TVK Vijay
-
చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..
-
విజయ్ కింగా..? కింగ్ మేకరా..?
-
’జననాయకన్’పై ఉమ్మడి కుట్ర: విజయ్
సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ చైన్నె పెరంబూరులో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఆయన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం పోటీకి నిర్ణయించారు. దీంతో ఇక్కడ నామినేషన్ దాఖలు నిమిత్తం తిరుచ్చికి చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆయనకు టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున, నిర్మల్‌కుమార్ తదితరులు ఆహ్వానం పలికారు. విమానాశ్రయంలో అర్ధగంట పాటుగా విజయ్ తన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి తన ప్రచార వాహనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి విజయ్ వెళ్లారు. మార్గం మధ్యలో విజయ్ను చూసేందుకు అభిమానులు, జనం ఎగబడ్డారు. తన వాహనం నుంచి వారికి అభివాదం తెలుపుతూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ఆయన వాహనాన్ని వెంబడిస్తూ యువకులు దూసుకొచ్చారు. కాన్వాయ్‌లోని ఓవాహనం ఢీ కొనడటంతో పోలీసు ఒకరు గాయపడ్డారు. అలాగే మేల పుదూర్ వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఓ చోట గాయపడి రోడ్డున పడ్డ మహిళా అభిమానితో పాటూ మరొకరి వద్దకు వెళ్లి విజయ్ పరామర్శించారు. కాగా, విజయ్ కాన్వాయ్‌లో ఓ యువతి మోటారు సైకిళ్పై దూసుకెళ్తుండటాన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై ఆమె చిందులు తొక్కడం గమనార్హం. నామినేషన్ దాఖలు అనంతరం మరక్కడై వద్ద జరిగిన ప్రచార సభలో విజయ్ ప్రసంగించారు. ముందుగా ఆయన దివంగత ఎంజీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఉమ్మడి కుట్ర..కరూర్ సంఘటన ఎలాగైతే ఒక కుట్రలో భాగమో, తన ’జననాయకన్’ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించడం వెనుక కూడా ఉమ్మడి కుట్ర ఉందని తన ప్రసంగంలో విజయ్ ఆరోపించారు. డీఎంకే వేరు, బీజేపీ వేరు కాదని, రాజకీయాల్లో ఈ రెండూ ఒక్కటే అని విజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న ఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు, చిన్న హోటల్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని, గ్యాస్ కొరతను తీర్చడానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుష్ట శక్తి డీఎంకేను తరిమి కొడుదామన్నారు.వారివి బూటకపు హామీలు2021 ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన నీట్ పరీక్ష రద్దు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. తిరుచ్చికి చెందిన ఓ మంత్రి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి తాను వచ్చానని పేర్కొన్నారు. తనను ఎదుర్కొనేందుకు పలు కూటములు రహస్య బంధంతో దూసుకొస్తున్నాయని, తనను ఎలా అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసునని వివరించారు. ప్రజలు అందరి కోసం వచ్చిన తనకు న్యాయం చేకూరే విధంగా అండగా నిలబడాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించనని, ఇప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినానంతరం మరో మాట మాట్లాడనని, నమ్మిన వారిని మోసం చేయడం తెలియదని, అబద్ధాలు వళ్లించడం అస్సలు తెలియదని, అందరికీ నిజాయితీ ఉంటానని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులకు విజిల్ చిహ్నంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా నియోజకవర్గాలలోని అభ్యర్థులు, విజయ్ వేర్వేరు కాదని, అన్ని చోట్ల ఈ విజయ్ పోటీలో ఉన్నట్టుగా భావించి ఆదరించాలని విన్నవించారు. వంద శాతం ఈ విజయ్ను నమ్మండి, తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడిగే అవకాశం తనకు ఉందని, తనకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విన్నవించారు. కాగా విజయ్ తిరుచ్చిలో ఇక బస చేసేందుకు వీలుగా అరియామంగళం గ్రామంలో ప్రత్యేక బంగళా సిద్ధం చేశారు. -
విజయ్ ఇంపాక్ట్.. డీఎంకే, అన్నాడీఎంకే లేకుండానే పోటీ
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఆయ పార్టీల అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే-బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ తప్పదని ప్రిపోల్ సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచింది. సీమాన్ పార్టీ నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) కూడా ఒంటరిగా పోటీ చేస్తోంది. దీంతో ఈసారి గెలిచే అభ్యర్థులకు భారీగా ఆధిక్యాలు రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.పోటీ ఎక్కువ ఉండడంతో ప్రధాన పార్టీలు చిన్న పార్టీలను కూడా తమ కూటమిల్లో చేర్చుకున్నారు. దీంతో భాగస్వామ్య పార్టీలకు అధికంగా సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఫలితంగా 21 స్థానాల్లో డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ పోటీలో లేవు. ఈ స్థానాల్లో రెండు కూటముల మిత్రపక్షాల అభ్యర్థులు పోటీలో ఉండడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి మరో పది స్థానాలు జతయ్యాయి. చిన్న పార్టీల ప్రాతినిథ్యం పెరగడంతో వాటికి సీట్ల కేటాయింపులు కూడా పెంచాల్సి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. డీఏంకే కూటమిలో 20పైగా చిన్న పార్టీలు ఉండడం గమనార్హం.మిత్రపక్షాలు బలంగా ఉన్నందువల్లే ఈ 21 స్థానాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వదులుకోవాల్సి వచ్చిందని జాతీయ పార్టీలకు ఎనలిస్టుగా వ్యవహరిస్తున్న వి. భారతి అభిప్రాయపడ్డారు. కొత్తగా బరిలోకి దిగిన టీవీకే, ఎన్టీకే పార్టీలు కూడా స్థానికంగా బలమున్న నేతలకే టిక్కెట్లు ఇవాల్సి ఉంటుందన్నారు. విజయ్ ఎన్నికల బరిలోకి దిగడంతో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల లెక్కలు మారిపోయాయని సెపాలజిస్ట్ ఆర్. చంద్రశేఖరన్ అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలిచే అభ్యర్థులకు పెద్దగా మెజార్టీలు రాకపోవచ్చని తెలిపారు. చదవండి: హీరో విజయ్ విద్యార్హతలు ఇవే -
TVK విజయ్ నామినేషన్ దాఖలు
-
ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్ నామినేషన్ దాఖలు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉధయనిధి స్టాలిన్ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ 2024 సెప్టెంబరు 28న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2022 డిసెంబరు 14 నుంచి క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.మళ్లీ ర్యాలీ నిర్వహించిన టీవీకే విజయ్టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ తిరుచిరాపల్లిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 30న పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో విజయ్‌పై కేసు నమోదైంది.మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇవాళ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ మళ్లీ విజయ్ రోడ్ షో నిర్వహించడం గమనార్హం. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా, విజయ్ తనకు రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. -
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్?
ముంబై: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగక ముందే తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు–ఓటములపై,పొత్తులపై అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయా? ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోకపోతే హీరో,తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను ఆహ్వానించే అవకాశముందా? ఒప్పందం ప్రకారం విజయ్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారా? త్రిముఖ పోరులో విజయ్ ‘కింగ్ మేకర్’అవుతాడా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే.కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్డీఏలో చేరుతుంది. విజయ్ మద్దతుతో ఎన్డీఏ సర్కార్ వచ్చే ఛాన్స్’ఉందని అని వ్యాఖ్యానించారు.మంగళవారం పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం.. అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్డీఏ కూటమి విజయ్‌తో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన లక్ష్యం’అని ఆయన అన్నారు.ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్డీఏ పెద్దలు ఓ దూతను విజయ్ వద్దకు పంపించారు. ఎన్డీఏ కూటమి తరుఫున సదరు నేత విజయ్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ధృవీకరించారు.అయితే, పళనిస్వామి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఒప్పందాన్ని అంగీకరించలేదు.దీంతో, విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా,పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్‌దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయా పార్టీల పొత్తులు, గెలుపు–ఓటములు ఊహాగానాలు మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కింగ్ మేకర్ ఎవరు అవుతారు? ఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? అన్నది ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
హీరో విజయ్ ఏం చదివారో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తులు, వాహనాలు, విద్యా వివరాలను పొందుపరిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.విలాసవంతమైన కార్లు, బైకులుఅఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం విజయ్‌కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫైర్ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌ట్యాక్స్(అప్పీల్స్), హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.భార్య పేరిట విడిగా ఆస్తులువిజయ్ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.అప్పులు లేవుతనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్ అఫిడవిట్లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్‌కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్కు విజయ్ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్పీ ఆంటోనియస్ బ్రిటో, కోకిలాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్ ట్రస్ట్‌కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్‌కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నారు.చదవండి: ఎన్నికల వేళ.. విజయ్‌కు మరో షాక్డిగ్రీ డిస్కంటిన్యూవిజయ్ విద్యార్హతలను గమనిస్తే.. 1989లో పదోతరగతి పాసయ్యారు. ఆ తర్వాత ప్రైవేట్‌గా ఇంటర్మీడియట్ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. -
హీరో విజయ్‌కి వేల కోట్ల ఆస్తులు.. అప్పులు ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశాడు.రూ.600 కోట్లు..ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్ తన స్థిర, చరాస్తుల విలువలను దాదాపు రూ.600 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించాడు. అందులో నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు. విధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుమీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్లో వెల్లడించాడు.లగ్జరీ కార్లు.. ఫ్యామిలీకి అప్పుఇక తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్లో పొందుపరిచాడు. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్‌కి రూ.3.02 కోట్లు, తల్లికి రూ. 87.12 లక్షలు, కొడుకుకి రూ. 8.78 లక్షలు, కూతురు దివ్యకి రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు.దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్ ఆనంద్కి రూ. 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నాడు. సంగీత పేరుపై కూడా భారీ ఆస్తులువిజయ్ అఫిడవిట్లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు . తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. -
ఎన్నికల వేళ.. టీవీకే విజయ్‌కు మరో షాక్!
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు కుమార్ చెప్పారు.కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్ సోమవారం (మార్చి 30న) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోకు భారీగా జనాలు వచ్చారు. అయితే, చెన్నై పోలీసులపై టీవీకే నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేదని అన్నారు.చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందిన తర్వాత కూడా విజయ్‌కు భద్రత కల్పించలేదని చెప్పింది.కాగా, విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, త్రిచీ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఆయా స్థానాల్లో డీఎంకే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆర్డీ శేఖర్, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ విజయ్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో 2016 వరకు సీపీఎం ఆధిపత్యం ఉండేది. ఆర్డీ శేఖర్ 2019 ఉపఎన్నికలో గెలిచి ఈ స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
జ్యోతిష్యంతో క్యాన్సర్ నయమవుతుందట..
కోయంబత్తూరు: తమిళనాడు ఎన్నికల వేళ కోయంబత్తూరు-గౌండంపాళయం నియోజకవర్గ అభ్యర్థిగా టీవీకే తరఫున కనిమొళి సంతోష్ పేరును ప్రకటించడంతో వివాదం రాజుకుంది. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో ఆమె.. “మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్‌ను 100 శాతం నయం చేయవచ్చు” అని చెప్పినట్లు ఉంది.సెలబ్రిటీ జ్యోతిష్కురాలు కమిమొళి నరసింహనాయకన్పాళయం ప్రాంతానికి చెందిన కనిమొళి న్యాయవాది, వ్యాపారవేత్త. అంతేకాదు, తనను తాను సెలబ్రిటీ జ్యోతిష్కురాలినని, వాస్తు నిపుణురాలినని చెప్పుకుంటారు. మెడికల్ ఆస్ట్రాలజీపై ఆమె చేసిన పాత సోషల్ మీడియా పోస్టులను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. ఒక వీడియోలో కనిమొళి మాట్లాడుతూ.. “మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో ప్రత్యేక శాఖ. క్యాన్సర్ ప్రాణాపాయం కలిగించే వ్యాధి. మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్‌ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు” అని చెప్పారు. అలాగే వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి వచ్చే వ్యాధులను గుర్తించవచ్చని, సరైన పరిష్కారాలు తెలుసుకోవచ్చని కూడా తెలిపారు.కనిమొళికి ప్రస్తుతం సోషల్ మీడియాలో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రచారం చేసిన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలను డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్ కచ్చి సభ్యులు బాగా షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనిమొళి మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారని అంటున్నారు.ఎలాంటి వారికి టికెట్లిచ్చారు? టీవీకే అధినేత విజయ్ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 234 మంది అభ్యర్థులతో విజయ్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అవి వైరల్ అయ్యాయి.అయితే కనిమొళిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి ఎంపిక చేశామని విజయ్ ముందుగా చెప్పారు. అయితే, సిన్సియర్ నేతలకు సీట్లు రాలేదని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారికి సీట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. -
స్టాలిన్, విజయ్ నామినేషన్ దాఖలు
-
మేనిఫెస్టో ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్
-
TVK : విజయ్ అరుదైన నిర్ణయం.. తన డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్
సాక్షి,చెన్నై: సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పార్టీ అధినేతలు సామాన్యులకు కీలక పదవులు ఇచ్చి, తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అందరి మన్ననలు పొందుతుంటారు. తాజాగా, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ను విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ప్రకటించారు.ఆదివారం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్న 234 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అయితే, వేదికగా విజయ్ తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును ప్రకటించడంతో శబరినాథన్, ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. శబరీనాథన్ విజయ్ పాదాలను తాకి, ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో విజయ్ స్వయంగా అతని కన్నీళ్లను తుడిచారు. ఈ దృశ్యం అభిమానులను కదిలించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ‘విజయ్ తన డ్రైవర్ కుమారుడిని రాజకీయ నాయకుడిగా నిలబెట్టడం విశ్వాసానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.మరికొందరు ‘రాజేంద్రన్ 30 ఏళ్లుగా విజయ్‌తో ఉన్నాడు. అతని కుమారుడు శబరీనాథన్ అభిమాన సంఘం కార్యకలాపాల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నాడు’ అని వివరించారు. గత ఏడాది శబరీనాథన్‌ను విరుగంబాక్కం జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం ద్వారా విజయ్ తన విశ్వాసపాత్రులపై నమ్మకం ఉంచినట్లు స్పష్టమైంది.2024లో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీని ప్రకటించారు. ఆయన చివరి సినిమా ‘జన నాయకన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపై ఆయన పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి స్వయంగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రజలతో నిలబడే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాను’అని విజయ్ స్పష్టం చేశారు. Namma Kuda Irkavangala Namma Pathukitta , Namaku Mela Irkavan Nammala Paarthupaan 🫶Thalapathy Vijay Personal Driver Rajendran & his Son Got Emotional ♥️😭#TVKPeopleCandidates pic.twitter.com/dIe7bqZpo0— Arun Vijay (@AVinthehousee) March 29, 2026 -
తమిళనాడులో విజయ్ దూకుడు
-
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్‌ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు ‘దళపతి’ పూర్తి స్థాయిలో విజయ్ సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అడుగు వేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 29వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థులను విజయ్ స్వయంగా పరిచయం చేయనున్నారు.తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లోతుగా కసరత్తు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆదివారం (మార్చి 29) చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ వేదిక నుంచే విజయ్ అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.ఎన్నికల బరిలో 264 స్థానాలుతమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పుదుచ్చేరికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, తమిళనాడు అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.ఏప్రిల్‌లో పోలింగ్ సందడిఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్వల్ప సమయంలోనే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశం టీవీకే ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార పంథాను స్పష్టం చేయనుంది.నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నేతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, విజయ్ తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళపతి అభిమానులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 29.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపునకు నాంది కాబోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ! -
అక్కడ నుంచే విజయ్ పోటీ.. భారీగా సభ్యత్వం నమోదు
-
చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం
తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు. -వెబ్‌డెస్క్ -
అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?
చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
భార్య సంగీతతో మరో చిక్కు..? విజయ్‌కు షాక్ తగలనుందా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారిందిఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్‌కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్‌కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
ఎన్నికల వేళ విజయ్ ‘టీవీకే’కి మరో షాక్
చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. “టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...” అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి. -
విజయ్‌కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. -
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. -
టీవీకే నేత కామెంట్లు.. రజినీకాంత్ రెస్పాన్స్ అదుర్స్
చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్‌పై టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున పలు కామెంట్లు చేయడంపై తమిళనాడులో రాజకీయ వివాదం మొదలైంది. తాజాగా, ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. డీఎంకేలో అత్యధిక ప్రభావం చూపిస్తున్న కుటుంబ బెదిరింపుల వల్ల రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా మానుకున్నారని అన్నారు. అర్జున ఈ వ్యాఖ్యను తమ నాయకుడు విజయ్ మానసికంగా ఎంతగా బలంగా ఉన్నారో చెప్పడానికి చేశారు. విజయ్ ఏ బెదిరింపులకు లొంగలేదని చెప్పాలన్న ఉద్దేశంతో అన్నారు. అర్జున చేసిన ఈ కామెంట్ వివాదానికి దారితీసింది. అన్ని పార్టీల నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి.దీనిపై రజినీకాంత్ స్పందించారు. అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అర్జున చేసిన కామెంట్లలో నిజం లేదని పేర్కొంటూ తమిళంలో ఓ ప్రకటన చేశారు. "సమయం ఇప్పుడు సమాధానం చెప్పకపోవచ్చు.. చివరికి నిజాన్ని బయటపెడుతుంది. సరైన సమాధానం ఇస్తుంది" అని అందులో అన్నారు.కాగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందిస్తూ ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. ‘రజినీకాంత్ రాజకీయాలకు అతీతంగా ఉంటారు. ఆయనను అందరూ గౌరవిస్తారు. ఆయన కీర్తిని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదు. రాజకీయాల్లోకి వచ్చే హక్కు, అలాగే, దానికి దూరంగా ఉండే హక్కు అందరికీ ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మర్యాద అనిపించుకోదు" అని ఎక్స్‌లో చెప్పారు.రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై దశాబ్దాలుగా ఊహాగానాలు కొనసాగాయి. 2020లో ఆయన ఆరోగ్య సమస్యలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజకీయాల్లోకి రావద్దని నిర్ణయం తీసుకున్నారు. టీవీకే నాయకుడి వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఎస్ రెగుపతి కూడా విమర్శలు గుప్పించారు. అర్జున చేసిన వ్యాఖ్యలు అసత్యాలని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా టీవీకే రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు.కాగా, తమిళనాడులో రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఇప్పటివరకు పొత్తుల గురించి ప్రకటన చేయలేదు. ఎన్డీఏతో కలిసి టీవీకే పోటీ చేస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, దాన్ని టీవీకే కొట్టివేసింది. సినీరంగం నుంచి గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటివారు వచ్చి సక్సెస్ అయ్యారు. కమల్ హాసన్ వంటి వారు అంతగా రాణించలేదు. మరికొందరు సినీనటులు రజినీకాంత్‌లా రాజకీయాలకు దూరంగా నిలిచారు. -
