జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు మరో రజతం
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్ మరో రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ విభాగంలో ముఖేష్ 569/600 పాయింట్లతో మంగళవారం మరో రజత పతకం సాధించినట్లు తెలిపారు. ఒక్క పాయింట్ తేడాతో బంగారు పతకం చేజారిపోయిందన్నారు. ముఖేష్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది రెండో పతకం అని తెలిపారు. ముఖేష్‌ను ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజకుమార్, కేఎల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ కాకర్ల హరికిషోర్, పీడీ శ్రీహరి, పూజిత అభినందించారన్నారు.


