breaking news
Pawan Kalyan
-
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్‌ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
పవన్ కార్యాలయం ప్రకటనతో బట్టబయలైన లిక్కర్ దందా
కాకినాడ: ఏపీలో విచ్చలవిడిగా అధిక ధరలకు లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయని చాలాకాలంగా వైఎస్సార్సీపీ చెబుతూ వస్తున్నమాట వాస్తవమేననేది తేటతెల్లమైంది. ఏపీలో అధిక మద్యం ధరలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటనతో లిక్కర్ దందా జరుగుతుందనేది బట్టబయలైంది. ఏపీలో మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో అధిక ధరలపై తమకు వరుస ఫిర్యాదు వచ్చాయని పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించింది. ఇందులో పవన్ ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లాలో అధిక ధరలే కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులొచ్చాయి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించడంతో అసలు విషయం వెలుగుచూసింఇ. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖక సూచించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది పవన్ కార్యాలయం. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి ఏపీలో లిక్కర్ షాఫులు నిర్వహిస్తున్నారు. అత్యధిక శాతం లిక్కర్ దందా అంతా కూడా కూటమి కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా అత్యధిక ధరలకు మద్యం అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
గలీజు ఎమ్మెల్యే కోసం జనసేన కొత్తడ్రామా
సాక్షి, విజయవాడ/అన్నమయ్య: రైల్వేకోడూరు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ జనసేన. ఏకంగా అసెంబ్లీ నుంచే అరవ శ్రీధర్ వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ.. ఇటు కమిటీ పేరిట కాలయాపన చేస్తోందా పార్టీ.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. వారం గడుస్తున్నా ఎలాంటి చర్యల్లేవ్. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. మరోవైపు..ఎమ్మెల్యే అరవశ్రీధర్ గలీజు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా.. జనసేన చర్యలు తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించకుండా ముఖం చాటేస్తున్నారు. పైగా బాధితురాలిని బెదిరించిన జనసేన నేత నాగేంద్రతోనే కమిటీ వేయించారు. ఈ కమిటీలో శివశంకర్, రమాదేవి, వరుణలు ఉన్నారు. వీళ్లు ఓ హోటల్లో దిగారు. శ్రీధర్ వాళ్ల ముందు హాజరయ్యారు. ఇవాళ, రేపు అరవ శ్రీధర్‌ను విచారిస్తారట. ఆ వీడియోలు అసలువో.. నకిలీవో నిర్ధారించుకుంటున్నారట. అంతేగానీ అరవ శ్రీధర్ తప్పేం లేదని మాత్రం ఆ పార్టీ ప్రకటించలేకపోతోంది. అరవశ్రీధర్, జనసేనలోని అతని అనుచరులు ఇప్పటికీ బాధితురాలిని బెదిరిస్తూ తిరుగుతున్నారు. జంగిల్ రాజ్‌లో ఇప్పటికే మహిళలకు భద్రత కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరుసలో.. ఓ కామాంధుడైన ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
MAGAZINE STORY: బండబూతుల దండుపాళ్యం
-
Tirumala Laddu Row : ఫ్రస్టేషన్లో పవన్ కళ్యాణ్
సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం గుంటూరులో జనసేన జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
Mounika : పీకే గారూ.. ఇదేనా మీరన్న మహిళల భద్రత..?
-
Jada Sravan: ఏపీకి కేంద్రం వరాల జల్లా..? ఫ్లైట్ ఎక్కడం... ఫ్లైట్ దిగడం...
-
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్‌ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్‌ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్‌లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు, పవన్, లోకేశ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలి
సాక్షి నెట్వర్క్: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, లోకేశ్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల కల్తీ ఆరోపణలపై ప్రాయశి్చత్త పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు. లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలినా టీడీపీ కూటమి నేతలు బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేస్తుండడాన్ని నిరసిస్తూ అభిషేకాలు, పాప ప్రక్షాళన పూజలు చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 101 టెంకాయలు కొట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లను కడిగి పూజలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ పశ్చిమంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో మెట్లు కడిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ఆలయాలను నాయకులు శుద్ధిచేశారు. కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. -
Sailajanath: గుర్తుపెట్టుకోండి.. మీరు గెలిచింది EVMల వల్లే
-
Kannababu : ఇంతమందికి నిద్రలేకుండా చేస్తున్న..
-
చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్‌లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్, లోకేష్‌ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు. -
నోరు పడిపోయిందా? MLA శ్రీధర్ ఘటనపై మహిళల స్ట్రాంగ్ రియాక్షన్
-
రాజకీయాలకోసం దేవుడిని అడ్డం పెట్టుకున్నారు.. మీ పతనం మొదలైంది..
-
కూటమి అపచారం.. వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువచ్చింది. దీంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తుల డిమాండ్ చేస్తున్నారు.విజయవాడఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కామెంట్స్..ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటారా?.ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్తారా?.రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగుతారా.రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు క్షమాపణ చెప్పాలి.జరగని ఒక ఘటన జరిగిందని ప్రచారం చేసారు సీబీఐ అలాంటిది ఏమి లేదని చెప్పింది.పవన్ కళ్యాణ్ దుర్గా గుడికి వచ్చి మళ్ళీ మెట్లు కడగాలని డిమాండ్ చేస్తున్నా.కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు మొహం చూపించలేక సమాధానం చెప్పలేక తిరుగుతున్నారు. కర్నూలు..కల్లూరు అర్బన్‌లోని వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలునంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలుచంద్రబాబు, పవన్ చేసిన అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులువారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకన్నను వేడుకుంటూ టెంకాయలు కొట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలువిజయవాడలబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాప పక్షాళన పూజలుపూజలు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు.బందర్ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేసిన పార్టీ శ్రేణులుచంద్రబాబు, పవన్ వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు విశాఖ..సీతమ్మధార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు.పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి , పార్టీ నేతలు.తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారంపై నేతలు ఆగ్రహం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. కూటమికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు.. వైయస్సార్ జిల్లా...బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో 101 టెంకాయ కొట్టి పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు...కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పులివెందుల నాయకులు ప్రత్యేక పూజలు విశాఖ..మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు..కేకే రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..తిరుమల లడ్డూ అంశంలో తప్పుడు ప్రచారంపై పార్టీ నేతల ఆగ్రహం..ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టిన నేతలు..పాప పరిహార పూజకు భారీగా హాజరైన పార్టీ శ్రేణులు.. -
బరితెగించిన కూటమి ప్రభుత్వం.. దేవుడితోనే రాజకీయాలు..
-
వేద మంత్రాలతో.. హోరెత్తిన నిందా పరిహార హోమం
తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిందాపరిహార హోమాన్ని నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికతో స్పష్టమవడంతో ఇప్పటి వరకు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారంతో దెబ్బతిన్న శ్రీవారి పవిత్రతకు, ప్రతిష్టకు ప్రాయశ్చిత్తంగా తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భూమన దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదంపై రాజకీయ నిందలా? ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచపు అపనిందలు మోపారు. ఆ ఇద్దరూ కుమ్మకై దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్‌కళ్యాణ్ అయితే దుర్గా మాత గుడి మెట్లు కడిగి అత్యంత నీచంగా ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో విష ప్రచారానికి తెగబడ్డారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నిందలకు పరిహారంగా శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. దీనిద్వారా అపవాదులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం. అయితే, లడ్డూ ప్రసాదంలో ఎక్కడా జంతు కొవ్వు కలవలేదని, ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని సీబీఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు చెంపపెట్టుగా మారింది. దీనిని వారు జీర్ణించుకోలేక అనుకూల పత్రికలు, ఛానళ్ల ద్వారా ఇంకా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించడం దారుణం’ అని భూమన అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు ఇక తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పార్టీలు అడ్డంగా దొరికిపోయినప్పటికీ, టీడీపీకి చెందిన కొందరు ఇప్పటికీ ప్రసాదంపై విషప్రచారం చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూతో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేస్తూ, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టులు.. వివిధ ప్రాంతాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు పెడుతున్నారని వారు ఆరోపించారు. హోమం భగ్నానికి యత్నం శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమాన్ని ఎలాగైనా భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన గూండాలు ఒక్కసారిగా భూమన నివాసానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. హోమం సమీపంలో నానాయాగీ చేస్తూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్థానికులు, హోమానికి హాజరైన వేద పండితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ దుష్ప్రచారాలు ప్రజల్లో బట్టబయలవుతాయన్న భయంతో కూటమి నేతలు హోమాన్ని అడ్డుకునేందుకు రౌడీమూకలను దింపారని భూమన ఆరోపించారు. టీడీపీకి చెందిన రాక్షస శక్తులు హోమం జరుగుతున్న తమ ఇంటిపై దాడికి ప్రయత్నించాయని, 100 మందికి పైగా రౌడీమూకలు అన్నమయ్య భవన్ సమీపంలో వీరంగం సృష్టించారని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి విష సంస్కృతిని తీసుకొచి్చంది కూటమి పార్టీల పెద్దలేనని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాన్ని రౌడీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన నేతలే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. -
‘చంద్రబాబుకు ఇప్పటికీ బుద్ధి రాలేదు’
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ప్రతిపక్షం మీద బురద జల్లాలని చేసిన కుట్రను ల్యాబ్ రిపోర్ట్లు భగ్నం చేశాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అబద్దాల పునాదుల మీద అసత్యాలు పోగుచేసి జగన్‌గారి మీద, వైఎస్సార్సీపీ మీద బురద జల్లాలని చేసిన కుట్ర పటాపంచలైందన్నారు.దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థల నివేదికల ద్వారా ఈ కుట్రలు భగ్నమై నిజం బయటికి వచ్చిందన్నారు. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రెస్మీట్లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి కుట్రకు అప్పుడే బీజం:చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నారు. అంతటితో ఆగకుండా పందికొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని, దాంతోనే లడ్డూలు తయారు చేశారని, వాటిని ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలతో దేశంలోని భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పంది కొవ్వు, పశువుల కొవ్వేమిటి!. లడ్డూ ప్రసాదంలో కలిశాయని ఓ ముఖ్యమంత్రే చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న అనుభవజ్ఢుడని చెప్పుకునే రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు ఇవి. వీటిని ఆరోజే విజ్ఞులైన వారంతా ఖండించారు.ఏ కొవ్వూ లేదని తేల్చిన ల్యాబ్‌లు. ఆ నివేదికలతో సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్ :రాజకీయాల్లో ప్రత్యర్థులపై కక్ష సాధించాలంటే వేరేలా ప్రయత్నాలు చేయొచ్చు కానీ హిందూ ధర్మానికి భంగం కలిగేలా ప్రపంచంలో అందరూ కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని చేసిన ఆరోపణ సహించరానిది. అంతకు ముందే టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చీవాట్లు పెట్టి మీ సిట్ కాదు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ శాంపిల్స్ ను సెకండ్ ఒపీనియన్ కోసం మళ్లీ ల్యాబ్స్ కు పంపమని ఆదేశించింది. ఆ శాంపిల్స్ పరిశీలించిన ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ.. అందులో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేల్చి చెప్పాయి. ఆ నివేదికల ఆధారంగా, చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని సిట్ తేల్చింది. అదే విషయాన్ని పొందుపర్చిన సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయినా మీడియా బలంతో, అధికార బలంతో జగన్మోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోలతో దారుణంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు.మీ హయాంలో నెయ్యిపైనే ల్యాబ్ రిపోర్టులు:చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చాక జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తేదీల్లో వీఆర్ డెయిరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళ్తే శాంపిల్స్ తీసుకున్నారు. ఇది జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. ఈ శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపించి, నెయ్యి కల్తీ జరిగిందని ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా ల్యాబ్ రిపోర్ట్స్ లోనే ఇలా జరగొచ్చు అని చెప్తే.. వాటిని పట్టుకుని చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. దీని మీద సుప్రీంకోర్టు వెళ్తే చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత సిట్ వేస్తే విచారణ జరిపి తాజాగా నివేదిక ఇచ్చింది. దున్నపోతు ఈనిందంటే కట్టేయండి అన్న చందాన పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి వెళ్లి, మెట్లు కడిగి, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 జూన్, జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి పరీక్షలు చేయకుండా, సెకండ్ ఒపీనియన్ కూడా లేకుండా అయోధ్యకు పంపిన లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసారు.ఆ డెయిరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే:నెయ్యి కల్తీ పేరుతో ఆధారాలు లేకపోయినా రాజకీయంగా వైఎస్సార్సీపీపై బురదజల్లడంతో పాటు శ్రీవారిని కూడా అడ్డుపెట్టుకుని ఆయన ప్రసాదంలో పందికొవ్వు పేరుతో కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు. ఇవాళ ఏ కొవ్వూ లేదని తేలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి వాడామని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కల్తీ నెయ్యిని ఎందుకు వాడారో చెప్పండి. తిప్పిపంపిన ట్యాంకర్లను తిరిగి తెప్పించి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అపచారం కాదా వీళ్లు చెప్పాలి.నెయ్యిపై రిపోర్ట్ ఇచ్చిన సంస్థలు రెండూ ప్రతిష్టాత్మకమైనవే. ఇందులో ఒకటి హర్యానాలోని కర్నాల్ లో ఉన్న నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), అలాగే గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ). టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నెయ్యి పంపిణీ మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలోనే. మేం అనుమతి ఇచ్చినా చంద్రబాబు హయాంలో సరఫరా చేస్తుంటే సరి చూసుకోవాలిగా. మీ పాలనలో సరఫరా అయిన నెయ్యికి కూడా మేం ఎలా బాధ్యత వహిస్తాం ?, భోలేబాబాకు తొలుత అనుమతి ఇచ్చింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. ముందు హర్ష డెయిరీగా పేరు పెట్టుకుని, ఆ తర్వాత పేరు మార్చుకున్నారు. భోలేబాబాకు పాలు లేవని ఇవాళ పచ్చమీడియాలో రాతలు రాస్తున్నారు. అటువంటి డెయిరీకి మీరు అనుమతి ఎలా ఇచ్చారు?.చంద్రబాబు అధికారంలో ఉండగా అనుమతిచ్చిన భోలే బాబాగా చెప్తున్న హర్ష డెయిరీ కిలో నెయ్యి రూ.291కి ఎలా ఇచ్చింది?, ఇప్పుడు ఇంత చౌకగా ఎలా నెయ్యి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్న వారు ముందు దీనికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మాన్ని గౌరవించే వారు ఇలాంటి చేష్టల్ని ఖండించాల్సిందే.అధికారులు రాజకీయ కుట్రలో భాగం కావద్దు:చిన్నప్పన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన దగ్గరే జీతం కూడా తీసుకున్నాడు. చిన్నప్పన్ పీఏ అయితే ఛార్జిషీట్ లో వైవీ సుబ్బారెడ్డి పేరు ఉండాలిగా, ఎందుకు లేదు. లడ్డూకు నామాలు పెట్టి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లకు అడ్డూ అదుపూ లేదు. టీటీడీ బోర్డు ఛైర్మన్ డబ్బు కోసం దేనికైనా సిద్దపడే వ్యక్తి. ఆయనకు వెంకటేశ్వరస్వామి మీద కాదు డబ్బుల మీద, బూతు బొమ్మలు చూపించడం మీద, నూజేన్ ఆయిల్ లాంటి ఉత్పత్తులు తయారు చేసి డబ్బులు దండుకోవడంలో, జూబ్లీ పార్క్ ల్లో డబ్బులు కాజేసే కార్యక్రమంలో ఉంది. ఆయన అపవిత్రుడు కాబట్టే కొండమీద అపచారాలు జరుగుతున్నాయి.మేం నాస్తికులు అంటున్న ఆయన పెద్ద ఆస్తికుడు మరి. ఐఏఎస్ అయిన శ్యామలరావు, ఐఆర్ఐఎస్ వెంకయ్య చౌదరికి ఏం పోయేకాలం వచ్చింది. మీరు భగవంతుడి దగ్గర కాపలా కాయకుండా నాటకాలు నడిపిస్తే భగవంతుడు క్షమించడు. వీరిద్దరిపై మాకు గౌరవం ఉంది. ధర్మాన్ని పాటించాల్సిన వీళ్లు చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగస్వాములై మా మీద బురదజల్లుతున్నారు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోండి. లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసిన వాళ్లు పుట్టగతుల్లేకుండా పోతారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..తిరుమలలో వాడిన నెయ్యికి సంబంధించి సీబీఐ సిట్ పూర్తి వాస్తవాలతో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎందుకు మాట్లాడటం లేదు?. ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఓ పార్టీ ఉందని గుర్తుంచుకోవాలి. మీరు చంద్రబాబు చెంచా అని మేం అనుకుంటున్నాం. కానీ జనం మాత్రం చంద్రబాబు చెంచా అనే అనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది మాత్రమే వినకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. పవన్ ఇంతవరకూ పొలిటిషియన్ గా మారలేకపోయారు. చంద్రబాబు, లోకేష్ చెప్పింది చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ల అవినీతిలో నాకు భాగం లేదని పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆయన బీజేపీ, టీడీపీ.. ఇలా ఎవరికి ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తున్నారు.అధికారం కోసం ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు. భగవంతుడు లేదు, తండ్రి లేదు, పిల్లనిచ్చిన మామ లేదు, పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఆయనకు కొడుకు మాత్రమే ఉండాలి. కొడుకు వారసుడు కాబట్టి తనను మాత్రమే చంద్రబాబు లెక్క చేస్తాడని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
‘బాబు, పవన్, లోకేష్‌లపై కేసు పెట్టాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్ ఎక్కడికి పోయారు?.తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్ ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం.. డిప్యూటీ సీఎం.. గుట్టురట్టు
-
24 గంటల్లో ఆ ఫ్లెక్సీ తొలగించాలి: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: నగరంలో టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. చిల్లీ సెంటర్లో అబద్ధాలతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముందు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నివేదిక ఇచ్చింది. అయినా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీపై వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బొమ్మలు వేసి విష ప్రచారం చేస్తున్నారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలి. లేకపోతే మేమే ఆ ఫ్లెక్సీలు చింపేస్తాం. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు. మా పార్టీ నాయకులు పైన తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లను ఆ దేవుడు కూడా క్షమించడు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ఛీ కొడుతున్న శ్రీవారి భక్తులు
-
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్‌షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్‌లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్‌లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్‌ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నో కల్తీ.. మెట్లు ఇప్పుడు కడుగు పవన్
-
మీ పాపం పండింది.. ఒక్క మాటలో ఇచ్చిపడేసిన అంబటి
-
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్‌పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్‌కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్
-
మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్
-
Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..
-
విశాఖలో జూపార్క్ మూసివేత.. సందర్శకుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇందిరాగాంధీ జూపార్క్ మూసివేతపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ తీసుకున్నా పార్క్ లోపలకు పంపడం లేదని పర్యాటకులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన కారణంగా అధికారులు.. జూపార్క్‌ను మూసేశారు. పవన్ కల్యాణ్ పర్యటనపై సమాచారం లేకుండా జూపార్క్ మూసివేశారు. జూపార్క్ సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు.పవన్ పర్యటన ఉన్నట్లు కనీసం బోర్డులు కూడా పెట్టలేదని సందర్శకుల అసహనం వ్యక్తం చశారు. ఉదయం నుంచి జూపార్క్‌ను మూసివేయడంతో పర్యాటకులు పడిగాపులు గాస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనుమతిస్తామన్న జూపార్క్ అధికారులు.. ఒంటి గంట తర్వాత కూడా అనుమతించకపోవడంతో పర్యాటకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జూపార్క్ సందర్శనకు రావాలన్న సెక్యూరిటీ సిబ్బందితో పర్యాటకులు వాగ్వాదానికి దిగారు. -
గీతం ల్యాండ్ స్కాం ఇష్యూపై పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
-
‘పవన్ ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారో..’
సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సీబీఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు.తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలి. చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోయాడు.సనాతన ధర్మం ముసుగులో ప్యాకేజీల కోసం ఆడించే డ్రామా ఆర్టిస్టులు. పవన్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?.వైఎస్ జగన్ కాళ్లు కడిగి చంద్రబాబు, పవన్ నెత్తిన చల్లుకోవాలి. ఆడవాళ్లకు అబార్షన్లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు.. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?. తప్పుడు ప్రచారం చేసిన నోర్లను పినాయిల్‌తో కడగాలి. శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారు.విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్‌లో ఉన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు’అని మండిపడ్డారు. -
‘గీతం భూ కబ్జాపై పవన్ మాట్లాడాలి.. పచ్చ మీడియాకు కళ్లు లేవా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ స్టాండ్ ఏమిటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాటం లేదు. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు.విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకునేతల పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు, మాజీ మంత్రి అమర్నాథ్ నియోజకవర్గ సమన్వయకర్తలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ వేయాలంటూ డిమాండ్ చేశారు.అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘చంద్రబాబు భూ దోపిడీని అడ్డుకోవడానికి గీతం యూనివర్సిటీకి వచ్చాము. చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదువేల కోట్ల భూమి ప్రభుత్వానికి చెందిందని గత వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలో హెచ్చరిక బోర్డులు పెట్టాం. ప్రభుత్వ భూమిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారా?. చంద్రబాబు లెజెండరీ అని రోజూ సొల్లు కబుర్లు చెబుతారు. భూ కబ్జాలు చేయడమేనా మీ లెజెండరీ. ఏబీఎన్, టీవీ-5, ఈనాడులకు భూ దోపిడీ కనిపించడం లేదా?. భూ కబ్జాపై నోరూ విప్పాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్‌కు ఉంది. విశాఖలో ఉండి కూడా పవన్ గీతంపై ఎందుకు మాట్లాడలేదు?. గీతం భూ దోపిడీపై బీజేపీ, జనసేన మాట్లాడాలి. అవసరమైతే గీతం భూకబ్జా భూములను పరిశీలించడానికి వైఎస్ జగన్‌ను పిలుస్తాము. చంద్రబాబు భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలి. భూ దోపిడీని రేపు కౌన్సిల్లో అడ్డుకుంటాం అని హెచ్చరించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘గీతం సంస్థకు భూమి కట్టబెట్టడంలో ప్రభుత్వం బరితెగించింది. భూములను ధారాదత్తం చేస్తే అడిగే వారు లేరని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. మా ప్రభుత్వం టూరిజం భవనాలు కడితే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గీతం సంస్థకు 55 ఎకరాలు కట్టబెడుతుంది ప్రభుత్వం. గీతం భూ కబ్జాపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటి?. గతంలో ఇక్కడికి వచ్చి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఏం తప్పు చేసినా మాట్లాడకుండా ఉండటమే మీ స్టాండా పవన్?. తిరుమల లడ్డు విషయం ఇప్పుడు పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.జీవీఎంసీ అజెండా నుంచి గీతం భూముల అంశం తీసేయ్యాలి. లేదంటే జీవీఎంసీ కౌన్సిల్ జరగనివ్వం. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. గీతం సంస్థ కబ్జా చేసి కేటాయించమని అడుగుతుంది. ఈ కబ్జాను అంగీకరించిన రోజే ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రచ్చ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ నడుస్తోంది. ఎంపీ భరత్ మీద కేసు పెట్టాలి. ఈ ప్రాంతంలో ఉన్న భూములను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘రుషికొండ ప్రభుత్వ భవనాలపై తప్పుడు ప్రచారం చేశారు. గీతం కబ్జాపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వేల కోట్లు విలువైన భూమి కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం. గీతంలో డబ్బున్న వారు చదువుతారని ఎంపీ చెప్పారు. చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని చట్టం ఏమైనా చేశారా?. కూటమి జమానాలో భూ కబ్జాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. గీతం కబ్జాపై కూటమి నేతలకు బాధ్యత లేదా?. ఈ భూమిని కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. -
Devineni: మీకు రోజులు దగ్గరపడ్డాయి.. ఎక్కడ మెట్లు కడిగావో.. అక్కడికే వచ్చి
-
3 హత్యలు, 6 మానభంగాలు.. మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?
-
వైఎస్ జగన్ ను దెబ్బ తీయడానికి చంద్రబాబు అండ్ కో కుట్రలు
-
అరవ శ్రీధర్ చేతి రాతలు మార్చారా, రోమాలు తీసారా? నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి
-
పవన్ జూ లకటక
విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన అధికారులు సందర్శకులను నిలిపివేయడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో వచ్చిన సందర్శకులు జూ ప్రవేశం అనుమతి లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.పవన్ కళ్యాణ్ జూ పర్యటన సందర్భంగా భద్రతా కారణాలతో ప్రధాన గేట్ల వద్ద కఠిన ఆంక్షలు విధించారు. దీంతో ఉదయం నుంచి టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్లేందుకు వచ్చిన సందర్శకులను పోలీసులు అడ్డుకున్నారు. సందర్శకులు మాట్లాడుతూ.. ముందుగా సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ప్రవేశం నిలిపివేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.దూర ప్రాంతాల నుంచి పిల్లలతో కలిసి వచ్చామని, ఇప్పుడు నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చిందని తెలిపారు. అధికారులు మాత్రం భద్రతా కారణాలతో తాత్కాలికంగా జూ సందర్శనను నిలిపివేశామని, పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయిన తర్వాత పరిస్థితిని సమీక్షించి సందర్శకులకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. -
చంద్రబాబు, పవన్ పని.. గోవిందా! (ఫొటోలు)
-
ఇప్పుడు తీయ్ తోలు, తాట.. సినిమా డైలాగులకు తప్ప దేనికి పనికిరాని DCM
-
ఇది జనసేన పతనం.. పవన్ కళ్యాణ్ ఒక డమ్మీ.. అందుకే నో యాక్షన్
-
మీ ఎమ్మెల్యే సంగతేంటి? పవన్ పరుగో పరుగు
-
బాధితురాలి సాక్ష్యాలలో చంద్రబాబు పేరు! పారిపోయిన పవన్
-
కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన వర్గానికి పదవుల కోసం హస్తిన వేదికగా లాబీయింగ్‌కు తెరలేపారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఇక్కడికొచ్చి తన బంధువు, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా ఇప్పుడు అదే బాటపట్టారు. తనకు, సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన పార్టీ లో కీలకంగా ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలÔౌరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. లింగమనేని కోసం పవన్ ఆరాటం.. త్వరలో ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వీటికోసం అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వేదికగా పైరవీలు చేస్తుండగా.. సీఎం చంద్రబాబు ఇటీవల తన అస్మదీయుల కోసం అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్‌కు అత్యంత ఆప్తుడుగా ఉన్న కిలారు రాజేశ్‌కు రాజ్యసభ సీటు కేటాయించాలని చంద్రబాబు అడగ్గా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కూడా రాజ్యసభలో చోటు కల్పించాలని పవన్ తాజాగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏడాది క్రితం ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి పంచుకున్నాయి. అప్పట్లో పవన్ లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో జనసేన నుంచి లింగమనేని రమేష్‌కు అవకాశం కల్పించాలంటూ పవన్ అమిత్ షాను అడిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ కి మంత్రి పదవిస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఎదుట పవన్ విన్నవించినట్లు సమాచారం. కాగా ఉప్పాడ సముద్ర రక్షణ కోసం గోడ నిర్మాణం, రాష్ట్రంలో పరిపాలన, ఇతర ముఖ్యమైన విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లు పవన్‌కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి,అమరావతి: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాల గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని బాధితురాలు మీడియాతో ఎదుట బాంబు పేల్చారు. ఎమ్మెల్యే శ్రీధర్‌పై చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. నారావారిపల్లెలో 10రోజల క్రితమే చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడతారునుకున్నా. బాబు మాత్రం సాధారణ అర్జీదారునిగానే ఫిర్యాదును తీసుకున్నారు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాట చేస్తా. ఎమ్మెల్యే నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు’అని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు టెలిగ్రామ్‌లో మెస్సేజ్ చేశాను.రెండురోజులు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత పర్సనల్ ఫొటోలు పంపించమని అడిగాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించాడు. నీ ట్రాన్స్ఫర్,ప్రమోషన్ నా చేతిలోనే ఉంటుందని బెదిరించాడు. మా ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఓ ఇంటి వద్ద ఆపాడు. నేను,నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరా అయ్యింది. బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. -
Ys Jagan: తాగరా.. తాగి చిందేయరా..! ఇదే కూటమి పాలన
-
RK Roja : జనసేన కాదు కామసేన
-
YSRCP Leaders: డిప్యూటీ CM పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి
-
RK Roja : కీచక జనసేన ఎమ్మెల్యేను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ
-
ఎమ్మెల్యే రాసలీలపై ప్రశ్నించగా పారిపోయిన పవన్
-
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెనుక ఉన్నదెవరు?
-
అరవ శ్రీధర్ ఎపిసోడ్.. మొహం చాటేసిన పవన్ కల్యాణ్
సాక్షి, ఢిల్లీ: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్‌పై స్పందించేందుకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరాకరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన్ని.. బుధవారం మీడియా ప్రతినిధులు పలకరించారు. అయితే చాలా అంశాలపై మాట్లాడిన ఆయన.. శ్రీధర్ అంశంపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. అయితే ఆయన నోరు విప్పలేదు. సైలెంట్‌గా మొహం చాటేసుకుని కారెక్కి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో అరవ శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు పడిందని నిన్నంతా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అదంతా జన సైనికుల అత్యుత్సాహం అని తర్వాతే తేలింది. రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు అరవ శ్రీధర్‌ను రక్షించే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా.. కేవలం విచారణ కమిటీ పేరిట తతంగం నడిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
‘ఎంపీ భరత్ భూ దోపిడీ.. పవన్, బీజేపీకి కనిపించట్లేదా?’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖలో భూ బదలాయింపు అంశం రేపు(గురువారం) జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ ఐటమ్‌గా చేర్చారు. భూ దోపిడిని ఆపాలని మేయర్, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించాం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. రేపు గీతం యూనివర్సిటీలో కబ్జాకి గురైన 5 వేల కోట్ల విలువైన భూమిని సందర్శిస్తాను. ఈనెల 30వ తేదీన కౌన్సిల్లో పోరాటం చేస్తాం. అదే రోజు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపడతాం.విశాఖ భూ దోపిడీపై జనసేన, బీజేపీ సమాధానం చెప్పాలి. ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడటంపై మీ స్పీడ్ చూపించాలి. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నీతి కబుర్లు చెబుతారు. విశాఖ భూ దోపిడీపై ఎందుకు మాట్లాడలేదు?. సెంటు, రెండు సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పెడతారు. 55 ఎకరాల భూమిని ఎలా క్రమబద్దీకరణ చేస్తారు?. వామపక్షాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. గీతం విద్యా సంస్థ ఒక దోపిడీ సంస్థ. విద్యార్థుల నుంచి సీట్లు కోసం కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేశారు. 1998 నుంచి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.మరోవైపు.. విశాఖ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..‘అధికారం చేతిలో ఉంది కదా అని గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఈ భూ కేటాయింపు అన్యాయం. ఎంపీ భరత్‌కు 55 ఎకరాల భూమి కేటాయించడం అప్రజాస్వామ్యం. విశాఖలో భూములను పప్పు బెల్లాలులా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్ట పెట్టారు. జీవీఎంసీ ఎజెండా నుంచి గీతం అంశాన్ని తొలగించాలని వినతి పత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూ దోపిడిపై మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
తూచ్.. అదేం లేదు.. జనసేన యూ టర్న్?
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓ ఒంటరి మహిళను బెదిరించి శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన, ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా జనసేన పార్టీ శ్రీధర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సదరు మహిళ ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కమిటీ మహిళ ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందించనుంది. అనంతరం, నివేదికను పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అందులో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అంశాన్ని, పవన్ కళ్యాణ్‌ను సేవ్ చేయడానికి జనసైనికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే అరవ శ్రీధర్‌ను జనసేన నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇక, తాజాగా పార్టీ ప్రకటనతో జనసైనికులకు భంగపాటు ఎదురైంది. అయితే, జనసేన కమిటీ ఏర్పాటుపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇదంతా డైవర్షన్‌లో భాగంగానే జరుగుతోందని.. శ్రీధర్‌ను కాపాడే ప్రయత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
పేర్ని నానిపై మరో కేసు నమోదు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నూజివీడులో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది. ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్‌లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్‌ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది. -
ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా?
ఓ ఒంటరి మహిళను బెదిరించి కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన నేతలు చేస్తున్న ప్రయత్నాలు, వాటికి నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియా మారుమోగుతోంది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా?Arava Sreedhar a genuine JanaSainik who follows his leader not just in words, but in actions. pic.twitter.com/DDc57K3BNn— Pandu (@PanduPrabhas__) January 27, 2026 హలో సేఫ్ హ్యాండ్స్ సాయి @IamSaiDharamTejమీ మామ చెప్పిన సేఫ్ హ్యాండ్స్ ఇదా?లుంగీ తీసి అంగం చూపించడమామీ మామ చెప్పిన మగతనం ఇదా?లుంగీ తీసి అంగం చూపించడమామీ మామ చెప్పిన ఆడబిడ్డకు రక్షణ ఇదా?లుంగీ తీసి 5 సార్లు అబార్షన్ చేయించడమా#aravasridhar #PawannKalyan#Kaamasena #YSRCPSM https://t.co/oYe0OSbrIg pic.twitter.com/7cMZzyprHi— దర్శన్–𝐃𝖆 𝐑ֆ𝖍𝖆η😎ツ (@Darshan_Ysj) January 27, 2026 ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా కాపాడుకునే యత్నంలో భాగంగా ముందుగానే లేఖలు విడుదల చేస్తున్నారా?చిన్న చిన్న వాటికే అతిగా స్పందించే పచ్చ మీడియా.. ఓ ఎమ్మెల్యే విషయంలో ఇంత జరుగుతున్నా..ఎందుకు స్పందించడం లేదు? NDA-Alliance @JanaSenaParty MLA caught in rape allegations. Railway Koduru MLA and Government Whip Arava Sridhar exposed for exploiting a woman government employee by misusing his political power, through threats, coercion, and sustained sexual abuse. The victim has reportedly… pic.twitter.com/klwWggPRID— YSR Congress Party (@YSRCParty) January 27, 2026@JanaSenaParty కామసేనాని ప్రొడక్షన్సీన్ -1 టేక్ -4 #SaveApSisters pic.twitter.com/x5GA71biqv— Andhra Now 📰 (@AndhraXpress) January 27, 2026 View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam) -
‘జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలి’
సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు లేవు.ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారుఅధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. -
Naga Malleswari: మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ సిగ్గు పడాలి.. దమ్ముంటే యాక్షన్ తీసుకోండి
-
చూశావా మీ ఎమ్మెల్యే రాసలీలలు తాటతీస్తా.. అంటావ్..!
-
ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు
-
పవన్ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
టాలీవుడ్లో సాధారణంగా దర్శకులు, అభిమానుల మధ్య గొడవలు, విమర్శలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవయితే.. ఫ్యాన్స్ అంతా దర్శకుడిని ట్రోల్ చేస్తుంటారు. అతన్ని విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ హరీష్ శంకర్, పవన్ ఫ్యాన్స్ మధ్య తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గతంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్పై కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అతిగా స్పందించి, నెగటివిటీ ప్రచారం చేశారు. దీంతో తన పనికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో హరీష్ శంకర్ ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.అయితే, తాజాగా విడుదలైన సినిమా అప్డేట్స్, టీజర్లు చూసిన అభిమానులు హరీష్ శంకర్ విజన్‌పై పూర్తి నమ్మకం పెంచుకున్నారు. దీంతో నిన్న ఒక అభిమాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. "గతంలో జరిగిన పొరపాట్లను మన్నించి, అందరం కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా మమ్మల్ని అన్‌బ్లాక్ చేయండి" అని వినమ్రంగా కోరారు.ఈ అభ్యర్థనకు హరీష్ శంకర్ ఎంతో సానుకూలంగా స్పందించారు. "గతాన్ని మర్చిపోదాం.. మనమంతా ఒకటే కుటుంబం. సినిమాను కలిసి ఎంజాయ్ చేద్దాం" అంటూ తక్షణమే ఆ అకౌంట్లను అన్‌బ్లాక్ చేశారు. సినిమా రీలీజ్ సమయం దగ్గర పడడంతో హరీశ్ అన్‌బ్లాక్ చేయడం మొదలు పెట్టాడు. మరి పవన్ ఫ్యాన్స్, హరీష్‌ల మధ్య ఈ సఖ్యత ఇలానే కొనసాగుతుందా లేదా రిలీజ్ వరకే పరిమితం అవుతుందా చూడాలి. Come on Boys…. We all are family Forget the past …Lets make a Blast 😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗#UstaadBhagatSingh https://t.co/xSiV1zV6tH— Harish Shankar .S (@harish2you) January 24, 2026 -
అకీరా నందన్‌పై వీడియో క్రియేట్.. కాకినాడలో అరెస్ట్
సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌పై ఏఐ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల ఒక వీడియోను క్రియేట్ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారు. పోలీసుల విచారణలో కూడా తప్పుడు రీతిలో డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీలతో పాటు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా కామన్ వ్యక్తులకు సంబంధించిన ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని పోలీసులు తెలిపారు. -
Putha Siva: నువ్వు ఏపీకి డిప్యూటీ సీఎంవా లేక పక్క రాష్ట్రానికా..??
-
పోటీ పడుతున్న పవన్, లోకేష్ అభివృద్ధిలో కాదు.. ఆ విషయంలో..
-
స్పెషల్ ఫ్లైట్ జర్నీలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జల్సా
-
హైకోర్టును ఆశ్రయించిన 'పవన్' కుమారుడు అకీరా నందన్
సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు కథనాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాయంతో పలు వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ సాంకేతికతతో క్రియేట్ చేసిన కంటెంట్‌ను వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో ఇలాంటి ఈ అంశంపై పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, సునీల్ గావస్కర్ వంటి స్టార్స్ ఉన్నారు. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల పాటు ఒక వీడియోను క్రియేట్ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారంటూ పవన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ తీసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫ్యాన్స్ ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు.. ఏడాదికి రూ.54.63 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె ఖర్చు రూ.54.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీఎం చంద్రబాబు (వీవీఐపీ) వినియోగించిన ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లించేందుకు రూ.13,65,75,000 విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు కలిపి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు రూ.54.63 కోట్లు అయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇప్పటికే మూడు త్రైమాసికాలకు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లింపునకు రూ.40.97 కోట్లను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్‌తోపాటు ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. అందువల్లే ఏడాదిలోనే రూ.54.63 కోట్లు అద్దెల రూపంలో చెల్లించాల్సి వచ్చిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె వ్యయం ఇలా..తొలి త్రైమాసికం రూ.19,12,05,000 రెండో త్రైమాసికం రూ.10,92,60,000మూడో త్రైమాసికం రూ.10,92,60,000 నాలుగో త్రైమాసికం రూ.13,65,75,000 పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.అయినా పవన్‌కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల వ్యయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెలకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
40 ఏళ్ల టీడీపీ... 12 ఏళ్ల YSRCP..అందుకే భయంతో చంద్రబాబు, పవన్..
-
పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్
దర్శకుడిగా వరుస బ్లాక్బస్టర్లు కొడుతున్న అనిల్ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. సరైన నిర్ణయం తీసుకోకపోతేఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్ ఇచ్చాను.టైటిలే విచిత్రంగా ఉండబోతోందితాజాగా వైజాగ్ టూర్లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్ అయితే జరగబోతోంది. టైటిల్ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్ ప్రకటిస్తాను.పవన్ కల్యాణ్‌తో కాదు!ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్ మాత్రమే ఫిక్స్ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్ దరకడం కదా! జూన్, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. పవన్ కల్యాణ్‌ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లి ప్రపోజల్.. ముందు కెరీర్‌పై ఫోకస్ చేయ్: హీరోయిన్ -
గర్భిణీ అని చూడకుండా.. పవన్ పై ఫైర్
-
APIIC గేటు ముందు పారిశ్రామిక వేత్తల ధర్నా పవన్ కళ్యాణకు డిమాండ్స్
-
పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?
'వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' అనేది పాత సామెత అయ్యిండొచ్చు. కానీ ఏ తరానికి అయినా కచ్చితంగా పనికొచ్చేదే. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు వరసగా గ్లామరస్ మూవీస్ చేస్తారు. కొన్నాళ్లకు పూర్తిగా తెరమరుగైపోతుంటారు. కొందరు మాత్రం తన తలరాత మారుతుందని చెప్పి కొన్ని ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంటారు. తీరా చూస్తే అవి అడియాశలు అవుతుంటాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)స్టార్ హీరో సినిమాలో నటించారని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. అందుకు తగ్గట్లే చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ అదృష్టం కలిసొచ్చి ఫేట్ మారేది మాత్రం అతికొద్ది మందికే. మరికొందరికి మాత్రం ఘోరమైన దురదృష్టం తప్పితే మరొకటి మిగలదు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అలానే పవన్ కల్యాణ్, ప్రభాస్‌లపై బోలెడంత నమ్మకం పెట్టుకుంది. నాలుగేళ్ల విలువైన సమాయాన్ని వెచ్చించింది. మరో సినిమా చేయలేదు. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.2017లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2022 వరకు తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఎనిమిది సినిమాల వరకు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. 2019లో అలా పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటించే ఛాన్స్ నిధికి వచ్చింది. లాక్డౌన్, పవన్ రాజకీయాల వల్ల సినిమా చాలా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ చిత్రం నిధికి ఏ మాత్రం ఉపయోగపడలేదు.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్)రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్'లోనూ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్గా చేసింది. దాదాపు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం తనకు ఫేట్ మార్చేస్తుందని, హిట్ అవుతుందని నిధి చాలా నమ్మింది. కానీ బ్యాడ్ లక్. ఇది కూడా ఫ్లాప్ అయింది. సరేలే ఈ రెండు మూవీస్ ఫెయిలైతే అయ్యాయి అనుకోవచ్చు. వీటిలో నిధి అగర్వాల్ పాత్రలు ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా ఉండవు. దీంతో ఈ విషయంలోనూ ఈమెకు పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు.నిధి అగర్వాల్ ఇప్పటికైతే ఏ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు అయితే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక, శ్రీలీల, భాగ్యశ్రీ, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వీళ్లు కాకుండా రుక్మిణి వసంత్, మృణాల్ ఠాకుర్ లాంటి బ్యూటీస్.. స్టార్ హీరోలకు మెయిన్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి ఈ ముద్దుగుమ్మలని దాటుకుని నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటుందా? అనేది చూడాలి. ఒకవేళ లేదంటే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పరంగా వెనకబడిపోయే ప్రమాదముంది!(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్) -
Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు
-
లోకేష్ ఇప్పటికైనా మారాలి.. ఎవరూ కాపాడలేరు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీలో 18 నెలలుగా దళితుల మారణహోమం జరుగుతోందని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. దళితుల పట్ల దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఎక్కడికి పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. ఇదే ఘటన మరో కులానికి చెందిన వ్యక్తికి జరిగితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కందుకూరులో కాపు-కమ్మలకు మధ్య దాడి జరిగితే హోం మంత్రి అనిత పరుగు పరుగున వెళ్లారు. పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మీరు వాళ్లకు సపోర్ట్ చేశారా?. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. తుని దుర్ఘటనలో 60 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపేస్తే.. చెరువులో దూకేశాడని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో ఆడవాళ్లను బట్టలు తీసేని డ్యాన్స్‌లు చేయమన్న జనసేన నేతను ఎందుకు అరెస్ట్ చేయలేదు?. జనసేన నాయకుడు మాట్లాడిన మాటలు మీకు కనబడవా?. ప్రతీ కేసులో అరెస్టులు చేసి రోడ్ల పై నడిపిస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్ అని హడావిడి చేస్తున్నారు. కేసు విచారణలో నిర్దోషిలుగా తేలితే వారి గౌరవాన్ని తిరిగి మీరు ఇవ్వగలరా?.పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త చట్టాలు ఇవేనా?. మీరు ఎంత రోడ్లపై నడిపిస్తే అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఇకపై ఎవరినైనా అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపిస్తే చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 60 శాతం మంది బాధితులు దళితులే. గ్రామాల్లోని నాయకుల ఇళ్లపై వేరే పార్టీ జెండాలు ఎగరేస్తే ఊరుకోవడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు ఎగరకపోతే వారిని బహిష్కరిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఇదేనా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. కూటమి కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకున్నా రెడ్ బుక్ ఉపయోగిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి కావాలి.యరపతినేనిపై కేసు కట్టాలి.. సామాన్య కార్యకర్త చనిపోయాడని ఎమ్మెల్యే యరపతనేని చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఏపీలో మర్డర్ చేస్తే మాట్లాడే వాడు లేడు. అత్యాచారం చేస్తే అడిగేవాడు లేడు. సాల్మన్ హత్య కేసులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడు. తక్షణమే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలి. 18 నెలల కూటమి పాలనలో 276 మంది దళిత ఆడబిడ్డలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. చనిపోయిన వ్యక్తి సమాధుల వద్దకు కూడా కుటుంబ సభ్యులను వెళ్లనివ్వడం లేదు. కుటుంబసభ్యులను కూడా రానివ్వకుండా పోలీసులే దహన సంస్కారాలు చేసేయడమేంటి?. మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో చంద్రబాబు సమాధానం చెప్పాలిదళితులకు, ఆడబిడ్డలకు ఏం జరిగినా పరుగు పరుగున వస్తానని పవన్ చెప్పారు.. ఇప్పుడు ఏమైపోయారు?. సాల్మన్ కుటుంబానికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సహా హత్యకు కారకులైన వారిపై 302 సెక్షన్ పెట్టాలి. లేనిపక్షంలో బాధితుల పక్షాన కోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తాం. యరపతినేని శ్రీనివాసరావును ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఇప్పుడు తప్పించుకున్నా 2029లోనైనా యరపతినేని తప్పించుకోలేడు. ఈ కేసులో మా వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత ఉద్యమం తప్పదులోకేశ్ శాశ్వతంగా దావోస్‌కే.. లోకేష్ ఇప్పటికైనా మారకపోతే.. భవిష్యత్ లో మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. ఇప్పుడు నెలకొకసారి నారా లోకేష్ దావోస్‌కి వెళుతున్నాడుఒక్కసారి ప్రభుత్వం మారితే నారా లోకేష్ పర్మినెంట్‌గా దావోస్‌కి పారిపోవడమే. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం కోల్పోయిన పరిస్థితి తర్వాత మీ పరిస్థితి ఏంటి?. తాటతీస్తా.. ఒంగోబెట్టేస్తా.. నారతీసేస్తా అంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. సనాతన ధర్మాధికారి పవన్‌కు జనసేన నేతల చర్యలు కనిపించడం లేదా?. దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మానప్రాణాలను కాపాడతానని పవన్ కబుర్లు చెప్పారు.పవన్ ఏం చేశారు.. భారతదేశంలో ఈ స్థాయిలో కోడి పందాలు ఎప్పుడూ జరగలేదు. మీకు 164 సీట్లు ఇస్తే మందులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీ చూపించారు. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రికార్డింగ్ డ్యాన్స్‌లు వేశారు. రాజకీయాలను మార్చడానికి వచ్చానని చెప్పుకునే పవన్ ఏం మార్చారు. ఇంతకుముందు కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. గతం కంటే ఎక్కువ జూదం జరిగింది.. ఎక్కువ క్యాసినోలు జరిగాయి. క్యాసినో పేరుతో కొడాలి నానిపై వారం రోజులు డిబేట్లు పెట్టారు. మరి ఇప్పుడు పెట్టిన క్యాసినోలు మీకు కనిపించడం లేదా?. -
Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా
-
‘నిధుల్లేవు’.. ఏపీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ
సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ ఖజానా ఖాళీ అయ్యింది. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ పంచాయతీ రాజ్ శాఖ హైకోర్టుకు చెప్పింది.2024 జూన్ నుంచి గౌరవ వేతనం చెల్లించడం లేదంటూ వైఎస్సార్ జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు గౌరవ వేతనం ఎందుకు చెల్లించలేదో ప్రమాణపత్రం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకు పంచాయతీ రాజ్ శాఖ స్పందించింది. తమ ఖజానాలో నిధులు లేవని స్పష్టం చేసింది. -
గలీజు కతలు.. కూటమి పెద్దలది ఎంత తెలివో!
