడున్న వారంతా కాసేపు షాక్‌లో ఉండిపోయారు.ఇదిలా ఉంటే, 2026 ఎడిషన్ పాక్ సూపర్ లీగ్ ఇవాళ (మార్చి 26) ప్రారంభమైంది. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇంధన సంక్షోభం ఏర్పడటంతో ఈ లీగ్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అవి కూడా కేవలం రెండు వేదికల్లో మాత్రమే జరుపుతున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని లాహోర్ ఖలందర్స్, మార్నస్ లబూషేన్ నేతృత్వంలోని కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కింగ్స్‌మన్ తలపడుతున్నాయి. -
పాకిస్తాన్ మర్యాద తీసి పారేసిన గిల్లెస్పీ
ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ మర్యాద తీసి పారేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా ఏర్పడిన హైదరాబాదు కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను.. ఫ్రాంచైజీ తరఫున రూపొందించే వెల్కమ్ వీడియోలో పాల్గొనడానికి నిరాకరించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన స్టుపిడ్ అని పిలుస్తూ పాక్ అభిమానులు, ఫ్రాంచైజీ యాజమాన్యం మనోభావాలను దెబ్బ తీశాడు. గిల్లెస్పీ నుంచి ఈ ఊహించని చర్యకు పాక్ క్రికెట్ అభిమానులు తొలుత షాక్ అయ్యారు. ఆతర్వాత ఫైరవవుతన్నారు.వాస్తవానికి గిల్లెస్పీ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో అతను పాక్ జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేసినప్పుడు పీసీబీ వల్ల చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అవి మనసులో పెట్టుకునే అతను ఇలా ప్రవర్తించి ఉంటాడని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి.కాగా, కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ నిన్న తమ ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గిల్లెస్పీ కూడా కనిపించినప్పటికీ, హోటల్ లాబీకి రావడానికి ఆయన నిరాకరించారు. నాకు చాలా పని ఉంది. మీరు ఆ మూర్ఖమైన వీడియోలు తీయమని అంటున్నారు. నేను చేయను అని స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మార్నస్ లాబుషేన్ నాయకత్వంలో మార్చి 26న లాహోర్ ఖలందర్స్‌తో తమ తొట్ట తొలి పీఎస్ఎల్ మ్యాచ్ ఆడనుంది. ఇంధన సంక్షోభం కారణంగా PCB ఈ టోర్నీని పరిమిత వేదికలలో, ప్రేక్షకులు లేకుండా నిర్వహించనుంది. -
ఆ స్టుపిడ్ వీడియోలు వద్దు: కోచ్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పి మరోసారి పాకిస్తాన్ క్రికెట్లో భాగమయ్యాడు. గతేడాది పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి ఈ మాజీ పేసర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు. తనకు చెప్పకుండానే సీనియర్ అసిస్టెంట్ కోచ్‌పై వేటు వేశారని.. అవమానాన్ని భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.హైదరాబాద్ కింగ్స్‌మెన్ కోచ్గాఅయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో గిల్లెస్పి భాగం కావడం విశేషం. మార్చి 26న తాజా ఎడిషన్ ఆరంభం కానున్న తరుణంలో కొత్త ఫ్రాంఛైజీ హైదరాబాద్ కింగ్స్‌మెన్ కోచ్‌గా అతడు బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో జట్టుతో చేరిన అతడు హోటల్లో కెమెరామెన్తో సంభాషించిన తీరు వైరల్‌గా మారింది.ఫ్రాంఛైజీ క్రికెట్లో స్వాగత వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లు, కోచ్‌ల ఆగమనం నేపథ్యంలో వీడియోలు తీసి వాటికి ఎలివేషన్లు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫ్రాంఛైజీ వెల్కమ్ వీడియో తీస్తున్న క్రమంలో గిల్లెస్పి కీలక వ్యాఖ్యలు చేశాడు.స్టుపిడ్ వెల్కమ్ వీడియోలు వద్దు‘‘నేనేమీ కిందకు రావడం లేదు. నాకు చాలా పని ఉంది. ఇలాంటి స్టుపిడ్ వెల్కమ్ వీడియోలు నేను చేయను’’ అంటూ పై అంతస్తులో ఉన్న గిల్లెస్పి వ్యాఖ్యానించాడు. తనకు పని ఎక్కువగా ఉందని.. కాబట్టి ఇలాంటి వాటిలో తాను భాగం కాలేనని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🚨 ANOTHER EMBARRASSMENT FOR PSLJason Gillespie refuses to shoot CRINGE 'WELCOME VIDEOS'"I am not coming down. I have a lot of work to do. I'm not gonna shoot those stupid welcome videos."Man chose actual work over scripted cringe. Priorities. 🤣🤡 pic.twitter.com/iYmDhcFRKN— Brutal Truth (@sarkarstix) March 24, 2026ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గిల్లెస్పి పేర్కొన్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఏమాత్రం సమయం వృథా చేయకుండా శిక్షణపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్‌లోనూ గందరగోళం నెలకొంది. అఫ్గనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2026 నిర్వహణ విషయంలో బోర్డు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది.ప్రేక్షకులు లేకుండానే..ఆరంభ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించమని.. కరాచీ, లాహోర్లలో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ భద్రతా ముప్పు ఉందని భావిస్తే PSLలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని అమినుల్ వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు PSLలో పాల్గొనేందుకు NOCలు జారీ చేసినట్లు సమాచారం.బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఈ విషయం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్‌బజ్‌తో మాట్లాడారు. ‘‘విదేశాంగ శాఖతో మేము చర్చలు జరిపాము. ఇస్లామాబాద్‌లో ఉన్న మా హై కమిషన్‌ను కూడా సంప్రదించాము. వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే PSLలో ఆడేందుకు మా ఆటగాళ్లకు అనుమతి ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.కాగా మరోసారి ఐపీఎల్‌కు పోటీగా పాక్ బోర్డు PSLను నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 26న తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ తదితరులు ఈ సీజన్లో భాగం కానున్నారు.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వాహకులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ ఆటగాళ్లను హెచ్చరిస్తూ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్‌కు చెందిన జమాత్ ఉల్ అహ్రార్ పంచుకున్న లేఖను ఇస్లామాబాద్ పోస్ట్ తన ‘ఎక్స్’లో పంచుకుంది. ‘కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కైబర్ పంక్తున్వా, బెలూచిస్థాన్ ఫ్రావిన్స్‌కు చెందిన అమాయక ప్రజలపై పాకిస్థాన్ అమానుష దాడులకు పాల్పడుతుంది. మా ప్రజలపై వారు చేస్తున్న దాష్టీకాలన్నింటిని గమనిస్తూనే ఉన్నాం. త్వరలోనే పాకిస్థాన్‌కు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లకు ఇదే మా హెచ్చరిక. పీఎస్ఎల్ ఆడేందుకు పాకిస్థాన్‌కు రావొద్దు. ఇక్కడి పరిస్థితులు అంతగా బాలేవు. కాబట్టి ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము. నిజానికి మేము క్రికెట్‌కు వ్యతిరేకులం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పీఎస్ఎల్ నిర్వహించడం మంచిది కాదు. పీఎస్ఎల్ ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు అవనసరంగా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. కాబట్టి పాకిస్థాన్‌కు రాకపోవడమే మంచిది. ఒకవేళ వస్తే పాక్ విడిచి వెళ్లిపోతే మంచిదని మా అభిప్రాయం.’ అని లేఖలో పేర్కొంది. పశ్చియాసియా యుద్ధం, అఫ్గానిస్థాన్‌తో వైరం కారణంగా పీఎస్ఎల్లో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతలో పాకిస్థాన్ వ్యతిరేక శక్తుల నుంచి లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భద్రతా, ఇతర కారణాల రీత్యా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్కు గుడ్‌బై చెబుతున్నారు. షనక, ముజరబానీ, స్పెన్సర్ జాన్సన్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్ఎల్లో ఈసారి ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా మొయిన్ అలీ (ఇంగ్లండ్), డెవన్ కాన్వే (న్యూజిలాండ్) ఇలా చాలా మందే ఉన్నారు. కానీ తాజా బెదిరింపులతో అసలు పీఎస్ఎల్ సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.చదవండి: 60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!🔴 JUST IN 🇵🇰 Armed opposition groups in Pakistan have issued a statement urging all foreign players participating in the Pakistan Super League (PSL) cricket matches to avoid traveling to Pakistan, stating that their security is not guaranteed and there is a risk of harm.The… pic.twitter.com/caf7Tim1ep— Islamabad Post (@ISBPost) March 23, 2026 -
క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!
పశ్చిమాసియాలో భీకర యుద్ధం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై ప్రభావం చూపిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఇంధన ధరలు పెరగడం ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని పీఎస్ఎల్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ క్రికెట్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. 'పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో పాకిస్థాన్ ప్రజలందరూ తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని ప్రధాని కోరారు. పరిస్థితులన్నింటిని గమనించి, మా భద్రతా సంస్థలతో చర్చించిన తర్వాతే ప్రేక్షకులు లేకుండా పీఎస్ఎల్ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. 10 నుంచి 15 రోజుల పాటు పీఎస్ఎల్లో అన్ని మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతాయి. ఫైనల్ వరకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఆలోచిస్తాం. ఇక టోర్నీ మొత్తం కూడా లాహోర్, కరాచీ వేదికల్లోనే జరుగుతుంది. అంతేకాదు చమురు సంక్షోభం కారణంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేశాము. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తుండడంతో గేట్ రెవెన్యూలో వచ్చిన నష్టానికి ఫ్రాంచైజీలకు నష్టపరిహారం చెల్లించనున్నాం. అఫ్గానిస్థాన్‌కు సరిహద్దుగా ఉండడంతో పెషావర్ స్టేడియంను మ్యాచ్‌ల నిర్వహణ నుంచి తొలగించినందుకు కూడా నఖ్వీ క్షమాపణలు చెబుతున్నా' అంటూ పేర్కొన్నాడు.చదవండి: లక్నో సూపర్‌జెయింట్స్ కథ మారేనా? -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు!
టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించడంతో.. భారత్‌లో జరిగే తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడమని బీసీబీ మొండికేసింది.భద్రతా కారణాలు సాకుగా..ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ వేదికను మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే, ఈ విషయంలో తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని నాటకాలాడిన పాక్.. తర్వాత భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది.బంగ్లాదేశ్ సహా ఇతర బోర్డుల నుంచి ఒత్తిడి, ఐసీసీ హెచ్చరికలతో పాక్ యూటర్న్ తీసుకుంది. భారత్‌తో కూడా మ్యాచ్ ఆడి.. అందులో ఓడి సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) షెడ్యూల్‌ను పాక్ బోర్డు ప్రకటించింది.ఎన్ఓసీ ఇచ్చినా..ఇక బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్ (లాహోర్ ఖలందర్స్), షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ (పెషావర్ జల్మీ) పీఎస్ఎల్ వేలంలో అమ్ముడుపోయారు. అయితే, వీరికి బంగ్లా బోర్డు పీఎస్ఎల్లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చినప్పటికీ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఇటీవల అఫ్గనిస్తాన్‌పై వైమానిక దాడులు చేయగా.. సుమారుగా 400 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీబీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ ప్లేయర్లను పాకిస్తాన్‌కు పంపాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.ప్రభుత్వం చెప్పినట్లే వింటాముఈ విషయం గురించి బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదిన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు ఆటగాళ్లను పంపే విషయంలో మేము ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు పూర్తిగా తెలియదు. అందుకే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాము’’ అని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యమని పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం పీఎస్ఎల్లో ఆడేందుకు వెళ్లే తమ ఆటగాళ్లను భద్రత విషయమై హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ విదేశీ ఆటగాళ్లు దూరమైతే పీఎస్ఎల్కు ఉన్న ఆ మాత్రం ఆదరణ కూడా కరువయ్యే అవకాశం ఉంది.చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు' -
పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక!
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సందిగ్ధంలో పడింది. తాజాగా అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా చాలా మంది ఆసీస క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. తాజాగా ఆసీస్ ఆటగాళ్లు పీఎస్ఎల్లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది. అయితే పెషావర్ జాల్మీ పేరుతో పీఎస్ఎల్లో ఒక జట్టు ఉండడంతో కచ్చితంగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే పాక్-ఆఫ్గన్ యుద్ధం కారణంగా పెషావర్ ప్రస్తుతం ‘నో ట్రావెల్ జోన్’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్‌లు ఆడేందుకు పెషావర్‌కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్ క్రికెట్ బోర్డు భయపడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 28న పెషావర్ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్‌కు పెషావర్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. పెషావర్ జాల్మీ జట్టులోనే ఆరోన్ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్ ప్రేజర్ మెక్‌గుర్క్ ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్‌ో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్ఎల్ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్ఎల్ సీజన్‌కు తెరలేవనుంది.చదవండి: ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా! -
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు! స్టార్ ప్లేయర్‌పై పీసీబీ సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీపై పాక్ క్రికెట్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముజారబానీ వాస్తవానికి ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది.వెస్టిండీస్ పేసర్ షమీర్ జోసెఫ్ స్థానంలో ముజారబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజారబానీ తన మనసు మార్చుకున్నాడు.పీఎస్ఎల్ బదులుగా ఐపీఎల్లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో ముజారబానీని కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ముజారబానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు సమాచారం.ఏడాది పాటు పీఎస్ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోందంట. కాగా పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్ వైపు ఆటగాళ్లు వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కోర్బిన్ బాష్ ఇలాగే పెషావర్ జల్మీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరారు.దీంతో పీసీబీ అతడిపై ఏడాది నిషేధం విధించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరగనుండడంతో ఈ సమస్య తలెత్తుంది. పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అక్కడికి రెండు రోజులకే ఐపీఎల్ షురూ కానుంది.చదవండి: BAN vs PAK: 'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్ ఫైర్ -
వెస్టిండీస్ స్టార్ సంచలన నిర్ణయం
వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్ జట్టుతో పాటు పశ్చిమ ఆసియాలో యుద్దం కారణంగా వారం రోజుల పాటు భారత్‌లో చిక్కుకుపోయాడు. ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్ తీసుకోడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది.మోతీతో పాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది వ్యవహరించనున్నాడు.లాహోర్ ఖలందర్స్ జట్టు ఇదేఫఖార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఆసిఫ్ అలీ, తయ్యాబ్ తాహిర్, సికందర్ రాజా, దసున్ షనక, హుస్సేన్ తలత్, డేవిడ్ వీస్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉసామా మీర్, సామ్ బిల్లింగ్స్, హసీబుల్లా ఖాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, దునిత్ వెల్లలాగే చదవండి: IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్? -
న్యూజిలాండ్ సభ్యుల సాహసోపేత నిర్ణయం
న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టులోని కీలక సభ్యులు జేకబ్ ఓరమ్ (బౌలింగ్ కోచ్), లూక్ రాంచీ (బ్యాటింగ్ కోచ్) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విధులు కాదని పరాయి దేశ ఫ్రాంచైజీ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు ప్రాధాన్యమిచ్చారు. వీరి అభీష్టానికి ఆ దేశ క్రికెట్ బోర్డు అడ్డు చెప్పకపోగా, అనుమతి ఇవ్వడం ఆసక్తికరం.ఓరమ్, రాంచీ త్వరలో ప్రారంభం కానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఎడిషన్ (మార్చి 26) కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీతో పని చేయనున్నారు. రాంచీ హెడ్ కోచ్‌గా.. ఓరమ్ అదే ఫ్రాంచైజీకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తారు. రాంచీ గతంలో పీఎస్ఎల్లో మూడు సీజన్లు ఆటగాడిగా కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఓరమ్, రాంచీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే సమయంలో న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్.. ఆతర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది.ఓరమ్, రాంచీ జాతీయ జట్టు విధుల మీద ప్రైవేట్ లీగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని న్యూజిలాండ్ క్రికెట్లోని కీలక వ్యక్తి సమర్దించాడు. ఇది వారి కోచింగ్ అనుభవాన్ని పెంచుకునే గొప్ప అవకాశమని అన్నాడు. ఓరమ్, రాంచీ గైర్హాజరీలో రాబోయే సిరీస్‌లకు ప్రత్యామ్నాయ కోచ్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జానీ బాసెట్-గ్రాహమ్, గ్రేమ్ ఆల్డ్రిడ్జ్.. బంగ్లాదేశ్ పర్యటనకు అదనంగా బ్రెండన్ డాంకర్స్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్‌కు డిప్యూటీలుగా పని చేస్తారని తెలిపాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్ బ్యాటర్ రూబిన్ హెర్మన్ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది.ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రెండో సౌతాఫ్రికన్‌గా హెర్మన్ గుర్తింపు పొందాడు. గతేడాది చివర్లో డుప్లెసిస్ ఐపీఎల్ వేలం నుంచి తప్పుకొని పీఎస్ఎల్లో చేరాడు. 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో దాదాపు 4,800 పరుగులు చేసిన డుప్లెసిస్, పీఎస్ఎల్ ఆడటం అప్పట్లో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్ విండోలో మరో సౌతాఫ్రికా ఆటగాడు పీఎస్ఎల్లో పాల్గొంటుండటం ఆసక్తికరం.హెర్మన్ ప్రదర్శనలు 29 ఏళ్ల హెర్మన్ CSA T20 ఛాలెంజ్ 2023-24లో 436 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత SA20లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడాడు. 2025 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్పై ఒత్తిడిలో 81* పరుగులు చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 226 పరుగులు చేశాడు. మొత్తం టీ20 కెరీర్లో హెర్మన్ 1,497 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 8 అర్ద శతకాలు ఉన్నాయి.లాహోర్ జట్టు వ్యూహం లాహోర్ జట్టు ఇప్పటికే ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్, హసీబుల్లా ఖాన్ వంటి స్థానిక ఆటగాళ్లను కలిగి ఉంది. హెర్మన్ చేరికతో ఆ ఫ్రాంచైజీ బ్యాటింగ్ బలం మరింత పెరుగనుంది. హెర్మన్ మిడిలార్డర్లో కీలకమైన బ్యాటర్. అతన్ని 5 లేదా 6వ స్థానంలో ఉపయోగించుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయడం, డెత్ ఓవర్లలో బౌండరీలు కొట్టడం హెర్మన్ ప్రత్యేకత. -
మ్యాక్స్‌వెల్‌కు బంపరాఫర్.. హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తొలిసారి కనిపించబోతున్నాడు. ఆ లీగ్‌లో కొత్త ఫ్రాంచైజీ 'హైదరాబాద్ హ్యూస్టన్ కింగ్స్‌మన్ బోల్స్టర్' 2026 ఎడిషన్ కోసం మ్యాక్సీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.తమతో జతకట్టిన సందర్భంగా హైదరాబాద్ ఫ్రాంచైజీ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంగ్లీష్‌లో పెద్దపెద్ద పదాలు (విధ్వంసకర బ్యాటింగ్‌కు సంబంధించి) ఉపయోగించి ఆకాశానికెత్తింది. అసాధ్యం అనే పదం మ్యాక్సీ నిఘంటువులో లేదు. అతని ప్రవేశంతో పీఎస్ఎల్లో అతిపెద్ద షో మొదలవుతోందంటూ తమ సోషల్‌మీడియా అకౌంట్లో డప్పు కొట్టింది.వాస్తవానికి సదరు ఫ్రాంచైజీ ఇస్తున్న హైప్‌కు ప్రస్తుత మ్యాక్సీ ఫామ్‌కు అస్సలు పొంతన లేదు. మ్యాక్స్‌వెల్ ఇటీవలికాలంలో కెరీర్లో ఎన్నడూ లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అతను.. అక్కడ కూడా పేలవమైన ప్రదర్శనలు కొనసాగించాడు. ఈ మెగా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. జట్టు పరంగా, వ్యక్తిగతంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మ్యాక్స్‌వెల్‌కు హైదరాబాద్ ఫ్రాంచైజీ బంపరాఫర్ ఇచ్చింది.ఐపీఎల్లో పట్టించుకునే నాథుడే లేడుఎటూ ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకునే ఆవకాశం లేకపోవడంతో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనలేదు. గత కొన్ని ఎడిషన్లుగా అతను ఐపీఎల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్ని ఫ్రాంచైజీలు మారినా అదే పరిస్థితి. పేలవ ఫామ్, వయసు మీద పడటంతో అంతర్జాతీయ క్రికెట్లో మ్యాక్స్‌వెల్ శకం ముగిసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించాడు. కెరీర్లో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న మ్యాక్సీ.. పీఎస్ఎల్లోనైనా రాణిస్తాడో లేక కెరీర్‌కు ముగింపు పలుకుతాడో వేచి చూడాలి. కాగా, పీఎస్ఎల్ 2026 ఎడిషన్ మార్చి 26 నుంచి మే 3 వరకు జరుగుతుంది. -
