breaking news
Perni Nani
-
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న.. పోకిరి డైలాగ్ తో లోకేష్ పై పేర్ని నాని సెటైర్లు
-
దమ్ముంటే మీ బాబుతో రాజీనామా చేపించు లోకేష్ ని ఉతికారేసిన పేర్ని నాని
-
‘డీఎస్సీ నియామకాల్లో క్రీడా కోటా పేరిట భారీ అక్రమాలు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అనర్హులకు, పచ్చ చొక్కాల అనుచరులకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నియామాకల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం తక్షణమే సీబీఐ తో విచారణ జరిపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...జీవోల రద్దు – అడ్డదారిలో సరికొత్త 'పచ్చ' క్రీడలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాదిగా అమలవుతున్న జీవో నెంబర్ 74, 75 ల ప్రకారం ఉద్యోగ నియామకాలలో 2% స్పోర్ట్స్ కోటా అమలు జరిగేది. కానీ, సరిగ్గా డిఎస్సీ ప్రకటన వెలువడే ఏప్రిల్ 19వ తేదీన ఆ పాత జీవోలను రద్దు చేసి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ 4, జఏడీ ద్వారా జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. ఈ రెండు జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే... స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావడానికి ఎలాంటి డిగ్రీ చదవక్కర్లేదు, టెట్ (TET) రాయక్కర్లేదు, ఆఖరికిడీఎస్సీ పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేదు.టీడీపీ నాయకుల చేతుల్లో క్రీడా సంఘాలు – సర్టిఫికెట్ల విక్రయంఈ జీవోల ప్రకారం క్రీడల్లో పాల్గొన్నట్లు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా మొత్తం 400 చిల్లర పోస్టుల్లో ఇప్పటికే 380 కి పైగా ఉద్యోగాలను నియామకం చేశారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చే క్రీడా సంఘాలు, అసోసియేషన్ల అధ్యక్షులుగా ఉన్నది ఎవరయ్యా అంటే... కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోకేష్ గారి అనుచరులు, టీడీపీ జెండాలు మోసిన నాయకులే! జూడో, సాఫ్ట్ బాల్ వంటి క్రీడా సంఘాల నుంచి ఒక్కో దానికి 38, 39 చొప్పున సర్టిఫికెట్లు ఇప్పించుకుని తమ సొంత మనుషులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.అంతర్జాతీయ మెడలిస్టులకు సున్నామన దేశం, రాష్ట్రం గర్వపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఏమాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అసలు గ్రౌండ్లో అడుగుపెట్టకుండా, కేవలం నాలుగు కాలేజీలు కలిసి ఆడుకున్న ఆటల్లో బయట కూర్చుని నీళ్ల సీసాలు, బాల్స్ అందించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఉద్యోగం రాక కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అడ్డదారిలో వచ్చిన కూటమి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు పంచిపెట్టడం అత్యంత దారుణం.ద్వంద్వ నీతి..30-35 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పి, మరో రెండేళ్లలో రిటైర్ అయ్యే 60 ఏళ్ల వయసున్న ఉపాధ్యాయులను మాత్రం నైపుణ్య పరీక్షల పేరిట 'టెట్ రాయండి' అని వేధిస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు మాత్రం తన కంటి సైగలతో డిఎస్సీలో 400 చిల్లర మందికి టెట్ లేదు, డిఎస్సీ పరీక్షా లేదు అని అడ్డదారి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇది నిరుద్యోగ యువతను, కష్టపడి చదివిన అభ్యర్థులను తీవ్రంగా మోసం చేయడమే. దొడ్డిదోవన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పొందిన 380కి పైగా నియామకాలను వెంటనే రద్దు చేసి, అర్హులైన ప్రతిభావంతులకు, నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి.వైఎస్సార్సీపీ డిమాండ్లివే... ఈ నేపధ్యంలో జీవో నెంబర్ 4, 47 ల మరుగున జరిగిన ఉపాధ్యాయ నియామకాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు.. విద్యావ్యవస్థను, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
మా ఆయన సత్య హరిచంద్రడు అన్నావే.. పేర్ని నాని మాస్ ర్యాగింగ్
-
దొంగ ఉద్యోగాలకు లోకేష్ టోకెన్లు ఇచ్చాడు
-
కార్యకర్తల ముందు తొడ కొట్టడం ఏంటి.. ఇదేమన్నా నీ మామ సినిమా అనుకుంటున్నావా
-
15 లక్షలు ఇస్తే మీ చెల్లికి జాబ్.. సంచలన ఆడియో లీక్ చేసిన పేర్ని నాని
-
నిజంగా దమ్ముంటే.. పేర్ని నాని ఓపెన్ ఛాలెంజ్
-
ఫస్ట్ ర్యాంక్ నవీన్ గురించి బయట పెట్టండి..! బాబు, లోకేష్ పై పేర్ని నాని ఫైర్
-
డీఎస్సీలో అక్రమాలు.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖను భ్రష్టు పట్టించడానికే నారా లోకేష్.. విద్యాశాఖను వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి.. లోకేష్ విద్యాశాఖను తప్పితే అన్ని శాఖలను పట్టించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఎస్ఈఆర్టీ కన్వీనర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరే!. పరీక్ష పేపర్ తయారీ హెడ్, పరీక్ష నిర్వహించే హెడ్ ఒక్కరే. డీఎస్సీలో పారదర్శకతకు నారా లోకేష్ పాతరేశారు. ఎస్ఈఆర్టీ ఉన్న వ్యక్తులే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అత్యంత గోప్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో డీఎస్సీ ప్రశ్నపత్రం అప్లోడ్ చేయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కి టాప్ ర్యాంక్ వచ్చింది. నవీన్‌ని టాపర్‌గా ప్రకటించి మళ్ళీ లిస్ట్‌లో మార్పులు చేశారు. నవీన్‌ని ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలి’ అని పేర్ని నాని నిలదీశారు.‘‘పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకున్నట్టే కదా?. లీకేజీని కప్పి పెట్టడానికే నవీన్ పేరు తొలగించారు. బరితెగించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందురోజు 4, 47 జీవోలను తెచ్చారు. అర్హత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తే పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన టీచర్లతో లోకేష్ కొడుక్కి పాఠాలు చెప్పించగలరా..?. నారా లోకేష్‌కి దమ్ముంటే దేవాన్స్కి ఈ టీచర్లతో పాఠాలు చెప్పించాలని ఛాలెంజ్ చేస్తున్నా. డీఎస్సీ అయిపోగానే మళ్ళీ జీవో మార్చేశారు. ఇక మీదట స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాస్తేనే ఉద్యోగం ఇస్తాం అని మార్చారు. డీఎస్సీలో అక్రమాలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.?‘‘ఐఏఎస్ అధికారులు కొందరు సిగ్గులేకుండా తప్పులు చేసినోళ్లకు వంత పాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనేది పేకాట కాదా..?. జోకర్ లేకుండా ఆడే పేకాట బ్రిడ్జ్ కాదా..?. దానికి ఉద్యోగం ఇస్తామన్నది వాస్తవం కాదా?. ఆ విమర్శ చేశానని నా మీద కేసు పెడతారా..?. కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. పోస్టులు అమ్ముకుంటు బేరాల వీడియోలు బయటకొచ్చినా సమగ్ర విచారణ జరపలేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం. వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తాం. ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరతాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
నేను వస్తా... దమ్ముంటే రా.. ఆఫాల్ మొదటి సారి ఎమ్మెల్యే గాడివి...!
-
నారా లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణాజిల్లా: డిఫాక్టో సీఎం లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే చర్చకురండని సవాల్ చేయడం కాదు.. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు. లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా’’ అంటూ ఆయన సవాల్ విసిరారు.‘‘విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడతాడు. కంపెనీలు తెచ్చా, ఉద్యోగాలు కల్పించా అంటాడు. రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. చీమ చిటుక్కుమన్నా తనవల్లే అంటాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికి వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి. దేనికైనా సమవుజ్జీ కావాలి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచావ్. నీకు సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాల పై నాతో చర్చకు రా. నీ వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారు. ఈ డీఎస్సీ దిక్కుమాలిన డీఎస్సీ. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. జిల్లా కలెక్టరేట్లలో ఎందుకు మెరిట్ లిస్ట్‌లు పెట్టలేకపోయారు. గోల్డ్ మెడల్ కొట్టినోడికి కాకుండా పాల్గొన్నవారికి పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్పై కోర్టు విచారణ చేయమని చెప్పింది. దమ్ముంటే విచారణ జరిపించండి. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. మంత్రి పదవి కోసం బోండా ఉమా ముచ్చట పడుతున్నారు కదా. మీరు రాజీనామా చేసి ఇవ్వండి ఆయనకు మంత్రి పదవి’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
గల్లా మాధవి వీడియో లైవ్ లో వేసి రఫ్ఫాడించిన పేర్ని నాని
-
మీరు దొరికిపోయే టైం వచ్చేసింది... పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
మహిళా బట్టలు చించేస్తే ... ఈవిడిగారు ఏం మాట్లాడుతుందో చుడండి
-
జేబులో పచ్చ బిల్లేసుకుని టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి
-
పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు: పేర్ని నాని
తాడేపల్లి: టీడీపీ నేతల కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గుంటూరు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను నీరుగారుస్తూనే ఉన్నారని తెలిపారు.‘‘కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈవీఎం ద్వారా వచ్చిన అధికారంతో పోలీస్ వ్యవస్థను అండగా పెట్టుకున్నారు. పచ్చ బిళ్ల ద్వారా నేరాలు-ఘోరాలకు అధికారిక గుర్తింపు ఇస్తున్నారు. రేప్ చేసిన వాడి జేబులో పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు. భారత రాజ్యాంగం కంటే రెడ్బుక్కే పోలీసులకు ముఖ్యమైంది. టీడీపీ నేతలు వద్దంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రాయడం లేదు.బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు కనీసం వారి మొర వినడం లేదు. కేసు నమోదు చేయాలన్నా టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేయాలట. బీఎన్ఎస్ కంటే కూడా చంద్రబాబు సెక్షన్, లోకేశ్ సెక్షనే పోలీసులకు ముఖ్యమా? ఒక మహిళ పోలీస్ స్టేషన్ గడప తొక్కిందంటే ఎంత ఆవేదన చెంది ఉంటుంది? హోంమంత్రి మాట కూడా మాట్లాడడం లేదు. పోలీసులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వృత్తిని పణంగా పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని రాష్ట్రంలో పరిస్థితులను దిగజార్చారు. -
హెలీకాప్టర్ ని ఆపితే భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తాడు.. పేర్ని నాని మాస్ వార్నింగ్
-
‘ఆక్వా రైతులను చంద్రబాబు సర్కార్ మోసం చేసింది’
సాక్షి, కృష్ణా జిల్లా: ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీడ్ ధర పెంచి రైతుల నడ్డి విరిచిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రొయ్యల కంపెనీల గూడు పుఠాణిని రైతులు పసిగట్టారు.. అందుకే రైతులు పోరాటం మొదలుపెట్టారు. రొయ్యల మేత తయారీ దారులంతా చంద్రబాబు చందాదారులే. ధరలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు కబుర్లు చెప్పాడు. కేజీకి 12 రూపాయలు పెంచి 2 రూపాయల తగ్గించారు’’ అని దుయ్యబట్టారు.‘‘రొయ్యల రైతుకు అండగా నిలిచేందుకు ఈనెల 15వ తేదీన జగన్ భీమవరం వెళ్తారు. హెలీకాప్టర్‌కు పర్మిషన్ లేదంటున్నారు. రొయ్యల రైతు కోసం బెజవాడ నుంచి భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తారు. వైఎస్ జగన్‌ను ఆపలేరు.. కష్టం చెప్పుకోవడానికి వచ్చే రైతులను ఆపలేరు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని మేల్కొలపడానికి ఒక్కోసారి యుద్ధం తప్పదన్నారు. -
మంగళగిరికి సెక్యూరిటీ లేకుండా వెల్లు ఎంత మంది కాలర్ పెట్టుకుంటారో చూస్తావ్
-
స్వాతి రెడ్డి కాదు.. శ్వేతా చౌదరి అడ్డంగా దొరికిన చంద్రబాబు
-
అమరావతి లో బలవంతంగా భూసేకరణ పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్
-
ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన YSRCP కార్యకర్త అనేవాడు తగ్గడు
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మా పార్టీ స్టాండ్ ఇదే
-
యూట్యూబర్లకు పేమెంట్ ఇస్తాం..పచ్చిగా చెబుతున్న చంద్రబాబు
-
వారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారు: పేర్ని నాని
సోషల్ మీడియా వికృతాలకు, వెర్రితలలకు పుట్టిల్లు టీడీపీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఇవాళ ఆయన తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేబినెట్ సమావేశంలో ప్రజాసమస్యల గురించి ఏ మాత్రం చర్చ జరగలేదని తెలిపారు.అమరావతిలో చంద్రబాబు, నారాయణ ఇళ్లు కట్టుకున్నారని పేర్ని నాని చెప్పారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి కేబినెట్లో చర్చ జరగలేదని తెలిపారు. సోషల్ మీడియా సమాజానికి ఇబ్బందికర రోగంగా మారిందని చర్చించారట అని వ్యాఖ్యానించారు.చంద్రబాబు దుర్మార్గ లక్ష్యాలను ఎదిరించేవారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారని తెలిపారు. ఐటీడీపీ వందలాది యూట్యూబ్ చానెళ్లను సృష్టించిందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలపై కూడా విష ప్రచారం చేస్తున్నారని అన్నాఉ. నీచంగా, వికృతంగా, అడ్డగోలుగా ఐటీడీపీ ప్రచారాలు చేస్తోందని పేర్ని నాని తెలిపారు. -
నీకు దమ్ముంటే జగన్ ను ఆపి చూడు... చంద్రబాబుకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన
-
ఏవండో కానిస్టేబుల్ కొడుకు గారు.. గొంతు చించుకుని అరిచావ్ ఇప్పుడు మాట్లాడవే..