ఆంధ్రప్రదేశ్‌లో జూదాల జాతర! రెండు వేల కోట్ల పందాలు! మందు బాబులకు పండగే! మూడు రోజుల్లో 438 కోట్ల రూపాయల మద్యం తాగేశారు! గోవా నుంచి క్లబ్ డాన్సర్లు! అశ్లీల నృత్యాలు! కాసినోలు, గుండాట! ఇలాంటి శీర్షికలతో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఏమనుకోవాలి? రాష్ట్రం ముందుకెళుతోందనా? లేక దిగజారిపోతోందనా?.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించడం, వినోదమని ప్రచారం చేసుకోవడం, పరోక్షంగా సమర్థిస్తూండటం చూసి ప్రముఖ సామాజికవేత్త సునీత కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు.. పరిస్థితి ఎంత నీచంగా ఉందో చెబుతున్నాయి. ‘ఏపీలో పలుచోట్ల రికార్డింగ్ డాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండవలసిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే, సమాజం దానిని ఎంజాయ్ చేయడం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి" అని సునీత కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో ఏపీలో ఏ స్థాయిలో చట్ట వ్యతిరేక పనులు జరిగాయో, పోలీసు వ్యవస్థ ఎంత అచేతనంగా మిగిలిపోయిందో, భారతీయ సంస్కృతిని ఏ రకంగా పతనావస్తకు తీసుకువెళ్లింది.. అనేది సునీత చేసిన ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ అని స్వార్ధ రాజకీయాల కోసం నిత్యం ప్రచారం చేస్తున్న చంద్రబాబు, సనాతని వేషం కట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెడ్‌బుక్ అంటూ అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చే మంత్రి లోకేశ్‌లకు ఏపీలో సంక్రాంతి పండుగ పూట మూడు రోజులపాటు సాగిన ఈ అకృత్యాలు ఏవీ కనిపించలేదు. కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొన్ని చోట్ల నిర్వహించిన అశ్లీల నృత్యాల భాగోతాలు, కోట్ల రూపాయల పందాలు, మద్యం పారించిన తీరు.. ఇన్ని జరిగాక కూడా ఏపీలో మంచి పాలన ఉందని ఎవరైనా చెప్పగలరా?.. వైసీపీ కార్యకర్తలు కొందరు కోడిని బహిరంగంగా కోయడం నేరం అంటూ కేసులు పెట్టి, హింసించి, రోడ్డు మీద నడిపించి శాడిజాన్ని ప్రదర్శించిన పోలీసులకు ఈ మూడు రోజులు సాగిన హింసాకాండ, అరాచకాలు, దందాలు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వాటిని అరికట్టవలసిన రక్షక భటులు, వాటికి రక్షణగా నిలబడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టు ఒకరు ఈ వికృతాలను వివరిస్తూ ఉయ్యూరు వద్ద ఒక బరి ఏర్పాటు చేసి, గోవా నుంచి డాన్సర్లను అందుబాటులో ఉంచారని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంటిచోట్ల కళ్లెదుటే క్యాంపులు కనిపించినా పోలీసులు కిమ్మనలేదు. కోనసీమ జిల్లాలో జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు క్లబ్ డాన్సర్ల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించింది తెలిపే వీడియో వైరల్ అయింది. కొందరు కోట్లలో పందాలు వేస్తే, ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వాటిని పండగ, సంబరమంటూ ప్రొజెక్టు చేసింది. పందాలు అనేవి నిషేధం. ఏపీలో పందాల వార్తలు, ఎవరు ఎంత పందెం కాసిందీ బహిరంగంగా తెలిసినా పోలీసు వ్యవస్థ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించిందంటే ఏమనుకోవాలి?.. ఎల్లో మీడియా అంచనా ప్రకారమే ఈ పందాల విలువ రూ.2,000 కోట్లు. తెలంగాణ వాసుల రాకతో జోష్ వచ్చిందని ఓ ఎల్లో పత్రిక సంబరపడింది. గుండాట, పేకాటలలోనే రూ.500 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.800 కోట్ల పందాలు జరిగాయట. బాపట్లలో రూ.200 కోట్ల కోడిపందాలు సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క పందంలో రూ.1.53 కోట్లు పెట్టారట. అందులో ఒక వ్యక్తి గెలిస్తే, మరో వ్యక్తి దానిని కోల్పోయారు. ఇలా పందాలలో ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చెప్పలేం. మొబైల్ వాన్లు తిప్పి మరీ మద్యాన్ని అధిక ధరలకు అమ్మించారట. వీటిలో ఏదీ చట్ట సమ్మతం కాదు. హైకోర్టు సైతం వీటిని అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు చీమ కుట్టినట్లు కూడా లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఒక టెంట్ వేసి కోడిపందాలు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎంత గొడవ చేసింది అందరికి తెలుసు. అక్కడ క్యాసినో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్లో మీడియా పలు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేసింది. ఈసారి అంతకుమించి సెటప్‌లు పెట్టినా, ఎమ్మెల్యేలు స్వయంగా వీటిని పర్యవేక్షించినా ఈ ఎల్లో మీడియాకు సంబరంగా కనిపించింది. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసులకు బాగా గిట్టుబాటైందని వార్తలు వచ్చాయి. జూదం, పందాలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగిపోతుంటే, వాటిని నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని డైవర్ట్ చేయడానికి మీడియాకు ఒక లీక్ ఇవ్వడం హైలైట్ గా చెప్పాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే మన జాతికి ఉనికి ఉండదని చంద్రబాబు అన్నారట. అన్ని జిల్లాలలో ఘనమైన ఆటపాటలు, ఉత్సవాలను ప్రభుత్వం ప్రోత్సహించిందట. రాష్ట్రంలోని పల్లెలు కళకళలాడాయట. చూడండి.. ఎంత తెలివో!.. ఒకపక్క అశ్లీల న్యత్యాలతో సంస్కృతిని నాశనం చేస్తుంటే, జూద పందాలతో ప్రజలు ఆర్ధికంగా చితికిపోతుంటే వాటి గురించి మాట మాత్రం వ్యాఖ్యానించకుండా.. ఈనాడు వంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సుభాషితాలు వల్లించినట్లు లీక్ ఇచ్చుకున్నారన్నమాట. ఇదంతా కేవలం జూద జాతరతో తనకు సంబంధం లేదని జనం అనుకోవాలన్నదే ఆయన ఉద్దేశం అన్నది తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే పోలీసులు ఇలాంటి వ్యవహారాలను చూసిచూడనట్లు పోతారన్నది బహిరంగ రహస్యం. ఈసారి అది మరీ శృతి మించి ఇలాంటి అకృత్యాలకు పోలీసులే కాపలాగా ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలగడం అత్యంత దురదృష్టకరం. ఈ నేపధ్యంలో సునీతా కృష్ణన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో రాష్ట్రం పరువు గంగలో కలిసింది. అశ్లీల నృత్యాల హోరులో బ్రాండ్ ఇమేజీ కొట్టుకు పోయింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్‌కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.2026లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీలదర్శకత్వం : హరీశ్ శంకర్టైటిల్: పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్దర్శకత్వం : బుచ్చిబాబుటైటిల్: ది ప్యారడైజ్నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబుదర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టిదర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్టైటిల్: ఆకాశంలో ఒక తారనటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిదర్శకత్వం: పవన్ సాదినేనిటైటిల్: ఛాంపియన్నటీనటులు : రోషన్, అనస్వర రాజన్దర్శకత్వం: ప్రదీప్ అద్వైతంటైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్దర్శకత్వం : అనుదీప్ కేవీటైటిల్: ‘రాకాస’సంగీత్ శోభన్, నయనసారికదర్శకత్వం: మాససా శర్మటైటిల్: బైకర్నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్దర్శకత్వం : . అభిలాష్ రెడ్డిటైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)నటీనటులు: విజయదేవరకొండ, రష్మికదర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ -
పవన్‌ను సైడ్ చేసి మరీ క్రెడిట్ చోరీ
ఒక భవనానికి ‘సిటీ’ అని పేరు పెడితే ఆ నగరమంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? శంకుస్థాపన చేసి తరువాత దానిని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం పొందగలుగుతారా? ఇతరుల విషయమేమో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం ఒప్పుకోవాలేమో. లేదంటే మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే జగన్ ఆ ముళ్లన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. అప్పట్లో జగన్ చెప్పినట్లే 2026 కల్లా ఇది పూర్తి కావడం విశేషం. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి దానిని ప్రారంభించే అవకాశం వచ్చింది. అంత మాత్రాన జగన్ పాత్ర ఏమీ లేదన్న భావన కల్పించే ప్రయత్నం అభ్యంతరకరం. ఇందులో మేజర్ క్రెడిట్ అంతా జగన్‌దే అనే అభిప్రాయం ఉంది. కరోనా రెండేళ్లు లేకుండా ఉంటే జగనే ప్రారంభించి ఉండేవారేమో!. హైటెక్ సిటీ విషయంలోనూ ఇంతే. దానికా పేరు, పరిసర ప్రాంతాలకు సైబరాబాద్ అన్న నామకరణం జరిగింది మొదలు.. అంతా బాబే చేశాడన్న ప్రచారం జరిగిపోయింది.. జరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ తరువాత చాలా అభివృద్ది జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినన్ని పనులు మరే ప్రభుత్వంలోను జరిగి ఉండకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నగరంలో రోడ్లు, పలు వంతెనల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ సీఎంగా ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, నిర్మాణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర, తన తర్వాత జరిగిన అభివృద్దిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. హైదరాబాద్‌లో నిజంగానే అంత అభివృద్ది జరిగి ఉంటే, విభజిత ఏపీలో కూడా ఎందుకు అభివృద్ది జరగలేదన్న దానికి జవాబు ఇవ్వరు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వ్యవస్థలను తామే తెచ్చామన్న భావన కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తోంది. జగన్ టైమ్‌లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ది చేయాలని తలపెడితే అడ్డు పడింది తెలుగుదేశం పార్టీనే కదా!. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు అమరావతి కోసం మరీ లక్ష కోట్ల వ్యయం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా నగరం వేగంగా అభివృద్ది చెందేది. తద్వారా కొత్త విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగేది. విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖది. దాన్ని పౌరసేవలకూ వాడుతున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకోవలసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదమైంది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా పరిహారంపై కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కేసులు వేశారు. అప్పట్లో విపక్ష నేతగా వైఎస్ జగన్ రైతులకు మద్దతిచ్చారు. టీడీపీ నేతల భూదందాను బహిర్గతం చేశారు. ఈ ఆందోళనల ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఐదువేల ఎకరాలు చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలు, టీడీపీ మీడియా పవన్ విమర్శల గురించి మాట్లాడకుండా, ఈ ఎయిర్ పోర్టును జగన్ వ్యతిరేకించినట్లు అబద్దపు ప్రచారం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ.. జగన్ మాత్రం పద్దతిగా కామెంట్ చేస్తూ ఎయిర్ పోర్టు యాజమాన్యం అయిన జీఎంఆర్ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్దిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూ సేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ దీనిని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్‌ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు?. శంషాబాద్ ఎయిర్‌పోర్టును వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తి అయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని స్వయంగా మల్లిఖార్జునరావు ఆ సభలో తెలిపారు. ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. జగన్ ఆ రోజుల్లో రైతుల తరపున నిలబడి అన్నివేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్ తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్ పోర్టు నిర్మాణానికి వాడారో తెలిపారు. బాగా రద్దీ ఉండే అనేక ఎయిర్ పోర్టులు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఉన్న మాట వాస్తవమే కదా! జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సేకరణను 2500 ఎకరాలకు పరిమితం చేసి రైతులలో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయినవారికి ఎకరాకి రూ.12.5 లక్షల బదులు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి, చంద్రబాబు టైమ్‌లో ఉన్న చిక్కు ముళ్లను విప్పి, కేసుల పరిష్కారం చేసి, రైతులకు కూడా అసంతృప్తి లేకుండా చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాలోను విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసేస్తామని ప్రకటించారు. ఈ టర్మ్‌లో అప్పుడే 18 నెలలు పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అది ఉండిపోయింది. అంతేకాదు. కొందరు విజయవాడ మెట్రో 2019కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కాని అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణా వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో.. శంకు స్థాపనలు,ప్రచారాలకే పరిమితం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి అయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్‌కే దక్కుతుందని చెప్పొచ్చు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
15 సంవత్సరాలు అధికారంలో ఉంటాడంటా.. పవన్ పై రోజా సెటైర్లు
-
నా డ్యాన్స్ క్రేజ్ కు పవనే కారణం.. అంబటి అదిరిపోయే సెటైర్లు
-
గుంటూరులో అంబరాన్నంటిన భోగి సంబురాలు
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. నేను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు చేయాలి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నా. సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను కాబట్టి సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు. అలా మాట్లాడేవాళ్లు ఆ పని చేయలేరు. ఎందుకంటే నేను పొలిటీషియన్‌ను.. వాళ్లు కాదు కాబట్టి’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అంబటి నేరుగా చురకలంటించారు.మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలి. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలడం ఖాయం అని అంబటి అన్నారు. -
Pawan : తిట్టినా సరే.. చంద్రబాబుకు జై
-
వర్మకు పవన్ అవమానం.. రగిలిపోతున్న పిఠాపురం
-
ఇదెక్కడి రాజకీయం పవనూ?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కీర్తించారు. తమిద్దరి మధ్య అరమరికలు లేవని అన్నారు. మంచిదే. తప్పు కూడా లేదు కానీ.. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి, ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతూండటం ఏ రకమైన రాజకీయమన్నది మనం ప్రశ్నించాల్సిందే. స్వోత్కర్ష, కులమతాలకు అతీతమన్నట్టు, దేశం కోసమే పనిచేస్తున్నాన్న బిల్డప్పులు చూస్తే.. పవన్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్లోకి వచ్చేశారనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ఏ హామీలిచ్చి గద్దెనెక్కాము?కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది? మిగిలిన వాటి గురించి ఏం చేయాలి? వంటి అంశాల జోలికి పోకుండా సంక్రాంతి సంబరాలలో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది.కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని ఆయన ఎద్దేవ చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాలలో నటించవచచ్చు.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని డాన్స్ చేయవచ్చన్న మాట. పవన్ డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు. కాని రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయాల్సి వస్తుంది.చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాలలో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వీక్ అయిపోతోందన్న భయమేదో పట్టుకున్నట్లుగా ఉంది.2014లో జనసేన అభ్యర్ధులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రోజులలో ఆ కూటమికి దూరమై వామపక్షాలు, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 2019లో ఓటమి పాలు కాగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి ఆ పార్టీతో, తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి కదా! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌ల పై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచ్ ఎలా పెట్టారు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్లపాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్య పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్లకు అర్థమవుతూనే ఉన్నాయి. పవన్ ఒక రకంగా అధృష్టవంతుడు. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. మూడు లక్షల కోట్ల అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడమేమిటిన ప్రశ్నించనవసరం లేదు. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు? వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు?ఒకసారి కులం ఏమిటి? మతం ఏమిటి అని అంటారు. మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు కులమైనా మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్ధించిన సంగతి ప్రజలు మర్చిపోతారన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపర్చనవసరం లేదు. ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు. పోలీసు బలగంతో, రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమి చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కారం వంటివి జరిగితే వాటిని చాలా చిన్న విషయాలుగా ఆయన పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి రాబోయిన ఒక మహిళను ఎందుకు మూడు రోజులపాటు హౌస్ అరెస్ట్ చేశారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు.పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే. కాని దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. జగన్ పై, ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు. ఆయన గత టర్మ్‌లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది? చెప్పులు ఎలా చూపింది.. అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రభుత్వమా? చట్టవిరుద్దంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్లు, కీళ్లు విరగగొడతానని రౌడీ భాష మాట్లాడడం.. ఇవన్ని ఎవరు చేస్తున్నారు. ఒకరకంగా జనసేన కేడర్‌ను చూసి జాలి పడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురి అవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్‌ది. అంతేకాదు. ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక పోలేదు. కాని టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలకు చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదో! మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా కూటమి నేతలే కదా! చంద్రబాబును పొగిడినంత సేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనించినట్లు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో! ఆత్మస్తుతి, పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దానిని పవన్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిలో ‘పెద్ద’ లాబీయింగ్!
