
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అలసటల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ‘పోర్టబుల్ సోనా బాత్ స్టీమర్’ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇది ఇంట్లోనే సౌకర్యవంతమైన స్పా అనుభూతిని కలిగిస్తుంది. దీని లోపల విశాలమైన చోటుతో కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. స్టీమింగ్ టబ్‌తో పాటు 3 లీటర్ల సామర్థ్యం గల స్టీమ్ జనరేటర్ లభిస్తుంది. ఇది ఎక్కువసేపు ఆవిరిని అందిస్తుంది.
ఈ డిజైన్ చాలా అనుకూలమైనది. ఉపయోగంలో లేనప్పుడు సులభంగా మడతపెట్టి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా సులువుగా వెంట తీసుకెళ్లవచ్చు. లోపలి భాగం వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో, బలమైన స్టెయి లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో (అటాచ్డ్ స్టాండ్స్) తయారు కావడంతో శుభ్రం చేయడం, ఆరబెట్టడం చాలా సులభం.
రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉండటంతో సమయాన్ని, ఉష్ణోగ్రతను సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది కేవలం 15 నిమిషాల్లో వేడెక్కుతుంది, ఆవిరి ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. డ్యూయల్ హెడ్ జిప్ ఉండటంతో దీన్ని లోపల నుంచి క్లోజ్ చేసుకోవడం కూడా తేలికే!
ఈ స్టీమర్‌తో మడత కుర్చీ, కంట్రోలర్, మ్యాట్ వంటి ఉపకరణాలు లభిస్తాయి. ఈ స్టీమర్ అలసట, ఉపశమనం, ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తుంది. నిద్ర సమస్యలను తగ్గించి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. అలాగే మృదువైన చర్మాన్ని పొందడానికి ఈ డివైస్ భలేగా ఉపయోగపడుతుంది. ఒక్కో సైజుని బట్టి, మెటీరియల్ క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
పట్టులాంటి చర్మం కోసం..
ఎక్స్‌ఫోలియేషన్ ట్రీట్‌మెంట్ – చర్మ సంరక్షణలో కీలకమైన ప్రక్రియ ఇది. చర్మం పైపొరపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, చర్మాన్ని పరిశుభ్రంగా, తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ చికిత్సతో చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ చికిత్స ప్రధానంగా భౌతిక ఎక్స్‌ఫోలియేషన్, రసాయన ఎక్స్‌ఫోలియేషన్ అనే రెండు రకాల పద్ధతుల్లో ఉంటుంది.
భౌతిక ఎక్స్‌ఫోలియేషన్‌లో స్క్రబ్‌లు, బ్రష్‌లతో చర్మాన్ని సున్నితంగా రుద్ది మృతకణాలను తొలగిస్తారు. రసాయన ఎక్స్‌ఫోలియేషన్‌లో కొన్నిరకాల ఆమ్లాలను ఉపయోగించి మృతకణాలను పోగొడతారు. ఈ పద్ధతి చర్మాన్ని మరింత లోతుగా శుభ్రపరుస్తుంది. ఈ చికిత్స పొందేటప్పుడు చర్మవైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
(చదవండి: