Sakshi News home page

స్థూల జాతీయ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అ‍గ్రగామి

Published Sat, Apr 29 2023 4:44 PM

Kommineni Srinivas Rao At Book Release Event Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కనపడకుండా అడ్డుపడే దురదృష్ట ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని ఆంద్రప్రదేశ్ సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్  కొమ్మినేని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. జర్నలిస్టు ఆంగ్ల మాస పత్రిక సంపాదకులు వీవీఆర్‌ కృష్ణం రాజు రూపొందించిన ‘దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర’ సర్వే నివేదిక విడుదల సందర్భంగా స్థానిక సీఆర్‌ మీడియా అకాడమీ కార్యాలయం ఏర్పాటైన  సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పక్షాలు, పత్రికలు తమ రాజకీయ, పత్రికా ప్రాయప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తూన్నారని అన్నారు.

అయితే, ప్రజల మనోభావాలతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందన్న సంగతిని ఈ వర్గాలు పూర్తిగా పక్కన పెట్టేయడం విచారించ దగ్గ అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సందర్భాల్లో వెలువరించిన అధికారిక సమాచారం సేకరించి, దాన్ని ఒక క్రమ పద్దతిలో ఉంచి ఆంద్ర ప్రదేశ్ వృద్ధి రేటును కళ్లముందుంచే ప్రయంత్నం చేసిన వీవీఆర్‌ కృష్ణంరాజు అభినందనీయులని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామంటే 6 వేలపై చిలుకు  ఆసుపత్రులు, 86 వేల  ఆసుపత్రి పడకలు ప్రభుత్వ  రంగంలోనే ఉండడం కారణమన్నారు.

వీవీఆర్‌ కృష్ణం రాజు మాట్లాడుతూ.. తాము సమీకరించిన గణాంకాలన్నీ నీతి ఆయోగ్, భారతీయ రిజర్వు బ్యాంక్, వివిధ రాష్ట్రాలు విడుదలచేసిన సామాజిక  ఆర్ధిక సర్వేల నుంచి సేకరించినవే అన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలనే తలంపుతోనే ఈ నివేదిక రూపొందించామని, ఇందులో ప్రత్యేకించి మరే ఉద్దేశ్యం లేదని  వివరించారు. స్థూల జాతీయ వృద్ధి రేటు 16.25 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో 25. 58 శాతం, వృద్ధి రేటు ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో రాష్ట్రంలో 16,924 పరిశ్రమలున్నాయని ఆయన పేర్కొన్నారు.
చదవండి: రజనీకాంత్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం: కొమ్మినేని శ్రీనివాసరావు

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంద్ర ప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతుండడాన్ని అందరూ ఖండించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 10వేల కోట్లు వివిధ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిందని, ఇలా వెళ్లిన నగదు పదే  పదే సర్క్యూలేట్ అయ్యి సమాజంలోని సేవారంగం, నిర్మాణ రంగం ల లో వృద్ధి కి కారణమైందన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రం లో  ఇంత పెద్ద ఎత్తున ప్రత్యక్ష నగదు బదలీ జరగలేదని ఆయన అన్నారు. 

లఖంరాజు సునీత మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహనరెడ్డి పాలనలో మొదటి 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా కొనసాగించారని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని ఆ ప్రయాజనాలు తక్షణమే కనిపించేవి కాదని అన్నారు. రామరాజు శ్రీనివాస రాజు మాట్లాడుతూ గత నాలుగేళ్ల పాలన లో అద్భుత ప్రగతి కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పధకాలు కొనసాగిస్తామని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర స్వంత టాక్స్ లు విషయం లో దేశంలో మన రాష్ట్రం 6 వ స్థానంలో ఉందన్నారు.

జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు జంపా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ.. 45వేల 396 కోట్లు సామాజిక రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలు కొత్తవి రాకుండా సైతం కొన్ని వర్గాలు పారిశ్రామిక వర్గాల వద్ద రాష్ట్ర పరిస్థితులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఈ విషయం తమ పరిశీలన లో వెల్లడైందన్నారు.  

ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన లో దేశం లోనే మన రాష్ట్రం 3 వ స్థానం లో వుందని అన్నారు.పేదరిక నిర్మూలనలో గత ప్రభుత్వం తో పోల్చితే 60 పాయింట్లు ఆధిక్యతతో ప్రస్తుతం 81 పాయింట్లకు చేరుకుందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ధి సరిగా జరిగితేనే జనాభా పెరుగుదల రాష్ట్రానికి, దేశానికి మేలుచేస్తుందని అన్నారు. 

హైకోర్టు న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ పత్రికలు, పార్టీలు ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్నారు.  రాష్ట్రం లోని వాలంటీర్ల వ్యవస్థ పై అధ్యయనానికి బెంగాల్, మహారాష్ట్ర బృందాలు పర్యటించాయన్నారు. 

లాంప్  ఎన్‌జీవో  అధినేత సాల్మన్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో సంస్కరణలతో కూడిన అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలు అందుకుంటారని అన్నారు.  మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం బాలగంగాధర తిలక్ మాట్లాడుతూ.. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమం గొప్ప విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభత్వాలు పెట్టె పెట్టుబడులు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు.

ప్రచారంలో ఉన్నా అసత్యాలు ప్రజలు తిరస్కరిస్తున్నారని అధ్యాపక విభాగం, రాష్ట్ర అధ్యక్షులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాజకీయ, కుల, మత ప్రాంతీయ భేదాలకతీతంగా పత్రికలూ పనిచేయాలని ఆయన అన్నారు. జర్నలిస్టు ఆంగ్ల మాస పత్రిక సంపాదకులు వీవీఆర్‌ కృష్ణం రాజును ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు.

Advertisement

What’s your opinion

Advertisement