సాక్షి, అమరావతి: త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబీయింగ్ మొదలైంది. మూడు నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్‌బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల కోసం మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేనకు మొండిచెయ్యి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్బాబుకే కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతోపాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. జనసేన కోటాలో లింగమనేని త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన లింగమనేని రమేష్‌కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఒక అంగీకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రెండు సీట్లకు బీజేపీ పట్టు ఏపీ కోటాలో ఈసారి తమకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి, రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యా బలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకు మరోమాటకు తావు లేకుండా ఒక సీటు కమలనాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.సానాకే మరోసారి చాన్స్..!రెండు బీజేపీకి, ఒకటి జనసేనకు ఇస్తే ఇక టీడీపీకి మిగిలేది ఒకే ఒక స్థానం. దాన్ని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడి సానా సతీష్బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. నారా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు చినబాబు వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. -
టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పై అంబటి రియాక్షన్
-
పవన్‌పై అంబటి సెటైర్లు.. ‘అది ఓ ఆర్టే’
సాక్షి,గుంటూరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు నిష్ణాతుడైతే.. తనలోని ఆరర్ట్స్ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్టా అని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం వంటి కీలక పనులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి.పదివేల ఎకరాలు కావాలని చంద్రబాబు కోరగా ప్రజలు తిరగబడ్డారని, తాము వచ్చాకే సరిపడా భూమికి కుదించాం. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెప్పే మాటలు బడాయి మాత్రమే. మా హయాంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 32 లక్షల ఉద్యోగాలు వస్తే.. గత చంద్రబాబు కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయి. కరెంటు, తాగునీరు సహా అనేక పన్నులు వేసి ప్రజలను బాధపెడుతున్న ఘనత చంద్రబాబుదే. ఛార్జీలు పెంచేదిలేదన్న ఆయన రూ.20 వేల కోట్లపైనే కరెంటు ఛార్జీలు పెంచారు. వైఎస్ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. గత 18 నెలల్లోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి దీన్ని ఏం అనాలో చంద్రబాబే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో నటించటం కూడా పవన్‌కు తెలిసిన విద్యే. చంద్రబాబును అనవసరంగా పొగడటం, వైఎస్ జగన్‌ను తిట్టినందుకు రహస్యంగా గిఫ్టులు అందుకుంటున్నారు. అది కూడా ఒక ఆర్టే. జనసేన నెత్తిమీద ఎక్కి టీడీపీ వారు డాన్స్ చేస్తున్నారు. ముందుగా మీ కార్యకర్తలను కాపాడుకో పవన్.పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హితువు పలికారు. -
Karumuru Venkat: సనాతన డ్రామా ఆర్టిస్ట్.... పొద్దున్నేమో సనాతని.. రాత్రయితే..
-
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్‌లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
తిరుమల మెట్లు ఎక్కలేని పవన్‌కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'.. అసలు కథ ఇదే
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీని గురించి పూర్తిగా వివరాలు తెలియకపోవడంతో చివరకు పవన్ ఫ్యాన్స్ కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్లకు విషయం తెలియకపోవడంతో 'పవన్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్' అంటూ పుష్ప డైలాగ్స్ కొడుతున్నారు. కొందరైతే ఇదీ అరుదైన ఘనత.. అంతర్జాతీయ గౌరవం అంటూ పవన్ ఫొటోలతో షేర్ చేస్తున్నారు. వాస్తవం తెలిసిన వారు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఆగాపురాలో ఉండే 'గోల్డెన్ డ్రాగన్స్' కరాటే ట్రైనింగ్ సంస్థ నుంచి పవన్ కల్యాణ్‌కు "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో సుమారు నలభై ఏళ్లకు పైగా డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీ వేల మందికి కరాటేలో కోచింగ్ ఇచ్చారు. ఆయన చేతుల మీదుగానే పవన్‌కు ఈ గౌరవం దక్కింది. అందరూ అనుకున్నట్లు జపాన్‌లోని ఏ మార్షల్ ఆర్ట్స్ సంస్థ పవన్‌కు ఈ బిరుదు ఇవ్వలేదు.పవన్‌కు 'ఫిఫ్త్ డాన్' పురస్కారం కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీనే ఇచ్చారు. జపాన్‌లో సంప్రదాయ యుద్ధకళలకు శిక్షణ ఇచ్చే సంస్థల్లో ఒకటైన ‘సాగో బుడో కన్’ నుంచి బ్లాక్‌బెల్ట్‌లో ఫిఫ్త్ డాన్ పురస్కారం ఇస్తున్నట్లు ఒక పత్రాన్ని పవన్ చేతికి ఇచ్చాడు. అయితే, ఇక్కడ ఫైనల్‌గా ఇంకో విషయం ఉంది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ (కెంజుట్సు)లో పవన్‌కు ఎంట్రీ దొరికింది అని చెప్పారు. బహుషా కత్తిసాము నేర్చుకునేందుకు ఆయన జపాన్ వెళ్తారేమో చూడాల్సి ఉంది.మార్షల్ ఆర్ట్స్‌తో పాటు 'చేతబడి' కూడా..పవన్ కల్యాణ్‌కు అవార్డ్ ప్రదానం చేసిన డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉంది. నాలుగు దశబ్దాలుగా ఆయన చాలామందికి శిక్షణ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్, ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, చిరోప్రాక్టర్, మాగ్నెటో థెరపీ, అరోమా థెరపీలలో నైపుణ్యంతో పాటుగా 'చేతబడి, మంత్రాలకు విరుగుడు' చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ ఎంతో సిద్ధహస్తుడని ఆయన ప్రొఫైల్‌లో పేర్కొనడం విశేషం. ఆయన చేతుల మీదుగా పవన్ కల్యాణ్‌కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.కెంజుట్సు అంటే ఏమిటి? పవన్‌కు సాధ్యమేనా?ఇది జపాన్‌లోని సమురాయ్ యోధులు యుద్ధంలో ఉపయోగించే ఖడ్గ యుద్ధకళ. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో ఇందులో నేర్పిస్తారు. కత్తితో ప్రత్యక్ష యుద్ధరంగంలోకి దిగితే ఎలాంటి కదలికలు ఉండాలో చూపుతారు. గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే అత్యంత కఠిణమైన శిక్షణగా జపాన్ యోధులు తెలుపుతారు. ఇందులో రాణించాలంటే శరీర శక్తి మాత్రమే కాకుండా మనసు స్థిరత్వం, క్రమశిక్షణ అతి ముఖ్యమైనవి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉన్న పరిస్థితిల్లో జపాన్ వెళ్లి కెంజుట్సు నేర్చుకునేందుకు సాధ్యమయ్యే పనేనా అని సందేహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.తిరుమల మెట్లు ఎక్కలేని పవన్‌కు సాధ్యమయ్యేనా..?సుమారు ఏడాది క్రితం ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ తిరుమల బయలుదేరారు. ఆ సమయంలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. అయితే, ఆ మెట్లు ఎక్కేందుకు పవన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో పలుమార్లు ఆగుతూ.. ఆపసోపాలు పడుతూ మెట్లు ఎక్కారు. ఈ క్రమంలో మోకాళ్ల నొప్పి రావడంతో స్విమ్స్‌కు చెందిన ఫిజియోథెరఫిస్ట్ రావాల్సి వచ్చింది. ఆపై హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కంటే డూప్ ఎక్కువ భాగం కనిపించారు. గ్రాఫిక్స్‌తోనే పని పూర్తిచేశారు. ఇంత హిస్టరీ ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు కెంజుట్సు(ఖడ్గ యుద్ధకళ) నేర్చుకునే చాన్స్ ఉందా..? అంటే సందేహమే..!పవన్ కల్యాణ్ సినీ రంగంలోకి రాకముందు చెన్నైలో కరాటేలో శిక్షణ పొందారు. ఆయన గురువు 'షిహాన్ హుస్సేని' చివరి రోజుల్లో బ్లడ్ క్యాన్సర్‌తో.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని మరణించారు. సాయం చేయాలని బహిరంగంగానే పవన్‌ను కోరారు. కానీ, ఆయన కష్టాల కేకలు పవన్ వరకు వినిపించలేదేమో.. చివరకు అనారోగ్యంతో ఆయన గత ఏడాది మరణించారు. కరాటే అంటే ఆయనకు చాలా ఇష్టం కావడంతో జానీ, తమ్ముడు, ఖుషి, ఓజీ వంటి సినిమాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత చూపించారు. View this post on Instagram A post shared by DrSiddiq Mahmoodi (@drsiddiq) View this post on Instagram A post shared by GOLDEN DRAGONS (@goldendragonsindia) -
మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు
-
‘పవన్.. అంబటి రాంబాబును ఫాలో అవుతున్నారు’
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో సంక్షేమం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు.. ఆయననే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారని తెలిపారు.గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ నేతలు అన్నబత్తుని శివ కుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకట రెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ పోటీల్లో గీతాంజలి లక్ష రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్.. రోజా మొదటిసారి ఎమ్మెల్యే కాగానే ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా ఎక్కడా వెనుక తగ్గలేదు. మా ప్రభుత్వం అధికారం రాగానే మొదటి క్యాబినెట్లో మాకు మంత్రి పదవులు లభించలేదు. వైఎస్ జగన్‌కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు. రోజా, నేను ఒకేసారి కేబినెట్లోకి వెళ్లాం. కూటమి ప్రభుత్వం రోజాపై, నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బయటపడే వాళ్ళం కాదు అని చెప్పుకొచ్చారు.సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా?మరి పవన్ డాన్స్ వేస్తే ?@PawanKalyan pic.twitter.com/3VxGOZ9vaB— Ambati Rambabu (@AmbatiRambabu) January 9, 2026మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే మొదట గుర్తు వచ్చేది ముగ్గుల పోటీలు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు. గతంలో రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే సంబరాల రాంబాబు అని హేళన చేశారు. వాళ్లే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లి డాన్సులు వేస్తున్నారు. అందరి ఆత్మీయుడు అంబటి రాంబాబు.వైఎస్ జగన్‌ను ఎవరు విమర్శిస్తే వారికి.. అంబటి రాంబాబు తన మాటల చురకులతో తాట తీస్తారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, చేయూత, రైతు భరోసా లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. వైఎస్ జగన్‌ను ఎందుకు వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘సంక్రాంతి అంటే సాంప్రదాయం. ఆటలు, పాటలు, కోడిపందాలు ఎన్నో ఉంటాయి. ప్రతీ సంక్రాంతికి అంబటి రాంబాబు సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన్ను కొంతమంది అవహేళన చేశారు. అంబటి రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంక్రాంతి సంబరాలకి వెళ్ళాడు. రాంబాబుని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు అని చెప్పుకొచ్చారు. -
జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
-
నేను DCM కాదు.. టీడీపీ కార్యకర్తని! పవన్ మనసులో మాట
-
Karumuri Venkat: దుర్గమ్మ గుడిలో కరెంటు కట్... పాలల్లో పురుగులు సనాతన డ్రామా ఆర్టిస్ట్ ఎక్కడ...?
-
చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్‌ను నిలదీసిన నేతలు
-
Vizianagaram: మెడకు ఉరితాళ్లతో..! గిరిజనుల సంచలన వీడియో
-
జగన్ పేరు వింటే మూడు సార్లు బాత్రూం కి వెళ్లే మీరు..
-
KSR Comment: లోకేష్ భవిష్యత్తు కోసం ఏపీ తాకట్టు!
-
జనసేనకు బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలోకి చేరికలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలకు వైఎస్సార్సీపీ కండువా కప్పి.. వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏబండారు గంగాసురేష్, ఆనెం సుభాష్, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ సహా పలువురు నేతలు.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ నేత బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు. -
పార్టీని నాశనం చేస్తున్న ఎమ్మెల్యే
తిరుపతి తుడా: నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీరుపై జన సేన కార్య కర్తలు కన్నెర్ర చేశారు. సీనియర్లకు పార్టీ పదవుల్లో మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో దశాబ్ద కాలం పాటు పనిచేసిన సీనియర్లను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి పెద్దపీట వేస్తారా? అని మండిపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పనికట్టుకుని సర్వనాశనం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు. జనసేన తిరుపతి డివిజన్లో క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకం ఎమ్మెల్యే ఇంటి వద్ద మంగళవారం రహస్యంగా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ సీనియర్లు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని రచ్చరచ్చ చేశారు. విషయం పెద్దది కావడంతో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు అక్కడి నుంచి జారుకున్నారు. క్లస్టర్ ఇన్‌చార్జ్‌లుగా 20 మంది తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అత్యంత గోప్యంగా చేపట్టారు. పార్టీ సీనియర్లతో కనీసం చర్చించకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా 20 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లను ఖరారు చేశారు. కొందరికి రెండు, కొందరికి మూడు డివిజన్ల చొప్పున క్లస్టర్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వివిధ పారీ్టల నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి ఫిరాయించిన వారికి, ఎమ్మెల్యేకు ఊడిగం చేస్తున్న వ్యక్తులకే పదవులు ఇచ్చారంటూ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. 20 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల్లో 15 మంది కొత్త ముఖాలకే పదవులు ఇచ్చారని వాపోయారు. పార్టీని నాశనం చేస్తున్న ఎమ్మెల్యే తిరుపతిలో జనసేన పార్టీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సర్వనాశనం చేస్తున్నారని ఆయనకు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ వత్తాసు పలుకుతున్నాడని పలువురు జనసేన నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటి వద్ద సీనియర్లు తిట్ల దండకంతో రచ్చ రచ్చ చేశారు. ఎమ్మెల్యే పదవీకాలం ముగిస్తే చిత్తూరుకి పారిపోయే వ్యక్తి తిరుపతిలో పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబడ్డారు. రాబోయే ఎన్నికల ముందు పార్టీలు మారబోయే వారికే జనసేనలో ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి, తిరుపతి అభివృద్ధికి ఏనాడు ఎమ్మెల్యే కృషి చేయలేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసేందుకు పలువురు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఆయనతోపాటు పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ వ్యవహార శైలిపై, పార్టీని నిర్వీర్యం చేస్తున్న ఉదంతంపై తాము త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు. -
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తీసేశారా?.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ..!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సాక్షిని తొలగించారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సాక్షి వైద్య స్పందించింది. తనను తీసివేశారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తనకు కీలక పాత్ర పోషించే అవకాశముందని సాక్షి వైద్య తెలిపింది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అత్యవసర పరిస్థితి వల్ల నేను వేరే ఊరికి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి మరుసటి రోజే షూటింగ్ ప్రారంభ కానుందని నాతో చెప్పారు. కానీ ఆ పరిస్థితుల్లో నేను డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని సాక్షి వైద్య క్లారిటీ ఇచ్చింది. సాక్షి వైద్య మాట్లాడుతూ..' తెలుగులో నేను నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే నన్ను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి తీసేశారని వార్తలొచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెళ్లలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటుచేయలేక ఆ ఛాన్స్ వదులుకున్నా. కానీ నాపై మరోలా రూమర్స్ వచ్చాయి. అలాంటివి నేను పట్టించుకోను' అని తెలిపింది.కాగా.. సాక్షి వైద్య ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఆమె శర్వానంద్ సరసన నటించిన నారీ నారీ నడుమ మురారి జనవరి 14న విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంయుక్త కూడా హీరోయిన్గా కనిపించనుంది. -
అంతర్వేది రథం దగ్ధం ఆధారాలు చెరిపేసే కుట్ర
-
KSR LIVE Show : అవసరానికో వేషం బాబాలను మించిపోయిన బాబులు
-
ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు
-
హీరోగా అకీరా నందన్.. రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్- పవన్ కల్యాణ్‌ల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్ కానీ, ఇటు రేణూ దేశాయ్ కానీ కచ్చితంగా చెప్పడం లేదు. కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే తనకు చాన్స్ ఇస్తే..అకీరాతో పాన్ వరల్ట్ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని.. అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్ అడగ్గా.. ‘ఈ టాపిక్ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు. -
పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టులో హై టెన్షన్.. జనసేన కార్యకర్తల ఆందోళన
-
కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు
-
Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష
-
2 లక్షల పుస్తకాలు చదివి సైన్స్ చదవడం మర్చిపోయాడు
-
TJR Sudhakar: బాబు, లోకేష్, పవన్ కనబడుట లేదు.. ఏమైనట్టు.. నన్ను చెప్పమంటారా..
-
కూటమి పెద్దలు మిస్సింగ్!
