హాట్‌స్టార్‌లో మరో కొత్త వెబ్‌సిరీస్‌, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే? | 9 Hours Teaser: Three Prisoners, One Escape Plan, Will They Succeed? | Sakshi
Sakshi News home page

9 Hours Teaser: ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ప్లాన్‌

Published Sat, May 14 2022 7:08 PM | Last Updated on Sat, May 14 2022 9:29 PM

9 Hours Teaser: Three Prisoners, One Escape Plan, Will They Succeed? - Sakshi

వినోదాన్ని అందించేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఈ క్రమంలో ఆల్‌రెడీ థియేటర్‌లో రిలీజ్‌ అయిన సినిమాలను మాత్రమే అందించకుండా ఒరిజినల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. సరికొత్త కథలు, వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి. దేశంలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌ తాజాగా 9 హవర్స్‌ అనే మరో కొత్త వెబ్‌సిరీస్‌ను రిలీజ్‌ చేయనుంది. అందులో భాగంగా శనివారం నాడు 9 అవర్స్‌ టీజర్‌ విడుదలయింది.

'మర్చిపోకండి.. మళ్లీ హాజరు సమయానికి మీకు మధ్య 9 గంటలు మాత్రమే!' అన్న సింగిల్‌ డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ఒక్క ప్లానే 9 అవర్స్‌ అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో తారకరత్న, అజయ్‌, వినోద్‌ కుమార్‌, మధుషాలిని, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రీతి, అంకిత, జ్వాల, మోనిక ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్‌ 2 నుంచి అన్ని ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి.

చదవండి: జాన్‌ అబ్రహం, రకుల్‌ మూవీ 'యాక్షన్‌', ఎప్పటినుంచంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement