నజ్రియా నజీమ్‌ ‘వాది’ కమింగ్‌!.. ఎందుకంటే.. | Nazriya Nazim Dance To Vaathi Coming Song | Sakshi
Sakshi News home page

నజ్రియా నజీమ్‌ ‘వాది’ కమింగ్‌!.. ఎందుకంటే..

Feb 25 2021 2:40 PM | Updated on Feb 25 2021 4:58 PM

Nazriya Nazim Dance To Vaathi Coming Song - Sakshi

వీడియో దృశ్యం

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్‌. రాజారాణి సినిమాలో నటనతో అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టారామె. మళయాల నటుడు ఫాహద్‌ ఫజిల్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అంజలీ మీనన్‌’ కూడె’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు.  షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు వీడియోలు, ఫొటోలతో అభిమాలను పలకరిస్తూ ఉంటారు. తాజాగా తన స్నేహితురాలు, దర్శకుడు అల్ఫోన్స్‌ పుథిరన్‌ భార్య అలీమతో కలిసి ఓ వీడియోను చేశారామె.

విజయ్‌ కథానాయకుడిగా నటించిన మాస్టర్‌ చిత్రంలోని ‘వాది కమింగ్‌!’ పాటకు ఇద్దరూ కాళ్లు కదిపారు. నజ్రియా ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ ఎందుకంటే.. వాది కమింగ్‌ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి..’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి : ఇంటర్వెల్‌ లేని సినిమాలో కత్రినా కైఫ్‌

Advertisement
 
Advertisement
Advertisement