rhea chakraborty
-
‘సుశాంత్ కేసు క్లోజ్.. రియాకు ఇదే నా శాల్యూట్..’!
ముంబై: సుమారు ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు పెద్ద సంచలనం. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తినే కారణమంటూ పెద్ద దుమారమే చెలరేగింది. 2020, జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిలా పడివున్నాడు. మెడకు ఉరి వేసుకుని ఉన్న సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ.. ఎట్టకేలకు తుది రిపోర్ట్ ఇచ్చింది. సుశాంత్ మరణం వెనుక ఎవరి ప్రేరేపితం లేదని స్పష్టం చేసింది. అంటే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాకు భారీ ఊరట లభించినట్లయ్యింది.అయితే దీనిపై రియా లాయర్ సతీష్ మనీషిండే మాట్లాడుతూ..‘ ఈ కేసులో ప్రతీకోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను ఇచ్చిన సీబీఐకి కృతజ్ఞతలు. అటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రియాపై అనేక రకాలైన తప్పుడు కథనాలు వచ్చాయి. అది కోవిడ్ వచ్చిన సమయం కావడంతో ప్రతీ ఒక్కరూ టీవీలు, సోషల్ మీడియాను ఎక్కువ చూశారు. ఈ క్రమంలోనే రియాపై ఎన్నో తప్పుడు వార్తలు చుట్టుముట్టాయి. నిరాధారమైన ఆరోపణలతో ఆమెను, ఆమె కుటుంబాన్ని నానా యాగీ చేశారు. ఈ రకంగా చేయడం వల్ల అమాయకులు చాలా నష్టపోతారు. కానీ చివరకు రియా పాత్ర ఏమీ లేదని క్లియరెన్స్ వచ్చింది. ఇక్కడ రియాకు సెల్యూట్ చేస్తున్నా. ఎన్నో అవమానాలను భరించి ఎటువంటి నోరు విప్పకుండా మౌనం పాటించిన రియాకు, ఆమె కుటుంబానికి సెల్యూట్ చేస్తున్నా’ అని రియా లాయర్ సతీష్ మనీషిండే తెలిపారు.సీబీఐ రిపోర్ట్‌లో ఏం చెప్పింది..?సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసుల్లో ఎవరి పాత్ర లేదని తెలిపింది. ఈ మేరకు ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం వెనుకు ఎవరి పాత్ర లేదని, ఎటువంటి కుట్రలు జరగలేదని తెలిపింది. సుశాంత్ మరణంలో నటి రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర లేదని పేర్కొంది. -
నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మృతి కేసులో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదు. తను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వెల్లడించింది. ఈ మేరకు కేసును క్లోజ్ చేసింది. దీంతో ఐదేళ్లుగా నిందలు మోస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న రియా చక్రవర్తికి ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయింది. సుశాంత్ మృతి.. మాజీ ప్రేయసిపై ట్రోలింగ్సుశాంత్ సింగ్ 2020లో జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతి వెనక కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) కూడా అందులో భాగమై ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. తనను ఈసడించుకున్నారు. ఒక విలన్‌గా చూశారు. దీని పర్యవసానంగా సినిమా అవకాశాలకు ఫుల్స్టాప్ పడింది. అరెస్టు, జైలు జీవితం, విచారణతో రియా మానసికంగా కుంగిపోయింది.కేసులో నిర్దోషిగా తేలిన నటితాను తప్పు చేయలేదన్న మాటను ఎవరూ లెక్కచేయలేదు. తప్పంతా నీదేనని నోరు నొక్కేశారు. ఎంతో భవిష్యత్తున్న హీరో ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యావని అభాండాలు వేశారు. గుండె నిండా బాధను మోస్తూనే ఒంటరిగా పోరాడింది.. చివరకు కేసులో నిర్దోషిగా తేలింది. ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని, పోరాటాన్ని గుర్తు చేస్తూ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నిజం ఎంతోకాలం దాగదురియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నిజం ఎంతోకాలం దాగదు.. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. రియా, ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే, మీతో రాక్షసంగా ప్రవర్తిస్తుంటే మీరు పోరాడిన విధానం ఆదర్శవంతం. మిమ్మల్ని అవమానించారు, చీల్చి చెండాడారు. అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు.క్షమాపణలు చెప్పండి: మంచు లక్ష్మినిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధపెట్టారో గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడాలి. రియా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీకు మరింత శక్తి చేకూరాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే.. ఇకపై అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. దీనికి #Justice, #TruthWins, #RheaChakraborty అన్న హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చింది.చదవండి: 'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్జే సూర్య -
సుశాంత్ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. -
నేను జైల్లో ఉన్నప్పుడు నా పేరెంట్స్ లావయ్యారు: నటి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్టయింది. 28 రోజులపాటు జైలు జీవితం గడిపింది. తన సోదరుడు షోవిక్ కూడా జైలు శిక్ష అనుభవించాడు. అయితే బయటకు వచ్చాక కూడా తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే తను నాలుగు గోడల మధ్య నరకయాతన అనుభవిస్తుంటే తన కుటుంబం, స్నేహితులు మాత్రం బాగా తిని లావయ్యారంటోంది.బయటకు వచ్చేసరికి..తాజాగా రియా చక్రవర్తి మాట్లాడుతూ.. నేను ఇంటికి దూరమైనప్పుడు ఫ్రెండ్సే నా పేరెంట్స్‌ను దగ్గరుండి చూసుకున్నారు. నాన్నతో కలిసి రోజూ తాగేవారు, తినేవారు. నేను బయటకు వచ్చాక.. ఏంటి? ఇంత లావయ్యారు? అని ఆశ్చర్యపోయాను. నేను జైల్లో ఉంటే మీరు బాగా తిని బరువెక్కారా? అని నిలదీశాను.ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా..అందుకు వాళ్లు.. లేదు, ఆంటీ, అంకుల్‌ను బాధ నుంచి బయటపడేసేందుకు వాళ్లతో కలిసి తాగాం, తిన్నాం అని చెప్పారు. నా ఫ్రెండ్సే నాకు రక్షణకవచాల్లా నిలబడ్డారు. అంత మంచి స్నేహితులు ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా శిబానీ దండేకర్ మాత్రం నావైపే నిలబడింది అని చెప్పుకొచ్చింది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సినిమాల్లేవుగా సంపాదన ఎలా? హీరో సుశాంత్ ప్రేయసి సమాధానమిదే!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు తలుచుకున్నప్పుడల్లా చిన్న వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతుంటారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఈమె వల్లే చనిపోయాడని కూడా అన్నారు. ఇప్పటికే పూర్తిగా యాక్టింగ్‌కి దూరమైపోయిన రియా.. ఏం చేస్తున్నాను? సంపాదన ఎలా అనే విషయాల్ని తన పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)'ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. మోటివేషనల్ స్పీకర్‌గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో ఛాప్టర్ అని చెప్పొచ్చు. గతంలో ఏం జరిగిందో, ఎలాంటి బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించని, నా గురించి అన్ని తెలిసినట్లు చాలా విమర్శలు చేశారు. ఇంకొందరైతే నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయతీగా ఉన్నా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను' అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి వచ్చిన సుశాంత్ సింగ్.. 'చిచ్చోరే' లాంటి సినిమాలతో హీరోగా చాలా ఫేమ్ సంపాదించాడు. కానీ ఏమైందో ఏమో గానీ 2020 జూన్‌లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి బాలీవుడ్‌లోని నెపోటిజం కల్చరే కారణమని, బడా హీరోలే ఇతడికి అవకాశాలు రాకుండా చేసి, మానసికంగా హింసపెట్టి చంపేశారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇతడి ప్రేయసి రియాపై కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా నటనకు దూరమైపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఈమెనే బయటపెట్టింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్) -
సినిమాల కంటే ఒక్క కాంట్రవర్సీతో ఫేమస్.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
అనుపమ అలాంటి పోజులు.. మరింత హాట్‌గా బాలీవుడ్ భామ!
హాట్ లుక్స్‌లో జియా శంకర్ హోయలు.. బ్లూ శారీలో టిల్లు స్క్వేర్ భామ అనుపమ.. వైజాగ్‌లో శ్రద్దాదాస్ అలాంటి లుక్స్.. బాలీవుడ్ భామ రియా చక్రవర్తి హాట్ పోజులు.. బర్త్ డే ముద్దుగుమ్మ రష్మిక అలాంటి వీడియో.. View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jiya Shankar (@jiyaashankarofficial) -
Rhea Chakraborty Saree Photos: సారీలో కవ్విస్తూ, కాక పుట్టిస్తున్న ఈ బ్యూటీని చూశారా?
-
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్‌పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్ మరణం.. ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు: నటి
నటుడు సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్‌ను కుదిపేసింది. ఇది ఆత్మహత్య కాదని అనుమానాలు వ్యక్తం కావడం, డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి మెడకు ఈ కేసు చుట్టుకుంది. పోలీసులు రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపిన ఈ నటి కొన్ని వారాల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున్నా ఆమెపై వ్యతిరేకత మాత్రం పోవడం లేదు. ట్రోలింగ్ దాదాపు తగ్గింది.. కానీ.. అంతేకాదు, తన కెరీర్ సైతం దెబ్బతిందని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'భయం, ట్రోలింగ్.. ఇలా చాలా ఫేస్ చేశాను. పరిస్థితి కొంత సద్దుమణిగింది. త్వరలోనే వాతావరణం అంతా మామూలైపోతుందనుకుంటున్నాను. ముఖ్యంగా ట్రోలింగ్ అయితే చాలావరకు తగ్గిపోయింది. గతంలో అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వ్యక్తిగా నేను మొదటి స్థానంలో ఉన్నాను. నాకు ఛాన్సులు ఇవ్వడానికి భయపడుతున్నారు ఆ స్థాయిలో నాపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో నా స్నేహితులు, కుటుంబం ఇచ్చిన అండదండల వల్లే బలం కూడగట్టుకుని నిలబడ్డాను. కానీ నాకు బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు. ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. నన్ను సినిమాలోకి తీసుకునేందుకు భయపడుతున్నారు' అని బాధపడింది. కాగా రియా చక్రవర్తి 2021లో వచ్చిన చెహర్ సినిమాతో చివరిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎమ్‌టీవీ రోడీస్: కరమ్ యా ఖాంద్ అనే రియాలిటీ షోలో గ్యాంగ్ లీడర్‌గా మెప్పించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్ -
సుశాంత్ మానసిక స్థితి గురించి నిజాలు తెలుసు: రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతని మరణంపై ప్రియురాలైన రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన రియా.. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చిన రియా.. తన కెరీర్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు కూడా హాజరైంది. సుశాంత్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ముంబయిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించా: స్టార్ హీరోయిన్) రియా మాట్లాడుతూ.. 'సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు బాగా తెలుసు. తను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నాకు తెలుసు. సుశాంత్ జీవితంలోకి తాను వచ్చినప్పటి నుంచి లైఫ్ మారిపోయింది. అతను అంతకుముందే బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్లో పెద్ద స్టార్‌గా ఎదిగాడు. అందువల్ల అతన్ని నియంత్రించే మనస్సు కాదని చెప్పుకొచ్చింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో.. ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని చెప్పింది. ముంబైలోని బాంద్రా నివాసంలో 2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
'అందుకే జైలులో నాగిని డ్యాన్స్ చేశా'.. సుశాంత్ ప్రియురాలు!
ఎంఎస్ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో ఐదు నిమిషాల పాటు డ్యాన్స్ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది. -
Rhea Chakraborty-Nikhil Kamath: ప్రేమలో పడ్డ సుశాంత్ సింగ్ ప్రేయసి.. అతడెవరో తెలుసా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు బాలీవుడ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెపోబ్యాచ్ సుశాంత్‌ను సైడ్ చేయడం వల్లే అతడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆక్రందన చెందారు. నటుడిది ఆత్మహత్య కాదని.. సినిమా ఇండస్ట్రీనే హత్య చేసిందని ఆరోపించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కూడా అతడి మరణానికి కారణమంటూ ఆరోపణలు సైతం వెలువడ్డాయి. అటు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే! ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రియా జైలు శిక్ష సైతం అనుభవించింది. ఈ విమర్శలు, తీవ్రమైన నెగెటివిటీ, ఆరోపణలు, కోర్టు కేసుల ఫలితంగా రియా చక్రవర్తికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి మామూలవుతున్న ఆమె తాజాగా ప్రేమలో పడిందంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని రెడ్డిట్‌లో ఓ రూమర్ వైరలవుతోంది. రియా ప్రేమలో పడిదంటూ వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ విరాట్ కోహ్లి మేనేజర్ బంటీ సాజ్దేతో ప్రేమలో పడిందని వార్తలు రాగా అవన్నీ వట్టి పుకారుగానే తేలిపోయింది. మరి ఇప్పుడు నిఖిల్ కామత్‌తో ప్రేమాయణంలో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ మాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్ -
డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు బిగ్ రిలీఫ్
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!) రియాపై నమోదైన సెక్షన్ 27-ఎ అంటే ఇదే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్‌కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది. అప్పట్లో జరిగింది ఇదీ 2020లో కలకలం రేపిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసు కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ చార్జీషీట్లో పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు నెలరోజుల పాటు జైల్లో ఉన్న రియా బెయిల్‌పై విడుదల అయింది. (ఇదీ చదవండి: జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్) -
ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్
కరోనా సమయంలో లాక్డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. దీంతో ఆయనను అభిమానించే వారిలో ఎక్కువగా యూత్నే ఉంటారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్ 'MTV రోడీస్ సీజన్ 19' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో నటి రియా చక్రవర్తి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. అక్కడ సెట్లో ఉన్న వారి కోసం సోనూసూద్ దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి కూడా అక్కడికి రాగా... 'మీకు ఎలాంటి దోశె కావాలి' అని అడిగి ఆమె కోరుకున్నట్లు టిఫిన్ సిద్ధం చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ఆయన అభిమానులు... 'మీరు అంటే మాకు ఎంతో గౌరవం.. అది ఎప్పటికీ కొనసాగుతుంది.. ఈ చర్యతో మీపై మరెంతో గౌరవం పెరుగుతుంది' అని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) కానీ.. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యువ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని ఇలా సోనూను కోరారు. 'మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ... తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారు సోనూసూద్‌కు ఈ సలహా ఇచ్చారు. -
మీకెందుకు భయం.. మీ పని అదేగా.. సుశాంత్ సోదరి సంచలన ఆరోపణలు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైరయింది. నువ్వు ఒక వేశ్య అంటూ రియాను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేసిందామె. సోమవారం రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రియాంక సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రియా వెనక పాలకులు ఉన్నందుకే భయపడట్లేదని ప్రియాంక ఆరోపిస్తోంది. ప్రియాంక ట్వీట్లో రాస్తూ.. 'మీరు ఎందుకు భయపడతారు? మీ చేసే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకంత ధైర్యం' అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులెవరో తనకు తెలుసని ప్రియాంక పేర్కొంది. అయితే కాసేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా.. సోమవారం రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్లు ప్రకటించింది. 'పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు' అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని గర్ల్‌ఫ్రెండ్ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్‌కు ముందు సుశాంత్, రియా రిలేషన్ షిప్లో ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్‌పై విడుదలైనప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी! प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है? कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है। WhoResponsible 4Delay InSSRCs is obvious — Priyanka Singh (@withoutthemind) April 10, 2023 -
సుశాంత్ మృతిలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? దర్యాప్తు స్టేటస్ ఏంటి?
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు. లోక్‌సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు. తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే.. లోక్‌సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం -
దేవకన్యలా మలైకా.. రాయల్ లుక్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ
సోషల్ హల్చల్ : తారల మెరుపులు ► పింక్ డ్రెస్‌లో అనుపమ క్యూట్ లుక్స్ ► షూటింగ్లో స్టిల్స్ ఇచ్చిన శ్రుతి హాసన్ ► జిమ్ సూట్లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ► కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి.. ఘనంగా గృహప్రవేశం ► వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మలైకా అరోరా ► సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ గ్లామరస్ ఫోటోలు ► రాయల్ లుక్‌లో మెరిసిపోతున్న శ్రీదేశి కూతురు జాన్వీ ► రష్మిక మందన్నా హాట్ లుక్స్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్
రియా చక్రవర్తి.. పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా తెరపై కంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో ఈమే పేరు ఎక్కువగా వినిపించింది. సుశాంత్ ప్రియురాలైన రియా అతడి మృతి, డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తిగా మారింది. 2020లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసు విచారణ చేప్పట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రీసెంట్గా ఆమెపై చార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి ఆమె ప్రధాన కారణమని, అతడికి డ్రగ్స్ కొని తెచ్చిందని ఎన్సీబీ పేర్కొంది. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ఇప్పిటికే రియాపై పీకలదాకా కోపంతో ఉన్న సుశాంత్ కుటుంబ సభ్యులు ఎన్సీబీ చార్జిషీట్ అనంతరం గుప్పుమన్నారు. పలు సందర్భాల్లో రియాపై మాటల దాడికి దిగిన సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తాజాగా ఆమెను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘2019లో అన్నయ్య(సుశాంత్ సింగ్) జీవితంలోకి రియా వచ్చినప్పుడే మా జీవితాలు నాశనమయ్యాయి. సుశాంత్‌కు క్లబ్‌లు, పార్టీలు అలవాటు లేదు. అందుకే అందుకే బాలీవుడ్ పెద్దలు కొందరు రియాను నియమించి సుశాంత్‌ను అలా తయారు చేశారు’ అంటూ మండిపడింది. ఇక ఆమె కామెంట్స్‌పై రియా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొట్ను షేర్ చేసింది. చదవండి: యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం ‘శబ్దానికి, ఈగోకు అతీతంగా ఎదుగు. నీవైపు వేలెత్తి చూపేలా ఎదుగు. ఎందుకంటే వారు చేరుకొలేని స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమతో ఎగరాలి. ఏ కారణం లేకుండానే నువ్వు వారిపట్ల కరుణతో ఉండాలి. నువ్వు వారిని ఆశ్చర్యపరచాలి. నీలా నువ్వు ఉండు. అదే నువ్వు. అదే నీ జీవితం. అంతేకాని ఇతరులు చెప్పేలా నువ్వు ఉండకు’ అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టింది. కాగా రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు మరో 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ తమ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జీషీట్లో వెల్లడించింది. -
షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?
2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్సీబీ నిందితులు పేర్కొంది. ఇక కోర్టులో ఎన్సీబీ చార్జిషీట్లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్సీబీ తమ చార్జీషీట్లో.. రియా, ఆమె సోదరుడుతో పాటు ఇతర నిందితలంత మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్య బాలీవుడ్లో డ్రగ్స్ పంపిణీ చేయడానికి, విక్రయించేందుకు ఒక గ్రూప్‌గా ఏర్పడి డ్రగ్స్ సప్లై చేశారు. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! నిందితులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రావాణకు ఆర్థికంగా సహాయం చేశారని, గంజాయి, చరస్, కొకైన్‌తో పాటు ఇతర మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించారని ఎన్సీబీ పేర్కొంది. రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి మాదక ద్రవ్యాలు సరఫర చేసే ముఠా తరచూ సంప్రదింపులు చేశాడని తెలిపింది గంజాయి, చరస్ ఆర్డర్ చేసిన అనంతరం ఇతర నిందితుల నుంచి దాన్ని పొందేవాడని, ఎన్డిపీఎస్ చట్టానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి విజి రఘువంశీ ఈ కేసు విచారణను జూలై 27కువ వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆమె బెయిలుపై బయటకు వచ్చింది. -
చివరికి ఆమె ఎలా బతకాలో నేర్చుకుంది.. హీరోయిన్ పోస్ట్
Rhea Chakraborty Said She Learnt How To Live In Present: బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సాధారణ స్థితికి రావడానికి ఒక్కో అడుగు వేస్తోంది. 2020 సంవత్సరంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ల వయసులో మరణించడంతో రియా పలు ఆరోపణలు ఎదుర్కొంది. సుశాంత్ మరణించిన సుమారు రెండేళ్ల తర్వాత ప్రియుడు జ్ఞాపకాలనుంచి బయటకు వచ్చేందుక ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ షిబానీ దండేకర్ వివాహానికి హాజరైంది. ఈ పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమంలో దిగిన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలో రియా ఎల్లో లెహెంగాలో అందంగా కనిపించింది. ఈ ఫొటో షేర్ చేస్తూ 'ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట.. చివరికీ ఆమె ఎలా జీవించాలోనేర్చుకుంది.' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది రియా. ఇక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో సుశాంత్, రియా అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంతో అందంగా ఉన్నావ్ అని ఒకరు, లవ్లీ అంటూ మరొకరు రియాను పొగుడుతున్నారు. కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం సుశాంత్ మరణాన్ని గుర్తు చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీవీ సీరియల్స్‌లో ప్రారంభమైన అతని కెరీర్ ఆ తర్వాత స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగింది. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యాడు. స్టార్ స్టేటస్‌తో కేరీర్లో దూసుకుపోతున్న సమయంలోనే అర్థాంతరంగా తనువు చాలించాడు. సుశాంత్ మనకు దూరమై రెండేళ్లయినా ఇంకా అతని మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(శుక్రవారం) సుశాంత్ 36వ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. సుశాంత్ మరణించే సమయంలో ప్రియురాలుగా ఉన్న రియా చక్రవర్తి సైతం సుశాంత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో ఇద్దరూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. మిస్ యూ సో మచ్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా సుశాంత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సైతం ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం రియా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
అమ్మాయిలు ఆ ట్రాప్‌లో పడకండి.. అదొక మాయ
Rhea Chakraborty Warns Girls Do Not Fall Into The Instagram Trap: అమ్మాయిలు అందంగా ఉండేందుకు అనేక దారులు వెతుకుతారు. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం అందంగా ఉండటానికి బదులు కనపడేందుకే ఆసక్తి చూపుతుంటారు. అలాగే బ్యూటిఫుల్‌గా కనిపించే ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. బెస్టీలు ఎవరైనా తాము బాగా కనిపించని పిక్స్ అప్లోడ్ చేస్తే కాల్ చేసి మరి వారిపై విరుచుకుపడతారు. అందుకే ఇలాంటి వారికోసం బ్యూటీ ఫిల్టర్లు అందిస్తున్నాయి కొన్ని యాప్స్. వివిధ రకాల ఫిల్టర్స్ వాడి ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటారు. కానీ అది వారి నిజమైన సోయగం అని మాత్రం ఆలోచించరు. ఇలాంటి వారికోసమే బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. ఇటీవల ఆసక్తికరమైన సంభాషణలు, స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లతో సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటోంది రియా. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో ఫిల్టర్లు వాడే అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతోంది. ఇన్‌స్టా గ్రామ్ బ్యూటీ ఫిల్టర్ల వలలో పడకండి అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో 'అమ్మాయిలందరికీ ఒక చిన్న విన్నపం. మీరు ఇన్‌స్టా బ్యూటీ ఫిల్టర్ల ట్రాప్‌లో పడకండి. అదొక మాయ. మీరు ఎలా ఉన్నారో అదే మీ అందం. ఈ మధ్య మీరు ఈ ఇన్‌స్టా బ్యూటీ, ఫిల్టర్ల గురించి ఎలా ఫీల్ అవుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారందరికీ నెను చెప్పేది ఒక్కటే. మీకు మీరుగా ఉండటమే నిజమైన అందం.' అని తెలిపింది రియా. ఇదీ చదవండి: ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి -
ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి
Rhea Chakraborty's Post Its Not Been Easy To Get Here About 2021 Year: 2021 సంవత్సరానికి బై బై చెబుతూ 2022 న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారికి ఈ ఏడాది ఎలా గడిచిందో అభిమానులతో పంచుకుంటున్నారు. కష్టం నుంచి చిరునవ్వు వరకు అంటూ ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి 2021 ఇయర్ తనకు ఎలా గడిచిందో చెప్పుకొచ్చింది. ఈ ఏడాదిని బాధ, దాన్ని నయం చేసిన సంవత్సరంగా తెలుపుతూ అందమైన పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో 'నేను నవ్వడం నువ్ చూశావ్. కానీ ఇక్కడికి రావడం (ఇలా మారడం) అంత సులభం కాదు. బాధ, బాధను నయం చేసుకునేందుకు ఈ ఏడాది మొత్తం గడిచింది. కానీ ఇప్పుడు నేను నిన్ను (2021) నవ్వుతూ చూస్తున్నాను. ఎందుకంటే నిన్ను కష్టపెట్టనిది ఏది నిన్నుస్ట్రాంగ్గా మార్చలేదు. మీ ప్రియమైన వారితో ఈ 2022 సంవత్సరాన్ని జరుపుకోండి. 2022 మనందరిపై దయ, ప్రేమతో ఉండాలి.' అని రియా పేర్కొంది. 2020లో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు రియా ప్రేరేపించిందన్న ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) ఇదీ చదవండి: చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్ -
రియా చక్రవర్తి పోస్ట్.. 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అంటూ హ్యాష్‌ట్యాగ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ ఇప్పుడు, ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన సందేశాలను పంచుకుంటుంది. ఇటీవల, నటి జీవితం గురించి ఒక విషయాన్ని షేర్ చేసింది. రియా చక్రవర్తి తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'నవ్వుతూ ఉండు.. ఎందుకంటే ఇప్పుడున్నదే జీవితం' అంటూ నవంబర్ 16న స్టోరీ షేర్ చేసింది. అలాగే దానికి 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అని ఒక హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చింది. సెండింగ్ యూ లవ్ అంటూ అని కూడా రాసి లవ్ ఎమోజీని పెట్టి స్టోరీని ముగించింది. జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి వర్ధంతి సందర్భంగా సుశాంత్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది రియా. ఆ పోస్ట్‌లో 'నువ్వు ఇక్కడ లేవని నేను నమ్మే క్షణం కూడా లేదు. సమయం అన్నింటిని నయం చేస్తుందని అంటారు. కానీ నా సమయం, నా సర్వస్వం అన్ని నువ్వే. అవును నువ్ ఇప్పుడు నన్ను కాపాడే సంరంక్షకుడివి అని నాకు తెలుసు. చంద్రుని నుంచి టెలిస్కోప్‌తో నన్ను చూస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు.' ఇలా ప్రేమగా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
ముంబై స్పెషల్ కోర్టులో రియాకు ఊరట
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి ముంబై స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. సుమారు 14 నెలల నుంచి సీజ్‌లో ఉన్న ఆమె బ్యాంక్ ఖాతాలను తిరిగి ఉపయోగించుకోవడానికి న్యాయస్థానం ఆమోదం తెలిపింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రియా గతేడాది సెప్టెంబర్‌లో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆమె బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అంతేగాక ఆమె ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన రియా.. తన బ్యాంక్ ఖాతాలను తిరిగి తన విడుదల చేయాలని స్పెషల్ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలే చేస్తూ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం తన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదల చేయాలని పటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాదోపవాదాలు విన్న తర్వాత.. రియా బ్యాంక్ ఖాతాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ని సైతం తిరిగి ఆమెకే ఇచ్చేయమని తీర్పులో పేర్కొంది. విచారణ పూర్తి అయ్యే వరకూ సెల్, ల్యాప్‌టాప్‌లను విక్రయించవద్దని కోర్టు రియాను ఆదేశించింది. -
అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి
Bigg Boss 15: టీవీ షోస్ బిగ్‌బాస్ షోకి ఉన్న పాపులారిటీ తెలిసిందే. అలాంటి షో పార్టిసీపేట్ చేసే అవకాశం వచ్చిందంటే ఎవరైన ఎగిరిగంతేస్తారు. అయితే ఇటీవల బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బిగ్‌బాస్ 15 పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరిగింది. దానికి షో యాజమాన్యం వారానికి దాదాపు 35 లక్షల ఆఫర్ చేసిన వార్తలు హల్చల్ చేశాయి. వాటి గురించి నటి తాజాగా సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. ‘నేను బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొంటున్నట్లు పుకార్లు వస్తున్నాయని విన్నాను. ఆ రూమర్స్‌లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఇది పెడుతున్నా. బిగ్‌బాస్‌లో నేను పార్టిసీపేట్ చేయట్లేదు’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రియా తెలిపింది. దీంతో ఒక్కసారిగా ప్రచారాలన్ని పటాపంచలైపోయినట్లైంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ షోలు, సినిమాలు చేస్తూ బాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్ హీరోయిన్ -
బిగ్‌బాస్‌లోకి సుశాంత్ ప్రేయసి?.. వామ్మో! వారానికి అన్ని లక్షలా..