-
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్‌లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. -
మహేష్ బాబు, అతని అభిమానిపై జనసేన ఫ్యాన్స్ బూతులు
ఎన్నికల సమయంలో వేదికలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఆపై అల్లు అర్జున్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా రేంజ్ హీరోలు అని, వాళ్లతో పోలిస్తే తాను చాలా చిన్న నటుడుని మాత్రమే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇలా ఇవ్వండి.. ఆ ప్రభాస్ ఫోటో పైకి ఎత్తండి అంటూ.. ఎన్నికల ముందు ఇతర హీరోలను ఆకాశానికి ఎత్తారు. ఇదంతా వారి ఫ్యాన్స్ ఓట్ల కోసం ఆయన చేసిన మ్యాజిక్.. కానీ, గెలిచిన తర్వాత పరిస్థితి మారింది. వారి అభిమానులపై సైకోలు మాదిరి జనసేన అభిమానులు రెచ్చిపోతున్నారు.మహేష్ బాబు అభిమానిపై బూతులువిశాఖలోని జగదాంబ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని జనసేన పార్టీ నేతలు దగ్గరుండి కొద్దిరోజుల క్రితమే తొలగించారు. ఆపై తాము తలుచుకుంటే ఒకే రోజులో విగ్రహాన్ని ఎత్తేశాం అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పడు మహేష్ బాబు అభిమానిపై బూతులతో జనసేన అభిమానులు రెచ్చిపోయారు. తాజాగా జల్సా, మురారి సినిమాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ బాబు అభిమాని ఒకరు జల్సా సినిమాకు వెళ్లాడు. అయితే, ఆ యువకుడి మెడలో వారణాసి మూవీ లాకెట్ ఉంది. దానిని గుర్తించిన జనసేన ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆ యువకుడిని తిట్టడమే కాకుండా ఏకంగా మహేష్ బాబును దూషిస్తూ ఆయన్ని కూడా తిట్టాలని హుకూం జారీ చేశారు. అలా చేయకుంటే దాడిచేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఆ యువకుడి తల్లిని కూడా వారు తిట్టి మరింత దిగిజారిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, నెటిజన్లు కూడా పవన్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడుతున్నారు. 'ఇవ్వేం బూతులు రా..' అంటూ భగ్గుమంటున్నారు. ఆపై అల్లు అర్జున్ ఫోటో మాస్క్‌ను దరించిన కొందరు జనసేన అభిమానులు సైకోలుగా మారిపోయారు. తమ వికృత చేష్టలకు విరుగుడు లేదన్నుట్లుగా పవన్ అభిమానులు ఉన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ఏ హీరో ఫ్యాన్‌తో తమకు పనిలేదనే అహంకారం వారిలో కనిపిస్తోందని ఇతర హీరోల అభిమానులు అంటున్నారు.ఇతర హీరోల అభిమానులంటే చిన్న చూపుకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది హీరోలను, వారి అభిమానులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది అనేది క్లియర్‌గా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి 'పుష్ప' సినిమాపై పవన్ చేసిన కామెంట్.. ఆపై జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆడించమంటూ ఏకంగా ఆయన కుటుంబంపై రాయలేని బూతులతో ఎగబడిన టీడీపీ ఎమ్మెల్యే, అతన్ని సపోర్ట్ చేసిన జనసేన అభిమానులు.. వారిని తరుచూగా ఎగదోసే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కల్యాణ్. వీళ్ల తీరు చూస్తుంటే.. తాము అధికారంలో ఉన్నాం.. ఇక హీరోల ఫ్యాన్స్‌తో పనేంటి.. ఏదైనా ఉంటే మళ్లీ ఎన్నికల ముందు వాళ్లను కాకపట్టొచ్చులే అనేలా వారి భావన ఉంది. (మహేష్ బాబు అభిమానిపై జనసేన ఫ్యాన్స్ వాగిన బూతులు చిన్న పిల్లలు వినకపోవడమే మంచిది) View this post on Instagram A post shared by Tupaki (@tupaki_official) -
డిజాస్టర్ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా
పవన్ కల్యాణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో పవన్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలారోజుల క్రితమే ప్రకటించారు. దర్శకుడు సురేంద్ర రెడ్డి 2023లో తెరకెక్కించిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా ప్రకటించలేదు. అయితే, తాజాగా పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. వక్కంతం వంశీ ఈ ప్రాజెక్ట్‌కు కథ అందిస్తున్నాడు. అయితే, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇప్పటికే రవితేజకు ఈ కథను వినిపించారని సమాచారం. పలు కారణాల వల్ల షూటింగ్ వరకు చేరలేదని టాక్ వుంది. గతంలో ఆయన తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి, ఏజెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సరైన కథ కోసం సురేంద్ర రెడ్డి ప్లాన్ చేస్తుండగా వక్కంతం వంశీ చెప్పిన కథతో పవన్ వద్దకు వెళ్లడంతో ఆయన ఓకే చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో గన్ కల్చర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుందని తెలుస్తోంది. అయితే, ఇదే స్టోరీని రవితేజకు చెబితే నో అన్నారని టాక్ ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి గతంలో రవితేజతో నేల టికెట్టు, డిస్కో రాజా చిత్రాలను నిర్మించారు. -
నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.
-
ఏపీలో పెరగనున్న సినిమా టికెట్ ధరలు.. అది కూడా పర్మినెంట్‌గా!
మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్ థియేటర్లో ఇకనుంచి రూ. 50 టికెట్ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.పవన్ కల్యాణ్‌తో చర్చలుసినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు. 'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్ ధర ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 175 వరకు ఉంది. ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్ థియేటర్స్‌లలో టికెట్ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.సింగిల్ థియేటర్ టికెట్ ధర రూ. 150కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్ థియేటర్లో టికెట్ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.చిన్న సినిమాలకి AP లో 50 పెంచుతున్నాం GO ద్వారా. దానికి కారణాలు ఇవి.అందుకే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, ఒక కమిటీ ఫార్మ్ చేసి పర్మినెంట్ GO వచ్చేలా జరుగుతుంది.- Naga Vamsi#AnaganagaOkaRaju Full interview youtube link : https://t.co/2RuecuqHJp@vamsi84 https://t.co/u8yhybkIxm pic.twitter.com/I2hwiXQWO8— idlebrain.com (@idlebraindotcom) December 29, 2025 -
70కోట్ల ప్యాకేజీతో నవరంధ్రాలు మూసుకుని... పవన్ పై రాచమల్లు ఫైర్
-
పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!
-
ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. నిధి అగర్వాల్ ట్వీట్
ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రభాస్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్‌కి మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు మరింత సంతోషపడిపోయేలా నిధి అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.'రాజాసాబ్'లో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్. చిత్ర ప్రమోషన్లో భాగంగా '#ఆస్క్ నిధి' పేరుతో ట్విటర్లో అభిమానులతో ముచ్చటించింది. మిగతా ప్రశ్నలు, సమాధానాలు ఏమో గానీ ఓ ఆన్సర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అని అడగ్గా.. హీరోలుగా ప్రభాస్-పవన్ కల్యాణ్ ఉంటారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా.. హీరోయిన్గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది.అయితే ఈ ట్వీట్ చేసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిధి అగర్వాల్‌కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయిగా అని మాట్లాడుకుంటున్నారు. నిజ జీవితంలో ఈ మల్టీస్టారర్ సెట్ అవుతుందా అంటే సందేహమే. ప్రభాస్ ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ. పవన్ మరోవైపు రాజకీయాలతో బిజీ. కాబట్టి నిధి కల కలాలానే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు.'రాజాసాబ్' సినిమాలో నిధి అగర్వాల్ బెస్సీ అనే పాత్ర చేసింది. ఇందులో ఈమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని నిధి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ 'రాజాసాబ్'పై పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం నిధికి రాబోయే రోజుల్లో తెలుగులో అవకాశాలు కష్టమే?PK sir PRABHAS sir NIDHHI me SRV #AskNidhhi #TheRajaSaab https://t.co/CG1GzbHyEV— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025 -
టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు
-
బాబూ.. సీఎం పోస్టు పీపీపీకి ఇచ్చేయండి: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలి. పీపీపీ, పీ-4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా?. నాలుగో పీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేటు పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారు?. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.ఆసుపత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా సంతకాలు చేశారు. మీ టీడీపీ, జనసేన నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసేది?. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు. ఆరోగ్యాన్ని, చదువును జగన్ బాధ్యతగా తీసుకున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు?. బాబూ.. నీ వాళ్లకు దోచిపెట్టాలి అనుకుంటే పీపీపీ కింద కొత్త కాలేజీలు పెట్టు. 17 మెడికల్ కాలేజీలు ఆరు కోట్ల ఏపీ ప్రజల ఆస్తి. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వైఎస్ జగన్ నిర్మాణం చేపట్టారు. 17 కాలేజీల్లో నాలుగు కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేశారు.ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. ప్రజల హక్కుగా పొందాల్సిన వైద్యాన్ని దిగజార్చుతున్నారు. అన్నీ ప్రైవేటీకరిస్తే సీఎం పదవి ఎందుకు?. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి. ప్రశ్నిస్తానని ఓట్లు అడుక్కున్న పవన్ కల్యాణ్.. ఇంకా జగన్నే ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీలను తీసుకుని ఆ పాపం మోయకూడదు అనుకునే ఎవరూ తీసుకోవడం లేదు. మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా తీసుకుంటామని ముందుకు రావడం లేదు. ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలపై సిట్ వేస్తారు. అమరావతిలో వచ్చిన ప్రతీ టెండర్లో చంద్రబాబుకు నాలుగు శాతం కమీషన్ ఇస్తున్నారు. ప్రజల సొమ్మును హల్వా తింటున్నట్టు బాబు అండ్ కో తినేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు మాస్ దోపిడీ చేస్తున్నారు. అమరావతి అవినీతి సొమ్ముతో కడుపు నిండటం లేదా బాబూ?. దేశంలో ఎక్కడైనా 99 పైసలకు భూములు ఇస్తున్నారా?.. లేక తీసుకుంటున్నారా?. చంద్రబాబు తానా అనగానే ఎల్లో మీడియా తానా తందానా అంటుంది. తన ఆవేదన చెబుతూ అమరావతి రైతు రామారావు చనిపోయారు. అమరావతి రైతుని ఈడ్చుకు వెళ్లమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనలేదా?. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు?. కూటమి పార్టీల కార్యకర్తల అరాచకాలు రాష్ట్రంలో పెరిగి పోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికార మందంతో విర్ర వీగుతున్నారు. రాజధాని రైతులపై పోలీసులను ఉసి గొల్పుతున్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులను రోడ్డు పాల్జేయవద్దు. కనకదుర్గమ్మ గుడికి బిల్ కట్టలేదని కరెంటు కట్ చేస్తారా?. బాలకృష్ణ అల్లుడి విద్యాసంస్థకు వందల కోట్ల బిల్ పెండింగ్ ఉన్నా కరెంటు ఎందుకు కట్ చేయలేదు?. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్ మాఫీ చేస్తే వచ్చే నష్టం ఏంటి?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెప్పు కోసం రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. -
వీళ్లకు బుద్ది రావాలంటే.. పవన్, చంద్రబాబులను ఏకిపారేసిన ప్రకాష్ రాజ్
-
ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు
-
ఈసారి ఇక కష్టమే.. పవన్ లో మొదలైన భయం
-
కూటమి గుండెల్లో అప్పుడే గుబులు?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా.. పార్టీ మీటింగ్‌లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్‌కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్ కూడా రెడ్‌బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి ఉండాలట. ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి
సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్టీల్‌ప్లాంట్‌పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్‌పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
తోలు తీస్తా, తొక్క తీస్తా.. చివరికి మీ వాడికే తోలు తీశారు
-
అరాచకాలకూ ప్రజలు మద్దతివ్వాలా?
‘‘మన పాలనను జనం మెచ్చడం లేదు.. బాగానే పని చేస్తున్నామని మనం అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు..’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. కుమారుడు, మంత్రి లోకేశ్ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను తెలుసుకుంటే బాబుగారికి ‘ఎండ్ రిజల్ట్’ ఎందుకు రావడం లేదో తెలిసొచ్చేదేమో. ‘రెడ్‌బుక్‌లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఎవరికి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’’ అని లోకేశ్ చేసిన వ్యాఖ్య అర్థమేమిటి? ప్రభుత్వాన్ని, విధానాలను ప్రశ్నించేవారిని వేధిస్తామనడమేగా? అధికారంలో వచ్చింది మొదలు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారనే కదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. అయితే లోకేశ్ వంటి నేతలు అధికారం రాగానే తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే..ఈ మధ్య ఎవరో చెప్పారు. చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గుతోందట. అంతా ఆయన కుమారుడే ఆదిపత్యం చెలాయిస్తున్నారట. చంద్రబాబు కూడా లోకేశ్‌ను పొగడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందని ఆయన ప్రత్యర్దులు సైతం చెప్పరు. ఈ విషయం ఆయకూ తెలుసు. రెడ్‌బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేశ్‌కు ఎలా వచ్చింది? ఆయన కనీసం హోం మంత్రి కూడా కాదు! అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయనే ఎందుకు నడుపుతున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారే! లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది.సోషల్ యాక్టివిస్ట్ సవిందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసుపై న్యాయ వ్యవస్థ మండిపడింది కదా! ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేశ్ మాట్లాడడమంటే ఇంతకంటే ఏమి చెప్పాలి. ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శమంటే ఏం చెబుతాం? హత్యను సమర్థించరు కానీ.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెరదీసిందా? లేదా? కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమన్న ఆరోపణలున్నాయి. అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆంజనేయులును కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రబుత్వం పట్టించుకోలేదు. మాచర్ల ప్రాంతంలో రెండు టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే దానిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్‌బుక్‌లో భాగమైతే ప్రజలు అంగీకరిస్తారా? చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేయడంపై లోకేశ్, ఇతర నేతలు విమర్శలు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని చెబుతున్నారే తప్ప, అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారే! పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై కేసులు పెట్టి వేధించి ఇది రెడ్‌బుక్ అని చెబితే ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు? ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమం నడుపుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్‌ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై లోకేశ్ రాజకీయ విమర్శ చేయవచ్చు. కాని అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురంచి ఏమి చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగళం సభలలో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదులు ఇవ్వాలి కదా! అది చేయకుండా రెడ్‌బుక్ మూడులో పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వమని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలక ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జనం అనుకోరా? లోకేశ్ యువగళం టీమ్ ఒకటి ఉంటుందట. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారట. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఎలా వేధించాలి?వారి ఆర్థిఖ మూలాలను ఎలా దెబ్బకొట్టాలి? అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నవాటిపైనే దృష్టి పెడుతుంటారట. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉన్నా అది లోకేశ్‌కే పెద్ద సమస్య అవుతుంది. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టోలని 150 హామీలను అమలు చేయలేదు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూ మాఫియా గురించి ఏమి చెప్పారు? పేకాట క్లబ్లుల గురించి ఏమని తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? అప్పుడప్పుడూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా, ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని అంటూ పవన్ చిటికెలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోం శాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? పది జిల్లాలలో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎన్నికైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలలోనే శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెబుతోంది కదా! టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కారకులవుతున్నారని అనేక మంది వాపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ పార్టీవారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమి చేసింది? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా? లేదా? ఇదంతా రెడ్‌బుక్ ప్రభావమని లోకేశ్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు.ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు. అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. దానికి రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ బృందం చేసిన నిర్వాకమే కారణమన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తమ్మీద జనం తన ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడి లోకేశ్ పెత్తనం, పిచ్చి రెడ్‌బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయయకుండా ప్రజలను భ్రమలలో ఉంచాలన్న యత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్తపడకపోతే అదే రెడ్‌బుక్ ఏదో రోజు టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తమ పాలనను జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తొక్క.. తోలు.. అన్నావ్.. ఆ ఆవేశం ఏమైంది..
-
టీడీపీకి తొత్తులుగా ఏపీ పోలీసులు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మంత్రి సంధ్యా రాణి పీఏ సతీష్.. మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టారు.. మంత్రి డైరెక్షన్లోనే ఆమెపై కేసు నమోదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి, సతీష్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను, మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. టీడీపీ తొత్తుల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పీఏ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా?.బాధితురాలి దగ్గర సతీష్ డబ్బులు తీసుకోవడం నిజం కాదా?. ఇప్పటికైనా సతీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
అడ్డంగా ఇరుక్కున్నారుగా!! పచ్చ బొట్టు సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం
-
పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!
