![Allu Arjun And Sneha Reddy Selfie Pic Goes Viral on Their Wedding Anniversary - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/allu-arjun.jpg.webp?itok=TXjN73JI)
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక అల్లు అర్జున్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అంటూ సెల్పీలు తీసుకునేందుకు వెంటపడుతున్నారు. అలాంటి బన్నీ సెల్ఫీ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే అది ఫ్యాన్‌తో తీసుకుకుంది కాదు. తన భార్య స్నేహతో దిగిన సెల్ఫీ. నిన్న సోమవారం(మార్చి 6) అల్లు అర్జున్-స్నేహల 12వ వివాహ వార్షికోత్సం. ఈ సందర్భంగా ఈ స్పెషల్ డేను సెలబ్రెట్ చేసుకుంటూ భార్యకు విషెస్ తెలిపాడు.
చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా?
ఇద్దరు కలిసి తీసుకున్న సెల్పీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. భార్యకు అలా క్యూట్‌గా విషెస్ చెప్పడంతో బన్నీ పోస్ట్‌పై అందరి దృష్టి పడింది. ఇక ఫ్యాన్స్ అయితే వారి సెల్ఫీకి ఫిదా అవుతూ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. క్యూట్ కపుల్ అంటూ వారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలిపారు. అలా కుప్పలు కుప్పలుగా బన్నీ-స్నేహలకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీంతో బన్నీ పోస్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ వంగతో చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది.
చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చేశా.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్
Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy pic.twitter.com/lWEJRfuQZH
— Allu Arjun (@alluarjun) March 6, 2023
Comments
Please login to add a commentAdd a comment