Rhea Chakraborty Offered For Bigg Boss 15: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది నటి రియా చక్రవర్తి. సుశాంత్ మరణానికి రియానే కారణం అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంటారు. బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చడంతో సుమారు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపింది. అనంతరం బెయిల్‌పై విడుదలైన రియా ప్రస్తుతం సినీ అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా త్వరలోనే హిందీ బిగ్‌బాస్ సీజన్15 ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు రియాను సంప్రదించారట. ఇందుకోసం ఆమెకు వారానికి రూ.35లక్షల రూపాయలు అంటే కేవలం ఒక్క రోజుకే రూ. 5లక్షల రూపాయలను ఆఫర్ చేశారట షో నిర్వాహకులు. సుశాంత్ మరణంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన రియా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే టీఆర్పీ రేటింగులో ఓ రేంజ్లో ఉంటాయని, ఇందుకోసమే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు బీటౌన్ టాక్. అయితే ఇప్పటికే సుశాంత్ మృతితో అప్రతిష్ట మూటగట్టుకున్న రియా బిగ్‌బాస్‌లోకి వెళ్లే ధైర్యం చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ -
హృదయ విదారక దృశ్యాలు: బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
సాక్షి,ముంబై: అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ పౌరులు, ప్రధానంగా మహిళల స్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వేతన సమానత్వం కోసం పోరాడుతోంటే.. అఫ్గన్ మహిళలు మాత్రం అమ్మకానికి గురవుతున్నారన్నారు. వారే ఆదాయవనరుగా మారిపోయి జీవన పోరాటం చేస్తున్నారన్నారు. అఫ్గన్ మహిళలు, మైనార్టీల పరిస్థితిని చూసి హృదయం బద్దల వుతోందని పేర్కిన్నారు. ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ సంక్షోభంలో అండగా నిలబడాలని రియా గ్లోబల్ నాయకులను కోరారు. "పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి...మహిళలు కూడా మనుషులే" అని వ్యాఖ్యానించారు. మరోవైపు అఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, ఇతర సినీరంగ ప్రముఖులు స్పందించారు. ‘ప్రపంచం మౌనంగా చూస్తుండగా ఇంతటి సంక్షోభం.. మానవత్వానికి సిగ్గుచేటు’ అంటూ నటుడు కరణ్ టాకర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. అలాగే చిత్రనిర్మాత శేఖర్ కపూర్ కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్ ప్రజలకోసం ప్రార్థిస్తున్నాననీ, విదేశీ శక్తుల వలస రాజ్యం ఆశలో అఫ్గన్ నాశనం మైందని కపూర్ ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, రిచా చద్దా, అనురాగ్ కశ్యప్, సనమ్ పురి, హన్సల్ మెహతాతో సహా ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. As the Americans leave Kabul: pic.twitter.com/VLYoOrPGZL — ian bremmer (@ianbremmer) August 16, 2021 కాగా అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే అఫ్గన్ రాజధాని కాబూల్‌తోపాటు కీలక భూభాగాలను అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని కాబూల్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపాయి. ముఖ్యంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. కాబూల్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దీంతో బీతిల్లిన ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా తరలి రావడంతో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు, విమాన చక్రాలను పట్టుకుని మరీ వేళ్లాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ముఖ్యంగా కదులుతున్న విమానాన్ని అందుకోవాలన్న ఆశతో రవ్‌వేపై వేలాదిగా పరుగులు పెడుతున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి ఏడాది గడుస్తోంది. 2020 జూన్ 14వ తేదిన బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ ఈ ప్రపంచాన్ని వీడి ఏడాది పూర్తవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, అందరూ నటుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా.. నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా.. సుశాంత్ మరణించే సమయంలో ఆయన ప్రియురాలిగా ఉన్న రియా చక్రవర్తి, సుశాంత్‌ను తలుచుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసింది. సుశాంత్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నిన్ను తలచుకోని క్షణం లేదంటూ రాసుకొచ్చింది. ‘నువ్వు ఇక్కడ లేవనే నిజాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. టైమ్ అన్నింటిని నయం చేస్తుందని విన్నాను. కానీ నువ్వే నా టైమ్. నా సర్వస్వం నువ్వే. నిన్ను తలచుకోని క్షణమంటూ లేదు. నువ్వు ఎక్కడున్న నన్ను అనుక్షణం చూస్తూ.. నన్ను ఎల్లప్పుడు రక్షిస్తుంటావు. నువ్వు నన్ను నీతోపాటే తీసుకెళ్తావని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను.. నీ కోసం ప్రతి చోట వెతుకుతున్నాను. నా వెంటే ఉన్నావని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు గుండె పగిలేలా చేస్తావు. నువ్వు సాధించావు బేబూ అని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటాను” అని రియా చక్రవర్తి తన పోస్టులో రాసుకొచ్చింది. ‘నువ్వు నా పక్కన లేవనే విషయం నా గుండెలో ఎన్నో ఎమోషన్స్ రేకెత్తిస్తుంది. ఈ విషయం బయటకు చెప్పడానికి గుండె పగిపోయేంత బాధ నాలో ఉంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. జీవితం అనే అర్ధాన్ని నువ్వే తీసుకెళ్లావ్. ఈ శూన్యాన్ని ఎవరూ పూడ్చలేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్నే నిల్చోని ఉన్నాను. నా స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురుచూస్తునే ఉంటాను. నేను మీకు ప్రతిరోజూ 'మాల్పువా' ఇస్తాను. ఈ ప్రపంచంలోని అన్ని క్వాంటం ఫిజిక్స్ పుస్తకాలను చదువుతానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నా వద్దకు తిరిగి వచ్చేయ్. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Viral Video: ప్రియురాలితో సుశాంత్ సింగ్ స్టెప్పులు View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
ద్రౌపదిగా కనిపించనున్న రియా చక్రవర్తి!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన సినిమాలపై దృష్టి సారించింది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి నటించిన 'చెహ్రే' సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు బీటౌన్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రియాను సంప్రదించారట. ఇందులో ఆమె ఆధునిక ద్రౌపదిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందట. మరి ద్రౌపది పాత్ర చేయడానికి రియా అంగీకరించిందా? లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. కాగా 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రియా.. బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, మేరే డాడ్ కీ మారుతి వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంలో గతేడాది రియా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ నటి ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవల టైమ్స్ విడుదల చేసిన '50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020' జాబితాలోనూ రియా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. చదవండి: 'బాలీవుడ్లో ఛాన్సులు లేక టాలీవుడ్ వైపు చూస్తున్న రియా' -
నేను సారా అలి ఖాన్ కలిసి గంజాయ్ పీల్చాం: రియా
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది కావొస్తున్న ఇప్పటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. అతడి మరణంతో బీ-టౌన్ డ్రగ్ వ్యవహరం బట్టబయలైంది. అలా సుశాంత్ సింగ్ కేసులో ఇప్పుడు ఎన్సీబీ, సీఐడీ ఇలా అనేక విభాగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఏడాది నుంచి ఈ కేసు ఎన్నో మలుపు తిరుగుతూ వస్తోంది. ఇక ఎన్సీబీ కేసు విచారణ, దర్యాప్తు అంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాగా ఈ కేసులో అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్‌కు అత్యధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చిందని, ఆమెకు డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉందని నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఆమెపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించింది. రియాతో పాటు ఆమె సోదరుడు, మరికొంతమందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం ఈ ఇద్దరికి బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన ఆమె కొద్ది రోజులు సైలెంట్‌గానే ఉన్నా.. తాజాగా ఎన్సీబీ విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుశాంత్ సోదరి ప్రియాంక, ఆమె భర్త ఇద్దరూ కూడా డ్రగ్స్ వాడేవారని, సుశాంత్ డ్రగ్స్ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలుసని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక సుశాంత్ చనిపోయే ముందు అంటే ఓ నాలుగు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీన సుశాంత్ సోదరి ప్రియాంక డ్రగ్స్ కావాలని వాట్సప్ మెసేజ్ చేసిందని, తనకు 10 గ్రాముల లిబ్రియం, నెక్సిటో కావాలంటూ చాట్ చేసినట్లు తెలిపింది. అంతేగాక నటి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగమైనట్లు వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల కూతురైన సారా తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి గంజాయి పిల్చానని, పలుమార్లు, సారా తనకు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో వెల్లడించింది. మరో వారంలో సుశాంత్ తొలి వర్థంతి వస్తున్న నేపథ్యంలో రియా తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా గతేడాది జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నన్ను నమ్మి తీరాల్సిందే: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. నింగికేగిన ఈ నటుడిని అభిమానులు తల్చుకోని రోజంటూ ఉండదు. సైన్స్ గురించి మాట్లాడినా, స్పేస్(అంతరిక్షం) ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో ఎవరైనా అణిచివేతకు గురయ్యారన్నా.. ఫ్యాన్స్‌కు ముందు సుశాంత్ పేరే తడుతుంది. అతడు అభిమానులను ఒంటరివాళ్లను చేస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్లి జూన్ 14 నాటికి సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా అతడి ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాల్సిందే.. అక్కడే ఉండు, ప్రేమతో రియా..' అని రాసుకొచ్చింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గతేడాది ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) అధికారులు సుశాంత్ ప్రేయసి రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుమారు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్‌లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో పాటు సెలబ్రిటీలు దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు -
టాలీవుడ్లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలగులోకి వచ్చిన నటి రియా చక్రవర్తి ప్రస్తుతం కెరీర్‌పై దృష్టిపెట్టింది. సినిమాల్లో తిరిగి నటించేందుకు సిద్ధమయ్యింది. అయితే ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు. ఇండస్ర్టీలో తనకు బాగా తెలిసివాళ్లు ఉన్నా ఆమెకు అవకాశాలు ఇప్పించలేకపోతున్నారు. దీంతో రియా చూపు ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది. గతంలో తూనీగ తూనీగ సినిమాతో రియా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగా హీరో కళ్యాణ్దేవ్తోనూ ఓ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కే మకాం మార్చింది. అక్కడ సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా పాపులర్ అయిన రియా ఆ తర్వాత సుశాంత్ రికమండేషన్ వల్లే కొన్ని సినిమా ఆఫర్లను అందుకున్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా సుశాంత్ సినిమాలో తననే హీరోయిన్గా పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసేదని కూడా సమాచారం. ఆ తర్వాత సుశాంత్ హత్య, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చింది. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్‌లో ఆమె బెయిల్‌పై విడుదలయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందట. బాలీవుడ్ తలుపు తట్టినా ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీ వైపు ఆశగా చూస్తుందట. మరి రియాకు తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి. చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మత్తు పదార్థాల నియంత్రణా సంస్థ (ఎన్సీబీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సీజేఐ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ కేసును మార్చి 18న విచారించనుంది. రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబర్ 7న బెయిల్ ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్‌పోర్టు అధికారులకు సమర్పించాలని, ముంబై దాటి వెళ్లాల్సి వస్తే ఎన్సీబీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందిగా పలు నిబంధనలు పెట్టింది. రానున్న ఆరు నెలల పాటు ప్రతినెల 1న పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు మీదే ఎన్సీబీ సుప్రీంకోర్టును చేరింది. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ దొరకలేదు. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు: రియా చక్రవర్తి -
దయచేసి నన్ను ఫాలో కావొద్దు
ముంబయి: బాలీవుడ్ నటి రియాచక్రవర్తి బాంద్రాలోని రోడ్డు పక్కన ప్రత్యక్షమైంది. బుధవారం ముంబైలోని బాంద్రాలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా చక్రవర్తి పూల బొకే కొనుగోలు చేసింది. రియా చక్రవర్తి కారు దిగి పూల దుకాణంలో బొకే కొనుగోలు చేసిన తర్వాత కారు వైపు నడుస్తున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. దింతో ఆమె వారిని దయచేసి నన్ను ఫాలో కావొద్దు, వీడియోలు తీయకండి అని వారిని వేడుకుంది. ఇప్పడు దీనికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.(చదవండి: క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) రియా పూలు కొన్న తర్వాత తన కారు దగ్గరకు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫాలో అయ్యారు. "అబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా" అని ఆమె అనడం మనం వీడియోలో గమనించవచ్చు. జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జన్మదినానికి ఒక రోజు ముందు రియా పువ్వులు కొన్నట్లు అభిమానులు గుర్తించారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించలేదు. రియా వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించింది. ఆమె నల్ల మాస్కు ధరించి వీడియోలో కనిపించింది. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెంది ఏడు నెలలు గడిచాయి. గతేడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి మృతి కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ రాసుకున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సోదరి శ్వేతా సింగ్ బుధవారం దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘భాయ్ రాసుకున్న లేఖ.. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి’ అంటూ ఆమె పంచుకున్నారు. ‘నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్లు గడిపాను. ఈ మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను. ఇందుకోసం నా ప్రతి పనిలో మంచిగా ఉండాలని కోరుకున్నాను. అలాగే టెన్నిస్, స్కూల్, చదువు, ర్యాంక్స్లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను. అయితే ప్రతి కోణాన్ని అలా చూడటం వల్ల నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని. నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను. ఎందుకంటే నేనేంటో తెలుసుకోవడానికే ఆట ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సుశాంత్ జీవితంపై ఎన్నో ఆశలతో రాసుకున్న ఈ లేఖ చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) అయితే తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరెపించేలా నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలు ప్రవర్తించారని ఆరోపిస్తు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు అనంతరం ఈ కేసు విచారణకై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోకు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూడటంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్సీబీ అధికారులు సమన్లు అందజేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియాను పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్టు చేసి జెలుగా తరలించగా ఇటీవలకామె బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) -
రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి గత నెల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె మీడియాకు ఎదురుపడలేదు. ఈ క్రమంలో ఇటీవల ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన రియా ఫొటో నెట్టింటా హల్చల్ చేస్తోంది. రోడీస్ ఫేం రాజీవ్ లక్ష్మన్ కుమారుడి మొదటి బర్త్‌డే పార్టీకి ఇటీవల రియా హజరయ్యారు. ఈ సందర్భంగా రియాతో కలిసి సన్నిహితంగా దిగిన ఓ ఫొటోను రాజీవ్‌తో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ‘మై ఫ్రెండ్ ’అంటూ పోస్టు చేసిన ఈ ఫొటో రియా రాజీవ్‌ను హగ్ చేసుకుని కెమెరాకు నవ్వుతూ ఫొజ్ ఇచ్చారు. దీంతో అతనితో అత్యంత సన్నిహితంగా ఉండటమే కాక సంతోషంతో నవ్వుతూ కనిపించిన రియాపై నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో రాజీవ్ ఈ పోస్టును డిలీట్ చేశాడు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) దీంతో చాలా రోజుల తర్వాత రియా మళ్లీ వార్తల్లో నిలిచారు. సుశాంత్ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గతేడాది సెప్టెంబర్‌లో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్‌లో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక బయటకు రాగానే కేరీర్‌పై దృష్టి పెట్టిన రియా తిరిగి సినిమాల్లో నటించనున్నట్లు దర్శకుడు రూమి జాఫరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రియా 2021 నుంచి షూటింగ్లో పాల్గొననున్నారని, ప్రస్తుతం ఆమె చేతిలో ‘సోనాలి కేబుల్’, ‘జలేబీ’, ‘మేరే డాడ్‌కి మారుతి’ వంటి ప్రాజెక్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) -
సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు డ్రగ్ డీలర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎన్సీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో సోదాలు నిర్వహించింది. సుమారు రెండున్నర కోట్ల విలువ గల 5 కిలోల హషిష్, ఆఫీం, ఎండీఎమ్ఏ(మాలి) తదితర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వీటిని సరఫరా చేస్తున్న రీగల్ మహాకల్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. కాగా మహాకల్‌తో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్సీబీ భావిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడం ద్వారా కేసులో పురోగతి సాధించగలమని అధికారులు వెల్లడించారు.(చదవండి: షోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు) ఇక ఈ విషయం గురించి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేం రీగల్ మహాకల్‌ను అరెస్టు చేశాం. రియా చక్రవర్తి, షోవిక్‌తో అతడికి సంబంధాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం’’ అని పేర్కొన్నారు. కాగా రీగల్, అనూజ్ కేశ్వానికి డ్రగ్స్ సరఫరా చేయగా, అతడి నుంచి రియా వాటిని కొనుగోలు చేసి సుశాంత్‌కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగత జీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తనతో సహజీవనం చేసిన రియా చక్రవర్తి కారణంగానే అతడు మరణించాడని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుశాంత్, రియా, వారి ఫ్లాట్‌లో నివసించే మరికొంత మందిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అనేక పరిణామాల అనంతరం అరెస్టైన రియా చక్రవర్తి తొలుత బెయిలుపై బయటకు రాగా, షోవిక్ కూడా ఇటీవలే జైలు నుంచి విముక్తి పొందాడు. (చదవండి: డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా) -
సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్‌లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది. అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్‌కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) అయితే అక్టోబర్‌లో రియాకు బెయిల్‌ను మంజూరు చేసిన కోర్టు సోవిక్ బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం నవంబర్ మొదటి వారంలో సోవిక్ మళ్లీ బెయిల్ పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్‌కు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్ 14వ సుశాంత్ సింగ్ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ స్టార్ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్ గోస్వామి తన టీవీ ఛానెల్ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్ తనకు అర్నాబ్ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్‌ను పదే పదే డిమాండ్ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా? సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్‌ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్‌ఫోన్ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్‌ఫోన్‌ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్ నాట్ జెయిల్’ అన్న అర్నాబ్ నినాదంలో నిజం లేకపోలేదు. -
‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’
‘‘సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ముంబైలో ఐదుగురు డాక్టర్లను సంప్రదించాడు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారంతా అతడికి సూచించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఇలాంటి వ్యసనాలు వీడితే బాగుంటుందని చెప్పారు. రియా కూడా అతడికి ఇదే మాట చెప్పింది. డాక్టర్ల మాట వినమని సూచించింది. కానీ అతడు అందుకు తిరస్కరించాడు. సుశాంత్ తీరు రియాను అతడి ఇంటిని వీడేలా చేసింది. అతడి కోరిక మేరకే రియా ఈ పని చేసింది’’ అంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మృతికేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ క్రమంలో అతడి కుటుంబం, సుశాంత్ ప్రేయసి రియా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్‌పై రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక సూచించిన మందుల కారణంగానే అతడు మృతి చెందాడని, ఈ విషయంపై సీబీఐ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని రియా కోరింది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంకతో పాటు ఆమె సోదరి మీతూ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసిన పోలీసులు, సుశాంత్ సోదరీమణుల పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. (చదవండి: డ్రగ్స్ కేసు: ఎన్సీబీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు) అంతేగాకుండా రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామాల గురించి సతీశ్ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘రియా చక్రవర్తి చెప్పిన అంశాల ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి వైద్యులను సంప్రదించకుండా, ప్రిస్కిప్షన్‌ను ఫోర్జరీ చేయడం చట్టవిరుద్ధం. ప్రియాంక తన సోదరుడికి సూచించిన మందుల విషయం గురించి జూన్8 నాటి మెసేజ్‌లలో స్పష్టంగా కనబడుతోంది. సుశాంత్ డ్రగ్స్‌కు బానిసగా మారాడని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాడని తెలిసి కూడా ఆ కుటుంబం ఇలా చేసింది’’అని ఆరోపణలు గుప్పించారు. -
సుశాంత్ కేసు: రూ. 10 లక్షలు ఇప్పించండి!
ముంబై: బాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి సహాయకుడు దీపేశ్ సావంత్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తనను అక్రమంగా నిర్బందించారని, ఇందుకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసిన 36 గంటల వరకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించాడు. సెప్టెంబరు 5 రాత్రి ఎనిమిది గంటల సమయంలో తనను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారని, నిజానికి తనను అంతకుముందు రోజు రాత్రి పదింటికి అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) సెప్టెంబరు 6న తనను మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారని, తద్వారా సుప్రీంకోర్టు నిబంధనల(నిందితుడిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టాలి)ను తుంగలో తొక్కారంటూ దీపక్ సావంత్ ఆరోపణలు చేశాడు. కాగా ఈనెల 5వ తేదీన దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణను నవంబరు 6కు వాయిదా వేశారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్ణిక్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఇక సుశాంత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తితో పాటు దీపక్ సావంత్ సహా పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. దీపక్ సావంత్‌కు ఇటీవల బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. -
సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్సీబీ అతనిని రిమాండ్‌లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్‌సావంత్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి వారిని కూడా ఎన్సీబీ విచారించింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. చదవండి: ప్రముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా -
పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా
ముంబై: తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పొరుగింటావిడ డింపుల్ తవానిపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐకిలేఖ రాసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రియాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సుశాంత్ వచ్చాడని డింపుల్ ఒక మీడియాతో చెప్పారు. అయితే ఆమె సీబీఐ విచారణలో నేను వారిని చూడలేదని ఎవరో చెబితే విన్నానని వెల్లడించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది. మీడియా తన టీర్పీల కోసం తనను అపకీర్తి పాలు చేస్తోంది లేఖలో పేర్కొంది. ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ సెప్టెంబర్‌లో అదుపులోకి తీసుకుంది. ఆమెకు అక్టోబర్7 వతేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రియా తమ్ముడు షోవిక్‌కు మాత్రం ఇంకా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇక రియా తరుపు న్యాయవ్యాది ఈ కేసులో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు సీబీఐ ముందు ఉంచుతామని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..? -
సుశాంత్ కేసు : సీబీఐ ఎదుట యూటర్న్
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించిన మహిళ యూటర్న్ తీసుకున్నారు. సుశాంత్ మరణించే ముందు రోజు రియా చక్రవర్తి ఆయనను కలిశారని ఆరోపించిన రియా పొరుగింటి మహిళ సీబీఐ ముందు తన ఆరోపణలపై వెనక్కి తగ్గారు. దర్యాప్తు ఏజెన్సీ ఎదుట స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో తప్పుడు సమాచారం ఇవ్వడంపై మహిళను సీబీఐ హెచ్చరించింది. మీడియా ఎదుట తప్పుడు ప్రకటనలు చేసే వారందరిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఇలాంటి వారితో కూడిన జాబితాను సీబీఐకి అందచేస్తామని రియా న్యాయవాది వెల్లడించారు. చదవండి : రియాకు బెయిల్ దర్యాప్తు ప్రక్రియను తప్పుదారిపట్టించిన వారిపై చర్యలు చేపట్టాలని సీబీఐని కోరతామని చెప్పారు. మరోవైపు ముంబై బైకుల్లా జైలులో దాదాపు నెలరోజులు గడిపిన రియా గత వారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ రాజ్‌పుత్ (34) ముంబైలోని బాంద్రా అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ముంబై పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం ఎయిమ్స్ వైద్యులు సైతం సుశాంత్ మరణం ఆత్మహత్యేనని ధ్రువీకరించారు. -
రియాకు బెయిల్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియాచక్రవర్తికి ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 28 రోజుల జైలు జీవితం తరువాత, రియా చక్రవర్తి బైక్యులా మహిళా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. రూ.1లక్ష వ్యక్తిగత బాండు, ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడం, ఆరు నెలల పాటు, ప్రతినెలా ఒకటవ తారీకున ఎన్సీబీ ముందు హాజరుకావడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేయరాదని హైకోర్టు షరతులు విధించింది. రియా ఎన్సీబీ అనుమతి లేకుండా, ముంబై వీడి వెళ్ళరాదని, విదేశాలకు వెళ్ళాలనుకుంటే స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతులు విధించింది. రియాకు నేర చరిత్ర లేదని, కనుక రియా సాక్ష్యాలను తారుమారు చేస్తారని తాము భావించడం లేదని బెయిలు ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలకీ, రోల్ మోడల్స్కీ ప్రత్యేక హక్కులేవీ ఉండవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రియా విడుదల సందర్భంగా, మీడియా ఆమె వెంటబడటం, ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడం సహించబోమని ముంబై పోలీసులు మీడియాని హెచ్చరించారు. రాజ్‌పుత్ వ్యక్తిగత సహాయకులు దీపేష్ సావంత్, సామ్యూల్ మిరిండాలకు హైకోర్ట్ బెయిలు మంజూరు చేసింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ స్మగ్లర్ అబ్దెల్ బాసిత్ పరిహార్‌లకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. -
జైలు నుంచి రియా విడుదల.. ఫోటోలు వైరల్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ఈ మేరకు నేడు(బుధవారం) విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ లభించలేదు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను బోంబే హైకోర్టు కొట్టి వేసింది. చదవండి: రియాకు బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్ ఎట్టకేలకు రియాకు బెయిల్ లభించడంతో 28 రోజుల తర్వాత ముంబైలోని బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. దీనికి సబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఈ విషయంపై డీసీపీ సంగ్రాంసింగ్ నిషందర్ మాట్లాడుతూ.. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఎవరైన ఆమె వాహనాన్ని వెంబడించడం, అడ్డుకోవడం వంటివి చేస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాతో సహా వెంబండించిన వారే కాకుండా ఇలాంటి చర్యలకు ప్రేరేపించిన వారిపై కూడా ఎంవీ చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. చదవండి: రియా బెయిల్: బాలీవుడ్ నటుల స్పందన Mumbai: Actor Rhea Chakraborty released from Byculla jail after a month. She was granted bail by Bombay High Court in a drug-related case filed against her by Narcotics Control Bureau (NCB) pic.twitter.com/FlfP1re1cQ — ANI (@ANI) October 7, 2020 కాగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్‌పోర్ట్‌ని సమర్పించాల్సిందిగా చెప్పింది. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని.. ఒకవేళ గ్రేటర్ ముంబై దాటి వెళ్లాల్సి వస్తే.. కేసు విచారణ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని షరతులు విధించింది. ప్రతీ పది రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది. రియాకు ఊరట.. షోవిక్‌కు షాక్! -
రియా బెయిల్: బాలీవుడ్ నటుల స్పందన
ముంబై : నటుడు సుశాంత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రక్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తికి నేడు(బుధవారం) బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజుల పాటు ఉన్న రియాకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్‌పోర్ట్‌ని సమర్పించాల్సిందిగా చెప్పింది. అయితే రియా చక్రవర్తి సోదరుడు సోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు.. అతడికి అక్టోబర్ 20 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. చదవండి: రియాకు ఊరట.. షోవిక్‌కు షాక్! కాగా రియాకు బెయిల్ లభించడంపై బాలీవుడ్‌లోని పలువురు నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుభవ్ సిన్హా, సోని రజ్ధాన్, హర్హాన్ అక్తర్ వంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘చివరికి రియాకు బెయిల్ లభించింది’ అని అనుభవ్ ట్వీట్ చేశారు. జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్‌ను సోని రీట్వీట్ చేశారు. అలాగే బెయిల్ అందించినందుకు బాంబే హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రియా జైల్లో ఉన్న సమయంలో ఆమెకు మద్దతు తెలుపుతూ తనను విడుదల చేయాలని స్వరా భాస్కర్, రచయిత కనికా ధిల్లాన్ సహా పలువురు నటులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రియా బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్ -
రియాకు బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్
ముంబై: డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముంబై పోలీసులు మీడియాకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే మీడియా రియా చక్రవర్తి విషయంలో పరిమితికి మించి ఉత్సాహం కనబరిచి ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని పోలీసులు హెచ్చరించారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని సూచించారు. మీరు (జర్నలిస్టులు,రిపోర్టర్లు) సదరు సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించరాదని పేర్కొన్నారు. చదవండి: (రియా చక్రవర్తికి బెయిలు మంజూరు.. కానీ) వాహనాలను వెంబడించడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశాందర్ తెలిపారు. అలా చేయడం వల్ల మీ జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజల జీవితాలకు అపాయం కలుగుతుందని పేర్కొన్నారు. సెలబ్రిటీల వాహనాలను వెంబడించే క్రమంలో డ్రైవర్‌తో పాటు, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం రియా బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టైన రియా సుమారు నెల రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో మీడియా తనపై అసత్య ప్రచారం జరుపుతోందని వాటిని వెంటనే ఆపాలంటూ నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
రియాకు బెయిలు..
-
రియాకు ఊరట.. షోవిక్‌కు షాక్!
ముంబై: బాలీవుడ్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం బుధవారం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పదిరోజుల పాటు పోలీష్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా గ్రేటర్ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు షరతు విధించింది. అయితే ఇదే కేసులో అరెస్టైన రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్, శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్‌లను హైకోర్టు బెయిలు నిరాకరించింది.(చదవండి: సుశాంత్ మృతి: ‘వాళ్లంతా ఉరేసుకోవాలి’) కాగా బాలీవుడ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతడి ప్రేయస రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె, సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో సెప్టెంబరు 9న అదుపులోకి తీసుకుని, బైకుల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిలు కోరుతూ రియా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా.. అనేక వాయిదాల అనంతరం హైకోర్టులో బుధవారం ఆమెకు ఊరట లభించింది. సుమారు నెల రోజుల తర్వాత ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది.(చదవండి: రియా రిమాండ్‌ను పొడిగించిన ముంబై కోర్టు) -
డ్రగ్ కేసు: రియా రిమాండ్ పొడిగింపు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో అరెస్టైన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కస్టడిని ముంబై సెషన్స్ కోర్టు పొడిగించింది. రియా సుశాంత్‌కు డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సెప్టంబర్ 9 అరెస్టు చేసి ముంబైని బైకుల్లా మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో సహా మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కస్టడిని అక్టోబర్ 20 వరకు పోడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్‌లో బెయిల్ కోరుతూ రియా ముంబై కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. కానీ కోర్టు తన పిటిషన్ రిజర్వులో ఉంచింది. అయితే దీనిపై తదుపరి ఉత్తర్వును బుధవాంర వెల్లడించే అవకావం ఉన్నట్లు సమాచారం. (చదవండి: సుశాంత్‌ది ఆత్మహత్యే.. హత్య కాదు!) అయితే డ్రగ్ కేసులో నేర నిరూపణ కావడంతో రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలతో పాటు మరో ముగ్గురిని ముంబై సెషన్స్ కోర్టు అక్టోబర్ 6 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపించింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ రియా ఆమె సోదరుడు షోవిక్‌తో సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీబీ త్రీవంగా వ్యతిరేకించింది. వారి బెయిల్ విచారణ సమయంలో యువకులకు వారు మాదకద్రవ్యాలను సరఫరా చేయలేదన్న నేర ఆరోపణ నిర్థారణకు వచ్చే వరకు వారికి బెయిల్ మంజూరు చేయోద్దని కోర్టును ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం డ్రగ్ వ్యవహారంలో డ్రగ్ సిండికెట్ క్రియాశీల సభ్యులు, సుశాంత్ మృతి కేసు సంబంధించిన ప్రారంభ దర్యాప్తును కూడా సమీక్షిస్తామని ఎన్సీబీ కోర్టుతో పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) చదవండి: అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి! -
అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులపై నటి రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. #JusticeforSushant అనేది ఓ బోగస్ ప్రచారం అంటూ విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సతీశ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో సీబీఐ విచారణ ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఎదురుచూడాలి. కానీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు, ఎయిమ్స్ వైద్యులపై కొంత మంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన సమాధానం రాకపోవడంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఇక సుశాంత్‌కు న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నవాళ్లదంతా ఓ బోగస్ ప్రచారం. డాక్టర్లు ఏం చెప్పారో విన్నారు కదా. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!) మీలాంటి వాళ్లంతా సిగ్గుతో తలకు ఉరేసుకోవాలి. ఎందుకంటే మీ నటుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతడి కుటుంబం వల్ల, సోకాల్డ్ మీడియా సృష్టించిన అసత్య ప్రచారాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అతడితో సహ జీవనం చేసిన నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక రియా తరఫున సతీశ్ మనేషిండే వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
సుశాంత్‌ది ఆత్మహత్యే.. హత్య కాదు!
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలాగా అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టిననప్పటికీ అతనిది ఆత్మహత్యా, హత్యా అన్న విషయంలో స్పష్టత రాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకు పేర్కొంది. చదవండి: సుశాంత్ కేసులో మరో మలుపు కాగా జూన్ 14న సుశాంత్ తన అపార్ట్మెంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్‌ది ఆత్మహత్యేనని తెలిపారు. అయితే తన కొడుకు చావుకు గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని, సుశాంత్ నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కొందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై రియా ప్రస్తుతం జైలులో ఉన్నారు. చదవండి: రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో సుశాంత్‌కు విషం ఇచ్చారని, గొంతు నులిమి చంపారని చేసిన ఆరోపణలను ఏయిమ్స్ వైద్య బృందం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు తమ మెడికో లీగల్ ఒపీనియన్‌ను న సీబీఐకు సమర్పించారు. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది ఆత్మహత్య కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు. 45 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం అనేక కోణాలలో దర్యాప్తు చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కోణంలో ఇక సీబీఐ దీన్ని దర్యాప్తు చేయనుంది. చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత -
డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!
న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణుల పేర్లే ఇప్పటిదాకా తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్ ఫోన్లలో గతంలో డిలీట్ అయిన డేటాను ఎన్సీబీ తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ ముగ్గురు ప్రముఖ హీరోలు భాగస్వాములేనని ఎన్సీబీ గుర్తించింది. బడా హీరోలుగా చెలామణి అవుతున్న కొందరు డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి, ఎన్సీబీ విచారించనుంది. సదరు బడా హీరోలు నోరు విప్పితే మొత్తం గుట్టు రట్టు కావడం ఖాయం. ప్రస్తుతం వారందరి ఫోన్లపై ఎన్సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును రకుల్ ప్రీత్‌సింగ్ ఆశ్రయించిన నేపథ్యంలో స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. (చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) -
రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్‌పై బాంబే హైకోర్టు నేడు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రిమాండ్‌లో ఉన్న రియా బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఇక గతంలో రియా బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న విషయం ఆసక్తిని రేపుతోంది. (‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?) కాగా సుశాంత్ సింగ్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) -
3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?
బాలీవుడ్లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎనోఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రంగంలోకి దిగుతున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. క్వాన్, రియా అకౌంట్ల మధ్య జరిగిన భారీ నగదు లావాదేవీలు షాక్ గురిచేస్తున్నాయి. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా రెండు భారీ మొత్తాలు క్వాన్, రియా చక్రవర్తి అకౌంట్ల మధ్య ట్రాన్స్ఫర్ జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలపై ఈడీ ఆరా తీయాలనుకొంటున్నది. కంపెనీ నుంచి రియా అకౌంట్లోకి భారీగా కమీషన్లు జమ అయ్యాయి. ఒకానొక సమయంలో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్న రియా అకౌంట్లోకి ఒక్కసారిగా లక్షలు బదిలీ కావడం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. రియా-ఆమె తల్లి సంధ్య పేరిట ఉన్న జాయింట్ అకౌంట్లోకి ఈ మొత్తం చేరినట్లు సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) ఈ క్రమంలో ఈడీ రియా, ఆమె తల్లి సంధ్య జాయింట్ అకౌంట్లో జరిగిన లావాదేవీలను పరిశీలించనుంది. ఇక రియా అకౌంట్లోకి వచ్చిన డబ్బు డ్రగ్ డీలర్లు ఇచ్చిన కమిషన్లే అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సుశాంత్ చనిపోయిన నెల తర్వాత రియా అకౌంట్లో కొన్ని కమీషన్లు జమ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్‌షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఇతరులకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రియా తరపు లాయర్ సుశాంత్ మొదటి నుంచీ మెంటల్ కేసే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రియాతో పరిచయానికి ముందు నుంచి అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలిపాడు. ఇక సుశాంత్ కోసం రియా డ్రగ్స్ కొనలేదని.. అతనికి డబ్బుకు కొదవలేదని తెలిపాడు. (చదవండి: ‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?) డ్రగ్స్ అలవాటు లేని రియా వాటిని ఎందుకు కొనుగోలు చేసిందని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. రియా, ఆమె సోదరుడు డ్రగ్ సిండికేట్ మెంబర్స్ అని తెలిపారు. ఇక బాలీవుడ్ నటుల ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేస్తున్న అధికారులు కొందరు నటులు డ్రగ్స్ కొనుగోలుకు క్రెడిట్ కార్డులు వాడినట్లు గుర్తించారు. -
రకుల్ పిటిషన్‌పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రియా చక్రవర్తి డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని రకుల్ ప్రీత్‌సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో తన పేరు మీద వార్తలు రాయడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో రకుల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టగా రకుల్ తరపున న్యాయవాది అమన్ హింగోరాని తమ వాదనలు వినిపించారు. నటి దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 17న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్చలను తీసుకున్నారో సూచిస్తూ స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే మీడియాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను జస్టిస్ నవీన్ చావ్లా ఆదేశాలు జారీ చేశారు. అయితే రకుల్ తన పిటిషన్లో డ్రగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసి, తగిన నివేదికను కోర్టు ముందు దాఖలు చేసే వరకు మీడియా తనపై వార్తలు ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు ఆక్టోబర్ 15కు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయట పడిన విషయం తెలిసిందే. రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది -
‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు నేడు విచారించనుంది. వీరిరువురితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టనుంది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు బెయిలు మంజూరు చేయవద్దంటూ ఎన్సీబీ సోమవారం తన నివేదికలో పేర్కొంది. రియా, ఆమె సోదరుడు స్వయంగా మాదక ద్రవ్యాలు సేవించడమే గాకుండా ఇతరులకు సరఫరా చేశారని, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!) అదే విధంగా.. రియాకు డ్రగ్స్ సిండికేట్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆమె మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు తగిన ఆధారాలు లభించాయని వెల్లడించింది. ఇక గతంలో రియా అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను విచారించారు.(నలుగురిదీ ఒక్కటే మాట..) -
ఉడ్తా బాలీవుడ్
-
ఉడ్తా బాలీవుడ్
-
రాజ్‌పుత్‌ది హత్యే..!
న్యూఢిల్లీ: గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. ఈ మృతికి కారణమంటూ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాలపైవిచారణ వరకు వచ్చింది. -
డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ
ముంబై: మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు హాజరయ్యారు. నటుడు సుశాంత్‌సింగ్ మృతి, తదనంతరం వెలుగు చూసిన తారల డ్రగ్స్ వినియోగం, సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్ శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆమెను ఎన్సీబీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. నటి దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాశ్‌ను అధికారులు శనివారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. దీపిక పదుకోన్‌ను శనివారం విచారించనున్నట్లు సమాచారం. క్షితిజ్ రవిని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. రవి ఇంట్లో ఎన్సీబీ జరిపిన సోదాల్లో డ్రగ్స్ లభించినట్లు సమాచారం. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్‌తో పాటు పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. సుశాంత్‌సింగ్ కోసం రియా తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ తెప్పించేదని ఎన్సీబీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అది నిజమేనని విచారణలో షోవిక్ కూడా అంగీకరించాడు. పారిహార్, కైజెన్ ఇబ్రహీంల నుంచి డ్రగ్స్‌ను సేకరించిరియాకు ఇచ్చేవాడినని తెలిపాడు. వాటితో రాజ్‌పుత్ మేనేజర్ సామ్యూల్ మిరండా, కుక్ దీపేశ్‌సావంత్ సిగరెట్లు తయారు చేసేవారని షోవిక్ చెప్పాడు. ఎన్సీబీ అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. రియా కుటుంబం పాల్పడిన నగదు అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా ఈ డ్రగ్స్ కోణం ఈడీ దృష్టికి వచ్చింది. దాంతో, ఈడీ ఈ విషయాన్ని ఎన్సీబీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్సీబీ విచారణలో డ్రగ్స్ సరఫరాలో కీలకమైన జాయిద్ పాత్ర బయటపడింది. లాక్డౌన్ కారణంగా తన హోటెల్ బిజినెస్ దెబ్బతిన్నదని, అందువల్ల ఈ డ్రగ్స్ దందాలో దిగానని జాయిద్ ఎన్సీబీ విచారణలో వెల్లడించాడు. బాసిత్ పారిహర్ పేరు కూడా జాయిదే వెల్లడించాడు. అలాగే, కైజెన్ ఇబ్రహీంను విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ సప్లైయర్ అనుజ్ కేశ్వానీ పేరు తెరపైకి వచ్చింది. బాంద్రాలోని ఆయన ఇంటిపై జరిపిన దాడిలో భారీగా చరస్, గంజాయి, టీహెచ్‌సీ, ఎల్సీడీ మాదకద్రవ్యాలు లభించాయి. రియా, షోవిక్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. కరణ్ జోహార్‌ను కూడా? పలువురు బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు కనిపించిన ఒక వీడియోను అప్లోడ్ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోçహార్ను కూడా ఎన్సీబీ విచారించనుందని శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. చాలా కాలం క్రితం నాటి ఆ వీడియోను సాక్ష్యంగా చూపుతూ మంజిందర్ సింగ్ తాజాగా ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎన్సీబీ ఆ వీడియో నిజానిజాలను నిర్ధారించేందుకు టెస్టింగ్‌కు పంపించింది. -
సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆ లోకాన్ని వీడి మూడు నెలలు దాటినా అతడి మరణానికి గల స్సష్టమైన కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. మీడియా, సోషల్ మీడియాలో మాదక ద్రవ్యాల కేసు గురించే విపరీతచర్చ జరుగుతోంది. దీంతో సుశాంత్ మృతి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని, అతడిది ఆత్మహత్యా లేదా హత్యా అన్నది తేల్చడంలో సీబీఐ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కుటుంబ లాయర్ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) ఈ మేరకు.. ఎయిమ్స్ బృందంలోని ఓ డాక్టర్‌కు తాను గతంలో కొన్ని ఫొటోలు పంపించానని, అందులో సుశాంత్ మెడపై కొన్ని గుర్తులున్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. వాటిని బట్టి సుశాంత్‌ను ఎవరో గొంతు నులిమి చంపేశారని, అయితే 200 శాతం సూసైడ్ కాదని చెప్పుకొచ్చారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా ఈ కేసును మర్డర్ కేసుగా మార్చడంలో సీబీఐ జాప్యం చేయడం విసుగు తెప్పిస్తోందంటూ వికాస్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు స్పందనగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి సైతం.. ‘‘చాలా రోజుల నుంచి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాం! నిజాన్ని వెలికితీసేందుకు ఇంకెంత సమయం పడుతుంది?’’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుశాంత్ కేసును పరిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీం పానెల్ చీఫ్ వికాస్ సింగ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మృతుడి శరీరంపై ఉన్న మరకల ఆధారంగా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, రిపోర్టు వచ్చేంత వరకు కాస్త ఓపికగా వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో బైకుల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. We have been so patient for so long! How long will it take to find the truth? #SSRDeathCase https://t.co/Vn5R62a0SY — Shweta Singh Kirti (@shwetasinghkirt) September 25, 2020 -
డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!
కోల్‌కతా: బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి స్పందించారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు మాత్రమే మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల కోసం పరితపించిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు కేవలం నటీమణులకు మాత్రమే సమన్లు జారీ అయిన నేపథ్యంలో తనదైన శైలిలో ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు.. ‘‘అవును.. పితృస్వామ్యమా.. బాలీవుడ్లో ఉన్న మహిళలు హష్, డ్రగ్స్ సహా ఇంకేం కావాలనుకున్నా దాన్ని దక్కించుకుంటారు. అయితే అక్కడున్న పురుషులు మాత్రం వంటపని, ఇంటిపనిలో నిమగ్నమై, తమ భార్యలు బాగుండాలంటూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు కళ్ల నిండా నీళ్లు నింపుకొని.. ‘‘దేవుడా తనను కాపాడు’’ అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంటారు’’అని మిమి చక్రవర్తి చురకలు అంటించారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బయటపడ్డ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే అతడి ప్రేయసి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకు ఒక్క నటుడి పేరు కూడా ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మిమి చక్రవర్తి ఈ మేరకు స్పందించారు. ఇక తనను వేధించిన ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కాగా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మిమి టీఎంసీలో చేరి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాదవ్‌పూర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: మిమి చక్రవర్తితో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన) Yes patriarchy Women in bollywood go for Hash nd drugs or whatever nd men in bollywood cook nd clean nd pray for their better half wit joined hands nd tears in eye “Bhagwan unki raksha karna” — Mimssi (@mimichakraborty) September 24, 2020 -
డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సతీశ్.. ‘‘ఎన్సీబీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవం. సుశాంత్‌తో ఉన్నన్ని రోజులు అతడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని మాత్రమే రియా చక్రవర్తి ఎన్సీబీకి తెలిపారు. అంతేతప్ప ఇతరుల గురించి ఆమె మాట్లాడలేదు’’అని పేర్కొన్నారు. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ) అదే విధంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. ‘‘సుశాంత్ ఇంటి మనిషిగా ఉన్నందున తన గురించి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అయితే జయా సాహా ఇతర డ్రగ్ డీలర్లతో రియా వాట్సాప్ చాట్స్ గురించి సతీశ్‌ను ప్రశ్నించగా.. ‘‘రియా, సుశాంత్‌లతో జయా ఏం మాట్లాడారన్న దానిపై స్పష్టతనివ్వాలనుకుంటున్నా. గంజాయి ఆకుల నుంచి తీసిన సీబీడీ ఆయిల్ ఇవ్వాలని మాత్రమే వాళ్లు ఆమెను అడిగారు. నిజానికి అది మత్తు పదార్థం కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ ఆయిల్ బాటిల్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని దానిపై రాసి ఉంటుంది’’అని పేర్కొన్నారు. (చదవండి: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టు కాగా, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీపికా సెప్టెంబరు 25న, సారా, శ్రద్ధ సెప్టెంబరు 26న ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. రకుల్, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, సిమోన్ ఖంబట్టా నేడు విచారణ ఎదర్కొంటున్నారు. అయితే రియా చెప్పడంతోనే వీరందరి పేర్లు బయటపడ్డాయనే ప్రచారం నేపథ్యంలో లాయర్ సతీశ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అమెజాన్‌లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్‌లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్‌ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్‌కు ఇచ్చే డ్రగ్‌ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్‌ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్‌కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్‌లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్‌ని విచారించనుంది. -
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్సీబీ ‘‘ఏ’’లిస్ట్‌లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌లను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. గోవా షూటింగ్లో దీపిక ప్రస్తుతం గోవా షూటింగ్లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్‌కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కీలక సమాచారమిచ్చిన జయ! గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్‌తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. -
డ్రగ్స్: ప్రముఖ టీవీ నటి ఇంట్లో సోదాలు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్సీబీ ఎదుట హాజరుకాగా, తాజాగా డ్రగ్స్ సెగ టీవీ నటులను కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర నటి అబిగేల్ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ జంట ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈ క్రమంలో డ్రగ్ డీలర్లు, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్న తీరు గురించి అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా అబిగేల్ పాండే, సనం జోహార్ నచ్ బలియే వంటి పలు ప్రముఖ షోల్లో పాల్గొని ప్రాచుర్యం పొందారు. ఇక బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోని ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ పేర్లతో పాటు రకుల్ ప్రీత్‌సింగ్, నమ్రతా శిరోద్కర్, దియా మీర్జా పేర్లు తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ దగ్గర పనిచేసిన టాలెంట్ మేనేజర్ జయ సాహాతో మత్తు పదార్థాల గురించి చాట్ చేసినట్లుగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే. -
సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి, మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న రియా చక్రవర్తికి ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణను బాంబే హై కోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్లో రియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాత్రమే డ్రగ్స్ వాడేవాడని.. అతను తన సిబ్బందిని డ్రగ్స్ తీసుకురావాల్సిందిగా కోరేవాడని తెలిపింది. సుశాంత్ జీవించి ఉంటే అతనిపై తక్కువ అభియోగాలు మోపబడేవని.. బెయిల్ లభించే నేరంగా ఉండేదని.. అతడికి ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించేవారని తెలిపింది. (చదవండి: స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్) అంతేకాక సుశాంత్ తనను, తన సోదరుడిని, ఇతర సిబ్బందిని డ్రగ్ సప్లయర్స్‌గా వాడుకున్నాడని రియా ఆరోపించింది. ‘సుశాంత్ డ్రగ్స్ కోసం తనతో క్లోజ్‌గా ఉండే వారిని అంటే నన్ను, నా సోదరుడిని వాడుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడు ఎలాంటి ఎలాక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని వదల్లేదు. దాంతో ఆధారాలు లేవు. ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారం వ్యక్తం చేసింది. పబ్లిక్ డొమైన్లోని సమాచారం ఆధారంగా రియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కుక్ నీరజ్‌ను ‘గంజా జాయింట్లు / రోల్స్ / డూబీలు తయారు చేసి తన పడకగదిలో ఉంచమని’ తన మరణానికి మూడు రోజుల ముందు కోరినట్లు వెల్లడించింది. దీని గురించి నీరజ్ సీబీఐ, ముంబై పోలీసులకు చెప్పాడని తెలిపింది. ‘తాను జాయింట్లు సిద్ధం చేసి సుశాంత్ బెడ్రూంలోని ఒక బాక్స్‌లో ఉంచానని నీరజ్ తెలిపాడు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆ బాక్స్ తెరిచి చూస్తే.. ఖాళీగా ఉందని.. సుశాంత్ జాయింట్లు / డూబీలు వాడాడని అర్థమయ్యింది అన్నది’ రియా. (చదవండి: సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు) ఇక నిన్నటితో రియా జ్యూడిషియల్ కస్టడీ ముగిసింది. దాంతో వచ్చే నెల 6 వరకు దాన్ని పొడిగించారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు బెయిల్‌కు అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. ఆమెను "డ్రగ్ సిండికేట్ యొక్క క్రియాశీల సభ్యురాలు" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభివర్ణించింది. -
రియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా) -
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
టాలీవుడ్‌ను షేక చేస్తోన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు
-
రియాకు రిమాండ్ పొడిగింపు
ముంబై: నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇరువురూ బాంబే హైకోర్టులో మంగళవారం బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు విచారణ బుధవారం జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని వారి తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సెప్టెంబర్ 9న రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రియా చక్రవర్తి తాను ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్న వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ, ఆ రోజు వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు తిరస్కరించింది. స్పెషల్ కోర్టు వీరి జ్యూడీషియల్ రిమాండ్‌ని అక్టోబర్ 6 వరకు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. శామ్యూల్ మిరాండాతో సహా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను సైతం ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11న తిరస్కరించింది. -
అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. -
మలుపులు తిరుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
డ్రగ్స్ కేసు: ఆ ఫోన్లో కీలక వివరాలు!
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ సహా ఇద్దరు డ్రగ్ డీలర్లను ఎన్సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా వాట్సాప్ చాట్స్, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా సోమవారం ఎన్సీబీ ఎదుట హాజరైనట్లు సమాచారం. ఆమె ఫోన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సీబీడీ ఆయిల్(గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవం), డ్రగ్స్‌ను సరఫరా చేయాల్సిందిగా తనను కోరినట్లు వెల్లడైంది. వీళ్లందరి కోసం జయ సాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసినట్లు సమాచారం. (చదవండి: సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు..?) ఇక రియాతో పాటు జయ కూడా మాదక ద్రవ్యాల సరఫరాలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలడంతో అధికారులు ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. జయకు సీబీడీ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఆమె ఫోన్లో లభించిన ఎస్ఎల్బీ, అమిత్ తదితర పేర్లతో ఉన్న కాంటాక్టు నంబర్ల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా తదితరులకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నో స్మోకింగ్, మూడో కన్ను.. సుశాంత్ నోట్!) -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం
-
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్‌కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్‌ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్‌ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
కృతికి టైం కేటాయించాలి, వాళ్లతో టూర్ వెళ్లాలి..