-
5 కోట్ల ఆవకాయ.. బాబు వేస్ట్ అంటున్న పవన్
-
పవన్ కల్యాణ్ భయం అదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘వైఎస్సార్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్‌లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్‌లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్‌కు కిక్ బ్యాగ్‌లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్‌తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్‌లో పవన్‌కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్‌గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?...కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్‌ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు...ఏపీలో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్‌ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్‌కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘పవన్ అంటే.. ఓవరాక్షన్.. ఇరిటేషన్.. కన్ఫ్యూజన్’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్‌లో ఓవరాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, క్లైమాక్స్‌లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్‌లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్‌కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..పాలన చేతకాక వైఎస్సార్సీపీని తిడుతున్నాడు.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. -
ప్రశ్నిస్తే బెదిరింపులా?.. మీ భాషేంటి?: బొత్స సీరియస్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల భాష ఏ మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైఎస్సార్సీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల భాష, ఆలోచన విధానాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోటి సంతకాల సేకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా?. జనంలోకి వెళ్లి అడిగితే ఎంత మంది మెడికల్ కాలేజీల కోసం సంతకాలు చేశారో అర్ధం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. అప్పుడు వాళ్ళే సమాధానం చెబుతారు. మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారో వారిపై మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం..20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తారో.. చస్తారో పక్కన పెడితే గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసింది. రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వలసలు మొదలవుతాయి. పేదలకు అన్నం దొరకలేని దయనీయ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖలోకే వస్తుంది కదా కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. చంద్రబాబుకి పేదలు అవసరం లేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అవసరం లేదు. చంద్రబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలేదు.ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నారు కదా పవన్.. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు?. అధికారం, గెలుపు ఓటములు సహజం. సిద్దాంతం, ఆలోచన ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే.. శాంతి భద్రతలు లేవు. హాస్టల్ పిల్లలు మధ్యాహ్నం మంచి భోజనం తినే పరిస్థితి లేదు.. పవన్ వ్యాఖ్యలు విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగి ఏపీలో యూరియా కొరత వస్తే.. మిగతా రాష్ట్రాల్లో యూరియా ఎలా వచ్చింది?. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నింటిలో యూరియా కొరత లేదు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఆయన టీమ్ కన్ను పడింది. ఇక్కడున్న భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా?. భూ కేటాయింపులు అన్నింటిని తిరగదోడుతాం. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. సీ పోర్టుల్లో చూస్తే అక్రమ రవాణా?. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నా?. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు వెనకాడుతున్నారు. ప్రతీ రోజూ రాష్ట్రంలో అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఏదో ఒక సమస్య చూస్తున్నాం. పెద్ద ఎత్తున అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేశారంటే సమాధానం లేదు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు?.ఫీజురియింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందింది. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 15వ ఆర్ధిక నిధులు వినియోగానికి బ్రేకులు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్‌కు ఆ విషయం తెలుసా?. ఉన్నప్పుడు ఏం పీకారని పవన్ అడుగుతున్నారు.. ఏంటి ఈ మాటలు. మాటలు ఎక్కువ మాట్లాడే వారికి చేతనైంది తక్కువ. రెండేళ్ల పాలనపై ఈ ప్రభుత్వానికి, మంత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. సంక్రాంతికల్లా గోతులు కప్పేయాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ ఏ సంక్రాంతో చెప్పడం లేదు. గోతులు కప్పడానికి నిధులు ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టంది. పిల్లల అవసరాలను తీర్చండి’ అని హితవు పలికారు. -
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్‌స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్‌బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్‌కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్‌కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్‌కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్‌పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్‌లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్‌గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్..? పవన్ పై కారుమూరి వెంకట్ రెడ్డి ఫైర్
-
ఏం పీకుతామా!.. జగన్ వచ్చాక తెలుస్తది
-
లోకేష్ బూతులకు YSRCP పగిలిపోయే రిప్లే
-
మోదీకి లోకేశ్ వారసుడా? పవన్ కల్యాణ్ లో ఫ్రస్ట్రేషన్
-
కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు.!
సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్ఐ, ఐపీ అడ్రస్‌లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. -
దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు
-
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు కేరాఫ్‌గా మారింది. గొల్లప్రోలు మండల కేంద్రంగా జనసేన నేత ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊటా నానిబాబు ఆధ్వర్యంలో యథేచ్ఛగా రేషన్ స్మగ్లింగ్ సాగుతోంది. పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేరుతో 26 కేజీల బస్తాను రూ.1600కు విక్రయిస్తున్నారు. ఎక్కువ మొత్తం బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ఇటీవల కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో బియ్యం కొంటున్న వ్యక్తిని జనసేన పార్టీకి చెందిన వ్యక్తి పట్టుకుని నిలదీస్తే.. అదే జనసేనకు చెందిన నేత ఊటా నానిబాబు నుంచి ఫోన్ చేయించి మన వాడే వదిలేయి అని చెప్పించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని కూటమి పందికొక్కులు బొక్కేస్తున్నాయి. చౌక ధరల దుకాణాలు కేంద్రంగా భారీగా బియ్యం స్మగ్లింగ్ దందా సాగుతోంది. ఎక్కడా ఒక్క వాహనం పట్టుబడదు. ఒకవేళ అధికారులు అడ్డగించినా.. ఉదయానికి అక్కడ వాహనం ఉండదు.. పట్టుకున్నా బియ్యం ఉండవు. నాణ్యమైన సార్టెక్స్ బియ్యం సరఫరా నిలిపేశారు. నాసిరకం సరఫరా చేస్తున్నారు. అందులోనూ సగానికి పైగా బ్లాక్ చేసేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి అందించే వ్యవస్థను నాశనం చేశారు. అరకొర పంపిణీ చేస్తూ అందులోనూ దోచుకుంటున్నారు. ఏడాదికి ఈ దందా రూ. వేల కోట్లకు పైమాటేనని క్షేత్రస్థాయిలో పరిశీలనను బట్టి అర్ధమౌతోంది. ప్రతి నెలా వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టే పక్కదారి పట్టిస్తున్నారు. దీని కోసం రాత్రిళ్లు ప్రత్యేకంగా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటు చేసుకుని బఫర్ గౌడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్లు, చౌక దుకాణాల నుంచి నేరుగా బినామీల మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రీసైక్లింగ్ చేసి ఎక్కువ రేటుకు మార్కెట్లోకి వదలడంతో పాటు రాచమార్గంలో విశాఖ, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. గోదావరి జిల్లాల రేషన్ దందాలో జనసేన నేతలే ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.బియ్యం అడిగితే కార్డు రద్దు చేస్తాం!రాష్ట్రంలో 29,793 రేషన్ దుకాణాల్లో 1.48 కోట్లు కార్డులున్నాయి. వీటి ద్వారా ఏటా 25లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు సరఫరా చేయాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైఎస్సార్ సీపీ హయాంలో సార్టెక్స్(నాణ్యమైన) బియ్యాన్ని అందించే విధానం తీసుకొచ్చారు. అంటే ఫైన్ వెరైటీలతో సమానంగా రేషన్ బియ్యం ఉంటాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో సార్టెక్స్ బియ్యం సరఫరాను అటకెక్కించేశారు. క్వాలిటీ పూర్తిగా పడిపోయింది. గట్టిగా నిలదీస్తే రేషన్ కార్డు రద్దు చేస్తామని పేదలను బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే వేల మంది రేషన్ డీలర్లపై వైఎస్సార్ సీపీ ముద్ర వేసి అక్రమంగా తొలగించారు. వాటిని తమ అనుయాయులకు కట్టబెట్టి బియ్యాన్ని బొక్కేస్తున్నారు. 29,793 రేషన్ దుకాణాల్లో దాదాపు 7వేలకుపైగా దుకాణాలు అసలు డీలర్ల కంటే ఇన్చార్జిల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. డీలర్లపై అక్రమంగా కేసులు బనాయించి వారిని రేషన్ సేవల నుంచి తప్పించడమే దీనికిప్రధాన కారణం. ఈ–పాస్ మిషన్లతో ఇంటింటికీ..బియ్యం పంపిణీలో పారదర్శకత లేదు. ఈ–పాస్ మిషన్‌కు, వెయింగ్ మిషన్‌కు అనుసంధానం ద్వారా మాత్రమే కచ్చితమైన తూకంతో బియ్యాన్ని ఇవ్వాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ అనుసంధానాన్ని గాలికొదిలేసింది. తూకంలో మోసాలతో లబ్ధిదారుల బియ్యాన్ని కొట్టేస్తున్న పరిస్థితి. దీనికి తోడు లబ్ధిదారులకు దుకాణాల్లో బియ్యం ఇవ్వట్లేదు. ఇంటింటికీ ఈ–పాస్ మిషన్లు పట్టుకుని వెళ్లి బలవంతంగా వేలి ముద్రలు తీసుకుని చేతిలో కిలోకు రూ.పదో పరకో పెట్టి వెళ్లిపోతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే దందా షురూ..అక్రమ రేషన్ దందా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే మొదలవుతోంది. వాస్తవానికి లబ్ధిదారుల అవసరాలకు తగ్గట్టుగా ఏనాడు బఫర్ గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్‌కు బియ్యం రావట్లేదు. వచ్చిన బియ్యం కాస్త ఎంఎల్ఎస్ పాయింట్లో తరిగిపోతోంది. చాలా చోట్ల డీలర్లకు ఇచ్చే ప్రతి బస్తాలో అరకేజీ నుంచి కేజీ వరకు తరుగు ఉంటోంది. దీనికి తోడు గోనె సంచి బరువునకు అరకేజీ అదనంగా ఇవ్వాల్సి ఉండగా పట్టించుకోవట్లేదు. ఈ మొత్తం బియ్యం దొడ్డిదారి పడుతోంది. నాయకులకు నెలవారీ కప్పం..రేషన్ అక్రమ రవాణాలో కూటమి నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాటాలు, వంతులు వేసుకుని మరీ పోటాపోటీ దందా చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కొందరు డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని కాజేస్తూ దొడ్డిదారిన మిల్లులకు తరలిస్తున్నారు. బాబు బినామీ బంధువులదే రాజ్యం!రేషన్ అక్రమ సామ్రాజ్యం చంద్రబాబు బినామీ అయిన ఓ మంత్రికి చెందిన బంధువు చక్రం తిప్పుతున్నాడు. ఏపీ క్యాబినెట్లో అత్యంత కీలక పదవిలో ఉన్న సదరు మంత్రికి చెందిన వియ్యంకుడికి కాకినాడ జిల్లాలో ఆగ్రోస్ కంపెనీ ఉంది. ఆ మంత్రి బంధువు సిండికేట్‌గా మారి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రేషన్‌ను శాసిస్తున్నారు. విదేశాలకు ఈ బియ్యాన్ని పోర్టుల ద్వారా ఎగుమతి చేయించడం, రీసైక్లింగ్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం, మళ్లీ ఇదే బియ్యాన్ని తిరిగి పీడీఎస్‌లోకి జొప్పించడం.. ఇలా సాగుతోంది. ఈ సిండికేట్ విదేశాల్లోని గోడౌన్లలో కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిందని మిల్లర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ నిల్వ చేయడానికి చోటులేకపోవడం వల్ల ఇప్పుడు మిల్లుల్లో నిల్వ చేస్తున్నారని, విజిలెన్స్ అధికారులు కన్నెత్తి కూడా చూడట్లేదని మిల్లర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.సీజ్ ద షిప్ ఓ కుట్ర!కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024–25 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి ఏకంగా రూ.23,363 కోట్ల విలువైన 59.78 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) రూ.8,500 కోట్ల విలువైన 25లక్షల టన్నుల నాన్‌బాస్మతి బియ్యం విదేశాలకు చేరింది. ఇక్కడ విచిత్రం ఏమంటే, ఈ దందా కాకినాడ పోర్టుతో పాటు విశాఖ పోర్టుకు పాకింది. ఈ బియ్యం మొత్తాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించేశారు. ఇందులో సెనెగల్, టోగో, బెనిన్, గినియా, ఐవరీ కోస్ట్, లైబీరియాలతో పాటు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, జాంబియా, కామెరూన్, వియత్నాం, అల్జీరియా, ఇండోనేషియా, మడగాస్కర్, మొరాకో వంటి దేశాలున్నాయి. వాస్తవానికి బయట రాష్ట్రాల నుంచి ఏపీ ద్వారా విదేశాలకు ఎగుమతయ్యే బియ్యం కూడా ఉంటాయి. అయితే, అవి ఎక్కువగా సన్న రకాలు కావడంతో వాటికి ఆఫ్రికా దేశాల్లో రేటు ఎక్కువగా ఉంటుంది. ఇలా రేషన్ బియ్యాన్ని మాత్రమే తక్కువ రేటుకు అందించేందుకు వీలుంటుంది. వివిధ జిల్లాల్లో రేషన్ దందా ఇలా..నెల్లూరు టు చెన్నై..నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ నేతలు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, గుంటూరు, తిరుపతి జిల్లాల నుంచి బియ్యం సేకరణ కోసం 16 టర్బో లారీలు కొనుగోలు చేశారు. ఇక్కడ పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు నెలవారీ రూ.లక్షల్లో మామూళ్లు చేరిపోతున్నాయి. జిల్లాకు చెందిన దేవస్థానాల బాధ్యతలు చూసే ఓ మంత్రి ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతున్న అనంతసాగరం మండలం వెంగంపల్లికి చెందిన బెట్రెడ్డి మహేష్‌రెడ్డి ఈ రేషన్ మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి నెలా నెల్లూరు జిల్లా నుంచి 9 వేల టన్నుల బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. నెల్లూరులోని గుడిపలి్లపాడు, బుచ్చిరెడ్డిపాళెంలోని రైస్‌మిల్లులు లీజుకు తీసుకొని సేకరించిన బియ్యాన్ని పాలిష్ పట్టి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో బాపట్ల జిల్లాకు చెందిన టీడీపీ నేత వణుకూరి సుధాకర్‌రెడ్డి, జనసేన నేత వక్కలగడ్డ సుధీర్ భాగస్వామ్యం ఉంది. ఇక్కడ మాస్టారు మంత్రి అవడంతో ఆయన అనుచరుడు పౌరసరఫరాల శాఖలో డైరెక్టర్‌గా చేరి దగ్గరుండి బియ్యం అక్రమ దందా సాగిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను డీలర్లుగా పెట్టుకుని మిల్లులను లీజుకు తీసుకుని వెంకటేశ్వరనాయుడు, ప్రసాద్‌నాయుడును ముందు పెట్టి బియ్యం దందా సాగిస్తున్నారు. విశాఖ పోర్టు నుంచి తరలింపు...