ఆసీస్‌కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్ బ్లెసింగ్ ముజరబానీకి బంపరాఫర్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వెస్టిండీస్ స్టార్ పేసర్ షమార్ జోసెఫ్ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. షమార్ జోసెఫ్‌పై వేటుకాగా మార్చి 26న పాక్ సూపర్ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్ జోసెఫ్‌పై వేటు వేసింది. ఈ విండీస్ పేసర్ స్థానంలో జింబాబ్వే స్టార్ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. షమార్ జోసెఫ్‌ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్ యునైటెడ్ నోరు విప్పలేదు. అటు జోసెఫ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది.కారణం అదేనా?కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. సత్తా చాటిన షమార్ జోసెఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు షమార్ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీఇక జింబాబ్వే రైటార్మ్ పేసర్ బ్లెసింగ్ ముజరబానీకి పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ ఇంగ్లిస్ (8), టిమ్ డేవిడ్ (0), మ్యాట్ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్‌కప్ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
ఐపీఎల్లో అమ్ముడుపోని వారిపై పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కనకవర్షం
ఐపీఎల్ 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కనకవర్షం కురిసింది. పీఎస్ఎల్లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఉన్నారు.ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోక, పీఎస్ఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు ఐపీఎల్ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్ఎల్లో మాత్రం మిచెల్‌పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.ఆడమ్ జంపా: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ఐపీఎల్ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.రిలీ రొస్సో: ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.పీఎస్ఎల్-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. మార్క్ చాప్మన్- 7 కోట్లు (పాక్ కరెన్సీలో)ఆస్టన్ టర్నర్- 4.2 కోట్లుమైఖేల్ బ్రేస్‌వెల్- 4.2 కోట్లుకుసాల్ మెండిస్- 4.2 కోట్లుటామ్ కర్రన్- 4.2 కోట్లుకుసాల్ పెరీరా- 3.1 కోట్లుజేమ్స్ విన్స్- 3 కోట్లురిషద్ హొసేన్- 3 కోట్లు వీరితో పాటు పీటర్ సిడిల్, జోష్ ఫిలిప్, తబ్రేస్ షంషి, జాన్సన్ ఛార్లెస్, మ్యాక్స్ బ్రయాంట్, షమార్ జోసఫ్, ఓట్నీల్ బార్ట్‌మన్, గుడకేశ్ మోటీ, రిచర్డ్ గ్లీసన్, బెన్ మెక్‌డెర్మాట్, దసున్ షనక, సామ్ హార్పర్, బెవాన్ జాకబ్స్ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్ఎల్ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.పీఎస్ఎల్లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్ అల్ హసన్, కైల్ మేయర్స్, కొలిన్ మున్రో, అల్జరీ జోసఫ్, జేమ్స్ నీషమ్, జేసన్ రాయ్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, డేవిడ్ మలాన్, కేశవ్ మహారాజ్ తదితరులు ఉన్నారు. -
బంగ్లాదేశ్ కెప్టెన్‌కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్‌ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్‌తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్‌లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్‌ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్‌కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్‌రౌండర్‌ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది. -
ఐపీఎల్ పొమ్మంది.. పీఎస్ఎల్ రమ్మంది! ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో లాహోర్ ఖలందర్స్ తరపున ముస్తాఫిజుర్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ వేలానికి ముందు అతడిని రూ. 2.08 కోట్లకు (పీకేర్ 6.44 కోట్లు) లాహోర్ ఒప్పందం కుదుర్చుకుంది.ఈ విషయాన్ని లాహోర్ ఖలందర్స్ ఓనర్ సమీన్ రానా ధ్రువీకరించాడు. "ముస్తాఫిజుర్ లాహోర్ ఖలందర్స్ ఫ్యామిలీలో ఎల్లప్పుడూ భాగమే. అతడు తిరిగి మా జట్టులో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని" సమీన్ రానా పేర్కొన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ముస్తాఫిజుర్ ప్రాతినిథ్యం వహించడం ఇదే మూడవసారి కావడం గమనార్హం. రూ. 7.12 కోట్ల నష్టంకాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్లకు దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడుల నేపథ్యంలో అతడిని జనవరి 3న బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి బంగ్లా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత్‌లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో రంగంలోకి దిగిన ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నించింది. కానీ బీసీబీ మాత్రం తమ పట్టును వీడలేదు. ఫలితంగా ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఏదేమైనప్పటికి రెండు దేశాల ఉద్రిక్తలకు ముస్తాఫిజుర్ బలైపోయాడు. అతడు ఐపీఎల్లో ఆడి ఉంటే రూ. 9.20 కోట్లు దక్కేవి. కానీ ఇప్పుడు పీఎస్ఎల్ ఒప్పందం కారణంగా ముస్తాఫిజుర్‌కు కేవలం రూ. 2.08 కోట్లు లభించనున్నాయి. దీంతో అతడు దాదాపు రూ. 7.12 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుంది. స్టీవ్‌ను రానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎడిషన్ కోసం సియాల్కోట్ స్టాలియన్జ్ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్ స్టీవ్‌ను డైరెక్ట్ సైనింగ్ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఈ వార్త పాక్ అభిమానుల సోషల్‌మీడియా గ్రూప్‌ల్లో హల్చల్ చేస్తుంది. పాక్ ఫ్యాన్స్ స్టీవ్‌కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్ ఇప్పటివరకు పీఎస్ఎల్లో ఆడలేదు. స్టీవ్ రాక పీఎస్ఎల్కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.తాజాగా ముగిసిన బిగ్ బాష్ లీగ్ (BBL) 15వ సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతూ 6 మ్యాచ్‌ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్ రేట్ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్లో 272 మ్యాచ్‌లు ఆడిన స్టీవ్.. 6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ తదుపరి ఎడిషన్ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్‌ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్, కామిల్ ఖాన్) స్టాలియన్జ్‌ను రూ.1.85 బిలియన్ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది. -
ఇదీ మీ స్థాయి: పాక్ బోర్డును ఏకిపారేస్తున్న నెటిజన్లు
ఫ్రాంఛైజీ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణే వేరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆశపడతాడనడంలో సందేహం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరింత సంపన్నం కావడానికి ఐపీఎల్ ప్రధాన కారణం.ఐపీఎల్ కంటే తమదే గొప్ప లీగ్ అంటూ..మరోవైపు.. దాయాది దేశం కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పేరిట టీ20 లీగ్ నిర్వహిస్తోంది. అయితే, కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు ఐపీఎల్‌తో పీఎస్ఎల్ను ముడిపెట్టి అభాసుపాలయ్యారు. ఐపీఎల్ కంటే తమదే గొప్ప లీగ్ అని హెచ్చులకు పోయి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్, అందులో భాగమైన ఆటగాళ్ల స్థాయి ఏమిటో చాటేలా తాజా పీఎస్ఎల్కు సంబంధించిన మరో అంశం తెరమీదకు వచ్చింది.హైదరాబాద్ ఫ్రాంఛైజీ@రూ. 55.57 కోట్లుపాక్ సూపర్ లీగ్‌లో ఇప్పటి వరకు ఆరుజట్లు పాల్గొంటుండగా.. గురువారం రెండు కొత్త జట్లకు బిడ్లు ఖరారయ్యాయి. సియాల్కోట్ ఫ్రాంఛైజీని ఓజీ డెవలపర్స్ 6.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 58.38 కోట్లు) సొంతం చేసుకోగా.. అమెరికాకు చెందిన ఎఫ్‌కేఎస్ గ్రూపు హైదరాబాద్ (పాక్) జట్టు కోసం 6.2 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 55.57 కోట్లు) వెచ్చించింది.ఐపీఎల్లో ఒక ఫ్రాంఛైజీ విలువ రూ. వేల కోట్లలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటిది పీఎస్ఎల్లో మాత్రం కనీసం వంద కోట్లు కూడా దాటలేదు. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్రాంఛైజీ విలువ.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ల జీతం మొత్తానికి దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం.పంత్, అయ్యర్ జీతం కలిపితే..ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేయగా.. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. వీరిద్దరి సాలరీ కలిపితే పీఎస్ఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ విలువకు సమానం అన్నమాట. ఈ గణాంకాలను షేర్ చేస్తూ.. ‘‘ఇదీ మీ స్థాయి’’ ఐపీఎల్‌తో పీఎస్ఎల్ను పోల్చే పాక్ మాజీ ఆటగాళ్లకు టీమిండియా అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా ఈసారి కూడా ఐపీఎల్‌కు పోటీగా మార్చి 26 నుంచే పీఎస్ఎల్ మొదలుకానుంది. గతంలోనూ ఇలాగే పోటీకి వచ్చి రేటింగ్లేక వెలవెలబోయింది.చదవండి: సరికొత్త ‘తలనొప్పి’గా సర్ఫరాజ్ ఖాన్.. సెలక్టర్లకు సవాల్ -
ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం
ఐపీఎల్-2026 నుంచి తొలగించబడ్డ బంగ్లాదేశీ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ అని అంటున్నాడు. ముస్తాఫిజుర్ కేకేఆర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ ఆదేశాలతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసిన తర్వాత ముస్తాఫిజుర్ పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ముస్తాఫిజుర్ చివరిగా 2017-18 సీజన్లో పీఎస్ఎల్ ఆడాడు. ఆ సీజన్లో అతను లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కాగా, ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరం కావడం.. ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్ అయిన ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడం జరిగిపోయాయి. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌కు పంపించబోమని అంటుంది. బంగ్లాదేశ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ వేదికపై ఆ దేశ క్రికెట్ జట్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. -
కేకేఆర్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం
కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ తనను వదిలించుకోవడంతో ఐపీఎల్ మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి సీజన్ వేలంలోనూ తన పేరు కూడా నమోదు చేసుకోలేదు.కేకేఆర్ వద్దనుకోవడంతో మనస్థాపం చెందినట్లున్న మొయిన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈమేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. పీఎస్ఎల్ 2026కి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.మొయిన్ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నాడు. 2020లో చివరిగా అతను ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీకి ఆడాడు.కాగా, ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ మొయిన్‌తో పాటు చాలామంది స్టార్ ఆటగాళ్లను వదిలేసింది. ఆ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఆటగాళ్లలో టీ20 దిగ్గజం ఆండ్రీ రసెల్ కూడా ఉన్నాడు.రసెల్‌తో పాటు గత సీజన్ వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్‌ను సైతం కేకేఆర్ వదిలేసింది. వీరితో పాటు టీ20 స్పెషలిస్ట్‌లు అయిన డికాక్, స్పెన్సర్ జాన్సన్, నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్‌ను కూడా వేలానికి వదిలేసింది.దిగ్గజాన్నే వదిలేసింది, మొయిన్ ఎంత..?మొయిన్‌ను కేకేఆర్ వదిలేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. వయసు పైబడటంతో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత సీజన్లో అతను లభించిన అడపాదడపా అవకాశాలను పెద్దగా సద్వినయోగం చేసుకోలేకపోయాడు. రసెల్ లాంటి దిగ్గజాన్నే సైతం వదులుకున్న కేకేఆర్‌కు మొయిన్‌ను సాగనంపడం పెద్ద సమస్యేమీ కాలేదు. -
రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
అఫ్గనిస్తాన్ టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో తెగదెంపులు చేసుకున్నట్లు అతడు సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ వైమానిక దాడిలో అఫ్గన్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రషీద్ ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అఫ్గనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్తాన్ శుక్రవారం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృత్యువాత పడగా.. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు ఉన్నారు. వీరిని కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్గా గుర్తించారు.మానవ హక్కుల ఉల్లంఘనపక్తికా రాజధాని షరానాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ స్పందిస్తూ.. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించాడు. ‘‘అఫ్గనిస్తాన్‌లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.దేశమే ముఖ్యంఇదొక చట్టవ్యతిరేక చర్య. మానవ హక్కుల ఉల్లంఘన. ఇందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. పాకిస్తాన్‌తో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతూ అఫ్గన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రషీద్ ఖాన్ ఈ సందర్భంగా సమర్థించాడు. బోర్డు నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నానని.. అన్నిటికంటే దేశ సమగ్రతే ముఖ్యమని పేర్కొన్నాడు.డిలీట్ కొట్టేశాడుతాజాగా రషీద్ ఖాన్ మరో నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా బయోలో అతడు చేసిన మార్పు ద్వారా స్పష్టమవుతోంది. 27 ఏళ్ల ఈ వరల్డ్‌క్లాస్ స్పిన్నర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021లో ఈ జట్టుతో చేరిన రషీద్.. మూడు టైటిళ్లు గెలిచాడు. గతేడాది కూడా ఇదే జట్టు ట్రోఫీ గెలుచుకుంది.అయితే, తన ఎక్స్ ఖాతా బయో నుంచి ఈ జట్టు పేరును రషీద్ తొలగించాడు. అఫ్గన్ బోర్డుతో పాటు గుజరాత్ టైటాన్స్, బిగ్‌బాష్ లీగ్ స్ట్రైకర్స్, ఇన్సిగ్నియా స్పోర్ట్స్ అనే అకౌంట్లను బయోలో కొనసాగించిన రషీద్.. లాహోర్ ఖలందర్ పేరును మాత్రం డిలీట్ చేశాడు. తద్వారా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను బాయ్‌కాట్ చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్ వక్రబుద్ధి తగిన విధంగా.. ఇలాగే బుద్ది చెప్పాలంటూ రషీద్ చర్యను అభినందిస్తున్నారు.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్ -
ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లు ఇవే.. ఐపీఎల్ తర్వాత అదే!
క్రికెట్లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ హవా నడుస్తోంది. పొట్టి క్రికెట్‌ను చూసేందుకు నవతరం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఆటగాళ్లు రెండు చేతులా సంపాదించుకుండగా.. ఆయా బోర్డులపై కూడా కనక వర్షం కురుస్తోంది.స్పాన్సర్‌షిప్‌లు. టీవీ ప్రసార హక్కులు, టికెట్ల విక్రయం తదితర మార్గాల ద్వారా బోర్డులు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లీగ్‌లే ప్రపంచ క్రికెట్ మార్కెట్‌ను ఏలుతున్నాయి. మరి 2025 నాటికి పేరెన్నికగన్న ధనిక పొట్టి లీగ్‌లలో టాప్-10లో ఉన్న లీగ్‌లు ఏవో తెలుసా?!ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)సందేహమే అక్కర్లేదు.. అవును.. ప్రపంచ టీ20 మార్కెట్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. 2008లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీనిని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేటి జట్ల ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో భాగమవుతూ.. కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు.ఎంతో మంది యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చి జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా పేరున్న ఐపీఎల్ కేవలం బ్రాడ్కాస్ట్ డీల్స్ ద్వారానే 6.2 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్ విలువ- 11 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపుగా 94, 220.5 కోట్ల రూపాయలు) వరకు ఉంటుందని అంచనా.రెండో స్థానంలో ఐఎల్టీ20 (ILt20)నెట్వర్త్పరంగా ఐపీఎల్ తర్వాతి స్థానం యూఏఈ వేదికగా సాగే ఇంటర్నేషనల్ లీగ్టీ20ది. మధ్య ప్రాచ్చ దేశాల పెట్టుబడి, ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎల్టీ20 విలువ 15 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 128.64 కోట్లు) అని తెలుస్తోంది. పన్ను లేని కాంట్రాక్టులు మేటి క్రికెటర్లను కూడా ఐఎల్టీ20 వైపు ఆకర్షిస్తున్నాయి.సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20)2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. హైదరాబాద్ (సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్), లక్నో (డర్బన్ సూపర్ జెయింట్స్), రాజస్తాన్ (పర్ల్ రాయల్స్), ఢిల్లీ (ప్రిటోరియా క్యాపిటల్స్), చెన్నై (జొబర్గ్ సూపర్ కింగ్స్), ముంబై (ఎంఐ కేప్‌టౌన్)ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ లీగ్ విలువ 12 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 102.79 కోట్లు) అని అంచనా.బిగ్‌బాష్ లీగ్ (BBL)ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీ20 లీగ్ నికర విలువ పది మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 85. 65 కోట్లు)వరకు ఉంటుందని తెలుస్తోంది.ది హండ్రెడ్ఇంగ్లండ్ వేదికగా సాగే 100 బాల్ టోర్నీ ‘ది హండ్రెడ్ లీగ్’ వాల్యూ తొమ్మిది మిలియన్ డాలర్లు (సుమారు రూ. 77.08 కోట్లు) అని అంచనా.మేజర్ లీగ్ క్రికెట్ (MLC)అమెరికాకు చెందిన ఈ పొట్టి లీగ్ విలువ 6.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 59.09 కోట్లు) అని సమాచారం.పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పాకిస్తాన్ సూపర్ లీగ్ నెట్‌వర్త్ 5.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 48.82 కోట్లు) అని అంచనా.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వాల్యూ 4.8 మిలియన్ డాలర్లు (సుమారు 41.11 కోట్ల రూపాయలు) అని తెలుస్తోంది.కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)ఈ వెస్టిండీస్ టీ20 లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల పెట్టుబడులు ఉన్నాయి. దీని నెట్‌వర్త్ 4.6 మిలియన్ డాలర్లు (సుమారు 39.40 కోట్లు) అని అంచనా.లంక ప్రీమియర్ లీగ్ (LPL)శ్రీలంకకు చెందిన ఈ పొటి ఫార్మాట్ లీగ్ వాల్యూ 3.98 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 34.09 కోట్లు) అని తెలుస్తోంది.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?! -
'అతడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.. మరి ఎప్పుడూ పాక్‌కు రానున్నాడు'
భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చకునేందుకు భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. తొలుత మంగళవారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం క్షిపణి దాడులు చేసింది.దీంతో పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. అంతేకాకుండా సరిహద్దులో ఉన్న నగరాలపై డ్రోన్ దాడి చేయడానికి యత్నించింది. కానీ భారత్ మాత్రం ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించి డ్రోన్స్‌ను, క్షిపణులను గాల్లోనే నేలకూల్చి దాయాదికి ధీటుగా సమాధనం చెబుతోంది. భారత్ కూడా పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.ఈ క్రమంలో భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ను పీసీబీ ఆకస్మికంగా నిలపివేసింది. ఈ టోర్నీలో భాగంగా మే 8(గురువారం) రావల్పిండి వేదికగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ తలపడాల్సింది. కానీ మ్యాచ్‌కు ముందు రోజు రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కూలిపోవడంతో పీసీబీ అప్రమత్తమైంది. వెంటనే ఆ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లను కూడా వాయిదా వేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన విదేశీ ఆటగాళ్లు సైతం తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ సస్పెన్షన్‌కు ముందు తమ పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ వివరించాడు. రెండు రోజుల పాటు భయందోళనకు గురైనట్లు రిషద్ హుస్సేన్ తెలిపాడు."ఆ దేవుడు దయవల్ల తీవ్ర ఉద్రిక్తల నడుమ మేము దుబాయ్‌కు చేరుకున్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేము లహోర్ నుంచి బయలు దేరిన 20 నిమిషాల తర్వాత విమానాశ్రయంపై మిస్సైల్ ఎటాక్ జరిగిందని దుబాయ్‌లో దిగాక తెలిసింది. ఆ వార్త విని మేము చాలా భయపడ్డాము. నా కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. బాంబు పేలుళ్లు, క్షిపణి దాడుల గురించి వారు తీవ్ర ఆందోళన చెందారు. నిరంతంరం మా ఫ్యామిలీతో టచ్‌లో ఉండేవాడిని. నా సహచర ఆటగాడు నహిద్ రాణా చాలా భయపడ్డాడు. నేను అతడికి టెన్షన్ పడొద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చాను. ఏదేమైనప్పటికి మేము దుబాయ్‌కి సురక్షితంగా చేరుకున్నాము. నహిద్ మాత్రమే కాదు ఇతర విదేశీ ఆటగాళ్లు సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ సైతం చాలా భయపడ్డారు. మరోసారి పాకిస్తాన్‌కు తాను తిరిగి రానని మిచెల్ నాతో చెప్పాడు. టామ్ కుర్రాన్ ఓ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ ఎయిర్పోర్ట్ మూసివేయబడింది. దీంతో అతడు చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. అతడిని మేమందరం ఓదార్చాము అని రిషద్ హుస్సేన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
పాకిస్తాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్ నిర్వహణకు యూఏఈ నో?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి."బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది. -
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. దుబాయ్ వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్‌లు?
