
సాక్షి,ముంబై: భారతదేశంలో 'అల్ట్రా-అఫర్డబుల్' 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ పలు కీలక విషయాలను వెల్లడించారు. (Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి)
మేడ్ ఇన్ ఇండియా 5జీ సేవలకుగాను ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలను భాగస్వాములుగా ఉండటమ విశేషమని ముఖేష్ అంబానీ అన్నారు. జియో ప్రస్తుతం మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సిస్కో వంటి గ్లోబల్ నెట్‌వర్క్ టెక్నాలజీ ప్రొవైడర్లతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అలాగే ఇండియా 5జీ సొల్యూషన్స్ డెవలప్‌మెంట్‌కి క్వాల్కంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.
రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, రిటైల్ దిగ్గజం ఈ సంవత్సరం ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. అలాగే తన తల్లి నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ అనేక సేవలందించిందని తెలిపారు.