-
తెరమీద చంద్రబాబు, పవన్.. తెర వెనుక ఆయన: పేర్ని నాని
బందరు: హోంగార్డుల సమస్యలను పట్టించుకోని కూటమి సర్కారుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు.‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తెరమీద కనిపిస్తారు. తెర వెనుక లోకేశ్ ఉంటారు. హోంగార్డుల జీతం నెలకు రూ.21 వేలు. హోంగార్డులకు రూ.18 వేలు ఉండే జీతాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.21 వేలకు పెంచారు. నెలకు రెండు రోజుల సెలవుతో హోంగార్డులకు రూ.21 వేల జీతం ఇచ్చారు. కానిస్టేబుళ్లు నిర్వహించే విధులనే హోంగార్డులు నిర్వహించాలి. హోంగార్డులు ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు’’ అని పేర్ని నాని చెప్పారు. -
రావణ్ ను చంపే కుట్ర.. ఆ ఎమ్మెల్యేకు బందరులో ఏం పని..
-
ఇంకో 50 వేల ఎకరాలు కావాలా..? సిగ్గులేదా అడగడానికి...?
-
రావణ్ పై కుట్రప్లాన్ పవన్ ఆఫీసులోనే..!
-
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
-
నువ్వు అంత పోటుగాడివా.? పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్
-
రావణ్ అరెస్ట్ కేసుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు!
-
అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు తీరని మోసం చేశారని అన్నారు. మీరు కట్టే ఆఫీసులకే రూ.50వేల కోట్లు అయితే.. రైతులకు ఏం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. అలాగే, రెండేళ్ల పాలనలో కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు?. యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందని అడిగితే సమాధానం చెప్పడం లేదు. అప్పు ఎంత అవుతుందో అన్న దానికి సమాధానం చెప్పరు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషిస్తున్నారు. మంత్రులు తిట్లు, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చారు. మీరు కట్టే ఆఫీసులకే రూ.50వేల కోట్లు అయితే.. రైతులకు ఏం ఇస్తారు?. వైఎస్ జగన్ ప్రశ్నకు ఒక్కరూ సమాధానం చెప్పరు. మంత్రులు తమ శాఖ పనితీరు గురించి ఒక్కరూ మాట్లాడరు. ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంటే మాట్లాడరు. రోగులు ఇబ్బందులు పడుతుంటే మాట్లాడరు. వైఎస్ జగన్‌ను తిట్టేందుకు మాత్రం మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తారు.మావిగన్ అంటే భయం..మావిగన్ అంటే కూటమి నేతలు భయపడుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్ని ఏళ్లు పడుతుంది. సింగపూర్ మించి రాజధాని నిర్మాణం చేస్తామని అన్నారు. చివరకు అమరావతిని ఓ మున్సిపాలిటీగా చేస్తున్నారు. అమరావతి పేరుతో అంతులేని అవినీతి, మోయలేని అప్పులు చేస్తున్నారు. అమరావతి దోపిడీ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. రాజధానిలో పేదలకు జగన్ ఇచ్చిన 50వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. ఇళ్ల పట్టాలు రద్దు చేశాక అమరావతిలో ఎవరు ఉంటారు?? జనం లేని రాజధాని ఎందుకు?. అమరావతిలో స్టార్ హోటల్స్ కట్టి ఏం చేస్తారు??అమరావతి రైతులను కలిసేందుకు వెళ్తే దాడులు చేస్తారు. కూటమి నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసేందుకు మళ్తీ రైతుల వద్దకు వెళ్తాం. అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు. పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నారు. మావిగన్ అనే పేరు చెబితే చంద్రబాబు అల్లాడిపోతున్నారు. అమరావతిలో అవినీతి జరగడం లేదని నిరూపించండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే సాహసం ఉందా?. లంచం ఇస్తే కానీ, ఈ ప్రభుత్వంలో ఏ పని అవదు. ప్రశ్నిస్తే వేధింపులా?ఎప్పుడూ కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు?. ఈ రెండేళ్ల కాలంలో దళితులకు ఏం చేశారు?. యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. జనసేన రౌడీలు పోలీసు స్టేషన్ గోడ దూకి దాడి చేసేందుకు వెళ్తున్నారు. పీఎస్ గోడలు దూకిన వారిపై కేసులు నమోదు చేశారా?. ప్రశ్నించే సోషల్ మీడియా మీద దాడులు చేస్తున్నారు. రావణ్ విషయంలో పోలీసులు చట్ట విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ టెర్రస్‌పై కాల్చి బూడిద చేశారా?. స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టరు?’ అంటూ మండిపడ్డారు.రాజధానిలో ఇళ్లు కట్టుకున్న చంద్రబాబు, మంత్రి నారాయణ వివరాలను ఎందుకు బ్లాక్ చేశారు?. చెప్పే దమ్ము, ధైర్యం మంత్రులకు ఉందా?. కాపులకు కూటమి ప్రభుత్వం మీద విసుగెత్తింది. కాపు నేతలమంతా లంచ్ మీటింగుకి వెళ్తే మమ్మల్ని తిట్టిస్తున్నారు. జనసేన బలహీన పడి, కాపులంతా పక్కకు వెళ్తున్నారు. దీంతో కాపులను తిట్టించి మళ్ళీ జనసేన దగ్గరకు చేరేలా చేస్తున్నారు. ప్రశ్న రావణ్‌ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ, జనసేన మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న చోటే రావణ్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. పవన్‌కి మోటివేటెడ్ డిజార్డర్స్ ఉంది. అప్పటికప్పుడు కావాలని వేషం మార్చుతాడు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు హరిప్రసాద్‌కు బందరులో ఏం పని?. కాపులను పవన్ కళ్యాణ్ బకరాలను చేసి వాడుకుంటున్నారు. పోలీసు అధికారులకు దమ్ముంటే ఇప్పటికే కేసు పెట్టేవారు అని ఎద్దేవా చేశారు. -
అమరావతిని ఇక ఆపేయండి..! మీ మంచికే చెప్తున్నా... పేర్ని నాని హెచ్చరిక!
