నెలరోజులుగా భారీ శబ్దాలు
గ్రామంలో ఈ బావి వద్ద నెల రోజుల నుంచి డ్రిల్లింగ్ చేస్తున్నారు. భారీగా శబ్దాలు వస్తున్నాయి. అధికారులకు వివరించాం. ఓఎన్జీసీ పట్టించుకోలేదు. అనేక కుటుంబాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. మేం భయపడినట్లే అయింది. ఇప్పడు ఊరి విడిచి వచ్చేశాం.
– అరిగెల సత్యనారాయణ, ఇరుసుమండ, మలికిపురం మండలం
ఓఎన్జీసీ అధికారుల తీరు విచారకరం
మాది బ్లో అవుట్ జరిగిన ఇరుసుమండ పక్క గ్రామం లక్కవరం. ఉదయం నుంచి భారీగా గ్యాస్ రెండు గ్రామాలకు వ్యాపించింది. తీవ్రంగా ఆందోళన చెందాం. బావిని వదిలేసి అధికారులు పారిపోయారు. మేం ఏమైపోయినా ఫర్వాలేదా? ఇక్కడ ఎందుకు ఓఎన్జీసీ కార్యకలాపాలు చేస్తున్నారు. మా పిల్లలకు, మా ప్రాణాలకు రక్షణ లేదు.
– గుర్రం జాషువా, వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ
యువజన విభాగం అధ్యక్షుడు, లక్కవరం
మంటలు అదుపు చేసేందుకు కృషి
ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్‌ను అదుపు చేసేందుకు ఆ సంస్థతో పాటు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ వెల్‌లో 30 నుంచి 40 మిలియన్ టన్నుల నిక్షేపాలు నిల్వలు ఉన్నట్లుగా అధికారులు విశ్లేషించారు. 2024లో డీప్ ఇండస్ట్రీస్ వారికి అద్దెకి ఇవ్వగా, వారు డ్రిల్లింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన పంట కాలువ నుంచి మంటలను అదుపు చేసేందుకు నీటి సదుపాయం కల్పించాం. 24 గంటల్లో బ్లో అవుట్ నియంత్రణపై స్పష్టత రావచ్చు. – మహేశ్‌కుమార్, కలెక్టర్
నెలరోజులుగా భారీ శబ్దాలు
నెలరోజులుగా భారీ శబ్దాలు