త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్‌కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్‌తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్‌ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టా? కుండబద్దలు కొట్టిన టీవీకే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న నేపథ్యంలో సినీనటుడు విజయ్‌కు చెందిన టీవీకే ఇప్పటికీ పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కూటమి తమిళనాడులో గెలిస్తే విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పొత్తుల గురించి వస్తున్న ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకు టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. కూటమి గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని, అలాగే వదంతులను నమ్మవద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.‘ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యం.కొన్ని నిర్దిష్ట పార్టీలతో, రాజకీయ నాయకులతో ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తున్నామంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రావడం అందరికీ తెలిసినదే, అది నిజం కాదు.అయితే ప్రజలు, టీవీకే కార్యకర్తల్లో గందరగోళం కొనసాగించేందుకు డీఎంకే ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేస్తోంది. బాధ్యతాయుత మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దు. నిజమే గెలుస్తుంది!’ అని చెప్పారు. -
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’ పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.బంపర్ ఆఫర్.. కానీ మెలిక!ఈ పొత్తులో భాగంగా విజయ్‌కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్‌కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్‌తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.విజయ్ క్యాంపులో అంతర్మథనంమరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. -
ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్‌లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పారావీల్’ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాష్ట్రంలో మూడో ప్రధాన శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.నిర్ణయాత్మక శక్తిగా 13.6 శాతం ఓట్లుపారావీల్ సీఈఓ కిరణ్ కొండేటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 13.6 శాతం ఓట్ల వాటాను కొల్లగొట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సుమారు 70.2 లక్షల మంది ఓటర్ల నాడిని సంగ్రహించిన ఈ సర్వేలో తమిళనాట ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. అధికార డీఎంకే 41.5 శాతం, ఏఐఏడీఎంకే 36.2 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, టీవీకే సాధిస్తున్న ఈ ఓట్ల శాతం షాకిచ్చేలా ఉంది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటును శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి విజయ్ చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.నవతరం ఓటర్లంతా..ఈ సర్వేలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యువత, తొలిసారి ఓటు వేస్తున్న నవతరం ఓటర్లంతా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కేవలం సినిమా అభిమానులే కాకుండా, సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన విద్యావంతులు, మార్పును కోరుకుంటున్న యువత టీవీకేను తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తేలింది. ముఖ్యంగా చెన్నై లాంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే, కొన్ని సెగ్మెంట్లలో ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీని వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.పక్కా వ్యూహం.. క్షేత్రస్థాయి విశ్లేషణకేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో కుల సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను లోతుగా విశ్లేషించారు. దీనిలో దక్షిణాది జిల్లాల నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేలింది. సినిమా గ్లామర్‌ను పొలిటికల్ పవర్‌గా మార్చడంలో టీవీకే కేడర్ సక్సెస్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుండటం, స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకే పుంజుకోవడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.వార్ రూమ్ టెక్నాలజీతో..ఎన్నికల కురుక్షేత్రంలో విజయ్ సరికొత్త సాంకేతికతను జోడించబోతున్నారు. పారావీల్ సంస్థ పరిచయం చేస్తున్న ‘వన్ క్యాండిడేట్ - వన్ వార్ రూమ్’ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి అభ్యర్థికి క్షేత్రస్థాయి డేటా విశ్లేషణను అందిస్తూ, గెలుపు గుర్రాలను సిద్ధం చేసే ఈ వ్యూహం పాత తరం రాజకీయ నాయకులకు సవాల్ విసురుతోంది. సంప్రదాయ ప్రచార శైలిని పక్కన పెట్టి, డేటా ఆధారిత వ్యూహాలతో విజయ్ అడుగులు వేస్తుండటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది.ద్రవిడ గడ్డపై సరికొత్త చరిత్ర?కరుణానిధి, జయలలిత తదితర రాజకీయ దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే సత్తా విజయ్‌లో ఉందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13.6 శాతం ఓట్ల వాటా అంటే అది కేవలం సంఖ్య కాదు, తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక బలమైన శక్తి అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ద్రవిడ కోటలో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు -
టీవీకే చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ను మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మంగళవారం సమన్లు పంపారు.విజయ్ను సీబీఐ జనవరిలో రెండు సార్లు విచారించింది. మరోసారి మార్చి 9న హాజరుకావాలని చెప్పింది. అయితే, 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ విచారణ చెన్నైలో లేదా తమిళనాడులోని ఇతర ఏ కార్యాలయంలోనైనా నిర్వహించాలని విజయ్ కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే, సీబీఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీలో మార్చి 15న హాజరుకావాలని సూచించింది.కరూర్ నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా బాలాజీ స్పందిస్తూ.. మార్చి 17న సీబీఐ ముందు హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.కాగా, 2025 సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో సీబీఐ నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేలా సీనియర్ అధికారిని నియమించాలని సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశించింది.న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగితేనే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. -
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్‌ల రిలేషన్)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది. -
దళపతి విడాకుల కేసు క్లోజ్..! భార్యకు రూ.250 కోట్ల భరణం..?
-
తమిళనాడులో ట్విస్ట్.. విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: టీవీకే అధినేత, నటుడు విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని తాజాగా నోటీసులు పంపింది. ఈ క్రమంలో మార్చి 10న దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట హాజరుకావాలన్న సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, కరూర్ ఘటనలో విజయ్ ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఢిల్లీలోని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.#TamilNadu: #CBI has reportedly issued a summons to actor and Tamilaga Vettri Kazhagam (#TVK) chief #Vijay, asking him to appear for inquiry on March 10 in connection with the #Karur crowd stampede case.— South First (@TheSouthfirst) March 9, 2026గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్‌ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.ఇక, తమిళనాడులో కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. -
సంగీత లాయర్ అంటూ విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. కౌంటర్ ఇచ్చిన శరణ్య
కోలీవుడ్ నటుడు విజయ్, సంగీతల విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే, న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంగీత కేసును వాదించే న్యాయవాదిపై తీవ్రంగా ట్రోలింగ్‌కు దిగారు. ఈ విషయం గురించి తాజాగా చెన్నై హైకోర్టు న్యాయవాది శరణ్య నటరాజన్ వివరణ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు.విజయ్, సంగీత విడాకుల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చారు. 'నేను సంగీత న్యాయవాదిని కాదు. ఆమె తరపున కోర్టులో హాజరవుతున్నట్లు ఎవరో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. గతంలో జయం రవి, ఇప్పుడు విజయ్- త్రిష కృష్ణన్ ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నారని ఇప్పుడు ఇదే ట్రెండ్ అని నేను పోస్ట్ చేసిన తర్వాతే నాపై ట్రోలింగ్ మొదలైంది. అయితే, అకస్మాత్తుగా కొంతమంది అభిమానులు నన్ను తిట్టడం ప్రారంభించారు. విజయ్ గురించి ఈ పోస్ట్ చేయమని ఎవరూ నాకు చెప్పలేదు. ఒకవేళ చేయాలనుకుంటే నేను చట్టపరంగా ఎన్ని వ్యాఖ్యలు అయినా సరే చేయగలను.విజయ్-సంగీత విడాకుల గురించి నా అభిప్రాయాన్ని వివరించాలనుకుంటున్నాను. సంగీత తన స్టే-ఎట్-హోమ్ ఆర్డర్ కోసం పిటిషన్ దాఖలు చేసిన రోజున, ప్రజలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా మరొక మహిళ న్యాయం కోసం పోరాడుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది అనుచరులు సంగీతను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరంగా ఉంది. కానీ, సాధారణ ప్రజలు ఆమె పట్ల జాలిపడుతున్నారు. నాకు మరో రాజకీయ నేపథ్యం లేదా భావజాలం ఉండవచ్చు. కానీ, నేను ఎప్పుడూ టీవీకే పార్టీ గురించి మాట్లాడలేదు. కరూర్‌లో 41 మంది మరణించినప్పుడు కూడా, నేను దానిని రాజకీయం చేయాలనుకోలేదు. ఒక మహిళగా, న్యాయవాదిగా నేను సంగీతకు మద్ధతు ఇస్తున్నాను. అందులో తప్పేముందు..? అభిమానం అనే ముసుగులో ఒకరిని గుడ్డిగా అనుసరించడం కంటే సానుభూతి, గౌరవం, న్యాయం ముఖ్యమని నేను నమ్ముతాను. ఇది రాజకీయం కాదు.. మానవత్వం అని శరణ్య అన్నారు.శరణ్య ప్రకటన చూసిన కొంతమంది విజయ్ అభిమానులు భగ్గుమన్నారు. నీకు విజయ్ అన్న గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఫైర్ అయ్యారు. సంగీత గురించి ఆలోచించడం సిగ్గుచేటు అని వారు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by SVN_Saranya (@advocate_saranya_natarajan) -
విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్
-
విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత
తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి ఆయన సతీమణి సంగీత షాక్ ఇచ్చింది. తాజాగా కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో పాటుగా ఉండేందుకు అనుమతి కావాలని పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగీత విడాకులు కేసు ముగిసే వరకు విజయ్ ఇంట్లోనే ఉంటానని పేర్కొనడం విశేషం.విజయ్ నుంచి విడాకులు కోరుతూ కొద్దిరోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్ వేసింది. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఏప్రిల్ 20న వారి విడాకుల పిటిషన్ విచారణకు రానుంది. ఆ రోజు కోర్టుకు విజయ్ హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసు ఇచ్చింది. -
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
-
రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో ,టీవీకే అధినేత విజయ్ దళపతి భార్య సంగీత సోర్నలింగంతో సెటిల్మెంట్కు రెడీ అవుతున్నారా? 27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత తన భర్త నుండి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త అటు సినీ అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తన భర్త విజయ్‌కు నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతున్నట్టు పేర్కొనడం మరింత దిగ్బ్రాంతి రేపింది.తాజాగా విజయ్ దళపతి కేసును పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.రూ. 250 కోట్ల భరణం ఆఫర్తాజా నివేదిక ప్రకారం, విజయ్ దళపతి ఈ విషయాన్ని కోర్టులో పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. తమిళనాట తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న విజయ్ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం రాకుండా ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామరస్య పరిష్కారం కోసం భార్యతో దీని గురించి పలు చర్చలు మొదలు పెట్టారట. తన భార్యకు రూ. 250 కోట్ల భరణం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సంగీత, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు ఈ సెటిల్మెంట్ మొత్తం చెల్లించాల్సి ఉంది. విజయ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడే నిమిత్తం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడట. ఇరు పక్షాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటే విడాకుల పిటిషన్ ఉపసంహరించు కోనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులువిజయ్-సంగీత వైవాహిక జీవితంవిజయ్ సంగీతను మొదటిసారి 1996లో కలిశాడు. ఆమె శ్రీలంక హిందూ, బ్రిటన్‌లో పెరిగింది. అప్పటికే స్టార్‌హీరోగా పేరుతెచ్చుకున్న విజయ్‌కి సంగీత పెద్ద అభిమాని. ఆమె UKలోని తన ఇంటిని వదిలి చెన్నైలో తన అభిమానిని కలవడానికి వచ్చేసింది. అది ప్రేమకు దారి తీసింది. చివరకు ప్రత్యేక వివాహ చట్టం కింద వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత 27 ఏళ్లుగా అన్యోన్య కాపురం తరువాత సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. సంగీత విడాకుల పిటిషన్ కాపీ ప్రకారం, విజయ్ దళపతి వివాహేతర సంబంధం ఉన్న నటితో విదేశాల్లో చక్కర్లు కొట్టాడనీ, అలాగే ఆ నటి తన సోషల్ మీడియా హ్యాండిల్లో తమ విహారయాత్ర చిత్రాలను షేర్ చేస్తూనే ఉందని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఇది తనకు తన పిల్లలకు తీవ్ర బాధ కలిగించిందని కూడా ఆమె పేర్కొంది. అంతేకాదు ఈ వివాదం తరువాత విజయ్ కుమారుడు సోషల్‌మీడియాలో ఆయనను అన్‌ఫాలో చేయడం కూడా వార్తల్లో నిలిచింది.ఇదీ చదవండి: మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం -
కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
చెన్నై: విడాకుల వార్తల నడుమ టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ.. విజయ్ తన వ్యక్తిగత వేదన కంటే రేపటి పౌరుల భవిష్యత్తుకే ప్రాధాన్యతనిచ్చారు. 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన పంచుకున్న ఒక సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.‘తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న నా ప్రియమైన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు శుభాకాంక్షలు. రేపటి సంపన్నమైన సమాజాన్ని నిర్మించబోతున్న మీరందరూ, ఈ పరీక్షను ఎటువంటి ఆందోళన లేకుండా, భయం లేకుండా, ధైర్యంతో ఎదుర్కోండి. ఉన్నత విద్యలో మీరు రాణించాలని ముందుస్తు (అడ్వాన్స్) శుభాకాంక్షలు.. మంచే జరుగుతుంది!.. విజయం నిశ్చయం!’ అని దానిలో విజయ్ పేర్కొన్నారు. 1996లో విజయ్‌కు ఒక అభిమానిగా పరిచయమై, 1999లో అర్ధాంగిగా మారిన సంగీతతో విజయ్ వైవాహిక ప్రయాణం ఆదర్శప్రాయంగా సాగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంట మధ్య 2021 నుండి విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నటితో సంబంధమే ఈ విడాకులకు కారణమని సంగీత తన పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. தமிழ்நாடு மற்றும் புதுச்சேரியில் 12ஆம் வகுப்புப் பொதுத் தேர்வு எழுதும் என் அன்புத் தம்பிகளுக்கும் தங்கைகளுக்கும் வாழ்த்துகள்.நாளைய வளமான சமுதாயத்தை உருவாக்க உள்ள நீங்கள் அனைவரும் இந்தத் தேர்வினைப் பதற்றமின்றி, அச்சமின்றி, துணிவுடன் எதிர்கொள்ளுங்கள். உயர்கல்வியில் சிறந்து…— TVK Vijay (@TVKVijayHQ) March 2, 2026సినిమాలకు గుడ్ బై చెప్పి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రజా సేవకు అంకితమైన తరుణంలో పలు వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ, సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్న విజయ్.. ప్రస్తుత పరీక్షల వేళ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. ‘భయం వద్దు.. విజయం మీదే’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు వెనుక, తన వ్యక్తిగత వైఫల్యాల నీడలు పడకుండా చూసుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.ఈ సంక్షోభం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. విజయ్ మాత్రం ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తన చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా, విద్యార్థుల పరీక్షల పై దృష్టి సారించడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏంటో విజయ్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే! -
మీకు మనస్సాక్షి లేదా..! TVK విజయ్ వార్నింగ్
-
Tamil Nadu Assembly Election 2026 : విజయ్ పోటీ ఇక్కడి నుంచే?
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో,తమిళగ వెట్రి కగజం (టీవీకే)అధినేత విజయ్ పోటీ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గంపై టీవీకే ప్రతినిధులు పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీవీకేతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా, చెన్నైలో టీవీకే కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు.. టీవీకే ఎన్నికల క్యాంపెయిన్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఆధవ్ అర్జునకి విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల విజ్ఞప్తిని పార్టీ అధినేత విజయ్‌కు వివరిస్తామని అన్నారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ మాట్లాడుతూ..‘మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. మీ తీర్మానాన్ని ‘దళపతి’కి చేరవేరుస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నమ్ముతుందని, ఉత్తర చెన్నై ప్రాంతం ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పెరంబూర్ నియోజకవర్గం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, సామాజిక సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా టీవీకే గుర్తించింది.అందుకు అనుగుణంగా పెరంబూర్,కోల్తాపూర్,ఆర్కే నగర్ ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం పోటీ చేసే అంశంపై విజయ్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
దోచుకోవడమే వీళ్లకి తెలుసు స్టాలిన్ పై విజయ్ ఫైర్
-
టీవీకే విజయ్‌పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈసారి తమిళనాడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార డీఏంకే ముందుకు సాగుతోంది. మరోవైపు.. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడులో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.బీజేపీ నేత అన్నామలై.. తాజాగా ఇండియా టుడే తమిళనాడు రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. టీవీకే విజయ్ను మేము తక్కువగా అంచనా వేయడం లేదు. తమిళనాడులోని జన్‌జెడ్ విజయ్ వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ప్రజాదరణ ఉంది. కానీ, విజయ్‌కు రాజకీయ అనుభవం లేదు. తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేలు మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన వారు ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేశారు. అలాంటి వారిపై విజయ్ ప్రభావం చూపించలేరు. ఉదాహరణకు బీహార్‌నే తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించారు. ప్రజాదరణ కూడా కనిపించింది. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. అదే విధంగా విజయ్ కూడా ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేరు. 2026 ఎన్నికలు మార్పు కోసం జరిగే ఎన్నికలు. తమిళ ప్రజలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు మార్పు కోసం ఆరాటపడుతున్నాయి. గత 50 సంవత్సరాలుగా మోదీకి గాంధీ అనే ఇంటి పేరు లేదు. గత 12 సంవత్సరాలలో ఆయన క్రమంగా తన మార్కు చూపించారు అని అన్నారు.కార్తీ కీలక వ్యాఖ్యలు..మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా టీవీకే విజయ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగత పార్టీ నిర్మాణం ఉండాలి. గ్రౌండ్ లెవల్ యంత్రాంగం అవసరం. విజయ్ ప్రస్తుతం అలాంటి యంత్రాంగాన్ని కలిగి లేరు. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అన్నారు. అలాగే, బీజేపీపై స్పందిస్తూ.. తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కిచెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. హిందూత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.విజయ్ పోటీ ఎక్కడ?ఇదిలా ఉండగా.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘వి’తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అదే అక్షరంతో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ఇప్పటికే ఖరారు చేయడంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విళుప్పురం జిల్లాలోని విక్రవాండి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వేడసందూర్ నియోజకవర్గాలను విజయ్ పరిశీలనలోకి తీసుకున్నారని సమాచారం. వాటిలో విరుగంబాక్కంలో తన తల్లిదండ్రులు నివసిస్తుండగా పనైయూర్ నివాసానికి, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి కొద్ది దూరంలో ఉన్నాయి. -
మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్
అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయ పన్నుల శాఖ తనకు గతంలో విధించిన భారీ పెనాల్టీని కొట్టేయాలంటూ ఆయన కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. ఆ జరిమానా సబబేనని.. ఇందులో న్యాయస్థానాలు ఎలాంటి జోక్యం చేసుకోబోవని చెబుతూ విజయ్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టేసింది.గతంలో ఓ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను దాచి.. పన్నులు ఎగవేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంతో 2019లో ఐటీ శాఖ ఆయనకు రూ.కోటిన్నర జరిమానా విధించింది. అయితే.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.జరిమానా విధించే ప్రక్రియలో అనవసరమైన జాప్యం జరిగిందని.. ఆ కారణంగానే చట్టపరంగా అనుమతించిన గడువుకు మించి జరిమానా విధించారని విజయ్ తరఫు లాయర్ వాదించారు. అంతేకాదు.. ఈ ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాను రద్దు చేయాలని కోరారు. అయితే.. అసెస్మెంట్పై జరిగిన అప్పీల్ ప్రక్రియల వల్లే ఆలస్యమైందని ఐటీ శాఖ వాదించింది. జరిమానా విధించడం పూర్తిగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా జరిగిందని.. తమ చర్యలో ఎటువంటి చట్టపరమైన లోపం లేదని స్పష్టం చేసింది.ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. జనవరి 23న వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ విజయ్ వేసిన ఆ పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది.ఆదాయపు పన్ను శాఖ విధించిన జరిమానా చట్టబద్ధమని, దానిపై న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, నటుడు విజయ్ ఈ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది.తీర్పుపై టీవీకేగానీ, విజయ్‌గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే విజయ్ తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ తీర్పు రాజకీయ విమర్శలు తావిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై డీఎంకే గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించింది. బ్లాక్‌మనీ తీసుకుని పన్నులు ఎగ్గొట్టే విజయ్‌కు.. అవినీతి అంటూ మాట్లాడే నైతికత లేదంటూ మండిపడింది. అయితే టీవీకే మాత్రం దీనికి కౌంటర్ ఇచ్చింది. ఆయన స్వచ్ఛందంగా ఆదాయ వివరాలను వెల్లడించి పన్ను చెల్లించారని అంటోంది.విజయ్ 2015లో పులి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రానికిగానూ ఆయన రూ.15 కోట్ల పారితోషకం అందుకున్నారని.. అయితే అందులో దాదాపు రూ.5 కోట్లు నగదు రూపంలో చెల్లింపు జరిగిందని.. అయితే విజయ్ మొదటిసారి సమర్పించిన రిటర్న్స్‌లో విజయ్ ఆ ఆదాయానికి సంబంధించిన విషయం ప్రస్తావించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. ఈ క్రమంలో.. 2019లో ఆదాయాన్ని దాచి పెట్టి పన్ను ఎగవేసిన అభియోగం కింద కోటిన్నర రూపాయల జరిమానా విధించింది. ఇదీ చదవండి: షాకింగ్.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!! -
TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్
-
తమిళనాడుకు ఏ డబ్బా ఇంజిన్లు అక్కర్లేదు: విజయ్
అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ లొంగిపోయే రకం కాదని.. డబ్బుతో తనను ఎవరూ కొనలేరని అన్నారు. తమిళనాడులో టీవీకే మాత్రమే టాప్ ఇంజిన్ అని.. ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం టీవీకే మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. తమిళ రాజకీయాల్లో విజిల్ సౌండ్ గట్టిగా ఉంటుందన్నారు. టీవీకే టాప్ ఇంజిన్ అని.. కాబట్టి ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ పరోక్షంగా బీజేపీ-అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆద్యంతంలో అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇక డీఎంకేపైనా ఆయన నేరుగా విమర్శలు చేయలేదు. ప్రముఖ కవి తిరువళ్లువర్ ఇవాళ జీవించి ఉంటే ఈ పాలన(డీఎంకే) చూసి.. తిరుక్కురల్‌ను తిరగరాసి ఉండేవారేమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. స్టాలిన్‌ను అడిగినా.. విజిల్ గుర్తుకే ఓటేస్తారని ఛలోక్తులు విసిరారు. విజయ్ వ్యాఖ్యలతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని.. ఒంటరి పోరే ఉంటుందని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. అభిమానుల కోసం మూడు స్టెప్పులు..టీవీకే వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్ హుషారుగా కనిపించారు. జన నాయగన్ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఆయన సినిమాకు నెలకొన్న సెన్సార్-రిలీజ్ కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో.. సింగర్ వేలుమరుగన్ పాడిన పాటకు చిన్నారులతో కలిసి విజయ్ చిందులేసి అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.தவெக 3ஆம் ஆண்டு தொடக்க விழாவில் ”உங்கக் கூட கொஞ்சம் Dance ஆடிக் கொள்ளட்டுமா?” எனக் கேட்டுக்கொண்டு நடனமாடிய விஜய்#TVK | #Vijay| #TVKVijay | #Panaiyur pic.twitter.com/SVZIGZaE87— PttvOnlinenews (@PttvNewsX) February 2, 2026 -
టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్‌లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తొలిసారి తన మనోగతాన్ని పంచుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్న అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్నే పార్టీ వైపు మళ్లించుకుని.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సందేశం ఇచ్చారు. కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ఇబ్బంది పెట్టాయా?కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తీవ్రంగా కలచివేసింది. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆ ఘోరం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మళ్లీ సినిమాలు చేస్తారా?.. దశాబ్దాలపాటు సినీ రంగంలో కొనసాగా. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే ఇక నా భవిష్యత్తుతాజాగా సినిమాకు ఎదురైన సెన్సార్ ఇబ్బందులు.. ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు అనుమతి రాకపోవడం నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించాఈ ఎన్నికల్లో ఫలితంపై రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందా? నేను ఈ ఒక్క ఎన్నిక కోసం పార్టీ పెట్టలేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా అమితంగా ప్రేరణ కలిగించిన వ్యక్తులు.. షారుక్ ఖాన్ నాకు అభిమాన నటుడు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నాతమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్ అవుతారని అనుకుంటున్నారా?నా ర్యాలీలకు వచ్చే జనాలను చూస్తున్నారా?. నేను గెలుస్తాను. అంతేగానీ కింగ్‌మేకర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?ఎన్నికల చిహ్నంపై రియాక్షన్ మొదటి విజయం.. దైవ సంకేతం. టీవీకే పార్టీకి ఎన్నికల కమిషన్ ‘విజిల్’ గుర్తు కేటాయించడం చాలా సంతోషాన్నిచ్చింది Source: NDTV -
విజయ్ టీవీకేకు గుర్తు కేటాయించిన ఈసీ..
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఈ క్రమంలో విజయ్ పార్టీ టీవీకేకు విజిల్ గుర్తును ఈసీ కేటాయించింది. అలాగే, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తమిళనాడులో టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది.ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.BIG BREAKING 🚨The Election Commission has allotted the whistle symbol to TVK ✅🥳🔥#TVKVijay @TVKVijayHQ pic.twitter.com/eYnFgK6doO— Vijay Social Teamⱽˢᵀ (@TST_Offcl) January 22, 2026అయితే.. కరూర్ ఘటన తర్వాత విజయ్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా స్పందించలేదు. అయితే, ఆయన తన పనిని తాను సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా.. పొంగల్ తర్వాత ఇటీవలే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. -
విజయ్ టీవీకే పార్టీకి కొత్త కష్టాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలలు కూడా లేవు. అక్కడి రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార, ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు.. వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా.. ఈ ఎన్నికల్లో మూడో పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ ‘తమిళగ వెట్రి కగళం’ పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. అయితే.. కరూర్ ఘటన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు.నెల రోజులు(డిసెంబర్ 18 నుంచి) గడుస్తున్నా విజయ్ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. డీఎంకే సర్కార్‌పై రెగ్యులర్ తరహా విమర్శలు సహా తిరుపరంకుండ్రం తీర్పులాంటి అంశంపై కూడా స్పందించలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా ఆయనలో చలనం లేదు.(ఆ సంగతి నిర్మాతలే చూసుకుంటారని ఆయన అన్నట్లు వినికిడి). అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు సెన్సార్‌బోర్డు తీరును ఎండగడుతున్నా.. టీవీకే మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా ఈ మధ్యలో విజయ్ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ సైలెన్స్ ఏంటి అన్నా? అంటూ అభిమానులే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సైలెన్స్‌లోనే..అయితే ఆయన తన పనిని తాను సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారంటూ విశ్లేషణ నడుస్తోందక్కడ. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం.మరోవైపు.. పొంగల్ తర్వాత మొన్నీమధ్యే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకంలో తేడాలు వస్తుండడంతో డీఎంకేకు కాంగ్రెస్ దూరం కావొచ్చని.. విజయ్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని గత కొంతరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ ఘటన, జన నాయగన్ సెన్సార్ విషయంలో రాహుల్ గాంధీ నేరుగా టీవీకేకు, విజయ్‌కు మద్దతు ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే టీవీకే కీలక నేతలు మాత్రం పొత్తులపై ఎక్కడా నోరు జారడం లేదు. కొత్త కష్టం.. టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఎన్నికల సంఘం (ECI) వద్ద ఒకే గుర్తు (common symbol) కోసం దరఖాస్తు చేసింది. అయితే కామన్ సింబల్ దక్కకపోవచ్చనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.‘‘మాకు ఒకే గుర్తు తప్పనిసరి. లేకపోతే ఎన్నికల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేం ఇప్పటికే ఒక గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. త్వరలో దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ టీవీకే నేత ఒకరు చెబుతున్నారు.ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. ఆర్‌యూపీపీ పార్టీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల అడిట్(Annual Audit Report), కాంట్రిబ్యూషన్ రిపోర్టు(Contribution Report)లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే టీవీకే మాత్రం ఒక్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను సమర్పించింది. అంటే.. రెండు సంవత్సరాల నివేదికలు అవసరం. అయితే..కొన్ని పరిమితుల ప్రకారం టీవీకేకు కామన్ సింబల్ దక్కవచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీలు తాజా ఆర్థిక సంవత్సరపు నివేదికలు సమర్పిస్తే కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాంటి పార్టీలు సాధారణంగా లిస్ట్‌లో ఉన్న కామన్ సింబల్లలో ఒకటి పొందుతాయి. అయితే అది ఎప్పుడు, ఏది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే దరఖాస్తును ఈసీ త్వరలో పరిశీలించనుంది. నిర్ణయం ఏదనేది ఈ పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. -
కాసేపట్లో మరోసారి సీబీఐ ముందుకు విజయ్
-
6 గంటలకుపైగా విజయ్ను ప్రశ్నించిన సీబీఐ
సాక్షి, చెన్నై: తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్ 27న 41 మంది ప్రాణాలను బలిగొన్న కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ను ఇరికించే కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసకేస్తే రాలనంత జనం వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని వెంటనే ముగించి జనాన్ని పంపేయకుండా సుదీర్ఘ ప్రసంగాలు చేశారని, అందుకే జనం అక్కడే ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్న కోణంలో నేరాభియోగాలు మోపాలని, ఆ చార్జ్‌షీట్‌లో విజయ్ పేరును చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. విజయ్‌తోపాటు అదనపు డీజీపీ, మరో తమిళనాడు సీనియర్ పోలీస్ అధికారి పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా సోమవారం సైతం విజయ్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏకధాటిగా ఆరు గంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు విజయ్ ఢిల్లీ లోథీ రోడ్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సోమవారం ఉదయం 10.20 గంటలకువచ్చారు. ర్యాలీని ఏ తరహాలో చేయాలని ప్రణాళిక వేశారు?. షెడ్యూల్ సమయం కంటే చాలా ఆలస్యంగా ఎందుకు ర్యాలీకి రావాల్సి వచ్చింది? జనం విపరీతంగా వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు?. జనం అదుపుతప్పుకున్నారని అర్థమయ్యాక కూడా జనాన్ని కట్టడిచేసే చర్యలను మీ పార్టీ శ్రేణులు ఎందుకు తీసుకోలేదు? వంటి పలు రకాల ప్రశ్నలకు విజయ్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్నింటికి సమాధానం చెప్పిన విజయ్ మరికొన్నింటికి వివరణ ఇచ్చేందుకు గడువు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విచారణ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్‌ను నుంచి బయటకు వచ్చి తాను బసచేస్తున్న హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ కేసులో ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ తన తొలి నేరాభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించనుంది. -
విజయ్‌కు రాహుల్ మద్దతు..!