-
రైతులు కాదు.. టీడీపీ రౌడీలు.. దాడి పై పేర్ని నాని రియాక్షన్
-
జగన్‌ను కలిసిన రైతులే వారి టార్గెట్: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల నుంచి భూములు లాక్కుంటోంది. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. ఉండవల్లిలో దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్బంగా తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘వైఎస్ జగన్‌ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఇది అన్యాయమని అమరావతి రైతులు జగన్‌కు చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా భూములు లాక్కుంటోంది. రైతుల భూముల్లో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నారని తెలిపారు.రైతుల ఆహ్వానం మేరకే పరిరక్షణ కమిటీ ఈరోజు అమరావతికి వెళ్లింది. అమరావతి అక్రమాలు బయటకు రావొద్దని బాటు, లోకేష్ కుట్రలు చేశారు. అమరావతి అప్పులు, దోపిడీ, అవినీతి బయటకు రాకుండా కుట్రలు చేస్తున్నారు. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తోంది. గూండాలు, రౌడీలను కావాలనే దాడికి తీసుకువచ్చారు. దాడి చేసిన వారు ఏ స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. జగన్‌కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర. జగన్‌ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోంది. మేము వెళ్తే అక్కడ జరిగే దోపిడీ, రైతుల సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయని భయపడ్డారు. కుట్ర పన్ని ఉండవల్లి సెంటర్లో అడ్డుకుని దాడి చేశారు. మమ్మల్ని అడ్డుకున్న వారు రాజధానికి భూములు ఇవ్వలేదు. పాలకొల్లు సత్యం అనే వ్యక్తి గూండాలను తెచ్చారు. క్వారీల్లో పనిచేసే వారిని తెచ్చి మద్యం తాగించి దాడి చేశారు. తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మరి పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదు?. కానీ రౌడీ మూకలను మాపైకి పంపాడు. డీఎస్పీ వచ్చి మరింత రెచ్చగొట్టి దాడి చేయించాడు. మాపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం పక్షాన ఉన్నారా?..మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది?. కానిస్టేబుల్‌పై రాయి వేసిందెవరో అందరికీ తెలుసు?. రైతుల విజ్ఞప్తితోనే వైఎస్ జగన్ పరిరక్షణ కమిటీ వేశారు. క్షేత్ర స్థాయితో పరిశీలించమని రైతులు కోరారు. రైతుల సమస్యలపై మేము పెనుమాక వెళ్తుంటే అడ్డుకున్నారు. మాది గొడ్డలి పార్టీ అయితే.. మేం తన్నులు తింటామా?. గొడ్డలి పార్టీ ఎవరిదో చంద్రబాబు చెప్పాలి. పోలీసులు న్యాయం పక్షాన ఉన్నారా?.. గుండాల పక్షాన ఉన్నారా?. రాష్ట్రంలో కూటమి పాలన దుర్మార్గంగా ఉంది. మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తే బండరాళ్లతో దాడి చేశారు.మాపైనే దాడి చేసి.. మళ్లీ మామీదే కేసులు పెడుతున్నారు. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. మాపై దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేదా.? మమ్మల్ని అడ్డుకుంది రైతులు కాదు.. టీడీపీ గూండాలే. నారా లోకేష్ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయి. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు మమ్మల్ని అడ్డుకున్నారు. టీడీపీ గూండాల దాడులను మేము లెక్కచేయం. దాడులను ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటాం. చంద్రబాబు గొడ్డలిని లోకేష్ చేతిలో పెట్టారు. లోకేష్ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు చేస్తున్నారు. ఎవరెంత అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడుతాం. ప్రజా రాజధాని ఎలా అవుతుంది..మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలోకి మేము వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. అక్కడ జరిగేది అంతా అక్రమాలు, అవినీతే. రైతులకు అండగా వెళ్తే దాడులు చేస్తారా?. మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి దుర్మార్గం జరగలేదు. పోలీసుల సాక్షిగా కార్లు ధ్వంసం చేశారు. మాపై రాళ్లదాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలు రాష్ట్రంలో లేవనటానికి ఈ సంఘటనే నిదర్శనం. టెర్రర్ సృష్టించే అమరావతి.. ప్రజా రాజధాని ఎలా అవుతుంది’ అని మండిపడ్డారు. టీడీపీ గూండాల ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. అమరావతిని బాబు తన బినామీలకు అప్పజెప్పాడు. ఈరోజు జరిగిన దాడిలో టీడీపీ మాఫియాదే కీలకపాత్ర. రైతు పరిరక్షణ కమిటీ అంటే ఎందుకంత భయపడుతున్నారు? అమరావతికి ఫౌండేషన్ పడినప్పటి నుంచి అన్నీ దుర్మార్గాలే’ అని మండిపడ్డారు. విధ్వంసాలకు మేము భయపడం..ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘ఏపీలో జరుగుతున్న దారుణాలు చూసి దేశం ఛీ కొడుతోంది. నిత్యం అరాచకాలు, లాకప్ డెత్‌లు జరుగుతున్నాయి. ఇవ్వాళ్టి ఘటనపై మేధావులు ఆలోచించాలి. ఎక్కడో మారుమూలన కాదు, రాష్ట్ర నడిబొడ్డున మాపై దాడి చేశారు. మేము వస్తే చంద్రబాబు, లోకేష్ ఎందుకు భయపడుతున్నారు?. దాడులు, విధ్వంసాలకు మేము భయపడం. మా పార్టీ పేరులోనే రైతులు ఉన్నారు. చంద్రబాబుకు జ్ఞానం, బుద్ది కలగాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇంటికి దగ్గరే మాపై దాడి జరిగింది. మా నేతలు, లీగల్ సభ్యులపై దాడి చేశారు. ఇదేనా చంద్రబాబూ.. నీ పాలన? అని ప్రశ్నించారు.దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘టీడీపీ గూండాలు చిల్లర వ్యక్తులను పోగేసి దాడులు చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు, దాడులకు మేము భయపడం. రైతులు భయపడాల్సిన పనిలేదు, వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. -
టీడీపీ గేమ్‌లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్‌మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్‌లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్‌కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్‌తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్‌లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్‌ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పవన్‌పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్‌తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్‌ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
నీ వయసేంటి..? నీ మాటలేంటి..? నీకు రోజులు దగ్గరపడ్డాయి!
-
‘సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణపై ఆయన బుధవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌లోనే మర్డర్ చేస్తే ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగలేదు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శిస్తే గాని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారు. ఈఘటనలో చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. సామాన్యుడి ప్రాణం పోతే పట్టించుకోరా?సాయికృష్ణ ఘటనకు ఎవరు రాజకీయ రంగు పులిమారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ప్రజలు ఖబడ్దార్ అంటున్నారు. మీ పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు రోజులు లెక్కపెడుతున్నారు.మీరు మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. రౌడీషీటర్ అని ఆరోపిస్తున్నారు.. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా?.కోర్టులో హాజరు పరిచి శిక్ష విధించేలా చేయండి. సాయికృష్ణ కేసులో ఇవాళ జరిగిందా డొల్ల విచారణే. సీపీ నేతృత్వంలోనే టాస్క్ ఫోర్స్ నడుస్తోంది. విచారణలో సీపీ పేరు రాకపోవడం దుర్మార్గం. కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరెందుకు విచారించలేదు.17మంది సాక్షులను విచారించామని చెబుతున్నారు. సిట్ అధికారులు ఈ 17మందితోనే ఎందుకు ఆగిపోయారు.సిట్ విచారణలో సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?. మిగితావారు ఈ కేసులో లేరా?. సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేశారు? డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలన్నీ ఎందుకు తేల్చలేదు. పీఎస్‌లో ఫుటేజీ మాయం చేస్తే.. బయటి ఫుటేజీ అయినా ఉండాలి కదా?. అంటే ఎవరూ లేని సమయంలో స్టేషన్లోనే మృతదేహాన్ని పాతి పెట్టారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
-
ఇక మారవా పవన్! ఐటెం సాంగ్ మాటలాపు!
-
‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’
తాడేపల్లి: ‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. 40 రోజుల తర్వాత చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారని తెలిపారు.మరోవైపు, క్రాంతికుమార్ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్ని నాని చెప్పారు. ‘‘సాయికృష్ణ కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. సాయికృష్ణ కేసు చంద్రబాబు పీకల మీదకు రావడంతో అతని తల్లిని పిలిపించుకుని మాట్లాడారు. మరి క్రాంతికుమార్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించలేదు? ఎస్సీ కులస్తుడైన క్రాంతికుమార్ కుటుంబానికి ఓదార్పు అవసరం లేదా?’’ అని నిలదీశారు.కేసు రీఓపెన్ ఎందుకు చేయలేదు? క్రాంతికుమార్ వీడియో బయటకు వచ్చాక కేసు రీఓపెన్ ఎందుకు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘సాయికృష్ణ మిస్సింగ్ పై 40 రోజుల క్రితమే న్యాయవాది కనకదుర్గ ఫిర్యాదు చేసినా సీపీ ఎందుకు స్పందించలేదు? సీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలోనే టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. అలాంటి టాస్క్‌ఫోర్స్ అధికారులే వెళ్లి సాయికృష్ణను పట్టుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎందుకు బయట పెట్టటం లేదు? సీఐ నాగరాజు క్రైం విచారణలో ఆరితేరిన అధికారి. అలాంటి వ్యక్తి సాయికృష్ణను కృష్ణలంక శ్మశాన వాటికలోనే ఎందుకు దహనం చేయిస్తారు? విచారణ అధికారులు కేవలం అదే శ్మశాన వాటికకే ఎలా వెళ్లారు? అక్కడ ఏమైనా అధారాలు దొరికాయా? సీపీ రాజశేఖర్ బాబుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? విచారణాధికారి డీఎన్ కిషోర్ తన పైస్థాయి అధికారులను విచారించగలరా? సీఐ నాగరాజుపై కేసు నమోదు చేసి 48 గంటలయినా అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు?సాయికృష్ణ కేసులో ప్రజల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముద్దాయిగా ఉన్న సీఐ నాగరాజును ఎందుకు విచారించరు? కేసులో సీపీ పాత్ర ఉందని అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. విజయవాడ సీపీ నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సీపీ చేతుల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్ అధికారులను ఎలా విచారణ చేస్తారు?’’ అని ప్రశ్నించారు. -
అవును వాడు రౌడీ నే.. 22 కేసులున్నాయి.. కానీ వాడిని చంపడానికి నువ్వు ఎవడ్రా..
