
Jacqueline Fernandez Trolls Old Video Her Bodyguard Better Than Sukesh: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఇటీవల తన వ్యక్తిగత ఫొటోలు ప్రసారం చేయొద్దని విన్నవించుకున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ మధ్యలో సుకేష్‌తో జాక్వెలిన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీంతో మీడియా మొత్తం జాక్వెలిన్‌పై దృష్టి సారించింది. అయితే తాజాగా ఈ శ్రీలంక భామ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 'సుకేష్ ఎక్కడా ఉన్నాడు. అస్సలు కనపడట్లేదుగా' అని ఒక యూజర్ రాస్తే సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బాగున్నాడు అని మరొకరు స్పందించారు. 'ఇంకా పీఆర్ వాళ్ల కష్టం బాగా తెలుస్తోంది', 'ఇదంతా డ్యామెజ్ కంట్రోల్ కోసం', 'జాక్వెలిన్‌ను ఇలా చూసే సుకేష్ ఫిదా అయింటాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ త్రోబ్యాక్ వీడియోలో ఎరుపు రంగు సాటిన్ దుస్తులు ధరించి ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్ ఫొటోలకు ఫోజులిచ్చింది జాక్వెలిన్.
ఇదీ చదవండి: మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. అవి ప్రసారం చేయొద్దని