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అతడి మరణం తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి మొదలు డ్రగ్స్ వ్యవహారం దాకా అన్ని విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఔట్‌సైడర్ అయిన సుశాంత్ పరిశ్రమలోని ప్రముఖుల అవమానాలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటే, మరికొందరు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ ప్రవర్తనా శైలి, అతడి ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగేవంటూ అక్కడి మేనేజర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. పవనాలోని ఫాంహౌజ్‌లో సుశాంత్‌కు సంబంధించిన నోట్స్ ఇండియా టుడే చేతికి చిక్కాయి. ఇందులో ఏప్రిల్ 27, 2018లో అతడు రాసుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. (చదవండి: సుశాంత్‌తో టచ్‌లో లేను.. కానీ నాకు తెలుసు!) అందులో ఉన్న వివరాల ప్రకారం.. ఆరోజు సుశాంత్ ఉదయం 2.30 గంటలకే నిద్రలేచి, టీ తాగి, చన్నీళ్లతో స్నానం చేశాడు. ఆ తర్వాత వేద మంత్రాలు పఠించాడు. అంతేగాక స్మోకింగ్ వదిలేయాలని అతడు నోట్లో రాసుకున్నాడు. ఆ మరుసటి రోజు కేదార్నాథ్ సినిమా స్క్రిప్టు వినాలని నిర్ణయించుకున్నాడు. కాగా కేదార్నాథ్ షూటింగ్ సమయంలోనే సుశాంత్ గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడని, అతడి ప్రేయసి రియా చక్రవర్తి తెలిపిన సంగతి తెలిసిందే. ఇక మరో నోట్లో తన రాబ్తా సినిమా కోస్టార్ కృతి సనన్ కోసం మరింత సమయం కేటాయించాలని సుశాంత్ రాసుకున్నాడు.(అంకితా లోఖండేతో విడిపోయిన తర్వాత సుశాంత్- కృతి ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది). అదే విధంగా తన అక్క ప్రియాంక సింగ్, ఆమె భర్త మహేష్‌తో ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. వీటితో పాటు.. ‘‘ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’’, సంతోషం ఎందుకు?, అనుభవం-విశ్లేషణ-ధైర్యం, ప్రతిభ, దైవత్వం, యోగ, తపస్య, కైలాష్, మూడో కన్ను వంటి పదాలు రాసుకున్నాడు. ‘‘నేను ఉన్నపుడు దేవుడు లేడు, దేవుడు ఉన్నపుడు నేను ఉండను’’అన్న కబీర్ పద్యంలోని పంక్తులను రాశాడు. (చదవండి: ఎన్సీబీ దృష్టి అంతా ఆ ఫామ్‌హౌస్ పైనే!) అంతేగాక 2018లో వరుణ్ మాథుర్ అనే వ్యక్తితో ఇన్సాయ్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా సుశాంత్ ఈ నోట్లో ప్రస్తావించాడు. అయితే అప్పటికింకా రియాతో పరిచయం లేనందు వల్ల ఆమె గురించి ఎక్కడా ఒక్కమాట కూడా రాయలేదు. ఇక ఈ నోట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సుశాంత్ క్రమశిక్షణతో మెలిగేవాడు అనడానికి ఇదొక ఉదాహరణ అని అతడి అభిమానులు అంటే, రియాకు దగ్గరకాకముందే అతడు కుంగుబాటులో ఉన్నాడని, కాబట్టి రియాను టార్గెట్ చేయడం మంచిది కాదంటూ ఆమె మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని డైరీలో రాసుకోవడం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అలవాటు అని అతడి సహ నటుడు దీపక్ ఖజీర్ వెల్లడించిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతి నేపథ్యంలో బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దీపక్.. ‘‘రాయడం అంటే సుశాంత్‌కు ఇష్టం. ఒకవేళ తను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదు’’ అని అనుమానం వ్యక్తం చేశారు. -
నన్ను మీడియా వేధిస్తోంది
-
నన్ను మీడియా వేధిస్తోంది: రకుల్ ప్రీత్
సాక్షి, న్యూఢిల్లీ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందోని, వెంటనే ఆపాలంటూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్ చేసిందని పిటిషన్లో వివరించారు. అంతేకాకుండా తనపై అసత్యాలు ప్రచారం చేయకుండా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు సైతం ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. ఇక రకుల్ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ న్యాయస్థానం.. కొంత ఊరట లభించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రకుల్‌పై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశించింది. రకుల్ పిటిషన్‌ను జస్టిస్ నవీన్ శుక్లా బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది.(డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు) కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో రకుల్ ఉన్నట్లు సోషల్ మీడియాతో సహా మీడియా ఛానల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాగా డ్రగ్ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో వెల్లడించినట్లు తెలిసింది. -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. ఒకవేళ
‘‘నాలుగేళ్ల నుంచి సుశాంత్‌తో టచ్‌లో లేను. అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడంటే నేను నమ్మను. తనది ముమ్మాటికి హత్యే అనిపిస్తోంది’’ అంటూ టీవీ నటుడు దీపక్ ఖజీర్ తన మనసులోని భావాలు వెల్లడించాడు. రాయడం అంటే సుశాంత్‌కు ఎంతో ఇష్టమని, ఒకవేళ తను నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదని అనుమానం వ్యక్తం చేశారు. మీడియా కథనాల ఆధారంగా ఈ విషయంలో అందరి అభిప్రాయాలు మారుతున్నాయని, అయితే సీబీఐ విచారణ పూర్తై, సుశాంత్‌ది ఆత్మహత్య అని తేలిస్తే తన అభిప్రాయంలో మార్పు ఉండవచ్చన్నారు. కాగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి, అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్లో అడుగుపెట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించి విషయం విదితమే. (చదవండి: డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్ వాడిన రియా!) ఈ క్రమంలో అతడి మృతి అనేక సందేహాలు, ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అంతేగాక సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సాప్ చాట్లు బహిర్గతం కావడంతో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిన పవిత్ర రిష్తా సీరియల్లో అతడితో కలిసి నటించిన దీపక్ ఖజీర్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ పవిత్ర రిష్తా సీరియల్ తర్వాత మళ్లీ తనను ఎన్నడూ కలవలేదు. అయితే నాలుగైదేళ్లలో ఓ వ్యక్తి పూర్తిగా మారిపోతాడని నేను అనుకోను. సుశాంత్‌కు ప్రతీ విషయం పేపర్‌పై పెట్టడం అలవాటు. నిజంగా ఆత్మహత్య చేసుకుంటే నోట్ రాసేవాడు కదా. (చదవండి: ‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’) అంతేకాదు అయినా ఎలాంటి ఆధారాలు లభించకుండానే సుశాంత్‌ది సూసైడ్ అని ముంబై పోలీసులు ఎలా తేలుస్తారు? సుశాంత్ కుటుంబం ఇప్పటికే శోక సంద్రంలో మునిగిపోయి ఉంది. వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసే సమయంలో మరాఠీలో రాశారని వార్తలు వచ్చాయి. అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ’’అని ప్రశ్నించారు. ఇక డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో నటి, ఎంపీ జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలను దీపక్ విమర్శించారు. ‘‘ఆమె అన్నట్లు ఇక్కడ చాలా మంది దగ్గర కనీసం కంచం కూడా లేదు. ఓ చిన్న గిన్నె పట్టుకుని పేమెంట్ల కోసం ఎదురుచూస్తారు. ఆలస్యమైతే ఆర్థిక బాధలు భరించలేక జీవితాలను అంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి’’అని సినీ నటుల పరిస్థితిని వివరించారు. అయితే సుశాంత్‌కు ఇలాంటి కష్టాలేమీ లేవని, అతడు ఆర్థికంగా బలంగా ఉండటం సహా చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ఇలా ప్రాణాలు తీసుకున్నాడంటే నమ్మడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. తనను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. -
‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’
ముంబై : యువ హీరో సుశాంత్ రాజ్‌పుత్ కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కేసును డ్రగ్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్లతోపాటు డ్రగ్స్‌ను సరాఫరా చేసే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. అదే క్రమంలో ఈ విషయంపై కంగనా రనౌత్‌కు.. ముంబై ప్రభుత్వం, .బీటౌన్ సెలబ్రిటీలకు మధ్య రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్లో మారుతున్న పరిణామాలపై స్పందించిన తాప్సీ పన్ను.. రియా, కంగనా, జయా బచ్చన్ గురించి మాట్లాడారు. కాగా గతంలో తాప్సీ, రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తాప్సీ చర్చించారు. (సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు) ‘రియా చక్రవర్తి ఎవరో నాకు నిజంగా తెలియదు. నేను కేవలం రియాకు జరుగుతున్న అన్యాయానికి, ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం కొత్తది కాదు. ఇంతకముందు ఇతర పరిశ్రమల నుంచి అనేక తప్పులు జరిగాయి. మా పరిశ్రమలో(సినీ పరిశ్రమ)కూడా కొంత మంది పెద్ద స్టార్లు తప్పులు చేశారు. కానీ ఎవరిని రియా మాదిరి శారీరకంగా, మానసికంగా హింసిస్తూ చిత్రీకరించి చూపించలేదు. ఇది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే ఆమె గురించి నాకు ఏమి తెలియకుండానే మాట్లాడాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. అలాగే కోర్టు, దర్యాప్తు సంస్థలు తమ తీర్పును ఇవ్వక ముందే తమకు ఇష్టం వచ్చినట్లు రాసే వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరిపై ప్రభావితం చేసేలా బలవంతం చేయాలనుకుంటున్నారు. అది తప్పు అని నేను అనుకుంటున్నాను. రియా చక్రవర్తి జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా లేదా నేరస్థులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా..’ అని ప్రశ్నించారు. (రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు) అలాగే రాజ్యసభ్యలో జయా బచ్చన్ ఇచ్చిన ప్రసంగాన్ని తాప్సి ప్రశంసించారు. ఆమె ప్రతి విషయాన్నా చాలా ఖచ్చితంగా చెప్పారని, ఈ రోజు తను చెప్పబోయే అనేక విషయాలు ఇప్పటికే జయా బచ్చన్ చెప్పేసారని అన్నారు. ఇక కంగనా రనౌత్ గురించి మట్లాడుతూ..కంగనా వ్యాఖ్యలు ఎప్పటి నుంచో తనపై ప్రభావం చూపడం ఆగిపోయిందన్నారు. ‘ఓకే వ్యక్తి తరచూ ఒకేలా మాట్లాడితే కొన్ని రోజులకు వారి మాటలు ఎవరిపై ప్రభావం చూపించలేవు. అలాగే కంగన మాటలు కూడా న్ను ఏ విధంగానే కదిలించలేవు’ అని తాప్సీ అన్నారు. (డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు) -
సుశాంత్ కేసు : ఎన్సీబీ అధికారికి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణకు కరోనా సెగ తాకింది. ఎన్సీబీ దర్యాప్తు బృందంలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో విచారణను అర్దాంతరంగా నిలిపివేశారు అధికారులు. నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ఇతర సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి చర్యల అనంతరం మళ్లీ దర్యాప్తు మొదలుకానుందని ఎన్సీబీ సీనియర్ అధికారి తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) బృంద సభ్యుల్లో ఒకరికి బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీని ప్రశ్నించడం అకస్మాత్తుగా ఆగిపోయింది. శ్రుతి మోడీని దర్యాప్తును ప్రస్తుతానికి నిలిపివేశామని, ఆమెను తిరిగి పంపించామని ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోడీతోపాటు, టాలెంట్ మేనేజర్ జయ సాహా పేర్లు బహిర్గతమైన తరువాత ఎన్సీబీ వీరిపై దృష్టి పెట్టింది. వీరిని ప్రశ్నించేందుకు బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రుతి దక్షిణ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. కానీ తాజా పరిణామంతో ఈమెతోపాటు, సాహా విచారణ కూడా ప్రస్తుతానికి వాయిదా పడింది. (డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్) కాగా జూన్14న సుశాంత్ అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుకు సంబంధించి అనేక కీలక పరిణామాల మధ్య డ్రగ్స్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు రియాపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా సహా పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు
ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్‌హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ ఒక న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ వద్ద పనిచేసే జగదీష్ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. సుశాంత్ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్‌హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్ ఫామ్‌హౌస్‌లో రీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్ హౌస్‌ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్ పేపర్లను కూడా ఆర్డర్ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని రీస్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్‌పుత్ ఈ ఫామ్‌హౌస్‌కు వచ్చేవారని రీస్ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్‌తో కలిసి ఆ ఫామ్ హౌస్‌లో జరుపుకుంది అని రీస్ తెలిపారు. పార్టీలలో స్మోక్ పేపర్ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్డౌన్లో ఫామ్‌హౌస్‌లో గడపాలని సుశాంత్ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు. చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు -
డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్సీబీ త్వరలో సారా, రకుల్, సిమోన్లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సుశాంత్ గెస్ట్ హౌజ్, పావనా డ్యామ్ ద్వీపంలోని పార్టీలపై ఎన్సీబీ దృష్టి చారించింది. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా వారికి సమన్లు జారీ చేయలేదని, త్వరలో పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. (చదవండి: రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...) ఈ కేసులో నిందితులైన రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు సుశాంత్ ఫాంహౌస్, పవనా డ్యామ్ హోమ్‌లో జరిగే పార్టీలపై ఎన్సీబీ బృందం దృష్టి సారించింది. రియా, సుశాంత్‌తో కలిసి ఇక్కడి పార్టీలకు చాలాసార్లు వచ్చారని, అంతేగాక సారా సుశాంత్‌తో కాలిసి 4 నుంచి 5 సార్లు, శ్రద్దా కపూర్ కూడా సుశాంత్ కలిసి ఈ పార్టీలకు హాజరైనట్లు విచారణలో వెల్లడైనట్లు ఎన్సీబీ తెలిపింది. కాగా డ్రగ్స్ కేసులో రియాను మూడు దశలుగా విచారించిన ఎన్సీబీకి చివరి విచారణలో ఆమె బాలీవుడ్‌కు 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్ వాడే పార్టీల వివరాలను వెల్లడించింది. అనంతరం రియాను ముంబైలోని బైకూల్లా మహిళా జైలుకు తరలించగా.. ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో మరో ముగ్గురిని కూడా పురుషుల జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఎన్సీబీ సారా, రకుల్, సిమోన్‌లను విచారించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతేగాక ద్వీపంలోని పార్టీలకు వచ్చిన వారిపై కూడా ఎన్సీబీ నిఘా పెట్టింది. (చదవండి: సుశాంత్‌కు స్లో పాయిజన్ ఇచ్చారు: నటి) -
డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్ వాడిన రియా!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో భాగంగా.. మాదక ద్రవ్యాల గురించి చాట్ చేసేందుకు ఆమె తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీని ద్వారానే రియా తన స్నేహితులతో సంప్రదింపులు జరిపేదని, మరెన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోన్ ద్వారా ఆమె కనెక్ట్ అయి ఉందని తమకు సమాచారం అందినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రియా.. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. (చదవండి: రియాను హనీ ట్రాప్‌గా ఉపయోగించారు: నటి) అయితే అప్పుడే తన వద్ద ఫోన్లను స్వాధీనం చేసుకునే క్రమంలో రియా ఈ మొబైల్‌ను ఈడీ అధికారులకు అప్పగించలేదని తెలిసింది. ఇక ఈడీ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి సంబంధించిన చాట్స్ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రియా తల్లి సంధ్యా చక్రవర్తి ఫోన్ వాట్సాప్ గ్రూపులో ఉన్న పలువురిపై కూడా ఎన్సీబీ దృష్టి సారించినట్లు సమాచారం. రియాతో డ్రగ్స్ గురించి చాట్ చేసిన పలువురిని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..) ఇక సుశాంత్ బలవనర్మణం నేపథ్యంలో అనేక కీలక మలుపుల అనంతరం ఎన్సీబీ రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్రా, బాసిత్ పరిహార్ తదితరులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా షోవిక్ వెల్లడించిన వివరాల ఆధారంగా రియాతో పాటు సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో సెప్టెంబరు 22 వరకు ఎన్సీబీ అదుపులో ఉండనున్నారు. -
సుశాంత్‌కు స్లో పాయిజన్ ఇచ్చారు: నటి
ముంబై: ప్రస్తుతం బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరో నలుగురిని ఎన్సీబీ అరెస్టు చేసిన జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక సమాచారం వెలుగు చూసింది. డ్రగ్స్ కేసులో రియాను హనీ ట్రాప్‌గా ఉపయోగించారని దీని వెనక పెద్ద కుట్ర ఉందని అంకిత లోఖండేల సన్నిహితురాలైన బాలీవుడ్ నటి వెల్లడించింది. అంతేగాక సుశాంత్‌కు స్లో పాయిజన్ కూడా ఇచ్చారని సదరు నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: రేఖ టూ రియా.. చరిత్ర పునరావృతమవుతోందా?) ఆమె ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాలను వెల్లడించారు. బాలీవుడ్ డ్రగ్ నెక్సస్ సుశాంత్‌ను బలిగొందని, ఆమె కూడా ఈ డ్రగ్స్ పెడ్లర్ల బాధితురాలినే అని చెప్పారు. అదృష్టవశాత్తు దీని నుంచి బయట పడ్డానని, తన జీవితంలో అది ఒక భయంకరమైన దశ అని ఆమె పేర్కొన్నారు. ‘సుశాంత్ మృతి కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇందంతా చేస్తుంటే తన జీవితాన్ని తెరపై చూస్తున్నట్టుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా ఒకప్పుడు అదే డ్రగ్స్ ముఠా బాధితురాలిగా ఉన్నాను. బాలీవుడ్ రెండవ పేరు డ్రగ్‌గా ఆమె పిలిచారు. ఈ డ్రగ్స్ ముఠా చాలా పెద్దది. పరిశ్రమలో పెద్ద పెద్ద లింక్‌లు ఉన్నాయ’ని సదరు నటి తెలిపింది. పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఈ సందర్భంగా నటి గుర్తు చేసుకున్నారు. (చదవండి: మళ్లీ డ్రగ్స్ కలకలం.. తెరపైకి రకుల్ పేరు) ‘‘పరిశ్రమలో ఎవరికి తెలియని డ్రగ్స్ చీకటి కోణం ఉంది. నేను అలీబాగ్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చాను. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ నా ఎదురుగా ఉన్న బల్లపై తెల్లటి పౌడర్ ఉంది. అది ఇది డ్రగ్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే అక్కడి వారంతా నువ్వు ఈ డ్రగ్ తీసుకోకపోతే నిన్ను ఓ గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిగా చులకనగా చూస్తారు’’ అని తనతో చెప్పినట్లు తెలిపారు. బాలీవుడ్లో డ్రగ్ తీసుకోవడం ట్రెండ్‌గా ఫాలో అవుతారని, ఇది తీసుకోకపోతే మిమ్మల్ని వింతగా చూస్తారని చెప్పింది. పెద్ద పెద్ద పార్టీల్లో మాదక ద్రవ్యాలను విచ్చల విడిగా వినియోగిస్తారని, పార్టీలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా డీలర్లు, పెడ్లర్లు ఉన్నట్లు ఆమె చెప్పింది. ఈ ముఠాకు సంబంధించిన ప్రధాన వ్యక్తిని చేరుకోలేరని కూడా సదరు నటి తెలిపింది. -
సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని ఇప్పటికే మూడు నెలలవుతోంది. మొదట ఆత్మహత్యగా భావించినప్పటికి.. తరువాత కేసు అనేక మలుపులు తిరుగుతూ.. చివరకు మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూడటంతో ఎన్సీబీ సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ కేసును పలు అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. కానీ వాటి కంటే ఎక్కువగా మీడియా, సోషల్ మీడియా రియాను దారుణంగా వేధిస్తోందంటూ ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెటబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థల కన్నా ముందు మీడియానే రియాను దోషిగా తేల్చాయి. అసలిప్పటి వరకు సుశాంత్ ఎందుకు చనిపోయాడో తెలియలేదు. కానీ మీడియా ట్రయల్స్ మాత్రం ఆమెను దోషిగా నిలబెట్టాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరలవుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే సంఘటన జరిగింది.. నటి రేఖ విషయంలో కూడా మీడియా ఇలానే ప్రవర్తించింది అంటూ సమినా షేక్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. (చదవండి: రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...) This! 💔 pic.twitter.com/1aTTf3dwu6 — Samina Shaikh (@saminaUFshaikh) September 12, 2020 వ్యాపారవేత్త ముఖేష్‌కి, రేఖకి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడు నెలలలోపే అనగా 1990, అక్టోబర్ 2న ముఖేష్ చనిపోయారు. భార్య దుపట్టాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతడు కూడా సుశాంత్ లానే చనిపోయే ముందు రోజు వరకు చాలా సంతోషంగా ఉన్నాడని అతడి సోదరుడు పోలీసులకు తెలిపాడు. ముఖేష్ కూడా డిప్రెషన్‌తో బాధపడేవాడు. ఆ విషయం పెళ్లైన తర్వాత రేఖకు తెలిసింది. ఈ విషయాల గురించి ఆమె రేఖ: అన్‌టోల్డ్ స్టోరిలో వివరించింది. ముఖేష్ డిప్రెషన్ సమస్య తనను ఎంతో బాధపెట్టిందని.. తమ బంధం మీద కూడా ప్రభావం చూపించిందని వెల్లడించింది. అప్పడప్పుడు ముఖేష్ చాలా విపరీతంగా ప్రవర్తించేవడు. దాంతో రేఖ ఆ బంధం నుంచి విడిపోవాలనుకుంది. దీనికి తోడు.. బిజినేస్‌లో నష్టాలు. దాంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖేష్ తరచుగా తమ దగ్గర సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని అనేవాడని అతడి స్నేహితులు తెలిపారు. అసలు ముఖేష్ ఎందుకు చనిపోయాడనే విషయం మాత్రం తెలియలేదు అంటూ ట్వీట్ చేసింది సమీన. (చదవండి: జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..) కానీ మీడియా మాత్రం రేఖను మంత్రగత్తె అని పిలిచింది. ముఖేష తల్లి కూడా రేఖను దారుణంగా విమర్శించింది. నటులు అనుపమ్ ఖేర్, సుభాష్ ఘయ్ వంటి వారు విరుద్ధ ప్రకటనలు చేశారు. ఇప్పుడు రియా విషయంలో కూడా అలానే జరిగుతోంది. అసలు సుశాంత్ ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ మీడియా మాత్రం రియాను మంత్రగత్తె అంటుంది. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా వేధిస్తుంది. సుశాంత్ కేసులో రియానే దోషిగా నిర్థారించింది అంటూ సమీన సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. -
రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...
ముంబై/న్యూఢిల్లీ: సుశాంత్‌సింగ్ మృతి కేసులో డ్రగ్స్ సంబంధాలున్న మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారుల విచారణలో హీరోయిన్లు సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్‌తోపాటు, ఫ్యాషన్ డిజైనర్, ఓ అగ్రహీరో స్నేహితురాలు కూడా అయిన సిమోన్ ఖంబట్టా పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్‌తోపాటు వీరు ముగ్గురూ తనతోపాటు డ్రగ్స్ తీసుకునే వారని అధికారుల ఎదుట అంగీకరించినట్లు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తెలిపింది. వీరిలో ఒక హీరోయిన్ సుశాంత్ స్నేహితురాలు కాగా, మరొకరు తన ఫ్రెండని రియా చెప్పింది. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేయడంతోపాటు చెల్లింపులు కూడా చేసినట్లు అంగీకరించింది. డ్రగ్స్ కొనుగోలు విషయంలో తన సూచనల మేరకే శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్, సోదరుడు షోవిక్ వ్యవహరించేవారని రియా తెలిపినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖుల్లో 80 శాతం మందికి డ్రగ్స్ అలవాటుందని కూడా ఆమె వెల్లడించిందని తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా 25 మంది అగ్రశ్రేణి బాలీవుడ్ స్టార్స్‌కు సమన్లు ఇచ్చేందుకు ఎన్సీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘డ్రగ్స్‌ను సుశాంత్ సింగ్ సిబ్బంది తీసుకువెళ్లేవారు, వీటి కొనుగోలు, డెలివరీ వంటి విషయాలన్నిటినీ రియానే చూసుకునేది’అంటూ రియా సోదరుడు షోవిక్ ఇప్పటికే ఎన్సీబీకి తెలిపాడని ఐఏఎన్ఎస్ పేర్కొంది. ఈ నెల 8వ తేదీన అరెస్టయిన రియాకు న్యాయస్థానం 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు రియా సహా ఆరుగురి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వీరంతా వచ్చే వారం బోంబే హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించే అవకాశాలున్నాయి. నాకు బెయిల్ ఇవ్వండి.. సుశాంత్ మృతి కేసులో మాదక ద్రవ్యాల సరఫరాదారుగా అనుమానాలున్న జయిద్ విలాత్రా(20) బెయిల్ కోసం శనివారం బోంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈనెల 9వ తేదీన సెషన్స్ కోర్టు ఇతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. తాను అమాయకుడిననీ, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా ఇరికించారని ఆ పిటిషన్లో బోంబే హైకోర్టుకు తెలిపాడు. ఆగస్టులో అరెస్టయిన బాంద్రా వాసి అబ్బాస్ అలీ లఖానీ, మరో డ్రగ్స్ సరఫరాదారు కరన్ అరోరా వెల్లడించిన సమాచారం మేరకు ఎన్సీబీ ఈనెల 4న విలాత్రాను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా విలాత్రా నుంచి రూ.9.55 లక్షల నగదుతోపాటు 2 వేల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకుంది. ఇదంతా డ్రగ్స్ ద్వారా సంపాదించిందేనని ఎన్సీబీ ఆరోపిస్తోంది. అయితే, తన వద్ద చాలా తక్కువ పరిమాణంలో డ్రగ్స్ దొరకడంతోపాటు, తనది బెయిల్ ఇచ్చేందుకు అవకాశమున్న అరెస్టని విలాత్రా అంటున్నాడు. రుజువైతే ఆ సర్వీసుపై నిషేధం: డీజీసీఏ ఈనెల 9వ తేదీన నటి కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానం లోపల ఎవరైనా ఫొటోలు తీసినట్లు తేలితే ఆ విమాన సర్వీస్‌పై రెండు వారాల నిషేధం విధించనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై ఆ విమానయాన సంస్థ చర్యలు తీసుకున్న తర్వాతే ఆ విమాన సర్వీసుకు తిరిగి అనుమతినిచ్చే విషయం పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఉత్తర్వులు పంపింది. కంగనా ప్రయాణిస్తున్న విమానం చండీగఢ్ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో కొందరు మీడియా సిబ్బంది ఫొటోలు తీయడంతోపాటు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా వచ్చిన వీడియోలపై శుక్రవారం డీజీసీఏ ఇండిగోకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఫొటోలు తీసి, నిబంధనలు ఉల్లంఘించిన వారి పేర్లను నో–ఫ్లై జాబితాలో పెట్టాలని కోరింది. ఏడుగురు డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్ ఎన్సీబీ శనివారం ముంబైతోపాటు గోవాలోని పలుప్రాంతాల్లో సోదాలు జరిపి ఏడుగురిని అరెస్టు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన వారిలో కరంజీత్ అలియాస్ కేజే ముఖ్యమైన వ్యక్తి. సుశాంత్ సింగ్, రియా చక్రవర్తికి కూడా ఇతడు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. శామ్యూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి వెల్లడించిన వివరాల్లో కేజే పేరు కూడా ఉండటం గమనార్హం. -
మళ్లీ డ్రగ్స్ కలకలం.. తెరపైకి రకుల్ పేరు
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో చిచ్చురేపుతున్న డ్రగ్స్ మంటలు.. తాజాగా తెలుగు చలనచిత్ర సీమనూ తాకాయి. టాలీవుడ్లో డ్రగ్స్ ఆరోపణలు కొత్తేం కాకపోయినా.. ఈసారి ఇద్దరు తెలుగు హీరోయిన్లపై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ గమ నించాల్సిన అంశం ఏంటంటే.. ఈ ముగ్గురు కథా నాయికలూ తెలుగులో నటించిన వారే కావడం. వాస్తవానికి నటుడు సుశాంత్ సింగ్ అనుమానా స్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ సీబీకి రియా.. డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురు సెలబ్రి టీల పేర్లు చెప్పిందని సమాచారం. అందులో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్ పేర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. రియా చక్ర వర్తి, రకుల్ ప్రీత్‌సింగ్ ఇద్దరూ టాలీవుడ్ నటులే. రకుల్ ప్రీత్‌సింగ్ కన్నా ముందే.. రియా చక్రవర్తిటాలీవుడ్లో 2012లో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత సంవత్సరంలో రకుల్ ప్రీత్‌సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి ఎన్ సీబీ అధికారు లకు వెల్లడించిన దాదాపుకు 25 మందికిపైగా పేర్లలో రకుల్ ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సదరు 25 మంది సెలెబ్రిటీలను త్వరలోనే విచారణకు రావాల్సిందిగా ఎన్ సీబీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని సమా చారం. మరోవైపు రకుల్ మాత్రం వికారాబాద్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో బిజీగా గడిపారు. శనివారం ప్రసార మాధ్యమాల్లో డ్రగ్స్ వివాదంలో ఆమె పేరు ఉందన్న ప్రచారం తీవ్రం కావడంతో షూటింగ్ నుంచి ఆమె వెళ్లిపోయారని తెలిసింది. అభిమానులు ఆమెకు అండగా నిలుస్తుంటే.. నెటిజన్లు మాత్రం నిష్పక్షపాత విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టాలీవుడ్లో బయటపడ్డ డ్రగ్స్ కేసులో పలువురు తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లను అప్పటి ఎక్సైజ్ శాఖ విచారించిన సంగతి తెలిసిందే. తరువాత ఈ కేసు క్రమంగా నీరుగారిందన్న విమర్శలున్నాయి. 2017లో ఏం జరిగిందంటే..? ఎక్సైజ్ అధికారులు 2017, జూలై 24న మణికొండలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో మేనేజర్‌గా పనిచేస్తున్న పుట్టకర్ రాన్సన్ జోసెఫ్ అనే వ్యక్తి ప్లాట్‌పై దాడులు చేశారు. ఈ సందర్భంగా గంజాయి, హుక్కా తదితర నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని విచారించగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారం సంచలనం సృష్టించింది. దీంతోపాటు రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో అలెక్స్ విక్టర్ అనే దక్షిణాఫ్రికా దేశస్తుడి వద్ద కొకైన్ పాకెట్లు లభించాయి. వీరంతా నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్ల చిన్నారులకు కూడా డ్రగ్స్ (ఎల్ఎస్డీ) విక్రయిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం మొదట్లో తీవ్రంగానే పరిగణించింది. ఈ కేసులను లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ )ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సిట్ అధికారులు 62 మంది సినీరంగంతో సంబంధం ఉన్న ప్రముఖులను విచారణకు పిలిచారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయస్థాయిలో పెద్ద దుమారాన్నే లేపింది. విచారణకు వచ్చిన పలువురు సెలబ్రిటీలు తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. వీరిలో పలువురిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరగడం తీవ్ర ఉత్కంఠ రేపింది. తరువాత ఎక్సైజ్ నుంచి అకున్ సబర్వాల్ బదిలీ కావడం, ఈ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. సంజన కూడా.. అదే సమయంలో ప్రస్తుతం ఇవే ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి సంజన కూడా గతంలో తెలుగులో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. గతంలో సంజనతో తెలుగులో కలిసి పనిచేసిన ఓ దర్శకుడు, సహనటులు, టెక్నీషియన్లు కూడా 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవ్వడం గమనార్హం. మూడేళ్ల తరువాత సంజన కూడా అదే కేసులో అరెస్టవడం విశేషం. 2017 డ్రగ్స్ కేసు కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనూ కొందరు నటులపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అసలు ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం కొత్తేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే గ్లామర్‌తో ముడిపడిన సినీపరిశ్రమకు డ్రగ్స్‌కు విడదీయరాని సంబంధం ఉంది. ఎలాగంటే.. ముఖంపై ముడతలు కనిపించకూడదని, బాడీ ఫిట్నెస్గా ఉండాలని, చర్మం కాంతులీనేందుకు, వెండితెరపై నిత్యం యవ్వనంతో కనిపించాలని, వేగంగా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని రకరకాల కారణాలతో కొందరు నటులు డ్రగ్స్ తీసుకుంటుంటారు. ముందు హడావుడి.. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే.. అరెస్టు చేస్తామని మీడియాకు గతంలో లీకులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 62 మంది చిత్రసీమ వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన అధికారులు నటుల గోళ్లు, వెంట్రుకలు, ఇతర నమూనాలు తీసుకుని హడావుడి చేశారు. అరెస్టులు తప్పవన్న ప్రచారం జరిగింది. కానీ, తరువాత ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీటులో ఒక్క సినిమా వ్యక్తి పేరు లేక పోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పటికీ ఈ కేసును విచారిస్తున్నామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఒకవేళ కేసులు పెట్టినా.. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూపిస్తే వారికి పెద్దగా శిక్షలేమీ పడక పోవచ్చ న్నది న్యాయనిపుణుల అభిప్రాయం. ఇప్పుడూ కేసులు నమోదైనా.. అవి నిలిచేనా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. -
హీరోయిన్ రియా చక్రవర్తి స్టైలిష్ ఫోటోలు
-
చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడున్నారు
సాక్షి, హైదరాబాద్ : సినీ రంగమంతా డ్రగ్స్మత్తకు బానిసగా మారిపోయిందని మాజీ ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్ అన్నారు. బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ లింక్స్ ఉంటాయని అన్నారు. డ్రగ్స్ వాడకం, సరఫరాకు ఏమాత్రం పరిధులు లేవున్నారు. తన దర్యాప్తులో భాగంగా డ్రక్స్కు బానిసలుగా మారిన ఎంతోమంది నటులను చూశామని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలను డ్రక్స్ కేసు ఊపేస్తున్న తరుణంలో చంద్రవదన్ సాక్షి మీడియాతో మాట్లాడారు. చాలామంది నటులు గ్లామర్ కాపాడుకోవాలంటే డ్రగ్స్ వాడక తప్పదని తమతో చెప్పారని వెల్లడించారు. సమాజంపై డ్రగ్స్ ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభత్వం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. (డ్రగ్స్ : షూటింగ్ నుంచి వెళ్లిపోయిన రకుల్) శనివారం సాక్షి మీడియాతో చంద్రవదన్ మాట్లాడుతూ.. ‘గతంలో మా దృష్టకి అనేక డ్రగ్స్ కేసులు వచ్చాయి. కానీ ఆ దర్యాప్తులో ఏం తేలిందో నేను ఇప్పుడు చెప్పలేను. మా విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా, నేను ఒక్కడినే కాదు చాలా మంది ఉన్నారని చెప్పారు. మేమూ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాము. రియా కేసులో ప్రముఖ నటి పేరు వింటున్నాం అది కాస్తా టాలీవుడ్‌కు రాదని మాత్రం చెప్పలేను. ఎన్సీబీ దర్యాప్తు చాలా లోతుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం ఉంది. డ్రగ్స్ వాడే వారిని మేము గతంలో బాధితులుగా చూశాము. అమ్మే వారి సమాచారం అంతా సేకరించాము. (డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?) ఎక్సైజ్ శాఖ దర్యాప్తు తర్వాత హైద్రాబాద్ లో డ్రగ్స్ మూలాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ డ్రగ్స్ మూలాలు మళ్లీ, మళ్లీ బయట పడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో లింక్స్ ఉంటాయి. చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడున్నారు. ఎన్సీబీ చట్టం ప్రకారం.. డ్రగ్స్ వినియోగ దారులు సైతం శిక్షార్హులే. ఇది అశామాశి వ్యవహారం కాదు. సమాజంలో అందరిపై ప్రభావం చూపుతుంది. కేంద్రం చొరవ చూపి కఠినంగా వ్యవహరించి మూలాలను బ్రేక్ చెయ్యాలి’ అని పేర్కొన్నారు. -
నాకు ట్విటర్ అకౌంట్ లేదు: రియా లాయర్
ముంబై: తనకు ఎలాంటి ట్విటర్ ఖాతా లేదని నటి రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మనేష్ షిండే శనివారం వెల్లడించారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఓ నకిలీ సమచారం సతీష్ మనేష్ షిండే పేరుపై ట్విటర్లో వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదని స్ఫస్టం చేశారు. ‘డియర్ ఫ్రెండ్స్.. ట్విటర్‌తో ఇటీవల నా పేరుపై వచ్చిన ఖాతా నాది కాదు. అది నకిలీ ఖాతా. దీనిని ఎవరో అభిమాని క్రియోట్ చేసి ఉంటారని భావిస్తున్నాను. దీని నుంచి వచ్చే నకిలీ సమాచారం, వార్తలకు నేను బాధ్యుడిని కాదు. త్వరలోనే దీనిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని తెలిపారు. సుశాంత్ కేసులో రియా తరపున ఆయన కోర్టు వాదిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో నేర నిరూపణ కావడంతో రియాను ముంబై మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్స్ కేసులో రియాకు షాక్) ఈ క్రమంలో రియా బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించిన అనంతరం ఆమెను ముంబై హైకోర్టు తరలించవచ్చని షిండే శుక్రవారం తెలిపారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తాము హైకోర్టును సంప్రదించడంపై నిర్ణయం తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. డ్రగ్ కేసులో నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు రియాను ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి జైలు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తప్పుడుగా తనను ఈ కేసులో ఇరికించారని రియా తన పిటిషన్లో పేర్కొంది. ఎన్సీబీ అధికారులు ఈ కేసులో తనను ఇరికించేలా తనను బలవంతం చేసి ఒప్పించారని ఆరోపించింది. విచారణ సమయంలో తాను చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ కేసులో సెప్టంబర్ 8న అరెస్టు అయిన రియాను సెప్టెంబర్ 22 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపారు. (చదవండి: రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ) -
రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ
కోలకతా: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు, మాదక ద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అరెస్టయిన నటి రియా చక్రవర్తికి కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును కొనసాగిస్తోంది. రియాకు అండగా శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో ఆ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఇప్పటికే మండిపడుతోంది. రియా బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయి అని, ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని, ఆయన దేశానికి సేవ చేశారంటూ ఇటీవల ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద మరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్యకు అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో నెపోటిజం ఆరోపణలు చేసిన మరో హీరోయిన్ కంగనా రనౌత్ ఈ కేసులో కీలకంగా మారింది. మానసిక అనారోగ్యం, నెపోటిజం..ఇలా రోజుకో పరిణామం మధ్య ఈ కేసు తాజాగా డ్రగ్ మాఫియా తుట్టెను కదుపుతోంది. అటు ఈ కేసు రాజకీయ టర్న్ తీసుకుని, బీజేపీ శివసేన మధ్య సెగలు పుట్టిస్తోంది. బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈకేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. (డ్రగ్స్ కేసులో రియాకు షాక్) -
డ్రగ్స్ : షూటింగ్ నుంచి వెళ్లిపోయిన రకుల్
బాలీవుడ్లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్‌వుడ్ మీదుగా టాలీవుడ్‌కు పాకాయి. ఈ కేసులో ఇప్పటికే నటి రియా చక్రవర్తి అరెస్ట్ కాగా.. ఆమె వెల్లడించిన 25 మందికి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రియా బయటపెట్టిన జాబితాలో టాలీవుడ్ తారా రకుల్ ప్రీత్‌సింగ్ పేరు కుడా ఉందని వస్తున్న వార్తలు టీ టౌన్లో చర్చనీయాంశంగా మారాయి. రకుల్ కూడా డ్రగ్స్ వాడుతుందంటూ వస్తున్న పుకార్లపై ఆమె స్నేహితులతో పాటు సన్నిహితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?) ఈ నేపథ్యంలో గతవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రకుల్ ప్రస్తుతం ఎక్కడుందనే అన్వేషణ ప్రారంభం అయ్యింది. ఓవైపు డ్రగ్స్ కేసు రచ్చ సాగుతుండగా రకుల్ మాత్రం తన సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం కూడా షూటింగ్‌కు వచ్చిన రకుల్.. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడినుంచి హుటాహుటిని జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమెపై వస్తున్న ఆరోపణలను రకుల్ మేనేజర్ తీవ్రంగా ఖండిస్తున్నారు. తనపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారు. (డ్రగ్స్ కేసులో రియాకు షాక్) కాగా రియా వెల్లడించిన 25 మందికి నోటీసులు జారీచేసే ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో శనివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదర్కొంటున్న వారికి నోటీసులు పంపిన అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్లో రియా అరెస్ట్‌తో మొదలైన పర్వం బెంగళూరులో బుజ్జిగాడు బ్యూటీ సంజనా వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మందిని కూడా ఎన్సీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీ మ్యానియాలో కొనసాగుతూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వారి గుండెళ్ల రైళ్లు పరిగెత్తుతున్నాయి. -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
-
డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటున్న మరికొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల గుట్టు బయటపెట్టినట్లు సమాచారం. వీరిలో ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లు, డ్రగ్స్ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ( జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..) కాగా, సెప్టెంబర్ 8 నార్కోటిక్స్ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. వీరి పిటిషన్లపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. -
డ్రగ్స్ కేసులో రియాకు షాక్
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రియాతోపాటు ఇదే కేసులు, ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరి పిటిషన్లపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. తనను ఈ తప్పుడు కేసులో ఇరికించారని రియా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్సీబీ విచారణ సమయంలో చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనను ఈ కేసులో ఇరికించేలా బలవంతంగా ఒప్పించారని ఆరోపించారు. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం రియాకు, ఆమె సోదరుడు షోవిక్‌కు తెలుసుననీ, సుశాంత్ చెప్పిన మేరకు వారిద్దరూ డ్రగ్స్ కొనుగోలు, చెల్లింపులు చేసినందున ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని ఎన్సీబీ వాదించింది. సుశాంత్ సింగ్, రియా చెప్పిన విధంగానే సుశాంత్ పనిమనిషి దీపేశ్ సావంత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడనీ, ఈ విషయం అతడు కూడా అంగీకరించినట్లు ఎన్సీబీ పేర్కొంది. -
జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మంగళవారం అరెస్టు అయిన రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్న రియాకు ఈ రోజు(శుక్రవారం) కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, మరో నలుగురు నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించగా.. ఈసారి కూడా బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. (రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ) ఇదిలా ఉండగా.. బైకుల్లా జైలులో నటి రియా సీలింగ్ ఫ్యాన్, మంచం కూడా లేని ఓ సెల్లో ఉన్నట్లు సమాచారం. రియాకు జైలులో భద్రత కారణంగా మూడు షిఫ్టుల్లో ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా ఉంటున్నారు. రియా పడుకునేందుకు కేవలం చాప మాత్రమే ఉన్నట్లు. కనీసం మంచం, దిండు కూడా ఇవ్వలేనట్లు తెలుస్తోంది. కాగా రియా సెల్లో ఫ్యాన్ లేదని అధికారులు తెలిపారు. ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఆమెకు టేబుల్ ఫ్యాన్ అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా బైకుల్లా జైలులో గత కొంత కాలంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఖైదీలకు పసుపు పాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె పక్కనే ఉన్న సెల్లో కుమార్తె షీనా బోరాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా ఉన్నారు. (2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!) -
రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ముంబై: సుశాంత్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి ముంబై కోర్టులో చుక్కెదురైంది. సోదరుడి షోవిక్‌తో పాటు ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియాను, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో ముగ్గురిని నార్కోటిక్ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈసారి కూడా రియాతో పాటు మరో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. తన చేత బలవంతంగా నేరాన్ని ఒప్పించారని, కస్టడిలో తనకు రేప్ అండ్ మర్డర్ బెదిరింపులు వస్తున్నాయని రియా బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాగే ఉంటే తన మానసిక పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రియా తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రియా ఏ నేరం చేయలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రియను ముంబైలోని బైకులా జైలులో ఉంచారు. ఆ జైలులో కేవలం రియా మాత్రమే మహిళ ముద్దాయిగా ఉన్నారు. చదవండి: మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా? -
2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!
ముంబై: రెండు సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే అంటూ తనపై విమర్శలు గుప్పించిన శిబానీ దండేకర్‌కు నటి అంకితా లోఖండే గట్టి కౌంటర్ ఇచ్చారు. చనిపోయిన తన స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తేనే తనకు ప్రచారం లభిస్తుందని అనుకోవడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 17 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని, టీవీ యాక్టర్‌ను అయినందుకే చిన్నచూపు చూస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత) ఈ నేపథ్యంలో అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే.. నటుడి కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ రియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుశాంత్ మృతి కేసులో రియాకు మద్దతుగా స్వరా భాస్కర్, రాధికా మదన్, మంచు లక్ష్మి తదితర నటీమణులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి శిబానీ దండేకర్ రియాను విడుదల చేయాలంటూ ఆమెకు న్యాయం చేకూరాలి అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంకితపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంకిత పితృస్వామ్య భావజాలానికి రాకుమారి వంటిదని, 2 సెకన్ల ప్రచారం కోసం ఇలా చేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) ఇక ఇందుకు అంకిత సైతం ఘాటుగానే బదులిచ్చారు. ‘‘ రెండు సెకన్ల ఫేం- ఈ పదం నన్ను ఆలోచింపజేసింది. సాధారణ పట్టణంలోని మర్యాదగల కుటుంబం నుంచి వచ్చాను. నన్ను నేను ప్రమోట్ చేసుకునే ఫ్యాన్సీ ఎడ్యుకేషన్ నాకు లేదు. 2004లో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే పవిత్ర రిష్తా సీరియల్‌తో 2009లోనే నా అసలైన ప్రయాణం మొదలైంది. 2014 వరకు ఆ సీరియల్ కొనసాగింది. వరుసగా ఆరేళ్లపాటు అత్యధిక టీఆర్సీతో కొనసాగిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. నిజం చెప్పాలంటే ఫేం అనేది ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, అభిమానానికి అదనపు హంగు మాత్రమే అనుకుంటున్నా. ప్రేక్షకుల్లో నాకున్న గుర్తింపు కారణంగానే మణికర్ణిక, భాగీ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 17 ఏళ్లుగా టీవీ పరిశ్రమలో ఉన్న నేను నా స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేయడం కేవలం 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే అనడం ఎందుకో నాకైతే అర్థం కావడంలేదు’’ అంటూ టీవీ నటిని అయినందుకు గర్విస్తున్నా నని శిబానీకి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కాగా పవిత్ర రిష్తా సీరియల్లో సుశాంత్‌కు జంటగా కనిపించిన అంకిత ఆరేళ్లపాటు అతడితో బంధాన్ని కొనసాగించింది. అయితే సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత సుశాంత్ ఆమెకు దూరం కావడంతో ఇద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారు. ఇక సింగర్‌గా గుర్తింపు పొందిన శిబానీ ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్‌తో ప్రేమలో ఉన్నారు. అతడి కూతుళ్లతోనూ ఆప్యాయంగా మెలుగుతూ ఉంటారు. -
మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా?
‘రోజెస్ ఆర్ రెడ్.. వయలెట్స్ ఆర్ బ్లూ..’ నర్సరీ రైమ్. రియా టీ షర్ట్‌పై అదే రైమ్! ఏం చెబుతోంది రియా? ఇన్నోసెంట్ననా? దగాపడిన ఆడపిల్లననా? ‘స్మాష్ పేట్రియార్కీ..’ ఈ మాట కూడా ఉంది! మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా? ఆ స్లోగన్ భావమేంటి? మంగళవారం అరెస్ట్ అవడానికి ముందు రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి.) విచారణకు బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వచ్చారు. ఆ టీ షర్ట్ మీద ఒక స్లోగన్ ఉంది. వదులుగా ఉంటుంది కదా అని చేతికి అందిన ఆ టీ షర్ట్‌ను రియా వేసుకుని ఉండొచ్చు. అయితే ఆ స్లోగన్‌కి అర్థం ఏమై ఉంటుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఎన్.సి.బి. రియాను నిర్బంధంలోకి తీసుకున్న వెంటనే ఆ రాత్రి ఆమె ఆ కార్యాలయంలోనే ఉండిపోయారు. మర్నాడు ఉదయం ఆమెను ముంబైలోని బైక్యులా జైలుకు తరలించారు. రియా ఇప్పుడు బయట లేరు. ఆమె వేసుకొచ్చిన టీ షర్ట్ మీది స్లోగన్ మాత్రం రెక్కలొచ్చి స్వేచ్ఛా విహంగంలా విహరిస్తోంది. ‘రోజెస్ ఆర్ రెడ్. వయొలెట్స్ ఆర్ బ్లూ. లెటజ్ స్మాష్ పేట్రియార్కీ. మి అండ్ యు’.. ఇదీ రియా టీ షర్ట్ పై ఉన్న స్లోగన్. ‘గులాబీలు ఎర్రగా ఉంటాయి. వయలెట్ పూలు నీలంగా ఉంటాయి. (వయలెట్ పూలంటే మన బిళ్ల గర్నేరులా బ్లూ కలర్లో ఉండే ఇంగ్లిష్ వాళ్ల ఫ్లవర్స్). నేను, నువ్వు పురుషాధిక్య పరంపర భావనలను ధ్వంసం చేద్దాం’ అని ఈ స్లోగన్‌కి అర్థం. ఇది అందరికీ తెలుసు. ఆ భావం వెనుక ఉన్న రియా భావన ఏమిటన్నది ఇప్పుడు డిస్కషన్. ‘చూడండి.. ఆ పిల్లకు ఎంత పొగరో. ఆ మాటలకు అర్థం ఏమిటి? మగవాళ్ల వల్ల తన జీవితం ఇలా అయిందని టీ షర్ట్ వేసుకుని చెబుతోందా! ఆ నడక చూశారా? ఎంత నిర్లక్ష్యంగా అడుగులు వేస్తోందో! ఆ చూపు కూడా. భయం లేకుండా, అపరాధినన్న పశ్చాత్తాపమే లేదు’ అని అప్పుడే ఎవరో రెండు మూడు ట్వీట్లు కూడా పెట్టేశారు. అయితే రియా వేసుకున్న స్లోగన్ టీ షర్ట్ గతంలో కొందరు బాలీవుడ్ నటులు (స్త్రీ, పురుషులిద్దరూ) వేసుకున్న లాంటిదే. ఒకవేళ రియా ఉద్దేశపూర్వకంగా ఆ స్లోగన్‌ను ఎంపిక చేసుకుని ఉన్నా కూడా.. ‘లెటజ్ స్మాష్ పేట్రియార్కీ’ అన్నంత వరకు ఓకే. మహిళను కాబట్టి ఈ పురుషాధిక్య సమాజం నన్ను మీడియా రూపంలో, సుశాంత్ అభిమానుల రూపంలో వెంటాడుతోంది అని చెప్పదలచుకున్నారని అనుకోవచ్చు. మరి.. ‘రోజెస్ ఆర్ రెడ్. వయలెట్స్ ఆర్ బ్లూ’ ఏంటి! చిన్న పిల్లల రైమ్లా ఉంటేనూ..! ఆ రైమ్స్‌తో రియా సంకేతపరిచేది ఏముంటుంది? అసలు రియాను కాదు.. పూలకు, పితృస్వామ్యానికీ సంబంధ లేకుండా లింక్ కలిపి స్లోగన్ సృష్టించి, టీ షర్ట్లు తయారు చేసినవాళ్లను అనుకోవాలి. అలాగైతే ‘ది సోల్డ్ స్టోర్’ అనే ఆన్లైన్ ఫ్యాషన్ దుస్తుల దుకాణాన్ని, ‘గివ్‌హర్ 5’ అనే శానిటరీ నేప్కిన్ల ఉద్యమకర్తల బృందాన్ని అనుకోవాలి. రెండేళ్ల క్రితం ఇదే స్లోగన్ ఉన్న టీ షర్ట్లతో శానిటరీ నేప్కిన్ల క్యాంపెయిన్‌కు ప్రచారకర్తలుగా ఉన్న దియా మీర్జా, రాహుల్ బోస్, మిస్ మాలిని, అరణ్యా జోహర్, తన్మయ్ భట్, రోష్నీ కుమార్ ఇండియాలో 80 శాతం మహిళలకు శానిటరీ ప్యాడ్స్ కొనే ఆర్థిక స్థోమత లేదని గివ్‌హర్ 5 చెబుతోంది. ఆ కారణంగా నెలలో ఐదు రోజులు స్కూళ్లకు, ఆఫీస్‌లకు వెళ్లలేకపోవడం చూసి గివ్‌హర్ 5 కార్యకర్తలు ‘ది సోల్ స్టోర్’తో ఒక ఒప్పందానికి వచ్చి, ‘రోజెస్ ఆర్ రెడ్..’ స్లోగన్‌తో కొన్ని టీ షర్ట్లు తయారు చేయించారు. ‘మీరు ఒక్క టీ షర్ట్ కొంటే ఒక ఏడాదికి సరిపడా శానిటరీ నేప్కిన్లను ఒక ఆడపిల్లకు ఇచ్చినట్లే’ అని ఆ షర్ట్‌లను రాహుల్ బోస్, దియామీర్జా, తన్మయ్ భట్, మిస్ మాలినీ, అరణ్య జోహర్, రోష్నీ కుమార్ వంటి సెలబ్రిటీల చేత రెండేళ్ల క్రితం ప్రచారం కూడా చేయించారు. ఆ టీ షర్ట్ వేసుకోవడమే కాదు, అరిచేతిలో ‘రోజెస్ ఆర్ రెడ్’ అని కూడా (ప్రచారంలో భాగంగా) రాయించారు. ఆనాటి టీ షర్ట్లు ఉన్నది ఒకటే వెర్షన్. మళ్లీ తయారు కాలేదు. ఆ వెర్షన్ షర్ట్‌నే ఇప్పడు రియా వేసుకున్నారు. సోల్ స్టోర్, గివ్‌హర్5 టీమ్‌లు రెడ్ రోజెస్ అనే మాటను మహిళలు ‘పీరియడ్స్’లో ఉన్న సమయానికి ప్రతీకగా ఉపయోగించాయి. బహుశా రియా తను అరెస్ట్ అయ్యే టైమ్‌లో ఓపికలేని బలహీన స్థితిలో (పీరియడ్స్ వల్ల) ఉన్నానని చెప్పదలిచారా! మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నాం. అసలు ఈ రోజెస్ ఆర్ రెడ్ అనే మాట ఈ టీ షర్ట్ల వాళ్లకు ఎక్కడ దొరికింది, పిల్లల రైమ్స్లా ఉంది అనుకున్నాం కదా. నిజమే, పిల్లల రైమ్స్ నుంచే తీసుకుని, ఆ మాటకు ‘లెటజ్ స్మాష్ పేట్రియార్కీ’ అనే మాటను తెచ్చి జోడించారు. మహిళల శారీరక ధర్మాల గురించి పట్టని ఈ పితృస్వామ్య వ్యవస్థను (పేట్రియాట్రీని) నేనూ నువ్వే ధ్వంసం చేయాలి అని ఓ స్లోగన్ సృష్టించారు. 1784 నాటి ఇంగ్లిష్ నర్సరీ రైమ్స్‌లో ఉండే ‘రోజెస్ ఆర్ రెడ్‌కు, వయలెట్స్ ఆర్ బ్లూ’ అనే లైన్లకు కొనసాగింపు ఇలా ఉంటుంది.. ‘సుగర్ ఈజ్ స్వీట్. అండ్ సో ఆర్ యు’ (చక్కెర తియ్యగా ఉంటుంది. నువ్వు కూడా తియ్యగా ఉంటావు) అని. రియా తన స్నేహితుడు సుశాంత్ సింగ్‌ని స్వీట్ బాయ్ అని పిలిచేవారని ఆమె వాట్సాప్ చాట్లను బట్టి తెలుస్తోంది. ఆమెకు మాత్రం చేదు మిగిలింది. -
‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, అతని తమ్ముడిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వద్ద రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తి అనేక విషయాలు వెల్లడించాడు. తాను అనేక సార్లు సుశాంత్ సింగ్‌కు మరిజువానా, హాష్, వీడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్డౌన్లో కూడా ఇచ్చినట్లు తెలిపాడు. దానికి సంబంధించిన బిల్లులు అన్ని రియా కార్డు నుంచే చెల్లించినట్లు అధికారులకు తెలిపాడు. ఇప్పటికే ఎన్సీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ పెడ్లర్లు బసిత్ పరిహార్, సూర్దీప్ మల్హోత్రా తనకు డ్రగ్స్ అందించేవారని షోవిక్ వెల్లడించాడు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని శ్యామ్యూల్ మిరండా, సిద్దార్థ్ పితానీ తనతో చెప్పారాని తెలిపాడు. రియా, బసిత్ పరిహార్ వాట్సప్ చాట్‌ను షోవిక్ నిర్ధారించారు. ‘నేను మార్చి 16, 2020లో సుశాంత్ తనతో డ్రగ్స్ గురించి మాట్లాడాడని చెప్పగా సుశాంత్ రోజుకు 5 సార్లు వీడ్ తీసుకుంటాడని రియా చెప్పింది. అందుకే తనకి నేను ఐదు గ్రాముల వీడ్‌ను ఏర్పాటు చేశాను. అది 20 సార్లు వాడొచ్చు. అప్పుడు నేను బసిత్‌ను కలిశాను’ అని తెలిపారు. చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి -
రియా అరెస్టు: అదొక మూర్ఖపు చర్య!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని బిహార్ నటుడి మృతిగా ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు రాబట్టుకునేందుకు ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ’పేరిట బీజేపీ బిహార్ విభాగం బ్యానర్లు, పోస్టర్లు విడుదల చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇండియన్ యాక్టర్. కానీ ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ఆయనను బిహార్ నటుడిగా మార్చివేసింది’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. అదే విధంగా సుశాంత్ మృతి కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న తీరును అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. (చదవండి: బలవంతంగా ఒప్పించారు: రియా ) ఈ మేరకు.. ‘‘ పొలిటికల్ మాస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. సముద్రాన్ని మధించి మకరందానికి బదులు మాదక ద్రవ్యాలను కనుగొన్నాయి. అసలైన హంతకుడిని పట్టుకునేందుకు ఇప్పటికీ చీకట్లో వారి వెదుకులాట కొనసాగుతూనే ఉంది’’అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రియా చక్రవర్తిని ఎన్డీపీఎస్ చట్టం(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెన్)కింద అరెస్టు చేయడాన్ని ఒక మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇక మరో ట్వీట్లో..‘‘రియా తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఆయన దేశానికి సేవ చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం చేయడాన్ని బిహారీకి న్యాయం చేసినట్లుగా చిత్రీకరించడం సరికాదు’’ అంటూ ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తూనే రియా బెంగాలీ అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా కొత్తగా ఎన్నికైన అధీర్ రంజన్ చౌదరి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. (చదవండి: ‘బిహార్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం’) అదే విధంగా సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’ న్యాయ వ్యవస్థకు అరిష్టంగా దాపురిచిందంటూ మండిపడ్డారు. కాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేమపేరిట తన కొడుకును మోసం చేసి, అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈడీ ఎదుట రియా విచారణకు హాజరయ్యారు. అంతేగాక సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. Rhea's father is a former military officer, served the nation. Rhea is a Bengalee Brahmin lady, justice to actor sushant rajput should not be interpreted as a justice to Bihari.#SushantSinghRajputCase (4/n) — Adhir Chowdhury (@adhirrcinc) September 9, 2020 -
నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత
ముంబై: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారని తాను ఎప్పుడూ అనలేదని ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖాండే తెలిపారు. సుశాంత్‌కు, అతని కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే కోరానని పేర్కొంది. సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ సోషల్‌మీడియా వేదికగా నిరసనలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన నార్కోటిక్ అధికారులు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. 🙏🏻 pic.twitter.com/Hu985iz6Od — Ankita lokhande (@anky1912) September 9, 2020 ఈ విషయంపై స్పందించిన అంకిత ‘ఇది అనుకోకుండా జరిగింది కాదని, చేసుకున్న కర్మ ఫలితం’ అని ట్వీట్ చేసింది. ఇక సుశాంత్ ఆత్మహత్య గురించి మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, తాను కేవలం సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడానని, సుశాంత్‌ను హత్య చేశారని ఎప్పుడూ అనలేదని పేర్కొన్నారు. తాను ఎవరిని అనుమానిస్తున్నట్లు కూడా పేర్కొనలేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పారు. ఈ కేసులో ఉన్న నిజానిజాలు బయటకు రావాలని మాత్రమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. JUSTICE ⚖️ pic.twitter.com/O5aRCirGPD — Ankita lokhande (@anky1912) September 8, 2020 ఇక అంకిత, రియాకు పలు ప్రశ్నలు సంధించారు. సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్లు డాక్టర్ చెప్పిన మందులు కాకుండా డ్రగ్స్‌ను తీసుకోవడానికి ప్రోత్సహిస్తారా? అసలు ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా కేవలం సుశాంత్ అనారోగ్యం గురించి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు చెప్పింది. అంతేకాని సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నట్లు చెప్పిందా? లేదు. ఎందుకంటే తాను కూడా ఆ డ్రగ్స్‌ను తీసుకుంటూ ఆనందించింది. అందుకే నేను ఖర్మ తప్పదూ అంటూ పేర్కొన్నాను అని అంకిత తెలిపింది. చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?! -
బలవంతంగా ఒప్పించారు: రియా
ముంబై: ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాచక్రవర్తి తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారం మెజిస్ట్రేటు కోర్టు రియా బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్‌లు నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. రియాని ప్రశ్నించింది పురుష అ«ధికారులేనని ఆమె న్యాయవాది సతీష్ మనే షిండే అన్నారు, ఆ సమయంలో కనీసం మహిళా పోలీసు అధికారి కానీ, కానిస్టేబుల్ కానీ లేకపోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నేరం అంగీకరించేలా రియాపై ఒత్తిడిచేశారని ఆమె లాయర్ ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ల బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు రానుందని షిండే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మంగళవారం స్థానిక కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్ పదిసంవత్సరాలకు తగ్గకుండా కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
ఆరోపణలు రుజువైతే రియాకు పదేళ్ల జైలు!