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలపడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్‌లో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా రాహుల్ పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి,వ్యూహాత్మక ఎత్తుగడా.?రాహుల్ గాంధీ తాజా ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ,.. డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక కూటమి కొనసాగుతుందా? లేక విజయ్ పార్టీ టీవీకేతో కలిసి కొత్త వ్యూహం రూపొందిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి.2017లో విజయ్ నటించిన మెర్సల్ సినిమా మీద కేంద్రం అభ్యంతరాలు తెలిపినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఒకవైప విజయ్.. తమిళ రాజకీయాల్లో బలంగా ఎదిగే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుకు రాహుల్ గాంధీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, దీనిలో భాగంగానే విజయ్‌కు మరోసారి మద్దతు పలికారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. The I&B Ministry’s attempt to block ‘Jana Nayagan’ is an attack on Tamil culture.Mr Modi, you will never succeed in suppressing the voice of the Tamil people.— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2026 అయితే డీఎంకేతోనే పొత్తు కొనసాగించాలని అధిక శాతం మంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడూ ఒక పార్టీనే అధికారంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి.. విజయ్‌కు ఈ రకంగా రాహుల్ మద్దతు ఇవ్వడం వ్యూహాత్మక ఎత్తుగడగా ఆ పార్టీకి చెందినే పలువురు నేతలు అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన సినిమాలపై కేంద్రం చూపుతున్న అడ్డంకులు, కాంగ్రెస్ పార్టీకి కొత్త అవకాశాలను తెచ్చేలా కనిపిస్తున్నాయి.గతంలో కూడా చర్చ..కొన్ని రోజుల క్రితం కూడా కాంగ్రెస్-టీవీకేల పొత్తు అంశానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇరు పార్టీలు త్వరలో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే అధికారంలో ఉన్న డీఎంకేతో బంధం తెంచుకోవడం మంచిది కాదని కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావిస్తోంది. దాంతోనే విజయ్ పార్టీతో పొత్తుపై అధిష్టానం కూడా ఎటువంటి ముందుకు సాగడం లేదు. కేవలం మద్దతు ఇస్తూ ట్వీట్లు పెట్టడం తప్పితే ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోకాంగ్రెస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డీఎంకే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందనే అంశాన్ని అతి దగ్గరగా పర్యవేక్షిస్తోంది. -
సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్
-
కరూర్ ఘటన.. రేపు సీబీఐ విచారణకు విజయ్
చెన్నై: తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట (Karur stampede) కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay).. రేపు సీబీఐ(CBI) విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అవుతారా? అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే, కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ (CBI) మూడు రోజుల క్రితమే విజయ్‌కు సమన్లు జారీచేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు విజయ్ హాజరు అవుతుండటం చర్చకు దారి తీసింది.కాగా, విచారణలో భాగంగా విజయ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్లాన్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. విజయ్.. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై అనుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే టీవీకే పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బీజేపీ కూడా విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సీబీఐ విచారణ జరగడం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక మూడు రోజుల క్రితం విజయ్‌కి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 12న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో విజయ్‌ని విచారించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. -
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితుల కారణంగా జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడిందని సంస్థ స్పష్టం చేసింది. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అదే రోజు ఈ చిత్రానికి సంబంధించిన తీర్పు చెప్తామని కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో నిరాశ చెందారు. అయితే కొత్త విడుదల తేదీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. -
TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..
-
తమిళనాట పెరిగిన పొలిటికల్ హీట్
సాక్షి చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. డీఎంకే అందుకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలనిపక్షంలో విజయ్ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పొత్తుల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. దీంతో సీట్ల షేరింగ్ అంశంపై రెండుపార్టీల మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోందట. కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.ఇటు కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీ టీవీకేతో పొత్తుపెట్టుకునే అవకాశాల్ని పూర్తిగా కొట్టిపడేసే అవకాశాలు లేవు. ఇటీవల ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ " కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజమిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులు, రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడం కలకలమే రేపింది. దీంతో.. బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తుకోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్‌తో చర్చించాకే ఏ నిర్ణయమనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతుండడం గమనార్హం. -
టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కోలీవుడ్ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ని విచారించాలని భావిస్తోంది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో విజయ్ను సీబీఐ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ తొలుత దర్యాప్తు చేపట్టింది. దీనిని సవాల్ చేస్తూ.. టీవీకే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకం లేదని, సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీన్ని విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను ‘సీబీఐ’కి అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు..సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ బృందం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. కరూర్‌లోని ఘటన స్థలాన్ని పరిశీలించింది. బాధితులు, సంబంధిత కుటుంబాల వాంగ్మూలాలను సేకరించింది. ఆపై విచారణను ముమ్మరం చేసింది. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌పై బీజేపీ బిగ్ ప్లాన్?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయం ములుపులు తీరుతోంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK Vijay) పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ మా సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన వేళ.. బీజేపీ రంగంలోకి దిగింది. టీవీకేతో పొత్తు గురించి బీజేపీ నేతలు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తమిళనాడుపై (Tamil Nadu Politics) బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక, తమిళనాడులో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీవీకే విజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ తన పార్టీని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలు విజయ్ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.బీజేపీ ప్లానేంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండటం అందరూ గమనిస్తున్నారు. ఈ క్రమంలో టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు. అలాగే, జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ (సంక్రాంతి) నాటికే మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా.. తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని సూచించారు.అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు.. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉంది. టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ తమిళనాడులోని అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ పలుమార్లు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, విజయ్ మధ్య గ్యాప్‌ను ఉపయోగించుకుని టీవీకేను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.టీవీకే నేత సంచలన ప్రకటన..!ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమ సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమై రాహుల్ గాంధీ, మా నాయకుడు విజయ్ కూడా స్నేహితులే అనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రాజకీయంగా వ్యూహత్మకంగా ముందుకెళ్లే బీజేపీ.. టీవీకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా తమిళ రాజకీయం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. -
విజయ్ కారును అడ్డుకున్న TVK మహిళా నేత
-
విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్ వణుకు
తమిళనాడు రాజకీయాల్లో ఆ పార్టీ పేరు మార్మోగుతోంది.. అదే ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే). దశాబ్దాలుగా డీఎంకే (డీఎంకే)కి కంచుకోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని టీవీకే అధినేత, నటుడు విజయ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రచిస్తున్న ‘మైనారిటీ’ వ్యూహం, స్టాలిన్ సర్కార్‌ను కలవరపెడుతోంది. తమిళనాడులో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ ఓటర్లు డీఎంకే వెన్నంటే ఉంటూ, ఆ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం రావడంతో ఈ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందనే ఆందోళన డీఎంకే క్యాంపులో మొదలైంది.మారిన సమీకరణలుతమిళ సినీ రంగంలో అగ్రనటునిగా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. క్రైస్తవ మత నేపథ్యం ఉండటం విజయ్‌కు ఒక అదనపు బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయకంగా డీఎంకే వెన్నంటి ఉండే క్రైస్తవ, ముస్లిం ఓటర్లలో ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, అధికార పార్టీలో కలవరం మొదలైంది. యువతలో ఉన్న క్రేజ్‌కు తోడు మైనారిటీల మద్దతు కూడా తోడైతే విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.చెన్నై నుంచి తిరునల్వేలికి..డీఎంకే పార్టీ తన వార్షిక క్రిస్మస్ వేడుకలను సాధారణంగా రాజధాని చెన్నైలో వైభవంగా నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా ఆ వేదికను దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలికి మార్చింది. ఈ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. దక్షిణ జిల్లాల్లో క్రైస్తవ జనాభా ప్రభావం చాలా ఎక్కువ. విజయ్ ప్రభావం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న డీఎంకే, ముందస్తుగా మైనారిటీలను ఆకట్టుకునేందుకు నెల్లైను వేదికగా ఎంచుకుని తన బలాన్ని ప్రదర్శించింది.నేతలతో స్టాలిన్ ఆత్మీయ భేటీతిరునల్వేలిలో జరిగిన 'క్రిస్తువ నల్లెన్న ఇయక్కం' సమ్మేళనం కేవలం పండుగ వేడుకలా కాకుండా ఒక రాజకీయ సభలా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల ఆర్చ్ బిషప్‌లు, సీనియర్ సువార్తికులు పాల్గొని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. చర్చి పెద్దల సమక్షంలో స్టాలిన్ ప్రార్థనలు చేయడం ద్వారా మైనారిటీ సమాజంతో తనకున్న అనుబంధాన్ని మరోమారు గుర్తుచేశారు.ముఖ్యమంత్రి వరాల జల్లుసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ క్రైస్తవ వర్గాల దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ సహాయక విద్యాసంస్థల నియామక ప్రక్రియలో విశ్వవిద్యాలయ నామినీ పాత్రను తొలగించడం ద్వారా ఆయా సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. పురాతన చర్చిల పునరుద్ధరణకు గ్రాంట్లు పెంపు, తీర్థయాత్రలకు సబ్సిడీలు, స్మశానవాటికలకు భూమి కేటాయింపు వంటి వరాలను ప్రకటించడం ద్వారా మైనారిటీ ఓటర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.లోలోపల అసంతృప్తి సెగలుపైన పటారం లోన లోటారం అన్నట్లుగా, డీఎంకే ప్రభుత్వపై మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా గూడుకట్టుకుని ఉంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని చర్చి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో పెరుగుతున్న రాజకీయ జోక్యం పట్ల కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తే, డీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.బీజేపీపై విమర్శలుమరోవైపు బీజేపీని లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ఒకే మతం, ఒకే భాష పేరుతో వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ఏఐఏడీఎంకేను కూడా మైనారిటీ వ్యతిరేక పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు. మైనారిటీల రక్షణ కేవలం డీఎంకేతోనే సాధ్యమనే భరోసా ఇచ్చారు.ప్రతిపక్షాల ఎదురుదాడిస్టాలిన్ విమర్శలపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సమాజంలో విభజన తెస్తున్నారని, మతాల మధ్య విషం చిమ్ముతున్నారని ఆమె ధ్వజమెత్తారు. డీఎంకే వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇదంతా చూస్తుంటే.. మైనారిటీ ఓట్ల కోసం జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.విజయ్ క్రిస్మస్ ప్లాన్ఈ రాజకీయ పోరులో విజయ్ అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి. త్వరలో విజయ్ కూడా క్రిస్మస్ వేడుకలను నిర్వహించబోతున్నారని సమాచారం. ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నేతగా ఆయన ఇచ్చే సందేశం మైనారిటీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది కీలకంగా మారింది. ఒకవేళ విజయ్ మైనారిటీ ఓట్లను చీల్చగలిగితే, అది 2026లో డీఎంకే విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి తమిళనాడులో ఇప్పుడు ‘మైనారిటీ ఓటు’ గెలుపు గుర్రాన్ని నిర్ణయించే కీలక అస్త్రంగా మారింది.ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్ -
