యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌తో పాటు జీవో ప్రతుల పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ జీవోల కాపీలను ఒకే పుస్తకంలో చేర్చడం అభినందనీయమన్నారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా యూటీఎఫ్ ముద్రించిన స్టడీ మెటీరియల్, డ్రగ్స్‌ను పారతోలతాం అనే కరపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు ఎండీ షకీలాబేగం, జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, ఎం.కోటిరెడ్డి, బి.ప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
●గన్నవరం ఏడీఏ ఎం.సునీల్
● పలు ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
తెనాలిటౌన్: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గన్నవరం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సునీల్ హెచ్చరించారు. పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, తెనాలి మండల వ్యవసాయాధికారి కె.సుధీర్‌బాబు, గుంటూరు మండల వ్యవసాయాధికారి బి.కిషోర్ తనిఖీల్లో పాల్గొన్నారు. స్టాక్ రిజిష్టర్ పరిశీలించి రికార్డు తనిఖీ చేశారు. రిజిష్టర్‌లు ఎప్పటికపుపడు అప్‌డేట్ చేయాలని సూచించారు. యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఎమ్మార్పీకంటే అధిక ధరకు విక్రయిస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి.కిషోర్, ఏఈఓ మురళి, తదితరులు ఉన్నారు.
రూ.15లక్షల ఎరువుల అమ్మకాలు నిలుపుదల..
చేబ్రోలు: రైతులకు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ రాష్ట్ర తనిఖీ బృందం అధికారి గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, కమీషనరేట్ కార్యాలయ వ్యవసాయశాఖాధికారి బి సురేష్‌బాబులు తెలిపారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, వడ్లమూడి, చేబ్రోలు గ్రామాల్లోని ప్రైవేటు ఎరువుల దుకాణాలను రాష్ట్ర తనిఖీ బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరు ఏడీఏ వి రామకోటేశ్వరి, స్థానిక ఏఓ ప్రియదర్శినిలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియా తనిఖీలు నిర్వహించారు. యూరియా నిల్వలు, అమ్మకాలు, ఎరువుల లభ్యత గురించి పరిశీలన చేశారు. శేకూరు, వడ్లమూడి గ్రామాల్లోని రెండు షాపుల్లో సరైన పత్రాలు, బిల్లులు లేకపోవటంతో అమ్మకాలు నిలుపుదల చేశారు. 85.4 మెట్రిక్ టన్నుల ఎరువులను రూ.15,19,870ల నిలుపదల చేశారు. మండలంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లుకు ఎరువులు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రికార్డు మెయింటైన్ సరిగ్లా లేని వారికి సంజాయిషీ తీసుకొని, లైసెన్స్ సస్పెన్షన్‌కి ఆదేశాలు జారీ చేశారు.
ఎరువుల అమ్మకాలు నిలిపివేత
పెదకాకాని: అనుమతులు, బిల్లులు లేకుండా అమ్మకాలు చేస్తున్న దుకాణాల్లో ఉన్న ఎరువుల విక్రయాన్ని నిలిపివేసినట్లు మండల వ్యవసాయ శాఖాధికారి కె.రమణకుమార్ అన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రైవేటు దుకాణాలకు యూరియా సరఫరా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ అధిక ధరలకు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. బిల్లులు లేకుండా ఎరువుల అమ్మకాలపై సోమవారం అధికారి రమణకుమార్ వెనిగండ్ల, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు గ్రామాల్లోని షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. వెనిగండ్ల దుకాణాల్లో అనుమతులు, సరఫరా వివరాలు లేని ఎరువులను గుర్తించారు. 4.35 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా అమ్మకాలు చేపట్టినా, అధిక ధరలకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
చిలకలూరిపేటటౌన్: అనుమానం పెనుభూతమై ఓ నిండు సంసారంలో చిచ్చుపెట్టిన ఘటన చిలకలూరిపేట మండలంలోని వేలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్‌రాజు తన భార్య పుష్ప (34) ప్రవర్తనపై అనుమానంతో, సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలిబండతో బలంగా మోది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్ర రక్తగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.
యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్