విశాఖ పోర్టు నుంచి చైనా, ఎమన్, వియత్నాం దేశాలకు ప్రతి నెలా 6వేల కంటైనర్ల బియ్యం ఎగుమతి జరుగుతుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. 2024–25 లో ఏకంగా 10 లక్షల టన్నుల వరకూ బియ్యం ఎగుమతి జరిగిందని తెలుస్తోంది. గంగవరంలోని అదానీ పోర్టు ద్వారా కూడా ఇటీవల కాలంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతిపరుడు, సీఎం సామాజికవర్గానికి చెందిన ఓ కార్గో వ్యాపారి వేర్‌హౌస్‌ల ద్వారా గంగవరం పోర్టుకు వెళ్తున్నట్లు సమాచారం. దందా నడిపిస్తోంది మొత్తం టీడీపీ, జనసేనకు చెందిన నేతలే. విశాఖతో పాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి మండలాలు పరిధిలో సేకరించిన బియ్యం మొత్తం.. ఆనందపురం మండలంపెద్దిపాలెంలో ఉన్న రైస్ మిల్లులకే చేరుతున్నాయి. చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు..చిత్తూరు జిల్లాలో కార్వేటినగరం, నగరి, ఎస్ఆర్పురం, జీడీనెల్లూరు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి, యాదమర్రి, బంగారుపాళ్యం, పలమనేరు, పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో అక్రమ రేషన్దందా నడుస్తోంది. తవణంపల్లి మండలం అరగొండ ప్రాంతానికి చెందిన అధికార పార్టీకి చెందిన వ్యక్తి రేషన్ మాఫియాకు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. జిల్లా నలుమూలల నుంచి అక్రమ బియ్యం తీసుకొచ్చి కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్ చేసే యంత్రాలతో కొత్త బియ్యంగా మార్చి మార్కెట్లోకి విక్రయిస్తున్నారు. పాలసముద్రం, నగరి, గుడిపాల, జీడీనెల్లూరు, మీదుగా చెన్నై పోర్టుకు తరలిస్తున్నారు.గుంటూరు ఎమ్మెల్యేల కనుసన్నల్లో..గుంటూరు నగరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అనుచరుడు సిద్ధిక్ రేషన్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.. ఆర్టీసీ కాలనీలో ఉన్న మిల్లర్ నాగేశ్వరరావు ద్వారా రేషన్ బియ్యాన్ని రీపాలీష్ చేయించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులే రేషన్ మాఫియాను ముందుకు నడిపిస్తున్నారు. గత కొంతకాలం వరకు ఫిరంగిపురం మండలానికి చెందిన యువనాయకుడు రేషన్ దందా చేస్తుండగా ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ స్థాయి మరో నేత దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. రేషన్ దందాలో ఓటీవీ చానల్ రిపోర్టర్ సోదరుడు భాగమైనట్లు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో డీలర్లతో దందా..తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యేల అండదండలతో రేషన్ డీలర్లే వ్యాపారులుగా మారారు. కార్డుదారుల నుంచి 70శాతం బియ్యాన్ని డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. వాటిని సన్నబియ్యంగా మార్చి కర్నాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ ప్రాంతానికి తరలిస్తున్నారు. జిల్లాలో 80శాతం అక్రమ బియ్యాన్ని కర్నాటక రాష్ట్రానికి 15శాతం బియ్యాన్ని తమిళనాడులోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి, 5 శాతం బియ్యాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారు.ఇంటివద్దకే అందించే వ్యవస్థపై విషం చిమ్మి...గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజారంజక వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా ముంచేసింది. ఇంటి వద్దకే రేషన్ అందించే ఎండీయూ వ్యవస్థపై విషప్రచారం చేశారు. తమ అవినీతికి అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. గతంలో 9,260 ఎండీయూ వాహనాల్లో ఇంటి వద్దకే వెళ్లి, లబ్ధిదారులు కళ్ల ఎదుటే బ్యాగులు తెరచి, ఈ–పాస్, వెయింగ్ మిషన్ అనుసంధానంతో కచ్చితమైన తూకంతో బియ్యాన్ని అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల ఉపాధిని ఊడగొట్టడంతోపాటు పేదలను రేషన్ దుకాణాల ఎదుట నిలబెట్టింది. ఒకప్పుడు ఇంటి వద్దకే బియ్యం వస్తే..ఇప్పుడు పేదలు రేషన్ దుకాణాలకు వెళ్లినా బియ్యం దొరకట్లేదు.ఉమ్మడి కృష్ణాలో నెలకు రూ.10 కోట్ల దందా..ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్లమెంట్ ముఖ్యనేతకు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు ప్రతినెలా భారీగా ముడుపులు ముట్టజెప్పుతున్నట్టు సమాచారం. రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ చేయించి కిలో రూ.50 నుంచి రూ.60 కి కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా జిల్లాలో రేషన్ మాఫియా ప్రతి నెలా రూ.10కోట్లకు పైగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాల్లో రేషన్ దందా సాగుతోంది. అక్రమ బియ్యం రవాణా కోసం పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి అన్ని మండలాల్లో అధికార పార్టీ నేతలతో అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. బియ్యాన్ని కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నారు. జగ్గయ్యపేటలో నియోజక వర్గ ప్రజా ప్రతినిధి, నందిగామలో కంచికచర్లకు చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, అనుచరులు, పెనమలూరులో నియోజక వర్గ ప్రజా ప్రతినిధి అనుచరులు క్రాంతి కిరణ్, గుడివాడలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి పేరుతో గిరి అనే వ్యక్తి, పామర్రులో ప్రజా ప్రతినిధి అండతో మాఫియా డాన్ గొట్టపు రమేష్‌లు ద్వారా బియ్యం దందా నడిపిస్తున్నారు.రాష్ట్రంలో రేషన్ పంపిణీ..చౌక దుకాణాల సంఖ్య 29,793పంపిణీ చేయాల్సిన బియ్యం 25 లక్షల టన్నులుదందా ఇలా..కిలో బియ్యం అసలు విలువ రూ.41బియ్యానికి బదులు చేతిలో పెడుతున్నది రూ.10–15 (కిలో)విదేశాలకు ఎగుమతిచేస్తే రూ.25–30 (కిలో)పాలిష్ చేసి బ్రాండ్ బ్యాగుల్లో నింపితే రూ.50–60(కిలో)పక్కదారి పడుతున్న బియ్యం 50% పైనేరేషన్ మాఫియా దందా విలువ రూ.5వేల కోట్లుపైనే (ఏడాదికి)రాజకీయ కక్షతోనే డిపో తొలగింపుఆనందపురం మండలం బంటుపల్లి వారి కళ్లాలు రేషన్ డిపోలో గత 28 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఏవిధమైన రిమార్కులూ లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనుకూల వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారని, నా డిపోని రద్దు చేశారు. ఇద్దరు లబ్ధిదారులకు చెందిన బియ్యం 50 కేజీలు మరుసటి రోజు ఉదయం తీసుకెళ్లేందుకు నా డిపోలో ఒక మూలన ఉంచారు. లెప్రసీతో బాధపడుతున్న వ్యక్తికి చెందినవి 30కిలోలు ఉన్నాయి. ఈ బియ్యం ఎక్కువ ఉన్నాయని 6ఏ కేసు నమోదు చేశారు. వారి వద్ద స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు. వెఎస్సార్సీపీ సానుభూతిపరుడిననే డిపో రద్దు చేశారు. – బి. సత్య సుమంగళి, బంటుపల్లి వారి కళ్లాలు, ఆనందపురం ఓర్వలేక రద్దు చేశారు పాతికేళ్లుగా పుల్లూరు పంచాయతీలో రేషన్ డీలర్‌గా ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేసి 6(ఏ) నోటీసులు ఇప్పించారు. నేను హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాను. స్థానిక వీఆర్వో ద్వారా రేషన్ షాప్ నడిపారు. తర్వాత వారికి అనుకూలమైన వడ్డీపల్లికి మార్చుకున్నారు. – వేలు నాటారు, రేషన్ షాప్ డీలర్, పుల్లూరు, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా -
‘పవన్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారు’
సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారంటూ వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ చర్యలను సొంత సామాజిక వర్గమే అంగీకరించటం లేదని.. డైవర్షన్ రాజకీయాల కోసమే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు.‘‘తనను ఎవరూ పట్టించుకోవటం లేదనే అక్కసుతో ఏదేదో మాట్లాడుతున్నారు. తన గ్రాఫ్ పడిపోయిందని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు పవన్ కష్ట పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తానని జగన్ అంటే పవన్‌కు కోపం ఎందుకు?’’ అంటూ అశోక్‌బాబు నిలదీశారు.‘‘ప్రభుత్వ స్కూళ్లను కూడా చంద్రబాబు ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిపై కూడా పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. అదేమంటే దాడులు చేస్తామంటున్నారు. చెప్పులు చూపిస్తూ పవన్ పచ్చి బూతులు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను తమ దుర్మార్గాలకు వాడుకుంటున్నారు. జగన్ హయాంలో దౌర్జన్యం, దుర్మార్గాలు జరగలేదు. కూటమి పాలనలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేశారు...సినిమా పోస్టర్లు ప్రదర్శించినా జైల్లో పెట్టారు. దుర్మార్గపు పాలన అంటే ఇదీ. పవన్ చర్యలను చూసి సొంత సామాజిక వర్గమే మదన పడుతోంది. టీడీపీ వారికి బానిసత్వం చేయించటాన్ని వారు సహించలేక పోతున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడితే మంచిది’’ అని అశోక్‌బాబు హితవు పలికారు. -
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
మేం మళ్లీ వస్తే అంటూ కొందరు బెదిరిస్తున్నారు.. బెదిరించేవారికి ఈ సారు భయపడడు.. మేం నిర్ణయం తీసుకుంటే మీకు మళ్లీ ఆ మాటలు రావు.. ఓ సభలో తమను నమ్మి చక్కని పాలన అందిస్తారని ఓట్లేసిన ప్రజల ముందు మన పవన్ సార్ పెట్టిన ముచ్చట్లు.. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నట్లు తనను విమర్శించారని, యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు.. కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు.. సాక్షాత్తు మన పవన్ సార్ పెట్టిన మరో ముచ్చట.అయితే ఇన్నేసి మాటలంటూ.. కాలుకు కాలు కీలుకు కీలు తీస్తామని బెదిరించేవారిని ఏమంటారంటూ ప్రజల్ని ఆలోచనలో పడేసారు. అయినా ఇంత కరుకుగా ఎలా మాట్లాడగలిగారని నోళ్ళు నొక్కుకోవాల్సిన అవసరం లేదు.. సారంటే ఎవరనుకున్నారు.. నట పవరేశ్వరుడు. ఏమాటకామాట.. అతనో విలక్షణ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం ఆయన సొంతం. తనది కాని పాత్రలోనూ అంతే సహజంగా ఇమిడిపోవడం అతని స్పెషాలిటీ. మొన్నమొన్నటి దాకా స్పాంటేనియస్ గా ఆవేశం వచ్చేది. ఇప్పుడేమో బూతులూ వస్తున్నాయి. అభిమానుల చప్పట్లకు పరవశించని నటుడుండడు కదా.. వీరూ అందుకు మినహాయింపు కానేకాదు. తనే ఓ సైన్యాన్ని కట్టి పార్టీ పెట్టి జన బాహుళ్యంలో చొచ్చుకుపోవాలని గతంలో విఫలయత్నం చేశారు. అయితే ఒక్కోసారి అదృష్టం కూడా దారితప్పుతుంది కదా.. అలా మన సారు గారికి పవర్ రావడంతో పవరేశ్వరుడి అవతారం ఎత్తారు.అసలే వెండితెర హీరో.. ఒంటి చేత్తో లారీలు లేపి ఆవల పడేసిన ధీరోదాత్తం ప్రదర్శించిన వారాయే. ఓట్ల పండగనాడు వారెంత వీరంగం వేశారని.. అబ్బో చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ప్రచారంలో ఆహా ఏం వాగ్దాటి.. ఆ.. ఏవన్నారు చూసి చదివారనా? సర్లేండి పేపర్లు పట్టుకునేవారు.. కళ్ళద్దాల్లోంచి తొంగి చూసి మరీ చదివేవారు.. అది కాదండీ మీరు చూడాల్సింది.. ప్రతి అయిదు నిమిషాలకోసారి పూనకం వచ్చినట్లు ఊగి రేగి చలరేగి పోయేవారు. అస్సలు ఆ కిక్ కోసమే కదా మేం కాళ్ళునొప్పెట్టేలా నిలుచుని మరీ చూసింది. మీరెన్నెన్ని అన్నా ఈసారి మన సారుకు బాగా వర్కవుట్ అయ్యింది. దెబ్బకు పెద్దసీట్లో పడ్డారు.. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందనమాట.సారు సినిమా రెండో భాగం ఇంకా సూపరు తెలుసా? అప్పుడే క్యారెక్టర్.. కాస్ట్యూములు మారిపోతాయి. అదెలా అదెలా అంటారేంటి సార్.. నటులకు ఆమాత్రం క్రియేటివ్ లిబర్టీ ఇవ్వరా ఏంటి? సరే మొన్నటి దాకా చెగువేరా అన్నారు. ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో అని స్టెప్పులేశారు.. గొంతుకు ఎర్ర తువాలు చుట్టుకున్నారు. మాటలో ఎరుపు అరువు తెచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో గట్టెక్కి సీట్లో సెటిలయ్యాక.. అడ్రస్ మారిస్తే ఎలా ఉంటుంది అని తెగ ఆలోచించారు. అదేమంటారు.. మేధోమథనం.. అదే అలా మదనపడీ పడీ.. సివరాఖరికి హిందూధర్మ పరిరక్షణోద్యమం అంటూ కాషాయం చుట్టేసుకుని నుదుటిపై పేద్ద బొట్టు పెట్టేసుకుని బొబ్బలు పెట్టడం మొదలెట్టారు. మొదట్లో కొందరు కంగారు పడిన మాట నిజవే. కానీ వెంటనే సర్దుకుని ఓహో క్యారెక్టర్ ఛేంజా అని సరిపెట్టుకున్నారు. ఎంతైనా వారి వెండితెర ప్రయాణంలో మమేకమైన అబిమానులం కదా ఆమాత్రం అడ్జస్టు చేసుకోలేమా ఏంటి? అని వ్యాఖ్యానించారు కూడా.అయినా సారు ఏ వేషం కట్టినా సరే.. ఆవేశం అస్సలు మిస్ చేయరు అదే బాగా నచ్చే విషయం. అపుడు చెగువేరా అని గర్జించారా.. ఇపుడు నా ధర్మం.. నా హిందుత్వ అంటూ గుండెలవిసేలా దిక్కులు పిక్కుటిల్లేలా ఘోషిస్తున్నారు. ఏదైనా అరుపే కదా మనకు కావల్సింది ఆ సౌండింగే కదా అందుకే పోనీలే పవరేశ్వరా ఈసారి ఇలా కానిచ్చేయ్ అంటూ అభిమానులు పచ్చజెండా బరబరా ఊపేసరికి సారువారు పొంగిపోయారు. అప్పట్నుంచి ఇదే బాపతు. అయినా దేశపెద్ద అండదండ తనకుందని.. ఇరు పెద్దల్ని కలిపిన పిల్లకాల్వలా తనకు ఎప్పటికైనా గుర్తింపు ఉండనే ఉంటుందని వారి గొప్ప నమ్మకం. అందుకే తాజాగా వారు తమదైన శైలిలో ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎందుకంటే అవసరం లేని చోట ప్రశ్నించడం వారి పురాప్రాప్త హక్కు కదా. అధికారంలోకి మళ్ళీ మేమొస్తే అని అన్నారో సహించం కాక సహించం అని గుడ్లురిమారు. బెదిరించే వారికి ఈ సారు అస్సలు భయపడడు.. రాజకీయంగా అనుకుంటే జస్ట్ 48 గంటల్లో అంతా క్లియర్ చేసేస్తాం అని హూంకరించారు. ఇక్కడ అర్థం కానిదేంటంటే...సారుకు కోపం ఎందుకొచ్చింది? ఎదుటి పార్టీవారేదో తమను బెదిరిస్తున్నారని.. సరే మరి మీరు బదులిచ్చిన ధోరణి ఎలా ఉంది? అది కూడా ఫక్తు బెదిరింపు ధోరణే కదా. ఈ మాత్రం దానికి మరీ అంతలేసి బిల్డప్పులు అవసురమా సార్. అసలు ఈపాటికే మీరు మీ పెద్దసారు చేయాల్సిందంతా చేస్తున్నారుగా.. ఇంకా తీగ లాగుడు ఎందుకు?పోనీ అలా అంటే వారేమైనా బెదురుతారా అంటే అదీ జరగదని మీక్కూడా తెలుసు. మరెందుకు పవరేశ్వర్ సార్ ఈ అనవసర రౌద్రు బీభత్స భయానక సమ్మిళిత డైలాగులు. దీనికన్నా కాస్త పాలన బెటర్‌గా చేయండి పదుగురు హ్యాపీగా ఫీలవుతారు. అంతేగానీ...రాక రాక వచ్చిందోచ్ నాకూ పవరూ అంటే ..అదేదో మీరన్నారే క్లియర్ చేస్తామని.. అంత రిస్క్ మీకెందుకు సార్.. మన ప్రజలున్నారుగా.. అయిదేళ్లు ఓపిక పట్టండి వారే క్లియర్ సేల్స్ బోర్డు పెట్టేస్తారు.-ఆర్ఎం -
జగన్ పై పవన్ వ్యాఖ్యలు.. సీదిరి అప్పలరాజు దిమ్మతిరిగే కౌంటర్


