
క్వారంటైన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగించుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ ఖాళీ సమయంలో తన ఆత్మకథ రాస్తున్నారు. ఈ ఆటోబయోగ్రఫీలో సినీ ప్రయాణం ఎలా సాగింది? నటుడిగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? చూసిన విజయాలు, వైఫల్యాలు, కుటుంబం, తనను ప్రభావితం చేసినవాళ్లు.. వంటి విషయాలన్నీ ప్రస్తావించనున్నారని తెలిసింది. హార్పర్‌కోలిన్స్ పబ్లిషర్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment