ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట
అధికారం చేతిలో ఉంది కదా అని గ్రామాలను విలీనం చేస్తున్నాం. పంచాయతీలు తీర్మానాలు చేసి పంపండి అంటూ హుకుం జారీ చేశారు. పంచాయతీ సెక్రటరీలు తప్పని పరిస్థితిలో కనీసం సర్పంచ్‌లకు సమాచారం కూడా లేకుండా తీర్మానాలు చేశారు.
– ఇంటూరి పద్మావతి, ఎంపీపీ చల్లావారిపాలెం, రూరల్ మండలం
విలీనం చేసే సమయంలో కనీసం గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. కానీ అటువంటి సంఘటన లు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు. – వంగా నవీన్‌రెడ్డి, జొన్నలగడ్డ
ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట