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టయిన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని బుధవారం ఉదయం పోలీసులు ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. డ్రగ్స్ కేసులో మూడు దశలుగా రియాను విచారించిన నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు నిన్న(మంగళవారం) రియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన మేజిస్ట్రేట్ రియాకు బెయిలును తిరస్కరించి 14 రోజుల పాటు రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రంతా రియా ఎన్సీబీ కార్యాలయంలోనే గడపాల్సి వచ్చింది. అయితే రేపు రియా బెయిలు పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. ముంబైలో మహిళలకు ఉన్న ఏకైక జైలు బైకుల్లా జైలు. ఈ జైలులోనే కోరీగావ్-భీమాలోని షీనా బోరా హత్య కేసలో ప్రధాన నిందితులుగా అరెస్టు అయిన ఇంద్రాణి ముఖర్జీయా, కార్యకర్త సుధా భరద్వాజ్ సహా మరి కొందరు మహిళ ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. (చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!) (చదవండి: బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా) కాగా, ఈ కేసులో రియా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఆరోపణలను ఎదుర్కొంటోంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సహాయంతో డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన మూడు రోజుల విచారణలో రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉందని, ఆమె సిండికేట్ సభ్యురాలుగా ఉన్నట్లు వెల్లడైంది. మూడవ దశ విచారణలో రియా డ్రగ్స్ దందాలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని 25 మంది పేర్లు, డ్రగ్స్ ఉపయోగించే పార్టీల జాబితాను ఎన్సీబీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్, శామ్యూల్ మిరాండా సహా సుశాంత్ వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులను కూడా పోలీసలు ఆరెస్టు చేసి జైలుకు తరలించారు. (చదవండి: రియా చక్రవర్తి అరెస్ట్) -
రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కొన్నేళ్లుగా మానసిక ఆందోళనతో బాధ పడుతూ అక్రమంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని అధిక మొత్తంలో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాపానికి నేడు ఓ యువతిని మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంటాడుతున్నాయి. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే’ అని బాలివుడ్ సినీ తార రియా చక్రవర్తిని మంగళవారం నాడు ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ అరెస్ట్ చేయడం పట్ల ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనెషిండే చేసిన వ్యాఖ్యలివి. రియా చక్రవర్తిని ప్రేమిస్తూ ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఆ కేసులో ఇంతకుముందే ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మంగళవారం నాడు రియాను అరెస్ట్ చేశారు. (చదవండి : ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) న్యాయవాది సతీష్ వాదన మేరకు రియా చక్రవర్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారా ? ఏ చట్టం కింద ఆమెను అరెస్ట్ చేశారు ? ఆ చట్టం ఏం చెబుతోంది ? చట్టంలో లోపాలు ఏమైనా ఉన్నాయా ? అన్న అంశాలపై ఆమెను అరెస్ట్ చేయడం సబబా, కాదా ! అన్న విషయం ఆధారపడి ఉంది. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. దేశంలో మాదక ద్రవ్యాలు లేదా మానసిక ప్రేరణ కలిగించే ద్రవ్యాలను ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం, కొనుగోలు చేయడం, కలిగి ఉండడం, ఉపయోగించడాలను నిషేధిస్తూ 1985లో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది. ఈ చట్టంతోపాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రపంచ దేశాలతో చేసుకున్న పలు ఒప్పందాలు, ఒడంబడికలను పటిష్టంగా అమలు చేయడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఓ చట్టం ద్వారా ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ ఏర్పాటు చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టయిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి చట్టంలోని 31, ఏ సెక్షన్ కింద మరణ శిక్షను కూడా విధించేందుకు ఆస్కారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో చట్టాన్ని సవరించింది. ‘ఇండియన్ హార్మ్ రిడక్షన్ నెట్వర్క్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో మరణ శిక్షకు వ్యతిరేకంగా ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. మాదక ద్రవ్యాల కేసులో మరణ శిక్షను అమలు చేయాల్సిందేనంటూ పంజాబ్ ప్రభుత్వం 2018లో కేంద్రానికి సిఫార్సు చేసింది.(చదవండి : రియా చక్రవర్తి అరెస్ట్ ) ఎన్టీపీఎస్ చట్టంలో ఎంతో గందరగోళం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని ఈ చట్టంలో ఎంతో గందరగోళం ఉంది. ఈ చట్టంలో ‘అడిక్షన్ (బానిసవడం)’ అన్న పదంగానీ, దానికి నిర్వచనంగానీ లేదు. కాకపోతే వైద్య అవసరాల కోసం మాదక ద్రవ్యాలను ప్రభుత్వమే సరఫరా చేయవచ్చు అని ఉంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి చికిత్స చేయడానికి లేదా వారి చేత వాటిని మాన్పించేందుకు మళ్లీ మాదక ద్రవ్యాలనే చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ వైద్య అవసరాలకు ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేయవచ్చంటే ‘డి అడిక్షన్’ సెంటర్లకు ప్రభుత్వం వీటిని సరఫరా చేయవచ్చని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క డి అడిక్షన్ కేంద్రం కూడా లేదు. స్వచ్ఛంద సంస్థలు, మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి బయట పడిన వ్యక్తులు, సమూహాలు వీటిని నడుపుతున్నారు. వీటికి ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పద్ధతి కూడా అమలులో లేదు. అమెరికా, కెనడా, నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాలు మాదక ద్రవ్యాల నిర్మూలనా చట్టంలో భారీ సవరణలను తీసుకొచ్చి ‘అడిక్ట్స్ ట్రీట్మెంట్’కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అమెరికా ‘సస్టేన్ అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్’ పేరిట ఓ చట్టాన్నే తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్షన్‌ను నైతిక పరమైన అంశంగా పరిగణించడం వల్లనే భారత ప్రభుత్వాలు ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు ఇంతవరకు సాహసించలే కపోయాయి. ‘డ్రగ్ అడిక్షన్’ను ఇతర దేశాలు ఓ జబ్బుగా, అంటే ‘జీవమనోసామాజిక’ స్థితిగా గుర్తించడం వల్ల సవరణలు తీసుకొచ్చాయి. చట్టంలో గందరగోళం ఉండడం వల్ల భారత్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో న్యాయవాదులు స్పష్టంగా వాదించలేకపోతున్నారు. న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పులు చెప్పలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిచా నేరం చేశారా? అంటే నైతికంగా చేసినట్లు, ‘అడిక్షన్’ పరంగా చేయనట్లని అర్థం చేసుకోవచ్చు! -
రియా చక్రవర్తి అరెస్ట్
న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ అనంతరం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది. రియా వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన ఎన్సీబీ తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటికొచ్చాయి. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చిట్టా బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పేర్లను రియా ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు మాదక ద్రవ్యాల డీలర్లతో ఎటువంటి సంబంధాల్లేవని ఆ విచారణలో తెలిపారు. కరోనా లాక్డౌన్ కాలంలో డ్రగ్స్ దొరకడం కష్టం కావడంతో, రియాచక్రవర్తి తన సోదరుడి ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. నిజానికి రెండో రోజు విచారణ అనంతరమే రియాను అరెస్టు చేయాల్సి ఉండగా, మాదకద్రవ్యాలకు సంబంధించిన మరింత లోతైన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ఎన్సీబీ, మూడో రోజు కూడా ఆమెను విచారించాలని భావించింది. అందులో భాగంగానే మంగళవారం ఉదయం తిరిగి ముంబైలోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి రియాను రప్పించి విచారించింది. విచారణ అనంతరం ఎన్సీబీ రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసినట్టు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్సీబీ కె.పిఎస్.మల్హోత్రా చెప్పారు. అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం ముంబైలోని సియాన్ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్ళారు. ఆమెకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు కోవిడ్–19 పరీక్ష కూడా నిర్వహించగా, నెగిటివ్ వచ్చింది. మాదకద్రవ్యాల చట్టంలోని సెక్షన్8(సి)మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం, అమ్మడం, 20(బి)(2) తక్కువ మోతాదులో నిషేధిత డ్రగ్స్ వినియోగం, వాటిని కలిగి ఉండడం తదితర సెక్షన్ల కింద రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఈనెల 22 దాకా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు రియాను హాజరుపరిచిన ఎన్సీబీ... సుశాంత్‌కు డ్రగ్స్ కొనుగోలు చేసిన సిండికేట్‌లో రియా క్రియాశీలకంగా పనిచేశారని ఆరోపించింది. కస్టడీ కోరడం లేదని తెలిపింది. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. రియా బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె లాయర్ తెలిపారు. ‘‘నేనేం చేసినా సుశాంత్ కోసమే చేశాను’’ రెండో రోజు విచారణలోనే ఎన్సీబీ ఎదుటయ రియా చక్రవర్తి భావోద్వేగంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘నేనేం చేసినా, సుశాంత్ కోసమే చేశాను’’అని ఆమె చెప్పారు. ఎన్సీబీ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేశారు. ఆగస్టులో ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సుశాంత్‌ని డ్రగ్స్ తీసుకోకుండా వారించేదాన్నని కూడా రియా చెప్పారు. సోదరుడిని చూసి బోరుమన్న రియా మంగళవారం రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌కు కలిపి ఎన్సీబీ విచారించింది. ఈ సందర్భంగా షోవిక్‌ని చూసిన రియా ఒక్కసారిగా బోరున విలపించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. క్రితం రోజు తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్న రియా మంగళవారం ఎన్సీబీ విచారణలో, తాను అప్పుడప్పుడూ సిగరెట్ ద్వారా డ్రగ్స్ తీసుకునేదాన్నని వెల్లడించారు. రియాను సీబీఐ, ఎన్సీబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు విచారిస్తున్నాయి. సుశాంత్ మత్తుకు బానిస: న్యాయవాది సుశాంత్ మాదకద్రవ్యాల బానిసై, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన్ను రియా చక్రవర్తి ప్రేమించడంతో మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక మహిళను వేటాడుతున్నాయని ఆమె లాయర్ సతీష్ షిండే వ్యాఖ్యానించారు. రియా అరెస్టు న్యాయవ్యవస్థని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. అక్రమంగా సుశాంత్‌కి మందులు ఇచ్చారని, డ్రగ్స్ కూడా తీసుకుంటాడని... అందువల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ కేసులో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రియా చక్రవర్తి సిద్ధంగా ఉన్నట్టు న్యాయవాది చెప్పారు. ఇదిలా ఉండగా రియా అరెస్టు బీహార్‌కి పెద్ద విజయమని, బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు. -
పితృస్వామ్యాన్ని నాశనం చేద్దాం!
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటి రియా చక్రవర్తి అరెస్టు అయిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసు విచారణలో ఆరోపణలు ఎదర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను నార్కోటిక్స్ కంటట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. అయితే డ్రగ్ కేసులో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. (డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్) ఇదిలా ఉండగా నటి రియాను ఎన్సీబీ అధికారులు నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో మూడో రోజు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకునే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలు అంతలా వైరల్ అవ్వడానికి కారణం ఆమె ధరించిన టీషర్టుపై ఉన్న ప్రింట్‌యే. ఆ రోజు రియా నలుపు రంగు టీ షర్టు ధరించగా దానిపై.. ‘గులాబీలు ఎరుపు.. వైలెట్లు నీలం.. పితృస్వామ్యాన్ని అందరం నాశనం చేద్ధాం’ అంటూ రాసి ఉంది. దీనిని చాలా మంది నెటిజన్లు గుర్తించడంతో ఈ ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. (బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా) View this post on Instagram Sushant Case: बयान देने #NCB ऑफिस पहुंची रिया चक्रवर्ती, आज हो सकती है गिरफ्तारी ड्रग मामले में बड़ा खुलासा कर सकती है NCB #sushantsinghrajput #ncb #rheachakraborty #JusticeforSSR #sakshamnewsindia #sninewsagency #sninews A post shared by SNI NEWS (@sakshamnewsindia) on Sep 8, 2020 at 1:10am PDT -
డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్
-
డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. (8 గంటలు ప్రశ్నల వర్షం) ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్‌ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే రియా డ్రగ్ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. -
బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా
సాక్షి, ముంబై: సుశాంత్ మృతితో వెలుగు చూసిన డ్రగ్ కేసులో కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాను తాము సిద్ధం చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉన్నతాధికారి తెలిపారు. వారి పేర్లను సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి విచారణలో వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. సుశాంత్ మృతి కేసులో రియాను విచారిస్తున్న క్రమంలో డ్రగ్ కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ వేగవంతం చేసేందుకు రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. అదివారం రియాకు కూడా సమాన్లు జారీ చేసి మూడు దశలుగా విచారణ చేపట్టారు. ఇవాళ జరిగిన మూడవ దశ విచారణలో రియా కిలక విషయాలను అధికారులకు వెల్లడిచింది. తాను డ్రగ్స్ తీసుకోనని, సిగరేట్ మాత్రం తాగుతానని చెప్పింది. (చదవండి: ఆ మెడిసిన్ వల్లే సుశాంత్ చనిపోయాడు : రియా) అయితే ఓ సినిమాలో తన పాత్రలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పింది. బాలీవుడ్లో పలువురికి కూడా డ్రగ్స్ కేసులో ఉన్నారని, వారి పేర్లను, డ్రగ్స్ ఉపయోగించే పార్టీల జాబితాను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా రియా కాల్ డేటాతో పాటు, స్వాధీనం చేసుకున్న పెడ్లర్, ఎలక్ట్రానిక్ పరికరాల డేటా అధారంగా బాలీవుడ్‌లోని ప్రముఖులకు కూడా కనెక్షన్లు ఉన్నట్లు ఇటీవల అధికారుల గుర్తించారు. తాజాగా రియా డ్రగ్ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన రియా సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, నటుడు కుక్ దీపెష్ సావంత్‌లను పోలీసులు రేపు(సెప్టెంబర్ 9)న కోర్టులో హాజరుపరచనున్నారు. (చదవండి: రియా.. రియా.. అంటూ అడ్డగించారు!) -
ఆ మెడిసిన్ వల్లే సుశాంత్ చనిపోయాడు : రియా
సాక్షి, ముంబై: దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణానికి అతని సోదరి ప్రియాంక సింగ్ కారణమంటూ రియా చక్రవర్తి ఆరోపించింది. సుశాంత్ ఇద్దరు అక్కలు ప్రియాంక సింగ్, నీతూ సింగ్ సుశాంత్‌కు సంబంధించిన బోగస్ మెడికల్ ప్రిస్కిప్షన్‌ను ఇచ్చారని, ఆ మెడిసిన్ తీసుకున్న 5 రోజుల్లోనే సుశాంత్ మరణించాడని రియా సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు అతని సిస్టర్స్ కారణమంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తరణ్‌పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సుప్రీం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు నిమిత్తం ముంబై పోలీసులు సీబీఐకి బదలాయించారు. (నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి) ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు జూన్ 8వ తేదిన బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ సమయంలో సుశాంత్ ముంబైలోనే ఉన్నట్లు తెలిపింది. చట్టవిరుద్ధంగా అతనికి సైకోట్రోపిక్ మెడిసిన్‌ను ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని ఆరోపించింది. సుశాంత్‌కు ఈ బోగస్ ప్రిస్క్రిప్షన్‌తో వైద్యం చేయడం వల్లే మరణించాడని ఇందుకు కారణమైన సుశాంత్ సోదరి ప్రియాంక, నీతూ సింగ్ డాక్టర్ తరుణ్‌లతో పాటు తదితరులను విచారించాల్సిందిగా రియా తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక సుశాంత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా మూడోరోజు కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకొంటోన్న బాలీవుడ్‌కు చెందిన కొందరి పేర్లను కూడా రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. (8 గంటలు ప్రశ్నల వర్షం) -
రియా.. రియా.. అంటూ అడ్డగించారు!
విచారణ సంస్థలు ‘చెప్పిస్తాయి’!... మీడియా చెప్పుకోనిస్తుంది..! అవునా కాదా అన్నది.. చెప్పించడం..! అసలేమైందన్నది.. చెప్పుకోనివ్వడం. మీడియా ఎప్పుడూ ఉన్నట్లే.. రియా విషయంలోనూ ఉంది. అయితే ఎప్పుడూ లేనంతగా.. విమర్శలను ఎదుర్కొంటోంది! సుశాంత్ పెట్టి వెళ్లిన అగ్నిపరీక్ష.. రియాకా.. మీడియాకా..?! ఊపిరి అందనిది ఎవరికి? జూలై 1 రియా చక్రవర్తి పుట్టిన రోజు. స్నేహితుడు సుశాంత్ సింగ్ ఉండి ఉంటే బహుశా ఆమె అతడితో తన ‘రెండో’ పుట్టిన రోజును జరుపుకుని ఉండేవారు. ఏడాది క్రితమే ఏప్రిల్‌లో సుశాంత్‌కి ఆమె పరిచయం. లేదా ఆమెకు సుశాంత్ పరిచయం. డిసెంబర్ నాటికి ఈ రెండు పక్షులు ఒక గూటికి చేరాయి. ఆ గూడు ముంబైలోని బాంద్రాలో సుశాంత్ ఉంటున్నది. అందులోనే మగపక్షి జూన్ 14 న సీలింగ్ ఫ్యాన్‌కి నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. అప్పటికి ఆరు రోజులుగా ఆ గూడులో జంటపక్షి కనిపించడం లేదు. రియాపై తొలి సందేహం! (చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..) తొలి సందేహం మొదట ప్రియమైన వారి మీదనే వస్తుంది. రియాతోపాటు ఈ కేసులో డబ్బు, డ్రగ్స్, వాట్సాప్ కీలకంగా ఉన్నాయి. వాట్సాప్ చాట్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పరిశీలిస్తోంది. డబ్బు ‘ఫ్లో’ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిశోధిస్తోంది. డ్రగ్స్ వేర్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) తవ్వితీస్తోంది. ప్రతి దాంట్లోనూ రియా కామన్. సీబీఐ, ఈడీ, ఎన్.సి.బి. ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నాయి. అయితే ఈ మూడింటిని మించి ఆమెపై విచారణ జరుపుతున్న అనధికార శక్తి ఒకటి ఉంది. మీడియా! చూసే ఉంటారు.. ఆది, సోమవారాల్లో విచారణకు హాజరయ్యేందుకు ఎన్.సి.బి. కార్యాలయానికి వెళ్తున్న, వెళ్లి వస్తున్న రియాను మూకుమ్మడిగా అడ్డగించి.. ‘రియా, రియా.. రియా..’ అంటూ మీద పడుతూ మీడియా ప్రతినిధులు తనని ఎంత అసౌకర్యానికి గురి చేశారో! అది వారి డ్యూటీలో భాగమే అవచ్చు. రాబట్టి, బయటపెట్టడం. అయితే అది డ్యూటీ చేస్తున్నట్లుగా లేదు. లాఠీ ఛార్జి చేస్తున్నట్లుగా ఉంది. రియాను ఎవరూ సమర్థించడం లేదు. అంతమాత్రాన మీడియా ఆమెను ఎలా ప్రశ్నించినా అంగీకారం అవుతుందా?! ‘‘సీబీఐ గానీ, ఈడీ గానీ, ఎన్.సి.బి. గానీ రియాను వెంటాడటం లేదు, వేటాడటం లేదు. మీడియా ఒక్కటే ఆ పని చేస్తోంది. విచ్–హంట్ చేస్తోంది. అరెస్టుకు రియా సిద్ధంగానే ఉన్నారు. ప్రేమించినందుకు ఫలితం ఇదే కనుకైతే ఆ ఫలితాన్ని అనుభవించకుండా పారిపోవాలని ఆమె అనుకోవడం లేదు. ముందస్తు బెయిలు ఇవ్వమని ఒక్క కోర్టును కూడా రియా ఇప్పటివరకు అభ్యర్థించలేదు’’ అని రియా లాయర్ మీడియా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘విచారణ సంస్థలకు ఏమీ మిగలకుండా తనే మొత్తం విచారణ జరిపి రియాను దోషిగా తేల్చేసింది మీడియా..’’ అని సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షీ బీబీసీతో అనడం కూడా మీడియా వహించవలసిన పాత్రను గుర్తు చేయడమే. ‘‘కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. నా కొడుకును అరెస్ట్ చేశావు. నా కూతుర్నీ అరెస్టు చేస్తావు. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని చక్కగా కూలగొట్టేశావ్. ఏమైనా.. న్యాయం కోసం ఏదైనా జరగాల్సిందే. జై హింద్’’ అని రియ తండ్రి ఆవేదన చెందారు. రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఆయన. ఇండియా అంటే మీడియానే! మీడియా ఏం చూపిస్తోందో అదే కదా మనం చూసే ఇండియా. విస్తరిస్తున్న కరోనా, ‘హద్దు’ మీరుతున్న చైనా, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. ఈ ఐదు నెలలుగా మన ఇండియా. ఇప్పుడు రియా కూడా! అభిమాన నటుల అర్ధంతర మరణం హృదయాన్ని కలచి వేస్తుంది. అర్ధంతర అనుమానాస్పద మరణమైతే సందేహ జ్వాలల్ని రేపుతుంది. ఆ జ్వాలలు ఇప్పుడు రియాను చుట్టుముట్టాయి. వాటిల్లో ఆమె కెరీర్ దగ్ధం అయిపోవడమో, సుశాంత్ పెట్టి వెళ్లిపోయిన అగ్నిపరీక్ష పాస్ అయి బయటికి రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఈలోపే మీడియా.. ఇన్విజిలేటర్‌గా, స్క్వాడ్‌గా, ఎవాల్యుయేటర్‌గా అన్నీ తానే అవడంతో పాటు, క్వొశ్చన్ పేపర్‌ను కూడా తనే సెట్ చేసి ఇస్తోందన్న ఒక విమర్శ అయితే ఉంది. తూనీగ తూనీగ టీవీ షోల నుంచి సినిమాల్లోకి వచ్చారు రియా. ఆమె తొలి చిత్రం తెలుగులో వచ్చిన ‘తూనీగ తూనీగ’ (2012). తర్వాత బాలీవుడ్లో ఆరు చిత్రాల్లో నటించారు. ‘జలేబీ’ (2018) లో చక్కటి నటనను ప్రదర్శించారు. ‘చెహ్రే’ అని ఇంకో సినిమా విడుదల కావలసి ఉంది. -
8 గంటలు ప్రశ్నల వర్షం
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా రెండో రోజు సోమవారం కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ఆమెను ఎనిమిది గంటలపాటు ఎన్సీబీ విచారించింది. బాలార్డ్ ఎస్టేట్‌లోని ఎన్సీబీ కార్యాలయానికి ఉదయం 9:30 నిముషాలకు పోలీసు ఎస్కార్టుతో వచ్చిన రియా, ఆరు గంటలకు తిరిగి వెళ్ళారు. విచారణ సందర్భంగా రియాచక్రవర్తి, డ్రగ్స్ తీసుకొంటోన్న బాలీవుడ్‌కు చెందిన కొందరి పేర్లను కూడా వెల్లడించడం సంచలనానికి దారితీసింది. 18 నుంచి 19 మంది పేర్లు రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో సుశాంత్ కోసం డ్రగ్స్ తెప్పించానని, తాను మాత్రం ఎప్పుడూ సేవించలేదని రియా తెలిపారు. అయితే సిగరెట్లు తాగే అలవాటుందని రియా చెప్పారు. తన సోదరుడు షోవిక్ ద్వారా డ్రగ్స్ సరఫరాదారు బాసిత్ పరిహార్‌ని ఐదుసార్లు కలిసినట్టు, అతడు తన నివాసానికి సైతం వచ్చేవాడని రియా వెల్లడించారు. రియాని, శామ్యూల్ మిరాండాతో కూర్చోబెట్టి విచారించగా.. రియా తనకు డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదని, కానీ సుశాంత్, అతని స్నేహితులు డ్రగ్స్ తీసుకునేవారని వెల్లడించినట్లు తెలిసింది. సుశాంత్ 2016 నుంచి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టినట్టు రియా వెల్లడించింది. మిరాండా ద్వారా డ్రగ్స్ తెప్పించి రియా సుశాంత్‌కి ఇచ్చేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రియాను విచారించిన విషయం తెలిసిందే. రియాతో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్‌లను కలిపి, విడివిడిగా ప్రశ్నించనున్నారు. దీనికోసం రియాని మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు ఎన్సీబీ డిప్యూటీ డీజీ ముత్తా అశోక్ జైన్ వివరించారు. ఆమె విచారణకు సహకరిస్తోందన్నారు. కాగా ఈ కేసులో అనూజ్ కేశ్వానీ అనే వ్యక్తిని సోమవారం ఎన్సీబీ అరెస్టు చేసింది. రియా అరెస్టు తప్పకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. సుశాంత్ సోదరిపై రియా ఫిర్యాదు సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకతోపాటు ఢిల్లీకి చెందిన డాక్టర్ తరుణ్‌పై రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ మానసిక సమస్యల చికిత్స కోసమంటూ వీరు తయారు చేసి ఇచ్చిన తప్పుడు, ఫోర్జరీ ప్రిస్క్రిప్షన్ వల్లే అతడు చనిపోయాడని ఆరోపించారు. ఈ మేరకు బాంద్రా పోలీసులకు ఫిర్యాదు పంపారు. -
సుశాంత్ సోదరిపై రియా ఫోర్జరీ కేసు
సాక్షి, ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ సోదరి ప్రియాంకపై రియా చక్రవర్తి సోమవారం ఫోర్జరీ కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియాపై డ్రగ్ కేసు కూడా నమోదైన క్రమంలో తాజాగా ఆమె సుశాంత్ సోదరిపై ఫిర్యాదు చేయడంతో మరింత ఆసక్తిని రేకిస్తోంది. ఈ ఫిర్యాదులో ప్రియాంక, సుశాంత్‌కు సంబంధించిన బోగస్ మెడికల్ ప్రిస్కిప్షన్‌ను ఇచ్చిందని, ఈ బోగస్ ప్రిస్కిప్షన్ వచ్చిన 5 రోజుల్లోనే సుశాంత్ మరణించాడని ఆమె తెలిపింది. అంతేగాక ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తరణ్‌పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: అరెస్టు అయ్యేందుకు సిద్ధం.. ప్రేమించడం నేరం కాదు!) రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు జూన్ 8వ తేదిన బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ సమయంలో సుశాంత్ ముంబైలోనే ఉన్నట్లు తెలిపింది. సుశాంత్‌కు ఈ బోగస్ ప్రిస్క్రిప్షన్‌తో వైద్యం చేయడం వల్లే మరణించాడని డాక్టర్ తరణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో సుశాంత్ సోదరి ప్రియాంక, డాక్టర్ తరుణ్‌లతో పాటు తదితరులను విచారించాల్పిందిగా రియా ఫిర్యాదులో పేర్కొంది. అయితే సుశాంత్ మృతి కేసులో రియాపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆమె డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిపై డ్రగ్ కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఎన్సీబీ విచారణలో షోవిక్, తనకేం తెలియదని రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మని చెప్పిన్టలు అతుడు అధికారులకు చెప్పడంతో రియా చూట్టు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..) -
సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ కొంత పురోగతిని సాధించింది. ఈ సందర్భంగా సుశాంత్ సోదరి, శ్వేతా సింగ్ కీర్తి అతనిని గుర్తుచేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ తాను కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. మేం ఒకరిని ఒకరం ఎప్పుడూ కాపాడుకుంటాం అని వాగ్దానం చేశాము. కానీ భాయ్ నేను నా మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అయితే ఇప్పుడు నేను, దేశం మొత్తం నీకు మరో వాగ్ధానం చేస్తున్నాం. మేం నిజం కనుక్కుంటాం, నీకు న్యాయం చేస్తాం. నా సోదరుడు ఎలాంటి వ్యక్తి అంటే అతని జీవితం ఆనందంతో నిండినది. అతను చిన్న పిల్లవాడిలా ఉంటాడు. అతను కోరుకున్నది ప్రేమ మాత్రమే. ఎవరైనా ఒకసారి తన తల నిమురుతూ ప్రేమతో మాట్లాడితే సుశాంత్‌కు అది చాలు. తన ప్రాణాలు బలవంతంగా తీసుకునే వ్యక్తి కాదు. అది నమ్మడానికి నా మనసు సిద్ధంగా లేదు. మన ఉద్దేశాలను స్పష్టంగా ఉంచుకుందాం. సుశాంత్ మరణానికి నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాం. ఇది సత్యానికి వచ్చిన ఆగ్రహం’ అని శీర్షికను జోడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అతడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని బాంద్రా పోలీసులు తెలిపారు. అయితే సుశాంత్ అత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, అతని మరణం వెనుక ఏదో నిజం ఉండే ఉంటుందని కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక నిరసనలు వెల్లువెత్తడంతో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో రియా సోదరుడిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram We promised each other that we will protect each other forever. But,I failed Bhai...I failed! But here is another promise I and the whole country make to you, we will find the truth, we will get you justice!I knew my brother, the kind of person he was, full of life and joy. He was like a child, the only thing he wanted was love. Koi ek baar, pyaar se haath pher de uske sar pe, pyaar se baat karle, bas that was enough for him to make him happy. He was not a person who would take his own life. My heart is not ready to believe it. Let’s keep our intentions clear, we want to know what is the cause of Sushant’s death, nothing less will suffice! It is Satya ka Agrah, #SatyagrahForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 6, 2020 at 10:29am PDT చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా.. -
సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..
ముంబై: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ, ఎన్సీబీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి సంబంధించిన డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆదివారం ఆరుగంటల పాటు విచారించింది. తిరిగి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సోమ వారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు సమన్లు జారీచేసినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. సుశాంత్ సింగ్ కోసం తన సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరో నిందితుడి ద్వారా తాను మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేదానినని రియా అంగీకరించినట్టు తెలు స్తోంది. డ్రగ్స్ కొన్నానని, అయితే తానెప్పుడూ వాటిని వాడలేదని ఆమె చెప్పారు. రక్త నమూ నాలు ఇవ్వడానికి సిద్ధమని, ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న జైద్ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేం దుకు మేనేజర్ మిరాండా వెళ్ళిన విషయం కూడా తనకు తెలుసునని ఎన్సీబీ ఎదుట రియా ఒప్పుకున్నారు. మార్చి 15న తన సోదరుడు షోవిక్‌కు, తనకు మధ్య మాదకద్రవ్యాలపై జరిగిన వాట్సాప్ చాట్ వాస్తవమేనని కూడా ఎన్సీబీ ఎదుట ఆమె అంగీకరించినట్టు సమా చారం. కాగా, రియా చక్రవర్తి విచారణ పూర్తి అయిన తరువాత, షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్‌లను రియాతో కూర్చోబెట్టి విడివిడిగా ఒక్కొక్కరి పాత్రపై వివరాలు సేకరిస్తామని ఎన్సీబీ తెలిపింది. తాజాగా అనూజ్ కేశ్వాని అనే వ్యక్తి ఇంటిపై ఎన్సీబీ దాడిచేసింది. ఈ దాడిలో 590 గ్రాముల హశీష్, 0.64 గ్రాముల ఎల్ఎస్డి షీట్స్, 304 గ్రాముల గంజాయి, 1,85,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సీబీఐ, అతని అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల డబ్బును బదలాయించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను కూడా రియా ఎదుర్కొంటున్నారు. ప్రశ్నల వర్షం... ఎన్సీబీ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం, కొంత మంది మహిళా పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున పశ్చిమ శాంతా క్రజ్‌లోని రియా చక్రవర్తి ఇంటికి వెళ్ళి, ఆమెకు సమన్లు అంద జేసింది. పోలీసు ఎస్కార్ట్‌తో రియాను మధ్యాహ్నం 12 గంటలకు బల్లార్డ్ ఎస్టేట్‌లోని సంస్థ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఆమె నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ ఇచ్చిన రిపోర్టుతో ఎన్సీబీ మాదక ద్రవ్యాల కోణంలో విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ ముఠాతో రియాచక్రవర్తికి ఉన్న సంబంధాలపై ఎన్సీబీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం, రియా చక్ర వర్తి వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు సేవించలేదని చెప్పారు. సుశాంత్ సింగ్ గంజాయి తీసుకునే వాడని, ఇదే విషయాన్ని మిరాండా కూడా విచారణలో చెప్పినట్లు ఎన్సీబీ తెలిపింది. షోవిక్ ఆదేశాల మేరకు మిరాండా డ్రగ్స్‌ని సరఫరా చేసేవాడని ఎన్సీబీ వెల్లడించింది. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. 2018 సెప్టెంబర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గంజాయి సేవిస్తున్నప్పుడు తాను చూశానని వ్యక్తిగత సలహాదారు దీపేశ్ సావంత్ అంగీకరించినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. మార్చి 13న రియా సోదరుడు షోవిక్ నుంచి డ్రగ్స్ తీసుకురావాలని సుశాంత్ చెప్పారని, అవి తీసుకొచ్చేందుకు మిరాండాతో కలిసి వెళ్ళానని దీపేశ్ చెప్పారు. అంతేకాకుండా ఏప్రిల్ 17న రియా చక్రవర్తి కోసం కూడా తాను డ్రగ్స్ సేకరించినట్లు దీపేశ్ ఎన్సీబీకి వెల్లడించారు. ప్రేమించడమే నేరమా? ‘‘రియాచక్రవర్తి అరెస్టుకి సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా ప్రేమించడం నేరమైతే, తన ప్రేమ కోసం ఆమె ఎన్నికష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె అమాయకురాలు. ఆమెపై బీహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీలతో కలిసి పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం రియా చక్రవర్తి ఏ కోర్టునీ ఆశ్రయించలేదు’’అని ఆమె న్యాయవాది సతీష్ మనేషిండే ట్వీట్ చేశారు. -
డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు!
-
డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు!
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్సీబీ నటి రియా చక్రవర్తికి ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబైలోని ఆమె ఇంటికి చేరుకున్న అధికారులు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించారు. తదుపరి విచారణకై ఎన్సీబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పడంతో.. ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా అక్కడకు బయల్దేరారు. మరికాసేపట్లో ఆమె అక్కడికి చేరుకోనున్నారు. ఏ క్షణమైనా రియా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.(చదవండి: కంగ్రాట్స్ ఇండియా: రియా చక్రవర్తి తండ్రి) ఈ సందర్భంగా.. రియా చక్రవర్తి న్యాయవాది సతీశ్ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘ఈ పరిస్థితుల్లో రియా ఏ క్షణమైనా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారు’’అని తెలిపారు. ఆమె పేరిట మరో ప్రకటన కూడా విడుదల చేశారు. ‘‘ఒకరిని ప్రేమించడం నేరం కానేకాదు. ఆ ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వీటన్నింటితో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ బిహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించలేదు’’ అని ఉద్వేగానికి గురయ్యారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మన్నట్లుగా అతడు చెప్పడంతో పాటుగా మరిన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది. ప్రస్తుతం ఎన్సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. -
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
నెక్ట్స్ నా కూతురే: రియా చక్రవర్తి తండ్రి
ముంబై: డ్రగ్స్ కేసులో తన కుమారుడిని అరెస్టు చేయడంపై నటి రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు. తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేసిన ఆయన ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కంగ్రాట్స్ ఇండియా, నువ్వు నా కొడుకును అరెస్టు చేశావు, ఆ తర్వాత వరుసలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ తదుపరి ఇంకెవరో తెలియదు. ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థవంతంగా పడగొట్టేశారు. అయితే న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుంది. జై హింద్’’అంటూ విమర్శనాత్మక లేఖ విడుదల చేశారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.(చదవండి: ‘రియా, సుశాంత్ కలిసి గంజాయి తాగేవారు’) ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో రియా, షోవిక్(24)ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ మేరకు శుక్రవారం వారి నివాసంలో సోదాలు జరిపిన ఎన్సీబీ అధికారులు షోవిక్‌ను అరెస్టు చేశారు. ఈనెల 9 వరకు తమ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా రియా చక్రవర్తి చెబితేనే తాను మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని అతడు విచారణలో అంగీకరించాడని పేర్కొన్నారు. (చదవండి: రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు) దీంతో రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్ డేటా ఆధారంగా ఎన్సీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రియాను విచారించి, ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజా సమచారాం ప్రకారం ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా ఇంటికి చేరుకున్నారు. కాగా షోవిక్‌తో పాటు ఇప్పటికే అరెస్టయిన సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా, డ్రగ్ డీలర్లు కైజాన్ ఇబ్రహీం, జైద్ విల్తారా, అబ్దుల్ బాసిత్ పరిహార్ తదితరులను... రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. -
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ముంబై: సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. బాలీవుడ్‌తో పెనవేసుకుపోయిన డ్రగ్స్ మాఫియా చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా యి. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ని ఎన్సీబీ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేయడంతో బాలీవుడ్లో డ్రగ్స్ నెట్వర్క్ తీగలాగితే డొంక కదలినట్టుగా బయటకొస్తోంది. ఈ మాదక ద్రవ్యాల రవాణాలో పెద్దచేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోన్న క్రమంలో అనూహ్యమైన విషయాలెన్నో బయటపడుతున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సౌత్ వెస్ట్ రీజియన్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. విచారణలో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సంచలన విషయాలను బయటపెట్టారని, రియా చక్రవర్తి చెపితేనే మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని షోవిక్ విచారణలో ఒప్పుకున్నాడని వారు వెల్లడించారు. రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్ డేటా ఆధారంగా ఎన్సీబీ నిర్ధారణకు వచ్చింది. ఆదివారం రియాను విచారణకు పిలిచి, ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. షోవిక్‌తో పాటు ఇప్పటికే అరెస్టయిన వారిని... రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారి అశోక్ జైన్ తెలిపారు. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్‌ని శనివారం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్ సిండికేట్‌లో షోవిక్‌ను భాగస్వామిగా గుర్తించిన ఎన్సీబీ అతను ఇంత భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఎలా సేకరించాడనే విషయాన్ని ఆరా తీస్తోంది. సుశాంత్ నివాసానికి సీబీఐ బృందం బాంద్రాలోని మోంట్‌బ్లాంక్ అపార్ట్మెంట్స్లోని సుశాంత్ సింగ్ ఫ్లాట్‌ని, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి, సీబీఐ బృందం శనివారం పరిశీలించింది. రాజ్‌పుత్ వంట మనుషులు నీరజ్, కేశవ్, సుశాంత్‌తో కలిసి అదే ఫ్లాట్‌లో నివసించిన సిద్ధార్థ్ పితానిలను సైతం సీబీఐ బృందం తమ వెంట తీసుకెళ్ళింది. ఇదే ఫ్లాట్‌లో జూన్ 14న సుశాంత్ ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఎన్సీబీ కస్టడీకి షోవిక్, మిరాండా షోవిక్ చక్రవర్తి అనేక మందికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని, ఇతనికి మరో నిందితుడు అబ్దుల్ బాసిత్ పరిహార్‌తో సంబంధాలున్నాయని ఎన్సీబీ స్థానిక కోర్టుకి వెల్లడించింది. షోవిక్‌ను, సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి కోర్టు అప్పగించింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనేకమార్లు సుశాంత్ ఆత్మహత్యాయత్నాలు చేయడం లాంటి విషయాలపై వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్, ప్రధాన ముద్దాయి రియా చక్రవర్తితో కలిపి షోవిక్‌ను, ముఖాముఖి విచారించాల్సి ఉందని కోర్టుకి ఎన్సీబీ తెలిపింది. మాదక ద్రవ్యాల సరఫరా కేసులో ఇదివరకే అరెస్టయిన బాసిత్ పరిహార్‌తో, షోవిక్, మిరాండాలు సంబంధాలు కలిగి ఉన్నట్టు ఎన్సీబీ తెలిపింది. ఈ విచారణలో షోవిక్ మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన అనేక మంది పేర్లను బయటపెట్టినట్లు కూడా ఎన్సీబీ వెల్లడించింది. కాల్ డేటా విశ్లేషణ, వాట్సాప్ చాట్స్, ప్రాథమిక విచారణలో బయటకొచ్చిన కొందరి పేర్లను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన మరో ముద్దాయి కైజన్ ఇబ్రహీంని కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఎన్సీబీ అదుపులో రియా సోదరుడు షోవిక్
-
ఎన్సీబీ అదుపులో రియా సోదరుడు షోవిక్
ముంబై: నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి ఈనెల 9 వరకు తమ కస్టడీలోనే ఉంటాడని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసులో అతడితో పాటు అరెస్టైన శామ్యూల్ మిరండాను కూడా నాలుగు రోజుల పాటు విచారించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా డ్రగ్ డీలర్ కైజాన్ ఇబ్రహీంను 14 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండాలు డ్రగ్స్ గురించి చర్చించుకున్న వాట్సాప్ చాట్స్ బయటపడిన నేపథ్యంలో రియాపై కేసు నమోదైంది.(చదవండి: థాంక్యూ గాడ్: సుశాంత్ సోదరి) దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు శుక్రవారం షోవిక్, మిరాండాల నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి వారిద్దరిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా శామ్యూల్ తన గూగుల్ పే అకౌంట్ ద్వారా డ్రగ్ డీలర్లకు డబ్బు చెల్లించినట్లు తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన డ్రగ్ డీలర్లు జైద్ విల్తారా, అబ్దుల్ బాసిత్ పరిహార్ల నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. (చదవండి: 5 కిలోల డ్రగ్స్‌కు డబ్బు చెల్లించు: షోవిక్) -
థాంక్యూ గాడ్: సుశాంత్ సోదరి
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్సీబీ గొప్పగా ముందుకు సాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు.. ‘‘మేమంతా సత్యం వైపు పయనించేలా మార్గదర్శనం చేస్తున్నందుకు ధన్యవాదాలు దేవుడా’’ అంటూ #GreatStartNCB #Warriors4SRR #Flag4SSR అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. సుశాంత్ న్యాయం జరగాలని పోరాడుతున్న వారికి ఇదొక ఉపశమనమని పేర్కొన్నారు. (చదవండి: 5 కిలోల డ్రగ్స్‌కు డబ్బు చెల్లించు: షోవిక్) కాగా జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రేమ పేరిట సహజీవనం చేస్తూ, డబ్బు తీసుకుని.. మోసం చేసి, సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతడి కుటుంబం రియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 15 కోట్ల మేర తన అకౌంట్‌కు డబ్బు బదిలీ చేయించుకుందని ఫిర్యాదు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రియాను విచారించింది. (చదవండి: సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్) ఇక సుశాంత్‌కు ఆమే డ్రగ్స్ అలవాటు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో సన్నిహితులతో రియా జరిపిన వాట్సాప్ చాట్స్ బయటకు రావడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రియా, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మందని అతడు చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. రియా, షోవిక్, శామ్యూల్ తదితరులతో కలిసి సుశాంత్ తన ఇంటి టెర్రస్‌పైన గంజాయి తాగేవాడని అతడి మేనేజర్ శృతి మోదీ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. -
5 కిలోల డ్రగ్స్‌కు డబ్బు చెల్లించు: షోవిక్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన ఎన్సీబీ.. శుక్రవారం ఉదయం ముంబైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. అదే విధంగా మరో బృందం సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరండా ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఎన్డీపీఎస్ చట్టం, విధివిధానాలను అనుసరించి ఈ మేరకు రియా, మిరండా నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. కాగా డ్రగ్ డీలర్‌తో రియా చక్రవర్తి సంభాషణ జరిపినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తద్వారా ఆమె నిషేధిత డ్రగ్స్ గురించి తన సన్నిహితులతో చర్చించినట్లు వెల్లడైంది. (చదవండి: ‘రియా, సుశాంత్ కలిసి గంజాయి తాగేవారు’) ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్సీబీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాలకు డ్రగ్స్ అందించినట్లుగా అనుమానిస్తున్న అబ్దుల్ బాసిత్, జైద్ విల్తారా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి మార్చి 17న జైద్ ఫోన్ నంబరును సుశాంత్ మేనేజర్ మిరాండాకు షేర్ చేసినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 10 వేల రూపాయల విలువ గల 5 కిలోల డ్రగ్స్‌ను కొనుగోలు చేసినందుకు జైద్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా షోవిక్ కోరాడు. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా) ఈ క్రమంలో మిరండా జైద్‌కు మూడు సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. భాసిత్ ద్వారా జైద్ నంబర్ వీరికి తెలిసినట్లు సమాచారం. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ ఎదుట హాజరైన అతడి మేనేజర్ శృతి మోదీ సుశాంత్, రియా కలిసి గంజాయి తాగేవారని వెల్లడించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు షోవిక్, మిరండా టెర్రస్ మీద గంజాయి పీల్చేవారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి తాము మీడియాకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని సీబీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. House search being conducted at Showik Chakraborty's and Samuel Miranda's residences as provided under NDPS Act: Narcotics Control Bureau (NCB) https://t.co/EpKDxZEkqK — ANI (@ANI) September 4, 2020 -
అమెరికాలో సుశాంత్ బిల్ బోర్డులు తొలగింపు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్‌కు తెలిపింది. ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో కొన్ని బిల్ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. It seems the paid PR has it’s reach everywhere. Hollywood Billboard company reached out telling they will not keep the Billboard any longer! The wordings on the billboard only demanded fair trial and justice! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR pic.twitter.com/YrMrLH3eIX — shweta singh kirti (@shwetasinghkirt) September 3, 2020 దీనిపై శ్వేత సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెయిడ్ పీఆర్ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్ బిల్‌బోర్డు సంస్థ సుశాంత్ బిల్బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్‌బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రచారం సాగుతోంది. View this post on Instagram Thanks Chicago! 🙏❤️🙏 Lets Stay United and keep demanding justice for Sushant. #JusticeForSushantSinghRajput #GlobalParyerForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 1, 2020 at 12:38pm PDT చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
‘రియా, సుశాంత్ కలిసి గంజాయి తాగేవారు’
ముంబై: నటి రియా చక్రవర్తికి కూడా గంజాయి తాగే అలవాటు ఉందని దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శృతి మోదీ సీబీఐకి వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్‌తో పాటు అతడి హౌజ్ కీపింగ్ మేనేజర్ శామ్యూల్ మిరండా, రియా, ఆమె సోదరుడు షోవిక్ టెర్రస్‌పై గంజాయి పీల్చేవారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శృతి సీబీఐ అధికారులతో వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ బహిర్గతమైన సంగతి తెలిసిందే. వీటి ద్వారా.. ఆమె నిషేధిత డ్రగ్స్ గురించి తన స్నేహితులతో చర్చించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి సారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రియాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను బుధవారం అరెస్టు చేసింది. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా) ఇక డ్రగ్స్ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియా.. ‘‘నన్ను కలిసే కంటే ముందు నుంచే సుశాంత్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. గంజాయి తాగేవాడు. నాకు తెలిసి కేదార్నాథ్ షూటింగ్ సమయంలో అనుకుంటా అలవాటు చేసుకున్నాడు. మానుకోమని చెప్పడం వరకే నా పాత్ర. ఈ విషయం గురించి సుశాంత్ మేనేజర్ శృతి మోదీతో నేను చాలా సార్లు చర్చించాను. నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సీబీఐ విచారణలో శృతి మోదీ చెబుతున్న విషయాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సుశాంత్‌తో కలిసి రియా గంజాయి పీల్చేవారని చెప్పడంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.(చదవండి: సుశాంత్ అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు: తండ్రి ) ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి ఈరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. శాంతాక్రజ్‌లోని కాలీనాలో గల డీఆర్డీవో గెస్ట్‌హౌజ్‌లో విచారణ కొనసాగుతోంది. ఇక బుధవారం సైతం సీబీఐ అధికారులు ఆయనపై పది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు.. సుశాంత్ సింగ్‌కు జీవిత బీమా పాలసీ ఉందని, ఆత్మహత్య చేసుకున్నాడని తేలితే ఈ మొత్తం రాదనే ఉద్దేశంతోనే సుశాంత్ కుటుంబం ఆరోపణలు చేస్తుందన్న వార్తలపై వారి లాయర్ వికాస్ సింగ్ కొట్టిపారేశారు. సుశాంత్ పేరిట ఇన్యూరెన్స్ లేదని తెలిపారు. -
సుశాంత్ అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు: తండ్రి
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్ డిప్రెషన్ గురించి తమకు తెలియదని పేర్కొన్న అతడి కుటుంబ సభ్యులు ముంబై పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం పలు అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్‌కు ఉన్న మానసిక సమస్యల గురించి తమకు ఆరేళ్ల క్రితమే తెలుసునని, ఈ విషయమై అతడు సైక్రియాటిస్ట్ను కూడా కలిసినట్లు అతడి సోదరి మీతూ సింగ్ తెలిపారు. ఇక తన కుమారుడి నుంచి డబ్బు తీసుకుని, మోసం చేసి, ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ నటి రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బిహార్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రియా తమను సుశాంత్‌కు దూరం చేసిందని, అతడిదో మాట్లాడకుండా అడ్డుపడిందని ఆరోపించారు. అయితే ముంబై పోలీసుల విచారణలో మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు, మీతూ సింగ్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: కీలక విషయాలు వెల్లడించిన సుశాంత్ సోదరి) ‘‘నా కొడుకు సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నాకు తెలియదు. తను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్లుగా, టెన్షన్లో ఉన్నట్లు నాతో ఎప్పుడూ చెప్పలేదు. సుశాంత్‌పై నాకెలాంటి అనుమానం గానీ, ఫిర్యాదు గానీ లేదు. నిరాశలో కూరుకుపోయి సుశాంత్ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నా. నా కొడుకు సుశాంత్ 13-5-2019లో కేశ ఖండన కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్నాకు వచ్చాడు. ఆ తర్వాత 16-5-2019 నాడు ముంబైకి తిరిగి వెళ్లాడు. నేను తనకు వాట్సాప్‌లో మెసేజ్ చేసేవాడిని. తను నాకు రిప్లై ఇచ్చేవాడు. నా వాంగ్మూలాన్ని మరాఠీలో రాతపూర్వంగా నమోదు చేశారు. దానిని నాకు హిందీలో వివరించారు. అంతా సరిగ్గానే ఉంది’’అని కేకే సింగ్ పేర్కొన్నట్లుగా ఉన్న వాంగ్మూల కాపీ తమకు లభించినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. (చదవండి: సుశాంత్ కుటుంబంపై రియా న్యాయపోరాటం!) ఇక ఈ విషయంపై స్పందించిన నటుడి ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్.. సుశాంత్ మానసిక ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రతికూల ప్రచారంపై అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ముంబై పోలీసులు వారి వాంగ్మూలాన్ని మరాఠీలో రాశారని, దాని బయటకు చదివి వినిపించలేదని ఆరోపించారు. అదే విధంగా సుశాంత్ సోదరీమణులతో బలవంతంగా ఆ స్టేట్మెంట్లపై సంతకం చేయించారని ఆరోపణలు చేశారు. ‘‘రియా చక్రవర్తే సుశాంత్ సమస్యలకు కారణమని ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొన్నారు. సుశాంత్‌కు అందించిన చికిత్స గురించి ఆమె అతడి కుటుంబానికి తెలియనివ్వలేదు’’అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ సోదరి నీతూ, ఆమె భర్త, హర్యానా సీనియర్ పోలీసు అధికారి ఓపీ సింగ్ ఆధ్వర్యంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. కాగా సుశాంత్ మృతి కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాతో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట కూడా హాజరైన విషయం తెలిసిందే. -
రియా రియల్ స్టోరీ
-
సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని తెలిపారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’ -
సీబీఐ ఎదుట హాజరైన రియా తల్లిదండ్రులు..
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తల్లిదండ్రులు మంగళవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ముంబైలో రియాను విచారించిన డీర్డీఓ గెస్ట్‌హౌజ్‌లోనే ఆమె తల్లిదండ్రులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. తన కుమారుడిని మానసికంగా వేధించడంతోపాటు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బుని అక్రమంగా మళ్లించారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తూ బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో రియాతోపాటు ఆమె తల్లిండ్రుల పేర్లు కూడా ఉన్నాయి. (సుశాంత్ కుటుంబంపై రియా న్యాయపోరాటం!) సుశాంత్ కేసులో సీబీఐ ఇప్పటి వరకు రియా, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీ, పీఎ రితేష్ షాలను ప్రశ్నించింది. మంగళవారం కూడా వంట మనిషి కేశవ్, సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, నీరజ్ సింగ్ మాజీ మేనేజర్ శృతి మోదీ కూడా విచారణ నిమిత్తం కాలినాలోని గెస్ట్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఇప్పటి వరకు సీబీఐ విచారణకు హాజరైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ను ఈ రోజు మాత్రం విచారణకు పిలవకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు షోవిక్‌ను సీబీఐ అయిదు రోజులపాటు 35 గంటలు ప్రశ్నించింది. (రియాపై వ్యాఖ్యలు: నాకైతే భయం లేదు!) ఇదిలా ఉండగా సోమవారం వరుసగా నాలుగో రోజు రియా, ఆమె సోదరుడు సీబీఐ ఎదుట హాజరయ్యారు. అనంతరం వారు తమ నివాసానికి చేరుకోగా రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ శ్వేతా త్రిపాఠి వారి నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా రియా, అతని సోదరుడు రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ శ్వేతా త్రిపాఠిని తోసేశారు. రియా, ఆమె కుటుంబ సభ్యులతోపాటు పలువురిపై గతంలో బిహార్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరిని పలుమార్లు ప్రశ్నించగా ఇటీవల ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. (డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్) -
సుశాంత్ కుటుంబంపై రియా న్యాయపోరాటం!
ముంబై: అర్ధాంతరంగా తనువు చాలించి, అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు అనూహ్య మలుపు తీసుకోనుంది. తనపై ఆరోపణలు చేసిన సుశాంత్ కుటుంబంపై నటి రియా చక్రవర్తి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. దర్యాప్తు సంస్థల ఎదుటే కాకుండా అత్యున్నత న్యాయస్థానం ముందు కూడా వారు తనపై అసత్య ఆరోపణలు చేసి అందరి ముందు దోషిగా నిలబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి రియా లాయర్ సతీష్ మాన్‌షిండే మాట్లాడుతూ.. సుశాంత్ సోదరీమణుల చాటింగ్లతోపాటు, అందులో షేర్ చేసిన ప్రిస్కిప్షన్ ప్రకారం అతని ఆరోగ్యం గురించి వారి కుటుంబానికి ముందే తెలుసన్నది నిరూపణ అవుతోంది. ప్రిస్కిప్షన్ వివరాలు కూడా ఒకరికి ఒకరు తెలియజేసుకున్నారు. కానీ కోర్టులో, ఈడీ ముందు ఏమీ తెలియదన్నట్టుగా నాటకమాడారు. ఇది చట్ట విరుద్ధమే అవుతుంది. (చదవండి: సుశాంత్ డిప్రెషన్: అతని కుటుంబానికి ముందే తెలుసా?) అలాగే ముందు నుంచి వైద్యం అందిస్తున్న పేషెంట్‌కు మాత్రమే డాక్టర్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తాడు. కానీ ఇక్కడ అలా జరగలేదని రుజువవుతోంది. కాబట్టి వీటన్నింటిపై రియా చక్రవర్తి.. సుశాంత్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనున్నారు. కాగా సుశాంత్ సోదరి నీతూ, అతడి మేనేజర్ శ్రుతి మోదీ చాటింగ్ వివరాలు లీకైన విషయం తెలిసిందే. ఇందులో నీతూ ప్రిస్కిప్షన్ పంపిచాల్సిందిగా శ్రుతిని కోరారు. మరోవైపు సుశాంత్ మరో సోదరి ప్రియాంక.. డాక్టర్ పంపించారంటూ ఓ ప్రిస్కిప్షన్‌ను అతనికి సెండ్ చేసిన చాట్ కూడా వైరల్‌గా మారింది. ఇందులో అతను మానసిక రుగ్మత పోగొట్టుకునేందుకు వాడాల్సిన మందుల పేర్లను కూడా ప్రస్తావించారు. అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో కూడా తెలియజేశారు. దీన్ని బట్టి సుశాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వారికి ముందే తెలుసని స్పష్టమవుతోంది (చదవండి: డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్) -
రియాపై వ్యాఖ్యలు: నాకైతే భయం లేదు!