డీఎంకే ఈవిల్, టీవీకే ప్యూర్.. విజయ్ రాజకీయ పునరాగమనం
తమిళనాడు: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత రాష్ట్రంలో ఆయన పెద్ద ఎత్తున జరిపిన మీటింగ్ ఇదే కావడం విశేషం. ఈ ర్యాలీ ద్వారా విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారానికి స్వరం సిద్ధం చేసుకున్నారు. విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో NEET పరీక్ష మినహాయింపు అంశం, శాంతిభద్రతల సమస్యలపై ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పార్టీకి సమస్యలు ఫెవికాల్తో ముడిపడి ఉన్నాయి, వాటిని వేరు చేయలేం అని వ్యాఖ్యానించారు. అధికార డీఎంకేను దుష్ట శక్తిగా, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం)ను స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించారు. పోరాటం స్వచ్ఛమైన శక్తికి, చెడుకు మధ్య అని విజయ్ మండిపడ్డారు. ర్యాలీకి వచ్చిన జనసమూహాన్ని సురక్షితంగా వెళ్లమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు కేఏ సెంగొట్టయన్ స్వస్థలం విజయమంగళం సమీపంలో జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెంగొట్టయన్ గత నెలలో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన తర్వాత విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆయనను సీనియర్ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పరిగణిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన రెండవ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇదే కావడం విశేషం. మొదటి సభ గత వారం పుదుచ్చేరిలో జరిగింది, అక్కడ కూడా ఆయన డీఎంకేపై మాటల దాడి చేశారు. ఈరోడ్ ర్యాలీతో విజయ్ తన రాజకీయ యాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు. తోపులాటకు ఆస్కారం లేకుండా.. తోపులాట, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను నిర్వహించారు. గర్భిణిలు, వృద్ధులు, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని ముందుగానే సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి విజయ్ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది. -
విజయ్‌కు ఝలక్.. తెరపైకి మరో కొత్త పార్టీ
తమిళనాడులో అధికారం హస్తగతం చేసుకోవడానికి పుదుచ్చేరిని గేట్వేగా వాడుకోవాలని భావిస్తున్న స్టార్ హీరో విజయ్‌కు బ్రేక్ పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పెట్టిన వ్యక్తి కూడా తన పార్టీకి చెందిన కీలక నేత బంధువువే కావడం గమనార్హం. కొత్త పార్టీతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్.. తాను సొంత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ 'జేసీఎం మక్కల్ మాండ్రం'ను (JCM Makkal Mandram) రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు వెల్లడించారు. ఆ పార్టీకి 'లక్ష్య జననాయక కచ్చి' (Latchiya Jananayaka Katchi) అని పేరు పెడతామని, డిసెంబర్ 14న లాంఛనంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ బావమరిదే చార్లెస్ మార్టిన్. చార్లెస్ సోదరి డైసీ మార్టిన్‌ను అర్జున్ వివాహం చేసుకున్నారు.మార్పు తెస్తాపుదుచ్చేరికి 1954లోనే స్వాతంత్ర్యం వచ్చినా, దాని ప్రయోజనాలను పూర్తిగా పొందలేదని చార్లెస్ మార్టిన్ (Charles Martin) అన్నారు. పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో డిసెంబర్ 14 ఒక 'చారిత్రాత్మక ఘట్టం' కానుందని పేర్కొన్నారు. తనకు అండగా నిలబడి ముందుకు నడిపించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.సింగపూర్ చేస్తా2026 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చార్లెస్ మార్టిన్ పేర్కొన్నారు. పుదుచ్చేరిలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు నిజాయితీగా లేవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోయాయని చార్లెస్ విమర్శించారు. పాలనలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. సింగపూర్ తరహాలో పుదుచ్చేరిని అభివృద్ధి చేయడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని 'ఇండియా టుడే'తో అన్నారు.జట్టు కడతారా?కాగా, మంగళవారం పుదుచ్చేరిలో బహిరంగ సభ నిర్వహించిన విజయ్.. ముఖ్యమంత్రి రంగస్వామి నాయకత్వంలోని ఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడులోని డీఎంకే సర్కారుకు చురకలు అంటించారు. రంగస్వామి ప్రభుత్వంపై విజయ్ సానుకూలంగా మాట్లాడటంతో.. పుదుచ్చేరి ఎన్నికల్లో వీరిద్దరూ జట్టు కడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.చదవండి: విజయ్, రంగస్వామి మెగా ప్లాన్ -
Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్..
చెన్నై: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత విజయ్ తన తొలి బహిరంగ సభ కోసం పుదుచ్చేరిని వేదికగా ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మంగళవారం నాటి ఈ ర్యాలీలో, విజయ్ తన ప్రధాన విమర్శనాస్త్రాలను డీఎంకే (డీఎంకే)పై సంధించారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.రంగస్వామిపై పొగడ్తల వర్షంసభలో విజయ్.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని, ఆయన ఎన్ఆర్ కాంగ్రెస్ (NR Congress) ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. తన పుదుచ్చేరి సభకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినందుకు రంగస్వామికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి సర్కారును చూసి, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలని ఆయన సూచించారు. విజయ్ తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ, రంగస్వామిని లేదా ఎన్ఆర్ కాంగ్రెస్‌ను మాత్రం విమర్శించకపోవడం గమనార్హం. ఆయన ప్రసంగం ప్రారంభం నుండీ ముగిసేవరకు రంగస్వామి పట్ల సానుకూలత స్పష్టంగా కనిపించింది.నూతన రాజకీయాలకు ఆరంభంవిజయ్ తన ప్రసంగంలో డీఎంకేను మాత్రమే తీవ్రంగా విమర్శించారు. విజయ్ ర్యాలీని రంగస్వామి తన మొబైల్లో చూస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నూతన రాజకీయాలకు తెర లేవనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో ఉన్న విభేదాలను ప్రస్తావించడం ద్వారా విజయ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక బలమైన రాజకీయ కూటమి ఏర్పాటుకు సంకేతంగా కనిపిస్తోంది.ఎంజీఆర్ బాటలో..రంగస్వామితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో విజయ్ రాబోయే ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తోంది. 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరి.. తమిళనాడుతో పోలిస్తే విజయ్‌కు రాజకీయంగా సులభంగా కలసివచ్చే ప్రాంతమనే భావన చాలామందిలో ఉంది. ఎంజీఆర్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాకముందు, అతని ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) పుదుచ్చేరిలో ఎలా అధికారాన్ని చేపట్టిందో విజయ్ తన ప్రసంగంలో గుర్తుచేయడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉంది. పుదుచ్చేరిలో విజయం సాధించడం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించవచ్చనేది విజయ్ లక్ష్యంగా కనిపిస్తోంది.పొత్తుతో లబ్ధిరంగస్వామి నాయకత్వాన్ని తన ప్రజాదరణను జోడించడం ద్వారా, పుదుచ్చేరి ఓటర్లను ఆకర్షించడం సులభమవుతుందని విజయ్ విశ్వసిస్తున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ లాంటి స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, టీవీకే కనీసం కొన్ని ఎమ్మెల్యే స్థానాలనైనా గెలవాలని ఆశిస్తోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే పుదుచ్చేరికి 'రాష్ట్ర హోదా' డిమాండ్‌ను విజయ్ మరోమారు లేవనెత్తారు.ఇరువురికి కలసివచ్చేలా..విజయ్ పుదుచ్చేరిలో రంగస్వామిని దగ్గర చేసుకోవడం అనేది 2026 ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీతో ఎన్ఆర్ కాంగ్రెస్‌కు సంబంధాలు దెబ్బతింటున్న ప్రస్తుత సమయంలో ఈ కొత్త పొత్తు ప్రతిపాదన రంగస్వామికి కూడా ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. తమిళనాడులోకి ప్రవేశించడానికి పుదుచ్చేరిని గేట్వేగా విజయ్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రంగస్వామి పుదుచ్చేరిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు విజయ్‌తో జతకలవాలని యోచిస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు కీలకం కానున్నాయయని సమాచారం.ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం! -
విజయ్ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం
కరూర్ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్ వద్ద విజయ్ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్‌ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్‌షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.Isha Singh IPS: UT: 2021 Gets Promotion To SSP Rank. She brings a rare combination of legal expertise and enforcement experience to her role. Read: https://t.co/D9i27rqJBi@HMOIndia @PuducheryPolice @iamishasingh @RajeshwarS73 pic.twitter.com/szTgMDL0Xx— Witness In The Corridors (@witnesscorridor) September 1, 2025 ఇషాసింగ్(28) 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. 2021 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్‌గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు.தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025 -
Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్
-
స్టాలిన్‌కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. గతంలో కరూర్‌లో విజయ్ బహిరంగ సభ జరగగా, తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేడు (మంగళవారం) పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. ‘2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుండి డీఎంకే పాలకులు 100 శాతం గుణంపాఠం నేర్చుకుంటారు. మా ప్రజలు దానిని నిర్ధారిస్తారు’ అని అన్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.డీఎంకే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు కొనసాగిస్తూ.. పుదుచ్చేరి సీఎం రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, ప్రత్యర్థి పార్టీ ర్యాలీకి సైతం భద్రత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ‘సీఎం రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడు డీఎంకే పాలన లాంటిది కాదు’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే పాలకులు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి నేర్చుకుంటే మంచిది, అయితే, వారు ఇప్పుడు నేర్చుకోరు' అని వ్యంగ్యంగా అన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన కర్తవ్యమని టీవీకే చీఫ్ ప్రకటించారు. #WATCH | Puducherry | Security arrangements in place as a large number of people start arriving for TVK Chief Actor Vijay's political rally in Uppalam Expo Ground. For the first time since the stampede during his rally in Karur that killed 41 people, actor-politician Vijay is… pic.twitter.com/NGMFCNIeeT— ANI (@ANI) December 9, 2025ఈ సందర్భంగా విజయ్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై ఉన్న డిమాండ్‌ను మరోమారు లేవనెత్తారు. కేంద్రం అభివృద్ధి విషయంలో పుదుచ్చేరికి మద్దతు ఇవ్వలేదనిఅని విమర్శించారు. అయితే, కేంద్రం విభజించి చూసినా.. తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నేత విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 110 మంది గాయపడ్డారు. "DMK regime will 100 per cent learn their lesson from 2026 TN Assembly election. Our people will ensure it," TVK chief #Vijay said at the party's first public rally at Puducherry since #KarurStampede. https://t.co/NMgDbEXbHH— The New Indian Express (@NewIndianXpress) December 9, 2025 -
పుదుచ్చేరిలో విజయ్ సభ.. తుపాకీ కలకలం
చెన్నై: తమిళనాడులో కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విజయ్ సభ నేపథ్యంలో సభా వేదిక వద్దకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, సదరు వ్యక్తిని టీవీకే పార్టీ నేతగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్పో గ్రౌండ్ (Expo ground) నేడు విజయ్ బహిరంగ సభ జరుగుతుంది. కరూర్ ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తుపాకీతో సభా వేదికలోకి ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే, సదరు వ్యక్తి శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా అధికారులు గుర్తించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.Everyone stay safe and go home, please 🙏 #தமிழகவெற்றிக்கழகம் #TVKVijay #உங்கவிஜய்_நா_வரேன் #TVKVijay #ThalapathyVijaypic.twitter.com/eqckGwYgVt— Ꮋꭼꭺꭱꭲ Ꮋꭺꮯꮶꭼꭱ 💫 (@hearthacker031) December 9, 2025మరోవైపు.. పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. విజయ్ మంగళవారం ఉదయం 11 గంటలకు కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం మొదలుపెట్టనున్నారు. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది. -
విజయ్ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. క్యూఆర్ కోడ్ గుర్తింపుతో..
సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్ తన కేడర్‌కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్‌కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్‌కు విజయ్ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణకు.. పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు. అంబులెన్స్‌లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్‌టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్ పేర్కొంటూ, టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈరోడ్‌లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో -
ఈరోడ్‌లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో
ఈరోడ్: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ఈ నెల 16వ తేదీన ఈరోడ్‌లో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవలే ఆ పారీ్టలో చేరిన మాజీ మంత్రి సెంగొట్టయాన్ ఈ మేరకు ఆదివారం పెట్టుకున్న అర్జీని తిరస్కరించినట్లు పోలీసు శాఖ తెలిపింది. అయితే, అదే రోజు ఓ ప్రైవేట్ మ్యారేజీ హాల్లో జరిగే సమావేశంలో విజయ్ పాల్గొంటారని సెంగొట్టయాన్ మీడియాకు తెలిపారు. ఈరోడ్ ప్రాంతం సెంగొట్టయాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతం. తొమ్మిది పర్యాయాలు ఇక్కడి నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏఐఏడీఎంకే బహిష్కరించడంతో విజయ్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ర్యాలీని తన బలాన్ని ప్రదర్శించుకునేందుకు వాడుకోవాలని ఆయన భావించారు. అయితే, విజయ్ తలపెట్టిన బహిరంగ సభా వేదికను ఎస్పీ సుజాత పరిశీలించారు. ఏడెకరాల సభాస్థలి 70 వేల మందికిపోదని భావిస్తూ అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. -
టీవీకే విజయ్‌కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన విజయ్‌కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. దీంతో, విజయ్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.వివరాల ప్రకారం.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు.కాగా, డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్‌కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు.కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. -
అన్నాడీఎంకేకు షాక్.. టీవీకే విజయ్‌తో ఆ ఎమ్మెల్యే భేటీ
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్‌కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్‌లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్‌కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు. -
వచ్చే ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోవడం ఖాయం: విజయ్ విమర్శలు
చెన్నై: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత కొన్ని నెలలు సుదీర్ఘ విరామం తీసుకున్న టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు విజయ్.. తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. నేడు(ఆదివారం, నవంబర్ 23 వ తేదీ) కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికోసం కాంచీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు.కేవలం 2000 మందికి మాత్రమే QR కోడ్ పాస్‌లతో కూడిన అనుమతి ఇచ్చారు. అనుమతి లేని వారికి ప్రవేశం లేకుండా పకడ్బందీ ప్లానింగ్ చేశారు. ప్రచార పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ర్యాడికల్స్‌కు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని ఆయన మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తోందని విజయ్ స్పష్టం చేశారు.ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకంగా లేదని, ఆ ప్రక్రియ ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు.తమిళనాడులో అధికార డీఎంకేతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని విజయ్ విమర్శించారు. రెండు పార్టీల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవని అన్నారు.విజయ్ ఒకేసారి డీఎంకే, బీజేపీలపై దాడి చేయడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
తమిళనాడు ఎన్నికలు.. మళ్ళీ ప్రజల్లోకి విజయ్
సాక్షి చెన్నై: కరూర్‌లో జరిగిన విషాద ఘటనతో తను చేస్తున్న అన్ని ప్రజా కార్యక్రమాలను నిలిపివేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కొంతకాలం విరామం తర్వాత తిరిగి తన ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ప్రచార యాత్ర పునఃప్రారంభానికి సంబంధించి నిర్వహించనున్న తొలి పెద్ద సభ కాంచీపురంలో జరగనుందని టీవీకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. పార్టీ బలోపేతం, స్థానిక నాయకుల సమావేశం, ప్రజలతో మళ్లీ ప్రత్యక్షంగా అనుసంధానమవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. తొలి సభను కాంచీపురంలో నిర్వహించడానికి విజయ్ టీమ్ నిర్ణయం తీసుకుంది. దాంతో కాంచీపురానికి ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ వెంటనే అన్ని ప్రజా ఈవెంట్లను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాల పట్ల గౌరవ సూచికగా చేపట్టిన ఈ నిర్ణయాన్ని అప్పట్లో విస్తృతంగా ఆయన అభిమానులు అభినందించారు. ఆ సమయంలో బీజేపీ పార్టీ విజయ్‌కు మద్దతుగా నిలిచింది. అయితే కొంతకాలం విరామం తరువాత విజయ్ తిరిగి ప్రచార యాత్రను ప్రారంభించడంతో తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసిన అధికారులుకరూర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. జనసంచారం నియంత్రణతో పాటు అత్యవసర సేవలు సిద్ధంగా ఉండేలా స్థానిక అధికారులు, పార్టీ నిర్వాహకులు కలిసి పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల అనుమతి తిసుకుని కేవలం రెండువేల మందితో మాత్రమే సభను నిర్వహించాలని టీవీకే పార్టీ వర్గాలు నిర్ణయించాయి.కాగా కాంచీపురం సభ అనంతరం, తమిళనాడులోని పలు కీలకమైన ప్రాంతాలలో విజయ్ ప్రచార షెడ్యూల్‌ను ఏర్పాటు చేసేందుకు పార్టీ ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. -
కరూర్ బాధితులకు విజయ్ ఓదార్పు
సాక్షి, చెన్నై: కరూర్ బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రాణనష్టంపై ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి తలా రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గత నెల 27న కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించారు.160 మంది గాయపడ్డారు.ఈ కుటుంబాలను కరూర్‌కు వెళ్లి పరామర్శించేందుకు తొలుత విజయ్ నిర్ణయించారు. అయితే, అనుమతుల మంజూరు, స్థల ఎంపిక సమస్యలు నెలకొనడంతో చివరకు బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించి ఒకే చోట పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో 8 కుటుంబాలు గైర్హాజరైనా మిగిలిన కుటుంబాలన్నీ చెన్నైకు వచ్చేందుకు సమ్మతించాయి. వీరందర్నీ ప్రత్యేక బస్సుల్లో చెన్నైకు తీసుకొచ్చారు. మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో కుటుంబాన్ని విజయ్ వేర్వేరుగా పరామర్శించారు.15 నుంచి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఓదార్చారు. ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లల చదవులకు అండగా ఉంటానని, ఖర్చులు భరిస్తానని విజయ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొన్ని కుటుంబాల్లోని వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు కూడా హామీ ఇచ్చారని తెలిసింది. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
విజయ్ టీవీకే పార్టీలో కీలక వ్యక్తులు తెలుగువారే
సాక్షి,చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీం నియమించింది. అయితే, విజయ్ (Vijay) ఇప్పటి వరకు నిర్వహించిన బహిరంగ సభల్లో అధికార, గత పాలకుల అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విజయకు మద్దతు ఎవరిస్తారు? విజయ్ మద్దతు ఎవరికుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్‌కు విశ్వాసపాత్రులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు తమిళనాడు తిరుచ్చికి చెందిన అధవ్ అర్జున్ రెడ్డి. ఈయన దేశంలో లాటరీ కింగ్ పేరు పేరొందిన మార్టిన్ అల్లుడే ఈ అర్జున్ రెడ్డి. ఎలక్టోరల్ బాండ్స్ కోసం రూ. 1318 కోట్లు ఇచ్చి దేశంలో అగ్రగామిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు ఆనంద్, విజయ్ ఫాన్స్ అసోసియేషన్ తరపున పుదుచ్చేరి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. వారిద్దరు విజయ్‌కు విశ్వాస పాత్రులుగా ఉంటూ టీవీకే (TVK) కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక తాజా, సుప్రీంకోర్టు నిర్ణయంతో విజయ్ త్వరలో జిల్లాల పర్యటన ఉండనుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో విజయ్.. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? లేదంటే ప్రశాంత్ కిషోర్ (prashant kishor) సూచనలు మేరకు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగతాడా? అన్నది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్‌కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్‌గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్‌కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్‌ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్‌ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్‌గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట


