మహిళ ఆత్మహత్య
ఆదోని రూరల్: మండలంలోని నాగలాపురం వద్ద ఇటుకల బట్టీలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాషిణి(23) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కారణాలు తెలియాల్సి ఉంది.
బైక్ అదుపు తప్పి..
ఆదోని రూరల్: మండలంలోని కపటి గ్రామానికి చెందిన నాయక్ ఈరన్న(40) ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామమైన కపటికి గురువారం బైకుపై వస్తుండగా ఆరేకల్ సమీపంలో ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. అదే బైకుపై కూర్చున్న మరోవ్యక్తి నాయక్ వీరేష్‌కు తీవ్ర గాయాలపాలయ్యామని చెప్పారు. ఘటనా స్థలానికి చేరు కుని నాయక్ ఈరన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మహిళ ఆత్మహత్య