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తికి తోటి నటీమణుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ కేసులో నిజానిజాలు తేలకముందే రియాను నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బోల్డ్ నటి స్వరా భాస్కర్, టాలీవుడ్ సెలబ్రిటీ లక్ష్మీ మంచు, హీరోయిన్ తాప్సీ పన్ను తదితరులు రియాకు మద్దతుగా నిలబడుతున్నారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ కొనసాగుతున్న వేళ మీడియా కూడా సమాంతర విచారణ జరుపుతూ రియాను వేధింపులకు గురిచేయడం సరికాదంటూ హితవు పలికారు. తాజాగా టీవీ నటి హీనా ఖాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: సుశాంత్ జీవితం స్ఫూర్తిదాయకం: హీనా ఖాన్) ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘‘సీబీఐ విచారణ పూర్తి చేసి ఒక ముగింపునకు రానివ్వండి. ఇలాంటి నిందల వల్ల ఆమె కెరీర్ నాశనమయ్యే అవకాశం ఉంది. మీ కారణంగా తను ఎదుటివారికి ముఖం కూడా చూపించుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ఘాటు విమర్శలు చేశారు. ఇక అప్పటి నుంచి షరా మామూలుగానే హీనా ఖాన్ నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. సుశాంత్ మరణానికి కారణమైన రియాను ఎలా వెనకేసుకు వస్తారంటూ ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. (చదవండి: సుశాంత్ అనారోగ్యం గురించి ముందే తెలుసు) అంతేగాక హీనా అభిమానులు సైతం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన హీనా ఖాన్.. ‘‘నేనెప్పుడూ నిజం వైపే నిలబడతాను. నా అభిమానులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నా! మనం ఒక్కటిగా ఉంటే ట్రోల్స్‌కి భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఆ సత్యమే మనం ధైర్యంగా నిలబడే శక్తిని ఇస్తుంది!. జై హింద్’’ సుతిమెత్తగానే కౌంటర్ ఇచ్చారు. కాగా ‘యే రిష్తా క్యా కహెలాతా హై’ సీరియల్(తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్లపంట)ల్లో అక్షరగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న హీనా.. సినిమాల్లోకి రాకముందే కాన్స్ ఫెస్టివల్లో హొయలొలికించే గౌరవం దక్కించుకున్న నటిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. (చదవండి: రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి) I always stand by the truth and want my fans to stand with me for the truth, together! If we believe each other we shall never fear these trolls or bots. I had, have and will always have my point of view. Without fear. Because truth gives you that power! Jai Hind https://t.co/r11GEEyPUi — Hina Khan (@eyehinakhan) August 31, 2020 -
ఈ మందులు వాడు: సుశాంత్ సోదరి
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఆయన అనారోగ్యం గురించి తమకు తెలియదని సుశాంత్ కుటుంబం గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అది అబద్ధమని రుజువు చేస్తూ సుశాంత్ సోదరి ప్రియాంక చాట్ లీకైంది. ఇందులో సుశాంత్ మానసిక స్థితి, డిప్రెషన్ గురించి ఆమె సోదరికి ముందే తెలుసని స్పష్టమవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మందులను కూడా వాడాలని ప్రియాంక సూచించారు. (చదవండి: సుశాంత్ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి) డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందుల వాడకం? లిబ్రియమ్(క్లోర్డియాజిపోక్సైడ్)ను వారం రోజులపాటు, ఆ తర్వాత నెక్సిటోను ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత వాడాలని సుశాంత్‌కు ఆమె సోదరి ప్రియాంక మెస్సేజ్ చేశారు. తీవ్ర ఆందోళనగా అనిపించినప్పుడు లొనాజెప్ను వేసుకోమని తెలిపారు. కానీ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఎవరూ ఇవ్వరు కదా? అని సుశాంత్ అనుమానం వ్యక్తం చేయగా తాను ఎలాగోలా మేనేజ్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సోదరుడికి కాల్ చేశారు. లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ మెసేజ్ పెట్టారు. తన మిత్రురాలు డాక్టర్ అని, ఆమె సహాయంతో ముంబైలోని మంచి వైద్యున్ని కలిసి చికిత్స కోరుదామని తెలిపారు. అనంతరం మందుల ప్రిస్కిప్షన్ ఆమె షేర్ చేశారు. ఇందులో ఉన్న మూడు ఔషధాలు మానసిక ఒత్తిడి, ఆందోళనకు వాడేవే కాగా లిబ్రియమ్ను డ్రగ్స్ నివారణకు కూడా వినియోగిస్తారు. కాగా సుశాంత్ కుటుంబ సభ్యులు అడిగితేనే ఆయన వాడాల్సిన ఔషధాలు రాసిచ్చానని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యుడు డా. తరుణ్ కుమార్ వెల్లడించారు. (చదవండి:బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్) చాట్ చేసిన రోజే రియా వెళ్లిపోయింది మరోవైపు లీకైన ఈ మెసేజ్ చాట్ ఎన్నో సందేహాలకు తావిస్తోంది. అసలు సుశాంత్ అనారోగ్యం గురించి తమకు తెలియదని ఆయన కుటుంబం అబద్ధం ఎందుకు చెప్పింది? రియాకు మాత్రమే అతను ఏ మందులు వేసుకోవాలో సూచించేవారని చెప్పారు. కానీ ఇక్కడ ప్రియాంకే మందుల ప్రిస్కిప్షన్ పంపిందంటే అర్థం ఏమిటి? మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సుశాంత్‌తో ప్రియాంక జూన్ 8న ఉదయం 10 గంటలకు చాట్ చేయడంతో పాటు ఫోన్ మాట్లాడారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రియా చక్రవర్తి అతని ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ మధ్యలో ఇంకా ఏమైనా జరిగి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. రోగి లేకుండా మందులు రాసివ్వడం నేరం ఈ చాట్‌పై రియా లాయర్ సతీష్ మనేషిండే మాట్లాడుతూ.. సుశాంత్ అనారోగ్యం గురించి వారి కుటుంటానికి ముందే తెలుసని పేర్కొన్నారు. నిజానికి రియా అతడికి ఎలాంటి మందులు ఇవ్వలేదని, ఆస్పత్రులకు మాత్రమే తీసుకెళ్లేదని తెలిపారు. కానీ సుశాంత్ సోదరి ప్రియా అతడికి ఏ మందులు వేసుకోవాలో సూచించిందని తెలిపారు. అసలు 2019 నవంబర్లోనే సుశాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వారికి తెలుసని ప్రియాంక మెసేజ్‌ల ద్వారా వెల్లడవుతుందన్నారు. రోగి లేకుండానే, అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించకుండానే మందులు రాసివ్వడం మానసిక ఆరోగ్య చట్ట ప్రకారం నేరమని తెలిపారు. (చదవండి: రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు) -
2019లోనే సుశాంత్ సోదరికి తెలుసా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తి.. అతడికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చేదని.. డబ్బు తీసుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సుశాంత్ మెంటల్ హెల్త్ కండిషన్ గురించి రియా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నటుడి కుటుంబ సభ్యులు గతంలో ఆరోపించారు. మీడియాలో కూడా రియాకు సంబంధించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నటి స్వర భాస్కర్ రియాకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం.. మీడియా, రియాను కసబ్ కన్నా దారుణంగా వేధిస్తుందని విమర్శించారు స్వర. తాజాగా రియాను ఈ కేసులో కావాలనే ఇరికించారంటున్నారు స్వర. అంతేకాక సుశాంత్ మానసిక అనారోగ్యం గురించి అతడి మాజీ మేనేజర్ శ్రుతి మోదీకి, అతడికి సోదరికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్‌ని ట్వీట్ చేశారు స్వర. (చదవండి: రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి) 2019, నవంబర్ 26న జరిగిన ఈ వాట్సాప్ చాట్‌లో శ్రుతి.. సుశాంత్ సోదరి నీతుకి ఓ ప్రిస్కిప్షన్‌ని మెసేజ్ చేసింది. దాంతో పాటు సుశాంత్‌కు వైద్యం చేస్తోన్న సైక్రియాట్రిస్ట్ సుసాన్ వాకర్ ఫోన్ నంబర్ని కూడా సెండ్ చేసింది. దీనికి బదులుగా నీతు.. ఆ వైద్యుడిని కలవాలని ఉందంటూ రిప్లై కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ కాస్త సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి అజయ్ కుమార్ అనే జర్నలిస్ట్ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన స్వర.. ‘హేయ్ మనస్సాక్షి లేని యాంకర్స్.. రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ మానసిక అనారోగ్యం గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసిందని ఈ వాట్సాప్ చాట్ నిరూపిస్తోంది. గట్టిగా అరుస్తూ.. డిబెట్లు నిర్వహించే యాంకర్లు దీన్ని విస్మరించారు ఎందుకు. చూడబోతే రియాను కావాలనే ఈ కేసులో ఫ్రేమ్ చేసినట్లు అనిపిస్తోంది’ అంటూ స్వర ట్వీట్ చేశారు. సుశాంత్ మానసిక అనారోగ్యం గురించి రియా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ హీరో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఈ చాట్‌తో స్పష్టమవుతోంది. ఇక సుశాంత్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ప్రిస్క్రిప్షన్‌లో ఉంది. Hey Voyeurs & shameless conscience-less anchors! Chat Proves #RheaChakraborty had informed the family about the mental health of SSR way back in 2019. Why did all the high decibel, screaming shouting anchors conveniently ignore this story? Does it seem like Rhea is being framed? https://t.co/qFWDuEw6B2 — Swara Bhasker (@ReallySwara) August 30, 2020 -
డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని చావుకు గల కారణాలు తెలియాలని, ఆయనకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ కేసులో పలు దర్యాప్తు సంస్థలు నిజం నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో సుశాంత్‌కు సంబంధించిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ఇందులో ఆయన తన ఆర్థిక పరిస్థితి గురించి కలవరపాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన ఫ్యాన్సీ కార్లను కూడా అమ్మేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అటు మానసిక స్థితితోపాటు, భవిష్యత్తుపై ఆందోళన కూడా సుశాంత్ మాటల్లో స్పష్టంగా గోచరించాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ సంభాషణలో సుశాంత్, రియా చక్రవర్తి, అతని మేనేజర్లు పాల్గొన్నారు. కాగా ఇందులో ఉన్న గొంతు సుశాంత్దేనని ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ ఆడియో టేపులో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని వెల్లడించారు. ఆడియో టేపులో ఏం మాట్లాడుకున్నారంటే.. సుశాంత్: ఇప్పుడు నువ్వు నాకో సాయం చేసి పెట్టగలవా? రియా: తప్పకుండా సుశాంత్: మనం డబ్బును ఎలా పొదుపు చేయాలి? పేరు తెలియని వ్యక్తి:(కలుగజేసుకుంటూ) నిన్ననే మనం ఇంకో ఘోరమైన పరిస్థితి గురించి మాట్లాడాం(సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది). సుశాంత్: అవును, ఇప్పుడు అసలు నేను నా మైండ్‌తో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇది నేనింతవరకు ఎన్నడూ ఎదుర్కోని సమస్య. వ్యక్తి: ఈ విషయంలో ఆ ట్రస్టు సభ్యులు నిర్ణయం తీసుకుంటారు.(ఈ సమయంలో సుశాంత్‌ను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రైవేటు ట్రస్ట్ సాయం చేస్తుందని సలహా ఇస్తాడు) సుశాంత్: కానీ, దీని కోసమని ఎలా వెళ్తాం? రియా: ఇదేం చిన్న సమస్య కాదు. వ్యక్తి: ఇది అత్యంత క్లిష్ట్య సమస్య, అర్థమవుతోందా? సుశాంత్: అవును, అదీ నిజమే ఇక మరో ఆడియో టేపులో సుశాంత్, అతని మాజీ మేనేజర్ శ్రుతి మోదీ, రియా, ఆమె తండ్రి ఇంద్రనీల్ సంభాషించారు. ఇందులో సుశాంత్ ముంబై నుంచి మకాం మార్చాలనుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: సుశాంత్ కేసుపై నెలల తరబడి చర్చిస్తారా!) సుశాంత్: నేను నగరాన్ని విడిచి వెళ్లాలనుకుంటున్నా. అయితే ఎక్కడికి వెళ్లాలి? రియా: బహుశా గోవానేమో. కొంతకాలం పావ్నాలో అయితే ఉంటే మంచిదని నాన్న సూచించారు. ఒక నెల సమయమిస్తే ఆ తర్వాత ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తాం. ముందు సుశాంత్ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు. అతను తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. రేపటి కోసం బెంగ పెట్టుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే మంచిది సుశాంత్: ఇదో రిటైర్మెంట్లాగా భావించండి. ఇంద్రనీల్: నేను అర్థం చేసుకోగలను సుశాంత్: కానీ నేను ఏం చేయగలను,? ఎలా చేయగలను? నాకు సాయం కావాలి రియా: ముందు ఇక్కడ డబ్బు అవసరం. నువ్వు పెట్టుబడిన పెట్టిన దగ్గర నుంచి కొంత మొత్తం నీకు వస్తుంది. సుశాంత్: అది ఎంత మొత్తమో నాకు తెలుసు. రియా: ఇప్పుడు ప్రతి నెలా ఎంత వస్తుందో నీకు తెలుసు కాబట్టి ఆ ఇంటిని వదిలేయాలని ఆలోచిస్తున్నావు. సుశాంత్: ముందు నాకు పానాకు వెళ్లడం ఇష్టం లేదు. స్త్రీ: నువ్వు మళ్లీ నీ అపార్ట్‌మెంట్‌కు వెళ్తే సంతోషంగా ఉండవు. ఏం జరుగుతోందో అర్థమవుతోందా.. సుశాంత్: ఏది మీకు మనశ్శాంతి ఇస్తుందని అనిపిస్తోంది రియా: ముందైతే మనం ప్రయత్నం చేద్దాం. పానా వెళ్లి అక్కడ ఒకటీరెండు రోజులు ఉందాం. అక్కడ నీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం! స్త్రీ: ఎప్పుడు వెళ్తున్నారు? సుశాంత్: ఇంకా ఏమీ అనుకోలేదు ఇంద్రనీల్: ఈ బుధవారం లేదా గురువారం అంటే 14వ తేదీనా? ఎప్పుడు? సుశాంత్: నా బర్త్‌డే కన్నా ముందే వెళ్తాం ఇంద్రనీల్: అయితే బుధవారం రియా: అవును, బుధవారం ఏడింటికి ఇంద్రనీల్: ఇదే మీ ప్లాన్ మరో వీడియోలో సుశాంత్ అతని మానసిక స్థితి గురించి మరింత కంగారు పడినట్లు కనిపిస్తోంది. సుశాంత్: ఇలాంటివన్నీ జీవితంలో ఒక భాగం. ఇది బైపోలార్ డిజార్డర్(భావోద్వేగాలు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి). ఇందులో మొదట నేను నటించగలనని అనుకోలేదు. రెండోది డబ్బు సంపాదించేందుకు ఏ రంగంలోకి ప్రవేశించాలో అర్థం కాలేదు. నాకంతా అయోమయంగా ఉంది. స్త్రీ: నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావు. సుశాంత్: దీని గురించి గత రెండు నెలలుగా మా డాక్టర్లతో మాట్లాడుతున్నా స్త్రీ: సరే, అసలు నీ చివరి లక్ష్యం ఏంటో చెప్పు? మేం నీ వెనకుండి సహాయపడతాం. నువ్వు దేని గురించి అతిగా భయపడుతున్నావో చెప్పు రియా: నేను చెప్తాను. అతను ఉన్న డబ్బునంతా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెడుతున్నాడు. దానివల్ల అతని డెబిట్ కార్డులో రూ.10-15 లక్షలు కన్నా ఎక్కువ లేవు. మరో విషయమేంటంటే అతని ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ వస్తుంది. దానివల్ల అతను సేవింగ్స్ ఖర్చు చేయడు. ముందు అతని డబ్బును కాపాడుతూ పొదుపు చేయాలి. అతని సంతకం లేకుండా ఆ డబ్బు ముట్టుకోడానికే వీల్లేకుండా చేయాలి... అంటూ సుశాంత్ డబ్బు గురించి ఆందోళన పడ్డట్లు తెలిపారు. అతని సంపాదన ఖర్చవకుండా ఏం చేయాలో మాట్లాడుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేశారు. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మేరకు చేయాలన్న దానిపై చర్చించారు. ఈ క్రమంలో తన ఫ్యాన్సీ కార్లను కూడా అమ్మేయడానికి సిద్ధమేనని సుశాంత్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని రియా సమర్థించగా, ఇతరులు మాత్రం వద్దని వారించారు. (చదవండి: రియా చక్రవర్తికి భద్రత కల్పించనున్న పోలీసులు) -
సుశాంత్ కేసు: ఈడీ ఆఫీస్‌కు గౌరవ్ ఆర్యా
ముంబై: ఇప్పటికే ఎన్నెన్నో మలుపులు తిరిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక విషయాలు రాబట్టే దిశగా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా నిందితురాలు రియా చక్రవర్తి వాట్సాప్ చాట్‌లో బయటపడిన గోవాకు చెందిన గౌరవ్ ఆర్యాను విచారించనున్నారు. సుశాంత్ మృతి కేసుతోపాటు మనీ లాండరింగ్, డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి గౌరవ్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఈడీ ఆఫీసుకు గౌరవ్ ఆర్య ఆదివారం చేరుకున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఆర్యాని విచారించనున్నారు. ఇక ముంబైకి బయల్దేరేముందు ఆర్యా మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుశాంత్‌తో ఎటువంటి పరియచం లేదని, ఎప్పుడూ అతన్ని చూడలేదని చెప్పాడు. రియాను 2017లో కలుసుకున్నాని వెల్లడించాడు. కాగా, గోవాలోని తమరైండ్ హొటల్ అండ్ కేఫ్ కొటింగాని అతను నిర్వహిస్తున్నాడు. ఈడీ విచారణ అనంతరం, సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యాను విచారించనున్నారు. ఇక రియా చక్రవర్తి కూడా సీబీఐ అధికారుల ఎదుట సోమవారం ఉదయం హాజరయ్యారు. (చదవండి: రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు) -
రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం కేసులో అందరి వేళ్లు అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి రియాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగాలని వాదిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆదివారం #JusticeForSushantSinghRajput, #JusticeForRheaChakraborty అంటూ ఓ పోస్ట్ పెట్టారు. "రియా చక్రవర్తిని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాత దీనిపై స్పందించాలా? వద్దా? అని చాలా ఆలోచించాను. కానీ ఇప్పటికే మీడియా ఆమెను రాక్షసిగా చిత్రీకరిస్తోంది. చాలామంది దీనిపై మౌనంగా ఉన్నారు. నాకు నిజం ఏంటో తెలీదు, కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే సమయంలో నిజం ఎలాగైనా బయటకు వస్తుందని నమ్ముతున్నా. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అన్ని రకాల దర్యాప్తు సంస్థలు సుశాంత్‌కు న్యాయం తీసుకువచ్చేందుకు పాటుపడుతున్నాయి. (ఆ రెండు ప్రశ్నలకు రియా సమాధానం?) @sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends... stop this lynching. #letthetruthprevail pic.twitter.com/5SCEX8Un8H — Lakshmi Manchu (@LakshmiManchu) August 30, 2020 అప్పటివరకు మనమంతా సహనం పాటించాలి. ఇతరులను ద్వేషించడం మానుకోవాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె కుటుంబానిపై నిందలు వేయడం తగదు. మీడియా వల్ల ఆమె కుటుంబం ఎంత బాధపడుతున్నారనేది నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా ఇలాంటివి ఎదురైతే ఒక్కసారైనా నా సహచరులు నావైపు నిలబడాలి. నిజం బయట పడేంతవరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నాను" అని పేర్కొన్నారు. దీనికి రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందిస్తూ 'గొప్పగా చెప్పారు' అని ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ తాప్సీ కూడా రిప్లై ఇచ్చారు. "నాకు వ్యక్తిగతంగా సుశాంత్ పెద్దగా పరిచయం లేదు, రియా కూడా అంతగా తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే.. నేరం నిరూపణ అవకముందే ఓ వ్యక్తిని దోషిగా నిలబట్టే ప్రయత్నం చేయడం తప్పు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించండి" అని ట్వీట్ చేశారు. (రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు) -
ఆ రెండింటికి సమాధానం చెప్పలేకపోతున్న రియా
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్ర, శనివారాలు వరుసగా రెండు సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆదివారం కూడా ఆమెను విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో రియా రెండు ముఖ్యమైన ప్రశ్నలకు దాటవేసే సమాధానాలిస్తున్నట్లు సమాచారం. సుమారు 50 ప్రశ్నలు అడిగితే అందులో రెండింటికి మాత్రం సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆ రెండు ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ దీనిపై మరింత క్లారిటీ కోసం మరోసారి వీటిని ప్రశ్నించనుంది.(చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) ఇంతకీ ఆ రెండు ప్రశ్నలేంటంటే.. "జూన్ 8న సుశాంత్‌తో బ్రేకప్ చేసుకున్నాకే అతని ఇంటి నుంచి వెళ్లిపోయారా? సమాధానం అవును అయితే ఏ కారణంతో విడిపోయారు?" రెండోది.. "మీరు అతని ఇంటి నుంచి వెళ్లిపోయాక కూడా సుశాంత్.. మీ సోదరుడికి ఫోన్ చేస్తూ మీ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. మరి జూన్ 8 నుంచి 14 తేదీల మధ్య అతని కోసం మీరేమైనా పట్టించుకున్నారా? లేదా?" ఆదివారం నాటి విచారణలోనైనా రియా దగ్గర నుంచి ఈ రెండింటికి సరైన సమాధానాలు రాబట్టాలని సీబీఐ ఆలోచిస్తోంది. ఇదిలా వుండగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే సుశాంత్ ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితానీ, సామ్యూల్ మిరండ, సుశాంత్ వంటమనిషి నీరజ్, వాచ్మెన్, మేనేజర్, రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా) -
ముంబై: సీబీఐ ఆఫీస్‌కు చేరుకున్న రియా చక్రవర్తి
-
సంజనపై రియా కామెంట్స్: నటి ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ మొదలైన నాటి నుంచి అతడి గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. జూన్ 8న తాను బాంద్రా ఫ్లాట్ నుంచి వచ్చేశానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెబుతున్నారు. అంతేగాక సుశాంత్ ఎప్పటి నుంచో డ్రిపెషన్‌లో ఉన్నాడని, అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గురువారం ఇండియా టుడేతో మాట్లాడిన రియా చక్రవర్తి.. ‘దిల్ బేచారా’ హీరోయిన్ సంజనా సంఘీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌పై వచ్చిన మీటూ ఆరోపణలపై స్పష్టతనివ్వడంతో సంజన ఆలస్యం చేసిందని, ఈ పరిణామాలు అతడిని కుంగదీశాయని చెప్పుకొచ్చారు. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు: రియా) లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా సుశాంత్ మానసికంగా బలహీనపడిపోయాడని, ఆ ఎపిసోడ్ తనను పూర్తిగా నాశనం చేసిందని పేర్కొన్నారు. ‘‘మీటూ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేశారు? ఈ విషయంపై విచారణ జరగాలి. నెలన్నరగా నేనెందుకు మౌనంగా ఉన్నానని ప్రశ్నించిన వాళ్లు ఈ విషయంపై దృష్టి సారించాలి’’అంటూ రియా వ్యాఖ్యానించారు. ఇక రియా వ్యాఖ్యలపై సంజన సంఘి తీవ్రంగా స్పందించారు. కాస్మోపాలిటన్ ఎడిటర్‌తో మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళగా నేనేం ఏం చెప్పాలో అంతా చెప్పాను. జరిగిన దాని గురించి పూర్తిగా వివరించాను. మళ్లీ కొత్తగా ఇలా మాట్లాడితే అస్సలు సహించేది లేదు’’రియాపై ఫైర్ అయ్యారు. (చదవండి: సుశాంత్, రియా కోసం ఎంత ఖర్చు చేశాడంటే..) లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక సతమతమవుతుంటే.. తనను వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. సహ నటిగా సుశాంత్ గురించి తాను కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగాని, ఒకరి జీవితంలో తలదూర్చే ప్రయత్నం చేయనని చెప్పుకొచ్చారు. దిల్ బేచారాకు ముందు తానెన్నడూ సుశాంత్‌ను కలవలేదని, అయితే సెట్లో తనను గమనించిన దాన్నిబట్టి ఎంతో మంచి వ్యక్తి చెప్పగలనన్నారు. ఇక సుశాంత్ మృతి తన మనసును కలచివేసిందన్న సంజన.. అతడికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయకూడదని పరోక్షంగా రియాను ఉద్దేశించి చురకలు అంటించారు.(చదవండి: దిల్ బేచారా మూవీ రివ్యూ) కాగా ‘దిల్ బేచారా’ సినిమాలో సుశాంత్, సంజన జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో(2018) సుశాంత్ ఆమెను లైంగికంగా వేధించాడంటూ వదంతులు వ్యాపించాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ సంజనతో తాను చేసిన చాట్‌ను బహిర్గతం చేసిన సుశాంత్, తనతో హుందాగా ప్రవర్తించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నెలరోజులకు ఈ విషయంపై స్పందించిన సంజన..‘‘యూఎస్ ట్రిప్ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. -
రియా చక్రవర్తికి భద్రత కల్పించనున్న పోలీసులు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి రక్షణ కల్పించాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం ముంబై పోలీసులకు లేఖ రాసింది. రియాతోపాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉన్న క్రమంలో సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డిమాండ్ మేరకు డీఆర్డీఓ అతిథి గృహం నుంచి తన ఇంటికి వెళ్లే క్రమంలో రియా చక్రవర్తికి భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. అయితే గురువారం రియా చక్రవర్తి ఇంటి ముందు మీడియా వ్యక్తులు తనను వేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలని రియా ముంబై పోలీసులను కోరారు. కొంతమంది మీడియా వ్యక్తులు తన బిల్డింగ్ కాంపౌండ్‌లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం రియా ఆమె సోదరుడు షోవిక్‌లు సీబీఐ దర్యాప్తు కోసం డీఆర్డీఓ కార్యాలయానికి బయలు దేరే ముందే వారికి రక్షణ కల్పించేందుకు ముంబై పోలీసులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. కాగా సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను సీబీఐ అధికారులు శుక్రవారం 10 గంటలకు పైగా విచారించారు. ముఖ్యంగా రియా, సుశాంత్ మధ్య ఉన్న సంబంధం గురించి వారు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. -
వాట్సాప్ చాట్‌ను బహిర్గతం చేసిన సుశాంత్ సోదరి
బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తిపై ఉచ్చు బిగుస్తోంంది. అయితే తనకే పాపం తెలియదని, సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని రియా చక్రవర్తి ప్రముఖ ఛానల్ ఆజ్‌తక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కుటుంబంపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రియా వాదనల్లో ఎంత మాత్రం నిజం లేదని పేర్కొంటూ సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ రియాకు సంబంధించి పలు వాట్సాప్ చాట్లను బహిర్గతం చేశారు. ఇందులో ప్రధానంలో రియా, షోయుక్ చక్రవర్తి, సిద్ధార్థ్ పిథాని, శ్యాముల్ మిరిండాల మధ్య జరిగిన సంభాషణ, అందులో సుశాంత్‌కు డ్రగ్ ఇవ్వడం లాంటి విషయాలను శ్వేతా బయటపెట్టారు. డూబీ (గంజాయి ) ఇవ్వండి అని షోయుక్ అడగగా, ఇప్పుడే సుశాంత్ తీసుకున్నాడు అని పిథాని బదులిచ్చాడు. జూలై 30, 2019న మరొక చాట్‌లో డూబీ కావాలి అని రియా అడగగా అట్నుంచి రోలింగ్, గెట్టింగ్ అనే సమాధానం వచ్చింది. ఎన్ఐఎఫ్డబ్ల్యూ పేరుతో ఉన్న ఈ వాట్సాప్ గ్రూపులో రియా, ఆమె సోదరుడు షోయుక్, సిద్ధార్థ్ పిథాని సహా మరికొందరు ఉన్నారు. (‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) డూబీ (గంజాయి) కావాలని, సుశాంత్ అది తీసుకున్నాడా లేదా లాంటి విషయాలే ఎక్కువగా చర్చించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సుశాంత్ సోదరి శ్వేతా సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది. దోషులను అరెస్ట్ చేయండంటూ ఓ క్యాప్షన్‌ను జతచేశారు. అంతేకాకుండా తన కుటుంబంపై రియా చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తన సోదరుడు సుశాంత్‌ను ప్రేమ పేరుతో రియా వాడుకుందని ఆరోపించారు. ప్రతీ నెల 17 వేల రూపాయలు ఈఎంలు కట్టుకునే సాధారణ మధ్య తరగతి కుటుంబంలోని రియాకు దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్‌ను ఎలా పెట్టుకోగలిగిందంటూ ప్రశ్నించారు. కాగా జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. సుశాంత్‌తో పరిచయం నాటి నుంచి సహజీవనం, జూన్ 8న ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లడం తదితర విషయాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. (రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం)