Director Shankar Plans Next Movie With Ram Charan And Yash | రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌! - Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!

Published Fri, Jan 22 2021 10:51 AM | Last Updated on Fri, Jan 22 2021 3:54 PM

Director Shankar Next Multi Starrer Movie With Ram Charan And Yash - Sakshi

శంకర్‌ సినిమాలు భారీగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్‌ ఆయన స్పెషాలిటీ. ప్రస్తుతం ‘ఇండియన్‌’ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత శంకర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ను హీరోలుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌. (చదవండి: అదే జరిగితే మెగా అభిమానులకు పండగే)

చరణ్, యశ్‌ హీరోలుగా ఓ చారిత్రాత్మక యుద్ధ నేపథ్యం ఉన్న సినిమా తీయాలనుకుంటున్నారట శంకర్‌. ప్రస్తుతం చేస్తున్న ‘ఇండియన్‌ 2’ పూర్తవ్వగానే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని కోలీవుడ్‌ ఖబర్‌. 2022 రెండో భాగంలో చిత్రీకరణ ప్రారంభం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఆచార్య: చెర్రీ 'సిద్ధ'మయ్యాడుగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement