Rajanna Sircilla District Latest News
-
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు పరిశీలించారు. డయల్ 100 కాల్స్‌కు స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని పదిర వద్ద గల ఇసుకరీచ్‌ను తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఎస్సై రాహుల్‌రెడ్డి ఉన్నారు. జిల్లాలో పోలీస్‌యాక్ట్ సిరిసిల్ల క్రైం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌యాక్ట్–1861ను ఈనెల 30 వరకు అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. డీజే వినియోగం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే కార్యకలాపాలు చేపట్టరాదని హెచ్చరించారు. -
అయోమయం
హడావుడిసిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆఫీస్ వద్ద బుధవారం హడావుడి.. అయోమయం నెలకొంది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తన సిబ్బంది, పోలీసులతో ‘సెస్’ ఆఫీస్‌కు చేరుకున్నారు. ‘సెస్’ ఎండీ భిక్షపతి, డీఈఈలతో సమావేశమయ్యారు. టీజీఈఆర్సీ ఆదేశాలతో ‘సెస్’ పరిధిలో విద్యుత్ సేవలను ఎన్పీడీసీఎల్ చూస్తుందని, ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ విధానం కొనసాగుతోందని స్పష్టం చేశారు. అమలులోకి ఎన్పీడీసీఎల్ విధానాలు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలకు సమాయత్తం కావాలని ఆదేశించారు. ఓవర్‌లోడ్ ఉన్న 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఒకే బ్రేకర్‌పై ఉన్న రెండు ఫీడర్లను అదనపు బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 2,491 సర్వీసులను మంజూరు చేయాలని, ఎన్పీడీసీఎల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఒక్క కిలోవాట్‌కు రూ.1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యుత్ సిబ్బంది భద్రతకు భరోసా కల్పించే ఎన్పీడీసీఎల్ పరిధిలో అమలవుతున్న రూ.కోటి ప్రమాదబీమా ‘సెస్’ ఉద్యోగులకూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సర్వీసుల మంజూరు మీసేవ కేంద్రాలు, గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అమలు చేయాలన్నారు. ఈ నెల జీతభత్యాలు సైతం ‘సెస్’ సిబ్బందికి ఎన్పీడీసీఎల్ చెల్లిస్తుందని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇస్తామని సీఎండీ స్పష్టం చేశారు. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ సీఈ ప్రభాకర్, సీఈలు కిషన్, బుస్సా అశోక్, కరీంనగర్ ఎస్ఈ రవీందర్ ఉన్నారు. పోలీస్ వలయంలో ‘సెస్’ ఆఫీస్ ఎన్పీడీసీఎల్ అధికారులు సిరిసిల్లకు రాగానే వారి ఎన్ఫోర్స్మెంట్ సీఐ, ఎస్సై, సిబ్బందితోపాటు సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, స్థానిక పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ‘సెస్’ పాలకవర్గం నుంచి ప్రతిఘటన ఉంటుందనే అనుమానంతో ముందస్తు సమాచారం లేకుండానే వచ్చారు. ఇదీ ‘సెస్’ లైసెన్స్ కథ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సంస్థకు ఐదేళ్లకోసారి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఈఆర్సీ) లైసెన్స్‌ను రెన్యూవల్ చేస్తుంది. 2021లో జారీచేసిన లైసెన్స్ గడువు 2026 మార్చి 31తో ముగిసిపోయింది. ‘సెస్’ పాలకవర్గం ఎండీ ద్వారా 2025 డిసెంబరులో లైసెన్స్ రెన్యూవల్ కోసం ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో గడువు మంగళవారంతో తీరిపోయింది. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు ‘సెస్’ సంస్థను స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఇలా.. ‘సెస్’లో అవినీతి ఉందని, పాలకవర్గం ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయనే అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెస్ పాలకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే ఉండడంతో ఈ చర్యలకు దిగినట్లు విమర్శలు ఉన్నాయి. ‘సెస్’ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఇటీవల సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క భట్టి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి విన్నవించారు. కానీ ముందే నిర్ణయించిన ప్రకారం ‘సెస్’ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయలేదని భావిస్తున్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సత్వర సేవలు అందిస్తాం. ఎన్పీడీసీఎల్ విధానాలు అమలు చేస్తాం. ఒకే విధమైన ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి రహితంగా సేవలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమాదబీమా ఉంటుంది. టీఈఆర్సీ ఆదేశాలు వచ్చే వరకు ‘సెస్’ పరిధిలో ఎన్పీడీసీఎల్ సేవలు అందుతాయి. – కర్నాటి వరుణ్‌రెడ్డి, సీఎండీ, ఎన్పీడీసీఎల్ -
కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోతులు, కుక్కల బెడద నుంచి గ్రామస్తులను రక్షించాలని బీజేపీ నాయకులు బుధవారంసర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, కార్యదర్శి సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలో కోతులు, కుక్కల దాడిలో అనేక మంది గాయపడ్డారన్నారు. నాలుగు రోజుల క్రితం కోతుల దాడిలో గాలిపెల్లి దేవవ్వ గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కుక్కల దాడిలో నీరటి విష్ణుప్రసాద్, లింగమ్మగారి భాస్కర్లకు కూడా గాయాలైనట్లు వివరించారు. కోతులు, కుక్కల బెడద తొలగించాలని కోరారు. నాయకులు ముత్యాల చంద్రారెడ్డి, ల్యాగాల సతీశ్, చల్ల పద్మారెడ్డి, వంగ బాపురెడ్డి, కొండాపురం సత్యంరెడ్డి, విభూది హనుమంత్, మారావేణి రంజిత్‌కుమార్, భిక్షపతి పాల్గొన్నారు. వేములవాడ: రాజన్న ఆలయ డీఈవోగా నియమితులైన భాస్కర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. యాదగిరిగుట్ట డీఈవోగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌ను దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల రాజన్న ఆలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమేరకు వేములవాడకు చేరుకుని భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈవో రమాదేవి ఉన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని ముస్కానిపేట, ఆరేపల్లి, కేసన్నపల్లి, దాచారం గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలకొరిగిన మక్కచేను పంటను మండల వ్యవసాయాధికారి సందీప్ బుధవారం పరిశీలించారు. కేసనపల్లి సర్పంచ్ పోతరాజు చంటి, వ్యవసాయ విస్తరణ అధికారి గంగ, అభిషేక్, రైతు రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కోఆప్షన్ నామినేషన్ షురూ..సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం సిరిసిల్ల బల్దియాలో కోఆప్షన్ సందడి షురువైంది. నాలుగు కోఆప్షన్ సభ్యుల కోసం బుధవారం నుంచి మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషా నామినేషన్లను ఆహ్వానించారు. మైనార్టీ మహిళ కోటాకు చెందిన కోఆప్షన్ పోస్టు కోసం ఎం.డి.ఆస్మా బుధవారం బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు. బుధవారం ఒకే నామినేషన్ వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. మూడు నెలల బియ్యం కోటా విడుదలసిరిసిల్ల: జిల్లాలోని రేషన్ కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యం కోటా విడుదలైందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు బుధవారం తెలిపారు. జిల్లాలోని 1,95,554 కుటుంబాలకు చెందిన రేషన్‌కార్డుదారులకు 1,11,721.65 క్వింటాళ్ల సన్న బియ్యం మంజూరైనట్లు వివరించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల రేషన్ బియ్యం తీసుకెళ్లాలని కోరారు. అంత్యోదయ కార్డులున్న వారికి కిలో చక్కెరను రూ.13.50 అందిస్తారని వివరించారు. మైనార్టీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు సిరిసిల్ల: మైనార్టీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా అల్పసంఖ్యాక సంక్షేమాధికారి భారతి బుధవారం తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీలకు చెందిన అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, విదేశీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 99499 10328లో సంప్రదించాలన్నారు. -
షాపింగ్ కమాల్
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ అధికారులు బడా వ్యాపారులకో లెక్క.. చిరువ్యాపారులకు రీతిలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటైన వాసవి వస్త్రాలయం షాపింగ్‌మాల్ విషయమే వీరి వైఖరికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ బడావ్యాపారి తమ వ్యాపారసంస్థ ఏర్పాటులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే మిన్నకుండడంపై విమర్శలు వస్తున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్ స్టోరీ. ఎందుకింత ఉదాసీనత? బల్దియాకు ఆదాయం వచ్చే భవనం, ట్రేడ్‌లైసెన్సులు అందించే అంశంలో కంచె చేను మేస్తున్న చందంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ నిబంధనలకు నీళ్లొదిలిన ఓ బడావ్యాపారి తమదైన శైలిలో బల్దియా ఆదాయానికి గండికొడుతున్నారు. పట్టణంలోని భావనరుషినగర్ ప్రాంతంలో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారీ జీ+4 అంతస్తుల్లో భవనం నిర్మించారు. దీనికి రెసిడెన్షియల్ భవనంగా అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే రూ.కోట్లు వెచ్చించి సదరు బడావ్యాపారి తమ వస్త్ర వ్యాపారంలో భాగంగా బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభించారు. దీనికి నామమాత్రంగా సెల్ఫ్ అసెస్మెంట్గా ట్రేడ్‌లైసెన్స్ పొందారు. రెసిడెన్షియల్ భవనంలో వస్త్రాలయం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయంపై నెల రోజులుగా బల్దియా అధికారులకు ఫిర్యాదులు అందినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొదటి నుంచి వివాదమే.. వాసవి వస్త్రాలయం వ్యాపారి తీరు షాప్ ప్రారంభానికి ముందు నుంచే వివాదాస్పదంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రారంభానికి వారం రోజుల ముందే పట్టణంలోని ప్రధాన డివైడర్లు, జంక్షన్లు, ప్రధాన ఏరియాల్లో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వాటికి అనుమతులు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక వస్త్రాలయం ప్రారంభానికి ఇద్దరు సినీతారలను తీసుకొచ్చారు. ఇందుకు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, డప్పుకళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కమర్షియల్ భవనంలో నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతులు పొందాల్సి ఉంది. కానీ ఇవేవి పట్టింపులేకుండా దర్జాగా రెసిడెన్షియల్ అనుమతులున్న భవనంలో షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. ఇందుకు పలువురు పెద్దమనుషుల సహకారంతో సదరు వ్యాపారి తతంగం నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. -
వేసవి నష్ట నియంత్రణకు చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: వేసవి వడగాలులతో నష్టాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆశకార్యకర్త నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అందరి దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. రద్దీగా ఉంటే ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఉపాధిహామీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. మూగ జీవాల కోసం తొట్లలో నీరు పోయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ గోశాలపై పశువైద్య, సంవర్ధకశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వైద్యాధికారి రజిత, వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, డీఆర్డీవో గీత, మిషన్ భగీరథ అధికారులు అన్వర్, సుమలత, జిల్లా పంచాయతీ అధికారి షరీపొద్దీన్, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కమిషనర్ ఖదీర్‌పాషా పాల్గొన్నారు. పొద్దుతిరుగుడు సేకరణకు ఏర్పాట్లు జిల్లాలో పొద్దుతిరుగుడు గింజల సేకరణకు ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కల్టెరేట్లో మార్కెటింగ్, వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సమీక్షించారు. పొద్దుతిరుగుడు గింజలను క్వింటాల్‌కు రూ.7,721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, మార్క్ ఫెడ్ డీఎం హబీబ్, సహకార శాఖ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. కలెక్టరేట్లో డీఎల్టీసీ సమావేశం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ టెలికాం కమిటీ(డీఎల్టీసీ) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్), రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, టెలికాం టవర్లకు విద్యుత్ సరఫరా, భారత్ నెట్ ఇన్ఫ్రా, కాల్ బీ ఫోర్ యూ డీజీ మొబైల్ అప్లికేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంగా ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా టీ ఫైబర్, బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీఓ గీత, టీ ఫైబర్, బీఎస్ఎన్ఎల్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. -
అకాల నష్టం
జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతకు అపార నష్టం కలిగించింది. బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లో 3,580 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయగా 270 ఎకరాల్లో పంట దెబ్బతింది. కోతకొచ్చిన వరి నేలవాలింది. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. మొక్కజొన్న, వరి, మామిడి రైతులకు కొంత మేరకు నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. – బోయినపల్లి/ఇల్లంతకుంట/చందుర్తి/వీర్నపల్లి -
‘మహాలక్ష్మి’తో ఆర్థిక స్వావలంబన
సిరిసిల్ల: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల కొత్త బస్టాండులో మంగళవారం ఉచిత ప్రయాణాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్న మహిళలకు బహుమతులు అందిస్తూ.. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్లకు పైగా పూర్తి అయి రూ.290 కోట్ల ప్రయాణాలు, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉ ద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలి పారు. కార్యక్రమంలో డీఆర్డీవో మచ్చ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేశ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగణనలో మాస్టర్ ట్రైనర్లు కీలకం జనగణన 2027లో మాస్టర్ ట్రైనర్లు కీలకమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, (సీఎంఎంఎస్), డిజిటల్ విధానం, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్‌పై మాస్టర్ ట్రైనర్లకు ఇచ్చిన శిక్షణలో మాట్లాడారు. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణనని, మే 11నుంచి జూన్ 9వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. జనగణన సేకరించే వివరాలు కీలకమని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ మాస్టర్ ట్రైనర్ శివ రామకృష్ణ వివరించారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు వైఫల్యంతోనే గురుకుల విద్యార్థి మృతి
సిరిసిల్లటౌన్: సర్కారు వైఫల్యంతోనే గురుకుల విద్యార్థి మృతిచెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో సమస్యలు పెరిగాయన్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆరెల్లి వినయ్ కుమార్, ఎండీ అజ్జు, లింగంపల్లి రామ్‌చరణ్, పవన్, జశ్విత్, ఈశ్వర్, కలీం తదితరులు పాల్గొన్నారు. -
గడువు ముగిసింది.. దిగులు మిగిలింది
● నిఘా వర్గాలకు తెలియదు.. మావోయిస్ట్ పార్టీ చెప్పదు ● కుటుంబ సభ్యుల్లో ఆందోళన ● కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కలవరం ‘వెనకచ్చే ఆవుల్లారా.. ఎర్ర ఆవుల్లారో.. శ్రీరామ రామ చంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామ చంద్రుడా.. ముందచ్చే లేగల్లారా.. ముద్దు లేగల్లారో.. శ్రీరామ రామచంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామ చంద్రుడా.. మందిలో నా కొడుకు ముందుండేటోడే.. శ్రీరామ రామ చంద్రుడా.. గోదారి అలలపై ఎదురీదేటోడే.. శ్రీరామ రామ చంద్రుడా.. కళ్లలో కదిలే కొడుకు కనపడకాపాయే.. శ్రీరామ రామ చంద్రుడా.. ఏ పాపిస్టి కళ్లల్లో కొడుకు పడ్డాడో.. శ్రీరామ రామ చంద్రుడా.. ఏ దేవుడు చెబుతాడో నా కొడుకు జాడ.. శ్రీ రామ రామ చంద్రుడా..’ సిరిసిల్ల: ‘దేశంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజాన్ని అంతమొందించామని, మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మార్చి 31లోగా నక్సలైట్లు లేని దేశంగా తీర్చుదిద్దుతామని పది నెలల కిందటే ప్రకటించిన కేంద్రం ఆ దిశగా భద్రతాదళాలతో దాడులు చేసింది. 12 రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించామని కేంద్ర మంత్రి వెల్లడించారు.’ ‘ఈ ప్రకటనకు ముందే సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ముఖ్య నేతలు లొంగుబాట పట్టారు. కొందరు ఆయుధాలను అప్పగించి, మరికొందరు నిరాయుధులుగా లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మా వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉంది. అప్పట్లో అడవి బాట పట్టిన ‘అన్నల’ ఆచూకీ ఇప్పటికీ చిక్కడం లేదు. కేంద్రం విధించిన గడువు ముగిసింది. కానీ, విప్లవోద్యమానికి అన్నలను అందించిన కుటుంబాలకు ఇంకా దిగులు మిగిలే ఉంది’. ఆ నలుగురి ఆచూకీ ఏది..? రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చాలా మంది ఆయుధాలు పట్టుకుని సాయుధపోరాట దారుల్లో వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు ఎన్కౌంటర్ కాగా, మరి కొందరు లొంగిపోయారు. మరో నలుగురు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. కానీ ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో.. అసలు సజీవంగా ఉన్నారా..? లేరా.. అనే విషయాన్ని పోలీస్ నిఘా వర్గాలు, మావోయిస్టు పార్టీ వర్గాలు చెప్పడం లేదు. వారి ఆచూకీ తెలియక నాలుగు కుటుంబాల్లో కన్నీరు మిగిలే ఉంది. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు, అరెస్ట్‌లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆ నలుగురి ఆచూకీ గల్లంతయింది. అడవిలో అజ్ఞాతంలోనే అదృశ్యమైన వారి కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా.. అనే అంతులేని ప్రశ్నలు ఆ కుటుంబాలను వేధిస్తున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. చదువులో చురుగ్గా ఉండే శ్రీనివాస్ సిద్దిపేటలో చదువుతూనే అడవి బాట పట్టినట్లు భావిస్తున్నారు. 28 ఏళ్లుగా అతడి జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా, తల్లి భూదమ్మ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు సైతం శ్రీనివాస్ రాకపోవడం విషాదం. నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే.. జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నారు. పదో తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న ఆయన 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక కూతురు శాంతమ్మ. చిన్నోడు చంద్రయ్య అడవిబాట పట్టారు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికి విసిగిపోయారు. చిన్నకొడుకు తలపుల్లో తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందాడు. తల్లిదండ్రులు, సోదరుడు మరణించినా చంద్రయ్య ఇల్లు ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినె దేవవ్వ ధర్మారంలో ఉన్నారు. 40 ఏళ్లుగా మహేశ్ పేరుతో మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నాడు. చంద్రయ్య ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు దిక్కులు చూస్తున్నారు. చందుర్తి నుంచి దండకారణ్యం చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్ నవీన్ 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. చాలా కాలం మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా పని చేసిన నవీన్ దండకారణ్యంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దండకారణ్యంలో సాయుధ నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. కాంతారావు అలియాస్ నవీన్ ఐదేళ్ల క్రితం ఒడిశాకు వెళ్లినట్లు సమాచారం. కాంతారావు ఆచూకీ 30 ఏళ్లుగా లేక పోవడంతో కుటుంబ సభ్యులు అతను ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడోనని అయోమయానికి గురవుతున్నారు. అజ్ఞాతంలోనే అదృశ్యం జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన చిన్నన్న అలియాస్ బాలసంతుల ఉప్పలయ్య మూడు దశాబ్దాల కిందటే అజ్ఞాతంలోనే అదృశ్యమయ్యాడు. ఆయన సిరిసిల్ల ప్రాంతంలో చిన్నన్న పేరుతో పని చేస్తూ పార్టీ డబ్బులతో పార్టీని వీడి పారిపోయినట్లు ప్రచారం జరిగినా ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నది ఎవరకీ తెలియదు. అజ్ఞాతంలోనే అదృశ్యమయ్యాడు. పోలీస్ రికార్డుల్లో కనిపించని ఆ పేర్లు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను ప్రకటించారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆ నలుగురు అజ్ఞాత వాసుల పేర్లు ఆ జాబితాలో లేవు. జిల్లాకు చెందిన విశ్వనాథ్ (శ్రీనివాస్), బండి చంద్రయ్య(మహేశ్), బత్తుల కాంతయ్య(నవీన్), చిన్నన్న(ఉప్పలయ్య) పేర్లు లేవు. వారంతా ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అటు మావోయిస్టు పార్టీ, లేదా పోలీస్ నిఘా విభాగంపై ఉంది. ‘ఎన్కౌంటర్’ సినిమాలోని ఈ పాట.. ఎదిగిన కొడుకు చదువు కోసం పట్నం వెళ్లి కనిపించకుండా పోవడంతో కొడుకు తలపుల్లో తల్లిపడిన వేదనకు అద్దం పడుతుంది. -
ఆపద సమయాల్లో ముందుండి సేవలందించాలి
సిరిసిల్ల అర్బన్: సమాజానికి ఆపద కలిగినప్పుడు కెడెట్లు ముందుండి సేవలందించాలని 17వ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేశ్ అన్నారు. మంగళవారం సర్దాపూర్ 17వ బెటాలియన్‌లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందం, యువ ఆపద మిత్ర స్కీం కింద ఎన్సీసీ కెడెట్లకు విపత్తు నివారణ, సహాయక చర్యలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్సై కె.నరేశ్ నేతృత్వంలో మెడికల్ ఫస్ట్ రెస్పాండర్, సెర్చ్ అండ్ రెస్క్యూ, రోప్ నాట్స్, హిచేన్ రెస్క్యూ ఆపరేషన్లు, వాటర్ రెస్క్యూ, స్విమ్మింగ్, విపత్తుల అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం కెడెట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్, ప్రశాంత్, లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీలకు 20 మంది ఎంపిక
సిరిసిల్లఅర్బన్ : జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికయ్యారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిదిలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో సుమారు 50 మంది పాల్గొనగా 10 మంది బాలురు, 10 మంది బాలికలు ఎంపికయ్యారని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికై న విద్యార్థులు 27 ఏప్రిల్ 2026 నుంచి 1 మే 2026 వరకు జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మినీ స్టేడియం వాలీబాల్ అకాడమీ కోచ్‌లు, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే ప్రధాన ఎజెండా
● రూ.51.21 కోట్ల బడ్జెట్‌కు పచ్చజెండా ● మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ● సిరిసిల్ల కౌన్సిల్ బడ్జెట్ సమావేశం సిరిసిల్లటౌన్: అభివృద్ధే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ రూపొందించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మంగళవారం ఆమె అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ప్రెస్మీట్లో సమావేశం వివరాలను వెల్లడించారు. పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యం మున్సిపల్ కౌన్సిల్ సకల చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 51.21కోట్లు బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పారిశుధ్య, వీధి దీపాల, మంచినీటి సరఫరా నిర్వహణకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. పూర్తి బడ్జెట్లో 10శాతం హరితహారంకు కేటాయించామన్నారు. విలీన, అభివృద్ధి చెందని, మురికివాడల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు 1/3వంతు నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించిందని తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు పూలమొక్క అందించి ఆహ్వానం పలికారు. సాధారణ సమావేశంలో వాగ్వాదం బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం మార్చి నెలకు సంబంధించిన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ సీఎం ఫొటోలు కౌన్సిల్ హాల్, చైర్పర్సన్ చాంబర్లో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించాలని గతనెల సమావేశంలో సూచించినా పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు మీడియాను ఖచ్చితంగా అనుమతించాలని అన్నారు. అనంతరం ప్రెస్మీట్లో చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా, వచ్చే వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన మురికి కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడం, ఓపెన్ జిమ్‌ల మరమ్మతు తదితర మౌలిక అవసరాలపై 21 అంశాలతో కూడిన ఎజెండాపై పాలకవర్గ సభ్యులందరితో చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సమావేశంలలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి హాజరై మాట్లాడారు. రెవెన్యూ వ్యయంలో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుధ్య ప నులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని, తప్పనిసరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని సూచించారు. మున్సిపల్‌కు రావాల్సిన పన్నులు 100 శాతం వసూలు చేయడంతో ప్రభు త్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గదులు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు. కొత్త చెరువులో మరమ్మతు పనులు చేయించి, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
అక్రమ పట్టా రద్దు చేయాలి
సిరిసిల్ల: మా పూర్వీకుల భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరుకు చెందిన పలువురు మంగళవారం సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. పెద్దూరు శివారులోని సర్వేనం.402లో ఖాతా నం.501, 344, 100064లో 9.20 ఎకరాల భూమి శ్రీరామల నారాయణ, చీకోటి సత్యనారాయణ, జిన్న పోషవ్వ, ఎల్లవేణి అనసూర్య, చీకోటి లచ్చవ్వ, చీకోటి రాజు, దాసరి దేవయ్య, జిన్న దేవయ్యలకు సంబంధించిన పూర్వీకులదన్నారు. పెద్దూరుకు చెందిన గండ్ర జయసింహారావు అక్రమంగా పట్టా చేయించుకుని ధరణి, భూభారతిలో పేరు మార్పిడి చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశామని వివరించారు. తహసీల్దార్‌ను కలవాలని కలెక్టర్ సూచించగా తహసీల్దార్ ఆఫీస్‌కు తరలివచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ అధి కారులు క్షేత్రస్థాయిలో విచారణ న్యాయం చేయాలని, అక్రమ పట్టాను రద్దు చేయాలని కోరారు. -
చర్చనీయాంశమైన చైన్‌స్నాచింగ్
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్‌స్టేషన్ వెనకాల గల పాతబజార్‌లో సోమవారం రాత్రి జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటన పాతబజార్తో పాటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. దీనిని సీరియస్‌గా పరిగణిస్తూ పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాకింగ్ చేస్తుండగా.. స్వశక్తి సంఘాల ముఖ్య ప్రతినిధి కోల కుసుమకుమారి.. సోమవారం సాయంత్రం వేళ అల్పాహారం చేసింది. ఆ తర్వాత తన ఇంటి ఎదుట కాసేపు వాకింగ్ చేసింది. ఆ వీధిలోని పల్లెర్ల శ్రీనివాస్ ఇంటి ఎదుట పొరుగు మహిళలతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని యువకుడు అక్కా అని పిలుస్తూ కుసుమ వద్దకు వస్తూనే మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడును కట్టర్తోకట్ చేసి పట్టుకొని పరుగులుపెట్టాడు. అప్పటికే ప్రధాన రోడ్డుపై పల్సర్ బైక్‌తో సిద్ధంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి క్షణాల్లో మాయమయ్యాడు. సినీఫక్కీగా జరిగిన ఘటనతో అర్ధగంట వరకు బాధితురాలు తేరుకోలేకపోయింది. గ్రూపు లీడర్ కావడంతో అక్కా అని పిలుస్తూ వచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. కాలనీలో అంధకారం కాలనీలో వీధిదీపాలు వెలుగడంలేదు. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సీసీ కెమెరాలు లేవు. దీంతోనే నిందితుడు చాకచాక్యంగా తనపని ముగించుకొని వెళ్లిపోయాడు. ఘటనకు ముందు సదరు వ్యక్తి ఒకసారి పాతబజార్కాలనీ చివరి వరకు రెక్కీచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. చైన్‌స్నాచింగ్‌పై డీసీపీ విచారణ రామగుండం: స్థానిక పాతబజార్‌లో సోమవారం రాత్రి జరిగిన చైన్‌స్నాచింగ్‌పై పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలు కోల కుసుమకుమారితో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం ఎస్సై సంధ్యారాణి తదితరులు ఉన్నారు. కాగా, పోలీస్‌స్టేషన్ వెనకాలే చైన్‌స్నాచింగ్ ఘటన జరగడాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్‌గా పరిగణిస్తోంది. పాతబజార్కాలనీలో కలకలం నిందితుల వేటలో పోలీస్‌యంత్రాంగం విచారణ చేపట్టాం పాతబజార్కాలనీలో ఇప్పటివరకు చైన్‌స్నాచింగ్‌లు చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. పలుప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. ఆరుబయటకు వెళ్లే మహిళలు చాలాజాగ్రత్తలు పాటించాలి. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని -
బకాయిలు చెల్లించాలి
సిరిసిల్లఅర్బన్: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్‌ను ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు ద్యావనపెల్లి పరమేశ్, జనపాల వెంకటయ్య, ముత్యాల ప్రభాకర్, గోవిందరావు, జీవన్‌రెడ్డి, ప్రకాశ్‌రావు, రాజు, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు. -
దాడులైనా దందా ఆగట్లే
● విచ్చలవిడిగా వంటగ్యాస్ వినియోగం ● తీవ్రతలేని కేసుల నమోదే కారణమా? ● క్రిమినల్ కేసులు నమోదు చేస్తేనే అడ్డుకట్ట ● పాత్రధారులు కాకుండా సూత్రధారులపై చర్యలేవీ? కరీంనగర్‌అర్బన్: తప్పు చేస్తే అధికారులు పట్టుకుంటున్నారంటే ఎవరికై నా భయమే. కానీ నగరంలో యథేచ్ఛగా వంట గ్యాస్ దందా సాగుతుందంటే లోపమొక్కడా.. తీవ్రత లేని కేసులు నమోదు చేయడమా, అధికారులతో ఉన్న అనుబంధమా..నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట గ్యాస్ పక్కదారి పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటనలకే తప్ప ఆచరణలో ఆమడదూరం. జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు నాలుగు సార్లు తనిఖీలు నిర్వహించగా పట్టుకున్న ప్రతీసారి పదుల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీ చేపట్టారు. జెస్సికా రీఫిలింగ్ సెంటర్లో 6 సిలిండర్లు, 13 హోటల్స్‌లో ఉపయోగిస్తున్న 21 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు ఆకారపు దినేశ్‌రెడ్డి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్, ఎఫ్ఐ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనగా మెరుపుదాడులు నిర్వహించారు. కానీ, మరోవైపు హోటళ్లలో వినియోగం సాగుతూ..నే ఉండటం విశేషం. సరఫరాదారులపై చర్యలేవీ గ్యాస్ కొరత పుకార్ల క్రమంలో విరివిగా దాడులు నిర్వహిస్తున్న అధికారులు పాత్రధారుల వరకే కేసులను పరిమితం చేస్తున్నారు. అసలు గ్యాస్ సరఫరా చేసిందెవరు, ఏ ఏజెన్సీ నుంచి సరఫరా జరిగింది, సదరు గ్యాస్ సిలిండర్ వినియోగదారుడెవరనే కోణంలో చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు ప్రక్రియలో విచారణ చేసి గ్యాస్ వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ రద్దు చేయడం, గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేయడం వంటి కఠినచర్యలు చేపడితే బ్లాక్ మార్కెట్ గొడవే ఉండదన్నది సుస్పష్టం. కేవలం హోటళ్లు, రీఫిల్లింగ్ సెంటర్లపై 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు కేసుతో ఒరిగేదేం లేదని ఇటీవల పట్టుబడిన హోటల్ నిర్వాహకుడొకరు చెప్పడం కొసమెరుపు. ఇటీవల ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారో హెచ్చు హోటళ్లలో వంట గ్యాస్ వినియోగిస్తుండటం చట్టంలోని లోపాలా..? లోపాయికారి ఒప్పందమా..నన్న వాదన వినిపిస్తోంది. అంతటా వంట గ్యాసే వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు చేరకుండా చర్యలు చేపట్టామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి నెలకొంది. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ప్రముఖ హోటళ్లు, దాబాలు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాల్లో బహిరంగంగా వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. పలు చోట్ల తట్టుసంచులను కప్పి వినియోగిస్తుండగా ప్రముఖ హోటళ్లలో పదుల సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. కొందరు చుట్టు పక్కల ప్రాంతాల్లో సిలిండర్లను నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగిస్తున్నారు. కాగా కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని ఇప్పటికే స్పష్టం చేశామని, వంట గ్యాస్ వినియోగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. -
హుండీ ఆదాయం రూ. 93.52 లక్షలు
వేములవాడ: ఎములాడ రాజన్నకు 18 రోజుల్లో భక్తులు భీమన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సమర్పించుకున్న హుండీల ద్వారా రూ.93,52,748 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మంగళవారం భీమేశ్వర సదన్‌లో చేపట్టిన లెక్కింపులో 60గ్రాముల బంగారం, 2కిలోల 900 గ్రాముల వెండి సమకూరిందన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ ఏసీ ఆఫీస్ అధికారి రాజమౌళి, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేశ్‌ను కులం పేరుతో దూషించిన సంఘటనపై మంగళవారం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి విచారణ చేపట్టారు. గ్రామంలోని పంచాయతీ ఆఫీస్‌లో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. విచారణలో గ్రామస్తులు తెలిపిన వివరాలను రికార్డు చేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాణిప్రసాద్కు వంశీ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డుసిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త కందేపి రాణిప్రసాద్ వంశీగ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందారు. హైదరాబాద్‌కు చెందిన వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర సందర్భంగా సాంస్కృతిక, సాహితీ రంగాల్లో ప్రతిభామూర్తులకు అవార్డులను సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు. వంశీ ఆర్ట్స్ అధినేత వంశీరామరాజు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. సిరిసిల్ల కవులు, రచయితలు ఆమెకు అభినందనలు తెలిపారు. అడవి పదిరలో చిరుత సంచారం వీర్నపల్లి: వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ధర్మారం చెరువు ప్రాంతంలోని మైసమ్మ లొద్ది వద్ద సోమవారం రాత్రి చిరుత ప్రత్యక్షం కావడంతో రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం పెరుగుతుండటంతో అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు. వీర్నపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్ కుమార్, అడవిపదిర బీట్ అధికారి వేణును వివరణ కోరగా అది చిరుత పాద ముద్రలే అని అన్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉచిత ఎంసెట్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి సిరిసిల్ల అర్బన్ : ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో1977–79లో చదివిన పూర్వ విద్యార్థులు నాగుల రవి, పత్తిపాక మదన్, గాజుల ప్రతాప్‌లు ఏర్పాటు చేసిన ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యాపకులు బుర్ర వెంకటేశం, సామల వివేకానంద, రవీందర్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని రాంనగర్లో నివాసముంటున్న ఇస్లావత్ కిషన్(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌కు వస్తుండగా, అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
దుబాయిలో ఉపాధి అవకాశాలు
● ఫ్రీ వీసా.. ఫ్రీ విమాన టికెట్లు ● 2, 3 తేదీల్లో వేములవాడలో ఇంటర్వ్యూలు ● మహమ్మద్ రఫీ, ఎండీ, ఏఆర్ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ సిరిసిల్ల: దుబాయ్‌లోని పలు కంపెనీలు ఉచిత వీసా, విమాన టిక్కెట్లు సమకూర్చుతూ ఉపాధి కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ విషయాన్ని వేములవాడకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఏఆర్ఆర్(మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. దుబాయ్ వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న యువకులకు ఉచితంగా వీసా, విమాన టిక్కెట్ పొందే అవకాశం ఉందన్నారు. 2, 3న ఇంటర్వ్యూలు దుబాయ్(యూఏఈ)లోని క్యాటరింగ్ కంపెనీలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వేములవాడలోని ఏఆర్ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఆఫీస్‌లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. భోజన వసతి కల్పించి నెలకు 950 దుబాయ్ దిరమ్స్(రూ.25వేలు) జీతం ఉంటుందని తెలిపారు. ఉచిత నివాసం, రవాణా, రోజుకు 9 గంటలు పని ఉంటుందని తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు ఉన్న వారు మాత్రమే అర్హులని వివరించారు. ఆసక్తి గల వారు 95505 60910/95506 20505/83411 65239, 96666 22890/ 70754 62519 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్అధికారులకు అభినందన 2న గ్రామ, వార్డుసభలు గృహ సముదాయాల బ్లాక్‌లను పోర్టల్‌లో నమోదు చేయాలి జనగణనకు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్‌లు గుర్తించి సీఎంఎంఎస్(సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టల్‌లో నమోదు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతీ హోలికేరి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న జనగణన కోసం ప్రతీ హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లో 700 నుంచి 850 వరకు జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమాకాంత్‌రావు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం హోరాహోరీగా సాగాయి. అధ్యక్షుడిగా ఆవునూరి రమకాంతరావు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 226 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా రమకాంతరావు, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్.వెంకటయ్య, కోశాధికారిగా ఎస్.దేవరాజు ఎన్నికై నట్లు ఎన్నికల అఽధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా జి.కిషన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీలుగా కె.శ్రీనివాస్, బి.కళ్యాణి, లైబ్రరీ సెక్రటరీగా ఎం.పుష్పలత, మహిళా రిప్రజంటేటీవ్‌గా వై.జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి జగ్గారావు తెలిపారు. నూతన పాలకవర్గం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. -
వీర్నపల్లిలో పట్టపగలే చోరీ
రెండు సబ్స్టేషన్ల మంజూరు సిరిసిల్ల: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు సబ్స్టేషన్లకు సాంకేతిక అనుమతులను ఎన్పీడీసీఎల్ జారీ చేసిందని కరీంనగర్ ఎస్ఈ ఆర్.రవీందర్ సోమవారం తెలిపారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల, తంగళ్లపల్లి మండలం రామన్నపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు అనుమతులు మంజూరైనట్లు ప్రకటించారు. ఈ రెండు సబ్స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.7.09 కోట్లు వ్యయమవుతుందని వివరించారు. రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలువీర్నపల్లి: మండలంలో సోమవారం రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని బంజేరుకు చెందిన బట్టు వెంకటేశ్ బైక్‌పై వీర్నపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎదురుగా అదే గ్రామానికి చెందిన మాలోత్ హరిదాస్ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
చందుర్తి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చందుర్తి, రుద్రంగి మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరానికి హాజరై మాట్లాడారు. మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మండల శాఖ అధ్యక్షులు మోకిలే విజేందర్, కర్ణవత్తుల వేణు, రాష్ట్ర నాయకులు అల్లాడి రమేశ్, ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కౌడిపల్లి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేశ్ పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: ప్రజాప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8, 9వ వార్డుల నుంచి పలువురు యువకులు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బడుగు భరత్, నాగరాజు, రజనీకాంత్ పాల్గొన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు అవుతుంది. శాంతినగర్‌లో ఇళ్ల పంపిణీ కోసం 106 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇండ్లను పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికై నా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి. – మూషం రమేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
ఉద్యమకారుల అరెస్ట్ అప్రజాస్వామికం
● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పలువురు ఖండించారు. సిరిసిల్లలో ఆదివారం అరెస్టయిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు ఠాణాలో నిరసన తెలిపారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250, గజాల భూమి రూ.25 వేల పెన్షన్. సంక్షేమబోర్డు, గుర్తింపుకాార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అరెస్టు అయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మామిడాల రమణ, కొండ శంకర్, బింగి ఇజ్జగిరి, కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాద్రి, చిలుక శారద పాల్గొన్నారు. -
డబుల్బెడ్రూమ్ కాలనీలో నీటి గోస
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ డబుల్బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో నీటిఎద్దడి నెలకొంది. కేసీఆర్ కాలనీతోపాటు పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలో సైతం నీటికి గోస పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. మిషన్ భగిరథ నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కాలనీల్లో వారం రోజులుగా నీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. కాలనీకి నీటిని అందించే బోరుబావిలో అడుగంటడం, మోటారు కాలిపోవడంతో నీటికి కటకట ఏర్పడిందన్నారు. పంచాయతీ అధికారులు నీటికష్టాలు తీర్చేందుకు నిత్యం ట్యాంకర్ ద్వారా సంపులోకి నీటిని అందిస్తున్నారన్నారు. అయినా నీరు సరిపోవడం లేదన్నారు. బోరు రిపేరు చేసి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ సిబ్బంది తెలిపారు. -
నిర్మించారు.. వదిలేశారు!
సిరిసిల్ల అర్బన్: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం సిరిసిల్ల పట్టణ పరిధి లోని శాంతినగర్, పెద్దూరు, రగుడు గ్రామాల్లో డ బుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. పూర్తయిన ఇళ్లు పేదలకు కేటాయించేందుకు ము న్సిపల్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డుల వ్యాప్తంగా 7,363 దరఖాస్తులు వచ్చాయి. వాటిపై రెవెన్యూ, మున్సి పల్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేశారు. లబ్ధిదారులను సైతం ఎంపిక చేశారు. వచ్చిన దరఖాస్తులలో 4,161 మందిని అనర్హులుగా గుర్తించా రు. అర్హులైన 3,202 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణ పరిధిలోని పెద్దూరు, రగుడు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా.. శాంతినగర్‌లో ని ర్మించిన 204 ఇండ్ల కేటాయింపు విషయంలో అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపులు ‘డబుల్’ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సర్వేలు చేశారు. వార్డు సభలు నిర్వహించి లబ్ధిదా రులను ఎంపిక చేశారు. రగుడు వద్ద 72, పెద్దూరులో 516 డబుల్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశా రు. శాంతినగర్‌లో 204 ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో డబుల్ బెడ్రూమ్ కాలనీలో పిచ్చిమొక్కలు మొలి చాయి. కొన్ని ఇళ్ల కిటికి అద్దాలు ధ్వంసమయ్యా యి. కొన్ని భవనాలు చిన్నపాటి వానలకు ఉరుస్తున్నాయి. జనసంచారం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.శాంతినగర్ ‘డబుల్’ కాలనీలో పెరిగిన పిచ్చిమొక్కలు పగిలిపోయిన కిటికి అద్దం -
‘అమ్మ’లకు అక్షర పరీక్ష
● డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘ఉల్లాస్’లో పరీక్షలు రాసిన 12,856 మంది మహిళలు సిరిసిల్ల: కొడవళ్లు పట్టిన.. బీడీలు చుట్టిన.. ఉపాధిహామీ పనిలో పలుగు, పారలు, తట్టా బుట్టలు పట్టిన చేతులు ఆదివారం అక్షరాలు రాశాయి. సామాజిక చైతన్యంతో బుద్ధిమాటలు చెప్పిన ‘అమ్మ’లు చిన్నపిల్లల్లా మారి అక్షరాలు రాస్తూ మురిసిపోయారు. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12,856 మంది అమ్మలు.. అక్కలు.. అక్షరాలు రాసి తమ అక్షర చైతన్యం చాటారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం వయోజన నిరక్షరాస్య మహిళలు ‘ఉల్లాస్’లో పరీక్షలు రాశారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 23,375 మంది నిరక్షరాస్యులైన మహిళలకు అక్షరాలు నేర్పించేందుకు ‘ఉల్లాస్’లో మూడు నెలల క్రితం పుస్తకాలు అందించారు. వారు నేర్చుకున్న అక్షరాలను ఆదివారం పరీక్షల్లో రాశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర వయోజన విద్య ఉపసంచాలకులు ఎం.డీ.నుమాన్, జిల్లా ఉపసంచాలకులు డి.ఆంజనేయులు పరిశీలించారు. డీఆర్డీవో మచ్చ గీత పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఆగస్టులో రెండోదశ పరీక్షలు కనీస విద్య అందరికీ అవసరమని ప్రభుత్వం ‘ఉల్లాస్’ నిర్వహిస్తోందని వయోజన విద్య ఉపసంచాలకులు నుమాన్ తెలిపారు. రెండోదశలో అక్షరమాల పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామన్నారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చేదిద్దే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వ్యాసరచనలో సత్తాచాటిన శ్రీనిధిముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రస్థాయిలో భాషోపాధ్యాయ సంఘం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మండలంలోని నామాపూర్ మోడల్‌స్కూల్ పదో తరగతి విద్యార్థిని వేదునూని శ్రీనిధి సత్తాచాటింది. హన్మకొండలో జరిగిన వేడుకలో రూ.2వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. శ్రీనిధిని ప్రిన్సిపాల్ కొండల్‌రెడ్డి, తెలుగు పండితుడు పాక అంజయ్య అభినందించారు. -
రైతులకు రాజన్న కోడెలు
● ఏప్రిల్ 7న పంపిణీ ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేములవాడఅర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తెలిపారు. తిప్పాపూర్‌లోని గోశాలలో 300 కోడెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 7న రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోడెలను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచి ంచారు. వివిధ ధ్రువీకరణపత్రాలతో https://rajannasiricilla.telan gana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకే జియో ట్యాగింగ్ కోడెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోడెలు తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. కో డెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బస్సుల సంఖ్య పెంచండి● మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విప్ ఆది శ్రీనివాస్ విన్నపం
పెన్షన్ డబ్బుల కోసం వచ్చి మృత్యువాతసిరిసిల్ల అర్బన్: పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనం రూపంలో మృత్యువు ఆ వృద్ధురాలిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన దానవేని నర్సవ్వ(80) పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు స్థానిక బైపాస్‌రోడ్డు పక్కన ఉన్న బ్యాంకుకు వెళ్లింది. పెన్షన్ తీసుకొని ఇంటికొస్తుండగా కామారెడ్డి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాలు విరిగి దూరంలో ఎగిరిపడింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి నర్సవ్వ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బైపాస్ రోడ్డు వెంట గాలించడంతో మృతిచెంది కనిపించింది. నర్సవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధి పనులు ప్రారంభం
● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో రూ.25లక్షలతో నిర్మించిన పనులు, శివాజీ విగ్రహాన్ని స్థానిక సర్పంచ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ముస్తాబాద్‌లో బిజీబిజీ ముస్తాబాద్‌లో ఎన్‌ఆర్‌ఐఈజీఎస్ ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ భూమిపూజ చేశారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి గృహంలో జరిగిన హన్మాన్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండలాల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్‌రావు, సౌల్ల క్రాంతి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి పాల్గొన్నారు. -
రాజీయే రాజమార్గం
సిరిసిల్లటౌన్/వేములవాడ: రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 14,820 కేసులు పరి ష్కరించినట్లు తెలిపారు. రూ.6,74,41,119 పరిహారంగా ఇప్పించినట్లు వివరించారు. ప్రమాద కేసులు 13, సివిల్ తగాదాలు 17, క్రిమినల్ కేసులు 330, ఎకై ్సజ్ కేసులు 43, చెక్‌బౌన్స్ కేసులు 20, కుటుంబ తగాదాలు 10, బ్యాంకు కేసులు 45, బీఎస్ఎన్ఎల్ 10, డ్రంకెన్‌డ్రైవ్ 1,851, ట్రాఫిక్ చలా న్ కేసులు 12,481 పరిష్కారమయ్యాయి. పోక్సో కోర్టు జడ్జి రాధికా జైశ్వాల్, సబ్‌కోర్టు జడ్జి లక్ష్మణాచారి, ఏఎస్పీ చంద్రయ్య, లోక్‌అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. వేములవాడలో 832 కేసులు జాతీయ లోక్‌అదాలత్‌లో 832 కేసులు పరిష్కారమైనట్లు వేములవాడ జూని యర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి తెలిపారు. గొడవపడ్డ అన్నదమ్ములు రాజీ కుదుర్చుకోవడంతో శాలువాతో సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, లోక్ అదాలత్ మెంబర్లు నాగుల సత్యనారాయణ, నక్క దివాకర్, ఏజీపీలు బొడ్డు ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026Iఎల్లారెడ్డిపేట: నారాయణపూర్ శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.వేములవాడ: సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన శివపార్వతులు, హిజ్రాలు శనివారం బద్దిపోచమ్మకు బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. ఎండలు తీవ్రంగా ఉంటాయి. వేడిగాలులు వీస్తాయి. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. -
కష్టంలోనూ తోడునీడగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారి లడ్డూకు రూ.70వేల వేళం పాటపాడా రు. ఈ లడ్డూను గ్రామానికి చెందిన వంగల లింగారెడ్డి–శోభ దంపతులు దక్కించుకున్నారు. బచ్చు మోహన్ రూ.40వేలతో స్వామి వారి వ్రతానికి మెట్లు చేయించారు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణస్వామి రూ.50వేలతో అన్నదానం చేశారు. సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మోతె మధుసూదన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, వైస్‌చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, డీటీ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దు చేయాలి
సిరిసిల్ల అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షనర్లకు తీవ్రంగా నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంను వెంటనే రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు బలరాం కోరారు. బుధవారం కలెక్టరేట్ వద్ద జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం ప్రకారం 1.1.2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు పీఆర్సీ, డీఆర్లు, పెన్షన్ పెంపుదల ఉండవన్నారు. పెన్షనర్లకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రికి చేరేలా చూడాలని కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు చౌకి సుధాకర్, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లపై నిఘా
సిరిసిల్ల: గర్భస్థ లింగనిర్ధారణ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్యాధికారి ఆఫీ స్లో జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. రజిత మాట్లాడుతూ భ్రూణ హత్యలు అరికట్టడానికి, లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేల జరి మానా, మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు తెలిపా రు. మానేరు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, సలహా సంఘం కన్వీనర్, ప్రోగ్రాం ఆఫీసర్ నాగేంద్రబాబు, గైనకాలజిస్ట్ సూచేత లక్ష్మి, డాక్టర్లు సాయికుమార్, ఆదిత్య, రామకృష్ణ, నహీ మ, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
బల్దియా లైన్మెన్కు విద్యుత్ షాక్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న బొమ్మకల్‌కు చెందిన లైన్మెన్ శివ విద్యుత్‌షాక్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అలుగునూరులో స్ట్రీట్ లైట్ బిగిస్తున్న స మయంలో పక్కనే ఉన్న 11 కేవీ లైన్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మేయర్కొలగాని శ్రీనివా స్ వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకొని, శివ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సి పల్ కార్మికులకు భద్రతా పరికరాలు అందించాలని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. విద్యుత్‌షాక్‌తో గాయపడిన శివను ఆసుపత్రిలో పరామర్శించారు. రూ.3.46 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తులువీర్నపల్లి(సిరిసిల్ల): ఆన్లైన్ మోసగాళ్ల ఉచ్చులో ప డి ఓ రైతు భారీగా నగదు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలంలో అడవిపదిరలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన పొలగాని లచ్చయ్యకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. తాము ధని బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించారు. భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో పలు విడతల్లో రూ.3,46,799 కాజేశారు. నగదు పంపిన తర్వాత సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య పోలీసులను బుధవారం ఆశ్రయించారు. -
ఎండుతున్న పంటలు
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కళ్ల ఎదుటే పంట పంటలు ఎండుతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు. చిప్పలపల్లిలో యాసంగిలో దాదాపు 900 ఎకరాలలో వరిపంట సాగుచేశారు. భూగర్భ జలాలు అడిగంటి పోవడంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎత్తిపోయాయి. ఇప్పటికే దాదాపు 400 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. చిప్పలపల్లికి శాపం చిప్పలపల్లికి ఎలాంటి నీటి ఆధారం లేదు. ఎగువమానేరు ప్రాజెక్టు కెనాల్ చిప్పలపల్లిలో లేదు. చిప్పలపల్లి గ్రామ సరిహద్దు నుంచి ఎగువమానేరు కెనాల్ వెళ్తున్నా ఈ పొలాలకు చుక్క నీరు కూడా వినియోగించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు బోరుబావులనే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కో రైతు మూడు నుంచి ఐదు బోర్లు వేసి పంటలు సాగు చేస్తున్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు కెనాల్ చిప్పలపల్లికి మళ్లించాలని గ్రామస్తులు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మల్లన్నసాగర్ కెనాల్ సైతం నామాపూర్ వరకు ఉండడంతో చిప్పలపల్లి పంట పొలాలకు రావడం లేదు. మల్లన్నసాగర్ జలాలు వస్తాయన్న ఆశ చిప్పలపల్లి రైతుల్లో ఉండగా, అది కూడా నెరవేరలేదు. చిప్పలపల్లిలో కేవలం ఒక ఊర చెరువు ఉన్నప్పటికీ అది వర్షాధారమే. మానేరు ప్రాజెక్టు లేదా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కెనాల్ నీటిని చిప్పలపల్లికి మళ్లిస్తే పుష్కలమైన పంటలు పండుతాయి. చిప్పలపల్లికి ఎలాంటి నీటి వసతి లేదు. యాసంగిలో బోర్లు ఎండిపోయి, చుక్క నీరు లేదు. మల్లన్నసాగర్, ఎగువ మానేరు ప్రాజెక్టు కెనాల్స్ చిప్పలపల్లి వరకు వేయాలి. సాగు, తాగునీటిని అందించాలి. – మాచెట్టి లచ్చయ్య, సర్పంచ్, చిప్పలపల్లి -
లక్కీ మిరానీ.. మిరాకిల్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌కు చెందిన లక్కీ మిరానీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతున్నాడు. బాల్యంలోనే చూపు కోల్పోయినప్పటికీ, సంకల్పం, క్రమశిక్షణతో చీకటిని జ్ఞాన వెలుగుగా మలచుకుంటూ తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడుతున్న దృష్టి లోపం గల యువకుడిగా లక్కీ మిరానీ రికార్డు సాధించాడు. మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 95.80శాతం మార్కులు సాధించాడు. యూజీసీ ఎంట్రెన్స్‌లో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించి, తొలి ప్రయత్నంలోనే యూజీసీ నెట్ క్లియర్ చేశాడు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటాడు. గోల్‌బాల్ క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. లక్కీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీ నిలవడం విశేషం. ప్రస్తుతం పాలిటికల్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్కీ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్‌లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్‌రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
● రాచర్ల బొప్పాపూర్‌లో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ డివైడర్‌ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్‌లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. పాముకాటుతో వృద్ధురాలి మృతి ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్‌క్రైం: సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాన్ని వేగవంతం చేయడంతో పాటు అవినీతి అధికారులకు అనుకూలంగా మారుతోంది. ఒకప్పుడు కవర్లలో, బ్యాగుల్లో దూరే నగదు, బళ్ల కింద నుంచి వెళ్లే లంచాలు ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ రూపంలో అకౌంట్లలో చెలామణి అవుతున్నాయి. ‘నగదు దొరికితేనే కేసు’ అనే పాత భావన నుంచి తప్పించుకోవడానికి అధికారులు డిజిటల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి మార్గాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసదాడులు చేపడుతున్నారు. యూపీఐ ద్వారా లంచం తీసుకున్న అధికారులను ఆధారాలతో సహా పట్టుకుని కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల వద్ద లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్‌ను ఈనెల 16న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ బినామీ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని విడిచిపెట్టేందుకు యూపీఐ ద్వారా రూ.15వేల లంచం తీసుకున్న కేసులో గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఎస్సైగా పనిచేసిన వెంకటేశ్వర్లును కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈనెల 24న అరెస్టు చేశారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సైగా ఉన్నారు. -
ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మండల కేంద్రంలోని మోడల్ హౌ స్ను బుధవారం ప్రారంభించారు. అనంతర గుండారంలో చెందిన సిద్ధాల అఖిల, కంకణాల శ్రీలత, ఇందిరాల మమత, లకావత్ సునీత ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ ప్రారంభించారు. ఫిల్లర్ రూఫింగ్‌తో ఖర్చు ఆదా హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌస్‌లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గించేందుకు, స్లాబ్ నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో నిర్మించడంపై అధికారులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 777 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్లు తెలి పారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఈ సాజిద్, ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో రాజు పాల్గొన్నారు. భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలి దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మండలకేంద్రంలో భవిత కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ బుధవారం, గురువారం ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపా రు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీ లించారు. జూనియర్ కళాశాల మైదానంలో పనులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి పాల్గొన్నారు. సేంద్రియ సాగు చేయండి కోనరావుపేట(వేములవాడ): రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు తయారీ విధానం పశువుల పెంపకం ఇతర అంశాలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, సర్పంచ్ మిర్యాల్‌కార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
పంటనష్టం పరిశీలన
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో మంగళవారం కురిసిన వడగండ్ల వానకు జరిగిన పంటనష్టాన్ని బుధవారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఎర్రగడ్డతండా, రంగంపేట, బాబాయిచెరువుతండా, భూక్యాతండా, బావుసింగ్‌తండా, లాల్సింగ్తండాల్లోని పొలాను పరిశీలించారు. దాదాపు 185 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట పరిశీలనలో వ్యవసాయాధికారి ఫజిలుద్దీన్, రైతులు పాల్గొన్నారు. చందుర్తిలో 50 ఎకరాల్లో పంట నష్టం చందుర్తి(వేములవాడ): మండలంలోని తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట, చందుర్తి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు 50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఏఈవోలు బుధవారం పరిశీలించారు. తిమ్మాపూర్‌లో గడికొప్పుల రాజేశం(6 ఎకరాలు), అట్టపెల్లి సతీశ్(3 ఎకరాలు), పేరుక మల్లేశం(5 ఎకరాలు), బొడ్డు దేవయ్య(2 ఎకరాలు), చందుర్తిలో మెంగని హన్మండ్లు, కోన లక్ష్మణ్, కోన శ్రీనివాస్, మర్రి మల్లేశంతోపాటు పలువురికి చెందిన 34 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఏఈవోలు యోగేశ్వర్, ప్రవీణ్ తెలిపారు. -
వంటగ్యాస్ కొరత లేదు
సిరిసిల్ల: జిల్లాలో వంటగ్యాస్ కృత్రిమ కొరతను సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్.బుచ్చిబాబు హెచ్చరించారు. జిల్లాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పక్షం రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాలో జాప్యం, పెట్రోల్‌బంకుల్లో ఇంధన కొరత ఉందని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారిని ‘సాక్షి’ బుధవారం ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...బుకింగ్‌ల సంఖ్య పెరిగింది పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ సరఫరాలో జాప్యమవుతుందని, వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందని మీడియాలో ప్రచారంతో ప్రజలు హైరానాపడ్డారు. అదనపు సిలిండర్‌ను ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు. జిల్లాలో నెలకు సగటును 2,500 నుంచి 3వేల వరకు సిలిండర్ల రీఫిల్లింగ్ బుకింగ్ జరిగేది. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా 5 వేల సిలిండర్లు బుక్ అయ్యాయి. దీంతో సరఫరాలో జాప్యమవుతుంది. పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒక్క సిలిండర్ సరఫరా అవుతుంది. 13 కేసులు బుక్ చేశాం జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో గృహావసరాలకు వాడాల్సిన ఎల్పీజీ గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగిస్తున్నట్లు గుర్తించి 13 కేసులు బుక్ చేశాం. 33 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. ఎవరైన సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా శిక్షిస్తాం. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు 11 ఉండగా.. 1,49,453 కనెక్షన్లు ఉన్నాయి. 685 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి జిల్లాలో 78 పెట్రోల్‌బంకులు ఉన్నాయి. అంతటా పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులు, ప్రచారాలు నమ్ముతూ కొన్ని పెట్రోల్‌బంకుల్లో క్యూ కడుతున్నారు. నిజానికి జిల్లాలో ఇంధన కొరత లేదు. పెట్రోల్ బంకులకు ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీ కంపెనీలు అరువుపై ఇంధనాన్ని సరఫరా చేసేవి. ఇప్పుడు యుద్ధంతో నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ పంపిస్తామని చెప్పడంతో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ఆయా కంపెనీల సేల్స్ ఆఫీసర్లతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా జిల్లా స్థాయిలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశాం. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి ఆఫీస్ పనివేళల్లో ఫిర్యాదులను నమోదు చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేశారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇంకా ఎవరికై నా సమస్యలు ఉంటే హెల్ప్‌డెస్క్ 80084 29738లో సంప్రదించవచ్చు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తాం. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం. 239 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 159, ప్యాక్స్ పరిధిలో 72, మెప్మా ఆధ్వర్యంలో 7, డీసీఎంఎస్ పరిధిలో ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. గోదాములను పరిశీలిస్తున్నాం. యాసంగిలో 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. గత అనుభవాల ప్రకారం 2.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచులను సిద్ధం చేస్తున్నాం. జిల్లాలోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు, పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనదారులు హైరానా పడకుండా.. అవసరాలకు మించి నిల్వలు చేయొద్దు. ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో అన్ని జాగ్రత్తలను జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. -
నియమించారు!
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026లక్షణంగా● ‘అర్బన్ బ్యాంకు’లో వసూళ్లపర్వం ● ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు వసూలు ● చక్రం తిప్పిన అర్బన్‌బ్యాంకు కీలక నేత ● 8 పోస్టులకు 67 మంది దరఖాస్తుసిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగులను ‘లక్ష’ణంగా నియమించారు. ప్రతిభ ఉన్న అభ్యర్థులను, బ్యాంకు అభివృద్ధికి పనిచేసే వారిని నియమించాల్సి ఉండగా.. పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గత శుక్రవారం ఆరు కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 46 మంది హాజరయ్యారు. ఎంపికై న అభ్యర్థులు ఆరుగురు సోమవారం విధుల్లో చేరారు. ఒక్కో కాంట్రాక్టు పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అక్టోబరులో నోటిఫికేషన్ సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ బ్రాంచ్‌లు ఉన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటల్లో ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రెండు బ్రాంచ్‌లలో కలిపి 10 వేల మంది సభ్యులతో ఏటా సుమారు రూ.750 కోట్ల లావాదేవీలతో రూ.125కోట్ల డిపాజిట్లతో రూ.90 కోట్ల రుణాలు అందించింది. వేములవాడ, కరీంనగర్లోనూ కొత్తగా బ్రాంచ్‌ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే సరిపోయేంత సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలోనే రెండు మేనేజర్ పోస్టులు, ఆరు క్లర్క్ పోస్టుల భర్తీకి 2025, అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. మేనేజర్ పోస్టులకు నలుగురు, క్లర్క్ పోస్టులకు 63 మంది దరఖాస్తు చేశారు. ప్రతిభ ఆధారంగా కాకుండా పైరవీలు, పైసలతో నియామకాలు జరిగినట్లు చర్చ సాగుతోంది. రెండు మేనేజర్ పోస్టులకు అనర్హులు దరఖాస్తు చేయడంతో ఆ పోస్టుల భర్తీని నిలిపివేశారు. సీఈవో పోస్టుకు రెండు సార్లు నోటిఫికేషన్ అర్బన్‌బ్యాంకులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) నియామకానికి గతంలో రెండుసార్లు నో టిఫికేషన్ ఇచ్చారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు సీఈవో పత్తిపాక శ్రీనివాస్ 2020లో రిటైర్డు అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ అధికారి శేరి శ్రీనివాస్‌ను ఇన్చార్జి సీఈవోగా నియమించారు. పనులు, పాలకవర్గం ఒత్తిళ్లతో శ్రీనివాస్ దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ఆయన స్థానంలో కరీంనగర్‌కు చెందిన చీటి ప్రకాశ్‌రావును సీఈవోగా తీసుకునేందుకు ప్రతిపాదించారు. వాస్తవానికి చీటి ప్రకాశ్‌రావు మహారాష్ట్రలో 2014 అక్టోబరులో రిటైర్డు అ య్యారు. ఆయన్ని అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో బ్యాంకు సీఈవోగా నియమించారనే ఆరోపణలు న్నాయి. 2021లో ఒక్కసారి, 2022 జూలై 7న మరో సారి బ్యాంకు సీఈవో పోస్టు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. 27 మంది దరఖాస్తు చేశారు. కానీ అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే నియామకాలను పక్కన పెట్టారు. మళ్లీ అక్టోబరులో కాంట్రాక్టు జూనియర్ అసిస్టెంట్(క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో అనేక మంది నిరుద్యోగులు ఆశతో దరఖాస్తు చేశారు. ఆ పోస్టులు అమ్ముడుపోవడంతో ప్రతిభ గల నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తుంది.అర్బన్ బ్యాంకు పాలకవర్గంలోని ఓ కీలక నేత వసూళ్లపర్వాన్ని కొనసాగించినట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.3.50లక్షలు తీసుకుంటూ.. పాలకవర్గంలోని వారికి రూ.3 లక్షలే ఇచ్చినట్లు చెప్పాలని, మిగతా రూ.50వేలు ఖర్చులు ఉన్నాయని సదరు కీలకనేత స్పష్టం చేసినట్లు తెలిసింది. మీ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో నియామకమై.. పర్మినెంట్ అవుతాయని, డబ్బుల విషయం బయటకొస్తే మీకే నష్టమంటూ బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. వసూళ్లపర్వంలోనూ తారతమ్యాలు పాలకవర్గంలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ఈ వసూళ్లపర్వంపై సహకార శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
సిరిసిల్లటౌన్: స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం సిరిసిల్లలోని నేతన్నచౌక్‌లో నిరసన చేపట్టారు. ఎస్.కె. అఫ్రోజ్, సాయి, తేజ, ఎండి అజ్జు, చరణ్, వినయ్, నిఖిల్, శశాంక్, అఖిల్, అభిషేక్, కై లాస్, మనోజ్, వంశీ, నిఖిల్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో బుధవారం కలిసి విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీపీలు గుడిసె ఐలయ్య, వి.వెంకటరమణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, ఆకుల సత్యం ఉన్నారు. వేములవాడరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హనుమంతు కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో వేములవాడరూరల్ మండలం బొల్లారంలో ప్రధానమంత్రి ముద్ర యోజనపై బుధవారం అవగాహన కల్పించారు. హనుమంతు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల లక్షణాలు, కొత్త యూనిట్ స్థాపనకు పరిశోధన ఎలా చేయాలి, కేంద్ర పథకాలు పీఎంఎంవై, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈపై అవగాహన కల్పించారు. ట్రైనర్ వంశీకృష్ణ, చార్టర్ అకౌంటెంట్ ఆంజనేయులు, ఈడీసీ మేనేజర్ జయంత్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటశివసాయి పాల్గొన్నారు. ఇల్లంతకుంట/సిరిసిల్ల ఎడ్యుకేషన్: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన జానపద రచయిత, గాయని కట్కూరి స్నేహకు పీపుల్స్ మీడియా పాయింట్ శివంగి ఆత్మీయ పురస్కారాన్ని అందించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ‘అల్లిబిల్లి సోకులాడి చిట్టమ్మి..’ అనే పాటతో స్నేహకు పేరు వచ్చింది. ఇప్పటి వరకు వందకు పైగా పాటలు రాసి, పాడింది. 7న ‘సెస్’ సర్వసభ్య సమావేశంసిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 7న నిర్వహిస్తున్నట్లు ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు బుధవారం తెలిపారు. సిరిసిల్ల శివారులోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని వివరించారు. సిరిసిల్ల ‘సెస్’ ఆఫీస్‌లో బుధవారం పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘సెస్’ జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు పాలకవర్గం నిర్ణయించింది. ‘సెస్’ సభ్యులకు ముందస్తు సమాచారం అందిస్తామని తెలిపారు. -
మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల: మహనీయులు బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోజూ పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలకు ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలన్నారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని, వైద్యులు, సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, డీఎంహెచ్‌వో రజిత, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఉద్యానవన అధికారి శరత్‌బాబు, ‘సెస్’ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, దళిత సంఘాల నాయకులు కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, నాలుక సత్యం, బూర యాదగిరి, మేకల కమలాకర్, బాలయ్య, బొడ్డు నారాయణ, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి బోయినపల్లి: టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని కొదురుపాక పీహెచ్సీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థికసాయం అందిస్తుందని, వ్యాధి సోకినవారు మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో టీబీ రహిత గ్రామాల కోసం కృషి చేసిన 20 మంది పంచాయతీ కార్యదర్శులు, ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిని సన్మానించారు. డీఎంహెచ్‌వో రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, వైద్యులు శంకర్, సత్యనారాయణ, ఆనంద్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రేణుప్రియాంక, రాజుకుమార్, తహసీల్దార్ నారాయణరెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపీవో శ్రీధర్, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నేలరాలిన ఆశలు
కోనరావుపేట: బావుసాయిపేటలో..వీర్నపల్లి: భావుసింగ్‌నాయక్ తండాలో నేలరాలిన వడ్లువీర్నపల్లి/కోనరావుపేట/చందుర్తి: జిల్లాలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో పలుచోట్ల వరిపంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, చేతికొచ్చిన పంట చేజారిపోయిందని పలువురు అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. వీర్నపల్లి మండలం బాబాయ్చెరువు తండా, భావుసింగ్‌నాయక్ తండా, భూక్య తండా, రంగంపేట తదితర గ్రామాల్లో కోతకు వచ్చిన వరిధాన్యం నేలపాలయింది. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట, కొండాపూర్ గ్రామాల్లో ధాన్యం రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు బర్కం రమేశ్, నక్క మల్లేశం, కంటె సత్తయ్య, మ్యాకల రేవతి ప్రభుత్వాన్ని కోరారు. చందుర్తి మండలం తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట గ్రామాల్లో గాలిపెల్లి వెంకటి, అట్టపల్లి సతీశ్, గడిగోప్పుల రాజశేఖర్, గాలిపల్లి సత్తయ్య తదితర రైతుల పొలాల్లో 30శాతానికి పైగా ధాన్యం రాలిపోవడంతో కుమిలిపోతున్నారు. పొలాలను పరిశీలించి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
కల్యాణ వైభోగమే..
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో మంగళవారం గౌడకులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ–జమదగ్నిల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎదుర్కోలు కార్యక్రమం అనంతరం బైండ్ల పూజారులు నాగవెళ్లి పట్నం వేసి కల్యాణం జరిపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్‌గౌడ్, రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) -
కొత్తగా ఐదు
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026ఎంపికై న విద్యార్థులతో డీఈవో, ఎంఈవోసాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసివస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాతవాటితోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీస్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహిళలకు కేటాయించేవి ఏమిటి, మహిళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారే అంశాలపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించిఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్‌గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్‌తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగిత్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీతారాముల కల్యాణానికి పటిష్ట భద్రత
● ఎస్పీ మహేశ్ బి గితే వేములవాడఅర్బన్: రాజన్న ఆలయంలో ఈ నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బి గితే అధికారులకు సూచించారు. మంగళవారం ఆలయ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలపై దృష్టి సారించి, ట్రాఫిక్‌ను నియంత్రించేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించవద్దని, పెండింగ్ కేసులు వేగవంతంగా పూర్తి చేసి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని, రోజూ డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వీరప్రసాద్, ఆలయ ఈఈ రాజేశ్, డిఈ రఘునందన్, రామ్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపిక
ఇల్లంతకుంట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని హైస్కూల్‌కు చెందిన బయాలాజికల్ స్కూల్ అసిస్టెంట్ వుడుత మహేశ్ చంద్ర ఫిన్లాండ్ దేశంటీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికయ్యాడు. ఐదురోజుల పాటు ఫిన్లాండ్ దేశంలోని అనేక విద్యాసంస్థలను సందర్శించి ప్రముఖ యూనివర్సిటీలు, ఆధునిక పాఠశాలల్లో ప్రయోగాత్మక ఇన్నోవేటివ్ అప్రోచ్‌లు, స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ తదితర అంశాల్లో శిక్షణ పొందుతారు. చంద్రశేఖర్‌ను డీఈవో జగన్మోహన్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు శైలజ, పద్మజ, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, హెచ్ఎం ప్రేమలత, ఉపాధ్యాయులు అభినందించారు. -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20267కోనరావుపేట: మామిడిపల్లి శ్రీసీతారాముల శోభాయాత్ర సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, టెంకాయలు కొట్టారు. వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 27న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శివార్చన వేదిక వద్ద చలువపందిళ్లు వేస్తున్నారు.ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తారు గాలులు వీస్తాయి. -
మిగిలింది రెండు రోజులే..
చందుర్తి(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత గల రైతులు తగిన పత్రాలతో స్థానిక రైతువేదికల్లో ఏఈవోల వద్ద ఈనెల 25 వరకు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం విధించిన నిబంధల ప్రకారం జిల్లాలోని 6,283 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా రైతుభరోసాకు 1,200 మంది రైతులు దూరమవుతున్నారన్నది అనధికార లెక్కలు మాత్రమే. అయితే యాసంగి పంట సాగు సమయంలో ప్రభుత్వం రైతుభరోసాను అందించలేదు. సోమవారం నుంచి ఎకరం డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. పాత రైతులకే కాకుండా కొత్తగా పట్టా చేయించుకున్న వారికి కూడా పంట పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల పేర్లను తెలుపుతూ వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. 2025 వానాకాలం పంటకు జిల్లాలోని 1,24,292 మంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమైంది. కావాల్సిన పత్రాలు ఫిబ్రవరి 28, 2025లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు అర్హులు. రైతుభరోసా అప్లికేషన్ పత్రం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్‌లతోపాటు రైతు మొబైల్నంబర్ వ్యవసాయాధికారి కార్యాలయానికి తీసుకెళ్లాలి.మండలం రైతులు గంభీరావుపేట 440 ఇల్లంతకుంట 686 ముస్తాబాద్ 441 సిరిసిల్ల 305 తంగళ్లపల్లి 863 వీర్నపల్లి 79 ఎల్లారెడ్డిపేట 1,153 బోయినపల్లి 347 చందుర్తి 221 కోనరావుపేట 659 రుద్రంగి 73 వేములవాడ 705 వేములవాడరూరల్ 311 -
పదిర బ్రిడ్జికి మరమ్మతు
● కొన్ని నెలలుగా ఇబ్బందిపడ్డ ప్రయాణికులు ● ‘సాక్షి’ వరుస కథనాలు ● స్పందించిన అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రోడ్డుపై ఉన్న వంతెనపై పడ్డ భారీ గుంత మరమ్మతు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు ఎనిమిది నెలల క్రితం పదిర వద్ద గల బ్రిడ్జిపై భారీ గుంత పడింది. ఇక్కడ భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో గుంతను మట్టితో పూడ్చి హెచ్చరిక బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి పదిర బ్రిడ్జి వద్ద ఒక వాహనం దాటిన తర్వాతే మరో వాహనం వెళ్లాయి. ఈ గుంతతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. స్పందించిన అధికారులు వంతెన మరమ్మతుకు రూ.3.75లక్షలు మంజూరు చేసి, టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సోమవారం పనులు ప్రారంభించారు. దీంతో వాహనాలను దారి మళ్లించారు. పదిర గ్రామంలో నుంచి హరిదాస్‌నగర్ పెద్దమ్మగుడి వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు పనులు ముగియడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.బ్రిడ్జి మరమ్మతు పనులు -
సిరిసిల్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటుకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యాలయంలో స్కూల్, జూనియర్ కళాశాల కొనసాగుతున్నట్లు గుర్తించారు. స్కూల్లో విద్యార్థుల సంఖ్య, ఎన్ని గదులు, ఎంత విస్తీర్ణంలో ఉందో ఆరా తీశారు. కాలేజీ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ మహేశ్‌కుమార్, హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ విధానంలో జనగణన జనగణన–2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జనగణనకు సంబంధించిన అంశాలపై చార్జ్ సహాయకులు, సాంకేతిక సహాయకులకు శిక్షణను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ శ్రేయ, శిరీష తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రం పరిశీలన జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ తనిఖీ చేశారు. పాఠశాలలోని ఏ, బీ విభాగాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో 7,304 మందికి 11 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు డీఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. సిరిసిల్లటౌన్: విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాడుతామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతి నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్‌కుమార్, శ్రీరాముల సంజన, నాయకులు రమేశ్, రమణ, విమల, నవీన్, సతీశ్, శివ, జశ్వంత్ పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ముందుకురావాలని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి కోరారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మోడల్‌స్కూల్, కేజీబీవీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లోని విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. వీర్నపల్లి, గొల్లపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఎస్.రంజిత్‌కుమార్, సకారం, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. కేంద్రియ విద్యాలయంలో అడ్మిషన్లుసిరిసిల్ల: జిల్లాలోని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో 2026–2027 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ ఎన్.శేషప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీలోగా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతి అడ్మిషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. 2వ తరగతి, ఆపై తరగతుల కోసం ఆఫ్‌లైన్ ద్వారా స్కూల్ పనివేళల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు పాఠశాల పనివేళల్లో సంప్రదించవచ్చని కోరారు. -
వెల్లువలా దరఖాస్తులు
● ప్రజావాణికి 167 విన్నపాలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్మాది ముస్తాబాద్ మండలం పోతుగల్. మా సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ కాకుండా ఆమె భర్త శ్రీనివాస్ అన్ని తానంటూ వ్యవహరిస్తున్నాడు. కనీసం వార్డు సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. సర్పంచ్ భర్త వ్యవహారంపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలి. – పోతుగల్ గ్రామ పాలకవర్గ సభ్యులుమాది సిరిసిల్లలోని గణేష్నగ. ముస్తాబాద్‌లోని పీపుల్స్ ఆస్పత్రిలో గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ ఫెయిల్ కావడంతోపాటు మూత్రనాళం వద్ద తీవ్రగాయం చేయడం జరిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారు డీఎంహెచ్‌వో సిరిసిల్లకు రెఫర్ చేయగా సంబంధిత మెడికల్ రిపోర్ట్స్ రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. మెడికల్ రిపోర్ట్స్ త్వరగా ఇప్పించండి. – జి.అనూష, సిరిసిల్లసిరిసిల్ల మున్సిపల్ రోడ్డు డివైడర్లపై ఉన్న కోనోకార్పస్ మొక్కలతో అలర్జీలు, శ్వాస సమస్యలు వస్తున్నాయి. డివైడర్లపై మొక్కలు ఏపుగా పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోనో కార్పస్ మొక్కలను తొలగించి ఆ స్థానంలో అనుకూలమైన మొక్కలు నాటాలి. – చెన్నమేని రాజుకుమార్, సిరిసిల్లసిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక పలువురు బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటి కప్పుడు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి 167 దరఖాస్తులు స్వీకరించారు.నా భర్త 20 ఏళ్ల క్రితం మస్కట్‌లో మృతిచెందాడు. శవం కూడా ఇంటికి రాలేదు. నా ఇద్దరు పిల్లలు సాహరిక, వేణు దివ్యాంగులే. వారి వైద్యఖర్చులకు చాలా వరకు ఖర్చు అవుతున్నాయి. మాది నిరుపేద కుటుంబం. నా పిల్లలకు ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలి. – కళ్యాణం కొమురవ్వ, దేశాయిపల్లి -
పర్యాటకంలో సిరిసిల్ల
సిరిసిల్ల: రాజన్న భక్తుల రాకతో జిల్లాకు పర్యాటకు ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ని లిచింది. ఏడాది పొడవునా భక్తులు వస్తుండడంతో వేములవాడతోపాటు నాంపల్లిగుట్ట సందడిగా మా రుతుంటుంది. జిల్లాకు 1,68,32,897 మంది పర్యాటకుల రాకతో వేములవాడ టూరిజం గుర్తింపు పొందింది. గతేడాదితో పోల్చితే జిల్లా తలసరి ఆదా యం పెరిగినా రాష్ట్రస్థాయిలో మాత్రం ర్యాంక్ దిగజారింది. 2025లో 28వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 30వ స్థానానికి పడిపోయింది. గోదావరి జలాల రాకతో జిల్లాలో వ్యవసాయరంగంలో ప్రగ తి సాధించింది. అభివృద్ధి సూచికలో స్వల్పంగా మెరుగుపడింది. సగటు వ్యక్తిగత తలసరి ఆదా యం గతేడాది కంటే రూ.42,259 పెరిగింది. 2026 సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా ఆరేళ్లలోపు అమ్మాయిల సంఖ్య తగ్గింది. ఫలితంగా జిల్లాలో పసిగుడ్డులను గుట్టుగా తల్లికడుపులోనే చిదిమేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో వాస్తవాలివీ. అక్షరాస్యతలోనూ అంతంతే.. జిల్లా అక్షరాస్యత 62.71 శాతం ఉండగా.. పురుషుల అక్షరాస్యత 73.5 శాతం, మహిళల అక్షరాస్యత 52.2 శాతంగా ఉంది. ఆరేళ్ల పైబడిన వారి సంఖ్య 5,03,286 మంది ఉండగా. ఇందులో 3,15,611 మంది చదువుకున్నారు. ఇందులో పురుషులు 1,82,296 మంది కాగా, మహిళలు 1,32,665 మంది ఉన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో జిల్లా 18వ స్థానంలో ఉంది. పనిమంతులు 2,53,918 మంది జిల్లాలో పనిమంతులు 54.10 శాతం ఉన్నారు. జనాభాలో 2,53,918 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయదారులు 66,751 మంది కాగా, వ్యవసాయ కూలీలు 1,01,737 మంది ఉన్నారు. పరిమితంగా పనిచేసే వారు 44,745 మంది ఉన్నారు. పనిచేసే అంశంలో రాష్ట్రంలో 30వ స్థానంలో జిల్లా నిలిచింది. గతేడాది ఒక్క వ్యక్తి తలసరి ఆదాయం(ప్రస్తుత ధరల్లో) రూ.2,13,725 ఉండగా.. ఆ ఏడాది రూ.2,55,984 ఉంది. ఒక్క ఏడాదిలోనే వ్యక్తి తలసరి ఆదాయం రూ.42,259 పెరిగింది. జాతీయ స్థాయిలో సగటు వ్యక్తి ఆదాయం రూ.2,19,575 కాగా.. జిల్లా సగటు ఆదాయం అంతకుమించి ఉండడం విశేషం. జిల్లా ఆదాయం రూ.5,363.27 కోట్లతో ఉంది. గుర్తింపు పొందిన పరిశ్రమలు 97 ఉండగా.. 520 మంది ఉద్యోగులు, 402 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా రూ.147.01కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. జిల్లాలో 1,38,992 కుటుంబాలు ఉండగా.. 16,058 కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. జిల్లాలో 4,224 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. వరి, పత్తిదే అగ్రస్థానం వరి, పత్తి పంటలదే అగ్రస్థానం. జిల్లాలో 2,37,373 ఎకరాల్లో వివిధ పంటలు వానాకాలంలో సాగవుతుండగా.. 1,87,688 ఎకరాల్లో వరి, 41,921 ఎకరాల్లో పత్తి పంట వేశారు. జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 80,389 ఉన్నాయి. గృహావసరాల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 1,78,035 ఉండగా, పరిశ్రమల కనెక్షన్లు 22,255 ఉన్నాయి. జిల్లాలో 666 చెరువులు ఉండగా.. 30,017 ఎకరాలు సాగవుతుంది. వ్యవసాయ అనుబంధంగా పశుసంపద పెరిగింది. గతంలో 4,31,338 పశువులు ఉండగా.. ఈ ఏడాది 5,95,763కి చేరాయి. వస్త్రోత్పత్తి రంగంలోనూ మెరుగుపడినా.. వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగినా.. రాష్ట్రస్థాయిలో చివరి నుంచి నాలుగు స్థానంలో ఉండడం గమనార్హం. -
గుట్టుగా భ్రూణహత్యలు !
