యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఫిడే చెస్ రేటెడ్ ప్లేయర్‌గా శ
అమలాపురం రూరల్: కామనగరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఏడేళ్ల శాన్వీ యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఫిడే చెస్ రేటెడ్ ప్లేయర్‌గా నిలిచింది. చెస్‌లో అతి ప్రధానమైన అంతర్జాతీయ ఫిడె చెస్‌లో 1436వ రేటింగ్ సాధించింది. 2025లో అండర్– 7 బాలికల విభాగంలో భారత్ మొత్తం 24 మంది రేటింగ్ సాధించగా, ఆంధ్ర నుంచి శాన్వి ఒక్కరే కావడం విశేషమని కోచ్ వి.శ్రీనుబాబు తెలిపారు. 2025లో రాష్ట్ర స్థాయి అండర్ –7 చెస్ చాంపియన్ షిప్‌లో రెండో స్థానం సాధించి ఆంధ్ర యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఫిడే చెస్ రేటెడ్ ప్లేయర్‌గా నిలవడం గర్వించదగ్గ విషయమని స్కూల్ చైర్మన్ నంద్యాల నాయుడు, డైరెక్టర్ స్నేహ ప్రియ, ప్రిన్సిపాల్ నంద్యాల మనోవిహార్ అభినందించారు.
ఎట్టకేలకు ఫ్లెక్సీ తొలగింపు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి ద్రాక్షారామ – కాకినాడ రోడ్డులో ఉన్న ఆలయ ముఖ ద్వారం వద్ద రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కోడి పందేలకు సిద్ధం అన్నట్టుగా ఉన్న ఫ్లెక్సీని కూటమి నాయకుడు ఏర్పాటు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. దీనిపై ‘సాక్షి’ పత్రికలో ‘భీమేశ్వరాలయ ముఖద్వారానికి కోడి పందేల ఫ్లెక్సీ’ శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ ఫ్లెక్సీని తొలగించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య
కరప: పనికి వెళ్లడం లేదని తల్లి మందలించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామానికి చెందిన సంగాని సూర్యనారాయణ, వీరవేణి దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో చిన్న కుమారుడైన సంగాని సింహాద్రి (16)తో కలసి తల్లి వీరవేణి హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకునేవారు. సింహాద్రి హైదరాబాద్‌లో ఉంటుండగా సరిగా పనికి వెళ్లడం లేదని తల్లీ, కొడుకులిద్దరూ తిరిగి తమ స్వగ్రామం మొండికి నెలరోజుల క్రితం వచ్చేశారు. ఈ నెల 2న వీరవేణి తన కుమారుడు సింహాద్రిని పనికి వెళ్లడం లేదని మందలించి, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. తల్లి మందలించిందన్న కోపం, హైదరాబాద్ వెళ్లిపోయిందనే బెంగతో మనస్థాపం చెంది సోమవారం సింహాద్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్‌ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
నల్లజర్ల: మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అనంతపల్లి గ్రామంలో జనసేనకు చెందిన ఆలపాటి అఖిల్ 4,670 కిలోల రేషన్ బియ్యాన్ని నల్లజర్ల నుంచి సింగరాజుపాలెం వైపునకు మినీ వ్యాన్‌లో తరలిస్తుండగా, విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గోపాలపురం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు సివిల్ సప్లయిస్ డీటీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడిలో వీఆర్వో టి.సురేష్, వీఆర్‌ఏ సర్ధార్ పాల్గొన్నారు.
యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఫిడే చెస్ రేటెడ్ ప్లేయర్‌గా శ


