ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను | Rakul Preet Singh Said Her Favorite Food is Aloo Paratha And Gulab Jamun | Sakshi
Sakshi News home page

ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను

Jan 18 2021 8:01 AM | Updated on Jan 18 2021 12:45 PM

Rakul Preet Singh Said Her Favorite Food is Aloo Paratha And Gulab Jamun - Sakshi

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో ఫిట్‌నెస్‌ మీద చాలా శ్రద్ధపెట్టే వారిలో రకుల్‌ మొదటి వరుసలో ఉంటారు. అయితే ఫిట్‌గా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నచ్చినా కూడా నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. కానీ రకుల్‌కి మాత్రం రెండు ఐటమ్స్‌ అంటే నోరూరుతుందట. అవేంటంటే ఆలూ పరాటా, గులాబ్‌ జామున్‌. ఈ రెండు ఫుడ్‌ ఐటమ్స్‌ విషయాల్లో కంట్రోల్డ్‌గా ఉండటం తన వల్ల కాదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. డైట్‌ అంటూ వీటికి దూరం కావడం నా వల్ల కాదంటారామె. అందుకే ఆలూ పరాటా, గులాబ్‌ జామున్‌ లాగించేసి, ఆ కేలరీలను జిమ్‌లో కరిగించేస్తా అంటున్నారు రకుల్‌.

Advertisement
 
Advertisement
Advertisement