-
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్‌గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్‌పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్‌కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్‌మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్‌మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్‌పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్‌ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్‌కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్‌కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
తప్పిపోయిన పసిపిల్ల మీద లేని శ్రద్ధ నీ మేకప్ మీద ఉంది
-
అందుకే అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: పేర్ని నాని
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్ లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు.తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అనిత మేకప్ గురించి మాత్రమే మాట్లాడితే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం స్త్రీ సమాజం మాట్లాడినట్లేనని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమర్ ఏదో అన్నారని, విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది. పవన్ దీనిమీద ట్వీట్ చేస్తారు. కట్టు, బొట్టు అంటూ ఏదేదో చెప్పారు. అనిత నోరు పారేసుకోబట్టి అమర్ మాట్లాడారు. ఆమె కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలి కదా. రాజకీయాల్లో కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరికి లూజ్ మోషన్ లాగా మాటలు విపరీతంగా వస్తాయి. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతారు..సమాజం నుంచి మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. సమాజం మీదకు రాళ్లు వేస్తే అవే తిరిగి వస్తాయని లోకేశ్, పవన్ గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ దిగజారిన మనుషులు ఉన్నారు. హోంమంత్రి ఎప్పుడైనా బాధ్యతగా మాట్లాడారా. నాలుకకు హద్దు ఉండాలి.. సభ్యతగా విమర్శించండి. పవన్, లోకేశ్ సూక్తులు చెబుతున్నారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హోదాలో అనిత స్పీచ్‌లు విన్నారా?విన్నవాళ్లు ఆమె మాటలను ఏమనాలి? ఆమె భాషను సరిదిద్దే ప్రయత్నం చేశారా? జగన్ ను తిట్టడం కోసమే వాడుకుంటున్నారు. ఆమెతో అలా మాట్లాడించి నజరానాగా హోంమంత్రి పదవిని ఆమెకు ఇచ్చారు. కొన్ని మాటలు ఎవరు మాట్లాడినా నీచం కాదా. గతంలో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి మాజీమంత్రి రోజాను ఎలా మాట్లాడారో అందరూ చూశారు. అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడితే చంద్రబాబు, లోకేశ్, పవన్ ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు.రోజా గురించి నీచంగా మాట్లాడారు..రోజాను నీచంగా తిట్టిన బండారు సత్యనారాయణను పవన్ బాగా చేశావని మెచ్చుకున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘గతంలో పవన్ కూడా రోజాపై దారుణమైన మాటలు మాట్లాడారు. మంత్రితో పాటు ఆయనకు ఇప్పుడే సంస్కారం వచ్చిందా? గతంలో మా పార్టీ నేతలను ఏదో చేస్తామని మాట్లాడారు.. ఏం చేశారు అని అడుగుతున్నా. సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టా అని చెప్పారు. హోంమంత్రి అనితను కూడా అమాయకురాలిని చేసి వాడుకుంటున్నారు. లోకేశ్ గతంలో మా నాయకుడు జగన్ గురించి.. ఆయన భార్యాపిల్లల గురించి మాట్లాడుతారు. మీ అమ్మగారు ఒక్కరే స్త్రీ నా? మీరు సంస్కారం గురించి మాట్లాడుతారు. అమర్ మాటల్లో తప్పేముంది.. అందులో అసభ్యత ఏముంది. లోకేశ్ నోరు ఉంది కదా అని అధికార మదంతో మాట్లాడితే వైసీపీ వాళ్లు కూడా అలాగే మాట్లాడుతారు. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం గురించి అలా మాట్లాడవచ్చా. ఎర్ర బుక్కు పేరుతో రాష్ట్రాన్ని దిగజార్చారు. అమర్ అనే వ్యక్తిని చిన్న వయస్సులోనే తండ్రి చనిపోతే తల్లిచాటున పెరిగారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతారు? అమర్ పై 10, 15 కేసులు పెట్టి తిప్పాలని చూస్తున్నారని మాకు సమాచారం ఉంది. మీ తప్పుడు కేసులు, అరెస్టులు అతని రోమాన్ని కూడా కదల్చలేరు’’ అని విమర్శించారు. -
చాలా చాలా ఓవర్ అవుతున్నావ్, అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’
మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్‌లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.పవన్‌వి పచ్చ దగాకోరు మాటలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. పచ్చి దగాకోరు మాటలే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.బాధిత కుటుంబాలకు అండగా నిలవాలినాడైనా, నేడైనా వైఎస్సార్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
ఉప్మా మంత్రి.. మాట్లాడితే మా నాన్న.. మా నాన్న.. పవన్ పై మాస్ ర్యాగ్లింగ్
-
‘పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన.. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరి చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ విభాగంలో అన్నీ శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరండర్ లీవల్ను వన్ బై టూ చేశారు.కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన ఆరు సరండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదు. లా అండ్ ఆర్డర్ పని చేసే ఒక్కో పోలీస్‌కు రూ.70వేలకు పైగా బాకీ ఉన్నారు.మందు తాగమని చంద్రబాబే చెబుతారు. తర్వాత డ్రండ్ అండ్ డ్రైవ్‌లు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెబితే పోలీసులకు నిద్ర పట్టడం లేదు.ప్రతి పీఎస్ పరిధిలో రోజుకు ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను కొట్టారు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం దేవుడెరుగు, వడగాల్పుల్లో అల్లాడి పోతున్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడంలేదో చంద్రబాబు చెప్పాలి. ఏపీఎస్పీలో పదేళ్లు సర్వీస్ నిండినవారిని ఏఆర్‌కు ఎందుకు పంపడం లేదు?.ఏపీఎస్పీలో వెట్టి చాకిరి చేస్తూ రిటైర్ అవుతున్నారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారు. ఓట్లు అడుకునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత హోం శాఖ గురించి తప్పితే అన్నీ మాట్లాడుతారు. వైఎస్ జగన్‌ను తిట్టడానికి మాత్రమే మంత్రి అనితను వాడుకుంటున్నారు’అని ధ్వజమెత్తారు. -
కేబినెట్ మీటింగ్ లో పవన్ కు బాబు వెన్నుపోటు
-
ఇప్పటివరకు YSRCPకి ఓటు వెయ్యనోడు నాకు ఫోన్ చేసి...
-
నువ్వు నాకు వెంట్రుకతో సమానం, యార్లగడ్డ వెంకటరావు కు మాస్ వార్నింగ్
-
ఎగేసుకొని వచ్చేసావ్.. విద్యాశాఖలో నీకేం పని అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘నేను బియ్యం దొంగతనం చేశానని ఆరోపిస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ జరిపి నన్ను లోపల వేయండి’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. 2029 కల్లా చంద్రబాబు సర్కార్ పతనమవ్వడం ఖాయమని.. ఈ లోపు మీకు దమ్ముంటే తనను లోపల వేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఇవాళ(గురువారం) అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు), నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, హోంమంత్రి అనితపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినప్పుడు మీకు జ్ఞానం లేదా?. 382 మందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటి వరకూ 3 శాతం అన్నారు.. ఇప్పుడు 382 మంది అంటున్నారు. ఎంతమందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారో కూడా చెప్పరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘జీవోను మార్చి 29 ఆటలను 67 ఆటలకు పెంచేశారు. 40వ ఆట కింద పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్ ఆటను పెట్టారు. ఏ ఆటకు ఎవర్ని తీసుకున్నారో 9 నెలలు నుంచి చెప్పడం లేదు. మేం నిరసనలు చేశాం కాబట్టి ఇప్పుడు డేటా బయటపెడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఐఏఎస్ సంతకం లేకుండా స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎలా పెట్టారు?. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదు. బ్యాగులు, సర్టిఫికెట్లు తెస్తే ఆ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్లు. ఆటలు కేంద్రం పెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం రుజువయ్యాక చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారు..డీఎస్సీ అక్రమాల పై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పడు. లోకేష్ ఏజెంట్ల కింద సీఎం, హోంమంత్రి మాత్రం మాట్లాడేందుకు వస్తారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి మాట్లాడరు. విద్యాశాఖలో తప్పు జరిగిందని మేం అనగానే హోం మంత్రి తెరమీదకు వచ్చేశారు. డీఎస్సీలో మీరు చేసిన పాపాలు మీకు తగలకుండా ఉంటాయా?. చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పులు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
టీడీపీవాడు కూడా జగనే బెస్ట్ అనేలా... పేర్ని నాని గూస్ బంప్స్ స్పీచ్
-
బూతులు తిట్టే 420 గాళ్లతో బాబు హగ్గులు.. పేర్ని నాని మాస్ ర్యాగింగ్
-
ఆ దరిద్రుడితో.... నీ ఏజ్ ఏంటి ఆ ఫోటో ఏంటి.. నాని సెటైర్లు
-
జగన్.. జగన్.. అని గొంతు చించుకున్నాడు... తెలంగాణలో మీటింగ్ పెడతాడట
-
‘అందుకే తెలంగాణలో పవన్ కొత్త డ్రామా’
సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్‌ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్‌పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్‌కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు...తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్‌ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?...ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్‌రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్‌పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్...నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్‌లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్‌లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భువనేశ్వరి గారు తన రెండు గాజులు ఇస్తుంటే ఎంతో ప్రేమ అనుకున్న..
-
ఎందుకు చెప్తున్నా అంటే.... SIR అంటే ఏంటి..? క్లుప్తంగా వివరించిన పేర్ని నాని
-
‘యువగళం’ బ్యాచ్‌కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.లోకేశ్ యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్‌లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్ ట్విట్టర్లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మెరిట్ లిస్టు మాయం ‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్ లిస్టు డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్లైన్ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి. -
నారా లోకేశ్‌కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు: పేర్ని నాని
విజయవాడ: కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విద్యాశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్నీ గుట్టుగానే జరుగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి. కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి. ఆన్లైన్లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి. చదువు రానివాడు చూసినా అర్ధమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చట్టం ఎంత కష్టంగా ఉంటుందో డీఎస్సీ కూడా అలాగే ఉంది.నారా లోకేశ్‌కి తప్ప డీఎస్సీ గురించి ఎవరికీ తెలియదు. స్పోర్ట్స్ కోటా తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి చెబుతాడు. సమాచార శాఖ హక్కు చట్టం ప్రకారం స్పార్ట్స్ కోటాలో కొన్ని ప్రశ్నలు అడిగాం. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో రిక్యూట్ మెంట్ కింద ఎంతమందిని తీశారు? ఎంత పర్సెంట్ కి ఎన్ని పోస్టులు తీశారు? ఏ జీవో, ఏ సర్క్యూలర్ కింద పోస్టులు తీశారు? 16 వేల పోస్టుల్లో ఎన్ని పోస్టులు తీసుకున్నారు? జిల్లాలో ఏ కేటగిరీ కింద పోస్టులు తీసుకున్నారు. అర్హతకి ఆధారాలు ఏంటీ? సెలక్షన్ ప్రోసిజర్ ఎంటీ? జిల్లా మెరిట్ లిస్ట్, పైనల్ లిస్ట్ కావాలి. స్పోర్ట్స్ కేటగిరీలో వివరాలు అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరి కింద సెలక్షన్ ఆధారాలు అడిగాం? సెలక్షన్ కమిటీ వివరాలు అడిగాం. స్పోర్ట్ కోటా కింద ఎంతమందిని రిజెక్ట్ చేశారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? వంటివి అడిగాం. అభ్యర్థనలు ఏంటీ? అనే కూడా వివరాలు అడిగాం.. డీఎస్సీలో రిక్యూట్ మెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు, ఇతర వివరాలు అడిగాం. సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సిన బాద్యత ప్రభుత్వానిది. టెట్ పేపర్ ఎవరు తయారు చేశారు? ఏ ప్రాతిపదికనా వాళ్లను నియమించారు? వాళ్ల సహయకులు ఎవరు అనేది అడిగాం? పైనల్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారా? వాళ్ల పేర్లు ఇవ్వాలని అడిగాం. 16 అంశాల మీద ఆర్టీఐ వేశాం. చంద్రబాబు, లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో రెచ్చిపోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. పాత స్పోర్ట్ కోటా జీవో మార్పు చేసి 29 నుండి 67గా ఎందుకు మార్పు చేశారు? రెండు శాతం నుండి 3శాతం వరకు ఎందుకు పెంచారు?పరీక్ష పూర్తి అయిన తరువాత ఎందుకు జీవో మార్పు చేశారు. యువగళంలో పాల్గొని, లోకేశ్‌తో నడిచిన వాళ్లకు హెరిటెజ్ లో ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉద్యోగాలు ఇచ్చేశారు. దొడ్డి దారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. నిజం నిలకడగానే తెలుస్తుంది.. డీఎస్సీలో తప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబుకు, లోకేశ్‌కు దమ్ములేదు. మమ్మల్ని తిట్టే టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బయటపెట్టండి. విద్యాశాఖ మంత్రి శాఖను పక్కన పెట్టి.. తప్పుడు పనులకు ప్రయారిటీ ఇస్తున్నారు. కూటమి నేతల పాపాల చిట్టా.. చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో కూకట్పల్లి సీటు హరికృష్ణ కూతురుకు ఇచ్చే బదులు రాజ్యసభ సీటు ఇవ్వండి. డబ్బున్న వాళ్లకే ఇస్తారా? డబ్బులేని నందమూరి ప్యామిలీని వాడుకొని వదిలేస్తారా?’’ అని నిలదీశారు. -
లోకేష్ వస్తే యువత బతుకులు మారతాయి అంటే ఏంట్లో అనుకున్న ఈ రేంజ్ లో మారుస్తావ్ అనుకోలేదు నాయన
-
ఖర్జూరనాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి! బాగా ప్లాన్ చేశావ్ బాబు..
-
హైబ్రిడ్ వంకాయలు, టమాటాలు చూశా.. హైబ్రిడ్ మహానాడు ఏందిరా స్వామి
-
ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు
-
ఏపీలో జరిగింది.. దగా డీఎస్సీ: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్‌లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్...బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్‌లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్‌లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
ప్రభుత్వమే ఆ పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో అర్హులైన ఓటర్లను ఒక్కరిని తగ్గించినా ఒప్పుకునేది లేదని వైఎస్సార్ సీపీ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని.. రాజకీయ పార్టీలు ఇప్పటికే సమర్పించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాను అధికారికంగా ఆథరైజ్ చేయాలని స్పష్టం చేసింది.వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి మంగళవారం వెలగపూడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో సమావేశం అనంతరం వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం చేపట్టటానికి వీల్లేదన్నారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటును కూడా తొలగించవద్దని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్‌ను కోరినట్లు పేర్ని నాని తెలిపారు. పార్టీల సమక్షంలోనే ‘సర్’ ప్రక్రియ జరపాలిఉత్తర భారత దేశం పలు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్) పేరు మీద చాలా విచిత్రాలు జరిగాయి. దీనివల్ల అనేకమంది అర్హులైన ఓటర్లకి ఓటు లేకుండా పోయిందని వార్తల్లోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అలా కాకుండా ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలి. రాజకీయ పార్టీలు ఇప్పటికే సమర్పించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాను అధికారికంగా ఆథరైజ్ చేయాలి. బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేసేటప్పుడు, ఖచ్చితంగా రాజకీయ పార్టీల ప్రతినిధులైన బీఎల్ఏలను కూడా తమ వెంట పెట్టుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.18 ఏళ్లు నిండిన, అర్హులైన ఏ ఒక్క ఓటరుకు కూడా రాష్ట్రంలో ఓటు లేకుండా పోకూడదు. 2002లో చివరిసారిగా ఇటువంటి ‘సర్’ జరిగింది కాబట్టి దానిని ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. అందువల్ల 2002 నాటి ఓటర్ల ముసాయిదాను కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరాం. అలాగే 2025 జనవరి 25 తర్వాత పబ్లిష్ అయిన సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్‌లు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. కాబట్టి 2025 జనవరి నుంచి ఈ నెల 25 వరకు నమోదైన ప్రతి ఓటరు లిస్టును రాజకీయ పార్టీలకు అందించాలి.2002లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉంది కాబట్టి ఇక్కడి పౌరులలో చాలామందికి అప్పట్లో తెలంగాణలో ఓటు ఉండే అవకాశం ఉంది. అందువల్ల బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లినప్పుడు వారి ఫోన్లలో ఉండే యాప్‌లో 2002 ఓటర్ లిస్ట్‌కు సంబంధించిన డేటా (తెలంగాణ లేదా భారతదేశంలో ఎక్కడ ఓటు ఉన్నా సరే) చూసుకునే వీలుండాలి. యాప్‌లో ఆ సదుపాయం ఖచ్చితంగా కల్పించాలని మేం కోరగా అందిస్తామని సీఈఓ చెప్పారు. ఓటర్లు ఇంట్లో అందుబాటులో లేకపోతే, విదేశాల్లో ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించే అవకాశాన్ని కల్పించాలి.డూప్లికేట్ ఓట్లు లేదా డబుల్ ఓట్లు (ఒకే మనిíÙకి రెండు లేదా మూడు ఊర్లలో, ఒకే నగరంలో రెండు డివిజన్లలో, లేదా రెండు రాష్ట్రాలలో ఓట్లు) లేకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘానిదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. డబుల్ ఓటు అనేది లేకుండా ఉండేలా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ‘సర్’ ప్రక్రియపై అనేక రాష్ట్రాల్లో అల్లర్లు, రచ్చ జరిగిందని, అనేక సందేహాలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ అలాంటిదేమీ జరగకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలన్నింటి సమక్షంలోనే ప్రక్రియ జరపాలని కోరాం. అత్యంత పారదర్శకంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. –పేర్ని నాని, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిరాష్ట్రంలో అలా జరగకూడదు.. ఇటీవల దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మన దేశ పౌరులై ఉండి గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న లక్షలాది మంది ఓట్లను బెంగాల్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో తొలగించారు. మన రాష్ట్రంలో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా నిజాయితీగా జరగాలని కోరాం. పేదలు, దళితులు రోజువారీ కూలీ పనుల కోసం ఉదయమే వెళ్తారు.కాబట్టి ఉదయం 7 నుంచి 10 గంటల లోపు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సూచించాం. గతంలో హైదరాబాద్ లేదా తెలంగాణలో ఓటు ఉండి, ఇప్పుడు ఇక్కడి ఓటర్ లిస్ట్‌లో పేరు లేని వారు ఓటు హక్కును కోల్పోకూడదు. అందుకోసం నాటి ఓటర్ల లిస్ట్‌లను కూడా ఇక్కడి అధికారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. ఇంటికి వచ్చినప్పుడు వెబ్సై ట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో 2002 తెలంగాణ ఓటర్ లిస్ట్ కూడా చూసే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు. –వై.వెంకటేశ్వరరావు, సీపీఎం కార్యవర్గ సభ్యుడురాజకీయ ఉద్దేశాలతోనే విమర్శలు దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ‘సర్’ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇదేదో ఇప్పుడు కొత్తగా జరుగుతున్న విషయం కాదు. దేశంలో చొరబాటుదారులను గుర్తించడంలో, చనిపోయిన వారి వివరాలను తొలగించడంలో, అలాగే అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడంలో ఎన్నికల కమిషన్ అత్యంత పారదర్శక విధానంతో వ్యవహరిస్తోంది. ఇటీవల మిగతా రాష్ట్రాలలో ఎన్నికలను గమనిస్తే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం భారీగా పెరగడానికి ఈ శుద్ధి ప్రక్రియే ప్రధాన కారణం. కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో, బురదజల్లేందుకే ఈ ప్రక్రియపై విమర్శలు చేస్తున్నాయి. –నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి -
డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వ బరితెగింపు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ/కోరుకొండ : డీఎస్సీ నియామకాల్లోను స్కామ్‌లకు పాల్పడిన ప్రభుత్వ బరితెగింపు అత్యంత దుర్మార్గమని మాజీమంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి భావిపౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. వీరు సోమవారం వేర్వేరు చోట్ల డీఎస్సీ అక్రమాలపై స్పందిస్తూ ఏమన్నారంటే.. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా?.. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్‌ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది? ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా? కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే పైలా పచ్చిస్లా సాగింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ వాళ్లది తడిగుడ్డల పార్టీ. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్‌కళ్యాణ్ కార్ టాప్‌పై ఎక్కి మరీ వచ్చారు.. ఇప్పుడు బందరులో కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదు? – పేర్ని నాని, మాజీమంత్రిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. నిరుద్యోగులను చంద్రబాబు, లోకేశ్ దగా చేశారు. అది మెగా డీఎస్సీ కాదు. మెగా స్కామ్. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వ పెద్దల గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నారు? జిల్లా సెలక్షన్ కమిటీలను ఎందుకు నిర్వీర్యం చేశారు? టెట్ నిబంధనలను ఎందుకు మార్చేశారు? ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. – మేరుగు నాగార్జున, మాజీమంత్రిలోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు.. చంద్రబాబు సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. అది మెగా డీఎస్సీ కాదు.. పూర్తిగా మాయా డీఎస్సీ. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖను ఆయన పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం చెప్పడంలేదు. లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. – ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి.. సీఎం చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అవినీతి అడ్డూ, అదుపులేకుండా సాగుతోంది. డీఎస్సీ నిర్వహించిన వ్యక్తే టాపర్‌గా నిలవడం, ముందుగా పేపర్ లీక్ అవడం భారీస్కామ్ జరిగిందనడానికి బలం చేకూరింది. టాపర్‌గా నిలిచిన వ్యక్తికి పోస్టు ఇవ్వకపోవడం.. అక్రమాల ఆనవాళ్లు లేకుండా ఆన్లైన్ డేటాను డిలీట్ చేయడం, మెరిట్‌లిస్టును ప్రకటించకుండా, ఎంపికైన అభ్యర్థులకు మెస్సేజ్లివ్వడం సిగ్గుచేటు. ఈ స్కామ్‌పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు -
గుడ్డలతో గొంతులు కోసే.. తడి గుడ్డల పార్టీ !
-
వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు: పేర్ని నాని
విజయవాడ: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్వహించింది మెగా DSC కాదని, దగా DSC అని విమర్శించారు. రాజధాని పేరు చెప్పి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ ఎక్కడో ఈ రోజుకీ తెలియదని అన్నారు. పరిశ్రమలకు భూముల పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. రూపాయికి ఎకరం భూమి ఇస్తా అని లోకేశ్ అంటున్నారని, కనీసం భయం, బాధ్యత లేదని విమర్శించారు.‘‘ఓటు వేసిన, ఓటు వేయించిన టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం వల్ల మోసపోయామని బాధ పడుతున్నారు. డబ్బులు ఇవ్వందే పని జరగడం లేదని టీడీపీకి మద్దతుగా నిలిచిన NRIలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు.. దర్బార్ అన్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు అర్జీలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు. రెండేళ్లు నిండింది ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?సమాజానికి మంచి పౌరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనూ అవినీతి చేశారు. DSC కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాడికి 1ST ర్యాంక్ వస్తుంది. DSC మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? మెగా DSC కాదు మెగా స్కాం ఇది. సంపద సృష్టిస్తాం.. సంపద మొత్తాన్ని ప్రజలకు పంచుతాం అన్నారు. టీడీపీ మానిఫెస్టో ఎక్కడ? ఏమైంది? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. ఏది సూపర్ హిట్ ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడూ PPP అనేవాడు ఇప్పుడేమో P4 అంటున్నాడు. PPP అయిపోయింది. ఇప్పుడు P4 కూడా అయిపోయింది అంటున్నాడు. బీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేశారని తెగ గోల చేశారు.. మరి అధికారంలోకి రాగానే ఇచ్చారా? గుది బండగా అమరావతిని తయారు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం పెంచితే మాకు ఏ సంబంధమూ లేదని అంటున్నారు కింద, పైన ప్రభుత్వాలు ఎవరివి? జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు’’ అని తెలిపారు.ఎక్కువ మందిని కనాలా? పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న అంశంపై ఎవరిది వాదన వాళ్లదని పేర్ని నాని అన్నారు. ‘‘విజన్ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏ రోజూ నిజాలు చెప్పలేదు.. నిజం చెప్పినా అది అమలు అవ్వదు. 1993లో రామారావును గద్దె దింపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని యూ టర్న్ లే. 2004లో మోదీ దుర్మార్గుడు అన్నారు. 2014లో మోదీ అచ్చాహై అన్నాడు. 2018లో మోదీకి భార్య లేదు కుటుంబం లేదు మోదీ టెర్రరిస్ట్ అన్నాడు. 2024 కు మోదీ ప్రపంచ నాయకుడు అంటూ చంద్రబాబు కీర్తిస్తున్నాడు. ఇప్పుడేమో నేను హిందూ, జగన్ నువ్వు క్రిస్టియన్ అంటాడు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను మారాను అంటాడు, నమ్మండి అంటాడు. చంద్రబాబు ప్రకటనతో వాళ్ల అబ్బాయి, వాళ్ల కోడలే కన్విన్స్ అవ్వరు.. రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇరాన్, ఇజ్రాయిల్ వార్‌కు పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకు ఏంటి సంబంధం? దివాలా కోరు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్స అందించడానికి ఆసుపత్రులు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి ముక్కులో కణితి వస్తే హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్న వారు ఒక్కరైనా ఉన్నారా?’’ అని నిలదీశారు. -
అమరావతిలో తేడా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గమనించారు.. అందుకే జై ఆంధ్ర అంటున్నాడు
-
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
-
జనసైనికులతో పవన్ కీలక వ్యాఖ్యలు టీడీపీతో పొత్తు ఇక లేనట్టే?
-
వాడెవడు నా మీద కేసు పెట్టడానికి పేర్ని నాని ఉగ్రరూపం
-
15వ తేదీ, 25వ తేదీ పెమ్మసాని & నారాయణ అవినీతి చిట్టా ఇదే..
-
రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని
తాడేపల్లి: అమరావతి కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి కదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం ఏం చేశారు? అమరావతిలో అద్దాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏం చేశారు? కేంద్ర మంత్రి పెమ్మసానికి రైతుల కష్టం తెలుసా? రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు జరుగుతున్నాయా? రైతుల కోసం నేను మాట్లాడితే యూట్యూబ్ నుంచి తొలగిస్తారా? చంద్రబాబుకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా చమటలు పట్టిస్తోంది. అమరావతిలో మట్టి వ్యాపారం తప్ప మరేమీ జరగటం లేదు. నిత్యం వెయ్యి టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. మట్టి మీదనే టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. కానీ భూములు ఇచ్చిన రైతులు మాత్రం రోడ్డున పడ్డారు. ఆ రైతుల సమస్యలపై మాట్లాడితే నేరం అంట. అదే ఎల్లోమీడియా చర్చలు పెట్టినా, మంత్రి నారాయణ మాట్లాడితే బాగుంటుందంట. రైతుల సమస్యలు ఉన్నాయనే కదా త్రీమెన్ కమిటీ వేసింది? మాకు సమాధానం చెప్పలేక మాపై కేసులు నమోదు చేస్తున్నారు. రాజధానిపై నేను మాట్లాడిన ప్రతి వీడియోనూ తొలగించాలని యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖలు రాశారు. సచివాలయం పునాదుల దశలోనే ఉంది. కానీ, అప్పుడే అద్దాలకు టెండర్లు పిలిచారు . ఈ రెండేళ్లలో సగమైనా కట్టిన బిల్డింగ్ ఒక్కటైనా ఉందా? రైతులను విపరీతంగా వాడుకుని ఊరూరా తిప్పారు. భూములు ఇచ్చిన రైతులు మంత్రి నారాయణ చుట్టూ రైతులు తిరగటమే సరిపోయింది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తిప్పుకుంటున్నారు. ఇక కేంద్ర మంత్రి పెమ్మసానికైతే అసలు రైతుల కష్టాలే తెలియదు. ఎన్ఆర్ఐ మహిళ ఒకరు శ్రీకాళహస్తి ఆలయంలోని అవినీతి గురించి ప్రశ్నిస్తూ వీడియో పెడితే దాన్ని తొలగించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ప్రతి వీడియోను తొలగిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను ఎందుకు ఇవ్వలేదు? బెజవాడ, గుంటూరు చుట్టుపక్కల లేఅవుట్లకు అమరావతిలోని మట్టిని తరలిస్తున్నారు.రోజూ వెయ్యి టిప్పర్ల మట్టి బయటకు వెళ్తుంది. చంద్రబాబు మౌఖిక ఆదేశాలతో మట్టి వ్యాపారం జరుగుతోంది. దీని గురించి ప్రశ్నిస్తే తప్పా? భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేశారు. అమరావతిలో ఎయిర్ పోర్ట్ కడితే మరి గన్నవరం ఎయిర్ పోర్ట్ సంగతేంటి? అశ్వనీ దత్, బ్రాహ్మణి, బలుసు శ్రీనివాసరావు, తదితరులకు ప్రైమ్ లొకేషన్ లో భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. సీఆర్డీఏ ఆఫీసుకు అద్దాల ఖర్చే భారీగా ఉంది. హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బు తెచ్చి అమరావతిలో పెడుతున్నారా? ప్రజా సొమ్మును ఎందుకిలా వృధా చేస్తున్నారు? ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది మట్టి వ్యాపారమే. 29 గ్రామాల రైతులు నరకం చూస్తున్నారు.పవన్ కల్యాణ్‌కు ఈ ప్రభుత్వం కూలిపోతుందని అర్థం అయింది. అందుకే కొత్త గెటప్ లోకి వెళ్తున్నారు. అందుకే జై అమరావతి కాకుండా జై ఆంధ్రా అనమంటున్నారు. జై అమరావతి అంటే ఆ 29 గ్రామాలకే పరిమితం అవుతామన్న భయంతో పవన్ ఉన్నారు. జనసేన కార్యకర్తలను టీడీపీ వారు కొడుతుంటే మాత్రం పవన్ కు కనపడటం లేదు’’ అని అన్నారు. -
ఉప్పు, కారం తిన్నోడు ఎవడైనా.. ఒళ్ళంతా ఆముదం పూసుకుని...
-
100% స్ట్రైక్ రేట్ తో గెలిచింది జనసేనలో ఉన్న టీడీపీ నేతలే..
-
రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మామిడికి రాజకీయ ‘మంగు’.. ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్ జగన్‌ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్లే పల్ప్‌పై ఆ దేశాలు షుగర్ సెస్ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్మాజీమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు
కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అన్నారు. పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలేనని ఎద్దేవా చేశారు. పవన్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడనుకుంటున్నారని చెప్పారు.కృష్ణా జిల్లాలో పేర్నినాని ఆదివారం మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను కల్లబొల్లి కబుర్లతో నమ్మించాలని చూస్తున్నాడు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారనే భావనలోనే పవన్ మీటింగ్ సాగింది. పవన్ మాటలకు పొంతన లేదు. 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎన్ని అసత్యాలు మాట్లాడారో మర్చిపోయారా? అప్పట్లో 175 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలే. రాష్ట్రం బాగు కోసం కూటమిలో చేరానంటాడు.జనసేన కార్యకర్తల బాధలను చూస్తూ సహించనంటాడు. బందరులో లంచాలు ఇవ్వలేదని జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లారు పవన్? కనీసం కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి బుద్దిలేదా అని అడిగారా? ఎంతమంది జనసేన కార్యకర్తలను తంతున్నారో మీకు తెలుసా? జనసేన కార్యకర్తల బాధలు పగోడికి కూడా వద్దు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేసొస్తే 95 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందంటున్నారు. ఏపీలో మీరు వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చినోళ్లలో గెలిచిన వారు ఎవరు... ఏరోజైనా మీ పార్టీ జెండా మోశారా? చంద్రబాబు జనసేన అని మెడలో వేసిన వాళ్లకే కదా మీరు సీట్లిచ్చింది? సీజ్ ద షిప్ అని నాలుగైదు రోజులు కూడా ఆపలేకపోయారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో సీజ్ ద షిప్ అని నాలుగు రోజులు కూడా ఆపలేకపోయామని మీరే ఒప్పు కుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే రోడ్డు మ్యాప్ వచ్చిందన్నారు. 2020లోనే ఇప్పటం సభలో ఓట్లు చీలనివ్వనని చెప్పింది మీరే’’ అని చెప్పారు. -
విజయ్ కి సత్తా ఉంది..! గెలిచి చూపించాడు.. పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్!
-
బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్..?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు..వైఎస్ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది. వైఎస్ జగన్ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది...తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్ జగన్ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు? ..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్‌కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్‌కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?..కోటి 70 లక్షల చొప్పున వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు. -
కాపులపై దాడులు.. స్పంధించని పవన్ పేర్ని నాని ఫైర్
-
సంఘం డైరీ ఒక కిక్కు... బోడి మంత్రి పదవి లో ఏముందని...
-
గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో?
సాక్షి, గుంటూరు: ముప్పై ఏళ్లపాటు జెండా మోసి గెలిపించిన కాపులపై దాడులు చేయించడానికి.. తప్పుడు కేసులు పెట్టించడానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మామిళ్లపల్లి ఘటనను ప్రస్తావిస్తూ శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిళ్ళపల్లిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మనుషుల్ని పంపి ధూళిపాళ్ల నరేంద్ర మామిళ్ళపల్లి పంపి మొక్కజొన్న రైతులపై దాడులు చేయించారు. ఆడా మగా తేడా లేకుండా ఆ రైతులపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం పేరిట తప్పుడు కేసులు పెట్టించారు. ఇది చూసి.. కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసులు కూడా ‘అరే మనం ఇంత దిగజారి పనిచేస్తున్నామా?’ బాధపడుతున్నారు. టీటీడీకి నకిలీ నెయ్యా?ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు, కృష్ణాజిల్లాలో గేదే పాలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అమ్ముకుంటున్నారు. గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు?. సంగం డెయిరీ.. వైష్ణవి డెయిరీ ఈ రెండూ ఒకటి కాదా?. వైష్ణవి డెయిరీ తప్పు చేసిందని సాక్షాత్తు సీబీఐనే చెప్పింది కదా అని పేర్ని నాని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ అంటే ఎంత ప్రాణమంటే.. ఆ డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించడం చంద్రబాబు వల్ల కూడా కాలేదు. ‘నీకు మంత్రి పదవి కావాలా? సంగం డెయిరీ కావాలా?’ అని చంద్రబాబు అడిగితే.. మరో మాటే లేకుండా పాల డెయిరీనే ధూళిపాళ్ల ఎన్నుకున్నారు. తన అనుచరులతో క్వింటా మొక్కజొన్న రూ.1600 కొని.. సంగం డెయిరీలో రూ.2100 కొంటున్నట్లు ఆయన రాయించుకుంటున్నారు. కాపులు ఉంది అందుకేనా?.. ముప్ఫై ఏళ్లు నీకు జండా మోసిన కాపులపై దాడి చేయిస్తావా? అంటూ ధూళిపాళ్లపై పేర్ని నాని ఫైరయ్యారు. అదే సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపైనా మండిపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్‌ను చూసి కాపులంతా కూటమికి ఓటేశారు. ఇప్పుడేమో కాపులపై అక్రమ కేసులు బనాయిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. కాపులను ఇంత చావబాదుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించరు. పైగా కూటమి ప్రభుత్వంలో ఉన్న రెండున్నరేళ్లు సీఎం అవుతారని కాపులు ఆశిస్తే.. ఆయనేమో మరొక 15 సంవత్సరాలు చంద్రబాబును మోయాలి అని కాపులకు పిలుపు ఇస్తున్నాడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కాపుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్న పేర్ని నాని.. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాపు రైతులపై పెట్టిన అక్రమ ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. -
5 ఎకరాల్లో ఇల్లు ఇంటి ముందు అసెంబ్లీ, వెనుక హైకోర్టు
-
బాబు బినామీలకు ‘ప్రైమ్ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్ బెల్ట్‌గా మార్చేశారన్నారు.కోర్ క్యాపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..‘సీఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు. రెండో విడత పూలింగ్‌కు వ్యతిరేకం..‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. -
మీరు ఆచరించి ప్రజలకు చెప్పండి.. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగకుండా..