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట దాయాది పాకిస్తాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.ఈ ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్ ను గాల్లోనే పేల్చివేశాయి. పాక్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లాహోర్ లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఓ డ్రోన్ కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మైదానంలో గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ జరగాల్సి ఉంది.షెడ్యూల్ ప్రకారం పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ తలపడాల్సింది. కానీ రావల్పిండిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు పీసీబీ లహోర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. పీఎస్ఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను వేరో చోటకు తరలించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా దోహాలను వేదికగా మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ భావిస్తోందంట. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అయితే టోర్నీని వేరో చోటకు మార్చడం పాకిస్తాన్‌కు అదనపు ఖర్చుతో కూడుకున్న వ్యవహరం. మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమి చేస్తుందో వేచి చూడాలి. -
Operation Sindoor: భయాందోళనలలో విదేశీ క్రికెటర్లు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు ఇవాళ (మే 8) పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇవాళ జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మ్యాచ్ రద్దైంది. ఈ లీగ్‌లో మున్ముందు జరగాల్సిన మ్యాచ్‌లపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.ఈ దాడి అనంతరం పీఎస్ఎల్ 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన దాదాపు 40 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్‌పై కన్నెర్ర చేయడంతో పీఎస్ఎల్ ఆడుతున్న విదేశీ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ దాడుల తీవ్రతను పెంచిన తర్వాత చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అయితే పాక్‌లో విమానాశ్రయాలు మూత పడటంతో వారు ఎటూ వెళ్లలేకపోతున్నారు. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.PSL 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు..ఇస్లామాబాద్ యునైటెడ్: ఆస్ట్రేలియా - మాథ్యూ షార్ట్, రిలే మెరిడిత్, బెన్ డ్వార్హుయిస్; న్యూజిలాండ్ - కాలిన్ మున్రో; దక్షిణాఫ్రికా - రాస్సీ వాన్ డెర్ డస్సెన్; యూఎస్ఏ - ఆండ్రీస్ గౌస్; వెస్టిండీస్ - జాసన్ హోల్డర్కరాచీ కింగ్స్: ఆఫ్ఘనిస్తాన్ - మొహమ్మద్ నబీ; ఆస్ట్రేలియా - డేవిడ్ వార్నర్, బెన్ మెక్‌డెర్మాట్; ఇంగ్లాండ్ - జేమ్స్ విన్స్; న్యూజిలాండ్ - టిమ్ సీఫెర్ట్, ఆడమ్ మిల్నే, కేన్ విలియమ్సన్.లాహోర్ ఖలందర్స్: బంగ్లాదేశ్ - రిషద్ హొస్సేన్; ఇంగ్లాండ్ - సామ్ బిల్లింగ్స్, టామ్ కుర్రాన్; నమీబియా - డేవిడ్ వైస్; శ్రీలంక - కుసల్ పెరెరా; న్యూజిలాండ్ - డారిల్ మిచెల్, జింబాబ్వే - సికందర్ రజా.ముల్తాన్ సుల్తాన్స్: ఆస్ట్రేలియా - ఆష్టన్ టర్నర్; ఇంగ్లాండ్ - డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్; న్యూజిలాండ్ - మైఖేల్ బ్రేస్‌వెల్; వెస్టిండీస్ - గుడకేష్ మోటీ, షాయ్ హోప్, ఐర్లాండ్ - జోష్ లిటిల్.పెషావర్ జల్మీ: ఆఫ్ఘనిస్తాన్ - నజీబుల్లా జద్రాన్; ఆస్ట్రేలియా - మాక్స్ బ్రయంట్, బంగ్లాదేశ్ - నహిద్ రానా, ఇంగ్లాండ్ - టామ్ కోహ్లర్-కాడ్మోర్; దక్షిణాఫ్రికా - లిజాడ్ విలియమ్స్, వెస్టిండీస్ - అల్జరీ జోసెఫ్.క్వెట్టా గ్లాడియేటర్స్: న్యూజిలాండ్ - ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, కైల్ జామీసన్; దక్షిణాఫ్రికా - రిలీ రోసౌ; వెస్టిండీస్ - అకేల్ హోసేన్ -
భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ కొడుకు హసన్ ఐసాఖిల్ స్వదేశంలో జరుగుతున్న ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో అమో రీజియన్‌కు ఆడతున్న 18 ఏళ్ల హసన్.. బాంద్-ఎ-అమీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 235 బంతుల్లో 143 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్లో హసన్‌కు ఇది తొలి సెంచరీ.ఈ మ్యాచ్‌లో హసన్ కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అంతకుముందు కమాల్ ఖాన్ (105), సెదిఖుల్లా పచా (77) కూడా సత్తా చాటడంతో అమో రీజియన్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది.అనంతరం బాంద్-ఎ-అమీర్ జట్టు ఓపెనర్ హరూన్ ఖాన్ (109) సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేయగలిగింది. అమో బౌలర్లలో సఖీ 4 వికెట్లు తీశాడు. 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమో టీమ్.. హసన్ సెంచరీతో సత్తా చాటడంతో 235 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 45 బంతుల్లో 150 పరుగులుహసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న హసన్ తండ్రి నబీ కొడుకుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ముచ్చట పడుతున్నాడు. -
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. కేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రారంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కేన్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పీఎస్ఎల్లోని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కేన్‌ను రూ. 86 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే కరాచీ కింగ్స్ ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది. కేన్ పీఎస్ఎల్లో తదుపరి మ్యాచ్‌లు వార్నర్ కెప్టెన్సీలో ఆడతాడు. కేన్ పీఎస్ఎల్లో ఆడటం ఇదే మొదటిసారి. పాక్ జట్టుతో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025కేన్ 2015 నుండి 2024 వరకు ఐపీఎల్లో ఆడాడు. 9 సీజన్లలో అతను అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఎక్కువ కాలం సన్‌రైజర్స్‌కు ఆడిన కేన్.. ఆ జట్టును 2018 సీజన్లో ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ సీజన్లో కేన్ 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. కేన్‌ను ఎస్ఆర్హెచ్ అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. కేన్‌ను 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్ వదిలేసింది. ఆతర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌తో జత కట్టాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా కేన్‌ను వదిలేసింది. మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా కేన్‌ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఘన చరిత్ర కలిగిన కేన్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 18 అర్ద సెంచరీల సాయంతో 2128 పరుగులు చేశాడు.పీఎస్ఎల్లో కేన్ సహా చాలామంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో అవకాశాలు రాకపోవడంతో వీరంతా పీఎస్ఎల్ పంచన చేరారు. పీఎస్ఎల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ (1.88 కోట్లు) కాగా.. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాపమన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జేమీసన్ ఓ మోస్తరు వేతనంతోనే సరిపెట్టుకున్నారు. పీఎస్ఎల్-2025లో కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌తో (ఏప్రిల్ 25) తలపడనుంది. ఈ మ్యాచ్‌తో కేన్ పీఎస్ఎల్ అరంగేట్రం చేస్తాడు. -
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా ఫీలయ్యే బాబర్ ఆజమ్ తన క్రికెటింగ్ ప్రస్థానంలో దినదినాభివృద్ధి చెందుతున్నాడు. గత కొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అదఃపాతాళానికి పడిపోయిన బాబర్.. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. పీఎస్ఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లో డకౌటైన బాబర్.. రెండో మ్యాచ్‌లో 1, మూడో మ్యాచ్‌లో 2, నిన్న (ఏప్రిల్ 21) జరిగిన నాలుగో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి పోటీ అని చెప్పుకునే బాబర్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూసి క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా 0, 1, 2, 46 స్కోర్లు చూసి బాబర్ దినదినాభివృద్ధి చెందుతున్నాడని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బాబర్ ఈ సీజన్లో కెప్టెన్‌గానూ తేలిపోయాడు. తన జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట ఓటమిపాలైంది. నిన్న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. విశేషమేమిటంటే పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమే (46) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
ఐపీఎల్ 2025కు పోటీగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా లేదు. ఆటగాళ్ల మెరుపులు లేకుండా దాయాది లీగ్ సప్పగా సాగుతుంది. ఏప్రిల్ 11న మొదలైన పీఎఎస్ఎల్ 2025లో నిన్నటికి (ఏప్రిల్ 20) పది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో కేవలం ఒకే ఒక మ్యాచ్ కాస్త ఆసక్తిగా సాగింది. ఏప్రిల్ 12న జరిగిన సీజన్ మూడో మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తలో సెంచరీ (మహ్మద్ రిజ్వాన్, జేమ్స్ విన్స్) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదొక్క మ్యాచే కాస్త ఆసక్తికరంగా సాగింది.ఏప్రిల్ 14న జరిగిన సీజన్ ఐదో మ్యాచ్ కూడా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం పెషావర్ జల్మీ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 141 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ మొత్తంలో ఇవే కాస్త చెప్పుకోదగ్గ ప్రదర్శనలు. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు పూర్తయినా కేవలం 14 హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. ఇస్లామాబాద్‌కు ఆడుతున్న విండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ (11) ఒక్కడే ఈ సీజన్లో సక్సెఫుల్ బౌలర్ అనిపించుకున్నాడు. కరాచీ కింగ్స్ బౌలర్ హసన్ అలీ (10) పర్వాలేదనిపించాడు.పాకిస్తాన్లో ఫ్లాట్ పిచ్‌లు ఉన్నా బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. 10 మ్యాచ్‌లు పూర్తయినా చెప్పుకోదగ్గ సిక్సర్లు కానీ బౌండరీలు కానీ నమోదు కాలేదు. ఇస్లామాబాద్ ఆటగాడు ఫర్హాన్ అత్యధిక సిక్సర్లు (11), అత్యధిక బౌండరీలు (25) కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. బాబర్ 3 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది (3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో జేమ్స్ విన్స్ మినహా విదేశీ ఆటగాళ్లు ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించడం లేదు. డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు కూడా తేలిపోతున్నాడు. కొలిన్ మున్రో, టిమ్ సీఫర్ట్, సామ్ బిల్లింగ్స్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంకర వీరులు కూడా అడపాదడపా ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. భారీ హిట్టర్‌గా పేరున్న రిలీ రొస్సో తడబడుతున్నాడు. లోకల్ హీరోలు సల్మాన్ అఘా, మహ్మద్ హరీస్, ఫకర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్లా షఫీక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్‌కు పోటీగా జరుగుతుంది. ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కాగా.. పీఎస్ఎల్ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఐపీఎల్‌తో పోటీపడే క్రమంలో ఈ సీజన్లో పీఎస్ఎల్ ఆటగాళ్ల పారితోషికాలకు భారీగా పెంచింది.గతంలో పీఎస్ఎల్లో విదేశీ ఆటగాళ్లు 2 కోట్లలోపు (భారత కరెన్సీలో), పాక్ ఆటగాళ్లు కోటిన్నర లోపు పారితోషికాన్ని అందుకున్నారు. అయితే ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 2.57 కోట్ల రూపాయలను పారితోషికంగా పొంది రికార్డు సృష్టించాడు. పీఎస్ఎల్ 2025లో వార్నర్‌దే అత్యధిక పారితోషికం. వార్నర్ తర్వాత అత్యధికంగా డారిల్ మిచెల్ రూ. 1.88 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడు. వార్నర్, మిచెల్ తర్వాత అత్యధిక పారితోషికాన్ని పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్, నసీం షా, మొహమ్మద్ రిజ్వాన్, మాథ్యూ షార్ట్, షాదాబ్ ఖాన్ అందుకుంటున్నారు. వీరింతా భారత కరెన్సీలో కోటి 88 లక్షలను పారితోషికంగా అందుకుంటున్నారు. ఈ సారి పీఎస్ఎల్లో స్థానిక ఆటగాళ్లకంటే విదేశీ ఆటగాళ్లకే అధిక పారితోషికం ఇవ్వడం విశేషం.భారత్‌లో జరిగే ఐపీఎల్‌తో పోలిస్తే.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆటగాళ్లకు లభించే పారితోషికం నామమాత్రమే. ఐపీఎల్-2025లో అత్యధిక ధర పొందిన రిషబ్ పంత్ పారితోషికంతో పోలిస్తే వార్నర్ పారితోషికం 10 శాతం లోపే. పంత్‌ను ఈ సీజన్లో మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో పంత్ అందుకుంటున్న మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం. వార్నర్ తొలుత ఐపీఎల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసి, అక్కడ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో పీఎస్‌ఎల్‌వైపు మళ్లాడు. ఈ సీజన్ వేలంలో అతన్ని కరాచీ కింగ్స్ సొంతం చేసుకుని కెప్టెన్సీ కూడా అప్పగించింది.పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికాలు పొందుతున్న ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)- 2.57 కోట్లు (భారత కరెన్సీలో)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుబాబర్ ఆజమ్ (పెషావర్ జల్మీ)- 1.88 కోట్లుఫకర్ జమాన్ (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుషాహీన్ అఫ్రిది (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుసైమ్ అయూబ్ (పెషావర్ జల్మీ)- 1.88 కోట్లునసీం షా (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుమొహమ్మద్ రిజ్వాన్ (ముల్తాన్ సుల్తాన్స్)- 1.88 కోట్లుమాథ్యూ షార్ట్ (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుషాదాబ్ ఖాన్ (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుఐపీఎల్ 2025లో టాప్-5 పారితోషికాలు.. రిషబ్ పంత్ (లక్నో)- 27 కోట్లుశ్రేయస్ అయ్యర్ (పంజాబ్)- 26.75 కోట్లువెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)- 23.75 కోట్లుఅర్షదీప్ సింగ్ (పంజాబ్)- 18 కోట్లుచహల్ (పంజాబ్)- 18 కోట్లు -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన పాక్ వికెట్ కీపర్
పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆ దేశ జాతీయ జట్టు వికెట్‌కీపర్ సాహిబ్జాదా ఫర్హాన్ విధ్వంసకర శతకంతో విరుచకుపడ్డాడు. పెషావర్ జల్మీతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లోనే శతకొట్టాడు. ఓవరాల్‌గా 52 బంతులు ఎదుర్కొన్న ఫర్హాన్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫర్హాన్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో కొలిన్ మున్రో (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), సల్మాన్ అఘా (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆండ్రియస్ గౌస్ 0, ఆజమ్ ఖాన్ 16, జేసన్ హోల్డర్ 20 నాటౌట్, డ్వార్షుయిస్ 18 నాటౌట్ పరుగులు చేశారు. పెషావర్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, తలాత్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఇస్లామాబాద్ బౌలర్లు ఇమాద్ వసీం (4-0-26-3), షాదాబ్ ఖాన్ (4-0-29-2), డ్వార్షుయిస్ (2.2-0-23-2), నసీం షా (3-0-14-1), జేసన్ హోల్డర్ (2-0-20-1), షాన్ మసూద్ (3-0-25-1) కలిసికట్టుగా రాణించడంతో 18.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (47 బంతుల్లో 87; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. హరీస్‌తో పాటు పెషావర్ జట్టులో మిచెల్ ఓవెన్ (10), తలాత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుఫర్హాన్.. పాక్ దేశవాలీ క్రికెట్లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఏడాది అతను పాక్ నేషనల్ టీ20 కప్‌లో 72 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాక్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్‌గా రికార్దైంది. ఓవరాల్‌గా చూసినా టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోర్. టీ20ల్లో తొలి రెండు అత్యధిక స్కోర్లు క్రిస్ గేల్ (175 నాటౌట్), ఆరోన్ ఫించ్ (172) పేరిట ఉన్నాయి. ఫర్హాన్.. హ్యామిల్టన్ మసకద్జ (162 నాటౌట్), హజ్రతుల్లా జజాయ్‌తో కలిసి (162 నాటౌట్) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. పీఎస్ఎల్ 2025లో భాగంగా పెషావర్‌పై ఫర్హాన్ చేసిన చేసిన 49 బంతుల సెంచరీ ఈ సీజన్లో మొదటిది. ఇస్లామాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2019 సీజన్లో సౌతాఫ్రికా ఆటగాడు కెమరూన్ డెల్పోర్డ్ కూడా ఇస్లామాబాద్‌కు ఆడుతూ లాహోర్ ఖలందర్స్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. -
ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేనందుకు సిగ్గుపడను.: పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తాను మాట్లాడే ఇంగ్లిష్‌పై గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రిజ్వాన్ అర్దం పర్దం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడతాడని సోషల్‌మీడియా అతన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. రిజ్వాన్ ఏం మాట్లాడతాడో అర్దం కాక సొంత అభిమానులే జట్టు పీక్కుంటుంటారు. రిజ్వాన్ ఇంగ్లిష్ విషయంలో ఫారిన్ మీడియా బాధలు వర్ణణాతీతం. వారు ఓ ప్రశ్న అడిగితే అతను ఇంకేదో సమాధానం చెబుతాడు. ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోవడం రిజ్వాన్ తప్పు కానప్పటికీ నిందులు ఎదుర్కొంటున్నాడు.I don't care on win and learn qoute trolling , I am not Educated, mujhe English Nahi aati but mujhe taleem Hasil karna chaye thi : Muhammad Rizwan pic.twitter.com/VmqmeHhsx5— ٰImran Siddique (@imransiddique89) April 11, 2025తాజాగా ఈ విషయంపై రిజ్వాన్ స్పందించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 (PSL) ప్రారంభానికి ముందు మాట్లాడుతూ.. తాను చదువు కొనసాగించలేనందు వల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాను. చదువుకునే రోజుల్లో క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. చదువు పూర్తి చేయనందుకు చింతిస్తున్నాను. కానీ క్రికెటర్‌గా దాని గురించి సిగ్గుపడను. భాష సరిగ్గా లేకపోయినా నిజం మాట్లాడుతున్నందుకు గర్విస్తున్నాను.చదువు పూర్తి చేయలేనందుకు బాధగా ఉంటుంది కానీ, ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేనందుకు ఎప్పుడూ బాధ పడను. నా దేశంలో అభిమానులు నా నుండి మంచి క్రికెట్ మాత్రమే ఆశిస్తారు. వారు నా నుండి ఇంగ్లిష్ డిమాండ్ చేయరు. ఏదిఏమైనప్పటికీ అభిమానులు నన్ను క్షమించాలి. చదువు పూర్తి చేయనందుకే ఈ కష్టాలు.అందుకే యువ క్రికెటర్లు ప్రతిభను మెరుగుపరుచుకుంటూనే భాషపై దృష్టి పెట్టాలని చెబుతూ ఉంటాను. పాక్ జట్టు కూడా నా నుంచి మంచి క్రికెట్ మాత్రమే ఆశిస్తుంది. ఇంగ్లిష్ మాట్లాడే సామర్థ్యం కాదు. నాకు క్రికెట్‌ను వదిలి ఇంగ్లిష్ నేర్చుకునేంత సమయం కూడా లేదు. ఒకవేళ అభిమానులు నన్ను ఇంగ్లిష్ నేర్చుకోమని అడిగితే క్రికెట్‌ను వదిలేసి ప్రొఫెసర్ని అవుతానని అన్నాడు.కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో మహ్మద్ రిజ్వాన్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. అతను ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సుల్తాన్స్ ఇవాళ (ఏప్రిల్ 12) రాత్రి కరాచీ కింగ్స్‌తో తలపడుతుంది. పీఎస్ఎల్ గత సీజన్లో సుల్తాన్స్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓడిపోయింది. పీఎస్ఎల్ 2025 ఎడిషన్ నిన్ననే ప్రారంభమైంది. ఈసారి పాక్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌తో పోటీపడుతుంది. రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరుగుతున్నాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. -
వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. తొలి మ్యాచ్‌లో రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌కు ముందు ఇస్లామాబాద్ యునైటెడ్‌కు గట్టి తగలింది. ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారీ పీఎస్ఎల్-2025 సీజన్ నుంచి వైదొలిగాడు.దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్థానంలో ఇస్లామాబాద్ ఫ్రాంచైజీ కారీని తమ జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాల కారణంగా ఫస్ట్ హాఫ్ సీజన్ దూరంగా ఉండాలని రాస్సీ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కారీతో ఇస్లామాబాద్ యునైటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.ఇప్పుడు కారీ కూడా పీఎస్ఎల్ నుంచి వైదొలిగి ఇస్లామాబాద్‌కు భారీ షాకిచ్చాడు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా డొమాస్టిక్ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా పీఎస్ఎల్ పదో సీజన్ నుంచి కారీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాన్ డెర్ డస్సెన్ మాత్రం త్వరలోనే ఇస్లామాబాద్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ నుంచి కారీతో పాటు చాలా మంది స్టార్ క్రికెటర్లు తప్పకున్నారు. సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఎంపిక కావడంతో పీఎస్ఎల్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్లో ఆడకుండా ఏడాది పాటు నిషేధం విధించింది. వీరితో పాటు కివీస్ ఆటగాళ్లు మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, బంగ్లాదేశ్ ప్లేయర్లు నహిద్ రాణా, లిట్టన్ దాస్ కూడా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నారు. పీఎస్ఎల్-2025 సీజన్లో మొత్తం 35 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 18న జరగనున్న ఫైనల్ పోరుతో ఈ ఏడాది సీజన్ ముగియనుంది. -
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మిస్సయిన పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు మరో అవకాశం దక్కింది. మన దాయాది దేశం పాకిస్తాన్ వారిని అక్కున చేర్చుకుంది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పలువురు విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అవకాశం కల్పించింది. ఇందులో స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కూడా ఉండడం విశేషం. వార్నర్ అయితే ఒక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కరాచీ కింగ్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదే టీమ్‌లో విలియమ్సన్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ ఫస్ట్‌టైం పీఎస్ఎల్లో ఆడుతున్నారు. అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ, న్యూజిలాండ్ ప్లేయర్లు ఆడమ్ మిల్నే, టిమ్ సీఫెర్ట్ కూడా కరాచీ కింగ్స్ (Karachi Kings) జట్టులో ఉన్నారు. ఈ మూడు దేశాలతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన క్రికెటర్లు కూడా పీఎస్ఎల్లో ఆడనున్నారు.కోలిన్ మున్రో (న్యూజిలాండ్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), రిలే మెరెడిత్, బెంజమిన్ డ్వార్షుయిస్ (ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్).. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత సంవత్సరం రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ జట్టులో షాయ్ హోప్, గుడాకేష్ మోటీ, జాన్సన్ చార్లెస్(వెస్టిండీస్), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్) ఉన్నారు.న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరెరా, నమీబియా మాజీ క్రికెటర్ డేవిడ్ వైస్.. లాహోర్ ఖలందర్స్ టీమ్‌లో ఉన్నారు.వెస్టిండీస్ సీమర్ అల్జారి జోసెఫ్, దక్షిణాఫ్రికాకు చెందిన జార్జ్ లిండే, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్.. పెషావర్ జల్మి జట్టుకు ఆడుతున్నారు. కుశాల్ మెండిస్(శ్రీలంక), మార్క్ చాప్మన్, కైల్ జామీసన్, ఫిన్ అలెన్(న్యూజిలాండ్), రిలీ రోసౌ(దక్షిణాఫ్రికా).. క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ తరపున బరిలోకి దిగనున్నారు.కాగా, పీఎస్ఎల్ (PSL 2025) పదో సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతోంది. ఈసారి ఐపీఎల్‌కు సమాంతరంగా పాకిస్తాన్ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతుండడంతో పీఎస్ఎల్కు ఆదరణ అంతంతమాత్రమేన్న వార్తలు వెలువడుతున్నాయి. వరల్డ్ క్రికెట్లోని స్టార్లు అందరూ ఐపీఎల్‌లోనే ఉండడం, మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇండియా క్యాష్ రిచ్ లీగ్వైపే మొగ్గు చూపిస్తున్నారు. నేటి నుంచి మే 18 వరకు జరిగే పీఎస్ఎల్ 10వ ఎడిషన్‌లో 6 జట్లు పోటీపడతాయి. నాలుగు వేదికల్లో 34 మ్యాచ్‌లు జరుగుతాయి.ఇస్లామాబాద్ యునైటెడ్షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), ఆజం ఖాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, రిలే మెరెడిత్, హునైన్ షా, బెంజమిన్ ద్వార్షుయిస్, కోలిన్ మున్రో, రుమ్మన్ రయీస్, సల్మాన్ ఇర్షాద్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, మాథ్యూ షార్ట్, ఇమాద్ వసీం, సల్మాన్ అగ్లీహమ్, సల్మాన్ అగ్లీహమ్, హోల్డర్ నవాజ్, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, ముహమ్మద్ షాజాద్.ముల్తాన్ సుల్తాన్స్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్& వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాయ్ హోప్ (వికెట్ కీపర్), జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), ఉసామా మీర్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, ఇఫ్తికార్ అహ్మద్, క్రిస్ జోర్డాన్, తయ్యబ్ తాహిర్, అమీర్ అజ్మత్, కమ్రాన్ గులామ్, మహ్మద్ జొహ్ల్ హస్నైన్, అకిఫ్స్ జొస్నాన్, లిటిల్, యాసిర్ ఖాన్, షాహిద్ అజీజ్, ఉబైద్ షా, ముహమ్మద్ అమీర్ బార్కీ.కరాచీ కింగ్స్ డేవిడ్ వార్నర్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, అమర్ జమాల్, అరాఫత్ బి మహ్మద్, ఓ జహీమా బి మహ్మద్, యు. అలీ, రియాజుల్లా, మీర్జా మామూన్, ఇంతియాజ్ మహ్మద్ నబీ.లాహోర్ ఖలందర్స్ షాహీన్ అఫ్రిది (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మహ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, డారిల్ మిచెల్, హరీస్ రవూఫ్, సికందర్ రజా, అబ్దుల్లా షఫీక్, సల్మాన్ అలీ మీర్జా, రిషద్ హుస్సేన్, ముహమ్మద్ నయీమ్, మహ్మద్ అజాబ్, డేవిడ్ ఖాన్, జమర్, డేవిడ్ ఖాన్, జహర్, మోమిన్ క్యూమ్, కుర్రాన్, ఆసిఫ్ ఆఫ్రిది, ఆసిఫ్ అలీ.పెషావర్ జల్మిబాబర్ ఆజం (కెప్టెన్), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (వికెట్ కీపర్), మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), జార్జ్ లిండే, అహ్మద్ డానియాల్, అల్జారీ జోసెఫ్, నహిద్ రానా, సైమ్ అయూబ్, మహ్మద్ అలీ, హుస్సేన్ తలత్, అబ్దుల్ సమద్, ఆరిఫ్ యాకూబ్, మెహ్రాన్ ముంతాజ్, నజీమ్ అలీక్స్ బ్రయంట్, మాజ్ సదాకత్, మిచెల్ ఓవెన్, ల్యూక్ వుడ్.చదవండి: పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్క్వెట్టా గ్లాడియేటర్స్సౌద్ షకీల్ (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, ఫహీమ్ అష్రఫ్, ఖవాజా నఫే, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ అమీర్, రిలీ రోసౌ, అకేల్ హోసేన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ తారిజ్, ఉస్మాన్ తారిజ్ జీషన్, సీన్ అబాట్, కైల్ జామీసన్, హసన్ నవాజ్, షోయబ్ మాలిక్, అలీ మజిద్. -