జిల్లా జనాభా 5,52,037 కాగా.. పురుషులు 2,74,109, మహిళలు 2,77,928. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,014 మంది మహిళలు ఉన్నారు. కానీ బాల, బాలికల నిష్పత్తిని పరిశీలిస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆరేళ్లలోపు పిల్లల్లో బాలు రు 25,099 మంది ఉంటే బాలికలు 23,652 మందే ఉన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య 1,447 తక్కువగా ఉంది. జిల్లాలో భ్రూణహత్యలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. అందుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కోనరావుపేట మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకు 886 మంది అమ్మాయిలు ఉన్నారు. బోయినపల్లిలో 917 మంది ఉన్నారు. అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో భ్రూణహత్యలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టినా గుట్టుగా అబార్షన్లు జరుగుతున్నాయి. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోటిక్ టెక్నిక్స్(పీసీ పీఎన్డీటీ) ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్ యాక్ట్ 1994, అండ్ రూల్స్ 1996 ప్రకారం తల్లి కడుపులోని పసి గుడ్డు లింగ నిర్ధారణను ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్లు వెల్లడించరాదు. గర్భంలో పాప ఎదుగుదల, లోపాలు తెలుసుకునేందుకు స్కానింగ్ ద్వారా పరిశీలించాలి. కానీ కొందరు డాక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి కడుపులోని పాప ఆడో, మగో చెప్పడంతో అబార్షన్లకు అవకాశమిస్తోంది. స్కానింగ్ సెంటర్లు, జనటిక్ సెంటర్లు, రేడియాలజిస్ట్‌లు తల్లి కడుపులోని బిడ్డ సెక్స్‌ను చెప్పడం జరుగుతోంది. ఇది నేరమని తెలిసినా పైసల కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. -
స్థలం లేక.. పనులు సాగక
ఇది సిరిసిల్ల శివారులోని చంద్రంపేట విద్యుత్ సబ్‌స్టేషన్. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ సబ్‌స్టేషన్‌లో రెండు ఫవర్ ట్రాన్స్ఫార్మర్లు(పీటీఆర్) ఉన్నాయి. వీటి పరిధిలో ఆరు ఫీడర్ల ద్వారా సిరిసిల్లకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. కలెక్టరేట్ శివారులో మరో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదన చేశారు. కలెక్టరేట్ వద్ద మరో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రంపేట సబ్‌స్టేషన్‌పై భారం తప్పుతుంది. ఇక్కడ ఓవర్‌లోడ్‌తో తరచూ సిరిసిల్లలో విద్యుత్ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. రెండో బైపాస్ రోడ్డులో ఒకటి, శాంతినగర్‌లో మరోటి, సుభాష్‌నగర్‌లో మరో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే సిరిసిల్ల పట్టణ విద్యుత్ వినియోగదారుల లోవోల్టేజీ సమస్య తీరుతుంది. -
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
చేనేత రంగంపై చిన్నచూపెందుకు?సిరిసిల్ల: చేనేత, జౌళి రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపిందని, ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. జనాభా ధామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపితగా కేసీఆర్‌ను ప్రజలు గుర్తిస్తే.. బూతుపితగా సీఎం రేవంత్‌రెడ్డి మారారని విమర్శించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో చేనేత, జౌళి రంగానికి రూ.1,200 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.258 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి చేనేత రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీలు గజభీంకార్ రాజన్న, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, నాయకులు బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, సత్తార్, కోడి అంతయ్య, కౌన్సిలర్లు బింగి రాంబాబు, ఎలుక వెంకటేశ్‌యాదవ్, నాగరాజు, బాలు, నరేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి
బోయినపల్లి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పరశురామ్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో రెండురోజులుగా జరుగుతున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ –2026 ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, శిక్షణతో కార్యకర్తలకు సిద్ధాంతపరమైన స్పష్టత, కార్యాచరణలో నైపుణ్యం, సమాజ సేవలో అంకితభావం పెరుగుతుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, మండల ప్రభారీ వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఉదారి నరసింహాచారి, మండల మాజీ అధ్యక్షుడు గుడి రవీందర్‌రెడ్డి, సర్పంచులు బొంగాని అశోక్‌గౌడ్, పెంచాల సౌమ్య మహేశ్, నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్‌రెడ్డి, మెరుపుల గంగా ధర్, సంగీత, గంగాధర్‌చారి, కొనుకటి హరీశ్, కొండం శ్రీనివాస్‌రెడ్డి, స్వామికుమార్, శరత్‌చంద్రారెడ్డి, సారంపల్లి రాజు, పాలోజు రాజేంద్రప్రసాద్, అమెరిశెట్టి గంగయ్య, ఇల్లందుల బాలయ్య, జనగం లక్ష్మణ్, సుంకపాక ప్రభు, రజనీకాంత్, ముఖ్యవక్తలు బత్తుల లక్ష్మీనారాయణ, కరెండ్ల మధుకర్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, సంగం నరేశ్ పాల్గొన్నారు. -
● విప్ ఆది శ్రీనివాస్
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంరుద్రంగి(వేములవాడ): ప్రజల అభ్యున్నతి, రైతు సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో రైతులు, పార్టీ నాయకులు 37 నెలల పాటు ప్రతినెలా 22న ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు నిర్వహించి నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూభాగానికి నీరు అందించే ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో సూరమ్మను చేర్చి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మల్యాల గ్రామంలో రూ.1,737 కోట్లతో ప్రాజెక్టు పనులకు అంకురార్పణ చేశారని, రుద్రంగి నాగారం చెరువు వారి హయాంలోని పూర్తయిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నిల్వ సామర్థ్యాన్ని 150 ఎంసీఎఫ్‌టీ నుంచి 450 ఎంసీఎఫ్‌టీ వరకు పెంచే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా రైతాంగానికి నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, వేములవాడ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
రెండు గ్రామాలకో సబ్‌స్టేషన్
జిల్లా పరిధిలో రెండు గ్రామాలకో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు మా లక్ష్యం. ‘సెస్’ పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లు ఎంతో అవసరం. ఈమేరకు ఎన్పీడీసీఎల్ అధికారులకు నివేదికలు పంపిస్తూ మంజూరు చేయిస్తున్నాం. చాలా గ్రామాల్లో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు వినియోగదారులు భూమిని కేటాయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం సమస్య ఉంది. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నాం. స్థలం కేటాయిస్తే సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. – చిక్కాల రామారావు, ‘సెస్’ చైర్మన్, సిరిసిల్ల -
బంగారు తెలంగాణను అప్పుల్లో నెట్టిండ్రు
● రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ సిరిసిల్లటౌన్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో ఆయన సమక్షంలో గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ–నర్సాగౌడ్ దంపతులతో పాటు పలువురు వార్డు మెంబర్లు కాంగ్రెస్‌లో చేరగా, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పాలనలో షాడో సీఎంగా ఉన్న కేటీఆర్ తన నియోజకవర్గం అభ్యున్నతిని గాలికి వదిలేశారని ఫలితంగానే గంభీరావుపేట మండలం వెనుకబాటులో కొట్టుమిట్టాడుతుందన్నారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం, కాంగ్రెస్ అందిస్తున్న అభివృద్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపడుతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కటుకం మృత్యుంజయం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, మల్లుగారి నర్సాగౌడ్ పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీట గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని వార్డు సభ్యులు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షుడు హమీద్, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, ప్రశాంత్, అర్జున్, శ్రీమతి, శిరీష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
పారా అథ్లెటిక్స్‌లో ప్రతిభ
వీర్నపల్లి: మండలంలో జవహర్‌లాల్‌నాయక్ తండా పరిధి భంగీరెడ్డితండాకు చెందిన దివ్యాంగురాలు భూక్యా సక్కుబాయి జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో నిర్వహించిన 24వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఎఫ్40 కేటగిరీ షాట్‌పుట్ పోటీలో 12వ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. సక్కుబాయి దివ్యాంగురాలైనప్పటికీ పట్టుదలతో శ్రమించి, జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అంజన్నకు కేంద్రమంత్రి బండి పూజలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శనివారం పూజలు చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, వైస్ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లతో కలిసి ఆలయానికి చేరుకోగా.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ అంజారెడ్డి, సర్పంచులు సంకూర్తి తిరుపతి, వకుళాభరణం మౌర్య, బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, ఉప సర్పంచ్ మల్లేశ్ యాదవ్, నాయకులు బొట్ల ప్రసాద్, కొల్లూరి గంగాధర్, బొబ్బిలి వెంకటస్వామి, కెల్లెటి రమేశ్, గుండేటి గంగారాం, ఆలయ సిబ్బంది హరిహరనాథ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిరాయికల్: రాయికల్ మండలం ధర్మాజీపేటకు చెందిన గిరిజన నాయకుడు గుగ్లావత్ చిరంజీవి (40) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సుధీర్‌రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుగ్లావత్ చిరంజీవి గ్రామంలోని కుంటలో చేపలు పట్టడానికి శనివారం వెళ్లాడు. పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న వైరు నీటిలో ఉండటంతో గమనించకుండా కుంటలోకి దిగాడు. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చిరంజీవికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిరంజీవి అఖిల భారత బంజార గిరిజన సేవ సంఘ్ మండల అధ్యక్షుడిగా గిరిజనులకు సుపరిచితులు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, గిరిజన నాయకులు సంతాపం ప్రకటించారు. అనుమానాస్పద స్థితిలో లస్కర్..చిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ కెనాల్ దగ్గర లస్కర్‌గా పనిచేస్తున్న చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన తడిగొప్పుల మల్లయ్య (55) శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి మల్ల య్య, అనిల్ కెనాల్‌పై డ్యూటీ చేశారు. రాత్రి కెనాల్ వద్దే నిద్రించారు. శనివారం ఉదయం అనిల్ నిద్రలేచి చూడగా మల్లయ్య కనిపించలేదు. కొద్దిదూరంలో ఉన్న గూడ తిరుపతి పొలం వద్ద అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దివ్యా.. నీ వెంటే నేను
ఇల్లందకుంట: అతనో ఎస్సై.. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితం. ఈ నెల 17న కడుపునొప్పి బాధ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేని ఎస్సై సైతం నీవెంటే నేనంటూ.. శనివారం అత్తగారింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలు కాగా.. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన దేసు చంద్రశేఖర్(36) ప్రస్తుతం కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య(30)తో 2016లో వివాహమైంది. నగరంలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శుభమన్యు(4) అశ్వద్ధామ(7) ఉన్నారు. దివ్య ఆత్మహత్యతో... అన్యోన్యంగా సాగుతున్న వారి జీవన ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దివ్య కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 17వ తేదీన గన్నేరుపువ్వు, ఆకు పసరు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివ్య పుట్టినిల్లు అయిన ఇల్లదంకుంట మండలం సీతంపేటకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల సమయంలో దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించారు. దివ్య తండ్రి చంద్రశేఖర్‌ను ఓ గదిలో ఉంచి తాళం వేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు. బట్టలు మార్చుకుంటానని వెళ్లి.. భార్య మృతితో చంద్రశేఖర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడో రోజు కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. శనివా రం ఐదవ రోజు కార్యక్రమం జరిగింది. శ్మశాన వాటిక వద్ద కార్యక్రమం పూర్తిచేసుకుని అంతా ఇంటికొచ్చారు. బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ గడియపెట్టుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. గదిలోంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో చంద్రశేఖర్ తల్లిదండ్రులు, తమ్ముడూ అక్కడే ఉన్నారు. అనాథలైన పిల్లలు భార్య, ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు కమ్ముకోవడంతో చంద్రశేఖర్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్య మృతి చెందడంతో మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని మరవక ముందే ఐదు రోజుల వ్యవధిలో తండ్రి కూడా దూరమవడంతో పదేళ్లలోపు పిల్లలిద్దరూ ‘మమ్మీ,డాడీ’ అంటూ రోదించడం అక్కడివారిని కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్ తమ్ముడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మాధవి వివరించారు. భార్య మృతిని తట్టుకోలేక కరీంనగర్ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న భార్య దివ్య ఐదు రోజుల వ్యవధిలో దంపతుల మృతి అనాథలైన ఇద్దరు చిన్నారులు సీతంపేటలో విషాదంఅదే నా చివరి కోరిక అంటూ..చంద్రశేఖర్ చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ.. ‘నేను ఒకవేళ చనిపోతే.. నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి’ అంటూ చెప్పాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సీతంపేటకు తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించి, దివ్య అంత్యక్రియలు చేసిన చోటే చంద్రశేఖర్ మృతదేహాన్ని ఖననం చేశారు. -
ఠాణా ఎదుట ధర్నా
కూతురుతో మాట్లాడించాలని ధర్మారం: ప్రేమ పేరుతో ఒక యువకుడు తమ కూతురిని వివాహం చేసుకున్నాడని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదని ధర్మారానికి చెందిన కుంటయ్య కుటుంబ సభ్యులు శనివారం పురుగుల మందు డబ్బా పట్టుకుని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితులు, పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన కుంటయ్య కూతురును జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గొడిసెల పేటకు చెందిన యువకుడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో తన కూతురుతో ఒకసారి మాట్లాడాలని తండ్రి కుంటయ్య, తల్లితోపాటు సోదురుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే యువకుడి తల్లిదండ్రులను పిలిపించి యువతీకువకులను ఠాణాకు తీసుకురావాలని ఆదేశించారు. తర్వాత యువకుడి తల్లిదండ్రులను వారి ఇంటికి పంపించారు. ఆగ్రహానికి గురైన యువతి కుటుంబసభ్యులు.. వారిని ఎందుకు పంపించారని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో యువతీయువకులను ఠాణాలకు పిలిపిస్తామని చెప్పి కుంటయ్య కుటుంబసభ్యులను ఇంటికి పంపించారు. పోలీసులు యువకుడి తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ కుంటయ్య కుటుంబ సభ్యులు పురుగులమందు డబ్బా పట్టుకుని మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అప్రమత్తమైన పోలీసులు.. పురుగులమందు డబ్బా స్వాధీనం చేసుకుని వారిని బయటకు పంపించారు. గ్రామంలోకి వెళ్లిన కుంటయ్య.. మరో పురుగుల మందు డబ్బాతో మళ్లీ ఠాణా వద్దకు చేరుకున్నాడు. డబ్బా మూత తీసి పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న స్థానికులు డబ్బాను లాక్కున్నారు. ఆవేదనకు గురైన కుంటయ్య కుటుంబసభ్యులు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని యువతి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. అదేసమయంలో ఠాణాకు వచ్చిన ఎస్సై ప్రవీణ్‌కుమార్.. కుంటయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెళ్లి చేసుకున్న యువతీయుకులను ఆదివారం రప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుంటయ్య, కుటుంబసభ్యులు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎస్సైని సంప్రదించగా.. వివాహం చేసుకున్న యువతీయువకులిద్దరి సర్టిఫికెట్లు పరిశీలించామని, పుట్టిన తేదీప్రకారం వారు మేజర్లు కావడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. అయినా.. వారిద్దరినీ పిలిపించే ప్రయత్నం చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని తల్లిదండ్రుల ఆవేదన -
బ్రాండ్ సెట్టర్
సిరిసిల్లలో మంచి పేరున్న వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన పుల్లూరి శ్రీకాంత్(39) చిన్న వయసులోనే నిర్మాణరంగంలో స్థిరపడ్డారు. శ్రీకాంత్ తాత, నానమ్మలు పుల్లూరి లక్ష్మీనారాయణ, అనసూర్యలు చిరువ్యాపారులు. వారి వారసత్వ వ్యాపారాన్ని మరింత పెంచుతూ శ్రీకాంత్ తల్లిదండ్రులు పుల్లూరి రాధా, కృష్ణమూర్తి స్థానికంగా హార్డ్‌వేర్ వ్యాపారాన్ని విస్తరించారు. ఆ వ్యాపారాన్ని ఆకాశమెత్తుకు చేర్చుతూ పారిశ్రామికవేత్తగా పీఎస్కే స్టీల్, పీఎస్కే సిమెంట్‌తోపాటు భవన నిర్మాణాలు, వంతెనలు, రోడ్లు, అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణాలకు అవసరమైన అన్ని వస్తువులను నేరుగా సరఫరా చేసే స్థాయికి చేరారు. నిజానికి ఈ వ్యాపార రంగంలో మార్వాడీ సేట్లు, ఉత్తర భారతానికి చెందిన బడా వ్యాపారులు స్థిరపడి ఉండగా.. వాళ్లకు ధీటుగా నమ్మకంగా.. శ్రీకాంత్ ఆ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్‌లో కంపెనీలో భాగస్వామిగా మారి సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా నిర్మాణ రంగంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించారు. -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
● దుబాయ్ వెళ్లినా తీరని కష్టాలు ● అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు ● వీర్నపల్లి మండలం శాంతినగర్‌లో విషాదం వీర్నపల్లి(సిరిసిల్ల): అప్పులు కుప్పలుగా మారి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ అన్నదాత ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన గుగులోత్ గోపాల్(40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించకపోవడంతో ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు తోడై గుదిబండలా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇంటి పనులు మొదలుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నుంచి బిల్లులు సరిగ్గా రాకపోవడంతో ఆ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు గూడు లేని వేదనతో గోపాల్ శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోడ్డున పడ్డ కుటుంబం గోపాల్ మరణంతో అతని భార్య నిర్మలతోపాటు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె సరస్వతి ఇంటర్ సెకండియర్, రెండో కుమార్తె శిరీష పదో తరగతి, కుమారుడు జగ్గు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. లారీ ఢీకొని చిన్నారి మృతిశంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో శనివారం రాత్రి లారీ ఢీకొని నిత్య(3) మృతి చెందింది. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు పక్కన కత్తులు, కొడవళ్లు, తయారు చేసే శ్రావణ్–పంచబూలకు నలుగురు కూతుళ్లు. మూడో కూతురు నిత్య రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నిత్య అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదాణానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పరారయ్యారు. కేశవపట్నం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
లక్ష మందికి ఉపాధి లక్ష్యం
2030 నాటికి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించి లక్ష మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నాను. ప్రముఖ కంపెనీల కొలాబ్రేషన్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను. ‘అల్ఫా సర్కిల్’ను ప్రపంచ వ్యాప్తం చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలగా అనుకున్నది సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను. మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తా. – పుల్లూరి శ్రీకాంత్, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు -
సామాజికాంశాలను కవిత్వీకరించాలి
● ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సిరిసిల్ల: కవులు, రచయితలు సామాజికాంశాలను తీసుకుని కవిత్వీకరించాలని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పేర్కొన్నారు. సిరిసిల్లలోని అక్షర చైతన్య గ్రంథాలయంలో శనివారం మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘మానేటి స్వరం’ పేరుతో ‘ప్రపంచ కవితా దినోత్సవం’ నిర్వహించారు. జూకంటి జగన్నాథం మాట్లాడుతూ 1999లో పారిస్‌లో జరిగి న యునెస్కో 30వ సర్వసభ్య సమావేశంలో మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. తన చిన్నతనంలో విన్న పాండవ కథలు, హరికథల గురించి వివరించారు. తనను ప్రభా వితం చేసిన జక్కని వెంకటరాజం, కనపర్తి, నిజాం వెంకటేశంలను గుర్తుకు చేసుకున్నారు. పుస్తకాల అధ్యయనం అవసరమన్నారు. పూలే గులాంగిరి, అంబేడ్కర్‌ను చదవాలని సూచించారు. ‘పాతాళగరిగే’, ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ లోంచి కవితలను వినిపించారు. మారసం 37 ఏండ్ల ప్రస్థానాన్ని ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్ వివరించారు. మారసం వ్యవస్థాపకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ ప్రపంచ కవితా దినోత్సవం ఆవిర్భావ, వికాసాల గురించి వివరించారు. మారసం కోశాధికారి, కవులు ఎలగొండ రవి, వెంగళ లక్ష్మణ్, అక్షరచైతన్య గ్రంథాలయ స్థాపకులు నాగుల పూర్ణచందర్, రచయిత, జర్నలిస్ట్ అల్లె రమేశ్, కవులు దూడం గణేశ్, గుండెల్లి వంశీకృష్ణ, తాటిపాముల కిరణ్, వేముల మార్కండేయులు పాల్గొన్నారు. -
‘చెత్త’పనులపై బల్దియా కొరడా
సిరిసిల్లటౌన్: చెత్తను వీధుల్లో పారవేస్తున్న వ్యాపారులపై బల్దియా కొరడా ఝుళిపించింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబజారు ప్రాంతంలో శనివారం కొందరు వ్యాపారులు, స్థానికులు చెత్తను వాహనానికి ఇవ్వకుండా రోడ్లపై పడేస్తున్నట్లు కమిషనర్ ఖదీర్‌పాషా తెలిపారు. ఇలాంటి పనులతో ప్రజా ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయన్నారు. చెత్తను రోడ్డుపై పడేస్తున్న షాపు యజమానులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానాలు విధించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో వెంటనే వర్కర్ టు ఓనర్ పథకం పూర్తి చేసి కార్మికులకు అందించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. నేతన్నల సమస్యల సాధన, సిరిసిల్ల వస్త్రపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలను ప్రస్తావిస్తూ చేపడుతున్న ఈనెల 25న జరిగే మహాధర్నా పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రం నేసిన కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని కోరారు. చేనేత జౌళి శాఖ గుర్తింపుకార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా పవర్‌లూమ్స్‌కు ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, యూనియన్ జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, ఒగ్గు గణేశ్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): కాపాడుకున్నప్పుడే మానవజాతి మనుగడ సాధ్యమని ఎఫ్ఆర్వో కల్పనదేవి పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర్నపల్లిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. అటవీ సంపదను అంతం చేయడం ద్వారా వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయన్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలతో కలిసి కేక్ కట్ చేశారు. సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, ఉపసర్పంచ్ జక్కుల నరేశ్, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. -
కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు
వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 27న నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈనెల 19 నుంచి 27 వరకు వసంత నవరాత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27న సీతారాముల కల్యాణోత్సవం శివార్చన వేదికపై నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదే రోజు సాయంత్రం రథోత్సవం ఉంటుందని వివరించారు. భక్తుల కోసం క్యూలైన్లు, చలివేంద్రాలు, పందిర్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
రాజన్న భక్తులకు సంపూర్ణ భద్రత
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రత ఏర్పాట్లు చేపట్టాలని మల్టీజోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. భీమేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభ కలశంతో స్వాగతం పలికారు. స్వామి వారి మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయ పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ, సిరిసిల్ల డీఎస్పీలు శ్రీనివాస్, నాగేంద్రచారి పాల్గొన్నారు. పోలీసులకు చట్టాలపై అవగాహన అవసరం సిరిసిల్ల క్రైం: పోలీసులకు చట్టాలపై అవగాహన ఉండాలని మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ అధికారులతో సమీక్షించారు. కేసుల దర్యాప్తు, నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కఠినతరం చేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతీ వ్యక్తి సురక్షితంగా తిరిగి ఇంటికి చేరే లక్ష్యంతో చేపట్టిన శ్రీఅరైవ్ అలైవ్శ్రీ కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, వెంకటేశ్వర్లు, రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
ప్రార్థనల్లో చిన్నారులు సిరిసిల్లటౌన్/వేములవాడ/గంభీరావుపేట(సిరిసిల్ల): ముస్లింలు రంజాన్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతపెద్దలు రంజాన్ పవిత్రతను వివరిస్తూ ప్రసంగించారు. శాంతి, సహనం, సోదరభావం వంటి విలువలు పాటించాలని సూచించారు. సిరిసిల్లలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్, మన్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్, టౌన్ సీఐ వీరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో వక్ఫ్‌బోర్డు చైర్మన్ గంభీరావుపేట మండల కేంద్రంలోని ఈద్గాలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ ప్రార్థనలు చేశారు. ఆలింగనం చేసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. -
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్సిరిసిల్ల అర్బన్: ప్రజాపాలనలో నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జేపీనగర్‌లో శనివారం నిర్వహించిన గుండేటి అఖిల–కరుణాకర్ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, 23వ వార్డు కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఆడెపు వెంకటేశం, ఆకెన సతీశ్, ఎదురుగట్ల వనిత తదితరులు పాల్గొన్నారు. -
సల్లంగా చూడు పోచమ్మతల్లి
ముస్తాబాద్(సిరిసిల్ల): కొండాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శనివారం పోచమ్మ బోనాలు తీశారు. కులస్తులు ప్రతీ ఇంటి నుంచి బోనాలతో తరలివచ్చారు. బైండ్ల కళా కారుల ఆటలు, డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో పోచమ్మ బోనాలు ఆలయానికి తీసుకెళ్లి మొక్కులు చెల్లించారు. ఏటా ఉగాది తర్వాత పోచమ్మ బోనాలు తీయడం ఈ గ్రామంలో ఆనవాయితీ. సర్పంచ్ మహేందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అధ్యక్షుడు చిగురు నరేశ్, రెడ్డి సంఘం అధ్యక్షుడు తీనేటి రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, కోశాధికారి గుడికందుల మహేందర్‌రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవిరెడ్డి, అంజిరెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళితవర్గాల సాధికారత బడ్జెట్
దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన స్కీంను ప్రారంభించింది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల అభివద్ధి, యువత సాధికారత, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సమతుల్యం దిశగా ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. – సత్తు మల్లేశ్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ అల్పాహారం పథకం పేద,మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వరం, మధ్యాహ్న భోజన పథకానికి ఇది తోడవడంతో డ్రాపౌట్స్ మరింత తగ్గుతాయి. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయడం సాహసోపేతమైన నిర్ణయం. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – డాక్టర్ సూరేపల్లి సుజాత, విద్యా కమిషన్ సభ్యురాలు విద్యాశాఖకు నిరాశ విద్యాశాఖకు 8.2 శాతం మాత్రమే నిధులు కేటాయించడం నిరాశను మిగిల్చింది. ఈ బడ్జెట్‌తో విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపించడం అసాధ్యం. కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ ప్రాధాన్యతను గుర్తించడం లేదు. – దుమాల రమానాథ్‌రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కార్మిక, కర్షకులకు మోసం నేతన్నలకు 12 నెలలు పని కల్పిస్తామన్న ప్రభుత్వం బడ్జెట్లో రూ.258 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇవి ఏ మూలకు సరిపోవు. పవర్లూమ్ కార్మికుల వర్కర్ టు ఓనర్ పథకానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. – మూశం రమేశ్, పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఉమ్మడి జిల్లాలో అల్పాహారం పథకం వివరాలు
స్కూళ్లు1,82021జగిత్యాల11కరీంనగర్8,70012పెద్దపల్లి15,000కరీంనగర్ 651పెద్దపల్లి 527సిరిసిల్ల 403103878,300సిరిసిల్లకళాశాలలు -
ప్రజారంజక బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్ అందించింది. వ్యాపారం, వ్యవసాయం రంగాలతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూర్చడం హర్షణీయం. అన్ని రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడంతో రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్‌కు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. – సంగీతం శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు మరోసారి మోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు రాష్ట్ర ప్రజలను మూడోసారి బడ్జెట్లో కూడా మోసం చేసింది. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్లు ఇస్తామన్న ఊసెత్తలేదు. సంక్షేమ పథకాలను విస్మరించారు. కేవలం అంకెల గారడితో నెట్టుకొస్తున్నారు. సీఎం రియల్ వ్యాపారంలా పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన నడుస్తుంది. అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. – తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వాస్తవాలకు దూరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది. అప్పులను దాచిపెట్టారు. అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు లేవు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక నిధులు లేక అభివృద్ధి అటకెక్కింది. ఆటో కార్మికులు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, స్కూటీల హామీలకు నిధులేవి. నిరుద్యోగుల గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదు. – రెడ్డబోయిన గోపి, బీజేపీ జిల్లా అధ్యక్షుడుప్రజా రంజకమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజ కంగా ఉంది. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం హర్షించతగ్గది. కొత్తగా రెండు లక్షల చేయూత ఫింఛన్ల మంజూరి సామాన్యులకు ఉపయోగకరంగా ఉంది. విద్యారంగానికి బడ్జెట్లో విషేశంగా నిధులు కేటాయించారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయని విధంగా ప్రజా ప్రభుత్వం చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ సమానంగా చూస్తుంది. – మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే మొండి చెయ్యి సర్కారు సబ్బండ వర్గాలకు మొండి చేయి చూపింది. మహాలక్ష్మికి రూ.2500, ఆసరా రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, నిరుద్యోగ భృతికి రూ.4వేలకు నిధులు కేటాయింపులు లేవు. రిటైర్డ్ ఉద్యోగులు, చేనేత కార్మికుల చేయూత లేదు. విద్యార్థినులకు స్కూటీ, మహిళలకు తులం బంగారం అధికారంలోకి రాగానే 100 రోజులలో ఇస్తామని.. మూడో బడ్జెట్లో కూడా మొండి చెయ్యి చూపింది. – అల్లాడి రమేశ్, సెస్ మాజీ చైర్మన్ -
బీమా..
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026అల్పాహారం!ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రస్తుతం 41 లక్షల కుటుంబాలు (2011 ప్రకారం.. 37 లక్షలు) ఇందిరమ్మ బీమా పొందే కుటుంబాలు: 8,00,000ఉమ్మడి జిల్లాకు కనీస అంచనా రూ.400 కోట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.హైదరాబాద్– కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్‌కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్‌ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్‌పై ప్రకటన, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ధాన్యం సేకరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గన్నీసంచుల లభ్యతపై చర్చించారు. జిల్లాలో 4లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, 2.70 లక్షల నుంచి 3 లక్షల టన్నుల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 159, పీఏసీఎస్ 73, డీసీఎంఎస్ 1, మెప్మా ఆధ్వర్యంలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 5,839 టార్పాలిన్లు, 507 తేమ యంత్రాలు, 700 ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, 606 ప్యాడీ క్లీనర్లు, 270 డిజిటల్ గ్రైన్ క్యాలివర్స్, 270 హస్క్ రిమూవర్లు, రెండు డ్రైయర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ వసతి కల్పించాలని సూచించారు. ధాన్యం వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎమ్మార్ ఇవ్వాలి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను రైస్‌మిల్లర్లు గడువులోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీలు అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దించుకునేందుకు హమాలీలను నియమించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీఆర్డీవో గీత తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధగా చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కిచెన్, స్టోర్‌రూమ్స్ తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లో ఉన్న సరుకుల నాణ్యతను స్వయంగా పరిశీలించడంతోపాటు విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను, మెనూ చార్ట్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా అని తెలుసుకున్నారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులను ఉత్తేజరపరిచారు. -
విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
వేములవాడరూరల్: వేధింపులపై విద్యార్థినులు నిర్భయంగా షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని షీటీమ్ ఏఎస్సై ప్రమీల కోరారు. వేములవాడ రూరల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్ర వారం అవగాహన కల్పించారు. ఏఎస్సై ప్రమీల మాట్లాడుతూ సోషల్ మీడియాలో అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా షీటీమ్ విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, షీటీమ్ సేవలు, మహిళాచట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు గురైతే నిర్భయంగా షీటీమ్‌కు 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సిబ్బంది రవి, శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కల్యాణోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు
వేములవాడ: ఈనెల 27న నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో రమాదేవి అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో శుక్రవారం సమావేశమయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి సిరిసిల్ల: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ ముందుచూపుతో వైద్యపరీక్షలు చే యించుకోవడం అన్నింటికీ మంచిదన్నారు. 263 మందికి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పీఎస్ నగర్ పట్టణ ఆ రోగ్య కేంద్రం వైద్యాధికారి సాహితీ, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత పాల్గొన్నారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని స్టార్ ఫంక్షన్హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేసింది. అడిషనల్ ఎస్పీతోపాటు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, మండల విద్యాధికారి కృష్ణహరి, సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు సా హెబ్, ఉపాధ్యక్షుడు గౌస్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు. అభిషేకం.. అర్చనలు వేములవాడ: రాజన్న ఆలయంలో కొనసాగుతున్న శ్రీసీతారాముల కళ్యాణోత్సవాల్లో భా గంగా రెండో రోజు శుక్రవారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శ్రీసీతారాములకు పంచో పనిషత్తు ద్వారా అభిషేకం, శ్రీరాజరాజేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీలక్ష్మీఅనంత పద్మనాభ స్వామికి అభిషేకం చేశారు. కవి సమ్మేళనం సిరిసిల్లటౌన్: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన సిరిసిల్లలోని డే కేర్ సెంటర్లో శుక్రవారం కవిసమ్మేళనం నిర్వహించారు. గోశికొండ మురారి పంతులు, వెంగళ లక్ష్మణ్, బూర దేవానందం, బార ధనరాజ్, పద్యాలు ఆలపించారు. సంఘం ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, దొంత దేవదాసు, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీరామరాజు, డాక్టర్ జనపాల శంకరయ్య, జ్ఞానోబా, ధ్యావనపల్లి శ్రీహరి, గజవాడ కైలాసం, మెరుగు లక్ష్మణ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తాంసిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ రెండున్నరేళ్లు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. విద్యార్థిభృతి, నిరుద్యోగుల భృతి ఇంకా అందలేదన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండున్నరేళ్లుగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఎన్నికల సమయంలో మాత్రమే రైతు భరోసా ప్రభుత్వానికి గుర్తుకొస్తుందన్నారు. మహిళలకు ప్రకటించిన కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి చందుర్తి/రుద్రంగి(వేములవాడ): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన కోరారు. బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సును చందుర్తి మండలం సనుగుల గ్రామపంచాయతీ గంగిరెద్దులకాలనీలో శుక్రవారం నిర్వహించారు. రుద్రంగి మండలం గైదిగుట్టలో నిర్మిస్తున్న గిరిజన బాలికల వసతి గృహం, రుద్రంగి జెడ్పీ హైస్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గంగిరెద్దులకాలనీని దత్తత తీసుకుని పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, చందుర్తి ఎంపీడీవో లెంకల రాధ, ఐసీడీఎస్ సీడీసీవో సౌందర్య, సర్పంచ్ బొడిగే లావణ్య, ఉపసర్పంచ్ స్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత, హెచ్ఎంలు సత్యనారాయణ, కట్కూరి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాపీమేసీ్త్ర ఆత్మహత్య
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన మట్ట రాజయ్య(48)ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజయ్యమేసీ్త్ర పనిచేస్తున్నాడు. కొందరి వద్ద డబ్బులు తీసుని ఇళ్లు నిర్మిస్తూ ఇచ్చేవాడు. ఈక్రమంలో అప్పుల పాలయ్యాడు. కొందరు యజమానులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో వారు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తావని తరచూ అడిగారు. మనస్తాపం చెందిన రాజయ్య రత్నాపూర్లో స్లాబ్వర్క్ ఉందని చెప్పి శుక్రవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లలేదు. భార్య ఓదేమ్మ ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయలేదు. తన తమ్ముడు రాజాపూర్‌లోని కలవేన సంపత్‌కు ఆమె ఫోన్‌చేసి విషయం చెప్పింది. అతడు రాజాపూర్‌లోని ఓ కొత్త ఇంటికి వెళ్లి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తన భర్త మరణంపై అనుమానాలు లేవని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి అక్కడే ఫిర్యాదు స్వీకరించి అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. రుద్రంగిలో చిరుత కలకలంరుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నాగారం బొర్రయ్య రైతు పొలం వద్ద ఉన్న కాపాల కుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఆవులు, గేదెలను పాకలో కట్టేసి, రెండు కుక్కలను కాపలాగా కట్టేశాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఒక కుక్కను చిరుత చంపివేసింది. కుక్కను రూ.8 వేలకు కొన్నట్లు రైతు బొర్రయ్య తెలిపాడు. గతంలోనూ ఇదే ఏరియాలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఫారెస్టు ఆఫీనర్ రవీందర్‌ను వివరణ కోరగా చిరుత ఆనవాళ్లు కనిసించలేదన్నారు. కుక్కపై దాడి చేసిందని హైనా కావచ్చని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తూ కుక్కను చంపిన ప్రదేశాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మోతీరాం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గోవధను అడ్డుకున్న వీహెచ్‌పీ నాయకులు
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామం వద్ద గోవధ కోసం అక్రమంగా తరలిస్తున్న కోడెను వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు. కోడెను జగిత్యాల నుంచి వేములవాడకు ఆటోలో తీసుకొస్తుండగా పట్టుకుని రాజన్న గోశాలకు తరలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు గడప కిశోర్‌రావు, నందగిరి రాహుల్, రాజేందర్, మహేశ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. నిమ్మపల్లిలో మూడిళ్లలో దొంగతనానికి యత్నం కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో శుక్రవారం దొంగతనానికి యత్నించారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిమ్మపల్లికి చెందిన ఇద్దగిరి మల్లేశం గల్ఫ్‌కు వెళ్లగా భార్య సుజాత బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. అయితే ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. అదే గ్రామానికి చెందిన ఇద్దగిరి మల్లయ్య(తండ్రి చిన్నమల్లయ్య), ఇద్దగిరి మల్లయ్య( తండ్రి రాజయ్య) ఇళ్లల్లోనూ చోరీకి యత్నించారు. కోనరావుపేట పోలీసులు విచారణ చేపడుతున్నారు. పుస్తెలు దొంగలించిన ఇద్దరి రిమాండ్ సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో మహిళ మెడలోని బంగారు పుస్తెలు దొంగిలించిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాశినగర్కు చెందిన సయ్యద్ మౌలానా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మంగూరు ప్రకాశ్‌యాదవ్‌ను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. ఈనెల 17న రాత్రి సాయినగర్ ఏరియాలో మేర్గు లత ఇంటి గేటు బయటకు రాగా, ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆమె మెడలోని బంగారు పుస్తెలను లాక్కొని, బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సయ్యద్ మౌలానా, మంగూరు ప్రకాశ్‌యాదవ్‌ను రగుడు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.4 గ్రాముల బంగారు పుస్తెలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎగువమానేరులో యువకుడి మృతదేహం● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి వినయ్‌కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతునికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం -
ప్లాస్టిక్ కవర్ల కొరత
మంథని: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం ఉన్నా విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. తక్కువ పరిమాణంగల ప్లాస్టిక్ కవర్లు మార్కెట్లో అందుబాటులో ఉండడంతో అనేకమంది వాటినే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలితిన్ కవర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు. ఫలితంగా ప్రజలు తప్పనిసరి బట్ట సంచులు, బుట్టలతో మార్కెట్‌కు వస్తున్నారు. చేతి సంచులతో సందడి పాలితిన్ కవర్ల కొరతతో పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తోపాటు కిరాణాల్లో నిత్యావసరాలు తీసుకెళ్లే ప్రజలు చేతిసంచులు, బుట్టలతో సందడి చేస్తున్నారు. గతంలో చేతిసంచులు, బుట్టలతోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్లే జనం.. ఇప్పుడు పాతరోజులను గుర్తుచేసుకుంటున్నారు. చేతి సంచులు, బుట్టలతో వచ్చే కస్టమర్లను ఆకర్శించడానికి వ్యాపారులు కొత్తిమీరకట్ట, ఆకుకూర కట్టలను ఉచితంగా అందిస్తున్నారు. ఇలా కొనసాగితే.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అధికారులు ఎన్నిమార్లు విన్నవించినా.. కొన్ని మున్సిపాలిటీల్లో జరిమానాలు విధిస్తు న్నా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కానీ, యుద్ధం నేపథ్యంలో పాలితిన్ కవర్ల దిగుమ తికి ఆటంకం ఏర్పడింది. వాటి కొరతతో ప్రజలు పాతరోజుల్లో మాదిరిగా బుట్ట, బట్ట సంచులను వినియోగిస్తున్నారు. ఇదే పద్ధతిని జనం అలవాటు చేసుకుంటే అనేక అనర్థాల నుంచి దూరం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ట సంచిలో కూరగాయలు తీసుకెళ్తున్న స్థానికులు బట్ట సంచులకు డిమాండ్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం -
ఇలాగైతే ఆడేదెలా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖ కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. విద్యార్థులు స్కూల్ లెవల్లో వివిధ పోటీల్లో పాల్గొన్న వారు ఇంటర్‌కు వచ్చేసరికి శిక్షకులు లేక నైపుణ్యం కరువైంది. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సైతం శిక్షణకు దూరమై వివిధ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. లెక్చరర్లతోనే శిక్షణ ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణలో విద్యార్థులు పెద్దగా ఆటలపై పట్టు సాధించడం లేదు. దీంతో వీరు ఏ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు. ఇదే సమయంలో గురుకులాల్లో ప్రత్యేక శిక్షకులు ఉండడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ వివిధ క్రీడావిభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడాకోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభు త్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో పీడీలు కరువు విద్యార్థులకు అందని క్రీడాశిక్షణ క్రీడాసామగ్రికి నిధులు.. శిక్షకులు కరువు జిల్లాలో 10 జూనియర్, రెండు డిగ్రీ కళాశాలలు ఆటలకు దూరంగా విద్యార్థులు -
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో మరణించడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మనోధైర్యం కల్పించారు. మృతుడు రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజిరెడ్డి మృతి అనంతరం మంత్రి రెండోసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజిరెడ్డి బతికున్న కాలంలో పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మంత్రి ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన మంత్రి -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
మెట్పల్లి (కోరుట్ల): పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్ ఇన్ గేట్ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన దుర్గయ్య(65) ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్‌గేట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా లోపలికి వస్తున్న బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. రాజన్న గుడి వద్ద నాగుపామువేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజేశ్వరపురం వద్ద నిర్మాణం పనుల ప్రాంతంలో శుక్రవారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చేరుకుని నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఆరింటిని సీజ్ చేశారు. 6 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. డీసీఎస్ రవీందర్‌రెడ్డి, సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్ వెంకటరాజిరెడ్డి, ఆర్ఐ అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. పిడుగుపడి ఎద్దు మృతి ఇల్లంతకుంట(మానకొండూర్): పిడుగుపడి శుక్రవారం తెల్లవారుజామున ఎద్దు మరణించింది. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో కేశవేణి ఎల్లయ్యకు చెందిన పశువుల కొట్టం వద్ద రెండు ఎడ్లను కట్టివేశాడు. శుక్రవారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగు పడడంతో ఒక ఎద్దు చనిపోయింది. గతేడాది హఠాత్తుగా ఒక ఎద్దు చనిపోయిందని, ఇప్పుడు మరో ఎద్దు చనిపోవడంతో అప్పులపాలైనట్లు రైతు రోదించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వే
బోయినపల్లి(చొప్పదండి): ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో భాగంగా మొదట సాధారణ వివరాలతో కూడిన సర్వే చేపట్టి వివరాలు నమోదు చేస్తున్నట్లు కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో భాగంగా మండలంలోని స్తంభంపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లో శుక్రవారం జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను సర్వే నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలను ఎంపిక చేసుకుని సర్వే చేసిన అనంతరం గ్రామంలో కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి, మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్‌లో వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, విద్యార్హతలు, వృత్తివిద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి వివరాలు రోజువారి కూలీ అయితే వివరాలు, మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్లు అయితే వారి ఆదాయ వివరాలు నమోదు చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, సర్పంచులు బొంగాని అశోక్, కొప్పుల లావణ్య నగేశ్, పంచాయతీ కార్యదర్శులు మౌనిక, ఎండీ. జాఫర్ హైమద్ ఉన్నారు. -
రూ.1.50లక్షల విరాళం
మల్యాల: హైదరాబాద్‌కు చెందిన పార్కంపేట వెంకటేశ్ దంపతులు శుక్రవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఉచిత నిత్యాన్నదానం కోసం తమవంతుగా రూ.1.50లక్షలు అందజేశారు. ఈవో అంజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు యువకుల అరెస్ట్మానకొండూర్: మానకొండూర్ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి, లింగాపూర్ గ్రామానికి చెందిన భరత్ గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ శ్రీలత శుక్రవారం తెలిపారు. మానకొండూర్ రైస్‌మిల్లుల వద్ద గంజాయి సేవిస్తుండగా పట్టుకుని రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. -
భట్టి బడ్జెట్‌పై ఆశలు..!
● హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల చిరకాలవాంఛ అయిన కల్వల ప్రాజెక్టు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి ఇటీవల డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి ప్రకటన ఉంటుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనసభలో నేడు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభించేనా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ – కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్‌ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్‌పై ప్రకటన, కల్వల ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.● వేములవాడ ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్ అమలు కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసింది. మాస్టర్‌ప్లాన్ సమగ్ర అమలు, ఆలయ నిర్మాణం పూర్తవాలంటే.. మరో రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.● జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దక్క న్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్ర భుత్వం నుంచి ప్రకటన కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. 2015లో మూ తబడిన ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ రూ.172 కోట్ల బ కాయిలు చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 2025లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటి బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.● మనోహరాబాద్ నుంచి కొ త్తపల్లి వరకు రూ.2,780 కోట్లతో రైల్వేప్రాజెక్టు లైన్ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల వరకు లైన్ పూర్తవగా.. సిద్ధిపేట – సికింద్రాబాద్ వరకు రైలు అందుబాటులోకి వచ్చింది. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక వేములవాడ, వెదిర, కొత్తపల్లి వరకు పనులు సాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు, భూసేకరణ వంటి సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఈ రైల్వేలైన్ పూర్తయితే.. ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉమ్మడి జిల్లాకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.● పెద్దపల్లితోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల విడుదలపై ఉమ్మడి జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు.● రామగుండం బీ థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేత అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రివర్గంలో మంత్రుల బృందం ఎన్టీపీసీ, జెన్కో సంస్థల్లో ఏది తక్కువ వ్యయంతో ప్లాంట్ నిర్మించి, తక్కువ రేట్‌కు కరెంట్ ఇచ్చే సంస్థకు నిర్మించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాంతవాసుల కోరికై నా ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం పాత బీ థర్మల్ ప్లాంట్ మిషనరినీ తుక్కు కింద విక్రయించేందుకు వివిధ విభాగాల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతో దాని నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రి పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 60వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం రూ.150 కోట్లు నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో భూ కేటాయింపులు, తదితర పనుల జాప్యంతో ముందుకు సాగడం లేదు. -
చిన్నారుల అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● అంగన్వాడీ భవనానికి భూమిపూజవేములవాడఅర్బన్: చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం శాభాష్‌పల్లిలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనానికి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరయ్యారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, పోషణరంగాల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. సర్పంచ్ ఏటీ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, మాజీ సర్పంచ్ పండుగ ప్రవీణ్, గ్రామాధ్యక్షుడు స్వామి, కదిరె రాజుకుమార్, అభియాదవ్ పాల్గొన్నారు. -
జిల్లా వాసులకు ఉగాది పురస్కారాలు
వేములవాడఅర్బన్: జిల్లాకు చెందిన ఇద్దరికి ఉగాది పురస్కారాలు దక్కాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు ఈశ్వర్‌గారి సురేష్, నాదస్వర కళాకారుడు శ్రీనివాస్‌కు ఉగాది పురస్కారాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. బోయినపల్లివాసికి గద్దర్ అవార్డు ప్రశంసలు బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025లో భాగంగా లఘుచిత్రాల విభాగంలో బోయినపల్లి మండలకేంద్రానికి చెందిన కనపర్తి హన్మాండ్లు డిప్లొమా ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన టీజీఎఫ్ఏ అవార్డుల కార్యక్రమలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, దిల్ రాజు, ప్రియాంక చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనే లఘు చిత్రానికి ప్రశంసా పత్రం దక్కింది. -
వరదకాలువకు నీరు విడుదల చేయండి
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్, దేశాయిపల్లి పరిసరాల్లోని వరదకాలువకు ఎల్లంపల్లి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విలాసాగర్ రైతులు గురువారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి విన్నవించారు. నీరు విడుదల చేస్తే పంటలకు అందుతుందన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సత్యం వెంటనే నీరు విడుదల చేయాలని ఎల్లంపల్లి ఈఈ సత్యనారాయణను ఫోన్లో ఆదేశించారు. రైతులు గంగాధర సురేందర్ తదితరులు ఉన్నారు. ఇఫ్తార్‌కు నిధులు మంజూరు చేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళపల్లి, వీర్నపల్లి మండలాల్లో ఇఫ్తార్ విందులకు నిధులు మంజూరు చేయాలని మైనార్టీ నాయకులు కోరారు. ఈమేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతికి గురువారం వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్, నాయకులు సయ్యద్ జహంగీర్, హైమద్, గౌస్, సర్దార్, హబీబ్, హమీద్ ఉన్నారు. భక్తిశ్రద్ధలతో సంత్ సేవాలాల్ జాతర రుద్రంగి(వేములవాడ): మండలంలోని బడితండాలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తండావాసులు జగదాంబదేవీకి, శ్రీసంత్ సేవలాల్ మహారాజ్‌కి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ జగదాంబదేవి, సంత్‌సేవాలాల్ మహారాజ్ జాతరను ఉగాది రోజున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర మహోత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కవి సమ్మేళనాలతో భాషాభివృద్ధి ఇల్లంతకుంట(మానకొండూర్): భాషాభివృద్ధికి కవి సమ్మేళనాలు దోహదపడతాయని బాలసాహితీవేత్త డాక్టర్ వాసరవేణి పరుశరాములు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం నవీన సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపరాభవ నామ ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. జిల్లాలో 200 మంది పీహెచ్డీ పట్టాదారులు ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో నవీన సాహితీ ప్రారంభించి, కవి సమ్మేళనాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నవీన సాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాజమౌళి, ఎస్సై సిరిసిల్ల అశోక్, ఉపసర్పంచ్ మూగు నాగరాజుశర్మ, వెంకటేశ్వరరావు, డాక్టర్ జగన్మోహనరావు, రణం మల్లేశం, కవులు బిల్ల సతీశ్‌కుమార్, రేగుల భిక్షపతి, ఎం.సుగుణ, గైని శ్రీనివాస్ గౌడ్, వొల్లాల మధుసూదన్ పాల్గొన్నారు. -
సరైన దారి చూపాలి
ప్రస్తుతం యువతలో విపరీతంగా కోపం, హింసాత్మక ప్రవర్తన కనిపిస్తుంది. వీటన్నంటికీ మూలం మత్తు పదార్థాలకు అలవాటుపడడం. డ్రగ్స్ ప్రభావంలో వారు చేసే నేరాలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సోషల్‌మీడియా, ఆన్లైన్లో హింసాత్మక గేమ్స్, సినిమాల ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడాలి. వారి కోసం సమయం కేటాయించాలి. పాఠశాలలు, కాలేజీల్లో కౌన్సెలింగ్ సదుపాయాలు కల్పించాలి. – సురేంద్రబాబు, పిల్లల వైద్యనిపుణుడు, సిరిసిల్ల -
పరాభవం.. శుభప్రదం
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026రాజన్న సన్నిధిలో.. వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వరాలయంలో ప్రధాన అర్చకుడు చంద్రగిరి శరత్‌శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పండితులను సత్కరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్సవమూర్తులను దర్శించుకొని పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ దర్శించుకున్నారు. సిరిసిల్లటౌన్/వేములవాడ: తెలుగు నవవత్సరం పరాభవంలో ప్రజలు సుఖసంతోషాలతో విరజిల్లుతారని సిద్ధాంతులు, పంచాంగకర్తలు పేర్కొన్నారు. సిరిసిల్ల శ్రీవేంకటేశ్వరస్వామి, వేములవాడ భీమన్న ఆలయాల్లో గురువారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని కొత్తకుండలో షడ్రుచుల మేళవింపుతో తయారు చేసిన పచ్చడిని సేవించారు. సిరిసిల్లలోని వెంకన్న క్షేత్రం, మార్కండేయ ఆలయం, శివసాయిబాబా, వాసవీ కన్యకాపరమేశ్వరీ, బీవై నగర్ భక్తాంజనేయ, విద్యానగర్ అభయాంజనేయస్వామి, నెహ్రూనగర్ హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పార్టీ కార్యాలయాల్లో... సిరిసిల్లలోని బీఆర్ఎస్ ఆఫీసులో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ గంభీరావుపేట(సిరిసిల్ల): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడి వై ద్యసేవలపై ఆరా తీశారు. ఇన్‌పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్‌రూమ్, వ్యాక్సినేషన్, యునాని హాస్పిటల్, ఆస్పత్రి ఆవరణ పరిశీలించారు. హాస్పిటల్ ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీవోకు సూచించారు. అవసరమైన మరమ్మతులు చేయించాలని అ ధికారులను ఆదేశించారు. వైద్యులు, సి బ్బంది అందుబాటులో ఉండాలని, మె రుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, డీసీహెచ్ఎస్ రవీందర్, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, వైద్యాధికారి సృజన్ ఉన్నారు. బాధితుల వద్దకే పోలీసులుసిరిసిల్ల క్రైం: వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు స్టేషన్‌కు వెళ్లడం భారంగా మారకుండా ఉండేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచే ఫిర్యాదు స్వీకరించి, ట్యాబ్‌ల సహాయంతో ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసినా, నేరుగా సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. -
శ్రీపరాభవ నామం.. షడ్రుచుల మేళం
నేడు ఉగాది పర్వదినంసిరిసిల్ల: వనాలన్నీ చిగురించే వేళ.. పూల పరిమళాలు వెదజల్లే సమయాన.. లేలేత చివుళ్లు వేసి... కోయిలమ్మల కుహు కుహూ రాగాలు .. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వచ్చేది వసంతం.. ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం. తెలుగు సంవత్సర ఉగాదిని ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం ఆనవాయితీ. నేటి నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ‘పరాభవ నామ సంవత్సరం’ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సామాజిక, జీవన మార్గదర్శక భావనలను అందిస్తుంది. ‘పరాభవ’ అనే పదానికి సాధారణంగా ‘పరాజయం’ అనే అర్థం ఉన్నప్పటికీ, ఇది మన లోపాలను గుర్తించి, వాటిని జయించి, విజయానికి పునాది వేయాలని సూచిస్తుంది. నేడు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరపనున్నారు. -
మానేరును తోడేస్తున్రు!
‘ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్, పదిర శివారులోని చిట్టివాగు నుంచి ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సమీప పొలాల రైతులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేలోపే ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్లతో సహ పరారయ్యారు.’ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక వ్యాపారుల అక్రమార్జనకు భూగర్భజలాలు పడిపోతున్నాయి. పంటలు చేతికొచ్చే దశలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మానేరువాగులో నుంచి ఇసుకను ఇష్టారీతిగా తరలిస్తుండడంతోనే సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రైతులు అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకుంటున్నారు. పగటిపూట అనుమతులతో ఇసుక తరలిస్తున్నా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో పలువురు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరు ఇష్టారీతిగా మానేరువాగులో తవ్వుతుండడంతో సమీప బావులు, బోరుబావులు అడుగంటుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు సాధారణంగా రైతులు పొలాల వద్ద కాపలా కాస్తుంటారు. కానీ జిల్లాలోని మానేరువాగు, చిట్టివాగు, నక్కవాగులను ఆనుకుని పొలాలు ఉన్న రైతులు మాత్రం రాత్రి పూట ఇసుక తీసుకెళ్లకుండా కాపలాగా ఉంటున్నారు. ఎండుతున్న పంటలు జిల్లా రైతుల వరప్రదాయని మానేరువాగు గంభీరావుపేట మండలం నర్మాల నుంచి బోయినపల్లి మండలం మిడ్‌మానేరు వరకు ప్రవహిస్తుంటుంది. మానేరువాగును ఆనుకుని 97వేల ఎకరాలలో వరి పంట సాగవుతుంది. ఇసుక వ్యాపారులు పైసాచికానికి పోయి అనుమతులు లేకుండా అర్ధరాత్రి కూడా వాగును తోడుతున్నారు. ఇలా ఇసుకను తీసుకెళ్తుండడంతో మానేరువాగులోని సమీప వ్యవసాయ బావులు, బోరుబావులు ఎండిపోతున్నాయి. ఫలితంగా మానేరువాగు, నక్కవాగులను ఆనుకుని ఉన్న సమీప పొలాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి కాపాడుకుంటున్న పంటలు ఇసుక దొంగల కారణంగా ఎండిపోతుండడంతో కడుపుమండిన రైతులు అర్ధరాత్రి కాపలా ఉండి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. పంటల సమాచారం జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం : 1,11,234 ఎకరాలు మానేరువాగు ప్రాంతం : 79వేల ఎకరాలు అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు ఇసుకాసురులపై రైతుల తిరుగుబాటు జలవనరుల సంరక్షణకు అన్నదాతల తిప్పలు రాత్రిపూట రెచ్చిపోతున్న స్మగ్లర్లు పగటిపూట అనుమతులు.. చీకట్లో అక్రమాలు -
ప్రజా ప్రభుత్వంలో రైతులకు భద్రత
● అసెంబ్లీలో విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని, ప్రజా ప్రభుత్వంలో రైతులకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా, పనిముట్లు, సన్నాలకు బోనస్ ఇస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని పశువులకు దాణాగా వేసేవారని, ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యాన్ని ప్రతీ ఒక్కరూ తింటున్నారని అన్నారు. నాడు డబుల్‌బెడ్ రూమ్ పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా 600 బస్సులను సంఘాలకు కేటాయించామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. -
నువ్వు చనిపోయావ్.. పింఛనివ్వం
కోనరావుపేట(వేములవాడ): ఓ వృద్ధురాలు బతికుండగానే మృతిచెందినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేయగా.. ఆసరా పింఛన్‌కు దూరమైంది. వివరాలు.. కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వృద్ధుడు మాదాసు నర్సయ్య 8 ఏళ్ల క్రితం మృతిచెందాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. భర్త పింఛన్‌ను తన పేరిట మార్చాలని నర్సవ్వ అధికారులకు దరఖాస్తు చేసుకుంది. నెలలు గడుస్తున్నా పింఛన్ మంజూరు కాకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అధికారులు చెప్పిన విషయం విని షాక్‌కు గురైంది. నర్సవ్వ మృతి చెందినట్లు రికార్డులో నమోదై ఉంది. దీంతో 8 ఏళ్లుగా అధికారులు, కార్యాలయాల చుట్టూ పింఛన్ కోసం తిరుగుతూనే ఉంది. చనిపోయింది తన భర్త అయితే తాను మృతి చెందినట్లు అధికారులు రికార్డు నమోదు చేశారని, వారి తప్పిదం వల్ల తనకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికై నా అధికారులు తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటోంది. 8 ఏళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న వృద్ధురాలు బతికుండగానే మృతిచెందినట్లు నమోదు చేసిన అధికారులు -
సాహితీవేత్తలు మార్గదర్శకులుగా నిలవాలి
సిరిసిల్లటౌన్: సమాజహితమే లక్ష్యంగా సాహిత్యం స్వచ్ఛమైన గంగా ప్రవాహమై నిరంతరం కొనసాగాలని డీఎస్పీ నాగేంద్రచారి ఆకాంక్షించారు. సిరిసిల్ల సాహితీ సమితి, మానేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా మంగళవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌లోని భక్త విఠలేశ్వర హనుమాన్ ఆలయంలో జరిగిన కవి సమ్మేళనానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ హితమే లక్ష్యంగా కవితలు, రచనలతో భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజానికి దిశానిర్దేశం చూపేది కవులు, రచయితలేనని పేర్కొన్నారు. సమ్మేళనంలో డీఎస్పీతో పాటు కవులను సన్మానించారు. కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చింతోజు భాస్కర్, సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షుడు పోరండ్ల మురళీధర్, వెంగళ లక్ష్మణ్, నేరోజు రమేశ్, ఆడెపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు లేకుంటే జైలుకే..
మానేరువాగు, ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించి జైలుకు పంపిస్తున్నాం. ఈ నెల 11న హరిదాస్‌నగర్‌లోని చిట్టివాగు నుంచి అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించాం. ఇసుక తరలించిన నిందితుడిని పట్టుకుని రిమాండ్ చేశాం. రాత్రి పూట ఇసుక తరలింపుపై నిఘా పెట్టాం. – రాహుల్‌రెడ్డి, ఎస్సై, ఎల్లారెడ్డిపేట -
పల్లె మారింది
● గల్ఫ్ వలసల నుంచి సాఫ్ట్వేర్ వరకు.. నాలుగు దశాబ్దాల కిందట నెలకొన్ని కల్లోల పరిస్థితుల్లో వ్యవసాయం జూదంలా ఉండేది. పొట్ట చేతపట్టుకుని ముంబయి, దుబాయ్ వలసపోయే రోజులు. అరకొర ఆదాయం.. గల్ఫ్ వలసలు పల్లె జీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. కారణాలు ఏమైనా పల్లె ముఖచిత్రం వేగంగా మారిపోయింది. చదువుకుంటూ ఉద్యోగాలు చేసే యువకులు.. పుట్టిపెరిగిన ఊరిలో అందమైన భవనాన్ని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయంలోనూ ఆధునిక విధానాలు రావడం, వాణిజ్యంగా కోళ్లఫారాలు వెలువడం, పసిడి పంటలతో పల్లె ఆర్థిక వ్యవస్థ బలపడింది. పల్లె ముంగిట్లోకి సూపర్‌మార్కెట్, బట్టల షోరూంలు రావడంతో ఊరు తీరు మారిపోయింది. ● భూముల ధరలకు రెక్కలు రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లెల్లో భూములకు ధరలు పెరిగాయి. గతంలో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా నక్సలైట్ల ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేకపోవడంతో స్వేచ్ఛా విఫణిలో భూముల రేట్ల పెరిగాయి. జిల్లాలోని ఏ పల్లెకు వెళ్లినా భూమి ఎకరం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. తారు రోడ్డును ఆనుకుని ఉంటే రూ.కోట్లలోకి చేరింది. రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాలతో భూముల ధరలు పెరిగాయి. ప్రభుత్వం సైతం భూముల విలువను 2020 నుంచి మూడుసార్లు పెంచింది. పల్లెల్లోనూ ఇళ్ల స్థలాల ధర రూ.లక్షలకు చేరింది. తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.3.56లక్షలకు చేరడంతో పల్లె జీవన శైలి మారింది. సెల్‌ఫోన్ ప్రభావం పెరిగింది. సామాజిక మాధ్యమాలు పెరగడంతో మంచి, చెడును తెలుసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సాంకేతిక విప్లవం పల్లెను చేరింది. పల్లె మారింది. పల్లె జనం శైలి మారింది. అందమైన భవనాలు.. అంతకుమించి ఆదాయ వనరులు.. మారిన జీవన శైలి.. ఆన్లైన్లో ఆర్డర్లు.. సాంకేతికత ఆలంబనగా పల్లె ప్రజలు పట్టణాలతో పోటీ పడుతున్నాయి. డూప్లెక్స్ ఇళ్లు, సీసీ కెమెరాల నిఘా, ఖరీదైన కార్లు.. సెల్ఫోన్లు, నిరంతరం ఇంటర్నెట్. పల్లె ముగింట్లో ఆధునిక సౌరభాల సందడి. జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేటలో రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులు ఆ పల్లె రూపురేఖలను మార్చివేసింది. కల్లోల పల్లె.. కనువిందు చేస్తుంది ఊరు మారింది.. తీరు జోరుంది వన్నెలద్దుకుంటున్న పల్లెలు ఆధునికీకరణ దిశగా గ్రామీణ జీవనంసిరిసిల్ల: రెండు దశాబ్దాల కింద భూమి కోసం.. భుక్తి కోసం నక్సలైట్ల సాయుధ పోరు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసుల గాలింపులతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా ఉండేది. గోధూలి వేళ.. విప్లవ నినాదాలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. ప్రజాకోర్టులు.. అక్కడికక్కడే తీర్పులు.. వీపులు విమానపు మోతలు. తెల్లవారితే.. బూట్లచప్పుళ్లు.. పోలీసుల దిగ్బంధం.. ఊరంతా కట్టడి.. పోలీసుల ప్రజాదర్భార్.. అన్నలకు అన్నం పెట్టారంటూ.. నక్సలైట్ల సానుభూతిపరులపై పోలీసుల లాఠీల మోతలు.. అత్తగారు ముచ్చటపడి పెళ్లికి కట్నంగా బైక్ పెడతామంటే కూడా వద్దని వారించే కాలమది. పూరిళ్లు, రేకులషెడ్లు, తాటికమ్మల గుడిసెలు.. పెంకుటిండ్లు.. కొట్టాలు.. మిద్దె.. ఇవన్నీ నాటి నివాసాలు. చిన్న పల్లె.. పెద్ద మార్పు కోనరావుపేట మండలం బావుసాయిపేట చిన్నపల్లె. 2,289 మంది ఓటర్లతో ఉండే ఆ పల్లెజనాభా 4వేలలోపే. కానీ, శివారులోని రామన్నపల్లె కలిపి ఊరు విస్తరించింది. ఊరుకు మామిడిపల్లి, బండపల్లి, వట్టిమల్ల, వెంకట్రావుపేట నాలుగు వైపులా తారురోడ్లు, రెండు పెట్రోల్‌బంక్‌లు, మినీ రైస్‌మిల్లులు. బుధవారం వారపు సంత, ఇంటర్నెట్ సెంటర్, కల్యాణ మండపం, బైక్‌మెకానిక్ షాప్‌లు.. ఇలా పట్టణాల్లో కనిపించే ఆధునిక హంగులన్నీ బావుసాయిపేటలో చేరిపోయాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఆధునిక పోకడలతో కనువిందు చేస్తుంది. ఒక్క ఈ ఊరే కాదు.. జిల్లాలో ఏ ఊరును చూసినా సమూల మార్పులు కళ్లముందు మెరుస్తున్నాయి. ఆధునికీకరణ దిశగా గ్రామీణ జీవనం సాగుతుంది. పల్లె తీరు మారింది.. ఊరు మారింది. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల: కక్షిదారులు ఈ నెల 28న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత కోరారు. మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు పరిష్కరించాలని సూచించారు. పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్, మెజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి, కుమారి మేఘన, ఏఎస్పీ డి.చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ పోలీసులు పాల్గొన్నారు. రాజన్న సేవలో మంత్రి అడ్లూరివేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరస్వామిని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం గావించగా, ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్లు సింహాచారి, నరాల రాజు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్‌కు మల్లన్నసాగర్ జలాలుముస్తాబాద్(సిరిసిల్ల): మండు వేసవిలో రైతులకు ఉపశమనం కలిగించేలా మల్లన్నసాగర్ జలాలు ముస్తాబాద్ మండలానికి సోమవారం చేరుకున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను 12వ ప్యాకేజీ ద్వారా మోహినికుంట, మద్దికుంట, చీకొడు చెరువులకు వదిలారు. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో చెరువు నిండి.. మద్దికుంట చెరువుకు వారం రోజులుగా గోదావరి జలాలు వస్తున్నాయి. ఈమేరకు మద్దికుంట చెరువు కూడా నిండి మత్తడి పోస్తోంది. దీంతో మోహినికుంట, మద్దికుంట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వరిపంటలు పండుతాయో లేదోననే ఆందోళనలో ఉన్న రైతులకు మల్లన్నసాగర్ జలాలు ఉపశమనం కలిగించాయి. ఏఈ నవీన్‌కుమార్ మద్దికుంట చెరువును పరిశీలించారు. వారం రోజుల్లో ముస్తాబాద్ లింగంకుంట చెరువుకు నీళ్లు చేరుతాయని తెలిపారు. -
జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు స్వరూపరాణి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాకు చెందిన ప్రముఖ గాయకురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కత్తి స్వరూపరాణి జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు ఆమె ఎంపికై నట్లు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ (వరంగల్) అధ్యక్షుడు శ్రీధరస్వామి తెలిపారు. ఇటీవల శ్రీఅఖిల భారత సివిల్ సర్వీసెస్ సంగీతం, నృత్యం, నాటక పోటీల్లో ప్రతిభ చాటారు. జానపద బృంద గానం విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆమెను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. స్వరూపరాణి ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ వేదికపై కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రేడియో, టీవీ గాయకుడు కాసు మహేందర్‌రాజ్ బృందంతో కలిసి ఆమె తన గానాన్ని వినిపించనున్నారు. ఈసందర్భంగా స్వరూపరాణి, ఆమె బృందాన్ని ఎంఈవో రాజునాయక్, ఉపాధ్యాయులు అభినందించారు. -
ప్రతి మహిళ 20 మందికి అండగా నిలవాలి
సిరిసిల్ల: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మహిళ కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయంలో భరోసా ఇవ్వాలన్నారు. వందశాతం పన్ను వసూలు చేయాలి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, భవనాల పన్ను వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సిరిసిల్లలో పన్ను వసూలు లక్ష్యం రూ.6.99కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.5.66కోట్లు, వేములవాడలో రూ.4.54 కోట్లు లక్ష్యం కాగా, రూ.3.18 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామ సమాఖ్య, అంగన్వాడీ భవనాల పనులను పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక మైనార్టీ కార్పొరేషన్ ద్వారా శ్రీరేవంతన్నా కా సహారా– మిస్కీన్లశ్రీ పథకం ద్వారా ఫకీర్, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతికి జిల్లాకు కేటాయించిన ఈ–బైక్‌ల ఎంపిక కోసం కలెక్టర్ లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, డీఎంహెచ్‌వో రజిత, మైనార్టీ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ అధికారి స్వప్న, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, ఐఎంఏ డాక్టర్లు శోభారాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ -
కర్రంట్ పొయ్యి
చిరు వ్యాపారులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పలురకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటళ్లు, హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ముస్తాబాద్‌లోని పలు హోటళ్లలో కట్టెలపొయ్యి మిషన్‌కు కరెంట్ కనెక్షన్ ఇచ్చి అల్పాహారం, టీ తయారు చేస్తున్నారు. కట్టెల పొయ్యికి గాలి వచ్చేలా కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారు. దీంతో సులభంగా కావాల్సినంత మంట వస్తుందని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరకే కట్టెలు, మిషన్ లభిస్తున్నాయని పేర్కొన్నారు. – ముస్తాబాద్(సిరిసిల్ల) -
‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ లక్ష్యం సాధించాలి
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ముందుకు వెళ్లాలన్నారు. మహిళా సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు. గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ సూచించారు. జాతీయ పశువ్యాధుల నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవాల ఆరోగ్య సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని వివరించారు. జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
వేములవాడ: రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో వేసవిలో భక్తులు ఇబ్బంది పడొద్దని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చలువపందిళ్లు.. నీటి వసతి కల్పిస్తున్నారు. ఏర్పాట్లు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సమాచారం సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలు ప్రారంభించారు. స్కానర్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా 87369 36969కు ఏజీ అని మెసేజ్ పంపితే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుతాయి. భక్తుల దాహార్తిని తీర్చేందుకు రాజన్న జలప్రసాదం పేరుతో రెండు తాగునీటి కేంద్రాలను ప్రారంభించారు. క్యూలైన్ల వద్ద నల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీసీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 27న నిర్వహించే శ్రీసీతారామ కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఈమేరకు పోస్టర్, ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో రాజరాజేశ్వరస్వామికి ఏకాంత సేవలు నిర్వహిస్తూనే సీతారాముల కల్యాణోత్సవాన్ని శివార్చన వేదికపై జరుపనున్నారు. లడ్డూ ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు రాజన్న ప్రసాదం లడ్డూ తయారీ గోదాంలో ఆలయ ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లడ్డూ తయారీ, బరువు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. వంటశాలలోని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భద్రత ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏఈవో శ్రవణ్, ఇతర అధికారులు ఉన్నారు. -
పారిశుధ్య పనులపై నజర్
● మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వేములవాడ: పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక నజర్ పెడుతున్నామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. రూ.21.50 లక్షలతో రెండు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఆవరణలో సోమవారం కమిషనర్ సంపత్‌కుమార్, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లతో కలిసి పూజలు చేశారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. కౌన్సి లర్లు తూం మధు, కొండ రాజశేఖర్, టైలర్ శ్రీనివాస్, తోట రాజు, కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, సిరిగిరి శ్రీకాంత్, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: గీతానగర్ జెడ్పీహెచ్ఎస్లో స్కౌట్ అండ్ గైడ్స్ దీక్షా దినోత్సవం సోమవారం నిర్వహించారు. 16 మంది స్కౌట్, 16 మంది గైడ్స్ దీక్ష స్వీకారం చేశారు. పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా వారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ దుస్తులను పంపిణీ చేసినట్లు హెచ్ఎం శారద తెలిపారు. అనురాధ, తిరుపతి, గైడ్‌టీచర్ కొండికొప్పుల మంజుల, స్కౌట్ మాస్టర్ తడుకల సురేష్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): అసంపూర్తి కాలువను పూర్తి చేయాలని కోరుతూ మండలంలోని పెద్దలింగాపూర్‌లో 35 రోజులుగా రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం ముగిసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌కుమార్ రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎల్ఎం 6 కాలువ పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రూ.3.19 కోట్లు మంజూరు చేయించారని, రైతులు దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల: రేడియాలజిస్ట్ రెండు ఆస్పత్రులకు మించి స్కాన్ పరీక్షలు చేయొద్దని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబుతో కలిసి తనిఖీ చేశారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధమన్నారు. డిప్యూటీ డెమో రాజకుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ యాక్షన్‌ప్లాన్‌కు దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్ల: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–2026ను విడుదల చేశారు. బ్యాంకు అనుసంధానంతో రవాణారంగంలో వాహనాలు, వ్యవసాయ అనుబంధ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. 21 నుంచి 50 ఏళ్లలోపు వారు లబ్ధి పొందేందుకు మార్చి 24లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని ఎస్సీడీవో అధికారులు కోరారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వ్యవసాయేతర పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. వివరాలకు ఎస్సీడీవో ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు. -
వదులుతోంది..
చమురుసిరిసిల్లటౌన్: అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం ప్రభావం మన ప్రాంతంపై తీవ్రంగా పడుతుంది. పక్షం రోజులుగా సాగుతున్న యుద్ధంతో ప్రధానంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో టిఫిన్స్, బిర్యానితోపాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా బుకింగ్ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో మారిన పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. ఎగబాకుతున్న ధరలు నాలుగైదు రోజులుగా గ్యాస్ కొరతతో ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నారు. వంట తయారీకి పెరిగిన ఖర్చును వినియోగదారులపై వేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే కోడిగుడ్ల ధరలు పడిపోతున్నాయి. ఎక్స్‌పోర్టు లేక పౌల్ట్రీలలో కోడిగుడ్ల నిల్వలు పెరిగి ధరలు తగ్గుతున్నాయి.క్లోజ్.. గ్యాస్ లేక మూతపడ్డ కర్రీ పాయింట్నో స్టాక్.. సిరిసిల్లలో మూసి ఉన్న గ్యాస్ ఏజెన్సీ -
గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు
మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు గతంలో మాదిరిగా విరివిగా దొరకడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బ్లాక్ చేసి కొరత సృష్టిస్తున్నారు. గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి నిర్వహణ భారమైంది. గతంలో కమర్షియల్ సిలిండర్ రూ.1,780 ఉండగా.. ఇప్పుడు రూ.2400కు చేరింది. ఏజెన్సీలో స్టాక్ లేదని చెబుతున్నారు. నెలకు 70 సిలిండర్లు వాడే మేము గత్యంతరం లేక కట్టెలపొయ్యిపై వంట చేస్తున్నాం. ధరలు పెంచడంతో కస్టమర్లతో ఇబ్బంది కలుగుతుంది. – శ్రీగాథ శ్రీనివాస్, రెస్టారెంట్ నిర్వాహకుడు -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026Iసిరిసిల్ల అర్బన్: కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రావు కోరారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సిరిసిల్ల: అగ్రహారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్సులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు.ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
ప్రజావాణి వినండి
● వివిధ సమస్యలపై 142 దరఖాస్తులు ● పెండింగ్‌లో పెట్టొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు బాధితులు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. వివిధ సమస్యలపై 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలన్నారు.వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో మెయిన్‌రోడ్డులో నిర్మించిన శివాలయానికి తాటిచెట్లతో నష్టం జరుగుతుందని కలెక్టర్‌కు రజక సంఘం తప్పుడు ఫిర్యాదు చేశారు. గీతాకార్మికుల జీవనోపాధికి మూలమైన తాటిచెట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. – గౌడ సంఘం, ఫాజుల్‌నగర్ -
బహుజన రాజ్యం సాధిస్తాం
● బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్ సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో బహుజనరాజ్యం సాధించినప్పుడే కాన్షీరామ్ నిజమైన నివాళి అర్పించినట్లుగా బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో–ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో ఆదివారం నిర్వహించిన కాన్షీరామ్ 92వ జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూలే, సాహుమహారాజ్, అంబేడ్కర్ ప్రారంభించిన సామజిక పరివార్తన ఉద్యమానికి కాన్షీరామ్ సర్వస్వం ధారబోశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బహుజనుల బతుకులను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషాని రామచంద్రం, ఎనగందుల వెంకన్న, మాతంగి అశోక్, నీరడి ఈశ్వర్, కల్లెపల్లి రాజేందర్, దొడ్డే సమ్మయ్య, పల్లె ప్రశాంత్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు కొమ్మట అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి మహేశ్, ఎడ్ల అరుణ్‌కుమార్, కొమ్మాట వేణు, కట్కూరి నాగరాజు పాల్గొన్నారు. వేతనాలు విడుదల చేయించండి సిరిసిల్ల ఎడ్యుకేషన్/సిరిసిల్లటౌన్: సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ(ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్‌లో ఆధార్ వివరాలు సరిపోలేదని నిలిపివేసిన ఉపాధ్యాయుల ఫిబ్రవరి వేతనాలు విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆధార్ వివరాలు సరిపోలేదని జిల్లాలో 30 మంది టీచర్ల వేతనాలు నిలిచిపోయాయన్నారు. వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, నాయకులు అంబటి రమేశ్, గాలిపెల్లి సంతోష్, ఉపాధ్యాయులు రాంప్రసాద్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
వంతెనపై ఇంత నిర్లక్ష్యమా?
ఎల్లారెడ్డిపేట మండలం పదిర బ్రిడ్జిపై భారీ గుంత పడి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయడంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బస్సు, ఓ కారు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న కారు వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ సంఘటనతో బస్సులోని ప్రయాణికులు, కారులో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యం వందలాది వాహనాలు నడిచే ఈ వంతెనను ఇప్పటికై నా మరమ్మతు చేయాలని కోరుతున్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) -
రాయినిచెరువును నీటితో నింపాలి
వీర్నపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద చేపట్టిన రాయిని చెరువు పైప్‌లైన్ పనులు పూర్తి చేసి చెరువును గోదావరి జలాలతో నింపాలని మండలం మద్దిమల్ల గ్రామ సర్పంచ్, రైతులు డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలోని రాయినిచెరువు వద్ద ఆదివారం వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మద్దిమల్ల సర్పంచ్ ప్యాట్ల రవి, మద్దిమల్లతండా సర్పంచ్ కొడావత్ శిరీష, బంజార సర్పంచ్ బట్టు కృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అల్మాస్పూర్ నుంచి రాయినిచెరువు వరకు పైప్‌లైన్ పనులు చేసినట్లు తెలిపారు. రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో అనుమతులు లేవనే సాకుతో పనులు నిలిచిపోయాయన్నారు. మూడేళ్లుగా పనులు ఆగిపోవడంతో చెరువులోకి చుక్క నీరు రాక వేసవిలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయినిచెరువు నిండితే మద్దిమల్ల, రంగంపేట, కంచర్ల, అల్మాస్పూర్, వీర్నపల్లి, అడవిపదిరతోపాటు కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 2,435 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, సర్పంచులు సామల్ల దేవరాజు, గుగులోత్ రమేశ్, చాంద్ పాషా, గుగులోత్ సురేష్, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్, గుగులోత్ రవిలాల్నాయక్, తెలంగాణ రాష్ట్ర గోర్ సేన మీడియా, వివిధ గ్రామాల రైతులు గడ్డం దేవయ్య, ప్యాట్ల మల్లయ్య పాల్గొన్నారు. -
పాతాళంలో గంగ
మండలం 2026 2025 ఫిబ్రవరి ఫిబ్రవరి బోయినపల్లి 6.30 7.21 చందుర్తి 6.14 5.23 గంభీరావుపేట 9.64 11.59 ఇల్లంతకుంట 5.76 5.90 కోనరావుపేట 8.59 9.72 ముస్తాబాద్ 10.38 9.79 రుద్రంగి 7.20 5.31 సిరిసిల్ల 13.09 11.65 తంగళ్లపల్లి 6.98 7.87 వీర్నపల్లి 15.74 13.45 వేములవాడరూరల్ 5.10 4.77 వేములవాడఅర్బన్ 14.41 13.18 ఎల్లారెడ్డిపేట 15.04 15.62 జిల్లా సగటు 9.08 9.28 ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట కొత్తకుంట. యాసంగి సీజన్ ఆరంభంలో నిండా నీటితో ఉన్న ఈ కుంట ఇప్పుడు ఇలా ఎండిపోయింది. సాగునీటి వనరులైన చెరువులు, కుంటలు, వాగులు, బోర్లు, బావులు ఎండిపోవడంతో వాటిని నమ్ముకుని యాసంగి సీజన్లో సాగుచేసిన పొలాలు చి‘వరి’కి బీటలు వారాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. మరో పక్షం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అడవికి ఆపద
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆకురాలే కాలంలో అడవులకు ముప్పు పొంచి ఉంది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే పచ్చని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఫైర్లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కూలీలతో ఫారెస్ట్ అధికారులు ఆ పని చేయించేవారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఫైర్లైన్ల పనులు మొదలుకాలేవు. ఇప్పటికే జిల్లాలోని అటవీలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 180 కిలోమీటర్ల మేర ఫైర్లైన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పనులు ముందుకుసాగలేవు. 27 హెక్టార్లలో అడవి విస్తీర్ణం జిల్లాలోని 27వేల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధికంగా అడవులు ఉన్నాయి. అడవుల్లో వన్యప్రాణులు ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంటాయి. ముఖ్యంగా దుప్పులు, చిరుతలు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు, మనుబోతులు, ముళ్లపందులతోపాటు నెమళ్లు వంటి అరుదైన జీవజాతులు సంచరిస్తుంటాయి. ఈక్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే రోడ్ల వెంట ప్రయాణించే ఆకతాయిలతోపాటు అడవిలో పశువులు, గొర్రెల కాపరులు బీడీ తాగుతున్న క్రమంలో దాని నుంచి నిప్పురవ్వలు పడి అడవులు కాలిపోతున్న సందర్భాలు అనేకం. ఆకతాయిలైతే ఏకంగా నిప్పు పెడుతుండడంతో అడవి సంపదకు ఆపరా నష్టం కలుగుతోంది. ఈక్రమంలో అడవిలో ఊహించని నష్టం జరగకుండా అధికారులు ముందుగానే ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తే మంటలు అడవి మొత్తానికి విస్తరించకుండా కట్టడి చేసే అవకాశాలున్నాయి. లక్ష్యం ఇదే.. సిరిసిల్ల, వేములవాడ రేంజ్‌ల పరిధిలో 12 సెక్షన్లు, 44 బీట్లలో కలిపి 27 హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. జిల్లాకు చెందిన అడవులు జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట జిల్లాలకు చెందిన అడవితో కలిసి ఉంటాయి. ఇవన్నీ ప్రధానంగా ఆకురాల్చే అడవులు కావడంతో వేసవి కాలంలో మంటలు చెలరేగకుండా ఏటా ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఒక మీటర్‌కు రూ.6 ఖర్చు చేస్తూ డబ్బా ఆకారంలో 100 మీటర్ల చొప్పున ఫైర్లైన్లు వేస్తారు. ఒక వేళ మంటలు అంటుకున్న అక్కడికే పరిమితమై అడవికి వ్యాపించవు. గ్రామాల్లో హెచ్చరికబోర్డులు అవగాహనతో అడవిని కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. వనాలు దగ్ధం కాకుండా వేసవిలో బీడీల తయారీకి ఉపయోగించే ఆకు, ఇప్పపూలు సేకరించేందుకు, నేలపై పడిన ఆకులను ఏరివేసేందుకు కూలీలను నియమించి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి తమకు తెలియకుండా పడేసిన బీడీలు, సిగరేట్లు ప్రమాదాలకు కారణం అవుతుండగా దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు అడవిలోని రాళ్లు రాపడి జరుగుతున్న క్రమంలో మంటలు ఎగసిపడే ప్రమాదాలు ఉన్నాయి. దానిని శాటిలైట్, గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని అధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు వెళ్లేలోపే ఫైర్లైన్లు లేకపోవడంతో మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ చిత్రం ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువుతండా శివారులో అడవికి మంటలు వ్యాపించి విలువైన కలప కాలిపోతోంది. అధికారులు ఫైర్లైన్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఫారెస్ట్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గతంలో ఫైర్లైన్లతో రక్షణ ఉండేదని.. ఇప్పుడు ఎండలు ముదిరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అడవుల రక్షణపై అవగాహన సమావేశాలు మాత్రమే పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
సిరిసిల్లలో పందుల సంచారంపై నిషేధం
● పెద్దూరులో కేటాయించిన స్థలంలో పెంచుకోవాలి ● మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో పందుల సంచారం నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషా తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పెద్దూరులో ప్రత్యేకంగా కేటాయి ంచిన స్థలంలో పెంచుకోవాలని సూచించారు. పందులను రోడ్లపై వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, జనావాస ప్రాంతాల్లో వదిలేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ముఖాల్లో ఇందిరమ్మ వెలుగులు వేములవాడ రూరల్: పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం బొల్లారం, బాలరాజ్పల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. చందుర్తి(వేములవాడ): మండలంలోని మూడపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై, లబ్ధిదారులు వట్టిమల్ల భాగమ్మ– బాలయ్య దంపతులకు నూత న వస్త్రాలను అందజేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుపేదకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జాతీయ పోటీలకు ఎంపికజాతీయ పోటీలకు ఎంపికై న వాలీబాల్ క్రీడాకారులు సిరిసిల్లటౌన్: జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు వెల్లువెత్తాయి. ఇటీవల వేములవాడలో జరిగిన 8వ తెలంగాణ యూత్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి భువనేశ్వర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు సభ్యులు టి.శ్రునిక్, ఎస్.వేణు, డి.మమతతోపాటు జాతీయ జట్టుకి మెన్ హెడ్ కోచ్‌గా జి.సంపత్‌గౌడ్, అసిస్టెంట్ కోచ్‌గా రాజశేఖర్, విమెన్ హెడ్ కోచ్ ప్రభాకర్, అసిస్టెంట్ కోచ్ అఖిల ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి జిల్లా క్రీడాకారుల సంక్షేమ సంఘం కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకుమార్, రాందాస్ అభినందించారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారంసిరిసిల్లటౌన్: ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటామని సెస్ అసిస్టెంట్ హెల్పర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఇటీవల చేపట్టిన 72 గంటల దీక్షకు మద్దతు తెలిపిన సీఐటీయూ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలీచాలని వేతనాలతో ప్రాణాలను ఫణంగా పెట్టి సెస్‌లో విధులు నిర్వహిస్తున్నామన్నారు. 72 గంటల విధుల బహిష్కరణ సందర్భంగా 10 డిమాండ్లకు ఆరింటికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తమకు మద్దతుగా నిలిసిన వారందరికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. నర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర మల్లేశం, అనిల్‌కుమార్, ఎర్ర శ్రీనివాస్, పిట్టల మల్లేశ్, కిషన్, దోర్నాల అంజిరెడ్డి పాల్గొన్నారు. -
నర్సరీల్లో పండ్ల మొక్కలు పెంచాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: నర్సరీల్లో పండ్ల మొక్కలను పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సాయినగర్, జేపీనగర్‌లోని నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా పండ్ల మొక్కలు సైతం పెంచాలని సూచించారు. మునగ, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, స్థానిక కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. -
కొండకు కాషాయ దండు
● దిగ్విజయంగా అంజన్న ఆశీర్వాద యాత్ర ● కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు కాషాయమయం ● రాత్రి 10 గంటలకు కొండకు చేరుకుని మొక్కులు చెల్లించిన కేంద్రమంత్రి సంజయ్సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/కొత్తపల్లి/రామడుగు/కొడిమ్యాల/మల్యాల: ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శనివారం చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని అప్పగిస్తే పార్లమెంట్ పరిధిలో ఎన్నికై న బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానన్న మాటను నిలబెట్టుకున్నారు. దాదాపు 40 డిగ్రీల మండుటెండను లెక్క చేయకుండా వేలాదిమంది కార్యకర్తలతో కలిసి 40 కిలో మీటర్లు నడిచి రాత్రి 10 గంటలకు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. బైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి తోపాటు కౌన్సిలర్లంతా పాదయాత్రలో కలిసి నడిచారు. యాత్ర ప్రారంభమైందిలా శనివారం ఉదయం 7 గంటలకు బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బీజేపీ సర్పంచులు 108 మంది, 450 వార్డుసభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు వేలాది మంది కాషాయ శ్రేణులతో కలిసి కాలినడకన బయల్దేరారు. ఆధ్యాత్మిక యాత్ర కావడంతో సంజయ్ సాక్సులతోనే నడిచారు. ట్రాఫిక్ జాం కాకుండా యాత్ర ఉదయం 9.30 గంటలకే పదో తరగతి పరీక్ష ఆరంభం కా వడం... అదే సమయంలో సంజయ్ చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జగిత్యాల హైవేపైకి రావడంతో ట్రాఫిక్ జాం అవుతుందనే ఆందోళన కన్పించింది. పాదయాత్ర రక్షక దళం, ఇటు పోలీసుల సాయంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాదయాత్రను కొనసాగించారు. అడుగడుగునా నీరాజనం నగరంలోని 23వ డివిజన్ సీతారాంపూర్‌లో మహిళలు మంగళహారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. 19వ డివిజన్ రేకుర్తి చౌరస్తాలో కార్పొరేటర్ సుదగోని మాధవికృష్ణగౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కొత్తపల్లి రామాలయం వద్దకు చేరుకోగాలనే కమిటీ సభ్యులు గజ మాలతో సత్కరించారు. కొత్తపల్లి మార్కండేయ ఆలయం వద్ద 17, 18 డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవితచంద్రశేఖర్, వాసాల రమేశ్ స్వాగతం పలికారు. రామడుగు మండలం వెదిర, గంగాధర మండలంలోని పలు గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలం పూడూరులో మంగళహారతులతో నీరాజనం పలికారు. తుర్కాశీనగర్ చేరుకోగానే ముస్లింలు, యువకులు స్వాగతం పలికారు. పూడూర్లో గజమాలతో స్వాగతం పలికారు. తేనెటీగల కలకలం యాత్ర రామడుగు మండలం కోనరావుపేట వద్దకు రాగానే.. కొందరు కార్యకర్తలు డ్రోన్ ఎగరేయడంతో చెట్టుపైనున్న తెనేతుట్టె కదిలింది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పొరేటర్లు, మరో ముగ్గురు బీజేపీ శ్రేణులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. పాదయాత్రలో డాక్టర్లు బండి సంజయ్‌కు సాధారణ హెల్త్ చెకప్ చేశారు. గంగాధరలో లంచ్ బ్రేక్ గంగాధరలోని వీఏఎస్ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ సైతం అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో భోజనం చేసి కాసేపు సేదదీరారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగల మర్రి మీదుగా రాత్రి 10గంటల వరకు కొండగట్టు అంజన్న ఆలయం చేరుకుని ‘అంజన్న ఆశీ ర్వాద యాత్ర’ను దిగ్విజయంగా ముగించారు. సంజయ్ కొండకు చేరుకునే సమయానికి ఆలయం మూసివేయడంతో సింహద్వారం ఎదుట కొబ్బరికాయ కొట్టి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. -
కాలువ పనులు పూర్తి చేయాలి
● ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే సత్యంబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని బూరుగుపల్లి రైతుల సాగునీటి అవసరాలు తీర్చే డీ–5 కాలువ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంను కోరారు. కాంగ్రెస్ నాయకులు కొలుపుల ప్రవీణ్, పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డితోపాటు ఎమ్మెల్యేను శనివారం కలిశారు. డీ–5 కాలువ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రెండు కుంటల కు నీరు చేరడం లేదన్నారు. స్పందించిన ఎమ్మె ల్యే సత్యం ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లా డి.. కాలువ పనులు చేయాలని సూచించారు. హోటళ్లపై అధికారుల దాడులు ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని పలు హోటళ్లలో జిల్లా డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల అధికారులు శనివారం దాడులు చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు రజిత, సత్యనారాయణ స్థానిక భారత్ గ్యాస్ గోదాంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం పలు హోటళ్లపై దాడి చేసి 13 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. మద్దిమల అడవిలో హైనా కలకలం వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని బంజేరు పరిధిలో హైనా సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని తుమ్మలకుంట చెరువు సమీపంలో శుక్రవారం రాత్రి కుక్కపై హైనా దాడి చేసి చంపి తిన్నది. ప్రస్తుతం వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పొలాలకు సమీపంలో హైనా సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్‌కుమార్ హెచ్చరించారు. వైద్య శిబిరం పరిశీలన ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపురంలో శనివారం నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని డీఎంహెచ్‌వో రజిత పరిశీలించారు. 296 మందిని పరీక్షించి మందులు అందజేశారు. టీబీ వ్యాధి గురించి, పొగాకు వినియోగం తగ్గించాలని పేషంట్లకు అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రేమ్‌కుమార్, జీవనజ్యోతి, సూపర్వైజర్ జవహర్, హెచ్‌ఈవో వెంకటరమణ పాల్గొన్నారు. మహిళలకు భద్రత కరువు సిరిసిల్లటౌన్: దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక నెహ్రూనగర్ ఏరియాలో ఐద్వా సభ్యత్వ నమోదును శనివారం నిర్వహించి మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. కార్యదర్శి జవ్వాజి విమల, సూరం పద్మ, ఆడెపు రజిత, గడప మాధవి, న్యాలపెల్లి శ్యామల, గురజాల మమత, మల్లారపు నర్సవ్వ, రూప పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్ నీటిని విడుదల చేయాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టన్నట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు అన్నారు. యాసంగికి అవసరమైన నీటిని మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని మోహినికుంట రైతులు ప్రాజెక్టు ఎస్ఈకి శనివారం విజ్ఞప్తి చేశారు. గోపాల్‌రావు మాట్లాడుతూ మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక చెరువు, చెల్లాపూర్, రాజక్కపేట చెరువులకు నీటిని విడుదల చేయాలన్నారు. మోహిని కుంట, మద్దికుంట, బందనకల్, సేవాలాల్‌తండా, తెర్లుమద్ది, వెంకట్రావుపల్లె గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. సర్పంచ్ బిల్లం మురళీ, శ్రీని వాస్‌రావు, మల్లేశ్, వేణుగోపాల్‌రావు, బాబు, రాజేశం, రాజం, శేఖర్ ఉన్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలుసిరిసిల్ల: జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 34 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 7,307 మందికి ఎనిమిది మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 99.89 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. కలెక్టర్ గరీమా అగ్రవాల్ బాలుర జెడ్పీ హైస్కూల్, నెహ్రూ నగర్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే గీతానగర్ బాలికల జెడ్పీ హైస్కూల్ కేంద్రాన్ని డీఎస్పీ నాగేంద్రచారితో కలిసి పరిశీలించారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 10 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎల్లంపల్లి నీటితో భూములు సస్యశ్యామలం
● తెగిన, గండ్లు పడిన కాలువల మరమ్మతుకు నిధులు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నపేట శివారులో గతంలో కురిసిన భారీ వర్షాలకు గండిపడి తెగిన కాలువను, చందుర్తిలో 450 ట్యాంకును, మల్యాల హంపుహౌస్ను శనివారం పరిశీలించారు. విప్ మాట్లాడుతూ యాసంగి పంటలకు సాగునీరు అందించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సనుగుల ఎర్ర, పటేల్చెరువులతోపాటు జోగాపూర్, ఎన్గల్, బండపల్లి చెరువులలో నీరు ఉంటే మండలం సస్యశామలంగా ఉంటుందన్నారు. రామన్నపేట శివారులో గండి పడ్డ 4 డీ కాలువ మరమ్మతుకు రూ.21లక్షలు మంజూరు చేయించి నట్లు తెలిపారు. ఎల్లంపల్లి నీటితో ఆశిరెడ్డిపల్లె కొత్తచెరువును నింపుతామన్నారు. కొత్త చెరువు నిర్మాణానికి రూ.43లక్షలు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు ఈసరి శ్రీనివాస్, ఏనుగు లచ్చిరెడ్డి, నాయకులు మల్లారపు రాజయ్య, దొంగరి భూమయ్య, లక్ష్మణ్‌రావు, ఆవారి మనోహర్ పాల్గొన్నారు. గోదావరి జలాలకు పూజలు రుద్రంగి(వేములవాడ): రైతులకు యాసంగి సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎండిపోతున్న పంటలకు మూడు రోజులుగా గోదావరి జలాలను విడుదల చేశారు. ఎల్లంపల్లి కాలువల ద్వారా శనివారం రుద్రంగిలోని గండి వేంకటేశ్వర్ల వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు చేశారు. నాగారం చెరువు కాలువలను పరిశీలించారు. సూరమ్మ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తహసీల్దార్ పుష్పలత, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పల్లి గంగాధర్, గంధం మనోజ్, ఎర్రం గంగనర్సయ్య పాల్గొన్నారు. -
వాలీబాల్ అసిస్టెంట్ కోచ్‌గా రాజశేఖర్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రానికి చెందిన చేరాల రాజశేఖర్ జాతీయస్థాయిలో తెలంగాణ యూత్ వాలీబాల్ టీం అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. భువనేశ్వర్‌లో జరిగే యూత్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు రాష్ట్ర బాలుర జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. రాజశేఖర్ ప్రస్తుతం ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తనను కోచ్‌గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, డీవైస్వో రామదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సానబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రబెల్లి స్వర్ణను సన్మానించిన సంగీతం సిరిసిల్లటౌన్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మర్యాదరపూర్వకంగా శనివారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆమెను కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు
● వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడొద్దని, వదంతులు నమ్మొద్దన్నారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బ్లాక్ దందా చేయొద్దు : ఎస్పీ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించొద్దని, బ్లాక్ దందా చేయొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌ ర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీవో సీ.హెచ్.వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్‌రెడ్డి, అఫ్జల్‌బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. పిల్లలపై శ్రద్ధ పెట్టాలి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. -
కనీస వేతనాలివ్వాలి
సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరా రు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న చలో హైదరాబాద్‌కు వెళ్తున్న నేపథ్యంలో శుక్రవా రం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి మాట్లాడారు. కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు వెళ్తున్న నేపథ్యంలో ముందస్తుగా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటెండెన్స్ పెరిగింది
నీటి గంట అమలు చేయడం ద్వారా మా పాఠశాల విద్యార్థులు మరింత చురుగ్గా మారుతున్నారు. తరగతుల్లో ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు. వారి అనారోగ్య కారణాలతో పాఠశాలకు రాకుండా ఉండే రోజులు కూడా తగ్గిపోయాయి. – జె.అనురాధ, హెచ్ఎం, జిల్లెల్ల నీరు తాగడం ఆరోగ్యదాయకం పాఠశాల వేళల్లో తగినంత నీరు తాగడం ద్వారా పిల్లల కిడ్నీలు, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధకశక్తి పెరగడం ద్వారా విద్యార్థులు అనేక అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉంటారు. – డాక్టర్ రజిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సిరిసిల్ల -
వేగం.. పారదర్శకత
ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాన్యువల్‌గా జరిగే విచారణతో కలిగే జాప్యాన్ని నివారిస్తూ, డిజిటల్ యాప్ ద్వారా సేవలను వేగవంతం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మారుతున్న విధానం గతంలో కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం మీసేవలో దరఖాస్తు చేస్తే అది నేరుగా నాయబ్ తహసీల్దార్ లాగిన్‌కు వెళ్లేది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ)కి, ఆపై క్షేత్రస్థాయి పరిశీలనకు పంపేవారు. కానీ కొత్త విధానంలో అభ్యర్థి మీసేవలో దరఖాస్తు చేసుకోగానే అది నేరుగా గ్రామపంచాయతీ అధికారి(జీపీవో) లాగిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ)కి, ఆపై నాయబ్ తహసీల్దార్‌కు డిజిటల్ రూపంలో ఫార్వర్డ్ అవుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ముందుగా ఆదాయం సర్టిఫికెట్లతో శ్రీకారం ధ్రువీకరణపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లింది. సామాన్యులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదాయ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పూర్తి డిజిటల్ పద్ధతి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఆదాయం సర్టిఫికెట్ పొందాలంటే దరఖాస్తుదారుడు తహసీల్ ఆఫీస్‌లో దరఖాస్తు నింపి, దానిపై గ్రామ పంచాయతీ అధికారి(జీపీవో), మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ)కి సంతకాలు తీసుకోవాల్సి వచ్చేది. అనంతరం మీసేవలో ఆన్లైన్ చేసి, మళ్లీ మాన్యువల్ కాపీలను సమర్పించిన తర్వాతే తహసీల్దార్ లాగిన్‌కు వెళ్లేది. దరఖాస్తుదారుడు నేరుగా మీసేవ కేంద్రానికి వెళ్లి ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన ఐడీ నంబర్ గ్రామపంచాయతీ అధికారి లాగిన్‌లో కనిపిస్తుంది. సదరు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్ఐకి ఫార్వర్డ్ చేస్తారు. ఆర్ఐ తన లాగిన్ ద్వారా వివరాలను తనిఖీ చేసి తహసీల్దార్‌కు పంపిస్తారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆమోదం తెలపగానే, అభ్యర్థి మొబైల్ ఫోన్‌కు సర్టిఫికెట్ సిద్ధమైనట్లు మెసేజ్ వస్తుంది. ఈ విధానం విజయవంతమైతే.. రానున్న రోజుల్లో కులం, నివాస ధ్రువీకరణపత్రాలను కూడా ఇదే పద్ధతిలో అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.ఒకప్పుడు ఆదాయం సర్టిఫికెట్ కావాలంటే అధికారుల సంతకాల కోసం రోజుల తరబడి ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లయ్ చేస్తే అధికారులే పరిశీలించి డిజిటల్ సంతకంతో పంపిస్తున్నారు. ఇది చాలా సులభంగా ఉంది. మీసేవ కేంద్రానికి వెళ్లే పని లేకుండా, ఇంట్లోనే కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. – పిట్ల ఖాజీబాబు, వీర్నపల్లిగతంలో ఆదాయ ధ్రువీకరణపత్రాలకు జీపీవోల వద్దకు దరఖాస్తుదారులు వెళ్లేవారు. మీసేవకు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేక యాప్ ద్వారా జీపీవో లాగిన్లోకి వస్తుంది. ఆయన విచారణ చేసి వాటిని ఆర్ఐకి పంపిస్తారు. ఆర్ఐ పరిశీలన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ వస్తుంది. – బి.రామ్‌చందర్, తహసీల్దార్, ముస్తాబాద్ -
ప్రశాంతంగా పరీక్షలు రాయండి
సిరిసిల్ల: జిల్లాలో పదోతరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, పరీక్ష కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న సందర్భంగా జిల్లాలో పరీక్షలకు చేసిన ఏర్పాట్లను శుక్రవారం వివరించారు. జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేశారని, నిర్ణీత పరీక్ష సమయం తరువాత ఐదు నిమిషాలు వరకు కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. 7,317 మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 7,317 మంది విద్యార్థులు హాజరుకానుండగా, బాలురు 3,511, బాలికలు 3,806 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో డెస్క్‌లు, తాగునీరు, టాయిలెట్స్, ట్యూబ్లైట్స్ సౌకర్యాలు కల్పించారు. 144 సెక్షన్ అమలు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. పర్యవేక్షణకు బృందాలు పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 34, డిపార్ట్మెంటల్ అధికారులు 34, సిట్టింగ్ స్క్వాడ్ 34, ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు టీంలు, అడిషనల్ డిపార్టుమెంటు ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ అబ్జ ర్వర్స్, కస్టోడియన్ అధికారులను నియమించారు. -
కార్మికులు మంచి అలవాట్లు అలవరచుకోవాలి
సిరిసిల్ల: నేత, ఇతర రంగాల్లోని కార్మికులు మంచి అలవాట్లను అలవరచుకోవాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ సూచించారు. స్థానిక వెంకట్రావునగర్‌లో శుక్రవారం మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక మనోవికాస సదస్సు నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు పొగ తాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమా, బూర శ్రీమతి, రాపెల్లి లత పాల్గొన్నారు. భూసార పరీక్షలు చేయించాలి చందుర్తి(వేములవాడ): భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు వాడితే సాగు ఖర్చులు తగ్గుతాయని బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ మధుకర్ పేర్కొన్నారు. మూడపల్లి రైతువేదికలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై శుక్రవారం అవగాహన సదస్సును సర్పంచ్ చిలుక మల్లేశ్వరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మార్కెట్ డైరెక్టర్ లావణ్య, చందుర్తి మండల వ్యవసాయాధికారి దుర్గారాజు, ఏఈవో ప్రవీణ్ హాజరయ్యారు. అవగాహన కల్పించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్ సూచించారు. మండలంలోని జిల్లెల్ల, నేరెళ్ల గ్రామాల్లో శుక్రవారం పర్యటించి మాట్లాడారు. తడిచెత్త, పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్‌బేగ్, ఏపీవో రాపోల నాగరాజు, కార్యదర్శి రాజు, టీఏ లక్ష్మణ్ పాల్గొన్నారు. అల్మాస్పూర్లో టవర్ నిర్మించొద్దని నిరాహార దీక్ష ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్పూర్లో జనావాసాల మధ్య ఎయిర్టెల్ సెల్‌టవర్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ గ్రామస్తులు మూడో రోజు శుక్రవారం నిరాహార దీక్ష కొనసాగించారు. సర్పంచ్ నాగెల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి దూరం సెల్‌టవర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఉపసర్పంచ్ కొర్రి అనిల్, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, నాయకులు పిల్లి కిషన్, పుణ్యానాయక్, రాజయ్య పాల్గొన్నారు. గోల్డెన్ అవర్‌లో జాగ్రత్తగా ఉండాలిసిరిసిల్లటౌన్: రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను గోల్డెర్ అవర్లోనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చాలని 108 ఉమ్మడి జిల్లా పీవో భూమా నాగేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిపి ఉంచిన 108 అత్యవసర అంబులెన్స్, 102 అమ్మఒడి, 1962 సంచార పశువైద్యశాల వాహనాలను జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. -
రోడ్డున పడేయొద్దు
● సెస్ కార్మికులు, ఉద్యోగులు ● మూడో రోజు మిన్నంటిన నిరసనసిరిసిల్లటౌన్: దశాబ్దాలుగా సెస్ సంస్థకు సేవలు అందిస్తున్నామని తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 72 గంటల నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సెస్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా టీజీయూఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తూ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా అసిస్టెంట్ హెల్పర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రావుపల్లికి చెందిన శ్రీకాంత్, వెంకటేశ్వర ఐ హాస్పిటల్ భానుచందర్ పులిహార, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ సర్పంచ్ అంజయ్య, చిప్పలపల్లి సర్పంచ్ లక్ష్మణ్, సెస్ సిరిసిల్ల పట్టణ ప్రతినిధి సుదర్శన్ వెంకటేశ్, ఐద్వా రాష్ట్ర నాయకురాలు మల్లు లక్ష్మి, జిల్లా నాయకురాలు జువ్వాజి విమల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి రాజశేఖర్, మూశం రమేశ్, గ్రామపంచాయతీ కార్మికులు బూర శ్రీనివాస్, మల్యాల నర్సయ్య సంఘీభావం తెలిపారు. టీజీయూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి నర్ర శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోగని నీటి గంట
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వాటర్‌బెల్.. అవును నిజమే పాఠశాలలో అమలు చేయాల్సిన అత్యంత ప్రాధాన్యమున్న బెల్ ఇది. ఈ బెల్ మోగగానే విద్యార్థులందరూ తగినంత నీరు తాగేలా చూడడం అత్యంత అవసరం. గతంలో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో వినిపించిన ‘వాటర్ బెల్’ ఇప్పుడు మోగటం లేదు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా ‘వాటర్ బెల్’ అమలు చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు తాగకపోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలామంది ఇంటి నుంచి నీటిసీసాలు తీసుకెళ్తున్నప్పటికీ మధ్యాహ్నం సమయంలోనే అన్నం తినేటప్పుడే ఆ నీటిని తాగుతున్నారు. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని భయంతో విద్యార్థులు నీటిని సరిగా తీసుకోవడం లేదని తెలి సింది. సరిపడా నీటిని తాగకపోవడంతో మూత్రకోశ వ్యాధులతోపాటు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో అమలు చేసినా... సాధారణ రోజుల్లో ఇంటర్వెల్, లంచ్ బ్రేకులతోపాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్ బెల్ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30కు, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలో చాలా పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేశారు. ఐతే అనేక పాఠశాలల్లో ఇవి పనిచేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నీరు ఎంత తాగాలి జిల్లెల్ల బడిలోనే నీటి గంట సవ్వడి తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిసారిగా వాటర్ బెల్‌ను అమలు చేస్తున్నారు. బడి ప్రారంభమైన తర్వాత ప్రతీ రెండు పీరియడ్లకు ఒకసారి నీటి గంట మోగిస్తారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని నీరు తాగమని ప్రోత్సహిస్తారు. తద్వారా విద్యార్థులు డీహైడ్రేషన్ సమస్యను జయిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు.సమాచారం ఇలా..పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు 511 38,629రెసిడెన్షియల్ పాఠశాలలు 21 7,762 ప్రైవేటు పాఠశాలలు 131 31,026 -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 20267వేములవాడఅర్బన్: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం అందజేశారు.డగ్స్‌ను నివారిద్దాంసిరిసిల్లక్రైం: డ్రగ్స్‌ను నివారించేందుకు ముందుకురావాలని టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేశ్ కోరారు.గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం అవగాహన కల్పించారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి. -
8 గంటలు.. 40 కిలోమీటర్లు
● అంజన్న ఆశీర్వాద యాత్రకు కేంద్రమంత్రి ‘బండి’ ప్రణాళిక ● 14న ఉదయం 7గంటలకు మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభంసాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో శనివారం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉండబోతున్నట్లు వాతావరణశాఖ చెబుతున్నప్పటికీ 8గంటల్లో 40కిలోమీటర్లు నడిచి కొండగట్టుకు చేరేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్ర పొడవునా మంచి నీళ్లు, మజ్జిగ, పులిహోర సహా అన్ని ఏర్పాట్లు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు ముందుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కరీంనగర్ బాట పడుతున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు గురువారం సాయంత్రం బీజేపీ శ్రేణులు నగరంలో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్చార్జి బండారి శాంతికుమార్, మోహన్‌రెడ్డి, జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో, కొండగట్టు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. పది పరీక్షలకు ఇబ్బంది లేకుండా శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడకుండా, రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా యాత్రను సాగించాలని బండి సంజయ్ కాషాయ శ్రేణులను కోరారు. పాదయాత్రలో పాల్గొనే వారంతా ఈనెల 14న ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర సాగుతుందిలా.. 14న ఉదయం 6 గంటలకు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయానికి బండి సంజయ్ చేరుకుంటారు. కార్యకర్తలతో కలిసి కొండగట్టుకు బయల్దేరుతారు. రామడుగు, వెదిర, కురిక్యాల మీదుగా గంగాధర చేరుకుంటారు. అక్కడి వీఏఎస్ ఫంక్షన్ హాలులో భోజనం చేస్తారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగలమర్రి, మీదుగా కొండగట్టు ఘాట్ రోడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అంజన్న ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటారు. -
అక్కడ వార్.. ఇక్కడ బేజార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పశ్చిమాసియాలోని యుద్ధం వెతలు ఇన్నిన్ని కాదయా.. ఇంటింటా వంటింటా తిప్పలేనయా! అన్నట్లుగా ఉంది పరిస్థితి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణాకు ఇబ్బందులు ఏర్పడి ఎల్పీజీ సరఫరాలో తలెత్తిన అంతరాయం ఉమ్మడి జిల్లాపై భారీగానే పడింది. గృహాలతోపాటు వాహనాలు, హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, హాస్పిటళ్లను సైతం ఎల్పీజీ కొరత ముప్పు వెంటాడుతోంది. యుద్ధం ప్రభావంతో ఇప్పటికే గృహ(రూ.60), కమర్షియల్ సిలిండర్ (రూ.115) ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన ఎల్పీజీ సరఫరా మునుపటిస్థాయిలో ఉండటం లేదని డీలర్లు అంటున్నారు. కొరతతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా వాహనాలకు విక్రయించే ఎల్పీజీ గ్యాస్ కేవలం వారం రోజుల్లోనే లీటరుకు రూ.30కిపైగా పెరగడం పరిస్థితికి నిదర్శనం. నిండుకుంటున్న గ్యాస్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలో 50కిపైగా ఎల్పీజీ స్టేషన్లు ఉన్నాయి. ప్రతీరోజూ ఆటోలు, కార్లు తదితర వాహనాలు 50వేల లీటర్ల వరకు ఎల్పీజీ నింపుకొంటున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు లీటరుకు రూ.55గా ఉన్న ఎల్పీజీ తాజాగా గురువారం లీటరు రూ.86కు పెరిగింది. ఈ లెక్కన ప్రతీరోజూ ఉమ్మడి జిల్లా ఎల్పీజీ వాహనాలపై రూ.కోటిన్నర వరకు భారం పడుతోంది. యుద్ధం మరింత ముదిరితే ఎల్పీజీ ధర లీటరుకు రూ.100 పెరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెట్రోలుతో పోలిస్తే.. గ్యాస్ ధర చవక, అధిక మైలేజీ ఇవ్వడం, పర్యావరణ హితంగా ఉండటంతో కొన్నాళ్లుగా ఎల్పీజీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, హాస్పిటళ్ల జాగ్రత్తలు యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తగ్గిపోతుండటంతో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, హాస్పిటళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు ముందు జాగ్రత్తగా వంటచెరుకు, చార్కోల్ తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారంతో ఇంటర్ పరీక్షలు ముగియడంతో రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పదోతరగతితో పాటు పాఠశాల విద్యార్థులకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక సాధారణ ప్రజలు ముందు జాగ్రత్తగా ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. మూలన పడిన పాత స్టవ్‌ను రిపేర్లకు బయటికి తీస్తున్నారు. ఒకవేళ ఎల్పీజీ కొరత ముదిరి సంక్షోభంలా మారితే.. హోటళ్లు మూతబడితే.. అందులో పనిచేసే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. గ్రానైట్ పరిశ్రమపై దెబ్బ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న కరీంనగర్ జిల్లాపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడింది. కరీంనగర్ నుంచి ఆంధ్రా మీదుగా చైనా, ఇటలీకి వెళ్లే కరీంనగర్ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా షిప్పింగ్ ఛార్జీలు పెరగడం ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కంటైనర్‌కు 21 డాలర్లుగా ఉన్న ధర ప్రస్తుతం 28 డాలర్లకు పెరిగింది. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, క్వారీల్లో వాడే యంత్ర పరికరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 250 రూపాయలు ఉన్న డ్రిల్లింగ్ బిట్టు ధర ఇప్పుడు ఏకంగా 1200 రూపాయలకు చేరడం పరిశ్రమ దీనస్థితికి అద్ధం పడుతోంది. మరోవైపు, క్వారీలను నడపడానికి అత్యంత కీలకమైన డీజిల్ సరఫరాపై కూడా ఆందోళన నెలకొంది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్ అవసరం కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా పెరిగితే.. అందులో పనిచేసే వేలాది మంది ఉత్తరాది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు -
పాలిస్టర్ కార్మికుల కూలీ చర్చలు విఫలం
సిరిసిల్ల: పాలిస్టర్, వైపణి, వార్పిన్ కార్మికులు కూలీ పెంపు చర్చలు విఫలమయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్మికశాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ ప్రసాద్ సమక్షంలో గురువారం జరిగిన సుదీర్ఘచర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కూలీరేట్లను పెంచేందుకు పాలిస్టర్ యజమానులు అంగీకరించలేదు. ఇప్పటికే తొలిదశ చర్చలు విఫలం కాగా.. మలిదశ చర్చలు గురువారం జరిగాయి. యజమానులకు, కార్మికులకు జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. పాలిస్టర్ అసోసియేషన్, కార్మిక నేతల మధ్య జరిగిన కూలీ ఒప్పందం గడువు 2022లో ముగిసింది. చిన్న పన్న పది పిక్కులకు(పోగులు) ప్రస్తుత కూలీ 25పైసలు ఉండగా.. 30 పైసలు, పెద్ద పన్నకు 26 పైసలు ఉండగా.. 35 పైసలు ఇవ్వాలని కోరుతున్నారు. వార్పిన్ కార్మికులకు 1000 పోగులకు 1250 మీటర్ల వరకు రూ.40 కూలీ ఇవ్వాలని, వైపణి కార్మికులకు 1000 పోగులకు రూ.110 చెల్లించాలని, టెక్స్టైల్ పార్క్‌లో పది పిక్కులకు 50 పైసలు చెల్లించాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్త్రపరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో కూలీ పెంపు సాధ్యం కాదని, ప్రస్తుతం ఉన్న రేట్లను అమలు చేస్తామని యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో కూలీచర్చలు కొలిక్కి రాలేదు. పక్షం రోజుల గడువు మరో పక్షం రోజుల్లో కూలీ పెంపు ఒప్పందం చేసుకోవాలని, మరో దఫా చర్చలు సిరిసిల్లలోనే నిర్వహిస్తామని డీసీఎల్ ప్రసాద్ స్పష్టం చేశారు. మళ్లీ చర్చలు జరిగే వరకు కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ఆగాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా యజమానులతో మాట్లాడి కూలీ రేట్లు పెంచే ప్రయత్నం చేస్తామని లేబర్ అధికారులు స్పష్టం చేశారు. చర్చల్లో అసిస్టెంట్ లేబర్ అధికారి రఫీ, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి రవి, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. -
కాగుతున్న వంటనూనె
● పెరుగుతున్న ధరలు ● జనం జేబులకు తూట్లు ● తగ్గిన కోడిగుడ్ల రేట్లుముస్తాబాద్(సిరిసిల్ల): గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. పద్నాలుగు రోజులుగా సాగుతున్న అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంతో మన ప్రాంతంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విదేశాల నుంచి పామాయిల్, చమురు ఉత్పత్తుల దిగుమతి నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో మన దేశానికి వచ్చే నౌకలు నిలిచిపోయాయి. అందులో వస్తున్న చమురు, పామాయిల్ తదితర వస్తువులు దేశానికి చేరే పరిస్థితి లేదు. దీంతో వాటికి అనుసంధానమైన వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కాగుతున్న వంటనూనెలు వంటనూనెల ధరలు 25 శాతం పెరిగాయి. పద్నాలుగు రోజుల క్రితం సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ధర రూ.152 ఉండగా.. ప్రస్తుతం రూ.175కు చేరింది. పది రోజుల వ్యవధిలో రూ.23 పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. డిస్పోజల్ గ్లాసుల ధరలైతే వందశాతం పెరిగాయి. 50 గ్లాసుల ధర పది రోజుల క్రితం రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.40కి విక్రయిస్తున్నారు. గోధుమపిండి, ఖర్జురాతోపాటు ఆయిల్‌తో సంబంధమున్న వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికై తే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. విశ్వ విపణిలో చమురు బ్యారెల్ ధరలు పెరిగినా ఆ ప్రభావం ప్రభుత్వం సామాన్యులపై పడనివ్వడం లేదు. తగ్గుతున్న కోడిగుడ్ల ధరలు పశ్చిమాసియాలో యుద్ధంతో కొడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. రోజుకు లక్షలాది గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం కోడిగుడ్డు రిటైల్ ధర రూ.7 ఉండేది. ప్రస్తుతం రూ.4.20 విక్రయిస్తున్నారు. అధిక మొత్తంలో గుడ్లు కొన్న వారికి రూ.4కు కూడా విక్రయిస్తున్నారు. ఇక వంట గ్యాస్ ఇప్పటికై తే కొత్త బుకింగ్‌లను స్వీకరించడం లేదు. హోటళ్లు, గృహాలకు పరిమిత సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. -
ప్రజాపాలనలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన సదస్సుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలలో గురు వారం నిర్వహించిన అవగాహన సదస్సును కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ఐదు దశల్లో కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 2న మొదటి దశలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తారని, రెండో దశలో ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మూడో దశలో మే 2న నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు, నాలుగో దశలో మే 22న జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు, ఐదో దశలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారని వివరించారు. జిల్లాలో 46,492 మందికి రూ.370.75 కోట్ల రుణ మాఫీ, 1.26 లక్షల రైతులకు రైతుభరోసా అందించామని, 22,554 రేషన్‌కార్డులు జారీ చేశామని తెలిపారు. జూన్ 2లోగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాల భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సహకరించాలి ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. డీఆర్డీవో గీత, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ చైర్మన్లు జిందం కళ, రాజు, కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, డీపీవో షర్ఫొద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వ్యవసాయ కళాశాల డీన్ సునీతాదేవి, వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, సర్పంచ్ దుబ్బాక రజిత పాల్గొన్నారు. పనికి సర్పంచ్ కావాలి.. నిధులకు వద్దా? పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల అధికారుల తీరును ఎండగట్టారు. ఉద్యోగస్తులు నాలుగు గంటలు పనిచేసినా, ఎనిమిది గంటలు పనిచేసినా జీతం వస్తుంది. కానీ సర్పంచులు 24 గంటలు గ్రామం కోసం పనిచేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి, పీఎం మోదీ పది పైసలు కూడా పంప డం లేదన్నారు. పందులు చనిపోయినా సర్పంచ్, ఎలుకలు చనిపోయినా సర్పంచ్.. కానీ పనిచేసేందుకు సర్పంచులు వద్దా? గ్రామపంచాయతీలకు నిధులు లేకుండా పనులు ఎలా చేయాలి? అని అధికారులను నిలదీశారు. -
పరీక్షలు ఇష్టంతో రాయాలి
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్లటౌన్: ఎస్సెస్సీ విద్యార్థులు పరీక్షలు భయంతో కాకుండా ఇష్టంతో రాయాలని.. అప్పుడే ఉన్నతంగా రాణిస్తారని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్‌లో రైతులు గత 31 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన కాలువ పనులు పూర్తి చేయాలని రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. పనులు మొదలుపెడితేనే దీక్ష విరమిస్తామని స్పష్టం చేశారు. కరికె నవీన్‌కుమార్, దుమాల శ్రీను, రేగుల భిక్షపతి, దొమ్మాటి మల్లయ్య, గాదె రవి, రౌతు నారాయణ, కొమ్ముల మోహన్, కీర్తి రాజు, మహేశ్, రవి, ఆనంద్ పాల్గొన్నారు రూ.3.19కోట్లు విడుదల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అసంపూర్తి కాలువ పనుల కోసం రూ.3.19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదు నుంచి గురువారం ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే కాలువ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సిరిసిల్లటౌన్: సెస్ విద్యుత్ కార్మికులు చేపట్టిన 72 గంటల విధులు బహిష్కరణ గురువారం రెండో రోజుకు చేరింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడుతూ శుక్రవారం సెస్ కార్మికులు, కుటుంబ సభ్యులతో సహా పాల్గొంటారని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన సెస్ విలేజ్ ప్రతినిధి రామచంద్రారెడ్డి, పద్మారెడ్డి సంఘీభావం తెలిపారు. శ్రీవేంకటేశ్వర ఐ హాస్పిటల్ భానుచందర్ మజ్జిక ప్యాకెట్లు అందించారు. ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్ రాజమల్లు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్, జిల్లా కార్యదర్శి నర్ర శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రప్రసాద్, విష్ణు, కరుణాకర్, భాస్కర్, సంతోష్‌నాయక్, రాచకొండ శ్రీనివాస్, తిరుపతినాయక్, నౌసిలాల్ పాల్గొన్నారు. ఆశీర్వాద పాదయాత్రను విజయవంతం చేయండిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొండగట్టు అంజన్న ఆ శీర్వాద పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ఎల్లారెడ్డిపేటలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడా రు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ నెల 14న చేపట్టిన కొండగట్టు అంజన్న ఆశీ ర్వాదయాత్రకు తరలిరావాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, ప్రధాన కా ర్యదర్శులు గణేశ్, నరేశ్, బాలాగౌడ్ ఉన్నారు. -
నైపుణ్యాలు పెంచుకోవాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసపత్రాలు సిరిసిల్ల క్రైం: పోలీసులు విధి నిర్వహణలో భాగంగా నైపుణ్యాలు పెంచుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతోపాటు ఆర్ముడ్ రిజర్వ్ విభాగం సైతం కీలకపాత్ర పోషిస్తుందని కొనియాడారు. సాయుధ దళాల వార్షిక పునశ్చరణ(మొబిలైజేషన్) ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం పరేడ్ మైదానంలో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం బాధ్యతాయుతమైందని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకు మొబిలైజేషన్ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సర్దాపూర్‌లోని బెటాలియన్‌లోని ఫైరింగ్ రేంజ్లో ఇచ్చే శిక్షణను పర్యవేక్షించారు. ఫైరింగ్‌లో బి.శ్రీనివాస్(ప్రథమ), జి.వెంకటేశ్(ద్వితీయ), ఎ.ప్రియాంక(తృతీయ), రాత పరీక్షలో మనోజ్‌కుమార్(ప్రథమ), బి.శ్రీనివాస్(ద్వితీయ), డి.ప్రియాంక(తృతీయ) స్థానాల్లో నిలిచారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.