-
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్‌ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్‌కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్‌ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు
-
హైదరాబాద్ ఆస్తులు అమ్మిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలు వదులుతాడా?: పేర్ని నాని
-
ఇలాంటి వాడిని అల్లుడు ఎలా చేసుకున్నావయ్యా.. చేతకానోడు ముఖ్యమంత్రి అయ్యాడు!
-
ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
-
TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్
-
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ తరపున హామీ ఇస్తున్నాం.ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్సీపీ పాలనే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు. -
నీ అనుభవం ఎందుకూ పనికిరాదు, నీ కొడుకేమో కనబడట్లేదు..
-
పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్
-
ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు
-
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..
-
జనసేన నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఎంపీ బాలశౌరికి పేర్ని నాని కౌంటర్
-
మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..
-
టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు
-
వెంట్రుక కూడా పీకలేవు .. నీకు ఇక మంగళమే, బాబుకు పేర్ని నాని వార్నింగ్
-
బాబు, లోకేష్.. పర్యవసానాలు అనుభవిస్తారు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: టీడీపీ వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు.. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గరున్న వారిని భయపెట్టాలనుకుంటున్నారా?.. లోకేష్ ఒక్కడికే విద్య తెలుసు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశారని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా నేరాలు చేశాడా?. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు.సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళతారా. చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు?. మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని ఓ 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు?. జైలు నుంచి బయటకి వచ్చాక జగన్ దగ్గర పనిచేయకుండా ఆపగలరా?. ఒకవేళ శ్రీహరి తప్పు చేస్తే అందరి ముందు అరెస్ట్ చేయండి. అలా కాకుండా దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి.. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సీజ్ చేయడం దేనికి?. ఎవరిని భయపెడదామనుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పోకడగలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరికాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే పర్యవసనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఏమైపోతారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు. మీ కేసులు అరెస్టులు జగన్ వెంట జెండా మోయకుండా ఆపలేరు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. తప్పుడు పనులు మానుకోవాలని లోకేష్ సూచిస్తున్నాం’ అని హితవు పలికారు. -
ఎవడు తుగ్లకో.. చెప్తా విను.. జయప్రకాశ్ నారాయణకు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
రాజధానిలో మచిలీపట్నం ఉందా? ఉంటే అక్కడ ఏం కడుతున్నారు?
-
ఇదిగో ప్రూఫ్.... బాబుని పచ్చి బూతులు తిట్టిన టీడీపీ జనసేన బిజేపీ నేతలు
-
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్‌పై చర్చ జరగకుండా జగన్‌ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్‌లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్‌లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్‌ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్‌లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్‌ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్‌కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్‌లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్‌లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
అమరావతి మోయలేని గుదిబండగా మారింది: పేర్ని నాని
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అత్యాశ వల్ల అమరావతి మోయలేని గుదిబండగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం (ఏప్రిల్ 13) పేర్నినాని తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.‘మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటి? బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. చంద్రబాబు అంతులేని అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మావిగన్ అనే ప్రతిపాదనతో రాజధాని తక్కువ ఖర్చుతో నిర్మితమవుతుంది. ప్రజలు అమాయకులేం కాదు.. అన్నీ ఆలోచిస్తారు. చంద్రబాబుకు విశ్వాసం లేదని ఎన్టీఆర్ విమర్శించారు. 224 మంది ఎమ్మెల్యేలను కాసులతో కొనుక్కున్నారని ఎన్టీఆర్ అన్నారు. వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీఆరే అన్నారు. కేబినెట్లో ఉన్న తొమ్మిది మంది మంత్రులే చంద్రబాబును తిట్టని తిట్టు తిట్టారురాజధానికి అప్పులు చేసి ఏం ఏస్తారు? అప్పులతో 7 కోట్ల ప్రజలను తాకట్టు పెడుతున్నారు. రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామని జబ్బలు చరుకుంటున్నారు. ఇప్పటివరకు మీరు మా ప్రాంతానికి చేసిందేంటి?’ అని పేర్ని నాని అన్నారు.అమరావతి వలన కలిగే ప్రయోజనం ఏంటో? మావిగన్ వలన కలిగే నష్టం ఏంటో చంద్రబాబు చెప్పటం లేదని పేర్ని నాని అన్నారు. ‘మావిగన్ ప్రకటనకు 48 గంటల్లోనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మావిగన్‌కు అడవిలో ఉండే గిరిజనులు సైతం మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయకూడదు. మావిగన్ పై జనంలో మంచి రెస్పాన్స్ రాగానే బొత్స, ధర్మానపై కూటమి నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబు వాడుకుని వదిలేసేరకం అని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో అన్నారు. మళ్లీ వచ్చి ఏం చేస్తావ్? అని పవన్ కల్యాణ్ విమర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకాలే రాశారు. కాంట్రాక్టర్లను రాత్రి సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడని చంద్రబాబుకు టార్చ్‌లైట్ మంత్రి అనే పేరుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు చూపిస్తాం. టీటీపీ నేతలు వీటిని కూడా ప్రెస్‌మీట్ లో చూపించగలరా? చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలకు చూపించే టైం వస్తుంది. అమరావతి, మావిగన్ లలో దేనికి సత్తా ఉందో ప్రజలకు ఎందుకు చెప్పటం లేదు? మావిగన్ ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోనే ఉందని చంద్రబాబు అంటున్నారు. పామర్రు వరకు సీఆర్డీఏ లో మరి మాస్టర్ ప్లాన్ ఎందుకు లేదు? జగన్ మావిగన్ అనగానే ఇప్పుడు సర్వే సంస్థలను కొన్ని గ్రామాలకు ఎందుకు పంపారు? అమరావతిలో రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామన్న ప్రభుత్వం మా ప్రాంతంలో ఏం అభివృద్ధి చేస్తున్నారు? మేము కూడా రాజధానిలోనే ఉంటే మరి మావైపు ఎందుకు అభివృద్ధి చేయటం లేదు? మావైపు ఒక్క టవర్ కూడా ఎందుకు కట్టలేదు? జడ్జీల బంగ్లాలు, అసెంబ్లీ, ఇతర బిల్డింగులు మా ఏరియాలో ఎందుకు కట్టటం లేదు? అసలు అమరావతిలో నిర్మించే భవనాలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. బేసిక్ నిర్మాణాలకే రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక కరెంటు, నీరు, డ్రైనేజీలు ఇతరత్రా పనులకు ఎంత ఖర్చు చేస్తారు? ఇవి కాకుండా అంతర్గత రోడ్లకు ఎంత ఖర్చు చేస్తారు? చంద్రబాబు, మంత్రి నారాయణ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరినీ మానసిక వైద్యులకు చూపించాలి. ఎకరంలో జగన్ ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అన్నారు. మరి ఐదు ఎకరాల్లో చంద్రబాబు కట్టేదాన్ని ఏం అనాలి? వెలగపూడిలో సచివాలయం లిఫ్టులే పని చేయటం లేదు, ఇక ఏం రాజధాని బిల్డింగులు కడతారు? అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?ఇంకా ఎంత అప్పు చేస్తారు? మావిగన్ ఎందుకు అవసరం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి చట్టబద్ధత అనగానే చంద్రబాబు, లోకేష్ పండుగ చేసుకున్నారు. కానీ భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు అయినా సంబరాలు చేసుకున్నారా? జనానికి అప్పులు, చంద్రబాబుకు సంపద మిగులుతుంది. టీడీపీ వారు కూడా మావిగన్ ప్రతిపాదనను మెచ్చుకుంటున్నారు’ అని పేర్ని నాని చెప్పారు. -
అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్
-
తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణం: పేర్ని నాని
గుంటూరు: తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అక్రమ భూకేటాయింపులపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించారు.ఇందులో పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువచేసే భూములను బడా బాబులకు కట్టబెడుతోందని తెలిపారు. 99 పైసలకి భూములు కేటాయించిన జీవోలు కొన్ని మాత్రమే బయటపడ్డాయని, కనిపించకుండా ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల భూములపైనే కాకుండా దేవుడి భూములపై కూడా కన్నేశారని తెలిపారు. ఇలా ప్రభుత్వం భూముల కేటాయింపులో ఇప్పుడు కొత్తరకం మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మ కర్త మాత్రమే. ప్రజల ఆస్తులు ఎవరికిబడితే వారి కట్టబెట్టడానికి వీల్లేదు. విశాఖలో 99 పైసలకే కొన్ని కంపెనీలకు భూములు కేటాయించడం దారుణం. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అమరావతికి ఓఆర్ఆర్ వేస్తామని చెప్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని చెన్నై కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లే అడ్డుకున్నాం. ఇవాళ కూడా బెజవాడలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాం’ అని చెప్పారు. -
మావిగన్ పంచ్‌తో రాధాకృష్ణకు భయం పట్టుకుంది
సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. ‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్‌ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా. రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
కాశీ వెళ్ళీ సిగ్గు వదిలేసి.. నీతి జాతి లేకుండా బ్రతికేస్తున్నాడు
-
కేవలం నీ డబ్బా కోసం.. నెలకు 85 లక్షలు ఖర్చు పెట్టి ఆరు న్యూస్ ఛానల్స్..
-
నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్
-
నాది నా కొడుకు కాల్ డేటా చెక్ చెయ్యి.. తప్పు చేశాం అని నువ్వు నిరూపిస్తే..