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కార్బిన్ బాష్ (Corbin Bosch)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా పీఎస్ఎల్-2025 (IPL 2025) సీజన్‌కు గానూ పెషావర్ జల్మీ ఫ్రాంఛైజీ బాష్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టుతో అతడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. నిజానికి ఈ ప్రొటిస్ పేసర్ ముందు నుంచి ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. కానీ మెగా వేలం-2025లో అతడిని ఎవరూ కొనలేదు.అలా అదృష్టం వరించింది..అయితే, సహచర ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరం కావడంతో.. బాష్‌ను అదృష్టం వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు విలియమ్స్ స్థానంలో బాష్‌ను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా నిర్వహించాలనే పీసీబీ నిర్ణయం వల్ల బాష్ వంటి విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.ఐపీఎల్ లేదంటే పీఎస్ఎల్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆడేందుకు వీలు పడుతుంది.. కాబట్టి సహజంగానే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చే ఐపీఎల్‌కే ఓటు వేసిన బాష్.. పీఎస్ఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది.సారీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాఇందుకు బదులుగా.. ‘‘విజయవంతమైన, వివిధ దేశాల టీ20 లీగ్‌లలో భాగమైన ముంబై ఇండియన్స్ వంటి మేటి ఫ్రాంఛైజీ ఆఫర్‌ను కాదంటే.. నాకు భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకే పెషావర్ జల్మీ నుంచి వైదొలిగాను’’ అని బాష్ వివరణ ఇచ్చాడు. అయితే, పీసీబీ మాత్రం అతడిపై ఏడాది పాటు వేటు వేస్తూ నిర్ణయం తసీఉకుంది.‘‘ఈ ఆల్‌రౌండర్‌పై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నాం. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ సెలక్షన్‌కు అతడు అర్హత పొందలేడు’’ అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా లీగల్ నోటీసులు అందుకున్న సమయంలోనే బాష్.. ‘‘నా నిర్ణయం పట్ల నాకూ పశ్చాత్తాపంగానే ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మీ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా.నా చర్యల వల్ల మీ మనసు బాధపడి ఉంటుందని తెలుసు. అయితే, నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. త్వరలోనే పీఎస్ఎల్లో పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. కానీ పీసీబీ మాత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.కాగా ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్లో 30 ఏళ్ల బాష్ ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చి రిషభ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ముంబైకి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ముంబై ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకటే గెలిచింది.చదవండి: CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’ -
పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(ఏప్రిల్ 11) లహోర్ వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లహోర్ ఖలందర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ క్రమంలో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది.తమ జట్టు వైస్ కెప్టెన్‌గా పాక్ స్పీడ్ స్టార్ హసన్ అలీని కరాచీ కింగ్స్ ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కరాచీ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. "కరాచీ కింగ్స్ జట్టు వైస్ కెప్టెన్‌గా హసన్ అలీ బాధ్యతలు స్వీకరించాడు. రాబోయే సీజన్ కోసం సిద్దంగా ఉండండి" అంటూ కరాచీ యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఈ క్రమంలో గురువారం జరిగిన పీఎస్ఎల్ కెప్టెన్ల మీట్‌కు డేవిడ్ వార్నర్ స్ధానంలో హసన్ అలీ హాజరయ్యాడు. కాగా ఇటీవలే కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికైన సంగతి తెలిసిందే. కరాచీ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన హసన్ అలీ పాక్ జట్టుకు మాత్రం దూరంగా ఉంటున్నాడు. అలీ చివరగా పాక్ జట్టు తరపున గతేడాది మేలో ఐర్లాండ్‌పై ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కాగా కరాచీ జట్టులో కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, జేమ్స్ విన్స్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు.కరాచీ కింగ్స్ జట్టుఅబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, ఇమ్మాద్ మమ్జామ్, ఎమ్బియామ్సన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లా. -
ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్ 11) పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం
ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్ 11) పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పీఎస్ఎల్ ఐపీఎల్‌తో పోటీపడుతూ ఒకే సమయంలో లీగ్‌ను నిర్వహిస్తుంది. ఐపీఎల్, పీఎస్ఎల్ సమాంతరంగా జరుగనుండటంతో ఈసారి పాక్ అభిమానులు కూడా పీఎస్ఎల్పై ఆసక్తి చూపడం లేదు.ఐపీఎల్ 2025లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో పాక్ ఫ్యాన్స్ క్యాష్ రిచ్ లీగ్‌ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఐపీఎల్‌తో తేదీలను క్లాష్ చేసుకుని పీఎస్ఎల్ ఇబ్బందులను కొని తెచ్చుకుంది. సాధారణంగా ఈ లీగ్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. అలాంటిది అంతర్జాతీయ షెడ్యూల్‌ను కారణంగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ను ఐపీఎల్ జరిగే ఏప్రిల్, మే నెలలకు మార్చింది.పైకి చెప్పనప్పటికీ పీసీబీ ఐపీఎల్‌తో పోటీపడాలనే పీఎస్ఎల్ను ఏప్రిల్, మే నెలలకు మార్చింది. తీరా చూస్తే స్వదేశంలోనే ఆదరణ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది. డేవిడ్ వార్నర్ లాంటి వెటరన్ ఆటగాళ్లు మినహా విదేశీ స్టార్లంతా ఐపీఎల్‌లోనే ఉండటంతో ఈసారి పీఎస్ఎల్ కళావిహీనంగా మారింది. అదే ఐపీఎల్‌తో పోటీపడకపోయుంటే కొందరైనా విదేశీ స్టార్లు పీఎస్ఎల్లో ఆడేవారు. ఐపీఎల్‌తో పోటీ పడి పీసీబీ చేజేతులా సొంత లీగ్‌ను నాశనం చేసుకుంది. ఈ సారి లీగ్‌కు ప్రజాదరణ లేకపోవడంతో ఆటగాళ్లే రంగలోకి దిగి అభిమానులను తమవైపు మళ్లించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ మంచి మాటలు చెబుతూ సొంత అభిమానులను ఐపీఎల్ పైనుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. మంచి క్రికెట్ ఆడి వినోదాన్ని పంచితే జనాలు ఐపీఎల్‌ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను (పీఎస్ఎల్) చూస్తారని హసన్ అన్నాడు.ఎవరూ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌కు లభించిన ప్రజాదరణ చూసి పాక్ సహా చాలా దేశాలు సొంత లీగ్‌ను ప్రారంభించి ఆశించినంత సక్సెస్‌ను సాధించలేకపోయాయి.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. రేపు జరుగబోయే లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో హసన్ అలీ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016లో మొదలైన పీఎస్ఎల్ గతేడాది వరకు అడపాదడపా ఆదరణతో సాగింది. అయితే ఈ సీజన్లో ఐపీఎల్‌తో పోటీ పెట్టుకోవడంతో ఉన్న కాస్త ప్రజాదరణ కూడా కోల్నోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది.పాక్ జాతీయ జట్టు విషయానికొస్తే.. గత రెండేళ్లలో అదఃపాతాళానికి పడిపోయిన ఈ జట్టు ఇటీవలికాలంలో మరింత పతనమైంది. స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగి ఒక్క విజయం కూడా లేకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆతర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ కూడా ఘోర పరాభవాలను ఎదుర్కొంది. ఆ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్ జట్టు.. ఆతర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. -
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కొనసాగుతోంది. అంతేకాదు క్రికెట్ వరల్డ్ అత్యంత ఖరీదైన లీగ్ కూడా ఇదే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2008లో ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ఈ పొట్టి లీగ్.. విజయవంతంగా పదిహేడేళ్లు పూర్తి చేసుకుంది.రాత్రికి రాత్రే కోటీశ్వరులుగాఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. దేశీ, విదేశీ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. ఇక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బోర్డులు కూడా ఇప్పటికే బిగ్‌బాష్, SAT20 లీగ్‌లు నిర్వహిస్తున్నాయి.మరోవైపు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా 2016లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పేరిట టీ20 టోర్నీని ప్రవేశపెట్టింది. అయితే, ఆశించిన స్థాయిలో ఈ లీగ్ హిట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐపీఎల్-2025 సీజన్ ఆరంభమైపోగా.. పీఎస్ఎల్ తాజా ఎడిషన్ ఏప్రిల్ 11న మొదలుకానుంది.అలా అయితే.. జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారుఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా పాక్ బౌలర్, కరాచీ కింగ్స్ పేసర్ హసన్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘మా దేశ ప్రజలకు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. అభిమానులకు ఇదో భావోద్వేగం.వారిని సంతోషరిచేందుకు మేము అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. క్రికెట్ ప్రేమికులు వినోదం కోరుకుంటారు. ఆటగాళ్లు ఎక్కడైతే అద్బుతంగా ఆడుతారో.. వారి కన్ను అటువైపే ఉంటుంది.ఒకవేళ మేము గనుక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరింత గొప్పగా ఆడితే.. ప్రేక్షకులంతా ఐపీఎల్ వదిలి మమ్మల్ని చూసేందుకు వస్తారు’’ అని హసన్ అలీ జియో న్యూస్‌తో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.టీమిండియా అభిమానులైతే.. ‘‘మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేరు. అసలు ఐపీఎల్‌తో, పీఎస్ఎల్కు పోలికే లేదు. ఏదేమైనా గొప్పగా ఆడాలన్న మీ సంకల్పం నెరవేరితే బాగుంటుంది’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.పునరాగమనమే లక్ష్యంఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై మే 25తో ముగియనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం పదిజట్లు ఉన్నాయి. మరోవైపు.. పీఎస్ఎల్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగనుంది. ఇందులో ఆరుజట్లు పాల్గొంటున్నాయి.ఇక 30 ఏళ్ల హసన్ అలీ గతేడాది పది మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు. మరోవైపు.. అతడి జట్టు కరాచీ కింగ్స్ గతేడాది పదింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఈసారి సత్తా చాటేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న హసన్ అలీ.. జాతీయ జట్టులో పునరాగమనం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. -
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్లో కరాచీ కింగ్స్ (KK) కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పీఎస్ఎల్లో డేవిడ్ వార్నర్ యాక్షన్ కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. కెప్టెన్ సాబ్ మీరు సిద్దంగా ఉన్నారా? అని కరాచీ కింగ్స్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ డేవిడ్ భాయ్ ఆడటం ఇదే తొలిసారి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో వార్నర్ తన పేరును పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో నమోదు చేసుకున్నాడు. దీంతో జనవరిలో జరిగిన పీఎస్ఎల్ వేలంలో 300,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు)కు వార్నర్‌ను కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది.మసూద్‌పై వేటు..గత సీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన షాన్ మసూద్‌పై కరాచీ కింగ్స్ వేటు వేసింది. అతడి స్ధానంలో డేవిడ్ వార్నర్‌కు తమ జట్టు పగ్గాలను కరాచీ అప్పగించింది. కాగా గతేడాదిలో జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి, వార్నర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్నాడు.ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో పాకిస్తాన్లో ఆడాలని ర్ణయించుకున్నాడు. పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో ప్లాటినం విభాగంలో అతడిని కేకే ఫ్రాంచైజీ దక్కించుకుంది. కరాచీ జట్టులో ఆడమ్ మిల్నే, జేమ్స్ విన్స్,టిమ్ సీఫెర్ట్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు. ఇక పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది.కరాచీ కింగ్స్ జట్టు: అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, ఇమ్మాద్ మమ్జామ్, ఎమ్బియామ్సన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లాచదవండి: IPL 2025: సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీకి గుడ్ న్యూస్! స్వింగ్ కింగ్ వచ్చేస్తున్నాడు? -
IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియన్స్ బౌలర్
సౌతాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్.. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బాష్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బాష్ తాజాగా స్పందించాడు. పీసీబీ అధికారుల ధమ్కీలకు వివరణ ఇస్తూ ఇలా అన్నాడు. తన నిర్ణయం పీఎస్ఎల్ను అగౌరవపరచాలని కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా అనేక ఇతర లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఇలాంటి జట్టు ఆఫర్‌ను వదులుకుంటే నా భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఐపీఎల్ ఆఫర్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ ఆఫర్ నా కెరీర్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందంటూ వివరణలో పేర్కొన్నాడు. బాష్ వివరణ తర్వాత కూడా పీసీబీ అతనిపై ఐపీఎల్ తరహాలో రెండేళ్లు నిషేధం విధించాలని భావించింది. అయితే ఇలా చేస్తే వచ్చే ఒకరిద్దరు విదేశీ స్టార్లు కూడా పీఎస్ఎల్కు రారని వెనక్కు తగ్గింది.కాగా, ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రాకముందు బాష్‌ను పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ వేలంలో కొనుగోలు చేసింది. వాస్తవానికి బాష్ మొదటి నుంచి ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే తొలుత వేలంలో బాష్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో బాష్‌కు ముంబై ఇండియన్స్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ ఆఫర్‌కు నో చెప్పాడు.వాస్తవంగా ఈ రాద్దాంతం జరగడానికి పాక్ క్రికెట్ బోర్డే కారణం. ఎప్పుడూ ఐపీఎల్‌తో క్లాష్ కాకుండా షెడ్యూల్ తయారు చేసుకునే పీఎస్ఎల్.. ఈసారి ఐపీఎల్‌తో పోటీ పడి ఐపీఎల్ డేట్స్‌లోనే షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో పీఎస్ఎల్కు ఎంపికైన వారు (విదేశీ ఆటగాళ్లు) ఐపీఎల్లో ఆడటానికి వీలుండదు. ఐపీఎల్లో ఆడితే పీఎస్ఎల్కు పోలేరు. ఈ యేడు పీఎస్ఎల్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌వైపే మొగ్గు చూపారు. ఐపీఎల్లో అయితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని వారి భావన. ఐపీఎల్‌తో క్లాష్ కావడంతో ఈ సారి పీఎస్ఎల్లో విదేశీ మెరుపులు కనిపించవు. లోకల్ ఆటగాళ్లతోనే పాక్ లీగ్ తూతూ మంత్రంగా జరుగనుంది. పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టక ముందు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి చెందిన ఎంఐ కేప్‌టౌన్‌కు (సౌతాఫ్రికా టీ20 లీగ్) ఆడాడు. ఈ సీజన్లో (2025) ఎంఐ కేప్‌టౌన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
IPL 2025: ముంబై ఇండియన్స్ బౌలర్‌కు నోటీసులు ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఐపీఎల్-2025లో భాగమైన ముంబై ఇండియన్స్ బౌలర్ కార్బిన్ బాష్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. బాష్.. ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అయిన బాష్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ కోసం పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాష్‌కు అనుకోకుండా ఐపీఎల్ ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ కాంట్రాక్ట్‌కు నో చెప్పాడు. లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో ముంబై ఇండియన్స్ బాష్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ పీసీబీ బాష్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఫ్రాంచైజీ (పెషావర్ జల్మీ) ఏజెంట్ ద్వారా బాష్‌కు లీగల్ నోటీసులు పంపింది. కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్ఎల్ నుండి వైదొలగడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ (మార్చి 16) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఐపీఎల్ 2025, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 తేదీలు క్లాష్ అయ్యాయి. పీఎస్ఎల్-2025 ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. -
ఐపీఎల్‌తో పోటీకి దిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పీఎస్ఎల్ 10వ ఎడిషన్ షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ఐపీఎల్-2025 షెడ్యూల్‌తో క్లాష్ అవుతుంది. పీఎస్ఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్ఎల్ను ఐపీఎల్ డేట్స్‌లో ఫిక్స్ చేసింది.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్‌లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఫైనల్ సహా 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్-1 సహా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సీజన్లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్లో (శనివారం) జరుగనుండగా.. ఓ డబుల్ హెడర్ పాక్ నేషనల్ హాలిడే లేబర్ డే రోజున జరుగనుంది.లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ టూ టైమ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగనుంది. ఏప్రిల్ 8న పెషావర్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్ఎల్-2025 పూర్తి షెడ్యూల్..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
పాక్ యువ పేసర్ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌కు (PSL) గుడ్‌బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు. వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్‌గా పేరుంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్ఎల్లో కాకుండా దేశవాలీ క్రికెట్లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.కాగా, నిన్న జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రోక్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సూల్తాన్స్ను 2 వికెట్ల తేడాతో ఓడించిన ఇస్లామాబాద్.. మూడో సారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో పెషెవర్ జెల్మీ టైటిల్ సాధించకపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం మాత్రం అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మూడు సార్లు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ సొంతం చేసుకున్న మొదటి క్రికెటర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. పీఎస్ఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి హనీఫ్ మొహమ్మద్ క్యాప్(గ్రీన్ క్యాప్)ను అందిస్తారు. ఇప్పుడు వరకు మూడు పీఎస్ఎల్ సీజన్లలో లీడింగ్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు. 2020 సీజన్లో 473 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన బాబర్.. ఆ తర్వాత 2021 సీజన్లోనూ 554 పరుగులతో గ్రీన్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఇప్పుడు పీఎస్ఎల్-2024లోనూ 569 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 569 పరుగులు చేశాడు. అందులో 5 ఫిప్టీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. -
ఛీ.. ఇదేం పని.. మ్యాచ్ మధ్యలోనే పాక్ క్రికెటర్ ఇలా! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించిన ఇస్లామాబాద్ యునైటెడ్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఇస్లామాబాద్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన వసీం.. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలకమైన 19 పరుగులు చేశాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్న ఇమాద్ వసీం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వసీం సిగరెట్ వెలగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 'పీఎసీఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!? PAKISTAN "SMOKING" LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8 — Farid Khan (@_FaridKhan) March 18, 2024 -
ఆఖరి బంతికి సంచలనం.. పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను 2 వికెట్లతో ఓడించిన ఇస్లామాబాద్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో ఇస్లామాబాద్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ పేసర్ మహ్మద్ అలీకి అప్పగించాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఇమాద్ వసీం సింగిల్ తీసి నసీం షాకు స్ట్రైక్ ఇచ్చాడు. నసీం షా రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో యూనైటడ్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 3 పరుగులగా మారింది. మూడో బంతి నసీం సింగ్ తీసి వసీంకు మళ్లీ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక నాలుగో బంతికి ఇమాద్ వసీం సింగిల్ తీసి స్కోర్లను సమం చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్కపరుగు కావల్సిన సమయంలో నషీం ఔటయ్యాడు. ఐదో బంతికి రిజ్వాన్ క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో ఇస్లామాబాద్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా ఆఖరి బంతికి ఫోరు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(20 బంతుల్లో 32, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో స్పిన్నర్ ఇమాద్ వసీం 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇస్లామాబాద్ ఛేదించాడు. ఇస్లామాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది. Shadab Khan won at this life! 😭♥️#HBLPSLFinal I #PSL2024 I #PSLFinal pic.twitter.com/gd53bAzPpy — Rizwan Babar Army (@RizwanBabarArmy) March 18, 2024 -
సూపర్ మ్యాన్‌లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్‌కు ఫ్యూజ్‌లు ఔట్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 లీగ్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజంను పెవిలియన్‌కు పంపాడు. పెషావర్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన నసీమ్ షా 4వ బంతిని బాబర్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాబర్ కొంచెం రూమ్ తీసుకుని మిడ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్ ఆఫ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఇది చూసిన బాబర్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A bird, a plane? No, it's SUPERMAN SHADAB KHAN 😱#HBLPSL9 | #KhulKeKhel | #PZvIU pic.twitter.com/PZFbd2ZNHV — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2024 -
నిరాశపరిచిన బాబర్.. ఫైనల్‌కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 5 వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్ నుంచి బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జల్మీ బ్యాటర్లలో సైమ్ అయూబ్(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్ హ్యారిస్(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్, షాదాబ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు ఇమాద్ వసీం(59 నాటౌట్), హైదర్ అలీ(52 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పెషావర్ బౌలర్లలో అయూబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్, ముమ్టాజ్, కుర్రామ్ తలా వికెట్ సాధించారు. ఇక మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్ యూనైటడ్ తలపడనుంది. -
మరోసారి చెలరేగిన బాబర్ ఆజమ్.. వరుసగా మూడో హాఫ్ సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారయ్యాయి. పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోగా.. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ.. కరాచీ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (51) మరోసారి చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బాబర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పెషావర్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్ (30) ఓ మోస్తరుగా రాణించాడు. కరాచీ బౌలర్లు డేనియల్ సామ్స్, జహీద్ మహమూద్, ఆరాఫత్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. పెషావర్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నవీన్ ఉల్ హాక్ తన కోటా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. వుడ్, ఆమెర్ జమాల్, సైమ్ అయూబ్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. టిమ్ సీఫర్ట్ (41), ఇర్ఫాన్ ఖాన్ (39 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించినా కరాచీని గెలిపించలేకపోయారు. -
వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 ప్లే ఆఫ్స్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆర్హత సాధించింది. ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్.. తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇస్లామామాబాద్ విజయంలో మున్రో(84), ఇమాద్ వసీం(30) కీలక పాత్ర పోషించారు. నసీం షాకు బిగ్ షాక్.. ఇస్లామామాబాద్ స్టార్ పేసర్ నసీం షాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీంకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. షా లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని పీఎస్ఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏం చేశాండంటే? ముల్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను నసీం షా అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని షా వమ్ము చేయలేదు. అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నప్పటికి ఓవర్ పూర్తి అయిన వెంటనే నసీం తన కాలితో స్టంప్స్‌ను తన్నాడు. ఈ విషయాపై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా అతడిపై ఈ చర్యలు తీసుకున్నాడు. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
కొలిన్ మున్రో విధ్వంసం.. ఉస్మాన్ ఖాన్ మెరుపు శతకం వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ చేసిన స్కోర్ సీజన్ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్ఎల్ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ ఇదివరకే నాకౌట్ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మున్రో విధ్వంసం.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. కొలిన్ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్‌ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్‌ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగింపు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ సారధి బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న బాబర్.. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేసి తన పరుగుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. క్వెట్టతో జరుగుతున్న మ్యాచ్‌లో 30 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 53 పరుగులు చేసిన బాబర్.. ప్రస్తుత ఎడిషన్‌లో తన పరుగుల సంఖ్యను 447కి పెంచుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. సెంచరీ, 4 అర్దసెంచరీలు చేశాడు. క్వెట్టాతో మ్యాచ్‌లో బాబర్ రాణించడంతో పెషావర్ జల్మీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 156 పరుగులుగా ఉంది. జల్మీ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు సైమ్ అయూబ్ (12 బంతుల్లో 30), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 20), కోహ్లెర్ కాడ్మోర్ (19 బంతుల్లో 33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. రోవ్‌మన్ పావెల్ (6), ఆమెర్ జమాల్ (5) క్రీజ్‌లో కొనసాగుతున్నారు. -
నిప్పులు చెరిగిన హసన్ అలీ.. టిమ్ సీఫర్ట్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. హసన్ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-27-2), జహీద్ మెహమూద్ (4-0-25-2), మీర్ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. .@RealHa55an is a vibe 😄pic.twitter.com/oq7KK1mc5M — CricTracker (@Cricketracker) March 6, 2024 గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్ హొసేన్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (9), సర్ఫరాజ్ ఖాన్ (7), ఆమిర్ (2), హస్నైన్ (5), ఉస్మాన్ తారిక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్ మాలిక్ (27 నాటౌట్) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. మధ్యలో జేమ్స్ విన్స్ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ షాన్ మసూద్ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. -
సత్తా చాటిన బాబర్.. మరోసారి బ్యాట్ ఝులిపించిన ఆమెర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ మరోసారి భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (22 బంతుల్లో 46;3 ఫోర్లు, 5 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరికి వికెట్‌కీపర్ హసీబుల్లా ఖాన్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్), రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (10 బంతుల్లో 11; 2 ఫోర్లు) తోడయ్యారు. ఆఖర్లో ఆమెర్ జమాల్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) గత మ్యాచ్ తరహాలో (జమాల్ నిన్న ఇస్తామాబాద్తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి 49 బంతుల్లో 8 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు) రెచ్చిపోయాడు. సుల్తాన్స్ బౌలర్లలో ఉసామా మిర్, క్రిస్ జోర్డన్లు పెషావర్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగారు. ఉసామా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. జోర్డన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్మద్ అలీ 3 ఓవర్లలో 46, డేవిడ్ విల్లే 4 ఓవర్లలో 36, ఇఫ్తికార్ ఓవర్లో 12, ఖుష్దిల్ షా ఓవర్లో 13, అఫ్తాబ్ 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు. -
సూపర్ క్యాచ్ పట్టిన బాల్ బాయ్.. హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్! వీడియో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు, కివీస్ స్టార్ కోలిన్ మున్రో ఓ బాల్ బాయ్‌ను ఎత్తుకున్నాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో అమీర్ జమాల్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల ఉన్న ఓ బాల్ బాయ్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లో పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ అదే పొజిషన్లో సిక్సర్ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? From drop to dazzling catch! 😲 Ball boy redeems himself in #IUvPZ match and gets a warm hug from Colin Munro. #HBLPSL9 | #KhulKeKhel pic.twitter.com/ncTKJ0xPfr — PakistanSuperLeague (@thePSLt20) March 4, 2024 -
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ తన విరోచిత పోరాటంతో అందరని అకట్టుకున్నాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమీల్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న వాల్టర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. జమాల్ ఇన్నింగ్స్ చూసి పెషావర్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆఖరిలో జమాల్ ఔట్ కావడంతో పెషావర్ ఓటమి చవిచూసింది. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జమాల్ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడిన జమాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా లక్ష్య ఛేదనలో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. AAMER JAMAL PLAYING LIKE HE DID IN THE TESTS IN AUSTRALIA 🔥🔥🔥#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/UeiRi24PSB — Farid Khan (@_FaridKhan) March 4, 2024 ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్, హునైన్ షా తలా రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ షాదాబ్(51 బంతుల్లో 80, 4ఫోర్లు,6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. Aamer Jamal REMEMBER THE NAME !🤝#HBLPSL9 #IUvPZ #PSL2024 pic.twitter.com/7Dgqv69zTD — Aussies Army🏏🦘 (@AussiesArmy) March 4, 2024 -
విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. కరాచీ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్ మసూద్(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్లలో ఉసమా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ అలీ, క్రిస్ జోర్డాన్, కుష్దుల్ షా తలా ఒక్క వికెట్ సాధించారు. ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీ.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్ ఖాన్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముల్తాన్ సుల్తాన్ ఖారారు చేసుకుంది. USMAN KHAN, TAKE A BOW! 🙇 Second HBL PSL 💯 for the Sultans star 👏#HBLPSL9 | #KhulKeKhel | #KKvMS pic.twitter.com/DCP60FJwoD — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2024 -
విండీస్ ప్లేయర్ సిక్సర్ల సునామీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేర్స్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో బౌండరీ, ఆర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి బంతికి బౌండరీ బాది గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జేమ్స్ విన్స్ (37) టాప్ స్కోరర్‌గా కాగా.. టిమ్ సీఫర్ట్ 21,షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ నవాజ్ 28, పోలార్డ్ 13, ఇర్ఫాన్ ఖాన్ 15, హసన్ అలీ 2 పరుగులు చేశారు. ఆఖర్లో అన్వర్ అలీ (14 బంతుల్లో 25 నాటౌట్) మెరపు ఇన్నింగ్స్ ఆడగా.. జహిద్ మహమూద్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. క్వెట్టా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు, వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్వెట్టా.. 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ (17 బంతుల్లో 22 నాటౌట్) రూథర్‌ఫోర్డ్‌కు జత కలిశాడు. క్వెట్టా ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ 24, ఖ్వాజా నఫే 2, సర్ఫరాజ్ అహ్మద్ 3, రిలీ రొస్సో 6 పరుగులు చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, జహిద్ మహమూద్ తలో 2 వికెట్లు.. షోయబ్ మాలిక్ ఓ వికెట్ పడగొట్టారు. -
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
న్యూజిలాండ్ ఓపెనర్ ఊచకోత.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ బ్యాటర్లలో కిరాన్ పొలార్డ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఇమాడ్ వసీం, నసీం షా, సల్మాన్, హునైన్ షా తలా వికెట్ సాధించారు. మున్రో ఊచకోత.. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కొలిన్ మున్రో విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేశాడు. అతడితో పాటు అలెక్స్ హేల్స్(47), అఘా సల్మాన్(25) పరుగులతో రాణించారు. చదవండి: BAN vs SL: హసరంగాపై వేటు.. శ్రీలంక కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్‌ల్లో) చేశాడు. -
సౌతాఫ్రికా ఆటగాడి విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు. 2024 PSL's first centurion 💯🥇 Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay — Sport360° (@Sport360) February 25, 2024 -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్‌మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్‌కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
రెచ్చిపోయిన రీజా హెండ్రిక్స్.. రాణించిన రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన హెండ్రిక్స్ తాజాగా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. క్వెట్టా గ్లాడయేటర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో హెండ్రిక్స్ మెరుపు అర్ధశతకంతో (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా సుల్తాన్స్ 13 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్‌పై విజయం సాధించింది. సుల్తాన్స్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (51) సైతం కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్, రిజ్వాన్‌తో పాటు తయ్యబ్ తాహిర్ (35 నాటౌట్) రాణించాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 2, అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుల్తాన్స్ బౌలర్లలో మొహమ్మద్ అలీ అద్భుత ప్రదర్శనతో (4-1-19-3) విజృంభించగా.. డేవిడ్ విల్లే 3, ఆఫ్తాబ్ ఇబ్రహీం 2, ఉసామా మిర్ ఓ వికెట్ పడగొట్టారు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా నఫే (36), రిలీ రొస్సో (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం
Angry Babar Azam Fumes At Ill Mannered Fans: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి బాబర్ ఆట తీరును కించపరిచేలా కామెంట్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఈ మాజీ కెప్టెన్ అతడి పైకి బాటిల్ విసిరాలని చూశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. ముల్తాన్ సుల్తాన్స్‌తో మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు. ముల్తాన్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజం తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 37 పరుగులతో హసీబుల్లా ఖాన్ జల్మీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బాబర్ 31 పరుగులతో అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో ముల్తాన్ సుల్తాన్స్ 174 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్ జల్మీ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. మ్యాచ్ సంగతి ఇలా ఉంటే.. డగౌట్లో కూర్చున్న సమయంలో బాబర్ ఆజంను ఉద్దేశించి ఓ ప్రేక్షకుడు ‘జింబాబర్’ అంటూ అరిచాడు. This is really unacceptable, Never expected this from Multan fans.. 🤦♂️ pic.twitter.com/MgZWQlO8oR — Nibraz Ramzan (@nibraz88cricket) February 24, 2024 దీంతో బాబర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్ దమ్ముంటే.. ఇక్కడకు రా’’ అంటూ సైగ చేసిన బాబర్ ఆజం.. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేస్తానంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్తానన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘జింబాబర్’ అని ఎందుకన్నాడు? టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లితో పోల్చదగిన సమకాలీన క్రికెటర్లలో ఒకడు బాబర్ ఆజం అని పలువురు పాక్ మాజీ క్రికెటర్ల అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయిలో అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో బాబర్ సతమతమవుతున్నాడు. ముఖ్యంగా పటిష్ట జట్ల మీద మెరుగైన స్కోర్లు సాధించలేకపోతున్నాడు. జింబాబ్వే వంటి పసికూన జట్లపై మాత్రం సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా.. ‘‘జింబాబర్’’అంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీఎస్ఎల్ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. బాబర్ కోపోద్రిక్తుడయ్యాడు. Kalesh b/w Babar Azam And One of guy from Crowd over he was Calling him "Zimbabar" during PSL match pic.twitter.com/mtR99WDmoW — Ghar Ke Kalesh (@gharkekalesh) February 24, 2024 -
అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ నుంచి మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్-19 అండర్ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన యువ పేసర్ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్ఎల్-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం లాహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హునైన్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసెన్ రాయ్‌ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. పీఎస్ఎల్లో హునైన్కు ఇదే తొలి వికెట్. కాగా హునైన్ షా ఎవరో కాదు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీం షాకు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్ఎల్ వికెట్ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటైడ్ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. hunain shah, remember the name pic.twitter.com/kkONIs1qXg — :) (@babardrive) February 22, 2024 -
పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరిలో సుల్తాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19 ఓవర్ వేసిన లహోర్ పేసర్ జమాన్ ఖాన్‌కు ఇఫ్తి భాయ్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. డగౌట్ నుంచి ఇఫ్తికర్ విధ్వంసం చూసిన రిజ్వాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్ పాక్ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్ డస్సెన్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముల్తాన్ బౌలర్లలో మహ్మద్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: AFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్ IFTI MANIA 🤯 Enough said...#HBLPSL9 | #KhulKeKhel | #MSvLQ pic.twitter.com/uXqkWv2btV — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2024 -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్‌ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్‌తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబరే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్
When the fat levels Checked Skin fold of all of them was high: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బ్యాటర్ బాబర్ ఆజం తీరును హెడ్‌కోచ్ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో కలిసి జట్టును భ్రష్టుపట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారు కావడానికి బాబర్, మిక్కీ కారణమని హఫీజ్ మండిపడ్డాడు. వరల్డ్‌కప్‌లో వైఫల్యం కాగా మిక్కీ ఆర్థర్ మార్గదర్శనంలో బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. హెడ్‌కోచ్ మిక్కీ ఆర్థర్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అంతేకాదు హెడ్‌కోచ్ బాధ్యతలనూ తానే చేపట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చేదు అనుభవం ఇక బాబర్ స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాక్.. న్యూజిలాండ్ టూర్లో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఓ విచిత్రమైన విషయం తెలిసిందంటూ మహ్మద్ హఫీజ్ తాజాగా వెల్లడించాడు. బాబర్ ఆజం, మిక్కీ ఆర్థర్ కలిసి ఫిట్నెస్ విలువలు గాలికొదిలేసిన తీరు తెలిసి ఆశ్చర్యపోయానన్నాడు. ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు చెప్పాను. ట్రైనర్‌తో కూడా ఇదే మాట అన్నాడు. కానీ అప్పుడతడు నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆర్నెళ్ల క్రితం అప్పటి కెప్టెన్, డైరెక్టర్.. ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయొద్దని చెప్పారన్నాడు. వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని వాళ్లిద్దరు తనను ఆదేశించారన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయిస్తే.. ఉండాల్సిన దాని కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కొవ్వు వారి శరీరాల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. చాలా మంది అన్‌ఫిట్‌గా ఉన్నారు. కొంతమంది కనీసం 2 కిలోమీటర్ల ట్రయల్ రన్ కూడా పూర్తిచేయలేకపోయారు. ఆర్నెళ్ల క్రితం వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను తారుమారు చేశాను. ఫిట్‌గా లేకుంటే ఓడిపోతూనే ఉంటారని ఆటగాళ్లను హెచ్చరించాను’’ అని మహ్మద్ హఫీజ్ ‘ఏ’ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం పాక్ ప్రధాన ఆటగాళ్లంతా పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్! -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్ మూడో మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ రెచ్చిపోయాడు. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెండ్రిక్స్‌తో పాటు డేవిడ్ మలాన్ (41 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (11) విఫలం కాగా.. ఆఖర్లో ఖుష్దిల్ షా (13 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, డేనియల్ సామ్స్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. మొహమ్మద్ అలీ (4-0-23-3), డేవిడ్ విల్లే (4-0-22-2), అబ్బాస్ అఫ్రిది (3-0-16-2), ఉసామా మిర్ (4-0-14-1) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సుల్తాన్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరాచీ ఇన్నింగ్స్‌లో షోయబ్ మాలిక్ (53), కెప్టెన్ షాన్ మసూద్ (30), కీరన్ పోలార్డ్ (28 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కరాచీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లు కావడం విశేషం. రాయ్, షకీల్ మెరుపు అర్దసెంచరీలు నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. ఓపెనర్లు జేసన్ రాయ్ (75), సౌద షకీల్ (74) మెరుపు అర్దసెంచరీలతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 206 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన పెషావర్ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో (190/6) నిలిచిపోయింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68), సైమ్ అయూబ్ (42) రాణించారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. తొలి క్రికెటర్‌గా
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 3000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా బాబర్ నిలిచాడు. పీఎస్ఎల్-2024 సీజన్లో భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆజం ఇప్పటివరకు 78 ఇన్నింగ్స్‌లలో 3003 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్(2381) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 16 పరుగుల తేడాతో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్ రాయ్(75), షకీల్(74) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పెషావర్ బౌలర్లలో ఈర్షద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. పెషావర్ బ్యాటర్లలో బాబర్ ఆజం(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
బాబర్ ఆజం విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే! అయినా పాపం?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్‌ను పెషావర్ జల్మీ ఓటమితో ఆరంభించింది. లహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొన్న ఆజం.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. బాబర్ క్రీజులో ఉన్నంతసేపు పెషావర్ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ 15 ఓవర్లో ఆజం కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ క్వెట్టా మలుపు తిరిగింది. క్వెట్టా బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. అమీర్, వసీం, అకిల్ తలా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్ రాయ్(75), షకీల్(74) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. You can't hit a six like that to 140+ KPH ball if you are not Babar Azam 🥵🔥#PSL2024 #BabarAzam𓃵pic.twitter.com/RB9uE1gVBF — Hassan (@HassanAbbasian) February 18, 2024 -
రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై ఇస్లామాబాద్ యునైటెడ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇస్లామాబాద్ టీమ్ 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన డస్సెన్.. వాన్ డర్ డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ భారీ స్కోర్ చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (57) అర్దసెంచరీతో రాణించగా.. షఫీక్ 28, ఫకర్ జమాన్ 13, డేవిడ్ వీస్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది డకౌటయ్యాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, షాదాబ్ ఖాన్, నసీం షా తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. కెప్టెన్ షాదాబ్ ఖాన్ (41 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఘా సల్మాన్ (31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్దశతకాలతో రెచ్చిపోవడంతో మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (36) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. కొలిన్ మున్రో (5) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఖలందర్స్ బౌలర్లలో జమాన్ ఖాన్, సల్మాన్ ఫయాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL: విండీస్ పేస్ సంచలనానికి లక్కీ ఛాన్స్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ప్రకటన
వెస్టిండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్‌కు లక్కీ ఛాన్స్!!... 24 ఏళ్ల ఈ పేస్ బౌలర్ త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ శనివారం వెల్లడించింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో షమార్ జోసెఫ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు.. ‘‘షమార్.. నీ రాక మాకెంతో సంతోషం. ఐపీఎల్-2024 సందర్భంగా మార్క్ వుడ్ స్థానంలో షమార్ జట్టుతో చేరనున్నాడు’’ అని లక్నో ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాపై అదరగొట్టి.. సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన షమార్ జోసెఫ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అడిలైడ్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ తొలి బంతికే వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు. స్టీవ్ స్మిత్ రూపంలో అంతర్జాతీయస్థాయిలో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అడిలైడ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు తీసిన షమార్ జోసెఫ్.. బ్రిస్బేన్ టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎనిమిది వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. కంగారూ గడ్డపై వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్ ఫ్రాంఛైజీలు షమార్ జోసెఫ్‌నకు బంపరాఫర్లు ఇస్తున్నాయి. ఇటీవలే అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ధ్రువీకరించింది. కాగా రూ. 3 కోట్లు వెచ్చించి ఈ కరేబియన్ బౌలర్‌ను లక్నో సొంతం చేసుకుంది. Shamar, we're so happy to have you 💙🔥@SJoseph70Guyana joins our squad for IPL 2024, replacing Mark Wood 🤝 pic.twitter.com/YPfGQZB18N — Lucknow Super Giants (@LucknowIPL) February 10, 2024 -
సంచలన బౌలర్ షమార్ జోసఫ్‌కు బంపర్ ఆఫర్లు
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి వార్తల్లో నిలిచిన విండీస్ పేసర్ షమార్ జోసఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్‌ల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. 24 ఏళ్ల షమార్కు తొలుత పాకిస్తాన్ క్రికెట్ లీగ్ నుంచి ఆహ్వానం లభించింది. షమార్ నిన్ననే పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. షమార్కు తాజాగా మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న అతను ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌తో డీల్ చేసుకోనున్నట్లు సమాచారం. అరంగేట్రం సిరీస్‌తోనే (ఆసీస్) షమార్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. షమార్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు విదేశీ లీగ్‌ల నుంచి ఆఫర్లు, ఎండార్స్మెంట్లు వస్తున్నాయి. అరంగేట్రం సిరీస్‌కు ముందు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసిన షమార్ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో ప్రదర్శనకు గానూ షమార్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆసీస్ మీడియా సహా ప్రపంచ మీడియా మొత్తం ఈ యువ పేసర్‌కు జేజేలు పలుకుతుంది. మాజీలు, విశ్లేషకులు షమార్ బౌలింగ్ ప్రదర్శనలను కొనియాడుతున్నాడు. షమార్ విండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాడని వారు అభిప్రాయపడుతున్నారు. రెండో టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించిన అనంతరం విండీస్ మాజీలు కన్నీటిపర్యంతమవుతూ షమార్‌ను ఆకాశానికెత్తిన వైనం క్రికెట్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రభ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్‌ను షమార్ మళ్లీ జీవం పోశాడంటూ ఆసీస్ మీడియా షమార్‌ను కొనియాడుతుంది. షమార్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి ఐపీఎల్ బంపరాఫర్ కూడా లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షమార్పై కన్నేసి ఉంచాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో షమార్‌ను తమ పంచన చేర్చుకోవాలని ఆశిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాతో వారి స్వదేశంలో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో షమార్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలతో 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమార్.. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే షమార్ పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ 7 వికెట్ల ప్రదర్శన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా కీర్తించబడుతుంది. ఈ ప్రదర్శన కారణంగానే షమార్ ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్దది: వసీం అక్రమ్
ఐపీఎల్- ప్రపంచంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు రారాజు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ ఐపీఎల్లో భాగం కావాలని కలలు కంటుంటారు. పీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాచ్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. అయితే మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ సైతం ఐపీఎల్‌కు పోటీగా ఓ టీ20 లీగ్(పాకిస్తాన్ సూపర్ లీగ్)ను నిర్వహిస్తోంది. ఇప్పటికీ 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్ఎల్ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ పాక్ క్రికెటర్లు, మాజీలు పాకిస్తాన్ సూపర్ లీగ్‌నే వరల్డ్‌లో నెం1 అని ప్రగల్బాలు పలుకుతూ వస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ లీగ్ అని అక్రమ్ పేర్కొన్నాడు. అక్రమ్ తాజాగా ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్కీడాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వరల్డ్ ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లో ఐపీఎల్ లేదా పీఎస్ఎల్ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా.. 'నేను పీఎస్ఎల్తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పనిచేశాను. అన్నిటికంటే ఐపీఎల్ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్ లీగ్. అందులో ఎటువంటి సందేహం లేదు. పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చడం సరికాదు. పీఎస్ఎల్ పాకిస్తాన్‌కు మినీ ఐపీఎల్ వంటిది" అని అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో.. హెడ్‌కోచ్‌గా
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్‌కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందించిన మైక్ హసన్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్‌తో భర్తీ చేసింది. సంతోషంగా ఉంది ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్‌లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్‌తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు కాగా గతంలో న్యూజిలాండ్‌తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్‌కు ముందు ఈ మూడు లీగ్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్‌రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్రూక్‌ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్‌ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్‌గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆత్మహత్య!
Alamgir Tareen, Owner Of Pakistan Super League Franchise: పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ శిబిరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంఛైజీ యజమాని ఆలంగిర్ తరీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాహోర్‌లోని గుల్బర్గ్లో గల తన నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా ముల్తాన్ సుల్తాన్స్ సీఈఓ హైదర్ అజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆలంగిర్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించాడు. ‘‘మా జట్టులో అత్యంత కీలకమైన, గౌరవనీయులైన వ్యక్తి ఆలంగిర్ తరీన్ హఠాన్మరణం చెందారు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మనమంతా ప్రార్థిద్దాం’’ అని హైదర్ ప్రకటన విడుదల చేశాడు. ఇక ముల్తాన్ సుల్తాన్స్ సైతం ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రైవసీకి భంగం కలిగించకండి ‘‘మా ప్రియమైన యజమాని ఆలంగిర్ ఖాన్ తరీన్ ఇక లేరన్న విషాదకర వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. దయచేసి ఎవరూ కూడా తరీన్ కుటుంబ గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని ఈ సందర్భంగా విజ్జప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని విచారం వ్యక్తం చేసింది. ఇక పీఎస్ఎల్లోని ఇతర ఫ్రాంఛైజీ లాహోర్ ఖలందర్స్ కూడా ఆలంగిర్ మృతి పట్ల సంతాపం తెలిపింది. కాగా 2021లో ముల్తాన్ సుల్తాన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. తాజా సీజన్లో ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. ఆలంగిర్ ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఉన్నత విద్యావంతుడు ఆలంగిర్ తరీన్(63) ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. దక్షిణ పంజాబ్‌లో మేటి వ్యాపారవేత్తగా ఎదిగిన అతడికి క్రీడల పట్ల ఆసక్తి మెండు. పాకిస్తాన్‌లోనే అత్యంత పెద్దదైన నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్న ఆలంగిర్.. పీఎస్ఎల్లో భాగమయ్యే క్రమంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ జట్టు ఇప్పటి వరకు ఒకే ఒకసారి ట్రోఫీ గెలిచింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా? 'టీమిండియాతో మ్యాచ్ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒక్క గేమ్ మాత్రమే' إنا لله وإنا إليه راجعون It is with deep sadness that we share the news of the passing of our beloved team owner, Alamgir Khan Tareen. Our thoughts and prayers are with Mr. Tareen’s family. We request you all to kindly respect his family’s privacy. May his soul rest in… pic.twitter.com/aISUQtAqI5 — Multan Sultans (@MultanSultans) July 6, 2023 -
'పాక్‌లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించింది'
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ జరుగుతున్న సమయంలోనే ఒక మ్యాచ్ లైవ్‌లో బాబర్ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాక్ క్రికెట్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైమన్ డౌల్ బయటికి వస్తే తమ చేతిలో దెబ్బలు తినడం ఖాయమని బెదిరించారు. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు టోర్నీ ముగిసేవరకు సైమన్ డౌల్‌ను బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. మ్యాచ్‌లు లేనప్పుడు హోటల్ రూంకే పరిమితమైన సైమన్ డౌల్ పీఎస్ఎల్ కోసం పాకిస్తాన్లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. "పాకిస్థాన్ లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లే అనిపించింది. బాబర్ ఆజం అభిమానులు నన్ను టార్గెట్ చేయడంతో నన్ను కనీసం బయటకు వెళ్లడానికీ అనుమతించలేదు. చాలా రోజుల పాటు కనీసం తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నాను. నన్ను మానసికంగా హింసించారు. దేవుని దయ వల్ల ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాను" అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు. బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ ను ఉద్దేశించి డౌల్ గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అతడు కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శించాడు. ఈమధ్యే విరాట్ కోహ్లిని కూడా డౌల్ ఇలాగే విమర్శించాడు. ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ సరిగా లేదని, విరాట్ కూడా కేవలం రికార్డుల కోసమే ఆడతాడని డౌల్ అన్నాడు. ఈ కామెంట్స్ పై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?
పాకిస్తాన్ దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇప్పటికి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ప్లాట్లు, ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్ఎల్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో సదరు ఫ్రాంఛైజీ ఓనర్ లాహోర్ ఖలండర్స్ సీవోవో సమీన్ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చింది. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌లో ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్ అదనంగా అందుకోవడం విశేషం. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. ''దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది'' అంటూ కామెంట్ చేశారు. Great Gesture from Lahore Qalandars - Appreciation for ALL "This is why we call it a FAMILY"#PSL08 #qalandarhum #SabSitarayHumaray #QalandarsCity pic.twitter.com/X4z2wxi7Tj — Lahore Qalandars (@lahoreqalandars) March 22, 2023 చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
ఐపీఎల్‌కు అంత సీన్ లేదు.. పాకిస్తాన్ సూపర్ లీగే తోపు..!
ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు. డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పీఎస్ఎల్ 8వ ఎడిషన్‌ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్‌ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు. పాక్‌లో జరగాల్సిన 2023 ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్ఎల్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్లో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్‌గా నిలిచన సుల్తాన్స్‌కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన షాహిన్ అఫ్రిది సేన వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంది. అప్పుడు కూడా ఫైనల్ ముల్తాన్ సుల్తాన్స్‌తో ఆడడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలండర్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో జమాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని కుష్దిల్ షా మిడాన్ దిశగా ఆడాడు. రెండు పరుగులు పూర్తి చేసిన కుష్దిల్ షా మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న డేవిడ్ వీస్ అఫ్రిదికి త్రో వేశాడు. వేగంగా అందుకున్న బంతిని అఫ్రిది క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లకు గిరాటేశాడు. అంతే ముల్తాన్ సుల్తాన్స్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచింది. ఓడినా ముల్తాన్ సుల్తాన్స్ తన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. షఫీకి 40 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షాహిన్ అఫ్రిది 15 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. ఫఖర్ జమాన్ 39 పరుగులు చేశాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలింగ్‌లో ఉస్మా మీర్ మూడు వికెట్లు తీయగా.. అన్వర్ అలీ, ఇషానుల్లా, కుష్దిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ వికెటఉల పడుతున్న లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. రిలీ రొసౌ(32 బంతుల్లో 52, 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 20, కుష్దిల్ షా 25 పరుగులు చేశారు. లాహోర్ ఖలండర్స్ బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. రషీద్ ఖాన్ రెండు, డేవిడ్ వీస్ ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తన ప్రదర్శనతో అదరగొట్టిన షాహిన్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ఇషానుల్లా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 𝘽𝙡𝙤𝙘𝙠𝙗𝙪𝙨𝙩𝙚𝙧 𝙛𝙞𝙣𝙞𝙨𝙝! 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/QfKcUSSnhj — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 🏆 W I N N E R S 🏆@lahoreqalandars - owners of the Supernova Trophy 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/XIDb9hDRlw — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం -
సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చిన షాహిన్ అఫ్రిది
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్ ఇదివరకే ఫైనల్స్‌కు చేరుకోగా.. నిన్న (మార్చి 17) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై విజయం (4 వికెట్ల తేడాతో) సాధించడంతో లాహోర్ ఖలందర్స్ ఇవాళ జరిగే తుది సమరానికి అర్హత సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. మహ్మద్ హరీస్ (54 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 42; 7 ఫోర్లు), రాజపక్స (18 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. మీర్జా తాహిర్ బేగ్ (42 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఖలందర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆఖర్లో ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది (11 నాటౌట్) వరుసగా బౌండరీ, సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సామ్ బిల్లింగ్స్ (28), సికందర్ రజా (23) ఓ మోస్తరుగా రాణించారు. జల్మీ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, వాహబ్ రియాజ్, ఆమెర్ జమాల్, సల్మాన్ ఇర్షాద్ తలో వికెట్ దక్కించుకోగా.. ఖలందర్స్ బౌలర్లు జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. -
ఫోజులు తర్వాత.. ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్‌లో రిలాక్స్ మోడ్‌లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్‌లా మారిపోయింది. తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్‌లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది. అయితే మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు. Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023 Jalebia zyada bik gai inki shayad — Noor ul Ain (@thenoorulain13) March 16, 2023 -
Viral: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ల మధ్య జరిగిన గొడవ లీగ్ మొత్తానికే కలంకంగా మారింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో సుల్తాన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్పై ఖలందర్స్ బౌలర్ షాహీన్ అఫ్రిది దాదాపుగా చేయి చేసుకున్నంత పని చేశాడు. తన బౌలింగ్‌లో పోలార్డ్ 4 సిక్సర్లు (ఒక ఓవర్లో 1, ఇంకో ఓవర్ 3) బాదడంతో సహనం కోల్పోయిన అఫ్రిది.. దూషణ పర్వానికి దిగగా, పోలీ సైతం అంతే ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. Shaheen Afridi and Kieron Pollard 😲#PSL8 #LQvMSpic.twitter.com/HM9CP5Y8tC — Cricket Pakistan (@cricketpakcompk) March 15, 2023 అయితే సొంతగడ్డ అడ్వాంటేజ్ తీసుకున్న అఫ్రిది ఓవరాక్షన్ చేసి పోలార్డ్పైకి దూసుకెళ్లడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సహచరులు సర్ది చెప్పడంతో వెనక్కు తగ్గిన అఫ్రిది తన పని తాను చేసుకున్నాడు. అఫ్రిది-పోలార్డ్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అఫ్రిది చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు పాక్ యువ పేసర్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముల్తాన్ సుల్తాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఫైనల్ బెర్తు ఎవరిది..? ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
పేలిన పోలార్డ్.. కేక పుట్టించిన కాట్రెల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెండు మ్యాచ్‌ల తర్వాత సుల్తాన్స్‌తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. TO THE FINALS#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/gIIye2TYtO — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 𝐏𝐎𝐋𝐋𝐀𝐑𝐃 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆-𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄 💥 Giving the treatment to the Qalandars 💪#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/k2CfWGN3xq — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లాహోర్ ఖలందర్స్‌పై ముల్తాన్ సుల్తాన్స్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. 🫡 #HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/zDH8en06kW — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
కట్టింగ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇమ్రాన్ తాహిర్ మాయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో చాలా రోజుల తర్వాత బౌలర్ల హవా నడిచింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 12) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగు జట్ల బౌలర్లు పేట్రేగిపోయారు. ఫలితంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరుగుల ప్రవాహానికి పాక్షికంగా బ్రేక్ పడింది. నిన్న మధ్యాహ్నం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ ఓ మోస్తరు స్కోర్ (179/8) నమోదు చేయగా.. ఛేదనలో జల్మీ బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ యునైటెడ్ (166 ఆలౌట్) చేతులెత్తేసింది. రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే సీన్ రిపీటయ్యింది. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ జట్టు.. ముహమ్మద్ అక్లక్ (51), ఇమాద్ వసీం (45), తయ్యబ్ తాహిర్ (40), బెన్ కట్టింగ్ (33) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఖలందర్స్.. ఇమాద్ వసీం (2/26), అకీఫ్ జావిద్ (2/8), మహ్మద్ ఉమర్ (2/20), జేమ్స్ ఫుల్లర్ (1/29), ఇమ్రాన్ తాహిర్ (2/24) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కాగా, ఈ పీఎస్ఎల్ సీజన్లో ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరు జట్లు సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని దాటాయి. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ముల్తాన్ సుల్తాన్స్ రికార్డు స్థాయిలో 262 పరుగులు చేయగా.. ఛేదనలో అదే స్థాయిలో రెచ్చిపోయిన గ్లాడియేటర్స్ 253 పరుగులు చేసి లక్ష్యానికి 10 పరుగులు దూరంలో నిలిచిపోయింది. ఈ సీజన్ మ్యాచ్‌ల గురించి చెప్పుకుంటు పోతే 240, 242, 243, 244, 226.. ఇలా ఆయా జట్లు పలు మార్లు 250 పరుగుల మైలురాయి వరకు రీచ్ అయ్యాయి. ప్రస్తుత సీజన్లో బ్యాటర్లు శతక్కొట్టుడులోనూ టాప్‌లో నిలిచారు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, జేసన్ రాయ్, రిలీ రొస్సొ, ఫకర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ వంటి బ్యాటర్లు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి ఆయా జట్లు భారీ స్కోర్లు చేయడానికి దోహదపడ్డారు. మరోవైపు లీగ్ కూడా చివరి అంకానికి చేరింది. మార్చి 15 లాహోర్ ఖలందర్స్-ముల్తాన్ సుల్తాన్స్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ మార్చి 16న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత ఎలిమినేటర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
పరుగుల సునామీకి, శతకాల మోతకు పాక్షిక విరామం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్‌లో పరుగుల సునామీకి, శతకాల మోతకు కాస్త బ్రేక్ పడింది. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్‌లుగా అతి భారీ స్కోర్లు, విధ్వంసకర శతకాలు నమోదవుతూ వస్తుండగా.. ఇవాళ (మార్చి 12) ఇస్లామాబాద్ యునైటెడ్-పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ప్రవాహానికి, శతక్కొట్టుడుకు పాక్షిక విరామం దొరికింది. ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ 166 పరుగులకే చాపచుట్టేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గత కొన్ని మ్యాచ్‌ల తరహాలో ఎలాంటి మెరుపులు లేకపోగా.. బౌలర్లు ఆధిపత్యం చలాయించి అందరినీ ఆశర్యర్యపరిచారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (79) ఒక్కడే మెరుపు హాఫ్‌సెంచరీతో అలరించగా.. భానుక రాజపక్ష (41) పర్వాలేదనిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో హసన్ అలీ 3, షాదాబ్ ఖాన్ 2, ఫజల్ హక్ ఫారూఖీ, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. జల్మీ బౌలర్లు ఖుర్రమ్ (1.4-0-13-3), సూఫియాన్ (3/37), అమెర్ జమాల్ (2/28), జేమ్స్ నీషమ్ (2/23) ధాటికి 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ (38), రహ్మానుల్లా గుర్భాజ్ (33), షాదాబ్ ఖాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పీఎస్ఎల్-2023లో గత కొన్ని మ్యాచ్‌ల్లో స్కోర్ల వివరాలు.. ముల్తాన్ సుల్తాన్స్: 262/3 (ఉస్మాన్ ఖాన్ 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120) క్వెట్టా గ్లాడియేటర్స్: 253/8 పెషావర్ జల్మీ 242/6 ముల్తాన్ సుల్తాన్స్ 244/6 (రిలీ రొస్సొ 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121) లాహోర్ ఖలందర్స్ 226/5 (ఫకర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115) ఇస్తామాబాద్ యునైటెడ్ 107 పెషావర్ జల్మీ 240/2 (బాబర్ ఆజమ్ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115) క్వెట్టా గ్లాడియేటర్స్ 243/2 (జేసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 నాటౌట్) -
PSL 2023: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్‌తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలనాలు నమోదవుతన్నాయి. మ్యాచ్ స్కోర్లు 250 దరిదాపుల్లో నమోదవుతున్నా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌నే చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మీల మధ్య జరిగిన మ్యాచ్ అందుకు ఉదాహరణ. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. సయామ్ అయుబ్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక మహ్మద్ హారిస్(11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు), కొహ్లెర్ కాడ్మెర్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు నమోదైంది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత వచ్చిన రిలీ రొసౌ(51 బంతుల్లోనే 121 పరుగులు, 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 52, 3ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముల్తాన్ సుల్తాన్స్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. అయితే చివర్లో ఇద్దరు స్వల్ప తేడాతో ఔటైనప్పటికి అన్వర్ అలీ(8 బంతుల్లో 24 నాటౌట్), ఉస్మా మీర్(3 బంతుల్లో 11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా పీఎస్ఎల్ చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్ విజయంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. Name: Riley Rossouw Game: Hitting the fastest 100s in the HBL PSL RECORD-HOLDER ROSSOUW#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvMS @Rileerr pic.twitter.com/JJtHoomWt3 — PakistanSuperLeague (@thePSLt20) March 10, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం -
PSL: హృదయాలు కొల్లగొట్టింది.. సూపర్.. స్టన్నింగ్! ఇంక ఆపుతావా?
PSL 2023- Simon Doull: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ‘నీకిది అవసరమా’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘పర్లేదు.. అతడు అన్నదాంట్లో తప్పేముంది’ అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో నేపథ్యంలో సైమన్ డౌల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్- ముల్తాన్ సుల్తాన్స్ తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ కింగ్స్‌ను 205 పరుగులకు అవుట్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో అద్భుత విజయం అందుకుంది. దీంతో ఇస్లామబాద్ యునైటెడ్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో డగౌట్లో ఉన్న హసన్ అలీ భార్య సమియా అర్జూ సైతం ఆనందంతో గెంతులేసింది. నమ్మశక్యంరాని రీతిలో భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు గెలుపొందడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో కెమెరాలు సమియా సెలబ్రేషన్స్ మీద దృష్టిసారించాయి. హృదయాలు కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్ సమియా రూపానికి ఫిదా అయిన సైమన్ డౌల్.. ‘‘ఆమె గెలిచింది. నాకు తెలిసి ఇక్కడున్న చాలా మంది హృదయాలు ఆమె కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో నెటిజన్లు 53 ఏళ్ల డౌల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ‘‘ఇంక ఆపెయ్! ఆట గురించి మాట్లాడమంటే.. నువ్వు చేసే పని ఇదా! జట్టును గెలిపించడానికి కృషి చేసిన ఆ ఆటగాళ్ల గురించి వర్ణించేందుకు నీ భాషాప్రావీణ్యాన్ని ఉపయోగించు.. బాగుంటుంది’’ అని ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. అందాన్ని ఆస్వాదించడంలో తప్పేముంది? అంటూ సైమన్ డౌల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హసన్ అలీ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి 51 పరుగులతో రాణించిన ఫహీం అష్రఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల పాక్ కెప్టెన్, పెషావర్ జల్మీ సారథి బాబర్ ఆజం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక హసన్ అలీ భార్య సమియా భారత్‌కు చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అన్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. Simon Doull is all of Us right now 😂😂😂 even he is baffled by the beauty of Pakistan 😅😅🔥🔥❤️❤️ #simondoull #tiktokdown #PSL8 pic.twitter.com/08VK1KizuQ — Adil Ali Shah (@AdilAliShah13) March 9, 2023 -
ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్లో లాహోర్ ఖలండర్స్ తన జోరు కొనసాగిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమిని మరిచిపోయేలా ఇస్లామాబాద్ యునైటెడ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఖలండర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 22 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో రషీద్ ఖాన్ 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 పరుగులు బాదాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలానికి ఇస్లామాబాద్ తోక ముడిచింది. జట్టులో అత్యధిక స్కోరు 18 పరుగులే కావడం గమనార్హం. బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ 15.1 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, రెండు పాయింట్లతో ఉన్న లాహోర్ ఖలండర్స్ దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్
వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పావెల్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారీ సిక్సర్ బాదిన పావెల్.. ఈ మ్యాచ్‌లో పావెల్ 116 మీటర్ల ఓ భారీ సిక్సర్ బాదాడు. 15 ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో తొలి బంతిని పావెల్ సిక్స్‌గా మలిచాడు. పావెల్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దెబ్బకు నవాజ్‌కు ప్యూజ్‌లు ఎగిరిపోయాయి. పావెల్ కొట్టిన సిక్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగెస్ట్ సిక్స్ల్లో ఒకటిగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 8 వికెట్ల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు. చదవండి: BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు.. Rovman Powell, what a shot 👏 #HBLPSL8 pic.twitter.com/hrJaON9hLL — Farid Khan (@_FaridKhan) March 8, 2023 -
బాబర్ ఆజం విధ్వంసకర శతకం.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వార్నర్ రికార్డు సమం
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పెషావర్ పరజాయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మహ్మద్ హాఫీజ్ 41 పరుగులతో రాణించాడు. బాబర్ ఆజం సెంచరీ వృథా ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లోనే బాబర్ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్‌కు ఇదే తొలి సెంచరీ. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు. అతడితో పాటు మరోఓపెనర్ సైమ్ అయూబ్(74) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలవ్వడంతో బాబర్ విరోచిత శతకం వృథాగా మిగిలిపోయింది. ఇక ఇది బాబర్ టీ20 కెరీర్లో ఎనిమిదివ శతకం. తద్వారా ఓ అరుదైన ఘనతను బాబర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా ఫించ్, వార్నర్, మైఖేల్ క్లింగర్ సరసన ఆజం నిలిచాడు. ఇక ఘనత సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ 22 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. Jersey # 56 lives rent-free in our hearts 🥰#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/e6HsozWROG — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 -
జేసన్ రాయ్ విధ్వంసకర శతకం.. టీ20ల్లో అతి భారీ లక్ష్యఛేదన రికార్డు
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పరుగుల ప్రవాహం పతాక స్థాయికి చేరింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (మార్చి 8) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు విధ్వంసకర శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో (ఆసియా పరిధిలో) అతి భారీ లక్ష్యఛేదన రికార్డు ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. Jersey # 56 lives rent-free in our hearts 🥰#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/e6HsozWROG — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 పెషావర్ జల్మీ నిర్ధేశించిన 241 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఊదేసి, ఆసియాలోనే అతి భారీ లక్ష్య ఛేదన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఊపుతో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే టీ20ల్లో మొట్టమొదటిసారి 300 పరుగుల టీమ్ స్కోర్ నమోదయ్యేది. B for Babar, B for Best 💯 Best in the world for a reason 👑#PZvQG #PSL8 #BabarAzam𓃵pic.twitter.com/XwoWJFjJOl — Cricket Pakistan (@cricketpakcompk) March 8, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 115; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సైమ్ అయూబ్ (34 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), రోవమన్ పావెల్ (18 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. Roy, oh ROY! Celebrate all you want @TeamQuetta 😍#SabSitarayHumaray l #HBLPSL8 I #PZvQG pic.twitter.com/QghDUv9BQ9 — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 60 బంతుల్లోనే శతక్కొట్టిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఇది పీఎస్ఎల్లో తొలి సెంచరీ కాగా.. పీఎస్ఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్ల (15) రికార్డు కూడా బాబర్ ఖాతాలోకే వెళ్లింది. అయితే గంట వ్యవధిలోనే ఈ రికార్డు తారుమారైంది. 241 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్.. జేసన్ రాయ్ (63 బంతుల్లో 145 నాటౌట్; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) సునామీ శతకంతో శివాలెత్తడంతో 18.2 ఓవర్లలోనే రికార్డు విజయం సాధించింది. New ball please ☝️🏽 because @Ravipowell26 has SENT IT OUTTA THE PARK! #SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/Q8OA4uBA71 — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 రాయ్‌కు మార్టిన్ గప్తిల్ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), విల్ స్మీడ్ (22 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), మహ్మద్ హఫీజ్ (18 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో ఎండ్ నుంచి పూర్తిగా సహకరించారు. ఫలితంగా గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయ్ విధ్వంసం ధాటికి 3 పెషావర్ బౌలర్లు 11 ఓవర్లలో 167 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రాయ్ పీఎస్ఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (145 నాటౌట్) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు పీఎస్ఎల్ టాప్ స్కోర్ రికార్డు కొలిన్ ఇంగ్రామ్ (127) పేరిట ఉండేది. 𝐊𝐢𝐧𝐠 𝐁𝐚𝐛𝐚𝐫 - 𝐑𝐞𝐜𝐨𝐫𝐝 𝐁𝐫𝐞𝐚𝐤𝐞𝐫 👑#PSL8 #PzvQG pic.twitter.com/By7yTLXrRy — Cricket Pakistan (@cricketpakcompk) March 8, 2023 -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషీ, అయినా..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల డామినేషన్ పతాక స్థాయిలో నడుస్తుంది. లీగ్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఫలితంగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. నిన్న (మార్చి 7) ముల్తాన్ సుల్తాన్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పరుగుల ప్రవాహం కొనసాగింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు పోటాపోటీగా విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. షాన్ మసూద్ (50 బంతుల్లో 75; 12 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (18 బంతుల్లో 33; ఫోర్, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరలెవెల్లో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఊచకోత ధాటికి ఇస్తామాబాద్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాదాబ్ ఖాన్ (4-1-26-2) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. సుల్తాన్స్ బ్యాటర్ల కంటే ఎక్కువగా రెచ్చిపోయి భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే (19.5 ఓవర్లలో 209/8) ఊదేశారు. ఇస్లామాబాద్ బ్యాటర్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. రహమానుల్లా గుర్భాజ్ (14 బంతుల్లో 25; 5 ఫోర్లు), కొలిన్ మున్రో (21 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ వసీం జూనియర్ (7 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఫలితంగా ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సుల్తాన్స్ బౌలర్లు అన్వర్ అలీ (3/33), ఇహసానుల్లా (2/35), ఉసామా మీర్ (2/38) బంతితో ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. కాగా, ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ విధ్వంసాన్ని చూసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. భారీ కాయుడు ఇదే తరహా విధ్వంసాన్ని ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు. గత సీజన్లోనూ మెరుపులు మెరిపించిన టిమ్.. రాబోయే సీజన్లో మరింత రెచ్చిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆసీస్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
Danny Morrison: అప్పుడు ఇండియా యువతి.. ఇప్పుడు ఆసీస్ యువతి
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ విజయవంతంగా నడుస్తోంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ లీగ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరుగా ఉంటుంది. ఆటలో గొప్ప బౌలర్‌గా పేరు పొందిన డానీ మోరిసన్ ఆట తర్వాత కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా డానీ మోరిసన్ చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్చి 5న(ఆదివారం) కెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ టీవీ ప్రజెంటర్.. మాజీ క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌తో కలిసి మోరిసన్ మాట్లాడాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే సడన్‌గా ఎరిన్ హాలండ్‌ను ఎత్తుకొని తన తొడపై కూర్చొబెట్టుకున్నాడు. ఈ చర్యతో ఎరిన్ హాలండ్ షాక్‌కు గురైనప్పటికి ఫన్నీగానే తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఎరిన్ హాలండ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ''లవ్ యూ అంకుల్ @SteelyDan66'' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన మోరిసన్.. ''నిన్ను నీ పాదాలపై నిల్చునేలా చేశాను మిసెస్ కటింగ్'' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''బెన్ కటింగ్ ఎక్కడున్నావు''.. ''బెన్ కటింగ్ చూశాడో నీ పని అయిపోతుంది మోరిసన్'' అంటూ ఫన్నీవేలో పేర్కొన్నారు. అయితే ఇలా చేయడం డానీ మోరిసన్‌కు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్‌లోనూ రెండు సందర్భాల్లో మోరిసన్ ఇలానే ప్రవర్తించాడు. ఒకసారి చీర్ లీడర్‌ను తన భుజాలపై మోసుకెళ్లిన మోరిసన్.. మరోసారి మాజీ ఐపీఎల్ ప్రజంటేటర్.. నటి కరిష్మా కొటక్‌ను కూడా తన తొడలపై కూర్చొబెట్టుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటో బాగా వైరల్ అయింది. తాజాగా పీఎస్ఎల్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసిన డానీ మోరిసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక 57 ఏళ్ల డానీ మోరిసన్ 1987లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 1994లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీయడం ద్వారా మోరిసన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 1997లో కివీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడిన మోరిసన్ తన 10 ఏళ్ల కెరీర్లో 48 టెస్టుల్లో 160 వికెట్లు, 96 వన్డేల్లో 126 వికెట్లు పడగొట్టాడు. Love ya uncle @SteelyDan66 😂 @thePSLt20 pic.twitter.com/9reSq6ekdN — Erin Holland (@erinvholland) March 5, 2023 Just keeping you on your toes Mrs Cutting!!! 🤣💃 #PSL8 https://t.co/r1i5Oebc5l — Danny Morrison (@SteelyDan66) March 5, 2023 చదవండి: షాహిన్ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి.. -
షాహిన్ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి..
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లోలో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలండర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం పెషావర్ జాల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలండర్స్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జట్టు కెప్టెన్ షాహిన్ అఫ్రిది(36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు), హుస్సేన్ తలత్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) చితక్కొట్టినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. పెషావర్ జాల్మీ బౌలింగ్‌లో అర్షద్ ఇక్బాల్, వహాబ్ రియాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సయీమ్ అయూబ్(36 బంతుల్లో 68), కెప్టెన్ బాబర్ ఆజం(41 బంతుల్లో 50) రాణించారు. ఇక కొహ్లెర్ కాడ్మోర్ 16 బంతుల్లో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ ఖలండర్స్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టగా, హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు -
మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 మ్యాచ్‌ల తర్వాత ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గ్లాడియేటర్స్.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్‌కు మరో ఎండ్ నుంచి ఎవరి సపోర్ట్ లేనప్పటికీ, ఒంటరి పోరాటంచేసి తన జట్టును గెలిపించుకున్నాడు. గప్తిల్‌కు సర్ఫరాజ్ అహ్మద్ (29), మహ్మద్ నవాజ్ (15), డ్వేన్ ప్రిటోరియస్ (10 నాటౌట్) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్ యామిన్, ముహ్మద్ మూసా, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్‌లో రొస్సింగ్టన్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఇమాద్ వసీం (30 నాటౌట్), ఆమెర్ యామిన్ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నసీం షా, ఐమల్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పెషావర్ జల్మీ-లాహోర్ ఖలందర్స్ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇస్లామాబాద్-ముల్తాన్ సుల్తాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
మున్రో విధ్వంసం.. చెలరేగిన ఆజమ్ ఖాన్, ఆఖర్లో ఫహీమ్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై గెలుపుతో ఖలందర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌పై ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. మహ్మద్ నవాజ్ (44 బంతుల్లో 52; 6 ఫోర్లు), నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో ఉమర్ అక్మల్ (14 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో గ్లాడియేటర్స్ ఈ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫహీమ్ అష్రాఫ్ 2, రయీస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్ మున్రో.. 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా.. ఆజమ్ ఖాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (31 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) హ్యాట్రిక్ బౌండరీలు బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో ఉమైద్ ఆసిఫ్ 3, మహ్మద్ నవాజ్ 2, నసీం షా, నవీన్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో ఇవాళ జరిగే మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్.. కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. -
ఫేర్వెల్ ఫంక్షన్లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్ మాలిక్ ఎక్కడ..?
Sania Mirza-Shoaib Malik: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న సానియా.. చివరిసారిగా రాకెట్ పట్టుకుని అందరినీ అలరించింది. ఫేర్వెల్ మ్యాచ్‌ల్లో భాగంగా జరిగిన సింగిల్స్ పోటీలో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీని ఢీకొట్టింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో సానియానే విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, హీరో దుల్కర్ సల్మాన్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్వెల్ మ్యాచ్‌ల అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్లో పాల్గొన్న సానియా.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్, ప్రిన్స్ మహేశ్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. Wasim Akram and Shoaib Malik in an intense discussion after the match 🧐 What could they be discussing? 🤔#IUvKKpic.twitter.com/HHumHfhUnt — Cricket Pakistan (@cricketpakcompk) March 3, 2023 కాగా, సానియా గౌరవార్ధం నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి నెటిజన్లు షోయబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జనాలకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. షోయబ్‌కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్వెల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే షోయబ్.. ఆ ఫ్రాంచైజీ మెంటార్, పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌తో వాదన తరహా డిస్కషన్‌కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. భార్య సానియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. సానియా-షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో వ్యవహరించడంతో వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే బాకీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
సామ్ బిల్లింగ్స్ మెరుపు అర్ధశతకం.. రషీద్ ఖాన్ మయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్‌తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్‌ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
ఆజాం ఖాన్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఇస్లామాబాద్ యునైటెడ్ నాలుగో విజయం నమోదు చేసింది. శుక్రవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆరు వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ గెలిపొందింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. ఇస్లామాబాద్ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 41 బంతుల్లో 72 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫహీమ్ అష్రఫ్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లుకోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాడ్ వసీం సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వసీం 54 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అయితే వసీం అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. కాగా సునామీ ఇన్నింగ్స్ ఆడిన ఆజం ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ ISLU fans to @MAzamKhan45 #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/OH93u9uCzR — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023 A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛,͛͛͛ ͛͛͛A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛!͛͛͛ ͛͛͛ Pindi crowd cannot stop cheering! #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/wwpVcDUhv3 — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023 -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్‌లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl) -
రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ జట్టు 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్.. కోహ్లెర్ కాడ్మోర్ (45 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్ (29 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవమన్ పావెల్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కరాచీ బౌలర్లలో మహ్మద్ అమీర్ (4-0-26-4) నిప్పులు చెరగగా.. షంషి (1/25), ఆమెర్ యామిన్ (4-1-38-0) పర్వాలేదనిపించారు. అనంతరం198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 53; 9 ఫోర్లు), ఇమాద్ వసీం (30 బంతుల్లో 57 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. పెషావర్ బౌలరల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆమెర్ జమాల్ తలో 3 వికెట్లు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2 వికెట్లు పడగొట్టారు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన బాబర్ ఆజమ్ సేనను మెరుపు అర్ధశతకంతో గట్టెక్కించిన రోవమన్ పావెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 2) లాహోర్ ఖలందర్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. 17 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి లాహోర్ ఖలందర్స్ (5 మ్యాచ్‌ల్లో 4 విజయలతో 8 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి. -
ఆట తక్కువ.. డ్రామాలెక్కువ
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఎనిమిదో సీజన్లో ఆట కన్నా డ్రామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి ఆటగాళ్లను తమ మాటలతో కవ్వించడం.. లేదంటే గొడవపడడం ఇవే హైలైట్ అవుతున్నాయి. తాజాగా ఆదివారం పీఎస్ఎల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సందర్భంగా కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాద్ వసీమ్ బూతులు మాట్లాడడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. విషయంలోకి వెళితే.. ముల్తాన్ సుల్తాన్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అన్వర్ అలీ ఔటయ్యాడు. ఆ తర్వాత యంగ్ పేసర్ ఇషానుల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్ వేస్తున్న అకిఫ్ జావేద్‌తో ఇషానుల్లాను ఉద్దేశించి ఇమాద్ వసీమ్.. 'వాడికి ఫుల్ డెలివరీలు వేయకు.. బౌన్సర్లు మాత్రమే సంధించు'(“Don’t bowl full delivery to this ****only bowl bouncers”) అంటూ అసభ్యకరమైన పదం వాడాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు పీఎస్ఎల్లో ఆట తక్కువ.. డ్రామాలెక్కువ అనేలా తయారైందంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తయాబ్ తాహిర్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూ వేడ్ 46, జేమ్స్ విన్స్ 27 పరుగులు చేశారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 101 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ రిజ్వాన్ 29 పరుగులు చేశాడు. కరాచీ కింగ్స్ బౌలర్లలో షోయబ్ మాలిక్, తబ్రెయిజ్ షంసీలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమాద్ వసీమ్, అకిఫ్ జావెద్‌లు తలా రెండు వికెట్లు తీశారు. Imad when Ihsanullah walked on https://t.co/o6IsjZYa3N pic.twitter.com/ka6B6AVbvL — Ali (@stuckon70) February 26, 2023 చదవండి: ముచ్చటగా మూడో టెస్టు.. ఎన్ని రోజుల్లో ముగుస్తుందో? ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు -
సూర్య కాదు.. అతడే నాకు స్ఫూర్తి! నిజమే.. నీకు ‘స్కై’తో పోలికేంటి?