-
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: పేర్ని నాని
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్రకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (ఏప్రిల్ 5న) పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన కార్యకర్త ఇంటిని మీరు కూల్చేస్తే మేం వెళ్లకూడదా? బాధితుడు తనకు జరిగిన కష్టం గురించి చెబితేనే నేను వెళ్లాను.కావాలంటే నా కాల్ డేటా ఇస్తా చెక్ చేసుకో. కోర్టు తీర్పు ఉంటేనే కూల్చేశామని చెబుతున్నారు కదా... దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. కోర్టు తీర్పు చూపించండి... మీరు ఏం చేయమన్నా చేస్తా. కోర్టు తీర్పు ఉందని నిరూపించలేకపోతే నేను చెప్పింది మీరు చేస్తారా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కొల్లు రవీంద్ర.గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొబ్బరి తోటలో లే అవుట్ వేశారు. ఇప్పుడు మీరు మంత్రి అయ్యాకే అక్కడ బిల్డింగ్ లు కట్టారు. అక్కడ స్థలానికి, ఇళ్లకు నాకేం సంబంధం? నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా ఎవరి ఆస్తులను కూల్చలేదు. రోడ్డు విస్తరణలో కోర్టు ఆదేశాల మేరకే ఒకే ఒక్క అక్రమ బిల్డింగ్ ను అధికారులు కూల్చివేశారు.ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా... బయటికి తీయండి ఆధారాలు. నేనే ఆ బిల్డింగ్ కూల్చి వేయించినట్లు నీ దగ్గర ఆధారాలుంటే నా పై కేసు పెట్టించు. బందరుకు ఏం చేయలేదని నన్ను విమర్శిస్తున్నావు? నేను బందరు రోడ్డు విస్తరణ చేశానని నీ నోటితోనే చెబుతున్నావ్. నా బినామీల కోసమే నేను ఏదైనా చేస్తే బినామీ చట్టం ఉపయోగించండి’ అని అన్నారు.మీకు ఆ సత్తా లేదా? ‘మీకు అధికారం ఉంది కదా... మీకు ఆ సత్తా లేదా? అందరినీ ఒప్పించి నేను బందరులో రోడ్డు విస్తరణ చేపట్టాను. 2014-19 వరకూ ఇప్పుడు రెండేళ్లలో బందరుకు మీరేం చేశారో చెప్పగలరా కొల్లు రవీంద్ర? 2004-2014 వరకు బందరు అభివృద్ధికి పాటుపడింది నేను. మీరు వచ్చాక బందరుకు ఏం చేశారో సమాధానం చెప్పండి. బందరు కోటలో మీరు కట్టిన ఇంటికి ప్లాన్ లేదు. మార్కెట్లో కట్టిన మీ కాంప్లెక్స్‌కు ప్లాన్ లేదు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్ కు ప్లాన్ లేదు. పోలీస్ కల్యాణ మండపానికి ప్లాన్ లేదు. నేను మాట్లాడేవన్నీ ఆన్ రికార్డు. బందరులో ప్లాన్ లేనివన్నీ వెతికిమరీ ఓ లిస్ట్ ఇస్తా. ప్లాన్లు లేనివన్నీ కొట్టేసే దమ్ముందా మీకు? అంత సీనుందా మీకు? నీకు దమ్ముంటే నా బినామీలను బయటపెట్టండి. విజయవాడ కేంద్రంగా మీరు ఆరు న్యూస్ ఛానల్స్ నడిపిస్తున్నారు’ అని అన్నారు. -
మా అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి జైపాల్ గారు.. పేర్ని నాని నాన్ స్టాప్ పంచులు
-
థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
-
పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
-
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్‌తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?...డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్‌ను విడుదల చేయండి...ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్‌మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్మెన్లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు...నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
నీ ఇల్లు, మంత్రి నారాయణ ఇల్లు ఉంటే రాజధాని చేసేస్తావా..
-
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు. -
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..
-
నువ్వు పేదల గుండెల్లో దింపిన గునపం నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా
-
‘కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్‌గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్‌లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా...అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్‌ను మీడియాకు విడుదల చేయండి...బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
‘రైతుల జోలికొస్తే సహించేది లేదు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టిపీడుస్తున్నారన్నారు. ఈ రోజు(సోమవారం, మార్చి 30వ తేదీ) ఆక్వారైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్‌కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా అనంతరం మీడియాతో మాట్లాడారు పేర్ని నాని. ‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు. వందల ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా రెండు ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవిన్యూ సిబ్బంది పాల్పడుతున్నారు. ఎకరం రిపేరుకు 50,000 బోరు వేసేందుకు మరో 50 వేలు వసూలు చేస్తూ ఆక్వా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెదపట్నం కానూరు గ్రామాలలో యథేచ్ఛగా మడ అడవులను చెరువులుగా తవ్వుకుంటుంటే పట్టించుకోవడం లేదు. కోన గ్రామంలో 83 సెంట్ల రైతును రికార్డులు చూపించమంటూ ఆర్డీవో నా నా హైరానా చేశారు. రైతు చెరువును పూడ్చమని ఆదేశించడం ఏంటి?, ముడుపుల మాయలో బందరు ఆర్డిఓ ఎమ్మార్వోలు రైతులపై అగత్యాలకు పాల్పడితే సహించబోం’ అని హెచ్చరించారు. -
లంచాలు కాదు.. ఇంటికెళ్లి అన్నం తినండి..పేర్ని నాని ఉగ్రరూపం
-
11 నుండి 170కు.. ఎలా వస్తామో చూద్దురు కానీ
-
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: అమరావతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. అమరావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా నడిపించిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘రెండోదశలో మరో 50వేల ఎకరాలు తీసుకునేందుకే తీర్మానం పేరిట అసెంబ్లీలో డ్రామా ఆడారు. అసెంబ్లీలో ఆరుగంటల పాటు కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవ సరం లేదా?. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను, అమరావతి రైతులను మోసగించటానికి, మభ్యపెట్టడానికే చంద్రబాబు ఈ డ్రామాలు, నాటకాలు’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అమరావతి రాజధాని అని చెప్పేందుకు ఒక్క అధికారిక పత్రం లేదని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి చెప్పింది. ఈ విషయం ఈనాడు పత్రికే రాసింది. (ఈ సందర్భంగా ఈనాడు ప్రతిని పేర్ని నాని చదివి వినిపించారు) అందుకే హడావిడిగా కేబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టారు. నిజంగానే అమరావతికి చట్ట బద్ధత కల్పించాలంటే శాసనమండలి అవసరం లేదా? మండలిని ఎందుకు సమావేశ పరచలేదు? ఒక చట్టం కావాలంటే శాసన వ్యవస్థలో భాగమైన మండలి అనుమతి అక్కర్లేదా? ఉభయ సభలు ఆమోదం తెలపకుండా చట్టం ఎలా అవుతుంది? వాస్తుకోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. మరి అలాంటప్పుడు రెండో దశ విస్తరణలో వాస్తు వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తున్నారు? ఇది అరిష్టంకాదా? అమరావతి ఆలోచనను చంద్రబాబు చేసినప్పుడే ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్నారు. ఈ ప్రశ్నలంటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే విజయవాడలో బస్సులో పడుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ఉండడానికి ఇళ్లు, హోటళ్లు ఉన్నాయి, కాని బస్సులో పడుకున్నారంటే అదికూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన డ్రామానే. బస్సులో పడుకునే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్తున్నారు, అది నిజమే, ఎందుకంటే మిగతావాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉండేది, డ్రామా చేసేది చంద్రబాబు మాత్రమేనని పేర్ని నాని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. మొత్తం అప్పులకుప్ప..అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి? 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–25లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్‌ఫిడ్ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్‌ని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా?రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా...రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొప్పున∙కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది.అమరావతికి న్యాయం చేసింది జగన్...అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది మాజీ సీఎం జగనే. పశ్చిమ బైపాస్‌ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకులు ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా? రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ తీర్మానం పెడితే జగన్ ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా?, (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు.ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి..ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనుల్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. -
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా’
సాక్షి, తాడేపల్లి: అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పేరుతో చంద్రబాబు జనం సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు 21 వేల కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్ చేశారు.‘‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా?. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగనే అమరావతికి న్యాయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయి. అమరావతిపై వైఎస్ జగన్‌కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు. రాజధానిలో పేదలు లేకుంటే ఎలా అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
స్టేషన్ లో లో సీసీ పుటేజ్ తీయండి..నిరూపిస్తే దేనికైనా రెడీ
-
సుప్రియా కేసు.. పోలీసులకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుంది ఏపీ పోలీసుల తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి.. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా అని పోలీసులకు పేర్ని నాని సవాల్ విసిరారు.మాజీ మంత్రి పేర్నినాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రియను మేం జైలులో పరామర్శించాం. బాధితురాలు చెప్పిన విషయాలపై నేను మీడియాతో మాట్లాడాను. పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్, హోంగార్డు కోటేశ్వరమ్మ ఎలా సుప్రియపై దాడి చేశారో చెప్పాను. బాధితురాలకి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను. కానీ, తెల్లవారుజామున 3 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి ఒక అశరీరవాణి విడుదల చేశారు. ప్రకటన పంపించడాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ సంతకం లేకుండా ప్రకటన ఇచ్చారు. ఎవరో ఒకరు సంతకం పెట్టి ప్రకటన ఇవ్వాల్సింది. పోలీసులు సుప్రియపై దాడి చేయలేదని అశరీరవాణి ప్రకటనలో చెబుతున్నారు. సుప్రియ శరీరం పై ఎలాంటి రక్త గాయాలు లేవని వైద్యులు చెప్పారట. 108 సిబ్బంది కూడా ఎలాంటి గాయాలు లేవని సుప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. పోలీసులు అంతా చెడ్డవారని నేను చెప్పడం లేదు. దుర్మార్గంగా వ్యవహరించే వారి పేర్లనే మేం చెబుతున్నాం.రాజకీయ నాయకుడు లెటర్ ఇస్తే కానీ కేసులు కట్టే పరిస్థితి లేదు. 21వ తేదీన సుప్రియ, ఆమె తల్లిదండ్రులు పామర్రు స్టేషన్ కు వెళ్లారు. 21వ తేదీన స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేయండి. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా. నేను మాట్లాడిన ప్రతీ మాట వెనక్కి తీసుకుంటా.. పోలీసు సిబ్బందికి క్షమాపణ చెబుతాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. రేపు 11:30 గంటల లోపు మీరు ఆధారాలను బయటపెట్టండి. సుప్రియ సోదరుడు తేజ దొంగతనం చేస్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలున్నాయంటున్నారు. తేజకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టండి. పామర్రు నియోజకవర్గం పేకాటకు నిలయంగా మారింది. ఆశ్రమం ఏరియాలో పేకాట శిబిరంపై దాడి చేసి పోలీసులు లక్షా 60 వేలు వసూలు చేశారని సమాచారంమూడు నక్షత్రాలు ఉన్న అధికారి ఏలూరు నుంచి వచ్చిన కొంతమంది నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడా లేదా?. కైలే అనిల్‌తో మాట్లాడమని ఏలూరుకు చెందిన ఓ మిత్రుడు నన్ను అడిగారు. అనిల్ కుమార్ దమ్ముగా రాజకీయం చేసే వ్యక్తి. డబ్బుకు కక్కుర్తి పడే రకం కాదు. నాకు కులమతాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలుసుకోవాలి. పోలీసులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి సామాన్యులకు ఉంటుందా?. ఆసుపత్రికి తీసుకెళ్లనని 108 సిబ్బంది ఎప్పుడైనా లిఖితపూర్వకంగా రాసివ్వడం చూశామా. కానీ సుప్రియ కేసులో 108 సిబ్బంది రాసిచ్చారు అని అన్నారు. -
నీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరాకులా.. చంద్రబాబు సిద్ధంగా ఉండు..
-
సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి.. దళిత మహిళా అని.. CI సుధాకర్ పై పేర్ని నాని ఫైర్
-
సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్
-
పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట