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇటీవల వార్తల్లో నిలిచాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్.. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 97 పరుగులు సాధించాడు. తన తండ్రి మొయిన్ ఖాన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గ్లాడియేటర్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఎదురైన ఘోర పరాభవానికి కారణమయ్యాడు. ఫిబ్రవరి 24 నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 220 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తుపాన్ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆజం ఖాన్. ఈ క్రమంలో అతడిని టీమిండియాస్టార్, టీ20 వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యతో పోలికపై ఆజం ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆదర్శమని, అతడి ఆట తీరుతో స్ఫూర్తిపొందానని చెప్పుకొచ్చాడు. సూర్య కాదు.. టిమ్ డేవిడ్.. ఎందుకంటే ఇందుకు గల కారణం వెల్లడిస్తూ.. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నా స్థానం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. 40కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌కు వెళ్లి మ్యాచ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను టిమ్ డేవిడ్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నా. అతడు భారీ షాట్లు ఆడతాడు. తన పాత్రను చక్కగా పోషిస్తాడు. జట్టుకు ఏం కావాలో అదే చేస్తాడు. నేను కూడా తనలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను కదా! అయితే, సూర్యకుమార్ మాత్రం ఎక్కువగా వన్‌డౌన్‌లో వస్తాడు. టాపార్డర్‌లో ఆడటానికి నా బ్యాటింగ్ పొజిషన్‌కు తేడా ఉంటుంది కదా!’’ అని ఆజం ఖాన్ పాక్‌టీవీతో పేర్కొన్నాడు. నిజమే నీకు సూర్యతో పోలికేంటి? ఇక ఆజం ఖాన్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నిజం చెప్పావు ఆజం ఖాన్! అయినా.. సూర్యతో నీకు పోలికేంటి? ఒక్క ఇన్నింగ్స్‌తో అందరూ చాలా ఊహించేసుకుంటున్నారు. సూర్య నంబర్ 1గా ఎదగడానికి ఎంతలా కష్టపడ్డాడో.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో అతడి ఆట తీరు గమనిస్తే మీకు తెలుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆజం ఖాన్ 2021లో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 3 టీ20లు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 5. అయితే, పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో మాత్రం రాణిస్తున్నాడు. చదవండి: NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
ఇదెక్కడి బాదుడు రా బాబు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు.. బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్లు చేస్తున్నారు. లీగ్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 26) లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు మరోసారి శివాలెత్తడంతో పరుగుల వరద పారింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌కు వేదిక అయిన గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. షాహీన్ అఫ్రిది (5/40) పెషావర్ పతనాన్ని శాసించగా.. జమాన్ ఖాన్ 2, హరీస్ రౌఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) లాహోర్ ఖలందర్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
షంషి, షోయబ్ మాలిక్ మాయాజాలం.. రిజ్వాన్ జట్టుకు ఊహించని షాక్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్ ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50, 110 నాటౌట్, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. మాథ్యూ వేడ్ (46), జేమ్స్ విన్స్ (27), తయ్యబ్ తాహిర్ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (25), మహ్మద్ రిజ్వాన్ (29), అన్వర్ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్ షంషి (3/18), షోయబ్ మాలిక్ (3/18), అకీఫ్ జావిద్ (2/8), ఇమాద్ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు సుల్తాన్స్‌ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. పీఎస్ఎల్లో ఇవాళ రాత్రి లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
ఇదేమి ఖర్మరా బాబు.. క్రికెట్ స్టేడియంలో కెమరాలు చోరీ! పాక్‌లో అంతే?
ప్రస్తుతం జరుగున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఈ ఏడాది ఈ లీగ్‌కు కరాచీ, ముల్తాన్, రావల్పిండి, లాహోర్ అతిథ్యం ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రావల్పిండి, లాహోర్‌లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఫిబ్రవరి 26(ఆదివారం) లాహోర్ క్యాలండెర్స్, పెషావర్ జల్మీ మ్యాచ్‌తో లాహోర్ లెగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ భద్రత కోసం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలు చోరికి గురయ్యాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ కూడా ఎత్తుకుపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చోరీకి గురైన వస్తువులన్నీ దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తాయని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఇందుకు సంబంధించి గుల్బర్గ్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా గడ్డాఫీ స్టేడియంలోనే క్వాలిఫియర్, ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మరో సారి భద్రతా వైఫల్యం తలెత్తడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: 'ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే' -
ఇక్కడ ఆడాల్సిన అవసరం వాళ్లకేంటి? బీసీసీఐని చూసి బుద్ధి తెచ్చుకోండి: పాక్ మాజీ ప్లేయర్
BCCI- Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్ లీగ్‌లన్నింటిలోకి క్యాష్ రిచ్ లీగ్ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఇక వెటరన్ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్‌లో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన అక్మల్‌కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది. కమ్రాన్ అక్మల్ వాళ్లకేం అవసరం? ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్ఎల్లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్‌లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్‌లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు. పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి అలాంటపుడు విదేశీ లీగ్‌లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్‌కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్ ముందు బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్ కూడా ఐపీఎల్‌కు సాటిరాదు’’ అని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. BGT 2023: ‘టమ్ టమ్’ పాటకు టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వీడియో వైరల్ -
గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం!
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో లిటిల్ను రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లిటిల్ మోకాలి గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతడు పీఎస్ఎల్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2022లో లిటిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో లిటిల్ కూడా రాణించాడు. చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
కోహ్లి కంటే బాబర్ చాలా బెటర్..! డేవిడ్ మిల్లర్ సంచలన వాఖ్యలు
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అత్యుత్తమ క్రికెటర్ల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎవరికి వారే సాటి. అయితే కొంత మంది కోహ్లి కంటే బాబర్ అద్భుతమైన ఆటగాడని.. మరి కొంత మంది కోహ్లితో బాబర్‌కు పోలిక అంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు కోహ్లి, బాబర్ సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. కవర్‌డ్రైవ్ షాట్ విషయంలో బాబర్, కోహ్లిలో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్న మిల్లర్‌కు ఎదురైంది. దానికి బదులుగా మిల్లర్ ఏమీ ఆలోచించకుండా బాబర్ బెటర్ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్స్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ మిల్లర్ పేర్కొన్నాడు. ఇక కోహ్లి బెటర్ కాదుంటూ మిల్లర్ చేసిన వాఖ్యలపై కింగ్ అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మిల్లర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నంత మాత్రాన బాబర్‌కు సపోర్ట్ చేస్తావా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా మిల్లర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ మూల్తాన్ సుల్తాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
నీకోసమే నాన్నా.. ఎంత పనిజేసినవ్ కొడుకా! పెద్ద ప్రమాదమే! వైరల్
Pakistan Super League, 2023: కడుపున పుట్టిన బిడ్డలు తాము అనుకున్న రంగంలో రాణిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు. అద్భుతమైన ప్రతిభాపాటవాలతో పేరు తెచ్చుకుంటే మురిసిపోతారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్‌కు తన కుమారుడి కారణంగా ఇలాంటి అనుభూతి కలిగింది. తనలాగే బ్యాట్ పట్టి అద్భుత ఇన్నింగ్స్‌తో కొడుకు చెలరేగడంతో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు మొయిన్. అయితే, అదే సమయంలో ‘ఎంత పనిజేసినవ్ బిడ్డా’ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కొడుకు ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌ను తనకు అంకిమితమివ్వగానే చప్పట్లతో అతడిని అభినందించిప్పటికీ అతడి విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు. ఇందుకు కారణమేమిటంటే.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కరాచీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ బ్యాటర్ ఆజం ఖాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ(97 పరుగులు) చేజారినా జట్టుకు విజయం అందించి ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ గా నిలిచాడు. ఈ క్రమంలో మరుపురాని ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిచ్చాడు. డగౌట్లో కూర్చున్న తండ్రి మొయిన్ ఖాన్ వైపు చూస్తూ.. ‘‘ఈ ఇన్నింగ్స్ నీకోసమే నాన్నా’’ అన్నట్లు సైగ చేశాడు. దీంతో మొయిన్ ఖాన్ చప్పట్లతో కొడుకుకు శుభాభినందనలు తెలియజేశాడు. కానీ.. తన జట్టుకు పరాభవం ఎదురుకావడంతో కాస్త నిరాశపడ్డాడు. అవును.. ఆజం ఖాన్ కారణంగా క్వెటా గ్లాడియేటర్స్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలు కావడంతో మొయిన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. తండ్రి కోచ్‌గా ఉన్న జట్టుపై సునామీ ఇన్నింగ్స్‌తో ఆజం ఖాన్ సునామీ ఇన్నింగ్స్‌తో.. తాజా విజయం కారణంగా ఇస్లామాబాద్ యునైటెడ్ పీఎస్ఎల్-2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఆజం ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ క్వెటా జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆజం ఇన్నింగ్స్ చూసిన మెయిన్ ఖాన్ షాక్‌లో ఉండిపోయాడు. కొడుకు ఆటకు మురిసిపోవాలో.. లేదంటే తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు చేరువైన తరుణంలో బాధపడాలో తెలియని సంకట స్థితిలో పడ్డాడు. పెద్ద ప్రమాదమే! క్వెటా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో కొడుకు వల్ల మొయిన్ ఖాన్‌కు పెద్ద ప్రమాదమే వచ్చి పడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మొయిన్ 1990- 2004 మధ్య కాలంలో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక తన తండ్రి కోచ్‌గా వ్యవహరిస్తున్న జట్టుపై కొడుకు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం బహుశా పీఎస్ఎల్ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! When you make your dad proud 🥹#SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/9sVWHkOByQ — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డ ఆజం ఖాన్.. 42 బంతుల్లోనే..
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యువ బ్యాటర్ ఆజం ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. తద్వారా ఇస్లామాబాద్ యునైటెడ్ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా పీఎస్ఎల్-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆరంభంలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కోలిన్ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్ ఖాన్ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాదాబ్ ఖాన్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆజంకు తోడుగా అసిఫ్ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది. రెండో స్థానానికి ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్ బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ(అరంగేట్రం), హసన్ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాబాద్ ఖాన్ షాదాబ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 Epic finale to a sizzling innings 👏 #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/VVY81pWBiq — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవి చూసింది. గురువారం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతంగా రాణించాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్.. కేవలం 14.5 ఓవర్లలోనే చేధించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో గుర్బాజ్(62) అర్ధశతకంతో చెలరేగగా.. వాన్ డెర్ డస్సెన్(42) పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ పేసర్ హసన్ అలీని బాబర్ తన బ్యాట్‌తో కొట్టేందుకు సరదగా ప్రయత్నించాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన హసన్ అలీ బౌలింగ్‌లో ఆఖరి బంతికి బాబర్ సింగిల్ తీశాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న బాబర్‌ను చూసి.. హసన్ అలీ నవ్వుతో ఏదో అన్నాడు. అందుకు బదులుగా బాబార్ తన బ్యాట్‌తో కొడతూ అన్నట్లగా సైగలు చేశాడు. బాబర్ అలా చేసిన వెంటనే అలీ నవ్వుతో కొంచెం ముందుకు పరిగెత్తాడు. వీరిద్దరి చర్యను చూసిన సహాచర ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన హసన్ అలీ మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: IND vs AUS: టీమిండియాతో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్! కెప్టెన్‌గా స్మిత్ HASAN and babar😭😭😭 pic.twitter.com/hzve62ME4o — a. (@yoonosenadaa) February 23, 2023 Some banter between Babar Azam and Hassan Ali#PZvsIUpic.twitter.com/tDsxIhcrCl — Cricket Pakistan (@cricketpakcompk) February 23, 2023 -
పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ ముందుకు వేగంగా కదిలి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 13 పరుగులు చేసిన మాలిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక సంచలన క్యాచ్‌ను అందుకున్న పొలార్డ్‌ను సహచర ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి మరి అభినందించారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం BIG MAN @KieronPollard55 TAKES A RIPPER! 😲#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/2ynzehnsp2 — PakistanSuperLeague (@thePSLt20) February 22, 2023 -
కోపంతో ఊగిపోయిన పాకిస్తాన్ దిగ్గజం.. సోఫాను తన్నుతూ! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ మరో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కరాచీ పరాజాయం పాలవ్వడంతో ఆ జట్టు ప్రెసిడెంట్, పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ తన సహానాన్ని కోల్పోయాడు. తమ జట్టు ఓటమిపాలైన వెంటనే అక్రమ్ తన ముందు ఉన్న సోఫాను బలంగా తన్నాడు. అతడి చర్య అక్కడ ఉన్న కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సింది. ఇక ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన కరాచీ.. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజాయం పాలైంది. చదవండి: BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత HAHAHAHAHAH pic.twitter.com/6w727GIhRy — a. (@yoonosenadaa) February 22, 2023 -
మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్, పాక్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50 స్కోర్లు చేసిన రిజ్వాన్.. నిన్న (ఫిబ్రవరి 22) కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయి ఉగ్రరూపం దాల్చాడు. 60 బంతుల్లోనే శతకం బాది, పీఎస్ఎల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు 42 బంతులు తీసుకున్న రిజ్వాన్.. రెండో హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేసి పీఎస్ఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ⚠️ Riz-storm! #MohammadRizwan #HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/hWD3IdESrP — Alex Cricket Prediction (@alex_prediction) February 22, 2023 ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో కరాచీ కింగ్స్ సైతం అద్భుతంగా పోరాడింది. జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 75; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (26 బంతుల్లో 46 నాటౌట్; 5 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ ఆ జట్టు లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో కరాచీ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. కింగ్స్ జట్టులో విన్స్, ఇమాద్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. కాగా, ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 109.66 సగటున, 144 స్ట్రయిక్ రేట్‌తో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేసి, సీజన్ టాప్ స్కోరర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఓవరాల్‌గా రిజ్వాన్ గత 10 టీ20 ఇన్నింగ్స్‌లో 6 హాఫ్‌సెంచరీలు, ఓ సెంచరీ సాధించి కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అతని ఫామ్ కారణంగా ముల్తాన్ సుల్తాన్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
తుస్సుమన్న షాహీన్ అఫ్రిది.. మెరిసిన జేమ్స్ విన్స్, మాథ్యూ వేడ్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో కరాచీ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కింగ్స్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. లహోర్ ఖలందర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ 67 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్), జేమ్స్ విన్స్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లాహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది, జమాన్ ఖాన్, హరీస్ రౌఫ్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. అఫ్రిది వికెట్ పడగొట్టినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. కింగ్స్ బౌలర్లు అకీఫ్ జావిద్ (4/28), అమెర్ యామిన్ (2/18), బెన్ కట్టింగ్ (2/12), మహ్మద్ అమీర్ (1/12) ధాటికి 17.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో మీర్జా తాహిర్ బేగ్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కమ్రాన్ గులామ్ (23), సికందర్ రజా (18), ఫకర్ జమాన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముల్తాన్ సుల్తాన్స్ టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) ఉండగా.. కరాచీ కింగ్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), ఇస్లామాబాద్ యునైటెడ్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), క్వెట్టా గ్లాడియేటర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), పెషావర్ జల్మీ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), లాహోర్ ఖలందర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
కిల్లర్ మిల్లర్ ఊచకోత.. పోలార్డ్ విధ్వంసం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. Killer Miller time 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/7bfAEfTRAp — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 ఈ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించగా.. మిల్లర్, పోలార్డ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్ చిన్న సైజ్ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మసూద్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో రయీస్, మహ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, టామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. A hat-trick of boundaries ⚡ The perfect finish for @MultanSultans 🙌#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/5HcJQpxs8h — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. అబ్బాస్ అఫ్రిది (4/22), మహ్మద్ ఇలియాస్ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో డస్సెన్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హసన్ (21), మున్రో (31), ఆజం ఖాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌తో కిల్లర్ మిల్లర్ కూడా ఫామ్‌లోకి రావడంతో తదుపరి లీగ్‌లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్‌లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. -
న్యూజిలాండ్ ఓపెనర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులు!వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో గుప్టిల్ క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే శనివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుప్టిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 168 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఆసీస్ పేసర్ ఆండ్రూ టైకు గుప్టిల్ చుక్కలు చూపించాడు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన టై బౌలింగ్‌లో గుప్టిల్.. 3 సిక్స్‌లు, మూడు ఫోర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇక గుప్టిల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా.. గ్లాడియేటర్స్ తొలుత 168 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 169 లక్క్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ.. 162 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్‌పై గ్లాడియేటర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీలో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఇదే తొలి విజయం. చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు 4⃣6⃣4⃣6⃣6⃣4⃣ Martin Guptill teed off against Andrew Tye in the 19th over🚀 (via @thepslt20) #PSL2023 #KKvQG pic.twitter.com/R7JJ7ZHJic — ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2023 -
రచ్చరచ్చ చేసిన మహ్మద్ రిజ్వాన్, రిలీ రొస్సో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. పెషావర్ జల్మీతో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 66; 9 ఫోర్లు, సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ రిలీ రొస్సో (36 బంతుల్లో 75; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రచ్చరచ్చ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిల్లర్ (14 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), పోలార్డ్ (6 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు,సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. పెషావర్ బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 2, సుఫీయాన్ ముకీమ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన పెషావర్.. సుల్తాన్స్ బౌలర్లు ఉసామా (3/22), ఇహసానుల్లా (3/24), అబ్బాస్ అఫ్రిది (2/33), కార్లోస్ బ్రాత్‌వైట్ (1/22) ధాటికి 18.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. అరంభంలో ఓపెనర్ మహ్మద్ హరీస్ (23 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ సయిమ్ అయూబ్ (37 బంతుల్లో 53; 3 సిక్సర్లు, 3 ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యారు. వీరు కాక రోవమన్ పావెల్ (23), జేమ్స్ నీషమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ ప్లేయర్ రొస్సో వరుసగా రెండో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో ఇవాల్టి (ఫిబ్రవరి 18) మ్యాచ్‌లో కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
150 కి.మీ వేగంతో సూపర్ డెలివరీ.. దెబ్బకు కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. ముల్తాన్ బౌలర్ల దాటికి కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. ముల్తాన్ బౌలర్లలో పేసర్ ఇహ్సానుల్లా ఐదు వికెట్లతో గ్లాడియేటర్స్ విన్ను విరచగా.. సామీన్ గుల్, అబ్బాస్ అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా గ్లాడియటర్స్ బ్యాటర్లలో జాసన్ రాయ్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో రిలీ రుసౌ 78 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇహ్సానుల్లా సూపర్ డెలివరీ.. ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ పేసర్ ఇహ్సానుల్లా సంచలన బంతితో మెరిశాడు. ఓ అద్భుతమైన బంతితో గ్లాడియేటర్స్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఇహ్సానుల్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. 150.3 కి.మీ వేగంతో వేసిన బంతికి సర్ఫరాజ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి నేరుగా వెళ్లి స్టంప్సను గిరాటేసింది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇక ఇహ్సానుల్లా దెబ్బకు సర్ఫరాజ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్, సూర్యకుమార్‌కు నో ఛాన్స్! -
రఫ్ఫాడించిన రొస్సో.. ఐదేసి ఇరగదీసిన ఇహసానుల్లా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత గ్లాడియేటర్స్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన సుల్తాన్స్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదే రేంజ్లో రెచ్చిపోయి కేవలం 13.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. సుల్తాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇహసానుల్లా ఫైఫర్‌తో (4-1-12-5) గ్లాడియేటర్స్‌ను గడగడలాడించగా.. బ్యాటింగ్‌లో రిలీ రొస్సో మెరుపు హాఫ్‌సెంచరీతో (42 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. A special performance from our young quick Ihsanullah as he takes 5 wickets for 12 runs!#SultanAaGayya #LetsPlaySaeen pic.twitter.com/8HVKfheWsu — Multan Sultans (@MultanSultans) February 15, 2023 ఫలితంగా సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో భంగపడ్డ సుల్తాన్స్.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి బోణీ విజయం దక్కించుకుంది. మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. .@Rileerr gets to his 5️⃣0️⃣ Nothing can go wrong for @MultanSultans today 👏#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/a3lcm44BjR — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సుల్తాన్స్.. ఇహసానుల్లా (5/12), అబ్బాస్ అఫ్రిది (2/27), సమీన్ గుల్ (2/20), ఉసామా మిర్ (1/19) చెలరేగడంతో ప్రత్యర్ధిని 18.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (27), ఉమర్ అక్మల్ (11), మహ్మద్ నవాజ్ (14), హఫీజ్ (18), మహ్మద్ హస్నైన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. Cracking shot! @Rileerr making Multan roar 🎉#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/zazLskMwYm — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సుల్తాన్స్.. షాన్ మసూద్ (3) వికెట్ కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. వైవిధ్యమైన షాట్లతో రిలీ రొస్సో రెచ్చిపోగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (28 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేసి సుల్తాన్స్‌ను గెలిపించారు. షాన్ మసూద్ వికెట్ నువాన్ తుషారకు దక్కింది. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 16) కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. Pace like fire! 🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/7UFeFx04kz — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 -
ఇంగ్లండ్ యువ ఆటగాడి విధ్వంసం.. సరిపోని ఇమాద్ వసీం మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎనిమిదో సీజన్ తొలి మ్యాచ్‌లో ఫకర్ జమాన్ బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 14) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు కొహ్లెర్ కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కొహ్లెర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (50 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. కొహ్లెర్ మెరుపులకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాధ్యతాయుతమైన ఫిఫ్టీ తోడవ్వడంతో పెషావర్ భారీ స్కోర్ సాధించగలిగింది. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, అండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, బెన్ కట్టింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీం (47 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చేలరేగినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇమాద్‌కు వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం తోడైనప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో కరాచీ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఇమాద్, బెన్ కట్టింగ్ (9) 13 పరుగులు చేయగలిగారు. ఆఖరి బంతిని ఇమాద్ భారీ సిక్సర్‌గా మలచినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పెషావర్ బౌలర్లలో వాహబ్ రియాజ్, జేమ్స్ నీషమ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ ఇర్షాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 15) ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి.


